LATEST NEWS
వైసీపీ సీనియర్ నాయకుడు,  మాజీ మంత్రి అంబటి రాంబాబు జగన్ ను అడ్డంగా బుక్ చేశారా? అంబటి తన నోటి దూలతో జగన్ ను సోషల్ మీడియాలో ట్రోల్ ఐటెమ్ గా మార్చేశారా? అంటే నెటిజనులు ఔననే అంటున్నారు. విషయం ఏంటంటే.. అంబటి రాంబాబు తాజాగా ఒక టీవీ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సొంత పార్టీ అధినేత జనగ్ మోహన్ రెడ్డి  విఫలమయ్యారని కుండబద్దలు కొట్టేశారు. ఆ ఇంటర్వ్యూకు సంబంధించిన వీడియో క్లిప్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.   ఇంటర్వ్యూలో యాంకర్ తన చొక్కాపై ఉన్న లోగోను గురించి యాంకర్ ప్రశ్నిస్తే.. ఆ లోగో నవరత్నాలు పథకాలకు సంబంధించిన లోగో అని అంబటి గొప్పగా చెప్పారు. అక్కడితో ఆగకుండా ఆ పథకాలే కాదు జగన్ నే విఫలమయ్యారంటూ వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలతో జగన్ నెటిజనులకు ట్రోలింగ్ ఐటెమ్ గా మారిపోయారు. అసలింతకీ అంబటి రాంబాబు ఉద్దేశమేంటంటే?.. పార్టీ పరాజయం పాలైనంత మాత్రాన జగన్ తమ నాయకుడు కాకుండా పోరనీ, పథకాలు విఫలమైనంత మాత్రాన నవరత్నాలు మంచి పథకాలు కాకుండా పోవనీ చెప్పడమే. అంబటికి ఏ విషయాన్నైనా వ్యంగ్యవైభవం జోడించి చెప్పడం అలవాటు. అలాగే నోటి దురద కూడా కొంచం ఎక్కువే. ఇంటర్వ్యూ సందర్భంగా ఆయన జగన్ వైఫల్యం అంటూ చేసిన వ్యాఖ్య కూడా ఆ నోటి దురద కారణంగానే అని పరిశీలకులు అంటున్నారు.  ఇప్పుడు ఆ వ్యాఖ్యలే జగన్ వ్యతిరేకులకు ఆయుధంగా మారాయి. జగన్ ఫెయిల్యూర్ అని స్వయంగా అంబటి రాంబాబు ఒప్పుకున్నారంటూ సోషల్ మీడియాలో మీమ్స్, వీడియోలతో విపరీతమైన  ఓ రేంజ్ లో జగన్ ను ట్రోల్ చేస్తున్నారు.  ఈ పరిస్థితి నిస్సందేహంగా జగన్ ను, వైసీపీనీ, ఆ పార్టీ క్యాడర్ ను ఇబ్బందుల్లో పడేసింది. డిఫెన్స్ లోకి నెట్టేసింది.   ఇటీవలి కాలంలో అంబటి రాంబాబు రాజకీయాల్లో చాలా దూకుడుగా వ్యవహరిస్తున్నారు. చంద్రబాబు నాయుడుపై అనుచిత వ్యాఖ్యల కేసులో అరెస్టై  బెయిల్ పై విడుదలైన తర్వాత ఆయన మరింతగా వార్తల్లో నిలుస్తున్నారు. ఆయన జైలుకు వెళ్లిన సమయంలో పార్టీ శ్రేణులు 'కాపు టైగర్' అంటూ అభివర్ణించగా, ఆయన కుమార్తె కూడా మీడియా ముందుకు వచ్చి చేసిన వ్యాఖ్యలు వైసీపీ మద్దతుదారుల దృష్టిని ఆకర్షించాయి. ఈ క్రమంలో అంబటి వరుస  ఇంటర్వ్యూలు ఇస్తూ నిత్యం వార్తల్లో ఉండేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే, తాజా ఇంటర్వ్యూలో ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు జగన్ మోహన్ రెడ్డి వ్యక్తిత్వానికి, పార్టీ ఇమేజ్‌కు నష్టం కలిగించేలా ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ పరిణామంపై వైసీపీ అధిష్టానం ఎలా స్పందిస్తుందోనని రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. అంబటి చేసిన వ్యాఖ్యలు వచ్చే ఎన్నికల వరకు కూడా ప్రత్యర్థి పార్టీలు వార్తల్లో, చర్చల్లో ఉండేలా వాడుకునే అవకాశాలు మెండుగా ఉన్నాయని అంటున్నారు.  సొంత పార్టీ అధినేతనే నేతనే విఫలనేతగా అంబటి అభివర్ణించడంతో ఆయన రాజకీయ భవిష్యత్ పై కచ్చితంగా ప్రభావం పడుతుందని పరిశీలకులు అంటున్నారు.   
  తెలంగాణ రాజకీయాల్లో మరోసారి ‘వందేమాతరం’ అంశం చర్చనీయాంశంగా మారింది. తెలంగాణ శాసన సభలో ‘వందేమాతరం’ ఆలపిస్తున్న సమయంలో ఎంఐఎం ఎమ్మెల్యేలు వాకౌట్ చేయడంపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి, బీజేపీ నేత బండి సంజయ్ కుమార్  తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనను ఖండిస్తూ ఆయన సామాజిక మాధ్యమ వేదిక ‘ఎక్స్’లో స్పందిస్తూ ఎంఐఎం వైఖరిపై మండి పడ్డారు. తెలంగాణ శాసనసభలో జాతీయ గీతమైన ‘వందేమాతరం’ ఆలపిస్తున్న సమయంలో మజ్లిస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు సభ నుంచి వాకౌట్ చేయడం అత్యంత సిగ్గుచేటైన చర్య అని బండి సంజయ్ వ్యాఖ్యానించారు.  ఇది కేవలం ఒక రాజకీయ నిరసన మాత్రమే కాదని, దేశానికి గౌరవ సూచకమైన జాతీయ గీతం పట్ల అవమానకరమైన ప్రవర్తనగా భావించాల్సి వస్తుందని ఆయన పేర్కొన్నారు. భారత దేశ స్వాతంత్ర్య పోరాట కాలంలో ప్రజల్లో జాతీయ స్పూర్తి ని నింపిన గీతం ‘వందేమాతరం’ అని గుర్తు చేసిన బండి సంజయ్, అలాంటి గీతాన్ని గౌరవించా ల్సిన బాధ్యత ప్రతి ఒక్కరికీ ఉందన్నారు. దేశానికి సంబంధించిన చిహ్నాలు, సంప్రదాయాలు, జాతీయ భావాలను గౌరవించడం ప్రతి భారతీయుడి కర్తవ్య మని ఆయన అన్నారు. అయితే ఎంఐఎం ఎమ్మె ల్యేలు సభ నుంచి బయట కు వెళ్లడం ద్వారా తమ అసలు వైఖరిని మరోసారి బయటపెట్టారని బండి సంజయ్ విమర్శించారు. భారతీయ చిహ్నాలు, జాతీయ భావాల పట్ల ఎంఐఎం ఎందుకు అభ్యంతరం వ్యక్తం చేస్తుందో ప్రజలకు సమాధానం చెప్పాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజల చేత ఎన్నికై శాసనసభకు వచ్చిన ప్రతినిధులు జాతీయ గౌరవాన్ని కాపాడే విధంగా ప్రవర్తించాల్సిన బాధ్యత ఉందని బండి సంజయ్ సూచించారు. ఈ ఘటనతో తెలం గాణ రాజకీయాల్లో మరోసారి జాతీయత, రాజకీయ నిరసనలపై చర్చ మొదలైంది. ఎంఐఎం ఎమ్మెల్యేల వాకౌట్‌పై వివిధ రాజకీయ పార్టీల నాయకులు భిన్నాభి ప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఇక బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో మరింత చర్చకు దారితీసే అవకాశముంది.  
మెగా బ్రదర్, జనసేనాని పవన్ కల్యాణ్ సోదరుడు, జనసేన కీలక నేత రాజకీయ ప్రయాణాన్ని గమనిస్తే ఆయన వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారా? లేక అయోమయంలో ఉన్నారా అన్న అనుమానాలు కలగకమానవు. ఆయన ప్రత్యక్ష రాజకీయాలలో ఇప్పటి వరకూ విజయం సాధించింది లేదు. అయితే ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్నారనుకోండి అది వేరే సంగతి. ఆయన రాజకీయంగా వేస్తున్న అడుగులపై మాత్రం రాజకీయవర్గాలలో ఆసక్తికర చర్చ జరుగుతోంది.  2019 ఎన్నికలలో ఆయన తొలి సారిగా నరసాపురం స్థానం నుంచి పోటీ చేశారు. అయితే అక్కడ ఆయన మూడో స్థానానికే పరిమితమయ్యారు. ఆ ఎన్నికలలో జనసేన కూడా ఏమంత ప్రభావం చూపకపోవడంతో నాగబాబు పరాజయం పెద్దగా ఎవరూ పట్టించుకోలేదు. కానీ 2024 ఎన్నికల సమయానికి ఆయన ప్రాతినిథ్యం వహిస్తున్న జనసేన పార్టీ తెలుగుదేశం, బీజేపీలతో పొత్తు పెట్టుకుని ఎన్నికల రంగంలోకి దిగింది.  ఆ ఎన్నికలలో నాగబాబు అనకాపల్లి లోక్ సభ స్థానం నుంచి రంగంలోకి దిగుతారని పెద్ద ఎత్తున ప్రచారం అయ్యింది. అయితే పొత్తు ధర్మంలో భాగంగా నాగబాబుకు ఆ ఎన్నికలలో పోటీ చేసే అవకాశమే దక్కలేదు. జనసేన అధినేత సోదరుడు, ఆ పార్టీలో కీలక నేత అయి ఉండి కూడా ఆయనకు పోటీకి అవకాశం దక్కకపోవడం అప్పట్లో రాజకీయవర్గాలను విస్మయానికి గురి చేసింది. అది పక్కన పెడితే.. 2025 ఏప్రిల్ లో నాగబాబు ఎమ్మెల్సీ అయ్యారు. ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా నాగబాబును కేబినెట్ లో తీసుకుంటామని ప్రకటించారు. అయినా ఎమ్మెల్సీ అయ్య దాదాపు ఏడాది కావస్తున్నా నాగబాబుకు కేబినెట్ బెర్త్ దక్కలేదు.  ఇక ఇప్పుడు ఆయనను రాజ్యసభకు పంపే యోచనలో జనసేనాని ఉన్నారన్న ప్రచారం జరుగుతోంది. అది కార్యరూపం దాలిస్తే జనసేన నుంచి రాజ్యసభకు వెళ్లే తొలి నేతగా నాగబాబు నిలుస్తారు. ఇక ఆయనకు కేంద్ర కేబినెట్ బెర్త్ అన్న ప్రచారం కూడా వినిపిస్తోంది.  అదలా ఉండగా నాగబాబు ప్రస్తుతం తన దృష్టినంతా శ్రీకాకుళం జిల్లా ఎచ్చర్ల నియోజకవర్గంపై కేంద్రీకృతం చేశారు. జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమాన్ని ఎచ్చెర్ల వేదికగా నాగబాబు నిర్వహించారు. ఈ నేపథ్యంలోనే ఆయన వచ్చే ఎన్నికలలో అంటే 2029 ఎన్నికలలో ఎచ్చెర్ల నుంచి అసెంబ్లీకి పోటీ చేస్తారన్న ప్రచారం జనసేన వర్గాలలో జోరుగా సాగుతోంది. ప్రస్తత టర్మ్ లో ఆయన ఏపీ కేబినెట్ లో చేరుతారా? లేక రాజ్యసభకు వెళ్లి కేంద్ర కేబినెట్ లో స్థానం దక్కించుకుంటారా? అన్న చర్చల నడుమ వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో ఎచ్చర్ల నుంచి పోటీ అంటూ జరుగుతున్న ప్రచారం నాగబాబు రాజకీయ అడుగులు ఎటు పడుతున్నాయన్న ప్రశ్నకు తావిస్తోంది. ఎచ్చర్లలో కాపు సామాజిక వర్గం ఓట్లు అధికంగా ఉండటంతో ఆయన ఎచ్చర్ల వైపు మొగ్గు చూపుతున్నారని భావించినా.. ప్రస్తతం ఎచ్చర్లలో బీజేపీ ఎమ్మెల్యే ఉన్నారు. వచ్చే ఎన్నికలలో బీజేపీ ఆ సీటును నాగబాబు కోసం త్యాగం చేస్తుందా? అంటే అనుమానమేనని పరిశీలకులు అంటున్నారు. ఈ నేపథ్యంలో నాగబాబు ఒకే సమయంలో  మూడు రకాల ప్రయత్నాలు చేయడం ఆయనలోని కన్ఫ్యూజన్ ను బయటపెట్టడమే కాకుండా జనసేన వర్గాలను కూడా అయోమయానికి గురి చేస్తోందని పరిశీలకులు చెబుతున్నారు. మొత్తం మీద నాగబాబు ది రాజకీయ వ్యూహమా లేక అయోమయమా? అన్నది కాలమే నిర్ణయిస్తుందని జనసేన వర్గీయులే అంటున్నారు. 
  తమిళనాడులో బీజేపీ, హీరో విజయ్ సారథ్యంలోని టీవీకేల పొత్తు విషయంలో మరోసారి వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. పొత్తులో భాగంగా విజయ్‌కు డిప్యూటీ సీఎం పదవి ఇస్తామని బీజేపీ ఆఫర్ చేసినట్లు జాతీయ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. తమిళనాడ, పశ్చిమబెంగాల్ తదితర రాష్ట్రాలకు ఎన్నికల షెడ్యూల్ విడుదల అయిన నేపధ్యంలో ఈ ప్రచారానికి ప్రాధాన్యత సంతరించుకుంది.  టీవీకేతో పొత్తుకు సంబంధించి చర్చలు తుది దశకు చేరుకున్నాయని బీజేపీ వర్గాలు అంటున్నాయి. విజయ్ పార్టీకి 80 సీట్లు ఇచ్చేందుకు బీజేపీ ప్రతిపాదించినట్లు ఆంగ్ల మీడియా పేర్కొంది. అయితే విజయ్ సీఎం పదవిపై దృష్టి పెట్టారని, చర్చల్లో ఆ విషయం కీలకంగా మారిందని చెప్తున్నారు. బీజేపీ, డీఎంకేలతో తమకు పొత్తులు ఉండవన విజయ్ గతంలోనే తేల్చి చెప్పారు. అయినా పొత్తులపై ప్రచారం జరుగుతూనే ఉండటం విశేషం.
కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన అధికారి జ్ఞానేష్ కుమార్‌పై ప్రతిపక్షాలు అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టాయి. సీఈసీపై అభిశంసన విషయంలో జగన్ తీసుకునే స్టాండ్ ఏమిటి అన్నది ఇప్పుడు అత్యంత ఆసక్తికరంగా మారింది. గత ఏన్నికలలో వైసీపీ ఘోర పరాజయానికి ఈవీఎంల ట్యాంపరింగే కారణం అంటూ సమయం వచ్చినా, రాకున్నా వైసీపీయులు విమర్శలు గుప్పిస్తూనే ఉన్నారు.  2024 ఎన్నికల్లో  కూటమి విజయం వెనుక ఈసీ హస్తం ఉందని పదేపదే ఆరోపిస్తున్న వైసీపీ ఇప్పుడు  సీఈసీపై ప్రతిపక్షాల అభిశంసన తీర్మానానికి మద్దతుగా నిలబడుతుందా? అలా నిలబడే ధైర్యం చేస్తుందా? జగన్ కు ఆ దమ్ముందా? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.  2024  ఎన్నికల ఫలితాల తర్వాత  వైసీపీ ఈసీ పనితీరుపై తీవ్రస్థాయిలో ఆరోపణలు చేసింది. ఓట్ల లెక్కింపులో తేడాలు ఉన్నాయనీ, అరకోటికి పైన ఓట్లపై స్పష్టత లేదనీ పలు విమర్శలు చేసింది.  రాజ్యసభలో ఆ పార్టీ ఎంపీలు దీనిపై ప్రశ్నలు కూడా సంధించారు. ఇప్పుడు  అదే ఈసీపై పక్షపాత వైఖరి, ఎన్నికల మోసం అనే ఆరోపణలతో కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమి అభిశంసన తీర్మానం నోటీసు ఇచ్చింది. ఇప్పుడు ఆ తీర్మానానికి  వైసీపీ   మద్దతు ఇస్తుందా లేదా అన్న చర్చ జోరందుకుంది.   ఈసీ తీరుపై నమ్మకం లేదని చెబుతున్న పార్టీ, ఇప్పుడు సీఈసీపై అభిసంశన తీర్మానానికి మద్దతుగా నిలబడకుంటే..   ఆ పార్టీ నైతికతే ప్రశ్నార్థకంగా మారుతుంది. ఒక వేళ  వైసీపీ ఈ తీర్మానాన్ని వ్యతిరేకిస్తే ఇక ముందు, ఎన్నికల అక్రమాలపై మాట్లాడేందుకు వైసీపీకి అర్హతే ఉండదు. ఇంత వరకూ తెలుగుదేశం  కూటమి విజయంపై వారు చేసిన విమర్శలన్నీ దూదిపింజెల్లా ఎగిరిపోతాయి. తప్పుడు ఆరోపణలు, విమర్శలు చేసిన పార్టీగా ప్రజల ముందు తలదించుకుని నిలబడాల్సి వస్తుంది. అసలు విషయం ఏమిటంటే ఆ పార్టీకి ఉన్న సంఖ్యాబలం దృష్ట్యా పార్లమెంటులో వైసీపీ ఈ తీర్మానానికి మద్దతు ఇచ్చినా ఇవ్వకున్నా ఒరిగేదేం లేదు. కానీ   తమ ఓటమికి ఈసీనే కారణమని  వైసీపీకి నిజంగా నమ్ముతుంటే.. తీర్మానాన్ని బలపరచాల్సి ఉంటుంది. అందుకు భిన్నంగా వైసీపీ వ్యవహరిస్తే.. ఆ పార్టీ విశ్వసనీయత పాతాళంలోకి దిగజారిపోవడం ఖాయం.    సీఈసీపై అవిశ్వాస తీర్మానంపై ఇప్పటి వరకూ దాదాపు 195 మంది ఎంపీలు సంతకాలు చేశారు.  అలా సంతకాలు చేసిన వారిలో ఒక్కరంటే ఒక్కరైనా వైసీపీ ఎంపీ లేరు. దీంతో వైసీపీది ద్వంద్వ నీతి, నైతికతనీ నైతికత లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇంతకీ విషయమేంటంటే.. కేసుల భయంతో జగన్ వైసీపీకి వ్యతిరేకంగా ఏ నిర్ణయమూ తీసుకోలేని పరిస్థితుల్లో ఉన్నారు. ఆ కారణంగానే సీఈసీపై అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా ఆ పార్టీ ఎంపీలు నిలబడే పరిస్థితి లేదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  ప్రజా విశ్వాసాన్ని చూరగొనడం కంటే.. జగన్ కు కేసుల నుంచి రక్షణ పొందడమే ముఖ్యమనీ, అందుకే  వైసీపీ ఎంపీలు సీఈసీపై అవిశ్వాన తీర్మానంపై సంతకాలు చేయడానికి ముందుకు రావడం లేదనీ అంటున్నారు. రాజకీయవర్గాలలో వైసీపీ నైతిక పతనానికి దీనిని సంకేతంగా చూపుతూ పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. చూడాలి మరి సీఈసీపై అవిశ్వాత తీర్మానం విషయంలో జగన్ నిర్ణయం ఎలా ఉంటుందో?
ALSO ON TELUGUONE N E W S
టాలీవుడ్ యంగ్ అండ్ ప్రామిసింగ్ హీరోల్లో కిరణ్ అబ్బవరం ఒకరు. ఎటువంటి సినీ బ్యాక్‌గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి, తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న ఈ హీరో.. ఇప్పుడు మరో అడుగు ముందుకు వేయబోతున్నట్లు సమాచారం. నటుడిగా, నిర్మాతగా ఇప్పటికే తన సత్తా చాటుకున్న కిరణ్, ఇప్పుడు మెగా ఫోన్ పట్టి దర్శకుడిగా మారబోతున్నారనే వార్త ఫిల్మ్ నగర్ సర్కిల్స్‌లో జోరుగా వినిపిస్తోంది. తాజా సమాచారం ప్రకారం, కిరణ్ అబ్బవరం త్వరలోనే ఒక భారీ ప్రాజెక్ట్‌ను డైరెక్ట్ చేయబోతున్నారట. గతేడాది 'క' సినిమాతో భారీ విజయాన్ని అందుకున్న ఈ యంగ్ హీరో, తన మార్కెట్‌ను ఒక్కసారిగా పెంచుకున్నారు. ఈ క్రమంలోనే ఒక వైవిధ్యమైన కథను సిద్ధం చేసుకున్న కిరణ్, తానే దర్శకత్వ బాధ్యతలు చేపట్టాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించి ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ పూర్తయిందని టాక్. ఈ క్రేజీ ప్రాజెక్ట్‌ను జాయ్ ఫిల్మ్స్ బ్యానర్‌పై సుధాకర్ చాగంటి నిర్మించనున్నట్లు సమాచారం. అలాగే, ఈ చిత్రానికి హిట్ మ్యూజిక్ డైరెక్టర్ భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించనున్నారనే వార్త ఇప్పుడు మరింత ఆసక్తిని కలిగిస్తోంది. కిరణ్ సినిమాల్లో పాటలకు ఉండే క్రేజ్ తెలిసిందే, అందుకే ఈ కాంబినేషన్ కుదిరితే మ్యూజికల్‌గా కూడా సినిమా మరో లెవల్లో ఉంటుందని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. గతంలో 'రాజావారు రాణిగారు' సినిమాతో సింపుల్‌గా ఎంట్రీ ఇచ్చిన కిరణ్ అబ్బవరం, ఆ తర్వాత 'ఎస్ఆర్ కళ్యాణమండపం' వంటి హిట్స్ అందుకున్నారు. అయితే మధ్యలో కొన్ని పరాజయాలు పలకరించినా, మొండి పట్టుదలతో 'క' సినిమాను పాన్ ఇండియా లెవల్లో రిలీజ్ చేసి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు. ఈ సినిమా సుమారు 50 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించడంతో కిరణ్ కెరీర్ గ్రాఫ్ ఒక్కసారిగా మారిపోయింది. ప్రస్తుతం కిరణ్ అబ్బవరం చేతిలో మరికొన్ని ఆసక్తికరమైన ప్రాజెక్టులు ఉన్నాయి. అందులో 'చెన్నై లవ్ స్టోరీ' ఒకటి. ఈ లోపే డైరెక్షన్ వైపు అడుగులు వేయడం టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. సాధారణంగా హీరోలు కెరీర్ పీక్ స్టేజ్‌లో ఉన్నప్పుడు దర్శకత్వం వైపు రావడం చాలా తక్కువగా చూస్తుంటాం. కానీ కిరణ్ తనలో ఉన్న మల్టీ టాలెంట్‌ను బయటపెట్టాలని ఫిక్స్ అయినట్లు కనిపిస్తోంది. సోషల్ మీడియాలో ఈ విషయంపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. కిరణ్ అబ్బవరం దర్శకత్వం వహిస్తే అది లవ్ స్టోరీ అవుతుందా లేక 'క' లాంటి ఏదైనా మిస్టరీ థ్రిల్లర్ అవుతుందా అని నెటిజన్లు ఆరా తీస్తున్నారు. ఏదేమైనా ఒక వెరైటీ కాన్సెప్ట్‌తోనే ఆయన ప్రేక్షకుల ముందుకు రావాలని ప్లాన్ చేస్తున్నట్లు సన్నిహిత వర్గాల భోగట్టా. త్వరలోనే ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించి అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. నటుడిగా మెప్పించి, నిర్మాతగా లాభాలు అందుకున్న కిరణ్.. మరి డైరెక్టర్ క్యాప్‌లో ఏ మేరకు సక్సెస్ అవుతారో చూడాలి. ఒకవేళ ఈ వార్త నిజమైతే, టాలీవుడ్‌లో మరో వెర్సటైల్ ఫిల్మ్ మేకర్ యాడ్ అయినట్లే! దీనిపై కిరణ్ అబ్బవరం టీమ్ నుంచి క్లారిటీ రావాల్సి ఉంది.
    -క్రైమ్ ఇన్విస్టిగేషన్ చూస్తే మతిపోతుంది -సరికొత్త సినీ జోష్  -పేరు మీకు తెలుసా!   సినీ ప్రియులకి గుడ్ న్యూస్. ముఖ్యంగా క్రైమ్ థ్రిల్లర్ ఇష్టపడే వాళ్ళకి అంతకు మించి. ఎందుకంటే ఇప్పుడు మనం చెప్పుకోబోయే క్రైమ్ థ్రిల్లర్ అలాంటి ఇలాంటిది కాదు. మీరు  మూవీ చూసిన వెంటనే కథకుడిగా మారిపోయి మీకు అందుబాటులో ఉన్న వాళ్ళందర్నీ కూర్చోపెట్టి కథని ఎంతో ఇంట్రెస్ట్ తో చెప్తారు. ఆ టైంలో వాళ్లంతా మీతో 'మూవీ మేము చూస్తాం ఎక్కడ ఉందో చెప్పు అన్నా కూడా ఎక్కడ ఉందో చెప్పకుండా కథ చెప్పడం కంప్లీట్ చేశాకే మీరు అసలు విషయం చెప్తారు. అంత స్వార్థం ఈ మూవీ చూసిన తర్వాత మీకు వస్తుంది. మరి ఆ మూవీ ఏంటో చూద్దాం.  'విలంగు'(Vilangu). తమిళంలో తెరకెక్కిన పక్కా క్రైమ్ థ్రిల్లర్ సిరీస్. మొత్తం ఏడు ఎపిసోడ్లు. ప్రతి ఎపిసోడ్ మన ఊహకి అందని విదంగా ఉంటుంది. ఊహించని విధంగా ప్రవర్తించే క్యారెక్టర్స్ తో పాటు సన్నివేశాల్లోని టెన్షన్ మనల్ని ఉక్కిరి బిక్కిరి చేస్తుంది. దీంతో క్రైమ్ థ్రిల్లర్ ని ఇష్టపడే ప్రేక్షకులు 'విలంగు' దగ్గర వాలిపోతున్నారు. రిపీట్ ఆడియన్స్ ని  కూడా సొంతం చేసుకుంటుంది. అందుకే  iMDb లో 7.9  రేటింగ్ తో ఉంది. 2022లో రిలీజ్ అయినా ఆ స్థాయి రేటింగ్ తో కొనసాగుతుండటం విశేషం. జీ 5(Zee 5)లో అందుబాటులో ఉంది. ఇంకో ఆనందకరమైన విషయం ఏంటంటే తెలుగు లాంగ్వేజ్ లోను ఉండటం  విశేషం. టైటిల్ సంకెళ్లు(Sankellu). సాగతీత లేకుండా చాలా వేగంగా సాగే స్క్రీన్ ప్లే అతి పెద్ద  ప్లస్ పాయింట్. మరి ఆలస్యం చేయకుండా జీ 5 లోకి వెళ్లిపోండి. also read: Varanasi: వారణాసి టీంకి షాక్! అక్రమం అని తేల్చి ప్రముఖ నటుడ్ని అరెస్ట్ చేసిన పోలీసులు   కథ చూసుకుంటే తమిళనాడులోని వెంబూర్ అనే పోలీస్ స్టేషన్‌ చుట్టు  స్టోరీ నడుస్తుంది. ఇళంపరిధి అనే పేరుగల పోలీస్ ఆఫీసర్ సబ్ ఇన్‌స్పెక్టర్‌గా బాధ్యతలు వహిస్తుంటాడు. పర్సనల్ ఇష్యూస్ వల్ల సెలవు తీసుకోవాలని అనుకుంటే అదే టైమ్‌లో ఒక మర్డర్ కేసు వస్తుంది. దాంతో మర్డర్ కేసుని సాల్వ్ చేసి సెలవు తీసుకోవాలనుకుంటాడు. కానీ  కేసు ఇన్వెస్టిగేషన్ చేస్తున్న కొద్ది ఇంకా క్రిటికల్‌గా, కన్ఫ్యూజింగ్‌గా మారుతుంది. ఒక వైపు  పర్సనల్ ఇష్యూస్, మరోవైపు క్రిటికల్‌గా మారుతున్న మర్డర్ కేసు. చివరికి హంతకుడిని ఎలా పట్టుకున్నాడు? అసలు ఆ హంతకుడు మర్డర్ ఎందుకు చేశాడు? అనేవి ఎంతో ఉత్కంఠతతో సాగుతాయి. విమల్, ఇనేయ, బాల శరవణన్, మునిషకాంత్ తదితరులు ముఖ్యమైన క్యారెక్టర్స్ పోషించగా ప్రశాంత్ పాండియరాజ్(prashanth pandiraj) దర్శకుడు.         
పవర్‌స్టార్ పవన్‌కళ్యాణ్, హరీష్ శంకర్ కాంబినేషన్‌లో వస్తున్న లేటెస్ట్ సెన్సేషన్ ‘ఉస్తాద్ భగత్ సింగ్‌’. వీరిద్దరి కాంబినేషన్‌లో గతంలో వచ్చిన ‘గబ్బర్‌సింగ్‌’ ఎంతటి సంచలన విజయం సాధించిందో అందరికీ తెలిసిందే. పవన్‌కళ్యాణ్ కెరీర్‌లోనే ఈ సినిమా ఓ మైల్‌స్టోన్‌గా నిలిచింది. చాలా గ్యాప్  తర్వాత ‘ఉస్తాద్ భగత్ సింగ్‌’తో ఈ కాంబినేషన్ రిపీట్ అవుతోంది. మరోసారి ఈ జంట మ్యాజిక్ చేస్తుందని ఫ్యాన్స్ ఎంతో ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. అయితే ఓ వింత సెంటిమెంట్ వారిని ఆందోళనకు గురి చేస్తోంది.  చిత్ర పరిశ్రమలో ఉన్నన్ని సెంటిమెంట్లు మరెక్కడా ఉండవు అంటే అతిశయోక్తి కాదు. టైటిల్ దగ్గర నుంచి అనేక విషయాల్లో రకరకాల సెంటిమెంట్స్ పెట్టుకుంటారు. దాని ప్రకారమే వెళుతుంటారు. పవన్‌కళ్యాణ్ విషయానికి వస్తే.. అది ఆయనకు సెంటిమెంట్‌గా ఉందో లేదో తెలీదుగానీ, ఫ్యాన్స్ మాత్రం దాన్ని గుర్తు తెచ్చుకొని మ‌రీ టెన్షన్ పడిపోతున్నారు. ఇంతకీ ఆ సెంటిమెంట్ ఏమిటంటే.. పవన్‌కళ్యాణ్‌తో ఒక బ్లాక్‌బస్టర్ హిట్ కొట్టిన తర్వాత అదే కాంబినేషన్‌లో చేసిన రెండో సినిమా ఫ్లాప్ అయిన చరిత్ర ఉంది. ఇది చాలా మంది డైరెక్టర్స్ విషయంలో నిజమైందని పవన్‌కళ్యాణ్ కెరీర్‌ను పరిశీలిస్తే అర్థమవుతుంది. ఆయా సినిమాల వివరాలేమిటో ఒకసారి చూద్దాం.  పవన్‌తో ‘తొలిప్రేమ’ వంటి క్లాసిక్ హిట్ తీసిన‌ కరుణాకరన్ ఆ తర్వాత చేసిన రెండో సినిమా ‘బాలు’ ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు. అలాగే ‘సుస్వాగతం’తో పవన్‌కి మెమరబుల్ హిట్ ఇచ్చిన భీమనేని శ్రీనివాసరావు ఆ తర్వాత చేసిన ‘అన్నవరం’ చిత్రంతో మెప్పించలేకపోయారు. పవన్‌కళ్యాణ్‌ని ‘బద్రి’ చిత్రంలో డిఫరెంట్‌గా ప్రొజెక్ట్ చేసి భారీ విజయాన్ని అందుకున్న పూరి జగన్నాథ్ కూడా రెండో సినిమాతో దెబ్బతిన్నారు. వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన ‘కెమెరామెన్ గంగతో రాంబాబు’ చిత్రం ఏవరేజ్ అనే టాక్ తెచ్చుకుంది. ‘ఉస్తాద్ భగత్‌సింగ్‌’ మార్చి 19న ఉగాది కానుకగా రిలీజ్ కాబోతోంది. ఇప్ప్పుడీ సెకండ్ సెంటిమెంట్ బలంగా ప్రచారంలోకి వచ్చేసింది. ‘గబ్బర్‌సింగ్‌’తో బ్లాక్‌బస్టర్ సాధించిన హరీష్ శంకర్ ఈ సినిమాను ఏం చేస్తాడోననే ఆందోళన ఫ్యాన్స్‌లో పెరిగిపోయింది. ఈ సెంటిమెంట్ నుంచి తప్పించుకున్న ఏకైక డైరెక్టర్ త్రివిక్రమ్.  పవన్‌కళ్యాణ్, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో వచ్చిన తొలి సినిమా ‘జల్సా’. 2008లో విడుదలైన ఈ సినిమా ఘనవిజయం సాధించింది. 5 సంవత్సరాల గ్యాప్ తర్వాత వీరిద్దరి కాంబినేషన్‌లోనే వచ్చిన ‘అత్తారింటికి దారేది’ ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది. అయితే 2018లో వచ్చిన మూడో సినిమా ‘అజ్ఞాతవాసి’ మాత్రం డిజాస్టర్ అయింది.  పవన్‌కళ్యాణ్‌తో రెండో హిట్ కొట్టిన డైరెక్టర్ త్రివిక్రమ్ తప్ప మరొకరు లేకపోవడంతో జరుగుతున్న ప్రచారానికి ఎక్కువ ప్రాధాన్యం ఏర్పడింది. పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి హోదాలో ఉన్నందు వల్ల ఆయన ఇమేజ్‌కు తగ్గట్టుగా కథలో మార్పులు చేశారు. అనవసరమైన అంశాలకు తావు ఇవ్వకుండా పవర్ ఫుల్ డైలాగులు, మాస్ ఎలిమెంట్స్‌తో సినిమాను తీర్చిదిద్దారు.  ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్, సాంగ్స్ సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేశాయి. ‘కాలరే ఎత్తరా’ పాట పవన్ పాత జ్ఞాపకాలను గుర్తు చేస్తోంది. ప్రస్తుతం అభిమానుల్లో ఉన్న ‘సెకండ్ మూవీ’ సెంటిమెంట్‌ను త్రివిక్రమ్ తరహాలో హరీష్ శంకర్ కూడా బ్రేక్ చేసి పవన్ కళ్యాణ్ కెరీర్‌లో మరో బ్లాక్‌బస్టర్‌ని అందిస్తారని ఆశిస్తున్నారు.
తమిళ చిత్ర పరిశ్రమలో రియలిస్టిక్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచే దర్శకుడు వెట్రిమారన్ మరోసారి వార్తల్లో నిలిచారు. తనదైన మార్కు మేకింగ్‌తో బాక్సాఫీస్ వద్ద ప్రకంపనలు సృష్టించే ఈ టాలెంటెడ్ డైరెక్టర్, తాజాగా రెండు భారీ ప్రాజెక్టులకు సంబంధించిన అప్‌డేట్స్‌ ఇచ్చి సినీ ప్రియులను ఖుషీ చేశారు. అటు సిలంబరసన్ (శింబు)తో కొత్త సినిమా, ఇటు ధనుష్‌తో మోస్ట్ అవేటెడ్ సీక్వెల్ గురించి ఆయన కీలక విషయాలు పంచుకున్నారు. ముందుగా శింబు అభిమానులకు ఒక తీపి కబురు అందింది. వెట్రిమారన్ దర్శకత్వంలో సిలంబరసన్ హీరోగా తెరకెక్కుతున్న 'అరసన్' చిత్రం మార్చి 16 నుంచి సెట్స్ పైకి వెళ్లనుంది. ఈ సినిమా అనౌన్స్‌మెంట్ వచ్చినప్పటి నుంచే కోలీవుడ్‌లో భారీ అంచనాలు నెలకొన్నాయి. పవర్‌ఫుల్ పొలిటికల్ లేదా గ్యాంగ్‌స్టర్ డ్రామాగా ఈ చిత్రం ఉండబోతోందని సమాచారం. శింబును వెట్రిమారన్ ఏ రేంజ్‌లో చూపిస్తారో అని ఫ్యాన్స్ ఇప్పటి నుంచే ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. మరోవైపు, కోలీవుడ్ హిస్టరీలోనే వన్ ఆఫ్ ది బెస్ట్ కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన 'వడ చెన్నై' సీక్వెల్ గురించి కూడా వెట్రిమారన్ క్లారిటీ ఇచ్చారు. ధనుష్ హీరోగా 2018లో వచ్చిన ఈ సినిమా గ్యాంగ్‌స్టర్ డ్రామాల్లో కొత్త ఒరవడిని సృష్టించింది. అప్పటి నుంచి పార్ట్-2 ఎప్పుడు వస్తుందా అని ఎదురుచూస్తున్న ప్రేక్షకులకు, త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన ఉంటుందని దర్శకుడు వెల్లడించారు. ఈ అప్‌డేట్‌తో సోషల్ మీడియాలో 'వడ చెన్నై 2' ట్రెండింగ్‌లోకి వచ్చేసింది. వెట్రిమారన్ - ధనుష్ కాంబినేషన్ అంటేనే ఒక సక్సెస్ బ్రాండ్. గతంలో వీరిద్దరి కలయికలో వచ్చిన 'పొల్లాధవన్', 'ఆడుకాలం', 'అసురన్' వంటి చిత్రాలు జాతీయ స్థాయిలో అవార్డులు అందుకోవడమే కాకుండా కమర్షియల్‌గానూ అదరగొట్టాయి. ఇప్పుడు మళ్లీ వీరిద్దరూ 'వడ చెన్నై 2' కోసం జట్టు కడుతుండటంతో అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. రా అండ్ రస్టిక్ కథలను చెప్పడంలో వెట్రిమారన్ సిద్ధహస్తుడు కావడంతో ఈ ప్రాజెక్ట్ పై భారీ హైప్ క్రియేట్ అయ్యింది. ప్రస్తుతం కోలీవుడ్ వర్గాల్లో ఈ రెండు సినిమాల గురించే చర్చ నడుస్తోంది. అటు శింబుతో 'అరసన్' షూటింగ్ ప్రారంభించడం, ఇటు ధనుష్‌తో సీక్వెల్ అనౌన్స్‌మెంట్ ఇవ్వడం చూస్తుంటే వెట్రిమారన్ ఈ ఏడాది బాక్సాఫీస్ వద్ద గట్టిగానే ప్లాన్ చేసినట్టు కనిపిస్తోంది. త్వరలోనే ఈ సినిమాలకు సంబంధించిన మరిన్ని వివరాలు, నటీనటుల వేట గురించి సమాచారం వచ్చే అవకాశం ఉంది. మొత్తానికి వెట్రిమారన్ మార్క్ యాక్షన్ కోసం ప్రేక్షకులు కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు.
    -షూటింగ్ లో వారణాసి -తెలుగు వారి ప్రెస్టేజియస్ట్ మూవీ  -ఎందుకు అరెస్ట్ చేసారు! 'వారణాసి'(Varanasi).. ఏ ముహూర్తాన మహేష్ బాబు(Mahesh Babu), రాజమౌళి(ss Rajamouli), విజయేంద్రప్రసాద్, కేఎల్ నారాయణ తమ సినిమాకి 'వారణాసి' అనే టైటిల్ ని ఫిక్స్ చేసారో కానీ, వారణాసి అప్ డేట్స్ చూడకుండా నిద్రపోని పాన్ ఇండియా ప్రేక్షకుడు లేడంటే అతిశయోక్తి లేదు. టేకింగ్, టెక్నీకల్, బడ్జెట్, ప్రొడక్షన్ వాల్యూస్ పరంగా కూడా తెలుగు సినిమా ఖ్యాతిని   వరల్డ్ సినీ మేకర్స్ ముందు వారణాసి ద్వారా సాక్షాత్కారం కానుంది. ఇంతటి ప్రతిష్టాత్మక మూవీ ఒక వ్యక్తి వలన ఎక్స్ క్లూజివ్ గా వైరల్ గా నిలిచింది. ఆ డీటెయిల్స్ ఏంటో చూద్దాం.   విక్టరీ అపుయామగన్‌..ఉరఫ్ కెన్నీ(kenni). నైజీరియా దేశస్థుడు. ఎలాంటి అనుమతులు లేకుండానే సుమారు ఎనిమిదేళ్లుగా మన దేశంలో నివసిస్తున్నాడు. అంటే  అక్రమంగా స్టే చేస్తున్నాడు. మొన్న  మార్చి 14 న హైదరాబాద్ లోని కొండాపూర్ ఏరియాలో తెలంగాణ స్పెషల్ వింగ్ ఈగల్ ఫోర్స్ (EAGLE Force) సభ్యులు కెన్నీని అరెస్ట్ చేసారు.  దీంతో కెన్నీ గురించిన వివరాలన్నీ బయటకి వచ్చాయి. కెన్నీ 2018 నవంబర్ లో 'ఘనా' దేశానికి చెందిన పాస్‌పోర్ట్ సంపాదించి యాకూబ్ అలీ అనే పేరుతో మెడికల్ అటెండెంట్ వీసాపై న్యూఢిల్లీకి వచ్చాడు. 2019  జనవరిలోనే సదరు వీసా గడువు ముగిసింది. కానీ తిరిగి వీసా పొడిగించుకోకుండా అక్రమంగా ఉండిపోయాడు. దీంతో హైదరాబాద్ పోలీసులు ఫారినర్స్ రీజినల్ రిజిస్ట్రేషన్ ఆఫీస్ (FRRO) అధికారులకి  అప్పగించారు. చెల్లుబాటు అయ్యే పత్రాలు లేకపోవడం మరియు ఫోర్జరీ పాస్‌పోర్ట్ కలిగి ఉండటంతో పట్టుబడ్డ శనివారమే  నైజీరియాకి పంపించేశారు.  also read: Ustaad Bhagat Singh vs dhurandhar 2: ఎవరి పెర్ ఫార్మెన్స్ బద్దలు కాబోతుంది మొదట పంజాబ్ లోని 'లూథియానా' లో జిమ్ ట్రైనర్‌గా పనిచేసి సెప్టెంబర్ 2025లో నటనపై ఆసక్తితో హైదరాబాద్‌(HYderabad)కి మారి కొండాపూర్ లో ఉన్న ఒక పీజీ హాస్టల్‌లో ఉంటు సినిమా అవకాశాల కోసం ప్రయత్నిస్తూ ఉన్నాడు. దీంతో సుమారు ఐదు సినిమాల్లో జూనియర్ ఆర్టిస్ట్ గా కనిపించాడు. ప్రస్తుతం వారణాసిలో  ఒక క్యారక్టర్ చేస్తున్నాడు. మరి  వారణాసిలో కెన్నీ ఎటువంటి రోల్ లో కనిపిస్తున్నాడు. అతని రోల్ పూర్తయిందా లేదా? అని అభిమానులు చర్చించుకుంటున్నారు. కెన్నీ విషయంపై వారణాసి టీం ఇంతవరకు స్పందించలేదు. ఇటీవల విడుదలైన 'తస్కరి' హిందీ మూవీ కూడా కెన్నీ లిస్ట్ లో ఉంది.    
  The teaser of Vishwanath & Sons starring Suriya has been released, offering a glimpse into the world of Sanjay Vishwanath. Directed by Venky Atluri and produced by Suryadevara Naga Vamsi, the film promises an emotional and engaging cinematic experience. The teaser introduces Sanjay Vishwanath, an international pistol shooter who continues to chase his dreams even in his 40s. Suriya appears in a layered role, portraying both fatherly warmth and emotional depth. His stylish presence and the impactful dialogues penned by Venky Atluri bring back shades reminiscent of his iconic performances. Adding freshness to the narrative is Mamitha Baiju, who brings vibrant and charming energy to the film. The teaser hints at an unconventional love story involving a noticeable age gap. With Venky Atluri’s sensibility in storytelling, the film is expected to handle this aspect with depth and emotional maturity. The teaser also highlights the film’s strong technical craft. G. V. Prakash Kumar delivers a classy and powerful background score that elevates the visuals. Cinematographer Nimish Ravi captures the film with rich and visually striking frames, while editing is handled by Navin Nooli. Production design by Banglan further enhances the film’s immersive world. Touted as a large-scale family drama with strong emotional undercurrents, Vishwanath & Sons brings together a compelling ensemble and a top-tier technical team. Director Venky Atluri, who is riding high on the success of Lucky Baskhar and Vaathi, aims to deliver another memorable entertainer. Produced under the banners of Sithara Entertainments and Fortune Four Cinemas, and presented by Srikara Studios, the film has successfully wrapped up shooting and is gearing up for a grand worldwide theatrical release this July.
ప్రపంచ సినిమా రంగంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన 98వ ఆస్కార్ వేడుకలు అట్టహాసంగా ముగిశాయి. 2026 ఆస్కార్ బరిలో ఎన్నో అంచనాల మధ్య నిలిచిన 'వన్ బాటిల్ ఆఫ్టర్ అనదర్' (One Battle After Another) చిత్రం ఆరు ప్రధాన విభాగాల్లో అవార్డులను గెలుచుకుని క్లీన్ స్వీప్ చేసింది. లాస్ ఏంజిల్స్‌లోని డాల్బీ థియేటర్‌లో జరిగిన ఈ వేడుకలో ఈ చిత్రం తన ఆధిపత్యాన్ని చాటుకుంది. ప్రముఖ దర్శకుడు పాల్ థామస్ ఆండర్సన్ రూపొందించిన ఈ చిత్రం 'ఉత్తమ చిత్రం' (Best Picture) కేటగిరీలో విజేతగా నిలిచింది. 13 విభాగాల్లో నామినేషన్లు పొందిన ఈ సినిమా, భారీ పోటీని తట్టుకుని ఈ ఘనత సాధించడం విశేషం. దర్శకుడు పాల్ థామస్ ఆండర్సన్ తన సుదీర్ఘ కెరీర్‌లో మొదటిసారిగా ఈ చిత్రంతో 'ఉత్తమ దర్శకుడి'గా ఆస్కార్‌ను అందుకోవడం సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. నటన పరంగా కూడా ఈ చిత్రం అద్భుతమైన ప్రతిభను కనబరిచింది. కల్నల్ స్టీవెన్ లాక్‌జా పాత్రలో ఒదిగిపోయిన సీన్ పెన్ 'ఉత్తమ సహాయ నటుడు'గా అవార్డును గెలుచుకున్నారు. ఆయనకు ఇది మూడవ ఆస్కార్ కావడం గమనార్హం. అయితే వ్యక్తిగత కారణాల వల్ల ఆయన వేడుకకు హాజరు కాలేకపోవడంతో, ఆయన తరపున నటుడు కియారన్ కల్కిన్ ఈ అవార్డును అందుకున్నారు. సాంకేతిక విభాగాల్లో కూడా ఈ చిత్రం తన ముద్ర వేసింది. ఉత్తమ అడాప్టెడ్ స్క్రీన్‌ప్లే, ఎడిటింగ్ విభాగాల్లో పురస్కారాలను దక్కించుకుంది. అంతేకాకుండా, ఆస్కార్ చరిత్రలో మొదటిసారిగా ప్రవేశపెట్టిన 'బెస్ట్ కాస్టింగ్' విభాగంలో మొదటి అవార్డును సొంతం చేసుకుని 'వన్ బాటిల్ ఆఫ్టర్ అనదర్' చరిత్ర సృష్టించింది. లియొనార్డ్ డికాప్రియో ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా ప్రేక్షకులను, విమర్శకులను ఒకేలా మెప్పించింది. అవార్డును అందుకున్న సందర్భంగా దర్శకుడు పాల్ థామస్ ఆండర్సన్ ఎమోషనల్ అయ్యారు. "మనం మన పిల్లలకు అందిస్తున్న ప్రపంచం గందరగోళంగా ఉంది, దానికి క్షమాపణగా ఈ సినిమాను రూపొందించాను" అంటూ తన ప్రసంగంతో అందరినీ ఆకట్టుకున్నారు. యువత సమాజంలో మార్పు తీసుకువస్తుందని తాను ఆశిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. మొత్తానికి 2026 ఆస్కార్స్ వేడుకల్లో 'వన్ బాటిల్ ఆఫ్టర్ అనదర్' కేవలం ఒక సినిమాగా కాకుండా ఒక ప్రభంజనంలా నిలిచింది. వార్నర్ బ్రదర్స్ స్టూడియో నిర్మించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద కూడా భారీ వసూళ్లను సాధించి, ఇప్పుడు అవార్డుల పంట పండించడంతో చిత్ర యూనిట్ ఆనందంలో మునిగిపోయింది. 
  -18 నుంచే ఉస్తాద్ భగత్ సింగ్, ధురంధర్ 2 సందడి  -ఎవరు విన్నర్  -ఫ్యాన్స్ , మూవీ లవర్స్ కి మాత్రం మజా  సెల్యులాయిడ్ కి సరికొత్త ఊపు, ఉత్సాహాన్ని ఇవ్వడానికి ఉస్తాద్ భగత్ సింగ్(Ustaad Bhagat singh),ధురంధర్ 2(Dhurandhar 2)పోటాపోటీగా కాచుకొని కూర్చున్నాయి. దీంతో ప్రీమియర్స్ నుంచే ఆ రెండు సినిమాలు  చూడాలనే ఆశావహుల సంఖ్య రోజు రోజుకి పెరుగుతుంది. అభిమానులు, మూవీ లవర్స్ అయితే క్షణమొక యుగంలాగా భావిస్తు సోమ, మంగళవారాలు ఫాస్ట్ గా గడిచిపోతే ఎంత బాగుండని అనుకుంటున్నారు. అదే టైంలో ఒక ఆసక్తికర చర్చ ఆ అందరి మధ్య జరుగుతుంది. మరి ఆ చర్చ ఏంటో చూద్దాం. ఉస్తాద్ భగత్ సింగ్ ట్రైలర్ మొన్న రిలీజయ్యింది. ట్రైలర్ చూసిన తర్వాత మూవీ ఎంత ఫుల్ ప్లెడ్జెడ్ మాస్ గా ఉండబోతుందో అర్దమవ్వడంతో పాటు విలన్స్ తో చేసే పోరాటం, యాక్షన్ సీక్వెన్స్ ఒక రేంజ్ లో ఉండబోతున్నాయి. పైగా పవన్(Pawan kalyan)పోలీస్ ఆఫీసర్ గా కనిపిస్తున్నాడు. ధురంధర్  పార్ట్ 2 కూడా అంతే. ఫుల్ ప్లెడ్జెడ్ మాస్ మూవీ. పార్ట్ 1 తోనే ఆ విషయం తెలిసినా, పార్ట్ 2 ట్రైలర్ తర్వాత  పార్ట్ 1 ని మించిన యాక్షన్ సీక్వెన్స్ పక్కా అనే నమ్మకం వచ్చింది. రణవీర్ కూడా పోలీస్ కాప్. పైగా రెండు చిత్రాల కథనం పవన్, రణవీర్ ల వన్ మాన్ షోతో సాగనున్నాయి. మరి ఈ లెక్కన  యాక్షన్ సీక్వెన్స్ లో పవన్, రణవీర్ సింగ్ ఏ విధంగా చేస్తారో తెలుసు. దీంతో తెలుగు నాట ఎవరి పెర్ ఫార్మెన్స్ బద్దలు కాబోతుందో అని అభిమానులు, మూవీ లవర్స్ చర్చించుకుంటున్నారు. also read: Ustaad Bhagat Singh: అప్పుడు ఎన్టీఆర్, ఇప్పుడు పవన్ కళ్యాణ్.. బిజీ అవ్వడం ఖాయమా! ధురంధర్ 2 కి వారం రోజుల క్రితమే ప్రీమియర్స్ కి సంబంధించి తెలుగు నాట బుకింగ్స్ స్టార్ట్ అయ్యాయి హిందీ, తెలుగు లాంగ్వేజ్ కి సంబంధించి స్టార్ట్ అవ్వగా ఇప్పటికే టికెట్స్ కూడా అయిపోయాయి. ఇప్పుడు ఉస్తాద్  బుకింగ్స్ కోసం అందరు వెయిటింగ్.      
తిరుమల పవిత్రతను కాపాడటం ప్రతి ఒక్కరి బాధ్యత. అయితే, ఇటీవల తిరుమల కొండపై చోటు చేసుకున్న కేక్ కటింగ్ వివాదం సోషల్ మీడియాలో పెద్ద దుమారం రేపింది. ఈ వివాదంలోకి అనవసరంగా తన పేరును లాగడంపై బాలీవుడ్ నటి జాన్వీ కపూర్ తీవ్రంగా స్పందించారు. అసలు తన తప్పును కప్పిపుచ్చుకోవడానికి తనపై నిందలు వేయడం ఏంటని ఆమె ప్రశ్నించారు. సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ దివ్వెల మాధురి, తన స్నేహితురాలు తనూజ పుట్టినరోజు సందర్భంగా తిరుమలలో కేక్ కట్ చేసి నెటిజన్ల ఆగ్రహానికి గురయ్యారు. శ్రీవారి సన్నిధిలో ఇలాంటి చర్యలు పవిత్రతను దెబ్బతీస్తాయని భక్తులు మండిపడటంతో, టీటీడీ.. విజిలెన్స్ విభాగం పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనిపై కేసు నమోదు కావడంతో మాధురి ఆత్మరక్షణలో పడ్డారు. ఈ వివాదంపై వివరణ ఇస్తూ దివ్వెల మాధురి సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘గతంలో జాన్వీకపూర్ కూడా తిరుమలలో కేక్ కట్ చేశారు, అప్పుడు లేని అభ్యంతరం నేను చేస్తేనే ఎందుకు? నన్నే ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? మీడియాకి ఏదో ఒక హాట్ టాపిక్ కావాలి. టిఆర్‌పి రేటింగ్ పెంచుకోవడానికి నన్ను ఉపయోగించుకుంటున్నారు. అలాగే చెయ్యనివ్వండి. నేను అలా ఉపయోగపడడం నాకూ గర్వంగానే ఉంది’ అన్నారు. ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో జాన్వీకపూర్ దృష్టికి వెళ్లాయి. సాధారణంగా వివాదాలకు దూరంగా ఉండే జాన్వీ, ఈ అబద్ధపు ఆరోపణలపై తీవ్రంగా మండిపడ్డారు. ‘అసలు ఈ మహిళ ఎవరు?’ అంటూ ఆమె సూటిగా ప్రశ్నించారు. తాను తిరుమలలో ఎప్పుడూ కేక్ కట్ చేయలేదని, తనపై వస్తున్నవన్నీ అసత్య ప్రచారాలని కొట్టిపారేశారు. ప్రచారం కోసం ఇతరులపై నిందలు వేయడం సరైన పద్ధతి కాదని అన్నారు. జాన్వీకపూర్ శ్రీవారికి పరమ భక్తురాలు. ఆమె తరచుగా తిరుమలకు కాలినడకన వచ్చి స్వామివారిని దర్శించుకుంటారు. భారతీయ సంస్కృతి, సంప్రదాయాల పట్ల తనకు ఎంతో గౌరవం ఉందని, అలాంటి పవిత్ర స్థలంలో తాను ఎప్పుడూ నిబంధనలు ఉల్లంఘించలేదని ఆమె స్పష్టం చేశారు. కేవలం తనను తాను సమర్థించుకోవడానికి సెలబ్రిటీల పేర్లు వాడటం సరికాదని సూచించారు. ఈ విషయంలో నెటిజన్లు కూడా జాన్వీకపూర్‌కే మద్దతుగా నిలుస్తున్నారు. శ్రీవారి భక్తురాలైన జాన్వీపై ఇలాంటి తప్పుడు ఆరోపణలు చేయడం మాధురి మూర్ఖత్వమని విమర్శిస్తున్నారు. తిరుమల పవిత్రతను కాపాడాల్సిన బాధ్యత అందరిపై ఉందని, తప్పు చేసిన వారు శిక్ష అనుభవించాల్సిందే కానీ పక్కదారి పట్టించకూడదని కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ వివాదం టాలీవుడ్ మరియు బాలీవుడ్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. టీటీడీ నిబంధనల ప్రకారం తిరుమల కొండపై పుట్టినరోజు వేడుకలు, కేక్ కటింగ్ వంటివి నిషేధం. ఈ నేపథ్యంలో సెలబ్రిటీలైనా, సామాన్యులైనా నిబంధనలు పాటించాల్సిందేనని భక్తులు కోరుతున్నారు. జాన్వీ ఇచ్చిన కౌంటర్‌తో దివ్వెల మాధురి మరిన్ని విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తోంది.
    -నిన్న జరిగిన ఉస్తాద్ ప్రీ  రిలీజ్ ఈవెంట్  -అందరిలో మూవీపై భారీ అంచనాలు -తాను మళ్ళీ బిజీ అవుతుందా!   ఉస్తాద్ భగత్ సింగ్(Ustaad Bhagath SIngh)పవర్ స్టార్ 'పవన్ కళ్యాణ్'(Pawak Kalyan)అభిమానుల ఫోకస్ మొత్తం ఇప్పుడు బుక్ మై షో తో పాటు ఆన్ లైన్ టికెట్స్ యాప్స్ పై ఉంది. ఉగాది సందర్భంగా ఈ నెల 19 న థియేటర్స్ లోకి అడుగుపెడుతున్నా కూడా, ముందు రోజు బెనిఫిట్ షో ఉండటంతో ఏ నిమిషాన ఆన్ లైన్ లో లోడ్ చేస్తారో, ఏ మాత్రం అశ్రద్ధ చేసినా ఎక్కడ టికెట్స్ అయిపోతాయో అనే చిన్నపాటి దిగులు కూడా వాళ్ళల్లో ఉంది. దీంతో ఎన్ని పనులు ఉన్నా ఫోన్ ని మాత్రం వదలడం లేదు. మరో వైపు నిన్న జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ లోని అందరి స్పీచ్ లని మరోసారి మననం చేసుకుంటు 'ఉస్తాద్' అందరికి మంచి బ్రేక్ ఇవ్వాలని కోరుకుంటున్నారు. ఆ లిస్ట్ లో రాశి ఖన్నా కూడా ఉంది. మరి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో  ఆమె మాటలు చూద్దాం. రాశి ఖన్నా(Raashii Khanna)మాట్లాడుతు కెరీర్ ప్రారంభం నుంచి పవన్ కళ్యాణ్ గారితో కలిసి నటించాలని కోరిక ఉండేది. ఉస్తాద్ భగత్ సింగ్ తో నా కల నెరవేరింది. . పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడూ ప్రజల గురించి ఆలోచిస్తూ నిజ జీవితంలో సింపుల్ గా ఉంటారు. ఒక వ్యక్తిగా నాలో ఎంతో స్ఫూర్తిని నింపారు. చాలా తక్కువ మాట్లాడతారు కానీ ప్రతి మాటలో విలువ ఉంటుంది. అంతటి   గొప్ప స్టార్ తో స్క్రీన్ ని పంచుకోవడం గౌరవంగా భావిస్తున్నాను.  నాకు ఈ అవకాశం ఇచ్చిన హరీష్ శంకర్(Harish Shankar)గారికి ధన్యవాదాలు. ఉస్తాద్ కోసం ఎంత కష్టపడ్డారో నేను కళ్లారా చూశాను. గబ్బర్ సింగ్ మ్యాజిక్ ని రిపీట్ చేస్తుందనే నమ్మకం నాలో ఉంది. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ లో పని చేయడం సంతోషంగా ఉంది. ఆ సంస్థలో మరిన్ని సినిమాలు చేయాలి. శ్రీలీల స్వీట్ హార్ట్. తనతో వర్క్ చేయడం చాలా బాగుందని  రాశి ఖన్నా చెప్పుకొచ్చింది. Also read: Ustaad Bhagat Singh: ఈ సారి నిలబడతాడా! ఆ స్పీచ్ ఏంటి స్వామి  ఢిల్లీకి చెందిన రాశి ఖన్నా 2014 లో ఊహలు గుసగుసలాడేతో తెలుగు సిల్వర్ స్క్రీన్ పై టేక్ ఆఫ్ అయ్యింది. సుప్రీమ్, ప్రతి రోజు పండగే తర్వాత చేసిన వరల్డ్ ఫేమస్ లవర్, పక్కా కమర్షియల్ సినిమాలతో పాటు గత ఏడాది చేసిన 'తెలుసు కదా' వరకు పరాజయాలని ఎదుర్కొంది. సినిమాల లిస్ట్ కూడా అంత పెద్దగా లేదు. ఎన్టీఆర్ తో చేసిన జై లవకుశ హిట్ తో తెలుగుతో పాటు ఇతర బాషల్లోను వరుస అవకాశాలని దక్కించుకుంది. మరి ప్రస్తుతం డల్ గా ఉన్న రాశి ఖన్నా కెరీర్ కి  పవన్ తన ఉస్తాద్ భగత్ సింగ్ తో మళ్ళీ జోరుని అందిస్తాడేమో చూడాలి.        
నేటికాలంలో ప్రతి ఇంట్లో వంట గ్యాస్ ఒక ప్రాథమిక అవసరంగా మారింది, కానీ  ప్రస్తుతం గ్యాస్ కొరత ఏర్పడిందని వస్తున్న వార్తల కారణంగా ప్రజల్లో భయం మొదలైంది. ఇంట్లో ఉన్న సిలిండర్ అయిపోతే   గ్యాస్ సిలిండర్లు దొరుకుతాయో లేదో అనే భయం చాలా మందిలో మొదలైంది. కొందరు భయంతో ఇంట్లో గ్యాస్ సిలిండర్ ఉన్నా సరే.. మళ్లీ కొత్తగా బుక్ చేసుకుంటున్నారు.  గ్యాస్ సిలిండర్ కోసం కిలీమీటర్ల మేర క్యూ కట్టిన జనాన్ని వార్తల్లో కూడా చూపిస్తున్నారు. ఈ నైపథ్యంలో గ్యాస్ సిలిండర్ దొరుకుతుందా లేదా అని ఆలోచించేకంటే.. ఇంట్లో ఉన్న గ్యాస్ ను పదుపుగా వాడుకోవడం చాలా మంచిది. గ్యాస్ ను సేవ్ చేసే కొన్ని చిట్కాలు ఫాలో అయితే సరిపోతుంది.  ఆ చిట్కాలు ఏంటో తెలుసుకుంటే.. చాలా మంది వినియోగదారులకు దేశీయ LPG సిలిండర్ యొక్క అసలు బరువు గురించి తెలియదు. సరిగ్గా నింపిన సిలిండర్ బరువు దాదాపు 29.7 కిలోలు, ఇందులో 14.2 కిలోల గ్యాస్ మరియు 15.5 కిలోల ఖాళీ సిలిండర్ బరువు ఉంటుంది. డెలివరీ సమయంలో సిలిండర్ బరువు దీని కంటే తక్కువగా ఉంటే సీలింగ్ చేసే ముందు తక్కువ గ్యాస్ నింపబడిన లేదా తీసివేయబడిన స్కామ్‌ను ఇది సూచిస్తుంది. వంట చేసేటప్పుడు ఈ జాగ్రత్తలు తీసుకోవాలి.. పాత్రల సెలక్షన్..  ఉపయోగించే వంట పాత్రల రకం కూడా  గ్యాస్ వినియోగాన్ని ప్రభావితం చేస్తుంది. వంట చేసేటప్పుడు, ఎల్లప్పుడూ  అడుగున చదునుగా ఉన్న పాత్రలను ఎంచుకోవాలి.  ఈ  పాత్రలు బర్నర్‌పై సరిగ్గా కూర్చుంటాయి, తద్వారా గ్యాస్ వేడి నేరుగా పాత్రను చేరుతుంది. పాత్ర అడుగు భాగం వంకరగా  ఉంటే, వేడి వ్యాపిస్తుంద,  వంట సమయం ఎక్కువ అవుతుంది, ఫలితంగా గ్యాస్ వినియోగం పెరుగుతుంది. మీడియం ప్లేమ్.. అధిక వేడి మీద వంట చేయడం వల్ల ఆహారం త్వరగా ఉడుకుతుందని,  గ్యాస్ వినియోగం తగ్గుతుందని  అనుకుంటారు. అయితే, ఇది చాలా తప్పు. అధిక వేడి ఆహారాన్ని కాల్చేస్తుంది,  ఎక్కువ గ్యాస్‌ను కూడా వినియోగించుకుంటుంది. చాలా కూరగాయలు, పప్పులు,  బియ్యం మీడియం లేదా తక్కువ వేడి మీద మరింత సులభంగా,  సమర్ధవంతంగా వండవచ్చు, దీనివల్ల గ్యాస్ ఆదా అవుతుంది. ప్రెజర్ కుక్కర్.. వంట చేయడానికి వీలైనంత వరకు ప్రెషర్ కుక్కర్‌ను ఉపయోగించడం మేలు. ప్రెషర్ కుక్కర్‌లో ఆహారం తక్కువ సమయంలోనే ఉడుకుతుంది. ఇది గ్యాస్ వినియోగాన్ని గణనీయంగా తగ్గిస్తుంది. మూత పెట్టి వండటం.. వంట చేసేటప్పుడు పాత్రల మీద మూత పెట్టడం కూడా మంచి అలవాటు. మూత లేకుండా వంట చేయడం వల్ల ఆవిరి బయటకు వెళ్లి వంట ఆలస్యం అవుతుంది. మూత ఉపయోగించడం వల్ల ఆవిరి  ఆహారం వేగంగా ఉడుకుతుంది. దీనివల్ల గ్యాస్ కూడా ఆదా అవుతుంది. బర్నర్.. బర్నర్ శుభ్రతపై  శ్రద్ధ వహించాలి. బర్నర్ రంధ్రాలు మూసుకుపోయినా లేదా ధూళి పేరుకుపోయినా, గ్యాస్ సరిగ్గా మండదు, ఫలితంగా గ్యాస్ వినియోగం పెరుగుతుంది. అందువల్ల వారానికి ఒకసారి బర్నర్‌ను శుభ్రం చేసుకోవడం మంచిది. ఇది  మంట బాగా వచ్చేలా చేస్తుంది. గ్యాస్ వినియోగాన్ని తగ్గిస్తుంది.                                                   *రూపశ్రీ.
  ఒకే తల్లి రక్తం పంచుకుని పుట్టినా.. పెద్దయ్యాక జీవితాలు విడివడి దూరం పెరిగే బంధం తోబుట్టువుల బంధం. అయితే ఈ ప్రపంచంలో రక్త సంబంధానికి ఉన్న శక్తి, దాని ప్రత్యేకత చాలా గొప్పది. తల్లిదండ్రులకు చెప్పుకోలేని విషయాలు తోబుట్టువుకు చెప్పుకునే వారు ఎందరో ఉంటారు.   పిల్లల మధ్య ఉన్న తోబుట్టువుల బంధం  జీవితాంతం నిలిచే సంబంధం. ఈ బంధం ప్రేమతో, గౌరవంతో, పరస్పర సహకారంతో ఉండాలంటే తల్లిదండ్రుల పాత్ర చాలా కీలకం.  తల్లిదండ్రులు చేసే  ప్రవర్తన,  ప్రేమ చూపే విధానం, మందలించే తీరు, పోలికలు పెట్టడం లాంటి వాటి వల్ల ఈ బంధం బలపడవచ్చు లేదా బలహీనమవచ్చు. తోబుట్టువుల బంధం బలంగా ఉండాలంటే తల్లిదండ్రులు నేర్పించాల్సినవి ఏంటో తెలుసుకుంటే.. తోబుట్టువుల బంధం బలంగా ఉండటానికి తల్లిదండ్రులు నేర్పించాల్సిన విషయాలు.. సమాన ప్రేమ, గౌరవం.. తల్లిదండ్రులు పిల్లలను  అందరినీ సమానంగా ప్రేమించడం, గౌరవించడం చాలా ముఖ్యం. “నువ్వు పెద్దవాడివి కాబట్టి ఎప్పుడూ తక్కువగా వాదించు” లేదా “నువ్వు చిన్నవాడివి, నీ అక్క/అన్న మాట విను” అనే మాటలు కొన్నిసార్లు అన్యాయంగా అనిపిస్తాయి. పిల్లలు ఇద్దరూ తల్లిదండ్రుల దృష్టిలో సమానమైనవారమనే భావన కలిగి ఉండాలి. ఇది అసూయ లేదా అసమానత ఫీలింగ్ రాకుండా చేస్తుంది.  సహకారం, పంచుకోవడం నేర్పించాలి.. చిన్నప్పటి నుంచే కలిసి ఆటలు ఆడించడం, పని చేయించడం, ఒకరికొకరు సహాయం చేసుకోడం అలవాటు చేయాలి. కలసి చేసే పనులు జట్టు భావన,  బాధ్యతా భావం పెంచుతాయి. కష్టాలు, ఇబ్బందులు పంచుకోవడం..  పిల్లలు తమ ఇబ్బందులను ఒకరితో ఒకరు చెప్పుకోవడం, ఒకరికి ఒకరు సహాయం చేసుకోడం, ఒకరి ఇబ్బందులలో మరొకరు తోడు ఉండటం చిన్నతనం నుండే తల్లిదండ్రులు నేర్పించాలి. దీనివల్ల తోబుట్టువు అంటే ధైర్యం, భరోసా ఏర్పడతాయి.  వివాదాలు వచ్చినప్పుడు న్యాయంగా వ్యవహరించడం.. తల్లిదండ్రులు పిల్లల పట్ల న్యాయంగా ఉండాలి. ఎప్పుడు ఒకరికే తమ సపోర్ట్ ఇవ్వడం, తప్పు చేయకపోయినా ఇంకొకరిని తిట్టడం లాంటివి చేయకూడదు. వివాదాలు, ఇబ్బందులు వచ్చినప్పుడు ఒకరి వెంట మరొకరు ఎలా సపోర్ట్ ఉండాలో కూడా నేర్పించాలి.  పోలికలు కాదు ప్రోత్సాహం ఇవ్వడం.. “నీ తమ్ముడు బాగా చదువుతున్నాడు, నువ్వు ఎందుకు చదవడం లేదు?” లాంటి పోలికలు బంధాన్ని పాడుచేస్తాయి. ప్రతిఒక్కరి బలాలు వేరు.  ఒకరు చదువులో, మరొకరు క్రీడల్లో మెరుస్తారు.  “నీకు వంట బాగా వస్తుంది, నీ అక్క డ్రాయింగ్ బాగా వేస్తుంది”  ఇలాంటి మాటలు  వల్ల ఇద్దరూ తమతమ ప్రతిభను గౌరవిస్తారు.   సమయం కేటాయించడం.. పిల్లలతో సమయం గడపడటం చాలా ముఖ్యం. మరీ ముఖ్యంగా పిల్లల అభిరుచిని బట్టి వారికి సమయాన్ని కేటాయించాలి.  ఇలా చేస్తే పిల్లలందరికీ తల్లిదండ్రులు “నన్ను ప్రత్యేకంగా చూసుకుంటున్నారు” అనే భావన వస్తుంది.  ఇది అసూయ తగ్గిస్తుంది. ప్రేమ చూపే విధానం నేర్పించడం.. తోబుట్టువులు ఒకరికి ఒకరు ప్రేమ చూపడం, క్షమించుకోవడం నేర్పించాలి. “అన్నకు sorry చెప్పు” అనడం కాకుండా, “నీ మాట వల్ల అన్నకి బాధ కలిగింది, ఇప్పుడు ఎలా సరిచేస్తావు?” అని అడగాలి.  ఇది మనసును అర్థం చేసుకునే నైపుణ్యాన్ని పెంచుతుంది.                           *రూపశ్రీ.
వేసవి కాలం అనగానే చాలామందికి కూలర్లు, ఏసీలు గుర్తుకు వచ్చేస్తాయి.  ఫిబ్రవరి నెల వరకు అంతగా అవసరం లేని, ఎక్కువగా వాడని వారు కూడా మార్చి నెలతో ఏసీలు వాడటం మొదలు పెడతారు. ఏసీ ఎంత చల్లదనం ఇస్తుందో.. అంతే కరెంట్ బిల్లు కూడా తెచ్చిపెడుతుంది.  ఏసీని ఎక్కువగా వాడితే వేలాది రూపాయల కరెంట్ బిల్లు వస్తుంది.  ఈ కారణంగానే చాలామంది మధ్యతరగతి కుటుంబాలు ఏసీ పెట్టించుకోవాలి అనే ఆశ ఉన్నా, కరెంట్ బిల్లు ఎక్కువ వస్తుందనే భయంతో ఆ ఆలోచన మానుకుంటారు. అయితే ఏసీ రోజంతా వాడినా సరే.. కరెంట్ బిల్లు ఎక్కువ రాకూడదంటే కొన్ని సీక్రెట్ ట్రిక్స్  ఫాలో అవ్వాలి. అవేంటో తెలుసుకుంటే.. టెంపరేచర్... చాలామంది ఏసీ ఆన్ చేశారంటే తక్కువ టెంపరేచర్ సెట్ చేసుకుంటారు.  ఎక్కువ మంది 17 లేదా 15 వరకు కూడా పెడుతుంటారు. కానీ ఏసీ ని ఎప్పుడూ 26డిగ్రీల వద్ద పెడితే సరిపోతుంది.  ఇది రూమ్ మొత్తం చల్లదనాన్ని ఇస్తుంది. కరెంట్ బిల్లు కూడా తక్కువ వస్తుంది. ఏసీ, ప్యాన్ కాంబినేషన్.. ఏసీ, ప్యాన్ కాంబినేషన్ గురించి చాలామందికి తెలియదు.  ఏసీ వేసినప్పుడు ప్యాన్ ఎందుకు అని కొందరు అనుకుంటారు.  కానీ ఏసీ వేసినప్పుడు కొద్దిసేపు ఫ్యాన్ కూడా ఆన్ చేయాలి.  ఇలా చేస్తే గది తొందరగా చల్లబడుతుంది. ఆ తర్వాత ఫ్యాన్ ఆప్ చేసుకోవచ్చు. డోర్స్, విండోస్.. చాలామంది ఏసీ ఆన్ చేసి డోర్స్, విండోస్ తెరచి ఉంచుతారు. కానీ ఇది చాలా తప్పు.  డోర్స్, విండోస్ తెరచి ఉంచడం వల్ల బయటి వేడి గాలి లోపలి వస్తూ గదిని చల్లబడనివ్వదు.  దీనివల్ల ఏసీ ఎక్కువ పనిచేయాల్సి వస్తుంది. కర్టెన్లు.. కిటికీలకు గాజు అద్దాలు ఉంటే.. వేడి సెగ అనేది లోపలికి వస్తూ ఉంటుంది.  అందుకే కిటికీ ల దగ్గర కర్టెన్లు వేయాలి.  ఇలా చేస్తే వేడి లోపలికి రాదు. ఫిల్టర్.. చాలామంది వేసవి రాగానే ఏసీ వేయాలి అనే ఆలోచన ఉంటుంది కానీ,  ఏసీ ఫిల్టర్ల గురించి మాత్రం అంతగా పట్టించుకోరు.  ఏసీ ఫిల్టర్లను క్లీన్ చేయాలి.  వాటిలో డస్ట్ అలాగే ఉంటే ఏసీ పని చేయడానికి విద్యుత్ ఎక్కువ ఖర్చు అవుతుంది. పైగా ఫిల్టర్ల లో ఉండే డస్ట్ కారణంగా ఆరోగ్యం దెబ్బతింటుంది.  శ్వాస సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. స్లీప్ మోడ్ లేదా టైమర్.. వేసవిలో కాసింత చల్లగాలి తగిలితే చాలు నిద్రపోవచ్చు అనుకునేవారు ఏసీని  ఆన్ చేసినప్పుడు స్లీప్ మోడ్ లేదా టైమర్ సెట్ చేసుకోవడం మంచిది. ఇది సెట్ చేస్తే ఏసీ దానంతకు అదే ఆఫ్ అవుతుంది.  ఇది సెట్ చేసుకొనేటప్పుడు రూమ్ లో ప్యాన్ ఆన్ లో ఉంచితే.. ఏసీ ఆప్ అయినా ఫ్యాన్ కారణంగా నిద్రకు ఆటంకం కలగకుండా హాయిగా నిద్రపోవచ్చు. పైన చెప్పుకున్న చిట్కాలు పాటిస్తే ఏసీ ఎంత వాడినా సరే.. కరెంట్ బిల్లు హడలిపోయేంతగా రాదు.  ఖచ్చితంగా విద్యుత్ బిల్లును ఆదా చేసుకోవచ్చు.                                        *రూపశ్రీ.
డ్రై ఫ్రూట్స్ శరీరానికి చాలా మంచివని చెబుతారు.  డ్రై ఫ్రూట్స్  రుచిగా ఉండటమే కాకుండా శరీరానికి మంచి పోషకాలను,  ఆరోగ్యకరమైన కొవ్వులను అందిస్తాయి.  అయితే డ్రై ఫ్రూట్స్ శరీరానికి ఎంత మంచివో.. వాటిలో ఎంత మంచి పోషకాలు ఉంటాయో.. వాటిని తీసుకునే విధానం సరిగా లేకపోతే అవన్నీ వ్యర్థమయినట్టే అని అంటున్నారు పోషకాహార నిపుణులు, వైద్యులు.. అంతేకాదు.. ఏ డ్రై ఫ్రూట్స్ లేదా నట్స్ శరీరంలో ఏ అవయవానికి మేలు చేస్తుందో తెలుసుకుని తీసుకోవడం కూడా చాలా ముఖ్యం అంటున్నారు.  వీటి గురించి పూర్తీగా తెలుసుకుంటే.. బాదం.. బాదంలో పోషకాలు చాలా ఉంటాయి. ముఖ్యంగా విటమిన్ ఇ, మెగ్నీషియం, కాల్షియం, ప్రోటీన్, ఆరోగ్యకరమైన కొవ్వులు ఉంటాయి.  ప్రయోజనాలు.. మెదడును పదును పెట్టి జ్ఞాపకశక్తిని మెరుగుపరుస్తుంది.  చర్మాన్ని ఆరోగ్యంగా,  యవ్వనంగా ఉంచుతుంది.   ఎముకలను బలపరుస్తుంది,  గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. వాల్నట్.. వాల్నట్స్ లో ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు, ప్రోటీన్, ఫైబర్, విటమిన్ B6 వంటి పోషకాలు ఉంటాయి.  ప్రయోజనాలు.. వాల్నట్స్ ముఖ్యంగా మెదడు ఆరోగ్యానికి,   జ్ఞాపకశక్తికి అద్భుతమైనది.  గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది, కొలెస్ట్రాల్‌ను నియంత్రిస్తుంది.   వాపు,  ఉద్రిక్తతను తగ్గిస్తుంది. జీడిపప్పు.. జీడిపప్పులో మెగ్నీషియం, ప్రోటీన్, భాస్వరం, జింక్ వంటి పోషకాలు ఉంటాయి.  ప్రయోజనాలు.. జీడిపప్పు  ఎముకలు, దంతాలను బలపరుస్తుంది.  చర్మానికి,  జుట్టుకు మంచిది. గుండె ఆరోగ్యానికి సహాయపడుతుంది. పిస్తా పప్పు.. డ్రై ఫ్రూట్స్ లో పిస్తా పప్పు కూడా ఖరీదైనది.  పిస్తా పప్పులో ప్రోటీన్, ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు, విటమిన్ B6 వంటి పోషకాలు ఉంటాయి.  ప్రయోజనాలు..   పిస్తా పప్పు గుండె,  రక్త నాళాలను ఆరోగ్యంగా ఉంచుతుంది.  బరువు నియంత్రణ,  జీర్ణక్రియకు సహాయపడుతుంది.  మెదడు,  కళ్ళకు మేలు చేస్తుంది. ఎండు ద్రాక్ష.. ఎండు ద్రాక్ష భారతీయులు ఎక్కువగా ఉపయోగించే, ఎంతో కాలం నుండి వాడుతున్న డ్రై ప్రూట్..  ఎండు ద్రాక్షలో ఐరన్, కాల్షియం, పొటాషియం, యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి.  ప్రయోజనాలు..   రక్తహీనతను తొలగించడంలో ఎండుద్రాక్ష చాలా బాగా పనిచేస్తుంది. ఎముకలు,  దంతాలను బలపరుస్తుంది. కడుపు ఆరోగ్యానికి  జీర్ణక్రియకు మంచిది. అంజీర్.. అంజీర్ చాలా శక్తివంతమైన డ్రై ఫ్రూట్. అంజీర్ లో ఫైబర్, కాల్షియం, పొటాషియం, మెగ్నీషియం వంటి పోషకాలు ఉంటాయి.  ప్రయోజనాలు..  జీర్ణక్రియ,  మలబద్ధకం నుండి ఉపశమనం కలిగిస్తుంది.  ఎముకలు,  దంతాలను బలపరుస్తుంది. గుండె,  రక్తంలో చక్కెరను నియంత్రిస్తుంది. ఖర్జూరం.. ఖర్జూరానికి చాలా ప్రత్యేక ప్రాధాన్యత ఉంది.  ఖర్జూరంలో సహజ చక్కెరలు, ఐరన్, పొటాషియం, మెగ్నీషియం వంచి పోషకాలు ఉంటాయి.  ప్రయోజనాలు..    ఖర్జూర పండ్లు తింటే తక్షణ శక్తిని ఇస్తుంది. రక్తాన్ని మెరుగుపరచడంలో,  బలహీనతను తొలగించడంలో సహాయపడుతుంది. గుండె,  కండరాలకు ప్రయోజనకరంగా ఉంటుంది.                                               *రూపశ్రీ.
వేసవి వచ్చేసింది. వేసవి కాలం దానితో పాటు మండే ఎండలు,  ఎండ వేడిని వెంట పెట్టుకుని వస్తుంది. ఈ సీజన్‌లో చెమట, శరీరం తేమ కోల్పోవడం,   నిరంతరం  అలసటగా అనిపించడం వంటి సమస్యలు పెరుగుతాయి. పెరుగుతున్న వేడి,  వేడిగాలుల కాలంలో శరీరాన్ని చల్లగా ఉంచుకోవడం చాలా ముఖ్యం.  వేసవి కాలంలో  హైడ్రేటెడ్ గా ఉండటానికి నీరు తాగుతారు,  కానీ అది శరీరాన్ని చల్లబరచదు. ఎన్ని నీళ్లు తాగినా తృప్తి కలగదు.  మార్కెట్ లో పానీయాలు కొనుగోలు చేయడం,  మరీ ముఖ్యంగా కూల్ డ్రింకుల కొనుగోలు వేసవిలో బాగా పెరుగుతాయి. కానీ వీటిలో రసాయనాలు ఉంటాయి.  ఈ వేసవిలో శరీరం చల్లగా ఉండాలంటే ఇంట్లోనే చేసుకోదగిన కొన్ని పానీయాలు తీసుకోవడం మంచిది. భారతీయులకు ఎంతో సుపరిచితమైన,  ఆరోగ్యానికి మేలు చేస్తూ వేసవి తాపాన్ని తగ్గించే పానీయాలు ఏంటో తెలుసుకుంటే.. బేల్ షర్బత్.. పరమ శివుడి ఆరాధనలో ఉపయోగించే బిల్వ  పత్రం మాత్రమే మనకు తెలుసు. కానీ బిల్వ వృక్షానికి పండ్లు కూడా కాస్తాయి.  వీటినే బిల్వ పండ్లు లేదా బేల్ పండ్లు అని మారేడు కాయలు అని అంటూ ఉంటారు.  ఇవి ఆరోగ్యానికి చాలా మంచివి. బాగా పండిన బిల్వ పండ్లను జ్యూస్ చేసి తాగితే శరీరం చల్లబడుతుంది. కావలసిన పదార్థాలు.. పండిన బిల్వ పండు చల్లని నీరు.. 4 గ్లాసులు బెల్లం లేదా చక్కెర.. 3 నుండి 4 స్పూన్లు నల్ల ఉప్పు.. కొద్దిగా. తయారు విధానం.. బిల్వ పండును పగలగొట్టి గుజ్జు తీయాలి.  ఈ గుజ్డులో నీరు పోసి బాగా బ్లెండ్ చేయాలి.  స్ట్రైయినర్ సహాయంతో వడబోయాలి. ఇందులో బెల్లం లేదా పంచదార,  నల్ల ఉప్పు వేసి బాగా కరిగిన తర్వాత తాగాలి. ఆమ్ పన్నా.. వేసవి అంటే మామిడికాయలు.  పచ్చి మామిడి కాయలతో చేసే ఆమ్ పన్నా రుచిగానే కాకుండా శరీరానికి చలువ చేస్తుంది. కావలసిన పదార్థాలు.. పచ్చి మామిడికాయలు.. 2 బెల్లం లేదా చక్కెర.. 3 టీస్పూన్లు వేయించిన జీలకర్ర పొడి నల్ల ఉప్పు పుదీనా.. తయారీ విధానం.. మామిడికాయలు ఉడకబెట్టి గుజ్జు తీసుకోవాలి.  గుజ్జులో బెల్లం లేదా చక్కెర వేయాలి. ఇందులో కాసింత పుదీనాను వేసి మిక్సీ వేసుకోవాలి.  దీనికి కావలసినంత నీరు కలిపి జ్యూస్ లాగా చేసుకోవాలి. ఇందులో వేయించిన జీలకర్ర పొడి, నల్ల ఉప్పు వేసి కలిపి తాగాలి.  ఇది శరీరాన్ని చల్లబరుస్తుంది. జల్ జీరా.. జల్ జీరా పేరు వింటేనే ఒక రిఫ్రెషింగ్ ఫీలింగ్ వస్తుంది.  ఇది ఆరోగ్యానికి ఆరోగ్యం,  శరీరానికి చలువ,  గ్యాస్, అజీర్ణం నుండి ఉపశమనం కూడా ఇస్తుంది. కావలసిన పదార్థాలు.. జల్ జీరా పొడి నీరు పుదీనా నిమ్మరసం నల్ల ఉప్పు తయారీ విధానం.. చల్లని నీటిలో జల్ జీరా పొడి,  నిమ్మరసం, నల్ల ఉప్పు,  పుదీనా అన్నీ వేసి బాగా కలిపి తాగడమే.   సత్తు జ్యూస్.. బీహార్, ఉత్తర ప్రదేశ్ ప్రాంతాలలో సత్తును వేసవిలో  తాగుతారు. ఇది చాలా శక్తివంతమైన పానీయం.  కడుపును చల్లబరుస్తుంది,  ఆకలిని నియంత్రణలో ఉంచుతుంది. కావలసిన పదార్థాలు.. సత్తు పొడి.. నల్ల ఉప్పు.. వేయించిన జీలకర్ర పొడి నిమ్మరసం తయారీ విధానం.. నీటిలో సత్తు పొడి, నల్ల ఉప్పు,  వేయించిన జీలకర్ర పొడి అన్ని వేసి బాగా మిక్స్ చేయాలి.  ఇందులో కాసింత నిమ్మరసం కలిపి తాగాలి. మజ్జిగ.. బారతీయులు ఎక్కువగా తాగే ఆరోగ్యకరమైన పానీయం మజ్జిగ.  పెరుగు నుండి  వెన్నను తీయగా మిగిలిన పానీయమే మజ్జిగ.  ఈ మజ్జిగ మరింత రుచిగా ఉండటానికి ఇందులో అల్లం, వేయించిన జీలకర్ర పొడి, నల్ల ఉప్పు,  పొదీనా వేసి తాగుతారు.  మజ్జిగ మరింత రుచిగా రావడానికి కరివేపాకుతో పోపు పెట్టి తాగుతారు.  ఇందులో కొత్తి మీర వేసుకుంటే రుచి మరింత బాగుంటుంది.                               *రూపశ్రీ.
నేటి ఉరుకుల పరుగుల జీవితంలో మన ఆరోగ్యం పట్ల మనం చూపే నిర్లక్ష్యం మనల్ని ఎక్కడికి తీసుకువెళుతుందో తెలుసా? ప్రపంచవ్యాప్తంగా దాదాపు 8 బిలియన్ల మంది ఊబకాయం (Obesity) మరియు దాని సంబంధిత వ్యాధులతో పోరాడుతున్నారు. ఇది కేవలం శరీర ఆకృతికి సంబంధించిన సమస్య కాదు.. ఇది మన ఆయుష్షును తగ్గించే ఒక నిశ్శబ్ద శత్రువు. ఈ రోజు మనం మన ఆరోగ్యం గురించి గంభీరంగా ఆలోచించకపోతే, రేపు భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది.  Metabolic and Bariatric Surgeon Dr. Kona Lakshmi చెప్పిన మరిన్ని విషయాలు Video Link క్లిక్ చేసి తెలుసుకోండి. మనం ఎందుకు అప్రమత్తంగా ఉండాలి? (Why should we care?) ఊబకాయం అనేది ఇతర ప్రమాదకరమైన రోగాలకు ఒక ముఖద్వారం లాంటిది. దీనివల్ల కలిగే నష్టాలు ఊహించలేనంత దారుణంగా ఉంటాయి: గుండె మరియు ఊపిరితిత్తులపై ప్రభావం: మీ బరువు పెరిగేకొద్దీ మీ ఊపిరితిత్తులపై ఒత్తిడి పెరుగుతుంది, ఇది గుండె దెబ్బతినడానికి దారితీస్తుంది. సడన్ కార్డియాక్ డెత్స్‌కు ఊబకాయం ప్రధాన కారణం. క్యాన్సర్ ముప్పు: దాదాపు 13 రకాల క్యాన్సర్లు నేరుగా ఊబకాయంతో ముడిపడి ఉన్నాయి. మెటబాలిక్ వ్యాధులు: డయాబెటిస్ (షుగర్), హై బ్లడ్ ప్రెషర్, మరియు కొలెస్ట్రాల్ వంటి సమస్యలు బాడీలోని "ఇంజిన్"ను లోపల నుండి దెబ్బతీస్తాయి. కీళ్ల నొప్పులు: అధిక బరువు వల్ల ఆర్థరైటిస్ వంటి కీళ్ల సంబంధిత సమస్యలు తలెత్తుతాయి. ఏమి చేయకూడదు? (What not to do?) మనం తెలియకుండానే చేసే కొన్ని పొరపాట్లు మనల్ని అనారోగ్యం వైపు నెట్టేస్తాయి: పెద్ద సైజు దుస్తులపై ఆధారపడకండి: మార్కెట్‌లో 3XL నుండి 5XL వరకు దుస్తులు దొరుకుతున్నాయి కదా అని, బరువు తగ్గడానికి బదులు పెద్ద సైజు బట్టలు కొనడం అలవాటు చేసుకోవద్దు. మీ డ్రెస్ సైజు పెరుగుతుంటే, మీ అనారోగ్యం పెరుగుతోందని గుర్తించండి. నిర్లక్ష్యం వద్దు: "నేను బాగానే నడుస్తున్నాను కదా, నాకు ఏమీ కాదు" అని భ్రమపడకండి. లోపల షుగర్ లేదా కొలెస్ట్రాల్ ఎంత ఉందో బయటకి కనిపించదు. కెమికల్స్ వినియోగం: ఫుడ్ కలర్స్, పెస్టిసైడ్స్ ఉన్న ఆహారం మరియు విపరీతమైన కెమికల్స్ ఉన్న స్కిన్ కేర్ ప్రోడక్ట్స్ వాడటం వల్ల శరీర మెటబాలిజం దెబ్బతింటుంది. ఆరోగ్యం కోసం ఏం చేయాలి? (How to manage?) BMI పర్యవేక్షణ: మీ ఎత్తుకు తగ్గ బరువు (BMI) ఉన్నారో లేదో చూసుకోండి. సాధారణంగా BMI 18 నుండి 24 మధ్య ఉండాలి. ముందస్తు గుర్తింపు: మీకు ఆయాసం వస్తున్నా లేదా 15 నిమిషాలు కూడా నిరంతరంగా నడవలేకపోతున్నా మీ సిస్టమ్ ఫెయిల్ అవుతుందని అర్థం. వెంటనే వైద్యుడిని సంప్రదించండి. జీవనశైలి మార్పులు: కాలుష్యం, జంక్ ఫుడ్ మరియు కెమికల్స్ కు దూరంగా ఉంటూ, శారీరక శ్రమను పెంచుకోవాలి. ప్రశ్నలు - సమాధానాలు (Q&A) 1. సన్నగా ఉన్నవారికి కూడా ఊబకాయం సమస్యలు ఉంటాయా?  అవును, బరువు తక్కువగా ఉన్నా మెటబాలిక్ సమస్యలు (షుగర్, బిపి) ఉండవచ్చు. ఊబకాయం అంటే కేవలం బయటకి కనిపించే కొవ్వు మాత్రమే కాదు, శరీర అంతర్గత వ్యవస్థల పనితీరులో లోపం కూడా. 2. 'మార్బిడ్ ఒబేసిటీ' అంటే ఏమిటి? BMI 40 కంటే ఎక్కువ ఉంటే దానిని 'మార్బిడ్ ఒబేసిటీ' అంటారు. ఈ స్థితిలో ఊబకాయం అనేది కేవలం బరువు సమస్య కాదు, అది ప్రాణాపాయ స్థితిని (Life risk) సూచిస్తుంది. 3. బేరియాట్రిక్ సర్జరీ అంటే కేవలం బరువు తగ్గడమేనా?  కాదు, ఈ సర్జరీ వల్ల బరువు తగ్గడంతో పాటు మెటబాలిక్ డిసీజెస్ (డయాబెటిస్, హై బిపి) కూడా కంట్రోల్ అవుతాయి, అందుకే దీనిని మెటబాలిక్ అండ్ బేరియాట్రిక్ సర్జరీ అంటారు. మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంది. ఊబకాయం అనేది మనకు సమయం ఇస్తుంది, దాన్ని మనం కంట్రోల్ చేయాలి. రేపటి తరానికి ఆరోగ్యకరమైన భవిష్యత్తును ఇవ్వాలంటే ఈ రోజే మనం మారాలి. ఆరోగ్య విషయాలపై మరింత లోతైన అవగాహన కోసం మరియు నిపుణుల సలహాల కోసం ఇప్పుడే మా TeluguOne Health యూట్యూబ్ ఛానెల్‌లో చూడండి (సబ్‌స్క్రైబ్ చేయడం మర్చిపోకండి!) ఆరోగ్యంగా ఉండండి.. ఆనందంగా జీవించండి!