
సూపర్ స్టార్ మహేష్ బాబు(Mahesh Babu)ఫ్యామిలీలో త్వరలోనే పెళ్లి బాజాలు మోగనున్నాయి. మహేష్ బాబు సోదరి పద్మావతి, మాజీ ఎంపీ గల్లా జయదేవ్ దంపతుల చిన్న కుమారుడు సిద్ధార్థ్ గల్లా వివాహ బంధంలోకి అడుగుపెట్టబోతున్నాడు.సిద్ధార్థ్ గల్లా గత కొంతకాలంగా సౌత్ కొరియాకి చెందిన హాయిన్ కిమ్ (జిన్నీ) అనే అమ్మాయితో ప్రేమలో ఉన్నాడు . వీరిద్దరి ప్రేమకు ఇరువైపులా ఉన్న పెద్దలు పచ్చజెండా ఊపడంతో, ఆదివారం నాడు కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల సమక్షంలో నిశ్చితార్థ వేడుక అత్యంత వైభవంగా జరిగింది. రెండు వేర్వేరు సంస్కృతులకు చెందిన ఈ జంట ఒక్కటి కాబోతుండటం ఘట్టమనేని, గల్లా అభిమానులలో సరికొత్త ఉత్సాహాన్ని నింపింది.
ఈ వేడుకకి సంబంధించిన అందమైన ఫోటోలని మహేష్ బాబు భార్య, మాజీ హీరోయిన్ నమ్రతా శిరోద్కర్ సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు. సిద్ధార్థ్ గల్లా, హాయిన్ కిమ్‌ల నిశ్చితార్థం కేవలం పరిమిత సంఖ్యలో ఉన్న 50 నుండి 100 మంది అతిథుల సమక్షంలో జరిగినట్లు తెలుస్తోంది. ఈ వేడుకలో మహేష్ బాబు అన్న రమేష్ బాబు కుమార్తె ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. గల్లా జయదేవ్ పెద్ద కుమారుడు అశోక్ గల్లా ఇప్పటికే టాలీవుడ్‌లో హీరోగా ఎంట్రీ ఇచ్చి రెండు సినిమాలు పూర్తి చేసుకోగా, ఆయన నటిస్తున్న 'విసా' సినిమా త్వరలోనే విడుదల కానుంది. మరోవైపు చిన్న కుమారుడైన సిద్ధార్థ్ అమర రాజా గ్రూప్‌కి సంబంధించిన ఫ్యామిలీ బిజినెస్ వ్యవహారాలను చూసుకుంటున్నారు. వ్యాపార రంగంలో బిజీగా ఉంటూనే, తన మనసు దోచిన కొరియన్ అమ్మాయిని జీవిత భాగస్వామిగా ఎంచుకోవడం విశేషం.
Also read: Lenin: సరికొత్త చర్చకి దారి తీస్తున్న క్లైమాక్స్ డైలాగ్.. ధర్మరాజు, కుక్క మాత్రమే మిగిలారా!
నిశ్చితార్థం ముగియడంతో త్వరలోనే వీరి వివాహం కూడా అత్యంత వైభవంగా జరగనుందని సమాచారం. సౌత్ కొరియన్ అమ్మాయి తెలుగు వారింటి కోడలిగా అడుగుపెట్టబోతుండటంతో ఈ పెళ్లి టాలీవుడ్‌లోనే వన్ ఆఫ్ ది మోస్ట్ టాక్‌డ్ వెడ్డింగ్స్ కానుంది. ప్రస్తుతం సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌లో ఈ కొత్త జంట ఫోటోలు మిలియన్ల కొద్దీ వ్యూస్‌తో ట్రెండ్ అవుతున్నాయి.





