- ఆగస్ట్‌తో ‘వారణాసి’ షూటింగ్ పూర్తి
- సెన్సేషనల్ డైరెక్టర్‌తో మహేష్ నెక్స్‌ట్ మూవీ
- మహేష్ కోసం స్రిప్ట్ రెడీ చేసిన డైరెక్టర్
సూపర్‌స్టార్ మహేష్‌బాబు, దర్శకధీరుడు రాజమౌళి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘వారణాసి’ చిత్రంపై రోజు రోజుకీ అంచనాలు భారీగా పెరుగుతున్నాయి. తన కెరీర్‌లోనే ఫస్ట్ టైమ్ గ్లోబల్ స్టార్‌గా అంతర్జాతీయ స్థాయి సినిమా చేస్తున్నారు. ఈ సినిమా ప్రస్తుతం సెట్స్‌పై ఉంది. అయినప్పటికీ మహేష్ చేసే నెక్స్‌ట్ ప్రాజెక్ట్‌పై ఆసక్తికరమైన చర్చలు ఫిలిం సర్కిల్‌లో జరుగుతున్నాయి.
‘వారణాసి’ సినిమా విషయానికి వస్తే.. షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఆగస్ట్ నాటికి చిత్రీకరణ పూర్తి చేసి, పోస్ట్ ప్రొడక్షన్ పనులపై దృష్టి పెట్టాలని చిత్ర యూనిట్ భావిస్తోంది. ఈ సినిమాను 2027, ఏప్రిల్ 7న ప్రపంచవ్యాప్తంగా అత్యంత భారీ స్థాయిలో విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఫారెస్ట్ బ్యాక్‌డ్రాప్‌లో ఒక డిఫరెంట్ కాన్సెప్ట్‌తో తెరకెక్కుతున్న ఈ అడ్వెంచరస్ థ్రిల్లర్ కోసం మహేష్, రాజమౌళి అభిమానులు ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు.
ఇక మహేష్ నెక్స్‌ట్ చేసే సినిమా విషయంలో రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. వాటిలో సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్‌రెడ్డి పేరు ప్రముఖంగా చెప్ప్పుకుంటున్నారు. ‘అర్జున్ రెడ్డి’, ‘యానిమల్’ వంటి బ్లాక్‌బస్టర్స్‌తో అంతర్జాతీయ స్థాయిలో పేరు తెచ్చుకున్న సందీప్‌రెడ్డి... మహేష్ కోసం ఒక ఎక్స్‌ట్రార్డినరీ సబ్జెక్ట్ సిద్ధం చేశారని తెలుస్తోంది.
మహేష్ క్లాస్ అండ్ మాస్ అప్పీల్‌కు, సందీప్ రా మేకింగ్ స్టెíల్ తోడైతే బాక్సాఫీస్ బద్దలు కావడం ఖాయమని ఫ్యాన్స్ నమ్ముతున్నారు. వీరిద్దరి కాంబినేషన్‌లో సినిమా ఉంటుందని చాలా కాలంగా వార్తలు వస్తున్నప్పటికీ రకరకాల కారణాల వల్ల అది మెటీరియలైజ్ కాలేదు. ‘వారణాసి’ చిత్రంతో గ్లోబల్ మార్కెట్‌కు వెళుతున్న మహేష్.. నెక్స్‌ట్ చెయ్యబోయే సినిమా సందీప్‌రెడ్డి డైరెక్షన్‌లో అయితే ఆ క్రేజ్ కంటిన్యూ అవుతుందని ఇండస్ట్రీలో చర్చ మొదలైంది.
సందీప్ రెడ్డి ప్రస్తుతం ప్రభాస్‌తో ‘స్పిరిట్’ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటివరకు ప్రభాస్ చేసిన సినిమాలకు భిన్నంగా ఈ సినిమా ఉండబోతోందని తెలుస్తోంది. ఈ సినిమా తర్వాత సందీప్ ‘యానిమల్ పార్క్’ చేస్తారు. మరి మహేష్ ప్రాజెక్ట్ ఎప్ప్పుడు సెట్స్ పైకి వెళ్తుందనే విషయంలో క్లారిటీ రావాల్సి ఉంది.





