LATEST NEWS
తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు.. అసెంబ్లీ సమావేశాలకు గైర్హాజరు అవుతున్న సంగతి తెలిసిందే. అధికారం కోల్పోయిన తరువాత ఇన్నేళ్లలో ఆయన అసెంబ్లీకి హాజరైన సందర్భాలు ఒకటి రెండు కంటే ఎక్కువ లేవు. అయితే ఎమ్మెల్యేగా మాత్రం ఆయన జీత భత్యాలను నిర్మొహమాటంగా తీసుకుంటున్నారు. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడించారు.    ప్రజాస్వామ్య వ్యవస్థలను, అసెంబ్లీని  గౌరవించడంలో ప్రతిపక్ష నేత కేసీఆర్ విఫలమయ్యారని విమర్శించారు.   ఇదే విషయాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేరుగా కేసీఆర్‌ను లక్ష్యం విమర్శలు గుప్పించడానికి  ఎంచుకోవడం తెలంగాణలో పొలిటికల్ హీట్ ను పెంచింది.   ఎమ్మెల్యేగా కేసీఆర్ వ్యవహరిస్తున్న తీరు, అసెంబ్లీకి ఆయన గైర్హాజరుపై రేవంత్ ఓ రేంజ్ లో విమర్శలు గుప్పించారు. అసెంబ్లీకి హాజరుకాకుంటే కేసీఆర్  ఎమ్మెల్యే పదవికి కేసీఆర్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఒక ప్రజా ఉద్యమాన్ని చేపట్టాలని రేవంత్ రెడ్డి ప్రజలకు పిలుపు నిచ్చారు.  తనను ఎన్నుకున్న నియోజకవర్గ సమస్యలను కేసీఆర్ పట్టించుకోవడం లేదని దుయ్యబట్టారు.   అసెంబ్లీకి డుమ్మా కొట్టి కూడా నిస్సిగ్గుగా   గత రెండేళ్లలో కేసీఆర్ జీతం రూపంలో రూ. 1.24 కోట్లు తీసుకున్నారని రేవంత్ పేర్కొన్నారు. అసెంబ్లీకి హాజరు కాకుండా ఎమ్మెల్యేగా కేసీఆర్ జీత భత్యాలు తీసుకుంటున్నారన్న అంశం ఇప్పుడు సామాజిక మాధ్యమంలో హాట్ హాట్ గా వైరల్ అయ్యింది. 2023 ఎన్నికల్లో ఓటమి తర్వాత కేసీఆర్  దాదాపుగా ఫామ్‌హౌస్‌కే పరిమితమయ్యారు. ఇక ఇప్పుడు రేవంత్ విమర్శలు, నిలదీత తరువాతైనా కేసీఆర్.. ఫామ్ హౌస్ లో అజ్ణాత వాసానికి చుక్క పెట్టి ప్రజాక్షేత్రంలోకి వస్తారేమో చూడాలి.   [Revanth Reddy, KCR Assembly Absence, Telangana Assembly,  BRS Leader KCR, Salarie, Telangana Politics, Telugu One]
ఏపీ పొలిటికల్ సర్కిల్స్ లో ఇప్పుడు జగన్ కు పులివెందుల భయం పట్టుకుందా అన్న చర్చ జోరుగా సాగుతోంది. 2024 ఎన్నికలలో పార్టీ  ఓటమి జగన్ రాష్ట్రంలో పార్టీకి పునర్వైభవం తీసుకురావడానికి రాష్ట్ర వ్యాప్తంగా పర్యటను చేస్తారని అంతా భావించారు. అయితే అందుకు భిన్నంగా ఆయన పులివెందులపైనే ఎక్కువగా కాన్సట్రేట్ చేయడంతో ఆయనకు పులివెందులలో పట్టు జారుతోందన్న భయం పట్టుకున్నట్లు కనిపిస్తోందని అంటున్నారు. అలాంటి భయమే లేకపోతే..  మాజీ సీఎంగా రాష్ట్రం మొత్తం తిరగాల్సిన ఆయన అది మానేసి  సొంత నియోజకవర్గానికే  ఎక్కువగా పరిమితం అవ్వరని అంటున్నారు.   నిజమే.. జగన్  ఇటీవలి కాలంలో క్రమం తప్పకుండా పులివెందులలో పర్యటిస్తున్నారు.  ఈ పర్యటనలు ఆయనలో భయాన్ని సూచిస్తున్నాయంటున్నారు పరిశీలకులు. ఎందుకంటే.. గతంలో అంటే జగన్ అధికారంలో ఉన్న ఐదేళ్లలో ఆయన పులివెందుల పర్యటనలు చాలా చాలా అరుదుగానే చేపట్టే వారు. తన తండ్రి వైఎస్ జయంతి, వర్ధంతి సందర్భాలు కాకుండా ఆయన పులివెందులలో అడుగుపెట్టడం అనేది చాలా అరుదుగా జరిగేది. కానీ 2024 ఎన్నికలలో వైసీపీ ఘోర పరాజయం, పులివెందులలో తన మెజారిటీ గణనీయంగా తగ్గడంతో ఆయన పులివెందుల పర్యటనలు పెరిగాయి. అన్నిటికీ మించి పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికలో వైసీపీకి డిపాజిట్ కూడా దక్కకుండా ఘోరంగా ఓడిపోయిన తరువాత ఆయనలో పులివెందులపై పట్టు జారిపోతోందన్న భయం మరింత ప్రస్ఫుటంగా కనిపిస్తోంది. దీంతో అప్పటి నుంచి సమయం, సందర్భంతో సంబంధం లేకుండా క్రమం తప్పకుండా పులివెందుల వెడుతున్నారు.  అక్కడ  తన నివాసంలో రెండు మూడు రోజుల ఉంటున్నారు.  స్థానిక నాయకులు, కార్యకర్తలతో సమావేశమౌతున్నారు.  ప్రజా దర్బార్ తరహాలో వినతులు స్వీకరిస్తున్నారు.   నియోజకవర్గంలో తన పట్టు సడలకుండా ఉండటానికే ఆయన ఇటీవలి కాలంలో తరచూ పులివెందులలో పర్యటిస్తున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  2024 ఎన్నికలలో పులివెందుల నియోజకవర్గంలోని గ్రామీణ ప్రాంతాలలో  వ్యతిరేకత కనిపించడంతో పాటు, పార్టీ క్యాడర్ లో కూడా ఉత్సాహం తగ్గి పెద్దగా పార్టీ కార్యక్రమాలు చేపట్టకపోవడంతో జగన్ ముందుజాగ్రత్త పడుతున్నారని అంటున్నారు.   [Pulivendula Fear in Jagan, Jagans Pulivendula visits, YCP Politics, Ap Politics, Telugu One]
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒంగోలు నియోజకవర్గం ఎప్పుడూ కీలకంగానే ఉంటుంది. 2024 ఎన్నికల అనంతరం వైసీపీని వీడి  జనసేన  గూటికి చేరిన మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి పరిస్థితి ఇప్పుడు అగమ్యగోచరంగా మారింది.  ప్రకాశం జిల్లాలో మరీ ముఖ్యంగా ఒంగోలులో  గట్టి పట్టు, రాజకీయ పలుకుబడి ఉన్న సీనియర్ నేత అయిన  బాలినేనికి, జనసేనలో ఏ మాత్రం ప్రాధాన్యత లభించడంలేదన్న ప్రచారం జోరుగా సాగుతోంది.  పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తీసుకుంటున్న  నిర్ణయాలు, స్థానిక పరిస్థితులు కూడా ఆ ప్రచారానికి బలం చేకూర్చేవిగానే ఉంటున్నాయి.  ఇటీవల  టీడీపీ ఎమ్మెల్యే దామచర్ల జనార్ధన్‌ను లక్ష్యంగా చేసుకుని బాలినేని శ్రీనివాసరెడ్డి  మీడియా సమావేశంలో చేసిన విమర్శలు, ఆరోపణలు తెలుగుదేశం, జనసేన పార్టీల మధ్య దాదాపు చిచ్చు పెట్టినంత పని చేశాయి.  అయితే సకాలంలో తెలుగుదేశం, జనసేన అధినాయకత్వాలు జోక్యం చేసుకుని దామచర్ల, బాలినేనిలను గట్టిగా హెచ్చరించడంతో పరిస్థితి సద్దుమణిగింది. అయితే బాలినేని వ్యాఖ్యలు, విమర్శల పట్ల మాత్రం ఇరు పార్టీలలోనూ తీవ్ర అసంతృప్తి వ్యక్తమైంది. వ్యక్తిగత విభేదాలు,  పాత తగాదాల లేక్క తేల్చచుకునేందుకు బాలినేని  జనసేనను   వాడుకుంటున్నారన్న విమర్శలు ఇటు తెలుగుదేశంలోనూ, అటు జనసేనలోనూ కూడా వెల్లువెత్తాయి.  పరిస్థితిని అర్ధం చేసుకున్న జనసేనాని పవన్ కల్యాణ్.. దిద్దుబాటు చర్యలు చేపట్టారు.  ఇటీవల జనసేన పార్టీ ప్రకటించిన స్థానిక సంస్థల ఎన్నికల కమిటీలో బాలినేనికి స్థానం దక్కలేదు. బాలినేని వంటి సీనియర్ నాయకుడికి   స్థానిక ఎన్నికల బాధ్యతల్లో ప్రాతినిధ్యం ఇవ్వకపోవడాన్ని బట్టి జనసేనాని బాలినేనిని దూరం పెట్టారని అవగతమౌతోందంటున్నారు పరిశీలకులు.  అలాగే  ఒంగోలులో ఎంతో ఘనంగా నిర్వహించిన జనసేన  ఆత్మీయ సమావేశానికి బాలినేని గైర్హాజరు కూడా బాలినేనికి జనసేనలో ఇసుమంతైనా ప్రాధాన్యత ఇవ్వడం లేదని తెలుస్తోందంటున్నారు.  అంతే కాదు.. ఒంగొలులో జరిగిన జనసేన ఆత్మీయ సమావేశానికి బాలినేని గైర్హాజర్ కాలేదనీ, ఆయనను ఆ సమావేశానికి పార్టీ అధిష్ఠానం ఆహ్వానించలేదనీ, అందుకే ఆయన దూరంగా ఉన్నారన్న ప్రచారం కూడా జోరుగా సాగుతున్నది. మొత్తం మీద ప్రకాశం జిల్లాలో, ఒంగోలులో బాలినేనికి జనసేనలో ప్రాధాన్యత తగ్గిందనీ, పార్టీ కార్యక్రమాలకు ఆయనను దూరం పెడుతున్నారనీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  బాలినేని తీరును, పార్టీ కార్యకర్తల, స్థానిక నేతల అభిప్రాయాలనూ, అలాగే మిత్రపక్షమైన తెలుగుదేశం అభిప్రాయాలనూ పరిగణనలోనికి తీసుకున్న జనసేనాని పవన్ కల్యాణ్.. పార్టీలో బాలినేని ప్రభావాన్ని,  జోక్యాన్ని తగ్గించారని అంటున్నారు.  పొత్తు ధర్మానికి విఘాతం కలగకుండా ఉండాలన్నా, పార్టీ అంతర్గత క్రమశిక్షణ దెబ్బతినకుండా ఉండాలన్నాబాలినేనిని పార్టీ కార్యక్రమాలకు దూరం పెట్టడమే మేలని, జనసేనాని అదే చేస్తున్నారని పార్టీ వర్గాలే చెబుతున్నాయి.  పవన్ కళ్యాణ్  కూటమి ఐక్యత దెబ్బతినకుండా ఉండటానికీ, అలాగే ప్రకాశం జిల్లాలో జనసైనికులలో కొత్త జోష్ నింపడానికి బాలినేనికి పార్టీలో ప్రాధాన్యత లేకుండా చర్యలు తీసుకుంటున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.   [Balineni Srinivasa Reddy Imoprtance Diminished, Pawan Kalyan, Janasena Party, Ongole Politics, TDP Janasena Alliance, Telugu One]
  భారత రాజకీయాల్లో ఇప్పుడు పార్లమెంట్ సీట్ల పునర్విభజన (డీలిమిటేషన్), మహిళా రిజర్వేషన్ బిల్లుల చుట్టూ తీవ్రమైన ఉత్కంఠ నెలకొంది. కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలను ప్రొరోగ్ చేయకుండా కొనసాగించడం, రాబోయే రోజుల్లో ఏ విధమైన బిల్లులను ప్రవేశపెడుతుందనే దానిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఒకవైపు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ప్రధానికి లేఖ రాస్తూ, మహిళా రిజర్వేషన్ బిల్లుకు తమ మద్దతు ఉంటుందని, కానీ డీలిమిటేషన్‌ను రాబోయే 25 ఏళ్ల పాటు వాయిదా వేయాలని డిమాండ్ చేస్తున్నారు. జాతీయ స్థాయిలో ఈ రెండు అంశాలను ముడిపెట్టడం వెనుక ఉన్న రాజకీయ వ్యూహాలు దక్షిణాది రాష్ట్రాలపై దీని ప్రభావం చర్చనీయాంశంగా మారాయి. ఈ అంశంపై టోన్ న్యూస్ ప్రత్యేక చర్చ నిర్వహించారు. రాజ్యాంగ రీత్యా వ్యూహం రాజకీయ పరిణామాలు ప్రస్తుతం పార్లమెంట్ స్థానాల పెంపునకు సంబంధించి జనాభా ప్రాతిపదికన నిర్ణయం తీసుకుంటే, అది ఉత్తరాది రాష్ట్రాలకు తీవ్రమైన ప్రయోజనం చేకూరుస్తుందనే అభిప్రాయం బలపడుతోంది. జనాభా నియంత్రణను సమర్థవంతంగా అమలు చేసిన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు వంటి దక్షిణాది రాష్ట్రాలకు లోక్‌సభలో ప్రాతినిధ్యం తగ్గే ప్రమాదం ఉందనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. సమీకరణాల మార్పు.. కేంద్ర ప్రభుత్వం ఈ బిల్లుల ద్వారా ఉభయ సభల్లోనూ మెజారిటీ నిరూపించుకునే వ్యూహంతో అడుగులు వేస్తోంది.  అయితే, ప్రాంతీయ పార్టీల వైఖరి, ముఖ్యంగా డిఎంకే  తృణమూల్ కాంగ్రెస్ మూడ్ మారడం వంటి పరిణామాలు అధికార పక్షానికి సవాలుగా మారాయి. ప్రతిపక్షాల ప్రతివ్యూహం.. మహిళా రిజర్వేషన్‌ను డీలిమిటేషన్‌తో ముడిపెట్టడం ఒక విభాజక వ్యూహమని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. మహిళా బిల్లును తక్షణమే అమల్లోకి తెచ్చి, సీట్ల పెంపు ప్రక్రియను సగానికి సగం విభజించేలా (ఉత్తరాది మరియు దక్షిణాదికి సమంగా) మార్పులు చేయాలని కోరుతోంది. రాజకీయ భయాలు & సంకోచాలు.. రాబోయే ఉత్తర ప్రదేశ్, గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు జాతీయ రాజకీయాలపై చూపించే ప్రభావం దృష్ట్యా, మోదీ ప్రభుత్వం ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకోకుండా అచితూచి అడుగులు వేస్తోంది.  ప్రధాని మోదీపై వ్యతిరేక స్వారాలు పెరిగే అవకాశం ఉందన్న అంచనాలు కూడా కేంద్రంలో కొత్త భయాలను సృష్టిస్తున్నాయి. భవిష్యత్ రాజకీయ ప్రభావంరాబోయే రోజుల్లో డీలిమిటేషన్ ప్రక్రియ రాజకీయంగా అత్యంత సున్నితమైన అంశంగా మారనుంది. జనాభా ఆధారిత విభజన అమలైతే, కేంద్ర ప్రభుత్వ ఏర్పాటులో ఉత్తరాది రాష్ట్రాల ఆధిపత్యం పెరిగి, దక్షిణాది రాష్ట్రాల గొంతు నొక్కబడుతుందనే భావన మరింత బలపడుతుంది. ఇది సమఖ్య వ్యవస్థకే పెద్ద సవాలుగా మారే ప్రమాదం ఉంది.ఈ రాజకీయ సందిగ్ధత మరింత తీవ్రమైతే, జాతీయ స్థాయిలో ప్రతిపక్షాల ఐక్యతకు డీలిమిటేషన్ ప్రధాన అస్త్రంగా మారుతుంది. రాబోయే సార్వత్రిక ఎన్నికల నాటికి దక్షిణాది రాష్ట్రాలు తమ రాజకీయ ప్రాతినిధ్యాన్ని కాపాడుకోవడానికి ఏకతాటిపైకి వస్తే, కేంద్ర ప్రభుత్వానికి చట్టసభల్లో నిర్ణయాలు తీసుకోవడం సంక్లిష్టంగా మారనుంది.       Delimitation Commission, South India Lok Sabha Seats, Women Reservation Bill, Mallikarjun Kharge Letter, Narendra Modi, North vs South Politics, Parliament Seats Expansion, Indian Political Analysis, Delimitation Impact Telugu, Indian Federation Issues, Telugu One, Telugu news
  తెలంగాణ రాజకీయాల్లో మరోసారి కాంగ్రెస్ అంతర్గత వ్యవహారాలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. మంత్రివర్గ విస్తరణ, నామినేటెడ్ పదవుల భర్తీకి కాంగ్రెస్ అధిష్ఠానం కసరత్తు ముమ్మరం చేస్తున్న తరుణంలో, రాష్ట్ర రాజకీయాలకు కేంద్రబిందువుగా హస్తిన మారింది. ప్రధానంగా రాష్ట్ర అటవీ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ హుటాహుటిన ఢిల్లీకి చేరుకోవడం తెలంగాణ కాంగ్రెస్ వర్గాల్లో ఊహించని ఉత్కంఠను రేకెత్తిస్తోంది. 2026 సెప్టెంబర్ 1 మంగళవారం నాడు తెలంగాణకు చెందిన కీలక నేతలంతా వరుసపెట్టి ఢిల్లీ బాట పట్టడం వెనుక పలు ఆసక్తికర రాజకీయ కారణాలు కనిపిస్తున్నాయి. మంత్రి కొండా సురేఖతో పాటు మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, సీఎం రేవంత్ రెడ్డి, ఇతర ముఖ్య నేతలు హస్తిన పర్యటనలో ఉన్నారు. ఈ పర్యటనల క్రమంలో చోటుచేసుకుంటున్న పరిణామాలు రాష్ట్రంలో మంత్రుల మార్పులు, చేర్పులపై జరుగుతున్న ప్రచారానికి బలాన్ని చేకూరుస్తున్నాయి. ఈ హఠాత్ పర్యటనకు ప్రధాన కారణాల్లో ఒకటి మంత్రి కొండా సురేఖ కుమార్తె సుస్మిత ఇటీవల ఒక బహిరంగ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లక్ష్యంగా చేసిన సంచలన వ్యాఖ్యలేనని పార్టీ వర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది. ఆ వ్యాఖ్యలు కాంగ్రెస్ అధిష్ఠానం దృష్టికి వెళ్లడం, పార్టీ అగ్రనాయకత్వం ఈ పరిణామాన్ని తీవ్రంగా పరిగణించడంతో సురేఖను ఢిల్లీకి రావాల్సిందిగా ఆదేశించినట్లు తెలుస్తోంది.  సురేఖను మంత్రివర్గం నుంచి తప్పించే అవకాశం ఉందనే ప్రచారం ఊపందుకోవడంతో ఆమె అధిష్ఠానంతో మాట్లాడి పరిస్థితిని వివరించేందుకు సిద్ధమయ్యారు. ఇప్పటికే కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అపాయింట్‌మెంట్‌ను కొండా సురేఖ కోరగా, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ నేతృత్వంలో కీలక భేటీ ఖరారైనట్లు సమాచారం. ఈ భేటీలో కొండా సురేఖ భవిష్యత్తు మరియు కేబినెట్‌లో ఆమె కొనసాగింపుపై కీలక నిర్ణయం తీసుకునే అవకాశముంది. మరోవైపు తెలంగాణ కేబినెట్ విస్తరణ సంకేతాలు స్పష్టంగా కనిపిస్తుండటంతో మంత్రి పదవుల ఆశావాహులు కూడా ఢిల్లీకి చేరుకుని లాబీయింగ్ తీవ్రతరం చేశారు. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ఢిల్లీ చేరుకుని, గతంలో తనకు కేబినెట్ పదవి ఇస్తామని ఇచ్చిన హామీని అధిష్ఠానానికి గుర్తుచేసే ప్రయత్నాల్లో ఉన్నారు. అలాగే తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ మల్లికార్జున ఖర్గేను కలసి మంత్రివర్గంలో స్థానం కల్పించాలని విజ్ఞప్తి చేశారు.  స్పీకర్ లాబీయింగ్ ప్రారంభించడంతో అలర్ట్ అయిన ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి కూడా ఉమ్మడి రంగారెడ్డి జిల్లా కోటాలో మంత్రి పదవిని ఆశిస్తూ హస్తినకు చేరుకున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ ఇప్పటికే ఢిల్లీలోనే ఉండి హైకమాండ్ పెద్దలతో మంతనాలు జరుపుతున్నారు. సెప్టెంబర్ 1 సాయంత్రం జరగనున్న ఈ వరుస భేటీలు కొండా సురేఖ రాజకీయంపైనే కాకుండా తెలంగాణ మంత్రివర్గంలో రాబోయే కీలక మార్పులపై కూడా పూర్తి స్పష్టత ఇవ్వనున్నాయి.   Konda Surekha Delhi Visit, Telangana Cabinet Expansion, Revanth Reddy Congress, Telangana Political News, KC Venugopal Meeting, Telangana Congress Politics
ALSO ON TELUGUONE N E W S
విజయనగర సామ్రాజ్యం అనగానే మనందరికీ గుర్తుకువచ్చే ఏకైక పేరు.. శ్రీకృష్ణదేవరాయలు. ఆ గొప్ప విజయనగర సామ్రాజ్య వైభవాన్ని, కృష్ణదేవరాయ రాజసాన్ని ఇప్పుడు మళ్ళీ బిగ్ స్క్రీన్ పై చూడబోతున్నాం. కిచ్చా సుదీప్ పుట్టినరోజు సందర్భంగా ఆయన అభిమానులకు, సినీ ప్రేమికులకు పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఒక మైండ్ బ్లోయింగ్ గిఫ్ట్ ఇచ్చింది. అదే 'దేవరాయ' (Devaraaya) సినిమా టైటిల్ అనౌన్స్‌మెంట్. సుప్రియన్వి పిక్చర్ స్టూడియోతో పీపుల్ మీడియా ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. కిచ్చా సుదీప్ శ్రీకృష్ణదేవరాయల పాత్రలో కనిపించబోతున్నారు. దేవరాయ పాత్రలో సుదీప్ రాయల్ లుక్, ఈ టైటిల్ గ్లింప్స్ సినీ అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. టైటిల్ గ్లింప్స్ తోనే గూస్ బంప్స్ తెప్పించారని చెప్పొచ్చు. ప్రొడ్యూసర్స్ టి.జి. విశ్వప్రసాద్, కృతి ప్రసాద్ ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ప్రతిష్టాత్మకంగా ఈ విజువల్ స్పెక్టకిల్‌ని తెరకెక్కిస్తున్నారు. శ్రీకృష్ణదేవరాయ చరిత్ర, పవర్‌ఫుల్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, విజువల్ గ్రాండ్‌నెస్.. ఇవన్నీ చూస్తుంటే ఇది కేవలం ఒక సినిమా మాత్రమే కాదు, బిగ్ స్క్రీన్ పై ఒక పీరియాడిక్ ఎపిక్ కాబోతోందని స్పష్టమవుతోంది. ఈ చిత్రానికి గౌరహరి అందిస్తున్న సంగీతం వింటేనే ఒక రేంజ్‌లో గూస్‌బంప్స్ వస్తున్నాయి. కిచ్చా సుదీప్ పవర్-ప్యాక్డ్ పెర్ఫార్మెన్స్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ భారీ నిర్మాణ విలువల కలయికలో రాబోతున్న ఈ 'దేవరాయ' విజువల్ వండర్ ని బిగ్ స్క్రీన్స్ పై చూడటానికి 2027 డిసెంబర్ వరకు వేచి చూడక తప్పదు. https://x.com/Theteluguone/status/2095044144825770169       [Kiccha Sudeep, Sri Krishna Devaraaya, Sri Krishnadevaraya, Devaraaya, People Media Factory, Telugu Film News, Telugu News]  
  థియేటర్స్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్  పవర్ ప్యాకేజ్డ్ మూవీ 'పంజా' జోరు కొనసాగుతూ ఉంది.ఆ ఏరియా, ఈ ఏరియా అని కాకుండా ఆల్ ఏరియాస్ హౌస్ ఫుల్ బోర్డ్స్ తో దర్శనమిస్తున్నాయి.  నిన్న ప్రీమియర్స్ ప్రదర్శించడం, అవి కూడా ఫుల్ కావడం కూడా ఒక రికార్డు. డిజాస్టర్ మూవీకి ఈ స్థాయి క్రేజా అని  ట్రేడ్ వర్గాలు సైతం ఆశ్చర్యపోతున్నాయి.  అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ అయిన కేవలం 3 గంటల్లోనే హైదరాబాద్ మరియు విశాఖపట్నంలో 150కి పైగా షోలు పూర్తిగా సోల్డ్ అవుట్ కావడం పవన్ మేనియాకు అద్దం పడుతోంది. నైజాం ఏరియాలో రీ రిలీజ్ మొదటి రోజే 1.2 కోట్ల షేర్ సాధించి ట్రేడ్ పండితులను సైతం షాక్‌కి గురిచేసింది. ఆంధ్రప్రదేశ్‌లో దాదాపు 220కి పైగా స్క్రీన్‌లలో రిలీజవ్వగా   ప్రతి థియేటర్ వద్ద 100% ఆక్యుపెన్సీ నమోదు కావడం గమనార్హం. ఈ రీ-రిలీజ్ హంగామా కేవలం థియేటర్ల లోపలే కాదు, బైట కూడా జాతరను తలపిస్తోంది. అభిమానులు బ్యానర్లు, కటౌట్లు, పాలాభిషేకాలు మరియు బాణసంచా కాల్పులతో థియేటర్ కాంప్లెక్స్‌లను పండగ వాతావరణంగా మార్చేశారు. ‘పాప రాయుడు’ పవర్ ఫుల్ సీన్స్, ఇంటర్వెల్ ఫైట్ అండ్ మేజర్ క్లైమాక్స్ యాక్షన్ సీన్స్ వస్తున్నప్పుడు థియేటర్లలో ఆడియెన్స్ చేస్తున్న విజిల్స్, కేకలతో హాల్స్ దద్దరిల్లుతున్నాయి. కాలం మారినా, ఏళ్లు గడిచినా 'జై' రోల్ లో పవన్ ప్రదర్శించిన రోల్ ఫ్యాన్స్ ని ఫిదా చేస్తుందని చెప్పడానికి రీ రిలీజ్ ఒక  ఉదాహరణ. Also Read: 200 కోట్లకి చేరువలో:  మరో డివోషనల్ సాంగ్ రిలీజ్ చేసిన మేకర్స్  2011 డిసెంబర్ 9న ప్రపంచ వ్యాప్తంగా రూ. 30 కోట్ల భారీ బడ్జెట్‌తో విడుదలైన ‘పంజా’, అప్పట్లో బాక్సాఫీస్ వద్ద రూ. 28 కోట్ల గ్రాస్ వసూలు చేసి ఆశించిన స్థాయిలో వాణిజ్య విజయం సాధించలేకపోయింది. అయితే, కాలక్రమేణా ఈ సినిమాకు ఒక ప్రత్యేకమైన కల్ట్ ఫాలోయింగ్ ఏర్పడింది. ముఖ్యంగా స్టైలిష్ విజువల్స్, యువన్ శంకర్ రాజా అందించిన ఐకానిక్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, శరత్ మారార్ - నీలిమ తిరుమలశెట్టి నిర్మాణం ఈ చిత్రానికి ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టాయి. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ పోషించిన జైదేవ్ అలియాస్ ‘డెక్స్‌స్టర్’ పాత్రలో చూపించిన రాయల్టీ, కామ్ గ్యాంగ్‌స్టర్ షేడ్స్ అభిమానులను కట్టిపడేసాయి. హాలీవుడ్ కల్ట్ సిరీస్ ‘డెక్స్‌స్టర్’ స్ఫూర్తితో డిజైన్ చేసిన క్రూరమైన మరియు విచక్షణతో కూడిన పవర్ ఫుల్ ప్యాకేజ్ అభిమానులకు ఎప్పటికీ విసుగు తెప్పించలేదు.     [ Panjaa Re Release, Pawan Kalyan, pawan fans, Telugu Cinema, Telugu Cinema News, Tollywood]      
  మాస్ మహారాజ రవితేజ, నక్షత్ర, శివ నిర్వాణ, మైత్రి మూవీ మేకర్స్, హరిహర సుతుడు అయ్యప్ప ల 'ఇరుముడి' 200 కోట్ల రూపాయిలు చేరుకోవడానికి రెడీ అవుతుంది.  తాజాగా ఇరుముడి నుంచి సరికొత్త డివోషనల్ వీడియో సాంగ్ 'కార్తీక మాసం' విడుదలై అభిమానులని ప్రేక్షకులని ఎంతోగానో ఆకట్టుకుంటోంది. స్వామి అయ్యప్ప భక్తి పారవశ్యాన్ని, మండల దీక్షా నియమాలను ఎంతో లోతుగా ఆవిష్కరించిన ఈ పాట ప్రతి ఒక్కరి హృదయాన్ని తాకేలా ఉంది.  ఈ అద్భుతమైన గీతానికి దర్శకుడు శివ నిర్వాణ స్వయంగా సాహిత్యాన్ని అందించగా,  జి. వి. ప్రకాష్ కుమార్ తో కలిసి  శివ నిర్వాణ ఆలపించాడు 4 నిమిషాల 5 సెకన్ల నిడివితో ఉండగా   నేరుగా శబరిమల భక్తి లోకంలోకి తీసుకెళ్తుంది.  "ఇది మరి కార్తీక మాసం స్వామి... తలపై చన్నీళ్ల స్నానం కాని మనసే మరింత భద్రం స్వామి" అంటూ సాగే లిరిక్స్ దీక్షా ధారుల జీవితాన్ని, శారీరక కష్టాలను దాటి పొందే ఆధ్యాత్మిక ప్రశాంతతను ప్రతిబింబిస్తాయి. భక్తులు పడే తపన, చలిలో ఉదయాన్నే చేసే స్నానాలు, కటిక నేలపై పడుకునే నిరాడంబరమైన జీవనశైలిని చాలా సహజంగా ఈ పాటలో వర్ణించారు.  పాటలోని అతి ముఖ్యమైన అంతరార్థం ఏమిటంటే— "కనిపించని శత్రువు కాదు, యుద్ధం కాదీ మండల దీక్ష... నాతోటి నేనే చేసే యుద్ధమే ఈ దీక్ష". బయటి సమాజంతో లేదా శత్రువులతో చేసే పోరాటం కాదు మండల దీక్ష, మనలోని అహంకారాలు, ద్వేషాలు, కామక్రోధాలపై మనతో మనమే చేసే అంతర్యుద్ధం అనే గొప్ప సందేశాన్ని ఈ పాటకు శివ నిర్వాణ అందించారు.  అలాగే "నేను అంటే నువ్వే అంటూ స్వామి పదవి ఇచ్చావు... ద్వేషాల్ని దూరం చేసి వర్ణాన్ని ఒక్కటి చేసి" అని అయ్యప్ప దీక్షలోని సమభావనను ఎత్తిచూపారు. కులమతాల భేదం లేకుండా, చిన్నపెద్ద తారతమ్యం లేకుండా నల్లటి దుస్తులు ధరించి ప్రతి ఒక్కరినీ 'స్వామి' అని పిలుచుకునే ఆచారాన్ని అత్యంత భావోద్వేగంగా పాటలో చూపించారు. రవితేజ ఈ పాటలో అయ్యప్ప స్వామి భక్తుడిగా కనిపించిన తీరు, ఆయన చూపించిన హావభావాలు అభిమానులను ఎంతగానో అలరిస్తున్నాయి.   Also read: అనారోగ్యంతో హాస్పిటల్ లో జాయిన్ అయిన మమితా భైజు..ప్రాబ్లమ్ ఇదే  ఇప్పటికే విడుదలైన 'ఇరుముడి కట్టు... శబరిమల ఎక్కు', 'మల్లెపూల పల్లకీ', 'యాలాలో యాలాలో సాంగ్స్ యూ ట్యూబ్ లో రికార్డు వ్యూస్ తో దూసుకుకెళ్తున్న విషయం తెలిసిందే.     [irmudi, Raviteja, Karthika Maasam Song, Shiva Nirvana, Telugu Cinema, Telugu Cinema News, Tollywood ]    
Kiccha Sudeep’s next, Billa Ranga Baasha: First Blood, has finally offered a glimpse of the world that Anup Bhandari is creating. The first look, unveiled on Sudeep’s birthday, presents the actor in a rugged avatar riding a motorcycle across a frozen battlefield, with a giant mechanical war machine and aircraft occupying the backdrop. The visual immediately suggests that BRB First Blood is aiming for something far removed from a conventional action film. The combination of snow-covered terrain, futuristic machinery and large-scale warfare points towards a stylised world where technology and adventure appear to be central to the narrative. Sudeep himself gets a distinctly rugged makeover, with a fur-lined costume and an intense expression that fit the harsh surroundings. However, the poster deliberately keeps the character’s identity and the actual conflict under wraps. That mystery is likely to remain one of the film’s biggest talking points as the promotional campaign progresses. The project reunites Sudeep with Anup Bhandari after their earlier collaboration Vikrant Rona, making the scale and ambition of their second outing particularly interesting. K Niranjan Reddy and Chaitanya Reddy are producing the film, with PrimeShow Entertainment backing the project. The makers are planning a long promotional runway, with the teaser expected in the first quarter of 2027, followed by the trailer in the third quarter. Billa Ranga Baasha: First Blood is targeting a worldwide theatrical release in the final quarter of 2027 across the South Indian languages and Hindi. Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them.
గుజరాతీ సినిమాలు అంటే తక్కువ బడ్జెట్, పరిమిత మార్కెట్ అని అందరూ అనుకుంటారు. కానీ 'లాలో: కృష్ణ సదా సహాయతే' అనే సినిమా ఆ అంచనాలన్నింటినీ తలకిందులు చేసింది. శ్రీకృష్ణుడి ఆధ్యాత్మికతకు, సర్వైవల్ డ్రామాను జోడించి తీసిన ఈ చిత్రం బాక్సాఫీస్ ను షేక్ చేసింది. కేవలం రూ.50 లక్షల బడ్జెట్ తో తీస్తే.. 100 కోట్ల క్లబ్‌లో చేరిన తొలి గుజరాతీ చిత్రంగా రికార్డు సృష్టించి, ఏకంగా 120 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఇంతటి సంచలనం సృష్టించిన ఈ సినిమా రీమేక్ హక్కుల కోసం ఇప్పుడు సౌత్ మేకర్స్ పోటీ పడుతున్నారు. ముఖ్యంగా 'లాలో' సినిమాను తెలుగులో రీమేక్ చేయడానికి గట్టి ప్రయత్నాలు జరుగుతున్నాయట. అంతేకాదు, ఈ తెలుగు రీమేక్‌లో శ్రీకృష్ణుడి పాత్ర కోసం రామ్ చరణ్‌ను సంప్రదించినట్లు ప్రచారం సాగుతోంది. 'ఆర్ఆర్ఆర్' తర్వాత గ్లోబల్ స్టార్‌గా మారిన చరణ్, డివైన్ టచ్ ఉన్న పాత్రలో కనిపిస్తే ఆ క్రేజ్ ఏ రేంజ్‌లో ఉంటుందో ఊహించుకోవచ్చు. గతంలో 'గోపాల గోపాల' సినిమాలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కృష్ణుడి పాత్రలో వచ్చి బాక్సాఫీస్‌ను షేక్ చేశారు. ఇప్పుడు అదే తరహాలో బాబాయ్ బాటలోనే అబ్బాయ్ కూడా కృష్ణుడిగా మారి మెగా అభిమానులకు పూనకాలు తెప్పించబోతున్నారా అనే చర్చ మొదలైంది. అంతేకాదు, ఈ ప్రాజెక్ట్‌కి కోలీవుడ్ డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వం వహించే అవకాశం ఉందనే వార్త ఫ్యాన్స్‌లో మరింత క్యూరియాసిటీని పెంచేసింది. విభిన్నమైన కథలను తనదైన మార్క్ స్క్రీన్‌ప్లేతో చెప్పే కార్తీక్ సుబ్బరాజ్ హ్యాండిల్ చేస్తే ఈ కాంబో నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చు. ఇక సినిమాలో ప్రధాన పాత్ర కోసం నటుడు సత్యదేవ్ పేరు కూడా వినిపిస్తోంది. అయితే ఇవన్నీ ప్రస్తుతం చర్చల దశలోనే ఉన్నాయి. మేకర్స్ నుంచి కానీ, రామ్ చరణ్ టీమ్ నుంచి కానీ ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. కానీ ఒక చిన్న బడ్జెట్ డివైన్ హిట్ మూవీ.. చరణ్ లాంటి పాన్ ఇండియా స్టార్ వైపు చూడటం నిజంగానే ఆసక్తికరమైన విషయం. ఒకవేళ రామ్ చరణ్ నిజంగానే కృష్ణుడిగా కనిపిస్తే.. బాక్సాఫీస్ షేక్ అవ్వడం ఖాయమని చెప్పొచ్చు.       [Ram Charan as Krishna, Laalo Remake Telugu, Laalo Krishna Sada Sahayate, Ram Charan, Karthik Subbaraj, Pawan Kalyan, Gopala Gopala, Telugu Film News, Telugu News]
  'ప్రేమలు' మూవీతో యూత్ హార్ట్స్ లో తిష్ట వేసిన భామ మమితా భైజు. రీసెంట్ గా విశ్వనాధ్ అండ్ సన్స్ తో భారీ హిట్ అందుకొని సౌత్ ఇండియా క్రేజీ హీరోయిన్ గా మారింది. ఇప్పుడు  ఉన్నట్టుండి  హఠాత్తుగా ఆసుపత్రిలో జాయిన్ కావడం అభిమానులతో పాటు  పరిశ్రమ వర్గాలని షాక్ కి గురి చేస్తుంది. హాస్పిటల్ లో జాయిన్ కావడానికి గల కారణాన్ని అధికారకంగా ప్రకటించకపోయినా  జ్వరం, , ఆస్తమా, అలర్జీ లాంటి సమస్యలతో బాధపడుతున్నట్టుగా ఇండస్ట్రీ వర్గాల టాక్.   ఈ నెల 5న ఆస్ట్రేలియా దేశంలోని  మెల్‌బోర్న్‌లో జరగాల్సి ఉన్న 'క్లైడ్ మలయాళీ' ఓణం  వేడుకలకి మమిత చీఫ్ గెస్ట్ గా హాజరుకావాల్సి ఉంది. దీంతో ఆ పర్యటన కూడా రద్దయింది. ఈ నేపథ్యంలో  సోషల్ మీడియా వేదికగా మమిత బైజూ  సోషల్ మీడియా వేదికగా ఒక వీడియో సందేశాన్ని విడుదల చేశారు. ఆ వీడియోలో 'ఆస్ట్రేలియా పర్యటన రద్దు కావడం నాకు చాలా పెద్ద లోటు. అనుకున్న దాని ప్రకారం రాలేకపోతున్నందుకు ప్రతి ఒక్కరికీ మనస్ఫూర్తిగా క్షమాపణలు చెబుతున్నాను. వైద్యుల సలహా మేరకు ప్రస్తుతం పూర్తిగా విశ్రాంతి తీసుకుంటున్నాను. వీలైతే ఎలాగైనా రావాలని అనుకున్నాను కానీ ఆరోగ్య పరిస్థితి సహకరించడం లేదు" అని ఆవేదన వ్యక్తం చేశారు.   Also Read: సంకల్ప సాధకుడు కల్యాణ్ బాబు.. తమ్ముడికి మెగాస్టార్ చిరంజీవి బర్త్ డే విషెస్ మమిత ఆరోగ్య పరిస్థితిపై సమాచారం తెలిసిన వెంటనే ఆమె అభిమానులు, సినీ ప్రముఖులు త్వరగా కోలుకోవాలని సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు.సినిమాలతో నిరంతరం బిజీగా గడపడం, తీవ్రమైన పని ఒత్తిడి వల్లనే ఆమె ఆరోగ్యం దెబ్బతిన్నట్లు తెలుస్తోంది. ఏది ఏమైనా కెరీర్ పీక్ స్టేజ్‌లో ఉన్న సమయంలో మమిత బైజూ ఇలా ఆసుపత్రి పాలవ్వడం అందరినీ కలవరపెట్టినప్పటికీ, వైద్యుల పర్యవేక్షణలో ఆమె త్వరలోనే కోలుకొని మళ్లీ షూటింగ్‌లలో పాల్గొంటారని అభిమానులు ఆశిస్తున్నారు.     [ Mamitha Baiju, Hospitalised, viswandh And Sons, Premalu, Telugu Cinema, Telugu Cinema News, Tollywood ]      
Kichcha Sudeep has spent a large part of his career playing larger-than-life characters, but Devaraaya puts him in a territory that comes with a very different responsibility. The actor is set to play Sri Krishna Devaraya, one of the most celebrated rulers of the Vijayanagara Empire, making this more than just another period-film outing for the Kannada Baadshah. The first look and title announcement, unveiled on his birthday, keep the focus firmly on the actor’s transformation. Sudeep appears in traditional royal attire with an elaborate crown and pearl jewellery, while his controlled expression gives the character a sense of authority. The glimpse doesn't reveal much about the story or the film's treatment, but it establishes the ruler as the central attraction. That is also where the film's biggest challenge lies. Sri Krishna Devaraya is already a deeply familiar historical figure in South Indian culture, and merely recreating the visual appearance of a king will not be enough. The film will have to find its own interpretation of the emperor while balancing historical context with the demands of mainstream cinema. Gowra Hari’s score adds to the period setting, but the makers have wisely kept the announcement video relatively restrained instead of attempting to reveal the entire scale of the project at this stage. The director and the remaining cast are yet to be announced, which makes it too early to judge the film beyond Sudeep’s casting and its visual intent. Produced by TG Vishwa Prasad and Krithi Prasad and presented by Priya Sudeep through Supriyanvi Picture Studio, Devaraaya is scheduled for a theatrical release in December 2027. With considerable time before release, the film now has the opportunity to build the world around its central character.   Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them.
  ఈ రోజు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు. మరి మెగా స్టార్ చిరంజీవికి ఉండే ఆనందం అంతా ఇంతా కాదు. ప్రతి సంవత్సరం పవన్ కి తనదైన శైలిలో శుభాకాంక్షలు చెప్తూ అభిమానుల్లో జోష్ నింపుతూ ఉంటారు. కానీ ఈ సంవత్సరం మాత్రం అంతకు మించిన ట్వీట్ తో సోషల్ మీడియాకి స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలవడం టూ డే టాక్ అఫ్ ది డే.   'ఎక్స్' వేదికగా 'సంకల్ప సాధకుడు కళ్యాణ్ బాబు.కేవలం చలనచిత్ర రంగంలో అగ్రనటుడిగానే కాకుండా ప్రజా జీవితంలో జనసేనానిగా, ఏపీ డిప్యూటీ సీఎంగా ప్రజలకు నిరంతరం సేవలందిస్తున్నాడు. అనుకున్న లక్ష్యాన్ని సాధించే వరకు విశ్రమించని గుణం, ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పనిచేసే తత్వం పవన్‌ సొంతం. కళ్యాణ్ బాబు ఆయురారోగ్యాలతో, ఎల్లప్పుడూ సంతోషంగా ఉంటూ ప్రజలకు మరింతగా సేవ చేసే శక్తిని ఆ భగవంతుడు ప్రసాదించాలి" అని ట్వీట్ లో పేర్కొన్నారు. ఇక పవన్ కళ్యాణ్ బర్త్ డే వేడుకలు రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు విదేశాల్లో ఘనంగా జరుగుతున్నాయి. అభిమానుల్లో మరింత జోష్ నింపేలా 'పంజా' మూవీ ఈ రోజు రీ రిలీజై థియేటర్స్ లో సందడి చేస్తుంది.     Chiranjeevi, Pawann Kalyan, Pawan Birthday Wishes, Sankalpa Saadhakudu, Telugu Cinema, Telugu Cinema News, Tollywood, Panjaa        https://x.com/KChiruTweets/status/2095007247286100015
ప్రకృతి సౌందర్యానికి నిలయమైన జమ్మూకశ్మీర్ ఇప్పుడు ప్రపంచ సినిమా వేదికగా మారబోతోంది. సినీ నిర్మాణ రంగానికి, సాంస్కృతిక వైవిధ్యానికి వేదికగా నిలిచిన కశ్మీర్ లోయలో తొలిసారిగా అత్యంత భారీ స్థాయిలో 'అంతర్జాతీయ చలనచిత్రోత్సవం' (International Film Festival of Jammu and Kashmir) నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది. జమ్మూకశ్మీర్ ప్రభుత్వ సమాచార, పౌర సంబంధాల శాఖ ఆధ్వర్యంలో సెప్టెంబర్ 7 నుంచి 10 వరకు ఈ ప్రతిష్ఠాత్మక చలనచిత్రోత్సవాలు జరగనున్నాయి. ఈ చలనచిత్రోత్సవం యొక్క ప్రధాన ఉద్దేశం కశ్మీర్‌తో వెండితెరకు ఉన్న సుదీర్ఘ అనుబంధాన్ని పునర్నిర్మించడమేనని నిర్వాహకులు తెలిపారు. స్థానిక ప్రతిభావంతులకు అవకాశాలు కల్పిస్తూనే, గ్లోబల్ సినిమా మ్యాప్‌లో కశ్మీర్‌కు తగిన గుర్తింపు తీసుకురావడం, పర్యాటకరంగాన్ని మరింత బలోపేతం చేయడం మరియు సృజనాత్మక సహకారానికి వేదికను కల్పించడమే ఈ ఉత్సవాల ముఖ్య లక్ష్యం. ఈ చిత్రోత్సవం కోసం ప్రత్యేకంగా ఐదుగురు సభ్యులతో కూడిన ఒక జ్యూరీ ప్యానెల్‌ను ఏర్పాటు చేశారు. ప్రముఖ ఛాయాగ్రాహకుడు, దర్శకుడు సంతోష్ శివన్ ఈ జ్యూరీలో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ ఉత్సవంలో ప్రపంచవ్యాప్తంగా 41 దేశాల నుంచి ఎంపిక చేసిన 135 చిత్రాలను ప్రదర్శించనుండగా, అందులో 64 ఎంట్రీలు భారతదేశానికి చెందిన చిత్రాలు కావడం విశేషం. విజేతలకు ప్రోత్సాహకంగా నిర్మాతలు భారీ నగదు బహుమతులను ప్రకటించారు. మొత్తం తొమ్మిది విభాగాల్లో చిత్రాలను ఎంపిక చేసి రూ. 96 లక్షల నగదు పురస్కారాలను అందించనున్నారు. ఉత్తమ చలనచిత్రానికి రూ. 25 లక్షలు, ఉత్తమ దర్శకుడికి మరియు ఉత్తమ తొలి చిత్ర దర్శకుడికి తలా రూ. 15 లక్షలు బహుమతిగా ఇస్తారు. అంతేకాకుండా 'ఉత్తమ చిత్రం - జమ్మూకశ్మీర్ సెలెక్ట్' కేటగిరీ విజేతకు రూ. 10 లక్షలు లభించనున్నాయి. ఇక ఉత్తమ నటీనటులకు తలా రూ. 8 లక్షలు చొప్పున, ఉత్తమ ఛాయాగ్రాహకుడు, సౌండ్ డిజైనర్ మరియు ఎడిటర్‌లకు తలా రూ. 5 లక్షలు చొప్పున అందజేయనున్నారు. ఈ వేడుకల్లో ప్రధాన ఆకర్షణగా ప్రసిద్ధ దాల్ లేక్ (Dal Lake) పైన ఫ్లోటింగ్ స్క్రీన్ ఏర్పాటు చేసి చిత్రాలను ప్రదర్శించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. భారతీయ సినీ చరిత్రలో కశ్మీర్‌కు ఒక ప్రత్యేక స్థానం ఉందన్న సంగతి తెలిసిందే. దశాబ్దాలుగా అనేక ఐకానిక్ చిత్రాల చిత్రీకరణకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచింది ఈ అందాల లోయ. ఈ చిత్రోత్సవాల నిర్వహణతో గ్లోబల్ ఫిలిం మేకర్స్ చూపు మళ్లీ కశ్మీర్ వైపు మరలడం ఖాయమని ఇండస్ట్రీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఈ చలనచిత్రోత్సవంతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ ప్రియులు, దర్శకులు మరియు నటీనటులు కశ్మీర్‌లో కొలువుదీరనుండటంతో టూరిజంతో పాటు స్థానిక సినీ రంగానికి సరికొత్త ఊపు రానుందని భావిస్తున్నారు.       [Jammu and Kashmir International Film Festival, Srinagar Dal Lake Floating Screen, Indian Cinema Updates, Santosh Sivan Jury, Film Festival J&K 2026]
నేషనల్ క్రష్ రష్మిక మందన్న వరుస పాన్-ఇండియా ప్రాజెక్టులతో టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు బాక్సాఫీస్ వద్ద తన ఆధిపత్యాన్ని చాటుకుంటున్నారు. గ్లామరస్ పాత్రలకే పరిమితం కాకుండా, నటనకు ఎంతో ప్రాధాన్యమున్న వైవిధ్యమైన కథలను ఎంచుకుంటూ ప్రేక్షకులను అలరిస్తున్నారు. ఈ క్రమంలో ఆమె ప్రధాన పాత్రలో రూపుదిద్దుకుంటున్న మోస్ట్ అవైటెడ్ యాక్షన్ థ్రిల్లర్ 'మైసా' రిలీజ్ డేట్‌ను మేకర్స్ అధికారికంగా వెల్లడించారు. ఈ భారీ యాక్షన్ డ్రామాను 2026 నవంబర్ 27న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేయనున్నట్లు నిర్మాతలు ఆఫీషియల్‌గా ప్రకటించారు. రిలీజ్ డేట్‌ను అనౌన్స్ చేస్తూ విడుదల చేసిన ప్రత్యేక పోస్టర్ సినిమాపై అంచనాలను ఒక్కసారిగా పెంచేసింది. ఈ పోస్టర్‌లో రష్మిక రక్తమోడుతున్న ముఖంతో, చేతిలో ఈటె పట్టుకుని అత్యంత రౌద్రంగా కనిపిస్తూ అభిమానులను ఆకట్టుకుంటున్నారు. తన కెరీర్‌లో నవంబర్ నెలకు ఒక ప్రత్యేక సెంటిమెంట్ ఉందనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. గతంలో ఆమె నటించిన భారీ ప్రాజెక్టులు, ముఖ్యంగా బ్లాక్‌బస్టర్ హిట్లుగా నిలిచిన కొన్ని చిత్రాలు ఇదే సమయంలో వచ్చి మంచి విజయాన్ని అందుకున్నాయి. ఇప్పుడు 'మైసా' చిత్రాన్ని కూడా నవంబర్ చివరి వారంలో ప్రేక్షకుల ముందుకు తీసుకురావడం విశేషం. రవీంద్ర పుల్లె దర్శకత్వంలో అన్‌ఫార్ములా ఫిలిమ్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి జేక్స్ బిజోయ్ సంగీతం అందిస్తున్నారు. ఇటీవలే హిప్ గాయం నుంచి కోలుకున్న రష్మిక మందన్న, ఈ సినిమా కోసం ఎంతో శ్రమించినట్లు తెలిపారు. తన కెరీర్‌లోనే అత్యంత అగ్రెసివ్ మరియు ఎమోషనల్ యాక్షన్ రోల్ ఇది అని ఆమె పేర్కొన్నారు. గిరిజన నేపథ్యంలో సాగే కథాంశంతో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రంలో రష్మిక ఒక వీరనారి తరహా పాత్రలో కనిపించనున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో 'మైసా' రిలీజ్ పోస్టర్ తీవ్రంగా ట్రెండ్ అవుతోంది. రష్మిక మేకోవర్ చూసి నెటిజన్లు, అభిమానులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఒక లేడీ ఓరియెంటెడ్ పాన్-ఇండియా మూవీకి ఈ స్థాయిలో వైలెంట్ మరియు ఇంటెన్స్ పోస్టర్ రావడం ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది. విజువల్ ఎఫెక్ట్స్ మరియు పోస్ట్-ప్రొడక్షన్ పనులను వేగవంతం చేస్తున్న మేకర్స్, త్వరలోనే టీజర్ మరియు సింగిల్స్ అప్‌డేట్స్‌తో అలరించేందుకు ప్లాన్ చేస్తున్నారు. నవంబర్ 27న థియేటర్లలోకి రాబోతున్న 'మైసా' బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ప్రభంజనం సృష్టిస్తుందో వేచి చూడాలి.       [Rashmika Mandanna, Mysaa Release Date, Mysaa Movie Poster, Rashmika Mandanna Action Movie, Telugu Cinema Updates]
  ప్రకృతి ప్రసాదించిన అద్భుతమైన మూలికా సంపదలో హిమాలయ పర్వత ప్రాంతాల్లో మాత్రమే లభించే  పహాడీ వెల్లుల్లి  లేదా  హిమాలయన్ సింగిల్ క్లోవ్ గార్లిక్  ఎంతో ప్రత్యేకమైనది. దీనిని సాధారణంగా కశ్మీరీ వెల్లుల్లి అని కూడా పిలుస్తారు. సాధారణంగా మనం వంటల్లో వాడే వెల్లుల్లి పాయల కంటే ఇది పరిమాణంలో చిన్నగా, ఒకే ఒక్క పాయగా (Single Clove) గుండ్రంగా ఉంటుంది. అయితే ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే, మన సాధారణ వెల్లుల్లితో పోలిస్తే ఈ పహాడీ వెల్లుల్లిలో దాదాపు 7 రెట్లు అధికంగా పోషకాలు మరియు ఔషధ గుణాలు దాగి ఉంటాయని ఆయుర్వేద నిపుణులు మరియు శతాబ్దాల వైద్య పరిశోధనలు స్పష్టం చేస్తున్నాయి. హిమాలయాలలోని స్వచ్ఛమైన వాతావరణం, మంచు నీరు మరియు ప్రత్యేకమైన నేల స్వభావం దీనికి అపరిమితమైన శక్తిని అందిస్తాయి. పహాడీ వెల్లుల్లిలో అత్యధిక గాఢత కలిగిన  అల్లిసిన్  (Allicin) అనే అద్భుతమైన ఆర్గానోసల్ఫర్ సమ్మేళనం ఉంటుంది. సాధారణ వెల్లుల్లి కంటే ఇందులో 300 శాతం ఎక్కువ అల్లిసిన్ నిల్వలు ఉంటాయి, ఇది మన శరీరానికి రక్షణ కవచంలా పనిచేస్తుంది. దీనితో పాటు పహాడీ వెల్లుల్లిలో శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్లు, ఫ్లేవనాయిడ్లు, ఐరన్, కాపర్, మాంగనీస్, విటమిన్ బి6 మరియు విటమిన్ సీ పుష్కలంగా లభిస్తాయి. రోజుకు కేవలం 2 నుండి 3 పహాడీ వెల్లుల్లి పాయలను పరగడుపున నమిలి తింటే, శరీరంలో రోగనిరోధక శక్తి దాదాపు 50 శాతం వరకు పెరుగుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి. ఇది శరీరంలో ఉండే有害 ఉచిత రాడికల్స్ (Free Radicals) ను నిరోధించి కణాల క్షీణతను 40 శాతం వరకు అడ్డుకుంటుంది. హృదయ సంబంధిత సమస్యలతో బాధపడేవారికి పహాడీ వెల్లుల్లి ఒక వరప్రసాదం లాంటిది. ఇది రక్తనాళాల్లో కొవ్వు పేరుకుపోకుండా నిరోధించి, రక్త ప్రసరణను 35 శాతం వరకు మెరుగుపరుస్తుంది. ప్రతిరోజూ క్రమం తప్పకుండా పహాడీ వెల్లుల్లిని ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల శరీరంలో ఉండే చెడు కొలెస్ట్రాల్ (LDL) మరియు ట్రైగ్లిజరైడ్ల స్థాయిలు 20 శాతం నుండి 25 శాతం వరకు తగ్గుతాయి. అంతేకాకుండా అధిక రక్తపోటు (High Blood Pressure)ను నియంత్రించడంలో ఇది 90 శాతం సమర్థవంతంగా పనిచేస్తుంది. రక్తనాళాలను రిలాక్స్ చేసి, బ్లడ్ క్లాట్స్ (రక్తపు గడ్డలు) ఏర్పడే ప్రమాదాన్ని గణనీయంగా తగ్గిస్తుంది.       how to use pahadi garlic daily,pahadi garlic vs normal garlic benefits.
      చర్మంపై అకస్మాత్తుగా కనిపించే చిన్నచిన్న పులిపిర్లు (Warts) చాలామందిని వేధించే ప్రధాన సౌందర్య మరియు ఆరోగ్య సమస్య. ఇవి ముఖం, మెడ, చేతులు, కాళ్లపై ఏర్పడి చర్మ సౌందర్యాన్ని దెబ్బతీయడమే కాకుండా కొన్నిసార్లు తీవ్రమైన అసౌకర్యాన్ని కలిగిస్తాయి. సాధారణంగా ఇవి హ్యూమన్ పాపిల్లోమావైరస్ (HPV) అనే ఇన్ఫెక్షన్ వల్ల వస్తాయి. చాలామంది వీటిని తగ్గించుకోవడానికి పార్లర్లు, క్లినిక్‌ల చుట్టూ తిరుగుతూ వేలాది రూపాయలు ఖర్చు చేస్తుంటారు. అయితే మన వంటింట్లోనే దొరికే ఒక చిన్న చిటికెడు పసుపుతో ఎటువంటి నొప్పి లేకుండా, సహజ సిద్ధంగా ఈ పులిపిర్లను తొలగించుకోవచ్చని ఆయుర్వేద నిపుణులు మరియు చర్మ వైద్యులు సూచిస్తున్నారు. పసుపులో  కర్కుమిన్ (Curcumin) అనే అత్యంత శక్తివంతమైన జీవక్రియ సంబంధిత సమ్మేళనం ఉంటుంది. ఇది అద్భుతమైన యాంటీ వైరల్, యాంటీ బాక్టీరియల్ మరియు యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలను కలిగి ఉంటుంది. కర్కుమిన్ వైరస్‌ల పెరుగుదలను సమర్థవంతంగా నిరోధించి, చర్మ కణాలను పునరుద్ధరించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. అధ్యయనాల ప్రకారం పసుపును క్రమంగా ఉపయోగించడం వల్ల దాదాపు 70 శాతం నుండి 80 శాతం వరకు పులిపిర్ల సమస్య నయమవుతుంది. పసుపులోని సహజ ఎక్స్‌ఫోలియేటింగ్ గుణాలు పులిపిరు కణజాలాన్ని నెమ్మదిగా ఎండబెట్టి, చర్మం నుండి విడిపోయేలా చేస్తాయి. ఈ సహజ వైద్యం కోసం పసుపును ఉపయోగించడం చాలా సులభం. ఒక చిన్న గిన్నెలో అర స్పూన్ పసుపు పొడిని తీసుకుని, దానికి కొన్ని చుక్కల ఆవనూనె లేదా వెజిటబుల్ ఆయిల్ కలిపి చిక్కటి పేస్ట్‌లా తయారు చేయాలి. ఆవనూనెలో ఉండే విటమిన్ ఇ మరియు పసుపులోని యాంటీ వైరల్ గుణాలు కలిపి వేగవంతమైన ఫలితాలను ఇస్తాయి. ఈ పేస్ట్‌ను పులిపిరి ఉన్న ప్రాంతంలో మాత్రమే ఖచ్చితంగా అప్లై చేసి, దానిపై ఒక కాటన్ బ్యాండేజ్ లేదా ప్లాస్టర్ వేసి రాత్రంతా ఉంచాలి. ఉదయాన్నే గోరువెచ్చని నీటితో కడిగేయాలి. ఇలా ప్రతిరోజు రాత్రి నిద్రపోయే ముందు క్రమం తప్పకుండా 2 నుండి 3 వారాల పాటు చేస్తే పులిపిరు పరిమాణం 50 శాతం వరకు తగ్గి, క్రమంగా రాలిపోతుంది.       How to remove warts with turmeric, painless home remedies for warts.
మన వంటింట్లో లభించే సుగంధ ద్రవ్యాలలో పసుపుకు ప్రత్యేకమైన స్థానం ఉంది. శతాబ్దాలుగా మన సాంప్రదాయ ఆయుర్వేద వైద్యంలో పసుపును ఒక దివ్యౌషధంగా ఉపయోగిస్తున్నారు. సాధారణంగా మనం ప్రతిరోజూ వంటల్లో పసుపు పొడిని ఉపయోగిస్తుంటాం. అయితే మార్కెట్‌లో లభించే పసుపు పొడి కంటే పచ్చి పసుపు కొమ్ముల్లో 30 శాతం నుండి 50 శాతం వరకు అధికంగా ఔషధ గుణాలు, పోషకాలు దాగి ఉంటాయని వైద్య నిపుణులు మరియు ఇటీవలి పరిశోధనలు స్పష్టం చేస్తున్నాయి. పసుపును ప్రాసెస్ చేసి పొడిగా మార్చే క్రమంలో అందులో ఉండే సహజ నూనెలు, సువాసన మరియు కీలక పోషకాలు కొంతవరకు నశిస్తాయి. కానీ పచ్చి పసుపును నేరుగా తీసుకోవడం వల్ల శరీరానికి లభించే ప్రయోజనాలు అపారం. పచ్చి పసుపులో  కర్కుమిన్  (Curcumin) అనే శక్తివంతమైన జీవక్రియ సంబంధిత సమ్మేళనం పుష్కలంగా ఉంటుంది. ఇది ఒక అద్భుతమైన యాంటీఆక్సిడెంట్ మరియు యాంటీ ఇన్‌ఫ్లమేటరీ ఏజెంట్‌గా పనిచేస్తుంది. పచ్చి పసుపులో 3 శాతం నుండి 5 శాతం వరకు అధిక గాఢత కలిగిన కర్కుమిన్ లభిస్తుంది, ఇది శరీరంలో వాపును తగ్గించడంలో మరియు కణజాలాన్ని రక్షించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. దీనికి తోడు పచ్చి పసుపులో శరీరానికి అవసరమైన ఫైబర్, ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు, విటమిన్ సి, విటమిన్ బి6 మరియు ఐరన్ వంటి ముఖ్యమైన పోషకాలు లభిస్తాయి. ప్రతిరోజూ ఉదయాన్నే పరగడుపున 2 నుండి 3 గ్రాముల పచ్చి పసుపు ముక్కను నమిలి తినడం లేదా దాని రసాన్ని తీసుకోవడం వల్ల రోగనిరోధక వ్యవస్థ దాదాపు 40 శాతం వరకు బలపడుతుందని అధ్యయనాలు పేర్కొంటున్నాయి. జీర్ణవ్యవస్థ పనితీరును మెరుగుపరచడంలో పచ్చి పసుపును మించిన ఔషధం లేదు. దీనిలోని  జింజరాల్  (Gingerol) సమ్మేళనం మరియు సహజ ఫైబర్ జీర్ణ రసాల ఉత్పత్తిని పెంచి, పేగుల కదలికలను వేగవంతం చేస్తాయి. భోజనానికి ముందు చిన్న పచ్చి పసుపు ముక్కను తినడం వల్ల కడుపు ఉబ్బరం, గ్యాస్, అజీర్తి మరియు యాసిడ్ రిఫ్లక్స్ వంటి సమస్యలు 70 శాతం వరకు తగ్గుతాయి. అంతేకాకుండా, పచ్చి పసుపు కాలేయంలో ఉండే టాక్సిన్లను తొలగించి, లివర్ ఫంక్షన్‌ను 25 శాతం వేగవంతం చేసే సహజ డిటాక్సిఫైయర్‌గా పనిచేస్తుంది. ఇది రక్తంలో చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి, ఇన్సులిన్ నిరోధకతను నియంత్రించడంలో కూడా ఎంతగానో తోడ్పడుతుంది.       how to use raw turmeric daily, curcumin benefits of fresh turmeric.
ఆరోగ్యమే మహాభాగ్యం అని అందరూ అంటారు, కానీ నేటి వేగవంతమైన జీవనశైలిలో మన ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఒక పెద్ద సవాలుగా మారింది. చాలామంది ఆరోగ్యం అంటే కేవలం క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం లేదా కఠినమైన ఆహార నియమాలు పాటించడమే అని అనుకుంటారు. కానీ నిజమైన ఆరోగ్యం మన రోజువారీ అలవాట్లలోనే దాగి ఉంటుంది. చిన్న చిన్న మార్పులు మన జీవితంలో ఊహించని పెద్ద సానుకూల ఫలితాలను తీసుకోస్తాయి. మన జీవితాన్ని సంపూర్ణంగా, ఆరోగ్యకరంగా మార్చే కొన్ని ముఖ్యమైన అలవాట్లు , ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన నిజాల గురించి  వివరంగా తెలుసుకుంటే... ఉదయాన్నే నీరు..  ఉదయాన్నే పరగడుపున నీరు తాగడం చాలా ప్రభావవంతమైన అలవాటు. రాత్రంతా మన శరీరం విశ్రాంతిలో ఉన్నప్పుడు అనేక జీవక్రియలు జరుగుతాయి. ఉదయం లేవగానే ఒక లీటరు వరకు గోరువెచ్చని నీరు తాగడం వల్ల శరీరంలోని వ్యర్థాలు బయటకు వెళ్ళిపోతాయి. ఇది జీర్ణవ్యవస్థను ఉత్తేజపరచడమే కాకుండా చర్మాన్ని కాంతివంతంగా మారుస్తుంది. రోజంతా కనీసం మూడు నుండి నాలుగు లీటర్ల నీరు తాగడం వల్ల డిహైడ్రేషన్ బారిన పడకుండా ఉండవచ్చు.  పోషకాహారం.. మన శరీరం మనం తినే ఆహారాన్ని బట్టే పనిచేస్తుంది. జంక్ ఫుడ్, వేపుళ్లు, అధిక పంచదార ఉన్న ఆహారాలకు దూరంగా ఉండాలి. రోజువారీ ఆహారంలో తాజా పండ్లు, ఆకుకూరలు, కూరగాయలు, నట్స్ , మొలకెత్తిన విత్తనాలు భాగం చేసుకోవాలి. మనం తినే ఆహారంలో పీచు పదార్థాలు, ప్రొటీన్లు, విటమిన్లు సరిపడా ఉండేలా చూసుకోవాలి. అలాగే ఆహారం తినేటప్పుడు ప్రశాంతంగా, నమిలి తినడం వల్ల జీర్ణక్రియ సులభతరం అవుతుంది.  క్రమం తప్పకుండా శారీరక శ్రమ, వ్యాయామం.. గంటల తరబడి జిమ్ లో కష్టపడాల్సిన అవసరం లేదు. రోజువారీ జీవితంలో కనీసం 30 నుండి 45 నిమిషాల పాటు వేగంగా నడవడం, యోగా చేయడం, ఈత కొట్టడం లేదా సైక్లింగ్ చేయడం వంటివి సరిపోతాయి. క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం వల్ల గుండె ఆరోగ్యం మెరుగవుతుంది, రక్త ప్రసరణ సరిగ్గా జరుగుతుంది, ఎముకలు , కండరాలు బలంగా మారతాయి. వ్యాయామం వల్ల శరీరంలో ఎండోర్ఫిన్లు అనే హార్మోన్లు విడుదలవుతాయి, ఇవి మన మానసిక ఒత్తిడిని తగ్గించి రోజంతా ఉత్సాహంగా ఉండేలా చేస్తాయి. నిద్ర.. మంచి నిద్ర చాలా ముఖ్యమైన అలవాటు. నేటి డిజిటల్ యుగంలో చాలామంది ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య సరిగ్గా నిద్రపోకపోవడం. రాత్రి వేళల్లో కనీసం 7 నుండి 8 గంటల ప్రశాంతమైన నిద్ర శరీరానికి చాలా అవసరం. నిద్రపోయే సమయంలోనే మన శరీరం తనను తాను రీఛార్జ్ చేసుకుంటుంది, కణాల మరమ్మత్తు జరుగుతుంది. రాత్రి పడుకోవడానికి ఒక గంట ముందు ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు పక్కన పెట్టడం మంచిది. సరిపడా నిద్ర లేకపోతే ఉబకాయం, మధుమేహం, గుండె జబ్బులు , మానసిక ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది. మానసిక ఆరోగ్యం..  శరీరం ఎంత ఆరోగ్యంగా ఉన్నా, మనస్సు ప్రశాంతంగా లేకపోతే పూర్తి ఆరోగ్యం లభించదు. ప్రతిరోజూ ఉదయం లేదా సాయంత్రం 10 నుండి 15 నిమిషాల పాటు ధ్యానం చేయడం వల్ల మనస్సు ప్రశాంతంగా మారుతుంది. ఒత్తిడిని తగ్గించుకోవడానికి నచ్చిన పనులు చేయడం, సంగీతం వినడం, పుస్తకాలు చదవడం లేదా ప్రకృతితో సమయం గడపడం వంటివి చేయాలి. ప్రతికూల ఆలోచనలకు దూరంగా ఉంటూ, సానుకూల ధోరణిని పెంపొందించుకోవడం వల్ల జీవన నాణ్యత పెరుగుతుంది. చివరగా.. ధూమపానం, మధ్యపానం వంటి చెడు అలవాట్లకు దూరంగా ఉండటం చాలా ముఖ్యం. ఇవి శరీరంలోని అవయవాలను లోపలి నుండి బలహీనపరుస్తాయి. అలాగే ఏటా లేదా ఆరు నెలలకోసారి సాధారణ ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడం వల్ల వ్యాధులను ప్రారంభంలోనే గుర్తించి తగిన జాగ్రత్తలు తీసుకోవచ్చు. ఈ ఆరోగ్యకరమైన అలవాట్లను ఒకే రోజులో సాధించడం సాధ్యం కాకపోవచ్చు. కానీ ప్రతిరోజూ ఒక్కో చిన్న మార్పు చేసుకుంటూ పోతే, కొద్ది రోజుల్లోనే ఇవి మన జీవనశైలిలో భాగమైపోతాయి. ఆరోగ్యకరమైన జీవితం అనేది ఒక రోజులో వచ్చేది కాదు, అది మనం ప్రతిరోజూ చేసుకునే ఎంపికలపై ఆధారపడి ఉంటుంది.                        *రూపశ్రీ.  
పిల్లలకు అంజీర్ ఇస్తున్నారా.. ఈ విషయాలు తప్పక తెలుసుకోండి! అంజీర్ పండు (Fig Fruit) ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలను అందించే పండు. తాజా అంజీర్ అయినా, ఎండిన అంజీర్ అయినా సరైన పద్ధతిలో తీసుకుంటే శరీరానికి అవసరమైన పోషకాలు అందుతాయి. రక్త ఆరోగ్యం, రోగనిరోధక శక్తి, జీర్ణవ్యవస్థతో పాటు పిల్లల ఎదుగుదలకు కూడా అంజీర్ ఉపయోగకరంగా ఉంటుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. అయితే Fresh Figs, Dried Figsలో ఏది మంచిది? అంజీర్‌ను ప్రతిరోజూ ఎలా తినాలి? ఎండిన అంజీర్‌ను నేరుగా తినవచ్చా? డ్రై రోస్ట్ చేస్తే ఏమవుతుంది? వంటి విషయాలు చాలామందికి తెలియవు. ఈ వీడియోలో సీనియర్ ఆయుర్వేద వైద్య నిపుణురాలు డాక్టర్ శిరీష అంజీర్ పండును తీసుకునే సరైన విధానం, తాజా అంజీర్ మరియు ఎండిన అంజీర్ మధ్య తేడాలు, ఆరోగ్యానికి కలిగే ప్రయోజనాలు, పిల్లల ఎదుగుదలలో దాని ప్రాధాన్యత వంటి విషయాలను సులభంగా వివరిస్తున్నారు. అంజీర్‌ను ఆహారంలో ఎలా చేర్చుకోవాలి? ఎవరు ఎలా తీసుకోవాలి? ఎందుకు డ్రై రోస్ట్ చేయకూడదు? అనే ఆసక్తికరమైన విషయాలను తెలుసుకోవడానికి పూర్తి వీడియోను చూడండి. గమనిక: ఈ సమాచారం సాధారణ అవగాహన కోసం మాత్రమే. వ్యక్తిగత ఆరోగ్య పరిస్థితులకు అనుగుణంగా ఆహారం తీసుకునే ముందు వైద్య నిపుణుల సలహా తీసుకోవడం మంచిది. మీ ఆరోగ్య సమస్య ఏదైనా... మా హెల్త్ యూట్యూబ్ ఛానల్‌లో సీనియర్ డాక్టర్స్ చెప్పిన సలహాలు... సూచనలు ఉన్నాయి. మా యూట్యూబ్ ఛానల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 👉 TeluguOne Health (సబ్‌స్క్రైబ్ చేయడం మర్చిపోకండి!)
భారతీయ సాంప్రదాయ వైద్య విధానమైన ఆయుర్వేదంలో పిప్పళ్లకు ఎంతో విశిష్టమైన స్థానం ఉంది. నల్లగా, చిన్న పొడుగు ఆకారంలో ఉండే ఈ పిప్పళ్లు కేవలం వంటగదిలోని దినుసు మాత్రమే కాదు, అద్భుతమైన ఔషధ గుణాలు ఉన్న దివ్యౌషధం. శతాబ్దాల నుంచి మన పెద్దలు, ఆయుర్వేద నిపుణులు రకరకాల ఆరోగ్య సమస్యల నివారణకు పిప్పళ్లను ప్రధానంగా ఉపయోగిస్తూ వస్తున్నారు. దీని గురించి మరింత వివరంగా తెలుసుకుంటే.. పిప్పళ్లు చేసే మేలు.. పిప్పళ్లలో ఉండే కెమికల్ కాంపౌండ్ పైపరీన్ శరీరంలో జీవక్రియలను వేగవంతం చేయడంలో ప్రధాన పాత్ర పోషిస్తుంది. ఊపిరితిత్తుల ఆరోగ్యానికి పిప్పళ్లు చేసే మేలు అపారం. జలుబు, దగ్గు, ఉబ్బసం, గొంతు నొప్పి, ఆస్తమా వంటి శ్వాసకోశ సంబంధిత సమస్యలతో బాధపడేవారికి పిప్పళ్లు తక్షణ ఉపశమనాన్ని అందిస్తాయి. పిప్పళ్ల పొడిని తేనెతో కలిపి తీసుకోవడం వల్ల ఊపిరితిత్తుల్లో పేరుకుపోయిన కఫం సులభంగా బయటకు వచ్చేస్తుంది. పిప్పళ్ల గురించి ఆయుర్వేదం ఏం చెబుతుంది? ఆయుర్వేదంలో పిప్పళ్లను రసాయన మూలికగా వర్గీకరించారు. అంటే ఇవి శరీరానికి పునరుజ్జీవనాన్ని అందిస్తాయి. ఆయుర్వేదంలో దీనిని త్రిదోషాలలో ప్రధానమైన కఫ, వాత దోషాలను సమతుల్యం చేయడానికి ఉపయోగిస్తారు. శరీరంలో జఠరాగ్నిని అంటే జీర్ణశక్తిని రగిల్చే గుణం పిప్పళ్లకు ఉంది. తిన్న ఆహారం సరిగ్గా అరగకపోయే సమస్యను, ఆకలి మందగించడాన్ని ఇది నివారిస్తుంది. శరీరంలో పేరుకుపోయిన టాక్సిన్స్ లేదా విష పదార్థాలను బయటకు పంపడంలో ఆయుర్వేద వైద్యంలో పిప్పళ్లను క్రియాశీలకంగా ఉపయోగిస్తారు. పిప్పళ్ల వల్ల కలిగే మరికొన్ని ముఖ్యమైన ఆరోగ్య ప్రయోజనాలు తెలుసుకుంటే.. జీర్ణ వ్యవస్థ మెరుగుపడటం..  గ్యాస్, కడుపు ఉబ్బరం, అజీర్తి వంటి సమస్యలను పిప్పళ్లు త్వరితగతిన నివారిస్తాయి. జీర్ణరసాల ఉత్పత్తిని పెంచి ఆహారం వేగంగా అరిగేలా చేస్తాయి. రోగనిరోధక శక్తి పెరుగుదల..  యాంటీఆక్సిడెంట్లు, యాంటీమైక్రోబియల్ గుణాలు సమృద్ధిగా ఉండటం వల్ల ఇవి శరీరంలో రోగనిరోధక శక్తిని పెంపొందిస్తాయి. తరచూ వచ్చే ఇన్ఫెక్షన్ల నుంచి రక్షణ కల్పిస్తాయి. బరువు నియంత్రణ..  శరీరంలో జీవక్రియల వేగాన్ని పెంచి, చెడు కొవ్వును కరిగించడంలో పిప్పళ్లు ఎంతో సహాయపడతాయి. బరువు తగ్గాలనుకునే వారికి ఇది మంచి సహజ నివారణి. నొప్పులు , వాపుల నివారణ..  పిప్పళ్లలో ఉండే యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు కీళ్ల నొప్పులు, వాతపు నొప్పుల నుంచి ఉపశమనం కలిగిస్తాయి. కాలేయ ఆరోగ్యం.. కాలేయంలోని వ్యర్థాలను తొలగించి, కాలేయం సరిగ్గా పనిచేయడానికి పిప్పళ్లు తోడ్పడతాయి. పిప్పళ్లను నిత్య జీవితంలో తగిన మోతాదులో వాడటం వల్ల అనేక దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యల నుంచి విముక్తి పొందవచ్చు. అయితే ఇవి శరీరంలో వేడిని పెంచే గుణం కలిగి ఉంటాయి కాబట్టి, పిత్త ప్రకృతి ఉన్నవారు లేదా గర్భిణులు ఆయుర్వేద వైద్యుల సలహా మేరకు మాత్రమే వీటిని తీసుకోవడం మంచిది.                        *రూపశ్రీ.