LATEST NEWS
బీఆర్ఎస్ నుంచి కవిత నిష్క్రమించడంతో, కేటీఆర్, కవితల మధ్య మాటల యుద్ధం    అధికారికంగా మొదలైంది. తెలంగాణలో ఎన్నో రాజకీయ పార్టీలు వస్తూ పోతూ ఉంటాయని, వాటి గురించి మాట్లాడటంలో గానీ, వాటిపై మానసిక వనరులను వృధా చేయడంలో గానీ అర్థం లేదని తన సోదరి కల్వకుంట్ల కవిత కొత్తగా ఏర్పాటుచేసిన టీఆర్ఎస్ పార్టీని ఉద్దేశించి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు అన్నా చెళ్లెళ్ల మధ్య మాటల యుద్ధానికి కారణమయ్యాయి.   కేటీఆర్ వ్యాఖ్యలపై కవిత చాలా ఘాటుగా స్పందించారు.  బీఆర్ఎస్, తనను, తన రాజకీయ పార్టీనీ చాలా తేలికగాతీసుకుంటోందన్న కవిత..  ప్రాథమిక స్థాయిలో తన పార్టీని చాలా తేలికగా తీసుకుం టున్నందుకు ఆమె కేటీఆర్‌పై ఎదురుదాడి చేశారు. ఇటీవలే కేటీఆర్ బీఆర్ఎస్‌ను తిరిగి టీఆర్ఎస్‌గా మార్చడం గురించి మాట్లాడారనీ.. కానీ ఇప్పుడు ఈసీ తమ పార్టీకి ట్రేడ్‌మార్క్ టీఆర్ఎస్ పేరు ఇవ్వడాన్ని జీర్ణించుకోలేకే..  బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ దానిని తేలికగా తీసుకుంటున్నట్లు మాట్లాడుతున్నారన్నారు.  మమ్మల్ని సీరియస్‌గా తీసుకోకూడదని  అంటున్నారు. కానీ ఏ రాజకీయ పార్టీ అయినా తొలుత చిన్నగానే మొదలవుతుంది,  పాత టీఆర్ఎస్ కూడా చాలా నెమ్మదిగానే ప్రారంభమైందని కవిత గుర్తు చేశారు. నా పార్టీ కూడా అలాంటి ధోరణినే చూడబోతోందన్నారు. తనపై కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను ఇసుమంతైనా పట్టిచుకోనన్న కవిత..  తెలంగాణ రాజకీయాల్లో నిలదొక్కుకోవడానికి కష్టపడి పనిచేస్తానన్నారు. కవిత బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చిన తరువాత, ఆమె సొంత పార్టీ ప్రకటించిన తరువాత ఆమెపై పరోక్షంగానే అయినా తొలిసారి కేటీఆర్ విమర్శించారు. అంటే అన్నాచెళ్లెళ్ల మధ్య మాటల యుద్ధం దిశగా తొలి అడుగు పడిందన్నమాటేనని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  ముందు ముందు ఈ మాటల యుద్ధం మరింత   ముదురుతుందని అంచనా వేస్తున్నారు.   ఒకప్పుడు ఐక్యంగా ఉండి ప్రత్యర్థులను ఎదుర్కొన్న కల్వకుంట్ల కుటుంబంలో ఇప్పుడు చీలిపోయింది.  బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు కుమార్తె పార్టీతో విభేదించి బయటకు వచ్చేశారు. ఆ సందర్భంగా కేటీఆర్.. యధాలాపంగానే అయినా  గత ఎన్నికలలో బీఆర్ఎస్ ఓటమికి   ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఒక ప్రధాన కారణమని అన్నారు. అయితే దానికి కవిత అప్పట్లో తీవ్రంగా ఖండించారు.  దాంతో అప్పటి నుంచీ కవిత విషయంలో కేటీఆర్ మౌనం వహిస్తూ వచ్చారు. అయితే తాజాగా కవిత టీఆర్ఎస్ పార్టీ పెట్టిన తరువాత..  రాజకీయాల్లో ఎన్నో పార్టీలు పుడుతుంటాయి, పోతుంటాయి.. వాటి గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదంటూ కవిత పార్టీని తక్కువ చేసే విధంగా మాట్లాడారు.  పార్టీ   ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తెలంగాణ భవన్‌లో జరిగిన కార్యవర్గ సమావేశంలో ఆయనీ వ్యాఖ్యలు చేశారు.  కవిత పార్టీ లాంటి  చిన్న చిన్న విషయాలకు ప్రాధాన్యత ఇవ్వొద్దని కార్యకర్తలకు సూచించారు. కేటీఆర్ వ్యాఖ్యలపై కవిత కూడా ఘాటుగా స్పందించారు.  
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం నారా లోకేష్ హవా నడుస్తోంది. గతంలో ఆయనను లక్ష్యంగా చేసుకుని వైసీపీ సోషల్ మీడియా విభాగం చేసిన ప్రచారాలు ఇప్పుడు ఏమాత్రం ప్రభావం చూపలేకపోతున్నాయి. ముఖ్యంగా జూనియర్ ఎన్టీఆర్ పేరును తెరపైకి తెచ్చి, టీడీపీలో వారసత్వ చిచ్చు పెట్టాలనే  వైసీపీ ఎత్తుగడలు ఇప్పుడు నవ్వులపాలౌతున్నాయి.   2024 ఎన్నికల్లో కూటమి చారిత్రాత్మక విజయం సాధించడం..  అందులోనూ లోకేష్ మంగళగిరిలో రికార్డు మెజారిటీతో గెలవడం.. అంతకు ముందు తన యువగళం పాదయాత్ర ద్వారా లోకేష్ ప్రజా నాయకుడిగా ఎదగడంతో ఇప్పుడు వైసీపీ ఆయనపై ఎక్కుపెడుతున్న పాత విమర్శలు, వ్యాఖ్యలు ఇసుమంతైనా ప్రభావం చూపడం లేదు.   ఒకప్పుడు సోషల్ మీడియాలో లోకేష్‌ను ట్రోల్ చేయడమే పనిగా పెట్టుకున్న వైసీపీకి ఆయన తన పనితీరుతోనే సమాధానం చెప్పారు. 400 రోజులకు పైగా సాగిన  యువగళం పాదయాత్ర లోకేష్‌ను   ప్రజలకు చేరువ చేయడమే కాకుండా..  ఆయనలోని నాయకత్వ పటిమను బయటపెట్టింది. ఆ యాత్రలో ఆయన సేకరించిన ప్రజా సమస్యలే ఇప్పుడు కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న  సూపర్ సిక్స్ పథకాలకు పునాదిగా మారాయి. పాత ఇమేజ్‌ను పూర్తిగా చెరిపివేసి, ఒక మాస్ లీడర్‌గా ఆయన ఎదిగిన తీరు వైసీపీ వ్యూహకర్తలకు మింగుడుపడటం లేదు. ప్రస్తుత కూటమి ప్రభుత్వంలో ఐటీ, ఎలక్ట్రానిక్స్, మానవ వనరుల అభివృద్ధి వంటి కీలక శాఖల మంత్రిగా లోకేష్ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. గతంలో వైసీపీ ప్రచారాల్లో వినిపించిన  పప్పు  అనే ముద్రను ఆయన తన తీరుతో  తుడిచిపెట్టేశారు. గూగుల్, మైక్రోసాఫ్ట్ వంటి దిగ్గజ కంపెనీల ప్రతినిధులతో చర్చలు జరుపుతూ..  రాష్ట్రానికి పెట్టుబడులు తేవడమే లక్ష్యంగా ఆయన ముందుకు సాగుతున్నారు. మరోవైపు వైసీపీ అనుకూల సోషల్ మీడియా హ్యాండిల్స్ మాత్రం ఇంకా పాత వ్యూహాలతోనే లోకేష్ పై దాడి చేస్తున్నది. జూనియర్ ఎన్టీఆర్ అంశాన్ని వాడుకుంటూ లోకేష్‌ను తక్కువ చేసే ప్రయత్నం చేస్తున్నాయి. అయితే వాటిని జనాలు ఇసుమంతైనా పట్టించుకోవడం లేదు.   సినిమా రంగంలో ఎన్టీఆర్ ప్రస్థానం వేరు, రాజకీయాల్లో లోకేష్ ప్రయాణం వేరు. ఒకరితో ఒకరిని పోల్చి విద్వేషాలు సృష్టించాలని వైసీపీ చేస్తున్న ప్రయత్నం వల్ల ఇసుమంతైనా ప్రయోజనం ఉండదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  లోకేష్ పై వైసీపీయులు సోషల్ మీడియా వేదికగా చేస్తున్న విమర్శలు, ట్రోలింగ్స్ నవ్వుల పాలౌతున్నాయి. ఇటువటి చౌకబారు ప్రయత్నాలు వైసీపీ ప్రతిష్టను మరింత మసకబారుస్తున్నాయంటున్నారు.  నారా లోకేష్ ప్రస్తుతం కేవలం ఒక వారసుడిగా మాత్రమే కాకుండా, టీడీపీ జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేస్తున్నారు. కూటమి ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరిస్తున్నారు.  యువతకు ఉపాధి కల్పనపై ప్రత్యేక దృష్టి సారించారు. ఈ పరిస్థితుల్లో 2019 నాటి పాత స్క్రిప్టులతో లోకేష్‌ను దెబ్బతీయాలనుకోవడం వైసీపీకి రాజకీయంగా ఆత్మహత్యాసదృశ్యమేనని పరిశీలకులు అంటున్నారు. సోషల్ మీడియాలో కృత్రిమంగా సృష్టించే వివాదాల కంటే క్షేత్రస్థాయిలో లోకేష్ సంపాదించుకున్న ప్రజాభిమానం ఎంతో బలంగా ఉందని చెబుతున్నారు.  వైసీపీ ఇంకా పాతకుట్రలు, వ్యూహాలతో చేస్తున్న ప్రయత్నాలు.. ఆ పార్టీ 2014 ఘోర పరాజయం నుంచి పాఠాలు, గుణపాఠాలూ నేర్చుకోలేదనడానికి నిదర్శనమని అంటున్నారు.   
తెలంగాణ రాజకీయ యవనికపై మరో కీలక అంకం మొదలైంది. భారత్ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్ ) నుంచి బయటకు వచ్చి సొంత రాజకీయ వేదికను టీఆర్ఎస్ ను ఏర్పాటు చేసుకున్న   కల్వకుంట్ల కవిత..  ఇప్పుడు తన తదుపరి లక్ష్యాన్నిప్రకటించారు. హైదరాబాద్ ప్రెస్ క్లబ్ లో మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో మాట్లాడిన ఆమె..  రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీని గద్దె దించడమే   ప్రధాన ధ్యేయమన్నారు.  ఈ పోరాటంలో జెన్-జీగా పిలువబడే నేటి యువతను భాగస్వామ్యం చేస్తామన్నారు. యువత  ఆకాంక్షలకు అనుగుణంగా తన రాజకీయ పంథాను మార్చుకోబోతున్నట్లు వెల్లడించారు. కవిత తన కొత్త రాజకీయ ప్రస్థానంలో భాగంగా యువతతో విస్తృతంగా మమేకమవ్వాలని నిర్ణయించుకున్నారు. ప్రస్తుత డిజిటల్ యుగంలో యువతరం ఆలోచనలు, వారి అవసరాలు గతానికి భిన్నంగా ఉన్నాయని, వాటిని అందిపుచ్చుకోవడంలో ప్రస్తుత ప్రభుత్వం విఫలమైందని  విమర్శించారు. స్క్రీన్లపై సమయం గడుపుతున్నారని యువతను విమర్శించే బదులు.. అదే డిజిటల్ వేదికలను వారి గొంతుకగా మార్చుతామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను తుంగలో తొక్కిందని..  అందుకే ఆ పార్టీని ఓడించేందుకు యువశక్తిని ఏకం చేయాల్సిన అవసరం ఉందని ఆమె పిలుపునిచ్చారు. రాజకీయాల్లో యువత  కేవలం ఓటర్లుగానే కాకుండా, నాయకులుగా కూడా ఎదగాలని ఆకాంక్షిస్తున్నట్లు కవిత చెప్పారు. తన పార్టీలో జెన్-జీ ప్రతినిధులకు పెద్దపీట వేస్తానని..  సమాజంలో వెనుకబడిన వర్గాలకు, అట్టడుగున ఉన్న వారికి ప్రాధాన్యత కల్పిస్తామన్నారు. కేవలం రాజకీయ ప్రసంగాలకు పరిమితం కాకుండా.. క్షేత్రస్థాయిలో యువత ఎదుర్కొంటున్న నిరుద్యోగిత, విద్యా సంబంధిత సమస్యలపై పోరాటమే తన అజెండా  అన్న కవిత.. రాష్ట్రంలో  రేవంత్ సర్కార్   వైఫల్యాలను ఎండగట్టడంలో యువతే ముందువరుసలో ఉంటారని  విశ్వాసం వ్యక్తం చేశారు.  ఇటీవల తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్  జారీ చేసిన నోటిఫికేషన్లలో వయోపరిమితి సడలింపు విషయంలో ప్రభుత్వం అనుసరిస్తున్న తీరును కవిత తీవ్రంగా తప్పుబట్టారు. గత ప్రభుత్వం ఇచ్చిన 10 ఏళ్ల వయోపరిమితి సడలింపును అమలు చేయకుండా నిరుద్యోగుల జీవితాలతో ఆడుకుంటున్నారని ఆమె ఆరోపించారు. జీవో 30ని యథాతథంగా అమలు చేయాలని, లేనిపక్షంలో నిరుద్యోగుల పక్షాన భారీ ఉద్యమానికి సిద్ధమవుతామని హెచ్చరించారు.  రాబోయే రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా పర్యటించి యువతతో ముఖాముఖి కార్యక్రమాలు నిర్వహించాలని కవిత ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు. ముఖ్యంగా 2029 ఎన్నికలే లక్ష్యంగా ఇప్పటి నుంచే పునాదులు వేయాలని ఆమె భావిస్తున్నారు. తన తండ్రి కేసీఆర్ స్థాపించిన పార్టీ నుంచి బయటకు వచ్చినప్పటికీ, తెలంగాణ సెంటిమెంట్‌ను, యువత ఆకాంక్షలను కలగలిపి కొత్త రాజకీయ ప్రత్యామ్నాయాన్ని చూపిస్తానని ఆమె ధీమా వ్యక్తం చేస్తున్నారు. 
తెలంగాణ రాజకీయాల్లో   భారత రాష్ట్ర సమితి  అధినేత కేసీఆర్ కుమార్తె, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఏప్రిల్ గత నెల 25న టీఆర్ఎస్ పేరుతో కొత్త రాజకీయ పార్టీని ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఆమె తన కొత్త పార్టీ ద్వారా తెలంగాణ రాజకీయాలలోనే కాదు, ఏపీ రాజకీయాలలో కూడా పెను సంచలనం సృష్టించారు. కొత్త పార్టీ ప్రకటన సందర్భంగా కల్వకుంట్ల కవిత.. తన తండ్రి, బీఆర్ఎస్ అధినేతపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. తన తండ్రిని మరమనిషి అన్నారు, గుంటనక్కల చేతిలో బందీ అని విమర్శించారు. ఈ పరిణామం సహజంగానే తెలంగాణ రాజకీయాలలో సంచలనం సృష్టించింది. బీఆర్ఎస్ లో పెను ప్రకంపనలకు కారణమైంది.  అయితే ఆమె కొత్త రాజకీయ పార్టీ ప్రకటన.. ఏపీ రాజకీయాలలో కూడా సంచలనం సృష్టించింది. ఆమె పార్టీ ప్రకటన వైసీపీకి ఒకింత ఇబ్బందికరంగా మారగా, తెలుగుదేశం, జనసేన పార్టీల్లో జోష్ ను నింపింది.   టీడీపీ-జనసేన కూటమికి కవిత కొత్త పార్టీ   ఒక గొప్ప వ్యూహాత్మక అవకాశాన్ని అందించినట్లయిందని విశ్లేషకులు భావిస్తున్నారు. గత కొన్నేళ్లుగా కేసీఆర్ నాయకత్వంలోని బీఆర్ఎస్, ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలోని వైసీపీ మధ్య ఒక అవగాహన ఉందని రాజకీయ వర్గాల్లో ప్రచారం ఉన్న సంగతి తెలిసిందే. గత ఎన్నికల సమయంలో వారిరువురూ ఒకరికొకరు అందించుకున్న సహకారం సంగతి తెలిసిందే.  ఆ సహకారం, స్నేహం ఇప్పుడు.. అంటే రెండు పార్టీలూ కూడా వాటి వాటి రాష్ట్రాలలో అధికారం కోల్పోయిన తరువాత కూడా కొనసాగుతోందని పరిశీలకులు సోదాహరణంగా ఉదహరి స్తున్నారు. అటువంటిది.. ఇప్పుడు కవిత సొంతంగా టీఆర్ఎస్ పార్టీని స్థాపించడమే కాకుండా... ఆ సందర్భంగా తన తండ్రి కేసీఆర్, సోదరుడు కేటీఆర్ లపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. అక్కడితో ఊరుకోకుండా.. బీఆర్ఎస్ ను ఆత్మ లేని పార్టీగా అభివర్ణించారు.  ఈ పరిణామాలు బీఆర్ఎస్ ను డిఫెన్స్ లో పడేశాయి. కవితను విమర్శించ లేక, ఆమె విమర్శలను తిప్పి కొట్టలేక నాయకత్వం మౌనాన్ని ఆశ్రయిస్తే.. బీఆర్ఎస్ క్యాడర్ అయోమయంలో పడింది. ఈ పరిస్థితి వైసీపీ అధినేత జగన్ కు ఒక బలమైన మిత్రుడి అండ లేకుండా చేసిందంటున్నారు పరిశీలకులు.   అదే సమయంలో..   టీడీపీ, జనసేన పార్టీలు.. కల్వకుంట్ల కుటుంబంలో తలెత్తిన విభేదాలను ఉదహరిస్తూ..  కుటుంబ రాజకీయాల వల్ల పార్టీలు ఎలా దెబ్బతింటాయో చెప్పడానికి కవిత ఉదంతాన్ని టీడీపీ-జనసేన శ్రేణులు ఉదహరిస్తున్నాయి. అదే తెలంగాణలో కవిత తిరుగుబాటును చూపిస్తూ, ఏపీలో కూడా వైసీపీ నాయకత్వం పట్ల అసంతృప్తిగా ఉన్న నేతలకు ఇదొక సంకేతమని   ప్రచారం చేస్తున్నారు. రాజకీయ అధికారం ఒకే కుటుంబం చుట్టూ తిరిగితే జరిగే నష్టాన్ని ప్రజలకు వివరించడానికి చంద్రబాబు మరియు పవన్ కళ్యాణ్ ఈ పరిణామాలను తమ ప్రసంగాల్లో వాడుకుంటున్నారు. జగన్ కూడాతన సొంత తల్లి, చెల్లిని దూరం పెట్టి అధికారం కోసం పాకులాడిన తీరును ఎత్తి చూపుతూ.. కవిత తన తండ్రికి అధికారంపై అపేక్ష మమకారాన్ని దూరం చేసిందని విమర్శించడాన్ని ప్రస్తావిస్తున్నారు.  ఇక పోతే.. తెలంగాణ సెంటిమెంట్‌ను కాపాడటమే తన లక్ష్యమని కవిత చెబుతున్నప్పటికీ..  ఆమె అడుగులు బీఆర్ఎస్ ఓటు బ్యాంకును చీల్చడం ఖాయంగా కనిపిస్తోంది. ఇదే జరిగితే, గతంలో బీఆర్ఎస్ నుంచి వైసీపీకి  అందిన, ప్రస్తుతం అందుతున్న, నైతిక సహకారం ఇకపై అందే అవకాశం వైసీపీకి ఉండదు.  ఇది ఏపీలో కూటమి ప్రభుత్వం తన పట్టును మరింత బిగించుకోవడానికి సహాయపడుతుంది.    భవిష్యత్తులో కవిత పార్టీ వల్ల తెలంగాణలో రాజకీయ సమీకరణాలు ఎలా మారినా, ఏపీలో మాత్రం ఇది కూటమి ప్రభుత్వానికి సానుకూల పవనాలను ఇస్తోంది. పొరుగురాష్ట్రంలో మిత్రుడి  బలం తగ్గడం, అంతర్గత కలహాలతో బలహీనపడటం వంటివి వైసీపీకి రాబోయే కాలంలో  సవాళ్లను విసిరేలా ఉన్నాయి. హైదరాబాద్‌ నుంచి మొదలైన ఈ రాజకీయ తుపాను  ఏపీలో వైసీపీని బలహీనపరిచే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
  పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రాజకీయ వాతావరణం మరింత వేడెక్కింది. గత విడతలో జరిగిన పోలింగ్ సందర్భంగా కొన్ని ప్రాంతాల్లో అక్రమాలు చోటుచేసుకున్నాయన్న ఫిర్యాదుల నేపథ్యంలో భారత ఎన్నికల సంఘం (ECI) కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని మొత్తం 15 పోలింగ్ కేంద్రాల్లో మే 2వ తేదీన (శనివారం) రీ-పోలింగ్ నిర్వహించాలని ఆదేశాలు జారీ చేసింది. ముఖ్యంగా దక్షిణ 24 పరగణాల జిల్లాలోని రెండు కీలక నియోజకవర్గాలపై ఈ ప్రభావం పడింది. మగ్రాహట్ పశ్చిమ నియోజకవర్గంలోని 11 పోలింగ్ కేంద్రాల్లోనూ, అలాగే అత్యంత ప్రాధాన్యత కలిగిన డైమండ్ హార్బర్ నియోజకవర్గంలోని 4 కేంద్రాల్లోనూ తిరిగి ఓటింగ్ జరగనుంది. ఈ మేరకు పశ్చిమ బెంగాల్ ప్రధాన ఎన్నికల అధికారికి కేంద్ర ఎన్నికల సంఘం అధికారిక లేఖ రాసింది. గత నెల 29న జరిగిన రెండో దశ ఎన్నికల సమయంలో పలు చోట్ల ఈవీఎంల ట్యాంపరింగ్ జరిగిందని, ఓటర్లను అడ్డుకున్నారని ప్రతిపక్షాలు ఆరోపించాయి. ముఖ్యంగా డైమండ్ హార్బర్ పరిధిలోని కొన్ని బూత్‌లలో బీజేపీ గుర్తుపై టేపులు అంటించి, ఓటర్లు ఆ పార్టీకి ఓటు వేయకుండా అడ్డుకున్నారని బీజేపీ నేత అమిత్ మాల్వియా విమర్శలు గుప్పించారు. దీనిని 'డైమండ్ హార్బర్ మోడల్' అక్రమంగా ఆయన అభివర్ణించారు. ఈ ఫిర్యాదులను పరిశీలించిన ఎన్నికల పరిశీలకులు, రిటర్నింగ్ అధికారులు ఇచ్చిన నివేదికల ఆధారంగా ఈ రీ-పోలింగ్ నిర్ణయం తీసుకున్నట్లు ఈసీ వెల్లడించింది. శనివారం ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు ఓటింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. ఈసారి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పకడ్బందీ భద్రతా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించింది. బెంగాల్ ఎన్నికలు ఎప్పుడూ హింసాత్మక ఘటనలకు వేదికవుతుంటాయి. గతంలో జరిగిన పంచాయతీ ఎన్నికల్లోనూ భారీగా ప్రాణనష్టం సంభవించింది. ఈ నేపథ్యంలో, ప్రస్తుతం రీ-పోలింగ్ జరుగుతున్న కేంద్రాల వద్ద కేంద్ర బలగాలతో భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. స్థానిక ప్రజలకు చాటింపు ద్వారా ఓటింగ్ గురించి అవగాహన కల్పించాలని కూడా ఈసీ సూచించింది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీ ప్రాతినిధ్యం వహిస్తున్న డైమండ్ హార్బర్ పరిధిలో ఈ అక్రమాల ఆరోపణలు రావడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. అధికార తృణమూల్ కాంగ్రెస్ (TMC) మరియు బీజేపీ మధ్య మాటల యుద్ధం ముదిరింది. ఓటర్లు స్వేచ్ఛగా ఓటు వేసేలా చూడటమే తమ బాధ్యతని ఎన్నికల యంత్రాంగం పేర్కొంటోంది. మే 4వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా ఓట్ల లెక్కింపు జరగనుంది. ఈ లోపు ఈ 15 కేంద్రాల్లో జరిగే రీ-పోలింగ్ ఫలితాల సరళిని ప్రభావితం చేసే అవకాశం ఉంది. ఈ ఎన్నికల తుది ఫలితం బెంగాల్ రాజకీయ భవిష్యత్తును నిర్ణయించనుంది. మరి ఈ రీ-పోలింగ్ ప్రక్రియ ఎంతవరకు ప్రశాంతంగా ముగుస్తుందో వేచి చూడాలి.
ALSO ON TELUGUONE N E W S
విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) ప్రస్తుతం వైవిధ్యమైన కథలతో బాక్సాఫీస్ వద్ద తన సత్తా చాటేందుకు సిద్ధమవుతున్నాడు. ఇప్పటికే రాహుల్ సాంకృత్యాయన్ దర్శకత్వంలో భారీ పీరియడ్ డ్రామా 'రణబాలి', రవి కిరణ్ కోలా దర్శకత్వంలో 'రౌడీ జనార్ధన' చిత్రాలతో బిజీగా ఉన్న విజయ్.. రీసెంట్ గా మరో క్రేజీ ప్రాజెక్టును పట్టాలెక్కించాడు. 'హాయ్ నాన్న' సినిమాతో క్లాసిక్ డెబ్యూ ఇచ్చిన దర్శకుడు శౌర్యువ్ దర్శకత్వంలో విజయ్ తన తర్వాతి సినిమా (#VDxShouryuv) చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్ ఎంట్రీ? ఈ భారీ పాన్-ఇండియా చిత్రంలో హీరోయిన్‌గా బాలీవుడ్ హీరోయిన్ కృతి సనన్ (Kriti Sanon) నటించబోతున్నట్లు ఫిల్మ్ నగర్ వర్గాల్లో గట్టిగా వినిపిస్తోంది. కృతి సనన్ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితురాలే. మహేష్ బాబు హీరోగా నటించిన '1: నేనొక్కడినే' సినిమాతోనే హీరోయిన్ గా ప్రయాణం మొదలుపెట్టింది. నాగచైతన్యతో దోచేయ్, ప్రభాస్ ఆదిపురుష్ సినిమాలు చేసింది. ఇప్పుడు మరోసారి తెలుగు హీరో సరసన నటించబోతున్నట్లు వార్తలొస్తున్నాయి. విజయ్ - కృతి జంట వెండితెరపై ఒక సరికొత్త కెమిస్ట్రీని పంచుతారని అభిమానులు ఆశిస్తున్నారు. అయితే, దీనిపై చిత్ర యూనిట్ నుండి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. ఈ సినిమా ఒక విజువల్ వండర్‌గా ఉండబోతోందని సమాచారం. దీనికోసం గ్లోబల్ స్థాయిలో హాలీవుడ్ సాంకేతిక నిపుణులను రంగంలోకి దింపారు. 'హౌస్ ఆఫ్ ది డ్రాగన్' ఫేమ్ అలెజాండ్రో మార్టినెజ్ సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరిస్తున్నారు. విజువల్ ఎఫెక్ట్స్ (VFX) సూపర్‌వైజర్ గా ఎరిక్ డర్స్ట్ వర్క్ చేస్తున్నారు. మ్యూజిక్ బాధ్యతలను మాత్రం హేషమ్ అబ్దుల్ వహాబ్ నిర్వహిస్తున్నారు. వైరా ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ పై రూపొందుతున్న ఈ చిత్రం 'మైథాలజికల్ యూనివర్స్' నేపథ్యంలో సాగే అడ్వెంచరస్ డ్రామా అని తెలుస్తోంది. ఇటీవల విడుదలైన అనౌన్స్‌మెంట్ పోస్టర్ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడేలా చేసింది. విజయ్ ఒక రాయల్ లుక్‌లో కనిపిస్తూ క్రూరమైన కుక్కలను చైన్‌తో పట్టుకున్న పోస్టర్ నెట్టింట వైరల్ అయింది. విజయ్ దేవరకొండ కెరీర్‌లో భారీ బడ్జెట్ తో ఇది తెరకెక్కనుంది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి వండర్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి.  
At 94, veteran filmmaker Singeetham Srinivasa Rao is stepping back behind the camera for a new feature film titled Sing Geetham. Known for his pioneering contributions to Indian cinema with classics like the silent film Pushpak and the science-fiction benchmark Aditya 369, the director is now exploring the musical fantasy genre.  The project is being backed by Nag Ashwin under the Vyjayanthi Movies and Swapna Cinema banners, marking a notable collaboration between the seasoned filmmaker and a modern production powerhouse. Sing Geetham is framed as a story that heavily intertwines music with magical realism.  The narrative centers on a young man named Prathap, played by Ayaan, who travels to a remote and mysterious village in search of better prospects. There, he finds himself caught in a complex struggle between modern progress and the preservation of the past. The film also features Ahilya Bamroo and Shalini Kondepudi in prominent roles. Devi Sri Prasad music and surreal setting helps the movie greatly. Singeetham has become a care of address for many creative and innovative films. Even at 94, he is ready to deliver such a brilliant film. Sing Geetham is releasing on 11th June, worldwide.    Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them.
The film 'Sathi Leelavathi' has been made with Lavanya Tripathi Konidela and Dev Mohan in lead roles. Presented by the renowned production house Anandi Arts, the film is produced by Naga Mohan under the Durgadevi Pictures banner. It is directed by Tatineni Satya, who is known for Bheemili Kabaddi Jattu and S.M.S (Shiva Manasulo Shruti). The makers are releasing this film worldwide on a grand scale on May 8. Mega Power Star Ram Charan released the movie trailer on Saturday. At the trailer launch event held in this regard,  Lavanya Tripathi said, “The hard work, love, and effort we put in for 'Sathi Leelavathi' will be seen on screen by the audience. Satya garu and Uday garu brought a good story to me. 'Sathi Leelavathi' has come out wonderfully. Naga Mohan garu worked very hard for this film. After it was known that I was pregnant during the shoot, the entire team supported me. Dev garu dubbed for himself. Thanks to my brother in law Ram Charan for releasing our trailer. Because of him, the reach of our trailer and our film has increased. Please watch our trailer and support us. Watch and support our film on May 8,” she said. Dev Mohan said.. “I’m happy to be coming before the Telugu audience again. I also watched the trailer along with all of you. I liked the trailer a lot. Thanks to Ram Charan garu for releasing our trailer. This movie, and the character I played in it, are very new and different. Thanks to the director and producers who gave me this opportunity. It was a pleasure to act with Lavanya garu. Our film is coming on May 8. I hope everyone will definitely watch and make it a success. Tatineni Satya said.. “Thanks to Ram Charan garu for launching our 'Sathi Leelavathi' trailer. Thanks to everyone who supported us during the shoot. Thanks to Uday garu who supported in writing, and to Venu garu, Ramesh garu, Srikanth garu, and Sai garu in my direction team. Our film is coming on May 8. It’s a very good film. I request everyone to come to the theatre and watch and support this film." Naga Mohan said .. “The film 'Sathi Leelavathi' is coming on May 8. I hope everyone will watch and enjoy it. Thanks to everyone who supported us in this journey. Thanks to Lavanya madam and Dev sir. We were able to bring the film this far only with the support they gave. Thanks to Ram Charan garu who launched our trailer. Our film will impress everyone." Jeevan Botimala said .. “Because I worked with Lavanya Tripathi garu, I immediately got 'Vishwambhara' and 'Ustaad Bhagat Singh' films. She became a lucky hand for me. Thanks to the director and producers who gave me this opportunity." Binendra Menon said .. “This is my second film with Satya garu. Thanks to everyone who gave me an opportunity in this film. We shot the film very enjoyably. We made this film wonderfully at a different location. Our movie is coming on May 8. Everyone please watch." Abhinaya Srinivas said .. “I wrote a song in 'Sathi Leelavathi'. Thanks to the director and producers who gave me this opportunity. This movie is coming on May 8. Everyone please watch." Tagubothu Ramesh said .. “Since 'Bheemili Kabaddi Jattu', Satya garu has been giving me opportunities. Lavanya garu shot even during her pregnancy. That’s a great thing. Thanks to everyone who gave me this opportunity. Thanks to Ram Charan garu who launched our trailer. Our movie is coming on May 8. Everyone watch and make it a success." Saptagiri said .. “I believe everyone would have liked the 'Sathi Leelavathi' trailer. We all shot together very enjoyably. Everyone liked the old 'Sathi Leelavathi'. This 'Sathi Leelavathi' we made now will also impress everyone. Currently, people are coming to theatres only by word of mouth. On May 8, come trusting our director Satya. Everyone will enjoy." Writer Uday said .. “The fun I felt while writing 'Sathi Leelavathi'... I felt even more entertained watching the teaser and trailer. Thanks to everyone who supported us in this journey. I wish this film a big success."   Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them.
కింగ్ నాగార్జున(Nagarjuna)ఏ ముహూర్తాన లెనిన్(Lenin)జూన్  26 రిలీజ్ డేట్ వాయిదాపడదని అన్నాడో కానీ ఆ విషయం నిజమైనందుకు అక్కినేని ఫ్యాన్స్ ఫుల్ జోష్ లో ఉన్నారు. ఎందుకంటే పెద్ది జూన్ 25  నుంచి జూన్ 4 కి షిఫ్ట్ అయ్యింది. దీంతో సినీ ట్రేడ్ సర్కిల్స్ లో లెనిన్ సింగిల్ గా వస్తుండంపై స్పందిస్తున్నారు. మరి ఆ లెనిన్ విశేషాలేంటో చూద్దాం. సోలో రిలీజ్ కావడం వల్ల తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక థియేటర్లలో లెనిన్  ప్రదర్శితమయ్యే అవకాశం ఉంది. పోటీ ఉండదు కాబట్టి  టాక్ కొంచెం పాజిటివ్‌గా వచ్చినా వసూళ్లు భారీగా రావడం ఖాయం. దీంతో సూపర్ హిట్ కోసం ఎదురుచూస్తున్న అఖిల్ కి లెనిన్ సోలో రిలీజ్ మంచి అవకాశం. హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ కావడం, అఖిల్ మాస్ లుక్ లో కనపడటంతో పాటు ఫ్యాన్స్, ప్రేక్షకులకి విపరీతంగా కనెక్ట్ అయ్యే కధాంశాలు పుష్కలంగా ఉన్నాయని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది. దీంతో లెనిన్ రికార్డులు సాధించే అవకాశం ఉందని అంటున్నారు. Also read: Rashmi Gautam: ఆ పార్టీకి నా బహిరంగ మద్దతు.. వెల్లడి చేసిన రష్మీ ఏజెంట్ పరాజయం తర్వాత అఖిల్  చాలా గ్యాప్ తీసుకుని వస్తున్న 'లెనిన్' లో భాగ్యశ్రీ బోర్సే(Bhagyashri borse)హీరోయిన్ కాగా మురళి కిషోర్(Murali Kishor)అబ్బూరి దర్శకుడు. అగ్ర నిర్మాణ సంస్థలు  సితార ఎంటర్ టైన్ మెంట్స్, అన్నపూర్ణ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. థమన్ మ్యూజిక్ ని అందిస్తున్నాడు.    
లావ‌ణ్య త్రిపాఠి కొణిదెల (Lavanya Tripathi Konidela), దేవ్ మోహన్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో తెరకెక్కిన చిత్రం ‘సతీ లీలావతి’ (Sathi Leelavathi). ఆనంది ఆర్ట్స్ సమర్పణలో దుర్గాదేవి పిక్చ‌ర్స్ బ్యానర్‌పై నాగ‌మోహ‌న్ ఈ చిత్రాన్ని నిర్మించారు. భీమిలీ కబడ్డీ జట్టు, ఎస్‌.ఎం.ఎస్‌(శివ మ‌న‌సులో శృతి) ఫేమ్ తాతినేని స‌త్య దర్శకత్వం వహించారు. ఈ చిత్రాన్ని మే 8న రిలీజ్ చేస్తున్నారు మేక‌ర్స్‌. ఈ క్రమంలో శనివారం నాడు మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ఈ మూవీ ట్రైలర్‌ను రిలీజ్ చేశారు.   ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో లావణ్య త్రిపాఠి మాట్లాడుతూ.. "సతీ లీలావతి కోసం మేం పెట్టిన శ్రమ, మా ప్రేమ, మా కష్టం అంతా తెరపై ఆడియెన్స్ చూస్తారు. సత్య గారు, ఉదయ్ గారు మంచి కథను నా వద్దకు తీసుకు వచ్చారు. ‘సతీ లీలావతి’ అద్భుతంగా వచ్చింది. ఈ చిత్రం కోసం నాగ మోహన్ గారు చాలా కష్టపడ్డారు. నేను చిత్రీకరణ సమయంలో ప్రెగ్నెంట్ అని తెలిశాక టీం మొత్తం సపోర్ట్ చేసింది. దేవ్ గారు సొంతంగా డబ్బింగ్ చెప్పారు. మా ట్రైలర్‌ను రిలీజ్ చేసిన మా బావ గారు రామ్ చరణ్‌కి థాంక్స్. ఆయన రిలీజ్ చేయడం వల్ల మా ట్రైలర్‌కి, మా సినిమాకు రీచ్ పెరిగింది. మా ట్రైలర్‌ని అందరూ చూసి సపోర్ట్ చేయండి. మే 8న మా సినిమాని చూసి సపోర్ట్ చేయండి" అని అన్నారు. దేవ్ మోహన్ మాట్లాడుతూ .. "తెలుగు ఆడియెన్స్ ముందుకు మళ్లీ వస్తున్నందుకు ఆనందంగా ఉంది. మీ అందరితో పాటే నేను కూడా ట్రైలర్ చూశాను. నాకు ట్రైలర్ చాలా నచ్చింది. మా ట్రైలర్‌ను రిలీజ్ చేసిన రామ్ చరణ్ గారికి థాంక్స్. ఈ మూవీ, ఇందులో నేను పోషించిన పాత్ర చాలా కొత్తగా, డిఫరెంట్‌గా ఉంటుంది. నాకు ఈ అవకాశం ఇచ్చిన దర్శక, నిర్మాతలకు థాంక్స్. లావణ్య గారితో నటించడం ఆనందంగా ఉంది. మే 8న మా సినిమా రాబోతోంది. అందరూ తప్పకుండా చూసి సక్సెస్ చేస్తారని ఆశిస్తున్నాను" అన్నారు. తాతినేని సత్య మాట్లాడుతూ .. "మా సతీ లీలావతి ట్రైలర్ లాంచ్ చేసిన రామ్ చరణ్ గారికి థాంక్స్. ఈ చిత్రీకరణ సమయంలో సపోర్ట్ చేసిన ప్రతీ ఒక్కరికీ థాంక్స్. రైటింగ్‌లో సపోర్ట్ చేసిన ఉదయ్ గారికి, నా డైరెక్షన్ టీంలోని వేణు గారు, రమేష్ గారు, శ్రీకాంత్ గారు, సాయి గారికి థాంక్స్. మే 8న మా చిత్రం రాబోతోంది. ఇది చాలా మంచి సినిమా. అందరూ థియేటర్‌కు వచ్చిన ఈ సినిమాని చూసి సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను" అన్నారు. నాగ మోహన్ మాట్లాడుతూ.. "సతీ లీలావతి చిత్రం మే 8న రాబోతోంది. అందరూ చూసి ఎంజాయ్ చేస్తారని ఆశిస్తున్నాను. మాకు ఈ జర్నీలో సపోర్ట్ చేసిన ప్రతీ ఒక్కరికీ థాంక్స్. లావణ్య మేడంకి, దేవ్ సర్‌కి థాంక్స్. వారిద్దరూ ఇచ్చిన సపోర్ట్‌తోనే సినిమాను ఇక్కడి వరకు తీసుకు రాగలిగాం. మా ట్రైలర్ లాంచ్ చేసిన రామ్ చరణ్ గారికి థాంక్స్. మా సినిమా ప్రతీ ఒక్కరినీ ఆకట్టుకునేలా ఉంటుంది" అన్నారు.  
ప్రపంచ సినిమా రంగంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన పురస్కారాలుగా భావించే ఆస్కార్స్ (Oscars) కొత్త నిబంధనలు తీసుకొచ్చింది. ఏఐ కంటెంట్‌పై బ్యాన్ విధించింది. అలాగే ఒకే నటుడు ఒకేసారి అనేక సినిమాలకు నామినేట్ కావచ్చని తెలిపింది. ఈ కొత్త రూల్స్ 2027లో జరిగే 99వ అకాడమీ అవార్డ్స్ నుండి అమలులోకి రానున్నాయి. ఏఐ కంటెంట్‌పై కఠిన ఆంక్షలు ప్రస్తుతం సినీ రంగంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) వాడకం విపరీతంగా పెరిగిపోయింది. కొందరు ఏఐను ఉపయోగించి సినిమా స్క్రిప్ట్ లు రెడీ చేస్తున్నారు. అలాగే నటీనటుల రూపాలను, గొంతులను ఏఐ ద్వారా సృష్టించి సినిమాల్లో వాడుతున్నారు. దీనిపై పలువురు హాలీవుడ్ రచయితలు, నటులు గతంలో పెద్ద ఎత్తున నిరసనలు కూడా చేపట్టారు. దీన్ని పరిగణనలోకి తీసుకున్న అకాడమీ, ఏఐ వినియోగాన్ని పూర్తిగా నిషేధించింది. టెక్నాలజీతో సృష్టించిన కంటెంట్‌ను పోటీకి అనర్హంగా ప్రకటిస్తూ నిర్ణయం తీసుకుంది. నామినేషన్లలో కీలక మార్పులు గతంలో ఒక నటుడు ఒకటి కంటే ఎక్కువ సినిమాలకు నామినేట్ కావడానికి కొన్ని పరిమితులు ఉండేవి. అయితే, కొత్త నిబంధనల ప్రకారం ఒకే నటుడు ఒకేసారి అనేక సినిమాలకు నామినేట్ అయ్యే అవకాశం కల్పించారు. అంటే ఒక నటుడు భిన్నమైన చిత్రాల్లో అద్భుత ప్రదర్శన ఇస్తే, అన్ని సినిమాలకూ నామినేషన్ పొందే ఛాన్స్ ఉంటుంది. అలాగే, బెస్ట్ ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిల్మ్ కేటగిరీలో ఒకే దేశం నుంచి ఒకటి కంటే ఎక్కువ సినిమాలను ఎంట్రీలుగా పంపే వెసులుబాటును కూడా కల్పిస్తున్నారు. ఆస్కార్స్ తీసుకొచ్చిన ఈ మార్పులు చిత్ర పరిశ్రమలో సహజత్వానికి పెద్దపీట వేయనున్నాయి. 2027లో జరగబోయే 99వ ఆస్కార్ వేడుకలు ఈ కొత్త రూల్స్‌తో సరికొత్తగా సాగనున్నాయి. మరి మన దేశం నుంచి ఈ కొత్త నిబంధనల ప్రకారం ఎన్ని సినిమాలు ఆస్కార్ బరిలో నిలుస్తాయో చూడాలి.  
వైసీపీ నాయకులు తమ నిరసనలో భాగంగా తిరుపతి(Tirupati)లో ఎద్దుల బండిపై ఆటోని , దానిపై మరికొంతమంది మనుషులను ఎక్కించి ఎద్దులతో లాగించారు. ఈ దృశ్యాలని చూసి చలించిపోయిన  యాంకర్ రష్మీ గౌతమ్ సదరు ఘటనపై సోషల్ మీడియా వేదికగా స్పందిస్తు 'ఆ ఎద్దు పడుతున్న వేదన కంటే మీరు వెయ్యి రెట్లు అధికంగా బాధపడాలి" అంటూ ఘాటైన వ్యాఖ్యలు చేసింది. దీంతో  వైసీపీ మద్దతుదారులు రష్మీని వ్యక్తిగతంగా పలు విషయాల్లో ట్రోల్ చేయడం మొదలుపెట్టారు.వాళ్ళల్లో ప్రదీప్ చింత అనే వైసిపీ నాయకుడు ఉన్నాడు. అతని విమర్శలపై రష్మీ ఒక పోస్ట్ చేసింది. సదరు పోస్ట్ లో మన దగ్గర ఉన్న  సమస్య ఏంటంటే ఒక విషయం గురించి మాట్లాడుతుంటే ప్రజలు మరో విషయాన్నీ ముందుకు తెస్తారు. కేవలం పోలికలు తీసుకురావడం తప్ప హీరోని ఆపడానికి ఎవరు ముందు రావడం లేదు. నేను ఏ రాజకీయపార్టీకి, ఏ మతానికి వ్యతిరేకం కాదు. జంతువులపై జరిగే క్రూరత్వానికే వ్యతిరేకం. నా పై ట్రోల్ చేసే వాళ్ళకి మరి ముఖ్యంగా చెప్పేది ఏంటంటే అవమానాలు నాకేం కొత్త కాదు. కానీ జంతువులపై జరిగే హింస విషయంలో మాత్రం ఎప్పటిలాగానే మాట్లాడుతూనే ఉంటాను. ఈ విషయంలో వెనకడుగు వేసే ప్రసక్తే లేదు. ఏ రాజకీయ పార్టీ అయితే జంతువుల సంక్షేమం కోసం పాటుపడుతుందో ఆ పార్టీకి బహిరంగ మద్దతు ఇస్తానని తన పోస్ట్ లో రాసుకొచ్చింది.       Also read: Trisha: త్రిషకి అవమానం.. షాకింగ్ ట్వీట్ చేసిన స్టార్ హీరోయిన్     
లెజెండరీ డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావు (Singeetham Srinivasa Rao) మ్యాజిక్ మళ్ళీ వెండితెరపై పునరావృతం కాబోతోంది. ఆయన దర్శకత్వంలో, నాగ్ అశ్విన్ నిర్మాణంలో తెరకెక్కుతున్న చిత్రం 'సింగ్‌ గీతం' (Sing Geetham). #SSR61 అనే వర్కింగ్ టైటిల్‌తో మొదలైన ఈ ప్రాజెక్ట్ అధికారిక టీజర్ తాజాగా విడుదలై సోషల్ మీడియాలో ప్రశంసలు అందుకుంటోంది. సుమారు 40 ఏళ్లుగా ఈ కథ చెప్పడం కోసం తాను వేచి చూస్తున్నానని సింగీతం చెప్పిన మాటలు, ఈ సినిమాపై ఆసక్తిని పెంచుతున్నాయి. టీజర్ ప్రారంభం నుండి చివరి వరకు ఒక అద్భుతమైన ఫీల్ గుడ్ వైబ్‌ను కలిగి ఉంది. 94 ఏళ్ల వయసులో కూడా సింగీతం శ్రీనివాసరావు విజన్ ఎంత యంగ్‌గా ఉందో ఈ విజువల్స్ చూస్తే అర్థమవుతుంది. కుబేరపురం అనే గ్రామం నేపథ్యంలో సాగే విభిన్న కథతో ఈ సినిమా రూపుదిద్దుకుంటోంది. మైనింగ్, ఫారెన్ డీల్ అంటూ ఊరి మనుషుల మధ్య సరదా సన్నివేశాలతో ట్రైలర్ నడిచింది. ఓ వైపు ఊరంతా హడావుడి, మరోవైపు బ్యాక్ గ్రౌండ్ లో "ఏమైంది ఏమైంది బాబో ఏదో అయిపొయింది" అనే సాంగ్ తో.. కథలో ఏదో జరగబోతుందని తెలిపేలా ఆసక్తికరంగా ట్రైలర్ ను కట్ చేశారు. ఈ సినిమాలో మాటల కంటే పాటలకు పెద్ద పీట వేస్తున్నట్లు తెలుస్తోంది. రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్ అందిస్తున్న సంగీతం ఈ సినిమాకు ప్రధాన బలంగా నిలవనుంది. టీజర్‌లో వినిపిస్తున్న బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఆహ్లాదకరంగా ఉంది. సింగీతం మేకింగ్ స్టైల్‌కు తగ్గట్లుగా దేవి శ్రీ ప్రసాద్ అందించే మ్యూజిక్ సినిమాకు ఆత్మలా నిలుస్తుంది అనిపిస్తోంది.  ప్రముఖ దర్శకుడు నాగ్ అశ్విన్ ఈ సినిమాను నిర్మించడం విశేషం. సింగీతం పట్ల ఆయనకున్న గౌరవం ప్రతి ఫ్రేమ్‌లోనూ కనిపిస్తోంది. నిర్మాణ విలువలు అత్యున్నత స్థాయిలో ఉన్నాయి. ఒక క్లాసిక్ స్టోరీని నేటి తరం టెక్నాలజీతో మిక్స్ చేసి ఎలా ప్రెజెంట్ చేయాలో నాగ్ అశ్విన్ టీమ్ మరోసారి నిరూపించింది. 'సింగ్‌ గీతం' మూవీ జూన్ 11న థియేటర్లలో అడుగుపెట్టనుంది. తాజాగా విడుదలైన టీజర్ ఒక స్వచ్ఛమైన సినిమాటిక్ అనుభూతిని ప్రామిస్ చేస్తోంది. వేసవి ముగింపులో ఒక చల్లని మెలోడీ లాంటి సినిమా రాబోతోందని అర్థమవుతోంది.  
  ప్రస్తుతం విజయ్(Vijay)అభిమానులు, తమిళనాడు యావత్తు మాత్రమే కాదు ఇండియా మొత్తం మే 4 న జరిగే ఎలక్షన్స్ రిజల్ట్ ఎలా రాబోతున్నాయనే క్యూరియాసిటీ తో ఎదురు చూస్తూ ఉంది. త్రిష కూడా అదే క్యూరియాసిటీ తో ఉంటుందనే వాస్తవం తెలిసిందే. ఈ నేపథ్యంలో త్రిష ఎలెక్షన్స్ రిజల్ట్ గురించి ఏమైనా చెప్తుందేమో అని ఎదురుచూస్తున్న వాళ్ళకి, సోషల్ మీడియాకి  త్రిష చేసిన షాకింగ్ ట్వీట్ కంటపడింది. మరి ట్వీట్ మ్యాటర్ ఏంటో చూద్దాం    సూర్య(Suriya)తో కలిసి త్రిష(Trisha)చేసిన 'కరుప్పు'(Karuppu)ఈ నెల 14 న రిలీజ్ కాబోతుంది. రీసెంట్ గా  త్రిష లుక్ ని మేకర్స్ రిలీజ్ చేసారు. 37 సెకన్ల నిడివి ఉన్న వీడియో ద్వారా 43 ఏళ్ళ ఏజ్ లో కూడా త్రిష మరోసారి తనదైన స్టయిల్లో మెస్మరైజ్ చెయ్యబోతుందని తెలుస్తుంది. సదరు వీడియోపై ఒక నెటిజన్ స్పందిస్తు కరుప్పులో త్రిష ఉందనే విషయం మర్చిపోయాను. తన ఏజ్ రివర్స్ గేర్ లో వెళ్తుందని ట్వీట్ చేసాడు. త్రిష స్పందిస్తు నేను కూడా కరుప్పులో ఉన్నానని మర్చిపోయాను. వాళ్ళు ఇలాగైనా గుర్తు చేసినందుకు సంతోషంగా ఉందని రిప్లై ఇచ్చింది. త్రిష రిప్లైపై సూర్య అభిమాని స్పందిస్తు కరుప్పు ఆడియో లాంచ్ కి రాని మీకు ఇంత వెటకారం అవసరమా అని బదులిచ్చాడు. నా ఇన్విటేషన్ బహుశా మెయిల్ లో ఎక్కడో మిస్ అయ్యి ఉంటుందని సదరు సూర్య అభిమానికి త్రిష రిప్లై ఇచ్చింది. Also read: Mahesh Babu: బ్లాక్ ఫారెస్ట్ లో మహేష్ బాబు..ఏ దేశమో తెలుసా! ఇప్పుడు ఈ ట్వీట్ వైరల్ గా మారడంతో మేకర్స్ త్రిషకి ఇన్విటేషన్ పంపించకపోవడం ఏంటని త్రిష ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. మొన్న ఏప్రిల్ 26 న మదురై వేదికగా  ఆడియో లాంచ్ జరగగా త్రిష హాజరు కాలేదు. కరుప్పు తెలుగులో 'వీరభద్రుడు'గా వస్తుంది.     
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) చేతుల మీదుగా విడుదలైన 'సతీ లీలావతి' (Sathileelavathi) మూవీ ట్రైలర్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. లావణ్య త్రిపాఠి, దేవ్ మోహన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రం ఒక పక్కా ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా మే 8న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ నేపథ్యంలో తాజాగా ట్రైలర్ విడుదల చేశారు. (Sathileelavathi Trailer) ట్రైలర్ ప్రారంభం నుండి చివరి వరకు ఎంతో సరదాగా సాగింది. ఒక మధ్యతరగతి కుటుంబంలో జరిగే సరదా సంఘటనలు, భార్యాభర్తల మధ్య వచ్చే చిన్నపాటి మనస్పర్థలను దర్శకుడు ఎంతో హాస్యభరితంగా మలిచినట్లు కనిపిస్తోంది. టైటిల్ వినగానే పాత కాలపు సినిమా అనిపించినా, ఇందులో నేటి తరం జంటల ఆలోచనలు, వారి మధ్య ఉండే కెమిస్ట్రీని చాలా ఫ్రెష్‌గా చూపించారు. ముఖ్యంగా లావణ్య త్రిపాఠి తనదైన కామెడీ టైమింగ్‌తో ఆకట్టుకోగా, దేవ్ మోహన్ తన లుక్స్‌తో మెప్పించాడు. ట్రైలర్ లో మొదట సాఫ్ట్ గా కనిపించిన లావణ్య, ఆ తర్వాత గయ్యాళిలా ప్రవర్తించడం భలే ఉంది. పెళ్ళికి ముందు భర్తకు ఉన్న లవ్ స్టోరీ గురించి ఆమె తెలుసుకోవడం, అతన్ని కట్టేసి హింసించడం వంటి సీన్స్ ఫ్రెష్ గా ఉన్నాయి. అలాగే భార్య నుంచి తప్పించుకోవడానికి భర్త పడే పాట్లు నవ్వులు పూయించాయి. ఇక ట్రైలర్ చివరిలో "నువ్వు నన్ను ఏం చేయలేవు రా" అంటూ లావణ్య అరుంధతిలా మారి విశ్వరూపం చూపించడం హైలైట్ గా నిలిచింది.  ఈ సినిమా ట్రైలర్‌ను రామ్ చరణ్ లాంచ్ చేయడం చిత్ర యూనిట్‌కు పెద్ద ప్లస్ అయ్యింది. ట్రైలర్ చూసిన తర్వాత ఒక మంచి ఫ్యామిలీ డ్రామాను చూస్తున్న అనుభూతి కలుగుతోంది. ఫన్, ఎమోషన్స్, బ్యూటిఫుల్ విజువల్స్ ట్రైలర్‌లో ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. మొత్తానికి 'సతీ లీలావతి' ట్రైలర్ సినిమాపై పాజిటివ్ వైబ్స్‌ను క్రియేట్ చేసింది. వేసవి సెలవుల్లో ఫ్యామిలీ అంతా కలిసి హాయిగా నవ్వుకునే సినిమా కోసం చూస్తున్న వారికి ఇదొక మంచి ఆప్షన్ కానుంది. మే 8న థియేటర్లలో ఈ సినిమా ఎలాంటి మ్యాజిక్ చేస్తుందో చూడాలి.   https://x.com/AlwaysRamCharan/status/2050440412675084757
వేసవి కాలం వచ్చిందంటే ప్రతి ఇంట్లో కూలర్ల దుమ్ము దులిపి వాడటానికి సిద్దం చేస్తుంటారు.  అయితే చాలా మంది ఇబ్బంది పడే సమస్య కూలర్ నుండి దుర్వాసన రావడం.  కూలర్ ను శుభ్రం చేసి వాడటానికి సిద్దం చేసినా సరే.. కూలర్ ఉపయోగించేటప్పుడు కూలర్ లో నీరు చేపల వాసన వస్తూ ఉంటుంది. కొందరు కూలర్ నుండి వాసన వస్తూ ఉందనే కారణంతో దాన్ని ఆఫ్ చేస్తారు. అయితే కూలర్ ను వాడకుండా ఉండటం పరిష్కారం కాదు.  కూలర్ ట్యాంక్ లోని పాత నీరు,  నాచు, తేమ కారణంగా కూలర్ లో చేపల వాసన లాగా వస్తూ ఉంటుంది. ఈ సమస్యకు చాలా సులువుగా చెక్ పెట్టవచ్చు.  అందుకోసం అనుసరించాల్సిన చిట్కాలు ఏంటో తెలుసుకుంటే.. కూలర్ నుండి చేపల వాసన ఎందుకు వస్తుంది? కూలర్‌లో చేపల వాసన రావడానికి అత్యంత సాధారణ కారణం ట్యాంక్‌లో పేరుకుపోయిన బయోఫిల్మ్ , బ్యాక్టీరియా. ట్యాంక్‌లో నీరు ఎక్కువ సేపు నిలిచి ఉన్నప్పుడు, సూక్ష్మజీవులు వృద్ధి చెందడం ప్రారంభిస్తాయి. నిలిచిపోయిన నీరు బయోఫిల్మ్‌ను ఏర్పరుస్తుంది, ఇది వాసనకు కారణమవుతుంది.  అది మాత్రమే కాకుండా కూలర్‌లోని మురికి, దుమ్ము , తేమ కూడా ఈ వాసనకు కారణం అవుతాయి. వాసన ఎలా తొలగించాలంటే.. కూలర్ నుండి దుర్వాసనను తొలగించడానికి  వైట్  వెనిగర్‌ను ఉపయోగించవచ్చు. వైట్  వెనిగర్‌ను ఉపయోగించడం వల్ల కూలర్ నీటి నుండి వచ్చే చేపల వాసనను తొలగిపోతుంది. ఒకవేళ వైట్ వెనిగర్ లేకపోతే దానికి  ప్రత్యామ్నాయంగా బేకింగ్ సోడాను కూడా ఉపయోగించవచ్చు. వెనిగర్ అనేది దుర్వాసనకు కారణమయ్యే బ్యాక్టీరియాను చంపే ఒక సహజ క్రిమిసంహారకం. మొదటగా  కూలర్ ట్యాంక్‌ను ఖాళీ చేయాలి. ఆ తర్వాత, ట్యాంక్‌లో వెనిగర్ పోసి కాసేపు అలానే ఉంచాలి. తర్వాత, ట్యాంక్‌ను శుభ్రంగా రుద్దాలి. ఆ తర్వాత 2 నుండి 3 టీస్పూన్ల బేకింగ్ సోడా కలపాలి. ట్యాంక్ శుభ్రం చేయాలి. దీని తర్వాత ట్యాంక్‌ను నీటితో నింపాలి. దీనివల్ల కూలర్‌లోని దుర్వాసన పోతుంది. ఎసెంటియల్ ఆయిల్స్.. ట్యాంక్‌ను శుభ్రం చేసిన తర్వాత నీటిని నింపి ఆ  నీటిలో ఎసెంటియల్ ఆయిల్స్  ఉపయోగించవచ్చు. కూలర్ నీటిలో 2 నుండి 3 చుక్కల టీ ట్రీ ఆయిల్ లేదా లెమన్‌గ్రాస్ ఆయిల్ కలపాలి. ఇది కూలర్ నుండి స్వచ్ఛమైన గాలి ప్రవహించడానికి సహాయపడుతుంది. కూలర్‌లోని నీటిని ప్రతి 2 నుండి 3 రోజులకు మార్చితే కూలర్ నుండి దుర్వాసన రాదు. చాలా మంది కూలర్ లో  నీటి మట్టం తగ్గగానే ప్రతిరోజూ నీటిని అయితే నింపుతూ ఉంటారు. కానీ.. పూర్తీగా కూలర్ ట్యాంక్ ను క్లీన్ చేసి కొత్త నీటిని నింపుతూ ఉంటే కూలర్ నుండి వాసన అనేది రాదు.                                 *రూపశ్రీ.
భారతీయుల ఆహారంలో బెల్లం ప్రధాన పదార్థం. తీపి పదార్థాల తయారీ నుండి కూరలలో కూడా రుచి కోసం బెల్లం వాడుతూ ఉంటారు.  అయితే వేసవి కాలంలో బెల్లం విషయంలో పెద్ద సమస్య ఎదురవుతుంది. అదే బెల్లం జిగటగా మారడం.  గాలిలోని వేడి, తేమ కారణంగా బెల్లం తరచుగా కరిగి జిగటగా మారుతుంది. అంతేకాకుండా, కొన్నిసార్లు దానికి బూజు కూడా పడుతుంది. వేసవిలో ఈ సమస్య ఎక్కువగా ఉంటుంది. అయితే కొన్ని సింపుల్ చిట్కాలు పాటించడం వల్ల వేసవి కాలంలో కూడా బెల్లం తాజాగా, పొడిగా ఉండేలా చేయవచ్చు. ఆ చిట్కాలు ఏంటో తెలుసుకుంటే.. ఎయిర్ టైట్ కంటైనర్.. బెల్లానికి గాలి, తేమ అనేవి అతిపెద్ద శత్రువులు. అందువల్ల బెల్లాన్ని నిల్వ చేయడానికి ఎల్లప్పుడూ మంచి నాణ్యత గల ఎయిర్ టైట్ కంటైనర్ ను  ఉపయోగించాలి. వీలైతే గాజు లేదా స్టీల్‌తో చేసిన పాత్రను ఎంచుకోవాలి. ప్లాస్టిక్ పాత్రలలోకి తరచుగా తేమ చేరి, బెల్లం కరిగిపోతుంది. చిన్న ముక్కలు.. మార్కెట్  నుండి తెచ్చిన బెల్లం ముద్ద మొత్తాన్ని ఒకేసారి డబ్బాలో వేస్తుంటారు. అయితే ఈ పద్ధతిని మానుకోవాలి. బెల్లాన్ని నిల్వ చేసే ముందు చిన్న చిన్న ముక్కలుగా చేయాలి. దీనివల్ల  అవసరమైనంత మాత్రమే బయటకు తీయడం వీలవుతుంది. బెల్లం మొత్తం పదేపదే బయటి గాలికి గురికాకుండా సురక్షితంగా ఉంటుంది. అంతేకాదు.. అవసరైమనప్పుడల్లా  బెల్లాన్ని బయటకు తీసి దాన్ని ఏదైనా రాయి లేదా రాడ్ లాంటి దానితో కొట్టి చిన్న ముక్క తీసుకుని,  తిరిగి దాన్ని మళ్లీ కంటైనర్ లో పెట్టడం లాంటివి చేస్తుంటే బెల్లం తొందరగా మెత్తబడి జిగటగా మారుతుంది. నీరు, తడి చేతులకు దూరం.. ఇది చాలా చిన్న విషయమే అయినా చాలా ముఖ్యమైనది. హడావిడిలో బెల్లం తీయడానికి తడి చేతులను గానీ, తడి చెంచాను గానీ ఎప్పుడూ ఉపయోగించకూడదు. చిన్న నీటి చుక్క కూడా  బెల్లం డబ్బా మొత్తాన్ని జిగటగా మార్చి, దానిని పాడుచేస్తుంది. బెల్లం తీసేటప్పుడు ఎల్లప్పుడూ పూర్తిగా పొడి చెంచాను  లేదా పొడి చేతులను మాత్రమే వాడాలి. బియ్యం చిట్కా.. బియ్యం చిట్కా మన అమ్మమ్మల కాలం నుండి వస్తున్న ఒక పాత చిట్కా.. కానీ ఇది చాలా ప్రభావవంతమైన చిట్కా. కొద్దిగా  బియ్యాన్ని ఒక శుభ్రమైన పత్తి లేదా మస్లిన్ గుడ్డలో కట్టి,  బెల్లం నిల్వ చేసే పాత్ర అడుగున ఉంచాలి. ఆ బియ్యం పాత్రలోని అదనపు తేమను పీల్చుకుంటుంది, దీనివల్ల  బెల్లం పూర్తిగా పొడిగా ఉంటుంది. ఫ్రిజ్ లో నిల్వ.. వేసవిలో  విపరీతమైన వేడి, తేమ ఉంటే , బెల్లాన్ని బయట కాకుండా ఫ్రిజ్‌లో నిల్వ చేయవచ్చు. అయితే, దానిని నేరుగా డబ్బాలో ఉంచి నిల్వ చేయకూడదు. బెల్లం ముక్కలను జిప్-లాక్ బ్యాగ్‌లో లేదా శుభ్రమైన కాగితంలో గట్టిగా చుట్టి, ఆ తర్వాత వాటిని ఫ్రిజ్‌లోని ఎయిర్ టైట్ కంటైనర్ లో నిల్వ చేయాలి. ఇలా చేస్తే బెల్లం జిగటగా మారడం, కరగడం వంటివి జరగవు.                      *రూపశ్రీ.
ఒక్కసారి ఆలోచించండి.. ఉదయం నిద్రలేవగానే మీరు చూసే మొదటి ముఖం ఎవరిది? మీ భాగస్వామిదా లేక మీ మొబైల్ ఫోన్ స్క్రీనా? ఒకప్పుడు పక్కపక్కనే కూర్చుని మనసు విప్పి మాట్లాడుకునే వాళ్ళం, కానీ ఇప్పుడు పక్కనే ఉన్నా ఎవరి ఫోన్లలో వాళ్ళు బిజీగా ఉంటున్నాం. నేటి కాలంలో మొబైల్ ఫోన్ మన అందరికీ "మొదటి లైఫ్ పార్ట్నర్" (First Life Partner) గా మారిపోయింది. ఈ డిజిటల్ వ్యసనం వల్ల మన మధ్య ఉండాల్సిన క్వాలిటీ టైమ్ మాయమైపోతోంది. ఈ పరిస్థితిని మార్చుకుని, మళ్ళీ మన బంధాలను ఎలా చిగురింపజేసుకోవాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. మొబైల్ వాడకాన్ని ఎందుకు తగ్గించాలి? (Why Should We?) మొబైల్ పక్కన పెట్టి మనుషులతో గడపడం ఎందుకు ముఖ్యం అంటే: సరైన నిర్ణయాలు తీసుకోవడానికి: ముఖాముఖి మాట్లాడుకున్నప్పుడే ఒక విషయంపై చర్చించి సరైన నిర్ణయం (Decision making) తీసుకోగలం. గౌరవం ఇవ్వడం: ఎదుటి వ్యక్తి మాట్లాడుతున్నప్పుడు ఫోన్ చూసుకోకుండా ఉండటం కనీస గౌరవం. బంధం బలపడటానికి: వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య లేదా ఫ్యామిలీ మధ్య క్వాలిటీ టైమ్ గడపడం వల్ల అనుబంధం పెరుగుతుంది. ఏమి చేయకూడదు? (What Not To Do?) మనకు తెలియకుండానే చేసే ఈ తప్పులు బంధాలను దూరం చేస్తున్నాయి: మొదటి ప్రాధాన్యత ఇవ్వకండి: ఫోన్ కంటే ముందు మనిషికి ప్రాధాన్యత ఇవ్వాలి. ఫోన్ ఫస్ట్ లైఫ్ పార్ట్నర్ కాకూడదు. మధ్యలో మాట్లాడకండి: ఇద్దరు వ్యక్తులు మాట్లాడుకుంటున్నప్పుడు మధ్యలో అకస్మాత్తుగా ఫోన్ కాల్ వస్తే అక్కడి నుండి వెళ్ళిపోవడం లేదా గట్టిగా మాట్లాడటం చేయకూడదు. దీనివల్ల అవతలి వాళ్ళు చిన్నబుచ్చుకుంటారు. ముఖ్యమైన సందర్భాల్లో వాడొద్దు: పెళ్లి చూపులు వంటి ముఖ్యమైన చర్చల్లో పాల్గొన్నప్పుడు మొబైల్స్ చూస్తూ కూర్చోవడం వల్ల వచ్చిన అసలు ఉద్దేశమే మర్చిపోయే ప్రమాదం ఉంది. ముందుకు వెళ్ళే మార్గం - చిట్కాలు (How-To Points): మొబైల్ వ్యసనం నుండి బయటపడటానికి ఈ చిన్న మార్పులు చేయండి: సెల్ఫ్ డిసిప్లిన్ (Self-discipline): మొబైల్ వాడకం విషయంలో మనకు మనమే ఒక క్రమశిక్షణ విధించుకోవాలి. సైలెంట్ మోడ్‌లో పెట్టండి: ఎవరితోనైనా క్వాలిటీ టైమ్ గడుపుతున్నప్పుడు లేదా రెస్టారెంట్లకు వెళ్ళినప్పుడు ఫోన్‌ను సైలెంట్ మోడ్‌లో పెట్టి దూరంగా ఉంచండి. ముందే చెప్పండి: ఎవరైనా ఇంపార్టెంట్ వ్యక్తులు ఉంటే, వారికి "నేను ఒక గంట పాటు బిజీగా ఉంటాను, తర్వాత కాల్ చేస్తాను" అని మెసేజ్ పెట్టి మీ క్వాలిటీ టైమ్‌ను ఆస్వాదించండి. పరస్పర అంగీకారం: భార్యాభర్తలు ఇద్దరూ కలిసి "మనం బయటికి వెళ్ళినప్పుడు మొబైల్స్ వాడొద్దు" అని ఒక రూల్ పెట్టుకోవాలి. ఎవరైనా వాడితే రెండో వ్యక్తి నిర్మొహమాటంగా గుర్తు చేయాలి. ప్రశ్నలు - సమాధానాలు (Q&A): ప్రశ్న: బోర్ కొట్టినప్పుడు మొబైల్ చూడటం తప్పా? సమాధానం: బోర్ కొట్టినప్పుడు ఫోన్ చూడటం సహజమే, కానీ ఎదురుగా ఒక మనిషి ఉన్నప్పుడు వారిని వదిలేసి ఫోన్ చూస్తూ కూర్చోవడం సరైన పద్ధతి కాదు. ఇది గౌరవం మరియు కామన్ సెన్స్ (Common sense) కి సంబంధించిన విషయం. ప్రశ్న: ఫోన్ వాడొద్దు అని చెబితే అవతలి వారు కోప్పడితే ఏం చేయాలి? సమాధానం: ఇది కోప్పడాల్సిన విషయం కాదు. "మనం ఈ సమయాన్ని సరదాగా గడపడానికి వచ్చాం, కాసేపు ఫోన్ పక్కన పెడదాం" అని సున్నితంగా చెప్పడం అలవాటు చేసుకోవాలి. మొబైల్ ఫోన్ అనేది మన అవసరానికి మాత్రమే, మన జీవితం అవ్వకూడదు. మన కళ్ళ ముందు ఉన్న మనుషుల కంటే, ఆ స్క్రీన్ లో కనిపించే ప్రపంచం ముఖ్యం కాదు. కాబట్టి, నేటి నుండే మీ మొబైల్‌ను కాసేపు పక్కన పెట్టి మీ ప్రియమైన వారితో ఆనందంగా గడపండి. అది మీ సెల్ఫ్ డిసిప్లిన్ మీద మాత్రమే ఆధారపడి ఉంటుంది. మరిన్ని ఆసక్తికరమైన విషయాల కోసం మా Naveena Column యూట్యూబ్ ఛానెల్‌ని సందర్శించండి! సబ్స్క్రైబ్ చేసుకోండి.
సాధారణంగా తాంబూలం వేసుకోవడం అనేది మన సంప్రదాయంలో ఒక భాగం. కానీ, ఆ తాంబూలానికి కొన్ని ప్రత్యేకమైన ఆయుర్వేద మూలికలను జత చేస్తే, అది గుండెను రక్షించే ఒక అద్భుతమైన ఔషధంగా మారుతుందని మీకు తెలుసా? హార్ట్ ఎటాక్ ప్రమాదాన్ని తగ్గించడంలో ఈ 'ఆయుర్వేద పాన్' అద్భుతంగా పనిచేస్తుంది. గుండె రక్తనాళాల్లో అడ్డంకులను (Blockages) తొలగించి, గుండెపోటు రాకుండా కాపాడే ప్రత్యేక ఆయుర్వేద పాన్/తాంబూలం తయారీ విధానం మరియు దాని ప్రయోజనాలు ఈ వీడియోలో చూడండి. ఈ వీడియోలో గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరిచే హార్ట్ స్పెషల్ తాంబూలం తయారీని వివరించారు: ఈ ఆయుర్వేద తాంబూలానికి కావలసినవి: తమలపాకు: ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది మరియు ఔషధ గుణాలను రక్తంలోకి త్వరగా చేరుస్తుంది. అర్జున చెట్టు బెరడు చూర్ణం: గుండె పనితీరును మెరుగుపరచడంలో ఇది అగ్రగామి. వెల్లుల్లి: రక్త నాళాల్లో పేరుకుపోయిన కొవ్వును (Cholesterol) కరిగించి, అడ్డంకులను తొలగిస్తుంది. అల్లం లేదా సొంఠి: రక్త ప్రసరణను సాఫీగా చేస్తుంది. దాల్చిన చెక్క: రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుంది. ఎలా తీసుకోవాలి? వీడియోలో చూపిన విధంగా, తమలపాకులో ఈ మూలికలను సరైన మోతాదులో ఉంచి, తాంబూలంలా చప్పరిస్తూ తీసుకోవాలి. ఇది రక్తాన్ని పల్చగా ఉంచి, గడ్డకట్టకుండా (Blood Clots) చేయడంలో సహాయపడుతుంది. ప్రయోజనాలు: గుండె రక్తనాళాల్లో బ్లాకేజీలు ఏర్పడకుండా నిరోధిస్తుంది. చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి, గుండె కండరాలను దృఢంగా మారుస్తుంది. అధిక రక్తపోటు (BP) సమస్యను అదుపులో ఉంచుతుంది. శరీరంలోని వ్యర్థాలను తొలగించి జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.   మరిన్ని ఆరోగ్య సూచనలు మరియు పరిష్కారాల కోసం మా యూట్యూబ్ ఛానెల్ "TeluguOne Health" ను సందర్శించి సబ్‌స్క్రైబ్ చేయండి! సూచన: ఇది కేవలం సమాచారం కోసం మాత్రమే. తీవ్రమైన గుండె సమస్యలు ఉన్నవారు వైద్యుల సలహా మేరకు మాత్రమే వీటిని ప్రయత్నించాలి.
వేసవి వాతావరణం శరీరాన్ని అలసటకు గురి చేయడమే కాకుండా, జీర్ణక్రియ , శక్తి పై కూడా ప్రభావం చూపుతుంది. ఆయుర్వేదం ప్రకారం, ఆరోగ్యకరమైన శరీరం , మనస్సును కాపాడుకోవడానికి వేసవి కాలంలో ఆహారంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టడం చాలా ముఖ్యం. ఎందుకంటే వేసవిలో పిత్త తత్వం మరింత చురుకుగా ఉంటుంది, ఇది కడుపులో మంట, జీర్ణ సమస్యలు , అలసటకు దారితీస్తుంది. అందువల్ల, ఆయుర్వేదం కొన్ని రకాల ఆహారాలను తినమని , మరికొన్నింటిని తినకుండా ఉండమని సిఫార్సు చేస్తుంది. ఆయుర్వేదం చెప్పిన తినాల్సిన, తినకూడని ఆహారాలు ఏంటో తెలుసుకుంటే.. వేసవిలో ఏం తినాలి? వేసవిలో శరీరం బాగా వేడెక్కి, పిత్త దోషం పెరుగుతుంది. అందువల్ల, తేలికైన, చల్లని ఆహారాలు తినడం చాలా అవసరం. కర్బూజా, పుచ్చకాయ, మామిడి వంటి తాజా పండ్లు శరీరాన్ని చల్లబరిచి, కోల్పోయిన నీటిని తిరిగి అందిస్తాయి. చల్లని పాలు , పెరుగు శరీరాన్ని చల్లబరుస్తాయి. జీర్ణ వ్యవస్థను సమతుల్యం చేస్తాయి. పీచుపదార్థాలు అధికంగా ఉండే సలాడ్‌లు , తేలికపాటి కూరగాయలు జీర్ణక్రియను సులభతరం చేసి, కడుపులో వేడి అసమతుల్యతను నివారిస్తాయి. చల్లని జ్యూస్‌లు , కొబ్బరి నీరు సహజ ఎలక్ట్రోలైట్‌లను అందించి, శరీరాన్ని తేమగా ఉంచుతాయి. వేసవిలో ఏం తినకూడదు? వేసవిలో వేయించిన , బరువైన ఆహారాలకు దూరంగా ఉండాలి,  అవి జీర్ణక్రియను నెమ్మదింపజేసి, కడుపులో వేడిని పెంచుతాయి. అందుకే ఈ ఆహారాలకు దూరంగా ఉండాలి. అధిక మసాలాలు గల వంటకాలతో పాటు, కాఫీ , టీ వంటి కెఫిన్ పానీయాలు,  అధిక నూనె లేదా తీపి పదార్థాలు పిత్త దోషాన్ని పెంచి, శరీరాన్ని అసమతుల్యం చేస్తాయి. వేసవిలో కెఫిన్‌కు వీలైనంత దూరంగా ఉండాలి. ఇవి గుర్తుంచుకోవాలి.. రోజులో ఎక్కువసార్లు కొద్దికొద్దిగా ఆహారం తీసుకోవడం జీర్ణక్రియకు సహాయపడి, శక్తిని నిలుపుతుంది.   శరీరం చల్లగా, ఆరోగ్యంగా ఉండాలంటే, తేలికైన, నీరు అధికంగా ఉండే ఆహారానికి ప్రాధాన్యత ఇవ్వాలి.   చల్లని పదార్థాలను తీసుకోవడం వల్ల పైత్యరసం అదుపులో ఉండి, వేసవిలో అలసట , చికాకును నివారిస్తుంది.                                *రూపశ్రీ.  
మలబద్ధకం (Constipation) సమస్యకు ప్రధాన కారణాలు, లక్షణాలు మరియు సులభమైన ఆయుర్వేద గృహ చిట్కాల గురించి ఈ వీడియోలో వివరంగా తెలుసుకోండి. నేటి కాలంలో మారుతున్న ఆహారపు అలవాట్లు, పని ఒత్తిడి మరియు జీవనశైలి కారణంగా చాలా మందిని వేధిస్తున్న ప్రధాన సమస్య మలబద్ధకం (Constipation). దీనినే తెలుగులో 'మలబద్ధకం' అని కూడా అంటారు. ఇది కేవలం ఒక సమస్య మాత్రమే కాదు, సకాలంలో దీనిని నివారించకపోతే ఇతర తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు దారితీసే అవకాశం ఉంది. ఈ వీడియోలో మలబద్ధకం గురించి పూర్తి సమాచారాన్ని నిపుణులు వివరించారు: మలబద్ధకం రావడానికి ప్రధాన కారణాలు: ఆహారంలో పీచు పదార్థం (Fiber) తక్కువగా ఉండటం. శరీరానికి సరిపడా నీరు తాగకపోవడం. సరైన సమయానికి ఆహారం తీసుకోకపోవడం.  శారీరక శ్రమ లేకపోవడం లేదా రోజంతా కూర్చుని పనిచేయడం. మానసిక ఒత్తిడి మరియు నిద్రలేమి. లక్షణాలు: వారానికి మూడు సార్లు కంటే తక్కువ మలవిసర్జన జరగడం. కడుపు ఉబ్బరంగా ఉండటం మరియు గ్యాస్ సమస్యలు. మల విసర్జన సమయంలో తీవ్రమైన నొప్పి లేదా ఇబ్బంది కలగడం. ఆకలి మందగించడం. ఆయుర్వేద గృహ చిట్కాలు (Home Remedies): మలబద్ధకాన్ని వదిలించుకోవడానికి ఆయుర్వేదంలో అద్భుతమైన మార్గాలు ఉన్నాయి. ఈ వీడియోలో సూచించిన కొన్ని ముఖ్యమైన చిట్కాలు: త్రిఫల చూర్ణం: ప్రతిరోజూ రాత్రి పడుకునే ముందు గోరువెచ్చని నీటిలో త్రిఫల చూర్ణం కలిపి తీసుకోవడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. ఆముదం (Castor Oil): తక్కువ మోతాదులో ఆముదాన్ని పాలలో కలిపి తీసుకోవడం వల్ల విరేచనం సాఫీగా అవుతుంది.  పండ్లు మరియు కూరగాయలు: పీచు పదార్థం ఎక్కువగా ఉండే ఆకుకూరలు, బొప్పాయి మరియు అరటిపండ్లను ఆహారంలో భాగం చేసుకోవాలి.  నీరు: రోజుకు కనీసం 3-4 లీటర్ల నీరు తాగడం వల్ల శరీరం డీహైడ్రేషన్ బారిన పడకుండా ఉంటుంది.  మలబద్ధకం సమస్య నుండి శాశ్వత ఉపశమనం పొందడానికి మరియు ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థను పెంపొందించుకోవడానికి ఈ వీడియోలో చెప్పిన సూచనలను తప్పక పాటించండి. మరిన్ని ఆరోగ్య సూచనలు మరియు పరిష్కారాల కోసం మా యూట్యూబ్ ఛానెల్ "TeluguOne Health" ను సందర్శించి సబ్‌స్క్రైబ్ చేయండి!