LATEST NEWS
  పార్టీ స్థాపించి దశాబ్ధం గడిచినా జనసేనకు బలమైన పునాదులు కనిపించడం లేదు. కేవలం డిప్యూటీ సీఎం పవన్ చరిష్మాతోనే పార్టీ నడుస్తోంది తప్ప.. సంస్థాగతంగా పార్టీ నిర్మాణం కాలేదు. ఓ సారి అధికారంలోకి వచ్చి ఆర్థికంగా కుదుటపడితే, తర్వాత పార్టీ రూట్స్ స్ట్రాంగ్ చేసేలా చర్యలు చేపడతారని జనసేనలోని చాలా మంది భావించారు. అయితే..డిప్యూటీ సీఎం అయిన తర్వాత పవన్‌కళ్యాణ్ పూర్తిగా పాలనపైన దృష్టి పెట్టారని.. పార్టీ నిర్మాణాన్ని పక్కన పడేశారని జనసైనికుల్లో ఒకింత అసహనం కనిపిస్తోంది. రాజకీయ విశ్లేషకుల విమర్శ కూడా అదే. కానీ పార్టీ పటిష్టత దిశగా పవన్ అడుగులు చూస్తే వ్యూహాత్మకంగానే కనిపిస్తున్నాయి.  జనసేనాని పవన్ కళ్యాణ్ తన సోదరుడు, పార్టీ ఎమ్మెల్సీ నాగబాబు ద్వారా ఉత్తరాంధ్రలో పార్టీని బలోపేతం చేయాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. అందుకే నాగబాబు తరచూ ఉత్తరాంధ్రలో అందులోనూ శ్రీకాకుళంలో పర్యటిస్తూ పార్టీ నేతలతో భేటీ అవుతున్నారంట. తరచూ సిక్కోలు టూర్స్ పై ఓ ఆసక్తికర ప్రచారం కూడా నడుస్తోంది. ఉత్తరాంధ్రలో తూర్పు కాపుల ప్రభావం చాలా ఎక్కువ. ఇక ఉమ్మడి శ్రీకాకుళంలో ఈ సామాజికవర్గం ఓటర్లే నిర్ణయాత్మకంగా ఉంటారు. అందుకే శ్రీకాకుళం నుంచే పవన్ తన వ్యూహాన్ని అమలు చేస్తున్నట్టు టాక్ నడుస్తోంది.  అక్కడ నుంచి ఉత్తరాంధ్ర మొత్తం పార్టీ రూట్స్ స్ట్రాంగ్ చేసుకోవాలని జనసేనాని స్కెచ్ గీస్తున్నారంట. వచ్చే ఎన్నికల్లో నాగబాబు శ్రీకాకుళం జిల్లాలోని ఎచ్చెర్ల అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారని కూడా పొలిటికల్ సర్కిల్స్ లో పుకార్లు షికారు చేస్తున్నాయి. అందుకే పార్టీ ఆవిర్బావ వేడుకలు కూడా నాగబాబు ఎచ్చర్లలోనే జరుపుకున్నారు. కాపు ప్రతినిధిగా నాగబాబుని పెట్టి ముందుకెళ్లాలన్నది జనసేనాని స్ట్రాటజీగా తెలుస్తోంది.  ప్రస్తుతానికి ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో బలమైన తూర్పుకాపు నేత కరువైయ్యారు. దానికి తోడు తూర్పు కాపులకు రాజకీయంగా జిల్లాలో అన్యాయం జరుగుతోందని అభిప్రాయం కూడా ఉంది. గతసారి వైసీపీ, ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో జిల్లా నుంచి తూర్పుకాపులకు చెప్పుకోదగ్గ పదవులు లేవు. సిక్కోలు పొలిటికల్ వార్ మొత్తం వెలమ వర్సెస్ కళింగ గానే నడుస్తోంది. దీంతో కాపులకు తాను కాపుకాస్తానని చెప్పడమే పవన్ వ్యూహంగా కనిపిస్తోంది. శ్రీకాకుళం మాత్రమే కాదు.. ఉత్తరాంధ్ర మొత్తం మీద వైసీపీలో బొత్స సత్యనారాయణ, టీడీపీలో కిమిడి కళావెంకట్రావు బలమైన తూర్పు కాపు నాయకులుగా ఉన్నారు. కిమిడికి దాదాపు మొన్నటి ఎన్నికలే చివరివి అంటున్నారు. ఇక బొత్సకి ఆరోగ్యం కూడా సహకరించడం లేదు కాబట్టి.. వచ్చే ఎన్నికల్లో ఆయన పోటీ చేస్తారనేది అనుమానమే. సో.. ఇప్పుడు టీడీపీ, వైసీపీలో కాపులను నడిపించే నాయకులు లేరు కాబట్టి.. జనసేన వారికి అండగా  ఉండేందుకు ప్రయత్నిస్తోందని పొలిటికల్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఆ క్రమంలో జనసేనాని అన్న కోసం ఎచ్చర్లను ఎంచుకోవడంలో కూడా ఓ తెలివైన వ్యూహం ఉన్నట్టు కనిపిస్తోంది. ఈ నియోజకవర్గంలో తూర్పుకాపులే ఎక్కువ. గడిచిన ఎన్నికల్లో ఇక్కడ బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచిన ఈశ్వర్ రావుది కమ్మ సామాజిక వర్గం. కేవలం టీడీపీ బలంతోనే ఆయన గెలిచారు. టీడీపీకి ప్రస్తుతం అక్కడ ఇంచార్జ్ కూడా లేకపోవడంతో క్యాడర్ తలోదారి అన్నట్టు ఉంది. స్థానిక బీజేపీ ఎమ్మెల్యేపై ప్రజల్లో సానుకూలత కూడా కనిపించడం లేదు. ఈ పరిస్థితిని వైసీపీ అయినా క్యాష్ చేసుకుంటుందా? అంటే ఆ పరిస్థితి కనిపించడం లేదు. వైసీపీ మాజీ ఎమ్మెల్యే, కాపు నేత గొర్లె కిరణ్ అసలు రాజకీయాల్లో ఉన్నారా? లేరా అన్నట్టు వ్యవహరిస్తున్నారు.  సో.. ఈ పొలిటికల్ స్పేస్ ని నింపడానికి జనసేన ప్రయత్నిస్తోందని రాజకీయ పండితులు చెబుతున్నారు. ఆలోచనలు అన్నీ బాగానే ఉంటాయి. దానికి తగ్గట్టుగా ఆచరణ ఉన్నప్పటికీ ఫలితం ఎలా ఉంటుందనేని చివరి వరకు సస్పెన్సే. మరి పవన్ వ్యూహాలు ఎంతవరకు ఫలిస్తాయో చూడాలి.
తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి పార్టీని వీడడం దాదాపు ఖాయమైపోయింది. దశాబ్దాలుగా తనకు కాంగ్రెస్ తో ఉన్న అనుబంధాన్ని తెంచేసుకునేందుకు జీవన్ రెడ్డి సిద్ధమయ్యారు. ఆయన రంజాన్ ప్రార్థనల్లో  బీఆర్ఎస్ నేతలతో కలిసి పాల్గొనడంతో అప్రమత్తమైన కాంగ్రెస్ ఆయనను బుజ్జగించే ప్రయత్నాలు చేసింది. అయితే ఆ బుజ్జగింపు ప్రయత్నాలు ఫలించలేదు. ఇంత వరకూ వచ్చిన తరువాత పార్టీలో కొనసాగితే.. తన గౌరవానికి భంగం అని జీవన్ రెడ్డి తనను బుజ్జగించడానికి వచ్చిన నేతలతో అన్నట్లు సమాచారం.  వాస్తవానికి  గత కొంతకాలంగా పార్టీ అంతర్గత పరిణామాలపై తీవ్ర అసంతృప్తిగా ఉన్నజీవన్ రెడ్డి..  బీఆర్ఎస్ గూటికి చేరనున్నారని రాజకీయ వర్గాల్లో బలంగా వినిపిస్తోంది. ముఖ్యంగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఇప్పటికే ఆయనతో సంప్రదింపులు జరిపారని, సముచిత గౌరవంతో పాటు భవిష్యత్తులో కీలక పదవిని కూడా ఆఫర్ చేసినట్లు వార్తలు వినవస్తున్నాయి. ఆయన బీఆర్ఎస్ లో చేరతానంటే భుజాల మీద మోసుకుని మరీ తీసుకువెడతానని బీఆర్ఎస్ నేత ఒకరు బాహాటంగానే చెప్పడం ఇక్కడ గమనార్హం.  జీవన్ రెడ్డి అసంతృప్తిని గమనించిన కాంగ్రెస్ అధిష్టానం రంగంలోకి దిగింది. ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ సైతం సీనియర్లను కాపాడుకోవడంలో రాష్ట్ర నాయకత్వం విఫలమవుతోందని అసహనం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో  ప్రభుత్వం తరపున మంత్రి శ్రీధర్ బాబు ఇతర నేతలు శనివారం (మార్చి 21)  జీవన్ రెడ్డితో సుదీర్ఘ చర్చలు జరిపారు. పార్టీ వీడవద్దనీ, ఏ సమస్యైనా అధిష్ఠానం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరిస్తామని నచ్చ చెప్పారు. అయితే జీవన్ రెడ్డి మాత్రం ఇసుమంతైనా మెత్తబడలేదు.   బీఆర్ఎస్ నుంచి గెలిచిన సంజయ్ కుమార్ కాంగ్రెస్‌కు మద్దతు తెలపడం, ఆయన వర్గానికే జగిత్యాల మున్సిపల్ చైర్మన్ పదవి దక్కడం వంటి పరిణామాలు జీవన్ రెడ్డి అసంతృప్తికి, ఆగ్రహానికి కారణంగా చెబుతున్నారు. అలాగే  అనర్హత వేటు విషయంలో స్పీకర్ నిర్ణయం సంజయ్ కుమార్ కు అనుకూలంగా ఉండటం,  ప్రభుత్వం కూడా  ఆయనకే ప్రాధాన్యత ఇస్తుండటం జీవన్ రెడ్డి ఇక కాంగ్రెస్ లో కొనసాగేది లేదన్న నిర్ణయానికి వచ్చేశారని చెబుతున్నారు.  అదలా ఉంటే జీవన్ రెడ్డి బీఆర్ఎస్ చేరికకు ముహూర్తం ఖరారైందని అంటున్నారు.  ఈ నెల 25వ తేదీన జీవన్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీలో చేరే అవకాశం ఉన్నట్లు ఆయన సన్నిహితవర్గాల సమాచారం. 
ఏ రాజకీయపార్టీ నుంచైనా అసెంబ్లీ ఎన్నికలలో పోటీ చేయాలంటే ఆ పార్టీ టికెట్ ఇవ్వాలి. అలా టికెట్ దక్కించుకోవాలంటే ఆ పార్టీలో పై స్థాయి నాయకుల ఆశీస్సులు, అలాగే సమాజిక సమీకరణాలూ కీలకం. అయితే తమిళనాడులో మాత్రం అధికార పార్టీ అందుకు భిన్నంగా రానున్న అసెంబ్లీ ఎన్నికలకు అభ్యర్థుల ఎంపిక విషయంలో వినూత్న పంధా అనుసరిస్తోంది.  త్వరలో రాష్ట్ర అసెంబ్లీకి అధికార డీఎంకే పార్టీ టికెట్ దక్కాలంటే వారు నేరుగా ముఖ్యమంత్రి స్టాలిన్ ఎదుట ఇంటర్వ్యూకు హాజరు కావాల్సిందే. ఇందు కోసం సదరు ఆశావహ అభ్యర్థులు నిర్ణీత రుసుము చెల్లించి అప్లికేషన్ పెట్టుకోవాల్సి ఉంటుంది. ఇలా అప్లికేషన్ పెట్టుకోవడానికి విభాగాల వారీగా రెండు రకాల ఫీజులను డీఎంకే నిర్ణయించింది. అదెలా అంటే రిజర్వుడు నియోజకవర్గాల నుంచి పార్టీ టికెట్ ఆశిస్తున్న అభ్యర్థులు 15వేల రూపాయలు, జనరల్ స్థానం నుంచి టికెట్ ఆశిస్తున్న వారు పాతిక వేల రూపాయలు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఇది నాన్ రిఫండబుల్. ఇలా ఫీజు చెల్లించి దరఖాస్తు చేసుకున్న వారికి నిర్దిష్ట తేదీ, నిర్దిష్ట సమయం కేటాయించి ఇంటర్వ్యూలకు పిలుస్తారు. ఈ ఇంటర్వ్యూకు అభ్యర్థులు తమ సొంత ఖర్చుతో రావాలి. ఇంతకీ ఈ ఇంటర్వ్యూ ఎందుకంటే.. సీఎం స్టాలిన్ స్వయంగా చేసే ఈ ఇంటర్వ్యూలో అభ్యర్థుల సమార్థ్యాన్ని, అతడికి రాజకీయాల పట్ల ఉన్న అవగాహనను, ప్రజాసేవ పట్ల ఉన్న తపనను పరిశీలిస్తారు. అలాగే సదరు క్యాండిడేట్ ఆర్థిక నేపథ్యం తదితర విషయాలను కూడా పరిశీలిస్తారు. ఈ ఇంటర్వ్యూ ఐదారు నిముషాల పాటు ఉంటుంది.   సిట్టింగ్ ఎమ్మెల్యేలతో పాటు కొత్తగా రాజకీయాల్లోకి రావాలనుకునే యువత, విద్యావంతులు కూడా ఈ ఇంటర్వ్యూల కోసం బారులు తీరుతున్నారు.   గతంలో దివంగత నేత కరుణానిధి కూడా అభ్యర్థుల ఎంపిక విషయంలో ఇదే పంథా అవలంబించేవారు. ఇప్పుడు సీఎం స్టాలిన్ కూడా తండ్రి బాటనే అనుసరిస్తున్నారు. ఇదే తరహాలో అభ్యర్థులను వడపోసేవారు. ఇప్పుడు స్టాలిన్ అదే సంప్రదాయాన్ని మరింత పక్కాగా అమలు చేస్తున్నారు. అర్హులైన, సమర్థులైన నాయకులను గుర్తించడమే  కాకుండా ఇంటర్వ్యూల కోసం వసూలు చేసే ఫీజు ద్వారా పార్టీకి నిధులు సమకూర్చుకోవడం కూడా జరుగుతుందని స్టాలిన్ ఈ పద్ధతిని ఎంచుకున్నారని డీఎంకే వర్గాలు చెబుతున్నాయి.   కాగా పొలిటికల్ సర్కిల్స్ లో మాత్రం డీఎంకే అనుసరిస్తున్న ఈ అభ్యర్థుల ఎంపికపై మిశ్రమ స్పందన కనిపిస్తోంది. అభ్యర్థులను సీఎం ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేయడం అన్న పద్ధతి పారదర్శకతకు నిదర్శనంగా కొందరు, ఫీజుల వసూలు అంటూ సొమ్ములు దండుకునే వ్యూహంగా మరి కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. మొత్తం మీద పార్టీ అభ్యర్థుల ఎంపిక కోసం స్వయంగా ముఖ్యమంత్రి స్టాలినే ఇంటర్వ్యూ చేయడం తమిళనాట హాట్ టాపిక్ గా మారింది.  
  తెలుగువన్ ‘వాస్తవ వేదిక’ తాజా సంచికలో ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపై ఉత్కంఠభరిత చర్చ జరిగింది. తెలుగువన్ ఎండీ కంఠంనేని రవిశంకర్ సారథ్యంలో జరిగిన ఈ చర్చలో ‘జమీన్ రైతు’ సంపాదకుడు డోలేంద్ర ప్రసాద్ పాల్గొని పలు కీలక అంశాలపై తమ అభిప్రాయాలను స్పష్టంగా వెల్లడించారు. వివేకానంద రెడ్డి హత్య కేసు విషయానికి వస్తే, వైఎస్ సునీతకు న్యాయం జరగలేదని డోలేంద్ర ప్రసాద్ అభిప్రాయపడ్డారు. ఈ కేసులో సీబీఐ వ్యవహార శైలి పట్ల కూడా అనుమానాలు వ్యక్తం చేస్తూ, భారత చరిత్రలోనే ఒక వ్యక్తిని అరెస్ట్ చేయడంలో సీబీఐ వెనుకడుగు వేసిందా? అని రవిశంకర్ ప్రశ్నించారు. ఈ హత్య కేసు ఆధారంగా సినిమా తీస్తే అది ‘బాహుబలి’కంటే పెద్ద హిట్ అవుతుందేమోనని రవిశంకర్ వ్యాఖ్యానించగా, దానికి స్పందించిన డోలేంద్ర ప్రసాద్—ఇది రాజమౌళి కాదు, రామ్ గోపాల్ వర్మ తీసే కథ అని వ్యాఖ్యానించారు. “హూ కిల్డ్ బాబాయ్?” అనే ప్రశ్నకు ఇంకా సమాధానం దొరకలేదని, చివరికి కేసు మూసివేసే ప్రయత్నాలు జరిగాయని విమర్శించారు. జగన్ మీడియా, ఎంపీ అవినాశ్ రెడ్డి, వివేక వివాహేతర సంబంధాల కోణంలో హత్యను మళ్లించే ప్రయత్నం చేసిందని డోలేంద్ర ప్రసాద్ ఆరోపించారు. ఈ కేసును సీఎం చంద్రబాబు సక్రమంగా హ్యాండిల్ చేయలేదని, తనపైకి వస్తుందనే భయంతో వెనుకడుగు వేశారని కూడా విమర్శించారు. సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వర్లరావు వద్ద కీలక ఆధారాలు ఉన్నప్పటికీ వాటిని పరిగణలోకి తీసుకోలేదని, అప్పటి కడప ఎస్పీ నిజాయితీగా విచారణ చేస్తుండగా ఆయనను బదిలీ చేశారని తెలిపారు. ఇక రాష్ట్ర రాజకీయాలపై మాట్లాడుతూ—తమిళనాడులో ఎవరైనా అధికారంలో ఉన్నా కేంద్ర నిధుల కోసం ఐక్యంగా పోరాడతారని, కానీ ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం పరిస్థితి భిన్నంగా ఉందని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం పరిశ్రమలను తీసుకురావడానికి ప్రయత్నిస్తుంటే, జగన్ కోర్టుల్లో కేసులు వేసి అడ్డుకుంటున్నారని ఆరోపించారు. ప్రభుత్వానికి మంచి పేరు రాకూడదనే స్వార్థంతోనే జగన్ వ్యవహరిస్తున్నారని డోలేంద్ర ప్రసాద్ వ్యాఖ్యానించారు. మరోవైపు, వచ్చే రెండున్నర సంవత్సరాల్లో అమరావతి నిర్మాణం పూర్తికాకపోతే చంద్రబాబు చరిత్రలో నిలబడలేరని హెచ్చరించారు. అమరావతి నిర్మాణం జరగకపోతే రైతుల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురవుతుందని కూడా తెలిపారు. రాజధాని అమరావతి నిర్మాణంలో మంత్రి పీ. నారాయణ విఫలమయ్యారని విమర్శించిన డోలేంద్ర ప్రసాద్, ఇప్పటికైనా తన సూచనలు తీసుకుని వేగంగా పనులు పూర్తి చేయాలని సూచించారు. ఇదే విషయాన్ని రవిశంకర్ కూడా ప్రస్తావిస్తూ—రైతులకు న్యాయం చేయాలంటే అమరావతి నిర్మాణాన్ని వేగవంతం చేయాలని కోరారు.ఇలాంటి పలు ఆసక్తికర రాజకీయ అంశాలపై కంఠంనేని రవిశంకర్, డోలేంద్ర ప్రసాద్‌ల మధ్య జరిగిన పూర్తి స్థాయి చర్చను తెలుగువన్ యూట్యూబ్ ఛానల్‌లో వీక్షించవచ్చు.  
ఆంధ్రప్రదేశ్ లో అధికారంలో ఉన్న తెలుగుదేశం కూటమి ప్రభుత్వంలో  సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేష్ అత్యంత కీలకం అనడంలో సందేహం లేదు.  ఈ ముగ్గురి మధ్య బంధం, అనుబంధం ఎంత బలంగా ఉందో.. రాజకీయాలలోనూ, వ్యక్తిగత విషయాలలోనూ, నిబంధనలను తు.చ. తప్పకుండా అమలు చేయడంలోనూ, నైతిక వర్తనలోనూ ముగ్గురూ ముగ్గురే అన్నట్లుగా ఉంటారు. వీరి రుజువర్తనకూ, హాస్య చతురతకు నిలువెత్తు నిదర్శనంగా నిలిచిన అరుదైన సంఘటన ఇటీవల దివ్యాంగ శక్తి పథకం ప్రారంభోత్సవం సందర్భంగా జరిగింది. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవ్వడమే కాకుండా ఈ ముగ్గురిపై నెటిజనుల ప్రశంసల పూల జల్లు కురవడానికి కారణమైంది. ఇంతకీ విషయం ఏమిటంటే.. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్,  మంత్రి నారా లోకేష్ కలిసి ఇటీవల ఒకే ఆర్టీసీ బస్సులో ప్రయాణించారు. అదెప్పుడంటే.. రాష్ట్రవ్యాప్తంగా దివ్యాంగులకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని కల్పించే 'దివ్యాంగ శక్తి' పథకం ప్రారంభోత్సవం సందర్భంగా. ఈ ముగ్గురూ కలిసి దివ్యాంగ శక్తి పథకం లబ్ధి దారులతో కలిసి ఆర్టీసీ బస్సులో ప్రయాణించారు.   మంగళగిరిలో ఏర్పాటు చేసిన  కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పచ్చ జెండా ఊపి దివ్యాంగ శక్తి పథకాన్ని ప్రారంభించిన సంగతి తెలిసిందే. అనంతరం చంద్రబాబు  పవన్ కళ్యాణ్, నారా లోకేష్ లతో కలిసి దివ్యాంగులకు ధైర్యం నింపే విధంగా వారితో పాటు బస్సులో ప్రయాణించారు. ఈ సందర్భంగానే  బస్సులో వీరిరువురి మధ్యా జరిగిన సరదా సంభాషణకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అయ్యింది. ఆ వీడియోలో బస్సులో కూర్చున్న చంద్రబాబు వెనుక వస్తున్న పవన్ కల్యాణ్ ను ఉద్దేశించి.. ఈ బస్సులో  దివ్యాంగులకు మాత్రమే ఉచిత ప్రయాణం.. మీరు టికెట్ తీసుకోవలసిందే అని గట్టిగా చెప్పారు. ఇందుకు పవన్ కల్యాణ్ తనదైన శైలిలో బిగ్గరగా నవ్వారు. ఆ వెనుకే ఉన్న లోకేష్ మాత్రం చంద్రబాబుతో అంతే సరదాగా మనమందరం ఎమ్మెల్యేలం కదా.. కనుక ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణానికి అర్హులమే  అని బదులిచ్చారు. అయితే తాము తమ గుర్తింపు కార్డులను వెంట తేచ్చుకోలేదని చెబుతూ.. తనకూ, పవన్ కల్యాణ్ కూ చంద్రబాబుకు టికెట్ తీసుకున్నారు.తాము తీసుకున్న టికెట్ ముగ్గురి కోసమేనని మరోసారి కండక్టర్ వద్ద నిర్ధారించుకున్నారు. ప్రస్తుతం ఈ వీడియో నెటిజనుల మనసు దోచుకుంది. ముగ్గురు నేతల మధ్యా ఆత్మీయ బంధానికి ప్రతీకగా ఉండటమే కాకుండా విలువలకు వారిచ్చే ప్రాధాన్యతను కూడా ఎత్తి చూపింది. ఈ వీడియో తెలుగుదేశం, జనసేన పార్టీలలో జోష్ నింపుతోంది. కూటమి పార్టీల మధ్యా చీలిక వస్తుందని  ఎదురు చూస్తున్న వారి ఆశలు అడియాశలేనని విస్పష్టంగా తేల్చేసింది.  
ALSO ON TELUGUONE N E W S
హీరో శర్వానంద్(Sharwanand) వైవిధ్యమైన కథలను ఎంచుకోవడంలో ముందుంటాడు. ఇప్పుడు మరోసారి డిఫరెంట్ అటెంప్ట్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. తాజాగా విడుదలైన శర్వానంద్ 'బైకర్' మూవీ ట్రైలర్ ఆకట్టుకుంటోంది. (Biker Trailer) అభిలాష్ రెడ్డి దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ చిత్రం, ఇండియాలో మొట్టమొదటి మోటోక్రాస్ ఫిల్మ్ కావడం విశేషం. యూవీ క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ సినిమా, ఏప్రిల్ 3న థియేటర్లలో అడుగుపెట్టనుంది. ఈ నేపథ్యంలో తాజాగా ట్రైలర్ ను విడుదల చేశారు మేకర్స్.   ట్రైలర్ ప్రారంభం నుండి ముగింపు వరకు అదిరిపోయే విజువల్స్ తో కట్టిపడేసింది. జిబ్రాన్ అందించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా అదిరిపోయింది. ట్రైలర్ లో మోటోక్రాస్ రేసింగ్ సీన్లు, మట్టి ఎగురుతుంటే శర్వానంద్ బైక్‌పై చేసే విన్యాసాలు గూస్ బంప్స్ తెప్పిస్తున్నాయి. శర్వానంద్ లుక్, బాడీ లాంగ్వేజ్ ఈ పాత్రకు చక్కగా సరిపోయాయి. రేసింగ్ ట్రాక్‌పై శర్వానంద్ తన బైక్‌తో చేసే సాహసాలు కన్నుల పండువగా ఉన్నాయి. సినిమాలో కేవలం రేసింగ్ మాత్రమే కాదు, ఒక బలమైన తండ్రి-కొడుకుల సెంటిమెంట్ కూడా ఉన్నట్లు ట్రైలర్ లో చూపించారు. ఇందులో శర్వానంద్ తండ్రి పాత్రలో సీనియర్ హీరో రాజశేఖర్ నటించడం విశేషం. ఆయన పాత్ర సీరియస్ గా కనిపిస్తోంది. రాజశేఖర్ స్క్రీన్ ప్రెజెన్స్, డైలాగ్స్ సినిమాకు మేజర్ ప్లస్ పాయింట్ కానున్నాయి.  "నువ్వు అందరికంటే ముందు రాలేదు. నీకంటే అందరూ వెనకాల వచ్చారు. రెండింటికీ చాలా తేడా ఉంది" అని శర్వానంద్ తో రాజశేఖర్ చెప్పే డైలాగ్ సినిమాలోని కథా వైవిధ్యాన్ని చాటి చెబుతోంది. రేసింగ్ లో కొడుకు ఫస్ట్ వచ్చినా రాజశేఖర్ కి తృప్తి లేదు. మిగతా వాళ్ళ కంటే బెటర్ రేసర్ గా కాదు, బెస్ట్ రేసర్ గా తన కొడుకుని చూడాలనే తాపత్రయం రాజశేఖర్ పాత్రలో కనిపిస్తోంది. తండ్రీకొడుకుల మధ్య సీన్స్ ట్రైలర్ లో హైలైట్ గా నిలిచాయి. తన డ్రీమ్ ని, తన కొడుకు ద్వారా తీర్చుకోవాలని చూస్తున్నట్టుగా రాజశేఖర్ పాత్ర కనిపిస్తోంది. అందుకే కొడుకు విషయంలో కఠినంగా ఉంటున్నాడనేలా సన్నివేశాలు ఉన్నాయి.  మరోవైపు మాళవిక నాయర్ పాత్ర కూడా చాలా సహజంగా ఉంది. ట్రైలర్ చివరలో వచ్చే రేసింగ్ సీన్స్, ఆ ఎమోషనల్ టచ్ సినిమాపై మరింత క్యూరియాసిటీని పెంచాయి. సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్ ఆకట్టుకున్నాయి. ప్రతి ఫ్రేమ్ లోనూ రిచ్ నెస్ కనిపిస్తోంది. మొత్తానికి ట్రైలర్ చూస్తుంటే.. 'బైకర్'తో శర్వానంద్ భారీ హిట్ కొట్టడానికి సిద్ధమైపోయాడని అర్థమవుతోంది. ఏప్రిల్ 3న విడుదల కానున్న ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి మ్యాజిక్ చేస్తుందో చూడాలి.  
తెలుగులో ఈ మధ్య కాలంలో ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ సినిమాలకు ఆదరణ పెరుగుతోంది. ఆ కోవలోనే గతేడాది చివర్లో థియేటర్లలో విడుదలై పరవాలేదు అనిపించుకున్న మూవీ 'మిస్‌టీరియస్‌' (MissTerious). సస్పెన్స్, సైకలాజికల్ ఎలిమెంట్స్ తో సాగే ఈ సినిమా ఇప్పుడు సైలెంట్ గా ఓటీటీలోకి వచ్చేసింది. 'మిస్‌టీరియస్‌' మూవీ ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో(Amazon Prime Video)లో అడుగుపెట్టింది. మార్చి 21 నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. ఎటువంటి అనౌన్స్ మెంట్ లేకుండానే సైలెంట్ గా ఈ సినిమా ఓటీటీ ఎంట్రీ ఇచ్చింది. అయితే ఇక్కడో ట్విస్ట్ ఉంది. ప్రస్తుతం రెంట్ విధానంలో అందుబాటులోకి వచ్చింది. కథ ఏంటంటే.. సబ్ ఇన్వెక్టర్ రాంకీ(ఆబిద్ భూషణ్) హఠాత్తుగా కనిపించకుండా పోవడంతో కథ మొదలవుతుంది. ఈ కేసును టేకప్ చేసిన ఏసీపీ ఆనంద్ సాయి(బలరాజ్ వాడి).. ఇన్వెస్టిగేషన్ లో భాగంగా ప్రముఖ ఆర్కిటెక్ట్ విరాట్(రోహిత్ సాహ్ని) భార్య శిల్ప(మేఘన రాజ్‌పుత్)ను అనుమానిస్తాడు. అసలు రాంకీ ఎక్కడికి వెళ్ళాడు? విరాట్, శిల్పలకు ఈ కేసుతో ఉన్న సంబంధం ఏంటి? చివరకు బయటపడిన ఆ భయంకరమైన నిజం ఏంటి? అనే ఆసక్తికర అంశాలతో దర్శకుడు మహి కొమటిరెడ్డి ఈ సినిమాను మలిచారు. బిగ్ బాస్ ఫేమ్ రోహిత్ సాహ్ని ఈ సినిమాలో తన నటనతో మెప్పించారు. అతనికి జోడీగా మేఘన రాజ్‌పుత్ తన పాత్రలో ఒదిగిపోయింది. ఏసీపీ పాత్రలో బాలరాజ్ హుందాతనాన్ని ప్రదర్శించగా, అబిద్ భూషణ్ కీలక పాత్రలో కనిపించాడు. ఎం.ఎల్. రాజా అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమాలోని సస్పెన్స్ మూడ్‌ను బాగా క్యారీ చేసింది. యాష్లే క్రియేషన్స్ బ్యానర్‌పై జై వల్లందాస్ నిర్మించిన ఈ చిత్రం డిసెంబర్ 2025లో థియేటర్లలో విడుదలై పాజిటివ్ టాక్ నే తెచ్చుకుంది. ముఖ్యంగా క్లైమాక్స్ లో వచ్చే ట్విస్టులు ప్రేక్షకులను థ్రిల్ కి గురిచేశాయి. అయితే తెలిసిన నటీనటులు కాకపోవడంతో ఈ సినిమా పెద్దగా జనాలకు రీచ్ అవ్వలేదు. ఓటీటీలో విడుదలైన తొలి రోజే ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ లభిస్తోంది. సోషల్ మీడియాలో ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ లవర్స్ ఈ సినిమా గురించి చర్చించుకుంటున్నారు. మిస్టరీ థ్రిల్లర్స్ ను ఇష్టపడే వారికి ఈ వీకెండ్ లో ఇదొక మంచి ఆప్షన్ అని చెప్పవచ్చు.  
'కోర్ట్' తర్వాత  హర్ష్ రోషన్, శ్రీదేవి జంటగా నటించిన మూవీ ‘బ్యాండ్ మేళం’(Band Melam). ప్రముఖ రచయిత, నిర్మాత కోన వెంకట్ కి చెందిన కోన ఫిల్మ్ కార్పొరేషన్ బ్యానర్‌పై ఇది రూపొందింది. సతీష్ జవ్వాజి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ.. ప్యూర్ విలేజ్ ఎమోషన్స్, యూత్ ఫుల్ ఎంటర్టైన్మెంట్ కలబోతగా వస్తోంది. మార్చి 26న థియేటర్లలో అడుగుపెట్టనుంది. ఈ నేపథ్యంలో తాజాగా చిత్ర బృందం మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా ట్రైలర్ ను విడుదల చేసింది. ఇప్పుడు ఈ ట్రైలర్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ట్రైలర్ లోని విజువల్స్ చాలా నేచురల్‌గా, కలర్ ఫుల్ గా ఉన్నాయి. పల్లెటూరి వాతావరణాన్ని కెమెరాలో బంధించిన తీరు సినిమాపై ఆసక్తిని పెంచుతోంది. ముఖ్యంగా హీరో హర్ష్ రోషన్ ఎనర్జీ, డైలాగ్ డెలివరీతో మాస్ ఆడియన్స్‌ను ఆకట్టుకునేలా ఉన్నాడు. సంగీతం పేరుతో హడావుడి చేసే కుర్రాడిగా, అలాగే ప్రేమ కోసం నిలబడే యువకుడిగా అతని వేరియేషన్స్ బాగున్నాయి.  ట్రైలర్ లో కామెడీ పంచ్ డైలాగ్స్ బాగానే పేలాయి. సోషల్ మీడియాలో ఈ డైలాగ్స్ వైరల్ అవుతున్నాయి. ఇదిలా ఉంటే సినిమాలో కామెడీతో పాటు, ఎమోషన్స్ కూడా పీక్స్‌లో ఉన్నాయని ట్రైలర్ హింట్ ఇస్తోంది. ట్రైలర్ లోని కొన్ని ఎమోషనల్ సీక్వెన్స్ లు కట్టిపడేస్తున్నాయి.  బావమరదళ్ళ కథగా ఇది తెరకెక్కింది. ప్రారంభంలో కామెడీ ఏ స్థాయిలో ఉంటుందో, చివరిలో అదే స్థాయిలో ఎమోషన్స్ ఉంటాయని అర్థమవుతోంది. ముఖ్యంగా ట్రైలర్ చివరిలో హీరో తన బాధను స్నేహితులతో పంచుకునే సీన్ గుండెకు హత్తుకునేలా ఉంది. యూత్ తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ ఎంజాయ్ చేసే విధంగా ఈ సినిమాను తీర్చిదిద్దినట్లు స్పష్టంగా తెలుస్తోంది. విజయ్ బల్గానిన్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ట్రైలర్‌ను నెక్స్ట్ లెవల్‌కు తీసుకెళ్లింది. ఎమోషనల్ సీన్లలో హృదయాన్ని హత్తుకుంటూనే, కామెడీ సీన్లలో అదిరిపోయే మ్యూజిక్ ఇచ్చాడు. గతేడాది 'కోర్ట్' సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న హర్ష్ రోషన్ - శ్రీదేవి కాంబినేషన్ మళ్లీ రిపీట్ అవుతుండటంతో ‘బ్యాండ్ మేళం’పై మంచి అంచనాలు నెలకొన్నాయి. తాజాగా విడుదలైన ట్రైలర్ ఆ అంచనాలను పెంచేసింది. పల్లెటూరి నేపథ్యంతో సాగే ఈ ప్రేమకథ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి మేజిక్ చేస్తుందో చూడాలి.
జూనియర్ ఎన్టీఆర్(Jr NTR) తన అప్ కమింగ్ మూవీ 'డ్రాగన్'(Dragon) కోసం చేస్తున్న కసరత్తులు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ మారాయి. సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ఈ పవర్ ప్యాక్డ్ యాక్షన్ డ్రామా కోసం ఎన్టీఆర్ తన ఫిజిక్‌ను పూర్తిగా మార్చేశాడు. ఈ సినిమాలోని పాత్ర డిమాండ్ మేరకు అత్యంత సన్నగా, ఫిట్‌గా కనిపించేందుకు ఎన్టీఆర్ కఠినమైన ఫిట్‌నెస్ నియమాలను అనుసరించాడు. తన ట్రైనర్స్ పర్యవేక్షణలో రోజుకు 90 నిమిషాల పాటు ఫంక్షనల్ ట్రైనింగ్ చేస్తూ, క్రమశిక్షణతో కూడిన డైట్ ప్లాన్‌ను ఫాలో అయ్యాడు. కేవలం ఏడు వారాల వ్యవధిలోనే 10 కిలోల బరువు తగ్గడం వెనుక ఎన్టీఆర్ పడిన శ్రమ అసామాన్యమని చెప్పవచ్చు.  సినిమా సినిమాకు ఎన్టీఆర్ తన బాడీ మేకోవర్లతో ప్రేక్షకులను ఆశ్చర్యపరుస్తూనే ఉన్నాడు. 'టెంపర్' కోసం తొలిసారి సిక్స్ ప్యాక్ లో కనిపించాడు. అలాగే 'అరవింద సమేత', 'ఆర్ఆర్ఆర్' సినిమాలలో డిఫరెంట్ ఫిజిక్‌ తో కనిపించాడు. ఇక ఇప్పుడు 'డ్రాగన్'లో సరికొత్తగా కనిపించనున్నాడు. ఇందులో కింగ్ ఆఫ్ మార్షల్ ఆర్ట్స్ 'బ్రూస్‌లీ' తరహా ఫిజిక్‌ తో ఎన్టీఆర్ సర్ ప్రైజ్ చేయబోతున్నాడట. అంటే చూడటానికి స్లిమ్ గా ఉంటూనే, కండలు తిరిగిన దేహంతో కనిపించనున్నాడన్నమాట. ఈ సినిమా షూటింగ్ కి ముందు సోషల్ మీడియాలో ఎన్టీఆర్ స్లిమ్ లుక్ వైరల్ కావడంతో, ఆయన ఆరోగ్యం పట్ల అభిమానులు కాస్త ఆందోళన చెందారు. ఆ తర్వాత సినిమా కోసం ట్రాన్స్‌ఫర్మేషన్ అని తెలిసి.. ఎన్టీఆర్ డెడికేషన్ కి ఫ్యాన్స్ ఫిదా అయ్యారు.  ప్రస్తుతం 'డ్రాగన్' మూవీ షూటింగ్ హైదరాబాద్‌ లోని రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతోంది. ఇటీవలే జోర్డాన్ లో ఒక కీలక షెడ్యూల్‌ను పూర్తి చేసుకున్న చిత్ర బృందం, తదుపరి యాక్షన్ సీక్వెన్స్‌లపై దృష్టి పెట్టింది. ఈ భారీ బడ్జెట్ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. రుక్మిణి వసంత్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే పాన్ ఇండియా స్థాయిలో భారీ అంచనాలు ఉన్నాయి. కాగా, మే 20న ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా 'డ్రాగన్' గ్లింప్స్ విడుదలయ్యే అవకాశముంది ఉంది. అదే రోజు కొత్త విడుదల తేదీపైనా క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉంది.  
టాలీవుడ్‌లో హారర్ థ్రిల్లర్ సినిమాలకు ఎప్పుడూ మంచి ఆదరణ ఉంటుంది. ఈ మధ్య కాలంలో బాక్సాఫీస్ వద్ద సందడి చేసిన  హారర్ థ్రిల్లర్ మూవీ 'అమరావతికి ఆహ్వానం'(Amaravathiki Aahwanam). శివ కంఠమనేని, ధ‌న్య బాల‌కృష్ణ‌, ఎస్తర్ నొరోన్హా, సుప్రీత ప్రధాన పాత్రలు పోషించారు. జీవీకే దర్శకత్వంలో లైట్ హౌస్ సినీ మ్యాజిక్‌ నిర్మించిన ఈ మూవీ ఫిబ్రవరి 13న థియేటర్లలో అడుగుపెట్టింది. థియేటర్లలో పరవాలేదు అనిపించుకున్న ఈ సినిమా, ఇప్పుడు ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చింది. 'అమరావతికి ఆహ్వానం' డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ని ప్రముఖ తెలుగు ఓటీటీ సంస్థ 'ఆహా' సొంతం చేసుకుంది. మార్చి 20 నుంచి ఈ మూవీ ఓటీటీలో స్ట్రీమింగ్ కి వచ్చింది. థియేటర్ రిలీజ్ అయిన ఐదు వారాలకే ఓటీటీలోకి రావడంతో హారర్ ప్రియులు ఖుషీ అవుతున్నారు. కథ ఏంటంటే.. ఈశ్వర్(శివ కంఠమనేని) సస్పెండ్ అయిన ఒక పోలీస్ ఆఫీసర్. భార్య భాను(ధ‌న్య బాల‌కృష్ణ‌), ఇద్దరు మరదళ్ళతో కలిసి హైదరాబాద్ లో నివసిస్తుంటాడు. మరదలు భార్గవి(సుప్రీత) ఓ యూట్యూబర్. సిటీలోని భూత్ బంగ్లాలలో ఒకరోజు గడిపి అక్కడ దెయ్యం లేదని రుజువు చేస్తూ సోషల్ మీడియాలో ఫేమస్ అవుతుంది. ఒకసారి ఓ అజ్ఞాత వ్యక్తి భార్గవికి ఫోన్ చేసి.. అమరావతి అనే ఊరిలో నిజంగా దెయ్యాలు ఉన్నాయంటూ అక్కడికి ఆహ్వానిస్తాడు. ఇదొక ట్రిప్ లా ఉంటుందని భార్గవితో పాటు ఫ్యామిలీ అంతా వెళ్ళడానికి రెడీ అవుతారు. ఈశ్వర్ కి ఇష్టం లేకపోయినా.. భార్య కోసం బయల్దేరతాడు. అమరావతిలో నిజంగానే దెయ్యాలు ఉన్నాయా? అక్కడ ఈశ్వర్ వాళ్ళకి ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి? అక్కడికి వెళ్ళాక తెలిసిన రహస్యం ఏంటి? ఇందులో రాజేశ్వరి(ఎస్తర్ నొరోన్హా) పాత్ర ఏంటి? వంటి విషయాలు సినిమా చూసి తెలుసుకోవాలి. డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లో విడుదలైన తర్వాత 'అమరావతికి ఆహ్వానం' సినిమాకు మంచి స్పందనే లభిస్తోంది. హారర్ ఎలిమెంట్స్, ఫ్యామిలీ ఎమోషన్స్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ బాగున్నాయని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ముఖ్యంగా ఇంటిల్లిపాదీ కలిసి చూసేలా దర్శకుడు జీవీకే ఈ కథను రూపొందించడం ప్లస్ పాయింట్ అని చెబుతున్నారు. అయితే, కొన్ని సీన్స్ పాత హారర్ సినిమాలను గుర్తుకు తెస్తున్నాయనే టాక్ కూడా వినిపిస్తోంది. హారర్ ఎలిమెంట్స్ తో పాటు ఫ్యామిలీ ఎమోషన్స్ కూడా ఉండటంతో ఈ వీకెండ్ ఓటీటీ ఆడియన్స్ కి 'అమరావతికి ఆహ్వానం' ఒక మంచి ఆప్షన్ అని చెప్పవచ్చు. Also Read: అమరావతికి ఆహ్వానం మూవీ రివ్యూ
టాలీవుడ్‌లో అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్ స్టేటస్ అందుకున్న యంగ్ బ్యూటీ శ్రీలీల(Sreeleela). తన డాన్సులతో, చలాకీతనంతో కుర్రకారు మనసు దోచుకున్న ఈ భామ.. తాజాగా సోషల్ మీడియాలో తనపై వచ్చే ట్రోల్స్ గురించి స్పందిస్తూ ఎమోషనల్ అయిపోయింది. కెరీర్ స్టార్టింగ్ లో వరుసగా సినిమాలు చేస్తున్న సమయంలో కొన్ని ఫ్లాప్ లు ఎదురుకావడంతో.. నెటిజన్లు తనపై దారుణంగా ట్రోల్స్ చేశారని శ్రీలీల గుర్తు చేసుకుంది. "నేను చాలా సెన్సిటివ్, ఆ కామెంట్స్ చూసి తట్టుకోలేక చాలాసార్లు ఏడ్చేశాను" అంటూ తనలోని బాధను బయటపెట్టింది. ఒకానొక దశలో సినిమాలకు గుడ్ బై చెప్పాలని కూడా నిర్ణయించుకున్నట్లు తెలిపింది. ట్రోల్స్ భరించలేక తన తల్లి దగ్గరకు వెళ్లి.. "అమ్మా, ఇవన్నీ నా వల్ల కావడం లేదు.. నేను మళ్ళీ కాలేజీకి వెళ్లి చదువుకుంటాను" అని ఎమోషనల్ అయినట్లు శ్రీలీల వెల్లడించింది. అయితే, తన తల్లి ఇచ్చిన ధైర్యంతోనే మళ్ళీ నిలబడ్డానని, ఇప్పుడు అలాంటి ట్రోల్స్ ని ధైర్యంగా ఎదుర్కొంటున్నానని శ్రీలీల చెప్పుకొచ్చింది. కెరీర్ పరంగా చూస్తే, 'పెళ్లి సందడి'తో ఎంట్రీ ఇచ్చి 'ధమాకా'తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది శ్రీలీల. ఆ తర్వాత 'భగవంత్ కేసరి'లో తన నటనతో అందరినీ మెప్పించింది. అయితే అప్పటినుంచి శ్రీలీలను ఎక్కువగా ఫ్లాప్ లే పలకరించాయి.  రీసెంట్ గా పవన్ కళ్యాణ్ సరసన 'ఉస్తాద్ భగత్ సింగ్'(Ustaad Bhagat Singh) సినిమాలో మెరిసింది శ్రీలీల. ఉగాది కానుకగా మార్చి 19న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా, మంచి వసూళ్లనే రాబడుతోంది.  ప్రస్తుతం శ్రీలీల కేవలం తెలుగులోనే కాకుండా తమిళం, హిందీ భాషల్లో కూడా భారీ ఆఫర్లను అందుకుంటోంది. వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్నప్పటికీ, కొన్ని సినిమాలు ఆశించిన ఫలితాన్ని ఇవ్వకపోవడంతో ట్రోలర్స్ ఆమెను టార్గెట్ చేస్తున్నారు. అయితే సోషల్ మీడియాలో ఎంత నెగెటివిటీ ఉన్నా, తన హార్డ్ వర్క్ తోనే సమాధానం చెబుతానని అంటోంది ఈ డ్యాన్సింగ్ క్వీన్.
మహా కుంభమేళా 2025లో తన నీలి రంగు కళ్లతో, రుద్రాక్ష మాలలు అమ్ముతూ రాత్రికి రాత్రే సోషల్ మీడియాలో సెన్సేషన్‌గా మారిన 'రుద్రాక్ష గర్ల్' మోనాలిసా భోస్లే ఇప్పుడు వార్తల్లో నిలిచారు. తన ప్రియుడు, నటుడు ఫర్మాన్ ఖాన్‌ను ఆమె పెళ్లాడటంతో ఈ జంట ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది.  కేరళలోని తిరువనంతపురంలో వీరి వివాహం హిందూ సంప్రదాయం ప్రకారం ఘనంగా జరిగింది. ఈ పెళ్లికి కేరళ మంత్రులు, రాజకీయ ప్రముఖులు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. అయితే వీరి వివాహాన్ని 'లవ్ జిహాద్' అంటూ సోషల్ మీడియాలో కొందరు ప్రచారం చేయడంతో పాటు, వీరికి బెదిరింపులు కూడా వస్తున్నట్లు తెలుస్తోంది. దీనిపై భర్త ఫర్మాన్ ఖాన్ మీడియా ముందు గట్టిగానే స్పందించారు. తాము ఒకరినొకరు మనస్ఫూర్తిగా ప్రేమించుకున్నామని, ఇందులో ఎటువంటి బలవంతం లేదని ఫర్మాన్ స్పష్టం చేశారు. "మేము ముందుగా మనుషులం. ఎవరి మతాన్ని వారు పాటిస్తూనే ఒకరినొకరు గౌరవించుకుంటాం. ఆమె హిందూగానే ఉంటుంది, నేను ముస్లింగానే ఉంటాను. ఇక్కడ మత మార్పిడి ప్రసక్తే లేదు" అని ఆయన కుండబద్ధలు కొట్టారు. మోనాలిసా కూడా తన తండ్రికి ఇష్టం లేకపోయినా, తన ఇష్ట ప్రకారమే ఈ వివాహం చేసుకున్నానని మీడియాకు వివరించారు. వీరిద్దరూ 'నాగమ్మ' అనే మలయాళ సినిమా షూటింగ్ సమయంలో ఒకరికొకరు పరిచయమయ్యారు. ఆరు నెలల ప్రేమ ప్రయాణం తర్వాత పెళ్లి పీటలెక్కారు. ఫర్మాన్ ఖాన్ ఉత్తరప్రదేశ్‌కు చెందిన నటుడు కాగా, మోనాలిసా మధ్యప్రదేశ్ వాసి. వీరిద్దరి కెరీర్ పరంగా చూస్తే ప్రస్తుతం ఈ సినిమా సెట్స్‌పై ఉంది. ఈ సినిమాలోని వీరి కెమిస్ట్రీ నిజ జీవితంలో కూడా ప్రేమగా మారి పెళ్లి వరకు దారితీసింది. ప్రస్తుతం వీరి పెళ్లి ఫోటోలు ఇంటర్నెట్‌లో వైరల్ అవుతున్నాయి. కేరళ ప్రభుత్వం ప్రవేశపెట్టిన స్మార్ట్ యాప్ ద్వారా వీరు తమ వివాహాన్ని చట్టబద్ధంగా రిజిస్టర్ చేసుకున్నారు. కేరళ ప్రజలు తమకు ఎంతో మద్దతుగా ఉన్నారని, అవసరమైతే అక్కడే సెటిల్ అవుతామని కూడా ఈ జంట ప్రకటించడం విశేషం.
  -థియేటర్స్ లో సందడి చేస్తున్న ఉస్తాద్  -సినిమా ఎలా ఉంది  -చిరు రాకతో అదనపు ఆకర్షణ  పవర్ స్టార్ 'పవన్ కళ్యాణ్'(Pawan Kalyan)పవర్ ప్యాక్డ్ మూవీ 'ఉస్తాద్ భగత్ సింగ్'(Ustaad Bhagat Singh)థియేటర్స్ లో తన హవా కొనసాగిస్తూ ఉంది. ఫ్యామిలీస్ కూడా ఉస్తాద్ బాట పడుతుండంతో పాటు మూవీ చూసాక వాళ్ళందరు మీడియాతో మాట్లాడుతు 'ఈ మధ్య కాలంలో ఎలాంటి అసభ్యత లేకుండా వచ్చిన మూవీ ఉస్తాద్. పలానా సీన్స్ మాకు బాగా నచ్చాయని తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు ఆ ఉస్తాద్ ఫ్యామిలీలో మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi)దంపతులు కూడా జాయిన్ అయ్యారు. రీసెంట్ గా హైదరాబాద్ లో చిరంజీవి, సురేఖ దంపతులు, పవన్ దంపతులు కలిసి ఉస్తాద్ భగత్ సింగ్ ని వీక్షించారు. ముఖ్యంగా గ్యాంగ్ లీడర్ లోని 'వాన వాన వెల్లువాయే' సాంగ్ కి పవన్ డాన్స్ చేస్తున్న సీన్ తో పాటు తొలిప్రేమలోని 'ఈ మనసే, నా మనసే' సాంగ్ కి చిరంజీవి ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాడు. ఈ స్పెషల్ షో లో హరీష్ శంకర్, శ్రీలీల, అనిల్ రావిపూడి, ఆనంద్ సాయి దంపతులు, మైత్రి మూవీ మేకర్స్ అధినేతలతో పాటు మరికొంత మంది శ్రేయోభిలాషులు పాల్గొన్నారు. మైత్రి మూవీస్ నే ఎక్స్ వేదికగా సదరు మొత్తం వీడియోని షేర్ చేసింది. Also read: Ntr vs chiranjeevi: ఎన్టీఆర్ పై చిరంజీవి ట్వీట్.. ఇది రేంజ్ అంటే  ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో మెగా అభిమానుల కామెంట్స్ తో మైత్రి ఎక్స్ సర్వర్ క్రాక్ అయ్యే పరిస్థితి. పవన్ ప్రీవియస్ చిత్రం 'ఓజి' ని కూడా చిరంజీవి, సురేఖ గారు చూసిన విషయం తెలిసిందే.        https://x.com/MythriOfficial/status/2035298848344822027?s=20  
నటి, బిగ్ బాస్ ఫేమ్ పునర్నవి భూపాలం ఓ ఇంటికి కోడలైంది. గత కొంతకాలంగా వెండితెరకు దూరంగా ఉంటూ విదేశాల్లో ఉన్నత చదువుల్లో బిజీగా ఉన్న ఈ భామ, తాజాగా వివాహ బంధంలోకి అడుగుపెట్టి అందరినీ ఆశ్చర్యపరిచింది. అత్యంత సన్నిహితుల మధ్య జరిగిన ఈ వేడుకలో తన చిరకాల మిత్రుడు హేమంత్‌వర్మతో కలిసి ఏడడుగులు వేసింది. చాలా కాలంగా ప్రేమలో ఉన్న ఈ జంట, తమ బంధాన్ని పెళ్లి పీటల వరకు తీసుకెళ్లారు. వరుడు హేమంత్‌వర్మ సినీ పరిశ్రమలో ప్రముఖ ఫొటోగ్రాఫర్‌గా రాణిస్తున్నారు. వీరిద్దరూ చిన్ననాటి నుంచే స్నేహితులు కావడం విశేషం. గతేడాది డిసెంబర్‌లో నిశ్చితార్థం చేసుకున్న ఈ జోడీ, తాజాగా మార్చి 20న వివాహం చేసుకుని కొత్త జీవితాన్ని ప్రారంభించారు. ఆర్భాటాలకు పోకుండా కేవలం కుటుంబ సభ్యుల సమక్షంలో ఈ వేడుక సింపుల్‌గా జరిగింది. పునర్నవి భూపాలం అనగానే తెలుగు ప్రేక్షకులకు ముందుగా గుర్తొచ్చేది ‘ఉయ్యాల జంపాల’ సినిమా. ఆ చిత్రంలో రాజ్ తరుణ్ సరసన సునీత పాత్రలో ఆమె పండించిన అమాయకత్వం, నటన అందరినీ ఆకట్టుకుంది. ఆ తర్వాత పలు చిత్రాల్లో నటించినా, ఆమెకు విపరీతమైన క్రేజ్ తెచ్చిపెట్టింది మాత్రం బిగ్ బాస్ రియాలిటీ షోనే. అందులో తన ముక్కుసూటి తనంతో బోల్డ్ సెలబ్రిటీగా గుర్తింపు తెచ్చుకుంది. బిగ్ బాస్ తర్వాత వెండితెరపై బిజీ అవుతుందని అందరూ భావించినప్పటికీ, పునర్నవి మాత్రం తన కెరీర్ విషయంలో భిన్నమైన నిర్ణయం తీసుకుంది. గ్లామర్ ఫీల్డ్‌కు విరామం ప్రకటించి, లండన్‌కు వెళ్లి సైకాలజీలో ఉన్నత విద్యను అభ్యసిస్తోంది. అక్కడి నుంచే సోషల్ మీడియా ద్వారా తన వ్యక్తిగత విషయాలను అభిమానులతో పంచుకుంటూ వస్తోంది. ఇప్పుడు నేరుగా పెళ్లి వార్తతో అందరికీ స్వీట్ షాక్ ఇచ్చింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో పునర్నవి వెడ్డింగ్ ఫొటోలు తెగ వైరల్ అవుతున్నాయి. ట్రెడిషనల్ లుక్‌లో పునర్నవి ఎంతో కళగా కనిపిస్తుండగా, వరుడు హేమంత్ కూడా క్లాసీగా ఉన్నాడు. ఈ జంటను చూసిన నెటిజన్లు “మేడ్ ఫర్ ఈచ్ అదర” అంటూ కామెంట్స్ చేస్తున్నారు. సినీ ప్రముఖులు సైతం ఈ కొత్త దంపతులకు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
ఇటీవ‌లికాలంలో ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌కి పెరుగుతున్న ఆద‌ర‌ణ గురించి అంద‌రికీ తెలిసిందే. థియేట‌ర్ల‌లో కంటే ఇంట్లోనే కూర్చుని ఓటీటీలో సినిమాలు చూసేందుకు ప్రేక్ష‌కులు ఎక్కువ ఉత్సాహం చూపిస్తున్నారు. దానికి త‌గ్గ‌ట్టుగానే ర‌క‌ర‌కాల జోనర్స్ సినిమాల‌ను ఆయా సంస్థ‌లు అందుబాటులో ఉంచుతున్నాయి. ముఖ్యంగా క్రైమ్‌, స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్ల‌కు ఎక్కువ ఆద‌ర‌ణ ల‌భిస్తోంది.  తాజాగా అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతున్న 'సుడల్: ది వార్టెక్స్' (Suzhal: The Vortex) వెబ్ సిరీస్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. తమిళం నుంచి తెలుగు సహా పలు భాషల్లోకి అనువదించిన ఈ సిరీస్ గ్రిప్పింగ్ నేరేషన్‌తో ప్రేక్షకులను క‌ట్టి ప‌డేస్తోంది.  ఈ కథ సాంబలూరు అనే చిన్న గ్రామంలోని ఓ సిమెంట్ ఫ్యాక్టరీలో జరిగిన అగ్ని ప్రమాదంతో మొదలవుతుంది. సరిగ్గా అదే సమయంలో యూనియన్ లీడర్ షణ్ముగం (పార్థిబన్) చిన్న కూతురు నీలా కనిపించకుండా పోతుంది. ఈ రెండు సంఘటనల వెనుక ఉన్న నిగూఢ సత్యాలను ఛేదించే క్రమంలో ఎదురయ్యే మలుపులే ఈ సిరీస్‌కి ఆయువుపట్టు. ముఖ్యంగా ఈ సిరీస్‌లో నటీనటుల పెర్ఫార్మెన్స్ హైలైట్ అని చెప్పాలి. ఐశ్వర్య రాజేష్ తన సహజ సిద్ధమైన నటనతో ఆకట్టుకోగా, చాలా కాలం తర్వాత పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించిన శ్రియారెడ్డి పవర్‌ఫుల్ నటనను కనబరిచారు. కథిర్ మరియు పార్థిబన్ తమ పాత్రల్లో ఒదిగిపోయారు. 'విక్రమ్ వేద' వంటి సంచలన చిత్రానికి కథను అందించిన పుష్కర్-గాయత్రి ద్వయం ఈ సిరీస్‌ను క్రియేట్ చేయడం విశేషం. సాంకేతికంగా కూడా ఈ సిరీస్ ఉన్నత స్థాయిలో ఉంది. సామ్ సీఎస్ అందించిన నేపథ్య సంగీతం సన్నివేశాలను మరింత ఎలివేట్ చేసింది. కేవలం క్రైమ్ మాత్రమే కాకుండా సామాజిక అంశాలను, ముఖ్యంగా చిన్న పిల్లలపై జరిగే అఘాయిత్యాలను మరియు వాటి తాలూకు మానసిక ప్రభావాలను ఈ సిరీస్ లో చాలా లోతుగా చర్చించారు.
వేసవి కాలం ప్రారంభమైంది, ఆరోగ్యం పట్ల శ్రద్ధ కూడా పెరుగుతుంది. చాలామంది నీటి శాతం అధికంగా ఉన్న పండ్లు, కూరగాయలు తినడానికి ఇష్టపడతారు. అలాంటి వాటిలో దోసకాయలు కూడా ముఖ్యమైనవి.  దోసకాయను జ్యూస్ గా అయినా తీసుకుంటారు, సలాడ్ లో ఉపయోగిస్తారు,  కొంతమంది నేరుగా దోసకాయలు ముక్కలు చేసుకుని తింటారు.  ఎలా తిన్నా దోసకాయ ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది.  మార్కెట్లలో దోసకాయలకు డిమాండ్  కూడా పెరిగే కాలం ఇది.  అయితే దోసకాయలు కొనుగోలు చేసేటప్పుడు చాలా మంది తెలియకుండానే చేదు దోసకాయలను ఎంపిక చేస్తుంటారు.   చేదు దోసకాయలు  అటు తినలేము, ఇటు డబ్బు కూడా వృధా అవుతుంది.  అలా కాకుండా మార్కెట్లో దోసకాయలు కొనుగోలు చేసేటప్పుడు చేదు దోసకాయలు కాకుండా అన్నీ మంచి దోసకాయలు ఎంచుకోవాలి అంటే కొన్ని టిప్స్ పాటించాలి.  ఆ టిప్స్ ఏంటో తెలుసుకుంటే.. చేదు దోసకాయలు అవాయిడ్ చేసి మంచి దోసకాయలు ఎంచుకునే టిప్స్.. రంగు,  ఆకారం..  దోసకాయల రంగు,  ఆకారం ను  బట్టి చేదు దోసకాయను సులభంగా గుర్తించవచ్చు. దోసకాయ ముదురు ఆకుపచ్చ రంగులో ఉంటే, అది తాజాగా ఉన్నట్లు. అది లేత పసుపు, తెలుపు రంగులో లేదా మచ్చలతో ఉంటే, అది పండిందని అర్థం, అలాగే  లోపల చేదుగా ఉండే అవకాశం ఉంటుంది. నొక్కడం.. దోసకాయ గట్టిగా, దృఢంగా ఉంటే ఫర్వాలేదు, అదే అది మెత్తగా లేదా స్పాంజిలాగా అనిపిస్తే అది చెడిపోయినది,  చేదుగా కూడా ఉండవచ్చు. దోసకాయ నొక్కినప్పుడు అది గట్టిగా ఉండాలి. ఆకారం.. దోసకాయ ఆకారాన్ని చూసి  సులభంగా అది చేదు దోసకాయ లేదా మంచి దోసకాయ అనేది చెప్పవచ్చు. మందంగా లేదా పసుపు రంగులో ఉండే దోసకాయలు చేదుగా ఉండే అవకాశం ఉంది. ముదురు ఆకుపచ్చ రంగులో, గట్టిగా ఉండే దోసకాయలను మంచిగా ఉంటాయి. వాసన.. వాసనను బట్టి సులభంగా దోసకాయ చేదు ఉందా లేదా అనేది కనుక్కోవచ్చు.   దోసకాయ  తాజాగా ఉంటే లోపల కూడా తాజాగా ఉంటుంది.  దాని వాసన వింతగా లేదా ఘాటుగా ఉంటే, అది  లోపల చేదుగా కూడా ఉండే అవకాశం ఉంటుంది. కాండం.. దోసకాయ కొనుగోలు చేసినప్పుడు దోసకాయ కాండం దగ్గర కట్ చేయాలి. ఆ కాండం భాగాన్ని  దోసకాయ మిగిలిన భాగంలో రుద్దితే తెల్లని నరుకు వస్తే దోసకాయ చేదు ఉండే అవకాశం ఉంటుంది.  ఈ నుగురు బాగా బయటకు వెళ్లిపోతే దోసకాయలో చేదు తగ్గిపోతుందని చెబుతారు. అందుకే చాలామంది దోసకాయను కట్ చేసేటప్పుడు మొదట కాండం దగ్గర కట్ చేసి  రుద్దుతారు.  దీని వల్ల దోసకాయలో ఉండే చేదు పోతుందని చెబుతారు.                                 *రూపశ్రీ.
కొందరు చాలా లోతుగా ఆలోచిస్తారు.  ఈ కారణంగా చాలా విషయాలు వారిలో సందేహాలుగానో,  నిర్ణయాలుగానో, అబిప్రాయాలుగానో ఉంటాయి.  వాటిని బయటకు చెప్పాలంటే ఏదో సంకోచం ఉంటుంది.  ఎదుటి వారు ఏమనుకుంటారో అనే సందిగ్ధం కూడా ఉంటుంది.  దీని వల్ల వారు చాలా విషయాలు బయటకు చెప్పలేక నిశ్శబ్దంగా ఉండిపోతుంటారు.  కానీ ఇలా నిశ్శబ్దంగా ఉండటం వల్ల  తరువాత చాలా బాధపడతారు కూడా.  అప్పుడు అలా చెప్పి ఉంటే బాగుండు, అలా చేసి ఉంటే బాగుండు అని అనుకునేవారు చాలా అధికంగా ఉంటారు. కానీ మనసులో మాటను ధైర్యంగా చెప్పడం వల్ల చాలా రకాల లాభాలు ఉన్నాయని అంటున్నారు మనస్తత్వ విశ్లేషకులు. ఇంతకూ మనసులో మాటను ధైర్యంగా బయటకు చెప్పడం వల్ల కలిగే లాభాలు ఏంటి తెలుసుకుంటే.. నమ్మకం, సాన్నిహిత్యం.. ప్రతి బలమైన సంబంధానికి ఓపెన్ కమ్యూనికేషన్ పునాది అవుతుంది. మనం మన భావాలను నిజాయితీగా వ్యక్తపరిచి, ఇతరుల మాటలను విన్నప్పుడు అపార్థాలు తొలగిపోతాయి.  నమ్మకం మరింత పెరుగుతుంది. మనసు విప్పి మాట్లాడగల  వ్యక్తులు పారదర్శకత,  పరస్పర గౌరవం కలిగి ఉంటారు. ఇది బందం దీర్ఘకాలం ఆరోగ్యంగా ఉండటంలో సహాయపడుతుంది. ఆత్మగౌరవం, ఆత్మవిశ్వాసం.. మనసులో ఉన్న ఆలోచనలను భయం లేదా సంకోచం లేకుండా వ్యక్తం చేసినప్పుడు..  చెప్పాలనుకున్న విషయాన్ని చెప్పేశాం అనే ఒక శాటిస్పాక్షన్ ఫీలింగ్ ఏర్పడుతుంది. ఇది  ఆత్మగౌరవాన్ని పెంచుతుంది,  క్రమంగా ఇలాంటి ప్రవర్తన వల్ల ఆత్మవిశ్వాసం కూడా మెరుగవుతుంది. ఎప్పుడైనా, ఎలాంటి సందర్భంలో అయినా తన మనసులో ఉన్నది చెప్పడానికి ఎలాంటి భయం ఉండదు. తేడాలు, పరిష్కారాలు.. జీవితంలో ప్రతి ఒక్కచోట విభేదాలు ఉండనే ఉంటాయి. అవి స్నేహం అయినా, కుటుంబం అయినా,  ప్రేమ అయినా, ఉద్యోగం చేసే చోట అయినా.. ఎక్కడైనా సరే.. విభేదాలు గొడవలుగా మారకుండా పరిష్కరించుకోవడానికి  సహాయపడుతుంది. అభిప్రాయాలను స్పష్టంగా , సంకోచం లేకుండా వ్యక్తపరిచినప్పుడు అవతలి వ్యక్తులు కూడా వినడానికి ఆసక్తి చూపిస్తారు.  ఇలా మాట్లాడటం అనేది సమస్యకు పరిష్కారాన్ని చూపిస్తుంది. ఆత్మవిమర్శ.. ఏదైనా విషయాన్ని స్పష్టంగా చెప్పే అలవాటు ఉండటం వల్ల కేవలం ఇతరులతో ఏదైనా చెప్పడమే కాదు.. తమతో తాము స్పష్టంగా మాట్లాడుకోగలుగుతారు. ఇది వ్యక్తులను కన్ప్యూజన్ లేకుండా చేస్తుంది. బలాలు, బలహీనతలను గుర్తించడంలో సహాయపడుతుంది. ఇది వ్యక్తిగత అభివృద్దికి మొదటి అడుగు అవుతుంది. మానసిక ఒత్తిడి, ఆందోళన.. భావోద్వేగాలను అణిచివేసినప్పుడు అవి లోపల ఒత్తిడి కలిగిస్తాయి. కానీ వాటిని సరైన విధంగా బయటకు వ్యక్తం చేసినప్పుడు ఒత్తిడి తగ్గుతుంది. ఇది మానసిక ఒత్తిడి,  ఆందోళన సమస్యలు పెరగకుండా ఉండటానికి కారణం అవుతుంది. శారీరక ఆరోగ్యం.. స్పష్టంగా ఏదైనా విషయాన్ని బయటకు చెప్పడం వల్ల శారీరక ఆరోగ్యం కూడా బాగుంటుంది. ఒత్తిడి తక్కువగా ఉండటం మంచి నిద్ర, రక్తపోటు సాధారణంగా ఉంటాయి. ఇది గుండెజబ్బు, తలనొప్పి, నిద్రలేమి వంటి సమస్యలు రాకుండా చేస్తుంది. సక్సెస్ కోసం.. స్పష్టంగా, మంచిగా కమ్యూనికేషన్ చేయడంలో వ్యక్తి విజయం ఆధారపడి ఉంటుంది. ఉద్యోగంలో అయినా, రాజకీయంలో అయినా,  కుటుంబంలో అయినా,  బంధంలో అయినా స్పష్టంగా మాట్లాడటం వల్ల అవతలి వ్యక్తులు అర్థం చేసుకునే అవకాశాలు ఎక్కువ ఉంటాయి.  ఇది అన్ని చోట్ల విజయాన్ని,  గౌరవాన్ని తెచ్చిపెడుతుంది. స్పష్టంగా మాట్లాడటం అంటే ఇతరుల పైన ఆధిపత్యం చెలాయించడం కాదు. భావాలను గౌరవంగా, పద్దతిలో వ్యక్తపరచడం. ఇతరులు ఏమనుకుంటారో అనుకోకుండా మనసులో ఉన్నది  చెప్పడం, మనసులో ఉన్నది తొక్కి పెట్టి మౌనంగా ఉండకుండా బయటకు వ్యక్తం చేయడం వల్ల మానసికంగా బలంగా ఉండటమే కాకుండా ఇతరుల ముందు సరైన విధంగా మాట్లాడటం ఎలాగో కూడా అర్థం  అవుతుంది.  కాబట్టి ఇతరుల గురించి ఆలోచించి మనసులో ఉన్నది దాచిపెట్టాల్సిన అవసరం లేదు.                          *రూపశ్రీ.
పరాభవం.. తెలుగు జానపద చిత్రాలు,  జానపద నవలలు చదివితే.. అందులో అవమానం జరిగిందనడానికి బదులుగా పరాభవం ఎదురైంది అనే పదం వాడటం చూస్తూనే ఉంటాము.  పరాభవం అంటే అగౌరవం,  అవమానం, కించపరచడం.. ఇలా చాలా సందర్బాలలో వాడుతూ ఉంటారు. అయితే తెలుగు పంచాంగంలో.. తెలుగు సంవత్సరాలలో 40వ తెలుగు సంపత్సరం పేరు పరాభవ నామ సంవత్సరం.  ఈ సంవత్సరం పేరు వినగానే చాలామంది భయపడుతున్నారు.  రెండేళ్ల క్రితం వచ్చిన క్రోథ నామ సంవత్సరం అప్పుడు ఇలాగే భయపడ్డారు. కానీ కాలంతో ప్రయాణం తప్పదు.  అయితే ప్రజలలో పరాభవనామ సంవత్సరం అనే పేరు వినగానే ఎక్కడలేని భయం పుట్టుకొస్తోంది. ఈ కొత్త ఏడాదిలో అవమానాలు, అగౌరవాలు తప్పవా అని ముందే తమ భవిష్యత్తు గురించి మనసులో బోలెడు భవిష్యవాణి ఊహించుకుంటున్నారు. కానీ పరాభవ నామ సంవత్సరం పేరు వెనుక ఉన్న అర్థం,  అందులో పరమార్థం వేరని, ఈ విషయం తెలిస్తే అందరూ ఎంతో ఊరట చెందుతారని అంటున్నారు పండితులు. ఇంతకూ పండితులు ఈ పరాభవ నామ సంవత్సరం గురించి, దాని పేరులో ఉన్న అర్థం గురించి ఏం చెప్తున్నారో తెలుసుకుంటే.. తెలుగు పంచాంగం ప్రకారం 60 తెలుగు సంవత్సరాలు  ఉంటాయి.  వాటిలో విశ్వావసు నామ సంవత్సరం 39వది కాగా.. పరాభవ నామ సంవత్సరం 40వది.  చైత్ర మాసంలో ఉగాది పర్వదినం సందర్బంగా కొత్త తెలుగు సంవత్సరం అయిన పరాభవ సంవత్సరం మొదలు కాబోతోంది. పరాభవ అనే పేరు వినగానే పరాభవాలే ఎదురవుతాయేమో అనుకుంటారు చాలా మంది. కానీ పరాభవ నామ సంవత్సరం అంటే వేరే అర్థాలు ఉన్నాయి.  పరాభవలో పరా అంటే పరాభట్టారికా దేవి.. లిలితా దేవినే పరాభట్టారికా దేవి అని అంటారు.  భవ అని భవుడు అని పరమేశ్వరుడిని సంభోధిస్తారు.  దీని ప్రకారంగా చూస్తే శక్తి స్వరూపమైన ఆ పార్వతీదేవి,  లయకారుడు అయిన పరమేశ్వరుడి కలయికగా వచ్చినదే తెలుగు సంవత్సరమని,  ఈ పరాభవ నామ సంవత్సరం మీద పార్వతీపరమేశ్వరుల అనుగ్రహం పుష్కలంగా ఉంటుందని పండితులు చెబుతున్నారు.   చాలా వరకు ప్రజలు ఎందులో అయినా ముందు చెడునే గుర్తిస్తారు, చెడునే తలుస్తారు.  ఈ స్వభావం కారణంగానే పరాభవ నామ సంవత్సరం గురించి పలు ఊహాగానాలు వస్తున్నాయని పండితులు చెబుతున్నారు. మరొక విధంగా చూస్తే.. పర అంటే పరదేవత.. ఆ పరదేవతే లలితా పరమేశ్వరి దేవి,  భవ అంటే అంటే కూడా పరమేశ్వరుడు.. ఎలా చూసినా ఇందులో ఎంతో ఆధ్యాత్మికత,  భక్తి మేళవింపు కనిపిస్తుంది.  ఇంతటి గొప్ప నామం వెనుక పిచ్చి అనుమానాలు, భయాలతో కొత్త ఏడాదిని మొదలుపెట్టడం మంచిది కాదని,  ప్రతి ఒక్కరూ సానుకూల ఆలోచన కలిగి ఉండాలని పండితులు చెబుతున్నారు. పరాభవ నామ సంవత్సరాన్ని అత్యున్నతమైన ఏడాది అని జ్యోతిష్యం చెబుతోంది. పరా అంటే గొప్పది, అత్యున్నతమైనది,  భవ అంటే పుట్టుక లేదా ఉద్భవించేది.  ఉన్నతంగా ఉద్భవించేది పరాభవ.. కాబట్టి ఈ పరాభవ నామ సంవత్సం కూడా ఉన్నతంగా ఉంటుందని చెబుతున్నారు. మనిషి తన కర్తవ్యాన్ని తాను ధర్మం తప్పకుండా నెరవేరుస్తుంటే.. ప్రతి ఏడాదిలో వారికి సానుకూలంగా సాగిపోతుందని ఆధ్యాత్మిక వేత్తలు కూడా చెబుతున్నారు. చెడులోనూ మంచి చూసే గుణం,  సానుకూల ఆలోచనలు ఉండటం ప్రధానం. కాబట్టి ఈ పరాభవ నామ సంవత్సరం రోజు సంతోషంతో ఉగాది పండుగను జరుపుకోవడం ద్వారా అందరూ సుఖ సంతోషాలు పొందాలని కోరుకుంటూ.. అందరికీ పరాభవ నామ తెలుగు సంవత్సరాది శుభాకాంక్షలు..                                   *రూపశ్రీ.
వేసవి కాలం రాగానే చాలామంది లైఫ్ స్టైల్ మారుతుంది. ముఖ్యంగా ఆహారం విషయంలో, పానీయాల విషయంలో చాలా మార్పులు వచ్చేస్తాయి. బీహార్, ఉత్తర ప్రదేశ్ రాష్ట్రాల పేమస్ పానీయం ఇది. అయితే దీని ప్రయోజనాల దృష్ట్యా దేశ వ్యాప్తంగా ఇష్టంగా ఉపయోగిస్తారు.  వేసవి వచ్చిందంటే సత్తు పానీయం చాలా ఎక్కువగా తీసుకుంటారు.  ఇది శరీరాన్ని కూల్ గా ఉంచడమే కాకుండా శరీరానికి కావలసిన పోషకాలను పుష్కలంగా అందిస్తుంది.  కాల్చిన శనగలతో తయారు చేసే సత్తు పౌడర్ ను సత్తు పానీయం కోసం ఉపయోగిస్తారు. అయితే.. సత్తు పొడితో కేవలం సత్తు పానీయమే కాకుండా.. చాలా రకాల పదార్థాలు తయారు చేసుకుంటారు.  వేసవిలో అటు శరీరాన్ని కూల్ గా ఉంచుతూ, ఇటు శరీరానికి బోలెడు పోషకాలు అందించే సత్తు పొడితో ఏమేం వంటకాలు బాగుంటాయో తెలుసుకుంటే.. సత్తు పేడ.. వేసవిలో  నీరసంగా అనిపిస్తే సత్తు పేడను తయారు చేసుకుని తినవచ్చు.. ఇది  ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. దీనిని తిన్న తర్వాత  శరీరం పూర్తి చురుకుగా ఉంటుంది. సత్తు పిండిని నెయ్యి వేసి బాగా వేయించి అందులో పంచదార పొడి వేసి సన్న మంట మీద గోల్డ్ కలర్ వచ్చే వరకు వేయిస్తే సత్తు పేడ రెఢీ.. ఇది చాలా రుచిగా ఉంటుంది. సత్తు మజ్జిగ.. వేసవి కాలంలో సత్తుతో మజ్జిగ తయారు చేసుకుని తాగవచ్చు. ఇది  శరీరాన్ని తేమగా ఉంచుతుంది.  పిల్లల నుండి పెద్దల వరకు అందరూ దీనిని ఇష్టపడతారు. దీనిని ప్రతిరోజూ తాగడం వల్ల తక్షణ శక్తి లభిస్తుంది. సత్తు లడ్డు.. సత్తు లడ్డూలను సత్తు పొడితో ఇంట్లోనే సులభంగా తయారు చేసుకోవచ్చు. సత్తు లడ్డులు తినడం వల్ల  శరీరం బలపడుతుంది. సత్తు లడ్డులో డ్రై ప్రూట్స్, నట్స్, నెయ్యి వేసి తయారు చేసుకుని తినవచ్చు. చాలా రుచిగా ఉంటాయి. సత్తు షార్డ్ బ్రెడ్.. వేసవిలో కూడా కారంగా తినాలని అనుకునే వారు చాలామంది ఉంటారు.  అలాంటి వారికి సత్తు షార్ట్ బ్రెడ్ చాలా మంచి ఫుడ్. సత్తు పిండిని వేయించి అందులో బంగాళదుంప,  బఠాణీ వంటి కూరగాయలు వేసి ముద్దగా చేసుకుని దీన్ని తడి చేసిన బ్రెడ్ మధ్యలో ఉంచి బ్రెడ్ ను బోండా లాగా రౌండ్ చేసి నూనెలో డీప్ ప్రై చేయాలి.  చాలా రుచిగా ఉంటాయి. సత్తు లిట్టి చోఖా.. లిట్టి చోఖా అనేది బీహార్, ఉత్తర ప్రదేశ్, జార్ఖండ్ రాష్ట్రాలలో చాలా ఫేమస్ ఫుడ్.  వేయించిన శనగపిండిని గోధుమ పిండిలో స్టఫ్ చేసి వాటిని కాలుస్తారు.  వీటిని లిట్టి అంటారు.  వీటిని నెయ్యితోనూ,  వంకాయ, టమాటా,  బంగాళాదుంపతో చేసిన చోఖా అనే వంటకంతో కలిపి వడ్డిస్తారు. ఈ పూర్తీ కాంబోను లిట్టీ చోఖా అంటారు.  ఇది చాలా రుచిగా ఉంటుంది.  చోఖా లేకపోయినా లిట్టిని వివిధ రకాల చట్నీలతో కూడా తింటారు.                                       *రూపశ్రీ.
ఆరోగ్యమే మహాభాగ్యం. కానీ నేటి కాలంలో మారిన జీవనశైలి కారణంగా చిన్న పిల్లల నుండి పెద్దల వరకు ఏదో ఒక దీర్ఘకాలిక (Chronic) ఆరోగ్య సమస్యతో బాధపడుతున్నారు. ఎన్ని మందులు వాడినా సమస్య తాత్కాలికంగా తగ్గుతుందే తప్ప, పూర్తిగా నయం కావడం లేదని చాలా మంది ఆవేదన చెందుతుంటారు. అలాంటి వారికి హోమియోపతీ ఒక గొప్ప వరప్రసాదం. కేవలం లక్షణాలను అణచివేయడం కాకుండా, వ్యాధిని మూలాల నుండి తొలగించే అద్భుత శక్తి హోమియోపతీకి ఉంది.  Renowned Homeopathy expert Dr Praveen Kumar చెప్పిన మరిన్ని విషయాలు ఈ  TeluguOne Health Video Link క్లిక్ చేసి తెలుసుకుందాం. మనం హోమియోపతీని ఎందుకు ఎంచుకోవాలి? (Why Homeopathy?) దీర్ఘకాలిక వ్యాధులలో తిరుగులేని చికిత్స: హోమియోపతీ యొక్క అసలు బలమే దీర్ఘకాలిక వ్యాధులను నయం చేయడం. బ్రాంకియల్ ఆస్తమా వంటి జెనెటిక్ డిజార్డర్లను కూడా సమూలంగా తొలగించడానికి హోమియోపతీలో మార్గం ఉంది. సంపూర్ణ ఆరోగ్య దృక్పథం (Holistic Approach): ఇతర వైద్య విధానాలు కేవలం వ్యాధి మీద దృష్టి పెడితే, హోమియోపతీ 'రోగి' (Patient) మీద దృష్టి పెడుతుంది. అంటే మీ వేలికి నొప్పి ఉంటే కేవలం వేలిని మాత్రమే కాకుండా, మీ శరీరాన్ని ఒక యూనిట్‌గా పరిగణించి చికిత్స అందిస్తుంది. శాస్త్రీయమైనది: ఒకప్పుడు హోమియోపతీ కేవలం ప్లాసిబో (Placebo) అని విమర్శలు ఉండేవి. కానీ నేడు IIT ముంబై మరియు IISc బెంగళూరు వంటి సంస్థలు చేసిన పరిశోధనల్లో హోమియోపతీ మందులలో 'నానో పార్టికల్స్' (Nano Particles) ఉంటాయని నిరూపితమైంది. దుష్ప్రభావాలు లేని వైద్యం: ఇది సహజ సిద్ధమైన పద్ధతిలో పనిచేస్తుంది కాబట్టి సైడ్ ఎఫెక్ట్స్ భయం ఉండదు. చికిత్స ప్రక్రియ ఎలా ఉంటుంది? (How it works?) హోమియోపతీలో చికిత్స అనేది చాలా లోతుగా సాగుతుంది. దీనిని 'కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్' అంటారు. కేస్ టేకింగ్: డాక్టర్ మీతో దాదాపు గంట సేపు మాట్లాడుతారు. మీ అలవాట్లు, మీ ఇష్టాయిష్టాలు, మీకు ఎప్పుడు కోపం వస్తుంది, మీ గత చరిత్ర (Past history) వంటి అంశాలన్నింటినీ అడిగి తెలుసుకుంటారు. ఇది మీ 'జర్నీ ఆఫ్ లైఫ్'ను అర్థం చేసుకునే ప్రక్రియ. మయాజమ్స్ (Miasms): ఆయుర్వేదంలో వాత, పిత్త, కఫ దోషాలు ఉన్నట్లే, హోమియోపతీలో సోరా, సిఫిలిస్, సైకోసిస్ అనే మూడు మయాజమ్స్ ఉంటాయి. వీటి ఆధారంగానే మీ వ్యాధి తీవ్రతను అంచనా వేస్తారు. పొటెంటైజేషన్: మందులను డైల్యూట్ చేసే ప్రక్రియను 'డైనమైజేషన్' అంటారు. ఇందులో మందు పరిమాణం తక్కువగా ఉన్నప్పటికీ, దాని శక్తి (Power) చాలా ఎక్కువగా ఉంటుంది. ఏం చేయకూడదు? (What Not to Do?) సమాచారాన్ని దాచకండి: డాక్టరుకు మీ శారీరక, మానసిక లక్షణాలను స్పష్టంగా చెప్పాలి. ఏదైనా విషయాన్ని దాచడం వల్ల సరైన మందును ఎంపిక చేయడం కష్టమవుతుంది. స్వయం వైద్యం వద్దు: హోమియోపతీ మందులు తీపి మాత్రల్లా కనిపిస్తాయి కదా అని సొంతంగా వాడకూడదు. వ్యాధి తీవ్రతను బట్టి డాక్టర్ ఇచ్చే పొటెన్సీ (30CH, 200CH లేదా 1M) మారుతూ ఉంటుంది. అపోహలు నమ్మకండి: హోమియోపతీ ఆలస్యంగా పనిచేస్తుందనేది ఒక అపోహ మాత్రమే. సరైన మందు పడితే అక్యూట్ కండిషన్స్ (జ్వరం, జలుబు) కూడా చాలా వేగంగా తగ్గుతాయి. తరచుగా అడిగే ప్రశ్నలు (Q&A) ప్ర: 30CH అంటే ఏమిటి? జ: ఇది హోమియోపతీలో ఒక రకమైన పొటెన్సీ (శక్తి). ఒక భాగం మందును 99 భాగాల వెహికల్ (ఆల్కహాల్ లేదా షుగర్ ఆఫ్ మిల్క్)తో కలిపి చేసే ప్రక్రియ ద్వారా 30CH తయారవుతుంది. ఇది అద్భుతమైన శక్తిని కలిగి ఉంటుంది. ప్ర: హోమియోపతీ మందులు ఘాటుగా ఎందుకు ఉంటాయి?  జ: మందులను పిల్స్ (మాత్రలు) మీద వేయడానికి ఆల్కహాల్‌ను వెహికల్‌గా ఉపయోగిస్తారు. ఆ ఆల్కహాల్ వల్ల ప్రారంభంలో కొంచెం ఘాటుగా అనిపించవచ్చు, కానీ ఆ మాత్రలు తియ్యగానే ఉంటాయి. ప్ర: మానసిక సమస్యలకు హోమియోపతీ పనిచేస్తుందా?  జ: అవును. హోమియోపతీలో మనిషి యొక్క సైకీ (Psyche) లేదా మానసిక స్థితిని బట్టి హైయర్ పొటెన్సీ మందులు ఇవ్వడం జరుగుతుంది, ఇవి మానసిక ఆరోగ్యంపై అద్భుతంగా పనిచేస్తాయి. దీర్ఘకాలిక వ్యాధులతో పోరాడుతున్న వారికి హోమియోపతీ ఒక ఆశాకిరణం. ఇది కేవలం వ్యాధిని తగ్గించడమే కాకుండా, మీ రోగనిరోధక శక్తిని పెంచి మిమ్మల్ని సంపూర్ణ ఆరోగ్యవంతులుగా తీర్చిదిద్దుతుంది. మరిన్ని ఆసక్తికరమైన ఆరోగ్య విషయాలు మరియు నిపుణుల సలహాల కోసం ఇప్పుడే మా TeluguOne Health యూట్యూబ్ ఛానెల్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి
డా ..చిరు మావిళ్ళ మురళీ మనోహర్.. ఉగాది అంటే ఉగాది పచ్చడి మాత్రమే అని అనుకుంటారు. కానీ ఉగాది పచ్చడిలో ఉన్న ఆయుర్వేద ఆరోగ్య రహస్యం ఏమిటో తెలుసా?ఇప్పుడు చైత్ర మాసం లో వసంత రుతువు లో ఉన్నాం ఆకు రాలిన తరువాత కొత్త కొత్త గా రేకు విచ్చినట్లు చిగుర్లు తోడుగుతాయి. ఆప్రాంతం అంతా పచ్చటి తివాచి పరిచినట్లు పచ్చగా విరబూస్తాయి. పువ్వులు పరిమళాలు.మావిడి పూత సువాసనలు, మామిడి చెట్లపై కొత్తగా చిగురులు తొడిగిన మామిడి పూత గుత్తులు,మామిడి పిందెలు ఆ వసంత శోభ అప్పుడే వచ్చిందా అనిపిస్తుంది మది పులక రిస్తుంది. కొత్త కొత్త పూతని ఆస్వాదించాలని అనిపిస్తూ ఉండడం సహజం.ప్రకృతి లో మార్పు వచ్చింది శీతకాలం నుండి ఎండా కాలానికి వాతావరణం మారుతుంది ఇక ఎండవేడి ని తట్టుకోవ దానికి మన శరీరం సన్నద్ధం కావాలి.వాతావరణం లో మార్పులకు తగ్గట్టుగా శరీరంలో వేడిమి ని,తట్టుకోవడం. శరీరం దానంతట అదే చల్లబడే సహజ లక్షణాన్ని వృద్ది   చేయడంకీలకం.ముఖ్యంగా ఎండాకాలం లో వేడికి శరీరం నీర సించి పోవడం.ఒక్కో సారి అతిసారం బారిన పడడం. ముఖ్యంగా డయాబెటీస్, గుండె సంబధిత సమస్యలు ఉన్న రోగులలో వచ్చే హార్ట్ బీట్ లో మార్పులు.లేదా శరీరంలో రక్త ప్రసరణలో సమస్యలు వస్తూ ఉంటాయని ప్రముఖ ఆయుర్వేద వైద్యులు  డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్ విశ్లేషించారు.ఈ క్రమం లో మనం ఉగాది రోజున తీసుకున్నే ఆరు రకాల లో ఉన్న ఆరోగ్య రహస్యాలు, వాటిలో  ఉండే పోషక విలువల గురించి తెలుగు వన్ హెల్త్ కు  వివరించారు. మనం పండగ పూట లేదా కొన్ని సందర్భాలాలో తీసుకున్న ఆహారం శరీరంలో తామస ,రజో గుణాలు పెంచు తాయని  శరీరంలో వేడి వల్ల వచ్చే సమస్యల ను అధిగమించాలి సత్వ ప్రాధాన మైనగుణాన్ని అలవారచుకోవాలాంటే ఉగాది పచ్చడి ఉపయోగ పడుతుందని ప్రముఖ ఆయుర్వేద వైద్యులు డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్ పేర్కొన్నారు. వేసవి రాగానే శరీరం లో కొన్ని రకాల రసాయన చర్యల వల్ల శరీరం లో సమతౌల్యం లోపిస్తుందని సమ తౌల్యాన్ని నియంత్రించే శక్తి ఉగాది పచ్చడి సమతుల పోషకాలు అందిస్తయాని అన్నారు డాక్టర్ చిరుమావిళ్ళ మురళీ మనోహార్. సాంప్రదాయ పద్దతిలో ఉగాది పచ్చడి కావాల్సిన పదార్ధాలు... **మట్టి పాత్ర,లేదా కుండ. **వేప పూత ఒక భాగం. **మామిడి పిందెలు  ముక్కలు రెండు భాగాలు.  . **చింత పండు,పా తది. నాలుగు భాగాలు. **ఉప్పు 5 భాగాలు. **బెల్లం ఆరు భాగాలు .ఇంకా అరిటి పండు ముక్కలు  అన్నీ కలిపి నీరు పోయాలి. పైన పేర్కొన్న కావాల్సిన పదార్ధాలలో  మధురం-తీపి  ఆమ్లం-పులుపు. లవణం-ఉప్పు . తి త్తం -చేదు. వగరు వంటి లక్షణాలు ఉంటాయి.ఇలా తయారు చేసిన వేప పచ్చడిని నింబ కుసుమ భక్షణం అని అంటారు.నింబ కుసుమము అంటే వేప పూత అని అర్ధం. మామిడి ముక్కలు,బెల్లము,పులుపు,చేదు వంటివి చింత పండు అరటి పండు,మిరియాలపొడి,ఉప్పు వంటివి వేసిన నింబ కుసుమ భక్షణం అంటే తింటే మరెన్నో లాభాలు ఔషద గుణాలు ఉన్నాయి.అని డాక్టర్ మురళీ మనోహర్ తెలుగు వన్ హెల్త్ కు వివరించారు. షడ్రసో పేతం ఉగాది పచ్చడి... ఉగాది పచ్చడిలో ఆరు రకాల రుచులు ఉంటాయని వాటిని షట్ రుచులుగా పేర్కొన్నారు.ఎందుకంటే జీవితానికి ఉగాదికి మానసిక సంబంధమైన సంబంధం ఉందని అంటారు చిరు మావిళ్ళ.అవును మనజీవితం లో తెలుగు వారికి తెలుగు సంవత్సరాది యుగ ఆది అంటే మరో యుగం నికి ఆది అంటే తొలి అడుగు. ఈ సమయం లో మనం ఎదుర్కునే ఎన్నోరకాల సమస్యలు ఒక్కో రుచిని సూచిస్తాయి. అన్ని సమపాళ్ళలో ఉంటె పచ్చడిని ఎలా అస్వాదిస్తామో.కస్టాలు,కడ గళ్ళు,ఆనందం,ఉత్సాహం, కష్టం,నష్టం, వచ్చినా మానసికంగా ఎదుర్కోడానికి మనల్ని సిద్ధం చేసేది ఉగాది అని అంటారు పండితులు.ఉగాది పచ్చడి ఔషద గుణాలు...వేప పువ్వు ,దీనిని బద్ర అని నింబ అని కూడా పిలుస్తారు. నిచిన, నిచినిండిన్ మార్గోసిన్ అనే పదార్ధాలు ఉంటాయని. వేప యాంటి ఫంగల్,యాంటి బ్యాక్టీరియాగా పని చేస్తుందని వేప  వల్ల వివిదరకాల జబ్బులను తగ్గించే గుణం వేపాకు ఉందని స్పష్టం చేసారు చిరుమవిళ్ళ మురళీ మనోహర్.వేపాలో తిత్త రసం ఉందని అంటే చెడు గుణం ఉన్నందున శరీరంలో వచ్చే కఫ,పిత్త దోషాన్ని తొలగించి ఆకలి పెంచుతుందని విశ్లేషించారు.వేపను తీసుకోవడం వల్ల ముఖ్యంగా డయాబెటీస్ ను నియంత్రించే గుణం వేపకు ఉందని వీటితో పాటు కామెర్లు,చర్మ సంబంధిత వ్యాధులను నివారిస్తుంది.పిల్లలకు వేపను తినిపించడం వల్ల కడుపులో ఉండే నులి పురుగులు చచ్చిపోతాయని కాబట్టి పిల్లకు మేలు చేస్తుందని.పేర్కొన్నారు. బెల్లం... ఉగాది పచ్చడికి కీలకమైన ఇంగ్రీడియంట్. బెల్లానికి తీపిగుణం ఉంటుంది. బెల్లానికి కఫం పెంచే గుణం ఉంది. బెల్లం ఉగాది నుంచి వాడితే కఫ దోషాన్ని తగ్గిస్తుంది. ఎండాకాలం లో వచ్చే ఎందవేదిమిని తట్టుకోడానికి ఎండబారిన పడ్డ వారికి నీ రసం  తగ్గించితక్షణ శక్తి నిచ్చేది గ్లుకోజ్ గా బెల్లం పనిచేస్తుంది.బెల్లం ఒక సువాసన,శ్రమ నీరసం తగ్గించి వడ దెబ్బ నుండి కాపాడే శక్తినిచ్చి ప్రోటీన్లను అందించేది బెల్లమే  అయితే బెల్లము అరిటి పండు కలిపి తీసుకుంటే మంచిదని అంటారు చిరుమామిళ్ళ. మామిడి ... ఉగాదిపచ్చడికి ఎన్ని ఉన్న మామిడి ముక్క పుల్లగా తగలనిదే పచ్చడికి రుచి ఉండదు. అని పెద్దలు అంటూ ఉంటారు.ముఖ్యంగా వేసవి కాలం లో చాలామంది కడుపు నొప్పి తో బాధ పడుతూఉంటారు.మామిదిపండులో ఉండే విటమిన్ సి మనలో ఇమ్యునిటీ పెంచుతుంది. మామిడి కాయ వల్ల గుండెజబ్బులు, డయాబెటిస్ రాకుండా నియంత్రిస్తుంది.  చింత పండు... దీనిని తెమరందన్ ఇండియా భారత దేశం లో అతి పురాతన మైన విటమిన్లు,పిండి పదార్ధాలు ఉంటాయి. చింతపండులో ముఖ్యంగా పాత చింత పండు ఉష్ణం తగ్గిస్తుంది. వాతాన్ని, బడలిక, జీర్ణ ప్రక్రియను సరి చేస్తుంది. శరీరంలో వచ్చే వేడి తగ్గించి చల్ల దానాన్ని ఇస్తుంది.ముఖ్యంగా చింత అంటే చింతలు తీర్చేది చింత రసం త్వరగా శక్తి నిస్తుంది.మూత్ర విసర్జన సాఫీగా సాగేట్లు సహకరిస్తుంది చింత రసం. అందుకు చింత పండు రసం వేసవి కాలం లో తీసుకోవడం అవసరమని నిపుణులు సూచిస్తున్నారు. ఉప్పు... ఉగాది పచ్చడి రుచిని పెంచేది చవి లేదా లవణం,ఉప్పు మన శరీర అవసరాలకు జీవన శక్తి నిచ్చేది లవణం. ఆహారం లో వేసే ఉప్పు ఆ వంటకు మంచి రుచిని ఇస్తుంది.ఉప్పు త్రిదోషాల ను హరిస్తుంది. అరటి పండు... అరటి పండు లో పోషక విలువలు పొటాషియం, యాంటి ఫంగల్, కూడా అరటి పండు పనిచేస్తుంది.అతిసారం నుండి రక్షించే సంజీవనిగా పేర్కొన్నారు వైద్యులు. అరటి పండు అధిక రక్త పోటు, కిడ్నీ సమస్యలు, రసాయనం గా పనిచేస్తుంది. ఇవి ఉగాది ఔషదం అధ్బుత ఫలితాలు ఉగాది పచ్చడి ఉగాది రోజే తీసుకోవాలా అప్పుడప్పుడూ తీసుకోవచ్చు అంటున్నారు. ముఖ్యంగా ఉగాది నుండి శ్రీరామ నవమి వరకు ఎప్పుడైనా తీసుకుంటే వేసవి కాలం లో ఎన్ని సార్లు తీస్జుకున్న తప్పులేదు. వ్యక్తిలో ఉండే త్రి దోషాల నుండి ముక్తి నిచ్చేది ఉగాది పచ్చడి.