LATEST NEWS
తెలుగువన్ ఎక్స్ క్లూజివ్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కుల సమీకరణాలు, ప్రత్యేకించి కాపు సామాజిక వర్గం చుట్టూ తిరుగుతున్న పరిణామాలు ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. వైసీపీ ఇటీవల నిర్వహించిన కాపు ఆత్మీయ సమావేశం, సాయికృష్ణ కేసును అడ్డం పెట్టుకుని కూటమి ప్రభుత్వంలో చిచ్చు పెట్టడానికి చేస్తున్న ప్రయత్నాలపై జనసేన పార్టీ ఘాటుగా స్పందించింది. తెలుగువన్ న్యూస్ తో ప్రత్యేకంగా మాట్లాడిన   జనసేన అధికార ప్రతినిధి కూసంపూడి శ్రీనివాస్  వైసీపీ యత్నాలపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.  వైసీపీ నేతలు అంబటి రాంబాబు, పేర్ని నాని వంటి వారు అసలైన కాపు నాయకులు కారని..  వారు కేవలం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బానిసలుగా పనిచేస్తున్నారని   శ్రీనివాస్ విమర్శించారు. గత ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్‌ను, ఆయన కుటుంబాన్ని బూతులు తిట్టించినప్పుడు ఈ నేతల ఆత్మగౌరవం ఎటు పోయిందని  ప్రశ్నించారు. జగన్ హయాంలో కాపు రిజర్వేషన్లను రద్దు చేసినప్పుడు, విదేశీ విద్యా దీవెన వంటి పథకాలను అణచివేసినప్పుడు నోరు మెదపని వీరు..  ఇప్పుడు హఠాత్తుగా కులప్రేమను ఒలకబోయడం హాస్యాస్పదంగా ఉందన్నారు. సాయికృష్ణ మిస్సింగ్ కేసును రాజకీయం చేయాలని వైసీపీ చూస్తోందనీ., కానీ ఈ కేసులో నిందితుడైన సీఐ నాగరాజు కూడా కాపు సామాజిక వర్గానికి చెందినవాడేనని గుర్తుచేశారు. తప్పు చేసిన వాడు ఏ కులానికి చెందినవాడైనా తప్పేనని, దానికి కులాన్ని అంటగట్టడం సరికాదని హితవు పలికారు. 14 ఏళ్ల మైనర్ బాలిక కుటుంబానికి అన్యాయం జరిగితే పరామర్శించని వైసీపీ నేతలు..  కేవలం రాజకీయ లబ్ధి కోసమే సభలు పెడుతున్నారని ఆరోపించారు. గత ఎన్నికల్లో కాపు సామాజిక వర్గం అత్యధికంగా ఉన్న నియోజకవర్గాల్లోనే ఈ వైసీపీ నేతలంతా ఘోరంగా ఓడిపోయారని, దీన్ని బట్టే కాపు యువత వీరిని నాయకులుగా అంగీకరించడం లేదనేది స్పష్టమవుతోందని  టట శ్రీనివాస్  పేర్కొన్నారు. చారిత్రకంగా కాపు సామాజిక వర్గం నుంచి ఎందరో మహానుభావులు సమాజానికి సేవలందించారని, కానీ కోడిగుడ్డు ఆమ్లెట్ కథలు చెప్పే అంబటి రాంబాబు, బియ్యం కేసుల్లో ఉన్న పేర్ని నాని వంటి వారిని నేటి తరం ఆదర్శంగా తీసుకోబోరని స్పష్టం చేశారు. కూటమి ప్రభుత్వంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రాష్ట్రాభివృద్ధి కోసం కట్టుబడి ఉన్నారన్న శ్రీనివాస్  ప్రజాప్రతినిధులు ఎవరైనా తప్పు చేస్తే ఉపేక్షించే ప్రసక్తే లేదని, ఇప్పటికే చంద్రబాబు నాయుడు కొందరు ఎమ్మెల్యేలకు గట్టి హెచ్చరికలు జారీ చేశారని గుర్తుచేశారు. కులాల గోడలు బద్దలు కొట్టి, రాష్ట్ర ప్రగతి కోసం జనరేషన్ జెడ్  ఆలోచనలకు అనుగుణంగా ముందుకెళ్లడమే కూటమి లక్ష్యమని పునరుద్ఘాటించారు. వైసీపీ ఆడుతున్న ఈ కుల రాజకీయ డ్రామాలను కాపు సామాజిక వర్గం గమనిస్తోందని, భవిష్యత్తులో వారికి తగిన బుద్ధి చెబుతుందని ముగించారు.
తెలుగువన్ ఎక్స్ క్లూజివ్ హైదరాబాద్‌లోని బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ రజతోత్సవ వేడుకల వేదికగా జరిగిన ఒక సంఘటన ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర రాజకీయ దుమారం రేపుతోంది. ఆసుపత్రి వ్యవస్థాపక దినోత్సవంలో క్యాన్సర్ నుండి కోలుకున్న స్వప్న అనే యువతి మాట్లాడిన మాటలను వక్రీకరిస్తూ వైసీపీ సోషల్ మీడియా విభాగం చేస్తున్న తప్పుడు ప్రచారాలపై ప్రముఖ నటుడు కిరాక్ ఆర్పీ తీవ్రస్థాయిలో మండిపడ్డారు.    సాక్ష్యాలతో సహా   వీడియోను ఆధారంతో అసలు వాస్తవాలను బహిర్గతం చేశారు. ఇటీవల జరిగిన బసవతారకం ఆసుపత్రి 25 ఏళ్ల వార్షికోత్సవానికి నందమూరి బాలకృష్ణతో పాటు పలువురు విశిష్ట అతిథులు హాజరయ్యారు. ఈ సందర్భంగా గతంలో క్యాన్సర్‌తో బాధపడి ఈ ఆసుపత్రిలో ఉచిత వైద్యం పొంది పూర్తిగా కోలుకున్న స్వప్న అనే అమ్మాయి వేదికపైకి  వచ్చి తన కృతజ్ఞతలు తెలిపింది.  నాకు అనారోగ్యంగా ఉన్నప్పుడు మా ఊరిలో  జగన్ సార్ మా ఇంటికి వచ్చి, బాలకృష్ణ సార్‌తో మాట్లాడించి నన్ను ఈ ఆసుపత్రిలో చేర్పించారు అని ఆమె పేర్కొంది.అయితే, ఆ అమ్మాయి నోట 'జగన్ సార్' అనే మాట రాగానే..  అది మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డేనంటూ వైఎసీపీ  సోషల్ మీడియా విభాగం పెద్ద ఎత్తున తప్పుడు ప్రచారానికి తెరలేపింది. ఆ అమ్మాయి ప్రాణాలు కాపాడింది వైఎస్ జగనేనంటూ ఫోటోలు మార్ఫింగ్ చేసి నెట్టింట పోస్టులు పెట్టారు. ఈ క్రెడిట్ చోరీపై కిరాక్ ఆర్పీ సాక్ష్యాలను చూపిస్తూ గట్టి కౌంటర్ ఇచ్చారు. ఆ అమ్మాయి చెప్పిన  జగన్ సార్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి కాదని, ఆయన అనంతపురానికి చెందిన  అనంతపురం జగన్  అని ఆర్పీ స్పష్టం చేశారు. నందమూరి కుటుంబానికి, ముఖ్యంగా నందమూరి బాలకృష్ణకు ఆయన దశాబ్దాలుగా వీరాభిమానిగా ఉన్నారని తెలిపారు.   ఎన్‌బీకే హెల్పింగ్ హ్యాండ్స్ సంస్థ ద్వారా బాలయ్య చేసే సేవా కార్యక్రమాల్లో ఆయన చురుగ్గా పాల్గొంటుంటారని వివరించారు.గతంలో అనంతపురం జిల్లాలో సదరు బాలిక క్యాన్సర్‌తో బాధపడుతున్న విషయం తెలుసుకున్న ఈ అభిమాని జగన్.. స్వయంగా ఆమె ఇంటికి వెళ్లి  పరామర్శించారు. ఆ వెంటనే బాలకృష్ణకు ఫోన్ చేసి విషయం చెప్పగా.. బాలయ్య చొరవ తీసుకుని ఆ అమ్మాయిని బసవతారకం ఆసుపత్రిలో చేర్పించి ఉచితంగా వైద్యం అందించారు. దీనికి సంబంధించిన పాత ఫోటోలను, బాలయ్య ఆ పాపను ఆసుపత్రిలో పరామర్శించిన విజువల్స్‌ను ఆర్పీ  చూపించారు. సొంత చెల్లిని, కన్నతల్లిని దూరం పెట్టి, బాబాయి మరణంపై రాజకీయం చేసిన వ్యక్తికి.. ఇలాంటి మానవతా కార్యక్రమాలతో ఏం సంబంధం ఉంటుందని ఆర్పీ ప్రశ్నించారు. ఏ చిన్న మంచి పని జరిగినా, వేరే వాళ్లు తెచ్చిన కంపెనీలైనా తమ ఖాతాలో వేసుకుని క్రెడిట్ కొట్టేయాలనుకోవడం  వైసీపీకి అలవాటుగా మారిందని ధ్వజమెత్తారు. రేపు ప్రపంచంలో  జగన్ అనే పేరున్న వాళ్లు ఏ మంచి పని చేసినా అది వైఎస్ జగనే చేశాడంటూ క్లెయిమ్ చేసుకునేలా ఉన్నారని ఎద్దేవా చేశారు. ఈ నిజాలు తెలుసుకోకుండా కేవలం పేరు ఒక్కటే చూసి వైసీపీ సోషల్ మీడియా బృందంక్రెడిట్ చోరీకి పాల్పడటం   సిగ్గుచేటని ఆర్పీ విమర్శించారు. ఇప్పటికైనా అబద్ధపు ప్రచారాలు మానుకోవాలని, వాస్తవాలను ప్రజలు గమనిస్తున్నారని ఆయన హితవు పలికారు. ప్రస్తుతం ఈ వ్యవహారం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.
తెలుగువన్ ఎక్స్ క్లూజివ్ విజయవాడ నగరంలో తీవ్ర సంచలనం సృష్టించిన గాదే సాయికృష్ణ మిస్సింగ్ కేసు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా పెను దుమారం రేపుతోంది. రోజుకో కొత్త మలుపు తిరుగుతున్న ఈ హైప్రొఫైల్ కేసులో తాజాగా కృష్ణలంక పోలీస్ స్టేషన్ సిఐ నాగరాజును పోలీసులు అరెస్టు చేయడం తీవ్ర కలకలం రేపింది. ఈ మిస్సింగ్ ఉదంతం వెనుక ఉన్న భయంకరమైన నిజాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తుండటంతో ఇటు లీగల్ వర్గాల్లోనూ, అటు రాజకీయ వర్గాల్లోనూ తీవ్ర ఉత్కంఠ నెలకొంది. అసలు సాయికృష్ణ మిస్సింగ్ వెనుక ఏం జరిగింది, ఒక పోలీస్ అధికారి అరెస్ట్ వరకు ఈ వ్యవహారం ఎందుకు దారితీసింది అనే కోణంలో విస్తుపోయే నిజాలు బయటపడుతున్నాయి. ఈ పరిణామంపై ప్రముఖ విశ్లేషకుడు భరద్వాజ్ తెలుగువన్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో వివరించారు.  ఈ కేసు తీవ్రతను గమనించిన కోర్టు ఇప్పటికే పోలీసు యంత్రాంగాన్ని గట్టిగా నిలదీసింది. సాయికృష్ణ తల్లి దాఖలు చేసిన పిటిషన్‌పై స్పందించిన న్యాయస్థానం, జూన్ 29వ తేదీ లోపు పూర్తి వివరాలతో కూడిన సమాధానాన్ని సమర్పించాలని పోలీసులను ఆదేశించింది. మరోవైపు ఈ ఉదంతం దేశ రాజధాని ఢిల్లీకి సైతం చేరింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ  ఎంపీలు తనూజ మరియు గురుమూర్తి ఇద్దరూ కలిసి   జాతీయ మానవ హక్కుల కమిషన్ కి అధికారికంగా ఫిర్యాదు చేశారు. దీంతో ఈ కేసు  స్థానిక పరిధిలోనే కాకుండా జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మారింది.  దీనిపై భరద్వాజ్.. సిఐ నాగరాజును అరెస్ట్ చేయకుండా తప్పించుకునే పరిస్థితి పోలీసు శాఖకు లేకుండా పోయిందన్నారు.   బాధిత తల్లితో సిఐ నాగరాజు మాట్లాడిన ఆడియో సంభాషణలు, ఆయన ప్రదర్శించిన దురుసు ప్రవర్తన ఇప్పటికే సామాజిక మాధ్యమాల్లో బహిర్గతమై ప్రపంచమంతటా సంచలనం సృష్టించాయన్నారు.  మీకు దిక్కున్న చోట చెప్పుకోండి అంటూ సీఐ బాధ్యతారాహిత్యంగా మాట్లాడిన తీరు ప్రజా బాహుళ్యంలో తీవ్ర ఆగ్రహాన్ని తెప్పించిందన్నారు. అయితే ఈ సింపతీని పక్కదారి పట్టించడానికి ఒక వ్యూహాత్మక నెరేటివ్ కూడా తెరపైకి వచ్చిందన్న ఆయన.. సాయికృష్ణపై గతంలో ఉన్న 23 క్రిమినల్ కేసుల రికార్డును ఎస్టాబ్లిష్ చేస్తూ, అతనొక ప్రమాదకరమైన గంజాయి పెడ్లర్ అనీ.. అతని వల్ల సమాజానికి ముప్పని ప్రచారం చేయడం ప్రారంభించారు. కృష్ణలంక ప్రాంతంలో మహిళలు రోడ్ల మీదకు వచ్చి కొవ్వొత్తుల ప్రదర్శన చేస్తూ సిఐ నాగరాజుకు మద్దతు తెలపడం ప్రత్యేకంగా గుర్తించాలన్నారు. గతంలో సురేంద్రబాబు  హయాంలో బుడ్డ శంతన్, పిల్లి దుర్గాప్రసాద్ ఎన్ కౌంటర్ల సమయంలో ఇలాంటి ప్రజా మద్దతు కనిపించినప్పటికీ, చట్టం ముందు ఇవేవీ నిలబడలేదని గుర్తు చేస్తూ ఇప్పుడూ అదే జరుగుతుందన్నారు. కేవలం ఒక పాత నాన్ బెయిలబుల్ వారెంట్ (ఎన్‌బిడబ్ల్యూ) అమలు కోసం తీసుకొచ్చిన వ్యక్తిని పోలీస్ స్టేషన్‌లో ప్రాణాలు పోయేలా కొట్టడం వెనుక ఏదో బలమైన రాజకీయ ఒత్తిడి లేదా మాఫియా ప్రమేయం ఉందని భరద్వాజ్ అన్నారు. సాయికృష్ణ తీవ్రమైన ఇంటరాగేషన్ తట్టుకోలేక మరణించాడని, ఆ తర్వాత అతని మృతదేహాన్ని ఎక్కడో గుర్తుతెలియని బస్టాప్ సమీపంలో అనాథ శవంగా దహనం చేసేశారని ప్రచారం జరుగుతోందనీ. కనీసం తల్లికి బూడిద కూడా దక్కకుండా సాక్ష్యాధారాలను పూర్తిగా తుడిచిపెట్టేయడం వెనుక పెద్ద నెట్‌వర్క్ ఉందన్న అనుమానాలు వ్యక్తం చేశారు. ఈ ఘోరం వెనుక కేవలం సిఐ నాగరాజు ఒక్కరే లేరని, మొత్తం ఇంటరాగేషన్ టీమ్ కానిస్టేబుళ్లు కూడా ఉన్నారని, అయితే స్టేషన్ హౌస్ ఆఫీసర్‌గా సిఐ కేంద్రబిందువు అయ్యారని భరద్వాజ్ అన్నారు.  ఈ మొత్తం వ్యవహారం వెనుక ఆంధ్రప్రదేశ్‌ను పట్టిపీడిస్తున్న గంజాయి, డ్రగ్స్ సిండికేట్ లింకులు ఉన్నాయన్నారు. కేవలం నైజీరియన్లు లేదా సినిమా వాళ్లే కాకుండా, స్థానిక పొలిటికల్ లీడర్ల అండదండలతో ఈ డ్రగ్ నెట్‌వర్క్ భారీ ఆర్థిక వనరుగా నడుస్తోందని విశ్లేషకులు చెబుతున్నారు. గతంలో గంగవరం పోర్టులో దొరికిన 4 కంటైనర్ల డ్రగ్స్ ఉదంతం లాగే, ఈ సాయికృష్ణకు కూడా కీలకమైన పొలిటికల్ డ్రగ్ లింకులు ఏమైనా తెలిసి, బ్లాక్‌మెయిల్ చేయడానికి ప్రయత్నించడం వల్లే ఈ హత్య జరిగిందా అనే కోణంలో దర్యాప్తు సాగాలన్నారు. ప్రస్తుతం ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం  ఈ కేసును లోతుగా విచారించి, రాజకీయ ఒత్తిళ్లకు లొంగకుండా నిజాలను బయటపెట్టాలని,  సిఐ నాగరాజు నుంచి నేర అంగీకార వాంగ్మూలం (కన్ఫెషన్ స్టేట్‌మెంట్) తీసుకుని, కేసును ఆయనతోనే ముగించేయడానికి తెరవెనుక ప్రయత్నాలు జరుగుతున్నట్లు భరద్వాజ అనుమానం వ్యక్తం చేశారు. 
హైదరాబాద్‌లోని ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ నానక్‌రామ్‌గూడలో ఉన్న అమెరికా కాన్సులేట్ రోడ్డుకు  డొనాల్డ్ ట్రంప్ అవెన్యూగా నామకరణం చేయడం ఇప్పుడు  రాజకీయ వర్గాల్లో  చర్చనీయాంశంగా మారింది. అగ్రరాజ్యం అమెరికాకు స్వాతంత్య్రం వచ్చి 250 ఏళ్లు పూర్తవుతున్న సందర్భాన్ని పురస్కరించుకుని తెలంగాణ ప్రభుత్వం ఈ ప్రత్యేక గౌరవాన్ని కల్పించింది.  ఫ్రీడమ్ 250 పేరిట   నిర్వహించిన  వేడుకకు అమెరికా అంబాసిడర్ సెర్జియో గోర్, తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.  వీరిద్దరూ కలిసి  ఆ రోడ్డు  డొనాల్డ్ ట్రంప్ అవెన్యూకు సంబంధించిన  శంకుస్థాపన శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ఇరు దేశాల మధ్య వ్యూహాత్మక బంధాన్ని పటిష్టం చేసే వేదికగా ఈ కార్యక్రమం నిలిచింది. అయితే..  ఈ శిలాఫలకంపై  ఉపముఖ్యమంత్రి  భట్టి విక్రమార్క పేరు ఎక్కడా కనిపించలేదు. ఈ వింత పరిస్థితిని గమనించిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆశ్చర్యానికి గురయ్యారు. ఎంతో ఉత్సాహంగా కార్యక్రమానికి వచ్చిన ఆయన, ఆ శిలాఫలకంపై తన పేరు లేకపోవడంతో  నిరాశకు లోనయ్యారు.  మరోవైపు, ఈ రోడ్డు నామకరణంపై రాజకీయంగా కూడా పెద్ద దుమారమే రేగుతోంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ గతంలో డొనాల్డ్ ట్రంప్ విధానాలను, ముఖ్యంగా భారత్‌పై విధిస్తున్న వాణిజ్య సుంకాలను తీవ్రంగా విమర్శించారని బీజేపీ జాతీయ ప్రతినిధి షెహజాద్ పూనావాలా గుర్తు చేశారు. రాహుల్ గాంధీ అమెరికా అధ్యక్షుడిని భారత వ్యతిరేకిగా చిత్రీకరిస్తుంటే..  తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం ఆయన పేరు  ఏకంగా ఒక రోడ్డుకు పెట్టి అత్యున్నత గౌరవాన్ని ఇవ్వడం ఏంటని నిలదీశారు. రాహుల్ హిపోక్రసీ ప్రో మాక్స్ అని ఎద్దేవా చేశారు. గతంలో అదానీ గ్రూపుపై రాహుల్ విమర్శలు చేసినప్పటికీ..  సీఎం రేవంత్ రెడ్డి అదానీతో ఒప్పందాలు చేసుకున్నారని, ఇప్పుడు ట్రంప్ విషయంలోనూ రేవంత్ రెడ్డి అసలు రాహుల్ గాంధీ మాటలను ఏమాత్రం లెక్కచేయడం లేదని బీజేపీ విమర్శలు గుప్పించింది. కమ్యూనిస్ట్ పార్టీలు కూడా ఈ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఈ వివాదాలు ఎలా ఉన్నప్పటికీ, తెలంగాణ , అమెరికా మధ్య వాణిజ్య, సాంకేతిక సంబంధాలు కొత్త శిఖరాలకు చేరుతున్నాయని ఈ వేడుక స్పష్టం చేసింది. ఈ ప్రాంతం నుంచి జరుగుతున్న ఐటీ, ఏరోస్పేస్,  డిఫెన్స్ రంగాలు ద్వైపాక్షిక సంబంధాలను శాసిస్తున్నాయని అమెరికా అంబాసిడర్ సెర్జియో గోర్ ప్రశంసించారు. మిషన్ ఇండియా' చొరవ,  తాత్కాలిక వాణిజ్య ఒప్పందాల ద్వారా అమెరికాలోకి ఏకంగా 20 బిలియన్ డాలర్లు, అంటే భారత కరెన్సీలో  1.66 లక్షల కోట్ల రూపాయలు కొత్త పెట్టుబడులు రాబోతున్నాయని ఆయన ఈ సందర్భంగా  వెల్లడించారు.  అమెరికా ఫస్ట్ అంటే అమెరికా ఒంటరిగా ఉండటం కాదన్నారు. ట్రంప్ పేరు పెట్టడంపై హర్షం వ్యక్తం చేస్తూ..  తెలంగాణ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ విధంగా ఒకవైపు అంతర్జాతీయ పెట్టుబడుల జోరు, మరోవైపు ప్రోటోకాల్ వివాదాలు,  రాజకీయ విమర్శలతో  డొనాల్డ్ ట్రంప్ అవెన్యూ   రాష్ట్రంలో హాట్ టాపిక్‌గా నిలిచింది.
  కాంగ్రెస్ నేతల పనితీరుపై ముఖ్యమంత్రి అసంతృప్తి.. తెలంగాణ రాజకీయాల్లో ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ ఇప్పుడు అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. ఎన్నికల సంఘం చేపడుతున్న 'స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్' (SIR) ప్రక్రియను కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఎవరూ కూడా తేలికగా తీసుకోవద్దని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అత్యంత తీవ్రంగా హెచ్చరించారు.  ఈ ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో ఏమాత్రం నిర్లక్ష్యం వహించినా, భవిష్యత్తు ఎన్నికల్లో ఊహించని రాజకీయ పరిణామాలు మరియు భారీ నష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుందని ఆయన స్పష్టం చేశారు. గాంధీ భవన్‌లో జరిగిన టీపీసీసీ ఆన్‌లైన్ సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, టీపీసీసీ అధ్యక్షుడు బి. మహేష్ కుమార్ గౌడ్ మరియు ఏఐసీసీ ఇన్-ఛార్జ్ మీనాక్షి నటరాజన్‌లతో కలిసి పార్టీ శ్రేణులకు దిశా నిర్దేశం చేశారు. అనుమానాస్పదంగా ఉన్నాయనే నెపంతో అర్హులైన నిజమైన ఓటర్ల పేర్లను జాబితా నుండి తొలగించే ప్రమాదం ఉందని, దీనిపై గ్రామ మరియు బూత్ స్థాయిలో ప్రతి ఒక్కరూ అత్యంత అప్రమత్తంగా ఉండాలని సీఎం పిలుపునిచ్చారు. ఈ సవరణ ప్రక్రియ ద్వారా అక్టోబర్ 2026 నాటికి తుది ఓటర్ల జాబితా ఖరారు కానుంది. ఈ అక్టోబర్ 2026 నాటి జాబితాయే 2028 లో జరగబోయే సాధారణ అసెంబ్లీ ఎన్నికలకు అత్యంత కీలకమైన ఆధారం కానుందని ముఖ్యమంత్రి గుర్తు చేశారు. ఇప్పుడు ఒక్క ఓటు కోల్పోయినా, భవిష్యత్తులో దాన్ని సరిదిద్దడం మరియు తిరిగి చేర్చడం అత్యంత కష్టతరమైన పనని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.  గతంలో కాంగ్రెస్ పార్టీ కేవలం 90 రోజుల్లోనే మొత్తం 45 లక్షల డిజిటల్ సభ్యత్వాలను విజయవంతంగా నమోదు చేసి రికార్డు సృష్టించిందని, ఆనాడు బూత్ స్థాయిలో చురుగ్గా పనిచేసిన ఎన్‌రోలర్ల సేవలను ఇప్పుడు కూడా ఈ SIR ప్రక్రియ కోసం పూర్తి స్థాయిలో ఉపయోగించుకోవాలని ఆదేశించారు. రాష్ట్రంలోని మొత్తం 119 అసెంబ్లీ నియోజకవర్గాలు మరియు 17 లోక్‌సభ నియోజకవర్గాల్లో పటిష్టమైన పర్యవేక్షణ వ్యవస్థను ఏర్పాటు చేయాలని ఆయన సూచించారు. ముఖ్యంగా, హైదరాబాద్‌ నగర పరిధిలోని 15 అసెంబ్లీ నియోజకవర్గాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, వీటి పర్యవేక్షణ బాధ్యతలను రాజ్యసభ సభ్యులు మరియు ఎమ్మెల్సీలకు అప్పగిస్తున్నట్లు వెల్లడించారు.   ఉపాధి కోసం తాత్కాలికంగా వేరే ప్రాంతాలకు వలస వెళ్లిన పేదలు, గిరిజనులు, దళితులు, మైనారిటీలు మరియు మహిళా ఓటర్ల పేర్లు కేవలం వారు వెరిఫికేషన్ సమయంలో ఇళ్లలో లేరనే కారణంతో ఓటర్ల జాబితా నుండి తొలగించబడకుండా చూసుకోవాల్సిన బాధ్యత బూత్ లెవెల్ ప్రతినిధులదేనని సీఎం స్పష్టం చేశారు. ప్రతి గ్రామంలోనూ బూత్ లెవెల్ అధికారులతో (BLO) నిరంతరం సమన్వయం చేసుకుంటూ ఓట్ల తొలగింపును అడ్డుకోవాలన్నారు.  ఈ ప్రక్రియను వేగవంతం చేసేందుకు మరియు నియోజకవర్గాల వారీగా పర్యవేక్షించేందుకు జూన్ 20 లోగా జిల్లా ఇన్-ఛార్జ్ మంత్రులు సంబంధిత నియోజకవర్గ ఇన్-ఛార్జ్‌లతో సమీక్షా సమావేశాలు పూర్తి చేయాలని డెడ్‌లైన్ విధించారు. సమస్యలను తక్షణమే పరిష్కరించేందుకు వీలుగా గాంధీ భవన్‌లో ప్రత్యేకంగా ఒక 'వార్ రూమ్' ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. ప్రజాప్రతినిధులు, మంత్రులు, ఎమ్మెల్యేలు మరియు కార్పొరేషన్ ఛైర్మన్లు ప్రతి 10 రోజులకు ఒక రోజు చొప్పున, తాను సైతం నెలకు 3 రోజులు పూర్తిగా పార్టీ సంస్థాగత బలోపేతం మరియు క్షేత్రస్థాయి పరిశీలన కోసం కేటాయిస్తానని రేవంత్ రెడ్డి ఈ సందర్భంగా స్పష్టం చేశారు.    
ALSO ON TELUGUONE N E W S
  శంకరాభరణం(sankarabharnam).. తెలుగు ప్రేక్షకుల మనసుల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన అత్యంత విలువైన ప్రాపర్టీ. స్టార్ హీరో, స్టార్ కాస్టింగ్ లేకుండా ఓన్లీ కథ, కథనాన్ని, సంగీతాన్ని మాత్రమే నమ్ముకొని వచ్చిన శంకరా భరణం అమరత్వాన్ని నింపుకున్న మూవీగా కూడా నిలిచింది. అసలు బ్రిటిష్ వాళ్ళు మనల్ని పరిపాలించే రోజుల్లో 'శంకరాభరణం'. వచ్చి ఉండి, సదరు బ్రిటిష్ వాళ్ళు మూవీని వీక్షించి ఉంటే కనుక స్వాతంత్య్రాన్ని ఇచ్చి వెళ్లే వాళ్ళు అనే మాట కూడా శంకరాభరణం మూవీ లవర్స్ లో ఉంది. గత కొన్నిరోజులుగా సినీ మార్కెట్ లో  ఏ ఇద్దరు సినీ ప్రియులు కలిసినా 'శంకరాభరణం' గురించి మాట్లాడుకుంటున్నారు. వాళ్ళ మాటల్లో 'శంకరా భరణం లాంటి మూవీ మళ్ళీ వస్తుందా!   మన ఇండస్ట్రీ ఆ దిశగా ఏమైనా ఆలోచనలు వేస్తుందా! అలాంటి మూవీ రావాలంటే ఎవరు పూనుకోవాలి!. ఒక వేళ పూనుకొని శంకరాభరణం లాంటి కథ, కథనంతో కూడిన చిత్రాలు వస్తే సినీ ప్రేమికులంతా అదృష్టవంతులు ఉండరని మాట్లాడుకుంటున్నారు. Also read: డైరెక్ట్ తెలుగు మూవీలో ప్రదీప్ రంగనాథన్.. డైరెక్టర్ ఎవరో తెలిస్తే ఈల వేస్తారు  ఫిబ్రవరి 2 1980 న అంటే నాలుగున్నర దశాబ్దాల క్రితం 'శంకరాభరణం' మూవీ రిలీజ్ అయ్యింది. శాస్త్రీయ సంగీతానికి ఉన్న గొప్పతనాన్ని చాటి చెప్పడంతో పాటు ఇద్దరు వ్యక్తుల మధ్య ఏర్పడే ప్రేమ, త్యాగం అనేవి శారీరక సుఖం కోసమే ఏర్పడవనే సత్యాన్ని సమాజానికి చాలా బలంగా చాటి చెప్పింది. ఆ మూగ, దైవ ప్రేమే 'శంకరాభరణం' చూసిన  ప్రతి తెలుగు వాడి హృదయంలోకి చొరబడి  నేటికీ  తిష్ట వేసాయి. టీవీల్లో చూసిన  వాళ్ళు, చూస్తున్న పరిస్థితి కూడా అదే.  ఎన్నో రికార్డులు, అవార్డులు సొంతం చేసుకున్న  శంకరా భరణంకి సంబంధించిన అందరు తెలుగు ప్రేక్షకుల బంధువులే.  
After building a strong market among Telugu audiences with back-to-back successful releases in the Telugu states, Tamil actor-director Pradeep Ranganathan now appears to be preparing for his first straight Telugu film. Industry reports suggest that the young star is in discussions to headline a project to be directed by filmmaker Chandrasekhar Yeleti. What makes the reported development interesting is the contrast in styles. Pradeep has become popular for his youthful energy, humour and contemporary storytelling, while Yeleti has built a reputation for crafting intelligent, concept-driven films such as Aithe, Anukokunda Oka Roju, Sahasam and Manamantha. According to circulating reports, the project is being planned as an action thriller and could be backed by Mythri Movie Makers. If materialised, the film is expected to be mounted as a bilingual venture targeting both Telugu and Tamil markets. However, an official confirmation from the production house or the team is still awaited. The timing also makes the speculation noteworthy. Pradeep’s popularity has expanded beyond Tamil cinema following the performance of films like Love Today, Dragon and Dude, turning him into one of the most watched young actors in the South market. If the project goes on floors, it would mark Yeleti’s return with a fresh-age leading man and also open a new phase in Pradeep Ranganathan’s career with a direct entry into Telugu cinema. For now, all eyes are on whether this unusual but exciting combination becomes official.   Disclaimer: This article is based on discussions and information shared across publicly available sources and social media. Interpretations remain those of the users involved. Readers are encouraged to exercise discretion before drawing conclusions.
  పాన్ ఇండియా అగ్ర సంస్థ మైత్రి మూవీ మేకర్స్(Mytri Movie Makers)తమిళ హీరో ప్రదీప్ రంగనాథన్(Pradeep ranganathan)తో డ్యూడ్ మూవీ చేసిందంటే ప్రదీప్ స్టామినాని అర్ధం చేసుకోవచ్చు. ప్రదీప్ కూడా తన పెర్ఫార్మ్ తో సౌత్ ఇండియా మొత్తాన్ని తన వైపు తిప్పుకొని ఇప్పుడు డైరెక్ట్ గా తెలుగు ప్రాజెక్ట్ చేయబోతున్నాడు. టాలీవుడ్ వర్సటైల్ డైరెక్టర్ చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వంలో ఒక భారీ ప్రాజెక్ట్ అధికారికంగా ఖరారైంది. ఈ మోస్ట్ యాంటిసిపేటెడ్ క్రేజీ చిత్రాన్ని టాలీవుడ్ టాప్ ప్రొడక్షన్ హౌస్ మైత్రీ మూవీ మేకర్స్ నే  నిర్మించబోతోంది. ఇప్పటివరకు డబ్బింగ్ సినిమాలతోనే తెలుగు ప్రేక్షకులని  ఎంతగానో అలరించిన ప్రదీప్ రంగనాథన్ నటిస్తున్న మొదటి 'స్ట్రెయిట్ తెలుగు సినిమా' (Straight Telugu Debut) ఇదే కావడం విశేషం. ప్రదీప్ రంగనాథన్ కేవలం నటుడిగానే కాకుండా దర్శకుడిగా, రైటర్‌గా తన ప్రతిభను నిరూపించుకున్నారు. బాక్సాఫీస్ వద్ద ఆయన సృష్టించిన వసూళ్ల సునామీ అంతా ఇంతా కాదు. 'లవ్ టుడే' (Love Today), 'డ్రాగన్' (Dragon), మరియు మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలోనే వచ్చి ప్రపంచవ్యాప్తంగా రూ. 114 కోట్లకు పైగా వసూలు చేసిన 'డ్యూడ్' (Dude) చిత్రాలతో వరుసగా మూడు సార్లు రూ. 100 కోట్ల క్లబ్‌లో చేరి తిరుగులేని హిట్స్ అందుకున్నారు. ట్రేడ్ వర్గాల ప్రకారం ఈ మూడు బ్యాక్-టు-బ్యాక్ రూ. 100 కోట్ల మైలురాళ్ళు ప్రదీప్‌ను సౌత్ ఇండస్ట్రీలోనే మోస్ట్ బ్యాంకబుల్ యంగ్ స్టార్‌గా నిలబెట్టాయి. ఇప్పుడు అదే జోష్‌తో తెలుగు మార్కెట్ పై కన్నేసిన ఈ యంగ్ హీరో, చంద్రశేఖర్ యేలేటి లాంటి కల్ట్ డైరెక్టర్‌తో చేతులు కలపడం టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. చంద్రశేఖర్ యేలేటి అంటేనే తెలుగు సినిమాలో ఒక ప్రత్యేకమైన బ్రాండ్. 'ఐతే', 'అనుకోకుండా ఒక రోజు', 'సాహసం', 'మనమంతా' వంటి సినిమాలతో టాలీవుడ్‌లో మైండ్ గేమ్‌లు, విభిన్నమైన సస్పెన్స్ స్క్రీన్‌ప్లేలకు ఆయన పెట్టింది పేరు. కమర్షియల్ హంగులకు దూరంగా ఉంటూనే ప్రేక్షకులను థ్రిల్ చేసే యేలేటి మార్క్ సరికొత్త స్క్రిప్ట్‌కు, ప్రదీప్ రంగనాథన్ మార్క్ యూత్‌ఫుల్ ఎనర్జీ మరియు కామెడీ టైమింగ్ తోడైతే థియేటర్లలో వినోదాల విధ్వంసం ఏ రేంజ్‌లో ఉంటుందో ఊహించుకోవడానికే మెగా క్రేజీగా ఉంది. ఈ చిత్రం ఒక హై-వోల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్ జోనర్‌లో రూపుదిద్దుకోబోతున్నట్లు సమాచారం. Also read: Og 2: ఓజి 2 లో ఉండబోయే కథ ఇదే   ఈ భారీ ప్రాజెక్ట్‌కి  సంబంధించిన కథా చర్చలు, ప్రీ-ప్రొడక్షన్ పనులు ప్రస్తుతం శరవేగంగా జరుగుతున్నాయి. స్క్రిప్ట్ పనులు పూర్తిగా లాక్ అయ్యాయని, మిగతా నటీనటులు మరియు సాంకేతిక నిపుణుల ఎంపిక ప్రక్రియ తుది దశకు చేరుకుందని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. మైత్రీ మూవీ మేకర్స్ ఈ ఇద్దరు విలక్షణ ప్రతిభావంతులను ఒకే ఫ్రేమ్‌లోకి తీసుకురావడంతో అంచనాలు ఆకాశాన్ని తాకాయి. ఈ క్రేజీ ప్రాజెక్ట్ యొక్క రెగ్యులర్ షూటింగ్ ఈ ఏడాది సెప్టెంబర్ నెల నుండి ప్రారంభం కానుందని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ప్రదీప్ రంగనాథన్ ఎనర్జీ, చంద్రశేఖర్ యేలేటి ఇంటెలిజెన్స్, మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణ విలువలు.. ఈ ముగ్గురి కలయిక బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులను సృష్టించడం ఖాయంగా కనిపిస్తోంది.    
   పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan)స్టైలిష్ గ్యాంగ్‌స్టర్ డ్రామా 'OG' (og)సృష్టించిన  సంచలనం  తెలిసిందే. ఎంటైర్ పవన్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలవడంతో పాటు 300 కోట్ల క్లబ్ లోకి కూడా చేరింది. ఈ భారీ విజయంతో పవర్ స్టార్ అభిమానుల్లో పూనకాలు తెప్పించిన దర్శకుడు సుజీత్, ఇప్పుడు అంతకు మించిన విధ్వంసానికి తెరలేపారు. గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో వినిపిస్తున్న ఊహాగానాలకి  తెరదించుతూ ఈ రోజు  ‘OG 2’ చిత్రాన్ని అధికారికంగా ప్రకటిస్తూ హై ఎనర్జీ వీడియోని  విడుదల చేసింది. ఈ అప్‌డేట్‌తో టాలీవుడ్‌లో ఒక్కసారిగా ప్రకంపనలు మొదలయ్యాయి. "తుఫాను రావడానికి ముందు.. అక్కడ కొంత నిశ్శబ్దం ఉంటుంది. ఓజాస్ గంభీర యొక్క అన్‌టోల్డ్ స్టోరీ ఇప్పుడు విప్పబడటానికి సిద్ధంగా ఉంది" అంటూ పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్ వేదికగా షేర్ చేసిన వీడియో సోషల్ మీడియాని  షేక్ చేస్తోంది. ఈ క్రేజీ ప్రాజెక్ట్‌ని పవన్ కళ్యాణ్ స్వయంగా తన సొంత నిర్మాణ సంస్థ ‘పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్’ పతాకంపై నిర్మిస్తుండటం గమనార్హం. ఈ ప్రత్యేక వీడియోలో దర్శకుడు సుజీత్, పవన్ కళ్యాణ్‌కు ‘OG 2’ స్క్రిప్ట్ లైన్ మరియు సరికొత్త ‘OG Universe’ ఐడియాలను వివరిస్తూ కనిపించారు. సుజీత్ చెప్తున్న పవర్‌ఫుల్ సీక్వెన్స్‌లని పవన్ ఎంతో ఆసక్తితో వింటూ ప్రశ్నలు అడుగుతూ, చర్చల్లో మునిగిపోయారు. ఈ వీడియో చివర్లో పవన్ కళ్యాణ్ దర్శకుడితో మాట్లాడుతూ "నా వైపు నుండి నువ్వు ఏం కోరుకున్నా నేను రెడీగా ఉన్నాను (Whatever from my side will be ready)" అని చెప్పిన డైలాగ్ ఇప్పుడు ఇంటర్నెట్‌లో విపరీతంగా ట్రెండ్ అవుతోంది. అంతేకాదు, సుజీత్ రాసుకున్న ఒక నిర్దిష్ట సీన్‌ని  విన్న పవన్.. అది వెండితెరపై ఒక ఐకానిక్ విజువల్‌గా నిలిచిపోతుందని ప్రశంసించారు. ఈ సీక్వెల్‌లో కథ కేవలం పార్ట్ 2 కి మాత్రమే పరిమితం కాకుండా, ఒక భారీ ‘OG సినిమాటిక్ యూనివర్స్’గా విస్తరించబోతోందని స్పష్టమైంది. ఈ చిత్రంలో మంచు క్రమంగా రక్తంగా మారే ఒక అద్భుతమైన సీన్‌తో పాటు, ఒక రహస్యమైన ‘అవుట్‌సైడర్’ పాత్ర మరియు ఓజీ పెట్ (పెంపుడు జంతువు) ప్రాధాన్యత గురించి సుజీత్ ప్రత్యేకంగా వివరించారు. సినిమా ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం, ‘OG 2’ చిత్రం కేవలం సీక్వెల్ మాత్రమే కాదు, ఓజాస్ గంభీర గతానికి సంబంధించిన ఒక ఇంటెన్స్ ప్రీక్వెల్ బ్యాక్‌డ్రాప్‌ని  కూడా కలిగి ఉండబోతోంది. ముఖ్యంగా జపాన్ నేపథ్యంలో గంభీర సృష్టించిన అసలు రక్తాక్షరాల విద్వంసం ఏమిటి? అతను ముంబై అండర్‌వరల్డ్‌ను శాసించే అంత పెద్ద గ్యాంగ్‌స్టర్‌గా ఎలా ఎదిగాడు? అనే కోణాల్లో ఈ కథ నడవనుంది. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ ముఖ్యమంత్రిగా తన రాజకీయ బాధ్యతలతో ఎంతో బిజీగా ఉన్నప్పటికీ, అభిమానుల కోరిక మేరకు ఈ చిత్రానికి కాల్షీట్లు సర్దుబాటు చేయనున్నారు. నవంబర్ తర్వాత పవన్ కళ్యాణ్ ఈ క్రేజీ ప్రాజెక్ట్ షూటింగ్‌లో పాల్గొనే అవకాశం ఉంది. థమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం టాలీవుడ్‌లో సరికొత్త రికార్డులను తిరగరాయడం ఖాయంగా కనిపిస్తోంది.    
  సమంత(Samantha)మా ఇంటి బంగారం సక్సెస్ జోష్ లో ఉంది. ఐదు రోజులకే 50 కోట్ల క్లబ్ లోకి కూడా చేరడంతో సమంత కట్ అవుట్ కి ఉన్న కెపాసిటీ ఏ పాటిదో మరో సారి  అర్ధమవుతుంది. ఈ మూవీ సక్సెస్ మీట్ వేడుక హైదరాబాద్‌లో అత్యంత వైభవంగా జరగగా, సదరు ఈవెంట్ లో సమంత మాట్లాడిన రిలేషన్‌షిప్స్, బంధాలు, ఒక వ్యక్తికి  ఉండాల్సిన ఆత్మవిశ్వాసంపై చేసిన కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియా వ్యాప్తంగా పెను సంచలనాన్ని సృష్టిస్తున్నాయి. ఈ వ్యాఖ్యలు నేరుగా అక్కినేని నాగచైతన్య భార్య, నటి శోభిత ధూళిపాళ గతంలో చేసిన కొన్ని స్టేట్‌మెంట్స్‌కి  కౌంటర్‌గా ఉన్నాయంటూ నెటిజన్లు పెద్ద ఎత్తున చర్చించుకుంటున్నారు. ఈ సక్సెస్ మీట్ ఇంటర్వ్యూలో సమంత మాట్లాడుతు 'ఒక బంధం నిలబడాలంటే ఇద్దరి భాగస్వామ్యం సమానంగా ఉండాలి. మన కెరీర్, మన రిలేషన్‌షిప్ అనేవి మన చేతుల్లోనే ఉన్నా కూడా  కొన్ని బంధాలు చాలా సంక్లిష్టంగా మారుతుంటాయి. ఒక బంధాన్ని విజయవంతంగా ముందుకు తీసుకెళ్లడానికి ఇద్దరు వ్యక్తులు కావాలి. అందుకే కొన్నిసార్లు అది మన చేతుల్లో ఉండదు. ముఖ్యంగా మహిళలు వేరొకరిపై ఆధారపడకుండా తమపై తాము నమ్మకం కలిగి సంపూర్ణమైన వ్యక్తిగా ఎదగాలి. జీవితంలో ఎదురయ్యే అతి తక్కువ స్థాయి లేదా కష్ట సమయాల్లో మనకి  మనమే బెస్ట్ ఫ్రెండ్‌గా నిలబడాలి. వేరొకరు వచ్చి మన జీవితాన్ని భర్తీ చేస్తారని ఆశించడం వల్ల బంధాలపై అనవసరమైన ఒత్తిడి పెరుగుతుందని సమంత  పేర్కొంది. Also read: Ajay Devgn: అజయ్ దేవ్‌గన్ కొత్త మూవీ చౌహన్.. పఠాన్ లతో చెప్పండి సమంత చేసిన ఈ కామెంట్స్ బయటకు రాగానే నెటిజన్లు, అభిమానులు .ఈ ఏడాది ప్రారంభంలో విడుదలైన నాగచైతన్య, శోభిత ధూళిపాళ(Sobhita dhulipala)వెడ్డింగ్ వీడియోలోని శోభిత వ్యాఖ్యలతో దీనిని పోల్చడం ప్రారంభించారు. ఆ వీడియోలో శోభిత మాట్లాడుతూ ఒక వ్యక్తి ఒంటరిగా ఉన్నప్పుడు అసంపూర్ణంగా ఉంటాడని, మరొకరు జీవితంలోకి వచ్చి ఆ వెలితిని పూరించినప్పుడే జీవితం పరిపూర్ణం అవుతుందని నేను నమ్ముతాను. చైతు తన జీవితంలో లేకపోతే తాను సంపూర్ణంగా ఉండలేనని పేర్కొంది. సరిగ్గా ఈ వ్యాఖ్యలకు భిన్నంగా సమంత.. "ఎవరికి వారు ఒంటరిగానూ సంపూర్ణులే, వేరొకరి వల్ల మనం పరిపూర్ణమవ్వాల్సిన అవసరం లేదు" అనే కోణంలో మాట్లాడటంతో ఇరు వర్గాల అభిమానుల మధ్య సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున కౌంటర్ల యుద్ధం నడుస్తోంది.    
  బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవ్‌గన్( Ajay Devgn)చిరకాలం నుంచే తెలుగు ప్రేక్షకులకి సుపరిచయస్తుడు. ఆర్ ఆర్ ఆర్ తో అయితే తెలుగు వారి అభిమాన నటుడుగా మారాడు. యాక్షన్ హీరో అనే టాగ్ లైన్ తో దూసుకుపోతున్న అజయ్ దేవ్ గన్   ప్రముఖ దర్శకుడు, నిర్మాత ఆనంద్ ఎల్ రాయ్ తో తన కొత్త మూవీ చేస్తున్నాడు.  ఇప్పుడు ఆ  చిత్రానికి 'చౌహాన్' (Chauhaan) అనే టైటిల్‌ని  అధికారికంగా ప్రకటించారు. జియో స్టూడియోస్, కలర్ ఎల్లో ప్రొడక్షన్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ టైటిల్ అనౌన్స్‌మెంట్ వీడియో నెట్టింట ట్రెండ్ అవుతోంది. ఈ చిత్రానికి మరో ప్రత్యేకత ఉంది. దిగ్గజ స్టంట్ కొరియోగ్రాఫర్, అజయ్ దేవ్‌గన్ తండ్రి దివంగత వీరూ దేవ్‌గన్ జయంతి సందర్భంగా ఈ టైటిల్ గ్లింప్స్‌ను విడుదల చేస్తూ మేకర్స్ ఆయనకి  ఘన నివాళులు అర్పించారు. . అజయ్ దేవ్‌గన్ రగ్గడ్, ఇంటెన్స్ లుక్, బ్యాక్‌గ్రౌండ్‌లో వచ్చే వార్ ఎలిమెంట్స్  అంచనాలని ఒక్కసారిగా స్కై హైకి తీసుకెళ్లాయి. కథాంశం విషయానికి వస్తే  2018 పుల్వామా ఉద్రిక్తతల నేపథ్యంలో, దేశ రక్షణ కోసం పోరాడే పవర్‌ఫుల్ ఆర్మీ ఆఫీసర్ గా అజయ్ దేవ్‌గన్ కనిపించనున్నాడు  .  వీడియో టీజర్‌లో దేశ భద్రతకి సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన గణాంకాలని  ప్రస్తావించారు. దేశంలో దాదాపు 15 లక్షల మంది సైనికులు ఉన్నప్పటికీ, రక్షణ రంగం కోసం సుమారు 35,000 కోట్లు పెట్టుబడి పెడుతున్నప్పటికీ, సరిహద్దుల్లో ఉగ్రవాదులని , తిరుగుబాటుదారులని  అణచివేయడం ఎంత కష్టమైన సవాలుగా మారిందో వాయిస్ ఓవర్ ద్వారా వివరించారు. కన్నీటి వాయువు (Tear Gas), వాటర్ కెనాన్లు, పెల్లెట్ గన్స్ వంటి సాధారణ శాంతిభద్రతల చర్యలు విఫలమైన చోట 'చౌహాన్' ఎలా రంగంలోకి దిగాడనేది కథాంశంగా చూపించబోతున్నారు. Also read: vishnu vishal: ఫేస్ మారిపోయే వ్యాధితో బాధపడుతున్న హీరో విష్ణు విశాల్.. ఎమోషనల్ పోస్ట్ వైరల్ వీడియో చివర్లో అజయ్ దేవ్‌గన్ తన ట్రేడ్‌మార్క్ గంభీరమైన గొంతుతో చెప్పిన డైలాగ్ థియేటర్లలో ఈలలు వేయించడం ఖాయంగా కనిపిస్తోంది. బ్యాక్‌గ్రౌండ్‌లో ఐకానిక్ సాంగ్ 'జుమ్మా చుమ్మా దే దే' మ్యూజిక్ వినిపిస్తుండగా, "పఠాణ్‌లతో చెప్పండి.. చౌహాన్ వస్తున్నాడు. అజయ్ దేవ్‌గన్ చెప్పిన పవర్ ప్యాక్డ్ పంచ్‌లైన్ సోషల్ మీడియాలో భారీ హైప్ క్రియేట్ చేస్తోంది. నీరజ్ యాదవ్ కథని అందిస్తూ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. జ్యోతి దేశ్‌పాండే, ఆనంద్ ఎల్ రాయ్, హిమాన్షు శర్మ కలిసి అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ చిత్రంలో మొహమ్మద్ జీషాన్ అయ్యూబ్ కీ రోల్ లో చేస్తున్నాడు.అజయ్ దేవ్‌గన్ కెరీర్‌లోనే వన్ ఆఫ్ ది బెస్ట్ యాక్షన్ డ్రామాగా నిలిచిపోతుందని బాలీవుడ్ ట్రేడ్ వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి. 2027 అక్టోబర్ 1 న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేయనున్నట్లు చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది.  
The excitement surrounding Allu Arjun and Lokesh Kanagaraj’s ambitious collaboration, tentatively titled AA23, appears to be entering a new phase. Industry reports suggest that the team has planned a large-scale trial shoot in Mumbai, with Allu Arjun expected to travel to the city to participate in the exercise. The development comes amid increasing curiosity around one of Indian cinema’s most anticipated combinations. Unlike a conventional look test or promotional photo session, the reported activity is being described as a full-fledged trial shoot designed to test the visual grammar, styling approach and technical scale envisioned for the project. Sources indicate that the exercise is being mounted in a much bigger format than standard pre-production rehearsals. AA23 has already generated enormous anticipation ever since the collaboration between Allu Arjun and Lokesh Kanagaraj was officially announced. Backed by Mythri Movie Makers with music by Anirudh Ravichander, the film is positioned as one of the biggest projects currently in development. Interestingly, this update also arrives after recent speculation surrounding the project’s status, with multiple reports reiterating that the film remains active and continues to move ahead through scripting and pre-production stages. If the Mumbai schedule indeed goes as planned, fans may finally get the first indications of the scale and visual identity Lokesh Kanagaraj is preparing for Allu Arjun’s next cinematic chapter. Disclaimer: This article is based on discussions and information shared across publicly available sources and social media. Interpretations remain those of the users involved. Readers are encouraged to exercise discretion before drawing conclusions.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun), డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ (Lokesh Kanagaraj) కాంబినేషన్‌లో ఒక భారీ చిత్రం రూపుదిద్దుకోబోతున్న సంగతి తెలిసిందే. ఈ క్రేజీ కాంబో అనౌన్స్ అయినప్పటి నుంచే సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకాయి. తాజాగా ఈ మోస్ట్ అవేటెడ్ ప్రాజెక్ట్ #AA23 కి సంబంధించి సోషల్ మీడియాలో ఒక సెన్సేషనల్ న్యూస్ వైరల్ అవుతోంది. సాధారణంగా ఏ సినిమాకైనా షూటింగ్ ప్రారంభించే ముందు లేదా ఫస్ట్ లుక్ రిలీజ్ చేసే ముందు నటీనటులపై సాధారణ ఫోటోషూట్ నిర్వహిస్తుంటారు. కానీ ఈ ప్రతిష్టాత్మక చిత్రం కోసం సరికొత్తగా సరిహద్దులను బ్రేక్ చేస్తూ చిత్ర బృందం ఏకంగా ఒక భారీ ట్రయల్ షూట్‌కు ప్లాన్ చేసింది. బాలీవుడ్ హబ్ అయిన ముంబై నగరంలో ఈ స్పెషల్ ట్రయల్ షూట్ రేపటి నుంచే ప్రారంభం కానుండడం విశేషం. ఈ అప్‌డేట్ ప్రకారం, ఇది కేవలం నటీనటుల లుక్స్ చెక్ చేయడానికి చేసే మామూలు ఫోటోషూట్ మాత్రం కాదు. లోకేష్ కనగరాజ్ తన సినిమాల్లో విజువల్స్, యాక్షన్ సీక్వెన్సులకు ఎంత ప్రాధాన్యత ఇస్తారో అందరికీ తెలిసిందే. అందుకే ఈ సినిమా కోసం విజువల్ ఎఫెక్ట్స్, లైటింగ్, క్యారెక్టర్ మేకోవర్‌ను అత్యున్నత స్థాయిలో పరీక్షించేందుకు ఒక బిగ్గర్ స్కేల్ ట్రయల్ షూట్‌ను ముంబైలో డిజైన్ చేశారు. ఈ ట్రయల్ షూట్‌లో అల్లు అర్జున్ డిఫరెంట్ లుక్‌లో కనిపించబోతున్నారని, ఆయన మేకోవర్ ఫ్యాన్స్‌ను థ్రిల్ చేయడం ఖాయమని ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి. లోకేష్ కనగరాజ్ తన విలక్షణమైన మేకింగ్ స్టైల్‌తో ఈ సినిమాను గ్లోబల్ స్టాండర్డ్స్‌లో తెరకెక్కించేందుకు ఇప్పటి నుంచే గ్రౌండ్ వర్క్ పక్కాగా సిద్ధం చేసుకుంటున్నారు. పుష్ప చిత్రంతో పాన్ ఇండియా స్థాయిలో తిరుగులేని క్రేజ్ సొంతం చేసుకున్న అల్లు అర్జున్, లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ (LCU)తో సౌత్ ఇండియాలోనే కాక దేశవ్యాప్తంగా సంచలనాలు సృష్టిస్తున్న లోకేష్ కనగరాజ్ కలిసి పని చేస్తుండడంతో ఈ ప్రాజెక్ట్ ట్రేడ్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ముంబైలో జరగబోయే ఈ భారీ స్కేల్ ట్రయల్ షూట్ ద్వారా ఈ సినిమా విజువల్ వండర్‌గా నిలవబోతోందనే సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ ముంబై ట్రయల్ షూట్ ముగిసిన తర్వాత సినిమాకు సంబంధించిన మరిన్ని కీలక వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.  
అక్కినేని హీరో అఖిల్ (Akhil Akkineni) నటిస్తున్న తాజా చిత్రం ‘లెనిన్’ (Lenin) ప్రస్తుతం టాలీవుడ్‌లో హాట్ టాపిక్ గా మారింది. ఈ మూవీ జూలై 10న విడుదలకు సిద్ధమవుతోంది. దర్శకుడు మురళీ కిషోర్ అబ్బూరి సరికొత్త కథాంశంతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. అఖిల్ కెరీర్ లోనే ఇది ఒక వైవిధ్యమైన చిత్రంగా నిలుస్తుందని చిత్ర యూనిట్ మొదటి నుండి ఎంతో నమ్మకంగా చెబుతోంది. అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఫిలిం నగర్ సర్కిల్స్ లో ఒక క్రేజీ అప్‌డేట్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. థియేటర్లలో అక్కినేని అభిమానులకు గూస్‌బంప్స్ తెప్పించే రేంజ్ లో ఒక సర్ప్రైజ్ ఎలిమెంట్ ని మేకర్స్ ప్లాన్ చేసినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ సినిమాలో టాలీవుడ్ కి చెందిన ఒక స్టార్ హీరో పవర్‌ఫుల్ గెస్ట్ రోల్ లో కనిపించబోతున్నారనే వార్త ఇప్పుడు ఇండస్ట్రీలో సంచలనం సృష్టిస్తోంది. సినిమా కథను మలుపు తిప్పే కీలకమైన సెకండాఫ్ లో ఈ సర్‌ప్రైజ్ ఎంట్రీ ఉండబోతోందని సమాచారం. దాదాపు 10 నుండి 15 నిమిషాల పాటు సాగే ఈ అతిథి పాత్ర సినిమాకే హైలైట్ గా నిలుస్తుందని, థియేటర్లలో ఫ్యాన్స్ కి పూనకాలు రావడం ఖాయమని ఇన్ సైడ్ టాక్ వినిపిస్తోంది. ఈ గెస్ట్ రోల్ కి సంబంధించిన వివరాలను చిత్రబృందం ఎంతో రహస్యంగా ఉంచినప్పటికీ, అక్కినేని అభిమానుల్లో మాత్రం ఈ సర్ప్రైజ్ గెస్ట్ ఎవరై ఉంటారా అనే ఉత్కంఠ రోజురోజుకూ పెరిగిపోతోంది. ఈ ఒక్క ఎలిమెంట్ సినిమా రేంజ్ ని మార్చేస్తుందని ట్రేడ్ వర్గాలు సైతం భావిస్తున్నాయి. మరోవైపు ఈ సినిమాలో అఖిల్ సరసన భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా నటిస్తోంది. వీరిద్దరి కాంబినేషన్ వెండితెరపై సరికొత్త మ్యాజిక్ క్రియేట్ చేయబోతోందని తెలుస్తోంది. ముఖ్యంగా అఖిల్-భాగ్యశ్రీ మధ్య వచ్చే లవ్ సీన్స్ సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. కేవలం యాక్షన్ మాత్రమే కాకుండా యూత్ ని ఆకట్టుకునే లవ్ ఎమోషన్స్ కూడా ఈ సినిమాలో పుష్కలంగా ఉన్నాయట. సినిమా ఫైనల్ అవుట్‌పుట్‌పై చిత్రబృందం పూర్తి నమ్మకంతో ఉన్నారు. మరి ఈ పవర్‌ఫుల్ సర్‌ప్రైజ్ ఎలిమెంట్ తో అఖిల్ అక్కినేని ఈసారి బాక్సాఫీస్ వద్ద బిగ్ హిట్ దక్కించుకుంటాడేమో చూడాలి.  
    -హీరో విష్ణు విశాల్ షాకింగ్ ట్వీట్  -ఫేస్ మారిపోవడానికి కారణం అదే  -మూడు సంవత్సరాలపై నుంచే ఆ వ్యాధితో బాధపడుతున్నాను  వెరీ టాలెంటెడ్ తమిళ హీరో విష్ణు విశాల్(vishnu vishal).. తెలుగు ప్రేక్షకులకి కూడా సుపరిచితుడు. ఆయన నటించిన ఎన్నో వైవిధ్యమైన చిత్రాలు తెలుగులోకి అనువాదమై మంచి విజయాన్ని అందుకున్నాయి. ముఖ్యంగా దగ్గుబాటి రానాతో కలిసి చేసిన  'అరణ్య' సినిమాతో పాటు, సూపర్ హిట్ యాక్షన్ థ్రిల్లర్ 'ఎఫ్‌ఐఆర్' వంటి చిత్రాలతో టాలీవుడ్‌లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. కేవలం సినిమాల పరంగానే కాకుండా, హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ అంతర్జాతీయ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి గుత్తా జ్వాలను ప్రేమించి వివాహం చేసుకోవడంతో ఆయన తెలుగు రాష్ట్రాల అల్లుడిగా ఇక్కడి ఆడియెన్స్‌కి  మరింత చేరువయ్యారు. కొన్ని రోజులుగా విష్ణు విశాల్ ఆరోగ్యంపై సోషల్ మీడియాలో రకరకాల రూమర్లు షికారు చేస్తున్నాయి. ఆయన శారీరక రూపం మారిపోవడం, ముఖంలో తీవ్రమైన అలసట కనిపించడంతో అభిమానులు ఎంతో ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో, తన ఆరోగ్యంపై వస్తున్న వదంతులకి పుల్ స్టాప్ వేస్తూ విష్ణు విశాల్ ఈ రోజు సోషల్ మీడియా వేదికగా  ఒక ఎమోషనల్ నోట్‌షేర్ చేశాడు.  తన పోస్ట్‌లో పేర్కొంటూ, "అందరికీ హాయ్.. అన్నిటికంటే ముందుగా మీ కామెంట్స్, మెసేజుల ద్వారా మీరు చూపిన అపారమైన ప్రేమకి , నా ఆరోగ్యం పట్ల మీరు చూపిస్తున్న శ్రద్ధకి  నా మనస్ఫూర్తి కృతజ్ఞతలు. మీ నుంచి లభిస్తున్న ఈ మద్దతు నాకు నిజంగా ఎంతో విలువైనది. అందుకే ఏ విషయాన్నీ దాచకుండా నా ఆరోగ్య పరిస్థితిని మీ అందరితోను నేరుగా పంచుకోవాలనుకుంటున్నాను. ఈ మధ్యకాలంలో నా ముఖం చాలా అలసిపోయినట్లు, కాస్త వాచినట్లు కనిపిస్తోందని మీలో చాలామంది గమనించి మెసేజ్‌లు చేశారు. ఆ మార్పులకు గల అసలు కారణాన్ని ఇప్పుడు మీకు తెలియజేస్తున్నాను. నేను గత మూడు నుంచి నాలుగు సంవత్సరాలుగా 'ఆటో ఇమ్యూన్' (Autoimmune) అనే  వ్యాధితో పోరాడుతున్నాను. ఈ వ్యాధి చికిత్సలో భాగంగా వైద్యులు నాకు కొన్ని ప్రత్యేకమైన మందులని  సూచించారు. దాంతో వాటిని వాడుతు ఉన్నాను. అయితే, ఆ బలమైన మందుల వాడకం వల్ల నా శరీరంలో కొన్ని స్పష్టమైన సైడ్ ఎఫెక్ట్స్  కనిపిస్తున్నాయి. ప్రస్తుతం నా ముఖంలో కనిపిస్తున్న ఉబ్బరం, విపరీతమైన నీరసం ఆ మందుల ప్రభావం వల్ల వచ్చినవే. ప్రస్తుత పరిస్థితుల్లో వైద్యపరంగా ఈ చికిత్సని  కొనసాగించడం నాకు ఎంతో అవసరం. అన్నిటికంటే ముఖ్యంగా నా ఆరోగ్యానికి మొదటి ప్రాధాన్యత ఇవ్వాల్సిన సమయం ఇది" అని విష్ణు విశాల్ భావోద్వేగానికి లోనయ్యారు. Also read: khushbu: గోవాలో ఖుష్బూ కుమార్తె డెస్టినేషన్ వెడ్డింగ్ 'నా జీవితంలో ఎదురైన ఈ క్లిష్ట సమయంలో మీరంతా చూపిస్తున్న ప్రేమ, అభిమానం నన్ను మానసికంగా  ముందుకు నడిపిస్తున్నాయి. నా తదుపరి చిత్రం 'గట్ట కుస్తీ 2' (తెలుగులో మట్టి కుస్తి 2) కోసం రాత్రింబగళ్లు అవిశ్రాంతంగా పనిచేసిన చిత్ర యూనిట్ సభ్యుల పట్ల నాకు ఎంతో బాధ్యత ఉంది. వారి కష్టాన్ని గౌరవిస్తూ, నా ఆరోగ్యం సహకరించకపోయినా సరే  ప్రమోషన్లలో  పాల్గొంటున్నాను. నా బాధ్యతని  సక్రమంగా నిర్వర్తించాలనే ఉద్దేశంతోనే అలసటను సైతం లెక్కచేయకుండా ప్రేక్షకుల ముందుకు వస్తున్నాను. త్వరలోనే నా ఆరోగ్యం పూర్తిగా మెరుగుపడుతుందని నమ్ముతున్నాను. నాపై మీకున్న భయం, ఆందోళన నన్ను నేను మరింత జాగ్రత్తగా చూసుకోవడానికి ఎంతో ప్రోత్సహించాయి. వచ్చే జూలై 3వ తేదీన థియేటర్లలో విడుదల కాబోతున్న 'గట్ట కుస్తీ 2' ని  మీ అందరితో కలిసి చూడటం కోసం నేను ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను. కష్టకాలంలో నాకు అండగా నిలిచిన ప్రతి ఒక్కరికీ పేరుపేరునా ధన్యవాదాలు" అంటూ తన  ట్వీట్ లో తెలిపాడు.  
కూరల రుచిని పెంచడం నుండి సలాడ్‌ల వరకు టమోటాలను అన్నింటికీ ఉపయోగిస్తారు. చాలామంది కూరగాయల కంటే టయోటాలే ఎక్కువ కొనుగోలు చేస్తుంటాయి. అయితే  వేసవి కాలంలో టమోటాలను ఒకేచోట నిల్వ చేయడం వల్ల అవి ఎక్కువుగా  కుళ్ళిపోతాయి.  ఇది చాలా మంది ఎదుర్కునే  సాధారణ సమస్య. వాటిని సరిగ్గా నిల్వ చేయడం ద్వారా పాడవకుండా నివారించవచ్చు. అందుకోసం టమాటాలను ఎలా నిల్వ చేయాలి తెలుసుకుంటే.. పచ్చి టమాటాలు.. టమాటా పూర్తిగా పండకపోయినా, ఇంకా కొంచెం గట్టిగా ఉంటే, దానిని గది ఉష్ణోగ్రత వద్ద నిల్వ చేసుకోవచ్చు. పండని టమాటాలను డైరెక్ట్ సన్ లైట్ కు  దూరంగా ఉంచాలి. పచ్చి గా ఉన్నవి, పూర్తీగా  పండని టమాటాలను ఫ్రిజ్‌లో నిల్వ చేయకూడదు. దీనివల్ల అవి  రుచిని కోల్పోయి, సరిగ్గా పండకుండా ఉంటాయి. పండిన టమోటాలు.. టమోటాలు పూర్తిగా పండి, ఎర్రగా ఉంటే, అవి గట్టిగా ఉంటే..  వాటిని గది ఉష్ణోగ్రత వద్ద కౌంటర్‌పై నిల్వ చేయాలి.  ఈ టమోటాలను 1 నుండి 2 రోజుల వరకు ఉపయోగించవచ్చు. టమోటాలను కాడ భాగం కిందికి ఉండేలా నిల్వ చేయాలి. దీనివల్ల కాడ చుట్టూ ఉన్న తేమ బయటకు పోతుంది , అవి త్వరగా వాడిపోకుండా  ఉంటాయి. టమోటాలను ఒకదాని మీద ఒకటి కాకుండా అన్నింటికి పక్కన పక్కన ఉంచి నిల్వ చేయాలి. బాగా పండిన టమోటాలు.. టమోటాలు బాగా పండితే పాడైపోతాయని చాలామంది భయపడతారు. వాటిని రిఫ్రిజిరేటర్‌లోని చల్లదనంలో ఉంచడం వల్ల పండే ప్రక్రియ నెమ్మదిస్తుంది. రిఫ్రిజిరేటర్ నుండి తీసిన వెంటనే టమోటాలను తినకూడదు. అవి గది ఉష్ణోగ్రతకు వచ్చినప్పుడు మాత్రమే తినాలి. ఇవి గుర్తుంచుకోవాలి.. టమోటాలను కడగకుండా, ఆరబెట్టకుండా ప్లాస్టిక్ సంచులలో నిల్వ చేయకూడదు. దీనివల్ల అవి త్వరగా పాడైపోతాయి. టమోటాలు పండినప్పుడు, అవి ఇథిలీన్ వాయువును విడుదల చేస్తాయి. అందువల్ల, బాగా పండిన టమోటాలను ఎక్కువగా ఒకేచోట నిల్వ చేయడం వల్ల అవి త్వరగా పాడైపోతాయి. టమోటాలను అతి చల్లని ఉష్ణోగ్రతలలో నిల్వ చేయడం వాటి రుచిని పాడు చేస్తుంది. దీనివల్ల వాటి తొక్క బలహీనపడి, మరింత త్వరగా పాడైపోతాయి.                                         *రూపశ్రీ.
ప్రేమలో ఒక్కసారి మోసపోయినా.. మోసపోయిన వ్యక్తి కుంగిపోతాడు. ఆ మోసం వల్ల కలిగే బాధ నుండి కోలుకోవడానికి చాలా కాలం పడుతుంది. ప్రేలో మోసపోయినా, ఇతరుల చేతుల్లో మోసపోయినా ఒకసారి జరిగితే దాన్ని పొరపాటుగా అనుకోవచ్చు. కానీ  కొందరు ప్రేమలో పదేపదే మోసపోతుంటారు. ఇలా పదే పదే  జరిగే మోసాలు దురదృష్టం వల్ల కాకుండా మనిషి చేసే  పొరపాటు వల్ల జరుగుతాయి. కొన్నిసార్లు, మనం తెలియకుండానే చేసే పొరపాట్లు పదేపదే మోసాలకు దారితీయవచ్చు. ప్రేమలో పదే పదే మోసపోయే వారు చేసే పొరపాట్లు ఏమిటో.. ఎందుకు జరుగుతాయో.. వివరంగా తెలుసుకుంటే.. హెచ్చరికలు.. ప్రేమలో మోసపోతున్నారని చెప్పడానికి కొన్ని వార్నింగ్ సిగ్నల్స్ తెలుస్తూ ఉంటాయి.  అబద్దాలు చెప్పడం, వింతగా ప్రవర్తించడం,  విషయాలు దాచడం,కేవలం మాటలు చెప్పడం,  చేతల్లో ఏమీ ఉండకపోవడం వంటివి ప్రేమలో మోసపోవడానికి హెచ్చరికలు. ఇవన్నీ చేసే వ్యక్తి ఏదో ఒకరోజు మోసం చేసే అవకాశం ఉంటుంది. ప్రాధాన్యత.. భాగస్వామిని సంతోషపెట్టాలనే కోరికలతో ఆత్మగౌరవాన్ని వదిలి  తమను తాము తక్కువగా అంచనా వేసుకుంటే, అవతలి వ్యక్తి  తేలికగా తీసుకుంటారు. అందుకే తమను తాము ఎప్పుడూ  ప్రేమించుకుని, గౌరవించుకోవాలి. అది జరగనంత వరకు  అవతలి వ్యక్తి  విలువ ఇవ్వరు.  భాగస్వామి  విలువ ఇవ్వనప్పుడు,  ఎప్పుడైనా మోసం చేయగలరు. అందుకే సెల్ఫ్ రెస్పెక్ట్, సెల్ఫ్ లవ్ చాలా కీలకం. తొందరపాటు నిర్ణయాలు.. చాలాసార్లు, గతంలో  విడిపోవడం వల్ల కలిగిన బాధను తగ్గించుకోవడానికి లేదా తుడిచివేయడానికి,  ఆలోచించకుండా కొత్త సంబంధాలను వెతుక్కుంటారు.  సంబంధంలోకి వెళ్లడానికి  ఎప్పుడూ తొందరపడకూడదు, ఎందుకంటే ఇది  అవతలి వ్యక్తిపై మానసికంగా ఆధారపడేలా చేస్తుంది. గుడ్డి నమ్మకం..  భాగస్వామిని గుడ్డిగా నమ్మడం సరికాదు. ఒక సంబంధంలో ఓపెన్ గా మాట్లాడుకోవడం చాలా అవసరం.  భాగస్వామిని గుడ్డిగా కాకుండా, తార్కికంగా నమ్మాలి. ఏ సంబంధంలోనైనా నమ్మకం కాలక్రమేణా ఏర్పడుతుంది. భాగస్వామిని గుడ్డిగా నమ్మితే, మోసపోవచ్చు.                                     *రూపశ్రీ.
ఈ రోజుల్లో ప్రేమలు, వివాహ బంధాలు ఎందుకు ఎక్కువగా విఫలమవుతున్నాయి? ప్రేమలో నమ్మకం, పరస్పర అవగాహన, స్వేచ్ఛ ఎంత ముఖ్యమో ఈ వీడియోలో సి. కళ్యాణ్ వివరంగా చర్చించారు. బ్రేకప్‌ల వెనుక ఉన్న అసలు కారణాలు ఏమిటి? బంధాలను బలంగా నిలబెట్టుకోవడానికి ఏం చేయాలి? వంటి అంశాలపై ఆసక్తికరమైన విశ్లేషణను తెలుసుకోండి.
ప్రస్తుత జీవనశైలిలో అధిక బరువు మరియు బెల్లీ ఫ్యాట్ సమస్యలు చాలా మందిని ఇబ్బంది పెడుతున్నాయి. ఎంత డైట్ చేసినా, ఎంత వ్యాయామం చేసినా ఆశించిన ఫలితాలు రాకపోవడంతో చాలామంది నిరుత్సాహానికి గురవుతున్నారు. అలాంటి వారికి ఉపయోగపడే కొన్ని సహజమైన ఆయుర్వేద చిట్కాలను ప్రముఖ ఆయుర్వేద వైద్య నిపుణుడు డా. చిట్టిబొట్ల మధుసూదన శర్మ ఈ వీడియోలో వివరించారు.  శరీరంలో పేరుకుపోయిన అదనపు కొవ్వును తగ్గించడానికి ఆహారపు అలవాట్లు, జీవనశైలి, జీర్ణవ్యవస్థ పనితీరు వంటి అంశాలు కీలక పాత్ర పోషిస్తాయని ఆయన చెబుతున్నారు.  అలాగే బరువు తగ్గాలంటే కేవలం మందులు లేదా ఇంటి చిట్కాలపై మాత్రమే ఆధారపడకుండా, సరైన ఆహారం, క్రమం తప్పని శారీరక వ్యాయామం, తగినంత నిద్ర కూడా అవసరమని నిపుణులు సూచిస్తున్నారు. ఆరోగ్యకరమైన జీవనశైలితో పాటు సహజమైన ఆయుర్వేద పద్ధతులను అనుసరించడం ద్వారా మెరుగైన ఫలితాలు పొందవచ్చని ఈ వీడియోలో తెలుసుకోవచ్చు.  బెల్లీ ఫ్యాట్ తగ్గించుకోవాలని, శరీరాన్ని ఫిట్‌గా ఉంచుకోవాలని కోరుకునే ప్రతి ఒక్కరూ తప్పక చూడాల్సిన ఆరోగ్య అవగాహన వీడియో ఇది. మీ ఆరోగ్య సమస్య ఏదైనా... మా హెల్త్ యూట్యూబ్ ఛానల్‌లో సీనియర్ డాక్టర్స్ చెప్పిన సలహాలు... సూచనలు ఉన్నాయి. మా యూట్యూబ్ ఛానల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 👉 TeluguOne Health సబ్‌స్క్రైబ్ చేయడం మర్చిపోకండి!
నేటికాలంలో వేగవంతమైన జీవనశైలి , సరైన ఆహారపు అలవాట్లు లేకపోవడం వల్ల, బరువు పెరగడం ప్రజలకు ఒక పెద్ద సమస్యగా మారుతోంది. ఊబకాయం  శారీరక దృఢత్వాన్ని ప్రభావితం చేయడమే కాకుండా, మధుమేహం, అధిక రక్తపోటు, గుండె జబ్బులు , అనేక ఇతర తీవ్రమైన అనారోగ్యాల ప్రమాదాన్ని కూడా పెంచుతుంది. అధిక బరువు వల్ల ఆరోగ్యానికి ప్రమాదం అని తెలుసుకున్న తర్వాత చాలామంది బరువు తగ్గడానికి చాలా ప్రయత్నాలు చేస్తారు. కానీ కొన్నిసార్లు తప్పుడు ఆహారం , తీవ్రమైన వ్యాయామాలు శరీరానికి హాని కలిగిస్తాయి. కానీ బరువు తగ్గాలని అనుకునేవారు దినచర్యలో కొన్ని సాధారణ, ఆరోగ్యకరమైన అలవాట్లను చేర్చుకోవడం ద్వారా  నెమ్మదిగా , సురక్షితంగా బరువు తగ్గవచ్చు.  అవేంటో తెలుసుకుంటే.. గోరు వెచ్చని నీరు.. రోజును గోరువెచ్చని నీటితో ప్రారంభించడం బరువు తగ్గే ప్రక్రియను మెరుగుపరచడానికి ఒక సులభమైన,  ప్రభావవంతమైన మార్గం. ఇది శరీర జీవక్రియను ఉత్తేజపరిచి, జీర్ణ వ్యవస్థ మెరుగ్గా పనిచేయడానికి సహాయపడుతుంది. ఉదయం ఖాళీ కడుపుతో నీళ్లు తాగడం వల్ల శరీరం నుండి విషపదార్థాలు తొలగిపోయి, రోజంతా శరీరం చురుకుగా ఉంటుంది. నడక.. బరువు తగ్గడంలో శారీరక శ్రమ ఒక ముఖ్యమైన భాగం. ప్రతిరోజూ 30 నిమిషాల పాటు చురుకుగా నడవడం వల్ల కేలరీలు ఖర్చవుతాయి , శరీరం ఆరోగ్యంగా ఉంటుంది.   ఇది అన్ని వయసుల వారు తమ దినచర్యలో చేర్చుకోగలిగే ఒక సులభమైన వ్యాయామం అవుతుంది. క్రమం తప్పకుండా నడవడం గుండె ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తుంది. స్వీట్స్, జంక్ ఫుడ్.. బరువు పెరగడానికి చక్కెర , ప్రాసెస్ చేసిన ఆహారాలు ప్రధాన కారణాలలో ఒకటి, ఇవి శరీరంలో కొవ్వు వేగంగా పేరుకుపోవడానికి కారణమవుతాయి. వీటికి బదులుగా,  ఆహారంలో పండ్లు, సలాడ్‌లు, డ్రై ఫ్రూట్స్ , ఆరోగ్యకరమైన స్నాక్స్‌ను చేర్చుకోవాలి. ఇది బరువు తగ్గడానికి సహాయపడటమే కాకుండా శరీరానికి అవసరమైన పోషకాలను కూడా అందిస్తుంది. నిద్ర.. నిద్రలేమి బరువు పెరగడానికి ఒక ప్రధాన కారణం కావచ్చని వైద్యులు చెబుతున్నారు. నిద్రలేమి హార్మోన్ల అసమతుల్యతకు దారితీస్తుంది, దీనివల్ల ఆకలి, పదే పదే తినాలనే కోరిక, జంక్ ఫుడ్స్, స్వీట్స్ తినాలనే కోరిక పెరుగుతుంది.  ప్రతిరోజూ 7 నుండి 8 గంటల పాటు చక్కగా నిద్రపోవడం వల్ల శరీరం కోలుకుంటుంది , బరువు అదుపులో ఉంటుంది. నీరు.. తగినంత నీరు త్రాగడం బరువు తగ్గే ప్రక్రియను వేగవంతం చేస్తుంది.   నీరు శరీరాన్ని తేమగా ఉంచి, అనవసరమైన ఆకలిని తగ్గిస్తుంది. చాలాసార్లు శరీరం దాహాన్ని ఆకలిగా పొరబడుతుంది, అందువల్ల క్రమం తప్పకుండా నీరు త్రాగడం ముఖ్యం. క్వాంటిటీ.. బరువు తగ్గాలంటే, మీరు ఏమి తింటున్నారు అనేదే కాదు, ఎంత తింటున్నారు అనేది కూడా ముఖ్యం. సమతుల్య ఆహారాన్ని కొద్దికొద్దిగా తినడం వల్ల, కేలరీల వినియోగం అదుపులో ఉంటుంది , శరీరంలో కొవ్వు పేరుకుపోదు.  ఇది జీర్ణక్రియను మెరుగుపరిచి, శక్తి స్థాయిని స్థిరంగా ఉంచుతుంది.                                       *రూపశ్రీ.
ప్రస్తుత జీవనశైలిలో సమయానికి ఆహారం తీసుకోకపోవడం, ఎక్కువగా బయట ఆహారం తినడం, ఒత్తిడి, నిద్రలేమి వంటి కారణాల వల్ల గ్యాస్, అజీర్తి, కడుపు ఉబ్బరం వంటి సమస్యలు సాధారణంగా కనిపిస్తున్నాయి. ఈ సమస్యలు చిన్నవిగా అనిపించినా రోజువారీ జీవితాన్ని ప్రభావితం చేస్తాయి. ఈ ఆరోగ్య అవగాహన వీడియోలో ఆయుర్వేద వైద్య నిపుణుడు Dr. Murali Manohar Chirumamilla గ్యాస్ సమస్యలకు ప్రధాన కారణాలు ఏమిటి, జీర్ణవ్యవస్థ సరిగా పనిచేయకపోతే శరీరంపై ఎలాంటి ప్రభావం పడుతుంది అనే అంశాలను వివరంగా చెబుతున్నారు. అలాగే గ్యాస్ సమస్యను తగ్గించేందుకు ఉపయోగపడే కొన్ని ఆయుర్వేద గృహచిట్కాలు, ఆహార నియమాలు, జీర్ణశక్తిని పెంచే అలవాట్లు గురించి కూడా సూచనలు అందిస్తున్నారు.  ఈ వీడియోలో తెలుసుకునే ముఖ్యాంశాలు: కడుపులో గ్యాస్ ఏర్పడడానికి కారణాలు అజీర్తి మరియు ఉబ్బరం సమస్యల లక్షణాలు జీర్ణశక్తిని మెరుగుపరచే సహజ మార్గాలు గ్యాస్ సమస్య తగ్గించేందుకు ఆయుర్వేద సూచనలు ఆహారంలో పాటించాల్సిన జాగ్రత్తలు ఆరోగ్యకరమైన జీవనశైలి చిట్కాలు గ్యాస్, అజీర్తి, కడుపు ఉబ్బరం వంటి సమస్యలతో బాధపడుతున్నవారికి ఈ వీడియో ఉపయోగకరమైన అవగాహనను అందిస్తుంది. ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థ కోసం సరైన ఆహారం, సరైన అలవాట్లు ఎంత ముఖ్యమో ఈ వీడియో ద్వారా తెలుసుకోండి   మీ ఆరోగ్య సమస్య ఏదైనా... మా హెల్త్ యూట్యూబ్ ఛానల్‌లో సీనియర్ డాక్టర్స్ చెప్పిన సలహాలు... సూచనలు ఉన్నాయి. మా యూట్యూబ్ ఛానల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 👉 TeluguOne Health (సబ్‌స్క్రైబ్ చేయడం మర్చిపోకండి!).