LATEST NEWS
  తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల వేళ రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. మాజీ ముఖ్యమంత్రి జయలలిత నెచ్చెలి వి.కె. శశికళ మరియు పట్టాలి మక్కల్ కట్చి (పీఎంకే) వ్యవస్థాపకుడు డాక్టర్ ఎస్. రాందాస్ అనూహ్యంగా చేతులు కలిపారు. రాష్ట్రంలోని ప్రధాన పార్టీలైన డీఎంకే, అన్నాడీఎంకేలకు గట్టి పోటీ ఇచ్చే లక్ష్యంతో ఈ ఇద్దరు నేతలు వ్యూహాత్మక పొత్తును ప్రకటించారు. శశికళ ఇటీవల స్థాపించిన 'ఆల్ ఇండియా పురట్చి తలైవర్ మక్కల్ మున్నేట్ర కజగం' పార్టీతో కలిసి పీఎంకే (రాందాస్ వర్గం) ఎన్నికల బరిలోకి దిగనుంది. విల్లుపురం జిల్లాలోని రాందాస్ నివాసం తైలాపురం గార్డెన్స్‌లో ఈ కీలక భేటీ జరిగింది. దాదాపు రెండు గంటల పాటు సాగిన చర్చల అనంతరం, 2026 ఏప్రిల్ 23న జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో రెండు పార్టీలు కలిసి పోటీ చేస్తాయని ఉమ్మడి ప్రకటన విడుదల చేశారు. తమిళనాడులోని మొత్తం 234 నియోజకవర్గాల్లో తమ అభ్యర్థులను నిలబెట్టనున్నట్లు వారు స్పష్టం చేశారు. ఈ పొత్తు రాష్ట్ర రాజకీయాల్లో ఒక 'ప్రకంపన' సృష్టిస్తుందని డాక్టర్ రాందాస్ ధీమా వ్యక్తం చేశారు. ఈ కూటమి ఏర్పాటుకు ప్రధాన కారణం అన్నాడీఎంకేలో నెలకొన్న అంతర్గత విభేదాలే అని తెలుస్తోంది. ప్రస్తుతం అన్నాడీఎంకే పగ్గాలు చేపట్టిన ఎడప్పాడి పళనిస్వామిపై పైచేయి సాధించేందుకు శశికళ సుదీర్ఘ కాలంగా ప్రయత్నిస్తున్నారు. మరోవైపు, పీఎంకేలో చీలక ఏర్పడి, రాందాస్ కుమారుడు అన్బుమణి రాందాస్ అన్నాడీఎంకే-బీజేపీ కూటమిలో చేరడంతో.. రాందాస్ ఒంటరి అయ్యారు. ఈ నేపథ్యంలో, తన రాజకీయ ఉనికిని కాపాడుకోవడానికి ఆయన శశికళతో జతకట్టారు. ఈ కొత్త కూటమిని కేవలం రెండు పార్టీలకే పరిమితం చేయకుండా, మరిన్ని చిన్న పార్టీలను తమ వైపు తిప్పుకోవాలని చిన్నమ్మ భావిస్తున్నారు. ప్రజల సంక్షేమం మరియు తమిళనాడు స్వయంప్రతిపత్తిని కాపాడటమే తమ లక్ష్యమని వారు పేర్కొన్నారు. అయితే, పీఎంకే గుర్తు మరియు జెండా విషయంలో కోర్టులో వివాదం నడుస్తున్నందున, రాందాస్ వర్గం ఏ గుర్తుపై పోటీ చేస్తుందనేది ఇంకా స్పష్టత రాలేదు. రాబోయే రోజుల్లో ఈ కూటమి సీట్ల సర్దుబాటు మరియు ఉమ్మడి ప్రచార ప్రణాళికను ప్రకటించనుంది. శశికళకు ఉన్న సామాజిక వర్గ మద్దతు, ఉత్తర తమిళనాడులో పీఎంకేకున్న బలం కలిస్తే ప్రధాన పార్టీల ఓట్ల బ్యాంకుకు గండి పడే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. ముఖ్యంగా అన్నాడీఎంకే ఓట్లను ఈ కూటమి ఎంతవరకు చీలుస్తుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.  
జగన్ హయాంలో ప్రభుత్వంలోనూ, పార్టీలోనూ అత్యంత కీలకంగా వ్యవహరించిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డినీ జగన్ వదల కుండా ముంచేశారు.   మాజీ మంత్రి, పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి జగన్ హయాంలో  పార్టీలోనూ, ప్రభుత్వంలోనూ ఓ వెలుగువెలిగిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రస్తుతం గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్నారు.  తాను చక్రం తిప్పిన ప్రభుత్వ హయాంలోనే తన కుటుంబానికి చెందిన పీఎల్ఆర్ సంస్థకు రావాల్సిన బకాయిల కోసం కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు.  ఆ బకాయిల కోసం ఆయన భార్య ఏకంగా సర్వోన్నత న్యాయస్ధానాన్నే ఆశ్రయించారు. అయితే అక్కడ ఆమెకు చుక్కెదురైంది. జగన్ హయాంలో చేపట్టిన రోడ్డు పనులకు సంబంధించిన బకాయిల చెల్లింపుల కోసం పెద్ది రెడ్డి ఇప్పుడు న్యాయపోరాటం చేస్తున్నారు. భార్య పేరుతో సర్వోన్నత న్యాయస్థానంలో పిటిషన్ వేశారు. చిత్తూరు జిల్లాలో తమ పీఎల్ఆర్ కంపెనీ చేపట్టిన ప్రాజెక్టులకు సంబంధించిన బకాయిలు చెల్లించేలా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని ఆ పిటిషన్ లో కోరారు.  అయితే న్యాయమూర్తి జస్టిస్ దిపాంకర్ దత్తా నేతృత్వంలోని సుప్రీం కోర్టు ధర్మాసం  ఈ విషయంలో తాము నేరుగా జోక్యం చేసుకోబోమని విస్పష్టంగా పేర్కొంది.  హైకోర్టును ఆశ్రయించాలని స్పష్టం చేసింది.   దీంతో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సతీమణి స్వర్ణలత తన పిటిషన్ ను ఉప సంహరించుకున్నారు.  నిజానికి తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికార పగ్గాలు చేపట్టిన తరువాత పిఎల్ఆర్ కంపెనీ చేపట్టిన పనులను నిలిపివేసింది. గత ప్రభుత్వ హయాంలో నిబంధనలకు విరుద్ధంగా జరిగిన పనులపై సమీక్షలు చేస్తోంది. అంటే పెద్దిరెడ్డి ఇప్పుడు అడుగుతున్న బకాయిలన్నీ జగన్ హయాంలో చేసిన పనులకు సంబంధించినవే. అంటే జగన్   తనకు అత్యంత సన్నిహితుడిగా ఉన్న పెద్దిరెడ్డికి కూడా తన హయాంలో బిల్లులు చెల్లించలేదని తేటతెల్లమౌతోంది.   ఎన్నికల సమయంలో పార్టీ కోసం భారీగా ఖర్చు చేసిన పెద్దిరెడ్డికి   సొంత ప్రభుత్వం నుంచే నిధులు అందలేదన్నమాట. ఇక ప్రస్తుతానికి వస్తే  తెలుగుదేశం కూటమి ప్రభుత్వం జగన్ హయాంలో అడ్డగోలుగా కాంట్రాక్టులు దక్కించుకున్న పనులకు సంబంధించిన బిల్లుల చెల్లింపుల విషయంలో ఆచితూచి వ్యవహరిస్తున్నది. పనులకు సంబంధించి కాంట్రాక్టు నిబంధనల ప్రకారమే ఇచ్చారా? ఆ పనుల నాణ్యత సరిగా ఉందా.. అన్న విషయంలో కచ్చితంగా పరిశీలించి పరిష్కరిస్తోంది. దీంతో బిల్లుల కోసం పెద్దరెడ్డి కుటుంబం అనివార్యంగా కోర్టుకెక్కి గత వైసీపీ ప్రభుత్వం తమకు అన్యాయం చేసిందని చెప్పకనే చెబుతున్నారు.   అధికారంలో ఉన్నప్పుడు బిల్లులు ఇచ్చే విషయంలో చొరవ తీసుకోని జగన్ ను నిలదీయాల్సింది పోయి.. ఇప్పుడు కోర్టుల చుట్టూ తిరుగుతున్న జగన్ రెడ్డిని చూసి వైసీపీ వర్గాలే జాలిపడుతున్న పరిస్థితి నెలకొంది.   కూటమి ప్రభుత్వం పెద్దిరెడ్డి కంపెనీ చేపట్టిన పనులపై విచారణకు ఆదేశిస్తే ఆయన కుటుంబం మరిన్ని చిక్కులను ఎదుర్కొనవలసిన పరిస్థితి ఏర్పడుతుందని పరిశీలకులు అంటున్నారు.  
ఆంధ్రప్రదేశ్ ఏకైక రాజధాని అమరావతి. ఈ విషయంలో వైసీపీకి వినా మరెవరికీ ఎటువంటి అభ్యంతరాలు, అనుమానాలూ లేవు. అయితే అడుగడుగునా అమరావతికి అడ్డంకులు కల్పిస్తూ వైసీపీ చీకాకులు సృష్టిస్తోంది. జగన్ ఐదేళ్ల హయాంలో అప్పటికి వేగంగా జరుగుతున్న అమరావతి నిర్మాణాన్ని నిలిపివేసి.. నిర్వీర్యం చేసింది. అమరావతికి భూములిచ్చిన రైతులను నానా ఇబ్బందులూ పెట్టింది. అయితే 2024 ఎన్నికలలో తెలుగుదేశం కూటమి విజయం సాధించి అధికారంలోకి రావడంతో అమరాతి అడ్డంకులు తొలిగిపోయి ఏకైక రాజధాని నిర్మాణం శరవేగంగా ముందుకు సాగుతోంది. ఇక ఆంధ్రప్రదేశ్ ఏకైక రాజధానిగా అమరావతిని గుర్తిస్తే రాష్ట్ర అసెంబ్లీ తీర్మానం ఆమోదించేందుకు సమాయత్తమౌతోంది. ఇందు కోసం ఈ నెల 28 రాష్ట్ర అసెంబ్లీ ప్రత్యేకంగా సమావేశం కానుంది. ఈ సమావేశం ఎజెండా అమరావతిని ఏకైక రాజధానిగా గుర్తిస్తూ తీర్మానం ఆమెదించడమే. ఇది ఏకైక రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పించే దిశగా కీలక ముందడుగుగా భావించవచ్చు. ఇప్పటికే  అమరావతిని ఆంధ్రప్రదేశ్  ఏకైక  శాశ్వత రాజధానిగా గుర్తించేందుకు కేంద్ర ప్రభుత్వం సానుకూలత వ్యక్తం చేసింది. అనుకున్నది అనుకున్నట్లుగా జరిగితే  పార్లమెంటు ప్రస్తుత సమావేశాల్లోనే రాబోయే పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లోనే ఇందుకు సంబంధించిన   బిల్లును ప్రవేశపెట్టేందుకు కేంద్రం సిద్ధంగా ఉంది. ఇప్పుడు రాష్ట్ర అసెంబ్లీ ఆమరావతిని రాష్ట్ర శాశ్వత రాజధానిగా తీర్మానం ఆమెదించి కేంద్రానికి పంపిస్తే.. ఆ దిశగా కేంద్రం పార్లమెంటులో సవరణ బిల్లు ప్రవేశపెట్టే అవకాశాలు మెండుగా ఉన్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ప్రస్తుతం పార్లమెంటులో ఎన్డీయేకు ఉన్న సంఖ్యాబలం దృష్ట్యా ఆ బిల్లు ఆమోదం లాంఛనమే. ఇక బిల్లు ఆమోదం పొందితే అమరావతికి తిరుగులేని చట్టబద్ధత లభిస్తుంది.  ఆంధ్రప్రదేశ్ విభజన జరిగిన సమయంలో హైదరాబాద్‌ను పదేళ్లపాటు ఉమ్మడి రాజధానిగా కేటాయించిన సంగతి తెలిసిందే.  ఆ గడువు దాదాపు రెండేళ్ల కిందటే.. అంటే 2024 జూన్ 2తో ముగిసింది. అంటే అప్పటి నుంచీ ఆంధ్రప్రదేశ్ రాజధాని లేని రాష్ట్రంగా ఉందన్న మాట.   సీఎం చంద్రబాబు ఇటీవలి తన హస్తిన పర్యటనలో కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో  రాజధానిగా అమరావతికి చట్టబద్ధతపై చర్చించారు.  గత వైసీపీ ప్రభుత్వ హయాంలో అమరావతిపై నెలకొన్న గందరగోళాన్ని పూర్తిగా తొలగించాలంటే పార్లమెంట్‌లో చట్టబద్ధత అవసరమని గట్టిగా చెప్పారు. దీనిపై అమిత్ షా సానుకూలంగా స్పందించి పార్లమెంటులో బిల్లు ప్రవేశపెడతామని హామీ ఇచ్చారు. ఈ విషయంపై ఇప్పటికే ముసాయిదా బిల్లు కూడా రెడీ అయ్యిందని తెలుస్తోంది. ఈ ముసాయిదా బిల్లుకు  న్యాయ, పట్టణాభివృద్ధి శాఖల నుంచి ఆమోదం కూడా అభించిందని అంటున్నారు. దీంతో అసెంబ్లీ  అమరావతి  ఏకైక శాశ్వత రాజధానిగా గుర్తిస్తూ   తీర్మానం ఆమోదించి కేంద్రానికి పంపడం  ఇక ఎలాంటి జాప్యం లేకుండా పార్లమెంటులో బిల్లు ప్రవేశపెట్టే దిశగా కేంద్రంపై ఒత్తిడి పెంచడానికి దోహదపడుతుందని పరిశీలకులు అంటున్నారు.  
2014 ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు. శకునిని అడ్డుపెట్టుకొని, జూదంలో పాండవులపై కౌరవులు పైచేయి సాధించినట్టుగా.. శకుని లాంటి రాజకీయ వ్యూహకర్త జిత్తులతో ఫ్యాన్ పార్టీ అధికారంలోకి వచ్చింది. భారతంలో ద్రౌపదిని వివస్త్రను చేయడానికి కౌరవులు ప్రయత్నిస్తే.. రాజధాని లేని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ను మిగల్చడానికి ఆ పార్టీ ప్రయత్నించింది. అందుకే కురుక్షేత్రంలో కౌరవులు ఓడిపోయినట్టుగా.. 2024 ఎన్నికల్లో ఘోర ఓటమిని చూసింది. అయినా ఫ్యాన్ పార్టీ తీరు మారలేదు. వచ్చే ఎన్నికల కోసం మళ్ళీ ఆ శకుని లాంటి వ్యూహకర్తను రంగంలోకి దింపడానికి చూస్తున్నట్లు తెలుస్తోంది.  అసలీ ఉపోద్ఘాతమంతా ఎందుకంటున్నారా? అక్కడికే వస్తున్నా... ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అత్యంత ఆసక్తికరమైన చర్చ జోరుగా సాగుతోంది.  2024ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని చవిచూసిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ,   2029 ఎన్నికల కోసం ఇప్పటి నుంచే పావులు కదపడం ప్రారంభించిందన్న చర్చ జరుగుతోంది.   ముఖ్యంగా గతంలో అంటే 2019 ఎన్నికలలో తనకు అఖండ విజయాన్ని అందించిన రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ అలియాస్ పీకే వైపు జగన్ మోహన్ రెడ్డి మళ్ళీ మొగ్గు చూపుతున్నారని చర్చ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.  గత ఎన్నికల సమయంలో తలెత్తిన విభేదాలను పక్కన పెట్టి, మళ్ళీ పాత బంధాన్ని పునరుద్ధరించుకోవాలని జగన్ భావిస్తున్నట్లు సమాచారం. 2019 ఎన్నికల్లో వైకాపా సాధించిన 151 సీట్ల అద్భుత విజయానికి ప్రశాంత్ కిషోర్ వ్యూహాలే ప్రధాన కారణమన్న సంగతి తెలిసిందే.  అప్పట్లో జగన్ పాదయాత్ర నుంచి అభ్యర్థుల ఎంపిక వరకు పీకే  కీలక పాత్ర పోషించారు.  అయితే, 2024 ఎన్నికల సమయానికి పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. ప్రశాంత్ కిషోర్ ప్రత్యక్ష రాజకీయాల నుంచి విరామం తీసుకోవడం, జగన్ కు దూరంగా జరగడం వంటి పరిణామాలు చోటుచేసుకున్నాయి. అంతేకాకుండా, గత ఎన్నికల్లో జగన్ ఓటమిని పీకే ముందే ఊహించి ప్రకటించడం ఇద్దరి మధ్య అగాధాన్ని పెంచింది. అయితే 2024 ఎన్నికలలో ఘోర పరాజయం తరువాత ఇప్పటి వరకూ వైసీసీ ఇసుమంతైనా కోలుకోలేదు. పైపెచ్చు ఆ పార్టీ అధినేత జగన్  ఏపీకి విజిటర్ గా మాత్రమే వస్తూ ఎక్కువ కాలం బెంగళూరుకే పరిమితం కావడంతో వైసీపీ క్యాడర్ కూడా దాదాపు చెల్లాచెదరైన పరిస్థితి.  ఉన్న కేడర్ లో సైతం నైరాశ్యం అలుముకుంది.  ఇక అధికారంలో ఉన్నంత కాలం పార్టీ తరఫున గొంతును గట్టిగా వినిపించిన నేతలలో చాలా మంది ప్రస్తుతం సైలంట్ మోడ్ లో ఉన్నారు. ఇటువంటి తరుణంలో పార్టీని గాడిన పెట్టడానికి పటిష్ట వ్యూహాలు రచించాలంటే పీకేయే శరణ్యమని జగన్ భావిస్తున్నట్లు పార్టీ వర్గాల నుంచే గట్టిగా వినిపిస్తోంది.  2024 ఎన్నికల్లో ఐప్యాక్  క్షేత్రస్థాయి పరిస్థితులను సరిగ్గా అంచనా వేయడంలో విఫలమైందని జగన్ భావిస్తున్నారు. ఆ లోపాలన్నిటినీ సరిదిద్ధి క్యాడర్ లో ఉత్సాహం నింపాలంటే ప్రశాంత్ కిశోర్ వినా మరో గత్యంతరం లేదని జగన్ గట్టిగా భావిస్తున్నారని అంటున్నారు.  ఈ నేపథ్యంలోనే  జగన్  పీకేతో సంప్రదింపులు జరిపాలని భావిస్తున్నట్లు చెబుతున్నారు. పార్టీ నాయకత్వంలో ఉన్న లోపాలను సరిదిద్దడం, నియోజకవర్గాల వారీగా బలాబలాలను అంచనా వేయడంలో పీకే అనుభవం తనకు ఉపకరిస్తుందని జగన్ భావిస్తున్నట్లు కనబడుతోంది.  గతంలో పీకేపై జగన్ కొన్ని విమర్శలు చేశారు. అలాగే పీకే సైతం జగన్ పై కొన్ని వ్యతిరేక వ్యాఖ్యలు చేశారు. గతం గత: అనుకుని మళ్లీ పీకేతో కలిసి ముందుకు సాగాలని జగన్ గట్టిగా నిర్ణయించుకున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.  అయితే రాజకీయ విశ్లేషకులు మాత్రం అది అంత సులభంగా జరిగే పని కాదని అంటున్నారు. గతంలో  జగన్ తనపై చేసిన వ్యాఖ్యలను పీకే విస్మరిస్తారా? అలాగే..   పీకే  జగన్ రాజకీయ శైలిపై చేసిన వ్యాఖ్యలను జగన్  మరచిపోయి మళ్లీ చేతులు కలుపుతారా? అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.  అదే సమయంలో  ఒక వేళ పీకే, జగన్ లు చేతులు కలిపినా.. 2019 నాటి మ్యాజిక్  రిపీట్ అయ్యే అవకాశాలు అంతంత మాత్రమేనని కూడా అంటున్నారు. సొంత రాష్ట్రం బీహార్ అసెంబ్లీ ఎన్నికలలో అన్ని స్థానాలకూ తన పార్టీ జనసురాజ్ పార్టీ అభ్యర్థులను నిలిపిన ప్రశాంత్ కిశోర్ కనీసం ఒక్కరిని కూడా గెలిపించుకోలేక బొక్కబోర్లా పడ్డ సంగతిని గుర్తు చేస్తూ.. ఏపీలో పీకే వ్యూహాలు పారే అవకాశాలు లేవంటున్నారు. 
  తెలంగాణ రాజకీయాల్లో అత్యంత సీనియర్ నాయకుడిగా, ఉమ్మడి కరీంనగర్ జిల్లా రాజకీయాల్లో కీలక పాత్ర పోషించిన మాజీ మంత్రి, ఎమ్మెల్సీ టి. జీవన్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. గత నాలుగు దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీలో కొనసాగిన ఆయన, బుధవారం తన ప్రాథమిక సభ్యత్వానికి అధికారికంగా రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. పార్టీలో చోటుచేసుకుంటున్న తాజా పరిణామాలు, సొంత పార్టీలోనే ఎదురవుతున్న అవమానాల నేపథ్యంలోనే తాను ఈ కఠిన నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని ఆయన వెల్లడించారు. జగిత్యాల నియోజకవర్గంలో గత 20 నెలలుగా జరుగుతున్న రాజకీయ పరిణామాలు తనను తీవ్ర మానసిక వేదనకు గురిచేశాయని జీవన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా ఇతర పార్టీల నుంచి కాంగ్రెస్‌లోకి వచ్చిన నాయకుల వల్ల పాత కార్యకర్తలకు, నమ్మకస్థులకు అన్యాయం జరుగుతోందని ఆయన ఆరోపించారు. క్రమశిక్షణకు మారుపేరుగా ఉన్న తనకు, కనీస గౌరవం దక్కని చోట కొనసాగడం అర్థరహితమని ఆయన భావించి ఈ నిర్ణయానికి వచ్చారు. పార్టీ అధిష్టానం నుంచి వచ్చిన రాయబారాలు కూడా జీవన్ రెడ్డిని శాంతింపజేయలేకపోయాయి. టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు శ్రీధర్ బాబు, లక్ష్మణ్ కుమార్ తదితరులు ఆయనతో భేటీ అయి నచ్చజెప్పే ప్రయత్నం చేసినప్పటికీ.. క్షేత్రస్థాయిలో పరిస్థితులు మారడం లేదని ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కాంగ్రెస్‌లో చేరినప్పటి నుంచి ఇద్దరి మధ్య విభేదాలు తారాస్థాయికి చేరాయి. స్థానిక సంస్థల ఎన్నికల్లో టికెట్ల కేటాయింపు విషయంలోనూ తన ప్రాధాన్యతను తగ్గించడాన్ని ఆయన తీవ్రంగా పరిగణించారు. జీవన్ రెడ్డి రాజీనామాతో జగిత్యాల జిల్లా కాంగ్రెస్ శ్రేణుల్లో అయోమయం నెలకొంది. ఆయన తదుపరి అడుగు ఎటువైపు అనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. తన అనుచరులు, కార్యకర్తలతో చర్చించిన తర్వాత భవిష్యత్తు కార్యాచరణను వెల్లడిస్తానని ఆయన పేర్కొన్నారు. ఏది ఏమైనా, ఉమ్మడి జిల్లాలో పట్టున్న బలమైన నేత పార్టీని వీడటం రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వానికి పెద్ద ఎదురుదెబ్బగానే విశ్లేషకులు భావిస్తున్నారు. వచ్చే ఎన్నికల నాటికి జిల్లాలో సమీకరణాలు ఎలా మారతాయో వేచి చూడాలి. జీవన్ రెడ్డి వంటి సీనియర్ నేత పార్టీని వీడటం వల్ల క్యాడర్‌లో చీలిక వచ్చే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ పరిణామం విపక్షాలకు కొంత మేర కలిసి వచ్చే అవకాశం కనిపిస్తోంది.
ALSO ON TELUGUONE N E W S
రాజకీయాలు వర్సెస్ సినిమాలు సినిమాల్లో నటించకుండా పవన్‌ను ఆపలేరు  మాజీ ఐఏఎస్ కు షాకిచ్చిన హైకోర్టు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan)కు హైకోర్టులో ఊరట లభించింది. ఆయన సినిమాల్లో నటించకుండా అడ్డుకోవాలంటూ దాఖలైన పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది. ఒకవైపు డిప్యూటీ సీఎంగా బాధ్యతలు నిర్వహిస్తూ, మరోవైపు తను కమిట్ అయిన సినిమాలను పూర్తి చేస్తున్న పవన్‌కు ఈ తీర్పు పెద్ద ఊరటనిచ్చింది.  మాజీ ఐఏఎస్ అధికారి విజయ్ కుమార్ ఈ పిటిషన్‌ను దాఖలు చేశారు. డిప్యూటీ సీఎంగా ఉన్న వ్యక్తి సినిమాల్లో నటించడం వల్ల అధికార దుర్వినియోగం జరుగుతుందని ఆయన ఆరోపించారు. ముఖ్యంగా “హరి హర వీరమల్లు” వంటి సినిమాల ప్రమోషన్‌లో ప్రభుత్వ వనరులు వాడుకున్నారని, టికెట్ ధరల పెంపు విషయంలోనూ నిబంధనలు పాటించలేదని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వ తరఫున న్యాయవాదులు ఆ వాదనలను తోసిపుచ్చారు. మంత్రి లేదా ముఖ్యమంత్రి సినిమాల్లో నటించడాన్ని ఆపేలా ఎలాంటి చట్టపరమైన నిబంధనలూ లేవని తెలిపారు. అలాగే పిటిషన్‌లో చేసిన ఆరోపణలకు సరైన ఆధారాలు లేవని కూడా కోర్టు దృష్టికి తీసుకెళ్ళారు. ఈ వాదనలను పరిశీలించిన హైకోర్టు, పవన్ కళ్యాణ్ కు అనుకూలంగా తీర్పు ఇచ్చింది. పిటిషన్‌లో బలమైన కారణాలు లేవని తేల్చింది. ఒక వ్యక్తి తన వృత్తిని ఎంచుకునే హక్కు రాజ్యాంగబద్ధంగా ఉంటుందని, ప్రజా జీవితంలో ఉన్నంత మాత్రాన సినిమాలు చేయకూడదని ఏ చట్టం చెప్పలేదని స్పష్టం చేస్తూ పిటిషన్‌ను కొట్టివేసింది. ఈ తీర్పుతో పవన్ కళ్యాణ్ తన రాజకీయ బాధ్యతలతో పాటు సినిమాల్లో నటించడానికి ఎలాంటి అడ్డంకులు లేకుండా పోయాయి. కాగా, పవన్ కళ్యాణ్ ఇటీవల 'ఉస్తాద్ భగత్ సింగ్'తో ప్రేక్షకులను పలకరించారు. ఈ సినిమా ప్రస్తుతం థియేటర్లలో ప్రదర్శితమవుతోంది. ఆ తర్వాత సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఒక సినిమా కమిటై ఉన్నారు. ఇందులో ఆయన ఇండియన్ ఆర్మీ ఆఫీసర్ గా కనిపించనున్నారని సమాచారం.
కాశీని రీ-క్రియేట్ చేసిన రాజమౌళి వారణాసి కోసం జక్కన్న చెక్కిన అద్భుతం సూపర్ స్టార్ మహేష్ బాబు(Mahesh Babu), దర్శక ధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి(Rajamouli) కాంబినేషన్‌లో రాబోతున్న ‘వారణాసి’(Varanasi) కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ అభిమానులు వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు. ఈ ప్రతిష్టాత్మక చిత్రం గురించి వస్తున్న ప్రతి చిన్న వార్త సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. తాజాగా ఈ సినిమా సెట్స్ కి సంబంధించిన వీడియోలు వైరల్ గా మారాయి. రాజమౌళి తన విజన్‌కు తగ్గట్టుగా వారణాసి(కాశీ) నగరాన్ని అద్భుతంగా రీ-క్రియేట్ చేశారు. సినిమాలో కీలకమైన కొన్ని సన్నివేశాల కోసం రాజమౌళి టీమ్ వారణాసి నగరాన్ని రీ-క్రియేట్ చేస్తూ ఒక భారీ సెట్‌ను నిర్మించింది. గంగానది ఘాట్లు, పురాతన వీధులు, ఆలయ నిర్మాణాలను కళ్ళకు కట్టినట్లు ఈ సెట్‌లో రూపొందించారు. సహజత్వం కోసం రాజమౌళి ఎక్కడా రాజీ పడకుండా, టెక్నికల్ టీమ్‌తో కలిసి ఈ సెట్‌ను అత్యంత గొప్పగా తీర్చిదిద్దారు. వారణాసి పుణ్యక్షేత్రం నేపథ్యంలో మహేష్ బాబు క్యారెక్టరైజేషన్‌కు సంబంధించిన ఇంపార్టెంట్ సీక్వెన్స్ ఇక్కడే షూట్ చేస్తున్నట్లు తెలుస్తోంది. సినిమాలోని ప్రతి సన్నివేశం సహజంగా కనిపించాలనే ఉద్దేశంతో రాజమౌళి ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారని సమాచారం. CGI కంటే రియల్ సెట్స్‌పై ఎక్కువగా ఆధారపడటం ఆయన స్టైల్. ఈ క్రమంలో వందలాది కార్మికులు, ఆర్ట్ డిపార్ట్‌మెంట్ సభ్యులు నెలల తరబడి శ్రమించి ఈ సెట్స్‌ను సిద్ధం చేశారు. ఈ సెట్స్‌కు సంబంధించిన ఫొటోలు, వీడియోలు బయటకు రావడంతో అభిమానులు ఆశ్చర్యపోతున్నారు. “ఇది సినిమా సెట్టా? లేక నిజమైన కాశీనా?” అనే స్థాయిలో కామెంట్లు వస్తున్నాయి. రాజమౌళి మరోసారి తన విజువల్ మ్యాజిక్‌తో ప్రేక్షకులను ఆకట్టుకోబోతున్నాడని ఫ్యాన్స్ నమ్మకం వ్యక్తం చేస్తున్నారు. రాజమౌళి గత చిత్రాలైన ‘బాహుబలి’, ‘RRR’ చిత్రాల్లో సెట్స్ ఎంత సహజంగా ఉంటాయో మనకు తెలిసిందే. ఇప్పుడు వారణాసి కోసం వేసిన సెట్స్ అద్భుతంగా ఉండటంతో, ఆ విజువల్స్ వెండితెరపై ఎంత గొప్పగా ఉంటాయోనని ఫ్యాన్స్ ఎగ్జైటింగ్ గా ఫీలవుతున్నారు. గంగా నది నేపథ్యంలో వచ్చే సన్నివేశాలు సినిమాకే హైలైట్ గా నిలుస్తాయని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న మాట. ఈ సినిమా కోసం మహేష్ బాబు తన రూపాన్ని పూర్తిగా మార్చుకున్నారు. పొడవాటి జుట్టు, గడ్డంతో కొత్తగా కనిపిస్తున్నారు. హాలీవుడ్ స్థాయి టెక్నాలజీతో, భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం మహేష్ బాబు దాదాపు రెండేళ్లుగా కేవలం దీనికే సమయాన్ని కేటాయించారు. ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్‌లో ఉండే యాక్షన్ సీన్లు, విజువల్ ఎఫెక్ట్స్ ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి. ‘వారణాసి’ సినిమాను కె.ఎల్. నారాయణ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఇందులో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రం అడ్వెంచర్, మైథాలజీ, టైమ్-ట్రావెల్ అంశాల కలయికగా రూపొందుతోంది. ఈ సినిమా 2027లో ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధమవుతోంది. IMAX ఫార్మాట్‌లోనూ రూపొందుతున్న ఈ సినిమా ఇండియన్ సినీ హిస్టరీలో కొత్త రికార్డులు సృష్టిస్తుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. https://www.instagram.com/reel/DWRrX_lpMfR/
    -తన పేరు మార్చుకున్న పవన్ వైఫ్ అన్నా  -కీలక నిర్ణయం కూడా  -ఇంతకీ ఏంటి ఆ నిర్ణయం  పవర్ స్టార్ 'పవన్ కళ్యాణ్'(Pawan Kalyan)వైఫ్ 'అన్నాలెజినోవా'(Anna lezhneva)గురించి ప్రత్యేకంగా పరిచయ వ్యాఖ్యానాలు అవసరం లేదు. అంతలా అభిమానులు, తెలుగు జనాలతో మమేకమై ఉంది. రీసెంట్ గా అన్నాలెజినోవా ఒక కీలక నిర్ణయం తీసుకుంది. దీంతో పవన్ ఆమెకి వెల్ కమ్ చెప్పాడు. పూర్తి మ్యాటర్ ఏంటో చూద్దాం.    అన్నాలెజినోవా రీసెంట్ గా ఇన్‌స్టాగ్రామ్‌లో జాయిన్ అయ్యింది. తన పేరుని 'అన్నా కొణిదెల'గా మార్చుకుంది. ఈ సందర్భంగా పవన్ తన భార్యకి స్వాగతం పలుకుతు ఒక పోస్ట్ చేసాడు. సదరు పోస్ట్ లో డియర్ అన్నా కొణిదెల, ఇన్‌స్టాగ్రామ్‌లోకి నీకు సాదర స్వాగతం. ఈ వేదిక ద్వారా నువ్వు అర్థవంతమైన మరియు స్ఫూర్తిదాయకమైన విషయాలని పంచుకుంటావని ఆశిస్తున్నాననే వ్యాఖ్యలు చేసాడు. Also read: Dhurandhar 2: ధురంధర్ గా అల్లుఅర్జున్ చేసి ఉంటే.. ఇలాగే ఉండేది పరిస్థితి ఇక అన్నా తన ఫస్ట్ పోస్ట్‌ని  చాలా స్పెషల్‌గా షేర్ చేశారు. పవన్ కళ్యాణ్‌తో కలిసి ఉన్న పిక్ ని షేర్ చేస్తు 'ఇది ఎప్పుడో జరగాల్సింది. కానీ ఇప్పుడే సరైన సమయం అనిపిస్తోంది. చిరంజీవి(Chiranjeevi)గారి ఆశీస్సులు, పవన్ కళ్యాణ్ గారి మద్దతుతో ఇక్కడికి వచ్చానని పేర్కొంది. ముఖ్యంగా తన బయోలో 'రష్యన్ హార్ట్, ఇండియన్ సోల్’ అని ఉంచడం నెటిజన్లని  ఆకర్షిస్తుంది. మరి పవన్ చెప్పినట్టుగా అర్థవంతమైన,స్ఫూర్తిదాయకమైన విషయాలతో అన్నా కొణిదెల పవన్, చిరంజీవిని మించిన ఫాలోవర్స్ ని దక్కించుకుంటుందేమో చూడాలి.  
    -కలెక్షన్స్ తో అదరగొడుతున్న ధురంధర్ 2  -ధురంధర్ గా అల్లు అర్జున్ చేసి ఉంటే ఎలా ఉండేది -మెప్పించే వాడా! -సోషల్ మీడియాలో పోలికలని తెస్తున్న ఫ్యాన్స్  -ఆ న్యూస్ ఏంటో చూద్దాం.   'సిరివెన్నెల సీతారామశాస్త్రి'(Sirivennela sitaramasastriగారి మనోఫలకం నుంచి వచ్చే విధ్వంసం యొక్క సాహిత్యాన్ని 'ధురంధర్ 2'(Dhurandhar 2)బాగా ఒంటబట్టించుకున్నట్టుగా ఉంది. ఆల్ ఏరియాస్ లో సర్వే జనా ధురంధర్ బాట పట్టేలా చేస్తుంది. దీంతో దురంధర్ యొక్క కలెక్షన్స్ ల ప్రవాహ శైలి ఏ ఏరియాలో ఎన్ని వంపులు తిరుగుతుందో తెలియని పరిస్థితి. వారం కూడా నిండకుండానే వసూలు చేసిన 919 కోట్ల గ్రాస్ నే ఉదాహరణ. మరి అంతటి శక్తిని ప్రదర్శిస్తున్న ధురంధర్ 2  లో తమ అభిమాన హీరో చేసి ఉంటే బాగుండని అనుకోని అభిమాని ఉండడు కదా!. ఈ  కోవలోనే అల్లు అర్జున్  ధురంధర్ గా చేసి ఉంటే ఎలా ఉండేదనే చర్చ సోషల్ మీడియా వేదికగా జరుగుతుంది. మరి ఆ చర్చకి ఆద్యులు అల్లు ఆర్మీనా మూవీ లవర్స్ నా అని తెలియదు. మరి ఆ చర్చల సారాంశం ఏమిటో చూద్దాం. వాళ్లంతా మాట్లాడుతు ధురంధర్ సబ్జెట్ అల్లు అర్జున్(Allu Arjun)కి కూడా సూటవుతుంది. అల్లు అర్జున్ ఇప్పటి వరకు గ్యాంగ్ స్టర్ గా చేయలేదు కాబట్టి ధురంధర్ క్యారక్టర్ సూటవుతుందా లేదా అని కొంత మంది అనుకోవచ్చు. పుష్ప సిరీస్ లో స్మగ్లర్ గా చేస్తున్నాడని గెటప్ రిలీజ్ చేసినప్పుడు కొంత మంది సంకోచించారు. జనరల్ ఆడియెన్స్ నుంచి రెస్పాన్స్ ఎలా వస్తుందని ఫ్యాన్స్ సైతం భయపడ్డారు. కానీ పుష్ప సిరీస్ లో అల్లు అర్జున్ నుంచి వచ్చిన ఊచకోత పెర్ఫార్మ్ చూసి యావత్తు ఇండియా పుష్ప పెర్ఫార్మ్ కి సెల్యూట్ కొట్టింది. మరి ఈ లెక్కన ధురంధర్ లోని హంజా అలియాస్ జస్కి రాత్ సింగ్ గా అల్లుఅర్జున్ పర్ఫెక్ట్ గా సూటయ్యేవాడు. హిందీలో పుష్ప సిరీస్ ని అక్కడి ప్రేక్షకులు తమ చిత్రం లాగా భావించి బ్రహ్మ రధం పట్టారు కాబట్టి అల్లు అర్జున్ చేసి ఉంటే సౌత్ లో కూడా ధురంధర్ కలెక్షన్స్ ప్రభావం ఒక రేంజ్ లో ఉండేదని చెప్తున్నారు. also read: Ram Charan: రామ్ చరణ్ గాయాలపై పవన్ కళ్యాణ్ వివరణ అభిమానులు, మూవీ లవర్స్ ఆశలో ఎలాంటి కల్మషం ఉండదు కాబట్టి వాళ్ళు అలా అనుకోవడంలో ఎలాంటి తప్పు లేదు. కానీ  ధురంధర్ 2 సౌత్ లో కూడా రికార్డు కలెక్షన్స్ సాధించే పనిలో బిజీగా ఉంది. రణవీర్ సింగ్ తో పాటి మిగతా నటీనటుల నాచురల్ పేర ఫార్మ్ కి, ఆదిత్య ధర్(Aditya Dhar)దర్శకత్వానికి ప్రతి ఒక్కరు ఫిదా అయ్యి సలాం కొడుతున్నారు.   
తమిళనాట మార్చి 19న విడుదలై సూపర్ హిట్ గా నిలిచిన యూత్ ఫుల్ ఎంటర్‌టైనర్‌ 'యూత్'(Youth). తెలుగులో ఈ సినిమా రేపు(మార్చి 26) విడుదల కావాల్సి ఉండగా, చివరి నిమిషంలో వాయిదా పడింది. అనివార్య కారణాలతో ఒక రోజు ఆలస్యంగా అంటే మార్చి 27న 'యూత్' సినిమా థియేటర్స్ లోకి రాబోతుందని తాజాగా మేకర్స్ ప్రకటించారు. పెయిడ్ ప్రీమియర్స్ పై ప్రకటన చేస్తామని ప్రొడ్యూసర్స్ వెల్లడించారు.  కెన్ కరుణాస్, అనిష్మ అనిల్ కుమార్, దేవదర్శిని చేతన్, సూరజ్ వెంజరముడు, ప్రియాన్షి యాదవ్, మీనాక్షి దినేష్ ప్రధాన పాత్రలు పోషించిన 'యూత్' సినిమాకు కెన్ కరుణాస్ దర్శకత్వం వహించాడు. జి.వి. ప్రకాష్ కుమార్ సంగీతం అందించాడు. కాలేజీ జ్ఞాపకాల ‘యూత్’ ప్రయాణం ‘యూత్’ ట్రైలర్ ఇప్పటికే సోషల్ మీడియాలో మంచి స్పందన సొంతం చేసుకుంది. జూనియర్ ఇంటర్మీడియట్ చేరిన ప్రవీణ్ (కెన్ కరుణాస్) & అతని గ్యాంగ్ చేసే అల్లరి, కాలేజీలో సీనియర్లతో గొడవలు, ఫ్యామిలీ ఎమోషన్స్ వంటి ఎలిమెంట్స్‌తో ఈ సినిమాను రూపొందించారు.  కెన్ కరుణాస్ విశ్వరూపం ఈ సినిమాకు హీరో మాత్రమే కాకుండా, రచన-దర్శకత్వ బాధ్యతలను కూడా కెన్ కరుణాస్ నిర్వహించడం విశేషం. ‘అసురన్’ సినిమాలో తన నటనతో మెప్పించిన ఆయన, ఈ సినిమాతో దర్శకుడిగా కూడా తన ప్రతిభను చాటుకున్నాడు. ఒక మధ్యతరగతి కుటుంబంలో పుట్టిన కుర్రాడు చదువు కంటే ప్రేమకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తే ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయి? అనే పాయింట్‌తో.. ఎంతో ఎంటర్టైనింగ్ గా, ఎమోషనల్ గా ఈ సినిమాను తెరకెక్కించాడు. “మీ గ్యాంగ్‌తో రండి.. ఏజ్ లిమిట్ లేదు” అనే ట్యాగ్‌లైన్‌తో ఈ సినిమా ప్రమోషనల్ క్యాంపెయిన్ చేస్తున్నారు. ఈ మూవీ ప్రమోషనల్ కంటెంట్ కు, సాంగ్స్ కు మంచి రెస్పాన్స్ వస్తోంది. ముఖ్యంగా యూత్ ఆడియెన్స్ ఈ సినిమా చూసేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తమిళంలో ఘన విజయం సాధించిన ఈ చిత్రాన్ని ఈ2సీ బ్యానర్ పై హౌస్ ఫుల్ వినీత్, సందీప్ తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. తెలుగులో కూడా అదే మ్యాజిక్ రిపీట్ అవుతుందేమో చూడాలి.  
యాక్షన్ మోడ్‌లోకి రామ్ పోతినేని భారీ బడ్జెట్‌ యాక్షన్ థ్రిల్లర్ కి గ్రీన్ సిగ్నల్ లోకేష్ అసోసియేట్ తో చేతులు కలుపుతున్న రామ్ టాలీవుడ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని(Ram Pothineni) మరోసారి యాక్షన్ బాట పడుతున్నాడు. గతేడాది 'ఆంధ్ర కింగ్ తాలూకా'తో ప్రేక్షకులను పలకరించిన రామ్.. తన నెక్స్ట్ మూవీని ఒక నూతన దర్శకుడితో చేయబోతున్నట్లు తెలుస్తోంది. అయితే ఇక్కడ విశేషం ఏమిటంటే.. ఆ దర్శకుడు మరెవరో కాదు, సౌత్ ఇండియా టాప్ డైరెక్టర్స్ లో ఒకరైన లోకేష్ కనగరాజ్(Lokesh Kanagaraj) వద్ద అసోసియేట్‌గా పనిచేసిన లోగి విఘ్నేష్ అని తెలుస్తోంది. లోకేష్ మార్క్ యాక్షన్.. రామ్ ఎనర్జీ లోకేష్ కనగరాజ్ సినిమాల్లో ఉండే రా అండ్ రస్టిక్ యాక్షన్, గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆయన శిష్యుడైన విఘ్నేష్ కూడా అదే తరహాలో రామ్ కోసం ఒక పవర్‌ఫుల్ యాక్షన్ థ్రిల్లర్ కథను సిద్ధం చేశాడట. ఇప్పటికే కథా చర్చలు ముగిశాయని, రామ్ ఈ ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని సమాచారం. భారీ బడ్జెట్‌తో తెరకెక్కనున్న ఈ చిత్రం న్యూ-ఏజ్ యాక్షన్ థ్రిల్లర్‌గా ఉండబోతోందని సినీ వర్గాల టాక్. ఆంధ్ర కింగ్ నిరాశ తర్వాత.. ఆచితూచి అడుగులు! రామ్ పోతినేని గత చిత్రం 'ఆంధ్ర కింగ్ తాలూకా' విమర్శకుల ప్రశంసలు అందుకున్నప్పటికీ, బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో మెప్పించలేకపోయింది. దీంతో రామ్ తన నెక్స్ట్ సినిమా విషయంలో దాదాపు ఆరు నెలల పాటు గ్యాప్ తీసుకున్నాడు. ఎన్నో కథలు విన్న తర్వాత, చివరకు లోకేష్ కనగరాజ్ శిష్యుడు చెప్పిన విభిన్నమైన పాయింట్‌కు ఫిదా అయ్యి ఈ సినిమాను పట్టాలెక్కించేందుకు మొగ్గు చూపినట్లు తెలుస్తోంది.  కొత్త లుక్‌లో ‘ఉస్తాద్’.. ఈ సినిమా కోసం రామ్ సరికొత్త మేకోవర్‌లో కనిపించనున్నట్లు సమాచారం. యాక్షన్ సన్నివేశాల కోసం ఆయన ప్రత్యేకంగా శిక్షణ కూడా తీసుకోనున్నాడట. లోకేష్ టీమ్ నుంచి వస్తున్న దర్శకుడు కావడంతో, లోకేష్ సినిమాటిక్ యూనివర్స్(LCU) తరహాలో ఈ ప్రాజెక్టులో ఏవైనా సర్ప్రైజ్ ఎలిమెంట్స్  ఉంటాయేమోనని అభిమానులు ఇప్పటి నుంచే సోషల్ మీడియాలో చర్చించుకుంటున్నారు.  అనౌన్స్‌మెంట్.. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ప్రీ-ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతున్నాయి. ఒక ప్రముఖ నిర్మాణ సంస్థ ఈ భారీ చిత్రాన్ని నిర్మించనుంది. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. మంచి హిట్ కోసం ఎదురుచూస్తున్న రామ్‌ని ఈ క్రేజీ యాక్షన్ థ్రిల్లర్ మళ్ళీ సక్సెస్ ట్రాక్ ఎక్కిస్తుందేమో చూడాలి.
  -చరణ్ గాయాలపాలయినట్టుగా వస్తున్న న్యూస్  -నిజమేనా అంటు అభిమానుల ఆందోళన  -ఇలాంటి టైంలో నోట్ రిలీజ్ చేసిన పవన్ కళ్యాణ్   'పెద్ది'(Peddi)షూటింగ్ లో మెగాపవర్ స్టార్ 'రామ్ చరణ్'(Ram Charan)గాయాలపాలైనట్టుగా మా 'తెలుగువన్' సైట్ లో ఎక్స్ క్లూజివ్ గా మీకు అందించిన  విషయం తెలిసిందే. దీంతో ఆ న్యూస్  నిజమేనా అంటు చాలా మంది కామెంట్స్ చేసుకొచ్చారు. కాకపోతే ఈ విషయంలో చరణ్ టీం గాని, పెద్ది మేకర్స్ గాని స్పందిస్తారేమో, ఆ న్యూస్ కూడా మీకు తెలియచేయాలని చూస్తున్నాం. కానీ ఇంకా ఎలాంటి ప్రకటన రాలేదు. అలాంటి టైంలో ఇప్పుడు పవన్ కళ్యాణ్(Pawan Kalyan)చేసిన ఒక్క ట్వీట్ తో చరణ్ గాయాలు పాలయినట్టుగా ఫిక్స్ అవ్వచ్చు.  ఎక్స్ క్లూజివ్ గా పవన్ కళ్యాణ్ ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేసాడు. సదరు ప్రెస్ నోట్ లో రామ్ చరణ్ 'పెద్ది‘ సినిమా చిత్రీకరణ సమయంలో గాయపడ్డారని తెలిసింది. రాంచరణ్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నానని తెలిపాడు. దీంతో చరణ్ గాయాలపాలైన విషయం నిజమైనట్లయింది.  Also read: Cinema: సినిమా తీసాడు.. అప్పు తీర్చడానికి 6 ఏళ్లు కప్పులు కడిగిన నిర్మాత  ఈ న్యూస్ ఉదయం నుంచే వినిపిస్తుండటంతో చరణ్ కి ఎలా ఉందనే టెన్షన్ తో ఉన్నారు. ఈ నేపథ్యంలో సాయంత్రానికి గాయం విషయంపై చరణ్ అండ్ టీం స్పందించే అవకాశం ఉంది. కంటి దగ్గర చిన్న గాయమైందని, ఈ విషయంలో పెద్దగా భయపడాల్సిన పని లేదనే మాటలు వినపడుతున్నాయి. ఇక మార్చి 27 న చరణ్ పుట్టిన రోజుని గ్రాండ్ గా జరపడానికి రెండు తెలుగు రాష్ట్రాల్లోని అభిమానులు ఫిక్స్ అయ్యారు.సోషల్ మీడియాలో అయితే  ఇప్పట్నుంచే అభిమాన సందడి వాతావరణాన్ని తెప్పిస్తున్నారు.   
  -సినిమాల్లో రాణించాలని అనుకున్నాడు  -నిర్మాతగా సినిమా తీసాడు -కప్పులు కడిగాడు  -ఇప్పడు ఏం చేస్తున్నాడు ధర్మంగా ఓవర్ నైట్ పేరు, కోట్ల కొద్దీ డబ్బు రావాలంటే సినిమా(Cinema),క్రికెట్(Cricket)అనే నానుడి చాలా బలంగా ఉంది. నానుడి అని ఏముందిలే కానీ నిజం కూడా. అందుకే చాలా మంది ఆయా రంగాల్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటు ఉంటారు. అలాంటి వాళ్ళల్లో శ్రీనివాస్(Srinivas)ఒకరు. సినిమాపై ఇష్టంతో సినీరంగ ప్రవేశించి 'పాండవులు' మూవీలో హీరోగా చేసాడు. లెజండ్రీ కమెడియన్ వేణుమాధవ్(venumadhav)కూడా ఒక హీరో. 2013 లో మే నెలలో ప్రేక్షకుల ముందుకు రాగా డిజాస్టర్ టాక్ ని సొంతం చేసుకుంది రీసెంట్ గా శ్రీనివాస్  ఒక ఇంటర్వ్యూలో పాండవులు గురించి చెప్పడంతో పాటు ఆ సినిమా తర్వాత తన జీవితం ఎలా మారిపోయిందో వివరించాడు. ఆయన మాటలు చూద్దాం. 30 లక్షల బడ్జెట్‌తో పాండవులు అనుకుంటే పలు మార్పులు చేర్పులతో చివరికి 1.4 కోట్ల రూపాయలకి చేరింది. కానీ పరాజయం పాలవ్వడంతో ఆర్థికంగా తీవ్ర ఇబ్బందుల్లో పడ్డాను. దీంతో సుమారు ఆరు సంవత్సరాల పాటు గుంటూరులో ఒక హోటల్ నడిపాను.  నా భార్య వంట చేస్తుంటే, నేను కప్పులు, ప్లేట్లు కడగడం, టీ సప్లై చేయడం, డబ్బులు తీసుకోవడం వంటి పనులు చేసానని చెప్పుకొచ్చాడు. Also read: Monalisa: ఎక్కడెక్కడో తాకుతు శారీరకంగా వేధించాడు.. మోనాలిసా సంచలన కామెంట్స్   శ్రీనివాస్ ప్రెజెంట్ పలు రకాల చిత్రాల్లో చిన్న చిన్న క్యారెక్టర్స్ చేస్తు తన సినీ ప్రేమని తీర్చుకుంటున్నాడు. ఎక్కువగా అనిల్ రావిపూడి సినిమాల్లో కనిపిస్తూ ఉంటాడు. చిన్న వయసు నుంచే పలు రంగస్థల నాటకాల్లో అద్భుతమైన పెర్ఫార్మ్  కనపరిచి ఎన్నో అవార్డ్స్, సన్మానాలు అందుకున్నాడు.        
The youth-centric entertainer “Youth,” starring Ken Karunaas, Anishma Anil Kumar, Devadarshini Chetan, Suraj Venjaramoodu, Priyanshi Yadav, and Meenakshi Dinesh in lead roles, was initially scheduled to release on the 26th of this month. However, due to unavoidable reasons, the film’s theatrical release has been postponed by one day and will now hit theatres on March 27th. The producers have also stated that an announcement regarding paid premieres will be made soon. Having already achieved great success in Tamil, the film is now being brought to Telugu audiences under the E2C banner by Housefull Vinith and Sandeep. The film is directed by Ken Karunaas and his team. It is being promoted with the slogan “Come with your gang, note – no age limit.” The promotional content and songs of the movie have been receiving a huge response, and youth audiences are eagerly waiting to watch it on the first day, first show.
నటసింహం నందమూరి బాలకృష్ణ(Nandamuri Balakrishna) హీరోగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న క్రేజీ ప్రాజెక్ట్ 'NBK 111'. 'వీరసింహారెడ్డి' వంటి బ్లాక్ బస్టర్ తర్వాత వీరిద్దరి కాంబినేషన్‌లో వస్తున్న సినిమా కావడంతో అనౌన్స్‌మెంట్ నుంచే భారీ అంచనాలు ఏర్పడ్డాయి. తాజాగా ఈ సినిమా షూటింగ్‌కు సంబంధించి అదిరిపోయే అప్‌డేట్ బయటకు వచ్చింది. తొలి షెడ్యూల్‌లో భారీ యాక్షన్ సీక్వెన్స్ మార్చి మొదటి వారంలో ప్రారంభమైన ఈ సినిమా తొలి షెడ్యూల్ మార్చి 18 ముగిసింది. ఈ షెడ్యూల్‌లో దర్శకుడు గోపీచంద్ మలినేని అత్యంత కీలకమైన సన్నివేశాలను చిత్రీకరించినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా బాలయ్య మార్క్ భారీ యాక్షన్ సీక్వెన్స్‌ను ఫైట్ మాస్టర్ వెంకట్ పర్యవేక్షణలో షూట్ చేశారు. ఈ ఫైట్‌తో పాటు దానికి దారితీసే కీలక సన్నివేశాలు, బాలయ్య పవర్‌ఫుల్ డైలాగ్ వెర్షన్లను కూడా ఈ షెడ్యూల్‌లోనే పూర్తి చేసినట్లు సమాచారం. బాలయ్య గెటప్‌పై చిత్ర యూనిట్ ఫుల్ హ్యాపీ! మొదటి షెడ్యూల్ అవుట్‌పుట్ చూసిన తర్వాత చిత్ర యూనిట్ మొత్తం చాలా ఉత్సాహంగా ఉందట. ముఖ్యంగా ఈ సినిమాలో బాలకృష్ణ గెటప్, ఆయన క్యారెక్టరైజేషన్ అనుకున్న దానికంటే చాలా అద్భుతంగా వచ్చాయని టాక్. గ్రే హెయిర్, సాల్ట్ అండ్ పెప్పర్ లుక్‌లో బాలయ్యను చూసి అభిమానులు మురిసిపోవడం ఖాయమని యూనిట్ వర్గాలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. ఆయన చెప్పే డైలాగులు కూడా మాస్ ఆడియన్స్‌కు పూనకాలు తెప్పించేలా ఉన్నాయట. సెకండ్ షెడ్యూల్ ఎక్కడంటే? ఇక రెండో షెడ్యూల్ ఏప్రిల్ మొదటి వారంలో ప్రారంభం కానుంది. ఈ షెడ్యూల్‌ను హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ప్లాన్ చేశారు. పెద్ద హీరోల సినిమాల విషయంలో షూటింగ్ లొకేషన్ల వద్ద అభిమానుల తాకిడి ఎక్కువగా ఉంటుంది కాబట్టి, చిత్ర యూనిట్ చాలా గోప్యంగా షూటింగ్ నిర్వహించాలని భావిస్తోంది. గ్యాంగ్‌స్టర్ స్టోరీ.. సరికొత్త షేడ్స్! NBK 111 కథ గురించి ఒక ఆసక్తికరమైన విషయం బయటకు వచ్చింది. ఇది ఒక పవర్‌ఫుల్ గ్యాంగ్‌స్టర్ డ్రామా అని, మాఫియా నేపథ్యంలో సాగుతుందని తెలుస్తోంది. ఈ సినిమాలో బాలకృష్ణ డ్యూయల్ రోల్ కాకుండా సింగిల్ రోల్‌లోనే కనిపిస్తారట. కానీ, ఒకే పాత్రలో డిఫరెంట్ షేడ్స్ ఉంటాయని, 10 ఏళ్ల క్రితం బాలయ్య ఎలా ఉండేవారు.. ఇప్పుడు ఎలా ఉన్నారు అనే టైమ్ లైన్ ఆధారంగా కథ సాగుతుందని సమాచారం. నటీనటులు - టెక్నీషియన్స్ ఈ సినిమాలో లేడీ సూపర్ స్టార్ నయనతార హీరోయిన్ గా నటిస్తుండగా, మరో కీలక పాత్రలో సముద్రఖని కనిపిస్తారని తెలుస్తోంది. సముద్రఖని పాత్ర కేవలం విలన్‌గా మాత్రమే కాకుండా, కథను మలుపు తిప్పే ఒక కీలకమైన పాత్ర అని టాక్. 'వీరసింహారెడ్డి'ని మించిన స్టైలిష్ మేకింగ్‌తో, భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్లు సమాచారం. దసరా లక్ష్యంగా బాలయ్య వేట! అన్నీ అనుకున్నట్టు జరిగితే, ఈ సినిమాను దసరా కానుకగా విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఈలోపు సినిమా ఫస్ట్ లుక్, టైటిల్ అనౌన్స్‌మెంట్‌తో అభిమానుల్లో జోష్ నింపాలని చూస్తున్నారు. నందమూరి అభిమానులు ఈ గ్యాంగ్‌స్టర్ వేట కోసం వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు. మరి గోపీచంద్ మలినేని ఈసారి బాలయ్యను ఏ రేంజ్‌లో చూపిస్తారో చూడాలి.  
  ప్రతి ఒక్కరూ జీవితంలో సంతోషంగా ఉండాలని  కోరుకుంటారు.  సంతోషంగా ఉండటం కోసం చేయాల్సినంత కష్టం చేస్తూనే ఉంటారు.  డబ్బు సంపాదిస్తారు,  నచ్చిన వస్తువులు కొనుక్కుంటారు, నచ్చిన చోటికి వెళతారు.. ఇలా సంతోషంగా ఉండటానికి చేయాల్సినవన్నీ చేస్తారు. కానీ ఇన్నిచేసినా సరే.. కొందరు సంతోషంగా ఉండరు.  ఇలా ఎందుకు జరుగుతుందనే విషయం చాలా మంది ఆలోచించరు.  కేవలం అసంతృప్తి దగ్గరే ఆగిపోతారు.  కానీ క్షుణ్ణంగా గమనిస్తే.. ఒక వ్యక్తి చుట్టూ ఎన్ని సౌకర్యాలు, ఎన్ని సంతోషపెట్టే విషయాలు ఉన్నా ఆ వ్యక్తి సంతోషంగా ఉండటం లేదంటే.. ఆ వ్యక్తి చుట్టూ ఉండే కొందరు వ్యక్తులే కారణం అయ్యే అవకాశం ఉంటుంది. పక్కవాళ్లు సంతోషంగా ఉంటే ఓర్వలేని వ్యక్తులు కొందరు ఉంటారు.  ఇలాంటి వ్యక్తులు పక్కవాళ్ల సంతోషాన్ని చెదపురుగుల్లా తినేస్తుంటారు.  పైశాచిక ఆనందాన్ని లోలోపలే అనుభవిస్తారు.  పక్కవాళ్ల సంతోషాన్ని నాశనం చేసే ఆ వ్యక్తులు ఎవరు?  వారి లక్షణాలు ఏంటో తెలుసుకుంటే.. ఎప్పుడూ ఏడుస్తూ కంప్లైంట్లు చేసే వ్యక్తులు.. జీవితంలో ఏ మంచినీ చూడని వాళ్ళు వీళ్ళు. వాతావరణం బాగుంటే, ఎండ వేడిమి గురించి ఫిర్యాదు చేస్తారు. మంచి ఉద్యోగం వస్తే, తమ బాస్‌ను విమర్శిస్తారు. వారి దృక్పథం ఎంత ప్రతికూలంగా ఉంటుందంటే, వారి పక్కన కూర్చోవడం కూడా  మానసిక స్థితిని పాడు చేస్తుంది. ఇలాంటి వ్యక్తులు పక్కవాళ్ల సానుకూల శక్తిని హరించివేస్తారు. వీరికి దూరంగా ఉండటమే ఉత్తమం. స్వప్రయోజనాలు చూసుకునేవారు.. స్నేహితులలో, బంధువులలో చాలామంది స్వార్థంగా ఉంటారు.  మాట్లాడి చాలా  రోజులు అయింది అంటూ మాటలు కలిపి తమ స్వప్రయోజనాల కోసం సహాయం అడుగుతుంటారు.  ఇలాంటి వారు ప్రతి ఒక్కరి సర్కిల్లో ఉంటారు.వీళ్ళు కేవలం తమకు సహాయం కావాలన్నా లేదా ఏదైనా పని చేయించుకోవాలన్నా మాత్రమే ఎదుటి వ్యక్తిని గుర్తు చేసుకుంటారు. పని పూర్తయిన వెంటనే మాయమైపోతారు. ఇలాంటి స్వార్థపరులు  ఎప్పటికీ నిజమైన స్నేహితులు కాలేరు. చాడీలు చెప్పేవారు.. ఒకరి గురించి ఇంకొకరు దగ్గర చాడీలు చెప్పేవారు.. ఏదో ఒకరోజు ఎదుటి వారికి మీ గురించి చాడీలు చెప్పే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది.  అలాంటి వారికి నిజాయితీ ఉండదు. వారు సంబంధాలను పాడుచేయడానికి కల్పిత కథలను మాత్రమే చెబుతారు.  జీవితంలో మనశ్శాంతి కావాలంటే అలాంటి వ్యక్తులకు  దూరంగా ఉండటం మంచిది. అసూయ పరులు.. మీరు సంతోషంగా ఉన్నప్పుడు చప్పట్లు కొట్టేవాడే నిజమైన స్నేహితుడు. అయితే, కొంతమంది మీతో చాలా మంచిగా ఉన్నట్లు నటిస్తారు, కానీ రహస్యంగా మీ పురోగతిని చూసి అసూయపడతారు. మీరు కొత్త కారు కొన్నా, పదోన్నతి పొందినా, వారు మిమ్మల్ని అభినందిస్తారు, కానీ వారి కళ్ళలో, మాటల్లో ఒక వింతైన అసూయ  స్పష్టంగా కనిపిస్తుంది. అలాంటి అసూయపడే వ్యక్తులు మీ మంచిని ఎప్పటికీ కోరుకోలేరు. నిరాశ పరిచేవారు.. నువ్వు చేయలేవు.. నీకు చేతకాద.. నీకు సాధ్యం కాదు.. నువ్వు ఫెయిల్ అవుతావు.. వంటి మాటలు చెప్పే వ్యక్తులే మీ కలలకు, ధైర్యానికి అతిపెద్ద శత్రువులు. మీరు ఏదైనా కొత్తగా, సానుకూలంగా చేయాలని అనుకున్నప్పుడల్లా, వాళ్ళు తమ మాటలతో మిమ్మల్ని భయపెట్టి, మీ ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తారు. మిమ్మల్ని మీరు నమ్మండి, వాళ్ళ మాటలను ఒక చెవితో విని, మరో చెవితో వదిలేయాలి. పైన చెప్పుకున్న లక్షణాలు గల వ్యక్తులు ప్రతి ఒక్కరి చుట్టూ ఉంటారు. ఇలాంటి వ్యక్తులకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. అలాగే ఇలాంటి వ్యక్తుల మాటలను ఎంత తక్కువ పరిగణలోకి తీసుకుంటే అంత మంచిది. లేకపోతే సంతోషాన్ని చెదపురుగుల్లా తినేసి,  మనిషిని అశాంతికి గురిచేస్తారు.                                        *రూపశ్రీ.
వేసవి కాలం ప్రారంభమైంది, ఆరోగ్యం పట్ల శ్రద్ధ కూడా పెరుగుతుంది. చాలామంది నీటి శాతం అధికంగా ఉన్న పండ్లు, కూరగాయలు తినడానికి ఇష్టపడతారు. అలాంటి వాటిలో దోసకాయలు కూడా ముఖ్యమైనవి.  దోసకాయను జ్యూస్ గా అయినా తీసుకుంటారు, సలాడ్ లో ఉపయోగిస్తారు,  కొంతమంది నేరుగా దోసకాయలు ముక్కలు చేసుకుని తింటారు.  ఎలా తిన్నా దోసకాయ ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది.  మార్కెట్లలో దోసకాయలకు డిమాండ్  కూడా పెరిగే కాలం ఇది.  అయితే దోసకాయలు కొనుగోలు చేసేటప్పుడు చాలా మంది తెలియకుండానే చేదు దోసకాయలను ఎంపిక చేస్తుంటారు.   చేదు దోసకాయలు  అటు తినలేము, ఇటు డబ్బు కూడా వృధా అవుతుంది.  అలా కాకుండా మార్కెట్లో దోసకాయలు కొనుగోలు చేసేటప్పుడు చేదు దోసకాయలు కాకుండా అన్నీ మంచి దోసకాయలు ఎంచుకోవాలి అంటే కొన్ని టిప్స్ పాటించాలి.  ఆ టిప్స్ ఏంటో తెలుసుకుంటే.. చేదు దోసకాయలు అవాయిడ్ చేసి మంచి దోసకాయలు ఎంచుకునే టిప్స్.. రంగు,  ఆకారం..  దోసకాయల రంగు,  ఆకారం ను  బట్టి చేదు దోసకాయను సులభంగా గుర్తించవచ్చు. దోసకాయ ముదురు ఆకుపచ్చ రంగులో ఉంటే, అది తాజాగా ఉన్నట్లు. అది లేత పసుపు, తెలుపు రంగులో లేదా మచ్చలతో ఉంటే, అది పండిందని అర్థం, అలాగే  లోపల చేదుగా ఉండే అవకాశం ఉంటుంది. నొక్కడం.. దోసకాయ గట్టిగా, దృఢంగా ఉంటే ఫర్వాలేదు, అదే అది మెత్తగా లేదా స్పాంజిలాగా అనిపిస్తే అది చెడిపోయినది,  చేదుగా కూడా ఉండవచ్చు. దోసకాయ నొక్కినప్పుడు అది గట్టిగా ఉండాలి. ఆకారం.. దోసకాయ ఆకారాన్ని చూసి  సులభంగా అది చేదు దోసకాయ లేదా మంచి దోసకాయ అనేది చెప్పవచ్చు. మందంగా లేదా పసుపు రంగులో ఉండే దోసకాయలు చేదుగా ఉండే అవకాశం ఉంది. ముదురు ఆకుపచ్చ రంగులో, గట్టిగా ఉండే దోసకాయలను మంచిగా ఉంటాయి. వాసన.. వాసనను బట్టి సులభంగా దోసకాయ చేదు ఉందా లేదా అనేది కనుక్కోవచ్చు.   దోసకాయ  తాజాగా ఉంటే లోపల కూడా తాజాగా ఉంటుంది.  దాని వాసన వింతగా లేదా ఘాటుగా ఉంటే, అది  లోపల చేదుగా కూడా ఉండే అవకాశం ఉంటుంది. కాండం.. దోసకాయ కొనుగోలు చేసినప్పుడు దోసకాయ కాండం దగ్గర కట్ చేయాలి. ఆ కాండం భాగాన్ని  దోసకాయ మిగిలిన భాగంలో రుద్దితే తెల్లని నరుకు వస్తే దోసకాయ చేదు ఉండే అవకాశం ఉంటుంది.  ఈ నుగురు బాగా బయటకు వెళ్లిపోతే దోసకాయలో చేదు తగ్గిపోతుందని చెబుతారు. అందుకే చాలామంది దోసకాయను కట్ చేసేటప్పుడు మొదట కాండం దగ్గర కట్ చేసి  రుద్దుతారు.  దీని వల్ల దోసకాయలో ఉండే చేదు పోతుందని చెబుతారు.                                 *రూపశ్రీ.
కొందరు చాలా లోతుగా ఆలోచిస్తారు.  ఈ కారణంగా చాలా విషయాలు వారిలో సందేహాలుగానో,  నిర్ణయాలుగానో, అబిప్రాయాలుగానో ఉంటాయి.  వాటిని బయటకు చెప్పాలంటే ఏదో సంకోచం ఉంటుంది.  ఎదుటి వారు ఏమనుకుంటారో అనే సందిగ్ధం కూడా ఉంటుంది.  దీని వల్ల వారు చాలా విషయాలు బయటకు చెప్పలేక నిశ్శబ్దంగా ఉండిపోతుంటారు.  కానీ ఇలా నిశ్శబ్దంగా ఉండటం వల్ల  తరువాత చాలా బాధపడతారు కూడా.  అప్పుడు అలా చెప్పి ఉంటే బాగుండు, అలా చేసి ఉంటే బాగుండు అని అనుకునేవారు చాలా అధికంగా ఉంటారు. కానీ మనసులో మాటను ధైర్యంగా చెప్పడం వల్ల చాలా రకాల లాభాలు ఉన్నాయని అంటున్నారు మనస్తత్వ విశ్లేషకులు. ఇంతకూ మనసులో మాటను ధైర్యంగా బయటకు చెప్పడం వల్ల కలిగే లాభాలు ఏంటి తెలుసుకుంటే.. నమ్మకం, సాన్నిహిత్యం.. ప్రతి బలమైన సంబంధానికి ఓపెన్ కమ్యూనికేషన్ పునాది అవుతుంది. మనం మన భావాలను నిజాయితీగా వ్యక్తపరిచి, ఇతరుల మాటలను విన్నప్పుడు అపార్థాలు తొలగిపోతాయి.  నమ్మకం మరింత పెరుగుతుంది. మనసు విప్పి మాట్లాడగల  వ్యక్తులు పారదర్శకత,  పరస్పర గౌరవం కలిగి ఉంటారు. ఇది బందం దీర్ఘకాలం ఆరోగ్యంగా ఉండటంలో సహాయపడుతుంది. ఆత్మగౌరవం, ఆత్మవిశ్వాసం.. మనసులో ఉన్న ఆలోచనలను భయం లేదా సంకోచం లేకుండా వ్యక్తం చేసినప్పుడు..  చెప్పాలనుకున్న విషయాన్ని చెప్పేశాం అనే ఒక శాటిస్పాక్షన్ ఫీలింగ్ ఏర్పడుతుంది. ఇది  ఆత్మగౌరవాన్ని పెంచుతుంది,  క్రమంగా ఇలాంటి ప్రవర్తన వల్ల ఆత్మవిశ్వాసం కూడా మెరుగవుతుంది. ఎప్పుడైనా, ఎలాంటి సందర్భంలో అయినా తన మనసులో ఉన్నది చెప్పడానికి ఎలాంటి భయం ఉండదు. తేడాలు, పరిష్కారాలు.. జీవితంలో ప్రతి ఒక్కచోట విభేదాలు ఉండనే ఉంటాయి. అవి స్నేహం అయినా, కుటుంబం అయినా,  ప్రేమ అయినా, ఉద్యోగం చేసే చోట అయినా.. ఎక్కడైనా సరే.. విభేదాలు గొడవలుగా మారకుండా పరిష్కరించుకోవడానికి  సహాయపడుతుంది. అభిప్రాయాలను స్పష్టంగా , సంకోచం లేకుండా వ్యక్తపరిచినప్పుడు అవతలి వ్యక్తులు కూడా వినడానికి ఆసక్తి చూపిస్తారు.  ఇలా మాట్లాడటం అనేది సమస్యకు పరిష్కారాన్ని చూపిస్తుంది. ఆత్మవిమర్శ.. ఏదైనా విషయాన్ని స్పష్టంగా చెప్పే అలవాటు ఉండటం వల్ల కేవలం ఇతరులతో ఏదైనా చెప్పడమే కాదు.. తమతో తాము స్పష్టంగా మాట్లాడుకోగలుగుతారు. ఇది వ్యక్తులను కన్ప్యూజన్ లేకుండా చేస్తుంది. బలాలు, బలహీనతలను గుర్తించడంలో సహాయపడుతుంది. ఇది వ్యక్తిగత అభివృద్దికి మొదటి అడుగు అవుతుంది. మానసిక ఒత్తిడి, ఆందోళన.. భావోద్వేగాలను అణిచివేసినప్పుడు అవి లోపల ఒత్తిడి కలిగిస్తాయి. కానీ వాటిని సరైన విధంగా బయటకు వ్యక్తం చేసినప్పుడు ఒత్తిడి తగ్గుతుంది. ఇది మానసిక ఒత్తిడి,  ఆందోళన సమస్యలు పెరగకుండా ఉండటానికి కారణం అవుతుంది. శారీరక ఆరోగ్యం.. స్పష్టంగా ఏదైనా విషయాన్ని బయటకు చెప్పడం వల్ల శారీరక ఆరోగ్యం కూడా బాగుంటుంది. ఒత్తిడి తక్కువగా ఉండటం మంచి నిద్ర, రక్తపోటు సాధారణంగా ఉంటాయి. ఇది గుండెజబ్బు, తలనొప్పి, నిద్రలేమి వంటి సమస్యలు రాకుండా చేస్తుంది. సక్సెస్ కోసం.. స్పష్టంగా, మంచిగా కమ్యూనికేషన్ చేయడంలో వ్యక్తి విజయం ఆధారపడి ఉంటుంది. ఉద్యోగంలో అయినా, రాజకీయంలో అయినా,  కుటుంబంలో అయినా,  బంధంలో అయినా స్పష్టంగా మాట్లాడటం వల్ల అవతలి వ్యక్తులు అర్థం చేసుకునే అవకాశాలు ఎక్కువ ఉంటాయి.  ఇది అన్ని చోట్ల విజయాన్ని,  గౌరవాన్ని తెచ్చిపెడుతుంది. స్పష్టంగా మాట్లాడటం అంటే ఇతరుల పైన ఆధిపత్యం చెలాయించడం కాదు. భావాలను గౌరవంగా, పద్దతిలో వ్యక్తపరచడం. ఇతరులు ఏమనుకుంటారో అనుకోకుండా మనసులో ఉన్నది  చెప్పడం, మనసులో ఉన్నది తొక్కి పెట్టి మౌనంగా ఉండకుండా బయటకు వ్యక్తం చేయడం వల్ల మానసికంగా బలంగా ఉండటమే కాకుండా ఇతరుల ముందు సరైన విధంగా మాట్లాడటం ఎలాగో కూడా అర్థం  అవుతుంది.  కాబట్టి ఇతరుల గురించి ఆలోచించి మనసులో ఉన్నది దాచిపెట్టాల్సిన అవసరం లేదు.                          *రూపశ్రీ.
నేటికాలంలో చాలామంది ఆరోగ్య స్పృహతో ఉంటున్నారు.  ఎంత బిజీగా ఉన్నా సరే.. తీసుకునే పండ్ల విషయంలో ఎంతో జాగ్రత్తగా ఉంటున్నారు.  చాలామంది రోడ్ సైడ్ లేదా మాల్స్,  ఆఫీసుల దగ్గర దుకాణాలలో పిచ్చి  ఆహారాలకు బదులు ఫ్రూట్ చాట్ తినడం మంచిదని అనుకుంటారు. దుకాణాలలో కూడా వివిధ రకాల పండ్లను కలిపి ప్రూట్ చాట్ గా తయారు చేసి అమ్ముతుంటారు.  ఫ్రూట్స్ ఆరోగ్యానికి మంచిది కాబట్టి ఫ్రూట్ చాట్ కూడా ఆరోగ్యానికి చాలా మంచివని అనుకుంటారు.  కానీ ఫ్రూట్ చాచ్ గురించి వైద్యులు,  ఆహార నిపుణులు దిమ్మతిరిగే నిజాలు చెబుతున్నారు.  ముఖ్యంగా వేసవిలో అందరూ ఫ్రూట్ చాట్ ఎక్కువగా తినాలని అనుకుంటారు కాబట్టి ఫ్రూట్ చాట్ అంటే ఇష్టపడే ప్రతి ఒక్కరూ వైద్యులు ఏం చెప్పారో తెలుసుకోవాలి.. తొక్క వల్ల కలిగే నష్టం.. చాలా వరకు ఫ్రూట్ చాట్ లో పండ్ల మీద తొక్కను తొలగించి పండ్లను ముందుగానే ముక్కలు చేసి సిద్దంగా పెట్టి ఉంటారు. కస్టమర్లు రాగానే వాటిని అందిస్తుంటారు.  పండ్ల పై తొక్క పండ్లను చెక్కు చెదరకుండా రక్షిస్తాయి.  కానీ పండ్లను తొక్క తొలగించి  కోసిన తర్వాత ఈ రక్షణ పొర తొలగిపోతుంది. పండు లోపలి భాగం నేరుగా గాలి, దుమ్ము, కాలుష్యం,  మురికి మొదలైనవాటికి గురవుతుంది. ఈ పండ్లను ఎక్కువ కాలం పాటు, ముఖ్యంగా వేడి వాతావరణంలో  వదిలేస్తే, బ్యాక్టీరియా,  ఫంగస్ వేగంగా వృద్ధి చెందుతాయి. పరిశుభ్రత లోపించడం వల్ల రోడ్డు పక్కన పండ్లు అమ్మే చోట ఇన్ఫెక్షన్ వచ్చే ప్రమాదం గణనీయంగా ఎక్కువగా ఉంటుంది. నిల్వ.. కోసిన పండ్లను సరైన ఉష్ణోగ్రతలో నిల్వ చేయకపోతే, అవి  తీవ్రమైన అనారోగ్యానికి గురిచేస్తాయి. ఈ కలుషితమైన పండ్లను తినడం వల్ల అనేక సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది. ఫుడ్ పాయిజన్,  కడుపునొప్పి,  వాంతులు విరేచనాలు, జ్వరం వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది.  ఇంట్లో  చిన్నపిల్లలు, వృద్ధులు, అనారోగ్యంతో ఉన్నవారు వంటి  బలహీనమైన రోగనిరోధక వ్యవస్థ ఉన్నవారికి ఇలాంటి ఫ్రూట్ చాట్ లేదా ముందే ముక్కలుగా కోసిన పండ్లు ఆరోగ్యానికి మరింత హాని చేసే అవకాశం ఎక్కువ. పోషణ ఉండవు..  శరీరానికి తగినంత పోషణ అందించడానికి  పండ్లు తింటాము, కానీ పండ్లను కోసి ఎక్కువ సేపు నిల్వ ఉంచడం వల్ల వాటిలోని ముఖ్యమైన పోషకాలు నశించిపోతాయని నిపుణులు చెబుతున్నారు. గాలికి నేరుగా గురికావడం వల్ల విటమిన్ సి వంటి సున్నితమైన, ప్రయోజనకరమైన పోషకాలు క్రమంగా నశించిపోతాయి. ముందుగా కోసిన పండ్లను తినడం వల్ల  అనారోగ్యానికి గురయ్యే ప్రమాదం ఉండటమే కాకుండా,  శరీరానికి అవసరమైన పోషకాలు కూడా అందవు. ప్యాక్ చేసిన కటింగ్ ఫ్రూట్స్.. సూపర్‌మార్కెట్లలో లభించే డబ్బాలలో ప్యాక్ చేసిన కోసిన పండ్లు, విడిగా అమ్మే పండ్ల కంటే కొంచెం సురక్షితమైనవిగా పరిగణించబడవచ్చు. అయినప్పటికీ, వాటిని కొనుగోలు చేసేటప్పుడు  జాగ్రత్తగా ఉండాలి. వాటి గడువు తేదీని,  వాటిని నిల్వ ఉంచిన ఉష్ణోగ్రతను  తనిఖీ చేయాలి. ఆరోగ్యంగా ఉండాలంటే.. మార్కెట్ నుండి  తాజాగా, కోయని పండ్లనే ఇంటికి తెచ్చుకోవాలి. పండ్లను శుభ్రమైన నీటితో బాగా కడిగి, ఆ తరువాతే కోయాలి. పండ్లను కోసిన తర్వాత వాటిని ఎక్కువ సేపు ఆరుబయట ఉంచకూడదు. కోసిన పండ్లు ఏవైనా మిగిలి ఉంటే, వాటిని గాలి చొరబడని డబ్బాలో పెట్టి ఫ్రిజ్‌లో ఉంచాలి. రోడ్డు పక్కన ఎలాంటి శుభ్రత లేని చోట,  ముందుగానే పండ్లను కోసి నిల్వ చేసి అమ్మే చోట పండ్ల ముక్కలు కొనుగోలు చేసి తినడం మంచిది కాదు.                                    *రూపశ్రీ.
వేసవి కాలం రాగానే చాలామంది లైఫ్ స్టైల్ మారుతుంది. ముఖ్యంగా ఆహారం విషయంలో, పానీయాల విషయంలో చాలా మార్పులు వచ్చేస్తాయి. బీహార్, ఉత్తర ప్రదేశ్ రాష్ట్రాల పేమస్ పానీయం ఇది. అయితే దీని ప్రయోజనాల దృష్ట్యా దేశ వ్యాప్తంగా ఇష్టంగా ఉపయోగిస్తారు.  వేసవి వచ్చిందంటే సత్తు పానీయం చాలా ఎక్కువగా తీసుకుంటారు.  ఇది శరీరాన్ని కూల్ గా ఉంచడమే కాకుండా శరీరానికి కావలసిన పోషకాలను పుష్కలంగా అందిస్తుంది.  కాల్చిన శనగలతో తయారు చేసే సత్తు పౌడర్ ను సత్తు పానీయం కోసం ఉపయోగిస్తారు. అయితే.. సత్తు పొడితో కేవలం సత్తు పానీయమే కాకుండా.. చాలా రకాల పదార్థాలు తయారు చేసుకుంటారు.  వేసవిలో అటు శరీరాన్ని కూల్ గా ఉంచుతూ, ఇటు శరీరానికి బోలెడు పోషకాలు అందించే సత్తు పొడితో ఏమేం వంటకాలు బాగుంటాయో తెలుసుకుంటే.. సత్తు పేడ.. వేసవిలో  నీరసంగా అనిపిస్తే సత్తు పేడను తయారు చేసుకుని తినవచ్చు.. ఇది  ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. దీనిని తిన్న తర్వాత  శరీరం పూర్తి చురుకుగా ఉంటుంది. సత్తు పిండిని నెయ్యి వేసి బాగా వేయించి అందులో పంచదార పొడి వేసి సన్న మంట మీద గోల్డ్ కలర్ వచ్చే వరకు వేయిస్తే సత్తు పేడ రెఢీ.. ఇది చాలా రుచిగా ఉంటుంది. సత్తు మజ్జిగ.. వేసవి కాలంలో సత్తుతో మజ్జిగ తయారు చేసుకుని తాగవచ్చు. ఇది  శరీరాన్ని తేమగా ఉంచుతుంది.  పిల్లల నుండి పెద్దల వరకు అందరూ దీనిని ఇష్టపడతారు. దీనిని ప్రతిరోజూ తాగడం వల్ల తక్షణ శక్తి లభిస్తుంది. సత్తు లడ్డు.. సత్తు లడ్డూలను సత్తు పొడితో ఇంట్లోనే సులభంగా తయారు చేసుకోవచ్చు. సత్తు లడ్డులు తినడం వల్ల  శరీరం బలపడుతుంది. సత్తు లడ్డులో డ్రై ప్రూట్స్, నట్స్, నెయ్యి వేసి తయారు చేసుకుని తినవచ్చు. చాలా రుచిగా ఉంటాయి. సత్తు షార్డ్ బ్రెడ్.. వేసవిలో కూడా కారంగా తినాలని అనుకునే వారు చాలామంది ఉంటారు.  అలాంటి వారికి సత్తు షార్ట్ బ్రెడ్ చాలా మంచి ఫుడ్. సత్తు పిండిని వేయించి అందులో బంగాళదుంప,  బఠాణీ వంటి కూరగాయలు వేసి ముద్దగా చేసుకుని దీన్ని తడి చేసిన బ్రెడ్ మధ్యలో ఉంచి బ్రెడ్ ను బోండా లాగా రౌండ్ చేసి నూనెలో డీప్ ప్రై చేయాలి.  చాలా రుచిగా ఉంటాయి. సత్తు లిట్టి చోఖా.. లిట్టి చోఖా అనేది బీహార్, ఉత్తర ప్రదేశ్, జార్ఖండ్ రాష్ట్రాలలో చాలా ఫేమస్ ఫుడ్.  వేయించిన శనగపిండిని గోధుమ పిండిలో స్టఫ్ చేసి వాటిని కాలుస్తారు.  వీటిని లిట్టి అంటారు.  వీటిని నెయ్యితోనూ,  వంకాయ, టమాటా,  బంగాళాదుంపతో చేసిన చోఖా అనే వంటకంతో కలిపి వడ్డిస్తారు. ఈ పూర్తీ కాంబోను లిట్టీ చోఖా అంటారు.  ఇది చాలా రుచిగా ఉంటుంది.  చోఖా లేకపోయినా లిట్టిని వివిధ రకాల చట్నీలతో కూడా తింటారు.                                       *రూపశ్రీ.
ఆరోగ్యమే మహాభాగ్యం. కానీ నేటి కాలంలో మారిన జీవనశైలి కారణంగా చిన్న పిల్లల నుండి పెద్దల వరకు ఏదో ఒక దీర్ఘకాలిక (Chronic) ఆరోగ్య సమస్యతో బాధపడుతున్నారు. ఎన్ని మందులు వాడినా సమస్య తాత్కాలికంగా తగ్గుతుందే తప్ప, పూర్తిగా నయం కావడం లేదని చాలా మంది ఆవేదన చెందుతుంటారు. అలాంటి వారికి హోమియోపతీ ఒక గొప్ప వరప్రసాదం. కేవలం లక్షణాలను అణచివేయడం కాకుండా, వ్యాధిని మూలాల నుండి తొలగించే అద్భుత శక్తి హోమియోపతీకి ఉంది.  Renowned Homeopathy expert Dr Praveen Kumar చెప్పిన మరిన్ని విషయాలు ఈ  TeluguOne Health Video Link క్లిక్ చేసి తెలుసుకుందాం. మనం హోమియోపతీని ఎందుకు ఎంచుకోవాలి? (Why Homeopathy?) దీర్ఘకాలిక వ్యాధులలో తిరుగులేని చికిత్స: హోమియోపతీ యొక్క అసలు బలమే దీర్ఘకాలిక వ్యాధులను నయం చేయడం. బ్రాంకియల్ ఆస్తమా వంటి జెనెటిక్ డిజార్డర్లను కూడా సమూలంగా తొలగించడానికి హోమియోపతీలో మార్గం ఉంది. సంపూర్ణ ఆరోగ్య దృక్పథం (Holistic Approach): ఇతర వైద్య విధానాలు కేవలం వ్యాధి మీద దృష్టి పెడితే, హోమియోపతీ 'రోగి' (Patient) మీద దృష్టి పెడుతుంది. అంటే మీ వేలికి నొప్పి ఉంటే కేవలం వేలిని మాత్రమే కాకుండా, మీ శరీరాన్ని ఒక యూనిట్‌గా పరిగణించి చికిత్స అందిస్తుంది. శాస్త్రీయమైనది: ఒకప్పుడు హోమియోపతీ కేవలం ప్లాసిబో (Placebo) అని విమర్శలు ఉండేవి. కానీ నేడు IIT ముంబై మరియు IISc బెంగళూరు వంటి సంస్థలు చేసిన పరిశోధనల్లో హోమియోపతీ మందులలో 'నానో పార్టికల్స్' (Nano Particles) ఉంటాయని నిరూపితమైంది. దుష్ప్రభావాలు లేని వైద్యం: ఇది సహజ సిద్ధమైన పద్ధతిలో పనిచేస్తుంది కాబట్టి సైడ్ ఎఫెక్ట్స్ భయం ఉండదు. చికిత్స ప్రక్రియ ఎలా ఉంటుంది? (How it works?) హోమియోపతీలో చికిత్స అనేది చాలా లోతుగా సాగుతుంది. దీనిని 'కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్' అంటారు. కేస్ టేకింగ్: డాక్టర్ మీతో దాదాపు గంట సేపు మాట్లాడుతారు. మీ అలవాట్లు, మీ ఇష్టాయిష్టాలు, మీకు ఎప్పుడు కోపం వస్తుంది, మీ గత చరిత్ర (Past history) వంటి అంశాలన్నింటినీ అడిగి తెలుసుకుంటారు. ఇది మీ 'జర్నీ ఆఫ్ లైఫ్'ను అర్థం చేసుకునే ప్రక్రియ. మయాజమ్స్ (Miasms): ఆయుర్వేదంలో వాత, పిత్త, కఫ దోషాలు ఉన్నట్లే, హోమియోపతీలో సోరా, సిఫిలిస్, సైకోసిస్ అనే మూడు మయాజమ్స్ ఉంటాయి. వీటి ఆధారంగానే మీ వ్యాధి తీవ్రతను అంచనా వేస్తారు. పొటెంటైజేషన్: మందులను డైల్యూట్ చేసే ప్రక్రియను 'డైనమైజేషన్' అంటారు. ఇందులో మందు పరిమాణం తక్కువగా ఉన్నప్పటికీ, దాని శక్తి (Power) చాలా ఎక్కువగా ఉంటుంది. ఏం చేయకూడదు? (What Not to Do?) సమాచారాన్ని దాచకండి: డాక్టరుకు మీ శారీరక, మానసిక లక్షణాలను స్పష్టంగా చెప్పాలి. ఏదైనా విషయాన్ని దాచడం వల్ల సరైన మందును ఎంపిక చేయడం కష్టమవుతుంది. స్వయం వైద్యం వద్దు: హోమియోపతీ మందులు తీపి మాత్రల్లా కనిపిస్తాయి కదా అని సొంతంగా వాడకూడదు. వ్యాధి తీవ్రతను బట్టి డాక్టర్ ఇచ్చే పొటెన్సీ (30CH, 200CH లేదా 1M) మారుతూ ఉంటుంది. అపోహలు నమ్మకండి: హోమియోపతీ ఆలస్యంగా పనిచేస్తుందనేది ఒక అపోహ మాత్రమే. సరైన మందు పడితే అక్యూట్ కండిషన్స్ (జ్వరం, జలుబు) కూడా చాలా వేగంగా తగ్గుతాయి. తరచుగా అడిగే ప్రశ్నలు (Q&A) ప్ర: 30CH అంటే ఏమిటి? జ: ఇది హోమియోపతీలో ఒక రకమైన పొటెన్సీ (శక్తి). ఒక భాగం మందును 99 భాగాల వెహికల్ (ఆల్కహాల్ లేదా షుగర్ ఆఫ్ మిల్క్)తో కలిపి చేసే ప్రక్రియ ద్వారా 30CH తయారవుతుంది. ఇది అద్భుతమైన శక్తిని కలిగి ఉంటుంది. ప్ర: హోమియోపతీ మందులు ఘాటుగా ఎందుకు ఉంటాయి?  జ: మందులను పిల్స్ (మాత్రలు) మీద వేయడానికి ఆల్కహాల్‌ను వెహికల్‌గా ఉపయోగిస్తారు. ఆ ఆల్కహాల్ వల్ల ప్రారంభంలో కొంచెం ఘాటుగా అనిపించవచ్చు, కానీ ఆ మాత్రలు తియ్యగానే ఉంటాయి. ప్ర: మానసిక సమస్యలకు హోమియోపతీ పనిచేస్తుందా?  జ: అవును. హోమియోపతీలో మనిషి యొక్క సైకీ (Psyche) లేదా మానసిక స్థితిని బట్టి హైయర్ పొటెన్సీ మందులు ఇవ్వడం జరుగుతుంది, ఇవి మానసిక ఆరోగ్యంపై అద్భుతంగా పనిచేస్తాయి. దీర్ఘకాలిక వ్యాధులతో పోరాడుతున్న వారికి హోమియోపతీ ఒక ఆశాకిరణం. ఇది కేవలం వ్యాధిని తగ్గించడమే కాకుండా, మీ రోగనిరోధక శక్తిని పెంచి మిమ్మల్ని సంపూర్ణ ఆరోగ్యవంతులుగా తీర్చిదిద్దుతుంది. మరిన్ని ఆసక్తికరమైన ఆరోగ్య విషయాలు మరియు నిపుణుల సలహాల కోసం ఇప్పుడే మా TeluguOne Health యూట్యూబ్ ఛానెల్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి