Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...తమ్మినేని సీతారాం కు జగన్ సపోర్ట్.. వైసీపీ అధినేత మౌనం సంకేతం అదేగా?!
posted on: Jul 21, 2026 10:26AM

వైసీపీ సీనియర్ నాయకుడు, జగన్ హయాంలో అసెంబ్లీ స్పీకర్ గా పని చేసిన తమ్మినేని సీతారాం ఇప్పుడు కుటుంబంతో సహా పరారీలో ఉన్నారు. తమ్మినేని కుటుంబం భూకబ్జా, ఫోర్జరీకి పాల్పడిందన్న ఆరోపణలు ఉన్నాయి. అందుకు సంబంధించిన కేసులోనే అరెస్టును తప్పించుకోవడానికి ఆయన రాత్రికి రాత్రే.. సొంత కార్లు, ఫోన్లూ కూడా వదిలేసి పరారైపోయారు.
ఈ ఘటన ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. బతికున్న వ్యక్తి చనిపోయినట్లుగా బోగస్ డెత్ సర్టిఫికేట్ సృష్టించి భూమిని కబ్జా చేశారన్న అభియోగాలపై ప్రాథమిక ఆధారాలు లభించడంతో ఈ కేసులో ఇప్పటికే ఎనిమిది మంది అరెస్టయ్యారు. ఆ కేసులో తమ్మినేని కుటుబ సభ్యులు అరెస్టు భయంతో అజ్ణాతంలోకి వెళ్లిపోయారు. ఈ విషయంపై జగన్ ఇప్పటి వరకూ స్పందించకపోవడంతో పొలిటికల్ సర్కిల్స్ లో జగన్.. తమ్మినేనికి వెనకేసుకు వస్తున్నారన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది.
అసలు రాజకీయంగా తీవ్ర సంచలనం సృష్టిస్తున్న ఈ కేసు పూర్వాపరాల్లోకి వెడితే.. శ్రీకాకుళం జిల్లాలో 4 కోట్ల రూపాయల విలువైన స్థలాన్ని హస్తగతం చేసుకునేందుకు తమ్మినేని సీతారాం నకిలీ పత్రాలు, తప్పుడు వారసత్వ ఆధారాలు సృష్టించారన్న ఆరోపణలపై కేసు నమోదైంది. ప్రాథమిక ఆధారాలు లభించడంతో ఈ కేసులో పోలీసులు అరెస్టుల పర్వానికి తెరతీశారు. కొందరిని అరెస్టు చేశారు కూడా.. ఈ నేపథ్యంలోనే తమ్మినేని కుటుంబంతో సహా పరారయ్యారు. ఈ కేసులో ప్రధాన నిందితులుగా తమ్మినేని సీతారాం కుటుంబ సభ్యులే ఉన్నారు.
అటువంటి తమ్మినేనికి వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్ అండగా నిలిచి వెనకేసుకు వస్తున్నారన్న చర్చ రాష్ట్రంలో జోరుగా సాగుతోంది. చట్టపరమైన విచారణ ఎదుర్కొంటున్న నేతలకు రాజకీయ అభయం ఇస్తూ, వారిపై విచారణ అధికార తెలుగుదేశం కూటమి కక్షసాధింపుగా అభివర్ణించే ప్రయత్నం చేయడం జగన్ కు రివాజుగా మారిపోయిందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఇప్పుడు తమ్మినేని విషయంలో కూడా జగన్ మౌనం ఆయనకు సమర్ధనే అని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. తమ్మినేని కుటుంబం బరితెగింపుగా కబ్జాకు పాల్పడిందన్న విషయంలో భూ యజమాని కుటుంబ సభ్యులు పోలీసులకు రాతపూర్వకంగా ఫిర్యాదు చేయడంతో వెలుగులోకి వచ్చింది. శ్రీకాకుళం జిల్లా ఎస్పీ ఆధ్వర్యంలో సమగ్ర దర్యాప్తు చేపట్టిన పోలీసులు, అక్రమ రిజిస్ట్రేషన్ కుట్ర వెనుక ఉన్న భారీ నెట్‌వర్క్‌ను ఛేదించారు. మొత్తం 13 మందిపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయగా, ఇందులో మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాంను A6 గా, ఆయన కుమారుడు చిరంజీవి నాగ్‌ను A5 గా, భార్య తమ్మినేని వాణిని A7 గా చేర్చారు. అంతేకాకుండా, నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించి ఈ ఫోర్జరీ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ పూర్తి చేసిన స్థానిక సబ్ రిజిస్ట్రార్ బొడ్డేపల్లి అరుణను A13 గా చేర్చారు. ఈ క్రమంలోనే కుట్రలో భాగస్వాములైన 8 మంది నిందితులను పోలీసులు ఇప్పటికే అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.
బాధితులకు న్యాయం జరగాల్సిన ఘటనలో, నిందితులుగా ఉన్న తమ పార్టీ సీనియర్ నేతకు జగన్ మద్దతుగా నిలవడం విమర్శలకు తావిస్తున్నది. గతంలోనూ పార్టీ నేతలపై కేసులు నమోదైన సందర్భాల్లో జగన్ తీసుకున్న వైఖరి తరహాలోనే, ఈ కేసులోనూ తమ్మినేని సీతారాంకు పూర్తి అభయం ఇచ్చినట్లు తెలుస్తోంది. అందుకే ఈ విషయంపై జగన్ ఇంత వరకూ స్పందించలేదు. పార్టీ పరంగా తమ్మినేని సీతారాంపై చర్యా తీసుకోలేదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
Srikakulam land grabbing case, fake death certificate forgery, YSR Congress Party






