LATEST NEWS
సమాజంలోని అన్ని వర్గాలూ ఆంధ్రప్రదేశ్‌లో కూటమిదే విజయం అనే విషయం ఫిక్సయ్యాయి. వాళ్ళూ వీళ్ళూ ఎందుకు.. వైసీపీకే పూర్తి క్లారిటీ వచ్చేసింది. ఓటరు చాలా తెలివైన వాడు.. ఐదేళ్ళపాటు జగన్ పార్టీ పెంచి పోషించిన చీకటిని ఒక్క ఓటుతో దివిటీ వెలిగించి పోగొట్టుకుంటున్నారు.  
చత్తీస్ గడ్ లోని  నారాయణ పూర్  భారీ ఎన్ కౌంటర్ జరిగింది. పోలీసులు జరిపిన కాల్పుల్లో ఏడుగురు మావోయిస్టులు చనిపోయారు. ఘటనా స్థలంలో భారీగా ఆయుధాలు, సామాగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆ సమీప ప్రాంతాల్లో పోలీసుల కార్డన్ సెర్చ్ కొనసాగుతోంది. పోలీసులు- మావోయిస్టుల మధ్య ఎదురు కాల్పులు జరిగిన తర్వాత కొందరు పారిపోయినట్టు సమాచారం.    ఛత్తీస్ గఢ్ లో మరోసారి భారీ ఎన్ కౌంటర్ జరిగింది. గత రెండు నెలల వ్యవధిలో ఛత్తీస్ గఢ్ లో జరిగిన మూడో ఎన్ కౌంటర్ ఇది. ఈ ఎదురుకాల్పుల్లో ఏడుగురు నక్సల్స్ మృతి చెందారు. 12 మందికి పైగా మావోయిస్టులు గాయపడినట్టు తెలుస్తోంది.  పోలీసులు, మావోయిస్టులకు ఇంకా ఎదురుకాల్పులు కొనసాగుతూనే ఉన్నాయి. పోలీసులు కూంబింగ్ నిర్వహించారు. ఈ మధ్య కాలంలో మావోయిస్టులను పోలీసులు మట్టుపెడుతున్నారు. ఇటీవలే కొంతమంది లొంగిపోయారు.దండకారణ్యంలో మావోయిస్టులు కీలక సమావేశం నిర్వహిస్తున్నారన్న సమాచారంతో భద్రతా బలగాలు రంగంలోకి దిగాయి. దంతేవాడ-బీజాపూర్ సరిహద్దుల్లో భద్రతా బలగాలు కూంబింగ్ చేస్తుండగా, మావోలు కాల్పులు జరిపారు. భద్రతా బలగాలు కూడా దీటుగా స్పందించి ఎదురు కాల్పులతో బదులిచ్చాయి. ఉదయం మొదలైన ఈ ఎన్ కౌంటర్ ఇప్పటికీ కొనసాగుతున్నట్టు తెలుస్తోంది.  కాగా, పారిపోయే ప్రయత్నంలో ఉన్న పలువురు మావోయిస్టులను భద్రతా బలగాలు అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం.
అంగరంగ వైభవంగా పెళ్ళి జరుగుతోంది. వేదిక మీద వున్న వధూవరులు చిలకాగోరింకల మాదిరిగా చూడముచ్చటగా వున్నారు. వాతావరణం అంతా సందడిగా వుంది. పెళ్ళికూతురు తరఫు వాళ్ళు భారీ స్థాయిలో పెళ్ళి ఏర్పాట్లు చేశారు. పెళ్ళికొడుకు తరఫు వాళ్ళకు అన్ని రకాల మర్యాదలూ చేస్తున్నారు. ఇంతలో ఊహించని సంఘటన జరిగింది. పెళ్ళి కూతురు బుగ్గ మీద అతను ముద్దు పెట్టాడు. అది చూసిన ఆడపెళ్ళివారికి ఆగ్రహం ముంచుకొచ్చింది. పెళ్ళికూతురికి ముద్దు పెట్టడానికి నువ్వెవడ్రా అంటూ పెళ్ళికూతురికి ముద్దుపెట్టిన వ్యక్తిని చావబాదారు. దాంతో అతను లబోదిబో, కుయ్యోమొర్రో అన్నాడు.. ఇంతకీ పెళ్ళికూతురికి ముద్దుపెట్టింది ఎవరో దారినపోయే దానయ్య కాదు.. సాక్షాత్తూ పెళ్ళికొడుకే. ఇవాళా రేపు పెళ్ళి వేదికల మీద పెళ్ళికొడుకు, పెళ్ళికూతురు ముద్దు పెట్టుకోవడం మామూలు విషయమే.. పాపం పెళ్ళికొడుకు కూడా అదే పని చేశాడు. దాంతో పెళ్ళికూతురు తరఫు వాళ్ళ చేతిలో చావుదెబ్బలు తిన్నాడు. పెళ్ళికొడుకుని అలా కొట్టినందుకు అతని తరఫు వాళ్ళు రెచ్చిపోయారు. పెళ్ళికూతురు ఫ్యామిలీవాళ్ళని కూడా తుక్కుతుక్కుగా ఇరగొట్టేశారు. వీళ్ళు కూడా తిరగబడ్డారు. దాంతో రెండు వర్గాల వాళ్ళూ విరగబాదుకుంటూ పెళ్ళికి వచ్చిన జనం మీద పడ్డారు. పెళ్ళికి వచ్చిన జనం ఇదేంట్రా కొత్తరకం గొడవ అనుకుంటూ పరుగులు తీసి, తినడానికి సిద్ధంగా వున్న ఆహార పదార్థాల మీద పడ్డారు. దాంతో కంగాళీ, గందరగోళం, సర్వనాశనం..  ఈ సందర్భంగా జరిగిన తన్నులాటలో మొత్తం ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. వాళ్ళలో పెళ్ళికూతురు తండ్రి కూడా వున్నాడు. గాయపడినవాళ్ళందరూ ఆస్పత్రిలో ట్రీట్‌మెంట్ తీసుకుంటున్నారు. వీళ్ళలో ఒక వికెట్ అయినా లేచే అవకాశం వుందని అంటున్నారు. తన్నుకునే శక్తి తగ్గిపోయిన తర్వాత రెండు వర్గాలూ మాటల యుద్దం ప్రారంభించాయి. పెళ్ళికూతుర్ని పెళ్ళికొడుకు ముద్దుపెట్టుకుంటే తప్పేంటయ్యా అని వీళ్ళు అంటే, మా అమ్మాయిని అందరి ముందూ ముద్దు పెట్టుకుంటే మేం ఊరుకోం అని వాళ్ళు అన్నారు. చివరికి పెళ్ళికొడుకు అసలు విషయం బయటపెట్టాడు. పెళ్ళికూతురు ముద్దు పెట్టుకోమంటేనే ఈ అందగాడు ముద్దు పెట్టుకున్నాడట. అలా ఒక్క ముద్దు పెట్టిన పాపానికి వంద గుద్దులు తినాల్సి వచ్చింది. అసలు విషయం తెలిసి అందరూ నోళ్ళు తెరిచారు. ఈ సంఘటన ఉత్తర్ ప్రదేశ్‌లోని హాపూర్‌లో జరిగింది.
ఆంధ్రప్రదేశ్ లోని పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గం రెంటచింతల పోలింగ్‌ స్టేషన్‌లో ఈవీఎం యంత్రాలను  ధ్వంసం చేసిన కేసులో ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి , అతడి సోదరుడి కోసం రెండు రాష్ట్రాల పోలీసులు విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టారు. ఈ ఘటనలో ఇప్పటికే పిన్నెల్లిని ఏ1గా ఎఫ్ఐఆర్ ‎లో చేర్చారు. ఐపీలోని143, 147, 448, 427, 353, 452, 120బి, తోపాటు ప్రజాప్రాతినిధ్య చట్టం, పీడీపీపీ చట్టం, ఆర్పీ చట్టం 131, 135లోని పలు సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. త్వరలోనే పిన్నెల్లిని అరెస్ట్ చేయనున్నట్టు సీఈవో ముఖేష్ కుమార్ మీనా స్పష్టం చేశారు.మరోవైపు నరసారావుపేట కోర్టులో లొంగిపోనున్నారనే వార్తలు వినిపించిన కొద్ది సేపటికే తాజాగా ఏపీ హైకోర్టు లో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి తరపున పిటిషన్ దాఖలు అయింది. హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. మరికాసేపట్లో పిన్నెల్లి ముందస్తు బెయిల్ పిటిషన్ పై ఏపీ హై కోర్టులో విచారణ జరుగనుంది.
వైసీపీ నాయకురాలు రోజాకి ‘ఐరన్ లెగ్’ అనే బిరుదు మొట్టమొదటిసారి ఎవరు ఇచ్చారోగానీ, ఆ ఇచ్చినోడి నాలుక మీద మచ్చలు వుండే వుంటయ్ నో డౌట్. ఎందుకంటే, ఆ మాట ఎప్పటికప్పుడు ప్రూవ్ అవుతూ వస్తోంది. రోజా రెండుసార్లు ఎమ్మెల్యే అయినా, మంత్రి పదవిలోకి వచ్చినా సదరు ‘ఐరన్ లెగ్’ అనే మాట మాత్రం ఆమె జీవితంలో నుంచి తొలగిపోవడం లేదు. నగరి నియోజకవర్గం నుంచి హాట్రిక్ సాధించడానికి ప్రయత్నిస్తున్న రోజా ఈ సారి తుక్కుతుక్కుగా ఓడిపోవడం ఖాయమనే విషయంలో పోలింగ్ రోజు క్లారిటీ వచ్చేసింది. తనను ఓడించడానికి తన పార్టీ నాయకులే పనిచేస్తున్నారని రోజా బాహాటంగా చెప్పుకుని లబోదిబో అనడం గురించి అందరికీ తెలిసిందే. దీన్నిబట్టి ఏంటంటే, నగరిలో రోజా ఓడిపోవడం ఖాయం. ఓడిపోవడం మాత్రమే కాదు.. ఫలితాలలో మొదటగా వచ్చే ఫలితం నగరిదే.. అంటే, వైసీపీకి ఓటమి బోణీ కొట్టేది రోజా నియోజకవర్గమేనన్నమాట.. పాపం వైసీపీ, అయ్యో పాపం రోజా! ఎన్నికల ఫలితాలలో మొదటి ఫలితం తనదే అయ్యే అదృష్ణం రోజాకి ఎందుకు పట్టిందంటే, నగరి నియోజకవర్గంలో ఓటర్ల సంఖ్య తక్కువ. ఇక్కడ మొత్తం 2,02,574 మంది ఓటర్లు వున్నారు. పోలింగ్ బూత్‌ల సంఖ్య కూడా తక్కువ (231). అలాగే పోటీలో నిలిచిన అభ్యర్థుల సంఖ్య కూడా తక్కువే. ఇక్కడ కేవలం ఏడుగురు అభ్యర్థులు మాత్రమే రంగంలో వున్నారు. సంఖ్యాపరంగా అన్నిరకాలుగా తక్కువలో వున్న నగరి నియోజకవర్గం రోజాకి, వైసీపీకి మొదటి షాక్ ఇవ్వబోతోంది.
ALSO ON TELUGUONE N E W S
బెంగళూరు రేవ్‌ పార్టీ ఇప్పుడు ఇండస్ట్రీలో, తెలుగు రాష్ట్రాల్లో హాట్‌ టాపిక్‌గా మారింది. ఈ పార్టీలో పాల్గొన్న వారిలో ఎక్కువ శాతం డ్రగ్స్‌ తీసుకున్నారని పోలీసులు చెబుతున్నారు. వారిలో మహిళలు కూడా అధికంగానే ఉన్నారని తేలింది. ముఖ్యంగా నటి హేమ ఈ పార్టీలో పాల్గొనడమే కాకుండా డ్రగ్స్‌ కూడా తీసుకున్నట్టు పోలీసులు నిర్ధారించారు. ఈ విషయంలో ఇండస్ట్రీలోని ప్రముఖులు కూడా స్పందిస్తున్నారు. తప్పు చేసిన వారిని కఠినంగా శిక్షించాలని కోరుతున్నారు.  ఈ నేపథ్యంలో చిత్ర నిర్మాత నట్టికుమార్‌ బెంగళూరు రేవ్‌పార్టీ వ్యవహారంపై తీవ్రంగా స్పందించారు. ‘డ్రగ్స్‌ మాఫియా ఎక్కడ జరిగినా, రేవ్‌ పార్టీలు ఎక్కడ జరిగినా... ఎక్కడో ఒకరు సినిమావాళ్లు పాల్గొన్నా, పట్టుబడినా ఆ నేరాన్ని సినీ పరిశ్రమ అంతటికీ ఆపాదిస్తున్నారు. దీనివల్ల సినిమా వారిని బయట ఛీప్‌గా చూస్తున్నారు. తప్పు చేసినవారు ఎవరైనా, ఎంతటి వారైనా శిక్షార్హులే. అందుకే సినీ పరిశ్రమకు చెడ్డ పేరు రాకుండా, నిజంగా తప్పు చేసారని నిరూపణ అయితే అలాంటి వారిని నిషేధిస్తూ మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌, పరిశ్రమకు చెందిన ఛాంబర్‌ వంటి సంస్థలు చర్యలు తీసుకోవాలి. ముఖ్యంగా నటి హేమ విషయంలో వాస్తవాలు బయటకు రావాలి. ఒకవేళ ఆమె తప్పు చేసినట్లు రుజువైతే ‘మా’ అసోసియేషన్‌ చర్యలు తీసుకోవాలి. ఆ మధ్య గోవాలో సురేష్‌ కొండేటి తాను ఏర్పాటు చేసిన అవార్డుల ఫంక్షన్‌లో ఏవో లోపాలు జరిగాయని ఫిర్యాదులు వస్తే, అతనిని నిషేధిస్తూ పరిశ్రమ నిర్ణయం తీసుకుంది. వాస్తవానికి అతను ఏర్పాటు చేసుకున్న ప్రైవేట్‌ ఫంక్షన్‌ అది. ఆ విషయంలోనే పరిశ్రమ వర్గాలు అలాంటి నిర్ణయం తీసుకున్నప్పుడు హేమ విషయంలో కూడా వాస్తవాలను పరిగణనలోనికి తీసుకుని తగిన చర్యలు తీసుకోవాలి. నిజంగా బెంగళూరు రేవ్‌ పార్టీలో ఆమె పాల్గొనకపోతే, సౌత్‌ ఇండియన్‌ ఫిలిం ఛాంబర్‌ ద్వారా కర్ణాటక గవర్నమెంట్‌తో మాట్లాడి దానికి బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలి’’ అని డిమాండ్‌ చేశారు. 
'లక్ష్మీ కళ్యాణం'తో తెలుగుతెరకు హీరోయిన్ గా పరిచయమైన కాజల్ అగర్వాల్ (Kajal Aggarwal).. 'చందమామ'తో ఘన విజయాన్ని అందుకొని, క్రేజీ హీరోయిన్ గా మారిపోయింది. 'చందమామ'లో నవదీప్ కి జోడిగా కాజల్ నటించింది. ఇందులో వీరి మధ్య కెమిస్ట్రీ బాగా కుదిరించి. నవదీప్, కాజల్ మధ్య రొమాంటిక్ సన్నివేశాలు హైలైట్ గా నిలిచాయి. 'చందమామ'లో రొమాన్స్ తో రెచ్చిపోయిన ఈ జోడి.. ఇప్పుడు బాక్సాఫీస్ వార్ కి దిగుతోంది. కాజల్ టైటిల్ రోల్ పోషించిన 'సత్యభామ'(Satyabhama), నవదీప్ హీరోగా నటించిన 'లవ్ మౌళి' (Love Mouli) ఒకేరోజు విడుదల కానున్నాయి. జూన్ 7న ఈ రెండు సినిమాలు బాక్సాఫీస్ దగ్గర అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాయి. ఈ చిత్రాల విజయం ఇద్దరికీ కీలకమే.  ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగిన కాజల్ జోరు ఈమధ్య బాగా తగ్గింది. పైగా 'సత్యభామ' అనేది ఫిమేల్ ఓరియెంటెడ్ సినిమా కావడంతో.. తన బ్రాండ్ తోనే వసూళ్లు రాబట్టాల్సి ఉంది. ఇది హిట్ అయితే కాజల్ మళ్ళీ టాలీవుడ్ లో ఫుల్ బిజీ అయ్యే అవకాశముంది. నవదీప్ హీరోగా బాక్సాఫీస్ దగ్గర అలరించి చాలా కాలమే అవుతుంది. కొన్నేళ్లుగా ఇతర హీరోల సినిమాల్లో కీలక పాత్రలకు పరిమితం అవుతూ వస్తున్న నవదీప్.. తనని తాను హీరోగా రీ లాంచ్ చేసుకుంటున్నట్లుగా 'లవ్ మౌళి'ని ప్రమోట్ చేసుకుంటున్నాడు. ఈ సినిమా హిట్ అయితేనే మళ్ళీ నవదీప్ కి హీరోగా అవకాశాలు క్యూ కట్టే ఛాన్స్ ఉంది. మరి జూన్ 7న 'సత్యభామ', 'లవ్ మౌళి' మధ్య జరుగుతున్న ఈ పోరులో ఎవరు పైచేయి సాధిస్తారో చూడాలి.
14వ దాదా సాహెబ్ ఫాల్కే ఫిలిం ఫెస్టివల్ అండ్ బూస్టన్ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ లో 'వీవ్ ఆఫ్ కల్చర్' షార్ట్ ఫిలిం ఉత్తమ స్టూడెంట్ షార్ట్ ఫిలింగా అవార్డు గెలుచుకుంది. దాదాసాహెబ్ ఫాల్కే ఫిలిం ఫెస్టివల్ వేడుక ఇండియాలోనే అత్యంత గుర్తింపు పొందిన సినిమా వేడుక.  వీవీ ఆఫ్ కల్చర్ చిత్రాన్ని సంతోష్ రామ్ మావూరి దర్శకత్వంలో తెరకెక్కింది. ఆయన నెల్లూరుకు చెందిన వ్యక్తి. లాస్ ఏంజిల్స్ లో సంతోష్ ఫిలిం మేకింగ్ లో మాస్టర్స్ చేశారు. ఈ చిత్రంలో చేనేత కార్మికుల వస్త్రాలని, వారి ప్రతిభని క్షుణ్ణంగా చూపించారు. స్పష్టమైన కథాంశం మరియు అద్భుతమైన సినిమాటోగ్రఫీ ద్వారా ఈ చిత్రంలో చేనేత కార్మికుల సంప్రదాయాలని కూడా చూపించారు.  ఈ చిత్ర కథాంశం విషయానికి వస్తే...  చేనేత వస్త్రాల తయారీలో ఒక కుటుంబం పేరు ప్రఖ్యాతలు సంపాదిస్తుంది. కుటుంబ పెద్ద ఆకస్మికంగా మరణించడం, చేనేత చీరలకు ప్రోత్సహం లభించకపోవడంతో ఆయన భార్య కుటుంబ పోషణ కోసం హ్యాండ్ లూమ్ ఫ్యాక్టరీలో అతితక్కువ వేతనానికి పనిలో చేరుతుంది. ఇంజనీరింగ్ చదువుకుంటున్న తన కుమారుడు విజయ్ ను ఉన్నత చదువుల కోసం అమెరికా పంపాలి అనుకుంటుంది, అందుకు కావాల్సిన డబ్బు కోసం తన ఇంటిని తాకట్టు పెట్టుకొని నగదు ఇవ్వమని ఫ్యాక్టరీ ఓనర్ ను కోరుతుంది. తరువాత ఏం జరిగింది అనేది చాలా ఆసక్తికరంగా ఉంటుందని దర్శక నిర్మాతలు తెలిపారు. ఈ చిత్రంలోని స్క్రీన్ ప్లే, సాంకేతిక అంశాలని, అద్భుతమైన మెసేజ్ ని ఫెస్టివల్ జ్యూరీ సభ్యులు అభినందించారు. ఈ చిత్రంతో విద్యార్థుల్లో ఉన్న అద్భుతమైన ప్రతిభ మరోసారి బయటపడింది. ఈ షార్ట్ ఫిలింలో త్యామ్ బకేశ్వర్ రెడ్డి, శ్రావణి లక్ష్మి, సత్యానంద్ నటించారు.   సత్యానంద్.. మహేష్ బాబు, పవన్ కళ్యాణ్, ప్రభాస్, రవితేజ లాంటి వారికి నటనలో శిక్షణ ఇచ్చిన గురువు.
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పుట్టిన రోజు కానుకగా  గేమ్ చేంజర్ నుంచి జరగండి అనే సాంగ్ రిలీజ్ అయ్యింది. ఇక అప్పటినుంచి మూవీ గురించి  ఎలాంటి అప్ డేట్ లేదు. ఒక పక్క ఎన్టీఆర్ దేవర, ప్రభాస్ కల్కి, అల్లు అర్జున్  పుష్ప 2 లు సినీ మార్కెట్ లో సందడి చేస్తున్నాయి.  దీంతో మెగా ఫ్యాన్స్ గేమ్ ఛేంజర్ విషయంలో డల్ గా ఉన్నారు. ఈ టైం లో తమన్ చేసిన వ్యాఖ్యలు చర్చినీయాంశమయ్యాయి  గేమ్ ఛేంజర్ కి తమన్ సంగీతాన్ని అందిస్తున్నాడు. ఆల్రెడీ  ఫస్ట్ సాంగ్  జరగండి సోషల్ మీడియాలో రికార్డు వ్యూస్ తో ముందుకు దూసుకుపోతుంది.  తాజాగా ఆయన  గేమ్ చేంజర్ గురించి మాట్లాడుతు  మూవీ లోని  సాంగ్స్ అన్ని సూపర్ గా ఉంటాయి. అలాగే మూవీ కూడా పక్కా బ్లాక్ బస్టర్.ప్రతి అంశం హైలైట్ గా ఉంటుంది. శంకర్ గారు మళ్ళీ చాలా కాలం తర్వాత తన మార్క్ కమర్షియల్ తో వస్తున్నారు. ఖచ్చితంగా మెగా ఫ్యాన్స్ కి పెద్ద ఫీస్ట్ రాబోతుంది. ఇది నా  ప్రామిస్  అంటు ట్విట్టర్ వేదికగా చెప్పాడు   ఇప్పుడు  తమన్ చెప్పిన ఈ మాటలతో  మెగా ఫ్యాన్స్ లో సరికొత్త  జోష్ వచ్చింది. ఎందుకంటే శంకర్  ఓల్డ్ మూవీస్  జెంటిల్ మెన్, భారతీయుడు, ఒకే ఒక్కడు,సినిమాలు ఎంతగా ఘన విజయం సాధించాయో అందరకి తెలిసిందే. విజయం సాధించడమే కాదు ఇండియన్ సిల్వర్ స్క్రీన్ వద్ద సరికొత్త రికార్డులు  సృష్టించాయి. పొలిటికల్ యాక్షన్ డ్రామా గా తెరకెక్కుతున్న గేమ్ ఛేంజర్ లో చరణ్ సరసన కియారా అద్వానీ జత కడుతుండగా  అంజలి, శ్రీకాంత్, ఎస్ జె సూర్య లు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పై  దిల్ రాజు అత్యంత భారీ వ్యయంతో నిర్మిస్తున్నాడు. ఆయనకిది 50 వ సినిమా. చరణ్ ప్రస్తుతం తన వైఫ్ ఉపాసన, కూతురు క్లీంకార తో కలిసి మస్కట్ లో ఉన్నాడు  
క్లాసిక్ సినిమాలను లేదా ఇతర భాషల్లో హిట్ అయిన సినిమాలను రీమేక్ చేయడం సహజం. కానీ ఫ్లాప్ సినిమాని ఎవరైనా రీమేక్ చేస్తారా?. అలాంటి రిస్క్ కి సిద్ధమంటున్నాడు యంగ్ హీరో విశ్వక్ సేన్ (Vishwak Sen). జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) నటించిన ఓ ఫ్లాప్ సినిమాని రీమేక్ చేయాలని ఉందని చెప్పి షాకిచ్చాడు. ఎన్టీఆర్ కి విశ్వక్ సేన్ వీరాభిమాని అనే విషయం తెలిసిందే. పలు సందర్భాల్లో ఎన్టీఆర్ పై తన అభిమానాన్ని చాటుకున్నాడు. కాగా, విశ్వక్ నటించిన లేటెస్ట్ మూవీ 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' మే 31న విడుదల కానుంది. ఈ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా యాంకర్ సుమకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికర ప్రశ్న ఎదురైంది. "మీకు ఎన్టీఆర్ తో మంచి అనుబంధం ఉంది కదా. ఒకవేళ ఆయన నటించిన సినిమాల్లో ఏదైనా రీమేక్ చేయాలంటే.. ఏది చేస్తారు?" అని సుమ అడగగా.. విశ్వక్ ఊహించని సమాధానం ఇచ్చాడు. తనకి ఎన్టీఆర్ అన్న నటించిన 'నా అల్లుడు' సినిమాని రీమేక్ చేయాలని ఉందని తెలిపాడు. ఆ సినిమా బాగుంటుందని, కొన్ని ఛేంజెస్ తో రీమేక్ చేయాలని ఉందని మనసులోని మాట బయటపెట్టాడు. ఎన్టీఆర్ నటించిన పలు హిట్ సినిమాలను వదిలేసి.. 'నా అల్లుడు' సినిమాని రీమేక్ చేస్తానని  విశ్వక్ చెప్పడం సర్ ప్రైజింగ్ గా ఉంది. 'నా అల్లుడు' అనేది 2005 లో వచ్చిన యాక్షన్ కామెడీ ఫిల్మ్. వర ముళ్ళపూడి డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో కార్తీక్ గా, మురుగన్ గా రెండు షేడ్స్ ఉన్న పాత్రలో ఎన్టీఆర్ నటించాడు. శ్రియా, జెనీలియా హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాలో.. రమ్యక్రిష్ణ, సుమన్, బ్రహ్మానందం, ఆలీ తదితరులు ముఖ్యపాత్రలు పోషించారు. ఇందులోని కామెడీ సన్నివేశాలు అప్పట్లో ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. అలాగే దేవిశ్రీ ప్రసాద్ స్వరపరిచిన పాటలు కూడా పెద్ద హిట్ అయ్యాయి. అయితే అప్పుడు 'ఆది', 'సింహాద్రి', 'సాంబ' వంటి సినిమాలతో అమాంతం పెరిగిన ఎన్టీఆర్ మాస్ ఇమేజ్ కారణంగా.. బాక్సాఫీస్ దగ్గర 'నా అల్లుడు' ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయింది.
Another intriguing web series, "Yakshini," is coming from the collaboration of Arka Media Works and Disney plus Hotstar. This web series is produced by Shobu Yarlagadda and Prasad Devineni.  Vedhika, Manchu Lakshmi, Rahul Vijay, and Ajay are playing the lead roles. Director Teja Marni is helming the "Yakshini" series. The character Jwala, played by Manchu Lakshmi in the "Yakshini" web series, was introduced today through a special poster titled "Mysterious Jwala."  Featuring elements of fantasy, romance, and comedy, "Yakshini" promises to offer a new experience to the audience. Arca Media Works has produced this series with significant production values, realizing director Teja Marni's vision. The "Yakshini" web series is set to stream in Tamil, Kannada, Malayalam, Hindi, and Telugu in June.
Presented by prestigious production company UV Creations, the movie "Bhaje Vaayu Vegam" starring hero Kartikeya Gummakonda is under the banner of UV Concepts. Iswarya Menon is playing the heroine. Rahul Tyson of Happy Days fame plays the pivotal role. Director Prashanth Reddy is making this film with the story of an emotional action thriller. Ajay Kumar Raju.P. Acting as co-producer. On 31st of this month, the movie "Bhaje Vaayu Vegam" is coming to a world wide grand theatrical release. Dheeraj Mogilineni Entertainments is releasing the film nationwide. The makers have recently announced the trailer release of this film. It has been announced that the trailer of the movie "Bhaje Vaayu Vegam" is going to be released on 25th of this month at 12.15 pm. As a new emotional action drama "Bhaje Vaayu Vegam" is creating interest among the movie audience. The film crew is hoping that the trailer will increase the hype.
ప్రస్తుతం ఎక్కడ చూసినా 'కల్కి 2898 AD' (Kalki 2898 AD) సినిమా పేరు మారుమోగిపోతోంది. జూన్ 27న విడుదల కానున్న ఈ సైన్స్ ఫిక్షన్ ఫిల్మ్.. 'బాహుబలి', 'ఆర్ఆర్ఆర్' స్థాయిలో ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించడం ఖాయమనే అంచనాలున్నాయి. ఇప్పటికే విడుదలైన ప్రచారం చిత్రాలు విశేషంగా ఆకట్టుకొని.. ఎప్పుడెప్పుడు బిగ్ స్క్రీన్ మీద సినిమా చూడాలా అనే ఆసక్తిని కలిగిస్తున్నాయి. అయితే ఇప్పుడు 'కల్కి'కి సంబంధించిన ఓ న్యూస్.. సినిమాపై అంచనాలను మరో స్థాయికి తీసుకెళ్తోంది. ప్రభాస్ (Prabhas) కథానాయకుడిగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందుతోన్న 'కల్కి'లో పలు పౌరాణిక పాత్రలు కనిపించనున్నాయి. అశ్వత్థామగా అమితాబ్ బచ్చన్, కలిగా కమల్ హాసన్ కనిపించనున్నారు. ఇక ప్రభాస్ పాత్రకి సంబంధించి సంచలన న్యూస్ వినిపిస్తోంది. టైటిల్ రోల్ సహా మొత్తం ఆరు పాత్రల్లో ప్రభాస్ కనిపించనున్నాడని ప్రచారం జరుగుతోంది. కల్కి, భైరవ పాత్రలతో పాటు.. రాముడు, కృష్ణుడు, విష్ణువు, బుద్ధుడు పాత్రల్లో ప్రభాస్ కనువిందు చేయనున్నాడట. ఈ పాత్రల విషయంలో మరో సర్‌ప్రైజ్ కూడా ఉందట. విష్ణువుగా ప్రభాస్ పాత్రను.. మహేష్ బాబు (Mahesh Babu) వాయిస్ ఓవర్ తో పరిచయం చేస్తారట. తెలుగునాట మహేష్ వాయిస్ ఓవర్ కి ఎందరో ఫ్యాన్స్ ఉన్నారు. గతంలో పవన్ కళ్యాణ్ (Pawan Kalyan), జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) వంటి హీరోలకు మహేష్ వాయిస్ ఓవర్ ఇచ్చాడు. ఇప్పుడు 'కల్కి' లాంటి భారీ సినిమాలో.. ప్రభాస్ కోసం వాయిస్ ఓవర్ ఇస్తున్నాడనే వార్త ఆసక్తికరంగా మారింది. 'కల్కి'లో ప్రభాస్ ఆరు పాత్రలు, మహేష్ వాయిస్ ఓవర్ తో పాటు.. మరికొన్ని సర్‌ప్రైజ్ లు కూడా ఉన్నాయని ప్రచారం జరుగుతోంది. అశ్వత్థామతో పాటు మిగతా సప్త చిరంజీవుల పాత్రలు కూడా ఈ సినిమాలో ఉంటాయని.. ఆ పాత్రల్లో జూనియర్ ఎన్టీఆర్, నాని, విజయ్ దేవరకొండ, దుల్కర్ సల్మాన్ వంటి హీరోలు కనిపించనున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ వార్తలన్నీ నిజమైతే.. విడుదల తర్వాత 'కల్కి' సినిమా సృష్టించే సంచలనాలు అంచనాలకు అందవనడంలో సందేహం లేదు.
అన్నం ఉడికిందా లేదా అని చెప్పడానికి  ఒక్క మెతుకు పట్టుకుంటే చాలు. అలాగే కీర్తి సురేష్ (keerthy suresh)మంచి నటి అని చెప్పడానికి మహానటి అనే ఒక్క సినిమా చాలు. అందంగా ఉండటమే కాదు  నటనని కూడా అంతే అందంగా మలుచుకోగలదు.ఇప్పుడంటే తనకి సినీ కాలం కలిసి రావడం లేదు గాని  ఎన్నో హిట్ సినిమాలు ఆమె ఖాతాలో ఉన్నాయి. ఎంతో మంది యువకుల కళల రాణి కూడా..తాజాగా ఆమె  కొత్త మూవీకి సంబంధించిన న్యూస్ ఒకటి సోషల్ మీడియాలో చక్కెర్లు కొడుతుంది ఎంఎస్ సుబ్బులక్ష్మి( subbulakshmi)కర్ణాటక  ఆధ్యాత్మిక సంగీత ప్రపంచంలో అగ్రగణ్యురాలు.  పదికి పైగా భాషల్లో ఎన్నో కృతులను, కీర్తనలును, శాస్త్రీయ, లలిత గీతాలు, భజనలు, జానపద గేయాలు,  అభంగాలు, దేశభక్తి గీతాలని ఆలపించారు. ఏ భాషలో పాడినా అదే తన మాతృభాష అన్నట్లుగా స్పష్టమైన భాషా నుడికారంతో ఆలపించడం ఆమె ప్రత్యేకత.ప్రపంచ అసెంబ్లీ  ఐక్యరాజ్య సమితి లో పాడిన  రికార్డు కూడా ఆమె సొంతం. ఇప్పుడు ఆమె బయోపిక్ తెరకెక్కనుందనే వార్తలు వస్తున్నాయి ఇందులో సుబ్బులక్ష్మి గారి పాత్రని కీర్తి సురేష్ పోషించబోతుందని ఈ మేరకు త్వరలోనే అధికార ప్రకటన రానుందని అంటున్నారు. అదే కనుక జరిగితే కర్ణాటక సంగీతానికి పాటకి అమరత్వం తెచ్చిన ఒక మహా శిఖామణి గురించి ఈ తరానికి తెలియచేసినట్టు అవుతుంది. ఒక తెలుగు దర్శకుడు ఈ సినిమాకి దర్శకత్వం వహించబోతున్నాడని సమాచారం ప్రెజంట్ కీర్తి చేతిలో ఎక్కువ  సినిమాలు లేవు.దీంతో అవకాశాల కోసం ఎక్స్ పోజింగ్ కి కూడా సిద్దమనే వార్తలు వస్తున్నాయి.  ఈ క్రమంలోనే బాలీవుడ్ మూవీకి ఒకే చెప్పిందనే చర్చ సినీ వర్గాల్లో నడుస్తుంది.ఇలాంటి టైం లో  ఎంఎస్ సుబ్బులక్ష్మి బయోపిక్ లో ఆమె నటిస్తే  ఇక  ప్రేక్షకుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోవడం ఖాయం              
Mythri Movie Makers, in collaboration with Sukumar Writings, has once again set ablaze the entertainment landscape with the innovative release of the announcement video for the second single from "Pushpa 2: The Rule," titled "SOOSEKI (Couple Song)." In this creatively crafted video, Rashmika Mandanna is seen on the movie set, preparing for a shot. Keshava asks her character, Srivalli, about the second single from Pushpa, prompting Srivalli to sing the song's lyrics. The video then dramatically reveals the iconic Pushpa brand hand logo, announcing that the song will be released on 29th May at 11:07 AM. Following the teaser, the release of the first song from "Pushpa 2" further amplified the excitement. This song became a massive hit across all languages, dominating music charts and garnering immense appreciation from fans and critics alike. The success of the song underscores the soaring anticipation for the film and the widespread appeal of its music. The promotional teaser for "Pushpa 2: The Rule," aptly titled #Pushpa2TheRuleTeaser, has stormed its way to the zenith of YouTube trends, seizing the coveted #1 spot for an unprecedented 138 hours. Garnering a staggering 110M+ views and an astonishing 15.5M+ likes, the teaser stands as a testament to the electrifying anticipation for this cinematic masterpiece.  "Pushpa 2: The Rule" boasts an exceptionally talented crew. Directed by the visionary Sukumar, whose previous works have set new benchmarks in the industry, the film promises a compelling narrative and stunning visuals. The music, composed by the maestro Devi Sri Prasad, is expected to deliver unforgettable melodies and powerful scores that resonate deeply with audiences. Starring the charismatic Allu Arjun in the titular role and the talented Rashmika Mandanna, the film is set to offer stellar performances and captivating chemistry. Their combined star power, along with Sukumar's direction and Devi Sri Prasad's music, ensures that "Pushpa 2: The Rule" will be a cinematic extravaganza that enthralls audiences worldwide. Mark your calendars for August 15th, as "Pushpa 2: The Rule" is set to hit theaters on this date, promising an unforgettable cinematic experience.
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు. వారితో పాటు పెద్ద సంఖ్యలో క్యాడర్ కూడా పార్టీని వీడుతున్నారు. ఇక ఇప్పుడు నామినేటెడ్ పదవులలో ఉన్న వారి వంతు మొదలైనట్లు కనిపిస్తోంది. తనకు కానీ తన భర్తకు  కానీ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు టికెట్ ఇవ్వాలంటూ గత  కొంత కాలంగా కోరుతూ వస్తున్న మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ వంతు వచ్చింది. ఆమె కూడా రాజీనామా అస్త్రం సంధించారు.  జగన్ కు నమ్మిన బంటుగా గుర్తింపు పొందిన మహిళాకమిషన్ చైర్ పర్సన్ వాసి రెడ్డి పద్మ తన పదవికి రాజీనామా చేశారు. ఉరుములేని పిడుగులా, ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా తన రాజీనామా లేఖను సీఎం జగన్ కు పంపేశారు. పేరుకు తాను పార్టీకి కాదు, కేవలం మహిళా కమిషన్ చైర్మన్ పదవికి మాత్రమే రాజీనామా చేశాననీ, ఇక నుంచి వైసీపీ కోసం పని చేస్తాననీ వాసిరెడ్డి పద్మ చెబుతున్నప్పటికీ, ఆమె రాజీనామాకు కారణం అసంతృప్తేనని పార్టీ వర్గాలు బాహాటంగానే చెబుతున్నాయి. చాలా కాలంగా వాసిరెడ్డి పద్మ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు తనకు కానీ తన భక్తకు కానీ పార్టీ టికెట్ ఇవ్వాలని జగన్ ను కోరుతూ వస్తున్నారు. అయితే ఇప్పటి వరకూ జగన్ చూద్దాం.. చేద్దాం అన్నట్లుగా దాట వేస్తూనే వచ్చారు. ఇప్పుడిక వరుసగా అభ్యర్థల జాబితాలను జగన్ ప్రకటించేస్తుండటం, తనకు గానీ తన భర్తకు కానీ పార్టీ టికెట్ విషయంలో ఎటువంటి స్పస్టత ఇవ్వకపోవడంతో ఆమె మనస్తాపం చెంది పదవికి రాజీనామా చేసేశారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.  వాసిరెడ్డి పద్మ రాజకీయ ప్రవేశం ప్రజారాజ్యం పార్టీతో జరిగింది. 2009లో ఆమె ప్రజారాజ్యం పార్టీలో చేరారు. ఇలా చేరడంతోనే ఆమె ప్రజారాజ్యం అధికార ప్రతినిథిగా పదవి దక్కించుకున్నారు. ప్రజారాజ్యం కాంగ్రెస్ పార్టీలో విలీనం కావడంతో ఆమె 2012లో జగన్ పార్టీలో చేరారు. జగన్ కూడా ఆమెకు అధికార ప్రతినిథి పదవి ఇచ్చారు.  2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆమెను రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా నియమించారు. చైర్ పర్సన్ హోదాలో ఆమె జగన్ మెప్పు పొందేందుకు చేయగలిగినంతా చేశారు. ప్రతిపక్ష పార్టీ నేతలకు నోటీసులు ఇచ్చారు. ఏకంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు సైతం నోటీసులు జారీ చేశారు. వార్డు వలంటీర్లపై పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు కమిషన్ ముందు హాజరై వివరణ ఇవ్వాలంటూ ఆమె పవన్ కు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. పవన్ హాజరు కాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు నమోదు చేయాలని ఆదేశించారు. ఇన్ని చేసినా వాసిరెడ్డి పద్మకు ఆమె కోరినట్లుగా పార్టీ టికెట్ లభించకపోవడంతో అలిగి పదవికి రాజీనామా చేశారని, ఇది జగన్ కు షాకేననీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు. ఒకరైతు తనకు చేసిన సేవలకు ప్రీతి చెందిన గురువు అతడికి స్వర్గ ప్రాప్తిని కలగజేయాలని అనుకుంటాడు. కానీ సంసారాసక్తి వల్ల ఆ రైతు ఆ అవకాశాన్ని వాయిదా వేసుకుంటూ వస్తాడు. చివరికి గురుకృప వల్ల ఆ రైతు స్వర్గ ప్రాప్తిని ఎలా పొందాడో ఈ కథ తెలియజేస్తుంది. "ఒక మహాపురుషుడు ప్రయాణం చేస్తూ, డస్సిపోయాడు. గొంతు ఎండిపోయింది. దారిలో ఒక రైతు కనపడితే నీళ్ళు అర్థించాడు. ఆ రైతు మహాత్మునికి సకల ఉపచారాలూ చేశాడు. చిరిగిపోయిన ఆయన ఉత్తరీయాన్ని రైతు జాగ్రత్తగా కుట్టి బాగుచేశాడు. రైతు పరిచర్యలకు సంతసించిన ఆ మహాత్ముడు శాంతి, ఆనందాలకు నిలయమైన స్వర్గానికి తనతోపాటు రమ్మని అంటాడు. అందుకు ఆ రైతు 'గురువుగారూ! మీరు నా మీద చూపిన దయకు కృతజ్ఞుణ్ణి. కానీ నా పిల్లలు ఇంకా చిన్నవాళ్ళు. ఓ ఏడేళ్ళ వ్యవధి ఇవ్వండి' అని అడుగుతాడు. అందుకు గురువు అంగీకరించాడు. సరిగ్గా ఏడేళ్ళ తర్వాత గురువు రైతును స్వర్గానికి తీసుకువెళ్ళడానికి వచ్చాడు. అప్పుడు రైతు 'అయ్యా! కడపటి కొడుకు కష్టాలకు అంతు లేదు. అన్ని జంఝాటాలనూ ఒక్కడే సంబాళించుకోలేకపోతున్నాడు. కాబట్టి మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని గురువుని అడిగాడు. మరో ఏడేళ్ళ తరువాత గురువు వచ్చాడు. కానీ రైతు చనిపోయాడని తెలిసింది. చనిపోయిన ఆ రైతు ఎద్దుగా పుట్టాడని ఆ గురువు తన దివ్య దృష్టితో తెలుసుకున్నాడు. ఎద్దుగా పుట్టిన ఆ రైతు తన కొడుకు పొలాన్నే దున్నుతున్నాడు. అప్పుడు గురువు ఆ ఎద్దుపై మంత్ర జలం చిలకరించగానే ఎద్దు జన్మనెత్తిన రైతు 'నా కొడుకు పరిస్థితి మరి కాస్త మెరుగు పడనీయండి స్వామీ! మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని అన్నాడు. ఇక చేసేది లేక వెనుదిరిగాడు గురువు. మరలా ఏడేళ్ళ తర్వాత వచ్చిన గురువుకు ఎద్దు చనిపోయిందని తెలిసింది. అది కుక్కగా పుట్టి కొడుకు ఇంటినీ, ఆస్తినీ కాపలా కాస్తోందని తన దివ్యదృష్టి ద్వారా తెలుసుకున్నాడు. గురువు. కుక్కగా పుట్టిన ఆ రైతు 'స్వామీ! నేను ఎంత దౌర్భాగ్యుణ్ణి. మీరు ఇంత దయ చూపుతున్నప్పటికీ మీతో స్వర్గమానం చేయలేకున్నాను. వీడికి ఆస్తిని కాపాడుకొనే దక్షత ఇంకా రాలేదు. కాబట్టి దయ చేసి మరో ఏడేళ్ళు వ్యవధి ఇవ్వండి' అని వేడుకున్నాడు. గురువు ఏడేళ్ళ తరువాత మళ్ళీ వచ్చేసరికి కుక్క మరణించింది. అది త్రాచుపాముగా జన్మనెత్తి, ఇప్పుడు కొడుకు భూమిలో ఉన్న లంకెబిందెలకు పడగెత్తి కాపలా కాస్తోంది. గుప్త ధనం ఇక్కడ ఉందని కొడుకుకి ఎలా తెలియజేయాలా అని పాము ఆలోచిస్తున్నప్పుడు గురువు ఆ రైతుకొడుకును పిలుచుకు వచ్చి లంకె బిందెలు ఉన్న చోట తవ్వమన్నాడు. లంకె బిందెలు బయటపడ్డాయి. ఆ పైన ఆ పామును చంపమన్నాడు. అనంతరం శిష్యుణ్ణి తీసుకొని స్వర్గారోహణం చేశాడు గురువు. సంసారంలోని ఈతి బాధల నుండి శిష్యుణ్ణి ఉద్ధరిస్తాడు సద్గురువు. అలాంటి గురువు అందరికీ అవసరం.                                      *నిశ్శబ్ద.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్  రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది.  80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత  ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది.   ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది. ఆమెది నెద‌ర్లాండ్స్‌. ఆమె తండ్రి నెద‌ర్లాండ్స్‌లోని ఆర్నెహెమ్‌లో చిన్న‌పిల్ల‌ల ఆస్ప‌త్రి డైరెక్ట‌ర్. పోయి దొరికిన ఆ పెయింటింగ్ విష‌యానికి వ‌స్తే.. అది 1683లో కాస్ప‌ర్ నెష‌ర్ వేసిన స్టీవెన్ ఓల్ట‌ర్స్ పెయింటింగ్‌. రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో నాజీల ఆదేశాల‌ను చార్లెట్ తండ్రి వ్య‌తిరేకించారు. ఆయ‌న ర‌హ‌స్య జీవ‌నం సాగించేడు. కానీ ఈ పెయింటింగ్‌ని మాత్రం త‌న న‌గ‌రంలోని ఒక బ్యాంక్‌లో భ‌ద్ర‌ ప‌ర‌చ‌మ‌ని ఇచ్చార‌ట‌. 1940లో నాజీలు నెద‌ర్లాండ్ పై దాడులు చేసినపుడు ఆ బ్యాంక్ మీద ప‌డి దోచుకున్నా రు. అప్పుడు ఈ పెయింటింగ్ కూడా తీసుకెళ్లారు. యుద్ధం అయిపోయిన త‌ర్వాత ఈ పెయింటింగ్ ఎక్క‌డున్న‌దీ ఎవ‌రికీ తెలియ‌లేదు. చిత్రంగా 1950ల్లో డ‌స‌ల్‌డార్ష్ ఆర్ట్ గ్యాల‌రీలో అది ప్ర‌త్య‌క్ష‌మ‌యింది. 1969లో ఆమ్‌స్ట‌ర్‌డామ్‌లో దాన్ని వేలానికి తీసికెళ్లే ముందు దాన్ని ఆ ఆర్ట్ గ్యాల‌రీలో వుంద‌ని చూసిన‌వారు చెప్పారు. వేలంపాట త‌ర్వాత మొత్తానికి ఆ పెయింటింగ్‌ను 1971లో ఒక క‌ళాపిపాసి త‌న ద‌గ్గ‌ర పెట్టుకున్నాడు.    ఆ త‌ర్వాత 2021లో అది చార్లెటీని చేరింది.  మొత్తానికి వూహించ‌ని విధంగా ఎంతో కాలం దూర‌మ‌యిన గొప్ప క‌ళాఖండం తిరిగి త‌న వ‌ద్ద‌కు చేర‌డంలో చార్లెటీ ఆనందానికి అంతేలేదు. అంతే క‌దా.. పోయింద‌నుకున్న గొప్ప వ‌స్తువు తిరిగి చేరితే ఆ ఆనంద‌మే వేరు!  అయితే చార్లెటీకి ఇపుడు ఆ పెయిం టింగ్‌ను భ‌ద్రంగా చూసుకునే ఆస‌క్తి వున్న‌ప్ప‌టికీ శ‌క్తి సామ‌ర్ధ్యాలు లేవు. అందుక‌నే త్వ‌ర‌లో ఎవ‌రిక‌యినా అమ్మేసీ వ‌చ్చిన సొమ్మును పిల్ల‌ల‌కు పంచుదామ‌నుకుంటోందిట‌!  చార్లెటీ కుటుంబంలో అయిదుగురు అన్న‌ద‌మ్ములు అక్క‌చెల్లెళ్లు వున్నారు. అలాగే ఇర‌వై మంది పిల్ల‌లు ఉన్నారు. అంద‌రూ ఆమె అంటే ఎంతో ప్రేమ చూపుతున్నారు. అంద‌రం ఒకే కుటుంబం, చాలాకాలం త‌ర్వాత ఇల్లు చేరిన క‌ళాఖండం మా కుటుంబానిది అన్న‌ది చార్లెటీ!
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు. చాకోను పార్టీలోకి ఆహ్వానిస్తూ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్’ ఫ్రంట్ ఏర్పాటు గురించి ప్రత్యేకించి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు కానీ, చాకో అలాంటి  సంకేతాలు ఇచ్చారు. ప్రస్తుతం దేశంలో ఉన్న ఏ ఒక్కపార్టీ కూడా బీజేపీకి ప్రత్యాన్మాయం కాదని,సమీప భవిష్యత్ కాంగ్రెస్ సహా ఏ పార్టీ కూడా ఆ స్థాయికి ఎదిగే అవకాశాలు కూడా కనిపించడంలేదని అన్నారు. ఈ పరిస్థితుల్లో దేశంలోని బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ, ఏకమై, ఒకే గొడుగు కిందకు రావలసిన అవసరం ఉందని చాకో అన్నారు. అదే సమయంలో ప్రతిపక్షాలను ఏక తాటిపైకి తెచ్చే బాధ్యతను పవార్ తీసుకోవాలని సంకేత మాత్రంగా చెప్పారు. అంతే కాకుండా కాంగ్రెస్ పేరు ఎత్తకుండా బీజేపీ వ్యతిరేక శక్తులను ఏకం చేసే ఆలోచన ఆ పార్టీ నాయకత్వానికి లేదని నెహ్రూ గాంధీ ఫ్యామిలీ (సోనియా, రాహుల్, ప్రియాంక)ఆలోచనా ధోరణిని పరోక్షంగానే అయినా ఎండ కట్టారు.ఆ విధంగా పవార్ ఆ బాధ్యత తీసుకోవాలని చాకో సూచించారు. ఇందుకు సంబంధించి, పవార్ బహిరంగంగా ఎలాంటి వ్యాఖ్య చేయలేదు. అయితే, చాకో సహా మరికొందరు ‘సీనియర్’ కాంగ్రెస్ నాయకులు, అలాగే సిపిఎం, సిపిఐ నాయకులు కూడా పవార్’తో చాలా కాలంగా థర్డ్ ఫ్రంట్  విషయంగా చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. అయితే మహారాష్ట్రలో సంకీర్ణం మనుగడను దృష్టిలో ఉంచుకుని పవార్ ఆచితూచి అడుగులేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే చాకో పార్టీలో చేరిన సందర్భంలో కూడా ‘చాకో చేరికతో మహారాష్ట్రలోని మహా వికాస్ అగాడీ ప్రభుత్వానికి ఎలాంటి నష్టం జరగదని, పవార్ మహారాష్ట్ర సంకీర్ణ సర్కార్ ప్రస్తావన చేశారని విశ్లేషకులు పేర్కొంటున్నారు.  మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వ మనుగడ గురించ్బి  పవార్ ప్రత్యేకంగా పేర్కొనడం ద్వారా, ఆయన థర్డ్ ఫ్రంట్ విషయంలో వేచి చూసే ఆలోచనలో ఉన్నట్లు అర్థమవుతోందని కూడా  రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే అదే ఎన్సీపీ అసెంబ్లీ ఎన్నికల జరుగతున్న కేరళలో, పశ్చిమ బెంగాల్లో  కాంగ్రెస్ వ్యతిరేక పార్టీలకు మద్దతు ఇస్తోంది. దీన్ని బట్టి చూస్తే, ఎన్సీపీ - కాంగ్రెస్ మధ్య దూరం పెరుగుతోందని స్పష్టమవుతోంది. అయితే, థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఏ రకంగా ముడి పడుతుంది అనే విషయంలో ఇంకా స్పష్టత రావలసి ఉంది. అలాగే, కాంగ్రెస్ లేకుండా జాతీయ స్త్గాయిలో బీజేపీ వ్యతిరేక కూటమిని ఏర్పాటు చేయడం వలన, వ్యతిరేక ఓటు చీలి  అది మళ్ళీ బీజేపీకే మేలు చేస్తుందని, కాబట్టి, ప్రస్తుతం కాంగ్రెస్ సారధ్యంలోని యూపీఏని బలోపేతం చేయడమే ఉత్తమమనే అలోచన కూడా  విపక్ష శిబిరం నుంచి వినవస్తోంది. ఈ నేపధ్యంలోనే, ప్రస్తుతం యూపీఏ ఛైర్పర్సన్’గా ఉన్న సోనియా గాంధీ వయసు, అనారోగ్యం కారణంగా బాధ్యతల నుంచి తప్పుకుని పవార్’కు బాద్యతలు అప్పగించాలనే ప్రతిపాదన వచ్చిందని అంటున్నారు. అలాగే, ఇతర పార్టీలను, ముఖ్యంగా కాంగ్రెస్ నుంచి విడిపోయి సొంత కుంపటి పెట్టుకున్న మమతా బెనర్జీ సారధ్యంలోని తృణమూల్, జగన్మోహన్ రెడ్డి సారధ్యంలోని వైసీపీలను కలుపుకుని కూటమిని బలోపేతం చేయడం ద్వారా బీజేపీని దీటుగా ఎదుర్కోవచ్చనే ఆలోచనలు కూడా సాగుతున్నాయి. అయితే, ఇటు థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు అయినా, యూపీఏని బలోపేతం చేయడమే అయినా, పవారే .. కేంద్ర బిందువు. ఆయన సారధ్యంలోనే ప్రత్యాన్మాయం అనేది విపక్ష శిభిరం నుంచి వినవస్తున్న ప్రస్తుత సమాచారం. మరి అదే జరిగితే రాహుల గాంధీ పరిస్థితి ఏమిటి ? గాంధీ నెహ్రూ కుటుంబం పరిస్థితి ఏమిటి? ఏ ప్రత్యేక ప్రాధాన్యత లేకుండా అందరిలో ఒకరిగా ఫస్ట్ ఫ్యామిలీ సర్దుకు పోతుందా? అంటే..చివరకు ఏమవుతుందో .. ఇప్పుడే చెప్పలేమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది. గతంలో అనేక సందర్భాలలో ముఖ్యమంత్రి కేసీఆర్,ఆర్థిక మంత్రి హరీశ రావు, కరోనా కారణంగా రాష్ట్ర  ఆదాయం గణనీయంగా తగ్గిందని, పేర్కొన్నారు. అయితే, కరోనా నుంచి వేగంగా కోలుకుని, ఆర్థికంగా అంతే వేగంగా పుంజుకున్న రాష్ట్రాలలో తెలంగాణ ప్రధమ స్థానంలో  ఉందని కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సర్వే 2020-21 నివేదిక పేర్కొంది. పడిలేచిన కెరటంలా, తెలంగాణ ‘వీ’ ఆకారంలో ఆర్థికంగా నిలతొక్కుందని కేంద్రం జనవరి  చివరి వారంలో విడుదల చేసిన ఆర్థిక సర్వేలో పేర్కొంది. అలాగే, రెవిన్యూ వసూళ్ళలో రాష్ట్రం కరోనా పూర్వస్థితికి చేరిందని కూడా సర్వే చెప్పింది.   అలాగే,రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు కూడా ఈ మధ్య కాలంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పై సంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరమ జనవరి,ఫిబ్రవరి, మార్చి నెలలతో పోలిస్తే ఈ సంవత్సరం ఈ మూడు నెలల కాలంలో రాష్ట్ర ఆర్థిక వృద్ది రేటు 10 నుంచి  15 శాతం మెరుగ్గా ఉందని హరీష్ రావు ఒకటి రెండు ఇంటర్వ్యూలలో పేర్కొన్నారు.అలాగే, బడ్జెట్ విషయంలోనూ ఆయన చాల ఆశావహ దృక్పథంతోనే ఉన్నారు. బడ్జెట్  పాజిటివ్’గా ఉంటుదని, ఎవ్వరూ ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని, సంక్షేమ పథకాలలో,ఇతరత్రా బడ్జెట్ కేటాయింపులలో ఎలాంటి కోతలు ఉండవని కూడా హరీష్ హామీ ఇచ్చారు. గత సంవత్సరంలో కొంత మేర హామీ ఇచ్చిన మేరకు అమలు చేయలేక పోయిన సొంత జాగాలలో డబల్ బెడ్ రూమ్ ఇళ్ళ నిర్మాణం, రుణ మాఫీ వంటి  పథకాలను ఈ బడ్జెట్ ద్వారా అమలు చేస్తామని చెప్పారు. అలాగే, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ తమిళి సై చేసిన ప్రసంగంలోనూ ఆశావహ దృక్పధమే వ్యక్తమైంది. ఆమె తమ ప్రసంగంలో,  ప్రభుత్వం సంక్షేమ పథకాలకు పెద్ద పీట వేసిందని అన్నారు. ‘సంపద పంచాలి ,పేదలకు పంచాలి’ అనేది తమ ప్రభుత్వ విధానమని స్పష్టం చేశారు. అలాగే, పెరుగతున్న ఆదాయంలో అధికశాతం సంక్షేమానికే వెచ్చిస్తున్నామని స్పష్టం చేశారు. దీంతో బడ్జెట్’లో కొత్త పథకాలకు శ్రీకారం చుట్టే అవకాశం ఉంటుందా అన్న చర్చ జరుగుతోంది. మరో వంక ఉద్యోగ వర్గాల్లో పీఆర్సీకి సంబంధించి ఆర్థిక మంత్రి తమ ప్రసంగంలో  ప్రకటన చేస్తారా లేదా అనే ఆసక్తి నెలకొంది. అలాగే, సామాన్య  ప్రజలు ఇటీవల పెరిగిన పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరల భారం నుంచి మంత్రి హరీష్, ఏదైనా ఉపసమనం కలిపిస్తారా అని ఎదురు చూస్తున్నారు. గతంలో వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సామాన్య ప్రజలపై వంటగ్యాస్ ధర భారాన్ని తగ్గించేందుకు కొంత మొత్తాన్ని, రూ.50(?) రాష్ట్ర ప్రభుత్వం తరపున  సబ్సిడీగా ఇచ్చిన విషయాన్ని, అదే విధంగా అసెంబ్లీ ఎన్నికలు జరుగతున్న తమిళనాడులో డిఎంకే పార్టీ,తమ పార్టీని అధికారంలోకి వస్తే  గ్యాస్ బండపై వంద రూపాయల సబ్సిడీ ఇస్తామని చేసిన  వాగ్దానాన్ని  గుర్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే, ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు, సోమవారం ఆర్థిక మంత్రి హరీష్ రావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఆర్థిక  శాఖ ముఖ్య కార్యదర్శి రామ కృష్ణా రావు,సలహాదారు జీఆర్ రెడ్డితో బడ్జెట్ పద్దులఫై సుదీర్ఘంగా చర్చించి తుది మెరుగులు దిద్దారు. బడ్జెట్ తుది రూపం సిద్దమైన నేపధ్యంలో ఆర్థిక శాఖ ప్రింటింగ్ ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 18 ఉదయం మంత్రి వర్గం ఆమోదం పొందిన అనంతరం ఆర్థికమంత్రి హరీష్ రావు అదే రోజు రాష్ట్ర బడ్జెట్ 2021-22ను సభలో ప్రవేశ పెడతారు. 20, 22 తేదీల్లో బడ్జెట్‌పై సాధారణ చర్చ,23, 24, 25 తేదీల్లో బడ్జెట్‌ పద్దులపై చర్చ ఉంటుంది 26న ద్రవ్యవినిమయ బిల్లు (బడ్జెట్)పై చర్చ, సభామోదం ఉంటాయి.
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది.  అధికార తెరాస, ఖమ్మం స్థానానికి సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర రెడ్డి పేరును ప్రకటించడంలో కొంచెం జాప్యం చేయడంతో పాటుగా, హైదరాబాద్ స్థానం నుంచి , పీవీ కుమార్తె వాణీ దేవి పేరును చివరి క్షణంలో తెరమీదకు తేవడంతో అంత వరకు కొంత స్తబ్దుగా సాగిన ప్రచారం ఆ తర్వాత వేడెక్కింది. ఉద్యోగ నియామకాల విషయంలో తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ తప్పులో కాలేయడంతో విపక్షాలు, పోటీలో ఉన్న ప్రత్యర్ధులు, నిరుద్యోగ యువత, విద్యార్ధి సంఘాలు  ఒకే సారి ఆయన మీద  విరుచుకు పడ్డారు. ఆయన లెక్క తప్పని నిరుపిస్తం రమ్మని వరస సవాళ్ళు విసిరారు. దీంతో, మంత్రి నియామకా ఇష్యూని పక్కకు తప్పించేందుకు , ఐటీఐఆర్, వరంగల్ రైల్వే ఫ్యాక్టరీ వంటి సెంటిమెంటల్ ఇష్యూస్’ను తెరపైకి  తెచ్చారు. అలాగే, కేంద్ర ప్రభుత్వంపై విమర్శల దాడిని పెంచారు. చివరకు పొరుగు రాష్ట్రానికి చెందిన విశాఖ ఉక్కు ఆందోళన   కూడా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగమైంది.   రెండు నియోజక వర్గాలలో గతంతో పోలిస్తే ఈసారి ఓటర్ల సంఖ్య రెట్టింపు అయింది. ఈసారి రెండు నియోజక వర్గాలలో కలిపి 10 లక్ష 36 వేల మంది తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. అలాగే, రెండు పట్ట భద్రుల నియోజక వర్గాల్లో 164 మంది అభ్యర్ధులు పోటీలో ఉన్నారు.  గత ఎన్నికలతో పోలిస్తే ఇటు ఓటర్ల సంఖ్య, అటు అభ్యర్థుల సంఖ్యా రెట్టింపునకు పైగానే పెరగడంతో ఎన్నికలలో జోష్ పెరిగింది. దీనికితోడు అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో సాధారణ ఎన్నికలను తలపించే రీతిలో ప్రచారం సాగింది. ఎక్కువమంది అభ్యర్ధులు బరిలో ఉండడంతో, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి  తమకే ప్రయోజనం జరుగుతుందని అధికార పార్టీ ఆశపడుతోంది .  దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో చేదు ఫలితాలను చవిచూసిన టీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా వ్యూహ రచన చేసి కేటీఆర్, హరీష్ సహా మంత్రులు,ఎమ్మెల్యేలకు స్పెసిఫిక్ బాధ్యతలు అప్పగించారు. అలాగే,కాంగ్రెస్‌ అభ్యర్థులు చిన్నారెడ్డి, రాములునాయక్‌లకు మద్దతుగా ఉత్తమ్‌, భట్టి, రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తదితరులు విస్తృతంగా ప్రచారం చేశారు. బీజేపీ అభ్యర్థులు ఎన్‌.రాంచందర్‌రావు, ప్రేమేందర్‌రెడ్డిల తరఫున ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, ఎంపీ అరవింద్‌ తదితరులు ప్రచారాన్ని వేడెక్కించారు.  ఖమ్మం స్థానం నుంచి ప్రత్యక్ష ఎన్నికల్లో తొలిసారి పోటీకి దిగిన కోదండరాంకు, టీజేఎస్‌ పార్టీకీ ఈ ఎన్నికలు కీలకంగా మారాయి. ఖమ్మ స్థానం నుంచి పోటీ చేస్తున్న తీన్మార్ మల్లన్న ముందస్తు వ్యూహంతో ప్రధాన పార్టీల అభ్యర్ధులకు ధీటుగా ప్రచారం సాగించారు.  వామపక్షాల మద్దతుతో జయసారథి, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్‌, యువతెలంగాణ కార్యనిర్వాహక అధ్యక్షురాలు రాణీ రుద్రమ తదితరులు పోటీలో ఖమ్మం సీటును పట్టభద్రులు  ఎవరికి  పట్టం కడతారు అన్నది ప్రశ్నార్థకంగా మారింది. హైదరాబాద్ సీటు కూడా ఇటు అధికార తెరాసకు అటు సిట్టింగ్ సీటును నిలుపుకోవడం తో పాటుగా దుబ్బాక , జీహెచ్ఎంసి జోష్ ను కొనసాగించాలని ఆశ పడుతున్నబీజేలకే కూడా ఇజ్జత్ కీ సవాల్ గా మారింది. కాంగ్రెస్ అభ్యర్ధి పార్టీ సీనియర్ నాయకుడు సౌమ్యుడు, మాజీ మంత్రి చిన్నారెడ్డి, వామ పక్షాల మద్దతుతో పోటీ చేస్తున్న మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ కూడా గట్టి పోటీ ఇస్తున్నారు. సో.. చివరకు ఏమి జరుగుతుంది అంటే ఏదైనా జరగవచ్చును. ఈ నెల 14 వ తేదీన పోలింగ్ జరుగుతుంది.17 ఫలితాలు వస్తాయి .. అంతవరకు వెయిట్ అండ్ వాచ్ .  
సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది. ఒకప్పుడు ఎర్ర జెండాను దిగ్విజయంగా ఎదిరించి, మార్క్సిస్టులను మట్టి కరిపించిన మమతా దీదీ ప్రస్తుతం, కాషాయ కూటమి నుంచి గట్టి సవాలును ఎదుర్కుంటున్నారు. వరసగా పదేళ్ళు పాలించడం వలన సహజంగా వచ్చిన ప్రభుత్వ వ్యతిరేకత  కంటే, హిందూ ఓటు పోలరైజేషన్ ఆమెను మరింతగా భయపెడుతోంది. నిజానికి ఐదేళ్ళ క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం ఐదు శాతం కంటే తక్కువ ఓట్లు, మూడంటే మూడు అసెంబ్లీ సీట్లు మాత్రమే గెలుచుకున్న బీజేపీ..  2019 లోక్ సభ ఎన్నికల్లో ఏకంగా 40 శాతం ఓట్లతో 18 స్థానాలు గెలుచుకుంది. ఈ  మార్పు ఇంకా కొన్ని కారణాలు ఉంటే ఉండవచ్చును కానీ.. హిందువుల ఓటు పోలరైజ్  కావడమే ప్రధాన కారణం.  ఈ నేపధ్యంలోనే కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ చివరకు కమ్యూనిస్టులు కూడా బీజేపీలో  చేరారు. ఎన్నికల ప్రకటన వెలువడిన తర్వాత కూడా సిట్టింగ్ ఎమ్మెల్ల్యేలు సహా  తృణమూల్ టికెట్ వచ్చిన నాయకులు కూడా బీజేపీలో చేరుతున్నారు. అనేక మంది ఇతర రంగాల ప్రముఖులు, ముఖ్యంగా ఇంతకాలం, బీజేపీని హిదుత్వ అనుకూల ‘అచ్చుత్’ (అంటారని) పార్టీగా చూసిన ‘సెక్యులర్’ ప్రముఖులు కాషాయం కప్పుకోవడంతో మమతా బెనర్జీకి కొంచెం అలస్యంగానే అయినా, తత్త్వం బోధపడింది. అందుకే ఆమె ఇప్పుడు గుళ్ళూ,గోపురాలకు తిరుగుతున్నారు. కార్యకర్తల సమావేశాల్లో తానూ హిందువునేనని, చెప్పుకుంటున్నారు.  నిజానికి ఇలా నేనూ హిందువునే  అని సెక్యులర్ నేతలు బహిరంగంగా ప్రకటించుకోవడం మమతా బెనర్జీతోనే మొదలు కాలేదు. రాహుల్ గాంధీ తాను హిందువునని, జన్యుధారీ కశ్మీరీ బ్రాహ్మణుని అనీ.. తమ గోత్రం, ‘దత్తాత్రేయ’ గోత్రమని బహిరంగంగా ప్రకటించుకున్నారు. అలాగే  కొద్ది రోజుల క్రితం ప్రియాంకా గాంధీ తానూ హిందువునని చెప్పుకునేందుకు ‘మౌని అమావాస్య’ సందర్భంగా అలహాబాద్ లో గంగా స్నానం చేశారు. గతంలోనూ ఆమె ఎన్నికలకు ముందు గంగా యాత్ర చేశారు. అంతవరకు ఎందుకు కొద్దిరోజుల క్రితం సిపిఐ నారాయణ విశాఖ స్వామి ఆశీస్సులు తీసుకున్నారు. చంద్రబాబు, జగన్ రెడ్డి, కేసీఆర్ ఇలా తెలుగు నేతలు అనేక మంది లౌకిక వాదానికి కాలం చెల్లిందన్న సత్యాన్ని గ్రహించి కావచ్చు ‘నేనూ హిందువును’ అంటూ ప్రకటించుకునేందుకు పోటీ పడుతున్నారు. రాముడిని తలచుకున్నా, జై శ్రీరామ్ అన్నా తమ  లౌకిక వాదం మయలపడి పోతుందని భయపడిన నాయకులు ఇప్పుడు .. జై శ్రీరామ్ అనేందుకు కూడా వెనకాడడం లేదు.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది. గత కొంత కాలంగా సబర్మలతో సహా అనేక అంశాలపై స్పందిస్తూ.. కేరళను టార్గెట్ చేస్తున్న బీజేపీ నాయకులు అక్కడ తమ జెండా ఎగరేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా పార్టీ పాలసీని కూడా పక్కన పెట్టి మెట్రో మ్యాన్ శ్రీధరన్ ను పార్టీలో చేర్చుకుని ఆయనే తమ సీఎం అభ్యర్థి అని ప్రకటించిన 24 గంటలలో యూ టర్న్ తీసుకున్నారు. ఇది ఇలా ఉండగా ప్రస్తుతం సీఎంగా ఉన్న కమ్యూనిస్ట్ నేత పినరై విజయన్ పై గోల్డ్ స్మగ్లింగ్ ఆరోపణలు రావడంతో.. ఈ ఎన్నికలలో ఎల్డిఎఫ్ భవిష్యత్తుపై ప్రజలు ఏ తీర్పు ఇవ్వబోతున్నారనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది ఈ నేపథ్యంలో అక్షరాస్యతలో దేశంలోనే మొదటి స్థానంలో ఉన్న ఆ రాష్ట్ర ప్రజలు ఎవరిని ఆశీర్వదిస్తారు అనే అంశంపై ప్రముఖ మీడియా సంస్థ టైమ్స్ నౌ, సీ ఓటరుతో కలిసి ఒక సర్వేను నిర్వహించారు. ఈ సర్వే ప్రకారం చూస్తే పాపం కమలనాథులు అక్కడ పవర్ చేతికి రావటం అటుంచి కనీసం రెండు మూడు అసెంబ్లీ స్థానాల్లో గెలవటం కూడా కష్టమేనని ఆ సర్వే తేల్చి చెబుతోంది. కేరళలో ఈసారి జరిగే అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ తన హవా చాటుతుందన్న ఆ పార్టీ నేతల మాటలలో ఎలాంటి నిజం లేదని.. ప్రస్తుతానికి అది ఏమాత్రం సాధ్యం కాదని ఈ తాజా సర్వే తేల్చి చెప్పింది. అంతేకాకుండా మొత్తం 140 స్థానాలు ఉన్న కేరళలో.. ప్రస్తుత సీఎం పినరయి విజయన్ నేతృత్వంలోని లెఫ్ట్డ్ డెమొక్రటిక్ ఫ్రంట్ కు 82 సీట్లు పక్కా అని.. ఆయనే తిరిగి అధికారాన్ని నిలబెట్టుకుంటాడని సర్వే చెపుతోంది. అదే సమయంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూనైటెడ్ డెమొక్రాటిక్ ఫ్రంట్ కు 56 నుంచి 60 వరకు సీట్లు వచ్చే అవకాశం ఉందని ఈ సర్వేలో తేలింది. అంతేకాకుండా 2016 ఎన్నికలతో పోలిస్తే ఎల్ డీఎఫ్ ఓటింగ్ శాతం కూడా కొంత పెరగటం ఇక్కడ గమనార్హం. ప్రస్తుతం సీఎంగా ఉన్న విజయన్ మరోసారి సీఎం కావాలని 43.34 శాతం మంది మొగ్గు చూపినట్లుగా సర్వేలో తేలింది. కరోనా సమయంలో విజయన్ సీఎంగా బాగా పని చేసారని ఈ సర్వే పేర్కొంది. మరోపక్క దేశ ప్రధానిగా రాహుల్ గాంధీ ఉండాలని కేరళ ప్రజల్లో 55.84 శాతం మంది కోరుకుంటున్నట్లుగా ఈ సర్వే;లో తేలింది. అయితే కేరళలో ఎలాగైనా పాగా వేయాలని పట్టుదలతో కృషి చేస్తున్న బీజేపీకి ఈసారి కూడా నిరాశ తప్పదని ఈ సర్వేలో స్పష్టం అయింది. ఈ ఎన్నికలలో బీజేపీకి రెండు సీట్లు కూడా రావటం కూడా కష్టమేనని ఈ సర్వే తేల్చింది. అయితే ఎన్నికలకు ముందు ఇలాంటి సర్వేలు బయటకు రావడం.. తరువాత అందులో కొన్ని చతికిల పడడం మనం చూస్తూనే ఉన్నాం. మరి ఈ సర్వే ఫలితాలు నిజామా అవుతాయో లేదో తేలాలంటే కొద్దీ రోజులు వెయిట్ చేయాల్సిందే.        
రాజకీయాలు అంటేనే అదో జూదం. పూలమ్మిన చోటనే కట్టెలు అమ్మవలసి రావచ్చును. అలాంటి పరిస్థితే వచ్చినా, తలవంచుకుని పోగలిగితేనే, ఎవరైనా రాజకీయాలలో రాణించగలరు. అలాకాదని, అలిమి కానిచోట, కూడా తామే అధికులమని భావిస్తే, ఎందుకూ కాకుండా పోతారు. అలాంటి వారు ఇద్దరూ కూడా ఇప్పుడు మన కళ్ళముందే ఉన్నారు.  జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు. అలాగే జయ మరణం తర్వాత ఆమె పరిస్థితి ఏమిటో కూడా వేరే చెప్పవలసిన, అవసరం లేదు. జైలు పాలయ్యారు. సర్వం తానై నడిపించిన పార్టీ నుంచి  బహిష్కరణకు గురయ్యారు. జయ ఉన్నంత వరకు తన వారుగా ఉన్న వారందరూ కానివారయ్యారు. ఒంటరిగా మిగిలారు.  నిజానికి నాలుగేళ్ళు జైలు జీవితం గడిపిన తర్వాత కూడా ఆమె తలచుకుంటే.. రాష్ట్ర రాజకీయాలలో, ముఖ్యంగా అధికారంలో ఉన్న డిఎంకే కూటమిలో అలజడి సృష్టించగలరు. ఎన్నికలలో ఆమె గెలవక పోవచ్చును కానీ.. తనను కాదన్న అన్నాడిఎంకేను ఓడించగలరు. అయిన  ఆమె అందుకు విరుద్ధంగా  రాజకీయాలకు వీడ్కోలు పలికి మౌనంగా పక్కకు తప్పుకున్నారు. రాజకీయ సన్యాసం ప్రకటించారు. ఉమ్మడి శతృవు డిఎంకే ను ఓడించేందుకు అన్నా డిఎంకే కూటమి  పోటీ చేయాలని, కూటమి ఐక్యతను దెబ్బతీయరాదనే ఉద్దేశంతోనే ఆమె రాజకీయ సన్యాసం ప్రకటించారు.    శశికళ మౌనంగా వెళ్లి పోవడం వెనక ఇంకా అనేక కారణాలున్నా ,అసలు కారణం ఆమె, రాజకీయ విజ్ఞత, వివేకం. ఆమె జైలుకు వెళ్ళిన సమయంలో జయలలిత సమాధి వద్ద ఎంత కసిగా, కోపంగా ‘మౌన’ ప్రతిజ్ఞ చేశారో చూశా. అలాంటి ఆమె ఇప్పుడు ఇలా ‘మౌనం’గా వెనకడుగు వేశారంటే, అది ఆలోచించ వలసిన విషయమే.ఆమె వ్యుహతంకంగానే సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే అనేక మంది అనేక కోణాల్లో శశికళ సంచలన నిర్ణయాన్ని విశ్లేషించారు.జైలు జీవితం తర్వాత కూడా అన్నా డిఎంకే నాయకులు తనను అగ్రనేతగా అంగీకరించక పోవడం, అమిత్ షా చెప్పినా.. అన్నా డిఎంకే నాయకులు ఆమెను, మేనల్లుడు దినకరన్’ను కులం పేరున, కుటుంబం పేరున దూరం చేయడం, తిరిగి పార్టీలోకి తీసుకోకపోవడంతో ఆమె మనసు కష్టపెట్టుకుని, సన్యాస నిర్ణయం తీసుకున్నారని కొందరంటున్నారు. పార్టీ మీద పట్టు లేదని, చరిష్మా అసలే లేదని, అందుకే ఆమె అలా నిశ్శబ్ధంగా రాజకీయ సన్యాసం స్వీకరించారని ఇంకొందరు విశ్లేషించారు. ఈ విశ్లేషణలో కొంత నిజం ఉంటే ఉండవచ్చును.. కానీ ఆమె గతాన్ని, నైజాన్ని గుర్తు చేసుకుంటే ఆమె స్ట్రైక్ బ్యాక్ వ్యూహంతోనే ఒకడుగు వెనక్కివేశారని ఆమెతో సన్నిహితంగా మెలిగినవారు, ఆమె రాజకీయ చాణక్యం తెలిసిన వారు అంటారు.   నిజానికి జైలులో ఉన్న కాలంలో కానీ, జైలు నుంచి విడుదలై వచ్చిన తర్వాత కానీ, ఆమె రాజకీయ సన్యాసం వైపు అడుగులు వేస్తున్నట్లు కనిపించలేదు. బెంగుళూరు జైలు నుంచి విడుదలై చెన్నైలో ప్రవేశించిన నప్పుడు ఆమె పెద్ద కాన్వాయ్ తో  తమ కారుకు అన్నాడిఎంకే జెండాతోనే ఎంటరయ్యారు. అలా ఎంట్రీలోనే రాజకీయ ఆకాంక్షను వెంట తెచ్చుకున్నారు. చివరకు ‘సన్యాస’ ప్రకట చేసే వరకు కూడా ఆమె రాజకీయ కార్యకలాపాలు సాగిస్తూనే ఉన్నారు. అటు ఢిల్లీని ఇటు చెన్నైనికూడా కదిల్చారు. అంతేకాదు, రాజకీయాలపై విరక్తితో కాదు, రాజకీయ కసితో, ఉమ్మడి శత్రువు (డిఎంకే) ను ఓడించేందుకే తాను రాజకీయాలనుంచి తపుకుంటున్నట్లు చెప్పారు.  సో .. సన్యాసం తీసుకోవాలనే ఆలోచన, రాజకీయవ్యూహం లోంచి పుట్టిందే కానీ,వైరాగ్యంతో పుట్టింది కాదు ,అన్నవిశ్లేషణ వాస్తవానికి ఇంకొంత దగ్గరగా ఉందని అనుకోవచ్చును. ఇది ‘కామా’నే కాని ‘ఫుల్స్టాప్’ కాదని అంటున్నారు.  ముఖ్యమంత్రి ఎడప్పాడి కే. పళని స్వామి (ఈపీఎస్) ఆమెను పార్టీలోకి అనుమతిస్తే తన కుర్చికీ ఎసరు పెడతారనే భయంతోనే,, ఆమె ఎంట్రీని అడ్డుకున్నారు. ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం, శశికళ ఒకే సామజిక వర్గానికి చెందిన వారు కావడం కూడా, ముఖ్యమంత్రి ఈపీఎస్’ భయానికి కారణంగా పేర్కొంటారు. అందుకే  ఆయన, ‘మన్నార్గుడి’ ఫ్యామిలీని బూచిగా చూపించి, ఆమెను దూరంగా ఉంచారని పార్టీలో ఒక వర్గం గట్టిగా విశ్వసిస్తుంది. అయితే ఆమె శక్తియుక్తులను కూడతీసుకుని  పులిలా పంజా విసిరేందుకే ఆమె వ్యూహాత్మకంగా ఒక అడుగు వెనక్కి వేశారు కావచ్చును అని కూడా, తమిళ రాజకీయ వర్గాల్లో ఒక చర్చ జరుగుతోంది.  గతంలో ఆమె జయలలితతో విబేధాలు వచ్చిన సమయంలో కూడా ఇలాగే కొద్ది కాలం మౌనంగా తెర చాటుకు వెళ్లి పోయారు.  కొద్ది కాలంలోనే మళ్ళీ ‘పోయస్ గార్డెన్’లో ప్రత్యక్షమయ్యారు. జయలలిత స్వయంగా ఆమెను వెనక్కి పిలుపించుకోవలసిన పరిస్థితులను సృష్టించారు. అలా  మళ్ళీ  చక్రం తిప్పారు. జయలలిత మరణం వరకు ఆమె అందరికీ చిన్నమ్మగా అమ్మకు పెద్దమ్మగా సర్వం తానై నిలిచారు. చివరకు జయ అంత్యక్రియల్లో కూడా ఆమెదే పై చేయిగా కనిపించింది.   జయలలిత చనిపోయిన సందర్భంలోనే అన్నా డిఎంకే ఎమ్మెల్ల్యేలో సుమారు 30 మంది వరకు ఆమెకు మద్దతుగా ఉన్నారన్న వార్తలొచ్చాయి. నిజానికి,ఇప్పటికి కూడా ఒక్క అన్నా డిఎంకే లోనేకాదు,డిఎంకే ఇతర పార్టీలలో కూడా  ఆమె అవసరం ఉన్న వాళ్ళు ఉన్నారు. కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో ‘మన్నార్గుడి’ ఫ్యామిలీ మద్దతు లేకుండా గెలిచే అవకాశం లేదు.  ఇవ్వన్నీ నిజమే అయినా.. అన్నీ ఉండి, ఎవరు లేని శశికళలో, ఇంకా  ఎవరి కోసం తాపత్రయ పడాలి? అనే ప్రశ్న జనించి ఉంటే, ఆమె రాజకీయ సన్యాసం నిజం కావచ్చును. ఎందుకంటే ఆమె నెచ్చలి, జయలిత లేరు, భర్త అంతకంటే ముందే చనిపోయారు, పిల్లలు లేరు... పైగా నాలుగేళ్ళ జైలు జీవితం ఆమెలో మార్పు తెచ్చి ఉండవచ్చును. ఈ వయస్సులో తనవారంటూ ఎవరు లేని తనకు రాజకీయాలు ఎందుకు ? శేష జీవితాన్ని ఇలా సాగిద్దామనే ఆలోచన నిజంగా వచ్చి ఉంటే, ఆమె సన్యాసం సత్యం అయినా కావచ్చును, కాకపోనూ వచ్చును. కానీ  శశికళ... ఆమెను అర్థం చేసుకోవడం, అంచనా వేయడం , అంత తేలిగ్గా అయ్యే పని కాదు..
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు. కాంగ్రెస్ అధినాయకత్వం పై నేరుగా అస్త్రాలు సంధించారు. రాహుల్ గాంధీ పేరు చెప్పకుండానే, ఆయన నాయకత్వానికి పనికిరాడని తేల్చి చెప్పారు. ఎవరైనా పార్టీ అధ్యక్షుడు అయితే కావచ్చును, కానీ, ప్రజానాయకుడు కాలేడని, రాహుల గాంధీ ప్రజానాయకుడు కాదు కాలేరు,అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తరచూ రాహుల్ గాంధీని ఉద్దేశించి చేసే  ‘నామ్’ధారీ వ్యంగ్యాస్త్రాన్నే కాంగ్రెస్ సీనియర్ నాయకులు కూడా సందించారు. ఇక అక్కడి నుంచి విధేయ, అసమ్మతి వర్గాల మధ్య మాటల యుద్ధం ఎదో ఒక రూపంలో సాగుతూనే వుంది. అదే క్రమంలో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ, కరుడు కట్టిన ముస్లిం మతోన్మాది, అబ్బాస్ సిద్దిఖీతో కాంగ్రెస్ పార్టీ చేతులు కలపడం అసమ్మతి నాయకులకు మరో అస్త్రాన్ని అందించింది. విషయంలోకి వెళితే, ఇటీవల పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా లోక్’సభలో కాంగ్రెస్ పక్ష నాయకుడు, పశ్చిమ బెంగాల్ పీసీసీ అధ్యక్షుడు అధీర్’రంజన్ చౌదరి, ముస్లిం మత ప్రచారకుడు, అబ్బాస్ సిద్దిఖీతో  వేదిక పంచుకున్నారు.అంతకు ముందే వామ పక్ష కూటమితో  పొత్తు కుదుర్చుకున్న కాంగ్రెస్ పార్టీ, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)ను కూటమిలో చేర్చుకుంది. ఇలా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) అమోదం లేకుండా మతోన్మాద ఐఎస్ఎఫ్’ తో ఎన్నికల పొత్తు పెట్టుకోవడం ఆ పార్టీ నాయకుడు,సిద్ధిఖీతో  పీసీసీ చీఫ్ వేదిక  పంచుకోవడం పై అసమ్మతి నేతలు మండి పడుతున్నారు. ఇలా సిద్దిఖీతో వేదిక పంచుకోవడం పార్టీ మౌలిక సిద్ధాంతాలకు వ్యతిరేకం అంటూ అసమ్మతి వర్గానికి చెందిన కీలక నేత, రాజ్యసభ సభ్యుడు,ఆనంద్ శర్మ మండిపడ్డారు. అంతే కాదు, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)తో జనవరిలో కుదుర్చుకున్న పొత్తుకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ)అమోదం లేదని ఆనంద్ శర్మ, అభ్యంతరం వ్యక్త చేశారు. పార్టీ విశ్వసించే లౌకిక వాదానికి కాంగ్రెస్ అధిష్టానం తీసుకున్న నిర్ణయం గొడ్డలి పెట్టని ఆయన తీవ్రంగా స్పందించారు.   శర్మ వ్యాఖ్యలపై అధీర్ రంజన్ చౌదరి అంతే ఘాటుగా ప్రతిస్పందించారు. “నిజాలు తెలుసుకోండి ఆనంద్ శ‌ర్మ జీ” అంటూ ఆయ‌న వ‌రుస ట్వీట్లు చేశారు. వ్య‌క్తిగ‌త ప్ర‌యోజ‌నాలు ప‌క్క‌న‌పెట్టి, ప్ర‌ధానిని పొగిడి టైమ్ వేస్ట్ చేయ‌కండంటూ ఆయ‌న ఓ ట్వీట్లో అన్నారు. ఆనంద్ శ‌ర్మ అన‌వ‌స‌రంగా కాంగ్రెస్‌ను ల‌క్ష్యంగా చేసుకుంటున్నార‌ని, ఈ అంశాన్ని పెద్ద‌ది చేసి చూపిస్తున్నార‌ని విమ‌ర్శించారు. ఆయ‌న ఉద్దేశాలు స‌రైన‌వే అయితే నేరుగా తనతో మాట్లాడ వలసిందని అన్నారు. బెంగాల్‌లో సీపీఐ(ఎం) కూట‌మికి నేతృత్వం వ‌హిస్తోంది. అందులో కాంగ్రెస్ ఓ భాగం. మ‌త‌తత్వ‌, విభ‌జ‌న రాజ‌కీయాలు చేస్తున్న బీజేపీకి చెక్ పెట్ట‌డానికే ఈ కూట‌మి అని మ‌రో ట్వీట్‌లో అధిర్ రంజ‌న్ అన్నారు. అక్కడతోనూ ఆగలేదు ... ట్వీట్ల మీద ట్వీట్లు సంధిస్తూ, ఆనంద్ శర్మ, బీజేపీ మత విభజన, అజెండాను బలపరుస్తున్నారని, పరోక్షంగా జీ23 నాయకులు బీజేపీకి ప్రయోజనం చేకూరుస్తున్నారని ఆరోపించారు.అంతే కాదు, క్షేత్ర స్థాయి వాస్తవ పరిస్థితులు తెలియకుండా, ఆనంద్ శర్మ పార్టీ మీద దండెత్తడం ఉచితం కాదని చౌదరి ఎదురుదాడి చేశారు. అసమ్మతిలో అసమ్మతి. ఇదలా ఉంటే, కాంగ్రెస్ పార్టీ  సమూల పక్షాళన కోరుతూ సోనియా గాంధీకి,గత సంవత్సరం  జీ 23గా ప్రాచుర్యం పొందిన సీనియర్ నాయకులు రాసిన లేఖపై సంతకాలు చేసిన  నాయకుల్లో నలుగురు,జమ్మూలోసమావేసమైన నాయకుల తాజా నిర్ణయాలు, వ్యాఖ్యలు,విమర్శల పట్ల అసంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరం సోనియా గాంధీకి రాసిన లేఖలో ప్రస్తావించిన అంశాలకు కట్టుబడి ఉన్నామని, అయితే, జీ 23లోని కొందరు సహచరులు, ఇటీవల గీతదాటి చేస్తున్న వ్యాఖ్యలు, విమర్శలను తాము సమర్ధించడం లేదని ఆ నలుగురు పేర్కొన్నారు. ఇందులో ముఖ్యంగా, రాజ్యసభ మాజీ డిప్యూటీ చైర్మన్, పీజే కురియన్ అయితే, “కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు అవసరమైన సంస్కరణలు తెచ్చేందుకు చేసే ప్రయత్నాలను పూర్తిగా సమర్దిస్తాను, కానీ, ‘లక్ష్మణ రేఖ’ దాటితే ఒప్పుకునేది లేదు”అని అసమ్మతిలో అసమ్మతికి తెర తీశారు.అలాగే, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ కుమారడు, మాజీ ఎంపీ సందీప్ దీక్షిత్,మధ్య ప్రదేశ్ సీనియర్ కాంగ్రెస్ నాయకుడు అజయ్ సింగ్’ కూడా గులాం నబీ ఆజాద్, కపిల్ సిబల్, ఆనంద్ శర్మ, మనీష్ తివారీ వంటి జీ 23 కీలక నేతలు అధినాయకత్వంపై చేసిన వ్యాఖ్యలను తప్పు పట్టారు. అలాగే, పార్టీ సీనియర్ నాయకుడు కేంద్ర మాజీమంత్రి వీరప్ప మొయిలీ కూడా,గత సంవత్సరం పార్టీ సీనియర్ నాయకులు  ఒక పరిమిత లక్ష్యంతో  సోనియా గాంధీకి లేఖ రాయడం జరిగిందని, ఆ పేరున జరుగతున్న  కార్యక్రమాలు లేఖ సంకల్పానికి  విరుద్ధమని అన్నారు. జీ 23 కార్యకలాపాలపై రాహుల్ గాంధీ కూడా పరోక్షగా స్పందించారు, ఒకప్పుడు ఎన్ఎస్’యుఐ, యూత్ కాంగ్రెస్’ కు సంస్థాగత ఎన్నికలు వద్దన్న వారే ఇప్పుడు ఇంకోలా మాట్లాడుతున్నారని పరోక్షంగానే అయినా సంస్థాగత ఎన్నికలు నిర్వహించడంతో పాటుగా, పార్టీ పక్షాలనకు తమ కుటుంబం వ్యతిరేకం కాదని, అందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఈ నేపధ్యంలో కాంగ్రెస్ పార్టీలో చెలరిగిన కలకలం  ఇక ముందు ఏమవుతుందో .. ఇంకెన్ని  మలుపులు తిరుగుతోందో ..చూడవలసిందే కానీ ఉహించలేము.
పంచతంత్రంగా పిలుచుకుంటున్న ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భతం జరగబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే, వివిధ సంస్థలు అసెంబ్లీ ఎన్నికలు జరిగే  అస్సాం. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటుగా కేరళలోనూ ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఆ ఒపీనియన్ పోల్ ఫలితాలు నిజంగా నిజం అయితే, కేరళలో మళ్ళీ సీపీఎం సారధ్యంలోని వామపక్ష కూటమి అధికారంలోకి వస్తుంది. ఇదే ఆ అద్భుతం. ఎందుకంటే, గత నాలుగు దశాబ్దాలలో కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో ఒకే కూటమి వరసగా రెండవసారి అధికారంలోకి వచ్చిన చరిత్ర లేనే లేదు. ఒక సారి ఎల్డీఎఫ్ అధికారంలోకి వస్తే ఐదేళ్ళ తర్వాత కాంగ్రెస్ సారధ్యంలోని ఐక్య ప్రజాస్వామ్య కూటమి(యూడీఎఫ్) అధికారంలోకి రావడం, దేవభుమిలో దైవ నిర్ణయమా అన్నట్లుగా ప్రతి ఎన్నికల్లోనూ అధికారం చేతులు మారుతూ వస్తోంది. అలాంటిది, ఈసారి ఒపీనియన్ పోల్స్ నిజమై వరసగా రెండవసారి వామపక్ష కూటమి అధికారంలోకి వస్తే, అది చరిత్రే అవుతుంది. ఇక ఒపీనియన్ పోల్స్ విషయానికి వస్తే, జాతీయ న్యూస్ ఛానెల్ ఏబీపీ, సీ ఓటర్ సంస్థలు సంయుక్తంగా ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఈ సర్వే ప్రకారం, 140 స్థానాలున్న కేరళ అసెంబ్లీలో వామపక్ష కూటమికి 83 నుంచి  91 స్థానాలు, యూడీఎఫ్ కూటమికి 47 నుంచి 55 స్థానాలు మాత్రమే దక్కుతాయని తెలుస్తోంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్రంలో ఇలా జాతకాలు తిరగబడడంపై సోషల్ మీడియాలో,’లెగ్ మహిమ’ లాంటి జోక్స్  ట్రోలవుతున్నాయి. అయితే 2016లో జరిగిన ఎన్నికల్లో కేవలం 47 సీట్లకే పరిమితం అయిన కాంగ్రెస్’కు ఈసారి ఒకటీ అరా సీట్లు ఎక్కువస్తే, రావచ్చును. అదే కాంగ్రెస్’కు కాసింత ఊరట. అదలా ఉంటే, పశ్చిమ బెంగాల్లో సైతం పట్టు సాధించిన బీజేపే, కేరళలో మాత్రం పట్టు కాదు కదా, పట్టుమని పది సీట్లు తెచ్చుకునే స్థితిలో లేదు. నిజానికి, దేశంలో బీజేపీకి అసలు ఏ మాత్రం మింగుడు పడని రాష్ట్రాలు ఎవైన ఉన్నాయంటే కేరళ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల  పేర్లే ప్రముఖంగా వినిపిస్తాయి. ఈ సారి కూడా కమల దళం కేరళలో కాలు పెట్టె పరిస్తి లేదని సర్వే ఫలితాలు చెపుతున్నారు. ఎప్పటిలానే ఇప్పడు కూడా  బీజేపీకి సున్నా నుంచి రెండు సీట్లు వచ్చే అవకాశం ఉందని, సర్వేస్వరుల అభిప్రాయంగా ఉంది. కేరళలో మొత్తం 140 స్థానాలకు ఏప్రిల్ 6 తేదీన ఒకే విడతలో పోలింగ్ జరుగుతుంది. మే 2 తేదీన ఫలితాలు వెలువడతాయి. కేరళ ఎలక్షన్ పై యావత్ దేశం ఆసక్తి కనబరుస్తోంది.    
కేంద్ర ఎన్నికలసంఘం ‘పాంచ్ పటాక’ గంట కొట్టింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. ఎన్నికల గంట మోగడంతో మొదలైన మరో భారత ‘మినీ’  సంగ్రామానికి మే 12 తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తెర పడుతుంది.ఈలోగా వివిధ అంచల్లో పోలింగ్ జరుగుతుంది.  నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతం ఓటరు తీర్పుకు వెళుతున్నా, అందరి దృష్టి, ముఖ్యంగా ప్రాంతీయ పార్టీల ఏలుబడిలో ఉన్న ఉభయ తెలుగు రాష్ట్రాలు, మరీ ముఖ్యంగా ఇప్పటికే బీజేపీ కన్నుపడిన తెలంగాణ రాష్ట్ర ప్రజలు, రాజకీయ పార్టీల దుష్టి  మాత్రం పశ్చిమ బెంగాల్ పైనే వుంది.  పశ్చిమ బెంగాల్లో ‘అద్భుతం’ జరిగి బీజేపీ విజయం సాధిస్తే, ఇక  కమల దళం ఫోకస్, తెలంగాణకు షిఫ్ట్ అవుతుంది. ఇది అందరికీ తెలిసిన బహిరంగ రహస్యం. ఈ నేపధ్యంలో బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయి అనే విషయంలో రాష్ట్ర రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. బెంగాల్లో బీజేపీ గెలిస్తే, ఇప్పటికే అంతర్గత కుటుంబ కలహాలతో సతమతవుతున్న తెరాస నాయకత్వానికి మరిన్నితిప్పలు తప్పవన్న మాట అంతఃపుర వర్గాలలో సైతం వినవస్తోంది.  పశ్చిమ బెంగాల్’లో ఎలాగైతే కమలదళం ఓ వంక తమ ట్రేడ్ మార్క్, హిందుత్వ రాజకీయాలు సాగిస్తూ, మరో వైపు నుంచి ‘ఆకర్ష్’ అస్త్రంతో అధికార పార్టీని నిర్వీర్యం చేసిన విధంగానే, ఇక్కడ కూడా ఫిరాయింపులను ప్రోత్సహింఛి పార్టీని నిట్టనిలువునా చీల్చే ప్రమాదాన్ని కొట్టివేయలేమని పార్టీ వర్గాలు కూడా అనుమానం వ్యక్త పరుస్తున్నాయి.  ఇప్పటికే తెలంగాణ  బీజేపీ నాయకులు 30 మంది తెరాస ఎమ్మెల్యేలు తమ టచ్ లో ఉన్నారని బెదిరిస్తున్నారు.అది నిజం అయినా కాకపోయినా..తెరాసలో అసంతృప్తి అగ్గి రగులుతోందనేది మాత్రం ఎవరూ కాదనలేని నిజం. అంతే కాకుండా రాష్ట్రానికి వచ్చిన కేంద్రనాయకులు ఎవరిని పలకరించినా, నెక్స్ట్ టార్గెట్ తెలంగాణ అని ఎలాంటి సషబిషలు లేకుండా కుండబద్దలు కొడుతున్నారు.అందుకే, బెంగాల్లో బీజేపీ గెలిస్తే.. అనే ఊహా కూడా  గులాబీ గూటిలో గుబులు పుట్టిస్తోంది. అయితే, బెగాల్’లో బీజేపీ గెలిస్తే ఒక్క తెలంగాణలోనే కాదు, దేశ రాజకీయ వాతావరణంలోనే పెను మార్పులు చోటు చేసుకుంటున్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.  అలాగే,  దేశ ముఖ చిత్రంలో కూడా పెను మార్పులు తప్పవని అంటున్నారు. అయితే రాజకీయాలలో ఎప్పుడు ఏం జరుగుతుందో.. ఎవరూహించెదరు..
ఈరోజుల్లో యువతలో ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచన పెరగడం బాధాకర విషయం. ఇంచుమించు వార్తా పత్రికలలో ప్రతిరోజూ ఆత్మహత్య సంఘటల్ని చూస్తున్నాము. ఆత్మహత్య గురించి ఆలోచించడం చాలా తెలివి తక్కువ పని. మానవ శరీరం దేవుడిచ్చిన విలువైన బహుమతి. చిన్న చిన్న విషయాల కోసం ప్రాణాలను విడవటం మంచిదికాదు. పిరికిపందలు,బలహీన మనష్కులే జీవితపు సవాళ్ళను ఎదుర్కోవడానికి భయపడతారు. అటువంటివారే ఇటువంటి తెలివితక్కువ పనులకు ఒడిగడతారు. ఎలాంటి ప్రతికూల పరిస్థితులు ఎదురైనా ధైర్యంగా సవాళ్లను ఎదుర్కునేవాడు ఎప్పుడూ ఇలాంటి ఆలోచన చేయడు. ఆ సవాళ్లకు పరిష్కార మార్గాలను అన్వేషిస్తాడు. చాలామంది తమ కోరికలు నెరవేరలేదు అని నిస్పృహ చెంది ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నిస్తారు. కానీ మనకు ఏది ప్రాప్తమో అదే దక్కుతుంది అనే సత్యాన్ని గ్రహించుకోలేరు. చిత్తశుద్ధితో, నిజాయితీతో పనిచేసి మనకు ఆ అర్హత కలిగించే శక్తిని ఎందుకు పెంచుకోకూడదు. ఓ క్షణం ఆలోచిస్తే ప్రాణం తీసుకోవడానికి మించిన ధైర్యం ఈ లోకంలో ఇంకోటి ఉందని నేను భావించను. అలాంటి నీ ధైర్యాన్ని కొంచెం నీ జ్ఞానికి జత చేసి సమస్యపై పోరాటం చేస్తే అసాధ్యమైనా సుసాధ్యం కాగలదు. కష్టాల్లో మన మనసు ఆలోచనా విధానం రాకెట్ వేగంతో ఉండాలి. మన నిర్ణయాలు,కార్యాచరణ మిస్సైల్ లా సాగాలి. మనో నిబ్బరాన్ని మించిన ఆయుధం ఇంకోటి లేదు. అది ఎప్పుడూ కోల్పోకూడదు. కనుక చిన్న చిన్న విషయాలకు ప్రాణాలను త్యజించి ఎంతో విలువైన జీవితాన్ని కోల్పోయి దేవుడు ఇచ్చిన దేహాన్ని హత్య చేసి వెళ్లిపోతే దేవుడు కూడా క్షమించడు. ◆ వెంకటేష్ పువ్వాడ  
చాలారోజుల క్రితం ఒక గొప్ప వ్యాపారి ఉండేవాడు. వ్యాపార నిమిత్తం అతను ఓసారి దూరదేశాలకు బయల్దేరాడు. వెళ్తూ వెళ్తూ అతను, తన దగ్గర పని చేసే ముగ్గురు పనివాళ్లని పిలిచాడు. ‘చూడండి! నేను తిరిగి రావడానికి కాస్త సమయం పడుతుంది. ఈలోగా నేను మీకో పని అప్పచెబుతున్నాను. మీ ముగ్గురికీ నేను కొంత డబ్బుని ఇస్తున్నాను,’ అంటూ మొదటి వ్యక్తికి ఐదువేలు, రెండో వ్యక్తికి రెండువేలు, మూడో వ్యక్తికి వేయి రూపాయల డబ్బుని చేతికిచ్చాడు.   అలా యజమాని తన ముగ్గురు పనివాళ్లకీ డబ్బుని అందించి ప్రయాణమైపోయాడు. కొంతకాలం తర్వాత యజమాని తిరిగివచ్చాడు. ‘నేను మీకిచ్చిన డబ్బుని ఏం చేశారు?’ అని ఆ ముగ్గురినీ అడిగాడు.   ‘ప్రభూ! వ్యాపారం చేయడం మీ లక్షణం. డబ్బుని స్థిరంగా ఉంచడం మీకు ఇష్టం ఉండదు. మీ మనస్తత్వం తెలిసినవాడిని కనుక మీరిచ్చిన డబ్బుని పెట్టుబడి పెట్టాను. రాత్రింబగళ్లు కష్టపడ్డాను. ప్రస్తుతానికి మీరు ఇచ్చిన డబ్బు రెట్టింపైంది,’ అని పదివేల రూపాయలని చేతిలో పెట్టాడు మొదటి పనివాడు.   ‘ప్రభూ! వ్యాపారం చేయడం నాకు అలవాటైన విద్య కాదు. కానీ డబ్బుని అలా నిరుపయోగంగా ఉండటం నాకు ఇష్టం లేకపోయింది. అందుకనే నష్టం వచ్చే ప్రమాదం ఉందన్న భయం ఉన్నా కూడా ఆ డబ్బుతో వ్యాపారం చేశాను. ఒళ్లు వంచి పనిచేశాను. అదృష్టవశాత్తూ ఫలితం దక్కింది. రెండు వేలు కాస్తా నాలుగు వేలు అయ్యాయి,’ అని చెప్పుకొచ్చాడు రెండో పనివాడు.   ‘ప్రభూ! మీరు పాపం డబ్బుని ఎంతో కష్టపడి సంపాదిస్తూ ఉంటారు. డబ్బు కోసం ఇల్లు విడిచి ఎక్కడెక్కడో వ్యాపారం చేసి వస్తుంటారు. అలాంటి డబ్బుని ఏదో ఒకటి చేసి పాడు చేయడం నాకు ఇష్టం లేకపోయింది. అందుకే ఓ గొయ్యి తీసి ఎవరికీ కనిపించకుండా ఆ డబ్బుని దాచిపెట్టాను. ఇదిగోండి మీరు ఇచ్చిన సొమ్ముని యథావిధిగా మీ చేతిలో పెడుతున్నాను,’ అంటూ వెయ్యి రూపాయలు ఉన్న మూటని వ్యాపారి చేతిలో పెట్టాడు మూడో పనివాడు.   ‘మూర్ఖుడా! డబ్బయినా, ప్రతిభ అయినా ఒక వరంలాంటిది. దాన్ని ఉపయోగించకపోతే ఎవరికీ పనికిరాకుండా పోతుంది. నీకు ఇచ్చిన అవకాశాన్ని వాడుకోలేకపోయావు. ఆ డబ్బు నీకూ ఉపయోగపడలేదు, నాకూ ఉపయోగపడలేదు. మొదటి ఇద్దరూ నేను ఇచ్చిన డబ్బులతో పాటు, వచ్చిన లాభాలని అట్టిపెట్టుకోండి. కానీ మూడో వ్యక్తికి ఇచ్చిన వేయి రూపాయలని కూడా నేను తిరిగి తీసేసుకుంటున్నాను,’ అన్నాడు వ్యాపారి.   ఇది బైబిల్‌లో Parable of the Talents అనే కథ ఆధారంగా రాయబడింది. ఇందులో వ్యాపారి తన ముగ్గురు పనివాళ్లకీ ఇచ్చిన సొమ్ముని ‘Talent’ అని పిలుస్తాడు. Talent అనేది పూర్వకాలంలో డబ్బుకి ఓ కొలబడ్డగా వాడేవారు (మిలియన్, లక్ష, వేయి లాగా). వ్యాపారి మొదటి పనివాడికి ఎనిమిది టాలెంట్లు, రెండోవాడికి రెండు టాలెంట్లు, మూడోవాడికి ఒక్క టాలెంటు ఇచ్చి వెళ్తాడన్నమాట. కానీ ఇక్కడ టాలెంట్ అంటే ప్రతిభ అన్న అర్థం కూడా వస్తుంది! ప్రకృతి మనలో ప్రతి ఒక్కరికీ కొన్ని టాలెంట్స్ ఇస్తుంది. వాటిని సవ్యంగా వాడుకున్నవాడు జీవితంలో పైకి వస్తాడు. ఉన్న ఒక్క టాలెంటునీ వాడుకోకుండా దాచుకున్నవాడు ఎందుకూ కొరగాకుండా పోతాడు. ఎక్కడ ఏ నష్టం వస్తుందో అని భయపడుతూ తన ప్రతిభని అణచివేసిననాడు జీవితం వృధా అయిపోతుంది. - నిర్జర.  
  మనసులో ఏదీ దాచుకోలేకపోవడం చాలా మంది బలహీనత. బాధ అయినా, సంతోషం అయినా, దుఃఖం అయినా తనకు తెలిసిన వారికో లేక స్నేహితులు, ఆత్మీయులకో ఏదో ఒక  సందర్భంలో చెప్పుకుని తీరతారు. అయితే ఇలా చెప్పడం తప్పని కాదు కానీ.. కొన్ని విషయాలు మాత్రం ఇతరులతో అస్సలు చెప్పడం మంచిది కాదని అంటున్నారు వ్యక్తిత్వ విశ్లేష నిపుణులు. ఏ వ్యక్తి అయినా ఇతరులతో అస్సలు చెప్పకూడని 5 విషయాలేంటో తెలుసుకుని వాటిని పాటిస్తే  వారి జీవితం చాలా మెరుగ్గా ఉంటుంది. ఆ అయిదు విషయాలేంటో తెలుసుకుంటే.. ఆర్థిక స్థితి.. ఉద్యోగం చేసేవారు అయినా వ్యాపారం చేసేవారు అయినా పొదుపు చేసేవారు అయినా తమ ఆర్థిక స్థితి గురించి మరో వ్యక్తికి చెప్పడం మంచిది కాదు. ప్రతి వ్యక్తి ఆర్థిక స్థితి సామాజిక స్థితిపై ప్రభావం చూపిస్తుంది. డబ్బును చూసి మనుషులు మసలుకునే కాలమిది. ఎవరిదగ్గరైనా డబ్బు ఎక్కువ ఉందని తెలిసినా, ఎక్కువ సంపాదిస్తున్నారని తెలిసినా అప్పు కోసం, సహాయాల కోసం సులువుగా చుట్టూ చేరతారు. పక్క మనిషి గురించి పట్టించుకోని ఈ కాలంలో ఆర్థిక సహాయాలు చెయ్యడం అంత మంచిది కాదు. అందుకే ఆర్థిక స్థితి గురించి ఎవరికీ చెప్పకూడదు. ఇంటి సమస్యలు.. ప్రతి ఇంట్లోనూ సమస్యలుంటాయి. ఇంటి సమస్యలను ఇంటి వారితో చర్చించి వాటిని చక్కబెట్టుకోవడం శ్రేయస్కరం. అలా కాకుండా సలహాలు, సూచనలు ఇస్తారనో లేదా మనసులో భారం దించుకోవాలనే ఆలోచనతోనో ఇంటి సమస్యలు బయటి వారికి, తెలిసిన వారికి చెప్పడం మంచిది కాదు. రిలేషన్ గొడవలు..  నిజానికి తోబుట్టువులు, చుట్టాలు, బాగా దగ్గరి వారైనా సరే.. భార్యాభర్తల సమస్యలలో జోక్యం చేసుకోవడం, తీర్పులు ఇవ్వడం మంచిది కాదు. ఏ ఇద్దరు వ్యక్తుల మధ్య ఉన్న గొడవలు, సమస్యలు వారే పరిష్కరించుకుంటే వారిద్దరికి ఒకరి మీద మరొకరికి గౌరవం పెరుగుతుంది. ఏ సమస్యకైనా ప్రతి వ్యక్తి స్పందన వేరుగా ఉంటుంది. అనుభవాలు కూడా వేరుగా ఉంటాయి. కాబట్టి సమస్యలను బయటకు, లేదా ఇతరుల దగ్గరకు తీసుకెళ్లడం, చెప్పడం మంచిది కాదు. మూడవ వ్యక్తికి భార్యాభర్తల సమస్యలు చెబితే వారు దాన్ని ఎంటర్టైన్మెంట్ గా చూస్తారు. బలహీనతలు.. ప్రతి వ్యక్తిలోనూ బలాలతో పాటూ బలహీనతలు ఉంటాయి. చాలామంది వ్యక్తులలో లోపాలు, బలహీనతలను వెతుకుతారు. వాటిని వేలెత్తి చూపిస్తారు. విమర్శిస్తారు. అందుకే వ్యక్తులలో బలాలు బయటపెట్టినా సమస్య లేదు కానీ బలహీనతల గురించి మాత్రం ఎట్టి పరిస్థితిలో ఎవరికీ చెప్పకూడదు. ప్రణాళికలు.. పెద్ద పెద్ద విషయాల గురించి నిర్ణయాలు తీసుకునే ముందు, పెద్ద ప్రణాళికలు వేసుకునేటప్పుడు వాటిని మరొక వ్యక్తితో చెప్పకూడదు. జీవితంలో ఇంకా ఎదిగే దశలో వేసుకునే ప్రణాళికలు ఇతరులతో చెప్పకూడదు.                                                      *రూపశ్రీ.  
ఆ స్ప్రిరిన్ ,వార్ ఫారిన్ మందులతో రక్త శ్రావం నిపుణుల పరిశోదనలో వెల్లడి.. ఒకవేళ మీరు రక్తం పల్చబడేందుకు వాడే మందులు అవసరం లేదని.వాస్తవానికి సహజంగా రోగులకు ఇచ్చే బ్లడ్ తిన్నర్స్ అస్టిలిన్ ను తీసుకోవడం మానాలని దీనివల్ల అధిక రక్తశ్రావం  జరగడం వల్ల వచ్చే పరిణామాలు నియంత్రించ కుంటే ముప్పే.7౦౦ మందిపై జరిపిన పరిశోదనలో మిచిగన్ లోని క్లినిక్ లో వీనస్ త్రాంబో  ఎంబాలిజం లేదా గడ్డ కట్టడం లేదా ఆర్టియాల్ ఫైబ్రి లేషన్ లో గుండె సరిగా కొట్టు కోక పోవడం వల్ల గుండె పోటు వస్తుంది. రోగులకు సాధారణంగా లభించ్గే బ్లడ్ తిన్నేర్స్ వార్న్ ఫారిన్ గుండె సమస్య లేకపోయినా ఆస్ప్రిన్ తీసుకునే వారు అని పరిశోదనలో వెల్లడించారు.మనకు తెలిసిన విషయం  ఏమిటి అంటే ఆస్ప్రిరిన్  పెనేషియా డ్రగ్ కాదని కొంతమందిలో ఎక్కువశాతం రక్త్గ శ్రావం జరిగింది.అయితే క్లినిక్స్ లో అస్ప్రిరిన్ వినియోగం  తగ్గించే ప్రయాత్నం చేశామని పేర్కొన్నారు.  ఎవరికి అయితే అవసరం లేదో వారికి అస్ప్రిరిన్ ఇవ్వలేదని మిచిగాన్ విశ్వవిద్యాలయానికి చెందిన కార్దియలజిస్ట్ హెల్త్ ఫ్రాంకల్ కార్డియో వాస్క్యులార్ సెంటర్ కర్దియలజిస్ట్ డాక్టర్ జాఫ్రీ బార్నేస్ అన్నారు.పరిశోదనలో ఎస్ప్రిరిన్ వినియోగం తగ్గించామని 46.6 % తగ్గించడం వల్ల రక్త శ్రావం తగ్గించగలిగామని రక్తశ్రావం ౩2.౩% వినియోగం తగ్గిందని వివరించారు. ప్రతి వెయ్యి మందిలో ఆస్పిరిన్ మానివేయడం వల్ల రక్త స్రావం తగ్గిందని పేర్కొన్నారు.అస్పిరిన్ ఆపడం వల్ల వచ్చిన ఫలితాలను జామా నెట్వర్క్ లో ప్రచురించారు.మేము పరిశోదన ప్రారంభించగానే అప్పటికే వైద్యులు అస్ప్రిరిన్ వినియోగం తగ్గించారని మాపరిశోదనలో రక్త శ్రావం వంటి సంఘటనలు పరిణామాలు తీవ్ర రక్త శ్రావం ఆపడం ద్వారారోగులను కాపాడగలిగా మని ఇంటర్నల్ మెడిసిన్ స్కూల్ జనరల్ ఫిజీషియన్లకు ఆరోగ్య శాఖ సిబ్బందికి  రోగుల కు బ్లడ్ తిన్నర్ గా అస్టిలిన్ ను వినియోగించరాదనిపరిశోధకులు సూచించారు. ఆస్టిలిన్ వాడే వారి కొంతమేర తక్కువ స్థాయిలో తగ్గించాల్సిన అవసరం ఉందని పరిశోధకులు వెల్లడించారు.ఇందులో  రక్తం పల్చబడితే ఇతర మందులతో పాటు ఎస్ప్రిరిన్ ను పరిసీలించినట్లు తెలుస్తోంది.మరో పరిశోదనలో వార్ ఫారిన్ తీసుకుంటున్న రోగులలో అస్పిరిన్ అర్తియాల్ ఫైబిలేషణ్,వి టి ఇ వీనస్ త్రాంబో ఎంబాలిజం లో రక్త శ్రావం ఎక్కువగా ఉందని వార్ ఫారిన్ తీసుకున్న వారిలోనూ రక్తశ్రావం జరగడం గమనించారు.అస్పిరిన్ తీసుకునే వారిలో ఇలాంటి సమస్యలు గమనించమని అయితే రక్తం గడ్డకట్టడం కన్నా రక్త శ్రావం ఎక్కువజరిగిందని పరిశోధకులు వెల్లడించారు.కొంత మందికి అస్టిలిన్ ప్రాణాలు రక్షిస్తే కొంతమందికి ఇస్కిమిక్ స్ట్రోక్ వచ్చిన చరిత్ర ఉందని గుండెపోటు అవసరమైన సమయంలో గుండెకు స్టంట్ పెట్టాల్సిన  పరిస్థితి వచ్చిందని రక్త ప్రవాహం పెరగడం గుండె సంబంధిత రక్త్గానాళా లలో సమస్యలు ఉన్నవారికి అందించడం అత్యవరం లాభం. మనం ఎదుర్కున్న సవాలు ఏమిటి అంటే గుండె సంబందిత సమస్యలు లేనివారు సైతం అస్పిరిన్ తీసుకుంటే యాంటి కాగులెంట్ గా సూచించవచ్చని ప్రముఖ హేపటాలజిస్ట్ ప్రొఫెసర్ జోడాన్ స్చేఫెర్ జనరల్ మెడిసిన్ వివరించారు.ప్రాధమిక స్థాయిలో నివారణకు అస్పిరిన్ వాడతారని గుండెపోటుకు చాలా తక్కువ ప్రభావం ఉంటుందని వార్ ఫారిన్ వాడినట్లైతే గుండె పోటును ఎదుర్కునేందుకు వాడరాదని అస్పిరిన్ పై సమీక్షించాలని మీసంరక్షణ చూసేవారు లేదా మీ ఫ్యామిలీ డాక్టర్ వీటి ప్రభావం నుండి బయట పడితే కొంతమేరా ప్రాణ హాని తీవ్ర రక్త్గశ్రావాని నివారించవచ్చు. 
బరువు తగ్గాలని అనుకునే వాళ్లకి శుభవార్త. ఇకమీరు బరువు తగ్గడానికి కొత్తమందులు వచ్చేసాయి. అయితే నియమ నిబందనల  ప్రకారం మందులు వాడాలని నిపుణులు సూచిస్తున్నారు. ఊబకాయం తగ్గాలంటే... ఊబకాయం తగ్గించుకోడానికి చాలామంది చలారకాల పద్దతులు అనుసరిస్తూ ఉంటారు. అందుకోసం పెద్దమొత్తంలో డబ్భులు వెచ్చిస్తూ ఉంటారు.  చేయని ప్రయత్నము లేదు అవసరమైన పక్షం లో సర్జరీ లకైనా వెనుకాడరు ఒక్కోసారి సర్జరీ కూడా ప్రాణంతకం అవుతుంది. లిపోసక్షన్,లేదా టమ్మీటక్ సర్జరీ,వెయిట్ రిడేక్షన్ కోసం రకరకాలక్లినిక్స్ ను ఆశ్రయిస్తూ ఉంటారు. ఇక్కడ ఆహారం లో మార్పులు, వ్యాయామం పూర్తిగా దీర్ఘకాలం పాటు పాటించినా ఊబకాయం తగ్గని పరిస్థితి.అయితే ఊబాకాయం ఒక బయోలాజికల్ డిసీజ్ గా పేర్కొన్నారు. అప్పుడప్పుడు దానికి మందులతో చికిత్చ అవసరం అని నిపుణులు సూచిస్తున్నారు.   * ఎవరైతే ఊబకాయం తో బాధపడుతున్నారో ఓబెసిటి  మందులు వాడాలంటే వారి జీవన శైలి ని మార్చుకోవాలన్న నూతన నిబందన లు విధించింది. *ఇవి కొన్ని మల్టిపుల్ డ్రగ్స్ వే గో వై ,క్య్యస్ ఎం జే ఏ, సక్ష్ ఎండా ,కాంట్రోవ్, వీటిని మాత్రమే అనుమతించినట్లు బృందం వెల్లడించింది. *ఏ జి ఏ అమెరికన్ గ్యాస్ట్రో లాజికల్ సంస్థ సూచనల ప్రకారం డాక్టర్స్ ఇచ్చే ప్రిస్కిప్షన్ మేరకు ఊబకాయం తగ్గించే మందులు వాడాలని సూచించింది. జీవన శైలి లో మార్పులు చేయాలని సూచించింది పరిమిత ఆహారం తోపాటు వ్యాయామం చేస్తే బరువు తగ్గవచ్చని పేర్కొంది. *ఈ అంశాన్ని గ్యాస్ట్రో ఎంట్రాలజీ జర్నల్ లో నియమనిబందనలను వెల్లడించారు. ఊబకాయానికి ఆధునిక పద్దతిలో చేసేందుకు వీలుందని నిపుణులు వెల్లడించారు. *నియమిత ఆహారం వ్యాయామం ఒక్కటే చేస్తే ఊబకాయం నియంత్రించలేరు. అలా చేయడం వల్ల విఫల మయ్యరని ఒబెసిటి బయోలాజికల్ డిసీజ్ అయినందున అప్పుడప్పుడు తరచుగా మందులు ఫార్మాకో తెరఫీ తో చికిత్చ అవసరమని పేర్కొన్నారు. యాలె స్కూల్ ఆఫ్ మెడిసిన్ కు చెందినా ప్రొఫెసర్ డాక్టర్ జోన్ మోర్టాన్ బెరియాట్రిక్  విభాగం చీఫ్ మినిమల్లి ఇన్వి జివ్ సర్జన్ మాట్లాడుతూ ఎఫ్ డి ఏ నిబంధనల ప్రకారం ఊబాకాయాన్ని రక్షణతో కూడిన నిపుణులతో కూడిన సారధ్యం అవసరమని నిపుణుల సమక్షం లోనే రోగులయోక్క రోగి యొక్క అందం ఆకారం చెడకుండా వారు కోరు కున్న విధంగా ఊబకాయాన్ని తగ్గించవచ్చని.ఊబకాయం కేవలం బయోలాజికల్ దిజార్దర్ అంటే దాని ఆర్ధం స్వతసిద్ధంగా వారిని మొటివేట్ చేసేందుకు వారిని మానసిక సంబంధమైన శారీరక నిర్మాణం గా డాక్టర్ మోర్గాన్ పేర్కొన్నారు. *అమెరికన్ గ్యాస్ట్రో లాజికల్ సంస్థ కొన్నిమండులను ఊబకాయాన్ని తగ్గించేందుకు సూచించింది.మోర్గాన్ నేతృత్వం లోని బృందందీనిని తెరఫీ సహకారం అవసరమని సమర్ధించండి.ఫార్మా కో తెరఫీ తోపాటు జీవన శైలిలో మార్పులు ఆరోగ్యంగా ఉండేందుకు మంచిఫలితాలు సాధించవచ్చు అని అంటున్నారు మోర్గాన్. ఊబకాయాన్ని బి ఎం ఐ అంటే బోడి మాస ఇండెక్స్ ప్రకారం నిర్ధారిస్తారు. ౩౦ కే జి అంటే 27 కన్నా తక్కువ లేదా ఎక్కువ ఉంటారని బరువు ఆధారంగా శరీర నిర్మాణం ఉంటుంది. ఒక్కోసారి అండర్ వెయిట్ ఉన్నప్పుడు నష్టం కలిగిస్తుంది.ఏ జి ఏ అమెరికన్ గ్యాస్ట్రో ఎంత్రలాజికల్ సంస్థ కొన్ని మందులను కొన్ని మందులకు సంబందించిన పనితీరు ఎలాఉంటుందో సంరక్షణ వంటి వాటిగురించి వివరించింది. వే గొవై ,క్వెస్మియా, సక్సేండా, కాంటేరోవ్ వంటి మందులు ఎలా పనిచేస్తాయో వివరించారు.. వే గోవేవై- (సేమాగ్లుటైడ్ ) తరచుగా ఇది ఊబకాయానికి ఒక ప్రత్యామ్న్సయం. వేగోవై గ్లూకోజ్ ను నియంత్రిస్తుంది. వేగో వై వల్ల లాభాలు గ్యస్టిక్ ను ఖాళీ చేయకుండా నియంత్రిస్తుంది. ఈ మందు ప్యాక్రియాటిక్ నుండి వచ్చే ప్రమాదాన్ని నియంత్రిస్తుంది. క్య్ స్మియా- (ఫెంటర్ మైన్ టోపిరామూట్ ఇ ఆర్ )క్య్ స్మియా ఊబకాయానికి మైగ్రైన్ నియంతరించడానికి ,లేదా హ్హృద్రోగసంబంధమైన హై బిపి ఇక్కడ కీలక మైన అంశం ఏమిటి అంటే పిల్లల ఒబెసిటి విషయం లో కౌన్సిలింగ్ తరువాతే వినియోగించాలని నిపుణులు సూచిస్తున్నారు. సక్షెన్ డా-(లీరా గ్లు టైడ్ )సక్షెన్ దా గ్లూకోజ్ ను నియంత్రించే శక్తి ఉంటుంది. గ్యస్టిక్ విడుదలను తగ్గిస్తున్బ్ది టైప్ 2 డయాబెటిస్ ను నియంత్రించడం లో సహకరిస్తుంది.పెంక్రియాటిక్ ప్రమాదం నుండి రక్షణ కల్పిస్తుంది. కాంట్రావే-(నత్రెక్ష్ వన్-బుప్రో ప్లాన్)ఇ ఆర్ రోగులకు కాంట్రావే పోగతాగే ప్రయాత్నం చేస్తారో ఒత్తిడికి గురి అవుతారో అలాగే మూర్చరోగుల సమస్యలు ఉన్నవారికి అంటే ఫిట్స్ వచ్చినవారికి ఈ మందు పనిచేస్తుంది.ఊబకాయానికి ఒర్లి స్టాల్ ను వినియోగించరాదనీ బృందం సూచించింది. దీనిపనితీరు చాలా ప్రతక్కువే అని ఎక్కువస్తాయిలో వివిదరకాల రియాక్షన్స్ గెలిసిస్ట్ 1౦౦ ను క్లినికల్ ట్రైల్స్ లో మాత్రమే వినియోగించాల ని ఏ ఐ జి సభ్యుల బృందం సూచించింది.చివరగా ఫెంటర్ మైన్ ఆహారం జీవనశైలి లో మార్పులు తప్పనిసరిగా చేపట్టాలి.డాక్టర్ మోర్గాన్ బృందం ఇచ్చిన సూచనలు అద్భుతమని. ఊబకాయానికి వ్యతిరేకంగా పనిచేసే సామర్ధ్యం ఉన్నట్లు రుజువైంది. ఒబెసిటి నియంత్రణలో వైద్యం పెద్దలు, అధికబరువు ఉన్నవాళ్ళు ఊబకాయం వల్ల వచ్చే ఇతర సమస్యలు బరువు తగ్గించడం లో ఆహారం వ్యాయామం పెద్దగాసహాయ పడలేదని డాక్టర్ జార్జ్ మోరానో యాలె మెడిసిన్ విదేశీ గుర్తింపు పొందిన వైద్య నిపుణులు వివరించారు. ఒబెసిటి స్థాయి పెరుగుతోంది... కొన్ని దశాబ్దాలుగా యునైటెడ్ స్టేట్స్ ఊబాకాయం తో బాధపడుతున్న వారిసంఖ్య పెరుగుతోంది. ౩౦5% 2౦౦౦-2౦౦9 లో 41.9% 2౦19-2౦2౦ నాటికి పిల్లలో 6.2% 197౦-8౦ ౩౩% 2౦17-2౦18 లో వివిదరకాల అనారోగ్య సమస్యలు ముడి పడి ఉన్నాయి.ఉదా ---గుండె సంబంధిత వ్యాధులు టైప్ 2 డయాబెటిస్ ,నిద్రలేమి ఆస్టియో ఆర్తరైటిస్, కొలస్ట్రాల్, లెవెల్స్ క్యాన్సర్, బి పి,ఒబెస్ ను క్రాస్కేడ్ ఎఫెక్ట్ గ్లుకోజ్ నియంత్రణ కొలస్ట్రాల్ ను నియంత్రించవచ్చు.దేశం లో ఊబకాయానికి చికిత్చ చేస్తే ఈ వ్యాధి బారిన పడుతున్న వారి సంఖ్యను బరువు తగ్గడం ఊబకాయానికి జీవనశైలి కీలకమని మందులు లేకుండా ఒబెసిటి చికిత్చలు ఫెయిల్ విషయాన్ని గుర్తుచేశారు దీర్ఘకాలంగా మీరు ఊబకాయం సమస్యనుండి బయట పడవచ్చు.మీశరీరం బరువు ఆపగలదా?ఆపలేదా?అయితే చికిత్చ తప్పదా అప్పుడే మీకు మేటాబాలిక్ ఇంటర్ వెంక్షన్ మందులు అవసరం.దీర్ఘకాలం గా ఊబకాయ నియంత్రణకు వీతిగురించిన అవగాహన లేనివారు ప్రిస్క్రిబ్  చేయరు..ఊబకాయానికి వాడే మందు రోగి హెల్త్ ఇన్సూరెన్స్ లో కవర్ కాలేదు. ప్రజలలో అవగాహన ప్రిస్కిప్షన్ ఈ మందులు కేవలం వెయిట్ లాస్ కు మాత్రమే వినియోగిస్తారు. ఎవరైతే రిస్క్ భరించగలరో డాక్టర్ సలహా తీసుకుని లాభం ,నష్టం అంచనా వేయాల్సిందే.ఇతర ఆమ్శాలాను మదిమ్పుచేసిన తరువాత నిర్ణయించుకోవచ్చు. బెరియాట్రిక్ సర్జరీ మీకు ఉపయోగపడితే చేయించుకోవచ్చు. రోగి స్థితిని బట్టి ఏమి నిర్ణయించు కోవచ్చు రోగి గత చరిత్ర రోగి ఇచ్చే ప్రాధాన్యత ఆధారంగానే చికిత్చ చేస్తారు.
ఇంట్లో ఉన్నప్పుడు టీవీ చూస్తున్నా, ఏదైనా పని చేసుకుంటున్నా  పక్కనే ఒక ప్లాస్టిక్ బాటిల్ లో నీళ్లు పెట్టుకుని ఉంటారు. ఇక భోజనం చేసేటప్పుడు అయితే ఇంట్లో ఎంత మంది ఉంటే అన్ని ప్లాస్టిక్ బాటిళ్లతో నీళ్ళు పక్కన పెట్టుకుంటారు. రాత్రి నిద్రపోయే ముందు పక్కనే ప్లాస్టిక్ బాటిల్ లో నీళ్ళు పెట్టుకుంటారు.  ఇక బయటకు వెళ్లినా  వెంట ప్లాస్టిక్ బాటిల్ లో నీళ్ళు తీసుకెళ్లాల్సిందే. లేకపోతే బయట 20 నుండి 30 రుపాయలు పెట్టి నీళ్ళ బాటిల్ కొనాల్సి వస్తుంది. ఎక్కడైనా తాగుదామా అంటే పరిశుభ్రత గురించి, నీటి క్వాలిటీ గురించి ఆలోచిస్తాం. కొందరు అయితే ఆరోగ్యం మీద స్పృహతో ప్రయాణాలలోనూ, హోటళ్లలోనూ వాటర్ బాటిళ్లు కొనుగోలు చేసి నీరు తాగుతారు. కానీ ఇలా బాటిళ్లలో నీరు తాగడం అంత మంచిది కాదని ఎప్పటినుండో చెబుతున్నా ఇప్పుడు ఓ దారుణమైన నిజం బయటపడింది. ప్లాస్టిక్ బాటిళ్ళలో నీరు తాగడం గురించి శాస్త్రవేత్తలు షాకింగ్ నిజాలు బయటపెట్టారు. అందరూ వాటర్ బాటిళ్లలో నీరు తాగుతారు. ఇంట్లో అయినా, బయట నేరుగా బాటిళ్లతో కొనే నీరు అయినా పరిశుభ్రంగా ఉన్నాయని అనుకుంటారు. అయితే తాజాగా శాస్త్రవేత్తలు  డబుల్ లేజర్ సూక్ష్మదర్శిని ఉపయోగించి ఈ బాటిళ్లలో నీటిని పరిశీలించగా దిమ్మతిరిగిపోయే విషయాలు బయటపడ్డాయి. సగటు లీటర్ వాటర్ బాటిల్ లో రెండు మిలియన్ల కంటే ప్లాస్టిక్ ముక్కలు సూక్ష్మరూపంలో ఉంటాయట. ఇవి అదృశ్యరూపంలో ఉండే నానోప్లాస్టిక్ ముక్కలుగా తేలింది. కొలంబియా,  రట్జర్స్ విశ్వవిద్యాలయాల పరిశోధకులు మూడు సాధారణ బాటిల్ వాటర్ బ్రాండ్‌ల నుంచి  ఐదు బాటిళ్ల నీటిని  పరిశీలిస్తే, ఒక లీటరు నీటిలో 1,10,000, మరొక దాంట్లో  4,00,000 ఇలా ఉన్నాయి. మొత్తం మీద  ప్లాస్టిక్ ముక్కల సంఖ్య ప్రతి బాటిల్ కు  సగటున 2,40,000 ఉన్నాయి.  ఇవి ఒక మైక్రాన్ కంటే తక్కువ పరిమాణంలో ఉండే కణాలు. ఒక అంగుళంలో 25,400 మైక్రాన్లు ఉంటాయి.  ఇది మీటర్‌లో మిలియన్ వంతు. కాబట్టి మైక్రోమీటర్ అని కూడా పిలుస్తారు. మనిషి  జుట్టు దాదాపు 83 మైక్రాన్ల వెడల్పు ఉంటుంది. ఇంతకు ముందు ప్లాస్టిక్ బాటిళ్లలో నీటి గురించి జరిపిన అధ్యయనంలో 5 మిల్లీమీటర్ల నుండి పావు అంగుళం కంటే తక్కువగానూ, ఒక మైక్రాన్ వరకు ఉండే కొంచెం పెద్ద మైక్రోప్లాస్టిక్‌లను కనుగొన్నాయి. మైక్రోప్లాస్టిక్‌ల కంటే బాటిల్ వాటర్‌లో దాదాపు 10 నుండి 100 రెట్లు ఎక్కువ నానోప్లాస్టిక్‌లు ఉన్నాయని అధ్యయనాలు కనుగొన్నాయి.  ప్లాస్టిక్ బాటిళ్లలో ఇలాంటి నీరు తాగడం వల్ల కలిగే ఇబ్బందులు  ఏమిటంటే..  ఈ చిన్న కణాలు మెదడుకు రక్త సరఫరాకు అంతరాయం కలిగించడం,   వివిధ అవయవాలు,  క్రాస్ మెమ్బ్రేన్‌లను ప్రభావితం చేయడం చేస్తాయి. అదే విధంగా  ఈ  నానోప్లాస్టిక్‌లు పేగుల్లో పేరుకుపోయి వాటిని నిరోధించే అవకాశం ఉంది. ఇది మాత్రమే కాదు ఈ కణాలు మెల్లిగా రక్త నాళాల వైపు కదులుతాయి. మనిషి  శరీరంలో ఆల్వియోలస్ అనేది ఊపిరితిత్తుల భాగం. ఇది రక్తంలోకి ఆక్సిజన్‌ను విడుదల చేయడానికి,  రక్తం నుండి కార్బన్ డయాక్సైడ్‌ను స్వీకరించడానికి పెద్ద రంధ్రాలను కలిగి ఉంటుంది. ఈ కణాలు ఊపిరితిత్తులలోకి ప్రవేశించి రక్తం-గాలి ప్రసరణకు అవరోధాన్ని కలిగిస్తాయి. మరీ ముఖ్యంగా చిన్న ప్లాస్టిక్ కణాలు గర్భవతులలో మావిని ప్రభావితం చేస్తాయి. తల్లీబిడ్డలను కలిపే  అవయవం మావి. ఇది ప్రభావితం కావడం వల్ల  ఆక్సిజన్,  పోషకాలను తల్లి నుండి పిండానికి రవాణా చేయడం కష్టతరమవుతుంది.                                               *నిశ్శబ్ద.