LATEST NEWS
దేశ రాజధాని హస్తిన వేదికగా  కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో సాగుతున్న జెన్ జెడ్  ఉద్యమ కవరేజ్ సందర్భంగా పలు ప్రధాన స్రవంతి మీడియా ప్రతినిధుల తీరు ప్రజాగ్రహాన్ని మూటగట్టుకుంటోంది. ఇప్పటికే ఆ ప్రజాగ్రహ జ్వాలల సెగ మెయిన్ స్ట్రీమ్ మీడియా ప్రతినిధులకు సోకింది కూడా.  అందుకు కారణమేంటంటే.. మెయిన్ స్ట్రీమ్ మీడియా..  కేంద్ర ప్రభుత్వానికి అనుకూలంగా, ప్రతిపక్షాలకు వ్యతిరేకంగా ఏకపక్ష వార్తలు ప్రసారం చేస్తున్నాయని జనం భావించడమే. ఆ ఆగ్రహంతోనే ఉద్యమకారులు జర్నలిస్టులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒకానొక సందర్భంగా మెయిన్ స్ట్రీమ్ మీడియా సంస్థల ప్రతినిధులపై అంటే ఆయా సంస్థలలో పని చేసే జర్నలిస్టులపై దాడులకు కూడా పాల్పడ్డారు. అటువంటి సంఘటనల్లో కొందరు విలేకరులు గాయపడ్డారు. ఇక సోషల్ మీడియాలో అయితే అటువంటి మెయిన్ స్ట్రీమ్ మీడియా సంస్థలపైనా, ఆయా సంస్థల విలేకరులపైనే ఓ రేంజ్ లో ఆగ్రహం, వ్యతిరేకత వ్యక్తమౌతోంది. నెటిజనులు ఆయా మీడియా సంస్థల ప్రతినిధులను బదరిస్తూ పోస్టులు కూడా పెడుతున్నారు.   జులై 20న జంతర్ మంతర్ వద్ద జరిగిన నిరసన ప్రదర్శనను కవర్ చేసేందుకు వెళ్లిన  టైమ్స్ నౌ విలేకరి పై కొందరు   దౌర్జన్యానికి దిగారు. గుంపుగా వచ్చిన నిరసనకారులు ఆయనపై పిడిగుద్దుల వర్షం కురిపించారు. నీళ్ల సీసాలు విసిరారు. కాలితో తన్నారు.  ప్రదర్శనకారుల ఆగ్రహానికి ఆయన అక్కడ నుంచి వెళ్లిపోక తప్పలేదు.  అలాగే.. పార్లమెంట్ దిశగా సాగిన విద్యార్థుల ప్రదర్శనపై పోలీసులు తీవ్రంగా వ్యవహరించారని, అయితే.. టైమ్స్ నౌ కవరేజీ ప్రభుత్వానికి అనుకూలంగా ఉందనీ, పోలీసుల దౌర్జన్యాలను హైలైట్ చేయలేదన్నది నిరసన కారుల ఆరోపణ. అందుకే ఆ మీడియా సంస్థ ప్రతినిథిపై దాడి జరిగిందని పరిశీలకులు సైతం విశ్లేషణలు చేశారు.  అలాగే రిపబ్లిక్ టీవీ  ప్రిన్సిపల్ కరస్పాండెంట్ కూడా నిరసనకారుల ఆగ్రహాగ్నిని చవిచూశారు.  మీడియా సంస్థలు అనుసరిస్తున్న ఏకపక్ష వైఖరిపై నిరసనకారుల ఆగ్రహానికి ఇవి నిదర్శనలుగా పరిశీలకులు చెబుతున్నారు.  ఆ రెండు మీడియా సంస్థలే కాదు, ప్రభుత్వ బాకాలుగా వ్యవహరిస్తున్న మరికొన్ని మీడియా సంస్థల విలేకరులపై కూడా  జంతర్ మంతర్ వద్ద నిరసనకారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రదర్శనకారులపై పోలీసుల దాష్టీకాన్నీ, తమ ఆందోళనలపై కేంద్రం అనుస రిస్తున్నఅణచివేతనూ ప్రస్తావించకుండా కేంద్ర ప్రభుత్వ అనుకూలతకే ప్రాధాన్యం ఇవ్వడంతోనే   మీడియా ప్రజాగ్రహానికి గురౌతోందని చెబుతున్నారు.   మోడీ అనుకూల వైఖరితో ప్రసారాలు, ప్రచురణలు చేస్తున్న మెయిన్ స్ట్రీమ్  మీడియా సంస్థలను నెటిజనులు గోడీ మీడియాగా సంబోధిస్తూ నెటిజనులు తమ ఆగ్రహాన్ని ప్రదర్శిస్తున్న సంగతి విదితమే.   ఈ పరిణామాల నేపథ్యంలో మీడియా సంస్థలు తమ వార్తా ప్రసారాలు, ప్రచురణల్లో నిష్పాక్షికతకు ప్రాధాన్యత ఇవ్వకపోతే.. ప్రజాగ్రహానికి గురి కావలసివస్తుందన్న విషయం తేటతెల్లమౌతోందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.   ప్రజాస్వామ్య వ్యవస్థలో  కీలక పాత్ర పోషించాల్సిన ఫోర్త్ ఎస్టేట్  మీడియా ప్రజల విశ్వాసాన్ని పూర్తిగా కోల్పోయే పరిస్థితులు కొని తెచ్చుకోకుండా, ఇక నుంచైనా నిష్పాక్షితకు, వాస్తవాల ప్రసార, ప్రచురణలకు ప్రాధాన్యత ఇవ్వాలని, లేకుంటే గోడీ మీడియాపై ప్రజా వ్యతిరేకత మరింత పెచ్చరిల్లే అవకాశాలు మెండుగా ఉన్నాయని అంటున్నారు.   Jantar Mantar protests, Attacks on Journalists, Partiality, News Coverage
కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో జరుగుతున్న ఆందోళన మోడీలో భయాన్ని పెంచుతోందా?  పరీక్షల ప్రక్రియలో పారదర్శకత పెంచేందుకు, అక్రమార్కులపై ఉక్కుపాదం మోపేందుకు ప్రస్తుతం ఉన్న చట్టాలను మరింత కఠినతరం చేస్తామంటూ గురువారం (జులై 24) అర్ధరాత్రి మోడీ విడుదల చేసిన వీడియోలో.. ఆయన ముఖంలో భయం స్పష్టంగా కనిపించిందా? అంటే ప్రముఖ నటుడు ప్రకాశ్ రాజ్ ఔననే అంటున్నారు.   ప్రధాని నరేంద్ర మోదీ విడుదల చేసిన ఈ వీడియో సందేశంపై ప్రముఖ నటుడు,   సామాజిక విమర్శకుడు ప్రకాశ్ రాజ్ ప్రధాని ముఖంలో భయం ప్రస్ఫుటంగా కనిపించిందంటూ చేసిన  వ్యాఖ్యలు  సోషల్ మీడియాలో  తెగ వైరల్ అవుతున్నాయి. ప్రధాని వీడియో సందేశాన్ని రీపోస్టు చేస్తూ.. ప్రకాశ్ రాజ్. తాను ప్రధాని ముఖంలో భయాన్ని స్పష్టంగా చూశానని పేర్కొన్నారు. ప్రధాని భయపడ్డారు.. యువత, విద్యార్థుల ఉద్యమంతో ప్రధాని దిగిరాక తప్పలేదనీ,   దేశ భవిష్యత్ కోసం కాక్రోచ్ జనతా పార్టీ  పోరాటాన్ని ఆయన అభినందిస్తూ.. ఆ పోరాటం వల్లనే దేశ ప్రజలలో చైతన్యం వచ్చిందని పేర్కొన్నారు.  విద్యార్థుల  మహోద్యమం ముందు మోడీ  మోకరిల్లక తప్పలేదనడానికి ఆయన విడుదల చేసిన వీడియోయే తిరుగులేని సాక్ష్యమని ప్రకాశ్ రాజ్ పేర్కొన్నారు.   Prakash Raj, PM Narendra Modi, NEET Paper Leak, Jantar Mantar Protests, Exam Reforms India
కేంద్ర మంత్రి రవ్ నీత్ సింగ్ బిట్టూ తన పదవికి రాజీనామా చేశారు.  కేంద్ర రైల్వే, ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి రవ్‌నీత్ సింగ్ బిట్టూ   ప్రధాని నరేంద్ర మోడీ    సూచనల మేరకు,   సమర్పించిన రాజీనామాను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శుక్రవారం (జులై 24) ఆమోదించారు.    రాజస్థాన్   నుంచి రాజ్యసభ కు ప్రాతినిథ్యం వహించిన  రవ్‌నీత్ సింగ్ బిట్టూ రాజ్యసభ పదవీకాలం   జూన్ 21తోనే ముగిసింది. ఆ తర్వాత ఆయనకు   రాజ్యసభ నామినేషన్ దక్కలేదు.  రాజ్యాంగంలోని ఆర్టికల్ 75(5) ప్రకారం.. పార్లమెంటు ఉభయ సభలలో ఏదో ఒక సభ లో సభ్యత్వం లేని  వ్యక్తి  ఆరు నెలల కాల పరిమితి మించి  కేంద్ర మంత్రిగా కొనసాగే అవకాశం లేదు. దీంతో మోడీ ఆదేశాల మేరకు రవ్ నీత్ సింగ్ బిట్టూ తన పదవికి రాజీనామా సమర్పించారు.  పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి బియాంత్ సింగ్ మనవడైన రవ్‌నీత్ సింగ్ బిట్టూ సుదీర్ఘ కాలం పాటు  కాంగ్రెస్ లో ఉన్నారు.  2024 సార్వత్రిక ఎన్నికలకు   ముందు ఆయన కాషాయ తీర్థం పుచ్చుకున్నారు. ఆ ఎన్నికలలో  పంజాబ్ నుంచి పోటీ ఓటమి పాలైనప్పటికీ  బీజేపీ కేంద్రంలో మంత్రి పదవి కట్టబెట్టింది,  రాజస్థాన్ నుంచి రాజ్యసభకు పంపింది.  ఇప్పుడు కూడా రవ్ నీత్ సింగ్ చేత  మోడీ రాజీనామా చేయించడానికి కారణం ఆయనకు పంజాబ్ బాధ్యతలు అప్పగించడానికేనని రాజకీయవర్గాలలోో చర్చ జరుగుతోంది.  పంజాబ్ లో ఇప్పుడు   ఆమ్ ఆద్మీ పార్టీ అధికారంలో ఉన్న సంగతి తెలిసిందే. పంజాబ్ అసెంబ్లీకి త్వరలో జరగనున్న ఎన్నికలలో బీజేపీ విజయమే లక్ష్యంగా వ్యూహాలు రచిస్తున్న కమల దళం..  అక్కడ పార్టీని బలోపేతం చేసే లక్ష్యంగానే వ్యూహాత్మకంగా బిట్టూ చేత రాజీనామా చేయించిందని అంటున్నారు.  కేంద్ర మంత్రి పదవిని వీడిన బిట్టూ రాబోయే రోజుల్లో పంజాబ్ లో విస్తృతంగా పర్యటించి క్షేత్రస్థాయిలో బీజేపీ బలోపేతానికి కృషి చేస్తానని మీడియాకు వెల్లడించారు.  rticle 75 Constitution, BJP Punjab Politics, Beant Singh Grandson
పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్  ) అధినేత్రి మమతా బెనర్జీ కాక్రోచ్ జనతా పార్టీ ఆందోళనకు సంఘీభావం ప్రకటించారు.   పరీక్షల్లో పారదర్శకత, విద్యారంగంలో   సంస్కరణలు, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా డిమాండ్ తో  యువత చేపట్టిన పోరాటానికి మద్దతు ప్రకటించడమే కాకుండా.. జంతర్ మంతర్ వద్ద కాక్రోచ్ జనతా పార్టీ  ఆధ్వర్యంలో సోమవారం (జులై 27)  జరగనున్న ధర్నాలో స్వయంగా పాల్గొంటానని వెల్లడించారు. దీంతో   మమత కేంద్రంతో ప్రత్యక్ష పోరాటానికి రెడీ అయ్యారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.   మమత  ఢిల్లీ పర్యటన వెనుక  విద్యార్థుల ఉద్యమానికి మద్దతు మాత్రమే కాకుండా, బలమైన రాజకీయ వ్యూహాలు కూడా   ఉన్నాయంటున్నారు. ఇటీవలి  పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో టీఎంసీ పరాజయం పాలై అధికారాన్ని కోల్పోయిన సంగతి తెలిసిందే. ఆ  తరువాత..  ఎంపీ శతాబ్ది రాయ్ సహా ఏకంగా 20 మంది టీఎంసీ ఎంపీలు టీఎంసీని    నేషనలిస్ట్ సిటిజన్స్ పార్టీ ఆఫ్ ఇండియాలో చేరారు.  ఈ పరిణామాల నేపథ్యంలో  కాక్రోచ్ జనతా పార్టీ ఆందోళనలకు సంఘీభావంగా ప్రత్యక్షంగా జంతర్ మంతర్ వద్ద ఆందోళనలో పాల్గొనడానికి మమతా బెనర్జీ హస్తిన వస్తుండటం రాజకీయంగా  ప్రాధాన్యత సంతరించుకుంది.    మమతా బెనర్జీ హస్తిన పర్యటనపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ పర్యటనలో మమతా బెనర్జీ  కాంగ్రెస్ అగ్రనాయకత్వంతో పాటు ఇతర కీలక ప్రతిపక్ష పార్టీల నేతలతో వరుస భేటీలు నిర్వహించే అవకాశం ఉందన్న చర్చ రాజకీయవర్గాలలో జోరుగా సాగుతోంది.   జాతీయ స్థాయిలో మోదీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కాక్రోచ్ జనతా పార్టీతో కలిసి మమత వేస్తున్న ఈ అడుగులు కొత్త రాజకీయసమీకరణాలకు దారితీసు అవకాశం లేకపోలేదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  Cockroach Janata Party, Jantar Mantar protest, Trinamool Congress TMC, Delhi protest July 27
  రాజకీయాల్లో విమర్శలు, ప్రతి విమర్శలు సాధారణమే. అయితే బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కల్వకుంట్ల తారకరామారావుకు ఓ కాంగ్రెస్ నేత బర్త్ డే గిఫ్ట్ గా ఓ వినూత్న గిఫ్ట్ పంపి సంచలనం సృష్టించారు. కల్వకుంట్ల తారకరామారావు జన్మదినం జులై 24 (శుక్రవారం) ఈ సందర్భాన్ని పురస్కరించుకుని తెలంగాణ ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయి కుమార్ కేటీఆర్ కు పాతిక కిలోల సన్నబియ్యాన్ని కానుకగా పంపారు. అదీ తాను స్వయంగా ఆ బర్త్ డే గిఫ్ట్ ను అందించకుండా, ర్యాపిడో బైక్ బుక్ చేసి.. ఆ కానుకను తెలంగాణ భవన్ కు కేటీఆర్ కు పంపించారు. ఈ విషయంపై గాంధీ భవన్ లో మీడియాతో మాట్లాడిన మెట్టు సాయి కుమార్..  ఇది కేటీఆర్‌కు మా బర్త్‌డే గిఫ్ట్ అన్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్రజలకు అందిస్తున్న సన్నబియ్యం విలువ తెలుసుకోవాలనే కేటీఆర్ కు  ఈ కానుక పంపినట్లు చెప్పారు.  ఈ పాతిక కిలోలతో సరిపెట్టేయడం లేదనీ, అవసరమైతే.. ప్రతి నెలా ఈ రేషన్ ను కేటీఆర్ కు పంపేందుకు రెడీగా ఉన్నామని చెప్పారు.  దేశంలో ప్రజలకు సన్నబి య్యం అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణేనని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రతి ఇంటికీ నాణ్యమైన బియ్యం చేరుతోందని పేర్కొన్నారు.  ఒకప్పుడు సన్నబియ్యంతో వంట చేస్తే అది పండగ రోజు అనుకునేవారు. ఇప్పుడు తెలంగాణలో ప్రతి ఇంట్లో ప్రతిరోజూ పండగేనని సాయికుమార్ చెప్పారు.  మొత్తం మీద సాయికుమార్ కేటీఆర్ కు పంపిన ఈ బర్త్ డే గిఫ్ట్ రాజకీయవర్గాలలో హాట్ టాపిక్ గా మారింది. ఇందుకు సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమంలో తెగ వైరల్ అవుతున్నాయి.   25kgs, sannabiyyam, rapido, telanganabhawan, Mettu Saikumar
ALSO ON TELUGUONE N E W S
ప్రపంచ సినిమా రంగాన్ని తన అద్భుతమైన ప్రతిభతో, వినూత్నమైన మేకింగ్ శైలితో అలరించిన హాలీవుడ్ ప్రముఖ డైరెక్టర్ చక్ రస్సెల్ ఇకలేరు. 74 సంవత్సరాల వయస్సులో ఆయన అకస్మాత్తుగా కన్నుమూయడం హాలీవుడ్ రంగాన్నే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆయన అభిమానులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది.  కాలిఫోర్నియాలోని తన స్వగృహంలో ఆయన విగతజీవిగా కనిపించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ విషాద ఘటనపై స్థానిక పోలీసులు విచారణ జరుపుతున్నారు. మరణానికి గల ఖచ్చితమైన కారణాలను తెలుసుకునేందుకు దర్యాప్తు వేగవంతం చేశారు. ఒక గొప్ప దర్శకుడిని ఇలా అకస్మాత్తుగా కోల్పోవడం వెండితెరకు తీరని లోటుగా మారింది. చక్ రస్సెల్ దాదాపు 4 దశాబ్దాల  సుదీర్ఘ సినీ ప్రస్థానంలో ఎన్నో మరపురాని, విలక్షణమైన చిత్రాలను ప్రేక్షకులకు అందించారు. హారర్, కామెడీ, హై-వోల్టేజ్ యాక్షన్ జోనర్లలో ఆయన వేసిన ముద్ర చెరగనిది. సినీ ప్రపంచంలో ప్రతి దశాబ్దంలోనూ తనదైన మార్క్ చూపిస్తూ, ప్రేక్షకుల్లో ఉత్కంఠను రేకెత్తించే సీన్లు రూపొందించడంలో ఆయన సిద్ధహస్తుడు. నాలుగు దశాబ్దాల పాటు అనేక బ్లాక్‌బస్టర్ చిత్రాలను తెరకెక్కించి హాలీవుడ్ మేటి దర్శకులలో ఒకరిగా తన స్థానాన్ని పదిలపరుచుకున్నారు. ఆయన దర్శకత్వం వహించిన గొప్ప చిత్రాల జాబితాలో 'ది మాస్క్' (The Mask) అత్యంత ప్రజాదరణ పొందిన సినిమాగా నిలిచింది. కల్ట్ క్లాసిక్ గా మారిన ఈ హారర్ కామెడీ చిత్రం బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులను సృష్టించింది. అలాగే హారర్ ప్రేమికులను విశేషంగా ఆకట్టుకున్న 'ఏ నైట్‌మేర్ ఆన్ ఎల్మ్ స్ట్రీట్ 3: డ్రీమ్ వారియర్స్' (A Nightmare on Elm Street 3: Dream Warriors), 'ది బ్లాబ్' (The Blob) చిత్రాలు ఆయనలోని మేకింగ్ ప్రతిభకు అద్దం పడతాయి. యాక్షన్ డ్రామా విభాగంలో 'ది స్కార్పియన్ కింగ్' (The Scorpion King) చిత్రం ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. కేవలం హాలీవుడ్‌కే పరిమితం కాకుండా, చక్ రస్సెల్ భారతీయ చిత్ర పరిశ్రమతో కూడా ఒక ప్రత్యేకమైన అనుబంధాన్ని ఏర్పరుచుకున్నారు. ఆయన 'ది జంగ్లీ' (The Junglee) అనే బాలీవుడ్ సినిమాను కూడా తెరకెక్కించి, ప్రశంసలు అందుకున్నారు. హాలీవుడ్ సాంకేతికతను, మేకింగ్ ప్రమాణాలను బాలీవుడ్ సినిమాకి అందించి అందరినీ ఆశ్చర్యపరిచారు. 74 ఏళ్ల వయసులో కన్నుమూసిన ఈ దిగ్గజ దర్శకుడు వదిలివెళ్లిన సినిమాలు, ఆయన సృష్టించిన విజువల్ వండర్స్ సినీ చరిత్రలో ఎప్పటికీ చిరస్థాయిగా నిలిచిపోతాయి.     Hollywood Director, Chuck Russell, Passed Away  
కన్నడ రాకింగ్ స్టార్ యశ్ హీరోగా, ప్రతిభావంతురాలైన దర్శకురాలు గీతు మోహన్‌దాస్ అత్యంత భారీ బడ్జెట్‌తో ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిస్తున్న పాన్ ఇండియా మోస్ట్ ఏవైటెడ్ మూవీ 'టాక్సిక్'. 'కేజీఎఫ్' సిరీస్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా సంచలన విజయం సాధించి, ఇండియన్ బాక్సాఫీస్ వద్ద తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ క్రియేట్ చేసుకున్న యశ్ నుంచి వస్తున్న తదుపరి చిత్రం కావడంతో 'టాక్సిక్'పై మొదటి నుంచీ అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. అయితే ఈ సినిమా థియేటర్లలోకి రాకముందే నెట్టింట అనేక విమర్శలు, వివాదాలకు ప్రధాన కేంద్రబిందువుగా మారింది. సినిమా నుంచి మేకర్స్ విడుదల చేసిన ప్రతి ప్రమోషనల్ గ్లింప్స్, టీజర్, పాట సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో సెకన్ల వ్యవధిలోనే వైరల్ అవుతుండటంతో పాటు తీవ్రమైన చర్చలకు కూడా దారితీస్తోంది. ముఖ్యంగా ఈ చిత్రంలో దర్శకురాలు గీతు మోహన్‌దాస్ ప్రదర్శిస్తున్న అత్యంత హింసాత్మక సన్నివేశాలు, బోల్డ్ రొమాంటిక్ విజువల్స్ ప్రేక్షకుల్లో, నెటిజన్లలో భిన్నాభిప్రాయాలను రేకెత్తిస్తున్నాయి. టీజర్ విడుదలైన నాటి నుంచి హాలీవుడ్ స్థాయి వైలెంట్ యాక్షన్ సన్నివేశాలను, అత్యంత కాంట్రవర్షియల్ అడల్ట్ రొమాన్స్‌ను చూపిస్తున్నారంటూ కొందరు నెటిజన్లు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా యశ్ పుట్టినరోజు సందర్భంగా రిలీజ్ చేసిన స్పెషల్ గ్లింప్స్, ఆ తర్వాత వచ్చిన టీజర్‌లోని వైలెన్స్ షాట్లు, అలాగే ప్రముఖ కథానాయిక కియారా అద్వానీతో చిత్రీకరించిన 'తబాహీ' పాటలోని ప్రమోషనల్ అండ్ ఇంటిమేట్ సీన్స్ సోషల్ మీడియా వేదికగా నిత్యం వార్తల్లో నిలుస్తున్నాయి. ఈ ప్రతిష్ఠాత్మక చిత్రంలో యశ్ సరసన నయనతార, కియారా అద్వానీ, తారా సుతారియా, హుమా ఖురేషి, రుక్మిణి వసంత్ వంటి ఐదుగురు అగ్ర కథానాయికలు అత్యంత కీలకమైన పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే ఇద్దరు కథానాయికలకు సంబంధించిన పాటలు విడుదలై ఆకట్టుకోగా, మిగిలిన 3 ప్రమోషనల్ ట్రాక్స్‌పై ఇండస్ట్రీలోనూ, అభిమానుల్లోనూ భారీ ఉత్కంఠ నెలకొంది. ఈ క్రమంలో ఈ సినిమాకు సెన్సార్ బోర్డు నుంచి 'ఎ' సర్టిఫికేట్ లేదా కట్స్ ఎదురయ్యే అవకాశం ఉందంటూ సాగుతున్న ప్రచారానికి చెక్ పెడుతూ చిత్ర నిర్మాత వెంకట్ కె.నారాయణ తాజాగా క్లారిటీ ఇచ్చారు. ఇటీవల 'జన నాయగన్' సినిమా ప్రమోషన్స్ సందర్భంగా మాట్లాడిన ఆయన, 'టాక్సిక్' అనేది ఏ రకమైన రెగ్యులర్ లేదా సాధారణ సినిమా కాదని, ఇది పూర్తిగా పెద్దల కోసం రూపుదిద్దుకున్న ఒక ప్రత్యేకమైన కల్పిత కథ అని స్పష్టం చేశారు. ప్రేక్షకులు కూడా ఈ చిత్రాన్ని అదే కోణంలో, ఆ మైండ్‌సెట్‌తో చూస్తే ఖచ్చితంగా థియేటర్లలో ఒక కొత్త అనుభూతిని పొంది ఆస్వాదిస్తారని ధీమా వ్యక్తం చేశారు. సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదలైన తర్వాత ఖచ్చితంగా ప్రేక్షకులు దీనిని ఒక విశిష్టమైన మరియు భిన్నమైన చిత్రంగా అభినందిస్తారనే పూర్తి నమ్మకాన్ని వెల్లడించారు. ఈ వ్యాఖ్యలతో సినిమాపై నెలకొన్న సెన్సార్ ఆందోళనలు మరింత ఊపందుకున్నాయి. మరి రాబోయే ఆగస్టు 26న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానున్న ఈ పాన్-ఇండియా చిత్రం ఎలాంటి కొత్త రికార్డులను సృష్టిస్తుందో చూడాలి.     Yash, Toxic Movie, Geetu Mohandas Toxic, Kiara Advani 
  గ్లామర్ ప్రపంచం వెనుక ఉండే నల్లటి చీకటి కోణాలు ఎప్పటికప్పుడు బయటపడుతూనే ఉంటాయి. ముఖ్యంగా బాలీవుడ్ సెలబ్రిటీల లైఫ్‌స్టైల్, లేట్ నైట్ పార్టీలు, అక్కడ జరిగే వ్యవహారాల గురించి నిత్యం వార్తలు వస్తుంటాయి. అయితే తాజాగా బుల్లితెర రంగానికి చెందిన ప్రముఖ నటి నారాయణి శాస్త్రి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో తీవ్ర కలకలం రేపుతున్నాయి. హిందీ టెలివిజన్ పరిశ్రమలో ఏళ్ల తరబడిగా పేరుగాంచిన ఆమె, ఒక యూట్యూబ్ ఛానెల్‌కి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో టీవీ ఇండస్ట్రీలో పేరుకుపోయిన డ్రగ్స్ సంస్కృతి గురించి అనేక షాకింగ్ విషయాలను బయటపెట్టారు. ఒకప్పుడు కేవలం వినోదం, డాన్స్‌లు, అల్పాహారాల కోసం మాత్రమే జరిగే పార్టీల రూపురేఖలు కాలక్రమేణా దారుణంగా మారిపోయాయని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. నారాయణి శాస్త్రి వెల్లడించిన కథనం ప్రకారం.. గతంలో ఇండస్ట్రీలో జరిగే గ్రాండ్ పార్టీల్లో మద్యం లేదా ఆల్కహాల్‌కు మాత్రమే ప్రత్యేకంగా బడ్జెట్ కేటాయించేవారు. కానీ ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. పార్టీల నిర్వహణలో అక్రమ మాదకద్రవ్యాలు, సింథటిక్ డ్రగ్స్ కోసం ప్రత్యేకంగా బడ్జెట్ కేటాయిస్తున్నారంటూ అమ్మడు చేసిన వ్యాఖ్యలు పరిశ్రమలో పెద్ద ప్రకంపనలే సృష్టిస్తున్నాయి. ముఖ్యంగా కోకైన్, ఎండీఎంఏ వంటి ప్రాణాంతకమైన డ్రగ్స్ ఈ పార్టీలలో సర్వసాధారణంగా అందుబాటులోకి వస్తున్నాయని ఆమె ఆరోపించారు. పెద్ద పెద్ద వేడుకల్లో ఇవన్నీ రహస్యంగా, గుట్టుచప్పుడు కాకుండా సాగుతుంటే, చిన్నపాటి సన్నిహిత సమావేశాలలో మాత్రం అందరికీ తెలిసేలా బహిరంగంగానే జరుగుతుంటాయని చెప్పారు. తాను స్వయంగా ఈ దారుణ పరిస్థితులను చూసి తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యానని, అందుకే కొన్నేళ్ల కిందటే ఇలాంటి ఇండస్ట్రీ పార్టీలకు వెళ్లడం పూర్తిగా మానేశానని తెలిపారు. తన వ్యక్తిగత అనుభవాల గురించి మాట్లాడిన నారాయణి, ఎవరైనా డ్రింక్స్‌లో ఏదైనా కలిపితే ఆ అనుభూతి ఎలా ఉంటుందో తెలుసుకోవడానికి గతంలో ఒకసారి ఆల్కహాల్‌ను రుచి చూశానని చెప్పారు. అంతేకాకుండా కేవలం ప్రయోగాత్మకంగా, కొత్త విషయాలను అర్థం చేసుకోవడానికి గతంలో కొన్నిసార్లు డ్రగ్స్ పరీక్షించి చూశానని, అయితే వాటికి ఎప్పుడూ బానిస కాలేదని స్పష్టం చేశారు. డ్రగ్స్ అలవాటు వ్యక్తిగత జీవితాలనే కాకుండా వృత్తిపరమైన బాధ్యతలను కూడా తీవ్రంగా దెబ్బతీస్తోందని ఆమె ఉదాహరణలతో వివరించారు. ఈ సంస్కృతి కేవలం నైట్ పార్టీలకే పరిమితం కాకుండా చివరికి షూటింగ్ సెట్లలోకి కూడా ప్రవేశించిందని ఆమె తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. షూటింగ్ సెట్లలో నటీనటులు డ్రగ్స్ ప్రభావంతో సరైన స్పృహలో లేకపోవడం వల్ల పలుమార్లు రాత్రింబవళ్లు ప్లాన్ చేసిన షూటింగ్‌లు సగం లోనే రద్దయిపోయిన సందర్భాలు ఉన్నాయని నారాయణి గుర్తుచేశారు. ఒకసారి ఓ ప్రధాన నటుడు డ్రగ్స్ మత్తులో అసలు నిలబడే స్థితిలో కూడా లేకపోవడంతో, తాను సెట్లో ఏకంగా 4 గంటల పాటు నిరీక్షించాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల వల్ల నిర్మాతలు కోట్లలో ఆర్థిక నష్టాలను ఎదుర్కొంటున్నారని అభిప్రాయపడ్డారు. ప్రధాన పాత్రధారులను హఠాత్తుగా తొలగిస్తే షో టీఆర్‌పీ పడిపోతుందని, సీరియల్ భవిష్యత్తు ప్రమాదంలో పడుతుందనే భయంతో నిర్మాతలు కఠిన చర్యలు తీసుకోలేకపోతున్నారని చెప్పారు. చివరికి చేసేదేమీ లేక నటుల కుటుంబ సభ్యుల సహాయం కోరుతూ షూటింగ్‌లను నెట్టుకొస్తున్నారని నారాయణి శాస్త్రి విమర్శించారు. 'కుసుమ్', 'పియా కా ఘర్', 'క్యూంకీ సాస్ భీ కభీ థీ' వంటి బ్లాక్‌బస్టర్ సీరియల్స్‌తో కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న ఒక సీనియర్ నటి ఇలాంటి నిజాలను బయటపెట్టడంతో టెలివిజన్ వర్గాల్లో తీవ్ర చర్చ జరుగుతోంది.
మలయాళ చిత్రసీమ నుంచి వచ్చే వైవిధ్యమైన కథాంశాలకు, పిరియాడికల్ డ్రామాలకు తెలుగు ప్రేక్షకుల్లో ఎప్పుడూ ఒక ప్రత్యేకమైన ఆదరణ ఉంటుంది. ముఖ్యంగా వైవిధ్యమైన పాత్రలతో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న నటుడు టోవినో థామస్. ఆయన కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం 'పళ్లిచట్టంబి'. ఈ ఏడాది ఏప్రిల్ 15న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం, జులై 24వ తేదీ నుంచి ప్రముఖ ఓటీటీ వేదిక 'సోనీలివ్' లో ఏకంగా 6 భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది. డిజో జోస్ ఆంటోనీ దర్శకత్వం వహించిన ఈ పిరియాడికల్ డ్రామా ప్రేక్షకులను ఏమేరకు మెప్పించిందో, 1950 - 1960ల కాలంనాటి కేరళ నేపథ్యాన్ని ఎలా ఆవిష్కరించిందో వివరంగా తెలుసుకుందాం. ఈ కథ అంతా కేరళలోని 'తరియెట్టమల' అనే పర్వత ప్రాంతం చుట్టూ తిరుగుతుంది. ఆ కొండల చుట్టూ అనేక గిరిజన గూడాలు ఉన్నప్పటికీ, ఎవరూ కూడా ఆ పర్వతం వైపు వెళ్లడానికి సాహసించరు. అది ఒక 'పిశాచి భూమి' అనే తీవ్రమైన భయం అక్కడి ప్రజల మనస్సుల్లో నాటుకుపోయింది. దాంతో ఆ ప్రాంతం గురించి చుట్టుపక్కల గ్రామాల ప్రజలు కథలు కథలుగా చెప్పుకుంటూ ఉంటారు. ఆ పర్వత ప్రాంతాన్ని ఆనుకుని ఉన్న గ్రామే 'కణియార్'. ఆ సమయంలో కేరళలో కమ్యూనిస్టులు అధికారంలోకి రావడంతో, తమ భూములను ప్రభుత్వం లాగేస్తుందేమోననే భయం స్థానిక ప్రజల్లో మొదలవుతుంది. ఆందోళన చెందిన చర్చి ఫాదర్, తమ చర్చి ఆస్తులను, భూములను రక్షించుకోవడం కోసం ఒక భయం లేని బలవంతుడిని, రౌడీయిజం తెలిసిన వ్యక్తిని వెతకడం ప్రారంభిస్తారు. ఈ క్రమంలోనే 'తోమాపురం' నుంచి కృష్ణ పిళ్లై (టోవినో థామస్)ను నెలకు నిర్దిష్ట జీతం ఇస్తామని ఒప్పించి, అతని పేరును 'క్రిస్టఫర్ పోతన్' గా మార్చి కణియార్‌కి తీసుకువస్తారు. ఊరిలో అడుగుపెట్టడమే లోకల్ రౌడీ జార్జ్‌ని ఓడించిన పోతన్, 'పళ్లిచట్టంబి' అంటే చర్చి తరఫున నిలబడే రౌడీగా గుర్తింపు పొందుతాడు. అయితే, వీధి నాటకాల ద్వారా కమ్యూనిజం సిద్ధాంతాలను ప్రచారం చేసే 'రెబెక్కా' (కయాదు లోహర్)తో పోతన్‌కు పరిచయం ఏర్పడుతుంది. ఆమె ఆకర్షణలో పడిన పోతన్, ప్రచారాన్ని అడ్డుకోలేకపోతాడు. అసలు ఈ గొడవల వెనుక ఉన్న అసలు సూత్రధారి ఎవరు, డబ్బు కోసం వచ్చిన పోతన్ తన ప్రేమికురాలి ఆశయం కోసం ఎలా మారాడు అనేది కథలోని మిగతా భాగం. సాంకేతికంగా చూస్తే, 1950 - 60ల కాలంనాటి వాతావరణాన్ని విజువల్‌గా ఆవిష్కరించడంలో సినిమా విజయం సాధించింది. జేక్స్ బిజోయ్ అందించిన నేపథ్య సంగీతం, 'ఇన్నినాళ్లు చూడలేదులే' అనే మెలోడీ పాట కథలోని ఎమోషన్ ని నిలబెట్టాయి. టిజో టోమీ సినిమాటోగ్రఫీ, శ్రీజిత్ సారంగ్ కూర్పు సినిమాకు బలాన్నిచ్చాయి. టోవినో థామస్ నటన, కయాదు లోహర్ అందం ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. యథార్థ సంఘటనల ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రానికి ఐదుకి 2.50 రేటింగ్ లభించింది. నిదానంగా సాగే కథనం ఉన్నప్పటికీ, చారిత్రక సామాజిక పరిస్థితులను ఆస్వాదించే ఓటీటీ ప్రేక్షకులకు ఇది ఒక మంచి ఆప్షన్‌గా నిలుస్తుంది.   Pallichattambi, Tovino Thomas 
    ప్రెజెంట్ కిరణ్ అబ్బవరం( Kiran Abbavaram),శ్రీ గౌరీ ప్రియ(Sri Gouri Priya),చెన్నై లవ్ స్టోరీ'(Chennai Love Story)తో థియేటర్స్ లో సందడి చేస్తున్నారు. 'బేబీ' వంటి కల్ట్ బ్లాక్‌బస్టర్ అందించిన దర్శకుడు సాయి రాజేష్ కథ, స్క్రీన్‌ప్లే అందించడంతో పాటు ఎస్‌కేఎన్, ధీరజ్ మొగిలినేనితో కలిసి ఈ చిత్రాన్ని నిర్మించారు. సీనియర్ రచయిత రవి నంబూరి దర్శకుడిగా పరిచయం అయ్యాడు. సంగీత బ్రహ్మ మణిశర్మ అందించిన స్వరాలు, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్  విడుదలకు ముందే భారీ అంచనాలని  పెంచేశాయి.   దీంతో ఈ రోజు థియేటర్స్ లో అడుగుపెట్టిన చెన్నై లవ్ స్టోరీ కి అభిమానులతో పాటు సినీ ప్రేమికులు కూడా భారీగానే పోటెత్తారు. నిన్న నైట్ ప్రీమియర్స్ నుంచే హంగామా మొదలైంది.  ఈ నేపథ్యంలొ బాక్సాఫీస్ వద్ద హిట్ అయ్యిందా లేక యావరేజ్/ఫ్లాప్ టాక్ తెచ్చుకుందా అనే పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.  కథ విషయానికి వస్తే, 3 ఏళ్ల పాటు ఒకరినొకరు ప్రేమించుకుని పెళ్లి పీటలు ఎక్కే సమయంలో కథానాయిక నివేదిత అలియాస్ నివి (శ్రీ గౌరీ ప్రియ)కి ఆమె ప్రియుడు అజయ్ (త్రిగుణ్) హ్యాండ్ ఇస్తాడు. వేరే అమ్మాయిని ప్రేమించానని చెప్పి బ్రేకప్ చెప్తాడు. తీవ్రమైన డిప్రెషన్‌కి గురైన నివి, బ్రేకప్ బాధ తట్టుకోలేక మందుకి బానిసవుతుంది. ఆమెను ఆ బాధ నుంచి బయటపడేసేందుకు స్నేహితులు చెన్నై తీసుకువెళ్తారు. అదే సమయంలో చెన్నైలో సినీ దర్శకుడు కావాలని ప్రయత్నిస్తున్న స్టీవెన్ శంకర్ (కిరణ్ అబ్బవరం) పరిచయమవుతాడు. స్టీవెన్ తింగరి పనులు, అతని ప్యాషన్ చూసి నివి నెమ్మదిగా సాధారణ స్థితికి వస్తుంది. అతనికి ఒక అవకాశాన్ని ఇప్పించడంతో పాటు, మళ్లీ అతని ప్రేమలో పడుతుంది. వీరిద్దరూ పెళ్లి చేసుకోవాలని ఫిక్స్ అయిన సమయంలో కథ ఒక అనూహ్యమైన మలుపు తిరుగుతుంది. Also read: ఈ వీకెండ్ మిస్ అవ్వకండి.. 25 సినిమాలు మీ కోసమే  మూవీకి అయితే థియేటర్ల వద్ద,సోషల్ మీడియాలో మిశ్రమ స్పందన లభిస్తోంది. మొదటి భాగం సరదా సన్నివేశాలు, మంచి ఫీల్ గుడ్ ఎమోషన్స్, మణిశర్మ అందించిన పాటలతో చాలా వేగంగా సాగిపోతుంది. ముఖ్యంగా ఇంటర్వెల్ లో ఇచ్చే ట్విస్ట్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. కథానాయికగా శ్రీ గౌరీ ప్రియ తన అద్భుతమైన నటనతో ఆకట్టుకోగా, కిరణ్ అబ్బవరం తన పరిధి మేరకు చక్కగా నటించాడు.  మణిశర్మ నేపథ్య సంగీతం సినిమాకి ప్రధాన బలంగా నిలిచింది.  అయితే, సెకండ్ హాఫ్ ప్రారంభమైన తర్వాత దర్శకుడు తీసుకున్న కథన విధానం కొంతవరకు ప్రేక్షకుల సహనానికి పరీక్షగా మారింది. 'ఎందుకంటే ప్రేమంట' వంటి సినిమాలను గుర్తుచేసే లాజిక్ లేని మ్యాజిక్ ఎలిమెంట్స్, సాగదీసినట్టు ఉండే సన్నివేశాలు సెకండ్ హాఫ్‌లోని ఎమోషన్‌ దెబ్బతీశాయని కొంత మంది మీడియా సముఖంగా చెప్తున్నారు.  దీంతో యావరేజ్ చిత్రంగా మిగలవచ్చనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. అదే టైంలో లవ్ స్టోరీస్, ఎమోషనల్ డ్రామాలని ఇష్టపడే వారు మాత్రం మూవీ చాలా బాగుందని చెప్తూ, మూవీ చూసి కన్నీళ్లు కూడా పెట్టుకుంటున్నారు. ఏది ఏమైనా ఈ రోజు తొలి రోజు కాబట్టి కన్ఫ్యూజ్ తో కూడిన టాక్ వస్తుంది. రేపు ఎలాంటి టాక్  వస్తుందో చూడాలి. chennai love story, kiran abbavaram, sri Gouri Priya, tollywood
  వాతావరణం చేంజ్ అయినా నాలో మాత్రం ఎలాంటి చేంజ్ లేదు, అంతకంత సినీ వినోదాన్ని అందివ్వడానికి ఓటిటి వేదిక డిజిటల్ వినోదాల పండుగలా మారబోతోంది. థియేటర్లలో విడుదలైన కొన్ని వారాల్లోనే ఓటీటీలోకి వస్తున్న బ్లాక్‌బస్టర్ సినిమాలు ఒకవైపు, వైవిధ్యమైన కథాంశాలతో ఉక్కిరిబిక్కిరి చేసే థ్రిల్లర్ సిరీస్‌లు మరొకవైపు డిజిటల్ వేదికలపై సందడి చేయడానికి సిద్ధమయ్యాయి. అమెజాన్ ప్రైమ్ వీడియో, నెట్‌ఫ్లిక్స్, సోనీలివ్, ఈటీవీ విన్ వంటి దిగ్గజ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లలో ఏకంగా 25ki పైగా కొత్త సినిమాలు వెబ్ సిరీస్‌లు వివిధ భాషల్లో స్ట్రీమింగ్ అవుతూ ప్రేక్షకులని విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. వీకెండ్‌లో ఇంటి పట్టునే ఉండి రిలాక్స్ అవ్వాలనుకునే సినిమా ప్రేమికులకు ఇది నిజంగానే ఒక అద్భుతమైన అవకాశం అని చెప్పవచ్చు. ఈ వారం ఓటీటీలో అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్న చిత్రాల్లో 'నాగబంధం' అగ్రస్థానంలో నిలుస్తోంది. విరాట్ కర్ణ కథానాయకుడిగా, నభా నటేష్, ఐశ్వర్య మేనన్ కథానాయికలుగా నటించిన ఈ పాన్-ఇండియా యాక్షన్ అడ్వెంచర్ మూవీకి అభిషేక్ నామా దర్శకత్వం వహించారు. జులై 3న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం, కేవలం నెల రోజుల వ్యవధిలోనే ప్రముఖ డిజిటల్ ప్లాట్‌ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో వేదికగా అందుబాటులోకి రావడం విశేషం. పురాతన నిధుల రహస్యాలు, నాగబంధం సంప్రదాయాలతో నిండిన ఈ విజువల్ వండర్ తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ప్రేక్షకుల ముందుకు వచ్చి రికార్డు స్థాయి వ్యూస్‌తో దూసుకుపోతోంది. ఇక పోలీస్ డ్రామాలు, క్రైమ్ థ్రిల్లర్ సినిమాలను ఇష్టపడే వీక్షకులకు ఈటీవీ విన్ (ETV Win) వేదిక సరికొత్త అనుభూతిని అందిస్తోంది. దేవి ప్రసాద్ శెట్టి దర్శకత్వంలో రూపుదిద్దుకున్న కన్నడ సూపర్ హిట్ థ్రిల్లర్ 'కేస్ ఆఫ్ కొండాన' ఇప్పుడు తెలుగులో అందుబాటులోకి వచ్చింది. విజయ్ రాఘవేంద్ర, భావన మేనన్ కీలక పాత్రల్లో జీవించిన ఈ సినిమా కథాంశం ఎంతో ఉత్కంఠభరితంగా సాగుతుంది. తెలియక చేసిన ఒక చిన్న పొరపాటును కప్పిపుచ్చుకునేందుకు చేసే వరుస తప్పులు మనిషి జీవితాన్ని ఎంతటి ముప్పులోకి నెడతాయో ఈ చిత్రంలో అత్యంత ప్రతిభావంతంగా చూపించారు. మలయాళ చిత్ర పరిశ్రమ నుంచి వచ్చిన మరో అద్భుతమైన కథా చిత్రం 'పళ్లిచట్టంబి'. కేరళలో జరిగిన వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రంలో టొవినో థామస్, కయాదు లోహర్ జంటగా నటించారు. డిజో జోస్ ఆంటోని నిర్దేశత్వంలో వచ్చిన ఈ యాక్షన్ డ్రామాలో పృథ్వీరాజ్ సుకుమారన్ ఒక కీలక పాత్రలో మెరిశారు. థియేటర్లలో విశేష ఆదరణ పొందిన ఈ సినిమా ప్రస్తుతం సోనీలివ్ (Sony LIV) లో మలయాళంతో పాటు తెలుగు వర్షన్‌లోనూ స్ట్రీమింగ్ అవుతూ సినీ విమర్శకుల ప్రశంసలు అందుకుంటోంది. మరోవైపు గ్లోబల్ ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ ప్రేక్షకుల కోసం హిందీ మరియు తెలుగు భాషల్లో 'ముసాఫిర్ కెఫే' అనే డిఫరెంట్ ఎంటర్‌టైనర్‌ను అందుబాటులోకి తెచ్చింది. విక్రాంత్ మాస్సే, వేదికా పింటో, మహిమా మక్వానా ముఖ్య పాత్రలు పోషించిన ఈ సిరీస్‌ను రుచిర్ అరుణ్ తెరకెక్కించారు. టెరిబ్లీ టైనీ టేల్స్ సంస్థ నిర్మించిన ఈ డ్రామా యూత్‌ను విపరీతంగా ఆకట్టుకుంటోంది. దీనితో పాటు అమెజాన్ ప్రైమ్ వీడియోలో పవన్ కల్యాణ్, సప్తగిరి, రాజ్‌కుమార్ కసిరెడ్డి ముఖ్య పాత్రల్లో రూపుదిద్దుకున్న 'పురుషః' చిత్రం మరియు హిందీ కామెడీ సిరీస్ 'ఆదర్శ బాల విద్యాలయ' కూడా వీక్షకులను అలరిస్తున్నాయి. Also read: పవన్ కళ్యాణ్, బాలకృష్ణ, విజయ్ పై బాబీ డియోల్ షాకింగ్ కామెంట్స్  వీటితో పాటు అంతర్జాతీయ కంటెంట్ ఇష్టపడే వారి కోసం నెట్‌ఫ్లిక్స్‌లో 'ఎలైట్ ఫోర్స్', 'ద డెట్ కలెక్టర్', '1941', '72 అవర్స్' వంటి 8కి పైగా ఇంగ్లీష్, తమిళ చిత్రాలు అందుబాటులో ఉన్నాయి. అమెజాన్ ప్రైమ్‌లో 'ఇగో రమణ్', 'అనోమి' వంటి ప్రాంతీయ భాషా చిత్రాలతో పాటు సబ్‌స్క్రైబర్లను మైమరిపించేందుకు దాదాపు 25కు పైగా విభిన్న రకాల ఆప్షన్లు సిద్ధంగా ఉన్నాయి. ఈ శని, ఆదివారాల్లో మీకు నచ్చిన జానర్ కథలను ఎంచుకుని డిజిటల్ వినోదాన్ని ఆస్వాదించండి! naga bandham, ott movies, anomi, elite force
నారా రోహిత్ తన వైవిధ్యమైన కథా ఎంపికలతో ప్రేక్షకుల్లో ఎప్పుడూ ప్రత్యేక స్థానాన్ని నిలబెట్టుకుంటారు. విభిన్నమైన పాత్రలతో మెప్పించే ఆయన, ఈసారి మరొక సరికొత్త కాన్సెప్ట్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. నారా రోహిత్ హీరోగా నటిస్తున్న ఈ నూతన చిత్రాన్ని దర్శకుడు రామ్ గన్ని తెరకెక్కిస్తున్నారు. పోలీస్ బ్యాక్‌డ్రాప్ కి సైకలాజికల్ హారర్ థ్రిల్లర్ అంశాలను జోడించి రూపొందిస్తున్న ఈ ప్రాజెక్ట్ ప్రస్తుతం టాలీవుడ్ వర్గాల్లో భారీ ఆసక్తిని రేకెత్తిస్తోంది.  శప్త అశ్వ మీడియా వర్క్స్ పతాకంపై కళ్యాణ చక్రవర్తి మంథెన, భాను కిరణ్ ప్రతాప ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా, విజయ్ కృష్ణ లింగమనేని ఈ సినిమాకు సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు. ఇక ఈ ఉత్కంఠభరితమైన హారర్ కథలో నారా రోహిత్ సరసన అందాల నటి హన్సిక మోత్వాని హీరోయిన్ గా నటిస్తోంది. నారా రోహిత్ పుట్టినరోజును పురస్కరించుకుని ఈ సినిమాకు సంబంధించిన బిగ్ అప్‌డేట్‌ను చిత్రబృందం అధికారికంగా విడుదల చేసింది. సినిమా టైటిల్ తో పాటు అత్యంత భయానకంగా, ఆకట్టుకునేలా ఉన్న ఫస్ట్ లుక్ పోస్టర్‌ను మేకర్స్ అన్వీల్ చేశారు.  ఈ చిత్రానికి 'కపాలీ' అనే పవర్ ఫుల్ టైటిల్‌ను ఖరారు చేశారు. 'కపాలీ' అంటే పుర్రెను ధరించినవాడు అని అర్థం వస్తుంది. ఈ ఆధ్యాత్మిక, తాంత్రిక నేపథ్యం ఉన్న పేరుకు తగ్గట్టుగానే ఫస్ట్ లుక్ పోస్టర్ డిజైన్ కూడా ఉత్కంఠభరితంగా, భయం గొలిపే విధంగా రూపొందించబడింది. టైటిల్ లోని గూఢమైన అర్థాన్ని పోస్టర్ విజువల్స్ పర్ఫెక్ట్‌గా ప్రతిబింబిస్తున్నాయి. దీనికి తోడు 'ఏ జర్నీ ఇంటో ది అన్నోన్' (తెలియని ప్రపంచంలోకి ఒక ప్రయాణం) అనే ట్యాగ్‌లైన్ సినిమాలోని మిస్టరీ స్థాయిని మరింత పెంచుతోంది. మొత్తం మీద, ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ అత్యంత గ్రిప్పింగ్‌గా ఉంటూ ప్రేక్షకులలో విపరీతమైన క్యూరియాసిటీని కలిగిస్తోంది. మేకర్స్ త్వరలోనే ఈ చిత్రంలో నటించే ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను అధికారికంగా ప్రకటించనున్నారు.   Nara Rohith, Kapaali Movie, Hansika Motwani  
The makers of Nenu Ready have unveiled the film's latest single, Konchem Konchem Kothaga, offering a glimpse into the romantic side of the Havish-starrer. After the teaser and earlier promotional material generated interest, the new track shifts focus to the chemistry between the lead pair and presents a bold yet aesthetically shot romantic number. Composed by Mickey J. Meyer, the song is sung by Sameera Bharadwaj, while Ramajogayya Sastry has penned the lyrics. The track revolves around two lovers embracing their growing intimacy, with the music and lyrics complementing the mood without crossing into overtly provocative territory. Mickey's melody keeps the composition soft and melodious, making it an easy listen despite its sensual theme. Havish and Kavya Thapar share impressive on-screen chemistry, with the visuals capturing their romance in a stylish and artistic manner. Director Trinadha Rao Nakkina, known primarily for commercial entertainers, appears to have opted for a more restrained and visually elegant approach while picturising the song. The choreography and cinematography further add to the song's polished appeal. Adding to the excitement is Nargis Fakhri, who makes a special appearance in the film. Her presence in the song has become another talking point among viewers, hinting at an interesting role in the narrative. Produced by Kanchana Koneru, Nenu Ready is currently in the final stages of post-production. With its youthful vibe, polished visuals and music-driven promotions, the film is steadily building anticipation ahead of its release, the date for which is expected to be announced soon. Disclaimer: This article is based on discussions and information shared across publicly available sources and social media. Interpretations remain those of the users involved. Readers are encouraged to exercise discretion before drawing conclusions.
విజయ్ ఆంటోనీ పుట్టినరోజు సందర్భంగా ఆయన రీసెంట్‌గా నటించిన ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ 'వంద దేవుళ్ళు' ఆగస్టులో తమ ప్లాట్‌ఫామ్‌లో ఓటీటీ ప్రీమియర్ కానుందని ZEE5 తెలుగు ప్రకటించింది. అధికారిక స్ట్రీమింగ్ తేదీని త్వరలో ప్రకటించనున్నారు.  ఇటీవల విడుదలైన 'పరిమళ & కో' ఫ్యామిలీ ఆడియెన్స్‌ని ఆకట్టుకుంది. జయరామ్, ఊర్వశి నటించిన ఈ చిత్రంలో కామెడీ, ఫ్యామిలీ ఎమోషన్స్ అన్ని రకాల అంశాలు పుష్కలంగా ఉన్నాయి. ఇప్పుడు ZEE5 తెలుగు ఈ విజయ పరంపరను కొనసాగించేందుకు 'వంద దేవుళ్ళు'తో ముందుకు వస్తోంది. ఇది ఫ్యామిలీ అంతటినీ ఒకచోట చేర్చే సామర్థ్యం ఉన్న చిత్రం. ఈ మూవీలోని భావోద్వేగాలు పూర్తిగా భిన్నమైనవి. నిజ సంఘటనల ఆధారంగా రూపొందిన 'వంద దేవుళ్ళు' చిత్రం వింతతువు, ఆమె ఇద్దరి కొడుకుల చుట్టూ తిరుగుతుంది. మధ్య వయస్సుకి వచ్చిన అమ్మని మళ్లీ పెళ్లి చేయాలని కొడుకు అనుకోవడం, ఆ తల్లి సైతం తోడును వెతుక్కోవాలని ఆలోచించినప్పుడు, ఆమె నిర్ణయం బంధువులు, గ్రామస్తులు, మొత్తం సమాజం నుండి ప్రతిఘటనను ఎదుర్కొంటుంది. తల్లి, కొడుకుల మధ్య ఉండే అందమైన బంధమే ఈ కథకు ప్రధాన ఆకర్షణ. ఒక తల్లి తన జీవితాంతం చేసే లెక్కలేనన్ని త్యాగాలను హైలైట్ చేస్తుంది ఈ చిత్రం. ఒక కొడుకు తన తల్లి కష్టాలను, త్యాగాలను చూసి, గుర్తించడమే కాకుండా, సామాజిక విమర్శలను ఎదుర్కొని కూడా తన సంతోషాన్ని తనే ఎంచుకునేలా ఆమెను ప్రోత్సహించడం ఈ మూవీలోని కోర్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. తల్లీకొడుకుల అద్భుతమైన బంధాన్ని తెరపై అంతే అద్బుతంగా చూపించారు.   Vijay Antony, Vanda Devullu, OTT Update, ZEE5  
  పాన్ ఇండియా సెల్యులాయిడ్ పై బాబీ డియోల్( దూసుకుపోతున్న విషయం తెలిసిందే. ఒకప్పటి హీరో కూడా అయిన బాబీ డియోల్ ప్రస్తుతం తన సెకండ్ ఇన్నింగ్స్‌లో విలక్షణమైన, అత్యంత పవర్‌ఫుల్ నెగిటివ్ రోల్స్ చేస్తూ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలోనే అత్యంత బిజీ నటుడిగా మారిపోయాడు. ప్రెజెంట్ నిన్న విడుదలైన జన నాయకుడుతో సందడి చేస్తున్నాడు. రీసెంట్ గా ఒక  ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు  వైరల్ అవుతున్నాయి. ఆయన మాట్లాడుతు 'నేను దక్షిణాదిలో ఏ అగ్ర నటుడితో కలసి పనిచేసినా, వాళ్లంతా ఆ తర్వాత పొలిటికల్ గా పవర్ సీట్లలో కూర్చుంటున్నారు. మంత్రులు, డిప్యూటీ సీఎంలు, సీఎంలు అవుతున్నారు! ఇది నిజంగా చాలా విచిత్రమైన, అత్యంత సరదాగా అనిపించే యాదృచ్ఛిక విషయం. నందమూరి బాలకృష్ణతో కలిసి 'డాకు మహారాజ్' లో  బలవంత్ సింగ్ ఠాకూర్ అనే పవర్‌ఫుల్ రోల్ లో చేశాను. ఆయన ఇప్పటికే రాజకీయాల్లో ఎంతో చురుగ్గా ఉంటూ ఇటీవలి శాసనసభ ఎన్నికల్లో ఘనవిజయం సాధించి హ్యాట్రిక్ విజయాన్ని నమోదు చేసారు. పవన్ కళ్యాణ్ తో  'హరిహర వీరమల్లు' లో  ఔరంగజేబు క్యారక్టర్  పోషించాను. ఈ ప్రాజెక్ట్ సమయంలోనే పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉపముఖ్యమంత్రిగా (డిప్యూటీ సీఎం) బాధ్యతలు స్వీకరించారు. ఇప్పుడు 'జన నాయగన్' లో విజయ్ తో చేశాను. సీఎం అయ్యారని బాబీ డియోల్  చెప్పుకొచ్చాడు.  Also read: సినిమాగా తెరకెక్కకుండా 30 లక్షలు సంపాదించిన కథ.. ఆ రైటర్ ఎవరో తెలుసా!  
భారతీయ కుటుంబాలలో అత్తాకోడళ్ల మధ్య సంబంధాన్ని చాలా ప్రత్యేకమైనదిగా భావిస్తారు. ఈ బంధం ప్రేమ, ఒకరికొకరు సహకారంగా ఉండటం, ఒకరినొకరు గౌరవించుకోవడం వంటి అంశాలపై ఆధారపడి ఉంటుంది. అయితే అత్త తరం వేరు, కోడలి తరం వేరు..  కొన్నిసార్లు తరాల మధ్య అభిప్రాయ భేదాలు లేదా ఆలోచనా విధానాలలో తేడాలు ఉంటాయి. ఈ తేడాలు విభేదాలకు దారితీయవచ్చు. దీని వల్ల ప్రతి కోడలికి తన మనసులో ఒక ప్రశ్న ఉండిపోతుంది. అత్తగారు చెప్పే ప్రతి విషయాన్ని కోడలు వినాలా? అత్త చెప్పిన ప్రతి విషయాన్ని కోడలు అంగీకరించాల్సిందేనా?  అని.  అయితే దీనికి సమాధానం అంత సులభమైనది కూడా కాదు.  దీని గురించి లైఫ్ స్టైల్ నిపుణులు వివరణ ఇస్తున్నారు.  ప్రతి కోడలు తెలుసుకోవలసిన ఈ విషయం గురించి తెలుసుకుంటే.. సెల్ఫ్ రెస్పెక్ట్.. ప్రవర్తన.. కొందరు అత్తలు చాలా దురుసుగా ఉంటారు.   దుర్భాషలాడటం, ఎగతాళి చేసి మాట్లాడటం, అందరి ముందు కోడలిని  అవమానించడం వంటివి చేస్తుంటారు. ఇలాంటివి ఎప్పుడూ  ఎదుర్కొంటున్నట్లయితే కోడలు  మౌనంగా ఉండవలసిన అవసరం లేదు. ఇలాంటి పరిస్థితులలో మొదట  ప్రశాంతంగా మాట్లాడి, సరిగ్గా మాట్లాడమని, సరిగ్గా ప్రవర్తించమని అడగడం మంచిది. అత్తాకోడళ్ల బంధం బాగుండాలంటే.. రెండు వైపులా గౌరవం చాలా ముఖ్యం. ఆరోగ్య సంబంధ విషయాలు..  అత్తల తరానికి,  ఇప్పటి కోడళ్ల తరానికి చాలా తేడాలు ఉన్నాయి.  వారి జీవనశైలి,  ఆహారం వంటి విషయాలు ఇప్పట్లో లేవు.  ఈ కారణంగా ఇప్పటి అమ్మాయిలలో అనారోగ్యం కనిపిస్తూ ఉంటుంది.  ఏదైనా అనారోగ్యానికి చికిత్స, మందులు, విశ్రాంతి తీసుకోవడం, గర్భం దాల్చడం, మానసిక ఆరోగ్యం లేదా మరే ఇతర వైద్య సలహాలలో అయినా అత్తలు ఎప్పుడూ కోడళ్లను నిర్ల7్యంగా మాట్లాడకూడదు.  మేము ఇంత పని చేసుకునేవాళ్లం, మాకేమీ సమస్య ఉండేది కాదు అనడం,  పని తప్పించుకోవడానికి అనారోగ్యం అని చెబుతున్నావని నిందించడం చాలా మంది అత్తగార్లు చేస్తారు. కోడళ్లు  అత్తగారి మాటల కంటే డాక్టర్ సలహాకు ప్రాధాన్యత ఇవ్వడం మంచిది. ఆరోగ్య నిర్ణయాలు కేవలం కుటుంబ ఒత్తిడి మీద కాకుండా, వాస్తవాలు , నిపుణుల సలహా ఆధారంగా తీసుకోవాలి. విద్య, ఉద్యోగం.. నేటికాలంలో అమ్మాయిలు అబ్బాయిలకేమీ తీసిపోకుండా బాగా చదువుతున్నారు, ఉద్యోగాలు తెచ్చుకుంటున్నారు.  ఉద్యోగం , ఆర్థిక స్వాతంత్య్రానికి  సంబంధించి నిర్ణయాలు తీసుకునే హక్కు ప్రతి కోడలికి ఉంటుంది.  కుటుంబ అంచనాలకు,  వృత్తిపరమైన లక్ష్యాలకు మధ్య పొంతన కుదరకపోతే ఓపెన్ గా ఇంట్లో డిస్కస్ చేసి  అందరికి నచ్చే విధంగా నిర్ణయం తీసుకోవడం మంచిది. అంతేకానీ అత్తగారు చేప్పారు అని ఉద్యోగాలు వదిలేయడం, ఇంటికే పరిమితం కావడం వంటివి చేయాల్సిన అవసరం లేదు.  ఏకపక్ష ఒత్తిడితో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడం భవిష్యత్తులో మనస్పర్థలకు దారితీయవచ్చు.అంతేకాదు.. భవిష్యత్తులో ఆర్థిక సమస్యలకు కూడా కారణం కావచ్చు. వ్యక్తిగత హద్దులు.. ప్రతి ఒక్కరికీ వ్యక్తిగత సమయం, వ్యక్తిగత స్వేచ్ఛ , వ్యక్తిగత నిర్ణయాలు తీసుకునే హక్కు ఉంటుంది.  వ్యక్తిగత హద్దులను పదేపదే ఉల్లంఘించినా లేదా ప్రతి నిర్ణయంలో అనవసరమైన జోక్యం ఉన్నా,  హద్దులను మర్యాదగా తెలియజేయడం మంచిది. ఇది అపార్థాలు, గొడవలు ఎక్కువ దూరం వెళ్లకుండా చేస్తుంది.  కొందరు అత్తలు కోడళ్లకు ఎలాంటి పర్సనల్ స్పేస్ ఉండకూడదని, వారికి పర్సనల్ అంటూ ఏమీ అవసరం లేదని వాదిస్తారు.  కానీ కోడళ్లకు పర్సనల్ స్పేట్ ఉండటం వల్ల కుటుంబం అంతా సంతోషంగా ఉండగలుగుతుంది.   ప్రొటెక్షన్,  లీగల్ రైట్స్.. ఆడపిల్ల  భద్రతకు, చట్టపరమైన హక్కులకు, లేదా నైతిక విలువలకు భంగం కలిగించే పని చేయమని అత్తగారు కోడలిని అడిగితే, దానికి తలొగ్గడం మంచిది కాదు. అలాంటి పరిస్థితిలో జీవిత భాగస్వామిని, నమ్మకమైన కుటుంబ సభ్యుడిని, లేదా అవసరమైతే చట్టపరమైన సహాయాన్ని తీసుకోవడం మంచిది.                                       *రూపశ్రీ.  
విజయం ప్రతి వ్యక్తి జీవితంలో ఒక లక్ష్యంగా ఉంటుంది.  చదువు, ఉద్యోగం, వ్యాపారం.. ఇలా ప్రతి విషయంలో ఒక లక్ష్యం పెట్టుకుని,  దాన్ని సాధించి,  విజయ బావుటా ఎగరవేయాలని అనుకుంటారు చాలా మంది. అయితే.. విజయం సాధించడానికి కష్టపడితే సరిపోతుందని  తెలివి ఉంటే చాలని అనుకుంటారు అందరూ. కానీ విజయం సాధించడానికి తెలివి తేటలు, కష్టపడే తత్వం ఉన్నా.. కొన్ని అలవాట్లు మాత్రం వారికి విజయాన్ని దూరంగానే ఉంచుతాయి.  కొన్ని అలవాట్లు ఉన్న వ్యక్తి జీవితంలో ఎప్పటికీ విజయం సాధించలేడని సాక్షత్తు ఆచార్య చాణక్యుడే చెబుతాడు.  ఒక వ్యక్తిని విజయం సాధించకుండా చేసే ఆ అలవాట్లు ఏమిటో తెలుసుకుంటే.. సోమరితనం.. కష్టపడే వ్యక్తులలో సోమరితనం ఉంటుందా అని చాలా మంది ఆశ్చర్యపోతారు. కానీ ఇది నిజం.. కష్టపడే వ్యక్తులలో ఎంతో కొంత సోమరితనం కనిపిస్తూ ఉంటుంది.  అయితే ఏదో ఒక సందర్బంలో ఈ సోమరితనం వారిని దెబ్బతీస్తుంది.  కీలకమైన సందర్బంలో ఏ విషయాన్ని అయినా లైట్ తీసుకుంటే లేదా పనిని నిర్లక్ష్యం చేస్తే.. చేతుల దాకా వచ్చిన విజయం కూడా చేజారిపోతుంది.  అందుకే.. ఏ కొద్దిపాటి సోమరితనం ఉన్నా,  దాన్ని వదిలిపెట్టడం మంచిది. పట్టుదల.. పట్టుదల ఏ పనిలో అయినా ముందుకు సాగడానికి,  పనిని పూర్తీ చేయడానికి ప్రేరణ ఇస్తుంది. కానీ చాలామంది ఏదైనా పనిని మొదలు పెట్టినప్పుడు చాలా సీరియస్ గా ప్రారంభించి కష్టపడతారు.. ఆ తరువాత మాత్రం తమ పట్టుదలను తగ్గిస్తారు.  దీని వల్ల దక్కాల్సిన విజయం చెయ్యి జారిపోతుంది. ప్రవర్తన.. మనిషి ప్రవర్తన కూడా వారు పనితీరుపై ప్రభావం చూపిస్తుంది. చాలామంది ఇతరులతో అమర్యాదగా ప్రవర్తిస్తుంటారు. ఇలాంటి వ్యక్తులను చుట్టుప్రక్కల వారు, సమాజం ఎప్పటికీ ఇష్టపడదు, వారికి గౌరవం ఇవ్వదు,  వారు చేసే పనులలో తోడ్పాటు, వారు చేసే పనులకు గౌరవం కూడా ఇవ్వదు. ఇలాంటి వ్యక్తిత్వం ఉన్నవారు తమ పనుల విషయంలో కూడా నెగెటివ్ ఫలితాలు పొందుతారు.                                   *రూపశ్రీ.
సల్వార్ సూట్‌లు భారతీయ మహిళలు చాలా ఇష్టపడే  సాంప్రదాయ వస్త్రాలలో ఒకటి. మారుతున్న ఫ్యాషన్ కు అనుగుణంగా సల్వార్ సూట్‌లను ధరించే విధానం కూడా చాలా మారింది. ఒకప్పుడు కేవలం పండుగలు,  పెళ్లిళ్లు, శుభకార్యాలు వంటి సమయాల్లో మాత్రమే ధరించినప్పటికీ, నేటికాలంలో మహిళలు ఆఫీస్, పార్టీలు, పండుగలు, నార్మల్ టూర్స్ వంటి వాటికి కూడా సల్వార్ సూట్ లు ధరించడానికి ఇష్టపడతారు.  అయితే ఇప్పట్లో సల్వార్ సూట్ అనేది ఓల్డ్ ఫ్యాషన్ లోకి మారింది. నేటికాలంలో మరింత ఫ్యాషన్ గా ఉన్న దుస్తులు రావడంతో సల్వార్ సూట్ కూడా సాధారణ దుస్తుల్లా మారిపోయింది.  కానీ సల్వార్ సూట్ ను కూడా ఫ్యాషన్ గా ధరిస్తే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా ఉండొచ్చు.  అందుకోసం సల్వార్ సూట్ ను ఎలా ధరించాలి?  తెలుసుకుంటే.. సల్వార్ సూట్ స్టైల్ గా ఉండాలంటే పాటించాల్సిన చిట్కాలు.. సరైన ఫిట్టింగ్..  సరైన ఫిట్‌తో సూట్‌ను ఎంచుకోండి. సల్వార్ సూట్ స్టైలిష్‌గా, ఆకర్షణీయంగా కనిపించాలంటే, దాని ఫిట్టింగ్‌పై శ్రద్ధ పెట్టడం ముఖ్యం. చక్కగా సరిపోయే సూట్  చక్కగా కనిపించేలా చేస్తుంది, అలాగే చాలా ఆత్మవిశ్వాసాన్ని కూడా పెంచుతుంది.  మరీ వదులుగా ఉండే సూట్ ధరించడం వల్ల దుస్తుల షేప్  పాడవుతుంది, అదే సమయంలో మరీ బిగుతుగా ఉండే సూట్ ఎబ్బెట్టుగా కనిపించేలా చేస్తుంది. అందుకే ఫిట్టింగ్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. దుప్పట్టా.. సల్వార్ సూట్‌లో దుపట్టా చాలా ముఖ్యమైనది.  ఇది మొత్తం రూపాన్ని డిఫరెంట్ గా మార్చేసే కెపాసిటీ కలిగి ఉంటుంది. అంతేకాదు.. దుపట్టాను ధరించే విధానాన్ని మార్చడం ద్వారా ఒకే సూట్‌ను చాలా విధాలుగా దరించవచ్చు. దుప్పట్టాను  ఒక భుజంపై ఓపెన్ గా  వేసుకోవచ్చు, ముందు వైపు కుచ్చులతో ధరించవచ్చు, లేదా బెల్ట్‌తో కొత్త టచ్ ఇవ్వవచ్చు.   ఫ్యాషన్ జ్యువెలరీ.. సరైన జ్యువెలరీ  సాధారణ సల్వార్ సూట్‌ను కూడా స్టైలిష్‌గా, ఆకర్షణీయంగా మార్చగలవు.  సూట్ సింపుల్‌గా ఉంటే, ఆక్సిడైజ్డ్ చెవిపోగులు, చాంద్‌బాలీలు, ఒక స్టేట్‌మెంట్ నెక్లెస్ లేదా రంగురంగుల బ్రాస్‌లెట్‌లు ధరించి  లుక్‌ను మరింత మెరుగుపరుచుకోవచ్చు. అయితే, భారీ వర్క్  ఉన్న సూట్‌తో సింపుల్ ఆభరణాలు మరింత హుందాగా కనిపిస్తాయి. ఆభరణాలను ఎంచుకునేటప్పుడు, బాలెన్స్డ్  లుక్ కోసం సూట్  రంగు , డిజైన్‌ను పరిగణలోకి తీసుకోవాలి. .పాదరక్షలు.. సల్వార్ సూట్‌కు సరైన పాదరక్షలను ఎంచుకోవడం  మొత్తం రూపాన్ని మార్చేస్తుంది. సాంప్రదాయ రూపానికి, ఎత్నిక్ జుట్టీలు, కొల్హాపురి చెప్పులు , శాండల్స్ మంచి ఎంపికలు.  పార్టీకి లేదా ప్రత్యేక సందర్భానికి సూట్ ధరిస్తుంటే, లైట్ హీల్స్ మరింత అందాన్ని ఇస్తాయి.  హెయిర్ స్టైల్, మేకప్.. సరైన హెయిర్‌స్టైల్ , మేకప్ సల్వార్ సూట్‌తో  రూపాన్ని మరింత మెరుగుపరుస్తాయి. సాంప్రదాయ దుస్తులతో, లూజ్ హెయిర్ స్టైల్ కు స్మూత్  కర్ల్స్, లో బన్, గజ్రా స్టైల్ లేదా సైడ్ బ్రెయిడ్ వంటివి బాగుంటాయి. హెవీ మేకప్ లుక్ కంటే లైట్ గా , సహజమైన మేకప్ మరింత హుందాగా కనిపిస్తుంది.  డ్రెస్ రంగుకు అనుగుణంగా   లిప్ కలర్, ఐ మేకప్ , బిందీని సెలెక్ట్ చేసుకోవచ్చు.                                           *రూపశ్రీ.  
శరీరంలో కొవ్వు కరిగించే ఆయుర్వేదం సూప్.. రోజులో ఒక్కసారి తాగినా చాలు..! శరీరంలో కొవ్వు పెరగడం అనేది చాలామంది చూస్తూనే ఉంటారు.  కొందరికి శరీరంలో కొన్ని ప్రదేశాలలో కొవ్వు పెరిగి, ఆ ప్రదేశాలు చాలా లావుగా కనిపిస్తూ ఉంటాయి.  కొందరికి పొట్ట భాగం, మరికొందరికి పిరుదుల భాగం,  ఇంకొదరికి తొడలు, మరికొందరికి తొడలకు ఇరుప్రక్కలా.. ఇలా చాలా ప్రదేశాలలో కొవ్వు పెరుగుతూ ఉంటుంది.  నేటికాలంలో దీన్ని ఫ్యాట్ అని కూడా అంటారు.  అయితే కారణాలు ఏవైనా.. శరీరంలో పెరిగిన కొవ్వును కరిగించడం అంత సులభమేమీ కాదు.. చాలామంది జిమ్ కు వెళ్తారు,  వాకింగ్ చేస్తారు,  కడుపు కూడా కాల్చుకుంటారు. కానీ ఫలితం పెద్దగా ఉండదు.  అయితే శరీరంలో కొవ్వు కరిగించడానికి ఆయుర్వేదం చాలా చక్కని మార్గాన్ని సూచించింది.  అదే  ఆయుర్వేదం సూప్ .  ఈ సూప్ ను రోజులో కనీసం ఒక్క పూట అయినా తీసుకుంటే శరీరంలో కొవ్వు మెల్లిగా తగ్గుతుందట.  ఆ సూప్ ఏంటో.. దాన్ని ఎలా తయారు చేసుకోవాలో.. ఎలా తాగాలో తెలుసుకుంటే.. శరీరంలో కొవ్వు తగ్గించుకోవడానికి,  బరువు తగ్గడానికి చాలామంది సలాడ్ ను తింటారు. క్యారెట్, కీర దోస,  బీట్రూట్,  టమోటా, ఉల్లిపాయ వంటివి సలాడ్ లో భాగంగా పచ్చివి తింటుంటారు. అయితే..  ఆయుర్వేదం సూప్ ఇంకా చక్కని ఫలితాలు ఇస్తుంది. ఆయుర్వేదం సూప్ తయారు చేయడానికి కావలసిన పదార్థాలు.. పొట్లకాయ, బీరకాయ, సొరకాయ, దోసకాయ, టమోటా, గుమ్మడికాయ, క్యారెట్, బీట్రూట్, పై చెప్పుకున్న కూరగాయలు అన్నీ ఒక కప్పు వచ్చేలా తీసుకోవాలి. తయారు చేసే విధానం.. కూరగాయలను ముక్కలుగా తీసుకున్నాక.. ఆ ముక్కలను పాత్రలోవేసి తగినన్ని నీరుకలిపి చిన్నమంట పైన మరిగించాలి. ముక్కలు మరుగుతూవుండగా అందులో కొత్తిమీర, పుదీనా, కరివేపాకు, మిరియాలపొడి, సైంధవలవణం, తగినంత కలుపుకోవాలి. ముక్కలు బాగా ఉడికినతరువాత దించి గోరువెచ్చగా అయ్యే వరకు పక్కన ఉంచాలి. ఎలా తీసుకోవాలి?  ఉడికించిన ముక్కలు గోరు వెచ్చగా అయిన తరువాత మొదట కూర ముక్కలను తినాలి,  ఆ తర్వాత కూర ముక్కలు ఉడికించిన నీటిని సూపులా తాగాలి. ఈ సూప్ తాగడం వల్ల శరీరంలో అదనంగా ఒకగ్రాము కూడా కొవ్వు పెరగదు.. పైగా ఇందులో వాడిన కూరగాయలలో నీటి శాతం,  ఫైబర్ శాతం మెరుగ్గా ఉన్నవే.. ఈ కారణంగా ఈ సూప్ తీసుకోవడం వల్ల  పొట్ట కూడా కరుగుతుంది.   శరీరంలో రక్తం తక్కువగా ఉన్నవారు,  రక్తం శుద్దిగా లేకుండా పదే పదే మొటిమలు,  గుల్లలు, పొక్కులు కడుతున్నవారు.. ఈ సూపును తీసుకుంటే  మంచిరక్తం  ఏర్పడుతుంది,  రక్తం శుద్ది అవుతుంది,  చర్మం కూడా చాలా మెరుగ్గా మారుతుంది.                                          *రూపశ్రీ.  
BMI వార్నింగ్..బిఎమ్ఐ ఎంత ఉండే జాగ్రత్త పడాలి తెలుసా.! బిఎమ్ఐ.. దీన్నే బాడీ మాస్ ఇండెక్స్ అని అంటారు. ఎత్తుకు తగ్గ బరువు  ఉన్నారా లేదా తెలుసుకోవడంలో ఇది సహాయపడుతుంది. నేటి కాలంలో అన్ని వయసుల వారిలో అధిక బరువు , ఊబకాయం సమస్య వేగంగా పెరుగుతోంది. అధిక బరువు ఎన్నో వ్యాధులకు ఒక కారణమని వైద్యులు చెబుతారు.  ఊబకాయం అనేది కేవలం శరీరాన్ని లావుగా చేస్తుందని చాలా మంది అనుకుంటారు.. కానీ నిజం దానికంటే చాలా భయంకరమైనది. ఇది హార్మోన్ల సమస్యలు, రోగనిరోధక వ్యవస్థ సమస్యలు,  మధుమేహం, గుండె జబ్బులు, క్యాన్సర్ వంటి వ్యాధుల ప్రమాదాన్ని కూడా చాలా  పెంచుతుంది . చాలామంది బరువు చూసుకుని తాము ఎక్కువ బరువు ఉన్నామా, తక్కువ బరువు ఉన్నామా అని తెలుసుకుని సాటిసిపై అవుతుంటారు. కానీ నిజానికి వెయిట్ మిషన్ లో బరువు చూసుకోవడం అనేది ఆరోగ్యకరమైన బరువును నిర్థారించదు.  ఆరోగ్యకరమైన బరువును బాడీ మాస్ ఇండెక్స్ ద్వారా నిర్ణయిస్తారు.  దీన్నే బిఎమ్ఐ అని కూడా అంటారు.  బిఎమ్ఐ ఎంత ఉంటే ఆరోగ్యం సేఫ్ గా ఉన్నట్టు? ఎప్పుడు జాగ్రత్త పడాలి? వివరంగా తెలుసుకుంటే.. బిఎమ్ఐ అంటే.. బాడీ మాస్ ఇండెక్స్ (BMI) అనేది  ఎత్తుకు తగ్గట్టు బరువు సాధారణంగా ఉందో లేదో తెలియజేసే ఒక కొలమానం. ఒక వ్యక్తి 70 కిలోగ్రాముల బరువు ఉండి, 1.70 మీటర్ల ఎత్తు ఉంటే, ఆ వ్యక్తి BMI సుమారుగా 24.2 ఉంటుంది. BMIని తెలుసుకోవడానికి,  బరువును (కిలోగ్రాములలో)  ఎత్తు యొక్క వర్గంతో (మీటర్లలో) భాగించాలి.ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం, 25 కంటే ఎక్కువ BMI ఉన్న వ్యక్తులు తమ ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి. 18.5 కంటే తక్కువ ఉంటే..  తక్కువ బరువు. 18.5- 24.9 మధ్య ఉంటే.. సాధారణ బరువు. 25 29.9 మధ్య ఉంటే..  అధిక బరువు. 30 లేదా అంతకంటే ఎక్కువ  ఉంటే.. ఊబకాయం. బిఎమ్ఐ ఎక్కువ ఉంటే ఏమవుతుంది?  BMI ఎక్కువ ఉంటే తరచుగా శరీరంలో అదనపు కొవ్వు పేరుకుపోయినట్టు అర్థం. ఇది రక్తనాళాలు , గుండెపై అదనపు ఒత్తిడిని కలిగిస్తుందని వైద్యులు చెబుతున్నారు.   పొట్ట చుట్టూ పేరుకుపోయిన కొవ్వు శరీరంలోకి వాపును కలిగించే రసాయనాలను విడుదల చేస్తుంది. దీనివల్ల ధమనులలో పాచి పేరుకుపోవడం, అధిక కొలెస్ట్రాల్ , అధిక రక్తపోటు వంటి ప్రమాదాలు పెరుగుతాయి. కాలక్రమేణా, ఈ పరిస్థితి కరోనరీ ఆర్టరీ వ్యాధి, గుండెపోటు , పక్షవాతం వంటి తీవ్రమైన సమస్యలకు దారితీయవచ్చు. శరీరంలో అదనపు కొవ్వు పేరుకుపోయినప్పుడు, కణాలు ఇన్సులిన్‌కు తక్కువ సున్నితంగా మారతాయి. దీనివల్ల రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగి, టైప్ 2 డయాబెటిస్ వచ్చే ప్రమాదం ఉంటుంది. ఎక్కువ బిఎమ్ఐ వల్ల సమస్యలు.. ఎక్కువ BMI ఉన్నవారికి నాన్-ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ వచ్చే ప్రమాదం కూడా ఎక్కువగా ఉంటుంది. దీనిని నియంత్రించకుండా వదిలేస్తే, అది కాలేయ వాపు, ఫైబ్రోసిస్ , సిర్రోసిస్‌ సమస్యలకు  దారితీయవచ్చు. ఊబకాయం వల్ల కనీసం 13 రకాల క్యాన్సర్లు వచ్చే ప్రమాదం పెరుగుతుందని అనేక  అధ్యయనాలు చెబుతున్నాయి. శరీరంలో  కొవ్వు శరీరంలో వాపుకు కారణమవుతుంది , ఇన్సులిన్, కొన్ని హార్మోన్ల స్థాయిలను పెంచుతుంది. దీనివల్ల కణాలు అసాధారణఁగా పెరుగుతాయి.  ఇది చాలా ప్రమాదంగా మారుతుంది. బిఎమ్ఐ ను ఎలా నియంత్రించాలి? BMIని నార్మల్ గా ఉంచుకోవడానికి సమతుల్య ఆహారం, క్రమం తప్పని వ్యాయామం ,  జీవనశైలి చురుగ్గా ఉంచుకోవడం చాలా కీలకమని వైద్యులు చెబుతున్నారు. వారానికి కనీసం 150 నిమిషాలు వ్యాయామం చేయాలి, అదనంగా ఆహారంలో తృణధాన్యాలు, పప్పులు, పండ్లు, కూరగాయలు , ప్రోటీన్ అధికంగా ఉండే ఆహారాలను చేర్చుకోవాలి. తగినంత నిద్ర పొవాలి,   ఒత్తిడిని నియంత్రించుకోవాలి. ఎందుకంటే ఈ రెండూ బరువుపై ప్రభావం చూపుతాయి.  BMI పెరుగుతూ ఉంటే లేదా 25-30 కంటే ఎక్కువగా ఉంటే వైద్యుడిని సంప్రదించాలి.                                  *రూపశ్రీ.  
ఆహారం మానెయ్యకుండా బరువు తగ్గడం ఎలా..Atkins Diet ప్లాన్ పూర్తి వివరాలు ఈ రోజుల్లో బరువు తగ్గడం అనేది చాలా మందికి పెద్ద సవాలుగా మారింది. అయితే బరువు తగ్గడం కోసం ఇష్టమైన ఆహారాన్ని పూర్తిగా మానెయ్యాల్సిన అవసరం లేదని ప్రముఖ సీనియర్ న్యూట్రిషన్ కన్సల్టెంట్ డాక్టర్ పి. జానకి శ్రీనాథ్ చెప్తున్నారు. తక్కువ కార్బోహైడ్రేట్లు, ఎక్కువ ప్రోటీన్లు ఉండే "అట్కిన్స్ డైట్" (Atkins Diet) విధానం ద్వారా ఆహార నియంత్రణల భయం లేకుండానే సులభంగా బరువు తగ్గవచ్చని ఆమె వివరించారు. అట్కిన్స్ డైట్ అంటే ఏమిటి? అట్కిన్స్ డైట్ అనేది ఆహారంలో పిండి పదార్థాలను (Carbohydrates) తగ్గించి, శరీరానికి అవసరమైన ప్రోటీన్లు, కొవ్వులను సరైన పరిమాణంలో అందించే ఒక ప్రత్యేకమైన డైట్ ప్లాన్. మనం సాధారణంగా తీసుకునే ఆహారంలో కార్బోహైడ్రేట్లు ఎక్కువ స్థాయిలో ఉంటాయి. అట్కిన్స్ డైట్‌లో వాటిని క్రమంగా తగ్గించడం వల్ల శరీరం శక్తి కోసం దాచుకున్న కొవ్వును (Fat) కరిగించడం ప్రారంభిస్తుంది. ఈ డైట్ ప్లాన్ వల్ల కలిగే ముఖ్యమైన ఉపయోగాలు: ఆకలి బాధలు ఉండవు: ఆహారం పూర్తిగా మానేయాల్సిన అవసరం లేకుండానే కేలరీలను సమర్థవంతంగా నియంత్రించవచ్చు. శరీరంలో కొవ్వు త్వరగా కరుగుతుంది: కార్బోహైడ్రేట్లు తగ్గడం వల్ల శరీరంలో నిల్వ ఉన్న కొవ్వు శక్తిగా మారుతుంది. బ్లడ్ షుగర్ కంట్రోల్: రక్తంలో చక్కెర స్థాయిలను క్రమబద్ధీకరించడానికి కూడా ఈ డైట్ సహకరిస్తుంది. ప్రోటీన్ సమృద్ధిగా లభిస్తుంది: ఆహారంలో ప్రోటీన్ మోతాదు ఎక్కువగా ఉండటం వల్ల రోజంతా నిరోధక శక్తి, ఉత్సాహం ఉంటాయి. బరువు తగ్గాలనుకునే వారు తమ జీవన శైలికి మరియు ఆరోగ్య పరిస్థితికి అనుగుణంగా సరైన న్యూట్రిషనిస్ట్ సలహాతో ఈ డైట్ ప్లాన్‌ని పాటించడం మంచిది. సంపూర్ణ వివరాలు మరియు డాక్టర్ గారి పూర్తి సలహాల కోసం TeluguOne Health వీడియోను తప్పకుండా వీక్షించండి. గమనిక: ఈ సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య సమస్యలు ఉన్నవారు డైట్ ప్లాన్ ప్రారంభించే ముందు తప్పనిసరిగా డాక్టర్‌ని సంప్రదించండి.