LATEST NEWS
పలమనేరు మాజీ ఎమ్మెల్యే ఠాణేదార్ చిన్న (టి.సి.) రాజన్ కన్నుమూశారు. ఆయన వయస్సు 108 ఏళ్లు.  కొంతకాలంగా వృద్ధాప్యంతో వచ్చే అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన, బెంగుళూరులోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఆయన మరణ వార్తతో పలమనేరులో విషాదం నెలకొంది. పలువురు రాజకీయ ప్రముఖులు రాజన్ మృతి పట్ల సంతాపం వ్యక్తం చేశారు.  టి.సి. రాజన్ 1967లో స్వతంత్ర పార్టీ తరపున పలమనేరు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. రాజకీయాల్లో ఆయన తన సుదీర్ఘ సేవలతో ప్రత్యేక గుర్తింపు పొందారు.    దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడిన రాజన్..   గాంధీజీ, నేతాజీ సిద్ధాంతాలతో ప్రభావితుడయ్యారు. విలువలకు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చారు.   రాజకీయాల్లో ఉన్నప్పటికీ మాజీ ఎమ్మెల్యే ఠాణేదార్ రాజన్ నిరాడంబర జీవితాన్నే గడిపారు. ఎటువంటి ఆస్తులూ కూడబెట్టలేదు.  ఆయనకు సంత ఇల్లు లేదు.   ప్రభుత్వ పింఛన్‌తోనే ఆ  జీవనాన్ని కొనసాగించారు.  2025లో తన 108వ జన్మదినాన్ని జరుపుకున్నారు.   ప్రజాసేవలో ఆయన చూపిన నిబద్ధత, నిజాయితీ నేటి తరానికి ఆదర్శంగా నిలుస్తాయని పలువురు తమ సంతాపసందేశంలో పేర్కొన్నారు.  
తెలంగాణ ప్రభుత్వం శాసనసభ, శాసనమండలిలో  సమన్వయం కోసం ప్రభుత్వ విప్‌లను   నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అసెంబ్లీలో ప్రభుత్వం తరఫున గొంతుక వినిపించేందుకు, ఎమ్మెల్యేల మధ్య సమన్వయం కోసమూ ముగ్గురు సీనియర్ శాసనసభ్యులను   విప్‌లుగా నియమించింది. నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం, పెద్దపల్లి ఎమ్మెల్యే విజయ రమణారావు,  మహబూబ్‌నగర్ ఎమ్మెల్యేయెన్నం శ్రీనివాస్ రెడ్డి శాసనసభ విప్‌లుగా నియమితులయ్యారు. అలాగే శాసనమండలిలో   అద్దంకి దయాకర్, బల్మూరి వెంకట్‌లను విప్‌లుగా  నియమించింది.   ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికె.రామకృష్ణారావు గురువారం ( మార్చి 19) ఉత్తర్వులు జారీ చేశారు.  
  మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కొత్త పార్టీ పేరును ఖరారు చేశారు. 'తెలంగాణ ప్రజా జాగృతి' (TPJ) పేరుతో కొత్త రాజకీయ పార్టీ పేరు రిజిస్ట్రేషన్ కోసం కవిత డిసెంబర్ 23న కేంద్ర ఎన్నికల సంఘానికి దరఖాస్తు చేసుకున్నాట్లు తెలుస్తోంది. ఈ ప్రక్రియను వేగవంతం చేయాలని కోరుతూ ఆమె ఢిల్లీ హైకోర్టులో ఆశ్రయించారు. దరఖాస్తులో కొన్ని సాంకేతిక లోపాలు ఉన్నాయని ఈసీఐ కోర్టుకు తెలిపింది.ఇవాళ జరగనున్న తదుపరి విచారణలో పార్టీ రిజిస్ట్రేషన్ అంశంపై స్పష్టత రానుంది. బీఆర్ఎస్‌లో చోటుచేసుకున్న పరిణామాల తర్వాత సొంత రాజకీయ పార్టీ ఏర్పాటు చేయబోతున్నట్లు కవిత ఈ ఏడాది జనవరిలోనే ప్రకటించారు. ఉగాది నాటికి కొత్త పార్టీని అధికారికంగా ప్రకటిస్తానని కూడా తెలిపారు. అయితే ఆ దిశగా కసరత్తు జరిగినప్పటికీ, రిజిస్ట్రేషన్ ప్రక్రియలో ఆలస్యం కారణంగా ప్రకటన వాయిదా పడినట్లు సమాచారం.ప్రస్తుతం ‘జాగృతి’ పేరుతో కార్యక్రమాలు కొనసాగుతున్నా, అది రాజకీయ పార్టీ కాకపోవడంతో అందరి దృష్టి కవిత కొత్త పార్టీపై నిలిచింది. రిజిస్ట్రేషన్ పూర్తి అయ్యి అధికారిక ప్రకటన వెలువడితే, తెలంగాణ రాజకీయాల్లో కొత్త పార్టీ ఆవిర్భవించే అవకాశముంది. ఇదిలా ఉంటే, కవిత ఏర్పాటు చేయబోయే పార్టీ పేరులో ‘తెలంగాణ’ పదం ఉండేలా చూస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో బీఆర్ఎస్‌ను టార్గెట్‌గా చేసుకుని ముందుకెళ్లే వ్యూహం ఉన్నట్టుగా చర్చ జరుగుతోంది. గతంలో తెలంగాణ రాష్ట్ర సమితి (TRS)గా ఉన్న పార్టీ, తర్వాత భారత రాష్ట్ర సమితి (BRS)గా పేరు మార్చుకున్న విషయం తెలిసిందే. అప్పటి నుంచి తెలంగాణతో బీఆర్ఎస్‌కు అనుబంధం తగ్గిందనే విమర్శలు వినిపిస్తున్నాయి.ఈ నేపథ్యంలో కవిత పార్టీ పేరులో ‘తెలంగాణ’కు ప్రాధాన్యం ఇవ్వాలని భావిస్తుండటంతో, రాష్ట్ర రాజకీయాల్లో ఆమె కొత్త పార్టీపై ఆసక్తి మరింత పెరుగుతోంది.  
తమిళనాడు రాజకీయాల్లో విలువల పతనం పతాక స్థాయికి చేరిందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.  రాజకీయ నేతలు అంశాల వారీ విమర్శలు కాకుండా హీరోయిన్లపై అనుచిత,  దిగజారుడు వ్యాఖ్యలూ చేస్తూ చౌకబారు రాజకీయాలకు పాల్పడుతున్నారు.   ప్రముఖ హీరోయిన్లను వివాదాల్లోకి లాగుతూ,  వివాదాల్లోకి లాగుతూ వ్యక్తిగత విమర్శల దిగజారుతున్న తీరు తమిళనాట రాజకీయ ప్రతిష్ఠను దిగజారుస్తున్నది. సీనియర్ హీరోయిన్లు త్రిష, నయనతార లను ఉద్దేశించి తమిళ రాజకీయ నాయకులు కొందరు చేసిన వ్యాఖ్యల పట్ల తమిళనాటే కాకుండా దేశ వ్యప్తంగా నిరసన వ్యక్తం అవుతున్నది.   తాజాగా  ఏఐఏడీఎంకే ఎంపీ షణ్ముగం నయనతారపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర అభ్యంతరకరంగా ఉన్నాయి.  తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ ఇటీవల రాష్ట్ర ప్రజల కలల గురించి ప్రస్తావించగా.. ఎంపి షణ్ముగం షణ్ముగం మాట్లాడుతూ..  నాకు నయనతార కావాలి, నా కలను నెరవేరుస్తారా? అంటూ తీచౌకబారు వ్యాఖ్యలు చేశారు.   బాధ్యతాయుతమైన ఎంపీ పదవిలో ఉన్న వ్యక్తి ఇలా  ఒక నటిని ఉద్దేశించి ఇంతటి అభ్యంతరకర రీతిలో వ్యాఖ్యానించడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.  అలాగే మరో అగ్రనటి   త్రిషపై  తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు నైనార్ నాగేంద్రన్ అనుచిత వ్యాఖ్యలు చేశారు. రాజకీయనాయకుడిగా మారిన నటుడు విజయ్‌ను విమర్శించే క్రమంలో  ఆయన అసందర్బంగా, అనుచితంగా త్రిష పేరు  ప్రస్తావించారు. విజయ్ తన ఇంటి నుంచి బయటకు వచ్చి క్షేత్రస్థాయి పరిస్థితులు చూడాలంటూ త్రిషను ఉద్దేశించి ఆయన చేసిన వ్యాఖ్యలు కూడా తీవ్ర విమర్శలకు గురయ్యాయి.  సినిమా రంగంలో తమకంటూ  గుర్తింపును, గౌరవాన్న, అశేష ప్రేక్షకాభిమానాన్నీ సంపాదించుకున్న నటీమణులపై ఇటువంటి అసభ్య, అసందర్భ వ్యాఖ్యలు చేయడంపై మహిళా సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.  రాజకీయ ప్రత్యర్థుల వారి విధానాలను ఎండగడుతూ విమర్శలు చేయాలి కానీ,   సంబంధం లేని మహిళల వ్యక్తిత్వాన్ని కించపరచడం  సరికాదని అంటున్నాయి.  కాగా ఎంపీ  షణ్ముగం నయనతారపై చేసిన వ్యాఖ్యలపై మహిళా కమిషన్   సీరియస్ అయింది. ప్రజాప్రతినిధులు నోరు అదుపులో పెట్టుకోకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించింది. త్వరలో తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో  ప్రచార పర్వంలో ఇంకా ఎలాంటి విమర్శలు వినాల్సి వస్తుందోనన్న ఆందోళన వ్యక్తమౌతోంది. 
మొయినాబాద్ ఫామ్ హౌస్ డ్రగ్స్ కేసులో తెలుగుదేశం ఎంపీ పుట్టా మహేష్ యాదవ్ పేరు ప్రముఖంగా ఉండటం తెలుగు రాజకీయాలలో సంచలనంగా మారింది.  డగ్స్   ఆరోపణలు ఎదుర్కొంటున్న ఏలూరు ఎంపీపై తెలుగుదేశం  అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.  పార్టీ క్రమశిక్షణ , ప్రతిష్ట   భంగం కలిగేలా వ్యవహరిస్తే ఎవరినైనా, ఎంతటి వారినైనా ఉపేక్షించే ప్రశ్నే లేదని స్పష్ఠం చేశారు. మంగళవారం (మార్చి 17)  రాత్రి తిరుపతి నియోజకవర్గ నేతలతో జరిగిన అంతర్గత సమావేశంలో చంద్రబాబు పుట్టా మహేష్ యాదవ్ వ్యవహారం ప్రస్తావించారు. గత ఎన్నికలలో   రాష్ట్రంలో డ్రగ్స్ సంస్కృతిని నిర్మూలిస్తామని ప్రజలకు హామీ ఇచ్చామని, అలాంటిది పార్టీకి చెందిన ప్రజాప్రతినిధే ఇలాంటి వివాదాల్లో చిక్కుకోవడం క్షమించరాని నేరమన్నారు. యువ నాయకుడు, మంచి నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి వచ్చాడన్న ఉద్దేశంతో అవకాశం ఇస్తే, పార్టీకి చెడ్డపేరు తీసుకువచ్చారంటూ పుట్టా మహేష్ యాదవ్ పై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది.  పోరుగు రాష్ట్రంలో ఫామ్ హౌస్ పార్టీకి వెళ్లాల్సిన అవసరం ఏముంది? వెళ్లినా అక్కడ డ్రగ్స్ తీసుకోవడం వంటి చర్యలకు పాల్పడటమేంటని చంద్రబాబు అసహనం వ్యక్తం చేసినట్లు తెలిసింది.   ఇప్పటికే ఈ వ్యవహారంపై ఐదు రోజుల్లోగా వివరణ ఇవ్వాలని పార్టీ అధిష్టానం ఎంపీ పుట్టా మహేష్ కి షోకాజ్ నోటీసు జారీ చేసిన సంగతి తెలిసిదే.   అప్పటి వరకు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని ఆదేశించింది. సాధారణంగా నేతల పట్ల సౌమ్యంగా ఉండే చంద్రబాబు, ఈ విషయంలో మాత్రం అత్యంత కఠినంగా  తిరపతి నియోజకవర్గ నేతలతో జరిగిన అంతర్గత సమావేశంలో పుట్టా మహేష్ యాదవ్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేయడం ద్వారా తెలుస్తోంది.  డ్రగ్స్ పరీక్షల్లో మహేష్ యాదవ్‌కు పాజిటివ్ రావడంతో  వైసీపీ విమర్శలకు పదును పెట్టింది. ఈ నేపథ్యంలోనే  పార్టీ సిద్ధాంతాలకు విరుద్ధంగా వెళ్లే వారిని మోయాల్సిన అవసరం లేదని చంద్రబాబు బాహాటంగానే ప్రకటించారని అంటున్నారు.  పార్టీ షోకాజ్ కు మహేష్ ఇచ్చే వివరణ సంతృప్తి కరంగా లేకుంటే.. ఆయనపై సస్పెన్షన్ వేటు పడటం ఖాయమని తెలుగుదేశం వర్గాలు అంటున్నాయి. పుట్టా మహేష్ యాదవ్ పై తీసుకునే చర్య  ఇతర యువ నేతలకు ఒక హెచ్చరికలా ఉండాలని చంద్రబాబు భావిస్తున్నట్లు చెబుతున్నారు. 
ALSO ON TELUGUONE N E W S
తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్(Gaddar Awards) వేడుక గురువారం సాయంత్రం హైదరాబాద్ లో ఘనంగా జరిగింది. ఈ వేడుకలో సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా 'ఎన్టీఆర్ నేషనల్ అవార్డు'ను చిరంజీవి(Chiranjeevi) అందుకున్నారు. అవార్డు అందుకున్న అనంతరం చిరంజీవి మాట్లాడుతూ.. రేవంత్ రెడ్డిపై ప్రశంసల వర్షం కురిపించారు. కళాకారులను ప్రోత్సహిస్తూ అవార్డులు ఇవ్వడం మంచి విషయమని కొనియాడారు.  అయితే చిరంజీవి తన స్పీచ్ లో ఎన్టీఆర్ గురించి మాట్లాడలేదు. దీంతో అభిమానులు నిరాశచెందారు. ఒక పెద్ద ఈవెంట్ లో మాట్లాడుతున్నప్పుడు.. మాట్లాడాలి అనుకున్నవన్నీ మాట్లాడలేకపోవడం లేదా అనుకోకుండా వేరేవి మాట్లాడటం సహజమే. గద్దర్ అవార్డ్స్ లో చిరంజీవి విషయంలోనూ అలాంటిది జరిగి ఉండొచ్చు. అందుకే ఎన్టీఆర్ పై తనకున్న గౌరవాన్ని తెలుపుతూ తాజాగా చిరంజీవి ట్వీట్ చేశారు. "చరిత్ర కర్తగా నిలిచిన నందమూరి తారక రామారావు గారు… తన పేరుతోనే లలిత కళలను ముందుకు తీసుకుని వెళ్లిన మహా కళాకారుడు. ఎన్టీఆర్ అంటే… N నాట్యం, T తాళం, R రాగం… కళల సమ్మేళనం. తెలుగు సినిమాకు ఉన్న కీర్తిని ఖండాంతరాలకు చేర్చిన మహానుభావుడు. దేవుడు ఎలా ఉంటాడో మనకు తెలియకపోయినా… ఆయన పోషించిన పాత్రల ద్వారా దేవుడిని మన కళ్ల ముందుంచిన అపూర్వ ప్రతిభ. రామారావు గారు జన్మించిందే సినిమాల కోసం అన్నట్టుగా, ఆయన లేని తెలుగు సినిమా ఊహించలేనిది. అలాంటి మహానుభావుని పేరుతో ఉన్న ‘ఎన్టీఆర్ నేషనల్ అవార్డు’ నాకు లభించడం, నా జీవితంలో గొప్ప గౌరవంగా భావిస్తున్నాను." అని చిరంజీవి రాసుకొచ్చారు. https://x.com/KChiruTweets/status/2034841137492762698
  -పెయిడ్ ప్రీమియర్స్ తో టేక్ ఆఫ్ అయిన ధురంధర్ 2  -అన్ని ఏరియాస్ లో పాజిటివ్ టాక్  -ఆ సినిమా రికార్డులన్నీ గల్లంతు కాబోతున్నాయా! -తొలి రోజు ఎంత రాబట్టిందో చూద్దాం. ఎంటైర్ భారతావని అగస్ట్ 15 తో పాటు ఫెస్టివల్స్ ని ఎలా అయితే గుర్తుపెట్టుకుంటుందో, అదే విధంగా ఈ మధ్య కాలంలో ఒక సినిమా రిలీజ్ డేట్ ని గుర్తుపెట్టుకున్నారంటే 'ధురంధర్ 2 'అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. అంతలా ధురంధర్ 2(Dhurandhar 2)భారతీయులతో మమేకమైంది. వాళ్ళు అనుకున్నట్టుగానే 18 సాయంత్రం నుంచి ప్రీమియర్స్ పడటంతో చలో టూ ధురంధర్ 2 అంటు థియేటర్స్ లోపలకి వెళ్లారు. ఆ సమయంలో వాళ్ళ ముఖాల్లో ధురంధర్ 2 చుస్తున్నామన్న గర్వం కూడా చాలా స్పషంగా కనపడింది. మరి అంతటి క్రేజ్ ని అందుకున్న ధురంధర్ 2  ఫస్ట్ డే ఏ మేర కలెక్షన్స్ ని రాబట్టిందో చూద్దాం. ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం వరల్డ్ వైడ్ గా 236 కోట్ల గ్రాస్ వసూలు చేసినట్టుగా రిపోర్ట్స్ వస్తున్నాయి. ఇండియా వైడ్ గా చూసుకుంటే పెయిడ్ ప్రీమియర్స్ ద్వారా 75 కోట్ల గ్రాస్,  నిన్న 100 కోట్ల గ్రాస్ తో మొత్తం 175 కోట్ల గ్రాస్ ని రాబట్టినట్టుగా చెప్తున్నారు . దీంతో బాలీవుడ్ హిస్టరీలోనే హయ్యస్ట్ కలెక్షన్స్ సాధించిన తొలి బాలీవుడ్ మూవీగా  నిలిచింది. ఈ విషయంలో ఇప్పటి వరకు ఆధిపత్యాన్ని చెలాయించిన షారుక్ ఖాన్ జవాన్ మూవీ ధురంధర్ 2 కి వెల్ కమ్ చెప్పి సైడ్ అవ్వాల్సిన పరిస్థితి.  Also read: UStaad Bhagat Singh: ఫస్ట్ డే రికార్డు కలెక్షన్స్!.. ధురంధర్ 2 అవుట్  ప్రెజెంట్ ధురంధర్ 2 అన్ని ఏరియాస్ లో పాజిటివ్ టాక్ తో దూసుకుపోతుంది. రణవీర్ సింగ్(Ranveersingh)వన్ మాన్ షో విశ్వరూపాన్ని ఆదిత్య దర్(Aditya Dhar)పర్ఫెక్ట్ గా ప్రెజెంట్ చెయ్యడమే పాజిటివ్ టాక్ కి కారణం. మరి ఈ లెక్కన తొలి రోజే 236 కోట్ల గ్రాస్ వసూలు చేసిందంటే లాంగ్ రన్ లో రికార్డు కలెక్షన్స్  సాధించడం గ్యారంటీ అని ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి. మరి ఈ లెక్కన పుష్ప 2 టోటల్ కలెక్షన్స్ కి ధురంధర్ 2 ఎసరు పెట్టే అవకాశం ఉంటుందేమో అనే చర్చ సైతం ఇండస్ట్రీ వర్గాల్లో జరుగుతుంది. ధురంధర్ మొదటి భాగం 1300 కోట్ల దగ్గరే ఆగిపోగా, పుష్ప 2 పూర్తి రన్నింగ్ లో 1700 కోట్ల రూపాయిల వరకు రాబట్టింది.   
  -నిన్న సిల్వర్ స్క్రీన్ పై ల్యాండ్ అయిన ఉస్తాద్  -హిట్ అంటున్న ఫ్యాన్స్, మేకర్స్  -తొలి రోజు కల్లెక్షన్స్ ఇవేనా! నిన్న ఉదయం నుంచి రెండు తెలుగు రాష్ట్రాలలోని థియేటర్స్ 'ఉస్తాద్ భగత్ సింగ్'(UStaad Bhagat Singh)రాకతో కళకళలాడాయి. దీంతో పవన్(Pawan Kalyan)అభిమానులు ఎవరో, మూవీ లవర్స్ ఎవరో తెలుసుకోలేని విధంగా జాతర వాతావరణం తలపించింది. ఉగాది రోజు బడా హీరో సినిమా రిలీజ్ చేస్తే బాక్స్ ఆఫీస్ వద్ద ఎంత సందడి వాతావరణం నెలకొని ఉంటుందో ఎంటైర్ ఇండస్ట్రీకి ఉస్తాద్ తన రాకతో కూడా చెప్పినట్లయింది. దాదాపుగా నిన్న అన్ని స్క్రీన్స్ వరల్డ్ వైడ్ గా  ఫుల్ క్లౌడ్ మరి ఫస్ట్ డే ఏ మేర కలెక్షన్స్ సాధించిందో చూద్దాం. ఉస్తాద్ మొదటి రోజు వరల్డ్ వైడ్ గా 52 కోట్ల గ్రాస్ ని రాబట్టినట్టుగా ట్రేడ్ వర్గాల్లో న్యూస్ చక్కర్లు కొడుతుంది. ఇదే కనుక నిజమైతే పవన్ కెరీర్ లోనే మరోసారి ఉస్తాద్ తో  ఫస్ట్ డే కి సంబంధించి మరోసారి రికార్డు  కలెక్షన్స్ రాబట్టినట్టే. ఓజి కన్నా తక్కువే అయినా ఉస్తాద్ సాధారణ రేట్స్ కే ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి ఓపెనింగ్స్ ని రాబట్టడం విశేషం. ధురంధర్ 2 ఫీవర్ తెలుగులో ఉన్నా కూడా ఉస్తాద్ ఫస్ట్ డే కలెక్షన్స్ ని ధురంధర్ 2 దాటలేకపోయింది. కాకపోతే ఉస్తాద్ ఫస్ట్ డే కల్లెక్షన్స్ గురించి మేకర్స్ నుంచి అధికార ప్రకటన రావాల్సి ఉంది. also read: Dhurandhar 2 review in telugu: ధురంధర్ 2 సినిమా రివ్యూ  టాక్ పరంగా చూసుకుంటే ఉస్తాద్ కి ప్రేక్షకుల తో పాటు మెజారిటీ రివ్యూస్ పర్వాలేదనే స్థాయిలో వస్తున్నాయి. అభిమానులు అయితే పవన్ వన్ మాన్ షో అని సినిమా హిట్ అంటున్నారు. మేకర్స్ నిన్న సక్సెస్ మీట్ ని నిర్వహించి అభిమానులకి, ప్రేక్షకులకి కృతజ్ఞతలు తెలిపారు. ఈ నేపథ్యంలో వీకెండ్ తో పాటు లాంగ్ రన్ లో ఉస్తాద్ ఏ మేర కలెక్షన్స్ సాధిస్తుందనే ఆసక్తి అందరిలో ఏర్పడింది.  
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్-2025’ వేడుక హైదరాబాద్‌ లో వైభవంగా జరిగింది. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ వేడుకలో ఈ ఏడాది 'ఎన్టీఆర్‌ నేషనల్ అవార్డు'ను మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) అందుకున్నారు. చిరంజీవికి ఈ అవార్డును రేవంత్ రెడ్డి ప్రధానం చేశారు. (Gaddar Awards) 'ఎన్టీఆర్‌ నేషనల్ అవార్డు' అందుకున్న అనంతరం చిరంజీవి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. "ఎక్కడైతే కళాకారులు గౌరవించబడతారో ఆ రాజ్యం సుభిక్షంగా ఉంటుందని అంటారు. దానిని రేవంత్ రెడ్డి గారు సరిగ్గా అర్థం చేసుకున్నారు. కొన్నేళ్లుగా నిర్లక్ష్యం చేయబడ్డ సినిమా అవార్డులను మళ్ళీ పునరుద్ధరించారు." అంటూ రేవంత్ పై ప్రశంసలు కురిపించారు. అదే సమయంలో ఏపీ సీఎం చంద్రబాబుకి చిరంజీవి ఓ విజ్ఞప్తి చేశారు. సినిమా అవార్డుల విషయంలో తెలుగు రాష్ట్రాల్లో ఒకటైన ఆంధ్రప్రదేశ్ వెనుకబడిందని అభిప్రాయపడ్డారు. సినిమా వాళ్ళకు అతి దగ్గరగా ఉండే చంద్రబాబు గారు.. దీనిని స్ఫూర్తిగా తీసుకొని కళాకారులను ప్రోత్సహిస్తూ అవార్డులు ఇస్తే బాగుంటుందని చిరంజీవి రిక్వెస్ట్ చేశారు. అవార్డుల జాబితా: ఉత్తమ చిత్రం - రాజు వెడ్స్ రాంబాయి రెండవ ఉత్తమ చిత్రం -  దండోరా మూడవ ఉత్తమ చిత్రం -  ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్‌ షో ఉత్తమ పర్యావరణ చిత్రం  - ఇగ్వా ఉత్తమ డెబ్యూ ఫీచర్‌ ఫిల్మ్ - లిటిల్‌ హార్డ్స్ ఉత్తమ వినోదాత్మక చిత్రం  - సంక్రాంతికి వస్తున్నాం ఉత్తమ సోషల్‌ మెసేజ్‌ చిత్రం - కోర్టు ఉత్తమ స్పెషల్‌ ఎఫెక్ట్స్ మూవీ - మిరాయ్‌ ఉత్తమ బాలల చిత్రం  - అనగనగా ఉత్తమ నటుడు- నాగచైతన్య (తండేల్‌) ఉత్తమ నటి - రష్మిక మందన్న (ది గర్ల్ ఫ్రెండ్ ) ఉత్తమ దర్శకుడు - సాయిలు (రాజు వెడ్స్ రాంబాయి) ఉత్తమ సహాయ నటుడు - శివాజీ (దండోరా) ఉత్తమ సహాయ నటి - భూమిక (యుఫోరియా ) ఉత్తమ సంగీత దర్శకుడు-  మార్క్ కె. రాబిన్  (దండోరా) ఉత్తమ మేల్‌ సింగర్‌- అనురాగ్‌ కులకర్ణి (రాజు వెడ్స్‌ రాంబాయి) ఉత్తమ ఫిమేల్‌ సింగర్‌- సాహితి చాగంటి (కన్నప్ప) ఉత్తమ కమెడియన్ - శ్రీ కృష్ణ తేజ (జిగ్రిస్‌) ఉత్తమ బాలనటుడు - రోహన్‌ (ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో ) ఉత్తమ స్టోరీ రైటర్‌ - గుణశేఖర్‌ (యుఫోరియా ) ఉత్తమ స్క్రీన్‌ ప్లే రైటర్‌ - అనిల్‌ రావిపూడి ఉత్తమ గేయ రచయిత - నందకిశోర్‌ (కుబేర) ఉత్తమ సినిమాటోగ్రాఫర్‌ - కార్తిక్‌ ఘట్టమనేని (మిరాయ్‌) ఉత్తమ ఎడిటర్‌- శ్రీకర్‌ ప్రసాద్‌ (మిరాయ్‌) ఉత్తమ ఆడియోగ్రాఫర్‌ - ఎం.ఆర్‌ రాధాకృష్ణన్‌ (కిష్కిందపురి) ఉత్తమ కొరియోగ్రాఫర్‌ - గిర గిర గిర (ఛాంపియన్‌) ఉత్తమ ఆర్ట్ డైరక్టర్‌ - తోట తరణి (ఛాంపియన్‌) ఉత్తమ మేకప్‌ ఆర్టిస్ట్ - గోవింద్‌ (అఖండ) ఉత్తమ కాస్ట్యూమ్‌ డిజైనర్‌ -  చంద్రకాంత్‌ (ఛాంపియన్‌) స్పెషల్‌ జ్యూరీ అవార్డులు.. శ్రీరాజ్ రాచకొండ (23 మూవీ) చైతు జొన్నలగడ్డ (రాజు వెడ్స్‌ రాంబాయి) రోషన్‌ మేక (ఛాంపియన్‌) అనంతిక సనీల్ కుమార్‌ (8 వసంతాలు) స్పెషల్‌ అవార్డులు.. ఎన్టీఆర్‌ నేషనల్ అవార్డు - చిరంజీవి పైడి జైరాజ్ అవార్డు - కమల్‌ హాసన్‌ బీఎన్‌రెడ్డి ఫిల్మ్‌ అవార్డు- సింగీతం శ్రీనివాసరావు నాగిరెడ్డి చక్రపాణి అవార్డు - అశ్వనీ దత్‌ కాంతారావు అవార్డు - ఆర్‌. నారాయణమూర్తి రఘుపతి వెంకయ్య ఫిల్మ్‌ అవార్డు - రమేష్ ప్రసాద్‌ సి.నారాయణరెడ్డి ఫిల్మ్‌ అవార్డు - సుద్దాల అశోక్‌ తేజ అక్కినేని నాగేశ్వరరావు ఫిల్మ్‌ అవార్డు - జయసుధ
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్-2025’ వేడుక హైదరాబాద్‌ లో అత్యంత వైభవంగా జరిగింది. ఈ అవార్డుల వేడుకలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో పాటు పలువురు సినీ ప్రముఖులు పాల్గొన్నారు. చిరంజీవి, నాగార్జున, కమల్ హాసన్, రామ్ చరణ్, నాగ చైతన్య, రష్మిక మందన్న, దిల్ రాజు, అల్లు అరవింద్, అనిల్ రావిపూడి సహా ఎందరో సినీ సెలబ్రిటీలు ఈ ఈవెంట్ లో సందడి చేశారు. (Gaddar Awards) నిధి అగర్వాల్, దేవి శ్రీ ప్రసాద్ వంటి వారు తమ స్టేజ్ పర్ఫార్మెన్స్ లతో అలరించారు. దేవి శ్రీ ప్రసాద్ తాను స్టెప్పులు వేయడమే కాకుండా, పలువురు స్టార్స్ చేత స్టెప్పులు వేయించడం విశేషం. ముఖ్యంగా రష్మికతో కలిసి డ్యాన్స్ చేయడం హైలైట్ గా నిలిచింది. 'గోంగూర తోట కాడ కాపు కాసా' సాంగ్ కి డ్యాన్స్ చేశారు. రష్మికను డ్యాన్స్ చేయడానికి పిలిచే ముందు.. సారీ విజయ్ దేవరకొండ అని దేవిశ్రీ ప్రసాద్ ఫన్నీగా చెప్పాడు. కాగా, విజయ్-రష్మిక ఇటీవల పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. అవార్డుల జాబితా: ఉత్తమ చిత్రం - రాజు వెడ్స్ రాంబాయి రెండవ ఉత్తమ చిత్రం -  దండోరా మూడవ ఉత్తమ చిత్రం -  ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్‌ షో ఉత్తమ పర్యావరణ చిత్రం  - ఇగ్వా ఉత్తమ డెబ్యూ ఫీచర్‌ ఫిల్మ్ - లిటిల్‌ హార్డ్స్ ఉత్తమ వినోదాత్మక చిత్రం  - సంక్రాంతికి వస్తున్నాం ఉత్తమ సోషల్‌ మెసేజ్‌ చిత్రం - కోర్టు ఉత్తమ స్పెషల్‌ ఎఫెక్ట్స్ మూవీ - మిరాయ్‌ ఉత్తమ బాలల చిత్రం  - అనగనగా ఉత్తమ నటుడు- నాగచైతన్య (తండేల్‌) ఉత్తమ నటి - రష్మిక మందన్న (ది గర్ల్ ఫ్రెండ్ ) ఉత్తమ దర్శకుడు - సాయిలు (రాజు వెడ్స్ రాంబాయి) ఉత్తమ సహాయ నటుడు - శివాజీ (దండోరా) ఉత్తమ సహాయ నటి - భూమిక (యుఫోరియా ) ఉత్తమ సంగీత దర్శకుడు-  మార్క్ కె. రాబిన్  (దండోరా) ఉత్తమ మేల్‌ సింగర్‌- అనురాగ్‌ కులకర్ణి (రాజు వెడ్స్‌ రాంబాయి) ఉత్తమ ఫిమేల్‌ సింగర్‌- సాహితి చాగంటి (కన్నప్ప) ఉత్తమ కమెడియన్ - శ్రీ కృష్ణ తేజ (జిగ్రిస్‌) ఉత్తమ బాలనటుడు - రోహన్‌ (ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో ) ఉత్తమ స్టోరీ రైటర్‌ - గుణశేఖర్‌ (యుఫోరియా ) ఉత్తమ స్క్రీన్‌ ప్లే రైటర్‌ - అనిల్‌ రావిపూడి ఉత్తమ గేయ రచయిత - నందకిశోర్‌ (కుబేర) ఉత్తమ సినిమాటోగ్రాఫర్‌ - కార్తిక్‌ ఘట్టమనేని (మిరాయ్‌) ఉత్తమ ఎడిటర్‌- శ్రీకర్‌ ప్రసాద్‌ (మిరాయ్‌) ఉత్తమ ఆడియోగ్రాఫర్‌ - ఎం.ఆర్‌ రాధాకృష్ణన్‌ (కిష్కిందపురి) ఉత్తమ కొరియోగ్రాఫర్‌ - గిర గిర గిర (ఛాంపియన్‌) ఉత్తమ ఆర్ట్ డైరక్టర్‌ - తోట తరణి (ఛాంపియన్‌) ఉత్తమ మేకప్‌ ఆర్టిస్ట్ - గోవింద్‌ (అఖండ) ఉత్తమ కాస్ట్యూమ్‌ డిజైనర్‌ -  చంద్రకాంత్‌ (ఛాంపియన్‌) స్పెషల్‌ జ్యూరీ అవార్డులు.. శ్రీరాజ్ రాచకొండ (23 మూవీ) చైతు జొన్నలగడ్డ (రాజు వెడ్స్‌ రాంబాయి) రోషన్‌ మేక (ఛాంపియన్‌) అనంతిక సనీల్ కుమార్‌ (8 వసంతాలు) స్పెషల్‌ అవార్డులు.. ఎన్టీఆర్‌ నేషనల్ అవార్డు - చిరంజీవి పైడి జైరాజ్ అవార్డు - కమల్‌ హాసన్‌ బీఎన్‌రెడ్డి ఫిల్మ్‌ అవార్డు- సింగీతం శ్రీనివాసరావు నాగిరెడ్డి చక్రపాణి అవార్డు - అశ్వనీ దత్‌ కాంతారావు అవార్డు - ఆర్‌. నారాయణమూర్తి రఘుపతి వెంకయ్య ఫిల్మ్‌ అవార్డు - రమేష్ ప్రసాద్‌ సి.నారాయణరెడ్డి ఫిల్మ్‌ అవార్డు - సుద్దాల అశోక్‌ తేజ అక్కినేని నాగేశ్వరరావు ఫిల్మ్‌ అవార్డు - జయసుధ
తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ వేడుకలో ఒక సరదా సన్నివేశం జరిగింది. మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) సతీమణి సురేఖ తన వంటల టాలెంట్ గురించి, చిరు దోసెల గురించి ఫన్నీ కామెంట్స్ చేశారు. ఆ సమయంలో చిరంజీవి ఎక్స్ ప్రెషన్స్ హైలైట్ గా నిలిచాయి. (Gaddar Awards) గద్దర్ అవార్డ్స్ ఈవెంట్ ను ప్రముఖ యాంకర్స్ సుమ, ప్రదీప్ హోస్ట్ చేశారు. వేడుకకు హాజరైన సినీ ప్రముఖులను సరదాగా పలకరిస్తూ.. సురేఖ దగ్గరకు వెళ్ళి, ఉగాది కదా ఈరోజు ఇంట్లో పులిహోర చేశారా అని అడిగారు. దానికి సురేఖ చేశామని సమాధానమిచ్చారు.  ఆ తర్వాత "మీరు చేసే వంటల్లో చిరంజీవి గారికి ఇష్టమైన వంట ఏది?" అని సుమ అడగగా.. "అసలు నేను చేస్తేనే కదా" అంటూ నవ్వుతూ ఆన్సర్ ఇచ్చారు సురేఖ. "అయితే చిరంజీవి గారు దోసెలు వేసే వీడియోలు నిజమేనా?" సుమ అనడంతో.. "దోసెలు వేయడం ఆయనే నేర్పించారమ్మా" అని సురేఖ చెప్పారు. సురేఖ అలా చెబుతున్న సమయంలో చిరంజీవి ఎక్స్ ప్రెషన్స్ భలే ఉన్నాయి. ప్రస్తుతం ఈ క్యూట్ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.  కాగా, గద్దర్ అవార్డ్స్ లో 'ఎన్టీఆర్ నేషనల్ ఫిల్మ్ అవార్డు'ను ఈ ఏడాది చిరంజీవి అందుకోవడం విశేషం. https://www.instagram.com/reel/DWEc0iKhaZO/
సినీ ప్రతిభను ప్రోత్సహిస్తూ తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా గద్దర్ అవార్డులను ఇస్తున్న విషయం తెలిసిందే. ప్రతి ఏడాది ఉత్తమ ప్రతిభ కనబరిచిన వారికి అవార్డులు ఇవ్వడమే కాకుండా.. సినీ దిగ్గజాల పేరిట కొన్ని ప్రత్యేక అవార్డులు కూడా అందిస్తుంది. అందులో 'పైడి జైరాజ్‌ ఫిల్మ్‌ అవార్డు'(Paidi Jairaj Film Award) ఒకటి. సినీ రంగంలో విశేష సేవలు అందించిన వారికి ఈ అవార్డుని అందిస్తున్నారు. గతేడాది ప్రముఖ దర్శకుడు మణిరత్నం అందుకోగా, ఈ ఏడాది కమల్ హాసన్ ను ఈ అవార్డు వరించడం విశేషం. (Gaddar Awards) ఈ తరం వారికి పైడి జైరాజ్(Paidi Jairaj) గురించి పెద్దగా తెలియపోవచ్చు కానీ, ఆయన ఒక లెజెండ్. తొలి పాన్ ఇండియా హీరో. తెలంగాణ గడ్డపై పుట్టి, బాలీవుడ్ ను ఏలిన సూపర్ స్టార్. భారతీయ సినిమా అత్యున్నత పురస్కారం 'దాదా సాహెబ్ ఫాల్కే' అందుకున్న తొలి తెలంగాణ వ్యక్తిగా చరిత్ర సృష్టించారు. ఇలా పైడి జైరాజ్ ఎన్నో ఘనతలు సాధించారు. తెలుగు దిగ్గజాలు అనగానే మనకు ముందుగా ఎన్టీఆర్, ఏఎన్నార్ గుర్తుకు వస్తారు. కానీ, వీరికంటే ముందే.. అంటే మూకీ సినిమాల కాలంలోనే హిందీ చిత్రసీమలో తనకంటూ  ఒక బ్రాండ్ ని క్రియేట్ చేసుకున్నారు పైడి జైరాజ్. పైడి జైరాజ్ 1909, సెప్టెంబర్ 28న సిరిసిల్లలో జన్మించారు. ఆయన అసలు పేరు పైడిపాటి జైరాజ్. హైదరాబాద్‌లోని నిజాం కాలేజీలో చదువుకున్న ఆయనకు.. చిన్నప్పటి నుంచే నాటకాలపై ఇష్టం ఉండేది.  సినిమాల్లో నటించాలనే కోరికతో తన 19వ ఏట 1928లో ముంబై వెళ్లారు. అక్కడ మొదట కెమెరా అసిస్టెంట్‌గా పనిచేశారు. 1929లో 'స్టార్ క్లింగ్ యూత్' అనే మూకీ సినిమాతో నటుడిగా పరిచయమయ్యారు. మాతృ భూమి, ఆల్ ఫర్ లవర్, మై హీరో వంటి సినిమాల్లో నటించారు. వరుస సినిమాలు చేస్తూ స్టార్ గా ఎదిగారు.  జైరాజ్ తన గంభీరమైన స్వరం, ఎత్తైన విగ్రహంతో చారిత్రక వీరుల పాత్రల్లో ఒదిగిపోయేవారు. పృథ్వీరాజ్ చౌహాన్, మహారాణా ప్రతాప్, అమర్ సింగ్ రాథోడ్, చంద్రశేఖర్ ఆజాద్ వంటి గుర్తుండిపోయే పాత్రలు ఎన్నో చేశారు.  యాక్షన్ సీన్స్ కి కేరాఫ్ అడ్రెస్ అనేలా జైరాజ్ ఉండేవారట. ఇప్పుడు చిన్న చిన్న యాక్షన్ సీక్వెన్స్ లకే డూప్‌లను వాడుతున్నారు. కానీ ఆ రోజుల్లోనే జైరాజ్ డేంజర్ సీక్వెన్స్ లను కూడా డూప్‌ లేకుండా స్వయంగా చేసేవారట. కత్తిసాము, గుర్రపు స్వారీ వంటి విద్యలు కూడా ఆయనకు తెలుసు. ఆ కాలంలోనే బాడీ బిల్డింగ్, ఫిట్‌నెస్‌పై ఆయనకు చాలా పట్టు ఉండేది. ఆయన ఆహార్యం, క్రమశిక్షణ చూసి అప్పట్లో కుర్రాళ్ళు జిమ్‌ల వైపు అడుగులు వేసేవారట. 60 ఏళ్ళు పైబడిన తర్వాత కూడా ఆయన ఎంతో ఆరోగ్యంగా, చురుకుగా ఉండేవారని చెప్తారు. జైరాజ్ హిందీ, మరాఠీ, గుజరాతీ వంటి భాషల్లో 300కు పైగా చిత్రాల్లో నటించారు. భారతీయ సినీ రంగానికి ఆయన చేసిన కృషిని గుర్తిస్తూ 1980లో ప్రభుత్వం ఆయనకు దాదా సాహెబ్ ఫాల్కే అవార్డును అందించింది.  పైడి జైరాజ్ కేవలం నటుడే కాదు, దర్శకుడిగా, నిర్మాతగా కూడా తన ముద్ర వేశారు. 2000వ సంవత్సరంలో 90 ఏళ్ళ వయసులో ఆయన కన్నుమూశారు.   
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, డైరెక్టర్ హరీష్ శంకర్ కాంబినేషన్ లో రూపొందిన 'ఉస్తాద్ భగత్ సింగ్'(Ustaad Bhagat Singh) సినిమా  ఉగాది కానుకగా నేడు(మార్చి 19) థియేటర్లలో అడుగుపెట్టింది. మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ఈ మాస్ ఎంటర్‌టైనర్.. పరవాలేదు అనే టాక్ ని సొంతం చేసుకుంది. ముఖ్యంగా పవర్ స్టార్ ఫ్యాన్స్ మెచ్చేలా ఈ సినిమాని హరీష్ శంకర్ తెరకెక్కించాడని టాక్ వచ్చింది.  వింటేజ్ పవర్ స్టార్ ని స్క్రీన్ మీద చూశామంటూ ఎందరో ఫ్యాన్స్ సోషల్ మీడియాలో పోస్ట్ లు పెడుతున్నారు. ఇక 'తొలిప్రేమ' సినిమాలోని 'ఈ మనసే' సాంగ్ ను సెకండ్ హాఫ్ లో ఉపయోగించడం ఫ్యాన్స్ కి బిగ్ సర్ ప్రైజ్ అనిపించింది. యూఎస్ లో ఉంటున్న ఓ పవన్ అభిమాని.. సినిమా చూసి వెంటనే హరీష్ శంకర్ కి ఫోన్ చేసి.. ఈ సాంగ్ గురించి మాట్లాడుతూ ఎమోషనల్ అవ్వడం విశేషం.  'ఉస్తాద్ భగత్ సింగ్' మూవీ టీమ్ తాజాగా సక్సెస్ ప్రెస్ మీట్ నిర్వహించింది. ఈ సందర్భంగా హరీష్ శంకర్ మాట్లాడుతూ.. "ఓ అబ్బాయి ఫోన్ చేసి.. ఎప్పుడు తొలిప్రేమ అన్నా.. టచ్ చేశావన్నా. అమెరికా నుంచి అర్జెంటుగా హైదరాబాద్ వచ్చి మళ్ళీ థియేటర్లో సినిమా చూడాలని ఉందన్నా అంటూ ఎమోషనల్ అయిపోయాడు" అని హరీష్ తెలిపాడు. మరికొందరు ఫ్యాన్స్ చేసిన మెసేజ్ ల గురించి కూడా హరీష్ చెప్పాడు. చైల్డ్ ఎపిసోడ్ కే ఫిదా అయిపోయి.. ఆ చిన్నబ్బాయిని చూస్తుంటే హీరోని చూస్తున్నట్టే ఉందన్నా అని ఒక ఫ్యాన్స్ మెసేజ్ లు పెట్టారని హరీష్ తెలిపాడు. కొంతమంది సెకండ్ హాఫ్ బాగుందని మెసేజ్ లు చేస్తున్నారని.. దానర్థం ఫస్ట్ హాఫ్ బాలేదని కాదని, ఫస్ట్ హాఫ్ కంటే సెకండ్ బాగుందని హరీష్ చెప్పుకొచ్చాడు. మొత్తానికి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ నుంచి హరీష్ శంకర్ కి వస్తున్న ఫోన్లు, మెసేజ్ లు చూస్తుంటే.. ఫ్యాన్స్ కి ఉస్తాద్ భగత్ సింగ్ బాగా నచ్చిందని అర్థమవుతోంది. Also Read: 'ఉస్తాద్ భగత్ సింగ్' మూవీ రివ్యూ
- నాని సినిమాలో విలన్‌గా కలెక్షన్ కింగ్ - మోహన్‌బాబు 'షికంజా' లుక్ అదిరిపోయింది! - 32 ఏళ్ల తర్వాత విలన్‌గా మోహన్‌బాబు - శ్రీకాంత్ ఓదెల మ్యాజిక్ మామూలుగా లేదుగా! కలెక్షన్ కింగ్, డైలాగ్ కింగ్ మోహన్‌బాబు పుట్టినరోజు సందర్భంగా సినీ ప్రియులకు ఒక క్రేజీ అప్‌డేట్ లభించింది. నేచురల్ స్టార్ నాని హీరోగా, సెన్సేషనల్ డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో రూపొందుతున్న భారీ చిత్రం ‘ది ప్యారడైజ్’. ఈ మూవీలో మోహన్‌బాబు ఒక కీలకమైన, పవర్‌ఫుల్ విలన్ పాత్రను పోషిస్తున్నారు. నేడు ఆయన పుట్టినరోజు కావడంతో, చిత్ర యూనిట్ 'షికంజా మాలిక్' గ్లింప్స్‌ను విడుదల చేస్తూ మోహన్‌బాబుకు ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపింది. దాదాపు 32 సంవత్సరాల సుదీర్ఘ విరామం తర్వాత మోహన్‌బాబు మళ్లీ పూర్తిస్థాయి ప్రతినాయకుడి పాత్రలో మెరవబోతున్నారు. ఈ గ్లింప్స్‌లో ఆయన లుక్ మరియు మేకోవర్ చూస్తుంటే, శ్రీకాంత్ ఓదెల ఆయనను చాలా పవర్‌ఫుల్‌గా ప్రెజెంట్ చేస్తున్నట్లు కనిపిస్తోంది. "డైరెక్టర్ శ్రీకాంత్ నన్ను మాయ చేశాడు" అంటూ మోహన్‌బాబు స్వయంగా ఈ పాత్ర గురించి మాట్లాడటం విశేషం. సుమారు 46 సెకన్ల నిడివి ఉన్న ఈ వీడియోలో ఆయన పాత్రకు సంబంధించిన సన్నద్ధతను చూపించారు. దర్శకుడు శ్రీకాంత్ ఓదెల మాట్లాడుతూ.. ఈ తరం ప్రేక్షకులకు మోహన్‌బాబు సత్తా ఏంటో సరిగ్గా తెలియకపోవచ్చని, కానీ ‘ది ప్యారడైజ్’ సినిమాతో ఆయన విశ్వరూపం అందరికీ అర్థమవుతుందని ధీమా వ్యక్తం చేశారు. గతంలో ‘దసరా’ చిత్రంతో బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేసిన ఈ కాంబినేషన్, ఇప్పుడు మరోసారి పక్కా మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌తో రాబోతుండటంతో అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. మోహన్‌బాబు గతంలో ‘పెదరాయుడు’, ‘అసెంబ్లీ రౌడీ’ వంటి చిత్రాలతో తనకంటూ ఒక ప్రత్యేక మేనరిజం, డైలాగ్ డెలివరీని క్రియేట్ చేసుకున్నారు. ఇప్పుడు మళ్లీ విలనిజం పండించడానికి సిద్ధమవ్వడం పట్ల ఆయన అభిమానులు సోషల్ మీడియాలో భారీగా స్పందిస్తున్నారు. షికంజా మాలిక్ గ్లింప్స్ ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్ ఈ చిత్రానికి మ్యూజిక్ అందిస్తుండటం మరో అదనపు ఆకర్షణ. నాని, మోహన్‌బాబుల మధ్య వచ్చే సన్నివేశాలు వెండితెరపై మంటలు పుట్టించడం ఖాయమని ఇండస్ట్రీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. త్వరలోనే ఈ సినిమా విడుదల తేదీ మరియు ఇతర వివరాలను మేకర్స్ అధికారికంగా ప్రకటించనున్నారు.
ప్రస్తుతం ఓటీటీ ప్రపంచంలో సైకలాజికల్ థ్రిల్లర్లకు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. తాజాగా ఆపిల్ టీవీ ప్లస్ వేదికగా ఇంప‌ర్‌ఫెక్ట్ ఉమెన్‌(Imperfect Women) అనే హై-వోల్టేజ్ డ్రామా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అరామింటా హాల్ రాసిన పాపులర్ నవల ఆధారంగా తెరకెక్కిన ఈ సిరీస్, ముగ్గురు మహిళల మధ్య ఉండే సంక్లిష్టమైన స్నేహం, వారి జీవితాల్లోని చీకటి కోణాలను ఆవిష్కరిస్తోంది. ఈ కథ ముగ్గురు బెస్ట్ ఫ్రెండ్స్ చుట్టూ తిరుగుతుంది. దశాబ్దాలుగా ఎంతో సన్నిహితంగా ఉండే వీరి జీవితాల్లో ఒక మరణం పెను తుఫానును సృష్టిస్తుంది. వారిలో ఒకరైన నాన్సీ అనుమానాస్పద స్థితిలో మరణించడంతో, మిగిలిన ఇద్దరు స్నేహితులైన ఎలియనోర్, మేరీల జీవితాలు ఒక్కసారిగా తలకిందులవుతాయి. ఈ ఇన్వెస్టిగేషన్ సాగుతున్న కొద్దీ ఒకరి గురించి ఒకరికి తెలియని షాకింగ్ నిజాలు బయటపడటం ఈ సిరీస్‌లో ప్రధానాంశం. హాలీవుడ్ స్టార్ నటీమణులు ఎలిజబెత్ మాస్, కెర్రీ వాషింగ్టన్ మరియు కేట్ మారా ఈ సిరీస్‌లో ప్రధాన పాత్రల్లో నటించారు. ముఖ్యంగా ఎలిజబెత్ మాస్ తన అద్భుతమైన నటనతో మరోసారి ఆకట్టుకోగా, కెర్రీ వాషింగ్టన్ పవర్ ఫుల్ పెర్ఫార్మెన్స్‌తో మెప్పించింది. వీరిద్దరూ నటనతోనే కాకుండా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్లుగా కూడా ఈ ప్రాజెక్ట్‌లో భాగస్వాములు కావడం విశేషం. దర్శకత్వం విషయానికి వస్తే, 'ఫిజికల్' ఫేమ్ అన్నీ వైస్‌మాన్ ఈ సిరీస్‌ను అత్యంత ఉత్కంఠభరితంగా రూపొందించారు. గతంలో ఎన్నో సూపర్ హిట్ సిరీస్‌లను అందించిన ఆమె, ఈసారి మహిళా మనస్తత్వాలను, వారి మధ్య ఉండే ఈర్ష్య, ద్వేషం మరియు రహస్యాలను చాలా లోతుగా విశ్లేషించారు. నాన్సీ భర్తగా జోయల్ కిన్నమన్ తన పాత్రకు పూర్తి న్యాయం చేశారు. సోషల్ మీడియాలో ఈ సిరీస్ పట్ల మిశ్రమ స్పందన లభిస్తోంది. కొందరు దీనిని 'బిగ్ లిటిల్ లైస్' వంటి సిరీస్‌లతో పోలుస్తుండగా, మరికొందరు నటీమణుల నటనను ఆకాశానికెత్తుతున్నారు. కథనం నెమ్మదిగా సాగినా, వచ్చే ట్విస్టులు మాత్రం ప్రేక్షకులను సీట్ ఎడ్జ్‌లో కూర్చోబెడతాయని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. మొత్తానికి ఎనిమిది ఎపిసోడ్ల సుదీర్ఘ ప్రయాణంగా సాగే ఈ మిస్టరీ థ్రిల్లర్, ప్రస్తుతం ఆపిల్ టీవీ ప్లస్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. క్రైమ్ మరియు సస్పెన్స్ కథలను ఇష్టపడే వారికి ఈ వారాంతంలో ఇది ఒక మంచి ఆప్షన్ అని చెప్పవచ్చు. తదుపరి ఎపిసోడ్లలో ఎలాంటి సంచలన నిజాలు బయటపడతాయో అని మూవీ ల‌వ‌ర్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు. వారితో పాటు పెద్ద సంఖ్యలో క్యాడర్ కూడా పార్టీని వీడుతున్నారు. ఇక ఇప్పుడు నామినేటెడ్ పదవులలో ఉన్న వారి వంతు మొదలైనట్లు కనిపిస్తోంది. తనకు కానీ తన భర్తకు  కానీ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు టికెట్ ఇవ్వాలంటూ గత  కొంత కాలంగా కోరుతూ వస్తున్న మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ వంతు వచ్చింది. ఆమె కూడా రాజీనామా అస్త్రం సంధించారు.  జగన్ కు నమ్మిన బంటుగా గుర్తింపు పొందిన మహిళాకమిషన్ చైర్ పర్సన్ వాసి రెడ్డి పద్మ తన పదవికి రాజీనామా చేశారు. ఉరుములేని పిడుగులా, ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా తన రాజీనామా లేఖను సీఎం జగన్ కు పంపేశారు. పేరుకు తాను పార్టీకి కాదు, కేవలం మహిళా కమిషన్ చైర్మన్ పదవికి మాత్రమే రాజీనామా చేశాననీ, ఇక నుంచి వైసీపీ కోసం పని చేస్తాననీ వాసిరెడ్డి పద్మ చెబుతున్నప్పటికీ, ఆమె రాజీనామాకు కారణం అసంతృప్తేనని పార్టీ వర్గాలు బాహాటంగానే చెబుతున్నాయి. చాలా కాలంగా వాసిరెడ్డి పద్మ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు తనకు కానీ తన భక్తకు కానీ పార్టీ టికెట్ ఇవ్వాలని జగన్ ను కోరుతూ వస్తున్నారు. అయితే ఇప్పటి వరకూ జగన్ చూద్దాం.. చేద్దాం అన్నట్లుగా దాట వేస్తూనే వచ్చారు. ఇప్పుడిక వరుసగా అభ్యర్థల జాబితాలను జగన్ ప్రకటించేస్తుండటం, తనకు గానీ తన భర్తకు కానీ పార్టీ టికెట్ విషయంలో ఎటువంటి స్పస్టత ఇవ్వకపోవడంతో ఆమె మనస్తాపం చెంది పదవికి రాజీనామా చేసేశారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.  వాసిరెడ్డి పద్మ రాజకీయ ప్రవేశం ప్రజారాజ్యం పార్టీతో జరిగింది. 2009లో ఆమె ప్రజారాజ్యం పార్టీలో చేరారు. ఇలా చేరడంతోనే ఆమె ప్రజారాజ్యం అధికార ప్రతినిథిగా పదవి దక్కించుకున్నారు. ప్రజారాజ్యం కాంగ్రెస్ పార్టీలో విలీనం కావడంతో ఆమె 2012లో జగన్ పార్టీలో చేరారు. జగన్ కూడా ఆమెకు అధికార ప్రతినిథి పదవి ఇచ్చారు.  2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆమెను రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా నియమించారు. చైర్ పర్సన్ హోదాలో ఆమె జగన్ మెప్పు పొందేందుకు చేయగలిగినంతా చేశారు. ప్రతిపక్ష పార్టీ నేతలకు నోటీసులు ఇచ్చారు. ఏకంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు సైతం నోటీసులు జారీ చేశారు. వార్డు వలంటీర్లపై పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు కమిషన్ ముందు హాజరై వివరణ ఇవ్వాలంటూ ఆమె పవన్ కు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. పవన్ హాజరు కాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు నమోదు చేయాలని ఆదేశించారు. ఇన్ని చేసినా వాసిరెడ్డి పద్మకు ఆమె కోరినట్లుగా పార్టీ టికెట్ లభించకపోవడంతో అలిగి పదవికి రాజీనామా చేశారని, ఇది జగన్ కు షాకేననీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు. ఒకరైతు తనకు చేసిన సేవలకు ప్రీతి చెందిన గురువు అతడికి స్వర్గ ప్రాప్తిని కలగజేయాలని అనుకుంటాడు. కానీ సంసారాసక్తి వల్ల ఆ రైతు ఆ అవకాశాన్ని వాయిదా వేసుకుంటూ వస్తాడు. చివరికి గురుకృప వల్ల ఆ రైతు స్వర్గ ప్రాప్తిని ఎలా పొందాడో ఈ కథ తెలియజేస్తుంది. "ఒక మహాపురుషుడు ప్రయాణం చేస్తూ, డస్సిపోయాడు. గొంతు ఎండిపోయింది. దారిలో ఒక రైతు కనపడితే నీళ్ళు అర్థించాడు. ఆ రైతు మహాత్మునికి సకల ఉపచారాలూ చేశాడు. చిరిగిపోయిన ఆయన ఉత్తరీయాన్ని రైతు జాగ్రత్తగా కుట్టి బాగుచేశాడు. రైతు పరిచర్యలకు సంతసించిన ఆ మహాత్ముడు శాంతి, ఆనందాలకు నిలయమైన స్వర్గానికి తనతోపాటు రమ్మని అంటాడు. అందుకు ఆ రైతు 'గురువుగారూ! మీరు నా మీద చూపిన దయకు కృతజ్ఞుణ్ణి. కానీ నా పిల్లలు ఇంకా చిన్నవాళ్ళు. ఓ ఏడేళ్ళ వ్యవధి ఇవ్వండి' అని అడుగుతాడు. అందుకు గురువు అంగీకరించాడు. సరిగ్గా ఏడేళ్ళ తర్వాత గురువు రైతును స్వర్గానికి తీసుకువెళ్ళడానికి వచ్చాడు. అప్పుడు రైతు 'అయ్యా! కడపటి కొడుకు కష్టాలకు అంతు లేదు. అన్ని జంఝాటాలనూ ఒక్కడే సంబాళించుకోలేకపోతున్నాడు. కాబట్టి మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని గురువుని అడిగాడు. మరో ఏడేళ్ళ తరువాత గురువు వచ్చాడు. కానీ రైతు చనిపోయాడని తెలిసింది. చనిపోయిన ఆ రైతు ఎద్దుగా పుట్టాడని ఆ గురువు తన దివ్య దృష్టితో తెలుసుకున్నాడు. ఎద్దుగా పుట్టిన ఆ రైతు తన కొడుకు పొలాన్నే దున్నుతున్నాడు. అప్పుడు గురువు ఆ ఎద్దుపై మంత్ర జలం చిలకరించగానే ఎద్దు జన్మనెత్తిన రైతు 'నా కొడుకు పరిస్థితి మరి కాస్త మెరుగు పడనీయండి స్వామీ! మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని అన్నాడు. ఇక చేసేది లేక వెనుదిరిగాడు గురువు. మరలా ఏడేళ్ళ తర్వాత వచ్చిన గురువుకు ఎద్దు చనిపోయిందని తెలిసింది. అది కుక్కగా పుట్టి కొడుకు ఇంటినీ, ఆస్తినీ కాపలా కాస్తోందని తన దివ్యదృష్టి ద్వారా తెలుసుకున్నాడు. గురువు. కుక్కగా పుట్టిన ఆ రైతు 'స్వామీ! నేను ఎంత దౌర్భాగ్యుణ్ణి. మీరు ఇంత దయ చూపుతున్నప్పటికీ మీతో స్వర్గమానం చేయలేకున్నాను. వీడికి ఆస్తిని కాపాడుకొనే దక్షత ఇంకా రాలేదు. కాబట్టి దయ చేసి మరో ఏడేళ్ళు వ్యవధి ఇవ్వండి' అని వేడుకున్నాడు. గురువు ఏడేళ్ళ తరువాత మళ్ళీ వచ్చేసరికి కుక్క మరణించింది. అది త్రాచుపాముగా జన్మనెత్తి, ఇప్పుడు కొడుకు భూమిలో ఉన్న లంకెబిందెలకు పడగెత్తి కాపలా కాస్తోంది. గుప్త ధనం ఇక్కడ ఉందని కొడుకుకి ఎలా తెలియజేయాలా అని పాము ఆలోచిస్తున్నప్పుడు గురువు ఆ రైతుకొడుకును పిలుచుకు వచ్చి లంకె బిందెలు ఉన్న చోట తవ్వమన్నాడు. లంకె బిందెలు బయటపడ్డాయి. ఆ పైన ఆ పామును చంపమన్నాడు. అనంతరం శిష్యుణ్ణి తీసుకొని స్వర్గారోహణం చేశాడు గురువు. సంసారంలోని ఈతి బాధల నుండి శిష్యుణ్ణి ఉద్ధరిస్తాడు సద్గురువు. అలాంటి గురువు అందరికీ అవసరం.                                      *నిశ్శబ్ద.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్  రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది.  80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత  ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది.   ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది. ఆమెది నెద‌ర్లాండ్స్‌. ఆమె తండ్రి నెద‌ర్లాండ్స్‌లోని ఆర్నెహెమ్‌లో చిన్న‌పిల్ల‌ల ఆస్ప‌త్రి డైరెక్ట‌ర్. పోయి దొరికిన ఆ పెయింటింగ్ విష‌యానికి వ‌స్తే.. అది 1683లో కాస్ప‌ర్ నెష‌ర్ వేసిన స్టీవెన్ ఓల్ట‌ర్స్ పెయింటింగ్‌. రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో నాజీల ఆదేశాల‌ను చార్లెట్ తండ్రి వ్య‌తిరేకించారు. ఆయ‌న ర‌హ‌స్య జీవ‌నం సాగించేడు. కానీ ఈ పెయింటింగ్‌ని మాత్రం త‌న న‌గ‌రంలోని ఒక బ్యాంక్‌లో భ‌ద్ర‌ ప‌ర‌చ‌మ‌ని ఇచ్చార‌ట‌. 1940లో నాజీలు నెద‌ర్లాండ్ పై దాడులు చేసినపుడు ఆ బ్యాంక్ మీద ప‌డి దోచుకున్నా రు. అప్పుడు ఈ పెయింటింగ్ కూడా తీసుకెళ్లారు. యుద్ధం అయిపోయిన త‌ర్వాత ఈ పెయింటింగ్ ఎక్క‌డున్న‌దీ ఎవ‌రికీ తెలియ‌లేదు. చిత్రంగా 1950ల్లో డ‌స‌ల్‌డార్ష్ ఆర్ట్ గ్యాల‌రీలో అది ప్ర‌త్య‌క్ష‌మ‌యింది. 1969లో ఆమ్‌స్ట‌ర్‌డామ్‌లో దాన్ని వేలానికి తీసికెళ్లే ముందు దాన్ని ఆ ఆర్ట్ గ్యాల‌రీలో వుంద‌ని చూసిన‌వారు చెప్పారు. వేలంపాట త‌ర్వాత మొత్తానికి ఆ పెయింటింగ్‌ను 1971లో ఒక క‌ళాపిపాసి త‌న ద‌గ్గ‌ర పెట్టుకున్నాడు.    ఆ త‌ర్వాత 2021లో అది చార్లెటీని చేరింది.  మొత్తానికి వూహించ‌ని విధంగా ఎంతో కాలం దూర‌మ‌యిన గొప్ప క‌ళాఖండం తిరిగి త‌న వ‌ద్ద‌కు చేర‌డంలో చార్లెటీ ఆనందానికి అంతేలేదు. అంతే క‌దా.. పోయింద‌నుకున్న గొప్ప వ‌స్తువు తిరిగి చేరితే ఆ ఆనంద‌మే వేరు!  అయితే చార్లెటీకి ఇపుడు ఆ పెయిం టింగ్‌ను భ‌ద్రంగా చూసుకునే ఆస‌క్తి వున్న‌ప్ప‌టికీ శ‌క్తి సామ‌ర్ధ్యాలు లేవు. అందుక‌నే త్వ‌ర‌లో ఎవ‌రిక‌యినా అమ్మేసీ వ‌చ్చిన సొమ్మును పిల్ల‌ల‌కు పంచుదామ‌నుకుంటోందిట‌!  చార్లెటీ కుటుంబంలో అయిదుగురు అన్న‌ద‌మ్ములు అక్క‌చెల్లెళ్లు వున్నారు. అలాగే ఇర‌వై మంది పిల్ల‌లు ఉన్నారు. అంద‌రూ ఆమె అంటే ఎంతో ప్రేమ చూపుతున్నారు. అంద‌రం ఒకే కుటుంబం, చాలాకాలం త‌ర్వాత ఇల్లు చేరిన క‌ళాఖండం మా కుటుంబానిది అన్న‌ది చార్లెటీ!
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు. చాకోను పార్టీలోకి ఆహ్వానిస్తూ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్’ ఫ్రంట్ ఏర్పాటు గురించి ప్రత్యేకించి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు కానీ, చాకో అలాంటి  సంకేతాలు ఇచ్చారు. ప్రస్తుతం దేశంలో ఉన్న ఏ ఒక్కపార్టీ కూడా బీజేపీకి ప్రత్యాన్మాయం కాదని,సమీప భవిష్యత్ కాంగ్రెస్ సహా ఏ పార్టీ కూడా ఆ స్థాయికి ఎదిగే అవకాశాలు కూడా కనిపించడంలేదని అన్నారు. ఈ పరిస్థితుల్లో దేశంలోని బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ, ఏకమై, ఒకే గొడుగు కిందకు రావలసిన అవసరం ఉందని చాకో అన్నారు. అదే సమయంలో ప్రతిపక్షాలను ఏక తాటిపైకి తెచ్చే బాధ్యతను పవార్ తీసుకోవాలని సంకేత మాత్రంగా చెప్పారు. అంతే కాకుండా కాంగ్రెస్ పేరు ఎత్తకుండా బీజేపీ వ్యతిరేక శక్తులను ఏకం చేసే ఆలోచన ఆ పార్టీ నాయకత్వానికి లేదని నెహ్రూ గాంధీ ఫ్యామిలీ (సోనియా, రాహుల్, ప్రియాంక)ఆలోచనా ధోరణిని పరోక్షంగానే అయినా ఎండ కట్టారు.ఆ విధంగా పవార్ ఆ బాధ్యత తీసుకోవాలని చాకో సూచించారు. ఇందుకు సంబంధించి, పవార్ బహిరంగంగా ఎలాంటి వ్యాఖ్య చేయలేదు. అయితే, చాకో సహా మరికొందరు ‘సీనియర్’ కాంగ్రెస్ నాయకులు, అలాగే సిపిఎం, సిపిఐ నాయకులు కూడా పవార్’తో చాలా కాలంగా థర్డ్ ఫ్రంట్  విషయంగా చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. అయితే మహారాష్ట్రలో సంకీర్ణం మనుగడను దృష్టిలో ఉంచుకుని పవార్ ఆచితూచి అడుగులేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే చాకో పార్టీలో చేరిన సందర్భంలో కూడా ‘చాకో చేరికతో మహారాష్ట్రలోని మహా వికాస్ అగాడీ ప్రభుత్వానికి ఎలాంటి నష్టం జరగదని, పవార్ మహారాష్ట్ర సంకీర్ణ సర్కార్ ప్రస్తావన చేశారని విశ్లేషకులు పేర్కొంటున్నారు.  మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వ మనుగడ గురించ్బి  పవార్ ప్రత్యేకంగా పేర్కొనడం ద్వారా, ఆయన థర్డ్ ఫ్రంట్ విషయంలో వేచి చూసే ఆలోచనలో ఉన్నట్లు అర్థమవుతోందని కూడా  రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే అదే ఎన్సీపీ అసెంబ్లీ ఎన్నికల జరుగతున్న కేరళలో, పశ్చిమ బెంగాల్లో  కాంగ్రెస్ వ్యతిరేక పార్టీలకు మద్దతు ఇస్తోంది. దీన్ని బట్టి చూస్తే, ఎన్సీపీ - కాంగ్రెస్ మధ్య దూరం పెరుగుతోందని స్పష్టమవుతోంది. అయితే, థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఏ రకంగా ముడి పడుతుంది అనే విషయంలో ఇంకా స్పష్టత రావలసి ఉంది. అలాగే, కాంగ్రెస్ లేకుండా జాతీయ స్త్గాయిలో బీజేపీ వ్యతిరేక కూటమిని ఏర్పాటు చేయడం వలన, వ్యతిరేక ఓటు చీలి  అది మళ్ళీ బీజేపీకే మేలు చేస్తుందని, కాబట్టి, ప్రస్తుతం కాంగ్రెస్ సారధ్యంలోని యూపీఏని బలోపేతం చేయడమే ఉత్తమమనే అలోచన కూడా  విపక్ష శిబిరం నుంచి వినవస్తోంది. ఈ నేపధ్యంలోనే, ప్రస్తుతం యూపీఏ ఛైర్పర్సన్’గా ఉన్న సోనియా గాంధీ వయసు, అనారోగ్యం కారణంగా బాధ్యతల నుంచి తప్పుకుని పవార్’కు బాద్యతలు అప్పగించాలనే ప్రతిపాదన వచ్చిందని అంటున్నారు. అలాగే, ఇతర పార్టీలను, ముఖ్యంగా కాంగ్రెస్ నుంచి విడిపోయి సొంత కుంపటి పెట్టుకున్న మమతా బెనర్జీ సారధ్యంలోని తృణమూల్, జగన్మోహన్ రెడ్డి సారధ్యంలోని వైసీపీలను కలుపుకుని కూటమిని బలోపేతం చేయడం ద్వారా బీజేపీని దీటుగా ఎదుర్కోవచ్చనే ఆలోచనలు కూడా సాగుతున్నాయి. అయితే, ఇటు థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు అయినా, యూపీఏని బలోపేతం చేయడమే అయినా, పవారే .. కేంద్ర బిందువు. ఆయన సారధ్యంలోనే ప్రత్యాన్మాయం అనేది విపక్ష శిభిరం నుంచి వినవస్తున్న ప్రస్తుత సమాచారం. మరి అదే జరిగితే రాహుల గాంధీ పరిస్థితి ఏమిటి ? గాంధీ నెహ్రూ కుటుంబం పరిస్థితి ఏమిటి? ఏ ప్రత్యేక ప్రాధాన్యత లేకుండా అందరిలో ఒకరిగా ఫస్ట్ ఫ్యామిలీ సర్దుకు పోతుందా? అంటే..చివరకు ఏమవుతుందో .. ఇప్పుడే చెప్పలేమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది. గతంలో అనేక సందర్భాలలో ముఖ్యమంత్రి కేసీఆర్,ఆర్థిక మంత్రి హరీశ రావు, కరోనా కారణంగా రాష్ట్ర  ఆదాయం గణనీయంగా తగ్గిందని, పేర్కొన్నారు. అయితే, కరోనా నుంచి వేగంగా కోలుకుని, ఆర్థికంగా అంతే వేగంగా పుంజుకున్న రాష్ట్రాలలో తెలంగాణ ప్రధమ స్థానంలో  ఉందని కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సర్వే 2020-21 నివేదిక పేర్కొంది. పడిలేచిన కెరటంలా, తెలంగాణ ‘వీ’ ఆకారంలో ఆర్థికంగా నిలతొక్కుందని కేంద్రం జనవరి  చివరి వారంలో విడుదల చేసిన ఆర్థిక సర్వేలో పేర్కొంది. అలాగే, రెవిన్యూ వసూళ్ళలో రాష్ట్రం కరోనా పూర్వస్థితికి చేరిందని కూడా సర్వే చెప్పింది.   అలాగే,రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు కూడా ఈ మధ్య కాలంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పై సంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరమ జనవరి,ఫిబ్రవరి, మార్చి నెలలతో పోలిస్తే ఈ సంవత్సరం ఈ మూడు నెలల కాలంలో రాష్ట్ర ఆర్థిక వృద్ది రేటు 10 నుంచి  15 శాతం మెరుగ్గా ఉందని హరీష్ రావు ఒకటి రెండు ఇంటర్వ్యూలలో పేర్కొన్నారు.అలాగే, బడ్జెట్ విషయంలోనూ ఆయన చాల ఆశావహ దృక్పథంతోనే ఉన్నారు. బడ్జెట్  పాజిటివ్’గా ఉంటుదని, ఎవ్వరూ ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని, సంక్షేమ పథకాలలో,ఇతరత్రా బడ్జెట్ కేటాయింపులలో ఎలాంటి కోతలు ఉండవని కూడా హరీష్ హామీ ఇచ్చారు. గత సంవత్సరంలో కొంత మేర హామీ ఇచ్చిన మేరకు అమలు చేయలేక పోయిన సొంత జాగాలలో డబల్ బెడ్ రూమ్ ఇళ్ళ నిర్మాణం, రుణ మాఫీ వంటి  పథకాలను ఈ బడ్జెట్ ద్వారా అమలు చేస్తామని చెప్పారు. అలాగే, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ తమిళి సై చేసిన ప్రసంగంలోనూ ఆశావహ దృక్పధమే వ్యక్తమైంది. ఆమె తమ ప్రసంగంలో,  ప్రభుత్వం సంక్షేమ పథకాలకు పెద్ద పీట వేసిందని అన్నారు. ‘సంపద పంచాలి ,పేదలకు పంచాలి’ అనేది తమ ప్రభుత్వ విధానమని స్పష్టం చేశారు. అలాగే, పెరుగతున్న ఆదాయంలో అధికశాతం సంక్షేమానికే వెచ్చిస్తున్నామని స్పష్టం చేశారు. దీంతో బడ్జెట్’లో కొత్త పథకాలకు శ్రీకారం చుట్టే అవకాశం ఉంటుందా అన్న చర్చ జరుగుతోంది. మరో వంక ఉద్యోగ వర్గాల్లో పీఆర్సీకి సంబంధించి ఆర్థిక మంత్రి తమ ప్రసంగంలో  ప్రకటన చేస్తారా లేదా అనే ఆసక్తి నెలకొంది. అలాగే, సామాన్య  ప్రజలు ఇటీవల పెరిగిన పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరల భారం నుంచి మంత్రి హరీష్, ఏదైనా ఉపసమనం కలిపిస్తారా అని ఎదురు చూస్తున్నారు. గతంలో వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సామాన్య ప్రజలపై వంటగ్యాస్ ధర భారాన్ని తగ్గించేందుకు కొంత మొత్తాన్ని, రూ.50(?) రాష్ట్ర ప్రభుత్వం తరపున  సబ్సిడీగా ఇచ్చిన విషయాన్ని, అదే విధంగా అసెంబ్లీ ఎన్నికలు జరుగతున్న తమిళనాడులో డిఎంకే పార్టీ,తమ పార్టీని అధికారంలోకి వస్తే  గ్యాస్ బండపై వంద రూపాయల సబ్సిడీ ఇస్తామని చేసిన  వాగ్దానాన్ని  గుర్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే, ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు, సోమవారం ఆర్థిక మంత్రి హరీష్ రావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఆర్థిక  శాఖ ముఖ్య కార్యదర్శి రామ కృష్ణా రావు,సలహాదారు జీఆర్ రెడ్డితో బడ్జెట్ పద్దులఫై సుదీర్ఘంగా చర్చించి తుది మెరుగులు దిద్దారు. బడ్జెట్ తుది రూపం సిద్దమైన నేపధ్యంలో ఆర్థిక శాఖ ప్రింటింగ్ ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 18 ఉదయం మంత్రి వర్గం ఆమోదం పొందిన అనంతరం ఆర్థికమంత్రి హరీష్ రావు అదే రోజు రాష్ట్ర బడ్జెట్ 2021-22ను సభలో ప్రవేశ పెడతారు. 20, 22 తేదీల్లో బడ్జెట్‌పై సాధారణ చర్చ,23, 24, 25 తేదీల్లో బడ్జెట్‌ పద్దులపై చర్చ ఉంటుంది 26న ద్రవ్యవినిమయ బిల్లు (బడ్జెట్)పై చర్చ, సభామోదం ఉంటాయి.
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది.  అధికార తెరాస, ఖమ్మం స్థానానికి సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర రెడ్డి పేరును ప్రకటించడంలో కొంచెం జాప్యం చేయడంతో పాటుగా, హైదరాబాద్ స్థానం నుంచి , పీవీ కుమార్తె వాణీ దేవి పేరును చివరి క్షణంలో తెరమీదకు తేవడంతో అంత వరకు కొంత స్తబ్దుగా సాగిన ప్రచారం ఆ తర్వాత వేడెక్కింది. ఉద్యోగ నియామకాల విషయంలో తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ తప్పులో కాలేయడంతో విపక్షాలు, పోటీలో ఉన్న ప్రత్యర్ధులు, నిరుద్యోగ యువత, విద్యార్ధి సంఘాలు  ఒకే సారి ఆయన మీద  విరుచుకు పడ్డారు. ఆయన లెక్క తప్పని నిరుపిస్తం రమ్మని వరస సవాళ్ళు విసిరారు. దీంతో, మంత్రి నియామకా ఇష్యూని పక్కకు తప్పించేందుకు , ఐటీఐఆర్, వరంగల్ రైల్వే ఫ్యాక్టరీ వంటి సెంటిమెంటల్ ఇష్యూస్’ను తెరపైకి  తెచ్చారు. అలాగే, కేంద్ర ప్రభుత్వంపై విమర్శల దాడిని పెంచారు. చివరకు పొరుగు రాష్ట్రానికి చెందిన విశాఖ ఉక్కు ఆందోళన   కూడా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగమైంది.   రెండు నియోజక వర్గాలలో గతంతో పోలిస్తే ఈసారి ఓటర్ల సంఖ్య రెట్టింపు అయింది. ఈసారి రెండు నియోజక వర్గాలలో కలిపి 10 లక్ష 36 వేల మంది తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. అలాగే, రెండు పట్ట భద్రుల నియోజక వర్గాల్లో 164 మంది అభ్యర్ధులు పోటీలో ఉన్నారు.  గత ఎన్నికలతో పోలిస్తే ఇటు ఓటర్ల సంఖ్య, అటు అభ్యర్థుల సంఖ్యా రెట్టింపునకు పైగానే పెరగడంతో ఎన్నికలలో జోష్ పెరిగింది. దీనికితోడు అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో సాధారణ ఎన్నికలను తలపించే రీతిలో ప్రచారం సాగింది. ఎక్కువమంది అభ్యర్ధులు బరిలో ఉండడంతో, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి  తమకే ప్రయోజనం జరుగుతుందని అధికార పార్టీ ఆశపడుతోంది .  దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో చేదు ఫలితాలను చవిచూసిన టీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా వ్యూహ రచన చేసి కేటీఆర్, హరీష్ సహా మంత్రులు,ఎమ్మెల్యేలకు స్పెసిఫిక్ బాధ్యతలు అప్పగించారు. అలాగే,కాంగ్రెస్‌ అభ్యర్థులు చిన్నారెడ్డి, రాములునాయక్‌లకు మద్దతుగా ఉత్తమ్‌, భట్టి, రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తదితరులు విస్తృతంగా ప్రచారం చేశారు. బీజేపీ అభ్యర్థులు ఎన్‌.రాంచందర్‌రావు, ప్రేమేందర్‌రెడ్డిల తరఫున ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, ఎంపీ అరవింద్‌ తదితరులు ప్రచారాన్ని వేడెక్కించారు.  ఖమ్మం స్థానం నుంచి ప్రత్యక్ష ఎన్నికల్లో తొలిసారి పోటీకి దిగిన కోదండరాంకు, టీజేఎస్‌ పార్టీకీ ఈ ఎన్నికలు కీలకంగా మారాయి. ఖమ్మ స్థానం నుంచి పోటీ చేస్తున్న తీన్మార్ మల్లన్న ముందస్తు వ్యూహంతో ప్రధాన పార్టీల అభ్యర్ధులకు ధీటుగా ప్రచారం సాగించారు.  వామపక్షాల మద్దతుతో జయసారథి, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్‌, యువతెలంగాణ కార్యనిర్వాహక అధ్యక్షురాలు రాణీ రుద్రమ తదితరులు పోటీలో ఖమ్మం సీటును పట్టభద్రులు  ఎవరికి  పట్టం కడతారు అన్నది ప్రశ్నార్థకంగా మారింది. హైదరాబాద్ సీటు కూడా ఇటు అధికార తెరాసకు అటు సిట్టింగ్ సీటును నిలుపుకోవడం తో పాటుగా దుబ్బాక , జీహెచ్ఎంసి జోష్ ను కొనసాగించాలని ఆశ పడుతున్నబీజేలకే కూడా ఇజ్జత్ కీ సవాల్ గా మారింది. కాంగ్రెస్ అభ్యర్ధి పార్టీ సీనియర్ నాయకుడు సౌమ్యుడు, మాజీ మంత్రి చిన్నారెడ్డి, వామ పక్షాల మద్దతుతో పోటీ చేస్తున్న మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ కూడా గట్టి పోటీ ఇస్తున్నారు. సో.. చివరకు ఏమి జరుగుతుంది అంటే ఏదైనా జరగవచ్చును. ఈ నెల 14 వ తేదీన పోలింగ్ జరుగుతుంది.17 ఫలితాలు వస్తాయి .. అంతవరకు వెయిట్ అండ్ వాచ్ .  
సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది. ఒకప్పుడు ఎర్ర జెండాను దిగ్విజయంగా ఎదిరించి, మార్క్సిస్టులను మట్టి కరిపించిన మమతా దీదీ ప్రస్తుతం, కాషాయ కూటమి నుంచి గట్టి సవాలును ఎదుర్కుంటున్నారు. వరసగా పదేళ్ళు పాలించడం వలన సహజంగా వచ్చిన ప్రభుత్వ వ్యతిరేకత  కంటే, హిందూ ఓటు పోలరైజేషన్ ఆమెను మరింతగా భయపెడుతోంది. నిజానికి ఐదేళ్ళ క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం ఐదు శాతం కంటే తక్కువ ఓట్లు, మూడంటే మూడు అసెంబ్లీ సీట్లు మాత్రమే గెలుచుకున్న బీజేపీ..  2019 లోక్ సభ ఎన్నికల్లో ఏకంగా 40 శాతం ఓట్లతో 18 స్థానాలు గెలుచుకుంది. ఈ  మార్పు ఇంకా కొన్ని కారణాలు ఉంటే ఉండవచ్చును కానీ.. హిందువుల ఓటు పోలరైజ్  కావడమే ప్రధాన కారణం.  ఈ నేపధ్యంలోనే కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ చివరకు కమ్యూనిస్టులు కూడా బీజేపీలో  చేరారు. ఎన్నికల ప్రకటన వెలువడిన తర్వాత కూడా సిట్టింగ్ ఎమ్మెల్ల్యేలు సహా  తృణమూల్ టికెట్ వచ్చిన నాయకులు కూడా బీజేపీలో చేరుతున్నారు. అనేక మంది ఇతర రంగాల ప్రముఖులు, ముఖ్యంగా ఇంతకాలం, బీజేపీని హిదుత్వ అనుకూల ‘అచ్చుత్’ (అంటారని) పార్టీగా చూసిన ‘సెక్యులర్’ ప్రముఖులు కాషాయం కప్పుకోవడంతో మమతా బెనర్జీకి కొంచెం అలస్యంగానే అయినా, తత్త్వం బోధపడింది. అందుకే ఆమె ఇప్పుడు గుళ్ళూ,గోపురాలకు తిరుగుతున్నారు. కార్యకర్తల సమావేశాల్లో తానూ హిందువునేనని, చెప్పుకుంటున్నారు.  నిజానికి ఇలా నేనూ హిందువునే  అని సెక్యులర్ నేతలు బహిరంగంగా ప్రకటించుకోవడం మమతా బెనర్జీతోనే మొదలు కాలేదు. రాహుల్ గాంధీ తాను హిందువునని, జన్యుధారీ కశ్మీరీ బ్రాహ్మణుని అనీ.. తమ గోత్రం, ‘దత్తాత్రేయ’ గోత్రమని బహిరంగంగా ప్రకటించుకున్నారు. అలాగే  కొద్ది రోజుల క్రితం ప్రియాంకా గాంధీ తానూ హిందువునని చెప్పుకునేందుకు ‘మౌని అమావాస్య’ సందర్భంగా అలహాబాద్ లో గంగా స్నానం చేశారు. గతంలోనూ ఆమె ఎన్నికలకు ముందు గంగా యాత్ర చేశారు. అంతవరకు ఎందుకు కొద్దిరోజుల క్రితం సిపిఐ నారాయణ విశాఖ స్వామి ఆశీస్సులు తీసుకున్నారు. చంద్రబాబు, జగన్ రెడ్డి, కేసీఆర్ ఇలా తెలుగు నేతలు అనేక మంది లౌకిక వాదానికి కాలం చెల్లిందన్న సత్యాన్ని గ్రహించి కావచ్చు ‘నేనూ హిందువును’ అంటూ ప్రకటించుకునేందుకు పోటీ పడుతున్నారు. రాముడిని తలచుకున్నా, జై శ్రీరామ్ అన్నా తమ  లౌకిక వాదం మయలపడి పోతుందని భయపడిన నాయకులు ఇప్పుడు .. జై శ్రీరామ్ అనేందుకు కూడా వెనకాడడం లేదు.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది. గత కొంత కాలంగా సబర్మలతో సహా అనేక అంశాలపై స్పందిస్తూ.. కేరళను టార్గెట్ చేస్తున్న బీజేపీ నాయకులు అక్కడ తమ జెండా ఎగరేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా పార్టీ పాలసీని కూడా పక్కన పెట్టి మెట్రో మ్యాన్ శ్రీధరన్ ను పార్టీలో చేర్చుకుని ఆయనే తమ సీఎం అభ్యర్థి అని ప్రకటించిన 24 గంటలలో యూ టర్న్ తీసుకున్నారు. ఇది ఇలా ఉండగా ప్రస్తుతం సీఎంగా ఉన్న కమ్యూనిస్ట్ నేత పినరై విజయన్ పై గోల్డ్ స్మగ్లింగ్ ఆరోపణలు రావడంతో.. ఈ ఎన్నికలలో ఎల్డిఎఫ్ భవిష్యత్తుపై ప్రజలు ఏ తీర్పు ఇవ్వబోతున్నారనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది ఈ నేపథ్యంలో అక్షరాస్యతలో దేశంలోనే మొదటి స్థానంలో ఉన్న ఆ రాష్ట్ర ప్రజలు ఎవరిని ఆశీర్వదిస్తారు అనే అంశంపై ప్రముఖ మీడియా సంస్థ టైమ్స్ నౌ, సీ ఓటరుతో కలిసి ఒక సర్వేను నిర్వహించారు. ఈ సర్వే ప్రకారం చూస్తే పాపం కమలనాథులు అక్కడ పవర్ చేతికి రావటం అటుంచి కనీసం రెండు మూడు అసెంబ్లీ స్థానాల్లో గెలవటం కూడా కష్టమేనని ఆ సర్వే తేల్చి చెబుతోంది. కేరళలో ఈసారి జరిగే అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ తన హవా చాటుతుందన్న ఆ పార్టీ నేతల మాటలలో ఎలాంటి నిజం లేదని.. ప్రస్తుతానికి అది ఏమాత్రం సాధ్యం కాదని ఈ తాజా సర్వే తేల్చి చెప్పింది. అంతేకాకుండా మొత్తం 140 స్థానాలు ఉన్న కేరళలో.. ప్రస్తుత సీఎం పినరయి విజయన్ నేతృత్వంలోని లెఫ్ట్డ్ డెమొక్రటిక్ ఫ్రంట్ కు 82 సీట్లు పక్కా అని.. ఆయనే తిరిగి అధికారాన్ని నిలబెట్టుకుంటాడని సర్వే చెపుతోంది. అదే సమయంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూనైటెడ్ డెమొక్రాటిక్ ఫ్రంట్ కు 56 నుంచి 60 వరకు సీట్లు వచ్చే అవకాశం ఉందని ఈ సర్వేలో తేలింది. అంతేకాకుండా 2016 ఎన్నికలతో పోలిస్తే ఎల్ డీఎఫ్ ఓటింగ్ శాతం కూడా కొంత పెరగటం ఇక్కడ గమనార్హం. ప్రస్తుతం సీఎంగా ఉన్న విజయన్ మరోసారి సీఎం కావాలని 43.34 శాతం మంది మొగ్గు చూపినట్లుగా సర్వేలో తేలింది. కరోనా సమయంలో విజయన్ సీఎంగా బాగా పని చేసారని ఈ సర్వే పేర్కొంది. మరోపక్క దేశ ప్రధానిగా రాహుల్ గాంధీ ఉండాలని కేరళ ప్రజల్లో 55.84 శాతం మంది కోరుకుంటున్నట్లుగా ఈ సర్వే;లో తేలింది. అయితే కేరళలో ఎలాగైనా పాగా వేయాలని పట్టుదలతో కృషి చేస్తున్న బీజేపీకి ఈసారి కూడా నిరాశ తప్పదని ఈ సర్వేలో స్పష్టం అయింది. ఈ ఎన్నికలలో బీజేపీకి రెండు సీట్లు కూడా రావటం కూడా కష్టమేనని ఈ సర్వే తేల్చింది. అయితే ఎన్నికలకు ముందు ఇలాంటి సర్వేలు బయటకు రావడం.. తరువాత అందులో కొన్ని చతికిల పడడం మనం చూస్తూనే ఉన్నాం. మరి ఈ సర్వే ఫలితాలు నిజామా అవుతాయో లేదో తేలాలంటే కొద్దీ రోజులు వెయిట్ చేయాల్సిందే.        
రాజకీయాలు అంటేనే అదో జూదం. పూలమ్మిన చోటనే కట్టెలు అమ్మవలసి రావచ్చును. అలాంటి పరిస్థితే వచ్చినా, తలవంచుకుని పోగలిగితేనే, ఎవరైనా రాజకీయాలలో రాణించగలరు. అలాకాదని, అలిమి కానిచోట, కూడా తామే అధికులమని భావిస్తే, ఎందుకూ కాకుండా పోతారు. అలాంటి వారు ఇద్దరూ కూడా ఇప్పుడు మన కళ్ళముందే ఉన్నారు.  జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు. అలాగే జయ మరణం తర్వాత ఆమె పరిస్థితి ఏమిటో కూడా వేరే చెప్పవలసిన, అవసరం లేదు. జైలు పాలయ్యారు. సర్వం తానై నడిపించిన పార్టీ నుంచి  బహిష్కరణకు గురయ్యారు. జయ ఉన్నంత వరకు తన వారుగా ఉన్న వారందరూ కానివారయ్యారు. ఒంటరిగా మిగిలారు.  నిజానికి నాలుగేళ్ళు జైలు జీవితం గడిపిన తర్వాత కూడా ఆమె తలచుకుంటే.. రాష్ట్ర రాజకీయాలలో, ముఖ్యంగా అధికారంలో ఉన్న డిఎంకే కూటమిలో అలజడి సృష్టించగలరు. ఎన్నికలలో ఆమె గెలవక పోవచ్చును కానీ.. తనను కాదన్న అన్నాడిఎంకేను ఓడించగలరు. అయిన  ఆమె అందుకు విరుద్ధంగా  రాజకీయాలకు వీడ్కోలు పలికి మౌనంగా పక్కకు తప్పుకున్నారు. రాజకీయ సన్యాసం ప్రకటించారు. ఉమ్మడి శతృవు డిఎంకే ను ఓడించేందుకు అన్నా డిఎంకే కూటమి  పోటీ చేయాలని, కూటమి ఐక్యతను దెబ్బతీయరాదనే ఉద్దేశంతోనే ఆమె రాజకీయ సన్యాసం ప్రకటించారు.    శశికళ మౌనంగా వెళ్లి పోవడం వెనక ఇంకా అనేక కారణాలున్నా ,అసలు కారణం ఆమె, రాజకీయ విజ్ఞత, వివేకం. ఆమె జైలుకు వెళ్ళిన సమయంలో జయలలిత సమాధి వద్ద ఎంత కసిగా, కోపంగా ‘మౌన’ ప్రతిజ్ఞ చేశారో చూశా. అలాంటి ఆమె ఇప్పుడు ఇలా ‘మౌనం’గా వెనకడుగు వేశారంటే, అది ఆలోచించ వలసిన విషయమే.ఆమె వ్యుహతంకంగానే సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే అనేక మంది అనేక కోణాల్లో శశికళ సంచలన నిర్ణయాన్ని విశ్లేషించారు.జైలు జీవితం తర్వాత కూడా అన్నా డిఎంకే నాయకులు తనను అగ్రనేతగా అంగీకరించక పోవడం, అమిత్ షా చెప్పినా.. అన్నా డిఎంకే నాయకులు ఆమెను, మేనల్లుడు దినకరన్’ను కులం పేరున, కుటుంబం పేరున దూరం చేయడం, తిరిగి పార్టీలోకి తీసుకోకపోవడంతో ఆమె మనసు కష్టపెట్టుకుని, సన్యాస నిర్ణయం తీసుకున్నారని కొందరంటున్నారు. పార్టీ మీద పట్టు లేదని, చరిష్మా అసలే లేదని, అందుకే ఆమె అలా నిశ్శబ్ధంగా రాజకీయ సన్యాసం స్వీకరించారని ఇంకొందరు విశ్లేషించారు. ఈ విశ్లేషణలో కొంత నిజం ఉంటే ఉండవచ్చును.. కానీ ఆమె గతాన్ని, నైజాన్ని గుర్తు చేసుకుంటే ఆమె స్ట్రైక్ బ్యాక్ వ్యూహంతోనే ఒకడుగు వెనక్కివేశారని ఆమెతో సన్నిహితంగా మెలిగినవారు, ఆమె రాజకీయ చాణక్యం తెలిసిన వారు అంటారు.   నిజానికి జైలులో ఉన్న కాలంలో కానీ, జైలు నుంచి విడుదలై వచ్చిన తర్వాత కానీ, ఆమె రాజకీయ సన్యాసం వైపు అడుగులు వేస్తున్నట్లు కనిపించలేదు. బెంగుళూరు జైలు నుంచి విడుదలై చెన్నైలో ప్రవేశించిన నప్పుడు ఆమె పెద్ద కాన్వాయ్ తో  తమ కారుకు అన్నాడిఎంకే జెండాతోనే ఎంటరయ్యారు. అలా ఎంట్రీలోనే రాజకీయ ఆకాంక్షను వెంట తెచ్చుకున్నారు. చివరకు ‘సన్యాస’ ప్రకట చేసే వరకు కూడా ఆమె రాజకీయ కార్యకలాపాలు సాగిస్తూనే ఉన్నారు. అటు ఢిల్లీని ఇటు చెన్నైనికూడా కదిల్చారు. అంతేకాదు, రాజకీయాలపై విరక్తితో కాదు, రాజకీయ కసితో, ఉమ్మడి శత్రువు (డిఎంకే) ను ఓడించేందుకే తాను రాజకీయాలనుంచి తపుకుంటున్నట్లు చెప్పారు.  సో .. సన్యాసం తీసుకోవాలనే ఆలోచన, రాజకీయవ్యూహం లోంచి పుట్టిందే కానీ,వైరాగ్యంతో పుట్టింది కాదు ,అన్నవిశ్లేషణ వాస్తవానికి ఇంకొంత దగ్గరగా ఉందని అనుకోవచ్చును. ఇది ‘కామా’నే కాని ‘ఫుల్స్టాప్’ కాదని అంటున్నారు.  ముఖ్యమంత్రి ఎడప్పాడి కే. పళని స్వామి (ఈపీఎస్) ఆమెను పార్టీలోకి అనుమతిస్తే తన కుర్చికీ ఎసరు పెడతారనే భయంతోనే,, ఆమె ఎంట్రీని అడ్డుకున్నారు. ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం, శశికళ ఒకే సామజిక వర్గానికి చెందిన వారు కావడం కూడా, ముఖ్యమంత్రి ఈపీఎస్’ భయానికి కారణంగా పేర్కొంటారు. అందుకే  ఆయన, ‘మన్నార్గుడి’ ఫ్యామిలీని బూచిగా చూపించి, ఆమెను దూరంగా ఉంచారని పార్టీలో ఒక వర్గం గట్టిగా విశ్వసిస్తుంది. అయితే ఆమె శక్తియుక్తులను కూడతీసుకుని  పులిలా పంజా విసిరేందుకే ఆమె వ్యూహాత్మకంగా ఒక అడుగు వెనక్కి వేశారు కావచ్చును అని కూడా, తమిళ రాజకీయ వర్గాల్లో ఒక చర్చ జరుగుతోంది.  గతంలో ఆమె జయలలితతో విబేధాలు వచ్చిన సమయంలో కూడా ఇలాగే కొద్ది కాలం మౌనంగా తెర చాటుకు వెళ్లి పోయారు.  కొద్ది కాలంలోనే మళ్ళీ ‘పోయస్ గార్డెన్’లో ప్రత్యక్షమయ్యారు. జయలలిత స్వయంగా ఆమెను వెనక్కి పిలుపించుకోవలసిన పరిస్థితులను సృష్టించారు. అలా  మళ్ళీ  చక్రం తిప్పారు. జయలలిత మరణం వరకు ఆమె అందరికీ చిన్నమ్మగా అమ్మకు పెద్దమ్మగా సర్వం తానై నిలిచారు. చివరకు జయ అంత్యక్రియల్లో కూడా ఆమెదే పై చేయిగా కనిపించింది.   జయలలిత చనిపోయిన సందర్భంలోనే అన్నా డిఎంకే ఎమ్మెల్ల్యేలో సుమారు 30 మంది వరకు ఆమెకు మద్దతుగా ఉన్నారన్న వార్తలొచ్చాయి. నిజానికి,ఇప్పటికి కూడా ఒక్క అన్నా డిఎంకే లోనేకాదు,డిఎంకే ఇతర పార్టీలలో కూడా  ఆమె అవసరం ఉన్న వాళ్ళు ఉన్నారు. కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో ‘మన్నార్గుడి’ ఫ్యామిలీ మద్దతు లేకుండా గెలిచే అవకాశం లేదు.  ఇవ్వన్నీ నిజమే అయినా.. అన్నీ ఉండి, ఎవరు లేని శశికళలో, ఇంకా  ఎవరి కోసం తాపత్రయ పడాలి? అనే ప్రశ్న జనించి ఉంటే, ఆమె రాజకీయ సన్యాసం నిజం కావచ్చును. ఎందుకంటే ఆమె నెచ్చలి, జయలిత లేరు, భర్త అంతకంటే ముందే చనిపోయారు, పిల్లలు లేరు... పైగా నాలుగేళ్ళ జైలు జీవితం ఆమెలో మార్పు తెచ్చి ఉండవచ్చును. ఈ వయస్సులో తనవారంటూ ఎవరు లేని తనకు రాజకీయాలు ఎందుకు ? శేష జీవితాన్ని ఇలా సాగిద్దామనే ఆలోచన నిజంగా వచ్చి ఉంటే, ఆమె సన్యాసం సత్యం అయినా కావచ్చును, కాకపోనూ వచ్చును. కానీ  శశికళ... ఆమెను అర్థం చేసుకోవడం, అంచనా వేయడం , అంత తేలిగ్గా అయ్యే పని కాదు..
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు. కాంగ్రెస్ అధినాయకత్వం పై నేరుగా అస్త్రాలు సంధించారు. రాహుల్ గాంధీ పేరు చెప్పకుండానే, ఆయన నాయకత్వానికి పనికిరాడని తేల్చి చెప్పారు. ఎవరైనా పార్టీ అధ్యక్షుడు అయితే కావచ్చును, కానీ, ప్రజానాయకుడు కాలేడని, రాహుల గాంధీ ప్రజానాయకుడు కాదు కాలేరు,అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తరచూ రాహుల్ గాంధీని ఉద్దేశించి చేసే  ‘నామ్’ధారీ వ్యంగ్యాస్త్రాన్నే కాంగ్రెస్ సీనియర్ నాయకులు కూడా సందించారు. ఇక అక్కడి నుంచి విధేయ, అసమ్మతి వర్గాల మధ్య మాటల యుద్ధం ఎదో ఒక రూపంలో సాగుతూనే వుంది. అదే క్రమంలో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ, కరుడు కట్టిన ముస్లిం మతోన్మాది, అబ్బాస్ సిద్దిఖీతో కాంగ్రెస్ పార్టీ చేతులు కలపడం అసమ్మతి నాయకులకు మరో అస్త్రాన్ని అందించింది. విషయంలోకి వెళితే, ఇటీవల పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా లోక్’సభలో కాంగ్రెస్ పక్ష నాయకుడు, పశ్చిమ బెంగాల్ పీసీసీ అధ్యక్షుడు అధీర్’రంజన్ చౌదరి, ముస్లిం మత ప్రచారకుడు, అబ్బాస్ సిద్దిఖీతో  వేదిక పంచుకున్నారు.అంతకు ముందే వామ పక్ష కూటమితో  పొత్తు కుదుర్చుకున్న కాంగ్రెస్ పార్టీ, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)ను కూటమిలో చేర్చుకుంది. ఇలా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) అమోదం లేకుండా మతోన్మాద ఐఎస్ఎఫ్’ తో ఎన్నికల పొత్తు పెట్టుకోవడం ఆ పార్టీ నాయకుడు,సిద్ధిఖీతో  పీసీసీ చీఫ్ వేదిక  పంచుకోవడం పై అసమ్మతి నేతలు మండి పడుతున్నారు. ఇలా సిద్దిఖీతో వేదిక పంచుకోవడం పార్టీ మౌలిక సిద్ధాంతాలకు వ్యతిరేకం అంటూ అసమ్మతి వర్గానికి చెందిన కీలక నేత, రాజ్యసభ సభ్యుడు,ఆనంద్ శర్మ మండిపడ్డారు. అంతే కాదు, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)తో జనవరిలో కుదుర్చుకున్న పొత్తుకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ)అమోదం లేదని ఆనంద్ శర్మ, అభ్యంతరం వ్యక్త చేశారు. పార్టీ విశ్వసించే లౌకిక వాదానికి కాంగ్రెస్ అధిష్టానం తీసుకున్న నిర్ణయం గొడ్డలి పెట్టని ఆయన తీవ్రంగా స్పందించారు.   శర్మ వ్యాఖ్యలపై అధీర్ రంజన్ చౌదరి అంతే ఘాటుగా ప్రతిస్పందించారు. “నిజాలు తెలుసుకోండి ఆనంద్ శ‌ర్మ జీ” అంటూ ఆయ‌న వ‌రుస ట్వీట్లు చేశారు. వ్య‌క్తిగ‌త ప్ర‌యోజ‌నాలు ప‌క్క‌న‌పెట్టి, ప్ర‌ధానిని పొగిడి టైమ్ వేస్ట్ చేయ‌కండంటూ ఆయ‌న ఓ ట్వీట్లో అన్నారు. ఆనంద్ శ‌ర్మ అన‌వ‌స‌రంగా కాంగ్రెస్‌ను ల‌క్ష్యంగా చేసుకుంటున్నార‌ని, ఈ అంశాన్ని పెద్ద‌ది చేసి చూపిస్తున్నార‌ని విమ‌ర్శించారు. ఆయ‌న ఉద్దేశాలు స‌రైన‌వే అయితే నేరుగా తనతో మాట్లాడ వలసిందని అన్నారు. బెంగాల్‌లో సీపీఐ(ఎం) కూట‌మికి నేతృత్వం వ‌హిస్తోంది. అందులో కాంగ్రెస్ ఓ భాగం. మ‌త‌తత్వ‌, విభ‌జ‌న రాజ‌కీయాలు చేస్తున్న బీజేపీకి చెక్ పెట్ట‌డానికే ఈ కూట‌మి అని మ‌రో ట్వీట్‌లో అధిర్ రంజ‌న్ అన్నారు. అక్కడతోనూ ఆగలేదు ... ట్వీట్ల మీద ట్వీట్లు సంధిస్తూ, ఆనంద్ శర్మ, బీజేపీ మత విభజన, అజెండాను బలపరుస్తున్నారని, పరోక్షంగా జీ23 నాయకులు బీజేపీకి ప్రయోజనం చేకూరుస్తున్నారని ఆరోపించారు.అంతే కాదు, క్షేత్ర స్థాయి వాస్తవ పరిస్థితులు తెలియకుండా, ఆనంద్ శర్మ పార్టీ మీద దండెత్తడం ఉచితం కాదని చౌదరి ఎదురుదాడి చేశారు. అసమ్మతిలో అసమ్మతి. ఇదలా ఉంటే, కాంగ్రెస్ పార్టీ  సమూల పక్షాళన కోరుతూ సోనియా గాంధీకి,గత సంవత్సరం  జీ 23గా ప్రాచుర్యం పొందిన సీనియర్ నాయకులు రాసిన లేఖపై సంతకాలు చేసిన  నాయకుల్లో నలుగురు,జమ్మూలోసమావేసమైన నాయకుల తాజా నిర్ణయాలు, వ్యాఖ్యలు,విమర్శల పట్ల అసంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరం సోనియా గాంధీకి రాసిన లేఖలో ప్రస్తావించిన అంశాలకు కట్టుబడి ఉన్నామని, అయితే, జీ 23లోని కొందరు సహచరులు, ఇటీవల గీతదాటి చేస్తున్న వ్యాఖ్యలు, విమర్శలను తాము సమర్ధించడం లేదని ఆ నలుగురు పేర్కొన్నారు. ఇందులో ముఖ్యంగా, రాజ్యసభ మాజీ డిప్యూటీ చైర్మన్, పీజే కురియన్ అయితే, “కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు అవసరమైన సంస్కరణలు తెచ్చేందుకు చేసే ప్రయత్నాలను పూర్తిగా సమర్దిస్తాను, కానీ, ‘లక్ష్మణ రేఖ’ దాటితే ఒప్పుకునేది లేదు”అని అసమ్మతిలో అసమ్మతికి తెర తీశారు.అలాగే, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ కుమారడు, మాజీ ఎంపీ సందీప్ దీక్షిత్,మధ్య ప్రదేశ్ సీనియర్ కాంగ్రెస్ నాయకుడు అజయ్ సింగ్’ కూడా గులాం నబీ ఆజాద్, కపిల్ సిబల్, ఆనంద్ శర్మ, మనీష్ తివారీ వంటి జీ 23 కీలక నేతలు అధినాయకత్వంపై చేసిన వ్యాఖ్యలను తప్పు పట్టారు. అలాగే, పార్టీ సీనియర్ నాయకుడు కేంద్ర మాజీమంత్రి వీరప్ప మొయిలీ కూడా,గత సంవత్సరం పార్టీ సీనియర్ నాయకులు  ఒక పరిమిత లక్ష్యంతో  సోనియా గాంధీకి లేఖ రాయడం జరిగిందని, ఆ పేరున జరుగతున్న  కార్యక్రమాలు లేఖ సంకల్పానికి  విరుద్ధమని అన్నారు. జీ 23 కార్యకలాపాలపై రాహుల్ గాంధీ కూడా పరోక్షగా స్పందించారు, ఒకప్పుడు ఎన్ఎస్’యుఐ, యూత్ కాంగ్రెస్’ కు సంస్థాగత ఎన్నికలు వద్దన్న వారే ఇప్పుడు ఇంకోలా మాట్లాడుతున్నారని పరోక్షంగానే అయినా సంస్థాగత ఎన్నికలు నిర్వహించడంతో పాటుగా, పార్టీ పక్షాలనకు తమ కుటుంబం వ్యతిరేకం కాదని, అందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఈ నేపధ్యంలో కాంగ్రెస్ పార్టీలో చెలరిగిన కలకలం  ఇక ముందు ఏమవుతుందో .. ఇంకెన్ని  మలుపులు తిరుగుతోందో ..చూడవలసిందే కానీ ఉహించలేము.
పంచతంత్రంగా పిలుచుకుంటున్న ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భతం జరగబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే, వివిధ సంస్థలు అసెంబ్లీ ఎన్నికలు జరిగే  అస్సాం. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటుగా కేరళలోనూ ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఆ ఒపీనియన్ పోల్ ఫలితాలు నిజంగా నిజం అయితే, కేరళలో మళ్ళీ సీపీఎం సారధ్యంలోని వామపక్ష కూటమి అధికారంలోకి వస్తుంది. ఇదే ఆ అద్భుతం. ఎందుకంటే, గత నాలుగు దశాబ్దాలలో కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో ఒకే కూటమి వరసగా రెండవసారి అధికారంలోకి వచ్చిన చరిత్ర లేనే లేదు. ఒక సారి ఎల్డీఎఫ్ అధికారంలోకి వస్తే ఐదేళ్ళ తర్వాత కాంగ్రెస్ సారధ్యంలోని ఐక్య ప్రజాస్వామ్య కూటమి(యూడీఎఫ్) అధికారంలోకి రావడం, దేవభుమిలో దైవ నిర్ణయమా అన్నట్లుగా ప్రతి ఎన్నికల్లోనూ అధికారం చేతులు మారుతూ వస్తోంది. అలాంటిది, ఈసారి ఒపీనియన్ పోల్స్ నిజమై వరసగా రెండవసారి వామపక్ష కూటమి అధికారంలోకి వస్తే, అది చరిత్రే అవుతుంది. ఇక ఒపీనియన్ పోల్స్ విషయానికి వస్తే, జాతీయ న్యూస్ ఛానెల్ ఏబీపీ, సీ ఓటర్ సంస్థలు సంయుక్తంగా ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఈ సర్వే ప్రకారం, 140 స్థానాలున్న కేరళ అసెంబ్లీలో వామపక్ష కూటమికి 83 నుంచి  91 స్థానాలు, యూడీఎఫ్ కూటమికి 47 నుంచి 55 స్థానాలు మాత్రమే దక్కుతాయని తెలుస్తోంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్రంలో ఇలా జాతకాలు తిరగబడడంపై సోషల్ మీడియాలో,’లెగ్ మహిమ’ లాంటి జోక్స్  ట్రోలవుతున్నాయి. అయితే 2016లో జరిగిన ఎన్నికల్లో కేవలం 47 సీట్లకే పరిమితం అయిన కాంగ్రెస్’కు ఈసారి ఒకటీ అరా సీట్లు ఎక్కువస్తే, రావచ్చును. అదే కాంగ్రెస్’కు కాసింత ఊరట. అదలా ఉంటే, పశ్చిమ బెంగాల్లో సైతం పట్టు సాధించిన బీజేపే, కేరళలో మాత్రం పట్టు కాదు కదా, పట్టుమని పది సీట్లు తెచ్చుకునే స్థితిలో లేదు. నిజానికి, దేశంలో బీజేపీకి అసలు ఏ మాత్రం మింగుడు పడని రాష్ట్రాలు ఎవైన ఉన్నాయంటే కేరళ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల  పేర్లే ప్రముఖంగా వినిపిస్తాయి. ఈ సారి కూడా కమల దళం కేరళలో కాలు పెట్టె పరిస్తి లేదని సర్వే ఫలితాలు చెపుతున్నారు. ఎప్పటిలానే ఇప్పడు కూడా  బీజేపీకి సున్నా నుంచి రెండు సీట్లు వచ్చే అవకాశం ఉందని, సర్వేస్వరుల అభిప్రాయంగా ఉంది. కేరళలో మొత్తం 140 స్థానాలకు ఏప్రిల్ 6 తేదీన ఒకే విడతలో పోలింగ్ జరుగుతుంది. మే 2 తేదీన ఫలితాలు వెలువడతాయి. కేరళ ఎలక్షన్ పై యావత్ దేశం ఆసక్తి కనబరుస్తోంది.    
కేంద్ర ఎన్నికలసంఘం ‘పాంచ్ పటాక’ గంట కొట్టింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. ఎన్నికల గంట మోగడంతో మొదలైన మరో భారత ‘మినీ’  సంగ్రామానికి మే 12 తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తెర పడుతుంది.ఈలోగా వివిధ అంచల్లో పోలింగ్ జరుగుతుంది.  నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతం ఓటరు తీర్పుకు వెళుతున్నా, అందరి దృష్టి, ముఖ్యంగా ప్రాంతీయ పార్టీల ఏలుబడిలో ఉన్న ఉభయ తెలుగు రాష్ట్రాలు, మరీ ముఖ్యంగా ఇప్పటికే బీజేపీ కన్నుపడిన తెలంగాణ రాష్ట్ర ప్రజలు, రాజకీయ పార్టీల దుష్టి  మాత్రం పశ్చిమ బెంగాల్ పైనే వుంది.  పశ్చిమ బెంగాల్లో ‘అద్భుతం’ జరిగి బీజేపీ విజయం సాధిస్తే, ఇక  కమల దళం ఫోకస్, తెలంగాణకు షిఫ్ట్ అవుతుంది. ఇది అందరికీ తెలిసిన బహిరంగ రహస్యం. ఈ నేపధ్యంలో బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయి అనే విషయంలో రాష్ట్ర రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. బెంగాల్లో బీజేపీ గెలిస్తే, ఇప్పటికే అంతర్గత కుటుంబ కలహాలతో సతమతవుతున్న తెరాస నాయకత్వానికి మరిన్నితిప్పలు తప్పవన్న మాట అంతఃపుర వర్గాలలో సైతం వినవస్తోంది.  పశ్చిమ బెంగాల్’లో ఎలాగైతే కమలదళం ఓ వంక తమ ట్రేడ్ మార్క్, హిందుత్వ రాజకీయాలు సాగిస్తూ, మరో వైపు నుంచి ‘ఆకర్ష్’ అస్త్రంతో అధికార పార్టీని నిర్వీర్యం చేసిన విధంగానే, ఇక్కడ కూడా ఫిరాయింపులను ప్రోత్సహింఛి పార్టీని నిట్టనిలువునా చీల్చే ప్రమాదాన్ని కొట్టివేయలేమని పార్టీ వర్గాలు కూడా అనుమానం వ్యక్త పరుస్తున్నాయి.  ఇప్పటికే తెలంగాణ  బీజేపీ నాయకులు 30 మంది తెరాస ఎమ్మెల్యేలు తమ టచ్ లో ఉన్నారని బెదిరిస్తున్నారు.అది నిజం అయినా కాకపోయినా..తెరాసలో అసంతృప్తి అగ్గి రగులుతోందనేది మాత్రం ఎవరూ కాదనలేని నిజం. అంతే కాకుండా రాష్ట్రానికి వచ్చిన కేంద్రనాయకులు ఎవరిని పలకరించినా, నెక్స్ట్ టార్గెట్ తెలంగాణ అని ఎలాంటి సషబిషలు లేకుండా కుండబద్దలు కొడుతున్నారు.అందుకే, బెంగాల్లో బీజేపీ గెలిస్తే.. అనే ఊహా కూడా  గులాబీ గూటిలో గుబులు పుట్టిస్తోంది. అయితే, బెగాల్’లో బీజేపీ గెలిస్తే ఒక్క తెలంగాణలోనే కాదు, దేశ రాజకీయ వాతావరణంలోనే పెను మార్పులు చోటు చేసుకుంటున్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.  అలాగే,  దేశ ముఖ చిత్రంలో కూడా పెను మార్పులు తప్పవని అంటున్నారు. అయితే రాజకీయాలలో ఎప్పుడు ఏం జరుగుతుందో.. ఎవరూహించెదరు..
పరాభవం.. తెలుగు జానపద చిత్రాలు,  జానపద నవలలు చదివితే.. అందులో అవమానం జరిగిందనడానికి బదులుగా పరాభవం ఎదురైంది అనే పదం వాడటం చూస్తూనే ఉంటాము.  పరాభవం అంటే అగౌరవం,  అవమానం, కించపరచడం.. ఇలా చాలా సందర్బాలలో వాడుతూ ఉంటారు. అయితే తెలుగు పంచాంగంలో.. తెలుగు సంవత్సరాలలో 40వ తెలుగు సంపత్సరం పేరు పరాభవ నామ సంవత్సరం.  ఈ సంవత్సరం పేరు వినగానే చాలామంది భయపడుతున్నారు.  రెండేళ్ల క్రితం వచ్చిన క్రోథ నామ సంవత్సరం అప్పుడు ఇలాగే భయపడ్డారు. కానీ కాలంతో ప్రయాణం తప్పదు.  అయితే ప్రజలలో పరాభవనామ సంవత్సరం అనే పేరు వినగానే ఎక్కడలేని భయం పుట్టుకొస్తోంది. ఈ కొత్త ఏడాదిలో అవమానాలు, అగౌరవాలు తప్పవా అని ముందే తమ భవిష్యత్తు గురించి మనసులో బోలెడు భవిష్యవాణి ఊహించుకుంటున్నారు. కానీ పరాభవ నామ సంవత్సరం పేరు వెనుక ఉన్న అర్థం,  అందులో పరమార్థం వేరని, ఈ విషయం తెలిస్తే అందరూ ఎంతో ఊరట చెందుతారని అంటున్నారు పండితులు. ఇంతకూ పండితులు ఈ పరాభవ నామ సంవత్సరం గురించి, దాని పేరులో ఉన్న అర్థం గురించి ఏం చెప్తున్నారో తెలుసుకుంటే.. తెలుగు పంచాంగం ప్రకారం 60 తెలుగు సంవత్సరాలు  ఉంటాయి.  వాటిలో విశ్వావసు నామ సంవత్సరం 39వది కాగా.. పరాభవ నామ సంవత్సరం 40వది.  చైత్ర మాసంలో ఉగాది పర్వదినం సందర్బంగా కొత్త తెలుగు సంవత్సరం అయిన పరాభవ సంవత్సరం మొదలు కాబోతోంది. పరాభవ అనే పేరు వినగానే పరాభవాలే ఎదురవుతాయేమో అనుకుంటారు చాలా మంది. కానీ పరాభవ నామ సంవత్సరం అంటే వేరే అర్థాలు ఉన్నాయి.  పరాభవలో పరా అంటే పరాభట్టారికా దేవి.. లిలితా దేవినే పరాభట్టారికా దేవి అని అంటారు.  భవ అని భవుడు అని పరమేశ్వరుడిని సంభోధిస్తారు.  దీని ప్రకారంగా చూస్తే శక్తి స్వరూపమైన ఆ పార్వతీదేవి,  లయకారుడు అయిన పరమేశ్వరుడి కలయికగా వచ్చినదే తెలుగు సంవత్సరమని,  ఈ పరాభవ నామ సంవత్సరం మీద పార్వతీపరమేశ్వరుల అనుగ్రహం పుష్కలంగా ఉంటుందని పండితులు చెబుతున్నారు.   చాలా వరకు ప్రజలు ఎందులో అయినా ముందు చెడునే గుర్తిస్తారు, చెడునే తలుస్తారు.  ఈ స్వభావం కారణంగానే పరాభవ నామ సంవత్సరం గురించి పలు ఊహాగానాలు వస్తున్నాయని పండితులు చెబుతున్నారు. మరొక విధంగా చూస్తే.. పర అంటే పరదేవత.. ఆ పరదేవతే లలితా పరమేశ్వరి దేవి,  భవ అంటే అంటే కూడా పరమేశ్వరుడు.. ఎలా చూసినా ఇందులో ఎంతో ఆధ్యాత్మికత,  భక్తి మేళవింపు కనిపిస్తుంది.  ఇంతటి గొప్ప నామం వెనుక పిచ్చి అనుమానాలు, భయాలతో కొత్త ఏడాదిని మొదలుపెట్టడం మంచిది కాదని,  ప్రతి ఒక్కరూ సానుకూల ఆలోచన కలిగి ఉండాలని పండితులు చెబుతున్నారు. పరాభవ నామ సంవత్సరాన్ని అత్యున్నతమైన ఏడాది అని జ్యోతిష్యం చెబుతోంది. పరా అంటే గొప్పది, అత్యున్నతమైనది,  భవ అంటే పుట్టుక లేదా ఉద్భవించేది.  ఉన్నతంగా ఉద్భవించేది పరాభవ.. కాబట్టి ఈ పరాభవ నామ సంవత్సం కూడా ఉన్నతంగా ఉంటుందని చెబుతున్నారు. మనిషి తన కర్తవ్యాన్ని తాను ధర్మం తప్పకుండా నెరవేరుస్తుంటే.. ప్రతి ఏడాదిలో వారికి సానుకూలంగా సాగిపోతుందని ఆధ్యాత్మిక వేత్తలు కూడా చెబుతున్నారు. చెడులోనూ మంచి చూసే గుణం,  సానుకూల ఆలోచనలు ఉండటం ప్రధానం. కాబట్టి ఈ పరాభవ నామ సంవత్సరం రోజు సంతోషంతో ఉగాది పండుగను జరుపుకోవడం ద్వారా అందరూ సుఖ సంతోషాలు పొందాలని కోరుకుంటూ.. అందరికీ పరాభవ నామ తెలుగు సంవత్సరాది శుభాకాంక్షలు..                                   *రూపశ్రీ.
నిజమే ఉగాది పండుగ మనదే. తెలుగువారి కొత్త సంవత్సరం ఉగాది తోనే ప్రారంభమవుతుంది.  మన కొత్త సంవత్సరం అంతా ఎంతో కళను నింపుకుని ఉంటుంది. సాంప్రదాయంగా ఉంటుంది. ముఖ్యంగా కృత్రిమత్వంలో పడిపోతున్న మనిషిని బయటకు తీసుకొచ్చి కాసింత ప్రకృతి మధ్య నిలబెడుతుంది. ఇంతకూ మన ఉగాది మనకు మాత్రమే తెలుసా!! మనకు తెలిసిన ఉగాది ఏంటి?? మనం రేపటి తరానికి ఉగాది గురించి చెబుతున్నది ఏంటి??  ఉగాది వెనుక కథ!! సోమకుడు అనేవాడు వేదాలను హరించాడు(దొంగిలించాడు). అలా వేదాలను దొంగిలించిన సోమకుడిని  మత్స్యవతారంలో ఉన్న  విష్ణువు వధించి(సంహరించి, చంపి) వేదాలను బ్రహ్మకు అప్పగించిన శుభదినంను పురస్కరించుకుని విష్ణువు ప్రీత్యర్ధం 'ఉగాది' ఆచరణలోకి వచ్చిందని పురాణాలు చెబుతున్నాయి.  అయితే చైత్రశుక్లపాడ్యమినాడు ఈ విశాల విశ్వాన్ని బ్రహ్మదేవుడు సృష్టించాడు కాబట్టి, సృష్టి ఆరంభించిన సంకేతంగా ఉగాది జరుపబడుతుందని కూడా చెప్పబడుతుంది. శాలివాహన చక్రవర్తి చైత్రశుక్లపాడ్యమినాడే పట్టాభిషిక్తుడై తన శౌర్యపరాక్రమాలతో శాలివాహన యుగకర్తగా మారిన కారణంతో ఆ యోధుడిని స్మరించుకుంటూ ఉగాది జరుపుకుంటారని చారిత్రక వృత్తాంతం. ఇలా కారణాలు ఎన్ని ఉన్నా ఉగాది అనేది ఓ కొత్తదనానికి సూచిక.  ఆశను మొలిపించే తరుణం!! మనిషి తరతరాలుగా ఓ నమ్మకంతో ఉన్నాడు. అదే కొత్తదనంలో జీవితం కొత్తగా మారుతుందని. అది చాలా మంచి ఆశావహదృక్పథం కలిగి ఉంటుంది. ఆకురాల్చు కాలంలో చెట్ల ఆకులు అన్నీ పోయాక, మోడువారి ఏమీలేనితనంతో ఉన్నప్పుడు, వసంతం వస్తుంది, మెల్లిగా చివురులు తొడుగుతాయి చెట్లు. అవన్నీ పచ్చని ఆశల చివురులు, ఉగాదిలో దాగున్నది అదే అంటారు అందరూ. షడ్రుచులు-జీవితసారం!! ఉగాది రోజు అందరి ఇళ్లలో ఉండే ప్రత్యేక విందు ఉగాది పచ్చడి. నిజానికి జీవితమంతా ఆ పచ్చడిలోనే ఉందని చెబుతారు పెద్దలు. కష్టాలు, సుఖాలు, బాధలు, ఇబ్బందులు, ప్రేమలు, పొట్లాటలు ఇలా అన్నీ ఉగాది పచ్చడిలో ఉండే ఆరు రుచులలో కలిసిపోయి ఉంటాయని చెబుతారు. అందుకే ఉగాది రోజు ఉగాది పచ్చడికి నత ప్రత్యేకత వచ్చి పడింది. అలాగే మరొక విషయం కూడా. ఉగాది సమయంలోనే కొత్త బెల్లం దొరుకుతుంది, మామిడికాయల గురించి ప్రత్యేకంగా చెప్పాలా?? ఈ సమయానికి కాస్త చిన్న చిన్నగా ఉన్న వగరుతో ఉన్న కాయలు వస్తాయి. ఇంకా ఎంతో గొప్ప ఔషధ మూలాలు కలిగిన వేపచెట్లకు పువ్వులు పూస్తాయి, కొత్త చింతపండు ఎర్రెర్రగా నిగానిగలాడుతూ అందరి ముందుకూ వస్తుంది.  వీటన్నింటి కలయిక అయిన వేపపచ్చడి ఆరు రుచులతో కనువిందు చేస్తుంది. సంప్రదాయపు గీతిక!! ఉగాది రోజు మగవాళ్ళు అందరూ పంచెకట్టులోనూ, ఆడవాళ్లు పట్టుచీరల్లోనూ, పిల్లలు కొత్త బట్టల్లోనూ మెరిసిపోతూ ఉంటారు. ఆ వస్త్రధారణలో అసలైన తెలుగుదనం ఉట్టిపడుతూ ఉంటుంది. నగరాలలో కృత్రిమత్వంలో మునిగిపోయిన యువత ఎంతో అందంగా, పద్దతిగా, బుద్దిగా ఇలా తయారైతే ఇంటిల్లిపాదికీ ఎంత సంతోషమో!! ఇంకా పంచాంగ శ్రవణం మరొక వేడుక, పిండి వంటల సంబరం మరొక ఎత్తు. ఇలా అన్ని విధాలుగా ఉగాది మనిషి జీవితంతో ముడిపడి ఉంటుంది. మనిషి జీవితానికి అసలైన నిర్వచనాన్ని ఉగాది చెబుతుంది. అభివృద్ధి వేగంలో మనిషి మర్చిపోతున్న అసలైన నడవడికను మన ఉగాది మనకు తిరిగి అందిస్తుంది. అందుకే ఇది మన తెలుగుసంవత్సరం అని గొప్పగా జరుపుకోవాలి.                                    ◆ వెంకటేష్ పువ్వాడ.
హిందువులకు తులసి మొక్క దైవంతో సమానం. తులసి మొక్క పచ్చగా కళకళలాడుతూ ఉంటే ా ఇంట్లో ఎంతో సానుకూల శక్తి,  మరెంతో సంతోషం ఉంటాయని చెబుతారు. అయితే వేసవి కాలం వచ్చేసింది. తులసి మొక్కతో సహా చాలా రకాల మొక్కలు వేసవి ఎండల కారణంగా వాడిపోయి ఎండిపోతుంటాయి. కానీ పవిత్రమైన తులసి మొక్క పచ్చగా ఉంటేనే మంచిది.  ఇది ఇంటికి అందాన్నే కాకుండా సానుకూల శక్తిని కూడా నిలిపి ఉంచుతుంది.  వేసవి ఎండలు ఎంత ఉన్నా తులసి మొక్క అందంగా,  పచ్చగా ఉండాలంటే  కొన్ని చిట్కాలు పాటించాలి. అవేంటో తెలుసుకుంటే.. తులసి మొక్క ఔషధ గుణాలతో సమృద్ధిగా ఉంటుంది. వేసవి కాలం కదా అని చాలామంది తులసి మొక్కకు ఎక్కువ నీరు పెడుతూ ఉంటారు. కానీ ఇది చాలా తప్పు.  ఎక్కువ నీరు పెట్టడం వల్ల మొక్క దెబ్బతింటుంది. నేల తేమగా  ఉండేందుకు తగినంత మాత్రమే మొక్కకు నీరు పెట్టాలి. మొక్క నీటిలో మునిగినట్టు ఉంటే ఆ మొక్కకు హాని కలుగుతుంది. తులసి మొక్క గురించి నిర్లక్ష్యంగా ఉండకూడదు.  కొన్నిసార్లు, మొక్కను సరిగ్గా చూసుకోకపోవడం వల్ల అది కుళ్ళిపోతుంది.  కొన్ని ఇళ్లలో వర్షాకాలంలో కూడా తులసి మొక్క పచ్చగా కనిపించదు. అలాంటి వారు జాగ్రత్తలు తీసుకోవాలి. మొక్కలను కుండీలలో పెంచుతూ ఉంటారు.  వీటికి కొన్నిసార్లు,  పోషకాహార లోపం కూడా  ఎదురవుతుంది.  మొక్కల ఎదుగుదలకు  అవసరమైన పోషకాలు అందించడం చాలా ముఖ్యం. తులసి మొక్కను పచ్చగా ఉంచడానికి,  ఎరువులు వేయాలి. ప్రతి 15 రోజులకు ఒకసారి ఎరువులు వేస్తూ ఉంటే కొన్ని రోజులకే మొక్క పచ్చగా మారుతుంది. తులసి మొక్క ఎండిపోయినట్టు ఉంటే మొక్క  మట్టికి ఆవాల కేక్ వేయవచ్చు. ఆవాల కేక్ వేయడం వల్ల మొక్క వేగంగా పెరుగుతుంది.  ఆవాల నూనె తీసిన తర్వాత వచ్చే పిప్పిని ఆవాల కేక్ అని అంటారు.  ఒకవేళ ఇది అందుబాటులో లేకపోతే ఒక స్పూన్ ఆవాలను బాగా గ్రైండ్ చేసి ఆ పొడిని నేరుగా మట్టిలో మిక్స్ చేయవచ్చు. లేదంటే ఆవాల పొడిని నీటిలో వేసి ఒక రోజంతా అలాగే ఉంచి,  ఆ తరువాత  ఆ నీటిని మొక్కకు పోయవచ్చు. మొక్క బలంగా పచ్చగా పెరుగుతుంది. తులసి మొక్క ఎండిపోతూ ఉంటే.. ఎండిపోయిన కొమ్మలను తొలగించి,  ఆవాల పొడిని వేయడం వల్ల మొక్క తిరిగి కొన్ని రోజులకే పచ్చగా మారుతుంది.                                          *రూపశ్రీ.
డా ..చిరు మావిళ్ళ మురళీ మనోహర్.. ఉగాది అంటే ఉగాది పచ్చడి మాత్రమే అని అనుకుంటారు. కానీ ఉగాది పచ్చడిలో ఉన్న ఆయుర్వేద ఆరోగ్య రహస్యం ఏమిటో తెలుసా?ఇప్పుడు చైత్ర మాసం లో వసంత రుతువు లో ఉన్నాం ఆకు రాలిన తరువాత కొత్త కొత్త గా రేకు విచ్చినట్లు చిగుర్లు తోడుగుతాయి. ఆప్రాంతం అంతా పచ్చటి తివాచి పరిచినట్లు పచ్చగా విరబూస్తాయి. పువ్వులు పరిమళాలు.మావిడి పూత సువాసనలు, మామిడి చెట్లపై కొత్తగా చిగురులు తొడిగిన మామిడి పూత గుత్తులు,మామిడి పిందెలు ఆ వసంత శోభ అప్పుడే వచ్చిందా అనిపిస్తుంది మది పులక రిస్తుంది. కొత్త కొత్త పూతని ఆస్వాదించాలని అనిపిస్తూ ఉండడం సహజం.ప్రకృతి లో మార్పు వచ్చింది శీతకాలం నుండి ఎండా కాలానికి వాతావరణం మారుతుంది ఇక ఎండవేడి ని తట్టుకోవ దానికి మన శరీరం సన్నద్ధం కావాలి.వాతావరణం లో మార్పులకు తగ్గట్టుగా శరీరంలో వేడిమి ని,తట్టుకోవడం. శరీరం దానంతట అదే చల్లబడే సహజ లక్షణాన్ని వృద్ది   చేయడంకీలకం.ముఖ్యంగా ఎండాకాలం లో వేడికి శరీరం నీర సించి పోవడం.ఒక్కో సారి అతిసారం బారిన పడడం. ముఖ్యంగా డయాబెటీస్, గుండె సంబధిత సమస్యలు ఉన్న రోగులలో వచ్చే హార్ట్ బీట్ లో మార్పులు.లేదా శరీరంలో రక్త ప్రసరణలో సమస్యలు వస్తూ ఉంటాయని ప్రముఖ ఆయుర్వేద వైద్యులు  డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్ విశ్లేషించారు.ఈ క్రమం లో మనం ఉగాది రోజున తీసుకున్నే ఆరు రకాల లో ఉన్న ఆరోగ్య రహస్యాలు, వాటిలో  ఉండే పోషక విలువల గురించి తెలుగు వన్ హెల్త్ కు  వివరించారు. మనం పండగ పూట లేదా కొన్ని సందర్భాలాలో తీసుకున్న ఆహారం శరీరంలో తామస ,రజో గుణాలు పెంచు తాయని  శరీరంలో వేడి వల్ల వచ్చే సమస్యల ను అధిగమించాలి సత్వ ప్రాధాన మైనగుణాన్ని అలవారచుకోవాలాంటే ఉగాది పచ్చడి ఉపయోగ పడుతుందని ప్రముఖ ఆయుర్వేద వైద్యులు డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్ పేర్కొన్నారు. వేసవి రాగానే శరీరం లో కొన్ని రకాల రసాయన చర్యల వల్ల శరీరం లో సమతౌల్యం లోపిస్తుందని సమ తౌల్యాన్ని నియంత్రించే శక్తి ఉగాది పచ్చడి సమతుల పోషకాలు అందిస్తయాని అన్నారు డాక్టర్ చిరుమావిళ్ళ మురళీ మనోహార్. సాంప్రదాయ పద్దతిలో ఉగాది పచ్చడి కావాల్సిన పదార్ధాలు... **మట్టి పాత్ర,లేదా కుండ. **వేప పూత ఒక భాగం. **మామిడి పిందెలు  ముక్కలు రెండు భాగాలు.  . **చింత పండు,పా తది. నాలుగు భాగాలు. **ఉప్పు 5 భాగాలు. **బెల్లం ఆరు భాగాలు .ఇంకా అరిటి పండు ముక్కలు  అన్నీ కలిపి నీరు పోయాలి. పైన పేర్కొన్న కావాల్సిన పదార్ధాలలో  మధురం-తీపి  ఆమ్లం-పులుపు. లవణం-ఉప్పు . తి త్తం -చేదు. వగరు వంటి లక్షణాలు ఉంటాయి.ఇలా తయారు చేసిన వేప పచ్చడిని నింబ కుసుమ భక్షణం అని అంటారు.నింబ కుసుమము అంటే వేప పూత అని అర్ధం. మామిడి ముక్కలు,బెల్లము,పులుపు,చేదు వంటివి చింత పండు అరటి పండు,మిరియాలపొడి,ఉప్పు వంటివి వేసిన నింబ కుసుమ భక్షణం అంటే తింటే మరెన్నో లాభాలు ఔషద గుణాలు ఉన్నాయి.అని డాక్టర్ మురళీ మనోహర్ తెలుగు వన్ హెల్త్ కు వివరించారు. షడ్రసో పేతం ఉగాది పచ్చడి... ఉగాది పచ్చడిలో ఆరు రకాల రుచులు ఉంటాయని వాటిని షట్ రుచులుగా పేర్కొన్నారు.ఎందుకంటే జీవితానికి ఉగాదికి మానసిక సంబంధమైన సంబంధం ఉందని అంటారు చిరు మావిళ్ళ.అవును మనజీవితం లో తెలుగు వారికి తెలుగు సంవత్సరాది యుగ ఆది అంటే మరో యుగం నికి ఆది అంటే తొలి అడుగు. ఈ సమయం లో మనం ఎదుర్కునే ఎన్నోరకాల సమస్యలు ఒక్కో రుచిని సూచిస్తాయి. అన్ని సమపాళ్ళలో ఉంటె పచ్చడిని ఎలా అస్వాదిస్తామో.కస్టాలు,కడ గళ్ళు,ఆనందం,ఉత్సాహం, కష్టం,నష్టం, వచ్చినా మానసికంగా ఎదుర్కోడానికి మనల్ని సిద్ధం చేసేది ఉగాది అని అంటారు పండితులు.ఉగాది పచ్చడి ఔషద గుణాలు...వేప పువ్వు ,దీనిని బద్ర అని నింబ అని కూడా పిలుస్తారు. నిచిన, నిచినిండిన్ మార్గోసిన్ అనే పదార్ధాలు ఉంటాయని. వేప యాంటి ఫంగల్,యాంటి బ్యాక్టీరియాగా పని చేస్తుందని వేప  వల్ల వివిదరకాల జబ్బులను తగ్గించే గుణం వేపాకు ఉందని స్పష్టం చేసారు చిరుమవిళ్ళ మురళీ మనోహర్.వేపాలో తిత్త రసం ఉందని అంటే చెడు గుణం ఉన్నందున శరీరంలో వచ్చే కఫ,పిత్త దోషాన్ని తొలగించి ఆకలి పెంచుతుందని విశ్లేషించారు.వేపను తీసుకోవడం వల్ల ముఖ్యంగా డయాబెటీస్ ను నియంత్రించే గుణం వేపకు ఉందని వీటితో పాటు కామెర్లు,చర్మ సంబంధిత వ్యాధులను నివారిస్తుంది.పిల్లలకు వేపను తినిపించడం వల్ల కడుపులో ఉండే నులి పురుగులు చచ్చిపోతాయని కాబట్టి పిల్లకు మేలు చేస్తుందని.పేర్కొన్నారు. బెల్లం... ఉగాది పచ్చడికి కీలకమైన ఇంగ్రీడియంట్. బెల్లానికి తీపిగుణం ఉంటుంది. బెల్లానికి కఫం పెంచే గుణం ఉంది. బెల్లం ఉగాది నుంచి వాడితే కఫ దోషాన్ని తగ్గిస్తుంది. ఎండాకాలం లో వచ్చే ఎందవేదిమిని తట్టుకోడానికి ఎండబారిన పడ్డ వారికి నీ రసం  తగ్గించితక్షణ శక్తి నిచ్చేది గ్లుకోజ్ గా బెల్లం పనిచేస్తుంది.బెల్లం ఒక సువాసన,శ్రమ నీరసం తగ్గించి వడ దెబ్బ నుండి కాపాడే శక్తినిచ్చి ప్రోటీన్లను అందించేది బెల్లమే  అయితే బెల్లము అరిటి పండు కలిపి తీసుకుంటే మంచిదని అంటారు చిరుమామిళ్ళ. మామిడి ... ఉగాదిపచ్చడికి ఎన్ని ఉన్న మామిడి ముక్క పుల్లగా తగలనిదే పచ్చడికి రుచి ఉండదు. అని పెద్దలు అంటూ ఉంటారు.ముఖ్యంగా వేసవి కాలం లో చాలామంది కడుపు నొప్పి తో బాధ పడుతూఉంటారు.మామిదిపండులో ఉండే విటమిన్ సి మనలో ఇమ్యునిటీ పెంచుతుంది. మామిడి కాయ వల్ల గుండెజబ్బులు, డయాబెటిస్ రాకుండా నియంత్రిస్తుంది.  చింత పండు... దీనిని తెమరందన్ ఇండియా భారత దేశం లో అతి పురాతన మైన విటమిన్లు,పిండి పదార్ధాలు ఉంటాయి. చింతపండులో ముఖ్యంగా పాత చింత పండు ఉష్ణం తగ్గిస్తుంది. వాతాన్ని, బడలిక, జీర్ణ ప్రక్రియను సరి చేస్తుంది. శరీరంలో వచ్చే వేడి తగ్గించి చల్ల దానాన్ని ఇస్తుంది.ముఖ్యంగా చింత అంటే చింతలు తీర్చేది చింత రసం త్వరగా శక్తి నిస్తుంది.మూత్ర విసర్జన సాఫీగా సాగేట్లు సహకరిస్తుంది చింత రసం. అందుకు చింత పండు రసం వేసవి కాలం లో తీసుకోవడం అవసరమని నిపుణులు సూచిస్తున్నారు. ఉప్పు... ఉగాది పచ్చడి రుచిని పెంచేది చవి లేదా లవణం,ఉప్పు మన శరీర అవసరాలకు జీవన శక్తి నిచ్చేది లవణం. ఆహారం లో వేసే ఉప్పు ఆ వంటకు మంచి రుచిని ఇస్తుంది.ఉప్పు త్రిదోషాల ను హరిస్తుంది. అరటి పండు... అరటి పండు లో పోషక విలువలు పొటాషియం, యాంటి ఫంగల్, కూడా అరటి పండు పనిచేస్తుంది.అతిసారం నుండి రక్షించే సంజీవనిగా పేర్కొన్నారు వైద్యులు. అరటి పండు అధిక రక్త పోటు, కిడ్నీ సమస్యలు, రసాయనం గా పనిచేస్తుంది. ఇవి ఉగాది ఔషదం అధ్బుత ఫలితాలు ఉగాది పచ్చడి ఉగాది రోజే తీసుకోవాలా అప్పుడప్పుడూ తీసుకోవచ్చు అంటున్నారు. ముఖ్యంగా ఉగాది నుండి శ్రీరామ నవమి వరకు ఎప్పుడైనా తీసుకుంటే వేసవి కాలం లో ఎన్ని సార్లు తీస్జుకున్న తప్పులేదు. వ్యక్తిలో ఉండే త్రి దోషాల నుండి ముక్తి నిచ్చేది ఉగాది పచ్చడి.   
  ఆరోగ్యమే మహాభాగ్యం అని మన పెద్దలు ఊరికే అనలేదు. కానీ నేటి కాలంలో మారుతున్న ఆహారపు అలవాట్లు, పని ఒత్తిడి వల్ల మనలో చాలా మంది మలబద్ధకం (Constipation) మరియు మధుమేహం (Diabetes) వంటి సమస్యలతో సతమతమవుతున్నారు. ప్రతిరోజూ మాత్రలు మింగడం, ఇన్సులిన్ తీసుకోవడం మానసికంగా ఎంతో కుంగదీస్తుంది. మీ ఇంట్లోనే, మీ వంటింట్లో ఉండే పదార్థాలతో ఈ సమస్యలకు శాశ్వత పరిష్కారం లభిస్తే ఎంత బాగుంటుంది కదా? ఆయుర్వేద నిపుణులు డాక్టర్ చిట్టిబొట్ల మధుసూదన శర్మ గారు సూచించిన ఒక అద్భుతమైన "డబుల్ ధమాకా" చిట్కా గురించి ఈ Video Link క్లిక్ చేసిన మనం వివరంగా తెలుసుకుందాం. మనం ఈ మార్పు ఎందుకు చేసుకోవాలి? (Why Should We?) సాధారణంగా మనం తినే రోటీలు కేవలం ఆకలిని తీరుస్తాయి. కానీ వాటికి కొన్ని ప్రత్యేక పదార్థాలను జత చేయడం వల్ల అవి ఔషధాలుగా మారుతాయి: • సహజసిద్ధమైన పరిష్కారం: ఎటువంటి రసాయనిక మందులు లేకుండానే ఉదయం పూట సాఫీగా విరేచనం అయ్యేలా చేస్తుంది. • పోషకాల గని: చియా సీడ్స్ వల్ల శరీరానికి అవసరమైన ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్, కాల్షియం మరియు ఫైబర్ అందుతాయి. • దీర్ఘకాలిక ప్రయోజనాలు: కేవలం షుగర్ కంట్రోల్ చేయడమే కాకుండా, భవిష్యత్తులో బరువు పెరగకుండా, హార్మోన్ల అసమతుల్యత కలగకుండా కాపాడుతుంది. • మెదడు ఆరోగ్యం: వృద్ధాప్యంలో వచ్చే మతిమరుపు (అల్జీమర్స్), పార్కిన్సన్స్ వంటి సమస్యలు రాకుండా ఈ పదార్థాలు రక్షణనిస్తాయి. • మందుల వాడకం తగ్గుతుంది: సరైన ఆహార నియమాలు పాటిస్తూ ఈ రోటీలు తీసుకోవడం వల్ల మీరు వాడే షుగర్ మాత్రల డోస్, ఇన్సులిన్ అవసరం క్రమంగా తగ్గే అవకాశం ఉంది. ఎలా తయారు చేసుకోవాలి? (How-to Guide) మీరు రోజూ తినే రెండు పుల్కాలు లేదా రోటీల పిండిలో ఈ క్రింది విధంగా కలపండి: 1. మలబద్ధకం సమస్య ఉన్నవారి కోసం: • చియా సీడ్స్: 2 నుండి 3 టీస్పూన్ల చియా సీడ్స్‌ను 15 నిమిషాల పాటు నీటిలో నానబెట్టాలి. • సబ్జా గింజలు: 1 నుండి 1.5 టీస్పూన్ల సబ్జా గింజలను కూడా నానబెట్టుకోవాలి. • ఈ నానబెట్టిన గింజలను నీటితో సహా పిండిలో కలిపేసి రొట్టెలు చేసుకోవాలి. 2. షుగర్ (డయాబెటిస్) నియంత్రణ కోసం: • పచ్చి పనసకాయ పొడి: 2 నుండి 3 టీస్పూన్ల పచ్చి పనసకాయల పొడిని పిండిలో కలపాలి (ఇది ఆన్‌లైన్ లేదా మెడికల్ షాపుల్లో దొరుకుతుంది). • మెంతి పొడి: ఒక టీస్పూన్ వేయించిన మెంతుల పొడిని కలపాలి. • ఈ మిశ్రమంతో రోటీలు చేసుకుంటే మెంతి పొడి వల్ల వచ్చే చేదు కూడా వేడి చేయడం వల్ల తగ్గుతుంది, రుచిగా ఉంటుంది. ఏమి చేయకూడదు? (What Not to Do) • నానబెట్టకుండా వాడకండి: చియా సీడ్స్ లేదా సబ్జా గింజలను నేరుగా పిండిలో కలపకూడదు, కచ్చితంగా నానబెట్టాలి. • పనస పండు వద్దు: షుగర్ ఉన్నవారు పనస పండు తినకూడదు (గ్లైసమిక్ ఇండెక్స్ ఎక్కువ), కేవలం 'పచ్చి పనసకాయ పొడి' మాత్రమే వాడాలి. • మందులు ఆపకండి: ఈ చిట్కాలు పాటిస్తూనే డాక్టర్ సలహా మేరకు మందులు వాడుతూ, షుగర్ లెవల్స్ తగ్గుతున్న కొద్దీ డాక్టర్ సలహాతోనే డోస్ తగ్గించుకోవాలి. • అతిగా వద్దు: ఆరోగ్యానికి మంచిది కదా అని మితిమీరిన పరిమాణంలో పదార్థాలను వాడకండి, పైన చెప్పిన కొలతలు పాటించండి. ప్రశ్నలు - సమాధానాలు (Q&A) ప్ర: ఈ రోటీలను పిల్లలకు ఇవ్వవచ్చా? జ: తప్పకుండా ఇవ్వవచ్చు. చిన్న పిల్లలకు ఇచ్చేటప్పుడు పదార్థాల పరిమాణం (డోస్) కాస్త తగ్గిస్తే సరిపోతుంది. ఇది వారి జీర్ణక్రియకు చాలా మంచిది. ప్ర: గింజలను విడిగా నీటిలో కలుపుకొని తాగితే సరిపోదా? రోటీలోనే ఎందుకు కలపాలి?  జ: రోటీలో కలిపి వేడి చేయడం వల్ల అవి సులభంగా జీర్ణమవుతాయి. అలాగే, ఔషధంలా విడిగా తీసుకోకుండా ఆహారంలో భాగంగా తీసుకోవడం వల్ల మానసికంగా కూడా బాగుంటుంది మరియు రుచిగా ఉంటుంది. ప్ర: ఆరోగ్యంగా ఉన్నవారు కూడా ఇవి తీసుకోవచ్చా?  జ: అవును, ఎటువంటి సమస్యలు లేని వారు కూడా వీటిని తీసుకోవడం వల్ల భవిష్యత్తులో షుగర్, బరువు పెరగడం వంటి సమస్యలు రాకుండా ఉంటాయి. ఆరోగ్యకరమైన జీవనశైలి మన చేతుల్లోనే ఉంది. చిన్న చిన్న మార్పులతో పెద్ద పెద్ద ఆరోగ్య సమస్యలకు చెక్ పెట్టవచ్చు. ఈ చిట్కాలను పాటించి మీ అనుభవాలను మాతో పంచుకోండి. మరిన్ని ఆసక్తికరమైన మరియు ఆరోగ్యకరమైన చిట్కాల కోసం, ప్రత్యక్ష నిపుణుల సలహాల కోసం మా యూట్యూబ్ ఛానల్  క్లిక్ చేయండి  👉 [www.youtube.com/@Naveenacolumn] (సబ్‌స్క్రైబ్ చేయడం మర్చిపోకండి!)
  డ్రై ఫ్రూట్స్ ఆరోగ్యానికి చాలా మంచివి.  చాలమంది డ్రై ఫ్రూట్స్ ను నేరుగా తినడం కంటే వాటిని నానబెట్టుకుని తినడం చాలా మంచిదని చెబుతారు. ఇలా నానబెట్టుకుని తినే డ్రై ప్రూట్స్ లో బాదం,  జీడిపప్పు, ఎండు ద్రాక్ష,  ఖర్జూరం మొదలైనవాటితో పాటు వాల్నట్స్ కూడా ఉంటాయి.  వీటిని నానబెట్టుకుని తినడం వల్ల పోషకాలు లభిస్తాయి. శరీరానికి ప్రోటీన్ లభిస్తుంది.  అలాగే సాధారణంగా ఉన్న డ్రై ఫ్రూట్స్ ను తినడం కంటే.. నానబెట్టిన వాటిని తినడం వల్ల ఎక్కువ పోషకాలు లభిస్తాయి.  అయితే నానబెట్టిన వాల్నట్స్ ను సాధారణంగా రాత్రి నానబెట్టి,  ఉదయాన్నే  తింటుంటారు.  కానీ.. ఇలా నానబెట్టిన వాల్నట్స్ ను ఉదయం కాకుండా వేరే సమయంలో తినడం వల్ల ఫలితాలు బాగుంటాయట.  శరీరానికి మంచి బెనిఫిట్ చేకూరుతుందట.  ఇంతకీ నానబెట్టిన వాల్నట్స్ ను ఏ సమయంలో తినాలి? ఏ సమయంలో తినడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి? తెలుసుకుంటే.. సాయంత్రం.. నానబెట్టిన వాల్నట్స్ ను సాయంత్రం సమయంలో తినడం చాలా మంచిదని వైద్యులు, ఆహార నిపుణులు అంటున్నారు. వాల్నట్స్ లో ఉండే పోషకాలలో ప్రముఖమైనది ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లు.  అలాగే మెలటోనిన్ కూడా పుష్కలంగా ఉంటుంది.  అందుకే వీటిని సాయంత్రం సమయంలో తినడం మంచిదని అంటారు. వాల్నట్స్ లో ఉండే ఒమేగా-3 మెదడును ఆరోగ్యంగా ఉంచుతుంది. ఇది మెదడు పని తీరుకు చాలా సహాయపడుతుంది.  అలాగే వాల్నట్స్ లో ఉండే మెలటోనిన్ కూడా శరీరానికి చాలా అవసరం. ఇది నిద్రను మెరుగ్గా ఉంచడంలో, నిద్రను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. వాల్నట్స్ లో ఒమెగా-3 కొవ్వు ఆమ్లాలు, మెలటోనిన్ మాత్రమే కాకుండా పాలీఫెనాల్స్ ఉంటాయి. ఇవి జ్ఞాపకశక్తిని, ఏకాగ్రతను, అభ్యాసన సామర్థ్యాన్ని మెరుగుపరుస్తాయి. వాల్నట్స్ లో ఉండే ఒమెగా-3 కొవ్వు ఆమ్లాలు ఆరోగ్యకరమైన కొవ్వుల జాబితాకు చెందినవి. ఇవి మంచి కొలెస్ట్రాల్ ను పెంచడంలో సహాయపడుతుంది. అట్లాగే చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించడంలో సహాయపడుతుంది. కొలెస్ట్రాల్ ను డీల్ చేయడం ద్వారా గుండెపోటు ప్రమాదాన్ని తగ్గిస్తుంది. చాలామందికి తెలియని విషయం ఏమిటంటే.. నానబెట్టిన వాల్నట్స్ తింటే జీర్ణవ్యవస్థ కూడా బలపడుతుంది. ఎందుకంటే వాల్నట్స్ నానడం ద్వారా ఫైబర్ మెరుగవుతుంది.  ఈ ఫైబర్ జీర్ణవ్యవస్థను బలపరుస్తుంది. ఇది మలబద్దకం సమస్యను నివారిస్తుంది. నానబెట్టిన వాల్నట్స్ తింటే ఎక్కువ సేపు కడుపు నిండిన ఫీలింగ్ ఉంటుంది. ఇది ఆహారం ఎక్కువ తీసుకోవడాన్ని నివారిస్తుంది. తద్వారా బరువు అదుపులో ఉంచడం లేదా బరువు తగ్గడంలో కూడా సహాయపడుతుంది.                                         *రూపశ్రీ. గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...