LATEST NEWS
ఎక్కడ రాయలసీమలోని చంద్రగిరి.. ఎక్కడ విశాఖపట్నం. చంద్రగిరి నుంచి వచ్చిన వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి విశాఖపట్నంలో వెయ్యి కోట్ల స్కామ్ చేశాడు. అక్రమ మైనింగ్‌తో  అందినంత దండుకున్నాడు. జగన్ ఆశీస్సులతో రాష్ట్రమంతటా రెచ్చిపోతున్న దండుపాళెం బ్యాచ్‌లో ముఖ్య సభ్యుడైన చెవిరెడ్డి, అడ్డగోలుగా సంపాదించడంలో ఆరితేరాడు. తనకెవరైనాఅడ్డు వస్తే భౌతికంగా అడ్డు తొలగించుకోవడానికి కూడా వెనుకాడడు. నిన్నగాక మొన్న చంద్రగిరి నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పులవర్తి నానిని హత్య చేయడానికి చెవిరెడ్డి చేసినప్రయత్నాలు చూశాం. ఇప్పుడు వైజాగ్‌లో చట్టాలు, నిబంధనల చెవుల్లో పూలు పెట్టి, ఆయనగారు  చేసిన వెయ్యి కోట్ల స్కామ్ వివరాలేంటో చూద్దాం.  చెవిరెడ్డి చేసేవన్నీ నేరాలు, మోసాలు. పైకి బిల్డప్పు మాత్రం పరమభక్త శిఖామణిలా వుంటుంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ దండుపాళెం బ్యాచ్‌లో కీలక మెంబర్ అనే విషయం ఆల్రెడీ చెప్పుకున్నాం. తనకు ఎంతమాత్రం సంబంధంలేని విశాఖలో మకాం వేసి ఏకంగా వెయ్యికోట్లకు పైగా నొక్కేశాడు. క్రైస్తవుడైన ముఖ్యమంత్రి  వైయస్ జగన్‌ను హిందువులు వ్యతిరేకించకుండా చెవిరెడ్డి మంచి ప్లాన్ వేశారు. ఆయన ఇంట్లో గోశాల ఏర్పాటు చేసి, దేవాలయ సెట్లు నిర్మించి ఆ పలుకుబడితో విశాఖలో భారీ స్కాములు చేసేశారు.  ఋషికొండ విధ్వంసకారుడు చెవిరెడ్డి బినామీలతో  ఋషికొండను విధ్వంసం చేయించిన చెవిరెడ్డి వేల లారీల గ్రావెల్‌తో  వందల కోట్లు సంపాదించారు. ఋషికొండను తవ్వగా వచ్చిన గ్రావెల్ రాళ్లను నిబంధనలకు విరుద్ధంగా సముద్రం ఒడ్డున సి.ఆర్.జెడ్. ప్రాంతంలో డంప్ చేయించిన చెవిరెడ్డి అక్కడి ఎర్ర మట్టిని మాత్రం విశాఖ పోర్టుకు తరలించి భారీగా లబ్ధి పొందారు. ముఖ్యమంత్రి జగన్‌కి గంగవరం పోర్టు అధినేత సన్నిహితులు కావడంతో, పోర్ట్.లోని మట్టిని విక్రయించడానికి చెవిరెడ్డి కాంట్రాక్ట్ తెచ్చుకున్నారు. ఆ కారణంగానే ఋషికొండపై అవసరం లేని చోట, నిర్మాణాలు లేని చోట కూడా లక్షల క్యూబిక్ మీటర్ల మట్టిని తవ్వి  అమ్ముకున్నారు. విశాఖ పోర్ట్ ట్రస్టులో అదానీ నిర్మిస్తున్న బెర్తులు, ఇతర అవసరాల కోసం వందల కోట్ల విలువైన ఈ మట్టిని తరలించి అమ్ముకొని సొమ్ముచేసుకున్నారు. పెందుర్తి నియోజకవర్గంలో భారీ స్కాం పెందుర్తి నియోజకవర్గం గుర్రంపాలెంలో 200 ఎకరాల్లో క్వారియింగ్ చేసి వందల కోట్లు చెవిరెడ్డి సంపాదించారు. ప్రభుత్వం పరిశ్రమలకని కేటాయించిన ఈ భూమిలో చాలా తెలివిగా మైనింగ్ చేశారు. ఈ ప్రాంతం పరిశ్రమల ఏర్పాటుకు అనుకూలం కాదని ప్రభుత్వ అధికారులతోనే సర్టిఫై చేయించి తన మైనింగ్ అవసరాలకు వాడుకున్నారు. కేవలం మైనింగ్ చేసేందుకే ఈ భూమిని పరిశ్రమలకు పనికి రాదని పలుకుబడితో సర్టిఫై చేయించారు. ప్రస్తుత పర్యాటక శాఖ మంత్రి రోజా ఏపీఐఐసీ చైర్మన్‌గా ఉండగా ఈ భూములకు నాట్ ఫిట్ ఫర్ ఇండస్ట్రీస్ అనే సర్టిఫికెట్ మంజూరు చేయించి దాని ఆధారంగా ఆ భూముల్లో మైనింగ్ చేసి  సొమ్ము చేసుకున్నారు. బక్కన్నపాలెంలో 208 కోట్ల టిడిఆర్ ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణల్లో  తాను చేస్తున్న సర్వేలకు డబ్బు కావాలంటూ మధురవాడ సమీపంలోని బక్కన్నపాలెం సర్వే నెంబర్ 2లో 208 కోట్ల టిడిఆర్ బాండ్లను తాడేపల్లి ప్యాలెస్ ఒత్తిడితో దక్కించుకున్నారు. మహావిశాఖ నగరపాలక సంస్థ టౌన్ ప్లానింగ్ అధికారులు కేవలం చెవిరెడ్డికి లబ్ధి చేకూర్చేందుకు టి.డి.ఆర్ బాండ్లు మంజూరు చేశారు. ఇది అక్రమమంటూ ఫిర్యాదుల వెళ్లినా, తమకూ తెలిసినా తాడేపల్లి ప్యాలెస్ ఒత్తిడికి తలొగ్గారు.  ఫార్మాసిటీలో డంపుల వ్యాపారం పరవాడలోని ఫార్మాసిటీలో పలువురు పారిశ్రామికవేత్తలను బెదిరించి, భయపెట్టి రసాయన వ్యర్ధాల డంపులను చెవిరెడ్డి స్వాధీనం చేసుకున్నారు. అప్పట్లో ఉత్తరాంధ్ర వైసీపీ ఇన్చార్జిగా పనిచేసిన రాజ్యసభ సభ్యుడు విజయ్ సాయి రెడ్డి ద్వారా ఈ డంపులతో ఎంచక్కా వ్యాపారం చేసుకొంటున్నారు. ఈ కారణంగానే  ఫార్మీ సిటీలో తరచూ ప్రమాదాలు జరుగుతున్నా, అధికారులు ధైర్యంగా ఎవరిపైనా చర్యలు తీసుకోలేక పోతున్నారు. ఒక 20 రోజుల ఆగితే, ఎన్డీయే గవర్నమెంట్ వచ్చాక చెవిరెడ్డికి భారీ సత్కారం జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఆంధ్ర ప్రదేశ్ లో ఎన్నికలు ముగిశాయి. పోలింగ్ సరళిని బట్టి తెలుగుదేశం భారీ విజయం సాధించడం ఖాయమన్న అంచనాలు వెల్లువెత్తుతున్నాయి. తెలుగుదేశం పార్టీ కూడా స్వయంగా నిర్వమించుకున్న పోస్ట్ పోల్ సర్వే ఫలితం కూడా భారీ విజయాన్ని ఖరారు చేసిందని పార్టీ శ్రేణులు చెబుతున్నాయి. రాష్ట్రంలో రాబోయేది తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వమేన్న విశ్వాసాన్ని వ్యక్తం చేస్తున్నాయి.  తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పాటైన తరువాత పార్టీ మహానాడు ఘనంగా నిర్వహించుకుందామని చంద్రబాబు పార్టీ శ్రేణులకు చెప్పారు.  పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ జయంతిని పురస్కరించుకుని  ఏటా మే 27, 28 తేదీలలో  పార్టీ మహానాడు జరుగుతుంది. అయితే ఆ మహానాడును వాయిదా వేస్తూ చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు.  జూన్ 4న ఎన్నికల ఫలితాలు వెలువడనున్న నేపథ్యంలో  ప్రభుత్వ ఏర్పాటు, ఎన్నికల ఫలితాలకు ముందు  ఓట్ల లెక్కింపు ముందు చేప్టటాల్సిన కార్యక్రమాలు, ఫలితాల అనంతరం ప్రభుత్వ ఏర్పాటుపై దృష్టి సారించాల్సి ఉన్న నేపథ్యంలో మహానాడును వాయిదా వేయాలని తెలుగుదేశం అధినేత చంద్రబాబు నిర్ణయించారు.   ఈ విషయాన్ని చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ ద్వారా ప్రకటించారు. అయితే  ఎన్టీఆర్ జయంతి సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామాలలో ఎన్టీఆర్ కు నివాళులర్పించడం, పార్టీ జెండా ఆవిష్కరించడం, రక్తదాన శిబిరాలు నిర్వహించాలని ఆదేశించారు.   ఇక మహానాడు ఎప్పుడు నిర్వహించాలన్నది ఎన్నికల ఫలితాలు వెలువడిన తరువాత ప్రకటించనున్నట్లు తెలిపారు.   
ఎపిలో సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో అక్కడ లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్ మామూలుగా లేదు. ఈ సారి పిఠాపురం లోకసభ స్థానం నుంచి పోటీ  చేస్తున్న పవన్ కళ్యాణ్ టార్గెట్ గా దాడులు జరుగుతున్నాయి. ఆయన సెక్యురిటీ గార్డ్ ఇంటిపై దాడి జరగడం చర్చనీయాంశమైంది.  హైదరాబాద్ మీర్‌పేట్‌లోని లెనిన్ నగర్‌లో జ‌న‌సేనాని పవన్ కల్యాణ్ పర్సనల్ సెక్యూరిటీ వెంకట్ ఇంటిపై కొంద‌రు దాడికి పాల్ప‌డ్డారు. ఇంటిపైన రాళ్లు, రాడ్లు, కత్తులతో దాడి చేసి సీసీ కెమెరాలను ధ్వంసం చేశారు. పాత కక్షలతోనే రాజు అనే వ్యక్తి వెంకట్ ఇంటి ముందు ఉన్న ద్విచ‌క్ర‌వాహ‌నానికి నిప్పుపెట్టి ఇంటిపై రాళ్లతో దాడి చేసిన‌ట్లు స‌మాచారం. బైక్‌ను ధ్వంసం చేసి వెంక‌ట్‌పై కూడా దాడి చేయడానికి ప్రయత్నించ‌డంతో స్థానికులు అడ్డుకున్నారు.  వెంకట్ తన భార్య సరిత, ఇద్ద‌రు పిల్ల‌ల‌తో కలసి ఐదేళ్లుగా లెనిన్ నగర్‌లోనే నివాసం ఉంటున్నాడు. ఈ క్ర‌మంలో ఇంటి ఎదురుగా ఉండే రాజు వారి బంధువులు పాత గొడవల నేపథ్యంలో ఈ నెల 15న‌ రాత్రి ఘ‌ర్ష‌ణ‌కు దిగారు. ఇంటి ప‌క్క‌న‌ ఉండే అబ్బాయి వెంకట్ కూతురు పట్ల అసభ్యకరంగా ప్రవర్తించాడు. దీంతో వెంకట్ భార్య సరిత అబ్బాయిని కొట్టడంతో వివాదం మొదలైంది.   మే 15న వెంకట్ ఇంటిపై కర్రలు, ఇటుకలు, ఇనుప రాడ్లతో దాడి చేసి ఇంట్లో ఉన్న సీసీ కెమెరాలు ధ్వంసం చేశారు. వెంకట్ కుటుంబ సభ్యులపై దాడికి పాల్ప‌పడ్డారు. దీంతో వెంక‌ట్ త‌న కుటుంబ స‌భ్యుల‌తో క‌లిసి మీర్‌పేట్ పోలీసుల‌కు ఫిర్యాదు చేశాడు. ఈ వివాదంపై కేసు నమోదు చేసుకొని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
తెనాలి ప్రస్తుత ఎమ్మెల్యే, ఘోర పరాజయం పాలవబోతున్న వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అన్నాబత్తుని శివకుమార్ కేవలం ఫైట్ మాస్టరే అని ఇప్పటి వరకూ అనుకుంటూ వచ్చాం కదా.. ఆయన కేవలం ఫైట్ మాస్టర్ మాత్రమే కాదు.. కథ, స్క్రీన్ ప్లే, మాటల రచయితగా కూడా మంచి టాలెండెడ్ అని ఇప్పుడు స్పష్టంగా అర్థమవుతోంది.  గొట్టిముక్కల సుధాకర్ అనే తెనాలి ఓటర్ కొట్టిన గాఠ్ఠి చెంపదెబ్బ నుంచి కాస్త కోలుకున్న అన్నాబత్తుని శివకుమార్ ఇప్పుడు కొత్త స్క్రీన్ ప్లేతో జనం ముందుకు వచ్చారు. వాస్తవానికి పోలింగ్ రోజు జరిగిందేమిటంటే, తెనాలి ఐతానగర్లో వున్న పోలింగ్ స్టేషన్‌కి ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ తన భార్యతో కలసి ఓటు వేయడానికి వచ్చారు. డైరెక్ట్.గా పోలింగ్ బూత్ దగ్గరకి వెళ్ళబోయారు.  అప్పటికే క్యూలో నిరీక్షిస్తున్న గొట్టిముక్కల సుధాకర్ మీరెలా డైరెక్ట్.గా  బూత్ దగ్గరకి వెళ్తారు. మీరు కూడా క్యూలో రావాలి అన్నారు. అంతే, శివకుమార్ శివాలెత్తిపోయారు. గొట్టిముక్కల సుధాకర్ దగరకి వెళ్ళి ఆయన చెంప మీద కొట్టారు. దాంతో గొట్టిముక్కల సుధాకర్ వెంటనే రియాక్ట్ అయ్యారు. శివకుమార్ కొట్టినదానికంటే డబుల్ కోటాలో రివర్స్ గిఫ్ట్.గా చెంప ఛెళ్ళుమనిపించారు. దాంతో శివకుమార్ అనుచరులు సుధాకర్ మీదపడి చావగొట్టారు. ఆ తర్వాత పోలీసులు సుధాకర్ మీద కేసు పెట్టారు. ఎన్నికల కమిషన్ జోక్యంతో శివకుమార్‌ని హౌస్ అరెస్టు చేశారు. సుధాకర్‌ని శివకుమార్ చెంపదెబ్బ కొట్టిన సంగతేమోగానీ, శివకుమార్‌ని సుధాకర్ లాగిపెట్టి కొట్టడం హైలైట్ అయింది. ఓటర్ని కొట్టినందుకు శివకుమార్‌కి తిక్క కుదిరిందన్న అభిప్రాయం అంతటా వ్యాపించింది. పోలింగ్ ప్రారంభమైన కొద్దిసేపటికే ఈ ఘటన జరిగింది. ఆ తర్వాత ఈ వార్త దావానలంలా వ్యాపించి, ఓటింగ్ మీద తీవ్ర ప్రభావం చూపించింది. అసలే ఓటమి బాటలో వున్న శివకుమార్ ఈ ఘటన పుణ్యమా అని ఓటమి కన్ఫమ్ చేసుకున్నారు. ఓటర్ని కొట్టి, ఓటర్ చేత కొట్టించుకున్న ఘటనలో పరువు పూర్తిగా పోగొట్టుకున్న శివకుమార్ ఇప్పుడు సరికొత్త స్క్రీన్ ప్లేతో రిపేరింగ్ వర్క్ మొదలుపెట్టారు. ‘‘నేను, నా భార్య ఓటు వేయడానికి వెళ్ళాం. అక్కడ గొట్టిముక్కల సుధాకర్ అనే వ్యక్తి నన్ను దూషించడం మొదలుపెట్టాడు. ఎమ్మెల్యేగా మాల, మాదిగ సామాజిక వర్గాలకు కొమ్ముకాస్తున్నావంటూ నన్ను దుర్భాషలాడాడు. వైసీపీపై ద్వేషంతో రగిలిపోయాడు. నా భార్య ముందే నన్ను తిట్టాడు. నేను పోలింగ్ బూత్‌లోకి వెళ్ళేటప్పుడు, వచ్చేటప్పుడు తిడుతూనే వున్నాడు. తాను కూడా నా సామాజిక వర్గం వాడే అయినప్పటికీ, నువ్వు మన సామాజిక వర్గం వాడినేనా అని తిట్టాడు. పోలింగ్ బూత్ దగ్గర మద్యం మత్తులో అతను చాలామందితో దురుసుగా ప్రవర్తించాడు. ఇదంతా అక్కడున్న ఓటర్లే చెప్పారు’’ అని కొత్త స్టోరీ అల్లి చెబుతున్నారు. తన అహంకారంతో జరిగిన సంఘటన మధ్యలోకి శివకుమార్ కులాలని కూడా లాక్కొచ్చారు. తన భార్యని కూడా ఇన్వాల్వ్ చేశారు. మిస్టర్ శివకుమార్.. ఓటర్ని కొట్టి నువ్వు చేసింది పెద్ద తప్పు. ఇప్పుడు దాన్ని కవర్ చేసుకోవడం కోసం కొత్త స్క్రీన్ ప్లే క్రియేట్ చేయడం, కులాలని, మీ భార్యని ఈ ఇష్యూలోకి లాగడం ఇంకా పెద్ద తప్పు. అర్థమవుతోందా?
సాధారణంగా ఓట్ల పండుగ పట్ల అర్బన్ ఓటర్లు పెద్దగా ఆసక్తి చూపరు. ఇన్నేళ్లుగా మనం చూస్తున్న ట్రెండ్ అదే. అయితే అనూహ్యంగా ఆంధ్రప్రదేశ్ లో ఈ సారి అర్బన్ ఓటింగ్ భారీగా పెరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా 81.80 శాతం పోలింగ్ నమోదైంది. అంటే గత ఎన్నికలతో పోలిస్తే ఇది రెండు శాతం అధికం. ఇక అర్బన్ ఓటింగ్ లో   పెరుగుదల  విస్మయం గొలిపే విధంగా ఉంది. విశాఖ వెస్ట్ నియోజకవర్గంలో అర్బన్ ఓటింగ్  అత్యధికంగా అత్యధికంగా 11.59శాతం పెరిగింది. అలాగే  విజయవాడ సెంట్రల్ లో 7.18శాతం, నెల్లూరు సిటీలో 6.3శాతం, కాకినాడ సిటీలో 5.78శాతం, విజయవాడ ఈస్ట్ లో 5.21శాతం ఇక గాజువాకలో 4.5శాతం చొప్పున ఓటింగ్ అధికంగా నమోదైంది. మొత్తం మీద రాష్ట్రంలో 35 అర్బన్ నియోజకవర్గాలు ఉంటే వాటిలో పాతికపైన నియోజకవర్గాలలో ఓటింగ్ శాతం పెరిగింది. అర్బన్ ఓట్లలో పెరుగుదల విషయంలో ఆంధ్రప్రదేశ్ ఈ సారి ఒక కొత్త రికార్డు నమోదు చేసిందని చెప్పవచ్చు. ఇక ఓవరాల్ పోలింగ్ విషయంలో కూడా సార్వత్రిక ఎన్నికలలో భాగంగా ఇప్పటి వరకూ జరిగిన నాలుగు దశలలో దేశం మొత్తంలోనే ఓటింగ్ శాతంలో ఏపీ నంబర్ వన్ గా నిలిచింది. అదొకటి అలా ఉంచితే అనూహ్యంగా అర్బన్ ఓటింగ్ పెరగడం పరిశీలకులనే విస్మయపరిచింది.  జగన్ సర్కార్ పై తీవ్ర ప్రజా వ్యతిరేకత కారణంగా ఓటింగ్ శాతం భారీగా పెరిగే అవకాశాలున్నాయని ముందునుంచీ అందరూ ఊహించిందే అయినా అర్బన్ ఓటింగ్ పెరుగుదల మాత్రం ఎవరి ఊహలకూ అందలేదనే చెప్పాలి.  ఎందుకంటే అర్భన్ ఓటర్లలో అత్యధికులు ఉద్యోగులు, వ్యాపారులు ఉంటారు. వారు సాధారణంగా పోలింగ్ బూత్ లకు వచ్చి క్యూలైన్ లో నిలుచుని ఓటు వేయడానికి పెద్దగా ఉత్సాహం చూపరు. కానీ ఈ సారి మాత్రం పొద్దుటే పోలింగ్ బూత్ లకు తరలివచ్చి గంటల తరబడి క్యూలైన్ లో తమ వంతు వచ్చే వరకూ ఓపికగా వెయిట్ చేసి మరీ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఇది ఎలా జరిగింది? ఎందుకు జరిగింది? అన్న ప్రశ్నకు పట్టణ ప్రజలలో జగన్ ప్రభుత్వ విధానాలపై తీవ్ర ఆగ్రహం, వ్యతిరేకత వ్యక్తం కావడం వల్లనేనని పరిశీలకులు బదులిస్తున్నారు. అర్బన్ ఓటర్లలో అత్యధికులు వ్యాపారాలు చేసుకునే వారు, ఉద్యోగులు, యువత ఉంటారు. వీళ్లందరిలో వైసీపీ ప్రభుత్వం పట్ల తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. ధరల పెరుగుదల, నిరుద్యోగం, విద్యుత్, పెట్రోల్ చార్జీల పెరుగుదల, అలవిమాలిన పన్నులు ఇవన్నీ పట్ణణ ప్రాంత ప్రజలలో ప్రభుత్వ వ్యతిరేకతను ప్రోది చేశారు. దీంతో వారు ఎలాగైనా జగన్ ను ఓడించాలన్న కంకణం కట్టుకున్నారు. దీంతో గతానికి భిన్నంగా వారు పట్టుదలగా బయటకు వచ్చి తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు.  సాధారణంగా ఓటింగ్ శాతంలో పెరుగుదల  ప్రజలలో తీవ్రంగా ఉన్న ప్రజా వ్యతిరేకతను సూచిస్తుంది. ఏపీలో కూడా అదే జరిగింది.  
ALSO ON TELUGUONE N E W S
అతిలోక సుందరి శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్  ఇప్పుడిప్పుడే పాన్ ఇండియా లెవల్లో బిజీ ఆర్టిస్ట్ గా మారుతుంది. దీంతో శ్రీదేవి అభిమానుల ఆనందం మాములుగా లేదు. తన తల్లి లాగా ఇండియన్ నెంబర్ వన్ హీరోయిన్ అవ్వాలని కోరుకుంటున్నారు. ఇలాంటి సమయంలో జాన్వీ  ఒక మూవీ  నుంచి తప్పుకోవాలని అనుకుందనే వార్త చూసి  అభిమానులు ఒక్కసారిగా ఉలిక్కిపాటుకు గురయ్యారు. అసలు విషయం ఏంటో చూద్దాం  జాన్వీ అప్ కమింగ్ మూవీ మిస్టర్‌ అండ్‌ మిసెస్‌ మహి. ప్రముఖ హీరో  రాజ్ కుమార్ రావు తో  కలిసి స్క్రీన్ షేర్ చేసుకుంది. మే 31 న వరల్డ్ వైడ్ గా విడుదల కానున్న ఈ మూవీలో  జాన్వీ ప్రొఫిషనల్  క్రికెటర్ గా   మెరవబోతుంది. క్యారక్టర్ పర్ఫెక్షన్ కోసం రెండు  సంవత్సరాల నుంచి క్రికెట్ లో  శిక్షణ తీసుకుంటుంది. పైగా తనని  పూర్తి స్థాయి  క్రికెటర్‌గా మార్చడానికి కోచ్ లు కూడా చాలా కష్టపడ్డారు. ఇక షూటింగ్  టైం లో అయితే చెప్పక్కర్లేదు. జాన్వీ కి ఎన్నో సార్లు  గాయాలయ్యాయి. ఒక దశలో తన  రెండు భుజాలు  పని చెయ్యలేదు. ఆ సమయంలో  ఎన్నోసార్లు  సినిమా నుంచి వైదొలగాలని అనుకుంది. కానీ  చిత్ర యూనిట్ ఆమెకి  ధైర్యం చెప్పి ముందుకు నడిపించారు. ఈ విషయాలన్నీ  జాన్వీ కపూర్ నే  చెప్పింది. ప్రస్తుతం ఆ  మాటలు వైరల్ గా మారాయి  చాలా మంది  జాన్వికి సినిమా పట్ల ఉన్న కమిట్మెంట్ ని పొగుడుతున్నారు. ప్రస్తుతం  తెలుగులో ఎన్టీఆర్ సరసన దేవర లో చేస్తుంది.అక్టోబర్ లో ఆ మూవీ విడుదల కానుంది. అలాగే రామ్ చరణ్ అండ్ బుచ్చిబాబు మూవీ లోను హీరోయిన్ గా చేస్తుంది. ఏది ఏమైనా ఒక్కటి మాత్రం నిజం. రాబోయే రోజులన్నీ జాన్వీ వే   
రాజ్ తరుణ్ హీరోగా నటిస్తున్న నూతన చిత్రం 'పురుషోత్తముడు'. ఈ చిత్రాన్ని శ్రీ శ్రీదేవి ప్రొడక్షన్స్ బ్యానర్ పై డా.రమేష్ తేజావత్, ప్రకాష్ తేజావత్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రంతో హాసిని సుధీర్ హీరోయిన్ గా పరిచయమవుతున్నారు. ఆకతాయి, హమ్ తుమ్ చిత్రాలతో ఆకట్టుకున్న రామ్ భీమన ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ప్రకాష్ రాజ్, మురళి శర్మ, రమ్య కృష్ణ, బ్రహ్మానందం, ముకేష్ ఖన్నా వంటి స్టార్ కాస్టింగ్ తో రూపొందిన ఈ సినిమా త్వరలో థియేట్రికల్ రిలీజ్ కు రాబోతోంది. తాజాగా ఈ చిత్ర టీజర్ ను హైదరాబాద్ లో రిలీజ్ చేశారు.  ఈ కార్యక్రమంలో హీరో రాజ్ తరుణ్ మాట్లాడుతూ.. "మా మూవీ టీజర్ రిలీజ్ కార్యక్రమానికి వచ్చిన మీడియా, గెస్టులకు థ్యాంక్స్. పురుషోత్తముడు మూవీ గురించి మాట్లాడాలంటే ముందు మా ప్రొడ్యూసర్ రమేష్ గారి గురించి చెప్పాలి. ఆయన సినిమాకు కావాల్సినంత ఖర్చు పెట్టి మూవీ బాగా వచ్చేలా చూసుకున్నారు. మా డైరెక్టర్ రామ్ భీమనతో నాకు మంచి అండర్ స్టాండింగ్ ఉంది. మేమిద్దరు ఒక్క చూపుతో సీన్ ఎలా ఉండాలో కన్వే చేసుకునేవాళ్లం. మా కాంబినేషన్ చూపులు కలిసిన శుభవేళ అనుకోవచ్చు. ఆయన రేపు పెద్ద డైరెక్టర్ అయ్యాక కూడా నాతో సినిమాలు చేయాలని కోరుకుంటున్నా. మా టీమ్ అందరికీ థ్యాంక్స్. అందరూ బాగా వర్క్ చేశారు. జూన్ 6న పురుషోత్తముడు రిలీజ్ చేయాలని అనుకుంటున్నాం. సెన్సార్ ఫార్మాలిటీస్ పూర్తయ్యాక డేట్ అనౌన్స్ చేస్తాం. మా మూవీని థియేటర్స్ లో చూసి ఎంకరేజ్ చేయండి." అన్నారు. దర్శకుడు రామ్ భీమన మాట్లాడుతూ.. "ఒక సినిమా అనేక ఇబ్బందులు దాటుకుని రిలీజ్ వరకు రావడం సంతోషకరమైన విషయం. మా మూవీ టీజర్ లాంఛ్ చేసుకోవడం సంతోషంగా ఉంది. కరోనా లాంటి పాండమిక్ మాలాంటి అప్ కమింగ్ రైటర్స్, డైరెక్టర్స్ ను చాలా ఇబ్బందిపెట్టింది. రెండు సినిమాలు చేసి మూడో సినిమా పెద్ద కాన్వాస్ లో డిజైన్ చేసుకున్నప్పుడు పాండమిక్ వచ్చి మొత్తం మార్చేసింది. అలాంటి టైమ్ లో కాగల కార్యం గంధర్వులు తీర్చినట్లు..ఇద్దరు గంధర్వుల్లాంటి ప్రొడ్యూసర్స్ రమేష్ గారు, ప్రకాష్ గారు వచ్చారు. నాకు వాళ్లు ఇంద్రుడు, చంద్రుడు. నిర్మాతలకు నాలుగు కథలు చెబితే మంచి టేస్ట్ తో ఈ స్టోరీ సెలెక్ట్ చేసుకున్నారు. వాళ్లు సినిమాకు ఇచ్చిన సపోర్ట్ మర్చిపోలేను. బడ్జెట్ గురించి ఆలోచించలేదు. అడిగిన పెద్ద ఆర్టిస్టులను ఇచ్చారు. గోపీసుందర్, పీజీ విందా, మార్తాండ్ కె వెంకటేష్ ఇలా..ఒక్కొక్కరు మా టీమ్ కు యాడ్ అవుతుంటే చాలా హ్యాపీగా అనిపించింది. రాజ్ తరుణ్ తో పనిచేసి ఆయనకు ఫ్యాన్ అయ్యా. మీరు తప్పుగా అర్థం చేసుకుంటారు గానీ హీరోయిన్ తో రాజ్ తరుణ్ కెమిస్ట్రీ కంటే సెట్ లో రాజ్ తరణ్ తో నా కెమిస్ట్రీ ఎక్కువగా ఉండేది. రాజ్ తరుణ్ గారిని కొత్తగా తెరపై ప్రెజెంట్ చేసే చిత్రమిది. మీకు ప్రామిస్ చేస్తున్నా పురుషోత్తముడుతో ఒక ఐ ఫీస్ట్ లాంటి సినిమాను చూడబోతున్నారు." అన్నారు. నిర్మాత డా.రమేష్ తేజావత్ మాట్లాడుతూ.. "సినిమా నిర్మించాలని 30 ఏళ్ల కిందట అనుకున్నాను. పురుషోత్తముడు సినిమా కథను దర్శకుడు రామ్ భీమన గారు చెప్పగానే వెంటనే నచ్చి ప్రొడక్షన్ స్టార్ట్ చేశాం. తెరపై నా పేరు ఉంది గానీ నా సోదరుడు ప్రకాష్, నా సతీమణి, పిల్లలు అంతా ప్రొడక్షన్ చూసుకున్నారు. పెద్ద ఆర్టిస్టులను మాట్లాడటం దగ్గర నుంచి అన్నీ పనులు వాళ్లే చేశారు. మా సినిమా వరకు పురుషోత్తముడు అంటే మా డైరెక్టర్ రామ్ భీమన. ఆయన ఈ సినిమానే జీవితంగా గడిపారు. యాక్సిడెంట్ జరిగినా షూటింగ్ కు వచ్చి అంతా చూసుకున్నారు. మా హీరోయిన్ ఫస్ట్ సినిమాకే ఇంత  డెడికేషన్ చూపించడం ఆశ్చర్యం వేసింది. ఆమెకు 102 డిగ్రీస్ జ్వరం ఉన్నా షూటింగ్ చేసింది. రాజ్ తరుణ్ గారు బాగా సపోర్ట్ చేశారు. ఒక మంచి మూవీ చేశామని బిలీవ్ చేస్తున్నాం. థియేటర్స్ లో మీ ఆదరణ దక్కుతుందని ఆశిస్తున్నాం. త్వరలో రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తాం." అన్నారు. నిర్మాత ప్రకాష్ తేజావత్ మాట్లాడుతూ.. "పురుషోత్తముడు సినిమా టీజర్ మీకు నచ్చిందనే ఆశిస్తున్నాను. త్వరలో ట్రైలర్ ను కూడా రిలీజ్ చేయబోతున్నాం.  మీ అందరి సపోర్ట్ మా చిత్రానికి ఉంటుందని కోరుకుంటున్నా. థియేటర్స్ లో కలుద్దాం." అన్నారు. హీరోయిన్ హాసినీ సుధీర్ మాట్లాడుతూ.. "ఈ మూవీలో నటించే అవకాశం ఇచ్చిన డైరెక్టర్ రామ్ భీమన గారికి థ్యాంక్స్. రాజ్ తరుణ్ షూటింగ్ టైమ్ లో బాగా సపోర్ట్ చేశారు. తెలుగు డైలాగ్స్ చెప్పడంలో హెల్ప్ చేశారు. మంచి ఎంటర్ టైనింగ్ మూవీ ఇది. తప్పకుండా థియేటర్స్ లో చూడండి." అన్నారు. యాక్టర్ రచ్చ రవి మాట్లాడుతూ.. "మంచి కథా కథనాలతో, ప్యాడింగ్ ఆర్టిస్టులతో పురుషోత్తముడు సినిమా మీ ముందుకు రాబోతోంది. మా ప్రొడ్యూసర్స్ చాలా మంచి వాళ్లు. వాళ్లకు సంచుల నిండా డబ్బులు ఈ సినిమాతో మిగలాలని కోరుకుంటున్నా. రాముడు, భీముడు కలిస్తే ఎలా ఉంటాడో అలాగే మా డైరెక్టర్ రామ్ భీమన ఉంటారు. సెట్ లో ఎవరినీ కష్టపెట్టకుండా వర్క్ చేయించుకున్నారు. చాక్లెట్ బాయ్ రాజ్ తరుణ్ కు పురుషోత్తముడు మంచి విజయాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నా." అన్నారు. నటుడు ఆకెళ్ల గోపాలకృష్ణ మాట్లాడుతూ.. "పురుషోత్తముడు మంచి విందు భోజనం లాంటి సినిమా. ప్రకాష్ రాజ్, రమ్యకృష్ణ, మురళీ శర్మ, బ్రహ్మానందం లాంటి పెద్ద నటీనటులతో మాలాంటి వాళ్లు కలిసి నటించే అవకాశం ఈ సినిమా కల్పించింది. మనసున్న నిర్మాతలు ఈ చిత్రాన్ని నిర్మించారు. వారికి, హీరో రాజ్ తరుణ్ కు పురుషోత్తముడు బిగ్ సక్సెస్ ఇవ్వాలి." అన్నారు. లిరిసిస్ట్ బాలాజీ మాట్లాడుతూ.. "ఈ సినిమాలో పాటలు రాసే అవకాశం ఇచ్చిన మా డైరెక్టర్ రామ్ భీమన గారికి థ్యాంక్స్. సినిమా షూటింగ్ టైమ్ లో ఆయనకు యాక్సిడెంట్ జరిగింది. అయినా పట్టుదలతో ఈ సినిమాను పూర్తి చేశారు. అందరికీ నచ్చేలా సినిమాను రూపొందించారు. రాజ్ తరుణ్ గారు ఈ కథలోని ఎమోషన్స్ ను వెయ్యింతలు తీసుకెళ్లారని రామ్ భీమన గారు చెబుతుండేవారు. టీమ్ అందరికీ ఈ మూవీ పెద్ద సక్సెస్ ఇవ్వాలని కోరుకుంటున్నా." అన్నారు. డైరెక్టర్ వీరశంకర్ మాట్లాడుతూ.. "రామ్ భీమనతో మాట్లాడితే పెద్ద విద్యావేత్తలా అనిపిస్తాడు. పురుషోత్తముడు టీజర్ చూస్తే రామ్ భీమన బీ, సీ సెంటర్స్ ఆడియెన్స్ కు కూడా రీచ్ అయ్యేలా ఈ సినిమాను రూపొందించాడని తెలుస్తోంది. రాజ్ తరుణ్, రామ్ భీమన ఇద్దరి కెరీర్ లకు ఈ సినిమా నెక్ట్ స్టెప్ లాంటి సక్సెస్ ఇవ్వాలని కోరుకుంటున్నా." అన్నారు. యాక్టర్ రాజా రవీంద్ర మాట్లాడుతూ.. "డైరెక్టర్ రామ్ భీమన గారు నాకు ఈ కథ చెప్పినప్పుడు ఇంప్రెస్ అయ్యాను. షూటింగ్ చేస్తున్నప్పుడు కూడా డైరెక్టర్ చాలా కూల్ గా ఉండేవారు. మార్నింగ్ ఎలా ఉండేవారో సాయంత్రం వరకు అదే ఎనర్జీతో వర్క్ చేశారు. చాలా పెద్ద ప్యాడింగ్ ఈ మూవీలో ఉంది. సినిమా తప్పకుండా ప్రేక్షకుల ఆదరణ పొందుతుంది." అన్నారు. రాజ్ తరుణ్, హాసినీ సుధీర్, ప్రకాష్ రాజ్, మురళి శర్మ, రమ్య కృష్ణ, బ్రహ్మానందం, విరాన్ ముత్తంశెట్టి, ముకేష్ ఖన్నా, ప్రవీణ్, బ్రహ్మాజీ, రాజా రవీంద్ర, సత్య తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి గోపీ సుందర్ సంగీతం అందిస్తుండగా.. సినిమాటోగ్రాఫర్ గా పీజీ విందా, ఎడిటర్ గా మార్తాండ్ కె వెంకటేష్ వ్యవహరిస్తున్నారు.
పవన్ కళ్యాణ్ మాజీ వైఫ్ రేణు దేశాయ్ కి అర్జెంటుగా మూడువేల ఐదు వందల రూపాయిలు కావాలి. ఆ పేరుతో ఎవరైనా అడుగుతున్నారేమో అని అనుకోవద్దు. నిజంగానే తనకే  ఆ డబ్బులు కావాలి. పైగా అడిగింది  నేనే అంటూ ఒక వీడియో కూడా రిలీజ్ చేసింది. అసలు ఆ మ్యాటర్  ఏంటో పూర్తిగా చూద్దాం  కొన్ని రోజుల క్రితం మూడు వేల ఐదు వందలు రూపాయిలు కావాలని  కోరుతూ రేణు దేశాయ్ ఇన్‌స్టా ఖాతాలో ఓ మెసేజ్ పోస్టు అయ్యింది. క్యూఆర్ కోడ్ కూడా షేర్ అయ్యింది.దీంతో ఆమె అభిమానులు అయితే ఏమి పవన్ అభిమానులు అయితే ఏమి   అమౌంట్ ని  ట్రాన్స్‌ఫర్ చేశారు. కొంత మంది అభిమానులు మాత్రం రేణు దేశాయ్ అకౌంట్ హ్యాక్ అయ్యి ఉండచ్చనే   అనుమానాలు వ్యక్తం చేశారు. ఆ అనుమానాలన్నింటిని పటా పంచలు చేస్తు రేణూ దేశాయ్ ఒక వీడియో  చేసింది. అమౌంట్ అడిగిన మాట నిజం. పిల్లలు,పెంపుడు జంతువులు, గోవుల కి సంబంధిచిన  దాతృత్వ కార్యక్రమాల గురించి డబ్బు అడిగినట్టు చెప్పింది. పైగా వాటి గురించి పూర్తి వివరణ కూడా ఇచ్చింది. నేను రెగ్యులర్‌గా కొంత మొత్తాన్ని డొనేట్ చేస్తుంటాను.  నా సంపాదనలో కొంత భాగాన్ని అందుకు  కేటాయించాను. అయితే, అప్పుడప్పుడూ కాస్త ఎక్కువ మనీ  అవసరం ఏర్పడుతుంది. కాకపోతే నాకున్న  లిమిట్స్ వలన మనీ ఎగ్జస్మెంట్  అవ్వడం లేదు. నాకు ఇద్దరు పిల్లలు ఉన్నారు కదా. అందువల్ల నా వరకు సాయం చేశాక ఇంకా బ్యాలెన్స్ కావాలంటే ఫాలోవర్స్‌ను అడుగుతున్నానని చెప్పకొచ్చింది. నిజానికి  ఇన్ స్టాలో  పోస్టు పెట్టిన రోజునే వీడియో సందేశం ఇద్దామని అనుకున్నాను. కానీ ఫుడ్ పాయిజన్ కారణంగా  ఆరోగ్యం బాగోలేకపోవటంతో  చెయ్యలేకపోయాను. గోవుల షెడ్ నిర్మిస్తున్నానని  ఏడాదిన్నర లోగా  నిర్మాణం పూర్తవుతుందని తెలిపింది. అలాగే తనకి అమౌంట్  పంపించిన వాళ్లందరికీ  ధన్యవాదాలు కూడా తెలిపింది  
జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) పుట్టినరోజు సందర్భంగా మే 20న 'దేవర' (Devara) మొదటి సాంగ్ విడుదల కానుందని కొద్దిరోజులుగా వార్తలొస్తున్నాయి. అయితే ఒకరోజు ముందుగానే అంటే మే 19నే ఫస్ట్ సాంగ్ ని విడుదల చేయనున్నట్లు ప్రకటించి సర్ ప్రైజ్ చేసింది దేవర టీం. దీంతో ప్రస్తుతం సోషల్ మీడియా షేక్ అయిపోతుంది. ఇలాంటి సమయంలో నిర్మాత నాగవంశీ చేసిన కామెంట్స్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి మరింత కిక్ ఇస్తున్నాయి. ఎన్టీఆర్ కి, నాగవంశీకి మధ్య మంచి అనుబంధముంది. 'టిల్లు స్క్వేర్' సక్సెస్ మీట్ కి ఇన్వైట్ చేయడం కోసం.. సిద్ధు జొన్నలగడ్డ, విశ్వక్ సేన్ తో కలిసి ఎన్టీఆర్ నివాసానికి వంశీ వెళ్లిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో ఎన్టీఆర్ 'దేవర' సాంగ్స్ వినిపించినట్లు చెప్పి.. ఆ ముగ్గురూ తమ ఆనందాన్ని పంచుకున్నారు. అయితే ఇప్పుడు దేవర ఫస్ట్ సింగిల్ అనౌన్స్ మెంట్ వచ్చిన సందర్భంగా.. నాగవంశీ మరోసారి సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్స్ కి కిక్కిచ్చే కామెంట్స్ చేశాడు. "దేవర నుంచి విడుదలవుతున్న ఫియర్ సాంగ్.. మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ అన్న ఫ్యాన్స్ కి పర్ఫెక్ట్ యాంతం" అని నాగవంశీ అన్నాడు. "మీ అందరి కంటే ముందు నేను పాట విన్నాను.. ట్రస్ట్ మీ.. హుకుం(జైలర్ సాంగ్) మర్చిపోతారు.. ఇది అనిరుధ్ నెక్స్ట్ లెవెల్ మాస్ సాంగ్." అని చెప్పుకొచ్చాడు. అంతేకాదు "దేవర ముంగిట నువ్వెంత" అనే లైన్ ని కూడా జోడించాడు.  అసలే ఎన్టీఆర్-అనిరుధ్ కాంబినేషన్ అంటేనే అంచనాలు భారీగా ఉన్నాయి. ఇక ఇప్పుడు నాగవంశీ చేసిన కామెంట్స్ తో అంచనాలు మరోస్థాయికి వెళ్లాయి.  మే 19న 'దేవర' నుంచి ఫియర్ సాంగ్ విడుదల కానుంది. మే 18న ప్రోమో విడుదలయ్యే అవకాశముంది.  
Talented hero Varun Sandesh is coming up with a unique thriller ‘Nindha’ which had its first look unveiled a few days ago to a good response. The movie directed and produced by Rajesh Jagannadham under the banner of The Fervent Indie Productions, unfolds Kandrakota Mystery. Today, the makers of the movie unveiled its teaser. Dada Saheb Phalke Award Winner Naveen Chandra did the honours of launching the teaser. After launching the teaser, he wished the team all the luck. https://youtu.be/rkWBtUwmxjs?si=E5vD-6M6b8QVTw_x The teaser opens with Thanikella Bharani uttering a thought-provoking dialogue: “Jeevithamlo Konni Sarlu Thappani Thelisinaa Cheyyaka Thappadu… (Sometimes in life you have to do something even if you know it's wrong…)” The clip then introduces Varun Sandesh in a gloomy avatar. He is undergoing a traumatic situation due to some happenings in life. The video also introduces other characters. The narrative becomes much more interesting and we get to witness a thrilling ride through twists of truth and deceit. The teaser doesn’t disclose the storyline, yet it makes a great impression. Rajesh Jagannadham cut the teaser fascinatingly, whereas Varun Sandesh came up with a brilliant performance. Ramiz Naveeth’s camera work is notable, while Santhu Omkar’s re-recording complements the visuals. Anil Kumar is the editor. The teaser has created inquisitiveness for the movie which is gearing up for its theatrical release.
  సిల్వర్ స్క్రీన్ మీద హీరో విలన్ కి షాక్ ఇవ్వాల్సిందే. ఇది రూల్. దీన్ని ఎవరు మార్చలేరు. హీరో చేత అదంతా చేయించేది    దర్శకుడు.కానీ ఒక  దర్శకుడు నిజ జీవితంలోనే   హీరోకి షాక్ ఇచ్చాడు. అది అలాంటి ఇలాంటి షాక్ కాదు. హీరో జీవితం మొత్తాన్ని తీసుకెళ్లి ఫేస్ బుక్ లో పెట్టాడు   పాన్ ఇండియా సినీ యుగంలో పర భాషా నటులు సైతం  సొంత భాషా నటులుగా మారారు.  అలా తెలుగు ప్రేక్షకులకి దగ్గరయిన  మలయాళ నటుడు  టోవినో థామస్(tovino thomas) రెండు వేళ పద్దెనిమిది మూవీతో పాటు నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కి వచ్చిన   మిన్నల్ మురళితో మంచి పేరుతో పాటు గుర్తింపుని పొందాడు. రెండు వేల  ఇరవై ఒకటవ సంవత్సరంలో మలయాళంలో  వజక్కు అనే మూవీలో హీరోగా చేసాడు. సనల్ కుమార్ శశిధరన్  దర్శకుడు. మూవీ  కంప్లీట్ కూడా అయ్యింది.  ఫస్ట్ కాపీ సిద్ధమై సెన్సార్ కు వెళ్లాల్సిన టైంలో  థామస్, శశిధరన్ (Sasidharan)మధ్య గొడవలు వచ్చాయి. ఆ గొడవలే సినిమాని ఫేస్ బుక్ పాలు చేసింది. థామస్ మీద కోపంతో  శశిధరన్ నే  ఫేస్ బుక్ లో షేర్ చేసాడు. విమియో అనే వీడియో అప్లోడింగ్ లో యూజర్లు ఉచితంగా చూసేలా అప్ లోడ్ చేసాడు.విషయం తెలిసి థామస్  ఒక్కసారిగా షాక్ కి గురయ్యాడు. పైగా నిర్మాత కూడా  తనే ఈ విషయం పైన థామస్ ని సంప్రదించగా  వజిక్కు  కోసం  ఇరవై ఏడు లక్షలు దాకా ఖర్చుపెట్టానని సినిమా విడుదల కాకపోవడానికి దర్శకుడే కారణమని చెప్పుకొచ్చాడు. మరో వైపు సినిమా బాగా రాలేదనే కారణంతోనే  థామస్ నే విడుదల కాకుండా  అడ్డుకున్నాడని సనల్ కుమార్ శశిధరన్ ఆరోపిస్తున్నాడు. కుని కుశృతి హీరోయిన్ గా  చేసిన ఈ చిత్రంలో సుదేవ్ నాయర్ , అజిస్ నేడుమంగడ్, బైజు నోటో, కీలక పాత్రలు పోషించారు. భార్య నుంచి విడాకులు తీసుకున్న వ్యక్తికి, భర్త నుంచి విడాకులు తీసుకున్న  మధ్య ఏర్పడిన అనుబంధం ఎటు వైపు దారి తీసిందనే పాయింట్ తో  వజక్కు  తెరకెక్కింది. వజిక్కు అంటే గొడవ  
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు 'మెగా వర్సెస్ అల్లు' వార్ కి దారితీసిన సంగతి తెలిసిందే. మెగా ఫ్యామిలీ అంతా పిఠాపురం బరిలో నిలిచిన పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) కి అండగా నిలబడితే.. అల్లు అర్జున్ (Allu Arjun) మాత్రం.. ఓ వైపు పవన్ కి మద్దతుగా ట్వీట్ చేసి, మరోవైపు నంద్యాల వెళ్లి తన స్నేహితుడు, వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డికి మద్దతు తెలిపాడు. అసలే జనసేన, వైసీపీ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది. ఇలాంటి టైంలో వైసీపీ అభ్యర్థికి అల్లు అర్జున్ సపోర్ట్ చేయడం మెగా ఫ్యాన్స్ కి ఆగ్రహం తెప్పించింది. అదే సమయంలో మెగా బ్రదర్ నాగబాబు (Nagababu) కూడా సోషల్ మీడియా వేదికగా.. "మాతో ఉంటూ ప్రత్యర్థులకి పని చేసేవాడు.. మావాడైనా పరాయివాడే." అంటూ చేసిన కామెంట్స్ బన్నీ గురించే అనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. దీంతో 'మెగా వర్సెస్ అల్లు' వార్ మరింత ముదిరింది. ఇక ఇప్పుడు నాగబాబుపై అల్లు అర్జున్ షాకింగ్ కామెంట్స్ అంటూ వచ్చిన తాజా న్యూస్ తో.. ఈ ఫైట్ మరోస్థాయికి వెళ్ళింది. నాగబాబుని టార్గెట్ చేస్తూ అల్లు అర్జున్ ట్వీట్ చేసినట్లుగా సోషల్ మీడియాలో ఒక స్క్రీన్ షాట్ చక్కర్లు కొడుతోంది. అందులో "తన తాతగారు అల్లు రామలింగయ్య లేకపోతే.. నాగబాబు అనే వ్యక్తి బాపట్ల పోస్టాఫీస్ ఎదురుగా ఉన్న సైకిల్ షాప్ లో పని చేసుకునేవాడు." అంటూ బన్నీ ట్వీట్ చేసినట్లుగా ఉంది. కానీ అల్లు అర్జున్ ట్విట్టర్ అకౌంట్ ఓపెన్ చేసి చూస్తే మాత్రం.. ఆ ట్వీట్ కనిపించడం లేదు. దీంతో బన్నీ ఆవేశంలో ట్వీట్ చేసి, ఆ తర్వాత వెంటనే డిలీట్ చేసి ఉంటాడని కొందరు అభిప్రాయపడుతున్నారు. కొందరు మెగా, అల్లు అభిమానులు ఈ విషయంపై సోషల్ మీడియా వేదికగా గొడవలు పడుతున్నారు.  అయితే నాగబాబుని టార్గెట్ చేస్తూ బన్నీ ట్వీట్ చేసినట్లుగా జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని తెలుస్తోంది. మెగా-అల్లు మధ్య దూరాన్ని పెంచడం కోసం ప్రత్యర్థులు కావాలని.. ఒక ఫేక్ ట్వీట్ ని ఎడిట్ చేసి సోషల్ మీడియాలో తిప్పుతున్నారని సమాచారం. అల్లు అభిమానులతో పాటు కొందరు మెగా ఫ్యాన్స్ సైతం ఈ ట్వీట్ ని నమ్మడంలేదు. అల్లు అర్జున్ ఒక ఫ్రెండ్ గా తెలిసీ తెలియకుండా వైసీపీ క్యాండిడేట్ కి సపోర్ట్ చేసి ఉండొచ్చు కానీ.. అతను ఇలా మెగా ఫ్యామిలీపై కామెంట్స్ చేసే రకం కాదని వారు అంటున్నారు. చిరంజీవి (Chiranjeevi) సహా మెగా ఫ్యామిలీలోని అందరిపై బన్నీకి ఎంతో గౌరవం ఉందని, అసలు అతను ఇలాంటి చీప్ కామెంట్స్ చేసే అవకాశమే లేదని చెబుతున్నారు.
Man of Masses NTR’s most awaited pan-Indian project, ‘Devara,’ directed by Koratala Siva, is being eagerly awaited by the fans. They were eagerly awaiting the film's first single, as Rockstar Anirudh Ravichander, known for viral chartbusters, is scoring the music. Delighting fans and music lovers, yesterday the makers announced first single releade date. The film's first song, titled "Fear Song," will be released on May 19th to amplify NTR's birthday celebration. Everyone is expecting a viral chartbuster from Anirudh, and the title suggests a mass number and it written by Ramajogaiah Sastry. After the announcement, the producer Naga Vamsi and also huge NTR fan, compared the Fear Song the viral chartbuster which became sensation from Jailer "Hukum." He said that people will forget Hukum song after listening to Fear Song. He also shared that he listened the song long back. Janhvi Kapoor is the heroine, while Saif Ali Khan will be seen as Bhaira in this movie. Heralded as India's most anticipated action epic in 2024, the film is set for a grand nationwide release on October 10th. Kalyan Ram presents this movie under ‘NTR Arts’ while Sudhakar Mikkilineni and Kosaraju Harikrishna are the producers. NTR Arts and Yuvasudha arts banrkolling the film. The film also stars Prakash Raj, Srikanth, Shine Tom Chacko and others in key roles. Anirudh Ravichander scoring the music.
రష్మిక (rashmika) సినీ ప్రయాణం ఇప్పుడు మంచి జోరు మీద ఉంది. వరుసగా హిట్ లు మీద హిట్ లు కొడుతు పాన్ ఇండియా హీరోయిన్ గా మారింది. చాలా తక్కువ టైం లోనే ఆ ఘనతని సాధించడంతో పాటు  సెటిల్డ్ పెర్ ఫార్మెన్స్ తో భారీ స్థాయిలో అభిమానుల్ని పొందింది. తాజాగా  సోషల్ మీడియాలో ఒక పోస్ట్ చేసింది. ఇప్పుడు అది రాజకీయ వాసనని తెస్తుంది  అటల్ సేతు(atal setu)..దేశంలోనే అతి పెద్ద మూడవ బ్రిడ్జ్. జపాన్  దేశ సహకారంతో  ముంబై లోని సముద్రం మీద దీన్ని నిర్మించారు. ఈ బ్రిడ్జ్ కి రష్మిక కి సంబంధం ఏంటనుకుంటున్నారా. రామ సేతు ని పొగుడుతు రష్మిక ట్వీట్ చేసింది.రెండు గంటల ప్రయాణాన్ని ఇరవై నిమిషాల్లో పూర్తి చేయడం అధ్బుతం. దేశంలో మౌలిక సదుపాయాలు, రహదారి ప్రణాళికలు బాగున్నాయంటూ ట్వీట్ చేసింది. ఇప్పుడు ఈ విషయం పైనే రష్మిక మీద కొంత మంది  విమర్శలు చేస్తున్నారు. పైగా ట్రోలింగ్ కూడా స్టార్ట్ చేసారు. మరో కంగనా రనౌత్ లాగా మారాలనుకుంటున్నావా,  ఒక వంతెనని చూపించి భారతదేశం ముందుకు వెళ్తుందని చెప్పడం అవివేకం. సాధారణ భారతీయుడు తన రోజు వారి జీవితాన్ని ఎలా గడుపుతున్నాడో తెలుసుకోవాలంటే లోకల్ ట్రైన్ లో ప్రయాణం చెయ్యి. తను చెప్తున్న మౌలిక సదుపాయల గురించి తెలుసుకోవాలంటే రష్మిక కారు దిగాలి. రష్మిక ఇన్ డైరెక్ట్ గా బిజెపి కి సపోర్ట్ చేస్తుంది. రాజకీయాల్లోకి  వస్తుందేమో.. ఇలా రకరకాల కామెంట్స్ చేస్తున్నారు. కొంత మంది నుంచి  సపోర్ట్ గా కూడా కామెంట్స్ వస్తున్నాయి.  అటల్ సేతు ఇరవై రెండు కిలో మీటర్ల పొడవుతో 18000 కోట్లతో నిర్మాణం అయ్యింది. సౌత్ ముంబై నుంచి నావి ముంబై కి వెళ్లాలంటే మినిమమ్ రెండు గంటల సమయం పడుతుంది.అలాంటిది  ఈ బ్రిడ్జ్ నిర్మాణం వల్ల కేవలం 20 నిమిషాల్లో ఒక వైపు నుంచి ఇంకో వైపుకి వెళ్ళవచ్చు.ప్రధానమంత్రి నరేంద్ర  మోదీ (narendra modi) జనవరిలో ప్రారంబించాడు. ఇక రష్మిక ఇటీవల యానిమల్ తో భారీ విజయాన్ని అందుకుంది. పుష్ప 2 , గర్ల్ ఫ్రెండ్,కుబేర లు షూటింగ్ దశలో ఉన్నాయి  
అప్పట్లో సుచి లీక్స్ (Suchi Leaks) ఎంతటి సంచలనం సృష్టించిందో తెలిసిందే. ఈ లీక్స్ కోలీవుడ్ ని ఓ కుదుపు కుదిపేశాయి. సింగర్ సుచిత్ర, లీక్ చేసిందంటూ.. అప్పట్లో ధనుష్, శింబు, త్రిష, హన్సిక వంటి ఎందరో సెలబ్రిటీల ప్రైవేట్ ఫొటోలు, వీడియోలు విడుదలయ్యాయి. ఆ వీడియోలు నిజమని నమ్మిన వారున్నారు. ఫేక్ అని కొట్టిపారేసిన వారు కూడా ఉన్నారు. మరోవైపు సుచిత్ర మతిస్థిమితం కోల్పోయిందని, అందుకే తనకు తెలియకుండానే నిరాధార ఆరోపణలతో, సినీ తారలను టార్గెట్ చేస్తుందని ఆమె సన్నిహితులు చెప్పుకొచ్చారు. ఏది ఏమైనా అప్పట్లో సుచి లీక్స్ దెబ్బకి.. ఎందరో కోలీవుడ్ స్టార్స్ షేక్ అయ్యారు. అయితే కొంతకాలంగా సుచిత్ర సైలెంట్ గా ఉండటంతో.. ఇప్పుడు అంతా సెట్ అయిందని భావించారంతా. కానీ ఉన్నట్టుండి తాజాగా మరోసారి సుచి లీక్స్ తెరపైకి వచ్చింది. ధనుష్ (Dhanush), ఐశ్వర్య రజినీకాంత్ (Aishwarya Rajinikanth) జంట రెండేళ్ల క్రితం విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే ఈ ఇద్దరిపై తాజాగా ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో సింగర్ సుచిత్ర షాకింగ్ కామెంట్స్ చేసింది. ధనుష్, ఐశ్వర్య ఒకరినొకరు చీట్ చేసుకున్నారని చెప్పింది. ఐశ్వర్య వేరే వారితో రిలేషన్ లో ఉందని, అలాగే ధనుష్ కి కూడా పలు ఎఫైర్లు ఉన్నాయని సుచిత్ర చెప్పుకొచ్చింది. ఇక ఇటీవల విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించిన జి.వి. ప్రకాష్, సింగర్ సైంధవిపై కూడా సంచలన వ్యాఖ్యలు చేసింది సుచిత్ర. సింగర్స్ సైంధవి, కార్తీక్ మధ్య సీక్రెట్ రిలేషన్ ఉందంటూ కామెంట్స్ చేసింది. ఇక ధనుష్, జి.వి. ప్రకాష్ గురించి ఆమె చేసిన గే కామెంట్ షాకింగ్ గా మారింది. తన మాజీ భర్త కార్తీక్ తో పాటు ధనుష్, జి.వి. ప్రకాష్ స్వలింగ సంపర్కులని బాంబు పేల్చింది. ధనుష్ కి తెల్లవారుజామున మూడు గంటల వరకు గడిపే ఫ్రెండ్స్ ఉన్నారని చెప్పుకొచ్చింది. సుచిత్ర తాజా కామెంట్స్ మరోసారి కోలీవుడ్ ని కుదిపేస్తున్నాయి. అయితే ఆమె డిప్రెషన్ లో ఉందని, మానసిక స్థితి సరిగా లేకనే ఇటువంటి కామెంట్స్ చేస్తుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు. వారితో పాటు పెద్ద సంఖ్యలో క్యాడర్ కూడా పార్టీని వీడుతున్నారు. ఇక ఇప్పుడు నామినేటెడ్ పదవులలో ఉన్న వారి వంతు మొదలైనట్లు కనిపిస్తోంది. తనకు కానీ తన భర్తకు  కానీ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు టికెట్ ఇవ్వాలంటూ గత  కొంత కాలంగా కోరుతూ వస్తున్న మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ వంతు వచ్చింది. ఆమె కూడా రాజీనామా అస్త్రం సంధించారు.  జగన్ కు నమ్మిన బంటుగా గుర్తింపు పొందిన మహిళాకమిషన్ చైర్ పర్సన్ వాసి రెడ్డి పద్మ తన పదవికి రాజీనామా చేశారు. ఉరుములేని పిడుగులా, ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా తన రాజీనామా లేఖను సీఎం జగన్ కు పంపేశారు. పేరుకు తాను పార్టీకి కాదు, కేవలం మహిళా కమిషన్ చైర్మన్ పదవికి మాత్రమే రాజీనామా చేశాననీ, ఇక నుంచి వైసీపీ కోసం పని చేస్తాననీ వాసిరెడ్డి పద్మ చెబుతున్నప్పటికీ, ఆమె రాజీనామాకు కారణం అసంతృప్తేనని పార్టీ వర్గాలు బాహాటంగానే చెబుతున్నాయి. చాలా కాలంగా వాసిరెడ్డి పద్మ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు తనకు కానీ తన భక్తకు కానీ పార్టీ టికెట్ ఇవ్వాలని జగన్ ను కోరుతూ వస్తున్నారు. అయితే ఇప్పటి వరకూ జగన్ చూద్దాం.. చేద్దాం అన్నట్లుగా దాట వేస్తూనే వచ్చారు. ఇప్పుడిక వరుసగా అభ్యర్థల జాబితాలను జగన్ ప్రకటించేస్తుండటం, తనకు గానీ తన భర్తకు కానీ పార్టీ టికెట్ విషయంలో ఎటువంటి స్పస్టత ఇవ్వకపోవడంతో ఆమె మనస్తాపం చెంది పదవికి రాజీనామా చేసేశారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.  వాసిరెడ్డి పద్మ రాజకీయ ప్రవేశం ప్రజారాజ్యం పార్టీతో జరిగింది. 2009లో ఆమె ప్రజారాజ్యం పార్టీలో చేరారు. ఇలా చేరడంతోనే ఆమె ప్రజారాజ్యం అధికార ప్రతినిథిగా పదవి దక్కించుకున్నారు. ప్రజారాజ్యం కాంగ్రెస్ పార్టీలో విలీనం కావడంతో ఆమె 2012లో జగన్ పార్టీలో చేరారు. జగన్ కూడా ఆమెకు అధికార ప్రతినిథి పదవి ఇచ్చారు.  2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆమెను రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా నియమించారు. చైర్ పర్సన్ హోదాలో ఆమె జగన్ మెప్పు పొందేందుకు చేయగలిగినంతా చేశారు. ప్రతిపక్ష పార్టీ నేతలకు నోటీసులు ఇచ్చారు. ఏకంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు సైతం నోటీసులు జారీ చేశారు. వార్డు వలంటీర్లపై పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు కమిషన్ ముందు హాజరై వివరణ ఇవ్వాలంటూ ఆమె పవన్ కు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. పవన్ హాజరు కాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు నమోదు చేయాలని ఆదేశించారు. ఇన్ని చేసినా వాసిరెడ్డి పద్మకు ఆమె కోరినట్లుగా పార్టీ టికెట్ లభించకపోవడంతో అలిగి పదవికి రాజీనామా చేశారని, ఇది జగన్ కు షాకేననీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు. ఒకరైతు తనకు చేసిన సేవలకు ప్రీతి చెందిన గురువు అతడికి స్వర్గ ప్రాప్తిని కలగజేయాలని అనుకుంటాడు. కానీ సంసారాసక్తి వల్ల ఆ రైతు ఆ అవకాశాన్ని వాయిదా వేసుకుంటూ వస్తాడు. చివరికి గురుకృప వల్ల ఆ రైతు స్వర్గ ప్రాప్తిని ఎలా పొందాడో ఈ కథ తెలియజేస్తుంది. "ఒక మహాపురుషుడు ప్రయాణం చేస్తూ, డస్సిపోయాడు. గొంతు ఎండిపోయింది. దారిలో ఒక రైతు కనపడితే నీళ్ళు అర్థించాడు. ఆ రైతు మహాత్మునికి సకల ఉపచారాలూ చేశాడు. చిరిగిపోయిన ఆయన ఉత్తరీయాన్ని రైతు జాగ్రత్తగా కుట్టి బాగుచేశాడు. రైతు పరిచర్యలకు సంతసించిన ఆ మహాత్ముడు శాంతి, ఆనందాలకు నిలయమైన స్వర్గానికి తనతోపాటు రమ్మని అంటాడు. అందుకు ఆ రైతు 'గురువుగారూ! మీరు నా మీద చూపిన దయకు కృతజ్ఞుణ్ణి. కానీ నా పిల్లలు ఇంకా చిన్నవాళ్ళు. ఓ ఏడేళ్ళ వ్యవధి ఇవ్వండి' అని అడుగుతాడు. అందుకు గురువు అంగీకరించాడు. సరిగ్గా ఏడేళ్ళ తర్వాత గురువు రైతును స్వర్గానికి తీసుకువెళ్ళడానికి వచ్చాడు. అప్పుడు రైతు 'అయ్యా! కడపటి కొడుకు కష్టాలకు అంతు లేదు. అన్ని జంఝాటాలనూ ఒక్కడే సంబాళించుకోలేకపోతున్నాడు. కాబట్టి మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని గురువుని అడిగాడు. మరో ఏడేళ్ళ తరువాత గురువు వచ్చాడు. కానీ రైతు చనిపోయాడని తెలిసింది. చనిపోయిన ఆ రైతు ఎద్దుగా పుట్టాడని ఆ గురువు తన దివ్య దృష్టితో తెలుసుకున్నాడు. ఎద్దుగా పుట్టిన ఆ రైతు తన కొడుకు పొలాన్నే దున్నుతున్నాడు. అప్పుడు గురువు ఆ ఎద్దుపై మంత్ర జలం చిలకరించగానే ఎద్దు జన్మనెత్తిన రైతు 'నా కొడుకు పరిస్థితి మరి కాస్త మెరుగు పడనీయండి స్వామీ! మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని అన్నాడు. ఇక చేసేది లేక వెనుదిరిగాడు గురువు. మరలా ఏడేళ్ళ తర్వాత వచ్చిన గురువుకు ఎద్దు చనిపోయిందని తెలిసింది. అది కుక్కగా పుట్టి కొడుకు ఇంటినీ, ఆస్తినీ కాపలా కాస్తోందని తన దివ్యదృష్టి ద్వారా తెలుసుకున్నాడు. గురువు. కుక్కగా పుట్టిన ఆ రైతు 'స్వామీ! నేను ఎంత దౌర్భాగ్యుణ్ణి. మీరు ఇంత దయ చూపుతున్నప్పటికీ మీతో స్వర్గమానం చేయలేకున్నాను. వీడికి ఆస్తిని కాపాడుకొనే దక్షత ఇంకా రాలేదు. కాబట్టి దయ చేసి మరో ఏడేళ్ళు వ్యవధి ఇవ్వండి' అని వేడుకున్నాడు. గురువు ఏడేళ్ళ తరువాత మళ్ళీ వచ్చేసరికి కుక్క మరణించింది. అది త్రాచుపాముగా జన్మనెత్తి, ఇప్పుడు కొడుకు భూమిలో ఉన్న లంకెబిందెలకు పడగెత్తి కాపలా కాస్తోంది. గుప్త ధనం ఇక్కడ ఉందని కొడుకుకి ఎలా తెలియజేయాలా అని పాము ఆలోచిస్తున్నప్పుడు గురువు ఆ రైతుకొడుకును పిలుచుకు వచ్చి లంకె బిందెలు ఉన్న చోట తవ్వమన్నాడు. లంకె బిందెలు బయటపడ్డాయి. ఆ పైన ఆ పామును చంపమన్నాడు. అనంతరం శిష్యుణ్ణి తీసుకొని స్వర్గారోహణం చేశాడు గురువు. సంసారంలోని ఈతి బాధల నుండి శిష్యుణ్ణి ఉద్ధరిస్తాడు సద్గురువు. అలాంటి గురువు అందరికీ అవసరం.                                      *నిశ్శబ్ద.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్  రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది.  80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత  ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది.   ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది. ఆమెది నెద‌ర్లాండ్స్‌. ఆమె తండ్రి నెద‌ర్లాండ్స్‌లోని ఆర్నెహెమ్‌లో చిన్న‌పిల్ల‌ల ఆస్ప‌త్రి డైరెక్ట‌ర్. పోయి దొరికిన ఆ పెయింటింగ్ విష‌యానికి వ‌స్తే.. అది 1683లో కాస్ప‌ర్ నెష‌ర్ వేసిన స్టీవెన్ ఓల్ట‌ర్స్ పెయింటింగ్‌. రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో నాజీల ఆదేశాల‌ను చార్లెట్ తండ్రి వ్య‌తిరేకించారు. ఆయ‌న ర‌హ‌స్య జీవ‌నం సాగించేడు. కానీ ఈ పెయింటింగ్‌ని మాత్రం త‌న న‌గ‌రంలోని ఒక బ్యాంక్‌లో భ‌ద్ర‌ ప‌ర‌చ‌మ‌ని ఇచ్చార‌ట‌. 1940లో నాజీలు నెద‌ర్లాండ్ పై దాడులు చేసినపుడు ఆ బ్యాంక్ మీద ప‌డి దోచుకున్నా రు. అప్పుడు ఈ పెయింటింగ్ కూడా తీసుకెళ్లారు. యుద్ధం అయిపోయిన త‌ర్వాత ఈ పెయింటింగ్ ఎక్క‌డున్న‌దీ ఎవ‌రికీ తెలియ‌లేదు. చిత్రంగా 1950ల్లో డ‌స‌ల్‌డార్ష్ ఆర్ట్ గ్యాల‌రీలో అది ప్ర‌త్య‌క్ష‌మ‌యింది. 1969లో ఆమ్‌స్ట‌ర్‌డామ్‌లో దాన్ని వేలానికి తీసికెళ్లే ముందు దాన్ని ఆ ఆర్ట్ గ్యాల‌రీలో వుంద‌ని చూసిన‌వారు చెప్పారు. వేలంపాట త‌ర్వాత మొత్తానికి ఆ పెయింటింగ్‌ను 1971లో ఒక క‌ళాపిపాసి త‌న ద‌గ్గ‌ర పెట్టుకున్నాడు.    ఆ త‌ర్వాత 2021లో అది చార్లెటీని చేరింది.  మొత్తానికి వూహించ‌ని విధంగా ఎంతో కాలం దూర‌మ‌యిన గొప్ప క‌ళాఖండం తిరిగి త‌న వ‌ద్ద‌కు చేర‌డంలో చార్లెటీ ఆనందానికి అంతేలేదు. అంతే క‌దా.. పోయింద‌నుకున్న గొప్ప వ‌స్తువు తిరిగి చేరితే ఆ ఆనంద‌మే వేరు!  అయితే చార్లెటీకి ఇపుడు ఆ పెయిం టింగ్‌ను భ‌ద్రంగా చూసుకునే ఆస‌క్తి వున్న‌ప్ప‌టికీ శ‌క్తి సామ‌ర్ధ్యాలు లేవు. అందుక‌నే త్వ‌ర‌లో ఎవ‌రిక‌యినా అమ్మేసీ వ‌చ్చిన సొమ్మును పిల్ల‌ల‌కు పంచుదామ‌నుకుంటోందిట‌!  చార్లెటీ కుటుంబంలో అయిదుగురు అన్న‌ద‌మ్ములు అక్క‌చెల్లెళ్లు వున్నారు. అలాగే ఇర‌వై మంది పిల్ల‌లు ఉన్నారు. అంద‌రూ ఆమె అంటే ఎంతో ప్రేమ చూపుతున్నారు. అంద‌రం ఒకే కుటుంబం, చాలాకాలం త‌ర్వాత ఇల్లు చేరిన క‌ళాఖండం మా కుటుంబానిది అన్న‌ది చార్లెటీ!
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు. చాకోను పార్టీలోకి ఆహ్వానిస్తూ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్’ ఫ్రంట్ ఏర్పాటు గురించి ప్రత్యేకించి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు కానీ, చాకో అలాంటి  సంకేతాలు ఇచ్చారు. ప్రస్తుతం దేశంలో ఉన్న ఏ ఒక్కపార్టీ కూడా బీజేపీకి ప్రత్యాన్మాయం కాదని,సమీప భవిష్యత్ కాంగ్రెస్ సహా ఏ పార్టీ కూడా ఆ స్థాయికి ఎదిగే అవకాశాలు కూడా కనిపించడంలేదని అన్నారు. ఈ పరిస్థితుల్లో దేశంలోని బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ, ఏకమై, ఒకే గొడుగు కిందకు రావలసిన అవసరం ఉందని చాకో అన్నారు. అదే సమయంలో ప్రతిపక్షాలను ఏక తాటిపైకి తెచ్చే బాధ్యతను పవార్ తీసుకోవాలని సంకేత మాత్రంగా చెప్పారు. అంతే కాకుండా కాంగ్రెస్ పేరు ఎత్తకుండా బీజేపీ వ్యతిరేక శక్తులను ఏకం చేసే ఆలోచన ఆ పార్టీ నాయకత్వానికి లేదని నెహ్రూ గాంధీ ఫ్యామిలీ (సోనియా, రాహుల్, ప్రియాంక)ఆలోచనా ధోరణిని పరోక్షంగానే అయినా ఎండ కట్టారు.ఆ విధంగా పవార్ ఆ బాధ్యత తీసుకోవాలని చాకో సూచించారు. ఇందుకు సంబంధించి, పవార్ బహిరంగంగా ఎలాంటి వ్యాఖ్య చేయలేదు. అయితే, చాకో సహా మరికొందరు ‘సీనియర్’ కాంగ్రెస్ నాయకులు, అలాగే సిపిఎం, సిపిఐ నాయకులు కూడా పవార్’తో చాలా కాలంగా థర్డ్ ఫ్రంట్  విషయంగా చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. అయితే మహారాష్ట్రలో సంకీర్ణం మనుగడను దృష్టిలో ఉంచుకుని పవార్ ఆచితూచి అడుగులేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే చాకో పార్టీలో చేరిన సందర్భంలో కూడా ‘చాకో చేరికతో మహారాష్ట్రలోని మహా వికాస్ అగాడీ ప్రభుత్వానికి ఎలాంటి నష్టం జరగదని, పవార్ మహారాష్ట్ర సంకీర్ణ సర్కార్ ప్రస్తావన చేశారని విశ్లేషకులు పేర్కొంటున్నారు.  మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వ మనుగడ గురించ్బి  పవార్ ప్రత్యేకంగా పేర్కొనడం ద్వారా, ఆయన థర్డ్ ఫ్రంట్ విషయంలో వేచి చూసే ఆలోచనలో ఉన్నట్లు అర్థమవుతోందని కూడా  రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే అదే ఎన్సీపీ అసెంబ్లీ ఎన్నికల జరుగతున్న కేరళలో, పశ్చిమ బెంగాల్లో  కాంగ్రెస్ వ్యతిరేక పార్టీలకు మద్దతు ఇస్తోంది. దీన్ని బట్టి చూస్తే, ఎన్సీపీ - కాంగ్రెస్ మధ్య దూరం పెరుగుతోందని స్పష్టమవుతోంది. అయితే, థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఏ రకంగా ముడి పడుతుంది అనే విషయంలో ఇంకా స్పష్టత రావలసి ఉంది. అలాగే, కాంగ్రెస్ లేకుండా జాతీయ స్త్గాయిలో బీజేపీ వ్యతిరేక కూటమిని ఏర్పాటు చేయడం వలన, వ్యతిరేక ఓటు చీలి  అది మళ్ళీ బీజేపీకే మేలు చేస్తుందని, కాబట్టి, ప్రస్తుతం కాంగ్రెస్ సారధ్యంలోని యూపీఏని బలోపేతం చేయడమే ఉత్తమమనే అలోచన కూడా  విపక్ష శిబిరం నుంచి వినవస్తోంది. ఈ నేపధ్యంలోనే, ప్రస్తుతం యూపీఏ ఛైర్పర్సన్’గా ఉన్న సోనియా గాంధీ వయసు, అనారోగ్యం కారణంగా బాధ్యతల నుంచి తప్పుకుని పవార్’కు బాద్యతలు అప్పగించాలనే ప్రతిపాదన వచ్చిందని అంటున్నారు. అలాగే, ఇతర పార్టీలను, ముఖ్యంగా కాంగ్రెస్ నుంచి విడిపోయి సొంత కుంపటి పెట్టుకున్న మమతా బెనర్జీ సారధ్యంలోని తృణమూల్, జగన్మోహన్ రెడ్డి సారధ్యంలోని వైసీపీలను కలుపుకుని కూటమిని బలోపేతం చేయడం ద్వారా బీజేపీని దీటుగా ఎదుర్కోవచ్చనే ఆలోచనలు కూడా సాగుతున్నాయి. అయితే, ఇటు థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు అయినా, యూపీఏని బలోపేతం చేయడమే అయినా, పవారే .. కేంద్ర బిందువు. ఆయన సారధ్యంలోనే ప్రత్యాన్మాయం అనేది విపక్ష శిభిరం నుంచి వినవస్తున్న ప్రస్తుత సమాచారం. మరి అదే జరిగితే రాహుల గాంధీ పరిస్థితి ఏమిటి ? గాంధీ నెహ్రూ కుటుంబం పరిస్థితి ఏమిటి? ఏ ప్రత్యేక ప్రాధాన్యత లేకుండా అందరిలో ఒకరిగా ఫస్ట్ ఫ్యామిలీ సర్దుకు పోతుందా? అంటే..చివరకు ఏమవుతుందో .. ఇప్పుడే చెప్పలేమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది. గతంలో అనేక సందర్భాలలో ముఖ్యమంత్రి కేసీఆర్,ఆర్థిక మంత్రి హరీశ రావు, కరోనా కారణంగా రాష్ట్ర  ఆదాయం గణనీయంగా తగ్గిందని, పేర్కొన్నారు. అయితే, కరోనా నుంచి వేగంగా కోలుకుని, ఆర్థికంగా అంతే వేగంగా పుంజుకున్న రాష్ట్రాలలో తెలంగాణ ప్రధమ స్థానంలో  ఉందని కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సర్వే 2020-21 నివేదిక పేర్కొంది. పడిలేచిన కెరటంలా, తెలంగాణ ‘వీ’ ఆకారంలో ఆర్థికంగా నిలతొక్కుందని కేంద్రం జనవరి  చివరి వారంలో విడుదల చేసిన ఆర్థిక సర్వేలో పేర్కొంది. అలాగే, రెవిన్యూ వసూళ్ళలో రాష్ట్రం కరోనా పూర్వస్థితికి చేరిందని కూడా సర్వే చెప్పింది.   అలాగే,రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు కూడా ఈ మధ్య కాలంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పై సంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరమ జనవరి,ఫిబ్రవరి, మార్చి నెలలతో పోలిస్తే ఈ సంవత్సరం ఈ మూడు నెలల కాలంలో రాష్ట్ర ఆర్థిక వృద్ది రేటు 10 నుంచి  15 శాతం మెరుగ్గా ఉందని హరీష్ రావు ఒకటి రెండు ఇంటర్వ్యూలలో పేర్కొన్నారు.అలాగే, బడ్జెట్ విషయంలోనూ ఆయన చాల ఆశావహ దృక్పథంతోనే ఉన్నారు. బడ్జెట్  పాజిటివ్’గా ఉంటుదని, ఎవ్వరూ ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని, సంక్షేమ పథకాలలో,ఇతరత్రా బడ్జెట్ కేటాయింపులలో ఎలాంటి కోతలు ఉండవని కూడా హరీష్ హామీ ఇచ్చారు. గత సంవత్సరంలో కొంత మేర హామీ ఇచ్చిన మేరకు అమలు చేయలేక పోయిన సొంత జాగాలలో డబల్ బెడ్ రూమ్ ఇళ్ళ నిర్మాణం, రుణ మాఫీ వంటి  పథకాలను ఈ బడ్జెట్ ద్వారా అమలు చేస్తామని చెప్పారు. అలాగే, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ తమిళి సై చేసిన ప్రసంగంలోనూ ఆశావహ దృక్పధమే వ్యక్తమైంది. ఆమె తమ ప్రసంగంలో,  ప్రభుత్వం సంక్షేమ పథకాలకు పెద్ద పీట వేసిందని అన్నారు. ‘సంపద పంచాలి ,పేదలకు పంచాలి’ అనేది తమ ప్రభుత్వ విధానమని స్పష్టం చేశారు. అలాగే, పెరుగతున్న ఆదాయంలో అధికశాతం సంక్షేమానికే వెచ్చిస్తున్నామని స్పష్టం చేశారు. దీంతో బడ్జెట్’లో కొత్త పథకాలకు శ్రీకారం చుట్టే అవకాశం ఉంటుందా అన్న చర్చ జరుగుతోంది. మరో వంక ఉద్యోగ వర్గాల్లో పీఆర్సీకి సంబంధించి ఆర్థిక మంత్రి తమ ప్రసంగంలో  ప్రకటన చేస్తారా లేదా అనే ఆసక్తి నెలకొంది. అలాగే, సామాన్య  ప్రజలు ఇటీవల పెరిగిన పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరల భారం నుంచి మంత్రి హరీష్, ఏదైనా ఉపసమనం కలిపిస్తారా అని ఎదురు చూస్తున్నారు. గతంలో వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సామాన్య ప్రజలపై వంటగ్యాస్ ధర భారాన్ని తగ్గించేందుకు కొంత మొత్తాన్ని, రూ.50(?) రాష్ట్ర ప్రభుత్వం తరపున  సబ్సిడీగా ఇచ్చిన విషయాన్ని, అదే విధంగా అసెంబ్లీ ఎన్నికలు జరుగతున్న తమిళనాడులో డిఎంకే పార్టీ,తమ పార్టీని అధికారంలోకి వస్తే  గ్యాస్ బండపై వంద రూపాయల సబ్సిడీ ఇస్తామని చేసిన  వాగ్దానాన్ని  గుర్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే, ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు, సోమవారం ఆర్థిక మంత్రి హరీష్ రావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఆర్థిక  శాఖ ముఖ్య కార్యదర్శి రామ కృష్ణా రావు,సలహాదారు జీఆర్ రెడ్డితో బడ్జెట్ పద్దులఫై సుదీర్ఘంగా చర్చించి తుది మెరుగులు దిద్దారు. బడ్జెట్ తుది రూపం సిద్దమైన నేపధ్యంలో ఆర్థిక శాఖ ప్రింటింగ్ ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 18 ఉదయం మంత్రి వర్గం ఆమోదం పొందిన అనంతరం ఆర్థికమంత్రి హరీష్ రావు అదే రోజు రాష్ట్ర బడ్జెట్ 2021-22ను సభలో ప్రవేశ పెడతారు. 20, 22 తేదీల్లో బడ్జెట్‌పై సాధారణ చర్చ,23, 24, 25 తేదీల్లో బడ్జెట్‌ పద్దులపై చర్చ ఉంటుంది 26న ద్రవ్యవినిమయ బిల్లు (బడ్జెట్)పై చర్చ, సభామోదం ఉంటాయి.
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది.  అధికార తెరాస, ఖమ్మం స్థానానికి సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర రెడ్డి పేరును ప్రకటించడంలో కొంచెం జాప్యం చేయడంతో పాటుగా, హైదరాబాద్ స్థానం నుంచి , పీవీ కుమార్తె వాణీ దేవి పేరును చివరి క్షణంలో తెరమీదకు తేవడంతో అంత వరకు కొంత స్తబ్దుగా సాగిన ప్రచారం ఆ తర్వాత వేడెక్కింది. ఉద్యోగ నియామకాల విషయంలో తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ తప్పులో కాలేయడంతో విపక్షాలు, పోటీలో ఉన్న ప్రత్యర్ధులు, నిరుద్యోగ యువత, విద్యార్ధి సంఘాలు  ఒకే సారి ఆయన మీద  విరుచుకు పడ్డారు. ఆయన లెక్క తప్పని నిరుపిస్తం రమ్మని వరస సవాళ్ళు విసిరారు. దీంతో, మంత్రి నియామకా ఇష్యూని పక్కకు తప్పించేందుకు , ఐటీఐఆర్, వరంగల్ రైల్వే ఫ్యాక్టరీ వంటి సెంటిమెంటల్ ఇష్యూస్’ను తెరపైకి  తెచ్చారు. అలాగే, కేంద్ర ప్రభుత్వంపై విమర్శల దాడిని పెంచారు. చివరకు పొరుగు రాష్ట్రానికి చెందిన విశాఖ ఉక్కు ఆందోళన   కూడా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగమైంది.   రెండు నియోజక వర్గాలలో గతంతో పోలిస్తే ఈసారి ఓటర్ల సంఖ్య రెట్టింపు అయింది. ఈసారి రెండు నియోజక వర్గాలలో కలిపి 10 లక్ష 36 వేల మంది తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. అలాగే, రెండు పట్ట భద్రుల నియోజక వర్గాల్లో 164 మంది అభ్యర్ధులు పోటీలో ఉన్నారు.  గత ఎన్నికలతో పోలిస్తే ఇటు ఓటర్ల సంఖ్య, అటు అభ్యర్థుల సంఖ్యా రెట్టింపునకు పైగానే పెరగడంతో ఎన్నికలలో జోష్ పెరిగింది. దీనికితోడు అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో సాధారణ ఎన్నికలను తలపించే రీతిలో ప్రచారం సాగింది. ఎక్కువమంది అభ్యర్ధులు బరిలో ఉండడంతో, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి  తమకే ప్రయోజనం జరుగుతుందని అధికార పార్టీ ఆశపడుతోంది .  దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో చేదు ఫలితాలను చవిచూసిన టీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా వ్యూహ రచన చేసి కేటీఆర్, హరీష్ సహా మంత్రులు,ఎమ్మెల్యేలకు స్పెసిఫిక్ బాధ్యతలు అప్పగించారు. అలాగే,కాంగ్రెస్‌ అభ్యర్థులు చిన్నారెడ్డి, రాములునాయక్‌లకు మద్దతుగా ఉత్తమ్‌, భట్టి, రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తదితరులు విస్తృతంగా ప్రచారం చేశారు. బీజేపీ అభ్యర్థులు ఎన్‌.రాంచందర్‌రావు, ప్రేమేందర్‌రెడ్డిల తరఫున ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, ఎంపీ అరవింద్‌ తదితరులు ప్రచారాన్ని వేడెక్కించారు.  ఖమ్మం స్థానం నుంచి ప్రత్యక్ష ఎన్నికల్లో తొలిసారి పోటీకి దిగిన కోదండరాంకు, టీజేఎస్‌ పార్టీకీ ఈ ఎన్నికలు కీలకంగా మారాయి. ఖమ్మ స్థానం నుంచి పోటీ చేస్తున్న తీన్మార్ మల్లన్న ముందస్తు వ్యూహంతో ప్రధాన పార్టీల అభ్యర్ధులకు ధీటుగా ప్రచారం సాగించారు.  వామపక్షాల మద్దతుతో జయసారథి, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్‌, యువతెలంగాణ కార్యనిర్వాహక అధ్యక్షురాలు రాణీ రుద్రమ తదితరులు పోటీలో ఖమ్మం సీటును పట్టభద్రులు  ఎవరికి  పట్టం కడతారు అన్నది ప్రశ్నార్థకంగా మారింది. హైదరాబాద్ సీటు కూడా ఇటు అధికార తెరాసకు అటు సిట్టింగ్ సీటును నిలుపుకోవడం తో పాటుగా దుబ్బాక , జీహెచ్ఎంసి జోష్ ను కొనసాగించాలని ఆశ పడుతున్నబీజేలకే కూడా ఇజ్జత్ కీ సవాల్ గా మారింది. కాంగ్రెస్ అభ్యర్ధి పార్టీ సీనియర్ నాయకుడు సౌమ్యుడు, మాజీ మంత్రి చిన్నారెడ్డి, వామ పక్షాల మద్దతుతో పోటీ చేస్తున్న మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ కూడా గట్టి పోటీ ఇస్తున్నారు. సో.. చివరకు ఏమి జరుగుతుంది అంటే ఏదైనా జరగవచ్చును. ఈ నెల 14 వ తేదీన పోలింగ్ జరుగుతుంది.17 ఫలితాలు వస్తాయి .. అంతవరకు వెయిట్ అండ్ వాచ్ .  
సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది. ఒకప్పుడు ఎర్ర జెండాను దిగ్విజయంగా ఎదిరించి, మార్క్సిస్టులను మట్టి కరిపించిన మమతా దీదీ ప్రస్తుతం, కాషాయ కూటమి నుంచి గట్టి సవాలును ఎదుర్కుంటున్నారు. వరసగా పదేళ్ళు పాలించడం వలన సహజంగా వచ్చిన ప్రభుత్వ వ్యతిరేకత  కంటే, హిందూ ఓటు పోలరైజేషన్ ఆమెను మరింతగా భయపెడుతోంది. నిజానికి ఐదేళ్ళ క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం ఐదు శాతం కంటే తక్కువ ఓట్లు, మూడంటే మూడు అసెంబ్లీ సీట్లు మాత్రమే గెలుచుకున్న బీజేపీ..  2019 లోక్ సభ ఎన్నికల్లో ఏకంగా 40 శాతం ఓట్లతో 18 స్థానాలు గెలుచుకుంది. ఈ  మార్పు ఇంకా కొన్ని కారణాలు ఉంటే ఉండవచ్చును కానీ.. హిందువుల ఓటు పోలరైజ్  కావడమే ప్రధాన కారణం.  ఈ నేపధ్యంలోనే కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ చివరకు కమ్యూనిస్టులు కూడా బీజేపీలో  చేరారు. ఎన్నికల ప్రకటన వెలువడిన తర్వాత కూడా సిట్టింగ్ ఎమ్మెల్ల్యేలు సహా  తృణమూల్ టికెట్ వచ్చిన నాయకులు కూడా బీజేపీలో చేరుతున్నారు. అనేక మంది ఇతర రంగాల ప్రముఖులు, ముఖ్యంగా ఇంతకాలం, బీజేపీని హిదుత్వ అనుకూల ‘అచ్చుత్’ (అంటారని) పార్టీగా చూసిన ‘సెక్యులర్’ ప్రముఖులు కాషాయం కప్పుకోవడంతో మమతా బెనర్జీకి కొంచెం అలస్యంగానే అయినా, తత్త్వం బోధపడింది. అందుకే ఆమె ఇప్పుడు గుళ్ళూ,గోపురాలకు తిరుగుతున్నారు. కార్యకర్తల సమావేశాల్లో తానూ హిందువునేనని, చెప్పుకుంటున్నారు.  నిజానికి ఇలా నేనూ హిందువునే  అని సెక్యులర్ నేతలు బహిరంగంగా ప్రకటించుకోవడం మమతా బెనర్జీతోనే మొదలు కాలేదు. రాహుల్ గాంధీ తాను హిందువునని, జన్యుధారీ కశ్మీరీ బ్రాహ్మణుని అనీ.. తమ గోత్రం, ‘దత్తాత్రేయ’ గోత్రమని బహిరంగంగా ప్రకటించుకున్నారు. అలాగే  కొద్ది రోజుల క్రితం ప్రియాంకా గాంధీ తానూ హిందువునని చెప్పుకునేందుకు ‘మౌని అమావాస్య’ సందర్భంగా అలహాబాద్ లో గంగా స్నానం చేశారు. గతంలోనూ ఆమె ఎన్నికలకు ముందు గంగా యాత్ర చేశారు. అంతవరకు ఎందుకు కొద్దిరోజుల క్రితం సిపిఐ నారాయణ విశాఖ స్వామి ఆశీస్సులు తీసుకున్నారు. చంద్రబాబు, జగన్ రెడ్డి, కేసీఆర్ ఇలా తెలుగు నేతలు అనేక మంది లౌకిక వాదానికి కాలం చెల్లిందన్న సత్యాన్ని గ్రహించి కావచ్చు ‘నేనూ హిందువును’ అంటూ ప్రకటించుకునేందుకు పోటీ పడుతున్నారు. రాముడిని తలచుకున్నా, జై శ్రీరామ్ అన్నా తమ  లౌకిక వాదం మయలపడి పోతుందని భయపడిన నాయకులు ఇప్పుడు .. జై శ్రీరామ్ అనేందుకు కూడా వెనకాడడం లేదు.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది. గత కొంత కాలంగా సబర్మలతో సహా అనేక అంశాలపై స్పందిస్తూ.. కేరళను టార్గెట్ చేస్తున్న బీజేపీ నాయకులు అక్కడ తమ జెండా ఎగరేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా పార్టీ పాలసీని కూడా పక్కన పెట్టి మెట్రో మ్యాన్ శ్రీధరన్ ను పార్టీలో చేర్చుకుని ఆయనే తమ సీఎం అభ్యర్థి అని ప్రకటించిన 24 గంటలలో యూ టర్న్ తీసుకున్నారు. ఇది ఇలా ఉండగా ప్రస్తుతం సీఎంగా ఉన్న కమ్యూనిస్ట్ నేత పినరై విజయన్ పై గోల్డ్ స్మగ్లింగ్ ఆరోపణలు రావడంతో.. ఈ ఎన్నికలలో ఎల్డిఎఫ్ భవిష్యత్తుపై ప్రజలు ఏ తీర్పు ఇవ్వబోతున్నారనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది ఈ నేపథ్యంలో అక్షరాస్యతలో దేశంలోనే మొదటి స్థానంలో ఉన్న ఆ రాష్ట్ర ప్రజలు ఎవరిని ఆశీర్వదిస్తారు అనే అంశంపై ప్రముఖ మీడియా సంస్థ టైమ్స్ నౌ, సీ ఓటరుతో కలిసి ఒక సర్వేను నిర్వహించారు. ఈ సర్వే ప్రకారం చూస్తే పాపం కమలనాథులు అక్కడ పవర్ చేతికి రావటం అటుంచి కనీసం రెండు మూడు అసెంబ్లీ స్థానాల్లో గెలవటం కూడా కష్టమేనని ఆ సర్వే తేల్చి చెబుతోంది. కేరళలో ఈసారి జరిగే అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ తన హవా చాటుతుందన్న ఆ పార్టీ నేతల మాటలలో ఎలాంటి నిజం లేదని.. ప్రస్తుతానికి అది ఏమాత్రం సాధ్యం కాదని ఈ తాజా సర్వే తేల్చి చెప్పింది. అంతేకాకుండా మొత్తం 140 స్థానాలు ఉన్న కేరళలో.. ప్రస్తుత సీఎం పినరయి విజయన్ నేతృత్వంలోని లెఫ్ట్డ్ డెమొక్రటిక్ ఫ్రంట్ కు 82 సీట్లు పక్కా అని.. ఆయనే తిరిగి అధికారాన్ని నిలబెట్టుకుంటాడని సర్వే చెపుతోంది. అదే సమయంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూనైటెడ్ డెమొక్రాటిక్ ఫ్రంట్ కు 56 నుంచి 60 వరకు సీట్లు వచ్చే అవకాశం ఉందని ఈ సర్వేలో తేలింది. అంతేకాకుండా 2016 ఎన్నికలతో పోలిస్తే ఎల్ డీఎఫ్ ఓటింగ్ శాతం కూడా కొంత పెరగటం ఇక్కడ గమనార్హం. ప్రస్తుతం సీఎంగా ఉన్న విజయన్ మరోసారి సీఎం కావాలని 43.34 శాతం మంది మొగ్గు చూపినట్లుగా సర్వేలో తేలింది. కరోనా సమయంలో విజయన్ సీఎంగా బాగా పని చేసారని ఈ సర్వే పేర్కొంది. మరోపక్క దేశ ప్రధానిగా రాహుల్ గాంధీ ఉండాలని కేరళ ప్రజల్లో 55.84 శాతం మంది కోరుకుంటున్నట్లుగా ఈ సర్వే;లో తేలింది. అయితే కేరళలో ఎలాగైనా పాగా వేయాలని పట్టుదలతో కృషి చేస్తున్న బీజేపీకి ఈసారి కూడా నిరాశ తప్పదని ఈ సర్వేలో స్పష్టం అయింది. ఈ ఎన్నికలలో బీజేపీకి రెండు సీట్లు కూడా రావటం కూడా కష్టమేనని ఈ సర్వే తేల్చింది. అయితే ఎన్నికలకు ముందు ఇలాంటి సర్వేలు బయటకు రావడం.. తరువాత అందులో కొన్ని చతికిల పడడం మనం చూస్తూనే ఉన్నాం. మరి ఈ సర్వే ఫలితాలు నిజామా అవుతాయో లేదో తేలాలంటే కొద్దీ రోజులు వెయిట్ చేయాల్సిందే.        
రాజకీయాలు అంటేనే అదో జూదం. పూలమ్మిన చోటనే కట్టెలు అమ్మవలసి రావచ్చును. అలాంటి పరిస్థితే వచ్చినా, తలవంచుకుని పోగలిగితేనే, ఎవరైనా రాజకీయాలలో రాణించగలరు. అలాకాదని, అలిమి కానిచోట, కూడా తామే అధికులమని భావిస్తే, ఎందుకూ కాకుండా పోతారు. అలాంటి వారు ఇద్దరూ కూడా ఇప్పుడు మన కళ్ళముందే ఉన్నారు.  జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు. అలాగే జయ మరణం తర్వాత ఆమె పరిస్థితి ఏమిటో కూడా వేరే చెప్పవలసిన, అవసరం లేదు. జైలు పాలయ్యారు. సర్వం తానై నడిపించిన పార్టీ నుంచి  బహిష్కరణకు గురయ్యారు. జయ ఉన్నంత వరకు తన వారుగా ఉన్న వారందరూ కానివారయ్యారు. ఒంటరిగా మిగిలారు.  నిజానికి నాలుగేళ్ళు జైలు జీవితం గడిపిన తర్వాత కూడా ఆమె తలచుకుంటే.. రాష్ట్ర రాజకీయాలలో, ముఖ్యంగా అధికారంలో ఉన్న డిఎంకే కూటమిలో అలజడి సృష్టించగలరు. ఎన్నికలలో ఆమె గెలవక పోవచ్చును కానీ.. తనను కాదన్న అన్నాడిఎంకేను ఓడించగలరు. అయిన  ఆమె అందుకు విరుద్ధంగా  రాజకీయాలకు వీడ్కోలు పలికి మౌనంగా పక్కకు తప్పుకున్నారు. రాజకీయ సన్యాసం ప్రకటించారు. ఉమ్మడి శతృవు డిఎంకే ను ఓడించేందుకు అన్నా డిఎంకే కూటమి  పోటీ చేయాలని, కూటమి ఐక్యతను దెబ్బతీయరాదనే ఉద్దేశంతోనే ఆమె రాజకీయ సన్యాసం ప్రకటించారు.    శశికళ మౌనంగా వెళ్లి పోవడం వెనక ఇంకా అనేక కారణాలున్నా ,అసలు కారణం ఆమె, రాజకీయ విజ్ఞత, వివేకం. ఆమె జైలుకు వెళ్ళిన సమయంలో జయలలిత సమాధి వద్ద ఎంత కసిగా, కోపంగా ‘మౌన’ ప్రతిజ్ఞ చేశారో చూశా. అలాంటి ఆమె ఇప్పుడు ఇలా ‘మౌనం’గా వెనకడుగు వేశారంటే, అది ఆలోచించ వలసిన విషయమే.ఆమె వ్యుహతంకంగానే సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే అనేక మంది అనేక కోణాల్లో శశికళ సంచలన నిర్ణయాన్ని విశ్లేషించారు.జైలు జీవితం తర్వాత కూడా అన్నా డిఎంకే నాయకులు తనను అగ్రనేతగా అంగీకరించక పోవడం, అమిత్ షా చెప్పినా.. అన్నా డిఎంకే నాయకులు ఆమెను, మేనల్లుడు దినకరన్’ను కులం పేరున, కుటుంబం పేరున దూరం చేయడం, తిరిగి పార్టీలోకి తీసుకోకపోవడంతో ఆమె మనసు కష్టపెట్టుకుని, సన్యాస నిర్ణయం తీసుకున్నారని కొందరంటున్నారు. పార్టీ మీద పట్టు లేదని, చరిష్మా అసలే లేదని, అందుకే ఆమె అలా నిశ్శబ్ధంగా రాజకీయ సన్యాసం స్వీకరించారని ఇంకొందరు విశ్లేషించారు. ఈ విశ్లేషణలో కొంత నిజం ఉంటే ఉండవచ్చును.. కానీ ఆమె గతాన్ని, నైజాన్ని గుర్తు చేసుకుంటే ఆమె స్ట్రైక్ బ్యాక్ వ్యూహంతోనే ఒకడుగు వెనక్కివేశారని ఆమెతో సన్నిహితంగా మెలిగినవారు, ఆమె రాజకీయ చాణక్యం తెలిసిన వారు అంటారు.   నిజానికి జైలులో ఉన్న కాలంలో కానీ, జైలు నుంచి విడుదలై వచ్చిన తర్వాత కానీ, ఆమె రాజకీయ సన్యాసం వైపు అడుగులు వేస్తున్నట్లు కనిపించలేదు. బెంగుళూరు జైలు నుంచి విడుదలై చెన్నైలో ప్రవేశించిన నప్పుడు ఆమె పెద్ద కాన్వాయ్ తో  తమ కారుకు అన్నాడిఎంకే జెండాతోనే ఎంటరయ్యారు. అలా ఎంట్రీలోనే రాజకీయ ఆకాంక్షను వెంట తెచ్చుకున్నారు. చివరకు ‘సన్యాస’ ప్రకట చేసే వరకు కూడా ఆమె రాజకీయ కార్యకలాపాలు సాగిస్తూనే ఉన్నారు. అటు ఢిల్లీని ఇటు చెన్నైనికూడా కదిల్చారు. అంతేకాదు, రాజకీయాలపై విరక్తితో కాదు, రాజకీయ కసితో, ఉమ్మడి శత్రువు (డిఎంకే) ను ఓడించేందుకే తాను రాజకీయాలనుంచి తపుకుంటున్నట్లు చెప్పారు.  సో .. సన్యాసం తీసుకోవాలనే ఆలోచన, రాజకీయవ్యూహం లోంచి పుట్టిందే కానీ,వైరాగ్యంతో పుట్టింది కాదు ,అన్నవిశ్లేషణ వాస్తవానికి ఇంకొంత దగ్గరగా ఉందని అనుకోవచ్చును. ఇది ‘కామా’నే కాని ‘ఫుల్స్టాప్’ కాదని అంటున్నారు.  ముఖ్యమంత్రి ఎడప్పాడి కే. పళని స్వామి (ఈపీఎస్) ఆమెను పార్టీలోకి అనుమతిస్తే తన కుర్చికీ ఎసరు పెడతారనే భయంతోనే,, ఆమె ఎంట్రీని అడ్డుకున్నారు. ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం, శశికళ ఒకే సామజిక వర్గానికి చెందిన వారు కావడం కూడా, ముఖ్యమంత్రి ఈపీఎస్’ భయానికి కారణంగా పేర్కొంటారు. అందుకే  ఆయన, ‘మన్నార్గుడి’ ఫ్యామిలీని బూచిగా చూపించి, ఆమెను దూరంగా ఉంచారని పార్టీలో ఒక వర్గం గట్టిగా విశ్వసిస్తుంది. అయితే ఆమె శక్తియుక్తులను కూడతీసుకుని  పులిలా పంజా విసిరేందుకే ఆమె వ్యూహాత్మకంగా ఒక అడుగు వెనక్కి వేశారు కావచ్చును అని కూడా, తమిళ రాజకీయ వర్గాల్లో ఒక చర్చ జరుగుతోంది.  గతంలో ఆమె జయలలితతో విబేధాలు వచ్చిన సమయంలో కూడా ఇలాగే కొద్ది కాలం మౌనంగా తెర చాటుకు వెళ్లి పోయారు.  కొద్ది కాలంలోనే మళ్ళీ ‘పోయస్ గార్డెన్’లో ప్రత్యక్షమయ్యారు. జయలలిత స్వయంగా ఆమెను వెనక్కి పిలుపించుకోవలసిన పరిస్థితులను సృష్టించారు. అలా  మళ్ళీ  చక్రం తిప్పారు. జయలలిత మరణం వరకు ఆమె అందరికీ చిన్నమ్మగా అమ్మకు పెద్దమ్మగా సర్వం తానై నిలిచారు. చివరకు జయ అంత్యక్రియల్లో కూడా ఆమెదే పై చేయిగా కనిపించింది.   జయలలిత చనిపోయిన సందర్భంలోనే అన్నా డిఎంకే ఎమ్మెల్ల్యేలో సుమారు 30 మంది వరకు ఆమెకు మద్దతుగా ఉన్నారన్న వార్తలొచ్చాయి. నిజానికి,ఇప్పటికి కూడా ఒక్క అన్నా డిఎంకే లోనేకాదు,డిఎంకే ఇతర పార్టీలలో కూడా  ఆమె అవసరం ఉన్న వాళ్ళు ఉన్నారు. కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో ‘మన్నార్గుడి’ ఫ్యామిలీ మద్దతు లేకుండా గెలిచే అవకాశం లేదు.  ఇవ్వన్నీ నిజమే అయినా.. అన్నీ ఉండి, ఎవరు లేని శశికళలో, ఇంకా  ఎవరి కోసం తాపత్రయ పడాలి? అనే ప్రశ్న జనించి ఉంటే, ఆమె రాజకీయ సన్యాసం నిజం కావచ్చును. ఎందుకంటే ఆమె నెచ్చలి, జయలిత లేరు, భర్త అంతకంటే ముందే చనిపోయారు, పిల్లలు లేరు... పైగా నాలుగేళ్ళ జైలు జీవితం ఆమెలో మార్పు తెచ్చి ఉండవచ్చును. ఈ వయస్సులో తనవారంటూ ఎవరు లేని తనకు రాజకీయాలు ఎందుకు ? శేష జీవితాన్ని ఇలా సాగిద్దామనే ఆలోచన నిజంగా వచ్చి ఉంటే, ఆమె సన్యాసం సత్యం అయినా కావచ్చును, కాకపోనూ వచ్చును. కానీ  శశికళ... ఆమెను అర్థం చేసుకోవడం, అంచనా వేయడం , అంత తేలిగ్గా అయ్యే పని కాదు..
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు. కాంగ్రెస్ అధినాయకత్వం పై నేరుగా అస్త్రాలు సంధించారు. రాహుల్ గాంధీ పేరు చెప్పకుండానే, ఆయన నాయకత్వానికి పనికిరాడని తేల్చి చెప్పారు. ఎవరైనా పార్టీ అధ్యక్షుడు అయితే కావచ్చును, కానీ, ప్రజానాయకుడు కాలేడని, రాహుల గాంధీ ప్రజానాయకుడు కాదు కాలేరు,అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తరచూ రాహుల్ గాంధీని ఉద్దేశించి చేసే  ‘నామ్’ధారీ వ్యంగ్యాస్త్రాన్నే కాంగ్రెస్ సీనియర్ నాయకులు కూడా సందించారు. ఇక అక్కడి నుంచి విధేయ, అసమ్మతి వర్గాల మధ్య మాటల యుద్ధం ఎదో ఒక రూపంలో సాగుతూనే వుంది. అదే క్రమంలో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ, కరుడు కట్టిన ముస్లిం మతోన్మాది, అబ్బాస్ సిద్దిఖీతో కాంగ్రెస్ పార్టీ చేతులు కలపడం అసమ్మతి నాయకులకు మరో అస్త్రాన్ని అందించింది. విషయంలోకి వెళితే, ఇటీవల పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా లోక్’సభలో కాంగ్రెస్ పక్ష నాయకుడు, పశ్చిమ బెంగాల్ పీసీసీ అధ్యక్షుడు అధీర్’రంజన్ చౌదరి, ముస్లిం మత ప్రచారకుడు, అబ్బాస్ సిద్దిఖీతో  వేదిక పంచుకున్నారు.అంతకు ముందే వామ పక్ష కూటమితో  పొత్తు కుదుర్చుకున్న కాంగ్రెస్ పార్టీ, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)ను కూటమిలో చేర్చుకుంది. ఇలా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) అమోదం లేకుండా మతోన్మాద ఐఎస్ఎఫ్’ తో ఎన్నికల పొత్తు పెట్టుకోవడం ఆ పార్టీ నాయకుడు,సిద్ధిఖీతో  పీసీసీ చీఫ్ వేదిక  పంచుకోవడం పై అసమ్మతి నేతలు మండి పడుతున్నారు. ఇలా సిద్దిఖీతో వేదిక పంచుకోవడం పార్టీ మౌలిక సిద్ధాంతాలకు వ్యతిరేకం అంటూ అసమ్మతి వర్గానికి చెందిన కీలక నేత, రాజ్యసభ సభ్యుడు,ఆనంద్ శర్మ మండిపడ్డారు. అంతే కాదు, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)తో జనవరిలో కుదుర్చుకున్న పొత్తుకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ)అమోదం లేదని ఆనంద్ శర్మ, అభ్యంతరం వ్యక్త చేశారు. పార్టీ విశ్వసించే లౌకిక వాదానికి కాంగ్రెస్ అధిష్టానం తీసుకున్న నిర్ణయం గొడ్డలి పెట్టని ఆయన తీవ్రంగా స్పందించారు.   శర్మ వ్యాఖ్యలపై అధీర్ రంజన్ చౌదరి అంతే ఘాటుగా ప్రతిస్పందించారు. “నిజాలు తెలుసుకోండి ఆనంద్ శ‌ర్మ జీ” అంటూ ఆయ‌న వ‌రుస ట్వీట్లు చేశారు. వ్య‌క్తిగ‌త ప్ర‌యోజ‌నాలు ప‌క్క‌న‌పెట్టి, ప్ర‌ధానిని పొగిడి టైమ్ వేస్ట్ చేయ‌కండంటూ ఆయ‌న ఓ ట్వీట్లో అన్నారు. ఆనంద్ శ‌ర్మ అన‌వ‌స‌రంగా కాంగ్రెస్‌ను ల‌క్ష్యంగా చేసుకుంటున్నార‌ని, ఈ అంశాన్ని పెద్ద‌ది చేసి చూపిస్తున్నార‌ని విమ‌ర్శించారు. ఆయ‌న ఉద్దేశాలు స‌రైన‌వే అయితే నేరుగా తనతో మాట్లాడ వలసిందని అన్నారు. బెంగాల్‌లో సీపీఐ(ఎం) కూట‌మికి నేతృత్వం వ‌హిస్తోంది. అందులో కాంగ్రెస్ ఓ భాగం. మ‌త‌తత్వ‌, విభ‌జ‌న రాజ‌కీయాలు చేస్తున్న బీజేపీకి చెక్ పెట్ట‌డానికే ఈ కూట‌మి అని మ‌రో ట్వీట్‌లో అధిర్ రంజ‌న్ అన్నారు. అక్కడతోనూ ఆగలేదు ... ట్వీట్ల మీద ట్వీట్లు సంధిస్తూ, ఆనంద్ శర్మ, బీజేపీ మత విభజన, అజెండాను బలపరుస్తున్నారని, పరోక్షంగా జీ23 నాయకులు బీజేపీకి ప్రయోజనం చేకూరుస్తున్నారని ఆరోపించారు.అంతే కాదు, క్షేత్ర స్థాయి వాస్తవ పరిస్థితులు తెలియకుండా, ఆనంద్ శర్మ పార్టీ మీద దండెత్తడం ఉచితం కాదని చౌదరి ఎదురుదాడి చేశారు. అసమ్మతిలో అసమ్మతి. ఇదలా ఉంటే, కాంగ్రెస్ పార్టీ  సమూల పక్షాళన కోరుతూ సోనియా గాంధీకి,గత సంవత్సరం  జీ 23గా ప్రాచుర్యం పొందిన సీనియర్ నాయకులు రాసిన లేఖపై సంతకాలు చేసిన  నాయకుల్లో నలుగురు,జమ్మూలోసమావేసమైన నాయకుల తాజా నిర్ణయాలు, వ్యాఖ్యలు,విమర్శల పట్ల అసంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరం సోనియా గాంధీకి రాసిన లేఖలో ప్రస్తావించిన అంశాలకు కట్టుబడి ఉన్నామని, అయితే, జీ 23లోని కొందరు సహచరులు, ఇటీవల గీతదాటి చేస్తున్న వ్యాఖ్యలు, విమర్శలను తాము సమర్ధించడం లేదని ఆ నలుగురు పేర్కొన్నారు. ఇందులో ముఖ్యంగా, రాజ్యసభ మాజీ డిప్యూటీ చైర్మన్, పీజే కురియన్ అయితే, “కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు అవసరమైన సంస్కరణలు తెచ్చేందుకు చేసే ప్రయత్నాలను పూర్తిగా సమర్దిస్తాను, కానీ, ‘లక్ష్మణ రేఖ’ దాటితే ఒప్పుకునేది లేదు”అని అసమ్మతిలో అసమ్మతికి తెర తీశారు.అలాగే, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ కుమారడు, మాజీ ఎంపీ సందీప్ దీక్షిత్,మధ్య ప్రదేశ్ సీనియర్ కాంగ్రెస్ నాయకుడు అజయ్ సింగ్’ కూడా గులాం నబీ ఆజాద్, కపిల్ సిబల్, ఆనంద్ శర్మ, మనీష్ తివారీ వంటి జీ 23 కీలక నేతలు అధినాయకత్వంపై చేసిన వ్యాఖ్యలను తప్పు పట్టారు. అలాగే, పార్టీ సీనియర్ నాయకుడు కేంద్ర మాజీమంత్రి వీరప్ప మొయిలీ కూడా,గత సంవత్సరం పార్టీ సీనియర్ నాయకులు  ఒక పరిమిత లక్ష్యంతో  సోనియా గాంధీకి లేఖ రాయడం జరిగిందని, ఆ పేరున జరుగతున్న  కార్యక్రమాలు లేఖ సంకల్పానికి  విరుద్ధమని అన్నారు. జీ 23 కార్యకలాపాలపై రాహుల్ గాంధీ కూడా పరోక్షగా స్పందించారు, ఒకప్పుడు ఎన్ఎస్’యుఐ, యూత్ కాంగ్రెస్’ కు సంస్థాగత ఎన్నికలు వద్దన్న వారే ఇప్పుడు ఇంకోలా మాట్లాడుతున్నారని పరోక్షంగానే అయినా సంస్థాగత ఎన్నికలు నిర్వహించడంతో పాటుగా, పార్టీ పక్షాలనకు తమ కుటుంబం వ్యతిరేకం కాదని, అందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఈ నేపధ్యంలో కాంగ్రెస్ పార్టీలో చెలరిగిన కలకలం  ఇక ముందు ఏమవుతుందో .. ఇంకెన్ని  మలుపులు తిరుగుతోందో ..చూడవలసిందే కానీ ఉహించలేము.
పంచతంత్రంగా పిలుచుకుంటున్న ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భతం జరగబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే, వివిధ సంస్థలు అసెంబ్లీ ఎన్నికలు జరిగే  అస్సాం. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటుగా కేరళలోనూ ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఆ ఒపీనియన్ పోల్ ఫలితాలు నిజంగా నిజం అయితే, కేరళలో మళ్ళీ సీపీఎం సారధ్యంలోని వామపక్ష కూటమి అధికారంలోకి వస్తుంది. ఇదే ఆ అద్భుతం. ఎందుకంటే, గత నాలుగు దశాబ్దాలలో కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో ఒకే కూటమి వరసగా రెండవసారి అధికారంలోకి వచ్చిన చరిత్ర లేనే లేదు. ఒక సారి ఎల్డీఎఫ్ అధికారంలోకి వస్తే ఐదేళ్ళ తర్వాత కాంగ్రెస్ సారధ్యంలోని ఐక్య ప్రజాస్వామ్య కూటమి(యూడీఎఫ్) అధికారంలోకి రావడం, దేవభుమిలో దైవ నిర్ణయమా అన్నట్లుగా ప్రతి ఎన్నికల్లోనూ అధికారం చేతులు మారుతూ వస్తోంది. అలాంటిది, ఈసారి ఒపీనియన్ పోల్స్ నిజమై వరసగా రెండవసారి వామపక్ష కూటమి అధికారంలోకి వస్తే, అది చరిత్రే అవుతుంది. ఇక ఒపీనియన్ పోల్స్ విషయానికి వస్తే, జాతీయ న్యూస్ ఛానెల్ ఏబీపీ, సీ ఓటర్ సంస్థలు సంయుక్తంగా ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఈ సర్వే ప్రకారం, 140 స్థానాలున్న కేరళ అసెంబ్లీలో వామపక్ష కూటమికి 83 నుంచి  91 స్థానాలు, యూడీఎఫ్ కూటమికి 47 నుంచి 55 స్థానాలు మాత్రమే దక్కుతాయని తెలుస్తోంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్రంలో ఇలా జాతకాలు తిరగబడడంపై సోషల్ మీడియాలో,’లెగ్ మహిమ’ లాంటి జోక్స్  ట్రోలవుతున్నాయి. అయితే 2016లో జరిగిన ఎన్నికల్లో కేవలం 47 సీట్లకే పరిమితం అయిన కాంగ్రెస్’కు ఈసారి ఒకటీ అరా సీట్లు ఎక్కువస్తే, రావచ్చును. అదే కాంగ్రెస్’కు కాసింత ఊరట. అదలా ఉంటే, పశ్చిమ బెంగాల్లో సైతం పట్టు సాధించిన బీజేపే, కేరళలో మాత్రం పట్టు కాదు కదా, పట్టుమని పది సీట్లు తెచ్చుకునే స్థితిలో లేదు. నిజానికి, దేశంలో బీజేపీకి అసలు ఏ మాత్రం మింగుడు పడని రాష్ట్రాలు ఎవైన ఉన్నాయంటే కేరళ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల  పేర్లే ప్రముఖంగా వినిపిస్తాయి. ఈ సారి కూడా కమల దళం కేరళలో కాలు పెట్టె పరిస్తి లేదని సర్వే ఫలితాలు చెపుతున్నారు. ఎప్పటిలానే ఇప్పడు కూడా  బీజేపీకి సున్నా నుంచి రెండు సీట్లు వచ్చే అవకాశం ఉందని, సర్వేస్వరుల అభిప్రాయంగా ఉంది. కేరళలో మొత్తం 140 స్థానాలకు ఏప్రిల్ 6 తేదీన ఒకే విడతలో పోలింగ్ జరుగుతుంది. మే 2 తేదీన ఫలితాలు వెలువడతాయి. కేరళ ఎలక్షన్ పై యావత్ దేశం ఆసక్తి కనబరుస్తోంది.    
కేంద్ర ఎన్నికలసంఘం ‘పాంచ్ పటాక’ గంట కొట్టింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. ఎన్నికల గంట మోగడంతో మొదలైన మరో భారత ‘మినీ’  సంగ్రామానికి మే 12 తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తెర పడుతుంది.ఈలోగా వివిధ అంచల్లో పోలింగ్ జరుగుతుంది.  నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతం ఓటరు తీర్పుకు వెళుతున్నా, అందరి దృష్టి, ముఖ్యంగా ప్రాంతీయ పార్టీల ఏలుబడిలో ఉన్న ఉభయ తెలుగు రాష్ట్రాలు, మరీ ముఖ్యంగా ఇప్పటికే బీజేపీ కన్నుపడిన తెలంగాణ రాష్ట్ర ప్రజలు, రాజకీయ పార్టీల దుష్టి  మాత్రం పశ్చిమ బెంగాల్ పైనే వుంది.  పశ్చిమ బెంగాల్లో ‘అద్భుతం’ జరిగి బీజేపీ విజయం సాధిస్తే, ఇక  కమల దళం ఫోకస్, తెలంగాణకు షిఫ్ట్ అవుతుంది. ఇది అందరికీ తెలిసిన బహిరంగ రహస్యం. ఈ నేపధ్యంలో బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయి అనే విషయంలో రాష్ట్ర రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. బెంగాల్లో బీజేపీ గెలిస్తే, ఇప్పటికే అంతర్గత కుటుంబ కలహాలతో సతమతవుతున్న తెరాస నాయకత్వానికి మరిన్నితిప్పలు తప్పవన్న మాట అంతఃపుర వర్గాలలో సైతం వినవస్తోంది.  పశ్చిమ బెంగాల్’లో ఎలాగైతే కమలదళం ఓ వంక తమ ట్రేడ్ మార్క్, హిందుత్వ రాజకీయాలు సాగిస్తూ, మరో వైపు నుంచి ‘ఆకర్ష్’ అస్త్రంతో అధికార పార్టీని నిర్వీర్యం చేసిన విధంగానే, ఇక్కడ కూడా ఫిరాయింపులను ప్రోత్సహింఛి పార్టీని నిట్టనిలువునా చీల్చే ప్రమాదాన్ని కొట్టివేయలేమని పార్టీ వర్గాలు కూడా అనుమానం వ్యక్త పరుస్తున్నాయి.  ఇప్పటికే తెలంగాణ  బీజేపీ నాయకులు 30 మంది తెరాస ఎమ్మెల్యేలు తమ టచ్ లో ఉన్నారని బెదిరిస్తున్నారు.అది నిజం అయినా కాకపోయినా..తెరాసలో అసంతృప్తి అగ్గి రగులుతోందనేది మాత్రం ఎవరూ కాదనలేని నిజం. అంతే కాకుండా రాష్ట్రానికి వచ్చిన కేంద్రనాయకులు ఎవరిని పలకరించినా, నెక్స్ట్ టార్గెట్ తెలంగాణ అని ఎలాంటి సషబిషలు లేకుండా కుండబద్దలు కొడుతున్నారు.అందుకే, బెంగాల్లో బీజేపీ గెలిస్తే.. అనే ఊహా కూడా  గులాబీ గూటిలో గుబులు పుట్టిస్తోంది. అయితే, బెగాల్’లో బీజేపీ గెలిస్తే ఒక్క తెలంగాణలోనే కాదు, దేశ రాజకీయ వాతావరణంలోనే పెను మార్పులు చోటు చేసుకుంటున్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.  అలాగే,  దేశ ముఖ చిత్రంలో కూడా పెను మార్పులు తప్పవని అంటున్నారు. అయితే రాజకీయాలలో ఎప్పుడు ఏం జరుగుతుందో.. ఎవరూహించెదరు..
నిస్సహాయత ఏమీ చేయలేని, చేయాలనే ఆరాటం ఉన్నా చేయడానికి అవకాశం లేని ఒకానొక ఒంటరి స్థితి. మనిషిని నిలువునా ఒత్తిడిలోకి తోసి, ఆత్మన్యూనతా భావాన్ని పెంచే పరిస్థితి. ప్రపంచంలో ఇలాంటి నిస్సహాయులు ఎందరో ఉన్నారు. ఇలాంటి వాళ్ళందరూ తిండి కోసం, ఉండటానికి నీడ కోసం ఎవరిని అడగాలో తెలియక, తమకు ఏమీ చేసే అవకాశాలు లేక అలా శూన్యం నిండిపోయినట్టు ఉండే స్థితి నిస్సహాయత. ఎందుకీ నిస్సహాయత?? ప్రపంచంలో మనిషి చేసుకుంటే ఎన్ని పనులు ఉండవు అని అనుకుంటారంతా. కానీ కొన్ని సార్లు అన్ని వైపుల నుండి తలుపులు మూసుకుపోయి చీకటిలో పడిపోయినట్టు ఉంటుంది. అలాంటి వాళ్ళు ఏదో ఒక చెయ్యి కోసం ఎదురుచూస్తూ ఉంటారు. ఆ తలుపులు ఎక్కడున్నాయో కనబడక, ఎవరైనా ఆ తలుపులు తీస్తారేమో అనే ఆశతో ఉంటారు. అందుకే ఏమీ చేతకానితనంతో అట్లా ఉండిపోతారు.  ఎక్కడెక్కడ?? నిస్సహాయతకు చోటు లేని ప్రదేశమంటూ లేదు. చోటివ్వని మనిషంటూ లేడు. చిన్న పిల్లాడి నుండి పెద్దవాళ్ళ దాకా ఎంతోమంది ఉంటారు. అయితే చాలా వరకు యూత్ లోనూ, మహిళల్లోనూ ఈ నిస్సహాయత బాధితులు ఎక్కువగా ఉంటున్నారు అనేది నమ్మితీరాల్సిన నిజం. మరీ ముఖ్యంగా కట్టుబాట్ల కంచెల మధ్య నలిగిపోతున్న ఎంతో మంది మహిళలు ఏదో చెయ్యాలని, తమ జీవితాలను మార్చుకోవాలని ఉన్నా అందరికీ పైపైన కనబడే విషయాలు వీళ్ళకేం బాగున్నారులే అనిపించేలా చేస్తున్నాయి. కానీ పైకి కనిపించేది వేరు, లోపల వాళ్ళ సంఘర్షణ వేరు. చేయూత!! నిస్సహాయంగా ఉన్న ఇలాంటి వాళ్ళ సంఘర్షణను గుర్తించే కొన్ని మహిళా స్వచ్చంధ చేయూత సంస్థలు ఆవిర్భవిస్తున్నాయి. అయితే ఇలాంటివి అందరికీ అందుబాటులో ఉండటం లేదు. కొన్ని మహానగరాలకు పరిమితమైతే మరికొన్ని దూరప్రాంతాలలో ఉండటం వల్ల ఎంతోమంది ప్రయోజనాలను పొందలేకపోతున్నారు. నిజం చెప్పాలంటే దిగువ తరగతి  కులాల మహిళల కంటే, ఉన్నత కులాల మహిళలలో ఇలాంటి నిస్సహాయులు చాలామంది ఉన్నారు. వాళ్ళందరూ పరువు, సమాజం, గౌరవం అనే గీతల వెనుక నిస్సహాయంగా నిలబడుకుని శూన్యపు చూపులు చూస్తుంటారు. మధ్యలోనే చదువు ఆగిపోయి, సంప్రదాయాలలో చిక్కుకుపోయి, గడప దాటి బయటకు వెళ్లే స్వేచ్ఛ లేని స్త్రీ సమాజం ఎంతో ఉంది. ఒక్క తలుపు తెరవండి!! ఇలాంటి సమస్యలో చిక్కుకుని మానసికంగా నలిగిపోయేవాళ్లకు సొంత ఆలోచన క్రమంగా తగ్గిపోతూ ఉంటుంది. ఏమి చేయలేకపోతున్నామనే చేతగాని తనమే అలాంటి అజ్ఞానపు వృత్తంలో పడిపోవడానికి కారణం అవుతుంది. అయితే నీ చుట్టూ బోలెడు ప్రపంచం ఉందని, అవకాశాలు ఉన్నాయని, దారి కూడా ఉందని చెబుతూ నువ్వున్నది ఓ చిన్న గది  మాత్రమే ఒక్కసారి మొత్తం తరచిచూస్తే ఎక్కడో ఒకచోట తలుపులు చేతికి దొరుకుతాయి అని మాటలతో భరోసా నింపితే ఆంజనేయుడికి  గుర్తుచేయగానే శరీరం పెరిగినట్టు వీళ్లకు కూడా ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. అలా మెల్లిగా మీ మాటలతోనే ఒక తలుపు తెరిచి వాళ్లకు చూపించినట్టవుతుంది కూడా.  ప్రపంచం పెద్దది!! మనుషులే చిన్నతనంతో ఉన్నారు!! ఆలోచిస్తే ఇదే నిజమని అనిపిస్తుంది. నిజానికి ఒకమనిషి బాగుపడితే చూసి సంతోషించేవాళ్ళు ఎక్కువ లేరు ఈ ప్రపంచంలో. ఎప్పుడూ అవతలి వాడిని ఎలా ముంచుదామా, వాడిది ఎలా లాక్కుందామా అనే ఆలోచనే తప్ప  అయ్యో ఇలా చేస్తే దారి కనబడుతుంది కదా వెళ్లి చెబుదాం అనుకునేవాళ్ళు ఎవరూ ఉండటం లేదు. ఎక్కడో, ఎవరో నూటికి ఒక్కరు ఉన్నా వాళ్ళ సాయం అందుకునే వాళ్ళు ఏ కొద్దీ మందో అంతే. మిగిలినవాళ్లకు పైన చెప్పుకున్నట్టు సంఘర్షణే మిగుల్తోంది. అందుకే మనుషులు తమ మనసును కాసింత పెద్దగా చేసుకోవాలి. అందులో ఎన్నో హృదయాలకు ప్రేమను పంచాలి. ఆ ప్రేమను అందుకున్న వాళ్ళు నిస్సహాయత నుండి బయటకొస్తారు నేస్తాల్లారా!! ◆వెంకటేష్ పువ్వాడ.
ఢిల్లీకి రాజైనా అమ్మకు కొడుకే అంటారు. అందుకే అవతార పురుషుడైనా ఓ అమ్మకు కొడుకే అంటూ పాటను రాశారు రచయితలు. బ్రహ్మకు మారు పేరు అమ్మ. మనకు దెబ్బ తగిలినా వెంటనే అమ్మా అని అంటాము. అంటే మనకు ఆనందం కలిగినా..బాధ కలిగినా వెంటనే అమ్మ గుర్తొస్తుంది. రెండు గంటల పాలు మనల్ని వినోదంలో ముంచెత్తే మన తారలైనా అమ్మకు ముద్దుల బిడ్డలే. మన తెరవేల్పుల్లో చాలా మంది అమ్మతో అనుబంధం గురించి వేదికలపైనో ప్రెస్ మీట్‌లలోనో చెబుతూ ఉంటారు. మన హీరోలు వాళ్ల అమ్మతో దిగిన చిత్రమాలిక మీ కోసం..   అమ్మ రమాబాయితో  రజనీకాంత్ అమ్మ అంజనాదేవితో  చిరంజీవి, నాగబాబు    అమ్మ అంజనాదేవితో  పవన్ కళ్యాణ్  అమ్మ ఇందిరాదేవితో  మహేశ్  అమ్మ షాలినితో ఎన్టీఆర్ అమ్మ రాజ్యలక్ష్మీతో  రవితేజ అమ్మ శివకుమారితో  ప్రభాస్  అమ్మ సురేఖతో రామ్‌చరణ్ అమ్మ నిర్మలతో అల్లు అర్జున్, అల్లు శిరీష్ అమ్మ విజయలక్ష్మీతో నాని
ప్రస్తుత పోటీ ప్రపంచంలో ఉద్యోగం సంపాదించడం కాస్త కష్టమైన పనే. చదివిన చదువుకు ప్రభుత్వ ఉద్యోగాల కోసం నిరీక్షించేవారు ప్రస్తుతం తక్కువే. పట్టణాలలో మంచి మంచి కంపెనీలలో గౌరవప్రదమైన వేతనంతో, హుందాగా ఉండే ఉద్యోగాలు చాలానే ఉన్నాయి. చాలామంది ఆ ఉద్యోగాల విషయంలో కూడా గందరగోళానికి గురవుతూ ఉంటారు. కారణం ఇంటర్వ్యూ లో సక్సెస్ కాకపోవడం. ఎంతో బాగా చదివి, మంచి ర్యాంక్ లు సాధించిన వారు కూడా ఇంటర్వ్యూ దగ్గరకు వచ్చేసరికి ఫెయిల్ అవుతూ ఉంటారు. మరి ఇంటర్వ్యూ లో సక్సెస్ కావాలంటే ఏమి చేయాలి??  ఎంపిక: కొంతమంది ఖాళీగా ఉన్నాం ఏదో ఒక జాబ్ తొందరగా చూసుకోవాలి, ఏదో ఒకటి క్లిక్ అవ్వకపోతుందా అనే ఆలోచనతో వరుసపెట్టి అన్నిటికి అప్లై చేసేస్తూ ఉంటారు. దీనివల్ల నెలకొనేదే పెద్ద గందరగోళం. కాన్ఫిడెంట్ లేకుండా పది కంపెనీలలో ఇంటర్వ్యూ కు వెళ్లడం కంటే కాన్ఫిడెంట్ తో ఒక్కదానికి అటెండ్ అవ్వడం మంచిదనే విషయం మర్చిపోకండి.  నాట్ ఓన్లీ దట్: ఇంటర్వ్యూ కాల్ వచ్చినప్పటి నుండి అందరూ చేసే పని, తాము అప్లై చేసిన జాబ్ కు సంబంధించిన ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా మననం చేసుకుంటూ వాటిని బట్టి పట్టడం. దీనివల్ల ఒనగూరేది ఏమి ఉండదు. ఎందుకంటే వాటిని మననం చేసుకుంటూ మిగిలిన వాటిని ఎంతో సులువుగా మర్చిపోయే అవకాశం ఉంటుంది. పైపెచ్చు ఇంటర్వ్యూ లో ఎలాంటి ప్రశ్నలు అడుగుతారు అనేది సంస్థకు సంబంధించిన వారి ఇష్టం. వారు పూర్తి జాబ్ కు సంబంధం లేని విషయం అయినా అడగవచ్చు. ఎందుకంటే వాళ్లకు కావలసింది పని చేయడం మాత్రమే కాదు అనే విషయం గుర్తుంచుకోవాలి. కాబట్టి వర్క్ కు సంబంధించిన విషయాలు ఒక అంశం మాత్రమే. మరింకేం కావాలి?? నమ్మకం ఇవ్వగలగాలి. బాధ్యతాయుతంగా ఉండగలరు అనే నమ్మకాన్ని ఇవ్వగలగాలి. చాలా సంస్థల్లో మొదట ప్రాధాన్యత ఇచ్చే విషయం కూడా ఇదే.  పని చేయబోయే సంస్థ  విషయంలో, చేయబోయే వృత్తి విషయంలో ఎంత బాధ్యతాయుతంగా ఉండగలరు అనే విషయం మీదనే ఎంపిక ఎక్కువగా జరుగుతుంది. అలాగే పని పట్ల నిబద్ధత ఎంతో అవసరం. పనికి ప్రాధాన్యత ఇచ్చేవారి వైపు కంపెనీ మొగ్గు చూపుతుంది. కాబట్టి పని విషయంలో భరోసా ఇవ్వగలగాలి. స్పృహ కలిగి ఉండాలి: ఇంటర్వ్యూకు వెళ్ళినప్పుడు కంపెనీ భవంతిలో అడుగుపెట్టినప్పటి నుండి చుట్టుపక్కల వాతావరణం ను గమనించుకుంటూ వెళ్ళాలి. కంపెనీలలో ప్రతిచోటా సీసీ కెమెరాల నిఘా ఉంటుందనే విషయం మరువకూడదు. మనిషి కదలిక నుండి ఆహార్యం వరకు ప్రతి విషయంలో ఒక నిజాయితీ కనిపించాలి. నటించాలని చూస్తే ఖాళీ చేతులతో బయటకు రావడం ఖాయం. తన పని మాత్రమే చూసుకుని పోయే వాళ్లకు ప్రాధాన్యత తక్కువగానే ఉంటుంది. ఇంటర్వ్యూ రూమ్ దగ్గరకు వెళ్లే మార్గంలో ఉన్న క్యాబిన్ లలో ఎవరు లేకుండా ఉండి, ఫ్యాన్ లు, లైట్ లు వంటివి ఆన్ లో ఉంటే వాటిని ఆఫ్ చేయడం. నీటిని వృథా చేయకపోవడం, లిఫ్ట్ సౌకర్యం ఉన్నా మెట్లెక్కి వెళ్లడం. మంచినీళ్లు వంటివి ఇచ్చే బాయ్ ని నవ్వుతూ పలకరించడం, థాంక్స్ చెప్పడం. ముఖ్యంగా సంస్థ గూర్చి ఇంటర్వ్యూ కు వచ్చిన తోటి వ్యక్తులతో ఎలాంటి చర్చా చేయకుండా ఉండటం. సంస్థ గురించి ముందుగానే వివరంగా తెలుసుకోవడం. అంటే సంస్థ స్థాపన నుండి ప్రస్తుతం అధికారుల వరకు అన్నిటి గూర్చి వారి కృషి గురించి కూడా అధ్యయనం చేసి తెలుసుకోవడం. స్కిల్స్ ఎప్పుడు కిల్ చేయకూడదు: కమ్యూనికేషన్ స్కిల్స్ చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. ఇంటర్వ్యూ లో అధికారులతో మాట్లాడేటపుడు కావాలని వారిని ఇంప్రెస్ చేయడానికి ప్రయత్నించకూడదు. లేకపోతే మీ స్కిల్స్ ను మీరే కిల్ చేసుకున్నట్టు అవుతుంది.  ముందుగా మరింత ఉత్సాహంగా: ఇక చివరగా చెప్పుకున్నా అన్నిటికంటే ముందు చేయవలసిన పని. ఇంటర్వ్యూ కు హడావిడిగా చివరి నిమిషంలో వెళ్లకుండా, వీలైనంత ముందుగా వెళ్లడం. దీనివల్ల కంపెనీని అక్కడి వాతావరణాన్ని, పని విధానాన్ని అంతో ఇంతో గమనించే వెసులుబాటు ఉంటుంది. తద్వారా సహజంగానే గందరగోళం తగ్గిపోతుంది.  ట్రస్ట్ యువర్ కాన్ఫిడెన్స్: మీ ఆత్మవిశ్వాసాన్ని మీరు నమ్మండి. ఎవరో ఏదో భయపెట్టేలా చెప్పే మాటలు, విషయాలు ఏవి పరిగణలోకి తీసుకోవలసిన అవసరం లేదు. మీరు ఖచ్చితంగా ఉన్నట్లయితే, మీ వ్యక్తిత్వం నుండి, పని విషయం వరకు మీ అభిప్రాయాలు నచ్చాయంటే ఏ కంపెనీ ఎం.డి కూడా మిమ్మల్ని వదులుకోడు.  సక్సెస్ మీ చేతుల్లోనే ఉంది సుమా!! ◆ వెంకటేష్ పువ్వాడ
భోజన ప్రియులకి నెయ్యి లేదా అంటూ ఉంటారు. నెయ్యి లేనిదే ముద్ద దిగదు.నెయ్యి తో పోపు పెట్టిన ఆహారం,నెయ్యితో కాల్చిన చపాతి నెయ్యితో కాల్చిన పెసరట్టు తప్ప మరేది వద్దు అంటూ ఉంటారు.ఇక కొంతమంది అయితే ముఖ్యంగా స్వీట్స్ లో నెయ్యి కారుతూ ఉండాలి. ముఖ్యంగా బొబ్బట్లు, బూరెలు  కూడా నెయ్యి తో చేసినవే బాగుంటాయి అంటారు భోజన ప్రియులు నెయ్యితో చేసిన పదార్ధాలు ఆస్వాదిస్తూ తిన్నప్పుడే వాటి మజా ఉంటుందని నిపుణులు అభిప్రాయ పడ్డారు. ముఖ్యంగా దక్షణాది రాష్ట్రాలలో కుటుంబంలో పెళ్ళి ళ్ళు శుభకార్యాలలో సంబంధాలు కోసం వెళ్ళినప్పుడు మా నానమ్మ నెయ్యి వెన్నతో పెట్టింది.మీరేం పెడతారు చెప్పండి అంటు అడగడం అనాదిగా వస్తున్న ఆచారం. అయితే మీరు ఇలాగే గనక నెయ్యి తింటే వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ తెలిస్తే ఇకమీరు నెయ్యి జోలికే వెళ్ళరు. నెయ్యి ఆరోగ్యానికి ఎలా దోహదం చేస్తుందో మీకు బాగా తెలుసు.వినిఉండచ్చు. ఇది కేవలం యాంటి ఏజింగ్ మాత్రమే కాదు మనసు మెదడు ఆరోగ్యంగా ఉండడానికి లాభం కలిగించే అంశం అయితే నెయ్యి ప్రతి ఒక్కరికి సరిపడదు. అని అంటున్నారు నిపుణులు. భారత దేశం లో నెయ్యి చాలా ప్రాచుర్యం లో ఉంది.నెయ్యి కొంతమంది ప్రతిరోజూ తమ భోజనం లో చేరుస్తారు. నెయ్యి వాడడం కూడా చాలా కష్టం నేతిని బ్రెడ్ లో లేదా చపాతీలో పప్పు కూరలో నెయ్యిని ఎక్కువగా వినియోగిస్తారు. నెయ్యిని ఆయుర్వేదం లో ఎక్కువగా వాడడం గమనించవచ్చు.నెయ్యి ఆరోగ్య పరంగా మంచి ఉపయోగాలు ఉన్నాయి. గుండె సంబందిత ఆరోగ్యానికి లాభదాయకంగా ఉంటుంది.ఖాళీ పొట్టతో నెయ్యి తీసుకోవడం వల్ల చాలా లాభాలు ఉన్నాయి. శరీరంలో ఉన్న పంచెంద్రియాలలో శుభ్ర పరిచి ఉపసమనం ఇస్తుంది. నెయ్యిలో యాంటి ఏజింగ్ మరియు గుండె ను ఆరోగ్యంగా ఉంచే గుణాలు ఉంటాయి. కంటి ఆరోగ్యానికి నెయ్యి చాలా మంచిది దీనితో పాటు నెయ్యి మెదడు,జ్ఞాపక శక్తిని పెంచి పంచేంద్రియాలు చురుకుగా పని చేసేందుకు దోహదం చేస్తుంది.
  శరీరంలో ప్యూరిన్ పెరుగుదల కారణంగా యూరిక్ యాసిడ్ పెరగడం ప్రారంభమవుతుంది. అధిక యూరిక్ యాసిడ్‌తో బాధపడేవారు ఆహారం విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. తినడం,  త్రాగడంలో ఏ కొంచెం అజాగ్రత్తగా ఉన్నా కీళ్ళు,  ఎముకలలో నొప్పి, వాపు, పెరుగుతుంది. ప్యూరిన్ అనే రసాయనం శరీరంలో విచ్ఛిన్నమైతే, యూరిక్ యాసిడ్ ఏర్పడుతుంది. అతిగా తాగడం, తక్కువ శారీరక శ్రమ, ప్రొటీన్లు ఎక్కువగా ఉండే ఆహారం, ఆహారపు అలవాట్లలో అజాగ్రత్త కారణంగా యూరిక్ యాసిడ్ పెరుగుతుంది. వేసవిలో యూరిక్ యాసిడ్ ఎక్కువగా ఉన్న రోగులు ఏ పండ్లు తినాలో తెలుసుకుంటే.. బ్లాక్బెర్రీస్.. బ్లాక్బెర్రీస్  వేసవిలో సీజన్లో అందుబాటులో ఉంటాయి. యాంటీఆక్సిడెంట్ లు అధికంహా ఉన్న బెర్రీ పండ్లు  అధిక యూరిక్ యాసిడ్ ఉన్నవారికి  ప్రయోజనకరంగా ఉంటాయి.  బెర్రీలు జీవక్రియను పెంచడంలో,  శరీరాన్ని నిర్విషీకరణ చేయడంలో సహాయపడతాయి. ఇది శరీరంలో వాపును తగ్గిస్తుంది.  యాసిడ్ స్థాయి కూడా సమతుల్యంగా ఉంటుంది. అధిక యూరిక్ యాసిడ్ ఉన్నవారు  బ్లాక్బెర్రీస్ తినవచ్చు. చెర్రీలు.. యూరిక్ యాసిడ్ రోగికి చెర్రీలు కూడా  చాలా ఉపయోగకరంగా ఉంటాయి. ఆమ్లాన్ని నియంత్రించే మూలకాలు చెర్రీస్‌లో ఉంటాయి. విటమిన్ బి-6, విటమిన్ ఎ, విటమిన్ కె, విటమిన్ సి, విటమిన్ ఎ,  విటమిన్ బి రెడ్  చెర్రీస్‌లో ఉంటాయి. చెర్రీస్ అధిక యూరిక్ యాసిడ్‌ను తగ్గించే అనేక ఖనిజాలను కలిగి ఉంటుంది. అరటిపండు.. యూరిక్ యాసిడ్ ప్రమాదాన్ని నివారించాలనుకుంటే రోజూ అరటిపండ్లను తినడం మంచిది. అరటిపండ్లలో ప్యూరిన్ తక్కువగా ఉంటుంది. అరటిపండ్లు తినడం ద్వారా అధిక యూరిక్ యాసిడ్ తగ్గుతుంది. గౌట్ సమస్యలో అరటిపండ్లు కూడా మేలు చేస్తాయి. అరటిపండ్లు తినడం వల్ల శరీరానికి తక్షణ శక్తి కూడా అందుతుంది. కివీ.. పుల్లటి,  జ్యుసి పండ్లను తినడం వల్ల యూరిక్ యాసిడ్ పెరుగుతుంటే వాటి స్థానంలో  కివీని తినవచ్చు. కివి వినియోగం యూరిక్ యాసిడ్‌ను నియంత్రిస్తుంది. కివి తినడం వల్ల విటమిన్ సి, విటమిన్ ఇ, పొటాషియం,  ఫోలేట్ లభిస్తాయి. దీని వల్ల శరీరంలో పేరుకుపోయిన టాక్సిన్స్ తొలగిపోతాయి. కివిని రోజూ తినడం వల్ల యూరిక్ యాసిడ్ నియంత్రణలో ఉంటుంది. యాపిల్.. ఎండాకాలం అయినా, చలికాలం అయినా పండ్ల దుకాణంలో యాపిల్స్ ఎప్పుడూ దొరుకుతాయి. యాపిల్ ఫైబర్ అధికంగా ఉండే  పండు. ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. యాపిల్ రక్తంలో యూరిక్ యాసిడ్ పేరుకుపోకుండా నిరోధిస్తుంది. యాపిల్ తినడం వల్ల యూరిక్ యాసిడ్ ప్రభావం తగ్గుతుంది.  రోజువారీ పనులు చేయడానికి తగినంత  శక్తి అందిస్తుంది. ప్రతిరోజూ ఒక యాపిల్ తినాలని వైద్యులు సూచిస్తున్నారు.                                                *రూపశ్రీ.  
అరటి చాలా  శక్తివంతమైన పండు. దీన్ని తినడం వల్ల శరీరానికి ప్రాణశక్తి లభిస్తుంది. ఆకలిగా ఉన్నప్పుడు ఓ అరటిపండు తింటే చాలాసేపటి వరకు ఆకలి బాధ దూరంగా ఉంటుంది. ఇది మెత్తగా ఉండటం వల్ల చిన్న పిల్లల నుండి వృద్దుల వరకు ప్రతి ఒక్కరూ తినదగిన పండు. జీర్ణం కావడానికి సులువుగానే ఉంటుంది. ఎక్కువసేపు ఆకలిని అదుపులో ఉంచుతుంది. కండరబలాన్ని, పోషకాలను ఇస్తుంది. వర్కౌట్ తర్వాత అరటిపండు తినడం ఫిట్నెస్ ఫాలో అయ్యేవారికి తప్పనిసరి. పైపెచ్చు అరటిపండు మిగిలిన పండ్లతో పోలిస్తే ధర తక్కువే. కాబట్టి అందరూ కొనుక్కుని తినగలుగుతారు. కానీ  అరటిపండు అందరికీ మంచిది కాదు. ఆయుర్వేదంలో అరటిపండు కొంతమందికి ప్రమాదకరమైనదిగా పరిగణించబడుతుంది. అరటిపండు తినడం వల్ల ఎలాంటి లాభాలు కలుగుతాయో? దీన్ని ఎవరు తినకూడదో  తెలుసుకుంటే.. పోషకాలు.. అరటిపండు తినడం వల్ల  విటమిన్ సి, ఫైబర్, పొటాషియం, మాంగనీస్, విటమిన్ బి6తో పాటు గ్లూటాతియోన్, ఫినాలిక్స్, డెల్ఫిడినిన్, రుటిన్, నారింగిన్ అనే యాంటీ ఆక్సిడెంట్లు ఉన్నాయి. 80వ్యాధులకు చికిత్స చేయగలదు.. పోషకాహార నిపుణులు అరటిపండులో ఉన్న గొప్పదానాన్ని చెబుతూ ఇది 80రకాల వ్యాధులకు చికిత్స చేయగలదని పేర్కొన్నారు. అరటి పండు వాత పిత్త దోషాన్ని సమతుల్యం చేస్తుంది. వాతం క్షీణించడం వల్ల దాదాపు 80 రకాల వ్యాధులు వస్తాయని ఆయుర్వేదంలో చెప్పబడింది. ఇది పొడిబారడం, ముడతలు పడటం, ఎముకలలో అంతరం, మలబద్ధకం, చేదు రుచి మొదలైన అనేక సమస్యలు ఇందులో ఉన్నాయి. వీటన్నింటికి అరటిపండు చికిత్స చేయగలుగుతుంది. అరటిపండు ఎవరు తినాలంటే.. ఆయుర్వేదం ప్రకారం అరటిపండు  చల్లని గుణం కలిగి ఉంటుంది. ఇది  జీర్ణం కావడానికి బరువుగా ఉంటుంది.   ఇది లూబ్రికేషన్‌గా పనిచేస్తుంది. శరీరం ఎండిపోయి, ఎప్పుడూ అలసిపోయినట్టు, బాగా నిద్రపోనట్టు, శరీరంలో ఎప్పుడూ మంటగా ఉన్నట్టు అనిపించేవారు, చాలా దాహంతో ఉన్నవారు,  ఎక్కువ  కోపంగా ఉన్నవారు అరటిపండును తినాలి. దీనివల్ల ఆ కోపస్వభావం, అతిదాహం వంటి సమస్యలు అణిచివేయబడతాయి. ఎవరు తినకూడదంటే.. అరటిపండు కఫ దోషాన్ని పెంచుతుంది. కాబట్టి అధిక కఫ శరీర తత్వం గలవారు దీనిని తినకూడదు. పెరిగిన కఫం కారణంగా జీర్ణాశయంలో  అగ్నితత్వం  బలహీనంగా ఉంటే అరటి పండు దానిని మరింత నెమ్మదిస్తుంది. అధిక కొవ్వు, దగ్గు,  జలుబు ఉన్నవారు, ఆస్తమా రోగులు దీనిని తినకూడదు. ఒకవేళ తినాలని అనిపిస్తే  చాలా ఆలోచించి దీని పర్యావసానాలు ఎదుర్కొనేందుకు సిద్దంగా ఉంటేనే తినాలి.                                              *నిశ్శబ్ద