LATEST NEWS
ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం కూటమి అధికారపగ్గాలు చేపట్టి రెండేళ్లు పూర్తయ్యింది. మరో మూడేళ్లలో మళ్లీ ఎన్నికలు రానున్నాయి. అయితే ముందస్తుగానే రాష్ట్రంలో రాజకీయ వేడి పీక్స్ కు చేరింది. రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు రానున్నాయా అన్న రేంజ్ లో  పొలిటికల్ హీట్ ఉంది. రాజకీయ క్షేత్రంలో ముందస్తు ఊహాగానాలు, భవిష్యత్ ఎన్నికల అంచనాలు ఎప్పుడూ ఆసక్తికరంగానే సాగుతుంటాయి. ఈ నేపథ్యంలో సపోజ్ ఫర్ సపోజ్  ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే పరిస్థితి ఎలా ఉంటుందన్న చర్చ జోరందుకుంది. రానున్న  రాజకీయ సమీకరణాలపై   చర్చోపచర్చలు మొదలయ్యాయి.   తెలుగుదేశం ప్రభుత్వ పనితీరుపై  వైసీపీ విమర్శలతో విరుచుకుపడుతోంది. అయితే.. అదే సమయంలో  వైసీపీ ఈ రెండేళ్లలో ఇసుమంతైనా పుంజుకోలేదన్న విశ్లేషణలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా రాని, ప్రజలివ్వని ప్రతిపక్ష హోదా కోసం ఆ పార్టీ అసెంబ్లీని బహిష్కరించడంపై జన సామాన్యంలో కూడా అసంతృప్తి వెల్లువెత్తుదోంది. ఈ నేపథ్యంలోనే వచ్చే ఎన్నికలలో విజయం సాధించి మళ్లీ సీఎంను అవుతానంటూ ధీమాగా ప్రకటనలు గుప్పిస్తున్న జగన్ పొలిటికల్ ఫ్యూచర్ పై రాజకీయ పండితులు, పరిశీలకులు ఆసక్తికర విశ్లేషణలు చేస్తున్నారు.  ప్రస్తుత పాలనలోని కొన్ని అంశాలను తటస్థ వేదికలపై విమర్శించే విశ్లేషకులు సైతం..  రాబోయే ఎన్నికలలో వైపీపీ విజయం సాధించి అధికారంలోకి రావడం సాధ్యమేనా అంటే ఔనని చెప్పలేమంటున్నారు.   వైసీపీకి ఏ మాత్రం సానుకూల పరిస్థితి లేదని, వైసీపీ పుంజుకుని జగన్ మళ్లీ సీఎం అవ్వడం సులువు కాదని ఎలాంటి శషబిషలూ లేకుండా చెబుతున్నారు.  సాధారణంగా  పబ్లిక్ ఒపీనియన్ ను ప్రభావితం చేయడంలో పొలిటికల్ అనలిస్టుల పాత్ర కీలకంగా ఉంటుంది. మరీ ముఖ్యంగా తటస్థ అనలిస్టుల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఆ రకంగా చూసినా తటస్థ విశ్లేషకులు సైతం వైసీపీ తీరుపై పెదవి విరుస్తున్నారు. వైసీపీ అసెంబ్లీ బహిష్కరణ ఆ పార్టీ చేసుకున్న సెల్ఫ్ గోల్ గా అభివర్ణిస్తున్నారు.   ప్రభుత్వ వైఫల్యాలు లేదా లోపాలను ఎత్తిచూపుతూనే విశ్లేషకులు  వైఎస్సార్సీపీకి అధికారంలోకి వచ్చే అవకాశాలు దాదాపు మృగ్యమన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తుండటం గమనార్హం.  గతంలో  అంటే 2014 నుండి 2019 మధ్యకాలంలో   తెలుగుదేశం   అధికారంలో ఉన్న సమయాన్ని గుర్తుచేసుకుంటే, నాటి రాజకీయ వాతావరణం వైసీపీకి   సానుకూలంగా ఉండేది. ఆ సమయంలో ప్రతిపక్షంలో ఉన్న  వైసీపీ . ప్రజా సమస్యలపై నిరంతరం పోరాటాలు చేయడం, బలమైన మీడియా మద్దతు లభించడం మరియు అప్పటి జాతీయ సమీకరణాలు కూడా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా మారాయి. ఆ కాలంలో ప్రతిపక్షంలో ఉన్న తీవ్రమైన దూకుడు, ప్రభుత్వ నిర్ణయాలను నిలదీసే నైతిక బలం జగన్ వైపు స్పష్టంగా కనిపించాయి. అంతేకాకుండా, 2014-2019 మధ్యకాలంలో నాటి ప్రభుత్వంపై విమర్శలు గుప్పించిన మేధావులు, రిటైర్డ్ అధికారులు, తటస్థ విశ్లేషకులు ప్రతిపక్ష వైఎస్సార్సీపీ వైపే ఎక్కువగా మొగ్గు చూపారు. ఉదాహరణకు, నాటి ప్రభుత్వ విధానాలను తీవ్రంగా తప్పుపట్టిన పలువురు ప్రముఖులు, ఐఏఎస్ అధికారులు మరియు ఇతర రంగాల ప్రముఖులు జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తారని బహిరంగంగానే  చెప్పారు.   అయితే, 2019 నుండి 2024 వరకు సాగిన ఐదేళ్ల  జగన్ పాలన తరువాత   పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. ఆయన అధికారంలో ఉండా తీసుకున్న  వివాదాస్పద నిర్ణయాలు, పాలనా విధానాలు విధానాల కారణంగా ప్రజా వ్యతిరేకత అధికమైంది. అదే 2024 ఎన్నికలలో ప్రభుత్వ పతనానికి కారణమైంది. అన్నిటికీ మించి మూడు రాజధానులు, బాబాయ్ గొడ్డలి పోటు, మద్యం కుంభకోణం వంటి అంశాలు జగన్ క్రెడిబులిటీని కోలుకోలేనంతగా దెబ్బతీశాయి.   ఆ తరువాత అధికారం కోల్పోయిన తరువాత జగన్ ఎక్కువగా బెంగళూరు ప్యాలెస్ కే పరిమితం కావడం, వారానికోసారి చుట్టపు చూపుగా రాష్ట్రానికి వచ్చినా తాడేపల్లి ప్యాలెస్ లో మీడియా సమావేశాలతో సరిపెట్టేయడం వంటివి పార్టీ శ్రేణులలో నిరుత్సాహానికి కారణమయ్యాయి. దీంతో క్షేత్రస్థాయిలో పార్టీ కార్యకలాపాలు నామమాత్రమయ్యాయి.  అన్నిటికీ మించి అధికారం కోల్పోయిన తర్వాత తిరిగి పుంజుకోవడానికి కావలసిన రాజకీయ వ్యూహాలు, ప్రజా విశ్వాసాన్ని చూరగొనే ప్రయత్నాలు జగన్ నుంచి కానీ, వైసీపీ నుంచి కానీ జరగలేదు. దీంతో పార్టీ ఇమేజ్ రోజురోజుకూ మసకబారుతోందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వ విధానాలను విమర్శించే మేధావులు కూడా వైసీపీకి అనుకూలంగా మాట్లాడలేని పరిస్థితి నెలకొంది.    Can Jagan Become CM Again, AP politics, YS Jagan Mohan Reddy, YCPs Future, AP elections, Telugu One
తెలంగాణ కాంగ్రెస్ లో  ఇటీవలి కాలంలో పెను సంచలనం సృష్టించిన కొండా సురేఖ ఎపిసోడ్ కు లాజికల్ కంక్లూజన్ దిశగా కాంగ్రెస్ హైకమాండ్ అడుగులు వేస్తున్నది.  పార్టీ ప్రతిష్టను దెబ్బతీసే విధంగా వ్యవహరించారనే ఆరోపణలపై కొండా సురేఖపై చర్యలకు సిఫారసు చేస్తూ తెలంగాణ కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ నివేదిక సమర్పించిన సంగతి తెలిసిందే. దీంతో కొండా సురేఖపై వేటు తప్పదనీ, ఆమెకు క్యాబినెట్ నుంచి ఉద్వాసన తప్పదన్న ప్రచారం జోరుగా సాధింది. ఒక దశలో రేవంత్ కేబినెట్ లోకి సురేఖ స్థానంలో మరో ఫైర్ బ్రాండ్ నాయకురాలు విజయశాంతిని తీసుకోనున్నట్లు కూడా వార్తలు వినిపించాయి.  అయితే రక్షాబంధన్ రోజున కొండా సురేఖ సీఎం రేవంత్ రెడ్డి అప్పాయింట్ మెంట్ తీసుకుని మరీ ఆయనతో భేటీ అవ్వడం, రాఖీ కట్టడం తెలిసిందే. ఆ తరువాత రేవంత్ రెడ్డిపై ప్రశంసల వర్షం కురిపించిన ఆమె.. తన కుమార్తె  వ్యాఖ్యలతో తనకు ఎటువంటి సంబంధం లేదని క్లియర్ కట్ గా, క్లారిటీ ఇచ్చారు. ఈనేపథ్యంలోనే కొండా సురేఖపై వేటు విషయంలో పార్టీ హైకమాండ్ వైఖరి మారిందని పొలిటికల్ సర్కిల్స్ లో గట్టిగా వినిపిస్తున్నది.    పార్టీ ప్రతిష్ఠకు భంగం కలిగించినందుకు ఆమెపై చర్య తీసుకోవడం ఖాయమే అని చెబుతూనే.. త్వరలో రేవంత్ కేబినెట్ పునర్వ్యవస్థీకరణ సందర్భంగా ఆమెకు ఉద్వాసన చెప్పడం కాకుండా.. రాజీనామా కోరాలని హైకమాండ్ భావిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం.  మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ చేపట్టి కొత్తవారికి అవకాశం   పేరుతో కొండా సురేఖను రాజీనామా చేయాల్సిందిగా సూచించేందుకే హైకమాండ్ భావిస్తోందంటున్నారు. ఏది ఏమైనా రానున్న రెండు రోజుల్లో  ఈ విషయంపై క్లారిటీ వస్తుందని అంటున్నారు.   [Congress High Command Softcorner on Konda Surekha, Telangana Congress, CM Revanth, Cabinet Expanssion, Telugu One] 
వైసీపీ అధినేత జగన్.. తన వ్యాఖ్యలతో పార్టీకి కలిగిన నష్టాన్ని నివారించేందుకు బొత్స రంగంలోకి దిగారు. నష్ట నివారణ కోసం ఆయన జగన్ వ్యాఖ్యలకు కొత్త భాష్యం చెప్పారు.  స్థానిక ఎన్నికలలో ఏకగ్రీవాలు ఉండడానికి వీల్లేదన్న జగన్ ఆదేశాలకు భిన్నంగా, బొత్స సత్యనారాయణ స్థానిక ఎన్నికలలో  ఏకగ్రీవాలు రెండు రకాలుగా ఉంటాయంటూ తనదైన శైలిలో వివరణ ఇచ్చారు.  వాటిలో ఒకటి.. గ్రామాభివృద్ధి కోసం ప్రభుత్వం వాటిని ప్రోత్సహించడం. మరొకటి, రాజకీయ ప్రయోజనాల కోసం అధికార పార్టీ బలవంతపు ఏకగ్రీవాలను నిర్వహించడమంటూ బొత్స చెప్పిన భాష్యంపై నెటిజనులు ఓ రేంజ్ లో సెటైర్లు గుప్పిస్తున్నారు. ఇక వైసీపీ వర్గాలైతే.. అసలు బొత్స చెప్పిందేంటో అర్ధం కాక తలలు పగలకొట్టుకుంటున్నారు. ఇంతకీ బొత్స చెప్పినదేంటంటే.. జగన్ ఆదేశించినంత మాత్రాన ఏకగ్రీవాలు జరగకుండా పోవని, అంటే పార్టీ అధినేత మాటను ఆయన ఖండిచారన్న మాట.  ప్రభుత్వ మద్దతుతో జరిగే ఏకగ్రీవ ఎన్నికలు ఉంటాయన్న ఆయన రాజకీయ పార్టీ కోణంలో ఏకగ్రీవాలు ఉండకూడదని జగన్ అన్నారంటూ బొత్స  వివరణపై వైసీపీ నేతలు పెదవి విరుస్తున్నారు.   ఏకగ్రీవ ఎన్నికలు జరిగిన నియోజకవర్గాల ప్రతినిధులకు తదుపరి ఎన్నికల్లో పార్టీ టిక్కెట్లు దక్కవంటూ జగన్ చేసిన హెచ్చరిక నేపథ్యంలో బొత్స వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.  అలాగే.. తాజాగా వైసీపీ మాజీ నేత, మాజీ ఎంపీ విజయసాయిపై కూడా బొత్స విరుచుకుపడ్డారు. విజయసాయిని ఆయన మరో కేఏపాల్ గా అభివర్ణించారు. విజయసాయి.. నోటికి వచ్చినట్లు మాట్లాడతారనీ, ఆయన మాటలకు ఇసుమంతైనా విలువ ఉండదని బొత్స అన్నారు.   అసెంబ్లీ సమావేశాలకు హాజరుకాని ఎమ్మెల్యేల సభ్యత్వాన్ని రద్దు చేయవచ్చన్న స్పీకర్ హెచ్చరికపై.. తనదైన శైలిలో సవాల్ విసిరారు... నిజంగా స్పీకర్ కు ఆ అధికారం ఉంటే రద్దు చేసుకోవచ్చన్నారు. సభ్యత్వాలు రద్దు చేస్తే.. వైసీపీ రాజ్యాంగ బద్ధంగా పోరాడుతుందన్నారు.   [Botsa New Interpretation on  Jagan Comments, Botsa, YS Jagan Mohan Reddy, YCP Unanimous Elections, Localbodies,   AP Politics, Telugu One]
  బహదూర్‌పురా నియోజకవర్గ ఎమ్మెల్యే మహ్మద్ ముబీన్‌ను రాజేంద్రనగర్ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌గా ఆల్ ఇండియా మజ్లిస్-ఎ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (AIMIM) నియమించింది. ఈ మేరకు పార్టీ అధికారికంగా ప్రకటన విడుదల చేసింది. రాజేంద్రనగర్ నియోజకవర్గంలో పార్టీ తరఫున సంస్థాగత కార్యక్రమాలను పర్యవేక్షించడంతో పాటు, పార్టీకి సంబంధించిన కార్యకలాపాల్లో ప్రాతినిధ్యం వహించే బాధ్యతలను మహ్మద్ ముబీన్ నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో రాజేంద్రనగర్ నియోజకవర్గానికి చెందిన AIMIM పార్టీ పదాధికారులు, నాయకులు, కార్యకర్తలు మహ్మద్ ముబీన్‌తో సమన్వయం చేసుకుంటూ పార్టీ సంస్థాగత కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లాలని పార్టీ సూచించింది. నియోజకవర్గంలోని పార్టీ కార్యక్రమాలు, సమావేశాలు, ఇతర సంస్థాగత వ్యవహారాలకు సంబంధించి ఆయనతో సంప్రదింపులు జరపాలని పేర్కొంది. ముబీన్‌కు అప్పగించిన కొత్త బాధ్యతలతో రాజేంద్రనగర్ నియోజకవర్గంలో పార్టీ కార్యకలాపాలను మరింత బలోపేతం చేసే దిశగా చర్యలు చేపట్టే అవకాశం ఉంది.   MLA Mohammed Mubeen, Rajendranagar  MIM in-charge, AIMIM, Asaduddin Owaisi,  MLC Rahmat Beg, Telugu news, Telugu one 
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలోని వైసీపీకి అత్యంత బలమైన అనుకూల ప్రాంతంగా ఉంటూ వచ్చిన రాయలసీమలో 2024 ఎన్నికలలో ఆ పార్టీ దెబ్బతింది.  ముఖ్యంగా వైసీపీకి కొండంత అండగా నిలుస్తూ, ఆ పార్టీకి పెట్టని కోట లాంటి కడన జిల్లాలో కూడా వైసీపీ వెనుక బడింది. కడప లోక్ సభ నియోజకవర్గ పరిధిలోని  మొత్తం పది అసెంబ్లీ స్ధానాలలో ఏడింటిని తెలుగుదేశం కూటమి కైవశం చసుకుంది.  ఇంతటి ప్రతికూల పరిస్థితుల్లోనూ వైపీనీ కడప లోక్ సభ నియోజకవర్గాన్ని నిలబెట్టుకోగలిగింది.  అయితే ఇండియా టుడే ,  సి-వోటర్ సంయుక్తంగా నిర్వహించిన తాజా మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వే ఫలితాలు కడప లోక్ సభ స్థానానికి జగన్, ఆయన పార్టీ తిలోదకాలొదిలేయడం ఖాయమని పేర్కొంది.  ఏపీలో ఇప్పుడు గనక  ఎన్నికలు జరిగితే వైసీపీ  కడప పార్లమెంట్ స్థానంలో సైతం పరాజయం పాలౌతుందని సర్వే పేర్కొంది.  ఇండియా టుడే-సి ఓటర్ సర్వే అంచనాల ప్రకారం.. మొత్తం 25 లోక్‌సభ స్థానాలు ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం కూటమి  20 పార్లమెంట్ స్థానాలను దక్కించుకుంటుంది. ప్రస్తుతం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఉన్న 4 ఎంపీ స్థానాల సంఖ్య మరో స్థానం పెరిగి 5 కి చేరుకునే అవకాశం ఉందదని సర్వే పేర్కొన్నప్పటికీ, వైసీపీ కంచుకోట అయిన కడపలో ఓటమి మూటకట్టుకోవడం ఖాయమని ఇండియాటుడే సర్వే పేర్కింది,   {India Today survey, Kadapa MP seat, YCP Kadapa Lok Sabha, India Today C Voter AP survey, TDP AP Lok Sabha seats,  AP politics news, Telugu One}
ALSO ON TELUGUONE N E W S
      వినాయక చవితి(సెప్టెంబర్ 14 ) మరికొన్ని రోజుల్లో రాబోతున్న విషయం తెలిసిందే . దీంతో తెలుగు రాష్ట్రాల్లో ప్రతి సంవత్సరం లాగానే పండుగ వాతావరణం స్టార్ట్ అయ్యింది. రెండు రోజుల నుంచే  లారీల్లో, ఆటోల్లో అయితే లంబోదరుడి విగ్రహాలు తన నివాస స్థలానికి బయలుదేరుతున్నాయి. అయితే, ఈ వేడుకల వెనుక పర్యావరణానికి జరుగుతున్న తీవ్ర విఘాతం గురించి మనం ఆలోచించాల్సిన సమయం ఆసన్నమైంది. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్  విగ్రహాల విపరీతమైన వాడకం వల్ల మన నీటి వనరులు కలుషితమై జలచరాల మనుగడ ప్రశ్నార్థకంగా మారుతోంది. ఈ విషయాన్ని గమనించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ వ్యవస్థాపకుడు, బిఆర్ఎస్ మాజీ ఎంపీ, కె సి ఆర్ తోడల్లుడు కొడుకు జే సంతోష్ కుమార్ పర్యావరణ హితమైన వినాయక చవితి వేడుకల కోసం ‘సీడ్ గణేశ’ (విత్తన గణపతి) ప్రచారాన్ని రూపొందించారు. ఈ బృహత్తర కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి తన హైదరాబాద్ నివాసంలో శ్రీకారం చుట్టి పర్యావరణ పరిరక్షణపై పిలుపునిచ్చారు.  ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతు కెమికల్స్ తో కూడిన విగ్రహాలని నిమజ్జనం చేయడం వల్ల ఆరోగ్యం దెబ్బతినడంతో పాటు పర్యవరణం తీవ్రంగా దెబ్బతింటుంది. దీంతో నా మిత్రుడు జోగినపల్లి సంతోష్ కుమార్ ఆలోచన మేరకు సహజ పదార్ధాలతో, విత్తనాలతో సీడ్ గణేష్ విగ్రహాలని రూపొందించారు. 'వినాయకుడి పూజ ముగిసిన తర్వాత నీటి వనరుల్లో కాకుండా ఇళ్లలోనే విగ్రహ నిమజ్జనం చేసుకోవాలి. నా    విత్తన గణపతులను సహజసిద్ధమైన మట్టి, కోకో పీట్, కొబ్బరి పీచులతో తయారు చేయడంతో పాటు, వాటిలో వేప మరియు చింత వంటి దేశవాళీ వృక్షాల విత్తనాలను అమర్చడం విశేషం. పూజ అనంతరం ఇంట్లోనే కుండీలో నీటిని చల్లి నిమజ్జనం చేయడం వల్ల ఆ విగ్రహం కరిగి, అందులోని విత్తనం మొలకెత్తి పచ్చని మొక్కగా మారుతుంది. "స్వయంగా ఆ విఘ్నేశ్వరుడే ఒక మొక్క రూపంలో మీ ఇంట్లో ఉండి మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. పండుగలు కేవలం వేడుకలకే పరిమితం కాకుండా ప్రతీ ఇంట్లో ఆరోగ్యంతో పాటు భగవంతుడి ఆశీస్సులని నింపాలని చిరంజీవి చెప్పుకొచ్చాడు.  Also Read: 'ప్రేమ' కి క్యాన్సర్ అంటూ ప్రచారం.. 70 ఏళ్ల వయసులోనైనా పెళ్లి చేసుకుంటానంటూ కామెంట్స్  2018లో ప్రారంభమైన ఈ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ద్వారా ఇప్పటివరకు దేశవ్యాప్తంగా ఏకంగా 19.60 కోట్లకు పైగా మొక్కలు నాటడం గమనార్హం. ‘ఒక్కరు 3 మొక్కలు నాటాలి, వాటిని 3 ఏళ్ల పాటు సంరక్షించాలి, అలాగే మరొక ముగ్గురిని నాటమని నామినేట్ చేయాలి’ అనే సరళమైన 3x3x3 సూత్రంతో ఈ ఉద్యమం కొనసాగుతోంది. ఇక 2020 కొవిడ్ పాండమిక్ సమయంలో ప్రారంభమైన ‘సీడ్ గణేశ’ వినూత్న ప్రచారం ద్వారా ప్రతీ సీజన్‌లోనూ ఉచితంగా సుమారు 1.5 లక్షల మట్టి గణపతులను భక్తులకు పంపిణీ చేయడం విశేషం.       [ Chiranjeevi, Seed Ganesha, Green India , TeluguCinema, TelugucinemaNews, TollywoodNews, Tollywood]  
"నా కొడుకేం ఉగ్రవాది కాదు. ఒక బస్ డ్రైవర్ కొడుకుగా తన కష్టాన్ని నమ్ముకుని పైకొచ్చినోడు". ఈ కామెంట్స్ చేసింది ఎవరో కాదు.. కన్నడ రాకింగ్ స్టార్ యశ్‌ తల్లి పుష్ప. యశ్ లేటెస్ట్ గ్యాంగ్‌స్టర్ డ్రామా 'టాక్సిక్' సినిమా విడుదలయ్యాక ఎలాంటి ట్రోలింగ్, విమర్శలు వచ్చాయో తెలిసిందే. అయితే తాజాగా ఈ విమర్శలపై యశ్ తల్లి స్పందిస్తూ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు నెట్టింట తీవ్ర దుమారం రేపుతున్నాయి. ముఖ్యంగా "KGFకి ముందు యశ్ ఎవరు?" అంటూ గతంలో టాలీవుడ్ ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ చేసిన కామెంట్స్ కి కూడా ఆమె కౌంటర్ ఇచ్చారు. "వాడు ధనిక కుటుంబంలో పుట్టలేదు. కష్టపడి ఈ స్థాయికి వస్తే, వాడి ఎదుగుదలను కొందరు ఓర్చుకోలేకపోతున్నారు" అంటూ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ముఖ్యంగా 'కేజీయఫ్'కి ముందు యశ్ ఎవరు? అనే మాటలపై స్పందిస్తూ.. 'కేజీయఫ్' కంటే ముందే యశ్‌కు వరుసగా ఐదు సూపర్ హిట్ సినిమాలు ఉన్నాయి. అతనేం టెర్రరిస్ట్ కాదు. 'కేజీయఫ్'కి ముందు యశ్ ఎవరు? అని అనాల్సిన అవసరం ఏంటి?. అందరి హీరోల్లా యశ్ ధనిక కుటుంబంలో పుట్టలేదు. రాత్రికి రాత్రే ఈ విజయం రాలేదు, ఎన్నో ఏళ్ల కష్టానికి 'కేజీయఫ్' ఫలితమని ఒక తల్లిగా గర్వంగా చెప్పుకొచ్చారు. అల్లు అరవింద్ చేసిన వ్యాఖ్యలకు కూడా ఇవి కౌంటర్ లా ఉన్నాయని సినీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. ఒక తల్లిగా కొడుకుపై విమర్శలు వచ్చినప్పుడు బాధగా కలగడం సహజమే. ఈ క్రమంలోనే ఆమె 'టాక్సిక్' ట్రోల్స్ పై మండిపడ్డారు. అంతవరకు బాగానే ఉంది కానీ, గతంలో ఎప్పుడో అల్లు అరవింద్ వేరే ఉద్దేశంతో చేసిన కామెంట్స్ ని.. ఇప్పుడు 'టాక్సిక్'కి ముడిపెడుతూ ఆమె విమర్శించడాన్ని పలువురు తప్పుబడుతున్నారు. 'కేజీయఫ్'కి యశ్ తెలుగు ప్రేక్షకులకు తెలీదు. అయినప్పటికీ ఆ సినిమా తెలుగునాట ఘన విజయాన్ని సాధించింది. అదే విషయాన్ని అల్లు అరవింద్ ప్రస్తావిస్తూ.. హీరో కంటే కంటెంట్ ముఖ్యమని అన్నారు. ఆ ఓల్డ్ వీడియో క్లిప్ ను చూసి.. యశ్ తల్లి తప్పుగా అర్థం చేసుకున్నట్టున్నారు.       [Toxic Movie, Controversy, Yash Mother Pushpa, Allu Aravind Comments, Telugu Film News, Telugu News]  
Music composer and singer Kaala Bhairava, son of veteran composer MM Keeravaani, has made his relationship with actress Kavya Kalyanaraman official on Instagram. The couple shared a series of pictures together, accompanying them with deeply personal notes about what they mean to each other. Kaala Bhairava’s caption was particularly emotional as he described how his feelings for Kavya gradually became something much deeper than he could initially define. Addressing her as “Kaavyaa baabu,” he wrote, “Spending time with you feels like sitting by the mountains, watching a stream of water. Doing stuff with you feels like a vacation you don’t want to end.” He went on to compare their conversations to “having my favourite coffee on a winter early morning.” The composer then revealed what he believes that feeling truly was. “For the most part, I couldn’t name that feeling. I couldn’t. But somewhere along our journey, I finally realised what it was. The feeling. It was the feeling of ‘home’.” He added, “When I first met you, I didn’t meet a new person. I came home and never left it since,” before announcing that they have “a lifetime of being home together.” Kavya, meanwhile, shared her own playful and affectionate perspective on the relationship. “Life update: I found My Yellow Paper Daisy,” she wrote, adding that some people “make us feel like we are God’s favourite child!” She also thanked Kaala Bhairava for “lighting up my most mundane days and making me feel like the luckiest girl ever.” Ending on a lighter note, Kavya wrote, “Here’s to many many more years of you knowing that I want that Diet Coke even after I said No!” Their posts effectively turned a relationship reveal into a celebration of the affection, comfort and familiarity they have found in each other. Kaala Bhairava sang songs in films like Baahubali and composed music for Color Photo, Mathu Vadalara kind of films.  Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them.   https://www.instagram.com/p/DcsymQIgbQN/
  'చెప్పనా, చెప్పనా చిన్న మాట'.. 'సొగసు చూడ హాయిహాయిలే'...'కుంకుమ పూల తోటలో కులికే ఓ కుమారి'.. ఈ సాంగ్స్ వినిపిస్తున్నంత కాలం 'ప్రేమ' తెలుగు ప్రేక్షకుల మనస్సులో నుంచి చెరిగిపోవడం అసాధ్యం. 90 వ దశకంలో తెలుగు, కన్నడ భాషల్లో సత్తా చాటిన ప్రేమకి  ప్రాణాంతక క్యాన్సర్ సోకిందని, విదేశాల్లో చికిత్స తీసుకుంటుందంటూ  గతంలో సోషల్ మీడియాలో విపరీతంగా ప్రచారం జరగడం కలకలం రేపింది.  ఆ వార్తలపై తాజాగా ఓ ఇంటర్వ్యూలో ప్రేమ మాట్లాడుతు నాకు క్యాన్సర్ అనే మాటలు   కేవలం పుకార్లు మాత్రమే. న్యూజిలాండ్ మరియు ఆస్ట్రేలియా దేశాల్లో ఉన్న సమయంలో కొందరు కావాలనే నా ఆరోగ్యం గురించి ఇలాంటి అబద్ధపు వార్తలు సృష్టించారు. దేవుడి దయ వల్ల నాకు ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేవు. ఆ వదంతులు చూసి  మొదట్లో మానసిక కుంగుబాటుకు (డిప్రెషన్‌) గురయ్యాను.సోనాలి బింద్రే, మమతా మోహన్ దాస్, గౌతమి వంటి నటీమణులు క్యాన్సర్‌ను ఎదురించి విజయం సాధించారని, కానీ తన విషయంలో మాత్రం కాన్సర్ అనేది  సృష్టించిన వదంతి మాత్రమేనని స్పష్టం చేశారు.   Also read:  అసలు రహస్యం ఇదేనా! ఇదే ఇంటర్వ్యూ లో తన వైవాహిక జీవితం గురించి మాట్లాడుతూ.. 2006లో జీవన్ అప్పచ్చుని వివాహం చేసుకున్న నేను, వ్యక్తిగత మనస్పర్థల కారణంగా కొన్నేళ్ల క్రితం చట్టబద్ధంగా విడాకులు తీసుకుని విడిపోయాను. మంచి వ్యక్తి దొరికితే 70 ఏళ్ల వయసులోనైనా మళ్ళీ వివాహం చేసుకుంటాను. జీవితంలో ఎదురయ్యే సవాళ్లను ధైర్యంగా ఎదుర్కొవాలి తప్ప ఆత్మహత్య వంటి తీవ్ర నిర్ణయాలు ఎప్పటికీ తీసుకోవద్దని  యువతకి పిలుపునిచ్చింది.       [ Prema, cancer, Rumars, second Marraige, TeluguCinema, TelugucinemaNews, TollywoodNews, Tollywood]        
సౌత్ ఇండియన్ సినిమాలో ఒక హీరోనో లేక డైరెక్టరో పదుల కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటుంటే మనం పెద్దగా ఆశ్చర్యపోం. కానీ.. ఒక మ్యూజిక్ డైరెక్టర్ ఏకంగా 23 కోట్ల రూపాయల రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడంటే నిజంగా ఆశ్చర్యకర విషయమే. ఇండియన్ సినిమా హిస్టరీలోనే ఒక సంగీత దర్శకుడు తీసుకోబోతున్న బిగ్గెస్ట్ పే-చెక్స్ లో ఇది ఒకటిగా నిలవబోతోంది. ఈ రికార్డు క్రియేట్ చేసిన ఆ మ్యూజిక్ సెన్సేషన్ ఎవరో కాదు.. రాక్‌స్టార్ అనిరుధ్ రవిచందర్. ప్రస్తుతం ఇండియాలోనే అత్యంత డిమాండ్ ఉన్న ఈ మ్యూజిక్ డైరెక్టర్.. ఇప్పుడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ కాంబినేషన్‌లో రాబోతున్న భారీ ప్రాజెక్ట్ కోసం ఏకంగా 23 కోట్లు పారితోషికంగా అందుకోబోతున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. అసలు ఒక మ్యూజిక్ డైరెక్టర్‌కి ఇంత భారీ మొత్తంలో రెమ్యునరేషన్ ఇవ్వాల్సిన అవసరం ఏమొచ్చింది? మైత్రీ మూవీ మేకర్స్ వంటి అగ్ర నిర్మాణ సంస్థ అంత పెద్ద అమౌంట్ ఇవ్వడానికి ఎందుకు వెనుకాడలేదు? దీనికి ఒకటే కారణం.. అనిరుధ్ ఇచ్చే ఆ బీజీఎమ్స్ అండ్ చార్ట్‌బస్టర్ సాంగ్స్. ఈరోజుల్లో ఒక సినిమా బాక్సాఫీస్ విజయంలో మ్యూజిక్ ఎంత కీలక పాత్ర పోషిస్తోందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరంలేదు. బిజీఎమ్‌తోనే థియేటర్లలో పూనకాలు తెప్పించే సత్తా అనిరుధ్‌కి ఉంది. ముఖ్యంగా లోకేష్ కనగరాజ్ సినిమాల్లో అనిరుధ్ మ్యూజిక్ ఒక ప్రత్యేకమైన క్యారెక్టర్‌లా మారిపోతుంది. 'విక్రమ్', 'లియో' సినిమాల్లో వారి కాంబో తెచ్చిన మాస్ సునామీని మనం చూశాం. అటు అల్లు అర్జున్ విషయానికి వస్తే.. ప్రతి సినిమాలోనూ తన డ్యాన్స్ అండ్ స్టైల్‌తో పాటలకు ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల కొద్దీ వ్యూస్ తెచ్చే కెపాసిటీ ఆయన సొంతం. ఇప్పుడు ఈ ముగ్గురి కాంబినేషన్ అంటేనే అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. అందుకే నిర్మాతలు మైత్రీ మూవీ మేకర్స్ ఈ పాన్-ఇండియా వండర్ కోసం ఎలాంటి కాంప్రమైజ్ కాకుండా అనిరుధ్ అడిగిన భారీ అమౌంట్‌కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇండియన్ సినీ హిస్టరీలోనే ఒక మ్యూజిక్ డైరెక్టర్‌కి ఈ స్థాయిలో పారితోషికం లభించడం నిజంగానే ఒక హిస్టారికల్ బెంచ్‌మార్క్.         [AA23 Movie, Anirudh Ravichander, 23 Crore Remuneration, Allu Arjun, Lokesh Kanagaraj, Telugu Cinema News, Tollywood, Telugu News]  
    సినిమా సినిమాకి రేంజ్ పెంచుకుంటు వెళ్తున్నాడు కిరణ్ అబ్బవరం. దీంతో ఆటోమాటిక్ గా  ఫ్యాన్ బేస్ పెరుగుతుంది. ప్రీవియస్ హిట్ చెన్నై లవ్ స్టోరీ తో అయితే నటుడిగా ఒకే సారి వంద మెట్లు పైకి ఎక్కాడు. తాజాగా తన సరికొత్త ప్రాజెక్ట్‌ ప్రకటిస్తూ  విడుదల చేసిన టైటిల్ అండ్ ఫస్ట్ లుక్ గ్లింప్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో విత్ ఇన్ రిలీజ్ ఆలస్యమన్నట్టుగా రికార్డు వ్యూస్ తో దూసుకుపోతుంది.  కిరణ్ అబ్బవరంకి చెందిన KA ప్రొడక్షన్స్, పౌర్ణమి ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్లలో రూపొందుతున్న ఈ సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రానికి 'హఠః' (HATAH) అనే అత్యంత ఆసక్తికరమైన శీర్షిక ఖరారు చేశారు. .ముఖ్యంగా పోస్టర్‌లో కనిపించిన నల్లపిల్లి రూపం, దానికి తోడు “ఈ పిల్లి అసలు బతికే ఉందా లేక...” (Is this cat alive or...) అంటూ ఇచ్చిన క్యాప్షన్ చూస్తుంటే సైన్స్, క్వాంటమ్ ఫిజిక్స్ ఆధారిత మిస్టరీ డ్రామాతో  తెరకెక్కిస్తున్నట్లు స్పష్టమవుతోంది. భౌతిక శాస్త్రంలో ప్రాచుర్యం పొందిన ప్రముఖ ‘ష్రోడింగర్ క్యాట్’ (Schrödinger's Cat) థియరీతో ఈ సినిమా కాన్సెప్ట్ ముడిపడి ఉందా అనే చర్చ కూడా మొదలైంది.  ఈ ప్రకటన వెలువడిన కేవలం 10 నిమిషాల వ్యవధిలోనే ఎక్స్ (ట్విట్టర్) లో ట్రెండింగ్ కావడం, వేలాది రీట్వీట్లు మరియు లైక్‌లు రావడం విశేషం.   Also Read: మరోసారి విలన్ గా నాగార్జున: ఈ స్టార్ హీరో మూవీనే   "హఠః - వాట్ యూ నెవర్ సా కమింగ్"  అంటూ మేకర్స్ త్వరలోనే టీజర్ రాబోతోందని అధికారికంగా వెల్లడించడంతో టీజర్ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.కాన్సెప్ట్ ఓరియెంటెడ్ సినిమాలను ఆదరించే ప్రస్తుత ట్రెండ్‌లో కిరణ్ అబ్బవరం చేస్తున్న ఈ సరికొత్త ప్రయోగం ఎలాంటి మైలురాయిగా నిలుస్తుందో చూడాలి! అనూష్ గోరక్ దర్శకుడు.       [Kiran Abbavaram, Hatah, KA Productions, TeluguCinema, TelugucinemaNews, TollywoodNews, Tollywood]
Sree Vishnu’s upcoming film with Sithara Entertainments, Production No. 39, is set to showcase a story that resonates with the experiences, emotions, dreams and struggles of today’s youngsters. Promising a refreshing journey packed with relatable moments and every emotion, the film aims to strike a chord with audiences. The makers have unveiled a small glimpse into the world of the film, offering a peek into what promises to be a youthful and emotionally engaging journey. The glimpse beautifully sets the tone for the film and raises curiosity around Sree Vishnu’s next outing. Sree Vishnu's look and his attention to detail offer a new story and very hearttouching film. The shoot of the film has commenced. Produced by Haarika Suryadevara and presented by S Naga Vamsi, the film is directed by Sunny Sanjay, with Deepthi Sree Juttada as the writer.  The technical crew includes Pavan Pappula as Cinematographer, Venkatesh Chunduru as Editor, Arvind Mule as Production Designer and Chandu & Ravi as Music Directors. With its relatable premise and youthful appeal, Production No. 39 promises to be “ఇది మన అందరి కథ” a story where everyone can find a little bit of themselves.   Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them.
సాధారణంగా ఎంత పెద్ద బ్లాక్‌బస్టర్ సినిమా అయినా సరే.. రోజులు గడిచే కొద్దీ రెండో వారంలో వసూళ్లు క్రమంగా తగ్గుతుంటాయి. కానీ 'ఇరుముడి' విషయంలో మాత్రం సీన్ పూర్తిగా రివర్స్ అయింది. రెండో వారంలో అడుగుపెట్టిన తర్వాత కూడా బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా చూపిస్తున్న దూకుడు చూసి ట్రేడ్ వర్గాలే ఆశ్చర్యపోతున్నాయి. ఇరుముడి సినిమా విడుదలైన రోజు నుంచే బాక్సాఫీస్ దగ్గర సంచలనాలు సృష్టిస్తోంది. హౌస్ ఫుల్ కలెక్షన్స్ తో ప్రతిరోజూ సరికొత్త రికార్డును ఖాతాలో వేసుకుంటుంది. ముఖ్యంగా పదో రోజయిన రెండో ఆదివారం నాడు.. ఏకంగా 'బాహుబలి-2', 'పుష్ప-2' రికార్డులను బ్రేక్ చేయడం విశేషం. ఇప్పటిదాకా తెలుగు రాష్ట్రాల్లో పదో రోజు డబుల్ డిజిట్ షేర్ సాధించిన సినిమా 'ఆర్ఆర్ఆర్' ఒక్కటే. ఆ సినిమా పదో రోజు ఏకంగా 16 కోట్ల షేర్ రాబట్టింది. ఇప్పుడు దాదాపు 10 కోట్ల షేర్ తో 'ఇరుముడి' రెండో స్థానంలో నిలిచింది. 'బాహుబలి-2', 'పుష్ప-2' వంటి భారీ పాన్ ఇండియా సినిమాలు సైతం.. తెలుగునాట పదో రోజు డబుల్ డిజిట్ షేర్ రాబట్టలేకపోయాయి. అవి 8 కోట్లకు అటూఇటూగా షేర్ రాబట్టాయి. కానీ, 'ఇరుముడి' మాత్రం ఏకంగా 10 కోట్ల షేర్ తో సత్తా చాటింది. దీనిని బట్టి తెలుగునాట ఆ సినిమా ఏ స్థాయి ప్రభంజనాన్ని సృష్టిస్తుందో అర్థం చేసుకోవచ్చు. ఇక వరల్డ్ వైడ్ గానూ 'ఇరుముడి' సునామీ కొనసాగుతోంది. పది రోజుల్లోనే ఈ సినిమా 200 కోట్ల గ్రాస్ క్లబ్ కి చేరువైంది. ఫుల్ రన్ లో 300 కోట్ల గ్రాస్ మార్క్ కి చేరువైనా ఆశ్చర్యంలేదు.       [Irumudi Box Office, Irumudi Collections, Irumudi Day 10 Record, Irumudi Movie, RaviTeja, Baahubali 2, Pushpa 2, Telugu Film News, Telugu News]  
  సుదీర్ఘ కాలం నుంచి ట్రెండ్ సెట్టర్ గా నిలుస్తూ వస్తున్న కింగ్ నాగార్జున ప్రస్తుతం తన వందవ చిత్రంతో బిజీగా ఉన్నాడు. ఇటీవల(ఆగస్టు 29 ) తన పుట్టిన రోజు సందర్భంగా రిలీజ్ చేసిన టీజర్ ఒక రేంజ్ లో ఉండటంతో అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోతున్నాయి. రీసెంట్ గా నాగార్జున మరో సారి నెగిటివ్ షేడ్ ఉన్న క్యారక్టర్ లో చేయబోతున్నాడనే రూమర్ ఒకటి సినీ సర్కిల్స్ లో చక్కర్లు కొడుతుంది. Also Read: ప్రేక్షకుల పండుగ:  ఈ వారం ఓటిటి రిలీజ్ మూవీస్ ఇవే!    తమిళ స్టార్ హీరో సూర్య తన 49వ చిత్రాన్ని జన నాయగాన్ ఫేమ్  హెచ్. వినోత్  దర్శకత్వంలో చేస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రంలో సూర్యకు సమానమైన ప్రాధాన్యత కలిగిన, అత్యంత బలమైన ప్రతినాయకుడి రోల్ కోసం మేకర్స్  నాగార్జునని సంప్రదించారని, వినోత్ చెప్పిన విభిన్నమైన కథాంశం, క్యారక్టర్ లోని  తీవ్రత నాగార్జునని  నచ్చడంతో గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడనే రూమర్స్ చక్కర్లు కొడుతున్నాయి. నాగార్జున  గతంలో రజనీకాంత్ 'కూలీ'లో విలన్ గా కనిపించిన విషయం తెలిసిందే. సోషల్ మీడియాలో ఈ న్యూస్ వైరల్ గా మారడంతో ఫ్యాన్స్ నుంచి మిశ్రమ స్పందన వస్తుంది. ఏది ఏమైనా రూమర్ కనుక నిజమైతే సౌత్ సినీ ప్రేమికులు అదృష్టం చేసుకున్న వాళ్లవుతారనేది మాత్రం నిజం.       [Nagarjuna, Suriya, H vinoth, vilan Role, TeluguCinema, TelugucinemaNews, TollywoodNews, Tollywood]
Nandamuri Balakrishna’s next with Gopichand Malineni is finally set to break its biggest suspense. The makers of the yet-untitled NBK111 have announced that the film’s official title and release date will be unveiled on September 6, ending the wait that has been building since the birthday glimpse. The glimpse had already generated strong buzz with Balakrishna sporting a noticeably younger look, along with his trademark massy style, swagger and high-energy action sequences. The latest promotional video, “Who Let the Lion Out?”, has added further momentum, with S Thaman delivering another high-octane score designed perfectly around Balakrishna’s image. Thaman has become a key part of the sound and presentation of Balakrishna’s recent films, particularly after Akhanda, and the makers are once again leaning heavily on that combination of mass visuals and thumping music. The title announcement is therefore expected to be more than a routine reveal, with the film’s release date also being positioned as a major statement. Directed by Gopichand Malineni, NBK111 is being mounted on a massive scale by producer Venkata Satish Kilaru. Manchu Manoj and Kajal Aggarwal are playing prominent roles in the film, which is shaping up as a stylish action entertainer built around Balakrishna’s larger-than-life screen presence. Balakrishna is currently recovering from his recent leg surgery and has been taking rest for a complete recovery. Once he is ready to return, the makers are planning a non-stop shooting schedule to complete the remaining portions.  Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them.
నాన్ వెజ్ ప్రియుల ఆహారపు అలవాట్లలో చికెన్‌కి ఎప్పుడూ మొదటి ప్రాధాన్యత ఉంటుంది. రుచికరమైన రకరకాల వంటకాలు చేసుకోవడానికి చికెన్ అనువుగా ఉండటమే కాకుండా, మన శరీరానికి అవసరమైన అత్యంత విలువైన పోషకాలను కూడా ఇది అందిస్తుంది. చికెన్ కేవలం రుచికి మాత్రమే కాకుండా సరైన పద్ధతిలో తీసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని ప్రముఖ పీడియాట్రిషియన్ డాక్టర్ అజ్మీరా భగత్ సింగ్ స్పష్టం చేశారు. రోజూవారీ ఆహారంలో చికెన్ చేర్చుకోవడం వల్ల మన శరీరంలో ఎలాంటి సానుకూల మార్పులు వస్తాయో, అది ఏ విధంగా కండరాల బలానికి మరియు గుండె ఆరోగ్యానికి తోడ్పడుతుందో తెలుసుకోవడం ఎంతో అవసరం. చికెన్ గురించి మాట్లాడగానే అందరికీ ముందుగా గుర్తొచ్చేది అందులో ఉండే అత్యధిక ప్రొటీన్. చికెన్‌లో హై క్వాలిటీ ప్రొటీన్ లభిస్తుంది. ఇది మన శరీరంలోని కండరాల పెరుగుదలకు మరియు వర్కవుట్స్ లేదా కష్టమైన పనుల వల్ల దెబ్బతిన్న కండరాలు త్వరగా కోలుకోవడానికి (మజిల్ రికవరీ) అద్భుతంగా తోడ్పడుతుంది. అందుకే క్రమం తప్పకుండా జిమ్‌కు వెళ్లేవారు, క్రీడాకారులు తమ డైట్‌లో చికెన్ బ్రెస్ట్ భాగాన్ని తప్పనిసరిగా చేర్చుకుంటారు. అంతేకాకుండా రోజంతా తీవ్రమైన నీరసంతో బాధపడేవారికి చికెన్ ఒక మంచి శక్తి వనరుగా పనిచేస్తుంది. చికెన్‌లో నియాసిన్ అని పిలిచే విటమిన్ B3 మరియు విటమిన్ B6 పుష్కలంగా ఉంటాయి. మనం తీసుకునే ఆహారాన్ని శరీరానికి కావలసిన శక్తిగా మార్చడంలో ఈ విటమిన్లు కీలక పాత్ర పోషిస్తాయి. ఫలితంగా బద్ధకం తగ్గి, రోజంతా ఉత్సాహంగా మరియు ఎనర్జెటిక్‌గా ఉండేందుకు ఇది దోహదపడుతుంది. చికెన్ తింటే బరువు పెరుగుతారనేది సమాజంలో ఉన్న ఒక పెద్ద అపోహ మాత్రమే. నిజానికి సరైన పద్ధతిలో వండుకుని తింటే చికెన్ బరువు తగ్గడానికి అద్భుతంగా సహాయపడుతుంది. చికెన్ లోని ప్రొటీన్ వల్ల కొద్దిగా తినగానే కడుపు నిండిన భావన (సృప్తి) కలుగుతుంది. దీనివల్ల పదే పదే అనవసరమైన స్నాక్స్ తినాలనే కోరిక తగ్గి, కేలరీల స్వీకరణ అదుపులోకి వస్తుంది. ఫలితంగా శరీర బరువును వేగంగా మరియు ఆరోగ్యకరంగా నియంత్రించుకోవచ్చు.       Chicken for bone density and heart health,healthy ways to cook and eat chicken.
మన తాతముత్తాతల కాలం నుండి భారతీయ సాంప్రదాయ ఆహారంలో నల్ల శెనగలు ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నాయి. నిత్యం మనం తీసుకునే ఆహారంలో లభించే పోషకాల కంటే నల్ల శెనగలు అందించే పోషక విలువలు ఎంతో ప్రత్యేకమైనవి. ప్రతిరోజూ మనం 10 గుడ్లు తినడం ద్వారా లేదా లీటర్ పాలు తాగడం ద్వారా పొందే శక్తిని, కేవలం కొద్దిగా ఉడకబెట్టిన నల్ల శెనగలను తినడం ద్వారా డబుల్ చేసుకోవచ్చని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. బలహీనతతో బాధపడేవారికి, కండరాల బలం పెంచుకోవాలనుకునేవారికి మరియు ప్రతిరోజూ ఉత్సాహంగా ఉండాలనుకునేవారికి ఇది ఒక అద్భుతమైన సూపర్ ఫుడ్‌గా నిలుస్తుంది. ఈ శెనగలను వివిధ రూపాల్లో ఆహారంగా తీసుకోవచ్చు. ముఖ్యంగా రాత్రిపూట నానబెట్టిన శెనగలను ఉదయాన్నే లేదా సాయంత్రం వేళల్లో ఉడకబెట్టి గుగ్గిళ్ల మాదిరిగా తాలింపు పెట్టుకుని తింటే శరీరానికి అవసరమైన పుష్కలమైన ప్రోటీన్ లభిస్తుంది. శరీరంలో రోగనిరోధక శక్తి బాగా తక్కువగా ఉండి తరచూ నిరసించిపోయే వారికి నానబెట్టిన లేదా వేయించిన నల్ల శెనగలు తిరుగులేని శక్తిని అందిస్తాయి. వీటిలో లభించే పీచు పదార్థం (ఫైబర్) జీర్ణవ్యవస్థను మెరుగుపరచడంలో కీలక పాత్ర పోషిస్తుంది. జీర్ణక్రియ సులభతరం కావడమే కాకుండా కడుపులో పేరుకుపోయిన వ్యర్థాలను బయటకు పంపి కడుపును పరిశుభ్రంగా ఉంచడంలో సహాయపడుతుంది. అంతేకాకుండా బరువు తగ్గాలనుకునేవారికి నల్ల శెనగలు ఒక దివ్యౌషధంలా పనిచేస్తాయి. వీటిలో ఫైబర్ ఎక్కువగా ఉండటం వల్ల వీటిని కొద్దిగా తిన్నా కూడా కడుపు నిండిన భావన కలుగుతుంది, తద్వారా పదేపదే ఆకలి వేయకుండా ఉండి అధిక బరువును సులభంగా తగ్గించుకోవచ్చు. రక్తం లోని గ్లూకోజ్ లేదా షుగర్ లెవెల్స్ సమతుల్యంగా ఉంచడంలో ఇవి ఎంతో తోడ్పడతాయి. అందువల్ల మధుమేహం ఉన్నవారు అలాగే గుండె సంబంధిత సమస్యలతో బాధపడేవారు వీటిని తమ రోజువారీ ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల గుండె ఆరోగ్యం మెరుగుపడటమే కాకుండా హృద్రోగాల ప్రమాదం కూడా గణనీయంగా తగ్గుతుంది.         black chickpeas for weight loss and health, black chickpeas nutrition benefits in Telugu.
వాతావరణంలో హఠాత్తుగా సంభవిస్తున్న మార్పులు మరియు రుతుపవనాల ప్రభావంతో మనదేశంలో H1N1 ఇన్ఫెక్షన్లు లేదా స్వైన్ ఫ్లూ కేసుల సంఖ్య అత్యంత వేగంగా పెరుగుతోంది. ఆసుపత్రుల్లో సాధారణ జ్వరం, దగ్గు, గొంతు నొప్పితో చేరే రోగుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతుండటంతో పాటు ఫ్లూ వ్యాక్సిన్ కోసం జనం క్యూ కడుతున్నారు. ప్రారంభంలో ఇది ఒక సాధారణ జలుబు లేదా ఇన్ఫ్లుయెంజాలా కనిపించినప్పటికీ, కొందరిలో ఈ వైరస్ తీవ్రంగా మారి ఊపిరితిత్తులపై దాడి చేసి తీవ్రమైన శ్వాసకోశ ఇబ్బందులకు దారితీస్తోంది. ఈ నేపథ్యంలో H1N1 నివారణకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అసలు ఫ్లూ వ్యాక్సిన్ ఎవరెవరు తప్పనిసరిగా తీసుకోవాలో వైద్య నిపుణులు స్పష్టమైన సమాచారాన్ని అందించారు. స్వైన్ ఫ్లూ బారిన పడిన సాధారణ లక్షణాలు ఉన్న ప్రతి ఒక్కరికీ వైద్య పరీక్షలు అవసరం లేదని డాక్టర్లు స్పష్టం చేస్తున్నారు. కానీ కొన్ని రకాల తీవ్రమైన ప్రమాదం ఉన్న హై రిస్క్ వర్గాల ప్రజలకు లక్షణాలు కనిపిస్తే మాత్రం వెంటనే పరీక్ష చేయించుకోవడం ఎంతో ముఖ్యం. ముఖ్యంగా ఆస్తమా, సీఓపీడీ, గుండె సంబంధిత సమస్యలు, మధుమేహం లేదా కిడ్నీ వ్యాధులతో బాధపడుతున్న దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు ఏమాత్రం నిర్లక్ష్యం చేయకూడదు. అదేవిధంగా 65 ఏళ్లు పైబడిన వయోవృద్ధులు, రోగనిరోధక శక్తి తక్కువగా ఉండే 5 ఏళ్ల లోపు చిన్న పిల్లలలో ఈ ప్రమాదం చాలా ఎక్కువ. గర్భధారణ సమయంలో మహిళల్లో రోగనిరోధక వ్యవస్థలో అనేక మార్పులు వస్తాయి కాబట్టి, గర్భిణీలకు స్వైన్ ఫ్లూ సోకితే శ్వాసకోశ కాంప్లికేషన్లు వచ్చే అవకాశం ఉంటుంది. జ్వరంతో పాటు తీవ్రమైన అస్వస్థతతో ఆసుపత్రిలో చేరిన వారికి సరైన నివారణ చికిత్స అందించడానికి వైద్యులు పరీక్షలు నిర్వహిస్తారు. ఫ్లూ ఇన్ఫెక్షన్ తీవ్రరూపం దాల్చకుండా అడ్డుకోవడానికి ఫ్లూ టీకా ఒక గొప్ప రక్షణ కవచంలా పనిచేస్తుంది. వైద్య నిపుణుల ప్రకారం 6 నెలల నుండి 5 ఏళ్ల వరకు ఉన్న చిన్న పిల్లలకు ఈ వ్యాక్సిన్ వేయించడం చాలా అవసరం. 65 ఏళ్లు పైబడిన వృద్ధులలో వయస్సు పెరిగే కొద్దీ సహజ నిరోధక శక్తి తగ్గుతుంది కాబట్టి వీరు ముందస్తుగా ఫ్లూ షాట్ తీసుకోవాలి. అలాగే గర్భిణీ స్త్రీలు తమ భద్రతతో పాటు కడుపులోని బిడ్డ క్షేమం కోసం ఈ వ్యాక్సిన్ తీసుకోవడం సురక్షితమని నిపుణులు చెబుతున్నారు. ఆస్తమా, బిపి, షుగర్ వంటి దీర్ఘకాలిక జబ్బులు ఉన్నవారితో పాటు, రోజూ ఆసుపత్రుల్లో రోగుల మధ్య ఉండే డాక్టర్లు, నర్సులు మరియు హెల్త్‌కేర్ సిబ్బందికి ఈ వ్యాక్సిన్ వేయించుకోవడం అత్యంత ఆవశ్యకం.           Annual flu shot importance H1N1, swine flu prevention high risk groups.
భారతీయ సాంప్రదాయ వైద్య విధానమైన ఆయుర్వేదంలో పిప్పళ్లకు ఎంతో విశిష్టమైన స్థానం ఉంది. నల్లగా, చిన్న పొడుగు ఆకారంలో ఉండే ఈ పిప్పళ్లు కేవలం వంటగదిలోని దినుసు మాత్రమే కాదు, అద్భుతమైన ఔషధ గుణాలు ఉన్న దివ్యౌషధం. శతాబ్దాల నుంచి మన పెద్దలు, ఆయుర్వేద నిపుణులు రకరకాల ఆరోగ్య సమస్యల నివారణకు పిప్పళ్లను ప్రధానంగా ఉపయోగిస్తూ వస్తున్నారు. దీని గురించి మరింత వివరంగా తెలుసుకుంటే.. పిప్పళ్లు చేసే మేలు.. పిప్పళ్లలో ఉండే కెమికల్ కాంపౌండ్ పైపరీన్ శరీరంలో జీవక్రియలను వేగవంతం చేయడంలో ప్రధాన పాత్ర పోషిస్తుంది. ఊపిరితిత్తుల ఆరోగ్యానికి పిప్పళ్లు చేసే మేలు అపారం. జలుబు, దగ్గు, ఉబ్బసం, గొంతు నొప్పి, ఆస్తమా వంటి శ్వాసకోశ సంబంధిత సమస్యలతో బాధపడేవారికి పిప్పళ్లు తక్షణ ఉపశమనాన్ని అందిస్తాయి. పిప్పళ్ల పొడిని తేనెతో కలిపి తీసుకోవడం వల్ల ఊపిరితిత్తుల్లో పేరుకుపోయిన కఫం సులభంగా బయటకు వచ్చేస్తుంది. పిప్పళ్ల గురించి ఆయుర్వేదం ఏం చెబుతుంది? ఆయుర్వేదంలో పిప్పళ్లను రసాయన మూలికగా వర్గీకరించారు. అంటే ఇవి శరీరానికి పునరుజ్జీవనాన్ని అందిస్తాయి. ఆయుర్వేదంలో దీనిని త్రిదోషాలలో ప్రధానమైన కఫ, వాత దోషాలను సమతుల్యం చేయడానికి ఉపయోగిస్తారు. శరీరంలో జఠరాగ్నిని అంటే జీర్ణశక్తిని రగిల్చే గుణం పిప్పళ్లకు ఉంది. తిన్న ఆహారం సరిగ్గా అరగకపోయే సమస్యను, ఆకలి మందగించడాన్ని ఇది నివారిస్తుంది. శరీరంలో పేరుకుపోయిన టాక్సిన్స్ లేదా విష పదార్థాలను బయటకు పంపడంలో ఆయుర్వేద వైద్యంలో పిప్పళ్లను క్రియాశీలకంగా ఉపయోగిస్తారు. పిప్పళ్ల వల్ల కలిగే మరికొన్ని ముఖ్యమైన ఆరోగ్య ప్రయోజనాలు తెలుసుకుంటే.. జీర్ణ వ్యవస్థ మెరుగుపడటం..  గ్యాస్, కడుపు ఉబ్బరం, అజీర్తి వంటి సమస్యలను పిప్పళ్లు త్వరితగతిన నివారిస్తాయి. జీర్ణరసాల ఉత్పత్తిని పెంచి ఆహారం వేగంగా అరిగేలా చేస్తాయి. రోగనిరోధక శక్తి పెరుగుదల..  యాంటీఆక్సిడెంట్లు, యాంటీమైక్రోబియల్ గుణాలు సమృద్ధిగా ఉండటం వల్ల ఇవి శరీరంలో రోగనిరోధక శక్తిని పెంపొందిస్తాయి. తరచూ వచ్చే ఇన్ఫెక్షన్ల నుంచి రక్షణ కల్పిస్తాయి. బరువు నియంత్రణ..  శరీరంలో జీవక్రియల వేగాన్ని పెంచి, చెడు కొవ్వును కరిగించడంలో పిప్పళ్లు ఎంతో సహాయపడతాయి. బరువు తగ్గాలనుకునే వారికి ఇది మంచి సహజ నివారణి. నొప్పులు , వాపుల నివారణ..  పిప్పళ్లలో ఉండే యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు కీళ్ల నొప్పులు, వాతపు నొప్పుల నుంచి ఉపశమనం కలిగిస్తాయి. కాలేయ ఆరోగ్యం.. కాలేయంలోని వ్యర్థాలను తొలగించి, కాలేయం సరిగ్గా పనిచేయడానికి పిప్పళ్లు తోడ్పడతాయి. పిప్పళ్లను నిత్య జీవితంలో తగిన మోతాదులో వాడటం వల్ల అనేక దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యల నుంచి విముక్తి పొందవచ్చు. అయితే ఇవి శరీరంలో వేడిని పెంచే గుణం కలిగి ఉంటాయి కాబట్టి, పిత్త ప్రకృతి ఉన్నవారు లేదా గర్భిణులు ఆయుర్వేద వైద్యుల సలహా మేరకు మాత్రమే వీటిని తీసుకోవడం మంచిది.                        *రూపశ్రీ.  
కొలెస్ట్రాల్ అనేది శరీరంలో ఉండే ఒక రకమైన కొవ్వు పదార్థం. ఇది శరీరంలోని కణాల నిర్మాణానికి మరియు కొన్ని రకాల హార్మోన్ల తయారీకి ఎంతో అవసరం. అయితే, రక్తంలో కొలెస్ట్రాల్ పరిమాణం ఉండాల్సిన దానికంటే ఎక్కువగా పెరిగితే అది గుండె ఆరోగ్యానికి తీవ్రమైన ముప్పుగా మారుతుంది. రక్తనాళాల్లో కొవ్వు పేరుకుపోవడం వల్ల రక్త ప్రసరణకు అడ్డంకులు ఏర్పడి, గుండెపోటు , పక్షవాతం వంటి సమస్యలు వచ్చే ప్రమాదం పెరుగుతుంది. ప్రస్తుతం కాలంలో ఉన్న జీవనశైలి, శారీరక శ్రమ లేకపోవడం, పోషకాహార లోపం , తప్పుడు ఆహారపు అలవాట్ల వల్ల చాలామందిలో కొలెస్ట్రాల్ సమస్యలు తలెత్తుతున్నాయి. అయితే సరైన ఆహారాన్ని ఎంచుకోవడం ద్వారా రక్తంలో చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించుకోవడమే కాకుండా, మంచి కొలెస్ట్రాల్‌ను పెంచుకోవడానికి అవకాశం ఉంటుంది. కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉన్నవారు తీసుకోవాల్సిన ముఖ్యమైన ఆహారాలు ఏమిటో, అవి ఎలా సహాయపడతాయో తెలుసుకుంటే.. ఫైబర్.. కొలెస్ట్రాల్‌ను నియంత్రించడంలో  పీచు పదార్థం లేదా ఫైబర్ పాత్ర చాలా కీలకమైనది. ముఖ్యంగా కరిగే పీచు పదార్థం పుష్కలంగా ఉండే ఆహారాలు చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో అద్భుతంగా పనిచేస్తాయి. ఓట్స్ , బార్లీ వంటి ధాన్యాలలో కరిగే ఫైబర్  ఎక్కువగా ఉంటుంది. ఇవి జీర్ణవ్యవస్థలో కొలెస్ట్రాల్ శోషణను తగ్గించి, శరీరం నుండి దాన్ని బయటకు పంపడానికి సహాయపడతాయి. రోజూ ఉదయం అల్పాహారంలో ఓట్స్ లేదా బార్లీ చేర్చుకోవడం వల్ల రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయిలు క్రమంగా తగ్గుతాయి. పప్పుధాన్యాలు, గింజలు.. వివిధ రకాల పప్పుధాన్యాలు , గింజలు కొలెస్ట్రాల్ తగ్గించడంలో ఎంతో మేలు చేస్తాయి. శనగలు, పెసలు, రాజ్మా, మినుములు , కందిపప్పు వంటి వాటిలో ప్రోటీన్లు, విటమిన్లు , పీచు పదార్థాలు సమృద్ధిగా ఉంటాయి. ఇవి కడుపు నిండిన భావనను కలిగించి, అనవసరమైన కేలరీలు తీసుకోకుండా నిరోధిస్తాయి. అలాగే నట్స్ అని పిలిచే బాదం, వాల్‌నట్స్ , పిస్తా పప్పులు గుండె ఆరోగ్యానికి చాలా మంచివి. వీటిలో ఉండే అసంతృప్త కొవ్వులు శరీరంలో ఉండే చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి, మంచి కొలెస్ట్రాల్ స్థాయిలను పెంచడంలో సహాయపడతాయి. కాకపోతే వీటిని పరిమిత పరిమాణంలోనే తీసుకోవడం మంచిది. తాజా కూరగాయలు , ఆకుకూరలు.. రోజువారీ ఆహారంలో తప్పనిసరిగా తాజా కూరగాయలు, ఆకుకూరలు తీసుకోవాలి. పాలకూర, తోటకూర, మెంతి కూర వంటి ఆకుకూరలలో యాంటీఆక్సిడెంట్లు, విటమిన్లు , ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. బెండకాయ, వంకాయ, క్యారట్ , బీట్‌రూట్ వంటి కూరగాయలలో కరిగే పీచు పదార్థం ఎక్కువగా ఉండటం వల్ల ఇవి కొలెస్ట్రాల్ శోషణను అడ్డుకుంటాయి.  వెల్లుల్లి.. వెల్లుల్లి రక్తనాళాలను శుభ్రపరచడంలో , కొలెస్ట్రాల్‌ను నియంత్రించడంలో ఎంతో ప్రసిద్ధి చెందింది. రోజూ ఒకటో రెండో వెల్లుల్లి రెబ్బలను ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల రక్తం గడ్డకట్టే ప్రమాదం కూడా తగ్గుతుంది. పండ్లు.. పండ్లు కూడా కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో ప్రముఖ పాత్ర వహిస్తాయి. బొప్పాయి, ఆపిల్, నారింజ, జామ, దానిమ్మ  వంటి పండ్లలో పెక్టిన్ అనే ప్రత్యేకమైన కరిగే పీచు పదార్థం ఉంటుంది. ఇది శరీరంలో కొలెస్ట్రాల్ శోషణను తగ్గించడంలో ఎంతగానో దోహదపడుతుంది. అలాగే పండ్లలో ఉండే యాంటీఆక్సిడెంట్లు రక్తనాళాలలో కొవ్వు పేరుకుపోకుండా కాపాడతాయి.  నిమ్మజాతి పండ్లు.. నిమ్మ జాతి పండ్లలో ఉండే విటమిన్ సి గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. హెల్తీ ఫ్యాట్స్.. చేపలు , ఆరోగ్యకరమైన నూనెలు కూడా కొలెస్ట్రాల్ నిర్వహణకు సహాయపడతాయి. ముఖ్యంగా ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్లు ఎక్కువగా ఉండే చేపలను తినడం వల్ల రక్తంలో ట్రైగ్లిజరైడ్స్ స్థాయిలు తగ్గుతాయి. వంటల కోసం ప్రాసెస్ చేసిన నూనెలకు బదులుగా ఆలివ్ ఆయిల్, నువ్వుల నూనె లేదా ఆవనూనె వంటి వాటిని పరిమితంగా ఉపయోగించడం మంచిది. ఇవి చెడు కొలెస్ట్రాల్‌ను పెంచకుండా కాపాడతాయి. ఈ ఆహారాలు తినకూడదు.. కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉన్నవారు కొన్ని ఆహారాలకు పూర్తిగా దూరంగా ఉండటం కూడా చాలా ముఖ్యం. వేయించిన ఆహారాలు, ప్రాసెస్ చేసిన మాంసం, మైదాతో చేసిన పదార్థాలు, తీపి పదార్థాలు, బేకరీ ఆహారాలు , పూర్తి కొవ్వు ఉన్న పాల పదార్థాలను తగ్గించాలి. వీటిలో ఉండే ట్రాన్స్ ఫ్యాట్స్ , సంతృప్త కొవ్వులు రక్తంలో చెడు కొలెస్ట్రాల్‌ను వేగంగా పెంచుతాయి. ఆహారాలు మాత్రమే కాదు.. ఇవి కూడా ముఖ్యమే.. కేవలం మంచి ఆహారం తీసుకోవడమే కాకుండా, రోజువారీ జీవనశైలిలో చిన్నచిన్న మార్పులు చేసుకోవడం అవసరం. ప్రతిరోజూ కనీసం ముప్పై నిమిషాల పాటు నడక లేదా ఇతర వ్యాయామాలు చేయడం, తగినంత నీరు తాగడం, ఒత్తిడిని తగ్గించుకోవడం , మంచి నిద్ర వల్ల గుండె ఆరోగ్యం మెరుగవుతుంది. సరైన ఆహార నియమాలు , ఆరోగ్యకరమైన జీవనశైలిని పాటిస్తే కొలెస్ట్రాల్‌ను సులభంగా అదుపులో ఉంచుకోవచ్చు.                         *రూపశ్రీ.
ఒమేగా3 కొవ్వు ఆమ్లాలు మన ఆరోగ్యానికి చాలా అవసరం. ఇవి గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడమే కాకుండా, మెదడు పనితీరును పెంచడంలో , శరీరంలో మంటను తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తాయి. సాధారణంగా ఒమేగా3 అనగానే ఖరీదైన సప్లిమెంట్లు లేదా సాల్మన్ వంటి పెద్ద చేపలే గుర్తొస్తాయి. కానీ మనకు సులభంగా , తక్కువ ధరలో లభించే ఆహార పదార్థాల ద్వారా కూడా ఒమేగా3 ని పొందవచ్చు. ఆ ఆహారాలు ఏంటో తెలుసుకుంటే.. అవిసె గింజలు.. అవిసె గింజలు ఒమేగా3 పొందడానికి అత్యంత చౌకగా లభించే పదార్థం. వీటిని కాస్త వేయించి పొడి చేసుకుని రోజువారీ ఆహారంలో, పెరుగులో లేదా నీటిలో కలుపుకుని తీసుకోవచ్చు. ఇవి గుండె ఆరోగ్యాన్ని ఎంతో మెరుగుపరుస్తాయి. చియా విత్తనాలు.. శాకాహారులకు ఇవి మంచి ఎంపిక. వీటిని నీటిలో నానబెట్టి స్మూతీలు, జ్యూస్‌లు లేదా మజ్జిగలో కలుపుకుని తాగవచ్చు. ఇవి ఒమేగా3 తో పాటు శరీరానికి కావలసిన పీచు పదార్థాన్ని కూడా అందిస్తాయి. చిన్న చేపలు (సార్డిన్స్, మకేరల్).. ఖరీదైన విదేశీ చేపల జోలికి వెళ్లకుండా  స్థానిక మార్కెట్లలో దొరికే చిన్న రకం చేపలను ఎంచుకోవచ్చు. సార్డిన్స్, మకేరల్ వంటి చిన్న చేపల్లో ఒమేగా3 సమృద్ధిగా ఉంటుంది. ఇవి ధరలో తక్కువగా ఉండటమే కాకుండా ఆరోగ్యానికి ఎంతో శ్రేయస్కరం. సోయాబీన్స్.. మొక్కల ఆధారిత పోషకాల్లో సోయాబీన్స్ ఒకటి. వీటిని కూరగాయల రూపంలో లేదా సోయా పాలు, తోఫు రూపంలో తీసుకోవడం వల్ల ఒమేగా3 తో పాటు మంచి ప్రొటీన్ లభిస్తుంది. నువ్వులు.. భారతీయ ఇళ్లలో సాధారణంగా వాడే నువ్వులు కూడా మంచి పోషకాలను అందిస్తాయి. వీటిని వివిధ వంటకాల రూపంలో తీసుకోవడం ద్వారా శరీరానికి అవసరమైన కొవ్వు ఆమ్లాలు లభిస్తాయి. పాలకూర మరియు ఆకుకూరలు.. రోజువారీ వంటల్లో వాడే ఆకుకూరలు, ముఖ్యంగా పాలకూరలో కొంత పరిమాణంలో ఒమేగా3 లభిస్తుంది. ఇవి శరీరానికి ఇతర విటమిన్లు , ఖనిజాలను కూడా అందిస్తాయి. ఎక్కువ డబ్బు ఖర్చు చేయకుండానే మన రోజువారీ ఆహారంలో ఈ సాధారణ పదార్థాలను చేర్చుకోవడం ద్వారా ఒమేగా3 లోపాన్ని నివారించి ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.                                                                                                                                          *రూపశ్రీ.