LATEST NEWS
  ప్రజాస్వామ్యంలో అధికారులు వ్యవస్థకు వెన్నెముక వంటివారు. కానీ, స్వలాభం కోసమో, రాజకీయ విధేయత కోసమో ఆ వ్యవస్థకే తూట్లు పొడిస్తే? ఇటీవల ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఐఏఎస్, ఐపిఎస్ అధికారుల  రహస్య బేటీలు  సంచలనాన్ని సృష్టిస్తున్నాయి. ఒకవైపు ప్రభుత్వం ప్రజా సంక్షేమం కోసం అడుగులు వేస్తుంటే, మరోవైపు తెరచాటున ఏం జరుగుతోంది? వ్యవస్థను కాపాడాల్సిన వారే విద్రోహానికి పాల్పడుతున్నారా? అనే అంశాలపై  ప్రముఖ విశ్లేషకుడు అప్పసాని రాజేష్ తెలుగువన్ కు ఇచ్చిన  ప్రత్యేక ఇంటర్వ్యూలో కూలంకషంగా వివరించారు.   లక్షలాది మంది పోటీ పడే యూపీఎస్సీ పరీక్షల్లో నెగ్గి, అత్యున్నత శిక్షణ పొందిన ఐఏఎస్ అధికారులను మనం క్రీమ్ ఆఫ్ ది సొసైటీ  అని పిలుచుకుంటాం. ప్రభుత్వం తీసుకునే ప్రతి నిర్ణయం, రూపొందించే ప్రతి రూల్ వీరి కనుసన్నల్లోనే జరుగుతుంది. అయితే.. ప్రభుత్వానికి సన్నిహితంగా ఉన్న కొందరు అధికారులు, హైదరాబాద్‌ వేదికగా రహస్య సమావేశాలు నిర్వహిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ప్రభుత్వ అంతర్గత సమాచారాన్ని, కాంట్రాక్టర్ల వివరాలను, పెట్టుబడుల సమాచారాన్ని ప్రత్యర్థి పార్టీలకు చేరవేస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. ఇది కేవలం క్రమశిక్షణారాహిత్యం మాత్రమే కాదు, ప్రజలు కట్టిన పన్నులతో జీతం తీసుకుంటూ ఆ ప్రజలకే చేసే విశ్వాసద్రోహం. ఈ విషయంలో ప్రభుత్వాధినేతలు ఉదాసీనంగా వ్యవహరిస్తే అది పెను ప్రమాదానికి దారి తీస్తుందని అప్పసాని రాజేష్ హెచ్చరించారు. తెలుగువన్ యూట్యూబ్ చానల్ అప్పసాని ఇచ్చిన ఇంటర్వ్యూ పూర్తి పాఠం ఈ కింది లింక్ క్లిక్ చేసి వీక్షించండి
ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం  కేవలం రెండు దేశాల మధ్య సరిహద్దు పోరు కాదు ప్రపంచ దేశాల సమస్య. అన్ని దేశాల్లోని ప్రజల ఇంటి సమస్య. యుద్ధం అనగానే మనకు చాలా దూరంగా, ఎక్కడో సరిహద్దుల్లో జరిగే తుపాకుల మోత మాత్రమే అని అనిపిస్తుంది. కానీ ఇప్పటి గ్లోబల్ ప్రపంచంలో ఒక చోట రేగే చిచ్చు, ఖండాలు దాటి మన వంటింటి గ్యాస్ ధరను, మన పిల్లల సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలను కూడా ప్రభావితం చేస్తుంది. ప్రస్తుతం పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతలు కేవలం రెండు దేశాల మధ్య ఘర్షణ గా పరిమితం కాలేదు. ఇది ప్రపంచ ఆర్థిక వ్యవస్థను, మరీ ముఖ్యంగా  భారతదేశ భవిష్యత్తును మార్చబోయే ఒక పెద్ద మలుపు. పెద్ద కుదుపు. ఇండియాకు  అవసరమైన ఇంధన అవసరాలలో దాదాపు 90% మనం దిగుమతి చేసుకుంటున్నాం. ప్రస్తుత పరిస్థితుల్లో ఆ దిగుమతులకు ఆటంకం ఏర్పడింది.   ఈ  కారణంగా పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగి, ఆ ప్రభావంతో  నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని తాకుతాయి. అంతేనా యుద్ధం కారణంగా తీవ్ర ఉద్రిక్తతలునెలకొన్న గల్ఫ్ దేశాలలో దాదాపు కొటి మంది ఇండియన్స్ పని చేస్తున్నారు. ఈ యుద్ధం   వారి ఉద్యోగాలు, భవిష్యత్, అలాగే ఆయా దేశాల నుంచి వచ్చే పెట్టుబడులను ప్రభావితం చేస్తున్నది. తద్వారా ఆర్థిక వ్యవస్థ కుదేలయ్యే ప్రమాదం ఉంది.   ఈ సంక్షోభ సమయాన్ని ఎదుర్కోవడానికి లేదా  పరిష్కరించడానికి  భారతదేశం వంటి పెద్ద దేశానికి ప్రధానిగా ఉన్న మోడీ తన పలుకుబడిని ఉపయోగించి ఆపడానికి కృషి చేయాలి.   బ్రిక్స్ ద్వారా చైనా, రష్యా, బ్రెజిల్ వంటి దేశాలను ఏకం చేసి శాంతి కోసం ఒత్తిడి తేవాలి.   తెలుగువన్ యూట్యూబ్ చానెల్ వాస్తవ వేదికలో తెలుగువన్ ఎండీ కంఠంనేని రవిశంకర్, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి డాక్టర్ పీవీ రమేష్ మధ్య  ఇజ్రాయెల్, ఇరాన్ యుద్ధం, అది ప్రపంచ ఆర్ధిక వ్యవస్థపై చూపే ప్రభావం తదితర అంశాలపై విశ్లేషణాత్మక చర్చ జరిగింది. ఆ చర్చ పూర్తి పాఠం ఈ దిగువ ఇచ్చిన లింక్ ను క్లిక్ చేసి వీక్షించండి.  
చంద్ర‌బాబు ప‌నై పోయింద‌ని.. ఆయ‌న‌కివే చివ‌రి ఎన్నిక‌లు అవుతాయ‌ని..  ఈ వ‌య‌సులో కృష్ణా రాా అనుకోకుండా  ఆయ‌న‌కెందుకీ రాజ‌కీయాలు. అలాగైనా ఆయ‌న‌కు పుణ్యం వ‌స్తుంది  క‌దా? అంటూ అహంకారపూరిత వ్యాఖ్యలు చేసిన జగన్ కు  వైసీపీ సీనియ‌ర్ నేత బొత్స  ప‌ట్ల లోకేష్ చూపిన   వాత్స‌ల్యం చెంపపెట్టులాంటిదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఎందుకంటే జగన్, లోకేష్ ఇద్దరూ పొలిటీషియన్సే.. కానీ మెచ్యూరిటీ, పరిపక్వల విషయంలో ఇద్దరికీ ఉన్న తేడా ఇది అంటూ.. మండలిలో ప్రతిపక్ష నేత, వైసీపీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ ఇటీవల తీవ్ర అస్వస్థతకు లోనై, కోలుకుని మండలికి వచ్చిన సందర్భంగా లోకేష్ ఆయనను ఆప్యాయంగా పలకరించి,  మా మాస్టారు బొత్స తిరిగి  స‌భ‌కు వ‌చ్చారు, సభలో ఆయనన చూడటం ఎంతో సంతోషంగా  ఉంద‌న్నారు లోకేష్.  ఇటీవ‌ల బొత్సకు బ్రెయిన్ స్ట్రోక్ త‌గిలి  తీవ్రంగా  ఇబ్బంది  ప‌డ్డారు.  కోలుకుని ఆయ‌న మండ‌లికి వచ్చారు. అప్పుడు ఆయనకు లోకేష్  సాద‌రంగా ఆహ్వానించిన తీరు పట్ల లోకేష్ పై సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది. అదే గతంలో చంద్రబాబు పై జగన్ చేసిన వ్యాఖ్యలపై పార్టీలకు అతీతంగా అందరూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అందుకే ష‌ర్మిళ.. జ‌గ‌న్ మానసిక పరిస్థితి ప‌ట్ల తనకు సందేహాలున్నాయని షర్మిల అంటారు.   ఏదో సినిమా డైలాగులో ఆయ‌న్ను ఎవ‌రికైనా చూపించండ్రా, అలా వదిలేయకండ్రా అని వైసీపీ శ్రేణులకు సూచించారు.   జ‌గ‌న్ ఎందుక‌ని ఇంత ప‌ర్వ‌ర్టెడ్ గా ఉన్నారు? మంచి చెడులు మ‌ర‌చి వ్యవహరిస్తారు?   చంద్ర‌బాబు వ‌య‌సుతో ఆయ‌న‌కేం ప‌ని? అంటూ పలు సందర్భాలలో ఆయనపై పలువురు విమర్శలు వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.  ప్రస్తుతం రాష్ట్రానికి   అనుభ‌వంతో కూడిన నాయ‌క‌త్వం  అవసరం అని ప్రజలు భావించారు. కనుకనే చంద్రబాబుకు అఘండ మెజారిటీతో అధికారం కట్టబెట్టారు.  ఆ విషయాన్ని పట్టించుకోకుండా జగన్ చంద్రబాబు విషయంలో అనుచిత వ్యాఖ్యలు చేసిన తీరుకు.. లోకేష్ తన పరిణితితో సమాధానమిచ్చారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 
కాలం ఎంత విచిత్ర‌మైన‌దంటే.. ఒక‌ప్పుడు మీకు క‌నీసం ప్ర‌తిప‌క్ష హోదా లేకుండా చేయ‌గ‌ల‌ను అంటూ  అహంకార పూరితంగా అసెంబ్లీ వేదికగా మాట్లాడిన జగన్  ఇప్పుడు ఆయనే అదే అసెంబ్లీలో   ప్రతిపక్ష  నేత హోదా లేకుండా నిలిచారు. వైసీపీకి కనీసం ప్రతిపక్ష  హోదా  దక్కలేదు. స‌రిగ్గా  అదే స‌మ‌యంలో ఒక‌ప్పుడు ఈ శాస‌న  మండ‌లి అన్న‌దే వృథా ఖ‌ర్చు,  కాల‌యాప‌న అన్న జ‌గ‌న్ నేడు అదే శాస‌న మండ‌లిని ఆధారం చేసుకుని తన రాజకీయ ఉనికిని చాటుకుంటున్నారు.  బొత్స‌ను ఎమ్మెల్సీని చేసి,  త‌ద్వారా ఆయనకు మండ‌లి  ప్ర‌తిప‌క్ష  నేత హోదా  క‌ల్పించి, ఇక్క‌డ త‌మ ఉనికి కాపాడుకునే య‌త్నం చేస్తున్నారు జ‌గ‌న్. నాడు  చంద్రబాబుకు ప్ర‌తిప‌క్ష హోదా లేకుండా  చేస్తాన‌ని బీరాలు పలికిన జ‌గ‌న్.. ఇప్పుడు ప్రతిపక్ష హోదా లేకపోవడంతో సాధార‌ణ ఎమ్మెల్యేగా స‌భ‌కు వెళ్ల‌లేక గైర్హాజ‌ర‌వుతున్నారు. ఓడ‌లు బండ్లు అవుతాయి. బండ్లే ఓడ‌ల‌వుతాయి అన్న సామెతకు నేటి జగన్ పరిస్థితి అచ్చుగుద్దినట్లు సరిపోతుందంటున్నారు పరిశీలకులు.  ఒక్కోసారి  అవ‌స‌రం  తీరిపోయిన త‌ర్వాత విసిరేసిన తెడ్డే.. చివ‌రికి  ప‌డ‌వ బోల్తా  ప‌డ్డ‌ప్పుడు దిక్క‌వుతుంది. అన్న‌దానికి జ‌గ‌న్ అప‌రిప‌క్వంతో కూడుకున్న రాజ‌కీయ విధానాలే  ఉదాహ‌ర‌ణంటున్నారు. 175 స్థానాలున్న ఏపీ అసెంబ్లీకి 2024లో జరిగిన ఎన్నికలలో వైపీపీకి కేవలం 11 స్థానాలే వచ్చిన సంగతి తెలిసిందే.  దీంతో ప్ర‌తిప‌క్ష హోదాకు ఉండాల్సిన 18 సీట్ల సంఖ్యా బ‌లం లేక పోవ‌డ‌తో  ఆయన పార్టీకి ప్రతిపక్ష హోదా దక్కలేదు. ఇక జగన్ అసెంబ్లీకి కేవలం పులివెందుల ఎమ్మెల్యే హోదాలో మాత్రమే హాజరు కావాల్సిన పరిస్థితి.  అందుకే గైర్హాజరౌతున్నారు అది వేరే సంగతి. అదే శాస‌న మండ‌లిలో మొత్తం 58 సీట్లుండ‌గా.. ప్ర‌స్తుతం 30 సీట్ల‌తో వైసీపీ  బ‌లంగా  ఉంది. దీంతో మండలిలో ఆ పార్టీకి ప్రతిపక్ష హోదా ఉంది. దీంతో ప్ర‌భుత్వం ప్ర‌వేశ పెట్టే బిల్లుల‌ను అడ్డుకోవ‌డం, లేదా  చ‌ర్చ‌కు ప‌ట్టుబ‌డే అవ‌కాశం వారికి మండలిలో ల‌భిస్తోంది.    గ‌తంలో ఇదే జ‌గ‌న్ మండ‌లిని ర‌ద్దు చేయాల‌ని తీర్మానం చేశారు జ‌గ‌న్. ఎందుకంటే అప్పట్లో  అసెంబ్లీలో వైసీకీ భారీ మెజారిటీ ఉన్నా.. మండ‌లిలో మాత్రం లేదు.   అప్ప‌ట్లో టీడీపికి శాస‌న  మండలిలో  మెజారీ ఉండేది. దీంతో  మూడు రాజ‌ధానుల బిల్లు వంటి  కీల‌క నిర్ణ‌యాల‌ను మండ‌లిలో టీడీపీ  అడ్డుకునేది. దీంతో మండ‌లి  వ‌ల్ల ప్ర‌జా ధ‌నం వృధా, కాల‌యాప‌న  అంటూ ఈసడించిన జగన్  ఇప్పుడుఅదే మండలి నుంచి తమ పార్టీ వాయిస్ వినిపించాల్సిన పరిస్థితి వచ్చింది.  ఇక్క‌డ మ‌రో విచిత్ర‌మేంటంటే..  ఆ తర్వాత మండలిలో వైసీపీకి మెజారిటీ రావడంతో 2021 నాటి రద్దు తీర్మానాన్ని నాటి  జ‌గ‌న్ ప్రభుత్వం ఉపసంహరించుకుంది.  అహంకారం ప‌నికిరాదనీ, వ్య‌వ‌స్థ‌ల‌ను అవ‌గాహ‌నారాహిత్యంతో త‌ప్పు ప‌ట్ట‌రాద‌ని.. ఈ   ఉదంతంతో తెలుస్తోంద‌ంటున్నారు పరిశీలకులు.  వ్య‌వ‌స్థ‌ల ప‌ట్ల కనీస గౌర‌వం లేక పోవ‌డం వ‌ల్ల వ‌చ్చిన ఇబ్బందిగా దీన్ని అభివర్ణిస్తూ..  ఇప్పటికైనా తెలిసివచ్చిందా జగన్? అంటూ ఎద్దేవా చేస్తున్నారు. 
ఇటీవ‌ల   కిర‌ణ్ రాయ‌ల్ వంటి కొంద‌రు ప‌వ‌న్ లేకుంటే తెలుగుదేశం గెలిచే ఛాన్సే లేద‌ని కామెంట్ చేయ‌డం కూట‌మి వ‌ర్గాల్లో పెద్ద ఎత్తున వ్య‌తిరేక‌త‌ వచ్చింది. తెలుగుదేశం, జనసేన పార్టీల   సోష‌ల్ మీడియాలో ఒక రకంగా డైలాగ్ వార్.. మాటల యుద్ధం జరిగింది. అంతే కాకుండా కిరణ్ రాయల్ వ్యాఖ్యలపై తెలుగుదేశం శ్రేణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.   ఈ నేపథ్యంలో కూటమి ఐక్యత ప్రాధాన్యతను జనసేనాని, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అసెంబ్లీ వేదికగా వివరించడం కిరణ్ రాయల్ వంటి నేతలకు చెంపపెట్టుగానే పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  కూటమి ఐక్యత వల్ల  ఎంత మేలు జ‌రుగుతుందో పవన్ కల్యాణ్  విడ‌మ‌ర‌చి చెప్పారు.  వైసీపీ వారు కేవ‌లం 11 మందే ఉన్నా.. వారు 1100 మంది ఉన్న‌ట్టు బిల్డ‌ప్ ఇస్తార‌నీ,  క‌ల్తీ వాళ్లే చేస్తారు, బూతులు వాళ్లే మాట్లాడ‌తారు,  మ‌న‌మేదైనా  ఆన్స‌ర్ ఇస్తే దాన్ని కూడా  బ‌ద‌నాం చేస్తారు.. అదే మ‌నం మ‌నం చేసిన  ప‌ని చెప్పుకోలేక పోవ‌డం చేటు తెస్తోంద‌ని అసెంబ్లీ  వేదిక‌గా  ఆవేద‌న వ్య‌క్తం  చేశారు ఉప ముఖ్య‌మంత్రి  ప‌వ‌న్ క‌ళ్యాణ్. అదే స‌మ‌యంలో గ‌త  విధ్వంస  పాల‌న‌కు ప్ర‌స్తుత పాల‌న‌కూ ఎంతో తేడా ఉంద‌నీ,  ఆర్ధిక మంత్రి బ‌డ్జెట్ ప్ర‌సంగంలో ర‌వీంద్రుడి వ‌చ‌నాల‌ను జోడించి ఎంతో గొప్ప‌గా  వినిపించార‌నీ, ఆయ‌న కూట‌మి  పాల‌న‌లో త‌న నియోజ‌క‌వ‌ర్గంలో జ‌రుగుతున్న అభివృద్ధిని కూడా ఎంతో చ‌క్కగా పాంప్లెంట్లు వేసి మ‌రీ వివ‌రించి చెబుతున్నార‌నీ ప‌య్యావుల పనితీరును ప్ర‌సంగించారు. వాళ్లు కోట్ల రూపాయ‌ల అప్పులు మిగిల్చి పోయినా, ఇక్క‌డ మ‌నం ఇంత చేస్తున్నామ‌న్న పవన్ కల్యాణ్  ఈ స‌మ‌యంలో మ‌న ముఖ్య‌మంత్రికి మ‌న‌మంతా అండ‌గా నిల‌వాల్సిన అవ‌స‌ర‌ముంద‌న్నారు.   దీంతో బ‌య‌ట కిర‌ణ్ రాయ‌ల్ వంటి బాధ్య‌త‌లేని కార్య‌క‌ర్త‌ల  ద్వారా ఏర్ప‌డ్డ అగాథాల‌ను పవన్ కల్యాణ్  ఈ ఒక్క మాట‌తో పూడ్చే య‌త్నం చేశారు. ఎవ‌రెన్ని  య‌త్నాలు చేసినా, ఇక్క‌డ కూట‌మి ని ఎవ‌రూ విడ‌దీయ‌లేర‌నీ.. పైపెచ్చు బ‌య‌ట ఎంత‌గా వైసీపీ విజృంభిస్తోంటే.. మ‌న ఐక్య‌త అంత‌గా బ‌ల‌ప‌డాల‌ని త‌న శ్రేణుల‌తో పాటు కూట‌మి  శ్రేణుల‌కు కూడా అసెంబ్లీ  నుంచి ఒక సందేశం ఇచ్చారు పవన్ కల్యాణ్
ALSO ON TELUGUONE N E W S
బడ్జెట్ 4 కోట్లు.. కలెక్షన్స్ 40 కోట్లు పెద్ద హిట్ గా నిలిచిన చిన్న సినిమా 'విత్ లవ్' తొలిప్రేమను గుర్తుచేస్తూ ఓటీటీలోనూ సంచలనం రొమాంటిక్ కామెడీ సినిమాలు బాక్సాఫీస్ దగ్గర మ్యాజిక్ చేస్తుంటాయి. ఈ ఏడాది చిన్న సినిమాగా విడుదలై, పెద్ద విజయాన్ని సాధించిన తమిళ్ రొమాంటిక్ కామెడీ ఫిల్మ్ 'విత్ లవ్'(With Love). కేవలం రూ.4 కోట్ల బడ్జెట్ తో రూపొందిన ఈ మూవీ, వరల్డ్ వైడ్ గా దాదాపు రూ.40 కోట్ల గ్రాస్ రాబట్టి సంచలనం సృష్టించింది. ‘టూరిస్ట్ ఫ్యామిలీ’ సినిమాతో దర్శకుడిగా ప్రశంసలు అందుకున్న అభిషన్ జీవింత్, ‘విత్ లవ్’తో హీరోగా మారాడు. అనస్వర రాజన్ హీరోయిన్ గా నటించింది. మధన్ దర్శకత్వం వహించగా, సౌందర్య రాజినీకాంత్ ఈ చిత్రాన్ని నిర్మించడం విశేషం. ప్రేమ, స్కూల్ మెమోరీస్, ఫస్ట్ క్రష్‌ల నేపథ్యంతో సాగే ఈ రొమాంటిక్ డ్రామా.. ఫిబ్రవరి 6న థియేటర్లలో అడుగుపెట్టింది.   కథ ఏంటంటే.. పెళ్ళిపై ఆసక్తి లేని సత్య( అభిషన్ జీవింత్), తన సోదరి కారణంగా అనుకోకుండా పెళ్ళి చూపుల కోసం మోనిషా (అనస్వర రాజన్)ను కలుస్తాడు. అలా కలిసిన తర్వాత వాళ్లిద్దరూ ఒకే స్కూల్లో చదువుకున్నారని.. సీనియర్, జూనియర్ అని తెలుసుకుంటారు. మాటల్లో స్కూల్ లవ్ స్టోరీలు షేర్ చేసుకుంటారు. స్కూల్ టైంలో తమ ప్రేమని వ్యక్తపరచలేకపోవడంతో.. తమ ఫస్ట్ క్రష్ లను ఇప్పుడు కలవాలి అనుకుంటారు. పాత జ్ఞాపకాలను వెలికితీస్తూ మొదలైన వీరి ప్రయాణం ఎలా సాగింది? అనేది సినిమా చూసి తెలుసుకోవాలి. Also Read: విత్ లవ్ మూవీ రివ్యూ తొలిప్రేమ ఎప్పటికీ ప్రత్యేకమే. ముఖ్యంగా స్కూల్ రోజుల్లో క్రష్ పై ఇష్టాన్ని మనసులోనే దాచుకొని, మాటల రూపంలో బయటపెట్టనివారు ఎందరో ఉంటారు. మనసులోని మాటను చెప్పలేకపోయామని జీవితాంతం గుర్తు చేసుకొని బాధపడే కంటే, ఏదొక సమయంలో మనసులోని మాటను చెప్పేయడం మంచిది. ఆ ఆలోచన నుంచి పుట్టిందే ఈ 'విత్ లవ్'. పెళ్లి చూపులతో మొదలై, స్కూల్ లైఫ్ ను గుర్తుచేస్తూ.. క్యూట్ లవ్ స్టోరీలతో, అందమైన జ్ఞాపకాలతో సరదాగా నడిచింది. 'గుర్తుకొస్తున్నాయి' అనేలా సాగిన ఈ ప్రయాణం.. ప్రతి ఒక్కరికీ వారి పాత జ్ఞాపకాలను గుర్తు చేస్తుంది అనడంలో సందేహం లేదు. అందుకే థియేటర్లలో అంతటి విజయాన్ని సాధించింది. ఓటీటీలోనూ 'విత్ లవ్' సినిమాకి అద్భుతమైన స్పందన లభిస్తోంది. మార్చి 6 నుంచి ప్రముఖ ఓటీటీ వేదిక నెట్ ఫ్లిక్స్ లోకి అందుబాటులోకి వచ్చింది. థియేటర్లలో మిస్ అయిన వారు.. ఇప్పుడు ఓటీటీలో ఈ సినిమాని చూసి ప్రశంసలు కురిపిస్తున్నాయి. తెలిసిన కథే అయినప్పటికీ.. దానిని బ్యూటిఫుల్ గా, ఎంటర్టైనింగ్ చెప్పిన తీరు కట్టిపడేసిందని అంటున్నారు. ప్రస్తుత రెస్పాన్స్ చూస్తుంటే.. ఓటీటీలోనూ 'విత్ లవ్' రికార్డులు సృష్టించేలా ఉంది.
The film Mrithyunjay, starring content king Sree Vishnu and directed by Hussain Sha Kiran, is an investigative thriller produced by Sandeep Gunnam and Vinay Chilakapati under the banners of Light Box Media and Picture Perfect Entertainment. Sree Vishnu, who previously delivered a blockbuster hit with Samajavaragamana, once again impressed audiences along with Reba Monica John. Released on March 6, the film is now a runaway blockbuster. In this context, the film unit organized a thrilling blockbuster success meet on Saturday, where the following statements were made: Sree Vishnu said, “Sandeep garu, Pavan garu, and I wanted to collaborate on a film. At that time, Sandeep introduced me to Hussain Sha. Sandeep garu wanted to make a film purely based on content. On set, Ramya garu spent a lot of time looking after all of us. Chinna garu, Sudarshan, Raccha Ravi, Ayyappa Sharma garu, Reba garu, and Baby Ooha all delivered amazing performances. The audience is finding the film very fresh. Sagar garu presented all of us in a new light. Hussain’s writing and twists were excellent. I was even shocked by Kal Bhairav’s score. Because of him, the level of the film went up. He is the real hero of this film. Everyone who has watched it is praising it highly. For those who haven’t seen it yet, watch it immediately. It’s a rare thriller in Telugu, and this is a very good film in that genre. I hope everyone enjoys it, and I wish the film great success.” Hussain Sha Kiran said, “‘Mrithyunjay’ was promoted without songs or comedy scenes. We connected with the audience purely through the content of the film. Seeing the positive reviews on social media after the release made us very happy. I thank the audience for supporting our film. Ramya garu, Vinay garu, and Sandeep garu gave me tremendous support throughout this journey. Baby Ooha performed wonderfully in the film. Raccha Ravi, Sudarshan, and others gave excellent performances. Kaala Bhairava elevated the film with his background score. My sister Manisha received recognition for her set designs. It was a pleasure to have Chinna garu in the film. None of this would have been possible without Sree Vishnu garu. His acceptance of the story brought all of us together. I feel I did not disappoint the trust he placed in me. I also thank my family for standing by me. I hope the audience continues to encourage our film in the same way.” Sandeep Gunnam said, “We received tremendous support from the media for ‘Mrithyunjay’. From day one, the film got a great response. Media reviews and audience word-of-mouth matched perfectly. All the distributors who took the film are happy, and that is a huge success for me. Vinay and I started this journey to make great films together. Without Vinay, this project would not have happened. Hussain used to send every story idea to Sree Vishnu, and that’s how we made ‘Mrityunjay’. We had decided from the beginning to focus purely on the story rather than comedy. Everyone is impressed with Sagar’s visuals and the world created by Manisha. Kaala Bhairava’s score is receiving great responses. Reba delivered a remarkable performance. Sri Vishnu is very passionate; he lives and breathes stories and films. After our two-year journey, the story of ‘Mrityunjay’ was finalized. We felt our product was good, but the audience is calling it exceptional. I thank Sree Vishnu garu for trusting me with this film. We will win the Sunday final match, and from Monday, watch our film in theaters.” Music director Kaala Bhairava said, “‘Mrithyunjay’ is receiving a lot of praise for its score. My team members Harsha Vardhan, Siddharth, Ebenezer Paul, and Vishal Bharadwaj contributed significantly, with Harsha Vardhan doing the most work. I thank the entire team. It was truly a team effort, which is why the output turned out so well. Sree Vishnu’s acting made my job easier. Hussain is like a family member to me, and I want to work with him again and again. Working with Sandeep garu has been a joy. I request the audience to continue supporting the film in the same way.”  
  -పిటిషన్ లో ఏముంది  -తీర్పు ఎలా వస్తుందంటారు -విజయ్ రియాక్షన్ ఏంటి! ఇళయ దళపతి విజయ్(Vijay),భార్య సంగీత(sangeetha)వ్యవహారంపై స్టిల్ తమిళనాడుతో పాటు తెలుగునాట కూడా చర్చలు జరుగుతూనే ఉన్నాయి. సంగీత నమోదు చేసిన విడాకుల పిటిషన్ లో విజయ్ కి ఒక సినీ నటితో ఉందని  చెప్పడం, సదరు నటి త్రిష అనే పుకార్లు వ్యాపిస్తూ ఉండటం, రీసెంట్ గా త్రిషతో కలిసి విజయ్ ఒక పెళ్ళికి హాజరు కావడంతో అందరి దృష్టి విజయ్ వ్యవహారంపై ఉంది. ఈ క్రమంలో కోర్టులో సంగీత వేసిన మరో పిటిషన్ చర్చల స్థాయిని తీవ్రతరం చేసింది. పిటిషన్ లో ఏముందో చూద్దాం.  సంగీత నమోదు చేసిన పిటిషన్ లో 'విడాకుల కేసు తుది విచారణ ముగిసి, తీర్పు వచ్చే వరకు నేను విజయ్‌ ఇంట్లోనే ఉండేందుకు అనుమతి కావాలి. లండన్‌ కి చెందిన నేను విజయ్ ఇంట్లోనే ఉండటం కరెక్ట్.  మా లాయర్ ద్వారా ఇంట్లో ఉండటానికి అనుమతి  కోరితే బెదిరింపులకి పాల్పడుతున్నారు. అందుకే పిటిషన్ వేసాను. సినిమాల ద్వారా సంపాదించిన కోట్ల రూపాయల డబ్బుల్లో తనకి, తన పిల్లలకి రావాల్సిన వాటా కూడా ఇవ్వాలని సదరు పిటిషన్ లో పేర్కొంది.  also read: Ustaad bhagat singh vs dhurandhar 2: అర్ధరాత్రి నుంచే వార్ స్టార్ట్    సంగీత ప్రస్తుతం లండన్ దేశంలోనే ఉంది. విజయ్ ఇల్లు సౌత్ చెన్నై నీలంకరై లోని కపిలేశ్వర్ నగర్ లో  ఉంది. సుమారు 20 ఇయర్స్ బ్యాక్ నుంచే అక్కడ ఉంటున్నాడు. ఇక విడకుల పిటిషన్ కేసులో విజయ్  ఏప్రిల్ 20 న కోర్టులో హాజరు అవ్వాల్సిన విషయం తెలిసిందే.     
సమాజంలో గురువుకు ఉన్న స్థానం అత్యున్నతమైనది. అక్షరాలు నేర్పడమే కాదు, ఒక తరాన్ని, ఒక దేశ భవిష్యత్తును తీర్చిదిద్దే బాధ్యత గురువుది. కానీ, అదే గురువు తన పదవీ విరమణ తర్వాత, తన సొంత హక్కు అయిన పెన్షన్ కోసం కార్యాలయాల చుట్టూ కాళ్లరిగేలా తిరగాల్సి వస్తే? తన కళ్ల ముందే పెరిగిన విద్యార్థులు అవినీతి అంచున నిలబడి లంచం అడిగితే? ఆ గురువు మనసు ఎంతలా గాయపడుతుందో తెలిపే హృదయ విదారక కథనం ఇది ఆర్.పి.పట్నాయక్ స్వీయ దర్శకత్వంలో నటించి రూపొందించిన ‘బ్రోకర్‌’ చిత్రంలోని ఈ సన్నివేశం దేశంలోని పరిస్థితుల్ని చూపిస్తుంది. గొల్లపూడి మారుతీరావు, అర్చన, కీర్తి చావ్లా, శ్రీహరి, ఫ్లోరా శైని ఇతర పాత్రలు పోషించిన ఈ సినిమా సంచలన విజయం సాధించింది.  35 ఏళ్ళపాటు నిష్కళంకంగా సేవలందించి, ఉత్తమ ఉపాధ్యాయుడిగా అవార్డు అందుకున్న ఒక మాస్టారు, తన ఐదేళ్ల పెన్షన్ కోసం పడిగాపులు కాస్తున్నారు. ఆయన అడుగుతున్నది కేవలం తన హక్కును మాత్రమే. కానీ వ్యవస్థలో పాతుకుపోయిన అవినీతి ఆయన్ని ప్రతి అడుగునా అడ్డుకుంటుంది. ‘గవర్నమెంట్ జీతం తీసుకుంటూ ఇలా లంచాలు తినడం వ్యభిచారం కన్నా మహాపాపం’ అని ఆయన ఆవేదన వ్యక్తం చేస్తారు. ఐదేళ్లుగా ఇద్దరు ప్రధానులు, ముగ్గురు ముఖ్యమంత్రులు మారినా, ఆయన ఫైలు మాత్రం కదలడం లేదు. కారణం? ఆయన అధికారుల చేతులు తడపకపోవడమే. ఆ మాస్టారు ఆగస్టు 15, 1947న, అంటే భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చిన రోజే పుట్టారు. కానీ తన పుట్టిన సర్టిఫికేట్ కోసం వెతుకుతున్నప్పుడు, ఈ దేశానికి ఇంకా నిజమైన స్వాతంత్య్రం రాలేదని ఆయనకు అర్థమవుతుంది. ‘రూపాయి విలువ పడిపోవడం లేదు బాబు, ఆ రూపాయి కోసం దిగజారుతున్న మీలాంటి వాళ్ల విలువ పడిపోతోంది” అని ఆయన చెప్పే మాటలు నేటి సమాజానికి చెంపపెట్టు. చచ్చినా ఒక్క రూపాయి లంచం ఇవ్వనని, తన ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టనని ఆయన తెగేసి చెప్తారు. అత్యంత బాధాకరమైన విషయం ఏమిటంటే, తన సొంత విద్యార్థే ‘సహాయం’ చేస్తానంటూ లంచంతో పని ముగించాలని చూడటం. ఇది ఆ మాస్టారి ఆత్మగౌరవానికి తగిలిన పెద్ద గాయం. విలువలను పాటించాలని జీవితాంతం నేర్పిన గురువే ఆ విలువలను తప్పితే, ఇక విలువలకే విలువ ఏముంటుందని ఆయన ప్రశ్నిస్తారు. అవినీతి లేని సమాజం కోసం పోరాడాలని ఉన్నా, ఆ వయసులో శక్తి లేక, యువత పట్టించుకోకపోవడం చూసి ఆయన కుమిలిపోతారు. ‘అవినీతి ముందు నిజాయితీ ఓడిపోయింది’ అని ఆయన భావించడం మన వ్యవస్థలోని వైఫల్యానికి నిదర్శనం. ఈ కథ కేవలం ఒక ఉపాధ్యాయుడి పెన్షన్ సమస్య మాత్రమే కాదు. ఇది మన సమాజంలో వేళ్లూనుకున్న అవినీతిపై ఒక హెచ్చరిక. నిజాయితీ పరులు కూడా ఉన్నారని నిరూపించాల్సిన బాధ్యత నేటి యువతపై ఉంది. వ్యవస్థ మారాలంటే మన ఆలోచనలు మారాలి. విలువల కోసం ప్రాణాలైనా ఇచ్చే అటువంటి గురువుల ఆశయాలను గౌరవించడం మనందరి బాధ్యత. ఇంత మంచి సందేశంతో కూడిన ఈ వీడియోను చూడండి. ఆలోచించండి. చైతన్యపూరితమైన ఇలాంటి వీడియోల కోసం మా Teluguone youtube channelను Subscribe చేసుకోండి. 
  -ధురంధర్ పార్ట్ 2 ట్రైలర్ వచ్చేసింది  -ఉస్తాద్ పరిస్థితి ఏంటి! -18 అర్ధరాత్రి నుంచే వార్ ఖాయమా!   భారతీయ సినీ ప్రేమికులు ఎంతగానో ఎదురుచూస్తున్న చిత్రం 'ధురంధర్ పార్ట్ 2(Dhurandhar 2).ఈ నెల 19 న రిలీజ్ కానున్న విషయం తెలిసిందే. పార్ట్ 1 లో 'రెహ్మాన్ డెకాయత్' ని మన దేశపు 'రా' ఏజెంట్ హోదాలో హంజా అలీ మజారి అలియాస్ 'జస్కి రత్ సింగ్ రంగి' చంపడంతో పార్ట్ 2 పై ఎవరికి ఇష్టమొచ్చిన రీతిలో వాళ్ళు కథని అల్లుకుంటు కోటి ఆశలతో ఎదురుచూస్తూ వస్తున్నారు. వాళ్ళ ఆలోచనలకి ఫుల్ స్టాప్ పెడుతు   అంచనాలని పెంచుకునేలా ఈ రోజు ధురంధర్ 2 ట్రైలర్ వచ్చేసింది. రావడమే కాదు తెలుగు ప్రేక్షకుల్లో సరికొత్త అనుమానాలకి, చర్చలకి తావు ఇచ్చింది. విషయమేంటో చూద్దాం. సుమారు మూడు నిమిషాల పద్దెనిమిది సెకన్ల నిడివి ఉన్న ట్రైలర్ ఒక రేంజ్ లో ఉంది. ఐదు గంటల్లోనే వచ్చిన  9 . 5 మిలియన్స్ వ్యూస్ రేంజ్ స్థాయికి ప్రత్యక్ష ఉదాహరణ. తెలుగులో కూడా ధురంధర్ 2 విడుదలవుతున్న విషయం తెలిసిందే. దీంతో సోషల్ మీడియాలో ధురంధర్ 2 vs ఉస్తాద్ భగత్ సింగ్(Ustaad Bhagat Singh)అనే డైలాగ్ ఫుల్ స్వింగ్ మోడ్ లో వెళ్తుంది. నిజానికి   ఉస్తాద్ భగత్ సింగ్ డేట్ 26 నుంచి 19 కి మారినప్పుడు పెద్దగా చర్చ జరగలేదు. కానీ ఇప్పుడు  ధురంధర్ ట్రైలర్ రిలీజైన దగ్గర్నుంచి ఉస్తాద్ vs ధురంధర్ వర్డ్  బాగానే రన్ అవుతుంది. కొంత మంది ధురంధర్ 2  ప్రభావం తెలుగులో పెద్దగా ఏముంటుందిలే అని సోషల్ మీడియా వేదికగా కామెంట్స్ చేస్తున్నారు. కానీ అలా అనుకోవడం పొరపాటే అవుతుంది.  also read: బెల్లంకొండ సాయి శ్రీనివాస్ పెళ్లి.. వధువు కావ్య రెడ్డి ఎవరో తెలుసా! ధురంధర్ మొదటి భాగం తెలుగు లాంగ్వేజ్ లో రిలీజ్ అవ్వకపోయినా హిందీ వెర్షన్ ని మెజారిటీ తెలుగు ప్రేక్షకులందరు చూసారు. భారీ స్థాయి కలెక్షన్స్ కూడా రావడంతో పాటు ధురంధర్ సబ్జెట్  గురించి చర్చలు కూడా జరిగాయి. మరి ఈ లెక్కన ధురంధర్ 2  తెలుగులో కూడా మంచి ప్రభావాన్ని చూపిస్తుంది. 18 నుంచే ప్రీమియర్ షోస్ ఉన్నాయని కూడా అనౌన్స్ చెయ్యడంతో ఉస్తాద్ vs  ధురంధర్ 2 మధ్య పోటీ ఖాయమని సినీ ఎక్స్ పర్ట్స్ చెప్తున్నారు. పైగా పోటీ అనేది అభిమానులు, మూవీ లవర్స్, ప్రేక్షకులు సినిమాకి కల్పించిన హక్కు . ఉస్తాద్ హంగామ కూడా ప్రీమియర్స్ తో షురు కానున్న విషయం తెలిసిందే. ఇక ధురంధర్ తెలుగు ట్రైలర్ ఈ సాయంత్రానికి ప్రత్యక్షమవ్వడం ఖాయం.    
- డాక్యుమెంటరీ తీర్చిదిద్దిన విధానంపై ప్రశంసలు కురిపించిన జ్యూరీ సభ్యులు - యూనిటీ డాక్యుమెంటరీని నిర్మించిన దర్శక నిర్మాతలకు అభినందనల వెల్లువ ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు, తెలంగాణ జాతిపితగా పిలుచుకునే కొండా లక్ష్మణ్ బాపూజీపై యువ దర్శకుడు బడుగు విజయ్ కుమార్ రూపొందించిన యూనిటీ. ది మ్యాన్ ఆఫ్ సోషల్ జస్టిస్ ఉప శీర్షిక.  చిరందాస్ శ్రీకాంత్ నిర్మించిన ఈ డాక్యుమెంటరీ ఫిల్మ్ కు తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రకటించిన తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డుల్లో సముచితమైన స్థానం దక్కింది. 2025 సంవత్సరానికి గాను వెల్లడించిన గద్దర్ ఫిల్మ్ అవార్డుల్లోని డాక్యుమెంటరీ విభాగంలో తొలి ఉత్తమ డాక్యుమెంటరీగా గద్దర్ అవార్డును సొంతం చేసుకుంది. డాక్యుమెంటరీ, షార్ట్ ఫిల్మ్స్ కు జ్యూరీ ఛైర్మన్ గా ఉన్న ప్రముఖ దర్శకులు విజయ్ కనకమేడల ఎఫ్ డీసీ కార్యాలయంలో ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన కొండా లక్ష్మణ్ బాపూజీ.... తెలంగాణ సమాజానికి మరో గాంధీ ఎలా అయ్యాడనే విషయాన్ని చాలా ఆసక్తికరంగా పెద్దల నుంచి పాఠశాల విద్యార్థులకు సైతం సులభంగా అర్థమయ్యేలా యూనిటీ డాక్యుమెంటరీని విజయ్ కుమార్ చిత్రీకరించారు. మైమ్ మధు, బాలనటుడు భాను ప్రధాన పాత్రలు పోషిస్తూ బాపూజీ కథను వివరించారు. డాక్యుమెంటరీ ఫిల్మ్ మేకింగ్ లో ఇలా వినూత్నమైన పద్దతిలో కొండా లక్ష్మణ్ బాపూజీ బాల్యం నుంచి మరణం వరకు, ఆ తర్వాత తెలంగాణ సాధన వరకు ప్రతి విషయాన్ని ఎంతో స్పష్టంగా చిత్రీకరించడం పట్ల జ్యూరీ సభ్యులు ప్రశంసలు కురిపించారు. నాణ్యమైన విజువల్స్, స్పష్టమైన వాయిస్ ఓవర్, చక్కని ఎడిటింగ్ తో ప్రేక్షకులకు ఎక్కడా ఇబ్బంది లేకుండా సుమారు అరగంటపాటు యూనిటీ డాక్యుమెంటరీని తీర్చిదిద్దిన దర్శక నిర్మాతలకు అభినందనలు తెలిపారు. ఇప్పటికే యూనిటీ డాక్యుమెంటరీ పలు జాతీయ, అంతర్జాతీయ వేదికలపై కూడా శభాష్ అనిపించుకొని అవార్డులు అందుకుంది. 2025లో దిల్లీలో జరిగిన 15వ దాదా సాహెబ్ ఫాల్కే అవార్డుల్లో ఉత్తమ దర్శకుడిగా దాదా సాహెబ్ ఫాల్కే పురస్కారం అందుకోగా.... ముంబయిలో జరిగిన భారత్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్-2023లో యూనిటీ డాక్యుమెంటరీకి రెండు అవార్డులు దక్కాయి. బెస్ట్ హిస్టారికల్ డాక్యుమెంట్ ఫిల్మ్, ఐకానిక్ ఫ్రైడ్ ఆఫ్ ఇండియా అవార్డును యూనిటీ (UNITY) సొంతం చేసుకుంది. ఇలా... ఎన్నో ప్రత్యేకతలను సంతరించుకున్న UNITY డాక్యుమెంటరీ ఫిల్మ్ ను తెలంగాణ ప్రభుత్వం గుర్తించి గద్దర్ అవార్డుకు ఎంపిక చేయడం పట్ల దర్శకుడు విజయ్ కుమార్, నిర్మాత శ్రీకాంత్ ఆనందం వ్యక్తం చేశారు. సామాజిక న్యాయం కోసం పరితపించిన మహోన్నత శిఖరం లాంటి వ్యక్తి చరిత్రను గుర్తించి ప్రోత్సహించడం కొండా లక్ష్మణ్ బాపూజీ పట్ల ప్రభుత్వం తన సామాజిక బాధ్యతను చాటుకుందని తెలిపారు. అవార్డుకు ఎంపిక చేసిన జ్యూరీ ఛైర్మన్ విజయ్ కనకమేడల, జ్యూరీ సభ్యులకు దర్శకుడు విజయ్, నిర్మాత శ్రీకాంత్ తోపాటు అందులో నటించిన మైమ్ మధు, బాలనటుడు  మాస్టర్ భాను ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
పవర్‌స్టార్ పవన్‌కళ్యాణ్, హరీష్ శంకర్ కాంబినేషన్‌లో రూపొందుతున్న మోస్ట్ ఎవైటెడ్ మూవీ ‘ఉస్తాద్ భగత్‌సింగ్‌’. ఈ చిత్రాన్ని ఉగాది కానుకగా మార్చి 19న విడుదల చేయబోతున్నారు. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ చాలా స్పీడ్‌గా జరుగుతోంది. అందులో భాగంగా పవన్‌కళ్యాణ్ తన వెర్షన్ డబ్బింగ్‌ను ప్రారంభించారు. దీనికి సంబంధించి అధికారికంగా పెట్టిన పోస్ట్ ఇప్ప్పుడు వైరల్‌గా మారుతోంది. డబ్బింగ్ చెప్తున్న పవన్‌కళ్యాణ్ పక్కన దర్శకుడు హరీష్ శంకర్, సంగీత దర్శకుడు థమన్ ఉన్నారు.  శరవేగంగా జరుగుతున్న పోస్ట్ ప్రొడక్షన్ వర్క్‌ని హరీష్ శంకర్ పర్యవేక్షిస్తున్నారు. మరో పక్క థమన్ మరోసారి ఎక్స్‌ట్రార్డినరీ మ్యూజిక్ పవర్‌ఫుల్ స్కోర్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ సినిమాకి సంబంధించిన ఒక సర్‌ప్రైజ్‌ను ఈరోజు రివీల్ చేయబోతున్నట్టు చిత్ర యూనిట్ ప్రకటించింది. ఏది ఏమైనా ఎంతోకాలంగా పవర్‌స్టార్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘ఉస్తాద్ భగత్‌సింగ్‌’ ఉగాదికి థియేటర్లలో కలెక్షన్ల సునామీ సష్టించేందుకు సిద్ధమవుతోంది.  ఈ చిత్రంలో పవన్ సరసన శ్రీలీల, రాశిఖన్నా హీరోయిన్లుగా నటిస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ సంస్థ ఎంతో ప్రతిష్ఠాత్మకంగా చిత్రాన్ని నిర్మిస్తోంది. పవన్‌కళ్యాణ్, హరీష్ శంకర్ కాంబినేషన్‌లో గతంలో వచ్చిన ‘గబ్బర్‌సింగ్‌’ ఎలాంటి సంచలనాలు సష్టించిందో అందరికీ తెలిసిందే. ఇప్ప్పుడు ఆ చిత్రాన్ని మించే స్థాయిలో ‘ఉస్తాద్ భగత్‌సింగ్‌’ ఉందనే ప్రచారం జరుగుతోంది. 
సినీ తారల ఇళ్లల్లో పెళ్లిళ్ల హడావిడి  పెళ్లి పీటలు ఎక్కబోతున్న సాయి శ్రీనివాస్  ఆదివారం ఎంగేజ్మెంట్! నిర్మాత కొడుకు హీరోగా సక్సెస్ కావడమనే విషయంలో తెలుగు సినిమాకి జరిగిన అన్యాయం పాళ్ళు ఎక్కువే. కానీ ఆ అపవాదుని చెరిపేసిన ఇద్దరు, ముగ్గురు హీరోల్లో 'బెల్లంకొండ సాయి శ్రీనివాస్'(Bellamkonda sai Sreenivas)ఒకడు. హిట్టు ప్లాప్ లు సమానంగా పలరిస్తున్నా తను మాత్రం తన పని తాను చేసుకుంటూ వెళ్తున్నాడు. రీసెంట్ గా సాయిశ్రీనివాస్ పెళ్ళికి సంబంధించిన వార్తలు సోషల్ మీడియాని ఊపిరి సలపనంత బిజీగా చేస్తున్నాయి. మరి మనం కూడా కాసేపు పూర్తి న్యూస్ తో బిజీ అవుదాం. సాయిశ్రీనివాస్ ఫియాన్సీ పేరు కావ్య రెడ్డి.. హైదరాబాద్ కి చెందిన అమ్మాయి. తండ్రి లాయర్ కాగా తాత జడ్జి. రేపు( మార్చి 7 ) సాయి శ్రీనివాస్, కావ్య ల  ఎంగేజ్ మెంట్ జరగనుంది. ఈ కార్యక్రమానికి ఇరు వైపుల కుటుంబ సభ్యులు హాజరు కాబోతున్నారు. అయితే నిశ్చితార్థం విషయంపై అధికార ప్రకటన మాత్రం రాలేదు. ఏది ఏమైనా మొత్తానికి తెలుగు సినిమా తన వారసుల్నిఒక ఇంటివాళ్ళని చేస్తూ పెళ్లిళ్ల సీజన్ మాలో కూడా ఉంటుందని చెప్తుంది.  also read: Pawan Kalyan: వాళ్ళని కాపాడుతున్నాడా!.. ప్రముఖ నిర్మాత మాటలు వైరల్  సాయి శ్రీనివాస్ సినిమాల విషయానికి వస్తే హైందవ, టైసన్ నాయుడు అనే చిత్రాలు సెట్స్ పై ఉన్నాయి. సాయి శ్రీనివాస్ తండ్రి బెల్లకొండ సురేష్(Bellamkonda Suresh)గత మూడు దశాబ్దాలపై నుంచి చిత్ర సీమలో ఉంటు అగ్ర నిర్మాత హోదాలో ఎన్నో సూపర్ హిట్స్ నిర్మించాడు. ప్రస్తుతం రెస్ట్ మోడ్ లో ఉన్నాడు. కానీ రెస్ట్ కి గుడ్ బై చెప్పి నిర్మాతగా మళ్ళీ బిజీ అవుతానని ఇటీవల చెప్పాడు.   
టాలీవుడ్‌కి ఎంత మంది హీరోలు వచ్చినా మెగాస్టార్ చిరంజీవి స్థానం మాత్రం ఎంతో ప్రత్యేకం. దాదాపు 5 దశాబ్దాల సినీ ప్రస్థానంలో చిరంజీవి సాధించిన విజయాలు ఎన్నో. ప్రేక్షకుల అభిమానం అంతకు మించి ఉంటుంది. తన కెరీర్‌లో అన్నిరకాల పాత్రలు పోషించి ఒక ప్రత్యేకమైన ఇమేజ్‌ను సంపాదించుకున్నారు. ఆయన కెరీర్‌లో ఎన్నో అవార్డులు అందుకున్నారు.  తాజాగా ఎన్టీఆర్ నేషనల్ ఫిలిం అవార్డు మెగాస్టార్ ఖాతాలోకి వచ్చి చేరింది. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న గద్దర్ అవార్డ్స2025లో భాగంగా మెగాస్టార్‌కు ఎన్టీఆర్ నేషనల్ ఫిలిం అవార్డు ప్రదానం చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. భారతీయ సినీ రంగానికి ఆయన అందించిన సేవలను గుర్తించి ఈ గౌరవాన్ని ప్రకటించడం సినీ వర్గాల్లో, అభిమానుల్లో ఆనందాన్ని నింపుతోంది. మెగాస్టార్ ఎంతో మంది యువ హీరోలకు స్ఫూర్తిగా నిలిచి కొత్త హీరోలు ఇండస్ట్రీకి రావడానికి కారణమయ్యారు. 1978లో చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టిన మెగాస్టార్ నటుడిగానే కాదు, సేవా కార్యక్రమాలు కూడా చేస్తూ ప్రజల మనసుల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్నారు.  తెలంగాణ ప్రభుత్వం గద్దర్ పేరు మీద అవార్డులను ప్రవేశపెట్టడం ద్వారా ఆయన్ని గుర్తు చేసుకుంటూ కళాకారులను ప్రోత్సహిస్తున్నారు. అందులో భాగంగానే ఎన్టీఆర్ నేషనల్ ఫిలిం అవార్డును కూడా ప్రకటిస్తూ చిరంజీవిని ఆ అవార్డుకు ఎంపిక చేయడం అందరికీ సంతోషాన్ని కలిగించే విషయం. చిరంజీవికి ఈ అవార్డు దక్కడంపై సినీ ప్రముఖులు, అభిమానులు సోషల్ మీడియాలో అభినందనలు తెలియజేస్తూ పోస్టులు పెడుతున్నారు. ఇప్పటికే చిరంజీవికి ఎన్నో అవార్డులు లభించాయి. ఇప్ప్పుడు మరో ప్రతిష్ఠాత్మక అవార్డు ఆయన ఖాతాలో చేరింది. 
    -ప్రస్తుత తెలుగు సినిమా పరిస్థితి ఏంటి  -ఎందుకు వెలవెలబోతున్నాయి  -పరిష్కారం ఏంటి! ఎగ్జామ్స్ సీజన్ వచ్చేసింది. స్టూడెంట్స్ అందరు ఎంతో టెన్షన్ తో ఎగ్జామ్స్ మూడ్ లో ఉన్నారు. కానీ  ఈ నెల 19 న విడుదల కాబోతున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వన్ మాన్ షో ఉస్తాద్ భగత్ సింగ్, ధురంధర్ పార్ట్ 2 పై కూడా ఒక లుక్ వేశారు. ఎలా ఉండబోతున్నాయన్న టెన్షన్ కూడా వాళ్లల్లో ఉంది. అదేంటి పరీక్షలపై ఫోకస్ చేయండని ఎవరైనా చెప్పినా, అక్కడ ఉంది ఎలాంటి సినిమాలు దేని తోవ దానిదే అంటున్నారు. దీన్ని బట్టి ఉస్తాద్, ధురంధర్ 2 పై ఉన్న క్రేజ్ అర్ధం చేసుకోవచ్చు. పైగా ఈ చిత్రాలపై కొన్ని బాధ్యతలు కూడా నెలకొని కొన్నాయని ప్రముఖ  నిర్మాత, డిస్ట్రిబ్యూటర్, ఎగ్జిబిటర్ నట్టి కుమార్ (Nattikumar)మా తెలుగు వన్ సినిమా(Telugu One Cinema)ఛానల్ కి  చెప్తున్నాడు. ఆ మాటలు చూద్దాం. ఆయన మాట్లాడుతు ప్రస్తుతం చిత్ర పరిశ్రమ గడ్డు కాలాన్ని ఎదుర్కొంటోంది. మన శంకర వరప్రసాద్ గారు తర్వాత థియేటర్లలో సందడి చేసే సరైన సినిమా రాలేదు. దాదాపు 50 రోజులుగా థియేటర్లు ఖాళీగా ఉన్నాయి. కొన్నిచోట్ల షోలు పడక సెంటర్లు మూసివేసే పరిస్థితి వచ్చింది. ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు తాము తెచ్చిన అప్పులకి  వడ్డీలు కట్టలేక నష్టాల్లో కూరుకుపోతున్నారు. కేవలం ఒక్క హిట్ తో మొత్తం ఇండస్ట్రీని నడపడం సాధ్యం కాదు. అలాంటి హిట్ లతో  కనీసం నాలుగైదు సినిమాలు నిరంతరం రన్నింగ్‌లో ఉండాలి.  ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న యుద్ధ వాతావరణం యొక్కఉద్రిక్తతలు పరిశ్రమపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ముఖ్యంగా 'టాక్సిక్' (Toxic) 'దురందర్ 2' (Dhurandhar 2) వంటి పాన్ ఇండియా సినిమాలు వాయిదా పడే అవకాశం కనిపిస్తోంది. దీనికి ప్రధాన కారణం ఓవర్సీస్ మార్కెట్. హిందీ సినిమాలకు మరియు పాన్-ఇండియా చిత్రాలకు అమెరికా, గల్ఫ్ దేశాలు, జర్మనీ మరియు బ్రిటన్ వంటి దేశాల నుండి వచ్చే వసూళ్లు చాలా ముఖ్యం. అక్కడ పరిస్థితులు సజావుగా లేకపోవడంతో, భారీ బడ్జెట్ చిత్రాలు వెనక్కి తగ్గుతున్నాయి. . దీంతో అందరి దృష్టి 'ఉస్తాద్ భగత్ సింగ్'(ustaad Bhagatsingh)పైనే ఉంది. పాన్ ఇండియా సినిమాలతో పోలిస్తే పవన్ కళ్యాణ్(Pawan Kalyan)గారి సినిమాలకి ఓవర్సీస్ మార్కెట్ వల్ల వచ్చే నష్టం తక్కువగానే ఉండవచ్చు, ఎందుకంటే ఆయన సినిమాలకి మన లోకల్ మార్కెట్ చాలా బలంగా ఉంటుంది. అందుకే ఈ సినిమాను త్వరగా లేదా అనుకున్న సమయానికి తీసుకురావాలని ఎగ్జిబిటర్లు, అభిమానులు కోరుకుంటున్నారు. ఉగాది వంటి పెద్ద పండుగ సమయంలో సినిమా వస్తే థియేటర్లకు మళ్ళీ కళ వస్తుందని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. also read: mrithyunjay vs  sampradayini suppini suddapoosani: తొలి రోజు కలెక్షన్స్ ఇవే  కానీ ఒకేసారి  5000 థియేటర్లలో వేస్తే, ప్రేక్షకులందరూ మొదటి రోజే చూసేస్తారు. దీనివల్ల రెండో రోజు నుండి కలెక్షన్లు తగ్గిపోయే ప్రమాదం ఉంది, అందుకే ప్లానింగ్ ప్రకారం థియేటర్లని కేటాయించడం ముఖ్యమని నట్టి కుమార్ చెప్తున్నారు. ఆయన చెప్పినట్టుగానే తెలుగు ప్రేక్షకులకి సినిమా అనేది కేవలం వినోదం మాత్రమే కాదు, అది ఒక ఎమోషన్. కానీ గత కొన్నాళ్లుగా థియేటర్లు వెలవెలబోతున్నాయి. సరైన సినిమాలు లేక, ప్రేక్షకులు రాక ఎగ్జిబిటర్లు పడుతున్న ఇబ్బందులు వర్ణనాతీతం. ఈ తరుణంలో సినిమా కష్టాలు: 'ఉస్తాద్ భగత్ సింగ్' థియేటర్లకి పూర్వవైభవం తీసుకురావాలని ఆశిద్దాం.  ఇక నట్టి కుమార్ ఏ ముహూర్తాన కోరుకున్నాడో కానీ ఉస్తాద్ భగత్ సింగ్ ఈ నెల 26 నుంచి ఈ నెల 19 కి షిఫ్ట్ అయిన విషయం తెలిసిందే. దీంతో థియేటర్లు ఉగాది శోభతో  కళకళలాడనున్నాయి. ఆయన భయపడినట్టుగా యుద్ధ వాతావరణం నేపథ్యంలో టాక్సిక్ వాయిదా పడింది. ధురంధర్ 2 మాత్రం యధావిధిగా వస్తుంది. మరిన్ని ఆసక్తికర  అప్డేట్స్ కోసం మా తెలుగు వన్ సినిమా(Telugu One cinema) యూట్యూబ్ ఛానెల్‌ని ఇప్పుడే సబ్‌స్క్రైబ్ చేసుకోండి.  
1979- శశిబాల ఒక అందమైన 20 ఏళ్ల యువతి. దిల్లీలోని ప్రఖ్యత లక్ష్మీబాయ్‌ కాలేజి నుంచి డిగ్రీని కూడా సాధించింది. శశిబాలకు పది నెలల క్రితమే పెళ్లయింది. ఇప్పుడు తను ఆర్నెళ్ల గర్భవతి కూడా! బయట నుంచి చూసేవారికి ఇదంతా ఓ అందమైన జీవితం తాలూకు వర్ణనగా తోచవచ్చు. కానీ శశిబాల వ్యక్తిగత జీవితం ఆ చిత్రానికి తలకిందులుగా కనిపిస్తుంది. పెళ్లయిన దగ్గర్నుంచి శశిబాల అత్తమామలు కట్నం కింద ఏదోఒక వస్తువుని తీసుకురమ్మంటూ గొడవచేస్తూనే ఉన్నారు. శశిబాల తన తల్లి సత్యరాణి దగ్గర ఈ విషయాన్ని ప్రస్తావించిన ప్రతిసారీ, తల్లీకూతుళ్లు వారి కోరికను ఎలా తీర్చాలా అని మదన పడుతూనే ఉన్నారు. సత్యరాణి వితంతువు, పైగా శశిబాలతో పాటు ఆమె మీద మరికొందరి బిడ్డల భారం కూడా ఉంది. ఇలాంటి సమయంలో ఓ రోజు సత్యరాణికి, శశిబాల అత్తగారింటి నుంచి వెంటనే రమ్మంటూ కబురు వచ్చింది.     పరుగుపరుగున వెళ్లిన ఆమెకు తన బంగారు కూతురు నల్లటి ముద్దగా ఓ మూల కనిపించింది. ‘నీ కూతురు ఆత్మహత్య చేసుకుని చచ్చిపోయింది. ఆ చెత్తని ఇక్కడి నుంచి పట్టుకుపో!’ అన్నారు శశిబాల అత్తగారు. కూతురి శవాన్ని కప్పేందుకు వాళ్లు ఒక దుప్పటిని అందించేందుకు కూడా సిద్ధపడలేదు. 1980వ దశకంలో ఇలాంటి సంఘటనలు చాలానే వినిపించేవి. కిరసనాయిలు పోసుకునో, చీరకు నిప్పంటుకునో నిస్సహాయంగా ఎందరో ఆడవాళ్లు చనిపోయేవారు. అవన్నీ ప్రమాదాలో ఆత్మహత్యలో కాదనీ, వరకట్నపు హత్యలనీ తెలిసినా ఎవరూ నోరు మెదపలేని పరిస్థితి. కానీ సత్యరాణి అలా నిశ్శబ్దంగా ఊరుకోదల్చుకోలేదు.   స్కూటరు కొనిపెట్టలేదన్న కారణంగా తన అల్లుడు ఆమెను చంపేశాడంటూ కేసుని నమోదు చేసింది. అయితే అప్పట్లో చట్టాలు ఇంత కఠినంగా ఉండేవి కాదు. పెళ్లి సమయంలో అందుకున్నవే కట్నకానుకల కిందకి వస్తాయన్న నిర్వచనం ఉండేది. పైగా చావుకి సంబంధించిన ఆరోపణలను నిరూపించే బాధ్యత మృతుల తరఫు న్యాయవాదులకే ఉండేది. సత్యరాణి ఒక పక్క తన కూతురి చావుకి సంబంధించిన కేసులను పోరాడుతూనే, మరో పక్క వరకట్నపు చావులను ఎదుర్కొంటున్న ఎందరో అభాగ్యుల కోసం గొంతు విప్పడం మొదలుపెట్టింది. తమ కూతురు వరకట్నం కారణంగా చావుని ఎదుర్కొందిని భావించిన ప్రతి ఒక్కరి పోరాటానికీ ఆసరాగా నిలిచేది.       సత్యరాణి తనలాంటి దుస్థితిలో ఉన్న మరికొందరితో కలిసి శక్తిశాలిని పేరుతో ఒక స్వచ్ఛంద సంస్థను స్థాపించింది. వరకట్నపు వేధింపులను ఎదుర్కొనేవారికి ఈ సంస్థ నిలువనీడను కల్పించేది. సత్యరాణికి చదువు లేదు. వయసు పైబడుతోంది. పైగా చెట్టంత కూతురిని పోగొట్టుకుంది. అయినా వరకట్నానికి వ్యతిరేకంగా తన పోరులో రవ్వంత కూడా వెనక్కి తగ్గలేదు. రానురానూ సత్యరాణి ఉద్యమం ఫలితాలనివ్వసాగింది. వరకట్న వ్యతిరేక చట్టానికి ప్రభుత్వం మరింత పెట్టాల్సి వచ్చింది. వరకట్నం అంటే కేవలం డబ్బే కాదు, వస్తువుని కోరడం కూడా వరకట్న పరిధిలోనే వస్తాయంటూ చట్టాన్ని మార్చింది కేంద్రం. పెళ్లైన ఏడేళ్ల లోపు స్త్రీ ఆత్మహత్య చేసుకున్నా కూడా, అందుకు కారణం అత్తవారింటి ఆరళ్లు కూడా కావచ్చునంటూ మరో సవరణ కూడా చేసింది.   ఒక పక్క సమాజంలో మార్పు రావడం, మరో పక్క చట్టాలకు పదునెక్కించడంతో... వరకట్న హత్యలు కొంతమేరకన్నా తగ్గాయి. ముఖ్యంగా ‘వంటగదిలో ప్రమాదాలు, ఆత్మహత్యలు’ చాలామేరకు తగ్గాయి. నేరాల తగ్గుదలను చాలామంది గమనించారు కానీ, అందుకు కారణమైన సత్యరాణి వంటి తల్లుల పోరాటాన్ని పెద్దగా గమనించింది లేదు. వరకట్న చావులను తగ్గించడంలోనే సత్యరాణి విజయం సాధించడమే కాదు, మారిన చట్టాలకు అనుగుణంగా తన అల్లుడికి శిక్షపడేలా కూడా విజయం సాధించింది. 2014లో సత్యరాణి తన 85వ ఏట ప్రశాంతంగా కన్నుమూసింది. కానీ ఆమె జీవితం ఏనాడూ వృధాగా పోలేదు. ఒక తల్లిగా తాను పొందిన గర్భశోకాం, మరో తల్లికి కలుగకుండా ఉండేందుకే అనుక్షణం పోరాడింది. ఎందరో కూతుళ్లకి న్యాయాన్ని సాధించింది. మరెందరో వధువులు వరకట్నపు కోరల్లో చిక్కుకోకుండా తన జీవితాన్ని అడ్డు వేసింది.   - నిర్జర.
చాలామంది జీవితంలో కష్టాలు వస్తాయి. కలలా సాగిపోతున్న జీవితం కాస్తా తలకిందులైపోతుంది. అలా తారుమారైన జీవితాన్ని తల్చుకుని తల్చుకుని వారు కుమిలిపోతుంటారు. కానీ కొందరు మాత్రం తాము పడిన కష్టానికి ఉపశమనంగా, అలాంటి కష్టంలో ఉన్న తోటివారందరికీ ఓదార్పుగా..... ఓ భిన్నమైన మార్గాన్ని ఎన్నుకొంటారు. తన కష్టాన్ని సమాజానికి ఓ వరంగా అందిస్తారు. అలాంటి ఓ వ్యక్తే సరోజనీ అగర్వాల్‌! లక్నోలో ఉండే సరోజనీది ఓ అందమైన కుటుంబం. చక్కగా చూసుకునే భర్త, రత్నాల్లాంటి పిల్లలు... అంతా బాగుంది. హిందీలో పీ.హెచ్‌.డీ చేసిన సరోజనీకి కథలన్నా, కవితలన్నా చాలా ఇష్టం. ఆ ఇష్టంతో స్వయంగా ఎన్నో రచనలు చేశారు. ఓ రోజు సరోజనీ తన కూతురుతో కలిసి ప్రయాణిస్తుండగా... అనుకోని ఉపద్రవం ఎదురైంది. ఆమె నడుపుతున్న బండి ప్రమాదానికి లోనై, ఆమె కళ్ల ముందే కూతురు చనిపోయింది.   కళ్లముందే కూతురు చనిపోవడం, అది కూడా తను నడుపుతున్న బండి వల్లే చనిపోవడంతో సరోజనీ తేరుకోలేకపోయింది. కానీ అందరిలా ఆమె ఆవేదనతో మిగిలిపోలేదు. తన కూతురు జ్ఞాపకాలకు విలువనిచ్చేలా ఏదన్నా చేయాలనుకున్నారు. అలా 1985లో తన ఇంట్లోనే ఆడపిల్లల కోసం ఓ అనాథ శరణాలయాన్ని నెలకొల్పారు. ఆ శరణాలయానికి తన కూతురు పేరు మీదుగా ‘మనీషా మందిర్‌’ అని పేరు పెట్టారు. తన రచనల మీద వచ్చే రాయల్టీలతో దాన్ని నడపసాగారు.   మనీషా మందిర్‌ను మొదలుపెట్టడమే ఆలస్యం... ఎందరో పిల్లలకి అది ఆసరాగా మారింది. వికలాంగులుగా ఉన్నారనో, పెంచే ఆర్థిక స్తోమత లేదనో... వదిలేసే ఆడపిల్లలకు మనీషా మందిర్‌ నీడనిచ్చింది. రోడ్ల మీద తనకు అనాథలా కనిపించినవారినీ, వేశ్యాగృహాలలో పుట్టినవారినీ కూడా సరోజనీ అక్కున చేర్చుకునేవారు. మనీషా మందిర్లో అనాథలను చేర్చేందుకు ఆ ఇంటి ముంగిట ఒక ఊయల కట్టి ఉండేదంటే... ఆమె నిశ్చయం ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు.   మనీషా మందిర్‌లో ఇప్పటివరకూ 800 మందికి పైగా ఆడపిల్లలకు ఆశ్రయం లభించింది. అలాగని వారిని కేవలం అనాథలుగా చూడలేదావిడ. వారందరిలోనూ దూరమైన తన కూతురిని చూసుకుని మురుసుకునేవారు. ఒక కూతురి కోసం ఎలాంటి సుదాపాయాలు కల్పించాలని తల్లి తాపత్రయపడుతుందో... తన ఆశ్రమంలో ఉన్నవారికి అలాంటి సౌకర్యాలన్నీ కల్పిస్తారు సరోజని. లైబ్రరీ, కంప్యూటర్‌ లాబ్‌, బాడ్మింటన్ కోర్ట్‌... లాంటివన్నీ మనీషా మందిర్‌లో కనిపిస్తాయి. ఇక అందులోని పిల్లలకు విద్య, వృత్తి నైపుణ్యాలని అందించడం సరేసరి!   మనీషా మందర్‌లో రోజుల వయసులో చేరిన పిల్లలు, తమ కాళ్ల మీద తాము నిలబడేవరకూ చేయూతగా నిలుస్తారు సరోజనీ. అలా మనీషా మందిర్‌లో ఎదిగిన ఎందరో పిల్లలు బ్యాంక్‌ మేనేజర్లుగా, టీచర్లుగా, ప్రభుత్వోద్యోగులుగా గౌరవప్రదమైన స్థానాలకు ఎదిగారు. మరికొందరు పెళ్లి చేసుకుని జీవితంలో స్థిరపడ్డారు. ‘‘ఇంతమందికి సాయపడేందుకే భగవంతుడు నా కూతురిని తీసుకువెళ్లిపోయాడేమో! ఇన్ని వందల మందిలో నా కూతురిని పదిలంగా చూసుకునే అవకాశం కల్పించినందుకు ఆయనకి నేను రుణపడిపోయాను,’’ అంటారు సరోజనీ. మనీషా మందిర్‌ ముంగిట ఉన్న మనీష విగ్రహంలోని చిరునవ్వుని గమనిస్తే... ఆమె ఈ మాటలను వింటున్నట్లుగానే తోస్తుంది.   - నిర్జర.
కట్నం తీసుకోవడం శిక్షార్హం అని ప్రభుత్వం తెగ ప్రకటనలు చేస్తుంటుంది. కట్నం అడిగేవాడు గాడిదతో సమానం అంటూ టీవీలు చెడ తిడుతుంటాయి. కానీ కట్నం తీసుకునే ఆచారంలో మాత్రం ఎలాంటి మార్పూ లేదు. మునుపటిలా కట్నం తేలేదని కిరసనాయిలు పోసి తగటబెట్టేసిన వార్తలు వినిపించకపోవచ్చు. కానీ వేధింపులు మాత్రం యథాతథంగానే సాగుతున్నాయి. ఇలాంటి ఆచారానికి ముగింపు పలుకుతున్నాడు ఓ యోధుడు.... జార్ఖండ్లోని పొఖారీ గ్రామానికి చెందిన హాజీ ముంతాజ్ అలీకి కట్నం అంటే మా చెడ్డ చిరాకు. ఆ కట్నం కారణంగానే తన తోటి ముస్లిం కుటుంబాలు ఛిద్రమైపోతున్నాయన్నది అతని అభిప్రాయం. కానీ మిగతావారిలాగా ముంతాజ్ అలీ ఈ దురాచారం గురించి బాధపడుతూ కూర్చోలేదు. కట్నం తీసుకోవడం ఎంత అనాగరికమో, దాని వల్ల పేద కుటుంబాలు ఎలా నాశనం అయిపోతున్నాయో, యువత ఎలా అత్యాశలో కూరుకుపోతోందో ఊరిలో ఇంటింటికీ వెళ్లి చెప్పసాగాడు. 2016 ఏప్రిల్లో ముంతాజ్ అలీ మొదలుపెట్టిన ప్రచారం నెలలు గడిచేసరికి సత్ఫలితాలను ఇవ్వసాగింది. తాము కట్నం తీసుకోమంటూ తోటి ముస్లిం కుటుంబాలన్నీ ముంతాజ్ అలీకి మాట ఇచ్చాయి. అంతేకాదు! ఇప్పటికే కట్నం తీసుకున్నవారైతే తాము తీసుకున్న కట్నాన్ని ఆడపిల్లల కుటుంబానికి తిరిగి ఇచ్చేందుకు సిద్ధపడ్డారు. అలా ఒకరు కాదు, ఇద్దరు కాదు... ఏకంగా 800 కుటుబాల వారు ఆరుకోట్ల రూపాయల కట్నాన్ని తిరిగి ఇచ్చేశారు. కట్నానికి వ్యతిరేకంగా పోరాడుతున్న ముంతాజ్ అలీ పోరాటం రానురానూ ఓ ఉద్యమం స్థాయికి చేరుకుతంది. జార్ఖండ్లోని లాతేహర్, పాలము జిల్లాలలోని ముస్లిం కుటుంబాలు ఇప్పుడు కట్నం అంటేనే మండిపడుతున్నారు. ఆఖరికి పెళ్లిళ్లు చేయించే మతగురువులు (మౌల్వీలు) కూడా కట్నం తీసుకునేవారి పెళ్లిళ్లు చేయించం అంటూ ప్రతిజ్ఞ చేశారు. తన ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేసేందుకు దల్తోన్గంజ్ అనే ఊరిలో ఈ నెల 7వ తేదీన ఓ పెద్ద సభను ఏర్పాటు చేస్తున్నారు ముంతాజ్ అలీ. మతం ఏదైనా కానీ... కట్నం ఇచ్చే ఆచారం వెనుక ఒకప్పటి ఉద్దేశం వేరు. ప్రస్తుతం మాత్రం అది ఆడపిల్లల జీవితాలని తలకిందులుగా మార్చేస్తోంది. అలాంటి పరిస్థితిని చక్కదిద్దేందుకు నడుం కట్టుకున్నారు ముంతాజ్ అలీ. అతను ఆశయం అసాధ్యం కాదని 800 కుటుంబాలు సాక్ష్యంగా నిలుస్తున్నాయి. ఒక్క ముంతాజ్ అలీ ఒంటరిగా ఇంత సాధిస్తే... గంటల కొద్దీ కబుర్లు చెప్పే మన సమాజ సేవకులు ఇంకెంత సాధించాలి! - నిర్జర.        
బట్టతల మరియు జుట్టు రాలడం :  కారణాలు నివారణలు  ఆధునిక చికిత్సలు జుట్టు అనేది కేవలం మన శరీరంలో ఒక భాగం మాత్రమే కాదు, అది మన అందానికి మరియు ఆత్మవిశ్వాసానికి చిహ్నం. అద్దంలో చూసుకున్నప్పుడు జుట్టు పలచబడటం గమనిస్తే కలిగే ఆందోళన అంతా ఇంతా కాదు. ఒకప్పుడు 40 ఏళ్లు దాటిన వారిలో కనిపించే బట్టతల సమస్య, నేడు మారుతున్న జీవనశైలి వల్ల 13-14 ఏళ్ల చిన్న వయసులోనే మొదలవుతోంది. ఈ సమస్య ఎందుకు వస్తుంది? దీనిని అరికట్టడం సాధ్యమేనా?  Dr. Sunaina Shaik చెప్పిన మరిన్ని విషయాలు ఈ  TeluguOne Health Video Link క్లిక్ చేసి తెలుసుకుందాం. మనం జుట్టుపై ఎందుకు శ్రద్ధ వహించాలి? (Why Should We?) • ముందస్తు గుర్తింపు (Early Diagnosis): జుట్టు పూర్తిగా ఊడిపోయిన తర్వాత తిరిగి రావడం అసాధ్యం. ప్రారంభ దశలోనే గుర్తిస్తే మందుల ద్వారా జుట్టును కాపాడుకోవచ్చు. • ఆత్మవిశ్వాసం: జుట్టు రాలడం వల్ల కలిగే మానసిక ఒత్తిడి మన వ్యక్తిత్వాన్ని దెబ్బతీస్తుంది. సరైన సమయంలో చికిత్స తీసుకోవడం వల్ల మనల్ని మనం ఉత్సాహంగా ఉంచుకోవచ్చు. • మెరుగైన ఫలితాలు: జుట్టు పల్చబడే దశలో (Hair Thinning) చికిత్స ప్రారంభిస్తే, ఉన్న జుట్టును ఒత్తుగా మార్చుకోవడానికి అవకాశం ఉంటుంది. ఏమి చేయకూడదు? (What Not To Do?) • సొంత వైద్యం వద్దు: డాక్టర్ పర్యవేక్షణ లేకుండా మినాక్సిడిల్ (Minoxidil) వంటి మందులను వాడకూడదు. • గర్భధారణ సమయంలో జాగ్రత్త: గర్భం దాల్చిన వారు లేదా ప్లాన్ చేస్తున్న వారు మినాక్సిడిల్ వాడటం వల్ల పుట్టబోయే పిల్లల్లో లోపాలు వచ్చే అవకాశం ఉంది. • అతిగా ఆశించవద్దు: హెయిర్ ట్రాన్స్ ప్లాంట్ ద్వారా గతంలో ఉన్నంత సహజమైన సాంద్రత (Density) రాకపోవచ్చు; ఇది కేవలం పలచబడిన ప్రాంతాన్ని కవర్ చేయడానికి మాత్రమే ఉపయోగపడుతుంది. • ఒత్తిడిని నిర్లక్ష్యం చేయకండి: ఆధునిక పరిశోధనల ప్రకారం, ఒత్తిడి (Stress) అనేది బట్టతలకు ప్రధాన కారణాల్లో ఒకటిగా మారుతోంది. జుట్టును ఎలా కాపాడుకోవాలి? (How to - Treatment Steps) 1. కారణాన్ని గుర్తించండి: పురుషులలో వచ్చే బట్టతలను 'ఆండ్రోజెనెటిక్ అలోపేసియా' అంటారు, ఇది ఎక్కువగా జన్యుపరంగా వస్తుంది. మహిళల్లో జుట్టు మధ్యలో పలచబడటం వంటి లక్షణాలు కనిపిస్తాయి. 2. వైద్య చికిత్సలు:     ◦ మినాక్సిడిల్: ఇది సీరం, లోషన్, ఫోమ్ లేదా టాబ్లెట్ రూపంలో అందుబాటులో ఉంటుంది. ఇది జుట్టు రాలడాన్ని నియంత్రిస్తుంది. ◦ PRP మరియు GFC: ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా (PRP) మరియు గ్రోత్ ఫ్యాక్టర్ కాన్సంట్రేట్ (GFC) చికిత్సల ద్వారా మీ స్వంత రక్తం నుండి తీసిన పోషకాలను తలకు ఇంజెక్ట్ చేసి జుట్టు సాంద్రతను పెంచుతారు. ◦ హెయిర్ ట్రాన్స్ ప్లాంట్: జుట్టు పూర్తిగా ఊడిపోయిన చోట వేరే ప్రాంతం నుండి జుట్టును తీసి నాటుతారు. 3. సప్లిమెంట్స్: డాక్టర్ సూచన మేరకు అవసరమైన విటమిన్ సప్లిమెంట్స్ తీసుకోవడం వల్ల జుట్టుకు పోషణ అందుతుంది. సాధారణ సందేహాలు - సమాధానాలు (Q&A) ప్ర: బట్టతల అనేది కేవలం జన్యుపరంగానే వస్తుందా?  జ: పురుషులలో ఇది ప్రధానంగా జన్యుపరంగా వస్తుంది. కానీ మహిళల్లో జన్యువులతో పాటు హార్మోన్ల మార్పులు మరియు ఇతర కారణాల వల్ల కూడా రావచ్చు. ప్ర: PRP చికిత్సతో కొత్త జుట్టు వస్తుందా?  జ: లేదు. PRP లేదా GFC చికిత్సలు ఉన్న జుట్టును ఒత్తుగా (Thickening) చేయడానికి మరియు రాలకుండా ఆపడానికి మాత్రమే ఉపయోగపడతాయి. జుట్టు లేని చోట కొత్తగా జుట్టు రావాలంటే హెయిర్ ట్రాన్స్ ప్లాంట్ ఒక్కటే మార్గం. ప్ర: శరీరంలోని ఇతర భాగాల నుండి జుట్టును తీసి తలకు వాడవచ్చా?  జ: అవును, చాతి లేదా గడ్డం వంటి భాగాల నుండి జుట్టును తీసి ట్రాన్స్ ప్లాంట్ చేయవచ్చు. కానీ తలపై ఉన్న జుట్టు ఇచ్చినంత సహజమైన ఫలితాలు వీటితో రాకపోవచ్చు. జుట్టు రాలడం అనేది ఒక సమస్యే కావచ్చు, కానీ సరైన సమయంలో స్పందిస్తే దానికి పరిష్కారం తప్పక ఉంటుంది. భయపడకుండా నిపుణులైన డెర్మటాలజిస్ట్‌ను సంప్రదించి సరైన చికిత్స తీసుకోండి. మరింత సమాచారం కోసం మా యూట్యూబ్ ఛానెల్ సందర్శించండి: జుట్టు సంరక్షణ మరియు మరిన్ని ఆరోగ్య చిట్కాల కోసం ఇప్పుడే మా TeluguOne Health యూట్యూబ్ ఛానెల్‌ని సబ్‌స్క్రైబ్ చేయడం మర్చిపోకండి!
బిజీగా గడిపిన తర్వాత పురుషుల కంటే మహిళలు ఎక్కువగా అలసిపోయినట్లు కనిపిస్తారు. ఆడవాళ్ళు ఓవర్ యాక్షన్ చేస్తున్నారు అని చాలామంది మగాళ్లు అనుకుంటూ ఉంటారు. కానీ సైన్స్ మాత్రం ఆడవారి పరిస్థితి నిజమేనని చెబుతోంది.   సైన్స్ కూడా మహిళలు  పురుషుల కంటే ఎక్కువ  అలసిపోతారని,  వారికి ఎక్కువ నిద్ర అవసరమని చెబుతోంది.  ఇది కేవలం సోమరితనం లేదా విశ్రాంతి తీసుకోవడానికి చెబుతున్న విషయం కాదని, దాని వెనుక చాలా ముఖ్యమైన కారణాలు ఉన్నాయని చెబుతున్నారు. పురుషుల కంటే మహిళలకు ఎక్కువ నిద్ర ఎందుకు అవసరమో అర్థం తెలుసుకుంటే..   మల్టీ టాస్కింగ్..  మెదడు సంక్లిష్టత.. నిద్ర యొక్క అతి ముఖ్యమైన విధి మెదడును బాగుచేయడానికి,  తిరిగి శక్తిని  నింపడానికి సమయం కేటాయించడం. పరిశోధన ప్రకారం స్త్రీలు పురుషుల కంటే ఎక్కువ పనులు చేస్తారు.  ఇల్లు, పిల్లలు, ఉద్యోగం,  భవిష్యత్తు ప్రణాళికల గురించి ఒకేసారి ఆలోచిస్తారు. మెదడును  తీవ్రంగా,  ఎక్కువ కాలం ఇలా ఆలోచించినప్పుడు, అది కోలుకోవడానికి ఎక్కువ సమయం పడుతుంది. మహిళల మెదళ్ళు రోజంతా ఎక్కువ శక్తిని ఖర్చు చేస్తాయి. కాబట్టి వారికి మరింత గాఢ నిద్ర అవసరం అవుతుంది. హార్మోన్ల మార్పులు.. జీవితంలోని వివిధ దశలలో మహిళల శరీరాలు గణనీయమైన హార్మోన్ల మార్పులకు లోనవుతాయి. ఋతుస్రావం, గర్భధారణ, మెనోపాజ్  వంటి సమయాలలో ఈస్ట్రోజెన్,  ప్రొజెస్టెరాన్ వంటి హార్మోన్ల స్థాయిలు హెచ్చుతగ్గులకు లోనవుతాయి. గర్భం.. గర్బం దాల్చిన కాలంలో శరీర బరువు పెరగడం,  శారీరక మార్పులు అలసటను పెంచుతాయి. మెనోపాజ్.  మెనోపాజ్  దశలో వేడి ఆవిర్లు,  చెమటలు పట్టడం వంటి సమస్యలు తరచుగా నిద్రకు అంతరాయం కలిగిస్తాయి.  దీని కారణంగా శరీరానికి పూర్తి విశ్రాంతి లభించదు. అందుకే ఎక్కువగా నిద్రపోవాలని అనిపిస్తూ ఉంటుంది. నిద్ర నాణ్యత.. పురుషుల కంటే స్త్రీల నిద్ర తక్కువగా ఉంటుంది. ఇంట్లో శబ్దాలు, పిల్లలు ఏడుపు లేదా ఏదైనా చిన్న కదలికలకు కూడా వారు తొందరగా మేల్కొంటారు. ఇంకా మహిళలు నిద్రలేమి,  రెస్ట్‌లెస్ కాళ్ల సిండ్రోమ్ వంటి సమస్యలకు ఎక్కువగా గురవుతారు. తరచుగా నిద్ర అంతరాయాల కారణంగా, శరీర మరమ్మత్తుకు అవసరమైన గాఢ నిద్ర వారికి లభించదు. అందువల్ల  ఉదయం మేల్కొనేటప్పుడు అలసటగా,  ఇంకాసేపు నిద్రపోవాలని అనిపిస్తుంది. మానసిక ఆరోగ్యం,  ఒత్తిడి.. సామాజిక,  కుటుంబ బాధ్యతల కారణంగా మహిళలు తరచుగా ఎక్కువ మానసిక ఒత్తిడి,  ఆందోళనను అనుభవిస్తారు. ఒత్తిడి నేరుగా నిద్రను ప్రభావితం చేస్తుంది. మనస్సు ప్రశాంతంగా లేనప్పుడు, శరీరం విశ్రాంతి తీసుకోవడానికి ఎక్కువ సమయం పడుతుంది. తగినంత నిద్ర లేకపోవడం ఈ ఒత్తిడిని మరింత పెంచుతుంది, ఇది ఒక చక్రంలా కొనసాగుతుంది. బాగా నిద్రపోవడానికి ఏమి చేయాలి? మహిళలకు నిద్ర లేకపోవడం అలసటను మాత్రమే కాదు..  గుండె జబ్బులు, ఆందోళన,  నిరాశ ప్రమాదాన్ని కూడా పెంచుతుంది. పడుకోవడానికి, మేల్కొనడానికి ఒక సమయాన్ని నిర్థేశించుకోవాలి. నిద్రపోవడానికి కనీసం ఒక గంట ముందు మొబైల్,  ల్యాప్‌టాప్ వాడటం మానేయాలి. మధ్యాహ్నం తర్వాత టీ, కాఫీ తాగకూడదు.                             *రూపశ్రీ. గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...
                           ప్రకృతి మనకు ప్రసాదించిన అనేక పండ్లలో కొన్ని మనకు తెలియని రహస్యాలను దాచుకుంటాయి. అలాంటి ఒక అరుదైన మరియు శక్తివంతమైన పండే 'బిహి' (Behi). దీనిని ఇంగ్లీష్‌ లో 'క్విన్స్' (Quince) అని, సంస్కృతంలో 'అమృతఫల' అని, తెలుగులో 'సీమ దానిమ్మ' అని పిలుస్తారు. సుమారు 2500 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ పండు, పర్షియా (నేటి ఇరాన్) నుండి గ్రీస్, రోమ్ మరియు మధ్యప్రాచ్య దేశాలకు వ్యాపించింది. ప్రాచీన గ్రీకులు దీనిని 'ప్రేమ మరియు సంతాన సాఫల్యతకు' (Love and Fertility) చిహ్నంగా భావించేవారు. ఈ రోజు మనం ఈ 'బంగారు ఆపిల్' వంటి బిహి పండు విశిష్టతలను గురించి Dr SGV Satya (Unani Specialist) ఈ Video లింక్ క్లిక్ చేసి వివరంగా తెలుసుకుందాం. మనం ఈ పండును ఎందుకు తీసుకోవాలి? (Why should we?)  బిహి పండు కేవలం రుచికరమైనదే కాదు, ఇది ఒక పోషకాల గని. దీనిని మీ ఆహారంలో చేర్చుకోవడానికి గల ముఖ్య కారణాలు ఇక్కడ ఉన్నాయి: సంతాన సాఫల్యత మరియు పురుషుల ఆరోగ్యం: మగవారిలో స్పెర్మ్ కౌంట్‌ను (Sperm Count) అమాంతం పెంచే అద్భుత గుణం దీనికి ఉంది. అందుకే పురాతన కాలంలో పెళ్లికూతుళ్లకు పెళ్లికి ముందు దీనిని ఇచ్చే ఆనవాయితీ ఉండేది. బరువు తగ్గడానికి మరియు మధుమేహానికి: ఇది తక్కువ క్యాలరీలు ఉండి, పోషకాలు ఎక్కువగా ఉండే ఫ్రూట్. బరువు తగ్గాలనుకునే వారు, డయాబెటిక్ పేషెంట్లు, థైరాయిడ్ మరియు క్యాన్సర్ రోగులు కూడా దీనిని తమ డైట్‌లో చేర్చుకోవచ్చు. జీర్ణక్రియ మెరుగుదల: ఇందులో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉండటం వల్ల మలబద్ధకం (Constipation) మరియు అల్సర్ వంటి సమస్యలను తగ్గిస్తుంది. గుండె ఆరోగ్యం: పొటాషియం, కాపర్ మరియు ఐరన్ వంటి ఖనిజాలు పుష్కలంగా ఉండటం వల్ల ఇది రక్తపోటును (BP) అదుపులో ఉంచి గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది. రోగనిరోధక శక్తి (Immunity): కరోనా సమయంలో ప్రభుత్వం విడుదల చేసిన 'జోషాంద' (Joshanda) కాడాలో బిహి గింజలను (Behi Dana) ఒక ముఖ్యమైన ఇంగ్రిడియంట్‌గా వాడారు. ఇది వైరస్‌లకు వ్యతిరేకంగా పోరాడి బాడీని స్ట్రెంథన్ చేస్తుంది. ఎలా ఉపయోగించాలి? (How to use?) బిహి పండు నేరుగా తినడానికి చాలా పుల్లగా ఉంటుంది, కాబట్టి దీనిని ఈ క్రింది పద్ధతుల్లో తీసుకోవచ్చు: మురబ్బా (Murabba): ఇది అత్యంత ప్రాచుర్యం పొందిన పద్ధతి. బిహి మురబ్బా ఏ యునానీ మందుల షాపులోనైనా దొరుకుతుంది. తేనెతో కలిపి: డయాబెటిక్ పేషెంట్లు పంచదార పాకంలో చేసిన మురబ్బా కాకుండా, తేనెతో చేసిన దానిని ఎంచుకోవాలి. జెల్లీలు మరియు షర్బత్‌లు: దీనితో జెల్లీలు, జామ్‌లు లేదా 'షర్బతే బిహి' వంటి పానీయాలు తయారు చేసుకోవచ్చు. వంటల్లో: గ్రీస్ వంటి దేశాల్లో దీనిని నిమ్మరసంతో కలిపి ఉడికించి వంటల్లో వాడుతుంటారు. ఏమి చేయకూడదు? (What NOT to do?) ఈ పండు ఆరోగ్యకరమైనదే అయినప్పటికీ, కొన్ని జాగ్రత్తలు తప్పనిసరి: నేరుగా ఎక్కువగా తినకండి: ఇది చాలా పుల్లగా ఉండటం వల్ల నేరుగా పండును ఎక్కువగా తింటే జీర్ణ సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. మధుమేహ రోగులు జాగ్రత్త: బయట దొరికే మురబ్బాలలో షుగర్ సిరప్ ఎక్కువగా ఉంటుంది. డయాబెటిస్ ఉన్నవారు తేనె లేదా తాటి బెల్లంతో ఇంట్లోనే తయారు చేసుకున్న మురబ్బాను వాడటం శ్రేయస్కరం. అపరిమితంగా వద్దు: ఇది మన దేశీయ పండు కాదు కాబట్టి, రోజుకు ఒక చిన్న టీస్పూన్ మురబ్బా తీసుకుంటే సరిపోతుంది. అతిగా తీసుకోకూడదు. ప్రశ్నోత్తరాలు (Q&A): ప్రశ్న: బిహి పండు కేవలం మగవారికి మాత్రమే ఉపయోగపడుతుందా? సమాధానం: లేదు, ఇది అందరికీ ఆరోగ్యకరమైనది. అయితే పురుషులలో సంతానోత్పత్తి సామర్థ్యాన్ని పెంచడంలో ఇది విశేషంగా పనిచేస్తుంది. ప్రశ్న: ఇది మార్కెట్‌లో దొరుకుతుందా? సమాధానం: పండు దొరకడం కష్టమైనా, 'బిహి మురబ్బా' రూపంలో యునానీ స్టోర్లలో సులభంగా లభిస్తుంది. ప్రశ్న: పిల్లలకు ఇది ఇవ్వవచ్చా? సమాధానం: అవును, రోగనిరోధక శక్తి పెంచడానికి తక్కువ మోతాదులో మురబ్బాను ఇవ్వవచ్చు. పురాతన కాలం నుండి ప్రాచుర్యంలో ఉన్న ఈ బిహి పండు మన ఆరోగ్యానికి ఒక వరం లాంటిది. ముఖ్యంగా నేటి కాలంలో ఎదుర్కొంటున్న సంతాన సమస్యలకు మరియు ఇమ్యూనిటీ సమస్యలకు ఇది చక్కని పరిష్కారం. ప్రకృతి ఇచ్చిన ఈ 'అమృతఫలాన్ని' సరైన పద్ధతిలో తీసుకుని ఆరోగ్యంగా ఉందాం. మరిన్ని ఆసక్తికరమైన ఆరోగ్య చిట్కాలు మరియు ఇలాంటి అరుదైన పండ్ల గురించి వివరంగా తెలుసుకోవడానికి మా  TeluguOne Health Youtube Channel సందర్శించండి! మా వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్‌స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.