LATEST NEWS
అంబానీ గ్యారేజ్‌లో ఎన్నో ఖరీదైన కార్లు ఉన్నాయి. అయితే తాజాగా నీతా అంబానీ ఖరీదైన కారు గురించి ఆసక్తికర విషయాలు  బయటకు వచ్చాయి. ఆ కారు ఖరీదు, దానిలోని ఫీచర్స్ గురించి వింటే మాత్రం కళ్లు బైర్లు కమ్మాల్సిందే.  ప్రపంచ కుబేరుల్లో ఒకరైన రిలయన్స్ ఇండస్ట్రీస్‌ అధినేత ముఖేష్ అంబానీ భార్య నీతా అంబానీ  గ్యారేజ్‌లో ఎన్నో ఖరీదైన కార్లు ఉన్నప్పటికీ   ఓ  కారు మాత్రం వార్తల్లో నిలుస్తోంది.  దాదాపు వంద కోట్ల రూపాయల విలువైన ఆ కారు ఖరీదు, అందులోని ఫీచర్ల గురించి ఆసక్తికర సమాచారం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ కారు దేశంలోనే అత్యంత ఖరీదైనదని అంటున్నారు.  ఆ కారు పేరు ఆడీ ఏ9 చమేలియన్ . ఈ కారు ఖరీదు అక్షరాలా వంద కోట్ల రూపాయలు. ఈ కారులో ఎన్నో ప్రత్యేకమైన ఫీచర్స్ ఉన్నాయట. వాటిల్లో ముఖ్యమైనది ఏంటంటే,  ఈ కారు ఊసరవెల్లిలా రంగులు మార్చుకోగలదట.  ఈ కారు ఎప్పటికప్పుడు తన రంగులను మార్చుకుంటుందట. ఒక్క బటన్ నొక్కితే చాలు,  కారు రంగు మారిపోతుందట. ఈ కారు పెయింటింగ్ పూర్తిగా ఎలక్ట్రిక్‌గా జరుగుతుందట. ప్రపంచవ్యాప్తంగా ఇలాంటి కార్లు కేవలం 11 మాత్రమే ఉన్నాయట.ఈ కారు సింగిల్-పీస్ విండ్‌స్క్రీన్, రూఫ్‌తో స్పేష్ షిప్‌లా కనిపిస్తుంది. అల్ట్రా-ఎక్స్‌క్లూజివ్ కారు అయిన ఈ ఆడి ఏ9 చమేలియన్ రెండు-డోర్ల కాన్ఫిగరేషన్‌తో ఉంటుంది. ఈ కారులో 4.0-లీటర్ V8 ఇంజిన్‌ అమర్చారు. ఇది  600 సీసీ హార్స్‌పవర్‌ కారు. కేవలం మూడున్నర సెకన్లలో 0 నుంచి 100 కిలోమీటర్ల   వేగాన్ని అందుకుంటుంది. దీని గరిష్ట వేగం గంటకు 250 కిలోమీటర్లు. అందుకే నీతా అంబానీకి ఇప్పటికే ఎన్నో లగ్జరీ కార్లు ఉన్నప్పటికీ ఈ కారు ప్రత్యేకంగా నిలుస్తోంది.
బంగారం తయారు చేస్తామంటూ జనాలను మోసం చేస్తున్న నిందితుల ముఠాను జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్టు చేశారు.   హిమాలయాల్లో దొరికే మూలికలతో బంగారం తయారు చేసి ఇస్తామంటూ నాగపూర్ కు చెందిన ఓ ముఠా హైదరాబాద్ లో మోసాలకు పాల్పడుతోంది. అమాయకుల నుంచి  లక్షల్లో డబ్బు చోరీ చేస్తున్న ముఠాలోని ముగ్గురిని ఓ బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు  అరెస్టు చేశారు. వివరాలిలా ఉన్నాయి. నాగపూర్ కు చెందిన గ్యాంగ్ హైదరాబాద్ లోకి ప్రవేశించి స్వామీజీ వేషధారణలో కష్టాలు తొలగిపోయేలా రెండు కేజీల బంగారం తయారుచేసి ఇస్తామంటూ అమాయక  జనాలను బురిడీ కొట్టిస్తూ వారి వద్ద నుండి లక్షల్లో డబ్బులు వసూలు చేస్తున్నారు ఈ క్రమంలోనే బంజారాహిల్స్ కి చెందిన గోపాల్ సింగ్ అనే వ్యక్తి ఈ గ్యాంగ్ మాయలో పడ్డాడు.  హిమాలయాల్లో దొరికే మూలికలతో , భస్మంతో తయారు చేసిన బంగారాన్ని మీ ఇంట్లో పెట్టుకుంటే కష్టాలన్నీ తొలగిపోతాయని, ప్రతి పనిలో విజయం సాధిస్తారంటూ నమ్మించి ...గోపాల్ సింగ్ వద్దనుండి 10 లక్షల రూపాయలు తీసుకొని... అతని అతని ఇంటికి వెళ్లి నెల రోజుల పాటు పూజలు చేసి అనంతరం ఒక ఎర్ర  బట్టలో రెండు కేజీల బంగారం ఉందంటూ వారి చేతికి ఇచ్చారు. వారం రోజులు పూజ గదిలో ఉంచిన అనంతరం దీనిని తెరిచి చూడాలని సూచించారు. అయితే గోపాల్ సింగ్ కుటుంబ సభ్యులకు అనుమానం వచ్చి ఐదు రోజుల తర్వాత ఆ బట్ట తెరిచి చూడగా బంగారపు రంగులో ఉన్న ఇనుప ముక్కలు కనిపించాయి. స్వామీజీలమంటూ తమకు ఆ ఇనుపముక్కలను అంటగట్టిన వారికి ఫోన్ చేయగా స్విచ్ఛాఫ్ రావడంతో మోసపోయినట్లు గ్రహించి జూబ్లీహిల్స్ పోలీసులకు  ఫిర్యాదు చేశారు.   కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆ ముఠాలోని ముగ్గు రిని అరెస్టు చేశారు. అయితే ప్రధాన నిందితుడు పరారీలో ఉన్నాడు. అతడి కోసం గాలిస్తున్నారు.  ఈ ముఠా నిజాంపేట్ లోని గద్వాల్ ఆయుర్వేదిక్ సెంటర్, నాగోల్ లోని మహాలక్ష్మి ఆయుర్వేదిక్ సెంటర్లలో ఏజెంట్లుగా పని చేస్తున్నారు. వీరు హిమాలయాల్లో నుండి భస్మం తీసుకువచ్చి... జనాలను నమ్మించి... మోసాలకు పాల్పడుతూ...    లక్షల్లో నగదు దోచేస్తున్నారు.  ఇప్పుడు నిందితులను అరెస్టు చేయడంతో మరిన్ని ఫిర్యాదులు వచ్చే అవకాశం ఉందని పోలీసులు భావిస్తున్నారు.  
ఏపీలో కూటమి సర్కార్ కీలక ఎన్నికల హామీ అయిన మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకం స్త్రీశక్తికి సంబంధించి ప్రభుత్వం సోమవారం (ఆగస్టు 10) మార్గదర్శకాలు విడుదల చేసింది. ఈ పథకం ఏయే బస్సుల్లో అమలవుతుంది, టికెట్ల జారీ ఎలా ఉంటుంది వంటి అన్ని వివరాలతో కూడిన  జీవోను ప్రభుత్వం విడుదల చేసింది.  ఈ జీవోలో ప్రభుత్వం మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణానికి అనుమతించే స్త్రీశక్తి పథకం ఆగస్టు 15 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అమలులోకి వస్తుందన్ని స్పష్టం చేసింది.  ఈ పథకంలో భాగంగా ఆంధ్రప్రదేశ్ స్ధానికులైన మహిళలు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించవచ్చు. అయితే ఇందుకు తగిన గుర్తింపు కార్డులను చూపించాల్సి ఉంటుంది. ఇక ట్రాన్స్ జండర్లకు సైతం ఈ పథకం వర్తిస్తుంది.  స్త్రీ శక్తి పథకం కింద   మహిళలు రాష్ట్రంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా ఆర్టీసీ బస్సు ల్లో ఉచితంగా ప్రయాణం చేయవచ్చు. బాలికలు, మహిళలు, ట్రాన్ జెండర్ లు ఈ ఉచిత ప్రయాణానికి అర్హులు. అయితే పల్లెవెలుగు, ఆర్డినరీ, సిటీ ఆర్డినరీ, ఎక్స్ ప్రెస్, మెట్రో ఎక్స్ ప్రెస్ బస్సుల్లో మాత్రమే ఈ పథకం కింద ఉచితంగా ప్రయాణించే అవకాశం ఉంటుంది.  సప్తగిరి ఎక్స్ ప్రెస్ , సూపర్ లగ్జరీ , నాన్ స్టాప్ సర్వీసులు, అంతర్రాష్ట్ర సర్వీసులు, ఎసీ సర్వీసుల్లో ఉచిత ప్రయాణానికి  అవకాశం ఉండదు. 
టీమిండియా స్టార్ ఆటగాళ్లు విరాట్ కోహ్లీ , రోహిత్ శర్మలు రెండేళ్ల తర్వాత జరగనున్న వన్డే ప్రపంచ కప్ లో ఆడటం అనుమానంగానే కనిపిస్తోంది.  గతేడాది టీ-20 ప్రపంచకప్ తర్వాత ఇద్దరూ ఒకేసారి అంతర్జాతీయ టీ-20లకు వీడ్కోలు పలికారు. ఇక, ఈ ఏడాది ఐపీఎల్ తర్వాత ఇద్దరూ ఒకేసారి టెస్ట్ ఫార్మాట్‌ నుంచి వైదొలిగారు. ప్రస్తుతం వీరిద్దరూ వన్డేల్లో మాత్రం టీమిండియాకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వైట్ బాల్ క్రికెట్‌లో గొప్ప ఆటగాళ్లుగా పేరు తెచ్చుకున్న కోహ్లీ, రోహిత్ త్వరలోనే వన్డే క్రికెట్ నుంచి కూడా వైదొలగబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఈ ఏడాది అక్టోబర్‌లో ఆస్ట్రేలియాలో టీమిండియా వన్డే సిరీస్ ఆడబోతోంది. ఆ సిరీస్ తర్వాత రోహిత్, కోహ్లీ ఒకేసారి వన్డేలకు కూడా రిటైర్మెంట్ ప్రకటించవచ్చని తెలుస్తోంది.  నిజానికి వీరిద్దరూ 2027 వన్డే ప్రపంచకప్ వరకు కొనసాగాలని భావిస్తున్నట్టు ఆ మధ్య వార్తలు వచ్చాయి. అయితే ఆ ప్రపంచకప్ ఆడాలంటే బీసీసీఐ నిబంధనల ప్రకారం వీరిద్దరూ ఈ ఏడాది డిసెంబర్‌లో జరిగే దేశీయ వన్డే సిరీస్ అయిన విజయ్ హజారే ట్రోఫీ ఆడవలసి ఉంటుంది. 2007 ప్రపంచ కప్‌లో రోహిత్, కోహ్లీ ఆడాలంటే అప్పటి వరకు వారిద్దరు ఫిట్‌నెస్‌ కాపాడుకోవడంతో పాటు ఫామ్‌లో ఉండటం అవసరం. ఈ నేపధ్యంలో వారిద్దరనీ ఎంపిక చేయడానికి బీసీసీఐ ఓ కండీషన్ పెట్టిందంట. ఈ ఏడాది డిసెంబరులో ప్రారంభమయ్యే విజయ్ హజారే ట్రోఫీలో వారిద్దూ పాల్గొంటేనే ప్రపంచకప్ స్క్వాడ్ కోసం వీరిని పరిగణనలోనికి తీసుకుంటామన్నదే ఆ కండీషన్ గా చెబుతున్నారు. అంటే విజయ్ హజారే ట్రోఫీలో  వీరు ఆడకపోతే వరల్డ్ కప్ దారులు మూసుకుపోయినట్టే.  ఇక టీమ్ ఇండియా కోచ్  యువ ఆటగాళ్లవైపే మొగ్గు చేపుతాడన్నది తెలిసిందే.  టెస్టుల విషయంలోనూ అదే జరిగిందనీ,  గిల్‌కు సారథ్యం ఇవ్వడం వెనుక కారణం అదే అంటున్నారు.  ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్‌లో ఆడాలనే తొలుత  రోహిత్, కోహ్లీ భావించారంట. కానీ భవిష్యత్తు అవసరాలు దృష్య్టా ఎంపిక కష్టమని బీసీసీఐ వర్గాలు చెప్పడంతోనే  వారు టెస్టులకు గుడ్ బై చెప్పారట. ఇంగ్లాండ్ టెస్టు సిరీస్‌లో బీసీసీఐ, గంభీర్ వ్యూహాలు ఫలించి భారత్ యువ ఆటగాళ్లు మెరుగైన ప్రదర్శనతో సిరీస్‌ను డ్రాగా ముగించారు.  ఆ క్రమంలో రోహిత్, కోహ్లీ భవితవ్వం ఏంటో మరో రెండు నెలల్లో వచ్చే ఆస్ట్రేలియా వన్టే సిరీస్‌లో తేలనుంది. ప్రస్తుతం టీమ్ ఇండియా కెప్టెన్‌గా రోహిత్ శర్మే ఉన్నాడు.  ఇటీవలే చాంపియన్స్ ట్రోఫీని రోహిత్ సారథ్యంలో ఇండియా నెగ్గింది.  అయితే  ఆస్ట్రేలియా వన్టే సిరీస్‌కి శుభమన్‌గిల్‌కే జట్టు పగ్గాలు అప్పగిస్తారని గట్టిగా వినిపిస్తోంది. ఇక పోతే కోహ్లీ, రోహిత్ లు వచ్చే వరల్డ్ కప్ లో ఆడతారా లేదా అన్నది విజయ్ హజారే ట్రోఫీ తేల్చేస్తుంది. ఆ  ట్రోఫీలో ఆడితేనే రోహిత్, కోహ్లీ పేర్లను ప్రపంచకప్ కోసం పరిశీలిస్తారు. ఒక వేళ ఆ ట్రోఫీలో వీరిరువురూ ఆడినా, అందులో వారు రాణించడంపైనే వరల్డ్ కప్ జట్టకు ఎంపక ఆధారపడి ఉంటుందని క్రీడా పండితులు అంటున్నారు. కాగా ఈ పరిస్థితుల నేపథ్యంలో యువ ఆటగాళ్లకు అవకాశాలు ఇవ్వాలనే ఉద్దేశంతో వీరిద్దరూ ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్ తరువాత  తమ రిటైర్మెంట్ ప్రకటిస్తారని ఊహాగానాలు కూడా వినబడుతున్నాయి. ఆస్ట్రేలియాలో ఈ ఏడాది అక్టోబర్‌లో జరిగే వన్డే సిరీస్ ముగిసిన తర్వాత 2027 ప్రపంచకప్ లోపు టీమిండియా మరో ఆరు వన్డే సిరీస్‌లు ఆడనుంది.
కాంగ్రెస్ సీనియర్ నేత, లోక్ సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీని పోలీసులు అరెస్టు చేశారు.  గత కొద్ది రోజులుగా ఓట్ల చోరీపై కాంగ్రస్ పార్టీ, ఆ పార్టీ నేతృత్వంలోని ఇండియా కూటమి  ఆందోళనలు, నిరసనలు కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే.  బీహార్‌లో అధికార పార్టీకి తొత్తుగా ఎన్నికల సంఘం వ్యవహరిస్తుందంటూ పార్లమెంట్ వేదికగా నిరసనలు తెలుపుతున్న విపక్షాలు  లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ ఆధ్వర్యంలో ఎన్నికల సంఘం కార్యాలయం ముట్టడికి బయల్దేరాయి. తాజాగా  సోమ వారం పార్లమెంట్ భవనం నుంచి ఈసీ  కార్యాలయానికి ప్లకార్డులు ప్రదర్శిస్తూ మార్చ్ నిర్వహించ తలపెట్టాయి.  అయితే విపక్షాల ర్యాలీని పోలీసులు అడ్డుకున్నారు. సంసద్ మార్గ్ కు వెళ్లే మార్గంలో బారికేడ్లు అడ్డుగా పెట్టారు. అయితే విపక్ష ఎంపీలు వాటిని దాటుకుని వేళ్లే ప్రయత్నం చేయడంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.  ఈ సందర్భంగా పోలీసులు రాహుల్ గాంధీ సహా విపక్ష ఎంపీలను  అదుపులోనికి తీసుకుని అక్కడ నుంచి తరలించారు. 
ALSO ON TELUGUONE N E W S
Hansika Motwani has been lately in the news due to her rumored separation from her husband, Sohael. Recently, she deleted her marriage video and photos she shared with Sohael on Instagram. The news reports have been speculating about her indirect clarification, ever since.  Now, on her birthday, she shared a cryptic message which seems to be another confirmation about her separation and divorce. She mentioned that her life taught many lessons this year, which she never asked for. Still, she stated that she found peace and attributed it to birthday magic.    She wrote, "Feeling humbled and full of gratitude. Wrapped in love, topped with cake, and thankful for every little moment. This year brought lessons I didn't ask for... and strength I didn't know I had. Heart's full. Phone's full. Soul's at peace. Thank you for the birthday magic." Well, at a time when the divorce and separation rumors are going around, such a cryptic post does feel like an unofficial confirmation about the impending. For now though, she has chosen to stay silent and she might open up sooner than later.  Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them.
  'వార్-2'తో జూనియర్ ఎన్టీఆర్ బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో యశ్ రాజ్ ఫిలిమ్స్ నిర్మించిన ఈ యాక్షన్ థ్రిల్లర్ లో హృతిక్ రోషన్ తో కలిసి ఎన్టీఆర్ స్క్రీన్ షేర్ చేసుకున్నాడు. బాలీవుడ్ ఫిల్మ్ కావడం, హృతిక్ కూడా ఉండటంతో.. ఎన్టీఆర్ రోల్ కి సంబంధించి మొదటి నుంచి రకరకాల ప్రచారాలు జరుగుతున్నాయి. ఎన్టీఆర్ విలన్ అని, కాదు 30-40 నిమిషాల పాటు కనిపించే స్పెషల్ రోల్ అని.. ఇలా రకరకాల ప్రచారాలు జరిగాయి. అయితే ఆ వార్తల్లో వాస్తవం లేదని.. హృతిక్, ఎన్టీఆర్ పాత్రలు పోటాపోటీగా ఉంటాయని ప్రచార చిత్రాలతో తేలిపోయింది. ఇటీవల జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో సైతం మేకర్స్ ఇదే విషయాన్ని చెప్పారు. ఎన్టీఆర్, హృతిక్ పాత్రలు ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అన్నట్టు కాకుండా పోటాపోటీగా ఉంటాయని.. హీరో ఎవరు విలన్ ఎవరు? అనేది సినిమా చూసి ప్రేక్షకులే తేల్చాలని తెలిపారు. ఈ క్రమంలో ఎన్టీఆర్ రోల్ కి సంబంధించి తాజాగా ఓ సర్ ప్రైజింగ్ న్యూస్ వినిపిస్తోంది. (War 2)   'వార్-2'లో ఎన్టీఆర్ హీరోనా విలనా? అంటూ ఇన్నిరోజులు చర్చ జరిగింది. అయితే ఇప్పుడు అనూహ్యంగా ఇందులో ఎన్టీఆర్ డ్యూయల్ రోల్ చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. అదే ఈ సినిమాలో మేజర్ ట్విస్ట్ అని న్యూస్ వినిపిస్తోంది. ఇప్పటిదాకా 'వార్-2' అసలు స్టోరీని రివీల్ చేయలేదని మేకర్స్ తెలిపారు. మరోవైపు ఎన్టీఆర్ కూడా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మాట్లాడుతూ.. సినిమాలో బిగ్ ట్విస్ట్ లు ఉన్నాయని అన్నాడు. దీంతో ఆ ట్విస్ట్ లలో ఒకటి ఎన్టీఆర్ డ్యూయల్ రోల్ అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.   నిజానికి 'వార్-2'లో హృతిక్ కంటే ఎన్టీఆర్ స్క్రీన్ టైమే ఎక్కువ ఉంటుందట. డ్యూయల్ రోల్ లో ఎన్టీఆర్.. ఫ్యాన్స్ కి ట్రీట్ ఇవ్వబోతున్నాడని అంటున్నారు. ఒక రోల్ పాజిటివ్ గా ఉంటే, మరో రోల్ నెగటివ్ గా ఉంటుందని.. ఎన్టీఆర్ వర్సెస్ ఎన్టీఆర్ ఫైట్ కూడా చూడబోతున్నామని చెబుతున్నారు. అదే నిజమైతే 'వార్-2'ని ఎన్టీఆర్ ఫ్యాన్స్ మరింత ఓన్ చేసుకుంటారు అనడంలో సందేహం లేదు. దాంతో తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా వసూళ్ల వర్షం కురిపించే అవకాశముంది.  
సూపర్ స్టార్ రజనీకాంత్(Rajinikanth),కింగ్ నాగార్జున(Nagarjuna),లోకేష్ కనగరాజ్(Lokesh Kanagaraj)కాంబినేషన్ లో తెరకెక్కిన భారీ పాన్ ఇండియా చిత్రం 'కూలీ'(Coolie). యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కగా, ఈ నెల 14 న వరల్డ్ వైడ్ గా,విడుదల కానుంది. బాలీవుడ్ అగ్ర హీరో అమీర్ ఖాన్(Aamir Khan)'దహ' అనే గ్యాంగ్ స్టర్ గా స్పెషల్ అప్పీరియన్స్ ఇస్తుండటం, కన్నడ స్టార్ హీరో 'ఉపేంద్ర'(upendra)కీలక పాత్రలో కనిపిస్తుండటంతో, కూలీపై అంచనాలు భారీ స్థాయిలో ఉన్నాయి. రీసెంట్ గా 'కూలీ'ఆడియో లాంచ్ ఈవెంట్ చెన్నై వేదికగా అభిమానుల సమక్షంలో చాలా ఘనంగా జరిగిన విషయం తెలిసిందే. ఇప్పుడు  ఈ కార్యక్రమాన్ని 'కూలీ అన్ లిషెడ్'(Coolie Unleashed)పేరుతో ప్రముఖ ఓటిటి ప్లాట్ ఫార్మ్ సన్ నెక్స్ట్ (Sun Next)వేదికగా అందుబాటులోకి తీసుకొచ్చారు.ఇందులో  రజనీ స్పీచ్ తో పాటు మూవీ గురించి ఇతర అగ్ర తారలు పంచుకున్న విశేషాలు, మ్యూజిక్ ని అందించిన అనిరుద్ స్టేజ్ పెర్ ఫార్మెన్సు , సౌభిన్ షాహిర్ చేసిన మోనికా డాన్స్  ఉన్నాయి.   పాన్ ఇండియా వ్యాప్తంగా ఉన్నప్రేక్షకులకి 'కూలీ'ని మరింత చేరువ చెయ్యడానికి మేకర్స్  'అమెజాన్' డెలివరీ సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్నారు. అందులో భాగంగా కూలీ కి సంబంధించిన  బాగ్స్, స్టిక్కర్స్ ని ఇండియా వ్యాప్తంగా ఉచితంగా పంపిణి చేస్తున్నారు. శృతి హాసన్(Shruthi Haasan) రచిత రామ్, జూనియర్ ఎంజిఆర్ కీలక పాత్రల్లో కనిపిస్తుండగా, ప్రతిష్టాత్మక చిత్ర నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్(Sun Pictures)భారీ వ్యయంతో నిర్మిస్తుంది.     
గత కొన్ని రోజులుగా చిత్ర పరిశ్రమలో అనిశ్చితి నెలకొన్న విషయం తెలిసిందే. ఫిలిం ఛాంబర్‌, ఫిలిం ఫెడరేషన్‌ మధ్య వేతనాల సమస్య రోజురోజుకీ తీవ్రతరం అవుతోంది. దీని పరిష్కారం కోసం పలుమార్లు చర్చలు జరిగినా అవి సత్ఫలితాల్ని ఇవ్వలేదు. దీంతో ఆంధ్రప్రదేశ్‌ సినిమాటోగ్రఫీ మినిస్టర్‌ కందుల దర్గేశ్‌ను కలిసి సినీ పరిశ్రమలోని సమస్యలు, సినీ కార్మికుల ఆందోళనకు సంబంధించి ఒక వినతి పత్రాన్ని అందించారు నిర్మాతలు.  దీనిపై ఆంధ్రప్రదేశ్‌ సినిమాటోగ్రఫీ మినిస్టర్‌ కందుల దుర్గేశ్‌ మాట్లాడుతూ ‘సినీ పరిశ్రమలో ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు తెలియజేసేందుకు నిర్మాతలు వస్తామంటే రమ్మని చెప్పాం. అయితే దీనికి ప్రత్యేక ఎజెండా ఏమీ లేదు. ఈ సమస్యపై సినీ కార్మికులు, సినీ నిర్మాతలు.. ఇరువురు చెప్పే విషయాలు వింటాం. ఆ తర్వాత ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి దృష్టికి ఈ సమస్యను తీసుకెళ్లి చర్చిస్తాం. ఒకవేళ ప్రభుత్వ జోక్యం అవసరం అనుకుంటే సీఎం, డిప్యూటీ సీఎంల స్థాయిలో నిర్ణయం తీసుకుంటారు. అయితే ఈ అంశంపై ఫెడరేషన్‌, ఫిలింఛాంబర్‌ సభ్యులు కలిసి కూర్చొని మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. ఆంధ్రప్రదేశ్‌లో చలన చిత్ర పరిశ్రమ అభివృద్దికి కట్టుబడి ఉన్నాం. సినిమా నిర్మాణానికి కావాల్సిన మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తాం. ఏపీలో స్టూడియోలు, రీరికార్డింగ్‌ థియేటర్లు, డబ్బింగ్‌ థియేటర్లు నిర్మించేందుకు ముందుకు వస్తే ప్రభుత్వం తరఫున సహకారం అందిస్తాం’ అన్నారు. కందుల దుర్గేష్‌ను కలిసిన నిర్మాతల్లో  బి.వి.ఎస్‌.ఎన్‌.ప్రసాద్‌, కె.ఎల్‌.నారాయణ, డి.వి.వి.దానయ్య, రవిశంకర్‌, నాగవంశీ, భరత్‌, విశ్వప్రసాద్‌, చెర్రీ, సాహు గారపాటి, యువి క్రియేషన్స్‌ వంశీ, బన్నీ వాసు, వివేక్‌ కూచిభొట్ల తదితరులు ఉన్నారు.  మరోపక్క తెలంగాణ సినిమాటోగ్రఫీ మినిస్టర్‌ కోమటిరెడ్డి వెంకటరెడ్డిని కొందరు నిర్మాతలు కలిసి సమస్యను వివరించారు. ఈ సమావేశంలో ఎఫ్‌డిసి ఛైర్మన్‌ దిల్‌ రాజు, బాపినీడు, ఫిలిం ఛాంబర్‌ సెక్రటరీ దామోదర ప్రసాద్‌, సుప్రియ, జెమినీ కిరణ్‌ తదితరులు పాల్గొన్నారు.
మాస్ మహారాజ 'రవితేజ'(Ravi Teja)అప్ కమింగ్ మూవీ 'మాస్ జాతర'(Mass Jathara). యాక్షన్ ఎంటర్ టైనర్ గా  తెరకెక్కగా, ఈ నెల 27 న వరల్డ్ వైడ్ గా విడుదల కానుంది. చిరంజీవితో కలిసి వాల్తేరు వీరయ్య తర్వాత రవితేజ చేసిన చిత్రాలు రావణాసుర, టైగర్ నాగేశ్వరరావు, ఈగల్, మిస్టర్ బచ్చన్ అంతగా అలరించక పోవడంతో 'మాస్ జాతర'తో అయినా, తమ అభిమాన హీరో భారీ హిట్ ని అందుకోవాలని అభిమానులు కోరుతున్నారు. రవితేజ సరసన శ్రీలీల(Sreeleela)జత కడుతుండగా నూతన దర్శకుడు భాను బోగవరపు(Bhanu Bogavarapu) తెరకెక్కించాడు.  రీసెంట్ గా మాస్ జాతర నుంచి టీజర్ రిలీజయ్యింది. నిమిషం ముపై సెకన్ల నిడివితో ఉన్న టీజర్ చూస్తుంటే మూవీలో రవితేజ ఎనర్జీ ఒక లెవల్లో ఉండబోతుందని అర్ధమవుతుంది. ఒక క్యారక్టర్ రవితేజ గురించి చెప్తు 'తను చేసే ఫైర్ డిపార్ట్మెంట్ లో తప్ప అన్ని డిపార్ట్మెంట్స్ లో వేలు పెడతాడని చెప్పించడం, శ్రీలీలతో రవితేజ చెప్పిన డైలాగులు చూస్తుంటే ప్రేక్షుకులకి ఈ సారి ఫుల్ మీల్స్ గ్యారంటీ అని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా నాకంటూ ఒక చరిత్ర ఉందని రవితేజ చెప్పిన డైలాగ్ అభిమానులని విశేషంగా ఆకరిస్తుంది. ఫైట్స్ సరికొత్తగా డిజైన్ చేసారని అర్ధమవుతుండటంతో పాటు, విజువల్ గా ఛాయాగ్రాహకుడు విధు అయ్యన్న కెమెరా పనితనం మెస్మరైజ్ చేయనుందని తెలుస్తుంది.   అగ్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్ టైన్ మెంట్స్ , ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్, శ్రీకర స్టూడియోస్ సంయుక్తంగా మాస్ జాతర ని  నిర్మించగా, రాజేంద్ర ప్రసాద్(Rajendraprasad)తో పాటు మరికొంత మంది సినీ ప్రముఖులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. భీమ్స్ సిసిరోలియో((Beems sisirolio)సంగీత దర్శకత్వంలో ఇప్పటికే విడుదలైన రెండు పాటలకి  అద్భుతమైన స్పందన లభించింది. టీజర్  విడుదలైన నిమిషాల్లోనే రవితేజ గత చిత్రాల టీజర్స్ కంటే రికార్డు వ్యూస్ ని రాబడుతుంది.     
Mass Maharaja Ravi Teja's 75th film, Mass Jathara, is generating significant buzz following the release of its high-energy teaser. Directed by Bhanu Bogavarapu and produced by Sithara Entertainments and Fortune Four Cinemas, the film is set to release on August 27, coinciding with Vinayaka Chavithi. The teaser promises a full-on mass entertainer, packed with the action, comedy, and vintage energy that fans expect from Ravi Teja. He shines in his signature style, delivering witty one-liners and captivating screen presence. The film also reunites him with actress Sreeleela, and their on-screen chemistry is a major highlight, promising pure magic for the audience. Director Bhanu Bhogavarapu is crafting a true festival film, designed to appeal to both mass and family audiences. The teaser's impressive background score by Bheems Ceciroleo and stunning cinematography by Vidhu Ayyanna further elevate the excitement. With producers Suryadevara Naga Vamsi and Sai Soujanya ensuring a grand scale production, Mass Jaatara, is shaping up to be a festive treat that will delight moviegoers. Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them. 
ఎన్టీఆర్‌, హృతిక్‌ రోషన్‌ హీరోలుగా తెరకెక్కిన ‘వార్‌2’ చిత్రంపై ప్రేక్షకుల్లో, అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే రిలీజ్‌ అయిన ఈ ట్రైలర్‌ అందర్నీ ఆకట్టుకుంది. ఎన్టీఆర్‌ బాలీవుడ్‌ ఎంట్రీకి ఇది సరైన సినిమా అనే అభిప్రాయం ట్రేడ్‌ వర్గాల్లో ఉంది. ఆగస్ట్‌ 14న పాన్‌ ఇండియా మూవీగా ప్రపంచవ్యాప్తంగా రిలీజ్‌ కాబోతున్న ‘వార్‌2’ చిత్రానికి సంబంధించిన ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ ఆగస్ట్‌ 10న హైదరాబాద్‌లో భారీ ఎత్తున నిర్వహించారు. చిత్ర పరిశ్రమ నుంచి దిల్‌రాజు, త్రివిక్రమ్‌ హాజరయ్యారు. వేలాదిగా తరలి వచ్చిన అభిమానులతో ప్రీ రిలీజ్‌ ఫంక్షన్‌ ఎంతో సందడిగా జరిగింది.  ఈ సినిమా ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌కు ముంబాయి నుంచి వచ్చిన బాలీవుడ్‌ స్టార్‌ హీరో హృతిక్‌ రోషన్‌కు మాత్రం ఘోరమైన అవమానం జరిగింది. ఒక సంవత్సరం గ్యాప్‌లో ఎన్టీఆర్‌, హృతిక్‌రోషన్‌ హీరోలుగా తమ కెరీర్‌ను ప్రారంభించారు. అయితే నటుడుగా ఎన్టీఆర్‌ కంటే హృతిక్‌ రోషన్‌ 20 ఏళ్లు సీనియర్‌. 1980లో 16 ఏళ్ల వయసులోనే కెమెరా ముందుకు వచ్చాడు. ఆ తర్వాత తండ్రి రాకేష్‌ రోషన్‌ దర్శకత్వంలో వచ్చిన చాలా సినిమాలకు అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా పనిచేశాడు. 2000 సంవత్సరంలో తండ్రి డైరెక్షన్‌లోనే వచ్చిన కహో నా ప్యార్‌ హై చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. తొలి సినిమాలోనే డూయల్‌ రోల్‌ చేసి అందర్నీ మెప్పించాడు. హీరోగా 25 సంవత్సరాల తన కెరీర్‌లో ఎన్నో బ్లాక్‌బస్టర్స్‌లో నటించి మాచోస్టార్‌గా పేరు తెచ్చుకున్నాడు.  ఇదిలా ఉంటే.. వార్‌2 ప్రీ రిలీజ్‌కి వచ్చిన హృతిక్‌.. తనకు తెలుగు వారంటే ఎంతో గౌరమని, వారి మర్యాదలు తాను మర్చిపోలేనని చెప్పాడు. దాదాపు 20 సంవత్సరాల క్రితం వచ్చిన క్రిష్‌ సినిమా షూటింగ్‌కి హైదరాబాద్‌ వచ్చానని గుర్తు చేసుకున్నాడు. కానీ, బాలీవుడ్‌ నుంచి ఇక్కడికి పిలిచిన ఒక స్టార్‌ హీరోకి ఇవ్వాల్సినంత గౌరవం మాత్రం మనవాళ్లు ఇవ్వలేదు. కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న సుమ ఒక సమయంలో హృతిక్‌ రోషన్‌ 25 సంవత్సరాల సినీ ప్రయాణాన్ని ఒక వీడియో రూపంలో చూద్దాం అంటూ ఎనౌన్స్‌ చేసింది. ఆ వీడియో కోసం హృతిక్‌తోపాటు అందరూ 5 నిమిషాల పాటు ఎదురుచూశారు. కానీ, అది స్క్రీన్‌ మీద ప్రత్యక్షం కాలేదు. ఆ వీడియో వేయకపోవడానికి గల కారణాలు ఏమీ చెప్పకుండా వెంటనే ఎన్టీఆర్‌ 25 సంవత్సరాల కెరీర్‌కి సంబంధించిన వీడియోను వేశారు. ఆ తర్వాత కూడా దీనికి సంబంధించిన వివరణ ఎవరూ ఇవ్వలేదు.  ఇక హృతిక్‌ రోషన్‌ అంటే ఇండియాలో తెలియని వారు ఉండరు. అందులోనూ చిత్ర పరిశ్రమకు చెందిన వారికి అతని గురించి పూర్తిగా తెలిసి ఉంటుంది. కానీ, టాలీవుడ్‌ అగ్ర నిర్మాత దిల్‌ రాజుకు మాత్రం ఈ విషయం అంతగా తెలిసినట్టు లేదు. హృతిక్‌ రోషన్‌ అనే పేరును రితిక్‌ రోషన్‌ అని మెన్షన్‌ చేయడం మొదలుపెట్టారు. అంతటితో ఆగకుండా.. ఇద్దరు హీరోలు ఎన్‌.టి.ఆర్‌., ఆర్‌.ఆర్‌.(అంటే రితిక్‌ రోషన్‌ అన్నమాట) నటించిన ఈ సినిమా తప్పకుండా పెద్ద విజయం సాధిస్తుందని అన్నారు. ఒక స్టార్‌ హీరో పేరుని కూడా సరిగ్గా ఉచ్ఛరించలేకపోవడంతో నెటిజన్లు అసహనం వ్యక్తం చేస్తున్నారు. హృతిక్‌ రోషన్‌ వీడియో వేయకపోవడం, అతని పేరును దిల్‌రాజు సరిగ్గా పలకకపోవడం పట్ల నెటిజన్లు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. బాలీవుడ్‌ నుంచి పిలిపించి అవమానించడం సరైన పద్దతి కాదని సోషల్‌ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు.    Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them.
  జూనియర్ ఎన్టీఆర్(Jr NTR)కు వాచ్ లు అంటే ఎంత ఇష్టమో తెలిసిందే. కోట్ల విలువ చేసే ఖరీదైన వాచ్ లను ఆయన ధరిస్తూ ఉంటారు. ఏదైనా ఈవెంట్ లో ఎన్టీఆర్ పాల్గొన్నారంటే చాలు.. ఆయన ధరించిన వాచ్ గురించి, దాని ధర గురించి చర్చ జరుగుతూ ఉంటుంది. తాజాగా వార్-2 ఈవెంట్ లో కూడా ఎన్టీఆర్ వాచ్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.    'వార్-2'తో ఎన్టీఆర్ బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నారు. ఆగస్టు 14న విడుదల కానున్న ఈ యాక్షన్ థ్రిల్లర్ పై భారీ అంచనాలు ఉన్నాయి. తాజాగా ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో జరిగింది. 'వార్-2'పై ఎన్టీఆర్ ఎంతో కాన్ఫిడెంట్ గా ఉన్నారు. డబుల్ కాలర్ ఎగరేసి మరీ.. ఈ సినిమా అదిరిపోతుందని అభిమానులకు భరోసా ఇచ్చారు. ఇక ఈ ఈవెంట్ లో ఎన్టీఆర్ కాలర్ ఎత్తడం ఎంత హైలైట్ అయిందో.. ఆయన ధరించిన వాచ్ కూడా అదే స్థాయిలో అందరి దృష్టిని ఆకర్షించింది.   ఎన్టీఆర్ ఖరీదైన వాచ్ లు ధరిస్తారని ఇప్పటికే అందరికీ అవగాహన ఉండటంతో.. ఆ వాచ్ గురించి ఇంటర్నెట్ లో సెర్చ్ చేయడం మొదలుపెట్టారు. ఇది 'ఆడెమర్స్ పిగెట్' అనే బ్రాండ్ కి చెందినది. ప్రపంచంలో లగ్జరీ వాచ్ లను తయారు చేసే టాప్ బ్రాండ్స్ లో ఆడెమర్స్ పిగెట్ ఒకటి. లిమిటెడ్ ఎడిషన్ లగ్జరీ వాచ్ లకు ఇది పెట్టింది పేరు. అందుకే వాటి ధర ఎక్కువగా ఉంటాయి.    ఇక వార్-2 ఈవెంట్ లో ఎన్టీఆర్ ధరించిన వాచ్ ధర.. దాదాపు మూడున్నర కోట్ల రూపాయలు అని తెలుస్తోంది. ప్రస్తుతం ఈ వాచ్ ధర సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. కొన్ని లగ్జరీ కార్ల కంటే కూడా ఈ వాచ్ ధర ఎక్కువగా ఉందని నెటిజెన్లు సరదా కామెంట్స్ చేస్తున్నారు. ఇంకా కొందరైతే.. ఆ డబ్బులతో చిన్న సినిమా కూడా తీయొచ్చని అంటున్నారు.    ఎన్టీఆర్ ఇలా కోట్ల విలువైన వాచ్ లతో పలు ఈవెంట్లలో కనిపించారు. దీంతో అసలు ఆయన దగ్గర ఇలాంటి ఖరీదైన వాచ్ లు ఎన్ని ఉన్నాయని అభిమానులు చర్చించుకుంటున్నారు.  
గ్లోబల్ స్టార్ 'రామ్ చరణ్',(Ram Charan)'ఉపాసన'(Upasana)వివాహం 2012 జూన్ 14 న అభిమానులు, బంధు మిత్రుల మధ్య అంగరంగ వైభవంగా జరిగింది. ఈ ఇద్దరు ఒకరినొకరు ప్రేమించుకొని,ఇరువైపులపెద్దలని ఒప్పించి జీవితభాగస్వామ్యులవ్వగా, 2023 జూన్ 20 న 'క్లీంకార'(Klin Kaara)అనే పాపకి జన్మినిచ్చారు. సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉండే చరణ్, ఉపాసన తమ ఇద్దరికి సంబంధించిన ఎన్నో విషయాలని అభిమానులతో పంచుకుంటు వస్తున్నారు.     రీసెంట్ గా 'ఉపాసన' ఓ యూట్యూబ్ ఛానల్ కోసం హోమ్ టూర్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఉపాసన మాట్లాడుతు ప్రేమలో ఉన్నప్పుడు చరణ్ కి ఒక ప్రేమ పరీక్ష పెట్టాను. నువ్వు నిజంగా  నన్ను ప్రేమించనవాడివైతే హైదరాబాద్ లోని ఛార్మినార్(Charminar)దగ్గర ఉన్న ఫేమస్ ఐస్ క్రీమ్ దగ్గరకి తీసుకెళ్లాలని చెప్పాను. దాంతో చరణ్ నన్ను అక్కడికి తీసుకెళ్లాడు. అది చరణ్ కి నిజమైన లవ్ టెస్ట్.  తమది మగధీర సినిమాలోలాగా, చేతులు తగలగానే షాక్ ఇచ్చే సినిమాటిక్ లవ్ స్టోరీ కాదు.  చార్మినార్ దగ్గర అందరు చరణ్ ని గుర్తు పట్టడంతో, ఒక్కసారిగా చరణ్ పై పడిపోయారు.  చిరంజీవి(Chiranjeevi)మావయ్య లాగానే చరణ్  ఫుడ్ లవర్. ప్రపంచంలో ఉన్న ఏ పెద్ద రెస్టారెంట్ కి వెళ్లినా, నాకు ఇండియన్ ఫుడ్ కావాలని అడుగుతాడు. ఆ విషయంలో ఒక్క ఐటెం అయినా, ఇండియన్ ఫుడ్ ఉండాల్సిందే. ఎక్కువగా స్పైసి ఫుడ్  తినడంతో పాటు, రసం అన్నం అంటే  చాలా ఇష్టపడతాడని ఉపాసన చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ మాటలు మెగా అభిమానులతో పాటు,నెటిజన్స్ ని ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. చరణ్ సినిమాల విషయానికి వస్తే అప్ కమింగ్ మూవీ 'పెద్ది' తో బిజీ గా ఉన్నాడు. చరణ్ బర్త్ డే సందర్భంగా మార్చి 27  2026 న విడుదల కానుంది. బుచ్చిబాబు సాన దర్శకుడు.    
యూనివర్సల్ స్టార్ 'కమల్ హాసన్'(Kamal Haasan)ఇటీవల ప్రముఖ హీరో 'సూర్య'(Suriya)స్థాపించిన 'అగరం' ఫౌండేషన్(Agaram Foundation)లో జరిగిన వార్షికోత్సవ వేడుకలకి ముఖ్య అతిధిగా హాజరయ్యాడు. ఈ సందర్భంగా అక్కడి విద్యార్థులని ఉద్దేశించి కమల్ మాట్లాడుతు 'నియంతృత్వం, సనాతన బానిసత్వాన్ని అంతం చేయగల శక్తి ఒక్క విద్యకు మాత్రమే ఉంది. ఈ యుద్ధంలో గెలవాలంటే వేరే ఏ ఆయుధాన్ని మీ చేతిలోకి తీసుకోకండి. ఆ విధంగా మీరు గెలవలేరు. మెజారిటీ మూర్ఖులు మిమ్మల్ని ఓడిస్తారు. జ్ఞానం ఓడిపోతుందని మాట్లాడటం జరిగింది. కమల్ మాట్లాడిన ఈ మాటలపై రీసెంట్ గా ప్రముఖ తమిళ టివి నటుడు 'రవిచంద్రన్'(Ravi Chandran)మాట్లాడుతు సనాతన ధర్మానికి వ్యతిరేకంగా మాట్లాడిన కమల్ హాసన్ ని చంపేస్తానని, తల నరికేస్తానంటూ తీవ్ర వ్యాఖ్యలు చేసాడు. ఇప్పుడు ఈ మాటలు తమిళనాట సంచలనంగా మారాయి. ఇక కమల్ అభిమానులతో పాటు, మక్కల్ నీది మయ్యం' పార్టీ కార్యకర్తలు తమిళనాడు వ్యాప్తంగా ఉన్న పలు పోలీస్ స్టేషన్ లలో రవిచంద్రన్ పై ఫిర్యాదు చేసారు. రవిచంద్రన్ పై చర్యలు తీసుకొని ఇక ముందు ఎవరు ఇటువంటి వ్యాఖ్యలు చెయ్యకుండా చూడాలని కోరుతున్నారు.  రవిచంద్రన్ సుదీర్ఘ కాలం నుంచి పలు రకాల సీరియల్స్ లో చేస్తు మంచి గుర్తింపు పొందాడు. ముఖ్యంగా ' పాండియన్ స్టోర్స్'(Pandian Stores)సీరియల్ రవిచంద్రన్ కి ప్రత్యేక గుర్తింపుని ఇచ్చింది. సెంథిల్ అనే క్యారక్టర్ ద్వారా ప్రతి ఇంటికి ఎంతగానో చేరువయ్యాడు. 'మక్కల్ నీది మయ్యం' పార్టీ అధ్యక్షుడి హోదాలో కమల్ హాసన్ ఇటీవల అధికార డిఎంకె పార్టీ మద్దతుతో రాజ్యసభకు ఎంపిక అయ్యాడు. ఆ హోదాలోనే అగరం ఫౌండేషన్ కి హాజరై, సనాతన దర్మంపై కీలక  వ్యాఖ్యలు చేసాడు.     
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు. వారితో పాటు పెద్ద సంఖ్యలో క్యాడర్ కూడా పార్టీని వీడుతున్నారు. ఇక ఇప్పుడు నామినేటెడ్ పదవులలో ఉన్న వారి వంతు మొదలైనట్లు కనిపిస్తోంది. తనకు కానీ తన భర్తకు  కానీ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు టికెట్ ఇవ్వాలంటూ గత  కొంత కాలంగా కోరుతూ వస్తున్న మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ వంతు వచ్చింది. ఆమె కూడా రాజీనామా అస్త్రం సంధించారు.  జగన్ కు నమ్మిన బంటుగా గుర్తింపు పొందిన మహిళాకమిషన్ చైర్ పర్సన్ వాసి రెడ్డి పద్మ తన పదవికి రాజీనామా చేశారు. ఉరుములేని పిడుగులా, ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా తన రాజీనామా లేఖను సీఎం జగన్ కు పంపేశారు. పేరుకు తాను పార్టీకి కాదు, కేవలం మహిళా కమిషన్ చైర్మన్ పదవికి మాత్రమే రాజీనామా చేశాననీ, ఇక నుంచి వైసీపీ కోసం పని చేస్తాననీ వాసిరెడ్డి పద్మ చెబుతున్నప్పటికీ, ఆమె రాజీనామాకు కారణం అసంతృప్తేనని పార్టీ వర్గాలు బాహాటంగానే చెబుతున్నాయి. చాలా కాలంగా వాసిరెడ్డి పద్మ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు తనకు కానీ తన భక్తకు కానీ పార్టీ టికెట్ ఇవ్వాలని జగన్ ను కోరుతూ వస్తున్నారు. అయితే ఇప్పటి వరకూ జగన్ చూద్దాం.. చేద్దాం అన్నట్లుగా దాట వేస్తూనే వచ్చారు. ఇప్పుడిక వరుసగా అభ్యర్థల జాబితాలను జగన్ ప్రకటించేస్తుండటం, తనకు గానీ తన భర్తకు కానీ పార్టీ టికెట్ విషయంలో ఎటువంటి స్పస్టత ఇవ్వకపోవడంతో ఆమె మనస్తాపం చెంది పదవికి రాజీనామా చేసేశారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.  వాసిరెడ్డి పద్మ రాజకీయ ప్రవేశం ప్రజారాజ్యం పార్టీతో జరిగింది. 2009లో ఆమె ప్రజారాజ్యం పార్టీలో చేరారు. ఇలా చేరడంతోనే ఆమె ప్రజారాజ్యం అధికార ప్రతినిథిగా పదవి దక్కించుకున్నారు. ప్రజారాజ్యం కాంగ్రెస్ పార్టీలో విలీనం కావడంతో ఆమె 2012లో జగన్ పార్టీలో చేరారు. జగన్ కూడా ఆమెకు అధికార ప్రతినిథి పదవి ఇచ్చారు.  2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆమెను రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా నియమించారు. చైర్ పర్సన్ హోదాలో ఆమె జగన్ మెప్పు పొందేందుకు చేయగలిగినంతా చేశారు. ప్రతిపక్ష పార్టీ నేతలకు నోటీసులు ఇచ్చారు. ఏకంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు సైతం నోటీసులు జారీ చేశారు. వార్డు వలంటీర్లపై పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు కమిషన్ ముందు హాజరై వివరణ ఇవ్వాలంటూ ఆమె పవన్ కు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. పవన్ హాజరు కాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు నమోదు చేయాలని ఆదేశించారు. ఇన్ని చేసినా వాసిరెడ్డి పద్మకు ఆమె కోరినట్లుగా పార్టీ టికెట్ లభించకపోవడంతో అలిగి పదవికి రాజీనామా చేశారని, ఇది జగన్ కు షాకేననీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు. ఒకరైతు తనకు చేసిన సేవలకు ప్రీతి చెందిన గురువు అతడికి స్వర్గ ప్రాప్తిని కలగజేయాలని అనుకుంటాడు. కానీ సంసారాసక్తి వల్ల ఆ రైతు ఆ అవకాశాన్ని వాయిదా వేసుకుంటూ వస్తాడు. చివరికి గురుకృప వల్ల ఆ రైతు స్వర్గ ప్రాప్తిని ఎలా పొందాడో ఈ కథ తెలియజేస్తుంది. "ఒక మహాపురుషుడు ప్రయాణం చేస్తూ, డస్సిపోయాడు. గొంతు ఎండిపోయింది. దారిలో ఒక రైతు కనపడితే నీళ్ళు అర్థించాడు. ఆ రైతు మహాత్మునికి సకల ఉపచారాలూ చేశాడు. చిరిగిపోయిన ఆయన ఉత్తరీయాన్ని రైతు జాగ్రత్తగా కుట్టి బాగుచేశాడు. రైతు పరిచర్యలకు సంతసించిన ఆ మహాత్ముడు శాంతి, ఆనందాలకు నిలయమైన స్వర్గానికి తనతోపాటు రమ్మని అంటాడు. అందుకు ఆ రైతు 'గురువుగారూ! మీరు నా మీద చూపిన దయకు కృతజ్ఞుణ్ణి. కానీ నా పిల్లలు ఇంకా చిన్నవాళ్ళు. ఓ ఏడేళ్ళ వ్యవధి ఇవ్వండి' అని అడుగుతాడు. అందుకు గురువు అంగీకరించాడు. సరిగ్గా ఏడేళ్ళ తర్వాత గురువు రైతును స్వర్గానికి తీసుకువెళ్ళడానికి వచ్చాడు. అప్పుడు రైతు 'అయ్యా! కడపటి కొడుకు కష్టాలకు అంతు లేదు. అన్ని జంఝాటాలనూ ఒక్కడే సంబాళించుకోలేకపోతున్నాడు. కాబట్టి మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని గురువుని అడిగాడు. మరో ఏడేళ్ళ తరువాత గురువు వచ్చాడు. కానీ రైతు చనిపోయాడని తెలిసింది. చనిపోయిన ఆ రైతు ఎద్దుగా పుట్టాడని ఆ గురువు తన దివ్య దృష్టితో తెలుసుకున్నాడు. ఎద్దుగా పుట్టిన ఆ రైతు తన కొడుకు పొలాన్నే దున్నుతున్నాడు. అప్పుడు గురువు ఆ ఎద్దుపై మంత్ర జలం చిలకరించగానే ఎద్దు జన్మనెత్తిన రైతు 'నా కొడుకు పరిస్థితి మరి కాస్త మెరుగు పడనీయండి స్వామీ! మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని అన్నాడు. ఇక చేసేది లేక వెనుదిరిగాడు గురువు. మరలా ఏడేళ్ళ తర్వాత వచ్చిన గురువుకు ఎద్దు చనిపోయిందని తెలిసింది. అది కుక్కగా పుట్టి కొడుకు ఇంటినీ, ఆస్తినీ కాపలా కాస్తోందని తన దివ్యదృష్టి ద్వారా తెలుసుకున్నాడు. గురువు. కుక్కగా పుట్టిన ఆ రైతు 'స్వామీ! నేను ఎంత దౌర్భాగ్యుణ్ణి. మీరు ఇంత దయ చూపుతున్నప్పటికీ మీతో స్వర్గమానం చేయలేకున్నాను. వీడికి ఆస్తిని కాపాడుకొనే దక్షత ఇంకా రాలేదు. కాబట్టి దయ చేసి మరో ఏడేళ్ళు వ్యవధి ఇవ్వండి' అని వేడుకున్నాడు. గురువు ఏడేళ్ళ తరువాత మళ్ళీ వచ్చేసరికి కుక్క మరణించింది. అది త్రాచుపాముగా జన్మనెత్తి, ఇప్పుడు కొడుకు భూమిలో ఉన్న లంకెబిందెలకు పడగెత్తి కాపలా కాస్తోంది. గుప్త ధనం ఇక్కడ ఉందని కొడుకుకి ఎలా తెలియజేయాలా అని పాము ఆలోచిస్తున్నప్పుడు గురువు ఆ రైతుకొడుకును పిలుచుకు వచ్చి లంకె బిందెలు ఉన్న చోట తవ్వమన్నాడు. లంకె బిందెలు బయటపడ్డాయి. ఆ పైన ఆ పామును చంపమన్నాడు. అనంతరం శిష్యుణ్ణి తీసుకొని స్వర్గారోహణం చేశాడు గురువు. సంసారంలోని ఈతి బాధల నుండి శిష్యుణ్ణి ఉద్ధరిస్తాడు సద్గురువు. అలాంటి గురువు అందరికీ అవసరం.                                      *నిశ్శబ్ద.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్  రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది.  80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత  ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది.   ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది. ఆమెది నెద‌ర్లాండ్స్‌. ఆమె తండ్రి నెద‌ర్లాండ్స్‌లోని ఆర్నెహెమ్‌లో చిన్న‌పిల్ల‌ల ఆస్ప‌త్రి డైరెక్ట‌ర్. పోయి దొరికిన ఆ పెయింటింగ్ విష‌యానికి వ‌స్తే.. అది 1683లో కాస్ప‌ర్ నెష‌ర్ వేసిన స్టీవెన్ ఓల్ట‌ర్స్ పెయింటింగ్‌. రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో నాజీల ఆదేశాల‌ను చార్లెట్ తండ్రి వ్య‌తిరేకించారు. ఆయ‌న ర‌హ‌స్య జీవ‌నం సాగించేడు. కానీ ఈ పెయింటింగ్‌ని మాత్రం త‌న న‌గ‌రంలోని ఒక బ్యాంక్‌లో భ‌ద్ర‌ ప‌ర‌చ‌మ‌ని ఇచ్చార‌ట‌. 1940లో నాజీలు నెద‌ర్లాండ్ పై దాడులు చేసినపుడు ఆ బ్యాంక్ మీద ప‌డి దోచుకున్నా రు. అప్పుడు ఈ పెయింటింగ్ కూడా తీసుకెళ్లారు. యుద్ధం అయిపోయిన త‌ర్వాత ఈ పెయింటింగ్ ఎక్క‌డున్న‌దీ ఎవ‌రికీ తెలియ‌లేదు. చిత్రంగా 1950ల్లో డ‌స‌ల్‌డార్ష్ ఆర్ట్ గ్యాల‌రీలో అది ప్ర‌త్య‌క్ష‌మ‌యింది. 1969లో ఆమ్‌స్ట‌ర్‌డామ్‌లో దాన్ని వేలానికి తీసికెళ్లే ముందు దాన్ని ఆ ఆర్ట్ గ్యాల‌రీలో వుంద‌ని చూసిన‌వారు చెప్పారు. వేలంపాట త‌ర్వాత మొత్తానికి ఆ పెయింటింగ్‌ను 1971లో ఒక క‌ళాపిపాసి త‌న ద‌గ్గ‌ర పెట్టుకున్నాడు.    ఆ త‌ర్వాత 2021లో అది చార్లెటీని చేరింది.  మొత్తానికి వూహించ‌ని విధంగా ఎంతో కాలం దూర‌మ‌యిన గొప్ప క‌ళాఖండం తిరిగి త‌న వ‌ద్ద‌కు చేర‌డంలో చార్లెటీ ఆనందానికి అంతేలేదు. అంతే క‌దా.. పోయింద‌నుకున్న గొప్ప వ‌స్తువు తిరిగి చేరితే ఆ ఆనంద‌మే వేరు!  అయితే చార్లెటీకి ఇపుడు ఆ పెయిం టింగ్‌ను భ‌ద్రంగా చూసుకునే ఆస‌క్తి వున్న‌ప్ప‌టికీ శ‌క్తి సామ‌ర్ధ్యాలు లేవు. అందుక‌నే త్వ‌ర‌లో ఎవ‌రిక‌యినా అమ్మేసీ వ‌చ్చిన సొమ్మును పిల్ల‌ల‌కు పంచుదామ‌నుకుంటోందిట‌!  చార్లెటీ కుటుంబంలో అయిదుగురు అన్న‌ద‌మ్ములు అక్క‌చెల్లెళ్లు వున్నారు. అలాగే ఇర‌వై మంది పిల్ల‌లు ఉన్నారు. అంద‌రూ ఆమె అంటే ఎంతో ప్రేమ చూపుతున్నారు. అంద‌రం ఒకే కుటుంబం, చాలాకాలం త‌ర్వాత ఇల్లు చేరిన క‌ళాఖండం మా కుటుంబానిది అన్న‌ది చార్లెటీ!
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు. చాకోను పార్టీలోకి ఆహ్వానిస్తూ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్’ ఫ్రంట్ ఏర్పాటు గురించి ప్రత్యేకించి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు కానీ, చాకో అలాంటి  సంకేతాలు ఇచ్చారు. ప్రస్తుతం దేశంలో ఉన్న ఏ ఒక్కపార్టీ కూడా బీజేపీకి ప్రత్యాన్మాయం కాదని,సమీప భవిష్యత్ కాంగ్రెస్ సహా ఏ పార్టీ కూడా ఆ స్థాయికి ఎదిగే అవకాశాలు కూడా కనిపించడంలేదని అన్నారు. ఈ పరిస్థితుల్లో దేశంలోని బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ, ఏకమై, ఒకే గొడుగు కిందకు రావలసిన అవసరం ఉందని చాకో అన్నారు. అదే సమయంలో ప్రతిపక్షాలను ఏక తాటిపైకి తెచ్చే బాధ్యతను పవార్ తీసుకోవాలని సంకేత మాత్రంగా చెప్పారు. అంతే కాకుండా కాంగ్రెస్ పేరు ఎత్తకుండా బీజేపీ వ్యతిరేక శక్తులను ఏకం చేసే ఆలోచన ఆ పార్టీ నాయకత్వానికి లేదని నెహ్రూ గాంధీ ఫ్యామిలీ (సోనియా, రాహుల్, ప్రియాంక)ఆలోచనా ధోరణిని పరోక్షంగానే అయినా ఎండ కట్టారు.ఆ విధంగా పవార్ ఆ బాధ్యత తీసుకోవాలని చాకో సూచించారు. ఇందుకు సంబంధించి, పవార్ బహిరంగంగా ఎలాంటి వ్యాఖ్య చేయలేదు. అయితే, చాకో సహా మరికొందరు ‘సీనియర్’ కాంగ్రెస్ నాయకులు, అలాగే సిపిఎం, సిపిఐ నాయకులు కూడా పవార్’తో చాలా కాలంగా థర్డ్ ఫ్రంట్  విషయంగా చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. అయితే మహారాష్ట్రలో సంకీర్ణం మనుగడను దృష్టిలో ఉంచుకుని పవార్ ఆచితూచి అడుగులేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే చాకో పార్టీలో చేరిన సందర్భంలో కూడా ‘చాకో చేరికతో మహారాష్ట్రలోని మహా వికాస్ అగాడీ ప్రభుత్వానికి ఎలాంటి నష్టం జరగదని, పవార్ మహారాష్ట్ర సంకీర్ణ సర్కార్ ప్రస్తావన చేశారని విశ్లేషకులు పేర్కొంటున్నారు.  మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వ మనుగడ గురించ్బి  పవార్ ప్రత్యేకంగా పేర్కొనడం ద్వారా, ఆయన థర్డ్ ఫ్రంట్ విషయంలో వేచి చూసే ఆలోచనలో ఉన్నట్లు అర్థమవుతోందని కూడా  రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే అదే ఎన్సీపీ అసెంబ్లీ ఎన్నికల జరుగతున్న కేరళలో, పశ్చిమ బెంగాల్లో  కాంగ్రెస్ వ్యతిరేక పార్టీలకు మద్దతు ఇస్తోంది. దీన్ని బట్టి చూస్తే, ఎన్సీపీ - కాంగ్రెస్ మధ్య దూరం పెరుగుతోందని స్పష్టమవుతోంది. అయితే, థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఏ రకంగా ముడి పడుతుంది అనే విషయంలో ఇంకా స్పష్టత రావలసి ఉంది. అలాగే, కాంగ్రెస్ లేకుండా జాతీయ స్త్గాయిలో బీజేపీ వ్యతిరేక కూటమిని ఏర్పాటు చేయడం వలన, వ్యతిరేక ఓటు చీలి  అది మళ్ళీ బీజేపీకే మేలు చేస్తుందని, కాబట్టి, ప్రస్తుతం కాంగ్రెస్ సారధ్యంలోని యూపీఏని బలోపేతం చేయడమే ఉత్తమమనే అలోచన కూడా  విపక్ష శిబిరం నుంచి వినవస్తోంది. ఈ నేపధ్యంలోనే, ప్రస్తుతం యూపీఏ ఛైర్పర్సన్’గా ఉన్న సోనియా గాంధీ వయసు, అనారోగ్యం కారణంగా బాధ్యతల నుంచి తప్పుకుని పవార్’కు బాద్యతలు అప్పగించాలనే ప్రతిపాదన వచ్చిందని అంటున్నారు. అలాగే, ఇతర పార్టీలను, ముఖ్యంగా కాంగ్రెస్ నుంచి విడిపోయి సొంత కుంపటి పెట్టుకున్న మమతా బెనర్జీ సారధ్యంలోని తృణమూల్, జగన్మోహన్ రెడ్డి సారధ్యంలోని వైసీపీలను కలుపుకుని కూటమిని బలోపేతం చేయడం ద్వారా బీజేపీని దీటుగా ఎదుర్కోవచ్చనే ఆలోచనలు కూడా సాగుతున్నాయి. అయితే, ఇటు థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు అయినా, యూపీఏని బలోపేతం చేయడమే అయినా, పవారే .. కేంద్ర బిందువు. ఆయన సారధ్యంలోనే ప్రత్యాన్మాయం అనేది విపక్ష శిభిరం నుంచి వినవస్తున్న ప్రస్తుత సమాచారం. మరి అదే జరిగితే రాహుల గాంధీ పరిస్థితి ఏమిటి ? గాంధీ నెహ్రూ కుటుంబం పరిస్థితి ఏమిటి? ఏ ప్రత్యేక ప్రాధాన్యత లేకుండా అందరిలో ఒకరిగా ఫస్ట్ ఫ్యామిలీ సర్దుకు పోతుందా? అంటే..చివరకు ఏమవుతుందో .. ఇప్పుడే చెప్పలేమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది. గతంలో అనేక సందర్భాలలో ముఖ్యమంత్రి కేసీఆర్,ఆర్థిక మంత్రి హరీశ రావు, కరోనా కారణంగా రాష్ట్ర  ఆదాయం గణనీయంగా తగ్గిందని, పేర్కొన్నారు. అయితే, కరోనా నుంచి వేగంగా కోలుకుని, ఆర్థికంగా అంతే వేగంగా పుంజుకున్న రాష్ట్రాలలో తెలంగాణ ప్రధమ స్థానంలో  ఉందని కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సర్వే 2020-21 నివేదిక పేర్కొంది. పడిలేచిన కెరటంలా, తెలంగాణ ‘వీ’ ఆకారంలో ఆర్థికంగా నిలతొక్కుందని కేంద్రం జనవరి  చివరి వారంలో విడుదల చేసిన ఆర్థిక సర్వేలో పేర్కొంది. అలాగే, రెవిన్యూ వసూళ్ళలో రాష్ట్రం కరోనా పూర్వస్థితికి చేరిందని కూడా సర్వే చెప్పింది.   అలాగే,రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు కూడా ఈ మధ్య కాలంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పై సంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరమ జనవరి,ఫిబ్రవరి, మార్చి నెలలతో పోలిస్తే ఈ సంవత్సరం ఈ మూడు నెలల కాలంలో రాష్ట్ర ఆర్థిక వృద్ది రేటు 10 నుంచి  15 శాతం మెరుగ్గా ఉందని హరీష్ రావు ఒకటి రెండు ఇంటర్వ్యూలలో పేర్కొన్నారు.అలాగే, బడ్జెట్ విషయంలోనూ ఆయన చాల ఆశావహ దృక్పథంతోనే ఉన్నారు. బడ్జెట్  పాజిటివ్’గా ఉంటుదని, ఎవ్వరూ ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని, సంక్షేమ పథకాలలో,ఇతరత్రా బడ్జెట్ కేటాయింపులలో ఎలాంటి కోతలు ఉండవని కూడా హరీష్ హామీ ఇచ్చారు. గత సంవత్సరంలో కొంత మేర హామీ ఇచ్చిన మేరకు అమలు చేయలేక పోయిన సొంత జాగాలలో డబల్ బెడ్ రూమ్ ఇళ్ళ నిర్మాణం, రుణ మాఫీ వంటి  పథకాలను ఈ బడ్జెట్ ద్వారా అమలు చేస్తామని చెప్పారు. అలాగే, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ తమిళి సై చేసిన ప్రసంగంలోనూ ఆశావహ దృక్పధమే వ్యక్తమైంది. ఆమె తమ ప్రసంగంలో,  ప్రభుత్వం సంక్షేమ పథకాలకు పెద్ద పీట వేసిందని అన్నారు. ‘సంపద పంచాలి ,పేదలకు పంచాలి’ అనేది తమ ప్రభుత్వ విధానమని స్పష్టం చేశారు. అలాగే, పెరుగతున్న ఆదాయంలో అధికశాతం సంక్షేమానికే వెచ్చిస్తున్నామని స్పష్టం చేశారు. దీంతో బడ్జెట్’లో కొత్త పథకాలకు శ్రీకారం చుట్టే అవకాశం ఉంటుందా అన్న చర్చ జరుగుతోంది. మరో వంక ఉద్యోగ వర్గాల్లో పీఆర్సీకి సంబంధించి ఆర్థిక మంత్రి తమ ప్రసంగంలో  ప్రకటన చేస్తారా లేదా అనే ఆసక్తి నెలకొంది. అలాగే, సామాన్య  ప్రజలు ఇటీవల పెరిగిన పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరల భారం నుంచి మంత్రి హరీష్, ఏదైనా ఉపసమనం కలిపిస్తారా అని ఎదురు చూస్తున్నారు. గతంలో వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సామాన్య ప్రజలపై వంటగ్యాస్ ధర భారాన్ని తగ్గించేందుకు కొంత మొత్తాన్ని, రూ.50(?) రాష్ట్ర ప్రభుత్వం తరపున  సబ్సిడీగా ఇచ్చిన విషయాన్ని, అదే విధంగా అసెంబ్లీ ఎన్నికలు జరుగతున్న తమిళనాడులో డిఎంకే పార్టీ,తమ పార్టీని అధికారంలోకి వస్తే  గ్యాస్ బండపై వంద రూపాయల సబ్సిడీ ఇస్తామని చేసిన  వాగ్దానాన్ని  గుర్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే, ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు, సోమవారం ఆర్థిక మంత్రి హరీష్ రావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఆర్థిక  శాఖ ముఖ్య కార్యదర్శి రామ కృష్ణా రావు,సలహాదారు జీఆర్ రెడ్డితో బడ్జెట్ పద్దులఫై సుదీర్ఘంగా చర్చించి తుది మెరుగులు దిద్దారు. బడ్జెట్ తుది రూపం సిద్దమైన నేపధ్యంలో ఆర్థిక శాఖ ప్రింటింగ్ ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 18 ఉదయం మంత్రి వర్గం ఆమోదం పొందిన అనంతరం ఆర్థికమంత్రి హరీష్ రావు అదే రోజు రాష్ట్ర బడ్జెట్ 2021-22ను సభలో ప్రవేశ పెడతారు. 20, 22 తేదీల్లో బడ్జెట్‌పై సాధారణ చర్చ,23, 24, 25 తేదీల్లో బడ్జెట్‌ పద్దులపై చర్చ ఉంటుంది 26న ద్రవ్యవినిమయ బిల్లు (బడ్జెట్)పై చర్చ, సభామోదం ఉంటాయి.
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది.  అధికార తెరాస, ఖమ్మం స్థానానికి సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర రెడ్డి పేరును ప్రకటించడంలో కొంచెం జాప్యం చేయడంతో పాటుగా, హైదరాబాద్ స్థానం నుంచి , పీవీ కుమార్తె వాణీ దేవి పేరును చివరి క్షణంలో తెరమీదకు తేవడంతో అంత వరకు కొంత స్తబ్దుగా సాగిన ప్రచారం ఆ తర్వాత వేడెక్కింది. ఉద్యోగ నియామకాల విషయంలో తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ తప్పులో కాలేయడంతో విపక్షాలు, పోటీలో ఉన్న ప్రత్యర్ధులు, నిరుద్యోగ యువత, విద్యార్ధి సంఘాలు  ఒకే సారి ఆయన మీద  విరుచుకు పడ్డారు. ఆయన లెక్క తప్పని నిరుపిస్తం రమ్మని వరస సవాళ్ళు విసిరారు. దీంతో, మంత్రి నియామకా ఇష్యూని పక్కకు తప్పించేందుకు , ఐటీఐఆర్, వరంగల్ రైల్వే ఫ్యాక్టరీ వంటి సెంటిమెంటల్ ఇష్యూస్’ను తెరపైకి  తెచ్చారు. అలాగే, కేంద్ర ప్రభుత్వంపై విమర్శల దాడిని పెంచారు. చివరకు పొరుగు రాష్ట్రానికి చెందిన విశాఖ ఉక్కు ఆందోళన   కూడా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగమైంది.   రెండు నియోజక వర్గాలలో గతంతో పోలిస్తే ఈసారి ఓటర్ల సంఖ్య రెట్టింపు అయింది. ఈసారి రెండు నియోజక వర్గాలలో కలిపి 10 లక్ష 36 వేల మంది తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. అలాగే, రెండు పట్ట భద్రుల నియోజక వర్గాల్లో 164 మంది అభ్యర్ధులు పోటీలో ఉన్నారు.  గత ఎన్నికలతో పోలిస్తే ఇటు ఓటర్ల సంఖ్య, అటు అభ్యర్థుల సంఖ్యా రెట్టింపునకు పైగానే పెరగడంతో ఎన్నికలలో జోష్ పెరిగింది. దీనికితోడు అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో సాధారణ ఎన్నికలను తలపించే రీతిలో ప్రచారం సాగింది. ఎక్కువమంది అభ్యర్ధులు బరిలో ఉండడంతో, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి  తమకే ప్రయోజనం జరుగుతుందని అధికార పార్టీ ఆశపడుతోంది .  దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో చేదు ఫలితాలను చవిచూసిన టీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా వ్యూహ రచన చేసి కేటీఆర్, హరీష్ సహా మంత్రులు,ఎమ్మెల్యేలకు స్పెసిఫిక్ బాధ్యతలు అప్పగించారు. అలాగే,కాంగ్రెస్‌ అభ్యర్థులు చిన్నారెడ్డి, రాములునాయక్‌లకు మద్దతుగా ఉత్తమ్‌, భట్టి, రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తదితరులు విస్తృతంగా ప్రచారం చేశారు. బీజేపీ అభ్యర్థులు ఎన్‌.రాంచందర్‌రావు, ప్రేమేందర్‌రెడ్డిల తరఫున ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, ఎంపీ అరవింద్‌ తదితరులు ప్రచారాన్ని వేడెక్కించారు.  ఖమ్మం స్థానం నుంచి ప్రత్యక్ష ఎన్నికల్లో తొలిసారి పోటీకి దిగిన కోదండరాంకు, టీజేఎస్‌ పార్టీకీ ఈ ఎన్నికలు కీలకంగా మారాయి. ఖమ్మ స్థానం నుంచి పోటీ చేస్తున్న తీన్మార్ మల్లన్న ముందస్తు వ్యూహంతో ప్రధాన పార్టీల అభ్యర్ధులకు ధీటుగా ప్రచారం సాగించారు.  వామపక్షాల మద్దతుతో జయసారథి, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్‌, యువతెలంగాణ కార్యనిర్వాహక అధ్యక్షురాలు రాణీ రుద్రమ తదితరులు పోటీలో ఖమ్మం సీటును పట్టభద్రులు  ఎవరికి  పట్టం కడతారు అన్నది ప్రశ్నార్థకంగా మారింది. హైదరాబాద్ సీటు కూడా ఇటు అధికార తెరాసకు అటు సిట్టింగ్ సీటును నిలుపుకోవడం తో పాటుగా దుబ్బాక , జీహెచ్ఎంసి జోష్ ను కొనసాగించాలని ఆశ పడుతున్నబీజేలకే కూడా ఇజ్జత్ కీ సవాల్ గా మారింది. కాంగ్రెస్ అభ్యర్ధి పార్టీ సీనియర్ నాయకుడు సౌమ్యుడు, మాజీ మంత్రి చిన్నారెడ్డి, వామ పక్షాల మద్దతుతో పోటీ చేస్తున్న మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ కూడా గట్టి పోటీ ఇస్తున్నారు. సో.. చివరకు ఏమి జరుగుతుంది అంటే ఏదైనా జరగవచ్చును. ఈ నెల 14 వ తేదీన పోలింగ్ జరుగుతుంది.17 ఫలితాలు వస్తాయి .. అంతవరకు వెయిట్ అండ్ వాచ్ .  
సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది. ఒకప్పుడు ఎర్ర జెండాను దిగ్విజయంగా ఎదిరించి, మార్క్సిస్టులను మట్టి కరిపించిన మమతా దీదీ ప్రస్తుతం, కాషాయ కూటమి నుంచి గట్టి సవాలును ఎదుర్కుంటున్నారు. వరసగా పదేళ్ళు పాలించడం వలన సహజంగా వచ్చిన ప్రభుత్వ వ్యతిరేకత  కంటే, హిందూ ఓటు పోలరైజేషన్ ఆమెను మరింతగా భయపెడుతోంది. నిజానికి ఐదేళ్ళ క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం ఐదు శాతం కంటే తక్కువ ఓట్లు, మూడంటే మూడు అసెంబ్లీ సీట్లు మాత్రమే గెలుచుకున్న బీజేపీ..  2019 లోక్ సభ ఎన్నికల్లో ఏకంగా 40 శాతం ఓట్లతో 18 స్థానాలు గెలుచుకుంది. ఈ  మార్పు ఇంకా కొన్ని కారణాలు ఉంటే ఉండవచ్చును కానీ.. హిందువుల ఓటు పోలరైజ్  కావడమే ప్రధాన కారణం.  ఈ నేపధ్యంలోనే కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ చివరకు కమ్యూనిస్టులు కూడా బీజేపీలో  చేరారు. ఎన్నికల ప్రకటన వెలువడిన తర్వాత కూడా సిట్టింగ్ ఎమ్మెల్ల్యేలు సహా  తృణమూల్ టికెట్ వచ్చిన నాయకులు కూడా బీజేపీలో చేరుతున్నారు. అనేక మంది ఇతర రంగాల ప్రముఖులు, ముఖ్యంగా ఇంతకాలం, బీజేపీని హిదుత్వ అనుకూల ‘అచ్చుత్’ (అంటారని) పార్టీగా చూసిన ‘సెక్యులర్’ ప్రముఖులు కాషాయం కప్పుకోవడంతో మమతా బెనర్జీకి కొంచెం అలస్యంగానే అయినా, తత్త్వం బోధపడింది. అందుకే ఆమె ఇప్పుడు గుళ్ళూ,గోపురాలకు తిరుగుతున్నారు. కార్యకర్తల సమావేశాల్లో తానూ హిందువునేనని, చెప్పుకుంటున్నారు.  నిజానికి ఇలా నేనూ హిందువునే  అని సెక్యులర్ నేతలు బహిరంగంగా ప్రకటించుకోవడం మమతా బెనర్జీతోనే మొదలు కాలేదు. రాహుల్ గాంధీ తాను హిందువునని, జన్యుధారీ కశ్మీరీ బ్రాహ్మణుని అనీ.. తమ గోత్రం, ‘దత్తాత్రేయ’ గోత్రమని బహిరంగంగా ప్రకటించుకున్నారు. అలాగే  కొద్ది రోజుల క్రితం ప్రియాంకా గాంధీ తానూ హిందువునని చెప్పుకునేందుకు ‘మౌని అమావాస్య’ సందర్భంగా అలహాబాద్ లో గంగా స్నానం చేశారు. గతంలోనూ ఆమె ఎన్నికలకు ముందు గంగా యాత్ర చేశారు. అంతవరకు ఎందుకు కొద్దిరోజుల క్రితం సిపిఐ నారాయణ విశాఖ స్వామి ఆశీస్సులు తీసుకున్నారు. చంద్రబాబు, జగన్ రెడ్డి, కేసీఆర్ ఇలా తెలుగు నేతలు అనేక మంది లౌకిక వాదానికి కాలం చెల్లిందన్న సత్యాన్ని గ్రహించి కావచ్చు ‘నేనూ హిందువును’ అంటూ ప్రకటించుకునేందుకు పోటీ పడుతున్నారు. రాముడిని తలచుకున్నా, జై శ్రీరామ్ అన్నా తమ  లౌకిక వాదం మయలపడి పోతుందని భయపడిన నాయకులు ఇప్పుడు .. జై శ్రీరామ్ అనేందుకు కూడా వెనకాడడం లేదు.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది. గత కొంత కాలంగా సబర్మలతో సహా అనేక అంశాలపై స్పందిస్తూ.. కేరళను టార్గెట్ చేస్తున్న బీజేపీ నాయకులు అక్కడ తమ జెండా ఎగరేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా పార్టీ పాలసీని కూడా పక్కన పెట్టి మెట్రో మ్యాన్ శ్రీధరన్ ను పార్టీలో చేర్చుకుని ఆయనే తమ సీఎం అభ్యర్థి అని ప్రకటించిన 24 గంటలలో యూ టర్న్ తీసుకున్నారు. ఇది ఇలా ఉండగా ప్రస్తుతం సీఎంగా ఉన్న కమ్యూనిస్ట్ నేత పినరై విజయన్ పై గోల్డ్ స్మగ్లింగ్ ఆరోపణలు రావడంతో.. ఈ ఎన్నికలలో ఎల్డిఎఫ్ భవిష్యత్తుపై ప్రజలు ఏ తీర్పు ఇవ్వబోతున్నారనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది ఈ నేపథ్యంలో అక్షరాస్యతలో దేశంలోనే మొదటి స్థానంలో ఉన్న ఆ రాష్ట్ర ప్రజలు ఎవరిని ఆశీర్వదిస్తారు అనే అంశంపై ప్రముఖ మీడియా సంస్థ టైమ్స్ నౌ, సీ ఓటరుతో కలిసి ఒక సర్వేను నిర్వహించారు. ఈ సర్వే ప్రకారం చూస్తే పాపం కమలనాథులు అక్కడ పవర్ చేతికి రావటం అటుంచి కనీసం రెండు మూడు అసెంబ్లీ స్థానాల్లో గెలవటం కూడా కష్టమేనని ఆ సర్వే తేల్చి చెబుతోంది. కేరళలో ఈసారి జరిగే అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ తన హవా చాటుతుందన్న ఆ పార్టీ నేతల మాటలలో ఎలాంటి నిజం లేదని.. ప్రస్తుతానికి అది ఏమాత్రం సాధ్యం కాదని ఈ తాజా సర్వే తేల్చి చెప్పింది. అంతేకాకుండా మొత్తం 140 స్థానాలు ఉన్న కేరళలో.. ప్రస్తుత సీఎం పినరయి విజయన్ నేతృత్వంలోని లెఫ్ట్డ్ డెమొక్రటిక్ ఫ్రంట్ కు 82 సీట్లు పక్కా అని.. ఆయనే తిరిగి అధికారాన్ని నిలబెట్టుకుంటాడని సర్వే చెపుతోంది. అదే సమయంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూనైటెడ్ డెమొక్రాటిక్ ఫ్రంట్ కు 56 నుంచి 60 వరకు సీట్లు వచ్చే అవకాశం ఉందని ఈ సర్వేలో తేలింది. అంతేకాకుండా 2016 ఎన్నికలతో పోలిస్తే ఎల్ డీఎఫ్ ఓటింగ్ శాతం కూడా కొంత పెరగటం ఇక్కడ గమనార్హం. ప్రస్తుతం సీఎంగా ఉన్న విజయన్ మరోసారి సీఎం కావాలని 43.34 శాతం మంది మొగ్గు చూపినట్లుగా సర్వేలో తేలింది. కరోనా సమయంలో విజయన్ సీఎంగా బాగా పని చేసారని ఈ సర్వే పేర్కొంది. మరోపక్క దేశ ప్రధానిగా రాహుల్ గాంధీ ఉండాలని కేరళ ప్రజల్లో 55.84 శాతం మంది కోరుకుంటున్నట్లుగా ఈ సర్వే;లో తేలింది. అయితే కేరళలో ఎలాగైనా పాగా వేయాలని పట్టుదలతో కృషి చేస్తున్న బీజేపీకి ఈసారి కూడా నిరాశ తప్పదని ఈ సర్వేలో స్పష్టం అయింది. ఈ ఎన్నికలలో బీజేపీకి రెండు సీట్లు కూడా రావటం కూడా కష్టమేనని ఈ సర్వే తేల్చింది. అయితే ఎన్నికలకు ముందు ఇలాంటి సర్వేలు బయటకు రావడం.. తరువాత అందులో కొన్ని చతికిల పడడం మనం చూస్తూనే ఉన్నాం. మరి ఈ సర్వే ఫలితాలు నిజామా అవుతాయో లేదో తేలాలంటే కొద్దీ రోజులు వెయిట్ చేయాల్సిందే.        
రాజకీయాలు అంటేనే అదో జూదం. పూలమ్మిన చోటనే కట్టెలు అమ్మవలసి రావచ్చును. అలాంటి పరిస్థితే వచ్చినా, తలవంచుకుని పోగలిగితేనే, ఎవరైనా రాజకీయాలలో రాణించగలరు. అలాకాదని, అలిమి కానిచోట, కూడా తామే అధికులమని భావిస్తే, ఎందుకూ కాకుండా పోతారు. అలాంటి వారు ఇద్దరూ కూడా ఇప్పుడు మన కళ్ళముందే ఉన్నారు.  జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు. అలాగే జయ మరణం తర్వాత ఆమె పరిస్థితి ఏమిటో కూడా వేరే చెప్పవలసిన, అవసరం లేదు. జైలు పాలయ్యారు. సర్వం తానై నడిపించిన పార్టీ నుంచి  బహిష్కరణకు గురయ్యారు. జయ ఉన్నంత వరకు తన వారుగా ఉన్న వారందరూ కానివారయ్యారు. ఒంటరిగా మిగిలారు.  నిజానికి నాలుగేళ్ళు జైలు జీవితం గడిపిన తర్వాత కూడా ఆమె తలచుకుంటే.. రాష్ట్ర రాజకీయాలలో, ముఖ్యంగా అధికారంలో ఉన్న డిఎంకే కూటమిలో అలజడి సృష్టించగలరు. ఎన్నికలలో ఆమె గెలవక పోవచ్చును కానీ.. తనను కాదన్న అన్నాడిఎంకేను ఓడించగలరు. అయిన  ఆమె అందుకు విరుద్ధంగా  రాజకీయాలకు వీడ్కోలు పలికి మౌనంగా పక్కకు తప్పుకున్నారు. రాజకీయ సన్యాసం ప్రకటించారు. ఉమ్మడి శతృవు డిఎంకే ను ఓడించేందుకు అన్నా డిఎంకే కూటమి  పోటీ చేయాలని, కూటమి ఐక్యతను దెబ్బతీయరాదనే ఉద్దేశంతోనే ఆమె రాజకీయ సన్యాసం ప్రకటించారు.    శశికళ మౌనంగా వెళ్లి పోవడం వెనక ఇంకా అనేక కారణాలున్నా ,అసలు కారణం ఆమె, రాజకీయ విజ్ఞత, వివేకం. ఆమె జైలుకు వెళ్ళిన సమయంలో జయలలిత సమాధి వద్ద ఎంత కసిగా, కోపంగా ‘మౌన’ ప్రతిజ్ఞ చేశారో చూశా. అలాంటి ఆమె ఇప్పుడు ఇలా ‘మౌనం’గా వెనకడుగు వేశారంటే, అది ఆలోచించ వలసిన విషయమే.ఆమె వ్యుహతంకంగానే సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే అనేక మంది అనేక కోణాల్లో శశికళ సంచలన నిర్ణయాన్ని విశ్లేషించారు.జైలు జీవితం తర్వాత కూడా అన్నా డిఎంకే నాయకులు తనను అగ్రనేతగా అంగీకరించక పోవడం, అమిత్ షా చెప్పినా.. అన్నా డిఎంకే నాయకులు ఆమెను, మేనల్లుడు దినకరన్’ను కులం పేరున, కుటుంబం పేరున దూరం చేయడం, తిరిగి పార్టీలోకి తీసుకోకపోవడంతో ఆమె మనసు కష్టపెట్టుకుని, సన్యాస నిర్ణయం తీసుకున్నారని కొందరంటున్నారు. పార్టీ మీద పట్టు లేదని, చరిష్మా అసలే లేదని, అందుకే ఆమె అలా నిశ్శబ్ధంగా రాజకీయ సన్యాసం స్వీకరించారని ఇంకొందరు విశ్లేషించారు. ఈ విశ్లేషణలో కొంత నిజం ఉంటే ఉండవచ్చును.. కానీ ఆమె గతాన్ని, నైజాన్ని గుర్తు చేసుకుంటే ఆమె స్ట్రైక్ బ్యాక్ వ్యూహంతోనే ఒకడుగు వెనక్కివేశారని ఆమెతో సన్నిహితంగా మెలిగినవారు, ఆమె రాజకీయ చాణక్యం తెలిసిన వారు అంటారు.   నిజానికి జైలులో ఉన్న కాలంలో కానీ, జైలు నుంచి విడుదలై వచ్చిన తర్వాత కానీ, ఆమె రాజకీయ సన్యాసం వైపు అడుగులు వేస్తున్నట్లు కనిపించలేదు. బెంగుళూరు జైలు నుంచి విడుదలై చెన్నైలో ప్రవేశించిన నప్పుడు ఆమె పెద్ద కాన్వాయ్ తో  తమ కారుకు అన్నాడిఎంకే జెండాతోనే ఎంటరయ్యారు. అలా ఎంట్రీలోనే రాజకీయ ఆకాంక్షను వెంట తెచ్చుకున్నారు. చివరకు ‘సన్యాస’ ప్రకట చేసే వరకు కూడా ఆమె రాజకీయ కార్యకలాపాలు సాగిస్తూనే ఉన్నారు. అటు ఢిల్లీని ఇటు చెన్నైనికూడా కదిల్చారు. అంతేకాదు, రాజకీయాలపై విరక్తితో కాదు, రాజకీయ కసితో, ఉమ్మడి శత్రువు (డిఎంకే) ను ఓడించేందుకే తాను రాజకీయాలనుంచి తపుకుంటున్నట్లు చెప్పారు.  సో .. సన్యాసం తీసుకోవాలనే ఆలోచన, రాజకీయవ్యూహం లోంచి పుట్టిందే కానీ,వైరాగ్యంతో పుట్టింది కాదు ,అన్నవిశ్లేషణ వాస్తవానికి ఇంకొంత దగ్గరగా ఉందని అనుకోవచ్చును. ఇది ‘కామా’నే కాని ‘ఫుల్స్టాప్’ కాదని అంటున్నారు.  ముఖ్యమంత్రి ఎడప్పాడి కే. పళని స్వామి (ఈపీఎస్) ఆమెను పార్టీలోకి అనుమతిస్తే తన కుర్చికీ ఎసరు పెడతారనే భయంతోనే,, ఆమె ఎంట్రీని అడ్డుకున్నారు. ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం, శశికళ ఒకే సామజిక వర్గానికి చెందిన వారు కావడం కూడా, ముఖ్యమంత్రి ఈపీఎస్’ భయానికి కారణంగా పేర్కొంటారు. అందుకే  ఆయన, ‘మన్నార్గుడి’ ఫ్యామిలీని బూచిగా చూపించి, ఆమెను దూరంగా ఉంచారని పార్టీలో ఒక వర్గం గట్టిగా విశ్వసిస్తుంది. అయితే ఆమె శక్తియుక్తులను కూడతీసుకుని  పులిలా పంజా విసిరేందుకే ఆమె వ్యూహాత్మకంగా ఒక అడుగు వెనక్కి వేశారు కావచ్చును అని కూడా, తమిళ రాజకీయ వర్గాల్లో ఒక చర్చ జరుగుతోంది.  గతంలో ఆమె జయలలితతో విబేధాలు వచ్చిన సమయంలో కూడా ఇలాగే కొద్ది కాలం మౌనంగా తెర చాటుకు వెళ్లి పోయారు.  కొద్ది కాలంలోనే మళ్ళీ ‘పోయస్ గార్డెన్’లో ప్రత్యక్షమయ్యారు. జయలలిత స్వయంగా ఆమెను వెనక్కి పిలుపించుకోవలసిన పరిస్థితులను సృష్టించారు. అలా  మళ్ళీ  చక్రం తిప్పారు. జయలలిత మరణం వరకు ఆమె అందరికీ చిన్నమ్మగా అమ్మకు పెద్దమ్మగా సర్వం తానై నిలిచారు. చివరకు జయ అంత్యక్రియల్లో కూడా ఆమెదే పై చేయిగా కనిపించింది.   జయలలిత చనిపోయిన సందర్భంలోనే అన్నా డిఎంకే ఎమ్మెల్ల్యేలో సుమారు 30 మంది వరకు ఆమెకు మద్దతుగా ఉన్నారన్న వార్తలొచ్చాయి. నిజానికి,ఇప్పటికి కూడా ఒక్క అన్నా డిఎంకే లోనేకాదు,డిఎంకే ఇతర పార్టీలలో కూడా  ఆమె అవసరం ఉన్న వాళ్ళు ఉన్నారు. కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో ‘మన్నార్గుడి’ ఫ్యామిలీ మద్దతు లేకుండా గెలిచే అవకాశం లేదు.  ఇవ్వన్నీ నిజమే అయినా.. అన్నీ ఉండి, ఎవరు లేని శశికళలో, ఇంకా  ఎవరి కోసం తాపత్రయ పడాలి? అనే ప్రశ్న జనించి ఉంటే, ఆమె రాజకీయ సన్యాసం నిజం కావచ్చును. ఎందుకంటే ఆమె నెచ్చలి, జయలిత లేరు, భర్త అంతకంటే ముందే చనిపోయారు, పిల్లలు లేరు... పైగా నాలుగేళ్ళ జైలు జీవితం ఆమెలో మార్పు తెచ్చి ఉండవచ్చును. ఈ వయస్సులో తనవారంటూ ఎవరు లేని తనకు రాజకీయాలు ఎందుకు ? శేష జీవితాన్ని ఇలా సాగిద్దామనే ఆలోచన నిజంగా వచ్చి ఉంటే, ఆమె సన్యాసం సత్యం అయినా కావచ్చును, కాకపోనూ వచ్చును. కానీ  శశికళ... ఆమెను అర్థం చేసుకోవడం, అంచనా వేయడం , అంత తేలిగ్గా అయ్యే పని కాదు..
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు. కాంగ్రెస్ అధినాయకత్వం పై నేరుగా అస్త్రాలు సంధించారు. రాహుల్ గాంధీ పేరు చెప్పకుండానే, ఆయన నాయకత్వానికి పనికిరాడని తేల్చి చెప్పారు. ఎవరైనా పార్టీ అధ్యక్షుడు అయితే కావచ్చును, కానీ, ప్రజానాయకుడు కాలేడని, రాహుల గాంధీ ప్రజానాయకుడు కాదు కాలేరు,అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తరచూ రాహుల్ గాంధీని ఉద్దేశించి చేసే  ‘నామ్’ధారీ వ్యంగ్యాస్త్రాన్నే కాంగ్రెస్ సీనియర్ నాయకులు కూడా సందించారు. ఇక అక్కడి నుంచి విధేయ, అసమ్మతి వర్గాల మధ్య మాటల యుద్ధం ఎదో ఒక రూపంలో సాగుతూనే వుంది. అదే క్రమంలో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ, కరుడు కట్టిన ముస్లిం మతోన్మాది, అబ్బాస్ సిద్దిఖీతో కాంగ్రెస్ పార్టీ చేతులు కలపడం అసమ్మతి నాయకులకు మరో అస్త్రాన్ని అందించింది. విషయంలోకి వెళితే, ఇటీవల పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా లోక్’సభలో కాంగ్రెస్ పక్ష నాయకుడు, పశ్చిమ బెంగాల్ పీసీసీ అధ్యక్షుడు అధీర్’రంజన్ చౌదరి, ముస్లిం మత ప్రచారకుడు, అబ్బాస్ సిద్దిఖీతో  వేదిక పంచుకున్నారు.అంతకు ముందే వామ పక్ష కూటమితో  పొత్తు కుదుర్చుకున్న కాంగ్రెస్ పార్టీ, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)ను కూటమిలో చేర్చుకుంది. ఇలా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) అమోదం లేకుండా మతోన్మాద ఐఎస్ఎఫ్’ తో ఎన్నికల పొత్తు పెట్టుకోవడం ఆ పార్టీ నాయకుడు,సిద్ధిఖీతో  పీసీసీ చీఫ్ వేదిక  పంచుకోవడం పై అసమ్మతి నేతలు మండి పడుతున్నారు. ఇలా సిద్దిఖీతో వేదిక పంచుకోవడం పార్టీ మౌలిక సిద్ధాంతాలకు వ్యతిరేకం అంటూ అసమ్మతి వర్గానికి చెందిన కీలక నేత, రాజ్యసభ సభ్యుడు,ఆనంద్ శర్మ మండిపడ్డారు. అంతే కాదు, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)తో జనవరిలో కుదుర్చుకున్న పొత్తుకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ)అమోదం లేదని ఆనంద్ శర్మ, అభ్యంతరం వ్యక్త చేశారు. పార్టీ విశ్వసించే లౌకిక వాదానికి కాంగ్రెస్ అధిష్టానం తీసుకున్న నిర్ణయం గొడ్డలి పెట్టని ఆయన తీవ్రంగా స్పందించారు.   శర్మ వ్యాఖ్యలపై అధీర్ రంజన్ చౌదరి అంతే ఘాటుగా ప్రతిస్పందించారు. “నిజాలు తెలుసుకోండి ఆనంద్ శ‌ర్మ జీ” అంటూ ఆయ‌న వ‌రుస ట్వీట్లు చేశారు. వ్య‌క్తిగ‌త ప్ర‌యోజ‌నాలు ప‌క్క‌న‌పెట్టి, ప్ర‌ధానిని పొగిడి టైమ్ వేస్ట్ చేయ‌కండంటూ ఆయ‌న ఓ ట్వీట్లో అన్నారు. ఆనంద్ శ‌ర్మ అన‌వ‌స‌రంగా కాంగ్రెస్‌ను ల‌క్ష్యంగా చేసుకుంటున్నార‌ని, ఈ అంశాన్ని పెద్ద‌ది చేసి చూపిస్తున్నార‌ని విమ‌ర్శించారు. ఆయ‌న ఉద్దేశాలు స‌రైన‌వే అయితే నేరుగా తనతో మాట్లాడ వలసిందని అన్నారు. బెంగాల్‌లో సీపీఐ(ఎం) కూట‌మికి నేతృత్వం వ‌హిస్తోంది. అందులో కాంగ్రెస్ ఓ భాగం. మ‌త‌తత్వ‌, విభ‌జ‌న రాజ‌కీయాలు చేస్తున్న బీజేపీకి చెక్ పెట్ట‌డానికే ఈ కూట‌మి అని మ‌రో ట్వీట్‌లో అధిర్ రంజ‌న్ అన్నారు. అక్కడతోనూ ఆగలేదు ... ట్వీట్ల మీద ట్వీట్లు సంధిస్తూ, ఆనంద్ శర్మ, బీజేపీ మత విభజన, అజెండాను బలపరుస్తున్నారని, పరోక్షంగా జీ23 నాయకులు బీజేపీకి ప్రయోజనం చేకూరుస్తున్నారని ఆరోపించారు.అంతే కాదు, క్షేత్ర స్థాయి వాస్తవ పరిస్థితులు తెలియకుండా, ఆనంద్ శర్మ పార్టీ మీద దండెత్తడం ఉచితం కాదని చౌదరి ఎదురుదాడి చేశారు. అసమ్మతిలో అసమ్మతి. ఇదలా ఉంటే, కాంగ్రెస్ పార్టీ  సమూల పక్షాళన కోరుతూ సోనియా గాంధీకి,గత సంవత్సరం  జీ 23గా ప్రాచుర్యం పొందిన సీనియర్ నాయకులు రాసిన లేఖపై సంతకాలు చేసిన  నాయకుల్లో నలుగురు,జమ్మూలోసమావేసమైన నాయకుల తాజా నిర్ణయాలు, వ్యాఖ్యలు,విమర్శల పట్ల అసంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరం సోనియా గాంధీకి రాసిన లేఖలో ప్రస్తావించిన అంశాలకు కట్టుబడి ఉన్నామని, అయితే, జీ 23లోని కొందరు సహచరులు, ఇటీవల గీతదాటి చేస్తున్న వ్యాఖ్యలు, విమర్శలను తాము సమర్ధించడం లేదని ఆ నలుగురు పేర్కొన్నారు. ఇందులో ముఖ్యంగా, రాజ్యసభ మాజీ డిప్యూటీ చైర్మన్, పీజే కురియన్ అయితే, “కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు అవసరమైన సంస్కరణలు తెచ్చేందుకు చేసే ప్రయత్నాలను పూర్తిగా సమర్దిస్తాను, కానీ, ‘లక్ష్మణ రేఖ’ దాటితే ఒప్పుకునేది లేదు”అని అసమ్మతిలో అసమ్మతికి తెర తీశారు.అలాగే, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ కుమారడు, మాజీ ఎంపీ సందీప్ దీక్షిత్,మధ్య ప్రదేశ్ సీనియర్ కాంగ్రెస్ నాయకుడు అజయ్ సింగ్’ కూడా గులాం నబీ ఆజాద్, కపిల్ సిబల్, ఆనంద్ శర్మ, మనీష్ తివారీ వంటి జీ 23 కీలక నేతలు అధినాయకత్వంపై చేసిన వ్యాఖ్యలను తప్పు పట్టారు. అలాగే, పార్టీ సీనియర్ నాయకుడు కేంద్ర మాజీమంత్రి వీరప్ప మొయిలీ కూడా,గత సంవత్సరం పార్టీ సీనియర్ నాయకులు  ఒక పరిమిత లక్ష్యంతో  సోనియా గాంధీకి లేఖ రాయడం జరిగిందని, ఆ పేరున జరుగతున్న  కార్యక్రమాలు లేఖ సంకల్పానికి  విరుద్ధమని అన్నారు. జీ 23 కార్యకలాపాలపై రాహుల్ గాంధీ కూడా పరోక్షగా స్పందించారు, ఒకప్పుడు ఎన్ఎస్’యుఐ, యూత్ కాంగ్రెస్’ కు సంస్థాగత ఎన్నికలు వద్దన్న వారే ఇప్పుడు ఇంకోలా మాట్లాడుతున్నారని పరోక్షంగానే అయినా సంస్థాగత ఎన్నికలు నిర్వహించడంతో పాటుగా, పార్టీ పక్షాలనకు తమ కుటుంబం వ్యతిరేకం కాదని, అందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఈ నేపధ్యంలో కాంగ్రెస్ పార్టీలో చెలరిగిన కలకలం  ఇక ముందు ఏమవుతుందో .. ఇంకెన్ని  మలుపులు తిరుగుతోందో ..చూడవలసిందే కానీ ఉహించలేము.
పంచతంత్రంగా పిలుచుకుంటున్న ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భతం జరగబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే, వివిధ సంస్థలు అసెంబ్లీ ఎన్నికలు జరిగే  అస్సాం. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటుగా కేరళలోనూ ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఆ ఒపీనియన్ పోల్ ఫలితాలు నిజంగా నిజం అయితే, కేరళలో మళ్ళీ సీపీఎం సారధ్యంలోని వామపక్ష కూటమి అధికారంలోకి వస్తుంది. ఇదే ఆ అద్భుతం. ఎందుకంటే, గత నాలుగు దశాబ్దాలలో కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో ఒకే కూటమి వరసగా రెండవసారి అధికారంలోకి వచ్చిన చరిత్ర లేనే లేదు. ఒక సారి ఎల్డీఎఫ్ అధికారంలోకి వస్తే ఐదేళ్ళ తర్వాత కాంగ్రెస్ సారధ్యంలోని ఐక్య ప్రజాస్వామ్య కూటమి(యూడీఎఫ్) అధికారంలోకి రావడం, దేవభుమిలో దైవ నిర్ణయమా అన్నట్లుగా ప్రతి ఎన్నికల్లోనూ అధికారం చేతులు మారుతూ వస్తోంది. అలాంటిది, ఈసారి ఒపీనియన్ పోల్స్ నిజమై వరసగా రెండవసారి వామపక్ష కూటమి అధికారంలోకి వస్తే, అది చరిత్రే అవుతుంది. ఇక ఒపీనియన్ పోల్స్ విషయానికి వస్తే, జాతీయ న్యూస్ ఛానెల్ ఏబీపీ, సీ ఓటర్ సంస్థలు సంయుక్తంగా ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఈ సర్వే ప్రకారం, 140 స్థానాలున్న కేరళ అసెంబ్లీలో వామపక్ష కూటమికి 83 నుంచి  91 స్థానాలు, యూడీఎఫ్ కూటమికి 47 నుంచి 55 స్థానాలు మాత్రమే దక్కుతాయని తెలుస్తోంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్రంలో ఇలా జాతకాలు తిరగబడడంపై సోషల్ మీడియాలో,’లెగ్ మహిమ’ లాంటి జోక్స్  ట్రోలవుతున్నాయి. అయితే 2016లో జరిగిన ఎన్నికల్లో కేవలం 47 సీట్లకే పరిమితం అయిన కాంగ్రెస్’కు ఈసారి ఒకటీ అరా సీట్లు ఎక్కువస్తే, రావచ్చును. అదే కాంగ్రెస్’కు కాసింత ఊరట. అదలా ఉంటే, పశ్చిమ బెంగాల్లో సైతం పట్టు సాధించిన బీజేపే, కేరళలో మాత్రం పట్టు కాదు కదా, పట్టుమని పది సీట్లు తెచ్చుకునే స్థితిలో లేదు. నిజానికి, దేశంలో బీజేపీకి అసలు ఏ మాత్రం మింగుడు పడని రాష్ట్రాలు ఎవైన ఉన్నాయంటే కేరళ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల  పేర్లే ప్రముఖంగా వినిపిస్తాయి. ఈ సారి కూడా కమల దళం కేరళలో కాలు పెట్టె పరిస్తి లేదని సర్వే ఫలితాలు చెపుతున్నారు. ఎప్పటిలానే ఇప్పడు కూడా  బీజేపీకి సున్నా నుంచి రెండు సీట్లు వచ్చే అవకాశం ఉందని, సర్వేస్వరుల అభిప్రాయంగా ఉంది. కేరళలో మొత్తం 140 స్థానాలకు ఏప్రిల్ 6 తేదీన ఒకే విడతలో పోలింగ్ జరుగుతుంది. మే 2 తేదీన ఫలితాలు వెలువడతాయి. కేరళ ఎలక్షన్ పై యావత్ దేశం ఆసక్తి కనబరుస్తోంది.    
కేంద్ర ఎన్నికలసంఘం ‘పాంచ్ పటాక’ గంట కొట్టింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. ఎన్నికల గంట మోగడంతో మొదలైన మరో భారత ‘మినీ’  సంగ్రామానికి మే 12 తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తెర పడుతుంది.ఈలోగా వివిధ అంచల్లో పోలింగ్ జరుగుతుంది.  నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతం ఓటరు తీర్పుకు వెళుతున్నా, అందరి దృష్టి, ముఖ్యంగా ప్రాంతీయ పార్టీల ఏలుబడిలో ఉన్న ఉభయ తెలుగు రాష్ట్రాలు, మరీ ముఖ్యంగా ఇప్పటికే బీజేపీ కన్నుపడిన తెలంగాణ రాష్ట్ర ప్రజలు, రాజకీయ పార్టీల దుష్టి  మాత్రం పశ్చిమ బెంగాల్ పైనే వుంది.  పశ్చిమ బెంగాల్లో ‘అద్భుతం’ జరిగి బీజేపీ విజయం సాధిస్తే, ఇక  కమల దళం ఫోకస్, తెలంగాణకు షిఫ్ట్ అవుతుంది. ఇది అందరికీ తెలిసిన బహిరంగ రహస్యం. ఈ నేపధ్యంలో బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయి అనే విషయంలో రాష్ట్ర రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. బెంగాల్లో బీజేపీ గెలిస్తే, ఇప్పటికే అంతర్గత కుటుంబ కలహాలతో సతమతవుతున్న తెరాస నాయకత్వానికి మరిన్నితిప్పలు తప్పవన్న మాట అంతఃపుర వర్గాలలో సైతం వినవస్తోంది.  పశ్చిమ బెంగాల్’లో ఎలాగైతే కమలదళం ఓ వంక తమ ట్రేడ్ మార్క్, హిందుత్వ రాజకీయాలు సాగిస్తూ, మరో వైపు నుంచి ‘ఆకర్ష్’ అస్త్రంతో అధికార పార్టీని నిర్వీర్యం చేసిన విధంగానే, ఇక్కడ కూడా ఫిరాయింపులను ప్రోత్సహింఛి పార్టీని నిట్టనిలువునా చీల్చే ప్రమాదాన్ని కొట్టివేయలేమని పార్టీ వర్గాలు కూడా అనుమానం వ్యక్త పరుస్తున్నాయి.  ఇప్పటికే తెలంగాణ  బీజేపీ నాయకులు 30 మంది తెరాస ఎమ్మెల్యేలు తమ టచ్ లో ఉన్నారని బెదిరిస్తున్నారు.అది నిజం అయినా కాకపోయినా..తెరాసలో అసంతృప్తి అగ్గి రగులుతోందనేది మాత్రం ఎవరూ కాదనలేని నిజం. అంతే కాకుండా రాష్ట్రానికి వచ్చిన కేంద్రనాయకులు ఎవరిని పలకరించినా, నెక్స్ట్ టార్గెట్ తెలంగాణ అని ఎలాంటి సషబిషలు లేకుండా కుండబద్దలు కొడుతున్నారు.అందుకే, బెంగాల్లో బీజేపీ గెలిస్తే.. అనే ఊహా కూడా  గులాబీ గూటిలో గుబులు పుట్టిస్తోంది. అయితే, బెగాల్’లో బీజేపీ గెలిస్తే ఒక్క తెలంగాణలోనే కాదు, దేశ రాజకీయ వాతావరణంలోనే పెను మార్పులు చోటు చేసుకుంటున్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.  అలాగే,  దేశ ముఖ చిత్రంలో కూడా పెను మార్పులు తప్పవని అంటున్నారు. అయితే రాజకీయాలలో ఎప్పుడు ఏం జరుగుతుందో.. ఎవరూహించెదరు..
చాణక్య నీతి శాస్త్రంలో జీవితంలోని ప్రతి అంశం చక్కగా వివరించబడింది. ఆచార్య చాణక్యుడు తన జీవిత అనుభవాల ద్వారా వృత్తి, స్నేహం, వైవాహిక జీవితం, సంపద, విద్య, వ్యాపారం మొదలైన అన్ని విషయాలపై నైతిక పాఠాలను అందించాడు. ఇదిలా ఉంటే పెళ్లి గురించి ప్రస్తావించాడు. భార్యాభర్తల మధ్య ఉన్న సంబంధాల గురించి కూడా వివరించాడు. భార్యాభర్తల మధ్య అనుబంధం ప్రత్యేకమైనది. అది జీవితాంతం ఉండే అనుబంధం. వైవాహిక జీవితం సాదాసీదాగా, ప్రేమగా ఉండాలంటే ఇరువైపులా ప్రయత్నాలు చేయాల్సిన అవసరం ఉందని అంటున్నారు. పరస్పర సామరస్యం,  ప్రేమపై ఆధారపడిన సంబంధం మాత్రమే బలపడుతుంది. కాబట్టి చాణక్యుడి తత్వశాస్త్రం ప్రకారం సంతోషకరమైన వైవాహిక జీవితాన్ని ఏ అంశాలు దారితీస్తాయో ఇక్కడ వివరాలు ఉన్నాయి. చాణక్యుడు ప్రకారం, భార్యాభర్తలు ఒకరికొకరు సహచరులు, పోటీదారులు కాదు. సంతోషకరమైన వైవాహిక జీవితం కోసం, భార్యాభర్తలిద్దరూ కలిసి ముందుకు సాగడం ముఖ్యం. జీవితంలో ఎదురయ్యే రెండు సమస్యలనూ ప్రత్యర్థులుగా కాకుండా భాగస్వాములుగా చేసి పరిష్కరించుకోవాలి. ఆచార్య చాణక్య ప్రకారం ప్రతి సంబంధానికి వారి వ్యక్తిగత పరిమితులు ఉంటాయి. అదేవిధంగా, భార్యాభర్తల మధ్య కొన్ని రహస్య విషయాలు ఉన్నాయి, అవి ఎప్పుడూ మూడవ వ్యక్తికి చెప్పకూడదు, లేకుంటే వారి పరస్పర సంబంధంలో చీలిక ఉండవచ్చు. ఆచార్య చాణక్యుడు ప్రకారం, భార్యాభర్తలు ఇద్దరూ ఒకరి అవసరాలను ఒకరు చూసుకోవాలి. సంతోషకరమైన వైవాహిక జీవితం కోసం, మనం ఒకరి భావాలను గౌరవించుకోవాలి. మద్దతు ఇవ్వాలి.  మీ వైవాహిక జీవితం విజయవంతంగా ముందుకు సాగాలంటే , భార్యాభర్తలు ప్రతి విషయంలోనూ ఓపిగా ఉండటం చాలా అవసరం. ఎందుకంటే కొన్నిసార్లు ప్రతికూల పరిస్థితులు మీ సంబంధంలో చీలికలు ఏర్పడే ప్రమాదం ఉంటుంది. భార్యాభర్తల మధ్య స్నేహపూర్వక దృక్పథం ఉండాలి. సంబంధం ఒకరికొకరు మద్దతు ఇచ్చే స్నేహితులలా ఉండాలి. ఇద్దరి మధ్య సమానత్వ భావన ఉంటే ఎలాంటి సమస్యలనైనా సులభంగా పరిష్కరించుకోవచ్చు.
రక్షా బంధన్ ఆగస్టు 9వ తేదీన వచ్చింది. ఈ రోజు కోసం కొందరు  ప్రత్యేక ప్రణాళిక తయారు చేసుకుంటారు. కొందరు అక్కాచెల్లెళ్ళు  ఇప్పటికే కొత్త ఆలోచనలతో రాఖీ పండుగ సెలబ్రేట్ చేసుకోవడానికి రెఢీ అవుతున్నారు. కొత్త బట్టలు, రాఖీ  సిద్ధం చేసుకోవడం పరిపాటి. ప్రతిసారీ  పండుగను ఇంకాస్త మెరుగ్గా చేసుకోవాలని అనుకుంటారు.  కానీ ఇంకా మెరుగ్గా అంటే ఏం చేయాలో చాలామందికి తెలియదు.  మెరుగ్గా చేసుకోవడం అంటే కాస్త ఖరీదైన రాఖీ కట్టడం,  ఖరీదైన స్వీట్లు తెచ్చి పంచుకుని తినడం అని అనుకుంటారు చాలా మంది. కానీ ఇది తప్పు.. చాలామంది చేసేది కూడా రాఖీ కట్టడం, స్వీట్లు తినడం.. దీంతో రాఖీ సెలబ్రేషన్ అయిపోయింది అనుకుంటారు. కానీ రాఖీ పండుగ ఏడాది మొత్తం గుర్తుండిపోవాలి అంటే.. కాస్త డిఫరెంట్ గా ఆలోచించాలి.  ప్రణాళిక మార్చాలి.  ఇందుకోసం ఏమేమి చేయవచ్చు తెలుసుకుంటే.. సరదా రోజు.. రక్షా బంధన్ ను స్పెషల్ గా  చేసుకోవాలనుకుంటే  ఆ రోజును సరదాగా మార్చేయాలి. ఇందులో భాగంగా   సినిమా చూడటానికి వెళ్ళవచ్చు. ట్రిప్ ప్లాన్ చేసుకోవచ్చు,   తోబుట్టువులందరితో కలిసి సినిమా వెళ్లడం చాలా మంచి అనుభూతి ఇస్తుంది.  అందరూ కలసి ఇంట్లో అయినా ఒక మంచి సినిమా చూసేయవచ్చు.  సినిమా చూస్తూ ఆస్వాదించడానికి  అందరూ కలసి స్నాక్స్ రెఢీ చేసుకోవడం,  లేదా ఆర్డర్ చేసుకుని అయినా సరే.. అందరూ కలిసి కాసింత సమయం గడపడం మంచి అనుభూతిని ఇస్తుంది. అట్లాగే గేమ్స్ ఆడటం,  సరదాగా గడపడం ద్వారా రోజును గుర్తుండిపోయేలా చేసుకోవచ్చు. ఫ్యామిలీ టూర్.. కుటుంబం మొత్తం ఒకే చోట కలవడం చాలా మంచి జ్ఞాపకం అవుతుంది.  కుటుంబంతో కలిసి పిక్నిక్ ప్లాన్ చేసుకోవచ్చు.  కుటుంబ సభ్యులందరూ ఒకరితో ఒకరు సమయం గడపగలుగుతారు. కుటుంబం అంతా ఒకే చోట కలిసేలా మీరు ఒక గొప్ప రోజును ప్లాన్ చేసుకున్నట్లుగా ఉంటుంది.  అందమైన గార్డెన్ లో  లేదా మీకు ఇష్టమైన ప్రదేశాలలో ఏదైనా పిక్నిక్ ప్లాన్ చేసుకోవచ్చు. దీని కోసం స్నాక్స్, స్వీట్లు, పానీయాలు మొదలైనవి ఏర్పాటు చేసుకుంటే ఇబ్బంది లేకుండా టూర్ ఎంజాయ్ చేయవచ్చు. అందరూ కలసి గేమ్స్ ఆడుకోవడం లాంటివి కూడా భలే మజా ఇస్తాయి. కలిసి వంట చేయడం.. రక్షా బంధన్ రోజు  అన్నా చెల్లెళ్లు కలిసి ఇష్టమైన ఆహారాన్ని వండటం, దాన్ని ఇంటిల్లిపాదికి వడ్డించడం చేయవచ్చు. ఇది చాలా మంచి మెమరీ గా మిగులుతుంది.    మంచిగా మాట్లాడాలి.. సాధారణంగా అన్నా చెల్లెళ్లు అంటే గొడవ పడటం,  కొట్టుకోవడం, అల్లరి చేయడం.. ఇదే ఎక్కువ ఉంటుంది.  కానీ రాఖీ పండుగ రోజు ఇద్దరూ ఆప్యాయంగా ఉండటం, ఒకరితో ఒకరు ప్రేమగా మాట్లాడటం, ఒకరికి మరొకరు ధైర్యం ఇచ్చుకోవడం వంటివి చేయాలి.  ఇదే వారి జీవితాంతం కొనసాగితే  వారి జీవితం ఎంత అదంగా, ఎంత ధైర్యవంతంగా ఉంటుందో అర్థమైతే అన్నా చెల్లెళ్లు, అక్కా తమ్ముళ్ల బంధం పదికాలాల పాటు ఆనందమయంగా ఉంటుంది.                                  *రూపశ్రీ.  
తెలుగు పంచాంగంలో ఒకో మాసంలో వచ్చే పూర్ణిమకు ఒకో ప్రత్యేకత ఉంటుందనే విషయం బాగా గమనిస్తే అర్థమవుతుంది. మాఘ పూర్ణిమ, ఆషాడ పూర్ణిమ, శ్రావణ పూర్ణిమ, వీటిని బుద్ధ పౌర్ణమి, గురు పౌర్ణమి, రాఖీ పౌర్ణమి అని జరుపుకుంటారు.  ప్రస్తుతం శ్రావణ మాసం నడుస్తోంది. శ్రావణ మాసం అంతా సందడిగానూ ప్రత్యేకంగానూ ఉంటుంది.  అయితే పెళ్లిళ్లు, శుభకార్యాలు, వ్రతాలు వీటితో ఉండే సందడి వేరు. ఈ మాసంలో అన్నా, చెల్లెళ్లను పలకరించే రాఖీ పూర్ణిమ వేరు.  అన్నాచెల్లెళ్ల అనురాగాన్ని, వారి మధ్య ఒకరిమీద మరొకరికి ఉండాల్సిన బాధ్యతను గుర్తుచేసేది రాఖీ పౌర్ణమి. రాఖీ పౌర్ణమినే రక్షా బంధన్ అని కూడా అంటారు. రక్ష అంటే ఎలాంటి ఆపదలు, సమస్యలు రాకుండా కాపాడేది. బంధన్ అంటే కట్టి ఉంచేది. రక్షా బంధన్ అంటే ఎలాంటి సమస్యలు రాకుండా కట్టి ఉంచే బంధనం. ఆ బంధనమే రాఖీ. అందరూ తమ సోదరులకు రాఖీ కట్టడం వల్ల  వాడుక భాషలో అందరూ రాఖీ పండుగ అంటున్నారు. రాఖీ పండుగ వెనుక కథనాలు!! ఈ పండుగకు వెనుక విభిన్న కథనాలు ప్రచారంలో  ఉన్నాయి. వాటిలో ఎక్కువగా చెప్పుకునేది ఇంద్రుడి కథనం. ఇంద్రుడి కథ!! పూర్వం రాక్షసులు రెచ్చిపోయి మూడు లోకాల మీద దండయాత్ర చేసి మూడు లోకాలను సొంతం చేసుకున్నారు. అప్పుడు ఇంద్రుడు తన పరివారం, తన లోకంలో ఉన్న వాళ్ళందరితో కలసి తన నివాసమైన అమరావతిలో దాక్కున్నాడు. ఇంద్రుడి పరిస్థితి చూసి ఆయన భార్య శచీదేవికి బాధ కలిగింది. దేవాదిదేవుడు, అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు అయిన విష్ణుమూర్తి దగ్గరకు వెళ్లి ప్రార్థించి, నా భర్తను సమస్య నుండి గట్టెక్కించు అని అడిగింది. సరే అయితే నీ భర్తకు ఎరుపు రంగు దారంతో  రక్ష తయారుచేసి దాన్ని చేతికి కట్టు, అతను విజయం సాధిస్తాడు అని చెబుతాడు. శచీదేవి విష్ణుమూర్తి చెప్పినట్టు ఎరుపురంగు దారంతో రక్ష తయారుచేసి ఇంద్రుడికి కట్టి ఆ తరువాత హారతి ఇచ్చి, నుదుటన వీరతిలకం దిద్ది యుద్ధానికి వెళ్లమంది. అది తెలిసి అమరావతిలో ఉన్న మిగిలిన వారు కూడా రక్షలు తయారుచేసి ఇంద్రుడికి కట్టి, వీరతిలకం దిద్దారు. ఆ యుద్ధంలో ఇంద్రుడు గెలిచి తిరిగి మూడు లోకాల ఆధిపత్యాన్ని సంపాదించాడు. దీనికి గుర్తుగా రక్షా బంధన్ జరుపుకుంటున్నారని చెబుతారు. దీని వెనుక ఉన్న మరొక కథ ద్రౌపతి, కృష్ణుల కథ!! కృష్ణుడు శిశుపాలుడు వంద తప్పులు చేసిన తరువాత శిశుపాలుడిని వధిస్తాడు. ఆ సమయంలో కృష్ణుడి వేలు తెగితే ద్రౌపతి తన చీర కొంగు చింపి కట్టు కడుతుందట. అప్పుడు కృష్ణుడు ద్రౌపతితో నీ సమస్యలలో నేను అన్నగా తోడుంటాను అని చెబుతాడు. ఆ కారణంతోనే ద్రౌపతి వస్త్రాపహరణం జరుగుతున్నప్పుడు ఆమెను కాపాడాడు అని చెబుతారు. పురుషోత్తముడి కథ!! అలెగ్జాండర్ భార్య రోక్సానా తక్షశిల రాజు పురుషోత్తముడిని అన్నగా భావించి రాఖీ కడుతుంది. అలెగ్జాండర్ ప్రపంచానికి అధిపతి కావాలనే అత్యాశతో తక్షశిల మీద దండెత్తినప్పుడు పురుషోత్తముడు యుద్ధంలో గెలిచినా అలెగ్జాండర్ ని చంపకుండా వదిలేసాడు. రాఖీ కట్టినవారికి భయం దొరుకుతుందని ఈ సంఘటన స్పష్టం చేస్తోంది. ఇలా చరిత్రలో రాఖీ పౌర్ణమి గురించి ఎన్నో కథలు ప్రచారంలో ఉన్నాయి. మొత్తానికి ఇందులో ఉన్న అర్థం చెల్లెలు కట్టే రక్ష అన్నకు ఆరోగ్యాన్ని, ఆయుష్షును, అన్నిటికీ మించి క్షేమాన్ని కోరుకుంటే, అన్న చేతిలో ఉండే రక్ష అన్నకు తన చెల్లి విషయంలో ఉండాల్సిన బాధ్యత, చెల్లికి ఇవ్వాల్సిన రక్షణ, భరోసాను స్పష్టం చేస్తాయి. ఇదీ రాఖీ వెనుక ఉన్న అనుబంధం.                                    ◆నిశ్శబ్ద.
  శరీరాన్ని శుద్ది చేసే పానీయాలను డీటాక్స్ జ్యూసులు అని అంటుంటారు. ఈ  డీటాక్స్ జ్యూస్లు లేదా పానీయాలు ఫ్యాటీ లివర్ వ్యాధి లేదా దీర్ఘకాలిక కాలేయ వ్యాధి వంటి తీవ్రమైన కాలేయ సమస్యలను నయం చేయగలవని నమ్ముతారు.  ఈ కారణంగానే డిటాక్స్ పానీయాలకు చాలా ఆదరణ ఉంది. కొందరైతే రోజు మొత్తం డిటాక్స్ నీటినే తాగుతూ ఉంటారు.  సుమారు ఒకటి నుండి రెండు లీటర్ల డీటాక్స్ నీటిని లేదా పానీయాలను తీసుకోవడం వల్ల బరువు తగ్గడం, శరీరంలో కొలెస్ట్రాల్ తగ్గడం వంటివి జరుగుతాయని నమ్ముతారు. కానీ ఈ డిటాక్స్ జ్యూసుల గురించి దిమ్మతిరిగే నిజాలను వెలిబుచ్చుతున్నారు వైద్యులు.  దీని గురించి తెలుసుకుంటే.. డిటాక్స్ జ్యూస్లు  కాలేయ సంబంధిత సమస్యలను తొలగించడంలో లేదా నయం చేయడంలో పెద్దగా సహాయపడవట. బయట అమ్మే డిటాక్స్ జ్యూస్లు లేదా హెర్బల్ డ్రింక్స్  తయారీలో ఉపయోగించే పదార్థాలు,  వాటి కూర్పు గురించి స్పష్టమైన సమాచారం ఉండదు. ఈ ద్రవాలలో కాలేయానికి హానికరమైన భారీ లోహాలు లేదా ఇతర పదార్థాలు ఉండవచ్చు. అందువల్ల వీటిని తీసుకోవడం వల్ల ప్రయోజనాల కంటే కాలేయానికి ఎక్కువ హాని కలిగే అవకాశం ఉందని వైద్యులు అంటున్నారు. డీటాక్స్ పానీయాలు కొవ్వు కాలేయ సమస్యలను పెంచుతాయి.. నిజానికి ఈ జ్యూస్లను తీసుకోవడం వల్ల ఇప్పటికే ఉన్న కాలేయ సమస్య మరింత దిగజారిపోతుందట. ఫ్యాటీ లివర్ వ్యాధి నుండి క్రానిక్ లివర్ డిసీజ్,  క్రానిక్ లివర్ డిసీజ్ నుండి ఎండ్-స్టేజ్ లివర్ డిసీజ్ మారవచ్చట. కాబట్టి ఈ జ్యూస్లను తీసుకోకుండా ఉండటం మంచిది. కాలేయ ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి ఏం తినాలి.. కాలేయ ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి లేదా కాలేయ సమస్యలను నయం చేయడానికి  డీటాక్స్ జ్యూస్లను ఆశ్రయించే బదులు, ఆరోగ్యకరమైన జీవనశైలి మార్పులను అనుసరించడం మంచిదని ఆహార నిపుణులు అంటున్నారు. ఆరోగ్యకరమైన, పోషకమైన, సమతుల్య ఆహారం తీసుకోవడం. ప్రాసెస్ చేసిన,  కొవ్వు పదార్థాలను అధికంగా తీసుకోవడాన్ని నివారించడం, తరచుగా బయట తినడాన్ని నిషేధించడం చేయాలి.  వీటికి బదులు  ఆరోగ్యకరమైన ఇంట్లో వండిన భోజనాన్ని ఎంచుకోవాలి. రెడ్ మీట్ లేదా ప్రాసెస్ చేసిన మాంసం మానేయాలి.  లేదా వీటిని  పరిమితం చేయాలి.  మాంసాహారం తినాలని ఉంటే   లీన్ మాంసాలను ఎంచుకోవడం ఉత్తమమట. ఈ అలవాట్లకు దూరంగా ఉండాలి.. ధూమపానం,  అధికంగా  మద్యం సేవించడం వంటి అలవాట్లను నివారించడం కాలేయ ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో, కాలేయాన్ని రక్షించడంలో చాలా సహాయపడుతుంది. దీనితో పాటు కాలేయ ఆరోగ్యానికి హాని కలిగించే మధుమేహం,  కొలెస్ట్రాల్ వంటి ప్రమాద కారకాలను నియంత్రించడం కూడా చాలా ముఖ్యం. క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు, శారీరక వ్యాయామం,  ఆరోగ్యకరమైన బరువును నిర్వహించడం ఈ ప్రమాద కారకాలను నియంత్రించడంలో ఉపయోగపడతాయి.  కాలేయానికి నిజమైన 'డిటాక్స్' అంటే శుభ్రమైన,  పోషకమైన ఆహారం, ఆరోగ్యకరమైన జీవనశైలి, సకాలంలో వైద్య సలహా.  రోజువారీ ఎంపికలలో చిన్న మార్పులు కూడా దీర్ఘకాలంలో  కాలేయ ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో చాలా సహాయపడతాయి. కాలేయ ఆరోగ్యం కోసం డీటాక్స్ జ్యూస్లపై ఆధారపడటానికి బదులుగా, ఆరోగ్యకరమైన జీవనశైలిని అనుసరించడం మరింత ప్రభావవంతమైన,  సురక్షితమైన విధానం.                               *రూపశ్రీ. గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...
  ఉప్పు లేని వంట, సారం లేని జీవితం వ్యర్థం అని అంటారు. వంటల్లో పులుపు, కారం కు జతగా ఉప్పు కూడా తగిన పరిమాణంలో ఉండాలి. లేకపోతే అస్సలు తినలేం. అయితే ఉదయాన్నే ఉప్పు కలిపిన నీరు తాగితే ఆరోగ్యానికి బోలెడు ముప్పులు తప్పుతాయని అంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఇంతకీ ఉదయాన్నే ఉప్పు కలిపిన నీరు తాగితే ఏం జరుగుతుందంటే.. ఉప్పు నీటిలో సోడియం, పొటాషియం,  క్లోరైడ్ వంటి ఎలక్ట్రోలైట్లను కలిగి ఉంటుంది.  ఉదయాన్నే ఉప్పు కలిపిన నీరు తాగితే ఈ ఎలక్ట్రోలైట్లు శరీర ఆర్థ్రీకరణ, నరాల పనితీరు, కండరాల సంకోచాలు మొదలైన కార్యకలాపాలకు సహాయపడుతుంది. ఉప్పు నీరులో ఉండే సమ్మేళనాలు కడుపులో ఉండే జీర్ణ ఎంజైములు,  హైడ్రోక్లోరిక యాసిడ్ ఉత్పత్తిని ప్రేరేపిస్తుంది.  జీర్ణక్రియ,  పోషకాల శోషణకు సహాయపడుతుంది. జీర్ణ ఆరోగ్యాన్ని మెరుగ్గా ఉంచుతుంది. ఉప్పు నీటిలో మినరల్స్ కంటెంట్  ఎక్కువగా ఉంటుంది.  ఇది తామర, సొరియాసిస్ వంటి చర్మ సంబంధ సమస్యలను తగ్గించడంలో సహాయపడుతుంది. గొంతు నొప్పి,  గొంతు సంబంధ సమస్యలు తగ్గడానికి చాలామంది ఉప్పు నీటితో పుక్కిలిస్తుంటారు. అయితే ఉప్పు నీటితో పుక్కిలించడం,  ఉప్పు నీటిని ఉదయాన్నే తాగడం వల్ల గొంతు నొప్పి, దగ్గు,  గొంతులో శ్లేష్మం వంటివి తగ్గడమే కాకుండా అలెర్జీలు,  శ్వాసకోశ ఆరోగ్యం,  జలుబు వంటి సమస్యలు కూడా తగ్గుతాయి. శరీరంలో ఉండే సూక్ష్మ వ్యర్థాలు,  విష పదార్థాలను శరీరం నుండి బయటకు పంపడంలో ఉప్పు నీరు సహాయపడుతుంది.  ఈ కారణంగా ఇది శరీరాన్ని శుద్ది చేస్తుంది. ఏ ఉప్పు వాడితే మంచిదంటే.. నీటిలో ఉప్పు కలుపుకుని ఉదయాన్నే తాగడం మంచిదే అయినా  అన్ని రకాల ఉప్పుడు ఇందుకు మంచివి కావు. ఉప్పు నీరు తాగడం వల్ల మంచి ప్రయోజనాలు లభించాలంటే.. హిమాలయన్ పింక్ సాల్ట్ లేదా శుధ్ది చేయని ఉప్పును ఎంపిక చేసుకోవాలి. ఉప్పు నీరు ఆరోగ్యానికి మంచిది కదా అని ఎక్కువ మోతాదులో ఉప్పు కలిపి తాగకూడదు.  తగినంత మోతాదులో ఉప్పు కలిపి తాగడం అన్ని రకాల వ్యక్తులకు మంచిదే అయినా అధిక రక్తపోటు,  గుండె సంబంధ జబ్బులు ఉన్నవారు  ఉప్పు నీరు తాగే విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి.                                           *రూపశ్రీ.  
  మంచి ఆరోగ్యం కోసం ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవడం చాలా ముఖ్యమైనది. ఈ విషయాన్ని వైద్యులు చెప్పడమే కాకుండా ఆరోగ్యం మీద స్పుహ ఉన్న ప్రతి ఒక్కరూ అదే చెబుతారు.   ఏది తిన్నా అది  ఆరోగ్యంపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతుంది. అందుకే ఆరోగ్య నిపుణులు తీసుకునే ఆహారం పోషకాలతో సమతుల్యంగా ఉండాలని చెబుతారు. అంతేకాదు.. తీసుకునే ఆహారమే కాకుండా ఆహారం తీసుకునే  సమయం  కూడా అంతే ముఖ్యమని చాలా మంది చెబుతారు. కానీ అధిక శాతం మంది తీసుకునే ఆహారం విషయంలో చూపించిన శ్రద్ద ఆహారం తీసుకునే సమయం విషయంలో అస్సలు చూపించరు. నేటి బిజీ లైఫ్ లో రోజంతా హడావిడిగా పనులు చేయడమే కాదు.. హడావిడిగా తినడం కూడా జరుగుతోంది. రాత్రి సమయంలో  కొన్నిసార్లు  9 గంటలకు, కొన్నిసార్లు 10 లేదా 11 గంటలకు తింటుంటారు.  తిన్న  వెంటనే నిద్రపోతారు. కానీ  రాత్రి 7 నుండి 8 గంటల మధ్య ఆహారం తీసుకుంటే ఆరోగ్య పరంగా అద్భుతాలు జరుగుతాయని అంటున్నారు వైద్యులు.  దీని గురించి తెలుసుకుంటే.. 7-8 మధ్య భోజనం ఎందుకంటే.. 7-8 గంటల మధ్య భోజనం చేయడం వల్ల  మొత్తం ఆరోగ్యానికి మేలు జరుగుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి. త్వరగా భోజనం చేయడం వల్ల బరువు తగ్గడమే కాకుండా నిద్ర, గుండె, జీర్ణక్రియ,  చక్కెర నియంత్రణకు కూడా చాలా మంచిది.  త్వరగా భోజనం చేసేవారికి అధిక రక్తపోటు వచ్చే ప్రమాదం 27% తక్కువగా ఉంటుందని,  అధిక కొలెస్ట్రాల్ వచ్చే ప్రమాదం 19% తక్కువగా ఉంటుందని అధ్యయనాలు చెబుతున్నాయి. దీనితో పాటు, బరువు తగ్గడం, జీర్ణ ఆరోగ్యం,  నిద్ర నాణ్యతకు కూడా ఇది 7-8 మధ్య రాత్రి భోజనం చేయడం మంచిది.   రాత్రి 8 గంటల తర్వాత భోజనం చేయడం వల్ల షుగర్ సమస్య వచ్చే ప్రమాదం సాధారణం కంటే 20 శాతం ఎక్కువ ఉంటుందట. జీర్ణశక్తి.. త్వరగా భోజనం చేయడం వల్ల కలిగే అతిపెద్ద ప్రయోజనం ఏమిటంటే అది జీర్ణక్రియను చక్కగా ఉంచుతుంది. రాత్రి 8 గంటల ముందు భోజనం చేసినప్పుడు, శరీరం దానిని జీర్ణం చేసుకోవడానికి తగినంత సమయం తీసుకుంటుంది. ఆహారాన్ని జీర్ణం చేసుకోవడానికి దాదాపు 2 నుండి 4 గంటలు పడుతుంది. ఆహారం తిన్న వెంటనే నిద్రపోతే జీర్ణ ప్రక్రియ మందగిస్తుంది,  గ్యాస్, మలబద్ధకం, ఆమ్లత్వం వంటి సమస్యలు ఏర్పడతాయి. త్వరగా భోజనం చేయడం వల్ల యాసిడ్ రిఫ్లక్స్ (గుండెల్లో మంట) ప్రమాదం 50% తగ్గుతుంది. సూర్యాస్తమయం తర్వాత జీర్ణక్రియ మందగిస్తుందని ఆయుర్వేదం కూడా చెబుతోంది, కాబట్టి రాత్రిపూట తేలికగా,  త్వరగా తినాలి. నిద్ర.. రాత్రి ఆలస్యంగా తినడం వల్ల శరీరం ఆహారాన్ని జీర్ణం చేసుకోవడంలో బిజీగా ఉండటం వల్ల విశ్రాంతి లభించదు. దీని ప్రభావం నిద్రపై కూడా కనిపిస్తుంది.  నిద్రపోవడానికి 2-3 గంటల ముందు తినడం వల్ల శరీరం ప్రశాంతంగా ఉంటుంది.  నిద్ర గాఢంగా పడుతుంది. 7-8 మధ్య రాత్రి భోజనం చేసేవారికి నిద్రలో గ్యాస్, గుండెల్లో మంట లేదా భారం తక్కువగా ఉంటుంది. ఇది నిద్ర నాణ్యతను మెరుగుపరుస్తుంది. మంచి నిద్ర మానసిక,  శారీరక ఆరోగ్యానికి మంచిది. బరువు.. బరువు తగ్గాలనుకునేవారు ఆహారం మాత్రమే కాదు, తినే సమయం కూడా ముఖ్యమని తెలుసుకోవాలి. ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ ఒబేసిటీ (2013) ప్రకారం, సాయంత్రం 7 గంటలకు ముందు తినేవారిలో శరీరం కేలరీలను శక్తిగా మార్చగలదు కాబట్టి బరువు తగ్గడం వేగంగా ఉంటుంది. రాత్రి ఆలస్యంగా  భోజనం చేయడం వల్ల ఆహారం కొవ్వుగా నిల్వ చేయబడుతుంది. త్వరగా తినడం వల్ల జీవక్రియ చురుకుగా ఉంటుంది.  ఇన్సులిన్ బాగా పనిచేస్తుంది. అలాగే రాత్రి భోజనం తర్వాత  శారీరక శ్రమ లేదా కాస్త వాకింగ్ చేయడానికి కూడా సమయం దొరుకుతుంది. ఇది కేలరీలను బర్న్ చేయడంలో సహాయపడుతుంది. డయాబెటిక్ రోగులు సమయానికి రాత్రి భోజనం చేయడం  చాలా ముఖ్యం. ఆలస్యంగా భోజనం చేసేవారిలో రక్తంలో చక్కెర స్థాయిలు ఎక్కువగా ఉంటాయి. రాత్రి ఆలస్యంగా తినడం వల్ల శరీరం  సిర్కాడియన్ సైకిల్ కు భంగం కలుగుతుంది, ఇది హార్మోన్ల అసమతుల్యత ప్రమాదాన్ని పెంచుతుంది.                              *రూపశ్రీ.