LATEST NEWS
గదిలో బంధించి కొడితే పిల్లి కూడా  పులిలా తిరగబడుతుందన్నది సామెత. సినీ పరిశ్రమలు అన్ని విధాలుగా అవమానించిన ఏపీ సీఎం జగన్ కు సరిగ్గా ఎన్నికల వేళ ఆ సినీ పరిశ్రమ నుంచి షాక్ ల మీద షాక్ లు తగులుతున్నాయి.  సినీ పరిశ్రమ నుంచి ఒక్కరొక్కరుగా జగన్ కు వ్యతిరేకంగా జనసేనానికి మద్దతుగా బయటకు వచ్చి గొంతు విప్పుతున్నారు. వీరిలో నేచురల్ స్టార్ నానిని ప్రముఖంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే.. గతంలో జగన్ సర్కార్ సినిమా టికెట్లను తగ్గిస్తూ తీసుకున్న నిర్ణయాన్ని విమర్శించిన కారణంతో నానిని జగన్ సర్కార్ నానా విధాలుగా ఇబ్బందులకు గురి చేసింది. ఆయన సినిమా విడుదలకు అడ్డంకులు సృష్టించంది. సినీ పరిశ్రమ మేలు కోసం అంటూ వైసీపీ తీసుకున్న నిర్ణయాన్ని ప్రశ్నించినందుకు, సర్కార్ నిర్ణయం సినీ పరిశ్రమకు మేలు కాదు కీడు చేస్తుందంటూ చెప్పినందుకు  నానిపై పలువురు వైసీపీ నాయకులు నానికి వ్యతిరేకంగా ఇష్టానుసారంగా విమర్శలు గుప్పించారు. అంతటితో ఆగకుండా ప్రభుత్వాన్ని విమర్శించడానికి నాని స్థాయి ఏమిటంటూ నిలదీశారు.  అంతే కాకుండా అప్పట్లో ఆయన సినిమా శ్యాం సింగరాయ్ విడుదల సమయంలో అనేక అడ్డంకులు సృష్టించారు. అప్పటికి మౌనంగా ఉన్న నాని..నానిపై అకారణ ద్వేషాన్ని పెంచుకుని ఆయనను నానా ఇబ్బందులకు గురి చేసిన వైసీపీకి ఇప్పుడు నాని సరైన బదులిచ్చినట్లైంది. ఇప్పుడు సరిగ్గా ఎన్నికల ముంగిట, అదీ వైసీపీ గడ్డు పరిస్ధితులను ఎదుర్కొంటున్న వేళ నాని తన గళం విప్పారు. వైసీపీకి వ్యతిరేకంగా పవన్ కల్యాణ్ కు మద్దతుగా ముందుకు వచ్చారు. ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు సిద్ధమన్న సంకేతం ఇస్తూ తన ప్రచారానికి తానే బెస్టాఫ్ లక్ చెప్పుకున్నారు. పవన్ కల్యాణ్ ను పొగడ్తలలో ముంచెత్తారు.  దీంతో నాని నాడు వైసీపీ తనను వేధించిన తీరుకు టిట్ ఫర్ టాట్ అన్న చందంగా రిటార్డ్ ఇచ్చారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. తన సనిమా శ్యాం సింగరాయ్ విడుదల సందర్భంగా వైసీపీ ప్రభుత్వం తన పట్ల వ్యవహరించిన తీరుకు ఇప్పుడు సరైన బదులిచ్చినట్లైందని అంటున్నారు.  
చినుకు పడితే హైదరాబాద్ జంటనగరాలు చిగురుటాకులా వణికిపోవడం కొత్త కాదు. ప్రతి  ఏటా వానాకాలంలో భాగ్యనగర  వాసులు నరకం చూడటమూ కొత్త కాదు. తాజాగా గ్రేటర్ హైదరాబాద్ లో మంగళవారం(మే7)న కురిసిన వర్షంతో భాగ్యనగరం కాస్తా భాగ్యనరకంగా మారిపోయింది. విశ్వనగరం అంటూ ఘనంగా చెప్పుకునే హైదరాబాద్ నగరం విశ్వనరకంగా మారిపోయింది.   లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. రహదారులు నదులను తలపించాయి. వాహనాలు ఎక్కడిక్కడ స్తంభించిపోయాయి. గంటల తరబడి ట్రాఫిక్ స్తంభించిపోయింది. గత కొన్ని రోజులుగా మండే ఎండలు, వడగాల్పులు, ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరౌతున్న హైదరాబాదీయులు మంగళవారం సాయంత్రం ఆకాసం మబ్బుపట్టి వర్షం కురవడంతో హమ్మయ్యా అని ఆనందపడ్డారు. అయితే నిముషాల వ్యవధిలోనే వారి ఆనందం ఆవిరైపోయింది. మెల్లిగా మొదలైన వర్షం కుండపోతగా మారింది.  జనాలకు నరకం చూపించింది. పలు ప్రాంతాలలో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. కార్యాలయాలు వదిలి ఉద్యోగులు ఇళ్లకు వెళ్లే సమయంలో మొదలైన వాన ఏకధాటిగా రెండు గంటలకు పైగా కురిసింది.  దీంతో రోడ్లపై ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్ అయిపోయింది. మెట్రో రైళ్లు సైతం కిక్కిరిసిపోయాయి. భారీ వర్షం కారణంగా చూపుతూ కొంత సేపు మెట్రో సేవలు కూడా నిలిచిపోయాయి.  ప్రభుత్వాలు మారినా హైదరాబాద్ కు వానకష్టాలు మాత్రం తీరడం లేదని జనం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.   చిన్నపాటి వర్షానికే   రోడ్లు జలమయం కావడం, ట్రాఫిక్ జామ్ కావడం పరిపాటిగా మారిపోయింది. ఇప్పటికైనా ప్రభుత్వం ఇటువంటి నరకయాతన హైదరాబాదీయులకు పునరావృతం కాకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలని జనం కోరుతున్నారు.
కాళేశ్వరం ప్రాజెక్టుపై నేషనల్ డ్యాం సేఫ్టీ మధ్యంతర నివేదికను అందజేసింది. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలకు సంబంధించి ఎలాంటి చర్యలు చేపట్టాలో తెలంగాణ ప్రభుత్వానికి  ప‌లు సూచ‌న‌లు చేసింది.  1) మొత్తం 85గేట్లలో 77 గేట్లకు ఎలాంటి ఇబ్బంది లేదని, మిగిలిన ఎనిమిది గేట్లలో మాత్రం సాంకేతిక , మెకానికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయని , వీటిని చక్కదిద్దేందుకు ఏ పద్దతిన మరమ్మత్తులు చేపట్టాలో అధికారులు నివేదికలో పేర్కొన్నారు.   2) మేడిగడ్డ బ్యారేజీలోని ఏడో బ్లాకులో 15నుంచి 22 పిల్లర్లు దెబ్బతినడంతో వాటిని రిపేర్ చేసేందుకుగాను గేట్లను పైకి ఎత్తివేయాలని సూచించారు. 3) 20, 21 నెంబర్ గేట్లను ఓపెన్ చేయడానికి వీలు లేనందున వాటి స్థానంలో కొత్తవి అమర్చాలని,  రిపేర్ లను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ టెక్నికల్ పద్దతిన మరమ్మత్తులు చేపట్టాలని సూచించారు.   4) బ్యారేజ్ ప్రారంభమైన తర్వాత వచ్చిన మొదటి దఫా వరదతో, మేడిగడ్డలోని ఏడో బ్లాక్ లో సమస్యలు తలెత్తాయని, వాటిని అప్పుడే గుర్తించి మరమ్మత్తులు చేపట్టి ఉంటే, మిగతా పిల్లర్లకు ఎలాంటి సమస్యలు ఉండేవి కావని అధికారులు నివేదిక‌లో రాశారు.  మరమ్మత్తుల సమయంలో తగు జాగ్రత్తలు పాటించాలన్నారు. 5) 8 గేట్ల ప్రాంతంలో బ్యారేజీ మీదనున్న శ్లాబ్ కుంగిపోవడంతో కొత్త శ్లాబ్ వేయాలని పేర్కొన్నారు.   6) ప్రాజెక్టులో దెబ్బతిన్న పిల్లర్లకు మాత్రమే కాకుండా మిగిలిన వాటికీ ప్రమాదం లేదనుకోలేమని స్పష్టం చేశారు. కాళేశ్వరం మరమ్మత్తులపై గైడ్ లైన్స్ ను డ్యాం సేఫ్టీ అధికారులు జారీ చేశారు.  7)  ప్లానింగ్, డిజైన్, క్వాలీ కంట్రోల్, ఆపరేషన్ మెయింటెనెన్స్ లో నిర్ల‌క్ష్యం వ‌ల్లే మేడిగడ్డ బ్యారేజ్ కుంగింద‌ని డ్యాం సేఫ్టీ మధ్యంతర నివేదికలో తెలిపింది. 8) డ్యామ్ నిర్వాహకుల నిర్లక్ష్యం వల్ల బ్యారేజీ క్రమంగా బలహీనపడిందని నివేదికలో పేర్కొంది. బ్యారేజీ పునాది కింద ఉన్న ఇసుక కొట్టుకుపోవడం, ఫౌండేషన్ మెటీరియల్ యొక్క పటిష్టత సామర్థ్యం తక్కువగా ఉండటం, బ్యారేజీ లోడ్ వలన ఎగువన ఉన్న కాంక్రీట్ పైల్స్ బలహీన పడటం వల్ల పిల్లర్స్ సపోర్డ్ బలహీనపడిందని నివేదికలో వెల్లడించింది. పిల్లర్లు కుంగిపోవటానికి బ్యారేజీ పునాదుల కింద ఇసుక కొట్టుకుపోవటం వలనేనని తెలిపింది.   మ‌రో వైపు మేడిగడ్డ (లక్ష్మీ) బరాజ్‌ను  జ్యుడీషియల్‌ కమిషన్‌ సందర్శించింది. కాళేశ్వరం ప్రాజెక్ట్‌పై న్యాయ విచారణలో భాగంగా బరాజ్‌లోని కుంగుబాటుకు గురైన 19, 20, 21వ పియర్లలతోపాటు ఏడో బ్లాక్‌లో వంతెనపై కాలినడకన వెళ్లి జ్యుడీషియల్‌ కమిషన్‌ క్షుణ్ణంగా పరిశీలించింది.  ఏడో బ్లాక్‌లో దెబ్బతిన్న పియర్ల ప్రాంతాన్ని పరిశీలించి అధికారుల నుంచి వివరాలు సేకరించారు. బరాజ్‌లో కుంగిన పియర్ల పగుళ్లను పరిశీలించారు. కుంగుబాటుకు గల కారణాలను, ఇతర సాంకేతిక అంశాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు.  ఈ సందర్భంగా కమిషన్‌ చైర్మన్‌ జస్టిస్‌ పినాకి చంద్రఘోష్‌ మాట్లాడుతూ.. ఎన్‌డీఎస్‌ఏ నివేదిక  అందిందని, దాన్ని అధికారుల సమక్షంలో సమీక్షిస్తున్నట్టు తెలిపారు.  - ఎం.కె.ఫ‌జ‌ల్‌
జనసేన అధినేత పవన్ కల్యాణ్ గాయపడ్డారు. ఎన్నికలకు గట్టిగా ఐదు రోజుల సమయం కూడా లేదు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ చాలా చురుగ్గా ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. తాను పోటీ చేస్తున్న పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గంపై ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తూనే, కూటమి అభ్యర్థుల విజయం కోసం రాష్ట్ర వ్యాప్త పర్యటనలు చేస్తున్నారు. మండే ఎండలను సైతం లెక్క చేయకుండా పవన్ కూటమి శ్రేణుల్లో జోష్ నింపేలా ప్రసంగాలు చేస్తూ ముందుకు సాగుతున్నారు.  అయితే ఆయన కాలికి గాయం కావడం కూటమి నేతలు, శ్రేణుల్లో ఆందోళన కలిగించింది. నిర్విరామంగా పర్యటిస్తూ బహిరంగ సభలలో ప్రసగింస్తున్న పవన్ కల్యాణ్ కు అభిమానుల తాకిడీ విపరీతంగా ఉంది. ఎలాగైనా సరే ఆయనతో సెల్ఫీ దిగాలన్న వారి అత్యుత్సాహం కారణంగానే పవన్ కాలికి గాయమైందని అంటున్నారు. ఇంతకీ ఏం జరిగిందంటే.. రాజమండ్రి, అనకాపల్లిలో ప్రధాని నరేంద్ర మోడీ సభలలో పవన్ కల్యాణ్ పాల్గొన్నారు. ఆ సందర్భంగా ఉత్తేజపూరిత ప్రసంగాలు చేశారు. అయితే ఆ సందర్భంగా పవన్ కల్యాణ్ తో సెల్ఫీ కోసం అభిమానులు, పార్టీ శ్రేణులూ తహతహలాడిన సందర్భంలో జరిగిన స్వల్ప తొక్కిసలాటలో పవన్ కాలికి గాయమైంది. సాధారణంగా పవన్ కల్యాణ్ వ్యక్తిగత సిబ్బంది ఆయనకు రాక్షణగా ఉంటారు. అయితే ప్రధాని పర్యటన కావడంతో వారు పవన్ కు రక్షణగా ఉండే అవకాశం లేకపోయింది. అనకాపల్లి సభ అనంతరం సెల్ఫీల హడావుడిలో ఎవరో పొరపాటును పవన్ కాలిని తొక్కి ఉంటారనీ, అందుకే గాయమైందని చెబుతున్నారు.   ఆయన రేణిగుంట విమానాశ్రయంలో కాలికి బ్యాండేజితో కనిపించారు. కాలికి గాయమైన ఆయన లెక్క చేయకుండా ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు. తిరుమతిలో చంద్రబాబుతో కలిసి ప్రచారంలో పాల్గొన్నారు. 
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఇంత కాలం ఓ నమ్మకం ఉండేది. తాను ఎంత అరాచకపాలన సాగించినా, ఎంత ఆర్థిక అవకతవకలకు పాల్పడినా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ, ప్రధాని నరేంద్రమోడీ తనకు అండగా నిలుస్తారనీ, ఎన్నికల గండం నుంచి గట్టెక్కిస్తారని. అయితే  తెలుగుదేశం, జనసేనతో ఏపీలో బీజేపీ జతకట్టడంతో ఆ ఆశలు అడియాసలయ్యాయి. అయినా ఏదో దింపుడు కళ్లెం ఆశ.. పేరుకు తెలుగుదేశం, జనసేనలతో బీజేపీ జట్టు కట్టినా అది బీజేపీ రాష్ట్ర క్యాడర్ ను సంతృప్తి పరచడానికే తప్ప.. మరేమీ కాదనీ, బీజేపీ అధినాయకత్వం ఆశీస్సులు తనకే ఉన్నాయనీ ఆయన భ్రమల్లో మునిగి తేలారు. అందుకు అనుగుణంగానే నరసాపురం ఎంపీ టికెట్ ఆర్ఆర్ఆర్ అంటే రఘురామకృష్ణం రాజుకు ఇవ్వవద్దంటూ తాను చేసిన వినతిని బీజేపీ అధినాయకత్వం మన్నించడంతో బీజేపీ ఏ కూటమిలో ఉన్నా.. ఆ పార్టీ అగ్రనాయకత్వం మద్దతు సంపూర్ణంగా తనకే అని గట్టిగా నమ్మేశారు. అందుకే బీజేపీ రాష్ట్ర నేతలు, కొందరు జాతీయ నేతలూ కూడా తన ప్రభుత్వంపై ఎంత తీవ్రస్థాయిలో విమర్శలు చేసినా జగన్ కానీ, ఆయన పార్టీ నేతలు కానీ బీజేపీని పల్లెత్తు మాట అనలేదు.  ఇక ఎన్నికల షెడ్యూల్ వెలువడిన తరువాత కూడా జగన్ సర్కార్ కోడ్ ఉల్లంఘనలకు యథేచ్ఛగా పాల్పడుతున్నా ఎన్నికల సంఘం కొరడా ఝుళిపించకపోవడంతో తనకు ఎదురే లేదన్న భావన జగన్ లో వ్యక్తం అయ్యింది. సాక్షాత్తూ ప్రధాని నరేంద్రమోడీ రాష్ట్రంలో ఎన్నికల పర్యటనకు వచ్చి చిలకలూరి పేటలో కూటమి తొలి సభలో ప్రసంగించారు. ఆ సభ సందర్భంగా శాంతి భద్రతల విషయంలో జగన్ సర్కార్ ఘోరంగా విఫలమైనా.. ఎన్నికల సంఘం డీజీపీపై చర్య తీసుకోకపోవడంతో.. బీజేపీ పైకి కూటమితో ఉన్నా.. తనకు సహకారం అందించే విషయంలో రెండో ఆలోచనే ఆ పార్టీ అధినాయకత్వానికి లేదని జగన్ మాత్రమే కాదు , ఆయన పార్టీ నేతలు, కార్యకర్తలు, చివరాఖరికి కూటమిలోని తెలుగుదేశం, జనసేన శ్రేణులూ కూడా భావించాయి. నిజమే చిలకలూరిపేట బొప్పూడి సభలో.. జగన్ సర్కారును పల్లెత్తు మాట అనని మోదీ వైఖరిపై, కూటమిలో అసంతృప్తి వెల్లువెత్తింది. ఆ తర్వాత డీజీపీ-సీఎస్-టీటీడీ ఈఓ బదిలీలపై ఈసీ మౌనంపైనా అనుమానం తొంగిచూసింది. జగన్ ఒత్తిడి కారణంగానే ఎంపి రఘురామకృష్ణంరాజుకు నర్సాపురం టికెట్ ఇవ్వలేదన్న చర్చ జరిగింది. ఈ క్రమంలో బొప్పూడి సభలో మోదీ ఏపీ సీఎం జగన్‌పై, విమర్శలకు దూరంగా ఉండటం సహజంగానే అనుమానాలు పెంచినట్లయింది.  అయితే హఠాత్తుగా పరిస్థితులు మారిపోయాయి. ఇప్పటి వరకూ ఎవరేమన్నా జగన్ ను ప్రధాని మోడీ మాత్రం పన్నెత్తి విమర్శించిన పాపాన పోలేదు. కానీ కాకినాడ, అనకాపల్లి లో ఆయన ప్రసంగాలలో జగన్ సర్కార్ పై విమర్శల వాడి పెరిగింది. మోడీ కూడా జగన్ సర్కార్ అవినీతిపై విమర్శలు గుప్పించారు. మూడు రాజధానులంటూ ఒక్క రాజధానిని కూడా నిర్మించలేదనీ, కానీ ఆ పేరు చెప్పి భయంకరమైన దోపిడీకి పాల్పడ్డారనీ ఎలాంటి శషబిషలూ లేకుండా చెప్పేశారు. అంతే కాదు.. ఎపీలోనూ కేంద్రంలోనూ అధికారంలోకి రాబోయేది కూటమి ప్రభుత్వాలేనని చెప్పారు. చంద్రబాబు విజన్ పై పొగడ్తలు కురిపించారు.  కూటమి అభ్యర్థులకు ఓటేస్తే రాష్ట్రానికి చంద్రబాబు పాలన అందుతుందని చెప్పారు.  ఏపీలో ఉన్నది అవినీతి సర్కారు, అసమర్థ సర్కార్ అని ప్రకటించారు. మారిన మోడీ వైఖరితో అప్పటి వరకూ కూటమి పార్టీల మధ్య ఓట్ల బదలీపై ఉన్న అనుమానాలు పటాపంచలైపోయాయి.  అంతే కాదు తెలుగుదేశం అధినేత చంద్రబాబు నిజాయతీపరుడైన దార్శనికుడు. అందుకే ఆయనతో కలిశాం అని చెప్పడం ద్వారా జగన్ సర్కార్ అవినీతిమయం అని తేల్చేశారు. ప్రధాని  వైఖరి కూటమిలో  ఉత్సాహాన్ని నింపింది.   బీజేపీ-, వైసీపీ తెరచాటు బంధం  అనుమానాలను  పటాపంచలు చేసింది. ఏపీ సీఎం, వైసీపీ అధినేత జగన్ సర్కారుపై, ప్రధాని నరేంద్రమోదీ చేసిన మాటల దాడితో వైసీపీ డీలా పడిపోయింది.     
ALSO ON TELUGUONE N E W S
Lovely Young Hero Aadi Sai Kumar and talented director Veerabhadram Chowdary collaborated for the second time for a new movie titled 'Krishna From Brindavanam'. Produced jointly by Thumu Narasimha and Jami Srinivasa Rao under the Lakshmi Prasanna Productions banner, it is a village drama, laced with family, love, comedy, and feel-good emotions. The movie was launched recently. Meanwhile, the makers began musical sittings of the movie in Goa, in the presence of the core team. Anup Rubens who previously provided many super hit albums to Aadi such as Prema Kavali, Lovely, Sukumarudu, and Pyaar Mein Padipoyane, is on a mission to deliver another chartbuster album. The makers have also announced to commence the regular shoot of the movie in June. Digangana Suryavanshi who earlier worked with Aadi in Crazy Fellow is the leading lady in the new movie. Shyam takes care of cinematography of the movie, whereas the editing will be done by Chota K Prasad. Ramu Mannar provides the dialogues, while Dragon Prakash and Shankar will oversee fights in the movie.
నీహారిక  కొణిదెల.. మెగా డాటర్ అనే గుర్తింపుతో సినిమాల్లో రాణిస్తూ మంచి నటి అనే పేరు సంపాదించింది. ఇప్పుడు నిర్మాతగా మారి కమిటీ కుర్రోళ్లు అనే సామాజిక స్పృహతో కూడిన సినిమాని నిర్మిస్తుంది. త్వరలోనే ఆ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పుడు అందులోని ఒక  పాటని ప్రముఖ సామాజిక వేత్త జయప్రకాష్ నారాయణ విడుదల చెయ్యడం ప్రాధాన్యత సంతరించుకుంది మనిషివా గొర్రెవా అనే లిరిక్ తో పాట స్టార్ట్ అయ్యింది. ఆ తర్వాత  రోడ్లన్నీ గతుకులు పాలే.. ఊరంతా చీకటి పాలే.. రేషన్లు పింఛన్లన్నీ గల్లంతాయే అనే పల్లవి తో సాగింది.  ఎలక్షన్లలో ఓటు అమ్ముకోవద్దనే ఒక మంచి మెసేజ్ ని  చెప్తుంది. ఇప్పుడు ఈ పాటనే జయప్రకాశ్ నారాయణ విడుదల చేసాడు.అనంతరం అయన మాట్లాడుతు గొర్రెవా పాట అందరిలో ఆలోచన కలిగించే విధంగా  ఉందని చెప్పాడు.  దేశ భవిష్యత్తుని కాపాడాలంటే యువతలో సరైన  ఆలోచన ఉండాలి.  ఓటు వేసే విషయంలో మార్పు కూడా  రావాలి. నిరాశని వదిలి ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్లాలని కూడా తెలిపాడు    ఆ తర్వాత నీహారిక కూడా పలు ఆసక్తికర విషయాలని వెల్లడించింది. జయప్రకాశ్ సర్ ప్రసంగం వినే మా దర్శకుడు ఈ సినిమాని మొదలు పెట్టాడు. అలాంటిది ఆయన చేతుల మీదుగా పాట రిలీజ్ కావడం చాలా ఆనందంగా ఉందని తెలిపింది. యదు వంశీ దర్శకుడు కాగా సందీప్ సరోజ్, యశ్వంత్ పెండ్యాల, గోపరాజు రమణ, ఈశ్వర్,శ్రీనాధ్,శ్రీ లక్ష్మి తదితరులు నటించారు. నిహారిక తల్లి పద్మజ కూడా ఒక నిర్మాతగా వ్యవహరిస్తోంది   
నీహారిక  కొణిదెల.. మెగా డాటర్ అనే గుర్తింపుతో సినిమాల్లో రాణిస్తూ మంచి నటి అనే పేరు సంపాదించింది. ఇప్పుడు నిర్మాతగా మారి కమిటీ కుర్రోళ్లు అనే సామాజిక స్పృహతో కూడిన సినిమాని నిర్మిస్తుంది. త్వరలోనే ఆ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పుడు అందులోని ఒక  పాటని ప్రముఖ సామాజిక వేత్త జయప్రకాష్ నారాయణ విడుదల చెయ్యడం ప్రాధాన్యత సంతరించుకుంది మనిషివా గొర్రెవా అనే లిరిక్ తో పాట స్టార్ట్ అయ్యింది. ఆ తర్వాత  రోడ్లన్నీ గతుకులు పాలే.. ఊరంతా చీకటి పాలే.. రేషన్లు పింఛన్లన్నీ గల్లంతాయే అనే పల్లవి తో సాగింది.  ఎలక్షన్లలో ఓటు అమ్ముకోవద్దనే ఒక మంచి మెసేజ్ ని  చెప్తుంది. ఇప్పుడు ఈ పాటనే జయప్రకాశ్ నారాయణ విడుదల చేసాడు.అనంతరం అయన మాట్లాడుతు గొర్రెవా పాట అందరిలో ఆలోచన కలిగించే విధంగా  ఉందని చెప్పాడు.  దేశ భవిష్యత్తుని కాపాడాలంటే యువతలో సరైన  ఆలోచన ఉండాలి.  ఓటు వేసే విషయంలో మార్పు కూడా  రావాలి. నిరాశని వదిలి ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్లాలని కూడా తెలిపాడు    ఆ తర్వాత నీహారిక కూడా పలు ఆసక్తికర విషయాలని వెల్లడించింది. జయప్రకాశ్ సర్ ప్రసంగం వినే మా దర్శకుడు ఈ సినిమాని మొదలు పెట్టాడు. అలాంటిది ఆయన చేతుల మీదుగా పాట రిలీజ్ కావడం చాలా ఆనందంగా ఉందని తెలిపింది. యదు వంశీ దర్శకుడు కాగా సందీప్ సరోజ్, యశ్వంత్ పెండ్యాల, గోపరాజు రమణ, ఈశ్వర్,శ్రీనాధ్,శ్రీ లక్ష్మి తదితరులు నటించారు. నిహారిక తల్లి పద్మజ కూడా ఒక నిర్మాతగా వ్యవహరిస్తోంది   
నేడు తెలుగు సినిమా కోసం దేశం మొత్తం ఎదురుచూసే పరిస్థితి. అంతటి ఖ్యాతిని తెలుగు సినిమా ఓవర్ నైట్ సంపాదించలేదు. అహర్నిశలు  శ్రమిస్తు ఎన్నో అద్భుతమైన కథల్ని ఎంచుకొని ఒక సరికొత్త ప్రపంచంలోకి ప్రేక్షకులని తీసుకెళ్లింది. అందుకే ఇప్పుడు తెలుగు సినిమా ఫెస్టివల్ మూడ్ లోకి ఎంటర్ అవ్వబోతుంది  తెలుగు సినిమా వైభవాన్ని, వారసత్వ సంపదని తెలియచేసేలా తెలుగు సినిమా తొంభైయేళ్ల వేడుక జరగబోతుంది.  ఈ విషయాన్ని మా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ మంచు విష్ణు  తెలిపాడు. జులై 26 న  మలేసియా రాజధాని కౌలాలంపూర్ లోని బూకీట్ జలీల్ ప్రతిష్టాత్మక స్టేడియంలో జరగనున్నాయి. ఇటీవలే అందుకు సంబంధించిన ఏర్పాట్లు  మీద విష్ణు మలేసియాలో ఒక సమావేశం కూడా ఏర్పాటు చేసాడు. మలేషియాలోని తెలుగు మాట్లాడే ప్రజల మధ్య స్థానికుల మధ్య ఈ వేడుకలు ఒక వారధిగా నిలుస్తాయని కూడా  తెలిపాడు   మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్, మలేసియా టూరిజం, ఎం సి ఎంటర్ టైన్మెంట్స్ లు ఈ కార్యక్రమంలో భాగం కానున్నాయి. మొదటి తెలుగు సినిమా  భక్త ప్రహ్లద.1932 ఏప్రిల్ 2 న విడుదల అయ్యింది.సంవత్సరం తర్వాత  అయినా వేడుకలు జరగడం శుభపరిణామం. ఇక విష్ణు ప్రస్తుతం కన్నప్ప అనే చారిత్రాత్మక మూవీని  చేస్తున్నాడు. పరమేశ్వరుడికి భక్తితో తన రెండు కళ్ళు సమర్పించిన కన్నప్ప జీవిత  కథ ఆధారంగా తెరకెక్కుతుంది. నిర్మాత కూడా విష్ణునే  
  రెండు తెలుగు రాష్ట్రాలలో పొలిటికల్ డ్రామా నడుస్తోంది. అయితే ఈ తరుణంలో పొలిటికల్ పార్టీలు తమ ప్రత్యర్థులను బలహీన పరిచేందుకు వినూత్నంగా పోటీపడుతుంటారు. అయితే ఇదే తరహాలో కొన్ని వాస్తవ సంఘటనల ఆధారంగా ఓ పొలిటికల్ డ్రామా వెబ్ సిరీస్ రూపొందింది. భీమిలి కబడ్డీ జట్టు, హ్యాపీ, కాంతారా సినిమాలలో నటించిన కిషోర్ ప్రధాన పాత్రలో నటించిన వెబ్ సిరీస్ " తలైమై సేయలగం". జీ5 వేదికగా తమిళంతో పాటు తెలుగులోను ఈ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ కానుంది. ఈ సిరీస్ ని వాస్తవికతకు దగ్గరగా ఉండేలా నిర్మించారంట. అందుకే ఈ సిరీస్ ని భారీ అంచనాలతో రిలీజ్ చేస్తున్నారు. సలార్ మూవీ ఫేమ్ శ్రియారెడ్డి, కస్తూరి, భరత్, రమ్య నంబీశన్, దర్శన గుప్తా కీలక పాత్రలు పోషిస్తున్నారు. తాజాగా పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన రాధిక శరత్ కుమార్ ఈ వెబ్ సిరీస్ ని నిర్మిస్తున్నారు. గిబ్రాన్ మ్యూజిక్ అందించగా..నేషనల్ అవార్డ్ విన్నర్ వసంత బాలన్ దర్శకత్వం వహిస్తున్నాడు. అయితే తాజాగా ఈ సిరీస్ మేకర్స్ ఓ కీలక ప్రకటన చేశారు. మే 17 నుండి ఈ సిరీస్ జీ5 లో స్ట్రీమింగ్ కానున్నట్లు మేకర్స్ ఓ ప్రకటనలో తెలిపారు.  తమిళనాడులో బిజేపీ అభ్యర్థిగా లోక్ సభ ఎన్నికలలో భాగంగా రాధిక పోటీ చేస్తోంది. అయితే తమిళనాడులో ఎన్నికల సమయంలో కొంతమంది రాజకీయ పెద్దలు ఆడిన చదరంగాన్ని ఈ సిరీస్ లో చూపించబోతున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ వెబ్ సిరీస్ రిలీజ్ పై భారీ అంచనాలు పెట్టుకున్నారు మేకర్స్. మరికొన్ని రోజుల్లో ఓటీటీలోకి రాబోయే ఈ వెబ్ సిరీస్ ని మిస్ కాకుండా చూసేయ్యండి మరి.  
https://youtu.be/QREoKRr9e1Q?si=AVx3urbzdU8pn5Qs The sci-fi thriller, Darshini casting Vikas and Shanti in the lead roles, is all set to hit the silver screen on May 17, 2024. The film, which came under the direction of Dr Pradeep Allu is being bankrolled by V4 Cini Creations. Recently, the film has also got a clean chit from the Censor Board, as it got a clean U/A, which means all the family audiences are welcome.  At this juncture, producer, Dr L V Suryam interacted with the media and said, “Our film, Darshini got a U/A certificate from the censor board, the board members have also appreciated our film. And now, we are ready to release it on May 17.” Suryam further thanked producer Damodar Prasad for his co-operation for the film. “Our director, Dr Pradeep Allu has put his soul into making this movie and he is a very talented director,” said Suryam. Further briefing about the movie, Suryam said that the story of Darshini revolves around three friends who get an opportunity to get hold of a device that shows the future. And then followed by its consequences because of it.  https://youtu.be/QREoKRr9e1Q “Movie turned out excellent. It has all elements such as Comedy, emotion, love and everything in equal parts. We hope our telugu audience will like this movie,” said the producer. Director Dr Pradeep Allu, speaking on this occasion, said, “K L Damodar Prasad is our Godfather. His support was very crucial. Our producer, co-director, our hero and heroine and all of us have now become like a family. We have all owned this movie and we liked it very much. Censor board gave us a clean certificate and said that they liked our movie. The movie will hit the theatres in both Telugu states on May 17.” Actor Vikas, who is playing the lead role, said that Dr Pradeep Allu, director of this movie is the main pillar of this movie. “We have seen a lot of hardships in making this movie, but with a lot of passion, we came out with this output. The movie has turned out excellent, and it will hit the theatres on May 17,” said the actor.
నువ్వు పెళ్లి చేసుకెళ్ళిపోతే బంగార్రాజు.. మాకింకెవ్వడు కొనిపెడతడు కోకా బ్లౌజు అంటు తెలుగు ప్రేక్షకులని ఒక ఊపిన నటి ఫరియా అబ్దుల్లా.. ఇప్పుడు ఆమె అభిమానులు ఆ పాటకి రివర్స్ పాడుకుంటున్నారు. నువ్వు పెళ్లి వద్దంటే మేమేం కావాలని. వాళ్ళు అలా ఎందుకు పాడుకునే అవసరం వచ్చిందో చూద్దాం     నవీన్ పోలిశెట్టి హీరోగా 2021 లో వచ్చిన   జాతిరత్నాలుతో ఫరియా తెలుగు ప్రేక్షకులకి పరిచయం అయ్యింది. ఎంటర్ టైన్మెంట్ ప్రదానం సాగిన ఆ మూవీలో లాయర్ గా  నవ్వుల్ని పూయించింది.  క్యారక్టర్ కి తగ్గట్టు తనని తాను మౌల్డ్ చేసుకున్న విధానం సూపర్ గా ఉంటుంది. కాబట్టి  యువరానర్  నా క్లయింట్ కి  బెయిల్ ఇచ్చేయండి అనే చిన్న  డైలాగ్ నే అందుకు ఉదాహరణ. రీసెంట్ గా ఆ ఒక్కటి అడక్కు అంటు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అందుకు  సంబంధించిన  ఒక ఇంటర్వ్యూ లో  కొన్ని సంచలన వ్యాఖ్యలు చేసింది. నాకు పెళ్లి మీద ఆశ లేదు. ఒక వేళ అయితే అవ్వచ్చు.కానీ  ఖచ్చితంగా పెళ్లి చేసుకోవాలనైతే  లేదు. పిల్లలంటే మాత్రం చాలా ఇష్టం.కాబట్టి  పిల్లలని పెంచుతాను.కాకపోతే  తల్లి బాధ్యతో పాటు తండ్రి బాధ్యత కూడా పిల్లలకి  ఉండాలి. ఇద్దరు కలిసే పెంచాలి అని చెప్పింది. ఇప్పుడు ఈ మాటలు సోషల్ మీడియాలో  వైరల్ అవుతున్నాయి. పెళ్లి వద్దంటే ఎలా అంటు అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు  ఇక  ఆ ఒక్కటి అడక్కు ప్రస్తుతం థియేటర్స్ లో ఉంది. అల్లరి నరేష్ కి జతగా చేసి హిట్ కొట్టింది. ఇద్దరి ఫెయిర్ కి ప్రేక్షకుల నుంచి మంచి మార్కులు కూడా పడ్డాయి. వల్లి మయిల్ అనే ఒక తమిళ మూవీ  కూడా చేస్తుంది. ప్రస్తుతం అది  పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. మరి కొన్ని భారీ ప్రాజెక్ట్స్ కూడా చర్చల దశలో ఉన్నాయి.  తను పక్కా హైదరాబాదీ. వయసు పాతిక సంవత్సరాలు  
Malaysia proudly gears up to host the Navatihi Utsavam 2024, a grand celebration of the 90-year legacy of Telugu cinema, an illustrious journey that began in 1932. Under the stewardship of Vishnu Manchu, President of the Movie Artist Association (MAA), this event promises an unprecedented celebration of Telugu cinema’s rich heritage. Scheduled to take place on July 20, 2024, at the prestigious National Stadium in Bukit Jalil, Kuala Lumpur, this event is set to be a star-studded gala with the anticipation of a large turnout of cinema enthusiasts from around the world. The launch and press conference had happed at Sunway Pyramid and Sunway Resort, highlighting the event’s significance and the robust partnerships fostering its success. After careful consideration of proposals from three countries, Malaysia was chosen as the favored destination for this landmark event. This decision underscores Malaysia’s commitment to showcasing its capabilities as a top-tier venue for international cultural gatherings. Tourism Malaysia, in partnership with MAA and local event organizer MC Entertainment, is excited to enhance this global celebration.  In a significant move to support attendees, Tourism Malaysia has collaborated with airlines and hotels to offer attractive prices, ensuring a hospitable and memorable experience for all. These efforts are part of a broader strategy to promote Malaysia as a premier filming and tourist destination ahead of the Visit Malaysia Year 2026. Navatihi Utsavam 2024 is not just a celebration of cinematic achievements but also an emblem of cultural exchange, deepening mutual understanding and respect between the people of Malaysia and the Telugu-speaking communities. This event is a testament to the global appeal and enduring charm of Telugu cinema.
తెలుగు సినిమా అగ్ర హీరోల్లో పవన్ కళ్యాణ్ కూడా ఒకడు. తనదైన స్టైల్ తో, డాన్స్ తో, యాక్టింగ్ తో రెండున్నర దశాబ్దాల నుంచి ప్రేక్షకులని అలరిస్తు వస్తున్నాడు.అసలు ఆయన సినిమా రిలీజ్ అయిందంటే చాలు  తెలుగునాట పండుగ వాతావరణం వస్తుంది. లక్షలాది మంది అభిమానులు  ఆయన సొంతం. ఇప్పుడు  అభిమానులు పవన్ కళ్యాణ్ హెల్త్ విషయంలో ఆందోళనలో ఉన్నారు ఈ నెల 13 న ఆంధ్రప్రదేశ్ లో జరగనున్న ఎన్నికల దృష్ట్యా  పవన్ తన జనసేన పార్టీ తరుపున  రాష్టం మొత్తం ప్రచారం చేస్తున్నాడు. అందులో భాగంగా  నిన్న తిరుపతి వెళ్ళాడు. రేణిగుంట విమానాశ్రయంలో దిగిన పవన్ కి అభిమానులు,జనసేన పార్టీ కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. ఈ సమయంలో పవన్ కళ్యాణ్ కుడి కాలి బొటన వ్రేలుకి ఒక కట్టు కనిపిస్తుంది.పైగా చాలా నెమ్మదిగా నడుచుకుంటూనే తన కాన్వాయ్ ని ఎక్కాడు.ఇదంతా గమనించిన అభిమానులు, జన సైనికులు పవన్  కాలికి ఏమైందని ఆరాతీస్తున్నారు. పార్టీ నుంచి కూడా గాయం గురించి ఎలాంటి ప్రకటన రాలేదు.దీంతో వాళ్లంతా కొంచం ఆందోళనలో ఉన్నారు  ఇక పవన్ ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చిన దగ్గరనుంచి విరామం లేకుండా ప్రచారంలో పాల్గొంటున్నాడు. పైగా ఎండలు కూడా మండుతున్నాయి.దీంతో  హెల్త్ విషయంలో పవన్ జాగ్రత్తగా ఉండాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ఇక పవన్   పిఠాపురం అసెంబ్లీ నుంచి పోటీ చేస్తున్నాడు. పలువురు సినిమా హీరోలు ఇప్పటికే  పవన్ కి ఓటు వేసి గెలిపించాలని ప్రజల్ని కోరుతున్నారు. చిరంజీవి, రామ్ చరణ్, నాని లాంటి స్టార్స్ ఆ వరుసలో ఉన్నారు. మరి కొంత మంది సినిమా వాళ్ళు కూడా రానున్న రోజుల్లో పవన్ కి ఓటు వెయ్యాలని కోరే అవకాశం ఉంది  
ఏప్రిల్ 25న విడుదల కావాల్సిన 'ప్రతినిధి 2' సినిమా చివరి నిమిషంలో ఏవో కారణాల వల్ల మే 10కి వాయిదా పడిన సంగతి తెలిసిందే. అయితే ఈ చిత్రం మే 10న కూడా విడుదల కావడం కష్టమేనని, సెన్సార్ సర్టిఫికెట్ రాలేదని ప్రచారం జరిగింది. అయితే ఆ ప్రచారానికి తాజాగా మూవీ టీమ్ చెక్ పెట్టింది. 'ప్రతినిధి 2' చిత్రానికి యూ/ఏ సర్టిఫికెట్ వచ్చినట్లు తాజాగా చిత్ర బృందం ప్రకటించింది. అలాగే, 136 నిమిషాల రన్ టైం లాక్ అయినట్లు తెలిపింది. తాజా ప్రకటనతో 'ప్రతినిధి 2' మళ్ళీ వాయిదా పడనుందన్న వార్తల్లో వాస్తవం లేదని తేలిపోయింది. నారా రోహిత్ ప్రధాన పాత్రలో మూర్తి దర్శకత్వంలో రూపొందిన సినిమా 'ప్రతినిధి 2'. ఈ పొలిటికల్ ఫిల్మ్ ని వానర ఎంటర్టైన్మెంట్స్, రానా ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మించాయి. 
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు. వారితో పాటు పెద్ద సంఖ్యలో క్యాడర్ కూడా పార్టీని వీడుతున్నారు. ఇక ఇప్పుడు నామినేటెడ్ పదవులలో ఉన్న వారి వంతు మొదలైనట్లు కనిపిస్తోంది. తనకు కానీ తన భర్తకు  కానీ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు టికెట్ ఇవ్వాలంటూ గత  కొంత కాలంగా కోరుతూ వస్తున్న మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ వంతు వచ్చింది. ఆమె కూడా రాజీనామా అస్త్రం సంధించారు.  జగన్ కు నమ్మిన బంటుగా గుర్తింపు పొందిన మహిళాకమిషన్ చైర్ పర్సన్ వాసి రెడ్డి పద్మ తన పదవికి రాజీనామా చేశారు. ఉరుములేని పిడుగులా, ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా తన రాజీనామా లేఖను సీఎం జగన్ కు పంపేశారు. పేరుకు తాను పార్టీకి కాదు, కేవలం మహిళా కమిషన్ చైర్మన్ పదవికి మాత్రమే రాజీనామా చేశాననీ, ఇక నుంచి వైసీపీ కోసం పని చేస్తాననీ వాసిరెడ్డి పద్మ చెబుతున్నప్పటికీ, ఆమె రాజీనామాకు కారణం అసంతృప్తేనని పార్టీ వర్గాలు బాహాటంగానే చెబుతున్నాయి. చాలా కాలంగా వాసిరెడ్డి పద్మ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు తనకు కానీ తన భక్తకు కానీ పార్టీ టికెట్ ఇవ్వాలని జగన్ ను కోరుతూ వస్తున్నారు. అయితే ఇప్పటి వరకూ జగన్ చూద్దాం.. చేద్దాం అన్నట్లుగా దాట వేస్తూనే వచ్చారు. ఇప్పుడిక వరుసగా అభ్యర్థల జాబితాలను జగన్ ప్రకటించేస్తుండటం, తనకు గానీ తన భర్తకు కానీ పార్టీ టికెట్ విషయంలో ఎటువంటి స్పస్టత ఇవ్వకపోవడంతో ఆమె మనస్తాపం చెంది పదవికి రాజీనామా చేసేశారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.  వాసిరెడ్డి పద్మ రాజకీయ ప్రవేశం ప్రజారాజ్యం పార్టీతో జరిగింది. 2009లో ఆమె ప్రజారాజ్యం పార్టీలో చేరారు. ఇలా చేరడంతోనే ఆమె ప్రజారాజ్యం అధికార ప్రతినిథిగా పదవి దక్కించుకున్నారు. ప్రజారాజ్యం కాంగ్రెస్ పార్టీలో విలీనం కావడంతో ఆమె 2012లో జగన్ పార్టీలో చేరారు. జగన్ కూడా ఆమెకు అధికార ప్రతినిథి పదవి ఇచ్చారు.  2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆమెను రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా నియమించారు. చైర్ పర్సన్ హోదాలో ఆమె జగన్ మెప్పు పొందేందుకు చేయగలిగినంతా చేశారు. ప్రతిపక్ష పార్టీ నేతలకు నోటీసులు ఇచ్చారు. ఏకంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు సైతం నోటీసులు జారీ చేశారు. వార్డు వలంటీర్లపై పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు కమిషన్ ముందు హాజరై వివరణ ఇవ్వాలంటూ ఆమె పవన్ కు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. పవన్ హాజరు కాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు నమోదు చేయాలని ఆదేశించారు. ఇన్ని చేసినా వాసిరెడ్డి పద్మకు ఆమె కోరినట్లుగా పార్టీ టికెట్ లభించకపోవడంతో అలిగి పదవికి రాజీనామా చేశారని, ఇది జగన్ కు షాకేననీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు. ఒకరైతు తనకు చేసిన సేవలకు ప్రీతి చెందిన గురువు అతడికి స్వర్గ ప్రాప్తిని కలగజేయాలని అనుకుంటాడు. కానీ సంసారాసక్తి వల్ల ఆ రైతు ఆ అవకాశాన్ని వాయిదా వేసుకుంటూ వస్తాడు. చివరికి గురుకృప వల్ల ఆ రైతు స్వర్గ ప్రాప్తిని ఎలా పొందాడో ఈ కథ తెలియజేస్తుంది. "ఒక మహాపురుషుడు ప్రయాణం చేస్తూ, డస్సిపోయాడు. గొంతు ఎండిపోయింది. దారిలో ఒక రైతు కనపడితే నీళ్ళు అర్థించాడు. ఆ రైతు మహాత్మునికి సకల ఉపచారాలూ చేశాడు. చిరిగిపోయిన ఆయన ఉత్తరీయాన్ని రైతు జాగ్రత్తగా కుట్టి బాగుచేశాడు. రైతు పరిచర్యలకు సంతసించిన ఆ మహాత్ముడు శాంతి, ఆనందాలకు నిలయమైన స్వర్గానికి తనతోపాటు రమ్మని అంటాడు. అందుకు ఆ రైతు 'గురువుగారూ! మీరు నా మీద చూపిన దయకు కృతజ్ఞుణ్ణి. కానీ నా పిల్లలు ఇంకా చిన్నవాళ్ళు. ఓ ఏడేళ్ళ వ్యవధి ఇవ్వండి' అని అడుగుతాడు. అందుకు గురువు అంగీకరించాడు. సరిగ్గా ఏడేళ్ళ తర్వాత గురువు రైతును స్వర్గానికి తీసుకువెళ్ళడానికి వచ్చాడు. అప్పుడు రైతు 'అయ్యా! కడపటి కొడుకు కష్టాలకు అంతు లేదు. అన్ని జంఝాటాలనూ ఒక్కడే సంబాళించుకోలేకపోతున్నాడు. కాబట్టి మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని గురువుని అడిగాడు. మరో ఏడేళ్ళ తరువాత గురువు వచ్చాడు. కానీ రైతు చనిపోయాడని తెలిసింది. చనిపోయిన ఆ రైతు ఎద్దుగా పుట్టాడని ఆ గురువు తన దివ్య దృష్టితో తెలుసుకున్నాడు. ఎద్దుగా పుట్టిన ఆ రైతు తన కొడుకు పొలాన్నే దున్నుతున్నాడు. అప్పుడు గురువు ఆ ఎద్దుపై మంత్ర జలం చిలకరించగానే ఎద్దు జన్మనెత్తిన రైతు 'నా కొడుకు పరిస్థితి మరి కాస్త మెరుగు పడనీయండి స్వామీ! మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని అన్నాడు. ఇక చేసేది లేక వెనుదిరిగాడు గురువు. మరలా ఏడేళ్ళ తర్వాత వచ్చిన గురువుకు ఎద్దు చనిపోయిందని తెలిసింది. అది కుక్కగా పుట్టి కొడుకు ఇంటినీ, ఆస్తినీ కాపలా కాస్తోందని తన దివ్యదృష్టి ద్వారా తెలుసుకున్నాడు. గురువు. కుక్కగా పుట్టిన ఆ రైతు 'స్వామీ! నేను ఎంత దౌర్భాగ్యుణ్ణి. మీరు ఇంత దయ చూపుతున్నప్పటికీ మీతో స్వర్గమానం చేయలేకున్నాను. వీడికి ఆస్తిని కాపాడుకొనే దక్షత ఇంకా రాలేదు. కాబట్టి దయ చేసి మరో ఏడేళ్ళు వ్యవధి ఇవ్వండి' అని వేడుకున్నాడు. గురువు ఏడేళ్ళ తరువాత మళ్ళీ వచ్చేసరికి కుక్క మరణించింది. అది త్రాచుపాముగా జన్మనెత్తి, ఇప్పుడు కొడుకు భూమిలో ఉన్న లంకెబిందెలకు పడగెత్తి కాపలా కాస్తోంది. గుప్త ధనం ఇక్కడ ఉందని కొడుకుకి ఎలా తెలియజేయాలా అని పాము ఆలోచిస్తున్నప్పుడు గురువు ఆ రైతుకొడుకును పిలుచుకు వచ్చి లంకె బిందెలు ఉన్న చోట తవ్వమన్నాడు. లంకె బిందెలు బయటపడ్డాయి. ఆ పైన ఆ పామును చంపమన్నాడు. అనంతరం శిష్యుణ్ణి తీసుకొని స్వర్గారోహణం చేశాడు గురువు. సంసారంలోని ఈతి బాధల నుండి శిష్యుణ్ణి ఉద్ధరిస్తాడు సద్గురువు. అలాంటి గురువు అందరికీ అవసరం.                                      *నిశ్శబ్ద.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్  రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది.  80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత  ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది.   ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది. ఆమెది నెద‌ర్లాండ్స్‌. ఆమె తండ్రి నెద‌ర్లాండ్స్‌లోని ఆర్నెహెమ్‌లో చిన్న‌పిల్ల‌ల ఆస్ప‌త్రి డైరెక్ట‌ర్. పోయి దొరికిన ఆ పెయింటింగ్ విష‌యానికి వ‌స్తే.. అది 1683లో కాస్ప‌ర్ నెష‌ర్ వేసిన స్టీవెన్ ఓల్ట‌ర్స్ పెయింటింగ్‌. రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో నాజీల ఆదేశాల‌ను చార్లెట్ తండ్రి వ్య‌తిరేకించారు. ఆయ‌న ర‌హ‌స్య జీవ‌నం సాగించేడు. కానీ ఈ పెయింటింగ్‌ని మాత్రం త‌న న‌గ‌రంలోని ఒక బ్యాంక్‌లో భ‌ద్ర‌ ప‌ర‌చ‌మ‌ని ఇచ్చార‌ట‌. 1940లో నాజీలు నెద‌ర్లాండ్ పై దాడులు చేసినపుడు ఆ బ్యాంక్ మీద ప‌డి దోచుకున్నా రు. అప్పుడు ఈ పెయింటింగ్ కూడా తీసుకెళ్లారు. యుద్ధం అయిపోయిన త‌ర్వాత ఈ పెయింటింగ్ ఎక్క‌డున్న‌దీ ఎవ‌రికీ తెలియ‌లేదు. చిత్రంగా 1950ల్లో డ‌స‌ల్‌డార్ష్ ఆర్ట్ గ్యాల‌రీలో అది ప్ర‌త్య‌క్ష‌మ‌యింది. 1969లో ఆమ్‌స్ట‌ర్‌డామ్‌లో దాన్ని వేలానికి తీసికెళ్లే ముందు దాన్ని ఆ ఆర్ట్ గ్యాల‌రీలో వుంద‌ని చూసిన‌వారు చెప్పారు. వేలంపాట త‌ర్వాత మొత్తానికి ఆ పెయింటింగ్‌ను 1971లో ఒక క‌ళాపిపాసి త‌న ద‌గ్గ‌ర పెట్టుకున్నాడు.    ఆ త‌ర్వాత 2021లో అది చార్లెటీని చేరింది.  మొత్తానికి వూహించ‌ని విధంగా ఎంతో కాలం దూర‌మ‌యిన గొప్ప క‌ళాఖండం తిరిగి త‌న వ‌ద్ద‌కు చేర‌డంలో చార్లెటీ ఆనందానికి అంతేలేదు. అంతే క‌దా.. పోయింద‌నుకున్న గొప్ప వ‌స్తువు తిరిగి చేరితే ఆ ఆనంద‌మే వేరు!  అయితే చార్లెటీకి ఇపుడు ఆ పెయిం టింగ్‌ను భ‌ద్రంగా చూసుకునే ఆస‌క్తి వున్న‌ప్ప‌టికీ శ‌క్తి సామ‌ర్ధ్యాలు లేవు. అందుక‌నే త్వ‌ర‌లో ఎవ‌రిక‌యినా అమ్మేసీ వ‌చ్చిన సొమ్మును పిల్ల‌ల‌కు పంచుదామ‌నుకుంటోందిట‌!  చార్లెటీ కుటుంబంలో అయిదుగురు అన్న‌ద‌మ్ములు అక్క‌చెల్లెళ్లు వున్నారు. అలాగే ఇర‌వై మంది పిల్ల‌లు ఉన్నారు. అంద‌రూ ఆమె అంటే ఎంతో ప్రేమ చూపుతున్నారు. అంద‌రం ఒకే కుటుంబం, చాలాకాలం త‌ర్వాత ఇల్లు చేరిన క‌ళాఖండం మా కుటుంబానిది అన్న‌ది చార్లెటీ!
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు. చాకోను పార్టీలోకి ఆహ్వానిస్తూ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్’ ఫ్రంట్ ఏర్పాటు గురించి ప్రత్యేకించి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు కానీ, చాకో అలాంటి  సంకేతాలు ఇచ్చారు. ప్రస్తుతం దేశంలో ఉన్న ఏ ఒక్కపార్టీ కూడా బీజేపీకి ప్రత్యాన్మాయం కాదని,సమీప భవిష్యత్ కాంగ్రెస్ సహా ఏ పార్టీ కూడా ఆ స్థాయికి ఎదిగే అవకాశాలు కూడా కనిపించడంలేదని అన్నారు. ఈ పరిస్థితుల్లో దేశంలోని బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ, ఏకమై, ఒకే గొడుగు కిందకు రావలసిన అవసరం ఉందని చాకో అన్నారు. అదే సమయంలో ప్రతిపక్షాలను ఏక తాటిపైకి తెచ్చే బాధ్యతను పవార్ తీసుకోవాలని సంకేత మాత్రంగా చెప్పారు. అంతే కాకుండా కాంగ్రెస్ పేరు ఎత్తకుండా బీజేపీ వ్యతిరేక శక్తులను ఏకం చేసే ఆలోచన ఆ పార్టీ నాయకత్వానికి లేదని నెహ్రూ గాంధీ ఫ్యామిలీ (సోనియా, రాహుల్, ప్రియాంక)ఆలోచనా ధోరణిని పరోక్షంగానే అయినా ఎండ కట్టారు.ఆ విధంగా పవార్ ఆ బాధ్యత తీసుకోవాలని చాకో సూచించారు. ఇందుకు సంబంధించి, పవార్ బహిరంగంగా ఎలాంటి వ్యాఖ్య చేయలేదు. అయితే, చాకో సహా మరికొందరు ‘సీనియర్’ కాంగ్రెస్ నాయకులు, అలాగే సిపిఎం, సిపిఐ నాయకులు కూడా పవార్’తో చాలా కాలంగా థర్డ్ ఫ్రంట్  విషయంగా చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. అయితే మహారాష్ట్రలో సంకీర్ణం మనుగడను దృష్టిలో ఉంచుకుని పవార్ ఆచితూచి అడుగులేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే చాకో పార్టీలో చేరిన సందర్భంలో కూడా ‘చాకో చేరికతో మహారాష్ట్రలోని మహా వికాస్ అగాడీ ప్రభుత్వానికి ఎలాంటి నష్టం జరగదని, పవార్ మహారాష్ట్ర సంకీర్ణ సర్కార్ ప్రస్తావన చేశారని విశ్లేషకులు పేర్కొంటున్నారు.  మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వ మనుగడ గురించ్బి  పవార్ ప్రత్యేకంగా పేర్కొనడం ద్వారా, ఆయన థర్డ్ ఫ్రంట్ విషయంలో వేచి చూసే ఆలోచనలో ఉన్నట్లు అర్థమవుతోందని కూడా  రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే అదే ఎన్సీపీ అసెంబ్లీ ఎన్నికల జరుగతున్న కేరళలో, పశ్చిమ బెంగాల్లో  కాంగ్రెస్ వ్యతిరేక పార్టీలకు మద్దతు ఇస్తోంది. దీన్ని బట్టి చూస్తే, ఎన్సీపీ - కాంగ్రెస్ మధ్య దూరం పెరుగుతోందని స్పష్టమవుతోంది. అయితే, థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఏ రకంగా ముడి పడుతుంది అనే విషయంలో ఇంకా స్పష్టత రావలసి ఉంది. అలాగే, కాంగ్రెస్ లేకుండా జాతీయ స్త్గాయిలో బీజేపీ వ్యతిరేక కూటమిని ఏర్పాటు చేయడం వలన, వ్యతిరేక ఓటు చీలి  అది మళ్ళీ బీజేపీకే మేలు చేస్తుందని, కాబట్టి, ప్రస్తుతం కాంగ్రెస్ సారధ్యంలోని యూపీఏని బలోపేతం చేయడమే ఉత్తమమనే అలోచన కూడా  విపక్ష శిబిరం నుంచి వినవస్తోంది. ఈ నేపధ్యంలోనే, ప్రస్తుతం యూపీఏ ఛైర్పర్సన్’గా ఉన్న సోనియా గాంధీ వయసు, అనారోగ్యం కారణంగా బాధ్యతల నుంచి తప్పుకుని పవార్’కు బాద్యతలు అప్పగించాలనే ప్రతిపాదన వచ్చిందని అంటున్నారు. అలాగే, ఇతర పార్టీలను, ముఖ్యంగా కాంగ్రెస్ నుంచి విడిపోయి సొంత కుంపటి పెట్టుకున్న మమతా బెనర్జీ సారధ్యంలోని తృణమూల్, జగన్మోహన్ రెడ్డి సారధ్యంలోని వైసీపీలను కలుపుకుని కూటమిని బలోపేతం చేయడం ద్వారా బీజేపీని దీటుగా ఎదుర్కోవచ్చనే ఆలోచనలు కూడా సాగుతున్నాయి. అయితే, ఇటు థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు అయినా, యూపీఏని బలోపేతం చేయడమే అయినా, పవారే .. కేంద్ర బిందువు. ఆయన సారధ్యంలోనే ప్రత్యాన్మాయం అనేది విపక్ష శిభిరం నుంచి వినవస్తున్న ప్రస్తుత సమాచారం. మరి అదే జరిగితే రాహుల గాంధీ పరిస్థితి ఏమిటి ? గాంధీ నెహ్రూ కుటుంబం పరిస్థితి ఏమిటి? ఏ ప్రత్యేక ప్రాధాన్యత లేకుండా అందరిలో ఒకరిగా ఫస్ట్ ఫ్యామిలీ సర్దుకు పోతుందా? అంటే..చివరకు ఏమవుతుందో .. ఇప్పుడే చెప్పలేమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది. గతంలో అనేక సందర్భాలలో ముఖ్యమంత్రి కేసీఆర్,ఆర్థిక మంత్రి హరీశ రావు, కరోనా కారణంగా రాష్ట్ర  ఆదాయం గణనీయంగా తగ్గిందని, పేర్కొన్నారు. అయితే, కరోనా నుంచి వేగంగా కోలుకుని, ఆర్థికంగా అంతే వేగంగా పుంజుకున్న రాష్ట్రాలలో తెలంగాణ ప్రధమ స్థానంలో  ఉందని కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సర్వే 2020-21 నివేదిక పేర్కొంది. పడిలేచిన కెరటంలా, తెలంగాణ ‘వీ’ ఆకారంలో ఆర్థికంగా నిలతొక్కుందని కేంద్రం జనవరి  చివరి వారంలో విడుదల చేసిన ఆర్థిక సర్వేలో పేర్కొంది. అలాగే, రెవిన్యూ వసూళ్ళలో రాష్ట్రం కరోనా పూర్వస్థితికి చేరిందని కూడా సర్వే చెప్పింది.   అలాగే,రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు కూడా ఈ మధ్య కాలంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పై సంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరమ జనవరి,ఫిబ్రవరి, మార్చి నెలలతో పోలిస్తే ఈ సంవత్సరం ఈ మూడు నెలల కాలంలో రాష్ట్ర ఆర్థిక వృద్ది రేటు 10 నుంచి  15 శాతం మెరుగ్గా ఉందని హరీష్ రావు ఒకటి రెండు ఇంటర్వ్యూలలో పేర్కొన్నారు.అలాగే, బడ్జెట్ విషయంలోనూ ఆయన చాల ఆశావహ దృక్పథంతోనే ఉన్నారు. బడ్జెట్  పాజిటివ్’గా ఉంటుదని, ఎవ్వరూ ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని, సంక్షేమ పథకాలలో,ఇతరత్రా బడ్జెట్ కేటాయింపులలో ఎలాంటి కోతలు ఉండవని కూడా హరీష్ హామీ ఇచ్చారు. గత సంవత్సరంలో కొంత మేర హామీ ఇచ్చిన మేరకు అమలు చేయలేక పోయిన సొంత జాగాలలో డబల్ బెడ్ రూమ్ ఇళ్ళ నిర్మాణం, రుణ మాఫీ వంటి  పథకాలను ఈ బడ్జెట్ ద్వారా అమలు చేస్తామని చెప్పారు. అలాగే, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ తమిళి సై చేసిన ప్రసంగంలోనూ ఆశావహ దృక్పధమే వ్యక్తమైంది. ఆమె తమ ప్రసంగంలో,  ప్రభుత్వం సంక్షేమ పథకాలకు పెద్ద పీట వేసిందని అన్నారు. ‘సంపద పంచాలి ,పేదలకు పంచాలి’ అనేది తమ ప్రభుత్వ విధానమని స్పష్టం చేశారు. అలాగే, పెరుగతున్న ఆదాయంలో అధికశాతం సంక్షేమానికే వెచ్చిస్తున్నామని స్పష్టం చేశారు. దీంతో బడ్జెట్’లో కొత్త పథకాలకు శ్రీకారం చుట్టే అవకాశం ఉంటుందా అన్న చర్చ జరుగుతోంది. మరో వంక ఉద్యోగ వర్గాల్లో పీఆర్సీకి సంబంధించి ఆర్థిక మంత్రి తమ ప్రసంగంలో  ప్రకటన చేస్తారా లేదా అనే ఆసక్తి నెలకొంది. అలాగే, సామాన్య  ప్రజలు ఇటీవల పెరిగిన పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరల భారం నుంచి మంత్రి హరీష్, ఏదైనా ఉపసమనం కలిపిస్తారా అని ఎదురు చూస్తున్నారు. గతంలో వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సామాన్య ప్రజలపై వంటగ్యాస్ ధర భారాన్ని తగ్గించేందుకు కొంత మొత్తాన్ని, రూ.50(?) రాష్ట్ర ప్రభుత్వం తరపున  సబ్సిడీగా ఇచ్చిన విషయాన్ని, అదే విధంగా అసెంబ్లీ ఎన్నికలు జరుగతున్న తమిళనాడులో డిఎంకే పార్టీ,తమ పార్టీని అధికారంలోకి వస్తే  గ్యాస్ బండపై వంద రూపాయల సబ్సిడీ ఇస్తామని చేసిన  వాగ్దానాన్ని  గుర్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే, ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు, సోమవారం ఆర్థిక మంత్రి హరీష్ రావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఆర్థిక  శాఖ ముఖ్య కార్యదర్శి రామ కృష్ణా రావు,సలహాదారు జీఆర్ రెడ్డితో బడ్జెట్ పద్దులఫై సుదీర్ఘంగా చర్చించి తుది మెరుగులు దిద్దారు. బడ్జెట్ తుది రూపం సిద్దమైన నేపధ్యంలో ఆర్థిక శాఖ ప్రింటింగ్ ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 18 ఉదయం మంత్రి వర్గం ఆమోదం పొందిన అనంతరం ఆర్థికమంత్రి హరీష్ రావు అదే రోజు రాష్ట్ర బడ్జెట్ 2021-22ను సభలో ప్రవేశ పెడతారు. 20, 22 తేదీల్లో బడ్జెట్‌పై సాధారణ చర్చ,23, 24, 25 తేదీల్లో బడ్జెట్‌ పద్దులపై చర్చ ఉంటుంది 26న ద్రవ్యవినిమయ బిల్లు (బడ్జెట్)పై చర్చ, సభామోదం ఉంటాయి.
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది.  అధికార తెరాస, ఖమ్మం స్థానానికి సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర రెడ్డి పేరును ప్రకటించడంలో కొంచెం జాప్యం చేయడంతో పాటుగా, హైదరాబాద్ స్థానం నుంచి , పీవీ కుమార్తె వాణీ దేవి పేరును చివరి క్షణంలో తెరమీదకు తేవడంతో అంత వరకు కొంత స్తబ్దుగా సాగిన ప్రచారం ఆ తర్వాత వేడెక్కింది. ఉద్యోగ నియామకాల విషయంలో తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ తప్పులో కాలేయడంతో విపక్షాలు, పోటీలో ఉన్న ప్రత్యర్ధులు, నిరుద్యోగ యువత, విద్యార్ధి సంఘాలు  ఒకే సారి ఆయన మీద  విరుచుకు పడ్డారు. ఆయన లెక్క తప్పని నిరుపిస్తం రమ్మని వరస సవాళ్ళు విసిరారు. దీంతో, మంత్రి నియామకా ఇష్యూని పక్కకు తప్పించేందుకు , ఐటీఐఆర్, వరంగల్ రైల్వే ఫ్యాక్టరీ వంటి సెంటిమెంటల్ ఇష్యూస్’ను తెరపైకి  తెచ్చారు. అలాగే, కేంద్ర ప్రభుత్వంపై విమర్శల దాడిని పెంచారు. చివరకు పొరుగు రాష్ట్రానికి చెందిన విశాఖ ఉక్కు ఆందోళన   కూడా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగమైంది.   రెండు నియోజక వర్గాలలో గతంతో పోలిస్తే ఈసారి ఓటర్ల సంఖ్య రెట్టింపు అయింది. ఈసారి రెండు నియోజక వర్గాలలో కలిపి 10 లక్ష 36 వేల మంది తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. అలాగే, రెండు పట్ట భద్రుల నియోజక వర్గాల్లో 164 మంది అభ్యర్ధులు పోటీలో ఉన్నారు.  గత ఎన్నికలతో పోలిస్తే ఇటు ఓటర్ల సంఖ్య, అటు అభ్యర్థుల సంఖ్యా రెట్టింపునకు పైగానే పెరగడంతో ఎన్నికలలో జోష్ పెరిగింది. దీనికితోడు అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో సాధారణ ఎన్నికలను తలపించే రీతిలో ప్రచారం సాగింది. ఎక్కువమంది అభ్యర్ధులు బరిలో ఉండడంతో, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి  తమకే ప్రయోజనం జరుగుతుందని అధికార పార్టీ ఆశపడుతోంది .  దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో చేదు ఫలితాలను చవిచూసిన టీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా వ్యూహ రచన చేసి కేటీఆర్, హరీష్ సహా మంత్రులు,ఎమ్మెల్యేలకు స్పెసిఫిక్ బాధ్యతలు అప్పగించారు. అలాగే,కాంగ్రెస్‌ అభ్యర్థులు చిన్నారెడ్డి, రాములునాయక్‌లకు మద్దతుగా ఉత్తమ్‌, భట్టి, రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తదితరులు విస్తృతంగా ప్రచారం చేశారు. బీజేపీ అభ్యర్థులు ఎన్‌.రాంచందర్‌రావు, ప్రేమేందర్‌రెడ్డిల తరఫున ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, ఎంపీ అరవింద్‌ తదితరులు ప్రచారాన్ని వేడెక్కించారు.  ఖమ్మం స్థానం నుంచి ప్రత్యక్ష ఎన్నికల్లో తొలిసారి పోటీకి దిగిన కోదండరాంకు, టీజేఎస్‌ పార్టీకీ ఈ ఎన్నికలు కీలకంగా మారాయి. ఖమ్మ స్థానం నుంచి పోటీ చేస్తున్న తీన్మార్ మల్లన్న ముందస్తు వ్యూహంతో ప్రధాన పార్టీల అభ్యర్ధులకు ధీటుగా ప్రచారం సాగించారు.  వామపక్షాల మద్దతుతో జయసారథి, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్‌, యువతెలంగాణ కార్యనిర్వాహక అధ్యక్షురాలు రాణీ రుద్రమ తదితరులు పోటీలో ఖమ్మం సీటును పట్టభద్రులు  ఎవరికి  పట్టం కడతారు అన్నది ప్రశ్నార్థకంగా మారింది. హైదరాబాద్ సీటు కూడా ఇటు అధికార తెరాసకు అటు సిట్టింగ్ సీటును నిలుపుకోవడం తో పాటుగా దుబ్బాక , జీహెచ్ఎంసి జోష్ ను కొనసాగించాలని ఆశ పడుతున్నబీజేలకే కూడా ఇజ్జత్ కీ సవాల్ గా మారింది. కాంగ్రెస్ అభ్యర్ధి పార్టీ సీనియర్ నాయకుడు సౌమ్యుడు, మాజీ మంత్రి చిన్నారెడ్డి, వామ పక్షాల మద్దతుతో పోటీ చేస్తున్న మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ కూడా గట్టి పోటీ ఇస్తున్నారు. సో.. చివరకు ఏమి జరుగుతుంది అంటే ఏదైనా జరగవచ్చును. ఈ నెల 14 వ తేదీన పోలింగ్ జరుగుతుంది.17 ఫలితాలు వస్తాయి .. అంతవరకు వెయిట్ అండ్ వాచ్ .  
సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది. ఒకప్పుడు ఎర్ర జెండాను దిగ్విజయంగా ఎదిరించి, మార్క్సిస్టులను మట్టి కరిపించిన మమతా దీదీ ప్రస్తుతం, కాషాయ కూటమి నుంచి గట్టి సవాలును ఎదుర్కుంటున్నారు. వరసగా పదేళ్ళు పాలించడం వలన సహజంగా వచ్చిన ప్రభుత్వ వ్యతిరేకత  కంటే, హిందూ ఓటు పోలరైజేషన్ ఆమెను మరింతగా భయపెడుతోంది. నిజానికి ఐదేళ్ళ క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం ఐదు శాతం కంటే తక్కువ ఓట్లు, మూడంటే మూడు అసెంబ్లీ సీట్లు మాత్రమే గెలుచుకున్న బీజేపీ..  2019 లోక్ సభ ఎన్నికల్లో ఏకంగా 40 శాతం ఓట్లతో 18 స్థానాలు గెలుచుకుంది. ఈ  మార్పు ఇంకా కొన్ని కారణాలు ఉంటే ఉండవచ్చును కానీ.. హిందువుల ఓటు పోలరైజ్  కావడమే ప్రధాన కారణం.  ఈ నేపధ్యంలోనే కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ చివరకు కమ్యూనిస్టులు కూడా బీజేపీలో  చేరారు. ఎన్నికల ప్రకటన వెలువడిన తర్వాత కూడా సిట్టింగ్ ఎమ్మెల్ల్యేలు సహా  తృణమూల్ టికెట్ వచ్చిన నాయకులు కూడా బీజేపీలో చేరుతున్నారు. అనేక మంది ఇతర రంగాల ప్రముఖులు, ముఖ్యంగా ఇంతకాలం, బీజేపీని హిదుత్వ అనుకూల ‘అచ్చుత్’ (అంటారని) పార్టీగా చూసిన ‘సెక్యులర్’ ప్రముఖులు కాషాయం కప్పుకోవడంతో మమతా బెనర్జీకి కొంచెం అలస్యంగానే అయినా, తత్త్వం బోధపడింది. అందుకే ఆమె ఇప్పుడు గుళ్ళూ,గోపురాలకు తిరుగుతున్నారు. కార్యకర్తల సమావేశాల్లో తానూ హిందువునేనని, చెప్పుకుంటున్నారు.  నిజానికి ఇలా నేనూ హిందువునే  అని సెక్యులర్ నేతలు బహిరంగంగా ప్రకటించుకోవడం మమతా బెనర్జీతోనే మొదలు కాలేదు. రాహుల్ గాంధీ తాను హిందువునని, జన్యుధారీ కశ్మీరీ బ్రాహ్మణుని అనీ.. తమ గోత్రం, ‘దత్తాత్రేయ’ గోత్రమని బహిరంగంగా ప్రకటించుకున్నారు. అలాగే  కొద్ది రోజుల క్రితం ప్రియాంకా గాంధీ తానూ హిందువునని చెప్పుకునేందుకు ‘మౌని అమావాస్య’ సందర్భంగా అలహాబాద్ లో గంగా స్నానం చేశారు. గతంలోనూ ఆమె ఎన్నికలకు ముందు గంగా యాత్ర చేశారు. అంతవరకు ఎందుకు కొద్దిరోజుల క్రితం సిపిఐ నారాయణ విశాఖ స్వామి ఆశీస్సులు తీసుకున్నారు. చంద్రబాబు, జగన్ రెడ్డి, కేసీఆర్ ఇలా తెలుగు నేతలు అనేక మంది లౌకిక వాదానికి కాలం చెల్లిందన్న సత్యాన్ని గ్రహించి కావచ్చు ‘నేనూ హిందువును’ అంటూ ప్రకటించుకునేందుకు పోటీ పడుతున్నారు. రాముడిని తలచుకున్నా, జై శ్రీరామ్ అన్నా తమ  లౌకిక వాదం మయలపడి పోతుందని భయపడిన నాయకులు ఇప్పుడు .. జై శ్రీరామ్ అనేందుకు కూడా వెనకాడడం లేదు.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది. గత కొంత కాలంగా సబర్మలతో సహా అనేక అంశాలపై స్పందిస్తూ.. కేరళను టార్గెట్ చేస్తున్న బీజేపీ నాయకులు అక్కడ తమ జెండా ఎగరేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా పార్టీ పాలసీని కూడా పక్కన పెట్టి మెట్రో మ్యాన్ శ్రీధరన్ ను పార్టీలో చేర్చుకుని ఆయనే తమ సీఎం అభ్యర్థి అని ప్రకటించిన 24 గంటలలో యూ టర్న్ తీసుకున్నారు. ఇది ఇలా ఉండగా ప్రస్తుతం సీఎంగా ఉన్న కమ్యూనిస్ట్ నేత పినరై విజయన్ పై గోల్డ్ స్మగ్లింగ్ ఆరోపణలు రావడంతో.. ఈ ఎన్నికలలో ఎల్డిఎఫ్ భవిష్యత్తుపై ప్రజలు ఏ తీర్పు ఇవ్వబోతున్నారనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది ఈ నేపథ్యంలో అక్షరాస్యతలో దేశంలోనే మొదటి స్థానంలో ఉన్న ఆ రాష్ట్ర ప్రజలు ఎవరిని ఆశీర్వదిస్తారు అనే అంశంపై ప్రముఖ మీడియా సంస్థ టైమ్స్ నౌ, సీ ఓటరుతో కలిసి ఒక సర్వేను నిర్వహించారు. ఈ సర్వే ప్రకారం చూస్తే పాపం కమలనాథులు అక్కడ పవర్ చేతికి రావటం అటుంచి కనీసం రెండు మూడు అసెంబ్లీ స్థానాల్లో గెలవటం కూడా కష్టమేనని ఆ సర్వే తేల్చి చెబుతోంది. కేరళలో ఈసారి జరిగే అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ తన హవా చాటుతుందన్న ఆ పార్టీ నేతల మాటలలో ఎలాంటి నిజం లేదని.. ప్రస్తుతానికి అది ఏమాత్రం సాధ్యం కాదని ఈ తాజా సర్వే తేల్చి చెప్పింది. అంతేకాకుండా మొత్తం 140 స్థానాలు ఉన్న కేరళలో.. ప్రస్తుత సీఎం పినరయి విజయన్ నేతృత్వంలోని లెఫ్ట్డ్ డెమొక్రటిక్ ఫ్రంట్ కు 82 సీట్లు పక్కా అని.. ఆయనే తిరిగి అధికారాన్ని నిలబెట్టుకుంటాడని సర్వే చెపుతోంది. అదే సమయంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూనైటెడ్ డెమొక్రాటిక్ ఫ్రంట్ కు 56 నుంచి 60 వరకు సీట్లు వచ్చే అవకాశం ఉందని ఈ సర్వేలో తేలింది. అంతేకాకుండా 2016 ఎన్నికలతో పోలిస్తే ఎల్ డీఎఫ్ ఓటింగ్ శాతం కూడా కొంత పెరగటం ఇక్కడ గమనార్హం. ప్రస్తుతం సీఎంగా ఉన్న విజయన్ మరోసారి సీఎం కావాలని 43.34 శాతం మంది మొగ్గు చూపినట్లుగా సర్వేలో తేలింది. కరోనా సమయంలో విజయన్ సీఎంగా బాగా పని చేసారని ఈ సర్వే పేర్కొంది. మరోపక్క దేశ ప్రధానిగా రాహుల్ గాంధీ ఉండాలని కేరళ ప్రజల్లో 55.84 శాతం మంది కోరుకుంటున్నట్లుగా ఈ సర్వే;లో తేలింది. అయితే కేరళలో ఎలాగైనా పాగా వేయాలని పట్టుదలతో కృషి చేస్తున్న బీజేపీకి ఈసారి కూడా నిరాశ తప్పదని ఈ సర్వేలో స్పష్టం అయింది. ఈ ఎన్నికలలో బీజేపీకి రెండు సీట్లు కూడా రావటం కూడా కష్టమేనని ఈ సర్వే తేల్చింది. అయితే ఎన్నికలకు ముందు ఇలాంటి సర్వేలు బయటకు రావడం.. తరువాత అందులో కొన్ని చతికిల పడడం మనం చూస్తూనే ఉన్నాం. మరి ఈ సర్వే ఫలితాలు నిజామా అవుతాయో లేదో తేలాలంటే కొద్దీ రోజులు వెయిట్ చేయాల్సిందే.        
రాజకీయాలు అంటేనే అదో జూదం. పూలమ్మిన చోటనే కట్టెలు అమ్మవలసి రావచ్చును. అలాంటి పరిస్థితే వచ్చినా, తలవంచుకుని పోగలిగితేనే, ఎవరైనా రాజకీయాలలో రాణించగలరు. అలాకాదని, అలిమి కానిచోట, కూడా తామే అధికులమని భావిస్తే, ఎందుకూ కాకుండా పోతారు. అలాంటి వారు ఇద్దరూ కూడా ఇప్పుడు మన కళ్ళముందే ఉన్నారు.  జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు. అలాగే జయ మరణం తర్వాత ఆమె పరిస్థితి ఏమిటో కూడా వేరే చెప్పవలసిన, అవసరం లేదు. జైలు పాలయ్యారు. సర్వం తానై నడిపించిన పార్టీ నుంచి  బహిష్కరణకు గురయ్యారు. జయ ఉన్నంత వరకు తన వారుగా ఉన్న వారందరూ కానివారయ్యారు. ఒంటరిగా మిగిలారు.  నిజానికి నాలుగేళ్ళు జైలు జీవితం గడిపిన తర్వాత కూడా ఆమె తలచుకుంటే.. రాష్ట్ర రాజకీయాలలో, ముఖ్యంగా అధికారంలో ఉన్న డిఎంకే కూటమిలో అలజడి సృష్టించగలరు. ఎన్నికలలో ఆమె గెలవక పోవచ్చును కానీ.. తనను కాదన్న అన్నాడిఎంకేను ఓడించగలరు. అయిన  ఆమె అందుకు విరుద్ధంగా  రాజకీయాలకు వీడ్కోలు పలికి మౌనంగా పక్కకు తప్పుకున్నారు. రాజకీయ సన్యాసం ప్రకటించారు. ఉమ్మడి శతృవు డిఎంకే ను ఓడించేందుకు అన్నా డిఎంకే కూటమి  పోటీ చేయాలని, కూటమి ఐక్యతను దెబ్బతీయరాదనే ఉద్దేశంతోనే ఆమె రాజకీయ సన్యాసం ప్రకటించారు.    శశికళ మౌనంగా వెళ్లి పోవడం వెనక ఇంకా అనేక కారణాలున్నా ,అసలు కారణం ఆమె, రాజకీయ విజ్ఞత, వివేకం. ఆమె జైలుకు వెళ్ళిన సమయంలో జయలలిత సమాధి వద్ద ఎంత కసిగా, కోపంగా ‘మౌన’ ప్రతిజ్ఞ చేశారో చూశా. అలాంటి ఆమె ఇప్పుడు ఇలా ‘మౌనం’గా వెనకడుగు వేశారంటే, అది ఆలోచించ వలసిన విషయమే.ఆమె వ్యుహతంకంగానే సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే అనేక మంది అనేక కోణాల్లో శశికళ సంచలన నిర్ణయాన్ని విశ్లేషించారు.జైలు జీవితం తర్వాత కూడా అన్నా డిఎంకే నాయకులు తనను అగ్రనేతగా అంగీకరించక పోవడం, అమిత్ షా చెప్పినా.. అన్నా డిఎంకే నాయకులు ఆమెను, మేనల్లుడు దినకరన్’ను కులం పేరున, కుటుంబం పేరున దూరం చేయడం, తిరిగి పార్టీలోకి తీసుకోకపోవడంతో ఆమె మనసు కష్టపెట్టుకుని, సన్యాస నిర్ణయం తీసుకున్నారని కొందరంటున్నారు. పార్టీ మీద పట్టు లేదని, చరిష్మా అసలే లేదని, అందుకే ఆమె అలా నిశ్శబ్ధంగా రాజకీయ సన్యాసం స్వీకరించారని ఇంకొందరు విశ్లేషించారు. ఈ విశ్లేషణలో కొంత నిజం ఉంటే ఉండవచ్చును.. కానీ ఆమె గతాన్ని, నైజాన్ని గుర్తు చేసుకుంటే ఆమె స్ట్రైక్ బ్యాక్ వ్యూహంతోనే ఒకడుగు వెనక్కివేశారని ఆమెతో సన్నిహితంగా మెలిగినవారు, ఆమె రాజకీయ చాణక్యం తెలిసిన వారు అంటారు.   నిజానికి జైలులో ఉన్న కాలంలో కానీ, జైలు నుంచి విడుదలై వచ్చిన తర్వాత కానీ, ఆమె రాజకీయ సన్యాసం వైపు అడుగులు వేస్తున్నట్లు కనిపించలేదు. బెంగుళూరు జైలు నుంచి విడుదలై చెన్నైలో ప్రవేశించిన నప్పుడు ఆమె పెద్ద కాన్వాయ్ తో  తమ కారుకు అన్నాడిఎంకే జెండాతోనే ఎంటరయ్యారు. అలా ఎంట్రీలోనే రాజకీయ ఆకాంక్షను వెంట తెచ్చుకున్నారు. చివరకు ‘సన్యాస’ ప్రకట చేసే వరకు కూడా ఆమె రాజకీయ కార్యకలాపాలు సాగిస్తూనే ఉన్నారు. అటు ఢిల్లీని ఇటు చెన్నైనికూడా కదిల్చారు. అంతేకాదు, రాజకీయాలపై విరక్తితో కాదు, రాజకీయ కసితో, ఉమ్మడి శత్రువు (డిఎంకే) ను ఓడించేందుకే తాను రాజకీయాలనుంచి తపుకుంటున్నట్లు చెప్పారు.  సో .. సన్యాసం తీసుకోవాలనే ఆలోచన, రాజకీయవ్యూహం లోంచి పుట్టిందే కానీ,వైరాగ్యంతో పుట్టింది కాదు ,అన్నవిశ్లేషణ వాస్తవానికి ఇంకొంత దగ్గరగా ఉందని అనుకోవచ్చును. ఇది ‘కామా’నే కాని ‘ఫుల్స్టాప్’ కాదని అంటున్నారు.  ముఖ్యమంత్రి ఎడప్పాడి కే. పళని స్వామి (ఈపీఎస్) ఆమెను పార్టీలోకి అనుమతిస్తే తన కుర్చికీ ఎసరు పెడతారనే భయంతోనే,, ఆమె ఎంట్రీని అడ్డుకున్నారు. ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం, శశికళ ఒకే సామజిక వర్గానికి చెందిన వారు కావడం కూడా, ముఖ్యమంత్రి ఈపీఎస్’ భయానికి కారణంగా పేర్కొంటారు. అందుకే  ఆయన, ‘మన్నార్గుడి’ ఫ్యామిలీని బూచిగా చూపించి, ఆమెను దూరంగా ఉంచారని పార్టీలో ఒక వర్గం గట్టిగా విశ్వసిస్తుంది. అయితే ఆమె శక్తియుక్తులను కూడతీసుకుని  పులిలా పంజా విసిరేందుకే ఆమె వ్యూహాత్మకంగా ఒక అడుగు వెనక్కి వేశారు కావచ్చును అని కూడా, తమిళ రాజకీయ వర్గాల్లో ఒక చర్చ జరుగుతోంది.  గతంలో ఆమె జయలలితతో విబేధాలు వచ్చిన సమయంలో కూడా ఇలాగే కొద్ది కాలం మౌనంగా తెర చాటుకు వెళ్లి పోయారు.  కొద్ది కాలంలోనే మళ్ళీ ‘పోయస్ గార్డెన్’లో ప్రత్యక్షమయ్యారు. జయలలిత స్వయంగా ఆమెను వెనక్కి పిలుపించుకోవలసిన పరిస్థితులను సృష్టించారు. అలా  మళ్ళీ  చక్రం తిప్పారు. జయలలిత మరణం వరకు ఆమె అందరికీ చిన్నమ్మగా అమ్మకు పెద్దమ్మగా సర్వం తానై నిలిచారు. చివరకు జయ అంత్యక్రియల్లో కూడా ఆమెదే పై చేయిగా కనిపించింది.   జయలలిత చనిపోయిన సందర్భంలోనే అన్నా డిఎంకే ఎమ్మెల్ల్యేలో సుమారు 30 మంది వరకు ఆమెకు మద్దతుగా ఉన్నారన్న వార్తలొచ్చాయి. నిజానికి,ఇప్పటికి కూడా ఒక్క అన్నా డిఎంకే లోనేకాదు,డిఎంకే ఇతర పార్టీలలో కూడా  ఆమె అవసరం ఉన్న వాళ్ళు ఉన్నారు. కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో ‘మన్నార్గుడి’ ఫ్యామిలీ మద్దతు లేకుండా గెలిచే అవకాశం లేదు.  ఇవ్వన్నీ నిజమే అయినా.. అన్నీ ఉండి, ఎవరు లేని శశికళలో, ఇంకా  ఎవరి కోసం తాపత్రయ పడాలి? అనే ప్రశ్న జనించి ఉంటే, ఆమె రాజకీయ సన్యాసం నిజం కావచ్చును. ఎందుకంటే ఆమె నెచ్చలి, జయలిత లేరు, భర్త అంతకంటే ముందే చనిపోయారు, పిల్లలు లేరు... పైగా నాలుగేళ్ళ జైలు జీవితం ఆమెలో మార్పు తెచ్చి ఉండవచ్చును. ఈ వయస్సులో తనవారంటూ ఎవరు లేని తనకు రాజకీయాలు ఎందుకు ? శేష జీవితాన్ని ఇలా సాగిద్దామనే ఆలోచన నిజంగా వచ్చి ఉంటే, ఆమె సన్యాసం సత్యం అయినా కావచ్చును, కాకపోనూ వచ్చును. కానీ  శశికళ... ఆమెను అర్థం చేసుకోవడం, అంచనా వేయడం , అంత తేలిగ్గా అయ్యే పని కాదు..
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు. కాంగ్రెస్ అధినాయకత్వం పై నేరుగా అస్త్రాలు సంధించారు. రాహుల్ గాంధీ పేరు చెప్పకుండానే, ఆయన నాయకత్వానికి పనికిరాడని తేల్చి చెప్పారు. ఎవరైనా పార్టీ అధ్యక్షుడు అయితే కావచ్చును, కానీ, ప్రజానాయకుడు కాలేడని, రాహుల గాంధీ ప్రజానాయకుడు కాదు కాలేరు,అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తరచూ రాహుల్ గాంధీని ఉద్దేశించి చేసే  ‘నామ్’ధారీ వ్యంగ్యాస్త్రాన్నే కాంగ్రెస్ సీనియర్ నాయకులు కూడా సందించారు. ఇక అక్కడి నుంచి విధేయ, అసమ్మతి వర్గాల మధ్య మాటల యుద్ధం ఎదో ఒక రూపంలో సాగుతూనే వుంది. అదే క్రమంలో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ, కరుడు కట్టిన ముస్లిం మతోన్మాది, అబ్బాస్ సిద్దిఖీతో కాంగ్రెస్ పార్టీ చేతులు కలపడం అసమ్మతి నాయకులకు మరో అస్త్రాన్ని అందించింది. విషయంలోకి వెళితే, ఇటీవల పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా లోక్’సభలో కాంగ్రెస్ పక్ష నాయకుడు, పశ్చిమ బెంగాల్ పీసీసీ అధ్యక్షుడు అధీర్’రంజన్ చౌదరి, ముస్లిం మత ప్రచారకుడు, అబ్బాస్ సిద్దిఖీతో  వేదిక పంచుకున్నారు.అంతకు ముందే వామ పక్ష కూటమితో  పొత్తు కుదుర్చుకున్న కాంగ్రెస్ పార్టీ, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)ను కూటమిలో చేర్చుకుంది. ఇలా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) అమోదం లేకుండా మతోన్మాద ఐఎస్ఎఫ్’ తో ఎన్నికల పొత్తు పెట్టుకోవడం ఆ పార్టీ నాయకుడు,సిద్ధిఖీతో  పీసీసీ చీఫ్ వేదిక  పంచుకోవడం పై అసమ్మతి నేతలు మండి పడుతున్నారు. ఇలా సిద్దిఖీతో వేదిక పంచుకోవడం పార్టీ మౌలిక సిద్ధాంతాలకు వ్యతిరేకం అంటూ అసమ్మతి వర్గానికి చెందిన కీలక నేత, రాజ్యసభ సభ్యుడు,ఆనంద్ శర్మ మండిపడ్డారు. అంతే కాదు, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)తో జనవరిలో కుదుర్చుకున్న పొత్తుకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ)అమోదం లేదని ఆనంద్ శర్మ, అభ్యంతరం వ్యక్త చేశారు. పార్టీ విశ్వసించే లౌకిక వాదానికి కాంగ్రెస్ అధిష్టానం తీసుకున్న నిర్ణయం గొడ్డలి పెట్టని ఆయన తీవ్రంగా స్పందించారు.   శర్మ వ్యాఖ్యలపై అధీర్ రంజన్ చౌదరి అంతే ఘాటుగా ప్రతిస్పందించారు. “నిజాలు తెలుసుకోండి ఆనంద్ శ‌ర్మ జీ” అంటూ ఆయ‌న వ‌రుస ట్వీట్లు చేశారు. వ్య‌క్తిగ‌త ప్ర‌యోజ‌నాలు ప‌క్క‌న‌పెట్టి, ప్ర‌ధానిని పొగిడి టైమ్ వేస్ట్ చేయ‌కండంటూ ఆయ‌న ఓ ట్వీట్లో అన్నారు. ఆనంద్ శ‌ర్మ అన‌వ‌స‌రంగా కాంగ్రెస్‌ను ల‌క్ష్యంగా చేసుకుంటున్నార‌ని, ఈ అంశాన్ని పెద్ద‌ది చేసి చూపిస్తున్నార‌ని విమ‌ర్శించారు. ఆయ‌న ఉద్దేశాలు స‌రైన‌వే అయితే నేరుగా తనతో మాట్లాడ వలసిందని అన్నారు. బెంగాల్‌లో సీపీఐ(ఎం) కూట‌మికి నేతృత్వం వ‌హిస్తోంది. అందులో కాంగ్రెస్ ఓ భాగం. మ‌త‌తత్వ‌, విభ‌జ‌న రాజ‌కీయాలు చేస్తున్న బీజేపీకి చెక్ పెట్ట‌డానికే ఈ కూట‌మి అని మ‌రో ట్వీట్‌లో అధిర్ రంజ‌న్ అన్నారు. అక్కడతోనూ ఆగలేదు ... ట్వీట్ల మీద ట్వీట్లు సంధిస్తూ, ఆనంద్ శర్మ, బీజేపీ మత విభజన, అజెండాను బలపరుస్తున్నారని, పరోక్షంగా జీ23 నాయకులు బీజేపీకి ప్రయోజనం చేకూరుస్తున్నారని ఆరోపించారు.అంతే కాదు, క్షేత్ర స్థాయి వాస్తవ పరిస్థితులు తెలియకుండా, ఆనంద్ శర్మ పార్టీ మీద దండెత్తడం ఉచితం కాదని చౌదరి ఎదురుదాడి చేశారు. అసమ్మతిలో అసమ్మతి. ఇదలా ఉంటే, కాంగ్రెస్ పార్టీ  సమూల పక్షాళన కోరుతూ సోనియా గాంధీకి,గత సంవత్సరం  జీ 23గా ప్రాచుర్యం పొందిన సీనియర్ నాయకులు రాసిన లేఖపై సంతకాలు చేసిన  నాయకుల్లో నలుగురు,జమ్మూలోసమావేసమైన నాయకుల తాజా నిర్ణయాలు, వ్యాఖ్యలు,విమర్శల పట్ల అసంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరం సోనియా గాంధీకి రాసిన లేఖలో ప్రస్తావించిన అంశాలకు కట్టుబడి ఉన్నామని, అయితే, జీ 23లోని కొందరు సహచరులు, ఇటీవల గీతదాటి చేస్తున్న వ్యాఖ్యలు, విమర్శలను తాము సమర్ధించడం లేదని ఆ నలుగురు పేర్కొన్నారు. ఇందులో ముఖ్యంగా, రాజ్యసభ మాజీ డిప్యూటీ చైర్మన్, పీజే కురియన్ అయితే, “కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు అవసరమైన సంస్కరణలు తెచ్చేందుకు చేసే ప్రయత్నాలను పూర్తిగా సమర్దిస్తాను, కానీ, ‘లక్ష్మణ రేఖ’ దాటితే ఒప్పుకునేది లేదు”అని అసమ్మతిలో అసమ్మతికి తెర తీశారు.అలాగే, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ కుమారడు, మాజీ ఎంపీ సందీప్ దీక్షిత్,మధ్య ప్రదేశ్ సీనియర్ కాంగ్రెస్ నాయకుడు అజయ్ సింగ్’ కూడా గులాం నబీ ఆజాద్, కపిల్ సిబల్, ఆనంద్ శర్మ, మనీష్ తివారీ వంటి జీ 23 కీలక నేతలు అధినాయకత్వంపై చేసిన వ్యాఖ్యలను తప్పు పట్టారు. అలాగే, పార్టీ సీనియర్ నాయకుడు కేంద్ర మాజీమంత్రి వీరప్ప మొయిలీ కూడా,గత సంవత్సరం పార్టీ సీనియర్ నాయకులు  ఒక పరిమిత లక్ష్యంతో  సోనియా గాంధీకి లేఖ రాయడం జరిగిందని, ఆ పేరున జరుగతున్న  కార్యక్రమాలు లేఖ సంకల్పానికి  విరుద్ధమని అన్నారు. జీ 23 కార్యకలాపాలపై రాహుల్ గాంధీ కూడా పరోక్షగా స్పందించారు, ఒకప్పుడు ఎన్ఎస్’యుఐ, యూత్ కాంగ్రెస్’ కు సంస్థాగత ఎన్నికలు వద్దన్న వారే ఇప్పుడు ఇంకోలా మాట్లాడుతున్నారని పరోక్షంగానే అయినా సంస్థాగత ఎన్నికలు నిర్వహించడంతో పాటుగా, పార్టీ పక్షాలనకు తమ కుటుంబం వ్యతిరేకం కాదని, అందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఈ నేపధ్యంలో కాంగ్రెస్ పార్టీలో చెలరిగిన కలకలం  ఇక ముందు ఏమవుతుందో .. ఇంకెన్ని  మలుపులు తిరుగుతోందో ..చూడవలసిందే కానీ ఉహించలేము.
పంచతంత్రంగా పిలుచుకుంటున్న ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భతం జరగబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే, వివిధ సంస్థలు అసెంబ్లీ ఎన్నికలు జరిగే  అస్సాం. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటుగా కేరళలోనూ ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఆ ఒపీనియన్ పోల్ ఫలితాలు నిజంగా నిజం అయితే, కేరళలో మళ్ళీ సీపీఎం సారధ్యంలోని వామపక్ష కూటమి అధికారంలోకి వస్తుంది. ఇదే ఆ అద్భుతం. ఎందుకంటే, గత నాలుగు దశాబ్దాలలో కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో ఒకే కూటమి వరసగా రెండవసారి అధికారంలోకి వచ్చిన చరిత్ర లేనే లేదు. ఒక సారి ఎల్డీఎఫ్ అధికారంలోకి వస్తే ఐదేళ్ళ తర్వాత కాంగ్రెస్ సారధ్యంలోని ఐక్య ప్రజాస్వామ్య కూటమి(యూడీఎఫ్) అధికారంలోకి రావడం, దేవభుమిలో దైవ నిర్ణయమా అన్నట్లుగా ప్రతి ఎన్నికల్లోనూ అధికారం చేతులు మారుతూ వస్తోంది. అలాంటిది, ఈసారి ఒపీనియన్ పోల్స్ నిజమై వరసగా రెండవసారి వామపక్ష కూటమి అధికారంలోకి వస్తే, అది చరిత్రే అవుతుంది. ఇక ఒపీనియన్ పోల్స్ విషయానికి వస్తే, జాతీయ న్యూస్ ఛానెల్ ఏబీపీ, సీ ఓటర్ సంస్థలు సంయుక్తంగా ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఈ సర్వే ప్రకారం, 140 స్థానాలున్న కేరళ అసెంబ్లీలో వామపక్ష కూటమికి 83 నుంచి  91 స్థానాలు, యూడీఎఫ్ కూటమికి 47 నుంచి 55 స్థానాలు మాత్రమే దక్కుతాయని తెలుస్తోంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్రంలో ఇలా జాతకాలు తిరగబడడంపై సోషల్ మీడియాలో,’లెగ్ మహిమ’ లాంటి జోక్స్  ట్రోలవుతున్నాయి. అయితే 2016లో జరిగిన ఎన్నికల్లో కేవలం 47 సీట్లకే పరిమితం అయిన కాంగ్రెస్’కు ఈసారి ఒకటీ అరా సీట్లు ఎక్కువస్తే, రావచ్చును. అదే కాంగ్రెస్’కు కాసింత ఊరట. అదలా ఉంటే, పశ్చిమ బెంగాల్లో సైతం పట్టు సాధించిన బీజేపే, కేరళలో మాత్రం పట్టు కాదు కదా, పట్టుమని పది సీట్లు తెచ్చుకునే స్థితిలో లేదు. నిజానికి, దేశంలో బీజేపీకి అసలు ఏ మాత్రం మింగుడు పడని రాష్ట్రాలు ఎవైన ఉన్నాయంటే కేరళ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల  పేర్లే ప్రముఖంగా వినిపిస్తాయి. ఈ సారి కూడా కమల దళం కేరళలో కాలు పెట్టె పరిస్తి లేదని సర్వే ఫలితాలు చెపుతున్నారు. ఎప్పటిలానే ఇప్పడు కూడా  బీజేపీకి సున్నా నుంచి రెండు సీట్లు వచ్చే అవకాశం ఉందని, సర్వేస్వరుల అభిప్రాయంగా ఉంది. కేరళలో మొత్తం 140 స్థానాలకు ఏప్రిల్ 6 తేదీన ఒకే విడతలో పోలింగ్ జరుగుతుంది. మే 2 తేదీన ఫలితాలు వెలువడతాయి. కేరళ ఎలక్షన్ పై యావత్ దేశం ఆసక్తి కనబరుస్తోంది.    
కేంద్ర ఎన్నికలసంఘం ‘పాంచ్ పటాక’ గంట కొట్టింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. ఎన్నికల గంట మోగడంతో మొదలైన మరో భారత ‘మినీ’  సంగ్రామానికి మే 12 తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తెర పడుతుంది.ఈలోగా వివిధ అంచల్లో పోలింగ్ జరుగుతుంది.  నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతం ఓటరు తీర్పుకు వెళుతున్నా, అందరి దృష్టి, ముఖ్యంగా ప్రాంతీయ పార్టీల ఏలుబడిలో ఉన్న ఉభయ తెలుగు రాష్ట్రాలు, మరీ ముఖ్యంగా ఇప్పటికే బీజేపీ కన్నుపడిన తెలంగాణ రాష్ట్ర ప్రజలు, రాజకీయ పార్టీల దుష్టి  మాత్రం పశ్చిమ బెంగాల్ పైనే వుంది.  పశ్చిమ బెంగాల్లో ‘అద్భుతం’ జరిగి బీజేపీ విజయం సాధిస్తే, ఇక  కమల దళం ఫోకస్, తెలంగాణకు షిఫ్ట్ అవుతుంది. ఇది అందరికీ తెలిసిన బహిరంగ రహస్యం. ఈ నేపధ్యంలో బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయి అనే విషయంలో రాష్ట్ర రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. బెంగాల్లో బీజేపీ గెలిస్తే, ఇప్పటికే అంతర్గత కుటుంబ కలహాలతో సతమతవుతున్న తెరాస నాయకత్వానికి మరిన్నితిప్పలు తప్పవన్న మాట అంతఃపుర వర్గాలలో సైతం వినవస్తోంది.  పశ్చిమ బెంగాల్’లో ఎలాగైతే కమలదళం ఓ వంక తమ ట్రేడ్ మార్క్, హిందుత్వ రాజకీయాలు సాగిస్తూ, మరో వైపు నుంచి ‘ఆకర్ష్’ అస్త్రంతో అధికార పార్టీని నిర్వీర్యం చేసిన విధంగానే, ఇక్కడ కూడా ఫిరాయింపులను ప్రోత్సహింఛి పార్టీని నిట్టనిలువునా చీల్చే ప్రమాదాన్ని కొట్టివేయలేమని పార్టీ వర్గాలు కూడా అనుమానం వ్యక్త పరుస్తున్నాయి.  ఇప్పటికే తెలంగాణ  బీజేపీ నాయకులు 30 మంది తెరాస ఎమ్మెల్యేలు తమ టచ్ లో ఉన్నారని బెదిరిస్తున్నారు.అది నిజం అయినా కాకపోయినా..తెరాసలో అసంతృప్తి అగ్గి రగులుతోందనేది మాత్రం ఎవరూ కాదనలేని నిజం. అంతే కాకుండా రాష్ట్రానికి వచ్చిన కేంద్రనాయకులు ఎవరిని పలకరించినా, నెక్స్ట్ టార్గెట్ తెలంగాణ అని ఎలాంటి సషబిషలు లేకుండా కుండబద్దలు కొడుతున్నారు.అందుకే, బెంగాల్లో బీజేపీ గెలిస్తే.. అనే ఊహా కూడా  గులాబీ గూటిలో గుబులు పుట్టిస్తోంది. అయితే, బెగాల్’లో బీజేపీ గెలిస్తే ఒక్క తెలంగాణలోనే కాదు, దేశ రాజకీయ వాతావరణంలోనే పెను మార్పులు చోటు చేసుకుంటున్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.  అలాగే,  దేశ ముఖ చిత్రంలో కూడా పెను మార్పులు తప్పవని అంటున్నారు. అయితే రాజకీయాలలో ఎప్పుడు ఏం జరుగుతుందో.. ఎవరూహించెదరు..
ఫ్యాన్.. ప్రతి ఇంట్లో చాలా సాధారణంగా ఉండే ఎలక్ట్రిక్ పరికరం.  బయట నుండి ఇంటికి రాగానే ఫ్యాన్ వేసుకుని దాని కింద కూర్చుని రిలాక్స్  అవుతుంటాం. అయితే వేసవి కాలంలో ఫ్యాన్ వేగం తగ్గినట్టు అనిపిస్తుంది. కొన్నిసార్లు ఫ్యాన్ వేసినా అసలు వేయనట్టే అనిపిస్తుంది. అందుకే చాలా మంది ధర ఎక్కువైనా ఏసీ వైపు మొగ్గు చూపుతారు. కానీ ఫ్యాన్ సెట్టింగ్ లో 5 మార్పులు చేయడం వల్ల ఫ్యాన్ స్పీడ్ గా తిరుగుతుంది. దాని వేగం.. అది ఇచ్చే చల్లదనం ముందు ఏసీ కూడా బలాదూర్ అంటున్నారు టెక్నాలజీ నిపుణులు. ఇంతకీ ఆ సెట్టింగ్స్ ఏంటో తెలుసుకుంటే.. కెపాసిటర్.. సీలింగ్ ఫ్యాన్‌లో అమర్చిన కెపాసిటర్ మోటార్‌కు అవసరమైన విద్యుత్‌ను అందించడానికి పనిచేస్తుంది. కెపాసిటర్ల పనితీరు మందగించినట్టైతే  90% కంటే ఎక్కువ సీలింగ్ ఫ్యాన్ సమస్యలు ఎదురవుతాయి. కెపాసిటర్ పని చేయడం ఆపివేసినప్పుడు మోటారుకు విద్యుత్ సరిగా అందదు.  దీంతో ఫ్యాన్ వేగం తగ్గుతుంది.  70 నుండి 80 రూపాయల కెపాసిటర్‌ను తిరిగి అమర్చితే  ఫ్యాన్ వేగం పెరుగుతుంది.   బ్లేడ్.. కొన్ని సార్లు ఫ్యాన్ బ్లేడ్ వంగడం వల్ల కూడా ఫ్యాన్ వేగం తగ్గుతుంది. అలాంటి పరిస్థితిలో ఫ్యాన్ బ్లేడును మార్చాలి.  దీనివల్ల కూడా సీలింగ్ ఫ్యాన్ వేగం పెరుగుతుంది. బాల్ బేరింగ్ ఫెయిల్యూర్.. సీలింగ్ ఫ్యాన్లు కాలం గడిచేకొద్దీ వాటిలో బాల్ బేరింగ్స్ లో ధూళి పేరుకుపోతుంది. దీని కారణంగా సీలింగ్ ఫ్యాన్ వేగం తగ్గుతుంది.  దాన్ని మరమ్మత్తు చేయడం ద్వారా ఫ్యాన్ వేగం పెంచవచ్చు. స్క్రూలు.. ఫ్యాన్ లో స్క్రూలు వదులైతే ఫ్యాన్ వేగాన్ని దెబ్బతీస్తాయి. అందుకే ఫ్యాన్ స్క్రూలు సరిగా ఉన్నాయా లేదా చెక్ చేసుకుంటూ ఉండాలి. సరళత. సరళత లేకపోవడం కూడా ఫ్యాన్ వేగాన్ని దెబ్బతీస్తుంది. దీన్ని కూడా రిపేర్ చేయించడం ద్వారా ఫ్యాన్ వేగాన్ని పెంచవచ్చు.                                                *రూపశ్రీ.
ఆఫీసులో పనిచేస్తున్న వారిలో పనిపట్ల శ్రద్ధలేకపోయినా, పని చేయడంలో విసుగు చిరాకు ప్రదర్శిస్తున్నా వారి సమస్య ఒత్తిడికాదు... పని ఒత్తిడి ఎక్కువైందని...! పనితో అలసిపోతున్నామని చెప్పేవారి సమస్య ఏమిటంటే వారికి ఆ పనిపట్ల ఇష్టం లేకపోవడం. అందువల్ల పనిమీద శ్రద్ధ చూపించలేకపోయారు. దాని వలన వారు పని ఒత్తిడి ఎక్కువైందని భావిస్తారు. అయిష్టంతో పనిని చేయడం వలన ఏ వ్యక్తి అయినా, ఆ పనిని రెండుసార్లు చేస్తారు. ఎన్నిసార్లు చేసినా ఆ పనిలో వారు చురుకుదనంగా ఉండరు. ఆ పనిని అంత సమర్థవంతంగా చేయలేరు. ఆ పనిపట్ల అయిష్టతకు కారణం ఆ వ్యక్తి యొక్క వ్యక్తిగత విషయాలు కావచ్చు, లేక వేరే ఇంకేమైనా కావచ్చు. అందువల్ల ఆవ్యక్తి ఆ పని పట్ల ఆసక్తి చూపకపోవచ్చు.  ఎప్పుడైనా మనం ఒక ఫీల్డ్లోకి వెళ్ళినపుడు, మనం మన  వ్యక్తిగత విషయాలను పక్కనపెట్టాలి. ఆ ఫీల్డ్కి మనం ఇష్టంతో అంకితమవ్వాలి. అప్పుడు ఆ ఫీల్డ్కి మనం న్యాయం చేసినవారం అవుతాము. వ్యక్తిగత జీవితంలో ఎవరు హుషారుగా ఆనందంగా గడుపుతారో అటువంటివారే ఎంత ఒత్తిడినైనా తట్టుకుని, ఎంత పనైనా చేయగలుగుతారు. జీవితంలో తృప్తిగలవారికే పనిలోనూ తృప్తి లభిస్తుంది. జీవితాన్ని ఆనందించలేనివారు చిన్నచిన్న పనుల్లో కూడా చాలావరకు తప్పులనే చేస్తూ వుంటారు. "పనులు నువ్వు చేయడంలేదు. జరుగుతున్నాయ" అనే మాటను  గ్రహించి నిరహంకారంగా ఎవరి  కర్తవ్యం వారు నిర్వర్తించాలి. ఈ పని తర్వాత ఇంకేం చెయ్యాలి అని ఆలోచించకూడదు కేవలం చరిస్తూ వెళ్ళాలి. అలా ఆచరిస్తూంటే, ఒకదానివెంట మరొకటి అవే వస్తుంటాయి. మొదలుపెట్టిన పని సక్రమంగా పూర్తయితే ఆ పనిపట్ల నీవు ఇష్టతను చూపించావు అని అర్థం. మొదలుపెట్టినపని అవలేదంటే నీవు ఆ పనిపట్ల అయిష్టతను చూపించావు అని అర్థం. కొంతమంది ఇష్టంతో చేసినా ఆ పని ఆపలేదంటే దానికి కారణం ఆ పనిని వాయిదా వేయడం. ఇలా వాయిదా వేయడం వలన క్రమేపీ ఆ పనిపట్ల శ్రద్ధ తగ్గిపోతుంది. దీని వలన ఆ పనులు పూర్తికావు. అందువలన ఎప్పుడూ పనులను వాయిదా వేయకూడదు. కాబట్టి మనం ఏదైనా పనిని మొదలు పెట్టినపుడు ఆ పనిని ఇష్టంతో వాయిదా వేయకుండా ఆ పనిని త్వరగా పూర్తిచేసుకోవాలి. ఎప్పుడైన ఒక పనిని ఇష్టంతో చేస్తే ఆ పని కష్టమనిపించదు ఆ పనిలో విజయాన్ని పొందుతారు. ఎప్పుడైనా ఒక పనిని కష్టపడి చేస్తే మనకి ఆ పని కష్టంగా వుంటుంది. ఆ పని విజయవంతం కాదు. ఓటమి, విఘ్నం, అనేవి బయటెక్కడో లేవు. నీలోనే వున్నాయి. ఉత్సాహంతో పనులు చేస్తారు కొందరు, ఇంకేదో విషయంపై ఉత్సాహంతోనే పనులు మానేస్తారు మరికొందరు. ఎప్పుడైనా సరే మనం ఏదైనా పనిని తలపెడితే ఆ పని అయ్యేవరకూ ఆ పనిపట్ల ఇష్టాన్ని చూపించాలి. అప్పుడే ఆ పనిలో ఆనందాన్ని పొందగలం. అలా చేస్తే ఇక విజయం మన  సొంతమవుతుంది. ఒక సాకర్ ఆటలో ఆటగాళ్ళను మారుస్తూ, ఒకరు సరిగ్గా ఆడకపోతే వారికి బదులు ఇంకొకరిని అడటానికి పంపవచ్చు. కానీ - జీవితం అలాకాదు. ఒకసారి ఏదైనా తప్పుచేస్తే, దాన్ని వెనక్కి తీసుకుని, దానిస్థానే ఇంకోపని చెయ్యటం కుదరదు. మీ జీవితంలో సంభవించిన విషాద సంఘటనలని వెనక్కి తిప్పి సరిచూసుకోడానికి మీకు రెండో అవకాశం దొరకదు.                                      ◆నిశ్శబ్ద.
నవ్వడం ఒక భోగం, నవ్వించడం ఒక యోగం, నవ్వలేకపోవడం ఒక రోగం అన్నారు ప్రముఖ సినీ దర్శకుడు, రచయిత అయిన జంధ్యాల. ఈయన నవ్వు గురించి చెప్పినప్పుడు ఆ నవ్వు ప్రాముఖ్యత ప్రజలకు అంతగా తెలియలేదు. కానీ ఇప్పుడూ లాఫింగ్ క్లబ్బులు పెట్టుకుని మరీ నవ్వేస్తున్నారు. నవ్వు ఓ గొప్ప ఔషధం అని వైద్యులు కూడా క్లీన్ చిట్ ఇచ్చేస్తున్నారు. ఒక చిన్న నవ్వుతో ఎలాంటి వారిని అయినా గెలవచ్చు, ఎంత కఠిన హృదయం గలవారిని అయినా మార్చేయచ్చు అంటారు. అసలు నవ్వుకు ఇంత గొప్ప శక్తి ఉందంటే చాలా ఆశ్చర్యం వేస్తుంది. నవ్వుకున్న గొప్పదనాన్ని గుర్తుచేసుకుంటూ, నవ్వుతో ప్రపంచాన్ని కాస్తో కూస్తూ మార్చాలనే తపనతో ప్రతి ఏడాది నవ్వుల దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు కూడా. ఒక మనిషి జీవితంలో నవ్వు ఎంత మార్పు తెస్తుందో.. ఎలాంటి మార్పు తెస్తుందో కాసింత వివరంగా తెలుసుకుంటే ఔషధం.. నవ్వును ఔషధం అంటుంటే చాలామందికి కామెడీగా అనిపిస్తుంది కానీ ఇది అక్షరాలా నిజం. సైన్సే కూడా ఇదే నిజమని చెప్పింది. నవ్వినప్పుడు శరీరంలో విడుదల అయ్యే హ్యాపీ హార్మోన్లు మనిషికి ఉన్న ఆందోళన, ఒత్తిడి, నిరాశ వంటి మానసిక రుగ్మతలను సులువుగా తగ్గిస్తుంది. అందుకే నవ్వును ఔషధం అన్నారు. ప్రతి రోజూ ఉదయాన్నే ఎలాంటి సంకోచం లేకుండా కొన్ని సెకెన్ల నుండి నిమిషాల పాటూ  అలా పెదవులు సాగదీసి నవ్వితే ఇక ఆ రోజంతా చాలా హ్యాపీ మూమెంట్లోనే గడిచిపోతుంది. పాజిటివ్.. మనిషి జీవితంలో పాజిటివ్, నెగిటివ్ అంటూ రెండూ ఉన్నాయి. పాజిటివ్ ఆలోచనలు మనిషి జీవితంలో ఉన్నతికి తోడ్పడతాయి. నెగిటివ్ ఆలోచనలు ఉంటే మనిషి పతనానికి కారణం అవుతాయి. పాజిటివ్ వైబ్రేషన్ ను కలిగించడంలో నవ్వుదే కీలక  పాత్ర. ఎవరితోనైనా బాగా గొడవ పడినప్పుడు వారితో విభేదాలు వచ్చినప్పుడు ఇక వారితో మాట్లాడకుండా ఉండిపోతారు. కానీ వారు ఎప్పుడైనా తారసపడినప్పుడు ఒక చిన్న నవ్వు నవ్వి చూడండి. పాత గొడవలు, కలహాలు అన్నీ మర్చిపోయి వారు కూడా తిరిగి నవ్వుతారు. మళ్ళీ బంధం చిగురిస్తుంది. విజయానికి మెట్టు.. నవ్వు విజయానికి తొలిమెట్టు అవుతుంది. నవ్వు వల్ల జీవితంలో ఎంత కష్టాన్ని అయినా సునాయాసంగా అధిగమించగలుగుతారు. ఎక్కడలేని ఓర్పు, సహనం, నవ్వుతో వచ్చేస్తాయి. నవ్వుతూ ఇంకొకరిని ఎంకరేజ్ చేస్తే ఇంకొకరు విజయంలో భాగస్వాములు కూడా అవుతారు. సంబంధాలు.. పైన చెప్పుకున్నట్టు.. మనుషుల మధ్య ఎలాంటి సమస్యలున్నా నవ్వు పరిష్కరిస్తుంది. ఎంత గొడవ వచ్చినా, ఎలాంటి పరిస్థితిలో ఉన్నా నవ్వుతూ సర్థి చెప్పడం వల్ల పెద్దగా మారాల్సిన గొడవలను చిన్నగా ఉండగానే పరిష్కరించుకోవచ్చు. స్నేహితులు, కుటుంబ సభ్యులు, ఇతరులు, ఆఫీసులో కొలీగ్స్.. ఇలా చెప్పుకుంటూ పోతే నవ్వు వల్ల బలంగా ఉండే బంధాలు బోలెడు.                                                   *నిశ్శబ్ద.
వేసవిలో ఆహారం విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి.  ఎందుకంటే ఈ సీజన్‌లో జీర్ణక్రియ చాలా నెమ్మదిగా జరుగుతుంది. ఆహారంలో జీర్ణక్రియను ప్రేరేపించే ఆహారాలు తీసుకోవాలి. దీనివల్ల  జీర్ణక్రియ  ఆరోగ్యంగా ఉంటుంది. అందుకే వేసవి కాలంలో లిక్విడ్ ఫుడ్ కు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. వేసవి కాలంలో  ఎక్కువగా పండ్లు,  కూరగాయల రసాలను తాగుతారు. ఇది  మాత్రమే కాకుండా సత్తును త్రాగితే చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. యూట్యూబ్ పుణ్యమా అని  ఎన్నో రాష్ట్రాలు, దేశాల ఆహారాలు తెగ వైరల్ అవుతుంటాయి. అలాంటి వాటిలో సత్తు కూడా ఒకటి.  ఇది వేసవిలో సూపర్ ఫుడ్ గా పరిగణించబడుతుంది. దీన్ని పాలలో కలుపుకుని తాగితే పొట్ట చల్లగా ఉండడంతో పాటు మరికొన్ని ప్రయోజనాలు ఉన్నాయి. అవేంటో తెలుసుకుంటే.. సత్తులో పోషకాలు..  సత్తులో ప్రొటీన్లు పుష్కలంగా ఉంటాయి. ఇది కాకుండా  ఐరన్, కాల్షియం, మెగ్నీషియం,  పొటాషియం వంటి అనేక పోషకాలు ఉన్నాయి. సత్తును  పాలతో కలిపి త్రాగితే ఇది పోషక లక్షణాలను పెంచుతుంది. వేసవి కాలంలో శరీరం  శక్తి స్థాయి కొద్దిగా నెమ్మదిగా ఉంటుంది. ఇలాంటి  పరిస్థితిలో సత్తును తీసుకుంటే శక్తివంతంగా ఉండవచ్చు. ఇది కాకుండా శరీరంలో రక్త హీనతతో బాధపడుతున్న వ్యక్తులు సత్తును తీసుకుంటే ప్రయోజనం ఉంటుంది. వేసవిలో  జీర్ణవ్యవస్థ కొద్దిగా బలహీనపడుతుంది. ఇలాంటి సమయంలో సత్తును తీసుకోవడం వల్ల గ్యాస్, అజీర్ణం, లూజ్ మోషన్ మొదలైన కడుపు సంబంధిత సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది. ఇక పాలతో సత్తును తీసుకోవడం వల్ల బరువు తగ్గుతారు. బరువు తగ్గడానికి ప్రయత్నం చేసేవారు  దీన్నితమ డైట్ లో భాగంగా తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. సత్తు కేవలం చల్లదనాన్ని, శరీరానికి పోషణను, జీర్ణ ఆరోగ్యాన్ని బాగు చెయ్యడమే కాదు.. ఎముకలకు బలాన్ని కూడా ఇస్తుంది. శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచుతుంది. అయితే.. దీన్ని రెగ్యులర్ గా డైట్ లో భాగం చేసుకునే ముందు  ఆరోగ్య నిపుణులను సంప్రదించడం మంచిది.                                                  *రూపశ్రీ.
కిడ్నీ క్యాన్సర్ తరచుగా వస్తూ ఉంటె దీనిని రినాల్ సెల్ కార్సి నోమా గా పిలుస్తారు.. కిడ్నీ సైజ్ 4 సెం గా ఉంటుంది. ఇందుకోసం హీటింగ్ లేదా ఫ్రీజింగ్ పద్దతిద్వారా ట్యూమర్ కు సాధారణంగా తెరఫీ మాత్రమే ప్రత్యామ్నాయం.తెరఫీ క్యాన్సర్ ను నాశనం చేస్తుంది. దీనిని ఎబ్లేషణ్ గా అందరికీ తెలుసు. దీనివల్ల చాలామంది జీవితాలు కాపాడ వచ్చు.అని నిపుణులు అభిప్రాయ పడ్డారు.క్లినికల్ స్టేజి లోనే టి వి ఏ అవసరం లేకుండా కిడ్నీ సర్జరీ చేయవచ్చు.పెన్సిల్వేనియా లో నిర్వహించిన ప్రాధమిక పరిశోదనలో యురాలజీఅసోసియేషన్  అమెరిక అధికారిక జర్నల్ లో ప్రాధమిక స్థాయిలో ఉన్న రినాల్ కార్సినోమా ను గుర్తించారు.ఆర్ సి సి ద్వారా ౩ నుండి 4 సెమి క్రియో అబ్ లేషన్ క్యాన్సర్ ను నాశనం చేస్తుంది. ఫ్రీజింగ్ పద్ధతి ద్వారా క్యాన్సర్ కణాలు పెరుగుదలను నివారిస్తుంది.కిడ్నీ క్యాన్సర్ సంబందిత మరణాలు తక్కువే అయిన అబ్లేషణ్ ప్రభావం తక్కువే అని హీట్ పద్ధతికన్న  ధర్మల్ ఎబిలేషణ్ పద్ధతి  ఎబిలేషణ్ ఉత్తమమని నిర్ధారించారు.రెండిటిని పోల్చినప్పుడు ౩ సెమి లు తక్కువ ఉన్నప్పుడు చల్లటి పద్దతిలో హీట్ పద్దతిలో తెరఫీ ద్వారా క్యాన్సర్ నివారించ వచ్చు.రచయిత గాబ్రియల్ ఐ ఆర్ సి సి ఎస్ ఎం డి సైంటిఫిక్ ఇన్స్టిట్యుట్ మిలాన్ చేసిన పరిశోదన లో ఎబిలేషణ్ ఎలా వినియోగించాలి.అన్న అంశాల పై రోగులకు చిన్న ఆర్ సి సి ఎస్ పద్ధతి పై మరిన్ని పరిశోదనలు చేయాల్సి ఉంది.హీటింగ్ కన్నా క్రియో ఎబిలేషన్ వల్ల ప్రభావం తక్కువే. కిడ్నీ క్యాన్సర్ ను రినాల్ కార్సినోమా గా ప్పిలుస్తారు.రోగులలో అర సి సి 4 సెమీ కన్నా తక్కువ ఉంటుంది. ఇందులో ఫ్ర్రీజింగ్ పడ్డతి హీటింగ్ విధానాల ద్వారా ట్యూమర్ ను సహజంగా ఇచ్చే థెరపీ లానే ఉంటుంది.ఇది క్యాన్సర్ ను నాశనం చేస్తుంది. దీనిని ఎబ్లేషణ్ అంటారు ఎబ్లేషణ్ కూడా క్యాన్సర్ స్టేజ్ ను బట్టి  ఇవాల్సి ఉంటుంది.కిడ్నీ సర్జర్రీ లేకుండా నే  ఎబ్లేషణ్ పద్దతి అమలు చేయవచ్చు.ఏది ఏమైనా ఎబ్లేషణ్ వల్ల తక్కువ లాభాలే వ్యక్తిగతంగా వివిధ స్తేజిలలో టి ఎల్ క్యు అర్ సి సి ఎస్ ట్యూమర్ లు ౩ నుండి 4 సెమీ కణి తలు ఉంటె యురోపియన్ గైడ్ లైన్స్ ప్రాకారం చికిత్చ ఫ్రీజింగ్ ఫ్రీజింగ్ వినియోగించవచ్చు. అంతార్జాతీయ పరిశోదనా సంస్థ బృందం వివిధ స్తేజిలలో ఉన్న వారిని పరీక్షించి ఆర్ సి సి ని ఫ్రీజింగ్ హీటింగ్ పద్దతిని 2౦౦ 4-2౦18 లో కేసులు సర్వ్ లెన్స్ ఎపిడ మాలజీ ద్వారా ఫలితం నషనల్  క్యాన్సర్ ఇన్స్టిట్యుట్ ఫర్ యునైటెడ్ స్టేట్స్ ట్యూమర్ లు ౩,4 సెమీ ఉంది రెండు మూడు గ్రూపు లతో సరిపోయాయి. ఇందులో 75 7 మందికి క్రియో బిలేషణ్ చికిత్చ చేయాగా ౩ 88 మందికి హీట్ ధర్మల్ ఎబ్లేషణ్ చికిత్చ్చ చేసినట్లు నిపుణులు పేర్కొన్నారు.72 సం వచ్చరాలు పై బడిన 4 22 మందికి హీట్ పద్ధతి ద్వారా 2౩8 మందికి ఫ్రీజింగ్ పద్ధతి ని అందించారు.కిడ్నీ క్యాన్సర్ కాక ఇతర అనారోగ్య సమస్యల వల్ల చనిపోయిన వారే ఎక్కువ.౩ నుండి 4 సెమీ ఉన్న వారికి క్రియోబిలేషణ్ 8.5 % క్రియో బిలేషణ్ ద్వారా 18.9 హీట్ పద్ధతి ద్వారా ఎబిలేషణ్ రెన్దొఇ కొన్ని కేసులలో వినియోగించినట్లు తెలిపారు.కిడ్నీ త్యుమర్లను నివారించేందుకు స్మాల్ ఎబిలేషణ్ చికిత్చ చేయవచ్చు అన్నది పరిశోదన సారాంశం.  
టమోటా భారతీయ వంటల్లో తప్పనిసరిగా.. ఎక్కువగా వాడే కూరగాయ. దీన్ని కూరగాయ అంటుంటాం కానీ టమోటా పండుగానే పిలవబడుతుంది. ఉల్లిపాయ తర్వాత వంటల్లో లేకపోతే అస్సలు బాగోదు అనుకునే కూరగాయ టమోటానే..  అయితే టమోటాను వంటల్లో వాడటం కాకుండా జ్యూస్ చేసుకుని తాగితే చాలా మంచిదని, అది కూడా సమ్మర్ లో అయితే దీనివల్ల బోలెడు ప్రయోజనాలుంటాయని అంటున్నారు ఆహార నిపుణులు.. టమోటా జ్యూస్ తాగడం వల్ల కలిగే ప్రయోజనాలేంటో ఓ లుక్కేస్తే.. సాధారణంగా కూరల్లో మాత్రమే వాడే టమోటా ఇప్పటికే కెచప్ రూపంలో చాలా విరివిగా వినియోగించబడుతోంది. కొందరికి దీని కెచప్ లేకపోతే అస్సలు గడవదంటే అతిశయోక్తి కాదు. కానీ ఇది నిజమే.. టమోటా సూప్, టమోటా కెచప్, టమోటా ఉరగాయ.. ఇలా చెప్పుకుంటూ పోతే టమోటా పాత్ర చాలానే ఉంది. టమోటా జ్యూస్ చేసుకుని తాగితే బోలెడు ఆరోగ్య ప్రయోజనాలుంటాయి. టమోటా  లో విటమిన్-సి అధికంగా ఉంటుంది. శరీరం ఐరన్ గ్రహించడంలో ఇది సహాయపడుతుంది. ఇక ఇందులో ఉండే విటమిన్-కె పునరుత్పత్తి ఆరోగ్యాన్ని బలంగా ఉంచుతుంది. టమోటాలు ఆహారంలో భాగంగా తీసుకున్నా, టమోటా జ్యూస్ తాగుతున్నా పిల్లలు పుట్టడంలో కొన్ని సమస్యలు పరిష్కారం అవుతాయి. టమోటాలలో లైకోపీన్, బీటా కెరోటిన్, గామా కెరోటిన్ మొదలైనవి ఉంటాయి. గుండె సంబంధ సమస్యలను తగ్గించడంలో ఇవి చాలా బాగా  సహాయపడతాయి. వేసవిలో టమోటా జ్యూస్ తాగుతుంటే గుండె ఆరోగ్యం పదిలంగా ఉంటుంది. శరీరానికి అవసరమైన ఎలక్ట్రోలైట్ లలో సోడియం ఒకటి.   ఈ సోడియం కండరాల మరమ్మత్తులకు, సెల్ కమ్యూనికేషన్ కు చాలా అవసరం. టమటాలలో ఈ సోడియం ఉండటం మూలానా టమోటా జ్యూస్ తీసుకుంటే కండరాలు, సెల్ కమ్యూనికేషన్ ఆరోగ్యంగా ఉంటాయి. ఇప్పట్లో చాలామందిని వేధిస్తున్న సమస్య అధిక బరువు. బరువు  తగ్గాలని అనుకునేవారు టమోటా రసాన్ని తీసుకుంటే శరీరంలో కొవ్వు కరిగించి బరువు తగ్గడానికి దోహదం చేస్తుంది. కొందరు పోషకాహారం తీసుకున్నా శరీరంలో తగినంత శక్తి లేక ఇబ్బంది పడుతుంటారు. అయితే తీసుకునే పోషకాలను శరీరం సరిగా గ్రహించలేకపోవడం వల్ల ఈ సమస్య ఏర్పడుతుంది. కానీ  ఖాళీ కడుపుతో టమోటా జ్యూస్ తీసుకోవడం వల్ల శరీరానికి అవసరమైన పోషకాల శోషణ పెరుగుతుంది. టమోటా జ్యూస్ కేవలం ఆరోగ్య ప్రయోజనాలనే కాదు.. శరీరాన్ని డిటాక్స్ చేసే మంచి డిటాక్స్ డ్రింక్ గా కూడా పనిచేస్తుంది. శరీరంలో విషాలు తొలగించడంలో సహాయపడుతుంది. రోజూ టమోటా జ్యూస్ తీసుకుంటే శరీరం శుద్ది అవుతుంది.  టమోటాలలో జీర్ణ ఎంజైమ్ లు, ఫైబర్ పుష్కలంగా ఉండటం వల్ల  జీర్ణవ్యవస్థకు మంచి టానిక్ లాగా పనిచేస్తుంది. కడుపుకు సంబంధించిన సమస్యలు,  జీర్ణ ఇబ్బందులు ఉన్నవారు టమోటా జ్యూస్ తీసుకుంటే చక్కని ఉపశమనం ఉంటుంది.                                                                *రూపశ్రీ.