
మారుతి... చోటా డైరెక్టర్ నుంచి బడా డైరెక్టర్ గా ప్రమోషన్ పొంది పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ తో రాజా సాబ్ చేసాడు. చేసాడు అనే కంటే ప్రభాస్ అవకాశం ఇచ్చాడని చెప్పవచ్చు. కానీ కథనంలోని లోపాలు, రిలీజ్ కి ముందు తాత, మనవడు కథలా ప్రమోషన్స్ లో చూపించడం, ఆ తర్వాత నాయనమ్మ, మనవడు కథ అవ్వడం, ఇలా పలు లోపాల వల్ల రాజా సాబ్ డిజాస్టర్ ని అందుకుంది.
మారుతి తన తదుపరి ప్రాజెక్ట్ కోసం మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్‌ని కలిసి కథ వినిపించారని, రీజనబుల్ బడ్జెట్‌తో ఈ సినిమా పట్టాలెక్కనుందని సోషల్ మీడియాలో కథనాలు వైరల్ అయ్యాయి. కానీ, ఈ ప్రచారంపై తాజాగా వరుణ్ తేజ్ వర్గాల నుంచి స్పష్టమైన వివరణ లభించింది. మారుతి దర్శకత్వంలో వరుణ్ తేజ్ నటిస్తున్నట్లు వస్తున్న వార్తలు 100 శాతం అవాస్తవమని, వాటిల్లో ఎలాంటి నిజం లేదని క్లారిటీ ఇచ్చారు.
ప్రస్తుతం వరుణ్ తేజ్ వరుస ప్రాజెక్టులతో ఎంతో బిజీగా ఉన్నారు. మెర్లపాక గాంధీ దర్శకత్వంలో తెరకెక్కిన హారర్ కామెడీ చిత్రం ‘కొరియన్ కనకరాజు’ ఆగస్టు 7న ప్రేక్షకుల ముందుకు రావడానికి సర్వం సిద్ధమైంది. ఈ సినిమా షూటింగ్ సమయంలో వరుణ్ తేజ్ కాలికి తీవ్రమైన గాయం అయినప్పటికీ, ఆ నొప్పిని సైతం భరిస్తూ సినిమా ప్రమోషన్లలో అత్యంత చురుగ్గా పాల్గొంటున్నారు. ఆగస్టు 7న ‘కొరియన్ కనకరాజు’ గ్రాండ్ రిలీజ్ తర్వాత చిన్నపాటి విరామం తీసుకుని, ఆ వెంటనే తన చెల్లెలు నిహారిక కొణిదెల నిర్మాణంలో కమిటీ కుర్రోళ్లు ఫేమ్ యదు వంశీ దర్శకత్వంలో రాబోతున్న ‘బరి’ అనే స్పోర్ట్స్ డ్రామా షూటింగ్‌లో పాల్గొననున్నారు.
Also read: పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి ఈనాడు యాజమాన్యం గుడ్ న్యూస్.. చరిత్రలో ఇదే ఫస్ట్ టైం
వరుసగా రెండు విభిన్నమైన సినిమాలతో డైరీ ఫుల్ అయి ఉన్న వరుణ్ తేజ్, మారుతి కాంబినేషన్‌పై వస్తున్న కథనాలన్నీ వట్టి పుకార్లేనని తేలడంతో మెగా అభిమానులకు ఓ స్పష్టత వచ్చినట్లయింది. మరోవైపు, దర్శకుడు మారుతి తన కామెడీ బ్రాండ్ మార్క్ కథతో తిరిగి బాక్సాఫీస్ వద్ద బలంగా కంబ్యాక్ ఇవ్వడానికి సిద్ధమవుతున్నారు.
varun tej, maruthi, bari






