LATEST NEWS
కార్పొరేషన్ మేయర్లు, మున్సిపల్ ఛైర్‌పర్సన్‌ల రిజర్వేషన్లను తెలంగాణ  ప్రభుత్వం ఖరారు చేసింది. రాష్ట్రంలోని 121 మున్సిపాలిటీల్లో ఎస్టీలకు 5, ఎస్సీలకు 17, బీసీలకు 38 మున్సిపల్ ఛైర్‌పర్సన్ పదవులను కేటాయించారు. అలాగే మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు వర్తిస్తాయి. ఈ మేరకు మున్సిపల్ శాఖ డైరెక్టర్ శ్రీదేవి శనివారం (జనవరి 17) ఉత్తర్వులు జారీ చేశారు.  ఇక  కార్పొరేషన్‌ చైర్మన్లకు ఖరారు చేసిన రిజర్వేషన్లు ఈ విధంగా ఉన్నాయి. కొత్తగూడెం కార్పొరేషన్‌  ఎస్టీ జనరల్, రామగుండం కార్పొరేషన్‌కు ఎస్సీ జనరల్, మహబూబ్ నగర్ కార్పొరేషన్ బీసీ మహిళ, మంచిర్యాల కార్పొరేషన్ బీసీ జనరల్, కరీంనగర్ కార్పొరేషన్ బీసీ జనరల్, జీహెచ్ఎంసీ మహిళ జనరల్,  గ్రేటర్ వరంగల్ జనరల్, ఖమ్మం, నల్గొండ, నిజామాబాద్ కార్పొరేషన్‌లలో మహిళ జనరల్‌ను ఖరారు చేశారు.
ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం కేసులో వైసీపీ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డికి ఈడీ నోటీసులు జారీ చేసింది.  2019 నుంచి ఐదేళ్ల పాటు ఆంధ్రప్రదేశ్ లో జగన్ నేతృత్వంలోని వైసీపీ అధికారంలో ఉన్న సంగతి తెలిసిందే. జగన్ హయాంలో అనుసరించిన మద్యం విధానంలో అవకతవకలు, అక్రమాలు, మనీలాండరింగ్ చట్ట ఉల్లంఘనలపై ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ దర్యాప్తు చేస్తున్న సంగతి తెలిసిందే.  గత ప్రభుత్వ హయాంలో మద్యం వ్యాపారానికి సంబంధించిన పెద్ద ఎత్తున మనీలాండరింగ్, హవాలా లావాదేవీలు జరిగాయన్న ఆరోపణలపై ఈ దర్యాప్తు సాగుతోంది.   మద్యం సేకరణ వ్యవస్థను ఆటోమేటెడ్ ప్రక్రియ నుండి మాన్యువల్ ఆమోదాలకు మార్చడం, తద్వారా కొన్ని సంస్థలకు ప్రయోజనం చేకూరేలా ఒప్పందాల మార్పిడికి దోహదపడిందని ఈడీ తన దర్యాప్తులో ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చింది.   కాగా ఈ కేసును ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక దర్యాప్తు బృందం కూడా దర్యాప్తు చేస్తున్న సంగతి తెలిసిందే. సిట్ ఇప్పటికే ఈ కేసులో చాలా మందిని అరెస్టు చేసింది వారిలో కొందరు బెయిలుపై విడుదల కాగా, ఇంకా కొందరు రిమాండ్ ఖైదీలుగా ఉన్నారు. ఈ కేసులో విజయసాయి కూడా ఇప్పటికే సిట్, ఈడీ విచారణను ఎదుర్కొన్నారు. ఇప్పుడు తాజాగా ఈ నెల 22 విచారణకు రావాల్సిందిగా విజయసాయికి ఈడీ నోటీసులు పంపడం రాజకీయంగా కూడా ప్రాధాన్యత సంతరించుకుంది. వైసీపీ ద్వారా వచ్చిన రాజ్యసభ సభ్యత్వానికీ, వైసీపీకీ రాజీనామే చేసి రాజకీయాలకు గుడ్ బై చెప్పేశాననీ, వ్యవసాయమే తన వ్యాపకమని చెప్పుకుంటున్న విజయసాయి ఈడీ విచారణలో ఏం చెబుతారన్న ఆసక్తి, ఉత్కంఠ సర్వత్రా నెలకొని ఉంది. ఇప్పటికే పలు సందర్భాలలో వైసీపీ నేతలపై విమర్శలు చేసిన విజయసాయి ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం విషయంలో ఈడీ విచారణలో  వెల్లడించే విషయాలు కీలకం కానున్నాయంటున్నారు.  
తెలంగాణలో ఫిరాయింపు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వ్యవహారం క్లైమాక్స్ కు చేరుకుంది.  మొత్తం పది మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై ఫిరాయింపు ఆరోపణలు ఉండగా, వారిపై అనర్హత వేటు విషయంలో అసెంబ్లీ స్పీకర్  గడ్డం ప్రసాద్ కుమార్ ఇప్పటికే ఏడుగురు ఎమ్మెల్యేలపై తన నిర్ణయాన్ని వెలువరించారు. ఆ ఏడుగురూ పార్టీ ఫిరాయించారనడానికి ఎటువంటి ఆధారాలూ లేవనీ, వారు బీఆర్ఎస్ లోనే ఉన్నారనీ స్పష్టమైనే తీర్పు ఇచ్చారు.   ఇక ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, అలాగే  ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, జగిత్యాల ఎమ్మెల్యే మాకనూరు సంజయ్ లపై స్పీకర్ నిర్ణయం తీసుకోవలసి ఉంది. ఈ ముగ్గురిలో కూడా దానం నాగేందర్ పరిస్థితి ఒకింత భిన్నంగా ఉంది. ఎందుకంటే ఆయన బీఆర్ఎస్ టికెట్ పై విజయం సాధించిన తరువాత కాంగ్రెస్ కండువా కప్పుకోవడమే కాకుండా, ఆ పార్టీ తరపఫున లోక్ సభ ఎన్నికలలో పోటీకి కూడా దిగారు. ఈ నేపథ్యంలో ఆయన ఇప్పటికీ బీఆర్ఎస్ లోనే ఉన్నారని స్పీకర్ చెప్పడానికి ఇసుమంతైనా అవకాశం లేదని అంటున్నారు. ఈ నేపథ్యంలో ఆయన ముందున్న మార్గమేంటని పరిశీలిస్తే.. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి అనర్హత వేటు నుంచి తప్పించుకోవడమే కాకుండా, తన రాజీనామా ద్వారా వచ్చే ఉప ఎన్నికలో కాంగ్రెస్ తరఫున బరిలోకి దిగడం. ఇది ఒక్కటే దానం నాగేందర్ ను అనర్హత వేటు నుంచి బయటపడేయగదని పరిశీలకులు అంటున్నారు. అలా కాకుండా ఎమ్మెల్యేగా కొనసాగి అనర్హత వేటుకు గురైతే తదుపరి ఎన్నికలలో పోటీకి కూడా ఆయన అనర్హుడయ్యే అవకాశం ఉందంటున్నారు.   బహిరంగంగా వేరే పార్టీ గుర్తుపై పోటీ చేసిన వ్యక్తి పార్టీ మారలేదు అని స్పీకర్ తీర్పు ఇచ్చే అవకాశాలు ఇసుమంతైనా లేవని అంటున్నారు.   
కాంగ్రెస్ అగ్రనాయకుడు, లోక్ సభలో ప్రధాన ప్రతిపక్ష పార్టీ నాయకుడు రాహుల్ గాంధీ నోట మళ్లీ ఓటు చోరీ మాట వచ్చింది. మహా మునిసిపల్ ఎన్నికలలో భారీ ఎత్తున అక్రమాలు జరిగాయని ఆరోపించిన రాహుల్ గాంధీ, ఎన్నికలలో ఓటు వేసే సమయంలో ఓటర్ల వేలికి వేసే సిరాకు బదులు మార్కర్ పెన్నులు ఉపయోగించడం ద్వారా పెద్ద ఎత్తున ఓటు చోరీకి పాల్పడ్డారని ఆయన విమర్శించారు. ఎన్నికల నిర్వహణలో  ఎన్నికల సంఘం అనుసరిస్తున్న తీరు వల్ల ప్రజలలో ప్రజాస్వామ్యం పట్ల నమ్మకం సడలిపోతోందని రాహుల్ పేర్కొన్నారు. కాగా ఓటర్ల వేలికి సిరాకు బదులు మార్కర్ పెన్ను ఉపయోగించడంపై కాంగ్రెస్ మాత్రమే కాకుండా ఎన్డీయే కూటమి యేతర పార్టీలన్నీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. మహా మునిసిపోల్స్ లో మరీ ముఖ్యంగా బృహాన్ ముంబై కార్పొరేషన్ ఎన్నికలలో పెద్ద ఎత్తున అవకతవకలు జరిగాయని వారు ఆరోపిస్తున్నారు. 
బీహార్ లో కాంగ్రెస్ కు భారీ షాక్ తగిలింది. ఆ పార్టీకి చెందిన ఆరుగురు ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించి జేడీయూ గూటికి చేరడానికి రెడీ అయిపోయారు. ముఖ్యమంత్రి నితీష్ కుమార్ నేతృత్వంలోని ప్రభుత్వ విధానాలకు ఆకర్షితులై వారీ పార్టీ మారబోతున్నారంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. అయితే, ఈ వార్తలను కాంగ్రెస్  ఖండించింది. కాంగ్రెస్ ఇటీవల ఏర్పాటు చేసిన కార్యక్రమాలకు ఈ ఆరుగురు ఎమ్మెల్యేలూ డుమ్మా కొట్టడమే ఈ ప్రచారానికి కారణం.  ఈ నెల 13న పార్టీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన 'దహీ-చూరా' విందుకు ఈ ఆరుగురు ఎమ్మెల్యేలూ గైర్హాజరయ్యారు. దీనికి తోడు సంక్రాంతి తరువాత కాంగ్రెస్ లో పెద్ద కుదుపు ఉంటుందంటూ ఎన్డీయే నేతల ప్రచారం కూడా కాంగ్రెస్ కు చెందిన ఆరుగురు ఎమ్మెల్యేలు జనతాదళ్ గూటికి చేరనున్నారన్న ప్రచారానికి ఊతం ఇచ్చింది.   ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఆరు స్థానాలలో  మాత్రమే విజయం సాధించింది. ఇప్పుడు ఆ ఆరుగురూ కూడా కాంగ్రెస్ ను వీడనున్నారంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుండటంతో  రాష్ట్రంలో కాంగ్రెస్ బలం శూన్యం  అవుతుందన్న చర్చ మొదలైంది. అంతే కాకుండా కాంగ్రెస్ నుంచి ఆరుగురు ఎమ్మెల్యేలు జనతాదళ్ యూ గూటికి చేరితే ఆ పార్టీ బలం బీజేపీని మించుతుంది.    243 స్థానాలున్న అసెంబ్లీలో ఎన్డీయేకు 202 మంది సభ్యుల బలం ఉంది. ఇందులో బీజేపీకి 89, జేడీయూకు 85 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇలా ఉండగా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గంపగుత్తగా జనతాదళ్ యూ గూటికి చేరనున్నారంటూ జరుగుతున్న ప్రచారాన్ని బీహార్ కాంగ్రెస్ అధ్యక్షుడు షకీల్ అహ్మద్ ఖాన్ తోసిపుచ్చారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలందరూ పార్టీతోనే ఉన్నారన్న ఆయన పార్టీ కార్యకర్తల మనో స్థైర్యాన్ని దెబ్బతీయడానికే ప్రత్యర్థులు ఇటువంటి ప్రచారానికి తెరతీశారని విమర్శించారు.  
ALSO ON TELUGUONE N E W S
  మెగాస్టార్ చిరంజీవి నటించిన లేటెస్ట్ మూవీ 'మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Vara Prasad Garu) బాక్సాఫీస్ ని షేక్ చేస్తోంది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ మూవీ.. సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కేవలం ఐదు రోజుల్లోనే రూ.200 కోట్ల గ్రాస్ క్లబ్ లో చేరింది. చిరంజీవి కెరీర్ లో ఈ ఫీట్ సాధించిన మూడో సినిమా ఇది కావడం విశేషం.   చిరంజీవి కెరీర్ లో రూ.200 కోట్ల గ్రాస్ క్లబ్ లో చేరిన సినిమాలు గతంలో రెండు ఉన్నాయి. 2019లో విడుదలైన 'సైరా నరసింహారెడ్డి' రూ.240 కోట్లకు పైగా గ్రాస్ రాబట్టగా, 2023లో వచ్చిన 'వాల్తేరు వీరయ్య' రూ.230 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసింది.     ఇక 'మన శంకర వరప్రసాద్ గారు' విషయానికొస్తే.. నిర్మాతలు ప్రకటించిన దాని ప్రకారం.. ఐదు రోజుల్లోనే ఈ మూవీ రూ.226 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది. అంటే మొదటి వారంలోనే ఈ మూవీ రూ.250 కోట్ల క్లబ్ లో చేరి, చిరంజీవి కెరీర్ లో హైయెస్ట్ గ్రాసర్ గా నిలవనుంది.   ఇదిలా ఉంటే, టాలీవుడ్ సీనియర్ స్టార్స్ లో మూడు రూ.200 కోట్ల గ్రాస్ సినిమాలున్న ఏకైక హీరో చిరంజీవి కావడం విశేషం.   Also Read: 'మన శంకర వరప్రసాద్ గారు' మూవీ రివ్యూ  
  ఈ సంక్రాంతికి విడుదలైన సినిమాలలో 'అనగనగా ఒక రాజు'(Anaganaga Oka Raju) ఒకటి. నవీన్ పొలిశెట్టి, మీనాక్షి చౌదరి జంటగా నటించారు. నూతన దర్శకుడు మారి దర్శకత్వంలో సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మించింది. జనవరి 14న థియేటర్లలో అడుగుపెట్టిన ఈ మూవీ.. పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకుంది. కామెడీతో పాటు చివరిలో ఎమోషన్ కూడా బాగానే వర్కౌట్ అయింది. ముఖ్యంగా నవీన్ వన్ మ్యాన్ షోతో అదరగొట్టాడనే పేరు వచ్చింది.   సంక్రాంతి సీజన్ కావడంతో పాటు, పాజిటివ్ టాక్ కూడా రావడంతో 'అనగనగా ఒక రాజు' మంచి వసూళ్లతో సత్తా చాటుతోంది. మేకర్స్ తెలిపిన దాని ప్రకారం.. మూడు రోజుల్లోనే ఈ సినిమా వరల్డ్ వైడ్ గా రూ.60 కోట్లకు పైగా గ్రాస్ రాబట్టింది.     మొదటి రోజు వరల్డ్ వైడ్ గా రూ.22 కోట్ల గ్రాస్ సాధించిన అనగనగా ఒక రాజు.. రెండో రోజు రూ.19.2 కోట్లు, మూడో రోజు రూ.19.9 కోట్లతో సత్తా చాటింది. దీంతో మూడు రోజుల్లోనే రూ.61.1 కోట్ల గ్రాస్ తో సంచలనం సృష్టించింది. ఒక యంగ్ హీరో నటించిన సినిమా.. కేవలం మూడు రోజుల్లోనే ఈ స్థాయి వసూళ్లు రాబట్టడం మామూలు విషయం కాదు.   Also Read: 'అనగనగా ఒక రాజు' మూవీ రివ్యూ  
ఇటీవ‌లికాలంలో సౌత్ డైరెక్ట‌ర్ల‌కు బాలీవుడ్‌లో మంచి డిమాండ్ ఏర్ప‌డిన విష‌యం తెలిసిందే. సౌత్ నుంచి వెళ్లిన ఎన్నో సినిమాలు బాలీవుడ్‌లో బాక్సాఫీస్‌ని షేక్ చేశాయి. ముఖ్యంగా టాలీవుడ్ డైరెక్ట‌ర్లంటే అక్క‌డ ఎంతో క్రేజ్ ఉంది. అయితే ఆ డైరెక్ట‌ర్ల లిస్ట్‌లో లేని ఓ టాలీవుడ్ డైరెక్ట‌ర్‌తో ఓ బాలీవుడ్ సంస్థ భారీ ఒప్పందాన్ని కుదుర్చుకుంది. అత‌నెవ‌రో కాదు, ర‌మేష్‌వ‌ర్మ‌.   బాలీవుడ్ అగ్ర నిర్మాణ పెన్ స్టూడియోతో క‌లిసి డీల్ కుదుర్చుకున్నారు ర‌మేష్ వ‌ర్మ‌. ఈ సంస్థ‌తో క‌లిసి మొత్తం 10 సినిమాలు చెయ్యాల్సి ఉండ‌గా మొద‌టి విడత‌లో నాలుగు ప్రాజెక్టులు ఓకే అయ్యాయి. ఈ నాలుగు సినిమాల బ‌డ్జెట్ సుమారు 150 కోట్ల రూపాయ‌లు ఉంటుంద‌ని తెలుస్తోంది. త‌మిళ స్టార్స్ విక్ర‌మ్‌, ధ్రువ్‌, లారెన్స్‌, బాలీవుడ్ స్టార్ అజయ్ దేవ్‌గ‌ణ్‌ల‌తో ఈ నాలుగు సినిమాలు ఉంటాయ‌ని తెలుస్తోంది. ఈ సినిమాల‌కు సంబంధించిన క‌థ‌లు కూడా ఫైన‌ల్ అయిపోయాయి. త్వ‌ర‌లోనే అఫీషియ‌ల్ ఎనౌన్స్‌మెంట్ వచ్చే అవ‌కాశం ఉంద‌ని స‌మాచారం. ఈ నాలుగు సినిమాల టైటిల్స్‌, ఇత‌ర న‌టీన‌టులు, సాంకేతిక నిపుణుల వివ‌రాల‌ను ప్ర‌క‌టిస్తారు.    ఇదిలా ఉంటే.. ద‌ర్శ‌కుడు ర‌మేష్‌వర్మ `కొక్కొరొక్కో` అనే ఓ చిన్న సినిమాను స్వీయ ద‌ర్శ‌క‌త్వంలో నిర్మిస్తున్నారు. స‌మ్మ‌ర్‌లో ఈ చిత్రాన్ని విడుద‌ల చేసేందుకు స‌న్నాహాలు చేస్తున్నారు. అలాగే బాలీవుడ్‌లో ఘ‌న‌విజ‌యం సాధించిన `కిల్` చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేయ‌బోతున్నారు. ఈ సినిమాకి సంబంధించిన స్క్రిప్ట్ వ‌ర్క్ కూడా పూర్త‌యింది. త్వ‌ర‌లోనే ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లే అవ‌కాశం ఉంది. 
గత కొన్నిరోజులుగా టాలీవుడ్‌ని ఊపేస్తున్న అనసూయ, శివాజీ వివాదం రోజుకో మలుపు తిరుగుతూ మరింత ముదురుతోంది. హీరోయిన్ల వేషధారణపై శివాజీ చేసిన వ్యాఖ్యలపై స్పందించి తనదైన స్టైల్‌లో సమాధానం చెప్పిన అనసూయపై ఎంత ట్రోలింగ్‌ నడిచిందో అందరికీ తెలిసిందే. అక్కడా, ఇక్కడా అనే భేదం లేకుండా ప్రతి ప్లాట్‌ఫామ్‌లోనూ ఆమెకు వ్యతిరేకత కనిపించింది. పనిలోపనిగా కొందరు విశ్లేషకులు, నేతలు శివాజీ, అనసూయ వివాదంలో తలదూర్చి కాస్త ఘాటుగానే స్పందించారు.    గత కొన్నిరోజులుగా జరుగుతున్న ఈ వ్యతిరేక కార్యక్రమంపై స్పందించిన అనసూయ.. మీడియా ముఖంగా కన్నీరు మున్నీరయ్యారు. అంతటితో ఆగకుండా తనను అప్రతిష్టపాలు చెయ్యాలని ప్రయత్నించిన వారిని ఒక్కొక్కరిగా ఏరి మొత్తం 73 మందిపై కేసు పెట్టారు. అందులో మీడియాలో తన గురించి మాట్లాడినవారు, ట్రోలింగ్‌ చేసిన వారు, కొన్ని యూట్యూబ్‌ ఛానల్స్‌ కూడా ఉన్నాయి. బొజ్జ సంధ్యారెడ్డితోపాటు ప్రియా చౌదరి గోగినేని, పావని, శేఖర్‌ బాషా, రజినీ లాంటివారు ప్రధానంగా కనిపిస్తున్నారు. అలాగే పలు న్యూస్‌ టీవీలో యాంకర్లు, సోషల్‌ మీడియా స్టార్లు ఉన్నారు.    ఈ కేసు విషయాన్ని సింగర్‌ చిన్మయి స్వయంగా సోషల్‌ మీడియా వేదికగా ప్రకటించారు. యాంకర్‌ అనసూయను ఉద్దేశించి రాజకీయ నేత చేసిన వ్యాఖ్యలను మీడియాలో ఎక్కువగా ప్రచారం చేశారని చిన్మయి అన్నారు. మహిళల పట్ల గౌరవం ఉంటే వెంటనే సంధ్యారెడ్డిని కాంగ్రెస్‌ పార్టీ నుంచి సస్పెండ్‌ చెయ్యాలని ఆమె డిమాండ్‌ చేశారు. ఇప్పుడు చిన్మయి చేసిన వ్యాఖ్యలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. 
Charming Star Sharwanand has once again proved that the Sankranti season is his home ground, delivering a huge blockbuster with his latest family entertainer, Nari Nari Naduma Murari. Previously, he shook the box office with hits like Shatamanam Bhavati and Express Raja, and now NNNM has become hit with a unanimous positive response. Directed by Ram Abbaraju and produced by AK Entertainments, the film has turned into a volcanic success, delighting family audiences across the nation. Sharwanand said, "I was always confident that NNNM will be a huge blockbuster. Not just for Sankranti, the film would have been blockbuster any day it releases but the season will enhance the returns. I am happy looking at audience reactions thanking me for delivering a big hit and I am thrilled to see so much love for our film." He further mentioned the hardships faced during shooting but credited the team effort and ground-breaking writing for this victory. In an exciting update that has thrilled fans, Sharwanand has officially locked his next massive project with the king of comedy, Srinu Vaitla. Doubling down on his lucky streak, the actor announced that this highly anticipated collaboration is being aimed for Sankranti 2027.  Cheekily, he added, "Sharwa Sankranti is a lucky charm for the industry and I will keep continuing it." With Samyuktha and Sakshi Vaidya adding glamour to the current hit, the stage is now set for another storm in 2027. Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them. 
  పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(Prabhas), సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా(Sandeep Reddy Vanga) దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం 'స్పిరిట్'(Spirit). కేవలం ప్రకటనతోనే మోస్ట్ హైప్డ్ ఇండియన్ మూవీస్ లో ఒకటిగా నిలిచింది. తాజాగా ఈ మూవీ రిలీజ్ డేట్ ను రివీల్ చేశారు మేకర్స్.   2027 సంక్రాంతి కానుకగా 'స్పిరిట్' విడుదల కానుంది అంటూ రీసెంట్ గా సోషల్ మీడియాలో న్యూస్ చక్కర్లు కొడుతున్నాయి. ఈ నేపథ్యంలో చిత్ర బృందం విడుదల తేదీని ప్రకటించడం విశేషం.   స్పిరిట్ సినిమాను 2027, మార్చి 5న రిలీజ్ చేయనున్నట్లు తాజాగా ప్రకటించారు. పాన్ ఇండియా భాషలతో పాటు, పలు అంతర్జాతీయ భాషల్లోనూ ఈ సినిమా విడుదల కానుంది.   ఇదిలా ఉంటే మహేష్ బాబు - రాజమౌళి కాంబినేషన్ లో రూపుదిద్దుకుంటున్న 'వారణాసి'తో పాటు, అల్లు అర్జున్- అట్లీ కాంబోలో తెరకెక్కుతోన్న సైన్స్ ఫిక్షన్ ఫిల్మ్ 'AA22'ని కూడా 2027, మార్చిలోనే విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. విడుదల తేదీలను అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. అయితే ఇప్పుడదే మార్చి నెలలో స్పిరిట్ మూవీ కర్చీఫ్ వేయడం సంచలనంగా మారింది.   ఈ మూడూ ఇండియాలో రూపొందుతోన్న భారీ సినిమాలు. అలాంటిది ఈ మూడు సినిమాలు తక్కువ వ్యవధిలో విడుదలైతే.. ఇండియన్ సినీ చరిత్రలో సరికొత్త రికార్డులు నమోదవ్వడం ఖాయం.    
India's biggest Superstar Prabhas and Sandeep Reddy Vanga are brewing a cinematic earthquake with their intense action cop drama, Spirit. The movie announcement shook the industry but further hype is enhanced with the sound teaser and the Ajanubhau first look has become the biggest sensation.  Now, the makers have showcased great confidence by announcing the release date a year early. Spirit is releasing on 5th MARCH 2027 and it is going to take the world and nation by storm. Sandeep Reddy Vanga is known for delivering a great character based drama with his high technical prowess and impeccable vision. The Industry anticipates that with Prabhas, he is going to create a Box Office Mayhem that the world is going to remember for ages. Triptii Dimri is playing the leading lady role with Prakash Raj in a prominent role. The shoot of the movie is progressing at a rapid pace promising a memorable theatrical experience.  Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them. 
  సైదా ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై రమేష్ ఎగ్గిడి - శ్రీకాంత్ మొగదాసు - చందర్ గౌడ్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఔట్ అండ్ ఔట్ యాక్షన్ ఎంటర్టైనర్ "మిరాకిల్". "సత్య గ్యాంగ్, ఫైటర్ శివ" చిత్రాల దర్శకుడు ప్రభాస్ నిమ్మల దర్శకత్వంలో ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న ఈ చిత్రం ఫస్ట్ లుక్ సంక్రాంతి కానుకగా ఈరోజు (జనవరి 16న) విడుదల చేశారు. శ్రీమతి జ్యోత్స్న ఈ చిత్రానికి సహ నిర్మాత. పోరాట సన్నివేశాలతో మొదటి షెడ్యూల్ జరుపుకున్న ఈ చిత్రం రెండో షెడ్యూల్  ఈనెల 22 నుంచి హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో జరగనుంది.   రణధీర్ భీసు హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో హెబ్బా పటేల్ హీరోయిన్. అక్షర నున్న సుజన మరో హీరోయిన్. సీనియర్ హీరోలు శ్రీరామ్, సురేష్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. నాయుడు పెండ్ర విలన్ గా పరిచయమవుతున్నాడు. సీనియర్ ఫిల్మ్ జర్నలిస్ట్ ధీరజ అప్పాజీ ఫోరెన్సిక్ ఆఫీసర్ గా నటిస్తున్న ఈ చిత్రంలో జనార్దన్, యోగి కాత్రే, విజయ్ సూర్య, ఇంతియాజ్, సాయిబాబా, దిల్ రమేష్, ఝాన్సీ, సూర్యనారాయణ, శ్రీధర్, శ్రీకాంత్, శివ, ఆమని, హైమావతి, నవ్య (అమ్ము) బెజవాడ మస్తాన్, ఆర్. కుమార్ ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.   నిర్మాతలు మాట్లాడుతూ.. "సత్యా గ్యాంగ్, ఫైటర్ శివ" చిత్రాలతో దర్శకుడిగా తన సత్తా చాటుకున్న ప్రభాస్ నిమ్మల తన మూడో చిత్రంతో "మిరాకిల్" చేయబోతున్నారు. హెబ్బా పటేల్ గ్లామర్, సీనియర్ హీరోలు శ్రీరామ్, సురేష్ పోషిస్తున్న కీలక పాత్రలు, ముఖ్యంగా యాక్షన్ బ్లాక్స్ "మిరాకిల్" చిత్రానికి ముఖ్య ఆకర్షణలు కానున్నాయి.  రెండో షెడ్యూల్ ఈనెల 22 నుంచి జరగనుంది" అని అన్నారు.   
Producer Suryadevara Naga Vamsi has become one of the most popular and followed creative professional in Telugu Cinema for right and wrong reasons. His outspoken nature has made him a darling to trolls and at the same time, a dear to fans. He did come forward to release NTR's WAR 2 for huge amount in Telugu States.  He paid a huge amount of Rs.90 crores for the rights to YRF and many wrote that the losses accumulated by the film have pushed him into a huge abyss, so much so that, he flew to Dubai to run away from debtors. He refused all the claims but his Kingdom and Mass Jathara became such big disasters that many believed his time has come.  But Anaganaga Oka Raju starring Naveen Polishetty took a massive opening for the actor's market and while Rs.41.2 crores number in two days in heavily debated, the BO trackers do accept that the movie did come close to Rs.30 crores+ gross worldwide in two days. This puts the film on the path of recovering the budget greatly.  So, the movie is going to be a hit and this gave Naga Vamsi confidence again to give a big promise. Without explicitly stating he stated that one hero fans have been working non-stop to promote Anaganaga Oka Raju and he will give them a return gift that they have all been waiting for in coming days.  This resulted in speculations about Naga Vamsi returning gift to NTR fans, who have been by far owning him from WAR 2 time. So, he seem to have given an update about God of War film, starring NTR in the direction of Trivikram Sreenivas. As the film stars NTR as God Murugan/ Kumara Swamy, it has huge anticipation already.  Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them. 
  మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ కి ఎందరో అభిమానులు ఉన్నారు. వారిలో కొందరు సినీ ప్రముఖులు కూడా ఉంటారు. అలాంటి వారిలో ప్రముఖ నిర్మాత నాగవంశీ ముందు వరుసలో ఉంటారు. తాజాగా ఆయన ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి  రిటర్న్ గిఫ్ట్ ఇస్తానని ప్రకటించడం ఆసక్తికరంగా మారింది.   సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నాగవంశీ నిర్మించిన 'అనగనగా ఒక రాజు' మూవీ సంక్రాంతి కానుకగా జనవరి 14న విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. తాజాగా మూవీ టీమ్ 'థాంక్యూ మీట్'ని నిర్వహించగా.. అందులో నాగవంశీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.   ఎన్టీఆర్ ఫ్యాన్స్ ని ఉద్దేశించి నాగవంశీ మాట్లాడుతూ.. "72 గంటల నుంచి మా ఫ్యాన్ బాయ్స్ అంతా సోషల్ మీడియాలో ఒకటే డ్యూటీ చేస్తున్నారు. ఆ ఫ్యాన్ బాయ్స్ ఎవరి ఫ్యాన్సో.. మీ అందరికీ బాగా తెలుసు. ఇంకో వారం, పది రోజులు మన ఫ్యాన్ బాయ్స్ సపోర్ట్ ఇలాగే కొనసాగితే ఇంకా పెద్ద విజయం సాధిస్తాం. మీకు ఎలాంటి రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలి, ఎంత రేంజ్ లో ఇవ్వాలి నాకు బాగా తెలుసు. త్వరలోనే అనౌన్స్ చేస్తాము." అన్నారు.   Also Read: ఎన్టీఆర్ 'డ్రాగన్' నుంచి మరణ మాస్ అప్డేట్!   కుమారస్వామి కథతో 'గాడ్ ఆఫ్ వార్' అనే భారీ మైథలాజికల్ ఫిల్మ్ ని త్రివిక్రమ్ ప్లాన్ చేస్తున్నారు. ఇందులో కుమారస్వామి పాత్రలో ఎన్టీఆర్ కనిపిస్తారని గతంలో నాగవంశీ చెప్పారు. అయితే ఇటీవల మళ్ళీ ఆ ప్రాజెక్ట్ అల్లు అర్జున్ కి వెళ్ళినట్లు వార్తలు వచ్చాయి. దీంతో ఈ ప్రాజెక్ట్ విషయంలో చిన్న సస్పెన్స్ నెలకొంది. ఇప్పుడు దానికి చెక్ పెడుతూ.. త్వరలో అనౌన్స్ చేస్తాం అంటూ హింట్ ఇచ్చేశారు నాగవంశీ.   Also Read: 'అనగనగా ఒక రాజు' మూవీ రివ్యూ    
వివాహం ప్రతి ఒక్కరి జీవితంలో చాలా కీలకం. వివాహ వయస్సు కాలక్రమేణా పెరుగుతోంది. చదువు పూర్తయిన తర్వాత అబ్బాయి అయినా  అమ్మాయి అయినా  కెరీర్‌లో స్థిరపడిన సెటిల్ అయిన తర్వాత  మాత్రమే వివాహం చేసుకోవాలనుకుంటారు. అబ్బాయిలు ఆలస్యంగా వివాహం చేసుకోవడం పెద్దగా సమస్య కాదు, కానీ పెద్ద వయసులో అమ్మాయిలకు మంచి సంబందాలు రావడం లేదన్నది ఒప్పుకోవాల్సిన నిజం.  అమ్మాయిలకు వివాహానికి సరైన వయస్సు ఏమిటి అనే  విషయంపై సరైన స్పష్టత ఎక్కడా లేదు. అబ్బాయిల మాదిరిగానే అమ్మాయిలు కూడా మొదట తమ కెరీర్‌ను నిర్మించుకోవాలని, ఆ తర్వాత వివాహం చేసుకోవాలని కోరుకుంటున్నారు. కానీ 30ఏళ్ల  తర్వాత ఆడపిల్లల తల్లిదండ్రులకు పెద్ద సవాల్ ఎదురవుతోంది. దీనిగురించి రెలేషన్షపి నిపుణులు చెబుతున్న విషయాలు ఏంటో తెలుసుకుంటే.. కెరీర్ అడ్డంకి.. గతంలో ఆడపిల్లల చదువు, కెరీర్ కు ఇంత ప్రాముఖ్యత లేదు.  టెంత్,  ఇంటర్,  డిగ్ర లాంటివి పూర్తవ్వగానే ఆడపిల్లలకు పెళ్ళి చేసేవారు. పెళ్లి తర్వాత మహిళలు కూడా ఇంటిని,  భర్త,  పిల్లలు, అత్తమామలను చూసుకుంటూ ఉండే వారు. కానీ నేటికాలంలో అలా లేదు.. తల్లిదండ్రులు ఆడపిల్లలను కూడా కొడుకులతో సమానంగా చదివిస్తున్నారు. ఆడపిల్లలు తమ కెరీర్ ను అద్బుతంగా మలుచుకోవడంలో సపోర్ట్ చేస్తున్నారు. దీని వల్ల ఆడపిల్లలు కూడా తమ కెరీర్ ను బిల్డ్ చేసుకుని సెటిల్ కావడానికి సమయం పడుతోంది.  అది కాస్తా 30 ఏళ్ల వరకు వివాహానికి దూరం ఉండేలా చేస్తోంది. ఇదే తల్లిదండ్రులకు పెద్ద సవాల్ గా మారుతోంది.  ఆర్థిక స్వాతంత్ర్యం సంపాదించిన కూతురికి పెళ్లి చేయడం చాలా కష్టతరంగా మారింది. అబ్బాయిలకు కాస్త బెటర్.. అమ్మాయిల మాదిరిగానే పెద్ద వయసు అబ్బాయిలకు  కూడా వివాహం చేసుకోవడంలో కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. అయితే అబ్బాయి బాగా సంపాదిస్తే చిన్న వయసు అమ్మాయిల నుండి సంబంధాలు వస్తుంటాయి.  తల్లిదండ్రులు  తమ కూతురికి  ఆర్థిక భద్రత కల్పించే వ్యక్తికి ఇచ్చి వివాహం చేయాలని అనుకుంటారు. అయితే అమ్మాయిల విషయంలో అలా కాదు. ఒక అమ్మాయి ఎంత సంపాదించినా, ఆమె పెద్దది అయితే మంచి జత దొరకడం కష్టంగా ఉంటుంది. అబ్బాయిలు ఆశించడమే పెద్ద సమస్య.. కాలం ఎంత మారినా అది మగవారి ఆలోచనలు మార్చలేకపోతోంది.  మగవాళ్లకు తమ భార్యల పట్ల ఉన్న అవగాహన పెద్దగా మారలేదు. చాలా మంది మగవాళ్లు ఎక్కువగా ఆశిస్తున్నారనే మాట చాలా నిజం.  భార్య అటు ఉద్యోగం చేసి సంపాదించాలి,  అలాగే ఇటు ఇంటికి రాగానే ఇంటి పనులు అన్నీ ఆమె చేసి భర్తకు సేవలు చేస్తూ పిల్లలను కూడా చూసుకోవాలని కోరుకుంటారు.  చాలా సార్లు తమ తల్లితో భార్యను పోలుస్తారు,  వస్త్రధారణ నుండి అమ్మాయి పరిచయాల వరకు, స్నేహితులు, వ్యక్తిగత స్పేస్ వంటి విషయాలలో కూడా ఆబ్బాయిలు అమ్మాయిలను చికాకు పెడతారు. ఇలాంటివి అమ్మాయిలకు చాలా ఇబ్బంది కలిగిస్తాయి.  ఇవి కాస్తా వైవాహిక జీవితంలో అడ్డంకులకు కారణం అవుతున్నాయి. అమ్మాయిల వయసు పెరిగితే ఇదే సమస్య.. 30ఏళ్ళ తర్వాత అమ్మాయిలకు వివాహం విషయంలో ఎదురయ్యే అతి పెద్ద సమస్య అమ్మాయి సంతానోత్పత్తి ఆమె వయస్సుతో ముడి పడి  ఉంటుంది. వయస్సు పెరిగే కొద్దీ అమ్మాయి సంతానోత్పత్తి తగ్గుతుంది. అమ్మాయి పెద్దదైతే ఆ జంట పిల్లల కోసం ముందుగానే ప్రణాళిక వేసుకోవాలి. ఇది వైవాహిక జీవితాన్ని సరిగ్గా ఆస్వాదించకుండా చేస్తుంది. నేటి కాలంలో అమ్మాయిలు ఆర్థిక విషయం నుండి చాలా వరకు స్వతంత్రత కలిగి ఉన్నారు.  తన సొంత ఆలోచన ఉంటుంది. ఆమె తన భర్త లేదా కుటుంబం చెప్పే ప్రతిదానితో ఏకీభవించలేదు. ఆమె తన సొంత ఆలోచనకు కూడా ప్రాధాన్యత ఇస్తుంది. ఇదే భార్యభర్తల మధ్య సమస్యలు సృష్టిస్తోంది. సరైన వయసు.. మేజర్ అయితే చాలు అమ్మాయిలు, అబ్బాయిలు వివాహానికి అర్హత పొందుతారు. కానీ వివాహానికి  సరైన వయసు అనేది వ్యక్తిగతంగా ఉంటుంది.  అమ్మాయిలు కెరీర్ ను సీరియస్ గా తీసుకోవడం వివాహానికి ఇబ్బంది కలిగించే విషయమే అయినప్పటికీ చాలా మంది మహిళలు తమ కెరీర్ ను తొందరగా సెటిల్ చేసుకుని సరైన జోడి వెతుక్కుని హాయిగా సెటిల్ అవుతున్నారు.  అంటే.. వివాహం విషయంలో అబ్బాయిల  ఆలోచన కూడా ముఖ్యం.  వారు కూడా మారితేనే భార్యాభర్తల వైవాహిక జీవితం బాగుంటుంది.                           *రూపశ్రీ.  
  పండుగ అంటే అదొక  ఆనందం.  చదువులు, వృత్తి, ఉద్యోగం, సౌకర్యాలు.. ఇలా కారణాలు ఏవైనా సరే..  పట్టణంలో ఉన్నవారు పండుగ వచ్చిందంటే చాలు పల్లె బాట పడతారు. తెలుగు వారు ఎంతో సంబరంగా చేసుకునే పండుగలలో సంక్రాంతికి ఓ రేంజ్ ఉంది.  భోగి, సంక్రాంతి, కనుమ.. పేరిట ముచ్చటగా మూడురోజులు జరిగే ఈ పండుగ వైభోగం గ్రామాలలో మాత్రమే కనిపిస్తుంది. భోగి మంటలు, భోగి పళ్లు..  పొంగళ్లు, పిండి వంటలు.. పశువుల అలంకరణ,  కోడి పందేలు.. కొత్త అల్లుళ్లకు చేసే మర్యాదలు.. ప్రేమ, అభిమానం, ఆప్యాయత.. ఒక్కటనేమిటి? సంక్రాంతి పండుగలో లేనిదంటూ ఏదీ లేదు.. భోగి మంటలు, భోగి పళ్లు.. జనవరి 13వ తేదీన భోగి పండుగ.  ఈరోజు ఉదయాన్నే చలికి సవాల్ విసురుతూ ఉదయాన్నే లేచి భోగి మంటలు వేయడం చాలా చోట్ల కనిపిస్తుంది. ఇంట్లో ఉన్న పాత సామాను నుండి పిడకల హారం వరకు భోగి మంటలలో వేస్తారు.   ఇక ఇదే రోజు సాయంత్రం చిన్న పిల్లలకు భోగి పళ్లు పోస్తారు. ఈ భోగి పళ్లలో చెరకు ముక్కలు,  రేగు పళ్లు,  చిల్లర పైసలు, పువ్వులు ఉంటాయి.  ఇలా భోగి పళ్లు పోయడం వెనుక పురాణ కథనం ఉంది.  భోగి పండుగ రోజే బదరీ వనంలో  శ్రీహరిని పసిబిడ్డగా మార్చి దేవతలందరూ రేగుపళ్లు పోశారట.  బదరీ పళ్లనే రేగు పళ్లు అంటారు.  అందుకే కాల క్రమేణా భోగి రోజు చిన్న పిల్లలకు భోగి పళ్లు పోయడం ఆచారం అయ్యింది.  పిల్లలకు భోగి పళ్లు పోస్తే ఆ శ్రీహరి ఆశీస్సులు ఉంటాయని, పిల్లలు ఆరోగ్యంగా ఉంటారని చెబుతారు. పొంగల్.. సంక్రాంతి.. మూడు రోజులు జరిగే సంక్రాంతి పండుగలో రెండవ రోజు ప్రధాన పండుగ అయిన సంక్రాంతి జరుపుకుంటారు. సంక్రాంతి పండుగను పొంగళ్ల పండుగ అంటారు. ఈ రోజు సూర్యుడి గమనం మారుతుంది.  సూర్యుడు ఉత్తరాయణంలోకి ప్రవేశిస్తాడు. అది కూడా మకర రాశిలోకి ప్రవేశిచడం వల్ల దీనికి మకర సంక్రాంతి అని పేరు వచ్చింది. సంక్రాంతి రోజు పొంగళ్లు వండి నైవేద్యం పెడతారు. చాలా చోట్ల రథం ముగ్గులు వేసి సూర్యుడికి స్వాగతం చెబుతారు.  ఈ రోజు చేసే దాన ధర్మాలకు చాలా ప్రాముఖ్యత ఉంది.  కొత్తగా పెళ్లైన వారు ఈ పండుగను అత్తారింట్లో చేసుకోవడం, సావిత్రి గౌరీ వ్రతం చేసుకోవడం జరుగుతుంది. కనువిందు చేసే కనుమ.. సంక్రాంతి పండుగ ముఖ్యంగా రైతన్నల పండుగ. ఈ రోజు  రైతులు తమకు పంటలు పండించడంలో సహాయపడే పశువులకు కృతజ్ఞతలు చెప్పుకుంటారు. పశువులను చాలా మంది తమ కుటుంబంలో భాగంగా చూస్తారు.  పశువులకు స్నానం చేయించి అందంగా అలంకరిస్తారు. పశువులకు విశ్రాంతిని ఇస్తారు.  కొత్త పంట చేతికి వచ్చిన ఆనందంలో  సంబరాలు చేసుకుంటారు.  కోనసీమ ప్రాంతాలలో కోడి పందెల సందడి సాగుతుంది.  కోట్ల రూపాయల డబ్బులు చేతులు మారతాయి. కోడి పుంజుల పౌరుషాలు, వాటిలో పోరాట పటిమ ముక్కున వేలేసుకునేలా చేస్తాయి.  సంక్రాంతి పండుగంటే పల్లెలదే.. పండుగ ఆస్వాదించాలంటే పల్లెకు పోవాల్సిందే..!                           *రూపశ్రీ.
ప్రతి ఒక్కరికి తమ జీవితం బాగుండాలని కోరిక ఉంటుంది. ఇందుకోసం ఏదేదో చేయాలని కూడా ఆనుకుంటారు. కానీ తమ జీవితం బాగుండక పోవడానికి ఎన్నో పరిస్థితులు,  తమ చుట్టూ ఉన్న వ్యక్తులు కారణం అని అనుకుంటూ ఉంటారు.  జీవితంలో ఎవరికి వారు బాగుండాలంటే దానికి కావాల్సింది తమ చుట్టూ ఉన్న వ్యక్తులు మారడం లేదా వారు  అర్థం చేసుకోవడం కాదు.  ప్రతి వ్యక్తి తాము మారితేనే తమ జీవితం బాగుంటుందని అంటున్నారు లైప్ స్టైల్ నిపుణులు. కొత్త సంవత్సరంలో చాలామంది కొన్ని లక్ష్యాలు పెట్టుకుంటూ ఉంటారు. కొన్ని నిర్ణయాలు కూడా తీసుకుంటూ ఉంటారు.  అయితే దానికోసం మొదటగా ప్రతి ఒక్కరు తనకు తాను మారాలి అనే సంకల్పం చేసుకుంటే అదే గొప్ప మలుపు అవుతుంది.  ఇది ఎందుకు మేలు చేస్తుంది? దీని కోసం ఏం చేయాలి? అనే విషయం తెలుసుకుంటే.. అహంకారం.. దూరం..  కుటుంబం అయినా, స్నేహం అయినా లేదా ఆఫీసు  అయినా మనిషిలో ఉండే  అహం సంబంధాలలో చీలికకు అతిపెద్ద కారణం అవుతుంది. చాలా సార్లు అవతలి వ్యక్తి సరైన విషయం చెబుతున్నా  అది  వినే వారి  అహాన్ని దెబ్బతీస్తుంది.  అందుకే అది నిజమైనా,  అది మంచి విషయం అయినా దాన్ని అస్సలు అంగీకరించరు.  ఈ చిన్న ఇగో కాస్తా క్రమంగా విభేదాలకు,  దూరానికి కారణమవుతుంది. కొంతమంది ఎప్పుడూ తాము ఇతరులకన్నా గొప్పవారిగా భావిస్తారు.   వారి మాటలే ఫైనల్ అంటుంటారు. అలాంటి మనస్తత్వం రిలేషన్స్ లో  చేదు అనుభవాలను తెస్తుంది. బంధాలు కొనసాగాలి అంటే అహాన్ని పక్కన పెట్టడం,  అవతలి వ్యక్తి స్థానాన్ని అర్థం చేసుకోవడం, చిన్న విషయాలను విస్మరించడం చాలా ముఖ్యం.  ఈ చిన్న మార్పు పెద్ద వివాదాలను నిరోధించగలుగుతుంది. ఇతరులను మార్చకండి.. రిలేషన్స్ లో అయినా ఇతర విషయాలలో అయినా చాలా మంది తమ సమయాన్ని, శక్తిని ఎదుటి వ్యక్తిని తమకు అనుగుణంగా మార్చుకోవడానికి ప్రయత్నిస్తూ గడుపుతారు. కానీ నిజం ఏమిటంటే ఇతరుల  స్వభావాన్ని మార్చడం దాదాపు అసాధ్యం. మనం ఇతరులను మార్చడానికి ఎంత ఎక్కువగా ప్రయత్నిస్తామో, అంతగా నిరాశ చెందుతాము. ప్రతి పరిస్థితిలోనూ ప్రశాంతంగా  ఉండేవారు సమస్యలకు సులభంగా పరిష్కారాలను కనుగొంటారు. చాలా పాజిటివ్ గా,  సంతోషంగా ఉన్న వ్యక్తులు ఒత్తిడి, నిరాశ, అధిక రక్తపోటు,  ఆందోళన వంటి సమస్యలను రాకుండా చూసుకోగలుగుతారు.  అందుకే ఇతరులను మార్చడం కంటే మనలో మార్పు కోసం కృషి చేయడం తెలివైన పని. పాజిటివ్ గా ఉండాలి.. ఏ సంబంధం కూడా పూర్తిగా మన నియంత్రణలో ఉండదు. మనం ఇతరుల కోణం నుండి  విషయాలను అర్థం చేసుకోకపోతే చాలా వరకు ప్రతికూల పరిస్థితులే ఎదురవుతూ ఉంటాయి.  అంచనాలు ఉన్నప్పుడు ఇతరులలో  తప్పులను వెతకుతుంటాము. ఇది  అసంతృప్తికి గురిచేయడమే కాకుండా మన చుట్టూ ఉన్నవారిని కూడా ఇబ్బంది పెడుతుంది. పరిస్థితులకు అనుగుణంగా సర్దుబాటు చేసుకోవడం మంచిది. ఎప్పుడైతే మన ఆలోచన మారుతుందో.. అప్పుడు పరిస్థితులు కూడా పాజిటివ్ గా కనిపిస్తాయి.  మనస్సు కూడా సంతోషంగా ఉంటుంది. సానుకూల ఆలోచన ఉన్న వ్యక్తులు శారీరకంగా,  మానసికంగా ఆరోగ్యంగా ఉంటారని అనేక అధ్యయనాలు రుజువు చేస్తున్నాయి. ఆత్మ పరిశీలన.. ఎవ్వరూ పర్ఫెక్ట్ కాదు.. అలాగే ఎవరూ అన్ని విషయాలలో కరెక్ట్ గా ఉండరు. మన బలహీనతలు, తప్పులు,  తెలియకుండానే ఇతరులను ఇబ్బంది పెట్టే పరిస్థితులు ఉంటాయి. అయితే అలాంటి వాటిని గుర్తించడం చాలా ముఖ్యం.  మొదట మనల్ని మనం నిజాయితీగా అర్థం చేసుకోవడం,  మన లోపాలను అంగీకరించడం చాలా అవసరం. మన మనస్సును,  తెలివితేటలు సమతుల్యంగా ఉన్నప్పుడు మాత్రమే మనం సరైన నిర్ణయాలు తీసుకోగలం. మనం మన ఆలోచనలను సానుకూలంగా ఉంచుకుంటే మన తప్పులను అంగీకరించడం సులభం అవుతుంది. ఎవరికి వారు మారితే  ఒత్తిడిని తగ్గిస్తుంది, ప్రతికూలతను దూరంగా ఉంచుతుంది.  జీవితాన్ని మరింత సమతుల్యంగా చేస్తుంది. మంచి ఆరోగ్యం, సంతోషకరమైన మనస్సు,   సంబంధాల మధ్య సామరస్యం, మనలో సానుకూల మార్పులు చేసుకోవడం..  ఇవన్నీ  సంతోషకరమైన జీవితానికి మొదటి అడుగు అవుతాయి.   కాబట్టి జీవితం బాగుండాలంటే.. ఎవరి జీవితం వారికి బాగుండాలంటే పైన చెప్పుకున్న మార్పులు వచ్చే విధంగా కొత్త ఏడాదిలో ఒక లక్ష్యం పెట్టుకుని వాటికి అనుగుణంగా మారాలి. అప్పుడే సంతోషంగా ఉండగలుగుతారు.                             *రూపశ్రీ.
భారతీయుల ఆహారంలో నువ్వులు,  పల్లీలు, బెల్లం చాలా ప్రముఖమైనవి.  ఇవి లేని బారతీయ ఆహారాన్ని అస్సలు ఊహించలేరు కూడా.  అయితే నువ్వులు, పల్లీలు,బెల్లాన్ని సూపర్ ఫుడ్స్ అని కూడా అంటారు.  పోషకాహార నిపుణులు ఈ ఆహారాలను తప్పనిసరిగా తీసుకోమని తమ పేషెంట్లకు సిఫారసు చేస్తారు కూడా. ప్రాంతాలను బట్టి వీటిని విభిన్న రకాలుగా ఆహారం తయారీలో వాడుతుంటారు. సాంప్రదాయ వంటకాలు ఇవి లేకుండా అసంపూర్ణంగా ఉంటాయి.  అయితే వీటిని సూపర్ ఫుడ్స్ అని ఎందుకు పిలుస్తారు? ఇలా పిలవడం వెనుక ఉన్న కారణం ఏంటి? తెలుసుకుంటే.. నువ్వులు,  వేరుశెనగల్లో ప్రోటీన్, విటమిన్లు,  ఒమేగా 6 వంటి పోషకాలు ఉంటాయి.ఇక బెల్లం ఐరన్, మెగ్నీషియం,  కాల్షియం వంటి ముఖ్యమైన ఖనిజాలను కలిగి ఉంటుంది. ఈ మూడు సూపర్‌ఫుడ్‌లు వేడెక్కించే ప్రభావాన్ని కలిగి ఉంటాయి. అందుకే వీటిని శీతాకాలపు సూపర్‌ఫుడ్‌లు అని కూడా పిలుస్తారు. వాటి పోషక విలువలు వాటిని మరింత ప్రత్యేకంగా చేస్తాయి. బెల్లంలో పోషక విలువలు.. బెల్లంలో సుక్రోజ్,  ఫ్రక్టోజ్ రూపంలో చక్కెరలు ఉంటాయి. అందువల్ల ఇది తీపి రుచిని కలిగి ఉంటుంది, తక్షణ శక్తిని అందిస్తుంది. బెల్లంలో ముఖ్యమైన విటమిన్లు A, C,  E ఉంటాయి. ఇందులో ఐరన్ తో  సహా అనేక ముఖ్యమైన ఖనిజాలు కూడా ఉన్నాయి. బెల్లం తింటే కలిగే ప్రయోజనాలు.. జీర్ణవ్యవస్థ ఆరోగ్యం మెరుగుపడుతుంది, కాలేయం,  రక్తం శుద్ది జరుగుతుంది. శ్వాసకోశ ఇన్ఫెక్షన్లు తొలగిపోతాయి. మలబద్ధకం సమస్య తగ్గుతుంది.  మానసిక, శారీరక ఒత్తిడి తగ్గుతుంది. ప్రీమెన్స్ట్రువల్ సిండ్రోమ్ నుండి ఉపశమనం కలిగిస్తుంది. రక్తహీనత ప్రమాదం తగ్గుతుంది.  చర్మ ఆరోగ్యం మెరుగుపడుతుంది. గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది.  శరీరానికి మంచి ఎనర్జీ లభిస్తుంది. నువ్వుల పోషక విలువలు.. నువ్వులలో కాల్షియం, మెగ్నీషియం, ఐరన్,  పొటాషియం వంటి ఖనిజాలు సమృద్ధిగా ఉంటాయి. వాటిలో విటమిన్ B6 కూడా ఉంటుంది. నువ్వులు తింటే కలిగే ప్రయోజనాలు.. ఎముకలు దృఢంగా మారుతాయి, వాపు తగ్గుతుంది.  ఆర్థరైటిస్ నొప్పి నుండి ఉపశమనం కలిగిస్తుంది. జీర్ణ ఆరోగ్యం బాగుంటుంది.  మెనోపాజ్ సమయంలో హార్మోన్లను బాలెన్స్డ్ గా ఉంచడంలో సహాయపడుతుంది. థైరాయిడ్ ఆరోగ్యానికి మేలు చేస్తుంది. రక్తహీనత ప్రమాదం తగ్గుతుంది,  రక్తపోటు అదుపులో ఉంటుంది.  రక్తంలో చక్కెర స్థాయిలు  నియంత్రణలో ఉంటాయి.  కొలెస్ట్రాల్,  ట్రైగ్లిజరైడ్ స్థాయిలు తగ్గుతాయి. వేరుశనగ పోషక విలువలు.. వేరుశెనగల్లో ప్రోటీన్,  కొవ్వుతో సహా అనేక ఆరోగ్యకరమైన పోషకాలు ఉంటాయి. వాటిలో అనేక ముఖ్యమైన విటమిన్లు,  ఖనిజాలు కూడా ఉంటాయి. వేరుశనగ తినడం వల్ల కలిగే ప్రయోజనాలు.. బరువు తగ్గడానికి సహాయపడుతుంది. వాపు తగ్గుతుంది. డయాబెటిస్ వచ్చే ప్రమాదం తగ్గుతుంది.  క్యాన్సర్ ప్రమాదం తగ్గుతుంది,  కొలెస్ట్రాల్ స్థాయి తగ్గుతుంది. గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది,  పిత్తాశయంలో రాళ్ల ప్రమాదం తగ్గుతుంది. వేరుశనగ రెగ్యులర్ గా తింటే  జీవితకాలం పెరుగుతుంది.  మెదడు పనితీరు మెరుగుపడుతుంది.  కంటి ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఈ కారణాల వల్లనే ఈ మూడు ఆహారాలను సూపర్ ఫుడ్స్ అని అంటారు. మరీ ముఖ్యంగా శీతాకాలం సూపర్ ఫుడ్స్ అని అంటారు.      *రూపశ్రీ.     గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...                          
ఏ జబ్బు వచ్చినా దాన్ని నయం చేయడానికి మందులు చాలా అవసరం. మందులను సరైన సమయంలో తీసుకోవాలి.  అలాగే వైద్యుల సలహా లేకుండా మందులు వాడటం అస్సలు మంచిది కాదు.  అయితే  కొన్ని మందులను డాక్టర్ల సలహా లేకుండా ఎలాంటి సంకోచం లేకుండా ఎక్కువ కాలం పాటు సమస్య అనిపించినప్పుడల్లా వాడుతూనే ఉంటారు. మరీ ముఖ్యంగా ఎక్కువకాలం పాటు మధుమేహం,  గ్యాస్ సమస్యలకు మందులు వాడుతూనే ఉంటారు. ఈ మందుల వాడకం వల్ల విటమిన్ లోపాలు వస్తాయని వైద్యులు చెబుతున్నారు. అందులోనూ విటమిన్-బి12 చాలా అరుదుగా లభించే విటమిన్.  ఈ విటమిన్-12 విటమిన్ డయాబెటిస్,  అసిడిటి మందుల వాడకం వల్ల తగ్గుతుందని వైద్యులు చెబుతున్నారు. దీని గురించి వివరంగా తెలుసుకుంటే.. డాక్టర్ దగ్గరకు వెళ్లి వైద్యుల వద్ద రెగ్యులర్ గా చెకప్ చేయించుకునే అలవాటు భారతదేశంలో చాలా తక్కువ. మరీ ముఖ్యంగా గ్యాస్ సంబంధిత సమస్యలు,  డయాబెటిస్ వంటి   సమస్యలకు ఎక్కువ సార్లు వైద్యులను కలవాల్సిన అవసరం లేదని అనుకుంటారు.  ఈ సమస్యలు ఉన్నప్పుడు ఒకసారి వైద్యులను కలిస్తే వారు రాసిచ్చిన మందులను అలా జీవితాంతం అయినా మింగుతూ సమస్యను నిద్రపుచ్చే ఆలోచనలో ఉంటారు. కానీ చాలామందికి తెలియని విషయం ఏమిటంటే.. ఈ మందులను డాక్టర్ ను కలిసిన ప్రతి సారి డోస్ తగ్గించడం, ఎక్కించడం జరుగుతుంది.  ఇది తెలియకుండా ఒకే డోస్ ను దీర్ఘకాలం వాడటం విటమిన్ స్థాయిల మీద ప్రమాదం చూపిస్తుంది.  గ్యాస్, డయాబెటిస్ కు సంబంధించిన మందులను సంవత్సరాల తరబడి డాక్టర్ సలహా లేకుండా రెగ్యులర్ గా వాడుతూ ఉంటే అది శరీరంలో విటమిన్-బి12 లోపానికి కారణం అవుతుందని వైద్యులు చెబుతున్నారు. లక్షణాలు ఇవే.. అలసట,  తలతిరుగుడు,  తిమ్మిరి, చేతులు కాళ్లలో జలదరింపు వంటి సమస్యలు విటమిన్-బి12 లోపిస్తే వస్తాయి. మెట్లు ఎక్కడం కష్టంగా అనిపించడం,  మతిమరుపు వంటి సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. విటమిన్-బి12 ఎంత ఉండాలి.. నేషనవ్ ఇన్స్టిట్యూట్ ఆప్ హెల్త్ ప్రకారం సీరం,  ప్లాస్మా లో విటమిన్-బి12 స్థాయిలు 200 లేదా 250pg/ml కంటే తక్కువగా ఉంటే ల్యాబ్ రిపోర్ట్ లలో అది చాలా తక్కువగా ఉన్నట్టు.  ఇది విటమిన్-బి12 లోపాన్ని సూచిస్తుంది. గ్యాస్, డయాబెటిస్ మందులను ఎక్కవ కాలం వాడటం వల్ల పేగులలో  విటమిన్-12 శోషణ దెబ్బతింటుంది. అలాగే కడుపు ఆమ్లాన్ని కూడా తగ్గిస్తుంది. దీని వల్ల   ఆహారం నుండి ప్రోటీన్ విడుదల జరగదు.  అందుకే గ్యాస్, డయాబెటిస్ మందులను ఎక్కువ కాలం డాక్టర్ సలహా లేకుండా వాడటం మంచిది కాదని అంటున్నారు.                             *రూపశ్రీ. గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...
  ఈ రోజుల్లో చెడు జీవనశైలి,  తప్పుడు ఆహారపు అలవాట్లు  గుండె ఆరోగ్యంపై  చాలా చెడ్డ  ప్రభావాన్ని చూపుతాయి. అంతేకాకుండా మన చిన్న చిన్న రోజువారీ అలవాట్లు గుండెకు హాని కలిగిస్తాయి.  ఇవి క్రమంగా  గుండె జబ్బుల ప్రమాదాన్ని పెంచుతాయి. దీనితో పాటు నేటికాలంలో అన్ని సమస్యలకు మందులు వాడటం,  ఖరీదైన చికిత్సలు తీసుకోవడం  కూడా కొన్నిసార్లు  శరీరానికి హాని కలిగిస్తాయి.  అధిక వ్యాయామం కూడా గుండెపై చెడు ప్రభావాన్ని చూపుతుంది.  ఇలా నేటి కాలంలో చాలా కారణాలుగా గుండె జబ్బుల ప్రమాదం క్రమేపీ పెరుగుతోంది.  గుండె ఆరోగ్యాన్ని సంరక్షించుకోవాలంటే.. కొన్ని సులభమైన,  ఆరోగ్యకరమైన పద్ధతులను పాటించడం చాలా ముఖ్యం. ఇది శరీరానికి ఎటువంటి హాని లేకుండా  చేస్తుంది. అటువంటి 5 సులభమైన అలవాట్ల గురించి తెలుసుకుంటే.. భోజనం తర్వాత నడక.. భోజనం తర్వాత 10 నిమిషాల నడక చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. కాబట్టి భోజనం చేసిన వెంటనే కూర్చునే అలవాటును మార్చుకోవాలి.  ప్రతి భోజనం తర్వాత 10 నిమిషాల తేలికపాటి నడక చేయాలి. ఇది రక్తంలో చక్కెరను నియంత్రిస్తుంది. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది,  బరువు పెరగకుండా నిరోధిస్తుంది. ఒమేగా-3 ఫ్యాట్స్.. రోజువారీ ఆహారంలో ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు ఉండేలా చూసుకోవాలి. ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు గుండె,  మానసిక ఆరోగ్యానికి చాలా ముఖ్యమైనవి. ఇది గుండె, మెదడు,  వాపును నియంత్రించడంలో సహాయపడుతుంది. సాల్మన్, చేపలు, అవిసె గింజలు,  వాల్‌నట్‌ల వంటి వాటి నుండి  ఒమేగా-3ని పుష్కలంగా పొందవచ్చు. నిద్ర.. మంచి గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ప్రతిరోజూ 7-9 గంటలు మంచి నిద్ర పొందడం ముఖ్యం. ఈ రోజుల్లో చాలా మందికి రాత్రిపూట ఫోన్ వాడటం,  టీవీ చూడటం అలవాటు కారణంగా నిద్ర సైకిల్ దారుణంగా దెబ్బతింటోంది. తక్కువ నిద్రపోవడం వల్ల ఊబకాయం, వ్యాధులు,  అలసట వంటి సమస్యలు వస్తాయి. ప్లాస్టిక్ నిషేధం.. మంచి గుండె ఆరోగ్యానికి ప్లాస్టిక్ వస్తువులను నివారించడం,  గాజు లేదా స్టీల్ కంటైనర్లు ఉపయోగించడం ముఖ్యం. ప్లాస్టిక్‌లో ప్రమాదకరమైన రసాయనాలు ఉంటాయి.  ఇవి హార్మోన్లకు,  శరీరానికి హాని కలిగిస్తాయి. ప్లాస్టిక్ రసాయనాలు నెమ్మదిగా శరీరంలో విషాన్ని వ్యాపింపజేస్తాయి. ఇది క్యాన్సర్,  ఇతర వ్యాధులకు కారణమవుతుంది. అందువల్ల ఆహారాన్ని నిల్వ చేయడానికి గాజు లేదా స్టీల్  పాత్రలు మంచివి. ఇవి  గుండె ఆరోగ్యానికి అలాగే మొత్తం ఆరోగ్యానికి సురక్షితమైనవి. బరువు.. మంచి గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి  బరువు,  BMI ని చూస్తే సరిపోదు. రక్త పరీక్షలపై కూడా శ్రద్ధ వహించాలి.  బరువు లేదా BMI కంటే రక్త పరీక్ష చేయించుకోవడం చాలా ముఖ్యం. LDL, CRP,  ఫాస్టింగ్ ఇన్సులిన్ వంటి పరీక్షలు చేయించుకుంటూ ఉండాలి. తద్వారా గుండె ఆరోగ్యాన్ని పర్యవేక్షించవచ్చు. గుండె జబ్బులను నివారించడానికి ఇది ఉత్తమ మార్గం. క్రమం తప్పకుండా పరీక్షలు చేయించుకోవడం వల్ల సమస్యలను ముందుగానే గుర్తించవచ్చు. ఆహారం.. గుండె ఆరోగ్యాన్ని బాగా ఉంచుకోవాలంటే  ఆహారంలో పండ్లు,  ఆకుపచ్చ కూరగాయలను చేర్చుకోవాలి. వాటిలో  గుండెను బలంగా,  ఆరోగ్యంగా ఉంచే పోషకాలు ఉంటాయి.  వాటిని సరిగ్గా తినకపోతే, అది గుండెకు హాని కలిగిస్తుంది. ఈ రోజుల్లో, చాలా మంది ఏదో ఒక విషయం గురించి ఒత్తిడి తీసుకోవడం చాలా సహజం అయిపోయింది. ఇది గుండెపై కూడా చెడు ప్రభావాన్ని చూపుతుంది. అందుకే ఒత్తిడి లేకుండా చూసుకోవాలి.                                        *రూపశ్రీ. గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు..