Home

»

Latest News

Samantha: శోభితకి సమంత కౌంటర్.. ఆ వ్యాఖ్యల్లో మర్మమేదైనా ఉందా!

Jun 25, 2026 6:08PM

 

సమంత(Samantha)మా ఇంటి బంగారం సక్సెస్ జోష్ లో ఉంది. ఐదు రోజులకే 50 కోట్ల క్లబ్ లోకి కూడా చేరడంతో సమంత కట్ అవుట్ కి ఉన్న కెపాసిటీ ఏ పాటిదో మరో సారి  అర్ధమవుతుంది. ఈ మూవీ సక్సెస్ మీట్ వేడుక హైదరాబాద్‌లో అత్యంత వైభవంగా జరగగా, సదరు ఈవెంట్ లో సమంత మాట్లాడిన రిలేషన్‌షిప్స్, బంధాలు, ఒక వ్యక్తికి  ఉండాల్సిన ఆత్మవిశ్వాసంపై చేసిన కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియా వ్యాప్తంగా పెను సంచలనాన్ని సృష్టిస్తున్నాయి. ఈ వ్యాఖ్యలు నేరుగా అక్కినేని నాగచైతన్య భార్య, నటి శోభిత ధూళిపాళ గతంలో చేసిన కొన్ని స్టేట్‌మెంట్స్‌కి  కౌంటర్‌గా ఉన్నాయంటూ నెటిజన్లు పెద్ద ఎత్తున చర్చించుకుంటున్నారు.

ఈ సక్సెస్ మీట్ ఇంటర్వ్యూలో సమంత మాట్లాడుతు 'ఒక బంధం నిలబడాలంటే ఇద్దరి భాగస్వామ్యం సమానంగా ఉండాలి. మన కెరీర్, మన రిలేషన్‌షిప్ అనేవి మన చేతుల్లోనే ఉన్నా కూడా  కొన్ని బంధాలు చాలా సంక్లిష్టంగా మారుతుంటాయి. ఒక బంధాన్ని విజయవంతంగా ముందుకు తీసుకెళ్లడానికి ఇద్దరు వ్యక్తులు కావాలి. అందుకే కొన్నిసార్లు అది మన చేతుల్లో ఉండదు. ముఖ్యంగా మహిళలు వేరొకరిపై ఆధారపడకుండా తమపై తాము నమ్మకం కలిగి సంపూర్ణమైన వ్యక్తిగా ఎదగాలి. జీవితంలో ఎదురయ్యే అతి తక్కువ స్థాయి లేదా కష్ట సమయాల్లో మనకి  మనమే బెస్ట్ ఫ్రెండ్‌గా నిలబడాలి. వేరొకరు వచ్చి మన జీవితాన్ని భర్తీ చేస్తారని ఆశించడం వల్ల బంధాలపై అనవసరమైన ఒత్తిడి పెరుగుతుందని సమంత  పేర్కొంది.


Also read: Ajay Devgn: అజయ్ దేవ్‌గన్ కొత్త మూవీ చౌహన్.. పఠాన్ లతో చెప్పండి


సమంత చేసిన ఈ కామెంట్స్ బయటకు రాగానే నెటిజన్లు, అభిమానులు .ఈ ఏడాది ప్రారంభంలో విడుదలైన నాగచైతన్య, శోభిత ధూళిపాళ(Sobhita dhulipala)వెడ్డింగ్ వీడియోలోని శోభిత వ్యాఖ్యలతో దీనిని పోల్చడం ప్రారంభించారు. ఆ వీడియోలో శోభిత మాట్లాడుతూ ఒక వ్యక్తి ఒంటరిగా ఉన్నప్పుడు అసంపూర్ణంగా ఉంటాడని, మరొకరు జీవితంలోకి వచ్చి ఆ వెలితిని పూరించినప్పుడే జీవితం పరిపూర్ణం అవుతుందని నేను నమ్ముతాను. చైతు తన జీవితంలో లేకపోతే తాను సంపూర్ణంగా ఉండలేనని పేర్కొంది. సరిగ్గా ఈ వ్యాఖ్యలకు భిన్నంగా సమంత.. "ఎవరికి వారు ఒంటరిగానూ సంపూర్ణులే, వేరొకరి వల్ల మనం పరిపూర్ణమవ్వాల్సిన అవసరం లేదు" అనే కోణంలో మాట్లాడటంతో ఇరు వర్గాల అభిమానుల మధ్య సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున కౌంటర్ల యుద్ధం నడుస్తోంది.

 


 

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com