LATEST NEWS
భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం.. ఉత్తరాంధ్ర ప్రజల దశాబ్దాల కల.. మరో రెండు రోజుల్లో, ఇంకా స్పష్టంగా చెప్పాలంటే ఆగస్టు 1న ప్రధాని మోడీ చేతుల మీదుగా ప్రారంభం కానుంది.  ఈ   ప్రారంభోత్సవాన్ని కేవలం ఒక ప్రభుత్వ కార్యక్రమంగా కాకుండా, ఒక వేడుకగా, చరిత్రలో నిలిచిపోయే విధంగా ఘనంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లూ చేసింది.  ఉత్తరాంధ్ర ముఖ చిత్రాన్ని సమూలంగా మార్చివేసే ఈ విమానాశ్రయం అందుబాటులోకి రావడం ద్వారా  రాష్ట్ర ఆర్థిక పురోగతికి బాటలు పడతాయని పరిశీలకులు సైతం విశ్లేషిస్తున్నారు. అయితే ఇక్కడే వైసీపీ తీరు నగుబాటు అవుతోంది.  ఈ విమానాశ్రయ నిర్మాణ  క్రెడిట్ కొట్టేయడానికి వైసీపీ పడుతున్న ఆత్రం, తాపత్రయంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.   వైసీపీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు వంటి ఉత్తరాంధ్ర నాయకులు సహా ..  పలువురు..  విమానాశ్రయం క్రెడిట్  వైపీపీ ఖాతాలో వేసేందుకు నేల విడిచి సాము చేస్తున్నారు.   2023 మేలో అప్పటి సీఎం జగన్..  ఈ విమానాశ్రయ నిర్మాణానికి శంకుస్థాపన చేశారనీ, స్వల్ప వ్యవధిలోనే పనులను పరుగులు తీయించారనీ ఊరూవాడా ఏకం చేస్తూ ప్రచారం చేస్తున్నారు.  అయితే అదే సమయంలో  వైసీపీ ప్రతిపక్షంలో ఉన్న సమయంలో   భోగాపురం విమానాశ్రయ ఏర్పాటును తీవ్రంగా వ్యతిరేకిస్తూ జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన పాత వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుండడం ఆ పార్టీని  ఇరకాటంలోకి పడేయడమే కాకుండా.. నాటి విమర్శలు, నేటి క్రెడిట్ డ్రామాలపై నెటిజనులు పెద్ద ఎత్తున జగన్ ను, వైసీపీనీ ట్రోల్ చేస్తున్నారు.   ఉత్తరాంధ్ర అభివృద్ధికి అత్యంత కీలకమైన భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవ వేళ జగన్, వైసీపీ క్రెడిట్ చోరీ ప్రయత్నాలు వైసీపీని ఇబ్బందుల్లోకి నెట్టేశాయి. మరీ ముఖ్యంగా  ఉత్తరాంధ్ర జిల్లాల ప్రజల నుంచి భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి వస్తున్న విశేష సానుకూల స్పదన వైసీపీకి కంటి మీద కునుకులేకుండా చేస్తోంది. ఈ సానుకూలత.. ఉత్తరాంధ్రలో వైపీపీ ఉనికినే ప్రశ్నార్థకం చేస్తుందా అన్న భయం ఆ పార్టీకి చెందిన ఉత్తరాంధ్ర నేతల్లో ప్రస్ఫుటంగా కనిపిస్తోంది.  ఆ భయంతోనే   ధర్మాన ప్రసాదరావు వంటి సీనియర్లు   మీడియా ముందుకు వచ్చి క్రెడిట్ జగన్ కు, వైపీపీకీ అపాదించడానికి శతధా ప్రయత్నిస్తున్నారు.   అయితే ఆ ప్రయత్నాలకు నెటిజనులు  జగన్మోహన్ రెడ్డి పాత ప్రసంగాల వీడియోలను సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా షేర్ చేస్తూ గండి కొడుతున్నారు. గతంలో భోగాపురం ఎయిర్‌పోర్ట్ భూసేకరణ సమయంలో జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఆయన క్రెడిట్ చోరీ యత్నాలను ప్రజల ముందు బ్లాక్ అండ్ వైట్ లో ఎండగడుతున్నాయి.  ఎర్ర బస్సే  సరిగా రాని ఊరికి ఎయిర్ బస్సు ఎందుకు, అయినా ఇప్పటికే పక్కనే విశాఖపట్నం అంతర్జాతీయ విమానాశ్రయం అందుబాటులో ఉండగా, మళ్ళీ వేల ఎకరాలు ధారబోసి భోగాపురంలో ఇంకో విమానాశ్రయం నిర్మించడం దేనికి? అంటూ   ఆయన చేసిన విమర్శలు, రైతులు ఎట్టి పరిస్థితుల్లోనూ తమ అమూల్యమైన భూములను ఇవ్వద్దు, భోగాపురం విమానాశ్రయాన్ని అందరం కలిసి అడ్డుకుందాం" అంటూ జగన్ ఇచ్చిన పిలుపుల ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతూ భోగాపురం విషయంలో జగన్ ద్వంద్వ వైఖరిని ఎండగడుతున్నాయి.  ఒక ప్రాజెక్టుపై అధికారంలో ఉన్నప్పుడు ఒకలా, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మరొకలా మాట్లాడడం వైసీపీ స్థిరత్వం లేని రాజకీయాలకు అద్దం పడుతోందని నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు.  భోగాపురం విమానాశ్రయం అంశంలో గతంలో భూసేకరణను అడ్డుకోవడానికి ప్రయత్నించిన నాటి ప్రతిపక్షం, అధికారంలోకి వచ్చాక కూడా నిర్మాణాన్ని ఏళ్ల తరబడి జాప్యం చేసిందనే ఆరోపణలు ఉన్నాయి. తెలుగుదేశం పార్టీ హయాంలోనే విమానాశ్రయం కోసం భూసేకరణ ప్రక్రియ మెజారిటీ భాగం పూర్తయి, శంకుస్థాపనకు సిద్ధమైనప్పటికీ, 2019లో అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం ఈ ప్రాజెక్టును  సమీక్షల పేరుతో పక్కన పెట్టిందని విశ్లేషకులు గుర్తుచేస్తున్నారు. ఆ తర్వాత సుదీర్ఘ కాలం అలసత్వం వహించి..  పదవీ కాలం ముగిసే ముందర 2023లో అరకొరగా శంకుస్థాపన డ్రామాలు ఆడారనీ, ఇప్పుడు తీరా ప్రధాని మోడీ చేతుల మీదుగా ప్రపంచ స్థాయి ఎయిర్‌పోర్ట్ ప్రారంభమవుతుంటే మధ్యలో వచ్చి క్రెడిట్ కొట్టేయడానికి ప్రయత్నించడం హాస్యాస్పదంగా ఉందని వైసీపీపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.    Bhogapuram International Airport, YS Jagan Mohan Reddy, AP Politics, Narendra Modi Bhogapuram Airport, Dharmana Prasada Rao YSRCP
ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికార పగ్గాలు చేపట్టి రెండేళ్లయ్యింది. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా మూడేళ్ల సమయం ఉంది. స్థనిక ఎన్నికలు వినా ఇప్పట్లో రాష్ట్రంలో ఎన్నికల వాతావరణం లేదు. అయితే రెండేళ్ల   తెలుగుదేశం కూటమి పాలన పట్ల ప్రజా స్పందన ఎలా ఉంది? ప్రతిపక్ష హోదా లేకున్నా రాష్ట్రంలో ఏకైక విపక్షం గా ఉన్న వైసీపీ పట్ల ప్రజాదరణ ఎలా ఉంది అన్న అంశాలపై  ప్రముఖ పొలిటికల్ రీసెర్చ్ సంస్థ పయనీర్  స్ట్రాటజీస్ తాజాగా ఓ  సర్వే నిర్వహించింది.  ఆ సర్వే ఫలితం ఇటు అధికార కూటమిలోనూ, అటు వైసీపీలోనూ కలకలం రేపుతోంది.  రాష్ట్రంలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే..  రెండేళ్ల పాలనలో తెలుగుదేం కూటమి సర్కార్ పట్ల ప్రజలలో వ్యతిరేకత కనిపిస్తున్నప్పటికీ సునాయాసంగా గతం కంటే ఎక్కువ మెజారిటీతో అధికారంలోకి రావడం ఖాయమని సర్వే ఫలితం కుండబద్దలు కొట్టింది. అయితే తెలుగుదేశం కూమిటికి ఆందోళన కలిగించే విషయం ఏమిటంటే.. చంద్రబాబు నాయకత్వంలో కూటమి సర్కార్ సంక్షేమ, అభివృద్ధిని సమాంతరంగా పరుగులు పెట్టిస్తున్నప్పటికీ ఆ స్థాయిలో ప్రజాదరణ పెరగడం అటుంచి.. క్షేత్రస్థాయిలో కూటమి పాలన పట్ల ఒకింత అసంతృప్తి పె రిగిందని సర్వే స్పష్టం చేయడమే.  ఇక వైసీపీ విషయానికి వస్తే.. 40 శాతం ఓటు షేర్, ప్రభుత్వ వ్యతిరేకతే తమను 2029 ఎన్నికలలో అధికారంలో కూర్చోబెడతాయని ధీమా వ్యక్తం చేస్తున్న ఆ పార్టీకి ఈ సర్వే ఫలితం ఊహించని షాక్ ఇచ్చింది. తిరిగి అధికారంలోకి రావడం అటుంచి.. ఆ పార్టీ గ్రాఫ్ ఈ రెండేళ్లలో అధ:పాతాళానికి పడిపోయిందని సర్వే తేల్చింది.   గత ఎన్నికల ఘోర పరాజయం నుండి కోలుకుని తిరిగి పుంజుకుంటామని ఆశిస్తున్న వైపీపీకి  పయనీర్ స్ట్రాటజీన్ సర్వే గట్టి షాక్ ఇచ్చింది.  సర్వే ప్రకారం.. ఈ రెండేళ్లలో క్షేత్రస్థాయిలో వైసీపీ ఓటు బ్యాంకు పుంజుకోవడం అటుంచి ఉన్న ఓటు బ్యాంకు కూడా చాలా వరకూ దూరమైంది.   పయోనీర్ స్ట్రాటజీ విడుదల చేసిన   గణాంకాల ప్రకారం, రాష్ట్రవ్యాప్తంగా   అన్ని నియోజకవర్గాల్లో నిర్వహించిన ఈ సర్వేలో కూటమి ప్రభుత్వ పాలన పట్ల ప్రజలలో ఒకింత వ్యతిరేకత కనిపిస్తున్నా.. తెలుగుదేశం కూటమి ప్రభుత్వం పట్ల సానుకూలతే వ్యక్త మౌతోంది.  కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన   అభివృద్ధి, సంక్షేమ పథకాలు, పరిశ్రమల రాక, పెట్టుబడుల ప్రవాహం, అమరావతి, పోలవరం పనులలో వేగం వంటివి ప్రభుత్వం పట్ల వ్యతిరేకతను తోసి రాజని సానుకూలతను తీసుకువచ్చాయి.  ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే తెలుగుదేశం కూటమి గెలుచుకునే సీట్ల సంఖ్య గతం కంటే ఎక్కువగా ఉంటుంది.  గ్రామీణ, పట్టణ, నగరాలు అన్న తేడా లేకుండా..  యువత, మహిళలు  రైతులు   తెలుగుదేశం నేతృత్వంలోని కూటమి ప్రభుత్వానికే జై కొడుతున్నారు.    ఇక వైసీపీ విషయానికి వస్తే..  గతంలో అధికారాన్ని అనుభవించి, 2024 ఎన్నికలలో కేవలం 11 స్థానాలకే పరిమితమయ్యేంతగా ప్రజా వ్యతిరేకతను మూటగట్టుకున్న వైసీపీ పట్ల ఈ రెండేళ్లలో ప్రజలలో ఇసుమంతైనా సానుకూలత కానరావడం లేదని పయనీర్ స్ట్రాటజీస్ సర్వే తేల్చింది. అధికారం కోల్పోయిన తరువాత ఈ రెండేళ్లలో పార్టీ ఇసుమంతైనా పుంజుకోలేదని సర్వే ఫలితం పేర్కొంది. పుంజుకోకపోవడం అటుంచితే.. ఇప్పటికిప్పుడు రాష్ట్రంలో ఎన్నికలు జరిగితే వైసీపీ గత ఎన్నికలలో సాధించిన 11 స్థానాలను నిలుపుకోవడం కూడా కష్టమేనని సర్వే పేర్కొంటున్నది.  అధికారంలో ఉన్న సమయంలో చేసిన పొరపాట్లు, ప్రజావ్యతిరేక నిర్ణయాలు,   నిధుల మళ్లింపు వంటి అంశాలు ఇప్పటికీ ప్రజల జ్ఞాపకాల్లో బలంగా ఉన్నాయని సర్వే పేర్కొంది.   వైసీపీ ఓటు షేర్ మరింత దిగజారిపోవడానికి ఆ పార్టీ వైఖరి, అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించడం, ప్రజా సమస్యలపై  స్పందించకపోవడంతో పాటు.. ఆ పార్టీ అధినేత బెంగళూరు మకాం కూడా కారణం అని సర్వే పేర్కొంది.   ఉత్తరాంధ్ర, కోస్తా ఆంధ్ర, మరియు రాయలసీమ  ఇలా మూడు ప్రాంతాలలోనూ పయనీర్ స్ట్రాటజీన్ సర్వే చేసింది. ఈ సర్వేలో బయటపడిన మరో విశేషం ఏమిటంటే.. వైసీపీకి పెట్టని కోట వంటి రాయలసీమ ప్రాంతంలో కూడా ఆ పార్టీ ప్రతిష్ట మసకబారింది. సీమ ప్రాంతంలో కూడా తెలుగుదేశం కూటమి వైపు మొగ్గు స్పష్టంగా గోచరిస్తోంది. యువత, నిరుద్యోగులలో ఐటీ ఉద్యోగాల కల్పన, పారిశ్రామిక వేత్తల పెట్టుబడుల పట్ల ఆశావహ దృక్పథం వ్యక్తమవుతుండగా, మహిళలు ఉచిత బస్సు ప్రయాణం, దీపం పథకం,  ఇతర సంక్షేమ హామీల అమలు తీరుపై సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఒకప్పుడు వైసీపీకి కొండంత అండగా నిలిచిన గ్రామీణ ఓటర్లు కూడా ఇప్పుడు కూటమి ప్రభుత్వ సంక్షేమ అభివృద్ధి నమూనా వైపే మొగ్గు చూపుతున్నారని సర్వే ఫలితం పేర్కొంది.    ఇక ఈ సర్వే ఓటు శాతం విషయంలో కూడా తెలుగుదేశం కూటమి, వైసీపీల మధ్య స్పష్టమైన తేడా కనిపిస్తోందని వెల్లడించింది. గత ఎన్నికలలో 40 శాతం ఓటు షేరు మాకుందని చెప్పుకున్న వైసీపీకి ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే.. 28 శాతం ఓటు షేర్ కు పరిమితమౌతుందని సర్వే తేల్చింది. అదే సమయంలో తెలుగుదేశం కూటమికి 49 శాతం ఓటు షేర్ వస్తుందని పేర్కొంది. కూటమి పాలనపై ఒకింత అసంతృప్తి వ్యక్తమౌతున్నప్పటికీ, వైసీపీపై పెరుగుతున్నవ్యతిరేకత కారణంగా అది లెక్కలోకి రావడం లేదని సర్వే తేల్చింది.  YCP graph fallen, AP Political Survey, Pioneer Strategy Survey, TDP Alliance Lead, YSRCP Vote Share Drop, AP Politics, TeluguOne
దేశవ్యాప్తంగా పరీక్షల లీకేజీలు, రద్దుల చుట్టూ చెలరేగిన విద్యార్థుల ఆగ్రహజ్వాలలు చివరకు దేశ రాజధానిని, కేంద్ర ప్రభుత్వాన్ని ఇరకాటంలోకి నెట్టేశాయి.  ఏ ఉద్యమమైనా సరే, విద్యార్థులు రోడ్డు మీదకు వస్తే ప్రభుత్వాల పునాదులు కదులుతాయని చరిత్ర చెబుతోంది. ఇప్పుడు ఢిల్లీ వీధుల్లో కూదా దాదాపు అదే జరిగింది.  ప్రశ్నించే గొంతుకలపై లాఠీఛార్జ్, పెల్లెట్ గన్లు, చివరికి కరెంట్ షాక్ ఇచ్చే బ్యాటన్లు వాడినా... యంగ్ ఇండియా ఇసుమంతైనా తగ్గలేదు.   వ్రస్థాయి నిరసనలు, విద్యార్థుల అకుంఠిత పోరాటం ఫలితంగా కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది! అయితే దీని వెనుక అసలు రాజకీయ వ్యూహం ఏంటి?  విద్యాశాఖ మంత్రి రాజీనామా  నైతిక బాధ్యతతో చేశారా?   విద్యార్థి ఉద్యమ తీవ్రతను తగ్గించడానికి వేసిన ఎత్తడగా? అన్న అనుమానాలు తలెత్తుతున్నాయి.  ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా లేఖను  పరిశీలిస్తే..  పరీక్షల నిర్వహణలో జరిగిన ఘోర వైఫల్యానికి పూర్తి బాధ్యత వహిస్తూ రాజీనామా చేస్తున్నాననడం కాకుండా..  దేశద్రోహ శక్తులు  ఈ ఉద్యమాన్ని దుర్వినియోగం చేయకుండా ఉండేందుకే తాను పక్కకు తప్పుకుంటున్నానని పేర్కొన్నారు. అసలు పరీక్షల లీకేజీ వల్ల లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తు నాశనమైతే, న్యాయం కావాలని అడిగిన విద్యార్థులను, వారి తల్లిదండ్రులను  దేశద్రోహుల బీ-టీమ్ అని ప్రచారం చేయడమేంటి?  అధికార పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు చేస్తున్న వ్యాఖ్యలు ఈ  అగ్నికి ఆజ్యం పోస్తున్నాయనే చెప్పాలి.  ఎంపీ కంగనా రనౌత్ విద్యార్థి నాయకుల వయస్సు, ఉద్యోగంపై చేసిన వ్యాఖ్యలు సామాజిక మాధ్యమాల్లో పెద్ద దుమారాన్ని రేపాయి. అలాగే కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కూడా పరీక్షల రద్దు వల్ల వచ్చిన సమయాన్ని విద్యార్థులు మరింత ప్రిపేర్ అవ్వడానికి వాడుకున్నారనేలా వ్యాఖ్యానించడంపై విద్యార్థి లోకం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది.  ప్రధాన్ స్థానంలో నూతన విద్యాశాఖ మంత్రిగా ప్రహ్లాద్ జోషిని నియమించడం ఇప్పుడు సరికొత్త వివాదానికి తెరలేపింది. గతంలో బిల్కిస్ బానో కేసులోని ముద్దాయిల విడుదలపై ఆయన చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ ప్రతిపక్షాలు పార్లమెంట్‌లో  అధికిర కూగయొపై విరుచుకుపడ్డాయి. విద్యా వ్యవస్థను ప్రక్షాళన చేయాల్సిన కీలక సమయంలో, వివాదాస్పద నేపథ్యం ఉన్న నేతకు విద్యాశాఖను అప్పగించడంపై విద్యార్థి సంఘాలు సైతం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం మాత్రం విద్యార్థుల ఆగ్రహాన్ని చల్లార్చేందుకు పేపర్ లీకేజీలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకునేలా, ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేసేలా ఒక కొత్త బిల్లును సిద్ధం చేస్తోంది. కానీ, ఈ తాత్కాలిక చట్టాలు, నాయకుల మార్పులు విద్యార్థుల నిరసనల తీవ్రతను తగ్గించగలవా? అంటే మాత్రం తగ్గించలేవనే సమాధానమే వస్తోంది. తమపై నమోదు చేసిన కేసులను తక్షణమే ఎత్తివేయాలని, పరీక్షల నిర్వహణలో పూర్తి పారదర్శకత తేగల వ్యవస్థాత్మక మార్పులు కావాలని విద్యార్థిలోకం ఎలుగెత్తుతోంది. తాజాగా రైతుల ఆందోళనలకూ యువత సంఘీభావం ప్రకటించింది.  మొత్తంగా విద్యార్థులు, యువతఉద్యమం.. ఒక స్పష్టమైన సందేశాన్ని అయితేనిస్సందేహంగా ఇచ్చింది.   అన్యాయాన్ని ప్రశ్నించడంలో, హక్కుల కోసం పోరాడటంలో , న్యాయం కోసం నినదించడంలో  వెనకడుగు  వేసే ప్రశ్నేలేదని చాటింది.   ఆందోళనలను, ఉద్యమాలనూ అణచివేయడానికి అధికార పార్టీ, ప్రభుత్వం ఎన్ని వ్యూహాలురచించినా యువగళంముందు అవేవీ పారవని తాజా ఆందోళనలు నిర్ద్వంద్వంగారుజువుచేశాయి. ఇక ఈ ఉద్యమం సాధించిన మరో గొప్ప విజయం ఏమిటంటే.. ఏ రాజకీయ పార్టీకీ పొలిటికల్ మైలేజీ దక్కనీయకపోవడం.  Dharmendra Pradhan Resignation, Student Unrest, Pralhad Joshi Education Minister, Paper Leak Controversy, BJP Strategy, politicalmilage,  TeluguOne
   రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా కర్నూలు జిల్లా ఆదోని పట్టణ, మండల టీడీపీ నేతలు పని చేయాలని తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడు నారా లోకేష్ కోరారు. ఆదోని మండల, పట్టణ టీడీపీ ముఖ్యనేతలతో నారా లోకేష్ ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ... చిన్నచిన్న విభేదాలను పక్కనబెట్టి కూటమి నేతలు, కార్యకర్తలను కలుపుకెళ్లాలని అన్నారు. రెండేళ్ల కూటమి ప్రభుత్వ విజయాలపై డోర్ టు డోర్  కార్యక్రమాన్ని సమర్థవంతంగా నిర్వహించండి. మండల, క్లస్టర్, యూనిట్ ఇంచార్జిలు చురుగ్గా పనిచేయాలి. పనిచేసే వాళ్ళని గౌరవిస్తా. పార్టీ లైన్ దాటి ఎవరైనా మాట్లాడితే సహించేది లేదు.  ఏవైనా సమస్యలు ఉంటే ఇంచార్జితో మాట్లాడండి. నాలుగు గోడల నడుమ కలసి కూర్చొని సమస్య పరిష్కరించుకోండి. మీడియాకి ఎక్కితే పార్టీ నష్టపోతుంది. రెవెన్యూ, పోలీసు సమస్యలు, జీ రామ్ జీ బిల్లుల సమస్యలపై అధికారులకు ఆదేశాలు ఇస్తాం. 2014-19 నడుమ హౌసింగ్ బిల్లుల సమస్యపై ముఖ్యమంత్రితో మాట్లాడి, విడతలవారీగా చెల్లించేలా కృషిచేస్తా. కూటమి ధర్మాన్ని పాటిస్తూ కలసికట్టుగా పని చేయాలని లోకేష్ దిశానిర్దేశం చేశారు. ఈ సమావేశంలో జోనల్ ఇంచార్జి పెళ్లకూరు శ్రీనివాసరెడ్డి, పార్లమెంటు పార్టీ అధ్యక్షురాలు కిస్టమ్మ, నియోజకవర్గ టీడీపీ పరిశీలకుడు కేశవరెడ్డి, ఆదోని పట్టణ పార్టీ అధ్యక్షుడు బి.తిమ్మప్ప, మండల పార్టీ అధ్యక్షుడు కురువ శివప్ప, జిల్లా పార్టీ ట్రెజరర్ వాల్మీకి రవి, ఆదోని టీడీపీ నాయకులు బి. కృష్ణయ్య, లక్ష్మీనారాయణ, బి. విరూపాక్షి, సజ్జాద్ హుసేన్, కొల్లా వీరేష్, రామాంజని, ఎస్.సయ్యదుల్లా,  బిపి బస్వరాజ్, కురువ మురళీకృష్ణ తదితరులు పాల్గొన్నారు. Nara Lokesh, Adoni, TDP intimate meeting, CM Chandrababu, Election of local bodies, MLA Palla Srinivasa Rao
 ఇప్పటివరకు సోషల్ మీడియాలో, స్టూడెంట్ ప్రొటెస్ట్‌లలో మాత్రమే వినిపించిన పేరు... కాక్రోచ్  జనతా పార్టీ (సీజేపీ)! ఇప్పుడు ఈ బొద్దింకలు  రైతు సంఘాలతో చేతులు కలిపాయి.  నీట్ పేపర్ లీక్ ఆందోళనలతో దిల్లీ వీధులను ఊపేసిన బొద్దింకలు ఇప్పుడు దేశ రాజధాని జంతర్ మంతర్ వద్ద రైతు నాయకుడు రాకేష్ తికాయత్‌ను కలిసి సంఘీభావం ప్రకటించాయి. రైతులు, కాక్రోచ్ ల కలయిక నిస్పందేహంగా కేంద్ర ప్రభుత్వానికి కొత్త తలనొప్పులు తీసుకువస్తుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.    కేంద్రంలోని మోడీ సర్కార్ కు ఇన్నేళ్లలో ఎదురైన నిజమైన, బలమైన సవాళ్లు ఏవైనా ఉన్నాయంటే.. అవి.. గతంలో జరిగిన చారిత్రాత్మక రైతు ఉద్యమం, తాజాగా నీట్ లీకేజీకి నిరసనగా ఉవ్వెత్తున ఎగసిన కాక్రోచ్ ల ఆందోళన. రెండు సందర్భాలలోనూ కూడా మోడీ సర్కార్ దిగి వచ్చి వారి డిమాండ్లను అంగీకరించాల్సి వచ్చింది.  ఇప్పుడు ఈ రెండు శక్తులూ ఏకతాటిపైకి వచ్చాయి. దీంతో భవిష్యత్ లో వీరి కలయిక మోడీ సర్కార్ ను ఏ స్థాయిలో ఇరుకున పెడుతుందీ అన్న చర్చ ఇప్పుడు దేశ వ్యాప్తంగా జోరుగా సాగుతోంది.  జంతర్ మంతర్ వేదికగా సిజెపి నాయకులు, రాకేష్ తికాయత్ సహా 500 మంది రైతులతో  భేటీ అయ్యారు. గురువరాం(జులై 29) జరిగిన ఈ భేటీ..కాక్రోచ్ లు ఉద్యమ బాట వీడలేదనీ. కేవలం విద్యా సమస్యలే కాదు, కర్షకుల సమస్యలపైనా తాము ఉద్యమిస్తామనీ, అన్నదాతలకు అండగా నిలుస్తామని ఈ భేటీ ద్వారా సందేహాలకు అతీతంగా పరోక్షంగా ప్రకటించారు.  విద్యార్థులు, యువత,  రైతులు ఏకతాటిపైకి  వచ్చి ఉద్యమిస్తే.. ప్రజా సమస్యల పరిష్కారం విషయంలో కేందరంలోని మోడీ సర్కార్ పై ఒత్తిడి కొన్ని రెట్లు ఎక్కువ అవుతుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.    ఇప్పటికే నీట్ లీకేజీకి వ్యతిరేకంగా కాక్రోచ్ ల ఆందోళనల్లో పాల్గొన్న విద్యార్థులపై   నమోదైన కేసులను తక్షణమే ఉపసంహరించుకోవాలనీ, లేదంటే..  తన ఉద్యమాన్నినెక్స్ట్ లెవెల్ కు తీసుకువెడతామనీ సీజేపీ కేంద్రానికి అల్టిమేటమ్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ అల్టిమేటమ్ ఇచ్చిన రోజువ్యవధిలోనే... కాక్రోచ్ జనతా పార్టీ నేతలు రైతు సంఘాల నేతలతో భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది.    Cockroach Janta Party, Rakesh Tikait, NEET Protest Delhi, CJP Farmers Protest, Jantar Mantar Protest, Dharmendra Pradhan, Gen Z Protest India, CJP Foreign Funding Court
ALSO ON TELUGUONE N E W S
కొన్ని సినిమాలు బాక్సాఫీస్ రికార్డులను తిరగరాయడమే కాకుండా, పరిశ్రమ స్వరూపాన్నే పూర్తిగా మార్చివేస్తాయి. అటువంటి అరుదైన దృశ్య కావ్యం 'మగధీర'. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, దర్శకధీర ఎస్.ఎస్. రాజమౌళి కాంబినేషన్లో వచ్చిన ఈ చిత్రం 17 ఏళ్లు పూర్తి చేసుకుంది. 2009 జులై 30న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా, అప్పటివరకు ఉన్న అన్ని సౌత్ ఇండియన్ సినిమా రికార్డులను తుడిచిపెట్టేసి, తెలుగు సినిమా స్టామినాను ప్రపంచస్థాయికి చాటిచెప్పిన ఒక అద్భుతమైన మైలురాయిగా నిలిచింది. రూ. 35 కోట్ల బడ్జెట్‌తో నిర్మితమైన 'మగధీర', విడుదలైన తర్వాత కలెక్షన్ల సునామీ సృష్టించింది. అప్పట్లోనే దాదాపు రూ. 75 కోట్ల షేర్ వసూలు చేసి, రూ. 150 కోట్లకు పైగా గ్రాస్ సాధించిన మొదటి తెలుగు చిత్రంగా సరికొత్త చరిత్ర సృష్టించింది. రామ్ చరణ్ కెరీర్‌లో కేవలం రెండో సినిమాగానే వచ్చిన 'మగధీర', ఆయనను తిరుగులేని స్టార్‌గా నిలబెట్టింది. కాలభైరవ పాత్రలో రామ్ చరణ్ చూపించిన వీరత్వం, గుర్రపు స్వారీ, పవర్‌ఫుల్ డైలాగ్ డెలివరీ ప్రేక్షకులను ఎంతగానో అలరించాయి. ముఖ్యంగా 100 మంది యోధులతో కాలభైరవుడు చేసే ఆ వీరోచిత పోరాట ఘట్టం తెలుగు సినిమా చరిత్రలోనే అత్యంత ఉత్కంఠభరితమైన సీన్లలో ఒకటిగా నిలిచిపోయింది. రామ్ చరణ్ నటనకు, యాక్షన్ సీక్వెన్సులకు విమర్శకుల నుండి సైతం భారీ ప్రశంసలు దక్కాయి. ఈ విజువల్ వండర్‌లో కాజల్ అగర్వాల్ 'మిత్రవింద', 'ఇందు' పాత్రల్లో తన నటనతో, సౌందర్యంతో మెప్పించింది. ఎం.ఎం. కీరవాణి అందించిన సంగీతం ఈ సినిమా విజయంలో కీలక పాత్ర పోషించింది. కీరవాణి స్వరపరిచిన ప్రతి పాట ఇప్పటికీ సంగీతాభిమానుల గుండెల్లో మారుమోగుతూనే ఉంది. 'బంగారు కోడిపెట్ట' రీమిక్స్ పాట నుండి 'పంచదార బొమ్మ' వరకు ప్రతి పాట కూడా చార్ట్‌బస్టర్‌గా నిలిచాయి. అప్పటివరకు సాధారణ కమర్షియల్ ఫార్మాట్‌కే పరిమితమైన తెలుగు సినిమాను, పునర్జన్మల నేపథ్యంతో కూడిన విజువల్ గ్రాండియర్ డ్రామాగా మలచడంలో రాజమౌళి విజయం సాధించారు. అత్యున్నత సాంకేతిక ప్రమాణాలు, అద్భుతమైన విజువల్స్ తో.. బాహుబలి, ఆర్ఆర్ఆర్ వంటి అంతర్జాతీయ చిత్రాలకు అప్పుడే పునాది వేశారు. 17 ఏళ్లు పూర్తయినా కూడా 'మగధీర' అందించిన ఆ సంచలన అనుభూతి తెలుగు సినీ ప్రేక్షకులలో నేటికీ చెక్కుచెదరకుండా ఉందనడంలో ఎలాంటి సందేహం లేదు.     Magadheera, SS Rajamouli, Ram Charan  
తెలుగు సినిమాకి, నటప్రపూర్ణ మోహన్ బాబు కి మధ్య ఉన్న అనుబంధానికి మధ్య ఎంతో ఘనమైన చరిత్ర ఉంది. హీరోగా ఎన్నో శతదినోత్సవాలు, సిల్వర్ జూబ్లీ లు అందించి   కలెక్షన్స్ కింగ్ అనిపించాడు. తెలుగు ప్రేక్షకులు ఎంత అదృష్టం చేసుకున్నారో అనే విధంగా, తనకి మాత్రమే సాద్యమయ్యే డైలాగ్ మాడ్యులేషన్ తో పస లేని సీన్ ని సైతం మెప్పించడం మోహన్ బాబు స్టైల్. సెకండ్ ఇన్నింగ్స్ లో పెద్దగా స్పీడ్ చూపించడం లేదు. అందుకు కారణాలు ఏమిటనేది పక్కన పెడితే ఈ రోజు కృష్ణ గారి మనవడు జై కృష్ణ తో కలిసి 'శ్రీనివాస మంగాపురం'తో సెల్యులాయిడ్ పై తిష్ట వేసాడు.     అభిమానులతో పాటు మూవీ చూసిన వాళ్ళు మీడియాతో పాటు సోషల్ మీడియా వేదికగా స్పందిస్తు 'మూవీలో మోహన్ బాబు పోషించిన 'వెంకటాద్రి నాయుడు' రోల్ ఆయన నటనా జీవితంలో ఒక మైలురాయిగా నిలుస్తుంది. ఆ క్యారక్టర్ ద్వారా గంభీరం, బాధ్యత, కుటుంబం పట్ల ప్రేమాభిమానాలు, పరిస్థితులకు తగ్గట్టుగా స్పందించే గుణం ఇవన్నీ కలగలిపి చేసి మెప్పించడం సాధారణ విషయమేమీ కాదు. ఒక రకంగా  మోహన్ బాబు వెంకటాద్రి నాయుడు క్యారక్టర్ కి ప్రాణప్రతిష్ట చేశారు.  డైలాగ్ డెలివరీ లో ఇంకా తగ్గని వేడి, హావభావాలు కట్టిపడేసాయి. ముఖ్యంగా కుటుంబ వ్యవస్థలోని విలువలను, బంధాల ప్రాధాన్యతని  ఆవేశం, బాధ్యతారాహిత్యాన్ని ప్రశ్నించే తీరు, న్యాయం వైపు నిలబడే గుణం ఒక రకమైన భావోద్వేగాన్ని నింపుతాయి. ముఖ్యంగా స్క్రీన్ ప్రెజెన్స్ మరో స్థాయికి తీసుకెళ్లింది. చిత్రం మొదటి భాగం నుంచి ముగింపు వరకు మోహన్ బాబు తనదైన స్టైల్‌లో సినిమాని ముందుకు నడిపించారు. ఆయన చూపించిన విలక్షణమైన అభినయం వల్ల  శ్రీనివాస మంగాపురంకి అంతటి పేరు, గుర్తింపు వస్తుంది. కాబట్టి దర్శకులు, రైటర్స్ మోహన్ బాబుకి వేంకటాద్రి నాయుడు లాంటి రోల్స్ రాయాలి. మోహన్ బాబు గారు ఇలాంటి క్యారెక్టర్స్ మరిన్ని చేస్తూ  ఉంటే తెలుగు సినిమా తన వైభవాన్ని తలుచుకుంటూ మురిసిపోతూ ఉంటుందనేది వాళ్ల అభిప్రాయం. Also read: Srinivasa Mangapuram: తండ్రి పేరు నిలబెట్టినట్లేనా.. మాస్ అమ్మ మొగుడు అంటే అంతే మరి! Mohan Babu, Srinivasa Mangapuram, Jai krishna, Rasha Thadani
సినీ ప్రపంచంలో సెంటిమెంట్లు, లక్కీ నెంబర్స్, లెటర్స్ ఎప్పుడూ ఆసక్తికర చర్చకు దారితీస్తుంటాయి. ఇప్పుడు కన్నడ రాకింగ్ స్టార్ యశ్ కెరీర్‌ను పరిశీలిస్తే ఒక ఆసక్తికరమైన కామన్ పాయింట్ స్పష్టంగా కనిపిస్తుంది. అదే ఇంగ్లీష్ అక్షరం 'R'. యశ్ ను గ్లోబల్ స్టార్‌గా నిలబెట్టిన 'కేజీఎఫ్' సిరీస్ నుంచి మొదలుకొని, ఆయన రాబోయే అత్యంత భారీ బడ్జెట్ పాన్-వరల్డ్ చిత్రాల వరకు ప్రతి మైలురాయి పాత్ర వెనుక ఈ 'R' అక్షరమే ప్రధాన ఆకర్షణగా నిలుస్తోంది. 'కేజీఎఫ్: చాప్టర్ 1', 'కేజీఎఫ్: చాప్టర్ 2' సినిమాల్లో యశ్ పోషించిన 'రాకీ భాయ్' (Rocky Bhai) పాత్ర భారతీయ చిత్రసీమ చరిత్రలోనే ఒక సంచలనాన్ని సృష్టించింది. రాకీ భాయ్ అటిట్యూడ్, మాస్ మేనరిజమ్స్, గూస్‌బంప్స్ తెప్పించే ఎలివేషన్లు ప్రతి ఒక్క సినీ అభిమాని మనస్సులో చెరిగిపోని ముద్ర వేశాయి. అక్కడ 'R' తో ప్రారంభమైన ఆయన విజయ పరంపర ఇప్పుడు తదుపరి మైలురాళ్లకు బాటలు వేసింది. కేజీఎఫ్ తెచ్చిన సంచలన విజయం తర్వాత యశ్ తన తదుపరి ప్రాజెక్టుల ఎంపికలో ఎంతో వ్యూహాత్మకంగా అడుగులు వేశారు. ప్రస్తుతం ఆయన గీతు మోహన్‌దాస్ దర్శకత్వంలో నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ యాక్షన్ గ్యాంగ్‌స్టర్ డ్రామా 'టాక్సిక్'. ఈ అంతర్జాతీయ స్థాయి చిత్రంలో యష్ పోషిస్తున్న ప్రధాన పాత్ర పేరు 'రాయా' (Raya). మరోసారి 'R' అక్షరంతో ప్రారంభమయ్యే ఈ పాత్ర ద్వారా యష్ సరికొత్త మాస్ విశ్వరూపాన్ని ప్రదర్శించబోతున్నారు. మరోవైపు భారతీయ చలనచిత్ర చరిత్రలోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా, భారీ బడ్జెట్‌తో బాలీవుడ్ దర్శకుడు నితేష్ తివారీ తెరకెక్కిస్తున్న పౌరాణిక దృశ్యకావ్యం 'రామాయణ' (Ramayana). ఈ రెండు భాగాల విజువల్ ఎపిక్‌లో యశ్ లంకేశ్వరుడైన 'రావణాసురుడి' (Ravana) పాత్రలో కనిపించబోతున్నారు. తాజాగా విడుదలైన ట్రైలర్ లో రావణుడిగా యశ్  లుక్, స్క్రీన్ ప్రెజెన్స్ విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకుంది. ఇక్కడ కూడా ఆయన పాత్ర పేరు 'R' అక్షరంతోనే ప్రారంభం కావడం గమనార్హం. ఈ మూడింటినీ ఒకసారి నిశితంగా పరిశీలిస్తే.. రాకీ భాయ్, రాయా, రావణ.. ఈ మూడు ప్రతిష్టాత్మకమైన పాత్రల పేర్లు 'R' అక్షరంతోనే మొదలవుతున్నాయి. సోషల్ మీడియాలో ఇది యశ్ కి లక్కీ లెటర్ గా ప్రచారం పొందుతోంది. ఒకవేళ 'టాక్సిక్', 'రామాయణ' సినిమాలు కూడా ఘన విజయం సాధిస్తే.. ఈ R సెంటిమెంట్ మరింత బలపడే అవకాశముంది.     Rocking Star Yash, Ramayana, Ravana, Toxic  
    ఘట్టమనేని కృష్ణ(Krishna).. తెలుగు సినిమాకి దొరికిన అరుదైన, విలువైన వజ్రం.. సినిమా సినిమాకి తను ఎదగడమే కాకుండా తెలుగు సినిమాని కూడా ఎదిగేలా చేసాడు. మాస్ అమ్మ మొగుడనే ట్యాగ్ లైన్ తో పాటు కృష్ణ కోసం ఎంత వరకైనా వెళ్లే వీరాభిమానులకి లెక్కే లేదు. ప్రపంచంలోనే అత్యధిక అభిమాన సంఘాలు ఉన్న హీరో కూడా.  దీన్ని బట్టి తెలుగు సినిమాపై కృష్ణ ప్రభావం ఎలా ఉందో తెలుసుకోవచ్చు. మరి ఆ లెజండ్రీ పెద్ద కొడుకు మాజీ హీరో రమేష్ బాబు కుమారుడు జై కృష్ణ ఈ రోజు 'శ్రీనివాస మంగాపురం'తో సెల్యులాయిడ్ పై అడుగుపెడితే అభిమానుల్లో, ప్రేక్షకుల్లో ఉండే ఆసక్తి ఏ పాటిదో అర్ధం చేసుకోవచ్చు. మూవీ చూసిన వాళ్లంతా సోషల్ మీడియా వేదికగా స్పందిస్తు 'శ్రీను, వాసుబాబు అనే రెండు క్యారక్టర్ లలో జై కృష్ణ ఎలాంటి బెరుకు లేకుండా నటించాడు. డెబ్యూ మూవీనే రొమాన్స్, యాక్షన్ డ్రామాలో చేసి ఈ రోజుల్లో మెప్పించాలంటే చాలా కష్టం. అలాంటిది తాత, తండ్రి, బాబాయ్ మహేష్ బాబు పేరు నిలబెడుతు  సదరు సన్నివేశాల్లో అత్యంత సహజమైన నటన ప్రదర్శించాడు.తొలి సినిమానే అయినప్పటికీ ఎక్కడా కొత్త నటుడనే భావన కలగకుండా డాన్సులు, యాక్షన్ ఘట్టాలు, భావోద్వేగ సన్నివేశాలలో 100 శాతం  తన ప్రతిభని చాటుకున్నాడు. ముఖ్యంగా మాస్ సన్నివేశాలలో జై కృష్ణ కనబరిచిన స్క్రీన్ ప్రెజెన్స్, డైలాగ్ డెలివరీ ఆయనలోని పరిణతిని స్పష్టంగా చూపిస్తున్నాయి. తన తండ్రి రమేష్ బాబు కలలుగన్న నటుడిగా జై కృష్ణ రూపాంతరం చెందాడని ఘట్టమనేని అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. బాలీవుడ్ ప్రముఖ నటి రవీనా టాండన్ కుమార్తె రాశా తడాని కథానాయికగా తెలుగు తెరకు పరిచయమవ్వగా, జై కృష్ణ మరియు రాశాల మధ్య వచ్చిన రొమాంటిక్ కెమిస్ట్రీ సినిమాకి ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ప్రముఖ నటుడు మోహన్ బాబు, శ్యామ్, నరేష్  లాంటి సీనియర్ నటులు ఉన్నప్పటికీ జై కృష్ణ తనదైన శైలిలో నటనను పండించి సినిమా మొత్తాన్ని తన భుజాలపై నడిపించారు. జాతీయ అవార్డు గ్రహీత జి.వి. ప్రకాష్ కుమార్ అందించిన సంగీతం, ప్రత్యేకంగా “అల్లెలే” సాంగ్ మరియు బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ జై కృష్ణ మాస్ మేనియాని వేరే స్థాయికి తీసుకెళ్లాయి.     Also read:  శ్రీనివాస మంగాపురం హైలెట్స్   తండ్రి రమేష్ బాబు భౌతికంగా మన మధ్య లేకపోయినా, ఆయన ఆశయాలు, అభిమానుల ప్రేమ జై కృష్ణని  ముందుండి నడిపించాయని ఈ చిత్రం నిరూపించింది. బాబాయ్ మహేష్ బాబు సోషల్ మీడియా ద్వారా అందించిన ప్రత్యేక ప్రోత్సాహం జై కృష్ణపై ఉన్న అంచనాలను పెంచినప్పటికీ, ఆ అంచనాలను ఏమాత్రం తగ్గకుండా నిలబెట్టుకుని విజయాన్ని సాధించాడు. ఇప్పటికే ఈ చిత్ర డిజిటల్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియో దక్కించుకోవడం ఈ సినిమాకున్న క్రేజ్‌ను సూచిస్తోంది. ఘట్టమనేని వంశంలో మూడో తరం వారసుడిగా అడుగుపెట్టిన జై కృష్ణ, తన తండ్రి రమేష్ బాబు పేరును నిలబెట్టి టాలీవుడ్‌లో భవిష్యత్తులో సుదీర్ఘ ప్రయాణానికి బలమైన పునాది వేసుకున్నారు.  
ఘట్టమనేని వారసుడు జయకృష్ణ 'శ్రీనివాస మంగాపురం' సినిమాతో థియేటర్లలో అడుగుపెట్టాడు. సూపర్ స్టార్ కృష్ణ మనవడు హీరోగా ఎంట్రీ ఇవ్వడంతో.. మొదటి షో నుంచే థియేటర్ల వద్ద సందడి మొదలైంది. టాక్ కూడా బాగానే ఉంది. రెగ్యులర్ కమర్షియల్ ఫార్మాట్ ఫిల్మ్ అయినప్పటికీ.. జయకృష్ణ తన స్క్రీన్ ప్రజెన్స్, యాక్టింగ్ తో మెప్పించాడని ప్రశంసల వర్షం కురుస్తోంది. దీంతో బాక్సాఫీస్ వద్ద 'శ్రీనివాస మంగాపురం' సౌండ్ బాగానే వినిపిస్తోంది. ప్రేక్షకుల నుండి లభిస్తున్న ఈ విశేష ఆదరణ ఇప్పుడు బుకింగ్ ప్లాట్‌ఫామ్‌లలో కూడా స్పష్టంగా కనిపిస్తోంది. ప్రముఖ ఆన్‌లైన్ టికెట్ బుకింగ్ యాప్ బుక్‌మైషోలో ఈ సినిమా ట్రెండ్ అవుతోంది. కేవలం గడిచిన ఒక్క గంట వ్యవధిలో ఏకంగా 1.33K కంటే ఎక్కువ టికెట్లు అమ్ముడవ్వడం సినిమా సాధిస్తున్న రికార్డు స్థాయి క్రేజ్‌కు నిదర్శనంగా నిలిచింది.  ఆఫ్ లైన్ లోనూ ఫుట్ ఫాల్స్ బాగానే ఉన్నాయి. ముఖ్యంగా రూరల్ ఏరియాల్లో అదిరిపోయే రెస్పాన్స్ కనిపిస్తోంది. దాంతో యేటర్ల వద్ద హౌస్‌ఫుల్ బోర్డులు దర్శనమిస్తున్నాయి.  మొత్తానికి 'శ్రీనివాస మంగాపురం' రూపంలో జయకృష్ణకు మంచి ఎంట్రీనే లభించింది. థియేటర్లలో రెస్పాన్స్ చూస్తుంటే ఈ సినిమా లాంగ్ రన్ నమోదు చేయడం ఖాయంగా కనిపిస్తోంది.     Jaya Krishna Ghattamaneni, Srinivasa Mangapuram, Bookings, Book My Show  
  ఈ రోజు ఘట్టమనేని నయా వారసుడు ఘట్టమనేని జై కృష్ణ(Jai Krishna)శ్రీనివాస మంగాపురంతో వరల్డ్ సెల్యులాయిడ్ పై ల్యాండ్ అయ్యాడు. ప్రచార చిత్రాలతో మంచి బజ్ సంపాదించుకోవడంతో పాటు జై కృష్ణ తొలి సినిమా ఎలా ఉంటుందనే ఆసక్తి అభిమానులతో పాటు ప్రేక్షకుల్లో కలిగింది. మూవీ చూసిన వాళ్లంతా పలు హైలెట్స్ ని వ్యక్తం చేస్తున్నారు. మరి ఆ హైలెట్స్ ఏంటో చూద్దాం. 1 . లవ్, యాక్షన్, సెంటిమెన్స్ సీన్స్ లో జై కృష్ణ పెర్ఫార్మెన్స్  2 . జై కృష్ణ, హీరోయిన్ రష తడాని మధ్య జరిగిన లవ్ ట్రాక్  3 .మంగ, మంగ సాంగ్   4 . ఫస్ట్ హాఫ్ లో వచ్చిన యాక్షన్ సీక్వెన్స్  5 . మోహన్ బాబు , జై కృష్ణ మధ్య ట్రాక్  6 .  ఫ్ల్యాష్ బ్యాక్ ఎపిసోడ్  7 . ప్రతి ప్రేమ్ అత్యద్భుతంగా తీర్చిదిద్దిన ఫోటోగ్రఫీ  8 . తిరుపతిలో చిత్రీకరించడం వల్ల సరికొత్త ఫ్రెష్ నెస్   9 . ప్రీ క్లైమాక్స్ లో వచ్చిన సన్నివేశాలు  10 . మాటలని ఎంత వరకు వాడాలో అంతే వాడటం Also read: Srinivasa Mangapuram movie review in telugu: శ్రీనివాస మంగాపురం మూవీ రివ్యూ    టాక్ పరంగా చూసుకున్నా మెజారిటీ ప్రేక్షకులు బాగానే ఉందని చెప్తున్నారు. మెజారిటీ రివ్యూస్ కూడా అదే విధంగా వస్తున్నాయి. అశ్వని దత్, కిరణ్ నిర్మించగా ఆర్ ఎక్స్ 100 ఫే మ్ అజయ్ భూపతి దర్శకుడు. జీ వి ప్రకాష్ కుమార్ మ్యూజిక్ ని అందించాడు.   Jai Krishna, Rasha thadani, Mohan Babu, Tollywood  
Cast: Jaya Krishna Ghattamaneni, Rasha Thadani, Mohan Babu, Shyam, Naresh Vijay Krishna, Brahmaji Crew: Written and Directed by Ajay Bhupathi Cinematography by Jayakrishna Gummadi Music by G.V. Prakash Kumar Produced by P Kiran The Ghattamaneni family introduces its third-generation actor, Jaya Krishna, with Srinivasa Mangapuram. Directed by Ajay Bhupathi, the film also marks the debut of Rasha Thadani. With strong support from veteran actors like Mohan Babu, this romantic action drama has created decent buzz. Let's discuss the movie released today. Plot: Set in the temple town of Tirupati, the story follows a carefree young man, Srinu (Jaya Krishna), who falls in love with Manga (Rasha Thadani). However, Manga's father, Peddireddy (Shyam), is a ruthless and dangerous man who controls the area. Despite Manga rejecting his initial proposal, Srinu stays involved in her life. Things take a turn when his real identity as Vasu Babu is revealed. He must now fight dangerous enemies to protect his love and survive unexpected challenges. Will he be able to find a way? Watch the movie to know more. Analysis: Jaya Krishna makes a confident debut as a lead actor. He looks natural on screen and performs well in emotional scenes. Rasha Thadani is good and shares a decent chemistry with him. Mohan Babu and Shyam both deliver strong performances in negative roles, bringing weight to the central conflict. Director Ajay Bhupathi tries to blend a classic love story with a revenge drama using full commercial elements. The first half is interesting, building good suspense around the heroine's family and the hero's identity. But the problem lies in the second half. It looks like the makers chose a very easy and predictable path to finish the story. The major drawback is that the storyline feels heavily repeated and lacks fresh ideas. Once the second half begins, the audience can easily guess what will happen next. G.V. Prakash Kumar's background music is solid and elevates many scenes, but the songs are placed poorly and act as speed breakers. Still, Srinivasa Mangapuram is a decent launchpad for the new actors. On the whole, it is a routine romantic action drama that is passable but not as fresh as one would hope. Positives: Jaya Krishna's confident acting Strong background music Engaging first half Mohan Babu and Shayam's presence Negatives: Routine and predictable story Second half lacks freshness Songs acting as speed breakers Weak screenplay in the later half Bottomline: A routine romantic drama that relies mostly on its debutants. Rating: 2.75/5   Disclaimer: The views/opinions expressed in this review are personal views/opinions shared by the writer and organisation does not hold a liability to them. Viewers' discretion is advised before reacting to them.
  -సినిమా పేరు: శ్రీనివాస మంగాపురం -న‌టీన‌టులు: జై కృష్ణ, రషా తడాని, మోహన్ బాబు, శ్యామ్, నరేష్, బ్రహ్మాజీ, అజయ్    తదితరులు  -సినిమాటోగ్ర‌ఫీ: జయకృష్ణ గుమ్మడి  -ఎడిటింగ్: మాధవ్ కుమార్  -మ్యూజిక్: జి వి ప్రకాష్ కుమార్  -నిర్మాత‌: అశ్వనీదత్, కిరణ్  -బ్యానర్స్: వైజయంతి మూవీస్, చందమామ కథలు పిక్చర్స్   -రచన,దర్శకత్వం: అజయ్ భూపతి  -రిలీజ్ డేట్ : జులై 30 ,2026  ఘట్టమనేని మూడో తరం వారసుడు 'జై కృష్ణ'(Jai Krishna)ఈ రోజు నట ప్రపూర్ణ 'మోహన్ బాబు(Mohan Babu),మాజీ హీరోయిన్ రవీనా టాండన్ కుమార్తె రషా తడాని తో కలిసి 'శ్రీనివాస మంగాపురం'(Srinivasa Mangapuram)తో థియేటర్స్ లో అడుగుపెట్టాడు. మరి మూవీ ఎలా ఉందో చూద్దాం. కథ శ్రీను(జై కృష్ణ) యంగ్ అండ్ డైనమిక్ యువకుడు. ఎంతటి ప్రతికూల సంఘటనలనైనా ఫేస్ చేసే దైర్యం శ్రీను సొంతం. ఆంధ్రప్రదేశ్ బోర్డర్ కర్ణాటక రాష్ట్రంలోని బళ్లారి నుంచి తిరుపతి వస్తాడు. మంగ(రషా తడాని) తిరుపతిలో బాగా పేరు పలుకుబడి ఉన్న పెద్దిరెడ్డి( శ్యామ్) ఒక్కగానొక్క కూతురు. చాలా మంచి మనసు గల యువతితో పాటు తన వల్ల ఎవరు ఇబ్బందులు పడకూడదనే వ్యక్తిత్వం తన సొంతం. మంగని ప్రాణానికి ప్రాణంగా ప్రేమిస్తున్నానని శ్రీను వెంటపడుతుంటాడు. కానీ మంగ మాత్రం శ్రీనుని స్నేహితుడిలా చూస్తుండటంతో పాటు వేరే వ్యక్తితో పెళ్ళికి రెడీ అవుతుంది. వెంకటప్పనాయుడు(మోహన్ బాబు) బళ్లారిలో పేరు మోసిన మహాశక్తీ. తనకి అడ్డొచ్చాడని సొంత తమ్ముడినే చంపిన రికార్డు వెంకటప్ప నాయుడు సొంతం. వెంకటప్పనాయుడుని అంతం చెయ్యాలని తమ్ముడి కొడుకు( అజయ్) చూస్తుంటాడు. పెద్దిరెడ్డికి వంశ పారంపర్యంగా వస్తున్న 'గన్' ని శ్రీనుకి మంగ ఇస్తుంది.స్నేహితుడిలా చూస్తున్న శ్రీనుకి మంగ గన్ ఎందుకు ఇచ్చింది? తిరుపతి వచ్చిన వెంటనే  మంగని ప్రేమిస్తున్నాని శ్రీను ఎందుకు వెంటపడుతున్నాడు? శ్రీనుది నిజమైన ప్రేమేనా? లేక ఏమైనా కారణం ఉందా? అసలు బళ్లారి నుంచి ఎందుకు వచ్చాడు? ఎవరి తాలూకా? అనేదే కథ ఎనాలసిస్  ఇలాంటి కథతో కూడిన చిత్రాలు గతంలో కొన్నివచ్చాయి. కానీ కథనం బోర్ కొట్టకుండా సాగడంతో శ్రీనివాస మంగాపురం పర్వాలేదనే స్థాయిలోనే మెప్పిస్తుంది. ముఖ్యంగా జై కృష్ణ తన పెర్ ఫార్మెన్స్ తో మెప్పించకపోయి ఉంటె సినిమా ఫలితం వేరేలా ఉండేది. డెబ్యూ హీరోకి ఇలాంటి సబ్జెక్ట్ లో పెర్ఫార్మ్ చేయ్యడమంటే కత్తి మీద సాము అని చెప్పవచ్చు. అలాంటిది జై కృష్ణ తన స్క్రీన్ ప్రెజెన్స్ తో శ్రీనివాస మంగాపురం కి రక్షణ కవచంలా నిలిచాడు. ఫస్ట్ హాఫ్  చూసుకుంటే స్టార్టింగ్ లోనే వచ్చిన శ్రీను(జై కృష్ణ) ఇంట్రడక్షన్ సీన్ బాగుంది. ఆ తర్వాత ఏ మాత్రం లేటు చేయకుండా కథలోకి వెళ్లడంతో పాటు మంగ, శ్రీను మధ్య వచ్చిన సీన్స్ చాలా ఫన్నీగా బాగున్నాయి. స్వతంత్ర బాబు(నరేష్ ) బాలు( బ్రహ్మాజీ) మధ్య నడిచిన కామెడీ ట్రాక్ బాగానే  పేలింది. ఈ ఇద్దరి రోల్స్ ని శ్రీను లవ్ కి హెల్ప్ గా  వాడుకొని ఎంటర్ టైన్ మెంట్ ని సృషించాల్సింది. సాంగ్స్ కూడా బాగున్నాయి. పెద్ది రెడ్డి సీన్స్ కూడా బాగానే ఉన్నా శ్రీనుకి ఏదో ఫ్లాష్ బ్యాక్ ఉందనే క్యూరియాసిటీని కలిగించడంలో మేకర్స్ విఫలమయ్యారు. ఇంటర్వెల్ ఎపిసోడ్ పెద్దగా వర్క్ అవుట్ కాలేదు. సెకండ్ హాఫ్ లో ఊహించని కథ రన్ అవుతుంది. మంగ ఎపిసోడ్ హైలెట్. ఆ సందర్భంగా వచ్చిన సీన్స్ బాగున్నాయి . వెంకటప్ప నాయుడు(మోహన్ బాబు) క్యారక్టర్ డిజైన్ బాగుంది. కానీ ఆ క్యారక్టర్ చేసే పోరాటాన్ని ఇంకా బాగా ఎస్టాబ్లిష్ చేసి ఉండాల్సింది. ఫస్ట్ హాఫ్ లో మెప్పించిన విధంగా సాంగ్స్ ఉండాల్సింది. ప్రీ క్లైమాక్స్ బాగున్నా క్లైమాక్స్ లో హడా విడి సృష్టించి ఎండ్ చేయాల్సింది. అలా కాకుండా సింపుల్ గా తేల్చి పడేసారు. నటీనటులు సాంకేతిక నిపుణుల పని తీరు  జై కృష్ణ మొదటి సినిమా అయినా తన పెర్ఫార్మ్ తో నూటికి నూరు మార్కులు సంపాదించుకున్నాడు. లవ్, యాక్షన్, ఫైట్స్ సన్నివేశాల్లో ఎంతో అనుభవమున్న నటనని ప్రదర్శించాడు. తెలుగు పరిశ్రమకి ఇంకో మంచి నటుడు దొరికినట్లే. ముఖ్యంగా సిగరెట్ కాల్చే స్టైల్, రివాల్వర్ వాడే విధానంలో ఘట్టమనేని తర్వాతే ఎవరైనా అనే టాగ్ లైన్ ని మరోసారి గుర్తు చేసాడు.రష తడాని కూడా ఎంతో బరువున్న మంగ క్యారక్టర్ లో అవలీలగా నటించి మెప్పించింది. వెంకటప్ప నాయుడుగా  మోహన్ బాబు ఎప్పటిలాగా తన నట విశ్వరూపాన్ని ప్రదర్శించాడు. మోహన్ బాబు వి ఇంకొన్ని సీన్స్ ఉంటే బాగుండేది అనిపించేలా సాగింది. నరేష్ గారి గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. నరేష్ గారి సీన్స్ కూడా ఇంకొన్ని ఉంటే బాగుండని అనిపిస్తుంది. పెద్దిరెడ్డి గా శ్యామ్ నటనలో మెరుపులు లేకపోయినా పర్ఫెక్ట్ గా సూటయ్యాడు. బ్రహ్మాజీ, అజయ్ తో పాటు మిగతా వాళ్ళు కూడా పరిణితి చెందిన నటనతో మెప్పించారు. అజయ్ భూపతి దర్శకత్వంలో మెరుపులు లేకపోయినా రచన పరంగా మెప్పించడంతో పాటు డైలాగ్స్ ఆణిముత్యాల్లా ఉన్నాయి. మూవీని కాపాడింది కూడా డైలాగ్స్ అని చెప్పుకోవడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. జీవి ప్రకాష్ కుమార్ నుంచి వచ్చిన సాంగ్స్ లో రెండు మాత్రమే బాగున్నాయి. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ పర్లేదు. ఫొటోగ్రఫీ హైలెట్. ఇలాంటి సినిమాలకి నిర్మాణ విలువలు కనపడవు.  బలాలు 1 జై కృష్ణ, రష తడాని పెర్ ఫార్మెన్స్  2 . కథనం 3 . ఫొటోగ్రఫీ  4 . సెకండ్ హాఫ్  5 .మోహన్ బాబు పెర్ ఫార్మెన్స్   6 . తిరుపతి అందాలు బలహీనతలు  1 . ఎంచుకున్న కథలో కొన్ని సినిమాల పోలికలు గుర్తుకు రావడం  2 . డైరెక్షన్ లో మెరుపులు లేకపోవడం  ఫైనల్ గా చెప్పాలంటే కథలో కొన్ని సినిమాల పోలికలు ఉన్నా జై కృష్ణ, రష తడాని, మోహన్ బాబు తన అద్భుతమైన పెర్ఫార్మ్ తో 'శ్రీనివాస మంగాపురం' నచ్చేలా చేసారు.    రేటింగ్ 2 .75 /5                                                                                                                                                                                                                                                       అరుణాచలం   
కోలీవుడ్ స్టార్ ధనుష్, టాలెంటెడ్ డైరెక్టర్ వెంకీ అట్లూరి కాంబినేషన్ లో గతంలో వచ్చిన 'సార్' చిత్రం ఎంతటి విజయాన్ని సాధించిందో తెలిసిందే. బాక్సాఫీస్ వద్ద విజయం సాధించడమే కాకుండా, విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఇప్పుడు ఈ బ్లాక్‌బస్టర్ కాంబో మళ్లీ ఒక కొత్త ప్రాజెక్ట్ కోసం జతకట్టబోతోందనే వార్త ఆసక్తిని రేకెత్తిస్తోంది.  ఫిల్మ్ సర్కిల్స్ లో వినిపిస్తున్న సమాచారం ప్రకారం, వెంకీ అట్లూరి దర్శకత్వంలో రాబోయే ఈ చిత్రంలో ధనుష్ తొలిసారిగా ఒక పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతున్నారట. తన వైవిధ్యమైన నటనతో ఎన్నో రకాల పాత్రలకు ప్రాణం పోసిన ధనుష్, ఇప్పటివరకు ఒక్క సినిమాలో కూడా పూర్తిస్థాయి పోలీస్ ఆఫీసర్‌గా నటించకపోవడం విశేషం. అందుకే ఈసారి ఆయన ఖాకీ యూనిఫాం ధరిస్తున్నారనే ప్రచారం అభిమానుల్లో ఉత్సాహాన్ని నింపుతోంది. దర్శకుడు వెంకీ అట్లూరి ధనుష్ కోసం ఒక పవర్ ఫుల్, ఎమోషనల్ కాన్సెప్ట్ తో కూడిన కథను సిద్ధం చేశారని టాక్. ఎమోషనల్ డ్రైవ్‌తో పాటు పక్కా కమర్షియల్ హంగులను మేళవించి ధనుష్‌ను సరికొత్త అవతార్‌లో ప్రెజెంట్ చేయడానికి స్క్రిప్ట్ డిజైన్ చేశారని తెలుస్తోంది.  'సార్' సినిమా తర్వాత మళ్లీ ఒక బలమైన లైన్‌తో వెంకీ అట్లూరి సంప్రదించగానే ధనుష్ కూడా వెంటనే ఇంప్రెస్ అయి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని సమాచారం. సోషల్ మీడియాలో కూడా ఈ కాంబో అప్‌డేట్‌పై నెటిజన్లు విశేషంగా చర్చించుకుంటున్నారు. ఒక వైవిధ్యమైన నటుడు పోలీస్ ఆఫీసర్ పాత్రను తనదైన శైలిలో ఎలా పోషిస్తారో చూడాలని అందరూ చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం దర్శకుడు వెంకీ అట్లూరి.. సూర్య, మమితా బైజు కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న భారీ చిత్రం 'విశ్వనాథ్ అండ్ సన్స్' పోస్ట్ ప్రొడక్షన్ పనులతో ఎంతో బిజీగా ఉన్నారు. ఈ సినిమా ఆగస్టు 14న ప్రేక్షకుల ముందుకు రానుంది.     Dhanush, Venky Atluri, Vishwanath and Sons  
అఖిల్ అక్కినేని హీరోగా నటించిన తాజా యాక్షన్ డ్రామా చిత్రం 'లెనిన్' బాక్సాఫీస్ దగ్గర సంచలనం సృష్టిస్తోంది. ఈ సినిమా విడుదలైన మొదటి రోజు నుంచే ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటూ థియేటర్లలో రికార్డు స్థాయి వసూళ్లతో దూసుకుపోతోంది. ముఖ్యంగా అఖిల్ మాస్ మేకోవర్, ట్విస్ట్ లు, ఎమోషన్స్ కి అక్కినేని అభిమానులతో పాటు సామాన్య ప్రేక్షకులు కూడా ఫిదా అయిపోతున్నారు. మునుపెన్నడూ లేని విధంగా అఖిల్ ను ఒక పవర్ ఫుల్, ఎమోషనల్ అండ్ యాక్షన్ ఓరియెంటెడ్ పాత్రలో దర్శకుడు మురళి కిషోర్ అబ్బూరు చూపించిన తీరు బాక్సాఫీస్ వద్ద విజయాన్ని అందించింది. ఇప్పుడు ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా ఏకంగా రూ. 100 కోట్ల గ్రాస్ మార్కును అధిగమించి అఖిల్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్ గా నిలిచింది. ఈ సందర్భంగా చిత్ర బృందం "మనోడు బ్లాక్‌బస్టర్ కొట్టేసాడు" అంటూ ఒక పవర్ ఫుల్ పోస్టర్ ను విడుదల చేస్తూ తమ సంతోషాన్ని పంచుకుంది. బాక్సాఫీస్ వద్ద రికార్డు స్థాయిలో కలెక్షన్లు రాబట్టడం అక్కినేని అభిమానులకు పండగ వాతావరణాన్ని తీసుకొచ్చింది. ప్రపంచవ్యాప్తంగా రూ. 100 కోట్ల గ్రాస్ మైలురాయిని దాటిన 'లెనిన్' చిత్రం బాక్సాఫీస్ వద్ద తన విజయ పరంపరను ఇప్పటికీ కొనసాగిస్తోంది. మాస్ యాక్షన్ మూవీ లవర్స్ కు పర్ఫెక్ట్ ట్రీట్ లా మారిన ఈ చిత్రం రాబోయే రోజుల్లో కూడా మరింత మెరుగైన కలెక్షన్లను సాధిస్తుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.  https://x.com/SitharaEnts/status/2082722862193160686     Akhil Akkineni, Lenin Movie, 100 Crore Gross  
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు. వారితో పాటు పెద్ద సంఖ్యలో క్యాడర్ కూడా పార్టీని వీడుతున్నారు. ఇక ఇప్పుడు నామినేటెడ్ పదవులలో ఉన్న వారి వంతు మొదలైనట్లు కనిపిస్తోంది. తనకు కానీ తన భర్తకు  కానీ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు టికెట్ ఇవ్వాలంటూ గత  కొంత కాలంగా కోరుతూ వస్తున్న మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ వంతు వచ్చింది. ఆమె కూడా రాజీనామా అస్త్రం సంధించారు.  జగన్ కు నమ్మిన బంటుగా గుర్తింపు పొందిన మహిళాకమిషన్ చైర్ పర్సన్ వాసి రెడ్డి పద్మ తన పదవికి రాజీనామా చేశారు. ఉరుములేని పిడుగులా, ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా తన రాజీనామా లేఖను సీఎం జగన్ కు పంపేశారు. పేరుకు తాను పార్టీకి కాదు, కేవలం మహిళా కమిషన్ చైర్మన్ పదవికి మాత్రమే రాజీనామా చేశాననీ, ఇక నుంచి వైసీపీ కోసం పని చేస్తాననీ వాసిరెడ్డి పద్మ చెబుతున్నప్పటికీ, ఆమె రాజీనామాకు కారణం అసంతృప్తేనని పార్టీ వర్గాలు బాహాటంగానే చెబుతున్నాయి. చాలా కాలంగా వాసిరెడ్డి పద్మ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు తనకు కానీ తన భక్తకు కానీ పార్టీ టికెట్ ఇవ్వాలని జగన్ ను కోరుతూ వస్తున్నారు. అయితే ఇప్పటి వరకూ జగన్ చూద్దాం.. చేద్దాం అన్నట్లుగా దాట వేస్తూనే వచ్చారు. ఇప్పుడిక వరుసగా అభ్యర్థల జాబితాలను జగన్ ప్రకటించేస్తుండటం, తనకు గానీ తన భర్తకు కానీ పార్టీ టికెట్ విషయంలో ఎటువంటి స్పస్టత ఇవ్వకపోవడంతో ఆమె మనస్తాపం చెంది పదవికి రాజీనామా చేసేశారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.  వాసిరెడ్డి పద్మ రాజకీయ ప్రవేశం ప్రజారాజ్యం పార్టీతో జరిగింది. 2009లో ఆమె ప్రజారాజ్యం పార్టీలో చేరారు. ఇలా చేరడంతోనే ఆమె ప్రజారాజ్యం అధికార ప్రతినిథిగా పదవి దక్కించుకున్నారు. ప్రజారాజ్యం కాంగ్రెస్ పార్టీలో విలీనం కావడంతో ఆమె 2012లో జగన్ పార్టీలో చేరారు. జగన్ కూడా ఆమెకు అధికార ప్రతినిథి పదవి ఇచ్చారు.  2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆమెను రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా నియమించారు. చైర్ పర్సన్ హోదాలో ఆమె జగన్ మెప్పు పొందేందుకు చేయగలిగినంతా చేశారు. ప్రతిపక్ష పార్టీ నేతలకు నోటీసులు ఇచ్చారు. ఏకంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు సైతం నోటీసులు జారీ చేశారు. వార్డు వలంటీర్లపై పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు కమిషన్ ముందు హాజరై వివరణ ఇవ్వాలంటూ ఆమె పవన్ కు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. పవన్ హాజరు కాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు నమోదు చేయాలని ఆదేశించారు. ఇన్ని చేసినా వాసిరెడ్డి పద్మకు ఆమె కోరినట్లుగా పార్టీ టికెట్ లభించకపోవడంతో అలిగి పదవికి రాజీనామా చేశారని, ఇది జగన్ కు షాకేననీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు. ఒకరైతు తనకు చేసిన సేవలకు ప్రీతి చెందిన గురువు అతడికి స్వర్గ ప్రాప్తిని కలగజేయాలని అనుకుంటాడు. కానీ సంసారాసక్తి వల్ల ఆ రైతు ఆ అవకాశాన్ని వాయిదా వేసుకుంటూ వస్తాడు. చివరికి గురుకృప వల్ల ఆ రైతు స్వర్గ ప్రాప్తిని ఎలా పొందాడో ఈ కథ తెలియజేస్తుంది. "ఒక మహాపురుషుడు ప్రయాణం చేస్తూ, డస్సిపోయాడు. గొంతు ఎండిపోయింది. దారిలో ఒక రైతు కనపడితే నీళ్ళు అర్థించాడు. ఆ రైతు మహాత్మునికి సకల ఉపచారాలూ చేశాడు. చిరిగిపోయిన ఆయన ఉత్తరీయాన్ని రైతు జాగ్రత్తగా కుట్టి బాగుచేశాడు. రైతు పరిచర్యలకు సంతసించిన ఆ మహాత్ముడు శాంతి, ఆనందాలకు నిలయమైన స్వర్గానికి తనతోపాటు రమ్మని అంటాడు. అందుకు ఆ రైతు 'గురువుగారూ! మీరు నా మీద చూపిన దయకు కృతజ్ఞుణ్ణి. కానీ నా పిల్లలు ఇంకా చిన్నవాళ్ళు. ఓ ఏడేళ్ళ వ్యవధి ఇవ్వండి' అని అడుగుతాడు. అందుకు గురువు అంగీకరించాడు. సరిగ్గా ఏడేళ్ళ తర్వాత గురువు రైతును స్వర్గానికి తీసుకువెళ్ళడానికి వచ్చాడు. అప్పుడు రైతు 'అయ్యా! కడపటి కొడుకు కష్టాలకు అంతు లేదు. అన్ని జంఝాటాలనూ ఒక్కడే సంబాళించుకోలేకపోతున్నాడు. కాబట్టి మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని గురువుని అడిగాడు. మరో ఏడేళ్ళ తరువాత గురువు వచ్చాడు. కానీ రైతు చనిపోయాడని తెలిసింది. చనిపోయిన ఆ రైతు ఎద్దుగా పుట్టాడని ఆ గురువు తన దివ్య దృష్టితో తెలుసుకున్నాడు. ఎద్దుగా పుట్టిన ఆ రైతు తన కొడుకు పొలాన్నే దున్నుతున్నాడు. అప్పుడు గురువు ఆ ఎద్దుపై మంత్ర జలం చిలకరించగానే ఎద్దు జన్మనెత్తిన రైతు 'నా కొడుకు పరిస్థితి మరి కాస్త మెరుగు పడనీయండి స్వామీ! మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని అన్నాడు. ఇక చేసేది లేక వెనుదిరిగాడు గురువు. మరలా ఏడేళ్ళ తర్వాత వచ్చిన గురువుకు ఎద్దు చనిపోయిందని తెలిసింది. అది కుక్కగా పుట్టి కొడుకు ఇంటినీ, ఆస్తినీ కాపలా కాస్తోందని తన దివ్యదృష్టి ద్వారా తెలుసుకున్నాడు. గురువు. కుక్కగా పుట్టిన ఆ రైతు 'స్వామీ! నేను ఎంత దౌర్భాగ్యుణ్ణి. మీరు ఇంత దయ చూపుతున్నప్పటికీ మీతో స్వర్గమానం చేయలేకున్నాను. వీడికి ఆస్తిని కాపాడుకొనే దక్షత ఇంకా రాలేదు. కాబట్టి దయ చేసి మరో ఏడేళ్ళు వ్యవధి ఇవ్వండి' అని వేడుకున్నాడు. గురువు ఏడేళ్ళ తరువాత మళ్ళీ వచ్చేసరికి కుక్క మరణించింది. అది త్రాచుపాముగా జన్మనెత్తి, ఇప్పుడు కొడుకు భూమిలో ఉన్న లంకెబిందెలకు పడగెత్తి కాపలా కాస్తోంది. గుప్త ధనం ఇక్కడ ఉందని కొడుకుకి ఎలా తెలియజేయాలా అని పాము ఆలోచిస్తున్నప్పుడు గురువు ఆ రైతుకొడుకును పిలుచుకు వచ్చి లంకె బిందెలు ఉన్న చోట తవ్వమన్నాడు. లంకె బిందెలు బయటపడ్డాయి. ఆ పైన ఆ పామును చంపమన్నాడు. అనంతరం శిష్యుణ్ణి తీసుకొని స్వర్గారోహణం చేశాడు గురువు. సంసారంలోని ఈతి బాధల నుండి శిష్యుణ్ణి ఉద్ధరిస్తాడు సద్గురువు. అలాంటి గురువు అందరికీ అవసరం.                                      *నిశ్శబ్ద.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్  రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది.  80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత  ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది.   ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది. ఆమెది నెద‌ర్లాండ్స్‌. ఆమె తండ్రి నెద‌ర్లాండ్స్‌లోని ఆర్నెహెమ్‌లో చిన్న‌పిల్ల‌ల ఆస్ప‌త్రి డైరెక్ట‌ర్. పోయి దొరికిన ఆ పెయింటింగ్ విష‌యానికి వ‌స్తే.. అది 1683లో కాస్ప‌ర్ నెష‌ర్ వేసిన స్టీవెన్ ఓల్ట‌ర్స్ పెయింటింగ్‌. రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో నాజీల ఆదేశాల‌ను చార్లెట్ తండ్రి వ్య‌తిరేకించారు. ఆయ‌న ర‌హ‌స్య జీవ‌నం సాగించేడు. కానీ ఈ పెయింటింగ్‌ని మాత్రం త‌న న‌గ‌రంలోని ఒక బ్యాంక్‌లో భ‌ద్ర‌ ప‌ర‌చ‌మ‌ని ఇచ్చార‌ట‌. 1940లో నాజీలు నెద‌ర్లాండ్ పై దాడులు చేసినపుడు ఆ బ్యాంక్ మీద ప‌డి దోచుకున్నా రు. అప్పుడు ఈ పెయింటింగ్ కూడా తీసుకెళ్లారు. యుద్ధం అయిపోయిన త‌ర్వాత ఈ పెయింటింగ్ ఎక్క‌డున్న‌దీ ఎవ‌రికీ తెలియ‌లేదు. చిత్రంగా 1950ల్లో డ‌స‌ల్‌డార్ష్ ఆర్ట్ గ్యాల‌రీలో అది ప్ర‌త్య‌క్ష‌మ‌యింది. 1969లో ఆమ్‌స్ట‌ర్‌డామ్‌లో దాన్ని వేలానికి తీసికెళ్లే ముందు దాన్ని ఆ ఆర్ట్ గ్యాల‌రీలో వుంద‌ని చూసిన‌వారు చెప్పారు. వేలంపాట త‌ర్వాత మొత్తానికి ఆ పెయింటింగ్‌ను 1971లో ఒక క‌ళాపిపాసి త‌న ద‌గ్గ‌ర పెట్టుకున్నాడు.    ఆ త‌ర్వాత 2021లో అది చార్లెటీని చేరింది.  మొత్తానికి వూహించ‌ని విధంగా ఎంతో కాలం దూర‌మ‌యిన గొప్ప క‌ళాఖండం తిరిగి త‌న వ‌ద్ద‌కు చేర‌డంలో చార్లెటీ ఆనందానికి అంతేలేదు. అంతే క‌దా.. పోయింద‌నుకున్న గొప్ప వ‌స్తువు తిరిగి చేరితే ఆ ఆనంద‌మే వేరు!  అయితే చార్లెటీకి ఇపుడు ఆ పెయిం టింగ్‌ను భ‌ద్రంగా చూసుకునే ఆస‌క్తి వున్న‌ప్ప‌టికీ శ‌క్తి సామ‌ర్ధ్యాలు లేవు. అందుక‌నే త్వ‌ర‌లో ఎవ‌రిక‌యినా అమ్మేసీ వ‌చ్చిన సొమ్మును పిల్ల‌ల‌కు పంచుదామ‌నుకుంటోందిట‌!  చార్లెటీ కుటుంబంలో అయిదుగురు అన్న‌ద‌మ్ములు అక్క‌చెల్లెళ్లు వున్నారు. అలాగే ఇర‌వై మంది పిల్ల‌లు ఉన్నారు. అంద‌రూ ఆమె అంటే ఎంతో ప్రేమ చూపుతున్నారు. అంద‌రం ఒకే కుటుంబం, చాలాకాలం త‌ర్వాత ఇల్లు చేరిన క‌ళాఖండం మా కుటుంబానిది అన్న‌ది చార్లెటీ!
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు. చాకోను పార్టీలోకి ఆహ్వానిస్తూ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్’ ఫ్రంట్ ఏర్పాటు గురించి ప్రత్యేకించి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు కానీ, చాకో అలాంటి  సంకేతాలు ఇచ్చారు. ప్రస్తుతం దేశంలో ఉన్న ఏ ఒక్కపార్టీ కూడా బీజేపీకి ప్రత్యాన్మాయం కాదని,సమీప భవిష్యత్ కాంగ్రెస్ సహా ఏ పార్టీ కూడా ఆ స్థాయికి ఎదిగే అవకాశాలు కూడా కనిపించడంలేదని అన్నారు. ఈ పరిస్థితుల్లో దేశంలోని బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ, ఏకమై, ఒకే గొడుగు కిందకు రావలసిన అవసరం ఉందని చాకో అన్నారు. అదే సమయంలో ప్రతిపక్షాలను ఏక తాటిపైకి తెచ్చే బాధ్యతను పవార్ తీసుకోవాలని సంకేత మాత్రంగా చెప్పారు. అంతే కాకుండా కాంగ్రెస్ పేరు ఎత్తకుండా బీజేపీ వ్యతిరేక శక్తులను ఏకం చేసే ఆలోచన ఆ పార్టీ నాయకత్వానికి లేదని నెహ్రూ గాంధీ ఫ్యామిలీ (సోనియా, రాహుల్, ప్రియాంక)ఆలోచనా ధోరణిని పరోక్షంగానే అయినా ఎండ కట్టారు.ఆ విధంగా పవార్ ఆ బాధ్యత తీసుకోవాలని చాకో సూచించారు. ఇందుకు సంబంధించి, పవార్ బహిరంగంగా ఎలాంటి వ్యాఖ్య చేయలేదు. అయితే, చాకో సహా మరికొందరు ‘సీనియర్’ కాంగ్రెస్ నాయకులు, అలాగే సిపిఎం, సిపిఐ నాయకులు కూడా పవార్’తో చాలా కాలంగా థర్డ్ ఫ్రంట్  విషయంగా చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. అయితే మహారాష్ట్రలో సంకీర్ణం మనుగడను దృష్టిలో ఉంచుకుని పవార్ ఆచితూచి అడుగులేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే చాకో పార్టీలో చేరిన సందర్భంలో కూడా ‘చాకో చేరికతో మహారాష్ట్రలోని మహా వికాస్ అగాడీ ప్రభుత్వానికి ఎలాంటి నష్టం జరగదని, పవార్ మహారాష్ట్ర సంకీర్ణ సర్కార్ ప్రస్తావన చేశారని విశ్లేషకులు పేర్కొంటున్నారు.  మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వ మనుగడ గురించ్బి  పవార్ ప్రత్యేకంగా పేర్కొనడం ద్వారా, ఆయన థర్డ్ ఫ్రంట్ విషయంలో వేచి చూసే ఆలోచనలో ఉన్నట్లు అర్థమవుతోందని కూడా  రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే అదే ఎన్సీపీ అసెంబ్లీ ఎన్నికల జరుగతున్న కేరళలో, పశ్చిమ బెంగాల్లో  కాంగ్రెస్ వ్యతిరేక పార్టీలకు మద్దతు ఇస్తోంది. దీన్ని బట్టి చూస్తే, ఎన్సీపీ - కాంగ్రెస్ మధ్య దూరం పెరుగుతోందని స్పష్టమవుతోంది. అయితే, థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఏ రకంగా ముడి పడుతుంది అనే విషయంలో ఇంకా స్పష్టత రావలసి ఉంది. అలాగే, కాంగ్రెస్ లేకుండా జాతీయ స్త్గాయిలో బీజేపీ వ్యతిరేక కూటమిని ఏర్పాటు చేయడం వలన, వ్యతిరేక ఓటు చీలి  అది మళ్ళీ బీజేపీకే మేలు చేస్తుందని, కాబట్టి, ప్రస్తుతం కాంగ్రెస్ సారధ్యంలోని యూపీఏని బలోపేతం చేయడమే ఉత్తమమనే అలోచన కూడా  విపక్ష శిబిరం నుంచి వినవస్తోంది. ఈ నేపధ్యంలోనే, ప్రస్తుతం యూపీఏ ఛైర్పర్సన్’గా ఉన్న సోనియా గాంధీ వయసు, అనారోగ్యం కారణంగా బాధ్యతల నుంచి తప్పుకుని పవార్’కు బాద్యతలు అప్పగించాలనే ప్రతిపాదన వచ్చిందని అంటున్నారు. అలాగే, ఇతర పార్టీలను, ముఖ్యంగా కాంగ్రెస్ నుంచి విడిపోయి సొంత కుంపటి పెట్టుకున్న మమతా బెనర్జీ సారధ్యంలోని తృణమూల్, జగన్మోహన్ రెడ్డి సారధ్యంలోని వైసీపీలను కలుపుకుని కూటమిని బలోపేతం చేయడం ద్వారా బీజేపీని దీటుగా ఎదుర్కోవచ్చనే ఆలోచనలు కూడా సాగుతున్నాయి. అయితే, ఇటు థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు అయినా, యూపీఏని బలోపేతం చేయడమే అయినా, పవారే .. కేంద్ర బిందువు. ఆయన సారధ్యంలోనే ప్రత్యాన్మాయం అనేది విపక్ష శిభిరం నుంచి వినవస్తున్న ప్రస్తుత సమాచారం. మరి అదే జరిగితే రాహుల గాంధీ పరిస్థితి ఏమిటి ? గాంధీ నెహ్రూ కుటుంబం పరిస్థితి ఏమిటి? ఏ ప్రత్యేక ప్రాధాన్యత లేకుండా అందరిలో ఒకరిగా ఫస్ట్ ఫ్యామిలీ సర్దుకు పోతుందా? అంటే..చివరకు ఏమవుతుందో .. ఇప్పుడే చెప్పలేమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది. గతంలో అనేక సందర్భాలలో ముఖ్యమంత్రి కేసీఆర్,ఆర్థిక మంత్రి హరీశ రావు, కరోనా కారణంగా రాష్ట్ర  ఆదాయం గణనీయంగా తగ్గిందని, పేర్కొన్నారు. అయితే, కరోనా నుంచి వేగంగా కోలుకుని, ఆర్థికంగా అంతే వేగంగా పుంజుకున్న రాష్ట్రాలలో తెలంగాణ ప్రధమ స్థానంలో  ఉందని కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సర్వే 2020-21 నివేదిక పేర్కొంది. పడిలేచిన కెరటంలా, తెలంగాణ ‘వీ’ ఆకారంలో ఆర్థికంగా నిలతొక్కుందని కేంద్రం జనవరి  చివరి వారంలో విడుదల చేసిన ఆర్థిక సర్వేలో పేర్కొంది. అలాగే, రెవిన్యూ వసూళ్ళలో రాష్ట్రం కరోనా పూర్వస్థితికి చేరిందని కూడా సర్వే చెప్పింది.   అలాగే,రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు కూడా ఈ మధ్య కాలంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పై సంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరమ జనవరి,ఫిబ్రవరి, మార్చి నెలలతో పోలిస్తే ఈ సంవత్సరం ఈ మూడు నెలల కాలంలో రాష్ట్ర ఆర్థిక వృద్ది రేటు 10 నుంచి  15 శాతం మెరుగ్గా ఉందని హరీష్ రావు ఒకటి రెండు ఇంటర్వ్యూలలో పేర్కొన్నారు.అలాగే, బడ్జెట్ విషయంలోనూ ఆయన చాల ఆశావహ దృక్పథంతోనే ఉన్నారు. బడ్జెట్  పాజిటివ్’గా ఉంటుదని, ఎవ్వరూ ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని, సంక్షేమ పథకాలలో,ఇతరత్రా బడ్జెట్ కేటాయింపులలో ఎలాంటి కోతలు ఉండవని కూడా హరీష్ హామీ ఇచ్చారు. గత సంవత్సరంలో కొంత మేర హామీ ఇచ్చిన మేరకు అమలు చేయలేక పోయిన సొంత జాగాలలో డబల్ బెడ్ రూమ్ ఇళ్ళ నిర్మాణం, రుణ మాఫీ వంటి  పథకాలను ఈ బడ్జెట్ ద్వారా అమలు చేస్తామని చెప్పారు. అలాగే, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ తమిళి సై చేసిన ప్రసంగంలోనూ ఆశావహ దృక్పధమే వ్యక్తమైంది. ఆమె తమ ప్రసంగంలో,  ప్రభుత్వం సంక్షేమ పథకాలకు పెద్ద పీట వేసిందని అన్నారు. ‘సంపద పంచాలి ,పేదలకు పంచాలి’ అనేది తమ ప్రభుత్వ విధానమని స్పష్టం చేశారు. అలాగే, పెరుగతున్న ఆదాయంలో అధికశాతం సంక్షేమానికే వెచ్చిస్తున్నామని స్పష్టం చేశారు. దీంతో బడ్జెట్’లో కొత్త పథకాలకు శ్రీకారం చుట్టే అవకాశం ఉంటుందా అన్న చర్చ జరుగుతోంది. మరో వంక ఉద్యోగ వర్గాల్లో పీఆర్సీకి సంబంధించి ఆర్థిక మంత్రి తమ ప్రసంగంలో  ప్రకటన చేస్తారా లేదా అనే ఆసక్తి నెలకొంది. అలాగే, సామాన్య  ప్రజలు ఇటీవల పెరిగిన పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరల భారం నుంచి మంత్రి హరీష్, ఏదైనా ఉపసమనం కలిపిస్తారా అని ఎదురు చూస్తున్నారు. గతంలో వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సామాన్య ప్రజలపై వంటగ్యాస్ ధర భారాన్ని తగ్గించేందుకు కొంత మొత్తాన్ని, రూ.50(?) రాష్ట్ర ప్రభుత్వం తరపున  సబ్సిడీగా ఇచ్చిన విషయాన్ని, అదే విధంగా అసెంబ్లీ ఎన్నికలు జరుగతున్న తమిళనాడులో డిఎంకే పార్టీ,తమ పార్టీని అధికారంలోకి వస్తే  గ్యాస్ బండపై వంద రూపాయల సబ్సిడీ ఇస్తామని చేసిన  వాగ్దానాన్ని  గుర్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే, ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు, సోమవారం ఆర్థిక మంత్రి హరీష్ రావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఆర్థిక  శాఖ ముఖ్య కార్యదర్శి రామ కృష్ణా రావు,సలహాదారు జీఆర్ రెడ్డితో బడ్జెట్ పద్దులఫై సుదీర్ఘంగా చర్చించి తుది మెరుగులు దిద్దారు. బడ్జెట్ తుది రూపం సిద్దమైన నేపధ్యంలో ఆర్థిక శాఖ ప్రింటింగ్ ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 18 ఉదయం మంత్రి వర్గం ఆమోదం పొందిన అనంతరం ఆర్థికమంత్రి హరీష్ రావు అదే రోజు రాష్ట్ర బడ్జెట్ 2021-22ను సభలో ప్రవేశ పెడతారు. 20, 22 తేదీల్లో బడ్జెట్‌పై సాధారణ చర్చ,23, 24, 25 తేదీల్లో బడ్జెట్‌ పద్దులపై చర్చ ఉంటుంది 26న ద్రవ్యవినిమయ బిల్లు (బడ్జెట్)పై చర్చ, సభామోదం ఉంటాయి.
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది.  అధికార తెరాస, ఖమ్మం స్థానానికి సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర రెడ్డి పేరును ప్రకటించడంలో కొంచెం జాప్యం చేయడంతో పాటుగా, హైదరాబాద్ స్థానం నుంచి , పీవీ కుమార్తె వాణీ దేవి పేరును చివరి క్షణంలో తెరమీదకు తేవడంతో అంత వరకు కొంత స్తబ్దుగా సాగిన ప్రచారం ఆ తర్వాత వేడెక్కింది. ఉద్యోగ నియామకాల విషయంలో తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ తప్పులో కాలేయడంతో విపక్షాలు, పోటీలో ఉన్న ప్రత్యర్ధులు, నిరుద్యోగ యువత, విద్యార్ధి సంఘాలు  ఒకే సారి ఆయన మీద  విరుచుకు పడ్డారు. ఆయన లెక్క తప్పని నిరుపిస్తం రమ్మని వరస సవాళ్ళు విసిరారు. దీంతో, మంత్రి నియామకా ఇష్యూని పక్కకు తప్పించేందుకు , ఐటీఐఆర్, వరంగల్ రైల్వే ఫ్యాక్టరీ వంటి సెంటిమెంటల్ ఇష్యూస్’ను తెరపైకి  తెచ్చారు. అలాగే, కేంద్ర ప్రభుత్వంపై విమర్శల దాడిని పెంచారు. చివరకు పొరుగు రాష్ట్రానికి చెందిన విశాఖ ఉక్కు ఆందోళన   కూడా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగమైంది.   రెండు నియోజక వర్గాలలో గతంతో పోలిస్తే ఈసారి ఓటర్ల సంఖ్య రెట్టింపు అయింది. ఈసారి రెండు నియోజక వర్గాలలో కలిపి 10 లక్ష 36 వేల మంది తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. అలాగే, రెండు పట్ట భద్రుల నియోజక వర్గాల్లో 164 మంది అభ్యర్ధులు పోటీలో ఉన్నారు.  గత ఎన్నికలతో పోలిస్తే ఇటు ఓటర్ల సంఖ్య, అటు అభ్యర్థుల సంఖ్యా రెట్టింపునకు పైగానే పెరగడంతో ఎన్నికలలో జోష్ పెరిగింది. దీనికితోడు అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో సాధారణ ఎన్నికలను తలపించే రీతిలో ప్రచారం సాగింది. ఎక్కువమంది అభ్యర్ధులు బరిలో ఉండడంతో, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి  తమకే ప్రయోజనం జరుగుతుందని అధికార పార్టీ ఆశపడుతోంది .  దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో చేదు ఫలితాలను చవిచూసిన టీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా వ్యూహ రచన చేసి కేటీఆర్, హరీష్ సహా మంత్రులు,ఎమ్మెల్యేలకు స్పెసిఫిక్ బాధ్యతలు అప్పగించారు. అలాగే,కాంగ్రెస్‌ అభ్యర్థులు చిన్నారెడ్డి, రాములునాయక్‌లకు మద్దతుగా ఉత్తమ్‌, భట్టి, రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తదితరులు విస్తృతంగా ప్రచారం చేశారు. బీజేపీ అభ్యర్థులు ఎన్‌.రాంచందర్‌రావు, ప్రేమేందర్‌రెడ్డిల తరఫున ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, ఎంపీ అరవింద్‌ తదితరులు ప్రచారాన్ని వేడెక్కించారు.  ఖమ్మం స్థానం నుంచి ప్రత్యక్ష ఎన్నికల్లో తొలిసారి పోటీకి దిగిన కోదండరాంకు, టీజేఎస్‌ పార్టీకీ ఈ ఎన్నికలు కీలకంగా మారాయి. ఖమ్మ స్థానం నుంచి పోటీ చేస్తున్న తీన్మార్ మల్లన్న ముందస్తు వ్యూహంతో ప్రధాన పార్టీల అభ్యర్ధులకు ధీటుగా ప్రచారం సాగించారు.  వామపక్షాల మద్దతుతో జయసారథి, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్‌, యువతెలంగాణ కార్యనిర్వాహక అధ్యక్షురాలు రాణీ రుద్రమ తదితరులు పోటీలో ఖమ్మం సీటును పట్టభద్రులు  ఎవరికి  పట్టం కడతారు అన్నది ప్రశ్నార్థకంగా మారింది. హైదరాబాద్ సీటు కూడా ఇటు అధికార తెరాసకు అటు సిట్టింగ్ సీటును నిలుపుకోవడం తో పాటుగా దుబ్బాక , జీహెచ్ఎంసి జోష్ ను కొనసాగించాలని ఆశ పడుతున్నబీజేలకే కూడా ఇజ్జత్ కీ సవాల్ గా మారింది. కాంగ్రెస్ అభ్యర్ధి పార్టీ సీనియర్ నాయకుడు సౌమ్యుడు, మాజీ మంత్రి చిన్నారెడ్డి, వామ పక్షాల మద్దతుతో పోటీ చేస్తున్న మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ కూడా గట్టి పోటీ ఇస్తున్నారు. సో.. చివరకు ఏమి జరుగుతుంది అంటే ఏదైనా జరగవచ్చును. ఈ నెల 14 వ తేదీన పోలింగ్ జరుగుతుంది.17 ఫలితాలు వస్తాయి .. అంతవరకు వెయిట్ అండ్ వాచ్ .  
సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది. ఒకప్పుడు ఎర్ర జెండాను దిగ్విజయంగా ఎదిరించి, మార్క్సిస్టులను మట్టి కరిపించిన మమతా దీదీ ప్రస్తుతం, కాషాయ కూటమి నుంచి గట్టి సవాలును ఎదుర్కుంటున్నారు. వరసగా పదేళ్ళు పాలించడం వలన సహజంగా వచ్చిన ప్రభుత్వ వ్యతిరేకత  కంటే, హిందూ ఓటు పోలరైజేషన్ ఆమెను మరింతగా భయపెడుతోంది. నిజానికి ఐదేళ్ళ క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం ఐదు శాతం కంటే తక్కువ ఓట్లు, మూడంటే మూడు అసెంబ్లీ సీట్లు మాత్రమే గెలుచుకున్న బీజేపీ..  2019 లోక్ సభ ఎన్నికల్లో ఏకంగా 40 శాతం ఓట్లతో 18 స్థానాలు గెలుచుకుంది. ఈ  మార్పు ఇంకా కొన్ని కారణాలు ఉంటే ఉండవచ్చును కానీ.. హిందువుల ఓటు పోలరైజ్  కావడమే ప్రధాన కారణం.  ఈ నేపధ్యంలోనే కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ చివరకు కమ్యూనిస్టులు కూడా బీజేపీలో  చేరారు. ఎన్నికల ప్రకటన వెలువడిన తర్వాత కూడా సిట్టింగ్ ఎమ్మెల్ల్యేలు సహా  తృణమూల్ టికెట్ వచ్చిన నాయకులు కూడా బీజేపీలో చేరుతున్నారు. అనేక మంది ఇతర రంగాల ప్రముఖులు, ముఖ్యంగా ఇంతకాలం, బీజేపీని హిదుత్వ అనుకూల ‘అచ్చుత్’ (అంటారని) పార్టీగా చూసిన ‘సెక్యులర్’ ప్రముఖులు కాషాయం కప్పుకోవడంతో మమతా బెనర్జీకి కొంచెం అలస్యంగానే అయినా, తత్త్వం బోధపడింది. అందుకే ఆమె ఇప్పుడు గుళ్ళూ,గోపురాలకు తిరుగుతున్నారు. కార్యకర్తల సమావేశాల్లో తానూ హిందువునేనని, చెప్పుకుంటున్నారు.  నిజానికి ఇలా నేనూ హిందువునే  అని సెక్యులర్ నేతలు బహిరంగంగా ప్రకటించుకోవడం మమతా బెనర్జీతోనే మొదలు కాలేదు. రాహుల్ గాంధీ తాను హిందువునని, జన్యుధారీ కశ్మీరీ బ్రాహ్మణుని అనీ.. తమ గోత్రం, ‘దత్తాత్రేయ’ గోత్రమని బహిరంగంగా ప్రకటించుకున్నారు. అలాగే  కొద్ది రోజుల క్రితం ప్రియాంకా గాంధీ తానూ హిందువునని చెప్పుకునేందుకు ‘మౌని అమావాస్య’ సందర్భంగా అలహాబాద్ లో గంగా స్నానం చేశారు. గతంలోనూ ఆమె ఎన్నికలకు ముందు గంగా యాత్ర చేశారు. అంతవరకు ఎందుకు కొద్దిరోజుల క్రితం సిపిఐ నారాయణ విశాఖ స్వామి ఆశీస్సులు తీసుకున్నారు. చంద్రబాబు, జగన్ రెడ్డి, కేసీఆర్ ఇలా తెలుగు నేతలు అనేక మంది లౌకిక వాదానికి కాలం చెల్లిందన్న సత్యాన్ని గ్రహించి కావచ్చు ‘నేనూ హిందువును’ అంటూ ప్రకటించుకునేందుకు పోటీ పడుతున్నారు. రాముడిని తలచుకున్నా, జై శ్రీరామ్ అన్నా తమ  లౌకిక వాదం మయలపడి పోతుందని భయపడిన నాయకులు ఇప్పుడు .. జై శ్రీరామ్ అనేందుకు కూడా వెనకాడడం లేదు.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది. గత కొంత కాలంగా సబర్మలతో సహా అనేక అంశాలపై స్పందిస్తూ.. కేరళను టార్గెట్ చేస్తున్న బీజేపీ నాయకులు అక్కడ తమ జెండా ఎగరేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా పార్టీ పాలసీని కూడా పక్కన పెట్టి మెట్రో మ్యాన్ శ్రీధరన్ ను పార్టీలో చేర్చుకుని ఆయనే తమ సీఎం అభ్యర్థి అని ప్రకటించిన 24 గంటలలో యూ టర్న్ తీసుకున్నారు. ఇది ఇలా ఉండగా ప్రస్తుతం సీఎంగా ఉన్న కమ్యూనిస్ట్ నేత పినరై విజయన్ పై గోల్డ్ స్మగ్లింగ్ ఆరోపణలు రావడంతో.. ఈ ఎన్నికలలో ఎల్డిఎఫ్ భవిష్యత్తుపై ప్రజలు ఏ తీర్పు ఇవ్వబోతున్నారనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది ఈ నేపథ్యంలో అక్షరాస్యతలో దేశంలోనే మొదటి స్థానంలో ఉన్న ఆ రాష్ట్ర ప్రజలు ఎవరిని ఆశీర్వదిస్తారు అనే అంశంపై ప్రముఖ మీడియా సంస్థ టైమ్స్ నౌ, సీ ఓటరుతో కలిసి ఒక సర్వేను నిర్వహించారు. ఈ సర్వే ప్రకారం చూస్తే పాపం కమలనాథులు అక్కడ పవర్ చేతికి రావటం అటుంచి కనీసం రెండు మూడు అసెంబ్లీ స్థానాల్లో గెలవటం కూడా కష్టమేనని ఆ సర్వే తేల్చి చెబుతోంది. కేరళలో ఈసారి జరిగే అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ తన హవా చాటుతుందన్న ఆ పార్టీ నేతల మాటలలో ఎలాంటి నిజం లేదని.. ప్రస్తుతానికి అది ఏమాత్రం సాధ్యం కాదని ఈ తాజా సర్వే తేల్చి చెప్పింది. అంతేకాకుండా మొత్తం 140 స్థానాలు ఉన్న కేరళలో.. ప్రస్తుత సీఎం పినరయి విజయన్ నేతృత్వంలోని లెఫ్ట్డ్ డెమొక్రటిక్ ఫ్రంట్ కు 82 సీట్లు పక్కా అని.. ఆయనే తిరిగి అధికారాన్ని నిలబెట్టుకుంటాడని సర్వే చెపుతోంది. అదే సమయంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూనైటెడ్ డెమొక్రాటిక్ ఫ్రంట్ కు 56 నుంచి 60 వరకు సీట్లు వచ్చే అవకాశం ఉందని ఈ సర్వేలో తేలింది. అంతేకాకుండా 2016 ఎన్నికలతో పోలిస్తే ఎల్ డీఎఫ్ ఓటింగ్ శాతం కూడా కొంత పెరగటం ఇక్కడ గమనార్హం. ప్రస్తుతం సీఎంగా ఉన్న విజయన్ మరోసారి సీఎం కావాలని 43.34 శాతం మంది మొగ్గు చూపినట్లుగా సర్వేలో తేలింది. కరోనా సమయంలో విజయన్ సీఎంగా బాగా పని చేసారని ఈ సర్వే పేర్కొంది. మరోపక్క దేశ ప్రధానిగా రాహుల్ గాంధీ ఉండాలని కేరళ ప్రజల్లో 55.84 శాతం మంది కోరుకుంటున్నట్లుగా ఈ సర్వే;లో తేలింది. అయితే కేరళలో ఎలాగైనా పాగా వేయాలని పట్టుదలతో కృషి చేస్తున్న బీజేపీకి ఈసారి కూడా నిరాశ తప్పదని ఈ సర్వేలో స్పష్టం అయింది. ఈ ఎన్నికలలో బీజేపీకి రెండు సీట్లు కూడా రావటం కూడా కష్టమేనని ఈ సర్వే తేల్చింది. అయితే ఎన్నికలకు ముందు ఇలాంటి సర్వేలు బయటకు రావడం.. తరువాత అందులో కొన్ని చతికిల పడడం మనం చూస్తూనే ఉన్నాం. మరి ఈ సర్వే ఫలితాలు నిజామా అవుతాయో లేదో తేలాలంటే కొద్దీ రోజులు వెయిట్ చేయాల్సిందే.        
రాజకీయాలు అంటేనే అదో జూదం. పూలమ్మిన చోటనే కట్టెలు అమ్మవలసి రావచ్చును. అలాంటి పరిస్థితే వచ్చినా, తలవంచుకుని పోగలిగితేనే, ఎవరైనా రాజకీయాలలో రాణించగలరు. అలాకాదని, అలిమి కానిచోట, కూడా తామే అధికులమని భావిస్తే, ఎందుకూ కాకుండా పోతారు. అలాంటి వారు ఇద్దరూ కూడా ఇప్పుడు మన కళ్ళముందే ఉన్నారు.  జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు. అలాగే జయ మరణం తర్వాత ఆమె పరిస్థితి ఏమిటో కూడా వేరే చెప్పవలసిన, అవసరం లేదు. జైలు పాలయ్యారు. సర్వం తానై నడిపించిన పార్టీ నుంచి  బహిష్కరణకు గురయ్యారు. జయ ఉన్నంత వరకు తన వారుగా ఉన్న వారందరూ కానివారయ్యారు. ఒంటరిగా మిగిలారు.  నిజానికి నాలుగేళ్ళు జైలు జీవితం గడిపిన తర్వాత కూడా ఆమె తలచుకుంటే.. రాష్ట్ర రాజకీయాలలో, ముఖ్యంగా అధికారంలో ఉన్న డిఎంకే కూటమిలో అలజడి సృష్టించగలరు. ఎన్నికలలో ఆమె గెలవక పోవచ్చును కానీ.. తనను కాదన్న అన్నాడిఎంకేను ఓడించగలరు. అయిన  ఆమె అందుకు విరుద్ధంగా  రాజకీయాలకు వీడ్కోలు పలికి మౌనంగా పక్కకు తప్పుకున్నారు. రాజకీయ సన్యాసం ప్రకటించారు. ఉమ్మడి శతృవు డిఎంకే ను ఓడించేందుకు అన్నా డిఎంకే కూటమి  పోటీ చేయాలని, కూటమి ఐక్యతను దెబ్బతీయరాదనే ఉద్దేశంతోనే ఆమె రాజకీయ సన్యాసం ప్రకటించారు.    శశికళ మౌనంగా వెళ్లి పోవడం వెనక ఇంకా అనేక కారణాలున్నా ,అసలు కారణం ఆమె, రాజకీయ విజ్ఞత, వివేకం. ఆమె జైలుకు వెళ్ళిన సమయంలో జయలలిత సమాధి వద్ద ఎంత కసిగా, కోపంగా ‘మౌన’ ప్రతిజ్ఞ చేశారో చూశా. అలాంటి ఆమె ఇప్పుడు ఇలా ‘మౌనం’గా వెనకడుగు వేశారంటే, అది ఆలోచించ వలసిన విషయమే.ఆమె వ్యుహతంకంగానే సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే అనేక మంది అనేక కోణాల్లో శశికళ సంచలన నిర్ణయాన్ని విశ్లేషించారు.జైలు జీవితం తర్వాత కూడా అన్నా డిఎంకే నాయకులు తనను అగ్రనేతగా అంగీకరించక పోవడం, అమిత్ షా చెప్పినా.. అన్నా డిఎంకే నాయకులు ఆమెను, మేనల్లుడు దినకరన్’ను కులం పేరున, కుటుంబం పేరున దూరం చేయడం, తిరిగి పార్టీలోకి తీసుకోకపోవడంతో ఆమె మనసు కష్టపెట్టుకుని, సన్యాస నిర్ణయం తీసుకున్నారని కొందరంటున్నారు. పార్టీ మీద పట్టు లేదని, చరిష్మా అసలే లేదని, అందుకే ఆమె అలా నిశ్శబ్ధంగా రాజకీయ సన్యాసం స్వీకరించారని ఇంకొందరు విశ్లేషించారు. ఈ విశ్లేషణలో కొంత నిజం ఉంటే ఉండవచ్చును.. కానీ ఆమె గతాన్ని, నైజాన్ని గుర్తు చేసుకుంటే ఆమె స్ట్రైక్ బ్యాక్ వ్యూహంతోనే ఒకడుగు వెనక్కివేశారని ఆమెతో సన్నిహితంగా మెలిగినవారు, ఆమె రాజకీయ చాణక్యం తెలిసిన వారు అంటారు.   నిజానికి జైలులో ఉన్న కాలంలో కానీ, జైలు నుంచి విడుదలై వచ్చిన తర్వాత కానీ, ఆమె రాజకీయ సన్యాసం వైపు అడుగులు వేస్తున్నట్లు కనిపించలేదు. బెంగుళూరు జైలు నుంచి విడుదలై చెన్నైలో ప్రవేశించిన నప్పుడు ఆమె పెద్ద కాన్వాయ్ తో  తమ కారుకు అన్నాడిఎంకే జెండాతోనే ఎంటరయ్యారు. అలా ఎంట్రీలోనే రాజకీయ ఆకాంక్షను వెంట తెచ్చుకున్నారు. చివరకు ‘సన్యాస’ ప్రకట చేసే వరకు కూడా ఆమె రాజకీయ కార్యకలాపాలు సాగిస్తూనే ఉన్నారు. అటు ఢిల్లీని ఇటు చెన్నైనికూడా కదిల్చారు. అంతేకాదు, రాజకీయాలపై విరక్తితో కాదు, రాజకీయ కసితో, ఉమ్మడి శత్రువు (డిఎంకే) ను ఓడించేందుకే తాను రాజకీయాలనుంచి తపుకుంటున్నట్లు చెప్పారు.  సో .. సన్యాసం తీసుకోవాలనే ఆలోచన, రాజకీయవ్యూహం లోంచి పుట్టిందే కానీ,వైరాగ్యంతో పుట్టింది కాదు ,అన్నవిశ్లేషణ వాస్తవానికి ఇంకొంత దగ్గరగా ఉందని అనుకోవచ్చును. ఇది ‘కామా’నే కాని ‘ఫుల్స్టాప్’ కాదని అంటున్నారు.  ముఖ్యమంత్రి ఎడప్పాడి కే. పళని స్వామి (ఈపీఎస్) ఆమెను పార్టీలోకి అనుమతిస్తే తన కుర్చికీ ఎసరు పెడతారనే భయంతోనే,, ఆమె ఎంట్రీని అడ్డుకున్నారు. ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం, శశికళ ఒకే సామజిక వర్గానికి చెందిన వారు కావడం కూడా, ముఖ్యమంత్రి ఈపీఎస్’ భయానికి కారణంగా పేర్కొంటారు. అందుకే  ఆయన, ‘మన్నార్గుడి’ ఫ్యామిలీని బూచిగా చూపించి, ఆమెను దూరంగా ఉంచారని పార్టీలో ఒక వర్గం గట్టిగా విశ్వసిస్తుంది. అయితే ఆమె శక్తియుక్తులను కూడతీసుకుని  పులిలా పంజా విసిరేందుకే ఆమె వ్యూహాత్మకంగా ఒక అడుగు వెనక్కి వేశారు కావచ్చును అని కూడా, తమిళ రాజకీయ వర్గాల్లో ఒక చర్చ జరుగుతోంది.  గతంలో ఆమె జయలలితతో విబేధాలు వచ్చిన సమయంలో కూడా ఇలాగే కొద్ది కాలం మౌనంగా తెర చాటుకు వెళ్లి పోయారు.  కొద్ది కాలంలోనే మళ్ళీ ‘పోయస్ గార్డెన్’లో ప్రత్యక్షమయ్యారు. జయలలిత స్వయంగా ఆమెను వెనక్కి పిలుపించుకోవలసిన పరిస్థితులను సృష్టించారు. అలా  మళ్ళీ  చక్రం తిప్పారు. జయలలిత మరణం వరకు ఆమె అందరికీ చిన్నమ్మగా అమ్మకు పెద్దమ్మగా సర్వం తానై నిలిచారు. చివరకు జయ అంత్యక్రియల్లో కూడా ఆమెదే పై చేయిగా కనిపించింది.   జయలలిత చనిపోయిన సందర్భంలోనే అన్నా డిఎంకే ఎమ్మెల్ల్యేలో సుమారు 30 మంది వరకు ఆమెకు మద్దతుగా ఉన్నారన్న వార్తలొచ్చాయి. నిజానికి,ఇప్పటికి కూడా ఒక్క అన్నా డిఎంకే లోనేకాదు,డిఎంకే ఇతర పార్టీలలో కూడా  ఆమె అవసరం ఉన్న వాళ్ళు ఉన్నారు. కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో ‘మన్నార్గుడి’ ఫ్యామిలీ మద్దతు లేకుండా గెలిచే అవకాశం లేదు.  ఇవ్వన్నీ నిజమే అయినా.. అన్నీ ఉండి, ఎవరు లేని శశికళలో, ఇంకా  ఎవరి కోసం తాపత్రయ పడాలి? అనే ప్రశ్న జనించి ఉంటే, ఆమె రాజకీయ సన్యాసం నిజం కావచ్చును. ఎందుకంటే ఆమె నెచ్చలి, జయలిత లేరు, భర్త అంతకంటే ముందే చనిపోయారు, పిల్లలు లేరు... పైగా నాలుగేళ్ళ జైలు జీవితం ఆమెలో మార్పు తెచ్చి ఉండవచ్చును. ఈ వయస్సులో తనవారంటూ ఎవరు లేని తనకు రాజకీయాలు ఎందుకు ? శేష జీవితాన్ని ఇలా సాగిద్దామనే ఆలోచన నిజంగా వచ్చి ఉంటే, ఆమె సన్యాసం సత్యం అయినా కావచ్చును, కాకపోనూ వచ్చును. కానీ  శశికళ... ఆమెను అర్థం చేసుకోవడం, అంచనా వేయడం , అంత తేలిగ్గా అయ్యే పని కాదు..
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు. కాంగ్రెస్ అధినాయకత్వం పై నేరుగా అస్త్రాలు సంధించారు. రాహుల్ గాంధీ పేరు చెప్పకుండానే, ఆయన నాయకత్వానికి పనికిరాడని తేల్చి చెప్పారు. ఎవరైనా పార్టీ అధ్యక్షుడు అయితే కావచ్చును, కానీ, ప్రజానాయకుడు కాలేడని, రాహుల గాంధీ ప్రజానాయకుడు కాదు కాలేరు,అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తరచూ రాహుల్ గాంధీని ఉద్దేశించి చేసే  ‘నామ్’ధారీ వ్యంగ్యాస్త్రాన్నే కాంగ్రెస్ సీనియర్ నాయకులు కూడా సందించారు. ఇక అక్కడి నుంచి విధేయ, అసమ్మతి వర్గాల మధ్య మాటల యుద్ధం ఎదో ఒక రూపంలో సాగుతూనే వుంది. అదే క్రమంలో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ, కరుడు కట్టిన ముస్లిం మతోన్మాది, అబ్బాస్ సిద్దిఖీతో కాంగ్రెస్ పార్టీ చేతులు కలపడం అసమ్మతి నాయకులకు మరో అస్త్రాన్ని అందించింది. విషయంలోకి వెళితే, ఇటీవల పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా లోక్’సభలో కాంగ్రెస్ పక్ష నాయకుడు, పశ్చిమ బెంగాల్ పీసీసీ అధ్యక్షుడు అధీర్’రంజన్ చౌదరి, ముస్లిం మత ప్రచారకుడు, అబ్బాస్ సిద్దిఖీతో  వేదిక పంచుకున్నారు.అంతకు ముందే వామ పక్ష కూటమితో  పొత్తు కుదుర్చుకున్న కాంగ్రెస్ పార్టీ, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)ను కూటమిలో చేర్చుకుంది. ఇలా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) అమోదం లేకుండా మతోన్మాద ఐఎస్ఎఫ్’ తో ఎన్నికల పొత్తు పెట్టుకోవడం ఆ పార్టీ నాయకుడు,సిద్ధిఖీతో  పీసీసీ చీఫ్ వేదిక  పంచుకోవడం పై అసమ్మతి నేతలు మండి పడుతున్నారు. ఇలా సిద్దిఖీతో వేదిక పంచుకోవడం పార్టీ మౌలిక సిద్ధాంతాలకు వ్యతిరేకం అంటూ అసమ్మతి వర్గానికి చెందిన కీలక నేత, రాజ్యసభ సభ్యుడు,ఆనంద్ శర్మ మండిపడ్డారు. అంతే కాదు, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)తో జనవరిలో కుదుర్చుకున్న పొత్తుకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ)అమోదం లేదని ఆనంద్ శర్మ, అభ్యంతరం వ్యక్త చేశారు. పార్టీ విశ్వసించే లౌకిక వాదానికి కాంగ్రెస్ అధిష్టానం తీసుకున్న నిర్ణయం గొడ్డలి పెట్టని ఆయన తీవ్రంగా స్పందించారు.   శర్మ వ్యాఖ్యలపై అధీర్ రంజన్ చౌదరి అంతే ఘాటుగా ప్రతిస్పందించారు. “నిజాలు తెలుసుకోండి ఆనంద్ శ‌ర్మ జీ” అంటూ ఆయ‌న వ‌రుస ట్వీట్లు చేశారు. వ్య‌క్తిగ‌త ప్ర‌యోజ‌నాలు ప‌క్క‌న‌పెట్టి, ప్ర‌ధానిని పొగిడి టైమ్ వేస్ట్ చేయ‌కండంటూ ఆయ‌న ఓ ట్వీట్లో అన్నారు. ఆనంద్ శ‌ర్మ అన‌వ‌స‌రంగా కాంగ్రెస్‌ను ల‌క్ష్యంగా చేసుకుంటున్నార‌ని, ఈ అంశాన్ని పెద్ద‌ది చేసి చూపిస్తున్నార‌ని విమ‌ర్శించారు. ఆయ‌న ఉద్దేశాలు స‌రైన‌వే అయితే నేరుగా తనతో మాట్లాడ వలసిందని అన్నారు. బెంగాల్‌లో సీపీఐ(ఎం) కూట‌మికి నేతృత్వం వ‌హిస్తోంది. అందులో కాంగ్రెస్ ఓ భాగం. మ‌త‌తత్వ‌, విభ‌జ‌న రాజ‌కీయాలు చేస్తున్న బీజేపీకి చెక్ పెట్ట‌డానికే ఈ కూట‌మి అని మ‌రో ట్వీట్‌లో అధిర్ రంజ‌న్ అన్నారు. అక్కడతోనూ ఆగలేదు ... ట్వీట్ల మీద ట్వీట్లు సంధిస్తూ, ఆనంద్ శర్మ, బీజేపీ మత విభజన, అజెండాను బలపరుస్తున్నారని, పరోక్షంగా జీ23 నాయకులు బీజేపీకి ప్రయోజనం చేకూరుస్తున్నారని ఆరోపించారు.అంతే కాదు, క్షేత్ర స్థాయి వాస్తవ పరిస్థితులు తెలియకుండా, ఆనంద్ శర్మ పార్టీ మీద దండెత్తడం ఉచితం కాదని చౌదరి ఎదురుదాడి చేశారు. అసమ్మతిలో అసమ్మతి. ఇదలా ఉంటే, కాంగ్రెస్ పార్టీ  సమూల పక్షాళన కోరుతూ సోనియా గాంధీకి,గత సంవత్సరం  జీ 23గా ప్రాచుర్యం పొందిన సీనియర్ నాయకులు రాసిన లేఖపై సంతకాలు చేసిన  నాయకుల్లో నలుగురు,జమ్మూలోసమావేసమైన నాయకుల తాజా నిర్ణయాలు, వ్యాఖ్యలు,విమర్శల పట్ల అసంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరం సోనియా గాంధీకి రాసిన లేఖలో ప్రస్తావించిన అంశాలకు కట్టుబడి ఉన్నామని, అయితే, జీ 23లోని కొందరు సహచరులు, ఇటీవల గీతదాటి చేస్తున్న వ్యాఖ్యలు, విమర్శలను తాము సమర్ధించడం లేదని ఆ నలుగురు పేర్కొన్నారు. ఇందులో ముఖ్యంగా, రాజ్యసభ మాజీ డిప్యూటీ చైర్మన్, పీజే కురియన్ అయితే, “కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు అవసరమైన సంస్కరణలు తెచ్చేందుకు చేసే ప్రయత్నాలను పూర్తిగా సమర్దిస్తాను, కానీ, ‘లక్ష్మణ రేఖ’ దాటితే ఒప్పుకునేది లేదు”అని అసమ్మతిలో అసమ్మతికి తెర తీశారు.అలాగే, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ కుమారడు, మాజీ ఎంపీ సందీప్ దీక్షిత్,మధ్య ప్రదేశ్ సీనియర్ కాంగ్రెస్ నాయకుడు అజయ్ సింగ్’ కూడా గులాం నబీ ఆజాద్, కపిల్ సిబల్, ఆనంద్ శర్మ, మనీష్ తివారీ వంటి జీ 23 కీలక నేతలు అధినాయకత్వంపై చేసిన వ్యాఖ్యలను తప్పు పట్టారు. అలాగే, పార్టీ సీనియర్ నాయకుడు కేంద్ర మాజీమంత్రి వీరప్ప మొయిలీ కూడా,గత సంవత్సరం పార్టీ సీనియర్ నాయకులు  ఒక పరిమిత లక్ష్యంతో  సోనియా గాంధీకి లేఖ రాయడం జరిగిందని, ఆ పేరున జరుగతున్న  కార్యక్రమాలు లేఖ సంకల్పానికి  విరుద్ధమని అన్నారు. జీ 23 కార్యకలాపాలపై రాహుల్ గాంధీ కూడా పరోక్షగా స్పందించారు, ఒకప్పుడు ఎన్ఎస్’యుఐ, యూత్ కాంగ్రెస్’ కు సంస్థాగత ఎన్నికలు వద్దన్న వారే ఇప్పుడు ఇంకోలా మాట్లాడుతున్నారని పరోక్షంగానే అయినా సంస్థాగత ఎన్నికలు నిర్వహించడంతో పాటుగా, పార్టీ పక్షాలనకు తమ కుటుంబం వ్యతిరేకం కాదని, అందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఈ నేపధ్యంలో కాంగ్రెస్ పార్టీలో చెలరిగిన కలకలం  ఇక ముందు ఏమవుతుందో .. ఇంకెన్ని  మలుపులు తిరుగుతోందో ..చూడవలసిందే కానీ ఉహించలేము.
పంచతంత్రంగా పిలుచుకుంటున్న ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భతం జరగబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే, వివిధ సంస్థలు అసెంబ్లీ ఎన్నికలు జరిగే  అస్సాం. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటుగా కేరళలోనూ ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఆ ఒపీనియన్ పోల్ ఫలితాలు నిజంగా నిజం అయితే, కేరళలో మళ్ళీ సీపీఎం సారధ్యంలోని వామపక్ష కూటమి అధికారంలోకి వస్తుంది. ఇదే ఆ అద్భుతం. ఎందుకంటే, గత నాలుగు దశాబ్దాలలో కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో ఒకే కూటమి వరసగా రెండవసారి అధికారంలోకి వచ్చిన చరిత్ర లేనే లేదు. ఒక సారి ఎల్డీఎఫ్ అధికారంలోకి వస్తే ఐదేళ్ళ తర్వాత కాంగ్రెస్ సారధ్యంలోని ఐక్య ప్రజాస్వామ్య కూటమి(యూడీఎఫ్) అధికారంలోకి రావడం, దేవభుమిలో దైవ నిర్ణయమా అన్నట్లుగా ప్రతి ఎన్నికల్లోనూ అధికారం చేతులు మారుతూ వస్తోంది. అలాంటిది, ఈసారి ఒపీనియన్ పోల్స్ నిజమై వరసగా రెండవసారి వామపక్ష కూటమి అధికారంలోకి వస్తే, అది చరిత్రే అవుతుంది. ఇక ఒపీనియన్ పోల్స్ విషయానికి వస్తే, జాతీయ న్యూస్ ఛానెల్ ఏబీపీ, సీ ఓటర్ సంస్థలు సంయుక్తంగా ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఈ సర్వే ప్రకారం, 140 స్థానాలున్న కేరళ అసెంబ్లీలో వామపక్ష కూటమికి 83 నుంచి  91 స్థానాలు, యూడీఎఫ్ కూటమికి 47 నుంచి 55 స్థానాలు మాత్రమే దక్కుతాయని తెలుస్తోంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్రంలో ఇలా జాతకాలు తిరగబడడంపై సోషల్ మీడియాలో,’లెగ్ మహిమ’ లాంటి జోక్స్  ట్రోలవుతున్నాయి. అయితే 2016లో జరిగిన ఎన్నికల్లో కేవలం 47 సీట్లకే పరిమితం అయిన కాంగ్రెస్’కు ఈసారి ఒకటీ అరా సీట్లు ఎక్కువస్తే, రావచ్చును. అదే కాంగ్రెస్’కు కాసింత ఊరట. అదలా ఉంటే, పశ్చిమ బెంగాల్లో సైతం పట్టు సాధించిన బీజేపే, కేరళలో మాత్రం పట్టు కాదు కదా, పట్టుమని పది సీట్లు తెచ్చుకునే స్థితిలో లేదు. నిజానికి, దేశంలో బీజేపీకి అసలు ఏ మాత్రం మింగుడు పడని రాష్ట్రాలు ఎవైన ఉన్నాయంటే కేరళ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల  పేర్లే ప్రముఖంగా వినిపిస్తాయి. ఈ సారి కూడా కమల దళం కేరళలో కాలు పెట్టె పరిస్తి లేదని సర్వే ఫలితాలు చెపుతున్నారు. ఎప్పటిలానే ఇప్పడు కూడా  బీజేపీకి సున్నా నుంచి రెండు సీట్లు వచ్చే అవకాశం ఉందని, సర్వేస్వరుల అభిప్రాయంగా ఉంది. కేరళలో మొత్తం 140 స్థానాలకు ఏప్రిల్ 6 తేదీన ఒకే విడతలో పోలింగ్ జరుగుతుంది. మే 2 తేదీన ఫలితాలు వెలువడతాయి. కేరళ ఎలక్షన్ పై యావత్ దేశం ఆసక్తి కనబరుస్తోంది.    
కేంద్ర ఎన్నికలసంఘం ‘పాంచ్ పటాక’ గంట కొట్టింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. ఎన్నికల గంట మోగడంతో మొదలైన మరో భారత ‘మినీ’  సంగ్రామానికి మే 12 తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తెర పడుతుంది.ఈలోగా వివిధ అంచల్లో పోలింగ్ జరుగుతుంది.  నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతం ఓటరు తీర్పుకు వెళుతున్నా, అందరి దృష్టి, ముఖ్యంగా ప్రాంతీయ పార్టీల ఏలుబడిలో ఉన్న ఉభయ తెలుగు రాష్ట్రాలు, మరీ ముఖ్యంగా ఇప్పటికే బీజేపీ కన్నుపడిన తెలంగాణ రాష్ట్ర ప్రజలు, రాజకీయ పార్టీల దుష్టి  మాత్రం పశ్చిమ బెంగాల్ పైనే వుంది.  పశ్చిమ బెంగాల్లో ‘అద్భుతం’ జరిగి బీజేపీ విజయం సాధిస్తే, ఇక  కమల దళం ఫోకస్, తెలంగాణకు షిఫ్ట్ అవుతుంది. ఇది అందరికీ తెలిసిన బహిరంగ రహస్యం. ఈ నేపధ్యంలో బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయి అనే విషయంలో రాష్ట్ర రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. బెంగాల్లో బీజేపీ గెలిస్తే, ఇప్పటికే అంతర్గత కుటుంబ కలహాలతో సతమతవుతున్న తెరాస నాయకత్వానికి మరిన్నితిప్పలు తప్పవన్న మాట అంతఃపుర వర్గాలలో సైతం వినవస్తోంది.  పశ్చిమ బెంగాల్’లో ఎలాగైతే కమలదళం ఓ వంక తమ ట్రేడ్ మార్క్, హిందుత్వ రాజకీయాలు సాగిస్తూ, మరో వైపు నుంచి ‘ఆకర్ష్’ అస్త్రంతో అధికార పార్టీని నిర్వీర్యం చేసిన విధంగానే, ఇక్కడ కూడా ఫిరాయింపులను ప్రోత్సహింఛి పార్టీని నిట్టనిలువునా చీల్చే ప్రమాదాన్ని కొట్టివేయలేమని పార్టీ వర్గాలు కూడా అనుమానం వ్యక్త పరుస్తున్నాయి.  ఇప్పటికే తెలంగాణ  బీజేపీ నాయకులు 30 మంది తెరాస ఎమ్మెల్యేలు తమ టచ్ లో ఉన్నారని బెదిరిస్తున్నారు.అది నిజం అయినా కాకపోయినా..తెరాసలో అసంతృప్తి అగ్గి రగులుతోందనేది మాత్రం ఎవరూ కాదనలేని నిజం. అంతే కాకుండా రాష్ట్రానికి వచ్చిన కేంద్రనాయకులు ఎవరిని పలకరించినా, నెక్స్ట్ టార్గెట్ తెలంగాణ అని ఎలాంటి సషబిషలు లేకుండా కుండబద్దలు కొడుతున్నారు.అందుకే, బెంగాల్లో బీజేపీ గెలిస్తే.. అనే ఊహా కూడా  గులాబీ గూటిలో గుబులు పుట్టిస్తోంది. అయితే, బెగాల్’లో బీజేపీ గెలిస్తే ఒక్క తెలంగాణలోనే కాదు, దేశ రాజకీయ వాతావరణంలోనే పెను మార్పులు చోటు చేసుకుంటున్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.  అలాగే,  దేశ ముఖ చిత్రంలో కూడా పెను మార్పులు తప్పవని అంటున్నారు. అయితే రాజకీయాలలో ఎప్పుడు ఏం జరుగుతుందో.. ఎవరూహించెదరు..
పెద్దల మాట కొట్టి పడేయకండి..  కుటుంబం అందరూ కలిసి భోజనం చేస్తే జరిగేది ఇదే..! ఈ సమాజంలో ప్రతి వ్యక్తికి కుటుంబంతో ఉండే అనుబంధం చాలా గొప్పది. ఎన్నో విషయాలు కుటుంబం నుండే నేర్చుకుంటారు.  ఒకప్పుడు కుటుంబం మొత్తం కలిసి భోజనం చేసేవారు.  కానీ నేటి వేగవంతమైన జీవితాల కారణంగా ఇంటిల్లిపాది కలిసి భోజనం చేయడం చాలా అరుదుగా మారిపోయింది. పిల్లలు స్కూల్లో,  తల్లిదండ్రులు ఆఫీసులలో.. ఇలా అందరూ కలిసి భోజనం చేసే పరిస్థితులు ఉండటం లేదు.. కనీసం రాత్రి సమయంలో అయినా కలిసి భోజనం చేస్తారా అనుకుంటే.. ఒకరు బయట తినేయడం,  ఇంకొకరు పార్టీలో తినేయడం,  ఇంకొకరు ఆలస్యంగా ఇంటికి రావడం.. ఇలాంటి కారణాల వల్ల కుటుంబంలో అందరూ కలిసి తినే సందర్బం ఉండటం లేదు. అయితే.. పెద్దలు మాత్రం కుటుంబంలో అందరూ కలిసి కనీసం రోజులో  ఒకసారి అయినా భోజనం చేయాలని చెబుతారు. అందరూ కలిసి భోజనం చేయడం ఎందుకు ముఖ్యమూ.. తెలుసుకుంటే.. విద్య ఫలితాలు.. అంతా కలిసి భోజనం చేసే కుటుంబాలలో పిల్లలు చదువులో చాలా చురుగ్గా ఉంటారట. కుటుంబంతో కలిసి భోజనం చేయడం వారిని మానసికంగా మెరుగ్గా ఉంచి,  చదువులో మంచి వికాసం కలిగేలా చేస్తుందట. పిల్లలు చక్కగా చదువుకుంటారట. లాంగ్వేజ్,  కమ్యూనికేషన్ స్కిల్స్.. పిల్లలు, పెద్దలు కలిసి భోజనం చేసినప్పుడు  పిల్లలలో లాంగ్వేజ్ స్కిల్స్, కమ్యూనికేషన్ స్కిల్స్ డవలప్ అవుతాయి. పిల్లలు పెద్దలతో మాట్లాడటం,  కావలసినది అడగడం, వద్దని చెప్పడం,  వంట బాగుందని చెప్పడం.. ఇలా భోజనం సమయంలో చాలా సంఘటనల నుండి పిల్లలు చక్కగా మాట్లాడటం,  చక్కగా కమ్యూనికేట్ చేయడం నేర్చుకుంటారు. ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లు.. పెద్దల సమక్షంలో పిల్లలు భోజనం చేయడం వల్ల పిల్లలు తినే విధానం,  ఎలా తినాలి? కావలసిన ఆహారం తినడం, ఆహారం వృధా చేయకపోవడం, శుభ్రంగా తినడం వంటి మంచి ఆహారపు అలవాట్లు అలవడతాయి.  అంతేకాదు.. ఆహారాన్ని కలుపుకునే విధానం కూడా పెద్దల నుండే నేర్చుకుంటారు. పిల్లలు పెద్దలతో కలిసి తినేటప్పుడు సంపూర్ణ ఆహారం తినే అవకాశం ఉంటుంది.  పండ్లు, కూరగాయలు,  పోషకాలు, ప్రోటీన్.. ఇలా అన్ని రకాలు పిల్లలకు అందుతాయి. తృప్తిగా తింటారు.. పిల్లలు పెద్దలతో కలిసి తినేటప్పుడు హ్యాపీగా తినడం అలవాటు అవుతుంది. ఇది పిల్లలు తృప్తిగా తినడానికి కారణం అవుతుంది. సెల్ఫ్ రెస్సెక్ట్, సెల్ఫ్ కాన్పిడెన్స్.. పెద్దల దగ్గర కూర్చుని పిల్లలు తామే ఆహారం కలుపుకోవడం, తినడం వంటివి చేయడం వల్ల వారిలో ఆత్మవిశ్వాసం,  ఆత్మగౌరవం పెరుగుతాయి. బందాలు.. పిల్లలు, పెద్దలు కలిసి భోజనం చేయడం వల్ల కుటుంబ సభ్యుల మధ్య బంధం బలంగా మారుతుంది.  అందరూ కలిసి తినే ఆ కొద్ది సమయం అందరినీ కలిపి ఉంచుతుంది. ఒత్తిడి, ఆందోళన, డిప్రెషన్.. ఒంటరిగా తినేటప్పుడు కోపం,  డిప్రెషన్, ఒత్తిడి వంటి ఎమోషన్స్ తో తినే అవకాశం ఉంటుంది.  పైగా ఒంటరిగా తినేటప్పుడు ఒంటరితనం కూడా చాలా వరకు ప్రభావం చూపిస్తుంది. కానీ అందరూ కలిసి తింటే.. ఒత్తిడి,  ఆందోళన,  డిప్రెషన్ వంటివి ఉండవు. చెడు అలవాట్లు.. ఒక వయసులోకి వచ్చిన పిల్లలు చాలా వరకు మధ్యం సేవించడం,  స్మోక్ చేయడం,  డ్రగ్స్ వాడటం వంటివి చేసే అలవాటు ఉంటుంది. కానీ అందరూ కలిసి కూర్చుని భోజనం చేస్తే పిల్లలలో చాలా వరకు మానసిక మార్పు కలుగుతుంది.  చెడు అలవాట్లకు దూరంగా ఉండగలుగుతారు. ఆరోగ్య సమస్యలు.. అందరూ కలిసి భోజనం  చేసేటప్పుడు ఒకరి గురించి ఒకరు ఆలోచిస్తారు. ఎక్కువ ఆహారం తినవద్దని,  ఎక్కువ ఉప్పు, కారం వంటివి తినవద్దని ఒకరికి ఒకరు సలహా ఇచ్చుకోవడం లేదా జాగ్రత్తలు చెప్పడం లాంటివి జరుగుతాయి.  దీని వల్ల ఒబెసిటీ,  దీనికి సంబంధించిన వ్యాధుల ప్రమాదం తగ్గుతుంది.                      *రూపశ్రీ.  
జపనీస్ పెంపకం.. ఇలా పెంచితే పిల్లలు చదువులో, ప్రవర్తనలో టాప్ లో ఉంటారట..! ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లలు చదువులో రాణించడమే కాకుండా, తెలివైనవారుగా, క్రమశిక్షణ గలవారుగా , స్వయం సమృద్ధి గలవారుగా ఉండాలని కోరుకుంటారు. నేటి వేగవంతమైన ప్రపంచంలో, పిల్లలను సరైన మార్గంలో నడిపించడం ఒక పెద్ద ఛాలెంజ్ అనుకోవచ్చు. అయితే పిల్లలు చురుగ్గా ఉంటూ, చదువులో కూడా రాణిస్తూ,  మంచి ప్రవర్తనతో ఉండటానికి జపనీస్ పెంపకం చాలా బాగా సహాయపడుతుందట. ఇంతకీ ఆ జపనీస్ పెంపకం చిట్కాలు ఏంటో తెలుసుకుంటే.. జపనీస్ పెంపకం.. జపనీస్ పెంపక విధానం బాధ్యతాయుతమైన, సున్నితమైన , స్వయం సమృద్ధిగల పిల్లలను తయారుచేయడంలో సహాయపడుతుందట.  పిల్లల భవిష్యత్తును బలోపేతం చేయడానికి సహాయపడుతుందట. జపనీస్ పెంపకం చిట్కాలు..  బాధ్యతను నేర్పించడం.. జపాన్‌లో పిల్లలు చాలా చిన్న వయస్సు నుండే చిన్న పనులను స్వయంగా చేసుకోవడం నేర్చుకుంటారు. స్కూల్ బ్యాగులు సర్దుకోవడం, గదిని శుభ్రం చేసుకోవడం లేదా చిన్న చిన్న ఇంటి పనులలో సహాయం చేయడం వంటివన్నీ వారి దినచర్యలో భాగం. ఇది వారిలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించి, బాధ్యతా ఉండటాన్ని అభివృద్ధి చేస్తుంది. క్రమశిక్షణ..   జపనీస్ పెంపకంలో క్రమశిక్షణను కఠినంగా కాకుండా ఒక అలవాటుగా నేర్పిస్తారు. పిల్లలకు సమయానికి విలువ ఇవ్వడం, నియమాలను పాటించడం , ఇతరులను గౌరవించడం నేర్పిస్తారు. పాఠశాలల్లో, పిల్లలు తమ తరగతి గదులను కూడా స్వయంగా శుభ్రం చేసుకుంటారు. ఇది వారిలో సామూహిక బాధ్యతా భావాన్ని పెంపొందిస్తుంది. ఎమోషనల్ బాండింగ్..   జపనీస్ తల్లులు తమ పిల్లల బాల్యంలో వారితో గాఢమైన భావోద్వేగ బంధాన్ని ఏర్పరచుకుంటారు. దీనిని 'అమాయే' అని పిలుస్తారు. దీనిలో పిల్లలు సురక్షితంగా , ప్రేమతో చుట్టుముట్టబడినట్లు భావిస్తారు. ఇది వారి మానసిక వికాసాన్ని మెరుగుపరుస్తుంది , వారు మరింత ఆత్మవిశ్వాసంగా మారడానికి సహాయపడుుతంది. టీమ్ వర్క్..   జపనీస్ సంస్కృతిలో పిల్లలకు టీమ్ వర్క్, ఒకరికొకరు సహాయం చేసుకోవడం ,అందరూ కలిసి ఆలోచన చేయడం, నిర్ణయాలు తీసుకోవడం వంటివి నేర్పిస్తారు. ఇది వారు సమాజంలో మరింత మెరుగ్గా కలిసిపోవడానికి సహాయపడుతుంది. స్క్రీన్ సమయం..   జపనీస్ తల్లిదండ్రులు తమ పిల్లలను మొబైల్ ఫోన్లు , టెలివిజన్‌కు దూరంగా ఉంచి, సృజనాత్మక కార్యకలాపాలలో పాల్గొనేలా ప్రోత్సహిస్తారు. చదవడం, ఆరుబయట ఆడుకోవడం , కళలలో నిమగ్నమవడం వారి దినచర్యలో భాగం. ఇది వారి సంపూర్ణ అభివృద్ధికి దోహదపడుతుంది. తప్పుల నుండి నేర్చుకోవడం..   ప్రతి చిన్న తప్పుకు పిల్లలను తిట్టే బదులు, వారికి సలహా ఇచ్చి, వారి తప్పుల నుండి నేర్చుకునే అవకాశం కల్పిస్తారు. ఇది వారిలో ఆత్మవిశ్వాసాన్ని, సమస్య పరిష్కార సామర్థ్యాలను పెంపొందిస్తుంది. వ్యక్తిత్వ నిర్మాణానికే ప్రాధాన్యత.. అక్కడ కేవలం మార్కుల మీదనే కాకుండా, నిజాయితీ, వినయం, సానుభూతి వంటి గుణాలపై దృష్టి పెడతారు. అందుకే అక్కడ చదువు కన్నా, వ్యక్తిత్వ నిర్మాణానికే ఎక్కువ ప్రాధాన్యత ఉంది.                                     *రూపశ్రీ.  
టాక్సిక్ పాజిటివిటీ.. ఎప్పుడూ సంతోషంగా ఉండటం మంచిదేనా? జీవితం అన్నాక సంతోషాలు,  ఇబ్బందులు, కష్టాలు అన్నీ ఉంటాయి. కష్టం వచ్చినప్పుడు బాధపడటం అందరూ చేసే పనే.. కానీ.. కొందరుంటారు.. చుట్టూ ఉన్నవారు బాధపడితే.. ఏడిస్తే.. వారిని ఓదార్చాలనే ఆలోచనలతో "ఏడిస్తే ఏం ప్రయోజనం?", "అంతా సర్దుకుంటుంది," "ఎప్పుడూ పాజిటివ్ గా  ఆలోచించు!".. ఇలా చాలా మంది  ఇలాంటి సలహాలు ఇస్తుంటారు. ఈ మాటలు వినడానికి బానే ఉంటాయి.  కానీ మనస్తత్వవేత్తలు మాత్రం ఇది సరికాదు అంటున్నారు.  దీన్ని టాక్సిక్ పాజిటివిటీ అని పిలుస్తారట.  ఇది చాలా ప్రమాదకరమైనదని చెబుతున్నారు. కష్టంలో  ఉన్నప్పుడు పాజిటివిటీ మాటలను  ఒక మెడిసిన్ లాగా ఉపయోగిస్తారు. కానీ ఇది కాలక్రమేణా మనిషిని ఒంటరిని చేస్తుందని మానసిక విశ్లేషణ నిపుణులు అంటున్నారు.  దీని గురించి పూర్తీగా తెలుసుకుంటే.. టాక్సిక్ పాజిటివిటీ అంటే.. సులభంగా చెప్పాలంటే టాక్సిక్ పాజిటివీటి  అంటే మనిషిలో ఉండే నిజమైన ఫీలింగ్స్ ను అంగీకరించకుండా వాటిని దాచడానికి ప్రయత్నించడం. ఈ రోజుల్లో, సోషల్ మీడియా కారణంగా ఎలాంటి పరిస్థితుల్లోనైనా "బలంగా ఉండాలి" అనే మనస్తత్వం వల్ల ప్రజలు తమ దుఃఖాన్ని, భయాన్ని లేదా వైఫల్యాన్ని వ్యక్తపరచడానికి సంకోచిస్తున్నారు. అలా వ్యక్తం  చేయడం ఒక పెద్ద బలహీనత అని అనుకుంటారు. ఎప్పుడూ సంతోషంగా, బలంగా కనిపించాలనే  తీవ్రమైన ఒత్తిడి  వ్యక్తిలో అపరాధ భావాన్ని మాత్రమే పెంచుతుంది. ఎమోషన్స్ అణిచివేత ప్రమాదం.. మనిషిలో ఉండే నిజమైన , ప్రతికూల భావోద్వేగాలను దాచుకోవడం చాలా హానికరం అని మానసిక పరిశోధనలు కూడా స్పష్టంగా నిర్ధారిస్తున్నాయి. తమ ఎమోషన్స్  ను అణచిపెట్టుకోవడానికి ప్రయత్నించే వ్యక్తులు అకస్మాత్తుగా భయాందోళనలకు గురయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుందట. మనిషి తన నెగిటివ్ ఎమోషన్స్ ను నిరంతరం అణచివేస్తే, వారి ఒత్తిడి వేగంగా పెరుగుతుందట. ఇది సంబంధాలపైనా, మానసిక ఆరోగ్యంపైనా ప్రత్యక్షంగా, చాలా ప్రతికూల ప్రభావాన్ని చూపుతుందట. నిజమైన మానసిక బలం.. మనిషిలో ఉన్న ఎమోషన్స్ ను ఓపెన్ గా యాక్సెప్ట్ చేయడమే నిజమైన మానసిక బలం అని మానసిక విశ్లేషకులు చెబుతున్నారు. విచార భావనలు ఎప్పుడూ తప్పు కాదు. వాటిని అణచివేయకుండా అర్థం చేసుకుని స్వీకరించడమే మనిషిని మానసికంగా దృఢంగా చేస్తుంది. నిజమైన మానసిక బలం అంటే ఎప్పుడూ నవ్వుతూ ఉండటం కాదు, మనుషులుగా మనం కొన్నిసార్లు కుంగిపోవడం సహజమని అంగీకరించడమే. టాక్సిక్ పాజిటీవిటీ నుండి బయట పడటానికి సూచనలు.. విచారాన్ని బలహీనతగా భావించకూడదు.. ఎమోషన్స్ ను,  అభిప్రాయాలను  ఓపెన్ గా  వ్యక్తపరచాలి,  విచారాన్ని ఓటమిగా పరిగణించకూడదు. నమ్మకమైన వ్యక్తులతో మాట్లాడటం.. కష్ట సమయాల్లో ఆన్‌లైన్‌లో ఇతరులతో మిమ్మల్ని మీరు పోల్చుకోవడానికి బదులుగా, మీరు బాగా నమ్మే వ్యక్తులతో   సమస్యలను నిష్కపటంగా పంచుకోవాలి. దీని వల్ల ఊరట లభిస్తుంది, భారం తగ్గినట్టు అవుతుంది. సలహా ఇవ్వడానికి బదులుగా వినాలి..   మీ చుట్టూ ఎవరైనా విచారంగా ఉంటే, వారికి ఊరట ఇవ్వడానికి భరోసా మాటలు చెప్పడానికి బదులుగా వారి సమస్య ఏంటో మొదట ఓపికగా వినాలి.  తమ భాదను వెంటే చాలామంది మానసికంగా కుదటపడతారు, తిరిగి ధైర్యం కూడా తెచ్చుకుంటారు. "సానుకూల ఆలోచన"తో అస్సలు మార్చలేని కొన్ని సంఘటనలు ఉంటాయి. అందువల్ల,  విచారాన్ని పూర్తిగా కొట్టిపారేయడం పాజిటివ్ మార్గం కాదు, అది ఆత్మవంచన. కాబట్టి ఎప్పుడూ అన్నిటికీ పాజిటివ్ గా ఉండాలని, పాజిటివ్ జరగలేదని బాధపడకూడదు.                            *రూపశ్రీ.  
40 సంవత్సరాల తర్వాత మహిళల శరీరంలో సహజంగానే అనేక మార్పులు చోటుచేసుకుంటాయి. హార్మోన్లలో మార్పులు, మెటాబాలిజం తగ్గడం, బరువు పెరగడం, చర్మంపై ముడతలు, అలసట వంటి సమస్యలు కనిపించడం సాధారణం. అయితే సరైన ఆహారపు అలవాట్లు పాటిస్తే ఆరోగ్యంగా ఉండటమే కాకుండా, యవ్వనంగా కూడా కనిపించవచ్చు. ఈ వీడియోలో ప్రముఖ సీనియర్ న్యూట్రిషన్ కన్సల్టెంట్ డా. పి. జానకి శ్రీనాథ్ 40 ఏళ్లు దాటిన మహిళలు తప్పనిసరిగా తీసుకోవాల్సిన యాంటీ ఏజింగ్ ఆహారాల గురించి సులభంగా వివరిస్తున్నారు. శరీరానికి అవసరమైన ప్రోటీన్లు, కాల్షియం, ఐరన్, ఫైబర్, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లు, యాంటీ ఆక్సిడెంట్లు వంటి పోషకాలు ఏ ఆహారాల్లో లభిస్తాయి, అవి ఆరోగ్యానికి ఎలా ఉపయోగపడతాయో ఈ వీడియోలో తెలుసుకోవచ్చు. అలాగే బరువు నియంత్రణ, ఎముకల బలం, గుండె ఆరోగ్యం, చర్మ కాంతి, జుట్టు ఆరోగ్యం, హార్మోన్ల సమతుల్యత కోసం తీసుకోవాల్సిన ఆహారాలు, దూరంగా ఉండాల్సిన ఆహారాల గురించి కూడా విలువైన సూచనలు అందించారు. 40 ఏళ్ల తర్వాత కూడా ఫిట్‌గా, స్లిమ్‌గా, ఉత్సాహంగా ఉండాలనుకునే ప్రతి మహిళ ఈ వీడియోను తప్పక చూడాలి. ఈ వీడియోలో తెలుసుకునే అంశాలు: 40 ఏళ్ల తర్వాత మహిళలకు అవసరమైన పోషకాహారం యాంటీ ఏజింగ్ ఫుడ్స్ ప్రయోజనాలు బరువు పెరగకుండా ఉండే ఆహారాలు మెటాబాలిజం పెంచే ఆహారాలు చర్మం, జుట్టు ఆరోగ్యానికి ఉపయోగపడే ఫుడ్స్ ఎముకలు బలంగా ఉండేందుకు తీసుకోవాల్సిన ఆహారం ఆరోగ్యకరమైన జీవనశైలి కోసం డైట్ సూచనలు ఆరోగ్యానికి సంబంధించిన మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం TeluguOne Health ను ఫాలో అవ్వండి.    
రాత్రి పూట బాగా నిద్రలో ఉండగా మూత్ర విసర్జనకు వెళ్లడం తరచుగా జరుగుతూనే ఉంటుంది.  అయితే ఎప్పుడో ఒకసారి ఇలా నిద్ర మధ్యలో లేచి మూత్ర విసర్జనకు వెళ్లడం అనేది పెద్దగా సీరియస్ గా తీసుకోవాల్సిన విషయం కాదు. కానీ.. ప్రతిరోజూ రాత్రి నిద్ర మధ్యలో లేచి మూత్ర విసర్జనకు వెళ్లాల్సి వస్తే మాత్రం దాన్ని లైట్ గా తీసుకోకూడదు అంటున్నారు వైద్యులు. రాత్రి పూట ఇలా మూత్ర విసర్జనకు లేవడం అనేది  కేవలం నిద్రకు అంతరాయం కలిగించే సమస్య మాత్రమే కాదని, అది ఆరోగ్య సమస్యలకు సంకేతం కావచ్చని అంటున్నారు వైద్యులు. మీరు కూడా ప్రతి రోజూ నిద్ర మధ్యలో మూత్ర విసర్జన కోసం లేస్తుంటే కింది విషయాలు తప్పక తెలుసుకోవాలి. మధుమేహం.. శరీరంలో రక్తంలో చక్కెర స్థాయిలు సాధారణ స్థాయిని మించినప్పుడు, మూత్రపిండాలు అదనపు చక్కెరను మూత్రం ద్వారా బయటకు పంపడానికి ప్రయత్నిస్తాయి. ఈ ప్రక్రియ వల్ల శరీరం నుండి అధికంగా నీరు కూడా నష్టపోతుంది. దీనివల్ల తరచుగా మూత్రవిసర్జన చేయవలసి రావచ్చు. దీనితో పాటు అధిక దాహం, తరచుగా ఆకలి వేయడం, అలసట, లేదా అకస్మాత్తుగా బరువు తగ్గడం వంటి లక్షణాలు కూడా కనిపిస్తే బ్లడ్ షుగర్ టెస్ట్ చేయించుకోవడం మంచిది. ఓవర్ యాక్టీవ్ బ్లాడర్..  మూత్రాశయం సాధారణం కంటే ఎక్కువగా  సంకోచించే  పరిస్థితిని ఓవర్ యాక్టీవ్ బ్లాడర్ అని అంటారు. దీనివల్ల  వ్యక్తికి తరచుగా , ఆకస్మికంగా మూత్రవిసర్జన చేయాలనే కోరిక కలుగుతుంది, కొన్నిసార్లు రాత్రిపూట చాలాసార్లు నిద్రలోంచి మెలకువ కూడా వస్తుంది. ఈ సమస్య వృద్ధాప్యం, నరాల వ్యాధి, ఊబకాయం లేదా  మూత్రాశయ కండరాలు బలహీన వడటం వల్ల ఎదురవుతుంది. సరైన చికిత్స , జీవనశైలి మార్పులతో దీనిని చాలా వరకు నియంత్రించవచ్చు. యూటీఐ.. యూటీఐ అనేది మూత్ర మార్గంలోని ఏ భాగానికైనా సోకగల ఒక బాక్టీరియల్ ఇన్ఫెక్షన్. ఈ ఇన్ఫెక్షన్ వల్ల తరచుగా మూత్రవిసర్జన, మంట, నొప్పి, దుర్వాసన,   మూత్రం మబ్బు రంగులో ఉండటం,  కొన్నిసార్లు జ్వరం కూడా రావచ్చు. ఈ సమస్య పురుషుల కంటే మహిళల్లో ఎక్కువగా కనిపిస్తుంది. దీనికి వెంటనే చికిత్స చేయకపోతే, ఇన్ఫెక్షన్ మూత్రపిండాలకు వ్యాపించే  అవకాశం ఉంటుంది. కాబట్టి లక్షణాలు కనిపించిన వెంటనే వైద్యుడిని సంప్రదించడం ముఖ్యం. మూత్రపిండాల సమస్యలు.. మూత్రపిండాలు శరీరం నుండి వ్యర్థాలను , అదనపు నీటిని తొలగిస్తాయి. మూత్రపిండాలు సరిగ్గా పనిచేయకపోతే, మూత్రవిసర్జన పరిమాణంలో , సమయంలో మార్పులు సంభవించవచ్చు. రాత్రిపూట తరచుగా మూత్రవిసర్జన, పాదాలు లేదా చీలమండలలో వాపు, అలసట, ఆకలి లేకపోవడం , అధిక రక్తపోటు వంటి సమస్యలు మూత్రపిండాల వ్యాధికి సంకేతాలు కావచ్చు. ఇటువంటి సందర్భాలలో,  మూత్రపిండాలను పరీక్షించుకోవడం , వైద్యుడిని సంప్రదించడం చాలా అవసరం. అదిక రక్తపోటు, మందుల ప్రభావాలు.. అధిక రక్తపోటు చికిత్సకు ఉపయోగించే కొన్ని మందులు, ముఖ్యంగా డైయూరెటిక్స్ వంటి మూత్రవిసర్జనను పెంచే మందులు, శరీరం నుండి అదనపు ఉప్పు , నీటిని మూత్రం ద్వారా బయటకు పంపడానికి సహాయపడతాయి. ఈ మందులను సాయంత్రం లేదా రాత్రిపూట తీసుకుంటే, రాత్రి సమయంలో చాలాసార్లు బాత్రూమ్‌కు వెళ్లవలసిన అవసరం ఏర్పడవచ్చు. అంతేకాకుండా, దీర్ఘకాలికంగా నియంత్రణలో లేని అధిక రక్తపోటు మూత్రపిండాలపై కూడా ప్రభావం చూపి, మూత్రవిసర్జన అలవాట్లలో మార్పులకు దారితీస్తుంది. ఈ లక్షణాలు ఉంటే వైద్యుడిని కలవాలి.. ప్రతి రాత్రి 2-3 సార్లు లేదా అంతకంటే ఎక్కువ సార్లు మూత్రవిసర్జన కోసం నిద్రలేస్తుంటే వైద్యుడిని కలవాలి.  మూత్ర విసర్జన సమయంలో నొప్పి లేదా మంట,  మూత్రంలో రక్తం పడటం,  ఎన్ని నీళ్లు తాగినా చాలా దాహంగా ఉండటం,   కాళ్ళలో వాపులు కనిపించడం,  జ్వరంతో పాటు తరచుగా మూత్రవిసర్జనకు వెళ్లాల్సి రావడం వంటి లక్షణాలు ఉంటే తప్పనిసరిగా వైద్యుడిని కలవాలి.                                        *రూపశ్రీ.  
రాత్రి ఎంత ప్రయత్నించినా నిద్ర పట్టడం లేదా? అర్థరాత్రి వరకు మేల్కొని ఉండాల్సి వస్తుందా? ప్రస్తుతం చాలా మంది ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యల్లో ఇన్సోమ్నియా (Insomnia) ఒకటి. ఉద్యోగ ఒత్తిడి, మానసిక ఆందోళన, మొబైల్ ఫోన్‌ను ఎక్కువసేపు ఉపయోగించడం, జీవనశైలిలో వచ్చిన మార్పులు వంటి అనేక కారణాల వల్ల నిద్ర సమస్యలు పెరుగుతున్నాయి. ఈ వీడియోలో ప్రముఖ సైకాలజిస్ట్ డా. సి. మంజులా రావు నిద్ర ఎందుకు పట్టదో, ఇన్సోమ్నియా రావడానికి గల ముఖ్యమైన కారణాలు ఏమిటో, నిద్రలేమి వల్ల ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావం పడుతుందో సులభంగా వివరించారు. అలాగే ఎలాంటి మందులు లేకుండానే మంచి నిద్ర కోసం పాటించాల్సిన రోజువారీ అలవాట్లు, పడుకునే ముందు చేయాల్సిన చిన్న చిన్న మార్పులు, మానసిక ప్రశాంతతను పెంచే సూచనలు మరియు గాఢమైన నిద్ర కోసం ఉపయోగపడే సులభమైన చిట్కాలను కూడా ఈ వీడియోలో వివరించారు. మీకు లేదా మీ కుటుంబ సభ్యుల్లో ఎవరికైనా నిద్ర సమస్య ఉంటే ఈ వీడియో తప్పకుండా చూడండి. ఆరోగ్యకరమైన జీవితం కోసం మంచి నిద్ర ఎంత ముఖ్యమో తెలుసుకోండి. మీ ఆరోగ్య సమస్య ఏదైనా... మా హెల్త్ యూట్యూబ్ ఛానల్‌లో సీనియర్ డాక్టర్స్ చెప్పిన సలహాలు... సూచనలు ఉన్నాయి. మా యూట్యూబ్ ఛానల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 👉 TeluguOne Health (సబ్‌స్క్రైబ్ చేయడం మర్చిపోకండి!)