LATEST NEWS
  తొలి ఏకాదశి సందర్బంగా ఇంద్రకీలాద్రి కనకదుర్గమ్మ దర్శనానికి భక్తులు పోటెత్తారు. నేడు ఆషాడ సారెను సమర్పిస్తే మరింత శుభం కలుగుతుందనే నమ్మకంతో వందల సంఖ్యలో భక్తులు ఆలయానికి తరలివచ్చాయి. దీంతో లిఫ్ట్‌దారి, ఘాట్‌ రోడ్డు వైపు భక్తులు కిక్కిరిసిపోయారు. భక్తులు త్వరితగతిన దర్శనాలు పూర్తిచేసుకుని కొండపై నుంచి దిగువకు పంపేందుకు ఈవోశీనానాయక్‌ తో పాటు ఏఈవోలు, ఆలయ సిబ్బంది చర్యలు చేపట్టారు. సీసీ కెమెరాల ద్వారా రద్దీని ఈవో పరిశీలిస్తున్నారు. రద్దీ దృష్ట్యా అంతరాలయ దర్శనాలకు అనుమతిపై నియంత్రణ విధించారు.  తొలి ఏకాదశి  పర్వదినం సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో భక్తి పారవశ్యంతో పులకించిపోయాయి. ఎక్కడ చూసినా ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రసిద్ధ వైష్ణవాలయాలు అన్నీ భక్తులతో కిటకిటలాడాయి. పవిత్రమైన ఈ రోజున శ్రీమహావిష్ణువును దర్శించుకోవడం, ఆయనకు ప్రత్యేక పూజలు నిర్వహించడం వల్ల సకల శుభాలు కలుగుతాయని, అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని భక్తులు ప్రగాఢంగా విశ్వసిస్తారు. ఈ నమ్మకంతోనే వేలాది మంది భక్తులు తెల్లవారుజాము నుంచే ఆలయాలకు పోటెత్తారు. ఆలయ ప్రాంగణాలు “గోవిందా.. గోవిందా..” నామస్మరణతో మార్మోగిపోయాయి.
  నెల్లూరులోని ప్రసిద్ద బారాషషీద్ దుర్గ వద్ద రొట్టెల పండుగ ఇవాళ అత్యంత వైభవంగా ప్రారంభమైంది. ప్రతి సంవత్సరం జరిగే ఈ పండుగ ఐదు రోజుల పాటు జరిగే పాటు జరగనున్నది. తమ కోరికలు నెరవేరాలని ఆశిస్తూ భక్తులు స్వర్ణాల చెరువులో రొట్టెలు మార్చుకునే ఈ విశిష్టమైన ఉత్సవంలో పాల్గొనేందుకు దేశ, విదేశాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు. దీంతో దర్గా ప్రాంగణం, స్వర్ణాల చెరువు పరిసరాలు భక్తజన సంద్రంగా మారాయి.  తమ అనుకున్న కోరికలు తీరాలని ఆశిస్తూ, గతంలో కోరిక తీరిన వారి నుంచి రొట్టెను స్వీకరించడం, తమ కోరిక తీరితే ఇతరులకు రొట్టెను ఇవ్వడం ఈ పండుగలోని ప్రధాన ఆచారం. దీని కోసం భక్తులు స్వర్ణాల చెరువులో పుణ్యస్నానాలు ఆచరించి, భక్తిశ్రద్ధలతో రొట్టెలను మార్చుకుంటున్నారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర ప్రభుత్వం విస్తృత ఏర్పాట్లు చేసింది. ఎలాంటి అసౌకర్యం కలగకుండా ప్రాంగణంలో ప్రత్యేక టెంట్లు, తాగునీటి సౌకర్యం, ఉచిత భోజన వసతి కల్పించింది. జిల్లా కలెక్టర్, ఎస్పీ సహా ఉన్నతాధికారులు ఏర్పాట్లను ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ, పండుగ ప్రశాంతంగా జరిగేలా పర్యవేక్షిస్తున్నారు. భక్తుల రాకతో దర్గా పరిసర ప్రాంతాల్లో పూర్తి పండుగ వాతావరణం నెలకొంది.  
  పేలుడు పదార్థాలు లభ్యమైన కేసులో తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్ రెడ్డి అరెస్ట్  పోలీసులు అరెస్ట్ చేశారు. కామారెడ్డిలోని కేపీఆర్ కాలనీలో పేలుడు పదార్థాలు లభ్యమైన కేసులో నిన్న రాత్రి 10 గంటల సమయంలో ఆయన నివాసంలో అదుపులోకి తీసుకున్నారు. అనంతరం నిజామాబాద్ జైలుకు తరలించిన పోలీసులు. ఈ కేసులో గతంలో అరెస్టయిన ముగ్గురు నిందితులు పోలీసుల విచారణలో కీలక విషయాలు వెల్లడించారు.  తాము సేకరించిన పేలుడు పదార్థాలను చంద్రశేఖర్‌రెడ్డి వద్ద నుంచే తెచ్చినట్లు నిందితులు పోలీసులకు తెలియజేశారు. ఈ సమాచారం ఆధారంగా, పోలీసులు జూలై 3న రాత్రి గడ్డం చంద్రశేఖర్‌రెడ్డిని అదుపులోకి తీసుకుని, నిజామాబాద్ జైలుకు తరలించారు. ఈ కేసులో చంద్రశేఖర్‌రెడ్డి సోదరుడు సూర్య కూడా నిందితుడిగా ఉన్నాడని, ప్రస్తుతం పరారీలో ఉన్న సూర్య కోసం పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. కేసు తదుపరి దర్యాప్తు కొనసాగుతోంది.   
  ఉన్న పార్టీలో ఉన్న‌ట్టు ఉండి ఉంటే వీళ్ల ప‌రిస్థితి ఎంతో మెరుగ్గా ఉండేదేమో. కానీ అత్యాశ కొంప ముంచేసింది. పెట్టిన చేతినే క‌ర‌వ‌డంతో పాము, మొస‌లినే మించి పోయారీ ఇద్ద‌రూ. కార‌ణం ఈ భూ ప్ర‌పంచంలో పెట్టిన చేతినే క‌రిచే బుద్ధి కేవ‌లం పాము, మొస‌లికి మాత్ర‌మే ఉంటుంద‌ట‌. ఆ పార్టీలో ఉండి ఏమైనా పేరు సాధించారా అంటే అదీ లేదు. కొడాలి నాని, వ‌ల్ల‌భ‌నేని వంశీ వ‌ల్లే మేం ఓడాం అంటూ కాసు మ‌హేష్ రెడ్డి వీళ్ల‌పై చూపించిన కోపం తాపం అంతా ఇంతా  కాదు. వంశీ చేసిన కామెంట్లు మాకు చేటు తెచ్చాయ‌ని వాళ్లు కూడా వీళ్ల‌ను చూస్తే అస‌హ్యం వెళ్ల‌గ‌క్కుతున్నారు జోగి ర‌మేష్ వంటి వైసీపీ లీడ‌ర్లు కూడా. ఇక వీళ్ల ప‌రిస్థితి చూస్తే.. సూర్య చంద్రుల‌కే గ్ర‌హ‌ణం ప‌ట్టించిన రాహుకేతుల‌కే గ్ర‌హ‌ణం ప‌డితే ఎలా ఉంటుందో అలా త‌యార‌య్యారు. ఒక‌డు ఇప్ప‌టికే తాను చేసిన ద్రోహాల‌న్నీ ఆ మొహం మీద విల‌య తాండ‌వం చేస్తుంటే.. ప్ర‌త్య‌ర్ధుల‌కే జాలి క‌లిగేలా త‌యార‌య్యాడు.మ‌రొక‌డు గుడివాడ ఓట‌రు జ‌నాలు కొట్టిన దెబ్బ‌కు దిమ్మ తిరిగి గుండాప‌రేష‌న్ చేయించుకోవ‌డం మాత్ర‌మే కాకుండా.. అత్యంత ద‌యనీయంగా.. క‌ట్లు క‌ట్టుకుని తిరుగుతున్నాడు. అదే ఉన్న‌పార్టీలో ఉండి.. ప‌ద్ద‌తిగా బిహేవ్ చేసి ఉంటే ప‌రిస్థితి మ‌రోలా ఉండేద‌న్న కోణంలో సోష‌ల్ మీడియా కామెంట్లు హోరు మంటున్నాయ్ ఈ జంట ద్రోహుల మీద‌.
  క్యాప్షన్ కొత్తగా ఉందన్న మాటే కానీ మేటర్ మాత్రం చాలా చాలా పాతదే. పెద్దగా కంగారు పడకండి. కారణం ఏంటంటారా? అప్పుడే అభ్యర్ధుల ప్రకటన చేస్తున్నారట అతి- ఉత్సాహి జగన్. ఇప్పటికే వంద మంది పేర్లు వంద సీట్లకు ఖరారు చేసేశారట.. శ్రీమాన్ శ్రీ మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహనుల వారు.మొన్నటి ఎన్నికల్లో చివరి నిమిషం వరకూ అభ్యర్ధుల జీవితాలను అగమ్య గోచర పరిస్థితిలోకి నెట్టిన జగనన్న తాజాగా.. ముందస్తు ఎన్నికల్లాగా- ముందస్తు అభ్యర్ధుల ఖరారు ప్రకటనలు చేస్తున్నారట. ఇప్పటికి ఓకే అయిన వాటిలో మచ్చుకు కొన్ని పేర్లు.. ఎవరివీ, ఏంటని చూస్తే వాటిలో తొలిపేరు సర్వేపల్లి నుంచి- కాకాణి గోవర్ధన రెడ్డిదేనట. ఇక వరుసగా చూస్తే.. నరసన్న పేట- ధర్మాన కృష్ణదాస్, గననవరం- నుంచి వల్లభనేని వంశి, మచిలీపట్నం- నుంచి పేర్ని నాని, గుడివాడ- నుంచి కొడాలి నాని, దెందలూరు- నుంచి అబ్బయ్య చౌదరి, తాడికొండ- నుంచి  నందిగం సురేష్, మాచర్ల- నుంచి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, చిలకలూరి పేట- నుంచి విడదల రజనీ, తాడిపత్రి- నుంచి పెద్దారెడ్డి, రాఫ్తాడు- నుంచి తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి, ధర్మవరం- నుంచి కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి, పాతపట్నం- నుంచి రెడ్డి శాంతి.. ఇలా ఒక లిస్ట్ అప్పుడే లీక్ చేశారట. అంటే గతంలోలా పార్టీకి డిమాండ్ లేక పోవడం.. దానికి తోడు కేడర్ కూడా తీవ్ర నిరాశా నిస్పృహలకు లోను కావడంతో ఒక బూస్టింగా ఉంటుంది లెమ్మని జగన్ సార్ ఈ తరహాలో ముందుకెళ్తున్నట్టు తాజా కబర్. ఒక సమయంలో ఎమ్మెల్యేలను కలవడానికే అపాయింట్లు ఇవ్వని.. ఒక వేళ ఇచ్చినా వారిని నిలబెట్టే మాట్లాడే కల్చర్ గల జగనన్న.. ఇటీవల నేనూ మారాను బాస్! అని తెలియ చెప్పడంలో భాగంగా ఈ అడ్వాన్స్డ్ అనౌన్స్ మెంట్స్ ఒక పాలసీగా తీసుకున్నట్టు సమాచార్. రేపటికి రెడ్డెవరో- రాజెవరో అన్నది పాత నాటు సామెత. కానీ ఆ రేపటి ని కూడా ఇప్పటి నుంచే మార్చేసి.. తనకు తాను ఎప్పటిలాగానే అధినాయకుడిలా కాకుండా 'అతి'నాయకుడిలా వ్యవహరిస్తున్నారట జగన్. దానికి తోడు ఇప్పటికే ఈ అతి మీద పార్టీలో పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. వైసీపీ నేత రవిచంద్రారెడ్డి మాటలను బట్టీ చెబితే.. ఈ వైనాట్ 175 వంటి టూ మచ్ స్లోగన్స్ ఎవరి ఐడియాలో తెలియవు కానీ, ఇవన్నీ పార్టీని నిలువునా ముంచాయని అంటారాయన. దీంతో సామాన్యంగా వ్యవహరించాల్సిన జగన్ అత్యుత్సాహం కొద్దీ ఇలాంటి పనులు చేయడం వల్ల పార్టీ మైలేజ్ మరింత డ్యామేజ్ గా మారుతున్నట్టు సమాచారం.  మరి చూడాలి. జగన్ సార్ ఇదే ఫ్లో మెయిన్ టైన్ చేసి. ఆ పదకొండు కూడా పోగొట్టుకుంటారా అన్నది తేలాల్సి ఉందంటున్నాయి.. పార్టీ శ్రేణులు. మ‌రో ముఖ్య విష‌యం ఏంటంటే.. ఎన్నికలు వచ్చినట్లు నాలుగు ఏళ్ల ముందే ఊహించడం, తామే గెలుస్తామ‌ని క‌ల‌లు క‌న‌డం.. ఆ ఊహ‌ల్లో తేలియాడ‌టం.. అలా బతికేయడాన్ని ఏమనుకోవాలి? మానసిక సమస్యా.. లేక వేరే వ్యూహమా? నేతల్ని, కార్యకర్తలను తనతో నిలుపుకోవడం లో భాగమా? అన్న‌ది కూడా ఒక చ‌ర్చ‌నీయాంశంగా మారింది. అయితే జ‌గ‌న్  చేసిన ప్ర‌తి ఓవ‌రాక్ష‌న్ బెడిసికొట్ట‌డంతో.. ఇలాంటి విష‌యాల‌ను పార్టీలో కొంద‌రు బాహ‌టంగానే వ్య‌తిరేకిస్తున్నార‌ట‌.
ALSO ON TELUGUONE N E W S
  ప్రభాస్ నటిస్తున్న సినిమాలన్నీ పాన్ ఇండియా మార్కెట్ ను టార్గెట్ గా చేసుకొని విడుదలవుతాయి అనడంలో సందేహం లేదు. ప్రభాస్ నుంచి రానున్న నెక్స్ట్ మూవీ 'ది రాజా సాబ్'. మారుతి దర్శకత్వంలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తున్న ఈ హారర్ కామెడీ ఫిల్మ్.. డిసెంబర్ 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇటీవల విడుదలైన టీజర్ కి కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. దీంతో పాన్ ఇండియా వైడ్ గా 'రాజా సాబ్' మూవీ బాక్సాఫీస్ ని షేక్ చేస్తుందని ప్రభాస్ ఫ్యాన్స్ భావిస్తున్నారు. అయితే అదే రోజు ఓ భారీ బాలీవుడ్ ఫిల్మ్ విడుదలవుతోంది. దీంతో నార్త్ లో 'రాజా సాబ్' వసూళ్లపై ప్రభావం పడుతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.   రణవీర్ సింగ్ నెక్స్ట్ మూవీ 'ధురంధర్'. 'ఉరి: ది సర్జికల్‌ స్ట్రైక్‌' తర్వాత ఆదిత్య ధర్ దర్శకత్వంలో వస్తున్న చిత్రమిది. పైగా ఇందులో సంజయ్ దత్, అక్షయ్ ఖన్నా, మాధవన్, అర్జున్ రాంపాల్ వంటి వారు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. దాంతో హిందీ ప్రేక్షకుల్లో ఈ సినిమాపై మంచి అంచనాలే ఉన్నాయి. ఈ గ్యాంగ్ స్టర్ ఫిల్మ్ ను డిసెంబర్ 5న విడుదల చేయనున్నట్లు తెలుపుతూ తాజాగా ఓ టీజర్ ను వదిలారు. ఈ టీజర్ యాక్షన్ ప్రియులు మెచ్చేలా ఉంది. కొంతకాలంగా హిందీ మార్కెట్ లో యాక్షన్ సినిమాలకు ఎక్కువ ఆదరణ లభిస్తోంది. సౌత్ నుంచి వెళ్ళిన 'కేజీఎఫ్-2', 'పుష్ప-2' వంటి సినిమాలు సైతం అక్కడ సంచలన వసూళ్ళు సాధించాయి. అలాంటిది బాలీవుడ్ ఫిల్మ్ 'ధురంధర్'ను వారు ఓన్ చేసుకోవడంలో ఆశ్చర్యంలేదు. అదే జరిగితే 'రాజా సాబ్' హిందీ వసూళ్లపై ప్రభావం పడే అవకాశముంది. అయితే ప్రస్తుతం ప్రభాస్ ఇండియాలోనే బిగ్గెస్ట్ స్టార్. తన స్టార్డంతో హిందీ మార్కెట్ లో హిందీ సినిమాకే షాకిచ్చిన ఆశ్చర్య పడాల్సిన అవసరంలేదు. చూద్దాం మరి 'రాజా సాబ్' ఏం చేస్తాడో.  
  కొంతకాలంగా సీక్వెల్స్ ట్రెండ్ నడుస్తోంది. హిట్ సినిమాకి సీక్వెల్ తీయడానికి మేకర్స్ ఆసక్తి చూపుతున్నారు. ఈమధ్య కాలంలో పలు సీక్వెల్స్ వచ్చాయి. ఇప్పుడు ఆ లిస్టులో 'లక్కీ భాస్కర్' చేరనుంది. (Lucky Baskhar sequel)   దుల్కర్ సల్మాన్ హీరోగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మించిన చిత్రం 'లక్కీ భాస్కర్'. గతేడాది అక్టోబర్ లో విడుదలైన ఈ చిత్రం.. ప్రశంసలు అందుకోవడంతో పాటు, కమర్షియల్ గా మంచి సక్సెస్ ను అందుకుంది. ఈ మూవీ సీక్వెల్ కి సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ విషయాన్ని స్వయంగా దర్శకుడు వెంకీ అట్లూరి రివీల్ చేయడం విశేషం. ఇటీవల ఆయన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. లక్కీ భాస్కర్ సీక్వెల్ ఉంటుందని చెప్పాడు. అయితే ఈ సీక్వెల్ పట్టాలెక్కడానికి కాస్త సమయం పట్టే అవకాశముంది.   వెంకీ అట్లూరి ప్రస్తుతం సూర్యతో ఓ మూవీ చేస్తున్నాడు. అనంతరం ధనుష్ తో ఓ సినిమా చేసే అవకాశముంది. ఈ రెండు ప్రాజెక్ట్ ల తర్వాత.. లక్కీ భాస్కర్-2 స్టార్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. ఈ సీక్వెల్ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ లో రూపొందుతుందని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.  
  అప్పట్లో తరుణ్ కి తెలుగునాట లవర్ బాయ్ గా మంచి ఇమేజ్ ఉండేది. కెరీర్ స్టార్టింగ్ లో 'నువ్వే కావాలి', 'నువ్వు లేక నేను లేను', 'నువ్వే నువ్వే' వంటి విజయవంతమైన చిత్రాలతో యువతకు ఎంతగానో చేరువయ్యాడు తరుణ్. అయితే ఆ తర్వాత మాత్రం పెద్దగా విజయాలు చూడలేదు. ఇక కొన్నేళ్లుగా అసలు నటనకే దూరమయ్యాడు. అలాంటి తరుణ్ రీ-ఎంట్రీకి రెడీ అయినట్లు తెలుస్తోంది. అది కూడా స్పిరిట్ సినిమాతో అని ప్రచారం జరుగుతోంది.   ప్రభాస్, సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్ లో తెరకెక్కనున్న మూవీ స్పిరిట్. కేవలం ప్రకటనతోనే ఈ సినిమాపై అంచనాలు భారీస్థాయిలో నెలకొన్నాయి. ఇందులో కొరియన్ యాక్టర్ డాన్ లీ విలన్ గా నటిస్తున్నట్లు వార్తలొచ్చాయి. దీంతో స్పిరిట్ పై అంచనాలు మరోస్థాయికి వెళ్ళాయి. ఇక ఇప్పుడు మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ తెరపైకి వచ్చింది. అదేంటంటే స్పిరిట్ లో తరుణ్ కీలక పాత్ర పోషిస్తున్నట్లు వినికిడి.    ఇటీవల తరుణ్.. డాన్ లీతో దిగిన ఓ ఫొటోను సోషల్ మీడియాలో పంచుకున్నాడు. దాంతో తాను స్పిరిట్ లో నటిస్తున్నానని హింట్ ఇచ్చినట్లుగా ఉంది. ఆ ఫొటో చూసి ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. అప్పట్లో లవర్ బాయ్ ఇమేజ్ సొంతం చేసుకున్న తరుణ్.. ఇప్పుడు రీ-ఎంట్రీలో ఎలా కనిపిస్తాడనే ఆసక్తి నెలకొంది.   సందీప్ రెడ్డి సినిమాల్లో పాత్రలు ఎంత పవర్ ఫుల్ గా ఉంటాయో తెలిసిందే. 'యానిమల్'లో బాబీ డియోల్ కి అదిరిపోయే బ్రేక్ ఇచ్చాడు. నిడివి తక్కువయినా, డైలాగ్స్ లేకపోయినా.. బాబీ డియోల్ రోల్ ని సందీప్ చూపించిన తీరు ఆకట్టుకుంది. దానిని దృష్టిలో పెట్టుకునే.. స్పిరిట్ లో తరుణ్ ని ఎలా చూపిస్తాడనే ఇంట్రెస్ట్ కలుగుతోంది.    
  తెలుగునాట తిరుగులేని స్టార్స్ లో పవన్ కళ్యాణ్ ఒకరు. పాలిటిక్స్ తో బిజీగా ఉన్నప్పటికీ.. సినిమాల పరంగా ఆయన క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. అలాంటి పవన్ మొదటిసారి 'హరి హర వీరమల్లు' అనే పాన్ ఇండియా సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. పైగా ఇది హిస్టారికల్ ఫిల్మ్. అందుకే పలుసార్లు వాయిదా పడినా.. వీరమల్లుపై అంచనాలు బాగానే ఉన్నాయి. ముఖ్యంగా ఇటీవల విడుదలైన ట్రైలర్.. వీరమల్లుపై అంచనాలను అమాంతం పెంచేసింది. దీంతో జూలై 24న థియేటర్లలో అడుగుపెట్టనున్న 'హరి హర వీరమల్లు' సినిమా థియేట్రికల్ బిజినెస్ కి ఫుల్ డిమాండ్ ఏర్పడినట్లు తెలుస్తోంది. (Hari Hara Veera Mallu)   నైజాంలో వీరమల్లు థియేట్రికల్ రైట్స్ ను నిర్మాతలు రూ.65 కోట్లు చెబుతున్నట్లు సమాచారం. నైజాంలో పవన్ కి మంచి పట్టుంది. ఆయన సినిమాలు ఇక్కడ అదిరిపోయే వసూళ్లు రాబడుతుంటాయి. దానికి తోడు ఈమధ్య పలు పాన్ ఇండియా సినిమాలు నైజాంలో భారీ వసూళ్ళు రాబట్టాయి. దీనిని బట్టి చూస్తే.. రూ.60 కోట్లకు అటూఇటూగా వీరమల్లు నైజాం బిజినెస్ క్లోజ్ అయ్యే ఛాన్స్ ఉంది.    ఇక పవన్ ఏపీ డిప్యూటీ సీఎం అయిన తర్వాత ఆయన నుంచి వస్తున్న మొదటి చిత్రం కావడంతో.. ఆంధ్రా, సీడెడ్ లో కలిపి వీరమల్లు సుమారుగా రూ.100 కోట్లు బిజినెస్ చేసే అవకాశముంది. అంటే తెలుగు రాష్ట్రాల్లోనే వీరమల్లు మూవీ ఏకంగా రూ.160 కోట్ల బిజినెస్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. మొత్తానికి 'హరి హర వీరమల్లు' మూవీ వరల్డ్ వైడ్ గా రూ.200 కోట్లకు పైగా థియేట్రికల్ బిసినెస్ చేసే అవకాశం కనిపిస్తోంది.   
తన నటనతో, డైలాగ్‌ డెలివరితో ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు సంపాందించుకున్న క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌, కమెడియన్‌ ప్రవీణ్‌ ప్రధాన పాత్రలో రూపొందుతున్న చిత్రం 'బకాసుర రెస్టారెంట్‌', ఈ చిత్రంలో వైవా హర్ష టైటిల్‌ రోల్‌లో నటిస్తున్నారు. కృష్ణభగవాన్‌ ,షైనింగ్‌ ఫణి, కేజీఎఫ్‌ గరుడరామ్‌,ఇతర ముఖ్య పాత్రలో యాక్ట్‌ చేస్తున్నారు. ఎస్‌జే శివ దర్శకుడిగా పరిచయం కాబోతున్న ఈ చిత్రాన్ని ఎస్‌జే మూవీస్‌ పతాకంపై లక్ష్మయ్య ఆచారి, జనార్థన్‌ ఆచారి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. చిత్రీకరణ పూర్తిచేసుకున్న ఈ చిత్రం విడుదలకు సిద్దమైంది. హంగర్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ చిత్రంలోని బకాసుర టైటిల్‌ ర్యాప్‌ సాంగ్‌ను  బ్లాక్‌బస్టర్‌ మాస్‌ దర్శకుడు అనిల్‌ రావిపూడి విడుదల చేశారు. వికాస బడిస స్వరాలు సమాకూర్చిన ఈ పాటను ర్యాప్‌ సింగర్‌ రోల్‌ రైడ్‌, వికాస బడిస ఆలపించారు. ఈ సందర్భంగా అనిల్‌ రావిపూడి మాట్లాడుతూ '' బకాసుర రెస్టారెంట్‌ టైటిల్‌తో పాటు ఈ పాట కూడా బాగుంది. చాలా కొత్తగా అనిపించింది. ఈ సినిమా ఐడియా బాగుంది. నటుడు ప్రవీణ్‌ నాకు మొదట్నుంచి తెలుసు. ప్రవీణ్‌ హీరోగా రాబోతున్న ఈ చిత్రం మంచి సక్సెస్‌ కావాలి. తొలి చిత్ర దర్శకుడు ఎస్‌జే శివతో పాటు అందరికి ఈ చిత్రం మంచి పేరును తీసుకరావాలి' అన్నారు.   ఈ సందర్బంగా దర్శకుడు మాట్లాడుతూ '' హంగర్‌ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ సినిమాలో ప్రతి సన్నివేశం ఆడియన్స్‌కు థ్రిల్లింగ్‌తో పాటు వినోదాన్ని కూడా పంచుతుంది. ఓ ఇన్నోవేటివ్‌ కాన్సెప్ట్‌తో రూపొందుతున్న ఈ చిత్రం తప్పకుండా అందర్ని అలరిస్తుందనే నమ్మకం ఉందిఅతి త్వరలో చిత్ర విడుదల తేదిని ప్రకటిస్తాం. అనిల్‌ రావిపూడి గారు మా సాంగ్‌ను విడుదల చేయడం సంతోషంగా ఉంది. తప్పకుండా చిత్రం అందరికి నచ్చుతుంది' అన్నారు.  ప్రవీణ్‌, వైవా హర్ష, షైనింగ్‌ ఫణి (బమ్‌చిక్‌ బంటి), కేజీఎఫ్‌ గరుడ రామ్‌, కృష్ణభగవాన్‌, శ్రీకాంత్‌ అయ్యంగార్‌, ఉప్పెన జయకృష్న, వివేక్‌ దండు, అమర్‌, రామ్‌పటాస్‌, రమ్య ప్రియ, ప్రాచీ ఠాకూర్‌, జబర్థస్త్‌ అప్పారావు తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి డీఓపీ: బాల సరస్వతి, ఎడిటర్‌: మార్తండ్‌.కె.వెంకటేష్‌, సంగీతం: వికాస్‌ బడిస, ఎగ్జిక్యూటివ్‌ నిర్మాత: వినయ్‌ కొట్టి, ఆర్ట్‌ డైరెక్టర్: శ్రీ రాజా సీఆర్‌ తంగాల, పీఆర్‌ఓ: ఏలూరు శ్రీను, మడూరి మధు, నిర్మాతలు: లక్ష్మయ్య ఆచారి, జనార్థన్‌ ఆచారి, దర్శకత్వం: ఎస్‌జే శివ
పవర్‌స్టార్‌ పవన్‌కళ్యాణ్‌ ఫ్యాన్స్‌, ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా ‘హరిహర వీరమల్లు’. ఎన్నో అవరోధాల్ని అధిగమించి ఎట్టకేలకు జూలై 24న థియేటర్లలో సందడి చేయబోతోంది. ఇప్పటికే ఈ సినిమా రిలీజ్‌ పలుమార్లు వాయిదా పడింది. అయితే ఈసారి రిలీజ్‌ అవుతుందని అందరూ ఎంతో నమ్మకంతో ఉన్నారు. ఈ సమయంలో ఒక వివాదం ఈ చిత్రాన్ని చుట్టు ముట్టింది. తెలంగాణలో పోరాట యోధుడుగా పేరు తెచ్చుకున్న పండుగ సాయన్న జీవిత చరిత్రను వక్రీకరించి సినిమా తీశారంటూ బీసీ సంఘాలు ఆరోపిస్తున్నాయి. సినిమా రిలీజ్‌ను అడ్డుకుంటామంటూ ఆ సంఘాల నాయకులు హెచ్చరిస్తున్నారు. తెలుగు రాబిన్‌హుడ్‌గా పేరు తెచ్చుకున్న పండుగ సాయన్న గురించి చాలా మందికి తెలీదు. అసలు ఎవరీ పండుగ సాయన్న? అతనికి, ‘హరిహర వీరమల్లు’ చిత్రానికి ఉన్న లింక్‌ ఏమిటి? ఎందుకిది వివాదంగా మారింది? అనే విషయాల గురించి తెలుసుకుందాం. పండుగ సాయన్న 1860 నుండి 1900 మధ్య కాలానికి చెందినవారు. ఆరోజుల్లో తెలుగు రాబిన్‌హుడ్‌గా పేరు తెచ్చుకున్నారు. సాయన్న గ్రామీణ క్రీడల్లో ఆరితేరినవాడు. ఎంతో బలవంతుడు. 20 కేజీల గుండును అవలీలగా ఒక్క చేత్తో లేపే వాడు. ఎద్దులబండిని ఒక్క చేతితో లేపి విసిరేవాడు. ప్రజలను దోచుకుంటున్న దొరలు, దేశ్‌ముఖ్‌లు, అధికారులు, సంపన్నులను దోచుకొని పేదలకు పంచిపెట్టేవాడు. పేదల పాలిట రాబిన్‌హుడ్‌గా పేరు తెచ్చుకున్నప్పటికీ ఆధిపత్య వర్గాలు మాత్రం అతనిపై బందిపోటు అనే ముద్ర వేశాయి. అందరి దృష్టిలో అతను ఒక రాబిన్‌హుడ్‌ అయినప్పటికీ.. అతని లక్ష్యం మాత్రం వేరు. ఆనాటి నిరంకుశ నిజాం అధికారులను ప్రశ్నించాడు. వారిని ఎదిరించి, తన సొంత పాలనా వ్యవస్థను స్థాపించుకున్నాడు. ఒక సరికొత్త బహుజన రాజ్యాన్ని స్థాపించడానికి ప్రయత్నం చేశాడు సాయన్న. కానీ, ఇవి చూసి తట్టుకోలేని దేశముఖ్‌లు, కరణం పటేళ్లు, భూస్వాములు అప్పటి నిజాం ప్రభుత్వంతో కుమ్మక్కై సాయన్నను దారుణంగా చంపించారు. ఇప్పటికీ పండుగ సాయన్న మరణించిన రోజున వేలాదిమంది ఆయన సమాధి దగ్గరకొచ్చి నివాళులర్పిస్తారు. జయంతి ఉత్సవాలు జరుపుతారు. అతని చరిత్రను ఇప్పటికీ సజీవంగా ఉంచింది సంచార జాతులు, దళిత, బహుజన కళాకారుల కంఠాలే. వీళ్లు వూరూరా తిరుగుతూ సాయన్న చరిత్రను గానం చేశారు. మహబూబ్‌నగర్‌కు చెందిన న్యాయవాది బెక్కం జనార్ధన్‌ పండుగ సాయన్నపై ఒక నవల రాశారు. చారిత్రక ఆధారాలు తక్కువగా లభించే ఈ కథను దొరికిన ఆనవాళ్లతోనే ఉన్నతంగా రచించారు. ఇదీ స్తూలంగా పండుగ సాయన్న జీవిత చరిత్ర.  ‘హరిహర వీరమల్లు’ సినిమా విషయానికి వస్తే.. రిలీజ్‌ అయిన ట్రైలర్‌ని బట్టి పండుగ సాయన్నకు సంబంధించిన కొన్ని పోలికలు కనిపిస్తున్నాయి. ధనవంతుల్ని దోచుకొని పేదలకు సాయం చేసే లక్షణాలతోనే వీరమల్లు పాత్ర చిత్రణ జరిగింది. నిజాం నవాబుల నిరంకుశ పరిపాలనతోపాటు కోహినూర్‌ వజ్రాన్ని కూడా ఈ చిత్రంలో ప్రస్తావించారు. ట్రైలర్‌ చూస్తుంటే కథ మొత్తం కోహినూర్‌ వజ్రం చుట్టూనే తిరుగుతుంది అనిపిస్తుంది. ఆ వజ్రం కోసం గోల్కొండ నుంచి 8వ వాడిగా వీరమల్లు ఢిల్లీ బయల్దేరతాడు. అతను ఆ వజ్రాన్ని సాధించాడా లేదా అనేది కథగా కనిపిస్తోంది.  బీసీ సంఘాలు ఆరోపిస్తున్నట్టుగా ఇందులో పండుగ సాయన్నకు సంబంధించిన కీలక అంశాలేవీ ఉన్నట్టుగా లేదు. సంపన్నులను దోచుకొని పేదలకు పంచిపెట్టే రాబిన్‌హుడ్‌ లక్షణాలు తప్ప వీరమల్లులో సాయన్న అంశ లేదు. అతని జీవిత చరిత్రతోనే ఈ సినిమా చేస్తున్నట్టుగా ప్రచారం జరగడమే ఈ వివాదం రేగడానికి కారణం కావచ్చు. హరిహర వీరమల్లు అనేది కల్పిత పాత్ర అని ఇప్పటికే చిత్ర యూనిట్‌ ప్రకటించింది. చరిత్ర పోకడలు ఉన్న ఒక జానపద చిత్రంగా హరిహర వీరమల్లు ఉండే అవకాశం కనిపిస్తోంది. ఇప్పుడు ఈ సినిమాపై చెలరేగిన వివాదం వల్ల రిలీజ్‌కి అడ్డంకులు ఉండకపోవచ్చు. బీసీ సంఘాల నాయకులతో చర్చలు జరిపి సినిమాకి సంబంధించిన వాస్తవాలను వారికి వివరించడం ద్వారా సులువుగానే సమస్య పరిష్కారమవుతుంది అనే అభిప్రాయం అందరిలోనూ ఉంది.
UV Creations is one of the biggest production houses in Telugu Cinema. They have made films like Mirchi, Run Raja Run, Bhale Bhale Magadivoy, Bhagamathie, Saaho, Radhe Shyam. But they faced huge losses with Saaho and Radhe Shyam. They announced biggies like Vishwambhara and Ghaati with Megastar Chiranjeevi and Anushka, respectively.  Now, the production house have indefinitely postponed Vishwambhara and Ghaati. They have first announced Vishwambhara for Sankranti release of 2025 and the teaser did not impress anyone. Hence, they have announced that they are re-working on the graphics and will announce the release date only when the output is ready.  They have announced Ghaati for April and then, they have postponed it to July 11th. Currently, they have postponed movie again and did not announce any release date. Why are they facing such a situation? Many inside reports are stating that the production house is facing issues with VFX companies, it seems.    To control the finances, they have given contract of handling their projects to few VFX companies as a whole, it seems. Those companies are facing issues with delivering the output as per expectations and hence, UV Creations have been forced to change companies or give them even more time to complete the work, it seems.  Due to these postponements, they are unable to convince OTT platforms to not cut the overall rights amounts, say reports. They are ready to face such losses but are on serious mission to find a better VFX outlet before they produce another film with Prabhas, on a massive scale, it seems. But for now, they are trying to sort out issues with the delaying VFX companies and until then, they won't give any offical release dates for both the films, it seems.  Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them. 
రాజా దారపునేని నిర్మాతగా రాజ్ గురు బ్యానర్ పై దయానంద్ గడ్డం రచనా దర్శకత్వంలో జులై 11వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానున్న చిత్రం వర్జిన్ బాయ్స్. ఈ చిత్రంలో మిత్ర శర్మ, గీతానంద్, శ్రీహాన్, జెన్నీఫర్ ఇమాన్యుల్, రోనిత్, అన్షుల ముఖ్య పాత్రలు పోషించనున్నారు. స్మరణ్ సాయి సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్రానికి వెంకట్ ప్రసాద్ సినిమాటోగ్రాఫర్ గా పని చేయగా జేడీ మాస్టర్ కొరియోగ్రఫీ చేశారు. బబ్లు, కౌశల్ మంద, ఆర్జె సూర్య, సుజిత్ కుమార్, కేదార్ శంకర్, ఆర్జె శరన్, శీతల్ తదితరులు ఈ చిత్రంలో కీలకపాత్రలు పోషించారు. ఈరోజు మీడియా సమక్షంలో హైదరాబాద్ లోని ప్రసాద్ ల్యాబ్ లో అంగరంగ వైభవంగా వర్జిన్ బాయ్స్ చిత్ర ట్రైలర్ లాంచ్ చేయడం జరిగింది. అలాగే ఈ సినిమా టికెట్ కొన్న 11 మందికి ఐఫోన్లు గిఫ్ట్ గా ఇస్తామని ఈ ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో చిత్ర బృందం తెలిపింది. మనీ రైన్ ఇన్ థియేటర్స్ అనే కాన్సెప్ట్ తో కొన్ని థియేటర్లలో డబ్బు మీపై వర్షంలో కురిసి ఆ డబ్బు ప్రేక్షకులు సొంతం చేసుకోవచ్చు అంటూ తెలిపారు.  ఈ సందర్భంగా నటుడు రోనిత్ మాట్లాడుతూ... "అందరికీ నమస్కారం. నేను దర్శకుడు దయ కాలేజ్ ఫ్రెండ్స్. అప్పటినుండే ఇద్దరం సినిమాలు చేయాలని అనుకునే వాళ్ళం. చూస్తే పది సంవత్సరాల తర్వాత ఒక సినిమా స్టేజిపై ఉన్నాము. నాకు ఈ అవకాశం ఇచ్చిన చిత్ర బృందం అంతటికి నా ధన్యవాదాలు. అందరూ మా సినిమాను సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. చిన్న సినిమాలకు ఊపిరి పోసే సినిమాగా వర్జిన్ బాయ్స్ నిలుస్తుందని అనుకుంటున్నాను. జులై 11వ తేదీన అందరూ సినిమాను చూసి మమ్మల్ని ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నాను" అన్నారు.  నటుడు శ్రీహాన్ మాట్లాడుతూ... "వర్జిన్ బాయ్స్ చిత్ర ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు వచ్చిన అందరికీ నమస్కారం. నాకు ఈ సినిమాలో అవకాశం ఇచ్చిన దర్శకునికి ధన్యవాదాలు. నన్ను నమ్మి నాపై ఎంతో ఖర్చు పెట్టి నన్ను ఎంకరేజ్ చేసిన నిర్మాతకు నా ప్రత్యేక ధన్యవాదాలు. యువతను మెప్పించే చిత్రం వర్జిన్ బాయ్స్. అలాగే మత్తు పదార్థాలకు ఎవరు బానిసలు కాకండి. ఎవరైనా అటువంటి చర్యలు చేస్తే ప్రభుత్వానికి ఫిర్యాదు చేసి సహకరించాలని, బాధ్యతగా వ్యవహరించాలని కోరుకుంటున్నాను" అన్నారు.  నిర్మాత రాజా దారపునేని మాట్లాడుతూ... "వర్కింగ్ బాయ్స్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు వచ్చిన మీడియా వారికి, అతిథులకు ధన్యవాదాలు. ఈ చిత్రానికి వర్తిన్ బాయ్స్ అనే టైటిల్ ఖచ్చితంగా సూట్ అయ్యే టైటిల్. ఇప్పటికే విడుదలైన టీజర్, ఒక పాట ఎంతో వైరల్ అయ్యాయి. ఈ సినిమాలో పెద్దవారు ఎవరూ లేరు. అయినా ఈ సినిమాకు సపోర్ట్ చేసినందుకు అందరికీ థాంక్స్. ఎన్నో సర్ప్రైజ్ లతో ఈ సినిమాతో జులై 11వ తేదీన ప్రేక్షకుల ముందుకు వస్తున్నాము" అన్నారు.  దర్శకుడు దయానంద మాట్లాడుతూ... "ఈ కార్యక్రమానికి వచ్చిన వారందరికీ నా థ్యాంక్స్. మేము కాలేజీ రోజుల్లో ఉండగా చేసిన కొన్ని సంఘటనలను ఆధారంగా చేసుకుని ఈ సినిమా మొదలు పెట్టడం జరిగింది. ఇటువంటి సినిమాలు చాలా అరుదుగా వస్తాయి. అందరికీ కనెక్ట్ అవుతాయి. చిత్రానికి చాలా మంచి బృందం నాకు లభించినందుకు సంతోషంగా ఉంది. స్మరణ్ సాయి సంగీతం ఈ చిత్రానికి బోనస్ గా నిలుస్తుంది. మా అన్నయ్య గీతానంద్ తో నాకు ఇది రెండవ చిత్రం. అలాగే గీతానంద్, మిత్ర శర్మ మధ్య సీన్లు అద్భుతంగా వచ్చింది. జూలై 11వ తేదీన ప్రేక్షకులంతా చూడవలసిన సినిమా వర్జిన్ బాయ్స్" అన్నారు.  నటుడు గీతానంద్ మాట్లాడుతూ... "అందరికీ నమస్కారం. ప్రస్తుతం ఉన్న బిజీ జీవితంలో ఒక మంచి ఎంటర్టైన్మెంట్ ఇచ్చే సినిమాలను ఇష్టపడుతున్నాను. ఈ సినిమా ప్రేక్షకులని మరో కొత్త ప్రపంచంలోకి తీసుకువెళ్తుంది. ఇప్పటికే నా తమ్ముడితో కలిసి షార్ట్ ఫిలిమ్స్,  వెబ్ సిరీస్, ఒక సినిమా చేశాను. ఎంతో మంచి క్యాస్ట్ అండ్ క్రూ ఈ చిత్రానికి పనిచేశారు. ఎంతో కష్టపడి ఎంజాయ్ చేస్తూ ఈ సినిమాని పూర్తి చేసాము. శ్రీహన్ వల్ల సినిమా అద్భుతంగా వచ్చింది. ఈ సినిమాకు తర్వాత అందరికీ మంచి అవకాశాలు వస్తాయి. మిత్ర శర్మ ఈ సినిమాలో అద్భుతంగా పెర్ఫాం చేశారు. తన రోల్ సాధారణమైనది కాదు. అటువంటి రోల్ చేయాలంటే ఎంతో మెచ్యూరిటీ ఉండాలి. ఈ సినిమా యూత్ కు బయోపిక్ లాంటిది. నిజమైన సంతోషం మందు, మత్తు పదార్థాలలో ఉండదు. మనం ఏదైనా సాధించినప్పుడు వస్తుంది. ఈ సినిమా చూశాక ఎంత సంతృప్తితో బయటకు వెళ్తారు. జూలై 11వ తేదీన ఈ సినిమా తప్పకుండా థియేటర్లో చూడండి" అన్నారు.  నటి మిత్ర శర్మ మాట్లాడుతూ... "అందరికి నమస్కారం. ముందుగా ఈ సినిమాలో నా క్యారెక్టర్ కొంచెం కొత్తగా అనిపించింది. అలాగే ఎంతో మందితో కలిసి నాకు నటించే అవకాశం ఈ సినిమాతో రావడం సంతోషంగా అనిపించింది. ముందుగా నాకు ఈ సినిమాలో అవకాశం ఇచ్చినందుకు దయానంద్ కు థాంక్స్. ఏదైనా సాధించాలి అనే సంకల్పంతో ముందుకు వచ్చాడు. తన కష్టం వల్లే మేము ఈరోజు ఈ స్టేజి మీద ఉన్నాము. రోనిత్ ఎంతో మంచి పర్ఫార్మెన్స్ చేశారు. చిత్రంలో ఇతని క్యారెక్టర్ బాగా అనిపిస్తుంది. మనం కలిసి మరో చిత్రానికి పనిచేయాలని కోరుకుంటున్నాను. శ్రీహాన్ చేసిన క్యారెక్టర్ లేకపోతే సినిమాలో కిక్ ఉండదు. సినిమా చూసిన తర్వాత శ్రీహాన్ చేసిన క్యారెక్టర్ చూసి అందరూ ఆశ్చర్యపోతారు. అంత అద్భుతంగా నటించాడు. అతనితో కలిసి నటించడం ఎంతో సంతోషకరంగా అనిపించింది. అలాగే గీతానంద్ తో కలిసిన నటించడం బాగా ఎంజాయ్ చేశాను. చాలా సైలెంట్ గా ఉండే వ్యక్తి, బాగా సపోర్ట్ చేస్తారు. నేను మీ అందరిని జీవితాంతం గుర్తు పెట్టుకుంటాను. మా నిర్మాత రాజా గారు ఎంతో సహనం గలవారు. మమ్మల్ని ఎంతో ఎంకరేజ్ చేశారు. మేము చేసిన కొన్ని మంచి పనులను చూసి ఆయన గొప్పగా చెప్పుకుని మురిసిపోతూ ఉంటారు. నిస్వార్థమైన వ్యక్తి. అలాగే ఈ చిత్రంలో నటించిన ఇతర నటీనటులకు, టెక్నీషియన్లకు నా ప్రత్యేక ధన్యవాదాలు. ఈ కార్యక్రమానికి వచ్చి ఇంత ఘనవిజయం చేసిన ప్రతి ఒక్కరికి పేరుపేరునా మరోసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను" అంటూ ముగించారు. 
ఇటీవలికాలంలో పెద్ద సినిమాలన్నీ రిలీజ్‌ల విషయంలో తర్జనభర్జనలు పడుతున్నాయి. ఏ ఒక్కటీ చెప్పిన డేట్‌కి రిలీజ్‌ అవ్వడం లేదు. ఒకసారి కాదు పలుమార్లు తమ సినిమాల రిలీజ్‌లను వాయిదా వేస్తూ వస్తున్నారు మేకర్స్‌. ఇప్పుడు అదే దారిలో అనుష్క తాజా చిత్రం ‘ఘాటి’ కూడా వెళుతోంది. యువి క్రియేషన్స్‌ బేనర్‌లో క్రిష్‌ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాను జూలై 11న విడుదల చేస్తున్నట్టు గతంలో ప్రకటించారు. అయితే ఇప్పటివరకు ఈ సినిమాకి సంబంధించిన ట్రైలర్‌ను రిలీజ్‌ చెయ్యలేదు. దాన్ని బట్టే రిలీజ్‌ వాయిదా పడే అవకాశం ఉందని అంతా భావించారు. అనుకున్నట్టుగానే యువి క్రియేషన్స్‌ సంస్థ సినిమా రిలీజ్‌ను వాయిదా వేస్తున్నట్టు అధికారికంగా ప్రకటించింది.  అందుతున్న సమాచారం మేరకు ఈ సినిమాకి సంబంధించిన గ్రాఫిక్‌ వర్క్‌ ఇంకా బ్యాలెన్స్‌ ఉందట. అందుకే రిలీజ్‌ను వాయిదా వేసినట్టు తెలుస్తోంది. ఈమధ్యకాలంలో ఎక్కువ వాయిదాలు పడిన సినిమాల్లో హరిహర వీరమల్లు మొదటి స్థానంలో నిలుస్తుంది. టోటల్‌గా 14 సార్లు ఈ సినిమా రిలీజ్‌ను వాయిదా వేశారు. ఫైనల్‌గా జూలై 24న రిలీజ్‌ అవుతోంది. విజయ్‌ దేవరకొండ సినిమా కింగ్‌డమ్‌ రిలీజ్‌ను కూడా చాలా సార్లు వాయిదా వేశారు. ఇటీవల విడుదలైన కన్నప్ప చిత్రాన్ని కూడా కూడా చెప్పిన డేట్‌కి రిలీజ్‌ చెయ్యలేకపోయారు. ఇక మెగాస్టార్‌ చిరంజీవి సినిమా విశ్వంభర కూడా రిలీజ్‌ పోస్ట్‌ పోన్‌ అయింది. ఎప్పుడు రిలీజ్‌ చేస్తారు అనే విషయంలో క్లారిటీ లేదు. 
Sithara Entertainments is on a roll, delivering back to back blockbusters and leaving a mark with their impeccable storytelling. The powerful production house is also involved in distributing major films in Andhra Pradesh and Telangana. After the blockbusters Aravindha Sametha Veera Raghava and Devara, they have now joined forces for the third time with War 2, aiming for a hat-trick. YRF’s blockbuster Spy Universe’s most anticipated action spectacle of the year, WAR 2, is all set for a grand release in theatres on August 14th. Sithara Entertainments is proudly releasing the film in the Telugu states. The makers have acquired the theatrical rights for a hefty price. Announcing the same, Sithara wrote, " Kicking off the GUNS BLAZING for a HATTRICK. We are proud to join hands with Man of Masses @Tarak9999, Greek God @iHrithik and the powerhouse @yrf to bring this explosive ride called #WAR2 across the Telugu States. A festival of celebration awaits at theatres from this 14th August." The high-octane spy thriller War 2 marks the latest explosive chapter in the YRF Spy Universe ' India’s biggest and most successful film franchise - following global hits like Pathaan, Tiger 3, and the original War. The expectations are sky-high for the film, and now, with Sithara Entertainments distributing it on a grand scale, celebrations are guaranteed. War 2 pits two of the biggest superstars in the history of Indian cinema, Hrithik Roshan and NTR in the most epic face off that can truly be called a spectacle in every sense of the way. The film is directed by Ayan Mukerji known for Brahmaatra and Yeh Jawaani Hai Deewani. Yash Raj Films producing the film. The film will also have global IMAX release.
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు. వారితో పాటు పెద్ద సంఖ్యలో క్యాడర్ కూడా పార్టీని వీడుతున్నారు. ఇక ఇప్పుడు నామినేటెడ్ పదవులలో ఉన్న వారి వంతు మొదలైనట్లు కనిపిస్తోంది. తనకు కానీ తన భర్తకు  కానీ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు టికెట్ ఇవ్వాలంటూ గత  కొంత కాలంగా కోరుతూ వస్తున్న మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ వంతు వచ్చింది. ఆమె కూడా రాజీనామా అస్త్రం సంధించారు.  జగన్ కు నమ్మిన బంటుగా గుర్తింపు పొందిన మహిళాకమిషన్ చైర్ పర్సన్ వాసి రెడ్డి పద్మ తన పదవికి రాజీనామా చేశారు. ఉరుములేని పిడుగులా, ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా తన రాజీనామా లేఖను సీఎం జగన్ కు పంపేశారు. పేరుకు తాను పార్టీకి కాదు, కేవలం మహిళా కమిషన్ చైర్మన్ పదవికి మాత్రమే రాజీనామా చేశాననీ, ఇక నుంచి వైసీపీ కోసం పని చేస్తాననీ వాసిరెడ్డి పద్మ చెబుతున్నప్పటికీ, ఆమె రాజీనామాకు కారణం అసంతృప్తేనని పార్టీ వర్గాలు బాహాటంగానే చెబుతున్నాయి. చాలా కాలంగా వాసిరెడ్డి పద్మ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు తనకు కానీ తన భక్తకు కానీ పార్టీ టికెట్ ఇవ్వాలని జగన్ ను కోరుతూ వస్తున్నారు. అయితే ఇప్పటి వరకూ జగన్ చూద్దాం.. చేద్దాం అన్నట్లుగా దాట వేస్తూనే వచ్చారు. ఇప్పుడిక వరుసగా అభ్యర్థల జాబితాలను జగన్ ప్రకటించేస్తుండటం, తనకు గానీ తన భర్తకు కానీ పార్టీ టికెట్ విషయంలో ఎటువంటి స్పస్టత ఇవ్వకపోవడంతో ఆమె మనస్తాపం చెంది పదవికి రాజీనామా చేసేశారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.  వాసిరెడ్డి పద్మ రాజకీయ ప్రవేశం ప్రజారాజ్యం పార్టీతో జరిగింది. 2009లో ఆమె ప్రజారాజ్యం పార్టీలో చేరారు. ఇలా చేరడంతోనే ఆమె ప్రజారాజ్యం అధికార ప్రతినిథిగా పదవి దక్కించుకున్నారు. ప్రజారాజ్యం కాంగ్రెస్ పార్టీలో విలీనం కావడంతో ఆమె 2012లో జగన్ పార్టీలో చేరారు. జగన్ కూడా ఆమెకు అధికార ప్రతినిథి పదవి ఇచ్చారు.  2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆమెను రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా నియమించారు. చైర్ పర్సన్ హోదాలో ఆమె జగన్ మెప్పు పొందేందుకు చేయగలిగినంతా చేశారు. ప్రతిపక్ష పార్టీ నేతలకు నోటీసులు ఇచ్చారు. ఏకంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు సైతం నోటీసులు జారీ చేశారు. వార్డు వలంటీర్లపై పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు కమిషన్ ముందు హాజరై వివరణ ఇవ్వాలంటూ ఆమె పవన్ కు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. పవన్ హాజరు కాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు నమోదు చేయాలని ఆదేశించారు. ఇన్ని చేసినా వాసిరెడ్డి పద్మకు ఆమె కోరినట్లుగా పార్టీ టికెట్ లభించకపోవడంతో అలిగి పదవికి రాజీనామా చేశారని, ఇది జగన్ కు షాకేననీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు. ఒకరైతు తనకు చేసిన సేవలకు ప్రీతి చెందిన గురువు అతడికి స్వర్గ ప్రాప్తిని కలగజేయాలని అనుకుంటాడు. కానీ సంసారాసక్తి వల్ల ఆ రైతు ఆ అవకాశాన్ని వాయిదా వేసుకుంటూ వస్తాడు. చివరికి గురుకృప వల్ల ఆ రైతు స్వర్గ ప్రాప్తిని ఎలా పొందాడో ఈ కథ తెలియజేస్తుంది. "ఒక మహాపురుషుడు ప్రయాణం చేస్తూ, డస్సిపోయాడు. గొంతు ఎండిపోయింది. దారిలో ఒక రైతు కనపడితే నీళ్ళు అర్థించాడు. ఆ రైతు మహాత్మునికి సకల ఉపచారాలూ చేశాడు. చిరిగిపోయిన ఆయన ఉత్తరీయాన్ని రైతు జాగ్రత్తగా కుట్టి బాగుచేశాడు. రైతు పరిచర్యలకు సంతసించిన ఆ మహాత్ముడు శాంతి, ఆనందాలకు నిలయమైన స్వర్గానికి తనతోపాటు రమ్మని అంటాడు. అందుకు ఆ రైతు 'గురువుగారూ! మీరు నా మీద చూపిన దయకు కృతజ్ఞుణ్ణి. కానీ నా పిల్లలు ఇంకా చిన్నవాళ్ళు. ఓ ఏడేళ్ళ వ్యవధి ఇవ్వండి' అని అడుగుతాడు. అందుకు గురువు అంగీకరించాడు. సరిగ్గా ఏడేళ్ళ తర్వాత గురువు రైతును స్వర్గానికి తీసుకువెళ్ళడానికి వచ్చాడు. అప్పుడు రైతు 'అయ్యా! కడపటి కొడుకు కష్టాలకు అంతు లేదు. అన్ని జంఝాటాలనూ ఒక్కడే సంబాళించుకోలేకపోతున్నాడు. కాబట్టి మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని గురువుని అడిగాడు. మరో ఏడేళ్ళ తరువాత గురువు వచ్చాడు. కానీ రైతు చనిపోయాడని తెలిసింది. చనిపోయిన ఆ రైతు ఎద్దుగా పుట్టాడని ఆ గురువు తన దివ్య దృష్టితో తెలుసుకున్నాడు. ఎద్దుగా పుట్టిన ఆ రైతు తన కొడుకు పొలాన్నే దున్నుతున్నాడు. అప్పుడు గురువు ఆ ఎద్దుపై మంత్ర జలం చిలకరించగానే ఎద్దు జన్మనెత్తిన రైతు 'నా కొడుకు పరిస్థితి మరి కాస్త మెరుగు పడనీయండి స్వామీ! మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని అన్నాడు. ఇక చేసేది లేక వెనుదిరిగాడు గురువు. మరలా ఏడేళ్ళ తర్వాత వచ్చిన గురువుకు ఎద్దు చనిపోయిందని తెలిసింది. అది కుక్కగా పుట్టి కొడుకు ఇంటినీ, ఆస్తినీ కాపలా కాస్తోందని తన దివ్యదృష్టి ద్వారా తెలుసుకున్నాడు. గురువు. కుక్కగా పుట్టిన ఆ రైతు 'స్వామీ! నేను ఎంత దౌర్భాగ్యుణ్ణి. మీరు ఇంత దయ చూపుతున్నప్పటికీ మీతో స్వర్గమానం చేయలేకున్నాను. వీడికి ఆస్తిని కాపాడుకొనే దక్షత ఇంకా రాలేదు. కాబట్టి దయ చేసి మరో ఏడేళ్ళు వ్యవధి ఇవ్వండి' అని వేడుకున్నాడు. గురువు ఏడేళ్ళ తరువాత మళ్ళీ వచ్చేసరికి కుక్క మరణించింది. అది త్రాచుపాముగా జన్మనెత్తి, ఇప్పుడు కొడుకు భూమిలో ఉన్న లంకెబిందెలకు పడగెత్తి కాపలా కాస్తోంది. గుప్త ధనం ఇక్కడ ఉందని కొడుకుకి ఎలా తెలియజేయాలా అని పాము ఆలోచిస్తున్నప్పుడు గురువు ఆ రైతుకొడుకును పిలుచుకు వచ్చి లంకె బిందెలు ఉన్న చోట తవ్వమన్నాడు. లంకె బిందెలు బయటపడ్డాయి. ఆ పైన ఆ పామును చంపమన్నాడు. అనంతరం శిష్యుణ్ణి తీసుకొని స్వర్గారోహణం చేశాడు గురువు. సంసారంలోని ఈతి బాధల నుండి శిష్యుణ్ణి ఉద్ధరిస్తాడు సద్గురువు. అలాంటి గురువు అందరికీ అవసరం.                                      *నిశ్శబ్ద.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్  రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది.  80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత  ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది.   ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది. ఆమెది నెద‌ర్లాండ్స్‌. ఆమె తండ్రి నెద‌ర్లాండ్స్‌లోని ఆర్నెహెమ్‌లో చిన్న‌పిల్ల‌ల ఆస్ప‌త్రి డైరెక్ట‌ర్. పోయి దొరికిన ఆ పెయింటింగ్ విష‌యానికి వ‌స్తే.. అది 1683లో కాస్ప‌ర్ నెష‌ర్ వేసిన స్టీవెన్ ఓల్ట‌ర్స్ పెయింటింగ్‌. రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో నాజీల ఆదేశాల‌ను చార్లెట్ తండ్రి వ్య‌తిరేకించారు. ఆయ‌న ర‌హ‌స్య జీవ‌నం సాగించేడు. కానీ ఈ పెయింటింగ్‌ని మాత్రం త‌న న‌గ‌రంలోని ఒక బ్యాంక్‌లో భ‌ద్ర‌ ప‌ర‌చ‌మ‌ని ఇచ్చార‌ట‌. 1940లో నాజీలు నెద‌ర్లాండ్ పై దాడులు చేసినపుడు ఆ బ్యాంక్ మీద ప‌డి దోచుకున్నా రు. అప్పుడు ఈ పెయింటింగ్ కూడా తీసుకెళ్లారు. యుద్ధం అయిపోయిన త‌ర్వాత ఈ పెయింటింగ్ ఎక్క‌డున్న‌దీ ఎవ‌రికీ తెలియ‌లేదు. చిత్రంగా 1950ల్లో డ‌స‌ల్‌డార్ష్ ఆర్ట్ గ్యాల‌రీలో అది ప్ర‌త్య‌క్ష‌మ‌యింది. 1969లో ఆమ్‌స్ట‌ర్‌డామ్‌లో దాన్ని వేలానికి తీసికెళ్లే ముందు దాన్ని ఆ ఆర్ట్ గ్యాల‌రీలో వుంద‌ని చూసిన‌వారు చెప్పారు. వేలంపాట త‌ర్వాత మొత్తానికి ఆ పెయింటింగ్‌ను 1971లో ఒక క‌ళాపిపాసి త‌న ద‌గ్గ‌ర పెట్టుకున్నాడు.    ఆ త‌ర్వాత 2021లో అది చార్లెటీని చేరింది.  మొత్తానికి వూహించ‌ని విధంగా ఎంతో కాలం దూర‌మ‌యిన గొప్ప క‌ళాఖండం తిరిగి త‌న వ‌ద్ద‌కు చేర‌డంలో చార్లెటీ ఆనందానికి అంతేలేదు. అంతే క‌దా.. పోయింద‌నుకున్న గొప్ప వ‌స్తువు తిరిగి చేరితే ఆ ఆనంద‌మే వేరు!  అయితే చార్లెటీకి ఇపుడు ఆ పెయిం టింగ్‌ను భ‌ద్రంగా చూసుకునే ఆస‌క్తి వున్న‌ప్ప‌టికీ శ‌క్తి సామ‌ర్ధ్యాలు లేవు. అందుక‌నే త్వ‌ర‌లో ఎవ‌రిక‌యినా అమ్మేసీ వ‌చ్చిన సొమ్మును పిల్ల‌ల‌కు పంచుదామ‌నుకుంటోందిట‌!  చార్లెటీ కుటుంబంలో అయిదుగురు అన్న‌ద‌మ్ములు అక్క‌చెల్లెళ్లు వున్నారు. అలాగే ఇర‌వై మంది పిల్ల‌లు ఉన్నారు. అంద‌రూ ఆమె అంటే ఎంతో ప్రేమ చూపుతున్నారు. అంద‌రం ఒకే కుటుంబం, చాలాకాలం త‌ర్వాత ఇల్లు చేరిన క‌ళాఖండం మా కుటుంబానిది అన్న‌ది చార్లెటీ!
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు. చాకోను పార్టీలోకి ఆహ్వానిస్తూ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్’ ఫ్రంట్ ఏర్పాటు గురించి ప్రత్యేకించి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు కానీ, చాకో అలాంటి  సంకేతాలు ఇచ్చారు. ప్రస్తుతం దేశంలో ఉన్న ఏ ఒక్కపార్టీ కూడా బీజేపీకి ప్రత్యాన్మాయం కాదని,సమీప భవిష్యత్ కాంగ్రెస్ సహా ఏ పార్టీ కూడా ఆ స్థాయికి ఎదిగే అవకాశాలు కూడా కనిపించడంలేదని అన్నారు. ఈ పరిస్థితుల్లో దేశంలోని బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ, ఏకమై, ఒకే గొడుగు కిందకు రావలసిన అవసరం ఉందని చాకో అన్నారు. అదే సమయంలో ప్రతిపక్షాలను ఏక తాటిపైకి తెచ్చే బాధ్యతను పవార్ తీసుకోవాలని సంకేత మాత్రంగా చెప్పారు. అంతే కాకుండా కాంగ్రెస్ పేరు ఎత్తకుండా బీజేపీ వ్యతిరేక శక్తులను ఏకం చేసే ఆలోచన ఆ పార్టీ నాయకత్వానికి లేదని నెహ్రూ గాంధీ ఫ్యామిలీ (సోనియా, రాహుల్, ప్రియాంక)ఆలోచనా ధోరణిని పరోక్షంగానే అయినా ఎండ కట్టారు.ఆ విధంగా పవార్ ఆ బాధ్యత తీసుకోవాలని చాకో సూచించారు. ఇందుకు సంబంధించి, పవార్ బహిరంగంగా ఎలాంటి వ్యాఖ్య చేయలేదు. అయితే, చాకో సహా మరికొందరు ‘సీనియర్’ కాంగ్రెస్ నాయకులు, అలాగే సిపిఎం, సిపిఐ నాయకులు కూడా పవార్’తో చాలా కాలంగా థర్డ్ ఫ్రంట్  విషయంగా చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. అయితే మహారాష్ట్రలో సంకీర్ణం మనుగడను దృష్టిలో ఉంచుకుని పవార్ ఆచితూచి అడుగులేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే చాకో పార్టీలో చేరిన సందర్భంలో కూడా ‘చాకో చేరికతో మహారాష్ట్రలోని మహా వికాస్ అగాడీ ప్రభుత్వానికి ఎలాంటి నష్టం జరగదని, పవార్ మహారాష్ట్ర సంకీర్ణ సర్కార్ ప్రస్తావన చేశారని విశ్లేషకులు పేర్కొంటున్నారు.  మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వ మనుగడ గురించ్బి  పవార్ ప్రత్యేకంగా పేర్కొనడం ద్వారా, ఆయన థర్డ్ ఫ్రంట్ విషయంలో వేచి చూసే ఆలోచనలో ఉన్నట్లు అర్థమవుతోందని కూడా  రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే అదే ఎన్సీపీ అసెంబ్లీ ఎన్నికల జరుగతున్న కేరళలో, పశ్చిమ బెంగాల్లో  కాంగ్రెస్ వ్యతిరేక పార్టీలకు మద్దతు ఇస్తోంది. దీన్ని బట్టి చూస్తే, ఎన్సీపీ - కాంగ్రెస్ మధ్య దూరం పెరుగుతోందని స్పష్టమవుతోంది. అయితే, థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఏ రకంగా ముడి పడుతుంది అనే విషయంలో ఇంకా స్పష్టత రావలసి ఉంది. అలాగే, కాంగ్రెస్ లేకుండా జాతీయ స్త్గాయిలో బీజేపీ వ్యతిరేక కూటమిని ఏర్పాటు చేయడం వలన, వ్యతిరేక ఓటు చీలి  అది మళ్ళీ బీజేపీకే మేలు చేస్తుందని, కాబట్టి, ప్రస్తుతం కాంగ్రెస్ సారధ్యంలోని యూపీఏని బలోపేతం చేయడమే ఉత్తమమనే అలోచన కూడా  విపక్ష శిబిరం నుంచి వినవస్తోంది. ఈ నేపధ్యంలోనే, ప్రస్తుతం యూపీఏ ఛైర్పర్సన్’గా ఉన్న సోనియా గాంధీ వయసు, అనారోగ్యం కారణంగా బాధ్యతల నుంచి తప్పుకుని పవార్’కు బాద్యతలు అప్పగించాలనే ప్రతిపాదన వచ్చిందని అంటున్నారు. అలాగే, ఇతర పార్టీలను, ముఖ్యంగా కాంగ్రెస్ నుంచి విడిపోయి సొంత కుంపటి పెట్టుకున్న మమతా బెనర్జీ సారధ్యంలోని తృణమూల్, జగన్మోహన్ రెడ్డి సారధ్యంలోని వైసీపీలను కలుపుకుని కూటమిని బలోపేతం చేయడం ద్వారా బీజేపీని దీటుగా ఎదుర్కోవచ్చనే ఆలోచనలు కూడా సాగుతున్నాయి. అయితే, ఇటు థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు అయినా, యూపీఏని బలోపేతం చేయడమే అయినా, పవారే .. కేంద్ర బిందువు. ఆయన సారధ్యంలోనే ప్రత్యాన్మాయం అనేది విపక్ష శిభిరం నుంచి వినవస్తున్న ప్రస్తుత సమాచారం. మరి అదే జరిగితే రాహుల గాంధీ పరిస్థితి ఏమిటి ? గాంధీ నెహ్రూ కుటుంబం పరిస్థితి ఏమిటి? ఏ ప్రత్యేక ప్రాధాన్యత లేకుండా అందరిలో ఒకరిగా ఫస్ట్ ఫ్యామిలీ సర్దుకు పోతుందా? అంటే..చివరకు ఏమవుతుందో .. ఇప్పుడే చెప్పలేమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది. గతంలో అనేక సందర్భాలలో ముఖ్యమంత్రి కేసీఆర్,ఆర్థిక మంత్రి హరీశ రావు, కరోనా కారణంగా రాష్ట్ర  ఆదాయం గణనీయంగా తగ్గిందని, పేర్కొన్నారు. అయితే, కరోనా నుంచి వేగంగా కోలుకుని, ఆర్థికంగా అంతే వేగంగా పుంజుకున్న రాష్ట్రాలలో తెలంగాణ ప్రధమ స్థానంలో  ఉందని కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సర్వే 2020-21 నివేదిక పేర్కొంది. పడిలేచిన కెరటంలా, తెలంగాణ ‘వీ’ ఆకారంలో ఆర్థికంగా నిలతొక్కుందని కేంద్రం జనవరి  చివరి వారంలో విడుదల చేసిన ఆర్థిక సర్వేలో పేర్కొంది. అలాగే, రెవిన్యూ వసూళ్ళలో రాష్ట్రం కరోనా పూర్వస్థితికి చేరిందని కూడా సర్వే చెప్పింది.   అలాగే,రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు కూడా ఈ మధ్య కాలంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పై సంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరమ జనవరి,ఫిబ్రవరి, మార్చి నెలలతో పోలిస్తే ఈ సంవత్సరం ఈ మూడు నెలల కాలంలో రాష్ట్ర ఆర్థిక వృద్ది రేటు 10 నుంచి  15 శాతం మెరుగ్గా ఉందని హరీష్ రావు ఒకటి రెండు ఇంటర్వ్యూలలో పేర్కొన్నారు.అలాగే, బడ్జెట్ విషయంలోనూ ఆయన చాల ఆశావహ దృక్పథంతోనే ఉన్నారు. బడ్జెట్  పాజిటివ్’గా ఉంటుదని, ఎవ్వరూ ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని, సంక్షేమ పథకాలలో,ఇతరత్రా బడ్జెట్ కేటాయింపులలో ఎలాంటి కోతలు ఉండవని కూడా హరీష్ హామీ ఇచ్చారు. గత సంవత్సరంలో కొంత మేర హామీ ఇచ్చిన మేరకు అమలు చేయలేక పోయిన సొంత జాగాలలో డబల్ బెడ్ రూమ్ ఇళ్ళ నిర్మాణం, రుణ మాఫీ వంటి  పథకాలను ఈ బడ్జెట్ ద్వారా అమలు చేస్తామని చెప్పారు. అలాగే, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ తమిళి సై చేసిన ప్రసంగంలోనూ ఆశావహ దృక్పధమే వ్యక్తమైంది. ఆమె తమ ప్రసంగంలో,  ప్రభుత్వం సంక్షేమ పథకాలకు పెద్ద పీట వేసిందని అన్నారు. ‘సంపద పంచాలి ,పేదలకు పంచాలి’ అనేది తమ ప్రభుత్వ విధానమని స్పష్టం చేశారు. అలాగే, పెరుగతున్న ఆదాయంలో అధికశాతం సంక్షేమానికే వెచ్చిస్తున్నామని స్పష్టం చేశారు. దీంతో బడ్జెట్’లో కొత్త పథకాలకు శ్రీకారం చుట్టే అవకాశం ఉంటుందా అన్న చర్చ జరుగుతోంది. మరో వంక ఉద్యోగ వర్గాల్లో పీఆర్సీకి సంబంధించి ఆర్థిక మంత్రి తమ ప్రసంగంలో  ప్రకటన చేస్తారా లేదా అనే ఆసక్తి నెలకొంది. అలాగే, సామాన్య  ప్రజలు ఇటీవల పెరిగిన పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరల భారం నుంచి మంత్రి హరీష్, ఏదైనా ఉపసమనం కలిపిస్తారా అని ఎదురు చూస్తున్నారు. గతంలో వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సామాన్య ప్రజలపై వంటగ్యాస్ ధర భారాన్ని తగ్గించేందుకు కొంత మొత్తాన్ని, రూ.50(?) రాష్ట్ర ప్రభుత్వం తరపున  సబ్సిడీగా ఇచ్చిన విషయాన్ని, అదే విధంగా అసెంబ్లీ ఎన్నికలు జరుగతున్న తమిళనాడులో డిఎంకే పార్టీ,తమ పార్టీని అధికారంలోకి వస్తే  గ్యాస్ బండపై వంద రూపాయల సబ్సిడీ ఇస్తామని చేసిన  వాగ్దానాన్ని  గుర్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే, ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు, సోమవారం ఆర్థిక మంత్రి హరీష్ రావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఆర్థిక  శాఖ ముఖ్య కార్యదర్శి రామ కృష్ణా రావు,సలహాదారు జీఆర్ రెడ్డితో బడ్జెట్ పద్దులఫై సుదీర్ఘంగా చర్చించి తుది మెరుగులు దిద్దారు. బడ్జెట్ తుది రూపం సిద్దమైన నేపధ్యంలో ఆర్థిక శాఖ ప్రింటింగ్ ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 18 ఉదయం మంత్రి వర్గం ఆమోదం పొందిన అనంతరం ఆర్థికమంత్రి హరీష్ రావు అదే రోజు రాష్ట్ర బడ్జెట్ 2021-22ను సభలో ప్రవేశ పెడతారు. 20, 22 తేదీల్లో బడ్జెట్‌పై సాధారణ చర్చ,23, 24, 25 తేదీల్లో బడ్జెట్‌ పద్దులపై చర్చ ఉంటుంది 26న ద్రవ్యవినిమయ బిల్లు (బడ్జెట్)పై చర్చ, సభామోదం ఉంటాయి.
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది.  అధికార తెరాస, ఖమ్మం స్థానానికి సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర రెడ్డి పేరును ప్రకటించడంలో కొంచెం జాప్యం చేయడంతో పాటుగా, హైదరాబాద్ స్థానం నుంచి , పీవీ కుమార్తె వాణీ దేవి పేరును చివరి క్షణంలో తెరమీదకు తేవడంతో అంత వరకు కొంత స్తబ్దుగా సాగిన ప్రచారం ఆ తర్వాత వేడెక్కింది. ఉద్యోగ నియామకాల విషయంలో తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ తప్పులో కాలేయడంతో విపక్షాలు, పోటీలో ఉన్న ప్రత్యర్ధులు, నిరుద్యోగ యువత, విద్యార్ధి సంఘాలు  ఒకే సారి ఆయన మీద  విరుచుకు పడ్డారు. ఆయన లెక్క తప్పని నిరుపిస్తం రమ్మని వరస సవాళ్ళు విసిరారు. దీంతో, మంత్రి నియామకా ఇష్యూని పక్కకు తప్పించేందుకు , ఐటీఐఆర్, వరంగల్ రైల్వే ఫ్యాక్టరీ వంటి సెంటిమెంటల్ ఇష్యూస్’ను తెరపైకి  తెచ్చారు. అలాగే, కేంద్ర ప్రభుత్వంపై విమర్శల దాడిని పెంచారు. చివరకు పొరుగు రాష్ట్రానికి చెందిన విశాఖ ఉక్కు ఆందోళన   కూడా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగమైంది.   రెండు నియోజక వర్గాలలో గతంతో పోలిస్తే ఈసారి ఓటర్ల సంఖ్య రెట్టింపు అయింది. ఈసారి రెండు నియోజక వర్గాలలో కలిపి 10 లక్ష 36 వేల మంది తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. అలాగే, రెండు పట్ట భద్రుల నియోజక వర్గాల్లో 164 మంది అభ్యర్ధులు పోటీలో ఉన్నారు.  గత ఎన్నికలతో పోలిస్తే ఇటు ఓటర్ల సంఖ్య, అటు అభ్యర్థుల సంఖ్యా రెట్టింపునకు పైగానే పెరగడంతో ఎన్నికలలో జోష్ పెరిగింది. దీనికితోడు అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో సాధారణ ఎన్నికలను తలపించే రీతిలో ప్రచారం సాగింది. ఎక్కువమంది అభ్యర్ధులు బరిలో ఉండడంతో, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి  తమకే ప్రయోజనం జరుగుతుందని అధికార పార్టీ ఆశపడుతోంది .  దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో చేదు ఫలితాలను చవిచూసిన టీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా వ్యూహ రచన చేసి కేటీఆర్, హరీష్ సహా మంత్రులు,ఎమ్మెల్యేలకు స్పెసిఫిక్ బాధ్యతలు అప్పగించారు. అలాగే,కాంగ్రెస్‌ అభ్యర్థులు చిన్నారెడ్డి, రాములునాయక్‌లకు మద్దతుగా ఉత్తమ్‌, భట్టి, రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తదితరులు విస్తృతంగా ప్రచారం చేశారు. బీజేపీ అభ్యర్థులు ఎన్‌.రాంచందర్‌రావు, ప్రేమేందర్‌రెడ్డిల తరఫున ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, ఎంపీ అరవింద్‌ తదితరులు ప్రచారాన్ని వేడెక్కించారు.  ఖమ్మం స్థానం నుంచి ప్రత్యక్ష ఎన్నికల్లో తొలిసారి పోటీకి దిగిన కోదండరాంకు, టీజేఎస్‌ పార్టీకీ ఈ ఎన్నికలు కీలకంగా మారాయి. ఖమ్మ స్థానం నుంచి పోటీ చేస్తున్న తీన్మార్ మల్లన్న ముందస్తు వ్యూహంతో ప్రధాన పార్టీల అభ్యర్ధులకు ధీటుగా ప్రచారం సాగించారు.  వామపక్షాల మద్దతుతో జయసారథి, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్‌, యువతెలంగాణ కార్యనిర్వాహక అధ్యక్షురాలు రాణీ రుద్రమ తదితరులు పోటీలో ఖమ్మం సీటును పట్టభద్రులు  ఎవరికి  పట్టం కడతారు అన్నది ప్రశ్నార్థకంగా మారింది. హైదరాబాద్ సీటు కూడా ఇటు అధికార తెరాసకు అటు సిట్టింగ్ సీటును నిలుపుకోవడం తో పాటుగా దుబ్బాక , జీహెచ్ఎంసి జోష్ ను కొనసాగించాలని ఆశ పడుతున్నబీజేలకే కూడా ఇజ్జత్ కీ సవాల్ గా మారింది. కాంగ్రెస్ అభ్యర్ధి పార్టీ సీనియర్ నాయకుడు సౌమ్యుడు, మాజీ మంత్రి చిన్నారెడ్డి, వామ పక్షాల మద్దతుతో పోటీ చేస్తున్న మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ కూడా గట్టి పోటీ ఇస్తున్నారు. సో.. చివరకు ఏమి జరుగుతుంది అంటే ఏదైనా జరగవచ్చును. ఈ నెల 14 వ తేదీన పోలింగ్ జరుగుతుంది.17 ఫలితాలు వస్తాయి .. అంతవరకు వెయిట్ అండ్ వాచ్ .  
సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది. ఒకప్పుడు ఎర్ర జెండాను దిగ్విజయంగా ఎదిరించి, మార్క్సిస్టులను మట్టి కరిపించిన మమతా దీదీ ప్రస్తుతం, కాషాయ కూటమి నుంచి గట్టి సవాలును ఎదుర్కుంటున్నారు. వరసగా పదేళ్ళు పాలించడం వలన సహజంగా వచ్చిన ప్రభుత్వ వ్యతిరేకత  కంటే, హిందూ ఓటు పోలరైజేషన్ ఆమెను మరింతగా భయపెడుతోంది. నిజానికి ఐదేళ్ళ క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం ఐదు శాతం కంటే తక్కువ ఓట్లు, మూడంటే మూడు అసెంబ్లీ సీట్లు మాత్రమే గెలుచుకున్న బీజేపీ..  2019 లోక్ సభ ఎన్నికల్లో ఏకంగా 40 శాతం ఓట్లతో 18 స్థానాలు గెలుచుకుంది. ఈ  మార్పు ఇంకా కొన్ని కారణాలు ఉంటే ఉండవచ్చును కానీ.. హిందువుల ఓటు పోలరైజ్  కావడమే ప్రధాన కారణం.  ఈ నేపధ్యంలోనే కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ చివరకు కమ్యూనిస్టులు కూడా బీజేపీలో  చేరారు. ఎన్నికల ప్రకటన వెలువడిన తర్వాత కూడా సిట్టింగ్ ఎమ్మెల్ల్యేలు సహా  తృణమూల్ టికెట్ వచ్చిన నాయకులు కూడా బీజేపీలో చేరుతున్నారు. అనేక మంది ఇతర రంగాల ప్రముఖులు, ముఖ్యంగా ఇంతకాలం, బీజేపీని హిదుత్వ అనుకూల ‘అచ్చుత్’ (అంటారని) పార్టీగా చూసిన ‘సెక్యులర్’ ప్రముఖులు కాషాయం కప్పుకోవడంతో మమతా బెనర్జీకి కొంచెం అలస్యంగానే అయినా, తత్త్వం బోధపడింది. అందుకే ఆమె ఇప్పుడు గుళ్ళూ,గోపురాలకు తిరుగుతున్నారు. కార్యకర్తల సమావేశాల్లో తానూ హిందువునేనని, చెప్పుకుంటున్నారు.  నిజానికి ఇలా నేనూ హిందువునే  అని సెక్యులర్ నేతలు బహిరంగంగా ప్రకటించుకోవడం మమతా బెనర్జీతోనే మొదలు కాలేదు. రాహుల్ గాంధీ తాను హిందువునని, జన్యుధారీ కశ్మీరీ బ్రాహ్మణుని అనీ.. తమ గోత్రం, ‘దత్తాత్రేయ’ గోత్రమని బహిరంగంగా ప్రకటించుకున్నారు. అలాగే  కొద్ది రోజుల క్రితం ప్రియాంకా గాంధీ తానూ హిందువునని చెప్పుకునేందుకు ‘మౌని అమావాస్య’ సందర్భంగా అలహాబాద్ లో గంగా స్నానం చేశారు. గతంలోనూ ఆమె ఎన్నికలకు ముందు గంగా యాత్ర చేశారు. అంతవరకు ఎందుకు కొద్దిరోజుల క్రితం సిపిఐ నారాయణ విశాఖ స్వామి ఆశీస్సులు తీసుకున్నారు. చంద్రబాబు, జగన్ రెడ్డి, కేసీఆర్ ఇలా తెలుగు నేతలు అనేక మంది లౌకిక వాదానికి కాలం చెల్లిందన్న సత్యాన్ని గ్రహించి కావచ్చు ‘నేనూ హిందువును’ అంటూ ప్రకటించుకునేందుకు పోటీ పడుతున్నారు. రాముడిని తలచుకున్నా, జై శ్రీరామ్ అన్నా తమ  లౌకిక వాదం మయలపడి పోతుందని భయపడిన నాయకులు ఇప్పుడు .. జై శ్రీరామ్ అనేందుకు కూడా వెనకాడడం లేదు.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది. గత కొంత కాలంగా సబర్మలతో సహా అనేక అంశాలపై స్పందిస్తూ.. కేరళను టార్గెట్ చేస్తున్న బీజేపీ నాయకులు అక్కడ తమ జెండా ఎగరేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా పార్టీ పాలసీని కూడా పక్కన పెట్టి మెట్రో మ్యాన్ శ్రీధరన్ ను పార్టీలో చేర్చుకుని ఆయనే తమ సీఎం అభ్యర్థి అని ప్రకటించిన 24 గంటలలో యూ టర్న్ తీసుకున్నారు. ఇది ఇలా ఉండగా ప్రస్తుతం సీఎంగా ఉన్న కమ్యూనిస్ట్ నేత పినరై విజయన్ పై గోల్డ్ స్మగ్లింగ్ ఆరోపణలు రావడంతో.. ఈ ఎన్నికలలో ఎల్డిఎఫ్ భవిష్యత్తుపై ప్రజలు ఏ తీర్పు ఇవ్వబోతున్నారనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది ఈ నేపథ్యంలో అక్షరాస్యతలో దేశంలోనే మొదటి స్థానంలో ఉన్న ఆ రాష్ట్ర ప్రజలు ఎవరిని ఆశీర్వదిస్తారు అనే అంశంపై ప్రముఖ మీడియా సంస్థ టైమ్స్ నౌ, సీ ఓటరుతో కలిసి ఒక సర్వేను నిర్వహించారు. ఈ సర్వే ప్రకారం చూస్తే పాపం కమలనాథులు అక్కడ పవర్ చేతికి రావటం అటుంచి కనీసం రెండు మూడు అసెంబ్లీ స్థానాల్లో గెలవటం కూడా కష్టమేనని ఆ సర్వే తేల్చి చెబుతోంది. కేరళలో ఈసారి జరిగే అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ తన హవా చాటుతుందన్న ఆ పార్టీ నేతల మాటలలో ఎలాంటి నిజం లేదని.. ప్రస్తుతానికి అది ఏమాత్రం సాధ్యం కాదని ఈ తాజా సర్వే తేల్చి చెప్పింది. అంతేకాకుండా మొత్తం 140 స్థానాలు ఉన్న కేరళలో.. ప్రస్తుత సీఎం పినరయి విజయన్ నేతృత్వంలోని లెఫ్ట్డ్ డెమొక్రటిక్ ఫ్రంట్ కు 82 సీట్లు పక్కా అని.. ఆయనే తిరిగి అధికారాన్ని నిలబెట్టుకుంటాడని సర్వే చెపుతోంది. అదే సమయంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూనైటెడ్ డెమొక్రాటిక్ ఫ్రంట్ కు 56 నుంచి 60 వరకు సీట్లు వచ్చే అవకాశం ఉందని ఈ సర్వేలో తేలింది. అంతేకాకుండా 2016 ఎన్నికలతో పోలిస్తే ఎల్ డీఎఫ్ ఓటింగ్ శాతం కూడా కొంత పెరగటం ఇక్కడ గమనార్హం. ప్రస్తుతం సీఎంగా ఉన్న విజయన్ మరోసారి సీఎం కావాలని 43.34 శాతం మంది మొగ్గు చూపినట్లుగా సర్వేలో తేలింది. కరోనా సమయంలో విజయన్ సీఎంగా బాగా పని చేసారని ఈ సర్వే పేర్కొంది. మరోపక్క దేశ ప్రధానిగా రాహుల్ గాంధీ ఉండాలని కేరళ ప్రజల్లో 55.84 శాతం మంది కోరుకుంటున్నట్లుగా ఈ సర్వే;లో తేలింది. అయితే కేరళలో ఎలాగైనా పాగా వేయాలని పట్టుదలతో కృషి చేస్తున్న బీజేపీకి ఈసారి కూడా నిరాశ తప్పదని ఈ సర్వేలో స్పష్టం అయింది. ఈ ఎన్నికలలో బీజేపీకి రెండు సీట్లు కూడా రావటం కూడా కష్టమేనని ఈ సర్వే తేల్చింది. అయితే ఎన్నికలకు ముందు ఇలాంటి సర్వేలు బయటకు రావడం.. తరువాత అందులో కొన్ని చతికిల పడడం మనం చూస్తూనే ఉన్నాం. మరి ఈ సర్వే ఫలితాలు నిజామా అవుతాయో లేదో తేలాలంటే కొద్దీ రోజులు వెయిట్ చేయాల్సిందే.        
రాజకీయాలు అంటేనే అదో జూదం. పూలమ్మిన చోటనే కట్టెలు అమ్మవలసి రావచ్చును. అలాంటి పరిస్థితే వచ్చినా, తలవంచుకుని పోగలిగితేనే, ఎవరైనా రాజకీయాలలో రాణించగలరు. అలాకాదని, అలిమి కానిచోట, కూడా తామే అధికులమని భావిస్తే, ఎందుకూ కాకుండా పోతారు. అలాంటి వారు ఇద్దరూ కూడా ఇప్పుడు మన కళ్ళముందే ఉన్నారు.  జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు. అలాగే జయ మరణం తర్వాత ఆమె పరిస్థితి ఏమిటో కూడా వేరే చెప్పవలసిన, అవసరం లేదు. జైలు పాలయ్యారు. సర్వం తానై నడిపించిన పార్టీ నుంచి  బహిష్కరణకు గురయ్యారు. జయ ఉన్నంత వరకు తన వారుగా ఉన్న వారందరూ కానివారయ్యారు. ఒంటరిగా మిగిలారు.  నిజానికి నాలుగేళ్ళు జైలు జీవితం గడిపిన తర్వాత కూడా ఆమె తలచుకుంటే.. రాష్ట్ర రాజకీయాలలో, ముఖ్యంగా అధికారంలో ఉన్న డిఎంకే కూటమిలో అలజడి సృష్టించగలరు. ఎన్నికలలో ఆమె గెలవక పోవచ్చును కానీ.. తనను కాదన్న అన్నాడిఎంకేను ఓడించగలరు. అయిన  ఆమె అందుకు విరుద్ధంగా  రాజకీయాలకు వీడ్కోలు పలికి మౌనంగా పక్కకు తప్పుకున్నారు. రాజకీయ సన్యాసం ప్రకటించారు. ఉమ్మడి శతృవు డిఎంకే ను ఓడించేందుకు అన్నా డిఎంకే కూటమి  పోటీ చేయాలని, కూటమి ఐక్యతను దెబ్బతీయరాదనే ఉద్దేశంతోనే ఆమె రాజకీయ సన్యాసం ప్రకటించారు.    శశికళ మౌనంగా వెళ్లి పోవడం వెనక ఇంకా అనేక కారణాలున్నా ,అసలు కారణం ఆమె, రాజకీయ విజ్ఞత, వివేకం. ఆమె జైలుకు వెళ్ళిన సమయంలో జయలలిత సమాధి వద్ద ఎంత కసిగా, కోపంగా ‘మౌన’ ప్రతిజ్ఞ చేశారో చూశా. అలాంటి ఆమె ఇప్పుడు ఇలా ‘మౌనం’గా వెనకడుగు వేశారంటే, అది ఆలోచించ వలసిన విషయమే.ఆమె వ్యుహతంకంగానే సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే అనేక మంది అనేక కోణాల్లో శశికళ సంచలన నిర్ణయాన్ని విశ్లేషించారు.జైలు జీవితం తర్వాత కూడా అన్నా డిఎంకే నాయకులు తనను అగ్రనేతగా అంగీకరించక పోవడం, అమిత్ షా చెప్పినా.. అన్నా డిఎంకే నాయకులు ఆమెను, మేనల్లుడు దినకరన్’ను కులం పేరున, కుటుంబం పేరున దూరం చేయడం, తిరిగి పార్టీలోకి తీసుకోకపోవడంతో ఆమె మనసు కష్టపెట్టుకుని, సన్యాస నిర్ణయం తీసుకున్నారని కొందరంటున్నారు. పార్టీ మీద పట్టు లేదని, చరిష్మా అసలే లేదని, అందుకే ఆమె అలా నిశ్శబ్ధంగా రాజకీయ సన్యాసం స్వీకరించారని ఇంకొందరు విశ్లేషించారు. ఈ విశ్లేషణలో కొంత నిజం ఉంటే ఉండవచ్చును.. కానీ ఆమె గతాన్ని, నైజాన్ని గుర్తు చేసుకుంటే ఆమె స్ట్రైక్ బ్యాక్ వ్యూహంతోనే ఒకడుగు వెనక్కివేశారని ఆమెతో సన్నిహితంగా మెలిగినవారు, ఆమె రాజకీయ చాణక్యం తెలిసిన వారు అంటారు.   నిజానికి జైలులో ఉన్న కాలంలో కానీ, జైలు నుంచి విడుదలై వచ్చిన తర్వాత కానీ, ఆమె రాజకీయ సన్యాసం వైపు అడుగులు వేస్తున్నట్లు కనిపించలేదు. బెంగుళూరు జైలు నుంచి విడుదలై చెన్నైలో ప్రవేశించిన నప్పుడు ఆమె పెద్ద కాన్వాయ్ తో  తమ కారుకు అన్నాడిఎంకే జెండాతోనే ఎంటరయ్యారు. అలా ఎంట్రీలోనే రాజకీయ ఆకాంక్షను వెంట తెచ్చుకున్నారు. చివరకు ‘సన్యాస’ ప్రకట చేసే వరకు కూడా ఆమె రాజకీయ కార్యకలాపాలు సాగిస్తూనే ఉన్నారు. అటు ఢిల్లీని ఇటు చెన్నైనికూడా కదిల్చారు. అంతేకాదు, రాజకీయాలపై విరక్తితో కాదు, రాజకీయ కసితో, ఉమ్మడి శత్రువు (డిఎంకే) ను ఓడించేందుకే తాను రాజకీయాలనుంచి తపుకుంటున్నట్లు చెప్పారు.  సో .. సన్యాసం తీసుకోవాలనే ఆలోచన, రాజకీయవ్యూహం లోంచి పుట్టిందే కానీ,వైరాగ్యంతో పుట్టింది కాదు ,అన్నవిశ్లేషణ వాస్తవానికి ఇంకొంత దగ్గరగా ఉందని అనుకోవచ్చును. ఇది ‘కామా’నే కాని ‘ఫుల్స్టాప్’ కాదని అంటున్నారు.  ముఖ్యమంత్రి ఎడప్పాడి కే. పళని స్వామి (ఈపీఎస్) ఆమెను పార్టీలోకి అనుమతిస్తే తన కుర్చికీ ఎసరు పెడతారనే భయంతోనే,, ఆమె ఎంట్రీని అడ్డుకున్నారు. ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం, శశికళ ఒకే సామజిక వర్గానికి చెందిన వారు కావడం కూడా, ముఖ్యమంత్రి ఈపీఎస్’ భయానికి కారణంగా పేర్కొంటారు. అందుకే  ఆయన, ‘మన్నార్గుడి’ ఫ్యామిలీని బూచిగా చూపించి, ఆమెను దూరంగా ఉంచారని పార్టీలో ఒక వర్గం గట్టిగా విశ్వసిస్తుంది. అయితే ఆమె శక్తియుక్తులను కూడతీసుకుని  పులిలా పంజా విసిరేందుకే ఆమె వ్యూహాత్మకంగా ఒక అడుగు వెనక్కి వేశారు కావచ్చును అని కూడా, తమిళ రాజకీయ వర్గాల్లో ఒక చర్చ జరుగుతోంది.  గతంలో ఆమె జయలలితతో విబేధాలు వచ్చిన సమయంలో కూడా ఇలాగే కొద్ది కాలం మౌనంగా తెర చాటుకు వెళ్లి పోయారు.  కొద్ది కాలంలోనే మళ్ళీ ‘పోయస్ గార్డెన్’లో ప్రత్యక్షమయ్యారు. జయలలిత స్వయంగా ఆమెను వెనక్కి పిలుపించుకోవలసిన పరిస్థితులను సృష్టించారు. అలా  మళ్ళీ  చక్రం తిప్పారు. జయలలిత మరణం వరకు ఆమె అందరికీ చిన్నమ్మగా అమ్మకు పెద్దమ్మగా సర్వం తానై నిలిచారు. చివరకు జయ అంత్యక్రియల్లో కూడా ఆమెదే పై చేయిగా కనిపించింది.   జయలలిత చనిపోయిన సందర్భంలోనే అన్నా డిఎంకే ఎమ్మెల్ల్యేలో సుమారు 30 మంది వరకు ఆమెకు మద్దతుగా ఉన్నారన్న వార్తలొచ్చాయి. నిజానికి,ఇప్పటికి కూడా ఒక్క అన్నా డిఎంకే లోనేకాదు,డిఎంకే ఇతర పార్టీలలో కూడా  ఆమె అవసరం ఉన్న వాళ్ళు ఉన్నారు. కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో ‘మన్నార్గుడి’ ఫ్యామిలీ మద్దతు లేకుండా గెలిచే అవకాశం లేదు.  ఇవ్వన్నీ నిజమే అయినా.. అన్నీ ఉండి, ఎవరు లేని శశికళలో, ఇంకా  ఎవరి కోసం తాపత్రయ పడాలి? అనే ప్రశ్న జనించి ఉంటే, ఆమె రాజకీయ సన్యాసం నిజం కావచ్చును. ఎందుకంటే ఆమె నెచ్చలి, జయలిత లేరు, భర్త అంతకంటే ముందే చనిపోయారు, పిల్లలు లేరు... పైగా నాలుగేళ్ళ జైలు జీవితం ఆమెలో మార్పు తెచ్చి ఉండవచ్చును. ఈ వయస్సులో తనవారంటూ ఎవరు లేని తనకు రాజకీయాలు ఎందుకు ? శేష జీవితాన్ని ఇలా సాగిద్దామనే ఆలోచన నిజంగా వచ్చి ఉంటే, ఆమె సన్యాసం సత్యం అయినా కావచ్చును, కాకపోనూ వచ్చును. కానీ  శశికళ... ఆమెను అర్థం చేసుకోవడం, అంచనా వేయడం , అంత తేలిగ్గా అయ్యే పని కాదు..
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు. కాంగ్రెస్ అధినాయకత్వం పై నేరుగా అస్త్రాలు సంధించారు. రాహుల్ గాంధీ పేరు చెప్పకుండానే, ఆయన నాయకత్వానికి పనికిరాడని తేల్చి చెప్పారు. ఎవరైనా పార్టీ అధ్యక్షుడు అయితే కావచ్చును, కానీ, ప్రజానాయకుడు కాలేడని, రాహుల గాంధీ ప్రజానాయకుడు కాదు కాలేరు,అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తరచూ రాహుల్ గాంధీని ఉద్దేశించి చేసే  ‘నామ్’ధారీ వ్యంగ్యాస్త్రాన్నే కాంగ్రెస్ సీనియర్ నాయకులు కూడా సందించారు. ఇక అక్కడి నుంచి విధేయ, అసమ్మతి వర్గాల మధ్య మాటల యుద్ధం ఎదో ఒక రూపంలో సాగుతూనే వుంది. అదే క్రమంలో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ, కరుడు కట్టిన ముస్లిం మతోన్మాది, అబ్బాస్ సిద్దిఖీతో కాంగ్రెస్ పార్టీ చేతులు కలపడం అసమ్మతి నాయకులకు మరో అస్త్రాన్ని అందించింది. విషయంలోకి వెళితే, ఇటీవల పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా లోక్’సభలో కాంగ్రెస్ పక్ష నాయకుడు, పశ్చిమ బెంగాల్ పీసీసీ అధ్యక్షుడు అధీర్’రంజన్ చౌదరి, ముస్లిం మత ప్రచారకుడు, అబ్బాస్ సిద్దిఖీతో  వేదిక పంచుకున్నారు.అంతకు ముందే వామ పక్ష కూటమితో  పొత్తు కుదుర్చుకున్న కాంగ్రెస్ పార్టీ, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)ను కూటమిలో చేర్చుకుంది. ఇలా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) అమోదం లేకుండా మతోన్మాద ఐఎస్ఎఫ్’ తో ఎన్నికల పొత్తు పెట్టుకోవడం ఆ పార్టీ నాయకుడు,సిద్ధిఖీతో  పీసీసీ చీఫ్ వేదిక  పంచుకోవడం పై అసమ్మతి నేతలు మండి పడుతున్నారు. ఇలా సిద్దిఖీతో వేదిక పంచుకోవడం పార్టీ మౌలిక సిద్ధాంతాలకు వ్యతిరేకం అంటూ అసమ్మతి వర్గానికి చెందిన కీలక నేత, రాజ్యసభ సభ్యుడు,ఆనంద్ శర్మ మండిపడ్డారు. అంతే కాదు, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)తో జనవరిలో కుదుర్చుకున్న పొత్తుకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ)అమోదం లేదని ఆనంద్ శర్మ, అభ్యంతరం వ్యక్త చేశారు. పార్టీ విశ్వసించే లౌకిక వాదానికి కాంగ్రెస్ అధిష్టానం తీసుకున్న నిర్ణయం గొడ్డలి పెట్టని ఆయన తీవ్రంగా స్పందించారు.   శర్మ వ్యాఖ్యలపై అధీర్ రంజన్ చౌదరి అంతే ఘాటుగా ప్రతిస్పందించారు. “నిజాలు తెలుసుకోండి ఆనంద్ శ‌ర్మ జీ” అంటూ ఆయ‌న వ‌రుస ట్వీట్లు చేశారు. వ్య‌క్తిగ‌త ప్ర‌యోజ‌నాలు ప‌క్క‌న‌పెట్టి, ప్ర‌ధానిని పొగిడి టైమ్ వేస్ట్ చేయ‌కండంటూ ఆయ‌న ఓ ట్వీట్లో అన్నారు. ఆనంద్ శ‌ర్మ అన‌వ‌స‌రంగా కాంగ్రెస్‌ను ల‌క్ష్యంగా చేసుకుంటున్నార‌ని, ఈ అంశాన్ని పెద్ద‌ది చేసి చూపిస్తున్నార‌ని విమ‌ర్శించారు. ఆయ‌న ఉద్దేశాలు స‌రైన‌వే అయితే నేరుగా తనతో మాట్లాడ వలసిందని అన్నారు. బెంగాల్‌లో సీపీఐ(ఎం) కూట‌మికి నేతృత్వం వ‌హిస్తోంది. అందులో కాంగ్రెస్ ఓ భాగం. మ‌త‌తత్వ‌, విభ‌జ‌న రాజ‌కీయాలు చేస్తున్న బీజేపీకి చెక్ పెట్ట‌డానికే ఈ కూట‌మి అని మ‌రో ట్వీట్‌లో అధిర్ రంజ‌న్ అన్నారు. అక్కడతోనూ ఆగలేదు ... ట్వీట్ల మీద ట్వీట్లు సంధిస్తూ, ఆనంద్ శర్మ, బీజేపీ మత విభజన, అజెండాను బలపరుస్తున్నారని, పరోక్షంగా జీ23 నాయకులు బీజేపీకి ప్రయోజనం చేకూరుస్తున్నారని ఆరోపించారు.అంతే కాదు, క్షేత్ర స్థాయి వాస్తవ పరిస్థితులు తెలియకుండా, ఆనంద్ శర్మ పార్టీ మీద దండెత్తడం ఉచితం కాదని చౌదరి ఎదురుదాడి చేశారు. అసమ్మతిలో అసమ్మతి. ఇదలా ఉంటే, కాంగ్రెస్ పార్టీ  సమూల పక్షాళన కోరుతూ సోనియా గాంధీకి,గత సంవత్సరం  జీ 23గా ప్రాచుర్యం పొందిన సీనియర్ నాయకులు రాసిన లేఖపై సంతకాలు చేసిన  నాయకుల్లో నలుగురు,జమ్మూలోసమావేసమైన నాయకుల తాజా నిర్ణయాలు, వ్యాఖ్యలు,విమర్శల పట్ల అసంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరం సోనియా గాంధీకి రాసిన లేఖలో ప్రస్తావించిన అంశాలకు కట్టుబడి ఉన్నామని, అయితే, జీ 23లోని కొందరు సహచరులు, ఇటీవల గీతదాటి చేస్తున్న వ్యాఖ్యలు, విమర్శలను తాము సమర్ధించడం లేదని ఆ నలుగురు పేర్కొన్నారు. ఇందులో ముఖ్యంగా, రాజ్యసభ మాజీ డిప్యూటీ చైర్మన్, పీజే కురియన్ అయితే, “కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు అవసరమైన సంస్కరణలు తెచ్చేందుకు చేసే ప్రయత్నాలను పూర్తిగా సమర్దిస్తాను, కానీ, ‘లక్ష్మణ రేఖ’ దాటితే ఒప్పుకునేది లేదు”అని అసమ్మతిలో అసమ్మతికి తెర తీశారు.అలాగే, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ కుమారడు, మాజీ ఎంపీ సందీప్ దీక్షిత్,మధ్య ప్రదేశ్ సీనియర్ కాంగ్రెస్ నాయకుడు అజయ్ సింగ్’ కూడా గులాం నబీ ఆజాద్, కపిల్ సిబల్, ఆనంద్ శర్మ, మనీష్ తివారీ వంటి జీ 23 కీలక నేతలు అధినాయకత్వంపై చేసిన వ్యాఖ్యలను తప్పు పట్టారు. అలాగే, పార్టీ సీనియర్ నాయకుడు కేంద్ర మాజీమంత్రి వీరప్ప మొయిలీ కూడా,గత సంవత్సరం పార్టీ సీనియర్ నాయకులు  ఒక పరిమిత లక్ష్యంతో  సోనియా గాంధీకి లేఖ రాయడం జరిగిందని, ఆ పేరున జరుగతున్న  కార్యక్రమాలు లేఖ సంకల్పానికి  విరుద్ధమని అన్నారు. జీ 23 కార్యకలాపాలపై రాహుల్ గాంధీ కూడా పరోక్షగా స్పందించారు, ఒకప్పుడు ఎన్ఎస్’యుఐ, యూత్ కాంగ్రెస్’ కు సంస్థాగత ఎన్నికలు వద్దన్న వారే ఇప్పుడు ఇంకోలా మాట్లాడుతున్నారని పరోక్షంగానే అయినా సంస్థాగత ఎన్నికలు నిర్వహించడంతో పాటుగా, పార్టీ పక్షాలనకు తమ కుటుంబం వ్యతిరేకం కాదని, అందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఈ నేపధ్యంలో కాంగ్రెస్ పార్టీలో చెలరిగిన కలకలం  ఇక ముందు ఏమవుతుందో .. ఇంకెన్ని  మలుపులు తిరుగుతోందో ..చూడవలసిందే కానీ ఉహించలేము.
పంచతంత్రంగా పిలుచుకుంటున్న ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భతం జరగబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే, వివిధ సంస్థలు అసెంబ్లీ ఎన్నికలు జరిగే  అస్సాం. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటుగా కేరళలోనూ ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఆ ఒపీనియన్ పోల్ ఫలితాలు నిజంగా నిజం అయితే, కేరళలో మళ్ళీ సీపీఎం సారధ్యంలోని వామపక్ష కూటమి అధికారంలోకి వస్తుంది. ఇదే ఆ అద్భుతం. ఎందుకంటే, గత నాలుగు దశాబ్దాలలో కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో ఒకే కూటమి వరసగా రెండవసారి అధికారంలోకి వచ్చిన చరిత్ర లేనే లేదు. ఒక సారి ఎల్డీఎఫ్ అధికారంలోకి వస్తే ఐదేళ్ళ తర్వాత కాంగ్రెస్ సారధ్యంలోని ఐక్య ప్రజాస్వామ్య కూటమి(యూడీఎఫ్) అధికారంలోకి రావడం, దేవభుమిలో దైవ నిర్ణయమా అన్నట్లుగా ప్రతి ఎన్నికల్లోనూ అధికారం చేతులు మారుతూ వస్తోంది. అలాంటిది, ఈసారి ఒపీనియన్ పోల్స్ నిజమై వరసగా రెండవసారి వామపక్ష కూటమి అధికారంలోకి వస్తే, అది చరిత్రే అవుతుంది. ఇక ఒపీనియన్ పోల్స్ విషయానికి వస్తే, జాతీయ న్యూస్ ఛానెల్ ఏబీపీ, సీ ఓటర్ సంస్థలు సంయుక్తంగా ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఈ సర్వే ప్రకారం, 140 స్థానాలున్న కేరళ అసెంబ్లీలో వామపక్ష కూటమికి 83 నుంచి  91 స్థానాలు, యూడీఎఫ్ కూటమికి 47 నుంచి 55 స్థానాలు మాత్రమే దక్కుతాయని తెలుస్తోంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్రంలో ఇలా జాతకాలు తిరగబడడంపై సోషల్ మీడియాలో,’లెగ్ మహిమ’ లాంటి జోక్స్  ట్రోలవుతున్నాయి. అయితే 2016లో జరిగిన ఎన్నికల్లో కేవలం 47 సీట్లకే పరిమితం అయిన కాంగ్రెస్’కు ఈసారి ఒకటీ అరా సీట్లు ఎక్కువస్తే, రావచ్చును. అదే కాంగ్రెస్’కు కాసింత ఊరట. అదలా ఉంటే, పశ్చిమ బెంగాల్లో సైతం పట్టు సాధించిన బీజేపే, కేరళలో మాత్రం పట్టు కాదు కదా, పట్టుమని పది సీట్లు తెచ్చుకునే స్థితిలో లేదు. నిజానికి, దేశంలో బీజేపీకి అసలు ఏ మాత్రం మింగుడు పడని రాష్ట్రాలు ఎవైన ఉన్నాయంటే కేరళ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల  పేర్లే ప్రముఖంగా వినిపిస్తాయి. ఈ సారి కూడా కమల దళం కేరళలో కాలు పెట్టె పరిస్తి లేదని సర్వే ఫలితాలు చెపుతున్నారు. ఎప్పటిలానే ఇప్పడు కూడా  బీజేపీకి సున్నా నుంచి రెండు సీట్లు వచ్చే అవకాశం ఉందని, సర్వేస్వరుల అభిప్రాయంగా ఉంది. కేరళలో మొత్తం 140 స్థానాలకు ఏప్రిల్ 6 తేదీన ఒకే విడతలో పోలింగ్ జరుగుతుంది. మే 2 తేదీన ఫలితాలు వెలువడతాయి. కేరళ ఎలక్షన్ పై యావత్ దేశం ఆసక్తి కనబరుస్తోంది.    
కేంద్ర ఎన్నికలసంఘం ‘పాంచ్ పటాక’ గంట కొట్టింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. ఎన్నికల గంట మోగడంతో మొదలైన మరో భారత ‘మినీ’  సంగ్రామానికి మే 12 తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తెర పడుతుంది.ఈలోగా వివిధ అంచల్లో పోలింగ్ జరుగుతుంది.  నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతం ఓటరు తీర్పుకు వెళుతున్నా, అందరి దృష్టి, ముఖ్యంగా ప్రాంతీయ పార్టీల ఏలుబడిలో ఉన్న ఉభయ తెలుగు రాష్ట్రాలు, మరీ ముఖ్యంగా ఇప్పటికే బీజేపీ కన్నుపడిన తెలంగాణ రాష్ట్ర ప్రజలు, రాజకీయ పార్టీల దుష్టి  మాత్రం పశ్చిమ బెంగాల్ పైనే వుంది.  పశ్చిమ బెంగాల్లో ‘అద్భుతం’ జరిగి బీజేపీ విజయం సాధిస్తే, ఇక  కమల దళం ఫోకస్, తెలంగాణకు షిఫ్ట్ అవుతుంది. ఇది అందరికీ తెలిసిన బహిరంగ రహస్యం. ఈ నేపధ్యంలో బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయి అనే విషయంలో రాష్ట్ర రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. బెంగాల్లో బీజేపీ గెలిస్తే, ఇప్పటికే అంతర్గత కుటుంబ కలహాలతో సతమతవుతున్న తెరాస నాయకత్వానికి మరిన్నితిప్పలు తప్పవన్న మాట అంతఃపుర వర్గాలలో సైతం వినవస్తోంది.  పశ్చిమ బెంగాల్’లో ఎలాగైతే కమలదళం ఓ వంక తమ ట్రేడ్ మార్క్, హిందుత్వ రాజకీయాలు సాగిస్తూ, మరో వైపు నుంచి ‘ఆకర్ష్’ అస్త్రంతో అధికార పార్టీని నిర్వీర్యం చేసిన విధంగానే, ఇక్కడ కూడా ఫిరాయింపులను ప్రోత్సహింఛి పార్టీని నిట్టనిలువునా చీల్చే ప్రమాదాన్ని కొట్టివేయలేమని పార్టీ వర్గాలు కూడా అనుమానం వ్యక్త పరుస్తున్నాయి.  ఇప్పటికే తెలంగాణ  బీజేపీ నాయకులు 30 మంది తెరాస ఎమ్మెల్యేలు తమ టచ్ లో ఉన్నారని బెదిరిస్తున్నారు.అది నిజం అయినా కాకపోయినా..తెరాసలో అసంతృప్తి అగ్గి రగులుతోందనేది మాత్రం ఎవరూ కాదనలేని నిజం. అంతే కాకుండా రాష్ట్రానికి వచ్చిన కేంద్రనాయకులు ఎవరిని పలకరించినా, నెక్స్ట్ టార్గెట్ తెలంగాణ అని ఎలాంటి సషబిషలు లేకుండా కుండబద్దలు కొడుతున్నారు.అందుకే, బెంగాల్లో బీజేపీ గెలిస్తే.. అనే ఊహా కూడా  గులాబీ గూటిలో గుబులు పుట్టిస్తోంది. అయితే, బెగాల్’లో బీజేపీ గెలిస్తే ఒక్క తెలంగాణలోనే కాదు, దేశ రాజకీయ వాతావరణంలోనే పెను మార్పులు చోటు చేసుకుంటున్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.  అలాగే,  దేశ ముఖ చిత్రంలో కూడా పెను మార్పులు తప్పవని అంటున్నారు. అయితే రాజకీయాలలో ఎప్పుడు ఏం జరుగుతుందో.. ఎవరూహించెదరు..
  మనిషి జీవితంలో విజయం సాధించాలంటే చాలా కష్టాలు ఎదుర్కోవాలి. కానీ విజయం సాధించి మళ్ళీ కింద పడి, ఎమ్మల్లి లేచి నిలదొక్కుకోవాలంటే మాత్రం కష్టం, తెలివి, ఆత్మవిశ్వాసం, తన మీద తనకు నమ్మకం.. ఇవ్ణనే ఉండాలి. దేనికి ఒక కథ ఉదాహరణగా నిలుస్తుంది. విదేశంలోని ఒక వ్యాపారవేత్త అనుకోని పరిస్థితుల్లో ఘోరంగా దివాళా తీశాడు. ఫలితంగా అప్పుల్లో కూరుకుపోయాడు. మరోవైపు ఆయనకు డబ్బులు ఇవ్వాల్సిన వ్యక్తులు కూడా ముఖం చాటేస్తూ ఉన్నారు. ఈ విషయం తెలిసిన అప్పుల వాళ్ళు తీవ్రంగా ఒత్తిడి తెస్తూ ఉన్నారు. పరిస్థితి అగమ్యగోచరమైపోయింది. ఎంతో ఆందోళనతో ఆ వ్యాపారి ఒక రోజు తన ఇంటికి సమీపంలోని ఓ పార్క్ కు  వెళ్ళి, తలపై చేతులు పెట్టుకొని విషాదంగా కూర్చున్నాడు. ఇంతలో హుందాగా వస్త్రధారణ చేసుకున్న ఓ అరవై ఏళ్ళ వృద్ధుడు ఆయన వద్దకు వచ్చాడు. "ఏదో కోల్పోయిన వాడిలా ఉన్నావు. జీవితంలో ఏమైనా నష్టం వాటిల్లిందా?" అని అడిగాడు. ఎంతో ఆత్మీయంగా పలకరించే సరికి, కదలిపోయిన ఆ వ్యాపారి తన కష్టనష్టాల్ని ఆ పెద్దాయనకు వివరించాడు. వెంటనే ఆ వృద్ధుడు స్పందించి "నేను నీకు ఏదైనా సహాయం చేద్దామనుకుంటున్నాను" అంటూ, "నీ పేరేంట"ని అడిగాడు. ఆ వ్యాపారి తన పేరు చెప్పగానే వెంటనే తన చెక్ బుక్ జేబులో నుంచి తీసి, ఆ పేరుతో చెక్ రాసి, సంతకం చేసి వ్యాపారి చేతిలో పెట్టాడు. "ఈ చెక్కు తీసుకో. నేను దీన్ని నీకు అప్పుగా ఇస్తున్నాను. సరిగ్గా సంవత్సరం తరువాత నేను నిన్ను ఇక్కడే కలుస్తాను. అప్పుడు నా అప్పు తీర్చేయ్" అన్నాడు. అయిదు లక్షల డాలర్ల చెక్కు అది. పైగా ఇచ్చిన వ్యక్తి ఎవరో కాదు - ప్రపంచంలోనే అత్యంత శ్రీమంతుల్లో ఒకరైన రాక్ఫెల్లర్ అని తెలిసి వ్యాపారికి నోట మాట రాలేదు. ఆ చెక్కు తీసుకొని ఇంటికి చేరుకున్నాడు ఆ వ్యాపారి. కానీ దాన్ని నగదుగా మార్చుకొని అప్పులు తీర్చుకోలేదు. దాన్ని బీరువా అరలో పెట్టుకొని, అది ఉందన్న నమ్మకంతో ముందు తన వ్యాపారాన్ని చక్కదిద్దుకోవడం మొదలుపెట్టాడు. ఆ అయిదు లక్షల డాలర్లు తన వెనుక ఉన్నాయన్న విశ్వాసంతో ధైర్యంగా ముందడుగు వేశాడు. అప్పుల వాళ్ళ వద్దకు వెళ్ళి, కొద్దిరోజులు గడువు ఇవ్వమని అడిగాడు. తనకు రావలసిన మొత్తాన్ని చాకచక్యంతో రాబట్టుకున్నాడు. తిరిగి కొంత పెట్టుబడితో కొత్త వ్యాపారం ప్రారంభించాడు. కొన్నాళ్ళకు మళ్ళీ తన పూర్వవైభవానికి చేరుకున్నాడు. సరిగ్గా సంవత్సరం తరువాత అదే చెక్కు తీసుకొని, కృతజ్ఞతలు చెప్పుకొని ఇచ్చేసేందుకు అదే పార్క్ కు వెళ్ళాడు. సాయంత్రానికి ఆ వృద్ధుడు మళ్ళీ అక్కడకు వచ్చాడు. ఎంతో ఆనందంతో ఈ వ్యాపారి ఆయన వద్దకు వెళ్ళబోతుండగా, దూరంగా ఉన్న ఓ మొబైల్ వ్యాన్ నుంచి నర్సు దిగి పరుగెత్తుకుంటూ వచ్చింది. ఆ వృద్ధుడిని పట్టుకొని "హమ్మయ్య! ఇప్పటికి దొరికాడు. పిచ్చాసుపత్రి నుంచి పారిపోయి వచ్చి, కనిపించిన వారికల్లా. 'నేను రాక్ఫెల్లర్ని' అంటూ చెక్కులు రాసి ఇచ్చేస్తున్నాడు" అంటూ డ్రైవర్ సహాయంతో ఆ వాహనంలోకి అతణ్ణి ఎక్కించుకొని తీసుకువెళ్ళి పోయింది. వ్యాపారి ఆనందాశ్చర్యాలకు గురయ్యాడు. ఇన్నాళ్ళూ తన దగ్గర ఉన్నది ఓ చెల్లని చెక్కనీ, దానిపై భరోసా పెట్టుకొని ఇంత సాధించానా అనీ ఆత్మశోధన చేసుకొని పులకరించి పోయాడు. నిజానికి ఆ వ్యాపారికి బయట నుంచి ఏ సహాయమూ అందలేదు. కానీ తనలో అచేతనంగా ఉన్న ఆత్మవిశ్వాసాన్ని తట్టి లేపేందుకు ఆ చెల్లనిచెక్కు ఉపయోగపడింది అంతే! అదే విధంగా చాలాసార్లు మనం బయట నుంచి ఏదో ఒక ఆలంబన కావాలని తపించిపోతూ ఉంటాం. కానీ అది కొంత వరకే మనకు సహకరిస్తుంది. ఎప్పుడైనా మనకు వాటిల్లిన ఉపద్రవం నుంచి బయటపడడానికి పూర్తిగా బాధ్యత వహించాల్సింది మనమే!  బాహ్యప్రపంచం నుంచి ఎవరికీ, ఎప్పుడూ ఏ సహాయమూ అందదు. ఎవరికి వారే ఆలంబనగా నిలిచి, నిలదొక్కుకోవాలి. అలాంటివారే గొప్ప విజయాలను సాధించగలరు. ఈ విషయాన్ని అందరూ గుర్తుపెట్టుకోవాలి.                                         *నిశ్శబ్ద.
  పెద్దలు ఎల్లప్పుడూ స్నేహాలు మంచిగా ఉండాలని సలహా ఇస్తారు. దీని వెనుక వారి ఆలోచన ఏమిటంటే- 'స్నేహం ఎలా ఉంటుందో, ప్రవర్తన కూడా అలాగే ఉంటుంది.' ఎవరైనా సరే ఏ రకమైన వ్యక్తులతో సమయం గడుపుతారో, వారి ఆలోచన, ప్రవర్తన,  అలవాట్లు క్రమంగా ఎదుటివారిలో  రావడం ప్రారంభిస్తాయి. ముఖ్యంగా  పిల్లలలో ఈ ప్రక్రియ మరింత వేగంగా జరుగుతుంది. ఎందుకంటే వారు ఈ సమయంలో భావోద్వేగపరంగా పెళుసుగా ఉంటారు.   ఇతరుల వల్ల  సులభంగా ప్రభావితమవుతారు. పిల్లలు తప్పుడు స్నేహంలో పడితే, అది వారి ప్రవర్తన, నమ్మకం,  చదువులతో పాటు వారి భవిష్యత్తును కూడా ప్రభావితం చేస్తుంది. వారిలో కనిపించే కొన్ని అలవాట్ల కారణంగా వారు చెడుదారిలో పడ్డారా లేదా అనే విషయం తెలుసుకోవచ్చు. ఉపాధ్యాయుల గురించి చెడుగా మాట్లాడటం.. ఒక పిల్లవాడు తన ఉపాధ్యాయుల గురించి పదే పదే చెడుగా మాట్లాడటం లేదా వారిని తక్కువ అంచనా వేయడం ప్రారంభించినప్పుడు,  పిల్లవాడు చెడు సహవాసంలో పడిపోయాడని అర్థం చేసుకోవాలి. ఇది పిల్లలకు చదువు మీద  చులకన భావం ఏర్పడేలా చేస్తుంది. చెడు స్నేహితుల సమర్థింపు.. పిల్లవాడు తన స్నేహితుల్లో ఎవరి తప్పుడు ప్రవర్తననైనా సమర్థించడం ప్రారంభిస్తే , ఆ పిల్లవాడు ఆ స్నేహితుడి ప్రభావానికి లోనయ్యాడని స్పష్టమైన సంకేతం.  ఇది  హెచ్చరిక సంకేతం అవుతుందట.  ఇలాంటి వారు స్నేహితుల ద్వారా  ాలా దెబ్బ తింటారు. నెగెటివ్ గా మాట్లాడటం..  పిల్లవాడు అకస్మాత్తుగా తన గురించి ప్రతికూలంగా మాట్లాడటం ప్రారంభిస్తే లేదా అతని ఆత్మవిశ్వాసం తక్కువగా ఉన్నట్లు అనిపిస్తే, అది అతని స్నేహితుల  యొక్క ప్రతికూల ప్రభావం కావచ్చు.  ఇది పిల్లవాడిని ఆత్మవిశ్వాసం కోల్పోయేలా చేస్తుంది. రహస్యం.. పిల్లవాడు అకస్మాత్తుగా ఫోన్ దాచి స్నేహితులతో మాట్లాడటం,  లేదా చాట్ చేస్తున్నప్పుడు స్క్రీన్‌ను దాచిపెట్టడం వంటివి చేస్తే  తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలి.  పిల్లలు తల్లిదండ్రులకు తెలియకుండా తప్పు పనులు చేసే అవకాశం ఉంటుంది. చదువుకు దూరం కావడం.. పిల్లలు అకస్మాత్తుగా చదువుకు దూరం కావడం, హోంవర్క్ వాయిదా వేయడం, తరగతులకు హాజరు కాకపోవడానికి సాకులు వెతకడం లేదా అస్సలు చదువుకోకూడదని అనిపించడం ప్రారంభిస్తే, అది సోమరితనం వల్ల మాత్రమే కాకపోవచ్చు. చెడు సహవాసం వల్ల కూడా ఇలా చేసే అవకాశం ఉంటుంది.                                  *రూపశ్రీ.
మనీ ప్లాంట్ ఇంట్లో ఉంటే అదృష్టం అంటారు.  మనీ ప్లాంట్ ఎంత బాగా పెరిగితే ఇంట్లో ధనం అంతగా పెరుగుతుందని నమ్మకం.  అయితే కొన్ని ఇళ్లలో మనీ ప్లాంట్ అస్సలు సరిగ్గా పెరగదు.  వర్షాకాలంలో అయినా, సాధారణ రోజులలో అయినా మనీ ప్లాంట్ పెరుగుదల విషయంలో గందరగోళ పడే వారు ఉంటారు. అలాంటి వారి కోసం అద్భుతమైన చిట్కా ఉంది.  మనీ ప్లాంట్ బాగా,  గుబురుగా పెరగాలన్నా,  వేగంగా పెరగాలన్నా ఇంట్లోనే ఉన్న 5 పదార్థాలు ఉపయోగిస్తే సరిపోతుంది.  ఇంతకీ ఆ పదార్థాలు ఏంటో.. వాటిని ఎలా ఉపయోగించాలో తెలుసుకుంటే.. మనీ ప్లాంట్ కోసం ఎరువు.. మనీ ప్లాంట్ బాగా పెరగాలంటే ఇంట్లోనే దీనికి మంచి పోషకం కలిగిన ఎరువును తయారు చేసుకోవాలి. దీనికోసం ఇంట్లోనే లభించే 5 పదార్థాలు చక్కగా పనిచేస్తాయి. కావలసిన పదార్థాలు.. టీ ఆకులు లేదా టీ పౌడర్ పసుపు బెల్లం బంగాళదుంప తొక్కలు ఆవాలు తయారు చేసే విధానం.. ముందుగా టీ తయారు చేసిన తరువాత మిగిలిపోయే టీ పౌడర్ ను పడేయకూడదు.  ఈ టీ పౌడర్ ను మళ్లీ ఎండబెట్టాలి. వంటింట్లో బంగాళదుంపలను వినియోగించినప్పుడు తొక్కలు తీస్తుంటారు.  ఈ తొక్కలను కూడా ఎండబెట్టాలి.   టీ పౌడర్, బంగాళదుంప తొక్కలు బాగా ఎండిన తరువాత వీటిని మెత్తని పౌడర్ లా గ్రైండ్ చేసుకోవాలి.  ఈ టీ పౌడర్ లో కాసింత చిన్న బెల్లం ముక్క వేయాలి.  దీంతో పాటు ఆవాలు,  పసుపు కూడా వేసి బాగా గ్రైండ్ చేయాలి.  ఇలా తయారైన పొడిని మనీ ప్లాంట్ మొదట్లో కాసింత ఎరువులాగా వేసి నీరు పోయాలి. ఇలా 10 లేదా 15 రోజులకు ఒకసారి వేస్తూ ఉంటే మనీ ప్లాంట్ చాలా వేగంగా, బాగా పెరుగుతుంది.  కేవలం మనీ ప్లాంట్ కు మాత్రమే కాదు.. ఇతర తీగ జాతి మొక్కలకు,  పూల మొక్కలకు కూడా ఇలా చేయవచ్చు. ఏ పదార్థాలు ఎలా పనిచేసాయి.. బెల్లం.. బెల్లం నేలలో చిన్న చిన్న మంచి సూక్ష్మక్రిములను ఉత్పత్తి చేస్తుంది, నేలను మరింత సారవంతం చేస్తుంది.  మొక్క అవసరమైన పోషకాలను సులభంగా గ్రహించడంలో సహాయపడుతుంది. టీ ఆకులు.. ఉపయోగించిన టీ ఆకులు మనీ ప్లాంట్ ఆకులను ముదురు ఆకుపచ్చగా,  పెద్దవిగా చేస్తాయి. ఇందులో నత్రజని ఉంటుంది.  ఇది ఆకుల పెరుగుదలకు చాలా ముఖ్యమైనది. ఆవాలు.. ఇందులో నత్రజని, భాస్వరం,  పొటాషియం ఉంటాయి. ఇవి మొక్క బాగా పెరగడానికి, వేర్లు బలంగా,  ఆకులు ఆరోగ్యంగా ఉండటానికి సహాయపడతాయి. ఇది నేలను కూడా మెరుగుపరుస్తుంది. పసుపు.. పసుపు సహజ ఔషధంగా పనిచేస్తుంది. ఇది మొక్కను వ్యాధులు,  కీటకాల నుండి రక్షిస్తుంది.  ముఖ్యంగా వేరు కుళ్ళును నివారిస్తుంది. ఇది నేలను శుభ్రంగా ఉంచుతుంది. బంగాళాదుంప తొక్కలు.. బంగాళాదుంప తొక్కలలో పొటాషియం ఉంటుంది. ఇది మనీ ప్లాంట్ ఆకులను మెరిసేలా ఆరోగ్యంగా చేస్తుంది. ఇది మొక్క యొక్క బలాన్ని పెంచుతుంది  వ్యాధులతో పోరాడటానికి సహాయపడుతుంది.                        *రూపశ్రీ.  
  ఈ రోజుల్లో చెడు జీవనశైలి,  తప్పుడు ఆహారపు అలవాట్లు  గుండె ఆరోగ్యంపై  చాలా చెడ్డ  ప్రభావాన్ని చూపుతాయి. అంతేకాకుండా మన చిన్న చిన్న రోజువారీ అలవాట్లు గుండెకు హాని కలిగిస్తాయి.  ఇవి క్రమంగా  గుండె జబ్బుల ప్రమాదాన్ని పెంచుతాయి. దీనితో పాటు నేటికాలంలో అన్ని సమస్యలకు మందులు వాడటం,  ఖరీదైన చికిత్సలు తీసుకోవడం  కూడా కొన్నిసార్లు  శరీరానికి హాని కలిగిస్తాయి.  అధిక వ్యాయామం కూడా గుండెపై చెడు ప్రభావాన్ని చూపుతుంది.  ఇలా నేటి కాలంలో చాలా కారణాలుగా గుండె జబ్బుల ప్రమాదం క్రమేపీ పెరుగుతోంది.  గుండె ఆరోగ్యాన్ని సంరక్షించుకోవాలంటే.. కొన్ని సులభమైన,  ఆరోగ్యకరమైన పద్ధతులను పాటించడం చాలా ముఖ్యం. ఇది శరీరానికి ఎటువంటి హాని లేకుండా  చేస్తుంది. అటువంటి 5 సులభమైన అలవాట్ల గురించి తెలుసుకుంటే.. భోజనం తర్వాత నడక.. భోజనం తర్వాత 10 నిమిషాల నడక చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. కాబట్టి భోజనం చేసిన వెంటనే కూర్చునే అలవాటును మార్చుకోవాలి.  ప్రతి భోజనం తర్వాత 10 నిమిషాల తేలికపాటి నడక చేయాలి. ఇది రక్తంలో చక్కెరను నియంత్రిస్తుంది. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది,  బరువు పెరగకుండా నిరోధిస్తుంది. ఒమేగా-3 ఫ్యాట్స్.. రోజువారీ ఆహారంలో ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు ఉండేలా చూసుకోవాలి. ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు గుండె,  మానసిక ఆరోగ్యానికి చాలా ముఖ్యమైనవి. ఇది గుండె, మెదడు,  వాపును నియంత్రించడంలో సహాయపడుతుంది. సాల్మన్, చేపలు, అవిసె గింజలు,  వాల్‌నట్‌ల వంటి వాటి నుండి  ఒమేగా-3ని పుష్కలంగా పొందవచ్చు. నిద్ర.. మంచి గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ప్రతిరోజూ 7-9 గంటలు మంచి నిద్ర పొందడం ముఖ్యం. ఈ రోజుల్లో చాలా మందికి రాత్రిపూట ఫోన్ వాడటం,  టీవీ చూడటం అలవాటు కారణంగా నిద్ర సైకిల్ దారుణంగా దెబ్బతింటోంది. తక్కువ నిద్రపోవడం వల్ల ఊబకాయం, వ్యాధులు,  అలసట వంటి సమస్యలు వస్తాయి. ప్లాస్టిక్ నిషేధం.. మంచి గుండె ఆరోగ్యానికి ప్లాస్టిక్ వస్తువులను నివారించడం,  గాజు లేదా స్టీల్ కంటైనర్లు ఉపయోగించడం ముఖ్యం. ప్లాస్టిక్‌లో ప్రమాదకరమైన రసాయనాలు ఉంటాయి.  ఇవి హార్మోన్లకు,  శరీరానికి హాని కలిగిస్తాయి. ప్లాస్టిక్ రసాయనాలు నెమ్మదిగా శరీరంలో విషాన్ని వ్యాపింపజేస్తాయి. ఇది క్యాన్సర్,  ఇతర వ్యాధులకు కారణమవుతుంది. అందువల్ల ఆహారాన్ని నిల్వ చేయడానికి గాజు లేదా స్టీల్  పాత్రలు మంచివి. ఇవి  గుండె ఆరోగ్యానికి అలాగే మొత్తం ఆరోగ్యానికి సురక్షితమైనవి. బరువు.. మంచి గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి  బరువు,  BMI ని చూస్తే సరిపోదు. రక్త పరీక్షలపై కూడా శ్రద్ధ వహించాలి.  బరువు లేదా BMI కంటే రక్త పరీక్ష చేయించుకోవడం చాలా ముఖ్యం. LDL, CRP,  ఫాస్టింగ్ ఇన్సులిన్ వంటి పరీక్షలు చేయించుకుంటూ ఉండాలి. తద్వారా గుండె ఆరోగ్యాన్ని పర్యవేక్షించవచ్చు. గుండె జబ్బులను నివారించడానికి ఇది ఉత్తమ మార్గం. క్రమం తప్పకుండా పరీక్షలు చేయించుకోవడం వల్ల సమస్యలను ముందుగానే గుర్తించవచ్చు. ఆహారం.. గుండె ఆరోగ్యాన్ని బాగా ఉంచుకోవాలంటే  ఆహారంలో పండ్లు,  ఆకుపచ్చ కూరగాయలను చేర్చుకోవాలి. వాటిలో  గుండెను బలంగా,  ఆరోగ్యంగా ఉంచే పోషకాలు ఉంటాయి.  వాటిని సరిగ్గా తినకపోతే, అది గుండెకు హాని కలిగిస్తుంది. ఈ రోజుల్లో, చాలా మంది ఏదో ఒక విషయం గురించి ఒత్తిడి తీసుకోవడం చాలా సహజం అయిపోయింది. ఇది గుండెపై కూడా చెడు ప్రభావాన్ని చూపుతుంది. అందుకే ఒత్తిడి లేకుండా చూసుకోవాలి.                                        *రూపశ్రీ. గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు..
బెర్రీలు చాలా మంది ఇష్టంగా తినే పండ్లు. వీటిలో బ్లూబెర్రీ, బ్లాక్ బెర్రీ, స్ట్రాబెర్రీ.. ఇట్లా చాలా రకాలు ఉంటాయి.  తియ్యగా, పుల్లగా ఉంటూ ప్రత్యేకమైన సువాసన కలిగి ఉండే బెర్రీలు అంటే అందరికీ ఇష్టమే..  వీటిని ఉపయోగించి చేసే జ్యూస్ లు, స్మూతీలు, ఐస్ క్రీమ్ లకు చాలా ఆదరణ ఉంది.  వీటి ప్లేవర్ అంత బాగుంటుంది మరి. అయితే బెర్రీలు తినగానే కొన్ని రకాల ఆహారాలు, ద్రవ పదార్థాలు అస్సలు తీసుకోకూడదు అంట.  అలా తీసుకుంటే సైడ్ ఎఫెక్ట్స్ ఏర్పడి ఫుడ్ పాయిజన్ జరిగే ప్రమాదం ఉంటుందట. ఇంతకీ బెర్రీలు తిన్న తరువాత తీసుకోకూడని పదార్థాలు ఏంటో తెలుసుకుంటే.. పాలు.. బెర్రీలు తిన్న తర్వాత పాలు తీసుకోవడం కానీ, లేక  పాలు కలిపి బెర్రీలను తినడం కానీ ఆరోగ్యానికి మంచిది కాదట.  ఇది జీర్ణక్రియకు ప్రమాదకరం. రెండూ కలిసి యాసిడ్-బేస్ రియాక్షన్‌కు కారణమవుతాయి. దీని వలన గ్యాస్, కడుపు నొప్పి,  అజీర్ణం వంటి సమస్యలు వస్తాయి. దోసకాయ.. దోసకాయ,  బెర్రీలు  రెండూ శరీరాన్ని చల్లబరిచే  ప్రభావాన్ని కలిగి ఉంటాయి. ఈ రెండింటినీ కలిపి తినడం వల్ల శరీరంలో  అవసరానికి మించి చల్లదనం పెరుగుతుంది.  ఇది జలుబు,  అజీర్ణానికి కారణమవుతుంది. నీరు.. బెర్రీలు  తిన్న వెంటనే నీరు త్రాగడం వల్ల జీర్ణక్రియకు అంతరాయం కలుగుతుంది. దీనివల్ల కడుపులో గ్యాస్, తిమ్మిర్లు,  కొన్నిసార్లు వాంతులు కూడా వస్తాయి. బెర్రీలు తిన్న తర్వాత  కనీసం 30 నిమిషాల తర్వాత నీరు త్రాగాలి. ఊరగాయలు..  బెర్రీలు,  ఊరగాయలు రెండూ పుల్లగా,  ఆమ్లంగా ఉంటాయి. వీటిని కలిపి తినడం వల్ల ఆమ్లత్వం, గుండెల్లో మంట,  కడుపు నొప్పి వచ్చే అవకాశాలు చాలా రెట్లు పెరుగుతాయి. అందుకే బెర్రీలు తిన్న తర్వాత ఊరగాయల జోలికి పోకూడదు. సిట్రస్ పండ్లు.. నారింజ, నిమ్మ వంటి పండ్లను సిట్రస్ పండ్లు అంటారు.  బెర్రీలను   తిన్న వెంటనే సిట్రస్ పండ్లను  తినకూడదు. ఎందుకంటే ఈ రెండూ పుల్లని పండ్లు. దీనివల్ల విరేచనాలు,  కడుపు నొప్పి వస్తుంది. కూల్ డ్రింక్స్.. బెర్రీలు తిన్న తర్వాత చల్లని పానీయాలు తాగకూడదు. దీని వల్ల శరీరంలో రసాయన ప్రతిచర్య ఏర్పడుతుంది. ఇందులో ఉండే చక్కెర,  కార్బన్ డయాక్సైడ్ బెర్రీలలో ఉండే  సహజ ఆమ్లంతో కలిసిపోయి గ్యాస్ట్రిక్ సమస్యలను కలిగిస్తాయి.                                     *రూపశ్రీ. గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు..
  భారతీయ వంటగదిలో టమోటా ఒక ముఖ్యమైన భాగం. అది కూరలో అయినా, సలాడ్ అయినా లేదా చట్నీ అయినా టమోటా లేకుండా రుచి అసంపూర్ణంగా అనిపిస్తుంది. అయితే టమోటాను ఇలా కూరలలో కాదు.. పచ్చిగా తినమని చెబుతున్నారు ఆహార నిపుణులు.  దీని వల్ల అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయట. పచ్చి టమోటాలలో లైకోపీన్, విటమిన్ సి, పొటాషియం,  ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. ఈ పోషకాలన్నీ శరీరంలోని వివిధ భాగాలపై సానుకూల ప్రభావాన్ని చూపుతాయి. సాధారణంగా సలాడ్ లో పచ్చి టమోటా చేర్చుకోవడం చూస్తూంటాం. ప్రతిరోజూ పచ్చి టమోటా తినడం వల్ల కలిగే 6 గొప్ప ప్రయోజనాలను తెలుసుకుంటే.. చర్మానికి చేసే మేలు.. పచ్చి టమోటాలలో ఉండే లైకోపీన్,  విటమిన్ సి చర్మానికి సహజమైన బూస్టర్‌గా పనిచేస్తాయి.  చర్మాన్ని హైడ్రేట్ గా ఉంచుతాయి.  ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే నష్టం నుండి రక్షిస్తాయి. ప్రతిరోజూ పచ్చి టమోటా తినడం వల్ల చర్మం  మెరుపు పెరుగుతుంది.  వృద్ధాప్య సంకేతాలు నెమ్మదిస్తాయి.  మొటిమలు లేదా జిడ్డుగల చర్మం సమస్యలు ఉంటే టమోటాలు కూడా చాలా ప్రభావవంతంగా ఉంటాయి. గుండె ఆరోగ్యానికి.. టమోటాలలో లభించే లైకోపీన్, పొటాషియం,  ఫోలేట్ గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి సహాయపడతాయి. ఇది రక్తపోటును సమతుల్యం చేస్తుంది, కొలెస్ట్రాల్‌ను నియంత్రిస్తుంది,  రక్త నాళాలు దెబ్బతినకుండా నిరోధిస్తుంది. ప్రతిరోజూ పచ్చి టమోటాలు తినడం వల్ల గుండె జబ్బులు, ముఖ్యంగా గుండెపోటు లేదా స్ట్రోక్ వచ్చే ప్రమాదం తగ్గుతుంది. అధిక రక్తపోటు ఉన్నవారికి టమోటాలు సహజ ఔషధంగా పనిచేస్తాయి. దీనిని సలాడ్, జ్యూస్ లేదా నేరుగా కోసి తినడం చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. బరువు తగ్గడంలో..  బరువు తగ్గించుకునే ప్రయాణంలో ఉన్నవారికి  టమోటా భలే సహాయపడుతుంది.  ఇందులో కేలరీలు చాలా తక్కువగా ఉంటాయి,  ఫైబర్,  నీరు ఎక్కువగా ఉంటాయి. ఇది చాలా సేపు కడుపు నిండినట్లు అనిపిస్తుంది. టమోటా జీవక్రియను కూడా సక్రియం చేస్తుంది.  శరీరంలో నిల్వ ఉన్న కొవ్వును నెమ్మదిగా కాల్చడంలో సహాయపడుతుంది. పొట్ట ఆరోగ్యానికి..  టమోటాలలో ఉండే ఫైబర్, సహజ ఆమ్లాలు జీర్ణక్రియను మెరుగుపరచడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. ఇది గ్యాస్, ఆమ్లతత్వం,  మలబద్ధకం వంటి సమస్యలను తొలగిస్తుంది. ప్రతిరోజూ  టమోటా తినడం వల్ల కడుపు శుభ్రపడుతుంది, పేగు పనితీరు మెరుగుపడుతుంది. దీనితో పాటు, ఇది ప్రేగులలో ఉండే మంచి బ్యాక్టీరియాకు మద్దతు ఇస్తుంది, ఇది మొత్తం జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది. రోగనిరోధక శక్తి.. టమాటాలో విటమిన్ సి,  యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండటం వల్ల శరీర రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తుంది. దీనిని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల జలుబు, వైరల్,  అలెర్జీలతో పోరాడటానికి సహాయపడుతుంది. ముఖ్యంగా మారుతున్న వాతావరణంలో శరీరం సులభంగా అనారోగ్యానికి గురవుతుంది. ఇలాంటి వాతావరణంలో  టమోటా  రోగనిరోధక శక్తిని కాపాడుకోవడానికి సహాయపడుతుంది. ఇది పిల్లలు,  వృద్ధులకు కూడా  రోగనిరోధక శక్తిని పెంచుతుంది. పూర్తి పోషకాలను పొందడానికి దీనిని  తాజాగా తినడం మంచిది. డిటాక్స్ చేస్తుంది.. టమోటాలు శరీరం నుండి విషాన్ని తొలగించే సహజ నిర్విషీకరణ లక్షణాలను కలిగి ఉంటాయి. ఇది కాలేయం,  మూత్రపిండాలను శుభ్రంగా ఉంచడంలో సహాయపడుతుంది,  శరీరాన్ని శుభ్రపరుస్తుంది. బయటి ఆహారాన్ని ఎక్కువగా తినేవారికి లేదా అనారోగ్యకరమైన జీవనశైలిని కలిగి ఉన్నవారికి ప్రతిరోజూ టమోటాలు తినడం ప్రయోజనకరంగా ఉంటుంది. ఇది శరీర శక్తిని కూడా నిర్వహిస్తుంది,   అలసటను దూరం చేస్తుంది. ఉదయం లేదా భోజనానికి ముందు టమోటాను  తినడం మంచి ప్రయోజనాలు కలిగిస్తుంది.                                 *రూపశ్రీ. గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు..