LATEST NEWS
  సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్ అస్వ‌స్థ‌త‌కు గుర‌య్యారు. తీవ్ర ఇన్ఫ్‌క్షన్ కారణంగా ఢిల్లీలోని ఓ ఆస్ప‌త్రిలో చేరినట్లు అధికారిక వర్గలు వెల్లడించాయి. ప్రస్తుతం ఆయన చికిత్సకు స్పందిస్తున్నట్లు తెలిపారు.  శ‌నివారం ఆయ‌న హైద‌రాబాద్‌లో ప‌ర్య‌టించిన విష‌యం తెలిసిందే. నాల్స‌ర్ న్యాయ విద్యాల‌యంలో జ‌రిగిన స్నాత‌కోత్స‌వంలో ఆయ‌న పాల్గొన్నారు. ఒక‌టి లేదా రెండు రోజుల్లో ఆయ‌న కోలుకునే అవ‌కాశం ఉన్న‌ట్లు అధికారి తెలిపారు. జూలై 12వ తేదీన సీజేఐ హైద‌రాబాద్ వ‌చ్చారు. హైద‌రాబాద్ టూర్ స‌మ‌యంలో ఆయ‌న స్పెష‌ల్ పోస్ట‌ల్ క‌వ‌ర్‌ను కూడా రిలీజ్ చేశారు.
  సాగర్ పిక్చర్స్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌లో ఆకాశ్ సాగర్ చోప్రా నిర్మాణ సారథ్యంలో  శ్రీమద్ భాగవత్ం పేరుతో ఓ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. రామోజీ ఫిలిం సిటీలో ఏర్పాటు చేసిన సినిమా ప్రారంభోత్సవ కార్యక్రమానికి తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఈ సందర్బంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. రామోజీ ఫిల్మ్ సిటీలో శ్రీమద్ భాగవతం చిత్రీకరణ జరగడం రాష్ట్రానికే గర్వకారణం అన్నారు. రామోజీ ఫిల్మ్ సిటీ.. దేశంలోనే యూనిక్ స్టూడియో అని చెప్పారు. రామాయణం, మహా భారతం, భాగవతం మన జీవితాల్లో భాగం అయిపోయాయని అన్నారు.  ఇలాంటి గొప్ప కథను మరోసారి ప్రజలను అందించాలనే నిర్ణయం తీసుకున్న నిర్మాతలను అభినందించారు. తరం మారుతున్న సందర్భంగా దృశ్యకావ్యం తీయడం గొప్ప విషయం అని ప్రశంసించారు.  40 ఏళ్ల క్రితం టీవీల్లో రామాయణం సీరియల్ వస్తుందంటే.. బయట రోడ్లన్నీ నిర్మానుష్యంగా ఉండేవని గుర్తుచేశారు. ఒక్కరు లేకుండా అందరూ టెలివిజన్‌ల ముందు ఉండేదని అన్నారు. అంతేకాదు.. రామోజీ ఫిల్మ్ సిటీ అనే ఒక గొప్ప స్టూడియో తెలంగాణలో ఉందని చెప్పేందుకు గర్వపడుతున్నానని కొనియాడారు. కాగా, శ్రీమద్ భాగవతం సినిమాన్ని ఆకాష్ సాగర్, సాగర్​పిక్చర్​ఎంటర్​టైన్​మెంట్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు.  
  కడప ఆర్డీవో కార్యాలయం ఎదుట ఉద్రిక్తత చోటు చేసుకుంది. పోలీసులు ఆందోళన కారుల మధ్య నెలకొన్న పెనుగులాట, అరెస్ట్ లు ఉద్రిక్తత వాతావరణానికి దారితీశాయి . దళితులు తమ భూములను ఇతరులు కబ్జా చేశారని గత నెల రోజులుగా ఆర్డీవో  కార్యాలయం ఎదుట దీక్షలు చేస్తున్నారు. వీరికి రాయలసీమ కమ్యూనిస్టు పార్టీ మద్దతు ఇచ్చింది. ఎందుకూ  సమస్య పరిష్కారం కాకపోవడం, అధికారులు స్పందించక పోవడం తో రాయలసీమ కమ్యూనిస్టు పార్టీ నాయకులు  ఆర్డీఓ కార్యాలయం ముట్టడించారు. దీంతో  పోలీసులు ముట్టడిని బలవంతంగా బగ్నం చేసి రాయలసీమ కమ్యూనిస్టు పార్టీ నాయకులతో పాటు ఆందోళనకాలను బలవంతంగా లాక్కెళ్లి అరెస్ట్ చేశారు. ఈ పరిస్థితి అక్కడ ఉద్రిక్తత వాతావరణాన్ని కల్పించింది. పోలీసులు అరెస్టులతో ఆగకుండా నెల రోజులుగా  ఆందోళన చేపట్టిన దీక్ష శిబిరాన్ని కూల్చేశారు. దీంతో  రాయలసీమ కమ్యూనిస్టు పార్టీ నాయకులు, బాధిత దళితులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. కబ్జా కోరనుండి మా‌భూములకు విముక్తి కల్పించకపోగా తమను అరెస్ట్ చేయడం,చేయడం దీక్షా శిబిరం కూల్చివేయడం కారణమంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. *అరెస్టులతో ఆపలేరు: రవిశంకర్ రెడ్డి దళితులు చేస్తున్న న్యాయమైన సమస్యలను పరిష్కరించాలని, గత 29 రోజులుగా రిలే నిరాహార దీక్షలు చేస్తూఉంటే అధికారులు స్పందించకపోవడం , పోలీసులతో ఉద్యమాలను అణిచివేయాలని, టెంట్ ను తొలగించి దళితులను భయబ్రాంతులకు గిరిచేయడం  తగదని, రాయలసీమ కమ్యూనిస్టు పార్టీ రాష్ట్ర కార్యదర్శి రవిశంకర్ రెడ్డి మండి పడ్డారు.అరెస్ లో పై ఆయన  మాట్లాడుతూ, పేదలైన దళితుల సమస్యలను పరిష్కరించాలని అడిగితే పోలీసులను పెట్టి అరెస్టు చేయడం సరైన పద్దతి కాదన్నారు. సమస్యలను పరిష్కరించాల్సిన అధికారులు ప్రభుత్వాలు వాటిని ఏమాత్రం పట్టించుకోకుండా న్యాయం అడుగుతున్న  దళితులపై పోలీసుల ఉక్కు పాదాలను మోపడం ఏమిటని అయన ప్రశ్నించారు, సమస్యలను అధికారులు  పరిష్కరించకుండా ఉద్యమాలను అరెస్టులతో ఆపుతామనుకోవడం అవివేకమని అన్నారు.  దళితుల ఆందోళనలను అణచివేయటానికి పెద్ద సంఖ్యలో పోలీసులను మోహరింపచేసి గంటల తరబడి అరెస్టుకు ప్రణాళికలు చేసేబదులు పదినిమిషాలలో అధికారులు కూర్చుని సమస్యను పరిష్కరించవచ్చునని ఆయన అన్నారు. పాత కడప దళితుల భూమి సమస్యను పరిష్కరించకుండా కాలయాపన చేస్తే ఉద్యమాలను మరింత ఉధృతం చేస్తామని ఆయన హెచ్చరించారు. అరెస్ట్ అయిన వారు ఏఐసీసీ కోఆర్డినేటర్ ఎస్ ఎ సత్తార్, దళిత గిరిజన హక్కుల పోరాట సంఘం జిల్లా గౌరవ అధ్యక్షులు మడగలం ప్రసాద్, వెంకటేష్, రాయలసీమ మహిళా సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు లక్ష్మీదేవి, తస్లిమ్  రమేష్ బాబు, దివాకర్, గోపాల్, వీరయ్య, బాబు చిన్న సుబ్బయ్య, కార్యక్రమంలో సిపిఐ ఎంఎల్ లిబరేషన్ జిల్లా కార్యదర్శి ఓబయ్య, ఓబులేసు, సిపిఐ యం యల్ న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి బ్ల్యూ రాము, ఎమ్మార్పీఎస్ నాయకులు బీసీ గంగులు, ఆంజనేయులు, సుబ్బయ్య, తదితరులు పాల్గొన్నారు.  
  తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజు గోవా గవర్నర్ గా నియమితులవడం పట్ల ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు. గోవా గవర్నర్ గా నియమితులైన పి.అశోక్ గజపతిరాజుకు హృదయపూర్వక శుభాభినందనలు. ఏపీ ప్రజలకు ఇది గర్వకారణం. అశోక్ గజపతిరాజుకు ఇంతటి గౌరవనీయ పదవిని ఇచ్చిన సందర్భంగా భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారికి, ప్రధాని నరేంద్ర మోదీకి  కేంద్ర మంత్రి వర్గంకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఈ విశిష్ట పదవిలో అశోక్ గజపతిరాజు  విజయవంతం అవ్వాలని, పదవీకాలాన్ని పరిపూర్ణంగా నిర్వర్తిస్తారని ఆకాంక్షిస్తున్నాను" అంటూ   సీఎం చంద్రబాబు ట్వీట్ చేశారు.  హరియాణా గవర్నర్‌గా ప్రొఫెసర్‌ ఆషిమ్‌కుమార్‌ ఘోష్‌, లద్దాఖ్‌ లెఫ్టినెంట్ గవర్నర్‌గా కవీందర్‌ గుప్తాను నియమించారు. ఈ మేరకు రాష్ట్రపతి ఉత్తర్వులు జారీ చేశారు. ఇప్పటి వరకు హరియాణా గవర్నర్‌గా పనిచేసిన బండారు దత్తాత్రేయ పదవీకాలం ముగిసింది. అశోక్ గజపతిరాజు 1951 జూన్ 26న జన్మించారు. గ్వాలియర్‌లోని సింధియా, హైదరాబాద్‌ పబ్లిక్ స్కూల్‌, విశాఖలోని ప్రభుత్వ కృష్ణా కళాశాలలో ఆయన చదువుకున్నారు. పుట్టింది రాజవంశంలోనే అయినా సామ్యవాద భావాలను ఆయన చిన్నప్పటి నుంచే పుణికి పుచ్చుకున్నారు. విద్యార్థి దశలో కూడా ఎన్నో ఉద్యమాల్లో పాల్గొన్నారు.  ప్రత్యేకాంధ్ర ఉద్యమంలో ఆయన ప్రముఖ పాత్ర పోషించారు. ఎమర్జెన్సీ సమయంలో ప్రభుత్వ దమనకాండను నిరసిస్తూ ఆయన ప్రత్యక్ష రాజకీయ అరంగేట్రానికి తెరతీశారు. తెలుగు రాష్ట్రాల నుంచి ఇప్పటివరకూ మొత్తం 20 మంది వివిధ రాష్ట్రాలకు గవర్నర్లుగా పనిచేశారు. అలాగే ఒడిశా, తమళినాడులోని తెలుగు కుటుంబాల్లో జన్మించిన ఇద్దరితోపాటు తెలుగింటి కోడలుగా వచ్చి ఒకరు కూడా గవర్నర్లుగా పనిచేశారు. అంతేకాకుండా వీరిలో పలువురు ఏకకాలంలో వివిధ రాష్ట్రాల్లో గవర్నర్లుగా ఉన్నారు  
తిరుపతి రైల్వేస్టేషన్ లో  ఆగి ఉన్న రైలు బోగీలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో తీవ్ర రైల్వే స్టేషన్ లో ఉన్న ప్రయాణీకులు, సిబ్బంది తీవ్ర భయాందోళనలకు గురయ్యారు.  తిరుపతి హిసార్ ఎక్స్ ప్రెస్ లో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో రైలు బోగి పూర్తిగా కాలిపోయింది. అప్రమత్తమైన ఫైర్ అధికారులు మంటలు వచ్చిన బోగీని  రైలు నుంచి వేరు చేయడంతో పెద్ద ప్రమాదం  తప్పింది. రైల్వే స్టేషన్ నుంచి గ్యారేజీని తీసుకెళ్తుండగా ప్రమాదం  జరిగినట్లు రైల్వే అధికారులు తెలిపారు. రైలు బోగీని వేరు చేయడంతో పెను ప్రమాదం తప్పిందని తెలిపారు. అదే విధంగా తిరుపతి రైల్వే స్టేషన్ లోని లూప్ లైన్ లో ఆగి ఉన్న ప్యాసింజర్ రైలులోని బోగీలో కూడా మంటలు చెలరేగాయి. ఆ సమయంలో రైలులో ప్రయాణీకులు ఎవరూ లేకపోవడంతో ఎటువంటి ప్రాణ నష్టం సంభఢవించలేదు. రైల్వేసిబ్బంది, ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేశారు. దాదాపు ఒకే సమయంలో రెండు రైళ్లలోని బోగీలలో మంటలు చెలరేగడంతో పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఇక బోగీలలో మంటలు చెలరేగడానికి కారణాలు ఏంటి అన్నదానిపై శాఖాపరమైన విచారణ జరుగుతోంది. 
ALSO ON TELUGUONE N E W S
Hari Hara Veera Mallu, the highly awaited and most anticipated film of Pawan Kalyan is finally, releasing on 24th July 2025, after being 4 years in prodcution. Now, the makers have announced that the movie's censor is completed and they have secured U/A. The runtime is locked at 2 hrs and 42 minutes.  Directed by Jyothi Krisna and Krish Jagarlamudi Hari Hara Veera Mallu is set in the 17th-century Mughal Empire and follows the journey of the legendary outlaw Veera Mallu, portrayed by Pawan Kalyan, as he rises against tyranny to spark a revolution for justice and dharma. The film boasts a stellar ensemble cast, including Bobby Deol as the antagonist, Nidhhi Agerwal, Nargis Fakhri, Nora Fatehi with a powerful score by Oscar-winning composer M.M. Keeravani. The movie censor report suggests that even though Pawan Kalyan for the first time did a period drama, the actor performed with all his vigor, passion and utmost sincerity. The stunts and action seqeunces will amaze everyone, as the actor showcased great ease in his body langugae transforming into the character.  Also, the reports suggest that the movie has a very simple plot and VFX work could have been better. But Pawan Kalyan carries the film on his shoulders from start till end. More than comedy scenes, romantic portions have worked out well but being an action centric film, reports suggest that makers concentrated on spectacle.  The makers have announced grand pre-release event for the film on 20th July at Vizag and they promise it would be one of the best cinematic experiences for Telugu audiences from Pawan Kalyan. A Dayakar Rao is producing the film with AM Rathnam presenting it.  Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them. 
  మన భారత రాజ్యాంగ రూపశిల్పి బాబా సాహెబ్ అంబేద్కర్ సిద్ధాంతాల స్పూర్తితో రూపొందిన చిత్రం "అగ్రహారంలో అంబేద్కర్". పద్మశ్రీ మందా కృష్ణ మాదిగ ఈ చిత్రం టైటిల్ సాంగ్ రిలీజ్ చేశారు. కృష్ణచైతన్య ఎన్నో కష్టాలు పడి తెరకెక్కించిన ఈ చిత్రం అసాధారణ విజయం సాధించాలని ఆయన ఆకాంక్షించారు. అంబేద్కర్ అభిమానులైన ప్రతి ఒక్కరూ "అగ్రహారంలో అంబేద్కర్" చిత్రం చూసి తీరాలని పిలుపునిచ్చారు.   ఇప్పటికే పలు ప్రతిష్టాత్మక అంతర్జాతీయ చలనచిత్రోత్సవాలలో పురస్కారాలు అందుకున్న ఈ చిత్రాన్ని రామోజీ - లక్షమోజి ఫిల్మ్స్ పతాకంపై మంతా కృష్ణచైతన్య స్వీయ దర్శకత్వంలో నిర్మించారు. హీరో కూడా ఆయనే కావడం విశేషం. ఆయన మాట్లాడుతూ..."అంబేద్కర్ భావజాలాన్ని విశ్వవ్యాప్తం చేయడమే లక్ష్యంగా తెరకెక్కిన ఈ చిత్రం టైటిల్ సాంగ్ రిలీజ్ చేసిన మందా కృష్ణగారికి బిగ్ బిగ్ థాంక్స్. ఈ చిత్రాన్ని సినిటేరియా మీడియా వర్క్స్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం, కుల మత ప్రాంత వర్గ వైషమ్యాలకు అతీతంగా సమ సమాజ స్థాపన కోసం కృషి చేసిన అంబేద్కర్ కు గొప్ప నివాళిగగా.. ఎన్నో వ్యయప్రయాసలకు లోనై తెరకెక్కించిన ఈ చిత్రాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తారని ఆశిస్తున్నాం" అన్నారు.    
  జూలై 24న 'హరి హర వీరమల్లు' చిత్రంతో ప్రేక్షకులను పలకరించనున్నారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. తాజాగా ఈ చిత్రం సెన్సార్ పూర్తి చేసుకుంది. సెన్సార్ సభ్యులు వీరమల్లు సినిమాకి యూ/ఏ సర్టిఫికెట్ ఇచ్చారు. ఈ చిత్రాన్ని సెన్సార్ సభ్యులు ప్రశంసించినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా స్క్రీన్ ప్లే, విజువల్స్ బాగున్నాయని మెచ్చుకున్నట్లు సమాచారం. ఈ చిత్ర నిడివి 2 గంటల 42 నిమిషాలు. సెన్సార్ నుంచి పాజిటివ్ టాక్ రావడం, క్రిస్పీ ర‌న్ టైమ్ కావడంతో.. వీరమల్లు చిత్రం బాక్సాఫీస్ దగ్గర మ్యాజిక్ చేయడం ఖాయమని అభిమానులు నమ్మకంగా ఉన్నారు.   విడుదలకు పది రోజులే ఉండటంతో మూవీ టీమ్ ప్రమోషన్స్ లో స్పీడ్ పెంచింది. జూలై 20న వైజాగ్ లో భారీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించడానికి సన్నాహాలు చేస్తోంది. నిజానికి తిరుపతి లేదా విజయవాడలో ఈవెంట్ ఉంటుందని మొదట వార్తలొచ్చాయి. ఆ రెండు కాకుండా.. అనూహ్యంగా వైజాగ్ వేదిక కానుంది.   'హరి హర వీరమల్లు' చిత్రాన్ని ఎ.ఎం. రత్నం సమర్పణలో మెగా సూర్య ప్రొడక్షన్ పతాకంపై ఎ. దయాకర్ రావు నిర్మించారు. క్రిష్ జాగర్లమూడి, జ్యోతి కృష్ణ దర్శకులు. ఎం.ఎం. కీరవాణి సంగీతం అందించారు.     
పవర్‌స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌, హరీష్‌ శంకర్‌ కాంబినేషన్‌లో రూపొందిన ‘గబ్బర్‌సింగ్‌’ ఎంతటి బ్లాక్‌బస్టర్‌ అయిందో అందరికీ తెలిసిందే. ఆ సినిమాలో పవన్‌కళ్యాణ్‌ పెర్‌ఫార్మెన్స్‌, డైలాగ్స్‌ విపరీతంగా పాపులర్‌ అయ్యాయి. ఈ సినిమాలోని ఐటమ్‌ సాంగ్‌ ‘కెవ్వు కేక..’కి ఎంత క్రేజ్‌ వచ్చిందో చూశాం. మలైకా అరోరాపై చిత్రీకరించిన ఈ పాట యూత్‌ని ఉర్రూతలూగించింది. ఇప్పుడు పవన్‌కళ్యాణ్‌, హరీష్‌ శంకర్‌ కాంబినేషన్‌లో రూపొందుతున్న ‘ఉస్తాద్‌ భగత్‌సింగ్‌’ కూడా ఓ ఐటమ్‌ని పెట్టబోతున్నారు. ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. పవన్‌కళ్యాణ్‌ చేస్తున్న సినిమాల వరసలో ‘హరిహర వీరమల్లు’ తర్వాత ‘ఉస్తాద్‌ భగత్‌సింగ్‌’ చిత్రాన్ని పూర్తి చేసే పనిలో ఉన్నారు.  ఇప్పటికే ‘ఉస్తాద్‌ భగత్‌సింగ్‌’కి సంబంధించిన షూటింగ్‌ కొంత భాగం పూర్తయింది. ఇటీవలే బ్యాలెన్స్‌ వర్క్‌ కూడా పూర్తి చేసేందుకు పవన్‌ ఓకే చెప్పారని తెలుస్తోంది. ఈ సినిమాలో పవన్‌ సరసన శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తోంది. ‘గబ్బర్‌సింగ్‌’ చిత్రం మ్యూజికల్‌గా బ్లాక్‌బస్టర్‌ అయిన విషయం తెలిసిందే. దాన్ని మించే స్థాయిలో ‘ఉస్తాద్‌ భగత్‌సింగ్‌’ చిత్రం మ్యూజిక్‌ ఉండాలన్న ఉద్దేశంతో దేవిశ్రీప్రసాద్‌ స్పెషల్‌ కేర్‌ తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. ‘గబ్బర్‌సింగ్‌’లోని ‘కెవ్వు కేక..’ సాంగ్‌ తరహాలోనే ‘ఉస్తాద్‌ భగత్‌సింగ్‌’లో కూడా ఒక పాటను ప్లాన్‌ చేస్తున్నారట. అయితే ఆ పాట ఎలా ఉండబోతోంది, ఎవరిపైన ఆ పాటను చిత్రీకరిస్తారు అనే విషయాలు తెలియాల్సి ఉంది.  తమిళ్‌లో సూపర్‌హిట్‌ అయిన ‘తెరి’ చిత్రాన్ని తెలుగులో ‘పోలీసోడు’ పేరుతో విడుదల చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు పవన్‌కళ్యాణ్‌, హరీష్‌ శంకర్‌ కాంబినేషన్‌లో రూపొందుతున్న ‘ఉస్తాద్‌ భగత్‌సింగ్‌’ ఆ చిత్రానికి రీమేక్‌ అని ప్రచారం జరిగింది. ఈ విషయాన్ని ఈ సినిమాకి స్క్రీన్‌ప్లే అందిస్తున్న దశరథ్‌ ఓ సందర్భంలో తెలిపారు. అయితే ఆ సినిమా మూలకథను మాత్రమే తీసుకొని పవన్‌కళ్యాణ్‌ ఇమేజ్‌కి తగ్గట్టుగా, తెలుగు నేటివిటీకి అనుగుణంగా కథలో మార్పులు, చేర్పులు చేశారట. ఒకవిధంగా చూస్తే ఇది కొత్త కథగానే భావించాల్సి ఉంటుంది. పవన్‌కళ్యాణ్‌ అభిమానిగా ‘గబ్బర్‌సింగ్‌’ చిత్రాన్ని ఒక రేంజ్‌లో తెరకెక్కించిన హరీశ్‌శంకర్‌.. ‘ఉస్తాద్‌ భగత్‌సింగ్‌’ చిత్రాన్ని మరింత ఎఫెక్టివ్‌గా ప్రేక్షకుల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. అందుకే ఈ సినిమాలో కూడా స్పెషల్‌ సాంగ్‌ కోసం ప్రత్యేక శ్రద్ధ పెడుతున్నట్టు తెలుస్తోంది.  ప్రేక్షకులు, అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న ‘హరిహర వీరమల్లు’ ఎట్టకేలకు జూలై 24న విడుదల కాబోతోంది. అలాగే సుజిత్‌ దర్శకత్వంలో రూపొందుతున్న ‘ఓజి’ చిత్రం కూడా సెప్టెంబర్‌ 25న రిలీజ్‌కి సిద్ధమవుతోంది. అంటే ఈ ఏడాది పవర్‌స్టార్‌ నటించిన రెండు సినిమాలు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. ఇక ‘ఉస్తాద్‌ భగత్‌సింగ్‌’ చిత్రాన్ని వచ్చే ఏడాది రిలీజ్‌ అయ్యేలా ప్లాన్‌ చేసుకుంటున్నారు. మరి ఈ మూడు సినిమాలతో పవన్‌కళ్యాణ్‌ ఎలాంటి సంచలనాలు సృష్టిస్తారో చూడాలి. 
Actor Vishal, one of the leading stars of south cinema, recently scored a massive blockbuster hit with the film Madha Gaja Raja, which was well-received by audiences and critics alike. Following the success of that film, Vishal is now set to star in his 35th movie, which is being produced by veteran producer Mr. RB Choudhary under the prestigious banner Super Good Films. Mr. RB Choudhary started Super Good Films in 1990 with the film Pudhu Vasantham. Since then, the banner has delivered numerous successful films and has played a significant role in introducing many new directors to Tamil and Telugu cinema. This upcoming project marks the 99th film under the Super Good Films banner.   This new movie will be directed by Ravi Arasu, with acclaimed cinematographer Richard M. Nathan handling the camera. This marks the first collaboration between actor Vishal and director Ravi Arasu. Notably, after the grand success of Madha Gaja Raja, Vishal is once again teaming up with cinematographer Richard M. Nathan. Editing will be handled by NB Srikanth, with Durairaj serving as the art director. Following the success of Mark Antony, music composer G.V. Prakash Kumar is once again collaborating with Vishal for this film. Actress Dushara Vijayan will play the female lead opposite Vishal. The casting for other supporting roles is currently underway. The film’s grand pooja ceremony was held this morning in Chennai with much fanfare. Eminent personalities from the industry like Director Vetrimaaran, Saravana Subbaiah (Citizen), Manimaran (NH4), Venkat Mohan (Ayogya), Saravanan (Engeyum Eppodhum), Actors Karthi & Jiiva, DOP Arthur A Wilson and Distributor Tiruppur Subramaniam graced the occasion and conveyed their heartfelt wishes for a huge success. Filming will begin in Chennai and is scheduled to be completed in a single stretch over 45 days. This new project has generated high expectations among fans and cinema lovers, thanks to the promising team and powerful collaborations behind it.
Arya and Pa. Ranjith have delivered a huge cult blockbuster with their boxing drama Sarpetta Parambarai. While the reports suggested that they have joined to produce a sequel to this revered film, they titled it as Vettuvan. Now, a freak accident on their sets stunned entire Tamil Cinema.  Stunt Artist SM Raju has tragically died during a car flipping stunt on the sets. Vishal, President of Nadigar Sangam, has confirmed this update and he came forward to take care of Raju's family. Several videos fromt the sets have been circling on the internet, showing the accident.  The videos show Raju driving a car at high speed before it topples and crumbles violently, drawing gasps from the crew. Team members can be seen rushing to the wreckage, pulling Raju out of the mangled vehicle, only to discover he had succumbed to his injuries. The atmosphere on set turned grim within seconds, as what was meant to be a controlled stunt ended in heartbreak. Well, such an accident happened on the sets of Indian 2 before, leading to halting the shoot and production of the film. Currently, Vettuvan makers have reached out stuntmen union to extend their support to SM Raju's family and slowly, continue production of their film.  The Tamil Cinema industry biggies are stunned looking at this freak accident. The stuntmen union heads are asking for maintaining proper safety standards on sets. Few are stating that these sort of freak accidents are rare but it is better to be safe than sorry.  Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them. 
  కొందరు అభిమానం పేరుతో హద్దుమీరి ప్రవర్తిస్తుంటారు. సెలబ్రిటీ ఏ పరిస్థితిలో ఉన్నారన్న విషయాన్ని అర్థం చేసుకోకుండా.. సెల్ఫీల కోసం ఎగబడుతుంటారు. తాజాగా దర్శకధీరుడు రాజమౌళికి అలాంటి అనుభవమే ఎదురైంది.   ఆదివారం ప్రముఖ నటుడు కోట శ్రీనివాసరరావు కన్నుమూసిన విషయం తెలిసిందే. ఎందరో సినీ ప్రముఖులు కోట పార్థివదేహాన్ని సందర్శించి, నివాళులు అర్పించారు. కోట పార్థివదేహానికి నివాళులు అర్పించి.. రాజమౌళి తిరిగి తన కారు దగ్గరకు వెళ్తున్న సమయంలో.. ఒక వ్యక్తి సెల్ఫీ తీసుకునేందుకు పదే పదే ప్రయత్నించాడు. మొదట రాజమౌళి అతని నుంచి తప్పించుకునే ప్రయత్నం చేశాడు. అయినప్పటికీ ఆ వ్యక్తి రాజమౌళికి అడ్డుగా వెళ్ళి సెల్ఫీ తీసుకోవడానికి ట్రై చేశాడు. దీంతో రాజమౌళి అసహనం వ్యక్తం చేశాడు. ఎక్కడికొచ్చి ఏం చేస్తున్నావ్? అంటూ ఫైర్ అయ్యాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.   ఈ వీడియో చూసిన నెటిజెన్లు ఆ వ్యక్తి తీరుని తప్పుబడుతున్నారు. అభిమానానికి కూడా లిమిట్ ఉంటుందని, అలాంటి విషాద ఘటన చోటు చేసుకున్న సమయంలో సెల్ఫీ కోసం ఎగబడటం కరెక్ట్ కాదని అంటున్నారు.  
B. Saroja Devi passed away at her residence, today in Bengaluru. She was 87 years old and worked in Tamil, Telugu, Kannada languages. She was revered as hit pair with MG Ramachandran in Tamil. With NTR, she appeared in classics like Jagadeeka Veeruni Katha, Bhookailas, Dagudu Muthalu, Daana Veera Sura Karna.  She appeared with ANR in Atmabalam, Sri Krisharjuna Yuddham and several others. Her Anbe Vaa with MGR became a cult classic in romances. She appeared in lead roles in 161 films for 29 years between 1955-1984 and this is a rare record for any actress in South Indian Cinema. Her beauty captivated many audiences in many films.  Saroja Devi has been revered as glamorous beauty in South Indian Cinema due to her stunning looks and boldness for those times in wearing western dresses. While she never really take over Telugu Cinema as Savitri, Jamuna were preferred, she got many memorable roles that stay with audiences.  Chitapata Chinukulu song from Atmabalam became her most popular classic and in a way, it became first Telugu rain song which made it a norm in later films. She got Padma Shri in 1969 and Padma Bhushan in 1992 from Indian Government. Even though she hailed from Karnataka, she dubbed for her in all languages she acted in, showcasing her dedication to sound authentic.  Saroja Devi will be missed, not just by her family but Indian Cinema, as she changed the perception of heroines being either glam dolls or heavy melodrama queens to being sweet, cute, bold, clever, glamorous, talented and independent.  Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them. 
  ప్రముఖ నటి, పద్మభూషణ్ అవార్డు గ్రహీత బి. సరోజాదేవి (87) కన్నుమూశారు. బెంగళూరులోని తన నివాసంలో ఆమె తుదిశ్వాస విడిచారు. సరోజాదేవి మృతి పట్ల సినీ ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు.  (B Saroja Devi)   "దక్షిణ భారత సినీ పరిశ్రమలో ఒకనాడు ధ్రువతారగా వెలుగొందిన ప్రముఖ నటీమణి "పద్మభూషణ్" బి. సరోజాదేవి గారు పరమపదించారన్న వార్త అత్యంత బాధాకరం. అప్పట్లో తెలుగులో NTR గారితో, తమిళంలో MGR గారితో, కన్నడంలో రాజ్ కుమార్ గారితో ఏకకాలంలో హిట్ పెయిర్ గా వెలుగొందిన ఘనత ఆమెది. మా తండ్రి NTR గారి కాంబినేషన్లో 20 సంవత్సరాల కాలంలో దాదాపు 20 చిత్రాలలో హీరోయిన్ గా నటించారు. ఆయనతో శ్రీరాముడి ప్రక్కన సీతాదేవిగా, రావణాసురుడి ప్రక్కన మండోదరిగానూ నటించిన ప్రత్యేకత ఆమె సొంతం. శ్రీమతి బి. సరోజా దేవి మరణం భారతీయ చిత్ర పరిశ్రమకు, ముఖ్యంగా దక్షిణ భారత చిత్ర పరిశ్రమకు తీవ్ర విచారకరమైన పరిణామం. ఆమె వెండితెరపై మరియు నిజజీవితంలో చేసిన సేవలు రాబోయే తరాల తారలకు, చలనచిత్ర వర్గాల వారికి స్ఫూర్తినిస్తాయి. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తూ.. వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నాను." అని నందమూరి బాలకృష్ణ అన్నారు.   "ప్రముఖ నటి శ్రీమతి బి.సరోజాదేవి గారు కన్నుమూశారని తెలిసి బాధపడ్డాను. వారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను. 1955 నుంచి దాదాపు మూడు దశాబ్దాలపాటు తెలుగు, కన్నడ, తమిళ భాషా చిత్రాల్లో నటించి చిత్ర సీమపై తనదైన ముద్రను వేశారు. భూకైలాస్, పాండురంగ మహత్యం, సీతారామ కళ్యాణం, జగదేకవీరుని కథ, శకుంతల, దానవీర శూర కర్ణ, ఆత్మబలం లాంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులను మెప్పించారు. శ్రీమతి బి.సరోజా దేవి గారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నాను." అని పవన్ కళ్యాణ్ అన్నారు.  
  సినీ పరిశ్రమలో మరో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ నటుడు కోట శ్రీనివాసరావు మరణ వార్త మరువక ముందే.. ప్రముఖ నటి బి. సరోజాదేవి మరణ వార్త వినాల్సి వచ్చింది. (B Saroja Devi)   ప్రముఖ నటి, పద్మభూషణ్ అవార్డు గ్రహీత బి. సరోజాదేవి (87) కున్నుముశారు. బెంగళూరులోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. 1942 లో జన్మించిన ఆమె.. 13 ఏళ్ళ వయసులోనే సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టారు. 1955లో 'మహాకవి కాళిదాస' అనే కన్నడ సినిమాతో పరిచయమైన సరోజాదేవి.. ఇంటికి దీపం ఇల్లాలే, మంచి చెడు, దాగుడు మూతలు, పండంటి కాపురం, దాన వీర శూర కర్ణ వంటి తెలుగు సినిమాల్లో నటించారు. తెలుగు, కన్నడ, తమిళ, హిందీ భాషల్లో నటించిన సరోజాదేవి.. ఎన్టీఆర్, ఏఎన్నార్, ఎంజీఆర్, దిలీప్ కుమార్ వంటి దిగ్గజ నటులతో తెరను పంచుకున్నారు.    100 సినిమాలకు పైగా నటించి మంచి స్థాయిలో ఉండగా సరోజాదేవికి శ్రీహర్ష అనే వ్యాపారవేత్తతో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు కూతుర్లు భువనేశ్వరి, ఇందిరా పరమేశ్వరి, ఒక కొడుకు గౌతం రామచంద్ర. భర్త శ్రీహర్ష మరణించారు.  
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు. వారితో పాటు పెద్ద సంఖ్యలో క్యాడర్ కూడా పార్టీని వీడుతున్నారు. ఇక ఇప్పుడు నామినేటెడ్ పదవులలో ఉన్న వారి వంతు మొదలైనట్లు కనిపిస్తోంది. తనకు కానీ తన భర్తకు  కానీ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు టికెట్ ఇవ్వాలంటూ గత  కొంత కాలంగా కోరుతూ వస్తున్న మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ వంతు వచ్చింది. ఆమె కూడా రాజీనామా అస్త్రం సంధించారు.  జగన్ కు నమ్మిన బంటుగా గుర్తింపు పొందిన మహిళాకమిషన్ చైర్ పర్సన్ వాసి రెడ్డి పద్మ తన పదవికి రాజీనామా చేశారు. ఉరుములేని పిడుగులా, ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా తన రాజీనామా లేఖను సీఎం జగన్ కు పంపేశారు. పేరుకు తాను పార్టీకి కాదు, కేవలం మహిళా కమిషన్ చైర్మన్ పదవికి మాత్రమే రాజీనామా చేశాననీ, ఇక నుంచి వైసీపీ కోసం పని చేస్తాననీ వాసిరెడ్డి పద్మ చెబుతున్నప్పటికీ, ఆమె రాజీనామాకు కారణం అసంతృప్తేనని పార్టీ వర్గాలు బాహాటంగానే చెబుతున్నాయి. చాలా కాలంగా వాసిరెడ్డి పద్మ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు తనకు కానీ తన భక్తకు కానీ పార్టీ టికెట్ ఇవ్వాలని జగన్ ను కోరుతూ వస్తున్నారు. అయితే ఇప్పటి వరకూ జగన్ చూద్దాం.. చేద్దాం అన్నట్లుగా దాట వేస్తూనే వచ్చారు. ఇప్పుడిక వరుసగా అభ్యర్థల జాబితాలను జగన్ ప్రకటించేస్తుండటం, తనకు గానీ తన భర్తకు కానీ పార్టీ టికెట్ విషయంలో ఎటువంటి స్పస్టత ఇవ్వకపోవడంతో ఆమె మనస్తాపం చెంది పదవికి రాజీనామా చేసేశారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.  వాసిరెడ్డి పద్మ రాజకీయ ప్రవేశం ప్రజారాజ్యం పార్టీతో జరిగింది. 2009లో ఆమె ప్రజారాజ్యం పార్టీలో చేరారు. ఇలా చేరడంతోనే ఆమె ప్రజారాజ్యం అధికార ప్రతినిథిగా పదవి దక్కించుకున్నారు. ప్రజారాజ్యం కాంగ్రెస్ పార్టీలో విలీనం కావడంతో ఆమె 2012లో జగన్ పార్టీలో చేరారు. జగన్ కూడా ఆమెకు అధికార ప్రతినిథి పదవి ఇచ్చారు.  2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆమెను రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా నియమించారు. చైర్ పర్సన్ హోదాలో ఆమె జగన్ మెప్పు పొందేందుకు చేయగలిగినంతా చేశారు. ప్రతిపక్ష పార్టీ నేతలకు నోటీసులు ఇచ్చారు. ఏకంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు సైతం నోటీసులు జారీ చేశారు. వార్డు వలంటీర్లపై పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు కమిషన్ ముందు హాజరై వివరణ ఇవ్వాలంటూ ఆమె పవన్ కు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. పవన్ హాజరు కాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు నమోదు చేయాలని ఆదేశించారు. ఇన్ని చేసినా వాసిరెడ్డి పద్మకు ఆమె కోరినట్లుగా పార్టీ టికెట్ లభించకపోవడంతో అలిగి పదవికి రాజీనామా చేశారని, ఇది జగన్ కు షాకేననీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు. ఒకరైతు తనకు చేసిన సేవలకు ప్రీతి చెందిన గురువు అతడికి స్వర్గ ప్రాప్తిని కలగజేయాలని అనుకుంటాడు. కానీ సంసారాసక్తి వల్ల ఆ రైతు ఆ అవకాశాన్ని వాయిదా వేసుకుంటూ వస్తాడు. చివరికి గురుకృప వల్ల ఆ రైతు స్వర్గ ప్రాప్తిని ఎలా పొందాడో ఈ కథ తెలియజేస్తుంది. "ఒక మహాపురుషుడు ప్రయాణం చేస్తూ, డస్సిపోయాడు. గొంతు ఎండిపోయింది. దారిలో ఒక రైతు కనపడితే నీళ్ళు అర్థించాడు. ఆ రైతు మహాత్మునికి సకల ఉపచారాలూ చేశాడు. చిరిగిపోయిన ఆయన ఉత్తరీయాన్ని రైతు జాగ్రత్తగా కుట్టి బాగుచేశాడు. రైతు పరిచర్యలకు సంతసించిన ఆ మహాత్ముడు శాంతి, ఆనందాలకు నిలయమైన స్వర్గానికి తనతోపాటు రమ్మని అంటాడు. అందుకు ఆ రైతు 'గురువుగారూ! మీరు నా మీద చూపిన దయకు కృతజ్ఞుణ్ణి. కానీ నా పిల్లలు ఇంకా చిన్నవాళ్ళు. ఓ ఏడేళ్ళ వ్యవధి ఇవ్వండి' అని అడుగుతాడు. అందుకు గురువు అంగీకరించాడు. సరిగ్గా ఏడేళ్ళ తర్వాత గురువు రైతును స్వర్గానికి తీసుకువెళ్ళడానికి వచ్చాడు. అప్పుడు రైతు 'అయ్యా! కడపటి కొడుకు కష్టాలకు అంతు లేదు. అన్ని జంఝాటాలనూ ఒక్కడే సంబాళించుకోలేకపోతున్నాడు. కాబట్టి మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని గురువుని అడిగాడు. మరో ఏడేళ్ళ తరువాత గురువు వచ్చాడు. కానీ రైతు చనిపోయాడని తెలిసింది. చనిపోయిన ఆ రైతు ఎద్దుగా పుట్టాడని ఆ గురువు తన దివ్య దృష్టితో తెలుసుకున్నాడు. ఎద్దుగా పుట్టిన ఆ రైతు తన కొడుకు పొలాన్నే దున్నుతున్నాడు. అప్పుడు గురువు ఆ ఎద్దుపై మంత్ర జలం చిలకరించగానే ఎద్దు జన్మనెత్తిన రైతు 'నా కొడుకు పరిస్థితి మరి కాస్త మెరుగు పడనీయండి స్వామీ! మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని అన్నాడు. ఇక చేసేది లేక వెనుదిరిగాడు గురువు. మరలా ఏడేళ్ళ తర్వాత వచ్చిన గురువుకు ఎద్దు చనిపోయిందని తెలిసింది. అది కుక్కగా పుట్టి కొడుకు ఇంటినీ, ఆస్తినీ కాపలా కాస్తోందని తన దివ్యదృష్టి ద్వారా తెలుసుకున్నాడు. గురువు. కుక్కగా పుట్టిన ఆ రైతు 'స్వామీ! నేను ఎంత దౌర్భాగ్యుణ్ణి. మీరు ఇంత దయ చూపుతున్నప్పటికీ మీతో స్వర్గమానం చేయలేకున్నాను. వీడికి ఆస్తిని కాపాడుకొనే దక్షత ఇంకా రాలేదు. కాబట్టి దయ చేసి మరో ఏడేళ్ళు వ్యవధి ఇవ్వండి' అని వేడుకున్నాడు. గురువు ఏడేళ్ళ తరువాత మళ్ళీ వచ్చేసరికి కుక్క మరణించింది. అది త్రాచుపాముగా జన్మనెత్తి, ఇప్పుడు కొడుకు భూమిలో ఉన్న లంకెబిందెలకు పడగెత్తి కాపలా కాస్తోంది. గుప్త ధనం ఇక్కడ ఉందని కొడుకుకి ఎలా తెలియజేయాలా అని పాము ఆలోచిస్తున్నప్పుడు గురువు ఆ రైతుకొడుకును పిలుచుకు వచ్చి లంకె బిందెలు ఉన్న చోట తవ్వమన్నాడు. లంకె బిందెలు బయటపడ్డాయి. ఆ పైన ఆ పామును చంపమన్నాడు. అనంతరం శిష్యుణ్ణి తీసుకొని స్వర్గారోహణం చేశాడు గురువు. సంసారంలోని ఈతి బాధల నుండి శిష్యుణ్ణి ఉద్ధరిస్తాడు సద్గురువు. అలాంటి గురువు అందరికీ అవసరం.                                      *నిశ్శబ్ద.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్  రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది.  80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత  ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది.   ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది. ఆమెది నెద‌ర్లాండ్స్‌. ఆమె తండ్రి నెద‌ర్లాండ్స్‌లోని ఆర్నెహెమ్‌లో చిన్న‌పిల్ల‌ల ఆస్ప‌త్రి డైరెక్ట‌ర్. పోయి దొరికిన ఆ పెయింటింగ్ విష‌యానికి వ‌స్తే.. అది 1683లో కాస్ప‌ర్ నెష‌ర్ వేసిన స్టీవెన్ ఓల్ట‌ర్స్ పెయింటింగ్‌. రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో నాజీల ఆదేశాల‌ను చార్లెట్ తండ్రి వ్య‌తిరేకించారు. ఆయ‌న ర‌హ‌స్య జీవ‌నం సాగించేడు. కానీ ఈ పెయింటింగ్‌ని మాత్రం త‌న న‌గ‌రంలోని ఒక బ్యాంక్‌లో భ‌ద్ర‌ ప‌ర‌చ‌మ‌ని ఇచ్చార‌ట‌. 1940లో నాజీలు నెద‌ర్లాండ్ పై దాడులు చేసినపుడు ఆ బ్యాంక్ మీద ప‌డి దోచుకున్నా రు. అప్పుడు ఈ పెయింటింగ్ కూడా తీసుకెళ్లారు. యుద్ధం అయిపోయిన త‌ర్వాత ఈ పెయింటింగ్ ఎక్క‌డున్న‌దీ ఎవ‌రికీ తెలియ‌లేదు. చిత్రంగా 1950ల్లో డ‌స‌ల్‌డార్ష్ ఆర్ట్ గ్యాల‌రీలో అది ప్ర‌త్య‌క్ష‌మ‌యింది. 1969లో ఆమ్‌స్ట‌ర్‌డామ్‌లో దాన్ని వేలానికి తీసికెళ్లే ముందు దాన్ని ఆ ఆర్ట్ గ్యాల‌రీలో వుంద‌ని చూసిన‌వారు చెప్పారు. వేలంపాట త‌ర్వాత మొత్తానికి ఆ పెయింటింగ్‌ను 1971లో ఒక క‌ళాపిపాసి త‌న ద‌గ్గ‌ర పెట్టుకున్నాడు.    ఆ త‌ర్వాత 2021లో అది చార్లెటీని చేరింది.  మొత్తానికి వూహించ‌ని విధంగా ఎంతో కాలం దూర‌మ‌యిన గొప్ప క‌ళాఖండం తిరిగి త‌న వ‌ద్ద‌కు చేర‌డంలో చార్లెటీ ఆనందానికి అంతేలేదు. అంతే క‌దా.. పోయింద‌నుకున్న గొప్ప వ‌స్తువు తిరిగి చేరితే ఆ ఆనంద‌మే వేరు!  అయితే చార్లెటీకి ఇపుడు ఆ పెయిం టింగ్‌ను భ‌ద్రంగా చూసుకునే ఆస‌క్తి వున్న‌ప్ప‌టికీ శ‌క్తి సామ‌ర్ధ్యాలు లేవు. అందుక‌నే త్వ‌ర‌లో ఎవ‌రిక‌యినా అమ్మేసీ వ‌చ్చిన సొమ్మును పిల్ల‌ల‌కు పంచుదామ‌నుకుంటోందిట‌!  చార్లెటీ కుటుంబంలో అయిదుగురు అన్న‌ద‌మ్ములు అక్క‌చెల్లెళ్లు వున్నారు. అలాగే ఇర‌వై మంది పిల్ల‌లు ఉన్నారు. అంద‌రూ ఆమె అంటే ఎంతో ప్రేమ చూపుతున్నారు. అంద‌రం ఒకే కుటుంబం, చాలాకాలం త‌ర్వాత ఇల్లు చేరిన క‌ళాఖండం మా కుటుంబానిది అన్న‌ది చార్లెటీ!
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు. చాకోను పార్టీలోకి ఆహ్వానిస్తూ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్’ ఫ్రంట్ ఏర్పాటు గురించి ప్రత్యేకించి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు కానీ, చాకో అలాంటి  సంకేతాలు ఇచ్చారు. ప్రస్తుతం దేశంలో ఉన్న ఏ ఒక్కపార్టీ కూడా బీజేపీకి ప్రత్యాన్మాయం కాదని,సమీప భవిష్యత్ కాంగ్రెస్ సహా ఏ పార్టీ కూడా ఆ స్థాయికి ఎదిగే అవకాశాలు కూడా కనిపించడంలేదని అన్నారు. ఈ పరిస్థితుల్లో దేశంలోని బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ, ఏకమై, ఒకే గొడుగు కిందకు రావలసిన అవసరం ఉందని చాకో అన్నారు. అదే సమయంలో ప్రతిపక్షాలను ఏక తాటిపైకి తెచ్చే బాధ్యతను పవార్ తీసుకోవాలని సంకేత మాత్రంగా చెప్పారు. అంతే కాకుండా కాంగ్రెస్ పేరు ఎత్తకుండా బీజేపీ వ్యతిరేక శక్తులను ఏకం చేసే ఆలోచన ఆ పార్టీ నాయకత్వానికి లేదని నెహ్రూ గాంధీ ఫ్యామిలీ (సోనియా, రాహుల్, ప్రియాంక)ఆలోచనా ధోరణిని పరోక్షంగానే అయినా ఎండ కట్టారు.ఆ విధంగా పవార్ ఆ బాధ్యత తీసుకోవాలని చాకో సూచించారు. ఇందుకు సంబంధించి, పవార్ బహిరంగంగా ఎలాంటి వ్యాఖ్య చేయలేదు. అయితే, చాకో సహా మరికొందరు ‘సీనియర్’ కాంగ్రెస్ నాయకులు, అలాగే సిపిఎం, సిపిఐ నాయకులు కూడా పవార్’తో చాలా కాలంగా థర్డ్ ఫ్రంట్  విషయంగా చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. అయితే మహారాష్ట్రలో సంకీర్ణం మనుగడను దృష్టిలో ఉంచుకుని పవార్ ఆచితూచి అడుగులేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే చాకో పార్టీలో చేరిన సందర్భంలో కూడా ‘చాకో చేరికతో మహారాష్ట్రలోని మహా వికాస్ అగాడీ ప్రభుత్వానికి ఎలాంటి నష్టం జరగదని, పవార్ మహారాష్ట్ర సంకీర్ణ సర్కార్ ప్రస్తావన చేశారని విశ్లేషకులు పేర్కొంటున్నారు.  మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వ మనుగడ గురించ్బి  పవార్ ప్రత్యేకంగా పేర్కొనడం ద్వారా, ఆయన థర్డ్ ఫ్రంట్ విషయంలో వేచి చూసే ఆలోచనలో ఉన్నట్లు అర్థమవుతోందని కూడా  రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే అదే ఎన్సీపీ అసెంబ్లీ ఎన్నికల జరుగతున్న కేరళలో, పశ్చిమ బెంగాల్లో  కాంగ్రెస్ వ్యతిరేక పార్టీలకు మద్దతు ఇస్తోంది. దీన్ని బట్టి చూస్తే, ఎన్సీపీ - కాంగ్రెస్ మధ్య దూరం పెరుగుతోందని స్పష్టమవుతోంది. అయితే, థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఏ రకంగా ముడి పడుతుంది అనే విషయంలో ఇంకా స్పష్టత రావలసి ఉంది. అలాగే, కాంగ్రెస్ లేకుండా జాతీయ స్త్గాయిలో బీజేపీ వ్యతిరేక కూటమిని ఏర్పాటు చేయడం వలన, వ్యతిరేక ఓటు చీలి  అది మళ్ళీ బీజేపీకే మేలు చేస్తుందని, కాబట్టి, ప్రస్తుతం కాంగ్రెస్ సారధ్యంలోని యూపీఏని బలోపేతం చేయడమే ఉత్తమమనే అలోచన కూడా  విపక్ష శిబిరం నుంచి వినవస్తోంది. ఈ నేపధ్యంలోనే, ప్రస్తుతం యూపీఏ ఛైర్పర్సన్’గా ఉన్న సోనియా గాంధీ వయసు, అనారోగ్యం కారణంగా బాధ్యతల నుంచి తప్పుకుని పవార్’కు బాద్యతలు అప్పగించాలనే ప్రతిపాదన వచ్చిందని అంటున్నారు. అలాగే, ఇతర పార్టీలను, ముఖ్యంగా కాంగ్రెస్ నుంచి విడిపోయి సొంత కుంపటి పెట్టుకున్న మమతా బెనర్జీ సారధ్యంలోని తృణమూల్, జగన్మోహన్ రెడ్డి సారధ్యంలోని వైసీపీలను కలుపుకుని కూటమిని బలోపేతం చేయడం ద్వారా బీజేపీని దీటుగా ఎదుర్కోవచ్చనే ఆలోచనలు కూడా సాగుతున్నాయి. అయితే, ఇటు థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు అయినా, యూపీఏని బలోపేతం చేయడమే అయినా, పవారే .. కేంద్ర బిందువు. ఆయన సారధ్యంలోనే ప్రత్యాన్మాయం అనేది విపక్ష శిభిరం నుంచి వినవస్తున్న ప్రస్తుత సమాచారం. మరి అదే జరిగితే రాహుల గాంధీ పరిస్థితి ఏమిటి ? గాంధీ నెహ్రూ కుటుంబం పరిస్థితి ఏమిటి? ఏ ప్రత్యేక ప్రాధాన్యత లేకుండా అందరిలో ఒకరిగా ఫస్ట్ ఫ్యామిలీ సర్దుకు పోతుందా? అంటే..చివరకు ఏమవుతుందో .. ఇప్పుడే చెప్పలేమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది. గతంలో అనేక సందర్భాలలో ముఖ్యమంత్రి కేసీఆర్,ఆర్థిక మంత్రి హరీశ రావు, కరోనా కారణంగా రాష్ట్ర  ఆదాయం గణనీయంగా తగ్గిందని, పేర్కొన్నారు. అయితే, కరోనా నుంచి వేగంగా కోలుకుని, ఆర్థికంగా అంతే వేగంగా పుంజుకున్న రాష్ట్రాలలో తెలంగాణ ప్రధమ స్థానంలో  ఉందని కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సర్వే 2020-21 నివేదిక పేర్కొంది. పడిలేచిన కెరటంలా, తెలంగాణ ‘వీ’ ఆకారంలో ఆర్థికంగా నిలతొక్కుందని కేంద్రం జనవరి  చివరి వారంలో విడుదల చేసిన ఆర్థిక సర్వేలో పేర్కొంది. అలాగే, రెవిన్యూ వసూళ్ళలో రాష్ట్రం కరోనా పూర్వస్థితికి చేరిందని కూడా సర్వే చెప్పింది.   అలాగే,రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు కూడా ఈ మధ్య కాలంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పై సంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరమ జనవరి,ఫిబ్రవరి, మార్చి నెలలతో పోలిస్తే ఈ సంవత్సరం ఈ మూడు నెలల కాలంలో రాష్ట్ర ఆర్థిక వృద్ది రేటు 10 నుంచి  15 శాతం మెరుగ్గా ఉందని హరీష్ రావు ఒకటి రెండు ఇంటర్వ్యూలలో పేర్కొన్నారు.అలాగే, బడ్జెట్ విషయంలోనూ ఆయన చాల ఆశావహ దృక్పథంతోనే ఉన్నారు. బడ్జెట్  పాజిటివ్’గా ఉంటుదని, ఎవ్వరూ ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని, సంక్షేమ పథకాలలో,ఇతరత్రా బడ్జెట్ కేటాయింపులలో ఎలాంటి కోతలు ఉండవని కూడా హరీష్ హామీ ఇచ్చారు. గత సంవత్సరంలో కొంత మేర హామీ ఇచ్చిన మేరకు అమలు చేయలేక పోయిన సొంత జాగాలలో డబల్ బెడ్ రూమ్ ఇళ్ళ నిర్మాణం, రుణ మాఫీ వంటి  పథకాలను ఈ బడ్జెట్ ద్వారా అమలు చేస్తామని చెప్పారు. అలాగే, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ తమిళి సై చేసిన ప్రసంగంలోనూ ఆశావహ దృక్పధమే వ్యక్తమైంది. ఆమె తమ ప్రసంగంలో,  ప్రభుత్వం సంక్షేమ పథకాలకు పెద్ద పీట వేసిందని అన్నారు. ‘సంపద పంచాలి ,పేదలకు పంచాలి’ అనేది తమ ప్రభుత్వ విధానమని స్పష్టం చేశారు. అలాగే, పెరుగతున్న ఆదాయంలో అధికశాతం సంక్షేమానికే వెచ్చిస్తున్నామని స్పష్టం చేశారు. దీంతో బడ్జెట్’లో కొత్త పథకాలకు శ్రీకారం చుట్టే అవకాశం ఉంటుందా అన్న చర్చ జరుగుతోంది. మరో వంక ఉద్యోగ వర్గాల్లో పీఆర్సీకి సంబంధించి ఆర్థిక మంత్రి తమ ప్రసంగంలో  ప్రకటన చేస్తారా లేదా అనే ఆసక్తి నెలకొంది. అలాగే, సామాన్య  ప్రజలు ఇటీవల పెరిగిన పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరల భారం నుంచి మంత్రి హరీష్, ఏదైనా ఉపసమనం కలిపిస్తారా అని ఎదురు చూస్తున్నారు. గతంలో వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సామాన్య ప్రజలపై వంటగ్యాస్ ధర భారాన్ని తగ్గించేందుకు కొంత మొత్తాన్ని, రూ.50(?) రాష్ట్ర ప్రభుత్వం తరపున  సబ్సిడీగా ఇచ్చిన విషయాన్ని, అదే విధంగా అసెంబ్లీ ఎన్నికలు జరుగతున్న తమిళనాడులో డిఎంకే పార్టీ,తమ పార్టీని అధికారంలోకి వస్తే  గ్యాస్ బండపై వంద రూపాయల సబ్సిడీ ఇస్తామని చేసిన  వాగ్దానాన్ని  గుర్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే, ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు, సోమవారం ఆర్థిక మంత్రి హరీష్ రావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఆర్థిక  శాఖ ముఖ్య కార్యదర్శి రామ కృష్ణా రావు,సలహాదారు జీఆర్ రెడ్డితో బడ్జెట్ పద్దులఫై సుదీర్ఘంగా చర్చించి తుది మెరుగులు దిద్దారు. బడ్జెట్ తుది రూపం సిద్దమైన నేపధ్యంలో ఆర్థిక శాఖ ప్రింటింగ్ ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 18 ఉదయం మంత్రి వర్గం ఆమోదం పొందిన అనంతరం ఆర్థికమంత్రి హరీష్ రావు అదే రోజు రాష్ట్ర బడ్జెట్ 2021-22ను సభలో ప్రవేశ పెడతారు. 20, 22 తేదీల్లో బడ్జెట్‌పై సాధారణ చర్చ,23, 24, 25 తేదీల్లో బడ్జెట్‌ పద్దులపై చర్చ ఉంటుంది 26న ద్రవ్యవినిమయ బిల్లు (బడ్జెట్)పై చర్చ, సభామోదం ఉంటాయి.
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది.  అధికార తెరాస, ఖమ్మం స్థానానికి సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర రెడ్డి పేరును ప్రకటించడంలో కొంచెం జాప్యం చేయడంతో పాటుగా, హైదరాబాద్ స్థానం నుంచి , పీవీ కుమార్తె వాణీ దేవి పేరును చివరి క్షణంలో తెరమీదకు తేవడంతో అంత వరకు కొంత స్తబ్దుగా సాగిన ప్రచారం ఆ తర్వాత వేడెక్కింది. ఉద్యోగ నియామకాల విషయంలో తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ తప్పులో కాలేయడంతో విపక్షాలు, పోటీలో ఉన్న ప్రత్యర్ధులు, నిరుద్యోగ యువత, విద్యార్ధి సంఘాలు  ఒకే సారి ఆయన మీద  విరుచుకు పడ్డారు. ఆయన లెక్క తప్పని నిరుపిస్తం రమ్మని వరస సవాళ్ళు విసిరారు. దీంతో, మంత్రి నియామకా ఇష్యూని పక్కకు తప్పించేందుకు , ఐటీఐఆర్, వరంగల్ రైల్వే ఫ్యాక్టరీ వంటి సెంటిమెంటల్ ఇష్యూస్’ను తెరపైకి  తెచ్చారు. అలాగే, కేంద్ర ప్రభుత్వంపై విమర్శల దాడిని పెంచారు. చివరకు పొరుగు రాష్ట్రానికి చెందిన విశాఖ ఉక్కు ఆందోళన   కూడా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగమైంది.   రెండు నియోజక వర్గాలలో గతంతో పోలిస్తే ఈసారి ఓటర్ల సంఖ్య రెట్టింపు అయింది. ఈసారి రెండు నియోజక వర్గాలలో కలిపి 10 లక్ష 36 వేల మంది తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. అలాగే, రెండు పట్ట భద్రుల నియోజక వర్గాల్లో 164 మంది అభ్యర్ధులు పోటీలో ఉన్నారు.  గత ఎన్నికలతో పోలిస్తే ఇటు ఓటర్ల సంఖ్య, అటు అభ్యర్థుల సంఖ్యా రెట్టింపునకు పైగానే పెరగడంతో ఎన్నికలలో జోష్ పెరిగింది. దీనికితోడు అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో సాధారణ ఎన్నికలను తలపించే రీతిలో ప్రచారం సాగింది. ఎక్కువమంది అభ్యర్ధులు బరిలో ఉండడంతో, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి  తమకే ప్రయోజనం జరుగుతుందని అధికార పార్టీ ఆశపడుతోంది .  దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో చేదు ఫలితాలను చవిచూసిన టీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా వ్యూహ రచన చేసి కేటీఆర్, హరీష్ సహా మంత్రులు,ఎమ్మెల్యేలకు స్పెసిఫిక్ బాధ్యతలు అప్పగించారు. అలాగే,కాంగ్రెస్‌ అభ్యర్థులు చిన్నారెడ్డి, రాములునాయక్‌లకు మద్దతుగా ఉత్తమ్‌, భట్టి, రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తదితరులు విస్తృతంగా ప్రచారం చేశారు. బీజేపీ అభ్యర్థులు ఎన్‌.రాంచందర్‌రావు, ప్రేమేందర్‌రెడ్డిల తరఫున ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, ఎంపీ అరవింద్‌ తదితరులు ప్రచారాన్ని వేడెక్కించారు.  ఖమ్మం స్థానం నుంచి ప్రత్యక్ష ఎన్నికల్లో తొలిసారి పోటీకి దిగిన కోదండరాంకు, టీజేఎస్‌ పార్టీకీ ఈ ఎన్నికలు కీలకంగా మారాయి. ఖమ్మ స్థానం నుంచి పోటీ చేస్తున్న తీన్మార్ మల్లన్న ముందస్తు వ్యూహంతో ప్రధాన పార్టీల అభ్యర్ధులకు ధీటుగా ప్రచారం సాగించారు.  వామపక్షాల మద్దతుతో జయసారథి, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్‌, యువతెలంగాణ కార్యనిర్వాహక అధ్యక్షురాలు రాణీ రుద్రమ తదితరులు పోటీలో ఖమ్మం సీటును పట్టభద్రులు  ఎవరికి  పట్టం కడతారు అన్నది ప్రశ్నార్థకంగా మారింది. హైదరాబాద్ సీటు కూడా ఇటు అధికార తెరాసకు అటు సిట్టింగ్ సీటును నిలుపుకోవడం తో పాటుగా దుబ్బాక , జీహెచ్ఎంసి జోష్ ను కొనసాగించాలని ఆశ పడుతున్నబీజేలకే కూడా ఇజ్జత్ కీ సవాల్ గా మారింది. కాంగ్రెస్ అభ్యర్ధి పార్టీ సీనియర్ నాయకుడు సౌమ్యుడు, మాజీ మంత్రి చిన్నారెడ్డి, వామ పక్షాల మద్దతుతో పోటీ చేస్తున్న మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ కూడా గట్టి పోటీ ఇస్తున్నారు. సో.. చివరకు ఏమి జరుగుతుంది అంటే ఏదైనా జరగవచ్చును. ఈ నెల 14 వ తేదీన పోలింగ్ జరుగుతుంది.17 ఫలితాలు వస్తాయి .. అంతవరకు వెయిట్ అండ్ వాచ్ .  
సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది. ఒకప్పుడు ఎర్ర జెండాను దిగ్విజయంగా ఎదిరించి, మార్క్సిస్టులను మట్టి కరిపించిన మమతా దీదీ ప్రస్తుతం, కాషాయ కూటమి నుంచి గట్టి సవాలును ఎదుర్కుంటున్నారు. వరసగా పదేళ్ళు పాలించడం వలన సహజంగా వచ్చిన ప్రభుత్వ వ్యతిరేకత  కంటే, హిందూ ఓటు పోలరైజేషన్ ఆమెను మరింతగా భయపెడుతోంది. నిజానికి ఐదేళ్ళ క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం ఐదు శాతం కంటే తక్కువ ఓట్లు, మూడంటే మూడు అసెంబ్లీ సీట్లు మాత్రమే గెలుచుకున్న బీజేపీ..  2019 లోక్ సభ ఎన్నికల్లో ఏకంగా 40 శాతం ఓట్లతో 18 స్థానాలు గెలుచుకుంది. ఈ  మార్పు ఇంకా కొన్ని కారణాలు ఉంటే ఉండవచ్చును కానీ.. హిందువుల ఓటు పోలరైజ్  కావడమే ప్రధాన కారణం.  ఈ నేపధ్యంలోనే కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ చివరకు కమ్యూనిస్టులు కూడా బీజేపీలో  చేరారు. ఎన్నికల ప్రకటన వెలువడిన తర్వాత కూడా సిట్టింగ్ ఎమ్మెల్ల్యేలు సహా  తృణమూల్ టికెట్ వచ్చిన నాయకులు కూడా బీజేపీలో చేరుతున్నారు. అనేక మంది ఇతర రంగాల ప్రముఖులు, ముఖ్యంగా ఇంతకాలం, బీజేపీని హిదుత్వ అనుకూల ‘అచ్చుత్’ (అంటారని) పార్టీగా చూసిన ‘సెక్యులర్’ ప్రముఖులు కాషాయం కప్పుకోవడంతో మమతా బెనర్జీకి కొంచెం అలస్యంగానే అయినా, తత్త్వం బోధపడింది. అందుకే ఆమె ఇప్పుడు గుళ్ళూ,గోపురాలకు తిరుగుతున్నారు. కార్యకర్తల సమావేశాల్లో తానూ హిందువునేనని, చెప్పుకుంటున్నారు.  నిజానికి ఇలా నేనూ హిందువునే  అని సెక్యులర్ నేతలు బహిరంగంగా ప్రకటించుకోవడం మమతా బెనర్జీతోనే మొదలు కాలేదు. రాహుల్ గాంధీ తాను హిందువునని, జన్యుధారీ కశ్మీరీ బ్రాహ్మణుని అనీ.. తమ గోత్రం, ‘దత్తాత్రేయ’ గోత్రమని బహిరంగంగా ప్రకటించుకున్నారు. అలాగే  కొద్ది రోజుల క్రితం ప్రియాంకా గాంధీ తానూ హిందువునని చెప్పుకునేందుకు ‘మౌని అమావాస్య’ సందర్భంగా అలహాబాద్ లో గంగా స్నానం చేశారు. గతంలోనూ ఆమె ఎన్నికలకు ముందు గంగా యాత్ర చేశారు. అంతవరకు ఎందుకు కొద్దిరోజుల క్రితం సిపిఐ నారాయణ విశాఖ స్వామి ఆశీస్సులు తీసుకున్నారు. చంద్రబాబు, జగన్ రెడ్డి, కేసీఆర్ ఇలా తెలుగు నేతలు అనేక మంది లౌకిక వాదానికి కాలం చెల్లిందన్న సత్యాన్ని గ్రహించి కావచ్చు ‘నేనూ హిందువును’ అంటూ ప్రకటించుకునేందుకు పోటీ పడుతున్నారు. రాముడిని తలచుకున్నా, జై శ్రీరామ్ అన్నా తమ  లౌకిక వాదం మయలపడి పోతుందని భయపడిన నాయకులు ఇప్పుడు .. జై శ్రీరామ్ అనేందుకు కూడా వెనకాడడం లేదు.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది. గత కొంత కాలంగా సబర్మలతో సహా అనేక అంశాలపై స్పందిస్తూ.. కేరళను టార్గెట్ చేస్తున్న బీజేపీ నాయకులు అక్కడ తమ జెండా ఎగరేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా పార్టీ పాలసీని కూడా పక్కన పెట్టి మెట్రో మ్యాన్ శ్రీధరన్ ను పార్టీలో చేర్చుకుని ఆయనే తమ సీఎం అభ్యర్థి అని ప్రకటించిన 24 గంటలలో యూ టర్న్ తీసుకున్నారు. ఇది ఇలా ఉండగా ప్రస్తుతం సీఎంగా ఉన్న కమ్యూనిస్ట్ నేత పినరై విజయన్ పై గోల్డ్ స్మగ్లింగ్ ఆరోపణలు రావడంతో.. ఈ ఎన్నికలలో ఎల్డిఎఫ్ భవిష్యత్తుపై ప్రజలు ఏ తీర్పు ఇవ్వబోతున్నారనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది ఈ నేపథ్యంలో అక్షరాస్యతలో దేశంలోనే మొదటి స్థానంలో ఉన్న ఆ రాష్ట్ర ప్రజలు ఎవరిని ఆశీర్వదిస్తారు అనే అంశంపై ప్రముఖ మీడియా సంస్థ టైమ్స్ నౌ, సీ ఓటరుతో కలిసి ఒక సర్వేను నిర్వహించారు. ఈ సర్వే ప్రకారం చూస్తే పాపం కమలనాథులు అక్కడ పవర్ చేతికి రావటం అటుంచి కనీసం రెండు మూడు అసెంబ్లీ స్థానాల్లో గెలవటం కూడా కష్టమేనని ఆ సర్వే తేల్చి చెబుతోంది. కేరళలో ఈసారి జరిగే అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ తన హవా చాటుతుందన్న ఆ పార్టీ నేతల మాటలలో ఎలాంటి నిజం లేదని.. ప్రస్తుతానికి అది ఏమాత్రం సాధ్యం కాదని ఈ తాజా సర్వే తేల్చి చెప్పింది. అంతేకాకుండా మొత్తం 140 స్థానాలు ఉన్న కేరళలో.. ప్రస్తుత సీఎం పినరయి విజయన్ నేతృత్వంలోని లెఫ్ట్డ్ డెమొక్రటిక్ ఫ్రంట్ కు 82 సీట్లు పక్కా అని.. ఆయనే తిరిగి అధికారాన్ని నిలబెట్టుకుంటాడని సర్వే చెపుతోంది. అదే సమయంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూనైటెడ్ డెమొక్రాటిక్ ఫ్రంట్ కు 56 నుంచి 60 వరకు సీట్లు వచ్చే అవకాశం ఉందని ఈ సర్వేలో తేలింది. అంతేకాకుండా 2016 ఎన్నికలతో పోలిస్తే ఎల్ డీఎఫ్ ఓటింగ్ శాతం కూడా కొంత పెరగటం ఇక్కడ గమనార్హం. ప్రస్తుతం సీఎంగా ఉన్న విజయన్ మరోసారి సీఎం కావాలని 43.34 శాతం మంది మొగ్గు చూపినట్లుగా సర్వేలో తేలింది. కరోనా సమయంలో విజయన్ సీఎంగా బాగా పని చేసారని ఈ సర్వే పేర్కొంది. మరోపక్క దేశ ప్రధానిగా రాహుల్ గాంధీ ఉండాలని కేరళ ప్రజల్లో 55.84 శాతం మంది కోరుకుంటున్నట్లుగా ఈ సర్వే;లో తేలింది. అయితే కేరళలో ఎలాగైనా పాగా వేయాలని పట్టుదలతో కృషి చేస్తున్న బీజేపీకి ఈసారి కూడా నిరాశ తప్పదని ఈ సర్వేలో స్పష్టం అయింది. ఈ ఎన్నికలలో బీజేపీకి రెండు సీట్లు కూడా రావటం కూడా కష్టమేనని ఈ సర్వే తేల్చింది. అయితే ఎన్నికలకు ముందు ఇలాంటి సర్వేలు బయటకు రావడం.. తరువాత అందులో కొన్ని చతికిల పడడం మనం చూస్తూనే ఉన్నాం. మరి ఈ సర్వే ఫలితాలు నిజామా అవుతాయో లేదో తేలాలంటే కొద్దీ రోజులు వెయిట్ చేయాల్సిందే.        
రాజకీయాలు అంటేనే అదో జూదం. పూలమ్మిన చోటనే కట్టెలు అమ్మవలసి రావచ్చును. అలాంటి పరిస్థితే వచ్చినా, తలవంచుకుని పోగలిగితేనే, ఎవరైనా రాజకీయాలలో రాణించగలరు. అలాకాదని, అలిమి కానిచోట, కూడా తామే అధికులమని భావిస్తే, ఎందుకూ కాకుండా పోతారు. అలాంటి వారు ఇద్దరూ కూడా ఇప్పుడు మన కళ్ళముందే ఉన్నారు.  జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు. అలాగే జయ మరణం తర్వాత ఆమె పరిస్థితి ఏమిటో కూడా వేరే చెప్పవలసిన, అవసరం లేదు. జైలు పాలయ్యారు. సర్వం తానై నడిపించిన పార్టీ నుంచి  బహిష్కరణకు గురయ్యారు. జయ ఉన్నంత వరకు తన వారుగా ఉన్న వారందరూ కానివారయ్యారు. ఒంటరిగా మిగిలారు.  నిజానికి నాలుగేళ్ళు జైలు జీవితం గడిపిన తర్వాత కూడా ఆమె తలచుకుంటే.. రాష్ట్ర రాజకీయాలలో, ముఖ్యంగా అధికారంలో ఉన్న డిఎంకే కూటమిలో అలజడి సృష్టించగలరు. ఎన్నికలలో ఆమె గెలవక పోవచ్చును కానీ.. తనను కాదన్న అన్నాడిఎంకేను ఓడించగలరు. అయిన  ఆమె అందుకు విరుద్ధంగా  రాజకీయాలకు వీడ్కోలు పలికి మౌనంగా పక్కకు తప్పుకున్నారు. రాజకీయ సన్యాసం ప్రకటించారు. ఉమ్మడి శతృవు డిఎంకే ను ఓడించేందుకు అన్నా డిఎంకే కూటమి  పోటీ చేయాలని, కూటమి ఐక్యతను దెబ్బతీయరాదనే ఉద్దేశంతోనే ఆమె రాజకీయ సన్యాసం ప్రకటించారు.    శశికళ మౌనంగా వెళ్లి పోవడం వెనక ఇంకా అనేక కారణాలున్నా ,అసలు కారణం ఆమె, రాజకీయ విజ్ఞత, వివేకం. ఆమె జైలుకు వెళ్ళిన సమయంలో జయలలిత సమాధి వద్ద ఎంత కసిగా, కోపంగా ‘మౌన’ ప్రతిజ్ఞ చేశారో చూశా. అలాంటి ఆమె ఇప్పుడు ఇలా ‘మౌనం’గా వెనకడుగు వేశారంటే, అది ఆలోచించ వలసిన విషయమే.ఆమె వ్యుహతంకంగానే సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే అనేక మంది అనేక కోణాల్లో శశికళ సంచలన నిర్ణయాన్ని విశ్లేషించారు.జైలు జీవితం తర్వాత కూడా అన్నా డిఎంకే నాయకులు తనను అగ్రనేతగా అంగీకరించక పోవడం, అమిత్ షా చెప్పినా.. అన్నా డిఎంకే నాయకులు ఆమెను, మేనల్లుడు దినకరన్’ను కులం పేరున, కుటుంబం పేరున దూరం చేయడం, తిరిగి పార్టీలోకి తీసుకోకపోవడంతో ఆమె మనసు కష్టపెట్టుకుని, సన్యాస నిర్ణయం తీసుకున్నారని కొందరంటున్నారు. పార్టీ మీద పట్టు లేదని, చరిష్మా అసలే లేదని, అందుకే ఆమె అలా నిశ్శబ్ధంగా రాజకీయ సన్యాసం స్వీకరించారని ఇంకొందరు విశ్లేషించారు. ఈ విశ్లేషణలో కొంత నిజం ఉంటే ఉండవచ్చును.. కానీ ఆమె గతాన్ని, నైజాన్ని గుర్తు చేసుకుంటే ఆమె స్ట్రైక్ బ్యాక్ వ్యూహంతోనే ఒకడుగు వెనక్కివేశారని ఆమెతో సన్నిహితంగా మెలిగినవారు, ఆమె రాజకీయ చాణక్యం తెలిసిన వారు అంటారు.   నిజానికి జైలులో ఉన్న కాలంలో కానీ, జైలు నుంచి విడుదలై వచ్చిన తర్వాత కానీ, ఆమె రాజకీయ సన్యాసం వైపు అడుగులు వేస్తున్నట్లు కనిపించలేదు. బెంగుళూరు జైలు నుంచి విడుదలై చెన్నైలో ప్రవేశించిన నప్పుడు ఆమె పెద్ద కాన్వాయ్ తో  తమ కారుకు అన్నాడిఎంకే జెండాతోనే ఎంటరయ్యారు. అలా ఎంట్రీలోనే రాజకీయ ఆకాంక్షను వెంట తెచ్చుకున్నారు. చివరకు ‘సన్యాస’ ప్రకట చేసే వరకు కూడా ఆమె రాజకీయ కార్యకలాపాలు సాగిస్తూనే ఉన్నారు. అటు ఢిల్లీని ఇటు చెన్నైనికూడా కదిల్చారు. అంతేకాదు, రాజకీయాలపై విరక్తితో కాదు, రాజకీయ కసితో, ఉమ్మడి శత్రువు (డిఎంకే) ను ఓడించేందుకే తాను రాజకీయాలనుంచి తపుకుంటున్నట్లు చెప్పారు.  సో .. సన్యాసం తీసుకోవాలనే ఆలోచన, రాజకీయవ్యూహం లోంచి పుట్టిందే కానీ,వైరాగ్యంతో పుట్టింది కాదు ,అన్నవిశ్లేషణ వాస్తవానికి ఇంకొంత దగ్గరగా ఉందని అనుకోవచ్చును. ఇది ‘కామా’నే కాని ‘ఫుల్స్టాప్’ కాదని అంటున్నారు.  ముఖ్యమంత్రి ఎడప్పాడి కే. పళని స్వామి (ఈపీఎస్) ఆమెను పార్టీలోకి అనుమతిస్తే తన కుర్చికీ ఎసరు పెడతారనే భయంతోనే,, ఆమె ఎంట్రీని అడ్డుకున్నారు. ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం, శశికళ ఒకే సామజిక వర్గానికి చెందిన వారు కావడం కూడా, ముఖ్యమంత్రి ఈపీఎస్’ భయానికి కారణంగా పేర్కొంటారు. అందుకే  ఆయన, ‘మన్నార్గుడి’ ఫ్యామిలీని బూచిగా చూపించి, ఆమెను దూరంగా ఉంచారని పార్టీలో ఒక వర్గం గట్టిగా విశ్వసిస్తుంది. అయితే ఆమె శక్తియుక్తులను కూడతీసుకుని  పులిలా పంజా విసిరేందుకే ఆమె వ్యూహాత్మకంగా ఒక అడుగు వెనక్కి వేశారు కావచ్చును అని కూడా, తమిళ రాజకీయ వర్గాల్లో ఒక చర్చ జరుగుతోంది.  గతంలో ఆమె జయలలితతో విబేధాలు వచ్చిన సమయంలో కూడా ఇలాగే కొద్ది కాలం మౌనంగా తెర చాటుకు వెళ్లి పోయారు.  కొద్ది కాలంలోనే మళ్ళీ ‘పోయస్ గార్డెన్’లో ప్రత్యక్షమయ్యారు. జయలలిత స్వయంగా ఆమెను వెనక్కి పిలుపించుకోవలసిన పరిస్థితులను సృష్టించారు. అలా  మళ్ళీ  చక్రం తిప్పారు. జయలలిత మరణం వరకు ఆమె అందరికీ చిన్నమ్మగా అమ్మకు పెద్దమ్మగా సర్వం తానై నిలిచారు. చివరకు జయ అంత్యక్రియల్లో కూడా ఆమెదే పై చేయిగా కనిపించింది.   జయలలిత చనిపోయిన సందర్భంలోనే అన్నా డిఎంకే ఎమ్మెల్ల్యేలో సుమారు 30 మంది వరకు ఆమెకు మద్దతుగా ఉన్నారన్న వార్తలొచ్చాయి. నిజానికి,ఇప్పటికి కూడా ఒక్క అన్నా డిఎంకే లోనేకాదు,డిఎంకే ఇతర పార్టీలలో కూడా  ఆమె అవసరం ఉన్న వాళ్ళు ఉన్నారు. కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో ‘మన్నార్గుడి’ ఫ్యామిలీ మద్దతు లేకుండా గెలిచే అవకాశం లేదు.  ఇవ్వన్నీ నిజమే అయినా.. అన్నీ ఉండి, ఎవరు లేని శశికళలో, ఇంకా  ఎవరి కోసం తాపత్రయ పడాలి? అనే ప్రశ్న జనించి ఉంటే, ఆమె రాజకీయ సన్యాసం నిజం కావచ్చును. ఎందుకంటే ఆమె నెచ్చలి, జయలిత లేరు, భర్త అంతకంటే ముందే చనిపోయారు, పిల్లలు లేరు... పైగా నాలుగేళ్ళ జైలు జీవితం ఆమెలో మార్పు తెచ్చి ఉండవచ్చును. ఈ వయస్సులో తనవారంటూ ఎవరు లేని తనకు రాజకీయాలు ఎందుకు ? శేష జీవితాన్ని ఇలా సాగిద్దామనే ఆలోచన నిజంగా వచ్చి ఉంటే, ఆమె సన్యాసం సత్యం అయినా కావచ్చును, కాకపోనూ వచ్చును. కానీ  శశికళ... ఆమెను అర్థం చేసుకోవడం, అంచనా వేయడం , అంత తేలిగ్గా అయ్యే పని కాదు..
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు. కాంగ్రెస్ అధినాయకత్వం పై నేరుగా అస్త్రాలు సంధించారు. రాహుల్ గాంధీ పేరు చెప్పకుండానే, ఆయన నాయకత్వానికి పనికిరాడని తేల్చి చెప్పారు. ఎవరైనా పార్టీ అధ్యక్షుడు అయితే కావచ్చును, కానీ, ప్రజానాయకుడు కాలేడని, రాహుల గాంధీ ప్రజానాయకుడు కాదు కాలేరు,అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తరచూ రాహుల్ గాంధీని ఉద్దేశించి చేసే  ‘నామ్’ధారీ వ్యంగ్యాస్త్రాన్నే కాంగ్రెస్ సీనియర్ నాయకులు కూడా సందించారు. ఇక అక్కడి నుంచి విధేయ, అసమ్మతి వర్గాల మధ్య మాటల యుద్ధం ఎదో ఒక రూపంలో సాగుతూనే వుంది. అదే క్రమంలో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ, కరుడు కట్టిన ముస్లిం మతోన్మాది, అబ్బాస్ సిద్దిఖీతో కాంగ్రెస్ పార్టీ చేతులు కలపడం అసమ్మతి నాయకులకు మరో అస్త్రాన్ని అందించింది. విషయంలోకి వెళితే, ఇటీవల పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా లోక్’సభలో కాంగ్రెస్ పక్ష నాయకుడు, పశ్చిమ బెంగాల్ పీసీసీ అధ్యక్షుడు అధీర్’రంజన్ చౌదరి, ముస్లిం మత ప్రచారకుడు, అబ్బాస్ సిద్దిఖీతో  వేదిక పంచుకున్నారు.అంతకు ముందే వామ పక్ష కూటమితో  పొత్తు కుదుర్చుకున్న కాంగ్రెస్ పార్టీ, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)ను కూటమిలో చేర్చుకుంది. ఇలా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) అమోదం లేకుండా మతోన్మాద ఐఎస్ఎఫ్’ తో ఎన్నికల పొత్తు పెట్టుకోవడం ఆ పార్టీ నాయకుడు,సిద్ధిఖీతో  పీసీసీ చీఫ్ వేదిక  పంచుకోవడం పై అసమ్మతి నేతలు మండి పడుతున్నారు. ఇలా సిద్దిఖీతో వేదిక పంచుకోవడం పార్టీ మౌలిక సిద్ధాంతాలకు వ్యతిరేకం అంటూ అసమ్మతి వర్గానికి చెందిన కీలక నేత, రాజ్యసభ సభ్యుడు,ఆనంద్ శర్మ మండిపడ్డారు. అంతే కాదు, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)తో జనవరిలో కుదుర్చుకున్న పొత్తుకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ)అమోదం లేదని ఆనంద్ శర్మ, అభ్యంతరం వ్యక్త చేశారు. పార్టీ విశ్వసించే లౌకిక వాదానికి కాంగ్రెస్ అధిష్టానం తీసుకున్న నిర్ణయం గొడ్డలి పెట్టని ఆయన తీవ్రంగా స్పందించారు.   శర్మ వ్యాఖ్యలపై అధీర్ రంజన్ చౌదరి అంతే ఘాటుగా ప్రతిస్పందించారు. “నిజాలు తెలుసుకోండి ఆనంద్ శ‌ర్మ జీ” అంటూ ఆయ‌న వ‌రుస ట్వీట్లు చేశారు. వ్య‌క్తిగ‌త ప్ర‌యోజ‌నాలు ప‌క్క‌న‌పెట్టి, ప్ర‌ధానిని పొగిడి టైమ్ వేస్ట్ చేయ‌కండంటూ ఆయ‌న ఓ ట్వీట్లో అన్నారు. ఆనంద్ శ‌ర్మ అన‌వ‌స‌రంగా కాంగ్రెస్‌ను ల‌క్ష్యంగా చేసుకుంటున్నార‌ని, ఈ అంశాన్ని పెద్ద‌ది చేసి చూపిస్తున్నార‌ని విమ‌ర్శించారు. ఆయ‌న ఉద్దేశాలు స‌రైన‌వే అయితే నేరుగా తనతో మాట్లాడ వలసిందని అన్నారు. బెంగాల్‌లో సీపీఐ(ఎం) కూట‌మికి నేతృత్వం వ‌హిస్తోంది. అందులో కాంగ్రెస్ ఓ భాగం. మ‌త‌తత్వ‌, విభ‌జ‌న రాజ‌కీయాలు చేస్తున్న బీజేపీకి చెక్ పెట్ట‌డానికే ఈ కూట‌మి అని మ‌రో ట్వీట్‌లో అధిర్ రంజ‌న్ అన్నారు. అక్కడతోనూ ఆగలేదు ... ట్వీట్ల మీద ట్వీట్లు సంధిస్తూ, ఆనంద్ శర్మ, బీజేపీ మత విభజన, అజెండాను బలపరుస్తున్నారని, పరోక్షంగా జీ23 నాయకులు బీజేపీకి ప్రయోజనం చేకూరుస్తున్నారని ఆరోపించారు.అంతే కాదు, క్షేత్ర స్థాయి వాస్తవ పరిస్థితులు తెలియకుండా, ఆనంద్ శర్మ పార్టీ మీద దండెత్తడం ఉచితం కాదని చౌదరి ఎదురుదాడి చేశారు. అసమ్మతిలో అసమ్మతి. ఇదలా ఉంటే, కాంగ్రెస్ పార్టీ  సమూల పక్షాళన కోరుతూ సోనియా గాంధీకి,గత సంవత్సరం  జీ 23గా ప్రాచుర్యం పొందిన సీనియర్ నాయకులు రాసిన లేఖపై సంతకాలు చేసిన  నాయకుల్లో నలుగురు,జమ్మూలోసమావేసమైన నాయకుల తాజా నిర్ణయాలు, వ్యాఖ్యలు,విమర్శల పట్ల అసంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరం సోనియా గాంధీకి రాసిన లేఖలో ప్రస్తావించిన అంశాలకు కట్టుబడి ఉన్నామని, అయితే, జీ 23లోని కొందరు సహచరులు, ఇటీవల గీతదాటి చేస్తున్న వ్యాఖ్యలు, విమర్శలను తాము సమర్ధించడం లేదని ఆ నలుగురు పేర్కొన్నారు. ఇందులో ముఖ్యంగా, రాజ్యసభ మాజీ డిప్యూటీ చైర్మన్, పీజే కురియన్ అయితే, “కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు అవసరమైన సంస్కరణలు తెచ్చేందుకు చేసే ప్రయత్నాలను పూర్తిగా సమర్దిస్తాను, కానీ, ‘లక్ష్మణ రేఖ’ దాటితే ఒప్పుకునేది లేదు”అని అసమ్మతిలో అసమ్మతికి తెర తీశారు.అలాగే, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ కుమారడు, మాజీ ఎంపీ సందీప్ దీక్షిత్,మధ్య ప్రదేశ్ సీనియర్ కాంగ్రెస్ నాయకుడు అజయ్ సింగ్’ కూడా గులాం నబీ ఆజాద్, కపిల్ సిబల్, ఆనంద్ శర్మ, మనీష్ తివారీ వంటి జీ 23 కీలక నేతలు అధినాయకత్వంపై చేసిన వ్యాఖ్యలను తప్పు పట్టారు. అలాగే, పార్టీ సీనియర్ నాయకుడు కేంద్ర మాజీమంత్రి వీరప్ప మొయిలీ కూడా,గత సంవత్సరం పార్టీ సీనియర్ నాయకులు  ఒక పరిమిత లక్ష్యంతో  సోనియా గాంధీకి లేఖ రాయడం జరిగిందని, ఆ పేరున జరుగతున్న  కార్యక్రమాలు లేఖ సంకల్పానికి  విరుద్ధమని అన్నారు. జీ 23 కార్యకలాపాలపై రాహుల్ గాంధీ కూడా పరోక్షగా స్పందించారు, ఒకప్పుడు ఎన్ఎస్’యుఐ, యూత్ కాంగ్రెస్’ కు సంస్థాగత ఎన్నికలు వద్దన్న వారే ఇప్పుడు ఇంకోలా మాట్లాడుతున్నారని పరోక్షంగానే అయినా సంస్థాగత ఎన్నికలు నిర్వహించడంతో పాటుగా, పార్టీ పక్షాలనకు తమ కుటుంబం వ్యతిరేకం కాదని, అందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఈ నేపధ్యంలో కాంగ్రెస్ పార్టీలో చెలరిగిన కలకలం  ఇక ముందు ఏమవుతుందో .. ఇంకెన్ని  మలుపులు తిరుగుతోందో ..చూడవలసిందే కానీ ఉహించలేము.
పంచతంత్రంగా పిలుచుకుంటున్న ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భతం జరగబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే, వివిధ సంస్థలు అసెంబ్లీ ఎన్నికలు జరిగే  అస్సాం. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటుగా కేరళలోనూ ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఆ ఒపీనియన్ పోల్ ఫలితాలు నిజంగా నిజం అయితే, కేరళలో మళ్ళీ సీపీఎం సారధ్యంలోని వామపక్ష కూటమి అధికారంలోకి వస్తుంది. ఇదే ఆ అద్భుతం. ఎందుకంటే, గత నాలుగు దశాబ్దాలలో కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో ఒకే కూటమి వరసగా రెండవసారి అధికారంలోకి వచ్చిన చరిత్ర లేనే లేదు. ఒక సారి ఎల్డీఎఫ్ అధికారంలోకి వస్తే ఐదేళ్ళ తర్వాత కాంగ్రెస్ సారధ్యంలోని ఐక్య ప్రజాస్వామ్య కూటమి(యూడీఎఫ్) అధికారంలోకి రావడం, దేవభుమిలో దైవ నిర్ణయమా అన్నట్లుగా ప్రతి ఎన్నికల్లోనూ అధికారం చేతులు మారుతూ వస్తోంది. అలాంటిది, ఈసారి ఒపీనియన్ పోల్స్ నిజమై వరసగా రెండవసారి వామపక్ష కూటమి అధికారంలోకి వస్తే, అది చరిత్రే అవుతుంది. ఇక ఒపీనియన్ పోల్స్ విషయానికి వస్తే, జాతీయ న్యూస్ ఛానెల్ ఏబీపీ, సీ ఓటర్ సంస్థలు సంయుక్తంగా ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఈ సర్వే ప్రకారం, 140 స్థానాలున్న కేరళ అసెంబ్లీలో వామపక్ష కూటమికి 83 నుంచి  91 స్థానాలు, యూడీఎఫ్ కూటమికి 47 నుంచి 55 స్థానాలు మాత్రమే దక్కుతాయని తెలుస్తోంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్రంలో ఇలా జాతకాలు తిరగబడడంపై సోషల్ మీడియాలో,’లెగ్ మహిమ’ లాంటి జోక్స్  ట్రోలవుతున్నాయి. అయితే 2016లో జరిగిన ఎన్నికల్లో కేవలం 47 సీట్లకే పరిమితం అయిన కాంగ్రెస్’కు ఈసారి ఒకటీ అరా సీట్లు ఎక్కువస్తే, రావచ్చును. అదే కాంగ్రెస్’కు కాసింత ఊరట. అదలా ఉంటే, పశ్చిమ బెంగాల్లో సైతం పట్టు సాధించిన బీజేపే, కేరళలో మాత్రం పట్టు కాదు కదా, పట్టుమని పది సీట్లు తెచ్చుకునే స్థితిలో లేదు. నిజానికి, దేశంలో బీజేపీకి అసలు ఏ మాత్రం మింగుడు పడని రాష్ట్రాలు ఎవైన ఉన్నాయంటే కేరళ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల  పేర్లే ప్రముఖంగా వినిపిస్తాయి. ఈ సారి కూడా కమల దళం కేరళలో కాలు పెట్టె పరిస్తి లేదని సర్వే ఫలితాలు చెపుతున్నారు. ఎప్పటిలానే ఇప్పడు కూడా  బీజేపీకి సున్నా నుంచి రెండు సీట్లు వచ్చే అవకాశం ఉందని, సర్వేస్వరుల అభిప్రాయంగా ఉంది. కేరళలో మొత్తం 140 స్థానాలకు ఏప్రిల్ 6 తేదీన ఒకే విడతలో పోలింగ్ జరుగుతుంది. మే 2 తేదీన ఫలితాలు వెలువడతాయి. కేరళ ఎలక్షన్ పై యావత్ దేశం ఆసక్తి కనబరుస్తోంది.    
కేంద్ర ఎన్నికలసంఘం ‘పాంచ్ పటాక’ గంట కొట్టింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. ఎన్నికల గంట మోగడంతో మొదలైన మరో భారత ‘మినీ’  సంగ్రామానికి మే 12 తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తెర పడుతుంది.ఈలోగా వివిధ అంచల్లో పోలింగ్ జరుగుతుంది.  నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతం ఓటరు తీర్పుకు వెళుతున్నా, అందరి దృష్టి, ముఖ్యంగా ప్రాంతీయ పార్టీల ఏలుబడిలో ఉన్న ఉభయ తెలుగు రాష్ట్రాలు, మరీ ముఖ్యంగా ఇప్పటికే బీజేపీ కన్నుపడిన తెలంగాణ రాష్ట్ర ప్రజలు, రాజకీయ పార్టీల దుష్టి  మాత్రం పశ్చిమ బెంగాల్ పైనే వుంది.  పశ్చిమ బెంగాల్లో ‘అద్భుతం’ జరిగి బీజేపీ విజయం సాధిస్తే, ఇక  కమల దళం ఫోకస్, తెలంగాణకు షిఫ్ట్ అవుతుంది. ఇది అందరికీ తెలిసిన బహిరంగ రహస్యం. ఈ నేపధ్యంలో బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయి అనే విషయంలో రాష్ట్ర రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. బెంగాల్లో బీజేపీ గెలిస్తే, ఇప్పటికే అంతర్గత కుటుంబ కలహాలతో సతమతవుతున్న తెరాస నాయకత్వానికి మరిన్నితిప్పలు తప్పవన్న మాట అంతఃపుర వర్గాలలో సైతం వినవస్తోంది.  పశ్చిమ బెంగాల్’లో ఎలాగైతే కమలదళం ఓ వంక తమ ట్రేడ్ మార్క్, హిందుత్వ రాజకీయాలు సాగిస్తూ, మరో వైపు నుంచి ‘ఆకర్ష్’ అస్త్రంతో అధికార పార్టీని నిర్వీర్యం చేసిన విధంగానే, ఇక్కడ కూడా ఫిరాయింపులను ప్రోత్సహింఛి పార్టీని నిట్టనిలువునా చీల్చే ప్రమాదాన్ని కొట్టివేయలేమని పార్టీ వర్గాలు కూడా అనుమానం వ్యక్త పరుస్తున్నాయి.  ఇప్పటికే తెలంగాణ  బీజేపీ నాయకులు 30 మంది తెరాస ఎమ్మెల్యేలు తమ టచ్ లో ఉన్నారని బెదిరిస్తున్నారు.అది నిజం అయినా కాకపోయినా..తెరాసలో అసంతృప్తి అగ్గి రగులుతోందనేది మాత్రం ఎవరూ కాదనలేని నిజం. అంతే కాకుండా రాష్ట్రానికి వచ్చిన కేంద్రనాయకులు ఎవరిని పలకరించినా, నెక్స్ట్ టార్గెట్ తెలంగాణ అని ఎలాంటి సషబిషలు లేకుండా కుండబద్దలు కొడుతున్నారు.అందుకే, బెంగాల్లో బీజేపీ గెలిస్తే.. అనే ఊహా కూడా  గులాబీ గూటిలో గుబులు పుట్టిస్తోంది. అయితే, బెగాల్’లో బీజేపీ గెలిస్తే ఒక్క తెలంగాణలోనే కాదు, దేశ రాజకీయ వాతావరణంలోనే పెను మార్పులు చోటు చేసుకుంటున్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.  అలాగే,  దేశ ముఖ చిత్రంలో కూడా పెను మార్పులు తప్పవని అంటున్నారు. అయితే రాజకీయాలలో ఎప్పుడు ఏం జరుగుతుందో.. ఎవరూహించెదరు..
ప్రతి ఇంట్లో ప్రతి ఒక్కరికి ఇప్పుడు పాలసీ అనేది కామన్ అయిపోయింది. ఏ రోజు సంపాదన ఆరోజు సరిపోయి ఏదో జీవితం అట్లా సాగుతున్నవాళ్ళు తప్ప పేదల నుండి, మధ్యతరగతి, ధనవంతుల వరకు ఈ పాలసీలలో మునిగి తేలుతున్నారు. ఇంకా చెప్పాలంటే మధ్యతరగతి వారి మీదనే ఈ పాలసీ సంస్థలు కూడా నడుస్తున్నాయంటే కాస్త ఆశ్చర్యం వేస్తుంది. ధనవంతులకు ఈ పాలసీలు ఉన్నా లేకపోయినా ఏమి సమస్య లేదు. పెద్దలు వెనుకేసిన ఆస్తులు, బ్యాంక్ బ్యాలెన్సులు, వ్యాపార లాభాలు వంటివి సమృద్ధిగా ఉండటం వల్ల వారికి పాలసీల గురించి పెద్ద ఆసక్తి కూడా తక్కువే.  అయితే వ్యక్తి నుండి వాహనాలకు, వస్తువులకు, ఇళ్లకు, సంస్థలకు ఇన్సూరెన్స్ చేయించడం అనేది మొదలయ్యాక ఈ ధనవంతులు కూడా వీటితో బాగానే ప్రయోజనాలు పొందుతున్నారు. ఇకపోతే చాలా చోట్ల చాలా కుటుంబాలలో కనిపించే అతి సాధారణ సమస్య ఒకటుంది. శ్రీరామ్ చిట్స్ ఎల్.ఐ.సి హెచ్.డి.ఎఫ్.సి ఇంకా ఇంకా వివిధరకాల బోలెడు సంస్థలు ఎన్నో ఇన్సూరెన్స్ లు అందిస్తున్నాయి. వీటిలో పాలసీలు తీసుకుని వాటిని కడుతున్న వారిలో మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి కుటుంబాలు అధికంగా ఉంటాయి. అయితే ప్రతి ఇంట్లో ప్రతి ఒక్కరు ఎదుర్కొనే సమస్య పాలసీ చెల్లింపు గడువు రాగానే పైసల కోసం వెతుక్కోవడం. నిజానికి ఈ పాలసీలు కట్టడం మొదలుపెట్టినప్పుడు తప్ప మిగిలిన సందర్భాలలో డబ్బు సమకూర్చుకోవడం కోసం ఇబ్బంది పడుతూ ఉంటారు. దీనిక్కారణం సరైన ప్లానింగ్ లేకపోవడమే అనేది చాలా కొద్దిమందికి మాత్రమే తెలుసు. సగటు మధ్యతరగతి వ్యక్తి ఆరు నెలలకు ఒకసారి మూడువేల రూపాయల పాలసీ కట్టడానికి నిర్ణయించుకుంటే అతడి నెలవారీ సంపాదనలో ఐదువందల రూపాయలను పక్కన పెడుతుండాలి. ఆ ఆరు నెలల మొత్తం పాలసీ చెల్లింపును ఎలాంటి ఆందోళన లేకుండా చేస్తుంది. కానీ మధ్యతరగతి వాళ్ళు ఈ విషయం గూర్చి ఎక్కువ ఆలోచించరు. తీరా చెల్లింపు గడువు ముందుకొచ్చినప్పుడు అప్పు చేసో లేక వేరే చెల్లింపుల నుండి దీనికి డబ్బు మరల్చడమో చేస్తుంటారు. ఫలితంగానే ఒకవైపు ఇన్సూరెన్స్ లు కడుతూ మరోవైపు అప్పులు చేస్తూ ఉంటారు. ఇదీ సగటు మధ్యతరగతి పాలసీదారుని పితలాటకం. హెల్త్ ఇన్సూరెన్స్ లు వచ్చినప్పటి నుండి ఓ ఆలోచన పురుగులా మెదడును తొలిచేది. చావుకు అగ్రిమెంట్ రాసుకున్నట్టు చస్తే ఆ ఇన్సూరెన్స్ తాలూకూ డబ్బులు బోల్డు వస్తాయని కదా ఇవన్నీ అని. కానీ నిజానికి  పేద, మధ్యతరగతి వ్యక్తులు ఎప్పుడూ ఇంతే కదా కుటుంబచట్రంలో ఇరుక్కుపోయిన జీవులు కదా అనిపిస్తుంది. ఇకపోతే ఈ ఇన్సూరెన్స్ కంపెనీలు కూడా ఇలాంటి ఆలోచనలు చేసే మధ్యతరగతి జీవుల వల్ల హాయిగా తమ సామ్రాజ్యాన్ని విస్తరించుకుంటున్నాయి.  సంవత్సరంలో ఈ పాలసీలు కట్టాలనే కోణంలో తమ సంతోషాలు కూడా వధులుకుంటున్న మధ్యతరగతి కుటుంబాలు కోకొల్లలు ఉన్నాయి. మనిషికోక పాలసీ, కానీ సంపాదన ఒకే ఒకరిది. ఇబ్బందులున్నా కట్టడానికే ముందుకు వెళ్తారు. కారణం భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ ఉండటమే.  పాలసీలతో జాగ్రత్త! కొందరుంటారు. ఈ పాలసీ సంస్థలలో పనిచేసే ఎంజెంట్లు. వీళ్ళు పాలసీలు తీయించడం, డబ్బులు వసూలు చేయడం పనిగా చేస్తుంటారు. అదే వారి ఉద్యోగం కూడా. అయితే పాలసీ తీయించేటప్పుడు 90% మంది ఆ పాలసీ వల్ల లాభాలు మాత్రమే చెబుతారు. కానీ దాని వల్ల వచ్చే నష్టాలు ఎవరూ ఏమీ చెప్పరు. చివరకు దానివల్ల ఏదో ఒక నష్టం ఎదురయ్యే దాకా దాని గురించి పాలసీదారుడికి తెలియదు కూడ. ఇలాంటి సంఘటనలు బోలెడు జరుగుతూ ఉంటాయి. సగటు మధ్యతరగతి ఒక సంస్థమీద ఎంతకని పోరాడతాడు. కాబట్టి ఒకటికి బట్టి నాలుగైదు సార్లు తిరుగుతాడు, ఆ తరువాత మోసం చేసిన వాడి నాశనం వాడిదే  అనుకుని కొన్నిరోజులు బాధపడి తిరిగి జీవితమనే పోరాటంలో పడిపోతాడు. కానీ నిజానికి ఆ సంస్థవాడు హాయిగా తన వ్యాపారాన్ని పెంచుకుంటూ ఉంటాడు. కాబట్టి పాలసీ తీసుకునేటప్పుడు అందులో ప్లస్ పాయింట్స్ మాత్రమే కాదు మైనస్ పాయింట్స్ ఏంటి అనేది మొదట అందరూ తెలుసుకోవాలి. పైన చెప్పుకున్న విషయమంతా చదివాక పాలసీ అంటే భరోసా ఇవ్వాలి కానీ అది చిరాకు పెట్టించేదిగా ఉండకూడదని అందరికీ ఆర్గమయ్యే ఉంటుందనుకుంటా! ◆ వెంకటేష్ పువ్వాడ  
అబ్బాయి అయినా, అమ్మాయి అయినా.. ప్రతి ఒక్కరూ పరిపూర్ణ భాగస్వామి కావాలని కోరుకుంటారు. అలా కోరుకున్నప్పటికీ కొంతమందికి వారి హృదయాలను ముక్కలు చేసే భాగస్వాములు  జీవితంలోకి వస్తుంటారు.  ఇలాంటి పరిస్థితిలో హృదయంతో పాటు, మనస్సును కూడా  చురుగ్గా ఉంచుకోవాల్సిన అవసరం ఉంటుంది. తద్వారా ఫెయిల్యూర్ ఎదురైనప్పుడు, భాగస్వామి సరిగా ఉన్నాయా లేదా అనే విషయాన్ని తెలుసుకోవడానికి, వారి విషయంలో తీసుకునే నిర్ణయాలు తప్పా, ఒప్పా అనే విషయం ఆలోచించుకోవడానికి అవకాశం ఉంటుంది.  చాలా సార్లు ప్రేమ గా ఉన్నప్పుడు ఎదుటివారు ఏదైనా తప్పు చేసినా సరే.. ఆ తప్పులను  విస్మరిస్తుంటారు. అలా తప్పులను పట్టించుకోకపోవడం అనేది సరైనదే.. కానీ అన్నిసార్లు అది సరైనది కాదు.  మగవాళ్లలో ఉండే మూడు లక్షణాలు పైకి చెప్పుకొన్నంత సాధారణమైని కావు. ఇవి అమ్మాయిల జీవితాలను నరకప్రాయంగా మారుస్తాయి.  అబ్బాయిలలో ఉండే అలాంటి లక్షణాలు ఏంటి తెలుసుకుంటే.. నియంత్రణ.. కొంతమంది అబ్బాయిలు నియంత్రణ స్వభావం కలిగి ఉంటారు. వారు ప్రతి విషయంలోనూ భార్యలను  నియంత్రించాలని కోరుకుంటారు. ఇది అబ్బాయిలలో పెద్ద చెడు లక్షణం.  భర్త భార్యను   ప్రతిదానిలోనూ నియంత్రిస్తుంటే..  ఏమి ధరించాలి, ఎవరితో మాట్లాడాలి, ఎక్కడికి వెళ్లాలి, ఏమి తినాలి? ఇలాంటివి అనిపిస్తుంటే అప్పుడు  అమ్మాయిల ఆలోచన  ఎలా అనిపిస్తుంది? ప్రారంభంలో, అలాంటి స్వభావం మంచిగా అనిపించవచ్చు. కానీ క్రమంగా  అలాంటి సంబంధంలో ఉక్కిరిబిక్కిరి అవుతారు. ఇలా  నియంత్రించడం ప్రేమ లేదా శ్రద్ధ కాదు, అది  బలవంతం. అలాంటి భాగస్వాములు భార్యల నమ్మకాన్ని నాశనం చేస్తారు.  దీని కారణంగా  క్రమంగా తమను తాము కోల్పోయామని అమ్మాయిలు బాధపడతారు. టే, ఏమి ధరించాలి, ఎవరితో మాట్లాడాలి, ఎక్కడికి వెళ్లాలి, ఏమి తినాలి? అప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది? ప్రారంభంలో, అలాంటి స్వభావం మంచిగా అనిపించవచ్చు. కానీ క్రమంగా మీరు అలాంటి సంబంధంలో ఉక్కిరిబిక్కిరి అవుతారు. ప్రకృతిని నియంత్రించడం ప్రేమ లేదా శ్రద్ధ కాదు, బలవంతం. అలాంటి భాగస్వాములు మీ విశ్వాసాన్ని నాశనం చేయవచ్చు, దీని కారణంగా మీరు క్రమంగా కోల్పోయినట్లు అనిపించడం ప్రారంభిస్తారు. ప్రతి విషయంలోనూ తాము సరైనవారని నిరూపించుకునే అలవాటు.. అబ్బాయిలు ఏ విషయంలో అయినా, ఎలాంటి పరిస్థితిలో అయినా, వారివైపు ఎలాంటి తప్పిదం ఉన్నా సరే.. వారు ఏ పోరాటంలోనైనా, చర్చలోనైనా లేదా సంభాషణలోనైనా తమ తప్పులను చూడరు. వారు ఎదుటి వ్యక్తిని అర్థం చేసుకోవడానికి కూడా ప్రయత్నించరు. అలాంటి వ్యక్తులు తమ సొంత మాటలను మాత్రమే సరైనవిగా భావిస్తారు.  వాటిపై చర్య తీసుకోవడానికి ఇష్టపడతారు. ఇలాంటి వ్యక్తులతో జీవితం నరకం.  అలాంటి వ్యక్తులు మానసికంగా పరిణతి చెందరు. అలాంటి వ్యక్తితో జీవించడం చాలా నిరాశకు గురి చేస్తుంది. అమ్మాయిలు కోరుకునే అందమైన జీవితం ఇవ్వడంలో ఇలాంటి అబ్బాయిలు కంప్లీట్ గా ఫెయిల్ అవుతారు. అలాంటి వ్యక్తి  మానసిక ఆరోగ్యాన్ని కూడా పాడు చేసే అవకాశం ఉంది. అతిగా అనుమానించే అబ్బాయిలు.. భార్యలను అనుమానించే భర్తలు చాలానే ఉంటారు.  ఇలా అతిగా అనుమానించే భర్తలు భార్యలకు నరకం పరిచయం చేస్తారు. భాగస్వామి గురించి కొంచెం ఆందోళన చెందడం సరే, కానీ ప్రతిదానిపైనా సందేహం లేదా అసూయ కలిగి ఉండటం చాలా తప్పు. అలాంటి అబ్బాయిలకు తమ భాగస్వామి స్నేహంతో సమస్యలు మొదలవుతాయి.  చేసే ప్రతి పనికి  అనుమానంగా చూస్తారు. అలాంటి సంబంధం నెమ్మదిగా పాయిజన్ గా  మారుతుంది.                                *రూపశ్రీ.  
  ప్రపంచవ్యాప్తంగా నేడు ప్రపంచ జనాభా దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. ఈ దినోత్సవాన్ని జరుపుకోవడం  ఉద్దేశ్యం ప్రపంచంలోని జనాభాకు సంబంధించిన సమస్యలపై ప్రజల దృష్టిని ఆకర్షించడం. 2025 నాటికి ప్రపంచ జనాభా 806.19 కోట్లు దాటిందని అంచనా. ఐక్యరాజ్యసమితి 1989లో ఈ దినోత్సవాన్ని  ప్రకటించింది. కానీ దీనిని మొదటిసారిగా ప్రపంచవ్యాప్తంగా జూలై 11, 1990న జరుపుకున్నారు. ప్రపంచ జనాభా దినోత్సవాన్ని జరుపుకోవడం  అంటే   జనాభా లెక్కలను ప్రజలకు తెలియజేయడమే కాదు, పెరుగుతున్న జనాభా కారణంగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకోవడం,  వాటికి పరిష్కారాలను కనుగొనడం.  ప్రపంచ వ్యాప్తంగా జనాభా విషయంలో వివిధ దేశాలు వివిధ రకాల సమస్యలను ఎదుర్కుంటున్నాయి.  భారతదేశ జనాభా గురించి, పరిస్థితుల గురించి వివరంగా తెలుసుకుంటే.. ప్రతి సంవత్సరం జూలై 11న ప్రపంచ జనాభా దినోత్సవాన్ని జరుపుకుంటారు. ఈ దినోత్సవ వేడుకలు 1990 జూలై 11న ప్రారంభమయ్యాయి. ఐక్యరాజ్యసమితి అభివృద్ధి కార్యక్రమం పాలక మండలి ప్రపంచ జనాభా దినోత్సవ వేడుకలను ప్రారంభించింది. 1989లో ఐక్యరాజ్యసమితి ప్రపంచ జనాభా దినోత్సవ వేడుకలను ప్రకటించింది. ఈ రోజు అంటే జూలై 11, 1987న ప్రపంచ జనాభా సంఖ్య 5 బిలియన్లు దాటినప్పుడు ఈ దినోత్సవాన్ని జరుపుకోవాలనే ఆలోచన వచ్చింది. ఈ దినోత్సవాన్ని జరుపుకోవాలనే సూచనను మొదట డాక్టర్ కె.సి. జకారియా ఇచ్చారు.   2025 ప్రపంచ జనాభా దినోత్సవం  థీమ్.. ఈసారి 2025 ప్రపంచ జనాభా దినోత్సవం  ఇతివృత్తం, యువతకు న్యాయమైన,  ఆశాజనకమైన ప్రపంచంలో తమకు నచ్చిన కుటుంబాన్ని సృష్టించడానికి సాధికారత కల్పించడం. భారతదేశ జనాభా..    ఐక్యరాజ్యసమితి ప్రకారం, 2025 నాటికి భారతదేశ జనాభా 1,463.9 మిలియన్లుగా ఉండే అవకాశం ఉంది.  భారతదేశం ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశంగా అవతరించింది. నివేదికల ప్రకారం, రాబోయే 40 సంవత్సరాలలో ఈ జనాభా 1.7 బిలియన్లకు చేరుకుంటుంది. అత్యధిక జనాభా కలిగిన 10 దేశాలు.. ప్రస్తుతం ప్రపంచ జనాభా దాదాపు 8.2 బిలియన్లు. అత్యధిక జనాభా కలిగిన దేశాలలో భారతదేశం  అగ్రస్థానంలో ఉంది. ఆ తర్వాత వరుసగా చైనా, అమెరికా, ఇండోనేషియా, పాకిస్తాన్, నైజీరియా, బ్రెజిల్, బంగ్లాదేశ్, రష్యా,  ఇథియోపియా ఉన్నాయి. టాప్ 10 దేశాలు ఇవే..   1. భారతదేశ జనాభా (అంచనా) - 1.46 బిలియన్ 2. చైనా జనాభా - 1.42 బిలియన్ 3. అమెరికా జనాభా - 347 మిలియన్లు   4. ఇండోనేషియా జనాభా - 286 మిలియన్లు 5. పాకిస్తాన్ జనాభా - 255 మిలియన్లు 6. నైజీరియా జనాభా - 238 మిలియన్లు 7. బ్రెజిల్ జనాభా - 213 మిలియన్లు 8. బంగ్లాదేశ్ జనాభా - 176 మిలియన్లు 9. రష్యా జనాభా - 144 మిలియన్లు 10. ఇథియోపియా జనాభా - 135 మిలియన్లు                                      *రూపశ్రీ.
  రుతుపవనాలు వచ్చాయి. దేశంలోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు, మరికొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురుస్తున్నాయి. అయితే, వర్షాకాలం వచ్చిన వెంటనే, ఆరోగ్య సమస్యలు పెరిగే ప్రమాదం ఉంది. ఈ వర్షాకాలంలో ఆరోగ్య రక్షణ కోసం చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది.  వాటిలో రాగి పాత్రలో నిల్వ చేసిన నీరు తాగడం ఒకటని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.  రాగి పాత్రలో ఉంచిన నీరు ఈ సీజన్‌లో ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. రాగి నీరు శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడమే కాకుండా, అనేక వ్యాధుల నుండి కూడా రక్షిస్తుంది. ఇది అమృతం లాంటిది. దీని గురించి పూర్తీగా తెలుసుకుంటే.. వర్షాకాలంలో నీటి కాలుష్యం ప్రమాదం పెరుగుతుంది, ఇది ఇన్ఫెక్షన్ లకు దారితీస్తుంది. ఇలాంటి పరిస్థితిలో, రాగి నీరు సురక్షితమైన ఆయుర్వేద నివారణ. రాగి యాంటీ బాక్టీరియల్ లక్షణాలను కలిగి ఉంటుంది. ఇది నీటిలో ఉన్న హానికరమైన బ్యాక్టీరియాను నాశనం చేస్తుంది,  నీటిని శుద్ధి చేస్తుంది. రాగి పాత్రలోని నీరు స్వచ్ఛమైనది.  శరీరం నుండి విషాన్ని బయటకు పంపి, శరీరాన్ని ఆరోగ్యంగా,  మనస్సును ఉల్లాసంగా ఉంచడంలో సహాయపడుతుంది. రాగి పాత్రలో నీరు త్రాగడం వల్ల జీర్ణవ్యవస్థ కూడా బలపడుతుంది. ఇది ఆహారాన్ని బాగా జీర్ణం చేయడంలో సహాయపడుతుంది.  మలబద్ధకం, అపానవాయువు,  అజీర్ణం వంటి కడుపు సమస్యల నుండి ఉపశమనం కలిగిస్తుంది. దీనితో పాటు ఈ నీరు మూత్రపిండాల ఆరోగ్యానికి కూడా ప్రయోజనకరంగా ఉంటుంది. ఇది మూత్రపిండాల్లో రాళ్ల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.  మూత్రపిండాలు సజావుగా పనిచేయడానికి సహాయపడుతుంది. రాగి పాత్రలోని  నీరు రోగనిరోధక శక్తిని కూడా బలపరుస్తుంది. ఇది వర్షాకాలంలో వ్యాధులను నివారించడంలో సహాయపడుతుంది. రాగి నీటిని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల చర్మానికి కూడా మేలు జరుగుతుంది. ఇది చర్మాన్ని ప్రకాశవంతం చేస్తుంది,  ముడతలను తగ్గించడంలో సహాయపడుతుంది. ఆయుర్వేదం కూడా రాగి పాత్రలో నీరు త్రాగమని సిఫార్సు చేస్తుంది. ఆయుర్వేదం ప్రకారం రాగి నీరు శరీరంలోని త్రిదోషాలను (వాత, పిత్త, కఫ) సమతుల్యం చేస్తుంది. ఇది ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. రాగి పాత్రలో నీటిని రాత్రంతా ఉంచి ఉదయం ఖాళీ కడుపుతో త్రాగడం ఉత్తమం.  కానీ పాత్ర తుప్పు పట్టకుండా ఉండటానికి దానిని క్రమం తప్పకుండా శుభ్రపరచడం అవసరం. ఈ చిన్న మార్పుతో వర్షాకాలంలో కూడా నీరు తీసుకోవడం వల్ల ఆరోగ్యంగా ఉండవచ్చు.                                   *రూపశ్రీ. గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు..  
డయాబెటిస్ రోగులు క్రమం తప్పకుండా రక్తంలో చక్కెరను తనిఖీ చేసుకోవడం చాలా ముఖ్యం. దీని సహాయంతో మందులను సక్రమంగా తీసుకుంటూ ఉండటమే కాకుండా ,  ఆహారాన్ని బ్యాలెన్స్ చేసుకోవడానికి,    తీవ్రమైన సమస్యలను నివారించడానికి సహాయపడుతుంది. ఈ రోజుల్లో చాలా మంది ఇంట్లో గ్లూకోమీటర్‌తో చక్కెర స్థాయిని తనిఖీ చేసుకుంటూ ఉంటారు.  ఇది ఆరోగ్యానికి మంచిదే.  కానీ చాలాసార్లు ఈ పరీక్ష తప్పుగా జరుగుతోందని డయాబెటిస్ నిపుణులు అంటున్నారు.  దీని కారణంగా రీడింగ్ కూడా తప్పుగా వస్తుంది. ఇంట్లో రక్తంలో చక్కెరను తనిఖీ చేసేటప్పుడు  చాలామంది చేస్తున్న తప్పులేంటి? వాటిని ఎలా నివారించాలి?తెలుసుకుంటే.. చేతులు కడుక్కోకపోవడం.. చాలా మంది చేతులు కడుక్కోకుండానే పరీక్షలు చేసుకుంటారు. చెమట, నూనె లేదా చేతులపై చిన్న ఆహారం ముక్క కూడా తప్పుడు రీడింగ్ ఇస్తుంది. అందువల్ల, రక్తంలో చక్కెరను తనిఖీ చేసే ముందు ఎల్లప్పుడూ  చేతులను సబ్బుతో కడుక్కోవాలి.  చేతులు పూర్తీగా ఆరిన తరువాత పరీక్ష చేసుకోవాలి.   వేలు గుచ్చడానికి ప్రతిసారీ ఒకే వేలును ఉపయోగించడం.. ప్రతిసారీ ఒకే ప్రదేశం నుండి రక్తాన్ని తీయడం వల్ల అక్కడి చర్మం కఠినంగా మారుతుంది. దీని వల్ల  రక్తాన్ని తీయడం కష్టమవుతుంది. వేళ్లను మారుస్తూ ఉండాలి.  ఒకే వేలును పదే పదే ఉపయోగించకూడదు. పాత స్ట్రిప్స్ వాడకం.. టెస్ట్ స్ట్రిప్స్ కు గడువు తేదీ ఉంటుంది. చాలా సార్లు  పాత లేదా తేమతో కూడిన స్ట్రిప్స్ వాడతారు. ఇది తప్పు రీడింగ్ లను ఇస్తుంది. స్ట్రిప్స్ ను ఎల్లప్పుడూ పొడి,  చల్లని ప్రదేశంలో ఉంచాలి.  అలాగే  గడువు తేదీని తనిఖీ చేసుకుంటూ ఉండాలి. రక్త నమూనా తీసుకోవడానికి ఎక్కువ ఒత్తిడి తీసుకురావడం.. కొన్నిసార్లు రక్తం బయటకు రానప్పుడు,  వేలిని చాలా గట్టిగా నొక్కుతారు, ఇది కణజాల ద్రవాన్ని రక్తంతో కలిపి రీడింగ్‌ను ప్రభావితం చేస్తుంది. మృదువుగా  గుచ్చాలి.  అవసరమైతే చేతిని కొద్దిగా రబ్ చేయాలి,  లేదా క్రిందికి వంచాలి. తప్పు సమయంలో తనిఖీ చేయడం.. ఖాళీ కడుపుతో, భోజనం చేసిన 2 గంటల తర్వాత లేదా నిద్రపోయే ముందు రక్తంలో చక్కెరను తనిఖీ చేయడానికి సరైన సమయం. తప్పు సమయంలో తనిఖీ చేయడం వల్ల నివేదిక గందరగోళంగా మారే అవకాశం ఉంటుంది. ఇది తీసుకునే ఆహారం గురించి, వాడాల్సి మందుల గురించి కూడా గందరగోళం క్రియేట్ చేస్తుంది.                                 *రూపశ్రీ. గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు..
  లాంగ్ జర్నీ చాలామందికి ఇష్టం. అయితే అనుకున్న సులువుగా వీటిని ప్లాన్ చేయడానికి ధైర్యం సరిపోదు.  దీనికి కారణం మోషన్ సిక్నెస్. దీన్నే వాంతుల సమస్య, తల తిరగడం అంటారు. ప్రయాణంలో  వాంతులు లేదా తల తిరుగుతున్నట్లు అనిపిస్తే ప్రయాణంలోని సరదా అంతా పాడైపోతుంది. మోషన్ సిక్‌నెస్ అనేది ఒక సాధారణ సమస్య, ఇది ముఖ్యంగా పిల్లలు, వృద్ధులు,  స్త్రీలలో సర్వసాధారణం. బస్సు, కారు, రైలు లేదా విమానం..ఇలా ప్రయాణం ఎందులో అయినా సరే..  ప్రయాణించేటప్పుడు మన చెవులు, కళ్ళు,  శరీర సమతుల్యత అసౌకర్యానికి లోనైనప్పుడు , వికారం, చెమట, తల తిరగడం,  వాంతులు వంటి పరిస్థితులు తలెత్తుతాయి. అయితే ఒక రోజు ముందుగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం వల్ల ఈ మోషన్ సిక్నెస్ కు చెక్ పెట్టవచ్చు. ప్రయాణాన్ని హాయిగా ఎంజాయ్ చేయవచ్చు. ఇందుకోసం ఏం చేయాలో తెలుసుకుంటే.. ఆహారం.. ప్రయాణానికి ఒక రోజు ముందు భారీ, వేయించిన,  కారంగా ఉండే ఆహారాన్ని తినకుండా ఉండాలి. ఇది కడుపులో భారంగా మారుతుంది,  గ్యాస్ లేదా ఆమ్లత్వం కారణంగా  అనారోగ్యం పెరుగుతుంది. తేలికైన, సులభంగా జీర్ణమయ్యే,  ఫైబర్ ఆధారిత ఆహారాన్ని తినాలి. నిద్ర.. అలసట,  నిద్ర లేకపోవడం శరీరాన్ని బలహీనపరుస్తుంది. ఇది ప్రయాణ సమయంలో తలనొప్పి లేదా వాంతులు వచ్చే ప్రమాదాన్ని పెంచుతుంది. ప్రయాణానికి ఒక రోజు ముందు తగినంత నిద్రపోవడం చాలా ముఖ్యం. మందులు.. గతంలో మోషన్ సిక్‌నెస్ చాలాసార్లు జరిగి ఉంటే వైద్యుల సలహా మందులు వాడవచ్చు. ప్రయాణానికి 30-60 నిమిషాల ముందు వైద్యులు సిఫార్సు చేసిన మందులు  తీసుకోవాలి.  తద్వారా ప్రయాణం సాఫీగా సాగుతుంది. అల్లం లేదా నిమ్మకాయ నీరు.. అల్లం,  నిమ్మకాయ రెండూ కడుపుని శాంతపరచడానికి సహజ నివారణలు. అల్లం టీ లేదా గోరువెచ్చని నిమ్మకాయ నీరు ఒక రోజు ముందుగానే తీసుకోవడం మంచిది. ఇది వికారం అవకాశాలను తగ్గిస్తుంది. ముఖ్యమైన వస్తువులు.. ప్రయాణానికి ఒక చిన్న బ్యాగును సిద్ధంగా ఉంచుకోవాలి.   అందులో వాంతి బ్యాగ్, టిష్యూ పేపర్, పుదీనా క్యాప్సూల్స్, మౌత్ ఫ్రెషనర్,  వాటర్ బాటిల్ ఉండాలి.  మార్గంలో ఏదైనా అసౌకర్యాన్ని ఎదుర్కొంటే ఈ వస్తువులు సహాయపడతాయి.                                          *రూపశ్రీ. గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు..