
2023లో బాక్సాఫీస్ వద్ద ప్రకంపనలు సృష్టించిన చిత్రం 'ది కేరళ స్టోరీ'. వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాకు సీక్వెల్‌గా 'ది కేరళ స్టోరీ 2' (The Kerala Story 2) వచ్చింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో థియేటర్లలో విడుదలైన ఈ మూవీ ఫస్ట్ పార్ట్ రేంజ్ లో మ్యాజిక్ చేయలేకపోయింది. అయినప్పటికీ ఓటీటీలో ఈ సినిమాను చూడటానికి ఎందరో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే తాజాగా ఓటీటీ రిలీజ్ డేట్ మారింది.
ముందుగా ఈ సినిమాని మే 8వ తేదీ నుంచి ఓటీటీలో స్ట్రీమింగ్ చేయాలని భావించారు. కానీ, ఇప్పుడు ఈ క్రేజీ ప్రాజెక్ట్ మే 1 నుంచే ఓటీటీలో అందుబాటులోకి రానుంది. సమ్మర్ హాలిడేస్, ప్రేక్షకుల్లో ఉన్న విపరీతమైన క్రేజ్‌ను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
'ది కేరళ స్టోరీ 2' డిజిటల్ హక్కులను ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ జీ5 (ZEE5) సొంతం చేసుకుంది. మే 1 నుంచి హిందీతో పాటు తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో ఈ చిత్రం స్ట్రీమింగ్ అయ్యే అవకాశం ఉంది.
సుదీప్తో సేన్ దర్శకత్వంలో అదా శర్మ ప్రధాన పాత్రలో నటించిన 'ది కేరళ స్టోరీ' పార్ట్-1 కేవలం రూ. 15-20 కోట్ల బడ్జెట్‌తో రూపొంది, ఏకంగా రూ. 300 కోట్లకు పైగా వసూళ్లను సాధించింది. కామాఖ్యా నారాయణ్ సింగ్ దర్శకత్వంలో తెరకెక్కిన రెండో భాగం మాత్రం రూ.50 కోట్ల లోపు వసూళ్లతో సరిపెట్టుకుంది.






