LATEST NEWS
  డీఎంకే, బీజేపీలతో పొత్తులుండవ్. మా పార్టీ 'సీఎం కేండెట్ నేనే'నంటూ విజయ్ ప్రకటన. ఇదయ దళపతి, టీవీకే అధినేత విజయ్.. ఎట్టకేలకు ఒక క్లారిటీ ఇచ్చారు. తమిళ స్పీకర్ అప్పావు వంటి వారు విజయ్ మరో రజనీ కాంత్ అవుతారని భావించారు. కానీ ఇక్కడ సీన్ చూస్తే ఆయన ఎవరితోనూ పొత్తులుండవ్. అంతా ఓన్ గా పవర్ లోకి రావడమే అంటూ కుండ బద్ధలు కొట్టేశారు. నా పార్టీ సీఎం అభ్యర్ధిగా నేనే ఉంటానంటూ ఆయన క్లారిటీ ఇచ్చారు. ఇదిలా ఉంటే, కఠినమైన తమిళ రాజకీయాల్లో విజయ్ ఎంత వరకూ రాణించగలరు? అన్నదొక డిబేట్. కారణం ఇక్కడ జయ తర్వాత ఒక గ్యాప్ వచ్చిన మాట వాస్తవమే. దానికి తోడు ఆమె నెచ్చెలి శశికళ సైతం రాజకీయాలకు దూరంగా ఉండటంతో.. ఇక్కడొక వ్యాక్యూమ్ ఉన్న మాట నిజమే. అయితే స్టాలిన్ తర్వాత ఆ స్థాయిలో పొలిటికల్ మాస్ ఇమేజీని సొంతం చేసుకుని విజయ్ సీఎం పీఠం ఎక్కగలరా? అన్న ప్రశ్నకు సమాధానం తెలియాల్సి ఉంది. బేసిగ్గా దళిత సామాజిక వర్గానికి చెందిన 'విజయ్ జోసెఫ్ చంద్రశేఖర్'(పూర్తి పేరు) ని ఇక్కడి ఓటర్లు ఎంత వరకూ ఆదరిస్తారు? అన్న క్వశ్చన్లు కూడా డీకోడ్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే మేజర్ కులాలైన పన్నియార్లు, గౌండర్లు డీఎంకే, అన్నాడీఎంకేలుగా చీలిపోయాయి. ఇవిలా ఉంటే తమిళనాట గల కులాల వారీ శాతాలను పరిశీలిస్తే విజయ్ ప్రాతినిథ్యం వహించే దళిత ఓటు బ్యాంకు సుమారు ఇరవై శాతం మాత్రమే ఉంది. మిగిలిన 80లో అరవై శాతం బీసీలు, ఇంకో ఇరవై శాతం మరకూ ఇతర కులాలు ఉన్నాయి. కొంత కాలంగా దళిత పాంతర్స్ పార్టీ తమిళనాడు లో కూడా ఉంది. కానీ అది ఇప్పటి వరకూ ఏమంత ప్రభావం చూపించలేదు.ఇక వాటీజ్ విజయ్ ఆయన కెపాసిటీ ఏంటి? పూర్వాపరాలు ఎలాంటివని చూస్తే.. తండ్రి చంద్రశేఖర్ దర్శకుడు కాగా, తల్లి కర్ణాటక సంగీత కళాకారిణి. విజయ్ కి ఒక చెల్లెలు కూడా ఉండేది. పేరు దివ్య. అయితే ఆమె తన రెండో ఏటనే చనిపోయింది. ఆమె పేరిట దివ్య విజయ్ ప్రొడక్షన్ హౌస్ స్థాపించడం మాత్రమే కాకుండా శుక్రన్ సినిమాలో ఆమె బొమ్మ కూడా చూపించాడు విజయ్.  తండ్రి తీసిన వెట్రి అనే సినిమాతో చైల్డ్ ఆర్టిస్టుగా ఎంట్రీ ఇచ్చారు విజయ్. ఈ పదమే తన పార్టీ పేరులోనూ పెట్టుకున్నారాయన. విజయ్ పార్టీ పేరు 'తమిళిగ వెట్రి కళగం'. ఇక కమ్యూనికేషన్ లో పట్టా తీసుకుందాం అనుకున్న విజయ్ కి ఎలాగైనా సరే హీరో కావాలని ఉండేది. దీంతో డిగ్రీ మధ్యలోనే డిస్ కంటిన్యూ చేసి వచ్చేశాడు. 18 ఏళ్ల వయసులో తండ్రి చంద్రశేఖర్ తీసిన 'నాలై తీర్పు' అనే చిత్రంలో తాను హీరోగా, కీర్తన హీరోయిన్ గా నటించారు. విచిత్రమేంటంటే తన తండ్రి చిత్రమే అయినా.. ఆడిషన్స్ లో పాల్గొని మరీ సెలెక్ట్ అయ్యాడు విజయ్. ఆ టైంలో విజయ్ కొట్టిన డైలాగ్ అన్నామలైలో రజనీకాంత్ డైలాగ్. అందుకే విజయ్ 'రజనీకాంత్ లేకుంటే తాను లేనని' అంటారాయన. ఇదిలా ఉంటే, తమిళనాట విజయ్ హవా.. 'రసిగన్' మూవీతో ఒక్కసారిగా పెరిగింది. విజయ్ కీ మన తెలుగు వారికీ ఉన్న అనుబంధం ఎలాంటిదంటే.. ఆయన గల్లి, పోకిరి, బద్రీ వంటి తెలుగు చిత్రాలు రీమేక్ చేసి మరీ స్టార్ డమ్ సంపాదించుకున్నారు. వీటిల్లో పవన్ కళ్యాణ్‌ సినిమా బద్రి కూడా ఒకటి. ఇదిలా ఉంటే.. "పవన్ కళ్యాణ్‌ ని తాను తెరపై కాపీ కొట్టానేమోగానీ తెరబయట- రాజకీయంగా కాదని" అంటున్నారాయన. తాను సొంత కాళ్లపై రాజకీయాల్లో నిలబడతానని అంటారు. 2017లో హయ్యస్ట్ పెయిడ్ ఆర్టిస్టుల్లో 2వ స్థానంలో ఉన్న విజయ్ ప్రస్తుతం నెంబర్ వన్- తనే. మెర్సల్, తరీ, సర్కార్, మాస్టర్ వంటి సినిమాలు వంద, నూట యాభై, రెండు వందల కోట్ల వరకూ వసూల్ చేశాయి. బీస్ట్ కూడా యావరేజ్ టాక్ తెచ్చుకున్నా.. కలెక్సన్ల పరంగా విజయ్ కింగే అని నిరూపించింది. విదేశాల్లో రజనీ తర్వాత అంతటి ఫాలోయింగ్ ఉన్న స్టార్ యాక్టర్ విజయ్. బేసిగ్గా విజయ్ స్థానంలో అజిత్ ఇలాంటి పొలిటికల్ డయాస్ పైకి రావల్సింది. జయలతిత ఎంతో ముందు చూపుకొద్దీ.. 'తల' అజిత్ ని ఎంకరేజ్ చేయాలని చూశారు. కానీ ఆయనేమంత రియాక్ట్ కాలేదు. తానేంటో తన రేసింగ్ ఏంటో.. మూవీస్ ఏంటో.. అన్నట్టుగా ఉండిపోయారు. ప్రస్తుతానికి కూడా అజిత్ నుంచి పెద్దగా పొలిటికల్ రియాక్షన్ లేదు.  కానీ తన తండ్రి ప్రేరణో లేక, మరొకటో తెలీదు కానీ.. విజయ్ మాత్రం అనూహ్యంగా పొలిటికల్ పార్టీ అనౌన్స్ చేశారు. ఇప్పటి వరకూ దళిత్ కమ్యూనిటీ ఇక్కడ సిఎం పోస్టు వరకూ ఎదగలేదు. ఈ కొరత తీర్చడం కోసమైనా ఆయన ఈ పార్టీ, దాని నిర్వహణ చేయాలని భావించినట్టుగా కనిపిస్తోంది.అయితే తమిళ రాజకీయాల్లో కులాల ప్రస్తావన అధికంగా ఉంటుంది.  ఈ ప్రకారం చూస్తే ఆయన భారీ ఎత్తున అక్కడి లీడింగ్ క్యాస్ట్ లీడర్స్ ని తన పార్టీలోకి ఆహ్వానించాల్సి ఉంటుంది. మొన్నటికి మొన్న రోజా సైతం టీవీకేలోకి రావడానికి ఉత్సాహం చూపించగా.. అవినీతి మరక గల వారు మాకొద్దని ఆయన తెగేసి చెప్పినట్టు సమాచారం. అయితే భర్త ఆర్కే సెల్వమణి దక్షిణ భారత సినీ కార్మికుల సంఘం అధ్యక్షుడు కావడంతో.. ఆమెకు తలుపులు ఇంకా మూసుకుపోలేదని కూడా అంటారు. ఇదంతా ఇలాగుంటే అవినీతి మరక అంటని రాజకీయ నేతల్ని ప్రస్తుత పరిస్థితుల్లో ఊహించనలవి కాదు. అయితే విజయ్ తన తొలినాళ్లలో అభిమానులకే అధిక ప్రాధాన్యతనిచ్చేలా తెలుస్తోంది. వచ్చే ఎన్నికల్లో ఫలితాలు చూసుకున్న తర్వాత.. ఆయన రాజకీయ ధోరణిలో ఒక క్లారిటీ వచ్చేలా కనిపిస్తోంది. అప్పటి వరకూ విజయ్ ఎన్ని కామెంట్లు చేసినా.. వాటికి పెద్దగా విలువనిచ్చేలా కనిపించడం లేదు. గతంలో అంటే, 2005లో తమిళ సినిమా ఫీల్డు నుంచి విజయ్ కాంత్ రూపంలో 'డీఎండీకే' అనే పార్టీ పెట్టడం.. ఆయన పెద్దగా ప్రభావం చూపలేక పోవడం అన్నది విజయ్ కి సవాల్ విసురుతోంది. దీన్నిబట్టీ చూస్తే తమిళనాట సినిమా వారి ప్రాధాన్యత.. ఒక ముగిసిన అధ్యాయం అనేవారున్నారు. అయితే అది అప్పుడు- ఇప్పుడు కాదంటారు విజయ్ ఫ్యాన్స్. విజయ్ కాంత్ పార్టీ పెట్టి ఇరవై ఏళ్లు గడిచిపోయాయి. దానికి తోడు ఎక్కడో 'ఆంధ్ర సినీ పొలిటీషియన్ పవన్' మన వరకూ వచ్చేస్తున్నాడు. కాబట్టి మనం అలెర్ట్ కావాలి. ఇక్కడున్న లోకల్ పొలిటికల్ టాలెంట్ ని పబ్లిక్ ఎంకరేజ్ చేయాలన్న కోణంలో విజయ్ తమిళ రాజకీయ తెరపైకి దూసుకొస్తున్నారు. మరి చూడాలి.. ఈ కామెంట్లలోని దమ్ము తన రాజకీయాల్లో ఆయన ఏ విధంగా కొనసాగిస్తారో లేదో తేలాల్సి ఉంది  
  గతంలో అమెరికా బెదిరించినా మాజీ ప్రధాని ఇందిరా గాంధీ భయపడలేదని, కానీ అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఫోన్ చేయగానే పాకిస్థాన్‌తో యుద్ధాన్ని ప్రధాని మోదీ ఆపేశారని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆరోపించారు. హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో నిర్వహించిన ‘కాంగ్రెస్‌ సామాజిక న్యాయ సమరభేరి’ సభలో మాట్లాడుతు ఆపరేషన్ సింధూర్‌కు లోక్ సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీతో పాటు కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ మద్దతు తెలిపిందని, అయితే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాకిస్థాన్‌తో యుద్ధాన్ని మధ్యలోనే నిలిపివేశారని ఆయన అన్నారు.  దేశం కోసం ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ ప్రాణ త్యాగం చేశారని, బీజేపీ, ఆర్ఎస్ఎస్ నుంచి ఒక్కరైనా దేశం కోసం ప్రాణాలను అర్పించారా అని ఆయన ప్రశ్నించారు. ప్రధాని మోదీ, అమిత్ షా అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చారని విమర్శించారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల కృషితోనే అధికారంలోకి వచ్చిందని ఖర్గే పేర్కొన్నారు. సీఎం రేవంత్ రెడ్డి, డీప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సమష్టిగా పనిచేసి బీఆర్ఎస్‌ను ఓడించారని ప్రశంసించారు. మాజీ సీఎం కేసీఆర్ తన పాలనలో రైతులను, మహిళలను, నిరుద్యోగులను మోసం చేశారని ఆరోపించారు.  కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన మొదటి ఏడాదిలోనే 60 వేల ప్రభుత్వ ఉద్యోగ నియామక పత్రాలు అందించామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు ప్రధాని మోడీ, కేసీఆర్, కేటీఆర్ దీనిపై చర్చ పెట్టాలని, ఒక్క ఉద్యోగం తక్కువ ఇచ్చినట్టు నిరూపించినా వారి కాళ్ళ ముందు క్షమాపణ చెప్పేందుకు సిద్ధమని సవాల్ విసిరారు.గత బీఆర్ఎస్ పాలనలో యువతను గొర్రెలు, బర్రెలు కాయాలని, చెప్పులు కుట్టుకోవాలని, చేపలు పట్టుకోవాలని వారి కులవృత్తుల్లోకి మళ్ళీ వాళ్ళని నెట్టాలని చూశారని ముఖ్యమంత్రి అన్నారు
  తెలంగాణ బీజేపీ నూతన ఆధ్యక్షుడిగా, ఏకగ్రీవంగా ఎన్నికైన ఎన్. రామచంద్ర రావు, బాధ్యతలు స్వీకరించారు. ఇక్కడితో ఇంచుమించుగా సంవత్సరం  పైగా సాగుతున్న, కౌన్ బనేగా బీజేపీ అధక్ష్ కహానీలో ఒక అధ్యాయం ముగిసింది. అయితే,అసలు కథ ఇప్పుడే మొదలైందని, రాజకీయ పరిశీలకులు  భావిస్తున్నారు. ముఖ్యంగా,రామచంద్ర రావు ఎన్నిక లేదా ఎంపికలో బీజేపీ అధిష్టానం అనుసరించిన ప్రమాణాల విషయంలో ప్రధానంగా చర్చ జరుగుతోంది.రామచంద్ర రావు, ఎన్నికతో, కమల దళంలో పాత – కొత్తల విభజన రేఖ మరో మారు ప్రముఖంగా చర్చకు వచ్చింది.  తెలంగాణలోనే కాకుండా, పొరుగు రాష్ట్రం ఎపీలోనూ, అదే యార్డ్ స్టిక్’ ఆధారంగా’ పీవీ మాధవ్’కు పార్టీ పగ్గాలు అప్పగించారనే ప్రచారం జరగడంతో,ఇప్పడు పార్టీలో కొత్తగా చేరిన వారి పరిస్థితి ఏమిటి? ఎప్పటికీ, పల్లకీ మోయడ మేనా? అనే ప్రశ్నఇప్పుడు పార్టీ నేతల్లో ప్రముఖంగా చర్చకు వస్తున్నట్లు తెలుస్తోంది.  ముఖ్యంగా పార్టీ అధ్యక్ష పదవి ఆశించి భంగపడిన నాయకులలో, ‘కొందరు’ ఈ పరిస్థితిని జీర్ణించుకోలేక పోతున్నారని అంటున్నారు.   అయితే, ఇదేమీ కొత్తగా తెచ్చిన నిబంధన కాదని, పార్టీ రాజ్యాంగంలో ఉన్నదే అని పార్టీ నేతలు చెపుతున్నారు.పార్టీలో పదేళ్ళ క్రియాశీల సభ్యత్వంతో పాటుగా క్రియాశీల పాత్ర పోషించిన వారికి మాత్రమే పార్టీ సంస్థాగత ఎన్నికల్లోపోటీ చేసే అర్హత ఉంటుందని, వివరణ ఇస్తున్నారు. అలాగే, అధ్యక్ష పదవి ఆశించి భంగ పడిన నాయకులు నొచ్చుకోవడం, సహజమే అంటున్నారు. త్వరలోనే పరిస్థితి చక్కబడుతుందని, దశాబ్దాలుగా పార్టీ సంస్థాగత వ్యవహారాలను దగ్గరగా చూస్తున్న పెద్దలు అంటున్నారు.   మరోవంక,పార్టీ లోపల వెలుపల కూడా,రామచంద్ర రావుకు అధ్యక్ష పదవి ఇవ్వడాన్ని ఎవరూ పెద్దగా తప్పు పట్టడంలేదు. ఆయనకు, అధ్యక్షుడు అయ్యేందుకు,అవసరమైన అర్హతలు అన్నీ  ఉన్నాయి. అయితే, ప్రస్తుత రాజకీయ వాతావరణంలో,ఆయనకంటే దూకుడుగా వెళ్ళగలిగే, ప్రత్యర్ధులు ఒకటంటే నాలుగు అనగలిగే, ‘నోటి దురుసు’ ఉన్న నాయకుడు అయితే బాగుండేదని అంటున్నారు. అలాగే, అలాక్లు వహించిన నాయకులు కూడా మెల్లమెల్లగా  సర్దుకుంటున్నారని అంటున్నారు. చివరకు, పోటీలో ప్రముఖంగా వినిపించిన మల్కాజ్ గిరి ఎంపీ  ఈటల రాజేందర్ కూడా, మొదట్లో కొంత నొచ్చుకున్నా,ఆ తర్వాత సర్డుకున్నట్లు కనిపిస్తోందని అంటున్నారు. అయితే, పార్టీ క్యాడర్’లో ఒక వర్గం మాత్రం బీజేపే సెల్ఫ్ గోల్ చేసుకుందనే అభిప్రాయాన్ని వ్యక్తపరుస్తున్నారు.అలాగే సోషల్ మీడియాలోనూ రామచంద్ర రావును, ‘డమ్మీ’ ప్రెసిడెంట్ అంటూ ట్రోల్ చేస్తున్నారు.  అయితే, రామచంద్ర రావు అందరూ అనుకుంటున్నట్లుగా సౌమ్యుడు కాదని, ఆయన గత చరిత్ర తెలిసిన వారు చెపుతున్నారు. నిజానికి ఎవరో చెప్పడం కాదు, స్వయంగా ఆయనే, ‘‘మీరు అనుకుంటున్నట్లు నేను సౌమ్యుణ్ని కాను. ఉస్మానియా క్యాంప్‌సలో ఉన్నప్పుడు విద్యార్థుల కోసం 14 సార్లు జైలుకు వెళ్లొచ్చా. పోలీసుల లాఠీ దెబ్బలు తిన్నా. జితేందర్‌రెడ్డిని హత్య చేసిన నక్సలైట్లను అరెస్టు చేయాలని నాడు అసెంబ్లీ ముందు ధర్నా చేశా. అప్పుడే లాఠీచార్జిలో నా చెయ్యి విరిగింది. సోషల్‌ మీడియాలో ట్రోల్‌ చెయ్యడం కాదు.. దమ్ముంటే ఎదురుగా వచ్చి పోరాడాలి’’ అని కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ నేతలకు రాంచందర్‌రావు సవాలు విసిరారు. అయితే ఇవ్వన్నీ ఎలా ఉన్నా, రామచంద్ర రావు తన ముందున్న సవాళ్ళను ఎలా, ఎంత సమర్ద వంతంగా ఎదుర్కుంటారనే, దానిపై  ఆయన భవిష్యత్’తోపాటుగా పార్టీ భైశాయ్త్ కూడ ఆధార పడి ఉంటుందని అంటున్నారు. నిజానికి,రామచంద్ర రావు ముందు, సవాలక్ష సవాళ్ళున్నాయి. ముఖ్యంగా, ఓచేత్తో సంస్థాగతంగా పార్టీని బలోపేతం చేయడంతో పాటుగా, మరో చేత్తో స్థానిక సంస్థల ఎన్నికలు మొదలు 2008 అసెంబ్లీ ఎన్నికలవరకు, ఎన్నికల సమరంలోపార్టీని విజయ పథంలో నడిపించడం వరకు, ఎన్నో సవాళ్ళు అయన ముందున్నాయని అంటున్నారు. అలాగే, ఈ అన్నిటినీ మించి, ఆయన ఎన్నికతో పస్పుటంగా పైకొచ్చిన పాత కొత్త విభజన రేఖను తుడిచేసి, సమన్వయంతో పార్టీని ముదుకు తెసుకుపోవడం  రామచంద్ర యో మున్డునన్ అతి పెద్ద సవాలుగా పరిశీలకులు భావిస్తున్నారు.  
    ఈనెల 11న కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ పుట్టిన రోజు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ప్రభుత్వ పాఠశాలలు, రెసిడెన్సియల్ స్కూళ్లలో చదివే టెన్త్ క్లాస్ విద్యార్థినీ, విద్యార్థులతోపాటు  భారీ ఎత్తున సైకిళ్లను పంపిణీ చేయనున్నారు. తన పార్లమెంట్ పరిధిలోని జిల్లాల వారీగా చూస్తే.... కరీంనగర్ జిల్లాలో పదో తరగతి చదువుకునే బాలబాలికలు 3096 మంది ఉన్నారు. రాజన్న సిరిసిల్లలో 3841, జగిత్యాల జిల్లాలో 1137, సిద్దిపేటలో 783, హన్మకొండ జిల్లాలో 491 మంది వెరసి 9348 మంది బాలబాలికలు టెన్త్ క్లాస్ అభ్యసిస్తున్నారు.  అట్లాగే కరీంనగర్ కార్పొరేషన్ పరిధిలో 66 డివిజన్లు ఉన్నాయి. ఒక్కో డివిజన్ కు 50 చొప్పున సైకిళ్లను పంపిణీ చేయనున్నారు. వీటితోపాటు ఒక్కో మండలానికి వంద చొప్పున సైకిళ్లను అదనంగా పంపిణీ చేస్తారు. అట్లాగే హుజూరాబాద్, జమ్మికుంట, హుస్నాబాద్, సిరిసిల్ల, వేములవాడ, చొప్పదండి, కొత్తపల్లి మున్సిపాలిటీల పరిధిలో ఒక్కో వార్డుకు 50కి చొప్పున పంపిణీ చేస్తారు. ఇక గ్రామ పంచాయతీల వారీగా 10 నుండి 25 సైకిళ్ల చొప్పున పంపిణీ చేయనున్నారు. వెరసి తన కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో 20 వేల సైకిళ్లను దశలవారీగా పంపిణీ చేసేందుకు సిద్దమయ్యారు. ఈ మేరకు సైకిళ్ల తయారీలో పేరుగాంచిన ప్రముఖ సంస్థకు నెల రోజుల క్రితమే ఆర్డర్ కూడా ఇచ్చారు.  ఇప్పటికే 5 వేల సైకిళ్లు కరీంనగర్ కు వచ్చాయి. తొలి దశలో ఐదు వేల సైకిళ్లను  ఈనెల 8 లేదా 9వ తేదీన పంపిణీ చేసేందుకు బండి సంజయ్ సిద్ధమయ్యారు. మిగిలిన సైకిళ్లు కూడా వచ్చిన వెంటనే అసెంబ్లీ నియోజకవర్గాల, మండలాల వారీగా పంపిణీ చేయనున్నారు. ఇక  సైకిళ్ల ఖర్చు వివరాలకు వస్తే ఒక్కో సైకిల్ ను రూ.4 వేల చొప్పున కొనుగోలు చేస్తున్నారు. సైకిల్ రాడ్ కు ఒకవైపు ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఇంకోవైపు బండి సంజయ్ ఫోటోను ముద్రించనున్నారు. టెన్త్ విద్యార్థులకే ఎందుకంటే.... ప్రభుత్వ స్కూళ్లలో చదువుకునే పిల్లలు పేద కుటుంబం నుండి వచ్చిన వాళ్లే ఉంటారనే విషయం తెలిసిందే. తమ ఇంటి నుండి స్కూల్ దాకా వెళ్లడానికి తగిన రవాణా సౌకర్యాల్లేక, ఆటోలు, బస్సులు వెళ్లే స్థోమత లేక ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా టెన్త్ క్లాస్ విషయానికొచ్చే సరికి స్కూల్ వేళలు ముగిసిన తరువాత స్పెషల్ క్లాస్ లకు హాజరు కావాల్సి ఉంటుంది. దీనివల్ల పొద్దుపోయేదాకా స్కూళ్లోనే ఉండాల్సి వస్తుంది. దీనిని ద్రుష్టిలో ఉంచుకుని టెన్త్ బాలబాలికలకు రవాణా ఇబ్బంది ఉండకూడదనే సదుద్దేశంతో బండి సంజయ్ కుమార్ ప్రధాని మోదీ కానుకగా సైకిళ్లను పంపిణీ చేయనుండటం విశేషం.
  అధికారులు అంటే లెక్కలేని తనం వైసీపీ నేతల్లో ఇంకా కనిపిస్తుంది. అధికారుల పట్ల వారి దురుసు ప్రవర్తన వారి పెత్తందారి పోకడలకు అద్దం పడుతుంది. వైసీపీ నేతల్లో పెత్తందారి పోకడలు పోలేదు అనడానికి చేవిరెడ్డి భాస్కర్ రెడ్డి దురుసు ప్రవర్తనే నిదర్శనం. మద్యం కుంభకోణం కేసులో సిట్ అధికారుల విచారణకు సహకరించాల్సింది పోయి... మీ అంతు తేలుస్తా, సిట్ కార్యాలయం ముందు ఇంటిని అద్దెకు తీసుకొని ఒక్కొక్కరి తాట తీస్తానని చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి బెదిరించిన తీరు ఆయన అహంకార దోరిణికి నిదర్శనం. విచారణ చేస్తున్న అధికారులపై ఈ రకమైన దురుసు ప్రవర్తన వైసీపీ నాయకుల సైకో విధానాన్ని తెలియజేస్తోంది. అధికారం పోయినా ఇంకా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి అహంకారం దగ్గలేదు.  ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెప్పినా చెవిరెడ్డిలాంటి మూర్ఖుల్లో ఇంకా మార్పు రాలేదు. ఇంకా వైసీపీ ప్రభుత్వమే ఉందన్న భ్రమలో ఉన్నాడు. జైలు జీవితం తప్పదని తెలిసే విజయవాడ జైలులో చెవిరెడ్డి రంకెలు వేస్తూ చిందులు తొక్కుతున్నాడు. తప్పు చేశాడు కాబట్టే చెవిరెడ్డిలో ఈ విధమైన భయం, ఆందోళనలు కనిపిస్తున్నాయి. మద్యం కుంభకోణంలో కోట్ల రూపాయలు దోచుకొని, ఎన్నికల్లో తప్పుడు పద్దతిలో గెలిచేందుకు తరలించాడు. సిట్ అధికారులు 200 ప్రశ్నలు వేసినా ఒక్క సమాధానం కూడా చెవిరెడ్డి నుంచి రాలేదంటే... ఐదేళ్ల పాటు మద్యం కుంభకోణంలో ఏ రేంజ్ లో సొమ్ములు పక్కదారి పట్టించారో అర్థమవుతుంది. మద్యం కుంభకోణంలో ఉన్న ఏ ఒక్కరిని ఈ ప్రభుత్వం విడిచిపెట్టదని వైసీపీ నాయకులు గుర్తుంచుకోవాలని చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని తెలిపారు  
ALSO ON TELUGUONE N E W S
  ప్రముఖ నటుడు ఫిష్ వెంకట్ తీవ్ర అనారోగ్యం పాలైన సంగతి తెలిసిందే. కొంతకాలంగా ఆయన కిడ్నీ సంబంధిత సమస్యతో బాధపడుతున్నారు. ఫిష్ వెంకట్ రెండు కిడ్నీలు పాడైపోయాయని, ఆరోగ్యం బాగా క్షీణించిందని తెలుస్తోంది. తమను ఆదుకోవాలంటూ కుటుంబ సభ్యులు కూడా కోరారు. ఈ విషయం ప్రభాస్ కి చేరడంతో.. ఫిష్ వెంకట్ చికిత్సకు అవసరమైన మొత్తాన్ని తాను ఇస్తానని ప్రభాస్ చెప్పినట్లు సమాచారం.   ప్రభాస్ టీం తాజాగా ఫిష్ వెంకట్ కుటుంబ సభ్యులను సంప్రదించిందట. ఆపరేషన్ కోసం ఎంత ఖర్చయినా భరిస్తామని, కిడ్నీ దాతను చూసుకోవాలని ప్రభాస్ టీం చెప్పిందట. ఈ విషయాన్ని ఫిష్ వెంకట్ కుమార్తె తెలిపారు. అంతేకాదు, ఆపరేషన్ కోసం రూ.50 లక్షలు దాకా ఖర్చవుతుందని డాక్టర్లు చెప్పినట్లు ఆమె పేర్కొన్నారు.   
  అప్పట్లో ఉదయ్ కిరణ్ ఓ సంచలనం. 'చిత్రం', 'నువ్వు నేను', 'మనసంతా నువ్వే' వంటి హ్యాట్రిక్ హిట్స్ తో కెరీర్ ప్రారంభించి.. యూత్ లో తిరుగులేని క్రేజ్ ని సొంతం చేసుకున్నాడు. ఆ తర్వాత ఆ స్థాయి విజయాలను చూడనప్పటికీ.. పలు సినిమాల్లో నటించి.. హీరోగా తనదైన ముద్ర వేశాడు. అలాంటి ఉదయ్ కిరణ్.. 2014 లో ఆత్మహత్య చేసుకొని అందరికీ షాక్ ఇచ్చాడు. ఉదయ్ కిరణ్ మరణించి పదేళ్లు దాటిపోయినప్పటికీ.. అభిమానులు, సినీ పరిశ్రమలో ఆయన స్నేహితులు ఎప్పుడూ తలచుకుంటూనే ఉంటారు. తాజాగా బిగ్ బాస్ ఫేమ్ కౌశల్.. ఉదయ్ కిరణ్ తో తనకున్న అనుబంధం గురించి తెలుగువన్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో పంచుకున్నాడు.   మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ గా రూపొందిన 'కన్నప్ప'లో కౌశల్ కూడా నటించాడు. ఈ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా తెలుగువన్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఉదయ్ కిరణ్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు కౌశల్. "చిత్రం సినిమా రాకముందు నుంచే నాకు ఉదయ్ కిరణ్ తో పరిచయముంది. ఎటువంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా వచ్చి ఆ స్థాయికి వెళ్ళడం మామూలు విషయం కాదు. అందుకోసం ఉదయ్ ఎంతో కష్టపడ్డాడు. ఉదయ్ హీరోగా చేసిన చాలా సినిమాల్లో నేను నటించాను. చాలా మంచి వ్యక్తి. ఈ మాట అనకూడదు.. కానీ, అలాంటి మంచి వ్యక్తి.. ఇలాంటి సమాజంలో లేకపోవడమే మంచిది అనిపిస్తుంది. ఒక మనిషి జీవితంలో పైకి వెళ్తున్నా, ఏదైనా సాధిస్తున్నా కిందకి లాగడానికి ప్రయత్నిస్తారు. ఒక మనిషి ఎదుగుతుంటే హింసించి, డౌన్ చేయడానికి చూస్తారు." అంటూ కౌశల్ ఎమోషనల్ కామెంట్స్ చేశాడు.    
నితిన్ ఈ రోజు 'తమ్ముడు' మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. 'దిల్ రాజు' లాంటి ఎంతో అనుభవమున్న వ్యక్తి  తమ్ముడికి నిర్మాత కావడం, ఏంసిఏ, వకీల్ సాబ్ వంటి హిట్ సినిమాలని తెరకెక్కించిన 'వేణు శ్రీరామ్' దర్శకుడు కావడంతో తమ్ముడు హిట్ అవుతుందని అభిమానులతో పాటు ప్రేక్షకులు భావించారు. కానీ బాక్స్ ఆఫీస్ వద్ద  డిజాస్టర్ గా నిలిచి నితిన్ వరుస ప్లాప్ లకి 'ముగింపుని ఇవ్వకలేకపోయింది.  తెలుగు సినిమా పరిశ్రమతో 'నితిన్' కి ఉన్న అనుబంధం రెండు దశాబ్డలపై మాటే. 2003 లో 'తేజ' దర్శకత్వంలో వచ్చిన 'జయం' తో తెలుగు తెరకి పరిచయమయ్యాడు. తొలి సినిమాతోనే ఘన విజయాన్ని అందుకోవడమే కాకుండా, మంచి నటుడుగా కూడా ప్రేక్షకుల దృష్టిలో ప్రత్యేక   పొందాడు. ఆ తర్వాత 'వినాయక్' దర్శకత్వంలో వచ్చిన 'దిల్' తో మరో భారీ విజయాన్ని అందుకొని యాక్షన్, లవ్, సెంటిమెంట్,డాన్స్ లలో  తిరుగులేదని నిరూపించాడు. కానీ ఆ వెంటనే 'దశరధ్' దర్శకత్వంలో వచ్చిన 'సంబరం'తో తొలి ప్లాప్ ని అందుకున్నాడు. ఆ ప్లాప్ ని మర్చిపోయేలా రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన 'సై' సినిమాతో కెరీర్ బిగ్గెస్ట్ హిట్ ని అందుకున్నాడు. దీంతో నితిన్ అగ్ర హీరోగా మారడానికి ఎంతో సమయం లేదని అందరు  భావించారు. కానీ అనూహ్యంగా 'సై' మూవీ తర్వాత సుమారు పన్నెండు సినిమాలు ప్లాప్ అయ్యాయి. ఆ ప్లేస్ లో ఇంకో యువ హీరో ఉండి ఉంటే కనుమరుగై పోయేవాడు. కానీ నితిన్ కి ప్రేక్షకులని థియేటర్ కి రప్పించగలిగే సత్తా ఉంది. అందుకే బాగా ఆలోచించి 2012 లో 'ఇష్క్'  తో తన జైత్రయాత్ర ని ప్రారంభించి 'గుండె జారీ గల్లంతయ్యిందే', అ,ఆ' తో  విజయాల్ని అందుకున్నాడు. దీంతో నితిన్ టైం స్టార్ట్ అయ్యిందని అనుకున్నారు. కానీ  ఆ తర్వాత చేసిన   పదకొండు సినిమాల్లో 'భీష్మ' ఒక్కటే హిట్ గా నిలిచి మిగతావన్నీ ప్లాప్ గా నిలిచాయి. వీటిల్లో మిగతా సినిమాల విషయం ఎలా ఉన్నా, 'తమ్ముడు' కి ముందు వచ్చిన ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్, రాబిన్ హుడ్ లు ఎన్నో అంచనాలతో, హిట్ టాక్ తో వచ్చాయి. ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్ ని నితిన్ మరో సంస్థతో కలిసి భారీ కాస్టింగ్, భారీ వ్యయంతో నిర్మించగా, రాబిన్ హుడ్ ని పుష్ప 2 తో భారీ హిట్ ని అందుకున్న మైత్రి సంస్థ భారీ వ్యయంతో నిర్మించింది. దీంతో ఆ రెండు సినిమాలు హిట్  ని అందుకోవడం ఖాయమని అందరు అనుకున్నారు. కానీ భారీ డిజాస్టర్ గా నిలిచి అభిమానులతో పాటు,ప్రేక్షకులకి షాక్ ని ఇచ్చాయి. ఇప్పుడు  'తమ్ముడు' కూడా మంచి అంచనాలతో వచ్చి డిజాస్టర్ గా నిలిచింది. అన్ని సినిమాల్లో లాగానే నటన పరంగా నితిన్ పై వచ్చిన విమర్శలేమి లేవు. సరైన కథని ఎంచుకోకపోవడం వల్లే నితిన్ కి ప్లాప్ లు ఎదురవుతున్నాయని అభిమానులతో పాటు ప్రేక్షకులు నమ్ముతున్నారు. ఈ విషయంలో నితిన్ ప్రత్యేక శ్రద్ధ వహించాలని కూడా వాళ్ళు కోరుకుంటున్నారు. ఈ విషయంలో కూడా నితిన్ ఇటీవల మాట్లాడుతు కథల విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటానని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం నితిన్ ఖాతాలో 'ఎల్లమ్మ' అనే చిత్రం ఉంది. బలగం వేణు దీనికి దర్శకుడు.      
Cast: Siddharth, Chaitra Achar, Meetha Raghunath, Sarathkumar, Devyani, Yogi Babu  Crew:  Based on 3BHK Veedu by Aravindh Sachidanandam Music by Amrit Ramnath  Cinematography by Dinesh B. Krishnan, Jithin Stanislaus Edited by Ganesh Siva Written & Directed by Sri Ganesh  Produced by Arun Viswa    Siddharth has been choosing different and interesting scripts after some disappointing films. After a success like Chittah/ Chinna, he is coming up with a relatable movie 3BHK. Sarathkumar, Devyani kind of popular supporting actors have also joined them. Let's discuss about the movie, released today.    Plot:  Prabhu (Siddharth) wants to live up to the dreams of his father Vasudevan (Sarath Kumar). But he is an average student and his father keeps asking him to not end up like him, a failure, who is unable to even buy a house. Vasudeva keeps trying hard but fails to buy due to various issues.  He compels Prabhu to study IT, while he is more inclined to do Mechanical in engineering. Prabhu wants to give up but ends up being dragged into an vortex of issues with IT being hard nut to crack. He also falls short of buying a house. Can he achieve his father's dream? Will Vasudeva get his wish come true? Watch the movie to know more.    Analysis:  Siddharth is able to pull off playing a layered character that spans from 16 - 40 years of age. His look at each age is also believable to the tee. Sarathkumar is good in his role but Devyani, Chaitra have nothing much to do. Meetha Raghunath got a layered character and her performance is good.  But the writing and narrative keep dragging the issues too much. While the novelistic approach is welcome the movie drags the incidents too much making it feel repetitive. It tries to be a Vietnam Veedu, Samsaram Oka Chadarangam kind of films but narrative doesn't live up to it.  The kind of liveliness that we wish to see in such movies, which we saw in Good Night, Kudumbasthan, lacks in this movie. The leisurely pacing needed much active framing and blocking to seriously make it much more relatable. It fails to engage after a point as we are expecting another failure rather than a success.  Being realistic is great but the movie needed even more relatable sequences or crisp narrative. So, it ends up being a dragged out to death hyperbole from regular lives of middle-class people. Overall, the movie needed 1 RK level space pacing not 3BHK like elaborated one.    Bottomline:  Has a relatable premise but drags too much.    Rating: 2.5/5    Disclaimer: Views expressed in this review are personal opinions of the reviewer and organisation doesn't take any liability. Viewers discretion is advised before commenting or reacting to this review.  
  కొన్నేళ్లుగా సినీ పరిశ్రమలో విడాకుల వార్తలు ఎక్కువగా వింటున్నాం. కొందరు సినీ సెలబ్రిటీలు ప్రేమించి పెళ్లి చేసుకుంటున్నారు. కొంతకాలం ఎంతో ఆనందంగా ఉంటున్నారు. ఆ తర్వాత మనస్పర్థలతో అనూహ్యంగా విడిపోతున్నారు. ఇప్పుడు ఈ లిస్టులో నయనతార, విఘ్నేష్ శివన్ దంపతులు చేరనున్నారని ప్రచారం జరుగుతోంది.   నటి నయనతార, దర్శకుడు విఘ్నేష్ శివన్ 2022లో ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరు కవల పిల్లలకు జన్మనిచ్చారు. నయనతార తన కుటుంబంతో ఎంతో సంతోషంగా ఉంది. తన భర్తతో, పిల్లలతో దిగిన ఫోటోలను, వీడియోలను సోషల్ మీడియాలో పంచుకుంటుంది. అలాంటి నయనతార.. తాజాగా ఇన్ స్టాగ్రామ్ స్టోరీలో ఓ సంచలన పోస్ట్ పెట్టింది.    "స్టుపిడ్ ను పెళ్లి చేసుకుంటే.. పెళ్లి అనేది పెద్ద మిస్టేక్ అవుతుంది. నీ భర్త చేసే పనులకు నువ్వు బాధ్యత వహించాల్సిన అవసరంలేదు. నన్ను ఒంటరిగా వదిలేయండి. ఇప్పటికే మీ వల్ల చాలా ఫేస్ చేశాను." అంటూ నయనతార సోషల్ మీడియా హ్యాండిల్ లో ఓ పోస్ట్ దర్శనమిచ్చింది. దీంతో విడాకుల వార్తలు ఒక్కసారిగా గుప్పుమన్నాయి.    అసలు ఈ పోస్ట్ వెనుక ఆంతర్యమేంటి? నయనతార నిజంగానే విడాకులు తీసుకోబోతుందా? లేక ఆమె సోషల్ మీడియా హ్యాండిల్ హ్యాక్ అయిందా? లేదా ఇంకేమైనా జరిగిందా? అనేది తెలియాల్సి ఉంది. నయనతార, విఘ్నేష్ శివన్ లో ఎవరైనా స్పందిస్తే గానీ.. దీనిపై ఓ క్లారిటీ రాదు. కాగా, గతేడాది కూడా వీరి విడాకుల వార్తలు రావడం గమనార్హం.  
మూవీ : ఉప్పు కప్పురంబు నటీనటులు: కీర్తి సురేశ్, సుహాస్, బాబూ మోహన్,  శత్రు, తాళ్లూరి రామేశ్వరి, శుభలేఖ సుధాకర్ తదితరులు ఎడిటింగ్: శ్రీజిత్ సరంగ్ సినిమాటోగ్రఫీ: దివాకర్ మణి మ్యూజిక్:  స్వీకర్ అగస్తీ నిర్మాతలు:  రాధిక లావు దర్శకత్వం: ఐవీ శశి ఓటీటీ: అమెజాన్ ప్రైమ్ వీడియో కథ:  1990 లో చిట్టిజయపురం అనే గ్రామంలో శుభలేఖ సుధాకర్ ఊరిపెద్దగా ఉంటాడు. అతను మరణించడంతో తన కుమార్తె అపూర్వ(కీర్తి సురేష్) కొత్త గ్రామపెద్దగా ఎన్నుకోబడుతుంది. ఆమె గ్రామపెద్దగా నియమించబడటం ఇష్టం లేని భద్రయ్య (బాబు మోహన్), మధు (శత్రు) రెండు వర్గాలుగా విడిపోయి ఆమెను ఇబ్బంది పెడుతుంటారు. అయితే అనుకోకుండా ఆ ఊరికి ఓ పెద్ద సమస్య వచ్చి పడుతుంది. నిజానికి సంప్రదాయం ప్రకారం ఆ ఊరిలో ఎవరు చనిపోయిన ఊరికి ఉత్తరాన పాతిపెట్టడం ఆనవాయితీ. అలా పాతిపెట్టే క్రమంలో స్మశానం నిండిపోవడంతో, కొత్తగా ఎవరైనా చనిపోతే ఎక్కడ పాతిపెట్టాలనే సమస్య మొదలవుతుంది. ఇంకా నలుగురికి మాత్రమే చోటు ఉండటంతో, ఆ నలుగురిని లాటరీ పద్ధతి ద్వారా ఎంపిక చేసే ప్రయత్నం చేయడంతో అనుకోకుండా మరో నలుగురు మృతి చెందుతారు. చివరికి ఆ నలుగురిని పాతిపెట్టాక, ఆ ఊరి స్మశాన కాపరి చిన్న (సుహాస్) ఒక మోసం చేశాడని బయటపడుతుంది. ఇంతకు చిన్న చేసిన మోసమేంటి? చిన్న కుటుంబాన్ని వెలివేసిన తర్వాత ఆ ఊరికి ఏం జరిగింది? చివరికి ఈ సమస్యను పరిష్కరించారా లేదా అనేది మిగతా కథ. విశ్లేషణ: ఒక ఊరిలో అమాయక జనాలు.. ప్రతీ దానికి ఊరిపెద్ద నిర్ణయం.. మూఢ నమ్మకాలు.. ఇలా 1990లో సర్వసాధారణంగా సాగే కథే ఇది. ఈ తరహా కథలు ఇప్పటికే చాలా వచ్చాయి. అయితే ఆ ఊరికి ఓ సమస్య వస్తుంది. అదేంటంటే శ్మశానంలో మనుషులని పూడ్చేందుకు స్థలం లేదు.. ఇది చాలా చిన్న పాయింట్ దీనిని దర్శకుడు ఎక్కువ సేపు ఎంగేజింగ్ గా చూపించాలి. మరి అలా చూపించాడా లేదా అంటే కొంతవరకు సక్సెస్ అయ్యాడనే చెప్పాలి. ఎందుకు కొంతవరకు అంటే కొన్ని సీన్లు లాజిక్ లేకుండా ఉంటాయి‌. ఫస్టాఫ్ అంతగా కనెక్ట్ కాదు. ఇంటర్వెల్ లో కథపై కాస్త ఇంట్రస్ట్ వస్తుంది. కానీ ద్వితీయార్థంలో ఎక్కువగా కామెడీపై ఫోకస్ చేయడం వల్ల మెయిన్ పాయింట్ కాస్త డైవర్ట్ అయినట్టుగా ఉంటుంది. ఊరిపెద్ద మరణం తర్వాత ఆమె కూతురికి ఆ పదవిని ఇవ్వడం కన్విన్సింగ్ గా ఉండదు.  హీరోయిన్ పాత్ర కన్ఫ్యూజింగ్‌గా కనిపించినా కొన్ని చోట్ల అందరికన్నా చాలా తెలివిగా అలోచిస్తున్నట్టుగా చూపించారు. ఇది కొంచెం కన్విన్సింగ్ అనిపించదు. సుహాస్ అతని తల్లి మధ్య వచ్చే సీక్వెన్స్ హార్ట్ టచింగ్ గా ఉంటుంది. మిగతా సీన్స్‌తో పోలిస్తే ఈ సీక్వెన్స్ ఇంకాసేపు ఉంటే బాగుండేది. ఈ సినిమాను ఎలాంటి అంచనాలు పెట్టుకోకుండా చూస్తే కొంతవరకు సమయం పట్టినా తర్వాత బాగుందనిపిస్తుంది. ఎందుకంటే ఆ ఊరికి వచ్చిన సమస్యని వాళ్ళు ఎలా పరిష్కారించుకున్నారనేది ఆసక్తికరంగా సాగుతుంది. ఊర్లో రచ్చబండ సీన్, కీర్తి సురేశ్, సుహాస్ మధ్య సీన్లు, బాబూ మోహన్ కామెడీ ఆకట్టుకుంటాయి. అడల్ట్ సీన్లు లేవు. అసభ్య పదజాలం వాడలేదు. సినిమా చివర్లో మెసెజ్ బాగుంది. ఎడిటింగ్ వర్క్ నీట్ గా ఉంది. సినిమాటోగ్రఫీ బాగుంది. మ్యూజిక్ ఒకే.  నువ్విలా సాంగ్ ఒకటి బాగుంది. ఇంకా తల్లి సెంటిమెంట్ సాంగ్ బాగుంది. నిర్మాణ విలువలు బాగున్నాయి. నటీనటుల పనితీరు:  అపూర్వగా కీర్తి సురేశ్, చిన్నగా సుహాస్ తమ పాత్రల్లో ఒదిగిపోయారు.  బాబు మోహన్, శత్రు హాస్యాన్ని పండించారు. ఇక మిగతావారు వారి పాత్రల పరిధి మేర నటించారు. ఫైనల్ గా : ఫ్యామిలీతో కలిసి చూసే  మూవీ ఇది.   రేటింగ్: 2.5 / 5 ✍️. దాసరి మల్లేష్
  Cast: Suhas Pagolu, Keerthy Suresh, Babu Mohan, Shatru, Talluri Rameshwari, Subhalekha Sudhakar, Ravi Teja, Vishnu Oi, Duvvasi Mohan, Sivannarayana, Prabhavathi Varma Crew:  Music Director : Sweekar Agasthi Cinematographer : Divakar Mani Editor : Sreejith Sarang Director : Ani I.V.Sasi Producer : Radhika Lavu OTT Streaming Platform: Amazon Prime Video  OTT Release Date: 04th July 2025    Keerthy Suresh has been selecting interesting scripts that give her acting skills wings to explore on OTT platforms, if not theatrically. Now, she joined Suhas for an interesting OTT movie, Uppu Kappurambu. Let's discuss about the film in detail.    Plot:  Chinna (Suhas) is the only graveyard keeper in the small village, Chitti Jayapuram. The village has hundreds of years of history but a weird practice of everyone being buried to the North of it. Suddenly, head of the village (Sudhakar) dies and as per the norms, his daughter Apoorva (Keerthy Suresh) forcibly becomes the Head.  She faces the issue of burial ground being full as her biggest issue. Bheemayya (Babu Mohan) and Madhu Babu (Shatru), who belong to wealthy families, eye the Head position and try to create obstacles for Apoorva. Chinna wants to secure a special place for his cancer striken Mother (Thalluri Rajeshwari). What will he do? How Apoorva raise to the occasion? Watch the movie to know more.    Analysis:  Keerthy Suresh looked cute and she did a good job with her comic timing too. Her character needed to be very innocent yet shrewd and she hit the balance well. Suhas is good as Chinna and his performance in many scenes elevate the scene. Babu Mohan, Shatru are not as effective in comparison but they did well.  Writing wise the movie struggles to keep with the innovative ideas in the second hour but it did well in the first hour. The premise and Keerthy Suresh character are written well but Suhas character needed even better writing and imagination.  Execution wise movie banks heavily on performances and tries hard to give them enough material but story keeps revolving around the same. Few comic sequences worked well but the narrative feels like it is stuck in a loop for a long time. Had these issues been addressed, the movie would have been much better.  Overall, it remains a film that brings a weird problem in front of us which feels immediate and urgent as there is no relative expansion of free grounds according to the number of people. The movie could have been better but ends up being half-baked narrative.    Bottomline:  Movie entertains to an extent but could have been better.    Rating: 2.5/5    Disclaimer: Views expressed in this review are personal opinions of the reviewer and organisation doesn't take any liability. Viewers discretion is advised before commenting or reacting to this review.  
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan)ఈ నెల 24 న చారిత్రాత్మక మూవీ 'హరిహరవీరమల్లు'(Hari Hara veeramallu)తో ప్రేక్షకుల ముందుకు వస్తున్న విషయం తెలిసిందే. ఐదు సంవత్సరాల నుంచి వీరమల్లు షూటింగ్ ని జరుపుకోవడంతో పాటు, రిలీజ్ ఎన్నోసార్లు వాయిదా పడింది. దీంతో వీరమల్లుపై అభిమానులతో పాటు ప్రేక్షకుల్లో పెద్దగా హైప్ లేకుండా పోయింది. కానీ ట్రైలర్ రిలీజ్ తో ఒక్కసారిగా వీరమల్లు పై అంచనాలు పెరిగాయి. ఫ్యాన్స్ అయితే పక్కా హిట్ అని అంటున్నారు. ట్రైలర్ కూడా  యూట్యూబ్ లో రికార్డు వ్యూస్ తో ముందుకు దూసుకెళ్తుంది.   ఈ రోజు ఉదయం పవన్  తన ఇద్దరు కుమారులు అకిరా నందన్(Akira Nandan)మార్క్ శంకర్(Mark Shankar)తో కలిసి మంగళగిరి(Mangalagiri)లో తన ఇంటికి వెళ్తున్నాడు. ఇందుకు సంబంధించిన పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అభిమానులు అయితే  తండ్రి తనయులు అనే క్యాప్షన్ తో ఈ పిక్స్ ని షేర్ చేస్తున్నారు. మార్క్ శంకర్ కొన్ని నెలల క్రితం సింగపూర్ లోని ఒక స్కూల్ లో జరిగిన అగ్ని ప్రమాదంలో గాయపడి కోలుకున్న విషయం తెలిసిన విషయమే.       
  ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ తాజాగా ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) విచారణకు హాజరైనట్లు తెలుస్తోంది. రామకృష్ణ ఎలక్ట్రానిక్స్ బ్యాంకు స్కాం కేసుకు సంబంధించి అరవింద్‌ ను ఈడీ అధికారులు దాదాపు మూడు గంటల పాటు ప్రశ్నించారని సమాచారం. 2018-19 సంవత్సరాల మధ్య జరిగిన బ్యాంకు లావాదేవీలపై అల్లు అరవింద్‌ ను ఈడీ అధికారులు వివరాలు అడిగినట్లు వినికిడి. విచారణ అనంతరం వచ్చే వారం మరోసారి విచారణకు హాజరు కావాలని అల్లు అరవింద్‌ కు అధికారులు ఆదేశాలు జారీ చేశారని అంటున్నారు.    రామకృష్ణ సంస్థ.. బ్యాంకుల నుంచి వంద కోట్లకు పైగా రుణం తీసుకొని తిరిగి చెల్లించలేదని తెలుస్తోంది. లావాదేవీలలో అవకతవకలు జరిగినట్లు సమాచారం. ఆ సంస్థ లావాదేవీలలో అల్లు అరవింద్ పేరు కూడా ఉండటంతో.. ఈడీ విచారణకు పిలిచిందని చెబుతున్నారు. అయితే అసలు ఆ సంస్థతో గానీ, ఆ స్కాంతో గానీ అల్లు అరవింద్ కి సంబంధం ఉందా లేదా? అని స్పష్టత లేదు. దీనికి సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.  
    తారాగణం: నితిన్, లయ, సప్తమి గౌడ, వర్ష బొల్లమ్మ, స్వసిక విజయన్‌, సౌరభ్ సచ్‌దేవ, హరితేజ, శ్రీకాంత్ అయ్యంగర్, టెంపర్ వంశీ, చమ్మక్ చంద్ర తదితరులు సంగీతం: బి. అజనీష్ లోక్‌నాథ్ డీఓపీ: కె.వి. గుహాన్ ఎడిటర్: ప్రవీణ్ పూడి దర్శకత్వం: వేణు శ్రీరామ్ నిర్మాతలు: దిల్ రాజు, శిరీష్ బ్యానర్: శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ విడుదల తేదీ: జూలై 4, 2025    వరుస ప్లాప్  లని ఎదుర్కుంటున్న 'నితిన్' సంక్రాంతికి వస్తున్నాంతో భారీ హిట్ ని అందుకున్న దిల్ రాజు నిర్మాణ సారధ్యంలో ఈ రోజు 'తమ్ముడు'గా ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. వకీల్ సాబ్ మూవీ డైరెక్టర్ కావడం, ప్రచార చిత్రాలు బాగుండటంతో ప్రేక్షకుల్లో తమ్ముడి పై ఆసక్తి నెలకొని ఉంది. మరి మూవీ ఎలా ఉందో చూద్దాం.    కథ జై (నితిన్) ఆర్చరీ క్రీడలో గోల్డ్ మెడల్ సాధించాలనే లక్ష్యంతో ఉంటాడు. పదేళ్ల వయసులో చేసిన తప్పు వల్ల తన అక్కయ్య స్నేహలత(లయ) కి దూరం అవుతాడు. ఆ  తప్పుని సరిదిద్దుకోవడానికి ఫ్రెండ్ చిత్ర(వర్ష బొల్లమ్మ) తో కలిసి తన అక్కయ్య ఉంటున్న వైజాగ్ కి వస్తాడు. గవర్నమెంట్ అధికారి ఝాన్సీ(లయ) సంతకం కోసం అజర్వాల్  (సౌరభ్ సచ్ దేవ్) అనే బిజినెస్ మాన్ ఝాన్సీ కుటుంబాన్ని చంపాలని నిర్ణయించుకుంటాడు. దీంతో అజర్వాల్ వల్ల ఝాన్సీ ఫ్యామిలీ మొత్తం దట్టమైన అటవీ ప్రాంతమైన అంబరగొడుగులో చిక్కుకోవాల్సి వస్తుంది. ఝాన్సీ ని గుర్తుపట్టిన జై వాళ్ళని కాపాడుతుంటాడు. అడవిలోనే ఉండే  రత్న(సప్తమి గౌడ) కూడా జై కి సాయం చేస్తుంటుంది. ఝాన్సీ ని అజర్వాల్ ఎందుకు చంపాలనుకుంటున్నాడు? అసలు స్నేహలత తన పేరుని ఝాన్సీగా ఎందుకు మార్చుకుంది? జై,  స్నేహలత విడిపోవడానికి కారణం ఏంటి? అసలు చాలా సంవత్సరాల తర్వాత జై తన అక్కయ్య కోసం ఎందుకు వచ్చాడు?  అజర్వాల్ ని ఏం చేసాడు అనేదే ఈ కథ    ఎనాలసిస్  సిల్వర్ స్క్రీన్ పై ఎప్పుడో వచ్చిన ఇలాంటి కథల్ని మేకర్స్ మళ్ళీ ఎందుకు తెరకెక్కించాలని అనుకున్నారో తెలియదు. సినిమా ప్రారంభమైన ఐదు నిమిషాలకే సినిమా ఎలా ఉండబోతుందో ప్రేక్షకుడికి తెలిసిపోతుంది. పైగా ఇలాంటి కధల్ని సినిమా మొత్తం సీరియస్ గా రన్ చెయ్యాలని అనుకోవడం మొదటి మైనస్. ఫస్ట్ హాఫ్ చూసుకుంటే నితిన్ క్యారక్టర్ ని ఓపెన్ చెయ్యడమే డల్ గా ఓపెన్ చేసారు.అలా కాకుండా ఫ్లాష్ బ్యాక్ లో లో తన అక్కయ్య ఇచ్చిన మాట కోసం ఎప్పుడు సంతోషంగా ఉంటాడని ఎస్టాబ్లిష్ చేసి, ఆ దిశగా కథనాల్ని రన్ చెయ్యాల్సింది. తన అక్కయ్య గురించి ఫ్రెండ్ కి చెప్పి అక్క కోసం వైజాగ్ రావడంతో కొంచం ఇంట్రెస్ట్ కలిగింది. కానీ వెంటనే అంబరగోడు అనే అటవీ ప్రాంతానికి రావడంతో కథనంలో వేగం తగ్గింది. క్యారక్టర్ లు ఏం చేయడానికి వీలు లేకుండా కథనం సాగింది. ఇంకా గట్టిగా చెప్పుకోవాలంటే సెకండ్ హాఫ్  కోసం ఫస్ట్  హాఫ్ ని సాగదీసినట్టుగా ఉంది. ఇక సెకండ్ హాఫ్ కూడా ఎలా ఉండబోతుందో ముందుగానే తెలిసిపోతుంది. కాబట్టి కొత్తదనాన్నీ  ఏం ఉహించుకొం. యాక్షన్ సన్నివేశాలు తప్ప ఏం ఉండవు. వాటిని కూడా చాలా నాటకీయంగా తెరకెక్కించారు. చిత్ర క్యారక్టర్ చనిపోవడం కూడా అంత వర్క్ అవుట్ కాలేదు. కథనం రన్ అవ్వడానికి కూడా ఏం లేదు. క్లైమాక్స్ కూడా అందరు ఊహించిందే.   నటీనటులు, సాంకేతిక నిపుణుల పని తీరు నితిన్ తన క్యారక్టర్ పరిధి మేరకు ఎప్పటిలాగానే బాగానే నటించాడు. తన క్యారక్టర్ కి తగ్గట్టుగా కూడా సూటయ్యాడు. లయ, సప్తమి గౌడ, వర్ష బొల్లమ్మ కూడా బాగానే నటించారు. ఇక మిగతా వాళ్ల గురించి పెద్దగా చెప్పుకోవాల్సిన పని లేదు. దర్శకుడు వేణు శ్రీరామ్ దర్శకుడిగానూ, రచయితగాను మెప్పించలేకపోయాడు. దిల్ రాజు నిర్మాణ విలువలు బాగానే ఉన్నాయి. ఫొటోగ్రఫీ, సంగీతం పర్లేదు.   ఫైనల్ గా చెప్పాలంటే.. కథ, కథనాలు, దర్శకత్వం, డైలాగ్స్ అన్ని తమ్ముడికి వ్యతిరేకంగా పని చేసాయి.   రేటింగ్ 2/5                                                                                                           అరుణాచలం   
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు. వారితో పాటు పెద్ద సంఖ్యలో క్యాడర్ కూడా పార్టీని వీడుతున్నారు. ఇక ఇప్పుడు నామినేటెడ్ పదవులలో ఉన్న వారి వంతు మొదలైనట్లు కనిపిస్తోంది. తనకు కానీ తన భర్తకు  కానీ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు టికెట్ ఇవ్వాలంటూ గత  కొంత కాలంగా కోరుతూ వస్తున్న మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ వంతు వచ్చింది. ఆమె కూడా రాజీనామా అస్త్రం సంధించారు.  జగన్ కు నమ్మిన బంటుగా గుర్తింపు పొందిన మహిళాకమిషన్ చైర్ పర్సన్ వాసి రెడ్డి పద్మ తన పదవికి రాజీనామా చేశారు. ఉరుములేని పిడుగులా, ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా తన రాజీనామా లేఖను సీఎం జగన్ కు పంపేశారు. పేరుకు తాను పార్టీకి కాదు, కేవలం మహిళా కమిషన్ చైర్మన్ పదవికి మాత్రమే రాజీనామా చేశాననీ, ఇక నుంచి వైసీపీ కోసం పని చేస్తాననీ వాసిరెడ్డి పద్మ చెబుతున్నప్పటికీ, ఆమె రాజీనామాకు కారణం అసంతృప్తేనని పార్టీ వర్గాలు బాహాటంగానే చెబుతున్నాయి. చాలా కాలంగా వాసిరెడ్డి పద్మ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు తనకు కానీ తన భక్తకు కానీ పార్టీ టికెట్ ఇవ్వాలని జగన్ ను కోరుతూ వస్తున్నారు. అయితే ఇప్పటి వరకూ జగన్ చూద్దాం.. చేద్దాం అన్నట్లుగా దాట వేస్తూనే వచ్చారు. ఇప్పుడిక వరుసగా అభ్యర్థల జాబితాలను జగన్ ప్రకటించేస్తుండటం, తనకు గానీ తన భర్తకు కానీ పార్టీ టికెట్ విషయంలో ఎటువంటి స్పస్టత ఇవ్వకపోవడంతో ఆమె మనస్తాపం చెంది పదవికి రాజీనామా చేసేశారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.  వాసిరెడ్డి పద్మ రాజకీయ ప్రవేశం ప్రజారాజ్యం పార్టీతో జరిగింది. 2009లో ఆమె ప్రజారాజ్యం పార్టీలో చేరారు. ఇలా చేరడంతోనే ఆమె ప్రజారాజ్యం అధికార ప్రతినిథిగా పదవి దక్కించుకున్నారు. ప్రజారాజ్యం కాంగ్రెస్ పార్టీలో విలీనం కావడంతో ఆమె 2012లో జగన్ పార్టీలో చేరారు. జగన్ కూడా ఆమెకు అధికార ప్రతినిథి పదవి ఇచ్చారు.  2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆమెను రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా నియమించారు. చైర్ పర్సన్ హోదాలో ఆమె జగన్ మెప్పు పొందేందుకు చేయగలిగినంతా చేశారు. ప్రతిపక్ష పార్టీ నేతలకు నోటీసులు ఇచ్చారు. ఏకంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు సైతం నోటీసులు జారీ చేశారు. వార్డు వలంటీర్లపై పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు కమిషన్ ముందు హాజరై వివరణ ఇవ్వాలంటూ ఆమె పవన్ కు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. పవన్ హాజరు కాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు నమోదు చేయాలని ఆదేశించారు. ఇన్ని చేసినా వాసిరెడ్డి పద్మకు ఆమె కోరినట్లుగా పార్టీ టికెట్ లభించకపోవడంతో అలిగి పదవికి రాజీనామా చేశారని, ఇది జగన్ కు షాకేననీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు. ఒకరైతు తనకు చేసిన సేవలకు ప్రీతి చెందిన గురువు అతడికి స్వర్గ ప్రాప్తిని కలగజేయాలని అనుకుంటాడు. కానీ సంసారాసక్తి వల్ల ఆ రైతు ఆ అవకాశాన్ని వాయిదా వేసుకుంటూ వస్తాడు. చివరికి గురుకృప వల్ల ఆ రైతు స్వర్గ ప్రాప్తిని ఎలా పొందాడో ఈ కథ తెలియజేస్తుంది. "ఒక మహాపురుషుడు ప్రయాణం చేస్తూ, డస్సిపోయాడు. గొంతు ఎండిపోయింది. దారిలో ఒక రైతు కనపడితే నీళ్ళు అర్థించాడు. ఆ రైతు మహాత్మునికి సకల ఉపచారాలూ చేశాడు. చిరిగిపోయిన ఆయన ఉత్తరీయాన్ని రైతు జాగ్రత్తగా కుట్టి బాగుచేశాడు. రైతు పరిచర్యలకు సంతసించిన ఆ మహాత్ముడు శాంతి, ఆనందాలకు నిలయమైన స్వర్గానికి తనతోపాటు రమ్మని అంటాడు. అందుకు ఆ రైతు 'గురువుగారూ! మీరు నా మీద చూపిన దయకు కృతజ్ఞుణ్ణి. కానీ నా పిల్లలు ఇంకా చిన్నవాళ్ళు. ఓ ఏడేళ్ళ వ్యవధి ఇవ్వండి' అని అడుగుతాడు. అందుకు గురువు అంగీకరించాడు. సరిగ్గా ఏడేళ్ళ తర్వాత గురువు రైతును స్వర్గానికి తీసుకువెళ్ళడానికి వచ్చాడు. అప్పుడు రైతు 'అయ్యా! కడపటి కొడుకు కష్టాలకు అంతు లేదు. అన్ని జంఝాటాలనూ ఒక్కడే సంబాళించుకోలేకపోతున్నాడు. కాబట్టి మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని గురువుని అడిగాడు. మరో ఏడేళ్ళ తరువాత గురువు వచ్చాడు. కానీ రైతు చనిపోయాడని తెలిసింది. చనిపోయిన ఆ రైతు ఎద్దుగా పుట్టాడని ఆ గురువు తన దివ్య దృష్టితో తెలుసుకున్నాడు. ఎద్దుగా పుట్టిన ఆ రైతు తన కొడుకు పొలాన్నే దున్నుతున్నాడు. అప్పుడు గురువు ఆ ఎద్దుపై మంత్ర జలం చిలకరించగానే ఎద్దు జన్మనెత్తిన రైతు 'నా కొడుకు పరిస్థితి మరి కాస్త మెరుగు పడనీయండి స్వామీ! మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని అన్నాడు. ఇక చేసేది లేక వెనుదిరిగాడు గురువు. మరలా ఏడేళ్ళ తర్వాత వచ్చిన గురువుకు ఎద్దు చనిపోయిందని తెలిసింది. అది కుక్కగా పుట్టి కొడుకు ఇంటినీ, ఆస్తినీ కాపలా కాస్తోందని తన దివ్యదృష్టి ద్వారా తెలుసుకున్నాడు. గురువు. కుక్కగా పుట్టిన ఆ రైతు 'స్వామీ! నేను ఎంత దౌర్భాగ్యుణ్ణి. మీరు ఇంత దయ చూపుతున్నప్పటికీ మీతో స్వర్గమానం చేయలేకున్నాను. వీడికి ఆస్తిని కాపాడుకొనే దక్షత ఇంకా రాలేదు. కాబట్టి దయ చేసి మరో ఏడేళ్ళు వ్యవధి ఇవ్వండి' అని వేడుకున్నాడు. గురువు ఏడేళ్ళ తరువాత మళ్ళీ వచ్చేసరికి కుక్క మరణించింది. అది త్రాచుపాముగా జన్మనెత్తి, ఇప్పుడు కొడుకు భూమిలో ఉన్న లంకెబిందెలకు పడగెత్తి కాపలా కాస్తోంది. గుప్త ధనం ఇక్కడ ఉందని కొడుకుకి ఎలా తెలియజేయాలా అని పాము ఆలోచిస్తున్నప్పుడు గురువు ఆ రైతుకొడుకును పిలుచుకు వచ్చి లంకె బిందెలు ఉన్న చోట తవ్వమన్నాడు. లంకె బిందెలు బయటపడ్డాయి. ఆ పైన ఆ పామును చంపమన్నాడు. అనంతరం శిష్యుణ్ణి తీసుకొని స్వర్గారోహణం చేశాడు గురువు. సంసారంలోని ఈతి బాధల నుండి శిష్యుణ్ణి ఉద్ధరిస్తాడు సద్గురువు. అలాంటి గురువు అందరికీ అవసరం.                                      *నిశ్శబ్ద.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్  రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది.  80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత  ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది.   ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది. ఆమెది నెద‌ర్లాండ్స్‌. ఆమె తండ్రి నెద‌ర్లాండ్స్‌లోని ఆర్నెహెమ్‌లో చిన్న‌పిల్ల‌ల ఆస్ప‌త్రి డైరెక్ట‌ర్. పోయి దొరికిన ఆ పెయింటింగ్ విష‌యానికి వ‌స్తే.. అది 1683లో కాస్ప‌ర్ నెష‌ర్ వేసిన స్టీవెన్ ఓల్ట‌ర్స్ పెయింటింగ్‌. రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో నాజీల ఆదేశాల‌ను చార్లెట్ తండ్రి వ్య‌తిరేకించారు. ఆయ‌న ర‌హ‌స్య జీవ‌నం సాగించేడు. కానీ ఈ పెయింటింగ్‌ని మాత్రం త‌న న‌గ‌రంలోని ఒక బ్యాంక్‌లో భ‌ద్ర‌ ప‌ర‌చ‌మ‌ని ఇచ్చార‌ట‌. 1940లో నాజీలు నెద‌ర్లాండ్ పై దాడులు చేసినపుడు ఆ బ్యాంక్ మీద ప‌డి దోచుకున్నా రు. అప్పుడు ఈ పెయింటింగ్ కూడా తీసుకెళ్లారు. యుద్ధం అయిపోయిన త‌ర్వాత ఈ పెయింటింగ్ ఎక్క‌డున్న‌దీ ఎవ‌రికీ తెలియ‌లేదు. చిత్రంగా 1950ల్లో డ‌స‌ల్‌డార్ష్ ఆర్ట్ గ్యాల‌రీలో అది ప్ర‌త్య‌క్ష‌మ‌యింది. 1969లో ఆమ్‌స్ట‌ర్‌డామ్‌లో దాన్ని వేలానికి తీసికెళ్లే ముందు దాన్ని ఆ ఆర్ట్ గ్యాల‌రీలో వుంద‌ని చూసిన‌వారు చెప్పారు. వేలంపాట త‌ర్వాత మొత్తానికి ఆ పెయింటింగ్‌ను 1971లో ఒక క‌ళాపిపాసి త‌న ద‌గ్గ‌ర పెట్టుకున్నాడు.    ఆ త‌ర్వాత 2021లో అది చార్లెటీని చేరింది.  మొత్తానికి వూహించ‌ని విధంగా ఎంతో కాలం దూర‌మ‌యిన గొప్ప క‌ళాఖండం తిరిగి త‌న వ‌ద్ద‌కు చేర‌డంలో చార్లెటీ ఆనందానికి అంతేలేదు. అంతే క‌దా.. పోయింద‌నుకున్న గొప్ప వ‌స్తువు తిరిగి చేరితే ఆ ఆనంద‌మే వేరు!  అయితే చార్లెటీకి ఇపుడు ఆ పెయిం టింగ్‌ను భ‌ద్రంగా చూసుకునే ఆస‌క్తి వున్న‌ప్ప‌టికీ శ‌క్తి సామ‌ర్ధ్యాలు లేవు. అందుక‌నే త్వ‌ర‌లో ఎవ‌రిక‌యినా అమ్మేసీ వ‌చ్చిన సొమ్మును పిల్ల‌ల‌కు పంచుదామ‌నుకుంటోందిట‌!  చార్లెటీ కుటుంబంలో అయిదుగురు అన్న‌ద‌మ్ములు అక్క‌చెల్లెళ్లు వున్నారు. అలాగే ఇర‌వై మంది పిల్ల‌లు ఉన్నారు. అంద‌రూ ఆమె అంటే ఎంతో ప్రేమ చూపుతున్నారు. అంద‌రం ఒకే కుటుంబం, చాలాకాలం త‌ర్వాత ఇల్లు చేరిన క‌ళాఖండం మా కుటుంబానిది అన్న‌ది చార్లెటీ!
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు. చాకోను పార్టీలోకి ఆహ్వానిస్తూ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్’ ఫ్రంట్ ఏర్పాటు గురించి ప్రత్యేకించి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు కానీ, చాకో అలాంటి  సంకేతాలు ఇచ్చారు. ప్రస్తుతం దేశంలో ఉన్న ఏ ఒక్కపార్టీ కూడా బీజేపీకి ప్రత్యాన్మాయం కాదని,సమీప భవిష్యత్ కాంగ్రెస్ సహా ఏ పార్టీ కూడా ఆ స్థాయికి ఎదిగే అవకాశాలు కూడా కనిపించడంలేదని అన్నారు. ఈ పరిస్థితుల్లో దేశంలోని బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ, ఏకమై, ఒకే గొడుగు కిందకు రావలసిన అవసరం ఉందని చాకో అన్నారు. అదే సమయంలో ప్రతిపక్షాలను ఏక తాటిపైకి తెచ్చే బాధ్యతను పవార్ తీసుకోవాలని సంకేత మాత్రంగా చెప్పారు. అంతే కాకుండా కాంగ్రెస్ పేరు ఎత్తకుండా బీజేపీ వ్యతిరేక శక్తులను ఏకం చేసే ఆలోచన ఆ పార్టీ నాయకత్వానికి లేదని నెహ్రూ గాంధీ ఫ్యామిలీ (సోనియా, రాహుల్, ప్రియాంక)ఆలోచనా ధోరణిని పరోక్షంగానే అయినా ఎండ కట్టారు.ఆ విధంగా పవార్ ఆ బాధ్యత తీసుకోవాలని చాకో సూచించారు. ఇందుకు సంబంధించి, పవార్ బహిరంగంగా ఎలాంటి వ్యాఖ్య చేయలేదు. అయితే, చాకో సహా మరికొందరు ‘సీనియర్’ కాంగ్రెస్ నాయకులు, అలాగే సిపిఎం, సిపిఐ నాయకులు కూడా పవార్’తో చాలా కాలంగా థర్డ్ ఫ్రంట్  విషయంగా చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. అయితే మహారాష్ట్రలో సంకీర్ణం మనుగడను దృష్టిలో ఉంచుకుని పవార్ ఆచితూచి అడుగులేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే చాకో పార్టీలో చేరిన సందర్భంలో కూడా ‘చాకో చేరికతో మహారాష్ట్రలోని మహా వికాస్ అగాడీ ప్రభుత్వానికి ఎలాంటి నష్టం జరగదని, పవార్ మహారాష్ట్ర సంకీర్ణ సర్కార్ ప్రస్తావన చేశారని విశ్లేషకులు పేర్కొంటున్నారు.  మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వ మనుగడ గురించ్బి  పవార్ ప్రత్యేకంగా పేర్కొనడం ద్వారా, ఆయన థర్డ్ ఫ్రంట్ విషయంలో వేచి చూసే ఆలోచనలో ఉన్నట్లు అర్థమవుతోందని కూడా  రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే అదే ఎన్సీపీ అసెంబ్లీ ఎన్నికల జరుగతున్న కేరళలో, పశ్చిమ బెంగాల్లో  కాంగ్రెస్ వ్యతిరేక పార్టీలకు మద్దతు ఇస్తోంది. దీన్ని బట్టి చూస్తే, ఎన్సీపీ - కాంగ్రెస్ మధ్య దూరం పెరుగుతోందని స్పష్టమవుతోంది. అయితే, థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఏ రకంగా ముడి పడుతుంది అనే విషయంలో ఇంకా స్పష్టత రావలసి ఉంది. అలాగే, కాంగ్రెస్ లేకుండా జాతీయ స్త్గాయిలో బీజేపీ వ్యతిరేక కూటమిని ఏర్పాటు చేయడం వలన, వ్యతిరేక ఓటు చీలి  అది మళ్ళీ బీజేపీకే మేలు చేస్తుందని, కాబట్టి, ప్రస్తుతం కాంగ్రెస్ సారధ్యంలోని యూపీఏని బలోపేతం చేయడమే ఉత్తమమనే అలోచన కూడా  విపక్ష శిబిరం నుంచి వినవస్తోంది. ఈ నేపధ్యంలోనే, ప్రస్తుతం యూపీఏ ఛైర్పర్సన్’గా ఉన్న సోనియా గాంధీ వయసు, అనారోగ్యం కారణంగా బాధ్యతల నుంచి తప్పుకుని పవార్’కు బాద్యతలు అప్పగించాలనే ప్రతిపాదన వచ్చిందని అంటున్నారు. అలాగే, ఇతర పార్టీలను, ముఖ్యంగా కాంగ్రెస్ నుంచి విడిపోయి సొంత కుంపటి పెట్టుకున్న మమతా బెనర్జీ సారధ్యంలోని తృణమూల్, జగన్మోహన్ రెడ్డి సారధ్యంలోని వైసీపీలను కలుపుకుని కూటమిని బలోపేతం చేయడం ద్వారా బీజేపీని దీటుగా ఎదుర్కోవచ్చనే ఆలోచనలు కూడా సాగుతున్నాయి. అయితే, ఇటు థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు అయినా, యూపీఏని బలోపేతం చేయడమే అయినా, పవారే .. కేంద్ర బిందువు. ఆయన సారధ్యంలోనే ప్రత్యాన్మాయం అనేది విపక్ష శిభిరం నుంచి వినవస్తున్న ప్రస్తుత సమాచారం. మరి అదే జరిగితే రాహుల గాంధీ పరిస్థితి ఏమిటి ? గాంధీ నెహ్రూ కుటుంబం పరిస్థితి ఏమిటి? ఏ ప్రత్యేక ప్రాధాన్యత లేకుండా అందరిలో ఒకరిగా ఫస్ట్ ఫ్యామిలీ సర్దుకు పోతుందా? అంటే..చివరకు ఏమవుతుందో .. ఇప్పుడే చెప్పలేమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది. గతంలో అనేక సందర్భాలలో ముఖ్యమంత్రి కేసీఆర్,ఆర్థిక మంత్రి హరీశ రావు, కరోనా కారణంగా రాష్ట్ర  ఆదాయం గణనీయంగా తగ్గిందని, పేర్కొన్నారు. అయితే, కరోనా నుంచి వేగంగా కోలుకుని, ఆర్థికంగా అంతే వేగంగా పుంజుకున్న రాష్ట్రాలలో తెలంగాణ ప్రధమ స్థానంలో  ఉందని కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సర్వే 2020-21 నివేదిక పేర్కొంది. పడిలేచిన కెరటంలా, తెలంగాణ ‘వీ’ ఆకారంలో ఆర్థికంగా నిలతొక్కుందని కేంద్రం జనవరి  చివరి వారంలో విడుదల చేసిన ఆర్థిక సర్వేలో పేర్కొంది. అలాగే, రెవిన్యూ వసూళ్ళలో రాష్ట్రం కరోనా పూర్వస్థితికి చేరిందని కూడా సర్వే చెప్పింది.   అలాగే,రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు కూడా ఈ మధ్య కాలంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పై సంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరమ జనవరి,ఫిబ్రవరి, మార్చి నెలలతో పోలిస్తే ఈ సంవత్సరం ఈ మూడు నెలల కాలంలో రాష్ట్ర ఆర్థిక వృద్ది రేటు 10 నుంచి  15 శాతం మెరుగ్గా ఉందని హరీష్ రావు ఒకటి రెండు ఇంటర్వ్యూలలో పేర్కొన్నారు.అలాగే, బడ్జెట్ విషయంలోనూ ఆయన చాల ఆశావహ దృక్పథంతోనే ఉన్నారు. బడ్జెట్  పాజిటివ్’గా ఉంటుదని, ఎవ్వరూ ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని, సంక్షేమ పథకాలలో,ఇతరత్రా బడ్జెట్ కేటాయింపులలో ఎలాంటి కోతలు ఉండవని కూడా హరీష్ హామీ ఇచ్చారు. గత సంవత్సరంలో కొంత మేర హామీ ఇచ్చిన మేరకు అమలు చేయలేక పోయిన సొంత జాగాలలో డబల్ బెడ్ రూమ్ ఇళ్ళ నిర్మాణం, రుణ మాఫీ వంటి  పథకాలను ఈ బడ్జెట్ ద్వారా అమలు చేస్తామని చెప్పారు. అలాగే, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ తమిళి సై చేసిన ప్రసంగంలోనూ ఆశావహ దృక్పధమే వ్యక్తమైంది. ఆమె తమ ప్రసంగంలో,  ప్రభుత్వం సంక్షేమ పథకాలకు పెద్ద పీట వేసిందని అన్నారు. ‘సంపద పంచాలి ,పేదలకు పంచాలి’ అనేది తమ ప్రభుత్వ విధానమని స్పష్టం చేశారు. అలాగే, పెరుగతున్న ఆదాయంలో అధికశాతం సంక్షేమానికే వెచ్చిస్తున్నామని స్పష్టం చేశారు. దీంతో బడ్జెట్’లో కొత్త పథకాలకు శ్రీకారం చుట్టే అవకాశం ఉంటుందా అన్న చర్చ జరుగుతోంది. మరో వంక ఉద్యోగ వర్గాల్లో పీఆర్సీకి సంబంధించి ఆర్థిక మంత్రి తమ ప్రసంగంలో  ప్రకటన చేస్తారా లేదా అనే ఆసక్తి నెలకొంది. అలాగే, సామాన్య  ప్రజలు ఇటీవల పెరిగిన పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరల భారం నుంచి మంత్రి హరీష్, ఏదైనా ఉపసమనం కలిపిస్తారా అని ఎదురు చూస్తున్నారు. గతంలో వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సామాన్య ప్రజలపై వంటగ్యాస్ ధర భారాన్ని తగ్గించేందుకు కొంత మొత్తాన్ని, రూ.50(?) రాష్ట్ర ప్రభుత్వం తరపున  సబ్సిడీగా ఇచ్చిన విషయాన్ని, అదే విధంగా అసెంబ్లీ ఎన్నికలు జరుగతున్న తమిళనాడులో డిఎంకే పార్టీ,తమ పార్టీని అధికారంలోకి వస్తే  గ్యాస్ బండపై వంద రూపాయల సబ్సిడీ ఇస్తామని చేసిన  వాగ్దానాన్ని  గుర్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే, ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు, సోమవారం ఆర్థిక మంత్రి హరీష్ రావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఆర్థిక  శాఖ ముఖ్య కార్యదర్శి రామ కృష్ణా రావు,సలహాదారు జీఆర్ రెడ్డితో బడ్జెట్ పద్దులఫై సుదీర్ఘంగా చర్చించి తుది మెరుగులు దిద్దారు. బడ్జెట్ తుది రూపం సిద్దమైన నేపధ్యంలో ఆర్థిక శాఖ ప్రింటింగ్ ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 18 ఉదయం మంత్రి వర్గం ఆమోదం పొందిన అనంతరం ఆర్థికమంత్రి హరీష్ రావు అదే రోజు రాష్ట్ర బడ్జెట్ 2021-22ను సభలో ప్రవేశ పెడతారు. 20, 22 తేదీల్లో బడ్జెట్‌పై సాధారణ చర్చ,23, 24, 25 తేదీల్లో బడ్జెట్‌ పద్దులపై చర్చ ఉంటుంది 26న ద్రవ్యవినిమయ బిల్లు (బడ్జెట్)పై చర్చ, సభామోదం ఉంటాయి.
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది.  అధికార తెరాస, ఖమ్మం స్థానానికి సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర రెడ్డి పేరును ప్రకటించడంలో కొంచెం జాప్యం చేయడంతో పాటుగా, హైదరాబాద్ స్థానం నుంచి , పీవీ కుమార్తె వాణీ దేవి పేరును చివరి క్షణంలో తెరమీదకు తేవడంతో అంత వరకు కొంత స్తబ్దుగా సాగిన ప్రచారం ఆ తర్వాత వేడెక్కింది. ఉద్యోగ నియామకాల విషయంలో తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ తప్పులో కాలేయడంతో విపక్షాలు, పోటీలో ఉన్న ప్రత్యర్ధులు, నిరుద్యోగ యువత, విద్యార్ధి సంఘాలు  ఒకే సారి ఆయన మీద  విరుచుకు పడ్డారు. ఆయన లెక్క తప్పని నిరుపిస్తం రమ్మని వరస సవాళ్ళు విసిరారు. దీంతో, మంత్రి నియామకా ఇష్యూని పక్కకు తప్పించేందుకు , ఐటీఐఆర్, వరంగల్ రైల్వే ఫ్యాక్టరీ వంటి సెంటిమెంటల్ ఇష్యూస్’ను తెరపైకి  తెచ్చారు. అలాగే, కేంద్ర ప్రభుత్వంపై విమర్శల దాడిని పెంచారు. చివరకు పొరుగు రాష్ట్రానికి చెందిన విశాఖ ఉక్కు ఆందోళన   కూడా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగమైంది.   రెండు నియోజక వర్గాలలో గతంతో పోలిస్తే ఈసారి ఓటర్ల సంఖ్య రెట్టింపు అయింది. ఈసారి రెండు నియోజక వర్గాలలో కలిపి 10 లక్ష 36 వేల మంది తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. అలాగే, రెండు పట్ట భద్రుల నియోజక వర్గాల్లో 164 మంది అభ్యర్ధులు పోటీలో ఉన్నారు.  గత ఎన్నికలతో పోలిస్తే ఇటు ఓటర్ల సంఖ్య, అటు అభ్యర్థుల సంఖ్యా రెట్టింపునకు పైగానే పెరగడంతో ఎన్నికలలో జోష్ పెరిగింది. దీనికితోడు అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో సాధారణ ఎన్నికలను తలపించే రీతిలో ప్రచారం సాగింది. ఎక్కువమంది అభ్యర్ధులు బరిలో ఉండడంతో, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి  తమకే ప్రయోజనం జరుగుతుందని అధికార పార్టీ ఆశపడుతోంది .  దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో చేదు ఫలితాలను చవిచూసిన టీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా వ్యూహ రచన చేసి కేటీఆర్, హరీష్ సహా మంత్రులు,ఎమ్మెల్యేలకు స్పెసిఫిక్ బాధ్యతలు అప్పగించారు. అలాగే,కాంగ్రెస్‌ అభ్యర్థులు చిన్నారెడ్డి, రాములునాయక్‌లకు మద్దతుగా ఉత్తమ్‌, భట్టి, రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తదితరులు విస్తృతంగా ప్రచారం చేశారు. బీజేపీ అభ్యర్థులు ఎన్‌.రాంచందర్‌రావు, ప్రేమేందర్‌రెడ్డిల తరఫున ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, ఎంపీ అరవింద్‌ తదితరులు ప్రచారాన్ని వేడెక్కించారు.  ఖమ్మం స్థానం నుంచి ప్రత్యక్ష ఎన్నికల్లో తొలిసారి పోటీకి దిగిన కోదండరాంకు, టీజేఎస్‌ పార్టీకీ ఈ ఎన్నికలు కీలకంగా మారాయి. ఖమ్మ స్థానం నుంచి పోటీ చేస్తున్న తీన్మార్ మల్లన్న ముందస్తు వ్యూహంతో ప్రధాన పార్టీల అభ్యర్ధులకు ధీటుగా ప్రచారం సాగించారు.  వామపక్షాల మద్దతుతో జయసారథి, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్‌, యువతెలంగాణ కార్యనిర్వాహక అధ్యక్షురాలు రాణీ రుద్రమ తదితరులు పోటీలో ఖమ్మం సీటును పట్టభద్రులు  ఎవరికి  పట్టం కడతారు అన్నది ప్రశ్నార్థకంగా మారింది. హైదరాబాద్ సీటు కూడా ఇటు అధికార తెరాసకు అటు సిట్టింగ్ సీటును నిలుపుకోవడం తో పాటుగా దుబ్బాక , జీహెచ్ఎంసి జోష్ ను కొనసాగించాలని ఆశ పడుతున్నబీజేలకే కూడా ఇజ్జత్ కీ సవాల్ గా మారింది. కాంగ్రెస్ అభ్యర్ధి పార్టీ సీనియర్ నాయకుడు సౌమ్యుడు, మాజీ మంత్రి చిన్నారెడ్డి, వామ పక్షాల మద్దతుతో పోటీ చేస్తున్న మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ కూడా గట్టి పోటీ ఇస్తున్నారు. సో.. చివరకు ఏమి జరుగుతుంది అంటే ఏదైనా జరగవచ్చును. ఈ నెల 14 వ తేదీన పోలింగ్ జరుగుతుంది.17 ఫలితాలు వస్తాయి .. అంతవరకు వెయిట్ అండ్ వాచ్ .  
సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది. ఒకప్పుడు ఎర్ర జెండాను దిగ్విజయంగా ఎదిరించి, మార్క్సిస్టులను మట్టి కరిపించిన మమతా దీదీ ప్రస్తుతం, కాషాయ కూటమి నుంచి గట్టి సవాలును ఎదుర్కుంటున్నారు. వరసగా పదేళ్ళు పాలించడం వలన సహజంగా వచ్చిన ప్రభుత్వ వ్యతిరేకత  కంటే, హిందూ ఓటు పోలరైజేషన్ ఆమెను మరింతగా భయపెడుతోంది. నిజానికి ఐదేళ్ళ క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం ఐదు శాతం కంటే తక్కువ ఓట్లు, మూడంటే మూడు అసెంబ్లీ సీట్లు మాత్రమే గెలుచుకున్న బీజేపీ..  2019 లోక్ సభ ఎన్నికల్లో ఏకంగా 40 శాతం ఓట్లతో 18 స్థానాలు గెలుచుకుంది. ఈ  మార్పు ఇంకా కొన్ని కారణాలు ఉంటే ఉండవచ్చును కానీ.. హిందువుల ఓటు పోలరైజ్  కావడమే ప్రధాన కారణం.  ఈ నేపధ్యంలోనే కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ చివరకు కమ్యూనిస్టులు కూడా బీజేపీలో  చేరారు. ఎన్నికల ప్రకటన వెలువడిన తర్వాత కూడా సిట్టింగ్ ఎమ్మెల్ల్యేలు సహా  తృణమూల్ టికెట్ వచ్చిన నాయకులు కూడా బీజేపీలో చేరుతున్నారు. అనేక మంది ఇతర రంగాల ప్రముఖులు, ముఖ్యంగా ఇంతకాలం, బీజేపీని హిదుత్వ అనుకూల ‘అచ్చుత్’ (అంటారని) పార్టీగా చూసిన ‘సెక్యులర్’ ప్రముఖులు కాషాయం కప్పుకోవడంతో మమతా బెనర్జీకి కొంచెం అలస్యంగానే అయినా, తత్త్వం బోధపడింది. అందుకే ఆమె ఇప్పుడు గుళ్ళూ,గోపురాలకు తిరుగుతున్నారు. కార్యకర్తల సమావేశాల్లో తానూ హిందువునేనని, చెప్పుకుంటున్నారు.  నిజానికి ఇలా నేనూ హిందువునే  అని సెక్యులర్ నేతలు బహిరంగంగా ప్రకటించుకోవడం మమతా బెనర్జీతోనే మొదలు కాలేదు. రాహుల్ గాంధీ తాను హిందువునని, జన్యుధారీ కశ్మీరీ బ్రాహ్మణుని అనీ.. తమ గోత్రం, ‘దత్తాత్రేయ’ గోత్రమని బహిరంగంగా ప్రకటించుకున్నారు. అలాగే  కొద్ది రోజుల క్రితం ప్రియాంకా గాంధీ తానూ హిందువునని చెప్పుకునేందుకు ‘మౌని అమావాస్య’ సందర్భంగా అలహాబాద్ లో గంగా స్నానం చేశారు. గతంలోనూ ఆమె ఎన్నికలకు ముందు గంగా యాత్ర చేశారు. అంతవరకు ఎందుకు కొద్దిరోజుల క్రితం సిపిఐ నారాయణ విశాఖ స్వామి ఆశీస్సులు తీసుకున్నారు. చంద్రబాబు, జగన్ రెడ్డి, కేసీఆర్ ఇలా తెలుగు నేతలు అనేక మంది లౌకిక వాదానికి కాలం చెల్లిందన్న సత్యాన్ని గ్రహించి కావచ్చు ‘నేనూ హిందువును’ అంటూ ప్రకటించుకునేందుకు పోటీ పడుతున్నారు. రాముడిని తలచుకున్నా, జై శ్రీరామ్ అన్నా తమ  లౌకిక వాదం మయలపడి పోతుందని భయపడిన నాయకులు ఇప్పుడు .. జై శ్రీరామ్ అనేందుకు కూడా వెనకాడడం లేదు.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది. గత కొంత కాలంగా సబర్మలతో సహా అనేక అంశాలపై స్పందిస్తూ.. కేరళను టార్గెట్ చేస్తున్న బీజేపీ నాయకులు అక్కడ తమ జెండా ఎగరేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా పార్టీ పాలసీని కూడా పక్కన పెట్టి మెట్రో మ్యాన్ శ్రీధరన్ ను పార్టీలో చేర్చుకుని ఆయనే తమ సీఎం అభ్యర్థి అని ప్రకటించిన 24 గంటలలో యూ టర్న్ తీసుకున్నారు. ఇది ఇలా ఉండగా ప్రస్తుతం సీఎంగా ఉన్న కమ్యూనిస్ట్ నేత పినరై విజయన్ పై గోల్డ్ స్మగ్లింగ్ ఆరోపణలు రావడంతో.. ఈ ఎన్నికలలో ఎల్డిఎఫ్ భవిష్యత్తుపై ప్రజలు ఏ తీర్పు ఇవ్వబోతున్నారనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది ఈ నేపథ్యంలో అక్షరాస్యతలో దేశంలోనే మొదటి స్థానంలో ఉన్న ఆ రాష్ట్ర ప్రజలు ఎవరిని ఆశీర్వదిస్తారు అనే అంశంపై ప్రముఖ మీడియా సంస్థ టైమ్స్ నౌ, సీ ఓటరుతో కలిసి ఒక సర్వేను నిర్వహించారు. ఈ సర్వే ప్రకారం చూస్తే పాపం కమలనాథులు అక్కడ పవర్ చేతికి రావటం అటుంచి కనీసం రెండు మూడు అసెంబ్లీ స్థానాల్లో గెలవటం కూడా కష్టమేనని ఆ సర్వే తేల్చి చెబుతోంది. కేరళలో ఈసారి జరిగే అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ తన హవా చాటుతుందన్న ఆ పార్టీ నేతల మాటలలో ఎలాంటి నిజం లేదని.. ప్రస్తుతానికి అది ఏమాత్రం సాధ్యం కాదని ఈ తాజా సర్వే తేల్చి చెప్పింది. అంతేకాకుండా మొత్తం 140 స్థానాలు ఉన్న కేరళలో.. ప్రస్తుత సీఎం పినరయి విజయన్ నేతృత్వంలోని లెఫ్ట్డ్ డెమొక్రటిక్ ఫ్రంట్ కు 82 సీట్లు పక్కా అని.. ఆయనే తిరిగి అధికారాన్ని నిలబెట్టుకుంటాడని సర్వే చెపుతోంది. అదే సమయంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూనైటెడ్ డెమొక్రాటిక్ ఫ్రంట్ కు 56 నుంచి 60 వరకు సీట్లు వచ్చే అవకాశం ఉందని ఈ సర్వేలో తేలింది. అంతేకాకుండా 2016 ఎన్నికలతో పోలిస్తే ఎల్ డీఎఫ్ ఓటింగ్ శాతం కూడా కొంత పెరగటం ఇక్కడ గమనార్హం. ప్రస్తుతం సీఎంగా ఉన్న విజయన్ మరోసారి సీఎం కావాలని 43.34 శాతం మంది మొగ్గు చూపినట్లుగా సర్వేలో తేలింది. కరోనా సమయంలో విజయన్ సీఎంగా బాగా పని చేసారని ఈ సర్వే పేర్కొంది. మరోపక్క దేశ ప్రధానిగా రాహుల్ గాంధీ ఉండాలని కేరళ ప్రజల్లో 55.84 శాతం మంది కోరుకుంటున్నట్లుగా ఈ సర్వే;లో తేలింది. అయితే కేరళలో ఎలాగైనా పాగా వేయాలని పట్టుదలతో కృషి చేస్తున్న బీజేపీకి ఈసారి కూడా నిరాశ తప్పదని ఈ సర్వేలో స్పష్టం అయింది. ఈ ఎన్నికలలో బీజేపీకి రెండు సీట్లు కూడా రావటం కూడా కష్టమేనని ఈ సర్వే తేల్చింది. అయితే ఎన్నికలకు ముందు ఇలాంటి సర్వేలు బయటకు రావడం.. తరువాత అందులో కొన్ని చతికిల పడడం మనం చూస్తూనే ఉన్నాం. మరి ఈ సర్వే ఫలితాలు నిజామా అవుతాయో లేదో తేలాలంటే కొద్దీ రోజులు వెయిట్ చేయాల్సిందే.        
రాజకీయాలు అంటేనే అదో జూదం. పూలమ్మిన చోటనే కట్టెలు అమ్మవలసి రావచ్చును. అలాంటి పరిస్థితే వచ్చినా, తలవంచుకుని పోగలిగితేనే, ఎవరైనా రాజకీయాలలో రాణించగలరు. అలాకాదని, అలిమి కానిచోట, కూడా తామే అధికులమని భావిస్తే, ఎందుకూ కాకుండా పోతారు. అలాంటి వారు ఇద్దరూ కూడా ఇప్పుడు మన కళ్ళముందే ఉన్నారు.  జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు. అలాగే జయ మరణం తర్వాత ఆమె పరిస్థితి ఏమిటో కూడా వేరే చెప్పవలసిన, అవసరం లేదు. జైలు పాలయ్యారు. సర్వం తానై నడిపించిన పార్టీ నుంచి  బహిష్కరణకు గురయ్యారు. జయ ఉన్నంత వరకు తన వారుగా ఉన్న వారందరూ కానివారయ్యారు. ఒంటరిగా మిగిలారు.  నిజానికి నాలుగేళ్ళు జైలు జీవితం గడిపిన తర్వాత కూడా ఆమె తలచుకుంటే.. రాష్ట్ర రాజకీయాలలో, ముఖ్యంగా అధికారంలో ఉన్న డిఎంకే కూటమిలో అలజడి సృష్టించగలరు. ఎన్నికలలో ఆమె గెలవక పోవచ్చును కానీ.. తనను కాదన్న అన్నాడిఎంకేను ఓడించగలరు. అయిన  ఆమె అందుకు విరుద్ధంగా  రాజకీయాలకు వీడ్కోలు పలికి మౌనంగా పక్కకు తప్పుకున్నారు. రాజకీయ సన్యాసం ప్రకటించారు. ఉమ్మడి శతృవు డిఎంకే ను ఓడించేందుకు అన్నా డిఎంకే కూటమి  పోటీ చేయాలని, కూటమి ఐక్యతను దెబ్బతీయరాదనే ఉద్దేశంతోనే ఆమె రాజకీయ సన్యాసం ప్రకటించారు.    శశికళ మౌనంగా వెళ్లి పోవడం వెనక ఇంకా అనేక కారణాలున్నా ,అసలు కారణం ఆమె, రాజకీయ విజ్ఞత, వివేకం. ఆమె జైలుకు వెళ్ళిన సమయంలో జయలలిత సమాధి వద్ద ఎంత కసిగా, కోపంగా ‘మౌన’ ప్రతిజ్ఞ చేశారో చూశా. అలాంటి ఆమె ఇప్పుడు ఇలా ‘మౌనం’గా వెనకడుగు వేశారంటే, అది ఆలోచించ వలసిన విషయమే.ఆమె వ్యుహతంకంగానే సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే అనేక మంది అనేక కోణాల్లో శశికళ సంచలన నిర్ణయాన్ని విశ్లేషించారు.జైలు జీవితం తర్వాత కూడా అన్నా డిఎంకే నాయకులు తనను అగ్రనేతగా అంగీకరించక పోవడం, అమిత్ షా చెప్పినా.. అన్నా డిఎంకే నాయకులు ఆమెను, మేనల్లుడు దినకరన్’ను కులం పేరున, కుటుంబం పేరున దూరం చేయడం, తిరిగి పార్టీలోకి తీసుకోకపోవడంతో ఆమె మనసు కష్టపెట్టుకుని, సన్యాస నిర్ణయం తీసుకున్నారని కొందరంటున్నారు. పార్టీ మీద పట్టు లేదని, చరిష్మా అసలే లేదని, అందుకే ఆమె అలా నిశ్శబ్ధంగా రాజకీయ సన్యాసం స్వీకరించారని ఇంకొందరు విశ్లేషించారు. ఈ విశ్లేషణలో కొంత నిజం ఉంటే ఉండవచ్చును.. కానీ ఆమె గతాన్ని, నైజాన్ని గుర్తు చేసుకుంటే ఆమె స్ట్రైక్ బ్యాక్ వ్యూహంతోనే ఒకడుగు వెనక్కివేశారని ఆమెతో సన్నిహితంగా మెలిగినవారు, ఆమె రాజకీయ చాణక్యం తెలిసిన వారు అంటారు.   నిజానికి జైలులో ఉన్న కాలంలో కానీ, జైలు నుంచి విడుదలై వచ్చిన తర్వాత కానీ, ఆమె రాజకీయ సన్యాసం వైపు అడుగులు వేస్తున్నట్లు కనిపించలేదు. బెంగుళూరు జైలు నుంచి విడుదలై చెన్నైలో ప్రవేశించిన నప్పుడు ఆమె పెద్ద కాన్వాయ్ తో  తమ కారుకు అన్నాడిఎంకే జెండాతోనే ఎంటరయ్యారు. అలా ఎంట్రీలోనే రాజకీయ ఆకాంక్షను వెంట తెచ్చుకున్నారు. చివరకు ‘సన్యాస’ ప్రకట చేసే వరకు కూడా ఆమె రాజకీయ కార్యకలాపాలు సాగిస్తూనే ఉన్నారు. అటు ఢిల్లీని ఇటు చెన్నైనికూడా కదిల్చారు. అంతేకాదు, రాజకీయాలపై విరక్తితో కాదు, రాజకీయ కసితో, ఉమ్మడి శత్రువు (డిఎంకే) ను ఓడించేందుకే తాను రాజకీయాలనుంచి తపుకుంటున్నట్లు చెప్పారు.  సో .. సన్యాసం తీసుకోవాలనే ఆలోచన, రాజకీయవ్యూహం లోంచి పుట్టిందే కానీ,వైరాగ్యంతో పుట్టింది కాదు ,అన్నవిశ్లేషణ వాస్తవానికి ఇంకొంత దగ్గరగా ఉందని అనుకోవచ్చును. ఇది ‘కామా’నే కాని ‘ఫుల్స్టాప్’ కాదని అంటున్నారు.  ముఖ్యమంత్రి ఎడప్పాడి కే. పళని స్వామి (ఈపీఎస్) ఆమెను పార్టీలోకి అనుమతిస్తే తన కుర్చికీ ఎసరు పెడతారనే భయంతోనే,, ఆమె ఎంట్రీని అడ్డుకున్నారు. ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం, శశికళ ఒకే సామజిక వర్గానికి చెందిన వారు కావడం కూడా, ముఖ్యమంత్రి ఈపీఎస్’ భయానికి కారణంగా పేర్కొంటారు. అందుకే  ఆయన, ‘మన్నార్గుడి’ ఫ్యామిలీని బూచిగా చూపించి, ఆమెను దూరంగా ఉంచారని పార్టీలో ఒక వర్గం గట్టిగా విశ్వసిస్తుంది. అయితే ఆమె శక్తియుక్తులను కూడతీసుకుని  పులిలా పంజా విసిరేందుకే ఆమె వ్యూహాత్మకంగా ఒక అడుగు వెనక్కి వేశారు కావచ్చును అని కూడా, తమిళ రాజకీయ వర్గాల్లో ఒక చర్చ జరుగుతోంది.  గతంలో ఆమె జయలలితతో విబేధాలు వచ్చిన సమయంలో కూడా ఇలాగే కొద్ది కాలం మౌనంగా తెర చాటుకు వెళ్లి పోయారు.  కొద్ది కాలంలోనే మళ్ళీ ‘పోయస్ గార్డెన్’లో ప్రత్యక్షమయ్యారు. జయలలిత స్వయంగా ఆమెను వెనక్కి పిలుపించుకోవలసిన పరిస్థితులను సృష్టించారు. అలా  మళ్ళీ  చక్రం తిప్పారు. జయలలిత మరణం వరకు ఆమె అందరికీ చిన్నమ్మగా అమ్మకు పెద్దమ్మగా సర్వం తానై నిలిచారు. చివరకు జయ అంత్యక్రియల్లో కూడా ఆమెదే పై చేయిగా కనిపించింది.   జయలలిత చనిపోయిన సందర్భంలోనే అన్నా డిఎంకే ఎమ్మెల్ల్యేలో సుమారు 30 మంది వరకు ఆమెకు మద్దతుగా ఉన్నారన్న వార్తలొచ్చాయి. నిజానికి,ఇప్పటికి కూడా ఒక్క అన్నా డిఎంకే లోనేకాదు,డిఎంకే ఇతర పార్టీలలో కూడా  ఆమె అవసరం ఉన్న వాళ్ళు ఉన్నారు. కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో ‘మన్నార్గుడి’ ఫ్యామిలీ మద్దతు లేకుండా గెలిచే అవకాశం లేదు.  ఇవ్వన్నీ నిజమే అయినా.. అన్నీ ఉండి, ఎవరు లేని శశికళలో, ఇంకా  ఎవరి కోసం తాపత్రయ పడాలి? అనే ప్రశ్న జనించి ఉంటే, ఆమె రాజకీయ సన్యాసం నిజం కావచ్చును. ఎందుకంటే ఆమె నెచ్చలి, జయలిత లేరు, భర్త అంతకంటే ముందే చనిపోయారు, పిల్లలు లేరు... పైగా నాలుగేళ్ళ జైలు జీవితం ఆమెలో మార్పు తెచ్చి ఉండవచ్చును. ఈ వయస్సులో తనవారంటూ ఎవరు లేని తనకు రాజకీయాలు ఎందుకు ? శేష జీవితాన్ని ఇలా సాగిద్దామనే ఆలోచన నిజంగా వచ్చి ఉంటే, ఆమె సన్యాసం సత్యం అయినా కావచ్చును, కాకపోనూ వచ్చును. కానీ  శశికళ... ఆమెను అర్థం చేసుకోవడం, అంచనా వేయడం , అంత తేలిగ్గా అయ్యే పని కాదు..
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు. కాంగ్రెస్ అధినాయకత్వం పై నేరుగా అస్త్రాలు సంధించారు. రాహుల్ గాంధీ పేరు చెప్పకుండానే, ఆయన నాయకత్వానికి పనికిరాడని తేల్చి చెప్పారు. ఎవరైనా పార్టీ అధ్యక్షుడు అయితే కావచ్చును, కానీ, ప్రజానాయకుడు కాలేడని, రాహుల గాంధీ ప్రజానాయకుడు కాదు కాలేరు,అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తరచూ రాహుల్ గాంధీని ఉద్దేశించి చేసే  ‘నామ్’ధారీ వ్యంగ్యాస్త్రాన్నే కాంగ్రెస్ సీనియర్ నాయకులు కూడా సందించారు. ఇక అక్కడి నుంచి విధేయ, అసమ్మతి వర్గాల మధ్య మాటల యుద్ధం ఎదో ఒక రూపంలో సాగుతూనే వుంది. అదే క్రమంలో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ, కరుడు కట్టిన ముస్లిం మతోన్మాది, అబ్బాస్ సిద్దిఖీతో కాంగ్రెస్ పార్టీ చేతులు కలపడం అసమ్మతి నాయకులకు మరో అస్త్రాన్ని అందించింది. విషయంలోకి వెళితే, ఇటీవల పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా లోక్’సభలో కాంగ్రెస్ పక్ష నాయకుడు, పశ్చిమ బెంగాల్ పీసీసీ అధ్యక్షుడు అధీర్’రంజన్ చౌదరి, ముస్లిం మత ప్రచారకుడు, అబ్బాస్ సిద్దిఖీతో  వేదిక పంచుకున్నారు.అంతకు ముందే వామ పక్ష కూటమితో  పొత్తు కుదుర్చుకున్న కాంగ్రెస్ పార్టీ, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)ను కూటమిలో చేర్చుకుంది. ఇలా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) అమోదం లేకుండా మతోన్మాద ఐఎస్ఎఫ్’ తో ఎన్నికల పొత్తు పెట్టుకోవడం ఆ పార్టీ నాయకుడు,సిద్ధిఖీతో  పీసీసీ చీఫ్ వేదిక  పంచుకోవడం పై అసమ్మతి నేతలు మండి పడుతున్నారు. ఇలా సిద్దిఖీతో వేదిక పంచుకోవడం పార్టీ మౌలిక సిద్ధాంతాలకు వ్యతిరేకం అంటూ అసమ్మతి వర్గానికి చెందిన కీలక నేత, రాజ్యసభ సభ్యుడు,ఆనంద్ శర్మ మండిపడ్డారు. అంతే కాదు, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)తో జనవరిలో కుదుర్చుకున్న పొత్తుకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ)అమోదం లేదని ఆనంద్ శర్మ, అభ్యంతరం వ్యక్త చేశారు. పార్టీ విశ్వసించే లౌకిక వాదానికి కాంగ్రెస్ అధిష్టానం తీసుకున్న నిర్ణయం గొడ్డలి పెట్టని ఆయన తీవ్రంగా స్పందించారు.   శర్మ వ్యాఖ్యలపై అధీర్ రంజన్ చౌదరి అంతే ఘాటుగా ప్రతిస్పందించారు. “నిజాలు తెలుసుకోండి ఆనంద్ శ‌ర్మ జీ” అంటూ ఆయ‌న వ‌రుస ట్వీట్లు చేశారు. వ్య‌క్తిగ‌త ప్ర‌యోజ‌నాలు ప‌క్క‌న‌పెట్టి, ప్ర‌ధానిని పొగిడి టైమ్ వేస్ట్ చేయ‌కండంటూ ఆయ‌న ఓ ట్వీట్లో అన్నారు. ఆనంద్ శ‌ర్మ అన‌వ‌స‌రంగా కాంగ్రెస్‌ను ల‌క్ష్యంగా చేసుకుంటున్నార‌ని, ఈ అంశాన్ని పెద్ద‌ది చేసి చూపిస్తున్నార‌ని విమ‌ర్శించారు. ఆయ‌న ఉద్దేశాలు స‌రైన‌వే అయితే నేరుగా తనతో మాట్లాడ వలసిందని అన్నారు. బెంగాల్‌లో సీపీఐ(ఎం) కూట‌మికి నేతృత్వం వ‌హిస్తోంది. అందులో కాంగ్రెస్ ఓ భాగం. మ‌త‌తత్వ‌, విభ‌జ‌న రాజ‌కీయాలు చేస్తున్న బీజేపీకి చెక్ పెట్ట‌డానికే ఈ కూట‌మి అని మ‌రో ట్వీట్‌లో అధిర్ రంజ‌న్ అన్నారు. అక్కడతోనూ ఆగలేదు ... ట్వీట్ల మీద ట్వీట్లు సంధిస్తూ, ఆనంద్ శర్మ, బీజేపీ మత విభజన, అజెండాను బలపరుస్తున్నారని, పరోక్షంగా జీ23 నాయకులు బీజేపీకి ప్రయోజనం చేకూరుస్తున్నారని ఆరోపించారు.అంతే కాదు, క్షేత్ర స్థాయి వాస్తవ పరిస్థితులు తెలియకుండా, ఆనంద్ శర్మ పార్టీ మీద దండెత్తడం ఉచితం కాదని చౌదరి ఎదురుదాడి చేశారు. అసమ్మతిలో అసమ్మతి. ఇదలా ఉంటే, కాంగ్రెస్ పార్టీ  సమూల పక్షాళన కోరుతూ సోనియా గాంధీకి,గత సంవత్సరం  జీ 23గా ప్రాచుర్యం పొందిన సీనియర్ నాయకులు రాసిన లేఖపై సంతకాలు చేసిన  నాయకుల్లో నలుగురు,జమ్మూలోసమావేసమైన నాయకుల తాజా నిర్ణయాలు, వ్యాఖ్యలు,విమర్శల పట్ల అసంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరం సోనియా గాంధీకి రాసిన లేఖలో ప్రస్తావించిన అంశాలకు కట్టుబడి ఉన్నామని, అయితే, జీ 23లోని కొందరు సహచరులు, ఇటీవల గీతదాటి చేస్తున్న వ్యాఖ్యలు, విమర్శలను తాము సమర్ధించడం లేదని ఆ నలుగురు పేర్కొన్నారు. ఇందులో ముఖ్యంగా, రాజ్యసభ మాజీ డిప్యూటీ చైర్మన్, పీజే కురియన్ అయితే, “కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు అవసరమైన సంస్కరణలు తెచ్చేందుకు చేసే ప్రయత్నాలను పూర్తిగా సమర్దిస్తాను, కానీ, ‘లక్ష్మణ రేఖ’ దాటితే ఒప్పుకునేది లేదు”అని అసమ్మతిలో అసమ్మతికి తెర తీశారు.అలాగే, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ కుమారడు, మాజీ ఎంపీ సందీప్ దీక్షిత్,మధ్య ప్రదేశ్ సీనియర్ కాంగ్రెస్ నాయకుడు అజయ్ సింగ్’ కూడా గులాం నబీ ఆజాద్, కపిల్ సిబల్, ఆనంద్ శర్మ, మనీష్ తివారీ వంటి జీ 23 కీలక నేతలు అధినాయకత్వంపై చేసిన వ్యాఖ్యలను తప్పు పట్టారు. అలాగే, పార్టీ సీనియర్ నాయకుడు కేంద్ర మాజీమంత్రి వీరప్ప మొయిలీ కూడా,గత సంవత్సరం పార్టీ సీనియర్ నాయకులు  ఒక పరిమిత లక్ష్యంతో  సోనియా గాంధీకి లేఖ రాయడం జరిగిందని, ఆ పేరున జరుగతున్న  కార్యక్రమాలు లేఖ సంకల్పానికి  విరుద్ధమని అన్నారు. జీ 23 కార్యకలాపాలపై రాహుల్ గాంధీ కూడా పరోక్షగా స్పందించారు, ఒకప్పుడు ఎన్ఎస్’యుఐ, యూత్ కాంగ్రెస్’ కు సంస్థాగత ఎన్నికలు వద్దన్న వారే ఇప్పుడు ఇంకోలా మాట్లాడుతున్నారని పరోక్షంగానే అయినా సంస్థాగత ఎన్నికలు నిర్వహించడంతో పాటుగా, పార్టీ పక్షాలనకు తమ కుటుంబం వ్యతిరేకం కాదని, అందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఈ నేపధ్యంలో కాంగ్రెస్ పార్టీలో చెలరిగిన కలకలం  ఇక ముందు ఏమవుతుందో .. ఇంకెన్ని  మలుపులు తిరుగుతోందో ..చూడవలసిందే కానీ ఉహించలేము.
పంచతంత్రంగా పిలుచుకుంటున్న ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భతం జరగబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే, వివిధ సంస్థలు అసెంబ్లీ ఎన్నికలు జరిగే  అస్సాం. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటుగా కేరళలోనూ ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఆ ఒపీనియన్ పోల్ ఫలితాలు నిజంగా నిజం అయితే, కేరళలో మళ్ళీ సీపీఎం సారధ్యంలోని వామపక్ష కూటమి అధికారంలోకి వస్తుంది. ఇదే ఆ అద్భుతం. ఎందుకంటే, గత నాలుగు దశాబ్దాలలో కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో ఒకే కూటమి వరసగా రెండవసారి అధికారంలోకి వచ్చిన చరిత్ర లేనే లేదు. ఒక సారి ఎల్డీఎఫ్ అధికారంలోకి వస్తే ఐదేళ్ళ తర్వాత కాంగ్రెస్ సారధ్యంలోని ఐక్య ప్రజాస్వామ్య కూటమి(యూడీఎఫ్) అధికారంలోకి రావడం, దేవభుమిలో దైవ నిర్ణయమా అన్నట్లుగా ప్రతి ఎన్నికల్లోనూ అధికారం చేతులు మారుతూ వస్తోంది. అలాంటిది, ఈసారి ఒపీనియన్ పోల్స్ నిజమై వరసగా రెండవసారి వామపక్ష కూటమి అధికారంలోకి వస్తే, అది చరిత్రే అవుతుంది. ఇక ఒపీనియన్ పోల్స్ విషయానికి వస్తే, జాతీయ న్యూస్ ఛానెల్ ఏబీపీ, సీ ఓటర్ సంస్థలు సంయుక్తంగా ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఈ సర్వే ప్రకారం, 140 స్థానాలున్న కేరళ అసెంబ్లీలో వామపక్ష కూటమికి 83 నుంచి  91 స్థానాలు, యూడీఎఫ్ కూటమికి 47 నుంచి 55 స్థానాలు మాత్రమే దక్కుతాయని తెలుస్తోంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్రంలో ఇలా జాతకాలు తిరగబడడంపై సోషల్ మీడియాలో,’లెగ్ మహిమ’ లాంటి జోక్స్  ట్రోలవుతున్నాయి. అయితే 2016లో జరిగిన ఎన్నికల్లో కేవలం 47 సీట్లకే పరిమితం అయిన కాంగ్రెస్’కు ఈసారి ఒకటీ అరా సీట్లు ఎక్కువస్తే, రావచ్చును. అదే కాంగ్రెస్’కు కాసింత ఊరట. అదలా ఉంటే, పశ్చిమ బెంగాల్లో సైతం పట్టు సాధించిన బీజేపే, కేరళలో మాత్రం పట్టు కాదు కదా, పట్టుమని పది సీట్లు తెచ్చుకునే స్థితిలో లేదు. నిజానికి, దేశంలో బీజేపీకి అసలు ఏ మాత్రం మింగుడు పడని రాష్ట్రాలు ఎవైన ఉన్నాయంటే కేరళ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల  పేర్లే ప్రముఖంగా వినిపిస్తాయి. ఈ సారి కూడా కమల దళం కేరళలో కాలు పెట్టె పరిస్తి లేదని సర్వే ఫలితాలు చెపుతున్నారు. ఎప్పటిలానే ఇప్పడు కూడా  బీజేపీకి సున్నా నుంచి రెండు సీట్లు వచ్చే అవకాశం ఉందని, సర్వేస్వరుల అభిప్రాయంగా ఉంది. కేరళలో మొత్తం 140 స్థానాలకు ఏప్రిల్ 6 తేదీన ఒకే విడతలో పోలింగ్ జరుగుతుంది. మే 2 తేదీన ఫలితాలు వెలువడతాయి. కేరళ ఎలక్షన్ పై యావత్ దేశం ఆసక్తి కనబరుస్తోంది.    
కేంద్ర ఎన్నికలసంఘం ‘పాంచ్ పటాక’ గంట కొట్టింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. ఎన్నికల గంట మోగడంతో మొదలైన మరో భారత ‘మినీ’  సంగ్రామానికి మే 12 తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తెర పడుతుంది.ఈలోగా వివిధ అంచల్లో పోలింగ్ జరుగుతుంది.  నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతం ఓటరు తీర్పుకు వెళుతున్నా, అందరి దృష్టి, ముఖ్యంగా ప్రాంతీయ పార్టీల ఏలుబడిలో ఉన్న ఉభయ తెలుగు రాష్ట్రాలు, మరీ ముఖ్యంగా ఇప్పటికే బీజేపీ కన్నుపడిన తెలంగాణ రాష్ట్ర ప్రజలు, రాజకీయ పార్టీల దుష్టి  మాత్రం పశ్చిమ బెంగాల్ పైనే వుంది.  పశ్చిమ బెంగాల్లో ‘అద్భుతం’ జరిగి బీజేపీ విజయం సాధిస్తే, ఇక  కమల దళం ఫోకస్, తెలంగాణకు షిఫ్ట్ అవుతుంది. ఇది అందరికీ తెలిసిన బహిరంగ రహస్యం. ఈ నేపధ్యంలో బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయి అనే విషయంలో రాష్ట్ర రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. బెంగాల్లో బీజేపీ గెలిస్తే, ఇప్పటికే అంతర్గత కుటుంబ కలహాలతో సతమతవుతున్న తెరాస నాయకత్వానికి మరిన్నితిప్పలు తప్పవన్న మాట అంతఃపుర వర్గాలలో సైతం వినవస్తోంది.  పశ్చిమ బెంగాల్’లో ఎలాగైతే కమలదళం ఓ వంక తమ ట్రేడ్ మార్క్, హిందుత్వ రాజకీయాలు సాగిస్తూ, మరో వైపు నుంచి ‘ఆకర్ష్’ అస్త్రంతో అధికార పార్టీని నిర్వీర్యం చేసిన విధంగానే, ఇక్కడ కూడా ఫిరాయింపులను ప్రోత్సహింఛి పార్టీని నిట్టనిలువునా చీల్చే ప్రమాదాన్ని కొట్టివేయలేమని పార్టీ వర్గాలు కూడా అనుమానం వ్యక్త పరుస్తున్నాయి.  ఇప్పటికే తెలంగాణ  బీజేపీ నాయకులు 30 మంది తెరాస ఎమ్మెల్యేలు తమ టచ్ లో ఉన్నారని బెదిరిస్తున్నారు.అది నిజం అయినా కాకపోయినా..తెరాసలో అసంతృప్తి అగ్గి రగులుతోందనేది మాత్రం ఎవరూ కాదనలేని నిజం. అంతే కాకుండా రాష్ట్రానికి వచ్చిన కేంద్రనాయకులు ఎవరిని పలకరించినా, నెక్స్ట్ టార్గెట్ తెలంగాణ అని ఎలాంటి సషబిషలు లేకుండా కుండబద్దలు కొడుతున్నారు.అందుకే, బెంగాల్లో బీజేపీ గెలిస్తే.. అనే ఊహా కూడా  గులాబీ గూటిలో గుబులు పుట్టిస్తోంది. అయితే, బెగాల్’లో బీజేపీ గెలిస్తే ఒక్క తెలంగాణలోనే కాదు, దేశ రాజకీయ వాతావరణంలోనే పెను మార్పులు చోటు చేసుకుంటున్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.  అలాగే,  దేశ ముఖ చిత్రంలో కూడా పెను మార్పులు తప్పవని అంటున్నారు. అయితే రాజకీయాలలో ఎప్పుడు ఏం జరుగుతుందో.. ఎవరూహించెదరు..
  పెద్దలు ఎల్లప్పుడూ స్నేహాలు మంచిగా ఉండాలని సలహా ఇస్తారు. దీని వెనుక వారి ఆలోచన ఏమిటంటే- 'స్నేహం ఎలా ఉంటుందో, ప్రవర్తన కూడా అలాగే ఉంటుంది.' ఎవరైనా సరే ఏ రకమైన వ్యక్తులతో సమయం గడుపుతారో, వారి ఆలోచన, ప్రవర్తన,  అలవాట్లు క్రమంగా ఎదుటివారిలో  రావడం ప్రారంభిస్తాయి. ముఖ్యంగా  పిల్లలలో ఈ ప్రక్రియ మరింత వేగంగా జరుగుతుంది. ఎందుకంటే వారు ఈ సమయంలో భావోద్వేగపరంగా పెళుసుగా ఉంటారు.   ఇతరుల వల్ల  సులభంగా ప్రభావితమవుతారు. పిల్లలు తప్పుడు స్నేహంలో పడితే, అది వారి ప్రవర్తన, నమ్మకం,  చదువులతో పాటు వారి భవిష్యత్తును కూడా ప్రభావితం చేస్తుంది. వారిలో కనిపించే కొన్ని అలవాట్ల కారణంగా వారు చెడుదారిలో పడ్డారా లేదా అనే విషయం తెలుసుకోవచ్చు. ఉపాధ్యాయుల గురించి చెడుగా మాట్లాడటం.. ఒక పిల్లవాడు తన ఉపాధ్యాయుల గురించి పదే పదే చెడుగా మాట్లాడటం లేదా వారిని తక్కువ అంచనా వేయడం ప్రారంభించినప్పుడు,  పిల్లవాడు చెడు సహవాసంలో పడిపోయాడని అర్థం చేసుకోవాలి. ఇది పిల్లలకు చదువు మీద  చులకన భావం ఏర్పడేలా చేస్తుంది. చెడు స్నేహితుల సమర్థింపు.. పిల్లవాడు తన స్నేహితుల్లో ఎవరి తప్పుడు ప్రవర్తననైనా సమర్థించడం ప్రారంభిస్తే , ఆ పిల్లవాడు ఆ స్నేహితుడి ప్రభావానికి లోనయ్యాడని స్పష్టమైన సంకేతం.  ఇది  హెచ్చరిక సంకేతం అవుతుందట.  ఇలాంటి వారు స్నేహితుల ద్వారా  ాలా దెబ్బ తింటారు. నెగెటివ్ గా మాట్లాడటం..  పిల్లవాడు అకస్మాత్తుగా తన గురించి ప్రతికూలంగా మాట్లాడటం ప్రారంభిస్తే లేదా అతని ఆత్మవిశ్వాసం తక్కువగా ఉన్నట్లు అనిపిస్తే, అది అతని స్నేహితుల  యొక్క ప్రతికూల ప్రభావం కావచ్చు.  ఇది పిల్లవాడిని ఆత్మవిశ్వాసం కోల్పోయేలా చేస్తుంది. రహస్యం.. పిల్లవాడు అకస్మాత్తుగా ఫోన్ దాచి స్నేహితులతో మాట్లాడటం,  లేదా చాట్ చేస్తున్నప్పుడు స్క్రీన్‌ను దాచిపెట్టడం వంటివి చేస్తే  తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలి.  పిల్లలు తల్లిదండ్రులకు తెలియకుండా తప్పు పనులు చేసే అవకాశం ఉంటుంది. చదువుకు దూరం కావడం.. పిల్లలు అకస్మాత్తుగా చదువుకు దూరం కావడం, హోంవర్క్ వాయిదా వేయడం, తరగతులకు హాజరు కాకపోవడానికి సాకులు వెతకడం లేదా అస్సలు చదువుకోకూడదని అనిపించడం ప్రారంభిస్తే, అది సోమరితనం వల్ల మాత్రమే కాకపోవచ్చు. చెడు సహవాసం వల్ల కూడా ఇలా చేసే అవకాశం ఉంటుంది.                                  *రూపశ్రీ.
మనీ ప్లాంట్ ఇంట్లో ఉంటే అదృష్టం అంటారు.  మనీ ప్లాంట్ ఎంత బాగా పెరిగితే ఇంట్లో ధనం అంతగా పెరుగుతుందని నమ్మకం.  అయితే కొన్ని ఇళ్లలో మనీ ప్లాంట్ అస్సలు సరిగ్గా పెరగదు.  వర్షాకాలంలో అయినా, సాధారణ రోజులలో అయినా మనీ ప్లాంట్ పెరుగుదల విషయంలో గందరగోళ పడే వారు ఉంటారు. అలాంటి వారి కోసం అద్భుతమైన చిట్కా ఉంది.  మనీ ప్లాంట్ బాగా,  గుబురుగా పెరగాలన్నా,  వేగంగా పెరగాలన్నా ఇంట్లోనే ఉన్న 5 పదార్థాలు ఉపయోగిస్తే సరిపోతుంది.  ఇంతకీ ఆ పదార్థాలు ఏంటో.. వాటిని ఎలా ఉపయోగించాలో తెలుసుకుంటే.. మనీ ప్లాంట్ కోసం ఎరువు.. మనీ ప్లాంట్ బాగా పెరగాలంటే ఇంట్లోనే దీనికి మంచి పోషకం కలిగిన ఎరువును తయారు చేసుకోవాలి. దీనికోసం ఇంట్లోనే లభించే 5 పదార్థాలు చక్కగా పనిచేస్తాయి. కావలసిన పదార్థాలు.. టీ ఆకులు లేదా టీ పౌడర్ పసుపు బెల్లం బంగాళదుంప తొక్కలు ఆవాలు తయారు చేసే విధానం.. ముందుగా టీ తయారు చేసిన తరువాత మిగిలిపోయే టీ పౌడర్ ను పడేయకూడదు.  ఈ టీ పౌడర్ ను మళ్లీ ఎండబెట్టాలి. వంటింట్లో బంగాళదుంపలను వినియోగించినప్పుడు తొక్కలు తీస్తుంటారు.  ఈ తొక్కలను కూడా ఎండబెట్టాలి.   టీ పౌడర్, బంగాళదుంప తొక్కలు బాగా ఎండిన తరువాత వీటిని మెత్తని పౌడర్ లా గ్రైండ్ చేసుకోవాలి.  ఈ టీ పౌడర్ లో కాసింత చిన్న బెల్లం ముక్క వేయాలి.  దీంతో పాటు ఆవాలు,  పసుపు కూడా వేసి బాగా గ్రైండ్ చేయాలి.  ఇలా తయారైన పొడిని మనీ ప్లాంట్ మొదట్లో కాసింత ఎరువులాగా వేసి నీరు పోయాలి. ఇలా 10 లేదా 15 రోజులకు ఒకసారి వేస్తూ ఉంటే మనీ ప్లాంట్ చాలా వేగంగా, బాగా పెరుగుతుంది.  కేవలం మనీ ప్లాంట్ కు మాత్రమే కాదు.. ఇతర తీగ జాతి మొక్కలకు,  పూల మొక్కలకు కూడా ఇలా చేయవచ్చు. ఏ పదార్థాలు ఎలా పనిచేసాయి.. బెల్లం.. బెల్లం నేలలో చిన్న చిన్న మంచి సూక్ష్మక్రిములను ఉత్పత్తి చేస్తుంది, నేలను మరింత సారవంతం చేస్తుంది.  మొక్క అవసరమైన పోషకాలను సులభంగా గ్రహించడంలో సహాయపడుతుంది. టీ ఆకులు.. ఉపయోగించిన టీ ఆకులు మనీ ప్లాంట్ ఆకులను ముదురు ఆకుపచ్చగా,  పెద్దవిగా చేస్తాయి. ఇందులో నత్రజని ఉంటుంది.  ఇది ఆకుల పెరుగుదలకు చాలా ముఖ్యమైనది. ఆవాలు.. ఇందులో నత్రజని, భాస్వరం,  పొటాషియం ఉంటాయి. ఇవి మొక్క బాగా పెరగడానికి, వేర్లు బలంగా,  ఆకులు ఆరోగ్యంగా ఉండటానికి సహాయపడతాయి. ఇది నేలను కూడా మెరుగుపరుస్తుంది. పసుపు.. పసుపు సహజ ఔషధంగా పనిచేస్తుంది. ఇది మొక్కను వ్యాధులు,  కీటకాల నుండి రక్షిస్తుంది.  ముఖ్యంగా వేరు కుళ్ళును నివారిస్తుంది. ఇది నేలను శుభ్రంగా ఉంచుతుంది. బంగాళాదుంప తొక్కలు.. బంగాళాదుంప తొక్కలలో పొటాషియం ఉంటుంది. ఇది మనీ ప్లాంట్ ఆకులను మెరిసేలా ఆరోగ్యంగా చేస్తుంది. ఇది మొక్క యొక్క బలాన్ని పెంచుతుంది  వ్యాధులతో పోరాడటానికి సహాయపడుతుంది.                        *రూపశ్రీ.  
  ఇంటిని స్టైలిష్‌గా,  ప్రత్యేకంగా కనిపించేలా చేయడానికి,  తరచుగా మెష్ చేసిన కిటికీలు ,  తలుపులను ఏర్పాటు చేసుకుంటారు. కానీ వాటిలో చిక్కుకున్న మురికిని తొలగించడం చాలా కష్టం.  మెష్ కారణంగా వెంటిలేషన్ సమస్య ఉండదు. కాబట్టి ఇంట్లో మెష్  కిటికీలు,  తలుపులు ఉండటం చాలా బాగుంటుంది. కాన మెష్ ను క్లీన్  చేయడం గురించే అందరి భయం.  అలా కాకుండా కొన్ని సులభమైన చిట్కాలు పాటించడం ద్వారా మెష్ ను సులువుగా క్లీన్ చేయవచ్చు. అది కూడా ఇంట్లోనే ఉండే పదార్థాలతో మెష్ క్లీన్ చేసే ద్రావణాన్ని తయారు చేసుకోవచ్చు. ఇందుకోసం కావలసిన పదార్థాలు,  తయారీ విధానం తెలుసుకుంటే.. కావలసిన పదార్థాలు.. 1 స్ప్రే బాటిల్, కొబ్బరి నూనె 1 కాటన్ వస్త్రం, 1 టూత్ బ్రష్ 1 నుండి 2 టీస్పూన్లు టార్టార్ పౌడర్ 2 నుండి 3 టీస్పూన్ల లిక్విడ్ సోప్ 1/2 కప్పు టీ నీరు తయారీ విధానం.. ఒక గిన్నెలో టార్టార్ పౌడర్, లిక్విడ్ సోప్,  టీ వాటర్ కలిపి బాగా మిక్స్ చేయాలి. ఇలా చేస్తే మెష్ క్లీన్ చేసే ద్రావణం సిద్దమైనట్టే.. ఇక్కడ గుర్తుంచుకోవలసిన ముఖ్యమైన విషయం ఏమంటే.. పైన పేర్కొన్న పరిమాణం ప్రకారం  అన్ని వస్తువులను జోడించాలి, అప్పుడు మాత్రమే శుభ్రపరచడం సులభం అవుతుంది. ఇలా ఇంట్లోనే  క్లీనింగ్ లిక్విడ్ తయారు చేసుకోవాలి.  దీన్ని ఒక స్ప్రే బాటిల్ లో పోసుకోవాలి. మెష్ న ఇలా శుభ్రం చేయాలి.. ఇంట్లో తయారుచేసిన క్లీనింగ్ లిక్విడ్‌ను తలుపు లేదా కిటికీ గ్రిల్‌పై పూర్తిగా స్ప్రే చేయాలి . ఇప్పుడు దీన్ని 10 నిమిషాలు అలాగే వదిలేయాలి. నిర్ణీత సమయం తర్వాత, టూత్ బ్రష్ తీసుకొని గ్రిల్‌ను పూర్తిగా స్క్రబ్ చేయాలి. ఇప్పుడు కాటన్ వస్త్రంతో కొద్దిగా తడిపి గ్రిల్‌ను పూర్తిగా తుడవాలి. చివరగా పొడి వస్త్రంతో తుడవాలి. ఇలా చేస్తే మెష్ ప్రకాశవంతంగా మెరుస్తుంది. ఇలా కూడా క్లీనర్ తయారు చేసుకోవచ్చు.. ఒక స్ప్రే బాటిల్‌లో సమాన మొత్తంలో నీరు, వైట్  వెనిగర్ కలపాలి. ఉదాహరణకు..  ఒక కప్పు నీరు తీసుకుంటుంటే, ఒక కప్పు వైట్ వెనిగర్ కూడా కలపాలి. వెనిగర్ మురికి, గ్రీజును తగ్గించడంలో ప్రభావవంతంగా ఉంటుంది . ఇప్పుడు ఈ ద్రావణాన్ని మెష్‌పై పూర్తిగా స్ప్రే చేయాలి. మెష్‌లోని ప్రతి భాగం తడిగా ఉండేలా చూసుకోవాలి. దీన్ని కూడా కొంత సమయం పాటు అలాగే ఉంచాలి. తరువాత ఇప్పుడు మెష్‌ను పై నుండి క్రిందికి మైక్రోఫైబర్ క్లాత్ లేదా పాత టవల్‌తో తుడవాలి. ఇది మురికిని తొలగిస్తుంది. మెష్‌లో చాలా మురికి చిక్కుకుంటే పాత టూత్ బ్రష్‌ను ఉపయోగించవచ్చు. సున్నితంగా రుద్దడం ద్వారా మురికి తొలగిపోతుంది. ఇప్పుడు శుభ్రమైన గుడ్డను సాధారణ నీటిలో తడిపి శుభ్రం చేయాలి.  చివరకు పొడి గుడ్డతో శుభ్రం చేయాలి.  ఇలా చేస్తే మెష్ లో మురికి పూర్తీగా పోయి మెరుస్తుంది.                                       *రూపశ్రీ.  
బెర్రీలు చాలా మంది ఇష్టంగా తినే పండ్లు. వీటిలో బ్లూబెర్రీ, బ్లాక్ బెర్రీ, స్ట్రాబెర్రీ.. ఇట్లా చాలా రకాలు ఉంటాయి.  తియ్యగా, పుల్లగా ఉంటూ ప్రత్యేకమైన సువాసన కలిగి ఉండే బెర్రీలు అంటే అందరికీ ఇష్టమే..  వీటిని ఉపయోగించి చేసే జ్యూస్ లు, స్మూతీలు, ఐస్ క్రీమ్ లకు చాలా ఆదరణ ఉంది.  వీటి ప్లేవర్ అంత బాగుంటుంది మరి. అయితే బెర్రీలు తినగానే కొన్ని రకాల ఆహారాలు, ద్రవ పదార్థాలు అస్సలు తీసుకోకూడదు అంట.  అలా తీసుకుంటే సైడ్ ఎఫెక్ట్స్ ఏర్పడి ఫుడ్ పాయిజన్ జరిగే ప్రమాదం ఉంటుందట. ఇంతకీ బెర్రీలు తిన్న తరువాత తీసుకోకూడని పదార్థాలు ఏంటో తెలుసుకుంటే.. పాలు.. బెర్రీలు తిన్న తర్వాత పాలు తీసుకోవడం కానీ, లేక  పాలు కలిపి బెర్రీలను తినడం కానీ ఆరోగ్యానికి మంచిది కాదట.  ఇది జీర్ణక్రియకు ప్రమాదకరం. రెండూ కలిసి యాసిడ్-బేస్ రియాక్షన్‌కు కారణమవుతాయి. దీని వలన గ్యాస్, కడుపు నొప్పి,  అజీర్ణం వంటి సమస్యలు వస్తాయి. దోసకాయ.. దోసకాయ,  బెర్రీలు  రెండూ శరీరాన్ని చల్లబరిచే  ప్రభావాన్ని కలిగి ఉంటాయి. ఈ రెండింటినీ కలిపి తినడం వల్ల శరీరంలో  అవసరానికి మించి చల్లదనం పెరుగుతుంది.  ఇది జలుబు,  అజీర్ణానికి కారణమవుతుంది. నీరు.. బెర్రీలు  తిన్న వెంటనే నీరు త్రాగడం వల్ల జీర్ణక్రియకు అంతరాయం కలుగుతుంది. దీనివల్ల కడుపులో గ్యాస్, తిమ్మిర్లు,  కొన్నిసార్లు వాంతులు కూడా వస్తాయి. బెర్రీలు తిన్న తర్వాత  కనీసం 30 నిమిషాల తర్వాత నీరు త్రాగాలి. ఊరగాయలు..  బెర్రీలు,  ఊరగాయలు రెండూ పుల్లగా,  ఆమ్లంగా ఉంటాయి. వీటిని కలిపి తినడం వల్ల ఆమ్లత్వం, గుండెల్లో మంట,  కడుపు నొప్పి వచ్చే అవకాశాలు చాలా రెట్లు పెరుగుతాయి. అందుకే బెర్రీలు తిన్న తర్వాత ఊరగాయల జోలికి పోకూడదు. సిట్రస్ పండ్లు.. నారింజ, నిమ్మ వంటి పండ్లను సిట్రస్ పండ్లు అంటారు.  బెర్రీలను   తిన్న వెంటనే సిట్రస్ పండ్లను  తినకూడదు. ఎందుకంటే ఈ రెండూ పుల్లని పండ్లు. దీనివల్ల విరేచనాలు,  కడుపు నొప్పి వస్తుంది. కూల్ డ్రింక్స్.. బెర్రీలు తిన్న తర్వాత చల్లని పానీయాలు తాగకూడదు. దీని వల్ల శరీరంలో రసాయన ప్రతిచర్య ఏర్పడుతుంది. ఇందులో ఉండే చక్కెర,  కార్బన్ డయాక్సైడ్ బెర్రీలలో ఉండే  సహజ ఆమ్లంతో కలిసిపోయి గ్యాస్ట్రిక్ సమస్యలను కలిగిస్తాయి.                                     *రూపశ్రీ. గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు..
  భారతీయ వంటగదిలో టమోటా ఒక ముఖ్యమైన భాగం. అది కూరలో అయినా, సలాడ్ అయినా లేదా చట్నీ అయినా టమోటా లేకుండా రుచి అసంపూర్ణంగా అనిపిస్తుంది. అయితే టమోటాను ఇలా కూరలలో కాదు.. పచ్చిగా తినమని చెబుతున్నారు ఆహార నిపుణులు.  దీని వల్ల అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయట. పచ్చి టమోటాలలో లైకోపీన్, విటమిన్ సి, పొటాషియం,  ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. ఈ పోషకాలన్నీ శరీరంలోని వివిధ భాగాలపై సానుకూల ప్రభావాన్ని చూపుతాయి. సాధారణంగా సలాడ్ లో పచ్చి టమోటా చేర్చుకోవడం చూస్తూంటాం. ప్రతిరోజూ పచ్చి టమోటా తినడం వల్ల కలిగే 6 గొప్ప ప్రయోజనాలను తెలుసుకుంటే.. చర్మానికి చేసే మేలు.. పచ్చి టమోటాలలో ఉండే లైకోపీన్,  విటమిన్ సి చర్మానికి సహజమైన బూస్టర్‌గా పనిచేస్తాయి.  చర్మాన్ని హైడ్రేట్ గా ఉంచుతాయి.  ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే నష్టం నుండి రక్షిస్తాయి. ప్రతిరోజూ పచ్చి టమోటా తినడం వల్ల చర్మం  మెరుపు పెరుగుతుంది.  వృద్ధాప్య సంకేతాలు నెమ్మదిస్తాయి.  మొటిమలు లేదా జిడ్డుగల చర్మం సమస్యలు ఉంటే టమోటాలు కూడా చాలా ప్రభావవంతంగా ఉంటాయి. గుండె ఆరోగ్యానికి.. టమోటాలలో లభించే లైకోపీన్, పొటాషియం,  ఫోలేట్ గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి సహాయపడతాయి. ఇది రక్తపోటును సమతుల్యం చేస్తుంది, కొలెస్ట్రాల్‌ను నియంత్రిస్తుంది,  రక్త నాళాలు దెబ్బతినకుండా నిరోధిస్తుంది. ప్రతిరోజూ పచ్చి టమోటాలు తినడం వల్ల గుండె జబ్బులు, ముఖ్యంగా గుండెపోటు లేదా స్ట్రోక్ వచ్చే ప్రమాదం తగ్గుతుంది. అధిక రక్తపోటు ఉన్నవారికి టమోటాలు సహజ ఔషధంగా పనిచేస్తాయి. దీనిని సలాడ్, జ్యూస్ లేదా నేరుగా కోసి తినడం చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. బరువు తగ్గడంలో..  బరువు తగ్గించుకునే ప్రయాణంలో ఉన్నవారికి  టమోటా భలే సహాయపడుతుంది.  ఇందులో కేలరీలు చాలా తక్కువగా ఉంటాయి,  ఫైబర్,  నీరు ఎక్కువగా ఉంటాయి. ఇది చాలా సేపు కడుపు నిండినట్లు అనిపిస్తుంది. టమోటా జీవక్రియను కూడా సక్రియం చేస్తుంది.  శరీరంలో నిల్వ ఉన్న కొవ్వును నెమ్మదిగా కాల్చడంలో సహాయపడుతుంది. పొట్ట ఆరోగ్యానికి..  టమోటాలలో ఉండే ఫైబర్, సహజ ఆమ్లాలు జీర్ణక్రియను మెరుగుపరచడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. ఇది గ్యాస్, ఆమ్లతత్వం,  మలబద్ధకం వంటి సమస్యలను తొలగిస్తుంది. ప్రతిరోజూ  టమోటా తినడం వల్ల కడుపు శుభ్రపడుతుంది, పేగు పనితీరు మెరుగుపడుతుంది. దీనితో పాటు, ఇది ప్రేగులలో ఉండే మంచి బ్యాక్టీరియాకు మద్దతు ఇస్తుంది, ఇది మొత్తం జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది. రోగనిరోధక శక్తి.. టమాటాలో విటమిన్ సి,  యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండటం వల్ల శరీర రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తుంది. దీనిని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల జలుబు, వైరల్,  అలెర్జీలతో పోరాడటానికి సహాయపడుతుంది. ముఖ్యంగా మారుతున్న వాతావరణంలో శరీరం సులభంగా అనారోగ్యానికి గురవుతుంది. ఇలాంటి వాతావరణంలో  టమోటా  రోగనిరోధక శక్తిని కాపాడుకోవడానికి సహాయపడుతుంది. ఇది పిల్లలు,  వృద్ధులకు కూడా  రోగనిరోధక శక్తిని పెంచుతుంది. పూర్తి పోషకాలను పొందడానికి దీనిని  తాజాగా తినడం మంచిది. డిటాక్స్ చేస్తుంది.. టమోటాలు శరీరం నుండి విషాన్ని తొలగించే సహజ నిర్విషీకరణ లక్షణాలను కలిగి ఉంటాయి. ఇది కాలేయం,  మూత్రపిండాలను శుభ్రంగా ఉంచడంలో సహాయపడుతుంది,  శరీరాన్ని శుభ్రపరుస్తుంది. బయటి ఆహారాన్ని ఎక్కువగా తినేవారికి లేదా అనారోగ్యకరమైన జీవనశైలిని కలిగి ఉన్నవారికి ప్రతిరోజూ టమోటాలు తినడం ప్రయోజనకరంగా ఉంటుంది. ఇది శరీర శక్తిని కూడా నిర్వహిస్తుంది,   అలసటను దూరం చేస్తుంది. ఉదయం లేదా భోజనానికి ముందు టమోటాను  తినడం మంచి ప్రయోజనాలు కలిగిస్తుంది.                                 *రూపశ్రీ. గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు..  
  వయసు పెరిగే కొద్దీ చర్మం ముడతలు పడటం, జుట్టు నెరవడం, శరీరంలో శక్తి లేకపోవడం వంటి అనేక సమస్యలు మొదలవుతాయి. అయితే, ఆరోగ్యకరమైన ఆహారం,  ఆరోగ్యకరమైన జీవనశైలిని అవలంబించడం ద్వారా చాలా కాలం పాటు యవ్వనంగా,  ఆరోగ్యంగా ఉండవచ్చు. కొన్ని ఆహారాలు (Foods for Anti-Aging) కూడా  యవ్వనంగా ఉంచడంలో సహాయపడతాయి. అవి యాంటీ ఏజింగ్ లక్షణాలతో నిండి ఉంటాయి.  శరీరాన్ని లోపలి నుండి బలంగా చేస్తాయి. అలాంటి ఆహారాల గురించి తెలుసుకుని వాటిని  రెగ్యులర్ గా తీసుకుని, అవెలా పనిచేస్తాయో తెలుసుకుంటే.. టమోటా. టమోటా ఆహార రుచిని పెంచడమే కాకుండా, చర్మానికి కూడా చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఇందులో ఉండే లైకోపీన్ చర్మాన్ని సూర్యుని హానికరమైన కిరణాల నుండి రక్షిస్తుంది,  ముడతలను తగ్గిస్తుంది. అలాగే ఇది గుండె జబ్బులు,  క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది. అందుకే  ఆహారంలో టమోటాను ఖచ్చితంగా చేర్చుకోవాలి. టమోటాలను ఆహారంలో అనేక విధాలుగా భాగం చేసుకోవచ్చు. పసుపు.. పసుపులో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ,  యాంటీఆక్సిడెంట్ లక్షణాలు కలిగిన కర్కుమిన్ ఉంటుంది. అందువల్ల దీనిని "గోల్డెన్ స్పైస్" అని పిలుస్తారు. ఇది శరీరంలో మంటను తగ్గిస్తుంది. చర్మాన్ని మెరిసేలా చేస్తుంది.  మెదడు ఆరోగ్యానికి కూడా ఉపయోగపడుతుంది. అందువల్ల ఉదయం పసుపు కలిపిన పాలు తాగడం లేదా పసుపు నీరు త్రాగడం కూడా ఆరోగ్యానికి చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. పెరుగు.. పెరుగు ప్రోబయోటిక్స్ యొక్క అద్భుతమైన మూలం. ఇది జీర్ణవ్యవస్థను బలపరుస్తుంది. మంచి జీర్ణక్రియ శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో,  చర్మాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. పెరుగులో ఉండే కాల్షియం ఎముకలను బలపరుస్తుంది,  వృద్ధాప్య సంకేతాలను నెమ్మదిస్తుంది. కాబట్టి  ఆహారంలో పెరుగును ఖచ్చితంగా చేర్చుకోవాలి. రోజూ ఒక గిన్నె పెరుగు తినడం వల్ల  మొత్తం ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది. గ్రీన్ టీ. గ్రీన్ టీలో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరం నుండి విషాన్ని తొలగిస్తాయి,  జీవక్రియను పెంచుతాయి. ఇందులో ఉండే పాలీఫెనాల్స్ చర్మాన్ని దెబ్బతినకుండా కాపాడతాయి.  బరువు తగ్గడానికి కూడా సహాయపడతాయి. అందువల్ల, ప్రతిరోజూ గ్రీన్ టీ తాగడం వల్ల చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడమే కాకుండా కాలేయం కూడా చాలా ప్రయోజనాలను పొందుతుంది.                              *రూపశ్రీ గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...