LATEST NEWS
  గోదావరి బోటు ఘటన జరిగి నెల రోజులు కావొస్తున్నా ఎటువంటి పురోగతి లేకపోవడంతో ఆపరేషన్ వశిష్టా ఇక ఆగిపోయినట్లేనా అనే అనుమాలు అందరిలో నెలకొన్నాయి. అయితే  మొదటి ప్రయత్నంలో విఫలమైన ధర్మాణి సత్యం బృందం రెండో ప్రయత్నం కోసం సిద్ధం అవుతున్నట్లు తెలుస్తోంది. అయితే బోటును వెలికితీయటం ఎంతవరకు సాధ్యం అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారుతోంది.  బోటు మునిగి నెల రోజులు కావస్తున్నా ఇప్పటికీ గల్లంతైన వారి వివరాలు పూర్తిగా తెలియనేలేదు. ప్రాణాలతో బయటపడ్డ ఇరవై ఆరు మంది తప్ప గల్లంతైనవారు ఎంతమంది అన్న లెక్క ఇప్పటికీ తేలని లేదని చెప్పాలి. అధికారులు మాత్రం ఇంకో పధ్నాలుగు మంది ఆచూకీ తెలియాల్సి ఉందని చెబుతున్నారు.సెప్టెంబర్ 15 వ తేదీ న కచ్చులూరు దగ్గర ఊహించని విధంగా గోదావరిలో మునిగి పోయింది రాయల్ వశిష్ట బోటు. ఇప్పుడది మూడు వందల అడుగులకుపైగా లోతులో ఉంది. దాదాపు నలభై అయిదు టన్నులకు పైగా బరువున్న రాయల్ వశిష్ట బోటును వెలికితీస్తే గానీ అందులో చిక్కుకున్న మృతదేహాల సంఖ్య తేలే పరిస్థితి లేదు. అయితే బోటును వెలికితీయటం ఎలా ఇప్పుడు ఇదే అతిపెద్ద సమస్యగా మారింది.  బోటును బయటకు తీయడం కోసం సాంకేతిక పద్ధతులు అన్నీ అనుసరించారు.బోటు పడనున్న లోతులను కనిపెట్టడం తప్ప దాన్ని బయటకు లాగే మార్గాలేవి దొరక లేదు. దీంతో సంప్రదాయ పద్ధతుల్లో మాత్రమే బోటును బయటకు లాగగలనని ఆలోచన కు వచ్చారు. ఈ విధానంలో ముప్పయ్యేళ్ల అనుభవం ఉన్న ధర్మాడి సత్యంకు ఈ బాధ్యతలు అప్పగించారు .కాంట్రాక్ట్ తీసుకున్న మరుసటి రోజునే ధర్మాడి సత్యం టీమ్ కచ్చులూరుకు వెళ్ళింది. ఐరన్ రోపులతో, ప్రొక్లెయినర్ లు తీసుకొని లంగర్ లు వేసి బోటు మునిగి ఉన్న ప్లేస్ ను గుర్తించింది. కానీ బయటకు లాగేందుకు చేసిన వారి తొలి ప్రయత్నం విఫలమైంది. ఐరన్ రోప్ తెగి పోవడంతో సత్యం ఆపరేషన్ కు బ్రేక్ పడింది. ఇప్పటికీ సత్యం బృందం బోటును వెలికితీస్తామని నమ్మకం తోనే ఉంది.అయితే ఇటు ఉగ్రరూపం దాల్చిన గోదావరి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షం ఆపరేషన్ వశిష్టకు పెద్ద ఆటంకంగా మారింది. అయితే ఇప్పుడు పరిస్థితి కాస్త కుదుట పడడం గోదావరి ల వరద తగ్గడంతో మళ్లీ సత్యం టీం ఆపరేషన్ వశిష్టకు సిద్ధమవుతోంది. సోమవారం సాయంత్రం ధర్మాణి సత్యం టీమ్ కచ్చులూరుకు చేరుకోబోతోంది. బోటు తమ లంగర్లలకు చిక్కి బయటకు లాగేందుకు పట్టు దొరికితే రెండురోజుల్లోనే ఆపరేషన్ పూర్తి చేస్తామని చెప్తోంది ధర్మడి సత్యం టీమ్. సాయంత్రం కచ్చులూరు చేరుకోబోతున్న ధర్మడి సత్యం టీమ్ మళ్లీ  ఆపరేషన్ మొదటి నుంచి మొదలు పెట్టబోతోంది మొదటి ప్రయత్నం కోసం తెచ్చుకున్న సామాగ్రి మొత్తాన్ని మళ్లీ ఇప్పుడు కచ్చులూరుకు తరలించాల్సి ఉంది. గోదావరి సహకరించి వర్షం తగ్గితే ధర్మం సత్యం రెండో ప్రయత్నం మొదలుకానుంది.ఈ సారి ఐనా ఏ అవంతరాలు లేకుండా జరగుతుందో లేదో వేచిచూడాలి.  
  రైతు భరోసాను రేపటి నుంచి అమలు చేయబోతున్నట్లు ఏపీ మంత్రి కన్నబాబు తెలిపారు. ఇకపై పన్నెండు వేలకు బదులు పదమూడు వేల ఐదు వందలు ఇవ్వాలని నిర్ణయించింది సర్కార్. వ్యవసాయ మిషన్ పై సీఎం జగన్ సుదీర్ఘ సమీక్షలో ఈ నిర్ణయం తీసుకున్నారు. దీనిపై మంత్రి కన్నబాబు మాట్లాడుతూ రైతు భరోసా గడువు పెంచాల్సిన అవసరం ఉందని సీఎం దృష్టికి వచ్చినప్పుడు తక్షణమే ఆయన నెల రోజుల పాటు ఈ పథకానికి గడువు పెంచారని తెలిపారు. అక్టోబర్ పదిహేను నుంచి రైతు భరోసా ప్రక్రియ ప్రారంభమవుతుంది అని నవంబరు పదిహేను వరకు అర్హత కలిగిన రైతులు దరఖాస్తు చేసుకున్న వారికి ఈ పథకంలో ఉన్న నిబంధనల ప్రకారం పెట్టుబడి సాయం చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని తెలిపారు. ఇప్పటి వరకు ఎంపిక చేసిన మొత్తం లబ్ధిదారుల జాబితాలన్నీ విలేజ్ సెక్రటేరియట్ లో అదే విధంగా ఎమ్మార్వో ఆఫీసుల్లో, ఎండీఓ ఆఫీసు లో, కలెక్టర్ ఆఫీసులో కూడా తప్పకుండా నోటీసు బోర్డుల్లో పెట్టాలని సీఎం గారు ఆదేశించారని అన్నారు. ఇప్పటి వరకు విలేజ్ సెక్రటేరియట్ లో గత రెండు రోజులు నుంచి జాబితాలను ప్రదర్శించడం జరిగిందని, మిగతా చోట్ల కూడా ఏర్పాటు చేస్తారు అని తెలిపారు. గత ప్రభుత్వం నలభై మూడు లక్షల మంది రైతు కుటుంబాల జాబితాని పిఎం కిసాన్ పథకానికి సమర్పించినట్టుగా లెక్కలున్నాయన్నారు. అయితే ఇప్పుడు వాటన్నిటినీ సరిచూసినప్పుడు క్షేత్రస్థాయిలో వచ్చిన సమాచారం ప్రకారం దాదాపుగా మూడున్నర లక్షల మంది రైతు కుటుంబాలు ఈ ప్రయోజనం పొందటానికి నిబంధల ప్రకారం అనర్హులుగా తేలుతోందని వివరించారు. అర్హత ఉండి ఆరు లక్షల మంది ఈ పథకాల్లో ప్రయోజనం పొందలేకపోయారని కూడా ప్రాథమిక అంచనాల ప్రకారం తేలిందన్నారు. కాబట్టి ఈ డేటా మొత్తాన్ని సవరించి ప్రతి ఒక్కరికీ ఈ పథకం అందేలా చూడటం మీ బాధ్యత అని సీఎం గారు ఆదేశించారని తెలిపారు. గతంలో ఇచ్చిన దానికన్న మిన్నగా ఈ పథకం అమలు చేయమని సీఎం సూచించారన్నారు. ఇప్పటి వరకు వచ్చిన సమాచారం ప్రకారం దాదాపు మూడు లక్షల మంది కౌలు రైతులు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ లకు చెందిన కౌలు రైతులు ఈ పథకాల్లో లబ్ధి పొందబోతున్నారు అని మంత్రి కన్నబాబు తెలిపారు. ఈ రైతు భరోసా అక్టోబర్ లో ప్రారంభమౌతుంది కనుక కౌలురైతులు ఇంకా ఎవరైనా సరే నమోదు చేసుకోలేకపోవటం, సీ.సీ.ఆర్.సి కార్డ్సు పొందలేకపోవడం వంటి ఇబ్బందులుంటే వాటిని నవంబర్ పదిహేను వరకు మరల దరఖాస్తు చేసినా కూడా పరిగణలోకి తీసుకుంటామని సీఎం చెప్పారన్నారు.
  ఏపీలో కొత్త ప్రభుత్వ పాలన మొదలై ఇన్ని నెలలు గడుస్తున్నా కొన్ని విషయాలు తేల్చడంలో మాత్రం జగన్ సర్కార్ నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తోంది.రాయలసీమలో హైకోర్టు ఉద్యమం మళ్లీ మొదలైంది. గత కొద్ది రోజుల పాటు స్తబ్దుగా ఉన్న ఈ వ్యవహారం మళ్లీ రాజుకుంటోంది. కర్నూలులో హై కోర్టు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ లాయర్ లు నిరసన వ్యక్తం చేస్తున్నారు.ఏకంగా జిల్లా జడ్జి ఆలపాటి గిరిధర్ వాహనాన్ని అడ్డుకొని నిరసన తెలియజేశారు.విధులకు వెళ్లకుండా కోర్టు గేటుకు తాళాలు వేసే ప్రయత్నం కూడా చేశారు. ఈ క్రమంలో పోలీసులు లాయర్ లను అడ్డుకోవడంతో కాసేపు అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది.నెల రోజుల నుంచి పోరాడుతున్నా ప్రభుత్వం కనీసం స్పందించటం లేదంటూ భగ్గుమన్నారు న్యాయవాదులు.  కర్నూలులో హైకోర్టును  ఏర్పాటు చేయాలంటూ గత ముప్పై మూడు రోజులుగా కర్నూలు జిల్లా వ్యాప్తంగా న్యాయవాదులు చేస్తున్న ఉద్యమం మరింత ఉధృతం అవుతుంది. జిల్లా వ్యాప్తంగా ఎక్కడా కోర్టులు పనిచేయకుండా అడ్డుకుంటున్నారు. ఇప్పటి వరకూ ఏ ఒక్కరోజూ కూడా లాయర్ లందరూ కూడా విధులకు హాజరు కానీ సంధర్బాలు లేవు. ఈ రోజునుంచి ఏకంగా స్టాఫ్ కానీ జిల్లా జడ్జిలు కానీ ఎవ్వరూ కూడా కోర్టుకు హాజరు కాకుండా ఏకంగా కోర్టులకు తాళాలు వేశారు. ఉద్యమం మరింత ఉధృతం అవుతున్న సంధర్బంలో కచ్చితంగా హై కోర్టుని ఏర్పాటు చేయలనే డిమాండ్ మరింత ఊపందుకుంటోంది. ఖచ్చితంగా కర్నూలు జిల్లాలో హైకోర్టును ఏర్పాటు చేయాలసిందేనని డిమాండ్ ఉధృతం అవుతుంది.దీనిపై జగన్ సర్కార్ వీలైనంత త్వరగా స్పందిస్తే మంచిదని డిమాండ్ చేస్తున్నారు న్యాయమూర్తులు. జగన్ సర్కార్ ఏ నిర్ణయం తీసుకోబోతోందో వేచి చూడాలి. 
ALSO ON TELUGUONE N E W S
  దర్శకురాలు నందినీరెడ్డి క్లారిటీ ఇచ్చారు... 'ఆల్రెడీ సబ్‌టైటిల్స్‌తో వచ్చిన 'లస్ట్ స్టోరీస్'ను నెట్‌ఫ్లిక్స్ మళ్లీ ఎందుకు రీమేక్ చేయాలనుకుంటుంది? ఈ రూమర్స్ ఏంటో?' అని 'లస్ట్ స్టోరీస్' తెలుగు వెర్షన్ కి నందినీరెడ్డి దర్శకత్వం వహిస్తున్నారని వార్తలు రాసినవారిపై సోషల్ మీడియాలో సెటైర్స్ వేశారు. దాంతో 'లస్ట్ స్టోరీస్' తెలుగు వెర్షన్ ఉండదేమోనని చాలామంది అనుకున్నారు. నిజం ఏంటంటే... 'లస్ట్ స్టోరీస్' తెలుగులో రీమేక్ అవుతోంది. మరి, ఎవరు డైరెక్ట్ చేస్తున్నారు? అంటే.... తరుణ్ భాస్కర్. అవును... 'పెళ్లి చూపులు', 'ఈ నగరానికి ఏమైంది' సినిమాలతో న్యూ ఏజ్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న తరుణ్ భాస్కర్ 'లస్ట్ స్టోరీస్' తెలుగు రీమేక్ కి డైరెక్టర్. ప్రస్తుతం ఈ దర్శకుడు హీరోగా నటించిన 'మీకు మాత్రమే చెప్తా' విడుదలకు రెడీ అవుతోంది. అది ప్రేక్షకుల ముందుకు వచ్చాక 'లస్ట్ స్టోరీస్' రీమేక్ స్టార్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. అలాగే, 'ఈ నగరానికి ఏమైంది' సీక్వెల్ మీద కూడా తరుణ్ భాస్కర్ వర్క్ చేస్తున్నాడని తెలిసింది.
పవన్‌కల్యాణ్‌ హీరోగా తమిళ దర్శకుడు విష్ణువర్ధన్ తీసిన 'పంజా' ప్లాప్ కావొచ్చు. కానీ, ఆ సినిమాలో పవన్ స్టైల్, కాస్ట్యూమ్స్ సూపర్ హిట్. అందులో డైలాగులు కూడా హిట్టే. అబ్బూరి రవి 'సాయం పొందినవాడు కృతజ్ఞత చూపించకపోవడం ఎంత తప్పో, సాయం చేసినవాడు కృతజ్ఞత కోరుకోవడం కూడా అంతే తప్పు' వంటి అద్భుతమైన డైలాగులు రాశారు. అయితే... కొన్ని డైలాగులు విషయంలో దర్శకుడు విష్ణువర్ధన్‌తో గొడవ పడ్డారట. పవన్ కల్యాణ్ ముందే తనకు, దర్శకుడికి గొడవ జరిగిందని రీసెంట్ ఇంటర్వ్యూలో అబ్బూరి రవి చెప్పారు. కొన్ని డైలాగులు కొంతమందికి రాయకూడదని, ఏ డైలాగ్ ఎవరికి రాస్తే ఇంపాక్ట్ ఎలా ఉంటుందో దర్శకుడు, డైలాగ్ రైటర్ ఊహించగలగాలని ఆయన అన్నారు. 'ఆపరేషన్ గోల్డ్ ఫిష్'తో విలన్ గా ఇంట్రడ్యూస్ అవుతున్న అబ్బూరి రవి, డైలాగ్ రైటర్‌గా హ్యాపీగా ఉన్నానని చెప్పారు. దర్శకుడు కావాలనే కోరిక మనసులో బలంగా ఉందనీ, అయితే డైలాగ్ రైటర్‌గా బిజీగా ఉండటంతో ఇన్నాళ్లూ ఆ కోరికను పక్కన పెట్టాననీ, డైరెక్షన్ కోసం సొంత కథ రాసుకోవడానికి డైలాగ్ రైటర్‌గా సినిమాలు తాగించానని అబ్బూరి రవి తెలిపారు. దర్శకుడు సాయికిరణ్ అడివి కోసం 'ఆపరేషన్ గోల్డ్ ఫిష్'లో విలన్ ఘాజీ బాబా పాత్ర చేశానన్నారు. తన నటన ఎలా ఉందో ఈ నెల 18న విడుదలవుతున్న సినిమా చూసి ప్రేక్షకులే చెప్పాలని అన్నారు.
'సరిలేరు నీకెవ్వరు'లో మహేష్ బాబు మిలటరీ ఆర్మీ ఆఫీసర్ రోల్ చేస్తున్నాడు. ఆర్మీ డ్రస్సులో సినిమాలో మహేష్ ఫస్ట్ లుక్ విడుదల చేశారు. ఇండియన్ ఆర్మీకి అంకితం ఇస్తూ ఒక పాట కూడా విడుదల చేశారు. అయితే... సినిమాలో ఆర్మీ ఎపిసోడ్ ఎంతసేపు ఉంటుందో తెలుసా? మహేష్ బాబు ఆర్మీ అధికారిగా, దేశ సరిహద్దుల్లో సైనికుడిగా కనిపించేది ఎంతసేపో తెలుసా? జస్ట్ 20 మినిట్స్ మాత్రమే. మిగతా కథ అంతా తెలుగు నేల మీద నడుస్తుంది. బోర్డర్ నుండి కథ కర్నూల్ కొండారెడ్డి బురుజుకు షిఫ్ట్ అవుతుంది. వయా ఒక పెద్ద ట్రైన్ ఎపిసోడ్. ఆ ఎపిసోడ్ అంతా చాలా హిలేరియస్ గా ఉంటుందని టాక్. సినిమా స్టార్టింగులో మిలిటరీ, ఆర్మీ ఎపిసోడ్ ఉండే అవకాశాలు ఎక్కువ ఉన్నాయని సమాచారం. విజయశాంతి ప్రధాన పాత్రలో, రష్మిక మందన్న కథానాయికగా నటిస్తున్న ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల కానుంది. ఈ సినిమాతో బండ్ల గణేష్ కమెడియన్ గా రీ ఎంట్రీ ఇస్తున్నారు.
  దేశమంతా ఒక డైరెక్టర్ తీస్తున్న సినిమా కోసం ఎదురుచూస్తూ ఉంటుందని మనకు తెలుసు. ఆ డైరెక్టర్.. ఎస్.ఎస్. రాజమౌళి. 'బాహుబలి' సినిమాలతో ఇండియాస్ టాప్ డైరెక్టర్‌గా మారిన ఆయన.. ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్, రాంచరణ్ హీరోలుగా 'ఆర్ ఆర్ ఆర్' మూవీ రూపొందిస్తున్నాడు. పాన్ ఇండియా లుక్ కోసం రాంచరణ్ జోడీగా బాలీవుడ్ బ్యూటీ అలియా భట్‌ను, తమిళ స్టార్ కేరెక్టర్ ఆర్టిస్ట్ సముద్ర కనిని ఆయన తీసుకున్నాడు. అలాగే బాలీవుడ్ టాప్ యాక్టర్లలో ఒకడైన అజయ్ దేవ్‌గణ్ ఈ మూవీలో ఒక కీలక్ కేరెక్టర్ చేస్తున్నాడని చాలా కాలం క్రితమే రాజమౌళి ప్రకటించాడు. శంకర్ డైరెక్ట్ చేసిన '2.0' మూవీలో అక్షయ్ కుమార్ ఎలాగైతే విలన్‌గా కనిపించాడో, అదే తరహాలో అజయ్ దేవగణ్ సైతం 'ఆర్ ఆర్ ఆర్'లో విలన్‌గా కనిపించనున్నాడంటూ వదంతులు వినిపించాయి. దాంతో పాటు రాంచరణ్ తండ్రి కేరెక్టర్‌లో ఆయన కనిపించనున్నాడంటూ కూడా ప్రచారం జరిగింది.  అయితే అజయ్ చేస్తున్నది విలన్ కేరెక్టర్ కాదనీ, ఆయనది హీరోలను తీర్చిదిద్దే గురువు తరహా కేరెక్టర్ అనీ తాజాగా ఆన్‌లైన్‌లో ప్రచారంలోకి వచ్చింది. తెల్లవాళ్లపై తిరగబడ్డ మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజుగా రాంచరణ్, రజాకార్లకు నిద్రలేకుండా చేసిన గోండు వీరుడు కొమరం భీమ్ గా జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్నారు. అయితే నిజమైన పాత్రలతో, ఫిక్షనల్ స్టోరీతో ఈ మూవీని రాజమౌళి తీస్తున్నాడు. పోరాట యోధులుగా మారక ముందు సమకాలికులైన ఆ ఇద్దరూ.. తమ ఇళ్లను, ఊళ్లను విడిచిపెట్టి మూడు నాలుగేళ్ల పాటు ఎక్కడెక్కడో తిరిగి వచ్చారని వాళ్ల జీవిత కథలు చెప్పాయి కానీ, ఆ కాలంలో వాళ్లు ఎక్కడ ఉన్నారనే విషయం చరిత్రలో చెప్పలేదు. దాన్నే కథగా తీసుకొని.. ఆ ఇద్దర్నీ యోధులుగా తీర్చిదిద్దిన గురువుగా అజయ్ దేవగణ్‌ను 'ఆర్ ఆర్ ఆర్'లో రాజమౌళి చూపిస్తున్నాడంటూ ప్రచారం జరుగుతోంది. ఇందులో నిజమెంత ఉందో కాలమే చెబుతుంది.
  హిందీలో 'లస్ట్ స్టోరీస్' వెబ్ సిరీస్ ఎంత పాపులర్ అయ్యిందో మనకు తెలుసు. నాలుగు భాగాలుగా వచ్చిన ఈ సిరీస్‌కు నలుగురు పేరుపొందిన డైరెక్టర్లు.. అనురాగ్ కశ్యప్, జోయా అఖ్తర్, కరణ్ జోహార్, దిబాకర్ బెనర్జీ డైరెక్ట్ చేశారు. రాధికా ఆప్టే, కియారా అద్వానీ, మనీషా కొయిరాలా, భూమి పెడ్నేకర్, విక్కీ కౌశల్ వంటి స్టార్లు అందులో నటించారు. ఈ సిరీస్ ఇప్పుడు తెలుగులో రాబోతోందనే వార్త సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఒక ఎపిసోడ్‌లో అమలా పాల్, జగపతిబాబు నటిస్తున్నారంటూ ప్రచారం జరుగుతోంది. అంతేనా.. నాలుగు భాగాలకు నందినీరెడ్డి, సందీప్‌రెడ్డి వంగా, తరుణ్ భాస్కర్, సంకల్ప్‌రెడ్డి డైరెక్ట్ చేస్తున్నారని కూడా వైరల్ అయ్యింది.  అయితే తెలుగు 'లస్ట్ స్టోరీస్'కు తను డైరెక్ట్ చేస్తున్నాననే ప్రచారాన్ని నందినీరెడ్డి ఖండించింది. తన సోషల్ మీడియా అకౌంట్‌లో.. "ఆల్‌రెడీ సబ్‌టైటిల్స్‌తో వచ్చిన 'లస్ట్ స్టోరీస్'ని నెట్‌ఫ్లిక్స్ మళ్లీ ఎందుకు రీమేక్ చెయ్యాలనుకుంటుంది? వై అమ్మా? ఏంటో ఈ వెరైటీ రూమర్స్" అంటూ వ్యంగ్యంగా పోస్ట్ చేసింది. అయితే ఆమె డైరెక్ట్ చేసిన 'జబర్దస్త్', 'ఓ బేబీ' మూవీస్ రెండూ రీమేక్‌లే. వాటిలో 'ఓ బేబీ' ఒరిజినల్ అయిన కొరియన్ మూవీ 'మిస్ గ్రానీ' ఇంగ్లీష్ సబ్‌టైటిల్స్‌తో విడుదలైన విషయం ప్రస్తావనార్హం. నందిని ఇలా రెస్పాండ్ అయినా, ఇప్పటికే ఈ సిరీస్ తెలుగు రీమేక్ షూటింగ్ హైదరాబాద్‌లో జరుగుతోందనీ, అందులో అమలా పాల్ పాల్గొంటున్నదనీ ప్రచారం జరుగుతోంది. ఈ రెండు వెర్షన్స్‌లో ఏది నిజమో కొద్ది రోజుల్లో తెలిసిపోతుంది.
  అల్లు అర్జున్ హీరోగా 'అల.. వైకుంఠపురములో' అనే సినిమా ప్రెజెంట్ సెట్స్‌పై ఉంది. త్రివిక్రం డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ తర్వాత రెండు సినిమాలు చెయ్యడానికి బన్నీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. వాటిలో ఒకటి 'మిడిల్ క్లాస్ అబ్బాయి' ఫేం వేణు శ్రీరాం డైరెక్షన్‌లో అనౌన్స్ చేసిన 'ఐకాన్' కాగా, మరొకటి సుకుమార్ డైర్క్షన్‌లో చెయ్యాల్సిన సినిమా.  'అల.. వైకుంఠపురములో' మూవీ సంక్రాంతికి వచ్చేస్తోంది. దాని తర్వాత బన్నీ 'ఐకాన్' సినిమా చేస్తాడా? లేక సుకుమార్ సినిమా చేస్తాడా? అనేది తేలలేదు. ఇంతలోనే ఒక రూమర్ ఫిలింనగర్‌లో తెరపైకి వచ్చింది. 'ఐకాన్' మూవీ ఆగిపోయిందనేది ఆ రూమర్.  చేగువేరా బయోపిక్‌గా హాలీవుడ్‌లో వచ్చి క్లాసిక్‌గా నిలిచిన 'ద మోటార్ సైకిల్ డైరీస్' ఆధారంగా 'ఐకాన్' స్క్రిప్టును వేణు శ్రీరాం రాసుకున్నాడనేది సమాచారం. దాని ఫైనల్ స్క్రిప్ట్ విషయంలో బన్నీ హ్యాపీగా లేడనీ, అందుకే ఆ ప్రాజెక్టును వద్దనుకుంటున్నాడనీ ప్రచారం జరుగుతోంది. అయితే ఇది దిల్ రాజు ప్రాజెక్ట్ కాబట్టి అంత ఈజీగా ఆగిపోయే ప్రసక్తి ఉండదని బన్నీ సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. ఎందుకంటే అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా ఏప్రిల్ 8న దిల్ రాజు 'ఐకాన్' మోషన్ టీజర్ రిలీజ్ చేశాడు కూడా. 'కనబడుట లేదు' అనేది ట్యాగ్‌లైన్. డైరెక్టర్ వేణు శ్రీరాంతో స్క్రిప్టును మరింత పకడ్బందీగా తీర్చిదిద్దించే పని ఆయన చేపట్టాడనీ, త్వరలోనే ఈ మూవీకి సంబంధించిన అఫిషియల్ న్యూస్ బయటకు రావచ్చనీ ఆ వర్గాలు అంటున్నాయి. 
  హృతిక్ రోషన్, టైగర్ ష్రాఫ్ హీరోలుగా నటించిన మల్టీస్టారర్ 'వార్' హవా ఇప్పట్లో తగ్గేలా కనిపించడం లేదు. సిద్ధార్థ్ ఆనంద్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా దసరా సీజన్‌లో  200 కోట్ల రూపాయల క్లబ్‌లో జాయినయ్యింది. బుధవారం 11 కోట్ల రూపాయల నెట్ కలెక్షన్లను సాధించిన ఆ మూవీ గురువారం మరో 9 కోట్లను రాబట్టింది. వెరసి.. ఇప్పటివరకూ ఆ సినిమా హిందీ వెర్షన్ ఒక్కటే దేశవ్యాప్తంగా 228.50 కోట్ల రూపాయలను వసూలు చేసిందని అంచనా. మొదటివారం వసూళ్లపరంగా హృతిక్, టైగర్, ప్రొడక్షన్ హౌస్ యష్ రాజ్ ఫిలిమ్స్ (వైఆర్ఎఫ్)  కెరీర్‌లో ఇదే హయ్యెస్ట్ అని బాలీవుడ్ ట్రేడ్ అనలిస్ట్ తరణ్ ఆదర్శ్ తెలిపారు. ఈ క్రమంలో వైఆర్ఎఫ్ మునుపటి రికార్డ్ హోల్డర్ 'సుల్తాన్'ను అది అధిగమించింది. 2019లో ఇప్పటివరకూ విడుదలైన సినిమాల్లో హయ్యెస్ట్ గ్రాసర్‌గా నిలిచేందుకు పరుగులు తీస్తోంది 'వార్'. దేశవ్యాప్తంగా 'వార్' వసూళ్లు ఎలా ఉన్నాయంటే... అక్టోబర్ 2 - రూ. 51.60 కోట్లు  అక్టోబర్ 3 - రూ. 23.10 కోట్లు అక్టోబర్ 4 - రూ. 21.30 కోట్లు అక్టోబర్ 5 - రూ. 27.60 కోట్లు అక్టోబర్ 6 - రూ. 36.10 కోట్లు అక్టోబర్ 7 - రూ. 20.60 కోట్లు అక్టోబర్ 8 - రూ. 27.75 కోట్లు అక్టోబర్ 9 - రూ. 11.20 కోట్లు అక్టోబర్ 10 - రూ. 9.25 కోట్లు ఇప్పటివరకూ వసూలు చేసింది   - రూ. 228.50 కోట్లు (హిందీ వెర్షన్) తెలుగు, తమిళ వెర్షన్లు రాబట్టిన వసూళ్లు - రూ. 9.85 కోట్లు మొత్తం - రూ. 238.35 కోట్లు
  Cast: Payal Rajput, Tejus Kancherla, Naresh, Aamani, Adithya Menon, Mumaith Khan Songs: Bhaskarabhatla Cinematography: C Ram Prasad Editor: Prawin Pudi Music: Radhan Producer: C. Kalyan Story, Screenplay & Direction: Shankar Bhanu Release Date: 11th Oct 2019 While the teaser of the movie RDX Love was released with a lot of steamy scenes the trailer was exactly opposite. The trailer focused on social issues. After RX100, actress Payal Rajput will be seen in this movie. So how is the movie, let us read the review. Story: Alivelu (Payal Rajput) is promoting government schemes with 4 friends. The scheme emphasis on how to use condom (which is called safety in the movie). They also teach women on how to take care of their relationships. Siddu (Tejus Kancherla) falls in love with her. He asks her why does she promote such schemes? The answer is to meet the CM! But why does she want to meet CM? What is her ultimate aim? Answers to such questions form the movie story! Analysis: Before speaking about the movie RDX Love, we have to speak about a particular romantic scene where the heroine is seen sleeping under the tree showcasing her bellybutton. Up above the tree is a honeycomb from where a drop of honey falls near her belly button. Her friends tell the hero that she gets angry if something falls on her while she is sleeping & request him to do something. The hero then takes out the honey with his lips. All this are shot by heroine’s friends & later on heroine shares it to heros father. Why have they introduced this situation, to showcase what is a little unclear. If we keep the commercial success of the movie aside, it is a shock to know that a director who once took meaningful movies like “Ardhanari” has taken such a movie. Can directors come down to this level for commercial success? May be the director’s intensions were good. But just to meet CM will a girl do such things? Are there no other ways left? Audience will surely get this doubt. Okay, after taking that path has he traversed properly? The answer is no again. Plus Points: Payal Rajput Few DIalogues Minus Points: Direction Music & Background music Romantic scenes Performances: If we look at hero & heroine differently, we feel they have done a good job. But if we look at their chemistry, it has clearly not worked out. Heroine Payal looked elder than hero Tejas. Among the others Aditya Menon & Naresh did justice to their character. Tulasi’s character goes on an emotional track. TeluguOne Perspective: Audience who have gone for the movie after seeing RDX Love teaser, they will only be able to enjoy a few scenes & a couple of songs. Similarly, for people who have gone for the movie after watching the trailer, you will surely be disappointed. If anyone wishes to watch the movie with family, they will surely face awkward situation in the theatre. The movie is a collection of cheap scenes!! Rating 2/5
  జగన్ తో చిరంజీవి జరిపే భేటీలో ఏయే అంశాలు చర్చకు వస్తాయనే విషయం రాజకీయ వర్గాల్లో తీవ్ర ఉత్కంఠకు దారి తీస్తోంది. ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేయడం, రెండు వేల పద్నాలుగులో కాంగ్రెస్ దారుణ పరాజయంతో చిరంజీవి రాజకీయాల నుంచి పూర్తిగా తప్పుకొని ఎక్కడి నుంచి వచ్చారో అక్కడికే వెళ్లి పోయారు. అందుకే సోదరుడు పవన్ కల్యాణ్ సొంతంగా జనసేన పార్టీ పెట్టినా దానికి దూరంగానే ఉన్నారు. జనసేన వైసీపీకి పూర్తి వ్యతిరేక పార్టీ, మొన్నటి ఎన్నికల్లో వైసిపిని ఓడించేందుకు పవన్ కళ్యాణ్ తన వంతు ప్రయత్నాలు చేసినా విజయం సాధించలేకపోయారు. తమ్ముడు పవన్ ఏపీలో అధికార వైసీపీకి వ్యతిరేకం కనుకనే జగన్ ప్రమాణ స్వీకారానికి ఆహ్వానం అందినా ఆ కార్యక్రమానికి దూరంగా ఉన్నారు చిరంజీవి. హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరి వెళ్ళిన చిరంజీవి దంపతులు తాడేపల్లి లోని ముఖ్యమత్రి జగన్ క్యాంప్ ఆఫీస్ లో సమావేశమయ్యారు. సమావేశం తరువాత జగన్ తన నివాసంలో చిరంజీవి దంపతులకు విందు ఇవ్వబోతున్నారు. జగన్ తో చిరంజీవి జరిపే భేటీలో ఏయే అంశాలు చర్చకు వస్తాయనే విషయం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారి తీస్తోంది. కాంగ్రెస్ కు దూరంగా జరిగి తమ్ముడు స్థాపించిన జనసేనకు దూరంగా ఉంటున్న చిరంజీవి కేవలం తాను ఇటీవల సైరా సినిమా గురించి మాట్లాడతారా లేక రాజకీయాలు కూడా చర్చిస్తారా అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా ఉంది.  తెలుగు నాట తొలి స్వాతంత్య్ర సమరయోధుడు రేనాటి ప్రాంత వీరుడు ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి బయోపిక్ సంచలన విజయం సాధించింది. ఈ సినిమాకు అదనపు షోలు వేసుకోవడానికి ఏపీ ప్రభుత్వం అనుమతించింది. అడగ్గానే అదనపు షోలు వేసుకోవడానికి అనుమతించిన సీఎం జగన్ కు కృతజ్ఞతలు చెప్పడానికే చిరంజీవి దంపతులు తాడేపల్లి వెళ్లారని సమాచారం. ముఖ్యమంత్రి అపాయింట్ మెంట్ కోరగా సోమవారం రావాల్సిందిగా సీఎం కార్యాలయం ఆహ్వానించింది. జగన్ కు కృతజ్ఞతలు చెప్పి సైరా నరసింహా రెడ్డి సినిమా చూడాలని ఆహ్వానించనున్నట్లు సమాచారం. విజయవాడలో సినిమా చూడటానికి జగన్ అంగీకరించినట్లు కూడా సమాచారం. తమ్ముడు పవన్ కల్యాణ్ కు రాజకీయంగా ఇబ్బంది కలుగుతోందని ఆలోచనతో జగన్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినప్పుడు ఆహ్వానం అందినప్పటికీ చిరంజీవి హాజరు కాలేదు. వైసిపి అధినేత జగన్ కు చిరంజీవి సోదరుడు పవన్ రాజకీయంగా బద్ధ వ్యతిరేకి అనే విషయం తెలిసిందే. ఇప్పుడు విజయవంతం గా ఆడుతున్న సైరా నరసింహా రెడ్డి సినిమాను నిర్మించింది చిరు తనయుడు రామ్ చరణ్ తేజ్. ఈ సినిమా ప్రదర్శన విషయంలో జగన్ సహకారానికి కుమారుడు తరుపున చిరంజీవి కృతజ్ఞతలు తెలియజేస్తారు. ఇదిలా ఉంటే టాలీవుడ్ ను ఏపీకి ముఖ్యంగా విశాఖకు తరలి రావటానికి గల అవకాశాలపై ఇటు జగన్, చిరంజీవి చర్చిస్తారని తెలుస్తోంది. విశాఖలో స్టూడియో నిర్మించాలనే ఆలోచనలో చిరంజీవి ఉన్నట్టు సమాచారం. ఇందుకు స్థలం కేటాయించడంతో పాటు సహకారం అందించాలని చిరంజీవి కోరే అవకాశాలు ఉన్నాయని టాలీవుడ్ సమాచారం.
  చైనా భారత్ ద్వైపాక్షిక చర్చలకు మహాబలిపురం వేదికగా మారడంతో ఈ పేరు బాగా ప్రముఖంగా మారింది. మోదీ, జిన్ పింగ్ ల భేటీకి మహాబలిపురాన్ని ఎందుకు ఎంచుకున్నట్లు, ఈ ప్రాంత ప్రత్యేకత ఏంటి అని ప్రతి ఒక్కరూ ఆలోచిస్తున్నారు. 2014 సంవత్సరం సార్వత్రిక ఎన్నికల్లో ప్రధాన పార్టీలు హోరాహోరీగా తలపడ్డాయి. బీజేపీ తరఫున ప్రధాని అభ్యర్థిగా ఎన్నికల్లో దిగారు మోదీ. ప్రచారం ఆద్యంతం సహజత్వానికి భిన్నంగా సాగింది. ఈ క్రమం లోనే మోదీ కొన్ని కీలక ప్రకటనలు చేశారు. తాను ప్రధానిగా ఎన్నికైతే విదేశాలతో సంబంధాల బలోపేతానికి కృషి చేస్తానని ఇందు కోసం దేశీయంగా పర్యాటక ప్రదేశాలను వినియోగిస్తానని చెప్పారు మోదీ. సమావేశాలు, కీలక భేటీల నిర్వహణకు ప్రాముఖ్యత పర్యాటక ప్రదేశాలను ఉపయోగించుకుంటామని, తద్వారా ఆ ప్రాంతాలకు మరింత వన్నె తీసుకొస్తామని ప్రకటించారు. మోదీ ప్రధాని అయిన తరువాత చెప్పిన మాట ప్రకారం విదేశీ సంబంధాల పునరుద్ధరణకు ఆయన దేశంలోని పర్యాటక ప్రదేశాలను ఎంచుకుంటున్నారు. 2017లో కోల్ కతా వేదికగా బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనాతో భేటీ అయ్యారు ప్రధాని మోదీ. పశ్చిమబెంగాల్ తో బంగ్లాదేశ్ సంబంధం విడదీయరానిది. చారిత్రక నేపథ్యాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ భేటీకి మోదీ కోల్ కతాను ఎంచుకున్నారు. 2017 లో సబర్మతీ నదీ తీరం వేదికగా ఇండియా చైనా శిఖరాగ్ర సమావేశం జరిగింది. సబర్మతీ విశిష్టతా, మహాత్మా గాంధీ ఆశ్రమం ప్రత్యేకతలు ప్రపంచానికి తెలిపేందుకే ఈ భేటీ ఉపయోగపడింది. ఆ తర్వాత మళ్లీ ఇన్నాళ్లకు మహాబలిపురం వేదికగా మరోసారి భారత్, చైనా చర్చలు జరపబోతున్నాయి. ఉప్పు, నిప్పులా ఉండే భారత్, చైనా సంబంధాల బలోపేతానికి వడివడిగా అడుగులు పడుతున్నాయి. అంతర్జాతీయ వేదికలపై ఎప్పుడూ పాక్ కు వంతపాడే చైనాతో చర్చలంటే సహజంగానే ప్రతి ఒక్కరికీ ఆసక్తి. ఈ నేపధ్యంలో భారత ప్రధాని మోదీ జిన్ పింగ్ భేటీకి మహాబలిపురం వేదిక కావడం మరింత ప్రత్యేకతను సంతరించుకుంది. మహాబలిపురం విశిష్టతపై చర్చసాగుతోంది. మహాబలిపురంలో ఆకట్టుకునే శిల్పాలూ, ప్రసిద్ధ శిల్పులకు పెట్టింది పేరు, ఇక్కడ అడుగడుగునా శిల్పకళ ఉట్టిపడుతుంది. మహాబలిపురాన్ని ఏడవ శతాబ్దంలో పల్లవ రాజు నరసింహవర్మ నిర్మించాడు, ఇది చెన్నై మహానగరానికి సరిగ్గా యాభై కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. పల్లవ రాజు నరసింహ వర్మన్ ఇక్కడ ఓడరేవును సైతం నిర్మించాడు. తద్వారా విదేశాలతో వ్యాపారానికి మార్గం సులభతరమైంది. యుద్ధ విద్యలో ఆరితేరిన నరసింహవర్మన్ ను మమల్లన్ గా పిలిచేవారు, అతడి పేరుపైనే ఇక్కడ ఓడరేవుకు మమల్లపురంగా పేరు పెట్టారు. పల్లవరాజులు చైనాతో సత్సంబంధాలు కలిగి ఉన్నారు. తమ రాయబారులను వారు చైనాకు పంపేవారు, రెండో నరసింహవర్మన్ అరబ్స్, టిబెటియన్ల విషయంలో చైనాకు సాయమందించారు. ముఖ్యంగా చైనా, తమిళనాడు మధ్య సిల్క్ వ్యాపారానికీ మహాబలిపురం ఓడరేవు బాగా ఉపయోగపడింది. ఒకటో నరసింహవర్మన్ పాలనను ప్రత్యక్షంగా చూసిన చైనా పర్యాటకుడు హ్యున్ సంగ్ ఇక్కడి అభివృద్ధిని కొనియాడారు. ప్రజలు సుఖ సంతోషాలతో పాటు జీవిస్తున్నారనీ విద్యారంగం బాగుంటుందంటూ కితాబు ఇచ్చారు. ఇలా మహాబలిపురం, చైనా మధ్య చారిత్రక సంబంధాలున్నాయి.
కర్నూ లు జిల్లా రైతుల కన్నుగప్పి పచ్చని పొలాలపై కాలకూటం విరజిమ్మే కుట్ర  జరుగుతోంది. గత నెలలో ఓ కాంట్రాక్టు సంస్థ ప్రతి నిధులు బోర్ల పేరుతో గుట్టుగా తవ్వకాలు జరిపారు. యురేనియం కోసమేనని రైతు లు పసిగట్టి వ్యతిరేకించే వారికి మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అండగా నిలిచింది. దీంతో యురేనియం డ్రిల్లింగ్ పనులు నిలిచిపోయాయి.' సేవ్ నల్లమల సేవ్ ఆళ్లగడ్డ' క్యాంపైన్ తో అఖిలప్రియ ప్రభుత్వం పై మరింత ఒత్తి డి తెచ్చారు. కడపులో మాదిరిగా ఆళ్లగడ్డ లో యురేనియం తవ్వకాలు జరపనున్నామని అఖిల పక్షం నేతలు తేల్చి చెప్పారు.నల్లమల్ల ప్రకృతి అందాలు పచ్చని పైర్లు అనేక ఆధ్యాత్మిక క్షేత్రాలు శిల్ప సంపదకు ఆళ్లగడ్డ నిలయం. అలాంటి ఆళ్లగడ్డ ను సర్వనాశనం చేసేందుకు కుట్ర జరుగుతోంది. ఆళ్లగడ్డ మండలం యాదవాడ గ్రామ పొలిమేరల్లో ఓ కాంట్రాక్టు సంస్థ అడుగుపెట్టింది. గలగల పారే వాగుల పచ్చని పొలాల మధ్య యంత్రాలనూ దింపింది. సంస్థ ప్రతి నిధులు యంత్రా లతో బోర్లు వేస్తునట్టు నటించి యురేనియం తవ్వకాల సర్వే పనులు మొదలు పెట్టారు. ఆరు వందల అడుగుల లోతు వరకు యురేనియం కోసం అన్వేషణ సాగించారు. బోర్లు వేస్తున్నామంటూ చుట్టు పక్కల రైతు లకు సంస్థ ప్రతి నిధులు చెప్పి బోల్తా కొట్టించారు. భూగర్భం లోంచి తీసి ల్యాబ్ కు పంపిన రాళ్ల ను చూసి రైతు లకు అనుమానం వచ్చింది.ఇప్పటికే కడప జిల్లా ప్రజల బతుకుల్లో యురేనియం విషం చిమ్ముతోంది. ఇంతలోనే మరో రాయలసీమ జిల్లా ను కూడా ఈ ముప్పు తాకనుందని రైతులు ఆందోళన చెందారు. సర్వే తవ్వకాల కు వ్యతిరేకంగా రైతు లు రోడ్డెక్కారు.మాజీ మంత్రి భూమా అఖిలప్రియ యురేనియం సర్వే తవ్వకాలు జరుపుతున్న ప్రాంతానికి వచ్చి సంస్థ ప్రతినిధులతో మాట్లాడారు. రెవెన్యూ అధికారులను వివరా లు అడిగి తెలుసుకున్నారు. యురేనియం సర్వే తవ్వకాల అనుమతులపై సంస్థ ప్రతి నిధులు రెవెన్యూ అధికారుల పొంతన లేని సమాధానమిచ్చారు. రైతుల పర్మిషన్ లేకుండా సర్వే తవ్వకాలు ఎలా జరుపుతారని భూమా అఖిలప్రియ సంస్థ ప్రతి నిధులను నిలదీశారు. దీంతో కాంట్రాక్టు సంస్థ ప్రతి నిధులు యురేనియం సర్వే తవ్వకాల పనులు తాత్కాలికం గా నిలిపివేశారు. సర్వే పనులకు అనుమతి ఇవ్వా లని ఆళ్లగడ్డ తహసీల్దార్ కు లేఖ పంపారు. ఆళ్లగడ్డ నియోజకవర్గం లో దాదాపు ఇరవై గ్రామాల్లో పదిహే ను చోట్ల మళ్లీ యురేనియం సర్వే పనులు ప్రారంభించేందుకు సిద్ధమయ్యారు. ప్రభుత్వం యురేనియం సర్వే పనులు ఆపెయ్యాలని మాజీ మంత్రి భూమా అఖిలప్రియ డిమాండ్ చేశారు. ఆళ్లగడ్డ ను కాపాడేందుకు 'సేవ్ నల్లమల సేవ్ ఆళ్లగడ్డ' క్యాంపెయిన్ ను ఉధృతం చేశారు.సంస్థ ప్రతి నిధులు డ్రిల్లింగ్ పనులు చేసే యంత్రాలను అక్కడి నుంచి తీసుకెళ్లారు .ఆళ్లగడ్డ ఎమ్మెల్యే గంగుల బిజేంద్రనాథ్ రెడ్డి యురేనియం తవ్వకాల సర్వేపై స్పందించారు. యురేనియం తవ్వకాలకు తాము వ్యతిరేకమన్నారు. రెండు వేల పధ్ధెనిమిది లో చంద్రబాబు యురేనియం తవ్వకాల కు అనుమతులు ఇచ్చారని ఎమ్మెల్యే గంగుల బిజేంద్రనాథ్ రెడ్డి చెప్పుకొచ్చారు. తెలంగాణల యురేనియం తవ్వకాల ను సీఎం కేసీఆర్ అసెంబ్లీ వేదికగా ఖండిస్తున్నట్లు ప్రకటించారు. కానీ ఏపీ ప్రభుత్వం ఎందుకు స్పందించటం లేదని విపక్షా లు ప్రయత్నిస్తున్నాయి. యురేనియం తవ్వకాల కు వ్యతిరేకం గా అఖిల పక్ష బృందం కడప జిల్లాలో యురేనియం తవ్వకాల ప్రాంతాల్లో పర్యటించింది.ఆళ్లగడ్డ లో అఖిల పక్ష సమావేశం లో పాల్గొన్నారు. రాయలసీమ లో యురేనియం తవ్వకాల పై అఖిల పక్ష నేతలు ముక్త కంఠంతో వ్యతిరే కించారు. పులివెందుల ప్రజలు నరకం చూస్తున్న పట్టించుకోవడం లేదని మాజీ మంత్రి భూమా అఖిలప్రియ మండిపడ్డారు. కడప జిల్లా మాదిరి గా ఆళ్లగడ్డ లో యురేనియం తవ్వకాలు జరగనివ్వమని హెచ్చరించారు. యురేనియం తవ్వకాల పై సీపీఐ రాష్ట్ర కార్య దర్శి రామకృష్ణ సీరియస్ అయ్యారు. సీఎం జగన్ కడప జిల్లా లో యురేనియం బాధిత ప్రాంతాల్లో పర్యటించాలన్నారు. యురేనియం తవ్వకాలు జరపకముందే మేల్కొన్న ఆళ్లగడ్డ ప్రజల ను రామకృష్ణ అభినందించారు. యురేనియం సర్వే తవ్వకాల వల్ల తమ భూముల రేట్లు పడిపోతున్నాయి అని ఆళ్లగడ్డ అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎన్ని కుట్ర లు చేసినా సర్వే పనులను అడ్డు కుంటామన్నారు. రైతు లు ప్రజా సంఘాలు అన్ని విపక్ష పార్టీ లు ఏకం కావడం తో జగన్ సర్కార్ కు యురేనియం సెగ తగిలింది ఇక జగన్ ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి.
  తెలంగాణ ఆర్టీసీ సమ్మెను ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. డెడ్ లైన్ విధించి ఉద్యోగాలు పోతాయని హెచ్చరించి. అయినా ఆర్టీసీ ఉద్యోగులు వెనకడుగు వేయకుండా సమ్మెను కొనసాగిస్తున్నారు. దీంతో ఏకంగా ముఖ్యమంత్రి కేసీఆరే రంగంలోకి దిగారు. ఆర్టీసీలో ఇక మిగిలింది 12 వందల మంది ఉద్యోగులే అని చెప్పిన కేసీఆర్‌.. సమ్మెలో ఉన్న సుమారు 48 వేల మందిని తొలగిస్తున్నామని పరోక్షంగా హెచ్చరించారు. దీంతో సమ్మె చేస్తున్న ఆర్టీసీ కార్మికులను మూకుమ్మడిగా తొలగించవచ్చా? అన్ని వేల మందిని ఒకేసారి డిస్మిస్‌ చేయడాన్ని చట్టాలు సమర్థిస్థాయా? అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. గతంలో తమిళనాడులో అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత అధికారంలో ఉన్న సమయంలో మూకుమ్మడిగా దాదాపు 2 లక్షల మందిని తొలగించారు. 2003 లో రెవెన్యూ ఉద్యోగులు, ఉపాధ్యాయులు సమ్మెకు దిగగా.. మొత్తం 1.70 లక్షల మందిని తొలిగిస్తూ జయలలిత నిర్ణయం తీసుకున్నారు. అప్పట్లో ఈ ఘటన దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. అయితే, సమ్మె చేస్తున్న 1.70 లక్షల మంది ఉద్యోగులను జయలలిత తొలగిస్తే సుప్రీంకోర్టు మాత్రం ఉద్యోగులకు ఉపశమనం కల్పించింది. వాళ్లను తిరిగి తీసుకోవాలని చెబుతూనే, బేషరతుగా క్షమాపణ చెబుతూ.. భవిష్యత్‌లో సమ్మెలు చేయబోమంటూ ప్రమాణపత్రం ఇవ్వాలని ఉద్యోగులకు సుప్రీం నిర్దేశించింది.  ఆర్టీసీ కార్మికుల విషయంలో తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రకటన కూడా న్యాయసమీక్షకు నిలబడదని న్యాయనిపుణులు చెబుతున్నారు. ఆర్టీసీ ఉద్యోగులను తెలంగాణ ప్రభుత్వం తొలగిస్తే.. వారు కోర్టుకి వెళ్లే అవకాశముంది. అప్పుడు తమిళనాడు ఉద్యోగుల అంశంలో వెలువడిన తీర్పే మళ్లీ వెలువడే అవకాశముందని అంటున్నారు. మరోవైపు ఆర్టీసీ కార్మిక సంఘాలు కూడా ప్రభుత్వానికి ఉద్యోగులను తొలగించే అధికారం లేవంటున్నాయి. ‘‘మేము చట్టబద్ధంగా సమ్మె నోటీసులిచ్చాం. మంత్రి ఉన్నా.. చర్చల్లో పాల్గొనలేదు. మాకు న్యాయం చేయడానికి కోర్టులున్నాయి. చట్టాలు మూకుమ్మడి తొలగింపులను అనుమతించవు.’’ అని అంటున్నారు.
  హామీలు ఎన్నోఇస్తుంటారు కానీ రాను రాను వాటి బకాయిలు చెల్లించడంలో మాత్రం ప్రభుత్వం నిర్లక్షం వహిస్తోంది. ఉపాధి హామీ పథకం బకాయిల క్రింద కేంద్ర ప్రభుత్వ నిధులు ఇచ్చినా వాటిని కూలీలకు విడుదల చేయకుండా రాష్ట్ర ప్రభుత్వం తొక్కిపెడుతోందని టిడిపి అధ్యక్షుడు మాజీ సీఎం చంద్రబాబు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ కు గురువారం ఆయన లేఖ రాశారు.  కేంద్రం ఈ ఏడాది ఏప్రిల్ నుంచి జూలై వరకు మూడు విడతలుగా పధ్ధెనిమిది వందల నలభై ఐదు కోట్లు రాష్ట్రానికి పంపింది. ఈ డబ్బులకు రాష్ట్ర ప్రభుత్వం తన వాటా నిధులు కలిపి మూడు రోజుల్లోగా రాష్ట్ర ఉపాధి హామీ నిధుల బదిలీ చేయాలి. ఇలా చేయకపోతే తదుపరి నిధులు విడుదల నిలిపివేసే అధికారం కేంద్రానికి ఉంటుంది. అలాగే జాప్యం చేసిన కాలానికి రాష్ట్ర ప్రభుత్వం పన్నెండు శాతం వడ్డీ కూడా చెల్లించాలి. పెండింగ్ బిల్లుల చెల్లింపునకు ఈ నిధులు వినియోగించాలని పాత పెండింగ్ బిల్లులకు ప్రథమ ప్రాధాన్యం ఇవ్వాలని కూడా కేంద్రం తన ఆదేశాల్లో సూచించింది. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఇంత వరకు ఉపాధి హామీ పథకంలో మెటీరియల్ కాంపోనెంట్ కింద చెల్లించాల్సిన బిల్లులను చెల్లించలేదు. ఈ నిధులను ఇతర అవసరాల కోసం మళ్లించిందనే ఆరోపణలు వస్తున్నాయని అందులో పేర్కొన్నారు. నెలల తరబడి బిల్లులూ పేరుకుపోవడంతో అవి రావలసిన వారు తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నారని కొన్ని చోట్ల ఈ పరిణామం ఆత్మహత్యలకు కూడా దారి తీస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ పరిస్థితి ఉపాధి హామీ పథకానికి చెడ్డ పేరు తెస్తుందని బిల్లులు పేరుకుపోవడంతో ఈ పథకంతో జత కలిపి పనులు చేయటానికి ప్రభుత్వ విభాగాలు వెనుకంజ వేస్తున్నాయని తెలిపారు.  ఉపాధి హామీ పథకం గవర్నింగ్ కౌన్సిల్ సభ్యులు ఈ పరిస్థితి పై పలుమార్లు రాష్ట్ర ప్రభుత్వానికి వినతి పత్రాలిచ్చారని గవర్నర్ ను కూడా కలిసి వివరించారని తెలిపారు. ఇదే పరిస్థితి రాష్ట్రంలో కొనుసాగితే అతి త్వరలోనే ప్రజలు ఈ పథకం పై విశ్వాసం కోల్పోతారని ఫలితంగా గ్రామీణాభివృద్ధి తీవ్రంగా కుంటుపడుతోందని, దీనివల్ల కేంద్ర ప్రభుత్వ ప్రతిష్ఠ కూడా దెబ్బతింటుందంటున్నారు. ఉపాధి హామీ పథకం అమలులో ఏపీ గత ఐదేళ్లలో దేశంలో ప్రథమ స్థానంలో నిలిచిందని చంద్రబాబు లేఖలో గుర్తు చేశారు. ఈ పథకం నిధులతో రాష్ట్రంలో ఇరవై ఆరు వేల కిలోమీటర్ల సిమెంట్ రోడ్లు, ఆరు వేల అంగన వాడీ భవనాలు, రెండు వేల రెండు వందల గ్రామ పంచాయతీ కార్యాలయ భవనాలు, పదివేల సాలిడ్ వేస్ట్ కేంద్రాలూ, ఏడు లక్షల పంటకుంటలు నిర్మించామని చంద్రబాబు పేర్కొన్నారు. పన్నెండు వేల కిలోమీటర్ల మేర గ్రామాలకు రహదారి సౌకర్యం ఏర్పాటైంది. దేశవ్యాప్తంగా ఎనభై మూడు ఉత్తమ గ్రామ పంచాయతీలను ఎంపిక చేస్తే అందులో ముప్పై మూడు ఈ రాష్ట్రం నుంచే ఉన్నాయి. మొదటి పది లో ఏడు కూడా ఈ రాష్ట్రానికి చెందినవే అని తెలియజేశారు. దీనిని పరిశీలించి పెండింగ్ బిల్లుల చెల్లింపునకు కేంద్రం చొరవ తీసుకోవాలని కోరారు. ప్రస్తుత ఆర్థిక మాంద్యంలో ఉపాధి హామీ పథకం మాత్రమే ప్రజలకు ఉపశమనం కలిగిస్తుందని రాష్ట్రం నుంచి పెండింగ్ బిల్లులు విడుదల చేయాలని కేంద్రమంత్రికి విజ్ఞప్తి చేశారు. ఈ బకాయిలు చెల్లింపు పై చంద్రబాబు తన దృష్టని పెట్టారని స్పష్టంగా వెల్లడవుతోంది. 
  తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఢిల్లీ బాట పట్టారు. కేవలం ఒకే ఒక్క రోజు గ్యాప్ లో కేసీఆర్ అండ్ జగన్ హస్తినకు వెళ్తున్నారు. ఒకట్రెండు ఇష్యూస్ మినహా ఇద్దరి అజెండాలు దాదాపు ఒకేలా ఉన్నాయి. ఇద్దరూ కూడా ప్రధాని మోడీతోపాటు కేంద్ర మంత్రులను కలిసి తమతమ రాష్ట్రాల సమస్యలపై వినతిపత్రాలు ఇవ్వనున్నారు. ముఖ్యంగా ఇరు రాష్ట్రాలకు కేంద్రం నుంచి రావాల్సిన నిధులను తెచ్చుకోవడమే ప్రధాన లక్ష్యంగా కనిపిస్తోంది. అలాగే విభజన సమస్యలు కూడా ప్రస్తావనకు రానున్నాయి. అయితే, ఎన్నికలకు ముందు మోడీని తిట్టిన తిట్టకుండా ఒంటికాలిపై లేచిన కేసీఆర్... నరేంద్రమోడీ రెండోసారి ప్రధాని పగ్గాలు చేపట్టాక తొలిసారి సమావేశంకాబోతున్నారు. మరోవైపు తెలంగాణలో పొలిటికల్ వార్ ... టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీగా మారుతోన్న క్రమంలో.... కేసీఆర్... మోడీని కలవబోతుండటం ప్రాధాన్యత కలిగిస్తోంది. అయితే, రాష్ట్రానికి రావాల్సిన నిధులపైనే మోడీతో కేసీఆర్ చర్చించనున్నారు. ఆర్ధిక మాంద్యం నేపథ్యంలో తక్షణమే గ్రాంట్లను రిలీజ్ చేయాలని కోరనున్నారు. అలాగే, ఆయుష్మాన్-భవ పథకం నిధులను ఆరోగ్యశ్రీకి అనుసంధానం చేయాలని, అదేవిధంగా జలశక్తి కేటాయింపులకు మిషన్ భగీరథకు ఇవ్వాలని విజప్తి చేయనున్నారు. ఇక, బయ్యారంలో స్టీల్ ఫ్యాక్టరీ ఏర్పాటు, జోనల్ వ్యవస్థ సవరణ, రిజర్వేషన్ల పెంపు, యురేనియం తవ్వకాల నిలిపివేత, గోదావరి-కృష్ణా నదుల అనుసంధానం... ఇలా పలు డిమాండ్లను ప్రధాని ముందు పెట్టనున్నారు.  ఇక, ఒక్క రోజు గ్యాప్ తో ఢిల్లీ వెళ్లనున్న ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి కూడా... రాష్ట్రానికి రావాల్సిన నిధులను వెంటనే విడుదల చేయాలని ప్రధాని మోడీని కోరనున్నారు. రెవెన్యూ లోటు, ఆర్ధిక మాంద్యం నేపథ్యంలో... ఏపీని ఆర్ధికంగా ఆదుకోవాలంటూ మెమొరాండం ఇవ్వనున్నారు. అలాగే రాష్ట్రానికి సంబంధించిన పలు సమస్యలపై ప్రధానితో జగన్ చర్చించనున్నారు. అయితే, అక్టోబర్ 15న ప్రతిష్టాత్మకంగా ప్రారంభించబోతున్న రైతు భరోసా పథకం ప్రారంభానికి ముఖ్యఅతిథిగా రావాలని మోడీని జగన్మోహన్ రెడ్డి ఆహ్వానించనున్నారు. అయితే, ఇటీవల ప్రగతి భవన్లో సమావేశమైన కేసీఆర్-జగన్... కేంద్ర ప్రభుత్వ తీరుపైనా, మోడీ విధానాలపై తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేశారంటూ పత్రికల్లో కథనాలు రావడం సంచలనం సృష్టించింది. ఇక, ఇఫ్పుడు ఒక్క రోజు గ్యాప్ లో కేసీఆర్, జగన్ లు ఢిల్లీ వెళ్తుండటం... అదే సమయంలో ఇద్దరికీ మోడీ అపాయింట్ మెంట్లు ఇవ్వడం ఆసక్తిరేపుతోంది.
  గ్రామ సచివాలయాల వ్యవస్థను ఏపీ సర్కార్ ప్రారంభించింది. తూర్పుగోదారి కరపలో జగన్ గ్రామ సచివాలయాల వ్యవస్థను ప్రారంభించారు. ప్రతి రెండు వేల జనాభాకు ఒక గ్రామ సచివాలయాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ప్రతిచోటా పది నుండి పన్నెండు మంది వరకు ప్రభుత్వ ఉద్యోగులను నియమించింది. దాదాపు ప్రతి ఊరిలో ఒక గ్రామ సచివాలయం, జనాభా అత్యధికంగా ఉన్న గ్రామంలో ఆరు నుంచి ఏడు సచివాలయాలు ఏర్పాటు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో 11,158 గ్రామ సచివాలయాలు, పట్టణ ప్రాంతాల్లో 3,786 వార్డ్ సచివాలయాలు బుధవారం నుంచి ప్రజలకు అందుబాటులో రానున్నాయి. ఈ సచివాలయాల్లో పని చెయ్యటానికి రాష్ట్ర ప్రభుత్వం రికార్డు స్థాయిలో ఒకే విడతలో లక్షా ముప్పై నాలుగు వేల తొమ్మిది వందల పధ్ధెనిమిది లక్షల ఉద్యోగుల నియామక ప్రక్రియను చేపట్టింది. కేవలం నాలుగు నెలల వ్యవధిలోనే ఈ ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేసింది. పింఛన్ లు, రేషన్ కార్డులు ఇంటి పట్టా వంటి వాటి కోసం పేదల మండల ఆఫీసులు, కలెక్టరేట్ రాజధానిలో ఉండే శాఖాధిపతుల కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఉండకూడదని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సంకల్పించారు. ప్రస్తుతం గ్రామ స్థాయిలో కేవలం 19 రకాల సేవలు పంచాయతీల ద్వారా అందజేసే అధికారముంది, ఈ పరిస్థితిని మార్చేస్తూ 500 రకాల ప్రభుత్వ సేవలను గ్రామ సచివాలయాల ద్వారా ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అక్టోబర్ 2 వ తేదీ నుంచి ప్రతీ నెల కొన్ని సేవల చొప్పున గ్రామ సచివాలయాల ద్వారా ప్రజలకు అందజేస్తారు. జనవరి 1వ తేదీ కల్లా 500 రకాల సేవలను ప్రజలు పూర్తిగా గ్రామ సచివాలయాల్లోనే పొందేలా ప్రణాళికలు సిద్ధం చేశారు. సేవలు అందజేసే విషయంలో నిర్దిష్ట కాల పరిమితి విధించాలని ప్రభుత్వం నిర్ణయించింది. 34 ప్రభుత్వ శాఖలకు సంబంధించిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల సమాచారాన్ని గ్రామ సచివాలయాల్లో అందుబాటులో ఉంచుతారు. ఆయా శాఖల పరిధిలో జరిగే పనులను గ్రామ సచివాలయం అనుమతితో చేపట్టే అవకాశముందని అధికార వర్గాలు చెప్తున్నాయి. గ్రామ సచివాలయాల పరిధిలో జరిగే ప్రతి అభివృద్ధి పని, ప్రతి సంక్షేమ పథకంలో లబ్ధిదారుల పేర్లను అక్కడి ప్రజలందరి సమక్షంలో చేర్పించి నిర్ణయించాలనీ, ఏడాదిలో తప్పని సరిగా ఎనిమిది సార్లు గ్రామ సభలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం జిల్లా అధికారులను ఆదేశించింది. అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ పథకాల్లో అవినీతి, అక్రమాలకు ఏమాత్రం తావు లేకుండా పారదర్శకంగా అర్హులకే వాటిని అందించటానికి సన్నాహాలు చేస్తోంది. ప్రతి పథకం లబ్ధిదారుల జాబితాలో అందరికీ తెలిసేలా గ్రామ సచివాలయం నోటీస్ బోర్డులో ఉంచుతారు. ఏ శాఖ ద్వారా ఏ పనికి ఎంత ఖర్చు పెట్టారన్న వివరాలను సైతం సచివాలయంలో అందరికీ అందుబాటులోకి తీసుకొస్తారు.
  ఉరవకొండ టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ స్వగ్రామంలో అలజడి రేగింది. రాజకీయ కారణాలతో గ్రామాన్ని రెండుగా విడగొట్టేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. అనంతపురం జిల్లా ఉరవకొండ మండలం పెద్ద కౌకుంట్ల పంచాయతీ పరిధిలో పెద్ద కౌకుంట్ల, చిన్న కౌకుంట్ల, వై.రాంపురం, రాసిపల్లి, మైలారంపల్లి గ్రామాలు ఉన్నాయి. దాదాపు 5వేలకు పైగా జనాభా ఉన్న పెద్ద కౌకుంట్ల మొదట్నుంచీ మేజర్ పంచాయతీగా కొనసాగుతోంది. అయితే, జగన్మోహన్ ‌‌రెడ్డి అధికారంలోకి వచ్చాక, రాంపురం గ్రామాన్ని ప్రత్యేక పంచాయతీగా చేయాలంటూ వైసీపీ వర్గాలు డిమాండ్ రావడంతో అధికారులు ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టారు. అయితే, గ్రామస్తులు రెండు వర్గాలుగా చీలిపోయారు. పెద్ద కౌకుంట్ల... ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్‌ స్వగ్రామం కావడం... ముందునుంచీ టీడీపీకి పట్టు ఉండటంతో... తెలుగుదేశం వర్గీయులు.... మేజర్ పంచాయతీగానే కొనసాగాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే, వైసీపీ వర్గీయులు మాత్రం వై.రాంపురం గ్రామాన్ని ప్రత్యేక పంచాయతీగా ప్రకటించాలని పట్టుబడుతున్నారు. దాంతో గ్రామస్తులు...పార్టీల వారీగా విడిపోయి రగడకు దిగారు. అయితే, పెద్ద కౌకుంట్ల... టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్‌ సొంత గ్రామం కావడంతో గ్రామంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. అధికారులు ప్రజాభిప్రాయసేకరణకు రావడంతో పెద్ద కౌకుంట్లలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ స్వయంగా రంగంలోకి దిగి, తెలుగుదేశం శ్రేణులకు అండగా నిలిచారు. అయితే, గ్రామస్తులు... పార్టీల వైజ్‌... రెండు వర్గాలుగా విడిపోయి... వాదోపవాదాలకు దిగడంతో... ఉద్రిక్తత మధ్యే అధికారులు ప్రజాభిప్రాయాన్ని సేకరించారు. ప్రజాభిప్రాయ సేకరణలో... మొత్తం 1672మంది పాల్గొంటే, వై.రాంపురం గ్రామాన్ని... పెద్ద కౌకుంట్ల పంచాయతీలోనే కొనసాగించాలని 1522మంది కోరగా, కేవలం 150మంది మాత్రమే ప్రత్యేక పంచాయతీగా ప్రకటించాలంటూ డిమాండ్ చేశారు. దాంతో, గ్రామస్తుల అభిప్రాయాన్ని ఉన్నతాధికారులకు నివేదిస్తామని ఉరవకొండ ఎంపీడీవో తెలిపారు. ఇదిలాఉంటే, వైసీపీ అధికారంలోకి వచ్చాక, పచ్చని గ్రామాల్లో చిచ్చు పెడుతున్నారని ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్‌ మండిపడ్డారు. వైసీపీ నేత విశ్వేశ్వర్ రెడ్డి పనిగట్టుకుని... తమ గ్రామాన్ని విడగొట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు.
కేవీపీ రామచంద్రరావు... దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌ రెడ్డికి ఆత్మ... ఇప్పుడదే ఆత్మ రెండు రాష్ట్రాల్లోనూ, తెర వెనకుండి నడిపిస్తోందన్న వాదన, రాజకీయ వర్గాల్లో హాట్‌హాట్‌‌గా సాగుతోంది. ముఖ్యంగా సాగునీటి ప్రాజెక్టుల కాంట్రాక్టుల విషయంలో కేవీపీ మాటే చెల్లుబాటు అవుతోందని అంటున్నారు. తెలంగాణ కాళేశ్వరం... ఆంధ్రప్రదేశ్ పోలవరం ప్రాజెక్టుల కాంట్రాక్టులను మేఘా సంస్థ దక్కించుకోవడం వెనుక కేవీపీనే ఉన్నారనే మాట వినిపిస్తోంది. అంతేకాదు, కేసీఆర్-జగన్ ఫ్రెండ్షిప్ వెనుకా కేవీపీయే ఉన్నారని పొలిటికల్‌ సర్కిల్స్‌లో చర్చ జరుగుతోంది. తెలంగాణలో అత్యంత ప్రతిష్టాత్మక కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మిస్తోంది మేఘా సంస్థే... అయితే, మేఘాకి ఈ ప్రాజెక్టు దక్కడం వెనుక కేవీపీ కీలక పాత్ర పోషించారన్న వాదన ఉంది. ఎందుకంటే, ప్రత్యక్షంగా కనిపించకపోయినా, కేసీఆర్‌కు కేవీపీకి మంచి సంబంధాలున్నాయని అంటున్నారు. ఇద్దరి సామాజికవర్గం కూడా ఒక్కటే కావడమూ కారణమంటున్నారు. ఇక, కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మిస్తోన్న కంపెనీయే ఇప్పుడు రివర్స్ టెండరింగ్ లో పోలవరం కాంట్రాక్టును దక్కించుకుంది. అయితే, మేఘా సంస్థ... పోలవరం కాంట్రాక్టు దక్కించుకోవడం వెనుక కూడా కేవీపీయే ఉన్నారని మాట్లాడుకుంటున్నారు. వందల కోట్ల రూపాయల నష్టం వస్తుందని తెలిసినప్పటికీ, 12.6 శాతం తక్కువకు కోట్ చేస్తూ, మేఘా సంస్థ బిడ్ దాఖలు చేయడం వెనుక కేవీపీ వ్యూహం ఉందని మాట్లాడుకుంటున్నారు. మేఘా కంపెనీ ఇంత తక్కువకు బిడ్ దాఖలు చేయడం వెనుక, కేవీపీతోపాటు జగన్ కూడా ఉన్నారనే మాట కూడా వినిపిస్తోంది. అందుకే, మేఘాకి పోలవరం కాంట్రాక్టు దక్కడంతో వైసీపీ నేతలు ఖుషీ అవుతున్నారట. మరోవైపు, మేఘా సంస్థలో కేవీపీకి భారీగా షేర్లు ఉన్నాయనే మాట వినిపిస్తోంది. అందుకే మేఘా కంపెనీకి రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ కాంట్రాక్టులు దక్కేలా చేస్తున్నారని అంటున్నారు.
  జీవితంలో అనుభవం నేర్పిన పాఠాలు ఎవరూ నేర్పలేరంటారు. ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి తన అనుభవంతో మిగతా స్టార్ హీరోలకు పాఠాలు చెబుతున్నారు. ఆ పాఠాలు సినిమాలకు సంబంధించినవి అనుకుంటే పొరపాటే, రాజకీయాలకు సంబంధించినవి. చిరంజీవి సినిమాల్లో మెగాస్టార్ గా ఓ వెలుగు వెలుగుతున్న టైంలో 2008 లో ప్రజారాజ్యం పార్టీ స్థాపించారు. 2009 ఎన్నికల్లో బరిలోకి దిగారు. అయితే ఆ ఎన్నికల్లో చిరంజీవి ఆశించిన ఫలితం మాత్రం రాలేదు. రెండు అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేసిన చిరంజీవి.. తన సొంత నియోజకవర్గం పాలకొల్లులో ఓడిపోయారు. ఇక పార్టీ కూడా 18 స్థానాలతో సరిపెట్టుకుంది. తర్వాత కొందరి సలహాతో 2011 లో పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసారు. రాజ్యసభకు ఎంపికై కేంద్ర కేబినెట్ లో పనిచేసారు. ఓ రకంగా చిరంజీవి రాజకీయాల్లో ఆశించిన స్థాయిలో రాణించలేదనే చెప్పాలి. దీంతో చిరంజీవి మళ్లీ సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి అదరగొడుతున్నారు. ఇక చిరంజీవి సోదరుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా 2014 లో జనసేన పార్టీని స్థాపించారు. అయితే 2014 ఎన్నికల్లో పోటీ చేయకుండా ఎన్డీయే కూటమికి మద్దతు తెలిపారు. 2019 ఎన్నికల్లో మాత్రం ప్రత్యక్ష పోరుకి దిగారు. కానీ చిరంజీవి కంటే దారుణమైన ఫలితాన్ని చవిచూశారు. పవన్ పోటీ చేసిన రెండు స్థానాల్లోనూ ఓడిపోయారు. పార్టీ కేవలం ఒకే ఒక్క అసెంబ్లీ స్థానంతో సరిపెట్టుకుంది. అయినా పవన్ తన పోరాటం ఆగదంటున్నారు. అయితే చిరంజీవి మాత్రం ప్రజారాజ్యం, జనసేన పార్టీలను దగ్గర నుంచి చూసిన వ్యక్తిగా, మరియు రాజకీయాల్లో తనకున్న ప్రత్యక్ష అనుభవంతో.. సినిమా స్టార్లు రాజకీయాలకు ఎంత దూరంగా ఉంటే అంత మంచింది అంటున్నారు. ప్రస్తుతం చిరంజీవి నటించిన సైరా నరసింహారెడ్డి ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధమైంది. ఈ నేపథ్యంలో తాజాగా త‌మిళ మేగ‌జైన్ ఆనంద విక‌ట‌న్‌కు ఇచ్చిన ఓ ఇంట‌ర్వ్యూలో చిరంజీవి ఆస‌క్తిక‌ర‌మైన వ్యాఖ్యలు చేసారు. ర‌జ‌నీకాంత్‌, క‌మ‌ల్‌హాస‌న్‌లను రాజ‌కీయాల్లోకి రావ‌ద్దంటూ స‌ల‌హా ఇచ్చారు.  "నేను సినిమాల్లో నెంబ‌ర్ వ‌న్ స్టార్‌గా రాణిస్తున్న స‌మ‌యంలో రాజ‌కీయాల్లోకి వ‌చ్చాను. అయితే ప్ర‌త్య‌ర్థులు కోట్లు కుమ్మ‌రించ‌డంతో సొంత నియోజ‌క వ‌ర్గంలోనే ఓడిపోయాను. నా సోద‌రుడు ప‌వ‌న్‌ కళ్యాణ్ విష‌యంలోనూ అదే జ‌రిగింది" అని అన్నారు. ప్ర‌స్తుతం రాజకీయాలు పూర్తిగా డ‌బ్బుమ‌య‌మైయ్యాయ‌ని, సౌమ్యుల‌కు రాజ‌కీయాలు అంత సుల‌భ‌మైతే కాదని, నిజాయ‌తీగా ప్ర‌జ‌ల‌కు ఏదైనా చేయాల‌నుకున్నా ఏమీ చేయ‌లేర‌ని ఆయ‌న తెలిపారు. న‌న్న‌డిగితే ర‌జ‌నీకాంత్‌, క‌మ‌ల్‌హాస‌న్‌లు రాజ‌కీయాల్లోకి రావొద్ద‌నే స‌ల‌హా ఇస్తాను అని చిరంజీవి స్పష్టం చేసారు. మొత్తానికి చిరంజీవికి అనుభవంతో తత్త్వం బోధ పడింది. రాజకీయాలకు దూరం పాటించాలని సలహాలు ఇస్తున్నారు. మరి ఇప్ప‌టికే మ‌క్క‌ల్ నీది మ‌య్యం పార్టీతో క‌మ‌ల్ రాజ‌కీయ రంగ ప్ర‌వేశం చేసారు. ర‌జ‌నీ కూడా త్వ‌ర‌లోనే రాజ‌కీయాల్లోకి రాబోతున్నట్లు ప్రకటించారు. మరి వీరిద్దరూ చిరంజీవి సలహాతో ఆలోచనలో పడతారో, లేక అనుభవమే పాఠాలు నేర్పుతుంది అంటూ ముందుకి సాగుతారో చూడాలి.
The occurence of headcahes is very common. WHO states that tension headaches are the second most disabling condition in the world, with migraine being third. When headache strike what hurts is not the brain because brain lack pain-sensitive nerves. but several areas over head including scalp, face, mouth and throat may hurt due to the presence of pain-sensitive nerve fibres. It might be shocking to know that there are different types of headaches! 1. Migraine - A migraine headache is throbbing pain, usually localised to one side of the head, which may be severe and last from few hours to days. It may be accompanied with nausea, vomiting, sensitivity to light and noise and visual disturbances. This runs in families, and women are most likely to be afffect when compared to men! 2. Cluster Headaches - These aren't common. They are one-sided stabbing pain that last for an hour or two. They may occur one or more times  a day for a few days or weeks to months, sometimes at the same time of day also, hence the term 'cluster'. They are more prevalent in men than women. 3. Tension Headache - The most common form of headache, which is caused bymuscle tension in head neck and shoulders. It is steady, non-throbbing mild to moderate pain on both sides of the head. It may be caused by stressfull situations, thus also called stress-headache. 4. Hormonal Headaches and Migraine - Few women experience headaches and migraines simultaneously at times when their hormae levels go haywire, usually during menustruation. we are yet to find out what is triggering these demons on women! 5. Exertion Headache - some poeple experience headaches post -physical strain, though these are harmless, but at times they might be due to the underlying bleed, tumours or arterial disorders. It is best advised to ee a doctor when you are striked by exertion headache. 6. Eye-strain Headache - Seen in poeple who do not address their visual problem wit prescribed glasses or contact lens. It causes pain and heaviness around the eye. Some eye conditions such glaucoma, astigmatism and presbyopia can also cause headache. 7. Secondary Headache - Secondary headaches are a common symptom secondary disorders, such as sinus infections, severe hypertension, inflammation of the temporal artery and hangover. Take Care!! Stay Healthy!!
ఉద్యోగంలో ఒత్తిడి ఉండవచ్చు! కానీ... ఒత్తిడితో చేసే ఉద్యోగం వల్ల నానారకాల రోగాలు మనల్ని పట్టిపీడిస్తాయంటూ ఆ మధ్య కొన్ని పరిశోధనలు నిరూపించాయి. సదరు ఒత్తిడితో పాటుగా ఊబకాయం, రక్తపోటు, గుండెజబ్బులు వంటి అనారోగ్యాలన్నీ మనల్ని చుట్టుముడతాయని తేలిపోయింది. కానీ తాజాగా ఒక పరిశోధన ఒత్తిడిలో చేసే ఉద్యోగం మంచిదే అంటోంది. కాకపోతే దాని కోసం కొన్ని అంశాలను దృష్టిలో ఉంచుకోక తప్పదని చెబుతోంది. ఏడేళ్ల పరిశీలన ఇండియానా విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకులు తమ పరిశీలన కోసం ఒక 2,363 మంది ఉద్యోగులను ఎన్నుకొన్నారు. వీరందరూ కూడా యాభై ఏళ్లు పైబడినవారే. ఇలా ఎన్నుకొన్న అభ్యర్థులని ఏడేళ్ల పాటు నిశితంగా గమనించారు. ఈ పరిశీలనలో ఉద్యోగంలో ఒత్తిడికీ, మరణాలకీ ఖచ్చితమైన సంబంధం బయటపడింది. ఒత్తిడితో కూడిన ఉద్యోగాలు చేసేవారు త్వరగా చనిపోయేందుకు 15.4 శాతం అధికమైన అవకాశం ఉన్నట్లు తేలింది. పనిలో పనిగా బయటపడిన మరో ఫలితం వారిని నిర్ఘాంతపరిచింది. ఒత్తిడితో మృత్యువు దూరం ఉద్యోగంలో ఒత్తిడి ఉన్నప్పటికీ, నిర్ణయాలు తీసుకునే స్వేచ్ఛ ఎక్కువగా ఉన్న ఉద్యోగులు సుదీర్ఘకాలం బతికినట్లు తేలింది. ఉద్యోగం ఎంత కఠినమైనదైనప్పటికీ, లక్ష్యాలు ఏర్పరిచే అవకాశం దగ్గర్నుంచీ వాటిని సాధించే విధానం దాకా అన్నీ ఉద్యోగికి అందుబాటులో ఉన్నప్పుడు అది అతని ఆరోగ్యం మీద అనుకూల ప్రభావమే చూపుతోందని తేలింది. ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నవారు త్వరగా చనిపోయే అవకాశం ఏకంగా 34 శాతం తక్కువగా ఉందట. ఒత్తిడి ఒకోసారి బాగుంటుంది ఒక పక్క ఒత్తిడిలో ఉండి, దానిని పరిష్కరించేందుకు ఎలాంటి నిర్ణయాలూ తీసుకోలేని వ్యక్తులు... సదరు ఒత్తిడిని అధిగమించేందుకు అతిగా తినడమో, సిగిరెట్లు కాల్చడమో వంటి పనులు చేస్తుంటారట. ఇక మనసులోనే తిష్టవేసుకునే ఒత్తిడి వలన రక్తపోటు ఎలాగూ తప్పదు. అదే సమయంలో బాధ్యతలూ నీవే, హక్కులూ నీవే అన్న భరోసాని ఉద్యోగికి కల్పించినప్పుడు అతను అదే ఒత్తిడిని ఒక సవాలుగా తీసుకుంటాడు. దానిని ఎదుర్కోవడాన్ని, తద్వారా తనని తాను నిరూపించుకోవడాన్నీ ఇష్టపడతాడు. వింటానికి బాగుంది కానీ... ‘నిర్ణయాలు తీసుకునే అధికారం’ అన్న వాక్యం వినడానికి బాగుంది కానీ... ఆ అదృష్టం ఎంతవరకూ, ఎంతమందికి లభిస్తుందన్నదే అనుమానం. ఒత్తిడి మాత్రమే ఉండి స్వేచ్ఛ లేని సందర్భాలలో దానిని ఎదుర్కొనేందుకు మనసుని స్థిరంగా ఉంచుకోవడం, శ్వాస మీద ధ్యాస ఉంచడం, సమయానికి ఆహారం తీసుకోవడం, వ్యాయామం చేయడం... వంటి ఆరోగ్యకరమైన అలవాట్లను పాటించమని చెబుతున్నారు. వినడానికి బాగానే ఉంది కానీ, వీటిని ఎంతమంది పాటిస్తారన్నదే అనుమానం!!!   - నిర్జర.