LATEST NEWS
వైసీపీ సీనియర్ నాయకుడు, జగన్ హయాంలో అసెంబ్లీ స్పీకర్ గా పని చేసిన  తమ్మినేని సీతారాం ఇప్పుడు కుటుంబంతో సహా పరారీలో ఉన్నారు. తమ్మినేని కుటుంబం   భూకబ్జా, ఫోర్జరీకి పాల్పడిందన్న ఆరోపణలు ఉన్నాయి. అందుకు సంబంధించిన కేసులోనే అరెస్టును తప్పించుకోవడానికి ఆయన రాత్రికి రాత్రే.. సొంత కార్లు, ఫోన్లూ కూడా వదిలేసి పరారైపోయారు. ఈ ఘటన ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. బతికున్న వ్యక్తి చనిపోయినట్లుగా బోగస్ డెత్ సర్టిఫికేట్ సృష్టించి భూమిని కబ్జా చేశారన్న అభియోగాలపై ప్రాథమిక ఆధారాలు లభించడంతో ఈ కేసులో ఇప్పటికే ఎనిమిది మంది అరెస్టయ్యారు. ఆ కేసులో తమ్మినేని కుటుబ సభ్యులు అరెస్టు భయంతో అజ్ణాతంలోకి వెళ్లిపోయారు. ఈ విషయంపై జగన్ ఇప్పటి వరకూ స్పందించకపోవడంతో పొలిటికల్ సర్కిల్స్ లో జగన్.. తమ్మినేనికి వెనకేసుకు వస్తున్నారన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. అసలు రాజకీయంగా తీవ్ర సంచలనం సృష్టిస్తున్న ఈ కేసు పూర్వాపరాల్లోకి వెడితే..  శ్రీకాకుళం జిల్లాలో  4 కోట్ల రూపాయల విలువైన  స్థలాన్ని హస్తగతం చేసుకునేందుకు తమ్మినేని సీతారాం నకిలీ పత్రాలు, తప్పుడు వారసత్వ ఆధారాలు సృష్టించారన్న ఆరోపణలపై కేసు నమోదైంది. ప్రాథమిక ఆధారాలు లభించడంతో ఈ కేసులో పోలీసులు అరెస్టుల పర్వానికి తెరతీశారు. కొందరిని అరెస్టు చేశారు కూడా.. ఈ నేపథ్యంలోనే తమ్మినేని కుటుంబంతో సహా పరారయ్యారు. ఈ కేసులో   ప్రధాన నిందితులుగా   తమ్మినేని సీతారాం కుటుంబ సభ్యులే ఉన్నారు. అటువంటి తమ్మినేనికి వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్ అండగా నిలిచి వెనకేసుకు వస్తున్నారన్న చర్చ రాష్ట్రంలో జోరుగా సాగుతోంది.    చట్టపరమైన విచారణ ఎదుర్కొంటున్న నేతలకు రాజకీయ అభయం ఇస్తూ, వారిపై విచారణ  అధికార తెలుగుదేశం కూటమి కక్షసాధింపుగా అభివర్ణించే ప్రయత్నం చేయడం జగన్ కు రివాజుగా మారిపోయిందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.   ఇప్పుడు తమ్మినేని విషయంలో కూడా జగన్ మౌనం ఆయనకు సమర్ధనే అని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. తమ్మినేని కుటుంబం బరితెగింపుగా కబ్జాకు పాల్పడిందన్న విషయంలో   భూ యజమాని కుటుంబ సభ్యులు పోలీసులకు రాతపూర్వకంగా ఫిర్యాదు చేయడంతో  వెలుగులోకి వచ్చింది. శ్రీకాకుళం జిల్లా ఎస్పీ ఆధ్వర్యంలో సమగ్ర దర్యాప్తు చేపట్టిన పోలీసులు,  అక్రమ రిజిస్ట్రేషన్ కుట్ర వెనుక ఉన్న భారీ నెట్‌వర్క్‌ను ఛేదించారు. మొత్తం 13 మందిపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయగా, ఇందులో మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాంను A6 గా, ఆయన కుమారుడు చిరంజీవి నాగ్‌ను A5 గా, భార్య తమ్మినేని వాణిని A7 గా చేర్చారు. అంతేకాకుండా, నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించి ఈ ఫోర్జరీ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ పూర్తి చేసిన స్థానిక సబ్ రిజిస్ట్రార్ బొడ్డేపల్లి అరుణను A13 గా చేర్చారు. ఈ క్రమంలోనే కుట్రలో భాగస్వాములైన 8 మంది నిందితులను పోలీసులు ఇప్పటికే అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. బాధితులకు న్యాయం జరగాల్సిన ఘటనలో, నిందితులుగా ఉన్న తమ పార్టీ సీనియర్ నేతకు   జగన్  మద్దతుగా నిలవడం విమర్శలకు తావిస్తున్నది.  గతంలోనూ పార్టీ నేతలపై కేసులు నమోదైన సందర్భాల్లో జగన్ తీసుకున్న వైఖరి తరహాలోనే, ఈ కేసులోనూ తమ్మినేని సీతారాంకు పూర్తి అభయం ఇచ్చినట్లు తెలుస్తోంది. అందుకే ఈ విషయంపై జగన్ ఇంత వరకూ స్పందించలేదు. పార్టీ పరంగా తమ్మినేని సీతారాంపై చర్యా తీసుకోలేదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.     Srikakulam land grabbing case, fake death certificate forgery, YSR Congress Party
ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి రెండేళ్లు అయిన సందర్భంగా సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నరు.   ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తొలి రోజుల్లో ఆర్థిక వ్యవస్థ, పోలవరం ప్రాజెక్టు, అమరావతి రాజధాని, విద్యుత్ రంగం, శాంతిభద్రతలు, మైనింగ్ మరియు ఎక్సైజ్ విధానాలపై విడుదల చేసిన 7 కీలక శ్వేతపత్రాలకు   కొనసాగింపుగా, ఇప్పుడు సమగ్ర ప్రగతి నివేదికలను విడుదల చేయాలని నిర్ణయించారు.    వైసీపీ ప్రభుత్వ హయాంలో తీవ్రంగా దెబ్బతిన్న వ్యవస్థలను గాడిన పెట్టడమే కాకుండా, సంస్కరణలు, పారదర్శక పాలన,  సంక్షేమ పథకాల ద్వారా రాష్ట్రాన్ని ప్రగతి పథంలో ఎలా నడిపించామో ఈ నివేదికల ద్వారా ప్రజలకు వివరించాలని నిర్ణయించారు. ఈ క్రమంలోనే అన్ని శాఖలకు సంబంధించిన ప్రగతి నివేదికలను ఒకే చోట చేర్చి ప్రచురించాలని సీఎం చంద్రబాబు అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.   ఈ  ప్రగతి ప్రకటనలో భాగంగా ప్రభుత్వం మొత్తం 10 ప్రధాన అంశాలపై ప్రత్యేక నివేదికలు సిద్ధం చేస్తున్నది.  గతంలోని అంటే రాష్ట్రంలో తెలుగుదేశం కూటమి ప్రబుత్వం కొలువుదీరిన తొలి నాళ్లలో విడుదల చేసిన 7 శ్వేతపత్రాల యాక్షన్ టేకెన్ నివేదికలతో పాటు,  అభివృద్ధి  , సుపరిపాలన,  సంక్షేమం, సాధికారత   విభాగాలపై సమగ్ర నివేదికలు విడుదల చేయనుంది.  అభివృద్ధి నివేదికలో వ్యవసాయం, పరిశ్రమలు, మౌలిక వసతులు,  పర్యాటక రంగాల పురోగతిని పొందుపరచగా, సుపరిపాలన నివేదిక ద్వారా నూతన విధానాలు, డిజిటల్ విప్లవం,  వాట్సాప్ గవర్నెన్స్ వంటి  సేవల వివరాలను అందించనుంది.   ఆర్థిక, అభివృద్ధి, సంక్షేమ, పాలనా నివేదికలను స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విడుదల చేస్తారు. మిగిలిన నివేదికలను సంబంధిత శాఖల మంత్రులు ప్రజా సమక్షంలో ఆవిష్కరిస్తారు.   రెండేళ్ల పాలనలో కూటమి ప్రభుత్వం సంక్షేమానికి పెద్దపీట వేస్తూ రికార్డు స్థాయి నిధులను పంపిణీ చేసింది. ముఖ్యంగా పేదలు, వృద్ధులు,  వికలాంగులకు ఆర్థిక భద్రత కల్పిస్తూ  ఏడాదికి సగటున రూ. 33,000 కోట్లకు పైగా కేవలం పెన్షన్ల కోసమే వెచ్చించడం దేశ సంక్షేమ చరిత్రలోనే ఒక కొత్త అధ్యాయం. అదే విధంగా, పేదవారి ఆకలి తీర్చేందుకు రాష్ట్రవ్యాప్తంగా 269 అన్న క్యాంటీన్లను అందుబాటులోకి తెచ్చి, ఇప్పటివరకు రూ. 230 కోట్ల నిధులను కేటాయించింది. దీనివల్ల ప్రతి నెలా వేలాది మంది నిరుపేదలు, ఆటో డ్రైవర్లు,  కూలీలు భోజన ఖర్చులలో రూ. 2,500 నుండి రూ. 3,000 వరకు పొదుపు చేయగలుగుతున్నారు. మహిళా సాధికారతకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ చేపట్టిన  స్త్రీశక్తి  ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణ పథకం రాష్ట్రంలో ఊహించని విజయాన్ని సాధించింది. ఈ ఉచిత ప్రయాణ సదుపాయం కోసం ప్రభుత్వం  రూ. 2,565 కోట్ల సబ్సిడీ భార భారాన్ని  భరించి మహిళల ఉపాధి, విద్య,  ప్రయాణ స్వేచ్ఛకు ఊతమిచ్చింది.   అమరావతి ప్రాజెక్టు పనులతో పాటు పోలవరం నిర్మాణం, రహదారుల అభివృద్ధి మరియు డ్రోన్ నిఘా ద్వారా  నిర్మూలన వంటి చర్యలతో రాష్ట్రంలో శాంతిభద్రతలు, ఆర్థిక స్థిరత్వం  నెలకొన్నాయి. ఈ నివేదికలు,  డేటా పాయింట్లు ప్రతి పౌరుడికి ప్రభుత్వ పనితీరుపై పూర్తి అవగాహనను, భరోసాని కలిగిస్తాయని ప్రభుత్వం భావిస్తోంది.  AP Govt White Papers, Chandrababu Naidu 2 Years Governance, AP Coalition Govt Progress Report, NTR Bharosa Pension Scheme
తెలుగు పారిశ్రామిక రంగంలో  ఒకప్పుడు సంచలనం సృష్టించిన అమర రాజా బ్యాటరీస్ ప్రస్థానం రెండు రాష్ట్రాల్లో రాజకీయ, ఆర్థిక విశ్లేషణలకు కేంద్రబిందువుగా మారింది. అమెరికా నుంచి మాతృభూమిపై ఉన్న   ప్రేమతో తిరిగి వచ్చిన రామచంద్ర నాయుడు, రాయలసీమలోని చిత్తూరు జిల్లాలో ఈ భారీ పారిశ్రామిక సామ్రాజ్యానికి పునాదులు వేశారు. ఆ రోజుల్లో  అప్పటి  ముఖ్యమంత్రి దివంగత ఎన్.టి. రామారావు పారిశ్రామికవేత్తలకు పూర్తి ప్రోత్సాహం అందిస్తూ సబ్సిడీపై భూములు కేటాయించడం ద్వారా రాష్ట్రంలో పెట్టుబడులకు ప్రాణం పోశారు. చిత్తూరు జిల్లాలోని గ్రామీణ ప్రాంతాలకు చెందిన విద్యావంతులైన వేలాది మంది మహిళలకు స్వయంగా ఉద్యోగావకాశాలు కల్పిస్తూ అమర రాజా ఒక అద్భుతమైన సామాజిక, ఆర్థిక విప్లవానికి అప్పట్లోనే తెరలేపింది. అయితే జగన్ హయాంలో మారిన రాజకీయ పరిణామాల కారణంగా ఈ దిగ్గజ సంస్థ ఆంధ్రప్రదేశ్ నుంచి తన విస్తరణను తెలంగాణ వైపు మళ్లించాల్సి వచ్చింది. అమర రాజా వంటి   గ్లోబల్ టెక్నాలజీ సంస్థ వేల కోట్ల రూపాయల పెట్టుబడులను ఏపీలో కాకుండా పొరుగు రాష్ట్రమైన తెలంగాణలో పెట్టడం ఆంధ్రప్రదేశ్ ఒక గోల్డెన్ ఆపర్చునిటీని చేజార్చుకోవడమేనని ప్రముఖ విశ్లేషకుడు సువేరా అన్నారు. తెలుగువన్ న్యూస్ చానల్ తో ప్రత్యేకంగా మాట్లాడిన ఆయన  రాజకీయం, కులం, ప్రాంతీయ విద్వేషాల కారణాలతో ఇటువంటి పారిశ్రామిక దిగ్గజం రాష్ట్రం వీడాల్సి రావడం వల్ల యువతకు రావలసిన ఉపాధి అవకాశాలు చేజారిపోయాయన్నారు. మరోవైపు, ఐటీ,  హెవీ ఇండస్ట్రీ రంగాల్లో ఉన్న వ్యత్యాసాన్ని పరిశీలిస్తే, సాఫ్ట్‌వేర్ కంపెనీల మాదిరిగా ప్రతికూల పరిస్థితులు రాగానే లాజిస్టిక్స్‌ను సులభంగా తరలించడం భారీ తయారీ రంగానికి ఏ మంత సులభం కాదు.   తెలంగాణలోని మహబూబ్‌నగర్ జిల్లా దివిటిపల్లి వద్ద అమర రాజా సంస్థ ప్రపంచ స్థాయి గిగా ఫ్యాక్టరీ,  భారీ బ్యాటరీ తయారీ కర్మాగారానికి శ్రీకారం చుట్టింది. ఈ ఆధునిక ప్లాంట్ ప్రారంభోత్సవం తెలంగాణ అభివృద్ధి పథంలో మరొక మైలురాయిగా నిలిచిందనడంలో సందేహం లేదు. నాటి బిఆర్ఎస్ ప్రభుత్వం ఈ ప్రాజెక్టును దక్కించుకోవడానికి సానుకూల వాతావరణం కల్పించగా, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా రాష్ట్ర అభివృద్ధి, ఉపాధి కల్పనే ధ్యేయంగా ఈ ప్రాజెక్టుకు పూర్తి మద్దతు ప్రకటించారు. గ్లోబల్ టెక్నాలజీని స్థానిక ఉద్యోగావకాశాలతో సమన్వయం చేస్తూ వేలాది మంది తెలంగాణ యువతకు ఉద్యోగాలు అందించే దిశగా అమర రాజా అడుగులు వేస్తోంది. మరోవైపు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేష్ గతంలో అమర రాజా విషయంలో జరిగిన పొరపాట్లను ప్రస్తావిస్తూ, రాష్ట్రం తరఫున పారిశ్రామికవేత్తలకు సానుకూల సందేశాన్ని ఇచ్చారు. పరిశ్రమలకు ఏపీ తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయని, భవిష్యత్తులో అమర రాజా మళ్లీ తమ సొంత రాష్ట్రంలో కొత్త యూనిట్లను ఏర్పాటు చేయవచ్చని   ధీమా వ్యక్తం చేశారు. గత పాలకుల విధానాలు పరిశ్రమలపై తీవ్ర ప్రభావం చూపించినప్పటికీ, మళ్లీ కొత్త కూటమి ప్రభుత్వం రావడంతో పెట్టుబడులకు సురక్షితమైన వాతావరణం ఏర్పడుతోందనే ఆశాభావం వ్యక్తమవుతోంది. ఒక సంస్థ పుట్టుక నుంచి అది రెండు తెలుగు రాష్ట్రాల్లో చూపించిన ప్రభావం,  ఆర్థిక ప్రగతి పరిణామాలు పారిశ్రామిక చరిత్రలో ప్రత్యేక అధ్యాయంగా నిలిచాయి. అటువంటి అమరరాజా విషయంలో కులం, మతం, ప్రాంతం పేరుతో జగన్ ఆడిన క్రూర క్రీడ వల్లే ఏపీ అమరరాజా ఏపీకి దూరం అయ్యిందని సువేరా ఆవేదన వ్యక్తం చేశారు.  Amara Raja Batteries, Divitipally Giga Factory, Amara Raja AP to Telangana, Ramachandra Galla, Revanth Reddy Amara Raja, Nara Lokesh Industrial Policy
ALSO ON TELUGUONE N E W S
  రాజా రాణి, కాలా, విశ్వాసం', 'అరణ్మనై 3'  వంటి పలు హిట్ చిత్రాల్లో అర్ధమైన పెర్ఫార్మ్ తో అలరించి, దక్షిణాది చిత్రసీమలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకున్న భామ సాక్షి అగర్వాల్. ఇప్పుడు ఒక కొత్త అవతారంలో అభిమానుల ముందుకు వచ్చారు. తన పుట్టినరోజు సందర్భాన్ని పురస్కరించుకుని 'ఓకూ' (OKUU) అనే ప్రీమియం పెర్ఫార్మెన్స్ న్యూట్రిషన్ కంపెనీని అధికారికంగా ప్రారంభించి వ్యాపార రంగంలోకి అడుగుపెట్టారు. ఓకూ ని స్టార్ట్ చెయ్యాలనేది తన ఐదేళ్ల కల. జపాన్ తత్వశాస్త్రంలోని 'ఓకూ' అనే పదం నుంచి ఈ పేరును ఆమె ఎంచుకున్నారు. ఆంతరంగిక శక్తి, లోతైన సామర్థ్యం అనే అర్థానిచ్చే ఈ పదం వెనుక ఒక పెద్ద ఆశయమే దాగి ఉంది. సాధారణంగా సినీ రంగానికి చెందిన ప్రముఖులు ఏదైనా బ్రాండ్‌కు ప్రచారకర్తగా మారడం లేదా వేరే సంస్థల లైసెన్సింగ్ భాగస్వామ్యంతో ఉత్పత్తులను మార్కెట్లోకి తీసుకురావడం చూస్తుంటాం. కానీ సాక్షి అగర్వాల్ దానికి పూర్తి భిన్నమైన మార్గాన్ని ఎంచుకున్నారు. ఇది కేవలం ఒక సెలబ్రిటీ బ్రాండ్ కాదని, ఐదేళ్ల పాటు తాను రేయింబవళ్లు పడిన కష్టానికి, నిరంతర పరిశోధనకు ఫలితమని ఆమె ఎంతో గర్వంగా చెప్తున్నారు. ఈ సుదీర్ఘ ప్రయాణంలో ప్రతి దశలోనూ ఆమె స్వయంగా పాల్గొని ఈ సంస్థను తీర్చిదిద్దారు. ఒకవైపు బిజీగా సాగే సినిమా షూటింగ్‌లు, మరోవైపు కఠినమైన ఫిట్‌నెస్ నిత్యకృత్యాలను సమతుల్యం చేసుకునే క్రమంలో సాక్షి అగర్వాల్‌కి మార్కెట్‌లో దొరికే పోషకాహార ఉత్పత్తుల్లోని లోపాలు స్పష్టంగా అర్థమయ్యాయి. మార్కెట్లో అందుబాటులో ఉన్న చాలా ఉత్పత్తులు ఆరోగ్యకరమని ప్రచారం చేసుకుంటున్నప్పటికీ, వాటిల్లో గుప్తంగా దాగి ఉండే చక్కెరలు, అనవసరమైన ఫిల్లర్లు మరియు ఇతర రసాయనాలు ఉండడం ఆమెను కలవరపరిచింది. భారతీయులకు అత్యుత్తమ, నమ్మకమైన, స్వచ్ఛమైన పోషకాహారాన్ని అందించాలనే లక్ష్యంతోనే ఆమె స్వయంగా ఈ రంగానికి శ్రీకారం చుట్టారు. వేరొకరి బ్రాండ్‌ను ప్రమోట్ చేయడం కంటే, తానే స్వయంగా నిలబడి గర్వంగా చెప్పుకోగలిగే ఉత్పత్తిని తయారుచేయడమే సరైన మార్గమని ఆమె నమ్మారు. Also: రాజాసాబ్ మారుతి డైరెక్షన్ లో వరుణ్ తేజ్.. వంద శాతం ఈ వార్త....!   ఈ ప్రయాణం అనుకున్నంత సులభంగా ఏమీ సాగలేదు. పూర్తి నాణ్యతా ప్రమాణాలతో కూడిన ఉత్పత్తులను అందించడానికి సాక్షి అగర్వాల్ సుదీర్ఘ కాలం శ్రమించారు. ఈ ఐదేళ్ల ప్రయాణంలో కేవలం చివరి 11 నెలల్లోనే ఉత్పత్తుల ఫార్ములేషన్ కోసం ఏకంగా 551 రకాల ప్రయోగాలు మరియు మార్పులు చేశారు. ఎక్కడా ఎలాంటి రాజీ పడకుండా, శాస్త్రీయ ఆధారాలతో ఈ ప్రొటీన్ బార్‌ను రూపుదిద్దారు. ఈ మొక్కల ఆధారిత (ప్లాంట్-బేస్డ్) ప్రొటీన్ బార్‌లో ప్రతి ఒక్కరికీ అవసరమైన సమగ్ర పోషకాలు నిండి ఉన్నాయి. ఇందులో ఏకంగా 35 గ్రాముల అత్యధిక ప్రొటీన్, అసలు చక్కెర లేకుండా జీరో షుగర్, జీర్ణక్రియకు సహాయపడే 14 గ్రాముల డైటరీ ఫైబర్ మరియు చర్మ సౌందర్యానికి, ఆరోగ్యానికి ఉపయోగపడే 6 గ్రాముల కొల్లాజెన్ బూస్ట్ ఉన్నాయి. అంతేకాకుండా ఆరోగ్యానికి హాని కలిగించే మాల్టోడెక్స్ట్రిన్ వంటి పదార్థాలను పూర్తిగా నివారించారు.  ఈ విషయంపై ఆమె మాట్లాడుతు 'గత ఐదేళ్లుగా నేను రెండు వేర్వేరు సమాంతర జీవితాలని  గడిపాను. ప్రపంచం నన్ను ఒక నటిగా చూస్తున్న సమయంలో, చాలా కొద్దిమందికి మాత్రమే తెలిసిన నా ఇంకో ప్రయాణం ఈ 'ఓకూ' నిర్మాణం. భారతదేశానికి ఇంతకంటే మెరుగైన, స్వచ్ఛమైన పోషకాహారం లభించాలనే బలమైన కోరికతో నేను ప్రతిరోజూ శ్రమించాను" అని సాక్షి అగర్వాల్ ఎంతో భావోద్వేగంతో వెల్లడించారు.  
  మారుతి... చోటా డైరెక్టర్ నుంచి బడా డైరెక్టర్ గా ప్రమోషన్ పొంది పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ తో రాజా సాబ్ చేసాడు. చేసాడు అనే కంటే ప్రభాస్ అవకాశం ఇచ్చాడని చెప్పవచ్చు. కానీ కథనంలోని లోపాలు, రిలీజ్ కి ముందు తాత, మనవడు కథలా ప్రమోషన్స్ లో చూపించడం, ఆ తర్వాత నాయనమ్మ, మనవడు కథ అవ్వడం, ఇలా పలు లోపాల వల్ల రాజా సాబ్ డిజాస్టర్ ని అందుకుంది.  మారుతి తన తదుపరి ప్రాజెక్ట్ కోసం మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్‌ని  కలిసి కథ వినిపించారని, రీజనబుల్ బడ్జెట్‌తో ఈ సినిమా పట్టాలెక్కనుందని సోషల్ మీడియాలో కథనాలు  వైరల్ అయ్యాయి.  కానీ, ఈ ప్రచారంపై తాజాగా వరుణ్ తేజ్ వర్గాల నుంచి  స్పష్టమైన వివరణ లభించింది. మారుతి దర్శకత్వంలో వరుణ్ తేజ్ నటిస్తున్నట్లు వస్తున్న వార్తలు 100 శాతం అవాస్తవమని, వాటిల్లో ఎలాంటి నిజం లేదని క్లారిటీ ఇచ్చారు. ప్రస్తుతం వరుణ్ తేజ్ వరుస ప్రాజెక్టులతో ఎంతో బిజీగా ఉన్నారు. మెర్లపాక గాంధీ దర్శకత్వంలో తెరకెక్కిన హారర్ కామెడీ చిత్రం ‘కొరియన్ కనకరాజు’ ఆగస్టు 7న ప్రేక్షకుల ముందుకు రావడానికి సర్వం సిద్ధమైంది. ఈ సినిమా షూటింగ్ సమయంలో వరుణ్ తేజ్ కాలికి తీవ్రమైన గాయం అయినప్పటికీ, ఆ నొప్పిని సైతం భరిస్తూ సినిమా ప్రమోషన్లలో అత్యంత చురుగ్గా పాల్గొంటున్నారు. ఆగస్టు 7న ‘కొరియన్ కనకరాజు’ గ్రాండ్ రిలీజ్ తర్వాత చిన్నపాటి విరామం తీసుకుని, ఆ వెంటనే తన చెల్లెలు నిహారిక కొణిదెల నిర్మాణంలో కమిటీ కుర్రోళ్లు ఫేమ్ యదు వంశీ దర్శకత్వంలో రాబోతున్న ‘బరి’ అనే స్పోర్ట్స్ డ్రామా షూటింగ్‌లో పాల్గొననున్నారు. Also read: పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి ఈనాడు యాజమాన్యం గుడ్ న్యూస్.. చరిత్రలో ఇదే ఫస్ట్ టైం  వరుసగా రెండు విభిన్నమైన సినిమాలతో డైరీ ఫుల్ అయి ఉన్న వరుణ్ తేజ్, మారుతి కాంబినేషన్‌పై వస్తున్న కథనాలన్నీ వట్టి పుకార్లేనని తేలడంతో మెగా అభిమానులకు ఓ స్పష్టత వచ్చినట్లయింది. మరోవైపు, దర్శకుడు మారుతి తన కామెడీ బ్రాండ్ మార్క్ కథతో తిరిగి బాక్సాఫీస్ వద్ద బలంగా కంబ్యాక్ ఇవ్వడానికి సిద్ధమవుతున్నారు.   varun tej, maruthi, bari  
Veteran actor Nagarjuna has made a strong observation about one of the biggest issues affecting Telugu cinema today—last-minute delays and frequent release postponements. Speaking at the Akhil's Lenin success celebrations event, he stressed that every film's final edit should ideally be locked at least two to three weeks before it enters the DI (Digital Intermediate) and sound mixing stages. According to Nagarjuna, giving technicians enough breathing room can significantly elevate a film's overall quality. He pointed out that color grading, sound design, and mixing are not mere technical formalities but creative processes that can take a film to the next level when artists are given sufficient time instead of being forced to work under deadline pressure. Reflecting on the industry's past, Nagarjuna recalled that during the making of classics like Annamayya and Ninne Pelladatha, the release-ready copy of a film used to be completed almost a month before its theatrical release. He wondered why the industry is unable to follow the same practice today despite advancements in filmmaking technology and post-production tools. Drawing a comparison with Hollywood, Nagarjuna cited Christopher Nolan's The Odyssey, which announced its release date nearly a year in advance and arrived as scheduled. In contrast, he noted that Telugu cinema has become synonymous with postponements, often because productions and post-production continue until the final moments before release. Interestingly, Nagarjuna admitted that he was also guilty of the same practice with Akhil's Lenin. However, he insisted that the industry must evolve from this culture. He urged filmmakers to plan productions better, complete shoots and editing well ahead of schedule, and avoid the last-minute rush that not only affects quality but also disrupts release calendars. His comments have sparked discussion within the industry, as Telugu cinema has witnessed several high-profile release delays in recent years. By reminding filmmakers of the disciplined production practices followed during the Annamayya and Ninne Pelladatha era, Nagarjuna emphasized that timely planning is not impossible—it is a standard the industry has achieved before and can achieve again, including himself.  Disclaimer: This article is based on discussions and information shared across publicly available sources and social media. Interpretations remain those of the users involved. Readers are encouraged to exercise discretion before drawing conclusions.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అనే పేరుకి ఉన్న ప్రభంజనం గురించి ప్రత్యేకించి చెప్పుకోవాల్సిన పని లేదు. కట్ అవుట్ కనపడితే చాలు పూలదండలు, బాణా సంచా పేలుళ్లతో రచ్చ రచ్చ చేయడం అభిమానులు తమ కర్తవ్యంగా భావిస్తారు. ఇప్పుడు ఆ అభిమానులకి, ప్రేక్షకులకి ఈటీవీ యాజమాన్యం ఒక తీపి కబురు తీసుకొచ్చింది. స్టైలిస్ట్  డైరెక్టర్ సుజీత్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ నుంచి వచ్చిన  మోస్ట్ స్టైలిష్ గ్యాంగ్‌స్టర్ యాక్షన్ డ్రామా 'ఓజీ' (They Call Him OG) ఇప్పుడు బుల్లితెరపై సంచలనం సృష్టించడానికి సిద్ధమైంది. థియేటర్లలో కాసుల వర్షం కురిపించి, డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లలో సరికొత్త రికార్డులను తిరగరాసిన ఈ గ్యాంగ్‌స్టర్ విజువల్ వండర్, త్వరలోనే ప్రతిఒక్కరి ఇంట్లోని బుల్లితెరపై ప్రసారం కానుంది. 'ఓజీ'  శాటిలైట్ (టెలివిజన్) హక్కులని ప్రముఖ  ఛానల్ 'ఈటీవీ' (ETV) అత్యంత భారీ ఫ్యాన్సీ రేటుకి దక్కించుకుంది. బుల్లితెరపై ఈ వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ త్వరలోనే ప్రసారం కానుందంటూ ఈటీవీ యాజమాన్యం ఇప్పటికే అధికారికంగా పవర్‌ఫుల్ ప్రోమోలని  విడుదల చేసింది. ఫిల్మ్‌నగర్ వర్గాల ప్రకారం... రాబోయే ఆగస్టు 15న స్వాతంత్ర్య దినోత్సవ శుభసందర్భంగా ఈ గ్రాండ్ ప్రీమియర్‌ను ప్రసారం చేయడానికి ప్రణాళికలు రూపొందించారు. అంతేకాకుండా, ఆగస్టు 28న రాఖీ పండగ కానుకగా ఈ చిత్రాన్ని మరోసారి బుల్లితెరపై రీ టెలికాస్ట్ చేయాలని ఛానల్ ప్లాన్ చేస్తోంది. గత ఏడాది సెప్టెంబర్ 25వ తేదీన ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా థియేటర్లలో విడుదలైన 'ఓజీ' చిత్రం తొలి రోజు నుంచే బాక్సాఫీస్ వద్ద రికార్డుల సునామీ సృష్టించింది. పవన్ కళ్యాణ్ పవర్‌ఫుల్ ప్రెజెన్స్, సుజీత్ విజనరీ టేకింగ్, తమన్ హై-వోల్టేజ్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఫలితంగా ఈ చిత్రం బాక్సాఫీస్ బరిలో 300 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను సాధించి, టాలీవుడ్ హిస్టరీలోనే బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్‌లలో ఒకటిగా నిలిచింది. థియేట్రికల్ రన్ తర్వాత ఓటీటీలో సైతం మిలియన్ల కొద్దీ వ్యూస్‌తో గ్లోబల్‌గా ట్రెండ్ అయిన ఈ చిత్రం, థియేటర్లలో విడుదలైన దాదాపు 10 నెలల తర్వాత బుల్లితెర ప్రేక్షకులని  పలకరించబోతోంది. Also read: ఏంటి బాబు తెలుగు నాట ఈ థియేటర్స్.. రచ్చ రచ్చ ఖాయమా!  పవన్ సరసన ప్రియాంకా అరుల్ మోహన్ కథానాయికగా అలరించగా, బాలీవుడ్ ప్రముఖ నటుడు ఇమ్రాన్ హష్మీ ప్రధాన విలన్‌గా పవర్‌ఫుల్ రోల్‌లో మెప్పించారు. వీరితో పాటు ప్రకాష్ రాజ్, శ్రేయా రెడ్డి, అర్జున్ దాస్ తదితర ప్రముఖ నటీనటులు కీలక పాత్రల్లో నటించారు. డివివి ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై స్టార్ ప్రొడ్యూసర్ డివివి దానయ్య ఈ చిత్రాన్ని అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మించారు. తమన్ అందించిన మ్యూజిక్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ప్రధాన ఎసెట్.. ఇక ఈటీవీ చరిత్రలో మొట్టమొదటి సారిగా ఒక బడా మూవీ రైట్స్ కొని టెలికాస్ట్ చెయ్యడం అనేది ఇదే ఫస్ట్ టైం.   pawan kalyan,og, priyanka mohan, sujeeth, danayya, etv
  ఇళయ దళపతి విజయ్(VIjay)'జననాయగన్'(janaNayagan)గా సెల్యులాయిడ్ పై పెర్ఫార్మ్ చేస్తుంటే అభిమానులు, ప్రేక్షకులకి వచ్చే మజాకి కౌంట్ డౌన్ స్టార్ట్ అయ్యింది. కౌంట్ డౌన్ స్టార్ట్ అయ్యిందనే కంటే గంటలే అని చెప్పవచ్చు. తమిళనాడుతో పాటు ఆంధ్ర, తెలంగాణాలో కూడా తెల్లవారు జామునే షోస్ పడబోతున్నాయి. దీంతో విజయ్ అభిమానులతో పాటు ప్రేక్షకుల్లో సందడి వాతావరణం నెలకొని ఉంది. తెలుగులో 'జననాయకుడు' పేరుతో రిలీజ్ అవుతున్న విషయం తెలిసిందే. దీంతో విజయ్ కి ఉన్న తిరుగులేని స్టార్‌డమ్, మాస్ ఫాలోయింగ్‌ని దృష్టిలో ఉంచుకుని ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు బిగ్ ప్లానింగ్ తో రంగంలోకి దిగారు.  తెలుగు రాష్ట్రాల్లో ఈ భారీ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ ఎస్‌వీసీ (SVC) బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత దిల్ రాజు విడుదల చేస్తున్నారు. విజయ్ సినిమాకు ఇక్కడ ఉన్న విపరీతమైన క్రేజ్‌ని  డిస్ట్రిబ్యూషన్ వర్గాలు గట్టిగా నమ్ముతుండటంతో, ప్రధాన నగరాల నుంచి గ్రామీణ ప్రాంతాల వరకు భారీ ఎత్తున థియేటర్లను కేటాయించారు. రాజధాని హైదరాబాద్‌లోనైతే హడావుడి మరింత ఎక్కువగా ఉంది. నగరంలోని పాపులర్ సింగిల్ స్క్రీన్‌లు అన్నింటినీ 'జననాయకుడు' కోసమే ప్రత్యేకంగా లాక్ చేసి ఉంచారు. మల్టీప్లెక్స్‌లు, సింగిల్ స్క్రీన్‌లన్నింట్లోనూ ఉదయం 8 గంటల నుంచే ప్రత్యేక షోలు ప్రారంభమయ్యేలా షెడ్యూల్స్ సిద్ధం చేశారు.  హైదరాబాద్ నగరంలోని ప్రసాద్స్ మల్టీప్లెక్స్, పివిఆర్, ఐనాక్స్, మరియు ఏషియన్ నెట్‌వర్క్ థియేటర్లని  కేటాయించడం సినీ వర్గాలను సైతం విస్తుపోయేలా చేస్తోంది. ప్రతి రోజూ ఒక్కో ప్రముఖ మల్టీప్లెక్స్ ప్రాంగణంలోనే దాదాపు 15 నుండి 20 షోల వరకు కేవలం ఈ ఒక్క సినిమాకే కేటాయించడం విశేషం. సాధారణంగా గురువారం రోజు సినిమా విడుదల ఉంటే, రెండు మూడు రోజుల ముందే అంటే సోమవారమే అడ్వాన్స్ బుకింగ్‌లను ఓపెన్ చేయడం ద్వారా దిల్ రాజు జన నాయకుడుపై ఎంత నమ్మకంతో ఉన్నాడో అర్థం చేసుకోవచ్చు.  కేవలం హైదరాబాద్ లేదా నైజాం ఏరియాలోనే కాకుండా, ఆంధ్రప్రదేశ్ లోని ప్రధాన నగరాలైన విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి, గుంటూరు వంటి ప్రాంతాల్లోనూ 'జననాయకుడు' థియేటర్ల కౌంట్, షోల సంఖ్య రికార్డు స్థాయిలో ఉంది. సాధారణంగా ఒక డబ్బింగ్ సినిమాకి  తెలుగు రాష్ట్రాల్లో ఈ స్థాయిలో థియేటర్లు కేటాయించడం నిజంగానే అందరినీ ఆశ్చర్యపరిచే విషయం. ఒక రకంగా చెప్పాలంటే స్ట్రెయిట్ తెలుగు పెద్ద సినిమాలకు సమానంగా ఈ డబ్బింగ్ చిత్రానికి స్క్రీన్లు దక్కాయి. మొదటి రోజే రాబోయే బిగ్ ఓపెనింగ్స్ ద్వారా భారీ వసూళ్లను రాబట్టడమే లక్ష్యంగా డిస్ట్రిబ్యూటర్లు ఈ స్థాయిలో ప్లాన్ చేశారు.  అయితే, మరోవైపు అసలు విషయాన్ని గమనిస్తే, ఇప్పటికే ఓపెన్ చేసిన అడ్వాన్స్ బుకింగ్స్ మాత్రం ట్రేడ్ పండితులు ఆశించిన స్థాయిలో లేవనే వార్తలు వినిపిస్తున్నాయి. మరీ ముఖ్యంగా నందమూరి బాలకృష్ణ నటించిన సూపర్ హిట్ చిత్రం 'భగవంత్ కేసరి'కి రీమేక్‌గా ప్రచారం ఉన్న నేపథ్యంలో ఇప్పటికే ఆ కథ మన తెలుగు ప్రేక్షకులకి బాగా తెలిసి ఉండటం కూడా బుకింగ్స్‌పై ప్రభావం చూపుతోందనే మాటలు వినిపిస్తున్నాయి. అయినప్పటికీ దళపతి విజయ్ ఆఖరి సినిమా కావడంతో పాటు తెలుగు నాట ఏ మేర కలెక్షన్ల సునామీ సృష్టిస్తుందో చూడాలి. vijay, jananayagan, dil raju, jananayakudu  
టాలీవుడ్ లో ప్రస్తుతం మారుతున్న నిర్మాణ పద్ధతులు, ఆఖరి నిమిషం వరకు కొనసాగే పోస్ట్ ప్రొడక్షన్ టెన్షన్లపై అక్కినేని నాగార్జున సంచలన వ్యాఖ్యలు చేశారు. అఖిల్ అక్కినేని హీరోగా నటించిన 'లెనిన్' సక్సెస్ ఈవెంట్‌లో పాల్గొన్న నాగార్జున, పరిశ్రమలో నెలకొన్న ప్రస్తుత పరిస్థితులపై తన గళాన్ని విప్పారు. మూవీ క్వాలిటీ కోసం నిర్మాతలు, దర్శకులు, సాంకేతిక నిపుణులు మారాల్సిన అవసరాన్ని ఆయన గుర్తుచేశారు. అన్నపూర్ణ స్టూడియోస్ పోస్ట్ ప్రొడక్షన్ విభాగానికి పరిశ్రమలో ఎంతో అద్భుతమైన పేరు ఉందని కొనియాడిన నాగార్జున, తమ డిపార్ట్‌మెంట్ హెడ్ సివి గారు "సినిమా ఫైనల్ కట్ కనీసం రెండు మూడు వారాల ముందు ఇస్తే మేము అసలైన అవుట్‌పుట్ క్వాలిటీ చూపిస్తాం" అని అడిగిన విషయాన్ని గుర్తు చేసుకున్నారు. అయితే స్వయంగా తాను కూడా 'లెనిన్' సినిమా ఫైనల్ కాపీని విడుదల చేయడానికి కేవలం 2 రోజుల ముందు మాత్రమే వారికి అందించగలిగానని ఓపెన్ గా వేదికపై అంగీకరించారు. ఆఖరి 2 రోజులలోనే తమ పోస్ట్ ప్రొడక్షన్ టీమ్ 2 వారాల కష్టానికి సమానమైన అత్యుత్తమ నాణ్యతను అందించిందని, అదే గనుక 2 వారాల సమయం దక్కి ఉంటే.. అవుట్ పుట్ ఇంకా నెక్స్ట్ లెవెల్ లో ఉండేదని అభిప్రాయపడ్డారు.  ఇదే క్రమంలో టాలీవుడ్ లోని ప్రతి ఒక్కరికీ నాగార్జున ఒక ముఖ్యమైన విజ్ఞప్తి చేశారు. సినిమా నాణ్యత పెరగాలన్నా, టెక్నీషియన్ల శ్రమకు సరైన గుర్తింపు దక్కాలన్నా కనీసం 2 వారాల ముందు ఫైనల్ వర్క్ పోస్ట్ ప్రొడక్షన్ బృందానికి అప్పగించాలని కోరారు. ఒక నిర్దిష్ట వ్యక్తిని ఉద్దేశించి తాను మాట్లాడటం లేదని, ప్రతీ ప్రతిపాదన, ప్రతీ కరెక్షన్ నొక్కి పట్టి ఆఖరి నిమిషం వరకు వాయిదా వేసే అలవాటులో తాను, తన దర్శకుడు, ఎడిటర్ ఇలా ప్రతీ ఒక్కరం ఉన్నామని సెల్ఫ్ రివ్యూ చేసుకున్నారు. హాలీవుడ్ సినిమాలు, ఇతర అంతర్జాతీయ చిత్రాల విడుదలను ఉదాహరణగా చూపిస్తూ నాగార్జున కీలక ప్రశ్నలు లేవనెత్తారు. ఉదాహరణకు 'ఒడిస్సీ' లాంటి పెద్ద సినిమాలు సరిగ్గా 1 సంవత్సరం ముందుగానే విడుదల తేదీని ప్రకటిస్తాయని, దానికి తగ్గట్లే ప్రణాళికతో పూర్తి చేస్తాయని తెలిపారు. మరి మనం మాత్రం విడుదల తేదీలు ఇచ్చి ఎందుకు పోస్ట్‌పోన్ చేయాల్సి వస్తోందని ప్రశ్నించారు. స్వయంగా 'లెనిన్' సినిమా విషయంలో తాను కూడా ముందుగా జూన్ 2026 విడుదల అనుకున్నప్పటికీ, టెక్నికల్ వర్క్ పూర్తికాకపోవడం వల్ల క్వాలిటీ కాంప్రమైజ్ కాకూడదనే ఉద్దేశంతో విడుదల తేదీని 2 వారాలు వాయిదా వేయాల్సి వచ్చిందని చెప్పారు. తాను తీసిన 'నిన్నే పెళ్లాడతా', 'అన్నమయ్య' వంటి ఆల్‌టైమ్ బ్లాక్‌బస్టర్ చిత్రాల సమయంలో, సినిమా విడుదల కావడానికి నెల రోజుల ముందుగానే ఫైనల్ ప్రింట్ రెడీగా ఉండి తాము ల్యాబ్‌లలో చూసేవాళ్ళమని వెల్లడించారు. మరి అప్పట్లో సాధ్యమైన ప్రణాళిక ఇప్పుడు ఎందుకు సాధ్యం కావడం లేదని ప్రశ్నించారు. ఈ మార్పు కేవలం ఒక్కరిది కాదని, పరిశ్రమ ఆరోగ్యం, సినిమాల మనుగడ కోసమే తాను ఈ విజ్ఞప్తి చేస్తున్నానని నాగార్జున కుండబద్దలు కొట్టారు.     Nagarjuna Speech, Lenin Movie Event, Akhil Akkineni, Naga Vamsi  
అఖిల్ అక్కినేని, భాగ్యశ్రీ బోర్సే జంటగా అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో మనం ఎంటర్‌ప్రైజెస్, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్లపై అక్కినేని నాగార్జున, సూర్యదేవర నాగ వంశీ నిర్మించిన చిత్రం 'లెనిన్'.  మురళీ కిషోర్ అబ్బూరు దర్శకత్వం వహించారు. ఈ మూవీ జూలై 10న విడుదలై సక్సెస్ ఫుల్‌గా దూసుకుపోతోంది. ఈ క్రమంలో అక్కినేని అభిమానులు, డిస్ట్రిబ్యూటర్లందరితో కలిసి సోమవారం నాడు బ్లాక్ బస్టర్ వైభవం ఈవెంట్‌ను జరుపుకున్నారు. ఈ బ్లాక్ బస్టర్ సెలెబ్రేషన్స్‌లో డిస్ట్రిబ్యూటర్లకు, సినిమా టీంకి షీల్డ్స్‌ను అందించారు.  ఈ కార్యక్రమంలో అక్కినేని నాగార్జున మాట్లాడుతూ .. "డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లను పిలిచి షీల్డ్స్ ఇవ్వడం అనేది అప్పుడెప్పుడో సెలెబ్రేట్ చేసుకునేవాళ్లం. ఇప్పుడు మళ్లీ ‘లెనిన్’ కోసం ఇలా నిర్వహిస్తుండటం ఆనందంగా ఉంది. ప్రతీ చోటా ఇంకా హౌస్ ఫుల్స్ పడుతున్నాయని చెబుతుంటే ఆనందంగా ఉంది. రైటర్ సత్యానంద్ గారు ఈ కథకు ఇచ్చిన ఇన్ పుట్స్ ఎంతో సహాయపడ్డాయి. రామజోగయ్య శాస్త్రి గారితోనూ పాటల గురించి ఎంతో మాట్లాడాం. మా అన్నపూర్ణ పోస్ట్ ప్రొడక్షన్ టీం అద్భుతం అని చెప్పాలి. మా CVకి రెండు రోజుల గ్యాప్‌తో సినిమాని ఇస్తే కూడా అవుట్ స్టాండింగ్ అవుట్ పుట్ ఇచ్చారు. రెండు వారాల ముందే పోస్ట్ ప్రొడక్షన్ టీంకి ఇస్తే అద్భుతంగా బయటకు తీసుకు వస్తారు. అందరూ రెండు వారాల ముందే సినిమాని పోస్ట్ ప్రొడక్షన్ టీంకి ఇవ్వాలని రిక్వెస్ట్ చేస్తున్నాను. ఒకప్పుడు మేం రిలీజ్ కంటే ఒక నెల ముందే పూర్తి కాపీని చూసేవాళ్లం. ఇప్పుడు అలా జరగడం లేదు. ప్రతీ ఒక్కరూ అద్భుతంగా నటించారు. అందరూ ప్రేమించి ఈ మూవీని చేశారు. ఆ ప్రేమను ఆడియెన్స్, అభిమానులంతా తిరిగి చూపించారు. ఈ ప్రేమ కోసం, అరుపుల కోసమే అఖిల్ ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నాడు. అభిమానులకు ఎలా ఉందో తెలీదు కానీ.. నాకు, అఖిల్, చైతన్యకి పండగలా ఉంది. ఇల్లంతా కళకళలాడుతూ ఉంది. ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు ఫోన్ చేసి సినిమా బాగుందని చెప్తేనే హాయిగా, ఆనందంగా ఉంటుంది. షోలు పెంచుతున్నాం అని వాళ్లు చెప్తే సంతోషంగా అనిపిస్తుంది. ‘లెనిన్’ సినిమాను ఆదరించిన ప్రేక్షకులకు, అభిమానులకు థాంక్స్." అన్నారు. నాగ చైతన్య మాట్లాడుతూ .. "మాకు సపోర్ట్ చేస్తున్న అక్కినేని అభిమానులందరికీ థాంక్స్. తమ్ముడు కాస్త లేట్‌గా వచ్చినా.. అభిమానులు మాత్రం లేటెస్ట్‌గా సపోర్ట్ చేశారు. ఈ కథకి ఓకే చెప్పిన వెంటనే అఖిల్ సక్సెస్ కొట్టాడని ఫిక్స్ అయ్యాను. లెనిన్ కారెక్టర్‌కి, అఖిల్‌కి ఎలాంటి సంబంధం ఉండదు. కానీ లెనిన్ పాత్ర కోసం అఖిల్ పూర్తిగా మారిపోయాడు. ఓ అన్నయ్యగా, అభిమానిగా అఖిల్‌ను చూస్తే ఎంతో గర్వంగా ఉంది. నాన్న గారి ఫైర్ ఏ రేంజ్‌లో ఉంటుందో నాకు, అఖిల్‌కి మాత్రమే తెలుసు. నాన్న చేసిన డేరింగ్ స్టెప్స్‌తో ‘శివ’, ‘అన్నమయ్య’, ‘నిన్నే పెళ్లాడుతా’ వంటి చిత్రాలు వచ్చాయి. అలానే ఈ ‘లెనిన్’ను అంతే డేరింగ్‌గా తీసి చూపించారు. ఓ హీరోని ఎలా ప్రొజెక్ట్ చేయాలో నాగవంశీకి బాగా తెలుసు. ‘సవ్యసాచి’కి డైరెక్టర్ మురళీ ఏడీగా పని చేశారు. ‘లెనిన్’లోని క్లైమాక్స్, వసంత్‌ పర్ఫామ్ చేసిన ఓ సీన్ నాకు చాలా ఇష్టం. తమన్ అద్భుతమైన పాటలు, ఆర్ఆర్‌తో సినిమాని నెక్ట్స్ లెవెల్‌కి తీసుకు వెళ్లారు. భాగ్యశ్రీ మంచి ఆర్టిస్ట్. ఆమెకు ఓ మంచి కమర్షియల్ హిట్ పడాలని అనుకున్నాను. ప్రమోద్ అద్భుతమైన నటుడు. ఈ చిత్రంలో అందరూ అద్భుతంగా నటించారు. ఇలా షీల్డ్ ఫంక్షన్ చేసి చాలా రోజులైంది. మళ్లీ ఇలా ‘లెనిన్’ మూవీకి చేస్తుండటం ఆనందంగా ఉంది. డిస్ట్రిబ్యూటర్లు, నిర్మాతలు బాగుంటే.. ఇండస్ట్రీ అంతా బాగుంటుంది. ఇలాంటి ఫంక్షన్ చేస్తున్నందుకు ఆనందంగా ఉంది. ‘లెనిన్’ టీంకి బిగ్ కంగ్రాట్స్. నా బేబీ సిసింద్రీకి ఇంత పెద్ద హిట్ ఇచ్చిన ఆడియెన్స్‌కి థాంక్స్." అన్నారు. అఖిల్ అక్కినేని మాట్లాడుతూ .. "లెనిన్ గురించి చాలా మాట్లాడేశాం. రెండో రోజు నుంచే మాకు థియేటర్లు పెంచి సపోర్ట్ చేసిన డిస్ట్రిబ్యూటర్లకు థాంక్స్. మూడు రోజుల్లోనే ‘లెనిన్’ బ్రేక్ ఈవెన్ అవ్వడం చాలా ఆనందంగా ఉంది. సీవీ రావ్, పోస్ట్ ప్రొడక్షన్ టీంకి, రజినీ గారికి, రాంబాబు, ఆనంద్ ఇలా సినిమాకి పని చేసిన ప్రతీ ఒక్కరికీ థాంక్స్. మా కోసం వచ్చిన అక్కినేని అభిమానులకు థాంక్స్. అన్నయ్యకి థాంక్స్." అన్నారు. సూర్యదేవర నాగవంశీ మాట్లాడుతూ.. "అక్కినేని అభిమానుల్ని కలవడం ఆనందంగా ఉంది. ఇప్పటికే మా మూవీ గురించి ఎక్కువ మాట్లాడాం. డిస్ట్రిబ్యూటర్లంతా ఇక్కడకు వచ్చారు. మూడు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ అవ్వడం ఆనందంగా ఉంది. మా కోసం షోలు పెంచి సపోర్ట్ చేసిన డిస్ట్రిబ్యూటర్లందరికీ థాంక్స్." అన్నారు. దర్శకుడు మురళీ కిషోర్ అబ్బూరు మాట్లాడుతూ.. "మా ‘లెనిన్ ను ఇంత పెద్ద హిట్ చేసిన ప్రేక్షకులకు థాంక్స్ కంటే ఏం చెప్పగలను. నాకు ఈ అవకాశం ఇచ్చిన నాగార్జున గారు, నాగవంశీ గారు, అఖిల్ గారికి థాంక్స్. థాంక్స్ అండి.. ఇంత కంటే ఏం చేప్పగలను." అన్నారు.     Lenin Blockbuster Event, Akhil Akkineni, Nagarjuna, Naga Chaitanya  
టాలీవుడ్ సీనియర్ హీరో, ‘కింగ్’ అక్కినేని నాగార్జునలో ఫైర్ గురించి ఆయన కుమారుడు, నటుడు నాగచైతన్య చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి. తాజాగా జరిగిన 'లెనిన్' సక్సెస్ ఈవెంట్‌లో నాగచైతన్య ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఈ వేదికపై ఆయన తన తండ్రి నాగార్జున పనితీరును, పని పట్ల చూపే అంకితభావాన్ని వివరించారు. సాధారణంగా నాగార్జునను బయట చూసే అభిమానులకు ఆయన కేవలం ఒక గ్లామరస్ హీరోగానే, ఎప్పుడూ కూల్‌గా ఉండే వ్యక్తిగానే కనిపిస్తారని, కానీ ఆయన లోపల ఉండే అసలైన "ఫైర్" ఎలాంటిదో కేవలం తనకు, తన సోదరుడు అఖిల్‌కు మాత్రమే స్పష్టంగా తెలుసని నాగచైతన్య అన్నారు. బయటకు కనిపించే ఆ సాధు స్వభావం వెనుక ఒక అత్యంత క్రమశిక్షణ కలిగిన పట్టుదల ఉందనే విషయాన్ని నాగచైతన్య ఈ సందర్భంగా వెల్లడించారు. కింగ్ నాగార్జున ఏదైనా ఒక సవాలును లేదా ప్రాజెక్ట్‌ను మనసులో పెట్టుకుంటే, దానిని అనుకున్న సమయానికి నెరవేర్చే వరకు అసలు విశ్రమించరని నాగచైతన్య గుర్తుచేసుకున్నారు. ఒక లక్ష్యం అనుకుంటే దానికోసం రాత్రింబవళ్ళు కష్టపడే తత్వం ఆయనదని చెప్పారు. గతంలో అక్కినేని కుటుంబానికి ఎంతో ప్రత్యేకమైన 'మనం' సినిమా చిత్రీకరణ సమయంలో నాగార్జున చూపించిన ఆ పట్టుదలను, డెడికేషన్‌ను తాను చాలా దగ్గరగా గమనించానని నాగచైతన్య తెలిపారు. కేవలం 'మనం' మాత్రమే కాకుండా, 'బంగర్రాజు' సినిమా విషయంలోనూ నాగార్జున వ్యవహరించిన తీరు ప్రతి ఒక్కరికీ ఆశ్చర్యం కలిగిస్తుందని అన్నారు. కేవలం 5 నుండి 6 నెలల స్వల్ప వ్యవధిలోనే 'బంగర్రాజు' సినిమా షూటింగ్ ప్రారంభించి, అత్యంత వేగంగా పూర్తి చేసి, సంక్రాంతి బరిలో నిలబెట్టడమే కాకుండా ఆ సినిమాను బాక్సాఫీస్ వద్ద భారీ హిట్ సాధించేలా చేయడం మామూలు విషయం కాదని కొనియాడారు. 5 లేదా 6 నెలల తక్కువ సమయంలో ఒక పెద్ద సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లి, పూర్తి చేసి, పండుగ రేసులో విడుదల చేసి విజయం సాధించడం నాగార్జునలోని పట్టుదల, కష్టపడే తత్వానికి నిదర్శనమని నాగచైతన్య తెలిపారు. ఇటీవల విడుదలైన 'లెనిన్' సినిమా విషయంలోనూ నాగార్జున అదే స్థాయి అంకితభావంతో పనిచేసి సినిమాను విజయవంతం చేశారని చైతూ వెల్లడించారు. నాగార్జున ఒకసారి కంకణం కట్టుకుంటే ఎలాంటి అడ్డంకులు వచ్చినా లెక్కచేయకుండా లక్ష్యాన్ని ముద్దాడతారని ఆయన వ్యాఖ్యలు స్పష్టం చేస్తున్నాయి. తెలుగు సినిమా పరిశ్రమలో దశాబ్దాల తరబడి స్టార్‌గా కొనసాగుతున్నప్పటికీ, నాగార్జున నేటికీ ఒక నవయువకుడిలా కొత్త సవాళ్లను స్వీకరించడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటారని నాగచైతన్య అన్నారు. ఈ తరహా పట్టుదల, ప్రొఫెషనలిజం తమలాంటి యంగ్ హీరోలకు ఎంతో స్ఫూర్తినిస్తుందని చెప్పారు. లెనిన్ వేదికపై నాగచైతన్య పంచుకున్న ఈ విశేషాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.     Akhil Akkineni, Lenin Movie, Success Meet, Naga Chaitanya, Nagarjuna  
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు. వారితో పాటు పెద్ద సంఖ్యలో క్యాడర్ కూడా పార్టీని వీడుతున్నారు. ఇక ఇప్పుడు నామినేటెడ్ పదవులలో ఉన్న వారి వంతు మొదలైనట్లు కనిపిస్తోంది. తనకు కానీ తన భర్తకు  కానీ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు టికెట్ ఇవ్వాలంటూ గత  కొంత కాలంగా కోరుతూ వస్తున్న మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ వంతు వచ్చింది. ఆమె కూడా రాజీనామా అస్త్రం సంధించారు.  జగన్ కు నమ్మిన బంటుగా గుర్తింపు పొందిన మహిళాకమిషన్ చైర్ పర్సన్ వాసి రెడ్డి పద్మ తన పదవికి రాజీనామా చేశారు. ఉరుములేని పిడుగులా, ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా తన రాజీనామా లేఖను సీఎం జగన్ కు పంపేశారు. పేరుకు తాను పార్టీకి కాదు, కేవలం మహిళా కమిషన్ చైర్మన్ పదవికి మాత్రమే రాజీనామా చేశాననీ, ఇక నుంచి వైసీపీ కోసం పని చేస్తాననీ వాసిరెడ్డి పద్మ చెబుతున్నప్పటికీ, ఆమె రాజీనామాకు కారణం అసంతృప్తేనని పార్టీ వర్గాలు బాహాటంగానే చెబుతున్నాయి. చాలా కాలంగా వాసిరెడ్డి పద్మ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు తనకు కానీ తన భక్తకు కానీ పార్టీ టికెట్ ఇవ్వాలని జగన్ ను కోరుతూ వస్తున్నారు. అయితే ఇప్పటి వరకూ జగన్ చూద్దాం.. చేద్దాం అన్నట్లుగా దాట వేస్తూనే వచ్చారు. ఇప్పుడిక వరుసగా అభ్యర్థల జాబితాలను జగన్ ప్రకటించేస్తుండటం, తనకు గానీ తన భర్తకు కానీ పార్టీ టికెట్ విషయంలో ఎటువంటి స్పస్టత ఇవ్వకపోవడంతో ఆమె మనస్తాపం చెంది పదవికి రాజీనామా చేసేశారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.  వాసిరెడ్డి పద్మ రాజకీయ ప్రవేశం ప్రజారాజ్యం పార్టీతో జరిగింది. 2009లో ఆమె ప్రజారాజ్యం పార్టీలో చేరారు. ఇలా చేరడంతోనే ఆమె ప్రజారాజ్యం అధికార ప్రతినిథిగా పదవి దక్కించుకున్నారు. ప్రజారాజ్యం కాంగ్రెస్ పార్టీలో విలీనం కావడంతో ఆమె 2012లో జగన్ పార్టీలో చేరారు. జగన్ కూడా ఆమెకు అధికార ప్రతినిథి పదవి ఇచ్చారు.  2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆమెను రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా నియమించారు. చైర్ పర్సన్ హోదాలో ఆమె జగన్ మెప్పు పొందేందుకు చేయగలిగినంతా చేశారు. ప్రతిపక్ష పార్టీ నేతలకు నోటీసులు ఇచ్చారు. ఏకంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు సైతం నోటీసులు జారీ చేశారు. వార్డు వలంటీర్లపై పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు కమిషన్ ముందు హాజరై వివరణ ఇవ్వాలంటూ ఆమె పవన్ కు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. పవన్ హాజరు కాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు నమోదు చేయాలని ఆదేశించారు. ఇన్ని చేసినా వాసిరెడ్డి పద్మకు ఆమె కోరినట్లుగా పార్టీ టికెట్ లభించకపోవడంతో అలిగి పదవికి రాజీనామా చేశారని, ఇది జగన్ కు షాకేననీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు. ఒకరైతు తనకు చేసిన సేవలకు ప్రీతి చెందిన గురువు అతడికి స్వర్గ ప్రాప్తిని కలగజేయాలని అనుకుంటాడు. కానీ సంసారాసక్తి వల్ల ఆ రైతు ఆ అవకాశాన్ని వాయిదా వేసుకుంటూ వస్తాడు. చివరికి గురుకృప వల్ల ఆ రైతు స్వర్గ ప్రాప్తిని ఎలా పొందాడో ఈ కథ తెలియజేస్తుంది. "ఒక మహాపురుషుడు ప్రయాణం చేస్తూ, డస్సిపోయాడు. గొంతు ఎండిపోయింది. దారిలో ఒక రైతు కనపడితే నీళ్ళు అర్థించాడు. ఆ రైతు మహాత్మునికి సకల ఉపచారాలూ చేశాడు. చిరిగిపోయిన ఆయన ఉత్తరీయాన్ని రైతు జాగ్రత్తగా కుట్టి బాగుచేశాడు. రైతు పరిచర్యలకు సంతసించిన ఆ మహాత్ముడు శాంతి, ఆనందాలకు నిలయమైన స్వర్గానికి తనతోపాటు రమ్మని అంటాడు. అందుకు ఆ రైతు 'గురువుగారూ! మీరు నా మీద చూపిన దయకు కృతజ్ఞుణ్ణి. కానీ నా పిల్లలు ఇంకా చిన్నవాళ్ళు. ఓ ఏడేళ్ళ వ్యవధి ఇవ్వండి' అని అడుగుతాడు. అందుకు గురువు అంగీకరించాడు. సరిగ్గా ఏడేళ్ళ తర్వాత గురువు రైతును స్వర్గానికి తీసుకువెళ్ళడానికి వచ్చాడు. అప్పుడు రైతు 'అయ్యా! కడపటి కొడుకు కష్టాలకు అంతు లేదు. అన్ని జంఝాటాలనూ ఒక్కడే సంబాళించుకోలేకపోతున్నాడు. కాబట్టి మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని గురువుని అడిగాడు. మరో ఏడేళ్ళ తరువాత గురువు వచ్చాడు. కానీ రైతు చనిపోయాడని తెలిసింది. చనిపోయిన ఆ రైతు ఎద్దుగా పుట్టాడని ఆ గురువు తన దివ్య దృష్టితో తెలుసుకున్నాడు. ఎద్దుగా పుట్టిన ఆ రైతు తన కొడుకు పొలాన్నే దున్నుతున్నాడు. అప్పుడు గురువు ఆ ఎద్దుపై మంత్ర జలం చిలకరించగానే ఎద్దు జన్మనెత్తిన రైతు 'నా కొడుకు పరిస్థితి మరి కాస్త మెరుగు పడనీయండి స్వామీ! మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని అన్నాడు. ఇక చేసేది లేక వెనుదిరిగాడు గురువు. మరలా ఏడేళ్ళ తర్వాత వచ్చిన గురువుకు ఎద్దు చనిపోయిందని తెలిసింది. అది కుక్కగా పుట్టి కొడుకు ఇంటినీ, ఆస్తినీ కాపలా కాస్తోందని తన దివ్యదృష్టి ద్వారా తెలుసుకున్నాడు. గురువు. కుక్కగా పుట్టిన ఆ రైతు 'స్వామీ! నేను ఎంత దౌర్భాగ్యుణ్ణి. మీరు ఇంత దయ చూపుతున్నప్పటికీ మీతో స్వర్గమానం చేయలేకున్నాను. వీడికి ఆస్తిని కాపాడుకొనే దక్షత ఇంకా రాలేదు. కాబట్టి దయ చేసి మరో ఏడేళ్ళు వ్యవధి ఇవ్వండి' అని వేడుకున్నాడు. గురువు ఏడేళ్ళ తరువాత మళ్ళీ వచ్చేసరికి కుక్క మరణించింది. అది త్రాచుపాముగా జన్మనెత్తి, ఇప్పుడు కొడుకు భూమిలో ఉన్న లంకెబిందెలకు పడగెత్తి కాపలా కాస్తోంది. గుప్త ధనం ఇక్కడ ఉందని కొడుకుకి ఎలా తెలియజేయాలా అని పాము ఆలోచిస్తున్నప్పుడు గురువు ఆ రైతుకొడుకును పిలుచుకు వచ్చి లంకె బిందెలు ఉన్న చోట తవ్వమన్నాడు. లంకె బిందెలు బయటపడ్డాయి. ఆ పైన ఆ పామును చంపమన్నాడు. అనంతరం శిష్యుణ్ణి తీసుకొని స్వర్గారోహణం చేశాడు గురువు. సంసారంలోని ఈతి బాధల నుండి శిష్యుణ్ణి ఉద్ధరిస్తాడు సద్గురువు. అలాంటి గురువు అందరికీ అవసరం.                                      *నిశ్శబ్ద.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్  రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది.  80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత  ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది.   ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది. ఆమెది నెద‌ర్లాండ్స్‌. ఆమె తండ్రి నెద‌ర్లాండ్స్‌లోని ఆర్నెహెమ్‌లో చిన్న‌పిల్ల‌ల ఆస్ప‌త్రి డైరెక్ట‌ర్. పోయి దొరికిన ఆ పెయింటింగ్ విష‌యానికి వ‌స్తే.. అది 1683లో కాస్ప‌ర్ నెష‌ర్ వేసిన స్టీవెన్ ఓల్ట‌ర్స్ పెయింటింగ్‌. రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో నాజీల ఆదేశాల‌ను చార్లెట్ తండ్రి వ్య‌తిరేకించారు. ఆయ‌న ర‌హ‌స్య జీవ‌నం సాగించేడు. కానీ ఈ పెయింటింగ్‌ని మాత్రం త‌న న‌గ‌రంలోని ఒక బ్యాంక్‌లో భ‌ద్ర‌ ప‌ర‌చ‌మ‌ని ఇచ్చార‌ట‌. 1940లో నాజీలు నెద‌ర్లాండ్ పై దాడులు చేసినపుడు ఆ బ్యాంక్ మీద ప‌డి దోచుకున్నా రు. అప్పుడు ఈ పెయింటింగ్ కూడా తీసుకెళ్లారు. యుద్ధం అయిపోయిన త‌ర్వాత ఈ పెయింటింగ్ ఎక్క‌డున్న‌దీ ఎవ‌రికీ తెలియ‌లేదు. చిత్రంగా 1950ల్లో డ‌స‌ల్‌డార్ష్ ఆర్ట్ గ్యాల‌రీలో అది ప్ర‌త్య‌క్ష‌మ‌యింది. 1969లో ఆమ్‌స్ట‌ర్‌డామ్‌లో దాన్ని వేలానికి తీసికెళ్లే ముందు దాన్ని ఆ ఆర్ట్ గ్యాల‌రీలో వుంద‌ని చూసిన‌వారు చెప్పారు. వేలంపాట త‌ర్వాత మొత్తానికి ఆ పెయింటింగ్‌ను 1971లో ఒక క‌ళాపిపాసి త‌న ద‌గ్గ‌ర పెట్టుకున్నాడు.    ఆ త‌ర్వాత 2021లో అది చార్లెటీని చేరింది.  మొత్తానికి వూహించ‌ని విధంగా ఎంతో కాలం దూర‌మ‌యిన గొప్ప క‌ళాఖండం తిరిగి త‌న వ‌ద్ద‌కు చేర‌డంలో చార్లెటీ ఆనందానికి అంతేలేదు. అంతే క‌దా.. పోయింద‌నుకున్న గొప్ప వ‌స్తువు తిరిగి చేరితే ఆ ఆనంద‌మే వేరు!  అయితే చార్లెటీకి ఇపుడు ఆ పెయిం టింగ్‌ను భ‌ద్రంగా చూసుకునే ఆస‌క్తి వున్న‌ప్ప‌టికీ శ‌క్తి సామ‌ర్ధ్యాలు లేవు. అందుక‌నే త్వ‌ర‌లో ఎవ‌రిక‌యినా అమ్మేసీ వ‌చ్చిన సొమ్మును పిల్ల‌ల‌కు పంచుదామ‌నుకుంటోందిట‌!  చార్లెటీ కుటుంబంలో అయిదుగురు అన్న‌ద‌మ్ములు అక్క‌చెల్లెళ్లు వున్నారు. అలాగే ఇర‌వై మంది పిల్ల‌లు ఉన్నారు. అంద‌రూ ఆమె అంటే ఎంతో ప్రేమ చూపుతున్నారు. అంద‌రం ఒకే కుటుంబం, చాలాకాలం త‌ర్వాత ఇల్లు చేరిన క‌ళాఖండం మా కుటుంబానిది అన్న‌ది చార్లెటీ!
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు. చాకోను పార్టీలోకి ఆహ్వానిస్తూ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్’ ఫ్రంట్ ఏర్పాటు గురించి ప్రత్యేకించి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు కానీ, చాకో అలాంటి  సంకేతాలు ఇచ్చారు. ప్రస్తుతం దేశంలో ఉన్న ఏ ఒక్కపార్టీ కూడా బీజేపీకి ప్రత్యాన్మాయం కాదని,సమీప భవిష్యత్ కాంగ్రెస్ సహా ఏ పార్టీ కూడా ఆ స్థాయికి ఎదిగే అవకాశాలు కూడా కనిపించడంలేదని అన్నారు. ఈ పరిస్థితుల్లో దేశంలోని బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ, ఏకమై, ఒకే గొడుగు కిందకు రావలసిన అవసరం ఉందని చాకో అన్నారు. అదే సమయంలో ప్రతిపక్షాలను ఏక తాటిపైకి తెచ్చే బాధ్యతను పవార్ తీసుకోవాలని సంకేత మాత్రంగా చెప్పారు. అంతే కాకుండా కాంగ్రెస్ పేరు ఎత్తకుండా బీజేపీ వ్యతిరేక శక్తులను ఏకం చేసే ఆలోచన ఆ పార్టీ నాయకత్వానికి లేదని నెహ్రూ గాంధీ ఫ్యామిలీ (సోనియా, రాహుల్, ప్రియాంక)ఆలోచనా ధోరణిని పరోక్షంగానే అయినా ఎండ కట్టారు.ఆ విధంగా పవార్ ఆ బాధ్యత తీసుకోవాలని చాకో సూచించారు. ఇందుకు సంబంధించి, పవార్ బహిరంగంగా ఎలాంటి వ్యాఖ్య చేయలేదు. అయితే, చాకో సహా మరికొందరు ‘సీనియర్’ కాంగ్రెస్ నాయకులు, అలాగే సిపిఎం, సిపిఐ నాయకులు కూడా పవార్’తో చాలా కాలంగా థర్డ్ ఫ్రంట్  విషయంగా చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. అయితే మహారాష్ట్రలో సంకీర్ణం మనుగడను దృష్టిలో ఉంచుకుని పవార్ ఆచితూచి అడుగులేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే చాకో పార్టీలో చేరిన సందర్భంలో కూడా ‘చాకో చేరికతో మహారాష్ట్రలోని మహా వికాస్ అగాడీ ప్రభుత్వానికి ఎలాంటి నష్టం జరగదని, పవార్ మహారాష్ట్ర సంకీర్ణ సర్కార్ ప్రస్తావన చేశారని విశ్లేషకులు పేర్కొంటున్నారు.  మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వ మనుగడ గురించ్బి  పవార్ ప్రత్యేకంగా పేర్కొనడం ద్వారా, ఆయన థర్డ్ ఫ్రంట్ విషయంలో వేచి చూసే ఆలోచనలో ఉన్నట్లు అర్థమవుతోందని కూడా  రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే అదే ఎన్సీపీ అసెంబ్లీ ఎన్నికల జరుగతున్న కేరళలో, పశ్చిమ బెంగాల్లో  కాంగ్రెస్ వ్యతిరేక పార్టీలకు మద్దతు ఇస్తోంది. దీన్ని బట్టి చూస్తే, ఎన్సీపీ - కాంగ్రెస్ మధ్య దూరం పెరుగుతోందని స్పష్టమవుతోంది. అయితే, థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఏ రకంగా ముడి పడుతుంది అనే విషయంలో ఇంకా స్పష్టత రావలసి ఉంది. అలాగే, కాంగ్రెస్ లేకుండా జాతీయ స్త్గాయిలో బీజేపీ వ్యతిరేక కూటమిని ఏర్పాటు చేయడం వలన, వ్యతిరేక ఓటు చీలి  అది మళ్ళీ బీజేపీకే మేలు చేస్తుందని, కాబట్టి, ప్రస్తుతం కాంగ్రెస్ సారధ్యంలోని యూపీఏని బలోపేతం చేయడమే ఉత్తమమనే అలోచన కూడా  విపక్ష శిబిరం నుంచి వినవస్తోంది. ఈ నేపధ్యంలోనే, ప్రస్తుతం యూపీఏ ఛైర్పర్సన్’గా ఉన్న సోనియా గాంధీ వయసు, అనారోగ్యం కారణంగా బాధ్యతల నుంచి తప్పుకుని పవార్’కు బాద్యతలు అప్పగించాలనే ప్రతిపాదన వచ్చిందని అంటున్నారు. అలాగే, ఇతర పార్టీలను, ముఖ్యంగా కాంగ్రెస్ నుంచి విడిపోయి సొంత కుంపటి పెట్టుకున్న మమతా బెనర్జీ సారధ్యంలోని తృణమూల్, జగన్మోహన్ రెడ్డి సారధ్యంలోని వైసీపీలను కలుపుకుని కూటమిని బలోపేతం చేయడం ద్వారా బీజేపీని దీటుగా ఎదుర్కోవచ్చనే ఆలోచనలు కూడా సాగుతున్నాయి. అయితే, ఇటు థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు అయినా, యూపీఏని బలోపేతం చేయడమే అయినా, పవారే .. కేంద్ర బిందువు. ఆయన సారధ్యంలోనే ప్రత్యాన్మాయం అనేది విపక్ష శిభిరం నుంచి వినవస్తున్న ప్రస్తుత సమాచారం. మరి అదే జరిగితే రాహుల గాంధీ పరిస్థితి ఏమిటి ? గాంధీ నెహ్రూ కుటుంబం పరిస్థితి ఏమిటి? ఏ ప్రత్యేక ప్రాధాన్యత లేకుండా అందరిలో ఒకరిగా ఫస్ట్ ఫ్యామిలీ సర్దుకు పోతుందా? అంటే..చివరకు ఏమవుతుందో .. ఇప్పుడే చెప్పలేమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది. గతంలో అనేక సందర్భాలలో ముఖ్యమంత్రి కేసీఆర్,ఆర్థిక మంత్రి హరీశ రావు, కరోనా కారణంగా రాష్ట్ర  ఆదాయం గణనీయంగా తగ్గిందని, పేర్కొన్నారు. అయితే, కరోనా నుంచి వేగంగా కోలుకుని, ఆర్థికంగా అంతే వేగంగా పుంజుకున్న రాష్ట్రాలలో తెలంగాణ ప్రధమ స్థానంలో  ఉందని కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సర్వే 2020-21 నివేదిక పేర్కొంది. పడిలేచిన కెరటంలా, తెలంగాణ ‘వీ’ ఆకారంలో ఆర్థికంగా నిలతొక్కుందని కేంద్రం జనవరి  చివరి వారంలో విడుదల చేసిన ఆర్థిక సర్వేలో పేర్కొంది. అలాగే, రెవిన్యూ వసూళ్ళలో రాష్ట్రం కరోనా పూర్వస్థితికి చేరిందని కూడా సర్వే చెప్పింది.   అలాగే,రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు కూడా ఈ మధ్య కాలంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పై సంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరమ జనవరి,ఫిబ్రవరి, మార్చి నెలలతో పోలిస్తే ఈ సంవత్సరం ఈ మూడు నెలల కాలంలో రాష్ట్ర ఆర్థిక వృద్ది రేటు 10 నుంచి  15 శాతం మెరుగ్గా ఉందని హరీష్ రావు ఒకటి రెండు ఇంటర్వ్యూలలో పేర్కొన్నారు.అలాగే, బడ్జెట్ విషయంలోనూ ఆయన చాల ఆశావహ దృక్పథంతోనే ఉన్నారు. బడ్జెట్  పాజిటివ్’గా ఉంటుదని, ఎవ్వరూ ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని, సంక్షేమ పథకాలలో,ఇతరత్రా బడ్జెట్ కేటాయింపులలో ఎలాంటి కోతలు ఉండవని కూడా హరీష్ హామీ ఇచ్చారు. గత సంవత్సరంలో కొంత మేర హామీ ఇచ్చిన మేరకు అమలు చేయలేక పోయిన సొంత జాగాలలో డబల్ బెడ్ రూమ్ ఇళ్ళ నిర్మాణం, రుణ మాఫీ వంటి  పథకాలను ఈ బడ్జెట్ ద్వారా అమలు చేస్తామని చెప్పారు. అలాగే, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ తమిళి సై చేసిన ప్రసంగంలోనూ ఆశావహ దృక్పధమే వ్యక్తమైంది. ఆమె తమ ప్రసంగంలో,  ప్రభుత్వం సంక్షేమ పథకాలకు పెద్ద పీట వేసిందని అన్నారు. ‘సంపద పంచాలి ,పేదలకు పంచాలి’ అనేది తమ ప్రభుత్వ విధానమని స్పష్టం చేశారు. అలాగే, పెరుగతున్న ఆదాయంలో అధికశాతం సంక్షేమానికే వెచ్చిస్తున్నామని స్పష్టం చేశారు. దీంతో బడ్జెట్’లో కొత్త పథకాలకు శ్రీకారం చుట్టే అవకాశం ఉంటుందా అన్న చర్చ జరుగుతోంది. మరో వంక ఉద్యోగ వర్గాల్లో పీఆర్సీకి సంబంధించి ఆర్థిక మంత్రి తమ ప్రసంగంలో  ప్రకటన చేస్తారా లేదా అనే ఆసక్తి నెలకొంది. అలాగే, సామాన్య  ప్రజలు ఇటీవల పెరిగిన పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరల భారం నుంచి మంత్రి హరీష్, ఏదైనా ఉపసమనం కలిపిస్తారా అని ఎదురు చూస్తున్నారు. గతంలో వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సామాన్య ప్రజలపై వంటగ్యాస్ ధర భారాన్ని తగ్గించేందుకు కొంత మొత్తాన్ని, రూ.50(?) రాష్ట్ర ప్రభుత్వం తరపున  సబ్సిడీగా ఇచ్చిన విషయాన్ని, అదే విధంగా అసెంబ్లీ ఎన్నికలు జరుగతున్న తమిళనాడులో డిఎంకే పార్టీ,తమ పార్టీని అధికారంలోకి వస్తే  గ్యాస్ బండపై వంద రూపాయల సబ్సిడీ ఇస్తామని చేసిన  వాగ్దానాన్ని  గుర్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే, ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు, సోమవారం ఆర్థిక మంత్రి హరీష్ రావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఆర్థిక  శాఖ ముఖ్య కార్యదర్శి రామ కృష్ణా రావు,సలహాదారు జీఆర్ రెడ్డితో బడ్జెట్ పద్దులఫై సుదీర్ఘంగా చర్చించి తుది మెరుగులు దిద్దారు. బడ్జెట్ తుది రూపం సిద్దమైన నేపధ్యంలో ఆర్థిక శాఖ ప్రింటింగ్ ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 18 ఉదయం మంత్రి వర్గం ఆమోదం పొందిన అనంతరం ఆర్థికమంత్రి హరీష్ రావు అదే రోజు రాష్ట్ర బడ్జెట్ 2021-22ను సభలో ప్రవేశ పెడతారు. 20, 22 తేదీల్లో బడ్జెట్‌పై సాధారణ చర్చ,23, 24, 25 తేదీల్లో బడ్జెట్‌ పద్దులపై చర్చ ఉంటుంది 26న ద్రవ్యవినిమయ బిల్లు (బడ్జెట్)పై చర్చ, సభామోదం ఉంటాయి.
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది.  అధికార తెరాస, ఖమ్మం స్థానానికి సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర రెడ్డి పేరును ప్రకటించడంలో కొంచెం జాప్యం చేయడంతో పాటుగా, హైదరాబాద్ స్థానం నుంచి , పీవీ కుమార్తె వాణీ దేవి పేరును చివరి క్షణంలో తెరమీదకు తేవడంతో అంత వరకు కొంత స్తబ్దుగా సాగిన ప్రచారం ఆ తర్వాత వేడెక్కింది. ఉద్యోగ నియామకాల విషయంలో తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ తప్పులో కాలేయడంతో విపక్షాలు, పోటీలో ఉన్న ప్రత్యర్ధులు, నిరుద్యోగ యువత, విద్యార్ధి సంఘాలు  ఒకే సారి ఆయన మీద  విరుచుకు పడ్డారు. ఆయన లెక్క తప్పని నిరుపిస్తం రమ్మని వరస సవాళ్ళు విసిరారు. దీంతో, మంత్రి నియామకా ఇష్యూని పక్కకు తప్పించేందుకు , ఐటీఐఆర్, వరంగల్ రైల్వే ఫ్యాక్టరీ వంటి సెంటిమెంటల్ ఇష్యూస్’ను తెరపైకి  తెచ్చారు. అలాగే, కేంద్ర ప్రభుత్వంపై విమర్శల దాడిని పెంచారు. చివరకు పొరుగు రాష్ట్రానికి చెందిన విశాఖ ఉక్కు ఆందోళన   కూడా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగమైంది.   రెండు నియోజక వర్గాలలో గతంతో పోలిస్తే ఈసారి ఓటర్ల సంఖ్య రెట్టింపు అయింది. ఈసారి రెండు నియోజక వర్గాలలో కలిపి 10 లక్ష 36 వేల మంది తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. అలాగే, రెండు పట్ట భద్రుల నియోజక వర్గాల్లో 164 మంది అభ్యర్ధులు పోటీలో ఉన్నారు.  గత ఎన్నికలతో పోలిస్తే ఇటు ఓటర్ల సంఖ్య, అటు అభ్యర్థుల సంఖ్యా రెట్టింపునకు పైగానే పెరగడంతో ఎన్నికలలో జోష్ పెరిగింది. దీనికితోడు అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో సాధారణ ఎన్నికలను తలపించే రీతిలో ప్రచారం సాగింది. ఎక్కువమంది అభ్యర్ధులు బరిలో ఉండడంతో, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి  తమకే ప్రయోజనం జరుగుతుందని అధికార పార్టీ ఆశపడుతోంది .  దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో చేదు ఫలితాలను చవిచూసిన టీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా వ్యూహ రచన చేసి కేటీఆర్, హరీష్ సహా మంత్రులు,ఎమ్మెల్యేలకు స్పెసిఫిక్ బాధ్యతలు అప్పగించారు. అలాగే,కాంగ్రెస్‌ అభ్యర్థులు చిన్నారెడ్డి, రాములునాయక్‌లకు మద్దతుగా ఉత్తమ్‌, భట్టి, రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తదితరులు విస్తృతంగా ప్రచారం చేశారు. బీజేపీ అభ్యర్థులు ఎన్‌.రాంచందర్‌రావు, ప్రేమేందర్‌రెడ్డిల తరఫున ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, ఎంపీ అరవింద్‌ తదితరులు ప్రచారాన్ని వేడెక్కించారు.  ఖమ్మం స్థానం నుంచి ప్రత్యక్ష ఎన్నికల్లో తొలిసారి పోటీకి దిగిన కోదండరాంకు, టీజేఎస్‌ పార్టీకీ ఈ ఎన్నికలు కీలకంగా మారాయి. ఖమ్మ స్థానం నుంచి పోటీ చేస్తున్న తీన్మార్ మల్లన్న ముందస్తు వ్యూహంతో ప్రధాన పార్టీల అభ్యర్ధులకు ధీటుగా ప్రచారం సాగించారు.  వామపక్షాల మద్దతుతో జయసారథి, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్‌, యువతెలంగాణ కార్యనిర్వాహక అధ్యక్షురాలు రాణీ రుద్రమ తదితరులు పోటీలో ఖమ్మం సీటును పట్టభద్రులు  ఎవరికి  పట్టం కడతారు అన్నది ప్రశ్నార్థకంగా మారింది. హైదరాబాద్ సీటు కూడా ఇటు అధికార తెరాసకు అటు సిట్టింగ్ సీటును నిలుపుకోవడం తో పాటుగా దుబ్బాక , జీహెచ్ఎంసి జోష్ ను కొనసాగించాలని ఆశ పడుతున్నబీజేలకే కూడా ఇజ్జత్ కీ సవాల్ గా మారింది. కాంగ్రెస్ అభ్యర్ధి పార్టీ సీనియర్ నాయకుడు సౌమ్యుడు, మాజీ మంత్రి చిన్నారెడ్డి, వామ పక్షాల మద్దతుతో పోటీ చేస్తున్న మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ కూడా గట్టి పోటీ ఇస్తున్నారు. సో.. చివరకు ఏమి జరుగుతుంది అంటే ఏదైనా జరగవచ్చును. ఈ నెల 14 వ తేదీన పోలింగ్ జరుగుతుంది.17 ఫలితాలు వస్తాయి .. అంతవరకు వెయిట్ అండ్ వాచ్ .  
సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది. ఒకప్పుడు ఎర్ర జెండాను దిగ్విజయంగా ఎదిరించి, మార్క్సిస్టులను మట్టి కరిపించిన మమతా దీదీ ప్రస్తుతం, కాషాయ కూటమి నుంచి గట్టి సవాలును ఎదుర్కుంటున్నారు. వరసగా పదేళ్ళు పాలించడం వలన సహజంగా వచ్చిన ప్రభుత్వ వ్యతిరేకత  కంటే, హిందూ ఓటు పోలరైజేషన్ ఆమెను మరింతగా భయపెడుతోంది. నిజానికి ఐదేళ్ళ క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం ఐదు శాతం కంటే తక్కువ ఓట్లు, మూడంటే మూడు అసెంబ్లీ సీట్లు మాత్రమే గెలుచుకున్న బీజేపీ..  2019 లోక్ సభ ఎన్నికల్లో ఏకంగా 40 శాతం ఓట్లతో 18 స్థానాలు గెలుచుకుంది. ఈ  మార్పు ఇంకా కొన్ని కారణాలు ఉంటే ఉండవచ్చును కానీ.. హిందువుల ఓటు పోలరైజ్  కావడమే ప్రధాన కారణం.  ఈ నేపధ్యంలోనే కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ చివరకు కమ్యూనిస్టులు కూడా బీజేపీలో  చేరారు. ఎన్నికల ప్రకటన వెలువడిన తర్వాత కూడా సిట్టింగ్ ఎమ్మెల్ల్యేలు సహా  తృణమూల్ టికెట్ వచ్చిన నాయకులు కూడా బీజేపీలో చేరుతున్నారు. అనేక మంది ఇతర రంగాల ప్రముఖులు, ముఖ్యంగా ఇంతకాలం, బీజేపీని హిదుత్వ అనుకూల ‘అచ్చుత్’ (అంటారని) పార్టీగా చూసిన ‘సెక్యులర్’ ప్రముఖులు కాషాయం కప్పుకోవడంతో మమతా బెనర్జీకి కొంచెం అలస్యంగానే అయినా, తత్త్వం బోధపడింది. అందుకే ఆమె ఇప్పుడు గుళ్ళూ,గోపురాలకు తిరుగుతున్నారు. కార్యకర్తల సమావేశాల్లో తానూ హిందువునేనని, చెప్పుకుంటున్నారు.  నిజానికి ఇలా నేనూ హిందువునే  అని సెక్యులర్ నేతలు బహిరంగంగా ప్రకటించుకోవడం మమతా బెనర్జీతోనే మొదలు కాలేదు. రాహుల్ గాంధీ తాను హిందువునని, జన్యుధారీ కశ్మీరీ బ్రాహ్మణుని అనీ.. తమ గోత్రం, ‘దత్తాత్రేయ’ గోత్రమని బహిరంగంగా ప్రకటించుకున్నారు. అలాగే  కొద్ది రోజుల క్రితం ప్రియాంకా గాంధీ తానూ హిందువునని చెప్పుకునేందుకు ‘మౌని అమావాస్య’ సందర్భంగా అలహాబాద్ లో గంగా స్నానం చేశారు. గతంలోనూ ఆమె ఎన్నికలకు ముందు గంగా యాత్ర చేశారు. అంతవరకు ఎందుకు కొద్దిరోజుల క్రితం సిపిఐ నారాయణ విశాఖ స్వామి ఆశీస్సులు తీసుకున్నారు. చంద్రబాబు, జగన్ రెడ్డి, కేసీఆర్ ఇలా తెలుగు నేతలు అనేక మంది లౌకిక వాదానికి కాలం చెల్లిందన్న సత్యాన్ని గ్రహించి కావచ్చు ‘నేనూ హిందువును’ అంటూ ప్రకటించుకునేందుకు పోటీ పడుతున్నారు. రాముడిని తలచుకున్నా, జై శ్రీరామ్ అన్నా తమ  లౌకిక వాదం మయలపడి పోతుందని భయపడిన నాయకులు ఇప్పుడు .. జై శ్రీరామ్ అనేందుకు కూడా వెనకాడడం లేదు.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది. గత కొంత కాలంగా సబర్మలతో సహా అనేక అంశాలపై స్పందిస్తూ.. కేరళను టార్గెట్ చేస్తున్న బీజేపీ నాయకులు అక్కడ తమ జెండా ఎగరేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా పార్టీ పాలసీని కూడా పక్కన పెట్టి మెట్రో మ్యాన్ శ్రీధరన్ ను పార్టీలో చేర్చుకుని ఆయనే తమ సీఎం అభ్యర్థి అని ప్రకటించిన 24 గంటలలో యూ టర్న్ తీసుకున్నారు. ఇది ఇలా ఉండగా ప్రస్తుతం సీఎంగా ఉన్న కమ్యూనిస్ట్ నేత పినరై విజయన్ పై గోల్డ్ స్మగ్లింగ్ ఆరోపణలు రావడంతో.. ఈ ఎన్నికలలో ఎల్డిఎఫ్ భవిష్యత్తుపై ప్రజలు ఏ తీర్పు ఇవ్వబోతున్నారనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది ఈ నేపథ్యంలో అక్షరాస్యతలో దేశంలోనే మొదటి స్థానంలో ఉన్న ఆ రాష్ట్ర ప్రజలు ఎవరిని ఆశీర్వదిస్తారు అనే అంశంపై ప్రముఖ మీడియా సంస్థ టైమ్స్ నౌ, సీ ఓటరుతో కలిసి ఒక సర్వేను నిర్వహించారు. ఈ సర్వే ప్రకారం చూస్తే పాపం కమలనాథులు అక్కడ పవర్ చేతికి రావటం అటుంచి కనీసం రెండు మూడు అసెంబ్లీ స్థానాల్లో గెలవటం కూడా కష్టమేనని ఆ సర్వే తేల్చి చెబుతోంది. కేరళలో ఈసారి జరిగే అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ తన హవా చాటుతుందన్న ఆ పార్టీ నేతల మాటలలో ఎలాంటి నిజం లేదని.. ప్రస్తుతానికి అది ఏమాత్రం సాధ్యం కాదని ఈ తాజా సర్వే తేల్చి చెప్పింది. అంతేకాకుండా మొత్తం 140 స్థానాలు ఉన్న కేరళలో.. ప్రస్తుత సీఎం పినరయి విజయన్ నేతృత్వంలోని లెఫ్ట్డ్ డెమొక్రటిక్ ఫ్రంట్ కు 82 సీట్లు పక్కా అని.. ఆయనే తిరిగి అధికారాన్ని నిలబెట్టుకుంటాడని సర్వే చెపుతోంది. అదే సమయంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూనైటెడ్ డెమొక్రాటిక్ ఫ్రంట్ కు 56 నుంచి 60 వరకు సీట్లు వచ్చే అవకాశం ఉందని ఈ సర్వేలో తేలింది. అంతేకాకుండా 2016 ఎన్నికలతో పోలిస్తే ఎల్ డీఎఫ్ ఓటింగ్ శాతం కూడా కొంత పెరగటం ఇక్కడ గమనార్హం. ప్రస్తుతం సీఎంగా ఉన్న విజయన్ మరోసారి సీఎం కావాలని 43.34 శాతం మంది మొగ్గు చూపినట్లుగా సర్వేలో తేలింది. కరోనా సమయంలో విజయన్ సీఎంగా బాగా పని చేసారని ఈ సర్వే పేర్కొంది. మరోపక్క దేశ ప్రధానిగా రాహుల్ గాంధీ ఉండాలని కేరళ ప్రజల్లో 55.84 శాతం మంది కోరుకుంటున్నట్లుగా ఈ సర్వే;లో తేలింది. అయితే కేరళలో ఎలాగైనా పాగా వేయాలని పట్టుదలతో కృషి చేస్తున్న బీజేపీకి ఈసారి కూడా నిరాశ తప్పదని ఈ సర్వేలో స్పష్టం అయింది. ఈ ఎన్నికలలో బీజేపీకి రెండు సీట్లు కూడా రావటం కూడా కష్టమేనని ఈ సర్వే తేల్చింది. అయితే ఎన్నికలకు ముందు ఇలాంటి సర్వేలు బయటకు రావడం.. తరువాత అందులో కొన్ని చతికిల పడడం మనం చూస్తూనే ఉన్నాం. మరి ఈ సర్వే ఫలితాలు నిజామా అవుతాయో లేదో తేలాలంటే కొద్దీ రోజులు వెయిట్ చేయాల్సిందే.        
రాజకీయాలు అంటేనే అదో జూదం. పూలమ్మిన చోటనే కట్టెలు అమ్మవలసి రావచ్చును. అలాంటి పరిస్థితే వచ్చినా, తలవంచుకుని పోగలిగితేనే, ఎవరైనా రాజకీయాలలో రాణించగలరు. అలాకాదని, అలిమి కానిచోట, కూడా తామే అధికులమని భావిస్తే, ఎందుకూ కాకుండా పోతారు. అలాంటి వారు ఇద్దరూ కూడా ఇప్పుడు మన కళ్ళముందే ఉన్నారు.  జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు. అలాగే జయ మరణం తర్వాత ఆమె పరిస్థితి ఏమిటో కూడా వేరే చెప్పవలసిన, అవసరం లేదు. జైలు పాలయ్యారు. సర్వం తానై నడిపించిన పార్టీ నుంచి  బహిష్కరణకు గురయ్యారు. జయ ఉన్నంత వరకు తన వారుగా ఉన్న వారందరూ కానివారయ్యారు. ఒంటరిగా మిగిలారు.  నిజానికి నాలుగేళ్ళు జైలు జీవితం గడిపిన తర్వాత కూడా ఆమె తలచుకుంటే.. రాష్ట్ర రాజకీయాలలో, ముఖ్యంగా అధికారంలో ఉన్న డిఎంకే కూటమిలో అలజడి సృష్టించగలరు. ఎన్నికలలో ఆమె గెలవక పోవచ్చును కానీ.. తనను కాదన్న అన్నాడిఎంకేను ఓడించగలరు. అయిన  ఆమె అందుకు విరుద్ధంగా  రాజకీయాలకు వీడ్కోలు పలికి మౌనంగా పక్కకు తప్పుకున్నారు. రాజకీయ సన్యాసం ప్రకటించారు. ఉమ్మడి శతృవు డిఎంకే ను ఓడించేందుకు అన్నా డిఎంకే కూటమి  పోటీ చేయాలని, కూటమి ఐక్యతను దెబ్బతీయరాదనే ఉద్దేశంతోనే ఆమె రాజకీయ సన్యాసం ప్రకటించారు.    శశికళ మౌనంగా వెళ్లి పోవడం వెనక ఇంకా అనేక కారణాలున్నా ,అసలు కారణం ఆమె, రాజకీయ విజ్ఞత, వివేకం. ఆమె జైలుకు వెళ్ళిన సమయంలో జయలలిత సమాధి వద్ద ఎంత కసిగా, కోపంగా ‘మౌన’ ప్రతిజ్ఞ చేశారో చూశా. అలాంటి ఆమె ఇప్పుడు ఇలా ‘మౌనం’గా వెనకడుగు వేశారంటే, అది ఆలోచించ వలసిన విషయమే.ఆమె వ్యుహతంకంగానే సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే అనేక మంది అనేక కోణాల్లో శశికళ సంచలన నిర్ణయాన్ని విశ్లేషించారు.జైలు జీవితం తర్వాత కూడా అన్నా డిఎంకే నాయకులు తనను అగ్రనేతగా అంగీకరించక పోవడం, అమిత్ షా చెప్పినా.. అన్నా డిఎంకే నాయకులు ఆమెను, మేనల్లుడు దినకరన్’ను కులం పేరున, కుటుంబం పేరున దూరం చేయడం, తిరిగి పార్టీలోకి తీసుకోకపోవడంతో ఆమె మనసు కష్టపెట్టుకుని, సన్యాస నిర్ణయం తీసుకున్నారని కొందరంటున్నారు. పార్టీ మీద పట్టు లేదని, చరిష్మా అసలే లేదని, అందుకే ఆమె అలా నిశ్శబ్ధంగా రాజకీయ సన్యాసం స్వీకరించారని ఇంకొందరు విశ్లేషించారు. ఈ విశ్లేషణలో కొంత నిజం ఉంటే ఉండవచ్చును.. కానీ ఆమె గతాన్ని, నైజాన్ని గుర్తు చేసుకుంటే ఆమె స్ట్రైక్ బ్యాక్ వ్యూహంతోనే ఒకడుగు వెనక్కివేశారని ఆమెతో సన్నిహితంగా మెలిగినవారు, ఆమె రాజకీయ చాణక్యం తెలిసిన వారు అంటారు.   నిజానికి జైలులో ఉన్న కాలంలో కానీ, జైలు నుంచి విడుదలై వచ్చిన తర్వాత కానీ, ఆమె రాజకీయ సన్యాసం వైపు అడుగులు వేస్తున్నట్లు కనిపించలేదు. బెంగుళూరు జైలు నుంచి విడుదలై చెన్నైలో ప్రవేశించిన నప్పుడు ఆమె పెద్ద కాన్వాయ్ తో  తమ కారుకు అన్నాడిఎంకే జెండాతోనే ఎంటరయ్యారు. అలా ఎంట్రీలోనే రాజకీయ ఆకాంక్షను వెంట తెచ్చుకున్నారు. చివరకు ‘సన్యాస’ ప్రకట చేసే వరకు కూడా ఆమె రాజకీయ కార్యకలాపాలు సాగిస్తూనే ఉన్నారు. అటు ఢిల్లీని ఇటు చెన్నైనికూడా కదిల్చారు. అంతేకాదు, రాజకీయాలపై విరక్తితో కాదు, రాజకీయ కసితో, ఉమ్మడి శత్రువు (డిఎంకే) ను ఓడించేందుకే తాను రాజకీయాలనుంచి తపుకుంటున్నట్లు చెప్పారు.  సో .. సన్యాసం తీసుకోవాలనే ఆలోచన, రాజకీయవ్యూహం లోంచి పుట్టిందే కానీ,వైరాగ్యంతో పుట్టింది కాదు ,అన్నవిశ్లేషణ వాస్తవానికి ఇంకొంత దగ్గరగా ఉందని అనుకోవచ్చును. ఇది ‘కామా’నే కాని ‘ఫుల్స్టాప్’ కాదని అంటున్నారు.  ముఖ్యమంత్రి ఎడప్పాడి కే. పళని స్వామి (ఈపీఎస్) ఆమెను పార్టీలోకి అనుమతిస్తే తన కుర్చికీ ఎసరు పెడతారనే భయంతోనే,, ఆమె ఎంట్రీని అడ్డుకున్నారు. ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం, శశికళ ఒకే సామజిక వర్గానికి చెందిన వారు కావడం కూడా, ముఖ్యమంత్రి ఈపీఎస్’ భయానికి కారణంగా పేర్కొంటారు. అందుకే  ఆయన, ‘మన్నార్గుడి’ ఫ్యామిలీని బూచిగా చూపించి, ఆమెను దూరంగా ఉంచారని పార్టీలో ఒక వర్గం గట్టిగా విశ్వసిస్తుంది. అయితే ఆమె శక్తియుక్తులను కూడతీసుకుని  పులిలా పంజా విసిరేందుకే ఆమె వ్యూహాత్మకంగా ఒక అడుగు వెనక్కి వేశారు కావచ్చును అని కూడా, తమిళ రాజకీయ వర్గాల్లో ఒక చర్చ జరుగుతోంది.  గతంలో ఆమె జయలలితతో విబేధాలు వచ్చిన సమయంలో కూడా ఇలాగే కొద్ది కాలం మౌనంగా తెర చాటుకు వెళ్లి పోయారు.  కొద్ది కాలంలోనే మళ్ళీ ‘పోయస్ గార్డెన్’లో ప్రత్యక్షమయ్యారు. జయలలిత స్వయంగా ఆమెను వెనక్కి పిలుపించుకోవలసిన పరిస్థితులను సృష్టించారు. అలా  మళ్ళీ  చక్రం తిప్పారు. జయలలిత మరణం వరకు ఆమె అందరికీ చిన్నమ్మగా అమ్మకు పెద్దమ్మగా సర్వం తానై నిలిచారు. చివరకు జయ అంత్యక్రియల్లో కూడా ఆమెదే పై చేయిగా కనిపించింది.   జయలలిత చనిపోయిన సందర్భంలోనే అన్నా డిఎంకే ఎమ్మెల్ల్యేలో సుమారు 30 మంది వరకు ఆమెకు మద్దతుగా ఉన్నారన్న వార్తలొచ్చాయి. నిజానికి,ఇప్పటికి కూడా ఒక్క అన్నా డిఎంకే లోనేకాదు,డిఎంకే ఇతర పార్టీలలో కూడా  ఆమె అవసరం ఉన్న వాళ్ళు ఉన్నారు. కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో ‘మన్నార్గుడి’ ఫ్యామిలీ మద్దతు లేకుండా గెలిచే అవకాశం లేదు.  ఇవ్వన్నీ నిజమే అయినా.. అన్నీ ఉండి, ఎవరు లేని శశికళలో, ఇంకా  ఎవరి కోసం తాపత్రయ పడాలి? అనే ప్రశ్న జనించి ఉంటే, ఆమె రాజకీయ సన్యాసం నిజం కావచ్చును. ఎందుకంటే ఆమె నెచ్చలి, జయలిత లేరు, భర్త అంతకంటే ముందే చనిపోయారు, పిల్లలు లేరు... పైగా నాలుగేళ్ళ జైలు జీవితం ఆమెలో మార్పు తెచ్చి ఉండవచ్చును. ఈ వయస్సులో తనవారంటూ ఎవరు లేని తనకు రాజకీయాలు ఎందుకు ? శేష జీవితాన్ని ఇలా సాగిద్దామనే ఆలోచన నిజంగా వచ్చి ఉంటే, ఆమె సన్యాసం సత్యం అయినా కావచ్చును, కాకపోనూ వచ్చును. కానీ  శశికళ... ఆమెను అర్థం చేసుకోవడం, అంచనా వేయడం , అంత తేలిగ్గా అయ్యే పని కాదు..
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు. కాంగ్రెస్ అధినాయకత్వం పై నేరుగా అస్త్రాలు సంధించారు. రాహుల్ గాంధీ పేరు చెప్పకుండానే, ఆయన నాయకత్వానికి పనికిరాడని తేల్చి చెప్పారు. ఎవరైనా పార్టీ అధ్యక్షుడు అయితే కావచ్చును, కానీ, ప్రజానాయకుడు కాలేడని, రాహుల గాంధీ ప్రజానాయకుడు కాదు కాలేరు,అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తరచూ రాహుల్ గాంధీని ఉద్దేశించి చేసే  ‘నామ్’ధారీ వ్యంగ్యాస్త్రాన్నే కాంగ్రెస్ సీనియర్ నాయకులు కూడా సందించారు. ఇక అక్కడి నుంచి విధేయ, అసమ్మతి వర్గాల మధ్య మాటల యుద్ధం ఎదో ఒక రూపంలో సాగుతూనే వుంది. అదే క్రమంలో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ, కరుడు కట్టిన ముస్లిం మతోన్మాది, అబ్బాస్ సిద్దిఖీతో కాంగ్రెస్ పార్టీ చేతులు కలపడం అసమ్మతి నాయకులకు మరో అస్త్రాన్ని అందించింది. విషయంలోకి వెళితే, ఇటీవల పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా లోక్’సభలో కాంగ్రెస్ పక్ష నాయకుడు, పశ్చిమ బెంగాల్ పీసీసీ అధ్యక్షుడు అధీర్’రంజన్ చౌదరి, ముస్లిం మత ప్రచారకుడు, అబ్బాస్ సిద్దిఖీతో  వేదిక పంచుకున్నారు.అంతకు ముందే వామ పక్ష కూటమితో  పొత్తు కుదుర్చుకున్న కాంగ్రెస్ పార్టీ, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)ను కూటమిలో చేర్చుకుంది. ఇలా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) అమోదం లేకుండా మతోన్మాద ఐఎస్ఎఫ్’ తో ఎన్నికల పొత్తు పెట్టుకోవడం ఆ పార్టీ నాయకుడు,సిద్ధిఖీతో  పీసీసీ చీఫ్ వేదిక  పంచుకోవడం పై అసమ్మతి నేతలు మండి పడుతున్నారు. ఇలా సిద్దిఖీతో వేదిక పంచుకోవడం పార్టీ మౌలిక సిద్ధాంతాలకు వ్యతిరేకం అంటూ అసమ్మతి వర్గానికి చెందిన కీలక నేత, రాజ్యసభ సభ్యుడు,ఆనంద్ శర్మ మండిపడ్డారు. అంతే కాదు, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)తో జనవరిలో కుదుర్చుకున్న పొత్తుకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ)అమోదం లేదని ఆనంద్ శర్మ, అభ్యంతరం వ్యక్త చేశారు. పార్టీ విశ్వసించే లౌకిక వాదానికి కాంగ్రెస్ అధిష్టానం తీసుకున్న నిర్ణయం గొడ్డలి పెట్టని ఆయన తీవ్రంగా స్పందించారు.   శర్మ వ్యాఖ్యలపై అధీర్ రంజన్ చౌదరి అంతే ఘాటుగా ప్రతిస్పందించారు. “నిజాలు తెలుసుకోండి ఆనంద్ శ‌ర్మ జీ” అంటూ ఆయ‌న వ‌రుస ట్వీట్లు చేశారు. వ్య‌క్తిగ‌త ప్ర‌యోజ‌నాలు ప‌క్క‌న‌పెట్టి, ప్ర‌ధానిని పొగిడి టైమ్ వేస్ట్ చేయ‌కండంటూ ఆయ‌న ఓ ట్వీట్లో అన్నారు. ఆనంద్ శ‌ర్మ అన‌వ‌స‌రంగా కాంగ్రెస్‌ను ల‌క్ష్యంగా చేసుకుంటున్నార‌ని, ఈ అంశాన్ని పెద్ద‌ది చేసి చూపిస్తున్నార‌ని విమ‌ర్శించారు. ఆయ‌న ఉద్దేశాలు స‌రైన‌వే అయితే నేరుగా తనతో మాట్లాడ వలసిందని అన్నారు. బెంగాల్‌లో సీపీఐ(ఎం) కూట‌మికి నేతృత్వం వ‌హిస్తోంది. అందులో కాంగ్రెస్ ఓ భాగం. మ‌త‌తత్వ‌, విభ‌జ‌న రాజ‌కీయాలు చేస్తున్న బీజేపీకి చెక్ పెట్ట‌డానికే ఈ కూట‌మి అని మ‌రో ట్వీట్‌లో అధిర్ రంజ‌న్ అన్నారు. అక్కడతోనూ ఆగలేదు ... ట్వీట్ల మీద ట్వీట్లు సంధిస్తూ, ఆనంద్ శర్మ, బీజేపీ మత విభజన, అజెండాను బలపరుస్తున్నారని, పరోక్షంగా జీ23 నాయకులు బీజేపీకి ప్రయోజనం చేకూరుస్తున్నారని ఆరోపించారు.అంతే కాదు, క్షేత్ర స్థాయి వాస్తవ పరిస్థితులు తెలియకుండా, ఆనంద్ శర్మ పార్టీ మీద దండెత్తడం ఉచితం కాదని చౌదరి ఎదురుదాడి చేశారు. అసమ్మతిలో అసమ్మతి. ఇదలా ఉంటే, కాంగ్రెస్ పార్టీ  సమూల పక్షాళన కోరుతూ సోనియా గాంధీకి,గత సంవత్సరం  జీ 23గా ప్రాచుర్యం పొందిన సీనియర్ నాయకులు రాసిన లేఖపై సంతకాలు చేసిన  నాయకుల్లో నలుగురు,జమ్మూలోసమావేసమైన నాయకుల తాజా నిర్ణయాలు, వ్యాఖ్యలు,విమర్శల పట్ల అసంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరం సోనియా గాంధీకి రాసిన లేఖలో ప్రస్తావించిన అంశాలకు కట్టుబడి ఉన్నామని, అయితే, జీ 23లోని కొందరు సహచరులు, ఇటీవల గీతదాటి చేస్తున్న వ్యాఖ్యలు, విమర్శలను తాము సమర్ధించడం లేదని ఆ నలుగురు పేర్కొన్నారు. ఇందులో ముఖ్యంగా, రాజ్యసభ మాజీ డిప్యూటీ చైర్మన్, పీజే కురియన్ అయితే, “కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు అవసరమైన సంస్కరణలు తెచ్చేందుకు చేసే ప్రయత్నాలను పూర్తిగా సమర్దిస్తాను, కానీ, ‘లక్ష్మణ రేఖ’ దాటితే ఒప్పుకునేది లేదు”అని అసమ్మతిలో అసమ్మతికి తెర తీశారు.అలాగే, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ కుమారడు, మాజీ ఎంపీ సందీప్ దీక్షిత్,మధ్య ప్రదేశ్ సీనియర్ కాంగ్రెస్ నాయకుడు అజయ్ సింగ్’ కూడా గులాం నబీ ఆజాద్, కపిల్ సిబల్, ఆనంద్ శర్మ, మనీష్ తివారీ వంటి జీ 23 కీలక నేతలు అధినాయకత్వంపై చేసిన వ్యాఖ్యలను తప్పు పట్టారు. అలాగే, పార్టీ సీనియర్ నాయకుడు కేంద్ర మాజీమంత్రి వీరప్ప మొయిలీ కూడా,గత సంవత్సరం పార్టీ సీనియర్ నాయకులు  ఒక పరిమిత లక్ష్యంతో  సోనియా గాంధీకి లేఖ రాయడం జరిగిందని, ఆ పేరున జరుగతున్న  కార్యక్రమాలు లేఖ సంకల్పానికి  విరుద్ధమని అన్నారు. జీ 23 కార్యకలాపాలపై రాహుల్ గాంధీ కూడా పరోక్షగా స్పందించారు, ఒకప్పుడు ఎన్ఎస్’యుఐ, యూత్ కాంగ్రెస్’ కు సంస్థాగత ఎన్నికలు వద్దన్న వారే ఇప్పుడు ఇంకోలా మాట్లాడుతున్నారని పరోక్షంగానే అయినా సంస్థాగత ఎన్నికలు నిర్వహించడంతో పాటుగా, పార్టీ పక్షాలనకు తమ కుటుంబం వ్యతిరేకం కాదని, అందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఈ నేపధ్యంలో కాంగ్రెస్ పార్టీలో చెలరిగిన కలకలం  ఇక ముందు ఏమవుతుందో .. ఇంకెన్ని  మలుపులు తిరుగుతోందో ..చూడవలసిందే కానీ ఉహించలేము.
అంతర్జాతీయ చెస్ దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం జూలై 20న జరుపుకుంటారు . చెస్ అనేది మెదడును ఎక్కువగా ఉపయోగించే ఆట. అందువల్ల, చెస్ ఆడటం పిల్లల మేధస్సును పదును పెడుతుందని చాలా మంది చెబుతుంటారు. చాలా మంది తల్లిదండ్రులు కూడా తమ పిల్లల ఆలోచనా, గ్రహణ సామర్థ్యాలను మెరుగుపరచడానికి పిల్లలతో చెస్ ఆడించాలని అనుకుంటారు. కానీ కేవలం చెస్ ఆడటం మాత్రమే మేధస్సును పదును పెడుతుందా? దీనిపై వైద్యులు ఏమంటున్నారో తెలుసుకుంటే.. ఆలోచించే అలవాటు.. చదరంగం ఆడేటప్పుడు పిల్లలు ప్రతి ఎత్తును జాగ్రత్తగా పరిశీలించాలి,.  ప్రత్యర్థి ఎలాంటి ఎత్తు వేస్తాడు అనే విషయాన్ని కూడా పరిగణలోకి తీసుకోవాలి,  ఇది పిల్లలు తొందరపాటు నిర్ణయాలు తీసుకునే బదులు ముందుగా ఆలోచించేలా ప్రోత్సహిస్తుంది. క్రమంగా, వారు సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకునే అలవాటును పెంపొందించుకోగలుగుతారు. ఏకాగ్రత.. చదరంగం ఆడుతున్నప్పుడు పిల్లల పూర్తి ఏకాగ్రత ఆటపైనే ఉంటుంది. వారి ఏకాగ్రత ఒక్క క్షణం తగ్గినా,  లేదా డిస్టర్బ్ అయినా  వారు ఆటను ఓడిపోయే అవకాశం ఉంటుంది. అందువల్ల, ఈ ఆట పిల్లల ఏకాగ్రతను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. అందుకే చెస్ ఆడేటప్పుడు పిల్లలు ఏకాగ్రతగా ఉండటం వారి చదువులకు, ఇతర ముఖ్యమైన పనులకు కూడా ప్రయోజనం చేకూరుస్తుంది. జ్ఞాపకశక్తి.. చెస్ ఆడేటప్పుడు పిల్లలు అనేక ఎత్తులు, నియమాలు , చెస్ ఆడే ఇతర  పద్ధతులను గుర్తుంచుకోవలసి ఉంటుంది. దీనివల్ల వారి మెదడు నిరంతరం చురుకుగా ఉంటుంది. వైద్యుల ప్రకారం, ఇది వారి జ్ఞాపకశక్తిని మెరుగుపరుస్తుంది , కొత్త విషయాలు నేర్చుకోవాలనే ఆసక్తిని కూడా పెంచుతుంది. సహనం.. చెస్ అనేది తొందరపడి ఆడే ఆట కాదు. ప్రతి ఎత్తుగడకు జాగ్రత్తగా ఆలోచన అవసరం. కొన్నిసార్లు, గెలవడానికి చాలాసేపు వేచి ఉండాల్సి వస్తుంది. ఇది పిల్లలకు సహనాన్ని నేర్పి, వాస్తవిక దృక్పథంతో నిర్ణయాలు తీసుకునే అలవాటును పెంపొందించడంలో సహాయపడుతుంది. పాఠాలు.. చెస్ అనే కాదు.. ఏ ఆటలో అయినా సరే.. ఎల్లప్పుడూ గెలవాల్సిన అవసరం లేదు. కొన్నిసార్లు ఓడిపోతాం. కానీ ఓటమి పిల్లలు తమ తప్పులను అర్థం చేసుకోవడానికి సహాయపడుతుందని వైద్యులు చెబుతారు. ఇది తర్వాతిసారి మరింత మెరుగ్గా ఆడేందుకు వారిని ప్రోత్సహిస్తుంది. ఈ అలవాటు వారి చదువులో , ఇతర జీవిత పనులలో కూడా సహాయపడుతుంది. చెస్ మాత్రమే కాదు.. కేవలం చెస్  ఆడటం వల్ల మాత్రమే పిల్లల మెదడు పదునుదేరదని వైద్యులు చెబుతున్నారు. మంచి నిద్ర, సరైన పోషణ, రోజువారీ శారీరాన్ని చురుగ్గా ఉంచే ఇతర ఆటలు, చదువు కూడా చాలా అవసరం. ఇవన్నీ కలిసినప్పుడే పిల్లల మెదడు చక్కగా అభివృద్ధి చెందుతుంది. అందువల్ల, చదరంగంతో పాటు మంచి రోజువారీ అలవాట్లపై దృష్టి పెట్టడం ముఖ్యం.                                     *రూపశ్రీ.  
చిన్నతనం అంటేనే ఆటలు, అల్లరి పనులు, చిన్న చిన్న గొడవలు. పిల్లలు చిన్నతనంలో ఉన్నప్పుడు స్నేహితులు, తమ తోటి పిల్లలతో ఆడుకుంటారు.. అలాగే కొన్ని సార్లు గొడవలు కూడా పడతారు.  పిల్లలు తప్పులు చ చేయడం సహజం. తోటి పిల్లలను బాధపెట్టడం కూడా సహజం. కానీ పిల్లలు మాత్రం  కొంత సేపు అయ్యాక లేదా ఒక రోజు తర్వాత అవన్నీ మర్చిపోయి తిరిగి కలిసి ఆడుకుంటారు, మళ్లీ గొడవలు కూడా పడతారు.  అందుకే పిల్లలను కల్మషం లేని వారు అని చెబుతూ ఉంటారు. అయితే గొడవలు పడినప్పుడో.. లేదా ఇతర పిల్లలు మీ పిల్లలను బాధపెట్టినప్పుడు, ఇతర పిల్లలు చేసిన తప్పులను మీ పిల్లలు మర్చిపోకుండా మనసులో ఉంచుకోవడం వంటివి చేసినప్పుడు అది మంచి విషయం కాదని పిల్లల పెంపకం నిపుణులు అంటున్నారు.   దీని గురించి మరింత వివరంగా తెలుసుకుంటే.. కారణం.. పిల్లలు ప్రపంచాన్ని పెద్దల కంటే చాలా భిన్నంగా చూస్తారు. వారికి, ఒక బొమ్మను పగలగొట్టడం లేదా ఆటలో ఓడిపోవడం చాలా పెద్ద విషయం. అటువంటి పరిస్థితిలో, ఒక స్నేహితుడు వారి మాట వినకపోతే, వారు అభద్రతకు గురై, మోసపోయినట్లు భావిస్తారు. క్రమంగా, పిల్లలలో అహంభావం పెరుగుతుంది, దీనివల్ల క్షమాపణ చెప్పడం లేదా క్షమాపణ కోరడం ఒక కష్టమైన పనిగా అనిపిస్తుంది. ప్రవర్తనను మార్చడం వల్ల కలిగే ప్రభావం.. పిల్లవాడికి క్షమించే అలవాటు లేకపోతే, అతను క్రమంగా ఒంటరివాడు అవుతాడు. మనసులో పగను ఉంచుకోవడం అతని మానసిక ఒత్తిడిని పెంచుతుంది. దేనికీ సర్థుకుని పోలేని మనస్తత్వం,  ఇతరుల తప్పులను చూపించే కారణం వల్ల పిల్లవాడు ఎవరితో కూడా ఎక్కువకాలం స్నేహంగా ఉండలేడు.  పిల్లలు సున్నితమైన, అర్థం చేసుకునే వ్యక్తులుగా మారాలంటే,  క్షమించడం నేర్చుకోవాలి. తల్లిదండ్రులే సహాయం చేయాలి.. తల్లిదండ్రులు చిన్న విషయాలకే కోపగించుకుని, క్షమాపణ చెప్పకపోయినా లేదా క్షమించకపోయినా, పిల్లలు కూడా అదే నేర్చుకుంటారు. ఒకవేళ తను తప్పు చేసి ఉంటే ఏమి ఆశించి ఉండేవాడో ఆ పిల్లవాడిని అడగాలి. ఇతర పిల్లల పరిస్థితిని అర్థం చేసుకునేలా పిల్లలను  ప్రోత్సహించాలి. ఇంట్లో చిన్న చిన్న గొడవలు జరిగినప్పుడు మీరు కూడా క్షమాపణ చెప్పి, ఎదుటి వ్యక్తిని క్షమించడం నేర్చుకోవాలి. క్షమాపణ చెప్పడం బలహీనతకు సంకేతం కాదని, గొప్పతనానికి సంకేతమని పిల్లలు  అర్థం చేసుకోవడానికి ఇది సహాయపడుతుంది. స్నేహాన్ని బలపరిచే విషయాలు.. ఎవరూ పర్పెక్ట్ కారని పిల్లలకు వివరించాలి. ప్రతిఒక్కరూ తప్పులు చేస్తారు,  కాబట్టి అందరిలో  తప్పులు మాత్రమే  చూడటం తప్పని పిల్లలకు చెప్పాలి. స్నేహ సంబంధం అనేది నమ్మకం , క్షమాగుణం అనే పునాదులపై ఆధారపడి ఉంటుంది. 'క్షమించండి' అని చెప్పడంలో ఉన్న  ప్రాముఖ్యతను పిల్లలకు  వివరించాలి.  క్షమించడం ఎంతో గొప్ప గుణం అని  చెప్పాలి. చిన్నతనంలో క్షమించడం నేర్చుకున్న పిల్లలు భవిష్యత్తులో మరింత సంతోషంగా, విజయవంతంగా ఉంటారని మనస్తత్వవేత్తలు నమ్ముతారు. కాబట్టి పిల్లలకు క్షమాగుణం అలవాటు చేయాలి.                                       *రూపశ్రీ.  
  వయసు పైబడే కొద్దీ, చాలా మంది తల్లిదండ్రులకు రోజువారీ పనులలో సహాయం అవసరం అవుతుంది. ఉద్యోగాల రీత్యా పిల్లలు దూరంగా ఉండటం లేదా విదేశాల్లో ఉండటం జరుగుతుంది. ఇలాంటి పరిస్థితులలో పిల్లలు తల్లిదండ్రుల కోసం పిల్లలు కేర్ టేకర్ ను నియమించుకోవాలని అనుకుంటారు.  తల్లిదండ్రులు చాలా పెద్దవారైపోయి,  వారికి వారి పనులు కూడా చేసుకోలేని పరిస్థితిలో చాలా కుటుంబాలు కూడా కేర్ టేకర్ ను నియమించుకోవాలి అనుకుంటాయి.  అయితే కేవలం అనుభవం ఉందనో లేదా తక్కువ  పేమెంట్ తో కేర్ టేకర్ వస్తున్నారనో  తల్లిదండ్రుల కోసం కేర్ టేకర్ ను నియమించడం మంచిది కాదని అంటున్నారు లైఫ్ స్టైల్ నిపుణుల.   తల్లిదండ్రుల ఆరోగ్యం, భద్రత , మానసిక ఆరోగ్యం  కోసం  మంచి కేర్ టేకర్ ను ఎంచుకోవడం చాలా ముఖ్యం. అందుకే కేర్ టేకర్ ను నియమించుకునే ముందు కొన్ని విషయాలు గుర్తు పెట్టుకోవాలి.  అవేంటో తెలుసుకుంటే.. ముఖ్యమైన విషయం.. మొదట తల్లిదండ్రులకు ఎలాంటి సంరక్షణ అవసరమో నిర్ధారించుకోవాలి. వారికి అల్జీమర్స్, డిమెన్షియా లేదా మరో తీవ్రమైన అనారోగ్యం ఉంటే, శిక్షణ పొందిన కేర్ టేకర్  అవసరం అవుతారు. వారికి కేవలం సమయానికి మందులు వేసుకోవడం, ఆహారం తినడం లేదా రోజువారీ పనులు చేసుకోవడంలో సహాయం అవసరమైతే, ఒక సాధారణ కేర్ టేకర్ కూడా  సరిపోతారు. కేర్ టేకర్ ను  ఎంచుకునే ముందు, స్నానం చేయడం, బట్టలు మార్చుకోవడం, ఆహారం తినడం, మరుగుదొడ్డికి వెళ్లడం, మందులు వేసుకోవడం లేదా రాత్రిపూట వారికి ఎంత సంరక్షణ అవసరమో వంటి రోజువారీ అవసరాల లిస్ట్ ను తయారు చేసుకోవాలి. ఇది సరైన కేర్ టేకర్ ను  ఎంచుకోవడాన్ని సులభతరం చేస్తుంది. ప్రశ్నలు అడిగేటప్పుడు గుర్తుంచుకోవలసిన విషయాలు.. కేర్ టేకర్ ను ఇంటర్ప్యూ చేసే  సమయంలో అనుభవం గురించి అడిగితే సరిపోదు. వారు ఇంతకుముందు ఏ జబ్బు ఉన్న వ్యక్తులకు సర్వీస్ చేశారో,  మెడిసిన్ షెడ్యూల్ ను  నిర్వహించగలరో లేదో, అవసరమైతే భోజనం వండగలరో లేదో,  వైద్య అత్యవసర పరిస్థితిలో సరైన నిర్ణయాలు తీసుకోగల సామర్థ్యం ఉందో లేదో కూడా తెలుసుకోవాలి.  వీల్‌చైర్ లో ఉన్న తల్లిదండ్రుల కోసం  లేదా మంచం నుండి లేవడానికి సహాయం అవసరమయ్యే వారి గురించి పై  విషయాన్ని ముందుగానే చర్చించాలి.   తల్లిదండ్రులను కలవాలి.. కేర్ టేకర్ ను నియమించాలనే నిర్ణయం తీసుకునే ముందు, కేర్ టేకర్ ను తల్లిదండ్రులకు తప్పకుండా పరిచయం చేయాలి. దీనివల్ల తల్లిదండ్రులు, కేర్ టేకర్ ఇద్దరూ  ఒకరితో ఒకరు కంఫర్ట్ గా ఉన్నారో లేదో అర్థం చేసుకోవడానికి వీలవుతుంది. కొన్నిసార్లు, అనుభవం కంటే ప్రవర్తన , మాట్లాడే విధానం వంటివి ఎక్కువ ప్రాముఖ్యతను కలిగి ఉంటాయి. ప్రతి కేర్ టేకర్ ట్రైనింగ్ తీసుకున్నవారే అయి ఉండరు అనే విషయం  గుర్తుంచుకోవాలి. చాలా మందికి వృద్ధులను చూసుకునే విషయంలో అనుభవం లేదా వైద్య శిక్షణ ఉండదు. అందువల్ల వృద్దులకు  ఇన్సులిన్ ఇవ్వడం, రక్తంలో చక్కెర స్థాయిలను చెక్ చేయడంలో,, గాయానికి కట్టు కట్టడం లేదా ఇతర నర్సింగ్ పనులు అవసరం అయితే.. వాటిని చేసేందుకు వీలుగా నర్సింగ్ శిక్షణ తీసుకున్న వారిని ఎంచుకోవాలి. కుటుంబ భాద్యత.. చాలామంది కేర్ టేకర్ ను నియమిస్తే.. ఇక తల్లిదండ్రుల విషయంలో ఎలాంటి బాధ్యత,   భయం లాంటివి తమకు లేనట్టే అని అనుకుంటారు.  కానీ కేర్ టేకర్ ఉన్నంత మాత్రాన కుటుంబ బాధ్యతలు పూర్తిగా  వదిలేయాలని అర్థం కాదు.. కేర్ టేకర్ తల్లిదండ్రులను సరిగా చూసుకుంటున్నారా లేదా అని చెక్ చేస్తూ ఉండాలి.  కేర్ టేకర్ తమను బాగా చూసుకుంటున్నారా లేదా అని పెద్దలను అడిగి తెలుసుకుంటూ ఉండాలి, అలాగే కొందరు పెద్దవాళ్లు చాదస్తంగా కేర్ టేకర్ లు ఎంత బాగా చూసుకున్నా తృప్తి పడరు. ఇలాంటి పరిస్థితులలో కేర్ టేకర్ ను అర్ఖం చేసుకోవడం,  కేర్ టేకర్ కు మద్దతుగా ఉండటం చాలా ముఖ్యం.                                 *రూపశ్రీ.  
డెంగ్యూ పై భారత్ ఘన విజయం.. వ్యాక్సిన్ వచ్చేసింది..! వర్షాకాలం వేడి నుండి ఉపశమనం కలిగించినప్పటికీ, వర్షం, నీరు నిలవడం, వరదలు వంటివి  వివిధ వ్యాధుల ప్రమాదాన్ని పెంచుతాయి. ఈ సమయంలో దోమల ద్వారా సంక్రమించే వ్యాధుల ప్రమాదం కూడా గణనీయంగా పెరుగుతుంది. ప్రతి సంవత్సరం వర్షాకాలం రాగానే చాలామంది  డెంగ్యూ గురించి  భయపడతారు.  జూలై - అక్టోబర్ నెలల మధ్య ఆసుపత్రులలో డెంగ్యూ రోగుల సంఖ్య కూడా పెరుగుతూ ఉంటుంది. డెంగ్యూ సమస్య చాలా తీవ్రంగా మారితే అంతర్గత రక్తస్రావ ప్రమాదాన్ని కూడా పెంచుతుంది, ఇది ప్రాణాంతకం కూడా కావచ్చు. ఈ ప్రమాదాల మధ్య, డెంగ్యూ విషయంలో భారతదేశంలో ఒక పెద్ద పురోగతి సాధించబడింది. జపాన్‌కు చెందిన ఫార్మాస్యూటికల్ కంపెనీ టకేడా ఫార్మాస్యూటికల్ అభివృద్ధి చేసిన డెంగ్యూ వ్యాక్సిన్, క్యూడెంగా, భారత ఔషధ నియంత్రణ సంస్థ నుండి ఆమోదం పొందింది. ముఖ్యంగా, భారతదేశంలో ఆమోదం పొందిన మొట్టమొదటి డెంగ్యూ వ్యాక్సిన్ ఇదే. దీని గురించి మరింత వివరంగా తెలుసుకుంటే.. భారతదేశంలో డెంగ్యూ వ్యాక్సిన్.. ఇప్పటివరకు  డెంగ్యూకు ఎలాంటి సరైన చికిత్స లేదు.. రోగి లక్షణాలను తగ్గించడానికి సహాయక చికిత్స అందించబడేది.  కానీ ఇప్పుడు వ్యాక్సిన్ ను కనుగొన్నారు.  నివేదికల ప్రకారం నాలుగు రకాల డెంగ్యూ వైరస్‌ల నుండి రక్షణ కల్పించేలా ఈ వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేశారు. ఇదే  దీనిలో ప్రత్యేకత. అంతేకాకుండా, ఈ వ్యాక్సిన్ ఇచ్చే ముందు డెంగ్యూ వచ్చిందో లేదో పరీక్షించాల్సిన అవసరం ఉండదట.   గత 20 ఏళ్లుగా భారతదేశంలో డెంగ్యూ కేసులు చాలా రెట్లు పెరిగిన కారణంగా ఈ వ్యాక్సిన్ కు  ఆమోదం లభించింది. ప్రతి సంవత్సరం వేలాది మంది ఈ వ్యాధి బారిన పడుతున్నారు , చాలా మంది రోగులను ఆసుపత్రిలో చేర్చవలసి వస్తోంది. సమర్థవంతమైన వ్యాక్సిన్ ఉంటే మంచిదని ఎంతో కాలంగా వైద్యుల నుండి ప్రజల వరకు అందరూ ఎంతో ఎదురుచూశారు.   భారతీయ కంపెనీ బయోలాజికల్-ఇ సహకారంతో టకేడా ఈ వ్యాక్సిన్‌ను భారీ స్థాయిలో ఉత్పత్తి చేసేందుకు సన్నాహాలు కూడా ప్రారంభించింది. కుడెంగా టీకా.. కంపెనీ ప్రకారం క్యూడెంగా ఒక టెట్రావాలెంట్ లైవ్-అటెన్యూయేటెడ్ వ్యాక్సిన్. సులభంగా చెప్పాలంటే, ఈ వ్యాక్సిన్‌ను నాలుగు రకాల డెంగ్యూ వైరస్‌ల నుండి రక్షణ కల్పించేలా రూపొందించారు. ఇందులో బలహీనంగా ఉన్న వైరస్ ఉంటుందట.. దీన్ని శరీరంలో ప్రవేశపెడితే..   శరీరం యొక్క రోగనిరోధక వ్యవస్థ వ్యాధిని కలిగించకుండానే వైరస్‌ను గుర్తించి, పోరాడుతుందట.   భారతదేశంలో డెంగ్యూ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో, ఈ వ్యాక్సిన్ ను ఆమోదించడం  చాలా మేలైందని అంటున్నారు.  అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం, గత రెండు దశాబ్దాలలో భారతదేశంలో డెంగ్యూ కేసులు దాదాపు 11 రెట్లు పెరిగాయి.   టకేడా 2024 సంవత్సరంలో భారతీయ వ్యాక్సిన్ తయారీ సంస్థ బయోలాజికల్-ఇతో భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఈ ఒప్పందం ప్రకారం, బయోలాజికల్-ఇ ప్రతి సంవత్సరం సుమారు 50 మిలియన్ డోసులను ఉత్పత్తి చేసే సామర్థ్యాన్ని అభివృద్ధి చేస్తుంది.  ఈ దశాబ్దం చివరి నాటికి ప్రపంచవ్యాప్తంగా ఏటా 100 మిలియన్ డోసులను ఉత్పత్తి చేయాలన్న  లక్ష్యాన్ని సాధించడానికి ఇది టకేడాకు సహాయపడుతుందట.                                          *రూపశ్రీ.  
పిల్లలకు కూడా ఆర్థరైటిస్ వస్తుందా.. ఈ లక్షణాలు కనిపిస్తే వెంటనే జాగ్రత్త! రుమటాయిడ్ ఆర్థరైటిస్ (Rheumatoid Arthritis) అనేది పెద్దవారికే వచ్చే వ్యాధి అని చాలామంది అనుకుంటారు. కానీ ఈ సమస్య పిల్లల్లో కూడా వచ్చే అవకాశం ఉంది. దీనిని నిర్లక్ష్యం చేస్తే కీళ్ల నొప్పులు, వాపులు, కదలికల్లో ఇబ్బందులు, ఎదుగుదలపై ప్రభావం వంటి సమస్యలు తలెత్తవచ్చు. ఈ వీడియోలో హోమియోపతి వైద్య నిపుణులు డా. ప్రవీణ్ కుమార్ పిల్లల్లో వచ్చే రుమటాయిడ్ ఆర్థరైటిస్ గురించి సులభంగా వివరించారు. ఈ వ్యాధి ఎందుకు వస్తుంది? ప్రారంభ లక్షణాలు ఎలా గుర్తించాలి? ఏ వయస్సు పిల్లలకు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది? తల్లిదండ్రులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? చికిత్సలో ఆలస్యం చేస్తే ఎలాంటి సమస్యలు ఎదురవుతాయి? వంటి ముఖ్యమైన విషయాలను ఈ వీడియోలో తెలుసుకోవచ్చు. అలాగే పిల్లలలో కీళ్ల నొప్పి, ఉదయం లేవగానే కీళ్లు బిగుసుకుపోవడం, తరచూ వాపులు రావడం వంటి లక్షణాలను ఎలా గుర్తించాలో కూడా డాక్టర్ వివరించారు. సరైన సమయంలో వైద్యుడిని సంప్రదించడం వల్ల పిల్లల ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవచ్చో కూడా ఈ వీడియోలో తెలుసుకోండి. పిల్లల ఆరోగ్యం గురించి ప్రతి తల్లిదండ్రులు తప్పకుండా చూడాల్సిన ఉపయోగకరమైన వీడియో ఇది. గమనిక: ఈ వీడియోలో చెప్పిన సమాచారం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య సమస్యలు ఉంటే తప్పనిసరిగా అర్హత కలిగిన వైద్యుడిని సంప్రదించండి. మీ ఆరోగ్య సమస్య ఏదైనా... మా హెల్త్ యూట్యూబ్ ఛానల్‌లో సీనియర్ డాక్టర్స్ చెప్పిన సలహాలు... సూచనలు ఉన్నాయి. మా యూట్యూబ్ ఛానల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 👉 TeluguOne Health (సబ్‌స్క్రైబ్ చేయడం మర్చిపోకండి!)