Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...విజయ్ టీవీకేదే అధికారం.. ఎగ్జిట్ పోల్స్ లో యాక్సిస్ మై ఇండియా అంచనా
posted on: Apr 30, 2026 10:53AM

ఏప్రిల్ 29న విడుదలైన తమిళనాడు ఎగ్జిట్ పోల్స్ దేశవ్యాప్తంగా పెను సంచలనం సృష్టించాయి. ప్రదీప్ గుప్తాకి చెందిన యాక్సిస్ మై ఇండియా సర్వే ఫలితాలు అందరినీ విశ్మయ పరిచాయి. తమిళనాట విజయ్ టీవీకే పార్టీ ప్రభంజనం సృష్టించబోతోందని యాక్సిస్ మై ఇండియా సర్వే అంచనా వేసింది. తమిళనాట అధికారం చేపట్టడానికి అవసరమైన మ్యాజిక్ ఫిగర్ 117 కాగా.. విజయ్ టీవీకే పార్టీ 98 నుంచి 120 సీట్లు గెలిచే అవకాశం ఉందని యాక్సిస్ మై ఇండియా సర్వే అంచనా వేసింది. అంటే తమిళనాడులో టీవీకే పార్టీ విజయం సాధిస్తుందన్నది ఆయన అంచనా అన్నమాట.
ఇక డీఎంకే కూటమికి 92 నుంచి110 సీట్లు, అన్నాడీఎంకేకి 22 - 32 సీట్లు వస్తాయని యాక్సిస్ మై ఇండియా సర్వే పేర్కొంది. ప్రదీప్ గుప్తా విశ్లేషణ ప్రకారం.. ముఖ్యంగా 18 నుంచి 39 ఏళ్ల మధ్య ఉన్న యువత తమిళనాట సుమారు 42శాతంగా ఉన్నారు. వీరంతా గంపగుత్తగా విజయ్ వైపు మొగ్గు చూపారు. అందుకే ఆయన టీవీకే విజయం సాధిస్తుందనీ, ఆ విజయం 1983లో ఎన్టీఆర్ సృష్టించిన ప్రభంజనంతో పోల్చదగినదిగా ఉంటుందనీ పేర్కొన్నారు.
అదలా ఉంటే.. మిగిలిన ప్రముఖ సర్వేలన్నీ.. డీఎంకే మళ్లీ అధికారం చేపడుతుందని చెబుతున్నాయి. పీపుల్స్ పల్స్ సర్వే అయితే డీఎంకే కూటమికి 125 నుంచి 145 సీట్లు వస్తాయనీ, విజయ్ టీవీకే 18 నుంచి 24 సీట్లలో మాత్రమే విజయం సాధిస్తుందనీ పేర్కొంది. అదే విధంగా మాట్రిజ్ సర్వే టీవీకే పార్టీకి పది నుంచి పన్నెండ్లు సీట్లు రావడమే గగనమని పేర్కొంది.ఇక పోతే.. పీమార్క్ సర్వీ విజయ్ పార్టీ 16 నుంచి 26 సీట్లలో విజయం సాధించే అవకాశాలున్నాయని పేర్కొంది.
అంటే.. ఒకవైపు దాదాపు అన్ని సర్వేలూ.. స్టాలిన్ హవా కొనసాగుతుందని చెబుతుంటే, ప్రదీప్ గుప్తా యాక్సిస్ మై ఇండియా మాత్రం విజయ్ విజయం ఖాయమని పేర్కొంది. అయితే.. ఇక్కడ చెప్పుకోవలసిందేమిటంటే.. యాక్సిస్ మై ఇండియా గత లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి 400 సీట్లు వస్తాయని అంచనా వేసింది. అది తప్పవడంతో ప్రదీప్ గుప్తా టీవీ లైవ్ డిబేట్ లోనే కన్నీళ్లు పెట్టుకున్నారు. అప్పట్లో ఆయన అంచనాలు తప్పినా.. అంతకు ముందు.. అంటే గతంలో దాదాపు 90శాతం పైగా.. ఆయన అంచనాలు నిజమయ్యాయి. అందుకే ఈసారి ఆయన విజయ్ పై వేసిన విజిల్ నిజమవుతుందా లేదా? అన్న ఉత్కంఠ వ్యక్తమౌతోంది.



.webp)


