LATEST NEWS
  తెలంగాణలో అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు ఇకపై టీ-ఫైబర్‌ ద్వారానే ఇంటర్నెట్‌ సేవలు అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. సెప్టెంబర్‌ 1 నుంచి ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రైవేట్‌ ఆపరేటర్ల ఇంటర్నెట్‌ సేవలను వినియోగించకుండా, పూర్తిగా టీ-ఫైబర్‌ నెట్‌వర్క్‌ ద్వారా ఇంటర్నెట్‌ అందేలా చర్యలు చేపట్టాలని ఐటీ శాఖ మంత్రి శ్రీధర్‌బాబు అధికారులను ఆదేశించారు. సచివాలయంలో టీ-ఫైబర్‌ సేవలపై మంత్రి శ్రీధర్‌బాబు కీలక సమీక్ష నిర్వహించారు. సీఎస్‌ సంజయ్‌ జాజు, ఐటీ శాఖ సంయుక్త కార్యదర్శి అనుదీప్‌ దురిశెట్టి, టీ-ఫైబర్‌ ఎండీ వేణు ప్రసాద్‌ తదితరులు సమావేశంలో పాల్గొన్నారు.  రాష్ట్రంలోని ప్రభుత్వ కార్యాలయాలన్నింటినీ టీ-ఫైబర్‌ నెట్‌వర్క్‌తో అనుసంధానించే ప్రక్రియను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని మంత్రి ఆదేశించారు. సెప్టెంబర్‌ 1 తర్వాత ప్రభుత్వ కార్యాలయాల్లో ఇంటర్నెట్‌ సేవల కోసం ప్రైవేట్‌ ఆపరేటర్లకు ఎలాంటి బిల్లులు చెల్లించవద్దని అధికారులను శ్రీధర్‌బాబు స్పష్టం చేశారు. అన్ని కార్యాలయాలకు అంతరాయం లేకుండా టీ-ఫైబర్‌ కనెక్టివిటీ అందేలా ముందస్తు ఏర్పాట్లు చేయాలని సూచించారు. ప్రస్తుతం ప్రభుత్వ కార్యాలయాలకు సేవలందిస్తున్న ‘టీ-స్వాన్‌’ (T-SWAN) నెట్‌వర్క్‌ను నెల రోజుల్లోగా టీ-ఫైబర్‌కు బదిలీ చేసేలా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ విభాగాల డిజిటల్‌ సేవలకు ఎలాంటి అంతరాయం కలగకుండా ఈ మార్పిడి ప్రక్రియను పకడ్బందీగా పూర్తి చేయాలని సూచించారు. ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఫ్యూచర్‌ సిటీ ప్రాజెక్టుకు కూడా పూర్తిస్థాయిలో టీ-ఫైబర్‌ ఇంటర్నెట్‌ సేవలు అందేలా అవసరమైన మౌలిక వసతులను సిద్ధం చేయాలని మంత్రి ఆదేశించారు. ఫ్యూచర్‌ సిటీ అభివృద్ధికి అనుగుణంగా అత్యుత్తమ డిజిటల్‌ కనెక్టివిటీ అందుబాటులో ఉండేలా ప్రణాళిక రూపొందించాలని సూచించారు. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘ఇంటింటికి ఇంటర్నెట్‌’ కార్యక్రమాన్ని మరింత వేగవంతం చేయాలని శ్రీధర్‌బాబు అధికారులను ఆదేశించారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రతి ఇంటికీ నాణ్యమైన, అందుబాటులో ఉండే ఇంటర్నెట్‌ సేవలను చేరువ చేయడమే లక్ష్యంగా పనులను వేగంగా పూర్తి చేయాలని సూచించారు. Minister Sridhar Babu key review on T-Fiber, T-SWAN, Minister Sridhar , T-Fiber Connectivity, CS Sanjay 
బీహార్, మధ్య ప్రదేశ్ రాష్ట్రాలలో రెండు నియోజకవర్గాలకు జరిగిన ఉప ఎన్నికల ఫలతాలు బీజేపీకి పీడ కలనే మిగిల్చాయి.  బీజేపీకి కంచుకోటలు, అత్యంత సురక్షిత స్థానాలుగా గుర్తింపు పొందిన రెండు స్థానాలలోనూ కూడా ఉప ఎన్నికలో బీజేపీ పరాజయాన్ని మూటగట్టుకుంది.  ఈ ఫలితాలు మోదీ బ్రాండ్ ను మసకబార్చాయి.  మోడీ ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకతకు నిదర్శనంగా నిలిచాయి.  ఈ ఫలితాలు కేవలం  ఉప ఎన్నికలో తగిలిన ఎదురుదెబ్బగా కంటే బీజేపీపై ప్రజా వ్యతిరేకత పెచ్చరిల్లుతుందన్న భావననే ఎక్కువగా ఆవిష్కరించాయి.    బీహార్‌లోని బంకిపూర్  అసెంబ్లీ నియోజకవర్గం నుంచి జన సురాజ్ పార్టీ అధినేత ప్రశాంత్ కిషోర్ దాదాపు 20 వేల ఓట్ల ఆధిక్యతతో విజయం సాధించారు. ప్రశాంత్ కిషోర్‌కు 64,151 ఓట్లు రాగా, సిన్హా 44,827 ఓట్లు సాధించారు. ఇక మధ్యప్రదేశ్‌లోని దతియా అసెంబ్లీ నియోజకవర్గం నుంచి  కాంగ్రెస్ అభ్యర్థి ఘనశ్యామ్ సింగ్, బీజేపీ అభ్యర్థి అశుతోష్ తివారీపై  ఆరు వేల ఓట్లకు పైగా మెజారిటీతో విజయం సాధించారు. తివారీకి 60,741 ఓట్లు రాగా, సింగ్‌కు 66,757 ఓట్లు వచ్చాయి. ఈ రెండు ఫలితాలూ కూడా బీజేపీ ప్రజాదరణ కోల్పోతోందన్న సంకేతాలను బలంగా ఇచ్చాయి.   ముందుగా బంకీపూర్ విషయాన్ని తీసుకుంటే.. ఈ నియోజకవర్గం.. కమలం పార్టీ జాతీయ అధ్యక్షుడు  నితిన్ నబిన్సొంత నియోజకవర్గం.అంతే కాదు  బీజేపీకి అత్యంత సురక్షితమైన సీట్లలో ఒకటి. 1995 నుంచి బీజేపీ ఈ సీటు గెలుచుకుంటూనే వస్తోంది. అటువంటి స్థానంలో బీజేపీ ఓటమి.. మోడీ పాలనపై ప్రజావ్యతిరేకతకు బలమైన సందేశంగా నిస్సందేహంగా చెప్పవచ్చంటున్నారు పరిశీలకులు.  ఇలా ఎందుకు చెప్పొచ్చంటూ.. బంకీపూర్ లో కానీ, దతియా నియోజకవర్గంలో కానీ జరిగినది ఉప ఎన్నిక. సాధారణంగా ఉప ఎన్నికలో అధికారంలో ఉన్న రాష్ట్ర ప్రభుత్వాల పార్టీలు సునాయాసంగా గెలిచేస్తాయి. బీహార్, మధ్య ప్రదేశ్ లో  బీజేపీయే అధికారంలో ఉంది.      హస్తినలో జరిగిన కాక్రోచ్ జనతా పార్టీ ఆందోళన, పోరాటం వల్ల మోడీ ప్రతిష్టకు కలిగిన నష్టం ప్రభావం కూడా బంకీపూర్, దతియా ఉప ఎన్నికలలో బీజేపీ ఓటమికి కారణమైందని చెప్పొచ్చు. జంతర్ మంతర్ వద్ద కాక్రోచ్ ల ఆందోళన, నిరసనల సమయంలో  ప్రధాని మోదీపై బహిరంగ విమర్శలు బ్రాండ్ ను మసకబార్చాయి.   అలాగే.. బంకిపూర్,  దతియా  ఫలితాలు నిరుద్యోగం, విద్య, విద్యార్థులపై పోలీసుల చర్యలపై ప్రజలో వెల్లువెత్తిన ఆగ్రహజ్వాలలకు దర్పణంగా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  Bankipur and Datia defeats nightmare to BJP, Modi, Pride, Diminish
కాక్రోచ్ జనతా పార్టీ  వ్యవస్థాపకుడు అభిజీత్ దిప్కే నీట్ పరీక్షాపత్రాల లీకేజీ, విద్యావ్యవస్థలోని అక్రమాలపై దేశవ్యాప్త ఉద్యమానికి నాయకత్వం వహించి, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకు కారణమైన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ యువ నాయకుడి విదేశీ విద్యానిధులపై  బీజేపీ, దాని మద్దతు దారులు ప్రశ్నలు కురిపిస్తూ, విమర్శలు గుప్పిస్తున్నారు.  అమెరికాలోని బోస్టన్ విశ్వవిద్యాలయంలో అభిజీత్ విద్య  ఎలా అభ్యసించాడనే అంశంపై విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ సూరత్‌కు చెందిన ఆర్‌టీఐ కార్యకర్త అమిత్ తివారీ కేంద్ర ఎన్నికల సంఘం, పన్నుల శాఖతో పాటు మహారాష్ట్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు. అలాగే..  సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ సమకూర్చిన  1 కోటి రూపాయ నిధులపై అనుమానాలు వ్యక్తం చేశారు.  సామాజిక మాధ్యమాల వేదికగా అభిజీత్ దిప్కేను  పాకిస్తానీ ఏజెంట్ అని ఆరోపిస్తూ పోలీసులు కేసు నమోదు చేయాలనే డిమాండ్లు కూడా వెలువడ్డాయి. కాగా తనపై వస్తున్న   ఆరోపణలు, విచారణ డిమాండ్లపై అభిజీత్ దిప్కే స్పందించారు. ఈ విషయంలో ఆయన  నేరుగా ప్రధాని నరేంద్ర మోదీకి సవాల్ విసిరారు. సామాజిక మాధ్యమ వేదిక ఎక్స్ లో షేర్ చేసిన వీడియో ద్వారా అభిజీత్ దీప్కే.. ఒక సాధారణ మధ్యతరగతి కుటుంబానికి చెందిన యువకుడు బోస్టన్ లాంటి ప్రతిష్టాత్మక విశ్వవిద్యాలయంలో చదువుకుంటే ఈ ప్రభుత్వానికి అంత కడుపుమంట ఎందుకని నిలదీశారు. తన విద్యార్హతలూ, ఆర్థిక లావాదేవీలలో ఎటువంటి దాపరికంలేనన్న అభిజీత్ దిప్కే.. తాను పొందిన   స్కాలర్‌షిప్ పత్రాలు, విద్యారుణం మంజూరు లేఖలను బహిరంగంగా ప్రజల ముందు ఉంచడానికి సిద్ధంగా ఉన్నానన్నారు. అదే సమయంలో   ప్రధాని నరేంద్ర మోదీ తన   డిగ్రీ సర్టిఫికేట్‌ను దేశ ప్రజలకు చూపిస్తారా? అంటూ సవాల్ చేశారు.  ఈ వివాదంలో అభిజీత్ దిప్కే తన విద్యాభ్యాసం,  దానికి అయిన ఖర్చులకు సంబంధించిన  గణాంకాలను  వెల్లడించారు. బోస్టన్ యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ కమ్యూనికేషన్ నుండి మాస్టర్ ఆఫ్ సైన్స్ ఇన్ పబ్లిక్ రిలేషన్స్  పూర్తి చేసిన ఆయన, జూన్ నెలలో భారత్‌కు తిరిగి వచ్చారు. తన చదువు కోసం బోస్టన్ విశ్వవిద్యాలయం ప్రతీ సెమిస్టర్‌కు 12,వేల 500 డాలర్ల చొప్పున మొత్తం 3 సెమిస్టర్లకు  37 వేల500 డాలర్లు అంటే భారత కరెన్సీలో   రూ. 31 లక్షలకు పైగా)  డీన్స్ స్కాలర్‌షిప్ మంజూరు చేసిందని దీప్కే వివరించారు.  ఇక మిగిలిన విద్యా వ్యయం కోసం బ్యాంకు నుండి ఎడ్యుకేషన్ లోన్ తీసుకున్నానని, ఆ అప్పును తాను ఇప్పటికీ వాయిదాల పద్ధతిలో తీరుస్తున్నానని వెల్లడించారు.తప  అర్హత,  ప్రతిభ ఆధారంగానే ఈ స్కాలర్‌షిప్ లభించిందన్న ఆయన  ఈ విషయంలో కావాలంటే దర్యాప్తు చేసుకోవచ్చన్నారు.   ఈ ప్రభుత్వ విధానాలను ప్రశ్నించే వారిపై వెంటనే ఈడీ (ఈడీ), సీబీఐవంటి దర్యాప్తు సంస్థలను ప్రయోగించడం పరిపాటిగా మారిందన్న అభిజీత్ దిప్కే..    ప్రధాని నరేంద్ర మోదీ తన ఇంటికి  ఈడీని పంపినా తనకు అభ్యంతరం లేదనీ, దర్యాప్తు కోసం వచ్చే అధికారుల చేతికి మోడీ..  తన డిగ్రీ సర్టిఫికేట్ కాపీని   ఇచ్చి పంపాన్నారు. అప్పుడే నేను నా లోన్ పేపర్లు, స్కాలర్‌షిప్ లెటర్లు, డిగ్రీ కాపీలను అధికారులకు అందిస్తానని చెప్పారు.    Abhijeet Dipke, Narendra Modi Degree, Cockroach Janta Party, Boston University Scholarship, CJP Youth Movement, Education Loan Row
తమిళనాడు మాజీ ఉప ముఖ్యమంత్రి, అసెంబ్లీలో ప్రతిపక్ష నేత ఉదయ నిథి స్టాలిన్ ను పోలీసులు అరెస్టు చేశారు.  ముఖ్యమంత్రి విజయ్, ప్రముఖ నటి త్రిషను ఉద్దేశించి ఉదయనిధి స్టాలిన్ సోమవారం (ఆగస్టు 3) చేసిన అనుచిత వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఈ వివాదాస్పద వ్యాఖ్యలు వెలువడిన కేవలం 24 గంటల వ్యవధిలోనే చెన్నై పోలీసులు  ఉదయనిథి స్టాలిన్ ను అదుపులోనికి తీసుకున్నారు.  అనుచిత వ్యాఖ్యలకు సంబంధించి  ఉదయనిధి స్టాలిన్‌పై   ఎఫ్‌ఐఆర్ నమోదు చేసిన పోలీసులు, మంగళవారం (ఆగస్టు 4)ఉదయం ఉదయనిథి స్టాలిన్ ను ఆయన నివాసంలోనే అరెస్టు చేసి తీసుకెళ్లారు.  నివాసం నుంచి ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. అసలు వివాదం ఏమిటంటే.. సోమవారం (ఆగస్టు 3) తంజావూరులో కావేరి  జలాల హక్కుల పరిరక్షణ కోసం ఏర్పాటు చేసిన   బహిరంగ  సభలో ఉదయనిథి స్టాలిన్     ముఖ్యమంత్రి  విజయ్ పాలనపై, ఆయన రాజకీయ విధానాలపై విమర్శలు చేశారు. ఆయన ప్రసంగిస్తున్న సమయంలో కొందరు డీఎంకే  కార్యకర్తలు..   విజయ్ వ్యక్తిగత విషయాలు, సినిమాలను ప్రస్తావిస్తూ..  త్రిష అంటూ నినాదాలు చేశారు. వాటికి స్పందనగా.. ఉదయ నిథి స్టాలిన్  నీళ్లు ఎక్కడికి చేరినా చేరకపోయినా.. అక్కడికి మాత్రం తప్పకుండా చేరాలంటూ వ్యాఖ్యానించారు.  ఆ వెంటనే తాను మాట్లాడింది కావేరీ జలాల గురించేనని సర్ది చెప్పుకోవడానికి ప్రయత్నించినా.. ఉదయనిథి స్టాలిన్ వ్యాఖ్యలు నటి త్రిషను ఉద్దేశించి చేసినవేనంటూ విమర్శలు వెల్లువెత్తాయి.  సోషల్ మీడియా వేదికగా ఉదయనిథి స్టాలిన్   వ్యాఖ్యల వీడి యోలు  తెగ వైరల్ అవ్వడంతో వివాదం మరింత ముదిరింది.  ఎటువంటి ఆధారాలు లేకుండా, కేవలం రాజకీయ లబ్ధి కోసమే ఇటువంటి అసత్య, అవమానకర, ద్వంద్వార్థ వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ పోలీసులు కేసు నమోదు చేశారు. సామాజిక మాధ్యమాల్లో సైతం ఈ వ్యాఖ్యలపై పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తమయ్యాయి. ముఖ్యంగా సినిమా, రాజకీయ రంగాల నుంచి ఉదయనిధి శైలిపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. దాంతో తమిళనాడు హోంశాఖ,  చెన్నై పోలీసులు చట్టపరమైన చర్యలకు ఏమాత్రం ఆలస్యం చేయకుండా శ్రీకారం చుట్టారు.  కాగా ఉదయనిథి స్టాలిన్ అరెస్టును డీఎంకే తీవ్రంగా ఖండించింది.   డీఎంకే లీగల్ సెల్  మద్రాస్ హైకోర్టును ఆశ్రయించింది. డీఎంకే తరఫు న్యాయవాదులు మద్రాస్ హైకోర్టులో బెయిలు పిటిషన్ దాఖలు చేశారు. అదలా ఉంటే..  డీఎంకే నేతలు ఉదయనిథి స్టాలిన్ అరెస్టును రాజకీయ కక్షసాధింపుగా అభివర్ణిస్తుంటే..   ప్రభుత్వం  చట్టం తన పని తాను చేసుకుపోతుందని, ఎవరూ  చట్టానికి అతీతులు కారని అంటోంది.  రాజకీయ పరిశీలకులైతే.. ప్రజా క్షేత్రంలో ఉండే నాయకులు బాధ్యతా యుతంగా మాట్లాడాలనీ, అనుచిత వ్యాఖ్యలు చేస్తే పరిణామాలు ఇలానే ఉంటాయనీ అంటున్నారు.   Udayanithi Stalin arrested, Tamilnadu, Former, Deputy CM, Untoward, Comments, Actress, Trisha
తమిళనాట రాజకీయ విమర్శలకు త్రిష మరో సారి కేంద్ర బిందువుగా మారారు. త్రిషపై డీఎంకే నాయకుడు, అసెంబ్లీలో ప్రతిపక్ష నేత ఉదయనిధి స్టాలిన్ అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ అధికార టీవీకే, బీజేపీ, ఇతర రాజకీయ పార్టీలూ పెద్ద ఎత్తున విమర్శలు గుప్పిస్తున్నాయి.  తంజావూరులో కావేరి  జలాల హక్కుల పరిరక్షణ కోసం ఏర్పాటు చేసిన   బహిరంగ  సభలో ఉదయనిథి స్టాలిన్     ముఖ్యమంత్రి  విజయ్ పాలనపై, ఆయన రాజకీయ విధానాలపై విమర్శలు చేశారు. ఆయన ప్రసంగిస్తున్న సమయంలో కొందరు డీఎంకే  కార్యకర్తలు..   విజయ్ వ్యక్తిగత విషయాలు, సినిమాలను ప్రస్తావిస్తూ..  త్రిష అంటూ నినాదాలు చేశారు. వాటికి స్పందనగా.. ఉదయ నిథి స్టాలిన్  నీళ్లు ఎక్కడికి చేరినా చేరకపోయినా.. అక్కడికి మాత్రం తప్పకుండా చేరాలంటూ వ్యాఖ్యానించారు.  ఆ వెంటనే తాను మాట్లాడింది కావేరీ జలాల గురించేనని చెప్పినా,  ఉదయనిథి స్టాలిన్ వ్యాఖ్యలు నటి త్రిషను ఉద్దేశించి చేసినవేనంటూ విమర్శలు వెల్లువెత్తాయి.    సోషల్ మీడియా వేదికగా ఉదయనిథి స్టాలిన్   వ్యాఖ్యల వీడియోలు  వైరల్ అవ్వడంతో వివాదం మరింత ముదిరింది.  ఉదయనిధి స్టాలిన్  ద్వంద్వార్థ వ్యాఖ్యలపై   టీవీకే, బీజేపీ  తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. టీవీకే ఎమ్మెల్యే రేవంత్ చరణ్..   ఉదయనిధి చేసిన వ్యాఖ్యలు జుగుప్సాకరంగా ఉన్నాయన్నారు.   ప్రజాజీవితం ఉన్న  నాయకుడు మహిళల పట్ల ఇలాంటి చౌకబారు భాషను ఉపయోగించడం డీఎంకే  దిగజారుతున్న రాజకీయ సంస్కృతికి అద్దం పడుతోందని విమర్శించారు.  అలాగే..  బీజేపీ   కూడా ఉదయనిథి స్టాలిన్  వ్యాఖ్యలను  ఖండించింది. మహిళలను కించపరిచేలా మాట్లాడిన ఉదయనిధి స్టాలిన్‌ను తక్షణమే అరెస్ట్ చేయాలని   డిమాండ్ చేసింది. ఈ వివాదాన్ని టీవీకే అధిష్టానం  తీవ్రంగా పరిగణించింది. కేవలం రాజకీయ విమర్శలతో సరిపెట్టకుండా చట్టపరమైన చర్యలకు ఉపక్రమించింది.  ఉదయనిధి స్టాలిన్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ ఢిల్లీలోని జాతీయ మహిళా కమిషన్ కు అఫీషియల్ గా లేఖ రాసింది. సొసైటీలో ఎంతో గుర్తింపు పొందిన ఒక ప్రముఖ నటిని, మహిళను బహిరంగ వేదికపై అగౌరవపరిచినందుకు గాను ఆయనపై వెంటనే క్రిమినల్ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేసింది.  సమాజానికి, బాధితురాలికి ఆయన బేషరతుగా బహిరంగ క్షమాపణలు చెప్పాలని, ఆయనపై చట్ట ప్రకారం తగిన చర్యలు తీసుకోవాలని జాతీయ మహిళా కమిషన్‌ను కోరింది.   Udhayanidhi Stalin, Actress Trisha, DMK TVK controversy, Cauvery water protest, Tamil Nadu news, NCW complaint
ALSO ON TELUGUONE N E W S
తిరువీర్, ఐశ్వర్య రాజేష్ జంటగా నటించిన లేటెస్ట్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్ చిత్రం 'ఓ సుకుమారి' డిజిటల్ ప్రిమియర్‌కు రంగం సిద్ధమైంది. భరత్ దర్శన్ దర్శకత్వంలో గంగా ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై తెరకెక్కిన ఈ హ్యూమరస్ ఫ్యామిలీ డ్రామా.. జులై 17న థియేటర్లలోకి వచ్చి డిఫరెంట్ కాన్సెప్ట్‌తో ప్రేక్షకుల దృష్టిని ఆకట్టుకుంది. ఇప్పుడు ఓటీటీ ప్రియులను నవ్వించేందుకు సిద్ధమైంది.  ప్రముఖ ఓటీటీ ప్లాట్​ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video) ఈ సినిమా డిజిటల్ రైట్స్‌ను సొంతం చేసుకుంది. ఆగస్ట్ 7 నుంచి ఈ చిత్రం ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానున్నట్లు తాజాగా ప్రకటించారు. కేవలం తెలుగులోనే కాకుండా తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో కూడా అందుబాటులోకి రానుంది.  ఈ కథ విషయానికి వస్తే, ఊరి సర్పంచ్ కావాలని కలలు కనే యాదగిరి (తిరువీర్) చుట్టూ తిరుగుతుంది. అతనికి ఒక తమ్ముడు ఉంటాడు. యాదగిరి తాత తన ఆస్తి దక్కాలంటే ఒక వింత కండీషన్‌తో వీలునామా రాస్తాడు. అన్నదమ్ములు ఇద్దరిలో ఎవరికి ముందుగా మగబిడ్డ పుడితే వారిదే ఆస్తి అని రాస్తాడు. ఈ క్రమంలోనే పక్క ఊరి అమ్మాయి దామిని(ఐశ్వర్య రాజేష్)ని చూసి తొలిచూపులోనే ప్రేమలో పడతాడు యాదగిరి. అయితే ఆమెను ముట్టుకుంటేనే షాక్ కొడుతుంది. ఆ విషయం తెలియక యాదగిరి పెళ్లి చేసుకుంటాడు. అసలు దామినిని ముట్టుకుంటే షాక్ ఎందుకు కొడుతుంది? అలా షాక్ కొట్టే అమ్మాయితో యాదగిరి కాపురం ఎలా చేశాడు? తాత ఆస్తి ఎవరికి దక్కింది? వంటి విషయాలు సినిమా చూసి తెలుసుకోవాలి.   Oh Sukumari, OTT Release, Thiruveer, Aishwarya Rajesh  
    సినీ కళామతల్లి ఒడి నుంచి పాలిటిక్స్ లో సంచలనం సృష్టిస్తున్నాడు  ఉదయనిధి స్టాలిన్ ప్రస్తుతం డిఎంకె ఎంఎల్ఏ గా సేవలందిస్తున్న ఉదయనిధి తెలుగు ప్రేక్షకులకి కూడా సుపరిచయస్తుడే. ఇప్పుడు తమిళనాడు రాజకీయాల్లో అత్యంత ప్రభావవంతమైన వ్యక్తుల్లో ఒకడిగా ఉన్నాడు. డిఎంకె అగ్రనేత ఎం.కె. స్టాలిన్ కుమారుడైన ఉదయ్‌నిధి స్టాలిన్, రీసెంట్ గా సహ నటి 'త్రిష'పై మాట్లాడిన మాటలు,రాజకీయ పరిణామాలు మరియు అరెస్ట్ వివాదాల నేపథ్యంలో వార్తల్లో నిలిచాడు . ఈ పొలిటికల్ హీట్ మధ్యలోనే వ్యక్తిగత జీవితానికి సంబంధించిన అరుదైన విషయాలు, భార్య కృతిక, పిల్లలతో కలసి ఉన్న  కుటుంబ చిత్రాలు సోషల్ మీడియా వేదికగా  వైరల్ అవుతున్నాయి.  కేవలం రాజకీయ నాయకుడిగానే కాకుండా ఒక బాధ్యతాయుతమైన భర్తగా, స్నేహపూర్వక తండ్రిగా ఉదయనిధిని ప్రతిబింబించే ఈ ఫొటోలు నెటిజన్లని  ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి.  1977 నవంబర్ 27న జన్మించిన ఉదయ్‌నిధి స్టాలిన్, చెన్నైలోని ప్రతిష్టాత్మక లోయోలా కాలేజీ నుండి బిజినెస్ కామర్స్ పట్టా పొందారు. 2002 సంవత్సరంలో కృతికా రామసామిని వివాహమాడారు. దాదాపు 24 ఏళ్లకు పైగా అన్యోన్యంగా సాగుతున్న వీరి దాంపత్య బంధం ఎంతోమందికి ఆదర్శంగా నిలుస్తోంది. కృతికా కేవలం ఉదయ్‌నిధి భార్యగానే కాకుండా, తమిళ చలనచిత్ర రంగాన తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నారు. 2013లో 'వణక్కమ్ చెన్నై' చిత్రంతో దర్శకురాలిగా తెరంగేట్రం చేసిన కృతిక, ఆ తర్వాత 2018లో 'కాళీ', 2022లో 'పేపర్ రాకెట్' వెబ్ సిరీస్, అలాగే 2025లో 'కాదలిక్క నేరమిల్లై' వంటి పలు ప్రాజెక్ట్‌లను తెరకెక్కించి విజయవంతమైన మహిళా దర్శకురాలిగా నిలిచారు.   ఉదయ్‌నిధి, కృతిక దంపతులకు ఇద్దరు సంతానం ఉన్నారు. 2004లో జన్మించిన కుమారుడు ఇన్‌బనిధి స్టాలిన్, 2006లో జన్మించిన కుమార్తె తన్మయ స్టాలిన్. కుమారుడు ఇన్‌బనిధికి క్రీడల పట్ల అపారమైన ఆసక్తి ఉంది. ఆయన ప్రసిద్ధ ఐ-లీగ్ ఫుట్‌బాల్ క్లబ్ అయిన 'నెరోకా ఎఫ్‌సి' (NEROCA FC) తరఫున ప్రొఫెషనల్ ఫుట్‌బాల్ క్రీడాకారుడిగా ఒప్పందం కుదుర్చుకుని మ్యాచ్‌లు ఆడుతున్నారు. మరోవైపు కుమార్తె తన్మయ తన ఉన్నత చదువులపై దృష్టి సారించారు. రెడ్ జైంట్ మూవీస్ (Red Giant Movies) పతాకంపై 2008 నుండి అనేక ప్రతిష్టాత్మక చిత్రాలను నిర్మించి, పంపిణీ చేసిన ఉదయ్‌నిధి, 2019లో ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగుపెట్టి డిఎంకె  యూత్ వింగ్ సెక్రటరీగా బాధ్యతలు చేపట్టి, ఆ తర్వాత ఎమ్మెల్యేగా, మంత్రిగా, తమిళనాడు ఉప ముఖ్యమంత్రిగా  బాధ్యతలు నిర్వహించారు.  రాజకీయాల్లో ఎంత బిజీగా ఉన్నప్పటికీ, ఉదయ్‌నిధి తన కుటుంబంతో గడిపే సమయానికి ప్రాధాన్యత ఇస్తారు. udhayanidhi stalin, Trisha  
దక్షిణ భారత సినీ రంగంతో పాటు తమిళ రాజకీయాల్లోనూ ఒక తీవ్ర వివాదం పెను తుపానులా చెలరేగింది. నటి త్రిషను ఉద్దేశించి డీఎంకే నేత, తమిళనాడు శాసనసభ ప్రతిపక్ష నాయకుడు ఉదయనిధి స్టాలిన్ చేసిన వివాదాస్పద, అసభ్యకర వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపాయి. తంజావూరులో కావేరీ నదీ జలాల సమస్యపై నిర్వహించిన నిరసన ప్రదర్శనలో ప్రసంగిస్తున్న సమయంలో, సభలోని కొందరు మద్దతుదారులు "త్రిష, త్రిష" అంటూ నినాదాలు చేశారు. ఆ సమయంలో ఉదయనిధి స్టాలిన్ చిరునవ్వు చిందిస్తూ, త్రిష పేరును ప్రస్తావిస్తూ ద్వంద్వార్థాలు వచ్చేలా తీవ్ర ఆక్షేపణీయ వ్యాఖ్యలు చేశారు. రాజకీయం కోసం ఒక మహిళా నటి గౌరవాన్ని, వ్యక్తిత్వాన్ని దిగజార్చేలా ఆయన మాట్లాడిన మాటలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో తీవ్ర ఆగ్రహజ్వాలలు వ్యక్తమయ్యాయి. ఈ ఘటనపై తమిళనాడు పోలీసులు వెంటనే స్పందించి ఉదయనిధి స్టాలిన్ పై కేసులు నమోదు చేసి, ఆయనను చెన్నైలోని నివాసం వద్ద అదుపులోకి తీసుకున్నారు. ఈ అరెస్ట్ పరిణామాల నేపథ్యంలో ఆయన ముందస్తు బెయిల్ కోసం మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు. అయితే ఈ వివాదంపై సీనియర్ నటి, భారతీయ జనతా పార్టీ నాయకురాలు ఖుష్బూ సుందర్ అత్యంత ఘాటుగా స్పందించారు. సామాజిక మాధ్యమం వేదికగా ఉదయనిధి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ సుదీర్ఘమైన పోస్ట్ పెట్టారు. ఉదయనిధి స్టాలిన్ చేసిన ప్రసంగం అత్యంత నీచంగా, అసభ్యంగా, మహిళలను కించపరిచేలా ఉందంటూ నిప్పులు చెరిగారు. ఆయన ప్రసంగించిన తీరు, ఆయన వారసత్వంగా పొందాలని ఆరాటపడుతున్న రాజకీయ సంస్కృతినే ప్రతిబింబిస్తోందని తీవ్రంగా దుయ్యబట్టారు. ఒక ప్రముఖ రాజకీయ పార్టీకి నాయకత్వం వహిస్తూ, భవిష్యత్తులో రాష్ట్రాన్ని పాలించాలని ఆశపడే వ్యక్తులకు ఇలాంటి దిగజారిన మనస్తత్వం ఉంటే ఆ దేవుడే ప్రజలను కాపాడాలని ఖుష్బూ తన ఆవేదనను, ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. మహిళలను దూషించడం, అవమానించడం, కించపరచడాన్ని రాజకీయ వినోదంగా మార్చుకుని, మద్దతుదారుల నుంచి వచ్చే చప్పట్లు, ఈలలు, నవ్వులను చూసి ఆనందించే వారి నుంచి ఇంతకంటే మంచి ప్రవర్తనను ఆశించలేమని తీవ్ర స్థాయిలో విమర్శించారు. రాజకీయంలో ప్రత్యర్థుల పనితీరు, దూరదృష్టి, నాయకత్వ పటిమతో పోటీ పడలేనప్పుడు వ్యక్తిగత దూషణలు, నీచమైన వ్యాఖ్యలు చేయడం చవకబారు మార్గంగా మారిందని ఆమె ఎద్దేవా చేశారు. సభల్లో మాట్లాడేటప్పుడు ఎంతటి రాజకీయ విభేదాలు ఉన్నప్పటికీ ప్రజా ప్రతినిధులు ఒక హద్దు పరిమితి పాటించాలని, మహిళల గౌరవాన్ని రాజకీయ స్వార్థం కోసం బలిచేయకూడదని ఖుష్బూ హితవు పలికారు. ఇటువంటి అసభ్యకర భాషను ప్రోత్సహిస్తే, భవిష్యత్తులో రాజకీయాల కోసం ఏ కుటుంబంలోని మహిళల గౌరవమైనా బలికాక తప్పదని, సొంత కుటుంబాలు కూడా ఇలాంటి అవమానాల నుంచి తప్పించుకోలేవని హెచ్చరించారు. ఒక బహిరంగ వేదికపై నటి త్రిషను అంతలా అవమానించినందుకు ఉదయనిధి స్టాలిన్ తక్షణమే ఆమెకు బేషరతుగా బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. తప్పును ఒప్పుకునే ధైర్యం, సంస్కారం, హుందాతనం ఆయనకు ఉన్నాయో లేదో వేచి చూద్దామని సవాల్ విసిరారు. ఈ అంశంపై కేవలం ఖుష్బూ మాత్రమే కాకుండా తమిళగ వెట్రి కళగం (టీవీకే) పార్టీ నాయకులు, బీజేపీ నేతలు వానతి శ్రీనివాసన్, అన్నామలై, నారాయణన్ తిరుపతి, గాయని చిన్మయి శ్రీపాద కూడా తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. టీవీకే మహిళా విభాగం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పాటు, డీఎంకే నేత వైఖరిపై రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. కావేరీ నీటి సమస్య వంటి ప్రజా సమస్యాత్మక వేదికను మహిళపై అసభ్య వ్యాఖ్యలు చేసేందుకు ఉపయోగించుకోవడంపై తమిళనాడు ప్రజలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఉదయనిధి స్టాలిన్ చేసిన ఈ కామెంట్స్ ఇప్పుడు సినీ పరిశ్రమలోనే కాకుండా సమగ్ర రాజకీయ వర్గాల్లోనూ పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారాయి.   Trisha Krishnan, Khushbu Sundar, Udhayanidhi Stalin 
  సోషల్ మీడియా ఉదృతి తీవ్రంగా ఉన్న ఈ రోజుల్లో కూడా ఈ మధ్య చాలా మంది నటీనటుల మరణాలు ఆలస్యంగా వెలుగులోకి వస్తున్నాయి.  ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది సినిమా ప్రియుల హృదయాలను గెలుచుకున్న హాలీవుడ్  సీనియర్ నటి మేరీ రివెరా (Mary Rivera)ఇకలేరు.  ప్రపంచవ్యాప్తంగా రికార్డు కలెక్షన్లు సాధించిన మార్వెల్ బ్లాక్ బస్టర్ చిత్రం 'స్పైడర్ మేన్: నో వే హోమ్' (Spider-Man: No Way Home) లో నెడ్ లీడ్స్ అమ్మమ్మగా (లోలా) నటించి మెప్పించిన మేరీ, 82 ఏళ్ల వయస్సులో హవాయిలోని హానోలులులో తుదిశ్వాస విడిచారు. ఈ వార్త తెలియగానే హాలీవుడ్ చలనచిత్ర పరిశ్రమతో పాటు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న మార్వెల్ అభిమానులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా తమ ప్రియమైన 'లోలా'కి అశ్రునయనాలతో నివాళులర్పిస్తున్నారు.  మేరీ రివెరా ఏప్రిల్ 15, న తన నివాసంలో  కన్నుమూశారని ఆమె కుటుంబ సభ్యులు అధికారిక ప్రకటన ద్వారా వెల్లడించారు. ఆమె మరణానికి గల అసలు కారణాలను వివరిస్తూ, ఇటీవల మేరీ రివెరా హఠాత్తుగా తీవ్రమైన పక్షవాతానికి (Stroke) గురవ్వడంతో పాటు బ్రెయిన్ స్ట్రోక్ రావడంతో  తీవ్ర అస్వస్థతకు గురై కోమాలోకి వెళ్లారు. ఆసుపత్రిలోని అత్యవసర విభాగంలో వైద్యులు ఆమెను వెంటిలేటర్, లైఫ్ సపోర్ట్ సిస్టమ్ పై ఉంచి చికిత్స అందించినప్పటికీ పరిస్థితి ఎంతకీ కుదుటపడలేదు. ఒకవేళ కోమా నుంచి బయటకు వచ్చినా ఆమె ఆరోగ్య పరిస్థితి మెరుగయ్యే అవకాశం లేదని వైద్యులు స్పష్టం చేయడంతో, కుటుంబ సభ్యులు బరువైన  హృదయంతో ఆమెను లైఫ్ సపోర్ట్ నుండి తొలగించేందుకు అంగీకరించారు.   జూన్ 2, 1943న ఫిలిప్పీన్స్ లోని ఐలోయిలో (Iloilo) ప్రాంతంలో జన్మించిన మేరీ రివెరా జీవితంలో ఎక్కువ భాగం చర్చి మిషనరీగా ఆధ్యాత్మిక సేవలు అందించారు. వృద్ధాప్యంలో కుటుంబ సభ్యుల ప్రోత్సాహంతో నటన వైపు అడుగులు వేసిన ఆమె, 2021లో ప్రపంచవ్యాప్తంగా విడుదలైన 'స్పైడర్ మేన్: నో వే హోమ్' సినిమా కోసం ఆడిషన్ ఇచ్చి నెడ్ అమ్మమ్మ పాత్రకు ఎంపికయ్యారు. తక్కువ నిమిషాలు మాత్రమే తెరపై కనిపించినప్పటికీ, తన సహజమైన నటన, ప్రత్యేకమైన టైమింగ్ తో గ్లోబల్ ఆడియెన్స్ ను ఎంతగానో అలరించారు.  ముఖ్యంగా ఆ సినిమాలో ఆండ్రూ గార్‌ఫీల్డ్ స్పైడర్ మేన్ అవతారంలో నెడ్ ఇంట్లోని పోర్టల్ ద్వారా ప్రవేశించే సన్నివేశం సినిమాకే ప్రధాన ఆకర్షణగా నిలిచింది. గది సీలింగ్‌పై వేలాడుతున్న ఆండ్రూ గార్‌ఫీల్డ్‌ను చూసి బెదిరిపోకుండా, తన మాతృభాష అయిన 'తగలోగ్' (Tagalog) లో మాట్లాడటం ప్రేక్షకులను ఆకట్టుకుంది. "అక్కడే పైనే ఉన్నావు కదా, కొంచెం మూలలో ఉన్న బూజు తుడిచేయ్" అంటూ ఆమె చెప్పే కామిక్ డైలాగ్ థియేటర్లలో నవ్వుల పువ్వులు పూయించింది.  Also read: Prabhas: ప్రభాస్ కోసం గచ్చిబౌలికి చార్మినార్   ఈ ఒక్క సన్నివేశం హాలీవుడ్ పెద్ద తెరపై ఫిలిప్పీన్స్ సంస్కృతిని, భాషను ఎంతో గర్వంగా ఆవిష్కరించింది.  టామ్ హాలండ్, ఆండ్రూ గార్‌ఫీల్డ్, టోబీ మాగ్వైర్, జెండయా, జేమీ ఫాక్స్ వంటి హాలీవుడ్ అగ్ర నటులతో స్క్రీన్ షేర్ చేసుకున్న మేరీ రివెరాకు భర్త అలెజాండ్రో రివెరాతో పాటు నలుగురు పిల్లలు (కార్మెలా జెన్స్, పాల్ రివెరా, ఎడ్విన్ రివెరా, ఏంజెలా కెల్లీ), 11 మంది మనవళ్లు, మనవరాళ్లు, అలాగే నలుగురు మునిమనవళ్లు ఉన్నారు. మేరీ రివెరా భౌతికకాయం మన మధ్య లేకపోయినా, 'స్పైడర్ మేన్' చిత్రంలో ఆమె పోషించిన నెడ్ 'లోలా' పాత్ర ప్రపంచవ్యాప్త మార్వెల్ ప్రేమికుల గుండెల్లో ఎప్పటికీ చిరస్థాయిగా నిలిచిపోతుంది. Spider Man No Way Home, Mary Rivera    
రాకింగ్ స్టార్ మంచు మనోజ్ రీ ఎంట్రీ తర్వాత సరికొత్త ఎనర్జీ, డిఫరెంట్ కాన్సెప్ట్ సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తున్నారు. ప్రస్తుతం ఆయన నటిస్తున్న ప్రాజెక్టులలో 'వడ్డీ కాసుల వాడా' ఒకటి. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ లో తేజ్ ఉప్పలపాటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా టైటిల్ అనౌన్స్‌మెంట్ నుంచే సినీ ప్రియుల్లో ఆసక్తిని రేకెత్తించింది. మధ్యతరగతి జీవితాల్లో ఈఎంఐలు, అప్పులు, ఆర్థిక ఇబ్బందుల చుట్టూ తిరిగే కథాంశంతో కామెడీ ఎంటర్టైనర్ గా ఈ చిత్రాన్ని రూపుదిద్దుతున్నారు. అయితే ఈ సినిమాకి సంబంధించి ప్రస్తుతం సినీ వర్గాల్లో ఒక క్రేజీ న్యూస్ హాట్ టాపిక్‌గా మారింది. అదేంటంటే, ఈ సినిమాలో శ్రీ వేంకటేశ్వర స్వామి వారి పాత్రలో ప్రముఖ కోలీవుడ్ నటుడు జయం రవి నటించబోతున్నారని న్యూస్ వినిపిస్తోంది.  ఈ సినిమాలో వెంకటేశ్వర స్వామి భక్తుడిగా మనోజ్ కనిపించనున్నారు. అప్పుల తిప్పల నుంచి బయట పడేయమని ఆ వడ్డీ కాసుల వాడిని వేడుకుంటూ ఉంటాడు. ఈ క్రమంలో వెంకటేశ్వర స్వామికి, మనోజ్ జరిగే సంభాషణలు సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి. మరి ఆ శ్రీనివాసుడి పాత్రలో జయం రవి ఎలా ఉంటారో చూడాలి.      Manchu Manoj, Vaddi Kaasula Vaada, Jayam Ravi, Venkateswara Swamy  
సూపర్‌స్టార్ రజినీకాంత్ ప్రతిష్టాత్మక చిత్రం 'జైలర్' బాక్సాఫీస్ వద్ద సృష్టించిన ప్రభంజనం అంతా ఇంతా కాదు. ఇప్పుడు ఆ మహత్తర విజయానికి కొనసాగింపుగా తెరకెక్కుతున్న 'జైలర్ 2' చిత్రంపై దక్షిణ భారతదేశంలోనే కాకుండా దేశవ్యాప్తంగా అపారమైన అంచనాలు నెలకొన్నాయి. దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ ఈ రెండవ భాగం కోసం ఆసక్తికరమైన మాస్టర్ ప్లాన్‌ను సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం సినీ వర్గాల్లో, సోషల్ మీడియా వేదికల్లో తీవ్రంగా చర్చ జరుగుతున్న ఏకైక అంశం ఈ సినిమాలో ఉండబోయే స్పెషల్ క్యామియోల గురించే. సాధారణంగా సీక్వెల్స్‌లో నటీనటుల సంఖ్య పెరుగుతుంది, కానీ జైలర్ 2 విషయంలో మాత్రం నెంబర్ మాత్రమే కాదు, వారిని తెరపై చూపించే విధానం స‌ర్‌ప్రైజింగ్‌గా ఉండబోతోందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. ఫిలింన‌గ‌ర్ సమాచారం ప్రకారం, ఈ చిత్రంలో ఒకటి రెండు కాదు, ఏకంగా 8 మంది స్టార్ హీరోలు ప్రత్యేక పాత్రల్లో మెరవబోతున్నారట. సాధారణంగా నేటితరం చిత్రాల్లో పెద్ద నటుల క్యామియోలను ప్రమోషన్ల కోసం ముందే ఉపయోగించుకోవడం పరిపాటిగా మారింది. టీజర్లు, ట్రైలర్లు, కాన్సెప్ట్ పోస్టర్లు లేదా గ్లింప్స్ వీడియోల ద్వారా ఆ స్టార్ల పాత్రలను ముందే రివీల్ చేసి విపరీతమైన హైప్ క్రియేట్ చేయడానికి మేకర్స్ ప్రయత్నిస్తుంటారు. అయితే, నెల్సన్ దిలీప్ కుమార్ మాత్రం ఈ సంప్రదాయానికి పూర్తి భిన్నమైన వ్యూహాన్ని ఎంచుకున్నారు. జైలర్ 2 టీజర్, ట్రైలర్ లేదా ప్రచార చిత్రాలలో కేవలం ప్రధాన కథాంశాన్ని, రజినీకాంత్ మాస్ మేనియాను మాత్రమే ప్రదర్శించి, ఆ 8 మంది స్టార్ల రహస్య క్యామియోలను సినిమా విడుదలయ్యే వరకు అత్యంత సీక్రెట్‌గా ఉంచాలని గట్టి నిర్ణయం తీసుకున్నారు. ఈ వ్యూహం వెనుక ఒక బలమైన మార్కెటింగ్ స్ట్రాటజీ ఉంది. ప్రేక్షకులు థియేటర్లోకి అడుగుపెట్టినప్పుడు ఊహించని సర్ప్రైజ్ ఎలిమెంట్స్‌ను అనుభూతి చెందితే, ఆ థ్రిల్ ఇచ్చే కిక్ వేరుగా ఉంటుంది. మొదటి రోజు థియేటర్ల నుండి బయటకు వచ్చిన అభిమానులు, ప్రేక్షకులు సామాజిక మాధ్యమాల్లో చేసే రచ్చ, సోషల్ మీడియా డిస్కషన్లు ఈ సినిమాకు అనూహ్యమైన మౌత్ టాక్‌ను తెచ్చిపెడతాయని నెల్సన్ బలంగా నమ్ముతున్నారు. అంతేకాకుండా, ఈ స్పెషల్ పాత్రల ఎంపికలో కూడా ఒక ప్రత్యేకమైన కమర్షియల్ యాంగిల్ దాగి ఉంది. కేవలం తమిళ పరిశ్రమకే పరిమితం కాకుండా తెలుగు, కన్నడ, హిందీ తదితర ప్రాంతీయ భాషా చిత్రసీమల్లో విపరీతమైన క్రేజ్ ఉన్న అగ్ర నటులను ఈ 8 ప్రత్యేక పాత్రల కోసం ఎంపిక చేసినట్లు సమాచారం. తెలుగు, తమిళ, కన్నడ, హిందీ మార్కెట్లలో ఒక్కో ప్రాంతానికి చెందిన కీలక నటుడు ఈ సినిమాలో భాగమవ్వడం వల్ల ప్రతి రాష్ట్రంలోనూ సినిమా పట్ల విపరీతమైన బజ్ క్రియేట్ అవుతుంది. ప్రతి ప్రాంతీయ మార్కెట్‌కు ఒక ప్రముఖ నక్షత్రాన్ని జోడించడం ద్వారా బాక్సాఫీస్ పరిధిని మరియు కలెక్షన్ల సామర్థ్యాన్ని గణనీయంగా పెంచవచ్చని మేకర్స్ లెక్కలేస్తున్నారు. జైలర్ మొదటి భాగంలో శివరాజ్‌కుమార్, మోహన్‌లాల్, జాకీష్రాఫ్ వంటి దిగ్గజాల క్యామియోలు కథకు ప్రాణం పోసి, థియేటర్లలో పూనకాలు తెప్పించిన సంగతి అందరికీ తెలిసిందే. ఇప్పుడు జైలర్ 2లో రాబోయే ఆ 8 మంది స్టార్లు కేవలం స్క్రీన్ ప్రెజెన్స్ లేదా ఫ్యాన్స్ కోసం ఇచ్చే విజువల్ ట్రీట్‌గా మాత్రమే కాకుండా, కథను కీలక మలుపులు తిప్పే బలమైన పాత్రలుగా నిలుస్తాయా లేదా అనేది కాలమే నిర్ణయించాలి. దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ ఈ క్యామియోలను కేవలం ఒక ప్రచార సాధనంగా కాకుండా, ప్రమోషన్లలో ఒక సైలెంట్ వెపన్‌గా ఉపయోగిస్తున్నారు. సినిమా విడుదలయ్యే వరకు ఈ 8 మంది నటుల వివరాలను గుట్టుగా ఉంచగలిగితే, భారతీయ చిత్రసీమలోనే స‌ర్‌ప్రైజ్ మార్కెటింగ్ అనే ఒక నూతన విప్లవాత్మక మోడల్‌కు జైలర్ 2 శ్రీకారం చుట్టినట్లవుతుంది. రజినీకాంత్ మాస్ మేనియాకి నెల్సన్ మైండ్ గేమ్ తోడైతే, బాక్సాఫీస్ వద్ద రికార్డుల వేట ఖాయమని విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు.     Jailer2, Rajinikanth, Nelson Dilipkumar, Jailer 2 Star Cameos, Sun Pictures
  పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అప్ కమింగ్ మూవీ 'ఫౌజీ'. ఈ చిత్రంపై రోజురోజుకి అంచనాలు   పెరుగుతున్నాయి. ఫ్యాన్స్ అయితే రిలీజ్ డేట్ డిసెంబర్ 3 కోసం ఇప్పట్నుంచే కళ్ళల్లో ఒత్తులు వేసుకొని మరి చూస్తున్నారంటే అతిశయోక్తి  కాదు. పైగా ప్రభాస్ నుంచి అభూతకల్పనలతో కూడిన చిత్రాల తర్వాత వస్తున్న మూవీ  కావడంతో ఫ్యాన్స్ హార్ట్ డేట్ ఏ విధంగా కొట్టుకుంటూ ఉంటుందో కూడా అర్ధం చేసుకోవచ్చు .   విభిన్నమైన ప్రేమ కథలు, చారిత్రక నేపథ్యంతో ప్రేక్షకులను కట్టిపడేసే ప్రతిభావంతుడైన దర్శకుడు హను రాఘవపూడి ఈ చిత్రాన్ని అత్యంత విజువల్ గ్రాండియర్‌గా తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా నుంచి వస్తున్న ప్రతి చిన్న వార్త కూడా సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తుండగా, తాజాగా బయటకు వచ్చిన ఓ మైండ్ బ్లోయింగ్ అప్‌డేట్ రెబెల్ స్టార్ అభిమానుల్లో సరికొత్త ఉత్సాహాన్ని నింపింది. సినిమాలోని అతిముఖ్యమైన సన్నివేశాల చిత్రీకరణ కోసం చిత్రబృందం హైదరాబాద్ వేదికగా వేసిన చార్మినార్ సెట్  ప్రస్తుతం ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. సాధారణంగా చార్మినార్ నేపథ్యంతో కూడిన సన్నివేశాలను చిత్రీకరించాల్సి వస్తే ఏ దర్శకుడైనా పాతబస్తీలోని అసలైన చార్మినార్ ప్రాంగణాన్నే ఎంచుకోవడం సహజం. అయితే 'ఫౌజీ ' చిత్రబృందం మాత్రం ఇందుకు పూర్తిగా భిన్నమైన, అత్యంత బాధ్యతాయుతమైన వినూత్న నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్‌లోని గచ్చిబౌలి నుంచి లింగంపల్లికి వెళ్లే ప్రధాన రహదారిలో ఉన్న పాత అల్యూమినియం ఫ్యాక్టరీ ప్రాంగణంలో నిజమైన చార్మినార్‌ని  తలపించేలా ఒక భారీ సెట్‌ను ప్రత్యేకంగా నిర్మించింది. అత్యున్నత సాంకేతిక ప్రమాణాలు, అద్భుతమైన కళా నైపుణ్యంతో నిజమైన కట్టడానికి ఏమాత్రం తీసిపోని విధంగా ఈ ప్రతిరూపాన్ని డిజైన్ చేయడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ఈ రకమైన బారీ సెట్ నిర్మించడం వెనుక ఒక బలమైన కారణం ఉంది. ప్రభాస్‌కు ఉన్న అపారమైన గ్లోబల్ స్టార్‌డమ్, లక్షలాది మంది అభిమానుల క్రేజ్ కారణంగా పాతబస్తీ లాంటి రద్దీ ప్రాంతంలో ప్రత్యక్షంగా షూటింగ్ జరపడం ఎంతో ప్రమాదకరంతో కూడుకున్న పని. ఒకవేళ అక్కడ షూటింగ్ నిర్వహిస్తే వేలాది మంది అభిమానులు ఒక్కసారిగా తరలివచ్చే అవకాశం ఉంటుంది. దీనివల్ల తీవ్రమైన ట్రాఫిక్ సమస్యలు తలెత్తడమే కాకుండా, శాంతిభద్రతల పరంగా కూడా పెద్ద ఎత్తున భద్రతా ఇబ్బందులు ఎదురవుతాయని మేకర్స్ ముందే ఊహించారు. షూటింగ్‌కు ఎలాంటి ఆటంకాలు కలగకుండా, నటీనటులు మరియు సాంకేతిక నిపుణులకు పూర్తి రక్షణ కల్పిస్తూ పనిని వేగవంతం చేయడానికే ఈ ప్రత్యేక నిర్ణయం తీసుకున్నారు. తాజా సమాచారం ప్రకారం ఆగస్టు 3 నుంచి ఈ కొత్త షెడ్యూల్ అధికారికంగా ప్రారంభమైంది. గచ్చిబౌలిలో నిర్మించిన ఈ చార్మినార్ సెట్‌లో దాదాపు 25 రోజుల పాటు సుదీర్ఘంగా షూటింగ్ కొనసాగనుంది. ఈ 25 రోజుల కీలకమైన షెడ్యూల్‌లో ప్రభాస్‌పై అత్యంత ప్రాధాన్యత ఉన్న భారీ యాక్షన్ మరియు డ్రామా సన్నివేశాలను దర్శకుడు హను రాఘవపూడి చిత్రీకరించనున్నారు. ఈ దశ విజయవంతంగా పూర్తయితే, సినిమా మొత్తం చిత్రీకరణ దాదాపు 90 శాతం వరకు పూర్తయినట్లేనని ఫిలింనగర్ సమాచారం. ఆ తర్వాత మిగిలిన కొద్దిపాటి చిత్రీకరణను వేగంగా ముగించి, శరవేగంగా విజువల్ ఎఫెక్ట్స్, పోస్ట్ ప్రొడక్షన్ పనులను పూర్తి చేయాలని పక్కా ప్రణాళికతో ముందడుగు వేస్తున్నారు. గతంలో మహేష్ ఒక్కడు మూవీకి చార్మినార్ సెట్ వేసిన విషయం తెలిసిందే. Prabhas, Fauji, Hanu Raghavapudi    
తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ప్రతి నెలా ఎన్నో రకాల సినిమా ముచ్చట్లు, విడుదలలు, హంగామాలు చోటుచేసుకుంటూనే ఉంటాయి. కానీ 2026 ఆగస్టు మాసం మాత్రం టాలీవుడ్ చరిత్రలోనే అత్యంత ప్రత్యేకమైన ఘట్టంగా నిలిచిపోనుంది. కేవలం బాక్సాఫీస్ బొమ్మలు మాత్రమే కాకుండా, అభిమానులు ప్రాణంగా భావించే ముగ్గురు దిగ్గజ అగ్ర హీరోల పుట్టినరోజులు ఈ ఒక్క నెలలోనే రావడం సినీ ప్రియులకు నిజమైన పండుగ వాతావరణాన్ని తీసుకొస్తోంది. కేవలం సోషల్ మీడియాలో సాధారణ విషెస్ చెప్పి ఊరుకోవడం మాత్రమే కాకుండా, ఈసారి చిత్ర నిర్మాతలు కూడా తమ హీరోల బర్త్‌డే వేడుకలను సరికొత్త రీతిలో ప్లాన్ చేశారు. వారు నటిస్తున్న అత్యంత ప్రతిష్టాత్మక భారీ ప్రాజెక్టుల నుంచి ఊహించని రేంజ్‌లో అదిరిపోయే అప్‌డేట్స్‌ను సిద్దం చేసి టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర ట్రెండ్ సెట్ చేసేందుకు సమాయత్తమవుతున్నారు. ఈ అపూర్వమైన ఆగస్టు సంబరాల రేసులో ముందుగా అభిమానులను అలరించేందుకు సూపర్ స్టార్ మహేష్ బాబు వస్తున్నారు. ప్రతి ఏటా ఆగస్టు 9వ తేదీన మహేష్ బాబు పుట్టినరోజు అంటే ఘట్టమనేని అభిమానులకు ఒక మహోత్సవం లాంటిది. అయితే ఈసారి ఆగస్టు 9న రాబోతున్న అప్‌డేట్ సాధారణమైనది కాదు. దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళితో మహేష్ బాబు చేయబోతున్న గ్లోబల్ అడ్వెంచర్ ప్రాజెక్ట్ 'వారణాసి' నుంచి క్రేజీ సర్ ప్రైజ్ రాబోతోంది. ప్రపంచ వ్యాప్తంగా భారీ అంచనాలు ఉన్న ఈ సినిమా నుంచి జక్కన్న మహేష్ బర్త్‌డే సందర్భంగా ఒక సంచలనాత్మక గ్లింప్స్ లేదా ఫస్ట్ లుక్ పోస్టర్‌ను ప్లాన్ చేస్తున్నట్లు సోషల్ మీడియాను ఊపేస్తున్న వార్తలు స్పష్టం చేస్తున్నాయి. ఎలాంటి సందేహం లేకుండా ఈ అప్‌డేట్ గ్లోబల్ వైడ్‌గా సెన్సేషన్ సృష్టించడం ఖాయంగా కనిపిస్తోంది. ఆ తర్వాత ఆగస్టు నెలలో రెండో మైలురాయిగా మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు రానుంది. ఆగస్టు 22వ తేదీన చిరంజీవి బర్త్‌డే వేడుకలను పురస్కరించుకుని మెగా అభిమానులకు ముచ్చటగా ముగ్గురు దర్శకుల ప్రాజెక్టుల నుంచి అప్‌డేట్స్ అందనున్నాయి. వశిష్ట దర్శకత్వంలో తెరకెక్కుతున్న సోషియో ఫాంటసీ విజువల్ వండర్ 'విశ్వంభర' సినిమా నుంచి సరికొత్త టీజర్ లేదా రిలీజ్ డేట్ గ్లింప్స్ రావడం పక్కా అయింది. దీనితో పాటుగా, ప్రస్తుతం సెట్స్ పైకి వెళ్తున్న బాబీ కాంబినేషన్ మూవీ నుంచి కీలక విశేషాలను చిరంజీవి లీక్ చేసే అవకాశం ఉంది. వీటికి తోడుగా దసరా ఫేమ్ శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో రాబోతున్న మెగా 158వ ప్రాజెక్ట్ విశేషాలపై తప్పనిసరిగా అనౌన్స్‌మెంట్ క్లూ ఉంటుందని మెగా ఫ్యాన్స్ ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు. ఇక ఈ ఆగస్టు ముగింపు కింగ్ అక్కినేని నాగార్జున బర్త్‌డేతో జరగనుంది. ఆగస్టు 29వ తేదీన నాగార్జున పుట్టినరోజును పురస్కరించుకుని అక్కినేని అభిమానులకు ఒక అద్భుతమైన గిఫ్ట్ అందబోతోంది. నాగార్జున కెరీర్‌లో అత్యంత ప్రతిష్టాత్మకమైన 100వ సినిమాకు సంబంధించిన గ్రాండ్ అప్‌డేట్ లేకుండా ఈ పుట్టినరోజు వేడుక పూర్తి కాదు అని ఇండస్ట్రీ వర్గాలు బలంగా చెబుతున్నాయి. మైలురాయిగా నిలిచే ఈ వందవ ప్రాజెక్ట్ అనౌన్స్‌మెంట్‌తో పాటు ఆయన నటిస్తున్న కొత్త సినిమాల విశేషాలు కూడా అదే రోజున లీక్ కానున్నాయి. ఇలా తెలుగు సినీ చరిత్రలోనే ఒకే ఒక్క నెలలో, అదీ 2026 ఆగస్టు మాసంలో చిరంజీవి, మహేష్ బాబు, నాగార్జున వంటి ముగ్గురు దిగ్గజ అగ్ర నటులు ఒకేసారి తమ భారీ చిత్రాల గ్లింప్స్‌లు, టీజర్లు, టైటిల్ అనౌన్స్‌మెంట్లతో ప్రేక్షకుల ముందుకు రావడం గతంలో ఎన్నడూ జరగని అరుదైన శుభ పరిణామం. సెట్స్‌పై ఉన్న తమ కలల ప్రాజెక్టులతో బాక్సాఫీస్ వద్ద అంచనాలను పీక్స్‌కి తీసుకెళ్తున్న ఈ స్టార్ల బర్త్‌డే ధమాకా టాలీవుడ్‌లో సరికొత్త ఊపును రగిలిస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు.   megastar chiranjeevi, super star mahesh, king nagarjuna    
  ఎన్ని జోనర్లు ఉన్నా హారర్ జోనర్ ఇచ్చే కిక్కే వేరు. అభిమానులు, ప్రేక్షకులు కూడా భయపడుతూనే హారర్ జోనర్ సినిమాలు చూస్తుంటారు. చీకటి నిండిన వాతావరణం, ఊహించని మలుపులు, గుండెల్లో గుబులు పుట్టించే దృశ్యాలు మరియు ఒళ్ళు జలదరించే బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌తో ప్రేక్షకులను సీట్లకు కట్టిపడేసే శక్తి ఒక్క హారర్ జానర్‌కే సొంతం.  ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల కొద్దీ అభిమానులను సంపాదించుకున్న హాలీవుడ్ లెజెండరీ హారర్ ఫ్రాంచైజీలలో 'ఈవిల్ డెడ్' సిరీస్ ఒకటి. ఈ మోస్ట్ పాపులర్ ఫ్రాంచైజీలో 6వ చిత్రంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన లేటెస్ట్ సూపర్ హిట్ భయానక థ్రిల్లర్ 'ఈవిల్ డెడ్ బర్న్' (Evil Dead Burn). ఇటీవల థియేటర్లలో విడుదలై బాక్సాఫీస్ వద్ద రికార్డు స్థాయి వసూళ్లతో ప్రపంచాన్ని భయపెట్టిన ఈ చిత్రం, ఇప్పుడు డిజిటల్ లవర్స్ కోసం ఓటీటీ వేదికపై సందడి చేయడానికి సిద్ధమైంది. థియేటర్లలో ప్రపంచవ్యాప్తంగా దాదాపు 550 కోట్ల భారీ గ్రాస్ కలెక్షన్లు కొల్లగొట్టి బ్లాక్‌బస్టర్ హిట్ సాధించిన  ఈవిల్ డెడ్ బర్న్ ఈ రోజు నుంచి అంటే ఆగస్టు 4, నుంచి  డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లలో అధికారికంగా అందుబాటులోకి వచ్చింది. వార్నర్ బ్రదర్స్ డిజిటల్ ప్లాట్‌ఫారమ్స్ ద్వారా పివిఓడి (PVOD - Premium Video On Demand) పద్ధతిలో ఈ చిత్రాన్ని విడుదల చేశారు. అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video), ఆపిల్ టీవీ ప్లస్ (Apple TV+), మరియు యూట్యూబ్ (YouTube Movies) వంటి అగ్రశ్రేణి ఓటీటీ వేదికలలో ఈ సినిమాను వీక్షకులు రెంట్ (రైట్-టు-వాచ్) ప్రాతిపదికన వీక్షించవచ్చు. థియేటర్‌కు వెళ్లలేకపోయిన సినిమా ప్రియులకు మరియు డిజిటల్ స్క్రీన్‌పై రాత్రి వేళ భయానక అనుభూతిని సొంతం చేసుకోవాలనుకునే వారికి ఇది ఒక గొప్ప అవకాశం. Also read: టాలీవుడ్ డ్యాన్సర్స్ అసోసియేషన్‌లో మళ్లీ రగడ.. కుట్ర ఏమైనా ఉందా! ఈవిల్ డెడ్ బర్న్ కథాంశం విషయానికి వస్తే, ఇది కేవలం సాధారణ దెయ్యాల కథ కాదు. అనుకోని ఘోర ప్రమాదంలో తన కుమారుడిని కోల్పోయి విపరీతమైన శోకసంద్రంలో మునిగిపోయిన ఒక తల్లి వద్దకు, ఓదార్పు ఇచ్చేందుకు మిగిలిన కుటుంబ సభ్యులు అందరూ ఒక చోట చేరుకుంటారు. నగర సందడికి చాలా దూరంగా, నిర్మానుష్యమైన వాతావరణంలో ఉండే ఆ భవంతికి ఆ కుటుంబం చేరుకున్న తర్వాత అసలు భయం మొదలవుతుంది. అక్కడ దాగి ఉన్న రహస్యాలు, పురాతన శక్తులు మేల్కొని ఆ కుటుంబాన్ని చుట్టుముడతాయి. ఆ ఇంట్లోని సభ్యులు ఒక్కొక్కరుగా దుష్ట శక్తులు లేదా డెడైట్స్ (Deadites) బారిన పడి దెయ్యాలుగా మారిపోతారు. ఆ గృహం నిమిషాల్లో రక్తపాతం, కేకలు, ఊహించని నరకయాతనతో నిండిపోతుంది. ఈ చిత్రంలో ప్రదర్శించిన విజువల్ ఎఫెక్ట్స్, మేకప్, రక్తపాతం మరియు నటీనటుల భయంకరమైన నటన ప్రేక్షకులకు సరికొత్త భయాందోళనలను కలిగిస్తాయి. ముఖ్యంగా సౌహీలా యాకూబ్, టాండి రైట్, హంటర్ డూహన్, మరియు లూసియాన్ బుకానన్ తమ కేరక్టర్స్ లో జీవించి హారర్ ప్రియులను కట్టిపడేసారు. హాలీవుడ్ స్థాయి విజువల్ క్వాలిటీతో పాటు తెలుగు డబ్బింగ్ కూడా అందుబాటులో ఉండటంతో మన ప్రాంతీయ ప్రేక్షకులలోనూ ఈ సినిమాపై ఆసక్తి విపరీతంగా పెరిగింది. గతంలో వచ్చిన ఈవిల్ డెడ్ రైజ్ కంటే ఇందులో సర్రియల్ ఎలిమెంట్స్ మరియు సస్పెన్స్ మరింత ఎక్కువగా ఉన్నాయని ఫిల్మ్ క్రిటిక్స్ కొనియాడారు. గుండె నిబ్బరం ఉన్నవారు, హారర్ ప్రేమికులు ఈవిల్ డెడ్ ని చూసెయ్యడానికి రెడీ అవ్వండి. Evil Dead Burn, Hollywood horror  
న్యాచురల్ స్టార్ నాని ప్రస్తుతం శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో 'ది ప్యారడైజ్' మూవీ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ భారీ యాక్షన్ డ్రామాను సెప్టెంబర్ లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. దీని తర్వాత సుజీత్ డైరెక్షన్ లో 'బ్లడీ రోమియో' అనే యాక్షన్ ఎంటర్‌టైనర్ చేయనున్నాడు నాని. అయితే నాని 'ది ప్యారడైజ్' ఆలస్యం కావడంతో.. సుజీత్ తన ఫోకస్ ని పవన్ కళ్యాణ్ ప్రాజెక్ట్ 'ఓజీ-2'పైకి షిఫ్ట్ చేసినట్లు వార్తలొచ్చాయి. 'ఓజీ-2' పూర్తయిన తర్వాత 'బ్లడీ రోమియో' ఉంటుందని ప్రచారం జరిగింది. దీంతో నాని ఫ్యాన్స్ కాస్త నిరాశ చెందారు. అయితే ఇప్పుడు మళ్ళీ ఆయన ఫ్యాన్స్ ను ఖుషీ చేస్తూ ఓ క్రేజీ న్యూస్ ఒకటి బయటకు వచ్చింది. 'బ్లడీ రోమియో' రెగ్యులర్ షూటింగ్ ఈ ఏడాది అక్టోబర్ నుంచే ప్రారంభం కాబోతోందట. మొదటి షెడ్యూల్ హైదరాబాద్ లో ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. ఆ తర్వాత లండన్ లో భారీ షెడ్యూల్ ను ప్లాన్ చేశారట. ఏమాత్రం విరామం ఇవ్వకుండా ఒకే విడతలో ఈ లండన్ షెడ్యూల్ ను డిసెంబర్ కల్లా  కంప్లీట్ చేయాలని మేకర్స్ టార్గెట్ పెట్టుకున్నట్లు సమాచారం. మొత్తానికి ఈ లేటెస్ట్ న్యూస్ ను బట్టి చూస్తే.. 'బ్లడీ రోమియో' పూర్తయిన తర్వాతే 'ఓజీ-2' పట్టాలెక్కే అవకాశముంది. త్వరలోనే దీనిపై క్లారిటీ వస్తుందేమో చూడాలి.      Bloody Romeo, Nani, Sujeeth, OG2, Pawan Kalyan  
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు. వారితో పాటు పెద్ద సంఖ్యలో క్యాడర్ కూడా పార్టీని వీడుతున్నారు. ఇక ఇప్పుడు నామినేటెడ్ పదవులలో ఉన్న వారి వంతు మొదలైనట్లు కనిపిస్తోంది. తనకు కానీ తన భర్తకు  కానీ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు టికెట్ ఇవ్వాలంటూ గత  కొంత కాలంగా కోరుతూ వస్తున్న మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ వంతు వచ్చింది. ఆమె కూడా రాజీనామా అస్త్రం సంధించారు.  జగన్ కు నమ్మిన బంటుగా గుర్తింపు పొందిన మహిళాకమిషన్ చైర్ పర్సన్ వాసి రెడ్డి పద్మ తన పదవికి రాజీనామా చేశారు. ఉరుములేని పిడుగులా, ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా తన రాజీనామా లేఖను సీఎం జగన్ కు పంపేశారు. పేరుకు తాను పార్టీకి కాదు, కేవలం మహిళా కమిషన్ చైర్మన్ పదవికి మాత్రమే రాజీనామా చేశాననీ, ఇక నుంచి వైసీపీ కోసం పని చేస్తాననీ వాసిరెడ్డి పద్మ చెబుతున్నప్పటికీ, ఆమె రాజీనామాకు కారణం అసంతృప్తేనని పార్టీ వర్గాలు బాహాటంగానే చెబుతున్నాయి. చాలా కాలంగా వాసిరెడ్డి పద్మ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు తనకు కానీ తన భక్తకు కానీ పార్టీ టికెట్ ఇవ్వాలని జగన్ ను కోరుతూ వస్తున్నారు. అయితే ఇప్పటి వరకూ జగన్ చూద్దాం.. చేద్దాం అన్నట్లుగా దాట వేస్తూనే వచ్చారు. ఇప్పుడిక వరుసగా అభ్యర్థల జాబితాలను జగన్ ప్రకటించేస్తుండటం, తనకు గానీ తన భర్తకు కానీ పార్టీ టికెట్ విషయంలో ఎటువంటి స్పస్టత ఇవ్వకపోవడంతో ఆమె మనస్తాపం చెంది పదవికి రాజీనామా చేసేశారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.  వాసిరెడ్డి పద్మ రాజకీయ ప్రవేశం ప్రజారాజ్యం పార్టీతో జరిగింది. 2009లో ఆమె ప్రజారాజ్యం పార్టీలో చేరారు. ఇలా చేరడంతోనే ఆమె ప్రజారాజ్యం అధికార ప్రతినిథిగా పదవి దక్కించుకున్నారు. ప్రజారాజ్యం కాంగ్రెస్ పార్టీలో విలీనం కావడంతో ఆమె 2012లో జగన్ పార్టీలో చేరారు. జగన్ కూడా ఆమెకు అధికార ప్రతినిథి పదవి ఇచ్చారు.  2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆమెను రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా నియమించారు. చైర్ పర్సన్ హోదాలో ఆమె జగన్ మెప్పు పొందేందుకు చేయగలిగినంతా చేశారు. ప్రతిపక్ష పార్టీ నేతలకు నోటీసులు ఇచ్చారు. ఏకంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు సైతం నోటీసులు జారీ చేశారు. వార్డు వలంటీర్లపై పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు కమిషన్ ముందు హాజరై వివరణ ఇవ్వాలంటూ ఆమె పవన్ కు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. పవన్ హాజరు కాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు నమోదు చేయాలని ఆదేశించారు. ఇన్ని చేసినా వాసిరెడ్డి పద్మకు ఆమె కోరినట్లుగా పార్టీ టికెట్ లభించకపోవడంతో అలిగి పదవికి రాజీనామా చేశారని, ఇది జగన్ కు షాకేననీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు. ఒకరైతు తనకు చేసిన సేవలకు ప్రీతి చెందిన గురువు అతడికి స్వర్గ ప్రాప్తిని కలగజేయాలని అనుకుంటాడు. కానీ సంసారాసక్తి వల్ల ఆ రైతు ఆ అవకాశాన్ని వాయిదా వేసుకుంటూ వస్తాడు. చివరికి గురుకృప వల్ల ఆ రైతు స్వర్గ ప్రాప్తిని ఎలా పొందాడో ఈ కథ తెలియజేస్తుంది. "ఒక మహాపురుషుడు ప్రయాణం చేస్తూ, డస్సిపోయాడు. గొంతు ఎండిపోయింది. దారిలో ఒక రైతు కనపడితే నీళ్ళు అర్థించాడు. ఆ రైతు మహాత్మునికి సకల ఉపచారాలూ చేశాడు. చిరిగిపోయిన ఆయన ఉత్తరీయాన్ని రైతు జాగ్రత్తగా కుట్టి బాగుచేశాడు. రైతు పరిచర్యలకు సంతసించిన ఆ మహాత్ముడు శాంతి, ఆనందాలకు నిలయమైన స్వర్గానికి తనతోపాటు రమ్మని అంటాడు. అందుకు ఆ రైతు 'గురువుగారూ! మీరు నా మీద చూపిన దయకు కృతజ్ఞుణ్ణి. కానీ నా పిల్లలు ఇంకా చిన్నవాళ్ళు. ఓ ఏడేళ్ళ వ్యవధి ఇవ్వండి' అని అడుగుతాడు. అందుకు గురువు అంగీకరించాడు. సరిగ్గా ఏడేళ్ళ తర్వాత గురువు రైతును స్వర్గానికి తీసుకువెళ్ళడానికి వచ్చాడు. అప్పుడు రైతు 'అయ్యా! కడపటి కొడుకు కష్టాలకు అంతు లేదు. అన్ని జంఝాటాలనూ ఒక్కడే సంబాళించుకోలేకపోతున్నాడు. కాబట్టి మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని గురువుని అడిగాడు. మరో ఏడేళ్ళ తరువాత గురువు వచ్చాడు. కానీ రైతు చనిపోయాడని తెలిసింది. చనిపోయిన ఆ రైతు ఎద్దుగా పుట్టాడని ఆ గురువు తన దివ్య దృష్టితో తెలుసుకున్నాడు. ఎద్దుగా పుట్టిన ఆ రైతు తన కొడుకు పొలాన్నే దున్నుతున్నాడు. అప్పుడు గురువు ఆ ఎద్దుపై మంత్ర జలం చిలకరించగానే ఎద్దు జన్మనెత్తిన రైతు 'నా కొడుకు పరిస్థితి మరి కాస్త మెరుగు పడనీయండి స్వామీ! మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని అన్నాడు. ఇక చేసేది లేక వెనుదిరిగాడు గురువు. మరలా ఏడేళ్ళ తర్వాత వచ్చిన గురువుకు ఎద్దు చనిపోయిందని తెలిసింది. అది కుక్కగా పుట్టి కొడుకు ఇంటినీ, ఆస్తినీ కాపలా కాస్తోందని తన దివ్యదృష్టి ద్వారా తెలుసుకున్నాడు. గురువు. కుక్కగా పుట్టిన ఆ రైతు 'స్వామీ! నేను ఎంత దౌర్భాగ్యుణ్ణి. మీరు ఇంత దయ చూపుతున్నప్పటికీ మీతో స్వర్గమానం చేయలేకున్నాను. వీడికి ఆస్తిని కాపాడుకొనే దక్షత ఇంకా రాలేదు. కాబట్టి దయ చేసి మరో ఏడేళ్ళు వ్యవధి ఇవ్వండి' అని వేడుకున్నాడు. గురువు ఏడేళ్ళ తరువాత మళ్ళీ వచ్చేసరికి కుక్క మరణించింది. అది త్రాచుపాముగా జన్మనెత్తి, ఇప్పుడు కొడుకు భూమిలో ఉన్న లంకెబిందెలకు పడగెత్తి కాపలా కాస్తోంది. గుప్త ధనం ఇక్కడ ఉందని కొడుకుకి ఎలా తెలియజేయాలా అని పాము ఆలోచిస్తున్నప్పుడు గురువు ఆ రైతుకొడుకును పిలుచుకు వచ్చి లంకె బిందెలు ఉన్న చోట తవ్వమన్నాడు. లంకె బిందెలు బయటపడ్డాయి. ఆ పైన ఆ పామును చంపమన్నాడు. అనంతరం శిష్యుణ్ణి తీసుకొని స్వర్గారోహణం చేశాడు గురువు. సంసారంలోని ఈతి బాధల నుండి శిష్యుణ్ణి ఉద్ధరిస్తాడు సద్గురువు. అలాంటి గురువు అందరికీ అవసరం.                                      *నిశ్శబ్ద.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్  రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది.  80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత  ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది.   ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది. ఆమెది నెద‌ర్లాండ్స్‌. ఆమె తండ్రి నెద‌ర్లాండ్స్‌లోని ఆర్నెహెమ్‌లో చిన్న‌పిల్ల‌ల ఆస్ప‌త్రి డైరెక్ట‌ర్. పోయి దొరికిన ఆ పెయింటింగ్ విష‌యానికి వ‌స్తే.. అది 1683లో కాస్ప‌ర్ నెష‌ర్ వేసిన స్టీవెన్ ఓల్ట‌ర్స్ పెయింటింగ్‌. రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో నాజీల ఆదేశాల‌ను చార్లెట్ తండ్రి వ్య‌తిరేకించారు. ఆయ‌న ర‌హ‌స్య జీవ‌నం సాగించేడు. కానీ ఈ పెయింటింగ్‌ని మాత్రం త‌న న‌గ‌రంలోని ఒక బ్యాంక్‌లో భ‌ద్ర‌ ప‌ర‌చ‌మ‌ని ఇచ్చార‌ట‌. 1940లో నాజీలు నెద‌ర్లాండ్ పై దాడులు చేసినపుడు ఆ బ్యాంక్ మీద ప‌డి దోచుకున్నా రు. అప్పుడు ఈ పెయింటింగ్ కూడా తీసుకెళ్లారు. యుద్ధం అయిపోయిన త‌ర్వాత ఈ పెయింటింగ్ ఎక్క‌డున్న‌దీ ఎవ‌రికీ తెలియ‌లేదు. చిత్రంగా 1950ల్లో డ‌స‌ల్‌డార్ష్ ఆర్ట్ గ్యాల‌రీలో అది ప్ర‌త్య‌క్ష‌మ‌యింది. 1969లో ఆమ్‌స్ట‌ర్‌డామ్‌లో దాన్ని వేలానికి తీసికెళ్లే ముందు దాన్ని ఆ ఆర్ట్ గ్యాల‌రీలో వుంద‌ని చూసిన‌వారు చెప్పారు. వేలంపాట త‌ర్వాత మొత్తానికి ఆ పెయింటింగ్‌ను 1971లో ఒక క‌ళాపిపాసి త‌న ద‌గ్గ‌ర పెట్టుకున్నాడు.    ఆ త‌ర్వాత 2021లో అది చార్లెటీని చేరింది.  మొత్తానికి వూహించ‌ని విధంగా ఎంతో కాలం దూర‌మ‌యిన గొప్ప క‌ళాఖండం తిరిగి త‌న వ‌ద్ద‌కు చేర‌డంలో చార్లెటీ ఆనందానికి అంతేలేదు. అంతే క‌దా.. పోయింద‌నుకున్న గొప్ప వ‌స్తువు తిరిగి చేరితే ఆ ఆనంద‌మే వేరు!  అయితే చార్లెటీకి ఇపుడు ఆ పెయిం టింగ్‌ను భ‌ద్రంగా చూసుకునే ఆస‌క్తి వున్న‌ప్ప‌టికీ శ‌క్తి సామ‌ర్ధ్యాలు లేవు. అందుక‌నే త్వ‌ర‌లో ఎవ‌రిక‌యినా అమ్మేసీ వ‌చ్చిన సొమ్మును పిల్ల‌ల‌కు పంచుదామ‌నుకుంటోందిట‌!  చార్లెటీ కుటుంబంలో అయిదుగురు అన్న‌ద‌మ్ములు అక్క‌చెల్లెళ్లు వున్నారు. అలాగే ఇర‌వై మంది పిల్ల‌లు ఉన్నారు. అంద‌రూ ఆమె అంటే ఎంతో ప్రేమ చూపుతున్నారు. అంద‌రం ఒకే కుటుంబం, చాలాకాలం త‌ర్వాత ఇల్లు చేరిన క‌ళాఖండం మా కుటుంబానిది అన్న‌ది చార్లెటీ!
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు. చాకోను పార్టీలోకి ఆహ్వానిస్తూ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్’ ఫ్రంట్ ఏర్పాటు గురించి ప్రత్యేకించి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు కానీ, చాకో అలాంటి  సంకేతాలు ఇచ్చారు. ప్రస్తుతం దేశంలో ఉన్న ఏ ఒక్కపార్టీ కూడా బీజేపీకి ప్రత్యాన్మాయం కాదని,సమీప భవిష్యత్ కాంగ్రెస్ సహా ఏ పార్టీ కూడా ఆ స్థాయికి ఎదిగే అవకాశాలు కూడా కనిపించడంలేదని అన్నారు. ఈ పరిస్థితుల్లో దేశంలోని బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ, ఏకమై, ఒకే గొడుగు కిందకు రావలసిన అవసరం ఉందని చాకో అన్నారు. అదే సమయంలో ప్రతిపక్షాలను ఏక తాటిపైకి తెచ్చే బాధ్యతను పవార్ తీసుకోవాలని సంకేత మాత్రంగా చెప్పారు. అంతే కాకుండా కాంగ్రెస్ పేరు ఎత్తకుండా బీజేపీ వ్యతిరేక శక్తులను ఏకం చేసే ఆలోచన ఆ పార్టీ నాయకత్వానికి లేదని నెహ్రూ గాంధీ ఫ్యామిలీ (సోనియా, రాహుల్, ప్రియాంక)ఆలోచనా ధోరణిని పరోక్షంగానే అయినా ఎండ కట్టారు.ఆ విధంగా పవార్ ఆ బాధ్యత తీసుకోవాలని చాకో సూచించారు. ఇందుకు సంబంధించి, పవార్ బహిరంగంగా ఎలాంటి వ్యాఖ్య చేయలేదు. అయితే, చాకో సహా మరికొందరు ‘సీనియర్’ కాంగ్రెస్ నాయకులు, అలాగే సిపిఎం, సిపిఐ నాయకులు కూడా పవార్’తో చాలా కాలంగా థర్డ్ ఫ్రంట్  విషయంగా చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. అయితే మహారాష్ట్రలో సంకీర్ణం మనుగడను దృష్టిలో ఉంచుకుని పవార్ ఆచితూచి అడుగులేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే చాకో పార్టీలో చేరిన సందర్భంలో కూడా ‘చాకో చేరికతో మహారాష్ట్రలోని మహా వికాస్ అగాడీ ప్రభుత్వానికి ఎలాంటి నష్టం జరగదని, పవార్ మహారాష్ట్ర సంకీర్ణ సర్కార్ ప్రస్తావన చేశారని విశ్లేషకులు పేర్కొంటున్నారు.  మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వ మనుగడ గురించ్బి  పవార్ ప్రత్యేకంగా పేర్కొనడం ద్వారా, ఆయన థర్డ్ ఫ్రంట్ విషయంలో వేచి చూసే ఆలోచనలో ఉన్నట్లు అర్థమవుతోందని కూడా  రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే అదే ఎన్సీపీ అసెంబ్లీ ఎన్నికల జరుగతున్న కేరళలో, పశ్చిమ బెంగాల్లో  కాంగ్రెస్ వ్యతిరేక పార్టీలకు మద్దతు ఇస్తోంది. దీన్ని బట్టి చూస్తే, ఎన్సీపీ - కాంగ్రెస్ మధ్య దూరం పెరుగుతోందని స్పష్టమవుతోంది. అయితే, థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఏ రకంగా ముడి పడుతుంది అనే విషయంలో ఇంకా స్పష్టత రావలసి ఉంది. అలాగే, కాంగ్రెస్ లేకుండా జాతీయ స్త్గాయిలో బీజేపీ వ్యతిరేక కూటమిని ఏర్పాటు చేయడం వలన, వ్యతిరేక ఓటు చీలి  అది మళ్ళీ బీజేపీకే మేలు చేస్తుందని, కాబట్టి, ప్రస్తుతం కాంగ్రెస్ సారధ్యంలోని యూపీఏని బలోపేతం చేయడమే ఉత్తమమనే అలోచన కూడా  విపక్ష శిబిరం నుంచి వినవస్తోంది. ఈ నేపధ్యంలోనే, ప్రస్తుతం యూపీఏ ఛైర్పర్సన్’గా ఉన్న సోనియా గాంధీ వయసు, అనారోగ్యం కారణంగా బాధ్యతల నుంచి తప్పుకుని పవార్’కు బాద్యతలు అప్పగించాలనే ప్రతిపాదన వచ్చిందని అంటున్నారు. అలాగే, ఇతర పార్టీలను, ముఖ్యంగా కాంగ్రెస్ నుంచి విడిపోయి సొంత కుంపటి పెట్టుకున్న మమతా బెనర్జీ సారధ్యంలోని తృణమూల్, జగన్మోహన్ రెడ్డి సారధ్యంలోని వైసీపీలను కలుపుకుని కూటమిని బలోపేతం చేయడం ద్వారా బీజేపీని దీటుగా ఎదుర్కోవచ్చనే ఆలోచనలు కూడా సాగుతున్నాయి. అయితే, ఇటు థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు అయినా, యూపీఏని బలోపేతం చేయడమే అయినా, పవారే .. కేంద్ర బిందువు. ఆయన సారధ్యంలోనే ప్రత్యాన్మాయం అనేది విపక్ష శిభిరం నుంచి వినవస్తున్న ప్రస్తుత సమాచారం. మరి అదే జరిగితే రాహుల గాంధీ పరిస్థితి ఏమిటి ? గాంధీ నెహ్రూ కుటుంబం పరిస్థితి ఏమిటి? ఏ ప్రత్యేక ప్రాధాన్యత లేకుండా అందరిలో ఒకరిగా ఫస్ట్ ఫ్యామిలీ సర్దుకు పోతుందా? అంటే..చివరకు ఏమవుతుందో .. ఇప్పుడే చెప్పలేమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది. గతంలో అనేక సందర్భాలలో ముఖ్యమంత్రి కేసీఆర్,ఆర్థిక మంత్రి హరీశ రావు, కరోనా కారణంగా రాష్ట్ర  ఆదాయం గణనీయంగా తగ్గిందని, పేర్కొన్నారు. అయితే, కరోనా నుంచి వేగంగా కోలుకుని, ఆర్థికంగా అంతే వేగంగా పుంజుకున్న రాష్ట్రాలలో తెలంగాణ ప్రధమ స్థానంలో  ఉందని కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సర్వే 2020-21 నివేదిక పేర్కొంది. పడిలేచిన కెరటంలా, తెలంగాణ ‘వీ’ ఆకారంలో ఆర్థికంగా నిలతొక్కుందని కేంద్రం జనవరి  చివరి వారంలో విడుదల చేసిన ఆర్థిక సర్వేలో పేర్కొంది. అలాగే, రెవిన్యూ వసూళ్ళలో రాష్ట్రం కరోనా పూర్వస్థితికి చేరిందని కూడా సర్వే చెప్పింది.   అలాగే,రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు కూడా ఈ మధ్య కాలంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పై సంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరమ జనవరి,ఫిబ్రవరి, మార్చి నెలలతో పోలిస్తే ఈ సంవత్సరం ఈ మూడు నెలల కాలంలో రాష్ట్ర ఆర్థిక వృద్ది రేటు 10 నుంచి  15 శాతం మెరుగ్గా ఉందని హరీష్ రావు ఒకటి రెండు ఇంటర్వ్యూలలో పేర్కొన్నారు.అలాగే, బడ్జెట్ విషయంలోనూ ఆయన చాల ఆశావహ దృక్పథంతోనే ఉన్నారు. బడ్జెట్  పాజిటివ్’గా ఉంటుదని, ఎవ్వరూ ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని, సంక్షేమ పథకాలలో,ఇతరత్రా బడ్జెట్ కేటాయింపులలో ఎలాంటి కోతలు ఉండవని కూడా హరీష్ హామీ ఇచ్చారు. గత సంవత్సరంలో కొంత మేర హామీ ఇచ్చిన మేరకు అమలు చేయలేక పోయిన సొంత జాగాలలో డబల్ బెడ్ రూమ్ ఇళ్ళ నిర్మాణం, రుణ మాఫీ వంటి  పథకాలను ఈ బడ్జెట్ ద్వారా అమలు చేస్తామని చెప్పారు. అలాగే, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ తమిళి సై చేసిన ప్రసంగంలోనూ ఆశావహ దృక్పధమే వ్యక్తమైంది. ఆమె తమ ప్రసంగంలో,  ప్రభుత్వం సంక్షేమ పథకాలకు పెద్ద పీట వేసిందని అన్నారు. ‘సంపద పంచాలి ,పేదలకు పంచాలి’ అనేది తమ ప్రభుత్వ విధానమని స్పష్టం చేశారు. అలాగే, పెరుగతున్న ఆదాయంలో అధికశాతం సంక్షేమానికే వెచ్చిస్తున్నామని స్పష్టం చేశారు. దీంతో బడ్జెట్’లో కొత్త పథకాలకు శ్రీకారం చుట్టే అవకాశం ఉంటుందా అన్న చర్చ జరుగుతోంది. మరో వంక ఉద్యోగ వర్గాల్లో పీఆర్సీకి సంబంధించి ఆర్థిక మంత్రి తమ ప్రసంగంలో  ప్రకటన చేస్తారా లేదా అనే ఆసక్తి నెలకొంది. అలాగే, సామాన్య  ప్రజలు ఇటీవల పెరిగిన పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరల భారం నుంచి మంత్రి హరీష్, ఏదైనా ఉపసమనం కలిపిస్తారా అని ఎదురు చూస్తున్నారు. గతంలో వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సామాన్య ప్రజలపై వంటగ్యాస్ ధర భారాన్ని తగ్గించేందుకు కొంత మొత్తాన్ని, రూ.50(?) రాష్ట్ర ప్రభుత్వం తరపున  సబ్సిడీగా ఇచ్చిన విషయాన్ని, అదే విధంగా అసెంబ్లీ ఎన్నికలు జరుగతున్న తమిళనాడులో డిఎంకే పార్టీ,తమ పార్టీని అధికారంలోకి వస్తే  గ్యాస్ బండపై వంద రూపాయల సబ్సిడీ ఇస్తామని చేసిన  వాగ్దానాన్ని  గుర్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే, ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు, సోమవారం ఆర్థిక మంత్రి హరీష్ రావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఆర్థిక  శాఖ ముఖ్య కార్యదర్శి రామ కృష్ణా రావు,సలహాదారు జీఆర్ రెడ్డితో బడ్జెట్ పద్దులఫై సుదీర్ఘంగా చర్చించి తుది మెరుగులు దిద్దారు. బడ్జెట్ తుది రూపం సిద్దమైన నేపధ్యంలో ఆర్థిక శాఖ ప్రింటింగ్ ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 18 ఉదయం మంత్రి వర్గం ఆమోదం పొందిన అనంతరం ఆర్థికమంత్రి హరీష్ రావు అదే రోజు రాష్ట్ర బడ్జెట్ 2021-22ను సభలో ప్రవేశ పెడతారు. 20, 22 తేదీల్లో బడ్జెట్‌పై సాధారణ చర్చ,23, 24, 25 తేదీల్లో బడ్జెట్‌ పద్దులపై చర్చ ఉంటుంది 26న ద్రవ్యవినిమయ బిల్లు (బడ్జెట్)పై చర్చ, సభామోదం ఉంటాయి.
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది.  అధికార తెరాస, ఖమ్మం స్థానానికి సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర రెడ్డి పేరును ప్రకటించడంలో కొంచెం జాప్యం చేయడంతో పాటుగా, హైదరాబాద్ స్థానం నుంచి , పీవీ కుమార్తె వాణీ దేవి పేరును చివరి క్షణంలో తెరమీదకు తేవడంతో అంత వరకు కొంత స్తబ్దుగా సాగిన ప్రచారం ఆ తర్వాత వేడెక్కింది. ఉద్యోగ నియామకాల విషయంలో తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ తప్పులో కాలేయడంతో విపక్షాలు, పోటీలో ఉన్న ప్రత్యర్ధులు, నిరుద్యోగ యువత, విద్యార్ధి సంఘాలు  ఒకే సారి ఆయన మీద  విరుచుకు పడ్డారు. ఆయన లెక్క తప్పని నిరుపిస్తం రమ్మని వరస సవాళ్ళు విసిరారు. దీంతో, మంత్రి నియామకా ఇష్యూని పక్కకు తప్పించేందుకు , ఐటీఐఆర్, వరంగల్ రైల్వే ఫ్యాక్టరీ వంటి సెంటిమెంటల్ ఇష్యూస్’ను తెరపైకి  తెచ్చారు. అలాగే, కేంద్ర ప్రభుత్వంపై విమర్శల దాడిని పెంచారు. చివరకు పొరుగు రాష్ట్రానికి చెందిన విశాఖ ఉక్కు ఆందోళన   కూడా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగమైంది.   రెండు నియోజక వర్గాలలో గతంతో పోలిస్తే ఈసారి ఓటర్ల సంఖ్య రెట్టింపు అయింది. ఈసారి రెండు నియోజక వర్గాలలో కలిపి 10 లక్ష 36 వేల మంది తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. అలాగే, రెండు పట్ట భద్రుల నియోజక వర్గాల్లో 164 మంది అభ్యర్ధులు పోటీలో ఉన్నారు.  గత ఎన్నికలతో పోలిస్తే ఇటు ఓటర్ల సంఖ్య, అటు అభ్యర్థుల సంఖ్యా రెట్టింపునకు పైగానే పెరగడంతో ఎన్నికలలో జోష్ పెరిగింది. దీనికితోడు అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో సాధారణ ఎన్నికలను తలపించే రీతిలో ప్రచారం సాగింది. ఎక్కువమంది అభ్యర్ధులు బరిలో ఉండడంతో, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి  తమకే ప్రయోజనం జరుగుతుందని అధికార పార్టీ ఆశపడుతోంది .  దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో చేదు ఫలితాలను చవిచూసిన టీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా వ్యూహ రచన చేసి కేటీఆర్, హరీష్ సహా మంత్రులు,ఎమ్మెల్యేలకు స్పెసిఫిక్ బాధ్యతలు అప్పగించారు. అలాగే,కాంగ్రెస్‌ అభ్యర్థులు చిన్నారెడ్డి, రాములునాయక్‌లకు మద్దతుగా ఉత్తమ్‌, భట్టి, రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తదితరులు విస్తృతంగా ప్రచారం చేశారు. బీజేపీ అభ్యర్థులు ఎన్‌.రాంచందర్‌రావు, ప్రేమేందర్‌రెడ్డిల తరఫున ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, ఎంపీ అరవింద్‌ తదితరులు ప్రచారాన్ని వేడెక్కించారు.  ఖమ్మం స్థానం నుంచి ప్రత్యక్ష ఎన్నికల్లో తొలిసారి పోటీకి దిగిన కోదండరాంకు, టీజేఎస్‌ పార్టీకీ ఈ ఎన్నికలు కీలకంగా మారాయి. ఖమ్మ స్థానం నుంచి పోటీ చేస్తున్న తీన్మార్ మల్లన్న ముందస్తు వ్యూహంతో ప్రధాన పార్టీల అభ్యర్ధులకు ధీటుగా ప్రచారం సాగించారు.  వామపక్షాల మద్దతుతో జయసారథి, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్‌, యువతెలంగాణ కార్యనిర్వాహక అధ్యక్షురాలు రాణీ రుద్రమ తదితరులు పోటీలో ఖమ్మం సీటును పట్టభద్రులు  ఎవరికి  పట్టం కడతారు అన్నది ప్రశ్నార్థకంగా మారింది. హైదరాబాద్ సీటు కూడా ఇటు అధికార తెరాసకు అటు సిట్టింగ్ సీటును నిలుపుకోవడం తో పాటుగా దుబ్బాక , జీహెచ్ఎంసి జోష్ ను కొనసాగించాలని ఆశ పడుతున్నబీజేలకే కూడా ఇజ్జత్ కీ సవాల్ గా మారింది. కాంగ్రెస్ అభ్యర్ధి పార్టీ సీనియర్ నాయకుడు సౌమ్యుడు, మాజీ మంత్రి చిన్నారెడ్డి, వామ పక్షాల మద్దతుతో పోటీ చేస్తున్న మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ కూడా గట్టి పోటీ ఇస్తున్నారు. సో.. చివరకు ఏమి జరుగుతుంది అంటే ఏదైనా జరగవచ్చును. ఈ నెల 14 వ తేదీన పోలింగ్ జరుగుతుంది.17 ఫలితాలు వస్తాయి .. అంతవరకు వెయిట్ అండ్ వాచ్ .  
సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది. ఒకప్పుడు ఎర్ర జెండాను దిగ్విజయంగా ఎదిరించి, మార్క్సిస్టులను మట్టి కరిపించిన మమతా దీదీ ప్రస్తుతం, కాషాయ కూటమి నుంచి గట్టి సవాలును ఎదుర్కుంటున్నారు. వరసగా పదేళ్ళు పాలించడం వలన సహజంగా వచ్చిన ప్రభుత్వ వ్యతిరేకత  కంటే, హిందూ ఓటు పోలరైజేషన్ ఆమెను మరింతగా భయపెడుతోంది. నిజానికి ఐదేళ్ళ క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం ఐదు శాతం కంటే తక్కువ ఓట్లు, మూడంటే మూడు అసెంబ్లీ సీట్లు మాత్రమే గెలుచుకున్న బీజేపీ..  2019 లోక్ సభ ఎన్నికల్లో ఏకంగా 40 శాతం ఓట్లతో 18 స్థానాలు గెలుచుకుంది. ఈ  మార్పు ఇంకా కొన్ని కారణాలు ఉంటే ఉండవచ్చును కానీ.. హిందువుల ఓటు పోలరైజ్  కావడమే ప్రధాన కారణం.  ఈ నేపధ్యంలోనే కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ చివరకు కమ్యూనిస్టులు కూడా బీజేపీలో  చేరారు. ఎన్నికల ప్రకటన వెలువడిన తర్వాత కూడా సిట్టింగ్ ఎమ్మెల్ల్యేలు సహా  తృణమూల్ టికెట్ వచ్చిన నాయకులు కూడా బీజేపీలో చేరుతున్నారు. అనేక మంది ఇతర రంగాల ప్రముఖులు, ముఖ్యంగా ఇంతకాలం, బీజేపీని హిదుత్వ అనుకూల ‘అచ్చుత్’ (అంటారని) పార్టీగా చూసిన ‘సెక్యులర్’ ప్రముఖులు కాషాయం కప్పుకోవడంతో మమతా బెనర్జీకి కొంచెం అలస్యంగానే అయినా, తత్త్వం బోధపడింది. అందుకే ఆమె ఇప్పుడు గుళ్ళూ,గోపురాలకు తిరుగుతున్నారు. కార్యకర్తల సమావేశాల్లో తానూ హిందువునేనని, చెప్పుకుంటున్నారు.  నిజానికి ఇలా నేనూ హిందువునే  అని సెక్యులర్ నేతలు బహిరంగంగా ప్రకటించుకోవడం మమతా బెనర్జీతోనే మొదలు కాలేదు. రాహుల్ గాంధీ తాను హిందువునని, జన్యుధారీ కశ్మీరీ బ్రాహ్మణుని అనీ.. తమ గోత్రం, ‘దత్తాత్రేయ’ గోత్రమని బహిరంగంగా ప్రకటించుకున్నారు. అలాగే  కొద్ది రోజుల క్రితం ప్రియాంకా గాంధీ తానూ హిందువునని చెప్పుకునేందుకు ‘మౌని అమావాస్య’ సందర్భంగా అలహాబాద్ లో గంగా స్నానం చేశారు. గతంలోనూ ఆమె ఎన్నికలకు ముందు గంగా యాత్ర చేశారు. అంతవరకు ఎందుకు కొద్దిరోజుల క్రితం సిపిఐ నారాయణ విశాఖ స్వామి ఆశీస్సులు తీసుకున్నారు. చంద్రబాబు, జగన్ రెడ్డి, కేసీఆర్ ఇలా తెలుగు నేతలు అనేక మంది లౌకిక వాదానికి కాలం చెల్లిందన్న సత్యాన్ని గ్రహించి కావచ్చు ‘నేనూ హిందువును’ అంటూ ప్రకటించుకునేందుకు పోటీ పడుతున్నారు. రాముడిని తలచుకున్నా, జై శ్రీరామ్ అన్నా తమ  లౌకిక వాదం మయలపడి పోతుందని భయపడిన నాయకులు ఇప్పుడు .. జై శ్రీరామ్ అనేందుకు కూడా వెనకాడడం లేదు.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది. గత కొంత కాలంగా సబర్మలతో సహా అనేక అంశాలపై స్పందిస్తూ.. కేరళను టార్గెట్ చేస్తున్న బీజేపీ నాయకులు అక్కడ తమ జెండా ఎగరేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా పార్టీ పాలసీని కూడా పక్కన పెట్టి మెట్రో మ్యాన్ శ్రీధరన్ ను పార్టీలో చేర్చుకుని ఆయనే తమ సీఎం అభ్యర్థి అని ప్రకటించిన 24 గంటలలో యూ టర్న్ తీసుకున్నారు. ఇది ఇలా ఉండగా ప్రస్తుతం సీఎంగా ఉన్న కమ్యూనిస్ట్ నేత పినరై విజయన్ పై గోల్డ్ స్మగ్లింగ్ ఆరోపణలు రావడంతో.. ఈ ఎన్నికలలో ఎల్డిఎఫ్ భవిష్యత్తుపై ప్రజలు ఏ తీర్పు ఇవ్వబోతున్నారనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది ఈ నేపథ్యంలో అక్షరాస్యతలో దేశంలోనే మొదటి స్థానంలో ఉన్న ఆ రాష్ట్ర ప్రజలు ఎవరిని ఆశీర్వదిస్తారు అనే అంశంపై ప్రముఖ మీడియా సంస్థ టైమ్స్ నౌ, సీ ఓటరుతో కలిసి ఒక సర్వేను నిర్వహించారు. ఈ సర్వే ప్రకారం చూస్తే పాపం కమలనాథులు అక్కడ పవర్ చేతికి రావటం అటుంచి కనీసం రెండు మూడు అసెంబ్లీ స్థానాల్లో గెలవటం కూడా కష్టమేనని ఆ సర్వే తేల్చి చెబుతోంది. కేరళలో ఈసారి జరిగే అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ తన హవా చాటుతుందన్న ఆ పార్టీ నేతల మాటలలో ఎలాంటి నిజం లేదని.. ప్రస్తుతానికి అది ఏమాత్రం సాధ్యం కాదని ఈ తాజా సర్వే తేల్చి చెప్పింది. అంతేకాకుండా మొత్తం 140 స్థానాలు ఉన్న కేరళలో.. ప్రస్తుత సీఎం పినరయి విజయన్ నేతృత్వంలోని లెఫ్ట్డ్ డెమొక్రటిక్ ఫ్రంట్ కు 82 సీట్లు పక్కా అని.. ఆయనే తిరిగి అధికారాన్ని నిలబెట్టుకుంటాడని సర్వే చెపుతోంది. అదే సమయంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూనైటెడ్ డెమొక్రాటిక్ ఫ్రంట్ కు 56 నుంచి 60 వరకు సీట్లు వచ్చే అవకాశం ఉందని ఈ సర్వేలో తేలింది. అంతేకాకుండా 2016 ఎన్నికలతో పోలిస్తే ఎల్ డీఎఫ్ ఓటింగ్ శాతం కూడా కొంత పెరగటం ఇక్కడ గమనార్హం. ప్రస్తుతం సీఎంగా ఉన్న విజయన్ మరోసారి సీఎం కావాలని 43.34 శాతం మంది మొగ్గు చూపినట్లుగా సర్వేలో తేలింది. కరోనా సమయంలో విజయన్ సీఎంగా బాగా పని చేసారని ఈ సర్వే పేర్కొంది. మరోపక్క దేశ ప్రధానిగా రాహుల్ గాంధీ ఉండాలని కేరళ ప్రజల్లో 55.84 శాతం మంది కోరుకుంటున్నట్లుగా ఈ సర్వే;లో తేలింది. అయితే కేరళలో ఎలాగైనా పాగా వేయాలని పట్టుదలతో కృషి చేస్తున్న బీజేపీకి ఈసారి కూడా నిరాశ తప్పదని ఈ సర్వేలో స్పష్టం అయింది. ఈ ఎన్నికలలో బీజేపీకి రెండు సీట్లు కూడా రావటం కూడా కష్టమేనని ఈ సర్వే తేల్చింది. అయితే ఎన్నికలకు ముందు ఇలాంటి సర్వేలు బయటకు రావడం.. తరువాత అందులో కొన్ని చతికిల పడడం మనం చూస్తూనే ఉన్నాం. మరి ఈ సర్వే ఫలితాలు నిజామా అవుతాయో లేదో తేలాలంటే కొద్దీ రోజులు వెయిట్ చేయాల్సిందే.        
రాజకీయాలు అంటేనే అదో జూదం. పూలమ్మిన చోటనే కట్టెలు అమ్మవలసి రావచ్చును. అలాంటి పరిస్థితే వచ్చినా, తలవంచుకుని పోగలిగితేనే, ఎవరైనా రాజకీయాలలో రాణించగలరు. అలాకాదని, అలిమి కానిచోట, కూడా తామే అధికులమని భావిస్తే, ఎందుకూ కాకుండా పోతారు. అలాంటి వారు ఇద్దరూ కూడా ఇప్పుడు మన కళ్ళముందే ఉన్నారు.  జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు. అలాగే జయ మరణం తర్వాత ఆమె పరిస్థితి ఏమిటో కూడా వేరే చెప్పవలసిన, అవసరం లేదు. జైలు పాలయ్యారు. సర్వం తానై నడిపించిన పార్టీ నుంచి  బహిష్కరణకు గురయ్యారు. జయ ఉన్నంత వరకు తన వారుగా ఉన్న వారందరూ కానివారయ్యారు. ఒంటరిగా మిగిలారు.  నిజానికి నాలుగేళ్ళు జైలు జీవితం గడిపిన తర్వాత కూడా ఆమె తలచుకుంటే.. రాష్ట్ర రాజకీయాలలో, ముఖ్యంగా అధికారంలో ఉన్న డిఎంకే కూటమిలో అలజడి సృష్టించగలరు. ఎన్నికలలో ఆమె గెలవక పోవచ్చును కానీ.. తనను కాదన్న అన్నాడిఎంకేను ఓడించగలరు. అయిన  ఆమె అందుకు విరుద్ధంగా  రాజకీయాలకు వీడ్కోలు పలికి మౌనంగా పక్కకు తప్పుకున్నారు. రాజకీయ సన్యాసం ప్రకటించారు. ఉమ్మడి శతృవు డిఎంకే ను ఓడించేందుకు అన్నా డిఎంకే కూటమి  పోటీ చేయాలని, కూటమి ఐక్యతను దెబ్బతీయరాదనే ఉద్దేశంతోనే ఆమె రాజకీయ సన్యాసం ప్రకటించారు.    శశికళ మౌనంగా వెళ్లి పోవడం వెనక ఇంకా అనేక కారణాలున్నా ,అసలు కారణం ఆమె, రాజకీయ విజ్ఞత, వివేకం. ఆమె జైలుకు వెళ్ళిన సమయంలో జయలలిత సమాధి వద్ద ఎంత కసిగా, కోపంగా ‘మౌన’ ప్రతిజ్ఞ చేశారో చూశా. అలాంటి ఆమె ఇప్పుడు ఇలా ‘మౌనం’గా వెనకడుగు వేశారంటే, అది ఆలోచించ వలసిన విషయమే.ఆమె వ్యుహతంకంగానే సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే అనేక మంది అనేక కోణాల్లో శశికళ సంచలన నిర్ణయాన్ని విశ్లేషించారు.జైలు జీవితం తర్వాత కూడా అన్నా డిఎంకే నాయకులు తనను అగ్రనేతగా అంగీకరించక పోవడం, అమిత్ షా చెప్పినా.. అన్నా డిఎంకే నాయకులు ఆమెను, మేనల్లుడు దినకరన్’ను కులం పేరున, కుటుంబం పేరున దూరం చేయడం, తిరిగి పార్టీలోకి తీసుకోకపోవడంతో ఆమె మనసు కష్టపెట్టుకుని, సన్యాస నిర్ణయం తీసుకున్నారని కొందరంటున్నారు. పార్టీ మీద పట్టు లేదని, చరిష్మా అసలే లేదని, అందుకే ఆమె అలా నిశ్శబ్ధంగా రాజకీయ సన్యాసం స్వీకరించారని ఇంకొందరు విశ్లేషించారు. ఈ విశ్లేషణలో కొంత నిజం ఉంటే ఉండవచ్చును.. కానీ ఆమె గతాన్ని, నైజాన్ని గుర్తు చేసుకుంటే ఆమె స్ట్రైక్ బ్యాక్ వ్యూహంతోనే ఒకడుగు వెనక్కివేశారని ఆమెతో సన్నిహితంగా మెలిగినవారు, ఆమె రాజకీయ చాణక్యం తెలిసిన వారు అంటారు.   నిజానికి జైలులో ఉన్న కాలంలో కానీ, జైలు నుంచి విడుదలై వచ్చిన తర్వాత కానీ, ఆమె రాజకీయ సన్యాసం వైపు అడుగులు వేస్తున్నట్లు కనిపించలేదు. బెంగుళూరు జైలు నుంచి విడుదలై చెన్నైలో ప్రవేశించిన నప్పుడు ఆమె పెద్ద కాన్వాయ్ తో  తమ కారుకు అన్నాడిఎంకే జెండాతోనే ఎంటరయ్యారు. అలా ఎంట్రీలోనే రాజకీయ ఆకాంక్షను వెంట తెచ్చుకున్నారు. చివరకు ‘సన్యాస’ ప్రకట చేసే వరకు కూడా ఆమె రాజకీయ కార్యకలాపాలు సాగిస్తూనే ఉన్నారు. అటు ఢిల్లీని ఇటు చెన్నైనికూడా కదిల్చారు. అంతేకాదు, రాజకీయాలపై విరక్తితో కాదు, రాజకీయ కసితో, ఉమ్మడి శత్రువు (డిఎంకే) ను ఓడించేందుకే తాను రాజకీయాలనుంచి తపుకుంటున్నట్లు చెప్పారు.  సో .. సన్యాసం తీసుకోవాలనే ఆలోచన, రాజకీయవ్యూహం లోంచి పుట్టిందే కానీ,వైరాగ్యంతో పుట్టింది కాదు ,అన్నవిశ్లేషణ వాస్తవానికి ఇంకొంత దగ్గరగా ఉందని అనుకోవచ్చును. ఇది ‘కామా’నే కాని ‘ఫుల్స్టాప్’ కాదని అంటున్నారు.  ముఖ్యమంత్రి ఎడప్పాడి కే. పళని స్వామి (ఈపీఎస్) ఆమెను పార్టీలోకి అనుమతిస్తే తన కుర్చికీ ఎసరు పెడతారనే భయంతోనే,, ఆమె ఎంట్రీని అడ్డుకున్నారు. ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం, శశికళ ఒకే సామజిక వర్గానికి చెందిన వారు కావడం కూడా, ముఖ్యమంత్రి ఈపీఎస్’ భయానికి కారణంగా పేర్కొంటారు. అందుకే  ఆయన, ‘మన్నార్గుడి’ ఫ్యామిలీని బూచిగా చూపించి, ఆమెను దూరంగా ఉంచారని పార్టీలో ఒక వర్గం గట్టిగా విశ్వసిస్తుంది. అయితే ఆమె శక్తియుక్తులను కూడతీసుకుని  పులిలా పంజా విసిరేందుకే ఆమె వ్యూహాత్మకంగా ఒక అడుగు వెనక్కి వేశారు కావచ్చును అని కూడా, తమిళ రాజకీయ వర్గాల్లో ఒక చర్చ జరుగుతోంది.  గతంలో ఆమె జయలలితతో విబేధాలు వచ్చిన సమయంలో కూడా ఇలాగే కొద్ది కాలం మౌనంగా తెర చాటుకు వెళ్లి పోయారు.  కొద్ది కాలంలోనే మళ్ళీ ‘పోయస్ గార్డెన్’లో ప్రత్యక్షమయ్యారు. జయలలిత స్వయంగా ఆమెను వెనక్కి పిలుపించుకోవలసిన పరిస్థితులను సృష్టించారు. అలా  మళ్ళీ  చక్రం తిప్పారు. జయలలిత మరణం వరకు ఆమె అందరికీ చిన్నమ్మగా అమ్మకు పెద్దమ్మగా సర్వం తానై నిలిచారు. చివరకు జయ అంత్యక్రియల్లో కూడా ఆమెదే పై చేయిగా కనిపించింది.   జయలలిత చనిపోయిన సందర్భంలోనే అన్నా డిఎంకే ఎమ్మెల్ల్యేలో సుమారు 30 మంది వరకు ఆమెకు మద్దతుగా ఉన్నారన్న వార్తలొచ్చాయి. నిజానికి,ఇప్పటికి కూడా ఒక్క అన్నా డిఎంకే లోనేకాదు,డిఎంకే ఇతర పార్టీలలో కూడా  ఆమె అవసరం ఉన్న వాళ్ళు ఉన్నారు. కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో ‘మన్నార్గుడి’ ఫ్యామిలీ మద్దతు లేకుండా గెలిచే అవకాశం లేదు.  ఇవ్వన్నీ నిజమే అయినా.. అన్నీ ఉండి, ఎవరు లేని శశికళలో, ఇంకా  ఎవరి కోసం తాపత్రయ పడాలి? అనే ప్రశ్న జనించి ఉంటే, ఆమె రాజకీయ సన్యాసం నిజం కావచ్చును. ఎందుకంటే ఆమె నెచ్చలి, జయలిత లేరు, భర్త అంతకంటే ముందే చనిపోయారు, పిల్లలు లేరు... పైగా నాలుగేళ్ళ జైలు జీవితం ఆమెలో మార్పు తెచ్చి ఉండవచ్చును. ఈ వయస్సులో తనవారంటూ ఎవరు లేని తనకు రాజకీయాలు ఎందుకు ? శేష జీవితాన్ని ఇలా సాగిద్దామనే ఆలోచన నిజంగా వచ్చి ఉంటే, ఆమె సన్యాసం సత్యం అయినా కావచ్చును, కాకపోనూ వచ్చును. కానీ  శశికళ... ఆమెను అర్థం చేసుకోవడం, అంచనా వేయడం , అంత తేలిగ్గా అయ్యే పని కాదు..
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు. కాంగ్రెస్ అధినాయకత్వం పై నేరుగా అస్త్రాలు సంధించారు. రాహుల్ గాంధీ పేరు చెప్పకుండానే, ఆయన నాయకత్వానికి పనికిరాడని తేల్చి చెప్పారు. ఎవరైనా పార్టీ అధ్యక్షుడు అయితే కావచ్చును, కానీ, ప్రజానాయకుడు కాలేడని, రాహుల గాంధీ ప్రజానాయకుడు కాదు కాలేరు,అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తరచూ రాహుల్ గాంధీని ఉద్దేశించి చేసే  ‘నామ్’ధారీ వ్యంగ్యాస్త్రాన్నే కాంగ్రెస్ సీనియర్ నాయకులు కూడా సందించారు. ఇక అక్కడి నుంచి విధేయ, అసమ్మతి వర్గాల మధ్య మాటల యుద్ధం ఎదో ఒక రూపంలో సాగుతూనే వుంది. అదే క్రమంలో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ, కరుడు కట్టిన ముస్లిం మతోన్మాది, అబ్బాస్ సిద్దిఖీతో కాంగ్రెస్ పార్టీ చేతులు కలపడం అసమ్మతి నాయకులకు మరో అస్త్రాన్ని అందించింది. విషయంలోకి వెళితే, ఇటీవల పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా లోక్’సభలో కాంగ్రెస్ పక్ష నాయకుడు, పశ్చిమ బెంగాల్ పీసీసీ అధ్యక్షుడు అధీర్’రంజన్ చౌదరి, ముస్లిం మత ప్రచారకుడు, అబ్బాస్ సిద్దిఖీతో  వేదిక పంచుకున్నారు.అంతకు ముందే వామ పక్ష కూటమితో  పొత్తు కుదుర్చుకున్న కాంగ్రెస్ పార్టీ, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)ను కూటమిలో చేర్చుకుంది. ఇలా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) అమోదం లేకుండా మతోన్మాద ఐఎస్ఎఫ్’ తో ఎన్నికల పొత్తు పెట్టుకోవడం ఆ పార్టీ నాయకుడు,సిద్ధిఖీతో  పీసీసీ చీఫ్ వేదిక  పంచుకోవడం పై అసమ్మతి నేతలు మండి పడుతున్నారు. ఇలా సిద్దిఖీతో వేదిక పంచుకోవడం పార్టీ మౌలిక సిద్ధాంతాలకు వ్యతిరేకం అంటూ అసమ్మతి వర్గానికి చెందిన కీలక నేత, రాజ్యసభ సభ్యుడు,ఆనంద్ శర్మ మండిపడ్డారు. అంతే కాదు, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)తో జనవరిలో కుదుర్చుకున్న పొత్తుకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ)అమోదం లేదని ఆనంద్ శర్మ, అభ్యంతరం వ్యక్త చేశారు. పార్టీ విశ్వసించే లౌకిక వాదానికి కాంగ్రెస్ అధిష్టానం తీసుకున్న నిర్ణయం గొడ్డలి పెట్టని ఆయన తీవ్రంగా స్పందించారు.   శర్మ వ్యాఖ్యలపై అధీర్ రంజన్ చౌదరి అంతే ఘాటుగా ప్రతిస్పందించారు. “నిజాలు తెలుసుకోండి ఆనంద్ శ‌ర్మ జీ” అంటూ ఆయ‌న వ‌రుస ట్వీట్లు చేశారు. వ్య‌క్తిగ‌త ప్ర‌యోజ‌నాలు ప‌క్క‌న‌పెట్టి, ప్ర‌ధానిని పొగిడి టైమ్ వేస్ట్ చేయ‌కండంటూ ఆయ‌న ఓ ట్వీట్లో అన్నారు. ఆనంద్ శ‌ర్మ అన‌వ‌స‌రంగా కాంగ్రెస్‌ను ల‌క్ష్యంగా చేసుకుంటున్నార‌ని, ఈ అంశాన్ని పెద్ద‌ది చేసి చూపిస్తున్నార‌ని విమ‌ర్శించారు. ఆయ‌న ఉద్దేశాలు స‌రైన‌వే అయితే నేరుగా తనతో మాట్లాడ వలసిందని అన్నారు. బెంగాల్‌లో సీపీఐ(ఎం) కూట‌మికి నేతృత్వం వ‌హిస్తోంది. అందులో కాంగ్రెస్ ఓ భాగం. మ‌త‌తత్వ‌, విభ‌జ‌న రాజ‌కీయాలు చేస్తున్న బీజేపీకి చెక్ పెట్ట‌డానికే ఈ కూట‌మి అని మ‌రో ట్వీట్‌లో అధిర్ రంజ‌న్ అన్నారు. అక్కడతోనూ ఆగలేదు ... ట్వీట్ల మీద ట్వీట్లు సంధిస్తూ, ఆనంద్ శర్మ, బీజేపీ మత విభజన, అజెండాను బలపరుస్తున్నారని, పరోక్షంగా జీ23 నాయకులు బీజేపీకి ప్రయోజనం చేకూరుస్తున్నారని ఆరోపించారు.అంతే కాదు, క్షేత్ర స్థాయి వాస్తవ పరిస్థితులు తెలియకుండా, ఆనంద్ శర్మ పార్టీ మీద దండెత్తడం ఉచితం కాదని చౌదరి ఎదురుదాడి చేశారు. అసమ్మతిలో అసమ్మతి. ఇదలా ఉంటే, కాంగ్రెస్ పార్టీ  సమూల పక్షాళన కోరుతూ సోనియా గాంధీకి,గత సంవత్సరం  జీ 23గా ప్రాచుర్యం పొందిన సీనియర్ నాయకులు రాసిన లేఖపై సంతకాలు చేసిన  నాయకుల్లో నలుగురు,జమ్మూలోసమావేసమైన నాయకుల తాజా నిర్ణయాలు, వ్యాఖ్యలు,విమర్శల పట్ల అసంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరం సోనియా గాంధీకి రాసిన లేఖలో ప్రస్తావించిన అంశాలకు కట్టుబడి ఉన్నామని, అయితే, జీ 23లోని కొందరు సహచరులు, ఇటీవల గీతదాటి చేస్తున్న వ్యాఖ్యలు, విమర్శలను తాము సమర్ధించడం లేదని ఆ నలుగురు పేర్కొన్నారు. ఇందులో ముఖ్యంగా, రాజ్యసభ మాజీ డిప్యూటీ చైర్మన్, పీజే కురియన్ అయితే, “కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు అవసరమైన సంస్కరణలు తెచ్చేందుకు చేసే ప్రయత్నాలను పూర్తిగా సమర్దిస్తాను, కానీ, ‘లక్ష్మణ రేఖ’ దాటితే ఒప్పుకునేది లేదు”అని అసమ్మతిలో అసమ్మతికి తెర తీశారు.అలాగే, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ కుమారడు, మాజీ ఎంపీ సందీప్ దీక్షిత్,మధ్య ప్రదేశ్ సీనియర్ కాంగ్రెస్ నాయకుడు అజయ్ సింగ్’ కూడా గులాం నబీ ఆజాద్, కపిల్ సిబల్, ఆనంద్ శర్మ, మనీష్ తివారీ వంటి జీ 23 కీలక నేతలు అధినాయకత్వంపై చేసిన వ్యాఖ్యలను తప్పు పట్టారు. అలాగే, పార్టీ సీనియర్ నాయకుడు కేంద్ర మాజీమంత్రి వీరప్ప మొయిలీ కూడా,గత సంవత్సరం పార్టీ సీనియర్ నాయకులు  ఒక పరిమిత లక్ష్యంతో  సోనియా గాంధీకి లేఖ రాయడం జరిగిందని, ఆ పేరున జరుగతున్న  కార్యక్రమాలు లేఖ సంకల్పానికి  విరుద్ధమని అన్నారు. జీ 23 కార్యకలాపాలపై రాహుల్ గాంధీ కూడా పరోక్షగా స్పందించారు, ఒకప్పుడు ఎన్ఎస్’యుఐ, యూత్ కాంగ్రెస్’ కు సంస్థాగత ఎన్నికలు వద్దన్న వారే ఇప్పుడు ఇంకోలా మాట్లాడుతున్నారని పరోక్షంగానే అయినా సంస్థాగత ఎన్నికలు నిర్వహించడంతో పాటుగా, పార్టీ పక్షాలనకు తమ కుటుంబం వ్యతిరేకం కాదని, అందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఈ నేపధ్యంలో కాంగ్రెస్ పార్టీలో చెలరిగిన కలకలం  ఇక ముందు ఏమవుతుందో .. ఇంకెన్ని  మలుపులు తిరుగుతోందో ..చూడవలసిందే కానీ ఉహించలేము.
పంచతంత్రంగా పిలుచుకుంటున్న ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భతం జరగబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే, వివిధ సంస్థలు అసెంబ్లీ ఎన్నికలు జరిగే  అస్సాం. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటుగా కేరళలోనూ ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఆ ఒపీనియన్ పోల్ ఫలితాలు నిజంగా నిజం అయితే, కేరళలో మళ్ళీ సీపీఎం సారధ్యంలోని వామపక్ష కూటమి అధికారంలోకి వస్తుంది. ఇదే ఆ అద్భుతం. ఎందుకంటే, గత నాలుగు దశాబ్దాలలో కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో ఒకే కూటమి వరసగా రెండవసారి అధికారంలోకి వచ్చిన చరిత్ర లేనే లేదు. ఒక సారి ఎల్డీఎఫ్ అధికారంలోకి వస్తే ఐదేళ్ళ తర్వాత కాంగ్రెస్ సారధ్యంలోని ఐక్య ప్రజాస్వామ్య కూటమి(యూడీఎఫ్) అధికారంలోకి రావడం, దేవభుమిలో దైవ నిర్ణయమా అన్నట్లుగా ప్రతి ఎన్నికల్లోనూ అధికారం చేతులు మారుతూ వస్తోంది. అలాంటిది, ఈసారి ఒపీనియన్ పోల్స్ నిజమై వరసగా రెండవసారి వామపక్ష కూటమి అధికారంలోకి వస్తే, అది చరిత్రే అవుతుంది. ఇక ఒపీనియన్ పోల్స్ విషయానికి వస్తే, జాతీయ న్యూస్ ఛానెల్ ఏబీపీ, సీ ఓటర్ సంస్థలు సంయుక్తంగా ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఈ సర్వే ప్రకారం, 140 స్థానాలున్న కేరళ అసెంబ్లీలో వామపక్ష కూటమికి 83 నుంచి  91 స్థానాలు, యూడీఎఫ్ కూటమికి 47 నుంచి 55 స్థానాలు మాత్రమే దక్కుతాయని తెలుస్తోంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్రంలో ఇలా జాతకాలు తిరగబడడంపై సోషల్ మీడియాలో,’లెగ్ మహిమ’ లాంటి జోక్స్  ట్రోలవుతున్నాయి. అయితే 2016లో జరిగిన ఎన్నికల్లో కేవలం 47 సీట్లకే పరిమితం అయిన కాంగ్రెస్’కు ఈసారి ఒకటీ అరా సీట్లు ఎక్కువస్తే, రావచ్చును. అదే కాంగ్రెస్’కు కాసింత ఊరట. అదలా ఉంటే, పశ్చిమ బెంగాల్లో సైతం పట్టు సాధించిన బీజేపే, కేరళలో మాత్రం పట్టు కాదు కదా, పట్టుమని పది సీట్లు తెచ్చుకునే స్థితిలో లేదు. నిజానికి, దేశంలో బీజేపీకి అసలు ఏ మాత్రం మింగుడు పడని రాష్ట్రాలు ఎవైన ఉన్నాయంటే కేరళ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల  పేర్లే ప్రముఖంగా వినిపిస్తాయి. ఈ సారి కూడా కమల దళం కేరళలో కాలు పెట్టె పరిస్తి లేదని సర్వే ఫలితాలు చెపుతున్నారు. ఎప్పటిలానే ఇప్పడు కూడా  బీజేపీకి సున్నా నుంచి రెండు సీట్లు వచ్చే అవకాశం ఉందని, సర్వేస్వరుల అభిప్రాయంగా ఉంది. కేరళలో మొత్తం 140 స్థానాలకు ఏప్రిల్ 6 తేదీన ఒకే విడతలో పోలింగ్ జరుగుతుంది. మే 2 తేదీన ఫలితాలు వెలువడతాయి. కేరళ ఎలక్షన్ పై యావత్ దేశం ఆసక్తి కనబరుస్తోంది.    
కేంద్ర ఎన్నికలసంఘం ‘పాంచ్ పటాక’ గంట కొట్టింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. ఎన్నికల గంట మోగడంతో మొదలైన మరో భారత ‘మినీ’  సంగ్రామానికి మే 12 తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తెర పడుతుంది.ఈలోగా వివిధ అంచల్లో పోలింగ్ జరుగుతుంది.  నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతం ఓటరు తీర్పుకు వెళుతున్నా, అందరి దృష్టి, ముఖ్యంగా ప్రాంతీయ పార్టీల ఏలుబడిలో ఉన్న ఉభయ తెలుగు రాష్ట్రాలు, మరీ ముఖ్యంగా ఇప్పటికే బీజేపీ కన్నుపడిన తెలంగాణ రాష్ట్ర ప్రజలు, రాజకీయ పార్టీల దుష్టి  మాత్రం పశ్చిమ బెంగాల్ పైనే వుంది.  పశ్చిమ బెంగాల్లో ‘అద్భుతం’ జరిగి బీజేపీ విజయం సాధిస్తే, ఇక  కమల దళం ఫోకస్, తెలంగాణకు షిఫ్ట్ అవుతుంది. ఇది అందరికీ తెలిసిన బహిరంగ రహస్యం. ఈ నేపధ్యంలో బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయి అనే విషయంలో రాష్ట్ర రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. బెంగాల్లో బీజేపీ గెలిస్తే, ఇప్పటికే అంతర్గత కుటుంబ కలహాలతో సతమతవుతున్న తెరాస నాయకత్వానికి మరిన్నితిప్పలు తప్పవన్న మాట అంతఃపుర వర్గాలలో సైతం వినవస్తోంది.  పశ్చిమ బెంగాల్’లో ఎలాగైతే కమలదళం ఓ వంక తమ ట్రేడ్ మార్క్, హిందుత్వ రాజకీయాలు సాగిస్తూ, మరో వైపు నుంచి ‘ఆకర్ష్’ అస్త్రంతో అధికార పార్టీని నిర్వీర్యం చేసిన విధంగానే, ఇక్కడ కూడా ఫిరాయింపులను ప్రోత్సహింఛి పార్టీని నిట్టనిలువునా చీల్చే ప్రమాదాన్ని కొట్టివేయలేమని పార్టీ వర్గాలు కూడా అనుమానం వ్యక్త పరుస్తున్నాయి.  ఇప్పటికే తెలంగాణ  బీజేపీ నాయకులు 30 మంది తెరాస ఎమ్మెల్యేలు తమ టచ్ లో ఉన్నారని బెదిరిస్తున్నారు.అది నిజం అయినా కాకపోయినా..తెరాసలో అసంతృప్తి అగ్గి రగులుతోందనేది మాత్రం ఎవరూ కాదనలేని నిజం. అంతే కాకుండా రాష్ట్రానికి వచ్చిన కేంద్రనాయకులు ఎవరిని పలకరించినా, నెక్స్ట్ టార్గెట్ తెలంగాణ అని ఎలాంటి సషబిషలు లేకుండా కుండబద్దలు కొడుతున్నారు.అందుకే, బెంగాల్లో బీజేపీ గెలిస్తే.. అనే ఊహా కూడా  గులాబీ గూటిలో గుబులు పుట్టిస్తోంది. అయితే, బెగాల్’లో బీజేపీ గెలిస్తే ఒక్క తెలంగాణలోనే కాదు, దేశ రాజకీయ వాతావరణంలోనే పెను మార్పులు చోటు చేసుకుంటున్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.  అలాగే,  దేశ ముఖ చిత్రంలో కూడా పెను మార్పులు తప్పవని అంటున్నారు. అయితే రాజకీయాలలో ఎప్పుడు ఏం జరుగుతుందో.. ఎవరూహించెదరు..
సహాయం.. మనిషికి ఉండాల్సిన మంచి గుణాలలో సహాయం చేయడం కూడా ఒకటి. ఆపదలో ఉన్నవారికి,  అవసరం లో ఉన్నవారికి,  ఇబ్బందులలో ఉన్నవారికి సహాయం చేయడం చాలామంచి లక్షణం.కానీ కొన్నిసార్లు, ఆలోచించకుండా చేసే సహాయం పెద్ద తలనొప్పిగా మారవచ్చు. చాణక్య నీతి ప్రకారం.. కొందరు వ్యక్తులకు సహాయం చేయడం వల్ల ఇబ్బందులు పడతారని, అంతే కాకుండా కొందరు వ్యక్తులకు సహాయం చేస్తే.. సహాయం చేసిన వారే నాశనం అవుతారని, తీవ్ర సమస్యలో చిక్కుకుంటారని చెబుతారు. అలాంటి మూడు రకాల వ్యక్తుల గురించి కూడా ఆచార్య చాణక్యుడు చెప్పాడు. దీని గురించి వివరంగా తెలుసుకుంటే.. దుర్మార్గులు, చెడ్డ గుణం కలిగిన స్త్రీ, పురుషులు.. చెడ్డ మనసు లేదా చెడు గుణం కలిగిన , కోపిష్టి స్వభావం ఉన్నవారికి ఎల్లప్పుడూ దూరంగా ఉండాలి. అలాంటి వారికి సహాయం చేయడం అంటే మన కాళ్ళను  మనమే కాల్చుకోవడం లాంటిది. చెడ్డ   స్వభావం ఉన్నవారు ఎవరికీ స్నేహితులు కారు.  వారికి ఎంత దయ చూపినా,  అవకాశం దొరకగానే తిరిగి హాని చేయడానికి  వెనుకాడరు. అలాంటి వ్యక్తులకు సపోర్ట్ చేయడం  వల్ల సామాజిక హోదా , ప్రతిష్టపై ప్రతికూల ప్రభావం పడుతుంది. అందువల్ల అటువంటి వ్యక్తులకు సంబంధించిన ఏ విషయాలకు అయినా దూరంగా ఉండాలి. ఎప్పుడూ విచారంగా ఉండేవారు.. ఈ ప్రపంచంలో కొందరు ఎటువంటి కారణం లేకుండా ఎప్పుడూ ఏడుస్తూ ఉంటారు. అన్నీ ఉన్నప్పటికీ, వారు తమ విధిని, పరిస్థితులను ఎప్పుడూ  నిందించుకుంటూ ఉంటారు. ఇలాంటి నెది నెగిటివ్  మనస్తత్వం ఉన్నవారికి సహాయం చేయడం మానుకోవాలని చాణక్యుడు చెప్పాడు. అలాంటి వారు తమ జీవితంలో ఎప్పటికీ సంతోషంగా లేదా సంతృప్తిగా ఉండలేరు.  అలాంటి  వారికి సహాయం చేస్తే, వారి ప్రతికూల శక్తి  జీవితాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. క్రమంగా వారికి సహాయం చేసేవారు కూడా మానసిక ఒత్తిడికి గురై  సంతోషాన్ని కోల్పోతారు. మూర్ఖుడు.. మూర్ఖుడికి , బుద్ధిహీనుడికి ఏదైనా చెప్పడం,  మూర్ఖుడికి సలహా ఇవ్వడం లేదా సహాయం చేయడం అత్యంత మూర్ఖపు పనిగా చెబుతారు. తమ మంచి చెడులను తాము తెలుసుకోలేని వ్యక్తికి ఏదైనా వివరించడం పూర్తిగా సమయం వృధా చేసినట్టే. అలాంటి   సరైన మార్గంలోకి నడిపించడానికి ప్రయత్నించినప్పుడు, వారు తరచుగా  చెప్పేదాన్ని అపార్థం చేసుకుంటారు. అలాంటి వ్యక్తులు సహాయం అందించే వ్యక్తిని తమ శత్రువుగా భావిస్తారు. వారితో వాదించడం లేదా వారికి సహాయం చేయడానికి ప్రయత్నించడం వల్ల  మనశ్శాంతిని పూర్తిగా కోల్పోవాల్సి వస్తుంది. సహాయం చేసేటప్పుడు ఈ విషయాలను గుర్తుంచుకోవాలి.. ఇతరులకు సహాయం చేయడం అంటే తప్పనిసరిగా మిమ్మల్ని మీరు ప్రమాదంలో పడేసుకోవడం కాదు. సహాయం చేసే గుణం మంచిదే అయినప్పటికీ, ,తెలివిని  ఉపయోగించడం కూడా అంతే ముఖ్యం. ఎవరికైనా సహాయం చేసే ముందు, వారి ఉద్దేశాలను, ప్రవర్తనను జాగ్రత్తగా అంచనా వేయాలి. ఎదుటి వ్యక్తి మీ సహాయం చేసే గుణాన్ని  దుర్వినియోగం చేయవచ్చని మీకు అనుమానం వస్తే, వెంటనే వెనక్కి తగ్గడం మంచిది. మీ దయా గుణాన్ని ఎవరూ దుర్వినియోగం చేయకుండా ఉండేలా మీ హద్దులను మీరే ఏర్పరచుకోవడం నేర్చుకోవాలి. సరైన వ్యక్తికి సహాయం చేయడం సరైన వ్యక్తి సహాయం చేయడం చాలా మంచిది. మీరు అవసరంలో ఉన్న, నిజాయితీపరుడైన, నిష్కపటమైన వ్యక్తికి సహాయం చేసినప్పుడు,  తప్పకుండా ప్రతిఫలాన్ని పొందుతారు. సరైన వ్యక్తికి సహాయం చేయడం మనశ్శాంతిని ఇస్తుంది , సమాజంలో  గౌరవాన్ని పెంచుతుంది. మన సహాయ గుణాన్ని సరైన చోట ఉపయోగించాలని చాణక్య నీతి  బోధిస్తుంది. మీరు మీ శక్తిని, ధనాన్ని సరైన చోట, సరైన వ్యక్తుల వద్ద పెట్టుబడిగా పెట్టినప్పుడు మాత్రమే మీకు మంచి జరుగుతుందని అంటున్నాడు ఆచార్య చాణక్యుడు. అందువల్ల, ఎల్లప్పుడూ  మంచి చెడుల మధ్య వ్యత్యాసాన్ని అర్థం చేసుకున్న తర్వాతే ఇతరులకు సహాయం చేయాలి.                                    *రూపశ్రీ.  
 తల్లిదండ్రులు చేసే ఈ తప్పులు.. పిల్లల ఆత్మవిశ్వాసాన్ని దెబ్బ తీస్తాయి..!++ ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లలు ఆత్మవిశ్వాసంతో ఉండాలని, జీవితంలోని ప్రతి సవాలును ధైర్యంగా ఎదుర్కోవాలని కోరుకుంటారు. కానీ కొన్నిసార్లు, తల్లిదండ్రులకు తెలియకుండానే వారి కొన్ని అలవాట్లు, వారి పిల్లల ఆత్మవిశ్వాసాన్ని బలహీనపరుస్తాయి. ఏ తల్లిదండ్రులు కూడా ఉద్దేశపూర్వకంగా తమ పిల్లల ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీయాలని కోరుకోరు.. పిల్లల మనసు చాలా సున్నితంగా ఉంటుంది,  వారు తమ పరిసరాల నుండి త్వరగా నేర్చుకుంటారు. తల్లిదండ్రులు ఇంట్లో పిల్లల ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసేలా ఏమైనా మాట్లాడితే అది వారి భవిష్యత్తును చాలా గందరగోళంగా మారుస్తుంది.  చిన్నతనంలో పిల్లలకు ఎమోషనల్ గా సపోర్ట్ చేస్తేనే వారు భవిష్యత్తులో ఆత్మవిశ్వాసంగా ఉండగలుగుతారు. తాము కూడా తెలియకుండానే తమ పిల్లల ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసి, ఆ విషయాన్ని ఎవరికీ చెప్పుకోలేని స్థితికి తీసుకెళ్లే పరిస్థితి రాకుండా ఉండాలంటే.. తల్లిదండ్రులు కొన్ని విషయాలను తెలుసుకోవాలి.. పిల్లల తప్పుకు పోల్చి తిట్టడం.. చాలా మంది తల్లిదండ్రులు, తమ పిల్లల తప్పుకు కోపం తెచ్చుకుని, వారిని ఇతర పిల్లలతో పోల్చడం మొదలు పెడతారు.  ఇలా పోల్చడం ఎప్పుడైతై  మొదలవుతుందో అప్పుడు పిల్లలు ఇతరులను చూపించి, వారితో పోల్చి తిడతారు కూడా.  మార్కుల విషయంలో కావచ్చు,  తెలివి తేటల విషయంలో కావచ్చు, ఏదైనా కొత్త విషయం నేర్చుకోవడంలో కావచ్చు,  చురుగ్గా ఉండే విషయంలో కావచ్చు..  ఇలా  ప్రతిదానికి తల్లిదండ్రులు పిల్లలను పోల్చి మాట్లాడితే..  పిల్లలు చాలా బాధపడతారు, తమను తాము పనికిరానివారిగా భావిస్తారు. ఇక్కడే వారి ఆత్మవిశ్వాసం సన్నగిల్లడం మొదలవుతుంది. తిట్టడం.. తల్లిదండ్రులు తరచుగా తమ పిల్లలను తప్పులు చేసినందుకు కఠినంగా తిడతారు. కానీ తల్లిదండ్రులు గుర్తుంచుకోవాల్సినది.. వారు పిల్లలని, ఇంకా నేర్చుకునే దశలోనే ఉన్నారని, అలాంటప్పుడు  తరచుగా తప్పులు జరుగుతాయని అర్థం చేసుకోవాలి.   పిల్లలను తప్పులకు పదేపదే తిడితే, వారు కొత్తగా ఏదైనా ప్రయత్నించడానికి భయపడతారు. తప్పు చేయడం చెడ్డ విషయమని, మళ్ళీ తిట్లు పడతాయని భావించి, ఏదైనా కొత్త విషయం నేర్చుకోవడానికి, లేదా ప్రయత్నించడానికి కూడా భయపడి ప్రయత్నాలు మానేస్తారు. ఎమోషన్స్ ను లైట్ తీసుకోవడం.. పిల్లలు చాలా సున్నితంగా ఉంటారు.  వారు భయపడినప్పుడు, బాధపడినప్పుడు లేదా కలత చెందినప్పుడు,  "ఇంత చిన్న విషయానికి ఏడవకు"  అనడం లేదా "ఇది పెద్ద విషయమేమీ కాదు" అని తోసిపుచ్చేయడం.. వంటివి తల్లిదండ్రులు చేస్తుంటారు.  దీనివల్ల  తమ భావాలకు విలువ లేదని  పిల్లలు భావిస్తారు. దీనివల్ల, తమను ఎవరూ అర్థం చేసుకోరనే భావనతో వారు తమ భావాలను, ఆలోచనలను దాచుకుంటారు. ఇది వారి నమ్మకాన్ని బలహీనపరుస్తుంది, దాని ప్రభావం వారి ఆత్మవిశ్వాసంపై నేరుగా పడుతుంది ఓవర్ ప్రొటెక్షన్,  హెల్పింగ్.. చాలామంది తల్లిదండ్రులు, తమ పిల్లలకు సహాయం చేసే నెపంతో, వారి స్కూల్ బ్యాగులు సర్దడం, పిల్లల ఇష్టాలతో పని లేకుండా  తామే బట్టలు షాపింగ్ చేయడం లేదా నిర్ణయాలు తీసుకోవడం వంటి ప్రతి పనిని తామే చేస్తారు. దీనివల్ల పిల్లలు తమ పనులు తాము చేసుకునే అవకాశాన్ని కోల్పోతారు. పిల్లలు ఏదైనా పనిని  తామే చేసినప్పుడు వారికి తమ సామర్థ్యం పెరుగుతుంది. అలా కాకుండా అన్నీ తల్లిదండ్రులే చేస్తుంటే పిల్లలకు వారి సామర్థ్యం గురించి తెలియదు.  క్రమంగా, వారు చిన్న చిన్న విషయాలకు కూడా తమ తల్లిదండ్రులపై ఆధారపడతారు తక్కువ చేసి మాట్లాడటం.. కొంతమంది తల్లిదండ్రులు తమ పిల్లలను తిడతారు లేదా బంధువులు, స్నేహితులు లేదా అతిథుల ముందు వారి బలహీనతలను  బయటపెడతారు. దీనివల్ల పిల్లలు చాలా షేమ్ గా ఫీలవుతారు. తమను తాము తక్కువగా భావించుకుంటారు. పదేపదే అందరి ముందు  అవమానపడటం వల్ల,  అందరి ముందు ఓపెన్ మాట్లాడటానికి , ఏదైనా చెప్పడానికి భయపడతారు. అది వారి ఆత్మవిశ్వాసంపై నేరుగా ప్రభావం చూపుతుంది. అభిరుచులు రుద్దడం.. చాలా మంది తల్లిదండ్రులు తమ పిల్లలు చదువు విషయంలో గానీ, అభిరుచుల విషయంలో గానీ తమకు నచ్చినది చేయాలని కోరుకుంటారు. పిల్లల సొంత ఇష్టాయిష్టాలను, అభిప్రాయాలను  పట్టించుకోరు. పిల్లలకు తమకు నచ్చింది ఎంచుకోవడం,  నచ్చిన పని చేయడం వంటి అవకాశాలు లేనప్పుడు తమ నిర్ణయాలకు విలువ లేదని పిల్లలు భావిస్తారు. ఇది వారిలో ఆత్మవిశ్వాసం లోపించడానికి, అలాగే దృఢమైన నిర్ణయాలు తీసుకోవడంలో వెనకడుగు వేయడానికి  దారితీస్తుంది.                                *రూపశ్రీ  
ఉద్యోగం చేస్తున్నాం అయినా సంపాదన సరిపోవడం లేదు.. ఈ మాట చాలామంది చెబుతూ ఉంటారు.  ముఖ్యంగా మధ్యతరగతి కుటుంబాలలో అవసరాలు,  ఖర్చు,  కలలు ఎక్కువ.. కానీ సంపాదన మాత్రం అరకొరగానే ఉంటుంది. వచ్చే సంపాదన సరిపోక మెరుగైన సంపాద వచ్చే  ఉద్యోగాల కోసం వెతుకుతూ ఉంటారు. కానీ చాలామంది చేసే మిస్టేక్.. సైడ్ ఇన్కమ్ కోసం ప్రయత్నించకపోవడం. ఉద్యోగం చేస్తూనే ఎక్స్టాగా ఇన్కమ్ సంపాదించడం వల్ల ఆర్థికంగా ఎంతో వృద్ధి చెందవచ్చు.  దీనికోసం మంచి మార్గాలు,  ఎక్ట్సా ఇన్కమ్ సంపాదించాలనుకునే వారు చేయకూడని తప్పులు తెలుసుకుంటే.. ఫ్రీలాన్సింగ్..  రైటింగ్, డిజైనింగ్, వీడియో ఎడిటింగ్, డిజిటల్ మార్కెటింగ్ లేదా కోడింగ్ వంటి స్కిల్స్  ఉంటే  ఫ్రీలాన్స్ ప్రాజెక్టులు చేయవచ్చు. ఇది  మంచి ఆదాయాన్ని ఇస్తుంది. ఫ్రీలాన్సర్,  ఫైవర్ వంటి ప్లాట్‌ఫామ్‌లలో క్లయింట్ లు ఉంటారు. వారానికి 10–12 గంటలు కేటాయించడం ద్వారా, ₹10,000 నుండి ₹25,000 వరకు సంపాదించవచ్చు. బ్లాగింగ్, కంటెంట్ క్రియేషన్.. రాయడం పట్ల మంచి అభిరుచి ఉంటే  బ్లాగింగ్, యూట్యూబ్ లేదా ఇన్‌స్టాగ్రామ్ వంటి ప్లాట్‌ఫామ్‌లలో కంటెంట్‌ను క్రియేట్ చేయవచ్చు. సబ్స్క్రైబర్స్,  వ్యూస్ బాగా వచ్చిన తరువాత  యాడ్స్ , స్పాన్సర్‌షిప్‌లు కూడా వస్తాయి. వీటి ద్వారా అదనపు ఆదాయం కూడా ఉంటుంది. అయితే దీనికి మంచి కంటెంట్, క్లిక్ అయ్యేవరకు సమయం అవసరం అవుతాయి. ఆదాయం వెంటనే ఉండదు. కాస్త ఓపిక అవసరం. ఆన్లైన్ ట్యూటరింగ్.. కోర్సెస్.. ఏదైనా ఒక  సబ్జెక్టులో బాగా గ్రిప్ ఉంటే అలాంటి వారు  ఆన్‌లైన్ క్లాసెస్ చెప్పవచ్చు.  లేదా డిజిటల్ కోర్సులను క్రియేట్ చేసి  కూడా టీచింగ్ చేయవచ్చు. YouTube, Unacademy వంటి ప్లాట్‌ఫామ్‌లలో చేరవచ్చు.  లేదా Google Meetలో స్వయంగా  క్లాసెస్ చెప్పవచ్చు. ఇది   విద్యార్థులకు,  టీచింగ్ చేసేవారికి కూడా  చాలా బాగుంటుంది. ఈ-బుక్స్.. రాయడం పట్ల మంచి అబిరుచి ఉంటే ఈ-బుక్స్  రాసి కిండిల్ వంటి ప్లాట్‌ఫామ్‌లలో అమ్మడం ద్వారా మంచి ఆదాయాన్ని పొందవచ్చు. ఇంటి నుండి వ్యాపారాన్ని ప్రారంభించడానికి రీసెల్లింగ్ లేదా ఈ-కామర్స్ కూడా ఒక గొప్ప మార్గం. ఈ కామర్స్-రీసెల్లింగ్.. అమెజాన్,  ఫ్లిప్‌కార్ట్ వంటి ప్లాట్‌ఫామ్‌లలో ఉత్పత్తులను అమ్మడం ద్వారా అదనపు ఆదాయం పొందవచ్చు.  ఇంటి నుండి చిన్నగా ప్రారంభించవచ్చు. దుస్తులు, హస్తకళలు లేదా గృహోపకరణాలను అమ్మవచ్చు. ఇది క్రమంగా లాభదాయకమైన వ్యాపారంగా మారవచ్చు. ఇన్వెస్ట్మెంట్ ఇన్కమ్.. సైడ్ ఇన్‌కమ్ అంటే కేవలం పని చేయడం ద్వారా సంపాదించేది మాత్రమే కాదు, డబ్బు సంపాదించడం గురించి. మ్యూచువల్ ఫండ్ SIPలు, స్టాక్ మార్కెట్, బాండ్లు లేదా డిజిటల్ గోల్డ్‌లో  వంటి వాటిలో క్రమం తప్పకుండా పెట్టుబడులు పెట్టడం వల్ల క్రమంగా అదనపు నిధులు వస్తాయి. సరైన సమయంలో పెట్టుబడులు పెట్టడం వల్ల దీర్ఘకాలికంగా మంచి ఆదాయం సృష్టించవచ్చు. ఈ తప్పులు చేయకండి.. సైడ్ ఇన్‌కమ్‌ను మొదలుపెట్టే ముందు  త్వరగా డబ్బు సంపాదించాలనే లక్ష్యంతో  తరచుగా తప్పులు చేస్తాము. ఆ తప్పులేంటంటే.. తొందరపాటు చాలామందికి ఉంటుంది.  సైడ్ ఇన్కమ్ కావాలనే తొందరలో తప్పటడుగు వేయకూడదు. సైడ్ ఇన్కమ్ మీద ఆశతో ఎలాంటి పరిశోధనలు చేయకుండా లేదా డబ్బులు పెట్టుబడి పెట్టడం లేదా డబ్బు సరిగా చెల్లించని చోట వర్క్ చేయడానికి ఒప్పుకోవడం వంటివి చేయకూడదు. సైడ్ ఇన్కమ్ మోజులో పడిచాలామంది  ఉద్యోగాన్ని నిర్లక్ష్యం చేస్తారు. ఇది కూడా కరెక్ట్ కాదు. ఎక్కువ లాభం వస్తుందని ఇచ్చే ప్రకటనలు చూసి మోసపోయి డబ్బులు పెట్టకూడదు. కేవలం అదనంగా చేసే పని ద్వారా సైడ్ ఇన్కమ్ ఉండేలా చూసుకోవాలి. అంతేకానీ డబ్బు కోసం ఎక్కువ ఒత్తిడి తీసుకుని పని చేయకూడదు. సైడ్ ఇన్కమ్ అయిన, ఉద్యోగం ద్వారా వచ్చే ఆదాయం అయినా కుటుంబం కోసమే.. కానీ పని కోసం కుటుంబాన్ని నిర్లక్ష్యం చేయకూడదు. గొప్పలు చెప్పుకోవడానికి  సైడ్ ఇన్కమ్ సంపాదించడం మంచిది కాదు. భవిష్యత్ కోసం పొదువు చేయడానికి  సైడ్ ఇన్కమ్ సంపాదించాలి.                               *రూపశ్రీ.
పిల్లలు తమ మనసులో ఉన్న ప్రతి విషయాన్ని తల్లిదండ్రులతో స్వేచ్ఛగా పంచుకుంటున్నారా? లేక కొన్ని విషయాలను దాచిపెడుతున్నారా? పిల్లలు తమ సమస్యలు, భయాలు, సందేహాలు, విజయాలు, అపజయాలు అన్నింటినీ తల్లిదండ్రులతో నమ్మకంగా చెప్పుకోవడం వారి మానసిక ఎదుగుదలకు ఎంతో అవసరం.  ఈ వీడియోలో ప్రముఖ నిపుణురాలు డా. పూర్ణిమ నాగరాజ్ పిల్లలతో తల్లిదండ్రులు ఎలా స్నేహపూర్వకంగా ఉండాలి, పిల్లల్లో నమ్మకాన్ని ఎలా పెంచాలి, వారు ఏ పరిస్థితిలోనైనా తమ మనసులోని మాటను చెప్పేలా ఎలా ప్రోత్సహించాలి అనే అంశాలను సులభంగా వివరించారు. అలాగే పిల్లల మాటలను మధ్యలో అడ్డుకోకుండా వినడం, విమర్శించకుండా స్పందించడం, భయపెట్టకుండా మార్గనిర్దేశం చేయడం, కుటుంబంలో ఓపెన్ కమ్యూనికేషన్‌ను పెంపొందించడం వంటి ముఖ్యమైన పేరెంటింగ్ సూచనలను కూడా ఈ వీడియోలో తెలుసుకోవచ్చు. ప్రతి తల్లిదండ్రి తప్పకుండా చూడాల్సిన ఈ వీడియో పిల్లలతో బలమైన అనుబంధాన్ని ఏర్పరచుకోవడానికి ఉపయోగపడుతుంది. మీ ఆరోగ్య సమస్య ఏదైనా... మా హెల్త్ యూట్యూబ్ ఛానల్‌లో సీనియర్ డాక్టర్స్ చెప్పిన సలహాలు... సూచనలు ఉన్నాయి. మా యూట్యూబ్ ఛానల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 👉 TeluguOne Health (సబ్‌స్క్రైబ్ చేయడం మర్చిపోకండి!)    
పంచదార.. నేటికాలంలో చాలా విరివిగా వాడుతున్నారు. కాఫీ, టీ,  స్వీట్లు,  ఇంట్లో చేసే తీపి పదార్థాలు, డిజర్ట్ లు.. ఇలా చాలా తీపి పదార్థాల తయారీలో పంచదారది అగ్రస్థానం.  కాఫీ, టీ ల విషయాని వస్తే.. రోజులో కప్పుల కొద్ది తాగేవారు కూడా ఉంటారు. అయితే.. ఇది ఆరోగ్యానికి మంచిది కాదని నేటికాలంలో వైద్యులు కూడా పెద్ద ఎత్తునే చెబుతున్నారు. గత కొన్నేళ్లుగా చక్కెరను ఎడాపెడా వాడిన వారిలో చాలా మంది ప్రస్తుతం డయాబెటిస్ పేషెంట్లుగా మారారన్నది ఒప్పుకోవాల్సిన నిజం. అయితే.. కేవలం ఒక వారం రోజుల పాటూ చక్కెర వాడకాన్ని ఆపి చూడమని వైద్యులు, ఆహార నిపుణులు చెబుతున్నారు.  వారం రోజులు చక్కెర వాడటం మానేస్తే శరీరంలో జరిగే మార్పుల గురించి కూడా వారు చెబుతున్నారు.  అసలు వారం రోజుల పాటూ పంచదార వాడటం మానేస్తే  ఏం జరుగుతుంది? పూర్తీగా తెలుసుకుంటే.. వారం రోజులు చక్కెర వాడటం మానేస్తే జరిగే మార్పులు.. చక్కెర అలవాటు ఉన్నవారు ఉన్నపళంగా చక్కెర వాడటాన్ని ఆపేస్తే.. మొదటి ఒకటి రెండు రోజులు తీపి తినాలని అనిపిస్తుంది. కానీ క్రమంగా శరీరం చక్కెర లేకుండా ఉండటానికి అలవాటు పడుతుంది. చక్కెర వాడటం మానేస్తే.. మునుపటి కంటే ఎక్కువగా శరీరంలో ఎనర్జీ ఉండటాన్ని గమనించవచ్చు.  దీన్ని అనుభూతి కూడా చెందవచ్చు. చర్మంలో కూడా గణనీయమైన మార్పులు కనిపిస్తాయి. చర్మంలో మెరుపు వస్తుంది.  ముఖ్యంగా చర్మం మీద మొటిమలు,  దద్దుర్లు.. వంటివి క్రమంగా తగ్గడం గమనించవచ్చు. చక్కెర వాడటం ఆపేస్తే జీవక్రియ మెరుగవుతుంది.  గతంలో అంటే.. చక్కెర వాడుతున్నప్పుడు కంటే.. చక్కెర వాడటం మానేసిన తర్వాత జీవక్రియ వేగంగా మారుతుంది. చక్కెర వాడటం మానేస్తే.. ముఖ్యంగా రక్తంలో చక్కెర స్థాయిలు సమతుల్యంగా మారతాయి. అధిక బరువు ఉన్నవారు చక్కెర వాడటం మానేస్తే.., క్రమంగా బరువు తగ్గడం మొదలవుతుంది.  వారం రోజులలో స్పష్టంగా మార్పు కనిపించకపోయినా.. చక్కెర వాడటం మానేస్తే.. క్రమంగా బరువు తగ్గడం సులువు అవుతుంది.                                       *రూపశ్రీ.
పిల్లలకు పేరు పెట్టడం అనేది ప్రతి తల్లిదండ్రులకు ఎంతో ప్రత్యేకమైన మరియు పవిత్రమైన సందర్భం. అయితే పేరు అనేది కేవలం పిలవడానికి మాత్రమే కాకుండా, వ్యక్తి జీవితంపై, వ్యక్తిత్వంపై, ఆలోచనా విధానంపై కూడా ప్రభావం చూపుతుందని భారతీయ సనాతన సంప్రదాయం చెబుతోంది. ఈ భక్తివన్ ప్రత్యేక కార్యక్రమంలో ప్రముఖ ఆధ్యాత్మిక వక్త డా. అనంత లక్ష్మి గారు, పిల్లలకు పేరు ఎలా ఎంపిక చేయాలి, నామకరణంలో పాటించాల్సిన శాస్త్ర నియమాలు, జన్మ నక్షత్రం ఆధారంగా పేరు ఎందుకు పెట్టాలి, పేరుకు ఉన్న ఆధ్యాత్మిక మరియు సాంప్రదాయ ప్రాముఖ్యత వంటి అనేక ఆసక్తికరమైన విషయాలను సులభంగా వివరిస్తారు. అలాగే పిల్లల భవిష్యత్తు ఉజ్వలంగా ఉండేందుకు పేరు ఎంపికలో తల్లిదండ్రులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ అంశాలను పరిగణనలోకి తీసుకోవాలి అనే విషయాలపై కూడా విలువైన సూచనలు అందిస్తున్నారు. పిల్లలకు పేరు పెట్టాలని ఆలోచిస్తున్న ప్రతి తల్లిదండ్రులు, అలాగే హిందూ ధర్మం, నామకరణ సంప్రదాయాల గురించి తెలుసుకోవాలనుకునే ప్రతి ఒక్కరూ తప్పకుండా చూడాల్సిన ఆధ్యాత్మిక కార్యక్రమం ఇది. ఈ వీడియోను పూర్తిగా వీక్షించి, మీ కుటుంబ సభ్యులు మరియు స్నేహితులతో కూడా పంచుకోండి. ఆధ్యాత్మిక విశేషాలు, పూజా విధానాలు, దేవాలయాల మహిమ, పండుగల ప్రాముఖ్యత కోసం మా Bhakthi One యూట్యూబ్ ఛానల్‌ను సందర్శించండి. సబ్‌స్క్రైబ్ చేయడం మర్చిపోకండి!