LATEST NEWS
  నెల్లూరు జిల్లాలో నిర్వహించనున్న 2026 మహానాడును ‘స్త్రీ శక్తి’ థీమ్‌తో నిర్వహించాలని టీడీపీ పొలిట్‌బ్యూరో నిర్ణయించింది. తెలుగుదేశం పార్టీ పొలిట్‌బ్యూరో సమావేశం గురువారం(21-5-26న) మంగళగిరిలోని ఆ పార్టీ కార్యాలయంలో జరిగింది. నూతన కార్యవర్గం, పొలిట్‌బ్యూరో నియామకం తర్వాత తొలిసారి జరిగినఈ సమావేశానికి వర్చువల్‌గా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు హాజరయ్యారు. ఈ భేటీలో మహానాడు నిర్వహణపై కీలక నిర్ణయాలు తీసుకున్నారు. మహానాడు వేదికగా చేపట్టాల్సిన తీర్మానాలు, పార్టీ భవిష్యత్తు కార్యాచరణ, ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల ప్రచారంపై విస్తృతంగా చర్చించారు.  ఈసారి మహానాడులో మొత్తం 20 కీలక తీర్మానాలను ప్రవేశపెట్టాలని పొలిట్‌బ్యూరో నిర్ణయించింది. వీటిలో ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన 10 తీర్మానాలు, తెలంగాణకు సంబంధించిన 4 తీర్మానాలు, అండమాన్‌కు సంబంధించిన ఒక తీర్మానం, ఉమ్మడి అంశాలపై 4 తీర్మానాలు, రాజకీయ తీర్మానాలు ఉండనున్నాయి. రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు, పెట్టుబడులు, మహిళా సాధికారత వంటి అంశాలకు ప్రాధాన్యం ఇవ్వాలని నిర్ణయించారు.ఈ సారి మహానాడును ‘స్త్రీ శక్తి’ థీమ్‌తో నిర్వహించాలని పొలిట్‌బ్యూరో నిర్ణయించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడారు.  టీడీపీ ఆవిర్భావం నుంచి ఇప్పటి వరకు మహిళా సంక్షేమం కోసం చేపట్టిన పథకాలు, మహిళల భాగస్వామ్యంతో అమలు చేసిన కార్యక్రమాలను మహానాడు వేదికగా ప్రజలకు తెలియజేయాలని సూచించారు. మహిళల భాగస్వామ్యంతోనే ప్రతి సంక్షేమ పథకాన్ని రూపొందించిన విషయాన్ని సీఎం గుర్తు చేశారు. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు, చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, రాష్ట్రానికి వస్తున్న పెట్టుబడులు, యువతకు కల్పిస్తున్న ఉపాధి అవకాశాలపై మహానాడులో సమగ్ర చర్చ జరగాలని దిశానిర్దేశం చేశారు.ప్రజలకు ప్రభుత్వం అందిస్తున్న లబ్ధిని మరోసారి ప్రజల్లోకి తీసుకెళ్లేలా మహానాడును నిర్వహించాలని సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు. మహానాడును పండుగ వాతావరణంలో నిర్వహించాలని సూచించారు.  కార్యక్రమానికి రెండు రోజుల ముందే ప్రతి ఇంటిపై టీడీపీ జెండా ఎగురవేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. పార్టీ అగ్రనాయకత్వం నుంచి క్షేత్రస్థాయి కార్యకర్తల వరకు అందరినీ మహానాడులో భాగస్వాములను చేసేలా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. మహానాడు ప్రారంభానికి ముందు రాష్ట్రంలోని అన్ని క్లస్టర్లలో దివంగత మాజీ సీఎం నందమూరి తారక రామారావు విగ్రహాలకు నివాళులు అర్పించి కార్యక్రమాలను ప్రారంభించాలని నిర్ణయించారు. అలాగే ఎన్టీఆర్ సిద్ధాంతాలు, తెలుగుదేశం పార్టీ చరిత్రను నేటి తరానికి తెలియజేసేలా ప్రత్యేక ప్రజెంటేషన్లు నిర్వహించాలని నిర్ణయించారు. పార్టీ ఆవిర్భావం నుంచి జరిగిన రాజకీయ, సామాజిక మార్పులను మహానాడు వేదికగా ప్రదర్శించాలని సీఎం మార్గనిర్దేశం చేశారు.
  నెల్లూరు జిల్లా ఆత్మకూరు టీడీపీ ఎమ్మెల్యే, మంత్రి ఆనం రామనారాయణరెడ్డికి వ్యతిరేకంగా సొంత పార్టీ సీనియర్ నేతలే కూటమి కట్టడం హాట్ టాపిక్‌గా మారింది. వైసీపీలో ఉన్నప్పుడు వెంకటగిరి నుంచి ప్రాతినిధ్యం వహించిన రామనారాయణరెడ్డి, టీడీపీలోకి 2009లో కాంగ్రెస్ నుంచి ఆత్మకూరు నుంచి గెలిచిన ఆనం, పదిహేనేళ్ల తర్వాత తిరిగి అక్కడ నుంచి పోటీ చేసినప్పటికీ మంచి మెజార్టీతో గెలిచారు.  గత ఎన్నికల్లో ఆయన విజయం కోసం టీడీపీ టికెట్ ఆశించి భంగపడ్డ కొమ్మి లక్ష్మయ్యనాయుడు, సీనియర్ టీడీపీ నేత గూటూరు కన్నబాబులు కృషి చేశారు. ఇదే సమయంలో వైసీపీ నుంచి టీడీపీ లోకి జంప్ అయిన ఉదయగిరి మాజీ ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి సైతం ఆత్మకూరులోని తన సొంత మండలమైన మర్రిపాడులో ఆనం గెలుపు కోసం పనిచేశారట. ఇప్పుడా ముగ్గురూ ఆనం తిరిగి మంత్రి అయ్యాక ఆయన వ్యవహారశైలిపై గుర్రుగా ఉన్నారు. ఆత్మకూరులో మంత్రి ఆనం రామనారాయణ రెడ్డికి వ్యతిరేకంగా ఆ సీనియర్లు ఏకమై చక్రం తిప్పుతుడటం చర్చనీయాంశంగా మారింది. రామనారాయణరెడ్డి గెలుపు కోసం కష్టపడి పనిచేసిన తమకు కనీసం గౌరవం కూడా ఇవ్వట్లేదని ఆ సీనియర్లు మండిపడుతున్నారు. ఎన్నికల ముందు టీడీపీ అధిష్టానం తగిన ప్రాధాన్యత ఇస్తామని హామీ ఇచ్చినా అది నెరవేరకపోవడంతో కొమ్మి లక్ష్మయ్యనాయుడు, గూటూరు కన్నబాబు వర్గీయుల్లో అసంతృప్తి కనిపిస్తోంది. అయినా వారు టీడీపీ పట్ల లాయల్ గానే వ్యవహరిస్తున్నారు. 73 ఏళ్ల వయసు పైపడిన ఆనం వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఉండదని, అప్పుడు తమ అదృష్టాన్ని పరీక్షించుకోవచ్చని ఆ ఇద్దరు నేతలు లెక్కలు వేసుకుంటున్నారంట.  అయితే ఆనం రామనారాయణ తన రాజకీయ వారసురాలిగా కుమార్తె కైవల్లారెడ్డిని ప్రకటించడం, ఆమె ఆత్మకూరు నియోజకర్గంలో యాక్టివ్ అవుతుండటం అసలు ముసలానికి కారణమైంది. ఇటీవల టీడీపీలో యువతకు ప్రాధాన్యం పెరగడంతో నారా లోకేష్ యువనేత టీంలో కీలక భూమిక పోషించే విధంగా వారసురాలిని మంత్రి ఆనం రెడీ చేస్తున్నారట. తనయుడు శుభకర్ ఉన్నప్పటికీ రాజకీయంగా చురుకైన పాత్ర పోషిస్తున్న కైవల్యనే తన రాజకీయ వారసురాలిగా తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారట. 1983లో రామరాయణరెడ్డి తండ్ర ఆనం వెంకరెడ్డి ఆత్మకూరు నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. అది ప్రస్తావిస్తూ తాత వారసత్వాన్ని నిలబెట్టాలని రామనారాయణ కుమార్తెను గీతోపదేశం చేస్తున్నారట.  వచ్చే ఎన్నికలలో ఆత్మకూరు నియోజకవర్గం నుండి కైవల్య రెడ్డిని బరిలో దింపాలనే ఉద్దేశంతో  రామనారాయణరెడ్డి ప్రణాళిక సిద్ధం చేస్తూ.. సీనియర్ నాయకులు, మాజీ ఎమ్మెల్యేలను పక్కన పెట్టేస్తుండటం వారికి మింగుడు పడటం లేదంట. నెల్లూరు జిల్లా రాజకీయాల్లో ఆనం ఫ్యామిలీతో పాటు మేకపాటి వంశస్తులు కీలకంగా ఉన్నారు. ఆ క్రమంలో మాజీ ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖరరెడ్డి సైతం కొమ్మి లక్ష్మయ్యనాయుడు, గూటూరు కన్నబాబులతో జతకట్టి యాంటీ ఆనం గ్రూపు తయారు చేస్తున్నట్లు చెప్తున్నారు. రామనారాయణ రెడ్డి మంత్రి అయినప్పటి నుంచి జెండా మోసిన వారిని కాకుండా.. పార్టీ పిరాయింపుదారులకు ప్రాధాన్యత  ఇస్తున్నారని సీనియర్లు లోలోన రగిలిపోతున్నట్లు సమాచారం..  ఆనం అవినీతిపై రోడ్డు ఎక్కితే పార్టీ పరువు పోతుందనే ఉద్దేశంతో తామంతా మౌనంగా ఉన్నామని ఆ ముగ్గురు నేతలు చెబుతున్నారట. తమ వెంట తిరిగే కార్యకర్తలకు కూడా ప్రభుత్వ కార్యాలయాల్లో పనులు చేయించుకోలేని దుస్థితిలో ఉన్నామంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది. అదీకాక  కొమ్మి లక్ష్మయ్యనాయుడు సొంత మండలమైన చేజర్ల, గూటూరు కన్నబాబు సొంత మండలం కరటంపాడు లో కూడా ఆనం వర్గమే ఆదిపత్యం చెలాయిస్తుండటం వారికి మింగుడు పడటం లేదంట. ఆ క్రమంలో ఇటీవల జిల్లా పర్యటనకు వచ్చిన రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు ముందు ఆ ముగ్గురు సీనియర్ నేతలు కలిసి తమ గోడును వెళ్ళబోసుకున్నారట.  పార్టీ కోసం తాము చేసిన త్యాగాలను అధిష్టానం కూడా గుర్తించడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తూనే.. మంత్రి ఆనం మీద ఫిర్యాదు చేశారని వారి అనుచరులు గుసగుసలాడుకుంటున్నారు. అభివృద్ధి కార్యక్రమాలతో పాటు వారి మండలాల్లో జరిగే కార్యక్రమాలకి కూడా మంత్రి ఆనం వారిని ఆహ్వానించడం లేదట. తమతో తిరిగితే పనులు కూడా చెయ్యనని తమ అనుచరులను ఆనం భయపెడుతున్నారని ఆ ముగ్గురు నేతలు రగిలిపోతున్నారట. ఆ ఎఫెక్ట్‌తో  కొమ్మి లక్ష్మయ్యనాయుడు సహా ఆనంపై అసంతృప్తితో నేతలందరూ మేకపాటి శిబిరంలో చేరిపోతున్నారంట.  మరి కుమార్తె పొలిటికల్ కెరీర్ కోసం పాట్లు పడుతున్న ఆనం.. ఆత్మకూరులో ఈ వ్యతిరేక పరిస్థితులు ఎలా అధిగమిస్తారో చూడాలి.
రాజకీయాల్లో ప్రత్యర్థి పార్టీల నేతల మధ్య విమర్శలు, ప్రతి విమర్శలు సహజమే. రాజకీయ విమర్శల వరకూ ఎవరికీ ఎటువంటి అభ్యంతరం ఉండదు. కానీ అవి వ్యక్తిగత స్థాయికి దిగజారడం ఎంత మాత్రం సరికాదు. అయితే ఏపీలో వైసీపీ అధినేత జగన్ మాత్రం తన రాజకీయ ప్రత్యర్థులను విమర్శించే విషయంలో మాత్రం పదే పదే గీత దాటుతున్నారు. వ్యక్తిగత విమర్శలు, దూషణలు, శాపనార్ధాలతో శ్రుతి మించుతున్నారు.  ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఐదేళ్ల పాటు పని చేసినా మాజీ సీఎం జగన్ మాత్రం తన అనుచిత వ్యాఖ్యలతో నిత్యం విమర్శలను ఎదుర్కొనే పరిస్థితిని చేజేతులా కొని తెచ్చుకుంటున్నారు. తాజాగా గురువారం (మే 21) ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మరో సారి చంద్రబాబుపై అనుచిత, అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. మరీ ముఖ్యంగా చంద్రబాబు గుండే ఆగి చనిపోతారు అంటూ జగన్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు పెను దుమారం రుపుతున్నాయి.  చంద్రబాబు ఆరోగ్యం, మరణం గురించి అత్యంత వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం పట్ల సర్వత్రా అభ్యంతరం, ఆగ్రహం వ్యక్తం అవుతోంది.  ఇటీవల వైఎస్ జగన్ ప్రతిపాదించిన 'మావిగన్' (మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు) రాజధాని అంశంపై సోషల్ మీడియాలో  జగన్ పెద్ద ఎత్తున ట్రోలింగ్ కు గురయ్యారు.  ఈ నేపథ్యంలోనే గురువారం మీడియాతో మాట్లాడిన జగన్.. మావిగన్ అంశాన్ని మళ్లీ ప్రస్తావించారు. అయితే ఈ సారి  మాత్రం ఆయన చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేయడానికి, ఆయన మరణం గురించి మాట్లాడడానికి కూడా ఇసుమంతైనా వెనుకాడ లేదు.  ఒకవేళ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిద్రపోతున్న సమ యంలో ఎవరైనా పొరపాటున ఆయన చెవిలో 'మవిగన్' అని పలికితే, ఆయనకు గుండె ఆగిపోయి ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉందంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అంతేకాకుండా ఈ పేరు వింటేనే చంద్రబాబుకు రక్తపోటు (బీపీ)   పెరిగిపోతుందని జగన్ వ్యాఖ్యానించారు. ఒక రాష్ట్రానికి ఐదేళ్లపాటు ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి..  తోటి సీనియర్ నాయకుడి పట్ల ఇలాంటి భాషను ఉపయోగించడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.  సాధారణంగా దక్షిణ భారత రాజకీయాల్లో పార్టీల మధ్య సిద్ధాంతపరమైన విభేదాలు, విమర్శలు సహజమే అయినప్పటికీ, జగన్ మాత్రం చంద్రబాబు వయసును, ఆరోగ్యాన్ని లక్ష్యంగా చేసుకుని వ్యక్తిగత దూషణలకు దిగడం పట్ల పొలిటికల్ సర్కిల్స్ లో తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. జగన్  ఈ వ్యాఖ్యల ద్వారా తన నైతిక దిగజారుడుతన్నాన్ని చాటుకున్నారని నెటిజన్లు దుమ్మెత్తిపోస్తున్నారు. గత సార్వత్రిక ఎన్నికల్లో జగన్ ఇటువంటి వ్యక్తిగత విమర్శలు, కక్షసాధింపు ధోరణిని  రాష్ట్ర ప్రజలు తిరస్కరించినప్పటికీ.. ఆయన ధోరణిలో ఇసుమంతైనా మార్పు రాలేదంటున్నారు.    
ప్రధాని నరేంద్రమోడీ తన మంత్రివర్గాన్ని పునర్వ్యవస్థీకరించనున్నారా?  ప్రస్తతం ఉన్న కేబినెట్ నుంచి కనీసం పాతిక మందికి ఉద్వాసన పలకనున్నారా? అన్న చర్చ ఢిల్లీ రాజకీయవర్గాలలో జోరుగా సాగుతోంది. ఈ ఊగాహానాల నేపథ్యంలో గురువారం (మే 21) జరగనున్న కేంద్ర కేబినెట్ సమావేశం అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. మోడీ మంత్రివర్గంలోని కనీసం పాతిక మంది మంత్రులకు ఇదే చివరి కేబినెట్ సమావేశం అవుతుందని విశ్వసనీయంగా తెలుస్తోంది. గత కొంత కాలంగా ప్రదాని నరేంద్ర మోడీ తన మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణపై కసరత్తు చేస్తున్నారు. కేబినెట్ లో పనితీరు సరిగా లేని వారికి ఉద్వాసన పలికి,  కొత్తవారికి అవకాశం ఇవ్వాలని ప్రధాని భావిస్తున్నట్లు ప్రభుత్వ వర్గాలే అంటున్నాయి. ఆ మేరకు ఇప్పటికే కసరత్తు పూర్తయ్యిందని కూడా చెబుతున్నారు. కేవలం పని తీరు మాత్రమే కాకుండా.. ఆరోపణలు, వ్యక్తిగత వ్యవహారశైలి కూడా పరిగణనలోనికి తీసుకుని ప్రస్తుతం ఉన్న మంత్రులలో కొందరిపై వేటు వేసే అవకాశం ఉందని సమాచారం. ఈ నేపథ్యంలోనే ప్రస్తుత మంత్రివర్గ సమావేశంలో మంత్రుల, శాఖల పనితీరుపై సమీక్షించే అవకాశం ఉందని అంటున్నారు.    కేబినెట్ విస్తరణ ఊహాగానాలతో పాటు దేశ ఆర్థిక, భద్రతా వ్యవహారాలు కూడా మంత్రివర్గ సమావేశంలో చర్చకు వచ్చే అవకాశం ఉంది.  పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతలు, అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య యుద్ధ పరిస్థితుల కారణంగా భారత ఆర్థిక వ్యవస్థపై పడుతున్న ప్రభావంపై  చర్చించనున్నారు. అంతర్జాతీయ ప్రతికూల పరిస్థితుల ప్రభావం దేశ ప్రజలపై అతి తక్కువగా పడేలా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే అంశంపై ప్రధాని మోదీ మంత్రులకు, ఆయా విభాగాలకు దిశానిర్దేశం చేయనున్నారు.  
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సీనియర్ విశ్లేషకుడు  ప్రొఫెసర్ కె. నాగేశ్వర్ చేసిన కొన్ని వ్యాఖ్యలు   తీవ్ర దుమారం రేపుతున్నాయి. బీజేపీకి వైసీపీ లాంగ్ టర్మ్ ఫ్రెండ్ అనీ, టీడీపీ కేవలం ఇన్స్టంట్ ఫ్రెండ్ మాత్రమేనంటూ ఆయన సరికొత్త థియరీని తెరపైకి తెచ్చారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షాను పవన్ కళ్యాణ్, నాదెండ్ల మనోహర్ కలిసినప్పుడు ఈ విషయం చర్చకు వచ్చిందని, జనసేన కోర్ కమిటీ ద్వారా ఈ సమాచారం తనకు తెలిసిందని నాగేశ్వర్ పేర్కొనడం సంచలనంగా మారింది. దీనిపై తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి అప్పసాని రాజేష్  తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. తెలుగువన్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆయన  ప్రొఫెసర్ నాగేశ్వర్ వ్యాఖ్యలను పూర్తిగా కొట్టిపారేశారు.   ప్రొఫెసర్ నాగేశ్వర్ విజ్ణత కోల్పోయి మాట్లాడుతున్నారంటూ ధ్వజమెత్తారు.   తెలుగు దేశం, బీజేపీ  బంధం నిన్న మొన్నటిది కాదనీ..  1984లో ఎన్టీ రామారావు హయాం నుంచే రెండు పార్టీల మధ్య బలమైన రాజకీయ ప్రస్థానం మొదలైందని గుర్తు చేశారు. నాలుగు దశాబ్దాలకు  పైగా ఉన్న ఈ సుదీర్ఘ అనుబంధాన్ని ఇన్స్టంట్ ఫ్రెండ్ షిప్ అనడం నాగేశ్వర్ అజ్ఞానానికి నిదర్శనమని ఎద్దేవా చేశారు. కూటమిలో   వైరుధ్యాలు లేవని, ఇటీవల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఏపీ పర్యటనకు వచ్చినప్పుడు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ నివాసాలకు వెళ్లి విలువైన సమయం గడపడమే ఇందుకు నిదర్శనమని అప్పసాని రాజేష్ అన్నారు.   ఒకరి కాళ్ళ దగ్గర మాటలను తాకట్టు పెట్టి, వారు విసిరే ఎంగిలి మెతుకుల కోసం కొందరు కిరాయి రాజకీయ విశ్లేషకులుగా మారారని నాగేశ్వర్ ఉద్దేశించి అప్పసాని రాజేష్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. పవన్ కళ్యాణ్  జై ఆంధ్రప్రదేశ్' అని అనడాన్ని కూడా నాగేశ్వర్ తప్పుగా వక్రీకరిస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో ప్రాంతీయ, కుల విభేదాలను రూపుమాపి సమైక్యతను తీసుకురావడానికే జనసేనాని ఆ నినాదం ఇచ్చారని స్పష్టం చేశారు.  వైసీపీ   హయాంలో మూడు రాజధానుల వివాదం వచ్చినప్పుడే  జై అమరావతి నినాదం ప్రాధాన్యత సంతరించుకుందని, రాష్ట్రం మొత్తాన్ని ఉద్దేశించినప్పుడు  జై ఆంధ్రప్రదేశ్ అనడంలో తప్పేముందని ప్రశ్నించారు. అమరావతి అనేది ఐదు కోట్ల ప్రజల రాజధాని అన్న అప్పసాని రాజేశ్..  అది కేవలం టీడీపీకి మాత్రమే పరిమితమైనది కాదన్నారు. రాష్ట్రానికి వస్తున్న పెట్టుబడులను, రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రాంతాల్లో జరుగుతున్న అభివృద్ధిని చూడకుండా కేవలం అమరావతిపైనే నిధులు కుమ్మరిస్తున్నారనడం అబద్ధమని తోసిపుచ్చారు. గత ఎన్నికల్లో ప్రజలు వైసీపీని కేవలం 11 సీట్లకే ఎందుకు పరిమితం చేశారో ఇలాంటి సోకాల్డ్ ప్రొఫెసర్లకు అర్థం కావడం లేదన్నారు. కూటమి ప్రభుత్వంపై విద్వేషాలు చొప్పించేందుకు జరుగుతున్న ఇటువంటి ఎజెండా బేస్డ్ ప్రచారాలను ప్రజలు నమ్మరనీ, భవిష్యత్తులో వీరికి తగిన బుద్ధి చెబుతారని అప్పసాని అన్నారు.    
ALSO ON TELUGUONE N E W S
Under the Vadde Creations banner, presented by Vadde Jishnu, the film ‘Transfer Trimurthulu’ is being produced by and stars Vadde Naveen in the lead role. Kamal Teja Narla is making his directorial debut with this movie. The film features Vadde Naveen, Rashi Singh, Shilpa Tulaskar, Vivek Raghuvanshi, Raghu Babu, Shivannarayana, Vadlamani Srinivas, Jwala Koti, Devi Prasad, Surya, Baba Bhaskar, Pramodini, Sathwik Raju, Anjali Priya, Gayatri Chaganti, and others in important roles. The movie is slated for release on June 19. The teaser was launched on Thursday, and during the teaser launch event, the team shared their thoughts. Hero and Producer Vadde Naveen said, “This is the first film I am acting in and producing after my father passed away. I have always been in Hyderabad with my family. I may not appear in public often, but the media and audiences have always remembered me, and I thank them for that. I took a break, but many stories that came to me didn’t appeal to me, and the stories I liked never reached me. I listened to many scripts. Kamal first narrated only the character of Trimurthulu and mentioned the title ‘Transfer Trimurthulu.’ We worked together on the story and screenplay for almost a year before going on floors. The film has been made with high technical standards and fresh content. Everyone worked together like a family for this movie. Raashi is a wonderful actress. ‘Transfer Trimurthulu’ is coming before audiences on June 19 with strong content. I hope everyone likes the film. Even though I was away from films and public appearances for the last ten years, audiences still remembered me, and I sincerely thank them.” Heroine Rashi Singh said, “I thank the director and producer for giving me such a good role as Lakshmi in ‘Transfer Trimurthulu.’ Among all the production houses I have worked with, this is the best. Vadde Naveen garu is a very kind person. Whether as a producer or hero, he always remains humble. His comeback is going to be very strong. Our film is releasing on June 19, and I request everyone to watch and support it.” Director Kamal Teja Narla said, “The media has been extremely supportive of ‘Transfer Trimurthulu’ from the beginning. We worked on the story and screenplay for one and a half years. I’m very happy to launch the teaser today. I never imagined my debut film would turn out this grand. When I worked under Puri Jagannadh garu, I dreamed of a moment like this. Vadde Naveen garu’s re-entry and comeback will be exactly what his fans have been waiting for. I’m happy to make my first film with such a wonderful person. I hope everyone liked the teaser. Our movie is releasing on June 19, and I request everyone to watch and support it.” Actor Vadlamani Srinivas said, “Vadde Naveen garu is a very good human being. Even after a ten-year gap, he remains the same. I learned a lot while working with him. I thank him for giving me such a good role. I wish the film great success on June 19.” Actor Sai Kiran said, “I’m happy to be a part of Vadde Naveen garu’s comeback film ‘Transfer Trimurthulu.’ I thank the director and producer for giving me such a good role. Even today, people still enjoy Vadde Naveen garu’s songs and films. Our movie is releasing on June 19, and I hope everyone encourages and supports it.” Actor Sathwik said, “I thank the director and producer for giving me an opportunity in ‘Transfer Trimurthulu.’ It’s a pleasure acting alongside Vadde Naveen garu. I hope you all liked the teaser. Our movie is releasing on June 19, and I request everyone to watch it.” Fight Master Ram Sunkara said, “I’m happy to have worked on ‘Transfer Trimurthulu.’ The interval fight sequence will be outstanding. The film has action sequences on par with big-budget commercial entertainers. I’ve always liked Vadde Naveen garu’s films, and it was a pleasure working with him.” Music Director Kalyan Nayak said, “I was looking forward to composing music for a good commercial entertainer when I got the opportunity to work on ‘Transfer Trimurthulu.’ The background score has come out wonderfully. This movie will create wonders. The film releases on June 19, and the songs will be released before that. Audiences will definitely enjoy them.” Editor Vijay Muktavarapu said, “I thank the director and producer for trusting me and bringing me on board for this project. The film is releasing on June 19. Please watch and support it.” Cinematographer Karthik Sujatha Sai Kumar said, “This is a comeback film for Vadde Naveen sir. We worked hard for ten months on this project. The media’s support is important in taking this film to the audience.” Art Director Bhikshapati said, “I thank everyone who gave me the opportunity to work on ‘Transfer Trimurthulu.’ Our movie is releasing on June 19. Please bless and support us.” K Music Priyanka said, “Through the journey of ‘Transfer Trimurthulu,’ I became a fan of Vadde Naveen garu. I’m happy to be associated with such a good film. Kalyan’s music and Vadde Naveen garu’s performance will impress everyone. The movie is releasing on June 19, and I request everyone to watch it.”   Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do thorough research, at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them.
Cast: Mohanlal, Meena, Asha Sharath, Esther Anil, Ansiba Hassan Crew: Music Director: Anil Johnson Cinematography: Satheesh Kurup Editing: V.S. Vinayak Writer-Director: Jeethu Joseph Producer: Antony Perumbavoor After two solid films from the Drishyam world, we are finally here for the third. Drishyam 3, starring Mohanlal in the lead role, released today in theatres with all the hype and hoopla surrounding the film. Unlike the earlier films, this time the makers have wisely chosen to dub the film in Telugu and Tamil rather than completely remaking the project. All eyes are on Director Jeethu Joseph and how he handled the pressure of crafting a third part in a cinematic era dominated by duologies. Let's discuss the intricacies of the film in detail. Plot: ​Georgekutty (Mohanlal) and his family are desperately trying to live a peaceful life after the harrowing incidents of the previous films. He tries to leave the past behind and is profoundly concerned about the future of his daughters. He finds a groom for Anju (Ansiba) and the family slowly finds a way to fall into the groove of the real world, hoping to leave their dark past buried. But they forget that the past is like a shadow that never leaves you till you find true closure.  Now once again things turn complicated after fresh developments emerge in the Varun murder case. A new investigation begins from a mysterious person with stronger evidence and unexpected twists that slowly tighten the noose around Georgekutty and his family. Who wants to reopen the case again? Did Georgekutty finally make a mistake? Did his luck finally run out? How he plans to protect his family this time forms the thrilling core of the storyline. Analysis: ​Mohanlal once again delivers a masterfully controlled performance that suits the character flawlessly. His screen presence and subtle expressions work wonders in emotional scenes. Daughters Esther and Ansiba are fine in their young adult roles, constantly worrying about everything around their lives. In their somewhat limited roles, Meena and Asha Sharath perform neatly, grounding the emotional stakes. Siddique and Shajohn have given their absolute best for the film, adding gripping tension to every frame they inhibit.  This time ​Jeethu Joseph tries to work around the character of Georgekutty, exploring how he tries to find a workaround to stay in the real world and forget the past to move forward. He is shown as a vulnerable being trying to secure the right future for his daughters, desperate to make sure their past doesn't pull them down. Unlike the earlier films, Jeethu doesn't rely solely on forced tension and play around with mind bending twists. He just wanted to see how a character who mastered the art of escaping the law through cinema fails to find a script to escape his own internal guilt. It is a deeply meaningful and psychological arc to a legendary character. However, the film struggles heavily as a result of slightly weaker writing and a surprisingly predictable narration. Unlike the previous installments, the screenplay lacks those gripping moments and major emotional highs that the characters usually carry. The pacing becomes sluggish very early on and several scenes feel unnecessarily stretched after a while. The family portions fail to create that magical emotional resonance for the most part.  Even the "twists" appear routine and easily predictable. The emotional connection that made the earlier films so deeply memorable is mostly missing here. Thankfully, the final 25-30 minutes of the climax attempt to end the trilogy on a smart note, giving Georgekutty a solid arc and drawing interesting parallels with the darker version of past character that he is trying to save his family from. Unfortunately, the rest of the film leaves the audience experiencing a distinct sense of story fatigue. On the technical front, the background score by Anil Johnson is commendable, he makes sure the film's pivotal parts are highlighted effectively. The cinematography tries to bring a unique perspective to the characters and how things are seen through their eyes. But editing could have been much crisper, especially during the sluggish first half. Ultimately, the third chapter of this iconic saga ends up being the most underwhelming entry in the entire series, even with the actors giving it their absolute all. Positives: Mohanlal's performance Ensemble Cast Final 20 minutes Background score Negatives: Weak screenplay Predictable twists Slow pacing Lethargic and Sluggish narrative Bottomline:  An unnecessary prolongation of a case buried 13 years ago.  Rating: 2.25/5   Disclaimer: The views/opinions expressed in this review are personal views/opinions shared by the writer and organisation does not hold a liability to them. Viewers' discretion is advised before reacting to them.
దక్షిణాది సినీ పరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న నటి జ్యోతిక. చంద్రముఖి వంటి వైవిధ్యమైన పాత్రలతో కోట్ల మంది ప్రేక్షకుల గుండెల్లో స్థానం సంపాదించుకున్న ఈ నటీమణి, సౌత్‌లో స్టార్ హీరోయిన్‌గా ఎదగడానికి ముందు ఎదుర్కొన్న కొన్ని చేదు అనుభవాలను తాజాగా పంచుకున్నారు. ఆమె వెండితెరపై కథానాయికగా అడుగుపెట్టింది బాలీవుడ్‌లోనే కావడం విశేషం. 1998 సంవత్సరంలో ప్రముఖ దర్శకుడు ప్రియదర్శన్ తెరకెక్కించిన 'డోలి సజాకే రఖ్నా' అనే హిందీ చిత్రంతో జ్యోతిక హీరోయిన్‌గా పరిచయమయ్యారు. ఈ సినిమాలో అక్షయ్ ఖన్నా హీరోగా నటించారు. మలయాళంలో సూపర్ హిట్ అయిన 'అనియతిప్రావు' అనే చిత్రానికి రీమేక్‌గా వచ్చినప్పటికీ, ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఘోరంగా నిరాశపరిచింది. తొలి సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయి విజయాన్ని అందుకోకపోవడంతో బాలీవుడ్ పరిశ్రమ ఆమె పట్ల చాలా కఠినంగా ప్రవర్తించింది. ఒకే ఒక్క ఫ్లాప్‌ పడిందన్న కారణంతో జ్యోతికకు హిందీ చిత్ర పరిశ్రమలో మరో అవకాశం ఇవ్వకుండా బాలీవుడ్ తన తలుపులను పూర్తిగా మూసేసింది. బాక్సాఫీస్ నెంబర్ల ఆధారంగానే నటీనటుల భవిష్యత్తును నిర్ణయించే ఆ సంస్కృతి వల్ల జ్యోతిక ముంబై సినీ పరిశ్రమకు దూరం కావాల్సి వచ్చింది. అదే సమయంలో ఆమె టాలీవుడ్, కోలీవుడ్ వైపు అడుగులు వేశారు. ఆశ్చర్యకరంగా, తమిళంలో ఆమె చేసిన మొదటి సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద పెద్దగా ఆడలేదు. కానీ, అక్కడి పరిశ్రమ జ్యోతికను ఒదులుకోలేదు. సినిమా ఫలితంతో సంబంధం లేకుండా ఆమె నటనలోని ప్రతిభను చూసి తమిళ సినీ వర్గాలు ముగ్ధులయ్యారు. ఆ ఒక్క సినిమా ఫ్లాప్ అయినప్పటికీ, ఆమెకు వరుసగా అరడజనుకు పైగా కొత్త సినిమా అవకాశాలు వెల్లువలా వచ్చి పడ్డాయి. ఈ విభిన్నమైన అనుభవాల గురించి జ్యోతిక మాట్లాడుతూ, రెండు పరిశ్రమల మధ్య ఉన్న ప్రధాన వ్యత్యాసాన్ని ఎత్తిచూపారు. బాలీవుడ్ తన ముఖం మీదే తలుపులు వేస్తే, సౌత్ ఇండస్ట్రీ మాత్రం తన ప్రతిభను గుర్తించి ఆదరించిందని కృతజ్ఞతతో గుర్తుచేసుకున్నారు. చెన్నై నగరం తనకు అన్నం పెట్టడమే కాకుండా, సూర్య వంటి మంచి వ్యక్తితో వివాహం జరిగి ఒక అందమైన కుటుంబాన్ని కూడా ఇచ్చిందని భావోద్వేగానికి గురయ్యారు. దక్షిణాదిలో ఆమె మూగ, చెవుడు, అంధురాలిగా ఎన్నో విలక్షణమైన, సవాలుతో కూడిన పాత్రలను పోషించి, 5 సార్లు ప్రతిష్టాత్మకమైన తమిళనాడు స్టేట్ ఫిల్మ్ అవార్డును అందుకుని రికార్డు సృష్టించారు. 2000వ దశకంలో సౌత్ ఇండస్ట్రీలో స్టార్ హీరోలతో సమానంగా రెమ్యునరేషన్ మరియు క్రేజ్ సంపాదించుకున్నారు. దాదాపు 26 సంవత్సరాల సుదీర్ఘ విరామం తర్వాత జ్యోతిక మళ్లీ బాలీవుడ్‌లోకి ఘనంగా పునరాగమనం చేశారు. ఇటీవలే ఆమె నటించిన హారర్ థ్రిల్లర్ చిత్రం 'సైతాన్' బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించి ఏకంగా రూ.200 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. అలాగే ఆమె 'సిస్టమ్', 'డబ్బా కార్టెల్' వంటి సరికొత్త ప్రాజెక్ట్‌లతో హిందీలో దూసుకుపోతున్నారు. ప్రస్తుతం బాలీవుడ్‌లో 40 ఏళ్లు దాటిన మహిళా నటీమణుల కోసం ఎంతో వైవిధ్యమైన మరియు బలమైన స్క్రిప్ట్‌లు రాస్తున్నారని, ఈ విషయంలో సౌత్ ఇండస్ట్రీ ఇంకా మారాల్సి ఉందని ఆమె అభిప్రాయపడ్డారు. అలాగే సౌత్‌లో షూటింగులు ఉదయం నుంచి సాయంత్రం 6 గంటలకే ప్యాకప్ చెప్తారని, ఇటువంటి పని గంటల సంస్కృతి మహిళలకు, ముఖ్యంగా తల్లులకు ఎంతో అవసరమని జ్యోతిక స్పష్టం చేశారు.
టాలీవుడ్‌లో ఒకప్పుడు వరుస బ్లాక్‌బస్టర్లతో 'సంక్రాంతి రాజు'గా పేరు తెచ్చుకున్న స్టార్ ప్రొడ్యూసర్ ఎం.ఎస్. రాజు (MS Raju) తాజాగా ఒక ఇంటర్వ్యూలో తన కెరీర్‌కు సంబంధించిన ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. ముఖ్యంగా విక్టరీ వెంకటేష్, కోడి రామకృష్ణ కాంబినేషన్‌లో తాను నిర్మించిన విజువల్ వండర్ ‘దేవిపుత్రుడు’ (Devi Putrudu) సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో ఆడకపోవడానికి గల అసలు కారణాలను ఆయన ఓపెన్‌గా ఒప్పుకున్నారు. ఆ సినిమా ఫ్లాప్‌కు పూర్తి బాధ్యత తనదేనని ఎంఎస్ రాజు చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారాయి. 'దేవి' సినిమా భారీ విజయం తర్వాత ఎంతో ప్రతిష్టాత్మకంగా 'దేవిపుత్రుడు' సినిమాను ప్రారంభించామని ఎంఎస్ రాజు గుర్తుచేసుకున్నారు. కథ వినగానే వెంకటేష్ ఈ ప్రాజెక్ట్‌కు ఓకే చెప్పారని, అయితే క్లైమాక్స్‌కు ముందు వచ్చే లాస్ట్ 45 నిమిషాల స్క్రిప్ట్‌ను పక్కాగా ఫినిష్ చేయమని వెంకటేష్ ముందే హెచ్చరించారని తెలిపారు. కానీ, షూటింగ్ జరుగుతున్న కొద్దీ సీన్లు అల్లుకుంటూ వెళ్లే అలవాటు వల్ల, తాను ఆ విషయాన్ని పెద్దగా పట్టించుకోలేదని ఎంఎస్ రాజు అన్నారు. చివరికి వచ్చేసరికి వెంకటేష్ భయపడిందే జరిగిందని, ఎంత ప్రయత్నించినా లాస్ట్ అరగంట స్క్రిప్ట్ సరిగ్గా కుదరలేదని ఆయన స్పష్టం చేశారు. అప్పట్లో దర్శకుడు కోడి రామకృష్ణ గారు కూడా విపరీతమైన సినిమాలతో బిజీగా ఉండేవారని, ఆయన కూడా షూటింగ్ ఆపి తనతో కూర్చుని లాస్ట్ 30 నిమిషాలు సరిగ్గా రావడం లేదని ఆందోళన వ్యక్తం చేశారని చెప్పారు. సినిమా సంక్రాంతి రేసులో ఉండాలనే తీవ్రమైన ఒత్తిడి వల్ల, సెన్సార్ ఆఫీసర్ స్వయంగా 'సినిమాను కొద్ది రోజులు వాయిదా వేసుకుని రీకరెక్షన్లు చేసుకోండి' అని సలహా ఇచ్చినా వినకుండా హడావుడిగా రిలీజ్ చేశామని, అదే ఆ సినిమా పరాజయానికి కారణమైందని ఎంఎస్ రాజు ఒప్పుకున్నారు.  
టాలీవుడ్ చురుకైన భామ, 'ఇస్మార్ట్ శంకర్' చిత్రంతో యువత గుండెల్లో గూడు కట్టుకున్న నభా నటేష్ సామాజిక మాధ్యమాల్లో ఎప్పుడూ చురుగ్గా ఉంటుంది. గ్లామర్ డోస్ పెంచుతూ నిరంతరం అభిమానులను అలరించే ఈ కన్నడ కస్తూరి, తాజాగా పంచుకున్న కొన్ని ఫొటోలు ఇంటర్నెట్‌ను షేక్ చేస్తున్నాయి. ఈ లేటెస్ట్ ఫొటోషూట్‌లో నభా తన వయ్యారాలతో నెటిజన్లను కట్టిపడేస్తోంది. నభా నటేష్ ఈసారి కాస్త భిన్నంగా ట్రెడిషనల్ మరియు మోడ్రన్ కాంబినేషన్‌లో డిజైన్ చేసిన ఒక అద్భుతమైన లెహంగాలో మెరిసింది. డార్క్ బ్లూ కలర్ బ్లౌజ్, ఆరెంజ్ కలర్ స్కర్ట్ ధరించి తన నడుము వంపులతో అభిమానులకు విజువల్ ట్రీట్ ఇచ్చింది. ఈ ఫొటోలకు ఆమె పెట్టిన క్యాప్షన్ కూడా నెటిజన్ల దృష్టిని ఆకర్షిస్తోంది. పురాణాలు, అద్భుతాల కలయిక లాంటి కథ అంటూ నభా ఈ ఫొటోలను షేర్ చేసింది. ఆమె పెట్టిన క్యాప్షన్‌కు తగ్గట్టుగానే ఈ ఫొటోల్లో నభా లుక్ అచ్చం ఒక దేవకన్యలా ఉంది. హెవీ జువెలరీ ధరించి, కొంటె చూపులతో కుర్రకారును మాయ చేస్తోంది. తన పర్‌ఫెక్ట్ ఫిట్‌నెస్‌ను ఎలివేట్ చేస్తూ ఆమె ఇచ్చిన ఎక్స్‌ప్రెషన్స్ ఈ ఫొటోషూట్‌కే ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. గతంలో క్యూట్ లుక్స్‌తో మెప్పించిన ఈ ముద్దుగుమ్మ, ఇప్పుడు గ్లామర్ యాంగిల్‌ను కూడా గట్టిగానే ప్రదర్శిస్తోంది. గతంలో కొన్ని ఒడిదొడుకులు ఎదుర్కొన్నప్పటికీ, నభా నటేష్ ప్రస్తుతం టాలీవుడ్‌లో గట్టి కంబ్యాక్ ఇచ్చేందుకు సిద్ధమవుతోంది. ప్రస్తుతం 2026 లైనప్‌ను పరిశీలిస్తే ఆమె చేతిలో రెండు భారీ క్రేజీ ప్రాజెక్టులు ఉన్నాయి. అందులో మొదటిది యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్‌ సరసన నటిస్తున్న పీరియాడిక్ యాక్షన్ డ్రామా 'స్వయంభూ'. ఈ చిత్రంలో నభా ఒక పవర్‌ఫుల్ అండ్ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తోంది. దీనితో పాటు 'నాగబంధం' అనే మరో భారీ బడ్జెట్ ఫాంటసీ ఓరియెంటెడ్ ప్రాజెక్ట్‌లో కూడా నభా కీలక పాత్ర పోషిస్తోంది. విశేషం ఏమిటంటే, ఈ రెండు సినిమాలు కూడా పాన్ ఇండియా లెవెల్‌లో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్నాయి. ఈ చిత్రాలు నభా కెరీర్‌కు మైలేజ్ ఇవ్వడం ఖాయమని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా ఈ ముద్దుగుమ్మ షేర్ చేసిన ఫొటోలపై అభిమానులు, నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. "అచ్చం దేవతలా ఉన్నావు", "ఇస్మార్ట్ బ్యూటీ ఈజ్ బ్యాక్" అంటూ ఫ్యాన్స్ క్రేజీ కామెంట్స్ పెడుతున్నారు. ఇండస్ట్రీ వర్గాల్లో సైతం ఈ ఫొటోలు వైరల్ టాపిక్‌గా మారాయి. సినిమాల్లో చిన్న విరామం తర్వాత వస్తున్న ఈ రెండు పాన్ ఇండియా చిత్రాలు గనుక బాక్సాఫీస్ వద్ద విజయం సాధిస్తే, టాలీవుడ్‌లో నభా నటేష్ తన పాత క్రేజ్‌ను సొంతం చేసుకోవడమే కాకుండా స్టార్ హీరోయిన్ల రేసులోకి దూసుకుపోవడం ఖాయంగా కనిపిస్తోంది. ప్రస్తుతం ఈ సినిమాల షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.
టాలీవుడ్ సీనియర్ హీరో వడ్డే నవీన్ (Vadde Naveen) సుదీర్ఘ విరామం తర్వాత మళ్లీ వెండితెరపైకి రీఎంట్రీ ఇస్తున్నారు. ఆయన నటిస్తూ, నిర్మిస్తున్న లేటెస్ట్ క్రేజీ మూవీ 'ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు' (Transfer Trimurthulu). ఈ సినిమాకు సంబంధించిన గ్రాండ్ టీజర్ లాంచ్ ఈవెంట్ రీసెంట్‌గా హైదరాబాద్‌లో జరిగింది. ఈ వేడుకలో వడ్డే నవీన్ పాల్గొని మాట్లాడారు. చాలా కాలం తర్వాత మైక్ పట్టుకున్న ఆయన.. తన కెరీర్ గురించి, వ్యక్తిగత జీవితం గురించి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం నెట్టింట విపరీతంగా వైరల్ అవుతున్నాయి. ఈ ఈవెంట్‌లో వడ్డే నవీన్ మాట్లాడుతూ మొదటగా ఒక ఎమోషనల్ విషయాన్ని పంచుకున్నారు. తన తండ్రి చనిపోయిన తర్వాత తను నటిస్తూ, నిర్మిస్తున్న మొదటి సినిమా ఇదని ఆయన గుర్తుచేసుకున్నారు. ఈ సందర్భంగా సభలో ఉన్నవారందరితో కలిసి తన తండ్రికి నివాళులర్పించారు. ఆ తర్వాత మీడియాలో, సోషల్ మీడియాలో నిరంతరం వినిపించే ఒక ప్రశ్నపై ఆయన స్పష్టతనిచ్చారు. "చాలా మంది ఫ్యాన్స్, మీడియా మిత్రులు అడుగుతుంటారు.. అస్సలు వడ్డే నవీన్ ఎక్కడ ఉన్నాడు? టాలీవుడ్‌లో ఉన్నాడా లేదా అని సందేహపడుతుంటారు. నేను ఎక్కడికీ వెళ్ళలేదు, ఎప్పుడూ హైదరాబాద్‌లోనే ఉన్నాను. అయితే ఎక్కువగా ప్రెస్ ముందుకు, మీడియా ముందుకు రాకపోవడంతో ఆ అనుమానాలు వచ్చాయి. ఈ గ్యాప్‌లో నేను నా ఫ్యామిలీ, ఫ్రెండ్స్‌తో కలిసి నా పర్సనల్ లైఫ్‌ను ఎంజాయ్ చేశాను. నేను స్క్రీన్ మీద కనిపించకపోయినా తెలుగు ఆడియన్స్ నన్ను ఎప్పుడూ గుర్తుపెట్టుకుంటూనే ఉన్నారు. అందుకు అందరికీ పేరుపేరునా థాంక్స్" అని నవీన్ అన్నారు. సినిమాలకు ఇంత పెద్ద గ్యాప్ రావడంపై స్పందిస్తూ.. "నిజానికి నేను సినిమాలు చేయకూడదు అనుకున్నాను. నాకు నచ్చిన మంచి కథలు రాలేదు, వచ్చిన కథలను నేను చేయలేదు. అందుకే ఈ బ్రేక్ వచ్చింది. ఈ మూడేళ్లలో ఎన్నో స్క్రిప్ట్స్ విన్నాను. ఆ సమయంలోనే డైరెక్టర్ కమల్ వచ్చి నాకు 'త్రిమూర్తులు' క్యారెక్టర్, 'ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు' అనే టైటిల్ చెప్పాడు. ఆ పాయింట్ నచ్చి ఒక ఏడాది పాటు కూర్చుని కథను పూర్తిగా డెవలప్ చేశాం. కథ పూర్తిగా నమ్మకం కలిగించాకే ప్రొడక్షన్ స్టార్ట్ చేశాం. ఈ సినిమా కంటెంట్ పరంగా చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది" అని నవీన్ భరోసా ఇచ్చారు. చాలా మంది దీనిని తన సెకండ్ ఇన్నింగ్స్ లేదా కంబ్యాక్ మూవీ అంటున్నారని, కానీ తాను మాత్రం దీనిని కంబ్యాక్ లా భావించడం లేదని నవీన్ స్పష్టం చేశారు. కెరీర్ మొదట్లో తన మొదటి సినిమాకు ఎలాంటి డెడికేషన్, ప్యాషన్‌తో అయితే పనిచేశానో, ఈ సినిమాకు కూడా అదే కసిగా పనిచేశానని, అందుకే ఇది తనకు మరో మొదటి సినిమా లాంటిదేనని నవీన్ అన్నారు.  
తెలుగు సినీ ప్రియులకు ఒకప్పటి చాక్లెట్ బాయ్, విలక్షణ నటుడు వడ్డే నవీన్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఒకప్పుడు వరుస విజయాలతో టాలీవుడ్‌లో తనదైన ముద్ర వేసిన ఆయన, గత కొంతకాలంగా వెండితెరకు దూరంగా ఉంటున్నారు. అయితే, ఇప్పుడు ఆయన అభిమానులకు ఒక అదిరిపోయే శుభవార్త వచ్చేసింది. వడ్డే నవీన్ హీరోగా సరికొత్త యాక్షన్ థ్రిల్లర్ మూవీతో గ్రాండ్ రీఎంట్రీ ఇస్తున్నారు. ఆయన నటిస్తున్న తాజా చిత్రం 'ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు'. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన అఫీషియల్ టీజర్‌ను చిత్రబృందం విడుదల చేసింది. కేవలం 55 సెకన్ల నిడివి ఉన్న ఈ టీజర్, ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగుతూ సినిమాపై అంచనాలను ఒక్కసారిగా పెంచేసింది. ఒక పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ కథాంశంతో ఈ చిత్రం తెరకెక్కుతున్నట్లు టీజర్ చూస్తే అర్థమవుతోంది. టీజర్ ప్రారంభంలోనే కోర్టు రూమ్ డ్రామా, పోలీస్ స్టేషన్ బ్యాక్‌డ్రాప్, అలాగే "10 ఏళ్లలో 55 ట్రాన్స్‌ఫర్లా?" అంటూ వచ్చే డైలాగ్స్ సినిమాలోని తీవ్రతను తెలియజేస్తున్నాయి. సమాజంలో జరిగే ఒక పెద్ద కాన్‌స్పిరసీ చుట్టూ ఈ కథ తిరగనుందని స్పష్టమవుతోంది. ముఖ్యంగా వడ్డే నవీన్ ఖాకీ చొక్కా వేసుకుని, చేతిలో మండుతున్న దివిటీతో ఎంట్రీ ఇచ్చే సీన్ థియేటర్లలో ఈలలు వేయించేలా ఉంది. ఈ చిత్రంలో వడ్డే నవీన్ సరసన రాశి సింగ్ కథానాయికగా నటిస్తోంది. వీరిద్దరి మధ్య వచ్చే కొన్ని రొమాంటిక్ అండ్ ఎమోషనల్ షాట్స్ కూడా టీజర్‌లో ఆకట్టుకున్నాయి. అలాగే సీనియర్ నటుడు రఘుబాబు ఈ సినిమాలో కీలక పాత్రలో కనిపిస్తున్నారు. ఆయన డైలాగ్స్ మరియు స్క్రీన్ ప్రెజెన్స్ సినిమాకు అదనపు ఆకర్షణగా నిలవనున్నాయి. కమల్ తేజ నార్ల ఈ చిత్రానికి కథ, స్క్రీన్‌ప్లే అందిస్తూ స్వయంగా దర్శకత్వం వహించారు. ఒక పక్కా కమర్షియల్ ఎలిమెంట్స్‌తో కూడిన యాక్షన్ థ్రిల్లర్‌గా ఆయన ఈ చిత్రాన్ని మలిచినట్లు కనిపిస్తోంది. వడ్డే క్రియేషన్స్ ఎల్‌ఎల్‌పి పతాకంపై స్వయంగా వడ్డే నవీన్ ఈ చిత్రాన్ని నిర్మించడం విశేషం. కల్యాణ్ నాయక్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ టీజర్‌ను మరింత ఎలివేట్ చేసింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ టీజర్‌కు ప్రేక్షకుల నుండి, ముఖ్యంగా వడ్డే నవీన్ పాత అభిమానుల నుండి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. నవీన్ లుక్ మరియు యాక్షన్ సీక్వెన్సెస్ చాలా బాగున్నాయని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. చాలా కాలం తర్వాత ఒక మంచి పవర్‌ఫుల్ సబ్జెక్ట్‌తో ఆయన ప్రేక్షకుల ముందుకు వస్తుండటంతో టాలీవుడ్‌లో ఈ సినిమాపై పాజిటివ్ బజ్ క్రియేట్ అయింది. చివరగా, ఈ హై-వోల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్ 'ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు' జూన్ 19న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కాబోతోంది. మరి ఈ సినిమాతో వడ్డే నవీన్ తన సెకండ్ ఇన్నింగ్స్‌లో ఎలాంటి విజయాన్ని అందుకుంటారో చూడాలి.
Anirudh Ravichander doesn't need an introduction, as his music has become his identity. But rumors about his personal life have also been prominent on social media for a long time. Apart from his past relationship with actor-singer Andrea Jeremiah, none of the other rumors have ever been confirmed by him or his alleged partners. Recently, he was frequently linked with singer Jonita Gandhi, and post-Jailer, Anirudh started being linked to Sunrisers Hyderabad CEO Kavya Maran. Last year, Anirudh firmly denied being in a relationship with anyone. However, after Superstar Rajinikanth publicly encouraged him to find a partner and get married soon, speculation arose that the veteran actor is mediating between the Maran and Ravichander families. A photo of Anirudh and Kavya in the UK with a common friend recently surfaced on social media, and a few reports suggested that they met for a few jamming sessions related to composing songs for the SRH franchise. Interestingly, fans also pointed out how Sun Network recently issued copyright claims against Chennai Super Kings for using songs like Jailer and Petta in their promos—something many noted had never happened during Anirudh’s long association with the network. Naturally, all these incidents have started adding fresh fuel to the fire. Recent rumors now suggest that Anirudh and Kavya will get married in November, and an official announcement regarding their engagement will be made soon. Meanwhile, Anirudh is busy composing music for DC and Jailer 2, both produced by Sun Pictures. The "Raga of Revenge" track from DC has once again strongly established Anirudh as a master of composing background scores.   Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do thorough research, at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them.
టాలీవుడ్ నేచురల్ స్టార్ నాని ప్రస్తుతం ఫుల్ స్వింగ్‌లో ఉన్నారు. వైవిధ్యమైన కథలను ఎంచుకుంటూ బాక్సాఫీస్ వద్ద తనదైన ముద్ర వేస్తున్న ఈ హీరో, ఇప్పుడు తన కెరీర్‌లోనే అత్యంత భారీ బడ్జెట్ మూవీగా రూపొందుతున్న ‘ది ప్యారడైజ్’ చిత్రంతో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతున్నారు. ఒక పక్కా రా యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాపై టాలీవుడ్‌లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రంలో కలెక్షన్ కింగ్ మోహన్ బాబు పవర్‌ఫుల్ విలన్ పాత్రలో నటిస్తుండటం విశేషం. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన ‘ఆయా షేర్’ సాంగ్ చార్ట్‌బస్టర్‌గా నిలిచి సినిమాపై హైప్‌ను నెక్ట్స్ లెవెల్‌కు తీసుకెళ్లింది. మేకర్స్ ముందుగా ప్రకటించినట్లుగానే ఈ ఏడాది ఆగస్టు 21న సినిమాను థియేటర్లలోకి తెచ్చేందుకు శరవేగంగా పనులు పూర్తి చేస్తున్నారు. అయితే, తాజాగా టాలీవుడ్ సర్కిల్స్ నుంచి వినిపిస్తున్న సమాచారం ప్రకారం.. ఈ సినిమా ప్రమోషన్స్ విషయంలో చిత్ర యూనిట్ చాలా అప్రమత్తంగా వ్యవహరిస్తోంది. ఇటీవల కాలంలో చిత్ర పరిశ్రమలో చోటుచేసుకున్న కొన్ని పరిణామాలు ‘ది ప్యారడైజ్’ టీమ్‌ను ఆలోచనలో పడేసినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా అంతకుముందు ఎన్నో అంచనాలతో వచ్చిన ‘పెద్ది’ సినిమా ట్రైలర్ ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేక మిశ్రమ స్పందన తెచ్చుకుంది. అలాగే ‘డ్రాగన్’ గ్లింప్స్ విషయంలోనూ సోషల్ మీడియాలో నెగెటివ్ కామెంట్స్ వచ్చాయి. బ్యాక్‌డ్రాప్ పరంగా వచ్చిన కొన్ని పోలికలు అభిమానులను కాస్త నిరాశపరిచాయి. ఆయా సినిమాల ప్రమోషనల్ కంటెంట్ వల్ల జరిగిన చిన్నపాటి పొరపాట్లను నాని టీమ్ నిశితంగా గమనిస్తోంది. ఒక్క పాట హిట్ అయినంత మాత్రాన సంబరపడిపోకుండా, రాబోయే ప్రమోషనల్ మెటీరియల్‌ను ఎంతో జాగ్రత్తగా ప్లాన్ చేయాలని చిత్ర బృందం భావిస్తోంది. మన సౌత్ ప్రేక్షకులతో పాటు నార్త్ ఆడియన్స్‌ను కూడా మెప్పించేలా కంటెంట్‌ను సిద్ధం చేస్తున్నారు. ఏమాత్రం తేడా కొట్టినా సోషల్ మీడియా యుగంలో అంచనాలు తలకిందులయ్యే ప్రమాదం ఉందని గ్రహించిన మేకర్స్, ఇప్పుడు ప్రతి అడుగు ఆచితూచి వేస్తున్నారు. మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ ఈ చిత్రానికి అదిరిపోయే సంగీతాన్ని అందిస్తుండటంతో మిగిలిన సాంగ్స్ కూడా నెక్ట్స్ లెవెల్‌లో ఉంటాయని ఫ్యాన్స్ భావిస్తున్నారు. త్వరలోనే ఈ మూవీ నుంచి టీజర్, ఆ తర్వాత ట్రైలర్‌ను రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో నాని ఫ్యాన్స్ ఈ సినిమా అప్‌డేట్స్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరి ఈ జాగ్రత్తలన్నీ తీసుకుని రాబోతున్న నాని ‘ది ప్యారడైజ్’ థియేటర్లలో ఎలాంటి ప్రకంపనలు సృష్టిస్తుందో చూడాలి.
ఇండియన్ సినీ లవర్స్‌ లో క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ 'దృశ్యం'కు ఒక ప్రత్యేకమైన క్రేజ్ ఉంది. మలయాళ సూపర్ స్టార్ మోహన్‌లాల్, డైరెక్టర్ జీతూ జోసెఫ్ కాంబినేషన్‌లో వచ్చిన మొదటి రెండు భాగాలు ఘన విజయం సాధించడమే కాకుండా, తెలుగుతో పాటు పలు భాషల్లో రీమేక్ అయి సంచలనం సృష్టించాయి. భారీ అంచనాల మధ్య మూడో భాగం 'దృశ్యం 3' (Drishyam 3) నేడు (మే 21) థియేటర్లలోకి వచ్చింది. ఈసారి తెలుగులో రీమేక్ కాకుండా నేరుగా డబ్బింగ్ వెర్షన్‌గా విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించింది? జార్జ్‌కుట్టి తన కుటుంబాన్ని కాపాడుకోవడానికి ఆడిన చివరి మైండ్ గేమ్ వర్కవుట్ అయిందా? (Drishyam 3 Telugu Review) కథ: 'దృశ్యం 2' ఎక్కడ ముగిసిందో, అక్కడ నుంచే ఈ మూడో భాగం కథ ప్రారంభమవుతుంది. జార్జ్‌కుట్టి (మోహన్‌లాల్) సినిమా ప్రొడ్యూసర్‌గా మారి, మొదటి సినిమాతోనే మంచి సక్సెస్ అందుకుంటాడు. తన పెద్ద కుమార్తె అంజు (అన్సిబా హాసన్)కు ఒక మంచి సంబంధం చూసి పెళ్లి చేయాలని ప్రయత్నిస్తుంటాడు. అయితే ఏదో ఒక కారణంతో ప్రతి సంబంధం క్యాన్సిల్ అవుతూ ఉంటుంది. ఫైనల్‌గా దుబాయ్‌లో ఉండే ఒక ఎన్నారై (NRI) సంబంధం కుదరడంతో, త్వరగా పెళ్లి చేసి కూతురిని దుబాయ్ పంపించాలనుకుంటాడు జార్జ్‌కుట్టి. కానీ, జార్జ్‌కుట్టి కుటుంబంపై పగతో ఉన్న వరుణ్ తండ్రి ప్రభాకర్ (సిద్ధిఖ్).. అంజు పెళ్లిని ఎలాగైనా చెడగొట్టాలని ప్రయత్నిస్తుంటాడు. మరోవైపు పాత కేసును పోలీసులు మళ్లీ రీఓపెన్ చేస్తున్నారని జార్జ్‌కుట్టికి తెలుస్తుంది. తన కూతురి పెళ్లిని కాపాడుకుంటూ, కుటుంబాన్ని రక్షించడానికి జార్జ్‌కుట్టి ఈసారి ఎలాంటి మైండ్ గేమ్ ఆడాడనేదే 'దృశ్యం 3' కథ. ఎనాలిసిస్: 'దృశ్యం' సిరీస్ సినిమాలకు ప్రధాన బలం.. ఊహకందని ట్విస్ట్‌లు, మైండ్ బ్లోయింగ్ స్క్రీన్‌ప్లే. కానీ, 'దృశ్యం 3' లో ఆ మ్యాజిక్ మిస్ అయింది. జార్జ్‌కుట్టి రేంజ్ తెలివిని చూపించే సీన్స్ ఈసారి చాలా తక్కువ. ఫస్ట్ హాఫ్ అంతా కథ చాలా నెమ్మదిగా, ఫ్లాట్‌గా సాగుతుంది. ఇంటర్వెల్ బ్యాంగ్ కొంత ఆసక్తిని రేకెత్తించినప్పటికీ.. సెకండ్ హాఫ్‌లో వచ్చే ట్విస్ట్‌లు అంతగా ఇంపాక్ట్ చూపించవు. చివరి 15-20 నిమిషాలు మాత్రం పాత 'దృశ్యం' టెన్షన్‌ను గుర్తుచేస్తూ గ్రిప్పింగ్‌గా సాగుతుంది. అయినప్పటికీ, ముగింపు సీన్ మినహా మిగతా సినిమా అంతా చాలా బేసిక్‌గా ఉండటంతో ఈ ఫ్రాంచైజీలోనే ఇది అత్యంత బలహీనమైన చిత్రంగా మిగిలిపోతుంది. ఈ మూడవ భాగం కథను నడిపించడంలో దర్శకుడు జీతూ జోసెఫ్ తడబడినట్లు కనిపిస్తుంది. మొదటి రెండు భాగాలలో ఉన్నంత బిగువైన కథనం, ఊహించని ట్విస్టులు ఈ సినిమాలో లోపించాయి. సినిమా ప్రారంభంలో కథ చాలా నెమ్మదిగా సాగుతుంది, దాదాపు మొదటి గంట కేవలం పాత్రల పరిచయానికి, పాత జ్ఞాపకాలను నెమరువేసుకోవడానికే సరిపోయింది. మొదటి భాగంలో ఉన్న ఇంటెన్సిటీ గానీ, రెండవ భాగంలో క్లైమాక్స్ ముందు వచ్చే మైండ్ బ్లోయింగ్ కోర్టు రూమ్ డ్రామా ఎలివేషన్స్ గానీ ఇందులో ఆశించిన స్థాయిలో పండలేదు. సక్సెస్ ఫుల్ ఫ్రాంచైజ్ కదా అని కేవలం మూడో భాగంగా సాగదీసినట్టు అనిపిస్తుంది తప్ప, బ్రాండ్ ఇమేజ్‌కు తగ్గట్టుగా బలమైన కథనాన్ని రాసుకునే ప్రయత్నం దర్శకుడు చేయలేదు.  నటీనటులు, సాంకేతిక నిపుణుల పనితీరు: జార్జ్‌కుట్టి పాత్రలో మోహన్‌లాల్ మరోసారి జీవించేశారు. తన కుటుంబాన్ని కాపాడుకోవాలనే తపన పడే తండ్రిగా, లోపల తీవ్రమైన మానసిక ఆందోళన ఉన్నప్పటికీ బయటకు ప్రశాంతంగా కనిపించే ఒక క్రిమినల్ మైండ్‌గా ఆయన నటన అద్భుతం. ముఖ్యంగా ఎమోషనల్ సీన్స్‌లో ఆయన నటన సినిమాకు పెద్ద ప్లస్. ఇక భార్య రాణి పాత్రలో మీనా, కుమార్తెలుగా అన్సిబా హసన్, ఈస్తర్ అనిల్ తమ పరిధి మేరకు ఆకట్టుకున్నారు. పోలీస్ ఆఫీసర్లుగా మురళీ గోపి, ఆశా శరత్, సిద్ధిఖ్ తమ పాత పాత్రలకు పూర్తి న్యాయం చేశారు. దర్శకుడు జీతూ జోసెఫ్ ఈసారి థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ కంటే ఫ్యామిలీ ఎమోషన్స్‌కే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. ఒక థ్రిల్లర్ సినిమాకు కావాల్సిన మూడ్‌ను బిల్డ్ చేయడంలో, కొన్ని చోట్ల టెన్షన్ క్రియేట్ చేయడంలో జీతూ జోసెఫ్ సక్సెస్ అయ్యారు. అయితే, మొదటి రెండు భాగాలతో పోలిస్తే ఈసారి రైటింగ్ చాలా బలహీనంగా అనిపిస్తుంది. అనిల్ జాన్సన్ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ పర్వాలేదనిపించినా.. సతీష్ కురూప్ కెమెరా వర్క్, వి.ఎస్. వినాయక్ ఎడిటింగ్ సాదాసీదాగా ఉన్నాయి. ప్రొడక్షన్ వాల్యూస్ కూడా ఆశించిన స్థాయిలో లేవు. ప్లస్ పాయింట్స్: మోహన్‌లాల్ పర్‌ఫార్మెన్స్ ఇంటర్వెల్ బ్లాక్  క్లైమాక్స్ మైనస్ పాయింట్స్: ఫ్లాట్ నరేషన్ ఊహకు అందే ట్విస్ట్‌లు మొదటి రెండు భాగాల రేంజ్ థ్రిల్ మిస్ అవ్వడం ఫైనల్ గా... మొదటి రెండు భాగాల రేంజ్ మైండ్ గేమ్స్, షాకింగ్ ట్విస్ట్‌లను ఆశించి వెళ్తే 'దృశ్యం 3' తీవ్రంగా నిరాశపరుస్తుంది. ఎలాంటి అంచనాలు లేకుండా కేవలం మోహన్ లాల్ నటన కోసం, ఫ్యామిలీ ఎమోషన్స్ కోసం ఒకసారి చూడవచ్చు. రేటింగ్: 2.25/5 Disclaimer: The views/opinions expressed in this review are personal views/opinions shared by the writer and organisation does not hold a liability to them. Viewers' discretion is advised before reacting to them.  
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు. వారితో పాటు పెద్ద సంఖ్యలో క్యాడర్ కూడా పార్టీని వీడుతున్నారు. ఇక ఇప్పుడు నామినేటెడ్ పదవులలో ఉన్న వారి వంతు మొదలైనట్లు కనిపిస్తోంది. తనకు కానీ తన భర్తకు  కానీ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు టికెట్ ఇవ్వాలంటూ గత  కొంత కాలంగా కోరుతూ వస్తున్న మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ వంతు వచ్చింది. ఆమె కూడా రాజీనామా అస్త్రం సంధించారు.  జగన్ కు నమ్మిన బంటుగా గుర్తింపు పొందిన మహిళాకమిషన్ చైర్ పర్సన్ వాసి రెడ్డి పద్మ తన పదవికి రాజీనామా చేశారు. ఉరుములేని పిడుగులా, ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా తన రాజీనామా లేఖను సీఎం జగన్ కు పంపేశారు. పేరుకు తాను పార్టీకి కాదు, కేవలం మహిళా కమిషన్ చైర్మన్ పదవికి మాత్రమే రాజీనామా చేశాననీ, ఇక నుంచి వైసీపీ కోసం పని చేస్తాననీ వాసిరెడ్డి పద్మ చెబుతున్నప్పటికీ, ఆమె రాజీనామాకు కారణం అసంతృప్తేనని పార్టీ వర్గాలు బాహాటంగానే చెబుతున్నాయి. చాలా కాలంగా వాసిరెడ్డి పద్మ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు తనకు కానీ తన భక్తకు కానీ పార్టీ టికెట్ ఇవ్వాలని జగన్ ను కోరుతూ వస్తున్నారు. అయితే ఇప్పటి వరకూ జగన్ చూద్దాం.. చేద్దాం అన్నట్లుగా దాట వేస్తూనే వచ్చారు. ఇప్పుడిక వరుసగా అభ్యర్థల జాబితాలను జగన్ ప్రకటించేస్తుండటం, తనకు గానీ తన భర్తకు కానీ పార్టీ టికెట్ విషయంలో ఎటువంటి స్పస్టత ఇవ్వకపోవడంతో ఆమె మనస్తాపం చెంది పదవికి రాజీనామా చేసేశారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.  వాసిరెడ్డి పద్మ రాజకీయ ప్రవేశం ప్రజారాజ్యం పార్టీతో జరిగింది. 2009లో ఆమె ప్రజారాజ్యం పార్టీలో చేరారు. ఇలా చేరడంతోనే ఆమె ప్రజారాజ్యం అధికార ప్రతినిథిగా పదవి దక్కించుకున్నారు. ప్రజారాజ్యం కాంగ్రెస్ పార్టీలో విలీనం కావడంతో ఆమె 2012లో జగన్ పార్టీలో చేరారు. జగన్ కూడా ఆమెకు అధికార ప్రతినిథి పదవి ఇచ్చారు.  2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆమెను రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా నియమించారు. చైర్ పర్సన్ హోదాలో ఆమె జగన్ మెప్పు పొందేందుకు చేయగలిగినంతా చేశారు. ప్రతిపక్ష పార్టీ నేతలకు నోటీసులు ఇచ్చారు. ఏకంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు సైతం నోటీసులు జారీ చేశారు. వార్డు వలంటీర్లపై పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు కమిషన్ ముందు హాజరై వివరణ ఇవ్వాలంటూ ఆమె పవన్ కు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. పవన్ హాజరు కాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు నమోదు చేయాలని ఆదేశించారు. ఇన్ని చేసినా వాసిరెడ్డి పద్మకు ఆమె కోరినట్లుగా పార్టీ టికెట్ లభించకపోవడంతో అలిగి పదవికి రాజీనామా చేశారని, ఇది జగన్ కు షాకేననీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు. ఒకరైతు తనకు చేసిన సేవలకు ప్రీతి చెందిన గురువు అతడికి స్వర్గ ప్రాప్తిని కలగజేయాలని అనుకుంటాడు. కానీ సంసారాసక్తి వల్ల ఆ రైతు ఆ అవకాశాన్ని వాయిదా వేసుకుంటూ వస్తాడు. చివరికి గురుకృప వల్ల ఆ రైతు స్వర్గ ప్రాప్తిని ఎలా పొందాడో ఈ కథ తెలియజేస్తుంది. "ఒక మహాపురుషుడు ప్రయాణం చేస్తూ, డస్సిపోయాడు. గొంతు ఎండిపోయింది. దారిలో ఒక రైతు కనపడితే నీళ్ళు అర్థించాడు. ఆ రైతు మహాత్మునికి సకల ఉపచారాలూ చేశాడు. చిరిగిపోయిన ఆయన ఉత్తరీయాన్ని రైతు జాగ్రత్తగా కుట్టి బాగుచేశాడు. రైతు పరిచర్యలకు సంతసించిన ఆ మహాత్ముడు శాంతి, ఆనందాలకు నిలయమైన స్వర్గానికి తనతోపాటు రమ్మని అంటాడు. అందుకు ఆ రైతు 'గురువుగారూ! మీరు నా మీద చూపిన దయకు కృతజ్ఞుణ్ణి. కానీ నా పిల్లలు ఇంకా చిన్నవాళ్ళు. ఓ ఏడేళ్ళ వ్యవధి ఇవ్వండి' అని అడుగుతాడు. అందుకు గురువు అంగీకరించాడు. సరిగ్గా ఏడేళ్ళ తర్వాత గురువు రైతును స్వర్గానికి తీసుకువెళ్ళడానికి వచ్చాడు. అప్పుడు రైతు 'అయ్యా! కడపటి కొడుకు కష్టాలకు అంతు లేదు. అన్ని జంఝాటాలనూ ఒక్కడే సంబాళించుకోలేకపోతున్నాడు. కాబట్టి మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని గురువుని అడిగాడు. మరో ఏడేళ్ళ తరువాత గురువు వచ్చాడు. కానీ రైతు చనిపోయాడని తెలిసింది. చనిపోయిన ఆ రైతు ఎద్దుగా పుట్టాడని ఆ గురువు తన దివ్య దృష్టితో తెలుసుకున్నాడు. ఎద్దుగా పుట్టిన ఆ రైతు తన కొడుకు పొలాన్నే దున్నుతున్నాడు. అప్పుడు గురువు ఆ ఎద్దుపై మంత్ర జలం చిలకరించగానే ఎద్దు జన్మనెత్తిన రైతు 'నా కొడుకు పరిస్థితి మరి కాస్త మెరుగు పడనీయండి స్వామీ! మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని అన్నాడు. ఇక చేసేది లేక వెనుదిరిగాడు గురువు. మరలా ఏడేళ్ళ తర్వాత వచ్చిన గురువుకు ఎద్దు చనిపోయిందని తెలిసింది. అది కుక్కగా పుట్టి కొడుకు ఇంటినీ, ఆస్తినీ కాపలా కాస్తోందని తన దివ్యదృష్టి ద్వారా తెలుసుకున్నాడు. గురువు. కుక్కగా పుట్టిన ఆ రైతు 'స్వామీ! నేను ఎంత దౌర్భాగ్యుణ్ణి. మీరు ఇంత దయ చూపుతున్నప్పటికీ మీతో స్వర్గమానం చేయలేకున్నాను. వీడికి ఆస్తిని కాపాడుకొనే దక్షత ఇంకా రాలేదు. కాబట్టి దయ చేసి మరో ఏడేళ్ళు వ్యవధి ఇవ్వండి' అని వేడుకున్నాడు. గురువు ఏడేళ్ళ తరువాత మళ్ళీ వచ్చేసరికి కుక్క మరణించింది. అది త్రాచుపాముగా జన్మనెత్తి, ఇప్పుడు కొడుకు భూమిలో ఉన్న లంకెబిందెలకు పడగెత్తి కాపలా కాస్తోంది. గుప్త ధనం ఇక్కడ ఉందని కొడుకుకి ఎలా తెలియజేయాలా అని పాము ఆలోచిస్తున్నప్పుడు గురువు ఆ రైతుకొడుకును పిలుచుకు వచ్చి లంకె బిందెలు ఉన్న చోట తవ్వమన్నాడు. లంకె బిందెలు బయటపడ్డాయి. ఆ పైన ఆ పామును చంపమన్నాడు. అనంతరం శిష్యుణ్ణి తీసుకొని స్వర్గారోహణం చేశాడు గురువు. సంసారంలోని ఈతి బాధల నుండి శిష్యుణ్ణి ఉద్ధరిస్తాడు సద్గురువు. అలాంటి గురువు అందరికీ అవసరం.                                      *నిశ్శబ్ద.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్  రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది.  80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత  ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది.   ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది. ఆమెది నెద‌ర్లాండ్స్‌. ఆమె తండ్రి నెద‌ర్లాండ్స్‌లోని ఆర్నెహెమ్‌లో చిన్న‌పిల్ల‌ల ఆస్ప‌త్రి డైరెక్ట‌ర్. పోయి దొరికిన ఆ పెయింటింగ్ విష‌యానికి వ‌స్తే.. అది 1683లో కాస్ప‌ర్ నెష‌ర్ వేసిన స్టీవెన్ ఓల్ట‌ర్స్ పెయింటింగ్‌. రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో నాజీల ఆదేశాల‌ను చార్లెట్ తండ్రి వ్య‌తిరేకించారు. ఆయ‌న ర‌హ‌స్య జీవ‌నం సాగించేడు. కానీ ఈ పెయింటింగ్‌ని మాత్రం త‌న న‌గ‌రంలోని ఒక బ్యాంక్‌లో భ‌ద్ర‌ ప‌ర‌చ‌మ‌ని ఇచ్చార‌ట‌. 1940లో నాజీలు నెద‌ర్లాండ్ పై దాడులు చేసినపుడు ఆ బ్యాంక్ మీద ప‌డి దోచుకున్నా రు. అప్పుడు ఈ పెయింటింగ్ కూడా తీసుకెళ్లారు. యుద్ధం అయిపోయిన త‌ర్వాత ఈ పెయింటింగ్ ఎక్క‌డున్న‌దీ ఎవ‌రికీ తెలియ‌లేదు. చిత్రంగా 1950ల్లో డ‌స‌ల్‌డార్ష్ ఆర్ట్ గ్యాల‌రీలో అది ప్ర‌త్య‌క్ష‌మ‌యింది. 1969లో ఆమ్‌స్ట‌ర్‌డామ్‌లో దాన్ని వేలానికి తీసికెళ్లే ముందు దాన్ని ఆ ఆర్ట్ గ్యాల‌రీలో వుంద‌ని చూసిన‌వారు చెప్పారు. వేలంపాట త‌ర్వాత మొత్తానికి ఆ పెయింటింగ్‌ను 1971లో ఒక క‌ళాపిపాసి త‌న ద‌గ్గ‌ర పెట్టుకున్నాడు.    ఆ త‌ర్వాత 2021లో అది చార్లెటీని చేరింది.  మొత్తానికి వూహించ‌ని విధంగా ఎంతో కాలం దూర‌మ‌యిన గొప్ప క‌ళాఖండం తిరిగి త‌న వ‌ద్ద‌కు చేర‌డంలో చార్లెటీ ఆనందానికి అంతేలేదు. అంతే క‌దా.. పోయింద‌నుకున్న గొప్ప వ‌స్తువు తిరిగి చేరితే ఆ ఆనంద‌మే వేరు!  అయితే చార్లెటీకి ఇపుడు ఆ పెయిం టింగ్‌ను భ‌ద్రంగా చూసుకునే ఆస‌క్తి వున్న‌ప్ప‌టికీ శ‌క్తి సామ‌ర్ధ్యాలు లేవు. అందుక‌నే త్వ‌ర‌లో ఎవ‌రిక‌యినా అమ్మేసీ వ‌చ్చిన సొమ్మును పిల్ల‌ల‌కు పంచుదామ‌నుకుంటోందిట‌!  చార్లెటీ కుటుంబంలో అయిదుగురు అన్న‌ద‌మ్ములు అక్క‌చెల్లెళ్లు వున్నారు. అలాగే ఇర‌వై మంది పిల్ల‌లు ఉన్నారు. అంద‌రూ ఆమె అంటే ఎంతో ప్రేమ చూపుతున్నారు. అంద‌రం ఒకే కుటుంబం, చాలాకాలం త‌ర్వాత ఇల్లు చేరిన క‌ళాఖండం మా కుటుంబానిది అన్న‌ది చార్లెటీ!
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు. చాకోను పార్టీలోకి ఆహ్వానిస్తూ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్’ ఫ్రంట్ ఏర్పాటు గురించి ప్రత్యేకించి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు కానీ, చాకో అలాంటి  సంకేతాలు ఇచ్చారు. ప్రస్తుతం దేశంలో ఉన్న ఏ ఒక్కపార్టీ కూడా బీజేపీకి ప్రత్యాన్మాయం కాదని,సమీప భవిష్యత్ కాంగ్రెస్ సహా ఏ పార్టీ కూడా ఆ స్థాయికి ఎదిగే అవకాశాలు కూడా కనిపించడంలేదని అన్నారు. ఈ పరిస్థితుల్లో దేశంలోని బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ, ఏకమై, ఒకే గొడుగు కిందకు రావలసిన అవసరం ఉందని చాకో అన్నారు. అదే సమయంలో ప్రతిపక్షాలను ఏక తాటిపైకి తెచ్చే బాధ్యతను పవార్ తీసుకోవాలని సంకేత మాత్రంగా చెప్పారు. అంతే కాకుండా కాంగ్రెస్ పేరు ఎత్తకుండా బీజేపీ వ్యతిరేక శక్తులను ఏకం చేసే ఆలోచన ఆ పార్టీ నాయకత్వానికి లేదని నెహ్రూ గాంధీ ఫ్యామిలీ (సోనియా, రాహుల్, ప్రియాంక)ఆలోచనా ధోరణిని పరోక్షంగానే అయినా ఎండ కట్టారు.ఆ విధంగా పవార్ ఆ బాధ్యత తీసుకోవాలని చాకో సూచించారు. ఇందుకు సంబంధించి, పవార్ బహిరంగంగా ఎలాంటి వ్యాఖ్య చేయలేదు. అయితే, చాకో సహా మరికొందరు ‘సీనియర్’ కాంగ్రెస్ నాయకులు, అలాగే సిపిఎం, సిపిఐ నాయకులు కూడా పవార్’తో చాలా కాలంగా థర్డ్ ఫ్రంట్  విషయంగా చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. అయితే మహారాష్ట్రలో సంకీర్ణం మనుగడను దృష్టిలో ఉంచుకుని పవార్ ఆచితూచి అడుగులేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే చాకో పార్టీలో చేరిన సందర్భంలో కూడా ‘చాకో చేరికతో మహారాష్ట్రలోని మహా వికాస్ అగాడీ ప్రభుత్వానికి ఎలాంటి నష్టం జరగదని, పవార్ మహారాష్ట్ర సంకీర్ణ సర్కార్ ప్రస్తావన చేశారని విశ్లేషకులు పేర్కొంటున్నారు.  మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వ మనుగడ గురించ్బి  పవార్ ప్రత్యేకంగా పేర్కొనడం ద్వారా, ఆయన థర్డ్ ఫ్రంట్ విషయంలో వేచి చూసే ఆలోచనలో ఉన్నట్లు అర్థమవుతోందని కూడా  రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే అదే ఎన్సీపీ అసెంబ్లీ ఎన్నికల జరుగతున్న కేరళలో, పశ్చిమ బెంగాల్లో  కాంగ్రెస్ వ్యతిరేక పార్టీలకు మద్దతు ఇస్తోంది. దీన్ని బట్టి చూస్తే, ఎన్సీపీ - కాంగ్రెస్ మధ్య దూరం పెరుగుతోందని స్పష్టమవుతోంది. అయితే, థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఏ రకంగా ముడి పడుతుంది అనే విషయంలో ఇంకా స్పష్టత రావలసి ఉంది. అలాగే, కాంగ్రెస్ లేకుండా జాతీయ స్త్గాయిలో బీజేపీ వ్యతిరేక కూటమిని ఏర్పాటు చేయడం వలన, వ్యతిరేక ఓటు చీలి  అది మళ్ళీ బీజేపీకే మేలు చేస్తుందని, కాబట్టి, ప్రస్తుతం కాంగ్రెస్ సారధ్యంలోని యూపీఏని బలోపేతం చేయడమే ఉత్తమమనే అలోచన కూడా  విపక్ష శిబిరం నుంచి వినవస్తోంది. ఈ నేపధ్యంలోనే, ప్రస్తుతం యూపీఏ ఛైర్పర్సన్’గా ఉన్న సోనియా గాంధీ వయసు, అనారోగ్యం కారణంగా బాధ్యతల నుంచి తప్పుకుని పవార్’కు బాద్యతలు అప్పగించాలనే ప్రతిపాదన వచ్చిందని అంటున్నారు. అలాగే, ఇతర పార్టీలను, ముఖ్యంగా కాంగ్రెస్ నుంచి విడిపోయి సొంత కుంపటి పెట్టుకున్న మమతా బెనర్జీ సారధ్యంలోని తృణమూల్, జగన్మోహన్ రెడ్డి సారధ్యంలోని వైసీపీలను కలుపుకుని కూటమిని బలోపేతం చేయడం ద్వారా బీజేపీని దీటుగా ఎదుర్కోవచ్చనే ఆలోచనలు కూడా సాగుతున్నాయి. అయితే, ఇటు థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు అయినా, యూపీఏని బలోపేతం చేయడమే అయినా, పవారే .. కేంద్ర బిందువు. ఆయన సారధ్యంలోనే ప్రత్యాన్మాయం అనేది విపక్ష శిభిరం నుంచి వినవస్తున్న ప్రస్తుత సమాచారం. మరి అదే జరిగితే రాహుల గాంధీ పరిస్థితి ఏమిటి ? గాంధీ నెహ్రూ కుటుంబం పరిస్థితి ఏమిటి? ఏ ప్రత్యేక ప్రాధాన్యత లేకుండా అందరిలో ఒకరిగా ఫస్ట్ ఫ్యామిలీ సర్దుకు పోతుందా? అంటే..చివరకు ఏమవుతుందో .. ఇప్పుడే చెప్పలేమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది. గతంలో అనేక సందర్భాలలో ముఖ్యమంత్రి కేసీఆర్,ఆర్థిక మంత్రి హరీశ రావు, కరోనా కారణంగా రాష్ట్ర  ఆదాయం గణనీయంగా తగ్గిందని, పేర్కొన్నారు. అయితే, కరోనా నుంచి వేగంగా కోలుకుని, ఆర్థికంగా అంతే వేగంగా పుంజుకున్న రాష్ట్రాలలో తెలంగాణ ప్రధమ స్థానంలో  ఉందని కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సర్వే 2020-21 నివేదిక పేర్కొంది. పడిలేచిన కెరటంలా, తెలంగాణ ‘వీ’ ఆకారంలో ఆర్థికంగా నిలతొక్కుందని కేంద్రం జనవరి  చివరి వారంలో విడుదల చేసిన ఆర్థిక సర్వేలో పేర్కొంది. అలాగే, రెవిన్యూ వసూళ్ళలో రాష్ట్రం కరోనా పూర్వస్థితికి చేరిందని కూడా సర్వే చెప్పింది.   అలాగే,రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు కూడా ఈ మధ్య కాలంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పై సంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరమ జనవరి,ఫిబ్రవరి, మార్చి నెలలతో పోలిస్తే ఈ సంవత్సరం ఈ మూడు నెలల కాలంలో రాష్ట్ర ఆర్థిక వృద్ది రేటు 10 నుంచి  15 శాతం మెరుగ్గా ఉందని హరీష్ రావు ఒకటి రెండు ఇంటర్వ్యూలలో పేర్కొన్నారు.అలాగే, బడ్జెట్ విషయంలోనూ ఆయన చాల ఆశావహ దృక్పథంతోనే ఉన్నారు. బడ్జెట్  పాజిటివ్’గా ఉంటుదని, ఎవ్వరూ ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని, సంక్షేమ పథకాలలో,ఇతరత్రా బడ్జెట్ కేటాయింపులలో ఎలాంటి కోతలు ఉండవని కూడా హరీష్ హామీ ఇచ్చారు. గత సంవత్సరంలో కొంత మేర హామీ ఇచ్చిన మేరకు అమలు చేయలేక పోయిన సొంత జాగాలలో డబల్ బెడ్ రూమ్ ఇళ్ళ నిర్మాణం, రుణ మాఫీ వంటి  పథకాలను ఈ బడ్జెట్ ద్వారా అమలు చేస్తామని చెప్పారు. అలాగే, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ తమిళి సై చేసిన ప్రసంగంలోనూ ఆశావహ దృక్పధమే వ్యక్తమైంది. ఆమె తమ ప్రసంగంలో,  ప్రభుత్వం సంక్షేమ పథకాలకు పెద్ద పీట వేసిందని అన్నారు. ‘సంపద పంచాలి ,పేదలకు పంచాలి’ అనేది తమ ప్రభుత్వ విధానమని స్పష్టం చేశారు. అలాగే, పెరుగతున్న ఆదాయంలో అధికశాతం సంక్షేమానికే వెచ్చిస్తున్నామని స్పష్టం చేశారు. దీంతో బడ్జెట్’లో కొత్త పథకాలకు శ్రీకారం చుట్టే అవకాశం ఉంటుందా అన్న చర్చ జరుగుతోంది. మరో వంక ఉద్యోగ వర్గాల్లో పీఆర్సీకి సంబంధించి ఆర్థిక మంత్రి తమ ప్రసంగంలో  ప్రకటన చేస్తారా లేదా అనే ఆసక్తి నెలకొంది. అలాగే, సామాన్య  ప్రజలు ఇటీవల పెరిగిన పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరల భారం నుంచి మంత్రి హరీష్, ఏదైనా ఉపసమనం కలిపిస్తారా అని ఎదురు చూస్తున్నారు. గతంలో వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సామాన్య ప్రజలపై వంటగ్యాస్ ధర భారాన్ని తగ్గించేందుకు కొంత మొత్తాన్ని, రూ.50(?) రాష్ట్ర ప్రభుత్వం తరపున  సబ్సిడీగా ఇచ్చిన విషయాన్ని, అదే విధంగా అసెంబ్లీ ఎన్నికలు జరుగతున్న తమిళనాడులో డిఎంకే పార్టీ,తమ పార్టీని అధికారంలోకి వస్తే  గ్యాస్ బండపై వంద రూపాయల సబ్సిడీ ఇస్తామని చేసిన  వాగ్దానాన్ని  గుర్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే, ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు, సోమవారం ఆర్థిక మంత్రి హరీష్ రావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఆర్థిక  శాఖ ముఖ్య కార్యదర్శి రామ కృష్ణా రావు,సలహాదారు జీఆర్ రెడ్డితో బడ్జెట్ పద్దులఫై సుదీర్ఘంగా చర్చించి తుది మెరుగులు దిద్దారు. బడ్జెట్ తుది రూపం సిద్దమైన నేపధ్యంలో ఆర్థిక శాఖ ప్రింటింగ్ ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 18 ఉదయం మంత్రి వర్గం ఆమోదం పొందిన అనంతరం ఆర్థికమంత్రి హరీష్ రావు అదే రోజు రాష్ట్ర బడ్జెట్ 2021-22ను సభలో ప్రవేశ పెడతారు. 20, 22 తేదీల్లో బడ్జెట్‌పై సాధారణ చర్చ,23, 24, 25 తేదీల్లో బడ్జెట్‌ పద్దులపై చర్చ ఉంటుంది 26న ద్రవ్యవినిమయ బిల్లు (బడ్జెట్)పై చర్చ, సభామోదం ఉంటాయి.
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది.  అధికార తెరాస, ఖమ్మం స్థానానికి సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర రెడ్డి పేరును ప్రకటించడంలో కొంచెం జాప్యం చేయడంతో పాటుగా, హైదరాబాద్ స్థానం నుంచి , పీవీ కుమార్తె వాణీ దేవి పేరును చివరి క్షణంలో తెరమీదకు తేవడంతో అంత వరకు కొంత స్తబ్దుగా సాగిన ప్రచారం ఆ తర్వాత వేడెక్కింది. ఉద్యోగ నియామకాల విషయంలో తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ తప్పులో కాలేయడంతో విపక్షాలు, పోటీలో ఉన్న ప్రత్యర్ధులు, నిరుద్యోగ యువత, విద్యార్ధి సంఘాలు  ఒకే సారి ఆయన మీద  విరుచుకు పడ్డారు. ఆయన లెక్క తప్పని నిరుపిస్తం రమ్మని వరస సవాళ్ళు విసిరారు. దీంతో, మంత్రి నియామకా ఇష్యూని పక్కకు తప్పించేందుకు , ఐటీఐఆర్, వరంగల్ రైల్వే ఫ్యాక్టరీ వంటి సెంటిమెంటల్ ఇష్యూస్’ను తెరపైకి  తెచ్చారు. అలాగే, కేంద్ర ప్రభుత్వంపై విమర్శల దాడిని పెంచారు. చివరకు పొరుగు రాష్ట్రానికి చెందిన విశాఖ ఉక్కు ఆందోళన   కూడా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగమైంది.   రెండు నియోజక వర్గాలలో గతంతో పోలిస్తే ఈసారి ఓటర్ల సంఖ్య రెట్టింపు అయింది. ఈసారి రెండు నియోజక వర్గాలలో కలిపి 10 లక్ష 36 వేల మంది తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. అలాగే, రెండు పట్ట భద్రుల నియోజక వర్గాల్లో 164 మంది అభ్యర్ధులు పోటీలో ఉన్నారు.  గత ఎన్నికలతో పోలిస్తే ఇటు ఓటర్ల సంఖ్య, అటు అభ్యర్థుల సంఖ్యా రెట్టింపునకు పైగానే పెరగడంతో ఎన్నికలలో జోష్ పెరిగింది. దీనికితోడు అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో సాధారణ ఎన్నికలను తలపించే రీతిలో ప్రచారం సాగింది. ఎక్కువమంది అభ్యర్ధులు బరిలో ఉండడంతో, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి  తమకే ప్రయోజనం జరుగుతుందని అధికార పార్టీ ఆశపడుతోంది .  దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో చేదు ఫలితాలను చవిచూసిన టీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా వ్యూహ రచన చేసి కేటీఆర్, హరీష్ సహా మంత్రులు,ఎమ్మెల్యేలకు స్పెసిఫిక్ బాధ్యతలు అప్పగించారు. అలాగే,కాంగ్రెస్‌ అభ్యర్థులు చిన్నారెడ్డి, రాములునాయక్‌లకు మద్దతుగా ఉత్తమ్‌, భట్టి, రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తదితరులు విస్తృతంగా ప్రచారం చేశారు. బీజేపీ అభ్యర్థులు ఎన్‌.రాంచందర్‌రావు, ప్రేమేందర్‌రెడ్డిల తరఫున ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, ఎంపీ అరవింద్‌ తదితరులు ప్రచారాన్ని వేడెక్కించారు.  ఖమ్మం స్థానం నుంచి ప్రత్యక్ష ఎన్నికల్లో తొలిసారి పోటీకి దిగిన కోదండరాంకు, టీజేఎస్‌ పార్టీకీ ఈ ఎన్నికలు కీలకంగా మారాయి. ఖమ్మ స్థానం నుంచి పోటీ చేస్తున్న తీన్మార్ మల్లన్న ముందస్తు వ్యూహంతో ప్రధాన పార్టీల అభ్యర్ధులకు ధీటుగా ప్రచారం సాగించారు.  వామపక్షాల మద్దతుతో జయసారథి, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్‌, యువతెలంగాణ కార్యనిర్వాహక అధ్యక్షురాలు రాణీ రుద్రమ తదితరులు పోటీలో ఖమ్మం సీటును పట్టభద్రులు  ఎవరికి  పట్టం కడతారు అన్నది ప్రశ్నార్థకంగా మారింది. హైదరాబాద్ సీటు కూడా ఇటు అధికార తెరాసకు అటు సిట్టింగ్ సీటును నిలుపుకోవడం తో పాటుగా దుబ్బాక , జీహెచ్ఎంసి జోష్ ను కొనసాగించాలని ఆశ పడుతున్నబీజేలకే కూడా ఇజ్జత్ కీ సవాల్ గా మారింది. కాంగ్రెస్ అభ్యర్ధి పార్టీ సీనియర్ నాయకుడు సౌమ్యుడు, మాజీ మంత్రి చిన్నారెడ్డి, వామ పక్షాల మద్దతుతో పోటీ చేస్తున్న మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ కూడా గట్టి పోటీ ఇస్తున్నారు. సో.. చివరకు ఏమి జరుగుతుంది అంటే ఏదైనా జరగవచ్చును. ఈ నెల 14 వ తేదీన పోలింగ్ జరుగుతుంది.17 ఫలితాలు వస్తాయి .. అంతవరకు వెయిట్ అండ్ వాచ్ .  
సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది. ఒకప్పుడు ఎర్ర జెండాను దిగ్విజయంగా ఎదిరించి, మార్క్సిస్టులను మట్టి కరిపించిన మమతా దీదీ ప్రస్తుతం, కాషాయ కూటమి నుంచి గట్టి సవాలును ఎదుర్కుంటున్నారు. వరసగా పదేళ్ళు పాలించడం వలన సహజంగా వచ్చిన ప్రభుత్వ వ్యతిరేకత  కంటే, హిందూ ఓటు పోలరైజేషన్ ఆమెను మరింతగా భయపెడుతోంది. నిజానికి ఐదేళ్ళ క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం ఐదు శాతం కంటే తక్కువ ఓట్లు, మూడంటే మూడు అసెంబ్లీ సీట్లు మాత్రమే గెలుచుకున్న బీజేపీ..  2019 లోక్ సభ ఎన్నికల్లో ఏకంగా 40 శాతం ఓట్లతో 18 స్థానాలు గెలుచుకుంది. ఈ  మార్పు ఇంకా కొన్ని కారణాలు ఉంటే ఉండవచ్చును కానీ.. హిందువుల ఓటు పోలరైజ్  కావడమే ప్రధాన కారణం.  ఈ నేపధ్యంలోనే కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ చివరకు కమ్యూనిస్టులు కూడా బీజేపీలో  చేరారు. ఎన్నికల ప్రకటన వెలువడిన తర్వాత కూడా సిట్టింగ్ ఎమ్మెల్ల్యేలు సహా  తృణమూల్ టికెట్ వచ్చిన నాయకులు కూడా బీజేపీలో చేరుతున్నారు. అనేక మంది ఇతర రంగాల ప్రముఖులు, ముఖ్యంగా ఇంతకాలం, బీజేపీని హిదుత్వ అనుకూల ‘అచ్చుత్’ (అంటారని) పార్టీగా చూసిన ‘సెక్యులర్’ ప్రముఖులు కాషాయం కప్పుకోవడంతో మమతా బెనర్జీకి కొంచెం అలస్యంగానే అయినా, తత్త్వం బోధపడింది. అందుకే ఆమె ఇప్పుడు గుళ్ళూ,గోపురాలకు తిరుగుతున్నారు. కార్యకర్తల సమావేశాల్లో తానూ హిందువునేనని, చెప్పుకుంటున్నారు.  నిజానికి ఇలా నేనూ హిందువునే  అని సెక్యులర్ నేతలు బహిరంగంగా ప్రకటించుకోవడం మమతా బెనర్జీతోనే మొదలు కాలేదు. రాహుల్ గాంధీ తాను హిందువునని, జన్యుధారీ కశ్మీరీ బ్రాహ్మణుని అనీ.. తమ గోత్రం, ‘దత్తాత్రేయ’ గోత్రమని బహిరంగంగా ప్రకటించుకున్నారు. అలాగే  కొద్ది రోజుల క్రితం ప్రియాంకా గాంధీ తానూ హిందువునని చెప్పుకునేందుకు ‘మౌని అమావాస్య’ సందర్భంగా అలహాబాద్ లో గంగా స్నానం చేశారు. గతంలోనూ ఆమె ఎన్నికలకు ముందు గంగా యాత్ర చేశారు. అంతవరకు ఎందుకు కొద్దిరోజుల క్రితం సిపిఐ నారాయణ విశాఖ స్వామి ఆశీస్సులు తీసుకున్నారు. చంద్రబాబు, జగన్ రెడ్డి, కేసీఆర్ ఇలా తెలుగు నేతలు అనేక మంది లౌకిక వాదానికి కాలం చెల్లిందన్న సత్యాన్ని గ్రహించి కావచ్చు ‘నేనూ హిందువును’ అంటూ ప్రకటించుకునేందుకు పోటీ పడుతున్నారు. రాముడిని తలచుకున్నా, జై శ్రీరామ్ అన్నా తమ  లౌకిక వాదం మయలపడి పోతుందని భయపడిన నాయకులు ఇప్పుడు .. జై శ్రీరామ్ అనేందుకు కూడా వెనకాడడం లేదు.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది. గత కొంత కాలంగా సబర్మలతో సహా అనేక అంశాలపై స్పందిస్తూ.. కేరళను టార్గెట్ చేస్తున్న బీజేపీ నాయకులు అక్కడ తమ జెండా ఎగరేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా పార్టీ పాలసీని కూడా పక్కన పెట్టి మెట్రో మ్యాన్ శ్రీధరన్ ను పార్టీలో చేర్చుకుని ఆయనే తమ సీఎం అభ్యర్థి అని ప్రకటించిన 24 గంటలలో యూ టర్న్ తీసుకున్నారు. ఇది ఇలా ఉండగా ప్రస్తుతం సీఎంగా ఉన్న కమ్యూనిస్ట్ నేత పినరై విజయన్ పై గోల్డ్ స్మగ్లింగ్ ఆరోపణలు రావడంతో.. ఈ ఎన్నికలలో ఎల్డిఎఫ్ భవిష్యత్తుపై ప్రజలు ఏ తీర్పు ఇవ్వబోతున్నారనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది ఈ నేపథ్యంలో అక్షరాస్యతలో దేశంలోనే మొదటి స్థానంలో ఉన్న ఆ రాష్ట్ర ప్రజలు ఎవరిని ఆశీర్వదిస్తారు అనే అంశంపై ప్రముఖ మీడియా సంస్థ టైమ్స్ నౌ, సీ ఓటరుతో కలిసి ఒక సర్వేను నిర్వహించారు. ఈ సర్వే ప్రకారం చూస్తే పాపం కమలనాథులు అక్కడ పవర్ చేతికి రావటం అటుంచి కనీసం రెండు మూడు అసెంబ్లీ స్థానాల్లో గెలవటం కూడా కష్టమేనని ఆ సర్వే తేల్చి చెబుతోంది. కేరళలో ఈసారి జరిగే అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ తన హవా చాటుతుందన్న ఆ పార్టీ నేతల మాటలలో ఎలాంటి నిజం లేదని.. ప్రస్తుతానికి అది ఏమాత్రం సాధ్యం కాదని ఈ తాజా సర్వే తేల్చి చెప్పింది. అంతేకాకుండా మొత్తం 140 స్థానాలు ఉన్న కేరళలో.. ప్రస్తుత సీఎం పినరయి విజయన్ నేతృత్వంలోని లెఫ్ట్డ్ డెమొక్రటిక్ ఫ్రంట్ కు 82 సీట్లు పక్కా అని.. ఆయనే తిరిగి అధికారాన్ని నిలబెట్టుకుంటాడని సర్వే చెపుతోంది. అదే సమయంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూనైటెడ్ డెమొక్రాటిక్ ఫ్రంట్ కు 56 నుంచి 60 వరకు సీట్లు వచ్చే అవకాశం ఉందని ఈ సర్వేలో తేలింది. అంతేకాకుండా 2016 ఎన్నికలతో పోలిస్తే ఎల్ డీఎఫ్ ఓటింగ్ శాతం కూడా కొంత పెరగటం ఇక్కడ గమనార్హం. ప్రస్తుతం సీఎంగా ఉన్న విజయన్ మరోసారి సీఎం కావాలని 43.34 శాతం మంది మొగ్గు చూపినట్లుగా సర్వేలో తేలింది. కరోనా సమయంలో విజయన్ సీఎంగా బాగా పని చేసారని ఈ సర్వే పేర్కొంది. మరోపక్క దేశ ప్రధానిగా రాహుల్ గాంధీ ఉండాలని కేరళ ప్రజల్లో 55.84 శాతం మంది కోరుకుంటున్నట్లుగా ఈ సర్వే;లో తేలింది. అయితే కేరళలో ఎలాగైనా పాగా వేయాలని పట్టుదలతో కృషి చేస్తున్న బీజేపీకి ఈసారి కూడా నిరాశ తప్పదని ఈ సర్వేలో స్పష్టం అయింది. ఈ ఎన్నికలలో బీజేపీకి రెండు సీట్లు కూడా రావటం కూడా కష్టమేనని ఈ సర్వే తేల్చింది. అయితే ఎన్నికలకు ముందు ఇలాంటి సర్వేలు బయటకు రావడం.. తరువాత అందులో కొన్ని చతికిల పడడం మనం చూస్తూనే ఉన్నాం. మరి ఈ సర్వే ఫలితాలు నిజామా అవుతాయో లేదో తేలాలంటే కొద్దీ రోజులు వెయిట్ చేయాల్సిందే.        
రాజకీయాలు అంటేనే అదో జూదం. పూలమ్మిన చోటనే కట్టెలు అమ్మవలసి రావచ్చును. అలాంటి పరిస్థితే వచ్చినా, తలవంచుకుని పోగలిగితేనే, ఎవరైనా రాజకీయాలలో రాణించగలరు. అలాకాదని, అలిమి కానిచోట, కూడా తామే అధికులమని భావిస్తే, ఎందుకూ కాకుండా పోతారు. అలాంటి వారు ఇద్దరూ కూడా ఇప్పుడు మన కళ్ళముందే ఉన్నారు.  జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు. అలాగే జయ మరణం తర్వాత ఆమె పరిస్థితి ఏమిటో కూడా వేరే చెప్పవలసిన, అవసరం లేదు. జైలు పాలయ్యారు. సర్వం తానై నడిపించిన పార్టీ నుంచి  బహిష్కరణకు గురయ్యారు. జయ ఉన్నంత వరకు తన వారుగా ఉన్న వారందరూ కానివారయ్యారు. ఒంటరిగా మిగిలారు.  నిజానికి నాలుగేళ్ళు జైలు జీవితం గడిపిన తర్వాత కూడా ఆమె తలచుకుంటే.. రాష్ట్ర రాజకీయాలలో, ముఖ్యంగా అధికారంలో ఉన్న డిఎంకే కూటమిలో అలజడి సృష్టించగలరు. ఎన్నికలలో ఆమె గెలవక పోవచ్చును కానీ.. తనను కాదన్న అన్నాడిఎంకేను ఓడించగలరు. అయిన  ఆమె అందుకు విరుద్ధంగా  రాజకీయాలకు వీడ్కోలు పలికి మౌనంగా పక్కకు తప్పుకున్నారు. రాజకీయ సన్యాసం ప్రకటించారు. ఉమ్మడి శతృవు డిఎంకే ను ఓడించేందుకు అన్నా డిఎంకే కూటమి  పోటీ చేయాలని, కూటమి ఐక్యతను దెబ్బతీయరాదనే ఉద్దేశంతోనే ఆమె రాజకీయ సన్యాసం ప్రకటించారు.    శశికళ మౌనంగా వెళ్లి పోవడం వెనక ఇంకా అనేక కారణాలున్నా ,అసలు కారణం ఆమె, రాజకీయ విజ్ఞత, వివేకం. ఆమె జైలుకు వెళ్ళిన సమయంలో జయలలిత సమాధి వద్ద ఎంత కసిగా, కోపంగా ‘మౌన’ ప్రతిజ్ఞ చేశారో చూశా. అలాంటి ఆమె ఇప్పుడు ఇలా ‘మౌనం’గా వెనకడుగు వేశారంటే, అది ఆలోచించ వలసిన విషయమే.ఆమె వ్యుహతంకంగానే సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే అనేక మంది అనేక కోణాల్లో శశికళ సంచలన నిర్ణయాన్ని విశ్లేషించారు.జైలు జీవితం తర్వాత కూడా అన్నా డిఎంకే నాయకులు తనను అగ్రనేతగా అంగీకరించక పోవడం, అమిత్ షా చెప్పినా.. అన్నా డిఎంకే నాయకులు ఆమెను, మేనల్లుడు దినకరన్’ను కులం పేరున, కుటుంబం పేరున దూరం చేయడం, తిరిగి పార్టీలోకి తీసుకోకపోవడంతో ఆమె మనసు కష్టపెట్టుకుని, సన్యాస నిర్ణయం తీసుకున్నారని కొందరంటున్నారు. పార్టీ మీద పట్టు లేదని, చరిష్మా అసలే లేదని, అందుకే ఆమె అలా నిశ్శబ్ధంగా రాజకీయ సన్యాసం స్వీకరించారని ఇంకొందరు విశ్లేషించారు. ఈ విశ్లేషణలో కొంత నిజం ఉంటే ఉండవచ్చును.. కానీ ఆమె గతాన్ని, నైజాన్ని గుర్తు చేసుకుంటే ఆమె స్ట్రైక్ బ్యాక్ వ్యూహంతోనే ఒకడుగు వెనక్కివేశారని ఆమెతో సన్నిహితంగా మెలిగినవారు, ఆమె రాజకీయ చాణక్యం తెలిసిన వారు అంటారు.   నిజానికి జైలులో ఉన్న కాలంలో కానీ, జైలు నుంచి విడుదలై వచ్చిన తర్వాత కానీ, ఆమె రాజకీయ సన్యాసం వైపు అడుగులు వేస్తున్నట్లు కనిపించలేదు. బెంగుళూరు జైలు నుంచి విడుదలై చెన్నైలో ప్రవేశించిన నప్పుడు ఆమె పెద్ద కాన్వాయ్ తో  తమ కారుకు అన్నాడిఎంకే జెండాతోనే ఎంటరయ్యారు. అలా ఎంట్రీలోనే రాజకీయ ఆకాంక్షను వెంట తెచ్చుకున్నారు. చివరకు ‘సన్యాస’ ప్రకట చేసే వరకు కూడా ఆమె రాజకీయ కార్యకలాపాలు సాగిస్తూనే ఉన్నారు. అటు ఢిల్లీని ఇటు చెన్నైనికూడా కదిల్చారు. అంతేకాదు, రాజకీయాలపై విరక్తితో కాదు, రాజకీయ కసితో, ఉమ్మడి శత్రువు (డిఎంకే) ను ఓడించేందుకే తాను రాజకీయాలనుంచి తపుకుంటున్నట్లు చెప్పారు.  సో .. సన్యాసం తీసుకోవాలనే ఆలోచన, రాజకీయవ్యూహం లోంచి పుట్టిందే కానీ,వైరాగ్యంతో పుట్టింది కాదు ,అన్నవిశ్లేషణ వాస్తవానికి ఇంకొంత దగ్గరగా ఉందని అనుకోవచ్చును. ఇది ‘కామా’నే కాని ‘ఫుల్స్టాప్’ కాదని అంటున్నారు.  ముఖ్యమంత్రి ఎడప్పాడి కే. పళని స్వామి (ఈపీఎస్) ఆమెను పార్టీలోకి అనుమతిస్తే తన కుర్చికీ ఎసరు పెడతారనే భయంతోనే,, ఆమె ఎంట్రీని అడ్డుకున్నారు. ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం, శశికళ ఒకే సామజిక వర్గానికి చెందిన వారు కావడం కూడా, ముఖ్యమంత్రి ఈపీఎస్’ భయానికి కారణంగా పేర్కొంటారు. అందుకే  ఆయన, ‘మన్నార్గుడి’ ఫ్యామిలీని బూచిగా చూపించి, ఆమెను దూరంగా ఉంచారని పార్టీలో ఒక వర్గం గట్టిగా విశ్వసిస్తుంది. అయితే ఆమె శక్తియుక్తులను కూడతీసుకుని  పులిలా పంజా విసిరేందుకే ఆమె వ్యూహాత్మకంగా ఒక అడుగు వెనక్కి వేశారు కావచ్చును అని కూడా, తమిళ రాజకీయ వర్గాల్లో ఒక చర్చ జరుగుతోంది.  గతంలో ఆమె జయలలితతో విబేధాలు వచ్చిన సమయంలో కూడా ఇలాగే కొద్ది కాలం మౌనంగా తెర చాటుకు వెళ్లి పోయారు.  కొద్ది కాలంలోనే మళ్ళీ ‘పోయస్ గార్డెన్’లో ప్రత్యక్షమయ్యారు. జయలలిత స్వయంగా ఆమెను వెనక్కి పిలుపించుకోవలసిన పరిస్థితులను సృష్టించారు. అలా  మళ్ళీ  చక్రం తిప్పారు. జయలలిత మరణం వరకు ఆమె అందరికీ చిన్నమ్మగా అమ్మకు పెద్దమ్మగా సర్వం తానై నిలిచారు. చివరకు జయ అంత్యక్రియల్లో కూడా ఆమెదే పై చేయిగా కనిపించింది.   జయలలిత చనిపోయిన సందర్భంలోనే అన్నా డిఎంకే ఎమ్మెల్ల్యేలో సుమారు 30 మంది వరకు ఆమెకు మద్దతుగా ఉన్నారన్న వార్తలొచ్చాయి. నిజానికి,ఇప్పటికి కూడా ఒక్క అన్నా డిఎంకే లోనేకాదు,డిఎంకే ఇతర పార్టీలలో కూడా  ఆమె అవసరం ఉన్న వాళ్ళు ఉన్నారు. కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో ‘మన్నార్గుడి’ ఫ్యామిలీ మద్దతు లేకుండా గెలిచే అవకాశం లేదు.  ఇవ్వన్నీ నిజమే అయినా.. అన్నీ ఉండి, ఎవరు లేని శశికళలో, ఇంకా  ఎవరి కోసం తాపత్రయ పడాలి? అనే ప్రశ్న జనించి ఉంటే, ఆమె రాజకీయ సన్యాసం నిజం కావచ్చును. ఎందుకంటే ఆమె నెచ్చలి, జయలిత లేరు, భర్త అంతకంటే ముందే చనిపోయారు, పిల్లలు లేరు... పైగా నాలుగేళ్ళ జైలు జీవితం ఆమెలో మార్పు తెచ్చి ఉండవచ్చును. ఈ వయస్సులో తనవారంటూ ఎవరు లేని తనకు రాజకీయాలు ఎందుకు ? శేష జీవితాన్ని ఇలా సాగిద్దామనే ఆలోచన నిజంగా వచ్చి ఉంటే, ఆమె సన్యాసం సత్యం అయినా కావచ్చును, కాకపోనూ వచ్చును. కానీ  శశికళ... ఆమెను అర్థం చేసుకోవడం, అంచనా వేయడం , అంత తేలిగ్గా అయ్యే పని కాదు..
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు. కాంగ్రెస్ అధినాయకత్వం పై నేరుగా అస్త్రాలు సంధించారు. రాహుల్ గాంధీ పేరు చెప్పకుండానే, ఆయన నాయకత్వానికి పనికిరాడని తేల్చి చెప్పారు. ఎవరైనా పార్టీ అధ్యక్షుడు అయితే కావచ్చును, కానీ, ప్రజానాయకుడు కాలేడని, రాహుల గాంధీ ప్రజానాయకుడు కాదు కాలేరు,అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తరచూ రాహుల్ గాంధీని ఉద్దేశించి చేసే  ‘నామ్’ధారీ వ్యంగ్యాస్త్రాన్నే కాంగ్రెస్ సీనియర్ నాయకులు కూడా సందించారు. ఇక అక్కడి నుంచి విధేయ, అసమ్మతి వర్గాల మధ్య మాటల యుద్ధం ఎదో ఒక రూపంలో సాగుతూనే వుంది. అదే క్రమంలో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ, కరుడు కట్టిన ముస్లిం మతోన్మాది, అబ్బాస్ సిద్దిఖీతో కాంగ్రెస్ పార్టీ చేతులు కలపడం అసమ్మతి నాయకులకు మరో అస్త్రాన్ని అందించింది. విషయంలోకి వెళితే, ఇటీవల పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా లోక్’సభలో కాంగ్రెస్ పక్ష నాయకుడు, పశ్చిమ బెంగాల్ పీసీసీ అధ్యక్షుడు అధీర్’రంజన్ చౌదరి, ముస్లిం మత ప్రచారకుడు, అబ్బాస్ సిద్దిఖీతో  వేదిక పంచుకున్నారు.అంతకు ముందే వామ పక్ష కూటమితో  పొత్తు కుదుర్చుకున్న కాంగ్రెస్ పార్టీ, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)ను కూటమిలో చేర్చుకుంది. ఇలా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) అమోదం లేకుండా మతోన్మాద ఐఎస్ఎఫ్’ తో ఎన్నికల పొత్తు పెట్టుకోవడం ఆ పార్టీ నాయకుడు,సిద్ధిఖీతో  పీసీసీ చీఫ్ వేదిక  పంచుకోవడం పై అసమ్మతి నేతలు మండి పడుతున్నారు. ఇలా సిద్దిఖీతో వేదిక పంచుకోవడం పార్టీ మౌలిక సిద్ధాంతాలకు వ్యతిరేకం అంటూ అసమ్మతి వర్గానికి చెందిన కీలక నేత, రాజ్యసభ సభ్యుడు,ఆనంద్ శర్మ మండిపడ్డారు. అంతే కాదు, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)తో జనవరిలో కుదుర్చుకున్న పొత్తుకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ)అమోదం లేదని ఆనంద్ శర్మ, అభ్యంతరం వ్యక్త చేశారు. పార్టీ విశ్వసించే లౌకిక వాదానికి కాంగ్రెస్ అధిష్టానం తీసుకున్న నిర్ణయం గొడ్డలి పెట్టని ఆయన తీవ్రంగా స్పందించారు.   శర్మ వ్యాఖ్యలపై అధీర్ రంజన్ చౌదరి అంతే ఘాటుగా ప్రతిస్పందించారు. “నిజాలు తెలుసుకోండి ఆనంద్ శ‌ర్మ జీ” అంటూ ఆయ‌న వ‌రుస ట్వీట్లు చేశారు. వ్య‌క్తిగ‌త ప్ర‌యోజ‌నాలు ప‌క్క‌న‌పెట్టి, ప్ర‌ధానిని పొగిడి టైమ్ వేస్ట్ చేయ‌కండంటూ ఆయ‌న ఓ ట్వీట్లో అన్నారు. ఆనంద్ శ‌ర్మ అన‌వ‌స‌రంగా కాంగ్రెస్‌ను ల‌క్ష్యంగా చేసుకుంటున్నార‌ని, ఈ అంశాన్ని పెద్ద‌ది చేసి చూపిస్తున్నార‌ని విమ‌ర్శించారు. ఆయ‌న ఉద్దేశాలు స‌రైన‌వే అయితే నేరుగా తనతో మాట్లాడ వలసిందని అన్నారు. బెంగాల్‌లో సీపీఐ(ఎం) కూట‌మికి నేతృత్వం వ‌హిస్తోంది. అందులో కాంగ్రెస్ ఓ భాగం. మ‌త‌తత్వ‌, విభ‌జ‌న రాజ‌కీయాలు చేస్తున్న బీజేపీకి చెక్ పెట్ట‌డానికే ఈ కూట‌మి అని మ‌రో ట్వీట్‌లో అధిర్ రంజ‌న్ అన్నారు. అక్కడతోనూ ఆగలేదు ... ట్వీట్ల మీద ట్వీట్లు సంధిస్తూ, ఆనంద్ శర్మ, బీజేపీ మత విభజన, అజెండాను బలపరుస్తున్నారని, పరోక్షంగా జీ23 నాయకులు బీజేపీకి ప్రయోజనం చేకూరుస్తున్నారని ఆరోపించారు.అంతే కాదు, క్షేత్ర స్థాయి వాస్తవ పరిస్థితులు తెలియకుండా, ఆనంద్ శర్మ పార్టీ మీద దండెత్తడం ఉచితం కాదని చౌదరి ఎదురుదాడి చేశారు. అసమ్మతిలో అసమ్మతి. ఇదలా ఉంటే, కాంగ్రెస్ పార్టీ  సమూల పక్షాళన కోరుతూ సోనియా గాంధీకి,గత సంవత్సరం  జీ 23గా ప్రాచుర్యం పొందిన సీనియర్ నాయకులు రాసిన లేఖపై సంతకాలు చేసిన  నాయకుల్లో నలుగురు,జమ్మూలోసమావేసమైన నాయకుల తాజా నిర్ణయాలు, వ్యాఖ్యలు,విమర్శల పట్ల అసంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరం సోనియా గాంధీకి రాసిన లేఖలో ప్రస్తావించిన అంశాలకు కట్టుబడి ఉన్నామని, అయితే, జీ 23లోని కొందరు సహచరులు, ఇటీవల గీతదాటి చేస్తున్న వ్యాఖ్యలు, విమర్శలను తాము సమర్ధించడం లేదని ఆ నలుగురు పేర్కొన్నారు. ఇందులో ముఖ్యంగా, రాజ్యసభ మాజీ డిప్యూటీ చైర్మన్, పీజే కురియన్ అయితే, “కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు అవసరమైన సంస్కరణలు తెచ్చేందుకు చేసే ప్రయత్నాలను పూర్తిగా సమర్దిస్తాను, కానీ, ‘లక్ష్మణ రేఖ’ దాటితే ఒప్పుకునేది లేదు”అని అసమ్మతిలో అసమ్మతికి తెర తీశారు.అలాగే, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ కుమారడు, మాజీ ఎంపీ సందీప్ దీక్షిత్,మధ్య ప్రదేశ్ సీనియర్ కాంగ్రెస్ నాయకుడు అజయ్ సింగ్’ కూడా గులాం నబీ ఆజాద్, కపిల్ సిబల్, ఆనంద్ శర్మ, మనీష్ తివారీ వంటి జీ 23 కీలక నేతలు అధినాయకత్వంపై చేసిన వ్యాఖ్యలను తప్పు పట్టారు. అలాగే, పార్టీ సీనియర్ నాయకుడు కేంద్ర మాజీమంత్రి వీరప్ప మొయిలీ కూడా,గత సంవత్సరం పార్టీ సీనియర్ నాయకులు  ఒక పరిమిత లక్ష్యంతో  సోనియా గాంధీకి లేఖ రాయడం జరిగిందని, ఆ పేరున జరుగతున్న  కార్యక్రమాలు లేఖ సంకల్పానికి  విరుద్ధమని అన్నారు. జీ 23 కార్యకలాపాలపై రాహుల్ గాంధీ కూడా పరోక్షగా స్పందించారు, ఒకప్పుడు ఎన్ఎస్’యుఐ, యూత్ కాంగ్రెస్’ కు సంస్థాగత ఎన్నికలు వద్దన్న వారే ఇప్పుడు ఇంకోలా మాట్లాడుతున్నారని పరోక్షంగానే అయినా సంస్థాగత ఎన్నికలు నిర్వహించడంతో పాటుగా, పార్టీ పక్షాలనకు తమ కుటుంబం వ్యతిరేకం కాదని, అందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఈ నేపధ్యంలో కాంగ్రెస్ పార్టీలో చెలరిగిన కలకలం  ఇక ముందు ఏమవుతుందో .. ఇంకెన్ని  మలుపులు తిరుగుతోందో ..చూడవలసిందే కానీ ఉహించలేము.
పంచతంత్రంగా పిలుచుకుంటున్న ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భతం జరగబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే, వివిధ సంస్థలు అసెంబ్లీ ఎన్నికలు జరిగే  అస్సాం. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటుగా కేరళలోనూ ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఆ ఒపీనియన్ పోల్ ఫలితాలు నిజంగా నిజం అయితే, కేరళలో మళ్ళీ సీపీఎం సారధ్యంలోని వామపక్ష కూటమి అధికారంలోకి వస్తుంది. ఇదే ఆ అద్భుతం. ఎందుకంటే, గత నాలుగు దశాబ్దాలలో కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో ఒకే కూటమి వరసగా రెండవసారి అధికారంలోకి వచ్చిన చరిత్ర లేనే లేదు. ఒక సారి ఎల్డీఎఫ్ అధికారంలోకి వస్తే ఐదేళ్ళ తర్వాత కాంగ్రెస్ సారధ్యంలోని ఐక్య ప్రజాస్వామ్య కూటమి(యూడీఎఫ్) అధికారంలోకి రావడం, దేవభుమిలో దైవ నిర్ణయమా అన్నట్లుగా ప్రతి ఎన్నికల్లోనూ అధికారం చేతులు మారుతూ వస్తోంది. అలాంటిది, ఈసారి ఒపీనియన్ పోల్స్ నిజమై వరసగా రెండవసారి వామపక్ష కూటమి అధికారంలోకి వస్తే, అది చరిత్రే అవుతుంది. ఇక ఒపీనియన్ పోల్స్ విషయానికి వస్తే, జాతీయ న్యూస్ ఛానెల్ ఏబీపీ, సీ ఓటర్ సంస్థలు సంయుక్తంగా ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఈ సర్వే ప్రకారం, 140 స్థానాలున్న కేరళ అసెంబ్లీలో వామపక్ష కూటమికి 83 నుంచి  91 స్థానాలు, యూడీఎఫ్ కూటమికి 47 నుంచి 55 స్థానాలు మాత్రమే దక్కుతాయని తెలుస్తోంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్రంలో ఇలా జాతకాలు తిరగబడడంపై సోషల్ మీడియాలో,’లెగ్ మహిమ’ లాంటి జోక్స్  ట్రోలవుతున్నాయి. అయితే 2016లో జరిగిన ఎన్నికల్లో కేవలం 47 సీట్లకే పరిమితం అయిన కాంగ్రెస్’కు ఈసారి ఒకటీ అరా సీట్లు ఎక్కువస్తే, రావచ్చును. అదే కాంగ్రెస్’కు కాసింత ఊరట. అదలా ఉంటే, పశ్చిమ బెంగాల్లో సైతం పట్టు సాధించిన బీజేపే, కేరళలో మాత్రం పట్టు కాదు కదా, పట్టుమని పది సీట్లు తెచ్చుకునే స్థితిలో లేదు. నిజానికి, దేశంలో బీజేపీకి అసలు ఏ మాత్రం మింగుడు పడని రాష్ట్రాలు ఎవైన ఉన్నాయంటే కేరళ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల  పేర్లే ప్రముఖంగా వినిపిస్తాయి. ఈ సారి కూడా కమల దళం కేరళలో కాలు పెట్టె పరిస్తి లేదని సర్వే ఫలితాలు చెపుతున్నారు. ఎప్పటిలానే ఇప్పడు కూడా  బీజేపీకి సున్నా నుంచి రెండు సీట్లు వచ్చే అవకాశం ఉందని, సర్వేస్వరుల అభిప్రాయంగా ఉంది. కేరళలో మొత్తం 140 స్థానాలకు ఏప్రిల్ 6 తేదీన ఒకే విడతలో పోలింగ్ జరుగుతుంది. మే 2 తేదీన ఫలితాలు వెలువడతాయి. కేరళ ఎలక్షన్ పై యావత్ దేశం ఆసక్తి కనబరుస్తోంది.    
కేంద్ర ఎన్నికలసంఘం ‘పాంచ్ పటాక’ గంట కొట్టింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. ఎన్నికల గంట మోగడంతో మొదలైన మరో భారత ‘మినీ’  సంగ్రామానికి మే 12 తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తెర పడుతుంది.ఈలోగా వివిధ అంచల్లో పోలింగ్ జరుగుతుంది.  నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతం ఓటరు తీర్పుకు వెళుతున్నా, అందరి దృష్టి, ముఖ్యంగా ప్రాంతీయ పార్టీల ఏలుబడిలో ఉన్న ఉభయ తెలుగు రాష్ట్రాలు, మరీ ముఖ్యంగా ఇప్పటికే బీజేపీ కన్నుపడిన తెలంగాణ రాష్ట్ర ప్రజలు, రాజకీయ పార్టీల దుష్టి  మాత్రం పశ్చిమ బెంగాల్ పైనే వుంది.  పశ్చిమ బెంగాల్లో ‘అద్భుతం’ జరిగి బీజేపీ విజయం సాధిస్తే, ఇక  కమల దళం ఫోకస్, తెలంగాణకు షిఫ్ట్ అవుతుంది. ఇది అందరికీ తెలిసిన బహిరంగ రహస్యం. ఈ నేపధ్యంలో బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయి అనే విషయంలో రాష్ట్ర రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. బెంగాల్లో బీజేపీ గెలిస్తే, ఇప్పటికే అంతర్గత కుటుంబ కలహాలతో సతమతవుతున్న తెరాస నాయకత్వానికి మరిన్నితిప్పలు తప్పవన్న మాట అంతఃపుర వర్గాలలో సైతం వినవస్తోంది.  పశ్చిమ బెంగాల్’లో ఎలాగైతే కమలదళం ఓ వంక తమ ట్రేడ్ మార్క్, హిందుత్వ రాజకీయాలు సాగిస్తూ, మరో వైపు నుంచి ‘ఆకర్ష్’ అస్త్రంతో అధికార పార్టీని నిర్వీర్యం చేసిన విధంగానే, ఇక్కడ కూడా ఫిరాయింపులను ప్రోత్సహింఛి పార్టీని నిట్టనిలువునా చీల్చే ప్రమాదాన్ని కొట్టివేయలేమని పార్టీ వర్గాలు కూడా అనుమానం వ్యక్త పరుస్తున్నాయి.  ఇప్పటికే తెలంగాణ  బీజేపీ నాయకులు 30 మంది తెరాస ఎమ్మెల్యేలు తమ టచ్ లో ఉన్నారని బెదిరిస్తున్నారు.అది నిజం అయినా కాకపోయినా..తెరాసలో అసంతృప్తి అగ్గి రగులుతోందనేది మాత్రం ఎవరూ కాదనలేని నిజం. అంతే కాకుండా రాష్ట్రానికి వచ్చిన కేంద్రనాయకులు ఎవరిని పలకరించినా, నెక్స్ట్ టార్గెట్ తెలంగాణ అని ఎలాంటి సషబిషలు లేకుండా కుండబద్దలు కొడుతున్నారు.అందుకే, బెంగాల్లో బీజేపీ గెలిస్తే.. అనే ఊహా కూడా  గులాబీ గూటిలో గుబులు పుట్టిస్తోంది. అయితే, బెగాల్’లో బీజేపీ గెలిస్తే ఒక్క తెలంగాణలోనే కాదు, దేశ రాజకీయ వాతావరణంలోనే పెను మార్పులు చోటు చేసుకుంటున్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.  అలాగే,  దేశ ముఖ చిత్రంలో కూడా పెను మార్పులు తప్పవని అంటున్నారు. అయితే రాజకీయాలలో ఎప్పుడు ఏం జరుగుతుందో.. ఎవరూహించెదరు..
హిమాలయాలకు వెళ్ళిన ఒక యోగి ఐదేళ్ళ తర్వాత మళ్ళీ ప్రజల మధ్యకు వచ్చినప్పుడు వారిని చూసి, "ఇంకా పోట్లాడుకుంటూనే వున్నారా?” అని ఆశ్చర్యపోయాడంట. పిల్లల దగ్గరనుండి పెద్దవాళ్ళ వరకూ, మనుష్యులు పోట్లాడుకోకుండా క్షణముండలేరు. ఈ విషయంలో ఆధునికులూ పూర్వీకులూ అనిగానీ, ఈ జాతివారు ఆ జాతివారు అనిగానీ, ఈ మతంవారూ మరో మతానికి చెందినవారని గానీ, స్త్రీ పురుష భేదాలు గానీ ఏమీలేవు. పోట్లాడటం ప్రధానం, కారణమేదైనాగానీ, పోట్లాట అనేది ఒకటి వుంటూ వుండాలి. లేకపోతే తోచదు. సాధారణంగా చిన్న పిల్లల్ని "మీరిద్దరూ ఏదో గిల్లికజ్జా పెట్టుకుంటారేమిటర్రా?" అని మందిలిస్తాం కానీ, పెద్దవాళ్ళూ చేసేది అదే. కాకపోతే చిన్నవాళ్ళు ఏ చాక్లెట్ల పంపిణీ దగ్గరో, బడిలో ఏ కుర్చీలో ఎవరు కూచోవాలి అనే విషయానికో తగాదా పడతారు. పెద్దవాళ్ళు చాలా “పెద్ద” విషయాలనుకునే వాటి విషయంలో అంటే... మతపరమైన, భాషాపరమైన విషయాలతో, పోరాటానికి సిద్ధపడతారు. చిన్న పిల్లలు గిల్లుకోవటంతో ఆపేస్తారు. పెద్దవాళ్ళు రక్తం చిందిస్తారు. మనిషిలో తల ఎత్తే ప్రతి అభిప్రాయమూ, మరొక మనిషితో వచ్చే ప్రతి అభిప్రాయ భేదమూ రక్తం ధారపోసేటంతటి ముఖ్యమైన విషయమే. ఇక్కడ ఒక విషయమేమంటే తప్పని సరి అయితేనే తన రక్తం చిందుతుంది.  సాధారణంగా అయితే  తన అనుచరుల రక్తమే ఉంటుందక్కడ ఇదీ నేటి రాజకీయం, సమాజ పోకడ. మత విశ్వాసాలు బలంగావున్న కాలంలో ఒక్కొక్క మతం వారు మరొకరి మీద విరుచుకు పడేవారు. ఒకే మతానికి చెందినవారిలో కూడా ఎన్నో సంఘర్షణలు. కేథలిక్కులూ, ప్రాటస్టాంట్ లూ ఆనాటికీ ఈనాటికీ ఐర్లాండ్లో కుత్తుకలను కత్తరించుకోడానికి వెనుకాడడం లేదు. ముస్లిములలో సున్నీలకు షియాలకు మధ్యన పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటూనే వున్నది. హిందూమతంలోని వైష్ణవులకు, శైవులకు ఎంతటి ప్రజల విరోధమో చరిత్ర తెలియజేస్తూనే వున్నది. మతం కాకపోతే భాష, భాష కాకపోతే ప్రాంతం, నగరాలకై గ్రామాలకై పెనుగులాట, ఆదర్శాలకై, అభిప్రాయాలకై పోరుసల్పమని నాయకులు ఉద్ఘాటిస్తూనే వుంటారు. పోరునష్టం అనే విషయం మానవుడికి తెలిసినట్లుగానే వుంటుంది. కాని పోరునే అతడు ఆరాధిస్తాడు. పోరే అతడి జీవనసూత్రం, అందుకనే జీవితాన్ని కూడా "జీవనసమరం, జీవనపోరాటం" అనే పేర్లతో వ్యవహరిస్తూ వుంటాడు.  పూర్వం మనరాజులు ఆచరించిన అశ్వమేధయాగం లో "చేతనైతే మా యజ్ఞాశ్వాన్ని ఆపిచూడండి, ఆపినవారు మా భుజబలాన్ని చవిచూడండి". అనే ప్రకటన, పోరుకు ఆహ్వానమే కదా? అంటే మనిషికి పోరు అతి సహజమైన గుణమన్నమాట, పైపెచ్చు ఇది ఎంతో గౌరవించదగిన గుణమని మన నాగరీకుల భావన. కానీ ఈ ప్రపంచంలో అక్కడక్కడ కొన్ని "అనాగరికమైన" అడవి జాతులు కూడా వున్నాయి. వారిలో ఒక జాతివారు మరొక జాతివారిమీద అనివార్య కారణాల వల్ల యుద్ధ దుందుభులు మ్రోగించారనుకుందాం. ఇవతలి జాతివాడు అవతలి జాతివాణ్ణి చంపడం కూడా జరిగిందనుకుందాం. అప్పుడు ఇతడు తానొక ఘనకార్యం చేశానని తానొక వీరాధి వీరుణ్ణని భావించడం జరుగుతుంది. చాలా ఉద్రేకంగా ఉత్సాహంగా తనవారిలోకి తిరిగి వస్తాడు. అతని గ్రామంలోని వారందరూ అతడికి బ్రహ్మరథం పట్టారనీ, "వీరగంధం" పూస్తారని మనం అనుకోవచ్చు. కానీ మన ఊహ సరికాదు అంటాడు, ఆఫ్రికాలోని కొన్ని అడవి జాతుల్ని అధ్యయనం చేసిన ప్రఖ్యాత మనస్తత్వ శాస్త్రవేత్త, కార్ల్ యూంగ్, ఈ వీర శూర శిఖామణిని ఊరి పొలిమేరల్లోనే ఆపి అక్కడే ఒక గుడిసెలో అతడికి నివాసం ఏర్పాటు చేస్తారు. అతడిలోని రక్తదాహం తొలగిపోవడానికి కొన్ని నెలలపాటు అతణ్ణి ఏకాంతంగా వుండనిచ్చి, శాఖాహారం మాత్రమే పెడుతుంటారు. ఆ అడవి జాతివారికి తోటి మానవుడి ప్రాణం తీయడం అంత గర్భనీయం అంటారు. ఇదీ మనిషిలో ఉండే ఒకానొక స్వభావ కోణం                                    ◆నిశ్శబ్ద.
  భార్యాభర్తల మధ్య ప్రేమ అనేది ఒక విలువైన సంబంధం. అయితే ఈ బంధం  ఎప్పుడూ తగాదాలు,  వాదనలతో నిండి ఉంటుంది.  కానీ గొడవ అయినా, తగాదాలు అయినా  భర్త పదేపదే  అబద్ధం చెప్పడం చాలా ఇబ్బందికర విషయం.  ఇలా  అబద్ధాలు చెప్పడం భార్యను బాధకు గురిచేస్తుంది. భర్త చెప్పేవి అబద్దాలు అని తెలిసినా సరే.. కొందరు భార్యలు తమ భర్తల విషయంలో ఏమీ చేయలేక నిస్సహాయంగా ఉంటారు. మరికొందరు గొడవ పడుతుంటారు. అయితే ఇలా గొడవ పడటం వల్ల భార్యాభర్తల బంధానికే ముప్పు వాటిల్లుతుంది. అయితే ఇలాంటి విషయాల్లో ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. భర్త ఇంకోసారి అబద్దం చెప్పకుండా ఉండటానికి సహాయపడే కొన్ని చిట్కాలు ఉన్నాయి.  వాటిని ఫాలో అయితే భర్తలు అబద్దం చెప్పడం మానేస్తారు.  అవేంటో తెలుసుకుంటే.. భర్తకు అబద్ధాలు చెప్పే అలవాటును ఎలా వదిలించాలి..  భర్త  భార్యకు  అబద్ధం చెబితే, అది సంబంధానికి పెద్ద సమస్యగా మారవచ్చు. అబద్ధం చెప్పడం వల్ల భార్యాభర్తల మధ్య నమ్మకం తగ్గిపోతుంది.  సంబంధంలో చీలిక ఏర్పడుతుంది. దీన్ని నివారించడానికి  కొన్ని చిట్కాలను అనుసరించవచ్చు.  భర్తతో బహిరంగంగా మాట్లాడవచ్చు.. భర్త అబద్దాలు చెబుతుంటే భార్య వాటిని ఊరికే సహించడం చేయకుండా నేరుగా  భర్తతో ఓపెన్ గా  మాట్లాడాలి. అబద్ధం ఎంత ప్రమాదకరమూ,  అది భార్యను  ఎలా బాధపెడుతుందో వివరించాలి. ఇలాంటి విషయాలు చెప్పేటప్పుడు భర్తకు ఆ విషయాలు అర్థం కావడం కోసం కొన్నిఉదాహరణలు కూడా చెప్పవచ్చు. అతను చెప్పిన అబద్దాల వల్ల ఏ సందర్భంలో ఎంత బాధ అనుభవించారనేది చెప్పవచ్చు.  ఇలా చేస్తే భర్తలో ఆలోచనలు కలిగి అతను అబద్దం చెప్పడం మానుకునే అవకాశం ఉంటుంది. కారణాలు అర్థం చేసుకోవాలి.. భర్త అబద్దం చెప్పడం అనే విషయాన్ని మాత్రమే కాకుండా.. అతను ఎలాంటి సందర్బంలో, పరిస్థితిలో అబద్దం చెప్పాడు అనే విషయాన్ని కూడా కూడా అర్థం చేసుకోవడం భార్య బాధ్యత.  ఇలా అర్థం చేసుకుంటే  తన భావాలను భార్య అర్థం చేసుకుంటోందని అతను గ్రహిస్తాడు.  అతని అబద్ధాల వెనుక గల కారణాలను అర్థం చేసుకుంటే ఆ తరువాత అతను ఎప్పుడైనా అర్థం చెప్పినా అదంత బాధ లేదా కోపాన్ని కలిగించదు.   పరిష్కారం.. భార్య భర్తకు ఎలాంటి పరిస్థితిలో అయినా  అండగా ఉన్నారని,  ఏవైనా సమస్యలు వస్తే వాటి పరిష్కార మార్గాలు కనుగొనడంలో అతనికి సహాయం చేస్తారని అతనికి  అర్థమయ్యేలా చేయాలి. ఇలా చేస్తే భర్త ఏ సమస్య వచ్చినా తన భార్య కూడా తనకు సమస్య పరిష్కారంలో తోడు ఉంటుందనే భరోసాతో అబద్దాలు చెప్పకుండా ఏ విషయాలు దాపరికం లేకుండా ఉంటారు.   బయటి నుండి సహాయం.. పైన చెప్పుకున్న చిట్కాలన్నింటినీ అనుసరించిన తర్వాత కూడా భర్త ప్రవర్తన మెరుగుపడకపోతే.. భార్య  మంచి సలహాదారుడి సహాయం తీసుకోవచ్చు. అంతేకాదు భర్త అబద్ధం చెప్పడం మానేయడానికి  అతను చేస్తున్నది ఎంత  తప్పు అనే విషయం  అర్థం చేసుకునేలా చేయడానికి  అతనితో సమయం గడపాలి. దగ్గరి వ్యక్తుల  సహాయం..   భర్త అబద్దాలు చెప్పడం అనే  సమస్యను కుటుంబానికి బాగా దగ్గరగా ఉన్న వ్యక్తులు,   స్నేహితులు,  ఆత్మీయులు మొదలైనవారితో  చర్చించవచ్చు. ఈ సమస్యను పరిష్కరించడానికి సమయం పట్టవచ్చు.  కాబట్టి కొంత ప్రశాంతంగా ఉండాలి.  భార్యాభర్తల బంధంలో అబద్దాలు చెప్పడం బంధాన్ని ఎంత ప్రమాదంలో పడేస్తుందో అతనికి అర్థమయ్యే వరకు వేచి ఉండాలి.                                *రూపశ్రీ.
టీ భారతీయులకు ఒక గొప్ప ఎమోషన్. ఇది వేరే దేశం నుండి మన దేశానికి వచ్చిన పానీయమే అయినా భారతీయులు టీ అంటే ప్రాణం ఇస్తారు.  సమయం పాడు లేకుండా టీ తాగే వారు ఉంటారు.  నలుగురు స్నేహితులను అయినా,  ఉద్యోగ చర్చలకు అయినా, పిచ్చాపాటి కబుర్లు చెప్పుకోవడానికి అయినా ఛాయ్ సిట్టింగ్ ఒక మంచి మార్గం.  అయితే చాలా మందికి టీ తాగే సరైన మార్గం తెలియదు. టీ తాగడానికి కూడా ఒక పద్దతి ఉంది.  టీ కప్పు పట్టుకోవడం దగ్గర నుండి దాన్ని సిప్ చేయడం వరకు టీ వెనుక ఒక సంప్రదాయం,  దానికంటూ ఒక ప్రత్యేక గౌరవం ఉన్నాయి. ముఖ్యంగా పెద్ద పెద్ద రెస్టారెంట్లు,  ఖరీదైన లైఫ్ గడిపే వ్యక్తుల దగ్గర టీ తాగాల్సి వస్తే ఇష్టమొచ్చినట్టు తాగకూడదు.  టీ తాగేటప్పుడు పాటించాల్సిన టిప్స్ ఏంటి తెలుసుకుంటే.. కొన్ని ప్రాంతాలలో కొన్ని పదార్థాలను ఇష్టమొచ్చినట్టు తినలేం, తాగలేం.  తప్పు పద్దతిలో తినడం, తాగడం చేస్తే ప్రాంతీయత పరంగా వారిని అవమానించినట్టు ఫీలవుతారు.  అందుకే ప్రతి పదార్థం ఎలా తినాలి, ఎలా తాగాలి అనేవి తెలుసుకోవాలి. వాటిలో టీ తాగడం కూడా ఒకటి.  టీ భారతీయుల పానీయం కాదు.. కాబట్టి దాన్ని భారతీయులు వారికి నచ్చిన పద్దతిలో నచ్చినట్టు తాగేస్తారు. టీ తాగేటప్పుడు టీ కప్పు హ్యాండిల్ ను ఎల్లప్పుడూ టీ కప్పు సాసర్ పై ఉంచాలి. అది కూడా టీ కప్పు హ్యాండిల్ గడియారంలో  3 సంఖ్య ఎక్కడ ఉంటుందో ఆ కోణంలో ఉండాలి.  ఇక ఎడమ చేతితో టీ తాగేవారు అయితే టీ కప్పు హ్యాండిల్ గడియారంలో 9 సంఖ్య ఎక్కడ ఉంటుందో ఆ కోణం దగ్గర ఉండాలి. ఇలా ఉంటే టీ కప్పు అందుకోవడం సులభంగా ఉంటుంది. టీ కప్పు హ్యాండిల్ పట్టుకోవడానికి ఎప్పుడు చూపుడు వేలు, మధ్యవేలు,  బొటన వేలును ఉపయోగించాలి.  ఉంగరపు వేలు,  చిటికెన వేలును సపోర్ట్ కోసం ఉపయోగించాలి. టీ కప్పుతో పాటు చెంచా ఉంచితే దాన్ని కప్పు వెనుక భాగంలో ఉంచాలి.  కప్పులో ఎప్పుడూ చెంచాను ఉంచకూడదు.  టీలో పాలు లేదా పంచదార వేసుకున్నప్పుడు చెంచాను  కప్పు లో వృత్తాకారం లో తిప్పకూడదు.  అర్థవృత్తాకారంలో మాత్రమే అది కూడా ముందుకు వెనక్కు తిప్పాలి. శబ్దం రాకుండా తిప్పాలి. పంచదారను టీలో వేసుకుని చెంచాతో కలుపుతూ సుడిగుండం సృష్టించినట్టు తిప్పకూడదు.  అలాగే చెంచాను కప్పు మీద గట్టిగా కొట్టడం లాంటివి కూడా చేయకూడదు. టీని కలిపిన తరువాత చెంచాకు అంటుకున్న టీని నాకడం చేయకూడదు.  చెంచాను టీ కప్పు వెనుక భాగంలో పెట్టేయాలి. టీని కప్పులో సొంతంగా పోసుకునే పరిస్థితి ఉన్నప్పుడు కప్పు నిండుగా టీ పోసుకోకూడదు. ఎప్పుడూ కప్పులో 75శాతం మాత్రమే టీతో నింపాలి. 25శాతం ఖాళీగా ఉంచాలి.                                                *రూపశ్రీ.
ప్రస్తుత కాలంలో వయసుతో సంబంధం లేకుండా చాలా మందిని వేధిస్తున్న ప్రధాన ఆరోగ్య సమస్య గుండె జబ్బులు (Heart Diseases). మారుతున్న జీవనశైలి, ఒత్తిడి, శారీరక శ్రమ లేకపోవడం మరియు చెడు ఆహారపు అలవాట్ల వల్ల గుండె పనితీరు మందగిస్తోంది. అయితే, మనం తీసుకునే రోజువారీ ఆహారంలో కొన్ని చిన్న చిన్న మార్పులు చేసుకోవడం ద్వారా గుండెను ఎల్లప్పుడూ ఆరోగ్యంగా, బలంగా ఉంచుకోవచ్చని చెబుతున్నారు ప్రముఖ నిపుణులు డాక్టర్ శ్రీలత గారు. తెలుగువన్ హెల్త్ (TeluguOne Health) ప్రత్యేక వీడియోలో డాక్టర్ శ్రీలత గారు గుండె ఆరోగ్యానికి మేలు చేసే ఆహార పదార్ధాలు మరియు కొన్ని సులువైన చిట్కాలను పంచుకున్నారు. ఆ వివరాలు మీకోసం... గుండె ఆరోగ్యానికి రక్షణ కవచాలు.. ఈ ఆహారాలు: ఆకుకూరలు (Leafy Vegetables): తోటకూర, పాలకూర, గోంగూర వంటి ఆకుకూరల్లో విటమిన్లు, ఖనిజాలు (Minerals) పుష్కలంగా ఉంటాయి. ముఖ్యంగా వీటిలో ఉండే 'విటమిన్ కె' రక్తనాళాలను రక్షించి, బ్లడ్ ప్రెషర్ (BP) నియంత్రణలో ఉంచడానికి ఎంతగానో సహాయపడుతుంది. తృణధాన్యాలు (Whole Grains): మనం తినే పాలిష్ చేసిన బియ్యానికి బదులుగా ఓట్స్, బార్లీ, జొన్నలు, రాగులు, దంపుడు బియ్యం (Brown Rice) వంటి తృణధాన్యాలను డైట్‌లో చేర్చుకోవాలి. వీటిలో ఉండే పీచు పదార్థం (Fiber) శరీరంలో చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది. మంచి కొవ్వులు (Healthy Fats): అన్ని కొవ్వులు గుండెకు కీడు చేయవు. బాదం, వాల్‌నట్స్ వంటి నట్స్‌తో పాటు ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉండే గుమ్మడి గింజలు, ఫ్లాక్స్ సీడ్స్ (అవిసె గింజలు) గుండె రక్తనాళాల్లో పూడికలు (Blocks) ఏర్పడకుండా చూస్తాయి. నూనెల వాడకంలో జాగ్రత్తలు: వంటల్లో ట్రాన్స్ ఫ్యాట్స్ (Trans Fats) ఎక్కువగా ఉండే వనస్పతి, డాల్డాలను పూర్తిగా దూరం పెట్టాలి. బేకరీ ఫుడ్స్, ప్యాకేజ్డ్ స్నాక్స్ గుండె ఆరోగ్యానికి శత్రువులని డాక్టర్ శ్రీలత హెచ్చరిస్తున్నారు. ఉప్పు, పంచదార తగ్గించండి: ఆహారంలో సోడియం (ఉప్పు) శాతం పెరిగితే బీపీ పెరుగుతుంది. అది నేరుగా గుండెపై ప్రభావం చూపిస్తుంది. అందుకే ఉప్పు మరియు చక్కెర వాడకాన్ని వీలైనంత వరకు తగ్గించడం మంచిది. గుండె పదిలంగా ఉండాలంటే చేయాల్సినవి: ప్రతిరోజూ కనీసం 30 నుండి 45 నిమిషాల పాటు వాకింగ్ లేదా వ్యాయామం చేయడం అలవాటు చేసుకోండి. మానసిక ఒత్తిడిని తగ్గించుకోవడానికి యోగా లేదా ధ్యానం చేయండి. ధూమపానం (Smoking), మద్యపానం వంటి అలవాట్లకు దూరంగా ఉండండి. గుండె జబ్బులు వచ్చాక బాధపడటం కంటే, రాకుండా ముందే జాగ్రత్త పడటం ఎంతో ముఖ్యం (Prevention is better than cure). డాక్టర్ శ్రీలత గారు సూచించిన ఈ సాధారణ డైట్ టిప్స్ పాటిస్తూ మీ హృదయాన్ని పదికాలాల పాటు పచ్చగా ఉంచుకోండి. మీ ఆరోగ్య సమస్య ఏదైనా... మా హెల్త్ యూట్యూబ్ ఛానల్‌లో సీనియర్ డాక్టర్స్ చెప్పిన సలహాలు... సూచనలు ఉన్నాయి. మా యూట్యూబ్ ఛానల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 👉 TeluguOne Health సబ్‌స్క్రైబ్ చేయడం మర్చిపోకండి!
ప్రస్తుత ఆధునిక కాలంలో శారీరక ఆరోగ్యానికి ఎంత ప్రాధాన్యత ఇస్తున్నామో, మానసిక ఆరోగ్యానికి (Mental Health) కూడా అంతే ప్రాధాన్యత ఇవ్వడం ఎంతో అవసరం. కానీ, నేటి ఒత్తిడితో కూడిన జీవనశైలి, వ్యక్తిగత సమస్యల వల్ల చాలా మంది రకరకాల మానసిక రుగ్మతల (Mental Illness) బారిన పడుతున్నారు. అసలు మానసిక సమస్యలు ఎందుకు వస్తాయి? వాటి రకాలు ఏమిటి? వీటికి మందులు వాడకుండా కేవలం కౌన్సెలింగ్, థెరపీల ద్వారా శాశ్వత పరిష్కారం లభిస్తుందా? అనే విషయాలపై ప్రముఖ సీనియర్ సైకాలజిస్ట్ డాక్టర్ అన్నం సుబ్రహ్మణ్యం (న్యూ లైఫ్ కౌన్సెలింగ్ సెంటర్, హైదరాబాద్) గారు ఈ VIDEO లో విలువైన సమాచారాన్ని పంచుకున్నారు. మానసిక రుగ్మత (Mental Illness) అంటే ఏమిటి? సాధారణంగా ఒక వ్యక్తి ఆలోచనా విధానంలో, ప్రవర్తనలో మరియు భావోద్వేగాలలో అసాధారణ మార్పులు వచ్చి, అవి వారి దైనందిన జీవితాన్ని దెబ్బతీస్తే దానిని మానసిక రుగ్మతగా పరిగణిస్తారు. ఇది కేవలం 'పిచ్చి' కాదు, గుండె జబ్బు, మధుమేహం లాగే మెదడు పనితీరుకు సంబంధించిన ఒక ఆరోగ్య సమస్య. ప్రధాన మానసిక సమస్యలు - రకాలు: సమాజంలో ఎక్కువగా కనిపించే కొన్ని ముఖ్యమైన మానసిక రుగ్మతలు: డిప్రెషన్ (Depression - తీవ్ర నిరాశ): ఎప్పుడూ బాధగా ఉండటం, దేనిమీదా ఆసక్తి లేకపోవడం. యాంగ్జైటీ డిజార్డర్స్ (Anxiety Disorders - ఆందోళన): చిన్న విషయాలకే విపరీతంగా భయపడటం, కంగారుపడటం.  అబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్ (OCD): ఒకే ఆలోచన పదే పదే రావడం (ఉదాహరణకు చేతులు కడగడం, తాళాలు సరిచూసుకోవడం).  బైపోలార్ డిజార్డర్ (Bipolar Disorder): ఒకసారి విపరీతమైన ఆనందం, మరోసారి తీవ్రమైన నిరాశకు లోనవడం.  స్కిజోఫ్రీనియా (Schizophrenia): లేని విషయాలు ఉన్నట్లు ఊహించుకోవడం, భ్రమపడటం. మానసిక సమస్యలను గుర్తించడం ఎలా? (Diagnosis) చాలా మంది తమకు సమస్య ఉన్నా బయటకు చెప్పుకోవడానికి సంకోచిస్తారు. ఒక వ్యక్తిలో క్రింది లక్షణాలు కనిపిస్తే వారు మానసిక ఒత్తిడిలో ఉన్నారని అర్థం చేసుకోవచ్చు: నిద్రలేమి లేదా అతిగా నిద్రపోవడం. ఎవరితోనూ కలవకుండా ఒంటరిగా ఉండటానికి ప్రయత్నించడం. చిన్న విషయాలకే విపరీతంగా కోపం లేదా ఏడుపు రావడం. నెగటివ్ ఆలోచనలు, ఆత్మహత్య ఆలోచనలు రావడం. మందులు లేకుండా మానసిక సమస్యలకు చికిత్స (Treatment Without Medication): చాలా మంది మానసిక సమస్య అనగానే జీవితాంతం మందులు (Psychiatric Medicines) వాడాలేమో అని భయపడతారు. అయితే, అన్ని సమస్యలకూ మందులు అవసరం లేదని డాక్టర్ అన్నం సుబ్రహ్మణ్యం గారు స్పష్టం చేశారు. సైకాలజిస్టులు అందించే కొన్ని ప్రత్యేక పద్ధతుల ద్వారా వీటిని పూర్తిగా నయం చేయవచ్చు: కాగ్నిటివ్ బిహేవియరల్ థెరపీ (CBT): ఈ థెరపీ ద్వారా రోగిలోని ప్రతికూల (Negative) ఆలోచనలను గుర్తించి, వాటిని సానుకూల (Positive) ఆలోచనలుగా మారుస్తారు. సైకాలజికల్ కౌన్సెలింగ్: మనసులోని బాధను, ఒత్తిడిని నిపుణులైన సైకాలజిస్ట్‌తో పంచుకోవడం ద్వారా సగం సమస్య పరిష్కారమవుతుంది. వారు సమస్య మూలాల్లోకి వెళ్లి పరిష్కారాన్ని చూపిస్తారు. లైఫ్ స్టైల్ మార్పులు: క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, పోషక విలువలున్న ఆహారం తీసుకోవడం, సరైన నిద్ర మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. మైండ్‌ఫుల్‌నెస్ మరియు ధ్యానం: మెదడును ప్రశాంతంగా ఉంచడానికి, ఒత్తిడిని తగ్గించుకోవడానికి ధ్యానం (Meditation) ఎంతో సహాయపడుతుంది. మానసిక సమస్యలు అనేవి దాచుకోవాల్సిన విషయాలు కావు. శారీరక నొప్పులకు డాక్టర్‌ను సంప్రదించినట్లే, మానసిక ఇబ్బందులు ఉన్నప్పుడు సంకోచించకుండా సైకాలజిస్ట్‌ను కలిసి కౌన్సెలింగ్ తీసుకోవడం ఉత్తమం. మందుల వాడకం లేకుండా, కేవలం సరైన అవగాహన, థెరపీలతో మానసిక రుగ్మతలను జయించి సంతోషకరమైన జీవితాన్ని గడపటానికి మా హెల్త్ యూట్యూబ్ ఛానల్‌లో సీనియర్ డాక్టర్స్ చెప్పిన సలహాలు... సూచనలు ఉన్నాయి. మా యూట్యూబ్ ఛానల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 👉 [TeluguOne Health] సబ్‌స్క్రైబ్ చేయడం మర్చిపోకండి!
మలబద్ధకం (Constipation) లేదా మలబద్దకంతో బాధపడుతున్నారా? సుఖ విరేచనం అవ్వక ఇబ్బంది పడుతున్నారా? ఈ రోజుల్లో మారుతున్న జీవనశైలి, ఆహారపు అలవాట్ల వల్ల చాలా మంది ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య మలబద్ధకం. ఈ సమస్యను నిర్లక్ష్యం చేస్తే పైల్స్, గ్యాస్ వంటి ఇతర ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది. ఎలాంటి మందులు వాడకుండా, ఇంట్లోనే సహజంగా మలబద్ధకాన్ని ఎలా తగ్గించుకోవచ్చో ప్రముఖ ఆయుర్వేద నిపుణులు డాక్టర్ చిట్టిబొట్ల మధుసూదన శర్మ ఈ వీడియోలో అద్భుతమైన చిట్కాలను వివరించారు.  ముఖ్యంగా ఎండుద్రాక్ష (Raisins లేదా Kishmish) ఉపయోగించి సుఖ విరేచనం ఎలా అయ్యేలా చేసుకోవచ్చో, అలాగే మలబద్ధకానికి గల కారణాలు మరియు ఆయుర్వేద గృహ వైద్యం గురించి పూర్తి వివరాలు ఈ వీడియోలో చూసి తెలుసుకోండి. వీడియోలోని ముఖ్యమైన అంశాలు: మలబద్ధకం రావడానికి గల ముఖ్య కారణాలు ఏమిటి? కిస్‌మిస్ (ఎండుద్రాక్ష) మలబద్ధకాన్ని ఎలా నివారిస్తుంది? సుఖ విరేచనం కోసం కిస్‌మిస్‌ను ఎలా ఉపయోగించాలి? నిత్యం పాటించవలసిన సులభమైన ఆయుర్వేద చిట్కాలు. ఈ రోజే ఈ చిట్కాలను పాటించండి, మలబద్ధకం సమస్య నుండి ఉపశమనం పొందండి! మీ ఆరోగ్య సమస్య ఏదైనా... మా హెల్త్ యూట్యూబ్ ఛానల్‌లో సీనియర్ డాక్టర్స్ చెప్పిన సలహాలు... సూచనలు ఉన్నాయి. మా యూట్యూబ్ ఛానల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 👉 TeluguOne Health (సబ్‌స్క్రైబ్ చేయడం మర్చిపోకండి!)