LATEST NEWS
  కాంగ్రెస్ సీనియర్‌ నేత మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. సంగారెడ్డిలో అసెంబ్లీ ఎన్నికల్లో మర్చిపోలేనిదని జగ్గారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.ఇళ్ళ స్థలం లేని పేదలతో సంగారెడ్డిలోని గంజి మైదానంలో టీజీఐఐసీ ఛైర్మన్ నిర్మల జగ్గారెడ్డితో కలిసి ఆయన సమావేశమయ్యారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌ గాంధీ వచ్చి నన్ను గెలిపించాలని ప్రచారం చేస్తే, నన్ను  ఇక్కడ ఓడించారు. జగ్గారెడ్డిని గెలిపించాలని రాహుల్‌ గాంధీ అడిగితే.. నన్ను ఓడించారు. నా జీవితంలో ఇది మరిచిపోలేనిది.  అందుకే సంగారెడ్డిలో జీవితంలో పోటీ చేయకూడదని నిర్ణయించుకున్నాని  హాట్‌ కామెంట్స్‌ చేశారు. నా ఓటమికి కారణం పేద ప్రజలు కాదు..ఇక్కడి మేధావులు.. పెద్దలది. రేపు సంగారెడ్డిలో నా సతీమణి నిర్మలా పోటీ చేసిన కూడా నేను ప్రచారం చేయను. రాష్ట్రంలో నేను ఎక్కడికైన వెళ్ళి ప్రచారం చేస్తా కానీ.. సంగారెడ్డిలో ప్రచారం చేయను’ అని జగ్గారెడ్డి షాకింగ్ కామెంట్స్ చేశారు  
  (శ్రీరాముడికీ బీజేపీ సభ్యత్వం ఉంది.. ధర్మపురి అరవింద్) మొన్నామధ్య  వూరి పెద్ద బస్టాండ్‌లో మిట్టమధ్యాన్నం కాషాయ దుస్తుల్లో ఒకాయన బస్సుదిగాడు. మెల్లగా చెట్టు నీడలోకి వచ్చి సోడా తాగి బెంచీ మీద కూచున్నాడు. అప్పటిదాకా కాగితంతో ఆడుతున్న కుక్కపిల్లతో సహా అక్కడ బెంచీల మీద కూచున్నాళ్లంతా ఆయన్నే చూస్తుండిపోయారు.  ఓ అరగంట తర్వాత బస్సు క్లీనర్‌ దగ్గరగా వెళ్లి పలకరించాడు..‘సామీ ఎవరు మీరు? ఇక్కడ ఎవరు కావాల?’ అని. చిన్న గడ్డం సవరించుకుంటూ ‘నర్సిమ్మ కొట్టుకెల్లి   బీడీకట్టట్టుకురారా అంటూ ఆ స్వామి ఆదేశించాడు. అంతే ఆయన మాటతీరు  బాగా దగ్గరగా చూసిన ఆ కుర్రాడు.. ఒరేయ్‌  ఈడు సాములోరు గాదురా.. మన  సత్తిగాడు అని గావుకేక వేశాడు. ఏదో వజ్రాన్ని కనుగొన్నట్టు బస్టాండ్‌ అంతా పరిగెడుతూ అందరికీ స్వామి అసలు పేరుతో సహా ప్రకటించాడు. అంతే వీలయినంతమంది సత్తి చుట్టూ చేరి  అయినా ఇదేం యాశంరా ’ అంటూ ప్రేమగానే తిట్టారు.  సదరు స్వామి నవ్వి,  వేషం మార్చాల్సిన పరిస్థితి వచ్చింది. వీధిపేరు, ఊళ్లో బావిపేరు, మున్సిపల్‌ స్కూలు పేరు.. ఇలా అన్నీ  మార్చేస్తున్నారు. నన్నూ మారుస్తారని  ముందుగా నేనే మారిపోయాను. ఎవరో మనల్ని మార్చడం కన్నా మనకు మనము మారడం ఉత్తమం కదా  అన్నాడు స్వామి సత్తి. అందరూ తలగోక్కున్నారు. వీడిలానే వీడి మాటా అర్దమై చావదు, ఏం చెబుతున్నావో సరింగజెప్పరా పిచ్చి సన్నాసీ  అని అరిచింది అరటిపళ్లు అమ్మే ముసలామె. గొంతు సవరించుకుని సత్తి సామి..  అంతా రామమయం  అంటే కేవలం సినిమాలో ఎస్పీ గొంతు చించుకున్న పాటే అనుకున్నామా, కానీ  అది అంతటితో ఆగలేదు, అంతా రామమయం అంటే అంతటా, అన్నింటా రామమయం చేయాలని కొందరు కాషాయాలు బిగించారు. మీకింకా ఆ సంగతి తెలియలేదు. తెలిసేప్పటికీ మీ ఇళ్ల పేర్లన్నీ రాముడితో, కృష్ణుడితో నిండిపోతాయి నాయనలారా  అంటూ జ్ణానబోధ చేశాడు స్వామి సత్తి.  అదెట్టా? అడిగారు కొందరు. దేవర తలచుకుంటే ఊరేం ఖర్మ దేశమే పేరు మార్చుకుంటుంది. భరతావని మనది. జండా పట్టుకుని చాలా చక్కగా నవ్వుతూ నిలబడి ఉంటుంది. ఆ మాతను మనసులో నిలుపుకుని అంతే పద్దతిలో మనం నడచుకోవాలి అని  ఏలికలు నువ్వూ నేనూ చూడని పాతతరం సీనియర్‌ నాయకుల స్ఫూర్తితో, భక్తి రసం తలకెక్కించుకుని రైల్లో, విమానాల్లో బయలుదేరి వీలయినన్ని ప్రాంతాలు, భవనాలు, కూడళ్లు, గ్రామాల పేర్లు అమాంతం మార్చేస్తున్నారు. అదో దండు. లోకంలో వారిని మించిన రామభక్తులు ఉండటం అసాధ్యం అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. మీ యింట్లో పెద్దతరం వారూ వీళ్ల ముందు బలాదూర్‌. బతికిబట్టకట్టమంటూ ఇచ్చే కార్డు ముక్క కూడా స్వయంగా రాములవారి భిక్షట. ఏలిక స్వయంగా రామభక్తుడు. అందువల్ల ప్రజలంతా చచ్చినట్టు రామసంకీర్తనతోనే కార్యాలయాల్లో, బడిలో కాలం గడపాలేగాని వేరే లోకం ఉండకూడదు.  అలాగాకుంటే ఆంజనేయులవారికి చెడ్డ కోపం వస్తుందని, కండల మీద బొమ్మలు వేసుకున్న వస్తాదులు ఊరూరా తిరుగుతున్నారు.ఈ భక్తి పారవశ్యంలో వీలయినన్ని ఊళ్లు, బజార్లు, బస్టాండ్ల పేర్లు మారుస్తూ పోతున్నారు. అలవాటులో పొరపాటుగా నా పేరూ మార్చేస్తారేమోనని ముందు జాగ్రత్తకోసం కాషాయం ధరించా.  ఇంతలో ఎవరో సైకిల్‌ మీద పోతూ ‘జై శ్రీరామ్‌!’ అని అరుస్తూ వెళ్లాడు.   కొంత దూరం వెళ్లి ఆగి మళ్లీ  వెనక్కి వచ్చి అటుగా సిగెరెట్టు తాగుతూ వెళుతోన్న కుర్రాడిని అడ్డగించాడు. నీకు దేశభక్తి లేకపోతే ఎలాగయ్యా.. ఏలిక దేశ ప్రగతి కోసం  సంస్కృతిని కాపాడేందుకు ఎంత చమటోడుస్తున్నాడు.. జైశ్రీరామ్‌ అను ఆయనకు ఉపశమనం కలుగుతుంది అన్నాడు.  ఛస్తే అన్ను.. ఆయనకు దురదేస్తే.. నేను గోక్కోడం ఏమిటయ్యా బుద్ధుందా?’ అని ఎదురు తిరిగాడు.. అంతే ఓ అరగంట అలా గొంతు చించుకున్నారు. ఆనక అలసిపోయి విడిపోయారు.  రాములవారికీ పార్టీ సభ్యత్వం అంటగట్టినవారు దేశాన్ని ఒకే రంగు పులిమి ఓట్లు గుద్దించుకోవడమనే వారి భవిష్యత్‌ ప్రణాళిక. డబ్బు చేసినవాడికి జబ్బో లెక్కా.. రాముడిని ఎలాగయినా వాడుకోవచ్చని నిర్ధారించుకున్నాక కౌసల్య రూపంలో ఎవరు గుండెలు బాదుకున్నా ఏమీ కాదు..!
కార్పొరేషన్ మేయర్లు, మున్సిపల్ ఛైర్‌పర్సన్‌ల రిజర్వేషన్లను తెలంగాణ  ప్రభుత్వం ఖరారు చేసింది. రాష్ట్రంలోని 121 మున్సిపాలిటీల్లో ఎస్టీలకు 5, ఎస్సీలకు 17, బీసీలకు 38 మున్సిపల్ ఛైర్‌పర్సన్ పదవులను కేటాయించారు. అలాగే మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు వర్తిస్తాయి. ఈ మేరకు మున్సిపల్ శాఖ డైరెక్టర్ శ్రీదేవి శనివారం (జనవరి 17) ఉత్తర్వులు జారీ చేశారు.  ఇక  కార్పొరేషన్‌ చైర్మన్లకు ఖరారు చేసిన రిజర్వేషన్లు ఈ విధంగా ఉన్నాయి. కొత్తగూడెం కార్పొరేషన్‌  ఎస్టీ జనరల్, రామగుండం కార్పొరేషన్‌కు ఎస్సీ జనరల్, మహబూబ్ నగర్ కార్పొరేషన్ బీసీ మహిళ, మంచిర్యాల కార్పొరేషన్ బీసీ జనరల్, కరీంనగర్ కార్పొరేషన్ బీసీ జనరల్, జీహెచ్ఎంసీ మహిళ జనరల్,  గ్రేటర్ వరంగల్ జనరల్, ఖమ్మం, నల్గొండ, నిజామాబాద్ కార్పొరేషన్‌లలో మహిళ జనరల్‌ను ఖరారు చేశారు.
ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం కేసులో వైసీపీ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డికి ఈడీ నోటీసులు జారీ చేసింది.  2019 నుంచి ఐదేళ్ల పాటు ఆంధ్రప్రదేశ్ లో జగన్ నేతృత్వంలోని వైసీపీ అధికారంలో ఉన్న సంగతి తెలిసిందే. జగన్ హయాంలో అనుసరించిన మద్యం విధానంలో అవకతవకలు, అక్రమాలు, మనీలాండరింగ్ చట్ట ఉల్లంఘనలపై ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ దర్యాప్తు చేస్తున్న సంగతి తెలిసిందే.  గత ప్రభుత్వ హయాంలో మద్యం వ్యాపారానికి సంబంధించిన పెద్ద ఎత్తున మనీలాండరింగ్, హవాలా లావాదేవీలు జరిగాయన్న ఆరోపణలపై ఈ దర్యాప్తు సాగుతోంది.   మద్యం సేకరణ వ్యవస్థను ఆటోమేటెడ్ ప్రక్రియ నుండి మాన్యువల్ ఆమోదాలకు మార్చడం, తద్వారా కొన్ని సంస్థలకు ప్రయోజనం చేకూరేలా ఒప్పందాల మార్పిడికి దోహదపడిందని ఈడీ తన దర్యాప్తులో ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చింది.   కాగా ఈ కేసును ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక దర్యాప్తు బృందం కూడా దర్యాప్తు చేస్తున్న సంగతి తెలిసిందే. సిట్ ఇప్పటికే ఈ కేసులో చాలా మందిని అరెస్టు చేసింది వారిలో కొందరు బెయిలుపై విడుదల కాగా, ఇంకా కొందరు రిమాండ్ ఖైదీలుగా ఉన్నారు. ఈ కేసులో విజయసాయి కూడా ఇప్పటికే సిట్, ఈడీ విచారణను ఎదుర్కొన్నారు. ఇప్పుడు తాజాగా ఈ నెల 22 విచారణకు రావాల్సిందిగా విజయసాయికి ఈడీ నోటీసులు పంపడం రాజకీయంగా కూడా ప్రాధాన్యత సంతరించుకుంది. వైసీపీ ద్వారా వచ్చిన రాజ్యసభ సభ్యత్వానికీ, వైసీపీకీ రాజీనామే చేసి రాజకీయాలకు గుడ్ బై చెప్పేశాననీ, వ్యవసాయమే తన వ్యాపకమని చెప్పుకుంటున్న విజయసాయి ఈడీ విచారణలో ఏం చెబుతారన్న ఆసక్తి, ఉత్కంఠ సర్వత్రా నెలకొని ఉంది. ఇప్పటికే పలు సందర్భాలలో వైసీపీ నేతలపై విమర్శలు చేసిన విజయసాయి ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం విషయంలో ఈడీ విచారణలో  వెల్లడించే విషయాలు కీలకం కానున్నాయంటున్నారు.  
తెలంగాణలో ఫిరాయింపు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వ్యవహారం క్లైమాక్స్ కు చేరుకుంది.  మొత్తం పది మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై ఫిరాయింపు ఆరోపణలు ఉండగా, వారిపై అనర్హత వేటు విషయంలో అసెంబ్లీ స్పీకర్  గడ్డం ప్రసాద్ కుమార్ ఇప్పటికే ఏడుగురు ఎమ్మెల్యేలపై తన నిర్ణయాన్ని వెలువరించారు. ఆ ఏడుగురూ పార్టీ ఫిరాయించారనడానికి ఎటువంటి ఆధారాలూ లేవనీ, వారు బీఆర్ఎస్ లోనే ఉన్నారనీ స్పష్టమైనే తీర్పు ఇచ్చారు.   ఇక ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, జగిత్యాల ఎమ్మెల్యే మాకనూరు సంజయ్ లపై స్పీకర్ నిర్ణయం తీసుకోవలసి ఉంది. ఈ ముగ్గురిలో కూడా దానం నాగేందర్ పరిస్థితి ఒకింత భిన్నంగా ఉంది. ఎందుకంటే ఆయన బీఆర్ఎస్ టికెట్ పై విజయం సాధించిన తరువాత కాంగ్రెస్ కండువా కప్పుకోవడమే కాకుండా, ఆ పార్టీ తరపఫున లోక్ సభ ఎన్నికలలో పోటీకి కూడా దిగారు. ఈ నేపథ్యంలో ఆయన ఇప్పటికీ బీఆర్ఎస్ లోనే ఉన్నారని స్పీకర్ చెప్పడానికి ఇసుమంతైనా అవకాశం లేదని అంటున్నారు. ఈ నేపథ్యంలో ఆయన ముందున్న మార్గమేంటని పరిశీలిస్తే.. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి అనర్హత వేటు నుంచి తప్పించుకోవడమే కాకుండా, తన రాజీనామా ద్వారా వచ్చే ఉప ఎన్నికలో కాంగ్రెస్ తరఫున బరిలోకి దిగడం. ఇది ఒక్కటే దానం నాగేందర్ ను అనర్హత వేటు నుంచి బయటపడేయగదని పరిశీలకులు అంటున్నారు. అలా కాకుండా ఎమ్మెల్యేగా కొనసాగి అనర్హత వేటుకు గురైతే తదుపరి ఎన్నికలలో పోటీకి కూడా ఆయన అనర్హుడయ్యే అవకాశం ఉందంటున్నారు.   బహిరంగంగా వేరే పార్టీ గుర్తుపై పోటీ చేసిన వ్యక్తి పార్టీ మారలేదు అని స్పీకర్ తీర్పు ఇచ్చే అవకాశాలు ఇసుమంతైనా లేవని అంటున్నారు.   
ALSO ON TELUGUONE N E W S
  మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi), డైరెక్టర్ అనిల్ రావిపూడి(Anil Ravipudi) కాంబినేషన్ లో రూపొందిన 'మన శంకర వరప్రసాద్ గారు' మూవీ.. ఈ సంక్రాంతి కానుకగా విడుదలై బాక్సాఫీస్ దగ్గర సంచలనాలు సృష్టిస్తోంది. ఇప్పటికే వరల్డ్ వైడ్ గా రూ.200 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేయగా.. ఫుల్ రన్ లో రూ.300 కోట్ల క్లబ్ లో చేరడం ఖాయంగా కనిపిస్తోంది. 'మన శంకర వరప్రసాద్ గారు' సక్సెస్ ని అటు చిరంజీవి, ఇటు రావిపూడి ఇద్దరూ ఎంతగానో ఎంజాయ్ చేస్తున్నారు. ఇలాంటి సమయంలో 'చిరంజీవి వర్సెస్ అనిల్ రావిపూడి' అనే న్యూస్ ఆసక్తికరంగా మారింది. (Mana Shankara Vara Prasad Garu)   రీ ఎంట్రీ తర్వాత చిరంజీవికి సంక్రాంతి ఎంతగానో కలిసొస్తుంది. 'ఖైదీ నెం.150', 'వాల్తేరు వీరయ్య', 'మన శంకర వరప్రసాద్ గారు' సినిమాలు సంక్రాంతికే విడుదలై సక్సెస్ అయ్యాయి. దీంతో నెక్స్ట్ సంక్రాంతిపై కూడా చిరంజీవి కన్నేసినట్లు తెలుస్తోంది. చిరంజీవి తన 158వ సినిమాని బాబీ కొల్లి దర్శకత్వంలో చేస్తున్నాడు. కేవీఎన్ ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ఈ మూవీని 2027 సంక్రాంతికి విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం.   Also Read: 'మన శంకర వరప్రసాద్ గారు' కలెక్షన్స్.. చిరంజీవి సంచలన రికార్డు!   అనిల్ రావిపూడికి కూడా సంక్రాంతి దర్శకుడిగా పేరుంది. ఇప్పటిదాకా ఆయన తొమ్మిది సినిమాలు డైరెక్ట్ చేయగా.. అందులో నాలుగు సంక్రాంతికి విడుదలై సక్సెస్ అయినవే. 'ఎఫ్-2', 'సరిలేరు నీకెవ్వరు', 'సంక్రాంతికి వస్తున్నాం', 'మన శంకర వరప్రసాద్ గారు' సినిమాలు సంక్రాంతి కానుకగా విడుదలై విజయం సాధించాయి. ఇదే ఉత్సాహంతో నెక్స్ట్ సంక్రాంతిపై కూడా అనిల్ కర్చీఫ్ వేస్తున్నాడు. తన తదుపరి ప్రాజెక్ట్ ని వెంకటేష్ తో ప్లాన్ చేస్తున్న అనిల్ రావిపూడి.. ఈ సినిమాని 2027 సంక్రాంతికి తీసుకురావాలని టార్గెట్ గా పెట్టుకున్నట్లు తెలుస్తోంది.   Also Read: 'మన శంకర వరప్రసాద్‌ గారు' మూవీ రివ్యూ    మొత్తానికి 2026 సంక్రాంతికి 'మన శంకర వరప్రసాద్ గారు'తో బ్లాక్ బస్టర్ అందుకున్న చిరంజీవి, అనిల్ రావిపూడి.. 2027 సంక్రాంతికి సై అంటే సై అంటూ బరిలో దిగబోతున్నారన్నమాట. మరి రాబోయే పొంగల్ ఫైట్ లో ఎవరు పైచేయి సాధిస్తారో చూడాలి.  
  మలేషియా మెంబర్ ఆఫ్ పార్లమెంట్ దాతుక్ శరీ Dr M శరవణన్ చేతుల మీదుగా మలేషియాలోని సైబర్ జయ అనే ప్రదేశంలో జనవరి 5న శుద్ధ్ విలాస్ రెస్టారెంట్ సెకండ్ బ్రాంచ్ ప్రారంభించారు. ఇప్పటికే హైదరాబాద్ లోని మల్కాజిగిరిలో శుద్ధ్ విలాస్ మొదటి బ్రాంచ్ ఉండగా.. ఇప్పుడు మలేషియాలో రెండో బ్రాంచ్ మొదలు పెట్టడం, అక్కడి ప్రజలకు కూడా బెస్ట్ హైజీన్ ఫుడ్, సౌత్ ఇండియన్ ఫుడ్ అందించనుండటం పట్ల ఆనందంగా ఉందని శుద్ధ్ విలాస్ యాజమాన్యం చెబుతోంది. గ్లోబల్ వైజ్ ఇంకా చాలా దేశాల్లో చైన్ ఆఫ్ రెస్టారెంట్స్‌గా తమ బ్రాంచెస్ ఓపెన్ చేయనున్నట్లు వారు తెలిపారు.    ఈ కార్యక్రమంలో, శుద్ధ్ విలాస్ వ్యవస్థాపకులు శశికాంత్, శ్రీరామ్, ఇతర భాగస్వాములు మరియు తదితరులు పాల్గొన్నారు.    ఈ సందర్భంగా వ్యవస్థాపకులు మాట్లాడుతూ.. "హైదరాబాద్ మల్కాజిగిరిలో ఓపెన్ చేసిన శుద్ధ్ విలాస్ రెస్టారెంట్ సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతోంది. అక్కడి కస్టమర్స్ తాము అందించే ఫుడ్ చాలా బాగుందనే ఫీడ్ బ్యాక్ ఇస్తున్నారు. అదే ఉత్సాహంతో ఇప్పుడు మలేషియాలో ఓపెన్ చేశాము.  త్వరలోనే దుబాయ్ సహా ఇంకా మరిన్ని దేశాల్లో రెస్టారెంట్స్ ఓపెన్ చేస్తాము. బెస్ట్ హైజీన్ ఫుడ్, సౌత్ ఇండియన్ ఫుడ్ అందించడమే లక్ష్యంగా మా రెస్టారెంట్స్ ఓపెన్ చేస్తున్నాము. పలు వెరైటీ ఫుడ్స్ అందిస్తూ అత్యుత్తమ నాణ్యతతో టిఫిన్స్ మరియు భోజనం రెడీ చేసిపెడతాము. ఆహార ప్రియులకు పూర్తి సంతృప్తికర ఫుడ్ అందించడమే లక్ష్యంగా శుద్ధ్ విలాస్‌ను దేశ విదేశాల్లో విస్తరించుకుంటూ వెళ్తాము" అని అన్నారు.   ఆరోగ్యకరమైన, హైజీన్ ఆహారానికి ఉన్న, పెరుగుతున్న డిమాండ్‌ దృష్ట్యా మలేషియాకు శుద్ధ్ విలాస్ రావడం పట్ల స్వాగతిస్తున్నామని, తమ ప్రజలకు కూడా బెస్ట్ ఫుడ్ అందించి శుద్ధ్ విలాస్ బ్రాండ్ ప్రాముఖ్యత చాటుకోవాలని మలేషియా మెంబర్ ఆఫ్ పార్లమెంట్ దాతుక్ శరీ Dr M శరవణన్ అన్నారు.  
  ఈ సంక్రాంతికి పెద్దగా హడావుడి లేకుండా థియేటర్లలో అడుగుపెట్టి.. కంటెంట్ తో సర్ ప్రైజ్ చేసిన సినిమా అంటే 'నారీ నారీ నడుమ మురారి'(Nari Nari Naduma Murari) అని చెప్పవచ్చు. సంక్రాంతి హీరోగా శర్వానంద్ పేరుని ఈ మూవీ మరింత బలంగా నిలిపింది.   ఈ జనరేషన్ లో సంక్రాంతి హీరోగా శర్వానంద్(Sharwanand)కి పేరుంది. స్టార్స్ సినిమాలతో పోటీపడి హిట్ కొట్టడం శర్వాకు అలవాటు. 2016 సంక్రాంతికి 'నాన్నకు ప్రేమతో', 'డిక్టేటర్', 'సోగ్గాడే చిన్నినాయనా' వంటి పెద్ద హీరోల సినిమాలతో పోటీపడి 'ఎక్స్‌ప్రెస్ రాజా'తో హిట్ కొట్టాడు. 2017 సంక్రాంతికి 'ఖైదీ నెం.150', 'గౌతమిపుత్ర శాతకర్ణి' లాంటి బడా సినిమాలతో తలపడి 'శతమానం భవతి'తో సక్సెస్ సాధించాడు. 2026 సంక్రాంతికి కూడా ఆ మ్యాజిక్ ని రిపీట్ చేశాడు శర్వానంద్. పోటీగా 'ది రాజా సాబ్', 'మన శంకర వరప్రసాద్' వంటి భారీ సినిమాలున్నా.. హ్యాట్రిక్ సంక్రాంతి విజయాన్ని ఖాతాలో వేసుకున్నాడు.   శర్వానంద్ హీరోగా 'సామజవరగమన' ఫేమ్ రామ్ అబ్బరాజు దర్శకత్వంలో రూపొందిన మూవీ 'నారీ నారీ నడుమ మురారి'. ఏకే ఎంటర్టైన్మెంట్స్ నిర్మించిన ఈ రొమాంటిక్ కామెడీ ఫిల్మ్ సంక్రాంతి కానుకగా జనవరి 14 సాయంత్రం థియేటర్లలో అడుగుపెట్టింది. ఇందులో సంయుక్త మీనన్, సాక్షి వైద్య హీరోయిన్స్. ఎక్స్-గర్ల్ ఫ్రెండ్, గర్ల్ ఫ్రెండ్ మధ్య నలిగిపోయే వ్యక్తిగా శర్వానంద్ కనిపించాడు.    ఈ సంక్రాంతి సినిమాల్లో ప్రమోషన్స్ పరంగా తక్కువ హడావుడి చేసింది 'నారీ నారీ నడుమ మురారి'నే. దీంతో ఈ సారి శర్వానంద్ కి షాక్ తప్పదనే అభిప్రాయం వ్యక్తమైంది. కానీ అందరి అంచనాలను తలకిందులు చేస్తూ.. కంటెంట్ తో సర్ ప్రైజ్ చేసింది ఈ మూవీ.    స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు నాన్ స్టాప్ గా నవ్వించిన 'నారీ నారీ నడుమ మురారి'.. మొదటి షో నుంచే పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకుంది. దీంతో రోజురోజుకి స్క్రీన్లు, వసూళ్లు పెరిగిపోతున్నాయి. మొదటి వారంలోనే ఈ సినిమా బ్రేక్ ఈవెన్ సాధించడం ఖాయంగా కనిపిస్తోంది. దీంతో శర్వానంద్ ఖాతాలో మరో సంక్రాంతి విజయం పడినట్లే.   Also Read: నారీ నారీ నడుమ మురారి మూవీ రివ్యూ  
50 ఏళ్లుగా చిత్ర పరిశ్రమలో ఉంటూ తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో 200కి పైగా సినిమాల్లో నటించారు ‘ఊర్వశి’ శారద. అందులో 125 సినిమాలు మలయాళంలోనే చెయ్యడం విశేషం. అందుకే కేరళ ప్రభుత్వ అత్యున్నత పురస్కారమైన జె.సి.డేనియల్‌ అవార్డుకు 2024కిగాను శారదను ఎంపిక చేశారు. ఈ అవార్డులో భాగంగా రూ.5 లక్షల నగదు బహుమతి, ప్రశంసాపత్రం అందజేయనున్నారు. జనవరి 25న తిరువనంతపురంలో జరిగే కేరళ రాష్ట్ర చలనచిత్ర అవార్డుల వేడుకలో ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ చేతుల మీదుగా ఈ పురస్కారాన్ని అందుకోబోతున్నారు శారద.    1945 జూన్‌ 25న గుంటూరు జిల్లా తెనాలిలో వెంకటేశ్వర్లు, సత్యవతి దంపతులకు జన్మించారు శారద. ఆమె అసలు పేరు సరస్వతి. 1955లో వచ్చిన కన్యాశుల్కంతో బాలనటిగా కెరీర్‌ ప్రారంభించిన శారద.. చాలా తక్కువ సమయంలోనే నటిగా మంచి పేరు తెచ్చుకున్నారు. ముఖ్యంగా భావోద్వేగంతో సాగే పాత్రలు, సామాజిక సమస్యలపై రూపొందిన బలమైన పాత్రలతో ప్రేక్షకుల్ని కట్టి పడేశారు. ఉత్తమనటిగా జాతీయ అవార్డులు అందుకోవడంలోనూ అరుదైన గౌరవాన్ని దక్కించుకున్నారు శారద. ‘తులాభారం’ (1968), ‘స్వయంవరం’ (1972), ‘నిమజ్జనం’ (1977).. ఇలా మూడు సినిమాల్లో ప్రదర్శించిన అద్వితీయమైన నటనకు మూడు సార్లు ఉత్తమనటిగా అవార్డులు ఆమెను వరించాయి. ఆరోజుల్లో ఉత్తమనటికి ఇచ్చే అవార్డును ఊర్వశి పేరుతో పిలిచేవారు. అలా శారద పేరు ముందు ఊర్వశి ఇంటి పేరుగా చేరింది.    సినిమా రంగంలోనే కాదు, రాజకీయాల్లోనూ తనదైన ముద్ర వేశారు శారద. 1996లో 11వ లోక్‌సభకు తెనాలి నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ తరఫున ఎంపీగా ఎన్నికై రాజకీయ రంగంలోనూ సేవలందించారు. ప్రస్తుతం ఆమె పూర్తిగా సినిమాలకు, రాజకీయాలకు దూరంగా ఉంటూ ప్రశాంతమైన జీవితాన్ని గడుపుతున్నారు. ప్రస్తుతం సినిమాలు చేయకపోయినా ప్రేక్షకులు పదికాలాలపాటు గుర్తుంచుకోదగిన పాత్రలు చేశారు ఊర్వశి శారద. 
  అనిల్ రావిపూడి(Anil Ravipudi)కి సంక్రాంతి డైరెక్టర్ గా పేరు పడిపోయింది. అనిల్ డైరెక్ట్ చేసిన 'ఎఫ్-2', 'సరిలేరు నీకెవ్వరు', 'సంక్రాంతికి వస్తున్నాం' సినిమాలు సంక్రాంతి సీజన్ లో విడుదలై సక్సెస్ సాధించాయి. ముఖ్యంగా గతేడాది సంక్రాంతికి విడుదలైన 'సంక్రాంతికి వస్తున్నాం' బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఇక ఈ సంక్రాంతికి వచ్చిన 'మన శంకర వరప్రసాద్ గారు' అంతకుమించిన హిట్ దిశగా దూసుకుపోతోంది. (Mana Shankara Vara Prasad Garu)   ఇప్పటిదాకా అనిల్ రావిపూడి డైరెక్షన్ లో తొమ్మిది సినిమాలు వస్తే.. అందులో నాలుగు సినిమాలు సంక్రాంతికి వచ్చి విజయం సాధించినవే. వచ్చే సంక్రాంతికి కూడా మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి రావిపూడి సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.   'సంక్రాంతికి వస్తున్నాం', 'మన శంకర వరప్రసాద్ గారు' వంటి వరుస భారీ విజయాల తర్వాత అనిల్ రావిపూడి తదుపరి సినిమా ఎవరితోననే ఆసక్తి నెలకొంది. అయితే రావిపూడి మరోసారి వెంకటేష్ తో చేతులు కలపబోతున్నట్లు సమాచారం. 'ఎఫ్-2', 'ఎఫ్-3', 'సంక్రాంతికి వస్తున్నాం' తర్వాత వెంకటేష్-అనిల్ కాంబోలో వస్తున్న నాలుగో సినిమా ఇది. ఇప్పటికే ఈ ప్రాజెక్ట్ కి సంబంధించి ఇద్దరి మధ్య కథా చర్చలు కూడా జరిగాయట.    ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో 'ఆదర్శ కుటుంబం హౌస్ నెం.47' అనే సినిమా చేస్తున్నారు వెంకటేష్. ఇది వేసవిలో ప్రేక్షకుల ముందుకు రానుంది. దీని తర్వాత వెంకటేష్ చేయబోయే సినిమా రావిపూడితోనే అని సన్నిహిత వర్గాల్లో వినిపిస్తున్న మాట. జూన్ లో సినిమాను స్టార్ట్ చేసి, 2027 సంక్రాంతికి రిలీజ్ చేయాలని చూస్తున్నారట. మరి ఇది 'సంక్రాంతికి వస్తున్నాం'కి సీక్వెలా? లేక కొత్త కథనా? అనేది తెలియాల్సి ఉంది.   Also Read: 'మన శంకర వరప్రసాద్ గారు' మూవీ రివ్యూ  
  మెగాస్టార్ చిరంజీవి నటించిన లేటెస్ట్ మూవీ 'మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Vara Prasad Garu) బాక్సాఫీస్ ని షేక్ చేస్తోంది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ మూవీ.. సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కేవలం ఐదు రోజుల్లోనే రూ.200 కోట్ల గ్రాస్ క్లబ్ లో చేరింది. చిరంజీవి కెరీర్ లో ఈ ఫీట్ సాధించిన మూడో సినిమా ఇది కావడం విశేషం.   చిరంజీవి కెరీర్ లో రూ.200 కోట్ల గ్రాస్ క్లబ్ లో చేరిన సినిమాలు గతంలో రెండు ఉన్నాయి. 2019లో విడుదలైన 'సైరా నరసింహారెడ్డి' రూ.240 కోట్లకు పైగా గ్రాస్ రాబట్టగా, 2023లో వచ్చిన 'వాల్తేరు వీరయ్య' రూ.230 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసింది.     ఇక 'మన శంకర వరప్రసాద్ గారు' విషయానికొస్తే.. నిర్మాతలు ప్రకటించిన దాని ప్రకారం.. ఐదు రోజుల్లోనే ఈ మూవీ రూ.226 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది. అంటే మొదటి వారంలోనే ఈ మూవీ రూ.250 కోట్ల క్లబ్ లో చేరి, చిరంజీవి కెరీర్ లో హైయెస్ట్ గ్రాసర్ గా నిలవనుంది.   ఇదిలా ఉంటే, టాలీవుడ్ సీనియర్ స్టార్స్ లో మూడు రూ.200 కోట్ల గ్రాస్ సినిమాలున్న ఏకైక హీరో చిరంజీవి కావడం విశేషం.   Also Read: 'మన శంకర వరప్రసాద్ గారు' మూవీ రివ్యూ  
  ఈ సంక్రాంతికి విడుదలైన సినిమాలలో 'అనగనగా ఒక రాజు'(Anaganaga Oka Raju) ఒకటి. నవీన్ పొలిశెట్టి, మీనాక్షి చౌదరి జంటగా నటించారు. నూతన దర్శకుడు మారి దర్శకత్వంలో సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మించింది. జనవరి 14న థియేటర్లలో అడుగుపెట్టిన ఈ మూవీ.. పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకుంది. కామెడీతో పాటు చివరిలో ఎమోషన్ కూడా బాగానే వర్కౌట్ అయింది. ముఖ్యంగా నవీన్ వన్ మ్యాన్ షోతో అదరగొట్టాడనే పేరు వచ్చింది.   సంక్రాంతి సీజన్ కావడంతో పాటు, పాజిటివ్ టాక్ కూడా రావడంతో 'అనగనగా ఒక రాజు' మంచి వసూళ్లతో సత్తా చాటుతోంది. మేకర్స్ తెలిపిన దాని ప్రకారం.. మూడు రోజుల్లోనే ఈ సినిమా వరల్డ్ వైడ్ గా రూ.60 కోట్లకు పైగా గ్రాస్ రాబట్టింది.     మొదటి రోజు వరల్డ్ వైడ్ గా రూ.22 కోట్ల గ్రాస్ సాధించిన అనగనగా ఒక రాజు.. రెండో రోజు రూ.19.2 కోట్లు, మూడో రోజు రూ.19.9 కోట్లతో సత్తా చాటింది. దీంతో మూడు రోజుల్లోనే రూ.61.1 కోట్ల గ్రాస్ తో సంచలనం సృష్టించింది. ఒక యంగ్ హీరో నటించిన సినిమా.. కేవలం మూడు రోజుల్లోనే ఈ స్థాయి వసూళ్లు రాబట్టడం మామూలు విషయం కాదు.   Also Read: 'అనగనగా ఒక రాజు' మూవీ రివ్యూ  
ఇటీవ‌లికాలంలో సౌత్ డైరెక్ట‌ర్ల‌కు బాలీవుడ్‌లో మంచి డిమాండ్ ఏర్ప‌డిన విష‌యం తెలిసిందే. సౌత్ నుంచి వెళ్లిన ఎన్నో సినిమాలు బాలీవుడ్‌లో బాక్సాఫీస్‌ని షేక్ చేశాయి. ముఖ్యంగా టాలీవుడ్ డైరెక్ట‌ర్లంటే అక్క‌డ ఎంతో క్రేజ్ ఉంది. అయితే ఆ డైరెక్ట‌ర్ల లిస్ట్‌లో లేని ఓ టాలీవుడ్ డైరెక్ట‌ర్‌తో ఓ బాలీవుడ్ సంస్థ భారీ ఒప్పందాన్ని కుదుర్చుకుంది. అత‌నెవ‌రో కాదు, ర‌మేష్‌వ‌ర్మ‌.   బాలీవుడ్ అగ్ర నిర్మాణ పెన్ స్టూడియోతో క‌లిసి డీల్ కుదుర్చుకున్నారు ర‌మేష్ వ‌ర్మ‌. ఈ సంస్థ‌తో క‌లిసి మొత్తం 10 సినిమాలు చెయ్యాల్సి ఉండ‌గా మొద‌టి విడత‌లో నాలుగు ప్రాజెక్టులు ఓకే అయ్యాయి. ఈ నాలుగు సినిమాల బ‌డ్జెట్ సుమారు 150 కోట్ల రూపాయ‌లు ఉంటుంద‌ని తెలుస్తోంది. త‌మిళ స్టార్స్ విక్ర‌మ్‌, ధ్రువ్‌, లారెన్స్‌, బాలీవుడ్ స్టార్ అజయ్ దేవ్‌గ‌ణ్‌ల‌తో ఈ నాలుగు సినిమాలు ఉంటాయ‌ని తెలుస్తోంది. ఈ సినిమాల‌కు సంబంధించిన క‌థ‌లు కూడా ఫైన‌ల్ అయిపోయాయి. త్వ‌ర‌లోనే అఫీషియ‌ల్ ఎనౌన్స్‌మెంట్ వచ్చే అవ‌కాశం ఉంద‌ని స‌మాచారం. ఈ నాలుగు సినిమాల టైటిల్స్‌, ఇత‌ర న‌టీన‌టులు, సాంకేతిక నిపుణుల వివ‌రాల‌ను ప్ర‌క‌టిస్తారు.    ఇదిలా ఉంటే.. ద‌ర్శ‌కుడు ర‌మేష్‌వర్మ `కొక్కొరొక్కో` అనే ఓ చిన్న సినిమాను స్వీయ ద‌ర్శ‌క‌త్వంలో నిర్మిస్తున్నారు. స‌మ్మ‌ర్‌లో ఈ చిత్రాన్ని విడుద‌ల చేసేందుకు స‌న్నాహాలు చేస్తున్నారు. అలాగే బాలీవుడ్‌లో ఘ‌న‌విజ‌యం సాధించిన `కిల్` చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేయ‌బోతున్నారు. ఈ సినిమాకి సంబంధించిన స్క్రిప్ట్ వ‌ర్క్ కూడా పూర్త‌యింది. త్వ‌ర‌లోనే ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లే అవ‌కాశం ఉంది. 
గత కొన్నిరోజులుగా టాలీవుడ్‌ని ఊపేస్తున్న అనసూయ, శివాజీ వివాదం రోజుకో మలుపు తిరుగుతూ మరింత ముదురుతోంది. హీరోయిన్ల వేషధారణపై శివాజీ చేసిన వ్యాఖ్యలపై స్పందించి తనదైన స్టైల్‌లో సమాధానం చెప్పిన అనసూయపై ఎంత ట్రోలింగ్‌ నడిచిందో అందరికీ తెలిసిందే. అక్కడా, ఇక్కడా అనే భేదం లేకుండా ప్రతి ప్లాట్‌ఫామ్‌లోనూ ఆమెకు వ్యతిరేకత కనిపించింది. పనిలోపనిగా కొందరు విశ్లేషకులు, నేతలు శివాజీ, అనసూయ వివాదంలో తలదూర్చి కాస్త ఘాటుగానే స్పందించారు.    గత కొన్నిరోజులుగా జరుగుతున్న ఈ వ్యతిరేక కార్యక్రమంపై స్పందించిన అనసూయ.. మీడియా ముఖంగా కన్నీరు మున్నీరయ్యారు. అంతటితో ఆగకుండా తనను అప్రతిష్టపాలు చెయ్యాలని ప్రయత్నించిన వారిని ఒక్కొక్కరిగా ఏరి మొత్తం 73 మందిపై కేసు పెట్టారు. అందులో మీడియాలో తన గురించి మాట్లాడినవారు, ట్రోలింగ్‌ చేసిన వారు, కొన్ని యూట్యూబ్‌ ఛానల్స్‌ కూడా ఉన్నాయి. బొజ్జ సంధ్యారెడ్డితోపాటు ప్రియా చౌదరి గోగినేని, పావని, శేఖర్‌ బాషా, రజినీ లాంటివారు ప్రధానంగా కనిపిస్తున్నారు. అలాగే పలు న్యూస్‌ టీవీలో యాంకర్లు, సోషల్‌ మీడియా స్టార్లు ఉన్నారు.    ఈ కేసు విషయాన్ని సింగర్‌ చిన్మయి స్వయంగా సోషల్‌ మీడియా వేదికగా ప్రకటించారు. యాంకర్‌ అనసూయను ఉద్దేశించి రాజకీయ నేత చేసిన వ్యాఖ్యలను మీడియాలో ఎక్కువగా ప్రచారం చేశారని చిన్మయి అన్నారు. మహిళల పట్ల గౌరవం ఉంటే వెంటనే సంధ్యారెడ్డిని కాంగ్రెస్‌ పార్టీ నుంచి సస్పెండ్‌ చెయ్యాలని ఆమె డిమాండ్‌ చేశారు. ఇప్పుడు చిన్మయి చేసిన వ్యాఖ్యలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. 
Charming Star Sharwanand has once again proved that the Sankranti season is his home ground, delivering a huge blockbuster with his latest family entertainer, Nari Nari Naduma Murari. Previously, he shook the box office with hits like Shatamanam Bhavati and Express Raja, and now NNNM has become hit with a unanimous positive response. Directed by Ram Abbaraju and produced by AK Entertainments, the film has turned into a volcanic success, delighting family audiences across the nation. Sharwanand said, "I was always confident that NNNM will be a huge blockbuster. Not just for Sankranti, the film would have been blockbuster any day it releases but the season will enhance the returns. I am happy looking at audience reactions thanking me for delivering a big hit and I am thrilled to see so much love for our film." He further mentioned the hardships faced during shooting but credited the team effort and ground-breaking writing for this victory. In an exciting update that has thrilled fans, Sharwanand has officially locked his next massive project with the king of comedy, Srinu Vaitla. Doubling down on his lucky streak, the actor announced that this highly anticipated collaboration is being aimed for Sankranti 2027.  Cheekily, he added, "Sharwa Sankranti is a lucky charm for the industry and I will keep continuing it." With Samyuktha and Sakshi Vaidya adding glamour to the current hit, the stage is now set for another storm in 2027. Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them. 
ఆచార్య చాణక్యుడు గొప్ప తత్వవేత్త.. ఆయన 2వేల సంవత్సరాల కిందట చెప్పిన మాటలు నేటికీ అనుసరణీయంగా ఉన్నాయి. ఆయన గొప్ప తత్వవేత్త, జీవితం గురించి ఎన్నో సత్యాలు చెప్పాడు. ముఖ్యంగా మనిషి వ్యక్తిత్వం గురించి, మనిషి ఎలా  ఉండాలనే విషయాల గురించి ఆయన చెప్పిన విధానాలు ఎన్ని తరాలు మారినా ప్రతి ఒక్కరూ అనుసరించేలా ఉన్నాయి. ఎవరైనా సరే.. సక్సెస్ ఫుల్ లైఫ్ ను గడపాలని అనుకున్నా,  జీవితంలో గొప్పగా ఎదగాలన్నా చాణక్యుడు చెప్పిన సూత్రాలు పాటిస్తే చాలు.. వారు విజేతలు కావడాన్ని ఎవరూ అడ్డుకోలేరు. అలాగే వ్యక్తి జీవితంలో శాంతి లేకపోవడానికి కొన్ని కారణాలను కూడా పంచుకున్నాడు చాణక్యుడు. వ్యక్తి చేసే కొన్ని తప్పులే వారి జీవితంలో శాంతి కోల్పోయేలా చేస్తాయట.  వాటి గురించి తెలుసుకుంటే.. ఆచార్య చాణక్యుడు చెప్పిన దాని ప్రకారం.. ఇంట్లో పూజలు చేయకపోవడం, దేవుని నామాన్ని స్మరించకపోవడం జరిగే ఇళ్లలో ప్రజలు ఎప్పుడూ ఇబ్బందుల్లో ఉంటారట. అలాంటి ఇళ్లలో నివసించే ప్రజలు  సంతోషంగా ఉండరట.  పైగా  ఏదో ఒక సమస్యతో సతమతమవుతూ ఉంటారట.ఇలాంటి ఇళ్లలో నివసించే వారి జీవితాలు రోజు రోజుకూ దిగజారి పోతుంటాయట. మహిళలతో అసభ్యంగా ప్రవర్తించే లేదా అగౌరవపరిచే వ్యక్తి ఎప్పటికీ సంతోషంగా జీవించలేడట. అలా చేసిన ప్రతిసారీ జీవితంలో ఎదుగుదలకు ఆటంకం కలుగుతుందట. మహిళలను గౌరవించని కుటుంబాలు ఎప్పటికీ అభివృద్ధి చెందవని చాణక్యుడు స్పష్టంగా  చెప్పాడు. ఎందుకంటే లక్ష్మీ దేవి అలాంటి ఇళ్లలో ఎప్పుడూ నివసించదని కూడా స్పష్టంగా చెప్పాడు. పెద్దలు,  పిల్లలతో దుర్భాషలాడే ఇళ్లలో ఎల్లప్పుడూ అశాంతి నెలకొనే ఉంటుంది. అలాంటి ఇళ్లలో ధనం నిలవదు,  తరచుగా ఆర్థిక సంక్షోభాలు ఎదురవుతూ ఉంటాయట. పైగా ఇలాంటి ఇళ్లలో నెగిటివ్ ఎనర్జీ ఎక్కువ ఉంటుందట. ఇతరుల సంపదపై  దృష్టి పెట్టేవారి జీవితంలో ఎప్పటికీ శాంతి ఉండదట.  ఇతరుల సంపదను ముట్టుకోవడం అనేది పాముతో సమానం. అందుకే పరుల సొమ్ము పాము వంటిది అన్నారు అని చాణక్యుడు చెబుతాడు. పైన చెప్పుకున్నవన్నీ వ్యక్తి జీవితంలో శాంతి లేకపోవడానికి కారణం అవుతుంది.  అందుకే శాంతి కోరుకునే వారు వాటికి దూరంగా ఉండటం మంచిది.                                *రూపశ్రీ.  
వివాహం ప్రతి ఒక్కరి జీవితంలో చాలా కీలకం. వివాహ వయస్సు కాలక్రమేణా పెరుగుతోంది. చదువు పూర్తయిన తర్వాత అబ్బాయి అయినా  అమ్మాయి అయినా  కెరీర్‌లో స్థిరపడిన సెటిల్ అయిన తర్వాత  మాత్రమే వివాహం చేసుకోవాలనుకుంటారు. అబ్బాయిలు ఆలస్యంగా వివాహం చేసుకోవడం పెద్దగా సమస్య కాదు, కానీ పెద్ద వయసులో అమ్మాయిలకు మంచి సంబందాలు రావడం లేదన్నది ఒప్పుకోవాల్సిన నిజం.  అమ్మాయిలకు వివాహానికి సరైన వయస్సు ఏమిటి అనే  విషయంపై సరైన స్పష్టత ఎక్కడా లేదు. అబ్బాయిల మాదిరిగానే అమ్మాయిలు కూడా మొదట తమ కెరీర్‌ను నిర్మించుకోవాలని, ఆ తర్వాత వివాహం చేసుకోవాలని కోరుకుంటున్నారు. కానీ 30ఏళ్ల  తర్వాత ఆడపిల్లల తల్లిదండ్రులకు పెద్ద సవాల్ ఎదురవుతోంది. దీనిగురించి రెలేషన్షపి నిపుణులు చెబుతున్న విషయాలు ఏంటో తెలుసుకుంటే.. కెరీర్ అడ్డంకి.. గతంలో ఆడపిల్లల చదువు, కెరీర్ కు ఇంత ప్రాముఖ్యత లేదు.  టెంత్,  ఇంటర్,  డిగ్ర లాంటివి పూర్తవ్వగానే ఆడపిల్లలకు పెళ్ళి చేసేవారు. పెళ్లి తర్వాత మహిళలు కూడా ఇంటిని,  భర్త,  పిల్లలు, అత్తమామలను చూసుకుంటూ ఉండే వారు. కానీ నేటికాలంలో అలా లేదు.. తల్లిదండ్రులు ఆడపిల్లలను కూడా కొడుకులతో సమానంగా చదివిస్తున్నారు. ఆడపిల్లలు తమ కెరీర్ ను అద్బుతంగా మలుచుకోవడంలో సపోర్ట్ చేస్తున్నారు. దీని వల్ల ఆడపిల్లలు కూడా తమ కెరీర్ ను బిల్డ్ చేసుకుని సెటిల్ కావడానికి సమయం పడుతోంది.  అది కాస్తా 30 ఏళ్ల వరకు వివాహానికి దూరం ఉండేలా చేస్తోంది. ఇదే తల్లిదండ్రులకు పెద్ద సవాల్ గా మారుతోంది.  ఆర్థిక స్వాతంత్ర్యం సంపాదించిన కూతురికి పెళ్లి చేయడం చాలా కష్టతరంగా మారింది. అబ్బాయిలకు కాస్త బెటర్.. అమ్మాయిల మాదిరిగానే పెద్ద వయసు అబ్బాయిలకు  కూడా వివాహం చేసుకోవడంలో కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. అయితే అబ్బాయి బాగా సంపాదిస్తే చిన్న వయసు అమ్మాయిల నుండి సంబంధాలు వస్తుంటాయి.  తల్లిదండ్రులు  తమ కూతురికి  ఆర్థిక భద్రత కల్పించే వ్యక్తికి ఇచ్చి వివాహం చేయాలని అనుకుంటారు. అయితే అమ్మాయిల విషయంలో అలా కాదు. ఒక అమ్మాయి ఎంత సంపాదించినా, ఆమె పెద్దది అయితే మంచి జత దొరకడం కష్టంగా ఉంటుంది. అబ్బాయిలు ఆశించడమే పెద్ద సమస్య.. కాలం ఎంత మారినా అది మగవారి ఆలోచనలు మార్చలేకపోతోంది.  మగవాళ్లకు తమ భార్యల పట్ల ఉన్న అవగాహన పెద్దగా మారలేదు. చాలా మంది మగవాళ్లు ఎక్కువగా ఆశిస్తున్నారనే మాట చాలా నిజం.  భార్య అటు ఉద్యోగం చేసి సంపాదించాలి,  అలాగే ఇటు ఇంటికి రాగానే ఇంటి పనులు అన్నీ ఆమె చేసి భర్తకు సేవలు చేస్తూ పిల్లలను కూడా చూసుకోవాలని కోరుకుంటారు.  చాలా సార్లు తమ తల్లితో భార్యను పోలుస్తారు,  వస్త్రధారణ నుండి అమ్మాయి పరిచయాల వరకు, స్నేహితులు, వ్యక్తిగత స్పేస్ వంటి విషయాలలో కూడా ఆబ్బాయిలు అమ్మాయిలను చికాకు పెడతారు. ఇలాంటివి అమ్మాయిలకు చాలా ఇబ్బంది కలిగిస్తాయి.  ఇవి కాస్తా వైవాహిక జీవితంలో అడ్డంకులకు కారణం అవుతున్నాయి. అమ్మాయిల వయసు పెరిగితే ఇదే సమస్య.. 30ఏళ్ళ తర్వాత అమ్మాయిలకు వివాహం విషయంలో ఎదురయ్యే అతి పెద్ద సమస్య అమ్మాయి సంతానోత్పత్తి ఆమె వయస్సుతో ముడి పడి  ఉంటుంది. వయస్సు పెరిగే కొద్దీ అమ్మాయి సంతానోత్పత్తి తగ్గుతుంది. అమ్మాయి పెద్దదైతే ఆ జంట పిల్లల కోసం ముందుగానే ప్రణాళిక వేసుకోవాలి. ఇది వైవాహిక జీవితాన్ని సరిగ్గా ఆస్వాదించకుండా చేస్తుంది. నేటి కాలంలో అమ్మాయిలు ఆర్థిక విషయం నుండి చాలా వరకు స్వతంత్రత కలిగి ఉన్నారు.  తన సొంత ఆలోచన ఉంటుంది. ఆమె తన భర్త లేదా కుటుంబం చెప్పే ప్రతిదానితో ఏకీభవించలేదు. ఆమె తన సొంత ఆలోచనకు కూడా ప్రాధాన్యత ఇస్తుంది. ఇదే భార్యభర్తల మధ్య సమస్యలు సృష్టిస్తోంది. సరైన వయసు.. మేజర్ అయితే చాలు అమ్మాయిలు, అబ్బాయిలు వివాహానికి అర్హత పొందుతారు. కానీ వివాహానికి  సరైన వయసు అనేది వ్యక్తిగతంగా ఉంటుంది.  అమ్మాయిలు కెరీర్ ను సీరియస్ గా తీసుకోవడం వివాహానికి ఇబ్బంది కలిగించే విషయమే అయినప్పటికీ చాలా మంది మహిళలు తమ కెరీర్ ను తొందరగా సెటిల్ చేసుకుని సరైన జోడి వెతుక్కుని హాయిగా సెటిల్ అవుతున్నారు.  అంటే.. వివాహం విషయంలో అబ్బాయిల  ఆలోచన కూడా ముఖ్యం.  వారు కూడా మారితేనే భార్యాభర్తల వైవాహిక జీవితం బాగుంటుంది.                           *రూపశ్రీ.  
  పండుగ అంటే అదొక  ఆనందం.  చదువులు, వృత్తి, ఉద్యోగం, సౌకర్యాలు.. ఇలా కారణాలు ఏవైనా సరే..  పట్టణంలో ఉన్నవారు పండుగ వచ్చిందంటే చాలు పల్లె బాట పడతారు. తెలుగు వారు ఎంతో సంబరంగా చేసుకునే పండుగలలో సంక్రాంతికి ఓ రేంజ్ ఉంది.  భోగి, సంక్రాంతి, కనుమ.. పేరిట ముచ్చటగా మూడురోజులు జరిగే ఈ పండుగ వైభోగం గ్రామాలలో మాత్రమే కనిపిస్తుంది. భోగి మంటలు, భోగి పళ్లు..  పొంగళ్లు, పిండి వంటలు.. పశువుల అలంకరణ,  కోడి పందేలు.. కొత్త అల్లుళ్లకు చేసే మర్యాదలు.. ప్రేమ, అభిమానం, ఆప్యాయత.. ఒక్కటనేమిటి? సంక్రాంతి పండుగలో లేనిదంటూ ఏదీ లేదు.. భోగి మంటలు, భోగి పళ్లు.. జనవరి 13వ తేదీన భోగి పండుగ.  ఈరోజు ఉదయాన్నే చలికి సవాల్ విసురుతూ ఉదయాన్నే లేచి భోగి మంటలు వేయడం చాలా చోట్ల కనిపిస్తుంది. ఇంట్లో ఉన్న పాత సామాను నుండి పిడకల హారం వరకు భోగి మంటలలో వేస్తారు.   ఇక ఇదే రోజు సాయంత్రం చిన్న పిల్లలకు భోగి పళ్లు పోస్తారు. ఈ భోగి పళ్లలో చెరకు ముక్కలు,  రేగు పళ్లు,  చిల్లర పైసలు, పువ్వులు ఉంటాయి.  ఇలా భోగి పళ్లు పోయడం వెనుక పురాణ కథనం ఉంది.  భోగి పండుగ రోజే బదరీ వనంలో  శ్రీహరిని పసిబిడ్డగా మార్చి దేవతలందరూ రేగుపళ్లు పోశారట.  బదరీ పళ్లనే రేగు పళ్లు అంటారు.  అందుకే కాల క్రమేణా భోగి రోజు చిన్న పిల్లలకు భోగి పళ్లు పోయడం ఆచారం అయ్యింది.  పిల్లలకు భోగి పళ్లు పోస్తే ఆ శ్రీహరి ఆశీస్సులు ఉంటాయని, పిల్లలు ఆరోగ్యంగా ఉంటారని చెబుతారు. పొంగల్.. సంక్రాంతి.. మూడు రోజులు జరిగే సంక్రాంతి పండుగలో రెండవ రోజు ప్రధాన పండుగ అయిన సంక్రాంతి జరుపుకుంటారు. సంక్రాంతి పండుగను పొంగళ్ల పండుగ అంటారు. ఈ రోజు సూర్యుడి గమనం మారుతుంది.  సూర్యుడు ఉత్తరాయణంలోకి ప్రవేశిస్తాడు. అది కూడా మకర రాశిలోకి ప్రవేశిచడం వల్ల దీనికి మకర సంక్రాంతి అని పేరు వచ్చింది. సంక్రాంతి రోజు పొంగళ్లు వండి నైవేద్యం పెడతారు. చాలా చోట్ల రథం ముగ్గులు వేసి సూర్యుడికి స్వాగతం చెబుతారు.  ఈ రోజు చేసే దాన ధర్మాలకు చాలా ప్రాముఖ్యత ఉంది.  కొత్తగా పెళ్లైన వారు ఈ పండుగను అత్తారింట్లో చేసుకోవడం, సావిత్రి గౌరీ వ్రతం చేసుకోవడం జరుగుతుంది. కనువిందు చేసే కనుమ.. సంక్రాంతి పండుగ ముఖ్యంగా రైతన్నల పండుగ. ఈ రోజు  రైతులు తమకు పంటలు పండించడంలో సహాయపడే పశువులకు కృతజ్ఞతలు చెప్పుకుంటారు. పశువులను చాలా మంది తమ కుటుంబంలో భాగంగా చూస్తారు.  పశువులకు స్నానం చేయించి అందంగా అలంకరిస్తారు. పశువులకు విశ్రాంతిని ఇస్తారు.  కొత్త పంట చేతికి వచ్చిన ఆనందంలో  సంబరాలు చేసుకుంటారు.  కోనసీమ ప్రాంతాలలో కోడి పందెల సందడి సాగుతుంది.  కోట్ల రూపాయల డబ్బులు చేతులు మారతాయి. కోడి పుంజుల పౌరుషాలు, వాటిలో పోరాట పటిమ ముక్కున వేలేసుకునేలా చేస్తాయి.  సంక్రాంతి పండుగంటే పల్లెలదే.. పండుగ ఆస్వాదించాలంటే పల్లెకు పోవాల్సిందే..!                           *రూపశ్రీ.
భారతీయుల ఆహారంలో నువ్వులు,  పల్లీలు, బెల్లం చాలా ప్రముఖమైనవి.  ఇవి లేని బారతీయ ఆహారాన్ని అస్సలు ఊహించలేరు కూడా.  అయితే నువ్వులు, పల్లీలు,బెల్లాన్ని సూపర్ ఫుడ్స్ అని కూడా అంటారు.  పోషకాహార నిపుణులు ఈ ఆహారాలను తప్పనిసరిగా తీసుకోమని తమ పేషెంట్లకు సిఫారసు చేస్తారు కూడా. ప్రాంతాలను బట్టి వీటిని విభిన్న రకాలుగా ఆహారం తయారీలో వాడుతుంటారు. సాంప్రదాయ వంటకాలు ఇవి లేకుండా అసంపూర్ణంగా ఉంటాయి.  అయితే వీటిని సూపర్ ఫుడ్స్ అని ఎందుకు పిలుస్తారు? ఇలా పిలవడం వెనుక ఉన్న కారణం ఏంటి? తెలుసుకుంటే.. నువ్వులు,  వేరుశెనగల్లో ప్రోటీన్, విటమిన్లు,  ఒమేగా 6 వంటి పోషకాలు ఉంటాయి.ఇక బెల్లం ఐరన్, మెగ్నీషియం,  కాల్షియం వంటి ముఖ్యమైన ఖనిజాలను కలిగి ఉంటుంది. ఈ మూడు సూపర్‌ఫుడ్‌లు వేడెక్కించే ప్రభావాన్ని కలిగి ఉంటాయి. అందుకే వీటిని శీతాకాలపు సూపర్‌ఫుడ్‌లు అని కూడా పిలుస్తారు. వాటి పోషక విలువలు వాటిని మరింత ప్రత్యేకంగా చేస్తాయి. బెల్లంలో పోషక విలువలు.. బెల్లంలో సుక్రోజ్,  ఫ్రక్టోజ్ రూపంలో చక్కెరలు ఉంటాయి. అందువల్ల ఇది తీపి రుచిని కలిగి ఉంటుంది, తక్షణ శక్తిని అందిస్తుంది. బెల్లంలో ముఖ్యమైన విటమిన్లు A, C,  E ఉంటాయి. ఇందులో ఐరన్ తో  సహా అనేక ముఖ్యమైన ఖనిజాలు కూడా ఉన్నాయి. బెల్లం తింటే కలిగే ప్రయోజనాలు.. జీర్ణవ్యవస్థ ఆరోగ్యం మెరుగుపడుతుంది, కాలేయం,  రక్తం శుద్ది జరుగుతుంది. శ్వాసకోశ ఇన్ఫెక్షన్లు తొలగిపోతాయి. మలబద్ధకం సమస్య తగ్గుతుంది.  మానసిక, శారీరక ఒత్తిడి తగ్గుతుంది. ప్రీమెన్స్ట్రువల్ సిండ్రోమ్ నుండి ఉపశమనం కలిగిస్తుంది. రక్తహీనత ప్రమాదం తగ్గుతుంది.  చర్మ ఆరోగ్యం మెరుగుపడుతుంది. గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది.  శరీరానికి మంచి ఎనర్జీ లభిస్తుంది. నువ్వుల పోషక విలువలు.. నువ్వులలో కాల్షియం, మెగ్నీషియం, ఐరన్,  పొటాషియం వంటి ఖనిజాలు సమృద్ధిగా ఉంటాయి. వాటిలో విటమిన్ B6 కూడా ఉంటుంది. నువ్వులు తింటే కలిగే ప్రయోజనాలు.. ఎముకలు దృఢంగా మారుతాయి, వాపు తగ్గుతుంది.  ఆర్థరైటిస్ నొప్పి నుండి ఉపశమనం కలిగిస్తుంది. జీర్ణ ఆరోగ్యం బాగుంటుంది.  మెనోపాజ్ సమయంలో హార్మోన్లను బాలెన్స్డ్ గా ఉంచడంలో సహాయపడుతుంది. థైరాయిడ్ ఆరోగ్యానికి మేలు చేస్తుంది. రక్తహీనత ప్రమాదం తగ్గుతుంది,  రక్తపోటు అదుపులో ఉంటుంది.  రక్తంలో చక్కెర స్థాయిలు  నియంత్రణలో ఉంటాయి.  కొలెస్ట్రాల్,  ట్రైగ్లిజరైడ్ స్థాయిలు తగ్గుతాయి. వేరుశనగ పోషక విలువలు.. వేరుశెనగల్లో ప్రోటీన్,  కొవ్వుతో సహా అనేక ఆరోగ్యకరమైన పోషకాలు ఉంటాయి. వాటిలో అనేక ముఖ్యమైన విటమిన్లు,  ఖనిజాలు కూడా ఉంటాయి. వేరుశనగ తినడం వల్ల కలిగే ప్రయోజనాలు.. బరువు తగ్గడానికి సహాయపడుతుంది. వాపు తగ్గుతుంది. డయాబెటిస్ వచ్చే ప్రమాదం తగ్గుతుంది.  క్యాన్సర్ ప్రమాదం తగ్గుతుంది,  కొలెస్ట్రాల్ స్థాయి తగ్గుతుంది. గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది,  పిత్తాశయంలో రాళ్ల ప్రమాదం తగ్గుతుంది. వేరుశనగ రెగ్యులర్ గా తింటే  జీవితకాలం పెరుగుతుంది.  మెదడు పనితీరు మెరుగుపడుతుంది.  కంటి ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఈ కారణాల వల్లనే ఈ మూడు ఆహారాలను సూపర్ ఫుడ్స్ అని అంటారు. మరీ ముఖ్యంగా శీతాకాలం సూపర్ ఫుడ్స్ అని అంటారు.      *రూపశ్రీ.     గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...                          
ఏ జబ్బు వచ్చినా దాన్ని నయం చేయడానికి మందులు చాలా అవసరం. మందులను సరైన సమయంలో తీసుకోవాలి.  అలాగే వైద్యుల సలహా లేకుండా మందులు వాడటం అస్సలు మంచిది కాదు.  అయితే  కొన్ని మందులను డాక్టర్ల సలహా లేకుండా ఎలాంటి సంకోచం లేకుండా ఎక్కువ కాలం పాటు సమస్య అనిపించినప్పుడల్లా వాడుతూనే ఉంటారు. మరీ ముఖ్యంగా ఎక్కువకాలం పాటు మధుమేహం,  గ్యాస్ సమస్యలకు మందులు వాడుతూనే ఉంటారు. ఈ మందుల వాడకం వల్ల విటమిన్ లోపాలు వస్తాయని వైద్యులు చెబుతున్నారు. అందులోనూ విటమిన్-బి12 చాలా అరుదుగా లభించే విటమిన్.  ఈ విటమిన్-12 విటమిన్ డయాబెటిస్,  అసిడిటి మందుల వాడకం వల్ల తగ్గుతుందని వైద్యులు చెబుతున్నారు. దీని గురించి వివరంగా తెలుసుకుంటే.. డాక్టర్ దగ్గరకు వెళ్లి వైద్యుల వద్ద రెగ్యులర్ గా చెకప్ చేయించుకునే అలవాటు భారతదేశంలో చాలా తక్కువ. మరీ ముఖ్యంగా గ్యాస్ సంబంధిత సమస్యలు,  డయాబెటిస్ వంటి   సమస్యలకు ఎక్కువ సార్లు వైద్యులను కలవాల్సిన అవసరం లేదని అనుకుంటారు.  ఈ సమస్యలు ఉన్నప్పుడు ఒకసారి వైద్యులను కలిస్తే వారు రాసిచ్చిన మందులను అలా జీవితాంతం అయినా మింగుతూ సమస్యను నిద్రపుచ్చే ఆలోచనలో ఉంటారు. కానీ చాలామందికి తెలియని విషయం ఏమిటంటే.. ఈ మందులను డాక్టర్ ను కలిసిన ప్రతి సారి డోస్ తగ్గించడం, ఎక్కించడం జరుగుతుంది.  ఇది తెలియకుండా ఒకే డోస్ ను దీర్ఘకాలం వాడటం విటమిన్ స్థాయిల మీద ప్రమాదం చూపిస్తుంది.  గ్యాస్, డయాబెటిస్ కు సంబంధించిన మందులను సంవత్సరాల తరబడి డాక్టర్ సలహా లేకుండా రెగ్యులర్ గా వాడుతూ ఉంటే అది శరీరంలో విటమిన్-బి12 లోపానికి కారణం అవుతుందని వైద్యులు చెబుతున్నారు. లక్షణాలు ఇవే.. అలసట,  తలతిరుగుడు,  తిమ్మిరి, చేతులు కాళ్లలో జలదరింపు వంటి సమస్యలు విటమిన్-బి12 లోపిస్తే వస్తాయి. మెట్లు ఎక్కడం కష్టంగా అనిపించడం,  మతిమరుపు వంటి సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. విటమిన్-బి12 ఎంత ఉండాలి.. నేషనవ్ ఇన్స్టిట్యూట్ ఆప్ హెల్త్ ప్రకారం సీరం,  ప్లాస్మా లో విటమిన్-బి12 స్థాయిలు 200 లేదా 250pg/ml కంటే తక్కువగా ఉంటే ల్యాబ్ రిపోర్ట్ లలో అది చాలా తక్కువగా ఉన్నట్టు.  ఇది విటమిన్-బి12 లోపాన్ని సూచిస్తుంది. గ్యాస్, డయాబెటిస్ మందులను ఎక్కవ కాలం వాడటం వల్ల పేగులలో  విటమిన్-12 శోషణ దెబ్బతింటుంది. అలాగే కడుపు ఆమ్లాన్ని కూడా తగ్గిస్తుంది. దీని వల్ల   ఆహారం నుండి ప్రోటీన్ విడుదల జరగదు.  అందుకే గ్యాస్, డయాబెటిస్ మందులను ఎక్కువ కాలం డాక్టర్ సలహా లేకుండా వాడటం మంచిది కాదని అంటున్నారు.                             *రూపశ్రీ. గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...
  ఈ రోజుల్లో చెడు జీవనశైలి,  తప్పుడు ఆహారపు అలవాట్లు  గుండె ఆరోగ్యంపై  చాలా చెడ్డ  ప్రభావాన్ని చూపుతాయి. అంతేకాకుండా మన చిన్న చిన్న రోజువారీ అలవాట్లు గుండెకు హాని కలిగిస్తాయి.  ఇవి క్రమంగా  గుండె జబ్బుల ప్రమాదాన్ని పెంచుతాయి. దీనితో పాటు నేటికాలంలో అన్ని సమస్యలకు మందులు వాడటం,  ఖరీదైన చికిత్సలు తీసుకోవడం  కూడా కొన్నిసార్లు  శరీరానికి హాని కలిగిస్తాయి.  అధిక వ్యాయామం కూడా గుండెపై చెడు ప్రభావాన్ని చూపుతుంది.  ఇలా నేటి కాలంలో చాలా కారణాలుగా గుండె జబ్బుల ప్రమాదం క్రమేపీ పెరుగుతోంది.  గుండె ఆరోగ్యాన్ని సంరక్షించుకోవాలంటే.. కొన్ని సులభమైన,  ఆరోగ్యకరమైన పద్ధతులను పాటించడం చాలా ముఖ్యం. ఇది శరీరానికి ఎటువంటి హాని లేకుండా  చేస్తుంది. అటువంటి 5 సులభమైన అలవాట్ల గురించి తెలుసుకుంటే.. భోజనం తర్వాత నడక.. భోజనం తర్వాత 10 నిమిషాల నడక చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. కాబట్టి భోజనం చేసిన వెంటనే కూర్చునే అలవాటును మార్చుకోవాలి.  ప్రతి భోజనం తర్వాత 10 నిమిషాల తేలికపాటి నడక చేయాలి. ఇది రక్తంలో చక్కెరను నియంత్రిస్తుంది. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది,  బరువు పెరగకుండా నిరోధిస్తుంది. ఒమేగా-3 ఫ్యాట్స్.. రోజువారీ ఆహారంలో ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు ఉండేలా చూసుకోవాలి. ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు గుండె,  మానసిక ఆరోగ్యానికి చాలా ముఖ్యమైనవి. ఇది గుండె, మెదడు,  వాపును నియంత్రించడంలో సహాయపడుతుంది. సాల్మన్, చేపలు, అవిసె గింజలు,  వాల్‌నట్‌ల వంటి వాటి నుండి  ఒమేగా-3ని పుష్కలంగా పొందవచ్చు. నిద్ర.. మంచి గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ప్రతిరోజూ 7-9 గంటలు మంచి నిద్ర పొందడం ముఖ్యం. ఈ రోజుల్లో చాలా మందికి రాత్రిపూట ఫోన్ వాడటం,  టీవీ చూడటం అలవాటు కారణంగా నిద్ర సైకిల్ దారుణంగా దెబ్బతింటోంది. తక్కువ నిద్రపోవడం వల్ల ఊబకాయం, వ్యాధులు,  అలసట వంటి సమస్యలు వస్తాయి. ప్లాస్టిక్ నిషేధం.. మంచి గుండె ఆరోగ్యానికి ప్లాస్టిక్ వస్తువులను నివారించడం,  గాజు లేదా స్టీల్ కంటైనర్లు ఉపయోగించడం ముఖ్యం. ప్లాస్టిక్‌లో ప్రమాదకరమైన రసాయనాలు ఉంటాయి.  ఇవి హార్మోన్లకు,  శరీరానికి హాని కలిగిస్తాయి. ప్లాస్టిక్ రసాయనాలు నెమ్మదిగా శరీరంలో విషాన్ని వ్యాపింపజేస్తాయి. ఇది క్యాన్సర్,  ఇతర వ్యాధులకు కారణమవుతుంది. అందువల్ల ఆహారాన్ని నిల్వ చేయడానికి గాజు లేదా స్టీల్  పాత్రలు మంచివి. ఇవి  గుండె ఆరోగ్యానికి అలాగే మొత్తం ఆరోగ్యానికి సురక్షితమైనవి. బరువు.. మంచి గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి  బరువు,  BMI ని చూస్తే సరిపోదు. రక్త పరీక్షలపై కూడా శ్రద్ధ వహించాలి.  బరువు లేదా BMI కంటే రక్త పరీక్ష చేయించుకోవడం చాలా ముఖ్యం. LDL, CRP,  ఫాస్టింగ్ ఇన్సులిన్ వంటి పరీక్షలు చేయించుకుంటూ ఉండాలి. తద్వారా గుండె ఆరోగ్యాన్ని పర్యవేక్షించవచ్చు. గుండె జబ్బులను నివారించడానికి ఇది ఉత్తమ మార్గం. క్రమం తప్పకుండా పరీక్షలు చేయించుకోవడం వల్ల సమస్యలను ముందుగానే గుర్తించవచ్చు. ఆహారం.. గుండె ఆరోగ్యాన్ని బాగా ఉంచుకోవాలంటే  ఆహారంలో పండ్లు,  ఆకుపచ్చ కూరగాయలను చేర్చుకోవాలి. వాటిలో  గుండెను బలంగా,  ఆరోగ్యంగా ఉంచే పోషకాలు ఉంటాయి.  వాటిని సరిగ్గా తినకపోతే, అది గుండెకు హాని కలిగిస్తుంది. ఈ రోజుల్లో, చాలా మంది ఏదో ఒక విషయం గురించి ఒత్తిడి తీసుకోవడం చాలా సహజం అయిపోయింది. ఇది గుండెపై కూడా చెడు ప్రభావాన్ని చూపుతుంది. అందుకే ఒత్తిడి లేకుండా చూసుకోవాలి.                                        *రూపశ్రీ. గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు..