LATEST NEWS
2014 ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు. శకునిని అడ్డుపెట్టుకొని, జూదంలో పాండవులపై కౌరవులు పైచేయి సాధించినట్టుగా.. శకుని లాంటి రాజకీయ వ్యూహకర్త జిత్తులతో ఫ్యాన్ పార్టీ అధికారంలోకి వచ్చింది. భారతంలో ద్రౌపదిని వివస్త్రను చేయడానికి కౌరవులు ప్రయత్నిస్తే.. రాజధాని లేని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ను మిగల్చడానికి ఆ పార్టీ ప్రయత్నించింది. అందుకే కురుక్షేత్రంలో కౌరవులు ఓడిపోయినట్టుగా.. 2024 ఎన్నికల్లో ఘోర ఓటమిని చూసింది. అయినా ఫ్యాన్ పార్టీ తీరు మారలేదు. వచ్చే ఎన్నికల కోసం మళ్ళీ ఆ శకుని లాంటి వ్యూహకర్తను రంగంలోకి దింపడానికి చూస్తున్నట్లు తెలుస్తోంది.  అసలీ ఉపోద్ఘాతమంతా ఎందుకంటున్నారా? అక్కడికే వస్తున్నా... ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అత్యంత ఆసక్తికరమైన చర్చ జోరుగా సాగుతోంది.  2024ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని చవిచూసిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ,   2029 ఎన్నికల కోసం ఇప్పటి నుంచే పావులు కదపడం ప్రారంభించిందన్న చర్చ జరుగుతోంది.   ముఖ్యంగా గతంలో అంటే 2019 ఎన్నికలలో తనకు అఖండ విజయాన్ని అందించిన రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ అలియాస్ పీకే వైపు జగన్ మోహన్ రెడ్డి మళ్ళీ మొగ్గు చూపుతున్నారని చర్చ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.  గత ఎన్నికల సమయంలో తలెత్తిన విభేదాలను పక్కన పెట్టి, మళ్ళీ పాత బంధాన్ని పునరుద్ధరించుకోవాలని జగన్ భావిస్తున్నట్లు సమాచారం. 2019 ఎన్నికల్లో వైకాపా సాధించిన 151 సీట్ల అద్భుత విజయానికి ప్రశాంత్ కిషోర్ వ్యూహాలే ప్రధాన కారణమన్న సంగతి తెలిసిందే.  అప్పట్లో జగన్ పాదయాత్ర నుంచి అభ్యర్థుల ఎంపిక వరకు పీకే  కీలక పాత్ర పోషించారు.  అయితే, 2024 ఎన్నికల సమయానికి పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. ప్రశాంత్ కిషోర్ ప్రత్యక్ష రాజకీయాల నుంచి విరామం తీసుకోవడం, జగన్ కు దూరంగా జరగడం వంటి పరిణామాలు చోటుచేసుకున్నాయి. అంతేకాకుండా, గత ఎన్నికల్లో జగన్ ఓటమిని పీకే ముందే ఊహించి ప్రకటించడం ఇద్దరి మధ్య అగాధాన్ని పెంచింది. అయితే 2024 ఎన్నికలలో ఘోర పరాజయం తరువాత ఇప్పటి వరకూ వైసీసీ ఇసుమంతైనా కోలుకోలేదు. పైపెచ్చు ఆ పార్టీ అధినేత జగన్  ఏపీకి విజిటర్ గా మాత్రమే వస్తూ ఎక్కువ కాలం బెంగళూరుకే పరిమితం కావడంతో వైసీపీ క్యాడర్ కూడా దాదాపు చెల్లాచెదరైన పరిస్థితి.  ఉన్న కేడర్ లో సైతం నైరాశ్యం అలుముకుంది.  ఇక అధికారంలో ఉన్నంత కాలం పార్టీ తరఫున గొంతును గట్టిగా వినిపించిన నేతలలో చాలా మంది ప్రస్తుతం సైలంట్ మోడ్ లో ఉన్నారు. ఇటువంటి తరుణంలో పార్టీని గాడిన పెట్టడానికి పటిష్ట వ్యూహాలు రచించాలంటే పీకేయే శరణ్యమని జగన్ భావిస్తున్నట్లు పార్టీ వర్గాల నుంచే గట్టిగా వినిపిస్తోంది.  2024 ఎన్నికల్లో ఐప్యాక్  క్షేత్రస్థాయి పరిస్థితులను సరిగ్గా అంచనా వేయడంలో విఫలమైందని జగన్ భావిస్తున్నారు. ఆ లోపాలన్నిటినీ సరిదిద్ధి క్యాడర్ లో ఉత్సాహం నింపాలంటే ప్రశాంత్ కిశోర్ వినా మరో గత్యంతరం లేదని జగన్ గట్టిగా భావిస్తున్నారని అంటున్నారు.  ఈ నేపథ్యంలోనే  జగన్  పీకేతో సంప్రదింపులు జరిపాలని భావిస్తున్నట్లు చెబుతున్నారు. పార్టీ నాయకత్వంలో ఉన్న లోపాలను సరిదిద్దడం, నియోజకవర్గాల వారీగా బలాబలాలను అంచనా వేయడంలో పీకే అనుభవం తనకు ఉపకరిస్తుందని జగన్ భావిస్తున్నట్లు కనబడుతోంది.  గతంలో పీకేపై జగన్ కొన్ని విమర్శలు చేశారు. అలాగే పీకే సైతం జగన్ పై కొన్ని వ్యతిరేక వ్యాఖ్యలు చేశారు. గతం గత: అనుకుని మళ్లీ పీకేతో కలిసి ముందుకు సాగాలని జగన్ గట్టిగా నిర్ణయించుకున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.  అయితే రాజకీయ విశ్లేషకులు మాత్రం అది అంత సులభంగా జరిగే పని కాదని అంటున్నారు. గతంలో  జగన్ తనపై చేసిన వ్యాఖ్యలను పీకే విస్మరిస్తారా? అలాగే..   పీకే  జగన్ రాజకీయ శైలిపై చేసిన వ్యాఖ్యలను జగన్  మరచిపోయి మళ్లీ చేతులు కలుపుతారా? అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.  అదే సమయంలో  ఒక వేళ పీకే, జగన్ లు చేతులు కలిపినా.. 2019 నాటి మ్యాజిక్  రిపీట్ అయ్యే అవకాశాలు అంతంత మాత్రమేనని కూడా అంటున్నారు. సొంత రాష్ట్రం బీహార్ అసెంబ్లీ ఎన్నికలలో అన్ని స్థానాలకూ తన పార్టీ జనసురాజ్ పార్టీ అభ్యర్థులను నిలిపిన ప్రశాంత్ కిశోర్ కనీసం ఒక్కరిని కూడా గెలిపించుకోలేక బొక్కబోర్లా పడ్డ సంగతిని గుర్తు చేస్తూ.. ఏపీలో పీకే వ్యూహాలు పారే అవకాశాలు లేవంటున్నారు. 
  తెలంగాణ రాజకీయాల్లో అత్యంత సీనియర్ నాయకుడిగా, ఉమ్మడి కరీంనగర్ జిల్లా రాజకీయాల్లో కీలక పాత్ర పోషించిన మాజీ మంత్రి, ఎమ్మెల్సీ టి. జీవన్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. గత నాలుగు దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీలో కొనసాగిన ఆయన, బుధవారం తన ప్రాథమిక సభ్యత్వానికి అధికారికంగా రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. పార్టీలో చోటుచేసుకుంటున్న తాజా పరిణామాలు, సొంత పార్టీలోనే ఎదురవుతున్న అవమానాల నేపథ్యంలోనే తాను ఈ కఠిన నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని ఆయన వెల్లడించారు. జగిత్యాల నియోజకవర్గంలో గత 20 నెలలుగా జరుగుతున్న రాజకీయ పరిణామాలు తనను తీవ్ర మానసిక వేదనకు గురిచేశాయని జీవన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా ఇతర పార్టీల నుంచి కాంగ్రెస్‌లోకి వచ్చిన నాయకుల వల్ల పాత కార్యకర్తలకు, నమ్మకస్థులకు అన్యాయం జరుగుతోందని ఆయన ఆరోపించారు. క్రమశిక్షణకు మారుపేరుగా ఉన్న తనకు, కనీస గౌరవం దక్కని చోట కొనసాగడం అర్థరహితమని ఆయన భావించి ఈ నిర్ణయానికి వచ్చారు. పార్టీ అధిష్టానం నుంచి వచ్చిన రాయబారాలు కూడా జీవన్ రెడ్డిని శాంతింపజేయలేకపోయాయి. టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు శ్రీధర్ బాబు, లక్ష్మణ్ కుమార్ తదితరులు ఆయనతో భేటీ అయి నచ్చజెప్పే ప్రయత్నం చేసినప్పటికీ.. క్షేత్రస్థాయిలో పరిస్థితులు మారడం లేదని ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కాంగ్రెస్‌లో చేరినప్పటి నుంచి ఇద్దరి మధ్య విభేదాలు తారాస్థాయికి చేరాయి. స్థానిక సంస్థల ఎన్నికల్లో టికెట్ల కేటాయింపు విషయంలోనూ తన ప్రాధాన్యతను తగ్గించడాన్ని ఆయన తీవ్రంగా పరిగణించారు. జీవన్ రెడ్డి రాజీనామాతో జగిత్యాల జిల్లా కాంగ్రెస్ శ్రేణుల్లో అయోమయం నెలకొంది. ఆయన తదుపరి అడుగు ఎటువైపు అనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. తన అనుచరులు, కార్యకర్తలతో చర్చించిన తర్వాత భవిష్యత్తు కార్యాచరణను వెల్లడిస్తానని ఆయన పేర్కొన్నారు. ఏది ఏమైనా, ఉమ్మడి జిల్లాలో పట్టున్న బలమైన నేత పార్టీని వీడటం రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వానికి పెద్ద ఎదురుదెబ్బగానే విశ్లేషకులు భావిస్తున్నారు. వచ్చే ఎన్నికల నాటికి జిల్లాలో సమీకరణాలు ఎలా మారతాయో వేచి చూడాలి. జీవన్ రెడ్డి వంటి సీనియర్ నేత పార్టీని వీడటం వల్ల క్యాడర్‌లో చీలిక వచ్చే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ పరిణామం విపక్షాలకు కొంత మేర కలిసి వచ్చే అవకాశం కనిపిస్తోంది.
కాంగ్రెస్ పార్టీకి కేంద్రం షాక్ ఇచ్చింది. హస్తినలో దాదాపు ఐదు దశాబ్దాలుగా.. స్పష్టంగా చెప్పాలంటే 48 ఏళ్లుగా ఢిల్లీలోని అక్బర్ రోడ్డులో ఉన్న కాంగ్రెస్ కార్యాలయాన్ని వెంటనే ఖాళీ చేయాలంటూ ఆదేశాలు జారీ చేసింది.    1978 నుంచీ ఈ నెల  28)లోగా ఆ భవనాన్ని ఖాళీ చేయాలని ఆ ఆదేశాలలో స్పష్టంగా పేర్కొంది.  1978 నుంచి అంటే గత 48 ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీ జాతీయ కార్యకలాపాలకు కేంద్ర బిందువుగా ఉన్న నంబర్ 24, అక్బర్ రోడ్ భవనాన్ని ఈ నెల 28 లోగా అంటే శనివారం లోగా ఖాళీ చేయాలంటూ కేంద్రం నోటీసులు జారీ చేసింది. ఈ భవనంతో పాటు..  రైసినా రోడ్‌లో ఉన్న ఇండియన్ యూత్ కాంగ్రెస్ కార్యాలయాన్ని కూడా ఖాళీ చేయాలని తాఖీదులు పంపింది.   నిజానికి  కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే ఢిల్లీలోని కోట్లా మార్గ్‌లో  ఇందిరా భవన్  పేరుతో కొత్త జాతీయ కార్యాలయాన్ని నిర్మించుకుంది. నిబంధనల మేరకు పార్టీ సొంత కార్యాలయ భవనం నిర్మాణం పూర్తయితే..పాత భవనాన్ని ఖాళీ చేయాల్సి ఉంటుంది. ఇందిరా భవన్ కు ఏడాది కిందటే సోనియాగాంధీ గత ఏడాదే సోనియా గాంధీ ప్రారంభోత్సవం కూడా చేశారు. ఈ నేపథ్యంలోనే కేంద్రం అక్బర్ రోడ్డు భవనాన్ని ఖాళీ చేయాలంటూ నోటీసులు పంపింది. అయితే ఈ నోటీసులపై కాంగ్రెస్ మండి డుతోంది.  రాజకీయ కక్ష సాధింపు చర్యేనంటూ విమర్శిస్తోంది. ఈ నోటీసులను కోర్టులో సవాల్ చేసే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. 
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత జగన్ రెడ్డిని  2024 ఎన్నికల తరువాత నుంచీ  నెటిజనులు లెవ‌న్ రెడ్డి అంటూ ఎద్దేవా చేస్తున్నారు. చేరింది.   కారణం తెలిసిందే కదా.. 2024 ఎన్నికలలో ఆయన పార్టీ సాధించిన స్థానాల సంఖ్య 11 కావడంతో ఆ సంఖ్య పేరుతోనే వైసీపీ అధినేతనూ, ఆ పార్టీని నెటిజనులు ఓ ఆటాడుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే వైసీపీయులకు నంబర్ 11 ఒక పీడకలలా తయారైంది.  ఇక ఆయన వ్యతిరేకులైతే జగనాసుర, లెవనాసురా అంటూ కూడా ఎద్దేవా చేస్తుండటం కద్దు.    అంతే కాదు జగన్ తన ఎమ్మెల్యేలతో ఇలా అసెంబ్లీకి హాజరై అలా వాకౌట్ చేసిన సందర్భంలో  స్పీక‌ర్ అయ్య‌న్న  పాత్రుడు 11-11-11 అంటూ కామెంట్ చేశారు. ప‌ద‌కొండు మంది  ఎమ్మెల్యేల‌తో వ‌చ్చిన జ‌గ‌న్ 11 నిమిషాల  11 సెక‌న్లు మాత్ర‌మే ఉండి వెళ్లడంతోనే  స్పీక‌ర్ ఈ కామెంట్ చేశారు.  అలాగే గతంలో ఓసినిమా ఫంక్షన్ లో నటుడు పృధ్వీ  ప‌ద‌కొండు గొర్రెలు అంటూ చేసిన కామెంట్ వైసీపీయులు జీర్ణించుకోలేకపోయారు.  ఇందుకు కారణం 11 అన్న సంఖ్య అంటే జగన్ కు, ఆయన పార్టీ శ్రేణులకూ గిట్టదు.గుమ్మడికాయల దొంగ అంటే భుజాలు తడుముకున్న చందంగా.. వైసీపీయులకు 11 నంబర్ కనిపించినా, వినిపించినా   జగన్ ను  ఉద్దేశించే అని ఉలిక్కిపడుతుంటారు.  ఉడుక్కుంటుంటారు.  అంతెందుకు గతంలో ఆయ‌న జైల్లో ఉన్న కాలాన్ని కూడా ప‌ద‌కొండుకు ముడిపెట్టి  నెటిజనులు సెటైర్లు వేస్తున్నారంటే వైసీపీ అండ్ కోను నంబర్ 11 ఎలా వెంటాడుతోందో, ఏడిపిస్తోందో అర్ధం చేసుకోవచ్చు. ఇంకా చెప్పాలంటే..  ఆయన చట్టపరంగా ఎదుర్కొంటున్న కేసులలోనూ 11 నంబర్ మేజిక్  చేస్తున్నది. ఎలా అంటే ఇప్పటి వరకూ  సీబీఐ ఆయ‌న‌పై వేసిన ఛార్జి  షీట్ల సంఖ్య 11. ఇక ఆ కేసుల్లో ఆయ‌న ఏవ‌న్ నిందితుడు.  ఏ అంటే  న్యూమ‌రాల‌జీ  ప్ర‌కారం ఒక‌టి. వ‌న్ అంటే ఒక‌టి. ఈ రెండింటినీ ప‌క్క ప‌క్క‌న పెట్టి చూసినా ప‌ద‌కొండే  వ‌స్తుంద‌ని జగన్ ను నెటిజనులు ఓ రేంజ్ లో ట్రోలింగ్ చేశారు కూడా.  అలాగే అప్పట్లో జ‌గ‌న్ వ‌రుస‌గా  11 శుక్ర‌వారాలు ర్టుకు హాజ‌రైన సంగతీ ఆయనపై ట్రోలింగ్ కు దోహదపడింది.  అంతెందుకు ఇటీవలి కాలం వరకూ   వైసీపీ  రాజ్య‌స‌భ స‌భ్యుల సంఖ్య కూడా 11 ఉండేది.   కొంద‌రు రిజైన్ చేయ‌డంతో ఆ సంఖ్య‌లో మార్పు వ‌చ్చింది. అది వేరే సంగతి.   అలాగే జ‌గ‌న్ ఢిల్లీ ప‌ర్య‌ట‌న‌ల్లోనూ, సీట్ల కేటాయింపుల్లోనూ, ప‌ద‌కొండవ నెంబ‌ర్ ఆయ‌న్ను వదల కుండా వెంటాడింది. వెంటాడుతోంది.     జ‌గ‌న్ లెవ‌న్ పై మీమ్స్ గురించి  చెప్ప‌న‌క్క‌ర్లేదు. పంజాబ్ కింగ్స్ లెవ‌న్ లాగా.. జ‌గ‌న్స్   లెవ‌న్ అనే  పేరు మీద   మీమ్స్ వెల్లువెత్తాయి. ఇక తాజాగా  కొత్త పార్లమెంట్ భవనంలో వైసీపీ ఎంపీలకు లోక్ సభ స్పీకర్ కేటాయించినది కూడా  11వ నెంబర్  రూమే. పార్లమెంటులో మొదటి అంతస్తులోని 11వ నంబర్ రూమ్ ను స్పీకర్ కేటాయించారు. దీంతో ఒక్కసారిగా ఉలిక్కిపడిన వైసీపీ ఎంపీలు ఆ రూమ్ ను ఆక్యుపై చేయడానికి   నిరాకరించారు. మూకుమ్మడిగా స్పీకర్ ను కలిసిన వారు ఆ రూమ్ తమకు వద్దనీ, మరో రూమ్ కేటాయించాలంటూ కాళ్లా వేళ్లా పడి బతిమలాడుకున్నారు. వారి వినతులను మన్నించి స్పీకర్ వారికి 11వ నంబర్ రూమ్ ను మార్చి 12వ నెంబర్ రూమ్ ను కేటాయించారు.  దీంతో 11 నంబర్ జగన్ ను వదల బొమ్మాలీ నిన్నొదల అన్నట్లు వెంటాడుతోందని నెటిజనులు నెట్టింట సెటైర్లు గుప్పిస్తున్నారు. 
మాములుగా ఉచిత ప‌థ‌కాలంటే ఎవరికైనా ఠక్కున గుర్తుకు వ‌చ్చేది త‌మిళ‌నాడే.  ఈ ఉచితాల వ్య‌వ‌హారం ఇక్క‌డ 1925 నాటి నుంచే మొద‌లైంది. మ‌నం ఇప్పుడు మాట్లాడుకుంటున్న మ‌ధ్యాహ్న భోజ‌న ప‌థ‌కం మొద‌లైందే ఇక్క‌డ‌. ఇక 2026 త‌మిళ‌నాడు అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ప్ర‌ధాన  పార్టీలైన డీఎంకే, అన్నాడీఎంకే, టీవీకే ఓట‌ర్ల‌ను ఆక‌ర్షించేందుకు ప‌లుర‌కాల ఉచితాల వ‌ల ప‌న్నాయంటే ప‌రిస్థితి ఏమిటో ఊహించుకోవ‌చ్చు. ఆ ఫ్రీ స్కీమ్స్  వివ‌రాలు ఎలాంటివి అని చూస్తే..   ఎడ‌ప్పాడి ప‌ళ‌నిస్వామి  త‌న అన్నాడీఎంకే మేనిఫెస్టోలో భారీ ఉచితాల‌ను ప్ర‌క‌టించింది. అవేంటో చూస్తే.. మ‌హిళ‌ల‌కు నెల‌కు 2 వేల ఆర్ధిక సాయం, ప్ర‌తి కుటుంబానికి ఒక‌సారి ప‌ది వేల రూపాయ‌ల సాయం, బియ్యం రేష‌న్ కార్డు ఉన్న ప్ర‌తి  కుటుంబానికి ఉచిత రిఫ్రిజిరేట‌ర్, ఏడాదికి మూడు ఉచిత గ్యాస్ సిలిండ‌ర్లు.. ఇక ఉచిత బ‌స్సు ప్రయాణం మ‌హిళ‌ల‌తో పాటు ఇప్పుడు పురుషుల‌కూ వర్తింప చేయడం.  ఈ లెక్క‌న త‌మిళ‌నాడు ఆర్టీసీ బ‌స్సులో అంద‌రికీ దాదాపు ఫ్రీ అన్న‌మాట‌. ఇదిలా ఉంటే ప్ర‌తి  నెలా ఉచితంగా కిలో పప్పు, లీట‌ర్ వంట నూనె ఇస్తారు. ఇక వృద్ధాప్య ఫించ‌న్ నెల‌కు 1200 నుంచి రెండు వేల‌కు పెంపు.  ఇక విజ‌య్ టీవీకే పార్టీ అయితే.. మ‌హిళ‌ల‌కు నెల నెలా 2500, అన్న విజ‌య్ సాయం పథకం కింద  పెళ్లి చేసుకునే మ‌హిళ‌ల‌కు ఎనిమిది గ్రాముల బంగారం, ప‌ట్టు చీర ఇస్తాన‌ని ప్ర‌క‌టించారు. గ్యాస్ సిలిండ‌ర్ల విష‌యానికి వ‌స్తే.. ఏడాదికి ఆరు ఉచిత గ్యాస్ సిలిండ‌ర్లు ఇస్తామ‌ని అన్నారు. పుట్టిన ప్ర‌తి బిడ్డ‌కూ బంగారు ఉంగ‌రం, బేబీ వెల్కం కిట్, విద్యార్ధుల‌కు ఉచిత ఉన్న‌త విద్య‌, రైతుల‌కు పూర్తి రుణ మాఫీ.. అంటూ ఉచిత వరాల జ‌ల్లు కురిపించింది.   అలాగే అధికార   డీఎంకే త‌న పాత ప‌థ‌కాల‌ను ఒక ప‌క్క కొన‌సాగిస్తూనే .. కొత్త హామీల‌పైనా దృష్టి సారించింది.  ఒక‌ప‌క్క రాష్ట్రాభివృద్ధి, ఉపాధి క‌ల్ప‌న ఇప్ప‌టికే అమ‌ల‌వుతున్న మ‌హిళా నిధి పెంపుద‌ల‌పై త‌ర్జ‌న భ‌ర్జ‌న ప‌డుతోంది డీఎంకే.  ఎన్నిక‌ల  ప్ర‌చారంలో భాగంగా ఇప్ప‌టికే స్టీల్ పాత్ర‌లు, చీర‌లు వంటి  కానుక‌ల పంపిణీ ద్వారా ఓట‌ర్ల‌కు చేరువ‌య్యే య‌త్నం చేస్తోంది. ఇక్క‌డ అన్నాడీఎంకే, టీవీకే మ‌ధ్య ఒక ర‌క‌మైన ఉచితాల పోటీ న‌డుస్తోంద‌నే చెప్పాలి.. మహిళ‌ల‌కు ఇచ్చే న‌గ‌దు సాయం, గ్యాస్ సిలిండ‌ర్లు, పురుషుల‌కు కూడా ఉచిత బ‌స్సు, ఫ్రిడ్జ్, 8 గ్రాముల బంగారం అంటూ వీరు ఒక‌రికి మించి మ‌రొక‌రు పోటీ  ప‌డుతున్నారు.  ఈ ఉచితాల ప్ర‌భావం ఓట‌ర్ల‌పై ఎంత మేర ప్ర‌భావం చూపిస్తాయో తేలాల్సి ఉంది. దానికి తోడు అన్నాడీఎంకే ఈ సారి ఎన్డీయేతో క‌ల‌సి పోటీ చేస్తోంది. ఇటు ఉచితాలు, అటు కేంద్రంలోని బీజేపీతో క‌ల‌సి చేస్తున్న పోటీ అన్నాడీఎంకేని గెలిపిస్తాయా?  లేక విజ‌య్ ప్ర‌భావంతో డీఎంకే మ‌ళ్లీ  గెలుస్తుందా తేలాల్సి ఉంది.
ALSO ON TELUGUONE N E W S
  -సినిమాల్లో రాణించాలని అనుకున్నాడు  -నిర్మాతగా సినిమా తీసాడు -కప్పులు కడిగాడు  -ఇప్పడు ఏం చేస్తున్నాడు ధర్మంగా ఓవర్ నైట్ పేరు, కోట్ల కొద్దీ డబ్బు రావాలంటే సినిమా(Cinema),క్రికెట్(Cricket)అనే నానుడి చాలా బలంగా ఉంది. నానుడి అని ఏముందిలే కానీ నిజం కూడా. అందుకే చాలా మంది ఆయా రంగాల్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటు ఉంటారు. అలాంటి వాళ్ళల్లో శ్రీనివాస్(Srinivas)ఒకరు. సినిమాపై ఇష్టంతో సినీరంగ ప్రవేశించి 'పాండవులు' మూవీలో హీరోగా చేసాడు. లెజండ్రీ కమెడియన్ వేణుమాధవ్(venumadhav)కూడా ఒక హీరో. 2013 లో మే నెలలో ప్రేక్షకుల ముందుకు రాగా డిజాస్టర్ టాక్ ని సొంతం చేసుకుంది రీసెంట్ గా శ్రీనివాస్  ఒక ఇంటర్వ్యూలో పాండవులు గురించి చెప్పడంతో పాటు ఆ సినిమా తర్వాత తన జీవితం ఎలా మారిపోయిందో వివరించాడు. ఆయన మాటలు చూద్దాం. 30 లక్షల బడ్జెట్‌తో పాండవులు అనుకుంటే పలు మార్పులు చేర్పులతో చివరికి 1.4 కోట్ల రూపాయలకి చేరింది. కానీ పరాజయం పాలవ్వడంతో ఆర్థికంగా తీవ్ర ఇబ్బందుల్లో పడ్డాను. దీంతో సుమారు ఆరు సంవత్సరాల పాటు గుంటూరులో ఒక హోటల్ నడిపాను.  నా భార్య వంట చేస్తుంటే, నేను కప్పులు, ప్లేట్లు కడగడం, టీ సప్లై చేయడం, డబ్బులు తీసుకోవడం వంటి పనులు చేసానని చెప్పుకొచ్చాడు. Also read: Monalisa: ఎక్కడెక్కడో తాకుతు శారీరకంగా వేధించాడు.. మోనాలిసా సంచలన కామెంట్స్   శ్రీనివాస్ ప్రెజెంట్ పలు రకాల చిత్రాల్లో చిన్న చిన్న క్యారెక్టర్స్ చేస్తు తన సినీ ప్రేమని తీర్చుకుంటున్నాడు. ఎక్కువగా అనిల్ రావిపూడి సినిమాల్లో కనిపిస్తూ ఉంటాడు. చిన్న వయసు నుంచే పలు రంగస్థల నాటకాల్లో అద్భుతమైన పెర్ఫార్మ్  కనపరిచి ఎన్నో అవార్డ్స్, సన్మానాలు అందుకున్నాడు.        
The youth-centric entertainer “Youth,” starring Ken Karunaas, Anishma Anil Kumar, Devadarshini Chetan, Suraj Venjaramoodu, Priyanshi Yadav, and Meenakshi Dinesh in lead roles, was initially scheduled to release on the 26th of this month. However, due to unavoidable reasons, the film’s theatrical release has been postponed by one day and will now hit theatres on March 27th. The producers have also stated that an announcement regarding paid premieres will be made soon. Having already achieved great success in Tamil, the film is now being brought to Telugu audiences under the E2C banner by Housefull Vinith and Sandeep. The film is directed by Ken Karunaas and his team. It is being promoted with the slogan “Come with your gang, note – no age limit.” The promotional content and songs of the movie have been receiving a huge response, and youth audiences are eagerly waiting to watch it on the first day, first show.
నటసింహం నందమూరి బాలకృష్ణ(Nandamuri Balakrishna) హీరోగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న క్రేజీ ప్రాజెక్ట్ 'NBK 111'. 'వీరసింహారెడ్డి' వంటి బ్లాక్ బస్టర్ తర్వాత వీరిద్దరి కాంబినేషన్‌లో వస్తున్న సినిమా కావడంతో అనౌన్స్‌మెంట్ నుంచే భారీ అంచనాలు ఏర్పడ్డాయి. తాజాగా ఈ సినిమా షూటింగ్‌కు సంబంధించి అదిరిపోయే అప్‌డేట్ బయటకు వచ్చింది. తొలి షెడ్యూల్‌లో భారీ యాక్షన్ సీక్వెన్స్ మార్చి మొదటి వారంలో ప్రారంభమైన ఈ సినిమా తొలి షెడ్యూల్ మార్చి 18 ముగిసింది. ఈ షెడ్యూల్‌లో దర్శకుడు గోపీచంద్ మలినేని అత్యంత కీలకమైన సన్నివేశాలను చిత్రీకరించినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా బాలయ్య మార్క్ భారీ యాక్షన్ సీక్వెన్స్‌ను ఫైట్ మాస్టర్ వెంకట్ పర్యవేక్షణలో షూట్ చేశారు. ఈ ఫైట్‌తో పాటు దానికి దారితీసే కీలక సన్నివేశాలు, బాలయ్య పవర్‌ఫుల్ డైలాగ్ వెర్షన్లను కూడా ఈ షెడ్యూల్‌లోనే పూర్తి చేసినట్లు సమాచారం. బాలయ్య గెటప్‌పై చిత్ర యూనిట్ ఫుల్ హ్యాపీ! మొదటి షెడ్యూల్ అవుట్‌పుట్ చూసిన తర్వాత చిత్ర యూనిట్ మొత్తం చాలా ఉత్సాహంగా ఉందట. ముఖ్యంగా ఈ సినిమాలో బాలకృష్ణ గెటప్, ఆయన క్యారెక్టరైజేషన్ అనుకున్న దానికంటే చాలా అద్భుతంగా వచ్చాయని టాక్. గ్రే హెయిర్, సాల్ట్ అండ్ పెప్పర్ లుక్‌లో బాలయ్యను చూసి అభిమానులు మురిసిపోవడం ఖాయమని యూనిట్ వర్గాలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. ఆయన చెప్పే డైలాగులు కూడా మాస్ ఆడియన్స్‌కు పూనకాలు తెప్పించేలా ఉన్నాయట. సెకండ్ షెడ్యూల్ ఎక్కడంటే? ఇక రెండో షెడ్యూల్ ఏప్రిల్ మొదటి వారంలో ప్రారంభం కానుంది. ఈ షెడ్యూల్‌ను హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ప్లాన్ చేశారు. పెద్ద హీరోల సినిమాల విషయంలో షూటింగ్ లొకేషన్ల వద్ద అభిమానుల తాకిడి ఎక్కువగా ఉంటుంది కాబట్టి, చిత్ర యూనిట్ చాలా గోప్యంగా షూటింగ్ నిర్వహించాలని భావిస్తోంది. గ్యాంగ్‌స్టర్ స్టోరీ.. సరికొత్త షేడ్స్! NBK 111 కథ గురించి ఒక ఆసక్తికరమైన విషయం బయటకు వచ్చింది. ఇది ఒక పవర్‌ఫుల్ గ్యాంగ్‌స్టర్ డ్రామా అని, మాఫియా నేపథ్యంలో సాగుతుందని తెలుస్తోంది. ఈ సినిమాలో బాలకృష్ణ డ్యూయల్ రోల్ కాకుండా సింగిల్ రోల్‌లోనే కనిపిస్తారట. కానీ, ఒకే పాత్రలో డిఫరెంట్ షేడ్స్ ఉంటాయని, 10 ఏళ్ల క్రితం బాలయ్య ఎలా ఉండేవారు.. ఇప్పుడు ఎలా ఉన్నారు అనే టైమ్ లైన్ ఆధారంగా కథ సాగుతుందని సమాచారం. నటీనటులు - టెక్నీషియన్స్ ఈ సినిమాలో లేడీ సూపర్ స్టార్ నయనతార హీరోయిన్ గా నటిస్తుండగా, మరో కీలక పాత్రలో సముద్రఖని కనిపిస్తారని తెలుస్తోంది. సముద్రఖని పాత్ర కేవలం విలన్‌గా మాత్రమే కాకుండా, కథను మలుపు తిప్పే ఒక కీలకమైన పాత్ర అని టాక్. 'వీరసింహారెడ్డి'ని మించిన స్టైలిష్ మేకింగ్‌తో, భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్లు సమాచారం. దసరా లక్ష్యంగా బాలయ్య వేట! అన్నీ అనుకున్నట్టు జరిగితే, ఈ సినిమాను దసరా కానుకగా విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఈలోపు సినిమా ఫస్ట్ లుక్, టైటిల్ అనౌన్స్‌మెంట్‌తో అభిమానుల్లో జోష్ నింపాలని చూస్తున్నారు. నందమూరి అభిమానులు ఈ గ్యాంగ్‌స్టర్ వేట కోసం వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు. మరి గోపీచంద్ మలినేని ఈసారి బాలయ్యను ఏ రేంజ్‌లో చూపిస్తారో చూడాలి.  
In one of the most exciting collaborations of Global Cinema, Indian Superstar Hrithik Roshan has collaborated with the team of Project Hail Mary to introduce the film to the Indian audience. The video showcases an endearing crossover between India's OG sci-fi duo Hrithik and Jaadu from Koi... Mil Gaya along with the alien Rocky from Project Hail Mary . The video features the alien Rocky learning the iconic hookstep of 'Ek Pal Ka Jeena' from Hrithik Roshan. This budding intergalactic friendship receives a strong reaction from Hrithik's OG alien friend 'Jaadu' from Koi...Mil Gaya .  The Bollywood x Hollywood crossover aims to capitalise on the popularity and nostalgia for Hrithik & Jaadu's much-loved onscreen friendship to promote the Hollywood film Project Hail Mary to the Indian masses.  https://www.instagram.com/reel/DWGUOMsgJ2r/ Project Hail Mary is based on the bestselling novel by Andy Weir (author of The Martian ). Roshan, earlier in December 2025, publicly declared his love for the book on social media, making this collaboration a seamless blend of Star power & genuine appreciation for content, along with a cinematic crossover of two human-alien friendship films - Hrithik's Koi...Mil Gaya and Ryan Gosling's Project Hail Mary .  Speaking about the association, Shony Panjikaran, General Manager and Head, Sony Pictures Releasing International, India says, “ Project Hail Mary is the kind of ambitious, big-screen storytelling that audiences in India truly embrace. We’re thrilled to have Hrithik Roshan champion the film in India. His passion for the story and his powerful connection with audiences make him the perfect ambassador to help bring this extraordinary adventure to moviegoers across the country.”   Directed by the acclaimed filmmaking duo Phil Lord and Christopher Miller, Project Hail Mary follows Ryland Grace, played by Ryan Gosling, a lone astronaut who wakes up aboard a mysterious spacecraft with no memory of who he is or the mission that brought him there. The film also features a stellar supporting cast, including Sandra Hüller, Lionel Boyce, Ken Leung, and Milana Vayntrub. Presented by Amazon MGM Studios and distributed by Sony Pictures Releasing International, Project Hail Mary will release in Indian cinemas on 26 March 2026, in English, Hindi, Tamil, and Telugu, across IMAX® and other premium large formats.  
  -కొన్ని రోజుల క్రితమే ఫర్మాన్ ఖాన్ తో పెళ్లి  -లవ్ జిహాద్ ఆరోపణలు -కన్నీటి పర్యంతమవుతున్న మోనాలిసా  మోనాలిసా(Monalisa)..కుంభామేళ తర్వాత ఎంత పాపులర్ అయ్యిందో, తన ప్రియుడు ఫర్మాన్ ఖాన్ ని పెళ్లి చేసుకొని అంతే పాపులర్ అయ్యింది.  పెళ్లి విషయంలో ఆమె బంధువులు మాత్రం మోనాలిసా మైనర్ పెళ్లి చెల్లదని అంటుంటే, ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు సనోజ్ మిశ్రా(Sanoj Mishra)అయితే నేరుగా లవ్ జిహాద్ ఆరోపణలు చేసాడు.  దీంతో ఏ ఇద్దరు, ముగ్గురు కలిసినా మోనాలిసా గురించే చర్చ. రీసెంట్ గా మోనాలిసా ఒక ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి ఒక దర్శకుడిపై  పలు ఆరోపణలు చేసింది. దీంతో చర్చల స్థాయి ఆకలిని కూడా మర్చిపోయేలా ఇండియన్ సినీ, సోషల్ సర్కిల్స్ లో వైరల్ గా నిలుస్తున్నాయి. అవేంటో చూద్దాం. రీసెంట్ గా తన భర్త ఫర్మాన్ ఖాన్ తో కలిసి మీడియా సమక్షంగా మోనాలిసా కన్నీటి పర్యంతంతో మాట్లాడుతు 'నాకు తెలిసిన ఒక  దర్శకుడు చాలా చెడు స్వభావం గల వ్యక్తి.  షూటింగ్ సమయంలో పలుమార్లు నా శరీర భాగాలని తాకుతు లైంగికంగా వేధించాడు. ఆ విషయం ఇంట్లో వాళ్ళకి చెబితే మొదటి సినిమా కదా సర్దుకుపోవాలని అన్నారు. దీంతో ఎవరికీ చెప్పుకోలేక మౌనంగా ఉండిపోయాను. నన్నే కాదు సినిమా పేరు చెప్పి మైనర్ బాలికలతో కూడా అసభ్యంగా ప్రవర్తించాడు. అసలు ఆ దర్శకుడి సినిమాల్లో ఎవరు నటించాలని అనుకోరు. అతని పేరు పలకడానికే సిగ్గుగా ఉంది. అతడు నా పెళ్లిని లవ్ జిహాద్ అనడానికి కారణం నాపై ఉన్న కక్ష. నాపై లవ్ జిహాద్ ఆరోపణలు చేస్తున్నందుకు  ఆ దర్శకుడిపై పోలీసులకి  ఫిర్యాదు చేయబోతున్నాను. మాకు గుడిలో హిందూ సాంప్రదాయ ప్రకారం పెళ్లి జరగడంతో పాటు చట్టబద్ధంగా కూడా పెళ్లి జరిగింది. ఆ విషయం దేశంలో అందరికీ తెలుసు. నన్ను, నా భర్తని చంపేస్తామని కొంత మంది బెదిరిస్తున్నారు. ఈ విషయంలో కేంద్రంతో పాటు , కేరళ, మధ్యప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాల సహాయం కోరతామని చెప్పుకొచ్చింది. Also read: Anushka Sharma: కింగ్ కోహ్లీ వైఫ్ అనుష్క శర్మ టాలీవుడ్ ఎంట్రీ.. షాక్ ఇచ్చిన పీఆర్ టీం! తన స్పీచ్ లో సనోజ్ మిశ్రా పేరు మోనాలిసా చెప్పకపోయినా సనోజ్ ని ఉద్దేశించే ఆమె మాట్లాడిందనే విషయం అర్ధమవుతుంది. కుంభమేళాతో మోనాలిసా ఫేమస్ అయిన తర్వాత సనోజ్ నే ఆమెకి సినిమా ఆఫర్ ఇచ్చాడు. ఆ ఇద్దరి పిక్స్ కుడా సోషల్ మీడియాలో ఉన్నాయి. సినిమా అప్డేట్ గురించి అయితే ప్రెజెంట్ ఎలాంటి న్యూస్ జనరేట్ అవ్వడం లేదు.  
ముంబై టు అమరావతి చంద్రబాబును కలిసిన మున్నాభాయ్ ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు సంజయ్ దత్ ఆసక్తి ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు(Chandrababu)తో బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్(Sanjay Dutt) భేటీ అయ్యారు. ఏపీలో సినీ పరిశ్రమ అభివృద్ధికి సంబంధించి ఇద్దరి మధ్య చర్చ జరిగింది. ఫిలిం స్టూడియోల నిర్మాణం, మౌలిక సదుపాయాల కల్పనపై చర్చ జరిగినట్లు సమాచారం. సంజయ్ దత్ మంగళవారం నాడు తన బృందంతో కలిసి వెలగపూడిలోని సచివాలయంలో సీఎం చంద్రబాబుని కలిశారు. గత కొంతకాలంగా ఏపీని గ్లోబల్ ఇన్వెస్ట్‌మెంట్ హబ్‌గా మార్చేందుకు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాల్లో భాగంగా ఈ భేటీ జరగడం ఇప్పుడు రాజకీయ, సినీ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఏపీలో సినిమా హబ్.. సంజయ్ దత్ ఆసక్తి ఈ సమావేశంలో ప్రధానంగా ఆంధ్రప్రదేశ్‌లో సినీ ఇండస్ట్రీ అభివృద్ధికి ఉన్న అవకాశాలపై చర్చలు జరిగాయి. అమరావతిలో అత్యాధునిక మౌలిక సదుపాయాలతో కూడిన ఫిల్మ్ సిటీ నిర్మాణం, అలాగే విశాఖపట్నం వంటి ప్రాంతాల్లో షూటింగ్‌లకు కావాల్సిన వసతుల కల్పనపై సీఎం చంద్రబాబు వివరించారు. రాష్ట్రంలో సినీ రంగానికి సంబంధించి భారీ పెట్టుబడులు పెట్టేందుకు, స్టూడియోలు నిర్మించేందుకు సంజయ్ దత్ టీమ్ ఆసక్తిని కనబరిచినట్లు సమాచారం.  లోకేష్ విజన్‌కు కొనసాగింపుగా.. గత నెలలో ఏపీ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ముంబై పర్యటనలో భాగంగా సంజయ్ దత్‌తో భేటీ అయిన సంగతి తెలిసిందే. అప్పుడే ఏపీలో సింగిల్ విండో విధానంలో షూటింగ్‌లకు అనుమతులు ఇస్తామని, సినీ రంగానికి ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని లోకేష్ హామీ ఇచ్చారు. ఆ చర్చల కొనసాగింపుగానే సంజయ్ దత్ ఇప్పుడు సీఎంని కలిసినట్లు తెలుస్తోంది. సక్సెస్ మూడ్‌లో మున్నాభాయ్ ప్రస్తుతం సంజయ్ దత్ తన లేటెస్ట్ మూవీ 'ధురంధర్: ది రివెంజ్' (Dhurandhar: The Revenge) బాక్సాఫీస్ వద్ద సాధిస్తున్న భారీ విజయంతో ఫుల్ జోష్‌లో ఉన్నారు. ఈ సినిమా ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా రూ. 900 కోట్లకు పైగా వసూళ్లు సాధించి రికార్డులు సృష్టిస్తోంది. ఈ సక్సెస్ మూడ్‌లో ఉంటూనే, ఆయన తన టీమ్ సభ్యులు గౌరవ్ దూబే, కునాల్ పటేల్, అనుజ్ కుమార్‌లతో కలిసి అమరావతికి విచ్చేయడం గమనార్హం. కొత్త ఆశలు.. కొత్త అడుగులు రాష్ట్ర విభజన తర్వాత ఏపీలో ఒక భారీ ఫిల్మ్ సిటీ లేకపోవడం పెద్ద లోటుగా ఉంది. అయితే చంద్రబాబు ప్రభుత్వం అమరావతిలో అంతర్జాతీయ స్థాయి ఫిల్మ్ సిటీ నిర్మాణంతో పాటు, విశాఖ తీరంలో వరల్డ్ క్లాస్ స్టూడియోలను నిర్మించాలని ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఇందులో బాలీవుడ్ స్టార్స్ భాగమైతే.. ఇటు టాలీవుడ్‌తో పాటు అటు హిందీ చిత్ర పరిశ్రమకు కూడా ఏపీ ఒక ప్రధాన షూటింగ్ డెస్టినేషన్‌గా మారుతుంది. త్వరలోనే దీనిపై ఒక అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.
డైరెక్టర్ శ్రీను వైట్లకు భారీ షాక్ ల్యాండ్ ఫ్రాడ్ లో రూ. 7.2 కోట్లు పోగొట్టుకున్న స్టార్ మేకర్ నకిలీ పత్రాలతో బురిడీ కొట్టించిన కేటుగాళ్లు టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ శ్రీను వైట్ల(Srinu Vaitla) రియల్ ఎస్టేట్ మోసానికి గురయ్యారని సమాచారం. భారీ లాభాలు వస్తాయన్న ఆశతో పెట్టుబడి పెట్టిన ఆయనకు ఊహించని షాక్ తగిలింది. దాదాపు రూ.7.2 కోట్ల విలువైన భూమి వ్యవహారంలో కొందరు కేటుగాళ్లు తనను, తన మేనకోడలు శ్వేతను దారుణంగా మోసం చేశారంటూ ఆయన పోలీసులను ఆశ్రయించారు. ఈ వార్త ఇప్పుడు సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. నమ్మించి ముంచేసిన కేటుగాళ్లు ఈ వివాదం 2019లో మొదలైంది. వికారాబాద్ జిల్లాలోని కడ్మూర్ ప్రాంతంలో లాభదాయకమైన భూమి ఉందని నమ్మించి ఒక ముఠా శ్రీను వైట్లను సంప్రదించింది. భవిష్యత్తులో ఈ భూమికి భారీ ధర వస్తుందని, తక్కువ ధరకే ఇస్తున్నామని ఆశ చూపారు. నిందితులు పక్కా పథకం ప్రకారం ఫోర్జరీ చేసిన డాక్యుమెంట్లను చూపించి, ఆ భూమి తమదేనని నమ్మబలికారు. వారి మాటలను నిజమని నమ్మిన దర్శకుడు భారీ మొత్తాన్ని చెల్లించి రిజిస్ట్రేషన్ ప్రక్రియను కూడా పూర్తి చేశారు. అసలు నిజం తెలిసేసరికి అంతా పూర్తి రిజిస్ట్రేషన్ పూర్తయి, డబ్బులు చేతులు మారిన తర్వాత ఆలస్యంగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. తాము కొనుగోలు చేసిన భూమికి, అమ్మిన వ్యక్తులకు ఎలాంటి సంబంధం లేదని శ్రీను వైట్ల గుర్తించారు. నకిలీ పత్రాలతో తమను బురిడీ కొట్టించారని ఆలస్యంగా తెలుసుకున్న ఆయన షాక్‌కు గురయ్యారు. ప్రస్తుతం ఆ భూమి మార్కెట్ విలువ సుమారు రూ. 7.2 కోట్లు ఉంటుందని, పక్కా కుట్ర ప్రకారమే తమను మోసం చేశారని ఆయన తన ఫిర్యాదులో పేర్కొన్నారు. పోలీసుల రంగ ప్రవేశం శ్రీను వైట్ల ఫిర్యాదు ఆధారంగా హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. నిందితులు ఫోర్జరీ డాక్యుమెంట్లను ఎలా సృష్టించారు? ఈ ముఠా వెనుక ఉన్న సూత్రధారులు ఎవరు? అనే కోణంలో విచారణ కొనసాగుతోంది. ఈ స్కామ్‌లో ఇంకా ఎంతమంది బాధితులు ఉన్నారనే విషయంపై కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు.  శ్రీను వైట్ల కెరీర్ విషయానికి వస్తే.. ఒకప్పుడు టాలీవుడ్‌లో వరుస బ్లాక్‌బస్టర్ హిట్లతో స్టార్ డైరెక్టర్ గా వెలిగిన శ్రీను వైట్ల, గత కొంతకాలంగా సరైన సక్సెస్ కోసం ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం ఆయన శర్వానంద్ తో సినిమా చేసే ప్రయత్నాల్లో ఉన్నారు. సినిమా పనుల్లో బిజీగా ఉన్న సమయంలోనే ఈ భూ వివాదం తెరపైకి రావడం గమనార్హం.   
    -అనుష్క శర్మ టాలీవుడ్ ఎంట్రీ ఖాయమైందా! -ఇంతకీ ఆ సినిమా ఏంటి! -అల్లు అర్జున్, అట్లీ మూవీ నేనా! అనుష్క శర్మ(Anushka Sharma)..ఇండియన్ సిల్వర్ స్క్రీన్ కి దొరికిన అందమైన నటీమణుల్లో ఒకరు. సహజత్వం ఒట్టిపడటం అనుష్క శర్మ పెర్ఫార్మ్ స్టైల్. 2008 లో బాలీవుడ్ బాద్షా 'షారుక్'(Shahrukh Khan)తో 'రబ్ డే బనాదే జోడి'తో ఎంట్రీ ఇచ్చి ఎన్నో హిట్ చిత్రాల్లో చేసి తనకంటు ఒక ఇమేజ్ ని ఏర్పాటు చేసుకుంది. కింగ్ కోహ్లీ(Kohli)తో  వివాహం తర్వాత సిల్వర్ స్క్రీన్ పై పెద్దగా  మెరవకపోయినా నిర్మాతగా సినిమాలు చేస్తూ తన ఫ్యాషన్ మాత్రం తగ్గలేదని నిరూపిస్తుంది. రీసెంట్ గా తొలిసారి బాలీవుడ్ లో కాకుండా మన టాలీవుడ్ మీడియా సర్కిల్స్ తో పాటు సోషల్ మీడియాలో సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్ గా మారింది. ఆ న్యూస్ ఏంటో చూద్దాం. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun),అట్లీ(Atlee)కాంబోలో తెరకెక్కుతున్న మూవీ ఎంత ప్రెస్టేజియస్ట్ ప్రాజెక్ట్ నో తెలిసిందే. ఇండియన్ సినిమా ప్రౌడ్ గా ఫీలయ్యేలా కాంప్రమైజ్ అనే వర్డ్ కి చోటు లేదన్నట్టుగా నిర్మిస్తున్నారు. అలాంటి ఈ ప్రెస్టేజియస్ట్ ప్రాజెక్ట్ లో అనుష్క శర్మ కూడా జాయిన్ అయ్యిందనే వార్తలు నిన్నటుంచి వినిపిస్తున్నాయి. అధికార ప్రకటన రాకపోయినా తన కో యాక్ట్రెస్ ప్రియాంక చోప్రా, దీపికా పదుకునే తెలుగు చిత్రాల బాట పడుతుండటంతో అల్లు అర్జున్ తో అనుష్క శర్మ చెయ్యడం ఖాయమని అనుకున్నారు. కానీ అనూహ్యంగా అనుష్క శర్మ చెయ్యడం లేదని ఆమె పీఆర్ టీం ద్రువీకరించినట్టుగా తాజాగా బాలీవుడ్ మీడియాలో న్యూస్ చక్కర్లు కొడుతుంది. దీంతో అనుష్క శర్మ ని తెలుగు సెల్యులాయిడ్ పై చూడాలనే అభిమానుల ఆశ ఆవిరయినట్టయ్యింది. Also read: Ram Charan: చరణ్ కి గాయాలు!  అల్లు అర్జున్, అట్లీ ప్రాజెక్ట్ లో నలుగురు హీరోయిన్ లకి చోటు ఉందనే వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. దీపికా పడుకునే ఒక హీరోయిన్ కాగా మిగతా హీరోయిన్స్ విషయంలో చాలా రకాల రూమర్స్ వినిపిస్తున్నాయి. ఆ రూమర్స్ ని నమ్మే పరిస్థితిలో అయితే అల్లు ఆర్మీ, తెలుగు సినిమా లవర్స్ లేరు. ఎందుకంటే సోషల్ మీడియాలో ట్వంటీ ఫోర్ అవర్స్  లీనమయ్యే  హక్కు వాళ్లకి కూడా ఉంది కాబట్టి.     
రాణి ముఖర్జీ ‘మర్దానీ 3’ ఓటీటీ రిలీజ్ ఫిక్స్ బాక్సాఫీస్ వద్ద అదరగొట్టిన క్రైమ్ థ్రిల్లర్ నెట్‌ఫ్లిక్స్‌లో శివాని శివాజీ రాయ్ వేట షురూ బాలీవుడ్ యాక్షన్ క్వీన్ రాణి ముఖర్జీ(Rani Mukerji) సిల్వర్ స్క్రీన్ పై మరోసారి తన విశ్వరూపాన్ని ప్రదర్శించింది. పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ శివాని శివాజీ రాయ్ పాత్రలో ఆమె నటించిన లేటెస్ట్ క్రైమ్ థ్రిల్లర్ 'మర్దానీ 3'. థియేటర్లలో మంచి విజయాన్ని అందుకున్న ఈ చిత్రం ఇప్పుడు డిజిటల్ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. (Mardaani 3) కిడ్నాప్ మిస్టరీ 'మర్దానీ 3' కథాంశం అత్యంత సున్నితమైన, భయంకరమైన సామాజిక సమస్య చుట్టూ తిరుగుతుంది. మూడు నెలల వ్యవధిలోనే దాదాపు 93 మంది బాలికలు అదృశ్యం కావడం దేశవ్యాప్తంగా కలకలం సృష్టిస్తుంది. ఈ కేసును ఛేదించే బాధ్యతను శివాని శివాజీ రాయ్ (రాణి ముఖర్జీ) తీసుకుంటుంది. ఈ క్రమంలో ఆమెకు తారసపడే బిచ్చగాళ్ల మాఫియా, మెడికల్ ఎక్స్‌పెరిమెంట్స్ వెనుక ఉన్న అసలు నిజాలు ప్రేక్షకులను ఉక్కిరిబిక్కిరి చేస్తాయి.  స్ట్రీమింగ్ అప్డేట్ యష్ రాజ్ ఫిల్మ్స్ నిర్మించిన ఈ చిత్రం జనవరి 30న థియేటర్లలో విడుదలై విమర్శకుల ప్రశంసలు అందుకుంది. సాధారణంగా పెద్ద సినిమాలు ఎనిమిది వారాల తర్వాత ఓటీటీలోకి వస్తుంటాయి. అదే సంప్రదాయాన్ని పాటిస్తూ, 'మర్దానీ 3' ఈ నెల మార్చి 27 నుంచి నెట్‌ఫ్లిక్స్ (Netflix) వేదికగా స్ట్రీమింగ్ కానుంది. హిందీతో పాటు వివిధ ప్రాంతీయ భాషల్లో కూడా ఈ సినిమా అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. థియేటర్లలో మిస్ అయిన క్రైమ్ థ్రిల్లర్ ప్రియులకు ఇది మంచి అవకాశమని చెప్పాలి. ఫ్రాంచైజీలో ఫస్ట్ లేడీ విలన్ మర్దానీ సిరీస్‌లో గత రెండు భాగాల్లో మేల్ విలన్లే ఉండగా, ఈ మూడో పార్ట్‌లో మొదటిసారిగా ఒక లేడీ విలన్‌ను పరిచయం చేశారు. 'అమ్మ' అనే పాత్రలో మల్లికా ప్రసాద్ తన నటనతో వణుకు పుట్టించింది. రాణి ముఖర్జీకి ధీటుగా ఆమె పోషించిన ఈ క్రూరమైన పాత్ర సినిమాకే హైలెట్‌గా నిలిచింది. అలాగే జానకి బోడివాలా, జిషూ సేన్‌గుప్తా వంటి నటులు తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు.  సుమారు 60 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఇప్పటికే 75 కోట్లపైగా వసూళ్లను సాధించింది. కేవలం యాక్షన్ మాత్రమే కాకుండా, బలమైన ఎమోషన్స్ ఉండటంతో ఓటీటీలో కూడా ఈ మూవీ రికార్డులు సృష్టించడం ఖాయమని ఇండస్ట్రీ వర్గాలు భావిస్తున్నాయి. రాణి ముఖర్జీ కెరీర్‌లో ఇది మరో మైలురాయిగా నిలిచిపోవడమే కాకుండా, సామాజిక బాధ్యతను గుర్తుచేసే చిత్రంగా నిలిచింది. మార్చి 27 నుంచి నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానున్న ఈ మూవీ ఎలాంటి రెస్పాన్స్ సొంతం చేసుకుంటుందో చూడాలి.
  -గాయాలు పాలయిన రామ్ చరణ్! ఈ వార్తలో నిజమెంత! మరి పెద్ది పోస్ట్ పోన్ అవుతుందా! 'రై రారా' అంటు మెగాపవర్ స్టార్ 'రామ్ చరణ్'(Ram Charan)యూట్యూబ్ ని షేక్ చేస్తుండటంతో నీ కోసమే ఎదురుచూస్తున్నాం పెద్ది, కానీ ఈ సారి ఏప్రిల్ 30 న వస్తున్నాననే మాట తప్పితే బాగోదని అభిమానులు, మూవీ లవర్స్ పోటాపోటీగా 'పెద్ది' టీంకి మెసేజ్ లు చేస్తున్నారు. ఇప్పుడు ఆ అభిమానులు షాక్ కి గురయ్యే సంఘటన జరిగింది. ఎక్స్ క్లూజివ్ గా మీ కోసం అందిస్తున్నాం గత కొన్ని రోజుల నుంచి పెద్ది(Peddi)షూటింగ్ హైదరాబాద్ లో శరవేగంగా జరుగుతుంది. ఇప్పుడు ఈ షూటింగ్ లో చరణ్ గాయాలుపాలయినట్టుగా వార్తలు వస్తున్నాయి. ఒక యాక్షన్ ఎపిసోడ్ చేస్తుంటే కంటి దగ్గర గాయమైందని, కాకపోతే చిన్న దెబ్బే అని సమాచారం. అయితే చిత్ర బృందం నుంచి మాత్రం గాయం విషయంపై అధికార ప్రకటన రాలేదు. కొన్ని రోజులు షూటింగ్ వాయిదాపడనుందనే సమాచారం కూడా సినీ సర్కిల్స్ లో ఇష్టారీతిలో చక్కర్లు కొడుతుంది. also read: Mega Youth Force: మెగా యూత్ ఫోర్స్ జాతీయ కన్వీనర్ ఎంపిక.. ఎవరో తెలిస్తే కంగ్రాట్స్ చెప్తారు ఇక చరణ్ బర్త్ డే ఈ నెల 27 న కావడంతో సోషల్ మీడియాలో చరణ్ అండ్ మెగా ఫ్యాన్స్ హంగామా స్టార్ట్ అయింది. తమ అభిమాన హీరోకి బర్త్ డే విషెస్ చెప్తూ వాళ్ళు చేసే సేవా కార్యక్రమాల గురించి వెల్లడి చేస్తున్నారు. బర్త్ డే రోజు 'పెద్ది' నుంచి మరిన్ని అప్ డేట్స్ రానున్నాయి. ఇంకో టీజర్ తో పాటు సాంగ్ రిలీజ్ అవ్వచ్చనే టాక్ అయితే బలంగానే వినిపిస్తుంది. పెద్ది టీం గురించి అందరికి తెలిసిందే. కొత్తగా మృణాల్ ఠాకూర్(Mrunal Thakur)ఒక సాంగ్ లో జాయిన్ కానుందనేది ఫ్రెష్ న్యూస్.  
  ప్రతి ఒక్కరూ జీవితంలో సంతోషంగా ఉండాలని  కోరుకుంటారు.  సంతోషంగా ఉండటం కోసం చేయాల్సినంత కష్టం చేస్తూనే ఉంటారు.  డబ్బు సంపాదిస్తారు,  నచ్చిన వస్తువులు కొనుక్కుంటారు, నచ్చిన చోటికి వెళతారు.. ఇలా సంతోషంగా ఉండటానికి చేయాల్సినవన్నీ చేస్తారు. కానీ ఇన్నిచేసినా సరే.. కొందరు సంతోషంగా ఉండరు.  ఇలా ఎందుకు జరుగుతుందనే విషయం చాలా మంది ఆలోచించరు.  కేవలం అసంతృప్తి దగ్గరే ఆగిపోతారు.  కానీ క్షుణ్ణంగా గమనిస్తే.. ఒక వ్యక్తి చుట్టూ ఎన్ని సౌకర్యాలు, ఎన్ని సంతోషపెట్టే విషయాలు ఉన్నా ఆ వ్యక్తి సంతోషంగా ఉండటం లేదంటే.. ఆ వ్యక్తి చుట్టూ ఉండే కొందరు వ్యక్తులే కారణం అయ్యే అవకాశం ఉంటుంది. పక్కవాళ్లు సంతోషంగా ఉంటే ఓర్వలేని వ్యక్తులు కొందరు ఉంటారు.  ఇలాంటి వ్యక్తులు పక్కవాళ్ల సంతోషాన్ని చెదపురుగుల్లా తినేస్తుంటారు.  పైశాచిక ఆనందాన్ని లోలోపలే అనుభవిస్తారు.  పక్కవాళ్ల సంతోషాన్ని నాశనం చేసే ఆ వ్యక్తులు ఎవరు?  వారి లక్షణాలు ఏంటో తెలుసుకుంటే.. ఎప్పుడూ ఏడుస్తూ కంప్లైంట్లు చేసే వ్యక్తులు.. జీవితంలో ఏ మంచినీ చూడని వాళ్ళు వీళ్ళు. వాతావరణం బాగుంటే, ఎండ వేడిమి గురించి ఫిర్యాదు చేస్తారు. మంచి ఉద్యోగం వస్తే, తమ బాస్‌ను విమర్శిస్తారు. వారి దృక్పథం ఎంత ప్రతికూలంగా ఉంటుందంటే, వారి పక్కన కూర్చోవడం కూడా  మానసిక స్థితిని పాడు చేస్తుంది. ఇలాంటి వ్యక్తులు పక్కవాళ్ల సానుకూల శక్తిని హరించివేస్తారు. వీరికి దూరంగా ఉండటమే ఉత్తమం. స్వప్రయోజనాలు చూసుకునేవారు.. స్నేహితులలో, బంధువులలో చాలామంది స్వార్థంగా ఉంటారు.  మాట్లాడి చాలా  రోజులు అయింది అంటూ మాటలు కలిపి తమ స్వప్రయోజనాల కోసం సహాయం అడుగుతుంటారు.  ఇలాంటి వారు ప్రతి ఒక్కరి సర్కిల్లో ఉంటారు.వీళ్ళు కేవలం తమకు సహాయం కావాలన్నా లేదా ఏదైనా పని చేయించుకోవాలన్నా మాత్రమే ఎదుటి వ్యక్తిని గుర్తు చేసుకుంటారు. పని పూర్తయిన వెంటనే మాయమైపోతారు. ఇలాంటి స్వార్థపరులు  ఎప్పటికీ నిజమైన స్నేహితులు కాలేరు. చాడీలు చెప్పేవారు.. ఒకరి గురించి ఇంకొకరు దగ్గర చాడీలు చెప్పేవారు.. ఏదో ఒకరోజు ఎదుటి వారికి మీ గురించి చాడీలు చెప్పే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది.  అలాంటి వారికి నిజాయితీ ఉండదు. వారు సంబంధాలను పాడుచేయడానికి కల్పిత కథలను మాత్రమే చెబుతారు.  జీవితంలో మనశ్శాంతి కావాలంటే అలాంటి వ్యక్తులకు  దూరంగా ఉండటం మంచిది. అసూయ పరులు.. మీరు సంతోషంగా ఉన్నప్పుడు చప్పట్లు కొట్టేవాడే నిజమైన స్నేహితుడు. అయితే, కొంతమంది మీతో చాలా మంచిగా ఉన్నట్లు నటిస్తారు, కానీ రహస్యంగా మీ పురోగతిని చూసి అసూయపడతారు. మీరు కొత్త కారు కొన్నా, పదోన్నతి పొందినా, వారు మిమ్మల్ని అభినందిస్తారు, కానీ వారి కళ్ళలో, మాటల్లో ఒక వింతైన అసూయ  స్పష్టంగా కనిపిస్తుంది. అలాంటి అసూయపడే వ్యక్తులు మీ మంచిని ఎప్పటికీ కోరుకోలేరు. నిరాశ పరిచేవారు.. నువ్వు చేయలేవు.. నీకు చేతకాద.. నీకు సాధ్యం కాదు.. నువ్వు ఫెయిల్ అవుతావు.. వంటి మాటలు చెప్పే వ్యక్తులే మీ కలలకు, ధైర్యానికి అతిపెద్ద శత్రువులు. మీరు ఏదైనా కొత్తగా, సానుకూలంగా చేయాలని అనుకున్నప్పుడల్లా, వాళ్ళు తమ మాటలతో మిమ్మల్ని భయపెట్టి, మీ ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తారు. మిమ్మల్ని మీరు నమ్మండి, వాళ్ళ మాటలను ఒక చెవితో విని, మరో చెవితో వదిలేయాలి. పైన చెప్పుకున్న లక్షణాలు గల వ్యక్తులు ప్రతి ఒక్కరి చుట్టూ ఉంటారు. ఇలాంటి వ్యక్తులకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. అలాగే ఇలాంటి వ్యక్తుల మాటలను ఎంత తక్కువ పరిగణలోకి తీసుకుంటే అంత మంచిది. లేకపోతే సంతోషాన్ని చెదపురుగుల్లా తినేసి,  మనిషిని అశాంతికి గురిచేస్తారు.                                        *రూపశ్రీ.
వేసవి కాలం ప్రారంభమైంది, ఆరోగ్యం పట్ల శ్రద్ధ కూడా పెరుగుతుంది. చాలామంది నీటి శాతం అధికంగా ఉన్న పండ్లు, కూరగాయలు తినడానికి ఇష్టపడతారు. అలాంటి వాటిలో దోసకాయలు కూడా ముఖ్యమైనవి.  దోసకాయను జ్యూస్ గా అయినా తీసుకుంటారు, సలాడ్ లో ఉపయోగిస్తారు,  కొంతమంది నేరుగా దోసకాయలు ముక్కలు చేసుకుని తింటారు.  ఎలా తిన్నా దోసకాయ ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది.  మార్కెట్లలో దోసకాయలకు డిమాండ్  కూడా పెరిగే కాలం ఇది.  అయితే దోసకాయలు కొనుగోలు చేసేటప్పుడు చాలా మంది తెలియకుండానే చేదు దోసకాయలను ఎంపిక చేస్తుంటారు.   చేదు దోసకాయలు  అటు తినలేము, ఇటు డబ్బు కూడా వృధా అవుతుంది.  అలా కాకుండా మార్కెట్లో దోసకాయలు కొనుగోలు చేసేటప్పుడు చేదు దోసకాయలు కాకుండా అన్నీ మంచి దోసకాయలు ఎంచుకోవాలి అంటే కొన్ని టిప్స్ పాటించాలి.  ఆ టిప్స్ ఏంటో తెలుసుకుంటే.. చేదు దోసకాయలు అవాయిడ్ చేసి మంచి దోసకాయలు ఎంచుకునే టిప్స్.. రంగు,  ఆకారం..  దోసకాయల రంగు,  ఆకారం ను  బట్టి చేదు దోసకాయను సులభంగా గుర్తించవచ్చు. దోసకాయ ముదురు ఆకుపచ్చ రంగులో ఉంటే, అది తాజాగా ఉన్నట్లు. అది లేత పసుపు, తెలుపు రంగులో లేదా మచ్చలతో ఉంటే, అది పండిందని అర్థం, అలాగే  లోపల చేదుగా ఉండే అవకాశం ఉంటుంది. నొక్కడం.. దోసకాయ గట్టిగా, దృఢంగా ఉంటే ఫర్వాలేదు, అదే అది మెత్తగా లేదా స్పాంజిలాగా అనిపిస్తే అది చెడిపోయినది,  చేదుగా కూడా ఉండవచ్చు. దోసకాయ నొక్కినప్పుడు అది గట్టిగా ఉండాలి. ఆకారం.. దోసకాయ ఆకారాన్ని చూసి  సులభంగా అది చేదు దోసకాయ లేదా మంచి దోసకాయ అనేది చెప్పవచ్చు. మందంగా లేదా పసుపు రంగులో ఉండే దోసకాయలు చేదుగా ఉండే అవకాశం ఉంది. ముదురు ఆకుపచ్చ రంగులో, గట్టిగా ఉండే దోసకాయలను మంచిగా ఉంటాయి. వాసన.. వాసనను బట్టి సులభంగా దోసకాయ చేదు ఉందా లేదా అనేది కనుక్కోవచ్చు.   దోసకాయ  తాజాగా ఉంటే లోపల కూడా తాజాగా ఉంటుంది.  దాని వాసన వింతగా లేదా ఘాటుగా ఉంటే, అది  లోపల చేదుగా కూడా ఉండే అవకాశం ఉంటుంది. కాండం.. దోసకాయ కొనుగోలు చేసినప్పుడు దోసకాయ కాండం దగ్గర కట్ చేయాలి. ఆ కాండం భాగాన్ని  దోసకాయ మిగిలిన భాగంలో రుద్దితే తెల్లని నరుకు వస్తే దోసకాయ చేదు ఉండే అవకాశం ఉంటుంది.  ఈ నుగురు బాగా బయటకు వెళ్లిపోతే దోసకాయలో చేదు తగ్గిపోతుందని చెబుతారు. అందుకే చాలామంది దోసకాయను కట్ చేసేటప్పుడు మొదట కాండం దగ్గర కట్ చేసి  రుద్దుతారు.  దీని వల్ల దోసకాయలో ఉండే చేదు పోతుందని చెబుతారు.                                 *రూపశ్రీ.
కొందరు చాలా లోతుగా ఆలోచిస్తారు.  ఈ కారణంగా చాలా విషయాలు వారిలో సందేహాలుగానో,  నిర్ణయాలుగానో, అబిప్రాయాలుగానో ఉంటాయి.  వాటిని బయటకు చెప్పాలంటే ఏదో సంకోచం ఉంటుంది.  ఎదుటి వారు ఏమనుకుంటారో అనే సందిగ్ధం కూడా ఉంటుంది.  దీని వల్ల వారు చాలా విషయాలు బయటకు చెప్పలేక నిశ్శబ్దంగా ఉండిపోతుంటారు.  కానీ ఇలా నిశ్శబ్దంగా ఉండటం వల్ల  తరువాత చాలా బాధపడతారు కూడా.  అప్పుడు అలా చెప్పి ఉంటే బాగుండు, అలా చేసి ఉంటే బాగుండు అని అనుకునేవారు చాలా అధికంగా ఉంటారు. కానీ మనసులో మాటను ధైర్యంగా చెప్పడం వల్ల చాలా రకాల లాభాలు ఉన్నాయని అంటున్నారు మనస్తత్వ విశ్లేషకులు. ఇంతకూ మనసులో మాటను ధైర్యంగా బయటకు చెప్పడం వల్ల కలిగే లాభాలు ఏంటి తెలుసుకుంటే.. నమ్మకం, సాన్నిహిత్యం.. ప్రతి బలమైన సంబంధానికి ఓపెన్ కమ్యూనికేషన్ పునాది అవుతుంది. మనం మన భావాలను నిజాయితీగా వ్యక్తపరిచి, ఇతరుల మాటలను విన్నప్పుడు అపార్థాలు తొలగిపోతాయి.  నమ్మకం మరింత పెరుగుతుంది. మనసు విప్పి మాట్లాడగల  వ్యక్తులు పారదర్శకత,  పరస్పర గౌరవం కలిగి ఉంటారు. ఇది బందం దీర్ఘకాలం ఆరోగ్యంగా ఉండటంలో సహాయపడుతుంది. ఆత్మగౌరవం, ఆత్మవిశ్వాసం.. మనసులో ఉన్న ఆలోచనలను భయం లేదా సంకోచం లేకుండా వ్యక్తం చేసినప్పుడు..  చెప్పాలనుకున్న విషయాన్ని చెప్పేశాం అనే ఒక శాటిస్పాక్షన్ ఫీలింగ్ ఏర్పడుతుంది. ఇది  ఆత్మగౌరవాన్ని పెంచుతుంది,  క్రమంగా ఇలాంటి ప్రవర్తన వల్ల ఆత్మవిశ్వాసం కూడా మెరుగవుతుంది. ఎప్పుడైనా, ఎలాంటి సందర్భంలో అయినా తన మనసులో ఉన్నది చెప్పడానికి ఎలాంటి భయం ఉండదు. తేడాలు, పరిష్కారాలు.. జీవితంలో ప్రతి ఒక్కచోట విభేదాలు ఉండనే ఉంటాయి. అవి స్నేహం అయినా, కుటుంబం అయినా,  ప్రేమ అయినా, ఉద్యోగం చేసే చోట అయినా.. ఎక్కడైనా సరే.. విభేదాలు గొడవలుగా మారకుండా పరిష్కరించుకోవడానికి  సహాయపడుతుంది. అభిప్రాయాలను స్పష్టంగా , సంకోచం లేకుండా వ్యక్తపరిచినప్పుడు అవతలి వ్యక్తులు కూడా వినడానికి ఆసక్తి చూపిస్తారు.  ఇలా మాట్లాడటం అనేది సమస్యకు పరిష్కారాన్ని చూపిస్తుంది. ఆత్మవిమర్శ.. ఏదైనా విషయాన్ని స్పష్టంగా చెప్పే అలవాటు ఉండటం వల్ల కేవలం ఇతరులతో ఏదైనా చెప్పడమే కాదు.. తమతో తాము స్పష్టంగా మాట్లాడుకోగలుగుతారు. ఇది వ్యక్తులను కన్ప్యూజన్ లేకుండా చేస్తుంది. బలాలు, బలహీనతలను గుర్తించడంలో సహాయపడుతుంది. ఇది వ్యక్తిగత అభివృద్దికి మొదటి అడుగు అవుతుంది. మానసిక ఒత్తిడి, ఆందోళన.. భావోద్వేగాలను అణిచివేసినప్పుడు అవి లోపల ఒత్తిడి కలిగిస్తాయి. కానీ వాటిని సరైన విధంగా బయటకు వ్యక్తం చేసినప్పుడు ఒత్తిడి తగ్గుతుంది. ఇది మానసిక ఒత్తిడి,  ఆందోళన సమస్యలు పెరగకుండా ఉండటానికి కారణం అవుతుంది. శారీరక ఆరోగ్యం.. స్పష్టంగా ఏదైనా విషయాన్ని బయటకు చెప్పడం వల్ల శారీరక ఆరోగ్యం కూడా బాగుంటుంది. ఒత్తిడి తక్కువగా ఉండటం మంచి నిద్ర, రక్తపోటు సాధారణంగా ఉంటాయి. ఇది గుండెజబ్బు, తలనొప్పి, నిద్రలేమి వంటి సమస్యలు రాకుండా చేస్తుంది. సక్సెస్ కోసం.. స్పష్టంగా, మంచిగా కమ్యూనికేషన్ చేయడంలో వ్యక్తి విజయం ఆధారపడి ఉంటుంది. ఉద్యోగంలో అయినా, రాజకీయంలో అయినా,  కుటుంబంలో అయినా,  బంధంలో అయినా స్పష్టంగా మాట్లాడటం వల్ల అవతలి వ్యక్తులు అర్థం చేసుకునే అవకాశాలు ఎక్కువ ఉంటాయి.  ఇది అన్ని చోట్ల విజయాన్ని,  గౌరవాన్ని తెచ్చిపెడుతుంది. స్పష్టంగా మాట్లాడటం అంటే ఇతరుల పైన ఆధిపత్యం చెలాయించడం కాదు. భావాలను గౌరవంగా, పద్దతిలో వ్యక్తపరచడం. ఇతరులు ఏమనుకుంటారో అనుకోకుండా మనసులో ఉన్నది  చెప్పడం, మనసులో ఉన్నది తొక్కి పెట్టి మౌనంగా ఉండకుండా బయటకు వ్యక్తం చేయడం వల్ల మానసికంగా బలంగా ఉండటమే కాకుండా ఇతరుల ముందు సరైన విధంగా మాట్లాడటం ఎలాగో కూడా అర్థం  అవుతుంది.  కాబట్టి ఇతరుల గురించి ఆలోచించి మనసులో ఉన్నది దాచిపెట్టాల్సిన అవసరం లేదు.                          *రూపశ్రీ.
నేటికాలంలో చాలామంది ఆరోగ్య స్పృహతో ఉంటున్నారు.  ఎంత బిజీగా ఉన్నా సరే.. తీసుకునే పండ్ల విషయంలో ఎంతో జాగ్రత్తగా ఉంటున్నారు.  చాలామంది రోడ్ సైడ్ లేదా మాల్స్,  ఆఫీసుల దగ్గర దుకాణాలలో పిచ్చి  ఆహారాలకు బదులు ఫ్రూట్ చాట్ తినడం మంచిదని అనుకుంటారు. దుకాణాలలో కూడా వివిధ రకాల పండ్లను కలిపి ప్రూట్ చాట్ గా తయారు చేసి అమ్ముతుంటారు.  ఫ్రూట్స్ ఆరోగ్యానికి మంచిది కాబట్టి ఫ్రూట్ చాట్ కూడా ఆరోగ్యానికి చాలా మంచివని అనుకుంటారు.  కానీ ఫ్రూట్ చాచ్ గురించి వైద్యులు,  ఆహార నిపుణులు దిమ్మతిరిగే నిజాలు చెబుతున్నారు.  ముఖ్యంగా వేసవిలో అందరూ ఫ్రూట్ చాట్ ఎక్కువగా తినాలని అనుకుంటారు కాబట్టి ఫ్రూట్ చాట్ అంటే ఇష్టపడే ప్రతి ఒక్కరూ వైద్యులు ఏం చెప్పారో తెలుసుకోవాలి.. తొక్క వల్ల కలిగే నష్టం.. చాలా వరకు ఫ్రూట్ చాట్ లో పండ్ల మీద తొక్కను తొలగించి పండ్లను ముందుగానే ముక్కలు చేసి సిద్దంగా పెట్టి ఉంటారు. కస్టమర్లు రాగానే వాటిని అందిస్తుంటారు.  పండ్ల పై తొక్క పండ్లను చెక్కు చెదరకుండా రక్షిస్తాయి.  కానీ పండ్లను తొక్క తొలగించి  కోసిన తర్వాత ఈ రక్షణ పొర తొలగిపోతుంది. పండు లోపలి భాగం నేరుగా గాలి, దుమ్ము, కాలుష్యం,  మురికి మొదలైనవాటికి గురవుతుంది. ఈ పండ్లను ఎక్కువ కాలం పాటు, ముఖ్యంగా వేడి వాతావరణంలో  వదిలేస్తే, బ్యాక్టీరియా,  ఫంగస్ వేగంగా వృద్ధి చెందుతాయి. పరిశుభ్రత లోపించడం వల్ల రోడ్డు పక్కన పండ్లు అమ్మే చోట ఇన్ఫెక్షన్ వచ్చే ప్రమాదం గణనీయంగా ఎక్కువగా ఉంటుంది. నిల్వ.. కోసిన పండ్లను సరైన ఉష్ణోగ్రతలో నిల్వ చేయకపోతే, అవి  తీవ్రమైన అనారోగ్యానికి గురిచేస్తాయి. ఈ కలుషితమైన పండ్లను తినడం వల్ల అనేక సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది. ఫుడ్ పాయిజన్,  కడుపునొప్పి,  వాంతులు విరేచనాలు, జ్వరం వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది.  ఇంట్లో  చిన్నపిల్లలు, వృద్ధులు, అనారోగ్యంతో ఉన్నవారు వంటి  బలహీనమైన రోగనిరోధక వ్యవస్థ ఉన్నవారికి ఇలాంటి ఫ్రూట్ చాట్ లేదా ముందే ముక్కలుగా కోసిన పండ్లు ఆరోగ్యానికి మరింత హాని చేసే అవకాశం ఎక్కువ. పోషణ ఉండవు..  శరీరానికి తగినంత పోషణ అందించడానికి  పండ్లు తింటాము, కానీ పండ్లను కోసి ఎక్కువ సేపు నిల్వ ఉంచడం వల్ల వాటిలోని ముఖ్యమైన పోషకాలు నశించిపోతాయని నిపుణులు చెబుతున్నారు. గాలికి నేరుగా గురికావడం వల్ల విటమిన్ సి వంటి సున్నితమైన, ప్రయోజనకరమైన పోషకాలు క్రమంగా నశించిపోతాయి. ముందుగా కోసిన పండ్లను తినడం వల్ల  అనారోగ్యానికి గురయ్యే ప్రమాదం ఉండటమే కాకుండా,  శరీరానికి అవసరమైన పోషకాలు కూడా అందవు. ప్యాక్ చేసిన కటింగ్ ఫ్రూట్స్.. సూపర్‌మార్కెట్లలో లభించే డబ్బాలలో ప్యాక్ చేసిన కోసిన పండ్లు, విడిగా అమ్మే పండ్ల కంటే కొంచెం సురక్షితమైనవిగా పరిగణించబడవచ్చు. అయినప్పటికీ, వాటిని కొనుగోలు చేసేటప్పుడు  జాగ్రత్తగా ఉండాలి. వాటి గడువు తేదీని,  వాటిని నిల్వ ఉంచిన ఉష్ణోగ్రతను  తనిఖీ చేయాలి. ఆరోగ్యంగా ఉండాలంటే.. మార్కెట్ నుండి  తాజాగా, కోయని పండ్లనే ఇంటికి తెచ్చుకోవాలి. పండ్లను శుభ్రమైన నీటితో బాగా కడిగి, ఆ తరువాతే కోయాలి. పండ్లను కోసిన తర్వాత వాటిని ఎక్కువ సేపు ఆరుబయట ఉంచకూడదు. కోసిన పండ్లు ఏవైనా మిగిలి ఉంటే, వాటిని గాలి చొరబడని డబ్బాలో పెట్టి ఫ్రిజ్‌లో ఉంచాలి. రోడ్డు పక్కన ఎలాంటి శుభ్రత లేని చోట,  ముందుగానే పండ్లను కోసి నిల్వ చేసి అమ్మే చోట పండ్ల ముక్కలు కొనుగోలు చేసి తినడం మంచిది కాదు.                                    *రూపశ్రీ.
వేసవి కాలం రాగానే చాలామంది లైఫ్ స్టైల్ మారుతుంది. ముఖ్యంగా ఆహారం విషయంలో, పానీయాల విషయంలో చాలా మార్పులు వచ్చేస్తాయి. బీహార్, ఉత్తర ప్రదేశ్ రాష్ట్రాల పేమస్ పానీయం ఇది. అయితే దీని ప్రయోజనాల దృష్ట్యా దేశ వ్యాప్తంగా ఇష్టంగా ఉపయోగిస్తారు.  వేసవి వచ్చిందంటే సత్తు పానీయం చాలా ఎక్కువగా తీసుకుంటారు.  ఇది శరీరాన్ని కూల్ గా ఉంచడమే కాకుండా శరీరానికి కావలసిన పోషకాలను పుష్కలంగా అందిస్తుంది.  కాల్చిన శనగలతో తయారు చేసే సత్తు పౌడర్ ను సత్తు పానీయం కోసం ఉపయోగిస్తారు. అయితే.. సత్తు పొడితో కేవలం సత్తు పానీయమే కాకుండా.. చాలా రకాల పదార్థాలు తయారు చేసుకుంటారు.  వేసవిలో అటు శరీరాన్ని కూల్ గా ఉంచుతూ, ఇటు శరీరానికి బోలెడు పోషకాలు అందించే సత్తు పొడితో ఏమేం వంటకాలు బాగుంటాయో తెలుసుకుంటే.. సత్తు పేడ.. వేసవిలో  నీరసంగా అనిపిస్తే సత్తు పేడను తయారు చేసుకుని తినవచ్చు.. ఇది  ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. దీనిని తిన్న తర్వాత  శరీరం పూర్తి చురుకుగా ఉంటుంది. సత్తు పిండిని నెయ్యి వేసి బాగా వేయించి అందులో పంచదార పొడి వేసి సన్న మంట మీద గోల్డ్ కలర్ వచ్చే వరకు వేయిస్తే సత్తు పేడ రెఢీ.. ఇది చాలా రుచిగా ఉంటుంది. సత్తు మజ్జిగ.. వేసవి కాలంలో సత్తుతో మజ్జిగ తయారు చేసుకుని తాగవచ్చు. ఇది  శరీరాన్ని తేమగా ఉంచుతుంది.  పిల్లల నుండి పెద్దల వరకు అందరూ దీనిని ఇష్టపడతారు. దీనిని ప్రతిరోజూ తాగడం వల్ల తక్షణ శక్తి లభిస్తుంది. సత్తు లడ్డు.. సత్తు లడ్డూలను సత్తు పొడితో ఇంట్లోనే సులభంగా తయారు చేసుకోవచ్చు. సత్తు లడ్డులు తినడం వల్ల  శరీరం బలపడుతుంది. సత్తు లడ్డులో డ్రై ప్రూట్స్, నట్స్, నెయ్యి వేసి తయారు చేసుకుని తినవచ్చు. చాలా రుచిగా ఉంటాయి. సత్తు షార్డ్ బ్రెడ్.. వేసవిలో కూడా కారంగా తినాలని అనుకునే వారు చాలామంది ఉంటారు.  అలాంటి వారికి సత్తు షార్ట్ బ్రెడ్ చాలా మంచి ఫుడ్. సత్తు పిండిని వేయించి అందులో బంగాళదుంప,  బఠాణీ వంటి కూరగాయలు వేసి ముద్దగా చేసుకుని దీన్ని తడి చేసిన బ్రెడ్ మధ్యలో ఉంచి బ్రెడ్ ను బోండా లాగా రౌండ్ చేసి నూనెలో డీప్ ప్రై చేయాలి.  చాలా రుచిగా ఉంటాయి. సత్తు లిట్టి చోఖా.. లిట్టి చోఖా అనేది బీహార్, ఉత్తర ప్రదేశ్, జార్ఖండ్ రాష్ట్రాలలో చాలా ఫేమస్ ఫుడ్.  వేయించిన శనగపిండిని గోధుమ పిండిలో స్టఫ్ చేసి వాటిని కాలుస్తారు.  వీటిని లిట్టి అంటారు.  వీటిని నెయ్యితోనూ,  వంకాయ, టమాటా,  బంగాళాదుంపతో చేసిన చోఖా అనే వంటకంతో కలిపి వడ్డిస్తారు. ఈ పూర్తీ కాంబోను లిట్టీ చోఖా అంటారు.  ఇది చాలా రుచిగా ఉంటుంది.  చోఖా లేకపోయినా లిట్టిని వివిధ రకాల చట్నీలతో కూడా తింటారు.                                       *రూపశ్రీ.
ఆరోగ్యమే మహాభాగ్యం. కానీ నేటి కాలంలో మారిన జీవనశైలి కారణంగా చిన్న పిల్లల నుండి పెద్దల వరకు ఏదో ఒక దీర్ఘకాలిక (Chronic) ఆరోగ్య సమస్యతో బాధపడుతున్నారు. ఎన్ని మందులు వాడినా సమస్య తాత్కాలికంగా తగ్గుతుందే తప్ప, పూర్తిగా నయం కావడం లేదని చాలా మంది ఆవేదన చెందుతుంటారు. అలాంటి వారికి హోమియోపతీ ఒక గొప్ప వరప్రసాదం. కేవలం లక్షణాలను అణచివేయడం కాకుండా, వ్యాధిని మూలాల నుండి తొలగించే అద్భుత శక్తి హోమియోపతీకి ఉంది.  Renowned Homeopathy expert Dr Praveen Kumar చెప్పిన మరిన్ని విషయాలు ఈ  TeluguOne Health Video Link క్లిక్ చేసి తెలుసుకుందాం. మనం హోమియోపతీని ఎందుకు ఎంచుకోవాలి? (Why Homeopathy?) దీర్ఘకాలిక వ్యాధులలో తిరుగులేని చికిత్స: హోమియోపతీ యొక్క అసలు బలమే దీర్ఘకాలిక వ్యాధులను నయం చేయడం. బ్రాంకియల్ ఆస్తమా వంటి జెనెటిక్ డిజార్డర్లను కూడా సమూలంగా తొలగించడానికి హోమియోపతీలో మార్గం ఉంది. సంపూర్ణ ఆరోగ్య దృక్పథం (Holistic Approach): ఇతర వైద్య విధానాలు కేవలం వ్యాధి మీద దృష్టి పెడితే, హోమియోపతీ 'రోగి' (Patient) మీద దృష్టి పెడుతుంది. అంటే మీ వేలికి నొప్పి ఉంటే కేవలం వేలిని మాత్రమే కాకుండా, మీ శరీరాన్ని ఒక యూనిట్‌గా పరిగణించి చికిత్స అందిస్తుంది. శాస్త్రీయమైనది: ఒకప్పుడు హోమియోపతీ కేవలం ప్లాసిబో (Placebo) అని విమర్శలు ఉండేవి. కానీ నేడు IIT ముంబై మరియు IISc బెంగళూరు వంటి సంస్థలు చేసిన పరిశోధనల్లో హోమియోపతీ మందులలో 'నానో పార్టికల్స్' (Nano Particles) ఉంటాయని నిరూపితమైంది. దుష్ప్రభావాలు లేని వైద్యం: ఇది సహజ సిద్ధమైన పద్ధతిలో పనిచేస్తుంది కాబట్టి సైడ్ ఎఫెక్ట్స్ భయం ఉండదు. చికిత్స ప్రక్రియ ఎలా ఉంటుంది? (How it works?) హోమియోపతీలో చికిత్స అనేది చాలా లోతుగా సాగుతుంది. దీనిని 'కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్' అంటారు. కేస్ టేకింగ్: డాక్టర్ మీతో దాదాపు గంట సేపు మాట్లాడుతారు. మీ అలవాట్లు, మీ ఇష్టాయిష్టాలు, మీకు ఎప్పుడు కోపం వస్తుంది, మీ గత చరిత్ర (Past history) వంటి అంశాలన్నింటినీ అడిగి తెలుసుకుంటారు. ఇది మీ 'జర్నీ ఆఫ్ లైఫ్'ను అర్థం చేసుకునే ప్రక్రియ. మయాజమ్స్ (Miasms): ఆయుర్వేదంలో వాత, పిత్త, కఫ దోషాలు ఉన్నట్లే, హోమియోపతీలో సోరా, సిఫిలిస్, సైకోసిస్ అనే మూడు మయాజమ్స్ ఉంటాయి. వీటి ఆధారంగానే మీ వ్యాధి తీవ్రతను అంచనా వేస్తారు. పొటెంటైజేషన్: మందులను డైల్యూట్ చేసే ప్రక్రియను 'డైనమైజేషన్' అంటారు. ఇందులో మందు పరిమాణం తక్కువగా ఉన్నప్పటికీ, దాని శక్తి (Power) చాలా ఎక్కువగా ఉంటుంది. ఏం చేయకూడదు? (What Not to Do?) సమాచారాన్ని దాచకండి: డాక్టరుకు మీ శారీరక, మానసిక లక్షణాలను స్పష్టంగా చెప్పాలి. ఏదైనా విషయాన్ని దాచడం వల్ల సరైన మందును ఎంపిక చేయడం కష్టమవుతుంది. స్వయం వైద్యం వద్దు: హోమియోపతీ మందులు తీపి మాత్రల్లా కనిపిస్తాయి కదా అని సొంతంగా వాడకూడదు. వ్యాధి తీవ్రతను బట్టి డాక్టర్ ఇచ్చే పొటెన్సీ (30CH, 200CH లేదా 1M) మారుతూ ఉంటుంది. అపోహలు నమ్మకండి: హోమియోపతీ ఆలస్యంగా పనిచేస్తుందనేది ఒక అపోహ మాత్రమే. సరైన మందు పడితే అక్యూట్ కండిషన్స్ (జ్వరం, జలుబు) కూడా చాలా వేగంగా తగ్గుతాయి. తరచుగా అడిగే ప్రశ్నలు (Q&A) ప్ర: 30CH అంటే ఏమిటి? జ: ఇది హోమియోపతీలో ఒక రకమైన పొటెన్సీ (శక్తి). ఒక భాగం మందును 99 భాగాల వెహికల్ (ఆల్కహాల్ లేదా షుగర్ ఆఫ్ మిల్క్)తో కలిపి చేసే ప్రక్రియ ద్వారా 30CH తయారవుతుంది. ఇది అద్భుతమైన శక్తిని కలిగి ఉంటుంది. ప్ర: హోమియోపతీ మందులు ఘాటుగా ఎందుకు ఉంటాయి?  జ: మందులను పిల్స్ (మాత్రలు) మీద వేయడానికి ఆల్కహాల్‌ను వెహికల్‌గా ఉపయోగిస్తారు. ఆ ఆల్కహాల్ వల్ల ప్రారంభంలో కొంచెం ఘాటుగా అనిపించవచ్చు, కానీ ఆ మాత్రలు తియ్యగానే ఉంటాయి. ప్ర: మానసిక సమస్యలకు హోమియోపతీ పనిచేస్తుందా?  జ: అవును. హోమియోపతీలో మనిషి యొక్క సైకీ (Psyche) లేదా మానసిక స్థితిని బట్టి హైయర్ పొటెన్సీ మందులు ఇవ్వడం జరుగుతుంది, ఇవి మానసిక ఆరోగ్యంపై అద్భుతంగా పనిచేస్తాయి. దీర్ఘకాలిక వ్యాధులతో పోరాడుతున్న వారికి హోమియోపతీ ఒక ఆశాకిరణం. ఇది కేవలం వ్యాధిని తగ్గించడమే కాకుండా, మీ రోగనిరోధక శక్తిని పెంచి మిమ్మల్ని సంపూర్ణ ఆరోగ్యవంతులుగా తీర్చిదిద్దుతుంది. మరిన్ని ఆసక్తికరమైన ఆరోగ్య విషయాలు మరియు నిపుణుల సలహాల కోసం ఇప్పుడే మా TeluguOne Health యూట్యూబ్ ఛానెల్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి