LATEST NEWS
బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు కుమార్తె కల్వకుంట్ల కవిత తెలంగాణ రాష్ట్ర సేన (టీఆర్ఎస్) పేరిట కొత్త పార్టీ ప్రారంభించడం తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో పెను సంచలనంగా మారింది. ముఖ్యంగా కవిత టీఆర్ఎస్ పార్టీ.. బీఆర్ఎస్ పార్టీని క్లిష్టపరిస్థితుల్లోకి నెట్టేసింది. బీఆర్ఎస్ అధినేత సొంత కుటుంబం నుంచే తిరుగుబాటు రావడం ఆ పార్టీ క్యాడర్ ను అయోమయంలో, గందరగోళంలో పడేసింది.  పైగా కవిత.. పార్టీ పేరు టీఆర్ఎస్ కావడంతో బీఆర్ఎస్ పరిస్థితి వెంటిలేటర్ పైకి వెళ్లేలా మార్చిందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  పార్టీలోని అహంకారపూరిత ధోరణులు, ముఖ్యంగా కేటీఆర్ మరియు హరీష్ రావుల పనితీరు పట్ల తీవ్ర అసంతృప్తిగా ఉన్న కల్వకుంట్ల నేరుగా తండ్రి కేసీఆర్ పైనే యుద్ధం ప్రకటించారు. బీఆర్ఎస్  ఉద్యమకారులను, మేధావులను పక్కనపెట్టి కేవలం కొందరికే ప్రాధాన్యత ఇవ్వడం వల్ల ఆ పార్టీ పార్టీ పునాదులు బలహీనపడ్డాయి.  ఇప్పుడు కవిత సొంత పార్టీతో బీఆర్ఎస్ కోలుకోలేని విధంగా దెబ్బతీసిందని అంటున్నారు.   కవిత వ్యూహం కేవలం కొత్త పార్టీ పెట్టడం మాత్రమే కాదు, బీఆర్ఎస్ పట్ల అసంతృప్తిగా ఉన్న కేడర్‌ను తనవైపు తిప్పుకోవడం.  తెలంగాణ రాష్ట్ర సమితి  అనే పాత పేరుపై ప్రజలకు ఉన్న సెంటిమెంట్‌ను క్యాష్ చేసుకునేందుకు ఆమె  తన పార్టీకి తెలంగాణ రాష్ట్ర సేన  (టీఆర్ఎస్) అనే పేరును ఎంచుకోవడం ద్వారా..  పాత టీఆర్ఎస్ వారసత్వాన్ని సొంతం చేసుకోవడమనే వ్యూహం కనిపిస్తోందని పరిశీలకులు అంటున్నారు. కవిత కొత్త పార్టీ వల్ల ప్రధానంగా నష్టపోయేది బీఆర్ఎస్ అని అంటున్నారు. కవిత కొత్త పార్టీ ప్రధానంగా బీఆర్ఎస్ ఓటు బ్యాంకునే చీలుస్తుందని చెబుతున్నారు.   అటు కాంగ్రెస్, ఇటు బీజేపీలు ఈ అంతర్గత కలహాలను తమకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం చేస్తాయనడంలో సందేహం లేదు. కవితకు బీజేపీ పరోక్ష మద్దతు ఉండవచ్చని, తద్వారా బీఆర్ఎస్ బార్గేనింగ్ శక్తిని తగ్గించడమే ఆమె అసలు లక్ష్యమని విశ్లేషకులు అంటున్నారు. ఫోన్ ట్యాపింగ్ వంటి ఆరోపణలు, కుటుంబ సభ్యుల మధ్య ఈగో క్లాష్‌లు కూడా ఈ చీలికకు ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి.ఇదే విషయాన్ని తెలుగువన్ చర్చా వేదికలో సువేరా కుండబద్దలు కొట్టినట్లు చెప్పారు.   కవిత నిర్ణయం తెలంగాణలో ఒక కొత్త రాజకీయ శక్తిని సృష్టించవచ్చున్న ఆయన..  ఆమె కేవలం కేసీఆర్ బిడ్డగానే కాకుండా, తనకంటూ ఒక సొంత ఇమేజ్‌ను నిర్మించుకోవాలని చూస్తున్నాన్నారు. భవిష్యత్తులో బీఆర్ఎస్ బలహీనపడి, క్రమంగా బీజేపీలో విలీనమయ్యే అవకాశాలు  కొట్టిపారేయలేన్న సువేరా.. కవిత పార్టీ ఎంతవరకు సక్సెస్ అవుతుందనేది ఆమె ఎంచుకునే నాయకులు, యూత్ మేనిఫెస్టోపై ఆధారపడి ఉంటుందన్నారు. ఒకవేళ ఆమె బలమైన శక్తిగా ఎదిగితే, తెలంగాణలో త్రిముఖ పోటీ మరింత తీవ్రమై రాష్ట్ర రాజకీయ ముఖచిత్రం పూర్తిగా మారిపోయే అవకాశం ఉంది. మహిళా బిల్లు వంటి అంశాలపై ఆమె చేస్తున్న పోరాటం మహిళా ఓటర్లను ఆకర్షించే అవకాశం ఉందని సువేరా అభిప్రాయపడ్డారు.   
   ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి వ్యవహారం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. రాజ్యసభ సభ్యుడిగా ఉన్న ఆయన, బీజేపీలో చేరడానికి చేసిన ప్రయత్నాలు విఫలం కావడంతో ఇప్పుడు తన తదుపరి రాజకీయ అడుగుల కోసం తీవ్రంగా మథనపడుతున్నారు. ఎన్డీయే కూటమిలో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబు  అభ్యంతరం తెలపడం వల్లే, విజయసాయిరెడ్డికి కాషాయ పార్టీ తలుపులు మూసుకున్నాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. దీనికి తోడు, ఇటీవల జరిగిన ఈడి సోదాలు ఆయన్ను మరింత ఒత్తిడికి గురి చేస్తున్నాయి. వ్యూహాలు మరియు పరిణామాలు: విజయసాయిరెడ్డి రాజకీయంగా ఒంటరవుతున్న తరుణంలో, ఆయన కొత్త పార్టీ పెట్టే యోచనలో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. లిక్కర్ కేసులో ప్రధాన నిందితులుగా ఉన్నవారిని వదిలేసి, తనను విచారణల పేరుతో వేధిస్తున్నారని ఆయన ఆవేదన చెందుతున్నారు. చంద్రబాబు నాయుడుపై ఆయన చేసిన తీవ్ర వ్యాఖ్యలు ఆయనలోని రాజకీయ ఫ్రస్ట్రేషన్‌కు అద్దం పడుతున్నాయి.  ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలని, తనదైన మార్గంలో ప్రజల్లోకి వెళ్లాలని ప్రయత్నిస్తున్నప్పటికీ, ఆయనకు క్షేత్రస్థాయిలో ఆదరణ లభించడం ప్రశ్నార్థకమే. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వెలుపల తనకంటూ ఒక రాజకీయ ఉనికిని చాటుకోవాలని ఆయన చేస్తున్న ప్రయత్నాలు, ప్రధానంగా జగన్‌కు పరోక్షంగా ఉపయోగపడతాయా లేదా అన్నది కూడా గమనార్హం. భవిష్యత్తు రాజకీయ ప్రభావం: రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో విజయసాయిరెడ్డి నిర్ణయం కీలక మలుపు కావచ్చు. ఆయన సొంతంగా పార్టీ పెట్టినా, లేదా మరొక కూటమితో పొత్తు పెట్టుకున్నా, ప్రస్తుత రాజకీయ వాతావరణంలో అది ఎంతవరకు ప్రభావం చూపుతుందనేది చూడాలి. ముఖ్యమంత్రి పట్ల ఆయన చూపుతున్న తీవ్ర వ్యతిరేకత, టీడీపీ శ్రేణుల్లో ఆగ్రహాన్ని కలిగిస్తోంది. వ్యవస్థలపైన, దర్యాప్తు సంస్థల పైన ఆయనకు ఉన్న నమ్మకం సడలిపోవడం, తన ఉనికిని కాపాడుకోవడానికి ఆయన చేసే రాజకీయం రాష్ట్రంలో కొత్త సమీకరణాలకు దారితీసే అవకాశం ఉంది.  రాజకీయంగా ఆయన ఏ అడుగు వేసినా, అది ఆయన భవిష్యత్తును నిర్ణయించడమే కాకుండా, రాష్ట్ర రాజకీయాల్లోనూ ప్రకంపనలు సృష్టించేలా కనిపిస్తోంది. అయితే, ప్రజల్లోకి వెళ్లడం మరియు ప్రజల సమస్యలపై పోరాడటం అనే అంశాల్లో ఆయన వెనుకబడి ఉన్నారన్నది వాస్తవం. కేవలం మీడియా సమావేశాలు, సోషల్ మీడియా ట్వీట్లకే పరిమితం కాకుండా, ప్రజల్లోకి వెళ్తేనే ఆయన రాజకీయ మనుగడ సాధ్యమవుతుంది. తెలుగు వన్ యూట్యూబ్ ఛానల్‌లో మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి వ్యూహాలపై కమ్మ కార్పొరేషన్ డైరెక్టర్ అడుసుమిల్లి శ్రీనివాస్‌రావు, జర్నలిస్ట్ గోపి మధ్య ఆసక్తికర చర్చ జరిగింది.. తప్పక వీక్షించండి  
కేంద్ర ఎన్నికల సంఘం  ప్రధాన కమిషనర్ (సీఈసీ) జ్ణానేష్ కుమార్ ను పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తూ   ప్రతిపక్ష పార్టీలు తమ గళాన్ని పెంచాయి.  ఈ మేరకు వివిధ పార్టీలకు చెందిన సుమారు 73 మంది రాజ్యసభ సభ్యులు సంతకాలు చేసిన  నోటీసును రాజ్యసభ సెక్రటరీ జనరల్ కు అందజేశారు. భారత ఎన్నికల సంఘం పనితీరుపై గత కొంతకాలంగా విమర్శలు గుప్పిస్తున్న విపక్షాలు, ఇప్పుడు నేరుగా సీఈసీని లక్ష్యంగా చేసుకుని ముందుకు సాగడం రాజకీయ వర్గాల్లో   సంచలనంగా మారింది. రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న వ్యక్తిని తొలగించాలనే ప్రతిపాదనతో కూడిన ఈ పరిణామం హాట్ టాపిక్ గా మారింది.  ప్రతిపక్షాలు సమర్పించిన ఈ నోటీసులో ప్రధానంగా ఎన్నికల నిర్వహణలో పారదర్శకత లోపించిందని, నిష్పాక్షికంగా వ్యవహరించాల్సిన కేంద్ర ఎన్నికల సంఘం ఏకపక్షంగా వ్యవహరిస్తోందని ఆరోపించాయి.   ఈ వ్యవహారంలో వివిధ పార్టీలకు చెందిన సభ్యులు ఏకతాటిపైకి వచ్చి నోటీసు ఇవ్వడం ప్రాధాన్యత సంతరించుకుంది. దేశంలో ప్రజాస్వామ్య ప్రక్రియకు వెన్నెముకగా నిలిచే ఎన్నికల కమిషన్ విశ్వసనీయతను కాపాడాల్సిన బాధ్యత అందరిపై ఉందని విపక్ష నేతలు పేర్కొన్నారు. గతంలో కూడా కొన్ని అంశాలపై విపక్షాలు అభ్యంతరాలు వ్యక్తం చేసినప్పటికీ, ఈసారి ఏకంగా 73 మంది సభ్యులు ఒకే తాటిపైకి వచ్చి అధికారికంగా నోటీసు ఇవ్వడం కేంద్ర ప్రభుత్వానికి,  ఎన్నికల కమిషన్‌కు ఒక సవాలుగా మారిందనడంలో సందేహం లేదు. నోటీసులో పేర్కొన్న వివరాల ప్రకారం.. ఎన్నికల సమయంలో నిబంధనల అమలులో వివక్ష, అధికార పార్టీకి అనుకూలంగా నిర్ణయాలు వంటి ఆరోపణలు ఉన్నాయి.  కీలకమైన అంశాలపై ఫిర్యాదు చేసినా స్పందించకపోవడం, ఓటర్ల జాబితాలో మార్పులు-చేర్పులు వంటి సున్నితమైన విషయాల్లో తగిన జాగ్రత్తలు తీసుకోకపోవడం వంటి అంశాలను సభ్యులు తమ నోటీసులు సభ్యులు పేర్కొన్నారు.   రాజ్యసభ నిబంధనల ప్రకారం..  రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్న వ్యక్తిపై చర్యలు తీసుకోవాలంటే తగిన సంఖ్యలో సభ్యుల మద్దతు అవసరం. ప్రస్తుత నోటీసుపై 73 మంది సభ్యులు సంతకాలు చేయడంతో..  దీనిపై సభలో చర్చ జరగాలనే డిమాండ్ మరింత గట్టిగా వినిపించే అవకాశం ఉంది. చైర్మన్ ఈ నోటీసును పరిశీలించి, అది నిబంధనలకు అనుగుణంగా ఉందో లేదో  నిర్ధారించుకునన తరువాత తదుపరి చర్యలు తీసుకుంటారు. సపోజ్ ఫర్ సపోజ్ ఈ నోటీసు ఆమోదం పొందితే, సభలో దీనిపై  చర్చ జరిగే అవకాశాలు ఉన్నాయి. గత కొద్ది కాలంగా ఎన్నికల ప్రక్రియలో వినియోగిస్తున్న సాంకేతికత మరియు ఎన్నికల కోడ్ అమలు తీరుపై దేశవ్యాప్తంగా భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రజాస్వామ్య విలువలను కాపాడటంలో రాజ్యాంగ సంస్థలు విఫలమవుతున్నాయని విపక్షాలు పదేపదే ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే సీఈసీని లక్ష్యంగా చేసుకుని విపక్ష సభ్యులు ఇచ్చిన నోటీసు ప్రాధాన్యత సంతరించుకుంది.  
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల రణక్షేత్రంలో తొలి విడత పోలింగ్ ముగిసిన వేళ  కేంద్ర హోంమంత్రి అమిత్ షా  ప్రకటన రాజకీయ వర్గాల్లో పెను సంచలనం సృష్టిస్తోంది. మొదటి దశలో పోలింగ్ జరిగిన 152 స్థానాల్లో భారతీయ జనతా పార్టీ ఏకంగా 110కి పైగా సీట్లను కైవసం చేసుకోబోతోందని ఆయన   ధీమాగా చెప్పారు.  రాష్ట్రంలో గాలి   మార్పు స్పష్టంగా గోచరిస్తోందన్న అమిత్ షా..  తృణమూల్ కాంగ్రెస్ పట్ల ప్రజల్లో ఉన్న తీవ్ర వ్యతిరేకత తమకు కలిసి వస్తుందని చెప్పుకొచ్చారు. ఈ భారీ అంచనా వెనుక గణాంకాలను పరిశీలిస్తే ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. గతంలో ఇదే 152 స్థానాల పరిధిలో బీజేపీ బలం కేవలం 59 సీట్లు మాత్రమే. అయితే ఇప్పుడు ఆ సంఖ్యను రెండింతలు చేసి 110కి చేర్చడం అంటే అది సామాన్యమైన విషయం కాదు. అమిత్ షా లెక్కలు నిజం కావాలంటే..  ఈ ప్రాంతాల్లో కమలం పార్టీ ఓటు బ్యాంకులో భారీ ఎత్తున  స్వింగ్ రావాల్సి ఉంటుంది. ముఖ్యంగా అధికార టీఎంసీ ఓట్ల నుంచి సుమారు 10 శాతం, ఇతరుల నుంచి మరో 5 శాతం ఓట్లు బీజేపీ వైపు మళ్ళితేనే  అమిత్ షా చెప్పిన సంఖ్యలో నియోజకవర్గాలలో బీజేపీ విజయం సాధ్యమవుతుంది. రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో నమోదైన అధిక పోలింగ్ శాతం బీజేపీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపుతోంది. మాల్దా, జల్పాయ్‌గురి, మేదినిపూర్ వంటి ప్రాంతాల్లో ఓటర్లు పెద్ద ఎత్తున తరలిరావడం మార్పుకు సంకేతమని కాషాయ దళం భావిస్తోంది.  ముఖ్యంగా గతంలో టీఎంసీకి అండగా నిలిచిన కొన్ని వర్గాల ఓట్లు చీలిపోవడం.. ముస్లిం ఓట్లలో  విభజన   తమకు కలిసి వస్తుందని కమలం పార్టీ బలంగా నమ్ముతోంది.  మాల్దా వంటి చోట్ల కాంగ్రెస్, ఐఎస్ఎఫ్ వంటి పార్టీలు టీఎంసీ ఓటు బ్యాంకును దెబ్బతీసి.. అది పరోక్షంగా బీజేపీకి మేలు చేస్తాయని ఆశిస్తోంది. అయితే, ఈ అంచనాలపై భిన్నాభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి.  రాజకీయ నిపుణుల విశ్లేషణ ప్రకారం.. 152 సీట్లలో దాదాపు 60 స్థానాలలో  బీజేపీ గట్టి పోటీ  ఎదుర్కొనే అవకాశం ఉంది.   మిగిలిన స్థానాల్లో టీఎంసీకి ఉన్న బలమైన ఓటు బ్యాంకు..  ముఖ్యంగా ముస్లిం మైనారిటీలు అధికంగా ఉన్న చోట్ల కమలం పార్టీకి ఎదురుగాలి తప్పదంటున్నారు.   అమిత్ షా ఊహిస్తున్నట్లుగా 110 సీట్లు సాధించాలంటే రాష్ట్రంలో ఒక అసాధారణమైన  కాషాయ గాలి వీచాలి. ప్రభుత్వ వ్యతిరేకత  కూడా ఈ ఎన్నికల్లో కీలక పాత్ర పోషించనుంది. టీఎంసీ ప్రభుత్వంపై ఉన్న అవినీతి ఆరోపణలు, అభివృద్ధి లోపం వంటి అంశాలను బీజేపీ గట్టిగా ప్రజల్లోకి తీసుకెళ్లింది. దీనికి తోడు ఓటర్ల జాబితా నుంచి పేర్ల తొలగింపు వంటి ఆందోళనలు కూడా ఓటర్లను పోలింగ్ కేంద్రాలకు రప్పించాయని కొందరు అంటున్నారు. ఈ పరిస్థితులన్నీ బీజేపీకి సానుకూల వాతావరణాన్ని సృష్టిస్తున్నాయనేది కాషాయ నేతల వాదన. మొత్తంగా చూస్తే.. బెంగాల్ రాజకీయాల్లో మతపరమైన ధ్రువీకరణ ఎంతవరకు పనిచేస్తుందనేదే ఫలితాలను శాసించనుంది. హిందూ ఓట్లు ఏకపక్షంగా బీజేపీ వైపు మొగ్గు చూపితే అమిత్ షా అంచనాలు నిజం కావచ్చు.. కానీ, టీఎంసీ తన కోర్ ఓటు బ్యాంకును కాపాడుకోగలిగితే మాత్రం పోటీ అత్యంత హోరాహోరీగా ఉంటుంది. అమిత్ షా ప్రకటించిన 110 సీట్ల ధీమా నిజమవుతుందా లేదా అనేది తెలియాలంటే తుది ఫలితాల వరకు వేచి చూడాల్సిందే. -సీతారాం కంఠంనేని
తెలంగాణలో గత కొంతకాలంగా ఉత్కంఠ రేపుతున్న గవర్నర్ కోటా ఎమ్మెల్సీల నియామక ప్రక్రియ ఎట్టకేలకు  కొలిక్కి వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం సిఫార్సు చేసిన ప్రొఫెసర్ ఎం. కోదండరాం, మాజీ క్రికెటర్ మొహమ్మద్ అజారుద్దీన్ పేర్లకు గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా శనివారం (ఏప్రిల్ 25) ఆమోద ముద్ర వేశారు. దీనికి సంబంధించిన ఫైలుపై గవర్నర్ సంతకం చేయడంతో.. వీరిద్దరి నియామకానికి మార్గం సుగమమైంది. ముఖ్యంగా మంత్రిగా కొనసాగుతున్న అజారుద్దీన్ కు గవర్నర్ నిర్ణయం గొప్ప ఊరటనిచ్చిందని చెప్పుకోవాలి. ఆయన తన పదవిని నిలబెట్టుకోవడానికి అవసరమైన రాజ్యాంగ గడువు ముగియనున్న తరుణంలో ఈ నిర్ణయం వెలువడటం ప్రాధాన్యత సంతరించుకుంది. తెలంగాణ కేబినెట్ గతంలోనే గవర్నర్ కోటా కింద కోదండరాం, అజారుద్దీన్ పేర్లను ప్రతిపాదించింది. అయితే.. గతంలో జరిగిన న్యాయపరమైన చిక్కులు, గవర్నర్ల మార్పు వంటి కారణాలతో ఈ ప్రక్రియలో జాప్యం జరుగుతూ వచ్చింది. ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా రాజ్‌భవన్‌కు వెళ్లి గవర్నర్‌ను కలిసి, ఈ నియామకాలను త్వరగా పూర్తి చేయాలని కోరారు. ముఖ్యంగా మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రిగా ఉన్న అజారుద్దీన్.. ఆరు నెలల లోపు శాసనసభ లేదా శాసనమండలి సభ్యుడిగా ఎన్నికవ్వాలనే నిబంధన ఉండటంతో ప్రభుత్వం ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకుంది.   గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో దాసోజు శ్రవణ్, కుర్రా సత్యనారాయణ పేర్లను అప్పటి గవర్నర్ తమిళిసై తిరస్కరించడం, ఆ తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా న్యాయపరమైన స్టేలు రావడం వంటి అంశాలు ఈ ప్రక్రియను ఆలస్యం చేశాయి. సుప్రీంకోర్టులో ఉన్న స్టేలను దృష్టిలో ఉంచుకుని,,  ప్రభుత్వం సాంకేతికంగా ఎలాంటి ఇబ్బందులు రాకుండా జాగ్రత్తలు తీసుకుంది. తాజా నిర్ణయంతో కోదండరాం, అజారుద్దీన్‌లు త్వరలోనే శాసనమండలి సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో కీలక పాత్ర పోషించిన ప్రొఫెసర్ కోదండరాంకు ఎమ్మెల్సీగా అవకాశం కల్పించడం ద్వారా ప్రభుత్వం ఉద్యమకారులకు గుర్తింపునిచ్చింది. అలాగే, జాతీయ రాజకీయాల్లో కీలక నేతగా, మాజీ ఎంపీగా ఉన్న అజారుద్దీన్‌ను కేబినెట్‌లోకి తీసుకోవడం,   మండలికి పంపడం ద్వారా మైనారిటీ వర్గాలకు బలమైన ప్రాతినిధ్యం కల్పించినట్లయింది.   మరోవైపు, అజారుద్దీన్ మంత్రి పదవి విషయంలో ఉన్న గడువు సమీపిస్తున్న నేపథ్యంలో ఈ గ్రీన్ సిగ్నల్ రావడం కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపింది. ఈ నెల 30వ తేదీతో ఆయన మంత్రిగా ప్రమాణం చేసి ఆరు నెలలు పూర్తి కానున్నాయి. ఒకవేళ ఈ లోపు ఎమ్మెల్సీగా నియామకం జరగకపోతే..  అజారుద్దీన్ మంత్రి పదవికి రాజీనామా చేయాల్సి వచ్చేది.  ఇప్పుడు ఆ ముప్పు తప్పినట్లయింది.   గవర్నర్ ఆమోదంతో తదుపరి ప్రక్రియగా సాధారణ పరిపాలన విభాగం (GAD) ఉత్తర్వులు జారీ చేస్తుంది. అనంతరం శాసనమండలి చైర్మన్ సమక్షంలో వీరిద్దరూ ఎమ్మెల్సీలుగా ప్రమాణ స్వీకారం చేస్తారు. దీనివల్ల రాష్ట్ర కేబినెట్‌లో అజారుద్దీన్ స్థానం సుస్థిరమవుతుంది.
ALSO ON TELUGUONE N E W S
      టెక్నాలజీ పుట్టిందే  సైబర్ నేరాల కోసం అన్నట్టుగా సైబర్ నేరగాళ్లు దేశానికి స్వాతంత్రం తెచ్చింది మేమే అనే వీరుల్లా  విజృంబిస్తున్నారు. దీంతో సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు ఎవరూ ఈ మోసగాళ్ల బారి నుంచి తప్పించుకోలేకపోతున్నారు. తాజాగా ప్రముఖ నటి, 'ది కపిల్ శర్మ షో' ఫేమ్ అర్చన పురాణ్ సింగ్(Archana Puran singh)కుమారుడు ఆయుష్మాన్ సేథీ భారీ సైబర్ మోసానికి గురయ్యి తన క్రెడిట్ కార్డ్ ద్వారా ఏకంగా 87,000 రూపాయలు పోగొట్టుకున్నారు.  ఆయుష్మాన్ సేథీ ఫోన్‌కి క్రెడిట్ కార్డ్ లావాదేవీలకు సంబంధించిన అలర్ట్స్ రావడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. గుర్తు తెలియని వ్యక్తి ఆయుష్మాన్ క్రెడిట్ కార్డ్ వివరాలను సేకరించి, అతని అనుమతి లేకుండానే షాపింగ్ చేసినట్లు గుర్తించారు. ఎనిమిది విభిన్న లావాదేవీల ద్వారా మొత్తం రూ. 87,000 డ్రా అయినట్లు మెసేజ్‌లు రావడంతో ఆయుష్మాన్ వెంటనే అప్రమత్తమయ్యారు. సాధారణంగా ఓటీపీ లేకుండా ఇలాంటి లావాదేవీలు జరగడం కష్టమైనప్పటికీ, అంతర్జాతీయ లావాదేవీలు లేదా క్లోనింగ్ ద్వారా ఈ మోసం జరిగి ఉండవచ్చని అనుమానిస్తున్నారు. ఈ ఘటన జరిగిన వెంటనే ఆయుష్మాన్ ముంబైలోని అంబోలి పోలీసులను ఆశ్రయించారు. తన క్రెడిట్ కార్డు నుంచి అనధికారికంగా డబ్బులు కట్ అయ్యాయని, నిందితులపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. పోలీసులు వెంటనే స్పందించి ఐటీ చట్టం కింద కేసు నమోదు చేశారు. ప్రస్తుతం సైబర్ క్రైమ్ విభాగం ఈ వ్యవహారంపై లోతైన దర్యాప్తు చేస్తోంది. బాధితుడి అకౌంట్ నుండి డబ్బు ఎక్కడికి వెళ్లింది? ఏ వెబ్‌సైట్ లేదా యాప్ ద్వారా ఈ లావాదేవీలు జరిగాయి? అనే అంశాలపై విచారణ జరుపుతున్నారు. గత కొద్ది రోజులుగా బాలీవుడ్ ప్రముఖులే లక్ష్యంగా సైబర్ దొంగలు విరుచుకుపడుతున్నారు. కేవలం అర్చన పురాణ్ సింగ్ కుమారుడే కాకుండా, ఇటీవల కాలంలో మరికొందరు నటీనటులు కూడా ఆన్‌లైన్ మోసాలకు గురయ్యారు. సైబర్ నేరగాళ్లు కస్టమర్ కేర్ ఎగ్జిక్యూటివ్‌లుగా నటించడం లేదా ఆకర్షణీయమైన లింక్‌లు పంపడం ద్వారా క్రెడిట్ కార్డ్ వివరాలని తస్కరిస్తున్నారు. ఆన్‌లైన్ లావాదేవీలు జరిపేటప్పుడు ఎంత జాగ్రత్తగా ఉన్నా చిన్న పొరపాటు జరిగితే భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుంది. అర్చన పురాణ్ సింగ్ కుమారుడికి ఎదురైన ఈ అనుభవం అందరికీ ఒక హెచ్చరిక వంటిది. మన క్రెడిట్/డెబిట్ కార్డు వివరాలను ఎవరికీ షేర్ చేయకూడదని, అనుమానాస్పద లింక్స్‌పై క్లిక్ చేయవద్దని పోలీసులు మరోసారి విజ్ఞప్తి చేస్తున్నారు. ఒకవేళ మోసానికి గురైతే వెంటనే '1930' నంబర్‌కు ఫోన్ చేసి సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయడం ద్వారా డబ్బును తిరిగి పొందే అవకాశం ఉంటుంది.  
లేడీ సూపర్ స్టార్ నయనతార (Nayanthara) ఇటీవల మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) గురించి చేసిన ఆసక్తికర వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. సాధారణంగా నయనతార బయటి వేదికలపై తక్కువగా కనిపిస్తుంటారు, అలాగే సహ నటుల గురించి మాట్లాడటం కూడా అరుదు. అయితే తారక్ విషయంలో ఆమె ప్రశంసల వర్షం కురిపించడం నందమూరి అభిమానులను ఖుషీ చేస్తోంది. జూనియర్ ఎన్టీఆర్, నయనతార గతంలో 'అదుర్స్' వంటి బ్లాక్ బస్టర్ సినిమాలో కలిసి నటించిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో సెట్స్‌లో తారక్ పనితీరును చూసి తాను ఎంతగా ఆశ్చర్యపోయానో ఒక ఇంటర్వ్యూలో నయన్ గుర్తు చేసుకున్నారు. "నేను నా కెరీర్‌లో చాలా మంది స్టార్ హీరోలతో పని చేశాను. కానీ తారక్ స్టైల్ వేరు. ఆయన సెట్స్‌లోకి రాగానే ఒక పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. ముఖ్యంగా ఆయన మెమరీ పవర్ చూసి నేను షాక్ అయ్యాను" అని నయనతార పేర్కొన్నారు. ఎన్టీఆర్ డ్యాన్స్ గురించి నయనతార ప్రత్యేకంగా ప్రస్తావించారు. 'అదుర్స్' సినిమాలో పాటల చిత్రీకరణ సమయంలో తారక్ ఎంతో కష్టమైన స్టెప్పులను కూడా కేవలం ఒక్కసారి చూడగానే అలవోకగా వేసేవారని ఆమె చెప్పారు. "మేము ఆ స్టెప్పుల కోసం గంటల తరబడి ప్రాక్టీస్ చేస్తే, ఆయన మాత్రం రిహార్సల్స్ లేకుండానే సింగిల్ టేక్‌లో ఓకే చేసేవారు. షూటింగ్ గ్యాప్‌లో అందరితో ఎంతో సరదాగా ఉంటూనే, కెమెరా ముందుకు రాగానే ఆ పాత్రలో పరకాయ ప్రవేశం చేస్తారు. అలాంటి టాలెంట్ ఉన్న నటుడిని నేను ఇంతవరకు చూడలేదు" అని నయన్ కొనియాడారు.  
తమిళ స్టార్ ధనుష్ (Dhanush) నటించిన లేటెస్ట్ యాక్షన్ డ్రామా 'కర' (Kara). విఘ్నేశ్‌ రాజా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఏప్రిల్ 30న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో  ఇటీవల నిర్వహించిన ప్రీ-రిలీజ్ వేడుకలో ధనుష్ చేసిన ప్రసంగం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ముఖ్యంగా తన కెరీర్ ఆరంభంలో ఎదుర్కొన్న అవమానాలు, జాతీయ అవార్డుపై తనకున్న నమ్మకం గురించి ఆయన చేసిన వ్యాఖ్యలు అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ధనుష్ తన ప్రసంగాన్ని భగవద్గీతలోని "యద్భావం తద్భవతి" (మనం ఏది బలంగా కోరుకుంటామో అదే అవుతాం) అనే శ్లోకంతో ప్రారంభించారు. తన సినీ ప్రయాణంలో ఎదురైన ఒడిదుడుకులను గుర్తుచేసుకుంటూ.. "2002-2003 కాలంలో నేను ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తలో, నాకు ఏదో ఒకరోజు జాతీయ అవార్డు వస్తుందని ఎవరికైనా చెప్తే అందరూ నవ్వుకునేవారు. ఎందుకంటే అప్పుడు నా పరిస్థితి అలా ఉండేది. కానీ నేను నా మనసులో ఆ కోరికను బలంగా నాటుకున్నాను. నిరంతరం శ్రమించాను. చివరకు ఆ కల నిజమైంది" అని చెప్పుకొచ్చారు.  ఈ వేడుకలో ధనుష్‌కు ఆయన కెరీర్‌లోనే మైలురాయిగా నిలిచిన 'పొల్లాదవన్' సినిమా రోజులను గుర్తు చేసుకున్నారు. "పొల్లాదవన్ సినిమా కంటే ముందు నన్ను చాలా మంది బక్కగా ఉన్నావని ఎగతాళి చేసేవారు. నా బాడీపై బాడీ షేమింగ్ కామెంట్స్ వచ్చేవి. కానీ ఆ సినిమాలో మొదటిసారి సిక్స్ ప్యాక్ లుక్‌లో కనిపించినప్పుడు థియేటర్లలో చప్పట్లు, ఈలలు వినిపించాయి. నా నటనకే కాదు, నా ఫిజిక్‌కు కూడా గుర్తింపు రావడం ఆ సినిమాతోనే మొదలైంది" అని ధనుష్ భావోద్వేగానికి లోనయ్యారు. 1991 నాటి ఇంధన సంక్షోభం నేపథ్యంలో గ్యాంగ్‌స్టర్ డ్రామాగా 'కర' రూపొందింది. ఇందులో ధనుష్ ఒక బ్యాంకు దొంగగా కనిపించబోతున్నారు. మమితా బైజు కథానాయికగా నటించగా, జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందించారు. ఈ సినిమా కమర్షియల్ హంగుల కంటే కంటెంట్‌పైనే ఎక్కువ ఆధారపడి ఉంటుందని, ప్రేక్షకులకు ఒక కొత్త అనుభూతిని ఇస్తుందని ధనుష్ ఆశాభావం వ్యక్తం చేశారు. ధనుష్ మాటలు కేవలం సినిమా ప్రమోషన్ కోసం మాత్రమే కాకుండా, యువతకు ఒక గొప్ప సందేశాన్ని అందించాయి. ఎవరెన్ని విమర్శలు చేసినా, మనపై మనకు నమ్మకం ఉంటే సాధించలేనిది ఏదీ లేదని ఆయన తన ప్రయాణం ద్వారా నిరూపించారు. 'కర' సినిమా కూడా ఆయన కెరీర్‌లో మరో మైలురాయిగా నిలుస్తుందని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు.  
  -షూటింగ్ దశలో కల్కి పార్ట్ 2  -త్వరలోనే ప్రభాస్ జాయిన్  -ఈ క్రమంలో క్రేజీ న్యూస్ వైరల్  ప్రభాస్(Prabhas)తో పాటు ఫ్యాన్స్, పాన్ ఇండియా ప్రేక్షకులకి మోస్ట్ అవైటింగ్ మూవీ ఏది అంటే కల్కి పార్ట్ 2(Kalki part 2)అని చెప్పవచ్చు. అఫ్ కోర్స్ మేకర్స్ కి కూడా మోస్ట్ అవైటింగ్ మూవీ.  అందుకే వీలైనంత త్వరగా షూటింగ్ కంప్లీట్ చేయాలనే పట్టుదలతో ఉన్నారు. ఈ మేరకు రీసెంట్ గా షూటింగ్ స్టార్ట్ అయ్యింది. కమల్ హాసన్, అమితాబ్ కి సంబంధించిన కొన్ని కీలక సన్నివేశాలని చిత్రీకరిస్తున్నారు. ప్రభాస్ కూడా త్వరలోనే జాయిన్ కాబోతున్నాడు. ఈ చిత్రానికి సంబంధించిన క్రేజీ న్యూస్ ఒకటి సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది. ఆ న్యూస్ ఏంటో చూద్దాం. కల్కి మొదటి భాగం పేరు కల్కి 2898 ఏడి. దీంతో సెకండ్ పార్ట్ పేరు కల్కి పార్ట్ 2 ఫిక్స్ చేస్తారేమో అనుకుంటూ వస్తున్నారు. ఫిల్మ్ నగర్ వర్గాల తాజా సమాచారం ప్రకారం, 'కల్కి 2' కి కర్ణ: 3102 BC" అనే టైటిల్‌ని పరిశీలిస్తున్నట్లుగా తెలుస్తోంది. మొదటి భాగంలో  ప్రభాస్ క్యారక్టర్ కర్ణుడిగా రివీల్ అయిన విషయం తెలిసిందే. రెండో భాగానికి క్రీస్తు పూర్వం 3102లో కలియుగం ప్రారంభమైన సమయాన్ని, అలాగే కురుక్షేత్ర యుద్ధం తర్వాత కర్ణుడి పాత్ర యొక్క ప్రాముఖ్యతని ప్రతిబింబించపోతుంది. దీంతో కర్ణ: 3102 BC  టైటిల్ పవర్ ఫుల్ గా  ఉంటుందని భావిస్తున్నారు. సదరు టైటిల్ పై  చిత్ర యూనిట్ త్వరలోనే  అధికారిక ప్రకటన కూడా చేయబోతుందని అంటున్నారు. ఒకవేళ ఇదే టైటిల్ ఖరారైతే, ప్రభాస్ అభిమానులకి ఇది అంతకంటే పెద్ద పండగ అని చెప్పవచ్చు.  Also read: VIJay: సౌత్ ఇండస్ట్రీ నుంచి బ్యాన్ చేసారు..ఇక సినిమాలు చేయడానికి వీల్లేదు మొదటి భాగంలో భవిష్యత్తుపై ఎక్కువ దృష్టి పెట్టిన నాగ్‌ అశ్విన్, రెండో భాగంలో గతాన్ని భవిష్యత్తుని  అనుసంధానించబోతున్నారు. ముఖ్యంగా మహాభారత కాలంలోని కర్ణుడి యుద్ధ నైపుణ్యం, అశ్వత్థామతో అతని సంబంధం మరియు సుప్రీమ్ యాస్కిన్ అంతం కోసం కల్కి అవతారం ఎలా ఉద్భవిస్తుందనేది ఈ పార్ట్‌లో చూపించబోతున్నారు.  యాక్షన్ ఎపిసోడ్స్ మరియు విజువల్ ఎఫెక్ట్స్ మొదటి భాగాన్ని మించి మరింత భారీ స్థాయిలో ఉండనున్నాయి.      
      ప్రస్తుతం తమిళనాట ఎక్కడ చూసినా  మే 4 న ప్రకటించే ఎన్నికల ఫలితాలతో  విజయ్(VIjay)ముఖ్యమంత్రి పీఠాన్ని కైవసం చేసుకుంటాడా లేదా అనే ఒకటే చర్చ. ఇండియా మొత్తం ఇదే చర్చ అనుకోండి.  సర్వేల ప్రకారం చూసినా కొన్ని విజయ్ కి పాజిటివ్ గా మరికొన్ని నెగిటివ్ గా వస్తున్నాయి. ఈ లోపు విజయ్ సినీ జర్నీకి సంబంధించిన న్యూస్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ న్యూస్ ఏంటో చూద్దాం.  విజయ్ అప్ కమింగ్ మూవీ ‘జననాయగన్' (Jananayagan)పైరసీ జరిగిన విషయం తెలిసిందే. పైరసీ చేసింది ఎవరో కాదు ఫ్రీలాన్స్‌ ఎడిటర్‌ ప్రదీప్‌ ఇ.రాఘవ్‌. ఇప్పుడు సదరు ఎడిటర్ పై సౌత్‌ ఇండియన్‌ ఫిల్మ్‌ ఎడిటర్స్‌ అసోసియేషన్‌ సంచలన నిర్ణయం తీసుకుంది. తమ  అసోసియేషన్‌ నుంచి ప్రదీప్ ని సస్పెండ్‌ చేస్తున్నట్లుగా మొన్న పత్రికా ప్రకటన విడుదల చేసింది.దీంతో ప్రదీప్ తన సినీ లైఫ్ ఎలా ఉంటుందో కలలు కనడమే కానీ కలలు నిజమయ్యే పరిస్థితి లేదు. పైరసీ వ్యవహారంలో రాష్ట్ర సైబర్‌ క్రైమ్‌ విభాగం కేసు నమోదు చేసి, విచారణ చేపట్టి  మొదట ఆరుగురుని, ఆ తర్వాత మరో ముగ్గురిని అరెస్టు చేయగా.. వీరిలో ప్రదీప్‌ ఇ.రాఘవ్‌‌ ఒకరు.   ప్రదీప్‌ ఇ.రాఘవ్‌ వేరే మూవీకి  ఫ్రీలాన్స్ అసిస్టెంట్ ఎడిటర్‌గా పనిచేస్తున్నాడు. ‘జననాయగన్’ సినిమా ఎడిటింగ్ స్టూడియోలో అతనికి అనుమతి లేనప్పటికీ, అనధికారికంగా సినిమా రీల్స్‌ ని యాక్సెస్ చేసి డేటాను దొంగిలించినట్లుగా సైబర్‌ క్రైమ్‌ విభాగం కనుగొంది. ఆ దొంగిలించిన డేటాను సినిమాగా మార్చి, తన సహ నిందితులకు షేర్ చేయడంతో  ఆన్‌లైన్‌లో కూడా కంటెంట్ ని ప్రదర్శించడం జరిగింది. హెచ్. వినోద్(H Vinoth)దర్శకత్వంలో  కేవీఎన్ ప్రొడక్షన్ వెంకట్ కె. నారాయణ సుమారు 350 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కించడం జరిగింది. పూజా హెగ్డే, మమిత భైజు కీలక రోల్స్ లో చెయ్యగా జన నాయగన్ రిలీజ్ డేట్ కోసం అయితే ఫ్యాన్స్, మూవీ లవర్స్ ఇప్పటికి వెయిటింగ్.    
తెలుగు సినీ ఇండస్ట్రీలో రమ్యకృష్ణ అంటే మనకు వెంటనే గుర్తొచ్చేది 'నీలాంబరి' లాంటి పవర్‌ఫుల్ పాత్రలు లేదా 'శివగామి' వంటి గంభీరమైన రోల్స్. కానీ, ఆమెలోని అసలైన కామెడీ యాంగిల్‌ను చాలామంది మిస్ అవుతుంటారు. తాజాగా తెలుగువన్ విడుదల చేసిన రమ్యకృష్ణ రొమాంటిక్ కామెడీ సీన్స్ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. పాత సినిమాల్లోని ఆమె టైమింగ్ చూస్తుంటే, "అప్పట్లోనే రమ్యకృష్ణ ఇంత అల్లరి చేశారా?" అనిపించక మానదు. నంద‌మూరి బాల‌కృష్ణ హీరోగా న‌టించిన దేవుడు చిత్రంలోనిది ఈ ఫ‌న్నీ వీడియో. ఈ వీడియోలోని ప్రధాన హైలైట్ ఏంటంటే, పెళ్ళిచూపుల సీన్. పెళ్ళికొడుకు అనుకుని మరొకరిని ఇంట్లోకి పిలిచి, స్వీట్లు పెట్టి, అమ్మాయిని చూపించే క్రమంలో జరిగే గందరగోళం మామూలుగా లేదు. "రమ్మన్నారు వచ్చాను.. తినమన్నారు తిన్నాను.. చూడమన్నారు చూశాను.. ఇందులో నా తప్పేముంది?" అంటూ సాగే డైలాగులు థియేటర్లో ఏ రేంజ్ నవ్వులు పూయించాయో మనందరికీ తెలిసిందే. ముఖ్యంగా రమ్యకృష్ణ తన కళ్లతోనే పలికించే అమాయకత్వం, అల్లరి ఆ సీన్లకే ప్రాణం పోశాయి. మరో సీన్‌లో పొలిటికల్ సెటైర్లు అదిరిపోయాయి. ఎన్నికల్లో ఓడిపోయిన తండ్రీకొడుకుల మధ్య సాగే సంభాషణ నేటి రాజకీయాలకు కూడా సరిగ్గా సరిపోతుంది. ఇంట్లోని మూడు ఓట్లలో తనకు రెండు ఓట్లు మాత్రమే పడ్డాయని, ఆ మూడో ఓటు వేయని ద్రోహి ఎవరో తేలాలని తండ్రి పడే ఆరాటం కడుపుబ్బ నవ్విస్తుంది. దానికి తోడు "తొండ గుర్తుకు, ఉడత గుర్తుకు" మధ్య తేడా తెలియక తికమకపడే సీన్ ఆడియన్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంటోంది. రమ్యకృష్ణ - బ్రహ్మానందం కాంబినేషన్‌లో వచ్చే గోరింటాకు సీన్ అయితే అల్టిమేట్. గోరింటాకు పెడుతూ ఆమెను అల్లరి పెట్టడం, మధ్యలో ఆమె ఇచ్చే ఎక్స్‌ప్రెషన్స్ చూస్తుంటే నవ్వు ఆపుకోవడం ఎవరి తరమూ కాదు. కేవలం గ్లామర్ పాత్రలకే పరిమితం కాకుండా, కామెడీని కూడా చాలా ఈజ్‌తో పండించగలనని రమ్యకృష్ణ ఈ వీడియో ద్వారా మరోసారి నిరూపించుకున్నారు. మొత్తానికి, ఈ నాటి డిజిటల్ కాలంలో పాత కామెడీ సీన్లను ఇలా ఒక దగ్గర చేర్చి అందించడం పాత జ్ఞాపకాలను గుర్తు చేస్తోంది. అప్పట్లో సినిమాల్లో ఉండే ఆ స్వచ్ఛమైన హాస్యం ఇప్పుడు మిస్ అవుతున్నామని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. మీరు కూడా కాసేపు సరదాగా నవ్వుకోవాలనుకుంటే ఈ 'రమ్యకృష్ణ రొమాంటిక్ కామెడీ సీన్స్' వీడియోను అస్సలు మిస్ అవ్వకండి. ఇలాంటి మ‌రిన్ని ఫ‌న్నీ వీడియోల కోసం మా Teluguone youtube channelను Subscribeచేసుకోండి  
దర్శక ధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి ప్రతిష్టాత్మక చిత్రం ‘వారణాసి’ (Varanasi) షూటింగ్ శరవేగంగా సాగుతోంది. సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu), గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా (Priyanka Chopra) జంటగా నటిస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి. తాజాగా ఈ సినిమాలోని ఒక కీలకమైన సాంగ్ షూటింగ్ పూర్తయింది. 7 రోజుల పాటు భారీ సెట్స్‌లో షూటింగ్ హైదరాబాద్‌లోని భారీ సెట్స్‌లో 7 రోజుల పాటు ఈ పాటను షూట్ చేశారు. ప్రముఖ బాలీవుడ్ కొరియోగ్రాఫర్ బోస్కో మార్టిస్ (Bosco Martis) ఈ పాటకు అద్భుతమైన స్టెప్స్ అందించారు. మహేష్ బాబు స్టైలిష్ మూమెంట్స్, ప్రియాంక చోప్రా గ్రేస్ ఈ పాటకు ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి. షూటింగ్ పూర్తయిన తర్వాత మహేష్, ప్రియాంకలు బోస్కో మార్టిస్‌తో కలిసి దిగిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. రాజమౌళి మార్క్ విజువల్ వండర్ ఈ పాటలో విజువల్స్, భారీ సెట్స్ ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని ఇస్తాయని అంటున్నారు. రాజమౌళి సినిమాల్లో పాటలంటే కేవలం డ్యాన్స్ మాత్రమే కాదు, కథలో భాగంగా సాగే ఒక విజువల్ ట్రీట్. ‘వారణాసి’లో ఈ సాంగ్ ఒక హైలైట్‌గా నిలుస్తుందని సమాచారం. ఇప్పటికే ఈ సినిమా గ్లింప్స్ మెక్సికో కామిక్ కాన్ (CCXP) వంటి అంతర్జాతీయ వేదికలపై ప్రదర్శితమై రికార్డులు సృష్టిస్తోంది. కె.ఎల్. నారాయణ అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ‘వారణాసి’ సినిమాకి ఎం.ఎం. కీరవాణి సంగీతం అందిస్తున్నారు. పృథ్వీరాజ్ సుకుమారన్ విలన్ గా నటిస్తున్నారు. ఈ మూవీ ఏప్రిల్ 7, 2027 న ప్రేక్షకుల ముందుకు రానుంది.  
టాలీవుడ్ టాలెంటెడ్ యాక్టర్ సత్యదేవ్ (Satya Dev) హీరోగా, సెన్సిబుల్ డైరెక్టర్ వెంకటేశ్‌ మహా (Venkatesh Maha) దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ 'రావు బహదూర్‌' (Rao Bahadur). గతంలో వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన 'ఉమా మహేశ్వర ఉగ్రరూపస్య' విమర్శకుల ప్రశంసలు అందుకోవడమే కాకుండా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఇప్పుడు ఈ క్రేజీ కాంబో మరోసారి ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమైంది. జూన్ 5న గ్రాండ్ రిలీజ్ 'రావు బహదూర్‌' సినిమా విడుదల తేదీని చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. వేసవి కానుకగా జూన్ 5న ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు మేకర్స్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. ఈ చిత్రానికి సూపర్‌స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) తన సొంత నిర్మాణ సంస్థ 'జీఎంబీ ఎంటర్‌టైన్‌మెంట్' (GMB Entertainment) పతాకంపై సమర్పకుడిగా వ్యవహరిస్తుండటం విశేషం. రాజవంశం నేపథ్యంతో సైకలాజికల్ డ్రామా ఓ రాజవంశం నేపథ్యంతో సాగే 'సైకలాజికల్ డ్రామా'గా ఈ చిత్రాన్ని మలిచారు. ఇందులో సత్యదేవ్ విభిన్నమైన లుక్స్‌లో కనిపించనున్నారు. తాజా పోస్టర్‌లో సత్యదేవ్ ఒక అరిస్టోక్రాటిక్ అవతారంలో, గంభీరమైన ముద్రతో కనిపిస్తూ సినిమాపై అంచనాలను పెంచేశారు. ఈ పాత్ర కోసం సత్యదేవ్ తన మేకప్‌కే రోజుకు ఐదు గంటల సమయం కేటాయించాల్సి వచ్చేదట. శ్రీ చక్ర ఎంటర్‌టైన్‌మెంట్స్, ఏ+ఎస్ మూవీస్, మహాయాన మోషన్ పిక్చర్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. సత్యదేవ్ సరసన దీపా థామస్ హీరోయిన్‌గా నటిస్తోంది. స్మరణ్ సాయి సంగీతం అందిస్తుండగా, కార్తీక్ పర్మార్ సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరిస్తున్నారు. బాక్సాఫీస్ వద్ద పోరు జూన్ 4న కేజీఎఫ్ స్టార్ యశ్ నటిస్తున్న భారీ పాన్ ఇండియా చిత్రం 'టాక్సిక్' విడుదలవుతుండగా, మరుసటి రోజే (జూన్ 5) సత్యదేవ్ 'రావు బహదూర్‌' తో థియేటర్లలోకి రాబోతున్నారు. ఈ క్లాస్ అండ్ మాస్ సినిమాల పోరు బాక్సాఫీస్ వద్ద ఎలా ఉంటుందో చూడాలి.   https://x.com/Theteluguone/status/2048354953123733868
2023లో బాక్సాఫీస్ వద్ద ప్రకంపనలు సృష్టించిన చిత్రం 'ది కేరళ స్టోరీ'. వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాకు సీక్వెల్‌గా 'ది కేరళ స్టోరీ 2' (The Kerala Story 2) వచ్చింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో థియేటర్లలో విడుదలైన ఈ మూవీ ఫస్ట్ పార్ట్ రేంజ్ లో మ్యాజిక్ చేయలేకపోయింది. అయినప్పటికీ ఓటీటీలో ఈ సినిమాను చూడటానికి ఎందరో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే తాజాగా ఓటీటీ రిలీజ్ డేట్  మారింది. ముందుగా ఈ సినిమాని మే 8వ తేదీ నుంచి ఓటీటీలో స్ట్రీమింగ్ చేయాలని భావించారు. కానీ, ఇప్పుడు ఈ క్రేజీ ప్రాజెక్ట్ మే 1 నుంచే ఓటీటీలో అందుబాటులోకి రానుంది. సమ్మర్ హాలిడేస్, ప్రేక్షకుల్లో ఉన్న విపరీతమైన క్రేజ్‌ను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. 'ది కేరళ స్టోరీ 2' డిజిటల్ హక్కులను ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ జీ5 (ZEE5) సొంతం చేసుకుంది. మే 1 నుంచి హిందీతో పాటు తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో ఈ చిత్రం స్ట్రీమింగ్ అయ్యే అవకాశం ఉంది. సుదీప్తో సేన్ దర్శకత్వంలో అదా శర్మ ప్రధాన పాత్రలో నటించిన 'ది కేరళ స్టోరీ' పార్ట్-1 కేవలం రూ. 15-20 కోట్ల బడ్జెట్‌తో రూపొంది, ఏకంగా రూ. 300 కోట్లకు పైగా వసూళ్లను సాధించింది. కామాఖ్యా నారాయణ్ సింగ్ దర్శకత్వంలో తెరకెక్కిన రెండో భాగం మాత్రం రూ.50 కోట్ల లోపు వసూళ్లతో సరిపెట్టుకుంది.   https://x.com/ZEE5India/status/2048061330100539742
బిగ్ బాస్ ఫేమ్, సోషల్ మీడియా సెన్సేషన్ అషురెడ్డి (Ashu Reddy) మరోసారి వార్తల్లో నిలిచారు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఒక వ్యక్తి నుంచి కోట్లాది రూపాయలు వసూలు చేసి, ఇప్పుడు పెళ్లికి నిరాకరిస్తోందంటూ ఆమెపై హైదరాబాద్‌లో కేసు నమోదైంది. ఈ ఆరోపణలు సంచలనంగా మారడంతో అషురెడ్డి కూడా ఘాటుగా స్పందించారు. అసలేం జరిగింది? హైదరాబాద్‌లోని షేక్‌పేట్‌కు చెందిన యెనుముల సత్యనారాయణ అనే వ్యక్తి తన కుమారుడు ధర్మేంద్రను అషురెడ్డి మోసం చేసిందని సీసీఎస్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. 2018లో లండన్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్న ధర్మేంద్రకు అషురెడ్డి పరిచయమయ్యారు.  ప్రేమ, పెళ్లి పేరుతో ధర్మేంద్ర నుంచి ఇప్పటివరకు సుమారు రూ. 9.35 కోట్ల విలువైన నగదు, బంగారం, ఫ్లాట్లు, లగ్జరీ వాహనాలను అషురెడ్డి తన పేరిట తీసుకున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. అషురెడ్డి కుటుంబ సభ్యులు కూడా ఈ విషయంలో ధర్మేంద్రను నమ్మించారని, పెళ్లి ప్రస్తావన వస్తే ఇప్పుడు ముఖం చాటేస్తున్నారని బాధితుడి తండ్రి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అషురెడ్డి ఘాటు స్పందన తనపై వస్తున్న ఈ భారీ ఆరోపణలపై అషురెడ్డి సోషల్ మీడియా వేదికగా స్పందించారు. తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో ఒక హెచ్చరిక జారీ చేశారు. "నా ప్రమేయం లేకుండా, నా అనుమతి లేకుండా నా గురించి ఏ వార్త రాసినా లేదా తప్పుడు ప్రచారం చేసినా వారిపై కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకుంటాను." అని రాసుకొచ్చారు. గతంలో కూడా అషురెడ్డి పేరు కొన్ని వివాదాల్లో వినిపించినప్పటికీ, ఏకంగా రూ. 9 కోట్లకు పైగా మోసం జరిగిందనే వార్త ఇప్పుడు టాలీవుడ్ వర్గాల్లో హాట్ టాపిక్ అయింది. అయితే, అషురెడ్డి మాత్రం ఈ ప్రచారమంతా అబద్ధమని కొట్టిపారేస్తున్నారు.  
ప్రేమ ఒక అందమైన భావన, కానీ చాలా మందికి ఇది పదే పదే బాధ కలిగిస్తూ ఉంటుంది. ప్రేమ మొదట్లో అద్బుతంగా ఉంటుంది,  ఇష్టంగా అనిపిస్తుంది,  తమ చుట్టూ ఒక కొత్త ప్రపంచం ఉన్నట్టు అనిపిస్తుంది. కానీ కాలంతో పాటు ప్రేమ కూడా మారుతూ ఉంటుంది.  ముఖ్యంగా పరీక్షలు పెడుతూ ఉంటుంది.  ఇద్దరు వ్యక్తులు సిన్సియర్ గా ఉన్నారా లేదా అనేది కూడా కాలమే డిసైడ్ చేస్తుంది. అయితే ప్రేమించిన చాలా మంది సంతోషం కంటే ఎక్కువ బాధపడిన సందర్బాలే ఉంటాయి.  పదే పదే మనోవేదనకు గురవుతూ ఉంటారు.  ప్రేమ అనేది కేవలం ఒక్కరితో అగేది కూడా కాదు.. చాలామంది ప్రేమలో ఫెయిల్యూర్ వచ్చాక లేదా బ్రేకప్ అయ్యాక.. మళ్లీ ఇంకొకరితో ప్రేమలో పడతారు. కానీ అక్కడ కూడా మళ్లీ బాధ.. పదే పదే మానసిక వేధన బహుమానంలా లభిస్తాయి.  అసలు ప్రేమించేవారికి పదే పదే మానసిక వేధన ఎందుకు ఎదురవుతోంది? ఇందులో తప్పు ఎవరిది? తెలుసుకుంటే.. బాధ కలిగినా అదే మార్గంలో ప్రయాణం.. చాలామంది ప్రేమలో ఉన్నప్పుడు అయినా జీవితంలో వేరే బంధంలో అయినా.. తమకు బాధ కలిగినా సరే.. అదే జోన్ లోనే ఉండటానికి ఇష్టపడతారు. చిన్నతనంలోని అనుభవాలు,  పెరిగిన వాతావరణం,  గతంలో ఏర్పడిన బందాల వల్ల కలిగిన బాధ.. బందంలో గౌరవం లేకపోవడం వంటివి మనిషిని మారేలా చేయాలి. కానీ చాలామంది కొత్తగా ఏర్పడే ప్రతి బందంలోనూ అవే తప్పులు పదే పదే చేస్తుంటారు. అందుకే పదే పదే మనోవేధన కూడా ఎదురవుతూ ఉంటుంది. ఎమోషన్స్ నుండి బయట పడలేకపోవడం.. చాలా మంది తమకు తెలియకుండానే తమలాంటి భాగస్వాములనే ఎంచుకుంటారు. ఇది వారి సబ్ కాన్షియస్ మైండ్  చేసే ఒక ప్రయోగం.  గతంలో విషపూరితమైన సంబంధాలను అనుభవించి ఉంటే  మనస్సు వాటిని సాధారణమైనవిగా అంగీకరిస్తుంది. అందుకే పదే పదే అలాంటి రిలేషన్స్ వైపుకే  ఆకర్షితులు అవుతుంటారు. తమను తాము తక్కువగా  అంచనా వేసుకోవడం.. ఒక వ్యక్తి తమను తాము తక్కువగా అంచనా వేసుకున్నప్పుడు, వారు తరచుగా సంబంధాలలో తాము తక్కువ అన్నట్టు ఉంటారు. అలాంటి వ్యక్తులు ఎదుటి మనిషి వ్యక్తిత్వం గురించి పెద్దగా పట్టించుకోకుండా  పదే పదే తప్పుడు భాగస్వామిని ఎంచుకుంటారు. మార్పు పట్ల భయం.. చాలా మంది తాము తప్పులు చేస్తున్నామని తెలిసినా, మారడం వల్ల ఎదురయ్యే నష్టాలు,  ప్రమాదాలను చూసుకుని మారడానికి భయపడతారు.  అందుకే వారు అవే పాత పద్ధతులలో చిక్కుకుపోయి ఉంటారు. గత గాయాల ప్రబావం.. గత సంబంధాల వల్ల కలిగిన గాయం, పూర్తిగా మానకపోవడం వంటివి చాలామంది పదే పదే అవే తప్పులు చేసేలా చేస్తాయి.  ఇలాంటి వారు  భావోద్వేగపరంగా కోలుకునేంత వరకు, సరైన నిర్ణయాలు తీసుకోలేరు. గందరగోళం.. చాలా మంది ప్రేమకు , భావోద్వేగ అనుబంధానికి మధ్య ఉన్న తేడాను అర్థం చేసుకోరు. వారు తప్పుడు వ్యక్తికి దగ్గరై, దానినే ప్రేమగా పొరబడతారు, తద్వారా అవే తప్పులను రిపీట్ చేస్తూ ఉంటారు.   ప్రేమలో లేదా రిలేషన్ లో  అవే తప్పులను పదే పదే చేయడం అనేది విధి రాసే రాత కాదు.. అది మనిషి  అలవాట్లు,  ఆలోచనా విధానం ఇచ్చే  ఫలితం. ప్రతి వ్యక్తి తన  పద్ధతులను గుర్తించి, తమను తాము  సరిదిద్దుకున్నప్పుడు మాత్రమే ఇలా పదే పదే బాధపడే బంధంలో చిక్కుకోవడాన్ని నివారించగలుగుతారు. సింపుల్ గా చెప్పాలంటే.. ప్రతి మనిషి ప్రేమలో లేదా రెలేషన్ లో.. పదే పదే మానసిక వేదనకు అనుభవించడానికి అక్షరాలా ఆ మనిషి చేతులారా చేసుకునే తప్పులు,  పరిస్థితులకు అనుగుణంగా మారకపోవడం,  పాత ఆలోచనలు, సిద్దాంతాలలో  చిక్కుకుని ఉండటం వంటివి కారణం అవుతాయి.                                    *రూపశ్రీ.
వేసవి కాలం వచ్చిందంటే చాలు..  ప్రతి ఇంట్లో చల్లదనం కోసం ఫ్యాన్లతో పాటు కూలర్ల వాడకం  పెరుగుతుంది. ఉష్ణోగ్రతలు పెరిగేకొద్దీ, కూలర్లు  తప్పనిసరి అవుతాయి.  రోజంతా కూలర్లు పనిచేస్తూనే ఉంటాయి. అయితే కూలర్లు వాడేవారు దాని శుభ్రత గురించి మాత్రం అంత శ్రద్ద తీసుకోరు. దీని వల్ల నీరు మురికిగా మారి దోమలు పెరగడానికి ఆవాసంగా మారడమే కాకుండా.. . కూలర్‌లోని నీటిని శుభ్రంగా ఉంచకపోతే కూలింగ్ కూడా పెద్దగా రాదు.   అయితే కూలర్ లో నీటిని ప్రతిరోజూ శుభ్రం చేయడం అంత ఈజీ ఏమీ కాదు.. కొన్ని కంపెనీల కూలర్లలో నీటిని నింపడం సులువే.. కానీ వాటిలో నీటిని తొలగించడం, శుభ్రం చేయడం కాస్త శ్రమతో కూడుకున్నదే.. అయితే.. కూలర్లలో నీరు ప్రతిరోజూ శుభ్రం చేయకపోయినా కొన్నిరోజుల పాటు నీరు శుభ్రంగా ఉండాలన్నా, తాజాగా అనిపించాలన్నా కేవలం ఒకే ఒక్క చిట్కా అద్బుతంగా పనిచేస్తుంది. అదేంటో తెలుసుకుంటే.. పటిక.. కూలర్‌లోని నీటిని శుభ్రంగా ఉంచడానికి పటిక చాలా సులభమైన,  ఇంటి చిట్కా. దీనిని నీటిలో వేయడం  వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి. కూలర్ ట్యాంక్‌లో నీరు తరచుగా ఎక్కువ సేపు నిలిచి ఉంటుంది, ఇది తొందరగా మురికిగా మారే అవకాశం ఉంటుంది. ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా ఈ నీటిలో దోమలు  ఆవాసం ఏర్పాటు చేసుకుని  గుడ్లు పెడతాయి. అయితే కూలర్ ఎక్కువ కాలం పనిచేయాలంటే   దానిని శుభ్రపరచడం చాలా ముఖ్యం. నీటిలో ఒక చిన్న పటిక ముక్కను వేయడం వల్ల నీటిని శుభ్రపరచవచ్చు.  పైగా దోమల సమస్య కూడా తగ్గుతుంది. కూలర్ ట్యాంక్ లో పటిక వేయడం వల్ల కలిగే ప్రయోజనాలు.. నీటి స్వచ్చత.. పటిక నీటిలోని దుమ్ము, ధూళి , చిన్న కణాలను బంధిస్తుంది. ఈ కణాలు బరువెక్కి అడుగుకు చేరుకుంటాయి, దీనివల్ల పైన ఉన్న నీరు స్వచ్ఛంగా ఉంటుంది. దోమలకు చెక్.. పటిక నీటిని శుద్ధి చేయడం వల్ల దోమల గుడ్లు, లార్వాలు సులభంగా వృద్ధి చెందలేవు. దీనివల్ల దోమల సమస్య గణనీయంగా తగ్గుతుంది. దుర్వాసన.. కూలర్ నీటి నుండి ఏదైనా వింత లేదా దుర్వాసన వస్తుంటే, దానిని చాలా వరకు తగ్గించడంలో పటిక సహాయపడుతుంది. బ్యాక్టీరియా..  పటికకు తేలికపాటి యాంటీసెప్టిక్ గుణాలు ఉన్నాయి, ఇవి నీటిలో ఉండే  హానికరమైన బ్యాక్టీరియాను తగ్గించడంలో సహాయపడతాయి. నీటి నాణ్యత.. పటిక నీటిని ఎక్కువ సేపు శుభ్రంగా ఉంచడానికి సహాయపడుతుంది, దీనివల్ల కూలర్ ప్యాడ్‌లు త్వరగా పాడవకుండా ఉంటాయి , గాలి చల్లగా ఉంటుంది. పటికను ఉపయోగించేటప్పుడు గుర్తుంచుకోవలసిన విషయాలు.. పటికను ఎక్కువ పరిమాణంలో వాడకూడదు. ఒక చిన్న ముక్క సరిపోతుంది. ఎక్కువ పటిక కలపడం వల్ల నీటి నాణ్యత దెబ్బతింటుంది. అంతేకాకుండా కూలర్‌లోని నీటిని ఎక్కువ కాలం నిల్వ ఉంచకుండా అప్పుడప్పుడు మారుస్తూ ఉండాలి.                                 *రూపశ్రీ.
  వేసవి కాలం వచ్చిందంచే సాధారణ టేబుల్ ఫ్యాన్ లు,  సీలింగ్ ఫ్యాన్ లు సరిపోవు.  వీటి నుండి వచ్చే గాలి వేసవి వేడిని కంట్రోల్ చేయలేవు. పైగా వేసవి వేడి గాలిని తిప్పి, తిప్పి గది మొత్తం వేడిగా మార్చేస్తాయి. ఈ కారణంగానే ఇప్పట్లో ప్రతి ఇంట్లో కూలర్లు వాడుతున్నారు.  కాస్త అర్థిక స్థితి ఉన్నవారేతై ఏసీ లు కూడా పెట్టించుకుంటారు. కానీ రానురాను పెరుగుతున్న ఎండలు,  వాటి తాలుకూ వేడి కారణంగా కూలర్లు కూడా సరిపోవడం లేదని అనుకుంటూ ఉంటారు. కానీ.. సాధారణ కూలర్ ను కూడా చక్కగా ఏసీ లాంటి చల్లదనం ఇచ్చేలా చేయవచ్చు.  ఇందుకోసం కొన్ని చిట్కాలు పాటిస్తే సరిపోతుంది. సాధారణ కూలర్ తో ఏసీ లాంటి చల్లదనం కావాలంటే.. ఏ చిట్కాలు పాటించాలో తెలుసుకుంటే.. సాల్ట్ , ఐస్.. కూలర్  చల్లటి గాలిని అందించాలని  అనుకుంటే, ఐస్ లేదా ఉప్పు నీటిని కలపడం చాలా ప్రభావవంతమైన పద్ధతి. ఇది చాలా ఫేమస్ చిట్కా కూడా.  కూలర్ ట్యాంకులో రాళ్ల ఉప్పు,   ఐస్ క్యూబ్స్ వేస్తారు.  రాళ్ల ఉప్పు ఐస్ క్యూబ్స్ కరగకుండా ఎక్కువ సేపు ఉండేలా చేస్తాయి. దీని వల్ల కూలింగ్ బాగా వస్తుంది. అయితే.. ఇది రెగ్యులర్ గా చేయడం మంచిది కాదు.. ఉప్పు తొందరగా చిలుము పట్టేలా చేస్తుంది. దీని వల్ల కూలర్ లోని మెటల్ భాగాలు తొందరగా పాడయ్యే అవకాశం ఉంటుంది. దీన్ని ఎప్పుడైనా వేడి భరించలేని సమయాల్లో ట్రై చేయడం మంచిది. వెంటిలేషన్.. చాలా మంది ఏసీ లాంటి చల్లదనం వస్తుందని ఆశించి,  కూలర్లను మూసి ఉన్న గదులలో వాడుతుంటారు, కానీ ఇది  పెద్ద పొరపాటు. సరైన వెంటిలేషన్ ఉన్నప్పుడే ఎయిర్ కూలర్ సరిగ్గా పనిచేస్తుంది. గదిలో  వేడి గాలి బయటకు పోవడానికి , చల్లని గాలి లోపల ప్రసరించడానికి వీలుగా ఒక కిటికీని లేదా తలుపును తెరిచి ఉంచడం ముఖ్యం. సరైన వెంటిలేషన్ కూలర్ పనితీరును  మెరుగుపరుస్తుంది. శుభ్రత.. కాలక్రమేణా కూలర్ ప్యాడ్‌లపై దుమ్ము, ధూళి పేరుకుపోయి, వాటి కూలింగ్ సామర్థ్యాన్ని తగ్గిస్తాయి. అందువల్ల వాటిని క్రమం తప్పకుండా శుభ్రపరచడం లేదా మార్చడం ముఖ్యం. కూలర్ చాలా చల్లని గాలిని ఇవ్వాలి అంటే.. కూలర్ లోపల వట్టివేర్లతో తయారు చేసిన మ్యాట్లను  ఉపయోగించాలి. ఇది కూలింగ్ ను మెరుగుపరుస్తుంది. వట్టివేర్ల  గుండా నీరు ప్రవహించినప్పుడు, గాలి చల్లగా, తాజాగా మారుతుంది, మంచి  తేలికపాటి సువాసనను కూడా అందిస్తుంది. పైన పేర్కొన్న చిట్కాలను పాటించడం వల్ల వేసవి కాలంలో కూలర్ ఏసీ లాంటి చల్లదనాన్నిఇస్తుంది.                                     *రూపశ్రీ.
  కాలంతో పాటు అన్ని అలవాట్లు అప్డేట్ అవుతూ ఉన్నాయి.  మొదట వేప పుల్లలతో పళ్లు తోమేవారు,  తర్వాత పేస్ట్ లు వచ్చాయి.  ఆ తరువాత పేస్ట్ లలో ఉప్పు, బొగ్గు, లవంగం వంటివి చేరాయి.  అవి కూడా అయ్యాక మౌత్ వాష్ లు వచ్చాయి.  చాలా పరిశుభ్రతలో బాగంగా మౌత్ వాష్ లు వాడుతుంటారు.  కొందరు పళ్లు తోమే పని లేకుండా మౌత్ వాష్ వాడితే.. మరికొందరు పళ్లు తోమిన తర్వాత కూడా ఇంకా పళ్లు ఎక్కువగా శుభ్రం అవుతాయని అతి శుభ్రతతో మౌత్ వాష్ కూడా వాడతారు. అయితే.. మౌత్ వాష్ వాడే వారికి డాక్టర్లు ఓ చల్లని చావు కబురు చెబుతున్నారు.  మౌత్ వాష్ వాడితే రక్తపోటు సమస్య వస్తుందని అంటున్నారు.  దీని గురించి వైద్యులు చెప్పిన విషయాలు వివరంగా తెలుసుకుంటే.. మౌత్ వాష్.. నోటి ఆరోగ్యం.. నోటిలోని మంచి బ్యాక్టీరియా మానవ శరీరానికి చాలా అవసరం. ఈ బ్యాక్టీరియా ఆహారంలోని నైట్రేట్‌లను నైట్రైట్‌లుగా మార్చడానికి సహాయపడతాయి, ఇవి శరీరంలో నైట్రిక్ ఆక్సైడ్‌ను ఉత్పత్తి చేస్తాయి. నైట్రిక్ ఆక్సైడ్ అనేది రక్తనాళాలను సడలించడానికి, రక్త ప్రసరణను మెరుగుపరచడానికి , రక్తపోటును నియంత్రించడానికి సహాయపడే ఒక ముఖ్యమైన అంశం. మౌత్ వాష్ వల్ల కలిగే నష్టం.. బలమైన యాంటీసెప్టిక్ మౌత్‌వాష్‌లు నోటిలోని  మంచి బ్యాక్టీరియాను కూడా చంపగలవని నిపుణులు అంటున్నారు. ఇది నైట్రేట్, నైట్రైట్‌గా మారే ప్రక్రియను ప్రభావితం చేస్తుంది , శరీరంలో నైట్రిక్ ఆక్సైడ్ స్థాయిలను తగ్గించగలదు. ఇది నేరుగా రక్తనాళాల పనితీరుపై ప్రభావం చూపుతుంది, తద్వారా రక్తపోటును ప్రభావితం చేసే అవకాశం ఉంది. యాంటీ బాక్టీరియల్ మౌత్‌వాష్ వాడకం వల్ల నోటిలోని అవసరమైన బ్యాక్టీరియా 90 శాతం వరకు తగ్గుతుందని కొన్ని అధ్యయనాలలో తేలిందని వైద్యులు కూడా చెబుతున్నారు. కేవలం కొన్ని రోజుల వాడకం కూడా లాలాజలంలో నైట్రేట్ స్థాయిలను తగ్గించగలదని, దీనివల్ల సిస్టోలిక్ రక్తపోటులో స్వల్ప పెరుగుదల ఉంటుందని పరిశోధనలు చెబుతున్నాయి. మౌత్ వాష్ ఎక్కువ కాలం ఉపయోగిస్తే.. రోజు ఎక్కువగా మౌత్‌వాష్ ఉపయోగించడం వల్ల దీర్ఘకాలంలో అధిక రక్తపోటు వచ్చే ప్రమాదం పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. మంచి బ్యాక్టీరియాను తగ్గించడం, నైట్రిక్ ఆక్సైడ్‌ను తగ్గించడం, , రక్తనాళాల సరైన పనితీరును దెబ్బతీసే ప్రక్రియ వలనే ఇది జరుగుతుందని అంటున్నారు. దీని ప్రభావాలు అందరిపై తీవ్రంగా ఉండనప్పటికీ, రెగ్యులర్ గా అందులోనూ ఎక్కువగా వాడటం వల్ల ప్రమాదం పెరుగుతుందని వైద్యులు చెబుతున్నారు. చిగుళ్ల వ్యాధి, దంత చికిత్స తర్వాత, లేదా దంతాలపై అధికంగా పాచి పేరుకుపోయిన వంటి కొన్ని పరిస్థితులలో మౌత్‌వాష్ వాడకం  అవసరం అవుతుంది. అందువల్ల, మౌత్‌వాష్‌ను అవసరమైనప్పుడు మాత్రమే ఉపయోగించాలని, దానిని రోజువారీ అలవాటుగా చేసుకోకూడదని వైద్యులు చెబుతున్నారు. నోటి శుభ్రతకు బ్రష్ చేయడమే మంచిదని, దీనికే ప్రాధాన్యత ఇవ్వాలని చెబుతున్నారు. కాబట్టి మౌత్ వాష్ ఎక్కువగా వాడకూడదు.                                      *రూపశ్రీ.
ఆరోగ్యకరమైన శరీరానికి జింక్ చాలా అవసరం. జింక్ కణజాలాలను బాగుచేస్తుందని చెబుతారు. జింక్ ఒక యాంటీఆక్సిడెంట్‌గా పనిచేస్తూ, కణాలను దెబ్బతినకుండా కాపాడటానికి సహాయపడుతుంది. చర్మం,  జీర్ణవ్యవస్థ ఆరోగ్యానికి జింక్ చాలా కీలకం. శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే అన్ని రకాల పోషకాలు, ఖనిజాలు, విటమిన్లు అవసరం అవుతాయి. అలాంటి వాటిలో జింక్ కూడా ఒకటి. అయితే చాలామందికి జింక్ లోపం గురించి పెద్దగా అవగాహన ఉండదు.  జింక్ లోపం వల్ల ఇన్ఫెక్షన్లు సోకుతాయని వైద్యులు చెబుతున్నారు. ఇది నిజమేనా? జింక్ లోపం గురించి.  జింక్ లోపం వల్ల వచ్చే సమస్యల గురించి వైద్యులు ఏం చెబుతున్నారు తెలుసుకుంటే.. శరీరానికి జింక్ ఎందుకు అవసరం..  జీర్ణవ్యవస్థ ఆరోగ్యానికి , చర్మానికి జింక్ చాలా అవసరం. జింక్ చర్మాన్ని మృదువుగా ఉంచడానికి , కణజాలాలను బాగు చేయడానికి సహాయపడుతుంది. జింక్ లోపం తరచుగా ఇన్ఫెక్షన్లకు దారితీయవచ్చని, చర్మ, కడుపు సమస్యలను కూడా కలిగించవచ్చని వైద్యులు చెబుతున్నారు. జింక్ లోపం వల్ల వచ్చే సమస్యలు.. జింక్ లోపం శరీరంలో అనేక రకాల సమస్యలను కలిగిస్తుంది. జింక్ లోపం పిల్లలలో పెరుగుదలను నిరోధించగలదు , మానసిక ఆరోగ్యాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. ఇన్ఫెక్షన్లు.. జింక్ లోపం తరచుగా ఇన్ఫెక్షన్లకు దారితీస్తుంది. జింక్ లోపం ఇన్ఫెక్షన్లతో పోరాడే శరీర సామర్థ్యాన్ని గణనీయంగా తగ్గిస్తుంది. దీనివల్ల ఫంగస్ , చర్మం ఎర్రబడటం వంటి సమస్యలు తలెత్తవచ్చు. విరేచనాలు.. వైద్యుల ప్రకారం, జీర్ణవ్యవస్థ ఆరోగ్యానికి జింక్ చాలా అవసరం. జింక్ లోపం జీర్ణవ్యవస్థపై హానికరమైన ప్రభావాన్ని చూపుతుంది. శరీరంలో జింక్ లోపించినప్పుడు, విరేచనాలు అయ్యే అవకాశం ఉంటుంది. గాయాలు.. జింక్ లోపం చర్మం, కడుపునే కాకుండా గాయాలను కూడా ప్రభావితం చేస్తుంది. జింక్ లోపం ఉన్నవారిలో గాయాలు నెమ్మదిగా నయమవుతాయి. జింక్ లోపిస్తే కనిపించే లక్షణాలు.. జింక్ లోపం వేగంగా బరువు తగ్గడం, నీరసం , జుట్టు రాలడం వంటి లక్షణాలు కలిగి ఉంటుంది. జింక్ పుష్కలంగా లభించే ఆహారాలు.. ఆహారంలో జింక్‌ను చేర్చుకోవడానికి,  గుమ్మడి గింజలు, నువ్వులు, ఆవాలు, పొద్దుతిరుగుడు గింజలు , రాగులను చేర్చుకోవచ్చు. ఈ ఆహారాలలో జింక్ ఉంటుంది. అదనంగా,  ఆవాల ఆకుకూర, మాంసం, పప్పుధాన్యాలు, గుమ్మడికాయ, పుట్టగొడుగులు, పెరుగు, వేరుశెనగలు , గుడ్లను కూడా తినవచ్చు. ఈ ఆహారాలలో కూడా జింక్ సమృద్దిగా ఉంటుంది.                                 *రూపశ్రీ.
ఇనుప పాత్రలో వంట చేయడం ఆరోగ్యానికి మేలు చేస్తుందని చెబుతారు. ఎందుకంటే ఇనుప పాత్రలో వంట చేయడం వల్ల ఆ ఆహారాన్ని ఐరన్ ఖనిజం చేరుతుంది.  దీని వల్ల శరీరానికి ఐరన్ ఎలాంటి సప్లిమెంట్ అవసరం లేకుండా కొద్దిమోతాదులో అందుతుంది.  అయితే  అన్ని రకాల కూరగాయలను ఇనుప పాత్రలో వండకూడదు.  . కొన్ని కూరగాయలు ఐరన్ పాత్రలో వండినప్పుడు రియాక్షన్ జరిగి వాటి రుచి, రంగు లేదా పోషక విలువల్లో మార్పులు జరిగే అవకాశం ఉంటుంది.  ఆహారం  నాణ్యత , రుచిని కోల్పోకుండా ఉండేందుకు, ఐరన్ పాత్రలు వాడే ప్తి ఒక్కరూ వాటిలో వండకూడని కూరగాయలు ఏమిటో తెలుసుకోవడం చాలా ముఖ్యం. టమోటా.. టమోటాలు వంటల్లో ఎక్కువగా ఉపయోగించే  కూరగాయ. టమోటాలలో ఆమ్లం అధిక మొత్తంలో ఉంటుంది, ఇది ఐరన్ తో చర్య జరుపుతుంది. దీనివల్ల కూరగాయ రంగు ముదురుగా మారవచ్చు , కొద్దిగా వగరు రుచిని కలిగి ఉండవచ్చు. ఎక్కువసేపు వండటం ఈ ప్రభావాన్ని మరింత ఎక్కువ చేస్తుంది. అందువల్ల, టమోటా వంటి  కూరగాయలను స్టీల్ లేదా నాన్-స్టిక్ పాన్ లేదా బౌల్స్ లో వండాలి. పాలకూర.. పాలకూర వంటి ఆకుకూరలు ఐరన్ ప్రభావానికి గురైనప్పుడు వాటి  ఆకుపచ్చ రంగును కోల్పోయి, ముదురు రంగులోకి లేదా నల్లగా మారవచ్చు, దీనివల్ల అవి తినడానికి పనికిరావు. రుచిలో కూడా కొద్దిగా మార్పు ఉంటుంది. ఆకుకూరలను అల్యూమినియం లేదా స్టీల్ పాత్రలలో వండటం ఉత్తమం. చింతపండు.. చింతపండు ఉపయోగించి వండే  కూరను ఇనుప పెనంలో వండకూడదు. వీటిలో ఉండే ఆమ్లాలు ఇనుముతో చర్య జరిపి ఆహారం రుచిని మార్చి, దానికి లోహపు రుచిని ఇస్తాయి. ఇది అనారోగ్యకరమైనదిగా కూడా పరిగణించబడుతుంది. అందువల్ల, స్టీల్ లేదా నాన్-స్టిక్ పెనాన్ని ఉపయోగించాలి.  కేవలం చింతపండు మాత్రమే కాకుండా నిమ్మకాయ,  మామిడికాయ వంటివి కూడా ఐరన్ పాత్రలలో వండకూడదు. పెరుగు వంటలు.. పెరుగుతో చేసిన కూర లేదా పెరుగు గ్రేవీ వంటి కూరగాయల వంటకాలను ఇనుప పెనంలో వండినప్పుడు వాటి రుచి భిన్నంగా ఉంటుంది. పెరుగులోని పులుపు ఇనుముతో కలిసి కొద్దిగా చేదును కలిగిస్తుంది. అంతేకాకుండా రంగు ముదురుగా మారవచ్చు , కూరలో కొద్దిగా నలుపు కనిపించవచ్చు. నిమ్మకాయ.. కూరగాయలకు నిమ్మరసం కలపడం వల్ల వాటికి కొద్దిగా పులుపు, రుచి వస్తుంది, కానీ అది ఐరన్ తో  చర్య జరిపి రుచిని పాడుచేసే అవకాశం ఉంది.  దీనివల్ల ఆహారానికి లోహపు, వగరు రుచి వస్తుంది, కాబట్టి నిమ్మరసాన్ని ఎల్లప్పుడూ వంట చేసిన తర్వాత, తినడానికి ముందు మాత్రమే కలపాలి. ఎక్కువ నీటి శాతం కలిగిన కూరలు.. అధిక నీటి శాతం ఉన్న కూరగాయలను ఐరన్ పెనంలో వండినప్పుడు వాటి రంగు, ఆకృతి మారవచ్చు. ఈ కూరగాయలను ఎక్కువ సేపు వండితే నల్లగా మారిపోతాయి. అందువల్ల వాటిని రసాయనాలతో చర్య జరపని పాత్రలలో వండటం మంచిది.                               *రూపశ్రీ.