LATEST NEWS
  తెలుగువన్ ‘వాస్తవ వేదిక’ తాజా సంచికలో ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపై ఉత్కంఠభరిత చర్చ జరిగింది. తెలుగువన్ ఎండీ కంఠంనేని రవిశంకర్ సారథ్యంలో జరిగిన ఈ చర్చలో ‘జమీన్ రైతు’ సంపాదకుడు డోలేంద్ర ప్రసాద్ పాల్గొని పలు కీలక అంశాలపై తమ అభిప్రాయాలను స్పష్టంగా వెల్లడించారు. వివేకానంద రెడ్డి హత్య కేసు విషయానికి వస్తే, వైఎస్ సునీతకు న్యాయం జరగలేదని డోలేంద్ర ప్రసాద్ అభిప్రాయపడ్డారు. ఈ కేసులో సీబీఐ వ్యవహార శైలి పట్ల కూడా అనుమానాలు వ్యక్తం చేస్తూ, భారత చరిత్రలోనే ఒక వ్యక్తిని అరెస్ట్ చేయడంలో సీబీఐ వెనుకడుగు వేసిందా? అని రవిశంకర్ ప్రశ్నించారు. ఈ హత్య కేసు ఆధారంగా సినిమా తీస్తే అది ‘బాహుబలి’కంటే పెద్ద హిట్ అవుతుందేమోనని రవిశంకర్ వ్యాఖ్యానించగా, దానికి స్పందించిన డోలేంద్ర ప్రసాద్—ఇది రాజమౌళి కాదు, రామ్ గోపాల్ వర్మ తీసే కథ అని వ్యాఖ్యానించారు. “హూ కిల్డ్ బాబాయ్?” అనే ప్రశ్నకు ఇంకా సమాధానం దొరకలేదని, చివరికి కేసు మూసివేసే ప్రయత్నాలు జరిగాయని విమర్శించారు. జగన్ మీడియా, ఎంపీ అవినాశ్ రెడ్డి, వివేక వివాహేతర సంబంధాల కోణంలో హత్యను మళ్లించే ప్రయత్నం చేసిందని డోలేంద్ర ప్రసాద్ ఆరోపించారు. ఈ కేసును సీఎం చంద్రబాబు సక్రమంగా హ్యాండిల్ చేయలేదని, తనపైకి వస్తుందనే భయంతో వెనుకడుగు వేశారని కూడా విమర్శించారు. సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వర్లరావు వద్ద కీలక ఆధారాలు ఉన్నప్పటికీ వాటిని పరిగణలోకి తీసుకోలేదని, అప్పటి కడప ఎస్పీ నిజాయితీగా విచారణ చేస్తుండగా ఆయనను బదిలీ చేశారని తెలిపారు. ఇక రాష్ట్ర రాజకీయాలపై మాట్లాడుతూ—తమిళనాడులో ఎవరైనా అధికారంలో ఉన్నా కేంద్ర నిధుల కోసం ఐక్యంగా పోరాడతారని, కానీ ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం పరిస్థితి భిన్నంగా ఉందని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం పరిశ్రమలను తీసుకురావడానికి ప్రయత్నిస్తుంటే, జగన్ కోర్టుల్లో కేసులు వేసి అడ్డుకుంటున్నారని ఆరోపించారు. ప్రభుత్వానికి మంచి పేరు రాకూడదనే స్వార్థంతోనే జగన్ వ్యవహరిస్తున్నారని డోలేంద్ర ప్రసాద్ వ్యాఖ్యానించారు. మరోవైపు, వచ్చే రెండున్నర సంవత్సరాల్లో అమరావతి నిర్మాణం పూర్తికాకపోతే చంద్రబాబు చరిత్రలో నిలబడలేరని హెచ్చరించారు. అమరావతి నిర్మాణం జరగకపోతే రైతుల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురవుతుందని కూడా తెలిపారు. రాజధాని అమరావతి నిర్మాణంలో మంత్రి పీ. నారాయణ విఫలమయ్యారని విమర్శించిన డోలేంద్ర ప్రసాద్, ఇప్పటికైనా తన సూచనలు తీసుకుని వేగంగా పనులు పూర్తి చేయాలని సూచించారు. ఇదే విషయాన్ని రవిశంకర్ కూడా ప్రస్తావిస్తూ—రైతులకు న్యాయం చేయాలంటే అమరావతి నిర్మాణాన్ని వేగవంతం చేయాలని కోరారు.ఇలాంటి పలు ఆసక్తికర రాజకీయ అంశాలపై కంఠంనేని రవిశంకర్, డోలేంద్ర ప్రసాద్‌ల మధ్య జరిగిన పూర్తి స్థాయి చర్చను తెలుగువన్ యూట్యూబ్ ఛానల్‌లో వీక్షించవచ్చు.  
ఆంధ్రప్రదేశ్ లో అధికారంలో ఉన్న తెలుగుదేశం కూటమి ప్రభుత్వంలో  సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేష్ అత్యంత కీలకం అనడంలో సందేహం లేదు.  ఈ ముగ్గురి మధ్య బంధం, అనుబంధం ఎంత బలంగా ఉందో.. రాజకీయాలలోనూ, వ్యక్తిగత విషయాలలోనూ, నిబంధనలను తు.చ. తప్పకుండా అమలు చేయడంలోనూ, నైతిక వర్తనలోనూ ముగ్గురూ ముగ్గురే అన్నట్లుగా ఉంటారు. వీరి రుజువర్తనకూ, హాస్య చతురతకు నిలువెత్తు నిదర్శనంగా నిలిచిన అరుదైన సంఘటన ఇటీవల దివ్యాంగ శక్తి పథకం ప్రారంభోత్సవం సందర్భంగా జరిగింది. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవ్వడమే కాకుండా ఈ ముగ్గురిపై నెటిజనుల ప్రశంసల పూల జల్లు కురవడానికి కారణమైంది. ఇంతకీ విషయం ఏమిటంటే.. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్,  మంత్రి నారా లోకేష్ కలిసి ఇటీవల ఒకే ఆర్టీసీ బస్సులో ప్రయాణించారు. అదెప్పుడంటే.. రాష్ట్రవ్యాప్తంగా దివ్యాంగులకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని కల్పించే 'దివ్యాంగ శక్తి' పథకం ప్రారంభోత్సవం సందర్భంగా. ఈ ముగ్గురూ కలిసి దివ్యాంగ శక్తి పథకం లబ్ధి దారులతో కలిసి ఆర్టీసీ బస్సులో ప్రయాణించారు.   మంగళగిరిలో ఏర్పాటు చేసిన  కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పచ్చ జెండా ఊపి దివ్యాంగ శక్తి పథకాన్ని ప్రారంభించిన సంగతి తెలిసిందే. అనంతరం చంద్రబాబు  పవన్ కళ్యాణ్, నారా లోకేష్ లతో కలిసి దివ్యాంగులకు ధైర్యం నింపే విధంగా వారితో పాటు బస్సులో ప్రయాణించారు. ఈ సందర్భంగానే  బస్సులో వీరిరువురి మధ్యా జరిగిన సరదా సంభాషణకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అయ్యింది. ఆ వీడియోలో బస్సులో కూర్చున్న చంద్రబాబు వెనుక వస్తున్న పవన్ కల్యాణ్ ను ఉద్దేశించి.. ఈ బస్సులో  దివ్యాంగులకు మాత్రమే ఉచిత ప్రయాణం.. మీరు టికెట్ తీసుకోవలసిందే అని గట్టిగా చెప్పారు. ఇందుకు పవన్ కల్యాణ్ తనదైన శైలిలో బిగ్గరగా నవ్వారు. ఆ వెనుకే ఉన్న లోకేష్ మాత్రం చంద్రబాబుతో అంతే సరదాగా మనమందరం ఎమ్మెల్యేలం కదా.. కనుక ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణానికి అర్హులమే  అని బదులిచ్చారు. అయితే తాము తమ గుర్తింపు కార్డులను వెంట తేచ్చుకోలేదని చెబుతూ.. తనకూ, పవన్ కల్యాణ్ కూ చంద్రబాబుకు టికెట్ తీసుకున్నారు.తాము తీసుకున్న టికెట్ ముగ్గురి కోసమేనని మరోసారి కండక్టర్ వద్ద నిర్ధారించుకున్నారు. ప్రస్తుతం ఈ వీడియో నెటిజనుల మనసు దోచుకుంది. ముగ్గురు నేతల మధ్యా ఆత్మీయ బంధానికి ప్రతీకగా ఉండటమే కాకుండా విలువలకు వారిచ్చే ప్రాధాన్యతను కూడా ఎత్తి చూపింది. ఈ వీడియో తెలుగుదేశం, జనసేన పార్టీలలో జోష్ నింపుతోంది. కూటమి పార్టీల మధ్యా చీలిక వస్తుందని  ఎదురు చూస్తున్న వారి ఆశలు అడియాశలేనని విస్పష్టంగా తేల్చేసింది.  
చంద్రబాబు తన మంత్రివర్గాన్ని విస్తరించనున్నారా? అంటే పరిశీలకుల నుంచి మాత్రం విస్తరణ కాదు ప్రక్షాళనకు ఆయన మొగ్గు చూపుతున్నారన్న విశ్లేషణలు వస్తున్నాయి. కాగా చంద్రబాబు కేబినెట్ ప్రక్షాళనపై గత కొన్ని రోజులుగా రాజకీయవర్గాలలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. పలువురు మంత్రుల పనితీరుపై చంద్రబాబు అసంతృప్తిగా ఉన్నారనీ, అందుకే కేవలం కేబినెట్ విస్తరణకు, పునర్వ్యవస్థీకరణకు పరిమితం కాకుండా సమూల ప్రక్షాళనే బెటర్ అన్న అభిప్రాయంతో ఉన్నారనీ పార్టీ వర్గాల నుంచి కూడా వినబడుతోంది.   చంద్రబాబు కూడా పలు సందర్భాలలో కొందరు మంత్రుల పనితీరు బాగా లేదనీ, వారు తమ తీరు మార్చుకోవాలని పలుమార్లు సూచించిన విషయం తెలసిందే. అయితే ఏ సందర్భంలోనూ కూడా ఆయన పని తీరు బాగా లేని మంత్రుల పేర్లు వెల్లడించలేదు. ఇక బాబు తనదైన శైలిలో ఎప్పటికప్పుడు మంత్రుల పని తీరును సమీక్షిస్తున్న సంగతి తెలిసిందే. శాఖల వారీగా జరిగే సమీక్షలలోనే సీఎం చంద్రబాబు మంత్రుల పనితీరును కూడా మదింపు చేస్తూ వస్తున్నారనీ, ఇప్పుడు ఆ మదింపే ప్రామాణికంగా నిర్ణయం తీసుకుంటారని అంటున్నారు.  అయితే చంద్రబాబు కేబినెట్ ప్రక్షాళన అంటూ చేస్తే ఎంత మందిపై వేటు పడుతుంది? ఎందరిని కొత్తగా కేబినెట్ లోకి తీసుకుంటారు? ఎవరెవరి శాఖలు మారుస్తారు అన్న దానిపై పలు అభిప్రాయాలు రాజకీయవర్గాలలో వ్యక్తం అవుతున్నాయి. అయితే పార్టీ సీనియర్ నేతలు మాత్రం పెద్ద సంఖ్యలో కేబినెట్ నుంచి ఉద్వాసనలు ఉండే అవకాశం లేదనీ, పని తీరు మెరుగు పరుచుకునేందుకు కనీసం ప్రయత్నించని ఒకరిద్దరు మంత్రులపై వేటు పడే అవకాశం ఉందనీ అంటున్నారు.   ఇక కొత్తగా కేబినెట్ లోకి తీసుకునే వారిలో యువకులకు అధిక ప్రాధాన్యత ఉండే అవకాశం ఉందని చెబుతున్నారు. ప్రభుత్వ పని తీరును మరింత సమర్ధవంతంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా చంద్రబాబు కేబినెట్ ప్రక్షాళనకు నడుంబిగించారని అంటున్నారు.  క్షేత్రస్థాయిలో ప్రజల నుంచి వస్తున్న స్పందన, మంత్రుల పనితీరుపై ఇంటెలిజెన్స్ నివేదికల ఆధారంగా మార్పులు చేర్పులు జరుగుతాయని చెబుతున్నారు. 
ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన సీనియర్ నాయకుడు,  ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పేసినట్లే.  గత కొంతకాలంగా కాంగ్రెస్ అధిష్టానంపై తీవ్ర అసంతృప్తితో ఉన్న జీవన్ రెడ్డి బీఆర్ఎస్ నాయకులతో కలిసి నేడు రంజాన్ ప్రార్థనల్లో పాల్గొన్నారు. దీంతో ఆయన తనకు కాంగ్రెస్ తో ఉన్న అనుబంధానికి తెగతెంపులు చేసుకోవడం ఖాయమైపోయినట్లేనని పరిశీలకులు అంటున్నారు.  జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కాంగ్రెస్‌లో చేరినప్పటి నుండి జీవన్ రెడ్డి కాంగ్రెస్ పట్ల తీవ్ర అసంతృప్తితో ఉన్న సంగతి తెలిసిందే.  ఇప్పటికే తన నివాసం వద్ద కాంగ్రెస్ పార్టీ ఫ్లెక్సీలను తొలగించి, కాంగ్రెస్ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు.  తాజాగా బీఆర్ఎస్ నేతలతో కలిసి రంజాన్ ప్రార్థనల్లో పాల్గొనడం ద్వారా తను కాంగ్రెస్ కు గుడ్ బై చెబుతున్నట్లు చాటారని భావించవచ్చు. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ జీవన్ రెడ్డిని బుజ్జగించేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది.  పార్టీ మారతానని ప్రకటించిన సీనియర్ నేత జీవన్ రెడ్డిని కాంగ్రెస్ నేతలు బుజ్జగిస్తున్నారు.  మంత్రులు అడ్డూరి లక్ష్మణ్, శ్రీధర్ బాబులు జగిత్యాల వెళ్లి మరీ ఆయనతో భేటీ అయ్యారు.  పార్టీ మారే ఆలోచన వీడాలని సూచించారు. సమస్య ఏదైనా అధిష్ఠానం దృష్టికి తీసుకువెళ్తామనీ వారు ఈ సందర్భంగా జీవన్ రెడ్డికి హామీ ఇచ్చినట్లు సమచారం. అయితే ఈ రాయబారంపై జీవన్ రెడ్డి ఎలా స్పందించారన్నది తెలియరాలేదు.  ఇంతకు ముందే జీవన్ రెడ్డితో కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్లో నటరాజ్ భేటీ అయ్యారనీ, పార్టీలో ప్రాధాన్యత ఇస్తామనీ హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. చూడాలి మరి జీవన్ రెడ్డి పార్టీ మార్పు విషయంలో తన వైఖరిని మార్చుకుంటారా.. లేక గుడ్ బై చెప్పాలన్న నిర్ణయానికే కట్టుబడి ఉంటారా?  
 మొయినాబాద్ ఫామ్ హౌస్ డ్రగ్స్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎంపీ పుట్టామహేష్  తనకు తెలుగుదేశం హైకమాండ్ ఇచ్చిన షోకాజ్ నోటీసుకు వివరణ ఇచ్చారు.  ఫామ్ హౌస్ లో డ్రగ్స్ పార్టీకి వెళ్లినదానిపై పార్టీ ఇచ్చిన షోకాజ్ నోటీసులో  ఐదు రోజుల్లోగా వివరణ ఇవ్వాలనీ, అప్పటి వరకూ పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలనీ పుట్టా మహేష్ ను పార్టీ అధిష్ఠానం ఆదేశించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పార్టీ తనకు  జారీ చేసిన షోకాజ్ నోటీసులు ఎంపీ పుట్టా మహేష్ లిఖిత పూర్వక వివరణ ఇచ్చారు.  కాగా పుట్టా మహూష్ ఇచ్చిన వివరణ ఆధారంగా ఆయనపై చర్యలు తీసుకునే అవకాశం ఉందని అంటున్నారు.  మొయినాబాద్ ఫామ్ హౌస్  డ్రగ్స్ కేసులోతెలుగుదేశం పార్టీ నాయకుడు, ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ యాదవ్, బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి, ఆయన సోదరుడు రితేష్ రెడ్డి సహా  ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి విదితమే  ఈ వ్యవహారంపై చంద్రబాబు సీరియస్ గా స్పందించి.. పుట్టా మహేష్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే పార్టీ హైకమాండ్ ఆయనకు షోకాజ్ నోటీసు జారీ చేసి ఐదు రోజుల్లోగా వివరణ ఇవ్వాని ఆదేశించింది. ఈ నేపథ్యంలో  పుట్టా మహేష్ యాదవ్ తన వివరణను అధిష్టానానికి పంపారు.  ఆ వివరణలో తనకు డ్రగ్స్ వ్యవహారంతో ఎటువంటి సంబంధం లేదని పుట్టా పేర్కొన్నట్లు చెబుతున్నారు.  పార్టీకి రమ్మని ఆహ్వానిస్తే వెళ్లాననీ, తాను డ్రగ్స్ తీసుకోలేదని ఆయన పేర్కొన్నట్లు తెలుస్తోంది. కాగా పుట్టా మహేష్ ఇచ్చిన వివరణతో పార్టీ సంతృప్తి చెందుతుందా లేదా అన్న చర్చ జరుగుతోంది. కాగా ఈ విషయంలో పార్టీ తీసుకునే నిర్ణయంపై సర్వత్రా ఆసక్తి వ్యక్తమౌతోంది.  
ALSO ON TELUGUONE N E W S
మహా కుంభమేళా 2025లో తన నీలి రంగు కళ్లతో, రుద్రాక్ష మాలలు అమ్ముతూ రాత్రికి రాత్రే సోషల్ మీడియాలో సెన్సేషన్‌గా మారిన 'రుద్రాక్ష గర్ల్' మోనాలిసా భోస్లే ఇప్పుడు వార్తల్లో నిలిచారు. తన ప్రియుడు, నటుడు ఫర్మాన్ ఖాన్‌ను ఆమె పెళ్లాడటంతో ఈ జంట ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది.  కేరళలోని తిరువనంతపురంలో వీరి వివాహం హిందూ సంప్రదాయం ప్రకారం ఘనంగా జరిగింది. ఈ పెళ్లికి కేరళ మంత్రులు, రాజకీయ ప్రముఖులు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. అయితే వీరి వివాహాన్ని 'లవ్ జిహాద్' అంటూ సోషల్ మీడియాలో కొందరు ప్రచారం చేయడంతో పాటు, వీరికి బెదిరింపులు కూడా వస్తున్నట్లు తెలుస్తోంది. దీనిపై భర్త ఫర్మాన్ ఖాన్ మీడియా ముందు గట్టిగానే స్పందించారు. తాము ఒకరినొకరు మనస్ఫూర్తిగా ప్రేమించుకున్నామని, ఇందులో ఎటువంటి బలవంతం లేదని ఫర్మాన్ స్పష్టం చేశారు. "మేము ముందుగా మనుషులం. ఎవరి మతాన్ని వారు పాటిస్తూనే ఒకరినొకరు గౌరవించుకుంటాం. ఆమె హిందూగానే ఉంటుంది, నేను ముస్లింగానే ఉంటాను. ఇక్కడ మత మార్పిడి ప్రసక్తే లేదు" అని ఆయన కుండబద్ధలు కొట్టారు. మోనాలిసా కూడా తన తండ్రికి ఇష్టం లేకపోయినా, తన ఇష్ట ప్రకారమే ఈ వివాహం చేసుకున్నానని మీడియాకు వివరించారు. వీరిద్దరూ 'నాగమ్మ' అనే మలయాళ సినిమా షూటింగ్ సమయంలో ఒకరికొకరు పరిచయమయ్యారు. ఆరు నెలల ప్రేమ ప్రయాణం తర్వాత పెళ్లి పీటలెక్కారు. ఫర్మాన్ ఖాన్ ఉత్తరప్రదేశ్‌కు చెందిన నటుడు కాగా, మోనాలిసా మధ్యప్రదేశ్ వాసి. వీరిద్దరి కెరీర్ పరంగా చూస్తే ప్రస్తుతం ఈ సినిమా సెట్స్‌పై ఉంది. ఈ సినిమాలోని వీరి కెమిస్ట్రీ నిజ జీవితంలో కూడా ప్రేమగా మారి పెళ్లి వరకు దారితీసింది. ప్రస్తుతం వీరి పెళ్లి ఫోటోలు ఇంటర్నెట్‌లో వైరల్ అవుతున్నాయి. కేరళ ప్రభుత్వం ప్రవేశపెట్టిన స్మార్ట్ యాప్ ద్వారా వీరు తమ వివాహాన్ని చట్టబద్ధంగా రిజిస్టర్ చేసుకున్నారు. కేరళ ప్రజలు తమకు ఎంతో మద్దతుగా ఉన్నారని, అవసరమైతే అక్కడే సెటిల్ అవుతామని కూడా ఈ జంట ప్రకటించడం విశేషం.
  -థియేటర్స్ లో సందడి చేస్తున్న ఉస్తాద్  -సినిమా ఎలా ఉంది  -చిరు రాకతో అదనపు ఆకర్షణ  పవర్ స్టార్ 'పవన్ కళ్యాణ్'(Pawan Kalyan)పవర్ ప్యాక్డ్ మూవీ 'ఉస్తాద్ భగత్ సింగ్'(Ustaad Bhagat Singh)థియేటర్స్ లో తన హవా కొనసాగిస్తూ ఉంది. ఫ్యామిలీస్ కూడా ఉస్తాద్ బాట పడుతుండంతో పాటు మూవీ చూసాక వాళ్ళందరు మీడియాతో మాట్లాడుతు 'ఈ మధ్య కాలంలో ఎలాంటి అసభ్యత లేకుండా వచ్చిన మూవీ ఉస్తాద్. పలానా సీన్స్ మాకు బాగా నచ్చాయని తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు ఆ ఉస్తాద్ ఫ్యామిలీలో మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi)దంపతులు కూడా జాయిన్ అయ్యారు. రీసెంట్ గా హైదరాబాద్ లో చిరంజీవి, సురేఖ దంపతులు, పవన్ దంపతులు కలిసి ఉస్తాద్ భగత్ సింగ్ ని వీక్షించారు. ముఖ్యంగా గ్యాంగ్ లీడర్ లోని 'వాన వాన వెల్లువాయే' సాంగ్ కి పవన్ డాన్స్ చేస్తున్న సీన్ తో పాటు తొలిప్రేమలోని 'ఈ మనసే, నా మనసే' సాంగ్ కి చిరంజీవి ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాడు. ఈ స్పెషల్ షో లో హరీష్ శంకర్, శ్రీలీల, అనిల్ రావిపూడి, ఆనంద్ సాయి దంపతులు, మైత్రి మూవీ మేకర్స్ అధినేతలతో పాటు మరికొంత మంది శ్రేయోభిలాషులు పాల్గొన్నారు. మైత్రి మూవీస్ నే ఎక్స్ వేదికగా సదరు మొత్తం వీడియోని షేర్ చేసింది. Also read: Ntr vs chiranjeevi: ఎన్టీఆర్ పై చిరంజీవి ట్వీట్.. ఇది రేంజ్ అంటే  ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో మెగా అభిమానుల కామెంట్స్ తో మైత్రి ఎక్స్ సర్వర్ క్రాక్ అయ్యే పరిస్థితి. పవన్ ప్రీవియస్ చిత్రం 'ఓజి' ని కూడా చిరంజీవి, సురేఖ గారు చూసిన విషయం తెలిసిందే.        https://x.com/MythriOfficial/status/2035298848344822027?s=20  
నటి, బిగ్ బాస్ ఫేమ్ పునర్నవి భూపాలం ఓ ఇంటికి కోడలైంది. గత కొంతకాలంగా వెండితెరకు దూరంగా ఉంటూ విదేశాల్లో ఉన్నత చదువుల్లో బిజీగా ఉన్న ఈ భామ, తాజాగా వివాహ బంధంలోకి అడుగుపెట్టి అందరినీ ఆశ్చర్యపరిచింది. అత్యంత సన్నిహితుల మధ్య జరిగిన ఈ వేడుకలో తన చిరకాల మిత్రుడు హేమంత్‌వర్మతో కలిసి ఏడడుగులు వేసింది. చాలా కాలంగా ప్రేమలో ఉన్న ఈ జంట, తమ బంధాన్ని పెళ్లి పీటల వరకు తీసుకెళ్లారు. వరుడు హేమంత్‌వర్మ సినీ పరిశ్రమలో ప్రముఖ ఫొటోగ్రాఫర్‌గా రాణిస్తున్నారు. వీరిద్దరూ చిన్ననాటి నుంచే స్నేహితులు కావడం విశేషం. గతేడాది డిసెంబర్‌లో నిశ్చితార్థం చేసుకున్న ఈ జోడీ, తాజాగా మార్చి 20న వివాహం చేసుకుని కొత్త జీవితాన్ని ప్రారంభించారు. ఆర్భాటాలకు పోకుండా కేవలం కుటుంబ సభ్యుల సమక్షంలో ఈ వేడుక సింపుల్‌గా జరిగింది. పునర్నవి భూపాలం అనగానే తెలుగు ప్రేక్షకులకు ముందుగా గుర్తొచ్చేది ‘ఉయ్యాల జంపాల’ సినిమా. ఆ చిత్రంలో రాజ్ తరుణ్ సరసన సునీత పాత్రలో ఆమె పండించిన అమాయకత్వం, నటన అందరినీ ఆకట్టుకుంది. ఆ తర్వాత పలు చిత్రాల్లో నటించినా, ఆమెకు విపరీతమైన క్రేజ్ తెచ్చిపెట్టింది మాత్రం బిగ్ బాస్ రియాలిటీ షోనే. అందులో తన ముక్కుసూటి తనంతో బోల్డ్ సెలబ్రిటీగా గుర్తింపు తెచ్చుకుంది. బిగ్ బాస్ తర్వాత వెండితెరపై బిజీ అవుతుందని అందరూ భావించినప్పటికీ, పునర్నవి మాత్రం తన కెరీర్ విషయంలో భిన్నమైన నిర్ణయం తీసుకుంది. గ్లామర్ ఫీల్డ్‌కు విరామం ప్రకటించి, లండన్‌కు వెళ్లి సైకాలజీలో ఉన్నత విద్యను అభ్యసిస్తోంది. అక్కడి నుంచే సోషల్ మీడియా ద్వారా తన వ్యక్తిగత విషయాలను అభిమానులతో పంచుకుంటూ వస్తోంది. ఇప్పుడు నేరుగా పెళ్లి వార్తతో అందరికీ స్వీట్ షాక్ ఇచ్చింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో పునర్నవి వెడ్డింగ్ ఫొటోలు తెగ వైరల్ అవుతున్నాయి. ట్రెడిషనల్ లుక్‌లో పునర్నవి ఎంతో కళగా కనిపిస్తుండగా, వరుడు హేమంత్ కూడా క్లాసీగా ఉన్నాడు. ఈ జంటను చూసిన నెటిజన్లు “మేడ్ ఫర్ ఈచ్ అదర” అంటూ కామెంట్స్ చేస్తున్నారు. సినీ ప్రముఖులు సైతం ఈ కొత్త దంపతులకు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
ఇటీవ‌లికాలంలో ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌కి పెరుగుతున్న ఆద‌ర‌ణ గురించి అంద‌రికీ తెలిసిందే. థియేట‌ర్ల‌లో కంటే ఇంట్లోనే కూర్చుని ఓటీటీలో సినిమాలు చూసేందుకు ప్రేక్ష‌కులు ఎక్కువ ఉత్సాహం చూపిస్తున్నారు. దానికి త‌గ్గ‌ట్టుగానే ర‌క‌ర‌కాల జోనర్స్ సినిమాల‌ను ఆయా సంస్థ‌లు అందుబాటులో ఉంచుతున్నాయి. ముఖ్యంగా క్రైమ్‌, స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్ల‌కు ఎక్కువ ఆద‌ర‌ణ ల‌భిస్తోంది.  తాజాగా అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతున్న 'సుడల్: ది వార్టెక్స్' (Suzhal: The Vortex) వెబ్ సిరీస్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. తమిళం నుంచి తెలుగు సహా పలు భాషల్లోకి అనువదించిన ఈ సిరీస్ గ్రిప్పింగ్ నేరేషన్‌తో ప్రేక్షకులను క‌ట్టి ప‌డేస్తోంది.  ఈ కథ సాంబలూరు అనే చిన్న గ్రామంలోని ఓ సిమెంట్ ఫ్యాక్టరీలో జరిగిన అగ్ని ప్రమాదంతో మొదలవుతుంది. సరిగ్గా అదే సమయంలో యూనియన్ లీడర్ షణ్ముగం (పార్థిబన్) చిన్న కూతురు నీలా కనిపించకుండా పోతుంది. ఈ రెండు సంఘటనల వెనుక ఉన్న నిగూఢ సత్యాలను ఛేదించే క్రమంలో ఎదురయ్యే మలుపులే ఈ సిరీస్‌కి ఆయువుపట్టు. ముఖ్యంగా ఈ సిరీస్‌లో నటీనటుల పెర్ఫార్మెన్స్ హైలైట్ అని చెప్పాలి. ఐశ్వర్య రాజేష్ తన సహజ సిద్ధమైన నటనతో ఆకట్టుకోగా, చాలా కాలం తర్వాత పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించిన శ్రియారెడ్డి పవర్‌ఫుల్ నటనను కనబరిచారు. కథిర్ మరియు పార్థిబన్ తమ పాత్రల్లో ఒదిగిపోయారు. 'విక్రమ్ వేద' వంటి సంచలన చిత్రానికి కథను అందించిన పుష్కర్-గాయత్రి ద్వయం ఈ సిరీస్‌ను క్రియేట్ చేయడం విశేషం. సాంకేతికంగా కూడా ఈ సిరీస్ ఉన్నత స్థాయిలో ఉంది. సామ్ సీఎస్ అందించిన నేపథ్య సంగీతం సన్నివేశాలను మరింత ఎలివేట్ చేసింది. కేవలం క్రైమ్ మాత్రమే కాకుండా సామాజిక అంశాలను, ముఖ్యంగా చిన్న పిల్లలపై జరిగే అఘాయిత్యాలను మరియు వాటి తాలూకు మానసిక ప్రభావాలను ఈ సిరీస్ లో చాలా లోతుగా చర్చించారు.
  -ఉగాది రోజున ఎన్టీఆర్ జాతీయ అవార్డుతో చిరు  -ఆ రోజు మాట్లాడలేదు -కానీ ఇప్పుడు తన ట్వీట్ తో ఎన్టీఆర్ రేంజ్ చెప్పేసాడు తెలుగు సినిమా, అభిమానుల, ప్రేక్షకుల, ప్రజల ఆరాధ్య దైవం విశ్వవిఖ్యాత నటరత్నపద్మశ్రీ నందమూరి రామారావు(Ntr). ఆయన పేరుపై తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ అవార్డుని మొన్న ఉగాది రోజున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Revanth Reddy)చేతుల మీదుగా మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi)అందుకున్న విషయం తెలిసిందే. ఆ విషయంపై రీసెంట్ గా చిరంజీవి ఎక్స్ వేదికగా  తన భావాన్ని పంచుకోవడం జరిగింది. ఏమని స్పందించాడో చూద్దాం. 'తెలుగు సినిమాకి ఉన్న కీర్తిని ఖండాంతరాలకి  చేర్చిన మహానుభావుడు. చరిత్ర కర్తగా నిలిచిన నందమూరి తారక రామారావు గారి పేరిట ఏర్పాటు చేసిన అవార్డు అందుకోవడం చాలా ఆనందంగా ఉంది. నా జీవితంలో గొప్ప గౌరవం కూడాను. ఎన్టీఆర్ అంటే కళల సమ్మేళనం.  N అంటే నాట్యం, T అంటే  తాళం, R అంటే  రాగం. ఈ విధంగా తన పేరుతోనే లలిత కళలని ముందుకు తీసుకుని వెళ్లిన మహా కళాకారుడు. దేవుడు ఎలా ఉంటాడో మనకి తెలియకపోయినా తాను పోషించిన క్యారక్టర్ ల ద్వారా దేవుడిని మన కళ్ల ముందుంచిన అపూర్వ ప్రతిభావంతుడు. రామారావు గారు జన్మించిందే సినిమాల కోసం. ఆయన లేని తెలుగు సినిమా ఊహించలేనిదంటు చిరంజీవి తన ట్వీట్ లో పేర్కొన్నాడు. also read: Sri gowri priya: తెలుగు హీరోలపై కోపం.. తమిళ హీరోలతో మాత్రం రొమాన్స్ నా! ఇప్పుడు ఈ ట్వీట్ తో అవార్డు అందుకున్న రోజు ఎన్టీఆర్ గురించి చిరంజీవి మాట్లాడలేదనే విమర్శలకి చెక్ పడినట్లయింది. ఎన్టీఆర్, చిరంజీవి కలిసి తిరుగులేని మనిషి చిత్రంలో బావ, బామ్మర్దులుగా చేసారు. ఎన్టీఆర్ గారు తనని  కలిసినప్పుడల్లా   ఫైనాన్షియల్ విషయంలో జాగ్రత్తగా ఉండమని సలహాలు ఇచ్చేవారని చిరంజీవినే స్వయంగా చాలా సందర్భంలో చెప్పుకొచ్చాడు. అనంతర కాలంలో చిరంజీవి నుంచి వచ్చిన కొన్ని సినిమా ఫంక్షన్స్ కి ముఖ్యమంత్రి హోదాలో ఎన్టీఆర్ హాజరయ్యారు.      
టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ తన కెరీర్‌లో మళ్లీ పూర్వ వైభవం సంపాదించుకునేందుకు గట్టిగా ప్లాన్ చేస్తున్నారు. వరుస పరాజయాలు పలకరించినప్పటికీ, ఎక్కడా తగ్గకుండా వైవిధ్యమైన కథలతో బాక్సాఫీస్ వద్ద భారీ కమ్‌బ్యాక్ ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. ఈ క్రమంలోనే నితిన్ ఒకేసారి మూడు క్రేజీ ప్రాజెక్టులను లైన్లో పెట్టి అభిమానులకు అదిరిపోయే ట్రిపుల్ ట్రీట్ ఇచ్చేందుకు రెడీ అయ్యారు. ప్రస్తుతం నితిన్ ప్రతిభావంతుడైన దర్శకుడు వి.ఐ. ఆనంద్‌తో కలిసి ఒక భారీ సైన్స్ ఫిక్షన్ చిత్రంలో నటిస్తున్నారు. డిఫరెంట్ కాన్సెప్ట్‌లను హ్యాండిల్ చేయడంలో దిట్ట అయిన ఆనంద్, ఈసారి నితిన్ కోసం ఒక సరికొత్త ప్రపంచాన్ని సృష్టించినట్లు తెలుస్తోంది. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. ఈ భారీ ప్రాజెక్ట్ నితిన్ కెరీర్‌కు ఎంతో కీలకం కానుంది. కేవలం ఈ ఒక్క చిత్రంతోనే ఆగిపోకుండా, నితిన్ మరిన్ని ఆసక్తికర ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ‘ఆయ్’ సినిమాతో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్న దర్శకుడు అంజితో నితిన్ చేతులు కలిపారు. తన సొంత నిర్మాణ సంస్థ 'శ్రేష్ఠ్ మూవీస్' బ్యానర్‌పైనే ఈ సినిమా పట్టాలెక్కనుంది. జూలై నుంచి చిత్రీకరణ ప్రారంభించి, వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనేది నితిన్ ప్లాన్. అంతేకాకుండా, వచ్చే నెలలో మరో కొత్త దర్శకుడితో ఒక క్రేజీ ప్రాజెక్టును ప్రకటించేందుకు నితిన్ సిద్ధమవుతున్నారు. ఒక ప్రముఖ నిర్మాణ సంస్థలో రూపొందనున్న ఈ సినిమా గురించి త్వరలోనే అధికారిక ప్రకటన రానుంది. ఇలా వరుసగా మూడు సినిమాలు లైనప్‌లో ఉండటంతో నితిన్ తన మార్కెట్‌ను మళ్లీ సెట్ చేసుకోవడం ఖాయమని ట్రేడ్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. నితిన్ సినీ ప్రస్థానం గమనిస్తే, 'జయం', 'దిల్', 'సై' వంటి చిత్రాలతో యువతలో మంచి క్రేజ్ సంపాదించుకున్నారు. ఆ తర్వాత కొంతకాలం గ్యాప్ వచ్చినప్పటికీ 'ఇష్క్', 'అ ఆ', 'భీష్మ' వంటి బ్లాక్ బస్టర్ హిట్లతో తన స్టామినా ఏంటో నిరూపించారు. అయితే, గత కొన్ని చిత్రాలు నిరాశపరచడంతో ఈసారి కథల ఎంపికలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు కనిపిస్తోంది. సోషల్ మీడియాలో కూడా నితిన్ తదుపరి చిత్రాలపై భారీగా చర్చ జరుగుతోంది. ముఖ్యంగా వి.ఐ. ఆనంద్ సినిమాతో నితిన్ సరికొత్త అవతారంలో కనిపిస్తారని ఫ్యాన్స్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. హిట్ దర్శకులతో జతకట్టడం, విభిన్న జోనర్లను ఎంచుకోవడం చూస్తుంటే నితిన్ బాక్సాఫీస్ వద్ద గట్టి వేటకే సిద్ధమైనట్లు అర్థమవుతోంది. ప్రస్తుతం ఈ మూడు సినిమాలు వివిధ దశల్లో ఉన్నాయి. రానున్న నెలల్లో టీజర్లు, ట్రైలర్లతో నితిన్ సందడి మొదలుకానుంది. నితిన్ స్పీడ్ చూస్తుంటే ఈ ఏడాదితో పాటు వచ్చే ఏడాది కూడా బాక్సాఫీస్ వద్ద తనదైన ముద్ర వేయడం ఖాయంగా కనిపిస్తోంది. మరి ఈ సినిమాలు నితిన్ కెరీర్‌ను ఏ మలుపు తిప్పుతాయో వేచి చూడాలి.
    -మ్యాడ్ లో శృతిగా ఫుల్ పాపులర్  -ఈ నెల 27 నా హ్యాపీ రాజ్ తో సెల్యులాయిడ్ పైకి  -శ్రీ గౌరీ ప్రియకి హీరోలపై వివక్ష ఉందా! రెండు తెలుగు రాష్ట్రాల్లోని యువతని, సోషల్ మీడియా లవర్స్ ని రామ్ నితిన్ చెంప పగలకొట్టింది ఎవరు అని సమయం, సందర్భం లేకపోయినా పర్లేదు అడగండి. వాళ్లంతా ఇంకేం మాట్లాకుండా శృతి' అని చెప్తారు. మనం అడిగింది మ్యాడ్ మూవీ గురించి అని వీళ్ళకెలా తెలుసు అని మనం అనుకుంటూ ఉంటే, వాళ్లేమో శృతి క్యారక్టర్ తో తమకి ఎన్నో జ్ఞాపకాలు ఉన్నాయని గత స్మృతులు చెప్పడం స్టార్ట్ చేస్తారు. అంతలా  మ్యాడ్ లోని ఒకే ఒక చెంప దెబ్బ సన్నివేశంతో శ్రీ గౌరీప్రియ(Sri Gowri Priya)ఫుల్ పాపులర్ అయ్యింది. దీంతో తన అప్ కమింగ్ మూవీ హ్యాపీ రాజ్(Happy Raj)పై అభిమానులు ఒక లుక్ వేసి ఉంచారు. నిన్న హైదరాబాద్ లో సదరు మూవీ ట్రైలర్ రిలీజ్ అయ్యింది. ఈ సందర్భంగా శ్రీ గౌరీప్రియ మాట్లాడిన మాటలు అభిమానులకి, సోషల్ మీడియాకి సరికొత్త ఉత్సాహాన్ని తీసుకొస్తున్నాయి. ఆ మాటలేంటో చూద్దాం. ఆమె మాట్లాడుతు నేను తమిళ హీరోలతో రొమాంటిక్ గా, తెలుగు హీరోలతో యారంగిట్ గా ప్రవర్తిస్తూ కొడతానని అంటారు. నేను ఒక్క మూవీలో మాత్రమే హీరోని కొడతాను.అయినా నేనేమైనా హీరోలని కొట్టాలని కంకణం కట్టుకున్నానా! నాకు మాత్రం ఎవరి మీద కోపం లేదు. పైగా నేను తమిళ సినిమాల్లో ఏడుస్తానని, తెలుగు సినిమాల్లో మాత్రం సంతోషంగా ఉంటానని కూడా కొంత మంది  అంటారు. నాకు వచ్చిన ఆఫర్స్ మేరకే నా క్యారక్టర్ రియాక్షన్ ఉంటుందని  చెప్పుకొచ్చింది.  Also read: Niharika konidela: నీహారిక కొణిదెల విడాకులకి కారణం తెలిసింది.. ఇదే అసలు నిజం  కాకినాడకి చెందిన అచ్చ తెలుగింటి అమ్మాయి అయిన శ్రీ గౌరీప్రియ క్యారక్టర్ ఆర్టిస్ గా ఎంట్రీ ఇచ్చి ఒక్కో మెట్టు పైకి ఎదుగుతూ తమిళ్ లో మోడరన్ లవ్ చెన్నై, ట్రూ లవర్ వంటి చిత్రాల ద్వారా సోలో హీరోయిన్ గా తమిళ ప్రేక్షకులకి దగ్గర అయ్యింది. ఇప్పుడు హ్యాపీ రాజ్ తో తమిళ,తెలుగు భాషల్లో ఒకే సారి సందడి చేయనుంది. మ్యూజిక్ డైరెక్టర్ జి.వి ప్రకాష్ కుమార్  హీరో కాగా ముస్తఫా..ముస్తఫా డోంట్ వర్రీ ముస్తఫా అంటూ తెలుగు రాష్టాల ప్రేక్షకులని తన మైకంలో పడేసిన హీరో అబ్బాస్ పదేళ్ల తర్వాత రీ ఎంట్రీ ఇస్తున్నాడు. మరియ రాజ్(Mariya raj)దర్శకుడు. మార్చి 27 రిలీజ్ డేట్.  
టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో సందీప్ కిషన్ వరుస విలక్షణమైన కథలతో ప్రేక్షకులను అలరిస్తున్నారు. రీసెంట్ గా 'ఊరు పేరు భైరవకోన', 'రాయన్' వంటి చిత్రాలతో విజయాలను అందుకున్న ఈ హీరో, ఇప్పుడు తన కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ సోషియో ఫాంటసీ చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. 'శంబాల' చిత్రంతో సెన్సేషన్ క్రియేట్ చేసిన దర్శకుడు యుగంధర్ ముని ఈ చిత్రానికి దర్శకత్వం వహించబోతున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించి విడుదలైన అనౌన్స్‌మెంట్ పోస్టర్ సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. ఈ పోస్టర్ లో సింహం మరియు నక్కల మధ్య పోరాటాన్ని చూపిస్తూ పవర్, విధి, ఆధిపత్యం అనే అంశాలను హైలైట్ చేశారు. "సమ్ వార్స్ నెవర్ ఎండ్.. సమ్ కింగ్స్ నెవర్ డై" అనే ఆసక్తికరమైన ట్యాగ్ లైన్ సినిమా థీమ్‌పై భారీ అంచనాలను పెంచుతోంది. షైనింగ్ పిక్చర్స్ బ్యాన‌ర్‌పై రాజశేఖర్ అన్నభీమోజు, మహీధర్ రెడ్డి ఈ క్రేజీ ప్రాజెక్టును నిర్మించనున్నారు. 'శంబాల' వంటి సక్సెస్ ఫుల్ మూవీ తర్వాత అదే ప్రొడక్షన్ హౌస్ మరియు డైరెక్టర్ కాంబినేషన్ లో వస్తున్న రెండో సినిమా కావడంతో ఇండస్ట్రీ వర్గాల్లో దీనిపై ప్రత్యేక ఆసక్తి నెలకొంది. ఈసారి అంతకు మించిన గ్రాండియ‌ర్‌తో ఈ సోషియో ఫాంటసీని తెరకెక్కించబోతున్నారు. సందీప్ కిషన్ ఈ చిత్రంలో గతంలో ఎన్నడూ చూడని సరికొత్త గెటప్ లో కనిపించనున్నారని తెలుస్తోంది. యాక్ష‌న్‌కి  ఫాంటసీ అంశాలను జోడించి పాన్ ఇండియా స్థాయిలో తెలుగు, హిందీ, తమిళ భాషల్లో ఈ సినిమాను రూపొందించనున్నారు. భారీ విజువల్ ఎఫెక్ట్స్ మరియు రిచ్ ప్రొడక్షన్ వాల్యూస్ ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ప్రీ-ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఆగస్టు నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించేలా చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోంది. మిగిలిన నటీనటులు మరియు ఇతర సాంకేతిక నిపుణుల వివరాలను మేకర్స్ త్వరలోనే అధికారికంగా వెల్లడించనున్నారు. 'శంబాలస టీమ్‌తో సందీప్ కిషన్ చేస్తున్న ఈ ప్రయోగం ఎలాంటి వండర్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి.
  -డైవర్స్ పై నోరు విప్పిన నీహారిక  -ఇన్ని రోజులు ఎన్నో ఊహాగానాలు  -వాటన్నిటికీ చెక్ -అసలు నిజం ఏంటి!  హీరోయిన్ నుంచి ప్రొడ్యూసర్ గా మారి హిట్ జర్నీని కొనసాగించడమంటే మాములు విషయం కాదు. అందుకు ఎన్నో గట్స్ ఉండాలి. పైగా ప్రెజెంట్ చాలా చిత్రాలు హిట్ అనే పదానికి డిస్టెన్స్ ని చాలా కాన్ఫిడెన్స్ గా మెయింటెన్ చేస్తూ వస్తున్నాయి. అలాంటిది నిహారిక కొణిదెల(Niharika konidela)'డెడ్ లైన్,  కమిటీ కుర్రోళ్ళు తో  విభిన్నమైన మేకర్ గా గుర్తింపు పొంది నిర్మాతగా సక్సెస్ ఫుల్ జర్నీని కొనసాగిస్తోంది. రీసెంట్ గా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో తన  విడాకుల విషయంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఆ వ్యాఖ్యలేంటో చూద్దాం. నీహారిక త్రీ ఇయర్స్ బ్యాక్ చైతన్యతో విడాకులు తీసుకున్న విషయం తెలిసిందే. ఈ విషయంపైనే ఆమె మాట్లాడుతు ఎవరు కూడా విడిపోవాలని పెళ్లి చేసుకోరు. కానీ మా మధ్య వచ్చిన విభేదాలు పరిష్కరించలేనివి. అందుకే విడిపోవాలని ఇద్దరం కలిసి నిర్ణయం తీసుకోవడం మంచిధనిపించింది. విడాకులు నిర్ణయం తీసుకున్న వెంటనే నాన్నకి చెప్పాను. సైలెంట్ గా విన్నారు. వాళ్లు కూడా పెళ్లి తర్వాత నన్ను చూస్తూనే ఉన్నారు. నీ జీవితంలో నువ్వు సంతోషంగా లేవనుకున్నప్పుడు ఎక్కడా ఉండాల్సిన అవసరం లేదు అన్నారు. ఒకరినొకరు బాగా గొడవపడి విడిపోతే అది తొందరగా మరచిపోతాం. కానీ ఇలా విడిపోతే ఆ బాధ నుంచి బయటపడటం చాలా కష్టం. ఈ విషయంలో విడాకులు అనేవి ఇప్పుడు తీసుకుంటున్నది కాదు. ఎప్పటినుంచో ఉంది.  విడాకులు తీసుకున్న తర్వాత ఫ్రెండ్ గా అతనితో  కాంటాక్ట్ లో కూడా లేనని నీహారిక చెప్పుకొచ్చింది. ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా నిలుస్తున్నాయి.   Also read:  Allu arjun: తిప్పండి మీసం.. అన్నిటికి సమాధానం చెప్పే రోజు వచ్చింది!  తన అప్ కమింగ్ సినిమాల విషయానికి వస్తే వచ్చే నెల ఏప్రిల్ మూడున 'రాకాసా' అనే మూవీతో నిర్మాతగా మరో సారి ప్రేక్షకుల ముందుకు రానుంది.  సంగీత్ శోభన్,  నయన్ సారిక జంటగా చేస్తుండగా , మానస శర్మ(Manasa Sharma)దర్శకురాలు.    
- ఆగస్ట్‌తో ‘వారణాసి’ షూటింగ్ పూర్తి - సెన్సేషనల్ డైరెక్టర్‌తో మహేష్ నెక్స్‌ట్ మూవీ - మహేష్ కోసం స్రిప్ట్ రెడీ చేసిన డైరెక్టర్ సూపర్‌స్టార్ మహేష్‌బాబు, దర్శకధీరుడు రాజమౌళి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘వారణాసి’ చిత్రంపై రోజు రోజుకీ అంచనాలు భారీగా పెరుగుతున్నాయి. తన కెరీర్‌లోనే ఫస్ట్ టైమ్ గ్లోబల్ స్టార్‌గా అంతర్జాతీయ స్థాయి సినిమా చేస్తున్నారు. ఈ సినిమా ప్రస్తుతం సెట్స్‌పై ఉంది. అయినప్పటికీ మహేష్ చేసే నెక్స్‌ట్ ప్రాజెక్ట్‌పై ఆసక్తికరమైన చర్చలు ఫిలిం సర్కిల్‌లో జరుగుతున్నాయి.  ‘వారణాసి’ సినిమా విషయానికి వస్తే.. షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఆగస్ట్ నాటికి చిత్రీకరణ పూర్తి చేసి, పోస్ట్ ప్రొడక్షన్ పనులపై దృష్టి పెట్టాలని చిత్ర యూనిట్ భావిస్తోంది. ఈ సినిమాను 2027, ఏప్రిల్ 7న ప్రపంచవ్యాప్తంగా అత్యంత భారీ స్థాయిలో విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఫారెస్ట్ బ్యాక్‌డ్రాప్‌లో ఒక డిఫరెంట్ కాన్సెప్ట్‌తో తెరకెక్కుతున్న ఈ అడ్వెంచరస్ థ్రిల్లర్ కోసం మహేష్, రాజమౌళి అభిమానులు ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు.  ఇక మహేష్ నెక్స్‌ట్ చేసే సినిమా విషయంలో రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. వాటిలో సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్‌రెడ్డి పేరు ప్రముఖంగా చెప్ప్పుకుంటున్నారు. ‘అర్జున్ రెడ్డి’, ‘యానిమల్‌’ వంటి బ్లాక్‌బస్టర్స్‌తో అంతర్జాతీయ స్థాయిలో పేరు తెచ్చుకున్న సందీప్‌రెడ్డి... మహేష్ కోసం ఒక ఎక్స్‌ట్రార్డినరీ సబ్జెక్ట్ సిద్ధం చేశారని తెలుస్తోంది.  మహేష్ క్లాస్ అండ్ మాస్ అప్పీల్‌కు,  సందీప్ రా మేకింగ్ స్టెíల్ తోడైతే బాక్సాఫీస్ బద్దలు కావడం ఖాయమని ఫ్యాన్స్ నమ్ముతున్నారు. వీరిద్దరి కాంబినేషన్‌లో సినిమా ఉంటుందని చాలా కాలంగా వార్తలు వస్తున్నప్పటికీ రకరకాల కారణాల వల్ల అది మెటీరియలైజ్ కాలేదు. ‘వారణాసి’ చిత్రంతో గ్లోబల్ మార్కెట్‌కు వెళుతున్న మహేష్.. నెక్స్‌ట్ చెయ్యబోయే సినిమా సందీప్‌రెడ్డి డైరెక్షన్‌లో అయితే ఆ క్రేజ్ కంటిన్యూ అవుతుందని ఇండస్ట్రీలో చర్చ మొదలైంది.  సందీప్ రెడ్డి ప్రస్తుతం ప్రభాస్‌తో ‘స్పిరిట్‌’ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటివరకు ప్రభాస్ చేసిన సినిమాలకు భిన్నంగా ఈ సినిమా ఉండబోతోందని తెలుస్తోంది. ఈ సినిమా తర్వాత సందీప్ ‘యానిమల్ పార్క్’  చేస్తారు. మరి మహేష్ ప్రాజెక్ట్ ఎప్ప్పుడు సెట్స్ పైకి వెళ్తుందనే విషయంలో క్లారిటీ రావాల్సి ఉంది. 
వేసవి కాలం ప్రారంభమైంది, ఆరోగ్యం పట్ల శ్రద్ధ కూడా పెరుగుతుంది. చాలామంది నీటి శాతం అధికంగా ఉన్న పండ్లు, కూరగాయలు తినడానికి ఇష్టపడతారు. అలాంటి వాటిలో దోసకాయలు కూడా ముఖ్యమైనవి.  దోసకాయను జ్యూస్ గా అయినా తీసుకుంటారు, సలాడ్ లో ఉపయోగిస్తారు,  కొంతమంది నేరుగా దోసకాయలు ముక్కలు చేసుకుని తింటారు.  ఎలా తిన్నా దోసకాయ ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది.  మార్కెట్లలో దోసకాయలకు డిమాండ్  కూడా పెరిగే కాలం ఇది.  అయితే దోసకాయలు కొనుగోలు చేసేటప్పుడు చాలా మంది తెలియకుండానే చేదు దోసకాయలను ఎంపిక చేస్తుంటారు.   చేదు దోసకాయలు  అటు తినలేము, ఇటు డబ్బు కూడా వృధా అవుతుంది.  అలా కాకుండా మార్కెట్లో దోసకాయలు కొనుగోలు చేసేటప్పుడు చేదు దోసకాయలు కాకుండా అన్నీ మంచి దోసకాయలు ఎంచుకోవాలి అంటే కొన్ని టిప్స్ పాటించాలి.  ఆ టిప్స్ ఏంటో తెలుసుకుంటే.. చేదు దోసకాయలు అవాయిడ్ చేసి మంచి దోసకాయలు ఎంచుకునే టిప్స్.. రంగు,  ఆకారం..  దోసకాయల రంగు,  ఆకారం ను  బట్టి చేదు దోసకాయను సులభంగా గుర్తించవచ్చు. దోసకాయ ముదురు ఆకుపచ్చ రంగులో ఉంటే, అది తాజాగా ఉన్నట్లు. అది లేత పసుపు, తెలుపు రంగులో లేదా మచ్చలతో ఉంటే, అది పండిందని అర్థం, అలాగే  లోపల చేదుగా ఉండే అవకాశం ఉంటుంది. నొక్కడం.. దోసకాయ గట్టిగా, దృఢంగా ఉంటే ఫర్వాలేదు, అదే అది మెత్తగా లేదా స్పాంజిలాగా అనిపిస్తే అది చెడిపోయినది,  చేదుగా కూడా ఉండవచ్చు. దోసకాయ నొక్కినప్పుడు అది గట్టిగా ఉండాలి. ఆకారం.. దోసకాయ ఆకారాన్ని చూసి  సులభంగా అది చేదు దోసకాయ లేదా మంచి దోసకాయ అనేది చెప్పవచ్చు. మందంగా లేదా పసుపు రంగులో ఉండే దోసకాయలు చేదుగా ఉండే అవకాశం ఉంది. ముదురు ఆకుపచ్చ రంగులో, గట్టిగా ఉండే దోసకాయలను మంచిగా ఉంటాయి. వాసన.. వాసనను బట్టి సులభంగా దోసకాయ చేదు ఉందా లేదా అనేది కనుక్కోవచ్చు.   దోసకాయ  తాజాగా ఉంటే లోపల కూడా తాజాగా ఉంటుంది.  దాని వాసన వింతగా లేదా ఘాటుగా ఉంటే, అది  లోపల చేదుగా కూడా ఉండే అవకాశం ఉంటుంది. కాండం.. దోసకాయ కొనుగోలు చేసినప్పుడు దోసకాయ కాండం దగ్గర కట్ చేయాలి. ఆ కాండం భాగాన్ని  దోసకాయ మిగిలిన భాగంలో రుద్దితే తెల్లని నరుకు వస్తే దోసకాయ చేదు ఉండే అవకాశం ఉంటుంది.  ఈ నుగురు బాగా బయటకు వెళ్లిపోతే దోసకాయలో చేదు తగ్గిపోతుందని చెబుతారు. అందుకే చాలామంది దోసకాయను కట్ చేసేటప్పుడు మొదట కాండం దగ్గర కట్ చేసి  రుద్దుతారు.  దీని వల్ల దోసకాయలో ఉండే చేదు పోతుందని చెబుతారు.                                 *రూపశ్రీ.
కొందరు చాలా లోతుగా ఆలోచిస్తారు.  ఈ కారణంగా చాలా విషయాలు వారిలో సందేహాలుగానో,  నిర్ణయాలుగానో, అబిప్రాయాలుగానో ఉంటాయి.  వాటిని బయటకు చెప్పాలంటే ఏదో సంకోచం ఉంటుంది.  ఎదుటి వారు ఏమనుకుంటారో అనే సందిగ్ధం కూడా ఉంటుంది.  దీని వల్ల వారు చాలా విషయాలు బయటకు చెప్పలేక నిశ్శబ్దంగా ఉండిపోతుంటారు.  కానీ ఇలా నిశ్శబ్దంగా ఉండటం వల్ల  తరువాత చాలా బాధపడతారు కూడా.  అప్పుడు అలా చెప్పి ఉంటే బాగుండు, అలా చేసి ఉంటే బాగుండు అని అనుకునేవారు చాలా అధికంగా ఉంటారు. కానీ మనసులో మాటను ధైర్యంగా చెప్పడం వల్ల చాలా రకాల లాభాలు ఉన్నాయని అంటున్నారు మనస్తత్వ విశ్లేషకులు. ఇంతకూ మనసులో మాటను ధైర్యంగా బయటకు చెప్పడం వల్ల కలిగే లాభాలు ఏంటి తెలుసుకుంటే.. నమ్మకం, సాన్నిహిత్యం.. ప్రతి బలమైన సంబంధానికి ఓపెన్ కమ్యూనికేషన్ పునాది అవుతుంది. మనం మన భావాలను నిజాయితీగా వ్యక్తపరిచి, ఇతరుల మాటలను విన్నప్పుడు అపార్థాలు తొలగిపోతాయి.  నమ్మకం మరింత పెరుగుతుంది. మనసు విప్పి మాట్లాడగల  వ్యక్తులు పారదర్శకత,  పరస్పర గౌరవం కలిగి ఉంటారు. ఇది బందం దీర్ఘకాలం ఆరోగ్యంగా ఉండటంలో సహాయపడుతుంది. ఆత్మగౌరవం, ఆత్మవిశ్వాసం.. మనసులో ఉన్న ఆలోచనలను భయం లేదా సంకోచం లేకుండా వ్యక్తం చేసినప్పుడు..  చెప్పాలనుకున్న విషయాన్ని చెప్పేశాం అనే ఒక శాటిస్పాక్షన్ ఫీలింగ్ ఏర్పడుతుంది. ఇది  ఆత్మగౌరవాన్ని పెంచుతుంది,  క్రమంగా ఇలాంటి ప్రవర్తన వల్ల ఆత్మవిశ్వాసం కూడా మెరుగవుతుంది. ఎప్పుడైనా, ఎలాంటి సందర్భంలో అయినా తన మనసులో ఉన్నది చెప్పడానికి ఎలాంటి భయం ఉండదు. తేడాలు, పరిష్కారాలు.. జీవితంలో ప్రతి ఒక్కచోట విభేదాలు ఉండనే ఉంటాయి. అవి స్నేహం అయినా, కుటుంబం అయినా,  ప్రేమ అయినా, ఉద్యోగం చేసే చోట అయినా.. ఎక్కడైనా సరే.. విభేదాలు గొడవలుగా మారకుండా పరిష్కరించుకోవడానికి  సహాయపడుతుంది. అభిప్రాయాలను స్పష్టంగా , సంకోచం లేకుండా వ్యక్తపరిచినప్పుడు అవతలి వ్యక్తులు కూడా వినడానికి ఆసక్తి చూపిస్తారు.  ఇలా మాట్లాడటం అనేది సమస్యకు పరిష్కారాన్ని చూపిస్తుంది. ఆత్మవిమర్శ.. ఏదైనా విషయాన్ని స్పష్టంగా చెప్పే అలవాటు ఉండటం వల్ల కేవలం ఇతరులతో ఏదైనా చెప్పడమే కాదు.. తమతో తాము స్పష్టంగా మాట్లాడుకోగలుగుతారు. ఇది వ్యక్తులను కన్ప్యూజన్ లేకుండా చేస్తుంది. బలాలు, బలహీనతలను గుర్తించడంలో సహాయపడుతుంది. ఇది వ్యక్తిగత అభివృద్దికి మొదటి అడుగు అవుతుంది. మానసిక ఒత్తిడి, ఆందోళన.. భావోద్వేగాలను అణిచివేసినప్పుడు అవి లోపల ఒత్తిడి కలిగిస్తాయి. కానీ వాటిని సరైన విధంగా బయటకు వ్యక్తం చేసినప్పుడు ఒత్తిడి తగ్గుతుంది. ఇది మానసిక ఒత్తిడి,  ఆందోళన సమస్యలు పెరగకుండా ఉండటానికి కారణం అవుతుంది. శారీరక ఆరోగ్యం.. స్పష్టంగా ఏదైనా విషయాన్ని బయటకు చెప్పడం వల్ల శారీరక ఆరోగ్యం కూడా బాగుంటుంది. ఒత్తిడి తక్కువగా ఉండటం మంచి నిద్ర, రక్తపోటు సాధారణంగా ఉంటాయి. ఇది గుండెజబ్బు, తలనొప్పి, నిద్రలేమి వంటి సమస్యలు రాకుండా చేస్తుంది. సక్సెస్ కోసం.. స్పష్టంగా, మంచిగా కమ్యూనికేషన్ చేయడంలో వ్యక్తి విజయం ఆధారపడి ఉంటుంది. ఉద్యోగంలో అయినా, రాజకీయంలో అయినా,  కుటుంబంలో అయినా,  బంధంలో అయినా స్పష్టంగా మాట్లాడటం వల్ల అవతలి వ్యక్తులు అర్థం చేసుకునే అవకాశాలు ఎక్కువ ఉంటాయి.  ఇది అన్ని చోట్ల విజయాన్ని,  గౌరవాన్ని తెచ్చిపెడుతుంది. స్పష్టంగా మాట్లాడటం అంటే ఇతరుల పైన ఆధిపత్యం చెలాయించడం కాదు. భావాలను గౌరవంగా, పద్దతిలో వ్యక్తపరచడం. ఇతరులు ఏమనుకుంటారో అనుకోకుండా మనసులో ఉన్నది  చెప్పడం, మనసులో ఉన్నది తొక్కి పెట్టి మౌనంగా ఉండకుండా బయటకు వ్యక్తం చేయడం వల్ల మానసికంగా బలంగా ఉండటమే కాకుండా ఇతరుల ముందు సరైన విధంగా మాట్లాడటం ఎలాగో కూడా అర్థం  అవుతుంది.  కాబట్టి ఇతరుల గురించి ఆలోచించి మనసులో ఉన్నది దాచిపెట్టాల్సిన అవసరం లేదు.                          *రూపశ్రీ.
పరాభవం.. తెలుగు జానపద చిత్రాలు,  జానపద నవలలు చదివితే.. అందులో అవమానం జరిగిందనడానికి బదులుగా పరాభవం ఎదురైంది అనే పదం వాడటం చూస్తూనే ఉంటాము.  పరాభవం అంటే అగౌరవం,  అవమానం, కించపరచడం.. ఇలా చాలా సందర్బాలలో వాడుతూ ఉంటారు. అయితే తెలుగు పంచాంగంలో.. తెలుగు సంవత్సరాలలో 40వ తెలుగు సంపత్సరం పేరు పరాభవ నామ సంవత్సరం.  ఈ సంవత్సరం పేరు వినగానే చాలామంది భయపడుతున్నారు.  రెండేళ్ల క్రితం వచ్చిన క్రోథ నామ సంవత్సరం అప్పుడు ఇలాగే భయపడ్డారు. కానీ కాలంతో ప్రయాణం తప్పదు.  అయితే ప్రజలలో పరాభవనామ సంవత్సరం అనే పేరు వినగానే ఎక్కడలేని భయం పుట్టుకొస్తోంది. ఈ కొత్త ఏడాదిలో అవమానాలు, అగౌరవాలు తప్పవా అని ముందే తమ భవిష్యత్తు గురించి మనసులో బోలెడు భవిష్యవాణి ఊహించుకుంటున్నారు. కానీ పరాభవ నామ సంవత్సరం పేరు వెనుక ఉన్న అర్థం,  అందులో పరమార్థం వేరని, ఈ విషయం తెలిస్తే అందరూ ఎంతో ఊరట చెందుతారని అంటున్నారు పండితులు. ఇంతకూ పండితులు ఈ పరాభవ నామ సంవత్సరం గురించి, దాని పేరులో ఉన్న అర్థం గురించి ఏం చెప్తున్నారో తెలుసుకుంటే.. తెలుగు పంచాంగం ప్రకారం 60 తెలుగు సంవత్సరాలు  ఉంటాయి.  వాటిలో విశ్వావసు నామ సంవత్సరం 39వది కాగా.. పరాభవ నామ సంవత్సరం 40వది.  చైత్ర మాసంలో ఉగాది పర్వదినం సందర్బంగా కొత్త తెలుగు సంవత్సరం అయిన పరాభవ సంవత్సరం మొదలు కాబోతోంది. పరాభవ అనే పేరు వినగానే పరాభవాలే ఎదురవుతాయేమో అనుకుంటారు చాలా మంది. కానీ పరాభవ నామ సంవత్సరం అంటే వేరే అర్థాలు ఉన్నాయి.  పరాభవలో పరా అంటే పరాభట్టారికా దేవి.. లిలితా దేవినే పరాభట్టారికా దేవి అని అంటారు.  భవ అని భవుడు అని పరమేశ్వరుడిని సంభోధిస్తారు.  దీని ప్రకారంగా చూస్తే శక్తి స్వరూపమైన ఆ పార్వతీదేవి,  లయకారుడు అయిన పరమేశ్వరుడి కలయికగా వచ్చినదే తెలుగు సంవత్సరమని,  ఈ పరాభవ నామ సంవత్సరం మీద పార్వతీపరమేశ్వరుల అనుగ్రహం పుష్కలంగా ఉంటుందని పండితులు చెబుతున్నారు.   చాలా వరకు ప్రజలు ఎందులో అయినా ముందు చెడునే గుర్తిస్తారు, చెడునే తలుస్తారు.  ఈ స్వభావం కారణంగానే పరాభవ నామ సంవత్సరం గురించి పలు ఊహాగానాలు వస్తున్నాయని పండితులు చెబుతున్నారు. మరొక విధంగా చూస్తే.. పర అంటే పరదేవత.. ఆ పరదేవతే లలితా పరమేశ్వరి దేవి,  భవ అంటే అంటే కూడా పరమేశ్వరుడు.. ఎలా చూసినా ఇందులో ఎంతో ఆధ్యాత్మికత,  భక్తి మేళవింపు కనిపిస్తుంది.  ఇంతటి గొప్ప నామం వెనుక పిచ్చి అనుమానాలు, భయాలతో కొత్త ఏడాదిని మొదలుపెట్టడం మంచిది కాదని,  ప్రతి ఒక్కరూ సానుకూల ఆలోచన కలిగి ఉండాలని పండితులు చెబుతున్నారు. పరాభవ నామ సంవత్సరాన్ని అత్యున్నతమైన ఏడాది అని జ్యోతిష్యం చెబుతోంది. పరా అంటే గొప్పది, అత్యున్నతమైనది,  భవ అంటే పుట్టుక లేదా ఉద్భవించేది.  ఉన్నతంగా ఉద్భవించేది పరాభవ.. కాబట్టి ఈ పరాభవ నామ సంవత్సం కూడా ఉన్నతంగా ఉంటుందని చెబుతున్నారు. మనిషి తన కర్తవ్యాన్ని తాను ధర్మం తప్పకుండా నెరవేరుస్తుంటే.. ప్రతి ఏడాదిలో వారికి సానుకూలంగా సాగిపోతుందని ఆధ్యాత్మిక వేత్తలు కూడా చెబుతున్నారు. చెడులోనూ మంచి చూసే గుణం,  సానుకూల ఆలోచనలు ఉండటం ప్రధానం. కాబట్టి ఈ పరాభవ నామ సంవత్సరం రోజు సంతోషంతో ఉగాది పండుగను జరుపుకోవడం ద్వారా అందరూ సుఖ సంతోషాలు పొందాలని కోరుకుంటూ.. అందరికీ పరాభవ నామ తెలుగు సంవత్సరాది శుభాకాంక్షలు..                                   *రూపశ్రీ.
వేసవి కాలం రాగానే చాలామంది లైఫ్ స్టైల్ మారుతుంది. ముఖ్యంగా ఆహారం విషయంలో, పానీయాల విషయంలో చాలా మార్పులు వచ్చేస్తాయి. బీహార్, ఉత్తర ప్రదేశ్ రాష్ట్రాల పేమస్ పానీయం ఇది. అయితే దీని ప్రయోజనాల దృష్ట్యా దేశ వ్యాప్తంగా ఇష్టంగా ఉపయోగిస్తారు.  వేసవి వచ్చిందంటే సత్తు పానీయం చాలా ఎక్కువగా తీసుకుంటారు.  ఇది శరీరాన్ని కూల్ గా ఉంచడమే కాకుండా శరీరానికి కావలసిన పోషకాలను పుష్కలంగా అందిస్తుంది.  కాల్చిన శనగలతో తయారు చేసే సత్తు పౌడర్ ను సత్తు పానీయం కోసం ఉపయోగిస్తారు. అయితే.. సత్తు పొడితో కేవలం సత్తు పానీయమే కాకుండా.. చాలా రకాల పదార్థాలు తయారు చేసుకుంటారు.  వేసవిలో అటు శరీరాన్ని కూల్ గా ఉంచుతూ, ఇటు శరీరానికి బోలెడు పోషకాలు అందించే సత్తు పొడితో ఏమేం వంటకాలు బాగుంటాయో తెలుసుకుంటే.. సత్తు పేడ.. వేసవిలో  నీరసంగా అనిపిస్తే సత్తు పేడను తయారు చేసుకుని తినవచ్చు.. ఇది  ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. దీనిని తిన్న తర్వాత  శరీరం పూర్తి చురుకుగా ఉంటుంది. సత్తు పిండిని నెయ్యి వేసి బాగా వేయించి అందులో పంచదార పొడి వేసి సన్న మంట మీద గోల్డ్ కలర్ వచ్చే వరకు వేయిస్తే సత్తు పేడ రెఢీ.. ఇది చాలా రుచిగా ఉంటుంది. సత్తు మజ్జిగ.. వేసవి కాలంలో సత్తుతో మజ్జిగ తయారు చేసుకుని తాగవచ్చు. ఇది  శరీరాన్ని తేమగా ఉంచుతుంది.  పిల్లల నుండి పెద్దల వరకు అందరూ దీనిని ఇష్టపడతారు. దీనిని ప్రతిరోజూ తాగడం వల్ల తక్షణ శక్తి లభిస్తుంది. సత్తు లడ్డు.. సత్తు లడ్డూలను సత్తు పొడితో ఇంట్లోనే సులభంగా తయారు చేసుకోవచ్చు. సత్తు లడ్డులు తినడం వల్ల  శరీరం బలపడుతుంది. సత్తు లడ్డులో డ్రై ప్రూట్స్, నట్స్, నెయ్యి వేసి తయారు చేసుకుని తినవచ్చు. చాలా రుచిగా ఉంటాయి. సత్తు షార్డ్ బ్రెడ్.. వేసవిలో కూడా కారంగా తినాలని అనుకునే వారు చాలామంది ఉంటారు.  అలాంటి వారికి సత్తు షార్ట్ బ్రెడ్ చాలా మంచి ఫుడ్. సత్తు పిండిని వేయించి అందులో బంగాళదుంప,  బఠాణీ వంటి కూరగాయలు వేసి ముద్దగా చేసుకుని దీన్ని తడి చేసిన బ్రెడ్ మధ్యలో ఉంచి బ్రెడ్ ను బోండా లాగా రౌండ్ చేసి నూనెలో డీప్ ప్రై చేయాలి.  చాలా రుచిగా ఉంటాయి. సత్తు లిట్టి చోఖా.. లిట్టి చోఖా అనేది బీహార్, ఉత్తర ప్రదేశ్, జార్ఖండ్ రాష్ట్రాలలో చాలా ఫేమస్ ఫుడ్.  వేయించిన శనగపిండిని గోధుమ పిండిలో స్టఫ్ చేసి వాటిని కాలుస్తారు.  వీటిని లిట్టి అంటారు.  వీటిని నెయ్యితోనూ,  వంకాయ, టమాటా,  బంగాళాదుంపతో చేసిన చోఖా అనే వంటకంతో కలిపి వడ్డిస్తారు. ఈ పూర్తీ కాంబోను లిట్టీ చోఖా అంటారు.  ఇది చాలా రుచిగా ఉంటుంది.  చోఖా లేకపోయినా లిట్టిని వివిధ రకాల చట్నీలతో కూడా తింటారు.                                       *రూపశ్రీ.
ఆరోగ్యమే మహాభాగ్యం. కానీ నేటి కాలంలో మారిన జీవనశైలి కారణంగా చిన్న పిల్లల నుండి పెద్దల వరకు ఏదో ఒక దీర్ఘకాలిక (Chronic) ఆరోగ్య సమస్యతో బాధపడుతున్నారు. ఎన్ని మందులు వాడినా సమస్య తాత్కాలికంగా తగ్గుతుందే తప్ప, పూర్తిగా నయం కావడం లేదని చాలా మంది ఆవేదన చెందుతుంటారు. అలాంటి వారికి హోమియోపతీ ఒక గొప్ప వరప్రసాదం. కేవలం లక్షణాలను అణచివేయడం కాకుండా, వ్యాధిని మూలాల నుండి తొలగించే అద్భుత శక్తి హోమియోపతీకి ఉంది.  Renowned Homeopathy expert Dr Praveen Kumar చెప్పిన మరిన్ని విషయాలు ఈ  TeluguOne Health Video Link క్లిక్ చేసి తెలుసుకుందాం. మనం హోమియోపతీని ఎందుకు ఎంచుకోవాలి? (Why Homeopathy?) దీర్ఘకాలిక వ్యాధులలో తిరుగులేని చికిత్స: హోమియోపతీ యొక్క అసలు బలమే దీర్ఘకాలిక వ్యాధులను నయం చేయడం. బ్రాంకియల్ ఆస్తమా వంటి జెనెటిక్ డిజార్డర్లను కూడా సమూలంగా తొలగించడానికి హోమియోపతీలో మార్గం ఉంది. సంపూర్ణ ఆరోగ్య దృక్పథం (Holistic Approach): ఇతర వైద్య విధానాలు కేవలం వ్యాధి మీద దృష్టి పెడితే, హోమియోపతీ 'రోగి' (Patient) మీద దృష్టి పెడుతుంది. అంటే మీ వేలికి నొప్పి ఉంటే కేవలం వేలిని మాత్రమే కాకుండా, మీ శరీరాన్ని ఒక యూనిట్‌గా పరిగణించి చికిత్స అందిస్తుంది. శాస్త్రీయమైనది: ఒకప్పుడు హోమియోపతీ కేవలం ప్లాసిబో (Placebo) అని విమర్శలు ఉండేవి. కానీ నేడు IIT ముంబై మరియు IISc బెంగళూరు వంటి సంస్థలు చేసిన పరిశోధనల్లో హోమియోపతీ మందులలో 'నానో పార్టికల్స్' (Nano Particles) ఉంటాయని నిరూపితమైంది. దుష్ప్రభావాలు లేని వైద్యం: ఇది సహజ సిద్ధమైన పద్ధతిలో పనిచేస్తుంది కాబట్టి సైడ్ ఎఫెక్ట్స్ భయం ఉండదు. చికిత్స ప్రక్రియ ఎలా ఉంటుంది? (How it works?) హోమియోపతీలో చికిత్స అనేది చాలా లోతుగా సాగుతుంది. దీనిని 'కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్' అంటారు. కేస్ టేకింగ్: డాక్టర్ మీతో దాదాపు గంట సేపు మాట్లాడుతారు. మీ అలవాట్లు, మీ ఇష్టాయిష్టాలు, మీకు ఎప్పుడు కోపం వస్తుంది, మీ గత చరిత్ర (Past history) వంటి అంశాలన్నింటినీ అడిగి తెలుసుకుంటారు. ఇది మీ 'జర్నీ ఆఫ్ లైఫ్'ను అర్థం చేసుకునే ప్రక్రియ. మయాజమ్స్ (Miasms): ఆయుర్వేదంలో వాత, పిత్త, కఫ దోషాలు ఉన్నట్లే, హోమియోపతీలో సోరా, సిఫిలిస్, సైకోసిస్ అనే మూడు మయాజమ్స్ ఉంటాయి. వీటి ఆధారంగానే మీ వ్యాధి తీవ్రతను అంచనా వేస్తారు. పొటెంటైజేషన్: మందులను డైల్యూట్ చేసే ప్రక్రియను 'డైనమైజేషన్' అంటారు. ఇందులో మందు పరిమాణం తక్కువగా ఉన్నప్పటికీ, దాని శక్తి (Power) చాలా ఎక్కువగా ఉంటుంది. ఏం చేయకూడదు? (What Not to Do?) సమాచారాన్ని దాచకండి: డాక్టరుకు మీ శారీరక, మానసిక లక్షణాలను స్పష్టంగా చెప్పాలి. ఏదైనా విషయాన్ని దాచడం వల్ల సరైన మందును ఎంపిక చేయడం కష్టమవుతుంది. స్వయం వైద్యం వద్దు: హోమియోపతీ మందులు తీపి మాత్రల్లా కనిపిస్తాయి కదా అని సొంతంగా వాడకూడదు. వ్యాధి తీవ్రతను బట్టి డాక్టర్ ఇచ్చే పొటెన్సీ (30CH, 200CH లేదా 1M) మారుతూ ఉంటుంది. అపోహలు నమ్మకండి: హోమియోపతీ ఆలస్యంగా పనిచేస్తుందనేది ఒక అపోహ మాత్రమే. సరైన మందు పడితే అక్యూట్ కండిషన్స్ (జ్వరం, జలుబు) కూడా చాలా వేగంగా తగ్గుతాయి. తరచుగా అడిగే ప్రశ్నలు (Q&A) ప్ర: 30CH అంటే ఏమిటి? జ: ఇది హోమియోపతీలో ఒక రకమైన పొటెన్సీ (శక్తి). ఒక భాగం మందును 99 భాగాల వెహికల్ (ఆల్కహాల్ లేదా షుగర్ ఆఫ్ మిల్క్)తో కలిపి చేసే ప్రక్రియ ద్వారా 30CH తయారవుతుంది. ఇది అద్భుతమైన శక్తిని కలిగి ఉంటుంది. ప్ర: హోమియోపతీ మందులు ఘాటుగా ఎందుకు ఉంటాయి?  జ: మందులను పిల్స్ (మాత్రలు) మీద వేయడానికి ఆల్కహాల్‌ను వెహికల్‌గా ఉపయోగిస్తారు. ఆ ఆల్కహాల్ వల్ల ప్రారంభంలో కొంచెం ఘాటుగా అనిపించవచ్చు, కానీ ఆ మాత్రలు తియ్యగానే ఉంటాయి. ప్ర: మానసిక సమస్యలకు హోమియోపతీ పనిచేస్తుందా?  జ: అవును. హోమియోపతీలో మనిషి యొక్క సైకీ (Psyche) లేదా మానసిక స్థితిని బట్టి హైయర్ పొటెన్సీ మందులు ఇవ్వడం జరుగుతుంది, ఇవి మానసిక ఆరోగ్యంపై అద్భుతంగా పనిచేస్తాయి. దీర్ఘకాలిక వ్యాధులతో పోరాడుతున్న వారికి హోమియోపతీ ఒక ఆశాకిరణం. ఇది కేవలం వ్యాధిని తగ్గించడమే కాకుండా, మీ రోగనిరోధక శక్తిని పెంచి మిమ్మల్ని సంపూర్ణ ఆరోగ్యవంతులుగా తీర్చిదిద్దుతుంది. మరిన్ని ఆసక్తికరమైన ఆరోగ్య విషయాలు మరియు నిపుణుల సలహాల కోసం ఇప్పుడే మా TeluguOne Health యూట్యూబ్ ఛానెల్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి
డా ..చిరు మావిళ్ళ మురళీ మనోహర్.. ఉగాది అంటే ఉగాది పచ్చడి మాత్రమే అని అనుకుంటారు. కానీ ఉగాది పచ్చడిలో ఉన్న ఆయుర్వేద ఆరోగ్య రహస్యం ఏమిటో తెలుసా?ఇప్పుడు చైత్ర మాసం లో వసంత రుతువు లో ఉన్నాం ఆకు రాలిన తరువాత కొత్త కొత్త గా రేకు విచ్చినట్లు చిగుర్లు తోడుగుతాయి. ఆప్రాంతం అంతా పచ్చటి తివాచి పరిచినట్లు పచ్చగా విరబూస్తాయి. పువ్వులు పరిమళాలు.మావిడి పూత సువాసనలు, మామిడి చెట్లపై కొత్తగా చిగురులు తొడిగిన మామిడి పూత గుత్తులు,మామిడి పిందెలు ఆ వసంత శోభ అప్పుడే వచ్చిందా అనిపిస్తుంది మది పులక రిస్తుంది. కొత్త కొత్త పూతని ఆస్వాదించాలని అనిపిస్తూ ఉండడం సహజం.ప్రకృతి లో మార్పు వచ్చింది శీతకాలం నుండి ఎండా కాలానికి వాతావరణం మారుతుంది ఇక ఎండవేడి ని తట్టుకోవ దానికి మన శరీరం సన్నద్ధం కావాలి.వాతావరణం లో మార్పులకు తగ్గట్టుగా శరీరంలో వేడిమి ని,తట్టుకోవడం. శరీరం దానంతట అదే చల్లబడే సహజ లక్షణాన్ని వృద్ది   చేయడంకీలకం.ముఖ్యంగా ఎండాకాలం లో వేడికి శరీరం నీర సించి పోవడం.ఒక్కో సారి అతిసారం బారిన పడడం. ముఖ్యంగా డయాబెటీస్, గుండె సంబధిత సమస్యలు ఉన్న రోగులలో వచ్చే హార్ట్ బీట్ లో మార్పులు.లేదా శరీరంలో రక్త ప్రసరణలో సమస్యలు వస్తూ ఉంటాయని ప్రముఖ ఆయుర్వేద వైద్యులు  డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్ విశ్లేషించారు.ఈ క్రమం లో మనం ఉగాది రోజున తీసుకున్నే ఆరు రకాల లో ఉన్న ఆరోగ్య రహస్యాలు, వాటిలో  ఉండే పోషక విలువల గురించి తెలుగు వన్ హెల్త్ కు  వివరించారు. మనం పండగ పూట లేదా కొన్ని సందర్భాలాలో తీసుకున్న ఆహారం శరీరంలో తామస ,రజో గుణాలు పెంచు తాయని  శరీరంలో వేడి వల్ల వచ్చే సమస్యల ను అధిగమించాలి సత్వ ప్రాధాన మైనగుణాన్ని అలవారచుకోవాలాంటే ఉగాది పచ్చడి ఉపయోగ పడుతుందని ప్రముఖ ఆయుర్వేద వైద్యులు డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్ పేర్కొన్నారు. వేసవి రాగానే శరీరం లో కొన్ని రకాల రసాయన చర్యల వల్ల శరీరం లో సమతౌల్యం లోపిస్తుందని సమ తౌల్యాన్ని నియంత్రించే శక్తి ఉగాది పచ్చడి సమతుల పోషకాలు అందిస్తయాని అన్నారు డాక్టర్ చిరుమావిళ్ళ మురళీ మనోహార్. సాంప్రదాయ పద్దతిలో ఉగాది పచ్చడి కావాల్సిన పదార్ధాలు... **మట్టి పాత్ర,లేదా కుండ. **వేప పూత ఒక భాగం. **మామిడి పిందెలు  ముక్కలు రెండు భాగాలు.  . **చింత పండు,పా తది. నాలుగు భాగాలు. **ఉప్పు 5 భాగాలు. **బెల్లం ఆరు భాగాలు .ఇంకా అరిటి పండు ముక్కలు  అన్నీ కలిపి నీరు పోయాలి. పైన పేర్కొన్న కావాల్సిన పదార్ధాలలో  మధురం-తీపి  ఆమ్లం-పులుపు. లవణం-ఉప్పు . తి త్తం -చేదు. వగరు వంటి లక్షణాలు ఉంటాయి.ఇలా తయారు చేసిన వేప పచ్చడిని నింబ కుసుమ భక్షణం అని అంటారు.నింబ కుసుమము అంటే వేప పూత అని అర్ధం. మామిడి ముక్కలు,బెల్లము,పులుపు,చేదు వంటివి చింత పండు అరటి పండు,మిరియాలపొడి,ఉప్పు వంటివి వేసిన నింబ కుసుమ భక్షణం అంటే తింటే మరెన్నో లాభాలు ఔషద గుణాలు ఉన్నాయి.అని డాక్టర్ మురళీ మనోహర్ తెలుగు వన్ హెల్త్ కు వివరించారు. షడ్రసో పేతం ఉగాది పచ్చడి... ఉగాది పచ్చడిలో ఆరు రకాల రుచులు ఉంటాయని వాటిని షట్ రుచులుగా పేర్కొన్నారు.ఎందుకంటే జీవితానికి ఉగాదికి మానసిక సంబంధమైన సంబంధం ఉందని అంటారు చిరు మావిళ్ళ.అవును మనజీవితం లో తెలుగు వారికి తెలుగు సంవత్సరాది యుగ ఆది అంటే మరో యుగం నికి ఆది అంటే తొలి అడుగు. ఈ సమయం లో మనం ఎదుర్కునే ఎన్నోరకాల సమస్యలు ఒక్కో రుచిని సూచిస్తాయి. అన్ని సమపాళ్ళలో ఉంటె పచ్చడిని ఎలా అస్వాదిస్తామో.కస్టాలు,కడ గళ్ళు,ఆనందం,ఉత్సాహం, కష్టం,నష్టం, వచ్చినా మానసికంగా ఎదుర్కోడానికి మనల్ని సిద్ధం చేసేది ఉగాది అని అంటారు పండితులు.ఉగాది పచ్చడి ఔషద గుణాలు...వేప పువ్వు ,దీనిని బద్ర అని నింబ అని కూడా పిలుస్తారు. నిచిన, నిచినిండిన్ మార్గోసిన్ అనే పదార్ధాలు ఉంటాయని. వేప యాంటి ఫంగల్,యాంటి బ్యాక్టీరియాగా పని చేస్తుందని వేప  వల్ల వివిదరకాల జబ్బులను తగ్గించే గుణం వేపాకు ఉందని స్పష్టం చేసారు చిరుమవిళ్ళ మురళీ మనోహర్.వేపాలో తిత్త రసం ఉందని అంటే చెడు గుణం ఉన్నందున శరీరంలో వచ్చే కఫ,పిత్త దోషాన్ని తొలగించి ఆకలి పెంచుతుందని విశ్లేషించారు.వేపను తీసుకోవడం వల్ల ముఖ్యంగా డయాబెటీస్ ను నియంత్రించే గుణం వేపకు ఉందని వీటితో పాటు కామెర్లు,చర్మ సంబంధిత వ్యాధులను నివారిస్తుంది.పిల్లలకు వేపను తినిపించడం వల్ల కడుపులో ఉండే నులి పురుగులు చచ్చిపోతాయని కాబట్టి పిల్లకు మేలు చేస్తుందని.పేర్కొన్నారు. బెల్లం... ఉగాది పచ్చడికి కీలకమైన ఇంగ్రీడియంట్. బెల్లానికి తీపిగుణం ఉంటుంది. బెల్లానికి కఫం పెంచే గుణం ఉంది. బెల్లం ఉగాది నుంచి వాడితే కఫ దోషాన్ని తగ్గిస్తుంది. ఎండాకాలం లో వచ్చే ఎందవేదిమిని తట్టుకోడానికి ఎండబారిన పడ్డ వారికి నీ రసం  తగ్గించితక్షణ శక్తి నిచ్చేది గ్లుకోజ్ గా బెల్లం పనిచేస్తుంది.బెల్లం ఒక సువాసన,శ్రమ నీరసం తగ్గించి వడ దెబ్బ నుండి కాపాడే శక్తినిచ్చి ప్రోటీన్లను అందించేది బెల్లమే  అయితే బెల్లము అరిటి పండు కలిపి తీసుకుంటే మంచిదని అంటారు చిరుమామిళ్ళ. మామిడి ... ఉగాదిపచ్చడికి ఎన్ని ఉన్న మామిడి ముక్క పుల్లగా తగలనిదే పచ్చడికి రుచి ఉండదు. అని పెద్దలు అంటూ ఉంటారు.ముఖ్యంగా వేసవి కాలం లో చాలామంది కడుపు నొప్పి తో బాధ పడుతూఉంటారు.మామిదిపండులో ఉండే విటమిన్ సి మనలో ఇమ్యునిటీ పెంచుతుంది. మామిడి కాయ వల్ల గుండెజబ్బులు, డయాబెటిస్ రాకుండా నియంత్రిస్తుంది.  చింత పండు... దీనిని తెమరందన్ ఇండియా భారత దేశం లో అతి పురాతన మైన విటమిన్లు,పిండి పదార్ధాలు ఉంటాయి. చింతపండులో ముఖ్యంగా పాత చింత పండు ఉష్ణం తగ్గిస్తుంది. వాతాన్ని, బడలిక, జీర్ణ ప్రక్రియను సరి చేస్తుంది. శరీరంలో వచ్చే వేడి తగ్గించి చల్ల దానాన్ని ఇస్తుంది.ముఖ్యంగా చింత అంటే చింతలు తీర్చేది చింత రసం త్వరగా శక్తి నిస్తుంది.మూత్ర విసర్జన సాఫీగా సాగేట్లు సహకరిస్తుంది చింత రసం. అందుకు చింత పండు రసం వేసవి కాలం లో తీసుకోవడం అవసరమని నిపుణులు సూచిస్తున్నారు. ఉప్పు... ఉగాది పచ్చడి రుచిని పెంచేది చవి లేదా లవణం,ఉప్పు మన శరీర అవసరాలకు జీవన శక్తి నిచ్చేది లవణం. ఆహారం లో వేసే ఉప్పు ఆ వంటకు మంచి రుచిని ఇస్తుంది.ఉప్పు త్రిదోషాల ను హరిస్తుంది. అరటి పండు... అరటి పండు లో పోషక విలువలు పొటాషియం, యాంటి ఫంగల్, కూడా అరటి పండు పనిచేస్తుంది.అతిసారం నుండి రక్షించే సంజీవనిగా పేర్కొన్నారు వైద్యులు. అరటి పండు అధిక రక్త పోటు, కిడ్నీ సమస్యలు, రసాయనం గా పనిచేస్తుంది. ఇవి ఉగాది ఔషదం అధ్బుత ఫలితాలు ఉగాది పచ్చడి ఉగాది రోజే తీసుకోవాలా అప్పుడప్పుడూ తీసుకోవచ్చు అంటున్నారు. ముఖ్యంగా ఉగాది నుండి శ్రీరామ నవమి వరకు ఎప్పుడైనా తీసుకుంటే వేసవి కాలం లో ఎన్ని సార్లు తీస్జుకున్న తప్పులేదు. వ్యక్తిలో ఉండే త్రి దోషాల నుండి ముక్తి నిచ్చేది ఉగాది పచ్చడి.