LATEST NEWS
శ్రీ సత్య సాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గం గోరంట్ల మండల కేంద్రంలో  అశేష జనవాహిని మధ్య పెనుకొండ తెలుగుదేశం అభ్యర్థి శ్రీమతి సవితమ్మ ఎన్నికల ప్రచారం అద్భుతమైన రీతిలో జరుగుతోంది. ఉత్తేజం కలిగించే తెలుగుదేశం పార్టీ పాటలు మైకులలో వినిపిస్తూ వుండగా, తెలుగుదేశం కార్యకర్తలు పసుపుపచ్చ కండువాలను గాలిలో ఊపుతూ సందడి చూస్తూ ప్రచార కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.  ఈ రోడ్ షో కార్యక్రమంలో పెనుకొండ నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీమతి సవితమ్మ, ఎంపీ అభ్యర్థి బీకే పార్థసారథి, మాజీ ఎంపీ నిమ్మల కిష్టప్ప, బిజెపి జిల్లా అధ్యక్షులు జిఎం శేఖర్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున తెలుగుదేశం జనసేన బిజెపి పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు
జగన్ మళ్ళీ అధికారంలోకి వస్తే తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబు నాయుడిని చంపిస్తాడా? అవునని అంటున్నాడు వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో అప్రూవర్‌గా మారిన దస్తగిరి. జగన్ మళ్ళీ అధికారంలోకి వస్తే కచ్చితంగా చంద్రబాబుని హత్య చేయిస్తాడని దస్తగిరి కుండ బద్దలు కొట్టాడు. ఒక టీవీ ఛానల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో దస్తగిరి ఈ సంచలన వ్యాఖ్యలు చేశాడు. తన వెనుక చంద్రబాబు వున్నాడని జగన్, అతని అనుచరులందరూ ఆరోపణలు చేస్తూ వుంటారని, వాటిలో ఎంతమాత్రం నిజం లేదని దస్తగిరి చెప్పాడు. చంద్రబాబుతో తనకు ఏదైనా లావాదేవీ వుంటే, ఈ ఐదేళ్లలో మీ పార్టీనే అధికారంలో వుంది కదా? ఆధారాలతో సహా బయటపెట్టి వుండొచ్చు కదా అని జగన్‌ని దస్తగిరి ప్రశ్నించాడు. జగన్ మళ్ళీ అధికారంలోకి వచ్చాడంటే చంద్రబాబుతోపాటు తనని, సునీతని, మరికొందరిని తప్పకుండా చంపిస్తాడని దస్తగిరి అన్నాడు. ఈ ఘోరాలు జరగకుండా వుండాలనే తాను మళ్ళీ జగన్ అధికారంలోకి రాకూడదని, టీడీపీ కూటమి అధికారంలోకి రావాలని కోరుకుంటున్నానని దస్తగిరి అన్నాడు. ఈ ఐదేళ్ళుగా జరిగిన దారుణాలు ఆగిపోవాలంటే జగన్ ప్రభుత్వానికి చరమగీతం పాడాలని దస్తగిరి అభిప్రాయపడ్డాడు. నేను హత్య చేశాను అని ధైర్యంగా చెబుతున్నానని, ఈ కేసులో లేనివాళ్ళని ఇరికించాల్సిన అవసరం తనకు లేదని దస్తగిరి వివరించాడు.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ రాసలీలలు అన్నీ ఇన్నీ కావు. అమ్మాయిలంటే పడి చచ్చే ట్రంప్‌,  వారితో శారీరక సంబంధాల్ని కొన‌సాగించేవాడు. అధ్య‌క్ష‌ప‌ద‌వి చేప‌ట్ట‌క‌ముందు ప‌లువురు స్త్రీల‌తో శారీర‌క సంబంధాన్ని నెరిపిన ట్రంప్ ఆ త‌రువాత అధ్య‌క్ష ప‌ద‌వి పోటీ చేయాల‌నే ఉద్దేశంతో ..తాను స‌న్నిహితంగా ఉన్న మ‌హిళ‌లంద‌రిని దూరంగా పెట్టాడు. ట్రంప్ అధ్య‌క్ష ఎన్నిక‌ల్లో పోటీ చేసి గెల‌వ‌గా.. ఇప్పుడిప్పుడే ఇత‌ర స్త్రీల‌తో నెరిపిన అక్ర‌మ‌సంబంధాలు ఒక్కొక్క‌టిగా వెలుగులోకి వ‌స్తున్నాయి. గతంలో ట్రంప్ ఓ శృంగార తార వెంటపడ్డారు. ఆమె అమెరికాలో పేరు ఉన్న పెద్ద పోర్న్‌ స్టార్‌. ఆమెతో ఒకటి రెండు సార్లు ఆయన తన రాస‌లీల‌లు కొనసాగించారు.  ఈ విష‌యాన్ని బ‌య‌ట పెట్ట‌కుండా వుండ‌టానికి తన లాయర్‌ మైఖేల్‌ కోహెన్‌ ద్వారా లక్షా 30 వేల డాలర్లు  ఆమెకు పంపి- ‘మన బంధంపై నోరెత్తవద్దు’ అని కోరారు. ఆమె ఆయన చెప్పినట్లే ఆయనతో సెక్స్‌ బంధంపై మౌనం దాల్చింది. కానీ ఈ చెల్లింపు మాత్రం బయటకు పొక్కింది. ట్రంప్‌ రసికత వెల గురించి వాల్‌స్ట్రీట్‌ జర్నల్‌ ఓ కథనాన్ని ప్రచురించింది. అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌తో ఏకాంతంగా గడిపానని శృంగార తార స్టార్మీ డేనియల్స్ గుట్టు ర‌ట్టు చేసింది. ట్రంప్‌ను తానెలా కలిసిందీ.. ఇద్దరి మధ్య శృంగారం ఎలా జరిగిందీ తదితర వివరాలను కోర్టులోని జ్యూరీ సభ్యులకు ఆమె తెలిపారు.  అధ్యక్ష ఎన్నికల సమయంలో తనకు వ్యతిరేకంగా మాట్లాడకుండా అడ్డుకోవడానికి ట్రంప్‌ అడ్డదారులు తొక్కారనే ఆరోపణలపై విచారణ జరుగుతున్న క్రమంలో న్యూయార్క్‌ కోర్టులో ఆమె వాంగ్మూలం ఇచ్చారు. ట్రంప్ త‌న‌ అంగరక్షకుడి ద్వారా డిన్నర్‌కు ఆహ్వానం పంపారు.  ఆయ‌న హోటల్‌ గదికి వెళ్లాను. అప్పుడు ఆయన సిల్క్‌ దుస్తుల్లో ఉన్నారు. ఆయన వస్త్రధారణ చూసి నాకు నవ్వొచ్చింది. దాంతో ఆయన షర్ట్‌, ప్యాంట్‌ వేసుకున్నారు. నేను బాత్రూమ్‌కు వెళ్లాను. తిరిగి వచ్చేసరికి ఆయన టీషర్ట్‌, షార్ట్‌లోకి మారిపోయారు. అప్పుడే ట్రంప్‌ భార్య ప్రస్తావన వచ్చింది. అందుకు ఆయన అంతగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తాను, తన భార్య ఒకే గదిలో ఉండటం లేదని చెప్పారు. కండోమ్‌ లేకుండానే ట్రంప్‌ నాతో శృంగారంలో పాల్గొన్నారు. ఆ సమయంలో నా వయసు 27 ఏళ్లు.. ట్రంప్‌ వయసు నా తండ్రి కంటే ఎక్కువ ఉంటుందేమో’’ అంటూ వివరంగా ఆ రోజు ఏం జరిగిందో 45 ఏళ్ల స్టార్మీ డేనియల్స్‌ చెప్పారు.  ట్రంప్‌తో సంభోగాన్ని బయటపెట్టకుండా ఉండేదుకు 2016 ఎన్నికల సమయంలో 1 ల‌క్షా 30 వేల డాలర్ల మొత్తాన్ని ట్రంప్‌ న్యాయవాది మైఖేల్‌ కోహెన్‌ నుంచి స్వీకరించానని తన వాంగ్మూలంలో ఆమె పేర్కొన్నారు. 2006లో తాను ట్రంప్​తో లైంగికంగా కలిసినట్టు ఆమె​ తెలిపారు. ఇది ట్రంప్​ మూడో పెళ్లి మిలానియాతో జరిగిన ఏడాది అనంతర ఘటన! సరిగ్గా ఇక్కడి నుంచి దశాబ్ద కాలం తర్వాత డొనాల్డ్​ ట్రంప్​.. అమెరికా అధ్యక్షుడయ్యారు. - ఎం.కె.ఫ‌జ‌ల్‌
రైతుల ఆస్తులను కొల్లగొట్టేందుకు ఉద్దేశించిన లాండ్ టైటిలింగ్ యాక్ట్.ని ఎట్టి పరిస్థితుల్లోనూ అమలుచేయాలని జగన్ ప్రభుత్వం మొండి పట్టుదలతో వున్న నేపథ్యంలో, ఈసారి ఎన్నికలలో జగన్‌కి ఓటే్స్తే మీ ఆస్తి జగన్‌కి రాసిచ్చినట్టే అని చెప్పే స్టాంప్ పేపర్ సోషల్ మీడియాలో హల్‌చల్‌ చేస్తోంది. ‘‘2024 సంవత్సరం, మే నెల 13న ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు ఫ్యాన్ గుర్తుపై నొక్కడం ద్వారా యావదాస్తిని దానంగా ఇస్తున్నాం. ఇక మీదట మాకు, మా కుటుంబ సభ్యులకు ఈ ఆస్తితో ఎలాంటి సంబంధం లేదు. ఇందులో ఎవరి ప్రమేయం లేదు. నాకు తెలిసి విజ్ఞతతో తీసుకున్న నిర్ణయం’’ అంటూ జగన్ ఫొటో వాటర్‌ మార్కుగా వున్న వంద రూపాయల స్టాంపు పేపర్ మీద రాసి వుంది. స్టాంపు పేపర్ మీద జగన్ ఫొటో, ఫ్యాన్ గుర్తు, మరోపక్క లాండ్ టైటిలింగ్ యాక్ట్.కి సంబంధించిన లోగో వుంది. సోషల్ మీడియాలో వైరల్ అయిన ఈ స్టాంప్ పేపర్ మీద ప్రజల్లో చర్చ జరుగుతోంది.
జగన్ విదేశీ పర్యటనకు అనుమతి ఇవ్వవద్దంటూ సీబీఐ గట్టిగా అభ్యంతరం చెప్పింది.  ఎన్నికలు పూర్తి కాగానే కుటుంబంతో సహా విదేశీ పర్యటనకు అనుమతించాలంటూ జగన్ సీబీఐ కోర్టును అభ్యర్థించిన సంగతి తెలిసిందే. రాష్ట్రంలో మే 13న పోలింగ్ జరుగుతుంది. ఆ తరువాత మే 17న కుటుంబంతో సహా విదేశీ పర్యటనకు వెళ్లాలని భావించిన జగన్ అభ్యర్థనను అంగీకరించవద్దని సీబీఐ గట్టిగా అభ్యంతరం వ్యక్తం చేసింది. జగన్ పై 11 కేసులు విచారణలో ఉన్నాయనీ ఈ సమయంలో ఆయన విదేశీ పర్యటనకు అనుమతించవద్దనీ సీబీఐ కోర్టులో దాఖలు చేసిన అఫిడివిట్ దాఖలు చేసింది. సీబీఐ కోర్టులో దాఖలు చేసిన అఫిడవిట్లో నేరుగా చెప్పకపోయినా.. ఆయన విదేశాలకు వెడితే తిరిగి వస్తారన్న నమ్మకం లేదని అర్ధం వచ్చేలాగే పేర్కొంది. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే..జగన్ విదేశీ పర్యటనకు అనుమతి కోరుతూ కోర్టును ఆశ్రయించగానే  తెలుగుదేశం కూటమి నేతలు జగన్ పలాయనానికి రెడీ అయిపోయారని వ్యాఖ్యలు చేశారు. సరిగ్గా సీబీఐ కూడా నేరుగా కాకపోయినా పరోక్షంగా కోర్టుకు తన అఫిడవిట్ లో అదే చెప్పింది. మే 15వ తేదీన జగన్ ప్రధాన కేసు విచారణ ఉందనీ, ఆ విచారణకు ఆయన హాజరు కావాల్సి ఉందని సీబీఐ పేర్కొంది. అయితే జగన్ తరఫు న్యాయవాదులు యథాప్రకారం వితండ వాదనే చేశారు. విదేశాలకు వెళ్లే హక్కు రాజ్యాంగం కల్పించిందనీ, దానిని కాలరాయడమేంటని వాదించారు. వాస్తవానికి జగన్ ప్రస్తుతం కండీషనల్ బెయిలుపై ఉన్నారు.  బెయిలు షరతుల్లో అనుమతి లేకుండా విదేశాలకు వెళ్లకూడదన్నది ఒకటి. అలాంటి సమయంలో విదేశీయానాన్ని అడ్డుకోవడం హక్కును కాలరాయడం అవుతుందని వాదించడం విచిత్రమేనని న్యాయనిపుణులు అంటున్నారు. ఇరువైపు వాదనలూ విన్న మీదట కోర్టు తదుపరి విచారణను మే 14కు అంటే పోలింగ్ తరువాతి రోజుకు వాయిదా వేసింది. గతంలో జగన్ విదేశీయానానికి అనుమతి అడిగిన ఏ సందర్భంలోకూ కోర్టు వాయిదా వేయకుండా వెంటనే అనుమతి ఇచ్చింది. ఈ సారి మాత్రం వాయిదా వేయడంతో జగన్ అభ్యర్థనను కోర్టు అంగీకరించే అవకాశాలున్నాయా? లేవా అన్న చర్చ జోరందుకుంది.  
ALSO ON TELUGUONE N E W S
మూవీ : ఆవేశం నటీనటులు: ఫహద్ ఫాజిల్, హిప్ స్టర్, మిథున్ జై శంకర్, రోషన్ షానవాస్, షాజిన్ గోపు, మన్సూర్ అలీఖాన్ తదితరులు ఎడిటింగ్: వివేక్ హర్షన్ మ్యూజిక్: శుసిన్ శ్యామ్ సినిమాటోగ్రఫీ: సమీర్ తాహిర్ నిర్మాతలు: నజ్రియా నాజిమ్, అన్వర్ రషీద్ రచన, దర్శకత్వం: జీతూ మాధవన్ ఓటీటీ : అమెజాన్ ప్రైమ్ వీడియో కథ : బెంగుళూరులోని ఒక ఇంజనీరింగ్ కాలేజీలో చదువుకునేందుకు కేరళకి చెందిన బిబి (మిథున్ జెఎస్), శాంతన్(రోషన్ షానవాస్), అజు(యూట్యూబర్ హిప్ స్టర్) వస్తారు. ఈ ముగ్గురు ముందు తెలియకపోయినా అక్కడికి వెళ్ళాక కలిసిపోతారు. అయితే అదే కాలేజీలోని సీమియర్ బ్యాచ్ వారిని ర్యాగింగ్ పేరుతో తీవ్రంగా అవమానిస్తారు. అక్కడ వారికి సపోర్ట్ లేకపోవడంతో ఆ ముగ్గురు కలిసి లోకల్ గూండా రంగ(ఫహద్ ఫాజిల్) ని సంప్రదిస్తారు. రంగది డిఫరెంట్ క్యారెక్టర్. ప్రేమ, కోపం అన్నీ ఎక్కువగా ప్రదర్శిస్తుంటాడు. ర్యాగింగ్ విషయం తెలుసుకున్న రంగ ఆ సీనియర్ గ్యాంగ్ కి బుద్ధి చెప్తాడు. దాంతో అజు, బిబి, శంతనులపై రంగా మనుషులనే ముద్ర పడుతుంది. కాలేజీలోనూ వారి హావా సాగుతుంది. తర్వాత చదువు నిర్లక్ష్యం చేయడంతో అన్ని సబ్జెక్టులలో ఫెయిల్ అవుతారు. దాంతో కాలేజ్ డైరెక్టర్ పిలిచి ఆఖరి అవకాశం ఇస్తాడు. ఇక ఆ ముగ్గురు రంగాకి దూరంగా వెళ్ళి చదువుకోవాలనుకుంటారు కానీ రంగా వారిని వదిలిపెట్టడు. మరి ఆ ముగ్గురు ఏం చేశారు? మొదట ఆ ముగ్గురికి సపోర్ట్ చేసిన రంగానే వారిని ఎందుకు చంపాలనుకున్నాడు? తెలియాలంటే ఈ సినిమా చూడాల్సిందే. విశ్లేషణ:  కొన్ని ఇంజనీరింగ్ కాలేజీలలో ర్యాగింగ్ అనేది మాములుగా ఉంటుంది. అయితే కొంతమంది సీనియర్స్ చేసే ర్యాగింగ్ కి తట్టుకోలేక కొత్తగా వచ్చిన విద్యార్థులు తీవ్రంగా ప్రభావితం అవుతున్నారు. వారిలోని తిరుగుబాటు కొన్నిసార్లు వారి జీవితాలపై ప్రభావం చూపుతుంది. దానినే తెరపై ఆవిష్కరించాడు దర్శకుడు. తమకి జరిగిన అవమానానికి ప్రతీకారం తీర్చుకోవడానికి ముగ్గురు కుర్రాళ్ళు కలిసి రంగా అనే రౌడీతో డీలింగ్ కుదుర్చుకోవడం.. అతను సీనియర్స్ కి బుద్ది చెప్పడం అంతా బాగుంటుంది.  రంగా పాత్రకు నెగెటివ్ షేడ్స్ తో పాటు కామెడీ, అతిగా స్పందించే తీరు అన్నీ కలిసి ప్రేక్షకుడికి నచ్చేస్తుంది. అతను నెక్స్ట్ ఎలా రియాక్ట్ అవుతాడో అనే ఉత్సుకత సీన్ మారే కొద్ది పెరిగిపోతుంది. ముగ్గురు కుర్రాళ్ళతో కలిసి రంగా చేసే సీన్లు సాధారణంగా ఉన్నా .. ఫహద్ ఫాజిల్ ఎనర్జీని ఫస్ట్ నుండి లాస్ట్ వరకు వన్ పర్సెంట్ కూడా తగ్గకివ్వకుండా చూసుకున్నాడు దర్శకుడు. గ్యాంగ్ స్టర్ గా రంగా ఎలా మారాడని తెలిపే సీన్లు కాస్త స్లోగా అనిపిస్తాయి.  సినిమా ప్రథమార్ధంలో మొదటి ముప్పై నిమిషాలు మాములుగా సాగుతుంది. ఎప్పుడైతే రంగా పాత్ర పరిచయం అవుతుందో అక్కడి నుండి కథ పరుగులు తీస్తుంది. మన తెలుగు సినిమాలలోని కొన్ని సీన్లని వాడుకున్నట్టుగా అనిపిస్తుంది. అవేంటనేది 'ఆవేశం' చూస్తేనే తెలుస్తుంది. కథ సెకండాఫ్ లో కాస్త స్లోగా సాగినా క్లైమాక్స్ ముగించిన తీరు కన్విన్సింగ్ గా ఉంటుంది. యాక్షన్ సీన్లకి కొదవలేదు. రంగా గ్యాంగ్ కి అతడి ప్రత్యర్థి గ్యాంగ్ కి మధ్య వచ్చే ఫైట్ సీన్లు మెప్పిస్తాయి. మదర్ సెంటిమెంట్ సినిమాకి అదనపు బలాన్ని చేకూర్చింది. అడల్ట్ సీన్లు లేవు. అసభ్య పదజాలం వాడలేదు. నిర్మాణ విలువలు బాగున్నాయి. శుసిన్ శ్యామ్ మ్యూజిక్ ఆకట్టుకుంది. సమీర్ తాహిర్ సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటింగ్ నీట్ గా ఉంది.  నటీనటుల పనితీరు: కాలేజ్ కుర్రాళ్ళుగా హిప్ స్టర్, మిథున్, రోషన్ చక్కగా నటించారు. గ్యాంగ్ స్టర్ రంగా పాత్రలో ఫహద్ ఫాజిల్ నటన మరో స్థాయిలో ఉంది. మొదటి ముప్పై నిమిషాల తర్వాత సినిమా మొత్తం రంగా పాత్రే కన్పిస్తుంది. ఇక మిగతా వారు వారి పాత్రల పరిధి మేర నటించారు. ఫైనల్ గా..   ఫహద్ ఫాజిల్ ఆవేశం ప్రేక్షకుడికి గూస్ బంప్స్ తెప్పిస్తుంది.  రేటింగ్ : 3.25/5 - దాసరి మల్లేశ్
ఎన్నికలు దగ్గర పడుతుండడంతో వివిధ రాజకీయ పార్టీలు తమదైన శైలిలో ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు. ఎ.పి.లో మే 13న జరిగే ఎన్నికలపైనే అందరి దృష్టీ ఉంది. ముఖ్యంగా పవన్‌కళ్యాణ్‌ పోటీ చేస్తున్న పిఠాపురం నియోజకవర్గం ప్రత్యేతను సంతరించుకుంది. దీంతో అతనికి మద్దతుగా స్వయంగా మెగాస్టార్‌ ఫ్యామిలీ ప్రచారంలోకి దిగుతోంది. ముందుగా చిరంజీవి స్వయంగా ఓ వీడియోను రిలీజ్‌ చేశారు. తమ్ముడికి ఓటు వేయమని మెగాస్టార్‌ రిక్వెస్ట్‌ చేశారు.  ప్రస్తుతం రామ్‌చరణ్‌, నాని వంటి హీరోలు కూడా సోషల్‌ మీడియా వేదికగా పవన్‌కళ్యాణ్‌కు మద్దతు ప్రకటించారు. ఆల్రెడీ సాయిధరమ్‌ తేజ్‌, వరుణ్‌ తేజ్‌, వైష్ణవ్‌ తేజ్‌ వంటి హీరోలు ప్రచారం జోరుగా చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు తాజాగా అల్లు అర్జున్‌ కూడా ఓ ట్వీట్‌ ద్వారా పవన్‌కళ్యాణ్‌ను సపోర్ట్‌ చేస్తున్నట్టు ప్రకటించారు. ఇప్పుడీ ట్వీట్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.  ‘మీ ఎన్నికల ప్రయాణం సజావుగా సాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సేవకే అంకితమై  మీరు ఎంచుకున్న మార్గం పట్ల నాకెప్పుడూ గర్వంగానే ఉంటుంది.. ఓ కుటుంబ సభ్యుడిగా నేను ఎప్పుడూ మీతోనే ఉంటాను.. మీరు అనుకున్నది సాధించాలని కోరుకుంటున్నాను’ అని బన్ని తన ట్వీట్‌లో ఆకాంక్షించారు.
తెలుగు రాజకీయాల్లో చెరగని ముద్ర వేసిన నాయకులు తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు. ఆయనొక విజనరీ. ముఖ్యమంత్రిగా ఆయన చేపట్టిన సంస్కరణలు, భావి తరాల భవిష్యత్తుకు వేసిన బాటలు చరిత్ర. తెలుగు జాతి ఉన్నతికి కృషి చేసిన ఆయన జీవితంపై ఓ బయోపిక్‌ తెరకెక్కింది. నారా చంద్రబాబు నాయుడు జీవితం ఆధారంగా రూపొందిన బయోపిక్‌ ‘తెలుగోడు’. ప్రపంచంపై తెలుగోడి సంతకం అనేది ఉపశీర్షిక. విజయవాణి ప్రొడక్షన్స్‌ పతాకంపై చీలా వేణుగోపాల్‌ సమర్పణలో సినిమా తెరకెక్కింది. కథ, కథనం, మాటలు అందించడంతో పాటు స్వీయ దర్శకత్వంలో డాక్టర్‌ వెంకీ మేడసాని ఈ చిత్రాన్ని నిర్మించారు. యూట్యూబ్‌లో సినిమాను విడుదల చేశారు. గురువారం ఉదయం విడుదలైన ఈ సినిమా సామజిక మాధ్యమాల్లో సంచలనం సృష్టిస్తోంది. చిత్రసీమలో ఎటువంటి నేపథ్యం గానీ, అనుభవం గానీ లేని హెయిర్‌ ట్రాన్స్‌ప్లాంట్‌ సర్జన్‌ వెంకీ మేడసాని... తొలి ప్రయత్నంలో తెలుగు ప్రజానీకంపై తనదైన ముద్ర వేసిన చంద్రబాబు బయోపిక్‌ తీసి ప్రశంసలు అందుకుంటున్నారు. ఈ సినిమా విడుదలైన సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ‘’చంద్రబాబుగారి జీవితంలో, ఆయన పరిపాలనలో చేపట్టిన సంస్కరణల వల్ల ప్రజల జీవితాలు మారాయి. నన్ను ఆ అంశం ఎక్కువ ఆకర్షించింది. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ఐదు దశాబ్దాలు గడిచినా పల్లెటూరి ప్రజల జీవితాలు మారలేదు. చంద్రబాబు గారు చేసిన అభివృద్ధి కారణంగా నగరాలకు వచ్చిన పల్లె ప్రజలు ఉన్నతమైన జీవితం సాగిస్తున్నారు. అభివృద్ధి అంటే కేవలం బిల్డింగ్స్‌ మాత్రమే కాదు. సమాజంలో వచ్చిన మార్పు కూడా! ఎటువంటి సామజిక అసమానతలు లేకుండా అందరూ ఒక్కటిగా బతుకుతున్నారు. ఆ పాయింట్‌ మీద సినిమా తీశా’’ అని చెప్పారు. అభివృద్ధి అందరినీ ఒక్కటి చేస్తుందనే అంశం మీద తాను సినిమా తీశానని, నారా చంద్రబాబునాయుడుగారు ఎలా ఆలోచించారు? అనేది ‘తెలుగోడు’ కాన్సెప్ట్‌ అని డాక్టర్‌ వెంకీ మేడసాని చెప్పారు. ఇంకా ఆయన మాట్లాడుతూ... ‘’ప్రపంచానికి తెలియని ఓ ప్రాంతాన్ని ప్రపంచానికి గమ్యస్థానంగా మార్చాలని భావించిన ఓ నాయకుడి కథ మా సినిమా. ఐదారు నెలల క్రితం సినిమా తీయాలని నేను అనుకున్నా. కథ సిద్ధం చేశాక కొందరు నిర్మాతలను కలిశా. కొందరు పెద్దలనూ కలిశా. రాజకీయ నాయకుడి సినిమా సినిమా తీస్తే విజయం సాధించదని వారించారు. పాయింట్‌ నచ్చి సినిమా తీశా. చిన్న ఆర్టిస్టులతో పెద్ద సినిమా తీశాం. కంటెంట్‌ మీద నమ్మకంతో ప్రజలకు చేరువ అవుతుందని తీశాను. ఎక్కువ మంది ప్రజలకు సినిమా చేరాలనే ఉద్దేశంతో యూట్యూబ్‌ రిలీజ్‌ చేశాం. నేను సినిమా తీయగలననే కాన్ఫిడెన్స్‌ ఈ సినిమా ఇచ్చింది’’ అని చెప్పారు. చంద్రబాబు పాత్రలో వినోద్‌ నటించిన ‘తెలుగోడు’ చిత్రానికి ఛాయాగ్రహణం: మల్లిక్‌ చంద్ర, సంగీతం: రాజేష్‌ రాజ్‌, కథ, స్క్రీన్‌ప్లే,  డైలాగ్స్‌, ప్రొడ్యూసర్‌, డైరెక్టర్‌ : డాక్టర్‌ వెంకీ మేడసాని.
రాజశ్యామల బ్యానర్‌పై తెరకెక్కుతున్న ప్రొడక్షన్‌ నెంబరు- 2 చిత్రం 'మహేంద్రగిరి వారాహి'.  ఈ చిత్ర గ్లిమ్స్ ను ఇటీవల ప్రముఖ దర్శకుడు క్రిష్ విడుదల చేశారు. అలాగే గ్రిమ్స్ ఆసక్తికరంగా ఉందని తన ట్విట్టర్ ఖాతాలో టాలెంటెడ్ యాక్టర్ విశ్వక్ సేన్ పోస్ట్ చేశారు. గ్లిమ్స్ కు విశేష స్పందన లభించింది. లేటెస్ట్ గా మహేంద్రగిరి వారాహి సినిమాలో విలక్షణ నటుడు, హాస్య బ్రహ్మ బ్రహ్మానందం నటిస్తున్నట్లు చిత్ర దర్శకుడు సంతోష్ జాగర్లపూడి, నిర్మాత కాలిపు మధు వెల్లడించారు. మహేంద్రగిరి వారాహి స్క్రిప్ట్ అద్భుతంగా నచ్చి బ్రహ్మానందం ఈ సినిమా చేయబోతున్నారని, త్వరలో మొదలుకాబోయే షెడ్యూల్ లో బ్రహ్మానందం పాల్గొనబోతున్నారని చిత్ర దర్శకులు సంతోష్ జాగర్లపూడి తెలిపారు. మహేంద్రగిరిలో కొలువుదీరిన వారాహి అమ్మవారి ఆలయం చుట్టూ తిరిగే కథాంశాన్ని ఆధారంగా చేసుకుని ఈ సినిమాను రూపొందిస్తున్నామని చిత్ర నిర్మాత కాలిపు మధు తెలిపారు. రాజశ్యామల ఎంటర్‌టైన్‌మెంట్‌ బ్యానర్‌పై తెరకెక్కుతున్న ఈ సినిమాకు అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్నారు.
The highly anticipated movie, "Kannappa," has welcomed another significant addition to its already star-studded cast. Prabhas has officially joined the production, adding his immense talent to the team alongside Akshay Kumar, Mohan Babu, Mohanlal, and Sarathkumar. Vishnu Manchu, the driving force behind this passion project, has dedicated seven years to meticulously shaping the narrative, infusing it with depth and grandeur. Directed by Mukesh Kumar Singh, "Kannappa" pays homage to the unwavering devotion of Bhakta Kannappa, a devout follower of Lord Shiva. "Kannappa" boasts an impressive crew, including renowned Hollywood cinematographer Sheldon Chau and action director Kecha Khamphakdee. With its blend of captivating visuals and a poignant narrative, the film is poised to leave a lasting impact on audiences worldwide.
NTR seems to be on a roll. The actor is currently busy with Devara Part 1 directed by filmmaker Siva Koratala. After "Devara," the actor has multiple big projects in the pipeline, such as "War 2," "NTR Neel," and "Devara Part 2." Everyone is excited about NTR's Bollywood debut with Yash Raj Films' Spyverse film, "War 2," where the actor shares the screen with Greek God, Hrithik Roshan. The collaboration of these two phenomenal actors for an action drama is a delight for Indian cinema fans. NTR will be playing an Indian agent in "War 2." The shoot is going on in Mumbai. Both NTR and Hrithik Roshan are highly acclaimed for their extraordinary dancing abilities. Both stars have demonstrated exceptional dance techniques in numerous films. Furthermore, NTR and Ram Charan enthralled the global audience with dance skills in the internationally super hit film “RRR,” particularly in the popular song “Naatu Naatu,” which received the prestigious Oscar Award for Best Original Song. No wonder that producer Aditya Chopra is now planning a bigger song than “Naatu Naatu” between Hrithik Roshan and NTR. Ganesh Acharya will compose and choreograph a song featuring Hrithik Roshan and NTR. This song is intended to become the next major international hit from India. The film is packed with adrenaline-pumping chases and action stunts. This exciting news raised expectations on the biggie and fans are eager witness their epic face off. The film will be directed by Ayan Mukerji and produced by Aditya Chopra.
తెలుగు ప్రజలకు నిరంతరాయంగా వినోదాన్ని, సమాచారాన్ని నిర్విరామంగా అందిస్తూ, తెలుగు ప్రజల ఆదరణను, ఆశీస్సులను అందుకుంటోంది తెలుగువన్. ఎంట్రప్రిన్యుర్ క్వాలిటీతోపాటు సృజనాత్మకత కూడా పుష్కలంగా వున్న కంఠంనేని రవిశంకర్ పాతికేళ్ళ క్రితం ‘ఆబ్జెక్ట్ వన్’ సంస్థని స్థాపించారు. ఆబ్జెక్ట్ వన్ సంస్థని స్థాపించిన ఒక ఏడాది తర్వాత తెలుగు ప్రజల ముందుకు వచ్చింది ‘తెలుగువన్’. వెబ్‌సైట్, యూట్యూబ్ ఛానల్ రూపాల్లో తెలుగు ప్రజల ముందుకు వచ్చిన ‘తెలుగువన్’ భారతదేశంలో యూట్యూబ్‌తో కలసి ప్రయాణాన్ని ప్రారంభించిన తొలి సంస్థల్లో ఒకటిగా నిలిచింది. దక్షిణ భారతదేశంలోనే అతి పెద్ద డిజిటల్ మీడియా నెట్‌వర్క్‌గా అభివృద్ధి చెందిన ‘తెలుగువన్’ మొత్తం 350 యూట్యూబ్ ఛానళ్ళతో అగ్రస్థానంలో దూసుకువెళ్తోంది. ఇంటర్నెట్‌ అంటే దేశంలో అందరూ లైట్‌గా తీసుకుంటున్న సమయంలో, రాబోయే కాలంలో ఈ కొత్త టెక్నాలజీ ఎంతటి విశ్వరూపాన్ని చూపిస్తుందనే భవిష్యత్ దర్శనం చేసిన కంఠంనేని రవిశంకర్ యూట్యూబ్‌తో కలసి ప్రయాణం ప్రారంభించారు. ఈ 24 సంవత్సరాల ప్రయాణంలో తెలుగువన్ ఎన్నో సంచలనాలను సృష్టించింది. తెలుగు ప్రజలకు నాణ్యమైన వినోదాన్ని, నికచ్చి అయిన సమాచారాన్ని అందించడంలో నిబద్ధతను ప్రదర్శిస్తూ ముందడుగు వేసింది. ప్రజలకు సమాచారాన్ని, వినోదాన్ని అందించడంలో నైతిక విలువను పాటిస్తూ వచ్చిన సంస్థ తెలుగువన్. తెలుగువన్ స్పూర్తితో ఈ రంగంలోకి వచ్చిన ఎన్నో సంస్థలో ఈ ప్రవాహంలో ఎదురీదలేక ప్రయాణాన్ని ముగించాయి. మరికొన్ని సంస్థలు తమ ఉనికిని నిలుపుకోవడం కోసం అనైతిక ఆకర్షణీయ మార్గాలను అనుసరిస్తూ మనుగడ సాగిస్తున్నాయి. కానీ  ప్రారంభమైన మొదటి రోజు నుంచి 24 సంవత్సరాలు పూర్తి చేసుకున్న ఇప్పటి వరకు ‘తెలుగువన్’ది ఒకే మాట.. ఒకే బాట. అదే నైతికత. తెలుగువన్ చేసిన ఈ 24 సంవత్సరాల ప్రయాణంలో ఎన్నెన్నో విజయాలు, ఎన్నెన్నో ఎదురురాళ్ళు... విజయాలను ఆస్వాదిస్తూ, ఎదురురాళ్ళను అధిగమిస్తూ మరింత ఉజ్వల భవిష్యత్తువైపు ఆశావాదంతో దూసుకువెళ్తున్న తెలుగువన్ 24వ వార్షికోత్సవం గురువారం (09-05-2024) నాడు సంస్థ కార్యాలయంలో వైభవంగా జరిగింది. మూడు వందల మందికి పైగా సంస్థ ఉద్యోగులు ఆనందోత్సాహాలతో పాల్గొన్న ఈ వార్షికోత్సవంలో సంస్థ అధినేత కంఠంనేని రవిశంకర్, సంస్థ డైరెక్టర్ శ్రీమతి హిమబిందు కంఠంనేని, కంఠంనేని రవిశంకర్ దంపతుల కుమార్తె డాక్టర్ జితేష్ణ, అల్లుడు సాయిరామ్ పాల్గొన్నారు. ఉద్యోగుల కరతాళధ్వనుల మధ్య వీరు కేక్ కట్ చేసి, తమ ఆనందాన్ని అందరితో పంచుకున్నారు. ఈ సందర్భంగా ‘తెలుగువన్’ అధినేత కంఠంనేని రవిశంకర్ మాట్లాడుతూ, పాతికేళ్లుగా ‘ఆబ్జెక్ట్ వన్’, 24 ఏళ్ళుగా ‘తెలుగువన్’ అభివృద్ధి కోసం తనతో కలసి నడుస్తున్న సంస్థ ఉద్యోగులకు ధన్యవాదాలు తెలిపారు. సంస్థ నిర్వహణలో ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా తన వెంట నడచిన ఉద్యోగులకు తానెంతో కృతజ్ఞుడినని అన్నారు. రాబోయే రోజుల్లో ‘తెలుగువన్’ మరింత ఉజ్వల భవిష్యత్తును చూడబోతోందని, ఎన్నెన్నో ఘన విజయాలను సాధించబోతోందని ఆయన చెప్పారు. ‘తెలుగువన్’ నిర్వహణలో తనకు ఎదురైన సవాళ్ళను సమర్థంగా ఎదుర్కోవడంలో సంస్థ ఉద్యోగులు తనకు అందించిన సహకారాన్ని ఎన్నడూ మరువలేనని ఆయన కృతజ్ఞతాపూర్వకంగా తెలిపారు. ‘తెలుగువన్’ను మరింత సమర్థంగా ముందుకు తీసుకెళ్ళడానికి తన కుమార్తె డాక్టర్ జితేష్ణ, అల్లుడు సాయిరామ్ ఈ తరపు ఆధునిక ఆలోచనలతో తనకు సహకరిస్తారని, తన వారసత్వాన్ని అందిపుచ్చుకుంటారని కంఠంనేని రవిశంకర్ సంస్థ ఉద్యోగుల కరతాళ ధ్వనుల మధ్య ప్రకటించారు.
The movie 'Krishnamma' stars the versatile hero Satyadev and is directed by VV Gopalakrishna. It is produced by Krishna Kommalapati under the banner of Arunachala Creations, associated with the famous director Koratala Siva. Famous distribution companies Mythri Movie Makers and Prime Show Entertainments, known for delivering many successful films to audiences, are releasing the film on a grand scale on May 10. On this occasion, hero Satyadev spoke to the media about 'Krishnamma'.   How did 'Krishnamma' begin? How did you get involved in this project? I joined this film towards the end when everyone else was in place. Koratala Siva garu liked it and became a presenter. Kaala Bhairava also joined. I came on board as the hero at the end. Director Gopalakrishna convinced the producer, Krishna Garu, by narrating the story. When Koratala Siva heard the story from Krishna, he liked it and agreed to become a presenter.   After watching the trailer, it seems like it's a story involving the police and rowdies. Does Krishna, Vijayawada politics, involved? It is often said that Vijayawada is synonymous with politics and rowdyism. However, 'Krishnamma' tells a different story. It is fundamentally about three friends who desire simple lives and a good family. But what happens when such dreams are shattered? That's the story we're telling, which does not involve rowdyism or politics.   How do you think the audience will connect with the emotions in the film? If the audience feels compelled by what the hero does in the movie, like wanting to hit back, then they will connect with the movie. Watching this film, the audience will feel that connection as well.   Action sequences were shown in the trailer, yet you talk about friendship. How did you manage both elements in the film? The story is primarily about life. Action sequences arise only when necessary, as a response to the hero's suffering. But there are no gratuitous fight scenes anywhere in the film.   How did you struggle for the film role? Is it a real character or a fictional character? For the character of Vinchipeta Bhadra, mastering the Vijayawada slang and body language as a 40-year-old man years into the storyline proved to be quite challenging. It's different from the roles I've done so far. This is a fictional character based on some real events.   In a shot from the trailer where someone is being hit while planting a plant, that scene is quite novel. Could you tell me more about it? It's an emotional scene in the movie. In the film, a plant is grown as a symbol of letting go of revenge. However, as the plant grows, so do the grudges. The director has written this transition from the plant to the tree very effectively. It's a powerful visual metaphor that will be best experienced in the movie. There are many such novel scenes in the film.   Did Koratala make any changes to the script? Koratala didn't make any changes to the script. I was surprised too. A director of his stature didn't change the script; he completely liked it and came on board as a presenter, supporting the film.   The main theme shown in this movie involves accepting money for punishment. We have seen similar themes in many movies in the past; what sets Krishnamma apart? The main theme shown in this movie is the idea of taking money to accept punishment. Although we have seen this concept in many movies in the past, they only touched on it briefly. However, in Krishnamma, this theme is central throughout the story. Additionally, the movie has a strong emotional undercurrent about friendship and life.   Tell us about Athira Raj and the other characters in the film. Athira Raj and other characters in the film have been thoughtfully portrayed. Athira is the only Malayali girl in this movie; all the others are Telugu. Since we filmed in Vijayawada, we recruited many local artists. Athira brought a lot of genuine emotion to her role. She portrayed emotions akin to a Telugu girl very well. Police officer Nandagopal, Laxman Misala, Krishna, Archana, and other characters also delivered strong performances.   Will your character, Bhadra, in the film be focused solely on revenge, or will there be elements of love and romance as well? In the film, my character Bhadra isn’t just about revenge; there is also a subplot involving a girl named Archana. It’s not a love story, but a meaningful little narrative that is crucial to the overall plot.   Does Satyadev seek out new stories? How have they benefited your career? I’ve been drawn to new stories from the start of my career, which is why I am here. Many stories resonate with me. Even though I can’t take on every project, I strive to bring something new to the table each time. Next, I am playing a small-time criminal, then a crime comedy, followed by roles as a bank manager and an auto driver, each offering a different shade of character.   You have previously acted as a character artist and villain. Will you take on such roles again? Are opportunities coming from other industries? In the past, I played character roles and villains, like opposite Chiranjeevi in Godfather and alongside Akshay Kumar in Ram Sethu. Since then, I haven’t received roles of that caliber. I continue to receive offers, but if they aren’t at least on par with those roles, I prefer not to accept them. I’m open to good roles in other industries as well. Opportunities are arising in Hindi and Tamil cinema, and I’ll take them up if they are appealing. I've done web series like God, Locked.. and would be interested in similar projects if they come along.   At the trailer launch event, Rajamouli said that you will become a star after this movie. What are your thoughts on the potential success of this movie? At the trailer launch event, Rajamouli predicted that this film would make me a star. I believe this movie will be a big hit. Regardless of the success and stardom it may bring, I will remain true to myself and continue to make films with integrity.   Tell me about Kaala Bhairava's music. Kaala Bhairava’s music has been a major highlight. After watching the movie, the first thing people talk about is his intense music, which is a significant asset to our film. Kaala Bhairava is like a brother to me. The songs are also very good.   Tell us about the producer, Krishna. Producer Krishna made the film with great passion. We shot for 60 days in Vijayawada. Although it would have been easier to shoot in Hyderabad, he supported filming in Vijayawada to maintain authenticity, sparing no expense. He is a man of few words but great action.   What is your dream role? My dream role would be in a film like Nayagan, where I can explore new characters and appearances. I would love to take on a film like Chiranjeevi's Aapadbhandhavudu. Let's see if such roles come my way. All the best, Satyadev. Thank you.
మాస్ కా దాస్  విశ్వక్ సేన్  అప్ కమింగ్ మూవీ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి. ఈ మూవీపై విశ్వక్  అభిమానుల్లో భారీ అంచనాలే ఉన్నాయి. టీజర్ కూడా  అదిరిపోవడంతో మూవీ కోసం వెయిట్ చేస్తున్నారు. మే 17 న రిలీజ్ అని ప్రకటించడంతో  టికెట్స్ బుక్ చేసుకునే మూడ్ లో కూడా  ఉన్నారు. కానీ ఇప్పుడు మూవీ ఆ డేట్ కి కూడా రావడం లేదు    వాస్తవానికి  గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి  గత ఏడాదే  విడుదల అవ్వాలి. కానీ సినిమా ఖ్వాలిటీ లో ఎక్కడ రాజీ పడకుండా నిర్మాణం జరుపుకుంది. కొన్ని రోజుల క్రితం   మే 17 న రిలీజ్ చేస్తామని మేకర్స్  ప్రకటించారు. ఇప్పుడు ఆ డేట్ మారింది  మే 31 న  వరల్డ్ వైడ్ గా విడుదల కాబోతుంది.ఈ విషయాన్నీ ఒక పోస్టర్ ద్వారా తెలియచేసారు. మూవీ  కంటెంట్ చాలా బాగుంటుందని, వాయిదా పడటంతో సినిమాకి వచ్చిన నష్టమేమి లేదని అంటున్నారు. విశ్వక్ సేన్ సినీ కెరీర్ లోనే నెంబర్  వన్ చిత్రంగా నిలబడుతుందని చెప్తున్నారు     డి జె టిల్లు భామ నేహ శెట్టి  హీరోయిన్ గా చేస్తుండగా  సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు ఫేమ్ అంజలి ఒక కీలక పాత్రలో నటిస్తుంది. కృష్ణ చైతన్య దర్శకుడు కాగా  యువన్ శంకర రాజా సంగీతాన్ని అందిస్తున్నాడు.  నాజర్ ,సాయి కుమార్ లాంటి సీనియర్ నటులు కూడా స్క్రీన్ షేర్ చేసుకుంటున్నారు. సితార ఎంటర్ టైన్మెంట్స్  పై నాగ వంశీ నిర్మిస్తున్నాడు. ప్రస్తుతం ఆయన పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్న పిఠాపురం లో పవన్ గెలుపు కోసం ప్రచారం చేస్తున్నాడు  
Ram Charan's much-anticipated project, titled "Game Changer," has solid buzz among the audience and fans alike. This political action drama directed by Shankar. The film shoot is going at snail pace. This much delayed social drama may not make it to this october. The schedules aren't going according to the plan and the film may have to be delayed again. As Kamal Haasan and Shankar's Indian2 shifted to July. The Game Changer might take some more time as Shankar will be involved in promotions. Game Changer eyeing for December release. Kiara Advani is playing the female lead. SJ Suryah, Anjali, Srikanth, Naveen Chandra, Sunil, Jayaram, and Samuthirakani are playing pivotal roles. Dil Raju is bankrolling this film and Thaman is the tunesmith. Karthik Subbaraj penned the film’s story.
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు. వారితో పాటు పెద్ద సంఖ్యలో క్యాడర్ కూడా పార్టీని వీడుతున్నారు. ఇక ఇప్పుడు నామినేటెడ్ పదవులలో ఉన్న వారి వంతు మొదలైనట్లు కనిపిస్తోంది. తనకు కానీ తన భర్తకు  కానీ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు టికెట్ ఇవ్వాలంటూ గత  కొంత కాలంగా కోరుతూ వస్తున్న మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ వంతు వచ్చింది. ఆమె కూడా రాజీనామా అస్త్రం సంధించారు.  జగన్ కు నమ్మిన బంటుగా గుర్తింపు పొందిన మహిళాకమిషన్ చైర్ పర్సన్ వాసి రెడ్డి పద్మ తన పదవికి రాజీనామా చేశారు. ఉరుములేని పిడుగులా, ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా తన రాజీనామా లేఖను సీఎం జగన్ కు పంపేశారు. పేరుకు తాను పార్టీకి కాదు, కేవలం మహిళా కమిషన్ చైర్మన్ పదవికి మాత్రమే రాజీనామా చేశాననీ, ఇక నుంచి వైసీపీ కోసం పని చేస్తాననీ వాసిరెడ్డి పద్మ చెబుతున్నప్పటికీ, ఆమె రాజీనామాకు కారణం అసంతృప్తేనని పార్టీ వర్గాలు బాహాటంగానే చెబుతున్నాయి. చాలా కాలంగా వాసిరెడ్డి పద్మ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు తనకు కానీ తన భక్తకు కానీ పార్టీ టికెట్ ఇవ్వాలని జగన్ ను కోరుతూ వస్తున్నారు. అయితే ఇప్పటి వరకూ జగన్ చూద్దాం.. చేద్దాం అన్నట్లుగా దాట వేస్తూనే వచ్చారు. ఇప్పుడిక వరుసగా అభ్యర్థల జాబితాలను జగన్ ప్రకటించేస్తుండటం, తనకు గానీ తన భర్తకు కానీ పార్టీ టికెట్ విషయంలో ఎటువంటి స్పస్టత ఇవ్వకపోవడంతో ఆమె మనస్తాపం చెంది పదవికి రాజీనామా చేసేశారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.  వాసిరెడ్డి పద్మ రాజకీయ ప్రవేశం ప్రజారాజ్యం పార్టీతో జరిగింది. 2009లో ఆమె ప్రజారాజ్యం పార్టీలో చేరారు. ఇలా చేరడంతోనే ఆమె ప్రజారాజ్యం అధికార ప్రతినిథిగా పదవి దక్కించుకున్నారు. ప్రజారాజ్యం కాంగ్రెస్ పార్టీలో విలీనం కావడంతో ఆమె 2012లో జగన్ పార్టీలో చేరారు. జగన్ కూడా ఆమెకు అధికార ప్రతినిథి పదవి ఇచ్చారు.  2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆమెను రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా నియమించారు. చైర్ పర్సన్ హోదాలో ఆమె జగన్ మెప్పు పొందేందుకు చేయగలిగినంతా చేశారు. ప్రతిపక్ష పార్టీ నేతలకు నోటీసులు ఇచ్చారు. ఏకంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు సైతం నోటీసులు జారీ చేశారు. వార్డు వలంటీర్లపై పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు కమిషన్ ముందు హాజరై వివరణ ఇవ్వాలంటూ ఆమె పవన్ కు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. పవన్ హాజరు కాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు నమోదు చేయాలని ఆదేశించారు. ఇన్ని చేసినా వాసిరెడ్డి పద్మకు ఆమె కోరినట్లుగా పార్టీ టికెట్ లభించకపోవడంతో అలిగి పదవికి రాజీనామా చేశారని, ఇది జగన్ కు షాకేననీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు. ఒకరైతు తనకు చేసిన సేవలకు ప్రీతి చెందిన గురువు అతడికి స్వర్గ ప్రాప్తిని కలగజేయాలని అనుకుంటాడు. కానీ సంసారాసక్తి వల్ల ఆ రైతు ఆ అవకాశాన్ని వాయిదా వేసుకుంటూ వస్తాడు. చివరికి గురుకృప వల్ల ఆ రైతు స్వర్గ ప్రాప్తిని ఎలా పొందాడో ఈ కథ తెలియజేస్తుంది. "ఒక మహాపురుషుడు ప్రయాణం చేస్తూ, డస్సిపోయాడు. గొంతు ఎండిపోయింది. దారిలో ఒక రైతు కనపడితే నీళ్ళు అర్థించాడు. ఆ రైతు మహాత్మునికి సకల ఉపచారాలూ చేశాడు. చిరిగిపోయిన ఆయన ఉత్తరీయాన్ని రైతు జాగ్రత్తగా కుట్టి బాగుచేశాడు. రైతు పరిచర్యలకు సంతసించిన ఆ మహాత్ముడు శాంతి, ఆనందాలకు నిలయమైన స్వర్గానికి తనతోపాటు రమ్మని అంటాడు. అందుకు ఆ రైతు 'గురువుగారూ! మీరు నా మీద చూపిన దయకు కృతజ్ఞుణ్ణి. కానీ నా పిల్లలు ఇంకా చిన్నవాళ్ళు. ఓ ఏడేళ్ళ వ్యవధి ఇవ్వండి' అని అడుగుతాడు. అందుకు గురువు అంగీకరించాడు. సరిగ్గా ఏడేళ్ళ తర్వాత గురువు రైతును స్వర్గానికి తీసుకువెళ్ళడానికి వచ్చాడు. అప్పుడు రైతు 'అయ్యా! కడపటి కొడుకు కష్టాలకు అంతు లేదు. అన్ని జంఝాటాలనూ ఒక్కడే సంబాళించుకోలేకపోతున్నాడు. కాబట్టి మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని గురువుని అడిగాడు. మరో ఏడేళ్ళ తరువాత గురువు వచ్చాడు. కానీ రైతు చనిపోయాడని తెలిసింది. చనిపోయిన ఆ రైతు ఎద్దుగా పుట్టాడని ఆ గురువు తన దివ్య దృష్టితో తెలుసుకున్నాడు. ఎద్దుగా పుట్టిన ఆ రైతు తన కొడుకు పొలాన్నే దున్నుతున్నాడు. అప్పుడు గురువు ఆ ఎద్దుపై మంత్ర జలం చిలకరించగానే ఎద్దు జన్మనెత్తిన రైతు 'నా కొడుకు పరిస్థితి మరి కాస్త మెరుగు పడనీయండి స్వామీ! మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని అన్నాడు. ఇక చేసేది లేక వెనుదిరిగాడు గురువు. మరలా ఏడేళ్ళ తర్వాత వచ్చిన గురువుకు ఎద్దు చనిపోయిందని తెలిసింది. అది కుక్కగా పుట్టి కొడుకు ఇంటినీ, ఆస్తినీ కాపలా కాస్తోందని తన దివ్యదృష్టి ద్వారా తెలుసుకున్నాడు. గురువు. కుక్కగా పుట్టిన ఆ రైతు 'స్వామీ! నేను ఎంత దౌర్భాగ్యుణ్ణి. మీరు ఇంత దయ చూపుతున్నప్పటికీ మీతో స్వర్గమానం చేయలేకున్నాను. వీడికి ఆస్తిని కాపాడుకొనే దక్షత ఇంకా రాలేదు. కాబట్టి దయ చేసి మరో ఏడేళ్ళు వ్యవధి ఇవ్వండి' అని వేడుకున్నాడు. గురువు ఏడేళ్ళ తరువాత మళ్ళీ వచ్చేసరికి కుక్క మరణించింది. అది త్రాచుపాముగా జన్మనెత్తి, ఇప్పుడు కొడుకు భూమిలో ఉన్న లంకెబిందెలకు పడగెత్తి కాపలా కాస్తోంది. గుప్త ధనం ఇక్కడ ఉందని కొడుకుకి ఎలా తెలియజేయాలా అని పాము ఆలోచిస్తున్నప్పుడు గురువు ఆ రైతుకొడుకును పిలుచుకు వచ్చి లంకె బిందెలు ఉన్న చోట తవ్వమన్నాడు. లంకె బిందెలు బయటపడ్డాయి. ఆ పైన ఆ పామును చంపమన్నాడు. అనంతరం శిష్యుణ్ణి తీసుకొని స్వర్గారోహణం చేశాడు గురువు. సంసారంలోని ఈతి బాధల నుండి శిష్యుణ్ణి ఉద్ధరిస్తాడు సద్గురువు. అలాంటి గురువు అందరికీ అవసరం.                                      *నిశ్శబ్ద.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్  రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది.  80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత  ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది.   ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది. ఆమెది నెద‌ర్లాండ్స్‌. ఆమె తండ్రి నెద‌ర్లాండ్స్‌లోని ఆర్నెహెమ్‌లో చిన్న‌పిల్ల‌ల ఆస్ప‌త్రి డైరెక్ట‌ర్. పోయి దొరికిన ఆ పెయింటింగ్ విష‌యానికి వ‌స్తే.. అది 1683లో కాస్ప‌ర్ నెష‌ర్ వేసిన స్టీవెన్ ఓల్ట‌ర్స్ పెయింటింగ్‌. రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో నాజీల ఆదేశాల‌ను చార్లెట్ తండ్రి వ్య‌తిరేకించారు. ఆయ‌న ర‌హ‌స్య జీవ‌నం సాగించేడు. కానీ ఈ పెయింటింగ్‌ని మాత్రం త‌న న‌గ‌రంలోని ఒక బ్యాంక్‌లో భ‌ద్ర‌ ప‌ర‌చ‌మ‌ని ఇచ్చార‌ట‌. 1940లో నాజీలు నెద‌ర్లాండ్ పై దాడులు చేసినపుడు ఆ బ్యాంక్ మీద ప‌డి దోచుకున్నా రు. అప్పుడు ఈ పెయింటింగ్ కూడా తీసుకెళ్లారు. యుద్ధం అయిపోయిన త‌ర్వాత ఈ పెయింటింగ్ ఎక్క‌డున్న‌దీ ఎవ‌రికీ తెలియ‌లేదు. చిత్రంగా 1950ల్లో డ‌స‌ల్‌డార్ష్ ఆర్ట్ గ్యాల‌రీలో అది ప్ర‌త్య‌క్ష‌మ‌యింది. 1969లో ఆమ్‌స్ట‌ర్‌డామ్‌లో దాన్ని వేలానికి తీసికెళ్లే ముందు దాన్ని ఆ ఆర్ట్ గ్యాల‌రీలో వుంద‌ని చూసిన‌వారు చెప్పారు. వేలంపాట త‌ర్వాత మొత్తానికి ఆ పెయింటింగ్‌ను 1971లో ఒక క‌ళాపిపాసి త‌న ద‌గ్గ‌ర పెట్టుకున్నాడు.    ఆ త‌ర్వాత 2021లో అది చార్లెటీని చేరింది.  మొత్తానికి వూహించ‌ని విధంగా ఎంతో కాలం దూర‌మ‌యిన గొప్ప క‌ళాఖండం తిరిగి త‌న వ‌ద్ద‌కు చేర‌డంలో చార్లెటీ ఆనందానికి అంతేలేదు. అంతే క‌దా.. పోయింద‌నుకున్న గొప్ప వ‌స్తువు తిరిగి చేరితే ఆ ఆనంద‌మే వేరు!  అయితే చార్లెటీకి ఇపుడు ఆ పెయిం టింగ్‌ను భ‌ద్రంగా చూసుకునే ఆస‌క్తి వున్న‌ప్ప‌టికీ శ‌క్తి సామ‌ర్ధ్యాలు లేవు. అందుక‌నే త్వ‌ర‌లో ఎవ‌రిక‌యినా అమ్మేసీ వ‌చ్చిన సొమ్మును పిల్ల‌ల‌కు పంచుదామ‌నుకుంటోందిట‌!  చార్లెటీ కుటుంబంలో అయిదుగురు అన్న‌ద‌మ్ములు అక్క‌చెల్లెళ్లు వున్నారు. అలాగే ఇర‌వై మంది పిల్ల‌లు ఉన్నారు. అంద‌రూ ఆమె అంటే ఎంతో ప్రేమ చూపుతున్నారు. అంద‌రం ఒకే కుటుంబం, చాలాకాలం త‌ర్వాత ఇల్లు చేరిన క‌ళాఖండం మా కుటుంబానిది అన్న‌ది చార్లెటీ!
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు. చాకోను పార్టీలోకి ఆహ్వానిస్తూ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్’ ఫ్రంట్ ఏర్పాటు గురించి ప్రత్యేకించి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు కానీ, చాకో అలాంటి  సంకేతాలు ఇచ్చారు. ప్రస్తుతం దేశంలో ఉన్న ఏ ఒక్కపార్టీ కూడా బీజేపీకి ప్రత్యాన్మాయం కాదని,సమీప భవిష్యత్ కాంగ్రెస్ సహా ఏ పార్టీ కూడా ఆ స్థాయికి ఎదిగే అవకాశాలు కూడా కనిపించడంలేదని అన్నారు. ఈ పరిస్థితుల్లో దేశంలోని బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ, ఏకమై, ఒకే గొడుగు కిందకు రావలసిన అవసరం ఉందని చాకో అన్నారు. అదే సమయంలో ప్రతిపక్షాలను ఏక తాటిపైకి తెచ్చే బాధ్యతను పవార్ తీసుకోవాలని సంకేత మాత్రంగా చెప్పారు. అంతే కాకుండా కాంగ్రెస్ పేరు ఎత్తకుండా బీజేపీ వ్యతిరేక శక్తులను ఏకం చేసే ఆలోచన ఆ పార్టీ నాయకత్వానికి లేదని నెహ్రూ గాంధీ ఫ్యామిలీ (సోనియా, రాహుల్, ప్రియాంక)ఆలోచనా ధోరణిని పరోక్షంగానే అయినా ఎండ కట్టారు.ఆ విధంగా పవార్ ఆ బాధ్యత తీసుకోవాలని చాకో సూచించారు. ఇందుకు సంబంధించి, పవార్ బహిరంగంగా ఎలాంటి వ్యాఖ్య చేయలేదు. అయితే, చాకో సహా మరికొందరు ‘సీనియర్’ కాంగ్రెస్ నాయకులు, అలాగే సిపిఎం, సిపిఐ నాయకులు కూడా పవార్’తో చాలా కాలంగా థర్డ్ ఫ్రంట్  విషయంగా చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. అయితే మహారాష్ట్రలో సంకీర్ణం మనుగడను దృష్టిలో ఉంచుకుని పవార్ ఆచితూచి అడుగులేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే చాకో పార్టీలో చేరిన సందర్భంలో కూడా ‘చాకో చేరికతో మహారాష్ట్రలోని మహా వికాస్ అగాడీ ప్రభుత్వానికి ఎలాంటి నష్టం జరగదని, పవార్ మహారాష్ట్ర సంకీర్ణ సర్కార్ ప్రస్తావన చేశారని విశ్లేషకులు పేర్కొంటున్నారు.  మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వ మనుగడ గురించ్బి  పవార్ ప్రత్యేకంగా పేర్కొనడం ద్వారా, ఆయన థర్డ్ ఫ్రంట్ విషయంలో వేచి చూసే ఆలోచనలో ఉన్నట్లు అర్థమవుతోందని కూడా  రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే అదే ఎన్సీపీ అసెంబ్లీ ఎన్నికల జరుగతున్న కేరళలో, పశ్చిమ బెంగాల్లో  కాంగ్రెస్ వ్యతిరేక పార్టీలకు మద్దతు ఇస్తోంది. దీన్ని బట్టి చూస్తే, ఎన్సీపీ - కాంగ్రెస్ మధ్య దూరం పెరుగుతోందని స్పష్టమవుతోంది. అయితే, థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఏ రకంగా ముడి పడుతుంది అనే విషయంలో ఇంకా స్పష్టత రావలసి ఉంది. అలాగే, కాంగ్రెస్ లేకుండా జాతీయ స్త్గాయిలో బీజేపీ వ్యతిరేక కూటమిని ఏర్పాటు చేయడం వలన, వ్యతిరేక ఓటు చీలి  అది మళ్ళీ బీజేపీకే మేలు చేస్తుందని, కాబట్టి, ప్రస్తుతం కాంగ్రెస్ సారధ్యంలోని యూపీఏని బలోపేతం చేయడమే ఉత్తమమనే అలోచన కూడా  విపక్ష శిబిరం నుంచి వినవస్తోంది. ఈ నేపధ్యంలోనే, ప్రస్తుతం యూపీఏ ఛైర్పర్సన్’గా ఉన్న సోనియా గాంధీ వయసు, అనారోగ్యం కారణంగా బాధ్యతల నుంచి తప్పుకుని పవార్’కు బాద్యతలు అప్పగించాలనే ప్రతిపాదన వచ్చిందని అంటున్నారు. అలాగే, ఇతర పార్టీలను, ముఖ్యంగా కాంగ్రెస్ నుంచి విడిపోయి సొంత కుంపటి పెట్టుకున్న మమతా బెనర్జీ సారధ్యంలోని తృణమూల్, జగన్మోహన్ రెడ్డి సారధ్యంలోని వైసీపీలను కలుపుకుని కూటమిని బలోపేతం చేయడం ద్వారా బీజేపీని దీటుగా ఎదుర్కోవచ్చనే ఆలోచనలు కూడా సాగుతున్నాయి. అయితే, ఇటు థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు అయినా, యూపీఏని బలోపేతం చేయడమే అయినా, పవారే .. కేంద్ర బిందువు. ఆయన సారధ్యంలోనే ప్రత్యాన్మాయం అనేది విపక్ష శిభిరం నుంచి వినవస్తున్న ప్రస్తుత సమాచారం. మరి అదే జరిగితే రాహుల గాంధీ పరిస్థితి ఏమిటి ? గాంధీ నెహ్రూ కుటుంబం పరిస్థితి ఏమిటి? ఏ ప్రత్యేక ప్రాధాన్యత లేకుండా అందరిలో ఒకరిగా ఫస్ట్ ఫ్యామిలీ సర్దుకు పోతుందా? అంటే..చివరకు ఏమవుతుందో .. ఇప్పుడే చెప్పలేమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది. గతంలో అనేక సందర్భాలలో ముఖ్యమంత్రి కేసీఆర్,ఆర్థిక మంత్రి హరీశ రావు, కరోనా కారణంగా రాష్ట్ర  ఆదాయం గణనీయంగా తగ్గిందని, పేర్కొన్నారు. అయితే, కరోనా నుంచి వేగంగా కోలుకుని, ఆర్థికంగా అంతే వేగంగా పుంజుకున్న రాష్ట్రాలలో తెలంగాణ ప్రధమ స్థానంలో  ఉందని కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సర్వే 2020-21 నివేదిక పేర్కొంది. పడిలేచిన కెరటంలా, తెలంగాణ ‘వీ’ ఆకారంలో ఆర్థికంగా నిలతొక్కుందని కేంద్రం జనవరి  చివరి వారంలో విడుదల చేసిన ఆర్థిక సర్వేలో పేర్కొంది. అలాగే, రెవిన్యూ వసూళ్ళలో రాష్ట్రం కరోనా పూర్వస్థితికి చేరిందని కూడా సర్వే చెప్పింది.   అలాగే,రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు కూడా ఈ మధ్య కాలంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పై సంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరమ జనవరి,ఫిబ్రవరి, మార్చి నెలలతో పోలిస్తే ఈ సంవత్సరం ఈ మూడు నెలల కాలంలో రాష్ట్ర ఆర్థిక వృద్ది రేటు 10 నుంచి  15 శాతం మెరుగ్గా ఉందని హరీష్ రావు ఒకటి రెండు ఇంటర్వ్యూలలో పేర్కొన్నారు.అలాగే, బడ్జెట్ విషయంలోనూ ఆయన చాల ఆశావహ దృక్పథంతోనే ఉన్నారు. బడ్జెట్  పాజిటివ్’గా ఉంటుదని, ఎవ్వరూ ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని, సంక్షేమ పథకాలలో,ఇతరత్రా బడ్జెట్ కేటాయింపులలో ఎలాంటి కోతలు ఉండవని కూడా హరీష్ హామీ ఇచ్చారు. గత సంవత్సరంలో కొంత మేర హామీ ఇచ్చిన మేరకు అమలు చేయలేక పోయిన సొంత జాగాలలో డబల్ బెడ్ రూమ్ ఇళ్ళ నిర్మాణం, రుణ మాఫీ వంటి  పథకాలను ఈ బడ్జెట్ ద్వారా అమలు చేస్తామని చెప్పారు. అలాగే, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ తమిళి సై చేసిన ప్రసంగంలోనూ ఆశావహ దృక్పధమే వ్యక్తమైంది. ఆమె తమ ప్రసంగంలో,  ప్రభుత్వం సంక్షేమ పథకాలకు పెద్ద పీట వేసిందని అన్నారు. ‘సంపద పంచాలి ,పేదలకు పంచాలి’ అనేది తమ ప్రభుత్వ విధానమని స్పష్టం చేశారు. అలాగే, పెరుగతున్న ఆదాయంలో అధికశాతం సంక్షేమానికే వెచ్చిస్తున్నామని స్పష్టం చేశారు. దీంతో బడ్జెట్’లో కొత్త పథకాలకు శ్రీకారం చుట్టే అవకాశం ఉంటుందా అన్న చర్చ జరుగుతోంది. మరో వంక ఉద్యోగ వర్గాల్లో పీఆర్సీకి సంబంధించి ఆర్థిక మంత్రి తమ ప్రసంగంలో  ప్రకటన చేస్తారా లేదా అనే ఆసక్తి నెలకొంది. అలాగే, సామాన్య  ప్రజలు ఇటీవల పెరిగిన పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరల భారం నుంచి మంత్రి హరీష్, ఏదైనా ఉపసమనం కలిపిస్తారా అని ఎదురు చూస్తున్నారు. గతంలో వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సామాన్య ప్రజలపై వంటగ్యాస్ ధర భారాన్ని తగ్గించేందుకు కొంత మొత్తాన్ని, రూ.50(?) రాష్ట్ర ప్రభుత్వం తరపున  సబ్సిడీగా ఇచ్చిన విషయాన్ని, అదే విధంగా అసెంబ్లీ ఎన్నికలు జరుగతున్న తమిళనాడులో డిఎంకే పార్టీ,తమ పార్టీని అధికారంలోకి వస్తే  గ్యాస్ బండపై వంద రూపాయల సబ్సిడీ ఇస్తామని చేసిన  వాగ్దానాన్ని  గుర్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే, ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు, సోమవారం ఆర్థిక మంత్రి హరీష్ రావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఆర్థిక  శాఖ ముఖ్య కార్యదర్శి రామ కృష్ణా రావు,సలహాదారు జీఆర్ రెడ్డితో బడ్జెట్ పద్దులఫై సుదీర్ఘంగా చర్చించి తుది మెరుగులు దిద్దారు. బడ్జెట్ తుది రూపం సిద్దమైన నేపధ్యంలో ఆర్థిక శాఖ ప్రింటింగ్ ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 18 ఉదయం మంత్రి వర్గం ఆమోదం పొందిన అనంతరం ఆర్థికమంత్రి హరీష్ రావు అదే రోజు రాష్ట్ర బడ్జెట్ 2021-22ను సభలో ప్రవేశ పెడతారు. 20, 22 తేదీల్లో బడ్జెట్‌పై సాధారణ చర్చ,23, 24, 25 తేదీల్లో బడ్జెట్‌ పద్దులపై చర్చ ఉంటుంది 26న ద్రవ్యవినిమయ బిల్లు (బడ్జెట్)పై చర్చ, సభామోదం ఉంటాయి.
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది.  అధికార తెరాస, ఖమ్మం స్థానానికి సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర రెడ్డి పేరును ప్రకటించడంలో కొంచెం జాప్యం చేయడంతో పాటుగా, హైదరాబాద్ స్థానం నుంచి , పీవీ కుమార్తె వాణీ దేవి పేరును చివరి క్షణంలో తెరమీదకు తేవడంతో అంత వరకు కొంత స్తబ్దుగా సాగిన ప్రచారం ఆ తర్వాత వేడెక్కింది. ఉద్యోగ నియామకాల విషయంలో తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ తప్పులో కాలేయడంతో విపక్షాలు, పోటీలో ఉన్న ప్రత్యర్ధులు, నిరుద్యోగ యువత, విద్యార్ధి సంఘాలు  ఒకే సారి ఆయన మీద  విరుచుకు పడ్డారు. ఆయన లెక్క తప్పని నిరుపిస్తం రమ్మని వరస సవాళ్ళు విసిరారు. దీంతో, మంత్రి నియామకా ఇష్యూని పక్కకు తప్పించేందుకు , ఐటీఐఆర్, వరంగల్ రైల్వే ఫ్యాక్టరీ వంటి సెంటిమెంటల్ ఇష్యూస్’ను తెరపైకి  తెచ్చారు. అలాగే, కేంద్ర ప్రభుత్వంపై విమర్శల దాడిని పెంచారు. చివరకు పొరుగు రాష్ట్రానికి చెందిన విశాఖ ఉక్కు ఆందోళన   కూడా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగమైంది.   రెండు నియోజక వర్గాలలో గతంతో పోలిస్తే ఈసారి ఓటర్ల సంఖ్య రెట్టింపు అయింది. ఈసారి రెండు నియోజక వర్గాలలో కలిపి 10 లక్ష 36 వేల మంది తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. అలాగే, రెండు పట్ట భద్రుల నియోజక వర్గాల్లో 164 మంది అభ్యర్ధులు పోటీలో ఉన్నారు.  గత ఎన్నికలతో పోలిస్తే ఇటు ఓటర్ల సంఖ్య, అటు అభ్యర్థుల సంఖ్యా రెట్టింపునకు పైగానే పెరగడంతో ఎన్నికలలో జోష్ పెరిగింది. దీనికితోడు అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో సాధారణ ఎన్నికలను తలపించే రీతిలో ప్రచారం సాగింది. ఎక్కువమంది అభ్యర్ధులు బరిలో ఉండడంతో, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి  తమకే ప్రయోజనం జరుగుతుందని అధికార పార్టీ ఆశపడుతోంది .  దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో చేదు ఫలితాలను చవిచూసిన టీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా వ్యూహ రచన చేసి కేటీఆర్, హరీష్ సహా మంత్రులు,ఎమ్మెల్యేలకు స్పెసిఫిక్ బాధ్యతలు అప్పగించారు. అలాగే,కాంగ్రెస్‌ అభ్యర్థులు చిన్నారెడ్డి, రాములునాయక్‌లకు మద్దతుగా ఉత్తమ్‌, భట్టి, రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తదితరులు విస్తృతంగా ప్రచారం చేశారు. బీజేపీ అభ్యర్థులు ఎన్‌.రాంచందర్‌రావు, ప్రేమేందర్‌రెడ్డిల తరఫున ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, ఎంపీ అరవింద్‌ తదితరులు ప్రచారాన్ని వేడెక్కించారు.  ఖమ్మం స్థానం నుంచి ప్రత్యక్ష ఎన్నికల్లో తొలిసారి పోటీకి దిగిన కోదండరాంకు, టీజేఎస్‌ పార్టీకీ ఈ ఎన్నికలు కీలకంగా మారాయి. ఖమ్మ స్థానం నుంచి పోటీ చేస్తున్న తీన్మార్ మల్లన్న ముందస్తు వ్యూహంతో ప్రధాన పార్టీల అభ్యర్ధులకు ధీటుగా ప్రచారం సాగించారు.  వామపక్షాల మద్దతుతో జయసారథి, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్‌, యువతెలంగాణ కార్యనిర్వాహక అధ్యక్షురాలు రాణీ రుద్రమ తదితరులు పోటీలో ఖమ్మం సీటును పట్టభద్రులు  ఎవరికి  పట్టం కడతారు అన్నది ప్రశ్నార్థకంగా మారింది. హైదరాబాద్ సీటు కూడా ఇటు అధికార తెరాసకు అటు సిట్టింగ్ సీటును నిలుపుకోవడం తో పాటుగా దుబ్బాక , జీహెచ్ఎంసి జోష్ ను కొనసాగించాలని ఆశ పడుతున్నబీజేలకే కూడా ఇజ్జత్ కీ సవాల్ గా మారింది. కాంగ్రెస్ అభ్యర్ధి పార్టీ సీనియర్ నాయకుడు సౌమ్యుడు, మాజీ మంత్రి చిన్నారెడ్డి, వామ పక్షాల మద్దతుతో పోటీ చేస్తున్న మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ కూడా గట్టి పోటీ ఇస్తున్నారు. సో.. చివరకు ఏమి జరుగుతుంది అంటే ఏదైనా జరగవచ్చును. ఈ నెల 14 వ తేదీన పోలింగ్ జరుగుతుంది.17 ఫలితాలు వస్తాయి .. అంతవరకు వెయిట్ అండ్ వాచ్ .  
సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది. ఒకప్పుడు ఎర్ర జెండాను దిగ్విజయంగా ఎదిరించి, మార్క్సిస్టులను మట్టి కరిపించిన మమతా దీదీ ప్రస్తుతం, కాషాయ కూటమి నుంచి గట్టి సవాలును ఎదుర్కుంటున్నారు. వరసగా పదేళ్ళు పాలించడం వలన సహజంగా వచ్చిన ప్రభుత్వ వ్యతిరేకత  కంటే, హిందూ ఓటు పోలరైజేషన్ ఆమెను మరింతగా భయపెడుతోంది. నిజానికి ఐదేళ్ళ క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం ఐదు శాతం కంటే తక్కువ ఓట్లు, మూడంటే మూడు అసెంబ్లీ సీట్లు మాత్రమే గెలుచుకున్న బీజేపీ..  2019 లోక్ సభ ఎన్నికల్లో ఏకంగా 40 శాతం ఓట్లతో 18 స్థానాలు గెలుచుకుంది. ఈ  మార్పు ఇంకా కొన్ని కారణాలు ఉంటే ఉండవచ్చును కానీ.. హిందువుల ఓటు పోలరైజ్  కావడమే ప్రధాన కారణం.  ఈ నేపధ్యంలోనే కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ చివరకు కమ్యూనిస్టులు కూడా బీజేపీలో  చేరారు. ఎన్నికల ప్రకటన వెలువడిన తర్వాత కూడా సిట్టింగ్ ఎమ్మెల్ల్యేలు సహా  తృణమూల్ టికెట్ వచ్చిన నాయకులు కూడా బీజేపీలో చేరుతున్నారు. అనేక మంది ఇతర రంగాల ప్రముఖులు, ముఖ్యంగా ఇంతకాలం, బీజేపీని హిదుత్వ అనుకూల ‘అచ్చుత్’ (అంటారని) పార్టీగా చూసిన ‘సెక్యులర్’ ప్రముఖులు కాషాయం కప్పుకోవడంతో మమతా బెనర్జీకి కొంచెం అలస్యంగానే అయినా, తత్త్వం బోధపడింది. అందుకే ఆమె ఇప్పుడు గుళ్ళూ,గోపురాలకు తిరుగుతున్నారు. కార్యకర్తల సమావేశాల్లో తానూ హిందువునేనని, చెప్పుకుంటున్నారు.  నిజానికి ఇలా నేనూ హిందువునే  అని సెక్యులర్ నేతలు బహిరంగంగా ప్రకటించుకోవడం మమతా బెనర్జీతోనే మొదలు కాలేదు. రాహుల్ గాంధీ తాను హిందువునని, జన్యుధారీ కశ్మీరీ బ్రాహ్మణుని అనీ.. తమ గోత్రం, ‘దత్తాత్రేయ’ గోత్రమని బహిరంగంగా ప్రకటించుకున్నారు. అలాగే  కొద్ది రోజుల క్రితం ప్రియాంకా గాంధీ తానూ హిందువునని చెప్పుకునేందుకు ‘మౌని అమావాస్య’ సందర్భంగా అలహాబాద్ లో గంగా స్నానం చేశారు. గతంలోనూ ఆమె ఎన్నికలకు ముందు గంగా యాత్ర చేశారు. అంతవరకు ఎందుకు కొద్దిరోజుల క్రితం సిపిఐ నారాయణ విశాఖ స్వామి ఆశీస్సులు తీసుకున్నారు. చంద్రబాబు, జగన్ రెడ్డి, కేసీఆర్ ఇలా తెలుగు నేతలు అనేక మంది లౌకిక వాదానికి కాలం చెల్లిందన్న సత్యాన్ని గ్రహించి కావచ్చు ‘నేనూ హిందువును’ అంటూ ప్రకటించుకునేందుకు పోటీ పడుతున్నారు. రాముడిని తలచుకున్నా, జై శ్రీరామ్ అన్నా తమ  లౌకిక వాదం మయలపడి పోతుందని భయపడిన నాయకులు ఇప్పుడు .. జై శ్రీరామ్ అనేందుకు కూడా వెనకాడడం లేదు.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది. గత కొంత కాలంగా సబర్మలతో సహా అనేక అంశాలపై స్పందిస్తూ.. కేరళను టార్గెట్ చేస్తున్న బీజేపీ నాయకులు అక్కడ తమ జెండా ఎగరేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా పార్టీ పాలసీని కూడా పక్కన పెట్టి మెట్రో మ్యాన్ శ్రీధరన్ ను పార్టీలో చేర్చుకుని ఆయనే తమ సీఎం అభ్యర్థి అని ప్రకటించిన 24 గంటలలో యూ టర్న్ తీసుకున్నారు. ఇది ఇలా ఉండగా ప్రస్తుతం సీఎంగా ఉన్న కమ్యూనిస్ట్ నేత పినరై విజయన్ పై గోల్డ్ స్మగ్లింగ్ ఆరోపణలు రావడంతో.. ఈ ఎన్నికలలో ఎల్డిఎఫ్ భవిష్యత్తుపై ప్రజలు ఏ తీర్పు ఇవ్వబోతున్నారనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది ఈ నేపథ్యంలో అక్షరాస్యతలో దేశంలోనే మొదటి స్థానంలో ఉన్న ఆ రాష్ట్ర ప్రజలు ఎవరిని ఆశీర్వదిస్తారు అనే అంశంపై ప్రముఖ మీడియా సంస్థ టైమ్స్ నౌ, సీ ఓటరుతో కలిసి ఒక సర్వేను నిర్వహించారు. ఈ సర్వే ప్రకారం చూస్తే పాపం కమలనాథులు అక్కడ పవర్ చేతికి రావటం అటుంచి కనీసం రెండు మూడు అసెంబ్లీ స్థానాల్లో గెలవటం కూడా కష్టమేనని ఆ సర్వే తేల్చి చెబుతోంది. కేరళలో ఈసారి జరిగే అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ తన హవా చాటుతుందన్న ఆ పార్టీ నేతల మాటలలో ఎలాంటి నిజం లేదని.. ప్రస్తుతానికి అది ఏమాత్రం సాధ్యం కాదని ఈ తాజా సర్వే తేల్చి చెప్పింది. అంతేకాకుండా మొత్తం 140 స్థానాలు ఉన్న కేరళలో.. ప్రస్తుత సీఎం పినరయి విజయన్ నేతృత్వంలోని లెఫ్ట్డ్ డెమొక్రటిక్ ఫ్రంట్ కు 82 సీట్లు పక్కా అని.. ఆయనే తిరిగి అధికారాన్ని నిలబెట్టుకుంటాడని సర్వే చెపుతోంది. అదే సమయంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూనైటెడ్ డెమొక్రాటిక్ ఫ్రంట్ కు 56 నుంచి 60 వరకు సీట్లు వచ్చే అవకాశం ఉందని ఈ సర్వేలో తేలింది. అంతేకాకుండా 2016 ఎన్నికలతో పోలిస్తే ఎల్ డీఎఫ్ ఓటింగ్ శాతం కూడా కొంత పెరగటం ఇక్కడ గమనార్హం. ప్రస్తుతం సీఎంగా ఉన్న విజయన్ మరోసారి సీఎం కావాలని 43.34 శాతం మంది మొగ్గు చూపినట్లుగా సర్వేలో తేలింది. కరోనా సమయంలో విజయన్ సీఎంగా బాగా పని చేసారని ఈ సర్వే పేర్కొంది. మరోపక్క దేశ ప్రధానిగా రాహుల్ గాంధీ ఉండాలని కేరళ ప్రజల్లో 55.84 శాతం మంది కోరుకుంటున్నట్లుగా ఈ సర్వే;లో తేలింది. అయితే కేరళలో ఎలాగైనా పాగా వేయాలని పట్టుదలతో కృషి చేస్తున్న బీజేపీకి ఈసారి కూడా నిరాశ తప్పదని ఈ సర్వేలో స్పష్టం అయింది. ఈ ఎన్నికలలో బీజేపీకి రెండు సీట్లు కూడా రావటం కూడా కష్టమేనని ఈ సర్వే తేల్చింది. అయితే ఎన్నికలకు ముందు ఇలాంటి సర్వేలు బయటకు రావడం.. తరువాత అందులో కొన్ని చతికిల పడడం మనం చూస్తూనే ఉన్నాం. మరి ఈ సర్వే ఫలితాలు నిజామా అవుతాయో లేదో తేలాలంటే కొద్దీ రోజులు వెయిట్ చేయాల్సిందే.        
రాజకీయాలు అంటేనే అదో జూదం. పూలమ్మిన చోటనే కట్టెలు అమ్మవలసి రావచ్చును. అలాంటి పరిస్థితే వచ్చినా, తలవంచుకుని పోగలిగితేనే, ఎవరైనా రాజకీయాలలో రాణించగలరు. అలాకాదని, అలిమి కానిచోట, కూడా తామే అధికులమని భావిస్తే, ఎందుకూ కాకుండా పోతారు. అలాంటి వారు ఇద్దరూ కూడా ఇప్పుడు మన కళ్ళముందే ఉన్నారు.  జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు. అలాగే జయ మరణం తర్వాత ఆమె పరిస్థితి ఏమిటో కూడా వేరే చెప్పవలసిన, అవసరం లేదు. జైలు పాలయ్యారు. సర్వం తానై నడిపించిన పార్టీ నుంచి  బహిష్కరణకు గురయ్యారు. జయ ఉన్నంత వరకు తన వారుగా ఉన్న వారందరూ కానివారయ్యారు. ఒంటరిగా మిగిలారు.  నిజానికి నాలుగేళ్ళు జైలు జీవితం గడిపిన తర్వాత కూడా ఆమె తలచుకుంటే.. రాష్ట్ర రాజకీయాలలో, ముఖ్యంగా అధికారంలో ఉన్న డిఎంకే కూటమిలో అలజడి సృష్టించగలరు. ఎన్నికలలో ఆమె గెలవక పోవచ్చును కానీ.. తనను కాదన్న అన్నాడిఎంకేను ఓడించగలరు. అయిన  ఆమె అందుకు విరుద్ధంగా  రాజకీయాలకు వీడ్కోలు పలికి మౌనంగా పక్కకు తప్పుకున్నారు. రాజకీయ సన్యాసం ప్రకటించారు. ఉమ్మడి శతృవు డిఎంకే ను ఓడించేందుకు అన్నా డిఎంకే కూటమి  పోటీ చేయాలని, కూటమి ఐక్యతను దెబ్బతీయరాదనే ఉద్దేశంతోనే ఆమె రాజకీయ సన్యాసం ప్రకటించారు.    శశికళ మౌనంగా వెళ్లి పోవడం వెనక ఇంకా అనేక కారణాలున్నా ,అసలు కారణం ఆమె, రాజకీయ విజ్ఞత, వివేకం. ఆమె జైలుకు వెళ్ళిన సమయంలో జయలలిత సమాధి వద్ద ఎంత కసిగా, కోపంగా ‘మౌన’ ప్రతిజ్ఞ చేశారో చూశా. అలాంటి ఆమె ఇప్పుడు ఇలా ‘మౌనం’గా వెనకడుగు వేశారంటే, అది ఆలోచించ వలసిన విషయమే.ఆమె వ్యుహతంకంగానే సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే అనేక మంది అనేక కోణాల్లో శశికళ సంచలన నిర్ణయాన్ని విశ్లేషించారు.జైలు జీవితం తర్వాత కూడా అన్నా డిఎంకే నాయకులు తనను అగ్రనేతగా అంగీకరించక పోవడం, అమిత్ షా చెప్పినా.. అన్నా డిఎంకే నాయకులు ఆమెను, మేనల్లుడు దినకరన్’ను కులం పేరున, కుటుంబం పేరున దూరం చేయడం, తిరిగి పార్టీలోకి తీసుకోకపోవడంతో ఆమె మనసు కష్టపెట్టుకుని, సన్యాస నిర్ణయం తీసుకున్నారని కొందరంటున్నారు. పార్టీ మీద పట్టు లేదని, చరిష్మా అసలే లేదని, అందుకే ఆమె అలా నిశ్శబ్ధంగా రాజకీయ సన్యాసం స్వీకరించారని ఇంకొందరు విశ్లేషించారు. ఈ విశ్లేషణలో కొంత నిజం ఉంటే ఉండవచ్చును.. కానీ ఆమె గతాన్ని, నైజాన్ని గుర్తు చేసుకుంటే ఆమె స్ట్రైక్ బ్యాక్ వ్యూహంతోనే ఒకడుగు వెనక్కివేశారని ఆమెతో సన్నిహితంగా మెలిగినవారు, ఆమె రాజకీయ చాణక్యం తెలిసిన వారు అంటారు.   నిజానికి జైలులో ఉన్న కాలంలో కానీ, జైలు నుంచి విడుదలై వచ్చిన తర్వాత కానీ, ఆమె రాజకీయ సన్యాసం వైపు అడుగులు వేస్తున్నట్లు కనిపించలేదు. బెంగుళూరు జైలు నుంచి విడుదలై చెన్నైలో ప్రవేశించిన నప్పుడు ఆమె పెద్ద కాన్వాయ్ తో  తమ కారుకు అన్నాడిఎంకే జెండాతోనే ఎంటరయ్యారు. అలా ఎంట్రీలోనే రాజకీయ ఆకాంక్షను వెంట తెచ్చుకున్నారు. చివరకు ‘సన్యాస’ ప్రకట చేసే వరకు కూడా ఆమె రాజకీయ కార్యకలాపాలు సాగిస్తూనే ఉన్నారు. అటు ఢిల్లీని ఇటు చెన్నైనికూడా కదిల్చారు. అంతేకాదు, రాజకీయాలపై విరక్తితో కాదు, రాజకీయ కసితో, ఉమ్మడి శత్రువు (డిఎంకే) ను ఓడించేందుకే తాను రాజకీయాలనుంచి తపుకుంటున్నట్లు చెప్పారు.  సో .. సన్యాసం తీసుకోవాలనే ఆలోచన, రాజకీయవ్యూహం లోంచి పుట్టిందే కానీ,వైరాగ్యంతో పుట్టింది కాదు ,అన్నవిశ్లేషణ వాస్తవానికి ఇంకొంత దగ్గరగా ఉందని అనుకోవచ్చును. ఇది ‘కామా’నే కాని ‘ఫుల్స్టాప్’ కాదని అంటున్నారు.  ముఖ్యమంత్రి ఎడప్పాడి కే. పళని స్వామి (ఈపీఎస్) ఆమెను పార్టీలోకి అనుమతిస్తే తన కుర్చికీ ఎసరు పెడతారనే భయంతోనే,, ఆమె ఎంట్రీని అడ్డుకున్నారు. ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం, శశికళ ఒకే సామజిక వర్గానికి చెందిన వారు కావడం కూడా, ముఖ్యమంత్రి ఈపీఎస్’ భయానికి కారణంగా పేర్కొంటారు. అందుకే  ఆయన, ‘మన్నార్గుడి’ ఫ్యామిలీని బూచిగా చూపించి, ఆమెను దూరంగా ఉంచారని పార్టీలో ఒక వర్గం గట్టిగా విశ్వసిస్తుంది. అయితే ఆమె శక్తియుక్తులను కూడతీసుకుని  పులిలా పంజా విసిరేందుకే ఆమె వ్యూహాత్మకంగా ఒక అడుగు వెనక్కి వేశారు కావచ్చును అని కూడా, తమిళ రాజకీయ వర్గాల్లో ఒక చర్చ జరుగుతోంది.  గతంలో ఆమె జయలలితతో విబేధాలు వచ్చిన సమయంలో కూడా ఇలాగే కొద్ది కాలం మౌనంగా తెర చాటుకు వెళ్లి పోయారు.  కొద్ది కాలంలోనే మళ్ళీ ‘పోయస్ గార్డెన్’లో ప్రత్యక్షమయ్యారు. జయలలిత స్వయంగా ఆమెను వెనక్కి పిలుపించుకోవలసిన పరిస్థితులను సృష్టించారు. అలా  మళ్ళీ  చక్రం తిప్పారు. జయలలిత మరణం వరకు ఆమె అందరికీ చిన్నమ్మగా అమ్మకు పెద్దమ్మగా సర్వం తానై నిలిచారు. చివరకు జయ అంత్యక్రియల్లో కూడా ఆమెదే పై చేయిగా కనిపించింది.   జయలలిత చనిపోయిన సందర్భంలోనే అన్నా డిఎంకే ఎమ్మెల్ల్యేలో సుమారు 30 మంది వరకు ఆమెకు మద్దతుగా ఉన్నారన్న వార్తలొచ్చాయి. నిజానికి,ఇప్పటికి కూడా ఒక్క అన్నా డిఎంకే లోనేకాదు,డిఎంకే ఇతర పార్టీలలో కూడా  ఆమె అవసరం ఉన్న వాళ్ళు ఉన్నారు. కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో ‘మన్నార్గుడి’ ఫ్యామిలీ మద్దతు లేకుండా గెలిచే అవకాశం లేదు.  ఇవ్వన్నీ నిజమే అయినా.. అన్నీ ఉండి, ఎవరు లేని శశికళలో, ఇంకా  ఎవరి కోసం తాపత్రయ పడాలి? అనే ప్రశ్న జనించి ఉంటే, ఆమె రాజకీయ సన్యాసం నిజం కావచ్చును. ఎందుకంటే ఆమె నెచ్చలి, జయలిత లేరు, భర్త అంతకంటే ముందే చనిపోయారు, పిల్లలు లేరు... పైగా నాలుగేళ్ళ జైలు జీవితం ఆమెలో మార్పు తెచ్చి ఉండవచ్చును. ఈ వయస్సులో తనవారంటూ ఎవరు లేని తనకు రాజకీయాలు ఎందుకు ? శేష జీవితాన్ని ఇలా సాగిద్దామనే ఆలోచన నిజంగా వచ్చి ఉంటే, ఆమె సన్యాసం సత్యం అయినా కావచ్చును, కాకపోనూ వచ్చును. కానీ  శశికళ... ఆమెను అర్థం చేసుకోవడం, అంచనా వేయడం , అంత తేలిగ్గా అయ్యే పని కాదు..
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు. కాంగ్రెస్ అధినాయకత్వం పై నేరుగా అస్త్రాలు సంధించారు. రాహుల్ గాంధీ పేరు చెప్పకుండానే, ఆయన నాయకత్వానికి పనికిరాడని తేల్చి చెప్పారు. ఎవరైనా పార్టీ అధ్యక్షుడు అయితే కావచ్చును, కానీ, ప్రజానాయకుడు కాలేడని, రాహుల గాంధీ ప్రజానాయకుడు కాదు కాలేరు,అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తరచూ రాహుల్ గాంధీని ఉద్దేశించి చేసే  ‘నామ్’ధారీ వ్యంగ్యాస్త్రాన్నే కాంగ్రెస్ సీనియర్ నాయకులు కూడా సందించారు. ఇక అక్కడి నుంచి విధేయ, అసమ్మతి వర్గాల మధ్య మాటల యుద్ధం ఎదో ఒక రూపంలో సాగుతూనే వుంది. అదే క్రమంలో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ, కరుడు కట్టిన ముస్లిం మతోన్మాది, అబ్బాస్ సిద్దిఖీతో కాంగ్రెస్ పార్టీ చేతులు కలపడం అసమ్మతి నాయకులకు మరో అస్త్రాన్ని అందించింది. విషయంలోకి వెళితే, ఇటీవల పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా లోక్’సభలో కాంగ్రెస్ పక్ష నాయకుడు, పశ్చిమ బెంగాల్ పీసీసీ అధ్యక్షుడు అధీర్’రంజన్ చౌదరి, ముస్లిం మత ప్రచారకుడు, అబ్బాస్ సిద్దిఖీతో  వేదిక పంచుకున్నారు.అంతకు ముందే వామ పక్ష కూటమితో  పొత్తు కుదుర్చుకున్న కాంగ్రెస్ పార్టీ, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)ను కూటమిలో చేర్చుకుంది. ఇలా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) అమోదం లేకుండా మతోన్మాద ఐఎస్ఎఫ్’ తో ఎన్నికల పొత్తు పెట్టుకోవడం ఆ పార్టీ నాయకుడు,సిద్ధిఖీతో  పీసీసీ చీఫ్ వేదిక  పంచుకోవడం పై అసమ్మతి నేతలు మండి పడుతున్నారు. ఇలా సిద్దిఖీతో వేదిక పంచుకోవడం పార్టీ మౌలిక సిద్ధాంతాలకు వ్యతిరేకం అంటూ అసమ్మతి వర్గానికి చెందిన కీలక నేత, రాజ్యసభ సభ్యుడు,ఆనంద్ శర్మ మండిపడ్డారు. అంతే కాదు, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)తో జనవరిలో కుదుర్చుకున్న పొత్తుకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ)అమోదం లేదని ఆనంద్ శర్మ, అభ్యంతరం వ్యక్త చేశారు. పార్టీ విశ్వసించే లౌకిక వాదానికి కాంగ్రెస్ అధిష్టానం తీసుకున్న నిర్ణయం గొడ్డలి పెట్టని ఆయన తీవ్రంగా స్పందించారు.   శర్మ వ్యాఖ్యలపై అధీర్ రంజన్ చౌదరి అంతే ఘాటుగా ప్రతిస్పందించారు. “నిజాలు తెలుసుకోండి ఆనంద్ శ‌ర్మ జీ” అంటూ ఆయ‌న వ‌రుస ట్వీట్లు చేశారు. వ్య‌క్తిగ‌త ప్ర‌యోజ‌నాలు ప‌క్క‌న‌పెట్టి, ప్ర‌ధానిని పొగిడి టైమ్ వేస్ట్ చేయ‌కండంటూ ఆయ‌న ఓ ట్వీట్లో అన్నారు. ఆనంద్ శ‌ర్మ అన‌వ‌స‌రంగా కాంగ్రెస్‌ను ల‌క్ష్యంగా చేసుకుంటున్నార‌ని, ఈ అంశాన్ని పెద్ద‌ది చేసి చూపిస్తున్నార‌ని విమ‌ర్శించారు. ఆయ‌న ఉద్దేశాలు స‌రైన‌వే అయితే నేరుగా తనతో మాట్లాడ వలసిందని అన్నారు. బెంగాల్‌లో సీపీఐ(ఎం) కూట‌మికి నేతృత్వం వ‌హిస్తోంది. అందులో కాంగ్రెస్ ఓ భాగం. మ‌త‌తత్వ‌, విభ‌జ‌న రాజ‌కీయాలు చేస్తున్న బీజేపీకి చెక్ పెట్ట‌డానికే ఈ కూట‌మి అని మ‌రో ట్వీట్‌లో అధిర్ రంజ‌న్ అన్నారు. అక్కడతోనూ ఆగలేదు ... ట్వీట్ల మీద ట్వీట్లు సంధిస్తూ, ఆనంద్ శర్మ, బీజేపీ మత విభజన, అజెండాను బలపరుస్తున్నారని, పరోక్షంగా జీ23 నాయకులు బీజేపీకి ప్రయోజనం చేకూరుస్తున్నారని ఆరోపించారు.అంతే కాదు, క్షేత్ర స్థాయి వాస్తవ పరిస్థితులు తెలియకుండా, ఆనంద్ శర్మ పార్టీ మీద దండెత్తడం ఉచితం కాదని చౌదరి ఎదురుదాడి చేశారు. అసమ్మతిలో అసమ్మతి. ఇదలా ఉంటే, కాంగ్రెస్ పార్టీ  సమూల పక్షాళన కోరుతూ సోనియా గాంధీకి,గత సంవత్సరం  జీ 23గా ప్రాచుర్యం పొందిన సీనియర్ నాయకులు రాసిన లేఖపై సంతకాలు చేసిన  నాయకుల్లో నలుగురు,జమ్మూలోసమావేసమైన నాయకుల తాజా నిర్ణయాలు, వ్యాఖ్యలు,విమర్శల పట్ల అసంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరం సోనియా గాంధీకి రాసిన లేఖలో ప్రస్తావించిన అంశాలకు కట్టుబడి ఉన్నామని, అయితే, జీ 23లోని కొందరు సహచరులు, ఇటీవల గీతదాటి చేస్తున్న వ్యాఖ్యలు, విమర్శలను తాము సమర్ధించడం లేదని ఆ నలుగురు పేర్కొన్నారు. ఇందులో ముఖ్యంగా, రాజ్యసభ మాజీ డిప్యూటీ చైర్మన్, పీజే కురియన్ అయితే, “కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు అవసరమైన సంస్కరణలు తెచ్చేందుకు చేసే ప్రయత్నాలను పూర్తిగా సమర్దిస్తాను, కానీ, ‘లక్ష్మణ రేఖ’ దాటితే ఒప్పుకునేది లేదు”అని అసమ్మతిలో అసమ్మతికి తెర తీశారు.అలాగే, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ కుమారడు, మాజీ ఎంపీ సందీప్ దీక్షిత్,మధ్య ప్రదేశ్ సీనియర్ కాంగ్రెస్ నాయకుడు అజయ్ సింగ్’ కూడా గులాం నబీ ఆజాద్, కపిల్ సిబల్, ఆనంద్ శర్మ, మనీష్ తివారీ వంటి జీ 23 కీలక నేతలు అధినాయకత్వంపై చేసిన వ్యాఖ్యలను తప్పు పట్టారు. అలాగే, పార్టీ సీనియర్ నాయకుడు కేంద్ర మాజీమంత్రి వీరప్ప మొయిలీ కూడా,గత సంవత్సరం పార్టీ సీనియర్ నాయకులు  ఒక పరిమిత లక్ష్యంతో  సోనియా గాంధీకి లేఖ రాయడం జరిగిందని, ఆ పేరున జరుగతున్న  కార్యక్రమాలు లేఖ సంకల్పానికి  విరుద్ధమని అన్నారు. జీ 23 కార్యకలాపాలపై రాహుల్ గాంధీ కూడా పరోక్షగా స్పందించారు, ఒకప్పుడు ఎన్ఎస్’యుఐ, యూత్ కాంగ్రెస్’ కు సంస్థాగత ఎన్నికలు వద్దన్న వారే ఇప్పుడు ఇంకోలా మాట్లాడుతున్నారని పరోక్షంగానే అయినా సంస్థాగత ఎన్నికలు నిర్వహించడంతో పాటుగా, పార్టీ పక్షాలనకు తమ కుటుంబం వ్యతిరేకం కాదని, అందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఈ నేపధ్యంలో కాంగ్రెస్ పార్టీలో చెలరిగిన కలకలం  ఇక ముందు ఏమవుతుందో .. ఇంకెన్ని  మలుపులు తిరుగుతోందో ..చూడవలసిందే కానీ ఉహించలేము.
పంచతంత్రంగా పిలుచుకుంటున్న ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భతం జరగబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే, వివిధ సంస్థలు అసెంబ్లీ ఎన్నికలు జరిగే  అస్సాం. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటుగా కేరళలోనూ ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఆ ఒపీనియన్ పోల్ ఫలితాలు నిజంగా నిజం అయితే, కేరళలో మళ్ళీ సీపీఎం సారధ్యంలోని వామపక్ష కూటమి అధికారంలోకి వస్తుంది. ఇదే ఆ అద్భుతం. ఎందుకంటే, గత నాలుగు దశాబ్దాలలో కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో ఒకే కూటమి వరసగా రెండవసారి అధికారంలోకి వచ్చిన చరిత్ర లేనే లేదు. ఒక సారి ఎల్డీఎఫ్ అధికారంలోకి వస్తే ఐదేళ్ళ తర్వాత కాంగ్రెస్ సారధ్యంలోని ఐక్య ప్రజాస్వామ్య కూటమి(యూడీఎఫ్) అధికారంలోకి రావడం, దేవభుమిలో దైవ నిర్ణయమా అన్నట్లుగా ప్రతి ఎన్నికల్లోనూ అధికారం చేతులు మారుతూ వస్తోంది. అలాంటిది, ఈసారి ఒపీనియన్ పోల్స్ నిజమై వరసగా రెండవసారి వామపక్ష కూటమి అధికారంలోకి వస్తే, అది చరిత్రే అవుతుంది. ఇక ఒపీనియన్ పోల్స్ విషయానికి వస్తే, జాతీయ న్యూస్ ఛానెల్ ఏబీపీ, సీ ఓటర్ సంస్థలు సంయుక్తంగా ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఈ సర్వే ప్రకారం, 140 స్థానాలున్న కేరళ అసెంబ్లీలో వామపక్ష కూటమికి 83 నుంచి  91 స్థానాలు, యూడీఎఫ్ కూటమికి 47 నుంచి 55 స్థానాలు మాత్రమే దక్కుతాయని తెలుస్తోంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్రంలో ఇలా జాతకాలు తిరగబడడంపై సోషల్ మీడియాలో,’లెగ్ మహిమ’ లాంటి జోక్స్  ట్రోలవుతున్నాయి. అయితే 2016లో జరిగిన ఎన్నికల్లో కేవలం 47 సీట్లకే పరిమితం అయిన కాంగ్రెస్’కు ఈసారి ఒకటీ అరా సీట్లు ఎక్కువస్తే, రావచ్చును. అదే కాంగ్రెస్’కు కాసింత ఊరట. అదలా ఉంటే, పశ్చిమ బెంగాల్లో సైతం పట్టు సాధించిన బీజేపే, కేరళలో మాత్రం పట్టు కాదు కదా, పట్టుమని పది సీట్లు తెచ్చుకునే స్థితిలో లేదు. నిజానికి, దేశంలో బీజేపీకి అసలు ఏ మాత్రం మింగుడు పడని రాష్ట్రాలు ఎవైన ఉన్నాయంటే కేరళ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల  పేర్లే ప్రముఖంగా వినిపిస్తాయి. ఈ సారి కూడా కమల దళం కేరళలో కాలు పెట్టె పరిస్తి లేదని సర్వే ఫలితాలు చెపుతున్నారు. ఎప్పటిలానే ఇప్పడు కూడా  బీజేపీకి సున్నా నుంచి రెండు సీట్లు వచ్చే అవకాశం ఉందని, సర్వేస్వరుల అభిప్రాయంగా ఉంది. కేరళలో మొత్తం 140 స్థానాలకు ఏప్రిల్ 6 తేదీన ఒకే విడతలో పోలింగ్ జరుగుతుంది. మే 2 తేదీన ఫలితాలు వెలువడతాయి. కేరళ ఎలక్షన్ పై యావత్ దేశం ఆసక్తి కనబరుస్తోంది.    
కేంద్ర ఎన్నికలసంఘం ‘పాంచ్ పటాక’ గంట కొట్టింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. ఎన్నికల గంట మోగడంతో మొదలైన మరో భారత ‘మినీ’  సంగ్రామానికి మే 12 తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తెర పడుతుంది.ఈలోగా వివిధ అంచల్లో పోలింగ్ జరుగుతుంది.  నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతం ఓటరు తీర్పుకు వెళుతున్నా, అందరి దృష్టి, ముఖ్యంగా ప్రాంతీయ పార్టీల ఏలుబడిలో ఉన్న ఉభయ తెలుగు రాష్ట్రాలు, మరీ ముఖ్యంగా ఇప్పటికే బీజేపీ కన్నుపడిన తెలంగాణ రాష్ట్ర ప్రజలు, రాజకీయ పార్టీల దుష్టి  మాత్రం పశ్చిమ బెంగాల్ పైనే వుంది.  పశ్చిమ బెంగాల్లో ‘అద్భుతం’ జరిగి బీజేపీ విజయం సాధిస్తే, ఇక  కమల దళం ఫోకస్, తెలంగాణకు షిఫ్ట్ అవుతుంది. ఇది అందరికీ తెలిసిన బహిరంగ రహస్యం. ఈ నేపధ్యంలో బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయి అనే విషయంలో రాష్ట్ర రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. బెంగాల్లో బీజేపీ గెలిస్తే, ఇప్పటికే అంతర్గత కుటుంబ కలహాలతో సతమతవుతున్న తెరాస నాయకత్వానికి మరిన్నితిప్పలు తప్పవన్న మాట అంతఃపుర వర్గాలలో సైతం వినవస్తోంది.  పశ్చిమ బెంగాల్’లో ఎలాగైతే కమలదళం ఓ వంక తమ ట్రేడ్ మార్క్, హిందుత్వ రాజకీయాలు సాగిస్తూ, మరో వైపు నుంచి ‘ఆకర్ష్’ అస్త్రంతో అధికార పార్టీని నిర్వీర్యం చేసిన విధంగానే, ఇక్కడ కూడా ఫిరాయింపులను ప్రోత్సహింఛి పార్టీని నిట్టనిలువునా చీల్చే ప్రమాదాన్ని కొట్టివేయలేమని పార్టీ వర్గాలు కూడా అనుమానం వ్యక్త పరుస్తున్నాయి.  ఇప్పటికే తెలంగాణ  బీజేపీ నాయకులు 30 మంది తెరాస ఎమ్మెల్యేలు తమ టచ్ లో ఉన్నారని బెదిరిస్తున్నారు.అది నిజం అయినా కాకపోయినా..తెరాసలో అసంతృప్తి అగ్గి రగులుతోందనేది మాత్రం ఎవరూ కాదనలేని నిజం. అంతే కాకుండా రాష్ట్రానికి వచ్చిన కేంద్రనాయకులు ఎవరిని పలకరించినా, నెక్స్ట్ టార్గెట్ తెలంగాణ అని ఎలాంటి సషబిషలు లేకుండా కుండబద్దలు కొడుతున్నారు.అందుకే, బెంగాల్లో బీజేపీ గెలిస్తే.. అనే ఊహా కూడా  గులాబీ గూటిలో గుబులు పుట్టిస్తోంది. అయితే, బెగాల్’లో బీజేపీ గెలిస్తే ఒక్క తెలంగాణలోనే కాదు, దేశ రాజకీయ వాతావరణంలోనే పెను మార్పులు చోటు చేసుకుంటున్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.  అలాగే,  దేశ ముఖ చిత్రంలో కూడా పెను మార్పులు తప్పవని అంటున్నారు. అయితే రాజకీయాలలో ఎప్పుడు ఏం జరుగుతుందో.. ఎవరూహించెదరు..
ఎక్కువసేపు టీవీ చూస్తున్నారా? అయితే మిమ్మల్ని త్వరలోనే మతిమరుపు పలకరిస్తుంది అంటున్నారు ఆస్ట్రేలియాకు చెందిన పరిశోధకులు. రోజుకి గంటకన్నా తక్కువ సమయం మాత్రమే టీవీ చూస్తున్న వారికి మధ్య జ్ఞాపకశక్తి విషయంలో చాలా తేడా వుందని వీరి పరిశోధనలో తేలింది. కొన్ని వేలమందిపై రకరకాల పరీక్షలు నిర్వహించి తేల్చిన విషయమిది. చిన్న చిన్న విషయాలని కూడా టీవీని అతిగా చూసేవారు మర్చిపోతుండటం గమనించారట వీరు. ముఖ్యంగా పిల్లల జ్ఞాపకశక్తిపై టీవీ చాలా ప్రభావాన్ని చూపిస్తుందని చెబుతున్నారు వీరు. స్కూలుకి వెళ్ళేముందు లేదా చదువుకోవటానికి కూర్చునే ముందు టీవీ చూస్తే వారి ఏకాగ్రత, జ్ఞాపకశక్తిపై ప్రభావం ఖాయమని గట్టిగా చెబుతున్నారు. మరి జ్ఞాపకశక్తి పెరగడానికి ఏం చేయమంటారు అని వీరిని అడిగితే అందుకు చాలా మార్గాలున్నాయ్. అయితే టీవీ చూడటం తగ్గించమంటున్నాం కాబట్టి దానికి ప్రత్యామ్నాయంగా మిమ్మల్ని ఆహ్లాదపరిచే మరో మార్గం ఉంది. దానివల్ల మానసిక, శారీరక ఆరోగ్యం కూడా స్వంతమవుతుంది జ్ఞాపకశక్తి పెరగడంతోపాటు అంటున్నారు. ‘కాల్పనిక సాహిత్యం’ చదివితే మెదడు పదునెక్కుతుంది. జ్ఞాపకశక్తి పెరగుతుంది. మతిమరుపు తగ్గుతుంది. మానసిక ఉల్లాసం సొంతమవుతుంది. నమ్మకం లేకపోతే ఓ 20 రోజులపాటు మేం చెప్పింది పాటించి చూడండి అని చెబుతున్నారు ఈ ఆస్ట్రేలియా పరిశోధకులు. మరి టీవీ చూడటం తగ్గించి చదవటం మొదలుపెడదామా!? -రమ
ఫ్యాన్.. ప్రతి ఇంట్లో చాలా సాధారణంగా ఉండే ఎలక్ట్రిక్ పరికరం.  బయట నుండి ఇంటికి రాగానే ఫ్యాన్ వేసుకుని దాని కింద కూర్చుని రిలాక్స్  అవుతుంటాం. అయితే వేసవి కాలంలో ఫ్యాన్ వేగం తగ్గినట్టు అనిపిస్తుంది. కొన్నిసార్లు ఫ్యాన్ వేసినా అసలు వేయనట్టే అనిపిస్తుంది. అందుకే చాలా మంది ధర ఎక్కువైనా ఏసీ వైపు మొగ్గు చూపుతారు. కానీ ఫ్యాన్ సెట్టింగ్ లో 5 మార్పులు చేయడం వల్ల ఫ్యాన్ స్పీడ్ గా తిరుగుతుంది. దాని వేగం.. అది ఇచ్చే చల్లదనం ముందు ఏసీ కూడా బలాదూర్ అంటున్నారు టెక్నాలజీ నిపుణులు. ఇంతకీ ఆ సెట్టింగ్స్ ఏంటో తెలుసుకుంటే.. కెపాసిటర్.. సీలింగ్ ఫ్యాన్‌లో అమర్చిన కెపాసిటర్ మోటార్‌కు అవసరమైన విద్యుత్‌ను అందించడానికి పనిచేస్తుంది. కెపాసిటర్ల పనితీరు మందగించినట్టైతే  90% కంటే ఎక్కువ సీలింగ్ ఫ్యాన్ సమస్యలు ఎదురవుతాయి. కెపాసిటర్ పని చేయడం ఆపివేసినప్పుడు మోటారుకు విద్యుత్ సరిగా అందదు.  దీంతో ఫ్యాన్ వేగం తగ్గుతుంది.  70 నుండి 80 రూపాయల కెపాసిటర్‌ను తిరిగి అమర్చితే  ఫ్యాన్ వేగం పెరుగుతుంది.   బ్లేడ్.. కొన్ని సార్లు ఫ్యాన్ బ్లేడ్ వంగడం వల్ల కూడా ఫ్యాన్ వేగం తగ్గుతుంది. అలాంటి పరిస్థితిలో ఫ్యాన్ బ్లేడును మార్చాలి.  దీనివల్ల కూడా సీలింగ్ ఫ్యాన్ వేగం పెరుగుతుంది. బాల్ బేరింగ్ ఫెయిల్యూర్.. సీలింగ్ ఫ్యాన్లు కాలం గడిచేకొద్దీ వాటిలో బాల్ బేరింగ్స్ లో ధూళి పేరుకుపోతుంది. దీని కారణంగా సీలింగ్ ఫ్యాన్ వేగం తగ్గుతుంది.  దాన్ని మరమ్మత్తు చేయడం ద్వారా ఫ్యాన్ వేగం పెంచవచ్చు. స్క్రూలు.. ఫ్యాన్ లో స్క్రూలు వదులైతే ఫ్యాన్ వేగాన్ని దెబ్బతీస్తాయి. అందుకే ఫ్యాన్ స్క్రూలు సరిగా ఉన్నాయా లేదా చెక్ చేసుకుంటూ ఉండాలి. సరళత. సరళత లేకపోవడం కూడా ఫ్యాన్ వేగాన్ని దెబ్బతీస్తుంది. దీన్ని కూడా రిపేర్ చేయించడం ద్వారా ఫ్యాన్ వేగాన్ని పెంచవచ్చు.                                                *రూపశ్రీ.
ఆఫీసులో పనిచేస్తున్న వారిలో పనిపట్ల శ్రద్ధలేకపోయినా, పని చేయడంలో విసుగు చిరాకు ప్రదర్శిస్తున్నా వారి సమస్య ఒత్తిడికాదు... పని ఒత్తిడి ఎక్కువైందని...! పనితో అలసిపోతున్నామని చెప్పేవారి సమస్య ఏమిటంటే వారికి ఆ పనిపట్ల ఇష్టం లేకపోవడం. అందువల్ల పనిమీద శ్రద్ధ చూపించలేకపోయారు. దాని వలన వారు పని ఒత్తిడి ఎక్కువైందని భావిస్తారు. అయిష్టంతో పనిని చేయడం వలన ఏ వ్యక్తి అయినా, ఆ పనిని రెండుసార్లు చేస్తారు. ఎన్నిసార్లు చేసినా ఆ పనిలో వారు చురుకుదనంగా ఉండరు. ఆ పనిని అంత సమర్థవంతంగా చేయలేరు. ఆ పనిపట్ల అయిష్టతకు కారణం ఆ వ్యక్తి యొక్క వ్యక్తిగత విషయాలు కావచ్చు, లేక వేరే ఇంకేమైనా కావచ్చు. అందువల్ల ఆవ్యక్తి ఆ పని పట్ల ఆసక్తి చూపకపోవచ్చు.  ఎప్పుడైనా మనం ఒక ఫీల్డ్లోకి వెళ్ళినపుడు, మనం మన  వ్యక్తిగత విషయాలను పక్కనపెట్టాలి. ఆ ఫీల్డ్కి మనం ఇష్టంతో అంకితమవ్వాలి. అప్పుడు ఆ ఫీల్డ్కి మనం న్యాయం చేసినవారం అవుతాము. వ్యక్తిగత జీవితంలో ఎవరు హుషారుగా ఆనందంగా గడుపుతారో అటువంటివారే ఎంత ఒత్తిడినైనా తట్టుకుని, ఎంత పనైనా చేయగలుగుతారు. జీవితంలో తృప్తిగలవారికే పనిలోనూ తృప్తి లభిస్తుంది. జీవితాన్ని ఆనందించలేనివారు చిన్నచిన్న పనుల్లో కూడా చాలావరకు తప్పులనే చేస్తూ వుంటారు. "పనులు నువ్వు చేయడంలేదు. జరుగుతున్నాయ" అనే మాటను  గ్రహించి నిరహంకారంగా ఎవరి  కర్తవ్యం వారు నిర్వర్తించాలి. ఈ పని తర్వాత ఇంకేం చెయ్యాలి అని ఆలోచించకూడదు కేవలం చరిస్తూ వెళ్ళాలి. అలా ఆచరిస్తూంటే, ఒకదానివెంట మరొకటి అవే వస్తుంటాయి. మొదలుపెట్టిన పని సక్రమంగా పూర్తయితే ఆ పనిపట్ల నీవు ఇష్టతను చూపించావు అని అర్థం. మొదలుపెట్టినపని అవలేదంటే నీవు ఆ పనిపట్ల అయిష్టతను చూపించావు అని అర్థం. కొంతమంది ఇష్టంతో చేసినా ఆ పని ఆపలేదంటే దానికి కారణం ఆ పనిని వాయిదా వేయడం. ఇలా వాయిదా వేయడం వలన క్రమేపీ ఆ పనిపట్ల శ్రద్ధ తగ్గిపోతుంది. దీని వలన ఆ పనులు పూర్తికావు. అందువలన ఎప్పుడూ పనులను వాయిదా వేయకూడదు. కాబట్టి మనం ఏదైనా పనిని మొదలు పెట్టినపుడు ఆ పనిని ఇష్టంతో వాయిదా వేయకుండా ఆ పనిని త్వరగా పూర్తిచేసుకోవాలి. ఎప్పుడైన ఒక పనిని ఇష్టంతో చేస్తే ఆ పని కష్టమనిపించదు ఆ పనిలో విజయాన్ని పొందుతారు. ఎప్పుడైనా ఒక పనిని కష్టపడి చేస్తే మనకి ఆ పని కష్టంగా వుంటుంది. ఆ పని విజయవంతం కాదు. ఓటమి, విఘ్నం, అనేవి బయటెక్కడో లేవు. నీలోనే వున్నాయి. ఉత్సాహంతో పనులు చేస్తారు కొందరు, ఇంకేదో విషయంపై ఉత్సాహంతోనే పనులు మానేస్తారు మరికొందరు. ఎప్పుడైనా సరే మనం ఏదైనా పనిని తలపెడితే ఆ పని అయ్యేవరకూ ఆ పనిపట్ల ఇష్టాన్ని చూపించాలి. అప్పుడే ఆ పనిలో ఆనందాన్ని పొందగలం. అలా చేస్తే ఇక విజయం మన  సొంతమవుతుంది. ఒక సాకర్ ఆటలో ఆటగాళ్ళను మారుస్తూ, ఒకరు సరిగ్గా ఆడకపోతే వారికి బదులు ఇంకొకరిని అడటానికి పంపవచ్చు. కానీ - జీవితం అలాకాదు. ఒకసారి ఏదైనా తప్పుచేస్తే, దాన్ని వెనక్కి తీసుకుని, దానిస్థానే ఇంకోపని చెయ్యటం కుదరదు. మీ జీవితంలో సంభవించిన విషాద సంఘటనలని వెనక్కి తిప్పి సరిచూసుకోడానికి మీకు రెండో అవకాశం దొరకదు.                                      ◆నిశ్శబ్ద.
ఖర్జూరానికి చాలా పెద్ద చరిత్రే ఉంది. ప్రపంచ వ్యాప్తంగా ఆదరణ పొందిన  ఖర్జూరాలు రుచికే కాదు..  ఆరోగ్యానికి కూడా బోలెడు ప్రయోజనాలు కలిగిస్తాయి. అయితే ఖర్జూరాలను రాత్రి పడుకునే ముందు తేనెతో కలిపి తింటే ఆరోగ్యానికి చాలా మంచిదని అంటున్నారు. తేనె, ఖర్జూరం కాంబినేషన్ కేవలం ఒకటని కాదు.. లెక్కలేనన్ని ఆరోగ్య ప్రయోజనాలు కలిగిస్తుంది.  రాత్రి పడుకునే ముందు తేనె,  ఖర్జూరం లో ఉండే పోషకాలేంటో.. వాటిని కలిపి తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలేంటో తెలుసుకుంటే.. తేనె పోషకాలు.. ఒక టేబుల్ స్పూన్ తేనెలో - కేలరీలు: 64, కొవ్వు: 0 గ్రా, సోడియం: 0 mg, పిండిపదార్థాలు: 17 గ్రా, ఫైబర్: 0 గ్రా, చక్కెరలు: 17 గ్రా, ప్రోటీన్: 0.1 గ్రా, పొటాషియం: 10.9 mg, ఇనుము: 0.1 mg, కాల్షియం: 1.3 mg ఉంటాయి. ఖర్జూరం పోషకాలు.. ఎండు ఖర్జూరంలో  కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్లు, కొవ్వులు, చక్కెరలు, ఖనిజాలు (కాల్షియం, జింక్, ఐరన్, ఫాస్పరస్ మొదలైనవి),  విటమిన్లు (B1, B2, C, మొదలైనవి) వంటి పోషకాలు ఉంటాయి. ఇది టానిన్లు, కెరోటినాయిడ్లు, పాలీఫెనాల్స్ మొదలైన వివిధ బయోయాక్టివ్ సమ్మేళనాలను కూడా కలిగి ఉంటుంది. రాత్రి పడుకునే ముందు ఖర్జూరాన్ని తేనెతో కలిపి తింటే.. రాత్రి పడుకునే ముందు ఈ రెండు తింటే రోగనిరోధక శక్తి పెరుగుతుంది. వీటిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ మైక్రోబయల్ గుణాలు వ్యాధులతో పోరాడే శక్తిని శరీరానికి అందిస్తాయి. తేనె, ఖర్జూరం రెండు తీసుకుంటే   శరీరంలో ఎలాంటి వాపులను తగ్గించడంలో సహాయపడతాయి. ఈ రెండింటిని కలిపి తింటే ఆకలి కూడా పెరుగుతుంది. ఇది జీవక్రియను పెంచుతుంది. తేనె, ఖర్జూరం కాంబినేషన్ జుట్టు పెరుగుదలను కూడా పెంచుతుంది. వీటిలో యాంటీ ఆక్సిడెంట్లు, ఐరన్ పుష్కలంగా ఉంటాయి. అయితే ఈ రెండూ వేడిగా ఉంటాయి కాబట్టి వేసవి కాలంలో వీటి వినియోగాన్ని తగ్గించాలి.                                                       *రూపశ్రీ.
వేసవిలో ఆహారం విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి.  ఎందుకంటే ఈ సీజన్‌లో జీర్ణక్రియ చాలా నెమ్మదిగా జరుగుతుంది. ఆహారంలో జీర్ణక్రియను ప్రేరేపించే ఆహారాలు తీసుకోవాలి. దీనివల్ల  జీర్ణక్రియ  ఆరోగ్యంగా ఉంటుంది. అందుకే వేసవి కాలంలో లిక్విడ్ ఫుడ్ కు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. వేసవి కాలంలో  ఎక్కువగా పండ్లు,  కూరగాయల రసాలను తాగుతారు. ఇది  మాత్రమే కాకుండా సత్తును త్రాగితే చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. యూట్యూబ్ పుణ్యమా అని  ఎన్నో రాష్ట్రాలు, దేశాల ఆహారాలు తెగ వైరల్ అవుతుంటాయి. అలాంటి వాటిలో సత్తు కూడా ఒకటి.  ఇది వేసవిలో సూపర్ ఫుడ్ గా పరిగణించబడుతుంది. దీన్ని పాలలో కలుపుకుని తాగితే పొట్ట చల్లగా ఉండడంతో పాటు మరికొన్ని ప్రయోజనాలు ఉన్నాయి. అవేంటో తెలుసుకుంటే.. సత్తులో పోషకాలు..  సత్తులో ప్రొటీన్లు పుష్కలంగా ఉంటాయి. ఇది కాకుండా  ఐరన్, కాల్షియం, మెగ్నీషియం,  పొటాషియం వంటి అనేక పోషకాలు ఉన్నాయి. సత్తును  పాలతో కలిపి త్రాగితే ఇది పోషక లక్షణాలను పెంచుతుంది. వేసవి కాలంలో శరీరం  శక్తి స్థాయి కొద్దిగా నెమ్మదిగా ఉంటుంది. ఇలాంటి  పరిస్థితిలో సత్తును తీసుకుంటే శక్తివంతంగా ఉండవచ్చు. ఇది కాకుండా శరీరంలో రక్త హీనతతో బాధపడుతున్న వ్యక్తులు సత్తును తీసుకుంటే ప్రయోజనం ఉంటుంది. వేసవిలో  జీర్ణవ్యవస్థ కొద్దిగా బలహీనపడుతుంది. ఇలాంటి సమయంలో సత్తును తీసుకోవడం వల్ల గ్యాస్, అజీర్ణం, లూజ్ మోషన్ మొదలైన కడుపు సంబంధిత సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది. ఇక పాలతో సత్తును తీసుకోవడం వల్ల బరువు తగ్గుతారు. బరువు తగ్గడానికి ప్రయత్నం చేసేవారు  దీన్నితమ డైట్ లో భాగంగా తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. సత్తు కేవలం చల్లదనాన్ని, శరీరానికి పోషణను, జీర్ణ ఆరోగ్యాన్ని బాగు చెయ్యడమే కాదు.. ఎముకలకు బలాన్ని కూడా ఇస్తుంది. శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచుతుంది. అయితే.. దీన్ని రెగ్యులర్ గా డైట్ లో భాగం చేసుకునే ముందు  ఆరోగ్య నిపుణులను సంప్రదించడం మంచిది.                                                  *రూపశ్రీ.
కిడ్నీ క్యాన్సర్ తరచుగా వస్తూ ఉంటె దీనిని రినాల్ సెల్ కార్సి నోమా గా పిలుస్తారు.. కిడ్నీ సైజ్ 4 సెం గా ఉంటుంది. ఇందుకోసం హీటింగ్ లేదా ఫ్రీజింగ్ పద్దతిద్వారా ట్యూమర్ కు సాధారణంగా తెరఫీ మాత్రమే ప్రత్యామ్నాయం.తెరఫీ క్యాన్సర్ ను నాశనం చేస్తుంది. దీనిని ఎబ్లేషణ్ గా అందరికీ తెలుసు. దీనివల్ల చాలామంది జీవితాలు కాపాడ వచ్చు.అని నిపుణులు అభిప్రాయ పడ్డారు.క్లినికల్ స్టేజి లోనే టి వి ఏ అవసరం లేకుండా కిడ్నీ సర్జరీ చేయవచ్చు.పెన్సిల్వేనియా లో నిర్వహించిన ప్రాధమిక పరిశోదనలో యురాలజీఅసోసియేషన్  అమెరిక అధికారిక జర్నల్ లో ప్రాధమిక స్థాయిలో ఉన్న రినాల్ కార్సినోమా ను గుర్తించారు.ఆర్ సి సి ద్వారా ౩ నుండి 4 సెమి క్రియో అబ్ లేషన్ క్యాన్సర్ ను నాశనం చేస్తుంది. ఫ్రీజింగ్ పద్ధతి ద్వారా క్యాన్సర్ కణాలు పెరుగుదలను నివారిస్తుంది.కిడ్నీ క్యాన్సర్ సంబందిత మరణాలు తక్కువే అయిన అబ్లేషణ్ ప్రభావం తక్కువే అని హీట్ పద్ధతికన్న  ధర్మల్ ఎబిలేషణ్ పద్ధతి  ఎబిలేషణ్ ఉత్తమమని నిర్ధారించారు.రెండిటిని పోల్చినప్పుడు ౩ సెమి లు తక్కువ ఉన్నప్పుడు చల్లటి పద్దతిలో హీట్ పద్దతిలో తెరఫీ ద్వారా క్యాన్సర్ నివారించ వచ్చు.రచయిత గాబ్రియల్ ఐ ఆర్ సి సి ఎస్ ఎం డి సైంటిఫిక్ ఇన్స్టిట్యుట్ మిలాన్ చేసిన పరిశోదన లో ఎబిలేషణ్ ఎలా వినియోగించాలి.అన్న అంశాల పై రోగులకు చిన్న ఆర్ సి సి ఎస్ పద్ధతి పై మరిన్ని పరిశోదనలు చేయాల్సి ఉంది.హీటింగ్ కన్నా క్రియో ఎబిలేషన్ వల్ల ప్రభావం తక్కువే. కిడ్నీ క్యాన్సర్ ను రినాల్ కార్సినోమా గా ప్పిలుస్తారు.రోగులలో అర సి సి 4 సెమీ కన్నా తక్కువ ఉంటుంది. ఇందులో ఫ్ర్రీజింగ్ పడ్డతి హీటింగ్ విధానాల ద్వారా ట్యూమర్ ను సహజంగా ఇచ్చే థెరపీ లానే ఉంటుంది.ఇది క్యాన్సర్ ను నాశనం చేస్తుంది. దీనిని ఎబ్లేషణ్ అంటారు ఎబ్లేషణ్ కూడా క్యాన్సర్ స్టేజ్ ను బట్టి  ఇవాల్సి ఉంటుంది.కిడ్నీ సర్జర్రీ లేకుండా నే  ఎబ్లేషణ్ పద్దతి అమలు చేయవచ్చు.ఏది ఏమైనా ఎబ్లేషణ్ వల్ల తక్కువ లాభాలే వ్యక్తిగతంగా వివిధ స్తేజిలలో టి ఎల్ క్యు అర్ సి సి ఎస్ ట్యూమర్ లు ౩ నుండి 4 సెమీ కణి తలు ఉంటె యురోపియన్ గైడ్ లైన్స్ ప్రాకారం చికిత్చ ఫ్రీజింగ్ ఫ్రీజింగ్ వినియోగించవచ్చు. అంతార్జాతీయ పరిశోదనా సంస్థ బృందం వివిధ స్తేజిలలో ఉన్న వారిని పరీక్షించి ఆర్ సి సి ని ఫ్రీజింగ్ హీటింగ్ పద్దతిని 2౦౦ 4-2౦18 లో కేసులు సర్వ్ లెన్స్ ఎపిడ మాలజీ ద్వారా ఫలితం నషనల్  క్యాన్సర్ ఇన్స్టిట్యుట్ ఫర్ యునైటెడ్ స్టేట్స్ ట్యూమర్ లు ౩,4 సెమీ ఉంది రెండు మూడు గ్రూపు లతో సరిపోయాయి. ఇందులో 75 7 మందికి క్రియో బిలేషణ్ చికిత్చ చేయాగా ౩ 88 మందికి హీట్ ధర్మల్ ఎబ్లేషణ్ చికిత్చ్చ చేసినట్లు నిపుణులు పేర్కొన్నారు.72 సం వచ్చరాలు పై బడిన 4 22 మందికి హీట్ పద్ధతి ద్వారా 2౩8 మందికి ఫ్రీజింగ్ పద్ధతి ని అందించారు.కిడ్నీ క్యాన్సర్ కాక ఇతర అనారోగ్య సమస్యల వల్ల చనిపోయిన వారే ఎక్కువ.౩ నుండి 4 సెమీ ఉన్న వారికి క్రియోబిలేషణ్ 8.5 % క్రియో బిలేషణ్ ద్వారా 18.9 హీట్ పద్ధతి ద్వారా ఎబిలేషణ్ రెన్దొఇ కొన్ని కేసులలో వినియోగించినట్లు తెలిపారు.కిడ్నీ త్యుమర్లను నివారించేందుకు స్మాల్ ఎబిలేషణ్ చికిత్చ చేయవచ్చు అన్నది పరిశోదన సారాంశం.