LATEST NEWS
తమిళనాడు రాజకీయాల్లో అధికార, ప్రతిపక్షాల మధ్య నడుస్తున్న వివాదంలో దేశ అత్యున్నత న్యాయస్థానం కీలక తీర్పునిచ్చింది. తమిళనాడు ముఖ్యమంత్రి  విజయ్ కరూర్ జిల్లాలో పర్యటించకుండా నిరోధించాలని కోరుతూ ప్రతిపక్ష  డీఎంకే దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించడానికి సుప్రీంకోర్టు   నిరాకరించింది. ఒక రాష్ట్ర   ముఖ్యమంత్రి పర్యటనలను తాము ఏ విధంగా నియంత్రించగలమని న్యాయస్థానం  ప్రశ్నించింది. గతంలో   తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ప్రచార సమయంలో కరూర్ ప్రాంతంలో తీవ్రమైన తొక్కిసలాట చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. ఈ విషాద ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలనూ, అలాగే గాయపడిన బాధితులను పరామర్శించేందుకు ఈ నెల  10న కరూర్ సందర్శనకు  సీఎం విజయ్ అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. అయితే..  సీఎం పర్యటన ద్వారా ఈ కేసులోని సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉందంటూ డీఎంకే ప్రధాన కార్యదర్శి ఆర్.ఎస్. భారతి సుప్రీంకోర్టులో అత్యవసర పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై జస్టిస్ కె.వి. విశ్వనాథన్, జస్టిస్ అలోక్ అరధేలతో కూడిన సుప్రీంకోర్టు వెకేషన్ బెంచ్ విచారణ చేపట్టింది. డీఎంకే తరఫున సీనియర్ న్యాయవాది రంజిత్ కుమార్ వాదనలు వినిపించారు. బాధితులను కలిసి ప్రభుత్వ పరంగా ఉద్యోగ నియామక పత్రాలు, ఇతర ఆర్థిక సాయం అందించేందుకు సీఎం వెళ్తున్నారని, దీనివల్ల సీబీఐ దర్యాప్తు పారదర్శకత దెబ్బతింటుందని ఆయన కోర్టుకు వివరించారు. దీనిపై ధర్మాసనం తీవ్రంగా స్పందిస్తూ..  బాధిత కుటుంబాలను పరామర్శించడం సాక్షులను ప్రభావితం చేయడం ఎలా అవుతుందని ప్రశ్నించింది. పిటిషన్‌ను ఉపసంహరించుకోకపోతే కొట్టివేస్తామని స్పష్టం చేయడంతో..  డీఎంకే న్యాయవాది పిటిషన్‌ను వెనక్కి తీసుకునేందుకు అంగీకరించారు. దీంతో కోర్టు ఆ వ్యాజ్యాన్ని ముగించింది. దీంతో  ఈ నెల   10న సీఎం విజయ్  కరూర్ పర్యటనకు ఉన్న అడ్డంకులన్నీ తొలగిపోయాయి.   DMK Petition Dismissed, Tamil Nadu CM Joseph Vijay, Karur Stampede Case, Tamil Nadu Politics, TeluguOne
కల్వకుంట్ల కవిత కొత్త  రాజకీయ పార్టీ పేరు   ఇప్పుడు న్యాయస్థానం పరిధిలోకి చేరింది. తన నూతన పార్టీకి  తెలంగాణ రక్షణ సమితి  (టీఆర్ఎస్)  పేరు  ఖరారు చేయాలని కోరుతూ ఆ పార్టీ అధినేత్రి కల్వకుంట్ల కవిత..  ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కేంద్ర ఎన్నికల సంఘం  టీఆర్ఎస్  పేరు ఖరారు విషయంలో  పంపిన లేఖను సవాల్ చేస్తూ ఆమె   న్యాయపోరాటానికి దిగారు.  పార్టీ రిజిస్ట్రేషన్ ప్రక్రియలో భాగంగా తమ పార్టీ పేరుపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ జూన్ 23న కేంద్ర ఎన్నికల సంఘం తనకు ఒక అధికారిక లేఖను పంపిందని కవిత తన పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈసీ లేవనెత్తిన అభ్యంతరాల నేపథ్యంలో, పార్టీ పేరు ఆమోదం పొందేలా తగిన ఆదేశాలు ఇవ్వాలని ఆమె కోర్టును అభ్యర్థించారు. తెలంగాణ సెంటిమెంట్‌తో ముడిపడి ఉన్న ‘టీఆర్ఎస్’ అనే సంక్షిప్త నామం చుట్టూ ఈ వివాదం తిరుగుతోంది. గతంలో కవిత తండ్రి, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలోని తెలంగాణ రాష్ట్ర సమితి టీఆర్ఎస్ పార్టీని భారత రాష్ట్రీయ సమితి (బీఆర్ఎస్)గా మార్చిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత కవిత బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చి.. సొంత పార్టీ ఏర్పాటు చేసుకున్నారు. తెలంగాణ సెంటిమెంట్, తెలంగాణ ఉద్యమం గుర్తుకు వచ్చేలా.. తన పార్టీకి  తెలంగాణ రక్షణ సమితి  అని పేరు పెట్టుకున్నారు. అయితే ఈ పేరుపై, ముఖ్యంగా  టీఆర్ఎస్  అనే సంక్షిప్త అక్షరాల వాడకంపై అభ్యంతరం తెలుపుతూ ఈసీకి పలు పిటిషన్లు వచ్చాయి.    ప్రస్తుతం చలామణిలో ఉన్న..  లేదా ప్రజల్లో గుర్తింపు పొందిన ఇతర పార్టీల పేర్లను పోలి ఉండేలా కొత్త పేర్లు ఉంటే ఓటర్లలో గందరగోళం నెలకొనే అవకాశం ఉంటుంది. కనుక కవిత ప్రతిపాదించిన పేరు పాత టీఆర్ఎస్ పార్టీని పోలి ఉండటంతో, దీనిపై స్పష్టత ఇవ్వాలంటూ ఈసీ నోటీసులు జారీ చేసింది. దీనిపై స్పందించిన కవిత  చట్టప్రకారం తాము పెట్టుకున్న పేరు చెల్లుబాటు అవుతుందని వాదిస్తున్నారు.  ఈ పేరు మార్పు లేదా అభ్యంతరాలపై ఎన్నికల సంఘం అడిగిన వివరాలకు కవిత ఇప్పటికే బదులిచ్చినట్లు తెలుస్తోంది. అయినప్పటికీ రిజిస్ట్రేషన్ ప్రక్రియ మరింత ఆలస్యం కాకుండా ఉండేందుకు,  తమకు అనుకూలంగా నిర్ణయం వచ్చేలా చూసేందుకు ఆమె ముందు జాగ్రత్తగా ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించినట్లు పరిశీలకులు భావిస్తున్నారు.  ఈ పిటిషన్‌పై రానున్న రోజుల్లో ఢిల్లీ హైకోర్టులో విచారణ జరగనుంది. న్యాయస్థానం ఈ విషయంలో ఎలాంటి తీర్పు ఇస్తుంది, కేంద్ర ఎన్నికల సంఘానికి ఎలాంటి మార్గదర్శకాలు జారీ చేస్తుంది అనే అంశంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.   Telangana Rakshana Sena, TRS Party Name Row, Delhi High Court, Election Commission of India
తమిళనాడు రాజకీయాల్లోకి మరో స్టార్ హీరో ఎంట్రీ ఇచ్చారు. తమిళనాడు అసెంబ్లీకి ఇటీవల జరిగిన  ఎన్నికలలో   దళపతి విజయ్ సృష్టించిన సంచలన విజయం తెలిసిందే.  రాజకీయాల్లోకి ప్రవేశించిన తొలిసారే విజయం సాధించి   ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించి  విజయ్ చరిత్ర సృష్టించారు.  కమల్ హాసన్ వంటి మహామహులకే సాధ్యం కాని ఈ ఫీట్ ను విజయ్ సాకారం చేయడంతో..  ఇప్పుడు కోలీవుడ్‌లోని మరికొందరు స్టార్స్ రాజకీయాలలోకి  అడుగులు వేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఈ క్రమంలోనే   స్టార్ హీరో ధనుష్ కూడా   రాజకీయ అరంగేట్రం చేయబోతున్నారు.  తాజాగా ధనుష్ అభిమాన సంఘం నిర్వహించిన ఓ ప్రత్యేక కార్యక్రమంలో  పార్టీ  జెండాను ఆవిష్కరించడం ఆయన పొలిటికల్ ఎంట్రీకి సంకేతంగా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  కేవలం జెండా రూపకల్పనకే పరిమితం కాకుండా..  తమిళనాడు వ్యాప్తంగా విస్తృతంగా సేవా కార్యక్రమాలు చేపట్టాలని అభిమాన సంఘాల నేతలకు ధనుష్ పిలుపునివ్వడం కూడా  ఆయన పోలిటికల్ ఎంట్రీని కన్ ఫర్మ్ చేస్తోందంటున్నారు.   Hero, Dhanush, Fans, Flag, Public, Service, Teluguone
ALSO ON TELUGUONE N E W S
సినిమా పరిశ్రమలో ఒకే ఒక్క శుక్రవారం ఒక దర్శకుడి తలరాతను పూర్తిగా మార్చేయగలదు. నిన్నటివరకు పెద్దగా పరిచయం లేని ఒక నూతన దర్శకుడు, నేడు సౌత్ ఇండియాలోనే మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్ల జాబితాలోకి చేరిపోవడం వెనుక ఒక అద్భుతమైన సంచలనం దాగుంది. ఆ సంచలనం పేరే 'బ్లాస్ట్'. యాక్షన్ కింగ్ అర్జున్ సర్జా, అభిరామి, ప్రీతి ముకుందన్ ప్రధాన పాత్రల్లో సరికొత్త మార్షల్ ఆర్ట్స్ యాక్షన్ థ్రిల్లర్‌గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద అంచనాల్ని తలకిందులు చేస్తూ వసూళ్ల సునామీ సృష్టించింది. ఈ భారీ విజయంతో చిత్ర దర్శకుడు సుభాష్ కె. రాజన్ ఏకంగా కోలీవుడ్ వర్సటైల్ యాక్టర్, స్టార్ హీరో చియాన్ విక్రమ్‌ను డైరెక్ట్ చేసే గోల్డెన్ ఛాన్స్ దక్కించుకోవడం ఇప్పుడు ట్రేడ్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. అసలు 'బ్లాస్ట్' సినిమా బాక్సాఫీస్ వద్ద ఇంతటి పెను సంచలనం సృష్టిస్తుందని ట్రేడ్ వర్గాలు సైతం ఊహించలేదు. కేవలం 18 కోట్ల రూపాయల పరిమిత బడ్జెట్‌తో రూపుదిద్దుకున్న ఈ చిత్రం, థియేటర్లలోకి వచ్చే సమయానికి ఎలాంటి భారీ అంచనాలు లేవు. కానీ వెండితెరపై మైనింగ్ స్కామ్ బ్యాక్‌డ్రాప్‌లో ఒక సాధారణ మధ్యతరగతి కరాటే మాస్టర్ కుటుంబం విలన్ల ముఠాపై చేసిన మార్షల్ ఆర్ట్స్ యుద్ధం ప్రేక్షకులకు నెక్స్ట్ లెవెల్ థ్రిల్ ఇచ్చింది. అద్భుతమైన యాక్షన్ సీక్వెన్స్, బలమైన విజువల్స్, అద్భుతమైన మౌత్ టాక్ కారణంగా ఈ చిన్న చిత్రం ప్రపంచవ్యాప్తంగా ఏకంగా 70 కోట్ల రూపాయలకు పైగా వసూళ్లను సాధించి క్లీన్ బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ఈ చిత్రం సాధించిన అపూర్వ విజయంతో ఒక్కసారిగా చిత్ర పరిశ్రమ చూపు సుభాష్ కె. రాజన్ వైపు తిరిగింది. ఈ యంగ్ డైరెక్టర్ హ్యాండిల్ చేసిన టేకింగ్, కథను నడిపించిన విధానం చూసి పలువురు స్టార్ హీరోలు ఆయనతో పని చేసేందుకు ఆసక్తి కనబరిచారు. ఈ క్రమంలోనే సుభాష్, విలక్షణ నటుడు చియాన్ విక్రమ్‌కు ఒక పవర్‌ఫుల్ లైన్ వినిపించగా.. అది విక్రమ్‌కు విపరీతంగా నచ్చేసిందని ఇండస్ట్రీ టాక్ వినిపిస్తోంది. సామాజిక సందేశాన్ని కమర్షియల్ హంగులతో మిక్స్ చేసి చెప్పడంలో సుభాష్ చూపించిన ప్రతిభకు విక్రమ్ పూర్తిగా ఫిదా అయ్యారు. అందుకే ఈ క్రేజీ ప్రాజెక్ట్‌కు ఆయన వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ ప్రతిష్టాత్మక చిత్రాన్ని కోలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ ఏజీఎస్ ఎంటర్‌టైన్‌మెంట్ (AGS Entertainment) అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మించనుంది. థియేటర్లలో రికార్డులు సృష్టించిన 'బ్లాస్ట్' మూవీ, ఆ తర్వాత ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫారమ్ నెట్‌ఫ్లిక్స్‌లో ఐదు భాషల్లో విడుదలై డిజిటల్ స్క్రీన్స్‌ను సైతం షేక్ చేసింది. గ్లోబల్ ఆడియన్స్‌ను సైతం ఆకట్టుకుంటూ నెట్‌ఫ్లిక్స్‌లో టాప్ ట్రెండింగ్‌లో నిలిచింది. ముఖ్యంగా ఇందులో అర్జున్ సర్జా కూతురు 'నీల' పాత్రలో నటించిన ప్రీతీ ముకుందన్ క్రేజ్ ఈ సినిమాతో అమాంతం పెరిగిపోయింది. కేవలం గ్లామర్ పాత్రలకే పరిమితం కాకుండా, కళ్లు చెదిరే మార్షల్ ఆర్ట్స్ స్టంట్స్‌తో ఆమె చేసిన యాక్షన్ విన్యాసాలు ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశాయి. ఈ అద్భుతమైన విజయంతో ఆమె సౌత్ ఇండియాలోనే మోస్ట్ వాంటెడ్ యాక్ట్రెస్‌గా మారిపోయింది. అలాంటి అద్భుతమైన ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ను అందించిన సుభాష్ కె. రాజన్, ఇప్పుడు చియాన్ విక్రమ్ లాంటి అసాధారణ నటుడిని ఎలా ప్రెజెంట్ చేయబోతున్నారనే దానిపై అప్పుడే అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి.     Chiyaan Vikram, Subhash K Rajan, AGS Entertainment
తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఒకప్పుడు చిన్న సినిమాల కథానాయకుడిగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న నటుడు శివాజీ. ఎన్నో వైవిధ్యమైన పాత్రలతో, ఫ్యామిలీ ఓరియెంటెడ్ సినిమాలతో మెప్పించిన ఆయన, ఆ తర్వాత కాలంలో రాజకీయాల వైపు అడుగులు వేశారు. ఆ క్రమంలో సినిమాలకు పూర్తిగా దూరం కావాల్సి వచ్చింది. ఒకానొక దశలో రాజకీయాల్లోనూ చురుగ్గా లేక, ఇటు సినిమాల్లోనూ కనిపించక శివాజీ కెరీర్ పూర్తిగా ఫేడవుట్ అయిపోయిందని అందరూ భావించారు. ఇక ఆయనను వెండితెరపై చూడటం కష్టమే అనుకుంటున్న తరుణంలో, ఊహించని విధంగా బుల్లితెర బిగ్గెస్ట్ రియాలిటీ షో 'బిగ్ బాస్' లోకి ఎంట్రీ ఇచ్చి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఈ షో ద్వారా ఒక్కసారిగా ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించి, విపరీతమైన పాపులారిటీని దక్కించుకున్నారు. బిగ్ బాస్ ఇచ్చిన క్రేజ్‌తో తన సెకండ్ ఇన్నింగ్స్‌ను ఎంతో గ్రాండ్‌గా రీస్టార్ట్ చేశారు శివాజీ. రీఎంట్రీలో ఆయనకు లభించిన మొదటి అవకాశం 'కోర్ట్' వెబ్ సిరీస్ / మూవీ. ఈ ప్రాజెక్ట్‌ను రెండు చేతులా అందిపుచ్చుకుని, తన నటనా విశ్వరూపాన్ని చూపించారు. శివాజీ కెరీర్ మొదటి ఇన్నింగ్స్‌లో కూడా రానంతటి భారీ క్రేజ్ మరియు ప్రశంసలు ఈ 'కోర్ట్' ప్రాజెక్ట్ ద్వారా ఆయనకు దక్కడం విశేషం. దీని తర్వాత 'దండోరా' అనే చిత్రంతోనూ శివాజీ వైవిధ్యమైన నటనను కనబరిచి తన ప్రత్యేకతను మరోసారి చాటుకున్నారు. ఇటీవల హీరోగా నటించిన 'సంప్రదాయిని సుప్పిని శుద్ధ పూసని' బాక్సాఫీస్ వద్ద ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేకపోయినప్పటికీ, శివాజీ డిమాండ్‌కు ఎలాంటి ఢోకా లేకుండా పోయింది. ఈ వారంలోనే విడుదల కాబోతున్న మరో క్రేజీ మూవీ 'లెనిన్' లోనూ ఆయన అత్యంత కీలకమైన పాత్రలో అలరించబోతున్నారు. ఇలా తెలుగులో బ్యాక్ టు బ్యాక్ ప్రాజెక్టులతో దూసుకుపోతున్న శివాజీకి, తాజాగా పక్కనే ఉన్న కోలీవుడ్ నుండి ఒక భారీ, అద్భుతమైన అవకాశం లభించింది. 'లవ్ టుడే', 'డ్రాగన్', 'డ్యూడ్' వంటి చిత్రాలతో అటు తమిళంలోనే కాకుండా ఇటు తెలుగు ప్రేక్షకుల్లోనూ విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్న యువ నటుడు, దర్శకుడు ప్రదీప్ రంగనాథన్ ఇప్పుడు నిర్మాతగా మారుతున్నారు. ప్రదీప్ రంగనాథన్ స్వయంగా కథ అందిస్తూ, నిర్మాతగా వ్యవహరిస్తున్న సరికొత్త క్రేజీ ప్రాజెక్టులో శివాజీ ఒక కీలక పాత్రకు ఎంపికయ్యారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన అధికారిక అనౌన్స్‌మెంట్ వీడియోను చిత్ర బృందం చాలా డిఫరెంట్‌గా, ఒక రేంజ్‌లో ప్లాన్ చేసి విడుదల చేసింది. ఆరుగురు ప్రతిభావంతులైన కుర్రాళ్లు కలిసి 'పీఆర్ ఆల్ఫా యూనిట్' పేరుతో రూపొందిస్తున్న ఈ క్రేజీ చిత్రంలో సౌత్ క్రష్, పాపులర్ నటి మామిత బైజు కథానాయికగా ప్రధాన పాత్ర పోషిస్తోంది. 'డ్రాగన్' చిత్ర దర్శకుడు అశ్వత్ మారిముత్తు కూడా ఈ సినిమాలో ఒక ముఖ్యమైన పాత్రలో కనిపిస్తుండగా, మరో అత్యంత ప్రాధాన్యత కలిగిన పాత్రధారిగా తెలుగు నటుడు శివాజీని ఈ అనౌన్స్‌మెంట్ వీడియో ద్వారా అఫీషియల్‌గా పరిచయం చేశారు. ఈ ప్రత్యేకమైన ప్రమోషనల్ వీడియోలో శివాజీకి స్పేస్ ఇచ్చి, హైలైట్ చేశారంటేనే సినిమాలో ఆయన పాత్రకు ఎంతటి ప్రాధాన్యత ఉందో సులభంగా అర్థం చేసుకోవచ్చు. ఈ లాంచ్ వీడియోకి ఒక్క‌రోజులోనే 10 మిలియ‌న్ వ్యూస్ ల‌భించ‌డం గొప్ప విశేషంగా చెప్పుకోవ‌చ్చు. నిజానికి 'కోర్ట్', 'దండోరా' వంటి సక్సెస్‌ఫుల్ ప్రాజెక్టుల వల్ల ఇతర భాషల మేకర్స్‌లోనూ శివాజీ నటనపై మంచి ఇంప్రెషన్ ఏర్పడింది. శివాజీలో ఉన్న అద్భుతమైన పెర్ఫామర్‌ను, టైమింగ్‌ను గుర్తించి ప్రదీప్ రంగనాథన్ స్వయంగా ఆయనను ఈ ముఖ్యమైన పాత్ర కోసం ఎంపిక చేసినట్లు ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. ఈ తమిళ చిత్రంలో గనుక శివాజీ తనదైన ముద్ర వేసి, అక్కడి ప్రేక్షకులను మెప్పించగలిగితే కోలీవుడ్‌లోనూ ఆయనకు వరుస ఆఫర్లు రావడం ఖాయం. ఒక నటుడిగా కెరీర్ ముగిసిపోయింది అనుకున్న దశ నుండి, ఇలా ఊహించని రీతిలో పుంజుకుని, పరభాషా చిత్రాల్లో సైతం క్రేజీ ఆఫర్లు సొంతం చేసుకుంటూ శివాజీ సాగిస్తున్న ఈ ప్రయాణం మరియు కెరీర్ గ్రాఫ్ నిజంగా అందరినీ ఆశ్చర్యపరిచేలా, స్ఫూర్తినిచ్చేలా ఉందనడంలో ఎలాంటి సందేహం లేదు.     Shivaji Sontineni, Pradeep Ranganathan, Mamitha Baiju
Thaman started promoting his film, Hrudhayam Murali/ Idayam Murali. He acted in the movie and composed music too. He promoted the film in Hyderabad and talked about how he is happy with the film. He called it one of his best romantic films and has a nostalgic connection with actor Murali.  During his speech, he stated that he used to play cricket with Rajamouli team and had fun. As college students asked about OG 2 Update, he stated that something is brewing in September. Pawan Kalyan has took over the production of the film from DVV Danayya and he actively started promoting as well with his PKCW producing.  Pawan Kalyan Creative Works is producing it in a big way and Sujeeth is directing the most awaited prequel to OG. As Pawan Kalyan's birthday falls on 2nd September, the movie makers seem to planning to start shoot and reveal an update. Seems like the makers have some big plans coming up.  Idayam Murali has Atharvaa, Fahadh Faasil, Kayadu Lohar, Preity Mukundan, Niharika NM playing in lead roles with Thaman. The movie is releasing on 10th July in Telugu and Tamil languages. It is directed by Aakash Baskaran.  Disclaimer: This article is based on discussions and information shared across publicly available sources and social media. Interpretations remain those of the users involved. Readers are encouraged to exercise discretion before drawing conclusions.
సినీ పరిశ్రమలో మల్టీ టాలెంటెడ్ పర్సనాలిటీ అనగానే మనకు టక్కున గుర్తొచ్చే పేర్లలో రాఘవ లారెన్స్ ఒకరు. గ్రూప్ డాన్సర్‌గా కెరీర్ ప్రారంభించి, ఆ తర్వాత స్టార్ కొరియోగ్రాఫర్‌గా ఎదిగి, హీరోగా, దర్శకుడిగా, నిర్మాతగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నారు. ముఖ్యంగా ఒక సాదాసీదా కొరియోగ్రాఫర్ డైరెక్టర్ కాబోతున్నాడనే వార్త వచ్చినప్పుడు టాలీవుడ్‌లో ఎన్నో సందేహాలు వ్యక్తమయ్యాయి. కానీ, కింగ్ అక్కినేని నాగార్జున లాంటి స్టార్ హీరో లారెన్స్ లోని క్రియేటివిటీని నమ్మి, తన సొంత నిర్మాణ సంస్థలో దర్శకుడిగా అవకాశం ఇవ్వడం అప్పట్లో ఒక సంచలనం. ఆ నమ్మకాన్ని వమ్ము చేయకుండా లారెన్స్ తెరకెక్కించిన 'మాస్' సినిమా బాక్సాఫీస్ వద్ద ఎంత పెద్ద విజయం సాధించిందో మనందరికీ తెలిసిందే. ఆ ఒక్క సినిమాతో తన దర్శకత్వ ప్రతిభపై అంచనాలు పెంచేసిన లారెన్స్, ఆ తర్వాత హార్రర్ కామెడీ జానర్‌లో 'కాంచన' సిరీస్‌తో ఇండస్ట్రీ షేక్ అయ్యే రేంజ్ సెన్సేషన్ క్రియేట్ చేశారు. ప్రస్తుతం లారెన్స్ చేతినిండా క్రేజీ ప్రాజెక్టులతో ఫుల్ బిజీగా ఉన్నారు. ఒకవైపు స్టార్ హీరోయిన్ పూజా హెగ్డేతో కలిసి స్వీయ దర్శకత్వంలో 'కాంచన-4' సినిమాను ప్లాన్ చేస్తుండగా, మరోవైపు స్టార్ డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ ప్రొడక్షన్‌లో 'బెంజ్' అనే విభిన్నమైన యాక్షన్ ఎంటర్‌టైనర్‌లో నటిస్తున్నారు. ఇలాంటి బిజీ షెడ్యూల్‌లో కూడా రాఘవ లారెన్స్ తన సొంత బ్యానర్‌లో ఒక సరికొత్త సినిమాను అనౌన్స్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఈ సినిమా లారెన్స్ కెరీర్‌లో మైల్‌స్టోన్ లాంటి 30వ సినిమా కావడం విశేషం. అయితే ఈ ల్యాండ్‌మార్క్ సినిమా వెనుక ఒక ఊహించని ట్విస్ట్ ఉంది, అదే ఇప్పుడు సినీ సర్కిల్స్‌లో హాట్ టాపిక్‌గా మారింది. ఈ సారి లారెన్స్ ఒంటరిగా కాకుండా, మరొక కొత్త దర్శకుడితో కలిసి మెగాఫోన్ పట్టబోతున్నారు. పుగళ్ అనే నూతన దర్శకుడితో కలిసి లారెన్స్ ఈ 30వ చిత్రాన్ని సంయుక్తంగా తెరకెక్కించనుండటం విశేషం. సాధారణంగా ఇండస్ట్రీలో ఇద్దరు దర్శకులు కలిసి సినిమాలు చేయడం కొత్తేమీ కాదు. తెలుగు మూలాలున్న రాజ్-డీకే లాంటి ఎంతోమంది కాంబినేషన్లు సక్సెస్ అయ్యాయి. కానీ, ఇప్పటికే దర్శకుడిగా బ్లాక్‌బస్టర్ హిట్లు కొట్టి, మంచి గుర్తింపు తెచ్చుకున్న లారెన్స్ లాంటి సీనియర్, ఇప్పుడిలా ఒక కొత్త దర్శకుడితో దర్శకత్వాన్ని పంచుకోవడం నిజంగా ఆసక్తికరమైన విషయమే. కొత్త టాలెంట్‌ను ప్రోత్సహించడంలో ఎప్పుడూ ముందుండే లారెన్స్, ఈ నిర్ణయంతో మరోసారి తన ఉదారతను చాటుకున్నారు. ఇక ఈ క్రేజీ ప్రాజెక్ట్‌కి ప్రస్తుతం సౌత్ ఇండియాలోనే మ్యూజిక్ సెన్సేషన్‌గా దూసుకుపోతున్న సాయి అభ్యంకర్ సంగీతాన్ని అందించబోతున్నారు. ఈ ప్రతిష్టాత్మక చిత్రానికి సంబంధించిన పూర్తి కాస్ట్ అండ్ క్రూ వివరాలతో పాటు, ఒక అదిరిపోయే అనౌన్స్‌మెంట్ టీజర్‌ను ఈ నెల 12వ తేదీన గ్రాండ్‌గా విడుదల చేయడానికి చిత్రబృందం సిద్ధమైంది. ఇప్పటివరకు స్వీయ దర్శకత్వంలో ఎక్కువగా హార్రర్ కామెడీలతో మెప్పించిన లారెన్స్, ఈ కొత్త దర్శకుడి కాంబినేషన్‌లో ఎలాంటి సరికొత్త మ్యాజిక్ క్రియేట్ చేయబోతున్నారో చూడాలి.     Raghava Lawrence, Kanchana 4, Sai Abhyankar 
Karan Johar has pulled off one of the biggest distribution deals in recent Bollywood history. According to the latest reports, Dharma Productions has acquired the India theatrical distribution rights of Ranbir Kapoor's much-awaited mythological epic Ramayana: Part 1 in a deal worth around ₹250 crore. The agreement reportedly brings Dharma on board as the nationwide distributor for one of Indian cinema's most ambitious projects. Produced by Namit Malhotra's Prime Focus Studios in association with Yash's Monster Mind Creations, Ramayana has already generated massive buzz with its first glimpse. The film stars Ranbir Kapoor as Lord Rama, Sai Pallavi as Sita, and Yash as Ravana, while Nitesh Tiwari directs the two-part epic. The makers are mounting the franchise on a reported budget of nearly ₹4,000 crore for both installments, making it one of the costliest Indian film projects ever. For Dharma Productions, the deal marks a major strategic move. While the banner has produced and distributed several blockbuster films over the years, securing the theatrical distribution rights of Ramayana further strengthens its position in the exhibition business. Industry circles see it as a vote of confidence in the film's box office potential, especially with the Diwali release window expected to attract audiences across the country. With the distribution partner now locked, the focus shifts to the film's marketing campaign. Given the scale of the project, the star cast, and the mythology-driven appeal, Ramayana: Part 1 is already shaping up to be one of the biggest theatrical events in Indian cinema. Disclaimer: This article is based on discussions and information shared across publicly available sources and social media. Interpretations remain those of the users involved. Readers are encouraged to exercise discretion before drawing conclusions.
  సుదీర్ఘ కాలం నుంచి సౌత్ చిత్రపరిశ్రమలో రాణిస్తూ తనదైన పెర్ఫార్మ్ తో ఎంతో మంది అభిమానులని సంపాదించుకున్న సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సీత అచ్చ తెలుగు నటి 'అంజలి'(Anjali). సోషల్ మీడియాలో కొన్ని రోజుల నుంచి  అంజలి వ్యక్తిగత జీవితం, తోటి హీరోలతో ముడిపెడుతూ కొన్ని  రూమర్లు షికారు చేస్తున్నాయి. అంజలి అప్ కమింగ్  తమిళ చిత్రం 'మగుడం' ప్రచార కార్యక్రమాల్లో రూమర్స్ పై  అంజలి స్పందించింది. అంజలి మాట్లాడుతు 'ఇండస్ట్రీలో ఒకరితో పని చేసిన ప్రతిసారీ ఇలాంటి ప్రచారాలు జరగడం దురదృష్టకరం. నేను ఒకరి పేరు చెప్పి క్లారిటీ ఇస్తే, మీరు వెంటనే ఇంకొకరి గురించి అడుగుతారు. అందుకే నేను ఎవరి పేరు ప్రత్యేకంగా ప్రస్తావించదలచుకోలేదు.   ప్రస్తుతం నా జీవితంలో ఎవరూ లేరు. నేను ఒంటరిగానే ఉన్నాను. స్కూల్ చదువుకునే రోజుల్లో ఒక క్లాస్‌మేట్  వరుసగా ప్రపోజ్ చేస్తూ వెంటపడేవాడు. ఒకరోజు  నాకు ఒక వింత ఛాలెంజ్ విసిరాడు. "నువ్వు నాకు రాఖీ కట్టి చూడు" అంటూ సవాల్ చేసాడు. దాంతో  ఏమాత్రం సంకోచించకుండా అతనికి రాఖీ కట్టేసాను. అలా రాఖీ కడితే ఇక ఆ అబ్బాయి తన వెంట పడటం ఆపేస్తాడని భావించాను. కానీ  సీన్ పూర్తిగా రివర్స్ అయింది. ఆ అబ్బాయి ఏమాత్రం తగ్గకుండా, వెంటనే ఆ రాఖీని చేతి నుంచి తీసేసి, తిరిగి నాకే ఇచ్చేసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు అని అంజలి చెప్పుకొచ్చింది. anjali, magudam Also read: maa inti bangaaram: మూడోవారంలో మా ఇంటి బంగారం కలెక్షన్స్ పరిస్థితి ఇదే   
గత కొన్ని రోజులుగా టాలీవుడ్ ను తీవ్రంగా వేధిస్తోన్న ఒకే ఒక్క సమస్య 'పర్సంటేజ్ విధానం'. సినిమా కలెక్షన్లలో థియేటర్ల యాజమాన్యాలకు, నిర్మాతలకు మధ్య వచ్చే లాభాల వాటా గురించిన ఈ వివాదం ఇప్పుడు టాలీవుడ్‌లో మళ్లీ మొదటికొచ్చింది. కొద్దిరోజుల క్రితం పెద్ది సినిమా విడుదలయ్యే ముందు ఈ పర్సంటేజ్ విధానం మీద ఎగ్జిబిటర్లు తీవ్రమైన హడావుడి చేశారు. ఆ సమయంలో పరిస్థితి చేజారిపోకుండా చూసేందుకు మెగాస్టార్ చిరంజీవి స్వయంగా రంగంలోకి దిగారు. ఎగ్జిబిటర్లతో మాట్లాడి, ఈ సమస్యను తాత్కాలికంగా సద్దుమణిగించారు. తనకు కొంచెం సమయం ఇవ్వాలని, ఈసారి ఎలాంటి వాయిదాలు లేకుండా శాశ్వత పరిష్కారం చూపిస్తానని చిరంజీవి హామీ ఇవ్వడంతో ఎగ్జిబిటర్లు కూడా వెనక్కు తగ్గారు.  కానీ ఆ తర్వాత చాలా గ్యాప్ వచ్చేసింది. అనుకున్న సమయం దాటిపోవడంతో తెలంగాణ ఎగ్జిబిటర్లు అంతా కలిసి నిన్న అత్యవసరంగా సమావేశం అయ్యారు. ఇందులో భాగంగానే కొందరు కీలక సభ్యులు వెళ్లి చిరంజీవిని మరోసారి కలిసినట్లు తెలుస్తోంది. ఈ చర్చల్లో చిరంజీవి ఎగ్జిబిటర్ల బాధలను విన్నారని, ఈ సమస్యపై మరింత లోతుగా చర్చించేందుకు తనకు మరో వారం రోజుల సమయం కావాలని కోరినట్లు ఇండస్ట్రీ వర్గాల్లో గట్టిగా వినిపిస్తోంది. అయితే ఈ పర్సంటేజ్ వివాదంపై నిర్మాతల ఆలోచన మాత్రం పూర్తిగా వేరుగా ఉంది. థియేటర్ల యాజమాన్యాలు కోరుతున్న ఈ పర్సంటేజ్ ఆలోచనను కనీసం ఒక ఏడాదిన్నర పాటు పక్కన పెట్టాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఎందుకంటే, రాబోయే ఈ ఏడాదిన్నర కాలంలో ప్రస్తుతం ప్లానింగ్ దశలో ఉన్న భారీ బడ్జెట్ సినిమాలు అన్నీ థియేటర్లలోకి వచ్చేస్తాయి. ఆ క్రేజీ ప్రాజెక్టులన్నీ విడుదలైపోయిన తర్వాత, అంటే వచ్చే 2028 సంవత్సరం నుంచి ఈ పర్సంటేజ్ విధానాన్ని అమలు చేసుకోవచ్చు అనేది నిర్మాతల ప్రధాన వ్యూహంగా కనిపిస్తోంది. కానీ, నిర్మాతల ప్రతిపాదనను ఎగ్జిబిటర్లు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ ఏడాదిన్నర కాలం పాటు తాము ఆగితే, అప్పటివరకు సింగిల్ స్క్రీన్ థియేటర్లు తట్టుకోలేవని, చాలా వరకు సింగిల్ స్క్రీన్స్ పూర్తిగా మాయం అయిపోతాయని ఎగ్జిబిటర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిజానికి నిర్మాతల మదిలో ఉన్న అసలు ప్లాన్ కూడా ఇదే అయి ఉండొచ్చనే అనుమానాలు ఇండస్ట్రీలో వ్యక్తమవుతున్నాయి. మరో ఏడాదిన్నర కాలం పాటు ఈ వివాదాన్ని సాగదీస్తే, ఈలోగా పట్టణాల్లో, నగరాల్లో మల్టీప్లెక్స్‌లు ఇబ్బడిముబ్బడిగా పెరిగిపోతాయి. మల్టీప్లెక్స్‌ల సంఖ్య పెరిగితే, అప్పుడు ఈ పాత సింగిల్ స్క్రీన్ థియేటర్లతో వచ్చే తలనొప్పులు, డిమాండ్లు ఏవీ నిర్మాతలకు ఉండవు. ఈ పరిణామాలు గమనిస్తుంటే మొత్తం మీద ఈ పర్సంటేజ్ వివాదం ఎప్పటికీ ఒక కొలిక్కి వచ్చేలా కనిపించడం లేదు.      Tollywood, Percentage Controversy, Exhibitors, Chiranjeevi  
సమంత(Samantha)పని ఇక అయిపోయిందా అనే అనుమానపు మాటలు అభిమానులు, ప్రేక్షకుల నోళ్ళల్లో వినిపిస్తున్న వేళ, మీ అనుమానాలు నా దగ్గర నడవవు అంటు  'మా ఇంటి బంగారం' తో ఇచ్చి పడేసింది. రిలీజైన ఫస్ట్ డే నుంచే అద్భుతమైన వసూళ్లతో దూసుకుపోతోంది. ప్రెజెంట్ సినీ రోజుల్లో లేడీ ఓరియెంటెడ్ సినిమాలకి మార్కెట్‌లో ఉండే అంచనాలను తలకిందులు చేస్తూ, మూడో వారంలోనూ అదే జోరును ప్రదర్శిస్తుండటం ట్రేడ్ వర్గాలని  సైతం  ఆశ్చర్యానికి గురిచేస్తోంది. కేవలం ఐదు రోజుల్లోనే 50 కోట్ల మైలురాయిని దాటగా, 100 కోట్ల క్లబ్‌కి అత్యంత చేరువలో నిలిచింది. స్టిల్  ప్రపంచవ్యాప్తంగా 96.74 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించి, టాలీవుడ్‌లో అత్యధిక వసూళ్లు సాధించిన మహిళా ప్రధాన చిత్రంగా సరికొత్త రికార్డుని  లిఖించింది. మా ఇంటి బంగారం  ప్రస్థానాన్ని ఒకసారి పరిశీలిస్తే, మొదటి రోజే థియేటర్లలో సాలిడ్ ఓపెనింగ్స్‌ను నమోదు చేసింది. ప్రపంచవ్యాప్తంగా 2,658 షోలలో ప్రదర్శితమైన ఈ చిత్రం తొలిరోజే రూ.13.25 కోట్ల వరల్డ్‌వైడ్ గ్రాస్ కలెక్షన్స్ సాధించి అందరినీ ఆకట్టుకుంది. ఇందులో కేవలం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల నుంచే రూ.4.75 కోట్ల గ్రాస్ వసూలు కాగా, ఓవర్సీస్ మార్కెట్ నుండి రూ.6.50 కోట్ల భారీ వసూళ్లు రావడం విశేషం. మిగిలిన ప్రాంతాలైన కర్ణాటకలో రూ.90 లక్షలు, తమిళనాడులో రూ.38 లక్షల గ్రాస్ నమోదయ్యాయి. ఈ సినిమాకు లభించిన మౌత్ టాక్ కారణంగా మొదటి రోజు ఉదయం షోలకు కేవలం 26.15 శాతంగా ఉన్న ఆక్యుపెన్సీ, రాత్రి షోల సమయానికి ఏకంగా 51.38 శాతానికి పెరిగింది. మరీ ముఖ్యంగా ప్రీమియం తెలుగు EPIQ ఫార్మాట్‌లో ఏకంగా 96 శాతం ఓవరాల్ ఆక్యుపెన్సీతో థియేటర్లు హౌస్‌ఫుల్ అయ్యాయి. Also read: Vijay: అదంతా పక్కా ఫేక్.. మరి అంత హడావిడి చేసారుగా 'ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ పై తన భర్త తో కలిసి సమంత  నిర్మించిన ఈ చిత్రంలో గుల్షన్ దేవయ్య, దిగంత్, గౌతమి కీలక రోల్స్  పోషించగా, సంతోష్ నారాయణన్ అందించిన సంగీతం సినిమాకు ప్రధాన బలంగా నిలిచింది.నందిని రెడ్డి దర్శకురాలు.    
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు. వారితో పాటు పెద్ద సంఖ్యలో క్యాడర్ కూడా పార్టీని వీడుతున్నారు. ఇక ఇప్పుడు నామినేటెడ్ పదవులలో ఉన్న వారి వంతు మొదలైనట్లు కనిపిస్తోంది. తనకు కానీ తన భర్తకు  కానీ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు టికెట్ ఇవ్వాలంటూ గత  కొంత కాలంగా కోరుతూ వస్తున్న మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ వంతు వచ్చింది. ఆమె కూడా రాజీనామా అస్త్రం సంధించారు.  జగన్ కు నమ్మిన బంటుగా గుర్తింపు పొందిన మహిళాకమిషన్ చైర్ పర్సన్ వాసి రెడ్డి పద్మ తన పదవికి రాజీనామా చేశారు. ఉరుములేని పిడుగులా, ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా తన రాజీనామా లేఖను సీఎం జగన్ కు పంపేశారు. పేరుకు తాను పార్టీకి కాదు, కేవలం మహిళా కమిషన్ చైర్మన్ పదవికి మాత్రమే రాజీనామా చేశాననీ, ఇక నుంచి వైసీపీ కోసం పని చేస్తాననీ వాసిరెడ్డి పద్మ చెబుతున్నప్పటికీ, ఆమె రాజీనామాకు కారణం అసంతృప్తేనని పార్టీ వర్గాలు బాహాటంగానే చెబుతున్నాయి. చాలా కాలంగా వాసిరెడ్డి పద్మ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు తనకు కానీ తన భక్తకు కానీ పార్టీ టికెట్ ఇవ్వాలని జగన్ ను కోరుతూ వస్తున్నారు. అయితే ఇప్పటి వరకూ జగన్ చూద్దాం.. చేద్దాం అన్నట్లుగా దాట వేస్తూనే వచ్చారు. ఇప్పుడిక వరుసగా అభ్యర్థల జాబితాలను జగన్ ప్రకటించేస్తుండటం, తనకు గానీ తన భర్తకు కానీ పార్టీ టికెట్ విషయంలో ఎటువంటి స్పస్టత ఇవ్వకపోవడంతో ఆమె మనస్తాపం చెంది పదవికి రాజీనామా చేసేశారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.  వాసిరెడ్డి పద్మ రాజకీయ ప్రవేశం ప్రజారాజ్యం పార్టీతో జరిగింది. 2009లో ఆమె ప్రజారాజ్యం పార్టీలో చేరారు. ఇలా చేరడంతోనే ఆమె ప్రజారాజ్యం అధికార ప్రతినిథిగా పదవి దక్కించుకున్నారు. ప్రజారాజ్యం కాంగ్రెస్ పార్టీలో విలీనం కావడంతో ఆమె 2012లో జగన్ పార్టీలో చేరారు. జగన్ కూడా ఆమెకు అధికార ప్రతినిథి పదవి ఇచ్చారు.  2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆమెను రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా నియమించారు. చైర్ పర్సన్ హోదాలో ఆమె జగన్ మెప్పు పొందేందుకు చేయగలిగినంతా చేశారు. ప్రతిపక్ష పార్టీ నేతలకు నోటీసులు ఇచ్చారు. ఏకంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు సైతం నోటీసులు జారీ చేశారు. వార్డు వలంటీర్లపై పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు కమిషన్ ముందు హాజరై వివరణ ఇవ్వాలంటూ ఆమె పవన్ కు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. పవన్ హాజరు కాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు నమోదు చేయాలని ఆదేశించారు. ఇన్ని చేసినా వాసిరెడ్డి పద్మకు ఆమె కోరినట్లుగా పార్టీ టికెట్ లభించకపోవడంతో అలిగి పదవికి రాజీనామా చేశారని, ఇది జగన్ కు షాకేననీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు. ఒకరైతు తనకు చేసిన సేవలకు ప్రీతి చెందిన గురువు అతడికి స్వర్గ ప్రాప్తిని కలగజేయాలని అనుకుంటాడు. కానీ సంసారాసక్తి వల్ల ఆ రైతు ఆ అవకాశాన్ని వాయిదా వేసుకుంటూ వస్తాడు. చివరికి గురుకృప వల్ల ఆ రైతు స్వర్గ ప్రాప్తిని ఎలా పొందాడో ఈ కథ తెలియజేస్తుంది. "ఒక మహాపురుషుడు ప్రయాణం చేస్తూ, డస్సిపోయాడు. గొంతు ఎండిపోయింది. దారిలో ఒక రైతు కనపడితే నీళ్ళు అర్థించాడు. ఆ రైతు మహాత్మునికి సకల ఉపచారాలూ చేశాడు. చిరిగిపోయిన ఆయన ఉత్తరీయాన్ని రైతు జాగ్రత్తగా కుట్టి బాగుచేశాడు. రైతు పరిచర్యలకు సంతసించిన ఆ మహాత్ముడు శాంతి, ఆనందాలకు నిలయమైన స్వర్గానికి తనతోపాటు రమ్మని అంటాడు. అందుకు ఆ రైతు 'గురువుగారూ! మీరు నా మీద చూపిన దయకు కృతజ్ఞుణ్ణి. కానీ నా పిల్లలు ఇంకా చిన్నవాళ్ళు. ఓ ఏడేళ్ళ వ్యవధి ఇవ్వండి' అని అడుగుతాడు. అందుకు గురువు అంగీకరించాడు. సరిగ్గా ఏడేళ్ళ తర్వాత గురువు రైతును స్వర్గానికి తీసుకువెళ్ళడానికి వచ్చాడు. అప్పుడు రైతు 'అయ్యా! కడపటి కొడుకు కష్టాలకు అంతు లేదు. అన్ని జంఝాటాలనూ ఒక్కడే సంబాళించుకోలేకపోతున్నాడు. కాబట్టి మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని గురువుని అడిగాడు. మరో ఏడేళ్ళ తరువాత గురువు వచ్చాడు. కానీ రైతు చనిపోయాడని తెలిసింది. చనిపోయిన ఆ రైతు ఎద్దుగా పుట్టాడని ఆ గురువు తన దివ్య దృష్టితో తెలుసుకున్నాడు. ఎద్దుగా పుట్టిన ఆ రైతు తన కొడుకు పొలాన్నే దున్నుతున్నాడు. అప్పుడు గురువు ఆ ఎద్దుపై మంత్ర జలం చిలకరించగానే ఎద్దు జన్మనెత్తిన రైతు 'నా కొడుకు పరిస్థితి మరి కాస్త మెరుగు పడనీయండి స్వామీ! మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని అన్నాడు. ఇక చేసేది లేక వెనుదిరిగాడు గురువు. మరలా ఏడేళ్ళ తర్వాత వచ్చిన గురువుకు ఎద్దు చనిపోయిందని తెలిసింది. అది కుక్కగా పుట్టి కొడుకు ఇంటినీ, ఆస్తినీ కాపలా కాస్తోందని తన దివ్యదృష్టి ద్వారా తెలుసుకున్నాడు. గురువు. కుక్కగా పుట్టిన ఆ రైతు 'స్వామీ! నేను ఎంత దౌర్భాగ్యుణ్ణి. మీరు ఇంత దయ చూపుతున్నప్పటికీ మీతో స్వర్గమానం చేయలేకున్నాను. వీడికి ఆస్తిని కాపాడుకొనే దక్షత ఇంకా రాలేదు. కాబట్టి దయ చేసి మరో ఏడేళ్ళు వ్యవధి ఇవ్వండి' అని వేడుకున్నాడు. గురువు ఏడేళ్ళ తరువాత మళ్ళీ వచ్చేసరికి కుక్క మరణించింది. అది త్రాచుపాముగా జన్మనెత్తి, ఇప్పుడు కొడుకు భూమిలో ఉన్న లంకెబిందెలకు పడగెత్తి కాపలా కాస్తోంది. గుప్త ధనం ఇక్కడ ఉందని కొడుకుకి ఎలా తెలియజేయాలా అని పాము ఆలోచిస్తున్నప్పుడు గురువు ఆ రైతుకొడుకును పిలుచుకు వచ్చి లంకె బిందెలు ఉన్న చోట తవ్వమన్నాడు. లంకె బిందెలు బయటపడ్డాయి. ఆ పైన ఆ పామును చంపమన్నాడు. అనంతరం శిష్యుణ్ణి తీసుకొని స్వర్గారోహణం చేశాడు గురువు. సంసారంలోని ఈతి బాధల నుండి శిష్యుణ్ణి ఉద్ధరిస్తాడు సద్గురువు. అలాంటి గురువు అందరికీ అవసరం.                                      *నిశ్శబ్ద.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్  రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది.  80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత  ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది.   ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది. ఆమెది నెద‌ర్లాండ్స్‌. ఆమె తండ్రి నెద‌ర్లాండ్స్‌లోని ఆర్నెహెమ్‌లో చిన్న‌పిల్ల‌ల ఆస్ప‌త్రి డైరెక్ట‌ర్. పోయి దొరికిన ఆ పెయింటింగ్ విష‌యానికి వ‌స్తే.. అది 1683లో కాస్ప‌ర్ నెష‌ర్ వేసిన స్టీవెన్ ఓల్ట‌ర్స్ పెయింటింగ్‌. రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో నాజీల ఆదేశాల‌ను చార్లెట్ తండ్రి వ్య‌తిరేకించారు. ఆయ‌న ర‌హ‌స్య జీవ‌నం సాగించేడు. కానీ ఈ పెయింటింగ్‌ని మాత్రం త‌న న‌గ‌రంలోని ఒక బ్యాంక్‌లో భ‌ద్ర‌ ప‌ర‌చ‌మ‌ని ఇచ్చార‌ట‌. 1940లో నాజీలు నెద‌ర్లాండ్ పై దాడులు చేసినపుడు ఆ బ్యాంక్ మీద ప‌డి దోచుకున్నా రు. అప్పుడు ఈ పెయింటింగ్ కూడా తీసుకెళ్లారు. యుద్ధం అయిపోయిన త‌ర్వాత ఈ పెయింటింగ్ ఎక్క‌డున్న‌దీ ఎవ‌రికీ తెలియ‌లేదు. చిత్రంగా 1950ల్లో డ‌స‌ల్‌డార్ష్ ఆర్ట్ గ్యాల‌రీలో అది ప్ర‌త్య‌క్ష‌మ‌యింది. 1969లో ఆమ్‌స్ట‌ర్‌డామ్‌లో దాన్ని వేలానికి తీసికెళ్లే ముందు దాన్ని ఆ ఆర్ట్ గ్యాల‌రీలో వుంద‌ని చూసిన‌వారు చెప్పారు. వేలంపాట త‌ర్వాత మొత్తానికి ఆ పెయింటింగ్‌ను 1971లో ఒక క‌ళాపిపాసి త‌న ద‌గ్గ‌ర పెట్టుకున్నాడు.    ఆ త‌ర్వాత 2021లో అది చార్లెటీని చేరింది.  మొత్తానికి వూహించ‌ని విధంగా ఎంతో కాలం దూర‌మ‌యిన గొప్ప క‌ళాఖండం తిరిగి త‌న వ‌ద్ద‌కు చేర‌డంలో చార్లెటీ ఆనందానికి అంతేలేదు. అంతే క‌దా.. పోయింద‌నుకున్న గొప్ప వ‌స్తువు తిరిగి చేరితే ఆ ఆనంద‌మే వేరు!  అయితే చార్లెటీకి ఇపుడు ఆ పెయిం టింగ్‌ను భ‌ద్రంగా చూసుకునే ఆస‌క్తి వున్న‌ప్ప‌టికీ శ‌క్తి సామ‌ర్ధ్యాలు లేవు. అందుక‌నే త్వ‌ర‌లో ఎవ‌రిక‌యినా అమ్మేసీ వ‌చ్చిన సొమ్మును పిల్ల‌ల‌కు పంచుదామ‌నుకుంటోందిట‌!  చార్లెటీ కుటుంబంలో అయిదుగురు అన్న‌ద‌మ్ములు అక్క‌చెల్లెళ్లు వున్నారు. అలాగే ఇర‌వై మంది పిల్ల‌లు ఉన్నారు. అంద‌రూ ఆమె అంటే ఎంతో ప్రేమ చూపుతున్నారు. అంద‌రం ఒకే కుటుంబం, చాలాకాలం త‌ర్వాత ఇల్లు చేరిన క‌ళాఖండం మా కుటుంబానిది అన్న‌ది చార్లెటీ!
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు. చాకోను పార్టీలోకి ఆహ్వానిస్తూ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్’ ఫ్రంట్ ఏర్పాటు గురించి ప్రత్యేకించి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు కానీ, చాకో అలాంటి  సంకేతాలు ఇచ్చారు. ప్రస్తుతం దేశంలో ఉన్న ఏ ఒక్కపార్టీ కూడా బీజేపీకి ప్రత్యాన్మాయం కాదని,సమీప భవిష్యత్ కాంగ్రెస్ సహా ఏ పార్టీ కూడా ఆ స్థాయికి ఎదిగే అవకాశాలు కూడా కనిపించడంలేదని అన్నారు. ఈ పరిస్థితుల్లో దేశంలోని బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ, ఏకమై, ఒకే గొడుగు కిందకు రావలసిన అవసరం ఉందని చాకో అన్నారు. అదే సమయంలో ప్రతిపక్షాలను ఏక తాటిపైకి తెచ్చే బాధ్యతను పవార్ తీసుకోవాలని సంకేత మాత్రంగా చెప్పారు. అంతే కాకుండా కాంగ్రెస్ పేరు ఎత్తకుండా బీజేపీ వ్యతిరేక శక్తులను ఏకం చేసే ఆలోచన ఆ పార్టీ నాయకత్వానికి లేదని నెహ్రూ గాంధీ ఫ్యామిలీ (సోనియా, రాహుల్, ప్రియాంక)ఆలోచనా ధోరణిని పరోక్షంగానే అయినా ఎండ కట్టారు.ఆ విధంగా పవార్ ఆ బాధ్యత తీసుకోవాలని చాకో సూచించారు. ఇందుకు సంబంధించి, పవార్ బహిరంగంగా ఎలాంటి వ్యాఖ్య చేయలేదు. అయితే, చాకో సహా మరికొందరు ‘సీనియర్’ కాంగ్రెస్ నాయకులు, అలాగే సిపిఎం, సిపిఐ నాయకులు కూడా పవార్’తో చాలా కాలంగా థర్డ్ ఫ్రంట్  విషయంగా చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. అయితే మహారాష్ట్రలో సంకీర్ణం మనుగడను దృష్టిలో ఉంచుకుని పవార్ ఆచితూచి అడుగులేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే చాకో పార్టీలో చేరిన సందర్భంలో కూడా ‘చాకో చేరికతో మహారాష్ట్రలోని మహా వికాస్ అగాడీ ప్రభుత్వానికి ఎలాంటి నష్టం జరగదని, పవార్ మహారాష్ట్ర సంకీర్ణ సర్కార్ ప్రస్తావన చేశారని విశ్లేషకులు పేర్కొంటున్నారు.  మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వ మనుగడ గురించ్బి  పవార్ ప్రత్యేకంగా పేర్కొనడం ద్వారా, ఆయన థర్డ్ ఫ్రంట్ విషయంలో వేచి చూసే ఆలోచనలో ఉన్నట్లు అర్థమవుతోందని కూడా  రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే అదే ఎన్సీపీ అసెంబ్లీ ఎన్నికల జరుగతున్న కేరళలో, పశ్చిమ బెంగాల్లో  కాంగ్రెస్ వ్యతిరేక పార్టీలకు మద్దతు ఇస్తోంది. దీన్ని బట్టి చూస్తే, ఎన్సీపీ - కాంగ్రెస్ మధ్య దూరం పెరుగుతోందని స్పష్టమవుతోంది. అయితే, థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఏ రకంగా ముడి పడుతుంది అనే విషయంలో ఇంకా స్పష్టత రావలసి ఉంది. అలాగే, కాంగ్రెస్ లేకుండా జాతీయ స్త్గాయిలో బీజేపీ వ్యతిరేక కూటమిని ఏర్పాటు చేయడం వలన, వ్యతిరేక ఓటు చీలి  అది మళ్ళీ బీజేపీకే మేలు చేస్తుందని, కాబట్టి, ప్రస్తుతం కాంగ్రెస్ సారధ్యంలోని యూపీఏని బలోపేతం చేయడమే ఉత్తమమనే అలోచన కూడా  విపక్ష శిబిరం నుంచి వినవస్తోంది. ఈ నేపధ్యంలోనే, ప్రస్తుతం యూపీఏ ఛైర్పర్సన్’గా ఉన్న సోనియా గాంధీ వయసు, అనారోగ్యం కారణంగా బాధ్యతల నుంచి తప్పుకుని పవార్’కు బాద్యతలు అప్పగించాలనే ప్రతిపాదన వచ్చిందని అంటున్నారు. అలాగే, ఇతర పార్టీలను, ముఖ్యంగా కాంగ్రెస్ నుంచి విడిపోయి సొంత కుంపటి పెట్టుకున్న మమతా బెనర్జీ సారధ్యంలోని తృణమూల్, జగన్మోహన్ రెడ్డి సారధ్యంలోని వైసీపీలను కలుపుకుని కూటమిని బలోపేతం చేయడం ద్వారా బీజేపీని దీటుగా ఎదుర్కోవచ్చనే ఆలోచనలు కూడా సాగుతున్నాయి. అయితే, ఇటు థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు అయినా, యూపీఏని బలోపేతం చేయడమే అయినా, పవారే .. కేంద్ర బిందువు. ఆయన సారధ్యంలోనే ప్రత్యాన్మాయం అనేది విపక్ష శిభిరం నుంచి వినవస్తున్న ప్రస్తుత సమాచారం. మరి అదే జరిగితే రాహుల గాంధీ పరిస్థితి ఏమిటి ? గాంధీ నెహ్రూ కుటుంబం పరిస్థితి ఏమిటి? ఏ ప్రత్యేక ప్రాధాన్యత లేకుండా అందరిలో ఒకరిగా ఫస్ట్ ఫ్యామిలీ సర్దుకు పోతుందా? అంటే..చివరకు ఏమవుతుందో .. ఇప్పుడే చెప్పలేమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది. గతంలో అనేక సందర్భాలలో ముఖ్యమంత్రి కేసీఆర్,ఆర్థిక మంత్రి హరీశ రావు, కరోనా కారణంగా రాష్ట్ర  ఆదాయం గణనీయంగా తగ్గిందని, పేర్కొన్నారు. అయితే, కరోనా నుంచి వేగంగా కోలుకుని, ఆర్థికంగా అంతే వేగంగా పుంజుకున్న రాష్ట్రాలలో తెలంగాణ ప్రధమ స్థానంలో  ఉందని కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సర్వే 2020-21 నివేదిక పేర్కొంది. పడిలేచిన కెరటంలా, తెలంగాణ ‘వీ’ ఆకారంలో ఆర్థికంగా నిలతొక్కుందని కేంద్రం జనవరి  చివరి వారంలో విడుదల చేసిన ఆర్థిక సర్వేలో పేర్కొంది. అలాగే, రెవిన్యూ వసూళ్ళలో రాష్ట్రం కరోనా పూర్వస్థితికి చేరిందని కూడా సర్వే చెప్పింది.   అలాగే,రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు కూడా ఈ మధ్య కాలంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పై సంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరమ జనవరి,ఫిబ్రవరి, మార్చి నెలలతో పోలిస్తే ఈ సంవత్సరం ఈ మూడు నెలల కాలంలో రాష్ట్ర ఆర్థిక వృద్ది రేటు 10 నుంచి  15 శాతం మెరుగ్గా ఉందని హరీష్ రావు ఒకటి రెండు ఇంటర్వ్యూలలో పేర్కొన్నారు.అలాగే, బడ్జెట్ విషయంలోనూ ఆయన చాల ఆశావహ దృక్పథంతోనే ఉన్నారు. బడ్జెట్  పాజిటివ్’గా ఉంటుదని, ఎవ్వరూ ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని, సంక్షేమ పథకాలలో,ఇతరత్రా బడ్జెట్ కేటాయింపులలో ఎలాంటి కోతలు ఉండవని కూడా హరీష్ హామీ ఇచ్చారు. గత సంవత్సరంలో కొంత మేర హామీ ఇచ్చిన మేరకు అమలు చేయలేక పోయిన సొంత జాగాలలో డబల్ బెడ్ రూమ్ ఇళ్ళ నిర్మాణం, రుణ మాఫీ వంటి  పథకాలను ఈ బడ్జెట్ ద్వారా అమలు చేస్తామని చెప్పారు. అలాగే, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ తమిళి సై చేసిన ప్రసంగంలోనూ ఆశావహ దృక్పధమే వ్యక్తమైంది. ఆమె తమ ప్రసంగంలో,  ప్రభుత్వం సంక్షేమ పథకాలకు పెద్ద పీట వేసిందని అన్నారు. ‘సంపద పంచాలి ,పేదలకు పంచాలి’ అనేది తమ ప్రభుత్వ విధానమని స్పష్టం చేశారు. అలాగే, పెరుగతున్న ఆదాయంలో అధికశాతం సంక్షేమానికే వెచ్చిస్తున్నామని స్పష్టం చేశారు. దీంతో బడ్జెట్’లో కొత్త పథకాలకు శ్రీకారం చుట్టే అవకాశం ఉంటుందా అన్న చర్చ జరుగుతోంది. మరో వంక ఉద్యోగ వర్గాల్లో పీఆర్సీకి సంబంధించి ఆర్థిక మంత్రి తమ ప్రసంగంలో  ప్రకటన చేస్తారా లేదా అనే ఆసక్తి నెలకొంది. అలాగే, సామాన్య  ప్రజలు ఇటీవల పెరిగిన పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరల భారం నుంచి మంత్రి హరీష్, ఏదైనా ఉపసమనం కలిపిస్తారా అని ఎదురు చూస్తున్నారు. గతంలో వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సామాన్య ప్రజలపై వంటగ్యాస్ ధర భారాన్ని తగ్గించేందుకు కొంత మొత్తాన్ని, రూ.50(?) రాష్ట్ర ప్రభుత్వం తరపున  సబ్సిడీగా ఇచ్చిన విషయాన్ని, అదే విధంగా అసెంబ్లీ ఎన్నికలు జరుగతున్న తమిళనాడులో డిఎంకే పార్టీ,తమ పార్టీని అధికారంలోకి వస్తే  గ్యాస్ బండపై వంద రూపాయల సబ్సిడీ ఇస్తామని చేసిన  వాగ్దానాన్ని  గుర్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే, ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు, సోమవారం ఆర్థిక మంత్రి హరీష్ రావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఆర్థిక  శాఖ ముఖ్య కార్యదర్శి రామ కృష్ణా రావు,సలహాదారు జీఆర్ రెడ్డితో బడ్జెట్ పద్దులఫై సుదీర్ఘంగా చర్చించి తుది మెరుగులు దిద్దారు. బడ్జెట్ తుది రూపం సిద్దమైన నేపధ్యంలో ఆర్థిక శాఖ ప్రింటింగ్ ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 18 ఉదయం మంత్రి వర్గం ఆమోదం పొందిన అనంతరం ఆర్థికమంత్రి హరీష్ రావు అదే రోజు రాష్ట్ర బడ్జెట్ 2021-22ను సభలో ప్రవేశ పెడతారు. 20, 22 తేదీల్లో బడ్జెట్‌పై సాధారణ చర్చ,23, 24, 25 తేదీల్లో బడ్జెట్‌ పద్దులపై చర్చ ఉంటుంది 26న ద్రవ్యవినిమయ బిల్లు (బడ్జెట్)పై చర్చ, సభామోదం ఉంటాయి.
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది.  అధికార తెరాస, ఖమ్మం స్థానానికి సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర రెడ్డి పేరును ప్రకటించడంలో కొంచెం జాప్యం చేయడంతో పాటుగా, హైదరాబాద్ స్థానం నుంచి , పీవీ కుమార్తె వాణీ దేవి పేరును చివరి క్షణంలో తెరమీదకు తేవడంతో అంత వరకు కొంత స్తబ్దుగా సాగిన ప్రచారం ఆ తర్వాత వేడెక్కింది. ఉద్యోగ నియామకాల విషయంలో తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ తప్పులో కాలేయడంతో విపక్షాలు, పోటీలో ఉన్న ప్రత్యర్ధులు, నిరుద్యోగ యువత, విద్యార్ధి సంఘాలు  ఒకే సారి ఆయన మీద  విరుచుకు పడ్డారు. ఆయన లెక్క తప్పని నిరుపిస్తం రమ్మని వరస సవాళ్ళు విసిరారు. దీంతో, మంత్రి నియామకా ఇష్యూని పక్కకు తప్పించేందుకు , ఐటీఐఆర్, వరంగల్ రైల్వే ఫ్యాక్టరీ వంటి సెంటిమెంటల్ ఇష్యూస్’ను తెరపైకి  తెచ్చారు. అలాగే, కేంద్ర ప్రభుత్వంపై విమర్శల దాడిని పెంచారు. చివరకు పొరుగు రాష్ట్రానికి చెందిన విశాఖ ఉక్కు ఆందోళన   కూడా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగమైంది.   రెండు నియోజక వర్గాలలో గతంతో పోలిస్తే ఈసారి ఓటర్ల సంఖ్య రెట్టింపు అయింది. ఈసారి రెండు నియోజక వర్గాలలో కలిపి 10 లక్ష 36 వేల మంది తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. అలాగే, రెండు పట్ట భద్రుల నియోజక వర్గాల్లో 164 మంది అభ్యర్ధులు పోటీలో ఉన్నారు.  గత ఎన్నికలతో పోలిస్తే ఇటు ఓటర్ల సంఖ్య, అటు అభ్యర్థుల సంఖ్యా రెట్టింపునకు పైగానే పెరగడంతో ఎన్నికలలో జోష్ పెరిగింది. దీనికితోడు అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో సాధారణ ఎన్నికలను తలపించే రీతిలో ప్రచారం సాగింది. ఎక్కువమంది అభ్యర్ధులు బరిలో ఉండడంతో, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి  తమకే ప్రయోజనం జరుగుతుందని అధికార పార్టీ ఆశపడుతోంది .  దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో చేదు ఫలితాలను చవిచూసిన టీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా వ్యూహ రచన చేసి కేటీఆర్, హరీష్ సహా మంత్రులు,ఎమ్మెల్యేలకు స్పెసిఫిక్ బాధ్యతలు అప్పగించారు. అలాగే,కాంగ్రెస్‌ అభ్యర్థులు చిన్నారెడ్డి, రాములునాయక్‌లకు మద్దతుగా ఉత్తమ్‌, భట్టి, రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తదితరులు విస్తృతంగా ప్రచారం చేశారు. బీజేపీ అభ్యర్థులు ఎన్‌.రాంచందర్‌రావు, ప్రేమేందర్‌రెడ్డిల తరఫున ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, ఎంపీ అరవింద్‌ తదితరులు ప్రచారాన్ని వేడెక్కించారు.  ఖమ్మం స్థానం నుంచి ప్రత్యక్ష ఎన్నికల్లో తొలిసారి పోటీకి దిగిన కోదండరాంకు, టీజేఎస్‌ పార్టీకీ ఈ ఎన్నికలు కీలకంగా మారాయి. ఖమ్మ స్థానం నుంచి పోటీ చేస్తున్న తీన్మార్ మల్లన్న ముందస్తు వ్యూహంతో ప్రధాన పార్టీల అభ్యర్ధులకు ధీటుగా ప్రచారం సాగించారు.  వామపక్షాల మద్దతుతో జయసారథి, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్‌, యువతెలంగాణ కార్యనిర్వాహక అధ్యక్షురాలు రాణీ రుద్రమ తదితరులు పోటీలో ఖమ్మం సీటును పట్టభద్రులు  ఎవరికి  పట్టం కడతారు అన్నది ప్రశ్నార్థకంగా మారింది. హైదరాబాద్ సీటు కూడా ఇటు అధికార తెరాసకు అటు సిట్టింగ్ సీటును నిలుపుకోవడం తో పాటుగా దుబ్బాక , జీహెచ్ఎంసి జోష్ ను కొనసాగించాలని ఆశ పడుతున్నబీజేలకే కూడా ఇజ్జత్ కీ సవాల్ గా మారింది. కాంగ్రెస్ అభ్యర్ధి పార్టీ సీనియర్ నాయకుడు సౌమ్యుడు, మాజీ మంత్రి చిన్నారెడ్డి, వామ పక్షాల మద్దతుతో పోటీ చేస్తున్న మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ కూడా గట్టి పోటీ ఇస్తున్నారు. సో.. చివరకు ఏమి జరుగుతుంది అంటే ఏదైనా జరగవచ్చును. ఈ నెల 14 వ తేదీన పోలింగ్ జరుగుతుంది.17 ఫలితాలు వస్తాయి .. అంతవరకు వెయిట్ అండ్ వాచ్ .  
సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది. ఒకప్పుడు ఎర్ర జెండాను దిగ్విజయంగా ఎదిరించి, మార్క్సిస్టులను మట్టి కరిపించిన మమతా దీదీ ప్రస్తుతం, కాషాయ కూటమి నుంచి గట్టి సవాలును ఎదుర్కుంటున్నారు. వరసగా పదేళ్ళు పాలించడం వలన సహజంగా వచ్చిన ప్రభుత్వ వ్యతిరేకత  కంటే, హిందూ ఓటు పోలరైజేషన్ ఆమెను మరింతగా భయపెడుతోంది. నిజానికి ఐదేళ్ళ క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం ఐదు శాతం కంటే తక్కువ ఓట్లు, మూడంటే మూడు అసెంబ్లీ సీట్లు మాత్రమే గెలుచుకున్న బీజేపీ..  2019 లోక్ సభ ఎన్నికల్లో ఏకంగా 40 శాతం ఓట్లతో 18 స్థానాలు గెలుచుకుంది. ఈ  మార్పు ఇంకా కొన్ని కారణాలు ఉంటే ఉండవచ్చును కానీ.. హిందువుల ఓటు పోలరైజ్  కావడమే ప్రధాన కారణం.  ఈ నేపధ్యంలోనే కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ చివరకు కమ్యూనిస్టులు కూడా బీజేపీలో  చేరారు. ఎన్నికల ప్రకటన వెలువడిన తర్వాత కూడా సిట్టింగ్ ఎమ్మెల్ల్యేలు సహా  తృణమూల్ టికెట్ వచ్చిన నాయకులు కూడా బీజేపీలో చేరుతున్నారు. అనేక మంది ఇతర రంగాల ప్రముఖులు, ముఖ్యంగా ఇంతకాలం, బీజేపీని హిదుత్వ అనుకూల ‘అచ్చుత్’ (అంటారని) పార్టీగా చూసిన ‘సెక్యులర్’ ప్రముఖులు కాషాయం కప్పుకోవడంతో మమతా బెనర్జీకి కొంచెం అలస్యంగానే అయినా, తత్త్వం బోధపడింది. అందుకే ఆమె ఇప్పుడు గుళ్ళూ,గోపురాలకు తిరుగుతున్నారు. కార్యకర్తల సమావేశాల్లో తానూ హిందువునేనని, చెప్పుకుంటున్నారు.  నిజానికి ఇలా నేనూ హిందువునే  అని సెక్యులర్ నేతలు బహిరంగంగా ప్రకటించుకోవడం మమతా బెనర్జీతోనే మొదలు కాలేదు. రాహుల్ గాంధీ తాను హిందువునని, జన్యుధారీ కశ్మీరీ బ్రాహ్మణుని అనీ.. తమ గోత్రం, ‘దత్తాత్రేయ’ గోత్రమని బహిరంగంగా ప్రకటించుకున్నారు. అలాగే  కొద్ది రోజుల క్రితం ప్రియాంకా గాంధీ తానూ హిందువునని చెప్పుకునేందుకు ‘మౌని అమావాస్య’ సందర్భంగా అలహాబాద్ లో గంగా స్నానం చేశారు. గతంలోనూ ఆమె ఎన్నికలకు ముందు గంగా యాత్ర చేశారు. అంతవరకు ఎందుకు కొద్దిరోజుల క్రితం సిపిఐ నారాయణ విశాఖ స్వామి ఆశీస్సులు తీసుకున్నారు. చంద్రబాబు, జగన్ రెడ్డి, కేసీఆర్ ఇలా తెలుగు నేతలు అనేక మంది లౌకిక వాదానికి కాలం చెల్లిందన్న సత్యాన్ని గ్రహించి కావచ్చు ‘నేనూ హిందువును’ అంటూ ప్రకటించుకునేందుకు పోటీ పడుతున్నారు. రాముడిని తలచుకున్నా, జై శ్రీరామ్ అన్నా తమ  లౌకిక వాదం మయలపడి పోతుందని భయపడిన నాయకులు ఇప్పుడు .. జై శ్రీరామ్ అనేందుకు కూడా వెనకాడడం లేదు.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది. గత కొంత కాలంగా సబర్మలతో సహా అనేక అంశాలపై స్పందిస్తూ.. కేరళను టార్గెట్ చేస్తున్న బీజేపీ నాయకులు అక్కడ తమ జెండా ఎగరేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా పార్టీ పాలసీని కూడా పక్కన పెట్టి మెట్రో మ్యాన్ శ్రీధరన్ ను పార్టీలో చేర్చుకుని ఆయనే తమ సీఎం అభ్యర్థి అని ప్రకటించిన 24 గంటలలో యూ టర్న్ తీసుకున్నారు. ఇది ఇలా ఉండగా ప్రస్తుతం సీఎంగా ఉన్న కమ్యూనిస్ట్ నేత పినరై విజయన్ పై గోల్డ్ స్మగ్లింగ్ ఆరోపణలు రావడంతో.. ఈ ఎన్నికలలో ఎల్డిఎఫ్ భవిష్యత్తుపై ప్రజలు ఏ తీర్పు ఇవ్వబోతున్నారనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది ఈ నేపథ్యంలో అక్షరాస్యతలో దేశంలోనే మొదటి స్థానంలో ఉన్న ఆ రాష్ట్ర ప్రజలు ఎవరిని ఆశీర్వదిస్తారు అనే అంశంపై ప్రముఖ మీడియా సంస్థ టైమ్స్ నౌ, సీ ఓటరుతో కలిసి ఒక సర్వేను నిర్వహించారు. ఈ సర్వే ప్రకారం చూస్తే పాపం కమలనాథులు అక్కడ పవర్ చేతికి రావటం అటుంచి కనీసం రెండు మూడు అసెంబ్లీ స్థానాల్లో గెలవటం కూడా కష్టమేనని ఆ సర్వే తేల్చి చెబుతోంది. కేరళలో ఈసారి జరిగే అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ తన హవా చాటుతుందన్న ఆ పార్టీ నేతల మాటలలో ఎలాంటి నిజం లేదని.. ప్రస్తుతానికి అది ఏమాత్రం సాధ్యం కాదని ఈ తాజా సర్వే తేల్చి చెప్పింది. అంతేకాకుండా మొత్తం 140 స్థానాలు ఉన్న కేరళలో.. ప్రస్తుత సీఎం పినరయి విజయన్ నేతృత్వంలోని లెఫ్ట్డ్ డెమొక్రటిక్ ఫ్రంట్ కు 82 సీట్లు పక్కా అని.. ఆయనే తిరిగి అధికారాన్ని నిలబెట్టుకుంటాడని సర్వే చెపుతోంది. అదే సమయంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూనైటెడ్ డెమొక్రాటిక్ ఫ్రంట్ కు 56 నుంచి 60 వరకు సీట్లు వచ్చే అవకాశం ఉందని ఈ సర్వేలో తేలింది. అంతేకాకుండా 2016 ఎన్నికలతో పోలిస్తే ఎల్ డీఎఫ్ ఓటింగ్ శాతం కూడా కొంత పెరగటం ఇక్కడ గమనార్హం. ప్రస్తుతం సీఎంగా ఉన్న విజయన్ మరోసారి సీఎం కావాలని 43.34 శాతం మంది మొగ్గు చూపినట్లుగా సర్వేలో తేలింది. కరోనా సమయంలో విజయన్ సీఎంగా బాగా పని చేసారని ఈ సర్వే పేర్కొంది. మరోపక్క దేశ ప్రధానిగా రాహుల్ గాంధీ ఉండాలని కేరళ ప్రజల్లో 55.84 శాతం మంది కోరుకుంటున్నట్లుగా ఈ సర్వే;లో తేలింది. అయితే కేరళలో ఎలాగైనా పాగా వేయాలని పట్టుదలతో కృషి చేస్తున్న బీజేపీకి ఈసారి కూడా నిరాశ తప్పదని ఈ సర్వేలో స్పష్టం అయింది. ఈ ఎన్నికలలో బీజేపీకి రెండు సీట్లు కూడా రావటం కూడా కష్టమేనని ఈ సర్వే తేల్చింది. అయితే ఎన్నికలకు ముందు ఇలాంటి సర్వేలు బయటకు రావడం.. తరువాత అందులో కొన్ని చతికిల పడడం మనం చూస్తూనే ఉన్నాం. మరి ఈ సర్వే ఫలితాలు నిజామా అవుతాయో లేదో తేలాలంటే కొద్దీ రోజులు వెయిట్ చేయాల్సిందే.        
రాజకీయాలు అంటేనే అదో జూదం. పూలమ్మిన చోటనే కట్టెలు అమ్మవలసి రావచ్చును. అలాంటి పరిస్థితే వచ్చినా, తలవంచుకుని పోగలిగితేనే, ఎవరైనా రాజకీయాలలో రాణించగలరు. అలాకాదని, అలిమి కానిచోట, కూడా తామే అధికులమని భావిస్తే, ఎందుకూ కాకుండా పోతారు. అలాంటి వారు ఇద్దరూ కూడా ఇప్పుడు మన కళ్ళముందే ఉన్నారు.  జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు. అలాగే జయ మరణం తర్వాత ఆమె పరిస్థితి ఏమిటో కూడా వేరే చెప్పవలసిన, అవసరం లేదు. జైలు పాలయ్యారు. సర్వం తానై నడిపించిన పార్టీ నుంచి  బహిష్కరణకు గురయ్యారు. జయ ఉన్నంత వరకు తన వారుగా ఉన్న వారందరూ కానివారయ్యారు. ఒంటరిగా మిగిలారు.  నిజానికి నాలుగేళ్ళు జైలు జీవితం గడిపిన తర్వాత కూడా ఆమె తలచుకుంటే.. రాష్ట్ర రాజకీయాలలో, ముఖ్యంగా అధికారంలో ఉన్న డిఎంకే కూటమిలో అలజడి సృష్టించగలరు. ఎన్నికలలో ఆమె గెలవక పోవచ్చును కానీ.. తనను కాదన్న అన్నాడిఎంకేను ఓడించగలరు. అయిన  ఆమె అందుకు విరుద్ధంగా  రాజకీయాలకు వీడ్కోలు పలికి మౌనంగా పక్కకు తప్పుకున్నారు. రాజకీయ సన్యాసం ప్రకటించారు. ఉమ్మడి శతృవు డిఎంకే ను ఓడించేందుకు అన్నా డిఎంకే కూటమి  పోటీ చేయాలని, కూటమి ఐక్యతను దెబ్బతీయరాదనే ఉద్దేశంతోనే ఆమె రాజకీయ సన్యాసం ప్రకటించారు.    శశికళ మౌనంగా వెళ్లి పోవడం వెనక ఇంకా అనేక కారణాలున్నా ,అసలు కారణం ఆమె, రాజకీయ విజ్ఞత, వివేకం. ఆమె జైలుకు వెళ్ళిన సమయంలో జయలలిత సమాధి వద్ద ఎంత కసిగా, కోపంగా ‘మౌన’ ప్రతిజ్ఞ చేశారో చూశా. అలాంటి ఆమె ఇప్పుడు ఇలా ‘మౌనం’గా వెనకడుగు వేశారంటే, అది ఆలోచించ వలసిన విషయమే.ఆమె వ్యుహతంకంగానే సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే అనేక మంది అనేక కోణాల్లో శశికళ సంచలన నిర్ణయాన్ని విశ్లేషించారు.జైలు జీవితం తర్వాత కూడా అన్నా డిఎంకే నాయకులు తనను అగ్రనేతగా అంగీకరించక పోవడం, అమిత్ షా చెప్పినా.. అన్నా డిఎంకే నాయకులు ఆమెను, మేనల్లుడు దినకరన్’ను కులం పేరున, కుటుంబం పేరున దూరం చేయడం, తిరిగి పార్టీలోకి తీసుకోకపోవడంతో ఆమె మనసు కష్టపెట్టుకుని, సన్యాస నిర్ణయం తీసుకున్నారని కొందరంటున్నారు. పార్టీ మీద పట్టు లేదని, చరిష్మా అసలే లేదని, అందుకే ఆమె అలా నిశ్శబ్ధంగా రాజకీయ సన్యాసం స్వీకరించారని ఇంకొందరు విశ్లేషించారు. ఈ విశ్లేషణలో కొంత నిజం ఉంటే ఉండవచ్చును.. కానీ ఆమె గతాన్ని, నైజాన్ని గుర్తు చేసుకుంటే ఆమె స్ట్రైక్ బ్యాక్ వ్యూహంతోనే ఒకడుగు వెనక్కివేశారని ఆమెతో సన్నిహితంగా మెలిగినవారు, ఆమె రాజకీయ చాణక్యం తెలిసిన వారు అంటారు.   నిజానికి జైలులో ఉన్న కాలంలో కానీ, జైలు నుంచి విడుదలై వచ్చిన తర్వాత కానీ, ఆమె రాజకీయ సన్యాసం వైపు అడుగులు వేస్తున్నట్లు కనిపించలేదు. బెంగుళూరు జైలు నుంచి విడుదలై చెన్నైలో ప్రవేశించిన నప్పుడు ఆమె పెద్ద కాన్వాయ్ తో  తమ కారుకు అన్నాడిఎంకే జెండాతోనే ఎంటరయ్యారు. అలా ఎంట్రీలోనే రాజకీయ ఆకాంక్షను వెంట తెచ్చుకున్నారు. చివరకు ‘సన్యాస’ ప్రకట చేసే వరకు కూడా ఆమె రాజకీయ కార్యకలాపాలు సాగిస్తూనే ఉన్నారు. అటు ఢిల్లీని ఇటు చెన్నైనికూడా కదిల్చారు. అంతేకాదు, రాజకీయాలపై విరక్తితో కాదు, రాజకీయ కసితో, ఉమ్మడి శత్రువు (డిఎంకే) ను ఓడించేందుకే తాను రాజకీయాలనుంచి తపుకుంటున్నట్లు చెప్పారు.  సో .. సన్యాసం తీసుకోవాలనే ఆలోచన, రాజకీయవ్యూహం లోంచి పుట్టిందే కానీ,వైరాగ్యంతో పుట్టింది కాదు ,అన్నవిశ్లేషణ వాస్తవానికి ఇంకొంత దగ్గరగా ఉందని అనుకోవచ్చును. ఇది ‘కామా’నే కాని ‘ఫుల్స్టాప్’ కాదని అంటున్నారు.  ముఖ్యమంత్రి ఎడప్పాడి కే. పళని స్వామి (ఈపీఎస్) ఆమెను పార్టీలోకి అనుమతిస్తే తన కుర్చికీ ఎసరు పెడతారనే భయంతోనే,, ఆమె ఎంట్రీని అడ్డుకున్నారు. ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం, శశికళ ఒకే సామజిక వర్గానికి చెందిన వారు కావడం కూడా, ముఖ్యమంత్రి ఈపీఎస్’ భయానికి కారణంగా పేర్కొంటారు. అందుకే  ఆయన, ‘మన్నార్గుడి’ ఫ్యామిలీని బూచిగా చూపించి, ఆమెను దూరంగా ఉంచారని పార్టీలో ఒక వర్గం గట్టిగా విశ్వసిస్తుంది. అయితే ఆమె శక్తియుక్తులను కూడతీసుకుని  పులిలా పంజా విసిరేందుకే ఆమె వ్యూహాత్మకంగా ఒక అడుగు వెనక్కి వేశారు కావచ్చును అని కూడా, తమిళ రాజకీయ వర్గాల్లో ఒక చర్చ జరుగుతోంది.  గతంలో ఆమె జయలలితతో విబేధాలు వచ్చిన సమయంలో కూడా ఇలాగే కొద్ది కాలం మౌనంగా తెర చాటుకు వెళ్లి పోయారు.  కొద్ది కాలంలోనే మళ్ళీ ‘పోయస్ గార్డెన్’లో ప్రత్యక్షమయ్యారు. జయలలిత స్వయంగా ఆమెను వెనక్కి పిలుపించుకోవలసిన పరిస్థితులను సృష్టించారు. అలా  మళ్ళీ  చక్రం తిప్పారు. జయలలిత మరణం వరకు ఆమె అందరికీ చిన్నమ్మగా అమ్మకు పెద్దమ్మగా సర్వం తానై నిలిచారు. చివరకు జయ అంత్యక్రియల్లో కూడా ఆమెదే పై చేయిగా కనిపించింది.   జయలలిత చనిపోయిన సందర్భంలోనే అన్నా డిఎంకే ఎమ్మెల్ల్యేలో సుమారు 30 మంది వరకు ఆమెకు మద్దతుగా ఉన్నారన్న వార్తలొచ్చాయి. నిజానికి,ఇప్పటికి కూడా ఒక్క అన్నా డిఎంకే లోనేకాదు,డిఎంకే ఇతర పార్టీలలో కూడా  ఆమె అవసరం ఉన్న వాళ్ళు ఉన్నారు. కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో ‘మన్నార్గుడి’ ఫ్యామిలీ మద్దతు లేకుండా గెలిచే అవకాశం లేదు.  ఇవ్వన్నీ నిజమే అయినా.. అన్నీ ఉండి, ఎవరు లేని శశికళలో, ఇంకా  ఎవరి కోసం తాపత్రయ పడాలి? అనే ప్రశ్న జనించి ఉంటే, ఆమె రాజకీయ సన్యాసం నిజం కావచ్చును. ఎందుకంటే ఆమె నెచ్చలి, జయలిత లేరు, భర్త అంతకంటే ముందే చనిపోయారు, పిల్లలు లేరు... పైగా నాలుగేళ్ళ జైలు జీవితం ఆమెలో మార్పు తెచ్చి ఉండవచ్చును. ఈ వయస్సులో తనవారంటూ ఎవరు లేని తనకు రాజకీయాలు ఎందుకు ? శేష జీవితాన్ని ఇలా సాగిద్దామనే ఆలోచన నిజంగా వచ్చి ఉంటే, ఆమె సన్యాసం సత్యం అయినా కావచ్చును, కాకపోనూ వచ్చును. కానీ  శశికళ... ఆమెను అర్థం చేసుకోవడం, అంచనా వేయడం , అంత తేలిగ్గా అయ్యే పని కాదు..
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు. కాంగ్రెస్ అధినాయకత్వం పై నేరుగా అస్త్రాలు సంధించారు. రాహుల్ గాంధీ పేరు చెప్పకుండానే, ఆయన నాయకత్వానికి పనికిరాడని తేల్చి చెప్పారు. ఎవరైనా పార్టీ అధ్యక్షుడు అయితే కావచ్చును, కానీ, ప్రజానాయకుడు కాలేడని, రాహుల గాంధీ ప్రజానాయకుడు కాదు కాలేరు,అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తరచూ రాహుల్ గాంధీని ఉద్దేశించి చేసే  ‘నామ్’ధారీ వ్యంగ్యాస్త్రాన్నే కాంగ్రెస్ సీనియర్ నాయకులు కూడా సందించారు. ఇక అక్కడి నుంచి విధేయ, అసమ్మతి వర్గాల మధ్య మాటల యుద్ధం ఎదో ఒక రూపంలో సాగుతూనే వుంది. అదే క్రమంలో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ, కరుడు కట్టిన ముస్లిం మతోన్మాది, అబ్బాస్ సిద్దిఖీతో కాంగ్రెస్ పార్టీ చేతులు కలపడం అసమ్మతి నాయకులకు మరో అస్త్రాన్ని అందించింది. విషయంలోకి వెళితే, ఇటీవల పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా లోక్’సభలో కాంగ్రెస్ పక్ష నాయకుడు, పశ్చిమ బెంగాల్ పీసీసీ అధ్యక్షుడు అధీర్’రంజన్ చౌదరి, ముస్లిం మత ప్రచారకుడు, అబ్బాస్ సిద్దిఖీతో  వేదిక పంచుకున్నారు.అంతకు ముందే వామ పక్ష కూటమితో  పొత్తు కుదుర్చుకున్న కాంగ్రెస్ పార్టీ, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)ను కూటమిలో చేర్చుకుంది. ఇలా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) అమోదం లేకుండా మతోన్మాద ఐఎస్ఎఫ్’ తో ఎన్నికల పొత్తు పెట్టుకోవడం ఆ పార్టీ నాయకుడు,సిద్ధిఖీతో  పీసీసీ చీఫ్ వేదిక  పంచుకోవడం పై అసమ్మతి నేతలు మండి పడుతున్నారు. ఇలా సిద్దిఖీతో వేదిక పంచుకోవడం పార్టీ మౌలిక సిద్ధాంతాలకు వ్యతిరేకం అంటూ అసమ్మతి వర్గానికి చెందిన కీలక నేత, రాజ్యసభ సభ్యుడు,ఆనంద్ శర్మ మండిపడ్డారు. అంతే కాదు, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)తో జనవరిలో కుదుర్చుకున్న పొత్తుకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ)అమోదం లేదని ఆనంద్ శర్మ, అభ్యంతరం వ్యక్త చేశారు. పార్టీ విశ్వసించే లౌకిక వాదానికి కాంగ్రెస్ అధిష్టానం తీసుకున్న నిర్ణయం గొడ్డలి పెట్టని ఆయన తీవ్రంగా స్పందించారు.   శర్మ వ్యాఖ్యలపై అధీర్ రంజన్ చౌదరి అంతే ఘాటుగా ప్రతిస్పందించారు. “నిజాలు తెలుసుకోండి ఆనంద్ శ‌ర్మ జీ” అంటూ ఆయ‌న వ‌రుస ట్వీట్లు చేశారు. వ్య‌క్తిగ‌త ప్ర‌యోజ‌నాలు ప‌క్క‌న‌పెట్టి, ప్ర‌ధానిని పొగిడి టైమ్ వేస్ట్ చేయ‌కండంటూ ఆయ‌న ఓ ట్వీట్లో అన్నారు. ఆనంద్ శ‌ర్మ అన‌వ‌స‌రంగా కాంగ్రెస్‌ను ల‌క్ష్యంగా చేసుకుంటున్నార‌ని, ఈ అంశాన్ని పెద్ద‌ది చేసి చూపిస్తున్నార‌ని విమ‌ర్శించారు. ఆయ‌న ఉద్దేశాలు స‌రైన‌వే అయితే నేరుగా తనతో మాట్లాడ వలసిందని అన్నారు. బెంగాల్‌లో సీపీఐ(ఎం) కూట‌మికి నేతృత్వం వ‌హిస్తోంది. అందులో కాంగ్రెస్ ఓ భాగం. మ‌త‌తత్వ‌, విభ‌జ‌న రాజ‌కీయాలు చేస్తున్న బీజేపీకి చెక్ పెట్ట‌డానికే ఈ కూట‌మి అని మ‌రో ట్వీట్‌లో అధిర్ రంజ‌న్ అన్నారు. అక్కడతోనూ ఆగలేదు ... ట్వీట్ల మీద ట్వీట్లు సంధిస్తూ, ఆనంద్ శర్మ, బీజేపీ మత విభజన, అజెండాను బలపరుస్తున్నారని, పరోక్షంగా జీ23 నాయకులు బీజేపీకి ప్రయోజనం చేకూరుస్తున్నారని ఆరోపించారు.అంతే కాదు, క్షేత్ర స్థాయి వాస్తవ పరిస్థితులు తెలియకుండా, ఆనంద్ శర్మ పార్టీ మీద దండెత్తడం ఉచితం కాదని చౌదరి ఎదురుదాడి చేశారు. అసమ్మతిలో అసమ్మతి. ఇదలా ఉంటే, కాంగ్రెస్ పార్టీ  సమూల పక్షాళన కోరుతూ సోనియా గాంధీకి,గత సంవత్సరం  జీ 23గా ప్రాచుర్యం పొందిన సీనియర్ నాయకులు రాసిన లేఖపై సంతకాలు చేసిన  నాయకుల్లో నలుగురు,జమ్మూలోసమావేసమైన నాయకుల తాజా నిర్ణయాలు, వ్యాఖ్యలు,విమర్శల పట్ల అసంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరం సోనియా గాంధీకి రాసిన లేఖలో ప్రస్తావించిన అంశాలకు కట్టుబడి ఉన్నామని, అయితే, జీ 23లోని కొందరు సహచరులు, ఇటీవల గీతదాటి చేస్తున్న వ్యాఖ్యలు, విమర్శలను తాము సమర్ధించడం లేదని ఆ నలుగురు పేర్కొన్నారు. ఇందులో ముఖ్యంగా, రాజ్యసభ మాజీ డిప్యూటీ చైర్మన్, పీజే కురియన్ అయితే, “కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు అవసరమైన సంస్కరణలు తెచ్చేందుకు చేసే ప్రయత్నాలను పూర్తిగా సమర్దిస్తాను, కానీ, ‘లక్ష్మణ రేఖ’ దాటితే ఒప్పుకునేది లేదు”అని అసమ్మతిలో అసమ్మతికి తెర తీశారు.అలాగే, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ కుమారడు, మాజీ ఎంపీ సందీప్ దీక్షిత్,మధ్య ప్రదేశ్ సీనియర్ కాంగ్రెస్ నాయకుడు అజయ్ సింగ్’ కూడా గులాం నబీ ఆజాద్, కపిల్ సిబల్, ఆనంద్ శర్మ, మనీష్ తివారీ వంటి జీ 23 కీలక నేతలు అధినాయకత్వంపై చేసిన వ్యాఖ్యలను తప్పు పట్టారు. అలాగే, పార్టీ సీనియర్ నాయకుడు కేంద్ర మాజీమంత్రి వీరప్ప మొయిలీ కూడా,గత సంవత్సరం పార్టీ సీనియర్ నాయకులు  ఒక పరిమిత లక్ష్యంతో  సోనియా గాంధీకి లేఖ రాయడం జరిగిందని, ఆ పేరున జరుగతున్న  కార్యక్రమాలు లేఖ సంకల్పానికి  విరుద్ధమని అన్నారు. జీ 23 కార్యకలాపాలపై రాహుల్ గాంధీ కూడా పరోక్షగా స్పందించారు, ఒకప్పుడు ఎన్ఎస్’యుఐ, యూత్ కాంగ్రెస్’ కు సంస్థాగత ఎన్నికలు వద్దన్న వారే ఇప్పుడు ఇంకోలా మాట్లాడుతున్నారని పరోక్షంగానే అయినా సంస్థాగత ఎన్నికలు నిర్వహించడంతో పాటుగా, పార్టీ పక్షాలనకు తమ కుటుంబం వ్యతిరేకం కాదని, అందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఈ నేపధ్యంలో కాంగ్రెస్ పార్టీలో చెలరిగిన కలకలం  ఇక ముందు ఏమవుతుందో .. ఇంకెన్ని  మలుపులు తిరుగుతోందో ..చూడవలసిందే కానీ ఉహించలేము.
బ్రెయిన్ స్ట్రోక్ (Brain Stroke) అనేది అత్యవసర వైద్య పరిస్థితి. మెదడుకు రక్త సరఫరా అకస్మాత్తుగా ఆగిపోవడం లేదా రక్తనాళం పగిలిపోవడం వల్ల మెదడు కణాలు దెబ్బతింటాయి. సరైన సమయంలో చికిత్స అందకపోతే ప్రాణాపాయం మాత్రమే కాకుండా శాశ్వత వైకల్యం కూడా వచ్చే అవకాశం ఉంటుంది.  ఈ వీడియోలో ప్రముఖ న్యూరాలజిస్ట్ డా. అనిరుధ్ దేశ్‌ముఖ్ బ్రెయిన్ స్ట్రోక్ గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయాలను సులభంగా వివరించారు.  ఈ వీడియోలో మీరు తెలుసుకునే అంశాలు: బ్రెయిన్ స్ట్రోక్ అంటే ఏమిటి? స్ట్రోక్ ఎన్ని రకాలుగా ఉంటుంది? స్ట్రోక్ వచ్చే ప్రధాన కారణాలు ఏమిటి? స్ట్రోక్ వచ్చే ముందు కనిపించే హెచ్చరిక లక్షణాలు (TIA) ఏమిటి? చేతులు, కాళ్లు బలహీనపడటం, ముఖం వంకర కావడం, మాట తడబడటం వంటి లక్షణాలను ఎలా గుర్తించాలి? "గోల్డెన్ పీరియడ్" అంటే ఏమిటి? ఆ సమయంలో చికిత్స ఎందుకు చాలా కీలకం? ఆధునిక వైద్యంలో అందుబాటులో ఉన్న చికిత్సలు ఏమిటి? స్ట్రోక్ ప్రమాదాన్ని తగ్గించేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు. ఎప్పుడు వెంటనే ఆసుపత్రికి వెళ్లాలి? స్ట్రోక్ విషయంలో ప్రతి నిమిషం ఎంతో విలువైనది. లక్షణాలు కనిపించిన వెంటనే ఆలస్యం చేయకుండా అత్యవసర వైద్య సహాయం తీసుకోవడం వల్ల ప్రాణాలను కాపాడడమే కాకుండా మెదడు దెబ్బతినే ప్రమాదాన్ని కూడా తగ్గించవచ్చు.  బ్రెయిన్ స్ట్రోక్ గురించి పూర్తి అవగాహన పొందాలంటే ఈ వీడియోను పూర్తిగా చూడండి. ఆరోగ్యానికి సంబంధించిన మరిన్ని ఉపయోగకరమైన వీడియోల కోసం TeluguOne Health‌ ను ఫాలో అవుతూ ఉండండి.
పెరుగు ఆరోగ్యానికి ఎంతో మంచిది. పెరుగులో ప్రోబయోటిక్స్ పుష్కలంగా ఉంటుంది. అలాగే కాల్షియం,  ప్రోటీన్ కూడా ఉంటుంది.  భారతీయులు భోజనం చివర పెరుగుతో తింటే తప్ప వారికి తృప్తి ఉండదు. వేసవి కాలంలో పెరుగును ఇష్టంగా తింటారు. అయితే వర్షాకాలంలో పెరుగు తినడం గురించి చాలామంది చాలా రకాలుగా మాట్లాడుతుంటారు.  పెరుగు తినడం ఆరోగ్యానికి మంచిది కాదని,  జీర్ణవ్యవస్థ పై ప్రభావం పడుతుందని అంటుంటారు.  దీని గురించి వివరంగా తెలుసుకుంటే.. పెరుగు కడుపుకు మేలు చేసే ప్రోబయోటిక్ ఆహారంగా పరిగణించబడుతుంది, కానీ వర్షాకాలంలో పెరుగు తినడం పై  భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. వర్షాకాలంలో పెరుగు తినడం వల్ల జలుబు, దగ్గు వంటి సమస్యలు మరింత తీవ్రమవుతాయని కొందరు చెబుతారు, అయితే ఆరోగ్య నిపుణులు మాత్రం వేరే విధంగా చెబుతున్నారు. వర్షాకాలంలో పెరుగు తినవచ్చా? ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం, వర్షాకాలంలో పెరుగును తినవచ్చు, కానీ దాని పరిమాణం , పెరుగు తినే  సమయం విషయంలో జాగ్రత్తగా ఉండటం ముఖ్యం. పెరుగులో ప్రోబయోటిక్స్ పుష్కలంగా ఉంటాయి, ఇవి జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. అయితే, వర్షాకాలంలో జీర్ణక్రియ సరిగ్గా జరగకపోవడం వల్ల కొంతమందికి సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. పెరుగు తినడం వల్ల కలిగే ప్రయోజనాలు.. జీర్ణ వ్యవస్థను బలపరుస్తుంది,  పేగులలో మంచి బ్యాక్టీరియాను పెంచుతుంది, శరీరాన్ని చల్లబరచడమే కాకుండా ఉత్తేజపరుస్తుంది.   రోగనిరోధక వ్యవస్థకు మద్దతు ఇస్తుంది. వర్షంలో పెరుగు తినడం వల్ల కలిగే నష్టాలు.. వర్షాకాలంలో పెరుగు తినడం వల్ల జలుబు , ఫ్లూ పెరిగే అవకాశం ఉంటుంది. అందుకే పెద్దలు జలుబు, జ్వరం ఉన్నప్పుడు పెరుగు తినకూడదని చెబుతారు. పెరుగు తినడం వల్ల   కఫం , శ్లేష్మంతో సమస్యలు రావచ్చు. కొంతమందికి కడుపు ఉబ్బరం కలగవచ్చు.  రాత్రిపూట తినడం జీర్ణక్రియను నెమ్మదింపజేస్తుంది. పెరుగు ఎలా తింటే శ్రేష్టం..  పగటిపూట మాత్రమే పెరుగు తినడం మంచిది.  రాత్రిపూట పెరుగు తినడం మానుకోవాలి.   కొద్దిగా వేయించిన జీలకర్ర లేదా నల్ల మిరియాల పొడి వేసుకుని  పెరుగు తీసుకుంటే మంచిది.  తాజాగా,  ఇంట్లో తయారుచేసిన పెరుగును మాత్రమే తినడం ఆరోగ్యానికి ఎంతో ఉత్తమం. పెరుగు ఎవరు తినకూడదు? జలుబుతో బాధపడుతున్న వాళ్లు,  రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్న వాళ్ళు, ఆస్తమా లేదా అలర్జీ రోగులు, రాత్రి ఆలస్యంగా భోజనం చేసే వారు.. పెరుగు విషయంలో జాగ్రత్తగా ఉండాలి.                                   *రూపశ్రీ.