LATEST NEWS
  తెలంగాణ రక్షణ సేన పార్టీకి గుర్తింపు ఇవ్వాలని పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కేంద్ర ఎన్నికల కమిషన్‌ను కోరారు. ఢిల్లీ హైకోర్టు ఈ నెల 7న ఇచ్చిన ఆదేశాల మేరకు పార్టీ తరఫున కేంద్ర ఎన్నికల కమిషన్‌కు సమగ్ర వివరణ పంపినట్లు వెల్లడించారు. పార్టీ ప్రధాన కార్యదర్శి అనిల్ కుమార్ ఆదివారం ప్రధాన ఎన్నికల కమిషనర్‌తో పాటు ఎన్నికల కమిషనర్లకు లేఖ రాశారు. ఆ లేఖలో ఈ ఏడాది ఏప్రిల్ 28న కేంద్ర ఎన్నికల కమిషన్ "తెలంగాణ రక్షణ సేన" పేరును తమకు కేటాయిస్తూ లేఖ పంపిందని గుర్తు చేశారు. ఆ నిర్ణయాన్ని ఆధారంగా చేసుకుని రాష్ట్రవ్యాప్తంగా 105 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పార్టీ జెండాలు ఆవిష్కరించడం, సంస్థాగత నిర్మాణ కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని పేర్కొన్నారు. అయితే జూన్ 23న ఎన్నికల కమిషన్ పంపిన లేఖలో పార్టీ రిజిస్ట్రేషన్‌పై సుమారు వెయ్యి అభ్యంతరాలు వచ్చాయని తెలిపిందని, కానీ ఆ అభ్యంతరాల కాపీలను ఇప్పటి వరకు తమకు అందించలేదని విమర్శించారు. ఎవరు అభ్యంతరాలు వ్యక్తం చేశారో, వాటి వివరాలేమిటో తెలియకుండా తాము ఎలా సమాధానం చెప్పగలమని ప్రశ్నించారు. తెలంగాణ జనాభా మూడున్నర కోట్లకు పైగా ఉండగా కేవలం వెయ్యి అభ్యంతరాలను చూపిస్తూ నిర్ణయం తీసుకోవడం సమంజసం కాదన్నారు. అభ్యంతరాల వెనుక చట్టపరమైన బలం ఏమిటో పరిశీలించాలని, అవి సమన్వయంతో దాఖలు చేశారా అనే అంశం కూడా తెలుసుకోవాల్సి ఉంద న్నారు." తెలంగాణ రక్షణ సేన" అనే పేరును స్వతంత్రంగా, పూర్తి సదుద్దేశంతో ఎంపిక చేసుకున్నామని తెలిపారు. దేశంలో ఈ పేరుతో మరే రాజకీయ పార్టీ నమోదు కాలేదని, గుర్తింపు పొందిన లేదా నమోదైన ఏ రాజకీయ పార్టీ పేరుతోనూ ఇది పోలిక కలిగి లేదని స్పష్టం చేశారు. రాజకీయ పార్టీ పేర్లను పోల్చేటప్పుడు మొత్తం పేరునే ఒక యూనిట్‌గా పరిగణించాలే తప్ప విడివిడిగా పదాలను పరిశీలించకూడదన్నారు. "తెలంగాణ రక్షణ సమితి (డెమోక్రాటిక్)" మరియు "తెలంగాణ రాజ్య సమితి" పేర్లు నిర్మాణం, ఉచ్చారణ, నాయకత్వం, ప్రజల్లో గుర్తింపు వంటి అన్ని అంశాల్లో పూర్తిగా భిన్నమని వివరించారు. దేశవ్యాప్తంగా ఆమ్ ఆద్మీ, అఖండ్ భారత్, ప్రజా సేవ, జన్ అధికార్, రాష్ట్రీయ జనతా, డెమోక్రాటిక్, సోషల్, రిపబ్లిక్ ఇండియా, శిరోమణి వంటి సాధారణ పదాలతో వందలాది రాజకీయ పార్టీలు నమోదై ఉన్నాయని, అలాంటి పేర్ల జాబితాను కూడా ఎన్నికల కమిషన్‌కు జత చేశామని పేర్కొన్నారు. ఢిల్లీ హైకోర్టు ఆదేశాల ప్రకారం వ్యక్తిగత విచారణకు హాజరయ్యే ముందు తమ పార్టీపై వచ్చిన అన్ని అభ్యంతరాల కాపీలు, తమకు వ్యతిరేకంగా వినియోగించనున్న ఆధారాలను అందించాలని కోరారు. వాటిని పరిశీలించి సమాధానం ఇచ్చేందుకు తగిన సమయం ఇచ్చిన తర్వాతే విచారణ నిర్వహించాలని విజ్ఞప్తి చేశారు.కేవలం సాధారణ భౌగోళిక లేదా వర్ణనాత్మక పదాల ఆధారంగా, ఊహాజనిత సంక్షిప్త రూపాలను చూపిస్తూ వచ్చిన అభ్యంతరాలను తిరస్కరించాలని కోరిన పార్టీ, ప్రజాప్రాతినిధ్య చట్టం–1951లోని సెక్షన్ 29A ప్రకారం "తెలంగాణ రక్షణ సేన" పార్టీ నమోదు దరఖాస్తును ఆమోదించాలని కేంద్ర ఎన్నికల కమిషన్‌ను విజ్ఞప్తి చేసింది.  
తెలంగాణలో  అధికార, ప్రతిపక్షాల మధ్య సాగే  విమర్శలు, ప్రతి విమర్శల పర్వం కొనసాగుతూనే ఉంది.  విమర్శల జోరు పెరిగుతోంది. తీవ్రత ఎక్కువ అవుతోంది. అనకూడని మాటే అంటూ.. అనుచిత వ్యాఖ్యలు కూడా దొర్లుతున్నాయి. ఈ క్రమంలోనే బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు మాజీ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై ఓ రేంజ్ లో విమర్శల వర్షం కురిపించారు. సీఎం అవినీతి బండారం మొత్తం బయటపడిందన్న కేటీఆర్ కాంగ్రెస్ సర్కార్ తీరు పట్ల ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారన్నారు.  రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ప్రజా రంజక పాలనను పూర్తిగా గాలికొదిలేసి కేవలం ప్రతిపక్షాలపై నిందలు వేయడమే పనిగా పెట్టుకుందని విమర్శించారు.  ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా చేయించుకున్న సొంత సర్వేలోనే కాంగ్రెస్ పార్టీ వైఫల్యాలు స్పష్టంగా తేలాయని కేటీఆర్ సంచలన అంచనాను ప్రకటించారు. రాబోయే రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఏకంగా 78 అసెంబ్లీ స్థానాల్లో గులాబీ జెండా ఎగరడం ఖాయమని ఆ నివేదికల ఆధారంగా ధీమా వ్యక్తం చేశారు. కేవలం సీఎం సొంత సర్వే మాత్రమే కాకుండా, రాష్ట్ర ఇంటెలిజెన్స్ వర్గాలు, స్వతంత్ర మీడియా సంస్థలు క్షేత్ర స్థాయిలో సేకరించిన ప్రజాభిప్రాయ సేకరణలలో కూడా ఇదే సత్యం వెల్లడైందని ఆయన నొక్కి చెప్పారు. ఈ గణాంకాలు కాంగ్రెస్ పార్టీ పట్ల ప్రజల్లో పెరుగుతున్న వ్యతిరేకతకు అద్దం పడుతున్నాయని అన్నారు. అనకూడని మాటే అయినా అనక తప్పడం లేదని చెబుతూ సీఎం రేవంత్ రెడ్డి అనే దరిద్రుడు తెలంగాణకు అన్యాయం చేస్తున్నారంటూ దుయ్యబట్టిన కేటీఆర్..   అధికారులు ఇంజనీర్లు చెబుతున్న మాటలను కూడా పట్టించుకోకుండా ఏకపక్షంగా వ్యవహరిస్తున్న సీఎం  రేవంత్ రెడ్డిని బుర్ర తక్కువోడు అనాలా,దరిద్రుడు అనాలా,సన్నాసి అనాలా అని ప్రశ్నించారు. రాష్ట్రంలో ఏర్పడిన కరవు పరిస్థితులు కేసీఆర్ మీద కోపంతో రేవంత్ రెడ్డి తీసుకువచ్చారని కేటీఆర్ విమర్శించారు.   KTR Sensational Comments, CM Revanth Reddy Survey, BRS 78 Seats, Telangana Politics, Hydra Demolitions 
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. మంగళగిరి తెలుగుదేశం కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన చంద్రబాబునాయుడు వైసీపీకి ఒక రాజకీయ పార్టీకి ఉండాల్సిన కనీస లక్షణాలు లేవని విమర్శించారు. గొడ్డలి, ఫేక్ ప్రచారాలే వైసీపీ అస్త్రాలన్న చంద్రబాబు.. వైసీపీ చరిత్ర మొత్తం రక్త చరిత్రేనన్నారు.  తెలంగాణ షాబాద్ లో ఆరుగురిని అత్యంత కిరాతకంగా చంపిన రాజ్ కుమార్ కు, సొంత బాబాయిపై గొడ్డలి వేటు, సొంత తల్లీ, చెల్లిని గెంటేసిన జగన్ కూ మనస్తత్వ పరంగా పోలీకలు ఉన్నాయని సంచలన వ్యాఖ్యలు చేశారు.  తెలంగాణలో  ఒక వ్యక్తి తనపై పోక్సో   కేసు పెట్టిందన్న కక్షతో బాధితురాలితో పాటు ఆమె కుటుంబాన్ని, అలాగే తనకు సహకరించలేదనే కోపంతో సొంత కుటుంబాన్ని కలిపి మొత్తం ఆరుగురిని అత్యంత క్రూరంగా హతమార్చిన వ్యక్తికీ, సరిగ్గా అలాగే..  సొంత బాబాయిని గొడ్డలితో నరికి చంపడం, కన్నతల్లి మరియు చెల్లిని దూరం పెట్టే విషయంలో జగన్ ప్రవర్తించిన తీరుకూ చాలా దగ్గరి పోలికలు ఉన్నాయని చంద్రబాబు అన్నారు.  నేర ప్రవృత్తిని, దుర్మార్గాలను ప్రజల్లోకి తీసుకెళ్లి వారిని చైతన్యపరచాల్సిన బాధ్యత మీడియాపై ఉందన్నారు.   కడప స్టీల్ ప్లాంట్ ఏర్పాటు పేరుతో కేవలం ఒకే ఒక్క వ్యక్తి అవినీతి దాహానికి లక్షల కోట్ల రూపాయల విలువైన ఆంధ్రప్రదేశ్ సహజ సంపద పూర్తిగా ఆవిరైపోయిందని ఆరోపించారు. స్టీల్ ప్లాంట్ నెపంతో యథేచ్ఛగా అక్రమ మైనింగ్‌కు పాల్పడ్డారని దుయ్యబట్టారు. బ్రహ్మణీ స్టీల్స్‌కు గతంలో కేటాయించిన భూములను ప్రస్తుత కూటమి ప్రభుత్వం ఇప్పటికే పూర్తిగా వెనక్కి తీసుకుందని,  ఓబులాపురం మైనింగ్ అంశంపై విచారణ ఇంకా ముగియలేదని చెప్పిన చంద్రబాబు. జగన్   స్వార్థపూరిత నిర్ణయాల వల్ల ఎంతోమంది ఐఏఎస్  అధికారులు జైలుపాలయ్యారనీ, ఎంతోమంది వ్యాపారవేత్తలు సర్వనాశనమయ్యారని వివరించారు.  వైసీపీ నైజాన్ని చంద్రబాబు  హిట్, రన్ అండ్ ఎస్కేప్ (కొట్టడం, పారిపోవడం, దాక్కోవడం) గా అభివర్ణించారు. ఆంధ్రప్రదేశ్‌లో ఏదో ఒక విధ్వంసం సృష్టించడం, ఆ వెంటనే పక్క రాష్ట్రమైన కర్ణాటకలోని బెంగళూరు ప్యాలెస్‌కు వెళ్లి తలదాచుకోవడం   అలవాటుగా మారిందని ఎద్దేవా చేశారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందనే భయంతోనే పెట్టుబడులు పెట్టేందుకు వచ్చే పారిశ్రామికవేత్తలను బెదిరించి, పరిశ్రమలను రాష్ట్రం నుంచి తరిమేయాలని చూస్తున్నారని మండిపడ్డారు. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం, పోలవరం ప్రాజెక్టు, వెలిగొండ ప్రాజెక్టులు వేగంగా పూర్తికావస్తుండటంతో ఈ గొడ్డలి పార్టీలో తీవ్రమైన టెన్షన్ మరియు భయం మొదలైందని చంద్రబాబు పేర్కొన్నారు. సామాజిక మాధ్యమాల్లో జరుగుతున్న వ్యక్తిత్వ హననంపై చంద్రబాబు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. సోషల్ మీడియాను వాడుకుని మహిళలను బ్లాక్ మెయిల్ చేయడం, తప్పుడు పోస్టులతో సమాజంలో అలజడి సృష్టించడం అత్యంత ప్రమాదకరంగా మారిందన్నారు. ఇలాంటి ఫేక్ ప్రచారాలను, అసత్య పోస్టులను పూర్తిగా కట్టడి చేసేందుకు త్వరలోనే ఒక ప్రత్యేక టాస్క్‌ఫోర్స్  ఏర్పాటుపై కసరత్తు చేస్తున్నట్లు వెల్లడించారు.   Chandrababu makes sensational comments, Chandrababu Naidu, YS Jagan Mohan Reddy, YSRCP Axe Party, Andhra Pradesh Politics, Social Media Task Force AP, Kadapa Steel Plant Corruption
తెలుగువన్ ఎక్స్ క్లూజివ్.! కర్ణాటక మాజీ మంత్రి, మైనింగ్ కింగ్ గాలి జనార్ధన్ రెడ్డికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భారీ షాక్ ఇచ్చింది. కడప జిల్లాలో బ్రాహ్మణి స్టీల్స్ పరిశ్రమ ఏర్పాటు కోసం గతంలో కేటాయించిన వేల ఎకరాల భూములను వెనక్కి తీసుకోవాలని  చంద్రబాబు సర్కార్ నిర్ణయించింది.  దాదాపు 19 ఏళ్లు గడుస్తున్నా అక్కడ ఎలాంటి పరిశ్రమ ఏర్పాటు కాకపోవడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.  ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో 2007లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కడప జిల్లాలో బ్రాహ్మణి స్టీల్స్ ఏర్పాటుకు భారీగా భూములు కేటాయించారు.  ఎకరం భూమి  18 వేల రూపాయల చొప్పున దాదాపు 10 వేల ఎకరాలకు పైగా భూములను అప్పట్లో గాలి జనార్ధన్ రెడ్డి కుమార్తె పేరిట ఉన్నబ్రాహ్మిణి స్టీల్స్  సంస్థకు కేటాయించింది. దీనికోసం కేవలం 19 కోట్ల రూపాయలను గాలి జనార్ధన్ రెడ్డి ప్రభుత్వ ఖజానాకు చెల్లించారు. ఆ తర్వాత 2008లో విమానాశ్రయం ఏర్పాటు నెపంతో మరో 3,115 ఎకరాల భూములను 25 కోట్ల రూపాయలకే రాసిచ్చారు. పరిశ్రమల పేరుతో యువతకు ఉపాధి కల్పిస్తామని చెప్పి, వేల ఎకరాల విలువైన ప్రభుత్వ భూములను ఇలా కారుచౌకగా కేటాయించడంపై అప్పట్లోనే పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. అయితే, భూములు పొందిన తర్వాత గాలి జనార్ధన్ రెడ్డి అక్కడ ఉక్కు కర్మాగారాన్ని నిర్మించడంలో పూర్తిగా విఫలమయ్యారు. పరిశ్రమ పెట్టకపోగా, ఈ ప్రభుత్వ భూములను జాతీయ బ్యాంకుల్లో తాకట్టు పెట్టి దాదాపు 350 కోట్ల రూపాయల మేర రుణాలు పొంది బ్యాంకులను సైతం మోసం చేశారనే ఆరోపణలు వ్యక్తమయ్యాయి. గతంలో ఈ భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని ప్రయత్నించినప్పుడు, రుణాలు ఇచ్చిన యాక్సిస్ బ్యాంక్ వంటి జాతీయ బ్యాంకులు కోర్టులను ఆశ్రయించాయి. భూములు తమ అధీనంలో ఉన్నాయని వాదించాయి. అయితే, పూర్తి హక్కులు లేని భూములపై బ్యాంకులు ఏ విధంగా రుణాలు ఇస్తాయని కోర్టులు సైతం తీవ్రంగా వ్యాఖ్యానించిన నేపథ్యంలో, ప్రస్తుత జిల్లా కలెక్టర్ నేతృత్వంలో ఈ 10,000 ఎకరాల భూములను తిరిగి ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకునే ప్రక్రియ ఊపందుకుంది. ఈ ఉదంతంపై  విశ్లేషకుడు  మధుసూదన్ రెడ్డి తెలుగువన్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో  నాటి వైఎస్సార్ క్యాబినెట్ లో మంత్రులుగా ఉండి, నేడు కూటమి ప్రభుత్వంలోనూ మంత్రులుగా కొనసాగుతున్న కొందరు నేతల సమష్టి బాధ్యతను ప్రశ్నించారు. పరిశ్రమలు పెట్టకుండా కాలయాపన చేయడం వల్ల రాష్ట్ర ఖజానాకు నష్టం వాటిల్లడమే కాకుండా, స్థానిక నిరుద్యోగ యువత ఉపాధి అవకాశాలు కోల్పోయి తీవ్రంగా నష్టపోయారని పేర్కొన్నారు.  భవిష్యత్తులోనైనా ఏ ప్రభుత్వమైనా పరిశ్రమలకు భూములను శాశ్వతంగా రిజిస్ట్రేషన్ చేయకుండా, కేవలం లీజు ప్రాతిపదికన మాత్రమే ఇవ్వాలనన్నారు. అప్పుడే పారిశ్రామికవేత్తలు భూములను బ్యాంకుల్లో తాకట్టు పెట్టకుండా, నిజాయితీతో పరిశ్రమలు స్థాపించే అవకాశం ఉంటుందని చెప్తున్నారు. ఏది ఏమైనప్పటికీ గాలి జనార్ధన్ రెడ్డి ఆర్థిక సామ్రాజ్యానికి, బ్రాహ్మణి స్టీల్స్ భూముల ఉదంతం ఒక పెద్ద ఎదురుదెబ్బేనని మధుసూదన్ రెడ్డి  అన్నారు.  పూర్తి ఇంటర్వ్యూ తెలుగువన్ న్యూస్ చానల్ లో వీక్షించండి.  
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 2028 ఎన్నికలలో విజయం సాధించి మళ్లీ కాంగ్రెస్ పార్టీయే రాష్ట్రంలో అధికారం చేపడుతుందని ధీమా వ్యక్తం చేశారు. అలాఇలా కాదు.. ఏకంగా భద్రాద్రి రాములోరి మీద ఒట్టేసి మరీ  ఈ విషయం చెప్పారు.  ఉమ్మడి ఖమ్మం జిల్లా  జగన్నాథపురంలో నిర్వహించిన రైతు భరోసా చివరి విడత నిధుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నరేవంత్ రెడ్డి  రాబోయే ఎన్నికల్లో  కాంగ్రెస్ పార్టీ భారీ మెజారిటీతో మరోసారి అధికారంలోకి రావడం ఖాయమని  చెబుతూ.. భద్రాచలం రాముడి మీద ఆన... వచ్చే ఎన్నికల్లో   117 స్థానాల్లో గెలిచి తీరుతాంమని ప్రకటించారు.   రాష్ట్రంలో ప్రస్తుతం 119 శాసనసభ స్థానాలు ఉన్న సంగతి తెలిసిందే. అయితే రాబోయే పార్లమెంటు సమావేశాల్లో అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన లేదా స్థానాల పెంపు బిల్లు   ఆమోదం పొందితే, తెలంగాణలో సీట్లు దాదాపు 50 శాతం మేర పెరగనున్నాయన్న రేవంత్.. ఈ పెంపుదల ప్రకారంగా ప్రస్తుతం ఉన్న 119 అసెంబ్లీ స్థానాలు భవిష్యత్తులో 182 స్థానాలకు చేరనున్నాయన్నారు.    అలాగే.. ముందస్తు ఎన్నికల ప్రచారాలపైనా సీఎం  స్పష్టత ఇచ్చారు. కొందరు ప్రచారం చేస్తున్నట్లుగా రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు జరిగే ప్రశక్తే లేదని   స్పష్టం చేశారు. ఎవరో ఏదో అనుకున్నారని తాము ముందస్తుకు వెళ్లే ప్రసక్తే లేదన్నారు.    తమకు ఏ రాజకీయ పార్టీతోనూ పంచాయితీ లేదని, ప్రజలే తమ బలమని, ప్రజలతోనే కలిసి నడుస్తూ విజయం అందుకుంటామని  పేర్కొన్నారు. గత పాలకులు రాష్ట్రాన్ని అప్పులమయం చేయడం వల్లే  కొంత ఇబ్బంది ఎదురౌతోందన్న రేవంత్.. ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూడా  తాము 80 వేలకు పైగా ఉద్యోగాలు ఇచ్చామని, అన్ని వర్గాల సంక్షేమానికి కట్టుబడి ఉన్నామని సీఎం రేవంత్ రెడ్డి ఉద్ఘాటించారు. Revanth Reddy vow on Lord Ram, Telangana assembly seats increase 182, Revanth Reddy 117 seats Congress, Telangana early elections clarity
ALSO ON TELUGUONE N E W S
Jason Sanjay, the son of Tamil superstar and Tamil Nadu CM Vijay, is already making headlines with his directorial debut Sigma, which has completed production and is reportedly gearing up for a theatrical release in August or September. While fans are eagerly waiting to see him behind the camera, fresh industry buzz suggests he may soon step in front of it as well. According to reports circulating in Tamil cinema circles, Jason Sanjay is seriously considering an acting career after wrapping up Sigma. Sources claim that discussions are underway for his acting debut, although no official announcement has been made yet. The latest gossip further suggests that filmmaker Tamil Kumaran is on the lookout for a story that would be the perfect launch vehicle for Jason Sanjay. The idea is reportedly to introduce him with a script that establishes his own identity rather than relying solely on his father's massive stardom. Jason Sanjay has largely stayed away from the spotlight despite belonging to one of Tamil cinema's biggest film families. Instead of making an acting debut first, he chose to enter the industry as a director with Sigma, a move that generated considerable curiosity among fans and the trade alike. While there is no official confirmation regarding his acting plans, the speculation has already sparked excitement among Vijay fans. If the reports turn out to be true, Jason Sanjay could soon be following in his father's footsteps, this time as both a filmmaker and an actor. Disclaimer: This article is based on discussions and information shared across publicly available sources and social media. Interpretations remain those of the users involved. Readers are encouraged to exercise discretion before drawing conclusions.
  సూపర్ స్టార్ మహేష్ బాబు(Mahesh Babu)ఫ్యామిలీలో త్వరలోనే పెళ్లి బాజాలు మోగనున్నాయి. మహేష్ బాబు సోదరి పద్మావతి, మాజీ ఎంపీ గల్లా జయదేవ్ దంపతుల చిన్న కుమారుడు సిద్ధార్థ్ గల్లా వివాహ బంధంలోకి అడుగుపెట్టబోతున్నాడు.సిద్ధార్థ్ గల్లా గత కొంతకాలంగా సౌత్ కొరియాకి చెందిన హాయిన్ కిమ్ (జిన్నీ) అనే అమ్మాయితో ప్రేమలో ఉన్నాడు . వీరిద్దరి ప్రేమకు ఇరువైపులా ఉన్న పెద్దలు పచ్చజెండా ఊపడంతో, ఆదివారం నాడు కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల సమక్షంలో నిశ్చితార్థ వేడుక అత్యంత వైభవంగా జరిగింది. రెండు వేర్వేరు సంస్కృతులకు చెందిన ఈ జంట ఒక్కటి కాబోతుండటం ఘట్టమనేని, గల్లా అభిమానులలో సరికొత్త ఉత్సాహాన్ని నింపింది. ఈ వేడుకకి  సంబంధించిన అందమైన ఫోటోలని మహేష్ బాబు భార్య, మాజీ హీరోయిన్  నమ్రతా శిరోద్కర్ సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు. సిద్ధార్థ్ గల్లా, హాయిన్ కిమ్‌ల నిశ్చితార్థం కేవలం పరిమిత సంఖ్యలో ఉన్న 50 నుండి 100 మంది అతిథుల సమక్షంలో జరిగినట్లు తెలుస్తోంది. ఈ వేడుకలో మహేష్ బాబు అన్న రమేష్ బాబు కుమార్తె ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. గల్లా జయదేవ్ పెద్ద కుమారుడు అశోక్ గల్లా ఇప్పటికే టాలీవుడ్‌లో హీరోగా ఎంట్రీ ఇచ్చి రెండు సినిమాలు పూర్తి చేసుకోగా, ఆయన నటిస్తున్న 'విసా' సినిమా త్వరలోనే విడుదల కానుంది. మరోవైపు చిన్న కుమారుడైన  సిద్ధార్థ్ అమర రాజా గ్రూప్‌కి  సంబంధించిన ఫ్యామిలీ బిజినెస్ వ్యవహారాలను చూసుకుంటున్నారు. వ్యాపార రంగంలో బిజీగా ఉంటూనే, తన మనసు దోచిన కొరియన్ అమ్మాయిని జీవిత భాగస్వామిగా ఎంచుకోవడం విశేషం. Also read: Lenin: సరికొత్త చర్చకి దారి తీస్తున్న క్లైమాక్స్ డైలాగ్.. ధర్మరాజు, కుక్క మాత్రమే మిగిలారా!  నిశ్చితార్థం ముగియడంతో త్వరలోనే వీరి వివాహం కూడా అత్యంత వైభవంగా జరగనుందని సమాచారం. సౌత్ కొరియన్ అమ్మాయి తెలుగు వారింటి కోడలిగా అడుగుపెట్టబోతుండటంతో ఈ పెళ్లి టాలీవుడ్‌లోనే వన్ ఆఫ్ ది మోస్ట్ టాక్‌డ్ వెడ్డింగ్స్ కానుంది. ప్రస్తుతం సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌లో ఈ కొత్త జంట ఫోటోలు మిలియన్ల కొద్దీ వ్యూస్‌తో ట్రెండ్ అవుతున్నాయి.      
తెలుగు చలనచిత్ర పరిశ్రమలో సంచలనాలకు కేరాఫ్ అడ్రస్ అయిన దర్శకుడెవరు అంటే ఎవరైనా కళ్ళు మూసుకుని చెప్పే ఏకైక పేరు ఎస్.ఎస్. రాజమౌళి. ప్రస్తుతం ఆయన సూపర్ స్టార్ మహేష్ బాబుతో అత్యంత ప్రతిష్టాత్మకమైన 'వారణాసి' అనే భారీ యాక్షన్ అడ్వెంచర్ సినిమాను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. అయితే కేవలం పెద్ద సినిమాలే కాకుండా, టాలెంట్ ఉన్న కొత్త కథలను ప్రోత్సహించడంలో కూడా రాజమౌళి ఎప్పుడూ ముందే ఉంటారు. తాజాగా ఆయన సమర్పణలో, నటనకు మారుపేరైన మలయాళ వర్సటైల్ యాక్టర్ ఫహాద్ ఫాజిల్ ప్రధాన పాత్రలో రాబోతున్న సరికొత్త చిత్రం 'డోంట్‌ ట్రబుల్‌ ద ట్రబుల్‌'. బాహుబలి వంటి దృశ్యకావ్యాన్ని అందించిన ఆర్కా మీడియా వర్క్స్ అధినేతలు శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేనిలతో పాటు రాజమౌళి కుమారుడు ఎస్ఎస్ కార్తికేయ తన 'షోయింగ్ బిజినెస్' బ్యానర్‌పై ఈ క్రేజీ ప్రాజెక్ట్‌ను సంయుక్తంగా నిర్మిస్తున్నారు. అప్పుడెప్పుడో సైలెంట్‌గా సెట్స్ మీదకు వెళ్ళిన ఈ సినిమా, ఎట్టకేలకు షూటింగ్ ముగించుకుని చివరి దశకు చేరుకుంది. తాజాగా ఈ మూవీకి సంబంధించిన అఫీషియల్ టీజర్‌ను మేకర్స్ విడుదల చేశారు. టీజర్ విడుదలైన క్షణం నుంచే సోషల్ మీడియాలో విపరీతమైన రెస్పాన్స్ సంపాదించుకుంటోంది. ఈ సినిమాతో టాలీవుడ్‌కి శశాంక్ యేలేటి అనే ఒక సరికొత్త ప్రతిభావంతుడైన దర్శకుడు పరిచయమవుతున్నారు. టీజర్ చూస్తుంటే ఇదొక సరికొత్త థ్రిల్లింగ్ ఫాంటసీ ఎంటర్‌టైనర్‌గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు స్పష్టంగా అర్థమవుతోంది. 'పుష్ప' సినిమాలో భన్వర్ సింగ్ షెకావత్ లాంటి క్రూరమైన విలన్ పాత్రతో తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో బలమైన ముద్ర వేసిన ఫహాద్ ఫాజిల్, ఇందులో దానికి పూర్తి భిన్నంగా 'సూరి' అనే ఒక ఇంద్రజాలికుడి (మేజిషియన్) పాత్రలో కనిపించి మెప్పించనున్నారు. ఈ టీజర్ కథాంశాన్ని గమనిస్తే, ఇంద్రజాలికుడు సూరి తన అద్భుతమైన మ్యాజిక్ ట్రిక్స్‌తో 'దివ్య' అనే ఒక చిన్న పాపను మాయం చేస్తాడు. ఆ తర్వాత అతని జీవితంలో ఎలాంటి ఊహించని విచిత్రమైన పరిస్థితులు చోటుచేసుకున్నాయి, ఆ చిన్నారి వల్ల అతను ఎలాంటి కష్టాలను ఎదుర్కోవాల్సి వచ్చింది అనే విషయాన్ని దర్శకుడు చాలా ఆసక్తికరంగా, థ్రిల్లింగ్‌గా చూపించారు. ఈ సినిమాలో సారా పాలేకర్, సౌరభ్ సచ్‌దేవా లాంటి నటులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. సినిమాలోని భావోద్వేగాలను, ఫాంటసీ ప్రపంచాన్ని తన అద్భుతమైన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌తో మరింత ఎలివేట్ చేయడానికి ప్రముఖ సంగీత దర్శకుడు కాల భైరవ సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ టీజర్‌పై దర్శకధీరుడు రాజమౌళి సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ ఆసక్తికరమైన పోస్ట్ పెట్టారు. "ఈ సినిమా చూస్తున్నప్పుడు తెరపై ఉన్నది ఫహాద్ ఫాజిల్, సారా పాలేకర్ అనే విషయాన్ని మీరు పూర్తిగా మర్చిపోతారు. మీ మనసులో కేవలం సూరి, దివ్య పాత్రలు మాత్రమే నిలిచిపోతాయి. ఈ పాత్రలు మీ ముఖంలో చక్కని చిరునవ్వులు పూయిస్తాయి, మిమ్మల్ని కడుపుబ్బా నవ్విస్తాయి, అలాగే మీ హృదయాన్ని ఒక తెలియని ఆనందంతో నింపేస్తాయి. వారి జీవితాల్లోని ఒక చిన్న గ్లింప్స్ మాత్రమే ఈ టీజర్" అంటూ చిత్రయూనిట్‌ని మనస్ఫూర్తిగా అభినందించారు. రాజమౌళి బ్రాండ్ ఒక సినిమాకు తోడైందంటే ఖచ్చితంగా అందులో ఏదో ఒక బలమైన కంటెంట్ ఉండి తీరుతుందని ఇండస్ట్రీ వర్గాలు నమ్ముతాయి. బాహుబలి మేకర్స్ నిర్మాణ విలువలు, ఫహాద్ ఫాజిల్ నటన తోడవడంతో ఈ సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి. ఈ థ్రిల్లింగ్ ఫాంటసీ ఎంటర్‌టైనర్‌ను రాబోయే సెప్టెంబర్ 11వ తేదీన ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేయడానికి మేకర్స్ అన్ని సన్నాహాలు పూర్తి చేస్తున్నారు. మరి ఈ క్రేజీ కాంబినేషన్ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి రికార్డులను సృష్టిస్తుందో చూడాలి.     SS Rajamouli, Fahadh Faasil, Shobu Yarlagadda, SS Karthikeya, Kala Bhairava
Prabhas unveiled teaser of Korean Kanakaraju, starring Varun Tej and directed by Merlapaka Gandhi, has finally arrived, offering a glimpse into what promises to be a fun-filled cross-cultural horror comedy. The teaser lives up to the buzz generated by the film's promotional campaign and introduces audiences to a unique blend of mass entertainment, comedy and supernatural elements. It opens on an intriguing note with Varun Tej introducing himself as Kanakaraju from a village in Rayalaseema, while the visuals unexpectedly transport viewers to Korea. The makers quickly reveal why the character earns the name "Korean Kanakaraju," setting the stage for an entertaining narrative that seamlessly connects two contrasting worlds. Varun Tej impresses in two completely different avatars. As the carefree Rayalaseema villager, he delivers effortless comedy with Satya, whose timing adds significantly to the humour. In sharp contrast, his stylish Korean mob boss look showcases a menacing screen presence packed with swagger. The actor appears equally convincing in both shades, making the dual characterization one of the teaser's biggest highlights. The horror angle, particularly after Kanakaraju's possession, blends effectively with the comedy, giving the film a distinct identity. Director Merlapaka Gandhi seems to have struck the right balance between laughs, thrills and commercial entertainment, while S. Thaman's energetic background score elevates both the eerie moments and the comic sequences. Produced by UV Creations, Korean Kanakaraju stars Ritika Nayak as the female lead and is slated for a grand theatrical release on August 7. Going by the teaser, the film has all the ingredients of a wholesome commercial entertainer and has further raised expectations among audiences. Disclaimer: This article is based on discussions and information shared across publicly available sources and social media. Interpretations remain those of the users involved. Readers are encouraged to exercise discretion before drawing conclusions.
  భవిష్యత్తులో సృష్టించబోయే  విజయపరంపరకి శంఖారావం పూరించినట్టుగా లెనిన్ తో అఖిల్ భారీ విజయాన్ని అందుకున్నాడు. దీంతో రికార్డు కలెక్షన్స్  లెనిన్ వశం అవుతున్నాయి. భారతీయుల మనోఫలకంలో నిత్యం  మెదులుతూ ఉండే  మహాభారతం స్ఫూర్తితోనే లెనిన్ కథనం ఉంటుంది. మహాభారతంలో కావాల్సిన వాళ్లే, మనం ప్రేమించే వాళ్లే, మన కలల్ని, జీవితాన్ని నాశనం చేసిస్తే  పగ తీర్చుకోవడం తప్పదనే పాయింట్  ఆధారంగా లెనిన్ తెరకెక్కడం ప్రతి ఒక్కరికి లెనిన్ మరింతగా దగ్గరవవుతున్నాడు.   క్లైమాక్స్ సీన్‌లో లెనిన్ ని ఉద్దేశించి పోలీస్ ఆఫీసర్ (సునీల్) మాట్లాడుతు  మహాభారతంలోని  కురుక్షేత్ర యుద్ధం ముగిసిన తర్వాత ధర్మరాజు, ఒక కుక్క మాత్రమే మిగిలాయి" అనే డైలాగ్ చెప్పాడు.  ఆ సంభాషణ కేవలం ఒక సినిమా డైలాగ్ మాత్రమే కాదు, మానవ జీవిత సత్యాన్ని, నైతిక విలువలను ప్రతిబింబించే ఒక గొప్ప సందేశం. ఈ డైలాగ్ యొక్క సుదీర్ఘ వివరణను, దాని వెనుక ఉన్న పురాణ నేపథ్యాన్ని ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.చెప్పిన ఒక డైలాగ్ ప్రేక్షకుల హృదయాలను బలంగా తాకింది. మహాభారత యుద్ధం ముగిసిన తర్వాత పాండవులు 36 సంవత్సరాల పాటు హస్తినాపురాన్ని పరిపాలించారు. ఆ తర్వాత జీవితంపై వైరాగ్యంతో మహాప్రస్థానాన్ని ప్రారంబిస్తు ద్రౌపదితో సహా ఐదుగురు పాండవులు హిమాలయాల గుండా స్వర్గానికి ప్రయాణమయ్యారు. ఈ సుదీర్ఘ ప్రయాణంలో వారిని ఒక సాధారణ కుక్క మొదటి నుండి అనుసరిస్తూనే ఉంది. ప్రయాణం సాగుతుండగా, ఒక్కొక్కరుగా తమ పాపాల కారణంగా కిందపడి ప్రాణాలు కోల్పోయారు. మొదట ద్రౌపది, ఆ తర్వాత సహదేవుడు, నకులుడు, అర్జునుడు, చివరగా భీముడు కూడా కిందపడిపోయారు. కానీ ఆఖరి వరకు ధర్మరాజు ఏమాత్రం చలించకుండా తన ప్రయాణాన్ని కొనసాగించాడు. ఆయనతో పాటు ఆ నల్లని కుక్క మాత్రమే చివరి వరకు నడుస్తూ వచ్చింది. చివరకు స్వర్గలోక అధిపతి అయిన ఇంద్రుడు తన రథంతో ధర్మరాజును స్వర్గానికి తీసుకెళ్లడానికి స్వయంగా వచ్చాడు. అయితే, తనతో పాటు వచ్చిన ఆ కుక్కను కూడా రథం ఎక్కించుకోవాలని ధర్మరాజు కోరాడు. దానికి ఇంద్రుడు నిరాకరిస్తూ, "కుక్కలకు స్వర్గంలో ప్రవేశం లేదు, దాన్ని అక్కడే వదిలేసి రా" అని చెప్పాడు. అప్పుడు ధర్మరాజు ఎంతో నిక్కచ్చిగా సమాధానమిచ్చాడు. "నన్ను నమ్మి, నా నీడలా నా వెంటే వచ్చిన ఈ ప్రాణాన్ని నేను అర్ధాంతరంగా వదిలిపెట్టలేను. ఒకవేళ దీనికి స్వర్గ ప్రవేశం లేకపోతే, నాకు కూడా ఆ స్వర్గం వద్దు" అని ఖచ్చితంగా చెప్పేశాడు. ధర్మరాజు యొక్క ఈ అచంచలమైన ధర్మనిష్ఠని  చూసి ఆ కుక్క రూపంలో ఉన్న యమధర్మరాజు (ధర్మదేవత) తన నిజరూపంలో ప్రత్యక్షమయ్యాడు. ధర్మరాజును పరీక్షించడానికే తాను కుక్క రూపంలో వచ్చానని చెప్పి, అతని నీతిని మెచ్చుకున్నాడు. also read: Ntr: ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీ వార్తలపై అధికారకంగా లేఖ రిలీజ్  ఆ డైలాగ్ ని క్లైమాక్స్‌లో సునీల్ క్యారక్టర్  ద్వారా ఎందుకు చెప్పించారంటే, సదరు డైలాగ్ లెనిన్ క్యారెక్టరైజేషన్‌కి  పూర్తి అద్దం పడుతుంది.  యుద్ధ రంగంలో లేదా జీవిత పోరాటంలో ఎంతమంది ఉన్నా, చివరికి మిగిలేది కేవలం ధర్మం మరియు ఆ ధర్మాన్ని నమ్మినవాడు మాత్రమే. ఇక్కడ కుక్క అనేది విశ్వాసానికి, నిస్వార్థ భక్తికి మరియు ధర్మానికి ప్రతీక. ప్రపంచమంతా నిన్ను వదిలేసినా, నువ్వు నమ్మిన ధర్మం మరియు నీకున్న విశ్వాసం నిన్ను ఎప్పటికీ వదిలిపెట్టవు. క్లైమాక్స్ లో హీరో ఒంటరిగా పోరాడుతున్నప్పుడు, అతని వెనుక ఉన్న లాయల్టీని, అతను ఎంచుకున్న ధర్మ మార్గాన్ని ఎలివేట్ చేయడానికి ఈ పురాణ గాథను దర్శకుడు అద్భుతంగా వాడుకున్నాడు . అందుకే ఈ డైలాగ్ థియేటర్లలో ప్రేక్షకులకు ఒక సరికొత్త అనుభూతిని పంచడమే కాకుండా, జీవితంలో విశ్వాసానికి ఉన్న విలువని గుర్తు చేస్తుంది.
మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ విలక్షణమైన నటనతో, విభిన్నమైన కథాంశాలతో సౌత్ ఇండియాలోనే కాకుండా పాన్ ఇండియా స్థాయిలో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ముఖ్యంగా రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా వచ్చిన 'సలార్' సినిమాలో వరదరాజ మన్నార్‌గా పృథ్వీరాజ్ పోషించిన పాత్ర తెలుగు ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయింది. ఆ సినిమా అందించిన భారీ క్రేజ్, బలమైన నమ్మకంతోనే ఆయన తన తాజా సర్వైవల్ థ్రిల్లర్ చిత్రం 'ఐ నో బడి' ని నేరుగా తెలుగు రాష్ట్రాల్లో భారీ ఎత్తున రిలీజ్ చేశారు. అయితే, ఎన్నో అంచనాల మధ్య థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా ఆశించిన స్థాయిలో ప్రభావం చూపలేకపోయింది. బాక్సాఫీస్ వద్ద తీవ్ర నిరాశను మిగిల్చింది. ఈ నేపథ్యంలో సినిమా ప్రమోషన్ల వైఫల్యాలపై, జరిగిన తప్పులపై హీరో పృథ్వీరాజ్ స్వయంగా స్పందిస్తూ తెలుగు ప్రేక్షకులకు బహిరంగంగా క్షమాపణలు చెప్పడం ఇప్పుడు టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. ఈ సినిమా పరాజయానికి, ప్రేక్షకులకు కనెక్ట్ కాకపోవడానికి ప్రధాన కారణం టైటిల్ విషయంలో జరిగిన తీవ్రమైన కన్ఫ్యూజన్. సినిమా ప్రమోషన్ల సమయంలో ప్రొడక్షన్ టీమ్ అంతా ఇంగ్లీష్‌ టైటిల్ 'ఐ నో బడి' అంటూ పెద్ద ఎత్తున ప్రచారం చేసింది. కానీ, ఆడియన్స్ థియేటర్లలోకి వెళ్లి స్క్రీన్ మీద చూసేసరికి 'ఐ ఎవరూ లేరు' అనే వింతైన టైటిల్ కనిపించింది. ఇంగ్లీష్‌ లైన్‌ను తెలుగులోకి సరిగ్గా ట్రాన్స్‌లేట్ చేయకపోవడం వల్ల వచ్చిన ఈ అనువాద లోపం సాధారణ ప్రేక్షకులను తీవ్ర గందరగోళానికి గురిచేసింది. దీనికి తోడు గ్రౌండ్ లెవెల్‌లో పబ్లిసిటీ అసలు శూన్యమనే చెప్పాలి. పృథ్వీరాజ్ స్వయంగా హైదరాబాద్ వచ్చి గ్రాండ్‌గా ప్రెస్ మీట్ పెట్టినప్పటికీ, ఆ తర్వాత ప్రమోషన్స్ పూర్తిగా నత్తనడకన సాగాయి. సినిమా అసలు ఎప్పుడు రిలీజ్ అయిందో, ఏయే థియేటర్లలో నడుస్తోందో కూడా చాలా మంది సాధారణ ప్రేక్షకులకు కనీస సమాచారం లేకుండా పోయింది. ఈ వీక్ పబ్లిసిటీ ఎఫెక్ట్ వల్ల బాక్సాఫీస్ వద్ద కనీస ఓపెనింగ్స్ కూడా నమోదు కాలేదు. జనాలు లేక బీసీ సెంటర్లలో కొన్ని చోట్ల షోలు కూడా రద్దయ్యే పరిస్థితి వచ్చింది. మరోవైపు, ఈ సినిమాకు బాక్సాఫీస్ వద్ద గట్టి పోటీ కూడా ఎదురైంది. ప్రస్తుతం థియేటర్లలో 'లెనిన్' సినిమా బాక్సాఫీస్ హవా నడుస్తోంది. దీనితో పాటు ఇంగ్లీష్ డబ్బింగ్ హారర్ మూవీ 'ఈవిల్ డెడ్ బర్న్', మరో డబ్బింగ్ చిత్రం 'హృదయం మురళి' రేసులో ఉండటంతో 'ఐ నో బడి' కి మంచి థియేటర్లు దొరకడమే కష్టంగా మారింది. పైగా, ఈ మధ్య కాలంలో మన తెలుగు ప్రేక్షకులు మలయాళ కంటెంట్ ఆధారిత సినిమాలను థియేటర్ల కంటే ఓటీటీ  వేదికలపై చూసేందుకే ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు. వీటన్నింటిపై పృథ్వీరాజ్ ఓపెన్‌గా స్పందిస్తూ.. కేవలం ఒక ప్రెస్ మీట్ పెడితే సరిపోదని, బ్రాండింగ్ లోపాలు, టైటిల్ ట్రాన్స్‌లేషన్ లోపాలు సినిమాను దెబ్బతీశాయని అంగీకరించారు. ఈసారికి తనను క్షమించమని, భవిష్యత్తులో ఇలాంటి తప్పులు జరగకుండా చూసుకుంటానని ప్రామిస్ చేశారు. ప్రస్తుతం నితిన్ 'వారణాసి' చిత్రంలో పవర్‌ఫుల్ విలన్‌గా నటిస్తూ తెలుగు మార్కెట్‌పై కన్నేసిన పృథ్వీరాజ్, ఈ ఫెయిల్యూర్ నుంచి పాఠాలు నేర్చుకుని నెక్స్ట్ ప్రాజెక్ట్‌తో గట్టి కంబ్యాక్ ఇస్తారని ఆశిద్దాం.       Prithviraj Sukumaran, I No Body, Salaar, Varanasi Movie 
అక్కినేని యువ హీరో అఖిల్ నటించిన లేటెస్ట్ మూవీ 'లెనిన్' బాక్సాఫీస్ వద్ద సరికొత్త సంచలనాలు సృష్టిస్తోంది. ఈ సినిమా రిలీజ్ తర్వాత అఖిల్ కెరీర్‌ పూర్తిగా మలుపు తిరిగినట్లు కనిపిస్తోంది. ఒకవైపు థియేటర్లలో కలెక్షన్ల వర్షం కురుస్తుండగా, మరోవైపు అఖిల్ నటనపై సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖుల నుంచి ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలోనే ఎప్పుడూ తన మనసులోని భావాలను ఎలాంటి మొహమాటం లేకుండా ముక్కుసూటిగా చెప్పే సంచలన దర్శకుడు రామ్‌గోపాల్‌వర్మ సోషల్ మీడియా వేదికగా చేసిన కామెంట్స్ ఇప్పుడు టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారాయి. అక్కినేని ఫ్యామిలీలోనే ఇప్పటివరకు చూసిన నటులందరిలోకి అఖిలే అత్యుత్తమ నటుడు అంటూ వర్మ చేసిన వ్యాఖ్యలు అభిమానుల్లో పెద్ద చర్చకు దారితీశాయి. లెనిన్ సినిమా చూసిన తర్వాత ఆర్జీవీ ఎక్స్ వేదికగా తన అభిప్రాయాన్ని పంచుకుంటూ అఖిల్‌కు ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపారు. కేవలం సినిమా బాగుందని చెప్పడానికే పరిమితం కాకుండా, అఖిల్ యాక్టింగ్ స్కిల్స్‌ను ఆకాశానికెత్తేశారు. "అక్కినేని కుటుంబంలో నువ్వే బెస్ట్ యాక్టర్" అని పేర్కొంటూ, ఆ మాటను ఏకంగా నాగార్జునపై ఒట్టేసి చెబుతున్నాను అంటూ ఆర్జీవీ తనదైన మార్క్ స్టైల్‌లో ట్వీట్ చేయడం విశేషం. దీంతో సీనియర్ హీరో నాగార్జున, యువ సామ్రాట్ నాగ చైతన్యల కంటే కూడా అఖిల్ యాక్టింగ్‌ను ఆర్జీవీ ఎంతో ఎక్కువగా మెచ్చుకున్నట్టుగా సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ సంచలన పోస్ట్ ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఆర్జీవీ చేసిన ఈ కామెంట్స్‌లో మరో ఆసక్తికరమైన అంశం ఏంటంటే, అఖిల్ నటనలో కనిపించిన సహజత్వాన్ని ఆయన ప్రత్యేకంగా మెచ్చుకున్నారు. పెద్దగా ఎమోషన్స్ లేని నార్మల్ సీన్స్‌లో కూడా అఖిల్ చాలా ఈజ్‌తో, ఎంతో సులువుగా నటించాడని కొనియాడారు. అంతేకాదు, క్లిష్టమైన ఎమోషనల్ సీన్స్‌లో థియేటర్లోని ఆడియన్స్‌ను కట్టిపడేసే స్థాయిలో అద్భుతమైన పర్ఫార్మెన్స్ ఇచ్చాడని ప్రశంసించారు. ఒక పరిణతి చెందిన నటుడిగా అఖిల్‌లో కనిపించిన ఈ మెచ్యూరిటీ తనను ఎంతగానో ఆశ్చర్యపరిచిందని వర్మ తన సోషల్ మీడియా పోస్టులో స్పష్టంగా పేర్కొన్నారు. అఖిల్‌లోని ఈ సరికొత్త నటన కోణాన్ని, ఇంటెన్సిటీని బయటకు తీసుకొచ్చిన వైవిధ్యభరిత దర్శకుడు మురళి కిషోర్ అబ్బూరిని కూడా ఆర్జీవీ ప్రత్యేకంగా అభినందించారు. కేవలం ఒక స్టార్ హీరో ఇమేజ్‌ను మాత్రమే కాకుండా, అతడి నటనకు పూర్తి స్థాయిలో స్కోప్ ఉన్న ఒక పవర్‌ఫుల్ పాత్రను డిజైన్ చేసినందుకు డైరెక్టర్‌ను ప్రశంసించారు. ఇదిలా ఉంటే, బాక్సాఫీస్ వద్ద కూడా 'లెనిన్' చిత్రం భారీ వసూళ్లతో దూసుకుపోతోంది. ఈ సినిమా రిలీజైన మొదటి మూడు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ. 61 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్లను సాధించినట్లు నిర్మాతలు అధికారికంగా అనౌన్స్ చేశారు. రాబోయే రోజుల్లో ఈ కలెక్షన్ల వేగం మరింత పెరిగే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.     Akhil Akkineni, Ram Gopal Varma, Nagarjuna, Naga chaitanya
టాలీవుడ్‌లో ఒక్క విజయం దర్శకుడి తలరాతను మార్చేస్తుంది, అలాగే ఒక పెద్ద స్టార్ హీరో ఇచ్చే అవకాశం ఆ దర్శకుడి కెరీర్‌కు సరికొత్త ఊపిరి పోస్తుంది. ఇప్పుడు సరిగ్గా ఇదే తరహా ఆసక్తికర చర్చ టాలీవుడ్ వర్గాల్లో జోరుగా సాగుతోంది. సీనియర్ స్టార్ హీరో, కింగ్ అక్కినేని నాగార్జున తన ప్రతిష్టాత్మక 101వ సినిమాను ప్లాన్ చేసుకుంటున్న తరుణంలో, ఈ ప్రాజెక్ట్‌కు క్రేజీ డైరెక్టర్ బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం వహించే అవకాశం ఉందనే ప్రచారం ఫిల్మ్ నగర్ సర్కిల్స్‌లో హాట్ టాపిక్‌గా మారింది. ఈ కాంబినేషన్ గనుక నిజమైతే, ఇది భాస్కర్‌కు కేవలం ఒక సాధారణ సినిమా మాత్రమే కాదు, ఆయన కెరీర్‌ను మళ్లీ గాడిలో పెట్టే ఒక అద్భుతమైన మైలురాయి కానుందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. దర్శకుడు భాస్కర్ తన తొలి చిత్రం 'బొమ్మరిల్లు'తోనే తెలుగు చలనచిత్ర పరిశ్రమలో కుటుంబ కథా చిత్రాలకు ఒక సరికొత్త నిర్వచనం ఇచ్చారు. వెండితెరపై మానవ సంబంధాలను, సున్నితమైన కుటుంబ భావోద్వేగాలను అత్యంత సహజంగా ఆవిష్కరించగల ప్రతిభావంతుడైన దర్శకుడిగా ఆయన మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ బ్లాక్‌బస్టర్ విజయం తర్వాత ఆయన చేసిన కొన్ని సినిమాలు బాక్సాఫీస్ వద్ద ప్రేక్షకులను ఆశించిన స్థాయిలో అలరించలేకపోయాయి. కథల్లో మంచి కంటెంట్ ఉన్నప్పటికీ, కమర్షియల్ సక్సెస్ అందుకోవడంలో వెనుకబడటంతో, ఒకప్పుడు టాలీవుడ్ స్టార్ దర్శకుల జాబితాలో నిలిచిన భాస్కర్, ప్రస్తుతం మళ్లీ ఒక భారీ కమ్‌బ్యాక్ హిట్ కోసం చాలా కాలంగా ఎదురుచూస్తున్నారు. ఇలాంటి కీలక సమయంలో కింగ్ నాగార్జున 101వ చిత్రానికి దర్శకత్వం వహించే గోల్డెన్ ఛాన్స్ భాస్కర్ తలుపు తట్టిందనే వార్త అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. నటుడిగా ఎన్నో వైవిధ్యమైన ప్రయోగాలు చేసిన నాగార్జున కోసం భాస్కర్ ప్రస్తుతం ఒక అదిరిపోయే ఫ్యామిలీ ఎమోషనల్ లైన్ సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. ఈ స్టోరీకి సంబంధించిన ప్రాథమిక చర్చలు ఇప్పటికే జరిగాయని, కథ పూర్తిగా నచ్చితేనే కింగ్ నాగార్జున ఫైనల్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం ఉందని ఇండస్ట్రీ టాక్. అయితే కేవలం నాగార్జున వంటి స్టార్ హీరో అవకాశం ఇవ్వడం మాత్రమే భాస్కర్ కెరీర్‌ను మార్చేయదు, ఆ లభించిన అరుదైన అవకాశాన్ని ఆయన ఎంత బలంగా, సృజనాత్మకంగా ఉపయోగించుకుంటారనే దానిపైనే అంతా ఆధారపడి ఉంటుంది. నాగార్జున ఇమేజ్‌ను దృష్టిలో ఉంచుకుంటూనే, ప్రస్తుత తరం ప్రేక్షకుల మారుతున్న టేస్ట్‌కు అనుగుణంగా సరికొత్త స్క్రీన్‌ప్లేతో, హృదయాన్ని కట్టిపడేసే బలమైన భావోద్వేగాలతో ఈ సినిమాను తెరకెక్కించాల్సి ఉంటుంది. సాధారణంగా నాగార్జున కెరీర్‌ను గమనిస్తే, ఆయన కొత్త కథలను, ప్రతిభ గల దర్శకులను ప్రోత్సహించడంలో ఎప్పుడూ ముందుంటారు. దర్శకుడి గత సినిమాల ఫలితాలతో సంబంధం లేకుండా కథలో దమ్ముంటే చాలు అవకాశం ఇచ్చిన సందర్భాలు గతంలో ఎన్నో ఉన్నాయి. ప్రస్తుతం నాగార్జున తన మైల్‌స్టోన్ 100వ సినిమా షూటింగ్‌తో ఫుల్ బిజీగా గడుపుతున్నారు. ఈ ప్రాజెక్ట్ పూర్తయిన తర్వాతే 101వ సినిమాపై పూర్తి స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఇప్పటివరకు ఈ కాంబినేషన్‌పై ఎలాంటి అధికారిక ప్రకటన రానప్పటికీ, అక్కినేని అభిమానుల్లో మాత్రం ఈ క్రేజీ కాంబోపై భారీ అంచనాలు మరియు ఆసక్తి నెలకొన్నాయి.
  మాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్(Ntr)రాజకీయ ఆరంగేట్రంపై కొన్ని రోజులుగా  సోషల్ మీడియా మరియు ప్రధాన మీడియా వేదికల్లో ఒకటే ఉత్కంఠ నడుస్తోంది. ముఖ్యంగా జులై 18వ తేదీన ఎన్టీఆర్  పొలిటికల్ ఎంట్రీ ఇవ్వబోతున్నాడని, ఆ రోజు ఒక భారీ బహిరంగ సభని  నిర్వహించి తన భవిష్యత్తు ప్రణాళికని ప్రకటించబోతున్నాడనే ఊహాగానాలు సినీ, రాజకీయ వర్గాల్లో చక్కర్లు కొడుతు వస్తున్నాయి. పొరుగు రాష్ట్రం తమిళనాడులో నటుడు విజయ్ రాజకీయాల్లోకి ప్రవేశించి ఇళయ దళపతి విజయ్  రాజకీయాల్లోకి ప్రవేశించి  అసెంబ్లీ ఎన్నికల్లో సాధించిన ఘన విజయం, ఏపీలో పవన్ కళ్యాణ్ సాధించిన తిరుగులేని సక్సెస్ నేపథ్యంలో, అదే తరహాలో తారక్ కూడా రంగంలోకి దిగుతున్నారంటూ వార్తలు పుట్టుకొచ్చాయి. అయితే, ఈ సంచలన ప్రచారానికి తాజాగా ఎన్టీఆర్ అధికారిక టీమ్, ఎన్టీఆర్ అభిమానుల సంఘం సంయుక్తంగా ఒక లేఖ విడుదల చేస్తూ పూర్తి స్పష్టత ఇచ్చారు. ఈ లేఖతో అభిమానుల్లోనూ, పొలిటికల్ సర్కిల్స్‌లోనూ నెలకొన్న సస్పెన్స్‌కి  ఎట్టకేలకు తెరపడింది. అభిమానుల సంఘం విడుదల చేసిన అధికారిక లేఖ ప్రకారం.. జులై 18న నిర్వహించ తలపెట్టిన "ఊరు-వాడ" కార్యక్రమానికి, ఎన్టీఆర్ రాజకీయ ప్రవేశానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమం పూర్తిగా ఒక సామాజిక సేవా కార్యక్రమంతో పాటు  అభిమాన సంఘాల పునర్వ్యవస్థీకరణకి  సంబంధించినది. ఎన్టీఆర్ వెండితెరపై సాధిస్తున్న 100 శాతం విజయాల స్పూర్తితో సమాజంలో మార్పు తీసుకురావడానికి, సేవా కార్యక్రమాలు విస్తృతం చేయడానికి ఎప్పుడో నెలల క్రితమే ఈ "ఊరు-వాడ" ప్రణాళికని  సిద్ధం చేసినట్లు వివరించారు. కేవలం ఈ మీటింగ్‌ని  కొందరు రాజకీయ రంగు పులిమి తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఎన్టీఆర్ ప్రస్తుతం ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వస్తున్న "డ్రాగన్" వంటి ప్రతిష్టాత్మక పాన్-ఇండియా సినిమాలతో బిజీగా ఉన్నారు. ఆయన దృష్టి మొత్తం 100 శాతం సినిమాలపైనే ఉంది. Also read: sir sam neill: జురాసిక్ పార్క్ సామ్ ఇక లేరు.. ఈ రోజు ఉదయం కన్నుమూత  ఈ నేపథ్యంలో మీడియా సంస్థలు, యూట్యూబ్ ఛానెళ్లు మరియు డిజిటల్ సోషల్ మీడియా పేజీలు ఎలాంటి ధృవీకరణ లేని సమాచారాన్ని, అసత్య పుకార్లను ప్రచారం చేయవద్దని ఎన్టీఆర్ టీమ్ గట్టిగా విజ్ఞప్తి చేసింది. "ఊరు-వాడ" కార్యక్రమానికి సంబంధించిన వేదిక, సమయం, మరియు భవిష్యత్తు కార్యాచరణకు సంబంధించిన పూర్తి రోడ్‌మ్యాప్ వివరాలను త్వరలోనే ఎన్టీఆర్ తన అధికారిక సోషల్ మీడియా వేదికల ద్వారా స్వయంగా వెల్లడిస్తారు. కాబట్టి అభిమానులు ఎవరూ సోషల్ మీడియాలో వచ్చే ఫేక్ న్యూస్‌లను నమ్మవద్దని, కేవలం అధికారిక ప్రకటనలను మాత్రమే ఫాలో అవ్వాలని సూచించారు.     
టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద అక్కినేని యంగ్ హీరో అఖిల్ నూతన చిత్రం 'లెనిన్' భారీ స్పందనతో దూసుకుపోతోంది. వైవిధ్యమైన కథాంశంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా అన్ని వర్గాల ఆడియన్స్‌ను విశేషంగా ఆకట్టుకుంటూ థియేటర్లలో సక్సెస్ ఫుల్‌గా ప్రదర్శించబడుతోంది. అఖిల్ కెరీర్‌లోనే వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీగా నిలిచిన ఈ చిత్రంపై ప్రస్తుతం చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. తాజాగా ఈ జాబితాలోకి టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి కూడా చేరారు. లెనిన్ చిత్ర యూనిట్ ను అభినందిస్తూ ఆయన సోషల్ మీడియా వేదికగా షేర్ చేసిన ఒక ప్రత్యేకమైన ఎమోషనల్ పోస్ట్ ఇప్పుడు నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది. మెగాస్టార్ చిరంజీవి తన పోస్ట్‌లో లెనిన్ చిత్రం బాక్సాఫీస్ వద్ద సాధిస్తున్న అద్భుతమైన ఘనవిజయం పట్ల ఎంతో సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఒక సినిమా కేవలం కమర్షియల్‌గా కలెక్షన్లు రాబట్టడమే కాకుండా, ప్రేక్షకులు, విమర్శకుల నుండి ఈ స్థాయిలో ఏకగ్రీవంగా గొప్ప ప్రశంసలు అందుకోవడం అనేది నిజంగా విశేషమని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ భారీ సక్సెస్ సాధించిన సందర్భంగా చిత్రబృందానికి ఆయన తన హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. ముఖ్యంగా అఖిల్ అక్కినేని నటన, స్క్రీన్ ప్రెజెన్స్ గురించి చిరంజీవి చేసిన వ్యాఖ్యలు అక్కినేని అభిమానుల్లో సరికొత్త ఉత్సాహాన్ని నింపాయి. చిరంజీవి తన ఎమోషనల్ సందేశంలో అఖిల్‌తో తనకున్న ఆత్మీయ బంధాన్ని గుర్తుచేసుకుంటూ, "అఖిల్ నాకు నా సొంత కొడుకులాంటి వాడు. ప్రతి సినిమాతోనూ అతడు నటుడిగా ఎంతో పరిణతి సాధిస్తూ, తనను తాను కొత్తగా ఆవిష్కరించుకుంటూ ఎదుగుతున్న విధానం చూడటం నాకు ఒక తండ్రిగా ఎంతో గర్వంగా, ఆనందంగా ఉంది" అంటూ ఎంతో భావోద్వేగంగా ప్రశంసించారు. లెనిన్ సినిమాతో దక్కిన ఈ భారీ బ్లాక్‌బస్టర్ విజయం అఖిల్ సినీ కెరీర్‌లో మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించడానికి ఒక బలమైన నాంది కావాలని మెగాస్టార్ మనస్ఫూర్తిగా ఆకాంక్షించారు. అఖిల్‌తో పాటు తన చిరకాల మిత్రుడు, టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జునకు కూడా చిరంజీవి ప్రత్యేకంగా అభినందనలు అందజేశారు. అక్కినేని కుటుంబానికి, అభిమానులకు ఇంతటి అద్భుతమైన ఆనందాన్ని, విజయాన్ని అందించిన ఈ సినిమా వెనుక ఉన్న ప్రతి ఒక్కరి శ్రమ ప్రశంసనీయమని కొనియాడారు. ఈ చిత్రానికి అద్భుతమైన విజయాన్ని చేకూర్చిన దర్శకుడు మురళీ కిషోర్ అబ్బూరు ప్రతిభను, హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే నటనను, అలాగే నిర్మాతలతో పాటు సాంకేతిక విపుణుల కృషిని చిరంజీవి తన పోస్టు ద్వారా ప్రత్యేకంగా అభినందించారు. అయితే, తాను బిజీ షెడ్యూల్స్ వల్ల ఇంకా ఈ చిత్రాన్ని థియేటర్లలో చూడలేదని, కానీ ప్రతిచోటా ప్రేక్షకుల నుంచి వస్తున్న ఈ అద్భుతమైన పాజిటివ్ రెస్పాన్స్ చూశాక లెనిన్ సినిమాను వీలైనంత త్వరగా చూడాలనే ఆసక్తి తనలో మరింతగా పెరిగిందని మెగాస్టార్ వెల్లడించారు. త్వరలోనే ప్రత్యేకంగా సమయం కేటాయించుకుని ఈ చిత్రాన్ని వీక్షిస్తానని ఆయన స్పష్టం చేశారు. బాక్సాఫీస్ వద్ద 'లెనిన్' ఇదే విజయ పరంపరను, కలెక్షన్ల సునామీని మరికొన్ని వారాల పాటు కొనసాగించి మరిన్ని సరికొత్త రికార్డులను సృష్టించాలని చిరంజీవి కోరుకున్నారు. మెగాస్టార్ చిరంజీవి చేసిన ఈ ఎమోషనల్ అండ్ పాజిటివ్ పోస్ట్‌తో అటు మెగా అభిమానులు, ఇటు అక్కినేని అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. సోషల్ మీడియాలో మెగా-అక్కినేని బాండింగ్‌పై ప్రశంసలు కురుస్తున్నాయి.
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు. వారితో పాటు పెద్ద సంఖ్యలో క్యాడర్ కూడా పార్టీని వీడుతున్నారు. ఇక ఇప్పుడు నామినేటెడ్ పదవులలో ఉన్న వారి వంతు మొదలైనట్లు కనిపిస్తోంది. తనకు కానీ తన భర్తకు  కానీ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు టికెట్ ఇవ్వాలంటూ గత  కొంత కాలంగా కోరుతూ వస్తున్న మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ వంతు వచ్చింది. ఆమె కూడా రాజీనామా అస్త్రం సంధించారు.  జగన్ కు నమ్మిన బంటుగా గుర్తింపు పొందిన మహిళాకమిషన్ చైర్ పర్సన్ వాసి రెడ్డి పద్మ తన పదవికి రాజీనామా చేశారు. ఉరుములేని పిడుగులా, ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా తన రాజీనామా లేఖను సీఎం జగన్ కు పంపేశారు. పేరుకు తాను పార్టీకి కాదు, కేవలం మహిళా కమిషన్ చైర్మన్ పదవికి మాత్రమే రాజీనామా చేశాననీ, ఇక నుంచి వైసీపీ కోసం పని చేస్తాననీ వాసిరెడ్డి పద్మ చెబుతున్నప్పటికీ, ఆమె రాజీనామాకు కారణం అసంతృప్తేనని పార్టీ వర్గాలు బాహాటంగానే చెబుతున్నాయి. చాలా కాలంగా వాసిరెడ్డి పద్మ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు తనకు కానీ తన భక్తకు కానీ పార్టీ టికెట్ ఇవ్వాలని జగన్ ను కోరుతూ వస్తున్నారు. అయితే ఇప్పటి వరకూ జగన్ చూద్దాం.. చేద్దాం అన్నట్లుగా దాట వేస్తూనే వచ్చారు. ఇప్పుడిక వరుసగా అభ్యర్థల జాబితాలను జగన్ ప్రకటించేస్తుండటం, తనకు గానీ తన భర్తకు కానీ పార్టీ టికెట్ విషయంలో ఎటువంటి స్పస్టత ఇవ్వకపోవడంతో ఆమె మనస్తాపం చెంది పదవికి రాజీనామా చేసేశారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.  వాసిరెడ్డి పద్మ రాజకీయ ప్రవేశం ప్రజారాజ్యం పార్టీతో జరిగింది. 2009లో ఆమె ప్రజారాజ్యం పార్టీలో చేరారు. ఇలా చేరడంతోనే ఆమె ప్రజారాజ్యం అధికార ప్రతినిథిగా పదవి దక్కించుకున్నారు. ప్రజారాజ్యం కాంగ్రెస్ పార్టీలో విలీనం కావడంతో ఆమె 2012లో జగన్ పార్టీలో చేరారు. జగన్ కూడా ఆమెకు అధికార ప్రతినిథి పదవి ఇచ్చారు.  2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆమెను రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా నియమించారు. చైర్ పర్సన్ హోదాలో ఆమె జగన్ మెప్పు పొందేందుకు చేయగలిగినంతా చేశారు. ప్రతిపక్ష పార్టీ నేతలకు నోటీసులు ఇచ్చారు. ఏకంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు సైతం నోటీసులు జారీ చేశారు. వార్డు వలంటీర్లపై పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు కమిషన్ ముందు హాజరై వివరణ ఇవ్వాలంటూ ఆమె పవన్ కు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. పవన్ హాజరు కాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు నమోదు చేయాలని ఆదేశించారు. ఇన్ని చేసినా వాసిరెడ్డి పద్మకు ఆమె కోరినట్లుగా పార్టీ టికెట్ లభించకపోవడంతో అలిగి పదవికి రాజీనామా చేశారని, ఇది జగన్ కు షాకేననీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు. ఒకరైతు తనకు చేసిన సేవలకు ప్రీతి చెందిన గురువు అతడికి స్వర్గ ప్రాప్తిని కలగజేయాలని అనుకుంటాడు. కానీ సంసారాసక్తి వల్ల ఆ రైతు ఆ అవకాశాన్ని వాయిదా వేసుకుంటూ వస్తాడు. చివరికి గురుకృప వల్ల ఆ రైతు స్వర్గ ప్రాప్తిని ఎలా పొందాడో ఈ కథ తెలియజేస్తుంది. "ఒక మహాపురుషుడు ప్రయాణం చేస్తూ, డస్సిపోయాడు. గొంతు ఎండిపోయింది. దారిలో ఒక రైతు కనపడితే నీళ్ళు అర్థించాడు. ఆ రైతు మహాత్మునికి సకల ఉపచారాలూ చేశాడు. చిరిగిపోయిన ఆయన ఉత్తరీయాన్ని రైతు జాగ్రత్తగా కుట్టి బాగుచేశాడు. రైతు పరిచర్యలకు సంతసించిన ఆ మహాత్ముడు శాంతి, ఆనందాలకు నిలయమైన స్వర్గానికి తనతోపాటు రమ్మని అంటాడు. అందుకు ఆ రైతు 'గురువుగారూ! మీరు నా మీద చూపిన దయకు కృతజ్ఞుణ్ణి. కానీ నా పిల్లలు ఇంకా చిన్నవాళ్ళు. ఓ ఏడేళ్ళ వ్యవధి ఇవ్వండి' అని అడుగుతాడు. అందుకు గురువు అంగీకరించాడు. సరిగ్గా ఏడేళ్ళ తర్వాత గురువు రైతును స్వర్గానికి తీసుకువెళ్ళడానికి వచ్చాడు. అప్పుడు రైతు 'అయ్యా! కడపటి కొడుకు కష్టాలకు అంతు లేదు. అన్ని జంఝాటాలనూ ఒక్కడే సంబాళించుకోలేకపోతున్నాడు. కాబట్టి మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని గురువుని అడిగాడు. మరో ఏడేళ్ళ తరువాత గురువు వచ్చాడు. కానీ రైతు చనిపోయాడని తెలిసింది. చనిపోయిన ఆ రైతు ఎద్దుగా పుట్టాడని ఆ గురువు తన దివ్య దృష్టితో తెలుసుకున్నాడు. ఎద్దుగా పుట్టిన ఆ రైతు తన కొడుకు పొలాన్నే దున్నుతున్నాడు. అప్పుడు గురువు ఆ ఎద్దుపై మంత్ర జలం చిలకరించగానే ఎద్దు జన్మనెత్తిన రైతు 'నా కొడుకు పరిస్థితి మరి కాస్త మెరుగు పడనీయండి స్వామీ! మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని అన్నాడు. ఇక చేసేది లేక వెనుదిరిగాడు గురువు. మరలా ఏడేళ్ళ తర్వాత వచ్చిన గురువుకు ఎద్దు చనిపోయిందని తెలిసింది. అది కుక్కగా పుట్టి కొడుకు ఇంటినీ, ఆస్తినీ కాపలా కాస్తోందని తన దివ్యదృష్టి ద్వారా తెలుసుకున్నాడు. గురువు. కుక్కగా పుట్టిన ఆ రైతు 'స్వామీ! నేను ఎంత దౌర్భాగ్యుణ్ణి. మీరు ఇంత దయ చూపుతున్నప్పటికీ మీతో స్వర్గమానం చేయలేకున్నాను. వీడికి ఆస్తిని కాపాడుకొనే దక్షత ఇంకా రాలేదు. కాబట్టి దయ చేసి మరో ఏడేళ్ళు వ్యవధి ఇవ్వండి' అని వేడుకున్నాడు. గురువు ఏడేళ్ళ తరువాత మళ్ళీ వచ్చేసరికి కుక్క మరణించింది. అది త్రాచుపాముగా జన్మనెత్తి, ఇప్పుడు కొడుకు భూమిలో ఉన్న లంకెబిందెలకు పడగెత్తి కాపలా కాస్తోంది. గుప్త ధనం ఇక్కడ ఉందని కొడుకుకి ఎలా తెలియజేయాలా అని పాము ఆలోచిస్తున్నప్పుడు గురువు ఆ రైతుకొడుకును పిలుచుకు వచ్చి లంకె బిందెలు ఉన్న చోట తవ్వమన్నాడు. లంకె బిందెలు బయటపడ్డాయి. ఆ పైన ఆ పామును చంపమన్నాడు. అనంతరం శిష్యుణ్ణి తీసుకొని స్వర్గారోహణం చేశాడు గురువు. సంసారంలోని ఈతి బాధల నుండి శిష్యుణ్ణి ఉద్ధరిస్తాడు సద్గురువు. అలాంటి గురువు అందరికీ అవసరం.                                      *నిశ్శబ్ద.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్  రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది.  80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత  ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది.   ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది. ఆమెది నెద‌ర్లాండ్స్‌. ఆమె తండ్రి నెద‌ర్లాండ్స్‌లోని ఆర్నెహెమ్‌లో చిన్న‌పిల్ల‌ల ఆస్ప‌త్రి డైరెక్ట‌ర్. పోయి దొరికిన ఆ పెయింటింగ్ విష‌యానికి వ‌స్తే.. అది 1683లో కాస్ప‌ర్ నెష‌ర్ వేసిన స్టీవెన్ ఓల్ట‌ర్స్ పెయింటింగ్‌. రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో నాజీల ఆదేశాల‌ను చార్లెట్ తండ్రి వ్య‌తిరేకించారు. ఆయ‌న ర‌హ‌స్య జీవ‌నం సాగించేడు. కానీ ఈ పెయింటింగ్‌ని మాత్రం త‌న న‌గ‌రంలోని ఒక బ్యాంక్‌లో భ‌ద్ర‌ ప‌ర‌చ‌మ‌ని ఇచ్చార‌ట‌. 1940లో నాజీలు నెద‌ర్లాండ్ పై దాడులు చేసినపుడు ఆ బ్యాంక్ మీద ప‌డి దోచుకున్నా రు. అప్పుడు ఈ పెయింటింగ్ కూడా తీసుకెళ్లారు. యుద్ధం అయిపోయిన త‌ర్వాత ఈ పెయింటింగ్ ఎక్క‌డున్న‌దీ ఎవ‌రికీ తెలియ‌లేదు. చిత్రంగా 1950ల్లో డ‌స‌ల్‌డార్ష్ ఆర్ట్ గ్యాల‌రీలో అది ప్ర‌త్య‌క్ష‌మ‌యింది. 1969లో ఆమ్‌స్ట‌ర్‌డామ్‌లో దాన్ని వేలానికి తీసికెళ్లే ముందు దాన్ని ఆ ఆర్ట్ గ్యాల‌రీలో వుంద‌ని చూసిన‌వారు చెప్పారు. వేలంపాట త‌ర్వాత మొత్తానికి ఆ పెయింటింగ్‌ను 1971లో ఒక క‌ళాపిపాసి త‌న ద‌గ్గ‌ర పెట్టుకున్నాడు.    ఆ త‌ర్వాత 2021లో అది చార్లెటీని చేరింది.  మొత్తానికి వూహించ‌ని విధంగా ఎంతో కాలం దూర‌మ‌యిన గొప్ప క‌ళాఖండం తిరిగి త‌న వ‌ద్ద‌కు చేర‌డంలో చార్లెటీ ఆనందానికి అంతేలేదు. అంతే క‌దా.. పోయింద‌నుకున్న గొప్ప వ‌స్తువు తిరిగి చేరితే ఆ ఆనంద‌మే వేరు!  అయితే చార్లెటీకి ఇపుడు ఆ పెయిం టింగ్‌ను భ‌ద్రంగా చూసుకునే ఆస‌క్తి వున్న‌ప్ప‌టికీ శ‌క్తి సామ‌ర్ధ్యాలు లేవు. అందుక‌నే త్వ‌ర‌లో ఎవ‌రిక‌యినా అమ్మేసీ వ‌చ్చిన సొమ్మును పిల్ల‌ల‌కు పంచుదామ‌నుకుంటోందిట‌!  చార్లెటీ కుటుంబంలో అయిదుగురు అన్న‌ద‌మ్ములు అక్క‌చెల్లెళ్లు వున్నారు. అలాగే ఇర‌వై మంది పిల్ల‌లు ఉన్నారు. అంద‌రూ ఆమె అంటే ఎంతో ప్రేమ చూపుతున్నారు. అంద‌రం ఒకే కుటుంబం, చాలాకాలం త‌ర్వాత ఇల్లు చేరిన క‌ళాఖండం మా కుటుంబానిది అన్న‌ది చార్లెటీ!
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు. చాకోను పార్టీలోకి ఆహ్వానిస్తూ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్’ ఫ్రంట్ ఏర్పాటు గురించి ప్రత్యేకించి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు కానీ, చాకో అలాంటి  సంకేతాలు ఇచ్చారు. ప్రస్తుతం దేశంలో ఉన్న ఏ ఒక్కపార్టీ కూడా బీజేపీకి ప్రత్యాన్మాయం కాదని,సమీప భవిష్యత్ కాంగ్రెస్ సహా ఏ పార్టీ కూడా ఆ స్థాయికి ఎదిగే అవకాశాలు కూడా కనిపించడంలేదని అన్నారు. ఈ పరిస్థితుల్లో దేశంలోని బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ, ఏకమై, ఒకే గొడుగు కిందకు రావలసిన అవసరం ఉందని చాకో అన్నారు. అదే సమయంలో ప్రతిపక్షాలను ఏక తాటిపైకి తెచ్చే బాధ్యతను పవార్ తీసుకోవాలని సంకేత మాత్రంగా చెప్పారు. అంతే కాకుండా కాంగ్రెస్ పేరు ఎత్తకుండా బీజేపీ వ్యతిరేక శక్తులను ఏకం చేసే ఆలోచన ఆ పార్టీ నాయకత్వానికి లేదని నెహ్రూ గాంధీ ఫ్యామిలీ (సోనియా, రాహుల్, ప్రియాంక)ఆలోచనా ధోరణిని పరోక్షంగానే అయినా ఎండ కట్టారు.ఆ విధంగా పవార్ ఆ బాధ్యత తీసుకోవాలని చాకో సూచించారు. ఇందుకు సంబంధించి, పవార్ బహిరంగంగా ఎలాంటి వ్యాఖ్య చేయలేదు. అయితే, చాకో సహా మరికొందరు ‘సీనియర్’ కాంగ్రెస్ నాయకులు, అలాగే సిపిఎం, సిపిఐ నాయకులు కూడా పవార్’తో చాలా కాలంగా థర్డ్ ఫ్రంట్  విషయంగా చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. అయితే మహారాష్ట్రలో సంకీర్ణం మనుగడను దృష్టిలో ఉంచుకుని పవార్ ఆచితూచి అడుగులేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే చాకో పార్టీలో చేరిన సందర్భంలో కూడా ‘చాకో చేరికతో మహారాష్ట్రలోని మహా వికాస్ అగాడీ ప్రభుత్వానికి ఎలాంటి నష్టం జరగదని, పవార్ మహారాష్ట్ర సంకీర్ణ సర్కార్ ప్రస్తావన చేశారని విశ్లేషకులు పేర్కొంటున్నారు.  మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వ మనుగడ గురించ్బి  పవార్ ప్రత్యేకంగా పేర్కొనడం ద్వారా, ఆయన థర్డ్ ఫ్రంట్ విషయంలో వేచి చూసే ఆలోచనలో ఉన్నట్లు అర్థమవుతోందని కూడా  రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే అదే ఎన్సీపీ అసెంబ్లీ ఎన్నికల జరుగతున్న కేరళలో, పశ్చిమ బెంగాల్లో  కాంగ్రెస్ వ్యతిరేక పార్టీలకు మద్దతు ఇస్తోంది. దీన్ని బట్టి చూస్తే, ఎన్సీపీ - కాంగ్రెస్ మధ్య దూరం పెరుగుతోందని స్పష్టమవుతోంది. అయితే, థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఏ రకంగా ముడి పడుతుంది అనే విషయంలో ఇంకా స్పష్టత రావలసి ఉంది. అలాగే, కాంగ్రెస్ లేకుండా జాతీయ స్త్గాయిలో బీజేపీ వ్యతిరేక కూటమిని ఏర్పాటు చేయడం వలన, వ్యతిరేక ఓటు చీలి  అది మళ్ళీ బీజేపీకే మేలు చేస్తుందని, కాబట్టి, ప్రస్తుతం కాంగ్రెస్ సారధ్యంలోని యూపీఏని బలోపేతం చేయడమే ఉత్తమమనే అలోచన కూడా  విపక్ష శిబిరం నుంచి వినవస్తోంది. ఈ నేపధ్యంలోనే, ప్రస్తుతం యూపీఏ ఛైర్పర్సన్’గా ఉన్న సోనియా గాంధీ వయసు, అనారోగ్యం కారణంగా బాధ్యతల నుంచి తప్పుకుని పవార్’కు బాద్యతలు అప్పగించాలనే ప్రతిపాదన వచ్చిందని అంటున్నారు. అలాగే, ఇతర పార్టీలను, ముఖ్యంగా కాంగ్రెస్ నుంచి విడిపోయి సొంత కుంపటి పెట్టుకున్న మమతా బెనర్జీ సారధ్యంలోని తృణమూల్, జగన్మోహన్ రెడ్డి సారధ్యంలోని వైసీపీలను కలుపుకుని కూటమిని బలోపేతం చేయడం ద్వారా బీజేపీని దీటుగా ఎదుర్కోవచ్చనే ఆలోచనలు కూడా సాగుతున్నాయి. అయితే, ఇటు థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు అయినా, యూపీఏని బలోపేతం చేయడమే అయినా, పవారే .. కేంద్ర బిందువు. ఆయన సారధ్యంలోనే ప్రత్యాన్మాయం అనేది విపక్ష శిభిరం నుంచి వినవస్తున్న ప్రస్తుత సమాచారం. మరి అదే జరిగితే రాహుల గాంధీ పరిస్థితి ఏమిటి ? గాంధీ నెహ్రూ కుటుంబం పరిస్థితి ఏమిటి? ఏ ప్రత్యేక ప్రాధాన్యత లేకుండా అందరిలో ఒకరిగా ఫస్ట్ ఫ్యామిలీ సర్దుకు పోతుందా? అంటే..చివరకు ఏమవుతుందో .. ఇప్పుడే చెప్పలేమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది. గతంలో అనేక సందర్భాలలో ముఖ్యమంత్రి కేసీఆర్,ఆర్థిక మంత్రి హరీశ రావు, కరోనా కారణంగా రాష్ట్ర  ఆదాయం గణనీయంగా తగ్గిందని, పేర్కొన్నారు. అయితే, కరోనా నుంచి వేగంగా కోలుకుని, ఆర్థికంగా అంతే వేగంగా పుంజుకున్న రాష్ట్రాలలో తెలంగాణ ప్రధమ స్థానంలో  ఉందని కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సర్వే 2020-21 నివేదిక పేర్కొంది. పడిలేచిన కెరటంలా, తెలంగాణ ‘వీ’ ఆకారంలో ఆర్థికంగా నిలతొక్కుందని కేంద్రం జనవరి  చివరి వారంలో విడుదల చేసిన ఆర్థిక సర్వేలో పేర్కొంది. అలాగే, రెవిన్యూ వసూళ్ళలో రాష్ట్రం కరోనా పూర్వస్థితికి చేరిందని కూడా సర్వే చెప్పింది.   అలాగే,రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు కూడా ఈ మధ్య కాలంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పై సంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరమ జనవరి,ఫిబ్రవరి, మార్చి నెలలతో పోలిస్తే ఈ సంవత్సరం ఈ మూడు నెలల కాలంలో రాష్ట్ర ఆర్థిక వృద్ది రేటు 10 నుంచి  15 శాతం మెరుగ్గా ఉందని హరీష్ రావు ఒకటి రెండు ఇంటర్వ్యూలలో పేర్కొన్నారు.అలాగే, బడ్జెట్ విషయంలోనూ ఆయన చాల ఆశావహ దృక్పథంతోనే ఉన్నారు. బడ్జెట్  పాజిటివ్’గా ఉంటుదని, ఎవ్వరూ ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని, సంక్షేమ పథకాలలో,ఇతరత్రా బడ్జెట్ కేటాయింపులలో ఎలాంటి కోతలు ఉండవని కూడా హరీష్ హామీ ఇచ్చారు. గత సంవత్సరంలో కొంత మేర హామీ ఇచ్చిన మేరకు అమలు చేయలేక పోయిన సొంత జాగాలలో డబల్ బెడ్ రూమ్ ఇళ్ళ నిర్మాణం, రుణ మాఫీ వంటి  పథకాలను ఈ బడ్జెట్ ద్వారా అమలు చేస్తామని చెప్పారు. అలాగే, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ తమిళి సై చేసిన ప్రసంగంలోనూ ఆశావహ దృక్పధమే వ్యక్తమైంది. ఆమె తమ ప్రసంగంలో,  ప్రభుత్వం సంక్షేమ పథకాలకు పెద్ద పీట వేసిందని అన్నారు. ‘సంపద పంచాలి ,పేదలకు పంచాలి’ అనేది తమ ప్రభుత్వ విధానమని స్పష్టం చేశారు. అలాగే, పెరుగతున్న ఆదాయంలో అధికశాతం సంక్షేమానికే వెచ్చిస్తున్నామని స్పష్టం చేశారు. దీంతో బడ్జెట్’లో కొత్త పథకాలకు శ్రీకారం చుట్టే అవకాశం ఉంటుందా అన్న చర్చ జరుగుతోంది. మరో వంక ఉద్యోగ వర్గాల్లో పీఆర్సీకి సంబంధించి ఆర్థిక మంత్రి తమ ప్రసంగంలో  ప్రకటన చేస్తారా లేదా అనే ఆసక్తి నెలకొంది. అలాగే, సామాన్య  ప్రజలు ఇటీవల పెరిగిన పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరల భారం నుంచి మంత్రి హరీష్, ఏదైనా ఉపసమనం కలిపిస్తారా అని ఎదురు చూస్తున్నారు. గతంలో వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సామాన్య ప్రజలపై వంటగ్యాస్ ధర భారాన్ని తగ్గించేందుకు కొంత మొత్తాన్ని, రూ.50(?) రాష్ట్ర ప్రభుత్వం తరపున  సబ్సిడీగా ఇచ్చిన విషయాన్ని, అదే విధంగా అసెంబ్లీ ఎన్నికలు జరుగతున్న తమిళనాడులో డిఎంకే పార్టీ,తమ పార్టీని అధికారంలోకి వస్తే  గ్యాస్ బండపై వంద రూపాయల సబ్సిడీ ఇస్తామని చేసిన  వాగ్దానాన్ని  గుర్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే, ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు, సోమవారం ఆర్థిక మంత్రి హరీష్ రావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఆర్థిక  శాఖ ముఖ్య కార్యదర్శి రామ కృష్ణా రావు,సలహాదారు జీఆర్ రెడ్డితో బడ్జెట్ పద్దులఫై సుదీర్ఘంగా చర్చించి తుది మెరుగులు దిద్దారు. బడ్జెట్ తుది రూపం సిద్దమైన నేపధ్యంలో ఆర్థిక శాఖ ప్రింటింగ్ ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 18 ఉదయం మంత్రి వర్గం ఆమోదం పొందిన అనంతరం ఆర్థికమంత్రి హరీష్ రావు అదే రోజు రాష్ట్ర బడ్జెట్ 2021-22ను సభలో ప్రవేశ పెడతారు. 20, 22 తేదీల్లో బడ్జెట్‌పై సాధారణ చర్చ,23, 24, 25 తేదీల్లో బడ్జెట్‌ పద్దులపై చర్చ ఉంటుంది 26న ద్రవ్యవినిమయ బిల్లు (బడ్జెట్)పై చర్చ, సభామోదం ఉంటాయి.
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది.  అధికార తెరాస, ఖమ్మం స్థానానికి సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర రెడ్డి పేరును ప్రకటించడంలో కొంచెం జాప్యం చేయడంతో పాటుగా, హైదరాబాద్ స్థానం నుంచి , పీవీ కుమార్తె వాణీ దేవి పేరును చివరి క్షణంలో తెరమీదకు తేవడంతో అంత వరకు కొంత స్తబ్దుగా సాగిన ప్రచారం ఆ తర్వాత వేడెక్కింది. ఉద్యోగ నియామకాల విషయంలో తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ తప్పులో కాలేయడంతో విపక్షాలు, పోటీలో ఉన్న ప్రత్యర్ధులు, నిరుద్యోగ యువత, విద్యార్ధి సంఘాలు  ఒకే సారి ఆయన మీద  విరుచుకు పడ్డారు. ఆయన లెక్క తప్పని నిరుపిస్తం రమ్మని వరస సవాళ్ళు విసిరారు. దీంతో, మంత్రి నియామకా ఇష్యూని పక్కకు తప్పించేందుకు , ఐటీఐఆర్, వరంగల్ రైల్వే ఫ్యాక్టరీ వంటి సెంటిమెంటల్ ఇష్యూస్’ను తెరపైకి  తెచ్చారు. అలాగే, కేంద్ర ప్రభుత్వంపై విమర్శల దాడిని పెంచారు. చివరకు పొరుగు రాష్ట్రానికి చెందిన విశాఖ ఉక్కు ఆందోళన   కూడా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగమైంది.   రెండు నియోజక వర్గాలలో గతంతో పోలిస్తే ఈసారి ఓటర్ల సంఖ్య రెట్టింపు అయింది. ఈసారి రెండు నియోజక వర్గాలలో కలిపి 10 లక్ష 36 వేల మంది తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. అలాగే, రెండు పట్ట భద్రుల నియోజక వర్గాల్లో 164 మంది అభ్యర్ధులు పోటీలో ఉన్నారు.  గత ఎన్నికలతో పోలిస్తే ఇటు ఓటర్ల సంఖ్య, అటు అభ్యర్థుల సంఖ్యా రెట్టింపునకు పైగానే పెరగడంతో ఎన్నికలలో జోష్ పెరిగింది. దీనికితోడు అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో సాధారణ ఎన్నికలను తలపించే రీతిలో ప్రచారం సాగింది. ఎక్కువమంది అభ్యర్ధులు బరిలో ఉండడంతో, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి  తమకే ప్రయోజనం జరుగుతుందని అధికార పార్టీ ఆశపడుతోంది .  దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో చేదు ఫలితాలను చవిచూసిన టీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా వ్యూహ రచన చేసి కేటీఆర్, హరీష్ సహా మంత్రులు,ఎమ్మెల్యేలకు స్పెసిఫిక్ బాధ్యతలు అప్పగించారు. అలాగే,కాంగ్రెస్‌ అభ్యర్థులు చిన్నారెడ్డి, రాములునాయక్‌లకు మద్దతుగా ఉత్తమ్‌, భట్టి, రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తదితరులు విస్తృతంగా ప్రచారం చేశారు. బీజేపీ అభ్యర్థులు ఎన్‌.రాంచందర్‌రావు, ప్రేమేందర్‌రెడ్డిల తరఫున ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, ఎంపీ అరవింద్‌ తదితరులు ప్రచారాన్ని వేడెక్కించారు.  ఖమ్మం స్థానం నుంచి ప్రత్యక్ష ఎన్నికల్లో తొలిసారి పోటీకి దిగిన కోదండరాంకు, టీజేఎస్‌ పార్టీకీ ఈ ఎన్నికలు కీలకంగా మారాయి. ఖమ్మ స్థానం నుంచి పోటీ చేస్తున్న తీన్మార్ మల్లన్న ముందస్తు వ్యూహంతో ప్రధాన పార్టీల అభ్యర్ధులకు ధీటుగా ప్రచారం సాగించారు.  వామపక్షాల మద్దతుతో జయసారథి, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్‌, యువతెలంగాణ కార్యనిర్వాహక అధ్యక్షురాలు రాణీ రుద్రమ తదితరులు పోటీలో ఖమ్మం సీటును పట్టభద్రులు  ఎవరికి  పట్టం కడతారు అన్నది ప్రశ్నార్థకంగా మారింది. హైదరాబాద్ సీటు కూడా ఇటు అధికార తెరాసకు అటు సిట్టింగ్ సీటును నిలుపుకోవడం తో పాటుగా దుబ్బాక , జీహెచ్ఎంసి జోష్ ను కొనసాగించాలని ఆశ పడుతున్నబీజేలకే కూడా ఇజ్జత్ కీ సవాల్ గా మారింది. కాంగ్రెస్ అభ్యర్ధి పార్టీ సీనియర్ నాయకుడు సౌమ్యుడు, మాజీ మంత్రి చిన్నారెడ్డి, వామ పక్షాల మద్దతుతో పోటీ చేస్తున్న మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ కూడా గట్టి పోటీ ఇస్తున్నారు. సో.. చివరకు ఏమి జరుగుతుంది అంటే ఏదైనా జరగవచ్చును. ఈ నెల 14 వ తేదీన పోలింగ్ జరుగుతుంది.17 ఫలితాలు వస్తాయి .. అంతవరకు వెయిట్ అండ్ వాచ్ .  
సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది. ఒకప్పుడు ఎర్ర జెండాను దిగ్విజయంగా ఎదిరించి, మార్క్సిస్టులను మట్టి కరిపించిన మమతా దీదీ ప్రస్తుతం, కాషాయ కూటమి నుంచి గట్టి సవాలును ఎదుర్కుంటున్నారు. వరసగా పదేళ్ళు పాలించడం వలన సహజంగా వచ్చిన ప్రభుత్వ వ్యతిరేకత  కంటే, హిందూ ఓటు పోలరైజేషన్ ఆమెను మరింతగా భయపెడుతోంది. నిజానికి ఐదేళ్ళ క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం ఐదు శాతం కంటే తక్కువ ఓట్లు, మూడంటే మూడు అసెంబ్లీ సీట్లు మాత్రమే గెలుచుకున్న బీజేపీ..  2019 లోక్ సభ ఎన్నికల్లో ఏకంగా 40 శాతం ఓట్లతో 18 స్థానాలు గెలుచుకుంది. ఈ  మార్పు ఇంకా కొన్ని కారణాలు ఉంటే ఉండవచ్చును కానీ.. హిందువుల ఓటు పోలరైజ్  కావడమే ప్రధాన కారణం.  ఈ నేపధ్యంలోనే కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ చివరకు కమ్యూనిస్టులు కూడా బీజేపీలో  చేరారు. ఎన్నికల ప్రకటన వెలువడిన తర్వాత కూడా సిట్టింగ్ ఎమ్మెల్ల్యేలు సహా  తృణమూల్ టికెట్ వచ్చిన నాయకులు కూడా బీజేపీలో చేరుతున్నారు. అనేక మంది ఇతర రంగాల ప్రముఖులు, ముఖ్యంగా ఇంతకాలం, బీజేపీని హిదుత్వ అనుకూల ‘అచ్చుత్’ (అంటారని) పార్టీగా చూసిన ‘సెక్యులర్’ ప్రముఖులు కాషాయం కప్పుకోవడంతో మమతా బెనర్జీకి కొంచెం అలస్యంగానే అయినా, తత్త్వం బోధపడింది. అందుకే ఆమె ఇప్పుడు గుళ్ళూ,గోపురాలకు తిరుగుతున్నారు. కార్యకర్తల సమావేశాల్లో తానూ హిందువునేనని, చెప్పుకుంటున్నారు.  నిజానికి ఇలా నేనూ హిందువునే  అని సెక్యులర్ నేతలు బహిరంగంగా ప్రకటించుకోవడం మమతా బెనర్జీతోనే మొదలు కాలేదు. రాహుల్ గాంధీ తాను హిందువునని, జన్యుధారీ కశ్మీరీ బ్రాహ్మణుని అనీ.. తమ గోత్రం, ‘దత్తాత్రేయ’ గోత్రమని బహిరంగంగా ప్రకటించుకున్నారు. అలాగే  కొద్ది రోజుల క్రితం ప్రియాంకా గాంధీ తానూ హిందువునని చెప్పుకునేందుకు ‘మౌని అమావాస్య’ సందర్భంగా అలహాబాద్ లో గంగా స్నానం చేశారు. గతంలోనూ ఆమె ఎన్నికలకు ముందు గంగా యాత్ర చేశారు. అంతవరకు ఎందుకు కొద్దిరోజుల క్రితం సిపిఐ నారాయణ విశాఖ స్వామి ఆశీస్సులు తీసుకున్నారు. చంద్రబాబు, జగన్ రెడ్డి, కేసీఆర్ ఇలా తెలుగు నేతలు అనేక మంది లౌకిక వాదానికి కాలం చెల్లిందన్న సత్యాన్ని గ్రహించి కావచ్చు ‘నేనూ హిందువును’ అంటూ ప్రకటించుకునేందుకు పోటీ పడుతున్నారు. రాముడిని తలచుకున్నా, జై శ్రీరామ్ అన్నా తమ  లౌకిక వాదం మయలపడి పోతుందని భయపడిన నాయకులు ఇప్పుడు .. జై శ్రీరామ్ అనేందుకు కూడా వెనకాడడం లేదు.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది. గత కొంత కాలంగా సబర్మలతో సహా అనేక అంశాలపై స్పందిస్తూ.. కేరళను టార్గెట్ చేస్తున్న బీజేపీ నాయకులు అక్కడ తమ జెండా ఎగరేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా పార్టీ పాలసీని కూడా పక్కన పెట్టి మెట్రో మ్యాన్ శ్రీధరన్ ను పార్టీలో చేర్చుకుని ఆయనే తమ సీఎం అభ్యర్థి అని ప్రకటించిన 24 గంటలలో యూ టర్న్ తీసుకున్నారు. ఇది ఇలా ఉండగా ప్రస్తుతం సీఎంగా ఉన్న కమ్యూనిస్ట్ నేత పినరై విజయన్ పై గోల్డ్ స్మగ్లింగ్ ఆరోపణలు రావడంతో.. ఈ ఎన్నికలలో ఎల్డిఎఫ్ భవిష్యత్తుపై ప్రజలు ఏ తీర్పు ఇవ్వబోతున్నారనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది ఈ నేపథ్యంలో అక్షరాస్యతలో దేశంలోనే మొదటి స్థానంలో ఉన్న ఆ రాష్ట్ర ప్రజలు ఎవరిని ఆశీర్వదిస్తారు అనే అంశంపై ప్రముఖ మీడియా సంస్థ టైమ్స్ నౌ, సీ ఓటరుతో కలిసి ఒక సర్వేను నిర్వహించారు. ఈ సర్వే ప్రకారం చూస్తే పాపం కమలనాథులు అక్కడ పవర్ చేతికి రావటం అటుంచి కనీసం రెండు మూడు అసెంబ్లీ స్థానాల్లో గెలవటం కూడా కష్టమేనని ఆ సర్వే తేల్చి చెబుతోంది. కేరళలో ఈసారి జరిగే అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ తన హవా చాటుతుందన్న ఆ పార్టీ నేతల మాటలలో ఎలాంటి నిజం లేదని.. ప్రస్తుతానికి అది ఏమాత్రం సాధ్యం కాదని ఈ తాజా సర్వే తేల్చి చెప్పింది. అంతేకాకుండా మొత్తం 140 స్థానాలు ఉన్న కేరళలో.. ప్రస్తుత సీఎం పినరయి విజయన్ నేతృత్వంలోని లెఫ్ట్డ్ డెమొక్రటిక్ ఫ్రంట్ కు 82 సీట్లు పక్కా అని.. ఆయనే తిరిగి అధికారాన్ని నిలబెట్టుకుంటాడని సర్వే చెపుతోంది. అదే సమయంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూనైటెడ్ డెమొక్రాటిక్ ఫ్రంట్ కు 56 నుంచి 60 వరకు సీట్లు వచ్చే అవకాశం ఉందని ఈ సర్వేలో తేలింది. అంతేకాకుండా 2016 ఎన్నికలతో పోలిస్తే ఎల్ డీఎఫ్ ఓటింగ్ శాతం కూడా కొంత పెరగటం ఇక్కడ గమనార్హం. ప్రస్తుతం సీఎంగా ఉన్న విజయన్ మరోసారి సీఎం కావాలని 43.34 శాతం మంది మొగ్గు చూపినట్లుగా సర్వేలో తేలింది. కరోనా సమయంలో విజయన్ సీఎంగా బాగా పని చేసారని ఈ సర్వే పేర్కొంది. మరోపక్క దేశ ప్రధానిగా రాహుల్ గాంధీ ఉండాలని కేరళ ప్రజల్లో 55.84 శాతం మంది కోరుకుంటున్నట్లుగా ఈ సర్వే;లో తేలింది. అయితే కేరళలో ఎలాగైనా పాగా వేయాలని పట్టుదలతో కృషి చేస్తున్న బీజేపీకి ఈసారి కూడా నిరాశ తప్పదని ఈ సర్వేలో స్పష్టం అయింది. ఈ ఎన్నికలలో బీజేపీకి రెండు సీట్లు కూడా రావటం కూడా కష్టమేనని ఈ సర్వే తేల్చింది. అయితే ఎన్నికలకు ముందు ఇలాంటి సర్వేలు బయటకు రావడం.. తరువాత అందులో కొన్ని చతికిల పడడం మనం చూస్తూనే ఉన్నాం. మరి ఈ సర్వే ఫలితాలు నిజామా అవుతాయో లేదో తేలాలంటే కొద్దీ రోజులు వెయిట్ చేయాల్సిందే.        
రాజకీయాలు అంటేనే అదో జూదం. పూలమ్మిన చోటనే కట్టెలు అమ్మవలసి రావచ్చును. అలాంటి పరిస్థితే వచ్చినా, తలవంచుకుని పోగలిగితేనే, ఎవరైనా రాజకీయాలలో రాణించగలరు. అలాకాదని, అలిమి కానిచోట, కూడా తామే అధికులమని భావిస్తే, ఎందుకూ కాకుండా పోతారు. అలాంటి వారు ఇద్దరూ కూడా ఇప్పుడు మన కళ్ళముందే ఉన్నారు.  జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు. అలాగే జయ మరణం తర్వాత ఆమె పరిస్థితి ఏమిటో కూడా వేరే చెప్పవలసిన, అవసరం లేదు. జైలు పాలయ్యారు. సర్వం తానై నడిపించిన పార్టీ నుంచి  బహిష్కరణకు గురయ్యారు. జయ ఉన్నంత వరకు తన వారుగా ఉన్న వారందరూ కానివారయ్యారు. ఒంటరిగా మిగిలారు.  నిజానికి నాలుగేళ్ళు జైలు జీవితం గడిపిన తర్వాత కూడా ఆమె తలచుకుంటే.. రాష్ట్ర రాజకీయాలలో, ముఖ్యంగా అధికారంలో ఉన్న డిఎంకే కూటమిలో అలజడి సృష్టించగలరు. ఎన్నికలలో ఆమె గెలవక పోవచ్చును కానీ.. తనను కాదన్న అన్నాడిఎంకేను ఓడించగలరు. అయిన  ఆమె అందుకు విరుద్ధంగా  రాజకీయాలకు వీడ్కోలు పలికి మౌనంగా పక్కకు తప్పుకున్నారు. రాజకీయ సన్యాసం ప్రకటించారు. ఉమ్మడి శతృవు డిఎంకే ను ఓడించేందుకు అన్నా డిఎంకే కూటమి  పోటీ చేయాలని, కూటమి ఐక్యతను దెబ్బతీయరాదనే ఉద్దేశంతోనే ఆమె రాజకీయ సన్యాసం ప్రకటించారు.    శశికళ మౌనంగా వెళ్లి పోవడం వెనక ఇంకా అనేక కారణాలున్నా ,అసలు కారణం ఆమె, రాజకీయ విజ్ఞత, వివేకం. ఆమె జైలుకు వెళ్ళిన సమయంలో జయలలిత సమాధి వద్ద ఎంత కసిగా, కోపంగా ‘మౌన’ ప్రతిజ్ఞ చేశారో చూశా. అలాంటి ఆమె ఇప్పుడు ఇలా ‘మౌనం’గా వెనకడుగు వేశారంటే, అది ఆలోచించ వలసిన విషయమే.ఆమె వ్యుహతంకంగానే సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే అనేక మంది అనేక కోణాల్లో శశికళ సంచలన నిర్ణయాన్ని విశ్లేషించారు.జైలు జీవితం తర్వాత కూడా అన్నా డిఎంకే నాయకులు తనను అగ్రనేతగా అంగీకరించక పోవడం, అమిత్ షా చెప్పినా.. అన్నా డిఎంకే నాయకులు ఆమెను, మేనల్లుడు దినకరన్’ను కులం పేరున, కుటుంబం పేరున దూరం చేయడం, తిరిగి పార్టీలోకి తీసుకోకపోవడంతో ఆమె మనసు కష్టపెట్టుకుని, సన్యాస నిర్ణయం తీసుకున్నారని కొందరంటున్నారు. పార్టీ మీద పట్టు లేదని, చరిష్మా అసలే లేదని, అందుకే ఆమె అలా నిశ్శబ్ధంగా రాజకీయ సన్యాసం స్వీకరించారని ఇంకొందరు విశ్లేషించారు. ఈ విశ్లేషణలో కొంత నిజం ఉంటే ఉండవచ్చును.. కానీ ఆమె గతాన్ని, నైజాన్ని గుర్తు చేసుకుంటే ఆమె స్ట్రైక్ బ్యాక్ వ్యూహంతోనే ఒకడుగు వెనక్కివేశారని ఆమెతో సన్నిహితంగా మెలిగినవారు, ఆమె రాజకీయ చాణక్యం తెలిసిన వారు అంటారు.   నిజానికి జైలులో ఉన్న కాలంలో కానీ, జైలు నుంచి విడుదలై వచ్చిన తర్వాత కానీ, ఆమె రాజకీయ సన్యాసం వైపు అడుగులు వేస్తున్నట్లు కనిపించలేదు. బెంగుళూరు జైలు నుంచి విడుదలై చెన్నైలో ప్రవేశించిన నప్పుడు ఆమె పెద్ద కాన్వాయ్ తో  తమ కారుకు అన్నాడిఎంకే జెండాతోనే ఎంటరయ్యారు. అలా ఎంట్రీలోనే రాజకీయ ఆకాంక్షను వెంట తెచ్చుకున్నారు. చివరకు ‘సన్యాస’ ప్రకట చేసే వరకు కూడా ఆమె రాజకీయ కార్యకలాపాలు సాగిస్తూనే ఉన్నారు. అటు ఢిల్లీని ఇటు చెన్నైనికూడా కదిల్చారు. అంతేకాదు, రాజకీయాలపై విరక్తితో కాదు, రాజకీయ కసితో, ఉమ్మడి శత్రువు (డిఎంకే) ను ఓడించేందుకే తాను రాజకీయాలనుంచి తపుకుంటున్నట్లు చెప్పారు.  సో .. సన్యాసం తీసుకోవాలనే ఆలోచన, రాజకీయవ్యూహం లోంచి పుట్టిందే కానీ,వైరాగ్యంతో పుట్టింది కాదు ,అన్నవిశ్లేషణ వాస్తవానికి ఇంకొంత దగ్గరగా ఉందని అనుకోవచ్చును. ఇది ‘కామా’నే కాని ‘ఫుల్స్టాప్’ కాదని అంటున్నారు.  ముఖ్యమంత్రి ఎడప్పాడి కే. పళని స్వామి (ఈపీఎస్) ఆమెను పార్టీలోకి అనుమతిస్తే తన కుర్చికీ ఎసరు పెడతారనే భయంతోనే,, ఆమె ఎంట్రీని అడ్డుకున్నారు. ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం, శశికళ ఒకే సామజిక వర్గానికి చెందిన వారు కావడం కూడా, ముఖ్యమంత్రి ఈపీఎస్’ భయానికి కారణంగా పేర్కొంటారు. అందుకే  ఆయన, ‘మన్నార్గుడి’ ఫ్యామిలీని బూచిగా చూపించి, ఆమెను దూరంగా ఉంచారని పార్టీలో ఒక వర్గం గట్టిగా విశ్వసిస్తుంది. అయితే ఆమె శక్తియుక్తులను కూడతీసుకుని  పులిలా పంజా విసిరేందుకే ఆమె వ్యూహాత్మకంగా ఒక అడుగు వెనక్కి వేశారు కావచ్చును అని కూడా, తమిళ రాజకీయ వర్గాల్లో ఒక చర్చ జరుగుతోంది.  గతంలో ఆమె జయలలితతో విబేధాలు వచ్చిన సమయంలో కూడా ఇలాగే కొద్ది కాలం మౌనంగా తెర చాటుకు వెళ్లి పోయారు.  కొద్ది కాలంలోనే మళ్ళీ ‘పోయస్ గార్డెన్’లో ప్రత్యక్షమయ్యారు. జయలలిత స్వయంగా ఆమెను వెనక్కి పిలుపించుకోవలసిన పరిస్థితులను సృష్టించారు. అలా  మళ్ళీ  చక్రం తిప్పారు. జయలలిత మరణం వరకు ఆమె అందరికీ చిన్నమ్మగా అమ్మకు పెద్దమ్మగా సర్వం తానై నిలిచారు. చివరకు జయ అంత్యక్రియల్లో కూడా ఆమెదే పై చేయిగా కనిపించింది.   జయలలిత చనిపోయిన సందర్భంలోనే అన్నా డిఎంకే ఎమ్మెల్ల్యేలో సుమారు 30 మంది వరకు ఆమెకు మద్దతుగా ఉన్నారన్న వార్తలొచ్చాయి. నిజానికి,ఇప్పటికి కూడా ఒక్క అన్నా డిఎంకే లోనేకాదు,డిఎంకే ఇతర పార్టీలలో కూడా  ఆమె అవసరం ఉన్న వాళ్ళు ఉన్నారు. కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో ‘మన్నార్గుడి’ ఫ్యామిలీ మద్దతు లేకుండా గెలిచే అవకాశం లేదు.  ఇవ్వన్నీ నిజమే అయినా.. అన్నీ ఉండి, ఎవరు లేని శశికళలో, ఇంకా  ఎవరి కోసం తాపత్రయ పడాలి? అనే ప్రశ్న జనించి ఉంటే, ఆమె రాజకీయ సన్యాసం నిజం కావచ్చును. ఎందుకంటే ఆమె నెచ్చలి, జయలిత లేరు, భర్త అంతకంటే ముందే చనిపోయారు, పిల్లలు లేరు... పైగా నాలుగేళ్ళ జైలు జీవితం ఆమెలో మార్పు తెచ్చి ఉండవచ్చును. ఈ వయస్సులో తనవారంటూ ఎవరు లేని తనకు రాజకీయాలు ఎందుకు ? శేష జీవితాన్ని ఇలా సాగిద్దామనే ఆలోచన నిజంగా వచ్చి ఉంటే, ఆమె సన్యాసం సత్యం అయినా కావచ్చును, కాకపోనూ వచ్చును. కానీ  శశికళ... ఆమెను అర్థం చేసుకోవడం, అంచనా వేయడం , అంత తేలిగ్గా అయ్యే పని కాదు..
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు. కాంగ్రెస్ అధినాయకత్వం పై నేరుగా అస్త్రాలు సంధించారు. రాహుల్ గాంధీ పేరు చెప్పకుండానే, ఆయన నాయకత్వానికి పనికిరాడని తేల్చి చెప్పారు. ఎవరైనా పార్టీ అధ్యక్షుడు అయితే కావచ్చును, కానీ, ప్రజానాయకుడు కాలేడని, రాహుల గాంధీ ప్రజానాయకుడు కాదు కాలేరు,అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తరచూ రాహుల్ గాంధీని ఉద్దేశించి చేసే  ‘నామ్’ధారీ వ్యంగ్యాస్త్రాన్నే కాంగ్రెస్ సీనియర్ నాయకులు కూడా సందించారు. ఇక అక్కడి నుంచి విధేయ, అసమ్మతి వర్గాల మధ్య మాటల యుద్ధం ఎదో ఒక రూపంలో సాగుతూనే వుంది. అదే క్రమంలో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ, కరుడు కట్టిన ముస్లిం మతోన్మాది, అబ్బాస్ సిద్దిఖీతో కాంగ్రెస్ పార్టీ చేతులు కలపడం అసమ్మతి నాయకులకు మరో అస్త్రాన్ని అందించింది. విషయంలోకి వెళితే, ఇటీవల పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా లోక్’సభలో కాంగ్రెస్ పక్ష నాయకుడు, పశ్చిమ బెంగాల్ పీసీసీ అధ్యక్షుడు అధీర్’రంజన్ చౌదరి, ముస్లిం మత ప్రచారకుడు, అబ్బాస్ సిద్దిఖీతో  వేదిక పంచుకున్నారు.అంతకు ముందే వామ పక్ష కూటమితో  పొత్తు కుదుర్చుకున్న కాంగ్రెస్ పార్టీ, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)ను కూటమిలో చేర్చుకుంది. ఇలా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) అమోదం లేకుండా మతోన్మాద ఐఎస్ఎఫ్’ తో ఎన్నికల పొత్తు పెట్టుకోవడం ఆ పార్టీ నాయకుడు,సిద్ధిఖీతో  పీసీసీ చీఫ్ వేదిక  పంచుకోవడం పై అసమ్మతి నేతలు మండి పడుతున్నారు. ఇలా సిద్దిఖీతో వేదిక పంచుకోవడం పార్టీ మౌలిక సిద్ధాంతాలకు వ్యతిరేకం అంటూ అసమ్మతి వర్గానికి చెందిన కీలక నేత, రాజ్యసభ సభ్యుడు,ఆనంద్ శర్మ మండిపడ్డారు. అంతే కాదు, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)తో జనవరిలో కుదుర్చుకున్న పొత్తుకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ)అమోదం లేదని ఆనంద్ శర్మ, అభ్యంతరం వ్యక్త చేశారు. పార్టీ విశ్వసించే లౌకిక వాదానికి కాంగ్రెస్ అధిష్టానం తీసుకున్న నిర్ణయం గొడ్డలి పెట్టని ఆయన తీవ్రంగా స్పందించారు.   శర్మ వ్యాఖ్యలపై అధీర్ రంజన్ చౌదరి అంతే ఘాటుగా ప్రతిస్పందించారు. “నిజాలు తెలుసుకోండి ఆనంద్ శ‌ర్మ జీ” అంటూ ఆయ‌న వ‌రుస ట్వీట్లు చేశారు. వ్య‌క్తిగ‌త ప్ర‌యోజ‌నాలు ప‌క్క‌న‌పెట్టి, ప్ర‌ధానిని పొగిడి టైమ్ వేస్ట్ చేయ‌కండంటూ ఆయ‌న ఓ ట్వీట్లో అన్నారు. ఆనంద్ శ‌ర్మ అన‌వ‌స‌రంగా కాంగ్రెస్‌ను ల‌క్ష్యంగా చేసుకుంటున్నార‌ని, ఈ అంశాన్ని పెద్ద‌ది చేసి చూపిస్తున్నార‌ని విమ‌ర్శించారు. ఆయ‌న ఉద్దేశాలు స‌రైన‌వే అయితే నేరుగా తనతో మాట్లాడ వలసిందని అన్నారు. బెంగాల్‌లో సీపీఐ(ఎం) కూట‌మికి నేతృత్వం వ‌హిస్తోంది. అందులో కాంగ్రెస్ ఓ భాగం. మ‌త‌తత్వ‌, విభ‌జ‌న రాజ‌కీయాలు చేస్తున్న బీజేపీకి చెక్ పెట్ట‌డానికే ఈ కూట‌మి అని మ‌రో ట్వీట్‌లో అధిర్ రంజ‌న్ అన్నారు. అక్కడతోనూ ఆగలేదు ... ట్వీట్ల మీద ట్వీట్లు సంధిస్తూ, ఆనంద్ శర్మ, బీజేపీ మత విభజన, అజెండాను బలపరుస్తున్నారని, పరోక్షంగా జీ23 నాయకులు బీజేపీకి ప్రయోజనం చేకూరుస్తున్నారని ఆరోపించారు.అంతే కాదు, క్షేత్ర స్థాయి వాస్తవ పరిస్థితులు తెలియకుండా, ఆనంద్ శర్మ పార్టీ మీద దండెత్తడం ఉచితం కాదని చౌదరి ఎదురుదాడి చేశారు. అసమ్మతిలో అసమ్మతి. ఇదలా ఉంటే, కాంగ్రెస్ పార్టీ  సమూల పక్షాళన కోరుతూ సోనియా గాంధీకి,గత సంవత్సరం  జీ 23గా ప్రాచుర్యం పొందిన సీనియర్ నాయకులు రాసిన లేఖపై సంతకాలు చేసిన  నాయకుల్లో నలుగురు,జమ్మూలోసమావేసమైన నాయకుల తాజా నిర్ణయాలు, వ్యాఖ్యలు,విమర్శల పట్ల అసంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరం సోనియా గాంధీకి రాసిన లేఖలో ప్రస్తావించిన అంశాలకు కట్టుబడి ఉన్నామని, అయితే, జీ 23లోని కొందరు సహచరులు, ఇటీవల గీతదాటి చేస్తున్న వ్యాఖ్యలు, విమర్శలను తాము సమర్ధించడం లేదని ఆ నలుగురు పేర్కొన్నారు. ఇందులో ముఖ్యంగా, రాజ్యసభ మాజీ డిప్యూటీ చైర్మన్, పీజే కురియన్ అయితే, “కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు అవసరమైన సంస్కరణలు తెచ్చేందుకు చేసే ప్రయత్నాలను పూర్తిగా సమర్దిస్తాను, కానీ, ‘లక్ష్మణ రేఖ’ దాటితే ఒప్పుకునేది లేదు”అని అసమ్మతిలో అసమ్మతికి తెర తీశారు.అలాగే, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ కుమారడు, మాజీ ఎంపీ సందీప్ దీక్షిత్,మధ్య ప్రదేశ్ సీనియర్ కాంగ్రెస్ నాయకుడు అజయ్ సింగ్’ కూడా గులాం నబీ ఆజాద్, కపిల్ సిబల్, ఆనంద్ శర్మ, మనీష్ తివారీ వంటి జీ 23 కీలక నేతలు అధినాయకత్వంపై చేసిన వ్యాఖ్యలను తప్పు పట్టారు. అలాగే, పార్టీ సీనియర్ నాయకుడు కేంద్ర మాజీమంత్రి వీరప్ప మొయిలీ కూడా,గత సంవత్సరం పార్టీ సీనియర్ నాయకులు  ఒక పరిమిత లక్ష్యంతో  సోనియా గాంధీకి లేఖ రాయడం జరిగిందని, ఆ పేరున జరుగతున్న  కార్యక్రమాలు లేఖ సంకల్పానికి  విరుద్ధమని అన్నారు. జీ 23 కార్యకలాపాలపై రాహుల్ గాంధీ కూడా పరోక్షగా స్పందించారు, ఒకప్పుడు ఎన్ఎస్’యుఐ, యూత్ కాంగ్రెస్’ కు సంస్థాగత ఎన్నికలు వద్దన్న వారే ఇప్పుడు ఇంకోలా మాట్లాడుతున్నారని పరోక్షంగానే అయినా సంస్థాగత ఎన్నికలు నిర్వహించడంతో పాటుగా, పార్టీ పక్షాలనకు తమ కుటుంబం వ్యతిరేకం కాదని, అందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఈ నేపధ్యంలో కాంగ్రెస్ పార్టీలో చెలరిగిన కలకలం  ఇక ముందు ఏమవుతుందో .. ఇంకెన్ని  మలుపులు తిరుగుతోందో ..చూడవలసిందే కానీ ఉహించలేము.
పంచతంత్రంగా పిలుచుకుంటున్న ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భతం జరగబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే, వివిధ సంస్థలు అసెంబ్లీ ఎన్నికలు జరిగే  అస్సాం. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటుగా కేరళలోనూ ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఆ ఒపీనియన్ పోల్ ఫలితాలు నిజంగా నిజం అయితే, కేరళలో మళ్ళీ సీపీఎం సారధ్యంలోని వామపక్ష కూటమి అధికారంలోకి వస్తుంది. ఇదే ఆ అద్భుతం. ఎందుకంటే, గత నాలుగు దశాబ్దాలలో కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో ఒకే కూటమి వరసగా రెండవసారి అధికారంలోకి వచ్చిన చరిత్ర లేనే లేదు. ఒక సారి ఎల్డీఎఫ్ అధికారంలోకి వస్తే ఐదేళ్ళ తర్వాత కాంగ్రెస్ సారధ్యంలోని ఐక్య ప్రజాస్వామ్య కూటమి(యూడీఎఫ్) అధికారంలోకి రావడం, దేవభుమిలో దైవ నిర్ణయమా అన్నట్లుగా ప్రతి ఎన్నికల్లోనూ అధికారం చేతులు మారుతూ వస్తోంది. అలాంటిది, ఈసారి ఒపీనియన్ పోల్స్ నిజమై వరసగా రెండవసారి వామపక్ష కూటమి అధికారంలోకి వస్తే, అది చరిత్రే అవుతుంది. ఇక ఒపీనియన్ పోల్స్ విషయానికి వస్తే, జాతీయ న్యూస్ ఛానెల్ ఏబీపీ, సీ ఓటర్ సంస్థలు సంయుక్తంగా ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఈ సర్వే ప్రకారం, 140 స్థానాలున్న కేరళ అసెంబ్లీలో వామపక్ష కూటమికి 83 నుంచి  91 స్థానాలు, యూడీఎఫ్ కూటమికి 47 నుంచి 55 స్థానాలు మాత్రమే దక్కుతాయని తెలుస్తోంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్రంలో ఇలా జాతకాలు తిరగబడడంపై సోషల్ మీడియాలో,’లెగ్ మహిమ’ లాంటి జోక్స్  ట్రోలవుతున్నాయి. అయితే 2016లో జరిగిన ఎన్నికల్లో కేవలం 47 సీట్లకే పరిమితం అయిన కాంగ్రెస్’కు ఈసారి ఒకటీ అరా సీట్లు ఎక్కువస్తే, రావచ్చును. అదే కాంగ్రెస్’కు కాసింత ఊరట. అదలా ఉంటే, పశ్చిమ బెంగాల్లో సైతం పట్టు సాధించిన బీజేపే, కేరళలో మాత్రం పట్టు కాదు కదా, పట్టుమని పది సీట్లు తెచ్చుకునే స్థితిలో లేదు. నిజానికి, దేశంలో బీజేపీకి అసలు ఏ మాత్రం మింగుడు పడని రాష్ట్రాలు ఎవైన ఉన్నాయంటే కేరళ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల  పేర్లే ప్రముఖంగా వినిపిస్తాయి. ఈ సారి కూడా కమల దళం కేరళలో కాలు పెట్టె పరిస్తి లేదని సర్వే ఫలితాలు చెపుతున్నారు. ఎప్పటిలానే ఇప్పడు కూడా  బీజేపీకి సున్నా నుంచి రెండు సీట్లు వచ్చే అవకాశం ఉందని, సర్వేస్వరుల అభిప్రాయంగా ఉంది. కేరళలో మొత్తం 140 స్థానాలకు ఏప్రిల్ 6 తేదీన ఒకే విడతలో పోలింగ్ జరుగుతుంది. మే 2 తేదీన ఫలితాలు వెలువడతాయి. కేరళ ఎలక్షన్ పై యావత్ దేశం ఆసక్తి కనబరుస్తోంది.    
కేంద్ర ఎన్నికలసంఘం ‘పాంచ్ పటాక’ గంట కొట్టింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. ఎన్నికల గంట మోగడంతో మొదలైన మరో భారత ‘మినీ’  సంగ్రామానికి మే 12 తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తెర పడుతుంది.ఈలోగా వివిధ అంచల్లో పోలింగ్ జరుగుతుంది.  నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతం ఓటరు తీర్పుకు వెళుతున్నా, అందరి దృష్టి, ముఖ్యంగా ప్రాంతీయ పార్టీల ఏలుబడిలో ఉన్న ఉభయ తెలుగు రాష్ట్రాలు, మరీ ముఖ్యంగా ఇప్పటికే బీజేపీ కన్నుపడిన తెలంగాణ రాష్ట్ర ప్రజలు, రాజకీయ పార్టీల దుష్టి  మాత్రం పశ్చిమ బెంగాల్ పైనే వుంది.  పశ్చిమ బెంగాల్లో ‘అద్భుతం’ జరిగి బీజేపీ విజయం సాధిస్తే, ఇక  కమల దళం ఫోకస్, తెలంగాణకు షిఫ్ట్ అవుతుంది. ఇది అందరికీ తెలిసిన బహిరంగ రహస్యం. ఈ నేపధ్యంలో బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయి అనే విషయంలో రాష్ట్ర రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. బెంగాల్లో బీజేపీ గెలిస్తే, ఇప్పటికే అంతర్గత కుటుంబ కలహాలతో సతమతవుతున్న తెరాస నాయకత్వానికి మరిన్నితిప్పలు తప్పవన్న మాట అంతఃపుర వర్గాలలో సైతం వినవస్తోంది.  పశ్చిమ బెంగాల్’లో ఎలాగైతే కమలదళం ఓ వంక తమ ట్రేడ్ మార్క్, హిందుత్వ రాజకీయాలు సాగిస్తూ, మరో వైపు నుంచి ‘ఆకర్ష్’ అస్త్రంతో అధికార పార్టీని నిర్వీర్యం చేసిన విధంగానే, ఇక్కడ కూడా ఫిరాయింపులను ప్రోత్సహింఛి పార్టీని నిట్టనిలువునా చీల్చే ప్రమాదాన్ని కొట్టివేయలేమని పార్టీ వర్గాలు కూడా అనుమానం వ్యక్త పరుస్తున్నాయి.  ఇప్పటికే తెలంగాణ  బీజేపీ నాయకులు 30 మంది తెరాస ఎమ్మెల్యేలు తమ టచ్ లో ఉన్నారని బెదిరిస్తున్నారు.అది నిజం అయినా కాకపోయినా..తెరాసలో అసంతృప్తి అగ్గి రగులుతోందనేది మాత్రం ఎవరూ కాదనలేని నిజం. అంతే కాకుండా రాష్ట్రానికి వచ్చిన కేంద్రనాయకులు ఎవరిని పలకరించినా, నెక్స్ట్ టార్గెట్ తెలంగాణ అని ఎలాంటి సషబిషలు లేకుండా కుండబద్దలు కొడుతున్నారు.అందుకే, బెంగాల్లో బీజేపీ గెలిస్తే.. అనే ఊహా కూడా  గులాబీ గూటిలో గుబులు పుట్టిస్తోంది. అయితే, బెగాల్’లో బీజేపీ గెలిస్తే ఒక్క తెలంగాణలోనే కాదు, దేశ రాజకీయ వాతావరణంలోనే పెను మార్పులు చోటు చేసుకుంటున్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.  అలాగే,  దేశ ముఖ చిత్రంలో కూడా పెను మార్పులు తప్పవని అంటున్నారు. అయితే రాజకీయాలలో ఎప్పుడు ఏం జరుగుతుందో.. ఎవరూహించెదరు..
కుటుంబ వాతావరణం ఆరోగ్యంగా ఉందా లేదా?  ప్రతి వ్యక్తికి తన జీవితంలో బోలెడు బలం, ప్రశాంతత,  ఆత్మవిశ్వాసం,  జీవితం మీద భరోసా కలిగేది కుటుంబం వల్లనే.. బయట ఎన్ని సమస్యలు ఉన్నా,  ఎంత ఇబ్బందులు ఎదుర్కున్నా ఇంటికి రాగానే సంతోషం బోలెడు ప్రశాంతత,  జీవితంలో ఊరట కలుగుతోంది అంటే.. ఆ కుటుంబం ఎంతో ఆరోగ్యంగా ఉందని అర్థం. కానీ కొన్ని కుటుంబాలలో ఆరోగ్యకరమైన వాతావరణం ఉండదు. ఇలా ఆరోగ్యకరమైన వాతావరణం లేకపోతే కుటుంబ సభ్యులు చాలా వరకు మానసికంగా డిస్టర్బ్ అవుతుంటారు. అయితే  కుటుంబ వాతావరణం అనారోగ్యంగా ఉండటానికి చాలా కారణాలు ఉంటాయి. వాటిలో తరాల అంతరం వల్ల కుటుంబంలో వాతావరణం సరిగా లేకుండా ఉండే అవకాశం ఉంది, అలాగే కుటుంబ అలవాట్ల వల్ల కూడా వాతావరణం దెబ్బతింటుంది. కానీ కుటుంబ జీవితంలో నిర్లక్ష్యం చేయకూడని విషయాలు కొన్ని ఉన్నాయి.  వాటిని తెలుసుకుంటే.. కుటుంబం తిరిగి ఆరోగ్యంగా ఉండేలా చేసుకోవచ్చు.  ఇంతకీ ఆ విషయాలు ఏంటో తెలుసుకుంటే.. ఎమోషన్స్ దుర్వినియోగం.. కుటుంబంలో సులభంగా గుర్తించగలిగే ప్రమాదకరమైన విషయాలు ఏవీ ఉండవు. కానీ చాలా సున్నితంగా ఉంటూనే మనుషుల్ని బాధపెడతారు. ఎమోషన్స్ తో ఇబ్బంది పెడతారు. కుటుంబ సభ్యులు తమదే తప్పు అన్న భావనను కుటుంబంలో  వ్యక్తికి కలిగిస్తారు. కొన్నిసార్లు, వారు బాధితులుగా నటిస్తూ ఎదుటివారిని ఎక్కువగా నియంత్రించడానికి ప్రయత్నం చేస్తారు. ఇలాంటి వాతావరణం ఉన్న ఇంట్లో ఆరోగ్యకరమైన వాతావరణం, సంతోషం ఉండవు. నిర్ణయాల దగ్గర బంధనం..  కుటుంబంలో జీవిత నిర్ణయాల గురించి మిమ్మల్ని అడగకుండా, తమకు తాము నిర్ణయాలు తీసుకుని ఆఖరిగా మీకు చెబుతూ ఉంటే.. ఒకవేళ అదే నిజమైతే, ఇది నిర్లక్ష్యం చేయకూడని విషయమని లైఫ్ స్టైల్ నిపుణులు చెబుతున్నారు. . ఈ నియంత్రణ చిన్నతనం నుండి కౌమారదశ వరకు ఆరోగ్యకరంగానే ఉంటుంది. , కానీ  పెద్దయ్యాక కుటుంబ సభ్యుల నుండి ఇదే వైఖరి కొనసాగడం మంచిది కాదు. హద్దులు లేకపోవడం.. ప్రతిఒక్కరూ ఒకరి వ్యక్తిగత స్వేచ్ఛను మరొకరు గౌరవించుకున్నప్పుడే కుటుంబ సంబంధాలు ఆరోగ్యకరంగా ఉంటాయి. అలా చేయడంలో విఫలమైతే, కాలక్రమేణా విషపూరితమైన సంబంధాలకు దారితీయవచ్చు. అంతేకాకుండా, ఈ విషయాలు  వ్యక్తి యొక్క భావోద్వేగ ఎదుగుదలకు చాలా కీలకమైనవి. గొడవల పరిష్కారం.. పరిష్కారం కాని కుటుంబ వివాదాలు చాలా కుటుంబాలలో కనిపిస్తూ ఉంటాయి. ఇలాంటివి పదేపదే మరో వాదనకు లేదా ఘర్షణకు దారితీసి, పరిస్థితిని మరింత తీవ్రం చేస్తాయి. దీనివల్ల, ఆ విషయం పరిష్కారమైన తర్వాత కూడా ఎమోషనల్ దూరం పెరగవచ్చు. పట్టించుకోకపోవడం.. కుటుంబంలో మీ భావాలను లేదా అభిప్రాయాలను ఎప్పుడూ  పట్టించుకోవడం జరిగితే అది కుటుంబ సభ్యుల నుండి దూరాన్ని పెంచుతుంది. ఎందుకంటే ఎప్పుడైతై ఎమోషనల్ సపోర్ట్ లేదా అభిప్రాయాలకు విలువ ఇవ్వకపోవడం జరుగుతుందో అప్పుడు ఆ ఇంట్లో వ్యక్తి పరాయివాడుగా ఫీలవుతారు.                                     *రూపశ్రీ.  
వివాహం కేవలం ఇద్దరు వ్యక్తుల మధ్య ముడిపడేదే కాదు.. రెండు కుటుంబాల మధ్య ముడిపడే బంధం.  భారతదేశంలో చాలా వరకు వివాహం తర్వాత అమ్మాయి అత్తవారింటికి వెళుతుంది.  భర్త, అత్తమామలతో కలిసి జీవిస్తుంది.  అత్తారింట్లో అత్తమామలు మంచివాళ్లు, కోడలిని అర్థం చేసుకుని బాగా చూసుకునేవాళ్లు అయితే ఆ ఇంట్లో ఆడపిల్ల సంతోషంగా ఉంటుంది. కానీ కోడలిగా వచ్చిన ఆడపిల్లను బాధపెట్టే అత్తమామలు ఉంటే.. ఆ ఆడపిల్లల జీవితం నరకప్రాయంగా ఉంటుంది.  అయితే.. బాధపెట్టే అత్తమామలు ఉన్నారని, వివాహ బంధాన్ని తెంచుకుని వెళ్లలేరు చాలామంది అమ్మాయిలు,  బాధపెట్టే అత్తమామలతో  ఎలా ఉండాలో,  వాళ్లతో కలిసి ఎలా జీవించాలో లైఫ్ స్టైల్ నిపుణులు చెబుతున్నారు..  వీటి గురించి తెలుసుకుంటే.. మార్చాలని అనుకోకూడదు.. కొన్నిసార్లు  అత్తమామలు కోడళ్ల మీద ఒత్తిడిని, ఇబ్బందులను కలిగిస్తారు. బాధపెట్టే అత్తమామల గురించి చాలా మంది జోక్ గా చెప్తూ ఉంటారు. కానీ బాధపెట్టే అత్తమామలు ఉండటం జోక్ కాదు.. అది ఆడపిల్లలను చాలా బాధపెడుతుంది, చాలా ఒత్తిడిలోకి నెడుతుంది.  అలాంటి అత్తమామలు  మానసిక ప్రశాంతతను, వివాహ బంధాన్ని కూడా ప్రభావితం చేస్తారు. చాలా మంది కోడళ్లు తమ అత్తమామలు మారితే బాగుండు అని అనుకుంటారు. కానీ అత్తమామలు మారాలని,  వాళ్లను  మార్చాలని అనుకోవడం వ్యర్థం. అత్తమామలు ఏ విషయాల పట్ల బాధపెడతారో తెలిసినప్పుడు వాటి గురించి పట్టించుకోకుండా ఉండటమే  మంచిది. పరిమితులు..  బాధపెట్టే అత్తమామలు ఉన్నప్పుడు, ప్రతి కోడలు తన భర్త సహాయంతో  కొన్ని సొంత పరిమితులను నిర్దేశించుకుని, వాటికి కట్టుబడి ఉండడం  మంచిది. పరిమితులు ఏర్పాటు చేసుకున్నప్పుడు పెద్దవాళ్లు, అత్తమామలు మాట్లాడే ఏ మాటలు లేదా ప్రవర్తన పరిమితులను దాటి జీవితంలోకి తీసుకుని బాధపడే పరిస్థితి రాదు.   సమస్య, పరిష్కారం.. ఏదైనా సమస్యను పరిష్కరించే ముందు, దాని మూల కారణాన్ని అర్థం చేసుకోవడం ముఖ్యం. అత్తమామల చెడు  ప్రవర్తన అకస్మాత్తుగా జరగదు. వారు ప్రతీదీ తమకు నచ్చినట్టుగా జరగాలని కోరుకోవడం, తమ భావాలను అదుపు చేసుకోలేకపోవడం, లేదా గతంలోని మానసిక గాయాలను మోయడం వంటి కారణాల వల్ల ఇది తరచుగా జరుగుతుంది. కొన్నిసార్లు, అత్తమామలు కోడలు పెరిగిన విధానాన్ని, కోడలి పుట్టింటి వారి పద్దతులను,  నియమాలను అగౌరవపరుస్తారు, మరికొన్ని సార్లు  స్వార్థపరురాలు అనే ట్యాగ్ వేసి  వ్యక్తిగత స్వేచ్ఛను ఉల్లంఘిస్తారు, లేదా కుటుంబంలో కలహాలు సృష్టించి కోడలిని తమకు అనుకూలంగా మలచుకోవడానికి ప్రయత్నిస్తారు. ఈ పద్ధతులను గుర్తించడమే కోడళ్లు అత్తారింట్లో బాధపెట్టే అత్తమామలతో కలిసి ఎలా జీవించాలనే విషయాన్ని అర్థమయ్యేలా చేస్తాయి.                                      *రూపశ్రీ.
వేసవి సెలవలు పూర్తయ్యాక పిల్లలు స్కూల్ కు వెళ్లడం అనేది సహజం. పాఠశాలకు వెళ్లడం పిల్లల జీవితంలో పెద్ద మార్పుగా మారుతుంది. మరీ ముఖ్యంగా కొత్తగా స్కూల్ లో జాయిన్ అయిన పిల్లల విషయంలో ఇది మరింత ప్రభావవంతంగా ఉంటుంది. కొత్త వాతావరణం, కొత్త ఉపాధ్యాయులు, కొత్త తరగతులు మరియు కొత్త స్నేహితులు ఉత్సాహంతో పాటు ఆందోళనను కూడా కలిగిస్తాయి. చాలా మంది పిల్లలు మొదట్లో పాఠశాలలో తమకు ఎదురయ్యే విషయాలను, తమ మనసులోని విషయాలను  మనసు విప్పి చెప్పలేరు. అయితే తల్లిదండ్రుల బాధ్యత కేవలం పిల్లలను బడికి పంపడమే కాదు.. పిల్లల గురించి ఎన్నో విషయాలు తల్లిదండ్రులు ఆలోచించాలి. మరీ ముఖ్యంగా..  కొత్తగా స్కూల్ కు వెళ్తున్న పిల్లలను కొన్ని ప్రశ్నలు తప్పకుండా అడగాలి. ఆ ప్రశ్నలు ఏంటో తెలుసుకుంటే.. ప్రతిరోజూ పిల్లలను అడాగాల్సిన ప్రశ్నలు.. నచ్చిన విషయం.. ఈ రోజు పాఠశాలలో అన్నింటి కన్నా నీకు నచ్చిన విషయం ఏదని పిల్లలను అడగాలి.  ఈ ప్రశ్న పిల్లలో సానుకూల విషయాలను వెలికితీయడానికి సహాయపడుతుంది.  కొందరు పిల్లలు బడికి వెళ్లొచ్చిన తర్వాత మళ్లీ బడికి వెళ్లమని మారం చేస్తుంటారు. కానీ బడిలో వారికి నచ్చిన విషయాన్ని గుర్తు చేయడం వల్ల పిల్లలకు పాఠశాల పట్ల ఉత్సాహం పెరుగుతుంది.  అలాగే తల్లిదండ్రులు పిల్లలతో ఇలా మాట్లాడటం వల్ల పిల్లలు  స్వేచ్ఛగా మాట్లాడటం నేర్చుకుంటారు,  ఏ విషయాన్ని అయినా బెరుకు లేకుండా చెప్పగలుగుతారు. ఇది పిల్లలలో ఆత్మవిశ్వాసం పెంచుతుంది. పిల్లలకు ఏ విషయాల మీద ఆసక్తి ఉందో కూడా తల్లిదండ్రులకు అర్థం అవుతుంది. ఎవరితో ఆడుకున్నావు లేదా మాట్లాడావు అని అడగాలి.. పిల్లలు పాఠశాలలో ఎవరితో ఆడుకున్నారు, మాట్లాడారు అనే విషయాలు కొత్త స్నేహితుల గురించిన సమాచారాన్ని తెలుసుకోవడానికి సహాయపడుతుంది.  పిల్లలకు సామాజిక అవగాహన అర్థం అవుతుంది. పిల్లలు బడిలో ఒంటరిగా ఉంటారా లేదా ఇతరులతో కలుస్తున్నారా,  ఎవరితో అయినా కలవడంలో  ఇబ్బంది ఫీలవుతున్నారా?  అనే విషయాలు అర్థం చేసుకోవడానికి తల్లిదండ్రులకు సహాయపడుతుంది. ఏదైనా భయం లేదా బాధ పెట్టే విషయం ఉందా అని అడగాలి.. కొందరు పిల్లలు స్కూల్ లో తోటి విద్యార్థుల వల్ల, ఉపాధ్యాయుల వల్ల బాధపడటం, భయపడటం జరుగుతూ ఉంటుంది. దీని వల్ల పిలల్లు బడికి  వెళ్లాలంటే భయపడటారు.  ఈ కారణంగా చదువు మీద ఆసక్తి కూడా తగ్గిపోతుంది. పిల్లల భయాన్ని తగ్గించినప్పుడే పిల్లల భవిష్యత్తు బాగుంటుంది. ఈ రోజు ఏం నేర్చుకున్నావని అడగాలి.. పిల్లలను  ఈ రోజు ఏం నేర్చుకున్నావని ప్రతి రోజూ అడిగితే వారికి ఏ విషయం పట్ల ఆసక్తి ఎక్కువ ఉందో అర్థమవుతుంది. తద్వారా పిల్లలను ప్రోత్సహించడంలో తల్లిదండ్రులకు ఒక స్పష్టత ఏర్పడుతుంది. ఇలా అడిగినప్పుడు పిల్లలు అన్ని చెబుతూ ఉంటే.. పిల్లలలో జ్ఞాపకశక్తి,  వారిలో బావ వ్యక్తీకరణ వంటివి మెరుగు పడతాయి.                          *రూపశ్రీ.
వైద్య నిపుణురాలు చెప్పిన 7 అద్భుతమైన ఆరోగ్యకరమైన ఆహారాలు   ఈ రోజుల్లో క్యాన్సర్, మధుమేహం, గుండె జబ్బులు వంటి దీర్ఘకాలిక వ్యాధులు చాలా మందిని ప్రభావితం చేస్తున్నాయి. అయితే మన రోజువారీ ఆహారపు అలవాట్లలో చిన్న మార్పులు చేసుకోవడం ద్వారా ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవచ్చని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ఈ వీడియోలో ప్రముఖ వైద్య నిపుణురాలు డా. శ్రీలత రోజూ ఆహారంలో తప్పనిసరిగా ఉండాల్సిన 7 ముఖ్యమైన ఆరోగ్యకరమైన ఆహారాల గురించి సులభంగా వివరించారు. ఈ ఆహారాలు శరీరానికి అవసరమైన పోషకాలను అందించడంతో పాటు రోగనిరోధక శక్తిని పెంచడంలో, గుండె ఆరోగ్యాన్ని కాపాడడంలో, రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో మరియు క్యాన్సర్ వంటి వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించడంలో ఎలా ఉపయోగపడతాయో వివరించారు. అలాగే ఏ ఆహారాన్ని ఎంత మోతాదులో తీసుకోవాలి, వాటిని రోజువారీ ఆహారంలో ఎలా చేర్చుకోవాలి, ఆరోగ్యకరమైన జీవనశైలి కోసం పాటించాల్సిన ముఖ్యమైన సూచనలు ఏమిటో కూడా ఈ వీడియోలో తెలుసుకోవచ్చు. మీరు ఆరోగ్యంగా ఉండాలనుకుంటే, మీ కుటుంబ సభ్యులకు కూడా ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లు అలవాటు చేయాలనుకుంటే ఈ వీడియో తప్పకుండా చూడండి.   గమనిక: ఈ వీడియోలో ఇచ్చిన సమాచారం ఆరోగ్య అవగాహన కోసం మాత్రమే. మీ ఆరోగ్య పరిస్థితికి అనుగుణంగా ఆహారంలో మార్పులు చేసుకునే ముందు తప్పనిసరిగా మీ వైద్యుడిని లేదా పోషకాహార నిపుణుడిని సంప్రదించండి.  
  వర్షాకాలంలో చాలా మంది పకోరాలు, సమోసాల వంటి వేయించిన ఆహారాల కంటే మొక్కజొన్నను ఎక్కువగా తినడానికి ఇష్టపడతారు. మొక్కజొన్నలో అనేక ముఖ్యమైన పోషకాలు ఉండటం వల్ల ఆరోగ్య పరంగా చూసినా మొక్కజొన్న చాలా మంచిది.   అయితే ప్రతి వ్యక్తి ఆరోగ్య పరిస్థితి భిన్నంగా ఉంటుంది, కాబట్టి మొక్కజొన్నను సరైన పద్ధతిలో , సరైన పరిమాణంలో తీసుకోవడం చాలా ముఖ్యం.  వర్షాకాలంలో మొక్కజొన్న తినడం కొందరికి ఆరోగ్యపరంగా మేలు చేస్తే.. మరికొందరికి హాని కూడా కలిగించవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. వర్షాకాలంలో మొక్కజొన్న తినడం వల్ల కలిగే ప్రయోజనాలు, మొక్కజొన్న తినడంలో  పాటించాల్సిన జాగ్రత్తలు ,  మొక్కజొన్న తినడానికి సేఫ్ మార్గం.. ఇలా అన్ని విషయాలు తెలుసుకుంటే.. వర్షాకాలంలో మొక్కజొన్న.. ఆహార నిపుణుల అభిప్రాయం ప్రకారం  మొక్కజొన్నలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది, ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది , ఎక్కువసేపు కడుపు నిండిన అనుభూతిని కలిగిస్తుంది. మొక్కజొన్నలోని రెసిస్టెంట్ స్టార్చ్ పేగుల ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. పొటాషియం, మెగ్నీషియం , బి విటమిన్లు కూడా శక్తిని అందించడానికి , శరీరంలో జరిగే క్రియలను నిర్వహించడానికి తగిన శక్తి అందిస్తుంది. అందుకే వాతావరణ పరంగానే కాకుండా  ఆరోగ్య పరంగా కూడా మొక్కజొన్న ఆరోగ్యానికి చాలామంచిది. అసిడిటి, గ్యాస్, ఉబ్బరం సమస్యలుంటే.. గ్యాస్, ఎసిడిటీ లేదా కడుపు ఉబ్బరంతో బాధపడేవారికి, ఉడికించిన మొక్కజొన్న  మంచిది. ఉడికించిన మొక్కజొన్న మృదువుగా ఉండి, సులభంగా జీర్ణమవుతుంది. అయితే, దీనిని ఎక్కువ సేపు ఉడికించడం వల్ల దానిలోని కొన్ని పోషకాలు , రెసిస్టెంట్ స్టార్చ్ తగ్గిపోయే అవకాశం ఉంటుంది. ఐబియస్ ఉన్న వ్యక్తులకు..  ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్ (IBS) ఉంటే, మొదట్లో దీనిని అర కంకికి, అంటే సుమారు 35–40 గ్రాములకు పరిమితం చేసుకుని తినడం మంచిది. ఎక్కువ మొత్తంలో స్వీట్ కార్న్ లేదా నార్మల్ కార్న్  తినడం వల్ల కొంతమందిలో గ్యాస్ , ఉబ్బరం పెరగవచ్చు. మధుమేహం లేదా ఇన్సులిన్ నిరోధకత.. మధుమేహం లేదా ఇన్సులిన్ నిరోధకత ఉన్నవారికి ఉడకబెట్టిన లేదా ఆవిరి మీద ఉడికించిన మొక్కజొన్న మంచిదిగా. దీని గ్లైసెమిక్ ఇండెక్స్, వేయించిన మొక్కజొన్న కంటే తక్కువగా ఉంటుంది. ఒకసారికి అర కప్పు ఉడికించిన మొక్కజొన్న లేదా ఒక చిన్న మొక్కజొన్న కంకి సరిపోతుంది. మొక్కజొన్నలో ల్యూటిన్ , జీక్సాంథిన్ వంటి యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి, ఇవి కంటి ఆరోగ్యానికి మేలు చేస్తాయని భావిస్తారు. మొక్కజొన్నను కొద్దిగా ఆవిరి మీద ఉడికించడం వల్ల ఈ పోషకాలు శరీరానికి మరింత సులభంగా అందుతాయి. మొక్కజొన్న తినేటప్పుడు గుర్తుంచుకోవలసిన విషయాలు.. మొక్కజొన్నపై అధికంగా వెన్న, చీజ్ లేదా ఉప్పు వేసుకుని తినకూడదు.  అసిడిటీ సమస్యలు ఉంటే, మసాలాలు , నిమ్మరసం వాడకాన్ని తగ్గించాలి. మాడిపోయిన లేదా బాగా వేయించిన మొక్కజొన్నను తినడం మానుకోవాలి.  ఎల్లప్పుడూ తాజాగా, బాగా ఉడికించిన మొక్కజొన్నను తినడం మంచిది. మొక్కజొన్నను బాలెన్స్డ్ గా తీసుకోవడం మంచిది.  అవసరమైన దానికంటే ఎక్కువగా తినడం వల్ల జీర్ణ సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది.                                    *రూపశ్రీ.  
మన శరీరంలో రక్త ప్రసరణ సక్రమంగా ఉండటం ఆరోగ్యానికి ఎంతో ముఖ్యమైనది. జీవనశైలి మార్పులు, సరైన ఆహారం తీసుకోకపోవడం, వ్యాయామం లేకపోవడం వంటి కారణాల వల్ల రక్తంలో క్లాట్స్ ఏర్పడే ప్రమాదం పెరుగుతుంది. అలాగే అధిక బరువు కూడా అనేక ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది.  ఈ వీడియోలో ప్రముఖ ఆయుర్వేద వైద్య నిపుణులు Dr. Chittibotla Madhusudana Sharma గారు వంటింట్లో సులభంగా లభించే కొన్ని సహజ పదార్థాలతో సంప్రదాయ ఆయుర్వేదంలో ఉపయోగించే చిట్కాలను వివరించారు. రక్త ప్రసరణను మెరుగుపరచడంలో, శరీర ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో, బరువు నియంత్రణకు తోడ్పడే ఆహారపు అలవాట్లు మరియు సహజ పద్ధతుల గురించి ఆయన విలువైన సూచనలు అందించారు. అలాగే ఏయే ఆహార పదార్థాలను తీసుకోవాలి, ఎలాంటి జీవనశైలి పాటించాలి, ఆరోగ్యాన్ని సహజంగా ఎలా మెరుగుపరుచుకోవాలి వంటి విషయాలను కూడా ఈ వీడియోలో తెలుసుకోవచ్చు.  ఆయుర్వేదం చెప్పే ఈ సంప్రదాయ చిట్కాలను తెలుసుకుని, మీ రోజువారీ జీవితంలో ఆరోగ్యకరమైన అలవాట్లను అలవరచుకోండి.  గమనిక: ఈ వీడియోలో తెలిపిన సమాచారం అవగాహన కోసం మాత్రమే. ఇప్పటికే రక్తం గడ్డకట్టే సమస్యలు, గుండె సంబంధిత వ్యాధులు లేదా ఇతర ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నవారు తప్పనిసరిగా అర్హత కలిగిన వైద్యుడి సలహా మేరకు మాత్రమే చికిత్స తీసుకోవాలి. వైద్యుల సూచన లేకుండా ఎలాంటి మందులను ఆపడం లేదా ప్రారంభించడం చేయవద్దు.