LATEST NEWS
ఆ సాయంత్రం... రాక్సీలో నార్మా షేరర్‌, బ్రాడ్వేలో కాంచనమాల; ఎట కేగుటో సమస్య తగిలిం దొక విద్యార్థికి! ఇవి మహాకవి శ్రీశ్రీ రాసిన సంధ్యా సమస్యలు కవితలోని పంక్తులు.. ఇప్పుడు సరిగ్గా ఇలాంటి సమస్యే ఏపీ ఐటీ మంత్రి నారా లోకేష్ ఎదుర్కొన్నారు. నారా లోకేష్.. యువతలో, అలాగే సోషల్ మీడియా ట్రెండ్స్ తో  ఎప్పుడూ టచ్ లో ఉండే లోకేష్  తాజాగా.. టీనేజర్లు, యువతతో ఓ సరదా ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఆ సందర్భంగా  తమదైన శైలిలో  లోకేష్‌ను సరదా ప్రశ్నలతో టీజ్ చేయడానికి ప్రయత్నించారు. అయితే యువత ప్రశ్నలకు లోకేష్ వారి కంటే సరదాగా.. ఎదురు వారినే టీజ్ చేసేలా ఆసక్తికర సమాధానాలిచ్చారు.  ఈ క్రమంలోనే లోకేష్ అత్యంత క్లిష్టమైన, అంతకు మించి ఆసక్తికరమైన ప్రశ్న ఎదుర్కొన్నారు.  అదేంటంటే ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి నారా లోకేష్..  అలాగే.. జూనియర్ ఎన్టీఆర్ సినిమాలు ఒకే రోజున విడుదలైతే.. ఆ రెండింటిలో మీరు ముందుగా ఏ సినిమా అంటే ఎవరి సినిమా చూస్తారన్న ప్రశ్నకు.. లోకేష్ చాకచక్యంగా ఇద్దరి సినిమాలనూ ఒకే రోజు చూస్తానని బదులిచ్చారు. పైకి సరదాగా కనిపించినా.. ఈ ప్రశ్న రాజకీయంగా అత్యంత ప్రాధాన్యత, ప్రాముఖ్యత ఉన్న ప్రశ్నగానే భావించాల్సి ఉంటుంది. ఎందుకంటే.. పవన్ కల్యాణ్ తెలుగుదేశం కూటమి ప్రభుత్వంలో డిప్యూటీ సీఎంగా ఉన్నారు. ఇక ఎన్టీఆర్.. నందమూరి వంశానికి చెందిన స్టార్ హీరో.  ఈ ఇరువురిలో ఏ ఒకరి సినిమా ముందుగా చూస్తానని లోకేష్ చెప్పినా దానికి రాజకీయ రంగు పులమడానికి ఆయన ప్రత్యర్థులు రెడీగా ఉంటారు. అయితే వారికి అటువంటి అవకాశం ఇసుమంతైనా ఇవ్వకుండా లోకేష్ సమయస్ఫూర్తితో లౌక్యంగా ఇద్దరి సినిమాలూ ఒకే రోజు చూస్తానని బదులిచ్చి అందరినీ ఆకట్టుకున్నారు. యూత్ సరదా ప్రశ్నకు లోకేష్ ఇచ్చిన స్మార్ట్ రిప్లై ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ ట్రెండింగ్ లో ఉంది.  ఇది ఒక్కడే కాదు.. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును దేశ ప్రధానిగా  చూడాలనుకుంటున్నారా,  రాష్ట్రపతిగా చూడాలని ఉందా అన్న ప్రశ్నకు లోకేష్ అనితర సాధ్యమైన రీతిలో..  ఆ రెండు పదవులు కాకుండా, చంద్రబాబు నాయుడు అమరావతిలోనే ఉంటూ, తాను ఎల్లప్పు డూ చేసే విధంగానే నవ్యాంధ్రప్రదేశ్‌ను అభివృద్ధి బాటలో నడిపించడమే తనకు ఇష్టమని బదులిచ్చారు.  ఇక ఆహారంలో తనకు రాగి సంకటి అత్యంత ఇష్టమని లోకేష్ చెప్పారు. పొలిటికల్ గా 2029 ఎన్నికలలో కూడా తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి రాష్ట్రంలో భారీ విజయాన్ని సాధించి మళ్లీ అధికారంలోకి వస్తుందని లోకేష్ ధీమా వ్యక్తం చేశారు.  
  ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాజకీయ ముఖచిత్రాన్ని పరిశీలిస్తే, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజా సంక్షేమం మరియు పాలనపై తీవ్రమైన చర్చ నడుస్తోంది. ముఖ్యంగా రాష్ట్రంలో విద్యా, వైద్య రంగాలు ఎదుర్కొంటున్న సంక్షోభం, వ్యవసాయ రంగంలో రైతుల అవస్థలు ఈ చర్చల్లో ప్రధానాంశాలుగా మారాయి. ప్రభుత్వం కేవలం ప్రచారానికే పరిమితమవుతోందా, లేక నిజమైన మార్పు కోసం అడుగులు వేస్తోందా అనే కోణంలో రాజకీయ విశ్లేషకులు లోతుగా పరిశీలిస్తున్నారు. కేవలం అప్పుల ద్వారా పథకాలను అమలు చేయడం తప్ప, శాశ్వత సంపద సృష్టి జరగడం లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ అంశంపై ఈ అంశాలపై  తెలుగువన్ ఎండీ కంఠంనేని రవిశంకర్ సారథ్యంలో నిర్వహించిన ‘తెలుగువన్ వాస్తవ వేదిక’లో ‘జమీన్ రైతు’ సంపాదకుడు డోలేంద్ర ప్రసాద్ తన అభిప్రాయలు వ్యక్తం చేశారు. రాజకీయ వ్యూహాలు మరియు వాటి అంతరార్థాలురాష్ట్రంలో కొన్ని ప్రైవేట్ విద్యా సంస్థల అధిపతులే రాజకీయ నాయకులుగా చలామణి అవుతుండటంతో ప్రభుత్వ విద్యా విధానంలో ఆశించిన మార్పులు రావడం లేదనేది బహిరంగ రహస్యం. ప్రభుత్వ బడులు లేదా ఆసుపత్రులు బాగుపడితే ప్రైవేట్ వ్యాపారాలు దెబ్బతింటాయనే ఉద్దేశంతోనే ఈ వ్యవస్థలను నిర్వీర్యం చేస్తున్నారనే వాదనలు బలంగా ఉన్నాయి. రాజకీయ నాయకులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించడం లేదా తాము ప్రభుత్వ ఆసుపత్రుల్లో చికిత్స చేయించుకోవడం వంటివి కేవలం ప్రజల కళ్లకు పొరలు కమ్మే వ్యూహాత్మక చర్యలుగానే కనిపిస్తున్నాయి తప్ప, క్షేత్రస్థాయిలో ఎలాంటి మార్పూ రావడం లేదు.  దాదాపు అధిక శాతం ప్రభుత్వ పాఠశాలల్లో కనీస వసతులు, బ్లాక్‌బోర్డులు లేని దుస్థితి ఉంది. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (CSR) కింద కొన్ని స్కూళ్లను బాగు చేసినంత మాత్రాన మొత్తం విద్యా వ్యవస్థ మారదని, దీనికి బలమైన విధానపరమైన నిర్ణయాలు అవసరమని స్పష్టమవుతోంది.మరోవైపు, వ్యవసాయ రంగంలో కూడా ఇదే విధమైన వ్యూహాత్మక వైఫల్యం కనిపిస్తోంది. అంతర్జాతీయంగా బియ్యం ధరలు బాగున్నప్పటికీ, రాష్ట్రంలో రైతులు మాత్రం ధాన్యం అమ్ముకోవడానికి గోనె సంచుల దగ్గర నుండి అనేక ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వ కొనుగోలు వ్యవస్థల మందకొడితనం వల్ల రైతులు దళారులను, మిల్లు యజమానులను ఆశ్రయించి నష్టపోవాల్సి వస్తోంది. ఇది సంపదను సృష్టించడం కాదు, శ్రమను దోపిడీ చేయడమే అవుతుంది. భవిష్యత్తు రాజకీయ ప్రభావంకూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి కొంత కాలం గడుస్తున్నా, ప్రజల జీవన ప్రమాణాలను పెంచే దిశగా నిర్దిష్టమైన ప్రణాళికలు కనిపించడం లేదు. రాబోయే కాలంలో ఈ వైఫల్యాలు ప్రభుత్వానికి పెద్ద రాజకీయ సవాలుగా మారే ప్రమాదం ఉంది. సంక్షేమ పథకాలైన పెన్షన్లు, అమ్మవడి వంటివి ఓట్ల పరంగా తాత్కాలికంగా మేలు చేసినప్పటికీ, ఉపాధి కల్పన, విద్యా ప్రమాణాల మెరుగుదల, నాణ్యమైన వైద్యం వంటి ప్రాథమిక అవసరాలను తీర్చలేకపోతే ప్రజల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతుంది. రాబోయే మూడేళ్ల కాలం కూటమి ప్రభుత్వానికి అత్యంత కీలకం. ఈ లోగా విద్యా, వైద్య, వ్యవసాయ రంగాల్లో వ్యవస్థాగత మార్పులు తీసుకురాకపోతే, భవిష్యత్తు ఎన్నికల్లో అధికార పీఠాన్ని నిలబెట్టుకోవడం చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి అంత సులువు కాకపోవచ్చు. అంశాలపై కంఠంనేని రవిశంకర్ – డోలేంద్ర ప్రసాద్ మధ్య జరిగిన పూర్తి చర్చను టోన్ న్యూస్ యూట్యూబ్ ఛానల్‌లో తప్పక వీక్షించవచ్చు.  
 ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణం రాజు తనపై అనుచిత వ్యాఖ్యలు చేసిన జై భీమ్ భారత్ పార్టీ అధ్యక్షుడు జాడ శ్రవణ్ కుమార్‌పై ఫిర్యాదు చేస్తానన్నారు. అయితే.. ఇప్పడు కాదు.. ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ రాష్ట్ర హోంమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తరువాత ఫిర్యాదు చేస్తానని పేర్కొన్నారు.  సోమవారం (జూన్ 29) భీమవరంలోని తన కార్యాలయంలో  మీడియతో మాట్లాడిన ఆయన..  జడ శ్రవణ్ కుమార్ తనపై చేసిన వ్యాఖ్యలను  ఖండించారు. తన నాలుక కోసి సమాధి కడతానని బెదిరించడం హత్యను ప్రేరేపించే క్రిమినల్ చర్య కిందకే వస్తుందన్న ఆయన,  రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న వ్యక్తిపై ఇటువంటి అనుచిత వ్యాఖ్యలు చేస్తే కూటమి ప్రభుత్వం చూస్తూ ఊరుకోదన్నారు. ఒకవేళ ప్రభుత్వం సుమోటోగా చర్యలు తీసుకోకపోయినా, తనపై ఉన్న అభిమానంతో ఎవరో ఒకరు తప్పకుండా ఫిర్యాదు చేస్తారని రఘురామకృష్ణంరాజు పేర్కొన్నారు. ఇక తాను ఫిర్యాదు చేయాల్సి వస్తే.. ఇప్పుడు చేయబోనని స్పష్టం చేశారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ రాష్ట్ర హోంమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తరువాత ఫిర్యాదు చేస్తానని రఘురామకృష్ణం రాజు చెప్పారు. రాష్ట్ర హోంమంత్రిగా పవన్ కల్యాణ్ బాధ్యతలు చేపడతారని ఆయనీ విధంగా హింట్ ఇచ్చారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇటీవల రాష్ట్ర హోంమంత్రిగా తాను ఉంటే.. రాష్ట్రంలో...
ఆంధ్రప్రదేశ్  రాష్ట్రంలో హోం మంత్రి మార్పు జరగనుందా?  ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ త్వరలోనే రాష్ట్ర హోంమంత్రిగా  బాధ్యతలు చేపట్టనున్నారా అంటే.. రాజకీయవర్గాలు ఔననే అంటున్నాయి. ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణం రాజు వ్యాఖ్యలే అందుకు నిదర్శనమంటున్నాయి.   అసలీ చర్చకు మూలం ఏమిటంటే.. గత వారం ఒక బహిరంగ సభలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ..  రాష్ట్రంలో నేరగాళ్లు చాలా అదృష్టవంతులన్నారు.  తాను రాష్ట్ర హోం మంత్రి కాకపోవడం వల్లే నేరస్థఉలు   స్వేచ్ఛగా తిరుగుతున్నారనీ,   ఒకవేళ తానే గనుక హోం మంత్రిని అయి ఉంటే నేరగాళ్ల ఆటలు సాగేవి కావని పవన్ అన్నారు. పవన్ మాటలు అప్పట్లో తీవ్ర సంచలనం రేపాయి.  ఇక పవన్ వ్యాఖ్యలపై తాజాగా డిప్యూటీ స్పీకర్  రఘురామకృష్ణ రాజు స్పందిస్తూ..  పవన్ కళ్యాణ్ లాంటి నాయకుడు, రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న వ్యక్తి ఎటువంటి అవగాహన లేకుండా మాట్లాడరనీ, ఆయన తాను హోంమంత్రిని అయితే.. అంటూ పవన్ అన్నారంటూ.. ఆయన  ఆ పదవి చేపట్టే అవకాశాలు పుష్కలంగా ఉన్నట్లేనంటూ రఘురామకృష్ణం రాజు అన్నారు.  దీంతో ఇప్పుడు రాష్ట్ర రాజకీయాలలో హోంమంత్రిగా పవన్ కల్యాణ్ అన్న ప్రచారం జోరుగా సాగుతోంది. రానున్న రోజులలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ చేపట్టనున్నారన్న సమాచారం నేపథ్యంలో హోంమంత్రి మార్పు తథ్యమన్న చర్చ రాజకీయవర్గాలలో మొదలైంది.   పవన్ కళ్యాణ్ హోం మంత్రిగా బాధ్యతలు స్వీకరిస్తే..  ఆయన  దూకుడు,  పారదర్శకమైన శైలి కారణంగా రాష్ట్ర శాంతిభద్రతల విభాగంలో విప్లవాత్మక మార్పులు వస్తాయని పరిశీలకులు అంటున్నారు.  ఆయన చూపే చొరవ రాష్ట్రంలో నేర నియంత్రణకు నిస్సందేహంగా దోహదపడుతుం దని అంటున్నారు.   హోం శాఖ వంటి అత్యంత సున్నితమైన,  కీలకమైన మంత్రిత్వ శాఖను నిర్వహించడానికి అవసరమైన ఓర్పు పవన్ కు ఉందా అన్న చర్చ కూడా రాజకీయవర్గాలలో జరుగుతోంది.  
  తమిళనాడు రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. రాష్ట్రంలో రాబోయే మూడు నుంచి ఆరు నెలల్లోనే అసెంబ్లీ ఎన్నికలు జరిగే అవకాశం ఉందని డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చకు దారితీశాయి. పార్టీ శ్రేణులు ఇప్పటి నుంచే ఎన్నికల సమరానికి సిద్ధం కావాలని ఆయన పిలుపునిచ్చారు. చెన్నైలో నిర్వహించిన రాజకీయ కార్యక్రమంలో ఏఐఏడీఎంకే మాజీ మంత్రి బెంజమిన్‌తో పాటు పలువురు నాయకులు, కార్యకర్తలు డీఎంకేలో చేరారు. ఈ సందర్భంగా మాట్లాడిన స్టాలిన్, రాష్ట్రంలోని ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అధికారంలో ఉన్న టీవీకే ప్రభుత్వానికి పూర్తి మెజారిటీ లేదని స్టాలిన్ ఆరోపించారు. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన 118 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉండాల్సి ఉండగా, అధికార పక్షానికి కేవలం 108 మంది సభ్యుల బలమే ఉందని పేర్కొన్నారు. ఇతర పార్టీల మద్దతుతోనే ప్రభుత్వం కొనసాగుతోందని విమర్శించారు. కాంగ్రెస్, వామపక్షాలు, వీసీకే, ఐయూఎంఎల్ వంటి పార్టీల సహకారంతోనే ప్రభుత్వం మనుగడ సాగిస్తోందని, ఈ పరిస్థితుల్లో ఎప్పుడైనా రాజకీయ పరిణామాలు మారే అవకాశం ఉందని అన్నారు. గత కొన్ని నెలలుగా తమిళనాడులో అభివృద్ధి మందగించిందని స్టాలిన్ ఆరోపించారు. శాంతిభద్రతల పరిస్థితి క్షీణించిందని, మహిళలపై నేరాలు, మాదకద్రవ్యాల అక్రమ రవాణా, దోపిడీలు, పెట్రోల్ బాంబు దాడులు పెరిగిపోయాయని విమర్శించారు. తరచూ విద్యుత్ అంతరాయాలు ఏర్పడుతున్నాయని, పారిశ్రామికవేత్తలు పెట్టుబడుల విషయంలో వెనుకంజ వేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఎన్నికల ప్రకటన కోసం ఎదురుచూడకుండా, ఇప్పటి నుంచే పార్టీ కార్యకర్తలు ప్రజల్లోకి వెళ్లి పనిచేయాలని, డీఎంకేను తిరిగి అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా ముందుకు సాగాలని స్టాలిన్ సూచించారు. మరోవైపు, డీఎంకే నేత ఉదయనిధి స్టాలిన్ కూడా ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ఒకప్పుడు దేశానికే ఆదర్శంగా నిలిచిన తమిళనాడు పాలన నేడు గాడితప్పిందని వ్యాఖ్యానించారు. ప్రజలు తాగునీరు, విద్యుత్ వంటి ప్రాథమిక సౌకర్యాల కోసం ఇబ్బందులు పడుతుంటే, ప్రభుత్వం ప్రచార కార్యక్రమాలకే పరిమితమైందని ఆరోపించారు. అసెంబ్లీ సమావేశాలు ప్రజా సమస్యలపై చర్చించే వేదికలుగా కాకుండా, రాజకీయ ప్రదర్శనల వేదికలుగా మారిపోయాయని ఆయన ఎద్దేవా చేశారు. ఈ పరిణామాల నేపథ్యంలో తమిళనాడులో ముందస్తు ఎన్నికలపై ఊహాగానాలు మరింత ఊపందుకున్నాయి.  
ALSO ON TELUGUONE N E W S
      యష్(yash)వన్ మాన్ షో టాక్సిక్(Toxic)కోసం అభిమానులు ఎంతగా ఎదురుచూస్తున్నారో, మూవీ లవర్స్, ప్రేక్షకులు కూడా అంతే ఇదిగా ఎదురుచూస్తున్నారు.  ఆ ఎదురుచూపులతో పాటు కియారా అద్వానీ తో పాటు ఇతర హీరోయిన్స్ ఎవరున్నారో అనే ఆసక్తి కూడా వాళ్ళందరిలో ఉంది. ఈ విషయంపై యష్ రీసెంట్ ట్వీట్ తో క్లారిటీ ఇచ్చాడు. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్‌లో కేవీఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్ "యాదృచ్ఛికంగా మా లేడీస్ ఎక్కడ ఉన్నారు యష్?" అంటూ ఒక సరదా పోస్ట్ పెట్టింది. దీనికి  యష్ తనదైన స్టైల్‌లో  స్పందిస్తూ.. "కామ్ డౌన్! లేడీస్ రావడానికి కాస్త సమయం పడుతుంది! రేపు జులై 1, 2026 ఉదయం 11:33 గంటలకు చూద్దాం" అంటూ ట్వీట్ చేశాడు. ఈ క్రేజీ అప్‌డేట్‌తో 'టాక్సిక్' చిత్రంలో నటిస్తున్న లీడ్ యాక్ట్రెసెస్‌పై ఉన్న ఉత్కంఠకు తెరపడనుంది. రేపు ఉదయం విడుదల కాబోయే ప్రత్యేక టీజర్ లేదా గ్లింప్స్ ద్వారా ఈ సినిమాలో నటించే పవర్‌హౌస్ ఫీమేల్ కాస్ట్‌ను మేకర్స్ అధికారికంగా ప్రపంచానికి పరిచయం చేయబోతున్నారు. Also read: Allu Arjun: అల్లు అర్జున్ నా క్రష్.. మీ స్కూల్ డేస్ గుర్తుకొస్తాయి ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ కియారా అద్వానీ 'నాడియా' అనే ఛాలెంజింగ్ రోల్‌లో నటిస్తుండగా, లేడీ సూపర్ స్టార్ నయనతార 'గంగ' అనే పవర్‌ఫుల్ పాత్రలో కనిపించబోతున్నారు. వీరితో పాటు హుమా ఖురేషి 'ఎలిజబెత్' గా, తారా సుతారియా 'రెబెక్కా' గా, కన్నడ సెన్సేషన్ రుక్మిణి వసంత్ 'మెలిస్సా' అనే వైవిధ్యమైన పాత్రల్లో మెరవనున్నారు. డ్రగ్ మాఫియా మరియు గోవా బ్యాక్‌డ్రాప్‌లో సాగే ఈ పీరియడ్ గ్యాంగ్‌స్టర్ యాక్షన్ థ్రిల్లర్‌లో మహిళా దర్శకురాలి పర్స్పెక్టివ్ (ఫిమేల్ గేజ్) ఎలా ఉండబోతుందోనని యావత్ సినీ ప్రపంచం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ఆగస్టు 26 రిలీజ్ డేట్.    
తిరువీర్ హీరోగా, ఐశ్వర్య రాజేష్ హీరోయిన్‌గా నటిస్తున్న తాజా చిత్రం 'ఓ సుకుమారి' (Oh Sukumari). ఈ క్రేజీ ప్రాజెక్ట్ అనౌన్స్ అయినప్పటి నుంచే ట్రేడ్ వర్గాల్లో, ప్రేక్షకుల్లో మంచి అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే విడుదలైన టీజర్ ఆకట్టుకుంది. తాజాగా ఈ సినిమా విడుదల తేదీని మేకర్స్ అధికారికంగా ప్రకటిస్తూ ఒక అదిరిపోయే అప్‌డేట్ ఇచ్చారు. 'ఓ సుకుమారి' చిత్రాన్ని జూలై 17, 2026 న విడుదల చేయబోతున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. ఒక ఎలెక్ట్రిఫైయింగ్ లవ్ స్టోరీగా ఈ సినిమా రూపుదిద్దుకుంది. ఇందులో హీరోయిన్ ని హీరో ముట్టుకుంటే షాక్ కొడుతుంది, అలాంటిది ఈ ఇద్దరు ఎలా ఒక్కటయ్యారు అనే ఇంట్రెస్టింగ్ పాయింట్ తో వస్తోంది. రిలీజ్ డేట్ పోస్టర్‌ను కూడా ఆ కాన్సెప్ట్ కి తగ్గట్టుగానే ఎట్రాక్టివ్ గా డిజైన్ చేశారు. భరత్ దర్శన్ దర్శకత్వంలో గంగా ఎంటర్టైన్మెంట్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. జూలై 17న రిలీజ్ కాబోతున్న ఈ ఎలెక్ట్రిఫైయింగ్ లవ్ స్టోరీ ఎలాంటి రెస్పాన్స్ తెచ్చుకుంటుందో చూడాలి.  
తెలుగు చిత్ర పరిశ్రమలో విభిన్నమైన పాత్రలు పోషిస్తూ తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న కోలీవుడ్ బ్యూటీ ఐశ్వర్య రాజేష్. గతంలో 'వరల్డ్ ఫేమస్ లవర్', 'రిపబ్లిక్' వంటి చిత్రాల్లో నటించినప్పటికీ ఆశించిన స్థాయిలో బ్రేక్ లభించలేదు. కానీ, గతేడాది సంక్రాంతి బాక్సాఫీస్ బరిలో విక్టరీ వెంకటేష్, సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో వచ్చిన భారీ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ 'సంక్రాంతికి వస్తున్నాం' చిత్రంతో ఈ భామ కెరీర్ ఒక్కసారిగా తిరిగేసింది. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా ఏకంగా ₹300 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టి ఇండస్ట్రీలో బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ఈ సినిమాలో మరో కథానాయికగా మీనాక్షి చౌదరి కూడా మెప్పించగా, ఐశ్వర్య రాజేష్ పోషించిన పాత్రకు తెలుగు ప్రేక్షకుల నుండి అపూర్వ ఆదరణ లభించింది. ఈ భారీ సక్సెస్ ఇచ్చిన జోష్‌తో ఆమె టాలీవుడ్‌లో తన రేంజ్ మరియు రెమ్యునరేషన్‌ను కూడా భారీగా పెంచేసింది. ప్రస్తుతం తన తాజా చిత్రం 'ఇసకపట్నం' ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్న ఐశ్వర్య రాజేష్, ఒక ప్రత్యేక ఇంటర్వ్యూలో 'సంక్రాంతికి వస్తున్నాం' సినిమా తెచ్చిపెట్టిన విజయంపై కొన్ని ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. ఈ సినిమా సాధించిన ఘన విజయం తన కెరీర్‌లోనే ఒక మైలురాయిగా నిలిచిపోతుందని, ఆ ఆనందంలో తనకు తానే ఒక అరుదైన మరియు అత్యంత ఖరీదైన బహుమతిని (గిఫ్ట్) ఇచ్చుకున్నట్లు ఆమె వెల్లడించారు. ఈ సినిమా విడుదలయ్యాక సాధించిన తిరుగులేని విజయానికి గుర్తుగా ఏకంగా ₹15 లక్షల విలువైన ఒక లగ్జరీ రిస్ట్ వాచ్‌ను కొనుగోలు చేసి తనకు తానే ప్రెజెంట్ చేసుకున్నట్లు ఐశ్వర్య సంతోషంగా చెప్పుకొచ్చారు. ఒక నటిగా ఇంతటి భారీ కమర్షియల్ సక్సెస్ చూశాక ఆ జ్ఞాపకం ఎప్పటికీ గుర్తుండిపోయేలా ఈ ఖరీదైన గిఫ్ట్ ప్లాన్ చేసుకున్నట్లు ఆమె వివరించారు. ఈ సినిమా విడుదలైన తర్వాత తన లైఫ్ పూర్తిగా మారిపోయిందని, విమానాశ్రయాలు, పబ్లిక్ ప్లేసెస్‌కి వెళ్తుంటే జనాలు తనను గుర్తుపట్టి ఎగబడుతున్నారని, ఆ ప్రేమను చూడటం ఎంతో ముచ్చటేస్తోందని ఆమె పేర్కొన్నారు. గతంలో ఈ సినిమా కోసం ఆమె ₹60 లక్షల రెమ్యునరేషన్ తీసుకున్నట్లు ఇండస్ట్రీ వర్గాల్లో ప్రచారం సాగగా, ఈ సక్సెస్ తర్వాత ఆమె డిమాండ్ మరింత పెరిగింది. ప్రస్తుతం సమూతిరకని కీలక పాత్రలో, తామడ మీడియా నిర్మాణంలో వస్తున్న 'ఇసకపట్నం' చిత్రంలో ఆమె ఎంతో వైవిధ్యమైన క్యారెక్టర్‌లో కనిపించనున్నారు. వరుస ప్రాజెక్ట్‌లతో టాలీవుడ్‌లో దూసుకుపోతున్న ఈ క్రేజీ బ్యూటీ రాబోయే రోజుల్లో మరిన్ని విజయాలు అందుకోవాలని అభిమానులు ఆకాంక్షిస్తున్నారు.
Thiruveer and Aishwarya Rajesh's upcoming rural comedy Oh Sukumari is all set to hit theatres on July 17. The makers officially announced the release date with a new poster that offers another glimpse into the film's quirky premise. The poster features Aishwarya Rajesh charging electricity while Thiruveer appears to enjoy the shock, reflecting the unusual relationship between the lead characters. The film revolves around a young woman with the unique ability to pass electric shocks to people and a miser who ends up marrying her, setting the stage for an unconventional comedy. Directed by Bharat Darshan, Oh Sukumari marks the first on-screen pairing of Thiruveer and Aishwarya Rajesh. The project has generated curiosity over the past few weeks with its glimpse, teaser and the recently released song YadhiGani Pelli, all of which introduced audiences to the film's offbeat concept. Thiruveer has steadily built a reputation for choosing unconventional scripts, while Aishwarya Rajesh is returning with another character-driven role. Their contrasting personalities form the heart of the story, with the film blending rural humour and romance around its distinctive premise. Produced by Gangaa Entertainments as a Pan-India release, Oh Sukumari features music by Bharat Machiraju.  Disclaimer: This article is based on discussions and information shared across publicly available sources and social media. Interpretations remain those of the users involved. Readers are encouraged to exercise discretion before drawing conclusions.
  ప్రీతి ముకుందన్..సౌత్ సినీ ప్రపంచంలో ఇప్పుడు ఈ పేరు మారుమోగిపోతుంది. ఇటీవల నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలై, థియేటర్లలో సైతం సంచలన విజయం సాధించిన యాక్షన్ థ్రిల్లర్ 'బ్లాస్ట్' (Blast) సినిమాతో ఈమె ఒక్కసారిగా టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారిపోయింది. యాక్షన్ కింగ్ అర్జున్ సర్జా కూతురిగా, కరాటే ఫైటర్‌గా ప్రీతి చూపించిన యాక్షన్ సీక్వెన్స్ చూసి ప్రేక్షకులు షాక్ అవుతున్నారు. సాధారణంగా కమర్షియల్ సినిమాల్లో హీరోయిన్ల క్యారెక్టర్స్ కేవలం గ్లామర్‌కే పరిమితం అవుతుంటాయి. కానీ, ప్రీతి ముకుందన్ మాత్రం 'బ్లాస్ట్' సినిమాలో రిస్క్ చేసి, శారీరకంగా ఎంతో శ్రమించి ఫైట్లు చేసింది. బాక్సాఫీస్ వద్ద 100% కి పైగా పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతున్న ఈ చిత్రం, మహిళా ప్రేక్షకులను మరియు ఫ్యామిలీ ఆడియన్స్‌ను థియేటర్లకు భారీగా రప్పిస్తోంది. కేవలం గ్లామర్ పాత్రలకే కాకుండా, నటనకు ప్రాధాన్యం ఉన్న ఇలాంటి యాక్షన్ ఓరియెంటెడ్ పాత్రను ఎంచుకోవడం తాను తీసుకున్న అత్యంత సాహసోపేతమైన, వినూత్నమైన నిర్ణయమని ప్రీతి ముకుందన్ స్వయంగా వెల్లడించింది. ఈ భారీ సక్సెస్ ఇచ్చిన జోష్‌తో ప్రీతి ముకుందన్ కెరీర్ ఇప్పుడు పీక్ స్టేజ్‌కు చేరుకుంది. ఈ నేపథ్యంలోనే సోషల్ మీడియాలో ఒక రేంజ్ క్రేజీ రూమర్ హల్‌చల్ చేస్తోంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, బ్లాక్‌బస్టర్ దర్శకుడు సుజీత్ కాంబినేషన్‌లో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న గ్యాంగ్‌స్టర్ యాక్షన్ డ్రామా 'ఓజీ' (They Call Him OG) చిత్రానికి సంబంధించి తాజాగా మేకర్స్ పార్ట్ 2 ప్రకటన చేశారు. 'ఓజీ 2' (OG 2) పేరుతో ఈ సినిమా యూనివర్స్ మరింత పెద్దది కాబోతుందని, పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ అధికారికంగా ఒక గ్లింప్స్ వీడియో ద్వారా స్పష్టం చేసింది. ఈ గ్లింప్స్‌లో ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, దర్శకుడు సుజీత్‌తో కథా చర్చల్లో పాల్గొంటూ.. 'నేను రెడీ' అని చెప్పడం సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. అయితే, ఈ భారీ యాక్షన్ ప్రొజెక్ట్ 'ఓజీ 2' లో ఒక కీలకమైన, పవర్‌ఫుల్ లేడీ యాక్షన్ పాత్ర కోసం దర్శకుడు సుజీత్ ప్రస్తుతం ఫుల్ ట్రెండింగ్‌లో ఉన్న ప్రీతి ముకుందన్‌ను సంప్రదించినట్లు టాలీవుడ్ వర్గాల్లో గట్టిగా ప్రచారం సాగుతోంది. Also read: Prabhas: ప్రభాస్‌ని అడిగితే 3 కోట్లు ఇచ్చేస్తాడు..  కృష్ణ మాయ  'బ్లాస్ట్' లో ప్రీతి చేసిన ఒళ్ళు గగుర్పొడిచే స్టంట్స్, మార్షల్ ఆర్ట్స్ ఫైట్స్ చూసిన తర్వాతే సుజీత్ ఆమెను 'ఓజీ 2' లోని ఒక వినూత్న క్యారక్టర్  కోసం సంప్రదించినట్టుగా టాక్. ఒకవేళ ఇదే నిజమైతే, పవన్ లాంటి బిగ్గెస్ట్  స్టార్ తో  ఛాన్స్ రావడం ప్రీతి ముకుందన్ కెరీర్‌ని  మరో స్థాయికి తీసుకెళ్లడం ఖాయం. ప్రస్తుతం ప్రీతి తెలుగులో రోషన్ మేక సరసన 'ఏమో ఏమో ఇది' అనే లవ్ స్టోరీలో నటిస్తోంది. తమిళంలో అథర్వ మురళితో చేసిన  'ఇదయం మురళి' జూలై 10న విడుదల కాబోతోంది. ఒకవైపు గ్లామర్, మరోవైపు 'బ్లాస్ట్' లాంటి లేడీ ఎంపవర్‌మెంట్ యాక్షన్ చిత్రాలతో మెప్పిస్తున్న ఈ ముద్దుగుమ్మ, పవన్ కళ్యాణ్ 'ఓజీ 2' క్రేజీ కాస్టింగ్ రూమర్లతో టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా నిలిచింది.    
టాలీవుడ్ లో సరికొత్త ట్రెండ్‌లకు, విలక్షణమైన కథాంశాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన దివంగత దర్శకుడు ఈవీవీ సత్యనారాయణ మార్క్ సినిమాలకు ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఉంది. ఆయన తెరకెక్కించిన ఎన్నో సినిమాలు బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టించడమే కాకుండా, సమాజంలో చర్చనీయాంశాలుగా మారాయి. అలాంటి ఒక సంచలనాత్మక చిత్రమే 2004 ఫిబ్రవరి 6న విడుదలైన 'ఆరుగురు పతివ్రతలు' (Aaruguru Pativratalu). అప్పట్లో అత్యంత బోల్డ్ సబ్జెక్ట్‌తో వచ్చి, సంచలనం సృష్టించిన ఈ సినిమా ఇప్పుడు మరోసారి వెండితెరపై అలరించడానికి సిద్ధమవుతోంది. టాలీవుడ్‌లో ప్రస్తుతం నడుస్తున్న రీ-రిలీజ్ ట్రెండ్‌ను ఫాలో అవుతూ, ఈ కల్ట్ క్లాసిక్ రొమాంటిక్ డ్రామాను త్వరలోనే థియేటర్లలో గ్రాండ్‌గా రీ-రిలీజ్ చేయబోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఈ సంచలన ప్రకటనను ఐకానిక్ పోస్టర్ రూపంలో విడుదల చేస్తూ చిత్రబృందం ఒక ప్రత్యేకమైన సందర్భాన్ని ఎంచుకుంది. ఈవీవీ సత్యనారాయణ కుమారుడు, హీరో అల్లరి నరేష్ పుట్టినరోజు (జూన్ 30) సందర్భంగా ఈ రీ-రిలీజ్ పోస్టర్‌ను మేకర్స్ సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. ఈ పోస్టర్ చూసిన వెంటనే పాత రోజులను గుర్తుచేసుకుంటూ నెటిజన్లు సోషల్ మీడియాలో విపరీతంగా షేర్ చేస్తున్నారు. 'ఆరుగురు పతివ్రతలు' సినిమా కథ విషయానికి వస్తే, వివాహ బంధంలో ఉండే వివిధ కోణాలను, భార్యాభర్తల మధ్య ఉండే సంబంధాలను చాలా సున్నితంగా మరియు అంతే బోల్డ్‌గా చర్చించిన చిత్రమిది. ఆరుగురు స్నేహితులు ఒకరి పెళ్లి సందర్భంగా సుదీర్ఘ కాలం తర్వాత కలుసుకోవడం, వారి వైవాహిక జీవితాల్లోని కష్టసుఖాలను పంచుకోవడం అనే ఆసక్తికరమైన పాయింట్‌తో ఈ సినిమా నడుస్తుంది.  ఈ సినిమా యొక్క అతిపెద్ద విశేషం ఏమిటంటే, ఇందులో దాదాపు 42 మంది సరికొత్త నటీనటులను ఈవీవీ సత్యనారాయణ తెలుగు తెరకు పరిచయం చేశారు. కమలాకర్ అందించిన అద్భుతమైన సంగీతం మరియు జనార్ధన మహర్షి రాసిన పదునైన సంభాషణలు ఈ సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లాయి. సినిమా విడుదలై ఇప్పటికే 22 సంవత్సరాలు గడుస్తున్నా, నేటి తరం యువతకు కూడా కనెక్ట్ అయ్యే అంశాలు ఇందులో ఉండటం విశేషం. అందుకే ఇప్పటికీ ఈ మూవీ క్లిప్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. ప్రస్తుతం టాలీవుడ్‌లో పాత బ్లాక్‌బస్టర్ సినిమాలు రీ-రిలీజ్ అయ్యి అద్భుతమైన వసూళ్లను సాధిస్తున్న తరుణంలో, 'ఆరుగురు పతివ్రతలు' సినిమాకు కూడా భారీ ఓపెనింగ్స్ వచ్చే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అప్పట్లో థియేటర్లలో ఈ సినిమాను మిస్ అయిన వారు మరియు యూట్యూబ్‌లో చూసి ఎంజాయ్ చేసిన నేటి తరం ప్రేక్షకులు థియేటర్ ఎక్స్‌పీరియన్స్‌ను సొంతం చేసుకోవడానికి ఆసక్తి చూపుతున్నారు. ఈవీవీ సినిమాస్ బ్యానర్‌పై వచ్చిన ఈ సినిమా రీ-రిలీజ్ డేట్‌ను త్వరలోనే అధికారికంగా ప్రకటించనున్నారు.   
డిజిటల్ ప్లాట్‌ఫామ్‌ల యుగంలో సరికొత్త కథలతో, వినూత్నమైన కాన్సెప్ట్‌లతో దేశవ్యాప్తంగా ఉన్న సినీ ప్రియులను ఎంతగానో ఆకట్టుకుంటోంది మలయాళ చిత్ర పరిశ్రమ. మాలీవుడ్ నుండి వచ్చే ప్రతి సినిమా ఏదో ఒక కొత్త అనుభూతిని ఇస్తుందని నమ్మే ఆడియన్స్ కోసం మరో క్రేజీ ప్రయోగం ఇప్పుడు ఓటీటీ వేదికగా అలరించేందుకు సిద్ధమైంది. మలయాళ సినిమా చరిత్రలోనే మొట్టమొదటి పూర్తి స్థాయి మ్యూజికల్ హారర్ కామెడీ చిత్రంగా ప్రశంసలు అందుకున్న 'కరక్కం' ఇప్పుడు డిజిటల్ స్క్రీన్‌పై సందడి చేయడానికి సర్వం సిద్ధం చేసుకుంది. వైవిధ్యమైన నటనతో తనదైన గుర్తింపు తెచ్చుకున్న యంగ్ హీరో శ్రీనాథ్ భాసి, టాలెంటెడ్ బ్యూటీ ఫెమినా జార్జ్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ విలక్షణ చిత్రం, థియేటర్లలో ప్రేక్షకులకు సరికొత్త వినోదాన్ని పంచిన తర్వాత ఇప్పుడు ఓటీటీ ప్రియులను భయపెడుతూనే నవ్వించడానికి వచ్చేస్తోంది. గతంలో 'చార్లెస్ ఎంటర్‌ప్రైజెస్' వంటి విభిన్నమైన సినిమాను తెరకెక్కించిన దర్శకుడు సుభాష్ లలిత సుబ్రహ్మణ్యన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఈ ఏడాది మే 28వ తేదీన గ్రాండ్‌గా థియేటర్లలో విడుదలైన 'కరక్కం' చిత్రం చాలా తక్కువ సమయంలోనే సినీ లవర్స్ దృష్టిని ఆకర్షించింది. ఈ సినిమా కథాంశం విషయానికి వస్తే.. ఇద్దరు బాధ్యతారాహిత్యంగా తిరిగే జులాయి యువకులు న్యూ ఇయర్ వేడుకల రాత్రి ఒక చర్చి స్మశాన వాటికలోకి ప్రవేశిస్తారు. అక్కడ ఉన్న ఐదు ఇత్తడి సిలువలను వారు ఆటగా, నిర్లక్ష్యంగా అక్కడి నుండి పీకేస్తారు. వారు చేసిన ఈ చిన్న పొరపాటు వల్ల ఆ సమాధుల్లో ఉన్న ఐదు ఆత్మలు ఒక్కసారిగా మేల్కొంటాయి. ఆ క్షణం నుండి ఆ ఇద్దరు యువకుల జీవితాలు ఎలా తలకిందులయ్యాయి? ఆ ఐదు దెయ్యాలు వీరిని ఎలా వెంబడించి ముప్పుతిప్పలు పెట్టాయి? ఆ ప్రమాదం నుండి వారు ఎలా తప్పించుకున్నారు? అనే ఆసక్తికరమైన అంశాలతో ఈ సినిమా కథ ఎంతో ఉత్కంఠగా సాగుతుంది. ఈ చిత్రంలో హారర్, కామెడీ అంశాలను మేళవిస్తూనే, కథలో సంగీతాన్ని ఒక ముఖ్యమైన పాత్రగా మార్చి దర్శకుడు చూపించిన విధానం అద్భుతమని చెప్పాలి. ప్రముఖ సౌత్ ఇండియన్ మ్యూజిక్ డైరెక్టర్ సామ్ సీఎస్ ఈ చిత్రానికి అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌, సాంగ్స్ సినిమాలోని మూడ్‌ను నెక్స్ట్ లెవెల్‌కు తీసుకెళ్లాయి. దాదాపు 1 గంట 44 నిమిషాల రన్‌టైమ్‌తో సాగే ఈ చిత్రం ప్రేక్షకులను ఎక్కడా బోర్ కొట్టించకుండా గలగల నవ్విస్తూనే, సీటు అంచున కూర్చోబెట్టేలా భయపెడుతుంది. థియేటర్లలో ఈ వినూత్నమైన మ్యూజికల్ హారర్ ఎంటర్‌టైనర్‌ను మిస్ అయిన వారి కోసం ప్రముఖ ఓటీటీ దిగ్గజం 'సోనీ లివ్' ఈ క్రేజీ చిత్రాన్ని డిజిటల్ స్ట్రీమింగ్‌కు తీసుకువస్తోంది. జులై 3వ తేదీ నుండి ఈ సినిమా సోనీ లివ్ ప్లాట్‌ఫామ్‌లో గ్రాండ్‌గా స్ట్రీమింగ్ కానుంది. కేవలం మలయాళంలోనే కాకుండా తెలుగు, తమిళం, కన్నడ మరియు హిందీ భాషల్లో కూడా అందుబాటులోకి రానుండటం విశేషం. పారానార్మల్ ఎలిమెంట్స్‌తో సాగే ఈ వినోదాత్మక రైడ్‌ను మిస్ అవ్వకుండా చూసి ఎంజాయ్ చేయండి.  
    రెబల్ స్టార్ ప్రభాస్ తొలి చిత్రం 'ఈశ్వర్' సినిమాను తెలుగు ప్రేక్షకులు ఎవరూ అంత సులభంగా మర్చిపోలేరు. ఆ సినిమాలో ప్రభాస్ స్నేహితుడిగా నటించి మెప్పించిన నటుడు, ప్రముఖ ఆర్ట్ డైరెక్టర్ కృష్ణ మాయ తాజాగా ఒక ఇంటర్వ్యూలో ప్రభాస్ గురించి పలు సంచలన, ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. . ప్రభాస్ అనే వ్యక్తి ఇండస్ట్రీలో బ్యాక్‌గ్రౌండ్ ఉన్నప్పటికీ, కేవలం తన సొంత కష్టంతో, తిరుగులేని ఇమేజ్‌తో చిరుత పులి' లాంటి బ్రాండ్‌ క్రియేట్ చేసుకున్నారు. ప్రభాస్ యాక్టింగ్ లో ఒక ప్రత్యేకమైన వేరియేషన్ ఉంటుంది. అప్పట్లో ప్రభాస్ ఎంతో  సాధారణంగా ఉండేవారు. ఒకరోజు షూటింగ్ కోసం ప్రభాస్ తమతో పాటే ఒక సాధారణ డీసీఎం (DCM) వ్యాన్ ఎక్కి చార్మినార్‌కి  వచ్చారు. అంతటి పెద్ద కుటుంబం నుండి వచ్చిన వ్యక్తిలో ఆ సింప్లిసిటీని చూసి తామంతా ఆశ్చర్య పోయాం. అప్పుడున్న ప్రభాస్‌కు, ఇప్పుడు అంతర్జాతీయ స్థాయి గుర్తింపు తెచ్చుకున్న గ్లోబల్ స్టార్ ప్రభాస్‌కి  వ్యక్తిత్వంలో ఎలాంటి మార్పు రాలేదు. 'ఫౌజీ' (Fauji)  షూటింగ్ దగ్గరకి వెళ్ళాను. కానీ ఇప్పుడు ప్రభాస్ రేంజ్ ఎక్కడికో వెళ్ళిపోవడంతో, ఆయన దగ్గరకు వెళ్ళి మాట్లాడటానికి మొదట కొంచెం సిగ్గుగా, సంకోచంగా అనిపించింది. కానీ ప్రభాస్ నన్ను చూడగానే గుర్తుపట్టి, ఎంతో ఆప్యాయంగా దగ్గరకు తీసుకున్నారు. ఒక పాత స్నేహితుడిని చూసిన ఆనందం ప్రభాస్ కళ్లల్లో స్పష్టంగా కనిపించింది.  నా  చేయి పట్టుకుని మరీ ఎంతో ప్రేమగా మాట్లాడారు. నీకు ఏమన్నా ఇబ్బందులు ఉన్నాయా? ఏదైనా సమస్య ఉంటే మొహమాటం లేకుండా చెప్పు" అని ఆరా తీశారని కృష్ణ మాయ ఎమోషనల్ అయ్యారు. ఒకవేళ నేను ప్రభాస్‌ ని అడిగితే రెండు నుండి మూడు కోట్లు తక్షణమే ఇచ్చేంత ఆర్థిక కెపాసిటీ, అంతకంటే గొప్ప మనసు ఆయన సొంతమని కృష్ణ మాయ స్పష్టం చేశారు. అయితే, తానే ఎప్పుడూ అలా అడగలేదని, ఒకవేళ అలా డబ్బులు అడిగితే తమ మధ్య ఉన్న పవిత్రమైన స్నేహ బంధంతో పాటు ఆ మర్యాద కూడా  పోతుంది. నాకు ప్రస్తుతానికి డబ్బుల అవసరం లేదు. , తనకు తానుగా కష్టపడి సంపాదించుకుంటున్నానని, ప్రభాస్ చూపించిన ఆ ఆప్యాయత, గౌరవమే తనకు కోట్ల కంటే ఎక్కువని కృష్ణ మాయ ఈ ఇంటర్వ్యూలో గర్వంగా వెల్లడించారు. Also read: Chiranjeevi: చిరంజీవిపై మురళీ మోహన్ ఆసక్తికర వ్యాఖ్యలు  నటుడిగానే కాకుండా దాదాపు 80 కి పైగా చిత్రాలకు ఆర్ట్ డైరెక్టర్‌గా విజయవంతంగా పనిచేసిన కృష్ణ మాయ, ఆ తర్వాత దర్శకుడిగా మారి టాలీవుడ్‌లో 'దొంగల ముఠా', 'రైల్వే స్టేషన్' వంటి సినిమాలను తెరకెక్కించారు. ప్రభాస్ స్టార్డమ్, ఆయనకున్న అపారమైన మానవత్వం గురించి కృష్ణ మాయ మాట్లాడిన మాటలు ఇప్పుడు నెట్టింట విపరీతంగా ట్రెండ్ అవుతున్నాయి.  
With Nagabandham gearing up for its worldwide release and lead actor Virat Karrna has opened up about the physically and emotionally demanding journey behind the ambitious fantasy adventure. Calling the film a "gift from director Abhishek Nama and Lord Shiva," the actor said the project transformed him both as a performer and as a person. Virat revealed that playing the dual roles of Rudra and a Naga Sadhu in just his second film came with immense responsibility. "Abhishek Nama meticulously transformed me into a diamond," he said, adding that the director's confidence in him helped him overcome the nervousness of leading a massive production with hundreds of technicians on set. The actor disclosed that the film took a heavy physical toll. He underwent an intense body transformation, gaining nearly 20 kilograms before shedding weight for another look. During training, he suffered a severe muscle tear, while an outdoor schedule in freezing conditions left him with frostbite. Despite the injuries, Virat continued filming, saying his faith in the story and the director's vision kept him motivated. He also spoke about the extensive preparation that went into the project, praising Abhishek Nama for planning every sequence in advance. According to Virat, every shot was designed meticulously on paper before filming began, allowing the team to execute the film on a grand scale. To prepare for the spiritual dimension of his character, Virat said he visited a Shiva temple every day to perform Abhishekam before shooting and later observed the sacred Shiva Mala. He believes those experiences helped him connect deeply with the role. Confident about the film's prospects, Virat confirmed that the makers already have plans for a sequel. He also highlighted the use of state-of-the-art VFX and expressed confidence that audiences would embrace the film's vision. Produced by Nishitha Nagireddy and Kishore Annapureddy on a reported budget of ₹110 crore, Nagabandham has recorded encouraging advance bookings ahead of its July 3 release. Disclaimer: This article is based on discussions and information shared across publicly available sources and social media. Interpretations remain those of the users involved. Readers are encouraged to exercise discretion before drawing conclusions.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) క్రేజ్ నెక్స్ట్ లెవెల్‌కు చేరుకుంది. ‘పుష్ప’ ఫ్రాంచైజీతో గ్లోబల్ స్థాయిలో రికార్డుల వేట సాగించిన బన్నీ, ఇప్పుడు తన తదుపరి చిత్రాలతో భారతీయ సినిమా బాక్సాఫీస్‌ను పూర్తిగా తన గుప్పిట్లోకి తెచ్చుకునేందుకు సిద్ధమవుతున్నారు. కేవలం తెలుగుకే పరిమితం కాకుండా, విభిన్న భాషల దర్శకులను ఎంచుకుంటూ పాన్-ఇండియా మార్కెట్‌లో సరికొత్త బెంచ్‌మార్క్ క్రియేట్ చేస్తున్నారు. అల్లు అర్జున్ క్రేజీ లైనప్‌లో మొదటిగా రాబోతున్న మోస్ట్ అవేటెడ్ ప్రాజెక్ట్ ‘రాకా’ (Raaka). కోలీవుడ్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా భారీ బడ్జెట్‌తో సరికొత్త ప్యారలల్ యూనివర్స్ కాన్సెప్ట్‌తో రూపొందుతోంది. దర్శకుడు అట్లీ దాదాపు 18 ఏళ్లుగా గుండెల్లో దాచుకున్న ఈ అద్భుతమైన కథకు అల్లు అర్జున్ సరిగ్గా సరిపోతారని ఈ ప్రాజెక్ట్‌ను పట్టాలెక్కించారు. ఈ చిత్రంలో బన్నీ గుండుతో, భయంకరమైన గోళ్లతో ఒక వైల్డ్ అవతారంలో కనిపించనుండడం విశేషం. దీని తర్వాత మరో కోలీవుడ్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో రాబోతున్న ‘AA23’ ప్రాజెక్ట్ సరికొత్త సంచలనానికి తెరలేపనుంది. వైవిధ్యమైన స్క్రీన్ ప్లేతో డార్క్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రం రూపుదిద్దుకోనుంది. ఈ సినిమాలో అల్లు అర్జున్ క్యారెక్టరైజేషన్, లుక్ ఎవరూ ఊహించని విధంగా ఉండబోతోందని సమాచారం.  ఇక అందరినీ ఆశ్చర్యపరుస్తూ రీసెంట్‌గా లైన్లోకి వచ్చిన మరో క్రేజీ కాంబినేషన్ ‘AA24’. మలయాళ డైరెక్టర్ బాసిల్ జోసెఫ్‌తో ఈ చిత్రాన్ని ప్లాన్ చేస్తున్నట్లు వినికిడి. ‘మిన్నల్ మురళి’ చిత్రంతో జాతీయ స్థాయిలో ప్రశంసలు అందుకున్న బాసిల్ జోసెఫ్, అల్లు అర్జున్ కోసం ఒక సరికొత్త ఫాంటసీ కథను సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ఈ విధంగా అట్లీ, లోకేష్ కనగరాజ్, బాసిల్ జోసెఫ్ వంటి విలక్షణ దర్శకులతో అల్లు అర్జున్ సెట్ చేసిన ఈ లైనప్ భారతీయ సినిమా రికార్డులను తిరగరాయడం ఖాయంగా కనిపిస్తోంది. అంతేకాదు, తన మైల్ స్టోన్ ప్రాజెక్ట్ ‘AA25’ కోసం కూడా అల్లు అర్జున్ భారీ ప్లాన్ తో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ కోసం సుకుమార్ లేదా సందీప్ రెడ్డి వంగాను రంగంలోకి దింపే అవకాశముంది.  
ఏ రిలేషన్ కు అయినా  మంచి కమ్యూనికేషనే  పునాది. అది స్నేహమైనా, కుటుంబమైనా, లేదా ఆఫీసు  వాతావరణమైనా, చక్కగా కమ్యూనికేట్ చేయడం అనేది  మనుషులను దగ్గర చేస్తుంది. కానీ కొన్నిసార్లు  తెలియకుండానే అవతలి వ్యక్తికి అసౌకర్యం కలిగించే ప్రశ్నలు అడుగుతుంటారు. అడిగేవారి  ఉద్దేశాలు తప్పు కాకపోయినా, కొన్ని వ్యక్తిగత ప్రశ్నలు ఇతరులకు నచ్చకపోవచ్చు , పైగా ఇలాంటి ప్రశ్నలు అడగడం వల్ల ఎదుటివారు బాధపడతారు కూడా.  నేటికాలంలో  గతంలో కంటే తమ వ్యక్తిగత జీవితాల పట్ల చాలా మందికి ఎక్కువ శ్రద్ధ ఉంటోంది. అయితే  ప్రతి వ్యక్తికి వారి స్వంత హద్దులు , వ్యక్తిగత గోప్యత ఉంటాయి, వాటిని గౌరవించాలి. కొన్నిసార్లు, మనం కేవలం కుతూహలంతో ప్రశ్నలు అడుగుతాము, కానీ అవతలి వ్యక్తి దానిని తమ పర్సనల్  విషయాల్లోకి చొరబడినట్లుగా భావించే అవకాశం ఉంటుంది. ఇది సంబంధాలు చెడిపోయే అవకాశాన్ని పెంచుతుంది. ఎవరినీ అడగకూడని నాలుగు ప్రశ్నలు ఉన్నాయి. ఆ ప్రశ్నలు ఏంటో తెలుసుకుంటే.. ఎవరినీ నొప్పించకుండా ఉండగలం. అవేంటంటే.. జీతం.. ఒకరి ఆదాయం లేదా జీతం గురించి అడగడం చాలా సున్నితమైన ప్రశ్నలలో ఒకటిగా పరిగణించబడుతుంది. చాలా మంది తమ ఆర్థిక పరిస్థితిని గోప్యంగా ఉంచుకోవడానికి ఇష్టపడతారు.  ఈ ప్రశ్న ఎదుటి వ్యక్తికి అసౌకర్యాన్ని కలిగించవచ్చు.  ఇలాంటి ప్రశ్న వేయడం  వల్ల ఇతరులతో  తనను పోలుస్తున్నారని లేదా అంచనా వేస్తున్నారని ఎదుటివారికి  అనిపించవచ్చు. అందుకే ఎవరి సంపాదన గురించి ఎప్పుడూ అడగకూడదు. పెళ్ళెప్పుడు.. పెళ్లెప్పుడు అనే ప్రశ్నను భారతీయులు చాలా  తరచుగా అడుగుతుంటారు, కానీ ప్రతి వ్యక్తి పరిస్థితులు భిన్నంగా ఉంటాయి.  కొందరు తమ వృత్తిపై దృష్టి పెడుతుండగా, మరికొందరు వ్యక్తిగత కారణాల వల్ల పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడకపోవచ్చు.  ఈ ప్రశ్నను పదేపదే అడగడం వల్ల ఎదుటి  వ్యక్తిపై అనవసరమైన ఒత్తిడి పడవచ్చు. వయసు.. వయస్సు అడగడం సాధారణంగా అనిపించినప్పటికీ, చాలా మంది దానిని వ్యక్తిగత సమాచారంగా పరిగణిస్తారు. ముఖ్యంగా ఉద్యోగం చేసే చోట  లేదా మొదటి సారి ఎవరితోనైనా కలిసినప్పుడు ఇలాంటి ప్రశ్న వేస్తే అది ఎదుటి వారిని   ఇబ్బందికి గురిచేస్తుంది. అవసరం ఉంటే తప్ప  వయస్సుకు సంబంధించిన ప్రశ్నలు అడగకపోవడమే మంచిది. పిల్లలు.. భారతదేశంలో పెళ్లైన చాలా మంది మహిళలు ఎదుర్కునే  ప్రశ్న ఇంకా పిల్లలు పుట్టలేదు ఎందుకు ఏమిటి అని.  ఇది  చాలా  భావోద్వేగపరమైన,  సున్నితమైనదిగా  ప్రశ్న. కొంతమందికి వారు మాట్లాడటానికి ఇష్టపడని వ్యక్తిగత నిర్ణయాలు, ఆరోగ్య కారణాలు లేదా కుటుంబ పరిస్థితులు ఉండవచ్చు. అందువల్ల, ఇలాంటి ప్రశ్నలు సంబంధాలలో దూరాన్ని సృష్టించే అవకాశం ఉంటుంది. అందుకే ఏ ఆడపిల్లను  ఎవరు ఈ ప్రశ్న అడగకూడదు.                                 *రూపశ్రీ.
ప్రేమ అనేది బార్యాభర్తలు, ప్రేమికుల మధ్య ఉండే మధురమైన అనుభూతి. నిజానికి  అన్ని బంధాలలో ప్రేమ ఉన్నా.. ప్రేమికులు, భార్యాభర్తల మధ్య ఉండే ప్రేమ చాలా ప్రత్యేకమైనది.  చాలామంది రిలేషన్లో ఉన్నప్పుడు తమ బాగస్వామిని చాలా ప్రేమిస్తుంటారు. కానీ ఏదైనా సందర్బం వస్తే నువ్వు నన్ను ప్రేమించడం లేదు అనే మాటను ఎదుర్కుంటూ ఉంటారు. ఇదంతా ఎందుకు జరుగుతుంది అంటే.. మనసులో ఉన్న ప్రేమను వ్యక్తం చేయకపోవడం వల్ల.  ప్రేమించడం గొప్ప కాదు.. కానీ ప్రేమను సరైన విదంగా వ్యక్తం చేయకపోవడం వల్లే అసలైన సమస్య వస్తుంది. ప్రేమను సరైన విధంగా వ్యక్తం చేస్తే ఆ బంధాలు ఎంతో పదిలంగా పదికాలల పాటు సంతోషంగా ఉంటాయి.  బంధాలను బలంగా మార్చుకోవడానికి ప్రేమను వ్యక్తం చేసే పద్దతులు ఉన్నాయి.  అవేంటో తెలుసుకుంటే.. మనసులో కాదు.. మాటల్లో చెప్పాలి.. ప్రేమను మనసులో దాచుకుంటే ఏం ప్రయోజనం ఉండదు. కొంతమందికి ప్రేమను వ్యక్తం చేయడానికి మాటలే మంచి ఆయుదం. “నాకు నీ పట్ల గర్వంగా ఉంది”, “నువ్వు చాలా ప్రత్యేకమైన దానివి”, “నేను నిన్ను ప్రేమిస్తున్నాను” వంటి చిన్న వాక్యాలు కూడా ఎదుటి వారి హృదయాన్ని టచ్ చేస్తాయి.  భాగస్వామి  తమ ప్రేమను మాటల ద్వారా వ్యక్తపరుస్తుంటే, వారిని మెచ్చుకోవడం, వారి ప్రయత్నాలను అభినందించడం, ప్రేమ సందేశాలు పంపడం వంటివి ఆ బంధాన్ని బలపరుస్తాయి. ఇలాంటి వ్యక్తులు విమర్శలను కూడా మరింత లోతుగా తీసుకుంటారు, కాబట్టి వారితో మాట్లాడేటప్పుడు పాజిటివ్  పదాలను ఎంచుకోవడం ముఖ్యం. సమయం.. కొంతమందికి ప్రేమను వెలిబుచ్చడానికి  అత్యంత విలువైనది వారి సమయం. వారికి ఖరీదైన బహుమతుల కంటే, ఎలాంటి ఆటంకం  లేకుండా వారితో సమయం గడపడమే ముఖ్యం. ఫోన్‌ను పక్కన పెట్టి మాట్లాడుకోవడం, కలిసి నడవడం, కాఫీ డేట్‌కు వెళ్లడం లేదా కేవలం కలిసి కూర్చుని ఆ రోజు జరిగిన సంఘటనలను షేర్ చేసుకోవడం వంటివి కొందరికి   చాలా ప్రత్యేకమైన అనుభూతిని కలిగిస్తాయి. అలాంటి వారికి, లైప్ పార్ట్నర్ ఉనికే చాలా పెద్ద బహుమతి. స్పర్శ.. చాలా మంది కౌగిలించుకోవడం, చేతులు పట్టుకోవడం, నుదుటిపై ముద్దు పెట్టుకోవడం లేదా భుజంపై చేయి వేయడం వంటి టచింగ్  ద్వారా ప్రేమను అనుభూతి చెందుతారు. ఒకరినొకరు స్పృశించుకోవడం అంటే కేవలం శృంగారం మాత్రమే కాదు, భావోద్వేగ భద్రత , అనుబంధం కూడా ఇందులో భాగమే. అలాంటి వ్యక్తులు ప్రేమతో కూడిన టచింగ్ ను  పొందినప్పుడు, వారు తమ సంబంధంలో మరింత భద్రతగా, అనుబంధంగా , సంతోషంగా ఫీలవుతారు. మెమరీస్.. బహుమతులు ఇష్టపడేవారు బయటి విషయాలలోనే ప్రేమను చూస్తారని  చాలామంది తరచుగా అనుకుంటారు, కానీ ఈ నమ్మకం ఎప్పుడూ సరైనది కాదు. ఇది కూడా ప్రేమను వ్యక్తం చేయడానికి ఒక మార్గం.  ఇందులో  బహుమతి ధర ముఖ్యం కాదు, దాని వెనుక ఉన్న భావనే ముఖ్యం. ఒక చిన్న పువ్వు, ఇష్టమైన చాక్లెట్, లేదా ప్రయాణం నుండి తెచ్చుకున్న ఒక చిన్న గిఫ్ట్  కూడా వారికి చాలా ప్రత్యేకంగా అనిపించవచ్చు. ఇది  వారి గురించి ఆలోచిస్తున్నారని, వారిని గుర్తుంచుకుంటున్నారని  వారికి తెలియజేస్తుంది. సహాయం.. కొంతమందికి, “నేను నీకు సహాయం చేస్తాను” అని చెప్పడం కంటే, “నేను నిన్ను ప్రేమిస్తున్నాను” అని చెప్పడం మరింత ప్రభావవంతంగా ఉంటుంది.   భాగస్వామి సహాయానికి లేదా సపోర్ట్ ఇవ్వడానికి  విలువ ఇస్తే, వారికి చిన్న చిన్న పనులలో సహాయం చేయడం, వారి బాధ్యతలను తేలికపరచడం లేదా అవసరమైనప్పుడు సపోర్ట్  ఇవ్వడం వంటివి వారిని ఎంతగానో ప్రేమిస్తున్నారనే భావనకు గురి చేస్తాయి. వారికి మాటల కన్నా చేతలే గొప్పవి. కష్టసమయాలలో.. ప్రతి సంబంధం కేవలం సంతోషకరమైన క్షణాలపై మాత్రమే ఆధారపడి ఉండదు.  కష్ట సమయాల్లో ఒకరికొకరు మానసికంగా  అండగా ఉండటం కూడా అంతే ముఖ్యం. తమ మాటలను ఎలాంటి జడ్జ్ చేయకుండా  విన్నప్పుడు, వారి భావాలను అర్థం చేసుకున్నప్పుడు,  కష్ట సమయాల్లో వారికి అండగా నిలిచినప్పుడు, కొంతమంది తాము ప్రేమించబడ్డామని భావిస్తారు. అలాంటి వారికి ఏ బహుమతి లేదా ప్రేమను వ్యక్తపచడానికి స్పెషల్ గా వేరే ఏ పని చేయకపోయినా , ఎమోషనల్ సందర్భాలలో మద్దతుగా ఉండటమే ముఖ్యం అనిపిస్తుంది. ప్రేమను ఎలా గుర్తించాలి?  ఎక్కువ ప్రేమగా అనిపించే విషయాల పట్ల శ్రద్ధ వహించాలి.  భాగస్వామి తరచుగా ప్రేమను ఎలా వ్యక్తపరుస్తారో గమనించాలి.   ఏది లోపించిందని అనిపిస్తుందో, ఏది మిమ్మల్ని బాధపెడుతుందో అది కూడా ఒక సంకేతం కావచ్చు.  నిష్కపటంగా మాట్లాడాలి , ఒకరి ఎమోషన్ సపోర్ట్ ను  మరొకరు అర్థం చేసుకోవాలి.                                 *రూపశ్రీ.
ఏ బంధం అయినా ఎప్పుడూ ఒకేలా ఉండదు. ఇద్దరు వ్యక్తుల మధ్య పరిస్థితులు,  సందర్బాలు చాలా మారుతూ ఉంటాయి. కొన్ని సార్లు అర్థం చేసుకోలేని పరిస్థితులు ఎదురవుతాయి,  మరికొన్ని సార్లు చాలా ఎమోషనల్ గా అటాచ్ అయిపోయి ఉంటారు.  రిలేషన్ లో ఉండే ఈ పరిస్థితుల గురించి చెప్పేటప్పుడు ట్రామా బాండింగ్ అనే పదాన్ని లైఫ్ స్టైల్ నిపుణులు వాడుతూ ఉంటారు.  అయితే నేటి కాలంలో మాత్రం ఈ ట్రామా బాండింగ్ అనేది మానసిక భావనగా మారింది.  చాలామంది తమను మానసికంగా ప్రభావితం చేసే బంధాలలో చాలామంది ఉండిపోతారు. కానీ ఇలాంటి బంధాల నుండి బయటపడటం కష్టంగా ఉంటుంది. ఇది మనిషి ఆలోచనలు, నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం,  ఏదైనా అర్థం చేసుకునే తత్వం మీద కూడా ప్రభావితం చూపిస్తుంది. బంధాలలో వాస్తవాన్ని గుర్తించి,  సరైన అవగాహనతో నిర్ణయాలు తీసుకోవాలంటే ట్రామా బాండింగ్ ను అర్థం చేసుకోవాలి.  అసలు ట్రామా బాండింగ్ అంటే ఏమిటి?  దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? ఇది ఎలా ఏర్పడుతుంది? దీన్నుండి ఎలా బయటపడాలి లేదా దీనికి లోను కాకుండా ఉండాలంటే ఏం చేయాలి?  తెలుసుకుంటే.. ట్రామా బాండింగ్.. ట్రామా బాండింగ్ అనేది ఒక మానసిక పరిస్థితి. దీనిలో ఒక వ్యక్తి, తమకు మానసిక ఒత్తిడి, బాధ లేదా స్థిమితంగా ఉండలేక పోవడం వంటివి  కలిగించే రిలేషన్ కు  ఎమోషన్ గా  అతుక్కుపోయి ఉంటారు. ఈ పరిస్థితిలో ప్రేమ, ఆప్యాయత, ఆపై ఆకస్మిక అవమానం లేదా ఎమోషన్ గా దెబ్బ తినడం  అనే ఒక చక్రం ఉంటుంది. ఇది ఆ వ్యక్తిని చిక్కుకుపోయినట్లుగా, గందరగోళంగా భావించేలా చేస్తుంది. క్రమంగా, వారు దానికి అలవాటుపడి, దాని నుండి బయట పడటం కష్టంగా మారుతుంది. ట్రామా బాండింగ్ ఎలా ఏర్పడుుతంది? ఎమోషనల్ బ్యాలెన్స్ సరిగా లేని  సంబంధాలలో సాధారణంగా ట్రామా బాండింగ్ ఏర్పడుతుంది. ఇది అనేక కారణాల వల్ల సంభవిస్తుంది. వాటిలో కొన్ని.. రిలేషన్ లో  పదేపదే పాజిటివ్, నెగిటివ్ ప్రవర్తన ఉంటుంది.  ఇవి మారుతూఉంటాయి.  కొన్నిసార్లు చాలా  ప్రేమ కనిపిస్తుంది,   మరికొన్నిసార్లు ఉన్నట్టుండి  దూరం  పెరిగినట్టు లేదా అగౌరవం జరిగినట్టు జరుగుతుంది. ఎమోషన్ పరంగా బాగా ఎక్కువై ఇతరుల మీద ఆదారపటం,  భయం, ఒంటరితనం, అభద్రతా భావంతో కూడిన వాతావరణం ఉంటుంది.  ఆత్మగౌరవం క్రమంగా బలహీనపడుతుంది.   భాగస్వామి ద్వారా భావోద్వేగ నియంత్రణ లేదా తారుమారు అవుతుంది. ట్రామా బాండింగ్ సిగ్నల్స్.. ట్రామా బాండింగ్ ను గుర్తించడం చాలా ముఖ్యం, ఎందుకంటే ఇది మానసిక ఆరోగ్యంపై తీవ్రమైన ప్రభావాన్ని చూపుతుంది.    సంబంధాన్ని వదిలిపెట్టలేకపోవడం,   మళ్ళీ మళ్ళీ అదే వ్యక్తి దగ్గరికి వెళ్లడం లేదా వెళ్లాలని అనిపించడం. ప్రతి సమస్యకు తనను తాను నిందించుకోవడం,  ఎప్పుడూ ఒత్తిడి, ఆందోళన లేదా మానసికంగా అలసిపోయినట్లు అనిపించడం.  సంబంధంలో ఉన్నప్పటికీ అసంతృప్తిగా , సంతోషంగా లేకపోవడం.  ఇతరులు చెప్పేది పట్టించుకోకుండా, కేవలం ఆ సంబంధంలోనే లీనమై ఉండటం. ఎలా బయట పడాలి.. ట్రామా బాండింగ్‌ను అధిగమించడం అంత సులభం కాదు, కానీ సరైన చర్యలతో అది సాధ్యమేనని లైఫ్ స్టైల్ నిపుణులు అంటున్నారు.    మొదట, పరిస్థితిని అంగీకరించాలి. నమ్మకమైన స్నేహితులు లేదా కుటుంబ సభ్యులతో మాట్లాడటం  మానసిక ఆరోగ్య నిపుణుడు లేదా కౌన్సిలర్ నుండి సహాయం కోరడం మంచిది.  ట్రామా బాండింగ్ లో చిక్కుకున్న  వ్యక్తికి క్రమంగా దూరమవ్వాలని.  ఆత్మగౌరవంతో,  ఆత్మవిశ్వాసంతో  పనిచేయాలి.  తమ కోసం తాము  సురక్షితమైన , సానుకూల వాతావరణాన్ని సృష్టించుకోవాలి. ట్రామా బాండింగ్ గుర్తించడం ఎందుకు ముఖ్యం.. ట్రామా బాండింగ్ అనేది ఒక తీవ్రమైన భావోద్వేగ పరిస్థితి, ఇది ఒక వ్యక్తి  మానసిక ఆరోగ్యం, ఆత్మవిశ్వాసం , జీవిత నిర్ణయాలను ప్రభావితం చేస్తుంది. దీనిని ముందుగానే గుర్తించి, తగిన చర్యలు తీసుకోవడం చాలా ముఖ్యం, తద్వారా ఆ వ్యక్తి ఆరోగ్యకరమైన , సమతుల్యమైన జీవితం వైపు పయనించగలుగుతారు.                                  *రూపశ్రీ.
 నేటి కాలంలో ప్రపంచవ్యాప్తంగా గుండె సంబంధిత వ్యాధులు వేగంగా పెరుగుతున్నాయి. అందువల్ల, వైద్యులు క్రమం తప్పకుండా వ్యాయామం చేయమని చెబుతుంటారు.   గుండెను ఆరోగ్యంగా ఉంచుకోవడానికి  చాలామంది జిమ్ చేస్తుంటారు, మరికొందరు యోగా చేస్తుంటారు. గుండె ఆరోగ్యం కోసం కొత్తగా వ్యాయామం  మొదలు పెట్టాలని అనుకునేవారు జిమ్ చేయాలా, యోగా చేయాలా అని గందరగోళానికి గురవుతూ ఉంటారు.    కొంతమంది జిమ్‌లో వ్యాయామం చేయడానికి ఇష్టపడితే, మరికొందరు యోగానే ఉత్తమ పద్ధతిగా భావిస్తారు. ఫిట్‌నెస్ నిపుణుల అభిప్రాయం ప్రకారం జిమ్ లేదా యోగా..  ఈ రెండింటిలో  గుండె ఆరోగ్యానికి ఏది బాగుంటుంది?  తెలుసుకుంటే.. జిమ్ లేదా యోగా ఏది మంచిది? గుండెను కాపాడుకోవడానికి జిమ్ , యోగా రెండూ అవసరమైనవే. అయితే, అవి పనిచేసే పద్ధతులు భిన్నంగా ఉంటాయి. ఒకదానిని మించి మరొకటి ఎంచుకోవడం కంటే, రెండింటినీ  ఫిట్‌నెస్ లైఫ్ స్టైల్ లో  చేర్చుకోవడం మంచిదని నిపుణులు చెబుతున్నారు. వ్యాయామం వల్ల గుండెకు కలిగే ప్రయోజనాలు.. వేగంగా నడవడం, జాగింగ్, సైక్లింగ్, రోయింగ్ , స్ట్రెంగ్త్ ట్రైనింగ్ వంటి జిమ్ వ్యాయామాలు గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడతాయి. క్రమం తప్పకుండా చేసే  వ్యాయామం గుండెను బలపరుస్తుంది , శరీరమంతటా రక్తాన్ని ప్రసరింపజేయడంలో సహాయపడుతుంది.  జిమ్ వర్కౌట్లు గుండె పనితీరును మెరుగుపరుస్తాయి, రక్తపోటును నియంత్రించడంలో సహాయపడతాయి , కొలెస్ట్రాల్‌ను సమతుల్యం చేస్తాయి. అవి బరువును అదుపులో ఉంచడంలో కూడా సహాయపడతాయి.  తద్వారా గుండె జబ్బులు , పక్షవాతం వచ్చే ప్రమాదాన్ని తగ్గిస్తాయి. అవి స్టామినాను బాలెన్స్ ను  కూడా పెంచుతాయి. క్రమం తప్పకుండా  కార్డియో వ్యాయామాలు చేస్తే  గుండెను బలపరుస్తాయని , శరీరమంతటా ఆక్సిజన్‌తో కూడిన రక్తాన్ని పంప్ చేసే ప్రక్రియను సులభతరం చేస్తాయని నిపుణులు చెబుతున్నారు. యోగా ఎందుకు ముఖ్యం..? యోగా శరీర సౌలభ్యాన్ని మెరుగుపరచడం, సరైన శ్వాస, బాలెన్స్ ను  కాపాడుకోవడం , మానసిక ప్రశాంతతపై దృష్టి పెడుతుంది. కార్డియో వ్యాయామాల మాదిరిగానే  యోగా ఏరోబిక్ ఫిట్‌నెస్‌ను అందిస్తుంది.  అయితే యోగా  గుండె ఆరోగ్యానికి ఇంకా అనేక  విధాలుగా కూడా  ప్రయోజనకరంగా పరిగణించబడుతుంది. యోగా ఒత్తిడి , ఆందోళనను తగ్గించడంలో సహాయపడుతుంది. యోగా  ఒత్తిడి హార్మోన్లను తగ్గించడంలో సహాయపడుతుంది. ఇది శరీర సౌలభ్యాన్ని , శరీరాకృతిని  మెరుగుపరుస్తుంది, శ్వాస సామర్థ్యాన్ని మెరుగుపరుస్తుంది , మంచి నిద్రను ప్రోత్సహిస్తుంది. గుండె జబ్బులకు ఒత్తిడి ఒక ప్రధాన కారణమని నిపుణులు చెబుతున్నారు. యోగా మనస్సును , నాడీ వ్యవస్థను ప్రశాంతపరచడం ద్వారా ఈ ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది. కేవలం యోగాతో గుండె ఆరోగ్యం బాగుంటుందా? యోగా వల్ల అనేక శారీరక, మానసిక ప్రయోజనాలు ఉన్నప్పటికీ, గుండె సామర్థ్యాన్ని గణనీయంగా మెరుగుపరచడానికి అవసరమైన ఏరోబిక్ వ్యాయామాన్ని కేవలం యోగా మాత్రమే శరీరానికి అందించలేదు.  ఈ విషయాన్ని ఆరోగ్య  నిపుణులే చెబుతున్నారు.  ఆరోగ్య  నిపుణుల ప్రకారం, ఆరోగ్యంగా ఉన్నవారు ప్రతి వారానికి  కనీసం 150 నిమిషాల పాటు వేగంగా నడవడం, జాగింగ్ లేదా సైక్లింగ్ వంటి మధ్యస్థం నుండి  తీవ్రత గల వ్యాయామం చేయాలి. మెరుగైన ఫిట్‌నెస్ , గుండె ఆరోగ్యం కోసం యోగాను ఇతర శారీరక కార్యకలాపాలతో కలిపి చేయడం మంచిది. గుండె ఆరోగ్యంగా ఉండాలంటే ఎలాంటి వ్యాయామం చేయాలి? జిమ్ , యోగాలో ఒకదాన్ని ఎంచుకోవాల్సిన అవసరం లేదని  గుండె ఆరోగ్య  నిపుణులు చెబుతున్నారు.  ఫిట్‌నెస్ దినచర్యలో రెండింటినీ చేర్చుకోవడం మంచిదట. ఒక బాలెన్స్డ్  ఫిట్‌నెస్ ప్రణాళికలో వేగంగా నడవడం, జాగింగ్, సైక్లింగ్ లేదా ఈత వంటి ఏరోబిక్ వ్యాయామాలు, వారానికి కనీసం రెండు రోజులు స్ట్రెం్ ట్రైనింగ్,  కోలుకోవడానికి, ఒత్తిడిని తగ్గించుకోవడానికి యోగా ఉంటాయి. ప్రతిరోజూ స్ట్రెచింగ్ , శ్వాస వ్యాయామాలను కూడా చేర్చుకోవాలి. ఈ దినచర్య గుండె ఆరోగ్యాన్ని, కండరాల ఆరోగ్యాన్ని ,  మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి సహాయపడుతుంది.                                       *రూపశ్రీ.
ప్రోటీన్ శరీరానికి అవసరమైన పదార్థం.  శరీరంలో కండరాల నిర్మాణానికి, శక్తికి,కణాల అభివృద్దికి,  ఎముకల నిర్మాణానికి ఇలా చాలా విషయాలకు ప్రోటీన్ అవసరం అవుతుంది.  శరీరానికి ప్రోటీన్ కోసం చాలా మంది గుడ్లు, పాలు, పాల పదార్థాలు అయిన పనీర్ వంటివి తీసుకుంటారు. ఇక మాంసాహారులు అయితే మాంసాన్ని తీసుకుంటారు. కానీ కాయ ధాన్యాలలో కూడా ప్రోటీన్ ఉంటుంది. వీటిని తరచుగా పప్పు ధాన్యాలు అని పిలుస్తూ ఉంటాం. వంటింట్లో ఎన్నో రకాల పప్పు దాన్యాలు ఉంటాయి. వీటిలో ఏ ధాన్యాలలో ప్రోటీన్ ఎక్కువగా ఉంటుందనే విషయం చాలా మందికి తెలియదు.  దీని గురించి పూర్తీగా తెలుసుకుంటే.. సోయాబీన్.. సోయాబీన్లో అన్ని పప్పు ధాన్యాల కంటే అత్యధికంగా వంద గ్రాముల సోయాబీన్ కు 36–40 గ్రాముల వరకు ప్రోటీన్ ఉంటుంది. ఇందులో శరీరానికి అవసరమైన అన్ని ముఖ్యమైన అమైనో ఆమ్లాలు (Essential Amino Acids) దాదాపు సమతుల్యంగా లభిస్తాయి. అందువల్ల దీనిని అత్యుత్తమ ప్లాంట్  ప్రోటీన్ ఆహారాల్లో ఒకటిగా పరిగణిస్తారు. సోయాబీన్‌తో తయారయ్యే పాలు, టోఫూ, సోయా నగెట్స్ వంటి ఆహారాలు కూడా మంచి ప్రోటీన్ వనరులే. మినుములు.. ప్రోటీన్ అత్యధికంగా ఉండే ధాన్యాలలో మినుములు రెండవ స్థానంలో ఉంటాయి.  ఈ మినుములు ఒక  కప్పు మినుములలో సుమారు 25 నుండి 26 గ్రాముల ప్రోటీన్ ఉంటుందని చెబుతారు. ఇడ్లీ, దోశ వంటి పులియబెట్టిన ఆహారాల్లో మినప్పప్పు ఉపయోగించడం వల్ల జీర్ణక్రియకు కూడా మేలు జరుగుతుంది. పెసలు.. పెసలులో 23–24 గ్రాముల వరకు ప్రోటీన్ ఉంటుంది. మొలకలు వచ్చిన పెసలు విటమిన్ సి, కొన్ని బి విటమిన్లు , యాంటీఆక్సిడెంట్లను కూడా అందిస్తాయి. ఇవి సులభంగా జీర్ణమవుతాయి కాబట్టి చిన్నపిల్లలు, వృద్ధులు కూడా తినవచ్చు. శనగలు.. శనగలులో ప్రోటీన్‌తో పాటు పీచు ఎక్కువగా ఉంటుంది. దీని వల్ల ఎక్కువసేపు ఆకలి తగ్గి, బరువు నియంత్రణకు ఉపయోగపడుతుంది. శనగలు ఐరన్, ఫోలేట్ వంటి పోషకాలను కూడా అందిస్తాయి.   రాజ్మా.. రాజ్మాలో మంచి ప్రోటీన్, పీచు, పొటాషియం , ఐరన్  ఉంటాయి. అయితే వీటిని తప్పనిసరిగా బాగా నానబెట్టి, పూర్తిగా ఉడికించి మాత్రమే తినాలి. లేకపోతే జీర్ణవ్యవస్థకు చాలా ఇబ్బంది అవుతుంది. కందిపప్పు.. కందిపప్పు మన తెలుగు ఇళ్లలో ఎక్కువగా వాడే పప్పు. ఇందులో ప్రోటీన్‌తో పాటు ఫోలేట్, పొటాషియం, పీచు కూడా లభిస్తాయి. రోజువారీ ఆహారంలో దీనిని చేర్చడం మంచి అలవాటు. ఎలా తింటే ప్రయోజనం.. పప్పులను కేవలం ఒకటే తినడం కంటే వాటిని బియ్యం, జొన్న, రాగి లేదా గోధుమ వంటి ధాన్యాలతో కలిపి తినడం మంచిది. ఇలా తినడం వల్ల శరీరానికి అవసరమైన అమైనో ఆమ్లాల సమతుల్యత మెరుగుపడుతుంది. అంతేకాదు.. పప్పులను కూరగాయలతో కూడా కలిపి తింటే మంచి సమతుల్య ఆహారం తీసుకున్నట్టు అవుతుంది. అలాగే పప్పులను 6–8 గంటలు నానబెట్టి వండితే జీర్ణక్రియ సులభమవుతుంది. కొన్ని పప్పులను మొలకలు చేసి తింటే విటమిన్లు పెరగడంతో పాటు కొన్ని పోషకాల శోషణ కూడా మెరుగుపడుతుంది. రోజువారీ ప్రోటీన్ ఎంత తీసుకోవాలి? ఒక సాధారణ ఆరోగ్యవంతుడికి రోజుకు శరీర బరువు ప్రతి కిలోకు సుమారు 0.8 గ్రాముల ప్రోటీన్ అవసరం. ఉదాహరణకు 60 కిలోల బరువు ఉన్న వ్యక్తికి రోజుకు సుమారు 48 గ్రాముల ప్రోటీన్ అవసరమవుతుంది. ఎక్కువ శారీరక శ్రమ చేసే వారు, క్రీడాకారులు లేదా కండరాల పెరుగుదల లక్ష్యంగా పెట్టుకున్నవారికి అవసరం మరింత ఎక్కువగా అవసరం కావచ్చు.                             *రూపశ్రీ.
  ఏదైనా కొనడానికి వెళ్ళాలని అనుకుంటాం. కానీ తీరా అక్కడికి వెళ్లాకా ఏం తీసుకోవాలని వచ్చామో అదే మర్చిపోతుంటాం. ఇది చాలా మందికి జరుగుతూ ఉంటుంది.  కానీ ఎవరూ దీని గురించి పెద్దగా పట్టించుకోరు..  ఇది మాత్రమే కాదు..  రోజంతా  మనసు ఏదో మబ్బుపట్టినట్లుగా అనిపించడం వంటిది కూడా జరుగుతూ ఉంటుంది. చాలామంది దీన్ని పరధ్యానం అనో లేక జీవితంలో ఏదో కోల్పోయినట్టు అంత విరక్తిగా ఉండటం ఎందుకనో..  ఆరోగ్యం బాగాలేదేమో అనో.. ఇలా చాలా రకాలుగా సాకులు, కారణాలు చెప్పుకుని అప్పటికి సైలెంట్ అయిపోతూ ఉంటారు.  అప్పుడప్పుడు ఇలా జరగడం సహజమే.  ఒత్తిడి , ఆందోళన ఈ సమస్యలకు కారణం కావచ్చు. అయితే, ఎప్పుడో ఒకసారి అన్నట్టు కాకుండా.. పదే పదే ఎక్కువగా జరుగుతూ ఉంటే మాత్రం ఆలోచించాల్సిందే అంటున్నారు వైద్యులు. తరచుగా మతిమరుపు, ఏకాగ్రత లోపం , మానసిక అలసట వంటి సమస్యలు బ్రెయిన్ ఫాగ్ యొక్క సంకేతాలుగా ఉండవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అసలు బ్రెయిన్ ఫాగ్ అంటే ఏంటి?  ఇది ఆరోగ్యానికి ఎంతవరకు ఇబ్బందిగా మారుతుంది? ఎవరికి ఈ సమస్య ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది? వివరంగా తెలుసుకుంటే.. బ్రెయిన్ ఫాగ్.. బ్రెయిన్ ఫాగ్ ఒక వ్యాధి కానప్పటికీ, ఇది తాత్కాలికంగా ఆలోచించడం, గుర్తుంచుకోవడం, నిర్ణయాలు తీసుకోవడం , ఏకాగ్రత వహించడం వంటి మెదడు సామర్థ్యాలను దెబ్బతీసే ఒక పరిస్థితి.  వైరల్ ఇన్ఫెక్షన్ తర్వాత చాలామంది తరచుగా కొద్దికాలం పాటు బ్రెయిన్ ఫాగ్‌ సమస్యను ఎదుర్కుంటారు. వైద్య నివేదికల ప్రకారం, దీర్ఘకాలిక మానసిక అలసట, గందరగోళం , అయోమయం వంటి సమస్యకు 'బ్రెయిన్ ఫాగ్' అనే పదాన్ని ఉపయోగిస్తారు. బ్రెయిన్ ఫాగ్ ఎందుకు వస్తుంది? తరచుగా ఒత్తిడి, సరైన నిద్ర లేకపోవడం , శరీరంలో నీటి కొరత వంటి సమస్యల వల్ల ఇది వస్తుంది. చాలా సందర్భాలలో, విటమిన్ లోపం లేదా హార్మోన్ల మార్పులు వంటి అంతర్గత సమస్యల వల్ల కూడా బ్రెయిన్ ఫాగ్ ఏర్పడవచ్చు. థైరాయిడ్, రక్తహీనత, విటమిన్ బి12 లోపం, డిప్రెషన్ వంటి వాటిలో కూడా బ్రెయిన్ ఫాగ్ వంటి సమస్యలు కనిపిస్తాయి, కాబట్టి బ్రెయిన్ ఫాగ్ సమస్య ఉన్నట్టు అనిపిస్తే వైద్యులను సంప్రదించి సమస్య తెలుసుకోవడం ఎంతో మంచిది. బ్రెయిన్ ఫాగ్ ఎలా గుర్తించాలి? బ్రెయిన్ ఫాగ్ లక్షణాలు వ్యక్తిని బట్టి మారవచ్చు, కానీ కొన్ని సంకేతాలు చాలా సాధారణంగా ఉంటాయి. చిన్న విషయాలు మర్చిపోవడం, ఇతరులతో మాట్లాడే సమయంలో సరైన పదాలు గుర్తుకు రాకపోవడం, పని చేస్తున్నప్పుడు తరచుగా పరధ్యానానికి గురికావడం, నిర్ణయాలు తీసుకోవడంలో ఇబ్బంది పడటం అనేవి సర్వసాధారణమైన లక్షణాలు. కొంతమంది తాము ఇటీవల చదివిన విషయాలను గుర్తుంచుకోవడంలో ఇబ్బంది పడుతుండగా, మరికొందరు మీటింగ్స్ లేదా ఇతరులతో మాట్లాడే  సమయంలో విషయాలను అర్థం చేసుకోవడానికి ఎక్కువ సమయం తీసుకుంటారు. ఈ లక్షణాలు కొన్ని వారాల పాటు కొనసాగి, రోజువారీ  జీవితాన్ని ప్రభావితం చేస్తుంటే తప్పకుండా ఆరోగ్య నిపుణుడిని సంప్రదించాలి. ఇవి కూడా తెలుసుకోవాలి.. మెదడు మొద్దుబారడం  అనేది ఎల్లప్పుడూ మర్చిపోవడానికి లేదా ఏకాగ్రత కోల్పోవడానికి సంకేతం కాదు. ఒత్తిడి లేదా ఒకేసారి అనేక పనులు చేయడం వల్ల అప్పుడప్పుడు మతిమరుపు రావడం సాధారణమే. అయితే, నిరంతరంగా ఏకాగ్రత పెట్టడంలో ఇబ్బంది, మానసిక స్పష్టత లోపంతో పాటు, మతిమరుపు ఎక్కువగా  సంభవిస్తే, దానిని సీరియస్ గా తీసుకోవాలి. బ్రెయిన్ ఫాగ్ , డిమెన్షియా వంటి తీవ్రమైన సమస్యల  లక్షణాలు కూడా చాలా వరకు ఒకేలా ఉంటాయి, కాబట్టి వైద్యుడిని సంప్రదించి సరైన రోగ నిర్ధారణ చేయించుకోవడం చాలా ముఖ్యం. వైద్యుల  ప్రకారం గర్భధారణ , మెనోపాజ్ సమయంలో జరిగే హార్మోన్ల మార్పులు మహిళల్లో బ్రెయిన్ ఫాగ్ వంటి లక్షణాలను కూడా కలుగజేస్తాయి. థైరాయిడ్ వ్యాధి, మధుమేహం, రక్తహీనత , ఆటో ఇమ్యూన్ వ్యాధులతో బాధపడేవారికి కూడా ఈ ప్రమాదం ఎక్కువగా ఉంటుంది.                                     *రూపశ్రీ.