Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...బీఆర్ఎస్ లో నక్కలు.!
posted on: Jul 20, 2026 4:04PM
.webp)
తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్) అధినేత్రి కల్వకుంట్ల కవిత తన మౌనాన్ని బద్దలు కొట్టారు. బీఆర్ఎస్ నుంచి తాను బయటకు రావడానికి కారణాలను తొలి సారిగా వెళ్లడించారు. బీఆర్ఎస్ నుంచి తాను నిష్క్రమించడానికి పార్టీలోని కొందరు గుంటనక్కల వంటి నేతలే కారణమంటూ కుండబద్దలు కొట్టారు.
ఆ నక్కల కారణంగానే తాను తన మార్గాన్ని ఎంచుకుని బయటకు రావాల్సి వచ్చిందని చెప్పారు. బీఆర్ఎస్ పార్టీలోని తన మాజీ సహచరులపై తీవ్ర విమర్శలు గుప్పించిన కవిత.. బీఆర్ఎస్లోని కొందరు గుంటనక్కల వంటి నేతల బృందం తనను ఒంటరిని చేసి, పక్కన పెట్టడానికి పద్ధతి ప్రకారం పనిచేశారని కవిత చెప్పారు.
బీఆర్ఎస్ నుంచి తనను బయటకు పంపడానికి ఆనక్కల బృందం.. పథకం ప్రకారం తప్పుడు ప్రచారం చేసిందనీ, వారి కారణంగానే తాను బయటకు రాక తప్పని పరిస్థితులు ఏర్పడ్డాయనీ చెప్పారు. ఈ మేరకు సామాజిక మాధ్యమ వేదికగా చేసిన పోస్టు ఇప్పుడు తెగ వైరల్ అవుతోంది. తాజాగా కవిత వ్యాఖ్యలు బీఆర్ఎస్ లోని తన ప్రత్యర్థులతో ఆమె పోరాటం కొనసాగుతోందని తేటతెల్లం చేస్తున్నాయి.
BRS, Kalvakuntla Kavitha, BRS Party Resignation, Breaks Silence,



.webp)


