Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...ఎన్టీఆర్ , పవన్ కళ్యాణ్: నారా లోకేష్ ఎవరి సినిమా మొదట చూస్తారు?
posted on: Jun 30, 2026 3:07PM

ఆ సాయంత్రం...
రాక్సీలో నార్మా షేరర్,
బ్రాడ్వేలో కాంచనమాల;
ఎట కేగుటో సమస్య తగిలిం దొక విద్యార్థికి!
ఇవి మహాకవి శ్రీశ్రీ రాసిన సంధ్యా సమస్యలు కవితలోని పంక్తులు.. ఇప్పుడు సరిగ్గా ఇలాంటి సమస్యే ఏపీ ఐటీ మంత్రి నారా లోకేష్ ఎదుర్కొన్నారు. నారా లోకేష్.. యువతలో, అలాగే సోషల్ మీడియా ట్రెండ్స్ తో ఎప్పుడూ టచ్ లో ఉండే లోకేష్ తాజాగా.. టీనేజర్లు, యువతతో ఓ సరదా ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఆ సందర్భంగా తమదైన శైలిలో లోకేష్‌ను సరదా ప్రశ్నలతో టీజ్ చేయడానికి ప్రయత్నించారు. అయితే యువత ప్రశ్నలకు లోకేష్ వారి కంటే సరదాగా.. ఎదురు వారినే టీజ్ చేసేలా ఆసక్తికర సమాధానాలిచ్చారు.
ఈ క్రమంలోనే లోకేష్ అత్యంత క్లిష్టమైన, అంతకు మించి ఆసక్తికరమైన ప్రశ్న ఎదుర్కొన్నారు. అదేంటంటే ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి నారా లోకేష్.. అలాగే.. జూనియర్ ఎన్టీఆర్ సినిమాలు ఒకే రోజున విడుదలైతే.. ఆ రెండింటిలో మీరు ముందుగా ఏ సినిమా అంటే ఎవరి సినిమా చూస్తారన్న ప్రశ్నకు.. లోకేష్ చాకచక్యంగా ఇద్దరి సినిమాలనూ ఒకే రోజు చూస్తానని బదులిచ్చారు. పైకి సరదాగా కనిపించినా.. ఈ ప్రశ్న రాజకీయంగా అత్యంత ప్రాధాన్యత, ప్రాముఖ్యత ఉన్న ప్రశ్నగానే భావించాల్సి ఉంటుంది.
ఎందుకంటే.. పవన్ కల్యాణ్ తెలుగుదేశం కూటమి ప్రభుత్వంలో డిప్యూటీ సీఎంగా ఉన్నారు. ఇక ఎన్టీఆర్.. నందమూరి వంశానికి చెందిన స్టార్ హీరో. ఈ ఇరువురిలో ఏ ఒకరి సినిమా ముందుగా చూస్తానని లోకేష్ చెప్పినా దానికి రాజకీయ రంగు పులమడానికి ఆయన ప్రత్యర్థులు రెడీగా ఉంటారు. అయితే వారికి అటువంటి అవకాశం ఇసుమంతైనా ఇవ్వకుండా లోకేష్ సమయస్ఫూర్తితో లౌక్యంగా ఇద్దరి సినిమాలూ ఒకే రోజు చూస్తానని బదులిచ్చి అందరినీ ఆకట్టుకున్నారు. యూత్ సరదా ప్రశ్నకు లోకేష్ ఇచ్చిన స్మార్ట్ రిప్లై ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ ట్రెండింగ్ లో ఉంది.
ఇది ఒక్కడే కాదు.. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును దేశ ప్రధానిగా చూడాలనుకుంటున్నారా, రాష్ట్రపతిగా చూడాలని ఉందా అన్న ప్రశ్నకు లోకేష్ అనితర సాధ్యమైన రీతిలో.. ఆ రెండు పదవులు కాకుండా, చంద్రబాబు నాయుడు అమరావతిలోనే ఉంటూ, తాను ఎల్లప్పు డూ చేసే విధంగానే నవ్యాంధ్రప్రదేశ్‌ను అభివృద్ధి బాటలో నడిపించడమే తనకు ఇష్టమని బదులిచ్చారు. ఇక ఆహారంలో తనకు రాగి సంకటి అత్యంత ఇష్టమని లోకేష్ చెప్పారు. పొలిటికల్ గా 2029 ఎన్నికలలో కూడా తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి రాష్ట్రంలో భారీ విజయాన్ని సాధించి మళ్లీ అధికారంలోకి వస్తుందని లోకేష్ ధీమా వ్యక్తం చేశారు.


.webp)


