LATEST NEWS
నియోజకవర్గాల పునర్విభజనకు కేంద్రం సిద్ధమౌతుండటం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తం అవుతున్నా ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్ కు మాత్రం కేంద్రం నిర్ణయం పెద్ద ఎదురుదెబ్బ అని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  2029 సార్వత్రిక ఎన్నికలకు ముందే దేశవ్యాప్తంగా నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియను పూర్తి చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ పరిణామం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పెను మార్పులకు నాంది పలుకుతుందని అంటున్నారు. ముఖ్యంగా మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్ కు కేంద్రం నిర్ణయం మింగుడుపడటం లేదన్న చర్చ ఏపీ పొలిటికల్ సర్కిల్స్ లో జోరుగా సాగుతోంది.   కేంద్రం తాజా లెక్కల ప్రకారం, దేశవ్యాప్తంగా లోక్‌సభ స్థానాల సంఖ్య 543 నుండి 816కి, అసెంబ్లీ స్థానాలు 4,123 నుండి 6,185కి పెరగనున్నాయి. ఆంధ్రప్రదేశ్‌ విషయానికొస్తే ప్రస్తుతం ఉన్న 175 అసెంబ్లీ స్థానాలు 263కి, అలాగే ఇప్పుడున్న పాతిక లోక్ సభ స్థానాలు   38కి పెరగనున్నాయి.  ఈ మార్పు వైసీపీకి రాజకీయంగా తేరుకోలేని దెబ్బగా పరిణమించడం ఖాయమని అంటున్నారు. నియోజకవర్గాల పెంపు కారణంగా రాష్ట్రంలో ఇప్పటికే అంతంత మాత్రంగా ఉన్న వైసీపీ బలం మరింత దిగజారే అవకాశం ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  గతంలో నియోజకవర్గాల  పునర్విభజన సమయంలో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి తన వ్యూహాలతో కాంగ్రెస్ పార్టీకి గట్టి పట్టున్న ప్రాంతాలను అనుకూలంగా మార్చుకున్నారు. సీనియర్ నాయకుడు గాదె వెంకటరెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఆ ప్రక్రియలో తెలుగుదేశం  కంచుకోటలుగా ఉన్న అనేక నియోజకవర్గాలు ముక్కలయ్యాయి. అప్పట్లో వైఎస్ వేసిన ఆ పునాదులే తర్వాతి కాలంలో వైసీపీకి పెట్టని కోటలుగా మారాయి. అయితే  ప్రస్తుతం పరిస్థితి ఒకింత భిన్నంగా ఉంది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది. కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వంలో కూడా తెలుగుదేశం భాగస్వామి. అంతే కాకుండా కేంద్రంతో చంద్రబాబుకు ఇప్పుడు మంచి సత్సంబంధాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో  రాష్ట్రంలోనియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియపై ఆయన ముద్ర స్పష్టంగా ఉంటుంది. గతంలో వైసీపీకి అనుకూలంగా ఉండేలా మలచబడిన నియోజకవర్గాల సరిహద్దులు ఇప్పుడు చెల్లాచెదురు అయ్యే అవకాశాలే మెండుగా ఉన్నాయని అంటున్నారు.  అలాగే సీట్ల సంఖ్య పెరగడం వల్ల కూటమిలోని మిత్రపక్షాలైన జనసేన, బీజేపీలకు కూడా బోలెడంత ప్రయోజనం చేకూరుతుంది. సీట్ల సర్దుబాటు విషయంలో ఇబ్బందులు కనీస స్థాయికి తగ్గిపోతాయి. ఇది ఆ పార్టీలు మరింత బలోపేతం కావడానికి దోహదపడుతుంది.   కూటమి పార్టీలు బలపడటం అంటే వైసీపీ బలహీనపడటమేననడంలో సందేహం లేదు.  మొత్తానికి, 2024 ఎన్నికల ఓటమి నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నట్లు కనిపిస్తున్న వైసీపీకీ, ఆ పార్టీ అధినేత జగన్ కు నియోజకవర్గాల పునర్విభజన అంశం తేరుకోలేని దెబ్బగా మారుతుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
పశ్చిమ బెంగాల్‌లో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో భారత ఎన్నికల సంఘం  సంచలన నిర్ణయం తీసుకుంది. ఒకేసారి 73 మంది రిటర్నింగ్ అధికారులను  తొలగిస్తూ ఆదేశాలు జారీ చేసింది. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీకి   వచ్చేనెల 23, 29 తేదీలలో   రెండు దశల్లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఒకే సారి భారీగా ఆర్వోల తొలగింపు నిర్ణయం సంచలనం సృష్టించింది.   భారీగా ఆర్వోల తొలగింపు వెనుక రాజకీయ ఒత్తిడులు ఉన్నాయని పశ్చిమబెంగాల్ లో అధికార తృణమూల్ కాంగ్రెస్ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తోంది.  అయితే ఒకే సారి 72 మంది ఆర్వోలను తొలగిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయం వెలువరించిదే తప్ప అదుకు కారణాలను వెల్లడించలేదు. అయితే విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు ఎన్నికల అక్రమాల ఆరోపణల నేపథ్యంలో ఈ తొలగింపు జరిగిందని తెలుస్తోంది. ఎన్నికల సంఘం ఈ అధికారులను ఎందుకు తొలగించిందనే దానిపై స్పష్టమైన కారణాలు వెల్లడించలేదు. బీజేపీ వంటి పార్టీలు అయితే అధికార తృణమూల్ కాంగ్రెస్ కు అనుకూలంగా వ్యవహరిస్తున్నందునే 72 మంది ఆర్వోలపై ఎన్నికల సంఘం వేటు వేసిందని అంటున్నారు.   
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ మరో వారం రోజుల్లో విడుదల కానున్న నేపథ్యంలో.. రాష్ట్రంలో పొత్తుపొడుపులు కొలిక్కి వస్తున్నాయి.  ప్రతిపక్ష  అన్నాడీఎంకే నేతృత్వంలోని జాతీయ ఎన్డీయే మధ్య ఇంత కాలం కుదరని సీట్ల సర్దుబాటు ఎట్టకేలకు ఒక కొలిక్కి వచ్చింది.  సోమవారం (మార్చి 23) చెన్నైలో జరిగిన ఎన్డీయే భాగస్వామ్య పక్షాల  భేటీలో  పార్టీల  మధ్య ఏకాభిప్రాయం కుదిరింది. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించిన కూటమి.. ఏయే పార్టీలు ఎన్నెన్ని స్థానాల్లో పోటీ చేస్తాయన్న విషయాన్ని వెల్లడించింది.   కూటమిలోని పార్టీలు పోటీ చేసే సీట్ల వివరాలను అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి పళనిస్వామి కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ సమక్షంలో  వెల్లడించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి పీయూష్ గోయెల్.. సీట్ల సర్దుబాటుపై తాము పూర్తి సంతృప్తితో ఉన్నామని తెలిపారు. ముఖ్యమంత్రి స్టాలిన్ నాయకత్వంలోని డీఎంకే పాలనపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందన్న ఆయన  ఈ ఎన్నికల్లో ఎన్డీయే ఘనవిజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందన్న ధీమా వ్యక్తం చేశారు.   వాస్తవానికి ఈ కూటమి సీట్ల సర్దుబాటు ఇంత వరకూ ఓ కొలిక్కి రాకపోవడానికి ప్రధాన కారణం నటుడు విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ అని చెప్పాల్సి ఉంటుంది.  ఆ పార్టీతో పొత్తు కుదుర్చుకునేందుకు బీజేపీ చివరి నిముషం వరకూ ప్రయత్నించింది. ఒక దశలో టీవీకే, బీజేపీ మధ్య పొత్తుపొడిచిందన్న వార్తలు కూడా గట్టిగా వినిపించాయి. అయితే టీవీకే అధినేత విజయ్ ఒంటరి పోరుకే మొగ్గు చూపడంతో ఇక గత్యంతరం లేని పరిస్థితుల్లో బీజేపీ అన్నాడీఎంకేను కలుపుకుని ఎన్నికలకు వెళ్లాల్సి వచ్చిందన్నది పరిశీలకుల విశ్లేషణ.   మొత్తానికి   ఎన్డీయే కూటమిలో సీట్ల సర్దుపాట్లు ముగిసి ఏకాభిప్రాయం సాధ్యమైంది. 234 అసెంబ్లీ స్థానాలున్న తమిళనాడులో  అన్నాడీఎంకే సింహభాగం సీట్లను తన వద్దే ఉంచుకుంది.  ఆ పార్టీ  178 నియోజకవర్గాల్లో పోటీ చేయాలని నిర్ణయించింది. ఇక కూటమిలోని మరో ప్రధాన భాగస్వామి అయిన భారతీయ జనతా పార్టీ 27 స్థానాలలో పోటీ చేస్తుంది. ఇక్కడ గమనించాల్సిన అంశం ఏమిటంటే.. గత ఎన్నికలలో ఇదే పొత్తులో భాగంగా బీజేపీ కేవలం 20 స్థానాలలో మాత్రమే పోటీ చేసింది. ఈ సారి మరో ఏడు స్థానాలను అదనంగా దక్కించుకుంది.  ఇక కూటమిలోని ఇతర పార్టీలలో,  అన్బుమణి రామ్‌దాస్ నేతృత్వంలోని పీఎంకే  18 స్థానాల్లోనూ,  టీటీవీ దినకరన్ సారథ్యంలోని ఏఎంఎంకే11 స్థానాలలోనూ పోటీ చేస్తుంది.    అదలా ఉంటే పీఎంకేలో చీలిక వచ్చింది. ఆ పార్టీ అధినేత రామదాసు తన వర్గంతో కలిసి శశికళ కూటమితో చేతులు కలపడం ఆసక్తి కరంగా మారింది.  ఇక పోతే.. అధికార డీఎంకే కూటమిలో  సీట్ల సీట్ల సర్దు ‘పాట్లు’ ఇంకా కొనసాగుతున్నాయి.  ప్రస్తుతం తమిళట   డీఎంకే కూటమి, అన్నాడీఎంకే నేతృత్వంలోని ఎన్డీయే, విజయ్ టీవీకే పార్టీ,   శశికళ కూటముల మధ్య చతుర్ముఖ పోటీ  ఉన్నప్పటికీ.. అందరి ఆస క్తీ టీవీకే  ఈ ఎన్నికలలో చూపే ప్రభావంపై సర్వత్రా ఆసక్తి వ్యక్తం అవుతోంది. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు ఏప్రిల్ 23న ఒకే విడతలో  జరుగుతాయి. మే 4న ఫలితాలు విడుదల  అవుతాయి. 
చంద్రబాబు వంటి దార్శనికుడు ముఖ్యమంత్రిగా ఉండటం ఆంధ్రప్రదేశ్ ప్రజల అదృష్టమని కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ మంత్రి హెడీ కుమారస్వామి అన్నారు. అనకాపల్లి జిల్లా నక్కపల్లిలో భారీ ఉక్కుకర్మాగారం శంకుస్థాపన  ఈ కార్యక్రమంలో పాల్గొన్న హెచ్ డీ కుమారస్వామి అంతకు ముందు విశాఖలో మీడియాతో మాట్లాడారు.  దేశంలోనే అతిపెద్ద స్టీల్ ప్లాంట్‌ విశాఖలో ఏర్పాటు కావడం వెనుక ఉన్నది చంద్రబాబు కృషీ చిత్తశుద్ధేనని అన్నారు. ఈ స్టీల్ ప్లాంట్ ఏర్పాటుతో ఏపీ ప్రజలకు ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని పేర్కొన్నారు.  అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలంలో లక్సెంబర్గ్‌కు చెందిన ఆర్సెలార్ మిట్టల్, జపాన్‌కు చెందిన నిప్పన్ స్టీల్ కంపెనీలు సంయుక్తంగా ఈ భారీ ఉక్కు కర్మాగారాన్ని ఏర్పాటు చేస్తున్న విషయం తెలిసిందే. ఇందు కోసం ఆ కంపెనీలు   రూ.1,47,162 కోట్ల పెట్టుబడి పెట్టనున్నాయి. రెండు దశల్లో ప్లాంట్ నిర్మాణం జరగనుండగా, 2029 నాటికి ఉత్పత్తి ప్రారంభించాలని లక్ష్యం. ఈ పరిశ్రమ ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా  65 వేల మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయి.
ప్రధాని నరేంద్రమోడీ ఖాతాలో అత్యంత అరుదైన రికార్డ్ చేరింది. భారత రాజకీయ చరిత్రలోనే గతంలో ఎవరికీ సాధ్యం కాని ఈ రికార్డును మోడీ సొంతం చేసుకున్నారు. అయన పీఎంగా  అత్యున్నత స్థానంలో  అత్యధిక రోజులు కొనసాగిన వ్యక్తిగా రికార్డు సాధించారు. ఇక నుంచి ఆయన అధికారంలో ఉన్న ప్రతి రోజూ ఒక కొత్త రికార్డు నమోదు అవుతూనే ఉంటుంది. అదెలా ఉంటే  నరేంద్రమోడీ గుజరాత్ సీఎంగా 2001 అక్టోబర్ 7న పదవీ బాధ్యతలు చేపట్టారు. అంతకు ముందు ఆయన గుజరాత్ సీఎంగా ఆ రాష్ట్రాన్ని పాలించారు.  దీంతో సోమవారం (మార్చి 23) నాటికి ఆయన పాలనా పగ్గాలు చేపట్టి  8932  రోజులైంది. అంటే అత్యధిక రోజుల పాటు  రోజుల పాటు ప్రభుత్వాధినేతగా బాధ్యతలు నిర్వహించి, దేశంలోనే సుదీర్ఘకాలం పనిచేసిన నేతగా  మోడీ కొత్త రికార్డు సృష్టించారు.    వివరాల్లోకి వెడితే.. 2001 అక్టోబ‌ర్ 7న గుజ‌రాత్ సీఎంగా తొలిసారి గా బాధ్య‌త‌లు చేపట్టిన ఆయన సుమారు 13 ఏళ్ల పాటు ఆ రాష్ట్రానికి ముఖ్య‌మంత్రిగా సేవ‌లందించారు.  అనంతరం.. 2014, మే 26న భార‌త ప్ర‌ధాన మంత్రిగా ప్ర‌మాణ స్వీకారం  చేశారు. నాటి  నుంచి నేటి వ‌ర‌కూ ఆయ‌న భారత ప్రధానిగా సేవలందిస్తున్నారు. అంటే గుజరాత్ సీఎంగా నాలుగు సార్లు, ప్రధనిగా మూడు సార్లు వరుస ఎన్నికలలో విజయం సాధించడం ద్వారా మోడీ  సుదీర్ఘ రాజ‌కీయ ప్ర‌స్థానాన్ని ప్ర‌భుత్వాధినేత‌గా   కొన‌సాగిస్తున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కూ మోడీ 2002, 2007, 2012 ఎన్నిక‌ల‌ను ముఖ్య‌మంత్రిగా విజ‌యం సాధించ‌డం మాత్ర‌మే కాదు.. 2014, 19, 24 ఎన్నిక‌ల‌ను ప్ర‌ధానిగా విజ‌యం సాధించ‌డం  కూడా ఒక రికార్డే. ప్ర‌ధానిగా వ‌రుస‌గా  మూడు ఎన్నిక‌ల విజ‌యం సాధించ‌డం ద్వారా భారత తొలి ప్రధాని జవహర్లాల్  నెహ్రూ రికార్డును బ‌ద్ధ‌లు కొట్టారు. అత్య‌ధిక కాలం  పీఎంగా ఉండి  మజీ ప్రధాని ఇందిరా  గాంధీ రికార్డును కూడా ఆయన బ్రేక్ చేశారు.  అత్య‌ధిక కాలం ప్ర‌ధానిగా ఉన్న రెండో పీఎం మోడీయే. అంతే కాదు ముఖ్య‌మంత్రిగా ఎక్కువ కాలం అనుభ‌వం ఉన్న ప్ర‌ధాని కూడా మోడీయే. కాగా మోడీ రికార్డులపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా సహా పలువురు రాజకీయ ప్రముఖులు స్పందించి ప్రధానికి అభినందనలు తెలిపారు. మోడీ ప్రజాసేవ పట్ల ఉన్న నిబద్ధతకు, పాలనాదక్షతకు ఇది నిదర్శనమని ప్రస్తుతించారు.  24 ఏళ్లకు పైగా ఎక్కడా విరామం లేకుండా దేశానికి సేవ చేయడం ఒక అరుదైన ఘ‌న‌త‌గా కీర్తించారు.  2029 లో కూడా మోడీయే ప్ర‌ధాని అయితే ఇది మ‌రో ఘ‌న‌త కూడా అవుతుంది.  నాలుగు సార్లు ముఖ్య‌మంత్రి నాలుగు సార్లు ప్ర‌ధాని అయిన ఈ రికార్డును వ‌చ్చే రోజుల్లో మ‌రే నేత కూడా బ్రేక్ చేసే ఛాన్సే లేద‌ని అంచ‌నా వేస్తున్నారు.
ALSO ON TELUGUONE N E W S
- బలమైన కథే అసలైన కింగ్  - నేటి సినిమాల సక్సెస్ మంత్రం! - మూడు గంటల సినిమా చూస్తారా?  - యానిమల్, పుష్ప2, ధురంధర్ 2 సృష్టించిన ప్రభంజనం ఇదే! తెలుగు చిత్ర పరిశ్రమలో ఒకప్పుడు సినిమా అంటే రెండు గంటల పది నిమిషాలు లేదా రెండున్నర గంటలు ఉండాలనే ఒక అలిఖిత నియమం ఉండేది. నిడివి ఎక్కువైతే ఆడియన్స్ బోర్ ఫీలవుతారని, థియేటర్లలో షోల సంఖ్య తగ్గుతుందని నిర్మాతలు భయపడేవారు. కానీ, ప్రస్తుత ట్రెండ్ చూస్తుంటే ఆ భయాలన్నీ పటాపంచలవుతున్నాయి. కంటెంట్ బలంగా ఉంటే ప్రేక్షకులు మూడు గంటలైనా, అంతకంటే ఎక్కువే అయినా కదలకుండా కూర్చుని సినిమాని ఆదరిస్తున్నారని ఇటీవలి విజయాలు నిరూపిస్తున్నాయి. నిడివి గురించి చర్చ ఈరోజుది కాదు. 1951లో విడుదలైన 'పాతాళ భైరవి' సినిమా అప్పట్లోనే దాదాపు 3 గంటల 15 నిమిషాల నిడివితో వచ్చి సంచలనం సృష్టించింది. ఆ రోజుల్లోనే ప్రేక్షకులు కథలోని మ్యాజిక్‌కు ఫిదా అయి సినిమాకు బ్రహ్మరథం పట్టారు. అంటే, సినిమా బాగుంటే సమయం ఒక అడ్డంకి కాదని మన పూర్వీకులు అప్పుడే నిరూపించారు. మధ్యలో కొంతకాలం కమర్షియల్ ఫార్ములా కోసం నిడివిని తగ్గించినా, ఇప్పుడు మళ్ళీ అదే పాత పద్ధతి కొత్త హంగులతో తిరిగి వచ్చింది. ఆధునిక తెలుగు సినిమాల్లో నిడివి విషయంలో రిస్క్ తీసుకున్న సినిమా 'అర్జున్ రెడ్డి'. విజయ్ దేవరకొండ కథానాయకుడిగా సందీప్ రెడ్డి వంగా తెరకెక్కించిన ఈ చిత్రం మూడు గంటలకు పైగా నిడివితో వచ్చింది. అప్పట్లో డిస్ట్రిబ్యూటర్లు నిడివి తగ్గించమని ఒత్తిడి చేసినా, దర్శకుడు మొండిగా తన కంటెంట్‌ను నమ్మి ముందుకు వెళ్లారు. ఫలితం ఏంటో మనందరికీ తెలిసిందే. ఆ సినిమా క్రియేట్ చేసిన ఇంపాక్ట్ తో ఇప్పుడు పెద్ద దర్శకులందరూ తమ కథలకు ఎంత నిడివి అవసరమో అంత తీసుకుంటున్నారు. ఇటీవల విడుదలైన పాన్ ఇండియా సినిమాలు రన్ టైమ్ విషయంలో అస్సలు తగ్గడం లేదు. రణబీర్ కపూర్ 'యానిమల్' సినిమా 3 గంటల 24 నిమిషాల నిడివితో వచ్చి బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల వర్షం కురిపించింది. అలాగే అల్లు అర్జున్-సుకుమార్ కాంబోలో వచ్చిన 'పుష్ప 2' కూడా 3 గంటల 21 నిమిషాల నిడివితో థియేటర్లలో సందడి చేసింది. నిడివి ఎక్కువగా ఉన్నప్పటికీ ఎక్కడా బోర్ కొట్టకుండా సాగడమే ఈ చిత్రాల విజయరహస్యం. ఇక తాజాగా బాక్సాఫీస్ వద్ద దుమ్ములేపుతున్న 'ధురంధర్ 2' గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. మొదటి భాగం 'ధురంధర్' 3 గంటల 40 నిమిషాల నిడివితో ఆశ్చర్యపరిస్తే, సీక్వెల్ ఏకంగా 3 గంటల 51 నిమిషాల రన్ టైమ్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దాదాపు నాలుగు గంటల నిడివి అంటే సామాన్యమైన విషయం కాదు. అయినప్పటికీ, థియేటర్లు హౌస్ ఫుల్ అవుతుండటం చూస్తుంటే ఆడియ‌న్స్‌కి  కావాల్సింది క్వాలిటీ కంటెంట్ మాత్రమేనని స్పష్టమవుతోంది. మొత్తానికి, ప్రేక్షకులకు కావాల్సింది కొత్తదనం, బలమైన ఎమోషన్స్. సినిమా నిడివి ఎంత అన్నది ఇప్పుడు సెకండరీ అయిపోయింది. కంటెంట్‌లో దమ్ముంటే ఐదు గంటలైనా చూసేందుకు సినీ ప్రియులు సిద్ధంగా ఉన్నారు. భవిష్యత్తులో రాబోయే పెద్ద సినిమాలు కూడా ఇదే బాటలో సాగే అవకాశం కనిపిస్తోంది. 
టాలీవుడ్ యంగ్ హీరో ఆశిష్ తన కొత్త సినిమా 'దేత్తడి'(Dethadi)తో బాక్సాఫీస్ వద్ద రచ్చ చేసేందుకు సిద్ధమయ్యాడు. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమా నుంచి తాజాగా ఊర మాస్ గ్లింప్స్ ను విడుదల చేశారు. ఈ గ్లింప్స్ చూస్తుంటే థియేటర్లలో మాస్ ఆడియన్స్ విజిల్స్ వేయడం ఖాయమనిపిస్తోంది. ముఖ్యంగా హైదరాబాద్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే ఈ కథలో ఆశిష్ తన లుక్, యాటిట్యూడ్‌తో అందరినీ ఆశ్చర్యపరిచాడు. గూస్ బంప్స్ తెప్పించే సీన్లు ఈ గ్లింప్స్‌లో ప్రతి ఫ్రేమ్ ఒక విజువల్ ఫీస్ట్‌లా ఉంది. ఆశిష్ మాస్ ఎంట్రీనే అదిరిపోయింది. 'బ్యాండోళ్ళం అన్న.. గట్టిగ కొట్టుడు అలవాటైపోయింది" అని చెప్పే డైలాగ్ గూస్ బంప్స్ తెప్పించేలా ఉంది. డైరెక్టర్ ఆదిత్య రావు గంగసాని మేకింగ్ స్టైల్ చాలా ఫ్రెష్‌గా ఉండటమే కాకుండా, మాస్ ఆడియన్స్‌కు కావాల్సిన హై-వోల్టేజ్ ఎలిమెంట్స్ అన్నీ పుష్కలంగా ఉన్నాయి. ముఖ్యంగా గ్లింప్స్‌లో జాతర వాతావరణం కట్టిపడేసింది. అదిరిపోయే విజువల్స్, బిజిఎమ్ టెక్నికల్ పరంగా 'దేత్తడి' గ్లింప్స్ టాప్ నాచ్‌గా ఉంది. సినిమాటోగ్రఫీ చాలా రిచ్‌గా ఉండి, తెలంగాణ సంస్కృతిని, ముఖ్యంగా బోనాల జాతరను కళ్ళకు కట్టినట్లు చూపించారు. ఇక బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అయితే నెక్స్ట్ లెవల్‌లో ఉంది. డ్రమ్స్, ఫోక్ బీట్స్ మిళితం చేసిన సంగీతం వింటుంటేనే బాడీలో వైబ్రేషన్స్ వస్తున్నాయి. ఇది ఒక పక్కా కమర్షియల్ మాస్ ఎంటర్‌టైనర్ అని విజువల్స్ స్పష్టం చేస్తున్నాయి. కథ ఏంటి? ఈ గ్లింప్స్‌లో ఆశిష్ ఒక బ్యాండ్ ప్లేయర్‌గా కనిపిస్తున్నాడు. కేవలం ఎంటర్‌టైన్‌మెంట్ మాత్రమే కాకుండా, ఇందులో ఏదో ఒక పవర్‌ఫుల్ స్టోరీ కూడా దాగి ఉందనే హింట్స్ కనిపిస్తున్నాయి. ఆశిష్ కళ్లలో కనిపించే కసి సినిమా కథపై ఆసక్తిని పెంచుతోంది. ఈ గ్లింప్స్ విడుదలైన కొద్దిసేపట్లోనే సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. నెటిజన్లు ఆశిష్ మేకోవర్, అతని ఎనర్జీ చూసి ఫిదా అవుతున్నారు. ఇటీవల తెలంగాణ బ్యాక్‌డ్రాప్‌లో వస్తున్న సినిమాలు బాక్సాఫీస్ దగ్గర మ్యాజిక్ చేస్తున్నాయి. ‘దేత్తడి’ కూడా ఆ లిస్టులో చేరుతుందేమో చూడాలి.
- ఆదుర్స్ 2పై వినాయక్ క్లారిటీ.. ఫ్యాన్స్ షాక్! - స్టార్ డైరెక్టర్లు ఎందుకు సినిమాలు చేయడం లేదు - టాలీవుడ్ సీనియర్ దర్శకుల రూటు మారుతుందా?  - వినాయక్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ వైరల్. మాస్ పల్స్ తెలిసిన దర్శకుడిగా, మెగాస్టార్ చిరంజీవి నుంచి యంగ్ టైగర్ ఎన్టీఆర్ వరకు అందరికీ ఇండస్ట్రీ హిట్స్ ఇచ్చిన ట్రాక్ రికార్డ్ వి.వి.వినాయ‌క్‌ సొంతం. అయితే వినాయక్ మెగా ఫోన్ పట్టి చాలా కాలమే అవుతోంది. కేవలం ఆయనే కాదు, ఒకప్పుడు ఇండస్ట్రీని ఏలిన పలువురు స్టార్ డైరెక్టర్లు ఇప్పుడు సైలెంట్ అయిపోయారు. అసలు ఈ సీనియర్ దర్శకులు ఎందుకు సినిమాలు చేయడం లేదు? గ్యాప్ ఎందుకు వస్తోంది? అనే ప్రశ్నలకు వినాయక్ తాజాగా తనదైన శైలిలో సమాధానమిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వినాయక్ అభిప్రాయం ప్రకారం.. మారుతున్న కాలంతో పాటు ప్రేక్షకుల అభిరుచులు కూడా వేగంగా మారిపోతున్నాయి. ఒకప్పుడు వర్కవుట్ అయిన పాత ఫార్ములాలనే పట్టుకుని ఇప్పుడు సినిమాలు తీస్తామంటే కుదరదని ఆయన కుండబద్దలు కొట్టారు. వినూత్నమైన ఐడియాలు లేనప్పుడు పాత పద్ధతుల్లోనే సినిమాలు తీసి ఫెయిల్ అవ్వడం కంటే, మౌనంగా ఉండటమే ఉత్తమమని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం ఆడియన్స్ కంటెంట్ విషయంలో చాలా క్లారిటీతో ఉన్నారని, వారికి ఏదో ఒకటి ఇచ్చేద్దామనుకుంటే రిజల్ట్ దారుణంగా ఉంటుందని వినాయక్ విశ్లేషించారు. ముఖ్యంగా ఎన్టీఆర్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న 'ఆదుర్స్ 2' సీక్వెల్‌పై కూడా ఆయన క్లారిటీ ఇచ్చారు. 'ఆదుర్స్' సినిమా ఒక అద్భుతమని, దాన్ని అక్కడితో వదిలేయడమే గౌరవప్రదమని ఆయన చెప్పుకొచ్చారు. బలవంతంగా సీక్వెల్ తీసి ఆ సినిమాకున్న క్రేజ్‌ను పాడు చేయడం తనకు ఇష్టం లేదని, ఒకవేళ తీసినా మొదటి పార్ట్ రేంజ్‌లో మెప్పించగలమా అన్న సందేహాన్ని ఆయన వ్యక్తం చేశారు. దీంతో 'ఆదుర్స్ 2' కోసం వెయిట్ చేస్తున్న నందమూరి అభిమానులకు కొంత నిరాశ ఎదురైనప్పటికీ, వినాయక్ నిజాయితీని అందరూ అభినందిస్తున్నారు. వినాయక్ కెరీర్ విషయానికి వస్తే.. 'ఆది', 'ఠాగూర్', 'దిల్', 'ఖైదీ నంబర్ 150' వంటి భారీ విజయాలు ఆయన ఖాతాలో ఉన్నాయి. అయితే 'అఖిల్', 'ఇంటలిజెంట్' వంటి సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో రాణించకపోవడం ఆయనను కొంత ఇబ్బందికి గురిచేశాయి. ఇక బెల్లంకొండ శ్రీనివాస్‌తో హిందీలో చేసిన 'ఛత్రపతి' రీమేక్ కూడా ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు. ఈ నేపథ్యంలోనే ఆయన కొంతకాలం విరామం తీసుకోవాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో వినాయక్ వ్యాఖ్యలు తెగ వైరల్ అవుతున్నాయి. కేవలం వినాయక్ మాత్రమే కాదు, శ్రీను వైట్ల వంటి పలువురు దర్శకులు కూడా ప్రస్తుతం ఇదే తరహా సవాళ్లను ఎదుర్కొంటున్నారు. కొత్త తరం దర్శకులు సరికొత్త పాయింట్లతో వస్తుండటంతో, సీనియర్లు తమను తాము అప్‌డేట్ చేసుకోవాల్సిన అవసరం ఉందని ఇండస్ట్రీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. మరి ఈ గ్యాప్ తర్వాత వినాయక్ ఏదైనా పవర్‌ఫుల్ స్క్రిప్ట్‌తో మళ్ళీ రీ-ఎంట్రీ ఇస్తారో లేదో వేచి చూడాలి. ప్రస్తుతం ఆయన మాటలు చూస్తుంటే మాత్రం, సరైన కథ దొరికే వరకు కెమెరా ముందుకు వచ్చేలా కనిపించడం లేదు.
    -సుస్మిత కొణిదెల చేతుల మీదుగా అందచేత  -ఏడిద బాబీ ఎవరు  -సేవాకార్యక్రమాలు మరింత ముందుకి  చిరంజీవి(chiranjeevi),పవన్ కళ్యాణ్(Pawan Kalyan),రామ్ చరణ్(Ram Charan)తో పాటు మెగా హీరోలందరికీ మెగా ఫ్యాన్స్ ఎంత బలమో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఎన్నో ఏళ్ళ నుంచి మెగా హీరోలపేరుపై పలు రకాల సేవా కార్యక్రమాలు చేస్తు మెగా హీరోలు అంటే ఆన్ ది స్క్రీన్ తో పాటు ఆఫ్ ది స్క్రీన్ కూడా హీరోలని తెలియచేస్తున్నారు. ఇవన్నీ చేయడానికి అభిమాన సంఘాలు ఎంతగా సంఘటితం అవుతాయో తెలిసిందే. ఇప్పుడు సదరు సంఘాలు సరికొత్త రూపుని  సంతరించుకోనున్నాయి. ఆ వివరాలేంటో చూద్దాం. చిరంజీవి పెద్ద కూతురు, ప్రముఖ నిర్మాత సుస్మిత కొణిదెల(Sushmita Konidela)రీసెంట్ గా 'మెగా యూత్ ఫోర్స్‌'(Mega Youth Force)ని నేషనల్ స్థాయిలో అధికారకంగా లాంచ్ చేయడం జరిగింది. యువ మెగా అభిమానులని ఏకం చేసి, వారి శక్తిని సామాజిక సేవ వైపు మళ్లించడమే యూత్ ఫోర్స్ ప్రధాన ధ్యేయం. ఆంధ్రప్రదేశ్ లోని రాజమండ్రికి చెందిన బాబీ ఏడిద మెగా యూత్ ఫోర్స్ జాతీయ కన్వీనర్‌గా నియమితులయ్యాడు. ఈ మేరకు బాబీకి నియామక పత్రాన్ని సుస్మిత తన చేతుల మీదుగా అందచేసింది. దీంతో మెగా అభిమానులు బాబీకి కంగ్రాట్స్ చెప్తున్నారు. also read: Sri satya: మా నాన్న, నేను కలిసి మందు తాగుతాం.. బిగ్ బాస్ బ్యూటీ వెల్లడి సుస్మిత రీసెంట్ గా మన శంకర వరప్రసాద్ గారు(Mana Shankara varaprasad Garu)తో బ్లాక్ బస్టర్ ని అందుకున్న విషయం తెలిసిందే. బ్లాక్ బస్టర్ తోనే ఆగిపోలేదు. తొలి సినిమాతోనే లోకల్ తెలుగు సినిమాలోనే హయ్యెస్ట్ కల్లెక్షన్స్ అందుకున్న తొలి ప్రొడ్యూసర్ గా నిలవడంతో పాటు ఎంటైర్ తన తండ్రి నాలుగున్నర దశాబ్డల కెరీర్ లోనే హయ్యస్ట్ కలెక్షన్స్ సాధించిన మూవీగా కూడా నిలిపింది.     
'ధురంధర్: ది రివెంజ్' (Dhurandhar: The Revenge) సినిమా ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద తాండవం ఆడుతోంది. బాలీవుడ్ స్టార్ రణవీర్ సింగ్, డైరెక్టర్ ఆదిత్య ధర్ కాంబినేషన్ లో వచ్చిన ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్, ఇండియన్ సినీ హిస్టరీలో సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. తెలుగులోనూ భారీ వసూళ్లతో సత్తా చాటుతోంది. ఈ నేపథ్యంలో తెలుగు డైలాగ్ రైటర్ వి.ఎస్. వెంకటేశన్ (V.S. Venkatesan) 'తెలుగువన్'కి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సినిమాను తెలుగు ప్రేక్షకులకు చేరువ చేయడంలో అన్నపూర్ణ స్టూడియోస్, డైలాగ్ రైటర్ వి.ఎస్. వెంకటేశన్ కీలక పాత్ర పోషించారు. వెంకటేశన్ కేవలం డైలాగులను తర్జుమా చేయడమే కాకుండా, ఆ పాత్రల ఎమోషన్‌ను స్వయంగా అనుభవించి తెలుగులో ఎక్స్‌ప్రెస్ చేశారు. ముఖ్యంగా ఉర్దూ, సింధీ భాషల ప్రభావం ఉన్న సంభాషణలను తెలుగు మూలాలకు దగ్గరగా, ప్రేక్షకులకు అర్థమయ్యేలా రాయడం ఆయనకు ఒక గొప్ప సవాలుగా నిలిచింది. డైలాగ్స్ వెనుక అసలు కష్టం ఈ సినిమాకు సంబంధించి వి.ఎస్. వెంకటేశన్ కొన్ని ఆసక్తికర కామెంట్స్ చేశారు. సాధారణంగా యాక్షన్ సినిమాలకు డైలాగ్స్ రాయడం అంటే కేవలం పవర్ ఫుల్ పంచ్ లు ఇవ్వడమే అనుకుంటారు. కానీ 'ధురంధర్' విషయంలో ఆదిత్య ధర్ కోరుకున్నది 'రియలిస్టిక్' అని ఆయన వెల్లడించారు. "మాటలు తక్కువగా ఉండాలి, కానీ ఇంపాక్ట్ మాత్రం భారీగా ఉండాలి" అన్నది దర్శకుడి కండిషన్ అని, దానికోసం తాను పడ్డ కష్టం అంతా ఇంతా కాదని ఆయన చెప్పుకొచ్చారు. రణవీర్ సింగ్ క్యారెక్టర్ గురించి ఈ చిత్రంలో రణవీర్ సింగ్ క్యారెక్టర్ చాలా వైవిధ్యంగా ఉందని చెప్పారు. ఇప్పటివరకు మనం చూసిన రణవీర్ కంటే, ఈ సినిమాలో ఆయన చాలా తీవ్రమైన, గంభీరమైన పాత్రలో కనిపించారని పేర్కొన్నారు. ఆయన బాడీ లాంగ్వేజ్‌కు తగ్గట్టుగా, తెలుగు నేటివిటీ మిస్ కాకుండా డైలాగ్స్ రాయడం ఒక సవాల్‌తో కూడుకున్న పని అని వెంకటేశన్ అన్నారు. ఇండస్ట్రీపై వెంకటేశన్ అభిప్రాయం ఒక రైటర్‌గా తను ఎదుర్కొన్న సవాళ్లను ఆయన గుర్తు చేసుకున్నారు. ఇండస్ట్రీలో ఒక రచయితకు దక్కాల్సిన గుర్తింపుపై ఆయన ఆసక్తికరమైన కామెంట్స్ చేశారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో మంచి కథలు, సంభాషణలు రాసే వారికి అవకాశాలు దొరకడం ఒక ఎత్తు అయితే, వాటిని తెరపైకి సమర్థవంతంగా తీసుకురావడం మరొక ఎత్తు అని ఆయన విశ్లేషించారు. తన కెరీర్‌లో 'ధురంధర్' ఒక ప్రత్యేకమైన సినిమాగా నిలిచిపోతుందని చెప్పారు. మరిన్ని ఆసక్తికరమైన సినీ అప్‌డేట్స్, ఇంటర్వ్యూల కోసం మా తెలుగువన్(TeluguOne) యూట్యూబ్ ఛానెల్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి.  
మన టాలీవుడ్ తారలు కేవలం కెమెరా ముందే కాకుండా, వెండితెర వెనుక వ్యాపార సామ్రాజ్యాలను నిర్మించడంలోనూ ముందుంటున్నారు. ముఖ్యంగా ఫుడ్ అండ్ బెవరేజెస్ రంగంపై మక్కువ చూపుతున్న మన స్టార్లు, హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో విలాసవంతమైన రెస్టారెంట్లను ఏర్పాటు చేశారు. అభిమానులకు తమ అభిమాన హీరోలకు సంబంధించిన ప్రదేశాల్లో భోజనం చేయడం ఒక మధురానుభూతిని ఇస్తోంది. సూపర్ స్టార్ మహేష్ బాబు తన భార్య నమ్రతతో కలిసి వ్యాపార రంగంలోనూ రాణిస్తున్నారు. బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12లో 'మినర్వా కాఫీ షాప్' భాగస్వామ్యంతో 'ఏఎన్ (AN)' రెస్టారెంట్‌ను ప్రారంభించారు. దక్షిణ భారత రుచులతో పాటు మల్టీ కుజైన్ వంటకాలకు ఇది పెట్టింది పేరు. ప్యాలెస్ తరహా ఇంటీరియర్స్ ఇక్కడ వచ్చే వారికి రాజసం అనుభూతిని కలిగిస్తాయి. కేవలం నటుడిగానే కాకుండా మల్టీప్లెక్స్ రంగంలోనూ మహేష్ ఇప్పటికే తన ముద్ర వేశారు. ఇక ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ విషయానికి వస్తే, జూబ్లీహిల్స్ ప్రాంతంలో అంతర్జాతీయ బ్రాండ్ 'బఫెలో వైల్డ్ వింగ్స్' ఫ్రాంచైజీని నడుపుతున్నారు. స్పోర్ట్స్ ప్రేమికులకు, చిల్ అవుట్ అవ్వాలనుకునే యువతకు ఇది ఫేవరెట్ స్పాట్. మరోవైపు అక్కినేని నాగార్జున 'ఎన్ గ్రిల్', 'ఎన్ ఏషియన్' వంటి పేర్లతో ఏళ్ల తరబడి రెస్టారెంట్ రంగంలో తన సత్తా చాటుతున్నారు. నాగ చైతన్య సైతం 'షోయు' అనే ఏషియన్ రెస్టారెంట్‌తో ఫుడ్ లవర్స్‌ను ఆకట్టుకుంటున్నారు. ముఖ్యంగా జపనీస్ రుచుల కోసం నగరవాసులు ఇక్కడికి క్యూ కడతారు. క్రికెట్ లెజెండ్ విరాట్ కోహ్లీకి చెందిన 'వన్8 కమ్యూన్' హైటెక్ సిటీలో యువతను విశేషంగా ఆకర్షిస్తోంది. అలాగే మన 'లోకల్ బాయ్' మహ్మద్ సిరాజ్ బంజారాహిల్స్‌లో 'జోహార్ఫా' పేరిట సరికొత్త రెస్టారెంట్‌ను స్టార్ట్ చేశారు. రాణా దగ్గుపాటి 'శాంక్చురీ', 'బ్రాడ్‌వే' వంటి సోషల్ హ్యాంగవుట్ ప్లేసెస్‌లో భాగస్వామిగా ఉంటూ హైదరాబాద్ నైట్ లైఫ్‌కు కొత్త కళను తీసుకొచ్చారు. వీరితో పాటు సందీప్ కిషన్ 'వివాహ భోజనంబు' పేరిట తెలుగు వారి సంప్రదాయ భోజనాన్ని వడ్డిస్తుంటే, నితిన్ 'టీ గ్రిల్' ద్వారా, విజయ్ దేవరకొండ 'గుడ్ వైబ్స్ ఓన్లీ' కెఫేతో ప్రేక్షకులకు చేరువయ్యారు. హెల్త్ కాన్షియస్ ఉన్న వారి కోసం రకుల్ ప్రీత్ సింగ్ 'ఆరంభ్' పేరుతో మనికొండలో తన కేంద్రాన్ని నిర్వహిస్తోంది. సినిమా షూటింగ్‌లు, ప్రమోషన్లతో బిజీగా ఉన్నప్పటికీ, మన తారలు ఇలా వినూత్న వ్యాపారాలతో ప్రేక్షకులను పలకరిస్తుండటం విశేషం. కేవలం స్టార్ హోదానే కాకుండా, క్వాలిటీ మరియు రుచి విషయంలోనూ రాజీ పడకుండా ఈ రెస్టారెంట్లను నడుపుతుండటంతో వీటికి ఆదరణ పెరుగుతోంది. భవిష్యత్తులో మరికొంతమంది స్టార్లు కూడా ఇదే బాటలో పయనిస్తూ కొత్త రెస్టారెంట్లను ప్రారంభించే ఆలోచనలో ఉన్నట్లు ఇండస్ట్రీ టాక్. సో.. మీరు కూడా మీ ఫేవరెట్ స్టార్ రెస్టారెంట్‌లో ఒక్కసారైనా భోజనం చేసేయండి!
  - శ్రీ సత్య మాటలు వైరల్  -ఇంతకీ ఆమె ఆవేదన ఏంటి! -షేక్ అవుతున్న సోషల్ మీడియా  ఊహల పల్లకిలో ఉరేగించనా... ఆశల వెల్లువై రాగం పలికించనా.. అనే సాంగ్ లో ఎంత స్వచ్ఛత, మాధుర్యం ఉందో సినిమా కూడా అంతే స్వచ్ఛమైనది, మాధుర్యమైనది. ఆ విషయంలో ఎలాంటి డౌట్స్ ని మైండ్ లోకి తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. అందుకే చాలా మంది నటులు, నటీమణులు సినిమా అవకాశాల కోసం ప్రయత్నిస్తుంటారు. అలాంటి వాళ్ళల్లో  శ్రీ సత్య(Sri satya)కూడా ఒకటి. బిగ్ బాస్ 6 తో పాటు పలు సీరియల్స్ తన ఖాతాలో ఉన్నాయి. రీసెంట్ గా  ఒక ఇంటర్వ్యూ లో పాల్గొంది. అందులో ఆమె మాట్లాడిన సినీ, వ్యక్తిగత  మాటలు వైరల్ న్యూస్ కి కూడా ఒక టైం అనేది వస్తుందని  నిరూపిస్తున్నాయి. మరి ఆ వైరల్ మాటలేంటో చూద్దాం. ఇండస్ట్రీలో  క్యాస్టింగ్ కౌచ్ ఉందనేది నిజం. అందుకే నేనే ఉదాహరణ. నాకు టాలెంట్ ఉన్నా అవకాశాలు రావడం లేదు. పరిశ్రమలో నాకు ఎవరూ తెలియదు. ఫోటో షూట్లు చేసి, ఆ తర్వాత వేషం లేదని చెప్పేస్తారు. ఒకసారి నేను మేకప్ వేసుకుంటుంటే, నా బ్యాగుని రూమ్ బయట పడేశారు. ఎవరితో పడితే వాళ్లతో రూమ్ షేర్ చేసుకోవడం ఇష్టం లేదని చెప్పినందుకు నన్ను ఘోరంగా అవమానించారు. ఆస్తి, అంతస్తుల కోసమే నా లవర్ నాకు బ్రేకప్ చెప్పాడు. ఆ బాధని తట్టుకోలేక ఒకసారి ఆత్మహత్యాయత్నం చేశాను. దాంతో మా అమ్మ తట్టుకోలేకపోయింది. ఫలితంగా మాట పడిపోయింది. ఏడాది పాటు ట్రీట్ మెంట్ చేయించినా ఫలితం లేదు.  also read: స్టార్ హీరోలు ఉన్నా విలన్ వల్ల బ్లాక్ బస్టర్ అయిన మూవీస్.. మళ్ళీ ఆ విలన్ వస్తాడా! బతికి ఉన్నంత కాలం అమ్మ అలానే ఉండాలి" నా మూతి కొంచెం ముందుకు ఉండాలని లిప్ సర్జరీ చేయించుకున్నాను. డాక్టర్ వద్దు అని చెప్పినా వినకుండా చేయించుకున్నా. కానీ అది నా ముఖానికి సెట్ కాలేదు. పెళ్లికి ముందు సహజీవనం చేయడం నాకు ఇష్టం లేదు. పెళ్లి అనే బంధానికి  చాలా గౌరవం ఇస్తాను. నాకు మద్యం సేవించే అలవాటు ఉంది. మా నాన్న ఏ బ్రాండ్ తెస్తే దాన్నే ఇద్దరం కలిసి తాగుతాం. మేము తండ్రీకూతుళ్లం మాత్రమే కాదు, మంచి స్నేహితులం. నాన్నకి బ్రేకప్ అయ్యింది, నాకు బ్రేకప్ అయ్యింది.. ఆ బాధలు మర్చిపోవడానికి ఇద్దరం కలిసి తాగుతామని చెప్పుకొచ్చింది.  
టాలీవుడ్ ప్రిన్స్, సూపర్‌స్టార్ మహేశ్‌బాబు అంటే కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, దేశవ్యాప్తంగా విపరీతమైన క్రేజ్ ఉంది. ఆయన అందానికి, నటనకు ఫిదా అవ్వని వారుండరు. అయితే కేవలం వెండితెరపైనే కాదు, ఆఫ్ స్క్రీన్ కూడా మహేశ్ ఒక రియల్ హీరో అని ఇప్పటికే చాలా మంది సినీ ప్రముఖులు కొనియాడారు. తాజాగా నెట్‌ఫ్లిక్స్‌లో సెన్సేషన్ క్రియేట్ చేసిన 'కోహ్రా' సిరీస్ సెకండ్ సీజన్‌లో నటిస్తున్న నీరూ సెహగల్, మహేశ్‌బాబు గురించి కొన్ని ఆసక్తికర విషయాలను వెల్లడించింది. నీరూ సెహగల్ గతంలో మహేశ్‌బాబుతో కలిసి ఒక కమర్షియల్ యాడ్‌లో నటించింది. ఆ సమయంలో ఆయనతో తనకున్న అనుభవాన్ని గుర్తు చేసుకుంటూ.. మహేశ్ బాబు సెట్‌లో ఎంత సింపుల్‌గా ఉంటారో వివరించింది. షూటింగ్ స్పాట్‌లో ఆయన ప్రవర్తన, పని పట్ల ఆయనకున్న అంకితభావం తనను ఎంతగానో ఆశ్చర్యపరిచాయని ఆమె చెప్పుకొచ్చింది. సాధారణంగా అంత పెద్ద స్టార్ అంటే సెట్‌లో కాస్త హడావుడి ఉంటుందని ఊహిస్తాం, కానీ మహేశ్ విషయంలో అది పూర్తిగా భిన్నమని ఆమె పేర్కొంది. మహేశ్‌బాబు టైమ్ మేనేజ్‌మెంట్ గురించి నీరూ ప్రత్యేకంగా ప్రశంసించింది. "ఆయన సెట్‌లోకి వస్తే కేవలం పనిపైనే దృష్టి పెడతారు. అందరితో ఎంతో మర్యాదగా, గౌరవంగా ప్రవర్తిస్తారు. షూటింగ్ సమయంలో ఆయన చూపించే క్రమశిక్షణ ఒక గొప్ప పాఠం లాంటిది" అని నీరూ తెలిపింది. ఒక పెద్ద స్టార్ హోదాలో ఉన్నప్పటికీ, తోటి నటీనటులకు ఆయన ఇచ్చే కంఫర్ట్ లెవల్స్ చూసి తాను ఫిదా అయ్యానని ఈ నార్త్ బ్యూటీ మురిసిపోయింది. ప్రస్తుతం నీరూ సెహగల్ 'కోహ్రా 2' అనే వెబ్ సిరీస్‌తో బిజీగా ఉంది. మొదటి సీజన్ భారీ విజయం సాధించడంతో, ఈ రెండో భాగంపై ఓటీటీ ప్రియుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఇలాంటి సమయంలో ఆమె మహేశ్‌బాబు గురించి చేసిన ఈ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా మారాయి. సూపర్‌స్టార్ ఫ్యాన్స్ ఈ వార్తను తెగ షేర్ చేస్తూ.. "మా అన్న ఎప్పుడూ ఇంతే.. సింప్లిసిటీకి కేరాఫ్ అడ్రస్" అంటూ కామెంట్స్ పెడుతున్నారు. మహేశ్ బాబు తన క్రమశిక్షణతో, హుందాతనంతో కేవలం టాలీవుడ్ లోనే కాకుండా, ఉత్తరాది నటీనటుల మనసులను కూడా గెలుచుకుంటుండడం విశేషం. రాజమౌళి సినిమాతో ఆయన అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకోవడం ఖాయమని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ లోపు మహేశ్ వ్యక్తిత్వం గురించి ఇలాంటి పాజిటివ్ వార్తలు రావడం ఆయన అభిమానుల్లో మరింత ఉత్సాహాన్ని నింపుతోంది.
'ధురంధర్-2'తో సంచలనం సృష్టిస్తున్న ఆదిత్య ధర్ ఆయన భార్య ప్రముఖ హీరోయిన్  తెలుగులో చేసిన సినిమాలు తెలుసా? ప్రస్తుతం ఇండియా వైడ్ గా బాలీవుడ్ డైరెక్టర్ ఆదిత్య ధర్(Aditya Dhar) పేరు మారుమోగిపోతోంది. 'ఉరి: ది సర్జికల్ స్ట్రైక్' సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఆయన, ఇప్పుడు 'ధురంధర్: ది రివెంజ్'(Dhurandhar: The Revenge)తో సంచలనం సృష్టిస్తున్నారు. ఆదిత్య ధర్ మేకింగ్ స్టైల్ ఎప్పుడూ వాస్తవికతకు దగ్గరగా ఉంటుంది. అనవసరమైన హంగులు లేకుండా కథలోని ఆత్మను పట్టుకోవడంలో ఆయన సిద్ధహస్తుడు. అందుకే ఆయన సినిమాలకు మంచి క్రేజ్ ఉంటుంది. కేవలం తన దర్శకత్వ ప్రతిభతోనే కాకుండా, తన వ్యక్తిగత జీవితం, ముఖ్యంగా హీరోయిన్ యామీ గౌతమ్‌తో తనకున్న అందమైన ప్రేమ కథతో కూడా ఆయన తరచుగా చర్చల్లో ఉంటారు. ఆదిత్య ధర్ కెరీర్ ఆరంభంలో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొన్నారు. అయితే 'ఉరి' సినిమా ఆయన తలరాతను మార్చేసింది. ఈ సినిమా షూటింగ్ సమయంలోనే ఆదిత్యకు, యామీ గౌతమ్‌కు మధ్య పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్తా స్నేహంగా మారి, చివరికి ప్రేమగా దారితీసింది. అయితే వీరిద్దరూ తమ ప్రేమ విషయాన్ని బయట ప్రపంచానికి తెలియనివ్వకుండా చాలా రహస్యంగా ఉంచారు. ఆడంబరాలకు వెళ్లకుండా, కేవలం కుటుంబ సభ్యుల సమక్షంలో అత్యంత సాదాసీదాగా వివాహం చేసుకుని అందరినీ ఆశ్చర్యపరిచారు. యామీ గౌతమ్ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. 2011లో వచ్చిన 'నువ్విలా' సినిమాతో తెలుగుతెరకు పరిచయమైన ఆమె.. 'గౌరవం', 'యుద్ధం', 'కొరియర్ బాయ్ కళ్యాణ్' వంటి సినిమాల్లో నటించింది. ఆ తర్వాత హిందీ సినిమాలపై ఎక్కువ దృష్టి పెట్టింది. 'ఉరి' సినిమా ఆమె కెరీర్ టర్నింగ్ పాయింట్ అని చెప్పవచ్చు. యామీ గౌతమ్ తన భర్తకు అన్ని విషయాల్లోనూ చేదోడు వాదోడుగా ఉంటుంది. వీరిద్దరూ కలిసి 'ఉరి', 'ఆర్టికల్ 370', 'ధూమ్ ధామ్' వంటి సినిమాలకు పనిచేశారు. ముఖ్యంగా 'ఆర్టికల్ 370' సినిమాలో యామీ నటనకు మంచి మార్కులు పడ్డాయి.  సోషల్ మీడియాలో కూడా ఆదిత్య, యామీల ఫోటోలు ఎప్పుడూ వైరల్ అవుతూనే ఉంటాయి. ఇటీవల ఈ దంపతులు తల్లిదండ్రులుగా ప్రమోషన్ పొందారు. షూటింగ్స్ లో ఎంత బిజీగా ఉన్నా, తన కుటుంబాన్ని ప్రయారిటీగా చూసుకోవడం ఆదిత్య ధర్ నైజం. యామీ కూడా తన కెరీర్ ను బ్యాలెన్స్ చేస్తూనే ఆదిత్య ప్రాజెక్టులకు మద్దతుగా నిలుస్తున్నారు.  
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(Prabhas) హీరోగా మారుతి దర్శకత్వంలో రూపొందిన మూవీ 'ది రాజా సాబ్'(The Raja Saab). పీపుల్ మీడియా ఫ్యాక్టరీ భారీ బడ్జెట్ తో నిర్మించిన ఈ ఫాంటసీ హారర్ కామెడీ ఫిల్మ్.. 2026 సంక్రాంతి కానుకగా విడుదలై నిరాశపరిచింది. అయితే తాజాగా ఈ సినిమాపై ఆర్ట్ డైరెక్టర్‌ రాజీవన్(Rajeevan) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాజీవన్ ఆర్ట్ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్న 'బైకర్' మూవీ ఏప్రిల్ 3న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా తాజాగా 'తెలుగువన్'కి ఇచ్చిన ఇంటర్వ్యూలో రాజీవన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా 'రాజా సాబ్' సినిమా గురించి ఆయన చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 'రాజా సాబ్' సినిమాలో కీలకమైన 'ప్యాలెస్ సెట్' కోసం ఆయన ఏకంగా 50కి పైగా విభిన్నమైన డిజైన్లు చేశారట. ఒక భారీ బడ్జెట్ సినిమాకు ఆర్ట్ డిపార్ట్‌మెంట్ ఎంత కీలకమో చెబుతూ.. సినిమా బడ్జెట్‌లో దాదాపు 15 నుంచి 18 శాతం వరకు ఖర్చు ఆర్ట్ వర్క్ కోసమే జరుగుతుందని ఆయన చెప్పారు. ఇక ప్రభాస్ లుక్ గురించి రాజీవన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ సినిమా కోసం ప్రభాస్ గారు చాలా కష్టపడ్డారని, మొదట కొంత బరువు పెరిగినా.. కథా దృష్ట్యా మళ్ళీ బరువు తగ్గారని వెల్లడించారు. బైకర్ గురించి మాట్లాడుతూ.. ఇది బైక్ రేసింగ్ నేపథ్యంలో సాగే ఒక అద్భుతమైన స్పోర్ట్స్ డ్రామా అని చెప్పారు. కేవలం ఇండియాలోనే కాకుండా విదేశాల్లో కూడా కొన్ని కీలక సన్నివేశాలు, ముఖ్యంగా రేసింగ్ సీక్వెన్స్‌లను చిత్రీకరించినట్లు ఆయన వెల్లడించారు. మలేషియా వంటి దేశాల్లో షూటింగ్ చేయడం ఒక కొత్త అనుభవం అని రాజీవన్ గారు వివరించారు. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతున్నాయి.  మరిన్ని ఆసక్తికర సినీ అప్‌డేట్స్, ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూల కోసం మా 'తెలుగువన్'(TeluguOne) యూట్యూబ్ ఛానెల్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి.  
వేసవి కాలం ప్రారంభమైంది, ఆరోగ్యం పట్ల శ్రద్ధ కూడా పెరుగుతుంది. చాలామంది నీటి శాతం అధికంగా ఉన్న పండ్లు, కూరగాయలు తినడానికి ఇష్టపడతారు. అలాంటి వాటిలో దోసకాయలు కూడా ముఖ్యమైనవి.  దోసకాయను జ్యూస్ గా అయినా తీసుకుంటారు, సలాడ్ లో ఉపయోగిస్తారు,  కొంతమంది నేరుగా దోసకాయలు ముక్కలు చేసుకుని తింటారు.  ఎలా తిన్నా దోసకాయ ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది.  మార్కెట్లలో దోసకాయలకు డిమాండ్  కూడా పెరిగే కాలం ఇది.  అయితే దోసకాయలు కొనుగోలు చేసేటప్పుడు చాలా మంది తెలియకుండానే చేదు దోసకాయలను ఎంపిక చేస్తుంటారు.   చేదు దోసకాయలు  అటు తినలేము, ఇటు డబ్బు కూడా వృధా అవుతుంది.  అలా కాకుండా మార్కెట్లో దోసకాయలు కొనుగోలు చేసేటప్పుడు చేదు దోసకాయలు కాకుండా అన్నీ మంచి దోసకాయలు ఎంచుకోవాలి అంటే కొన్ని టిప్స్ పాటించాలి.  ఆ టిప్స్ ఏంటో తెలుసుకుంటే.. చేదు దోసకాయలు అవాయిడ్ చేసి మంచి దోసకాయలు ఎంచుకునే టిప్స్.. రంగు,  ఆకారం..  దోసకాయల రంగు,  ఆకారం ను  బట్టి చేదు దోసకాయను సులభంగా గుర్తించవచ్చు. దోసకాయ ముదురు ఆకుపచ్చ రంగులో ఉంటే, అది తాజాగా ఉన్నట్లు. అది లేత పసుపు, తెలుపు రంగులో లేదా మచ్చలతో ఉంటే, అది పండిందని అర్థం, అలాగే  లోపల చేదుగా ఉండే అవకాశం ఉంటుంది. నొక్కడం.. దోసకాయ గట్టిగా, దృఢంగా ఉంటే ఫర్వాలేదు, అదే అది మెత్తగా లేదా స్పాంజిలాగా అనిపిస్తే అది చెడిపోయినది,  చేదుగా కూడా ఉండవచ్చు. దోసకాయ నొక్కినప్పుడు అది గట్టిగా ఉండాలి. ఆకారం.. దోసకాయ ఆకారాన్ని చూసి  సులభంగా అది చేదు దోసకాయ లేదా మంచి దోసకాయ అనేది చెప్పవచ్చు. మందంగా లేదా పసుపు రంగులో ఉండే దోసకాయలు చేదుగా ఉండే అవకాశం ఉంది. ముదురు ఆకుపచ్చ రంగులో, గట్టిగా ఉండే దోసకాయలను మంచిగా ఉంటాయి. వాసన.. వాసనను బట్టి సులభంగా దోసకాయ చేదు ఉందా లేదా అనేది కనుక్కోవచ్చు.   దోసకాయ  తాజాగా ఉంటే లోపల కూడా తాజాగా ఉంటుంది.  దాని వాసన వింతగా లేదా ఘాటుగా ఉంటే, అది  లోపల చేదుగా కూడా ఉండే అవకాశం ఉంటుంది. కాండం.. దోసకాయ కొనుగోలు చేసినప్పుడు దోసకాయ కాండం దగ్గర కట్ చేయాలి. ఆ కాండం భాగాన్ని  దోసకాయ మిగిలిన భాగంలో రుద్దితే తెల్లని నరుకు వస్తే దోసకాయ చేదు ఉండే అవకాశం ఉంటుంది.  ఈ నుగురు బాగా బయటకు వెళ్లిపోతే దోసకాయలో చేదు తగ్గిపోతుందని చెబుతారు. అందుకే చాలామంది దోసకాయను కట్ చేసేటప్పుడు మొదట కాండం దగ్గర కట్ చేసి  రుద్దుతారు.  దీని వల్ల దోసకాయలో ఉండే చేదు పోతుందని చెబుతారు.                                 *రూపశ్రీ.
కొందరు చాలా లోతుగా ఆలోచిస్తారు.  ఈ కారణంగా చాలా విషయాలు వారిలో సందేహాలుగానో,  నిర్ణయాలుగానో, అబిప్రాయాలుగానో ఉంటాయి.  వాటిని బయటకు చెప్పాలంటే ఏదో సంకోచం ఉంటుంది.  ఎదుటి వారు ఏమనుకుంటారో అనే సందిగ్ధం కూడా ఉంటుంది.  దీని వల్ల వారు చాలా విషయాలు బయటకు చెప్పలేక నిశ్శబ్దంగా ఉండిపోతుంటారు.  కానీ ఇలా నిశ్శబ్దంగా ఉండటం వల్ల  తరువాత చాలా బాధపడతారు కూడా.  అప్పుడు అలా చెప్పి ఉంటే బాగుండు, అలా చేసి ఉంటే బాగుండు అని అనుకునేవారు చాలా అధికంగా ఉంటారు. కానీ మనసులో మాటను ధైర్యంగా చెప్పడం వల్ల చాలా రకాల లాభాలు ఉన్నాయని అంటున్నారు మనస్తత్వ విశ్లేషకులు. ఇంతకూ మనసులో మాటను ధైర్యంగా బయటకు చెప్పడం వల్ల కలిగే లాభాలు ఏంటి తెలుసుకుంటే.. నమ్మకం, సాన్నిహిత్యం.. ప్రతి బలమైన సంబంధానికి ఓపెన్ కమ్యూనికేషన్ పునాది అవుతుంది. మనం మన భావాలను నిజాయితీగా వ్యక్తపరిచి, ఇతరుల మాటలను విన్నప్పుడు అపార్థాలు తొలగిపోతాయి.  నమ్మకం మరింత పెరుగుతుంది. మనసు విప్పి మాట్లాడగల  వ్యక్తులు పారదర్శకత,  పరస్పర గౌరవం కలిగి ఉంటారు. ఇది బందం దీర్ఘకాలం ఆరోగ్యంగా ఉండటంలో సహాయపడుతుంది. ఆత్మగౌరవం, ఆత్మవిశ్వాసం.. మనసులో ఉన్న ఆలోచనలను భయం లేదా సంకోచం లేకుండా వ్యక్తం చేసినప్పుడు..  చెప్పాలనుకున్న విషయాన్ని చెప్పేశాం అనే ఒక శాటిస్పాక్షన్ ఫీలింగ్ ఏర్పడుతుంది. ఇది  ఆత్మగౌరవాన్ని పెంచుతుంది,  క్రమంగా ఇలాంటి ప్రవర్తన వల్ల ఆత్మవిశ్వాసం కూడా మెరుగవుతుంది. ఎప్పుడైనా, ఎలాంటి సందర్భంలో అయినా తన మనసులో ఉన్నది చెప్పడానికి ఎలాంటి భయం ఉండదు. తేడాలు, పరిష్కారాలు.. జీవితంలో ప్రతి ఒక్కచోట విభేదాలు ఉండనే ఉంటాయి. అవి స్నేహం అయినా, కుటుంబం అయినా,  ప్రేమ అయినా, ఉద్యోగం చేసే చోట అయినా.. ఎక్కడైనా సరే.. విభేదాలు గొడవలుగా మారకుండా పరిష్కరించుకోవడానికి  సహాయపడుతుంది. అభిప్రాయాలను స్పష్టంగా , సంకోచం లేకుండా వ్యక్తపరిచినప్పుడు అవతలి వ్యక్తులు కూడా వినడానికి ఆసక్తి చూపిస్తారు.  ఇలా మాట్లాడటం అనేది సమస్యకు పరిష్కారాన్ని చూపిస్తుంది. ఆత్మవిమర్శ.. ఏదైనా విషయాన్ని స్పష్టంగా చెప్పే అలవాటు ఉండటం వల్ల కేవలం ఇతరులతో ఏదైనా చెప్పడమే కాదు.. తమతో తాము స్పష్టంగా మాట్లాడుకోగలుగుతారు. ఇది వ్యక్తులను కన్ప్యూజన్ లేకుండా చేస్తుంది. బలాలు, బలహీనతలను గుర్తించడంలో సహాయపడుతుంది. ఇది వ్యక్తిగత అభివృద్దికి మొదటి అడుగు అవుతుంది. మానసిక ఒత్తిడి, ఆందోళన.. భావోద్వేగాలను అణిచివేసినప్పుడు అవి లోపల ఒత్తిడి కలిగిస్తాయి. కానీ వాటిని సరైన విధంగా బయటకు వ్యక్తం చేసినప్పుడు ఒత్తిడి తగ్గుతుంది. ఇది మానసిక ఒత్తిడి,  ఆందోళన సమస్యలు పెరగకుండా ఉండటానికి కారణం అవుతుంది. శారీరక ఆరోగ్యం.. స్పష్టంగా ఏదైనా విషయాన్ని బయటకు చెప్పడం వల్ల శారీరక ఆరోగ్యం కూడా బాగుంటుంది. ఒత్తిడి తక్కువగా ఉండటం మంచి నిద్ర, రక్తపోటు సాధారణంగా ఉంటాయి. ఇది గుండెజబ్బు, తలనొప్పి, నిద్రలేమి వంటి సమస్యలు రాకుండా చేస్తుంది. సక్సెస్ కోసం.. స్పష్టంగా, మంచిగా కమ్యూనికేషన్ చేయడంలో వ్యక్తి విజయం ఆధారపడి ఉంటుంది. ఉద్యోగంలో అయినా, రాజకీయంలో అయినా,  కుటుంబంలో అయినా,  బంధంలో అయినా స్పష్టంగా మాట్లాడటం వల్ల అవతలి వ్యక్తులు అర్థం చేసుకునే అవకాశాలు ఎక్కువ ఉంటాయి.  ఇది అన్ని చోట్ల విజయాన్ని,  గౌరవాన్ని తెచ్చిపెడుతుంది. స్పష్టంగా మాట్లాడటం అంటే ఇతరుల పైన ఆధిపత్యం చెలాయించడం కాదు. భావాలను గౌరవంగా, పద్దతిలో వ్యక్తపరచడం. ఇతరులు ఏమనుకుంటారో అనుకోకుండా మనసులో ఉన్నది  చెప్పడం, మనసులో ఉన్నది తొక్కి పెట్టి మౌనంగా ఉండకుండా బయటకు వ్యక్తం చేయడం వల్ల మానసికంగా బలంగా ఉండటమే కాకుండా ఇతరుల ముందు సరైన విధంగా మాట్లాడటం ఎలాగో కూడా అర్థం  అవుతుంది.  కాబట్టి ఇతరుల గురించి ఆలోచించి మనసులో ఉన్నది దాచిపెట్టాల్సిన అవసరం లేదు.                          *రూపశ్రీ.
పరాభవం.. తెలుగు జానపద చిత్రాలు,  జానపద నవలలు చదివితే.. అందులో అవమానం జరిగిందనడానికి బదులుగా పరాభవం ఎదురైంది అనే పదం వాడటం చూస్తూనే ఉంటాము.  పరాభవం అంటే అగౌరవం,  అవమానం, కించపరచడం.. ఇలా చాలా సందర్బాలలో వాడుతూ ఉంటారు. అయితే తెలుగు పంచాంగంలో.. తెలుగు సంవత్సరాలలో 40వ తెలుగు సంపత్సరం పేరు పరాభవ నామ సంవత్సరం.  ఈ సంవత్సరం పేరు వినగానే చాలామంది భయపడుతున్నారు.  రెండేళ్ల క్రితం వచ్చిన క్రోథ నామ సంవత్సరం అప్పుడు ఇలాగే భయపడ్డారు. కానీ కాలంతో ప్రయాణం తప్పదు.  అయితే ప్రజలలో పరాభవనామ సంవత్సరం అనే పేరు వినగానే ఎక్కడలేని భయం పుట్టుకొస్తోంది. ఈ కొత్త ఏడాదిలో అవమానాలు, అగౌరవాలు తప్పవా అని ముందే తమ భవిష్యత్తు గురించి మనసులో బోలెడు భవిష్యవాణి ఊహించుకుంటున్నారు. కానీ పరాభవ నామ సంవత్సరం పేరు వెనుక ఉన్న అర్థం,  అందులో పరమార్థం వేరని, ఈ విషయం తెలిస్తే అందరూ ఎంతో ఊరట చెందుతారని అంటున్నారు పండితులు. ఇంతకూ పండితులు ఈ పరాభవ నామ సంవత్సరం గురించి, దాని పేరులో ఉన్న అర్థం గురించి ఏం చెప్తున్నారో తెలుసుకుంటే.. తెలుగు పంచాంగం ప్రకారం 60 తెలుగు సంవత్సరాలు  ఉంటాయి.  వాటిలో విశ్వావసు నామ సంవత్సరం 39వది కాగా.. పరాభవ నామ సంవత్సరం 40వది.  చైత్ర మాసంలో ఉగాది పర్వదినం సందర్బంగా కొత్త తెలుగు సంవత్సరం అయిన పరాభవ సంవత్సరం మొదలు కాబోతోంది. పరాభవ అనే పేరు వినగానే పరాభవాలే ఎదురవుతాయేమో అనుకుంటారు చాలా మంది. కానీ పరాభవ నామ సంవత్సరం అంటే వేరే అర్థాలు ఉన్నాయి.  పరాభవలో పరా అంటే పరాభట్టారికా దేవి.. లిలితా దేవినే పరాభట్టారికా దేవి అని అంటారు.  భవ అని భవుడు అని పరమేశ్వరుడిని సంభోధిస్తారు.  దీని ప్రకారంగా చూస్తే శక్తి స్వరూపమైన ఆ పార్వతీదేవి,  లయకారుడు అయిన పరమేశ్వరుడి కలయికగా వచ్చినదే తెలుగు సంవత్సరమని,  ఈ పరాభవ నామ సంవత్సరం మీద పార్వతీపరమేశ్వరుల అనుగ్రహం పుష్కలంగా ఉంటుందని పండితులు చెబుతున్నారు.   చాలా వరకు ప్రజలు ఎందులో అయినా ముందు చెడునే గుర్తిస్తారు, చెడునే తలుస్తారు.  ఈ స్వభావం కారణంగానే పరాభవ నామ సంవత్సరం గురించి పలు ఊహాగానాలు వస్తున్నాయని పండితులు చెబుతున్నారు. మరొక విధంగా చూస్తే.. పర అంటే పరదేవత.. ఆ పరదేవతే లలితా పరమేశ్వరి దేవి,  భవ అంటే అంటే కూడా పరమేశ్వరుడు.. ఎలా చూసినా ఇందులో ఎంతో ఆధ్యాత్మికత,  భక్తి మేళవింపు కనిపిస్తుంది.  ఇంతటి గొప్ప నామం వెనుక పిచ్చి అనుమానాలు, భయాలతో కొత్త ఏడాదిని మొదలుపెట్టడం మంచిది కాదని,  ప్రతి ఒక్కరూ సానుకూల ఆలోచన కలిగి ఉండాలని పండితులు చెబుతున్నారు. పరాభవ నామ సంవత్సరాన్ని అత్యున్నతమైన ఏడాది అని జ్యోతిష్యం చెబుతోంది. పరా అంటే గొప్పది, అత్యున్నతమైనది,  భవ అంటే పుట్టుక లేదా ఉద్భవించేది.  ఉన్నతంగా ఉద్భవించేది పరాభవ.. కాబట్టి ఈ పరాభవ నామ సంవత్సం కూడా ఉన్నతంగా ఉంటుందని చెబుతున్నారు. మనిషి తన కర్తవ్యాన్ని తాను ధర్మం తప్పకుండా నెరవేరుస్తుంటే.. ప్రతి ఏడాదిలో వారికి సానుకూలంగా సాగిపోతుందని ఆధ్యాత్మిక వేత్తలు కూడా చెబుతున్నారు. చెడులోనూ మంచి చూసే గుణం,  సానుకూల ఆలోచనలు ఉండటం ప్రధానం. కాబట్టి ఈ పరాభవ నామ సంవత్సరం రోజు సంతోషంతో ఉగాది పండుగను జరుపుకోవడం ద్వారా అందరూ సుఖ సంతోషాలు పొందాలని కోరుకుంటూ.. అందరికీ పరాభవ నామ తెలుగు సంవత్సరాది శుభాకాంక్షలు..                                   *రూపశ్రీ.
వేసవి కాలం రాగానే చాలామంది లైఫ్ స్టైల్ మారుతుంది. ముఖ్యంగా ఆహారం విషయంలో, పానీయాల విషయంలో చాలా మార్పులు వచ్చేస్తాయి. బీహార్, ఉత్తర ప్రదేశ్ రాష్ట్రాల పేమస్ పానీయం ఇది. అయితే దీని ప్రయోజనాల దృష్ట్యా దేశ వ్యాప్తంగా ఇష్టంగా ఉపయోగిస్తారు.  వేసవి వచ్చిందంటే సత్తు పానీయం చాలా ఎక్కువగా తీసుకుంటారు.  ఇది శరీరాన్ని కూల్ గా ఉంచడమే కాకుండా శరీరానికి కావలసిన పోషకాలను పుష్కలంగా అందిస్తుంది.  కాల్చిన శనగలతో తయారు చేసే సత్తు పౌడర్ ను సత్తు పానీయం కోసం ఉపయోగిస్తారు. అయితే.. సత్తు పొడితో కేవలం సత్తు పానీయమే కాకుండా.. చాలా రకాల పదార్థాలు తయారు చేసుకుంటారు.  వేసవిలో అటు శరీరాన్ని కూల్ గా ఉంచుతూ, ఇటు శరీరానికి బోలెడు పోషకాలు అందించే సత్తు పొడితో ఏమేం వంటకాలు బాగుంటాయో తెలుసుకుంటే.. సత్తు పేడ.. వేసవిలో  నీరసంగా అనిపిస్తే సత్తు పేడను తయారు చేసుకుని తినవచ్చు.. ఇది  ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. దీనిని తిన్న తర్వాత  శరీరం పూర్తి చురుకుగా ఉంటుంది. సత్తు పిండిని నెయ్యి వేసి బాగా వేయించి అందులో పంచదార పొడి వేసి సన్న మంట మీద గోల్డ్ కలర్ వచ్చే వరకు వేయిస్తే సత్తు పేడ రెఢీ.. ఇది చాలా రుచిగా ఉంటుంది. సత్తు మజ్జిగ.. వేసవి కాలంలో సత్తుతో మజ్జిగ తయారు చేసుకుని తాగవచ్చు. ఇది  శరీరాన్ని తేమగా ఉంచుతుంది.  పిల్లల నుండి పెద్దల వరకు అందరూ దీనిని ఇష్టపడతారు. దీనిని ప్రతిరోజూ తాగడం వల్ల తక్షణ శక్తి లభిస్తుంది. సత్తు లడ్డు.. సత్తు లడ్డూలను సత్తు పొడితో ఇంట్లోనే సులభంగా తయారు చేసుకోవచ్చు. సత్తు లడ్డులు తినడం వల్ల  శరీరం బలపడుతుంది. సత్తు లడ్డులో డ్రై ప్రూట్స్, నట్స్, నెయ్యి వేసి తయారు చేసుకుని తినవచ్చు. చాలా రుచిగా ఉంటాయి. సత్తు షార్డ్ బ్రెడ్.. వేసవిలో కూడా కారంగా తినాలని అనుకునే వారు చాలామంది ఉంటారు.  అలాంటి వారికి సత్తు షార్ట్ బ్రెడ్ చాలా మంచి ఫుడ్. సత్తు పిండిని వేయించి అందులో బంగాళదుంప,  బఠాణీ వంటి కూరగాయలు వేసి ముద్దగా చేసుకుని దీన్ని తడి చేసిన బ్రెడ్ మధ్యలో ఉంచి బ్రెడ్ ను బోండా లాగా రౌండ్ చేసి నూనెలో డీప్ ప్రై చేయాలి.  చాలా రుచిగా ఉంటాయి. సత్తు లిట్టి చోఖా.. లిట్టి చోఖా అనేది బీహార్, ఉత్తర ప్రదేశ్, జార్ఖండ్ రాష్ట్రాలలో చాలా ఫేమస్ ఫుడ్.  వేయించిన శనగపిండిని గోధుమ పిండిలో స్టఫ్ చేసి వాటిని కాలుస్తారు.  వీటిని లిట్టి అంటారు.  వీటిని నెయ్యితోనూ,  వంకాయ, టమాటా,  బంగాళాదుంపతో చేసిన చోఖా అనే వంటకంతో కలిపి వడ్డిస్తారు. ఈ పూర్తీ కాంబోను లిట్టీ చోఖా అంటారు.  ఇది చాలా రుచిగా ఉంటుంది.  చోఖా లేకపోయినా లిట్టిని వివిధ రకాల చట్నీలతో కూడా తింటారు.                                       *రూపశ్రీ.
ఆరోగ్యమే మహాభాగ్యం. కానీ నేటి కాలంలో మారిన జీవనశైలి కారణంగా చిన్న పిల్లల నుండి పెద్దల వరకు ఏదో ఒక దీర్ఘకాలిక (Chronic) ఆరోగ్య సమస్యతో బాధపడుతున్నారు. ఎన్ని మందులు వాడినా సమస్య తాత్కాలికంగా తగ్గుతుందే తప్ప, పూర్తిగా నయం కావడం లేదని చాలా మంది ఆవేదన చెందుతుంటారు. అలాంటి వారికి హోమియోపతీ ఒక గొప్ప వరప్రసాదం. కేవలం లక్షణాలను అణచివేయడం కాకుండా, వ్యాధిని మూలాల నుండి తొలగించే అద్భుత శక్తి హోమియోపతీకి ఉంది.  Renowned Homeopathy expert Dr Praveen Kumar చెప్పిన మరిన్ని విషయాలు ఈ  TeluguOne Health Video Link క్లిక్ చేసి తెలుసుకుందాం. మనం హోమియోపతీని ఎందుకు ఎంచుకోవాలి? (Why Homeopathy?) దీర్ఘకాలిక వ్యాధులలో తిరుగులేని చికిత్స: హోమియోపతీ యొక్క అసలు బలమే దీర్ఘకాలిక వ్యాధులను నయం చేయడం. బ్రాంకియల్ ఆస్తమా వంటి జెనెటిక్ డిజార్డర్లను కూడా సమూలంగా తొలగించడానికి హోమియోపతీలో మార్గం ఉంది. సంపూర్ణ ఆరోగ్య దృక్పథం (Holistic Approach): ఇతర వైద్య విధానాలు కేవలం వ్యాధి మీద దృష్టి పెడితే, హోమియోపతీ 'రోగి' (Patient) మీద దృష్టి పెడుతుంది. అంటే మీ వేలికి నొప్పి ఉంటే కేవలం వేలిని మాత్రమే కాకుండా, మీ శరీరాన్ని ఒక యూనిట్‌గా పరిగణించి చికిత్స అందిస్తుంది. శాస్త్రీయమైనది: ఒకప్పుడు హోమియోపతీ కేవలం ప్లాసిబో (Placebo) అని విమర్శలు ఉండేవి. కానీ నేడు IIT ముంబై మరియు IISc బెంగళూరు వంటి సంస్థలు చేసిన పరిశోధనల్లో హోమియోపతీ మందులలో 'నానో పార్టికల్స్' (Nano Particles) ఉంటాయని నిరూపితమైంది. దుష్ప్రభావాలు లేని వైద్యం: ఇది సహజ సిద్ధమైన పద్ధతిలో పనిచేస్తుంది కాబట్టి సైడ్ ఎఫెక్ట్స్ భయం ఉండదు. చికిత్స ప్రక్రియ ఎలా ఉంటుంది? (How it works?) హోమియోపతీలో చికిత్స అనేది చాలా లోతుగా సాగుతుంది. దీనిని 'కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్' అంటారు. కేస్ టేకింగ్: డాక్టర్ మీతో దాదాపు గంట సేపు మాట్లాడుతారు. మీ అలవాట్లు, మీ ఇష్టాయిష్టాలు, మీకు ఎప్పుడు కోపం వస్తుంది, మీ గత చరిత్ర (Past history) వంటి అంశాలన్నింటినీ అడిగి తెలుసుకుంటారు. ఇది మీ 'జర్నీ ఆఫ్ లైఫ్'ను అర్థం చేసుకునే ప్రక్రియ. మయాజమ్స్ (Miasms): ఆయుర్వేదంలో వాత, పిత్త, కఫ దోషాలు ఉన్నట్లే, హోమియోపతీలో సోరా, సిఫిలిస్, సైకోసిస్ అనే మూడు మయాజమ్స్ ఉంటాయి. వీటి ఆధారంగానే మీ వ్యాధి తీవ్రతను అంచనా వేస్తారు. పొటెంటైజేషన్: మందులను డైల్యూట్ చేసే ప్రక్రియను 'డైనమైజేషన్' అంటారు. ఇందులో మందు పరిమాణం తక్కువగా ఉన్నప్పటికీ, దాని శక్తి (Power) చాలా ఎక్కువగా ఉంటుంది. ఏం చేయకూడదు? (What Not to Do?) సమాచారాన్ని దాచకండి: డాక్టరుకు మీ శారీరక, మానసిక లక్షణాలను స్పష్టంగా చెప్పాలి. ఏదైనా విషయాన్ని దాచడం వల్ల సరైన మందును ఎంపిక చేయడం కష్టమవుతుంది. స్వయం వైద్యం వద్దు: హోమియోపతీ మందులు తీపి మాత్రల్లా కనిపిస్తాయి కదా అని సొంతంగా వాడకూడదు. వ్యాధి తీవ్రతను బట్టి డాక్టర్ ఇచ్చే పొటెన్సీ (30CH, 200CH లేదా 1M) మారుతూ ఉంటుంది. అపోహలు నమ్మకండి: హోమియోపతీ ఆలస్యంగా పనిచేస్తుందనేది ఒక అపోహ మాత్రమే. సరైన మందు పడితే అక్యూట్ కండిషన్స్ (జ్వరం, జలుబు) కూడా చాలా వేగంగా తగ్గుతాయి. తరచుగా అడిగే ప్రశ్నలు (Q&A) ప్ర: 30CH అంటే ఏమిటి? జ: ఇది హోమియోపతీలో ఒక రకమైన పొటెన్సీ (శక్తి). ఒక భాగం మందును 99 భాగాల వెహికల్ (ఆల్కహాల్ లేదా షుగర్ ఆఫ్ మిల్క్)తో కలిపి చేసే ప్రక్రియ ద్వారా 30CH తయారవుతుంది. ఇది అద్భుతమైన శక్తిని కలిగి ఉంటుంది. ప్ర: హోమియోపతీ మందులు ఘాటుగా ఎందుకు ఉంటాయి?  జ: మందులను పిల్స్ (మాత్రలు) మీద వేయడానికి ఆల్కహాల్‌ను వెహికల్‌గా ఉపయోగిస్తారు. ఆ ఆల్కహాల్ వల్ల ప్రారంభంలో కొంచెం ఘాటుగా అనిపించవచ్చు, కానీ ఆ మాత్రలు తియ్యగానే ఉంటాయి. ప్ర: మానసిక సమస్యలకు హోమియోపతీ పనిచేస్తుందా?  జ: అవును. హోమియోపతీలో మనిషి యొక్క సైకీ (Psyche) లేదా మానసిక స్థితిని బట్టి హైయర్ పొటెన్సీ మందులు ఇవ్వడం జరుగుతుంది, ఇవి మానసిక ఆరోగ్యంపై అద్భుతంగా పనిచేస్తాయి. దీర్ఘకాలిక వ్యాధులతో పోరాడుతున్న వారికి హోమియోపతీ ఒక ఆశాకిరణం. ఇది కేవలం వ్యాధిని తగ్గించడమే కాకుండా, మీ రోగనిరోధక శక్తిని పెంచి మిమ్మల్ని సంపూర్ణ ఆరోగ్యవంతులుగా తీర్చిదిద్దుతుంది. మరిన్ని ఆసక్తికరమైన ఆరోగ్య విషయాలు మరియు నిపుణుల సలహాల కోసం ఇప్పుడే మా TeluguOne Health యూట్యూబ్ ఛానెల్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి
డా ..చిరు మావిళ్ళ మురళీ మనోహర్.. ఉగాది అంటే ఉగాది పచ్చడి మాత్రమే అని అనుకుంటారు. కానీ ఉగాది పచ్చడిలో ఉన్న ఆయుర్వేద ఆరోగ్య రహస్యం ఏమిటో తెలుసా?ఇప్పుడు చైత్ర మాసం లో వసంత రుతువు లో ఉన్నాం ఆకు రాలిన తరువాత కొత్త కొత్త గా రేకు విచ్చినట్లు చిగుర్లు తోడుగుతాయి. ఆప్రాంతం అంతా పచ్చటి తివాచి పరిచినట్లు పచ్చగా విరబూస్తాయి. పువ్వులు పరిమళాలు.మావిడి పూత సువాసనలు, మామిడి చెట్లపై కొత్తగా చిగురులు తొడిగిన మామిడి పూత గుత్తులు,మామిడి పిందెలు ఆ వసంత శోభ అప్పుడే వచ్చిందా అనిపిస్తుంది మది పులక రిస్తుంది. కొత్త కొత్త పూతని ఆస్వాదించాలని అనిపిస్తూ ఉండడం సహజం.ప్రకృతి లో మార్పు వచ్చింది శీతకాలం నుండి ఎండా కాలానికి వాతావరణం మారుతుంది ఇక ఎండవేడి ని తట్టుకోవ దానికి మన శరీరం సన్నద్ధం కావాలి.వాతావరణం లో మార్పులకు తగ్గట్టుగా శరీరంలో వేడిమి ని,తట్టుకోవడం. శరీరం దానంతట అదే చల్లబడే సహజ లక్షణాన్ని వృద్ది   చేయడంకీలకం.ముఖ్యంగా ఎండాకాలం లో వేడికి శరీరం నీర సించి పోవడం.ఒక్కో సారి అతిసారం బారిన పడడం. ముఖ్యంగా డయాబెటీస్, గుండె సంబధిత సమస్యలు ఉన్న రోగులలో వచ్చే హార్ట్ బీట్ లో మార్పులు.లేదా శరీరంలో రక్త ప్రసరణలో సమస్యలు వస్తూ ఉంటాయని ప్రముఖ ఆయుర్వేద వైద్యులు  డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్ విశ్లేషించారు.ఈ క్రమం లో మనం ఉగాది రోజున తీసుకున్నే ఆరు రకాల లో ఉన్న ఆరోగ్య రహస్యాలు, వాటిలో  ఉండే పోషక విలువల గురించి తెలుగు వన్ హెల్త్ కు  వివరించారు. మనం పండగ పూట లేదా కొన్ని సందర్భాలాలో తీసుకున్న ఆహారం శరీరంలో తామస ,రజో గుణాలు పెంచు తాయని  శరీరంలో వేడి వల్ల వచ్చే సమస్యల ను అధిగమించాలి సత్వ ప్రాధాన మైనగుణాన్ని అలవారచుకోవాలాంటే ఉగాది పచ్చడి ఉపయోగ పడుతుందని ప్రముఖ ఆయుర్వేద వైద్యులు డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్ పేర్కొన్నారు. వేసవి రాగానే శరీరం లో కొన్ని రకాల రసాయన చర్యల వల్ల శరీరం లో సమతౌల్యం లోపిస్తుందని సమ తౌల్యాన్ని నియంత్రించే శక్తి ఉగాది పచ్చడి సమతుల పోషకాలు అందిస్తయాని అన్నారు డాక్టర్ చిరుమావిళ్ళ మురళీ మనోహార్. సాంప్రదాయ పద్దతిలో ఉగాది పచ్చడి కావాల్సిన పదార్ధాలు... **మట్టి పాత్ర,లేదా కుండ. **వేప పూత ఒక భాగం. **మామిడి పిందెలు  ముక్కలు రెండు భాగాలు.  . **చింత పండు,పా తది. నాలుగు భాగాలు. **ఉప్పు 5 భాగాలు. **బెల్లం ఆరు భాగాలు .ఇంకా అరిటి పండు ముక్కలు  అన్నీ కలిపి నీరు పోయాలి. పైన పేర్కొన్న కావాల్సిన పదార్ధాలలో  మధురం-తీపి  ఆమ్లం-పులుపు. లవణం-ఉప్పు . తి త్తం -చేదు. వగరు వంటి లక్షణాలు ఉంటాయి.ఇలా తయారు చేసిన వేప పచ్చడిని నింబ కుసుమ భక్షణం అని అంటారు.నింబ కుసుమము అంటే వేప పూత అని అర్ధం. మామిడి ముక్కలు,బెల్లము,పులుపు,చేదు వంటివి చింత పండు అరటి పండు,మిరియాలపొడి,ఉప్పు వంటివి వేసిన నింబ కుసుమ భక్షణం అంటే తింటే మరెన్నో లాభాలు ఔషద గుణాలు ఉన్నాయి.అని డాక్టర్ మురళీ మనోహర్ తెలుగు వన్ హెల్త్ కు వివరించారు. షడ్రసో పేతం ఉగాది పచ్చడి... ఉగాది పచ్చడిలో ఆరు రకాల రుచులు ఉంటాయని వాటిని షట్ రుచులుగా పేర్కొన్నారు.ఎందుకంటే జీవితానికి ఉగాదికి మానసిక సంబంధమైన సంబంధం ఉందని అంటారు చిరు మావిళ్ళ.అవును మనజీవితం లో తెలుగు వారికి తెలుగు సంవత్సరాది యుగ ఆది అంటే మరో యుగం నికి ఆది అంటే తొలి అడుగు. ఈ సమయం లో మనం ఎదుర్కునే ఎన్నోరకాల సమస్యలు ఒక్కో రుచిని సూచిస్తాయి. అన్ని సమపాళ్ళలో ఉంటె పచ్చడిని ఎలా అస్వాదిస్తామో.కస్టాలు,కడ గళ్ళు,ఆనందం,ఉత్సాహం, కష్టం,నష్టం, వచ్చినా మానసికంగా ఎదుర్కోడానికి మనల్ని సిద్ధం చేసేది ఉగాది అని అంటారు పండితులు.ఉగాది పచ్చడి ఔషద గుణాలు...వేప పువ్వు ,దీనిని బద్ర అని నింబ అని కూడా పిలుస్తారు. నిచిన, నిచినిండిన్ మార్గోసిన్ అనే పదార్ధాలు ఉంటాయని. వేప యాంటి ఫంగల్,యాంటి బ్యాక్టీరియాగా పని చేస్తుందని వేప  వల్ల వివిదరకాల జబ్బులను తగ్గించే గుణం వేపాకు ఉందని స్పష్టం చేసారు చిరుమవిళ్ళ మురళీ మనోహర్.వేపాలో తిత్త రసం ఉందని అంటే చెడు గుణం ఉన్నందున శరీరంలో వచ్చే కఫ,పిత్త దోషాన్ని తొలగించి ఆకలి పెంచుతుందని విశ్లేషించారు.వేపను తీసుకోవడం వల్ల ముఖ్యంగా డయాబెటీస్ ను నియంత్రించే గుణం వేపకు ఉందని వీటితో పాటు కామెర్లు,చర్మ సంబంధిత వ్యాధులను నివారిస్తుంది.పిల్లలకు వేపను తినిపించడం వల్ల కడుపులో ఉండే నులి పురుగులు చచ్చిపోతాయని కాబట్టి పిల్లకు మేలు చేస్తుందని.పేర్కొన్నారు. బెల్లం... ఉగాది పచ్చడికి కీలకమైన ఇంగ్రీడియంట్. బెల్లానికి తీపిగుణం ఉంటుంది. బెల్లానికి కఫం పెంచే గుణం ఉంది. బెల్లం ఉగాది నుంచి వాడితే కఫ దోషాన్ని తగ్గిస్తుంది. ఎండాకాలం లో వచ్చే ఎందవేదిమిని తట్టుకోడానికి ఎండబారిన పడ్డ వారికి నీ రసం  తగ్గించితక్షణ శక్తి నిచ్చేది గ్లుకోజ్ గా బెల్లం పనిచేస్తుంది.బెల్లం ఒక సువాసన,శ్రమ నీరసం తగ్గించి వడ దెబ్బ నుండి కాపాడే శక్తినిచ్చి ప్రోటీన్లను అందించేది బెల్లమే  అయితే బెల్లము అరిటి పండు కలిపి తీసుకుంటే మంచిదని అంటారు చిరుమామిళ్ళ. మామిడి ... ఉగాదిపచ్చడికి ఎన్ని ఉన్న మామిడి ముక్క పుల్లగా తగలనిదే పచ్చడికి రుచి ఉండదు. అని పెద్దలు అంటూ ఉంటారు.ముఖ్యంగా వేసవి కాలం లో చాలామంది కడుపు నొప్పి తో బాధ పడుతూఉంటారు.మామిదిపండులో ఉండే విటమిన్ సి మనలో ఇమ్యునిటీ పెంచుతుంది. మామిడి కాయ వల్ల గుండెజబ్బులు, డయాబెటిస్ రాకుండా నియంత్రిస్తుంది.  చింత పండు... దీనిని తెమరందన్ ఇండియా భారత దేశం లో అతి పురాతన మైన విటమిన్లు,పిండి పదార్ధాలు ఉంటాయి. చింతపండులో ముఖ్యంగా పాత చింత పండు ఉష్ణం తగ్గిస్తుంది. వాతాన్ని, బడలిక, జీర్ణ ప్రక్రియను సరి చేస్తుంది. శరీరంలో వచ్చే వేడి తగ్గించి చల్ల దానాన్ని ఇస్తుంది.ముఖ్యంగా చింత అంటే చింతలు తీర్చేది చింత రసం త్వరగా శక్తి నిస్తుంది.మూత్ర విసర్జన సాఫీగా సాగేట్లు సహకరిస్తుంది చింత రసం. అందుకు చింత పండు రసం వేసవి కాలం లో తీసుకోవడం అవసరమని నిపుణులు సూచిస్తున్నారు. ఉప్పు... ఉగాది పచ్చడి రుచిని పెంచేది చవి లేదా లవణం,ఉప్పు మన శరీర అవసరాలకు జీవన శక్తి నిచ్చేది లవణం. ఆహారం లో వేసే ఉప్పు ఆ వంటకు మంచి రుచిని ఇస్తుంది.ఉప్పు త్రిదోషాల ను హరిస్తుంది. అరటి పండు... అరటి పండు లో పోషక విలువలు పొటాషియం, యాంటి ఫంగల్, కూడా అరటి పండు పనిచేస్తుంది.అతిసారం నుండి రక్షించే సంజీవనిగా పేర్కొన్నారు వైద్యులు. అరటి పండు అధిక రక్త పోటు, కిడ్నీ సమస్యలు, రసాయనం గా పనిచేస్తుంది. ఇవి ఉగాది ఔషదం అధ్బుత ఫలితాలు ఉగాది పచ్చడి ఉగాది రోజే తీసుకోవాలా అప్పుడప్పుడూ తీసుకోవచ్చు అంటున్నారు. ముఖ్యంగా ఉగాది నుండి శ్రీరామ నవమి వరకు ఎప్పుడైనా తీసుకుంటే వేసవి కాలం లో ఎన్ని సార్లు తీస్జుకున్న తప్పులేదు. వ్యక్తిలో ఉండే త్రి దోషాల నుండి ముక్తి నిచ్చేది ఉగాది పచ్చడి.