LATEST NEWS
బ్యాంకింగ్ నిబంధనలు ప్రజలకు సాయపడాలి కానీ, వారిని క్షోభకు గురిచేయకూడదు. కానీ ఒడిశాలో ఓ బ్యాంకు అధికారుల మొండితనం ఒక వ్యక్తిని తన సోదరి సమాధిని తవ్వి ఆమె అస్థిపంజరాన్ని బ్యాంకు గడపకు తీసుకువచ్చేలా చేసింది.  అసలేం జరిగిందంటే.. ఒడిశాకు చెందిన ఒక నిరుపేద వ్యక్తి తన సోదరి మరణానంతరం ఆమె బ్యాంకు ఖాతాలో ఉన్న ఇరవై  వేల రూపాయలు విత్ డ్రా చేసుకోవడానికి బ్యాంకును సంప్రదించాడు. ఆ డబ్బుతో ఆమె అంత్యక్రియల తాలూకు ఖర్చులు లేదా ఇతర అవసరాలు తీర్చుకోవాలని చెప్పాడు. అయితే అందుకు అధికారులు అంగీకరించలేదు. బ్యాంకులో సొమ్ము విత్ డ్రా చేయాలంటే.. ఖాతాదారుడు స్వయంగా వచ్చి తీరాలన్నారు. అలా రాలేని పక్షంలో సంతకం, లేదా వేలిముద్రకావాలని చెప్పారు.  తన సోదరి చనిపోయిందని, ఆమె రాలేదని  ఆ వ్యక్తి బ్యాంకు అధికారుల కాళ్లావేళ్లా పడినా ఫలితం లేకపోయింది. డెత్ సర్టిఫికేట్ ఉందని చెప్పినా బ్యాంకు అధికారులు వినకపోవడంతో..  తీవ్ర మనస్తాపానికి గురైన ఆ వ్యక్తి సంచలన నిర్ణయం తీసుకుని అమలు చేశాడు. బ్యాంకు నుంచి నేరుగా తన సోదరిని పూడ్చిపెట్టిన సమాధి వద్దకు వెళ్లాడు. ఆమె సమాధిని తవ్వి ఆమె అవశేషాలను (అస్తిపంజరం) వెలికి తీసి..మోసుకుంటూ మూడు కిలోమీటర్లు నడిచి బ్యాంకుకు వచ్చాడు. బ్యాంకు అధికారులకు తన సోదరి అస్తిపంజరాన్ని చూపుతూ.. ఆమె వచ్చింది.. ఇప్పుడు డబ్బులు ఇవ్వండంటూ డిమాండ్ చేశాడు.   ఈ సంఘటన అందరి చేతా కన్నీళ్లు పెట్టించింది.  వివరాలిలా ఉన్నాయి.. కియోన్‌ఝర్‌ జిల్లాలోని దియానాలి గ్రామానికి చెందిన గిరిజనుడు జితు ముండా సోదరి కక్రా ముండా రెండు నెలల క్రితం మరణించింది. ఆమె భర్త, ఏకైక సంతానం కూడా ముందే చనిపోవడంతో జితు ఒక్కడే ఆమెకు దగ్గరి బంధువుగా మిగిలాడు. కక్రా పేరు మీద మల్లీపసిలోని ఒడిశా గ్రామీణ బ్యాంకులో ఖాతా ఉండగా, అందులో రూ.19,300 ఉన్నాయి. ఆ సొమ్ము తీసుకునేందుకు జితు ముండా బ్యాంకుకు వస్తే.. అధికారులు  నిబంధనల ప్రకారం అడ్డు చెప్పారు. ఈ ఘటనపై నెటిజనులు బ్యాంకు అధికారుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాగితాలకే విలువఇస్తూ మానవత్వాన్ని మరిచారని దుమ్మెత్తి పోస్తున్నారు. 
వైసీపీ సోషల్ మీడియా విచారణలో కీలక పరిణామం చోటుచేసుకుంది. సోషల్ మీడియా వేదికగా జరిగిన దాడులు, అసభ్యకర పోస్టుల వెనుక ఉన్న ఆర్థిక మూలాల గురించి పోలీసులు సజ్జల భార్గవ్‌రెడ్డిని సుదీర్ఘంగా ప్రశ్నించారు. గత ప్రభుత్వ హయాంలో సోషల్ మీడియా వేదికగా రాజకీయ ప్రత్యర్థులను లక్ష్యంగా చేసుకుని చేసిన దాడుల కేసులో వైసీపీ సోషల్ మీడియా అప్పటి ఇన్‌ఛార్జ్ సజ్జల భార్గవ్‌రెడ్డిని పులివెందుల పోలీసులు విచారించారు. సుమారు 9 గంటల పాటు సాగిన ఈ విచారణలో పోలీసులు ఆయనపై దాదాపు 70 ప్రశ్నలను సంధించారు. ముఖ్యంగా ఈ కార్యకలాపాలకు నిధులు ఎక్కడి నుండి వచ్చాయి? ఈ నెట్‌వర్క్‌ను నడపడానికి ఎవరెవరు సహకరించారు? అనే కోణంలో దర్యాప్తు సాగింది.  విచారణ సమయంలో పోలీసులు ముఖ్యంగా నిధుల వ్యవహారంపై ఆరా తీశారు. సోషల్ మీడియా వింగ్ నడపడానికి భారీ మొత్తంలో ఖర్చవుతుందని, ఆ నిధులను ఎవరు సమకూర్చారనేది ఇప్పుడు కేసులో కీలకంగా మారింది.  ఏ1 నిందితుడు వర్రా రవీందర్ రెడ్డి ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా భార్గవ్‌రెడ్డిని పోలీసులు ప్రశ్నించినట్లు తెలిసింది. అయితే విచారణకు సజ్జల భార్గవ్ రెడ్డి సహకరించలేదనీ, చాలా ప్రశ్నలకు ఆయన  తెలియదు, గుర్తులేదు' అని సమాధానమిచ్చినట్లు సమాచారం.ఈ కేసులో మరో ఆసక్తికర అంశం ఏమిటంటే..  నిందితులు వాడిన పరికరాల గురించి పోలీసులు అడిగిన ప్రశ్నలు. పోస్టులు పెట్టడానికి ఉపయోగించిన మొబైల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌లను అప్పగించాలని పోలీసులు కోరగా..  భార్గవ్‌రెడ్డి   నిరాకరించినట్లు తెలుస్తోంది. కోర్టు ఆదేశాలు ఉంటేనే వాటిని ఇస్తానని ఆయన స్పష్టం చేశారని అంటున్నారు. రాజకీయ నేతలను, ముఖ్యంగా మహిళా నేతలను లక్ష్యంగా చేసుకుని చేసిన అసభ్యకర పోస్టుల వెనుక ఎవరి ప్రోద్బలం ఉందనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. షర్మిల, విజయమ్మ వంటి వారిపై జరిగిన వ్యక్తిగత దాడుల వెనుక ఉన్న అసలు సూత్రధారులను గుర్తించేందుకు పోలీసులు సాంకేతిక ఆధారాలను విశ్లేషిస్తున్నారు. ఈ పోస్టుల తయారీ మరియు వ్యాప్తి కోసం ప్రత్యేక టీమ్‌లు పనిచేశాయని పోలీసులు అనుమానిస్తున్నారు. గతంలో అన్నమయ్య ప్రాజెక్ట్ వంటి సున్నితమైన అంశాలపై కూడా సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలు జరిగాయనే ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే పోలీసుల దర్యాప్తు కేవలం పోస్టులకే పరిమితం కాకుండా, ఆ వ్యవస్థ వెనుక ఉన్న ఆర్థిక వనరులపై కూడా ఫోకస్ పెట్టింది. తదుపరి విచారణలో మరిన్ని కీలక విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతానికి భార్గవ్‌రెడ్డికి మరోసారి నోటీసులు జారీ చేసిన పోలీసులు, తదుపరి విచారణకు హాజరుకావాలని ఆదేశించారు. ఈ కేసులో మరికొంత మంది వైసీపీ నేతలకు కూడా నోటీసులు అందే అవకాశం ఉందని రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది.  
  బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి రాష్ట్ర స్థాయి కమిటీ మినహా అన్ని కమిటీలను పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ రద్దు చేశారు. త్వరలోనే అన్ని స్థాయిల్లో కొత్త కమిటీలను నియమించాలని ఆదేశాలు జారీ చేశారు. కొత్తగా నియమించబోయే కమిటీలకు శిక్షణా తరగతులు కూడా నిర్వహించనున్నారు. పార్టీ పునర్వ్యవస్థీకరణ బాధ్యతలను వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు కేసీఆర్ అప్పగించారు. ఈ నిర్ణయాన్ని పార్టీ అంతర్గత సమావేశంలో ప్రకటించారు. ఈ సందర్భంగా కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య తెలంగాణపై అవమానకర వ్యాఖ్యలు చేసినప్పుడు… తెలంగాణకు చెందిన కాంగ్రెస్, బీజేపీ ఎంపీలు మౌనం పాటించారని విమర్శించారు. “వాళ్లు తెలంగాణలో పుట్టలేదా? తెలంగాణ పౌరుషం లేదా?” అని ప్రశ్నించారు.“ఒక్క బీఆర్ఎస్ ఎంపీ ఉన్నా… క్షమాపణ చెప్పించేవాళ్లం” అని కేసీఆర్ అన్నారు. కాంగ్రెస్, బీజేపీ ఎంపీలు స్పందించకపోవడం పౌరుషం లేని వ్యవహారమని విమర్శించారు. ఇక రాష్ట్ర ప్రభుత్వంపై కూడా కేసీఆర్ తీవ్ర విమర్శలు చేశారు. గతంలో తెలంగాణను వ్యవసాయం సహా అన్ని రంగాల్లో ముందంజలో నిలబెట్టామని… ఇప్పుడు మాత్రం భూముల కబ్జాలు, కూల్చివేతల్లో నెంబర్ వన్‌గా మార్చే ప్రయత్నం జరుగుతోందన్నారు.ధాన్యం కొనుగోళ్ల విషయంలో ప్రభుత్వం విఫలమైందని… రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి, మంత్రుల తీరు చూస్తే జాలి వేస్తోందని వ్యాఖ్యానించారు. ఈ సమావేశంలో జీవన్ రెడ్డిని జనరల్ సెక్రటరీగా ప్రకటించి, కార్యవర్గానికి పరిచయం చేశారు కేసీఆర్.  
తెలంగాణ రాజకీయ యవనికపై  భారత రాష్ట్ర సమితి  అధినేత కే. చంద్రశేఖరరావు తనయ, మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల  ఎంట్రీ సంచలనాలకు వేదికైంది. పార్టీ ప్రకటన సందర్భంగా తన కన్నతండ్రిపై ఆమె చేసిన వ్యాఖ్యలు, విమర్శలు హాట్ టాపిక్ గా మారాయి. తండ్రి చాటు బిడ్డగా రాజకీయాలలో ఎదిగిన కల్వకుంట్ల కవిత.. ఇప్పుడు  తండ్రి బాటను వీడి సొంతంగా రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించడం  చర్చనీయాంశమైంది.  తెలంగాణ రాష్ట్ర సేన (టీఆర్ఎస్) పేరుతో సరికొత్త పార్టీని ప్రకటించిన ఆమె, గతంలో తండ్రి స్థాపించిన పార్టీ పేరులోని అక్షరాలనే మళ్ళీ తెరపైకి తీసుకురావడం ఆసక్తిరేకెత్తిస్తోంది. అన్నిటికీ మించి తన తండ్రిని మరమనిషి, గుంటనక్కల చేతిలో బంది అంటూ ఓ రేంజ్ లో విమర్శించడంతో అంతా దీనిపై బీఆర్ఎస్ రియాక్షన్ ఏ స్థాయిలో ఉంటుందా అని ఇసక్తిగా ఎదురు చూశారు. బీఆర్ఎస్ 25వ వ్యవస్థాపక దినం పురస్కరించుకుని కేసీఆర్, కేటీఆర్ కవిత వ్యాఖ్యలకు దీటుగా సమాధానం ఇస్తారని ఆశించారు. అయితే అందుకు భిన్నంగా కేసీఆర్, కేటీఆర్ ల మౌనం అందరినీ విస్మయపరిచింది.   ముఖ్యంగా కేసీఆర్ మౌనం వ్యూహమా? భయమా అన్న చర్చ ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో హాట్ హాట్ గా సాగుతోంది. కేసీఆర్ ను టార్గెట్ చేస్తూ కవిత వ్యాఖ్యల వెనుక పటిష్టమైన, పకడ్బందీ వ్యూహం ఉందని పరిశీలకులు అంటున్నారు.  అయితే కేసీఆర్ మౌనమే ఇప్పుడు అందరికి అర్ధం కాకుండా పోయింది.  తాజాగా కవిత చేసిన వ్యాఖ్యలపైనే కాదు.. ఆమెను  నుండి కవితను బహిష్కరించిన నాటి నుండి ఇప్పటి  వరకూ కేసీఆర్   ఏ సందర్భంలోనూ తన కుమార్తె గురించి పల్లెత్తు మాట మాట్లాడలేదు.  కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో కవిత చేసిన అవినీతి ఆరోపణల నుంచి తనను మరమనిషిగా అభివర్ణించడం వరకూ కవిత ఎంత పరుషంగా మాట్లాడినా కేసీఆర్ మాత్రం మౌనాన్నే ఆశ్రయించారు.  దీంతో కేసీఆర్ మౌనం వ్యూహాత్మక, కన్నబిడ్డ అన్న మమకారమా? అన్న చర్చ జరుగుతోంది.   కేసీఆర్ మౌనం ఇలాగే కొనసాగితే.. రానున్న రోజులలో బీఆర్ఎస్ ఓటు బ్యాంకును కవిత భారీగా చీల్చడం ఖాయమన్న భావన పార్టీ వర్గాలలోనే వ్యక్తమౌతోంది.  
  తమిళనాడులో ఎన్నికల పోలింగ్‌ ముగియడంతో.. అన్ని పార్టీలూ గెలుపు అంచనాల్లో నిమగ్నమయ్యాయి. ఇక, తొలిసారి ఎన్నికల్లో పోటీ చేసిన విజయ్‌ నేతృత్వంలోని టీవీకే ప్రభావం ఏ మేరకు ఉంటుందనేది సర్వత్రా ఆసక్తికరంగా మారింది.  విజయ్‌ పాపులారిటీ, అనూహ్యంగా పెరిగిన పోలింగ్‌, ప్రశాంతంగా ఎన్నికలు ముగియడం వంటి కారణాలతో.. టీవీకే ప్రభావాన్ని అంచనా వేస్తున్నారు. ఇక, విజయ్ తన పార్టీ గెలుపుపై భారీగా ఆశలు పెట్టుకున్నారని.. ఆయన ఏకంగా మంత్రివర్గంలో ఎవరెవరు ఉండాలనే జాబితాను సైతం ఆల్రెడీ సిద్ధం చేశారనే ప్రచారం కూడా జరుగుతోంది.  ఇంత‌కీ ఈ జాబితాలో ఎవ‌రి పేర్లు ఉన్నాయి? అని చూస్తే.. బుస్సీ ఆనంద్. ఈయ‌న‌ టీవీకే జనరల్ సెక్రటరీ. ఈయన విజయ్‌కు అత్యంత సన్నిహితుడు, అంతేనా పార్టీ వ్యవహారాలన్నీ చూసుకునే వ్యక్తి. ఈయనకు అత్యంత కీలకమైన శాఖ- బహుశా హోం లేదా మున్సిపల్ శాఖ.. దక్కే అవకాశం ఉందని అంటున్నారు. ఆదవ్ అర్జున. ఈయన ఎన్నికల వ్యూహకర్తగా పేరుపొందారు. ఈయనకు ఆర్థిక లేదా ఐటీ శాఖల బాధ్యతలు అప్పగించవచ్చని ప్రచారం జరుగుతోంది.కె.ఎ. సెంగోట్టయన్. గతంలో ఏఐఏడీఎంకే లో సీనియర్ మంత్రిగా పనిచేసిన ఈయన, విజయ్ పార్టీలో చేరడంతో ఆయన అనుభవాన్ని దృష్టిలో ఉంచుకుని కీలక శాఖ ఇచ్చే అవకాశం ఉంది. వేణుగోపాల్, మాజీ ఎంపీ. ఈయనకు కూడా సీనియారిటీ కోటాలో చోటు దక్కవచ్చని సమాచారం. కె.జి. అరుణ్‌రాజ్. పార్టీ సిద్ధాంతకర్త, ప్రచారంలో కీలక పాత్ర పోషించిన ఈయన పేరు కూడా పరిశీలనలో ఉంది.మహిళా కోటా విష‌యానికి వ‌స్తే.. విజయ్ తన మంత్రివర్గంలో మహిళలకు సముచిత స్థానం కల్పించాలని భావిస్తున్నట్లు, ఇందులో భాగంగా విజయలక్ష్మి వంటి మహిళా నేతల పేర్లు వినిపిస్తున్నాయి. కేవలం అనుభవం ఉన్నవారినే కాకుండా, చదువుకున్న యువతను కూడా తన కేబినెట్‌లోకి తీసుకోవాలని విజయ్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ పేర్లు కేవలం రాజకీయ విశ్లేషకులు, పార్టీ వర్గాల నుంచి అందుతున్న లీకుల ఆధారంగానే ప్రచారంలో ఉన్నాయి. మే 4వ తేదీన వెలువడే ఫలితాల తర్వాతే ఈ జాబితాపై పూర్తి స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఇదిలా ఉంటే తొంద‌ర ప‌డి ముందే కూసిన కోయిల‌లు త‌ర్వాత బొక్క బోర్లా ప‌డ్డం  కూడా ఉంది. గ‌త ఏపీ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో వైయ‌స్ జ‌గ‌న్ త‌న పార్టీ వ‌ర్గాల వారిని ఒక హైప్ లో ఉంచ‌డానికిగానూ.. ప్ర‌మాణ స్వీకార వేదిక‌, హోట‌ళ్ల బుకింగ్ వంటి ఎన్నో ముంద‌స్తు ఏర్పాట్లు చేసిన‌ట్టు ప్ర‌చారం జ‌రిగింది. కానీ, అది కాస్తా తుస్సు మ‌న‌డంతో వైసీపీ కార్య వ‌ర్గ‌మంతా  డీలా ప‌డిపోయింది.  అన్న‌ట్టు ఎన్డీయే కూట‌మి చంద్ర‌బాబును త‌మ తెలుగు బ్రాండ్ అంబాసిడ‌ర్ గా చూపితే, విజ‌య్ తాను జ‌గ‌న్ తో క‌ల‌సి దిగిన ఫోటోల‌ను ప్ర‌ద‌ర్శించారు. ఇప్పుడు చూస్తే ఆయ‌న‌లా ముంద‌స్తు జాబితాలు సిద్ధం చేయ‌డం వంటి హంగామా చూస్తుంటే ఇదేదో తేడాగా ఉందే అన్న అనుమానాలు కూడా వ‌స్తున్నాయ్. ఎందుకంటే ఏ స‌ర్వే కూడా విజ‌య్ కి 10- ప‌దిహేను సీట్ల కంటే ఎక్కువ వ‌చ్చేలా చెప్ప‌లేదు. అందుకే ఈ హంగామా చూస్తుంటే డౌట్ గా ఉందంటున్నారు కొంద‌రు.
ALSO ON TELUGUONE N E W S
వెంకటేష్ నటించిన హార్ట్ టచింగ్ సినిమా అబ్బాయిగారు ఇప్పటికీ ప్రేక్షకుల మనసుల్లో స్థానం సంపాదించింది. ఇ.వి.వి. సత్యనారాయణ దర్శకత్వం వహించిన ఈ చిత్రం తల్లి-కొడుకు సంబంధాలు, కపట ప్రేమ, కుటుంబ విలువలను ఎంతో భావోద్వేగంగా చూపించింది. ముఖ్యంగా తల్లి కొడుక్కి విషం ఇచ్చినట్టు సృష్టించిన సస్పెన్స్ సీన్స్ ఇప్పటికీ అనేక మంది గుండెల్లో రాతి మాదిరి కూరుకుపోయి ఉన్నాయి. దొర‌బాబుకి త‌ల్లంటే ఎంతో గౌర‌వం, ప్రేమ‌. త‌ల్లిని ఒక దేవ‌త‌గా భావిస్తాడు. కానీ, ఆ స‌వ‌తి త‌ల్లి ద్వంద్వ ప్రవర్తన ప్రేక్షకులను ఒక్కసారిగా ఆలోచింపజేస్తుంది. “తల్లే కన్న కొడుక్కి విషం ఇచ్చిందా?” అనే ప్రశ్న చుట్టూ తిరిగే క్లైమాక్స్ సీన్స్ వెంకటేష్ యాక్టింగ్‌కు మరో డైమెన్షన్ ఇచ్చాయి. అతని కళ్లలోని బాధ, ఆశ్చర్యం, కోపం అన్నీ కలిసి ప్రేక్షకులకు క‌న్నీళ్లు తెప్పిస్తాయి.  జ‌య‌చిత్ర ఈ పాత్ర‌లో జీవించింది. సవతి తల్లి పాత్రలో ఆమె చూపించిన భావాలు, ముఖ కవలికలు ఎంతో సహజంగా ఉన్నాయి. జయచిత్ర, శ్రీకాంత్, నూతన్ ప్రసాద్, కోట శ్రీనివాస్ రావు, బ్రహ్మానందం వంటి నటీనటులు కూడా తమ పాత్రలకు బలం చేకూర్చారు. కీర‌వాణి సంగీతం భావోద్వేగ సన్నివేశాలకు జీవం పోసింది. ఈ వీడియోలో చూపించిన అల్టిమేట్ సీన్స్‌లో తల్లి-కొడుకు మధ్య జరిగే ఆ భావోద్వేగ ముహూర్తాలు ఇప్పటికీ సినిమా ప్రేమికులను ఆకట్టుకుంటున్నాయి. కుటుంబ విలువలు, నిజాయితీ, ప్రేమ వంటి అంశాలు ఈ చిత్రాన్ని ఒక్కసారి చూస్తే మరచిపోలేని అనుభూతిని ఇస్తాయి. ప్రస్తుతం కూడా అనేక మంది ప్రేక్షకులు ఈ సినిమాను మళ్లీ థియేటర్లలో రీ-రిలీజ్ చేయాలని కోరుతున్నారు. “ఇలాంటి విలువలు ఉన్న సినిమాలు ఇప్పుడు అరుదుగా వస్తున్నాయి” అని చాలా మంది కామెంట్లు చేస్తున్నారు. అబ్బాయిగారు ఇప్పటికీ సెంటిమెంటల్ సినిమాల ప్రేమికులకు ఒక గుడ్ ఆప్షన్‌గా నిలుస్తోంది. వెంకటేష్ యాక్టింగ్ కోసం ఈ వీడియో త‌ప్ప‌నిస‌రిగా చూడాలి. ఇలాంటి భావోద్వేగ‌భ‌రిత‌మైన వీడియోల కోసం మా Teluguone youtube channelను Subscribe చేసుకోండి. 
  'ది ప్యారడైజ్(The Paradise)కోసం నాచురల్ స్టార్  నాని(Nani)అభిమానులతో పాటు మూవీ లవర్స్, ప్రేక్షకులందరూ ఎంతగానో వెయిట్ చేస్తున్నారు. ఆ ఎదురుచూపుల విషయంలో ఆ ముగ్గురి హార్ట్ బీట్ ఒకే రేంజ్ లో కూడా ఉంటుంది. దీన్ని బట్టి  ప్యారడైజ్ పై ఉన్న అంచనాలు ఏ పాటివో అర్ధం చేసుకోవచ్చు.  రీసెంట్ గా ఈ చిత్రం నుంచి ఒక ఫైట్ సీన్ లీక్ అయ్యింది. సదరు సీన్ యూ ట్యూబ్ లో ప్రత్యక్షంగా కనపడే సరికి ఫ్యాన్స్ షాక్ అవుతు సెట్‌లో భద్రత కట్టుదిట్టం చేయాలని కోరుతున్నారు. ఈ విషయంపై  నిర్మాణ సంస్థ కూడా స్పందిస్తు సెట్స్ వద్ద మొబైల్ ఫోన్లని పూర్తిగా నిషేధించడంతో పాటు, లీక్ చేసిన వారిని గుర్తించేందుకు సైబర్ క్రైమ్ పోలీసుల సహకారం కోరుతున్నామని, ఇప్పటికే వైరల్ అయిన లింకులను తొలగించేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. Also read: RC16 లీక్ కలకలం: రామ్ చరణ్ పెద్ది స్పెషల్ సాంగ్ విజువల్స్ అవుట్ పెద్ది(Peddi)నుంచి కూడా శృతి హాసన్ స్పెషల్ సాంగ్ కి సంబంధించిన విజువల్స్ లీక్ అయ్యాయి. ఇక ఒకే రోజు పెద్ది, ప్యారడైజ్ లీక్ ల బారిన పడటం వైరల్ గా మారింది.   . "ఒక సినిమా నిర్మాణం వెనుక వేల మంది శ్రమ ఉంటుంది. ఇలాంటి లీకుల వల్ల వారి కష్టం వృధా అయ్యే అవకాశాలకి ఎక్కువ స్కోప్ ఉంది  
  మేకర్స్  అలసత్వంగా ఉంటారో లేక, సెట్ లో సినీ ఉగ్రవాదులు ఉంటారో తెలియదు కానీ, చిత్రీకరణ దశలో ఉండగానే సినిమాకి సంబంధించిన లీక్స్ బయటకి వచ్చేస్తున్నాయి. తాజాగా పెద్ది(Peddi)లీక్ ల బారిన పడింది.  శృతి హాసన్, చరణ్ మధ్య ఒక స్పెషల్ సాంగ్ ని ప్రస్తుతం చిత్రీకరిస్తున్నారు.ఈ సాంగ్ కి సంబంధించిన కొన్ని విజువల్స్ లీక్ అయ్యాయి. సెట్స్ లో చరణ్,శృతి డాన్స్ రిహార్సల్స్ చేస్తున్న విజువల్స్ నెట్టింట వైరల్ గా మారాయి. ఒక రకంగా ఈ లీక్ పెద్ది టీంకి  ఊహించని షాక్ అని  చెప్పవచ్చు. ఇక నుంచి లాంటి లీక్ ల బారిన పడకుండా పెద్దిని కాపాడాలని ఫ్యాన్స్ కోరుతున్నారు. రిలీజ్ డేట్ జూన్ 25 లోపు ఇంకెన్ని లీక్ ల బారిన పడాల్సి వస్తుందో అని ఫ్యాన్స్ తో పాటు సినీ ప్రియులు  ఆందోళన చెందుతున్నారు. also read:  Tollywood Trending:టాలీవుడ్ ట్రెండింగ్ లో ఈరోజు హెడ్ లైన్స్ చూద్దాం..  
  మనిషికి నిజమైన సంతోషాన్ని అందించే సాధనం ఏదైనా ఉంది అంటే అది కేవలం   సినిమానే. ఈ క్రమంలో తన డైలీ అప్ డేట్స్ ని సినిమా అనేది మన ముందు ఉంచుతుంది.మరి ఈ రోజు అప్ డేట్స్  ఏంటో చూద్దాం టాలీవుడ్ ట్రెండింగ్ లో ఈరోజు హెడ్ లైన్స్ చూద్దాం.. 1 .మహేష్ బాబు - రాజమౌళి 'వారణాసి' నెక్స్ట్ షెడ్యూల్ రాజమౌళి  మహేష్ బాబు నటిస్తున్న భారీ అడ్వెంచర్ డ్రామా 'వారణాసి' గురించి క్రేజీ అప్‌డేట్ వచ్చింది. ఈ సినిమా తదుపరి షెడ్యూల్‌ను అంటార్కిటికాలోని 'రోస్ ఐస్ షెల్ఫ్' వద్ద ప్లాన్ చేశారు. అంటార్కిటికాలో షూటింగ్ జరుపుకుంటున్న మొదటి భారతీయ చిత్రంగా కూడా రికార్డు సృష్టించనుంది. 2. రామ్ చరణ్ 'పెద్ది' సాంగ్ లీక్  రామ్ చరణ్  'పెద్ది' (Peddi)కి సంబంధించి ఒక సాంగ్ బిట్ సోషల్ మీడియాలో లీక్ అయింది. ఎవరు లీక్  చేసారో తెలియదు గాని సదరు లీక్డ్ విజువల్స్‌లో చరణ్ ఊరమాస్ లుక్‌లో కనిపిస్తుండటంతో ఫ్యాన్స్  అయితే ఫుల్ ఖుషీలో ఉన్నారు. పెద్ది వరల్డ్ వైడ్ గా  జూన్ 25, 2026న రిలీజ్ కానున్న విషయం తెలిసిందే. 3. నాని 'ది ప్యారడైజ్' యాక్షన్ సీక్వెన్స్ లీక్ రామ్ చరణ్ సినిమాతో పాటే నాని నటిస్తున్న 'ది ప్యారడైజ్' నుండి కూడా ఒక భారీ యాక్షన్ సీన్ లీక్ కావడం కలకలం రేపుతోంది. ఈ రెండు సినిమాల మేకర్స్ సెక్యూరిటీని మరింత కట్టుదిట్టం చేస్తున్నారు.   4 .  అషు రెడ్డి ఆడియో లీక్స్ కలకలం పెళ్లి చేసుకుంటానని నమ్మించి కోట్లాది రూపాయల నగదు, ఆస్తులు వసూలు చేయడమే కాకుండా ప్రాణహాని తలపెడుతుందంటు  ధర్మేంద్ర అనే NRI పోలీసులను ఆశ్రయించడం తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. ఈ కేసుకు సంబంధించి  అషు రెడ్డి  ఆడియో క్లిప్పులు బయటకు వచ్చాయి. నేను తీసుకున్న డబ్బులో కోటిన్నరే ఇస్తాను. మిగతా డబ్బులు లైఫ్ లో సెటిల్ అవ్వగానే ఇస్తాను. ఈ ప్రాసెస్ కి ఒకే అనకపోతే మా ఇంటికి వచ్చి వేదిస్తున్నావని బెదిరింపుల కేసు పెడతాను. వేణుస్వామి. ప్రవీణ్ అక్క తో కలిసి రాజీ చేసుకుందాం. నీ ముఖం చూడటానికి కూడా నాకు ఇష్టం లేదని వార్నింగ్ లా అషురెడ్డి మాట్లాడుతున్న మాటలు ఉన్నాయి 5 . పోకిరి కి 20 ఏళ్ళు  తెలుగు సినిమా చరిత్రని 'పోకిరి'కి ముందు 'పోకిరి'కి తర్వాత అని విభజించవచ్చు. 2006 ఏప్రిల్ 28న సరిగ్గా ఈ రోజే రిలీజ్ అయ్యింది. అంటే పోకిరి వయసు 20 ఏళ్ళు. దీంతో ఈ రోజు స్పెషల్ డేట్ గా మారడంతో ఫ్యాన్స్ అందరు పోకిరి మూడ్ లో ఉన్నారు.  ఆగస్టు లో  పోకిరి రీ రిలీజ్ కానున్నట్టుగా చిత్ర యూనిట్ కూడా తెలిపింది. 6 . చెమటోడుస్తున్న ఘట్టమనేని వారసుడు జయకృష్ణ హీరోగా, డైనమిక్ డైరెక్టర్ అజయ్ భూపతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'శ్రీనివాస మంగాపురం'. ప్రస్తుతం షూటింగ్ చివరి దశకి చేరుకుంది. ప్రస్తుతం అత్యంత కీలకమైన ఇంటెన్స్ క్లైమాక్స్ యాక్షన్ సీక్వెన్స్‌ను చిత్రీకరిస్తున్నారు. ఒక క్వారీలో హీరో జయకృష్ణ, విలన్ అజయ్ గ్యాంగ్ మధ్య జరిగే హై-వోల్టేజ్ ఫైట్ సీన్లు తెరకెక్కుతున్నాయి. విశేషం ఏమిటంటే. మండుతున్న ఎండలను సైతం లెక్కచేయకుండా జయకృష్ణ ఎంతో డెడికేషన్‌తో ఈ యాక్షన్ పార్ట్‌లో పాల్గొంటున్నాడు.  7 . చిరంజీవి ఫ్యాన్స్ అసంతృప్తి చిరు,బాబీ ల మూవీకి 'కాకాజీ' అనే టైటిల్‌ని ఫిక్స్ చేయబోతునట్టుగా ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ నడుస్తోంది. దీంతో మెజారిటీ మెగా ఫ్యాన్స్ నెట్టింట్లో తిష్ట వేసి 'చిరంజీవి వంటి మాస్ ఇమేజ్ ఉన్న హీరోకి  'కాకాజీ' టైటిల్ ఏమాత్రం సెట్ అవ్వదు. పైగా చాలా సాఫ్ట్‌గా ఉండటంతో పాటు వినడానికి ఇబ్బందిగా ఉంది. దయచేసి టైటిల్ కాకాజీ కాదని నోట్ రిలీజ్ చేయాలనీ కోరుతున్నారు. ఇక ఈ చిత్రానికి సంబంధించి చిరు టెస్ట్ లుక్ ఈ రోజు జరిగింది. 8 . నాగార్జున 100వ చిత్రంలో కన్ఫార్మ్ అయిన టబు నాగార్జున 100వ చిత్రం షూటింగ్ జరుగుతున్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఈ చిత్రంలో టబు చేయడం కన్ఫార్మ్ అయ్యింది. ఈ విషయానికి ద్రువీకరిస్తు టబు తన ఇన్ స్టా అకౌంట్ లో ఒక సోఫాలో 100 చిత్రానికి సంబంధించిన క్లాప్ బోర్డు ఉంచింది. ఇప్పుడు ఈ న్యూస్ తో ఇరువురి కాంబో అభిమానుల్లో జోష్ వచ్చింది. పైగా నాగ్ ఇరవై ఐదేళ్ల యువకుడిగా కూడా కనిపించబోతున్నాడనే టాక్  నేపథ్యంలో టబు రోల్ పై మరింత ఆసక్తి పెరిగిందని చెప్పవచ్చు. 9 . పెళ్లి కాకుండానే తల్లి కాబోతున్న కట్టప్ప కూతురు బాహుబలి కట్టప్ప అలియాస్ సత్య రాజ్ కూతురు దివ్య మాట్లాడుతు 'పెళ్లి అనేది ప్రతి ఒక్కరికీ అవసరమని నేను భావించడం లేదు. ఒక పురుషుడు, ఒక స్త్రీ పరస్పరం ఇష్టపడితే కలిసి జీవించవచ్చు. దానికి పెళ్లి అనే ముద్ర అవసరం లేదు. పెళ్లి చేసుకుంటేనే పిల్లల్ని కనాలనే నిబంధన కూడా అక్కర్లేదు. నా వరకైతే పెళ్లి చేసుకోకుండానే తల్లిని కావడానికి సిద్ధం. ఒక మహిళకి తన శరీరంపై పూర్తి హక్కు ఉంటుందని చెప్పుకొచ్చింది.  10 . లెనిన్ డేట్ మళ్ళీ మారబోతుందా! అఖిల్ అండ్ అక్కినేని ఫ్యాన్స్ ప్రెస్టేజియస్ట్ మూవీ లెనిన్.  జూన్ 26న రిలీజ్ కాబోతుందని మేకర్స్ పోస్టర్  రిలీజ్ చేసారు. కానీ ఈ డేట్ నుంచి  మళ్ళీ వాయిదా పడే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. ఇందుకు పెద్దినే కారణమని రీసెంట్ గా పెద్దిని జూన్ 25 న రిలీజ్ చేస్తామని బుచ్చిబాబు ప్రకటించాడు. కాబట్టి లెనిన్ రిలీజ్ డేట్ మారవచ్చనేది టాక్. పెద్ది వల్లనే ఫస్ట్ రిలీజ్ డేట్ మే 1 నుంచి కూడా లెనిన్ మారిన విషయం తెలిసిందే.    
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం గ్లోబల్ స్థాయిలో తన సత్తా చాటుతున్నారు. 'మగధీర'తో ఇండస్ట్రీ రికార్డులను తిరగరాసిన చరణ్, ఆ తర్వాత వరుస హిట్లతో దూసుకుపోయారు. అయితే మెగా అభిమానులు ఇప్పటికీ ఒక విషయంలో మాత్రం చిన్న అసంతృప్తితో ఉంటారు. అదే చరణ్ కెరీర్‌లో ఆగిపోయిన క్రేజీ ప్రాజెక్ట్ 'మెరుపు'. భారీ అంచనాలతో ప్రారంభమై, షూటింగ్ కూడా జరుపుకున్న ఈ సినిమా ఎందుకు మధ్యలోనే నిలిచిపోయిందో తెలుసుకోవాలని ఫ్యాన్స్ ఎప్పుడూ ఆసక్తి చూపిస్తుంటారు. ఈ సినిమా 2010లో ప్రారంభమైంది. తమిళంలో 'గిల్లి' (తెలుగు 'ఒక్కడు' రీమేక్), 'ధూల్' వంటి మాస్ హిట్స్ ఇచ్చిన డైరెక్టర్ ధరణి ఈ చిత్రానికి దర్శకుడు. స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌లో ఫుల్ లెంగ్త్ కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా దీనిని ప్లాన్ చేశారు. సూపర్‌ గుడ్ ఫిలిమ్స్‌ పతాకంపై ఆర్.బి. చౌదరి భారీ బడ్జెట్‌తో నిర్మించేందుకు పూనుకున్నారు. మెగాస్టార్ చిరంజీవి స్వయంగా క్లాప్ కొట్టి ఈ ప్రాజెక్ట్‌ను పట్టాలెక్కించారు. కానీ కేవలం 15 రోజుల షూటింగ్ తర్వాత ఈ సినిమా అనూహ్యంగా ఆగిపోయింది. సినిమా ఆగిపోవడానికి ప్రధానంగా బడ్జెట్ లెక్కలు తలకిందులు కావడమే కారణమని తెలుస్తోంది. అప్పట్లోనే ఈ సినిమాకు దాదాపు 35 కోట్ల బడ్జెట్ అనుకున్నారు. కానీ డైరెక్టర్ విజన్ ప్రకారం చూస్తే అది 45 కోట్లకు చేరేలా కనిపించింది. కేవలం మొదటి 15 రోజుల షూటింగ్‌కే దాదాపు 8 కోట్ల వరకు ఖర్చు అవ్వడంతో నిర్మాతలు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. ఆ కాలంలో ఇది చాలా పెద్ద మొత్తం కావడంతో నిర్మాత ఆర్.బి. చౌదరి వెనకడుగు వేశారు. మరోవైపు, షూటింగ్ జరిగిన రష్‌ను చూసిన మెగాస్టార్ చిరంజీవికి కూడా అవుట్‌పుట్ అంతగా నచ్చలేదని టాక్. కథలో మార్పులు చేయాలని సూచించినప్పటికీ, అప్పటికే బడ్జెట్ పరిమితులు దాటిపోవడంతో రిస్క్ చేయడం ఎందుకని భావించి సినిమాను ఆపేయాలని నిర్ణయించుకున్నారు. ఈ మూవీలో హీరోయిన్‌గా మొదట షాజన్ పదాంసి, ఆ తర్వాత కాజల్, ఇలియానా పేర్లు వినిపించాయి. రామ్ చరణ్‌కు కోచ్‌గా యాక్షన్ కింగ్ అర్జున్ నటించాల్సి ఉండటం విశేషం. 'మగధీర' వంటి భారీ విజయం తర్వాత చరణ్ నుంచి ఒక స్పోర్ట్స్ సినిమా వస్తే బాక్సాఫీస్ షేక్ అవుతుందని ఫ్యాన్స్ భావించారు. ఈ సినిమా కోసం చరణ్ తన బాడీని కూడా మౌల్డ్ చేసుకున్నారు. కానీ పరిస్థితులు సహకరించకపోవడంతో 'మెరుపు' కాస్తా 'రచ్చ'గా మారింది. మెరుపును పక్కన పెట్టి అదే బ్యానర్‌లో చరణ్ 'రచ్చ' సినిమాను పూర్తి చేశారు. అప్పట్లో ఈ సినిమా నుంచి విడుదలైన కొన్ని పోస్టర్లు ఇప్పటికీ సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటాయి.
Bellamkonda Sreenivas is getting married to Kavya Reddy on April 29. The wedding ceremony will take place in Tirumala at 11:13 PM. The couple has opted for a traditional ceremony deeply rooted in Sanathana Dharma, and the event will follow authentic Vedic rituals. Moving away from the typical grand celebrity weddings, the focus of this ceremony is on simplicity and spiritual devotion. For the traditional event, the bride and groom will be wearing exclusive outfits designed by the well-known fashion designer Shravan Kumar. These custom outfits have been created specifically to match the cultural significance of the Tirumala setting. Following the main wedding event, the newly married couple will host a formal reception in Hyderabad on May 1. The Hyderabad reception is expected to be a large gathering. Sreenivas has sent out personal invitations to all major celebrities within the Telugu film industry. Additionally, prominent political leaders from both Telangana and Andhra Pradesh have been invited to attend the event. The reception will serve as the primary celebration for the film fraternity, politicians, and the couple's close friends and well-wishers to bless their new chapter.   Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them.
- ఫిజిక్స్ చదువుతూ కవిత్వం రాశా - ఏయూ వేడుకల్లో త్రివిక్రమ్ శ్రీనివాస్ భావోద్వేగం - 'మాటల మాంత్రికుడి' స్ఫూర్తిదాయక ప్రసంగం విశాఖపట్నంలోని ఆంధ్ర యూనివర్సిటీ (AU) శతాబ్ది వేడుకల్లో భాగంగా ప్రముఖ సినీ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ చేసిన ప్రసంగం అందరినీ ఆలోచింపజేసేలా సాగింది. తాను చదువుకున్న విద్యాసంస్థ వందేళ్ల పండుగ జరుపుకోవడంపై ఆయన భావోద్వేగానికి లోనయ్యారు. ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి ఆయన చేసిన ప్రసంగం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. త్రివిక్రమ్ తన ప్రసంగాన్ని చాలా వినమ్రంగా మొదలుపెట్టారు. "ఈ వేదికపై మాట్లాడే అర్హత నాకు ఎంత ఉందో తెలియదు కానీ, కేవలం ఈ యూనివర్సిటీ పూర్వ విద్యార్థిని అనే అభిమానంతో నన్ను పిలిచినట్లున్నారు" అంటూ తన వినయాన్ని చాటుకున్నారు. ఒకప్పుడు ఇదే క్యాంపస్‌లో విద్యార్థిగా తిరిగిన ఆయన, ఇప్పుడు అదే ప్రాంగణంలో అతిథిగా రావడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. యూనివర్సిటీ అంటే కేవలం తరగతి గదులు, పుస్తకాలు కాదని.. భిన్నమైన ఆలోచనలు కలిసే వేదిక అని ఆయన అభివర్ణించారు. "యూనివర్సిటీ అనే పదం 'యూనిజన్', 'డైవర్సిటీ' అనే రెండు పదాల కలయిక. విభిన్న సంస్కృతులు, ప్రాంతాల నుంచి వచ్చిన విద్యార్థులు ఇక్కడ కలిసి మెలిసి ఉండటం వల్ల ప్రపంచం పట్ల కొత్త అవగాహన ఏర్పడుతుంది" అని త్రివిక్రమ్ వివరించారు. చదువు గురించి చెబుతూ.. విద్య అనేది ఎక్కడో ఉన్న విషయాన్ని నేర్చుకోవడం కాదని, మన కళ్ల ముందే ఉండి కూడా మనం గమనించని విషయాన్ని కొత్త కోణంలో చూడటమే అసలైన విద్య అని ఆయన పేర్కొన్నారు. ఫిజిక్స్ లోని 'ఎనర్జీ' సూత్రాన్ని ప్రస్తావిస్తూ ప్రకృతి సిద్ధాంతాలను ఆయన వివరించిన తీరు ఆకట్టుకుంది. తన వ్యక్తిగత అనుభవాలను పంచుకుంటూ.. తాను ఆంధ్ర యూనివర్సిటీలో ఉన్నప్పుడు ఫిజిక్స్ కంటే ఎక్కువగా కవిత్వం రాశానని, సైన్స్ పుస్తకాల కంటే తెలుగు సాహిత్యం ఎక్కువగా చదివానని త్రివిక్రమ్ గుర్తు చేసుకున్నారు. ఇక్కడే తనకు జీవితంలో పోరాడేందుకు కావాల్సిన 'ఆయుధం' దొరికిందని ఆయన చెప్పుకొచ్చారు. మొదట్లో యూనివర్సిటీ ప్రాంగణం, అక్కడి వాతావరణం భయపెట్టినట్లు అనిపించినా.. అది మందు లాంటిదని, చేదుగా ఉన్నా ఆరోగ్యానికి మంచి చేస్తుందని ఆయన విశ్లేషించారు. 130 దేశాల నుంచి ప్రజలు ఇక్కడికి రావడం వెనుక ఉన్న గొప్పతనాన్ని ఆయన గుర్తు చేశారు. చివరగా, ఆంధ్ర యూనివర్సిటీ లోగోలోని 'తేజస్వినా వధితమస్తు' అనే వాక్యాన్ని ప్రస్తావిస్తూ, విద్యార్థులు అసత్యం నుంచి సత్యం వైపు, మృత్యువు నుంచి అమృతత్వం వైపు పయనించాలని ఆకాంక్షించారు. వందేళ్ల పండుగ జరుపుకుంటున్న తన మాతృసంస్థను 'శతాయుష్మాన్ భవ' అంటూ దీవించి తన ప్రసంగాన్ని ముగించారు.
  ఎవరి అప్డేట్ కోసం అయితే అభిమానులు ఎదురుచూస్తుంటారో ఆ అప్ డేట్ రానే వచ్చింది. సోషల్ మీడియా సైతం మేము కూడా సదరు న్యూస్ కి  అభిమానులమే అనే రీతిలో అందరికి ఆ న్యూస్ సువాసనలు అందేలా చేస్తుంది. దీంతో ప్రభాస్(Prabhas),సందీప్ రెడ్డి( Sandeep Reddy)ఫ్యాన్స్ లో జోష్ వచ్చింది. మరి పూర్తి మ్యాటర్ చూద్దాం.   ప్రభాస్, సందీప్ రెడ్డి స్పిరిట్ నెక్స్ట్ ఇయర్ మార్చి 5 న రిలీజ్ కానున్న విషయం తెలిసిందే. కానీ ఈ మధ్య కాలంలో సినిమాలన్నీ చెప్పిన డేట్ కి రావడం లేదు. ప్రభాస్ సినిమాలు కూడా అందుకు ఉదాహరణగా ఉన్నాయి. కానీ తాజాగా వినిపిస్తున్న కథనాల ప్రకారం సందీప్ ఈ సంవత్సరం సెప్టెంబర్ చివరికల్లా కంప్లీట్ చెయ్యాలని డిసైడ్ అయినట్టు తెలుస్తుంది. ఇందులో నెక్స్ట్ ఆలోచనకి తావు ఇవ్వకుండా పక్కా ప్లానింగ్ తో వెళ్తున్నట్టుగా సన్నిహిత వర్గాలు తెలుపుతున్నాయి. కంటెంట్ కూడా చాలా అడ్వాన్స్ గా ఉండబోతున్నటుగా తెలుస్తుంది. Also read: Ashu reddy: అషు రెడ్డి ఆడియో లీక్స్ కలకలం.. వామ్మో మరింత దారుణమా! సందీప్ రెడ్డి వంగా తన సినిమాల్లో హీరో క్యారెక్టరైజేషన్‌ని ఎంత ఊరమాస్‌గా చూపిస్తారో మనందరికీ తెలిసిందే. ప్రభాస్ కేవలం ఒక పోలీస్ ఆఫీసర్‌గానే కాకుండా, మల్టీ షేడ్స్ ఉన్న క్యారెక్టర్‌లో కనిపిస్తారని టాక్. మునుపెన్నడూ చూడని హై-వోల్టేజ్ యాక్షన్ సీన్లు 'స్పిరిట్'లో ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి.మ్యూజిక్ డైరెక్టర్ హర్షవర్ధన్ రామేశ్వర్ ఈ  'యానిమల్' రేంజ్‌లోనే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ పీక్స్‌లో ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. ప్రభాస్ తో  అందాల భామ త్రిప్తి డిమ్రి(Tripti Dimri)జత కడుతుంది.   
భారతీయ చలనచిత్ర చరిత్రలో మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన 'నాయకుడు' ఒక మైలురాయి వంటి సినిమా. ముంబై మురికివాడల్లోని ప్రజల కోసం పోరాడే ఒక సామాన్యుడు డాన్‌గా ఎలా ఎదిగాడు అనే కథాంశంతో తెరకెక్కిన ఈ చిత్రం, నటనకు కొత్త అర్థాన్ని ఇచ్చింది. తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియోలో, కమల్ హాసన్ పోషించిన శక్తివంతుడైన పాత్ర వేలప్ప నాయకర్, సామాన్యుల భూములను ఆక్రమించుకోవాలని చూసే భూస్వాములు మరియు అక్రమార్కులకు బుద్ధి చెప్పే అద్భుతమైన యాక్షన్ సన్నివేశాన్ని మనం చూడవచ్చు. ఈ వీడియో క్లిప్‌లో ఒక ఫ్యాక్టరీ నిర్మాణానికి సంబంధించి వివాదం తలెత్తుతుంది. 10 లక్షల పెట్టుబడితో నిర్మిస్తున్న ఫ్యాక్టరీ అని, సామాన్యులకు ఇక్కడ సంబంధం లేదని ధనవంతులు మరియు అధికారులు హెచ్చరిస్తుంటారు. పేదల భూములను అక్రమంగా దక్కించుకుని, అక్కడ నిర్మాణాలు చేపడుతున్న క్రమంలో సేఠ్‌.. అనుచరులతో కలిసి రంగంలోకి దిగుతారు. ప్రభుత్వ పత్రాలను, సీళ్ళను లెక్కచేయకుండా అక్రమంగా సాగుతున్న ఈ వ్యవహారాన్ని నాయకర్ తనదైన శైలిలో అడ్డుకుంటారు. ఈ సన్నివేశంలో కమల్ హాసన్ నటన అత్యంత సహజంగా ఉంటుంది. మాటల కన్నా ముందే తన చూపులతో, నడకతో గంభీరత్వాన్ని ప్రదర్శిస్తారు. అక్రమ నిర్మాణాలు చేస్తున్న చోటకి చేరుకుని, అక్కడ ఉన్న వస్తువులను ధ్వంసం చేస్తూ, అక్రమార్కుల గుండెల్లో వణుకు పుట్టిస్తారు. ముఖ్యంగా సెట్ ప్రాపర్టీలను పగలగొడుతూ, అధికారులను నిలదీసే క్రమంలో ఆయన బాడీ లాంగ్వేజ్ అద్భుతంగా ఉంటుంది. ఢిల్లీ గణేష్ మరియు జనగరాజ్ వంటి దిగ్గజ నటులు కమల్ హాసన్ పాత్రకు తోడుగా ఉంటూ ఈ సన్నివేశాన్ని మరింత రక్తికట్టించారు. నాయకర్ చేసే ఈ పోరాటం కేవలం హింస కోసం కాదు, న్యాయం కోసం. భూమిని కోల్పోతున్న పేదల ఆవేదనను చూసి ఆయన స్పందిస్తారు. ఫ్యాక్టరీ యజమాని భయపడుతూ తన పిల్లల మీద ఒట్టు వేసి, తనకు ఆ భూమి వద్దని వేడుకునే స్థాయికి నాయకర్ భయం పుట్టిస్తారు. అక్రమ డాక్యుమెంట్లను బయటకు తీయించి, చెడును అంతం చేసే దిశగా ఈ సీన్ సాగుతుంది. మొత్తానికి, 'నాయకుడు' సినిమాలోని ఈ చిన్న క్లిప్ నేటికీ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఒక నాయకుడు ప్రజల కోసం ఎలా నిలబడాలి అనే దానికి ఈ సన్నివేశం ఒక నిదర్శనం. ఇళయరాజా సంగీతం, మణిరత్నం మేకింగ్ మరియు కమల్ హాసన్ విశ్వరూపం వెరసి ఈ యాక్షన్ సీన్ ఎప్పటికీ మర్చిపోలేనిదిగా నిలిచిపోయింది. క్లాసిక్ సినిమాలను ఇష్టపడే వారికి ఈ వీడియో ఒక కనువిందు. ఇలాంటి అద్భుత‌మైన వీడియోల కోసం మా Teluguone youtube channelను Subscribe చేసుకోండి. 
    పవన్ కళ్యాణ్(Pawan Kalyan)అభిమాని, బిగ్ బాస్ ఫేమ్ అషు రెడ్డి చుట్టూ ఇప్పుడు తీవ్రమైన వివాదం ముసురుతోంది. పెళ్లి చేసుకుంటానని నమ్మించి కోట్లాది రూపాయల నగదు, తీసుకోవడమే కాకుండా  ప్రాణహాని తలపెడుతుందంటు ధర్మేంద్ర అనే NRI పోలీసులను ఆశ్రయించడం తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. ఈ కేసుకు సంబంధించి తాజాగా కొన్ని ఆడియో క్లిప్పులు బయటకు రావడం మరిన్ని అనుమానాలకి  తావిస్తోంది.   అషు రెడ్డి వాయిస్' నేను తీసుకున్న డబ్బులో కోటిన్నరే ఇస్తాను.  మిగతా డబ్బులు లైఫ్ లో సెటిల్ అవ్వగానే ఇస్తాను. ఈ ప్రాసెస్ కి ఒకే అనకపోతే మా ఇంటికి వచ్చి వేదిస్తున్నావని బెదిరింపుల కేసు పెడతాను. వేణుస్వామి. ప్రవీణ్ అక్క తో కలిసి రాజీ చేసుకుందాం.నీ ముఖం చూడటానికి కూడా నాకు ఇష్టం లేదని వార్నింగ్ లా అషు రెడ్డి మాట్లాడుతున్న మాటలు ఉన్నాయి లండన్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్న వై.వి. ధర్మేంద్రకు 2018లో అషు రెడ్డితో పరిచయం ఏర్పడింది. అప్పటికే తనకు విడాకులు అయిన విషయాన్ని ఆమెకు చెప్పినప్పటికీ, అషు రెడ్డి అతనితో ప్రేమలో పడిందని, పెళ్లి చేసుకుంటానని నమ్మించిందని బాధితుడు పేర్కొన్నాడు. ఈ క్రమంలో తన వ్యక్తిగత అవసరాలు, విలాసాల కోసం ధర్మేంద్ర నుండి భారీగా డబ్బు వసూలు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి.  రూ. 9.35 కోట్ల మోసం?ధర్మేంద్ర తండ్రి హైదరాబాద్ సీసీఎస్ (CCS) పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం గత ఐదేళ్లలో సుమారు 5 కిలోల బంగారం, ఖరీదైన కార్లు, నగదు రూపంలో మొత్తం 9.35 కోట్లు వసూలు చేసినట్లు సమాచారం. హైదరాబాద్‌లోని మణికొండ ప్రాంతంలో . 3 కోట్ల విలువైన ఫ్లాట్ కొనుగోలు కోసం ధర్మేంద్రతో రూ. 1.80 కోట్లు కట్టించి, ఆ ఆస్తిని అషు తన పేరు మీద రిజిస్టర్ చేయించుకుందని బాధితుడు ఆరోపిస్తున్నాడు.  బెదిరింపులు మరియు ఆడియో లీక్స్డబ్బులు ఇవ్వడం ఆపివేసి, పెళ్లి గురించి ఒత్తిడి తెచ్చినప్పటి నుండి అషు రెడ్డి ప్రవర్తన మారిందని ధర్మేంద్ర ఆవేదన వ్యక్తం చేశాడు. తన డబ్బు తిరిగి అడిగితే తప్పుడు కేసులు పెడతానని, ఒక హత్య కేసు నిందితుడితో కలిసి తనను బెదిరిస్తోందని ఆరోపించాడు.  Also read: Toxic: టాక్సిక్ మిస్టరీ.. లేట్ అవ్వడానికి అసలు కారణం ఇదేనా! .అషు రెడ్డి కూడా ధర్మేద్ర ఆరోపణలపై  సోషల్ మీడియావేదికగా స్పందించారు. తనపై వస్తున్న వార్తలన్నీ అవాస్తవాలని, తన అనుమతి లేకుండా తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేసే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటానని ఆమె హెచ్చరించారు. తాను ఎలాంటి తప్పు చేయలేదని, నిజం త్వరలోనే బయటకు వస్తుందని ఆమె ధీమా వ్యక్తం చేశారు.ముగింపుప్రస్తుతం ఈ హై-ప్రొఫైల్ మోసం కేసును పోలీసులు క్షుణ్ణంగా దర్యాప్తు చేస్తున్నారు. ధర్మేంద్ర సమర్పించిన బ్యాంకు లావాదేవీల రికార్డులు, ఆడియో ఆధారాలను అధికారులు పరిశీలిస్తున్నారు. ఒక సెలబ్రిటీపై ఇంత భారీ మొత్తంలో మోసం ఆరోపణలు రావడం టాలీవుడ్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఈ కేసులో తదుపరి పరిణామాలు ఎలా ఉంటాయో వేచి చూడాలి.   
ఒక్కసారి ఆలోచించండి.. ఉదయం నిద్రలేవగానే మీరు చూసే మొదటి ముఖం ఎవరిది? మీ భాగస్వామిదా లేక మీ మొబైల్ ఫోన్ స్క్రీనా? ఒకప్పుడు పక్కపక్కనే కూర్చుని మనసు విప్పి మాట్లాడుకునే వాళ్ళం, కానీ ఇప్పుడు పక్కనే ఉన్నా ఎవరి ఫోన్లలో వాళ్ళు బిజీగా ఉంటున్నాం. నేటి కాలంలో మొబైల్ ఫోన్ మన అందరికీ "మొదటి లైఫ్ పార్ట్నర్" (First Life Partner) గా మారిపోయింది. ఈ డిజిటల్ వ్యసనం వల్ల మన మధ్య ఉండాల్సిన క్వాలిటీ టైమ్ మాయమైపోతోంది. ఈ పరిస్థితిని మార్చుకుని, మళ్ళీ మన బంధాలను ఎలా చిగురింపజేసుకోవాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. మొబైల్ వాడకాన్ని ఎందుకు తగ్గించాలి? (Why Should We?) మొబైల్ పక్కన పెట్టి మనుషులతో గడపడం ఎందుకు ముఖ్యం అంటే: సరైన నిర్ణయాలు తీసుకోవడానికి: ముఖాముఖి మాట్లాడుకున్నప్పుడే ఒక విషయంపై చర్చించి సరైన నిర్ణయం (Decision making) తీసుకోగలం. గౌరవం ఇవ్వడం: ఎదుటి వ్యక్తి మాట్లాడుతున్నప్పుడు ఫోన్ చూసుకోకుండా ఉండటం కనీస గౌరవం. బంధం బలపడటానికి: వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య లేదా ఫ్యామిలీ మధ్య క్వాలిటీ టైమ్ గడపడం వల్ల అనుబంధం పెరుగుతుంది. ఏమి చేయకూడదు? (What Not To Do?) మనకు తెలియకుండానే చేసే ఈ తప్పులు బంధాలను దూరం చేస్తున్నాయి: మొదటి ప్రాధాన్యత ఇవ్వకండి: ఫోన్ కంటే ముందు మనిషికి ప్రాధాన్యత ఇవ్వాలి. ఫోన్ ఫస్ట్ లైఫ్ పార్ట్నర్ కాకూడదు. మధ్యలో మాట్లాడకండి: ఇద్దరు వ్యక్తులు మాట్లాడుకుంటున్నప్పుడు మధ్యలో అకస్మాత్తుగా ఫోన్ కాల్ వస్తే అక్కడి నుండి వెళ్ళిపోవడం లేదా గట్టిగా మాట్లాడటం చేయకూడదు. దీనివల్ల అవతలి వాళ్ళు చిన్నబుచ్చుకుంటారు. ముఖ్యమైన సందర్భాల్లో వాడొద్దు: పెళ్లి చూపులు వంటి ముఖ్యమైన చర్చల్లో పాల్గొన్నప్పుడు మొబైల్స్ చూస్తూ కూర్చోవడం వల్ల వచ్చిన అసలు ఉద్దేశమే మర్చిపోయే ప్రమాదం ఉంది. ముందుకు వెళ్ళే మార్గం - చిట్కాలు (How-To Points): మొబైల్ వ్యసనం నుండి బయటపడటానికి ఈ చిన్న మార్పులు చేయండి: సెల్ఫ్ డిసిప్లిన్ (Self-discipline): మొబైల్ వాడకం విషయంలో మనకు మనమే ఒక క్రమశిక్షణ విధించుకోవాలి. సైలెంట్ మోడ్‌లో పెట్టండి: ఎవరితోనైనా క్వాలిటీ టైమ్ గడుపుతున్నప్పుడు లేదా రెస్టారెంట్లకు వెళ్ళినప్పుడు ఫోన్‌ను సైలెంట్ మోడ్‌లో పెట్టి దూరంగా ఉంచండి. ముందే చెప్పండి: ఎవరైనా ఇంపార్టెంట్ వ్యక్తులు ఉంటే, వారికి "నేను ఒక గంట పాటు బిజీగా ఉంటాను, తర్వాత కాల్ చేస్తాను" అని మెసేజ్ పెట్టి మీ క్వాలిటీ టైమ్‌ను ఆస్వాదించండి. పరస్పర అంగీకారం: భార్యాభర్తలు ఇద్దరూ కలిసి "మనం బయటికి వెళ్ళినప్పుడు మొబైల్స్ వాడొద్దు" అని ఒక రూల్ పెట్టుకోవాలి. ఎవరైనా వాడితే రెండో వ్యక్తి నిర్మొహమాటంగా గుర్తు చేయాలి. ప్రశ్నలు - సమాధానాలు (Q&A): ప్రశ్న: బోర్ కొట్టినప్పుడు మొబైల్ చూడటం తప్పా? సమాధానం: బోర్ కొట్టినప్పుడు ఫోన్ చూడటం సహజమే, కానీ ఎదురుగా ఒక మనిషి ఉన్నప్పుడు వారిని వదిలేసి ఫోన్ చూస్తూ కూర్చోవడం సరైన పద్ధతి కాదు. ఇది గౌరవం మరియు కామన్ సెన్స్ (Common sense) కి సంబంధించిన విషయం. ప్రశ్న: ఫోన్ వాడొద్దు అని చెబితే అవతలి వారు కోప్పడితే ఏం చేయాలి? సమాధానం: ఇది కోప్పడాల్సిన విషయం కాదు. "మనం ఈ సమయాన్ని సరదాగా గడపడానికి వచ్చాం, కాసేపు ఫోన్ పక్కన పెడదాం" అని సున్నితంగా చెప్పడం అలవాటు చేసుకోవాలి. మొబైల్ ఫోన్ అనేది మన అవసరానికి మాత్రమే, మన జీవితం అవ్వకూడదు. మన కళ్ళ ముందు ఉన్న మనుషుల కంటే, ఆ స్క్రీన్ లో కనిపించే ప్రపంచం ముఖ్యం కాదు. కాబట్టి, నేటి నుండే మీ మొబైల్‌ను కాసేపు పక్కన పెట్టి మీ ప్రియమైన వారితో ఆనందంగా గడపండి. అది మీ సెల్ఫ్ డిసిప్లిన్ మీద మాత్రమే ఆధారపడి ఉంటుంది. మరిన్ని ఆసక్తికరమైన విషయాల కోసం మా Naveena Column యూట్యూబ్ ఛానెల్‌ని సందర్శించండి! సబ్స్క్రైబ్ చేసుకోండి.
నేటి కాలంలో వయస్సుతో సంబంధం లేకుండా చాలా మందిని వేధిస్తున్న ప్రధాన సమస్యలలో 'ఫ్రోజెన్ షోల్డర్' (Frozen Shoulder) ఒకటి. వైద్య పరిభాషలో 'అడెసివ్ క్యాప్సులైటిస్' అని పిలిచే ఈ సమస్య వల్ల భుజం కీలు బిగుసుకుపోయి, కనీసం చేయి పైకి ఎత్తడానికి కూడా వీలు లేని పరిస్థితి ఏర్పడి దైనందిన జీవితం స్తంభించిపోతుంది. దీనిని కేవలం సాధారణ నొప్పి అని సరిపెట్టుకొని నిర్లక్ష్యం చేస్తే మున్ముందు కదలికలు మరింత కష్టతరంగా మారుతాయి. ఆధునిక వైద్యంలోని పెయిన్ కిల్లర్స్ కేవలం తాత్కాలిక ఉపశమనాన్ని మాత్రమే ఇస్తుండగా, ఆయుర్వేదం ఈ వ్యాధిని మూలాల నుండి నయం చేసే అద్భుతమైన మార్గాలను చూపుతోంది. ఈ క్రమంలో ఫ్రోజెన్ షోల్డర్ లక్షణాలు, కారణాలు మరియు దీనిని శాశ్వతంగా నయం చేసే ఆయుర్వేద చికిత్సా పద్ధతుల గురించి ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఫ్రోజెన్ షోల్డర్ అంటే ఏమిటి? మన భుజంలోని కీలు చుట్టూ ఉండే కణజాలం (Capsule) వాపునకు గురై, మందంగా మారడం వల్ల భుజం కదలికలు తగ్గిపోతాయి. దీనివల్ల తీవ్రమైన నొప్పి మరియు బిగుతుగా ఉన్న భావన కలుగుతుంది. ప్రధాన కారణాలు: మధుమేహం (Diabetes): షుగర్ వ్యాధి ఉన్నవారిలో ఈ సమస్య వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది.  గాయాలు: భుజానికి తగిలిన పాత గాయాలు లేదా శస్త్రచికిత్సల వల్ల.  థైరాయిడ్ సమస్యలు: హార్మోన్ల అసమతుల్యత వల్ల కూడా భుజం కండరాలు దెబ్బతినవచ్చు.  కదలిక లేకపోవడం: ఎక్కువ కాలం చేతికి పని చెప్పకపోవడం వల్ల కీళ్లు బిగుసుకుపోతాయి. ఆయుర్వేద చికిత్స - సహజ సిద్ధమైన పరిష్కారం: ఆయుర్వేదం ప్రకారం, శరీరంలో 'వాత దోషం' పెరగడం వల్ల కీళ్లలో ద్రవాలు తగ్గి ఇలాంటి సమస్యలు తలెత్తుతాయి. ఆయుర్వేదంలో ఫ్రోజెన్ షోల్డర్‌ను 'అవబాహుక' అని అంటారు. దీనికి అందుబాటులో ఉన్న కొన్ని అద్భుతమైన చికిత్సలు: అభ్యంగనం (Abhyangam): వేడి చేసిన ఆయుర్వేద తైలాలతో (మహానారాయణ తైలం వంటివి) మర్దన చేయడం వల్ల రక్త ప్రసరణ పెరిగి నొప్పి తగ్గుతుంది.   స్వేదనం (Swedanam): మూలికల ఆవిరి పట్టడం ద్వారా బిగుసుకుపోయిన కండరాలు వదులవుతాయి.   గ్రీవ వస్తి / పీచు: నొప్పి ఉన్న భాగంలో ప్రత్యేకమైన నూనెను నిల్వ ఉంచే ప్రక్రియ.   పౌష్టిక ఆహారం: వాతాన్ని తగ్గించే ఆహార పదార్థాలను తీసుకోవడం మరియు శొంఠి, గుగ్గులు వంటి మూలికలను వాడటం. ఫ్రోజెన్ షోల్డర్ సమస్యను ప్రారంభ దశలోనే గుర్తిస్తే ఫిజియోథెరపీ మరియు ఆయుర్వేద చికిత్సలతో సులభంగా నయం చేసుకోవచ్చు. నిర్లక్ష్యం చేస్తే భవిష్యత్తులో చేతి కదలికలు పూర్తిగా తగ్గిపోయే ప్రమాదం ఉంది. సరైన ఆహారం, క్రమం తప్పని వ్యాయామం మరియు ఆయుర్వేద జీవనశైలితో మీ భుజం ఆరోగ్యాన్ని కాపాడుకోండి. మరిన్ని ఆరోగ్య సూచనలు మరియు పరిష్కారాల కోసం మా యూట్యూబ్ ఛానెల్ "TeluguOne Health" ను సందర్శించి సబ్‌స్క్రైబ్ చేయండి!
ప్రేమ ఒక అందమైన భావన, కానీ చాలా మందికి ఇది పదే పదే బాధ కలిగిస్తూ ఉంటుంది. ప్రేమ మొదట్లో అద్బుతంగా ఉంటుంది,  ఇష్టంగా అనిపిస్తుంది,  తమ చుట్టూ ఒక కొత్త ప్రపంచం ఉన్నట్టు అనిపిస్తుంది. కానీ కాలంతో పాటు ప్రేమ కూడా మారుతూ ఉంటుంది.  ముఖ్యంగా పరీక్షలు పెడుతూ ఉంటుంది.  ఇద్దరు వ్యక్తులు సిన్సియర్ గా ఉన్నారా లేదా అనేది కూడా కాలమే డిసైడ్ చేస్తుంది. అయితే ప్రేమించిన చాలా మంది సంతోషం కంటే ఎక్కువ బాధపడిన సందర్బాలే ఉంటాయి.  పదే పదే మనోవేదనకు గురవుతూ ఉంటారు.  ప్రేమ అనేది కేవలం ఒక్కరితో అగేది కూడా కాదు.. చాలామంది ప్రేమలో ఫెయిల్యూర్ వచ్చాక లేదా బ్రేకప్ అయ్యాక.. మళ్లీ ఇంకొకరితో ప్రేమలో పడతారు. కానీ అక్కడ కూడా మళ్లీ బాధ.. పదే పదే మానసిక వేధన బహుమానంలా లభిస్తాయి.  అసలు ప్రేమించేవారికి పదే పదే మానసిక వేధన ఎందుకు ఎదురవుతోంది? ఇందులో తప్పు ఎవరిది? తెలుసుకుంటే.. బాధ కలిగినా అదే మార్గంలో ప్రయాణం.. చాలామంది ప్రేమలో ఉన్నప్పుడు అయినా జీవితంలో వేరే బంధంలో అయినా.. తమకు బాధ కలిగినా సరే.. అదే జోన్ లోనే ఉండటానికి ఇష్టపడతారు. చిన్నతనంలోని అనుభవాలు,  పెరిగిన వాతావరణం,  గతంలో ఏర్పడిన బందాల వల్ల కలిగిన బాధ.. బందంలో గౌరవం లేకపోవడం వంటివి మనిషిని మారేలా చేయాలి. కానీ చాలామంది కొత్తగా ఏర్పడే ప్రతి బందంలోనూ అవే తప్పులు పదే పదే చేస్తుంటారు. అందుకే పదే పదే మనోవేధన కూడా ఎదురవుతూ ఉంటుంది. ఎమోషన్స్ నుండి బయట పడలేకపోవడం.. చాలా మంది తమకు తెలియకుండానే తమలాంటి భాగస్వాములనే ఎంచుకుంటారు. ఇది వారి సబ్ కాన్షియస్ మైండ్  చేసే ఒక ప్రయోగం.  గతంలో విషపూరితమైన సంబంధాలను అనుభవించి ఉంటే  మనస్సు వాటిని సాధారణమైనవిగా అంగీకరిస్తుంది. అందుకే పదే పదే అలాంటి రిలేషన్స్ వైపుకే  ఆకర్షితులు అవుతుంటారు. తమను తాము తక్కువగా  అంచనా వేసుకోవడం.. ఒక వ్యక్తి తమను తాము తక్కువగా అంచనా వేసుకున్నప్పుడు, వారు తరచుగా సంబంధాలలో తాము తక్కువ అన్నట్టు ఉంటారు. అలాంటి వ్యక్తులు ఎదుటి మనిషి వ్యక్తిత్వం గురించి పెద్దగా పట్టించుకోకుండా  పదే పదే తప్పుడు భాగస్వామిని ఎంచుకుంటారు. మార్పు పట్ల భయం.. చాలా మంది తాము తప్పులు చేస్తున్నామని తెలిసినా, మారడం వల్ల ఎదురయ్యే నష్టాలు,  ప్రమాదాలను చూసుకుని మారడానికి భయపడతారు.  అందుకే వారు అవే పాత పద్ధతులలో చిక్కుకుపోయి ఉంటారు. గత గాయాల ప్రబావం.. గత సంబంధాల వల్ల కలిగిన గాయం, పూర్తిగా మానకపోవడం వంటివి చాలామంది పదే పదే అవే తప్పులు చేసేలా చేస్తాయి.  ఇలాంటి వారు  భావోద్వేగపరంగా కోలుకునేంత వరకు, సరైన నిర్ణయాలు తీసుకోలేరు. గందరగోళం.. చాలా మంది ప్రేమకు , భావోద్వేగ అనుబంధానికి మధ్య ఉన్న తేడాను అర్థం చేసుకోరు. వారు తప్పుడు వ్యక్తికి దగ్గరై, దానినే ప్రేమగా పొరబడతారు, తద్వారా అవే తప్పులను రిపీట్ చేస్తూ ఉంటారు.   ప్రేమలో లేదా రిలేషన్ లో  అవే తప్పులను పదే పదే చేయడం అనేది విధి రాసే రాత కాదు.. అది మనిషి  అలవాట్లు,  ఆలోచనా విధానం ఇచ్చే  ఫలితం. ప్రతి వ్యక్తి తన  పద్ధతులను గుర్తించి, తమను తాము  సరిదిద్దుకున్నప్పుడు మాత్రమే ఇలా పదే పదే బాధపడే బంధంలో చిక్కుకోవడాన్ని నివారించగలుగుతారు. సింపుల్ గా చెప్పాలంటే.. ప్రతి మనిషి ప్రేమలో లేదా రెలేషన్ లో.. పదే పదే మానసిక వేదనకు అనుభవించడానికి అక్షరాలా ఆ మనిషి చేతులారా చేసుకునే తప్పులు,  పరిస్థితులకు అనుగుణంగా మారకపోవడం,  పాత ఆలోచనలు, సిద్దాంతాలలో  చిక్కుకుని ఉండటం వంటివి కారణం అవుతాయి.                                    *రూపశ్రీ.
నేటి ఉరుకుల పరుగుల జీవితంలో మనల్ని నిరంతరం వేధించే ప్రధాన శత్రువులు ఒత్తిడి మరియు ఆందోళన. వీటితో పాటు థైరాయిడ్, మధుమేహం, PCOD వంటి సమస్యలు మన జీవితాలను అస్తవ్యస్తం చేస్తున్నాయి. మందులు వాడుతున్నా పూర్తి ఉపశమనం లభించడం లేదా? అయితే మీకు 'థెరప్యూటిక్ యోగా' ఒక అద్భుతమైన మార్గం. ఇది కేవలం శరీరాన్ని కదిలించడం మాత్రమే కాదు, మీ మనస్సును మరియు ఆత్మను పునరుజ్జీవింపజేసే ఒక దివ్యౌషధం. మనం థెరప్యూటిక్ యోగాను ఎందుకు ఎంచుకోవాలి? (Why Should We?) రోజంతా ఉత్సాహం: మీరు రోజుకు కేవలం గంటన్నర సమయం యోగాకు కేటాయిస్తే, మిగిలిన 22.5 గంటల సమయం ఎంతో శక్తివంతంగా మరియు ఆనందంగా గడుస్తుంది. దీర్ఘకాలిక వ్యాధుల నుండి విముక్తి: థైరాయిడ్ సమస్య ఉన్నవారు కేవలం 3 నెలల్లో మార్పును గమనించవచ్చు, అలాగే PCOD సమస్యలు 4 నుండి 5 నెలల్లో నయమయ్యే అవకాశం ఉంది. మానసిక ప్రశాంతత: ఈ ప్రపంచంలో మానసిక సమస్యలను సమూలంగా నయం చేసే శక్తి కేవలం యోగాకు మాత్రమే ఉంది. ఇది మీలో ఆత్మవిశ్వాసాన్ని పెంచి, బద్ధకాన్ని వదిలిస్తుంది. అంతర్గత మార్పు: యోగా మిమ్మల్ని లోపలి నుండి మారుస్తుంది. అది ఒక చిన్న పిల్లవాడి నవ్వులో ఉండే స్వచ్ఛతను మీ జీవితంలోకి తీసుకువస్తుంది. ఏం చేయకూడదు? (What Not to Do) నియమాలను విస్మరించవద్దు: మధుమేహం లేదా రక్తపోటు ఉన్నవారు యోగా చేస్తున్నాం కదా అని ఆహార నియమాలను పూర్తిగా వదిలేయకూడదు. వ్యాధి పూర్తిగా నయమయ్యే వరకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. తక్షణ ఫలితాల కోసం ఆరాటపడవద్దు: యోగా అనేది ఏటీఎం మిషన్ నుండి డబ్బులు వచ్చినట్లు తక్షణమే రాదు, కానీ సాధన మొదలుపెట్టిన కొద్దిసేపటికే మీరు ఆ మార్పును అనుభూతి చెందుతారు. ఆనందాన్ని వదులుకోవద్దు: జీవితంలో దేనికైనా రాజీ పడండి కానీ మీ సంతోషం విషయంలో మాత్రం ఎప్పుడూ రాజీ పడకండి. ప్రారంభించడం ఎలా? (How to Start) శ్వాసపై ధ్యాస: మన శ్వాస మరియు మనస్సు భార్యాభర్తల వంటివి. శ్వాస దీర్ఘంగా, ప్రశాంతంగా ఉంటే మనస్సు కూడా అంతే ప్రశాంతంగా మారుతుంది. సరైన భంగిమలు: 'సుప్త ఆసనం' (Subtasana) వంటి భంగిమలు కేవలం 10 నిమిషాల్లోనే మిమ్మల్ని ఎంతో రిలాక్స్‌గా మరియు శక్తివంతంగా మారుస్తాయి. ఆధారాలతో సాధన (Props): శారీరక ఇబ్బందుల వల్ల ఆసనాలు వేయలేకపోయేవారు రకరకాల ప్రాప్స్ (Props) సహాయంతో సులభంగా యోగా చేయవచ్చు. ఇది క్యాన్సర్ వంటి క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నవారికి కూడా ఉపశమనాన్ని ఇస్తుంది. ప్రశ్నలు - సమాధానాలు (Q&A) ప్ర: థైరాయిడ్ సమస్య యోగాతో నయమవుతుందా?  జ: అవును, క్రమం తప్పకుండా థెరప్యూటిక్ యోగా చేయడం ద్వారా 3 నెలల్లో థైరాయిడ్ మందుల మోతాదును తగ్గించుకోవచ్చు. ప్ర: క్యాన్సర్ రోగులకు యోగా ఎలా సహాయపడుతుంది?  జ: యోగా క్యాన్సర్‌ను పూర్తిగా నయం చేయకపోవచ్చు, కానీ రోగిలో ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది, ఒత్తిడిని తగ్గిస్తుంది మరియు శరీరంలో ప్రాణవాయువును (Oxygenation) పెంచి మనశ్శాంతిని చేకూరుస్తుంది. ప్ర: వ్యాయామం చేయడానికి సమయం లేని వారి పరిస్థితి ఏంటి?  జ: మీ శరీరం కోసం మీరు రోజుకు కనీసం గంటన్నర కేటాయించలేకపోతే, అనారోగ్యం పాలైనప్పుడు అంతకంటే ఎక్కువ సమయాన్ని ఆసుపత్రుల్లో గడపాల్సి వస్తుందని గుర్తుంచుకోండి. మీరు అందంగా, ఆకర్షణీయంగా కనిపించాలన్నా, ఆత్మవిశ్వాసంతో మెరవాలన్నా యోగా ఒక్కటే మార్గం. మాటల కంటే సాధన ద్వారానే మీరు ఆ వ్యత్యాసాన్ని గమనించగలరు. ఆరోగ్యం అనేది మన చేతుల్లోనే ఉంది, దాన్ని నిర్లక్ష్యం చేయకండి. మరిన్ని ఆసక్తికరమైన ఆరోగ్య చిట్కాలు మరియు యోగా ప్రాక్టికల్ వీడియోల కోసం మా యూట్యూబ్ (YouTube) ఛానెల్‌ని సందర్శించండి! ఇప్పుడే సబ్‌స్క్రైబ్ చేసుకోండి మరియు ఆరోగ్యవంతులుగా మారండి.
బ్రేక్ ఫాస్ట్ లేదా అల్పాహారం నేటికాలపు జీవనశైలికి చాలా ముఖ్యంగా మారింది.  ఉదయాన్నే అల్పాహారం తప్పకుండా తినాలని వైద్యుల నుండి ఆహార నిపుణుల వరకు ప్రతి ఒక్కరూ చెబుతారు.  అయితే చాలామంది అల్పాహారంలో తీసుకునే ఆహారాలు కేవలం కడుపు నిండినట్టు లేదా రుచి కోసం తీసుకుంటూ ఉంటారు. కానీ శరీరంలో ఎంతో ముఖ్యమైన భాగమైన పేగు ఆరోగ్యం బాగుండటం కోసం ఎలాంటి ఆహారం తీసుకోవాలో చాలామందికి తెలియదు. ఉదయాన్నే తీసుకునే ఆహారమే పేగు ఆరోగ్యాన్ని, రోజు మొత్తం జీర్ణ ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది.  పేగు ఆరోగ్యాన్ని ఎంతో సేఫ్ గా ఉంచే కొన్ని బ్రేక్ ఫాస్ట్ లు ఉన్నాయి.  ఫైబర్ పుష్కలంగా ఉండే ఈ ఆహారాలు తీసుకుంటే రోజు మొత్తం హాయిగా గడిచిపోతుంది. అవేంటో తెలుసుకుంటే.. ఓట్స్, చియా సీడ్స్ స్మూతీ.. ఓట్స్‌లో బీటా-గ్లూకాన్ అనే కరిగే ఫైబర్ ఉంటుంది, ఇది జీర్ణక్రియను నెమ్మదిస్తుంది,  మెరుగుపరుస్తుంది. ఓట్స్ ను  చియా విత్తనాలతో కలిపితే, ఫైబర్ కంటెంట్ రెట్టింపు అవుతుంది. చియా విత్తనాలు నీటిని గ్రహిస్తాయి,  జెల్ లాంటి పదార్థాన్ని ఏర్పరుస్తాయి, ఇది ప్రేగులను శుభ్రపరచడంలో సహాయపడుతుంది. వెజిటబుల్ రాగి ఇడ్లీ లేదా దోశ.. రాగులు ఫైబర్,  కాల్షియం పుష్కలంగా కలిగి ఉంటాయి. ఇతర ధాన్యాలతో పోలిస్తే, రాగులలో  ఫైబర్ చాలా ఎక్కువగా ఉంటుంది, ఇది మలబద్ధకం వంటి సమస్యలను నివారిస్తుంది. తురిమిన క్యారెట్లు, బీన్స్,  పాలకూరను రాగి పిండిలో కలపాలి. ఆవిరి మీద ఉడికించి ఇడ్లీగా తినవచ్చు.  లేదంటే దీంతో దోశ కూడా ట్రై చేయవచ్చు. . ఇది తేలికగా ఉంటూనే  జీర్ణవ్యవస్థకు అనుకూలంగా ఉంటుంది. మొలకెత్తిన ధాన్యాలు.. పెసలు, శనగలు లేదా బొబ్బర్లు వంటివి  మొలకెత్తడం వల్ల వాటి ఫైబర్,  ఎంజైమ్ కంటెంట్ పెరుగుతుంది. మొలకెత్తిన ధాన్యాలు ప్రీబయోటిక్స్‌గా పనిచేస్తాయి. మంచి గట్ బ్యాక్టీరియా పెరుగుదలను ప్రోత్సహిస్తాయి. మొలకెత్తిన పెసలను దోసకాయ, టమోటా, నిమ్మరసం,  కొద్దిగా ఉప్పుతో కలపాలి. ఇది ఫైబర్‌ను అందించడమే కాకుండా ప్రోటీన్ కూడా పుష్కలంగా అందిస్తుంది. మల్టీగ్రెయిన్ వెజిటబుల్ ఉప్మా.. సెమోలినాకు బదులుగా మల్టీగ్రెయిన్ గంజి లేదా ఓట్ ఉప్మా తయారు చేయడం వల్ల ఫైబర్  మరింత మెరుగవుతుంది. బఠానీలు, కాలీఫ్లవర్,  బీన్స్ వంటి కూరగాయలను జోడించడం వల్ల ఫైబర్ కంటెంట్ మరింత పెరుగుతుంది. తక్కువ నూనె,  ఆకుపచ్చ కూరగాయలను పుష్కలంగా జోడిండం వల్ల దీనిలో హెల్తీ బెనిఫిట్స్ మెరుగవుతాయి. జీర్ణక్రియకు ప్రయోజనకరంగా భావించే కరివేపాకును జోడిస్తే మరీ మంచిది. జొన్న రోటీ, పెరుగు.. చిరు ధాన్యాలలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. చిరు ధాన్యాలు,  జొన్నలు గ్లూటెన్ రహితంగా ఉండటమే కాకుండా పేగు ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తాయి. పెరుగు అనేది పేగులో మంచి బ్యాక్టీరియాను పెంచే ప్రోబయోటిక్. చిరు ధాన్యాల రోటీతో ఒక గిన్నెడు తాజా పెరుగు కలిపి తింటే చాలా మంచిది. ఈ కాంబో ఫైబర్,  ప్రోబయోటిక్స్ రెండూ కలిగి ఉంటుంది.                            *రూపశ్రీ.  
  కాలంతో పాటు అన్ని అలవాట్లు అప్డేట్ అవుతూ ఉన్నాయి.  మొదట వేప పుల్లలతో పళ్లు తోమేవారు,  తర్వాత పేస్ట్ లు వచ్చాయి.  ఆ తరువాత పేస్ట్ లలో ఉప్పు, బొగ్గు, లవంగం వంటివి చేరాయి.  అవి కూడా అయ్యాక మౌత్ వాష్ లు వచ్చాయి.  చాలా పరిశుభ్రతలో బాగంగా మౌత్ వాష్ లు వాడుతుంటారు.  కొందరు పళ్లు తోమే పని లేకుండా మౌత్ వాష్ వాడితే.. మరికొందరు పళ్లు తోమిన తర్వాత కూడా ఇంకా పళ్లు ఎక్కువగా శుభ్రం అవుతాయని అతి శుభ్రతతో మౌత్ వాష్ కూడా వాడతారు. అయితే.. మౌత్ వాష్ వాడే వారికి డాక్టర్లు ఓ చల్లని చావు కబురు చెబుతున్నారు.  మౌత్ వాష్ వాడితే రక్తపోటు సమస్య వస్తుందని అంటున్నారు.  దీని గురించి వైద్యులు చెప్పిన విషయాలు వివరంగా తెలుసుకుంటే.. మౌత్ వాష్.. నోటి ఆరోగ్యం.. నోటిలోని మంచి బ్యాక్టీరియా మానవ శరీరానికి చాలా అవసరం. ఈ బ్యాక్టీరియా ఆహారంలోని నైట్రేట్‌లను నైట్రైట్‌లుగా మార్చడానికి సహాయపడతాయి, ఇవి శరీరంలో నైట్రిక్ ఆక్సైడ్‌ను ఉత్పత్తి చేస్తాయి. నైట్రిక్ ఆక్సైడ్ అనేది రక్తనాళాలను సడలించడానికి, రక్త ప్రసరణను మెరుగుపరచడానికి , రక్తపోటును నియంత్రించడానికి సహాయపడే ఒక ముఖ్యమైన అంశం. మౌత్ వాష్ వల్ల కలిగే నష్టం.. బలమైన యాంటీసెప్టిక్ మౌత్‌వాష్‌లు నోటిలోని  మంచి బ్యాక్టీరియాను కూడా చంపగలవని నిపుణులు అంటున్నారు. ఇది నైట్రేట్, నైట్రైట్‌గా మారే ప్రక్రియను ప్రభావితం చేస్తుంది , శరీరంలో నైట్రిక్ ఆక్సైడ్ స్థాయిలను తగ్గించగలదు. ఇది నేరుగా రక్తనాళాల పనితీరుపై ప్రభావం చూపుతుంది, తద్వారా రక్తపోటును ప్రభావితం చేసే అవకాశం ఉంది. యాంటీ బాక్టీరియల్ మౌత్‌వాష్ వాడకం వల్ల నోటిలోని అవసరమైన బ్యాక్టీరియా 90 శాతం వరకు తగ్గుతుందని కొన్ని అధ్యయనాలలో తేలిందని వైద్యులు కూడా చెబుతున్నారు. కేవలం కొన్ని రోజుల వాడకం కూడా లాలాజలంలో నైట్రేట్ స్థాయిలను తగ్గించగలదని, దీనివల్ల సిస్టోలిక్ రక్తపోటులో స్వల్ప పెరుగుదల ఉంటుందని పరిశోధనలు చెబుతున్నాయి. మౌత్ వాష్ ఎక్కువ కాలం ఉపయోగిస్తే.. రోజు ఎక్కువగా మౌత్‌వాష్ ఉపయోగించడం వల్ల దీర్ఘకాలంలో అధిక రక్తపోటు వచ్చే ప్రమాదం పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. మంచి బ్యాక్టీరియాను తగ్గించడం, నైట్రిక్ ఆక్సైడ్‌ను తగ్గించడం, , రక్తనాళాల సరైన పనితీరును దెబ్బతీసే ప్రక్రియ వలనే ఇది జరుగుతుందని అంటున్నారు. దీని ప్రభావాలు అందరిపై తీవ్రంగా ఉండనప్పటికీ, రెగ్యులర్ గా అందులోనూ ఎక్కువగా వాడటం వల్ల ప్రమాదం పెరుగుతుందని వైద్యులు చెబుతున్నారు. చిగుళ్ల వ్యాధి, దంత చికిత్స తర్వాత, లేదా దంతాలపై అధికంగా పాచి పేరుకుపోయిన వంటి కొన్ని పరిస్థితులలో మౌత్‌వాష్ వాడకం  అవసరం అవుతుంది. అందువల్ల, మౌత్‌వాష్‌ను అవసరమైనప్పుడు మాత్రమే ఉపయోగించాలని, దానిని రోజువారీ అలవాటుగా చేసుకోకూడదని వైద్యులు చెబుతున్నారు. నోటి శుభ్రతకు బ్రష్ చేయడమే మంచిదని, దీనికే ప్రాధాన్యత ఇవ్వాలని చెబుతున్నారు. కాబట్టి మౌత్ వాష్ ఎక్కువగా వాడకూడదు.                                      *రూపశ్రీ.