LATEST NEWS
837.37కోట్ల రూపాయల రుణం ఎగవేత కేసులో టీడీపీ మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు తనఖా పెట్టిన ఆస్తులను వేలం వేసేందుకు ఆంధ్రాబ్యాంక్ తాజాగా బహిరంగ ప్రకటన జారీ చేసింది. వచ్చే నెల 23న వేలం నిర్వహించనున్నట్లు ఆంధ్రాబ్యాంక్ ఈ ప్రకటనలో పేర్కొంది. అంతవరకూ బాగానే ఉన్నా రాయపాటి తనఖా పెట్టిన ఆస్తుల విలువ, ఆయన ఎగవేసిన రుణం విలువ తెలిస్తే ఆశ్చర్య పోవడం ఖాయం. రాయపాటి సాంబశివరావు ప్రమోటర్ గా ఉన్న ట్రాన్స్ ట్రాయ్ ఇండియాతో పాటు రాయపాటి రంగారావు, చెరుకూరి శ్రీధర్, మల్లినేని సాంబశివరావు, దేవికారాణి, లక్ష్మి పేరిట తీసుకున్న రుణం విలువ 837 కోట్లయితే ఆయన ఇందుకోసం తనఖా పెట్టిన ఆస్తుల విలువ కేవలం 17.5 కోట్లు మాత్రమే. ఇందులో గుంటూరులో ఉన్న భవనం విలువ 16.44 కోట్లు కాగా.. ఢిల్లీలోని ఫ్లాట్ విలువ 1.09 కోట్లుగా బ్యాంకు నిర్ధారించింది. అంటే దీన్ని బట్టి ఈ వేలం నిర్వహణ ద్వారా బ్యాంకుకు ఒనగూరే ప్రయోజనం విలువ తీసుకున్న రుణంలో కేవలం రెండుశాతం మాత్రమే. ఈ రుణానికి హామీ దారులుగా ఉన్నది రాయపాటి జగదీష్, రాయపాటి జీవన్, నారయ్య చౌదరి, రాయపాటి రంగారావు, దేవికారాణి, లక్ష్మి, సీహెచ్ వాణి, యలమంచిలి జగన్ మోహన్. వీరందరి ఆస్తులను ఒకేసారి వేలం వేయకుండా కేవలం రాయపాటి పేరు మీద ఉన్న ఆస్తులను మాత్రమే వేలం వేస్తున్నారంటే పరిస్ధితి అర్ధమవుతోంది. వాస్తవానికి 2014 కంటే ముందు కాంగ్రెస్ ఎంపీగా ఉన్న రాయపాటి సాంబశివరావు సార్వత్రిక ఎన్నికల సమయంలో టీడీపీలో చేరి గుంటూరు ఎంపీగా పోటీ చేసి గెలిచారు. అప్పట్లో ఆయన కున్న పరపతితోనే పోలవరం ప్రాజెక్టు కాంట్రాక్టును ఆయన ప్రమోటర్ గా ఉన్న ట్రాన్స్ ట్రాయ్ సంస్ధ దక్కించుకోగలిగింది. అయితే అప్పటికే ఆర్ధిక ఇబ్బందుల‌్లో ఉన్న ట్రాన్స్ ట్రాయ్ ఆ తర్వాత దివాలా తీసింది. పోలవరం పనులు పూర్తి చేయలేక చేతులెత్తేయడంతో నవయుగ ఇంజనీరింగ్ కు అప్పటి టీడీపీ సర్కారు పనులు అప్పగించింది. పోలవరం ప్రాజెక్టులో పని చేయకుండానే ఆయన ట్రాన్స్ ట్రాయ్ క్లెయిమ్ చేసిన మొత్తాన్ని చెల్లించి మరీ నవయుగతో అప్పటి ప్రభుత్వం ఒప్పందం కుదిర్చి రాయపాటిని ఒడ్డున పడేసింది. అయితే దివాలా నోటీసు నేపథ్యంలో బ్యాంకులు ఒక్కొక్కటిగా ఆయన ఆస్తులను వేలం వేయడం ద్వారా రుణాల వసూలుకు ప్రయత్నిస్తున్నాయి. రుణాలు ఎగవేసిన బడా బాబుల వ్యవహారంలో బ్యాంకులు వ్యవహరిస్తున్న తీరుపై ఇప్పటికే పలు విమర్శలు ఉన్నాయి. వారికి ఇచ్చే రుణాలకూ, తనఖా పెట్టే ఆస్తులకూ ఎక్కడా పొంతనం ఉండటం లేదు. ఇదే రుణాల ఎగవేతకు కారణమవుతోంది. కేవలం వ్యక్తులకు సమాజంలో ఉన్న పరపతి, రాజకీయంగా వారి పదవులను చూసి భారీగా రుణాలు ఇచ్చిన బ్యాంకులు ఇప్పటికే దివాలా తీస్తున్నాయి. అయినా వాటి వైఖరిలో మార్పు రావడం లేదు. కోట్లాది రూపాయలు నిరర్ధక ఆస్తుల (ఎన్పీఏ) రూపంలో పేరుకుపోతున్నా కనీసం ఎగవేతదారుల ఆస్తులను పూర్తిస్దాయిలో వేలం కూడా వేసే పరిస్ధితి లేదు. ప్రస్తుతం రాయపాటి సాంబశివరావు ఆస్తుల వేలం వ్యవహారంతో ఈ విషయం మరోసారి చర్చనీయాంశంగా మారుతోంది.
కృష్ణాజిల్లా నూజివీడు ట్రిపుల్ ఐటీ విద్యార్ధినుల హాస్టల్లో విద్యార్ధి రోజంతా ఉన్న వ్యవహారంపై వైస్ ఛాన్సలర్ హేమచంద్రారెడ్డి స్పందించారు. పిల్లల భవిష్యత్తు పాడవుతుందనే ఉద్దేశంతోనే తాము ఈ వ్యవహారంపై మౌనంగా ఉన్నామన్నారు. అదే సమయంలో హాస్టల్లో భద్రతా వైఫల్యం కారణంగానే ఈ ఘటన చోటు చేసుకుందని వీసీ తెలిపారు. విద్యార్ధినుల హాస్టల్ కిటికీ బయటి నుంచి కంటే లోపల నుంచి తెరవడం సులువని ఆయన పేర్కొన్నారు. దీన్ని బట్టి చూస్తే లోపల ఉన్న విద్యార్ధినుల్లో ఒకరు కిటికీ తెరిచి తనకు పరిచయమైన విద్యార్ధిని లోపలికి ఆహ్వానించారని వీసీ వెల్లడించారు. అదే గదిలో ఉన్న మిగిలిన విద్యార్ధినుల్లో ఒకరు మంచం కింద ఎవరో ఉన్నారని వార్డెన్ కు ఫిర్యాదు చేయడంతో గది తాళం బద్దలు కొట్టి అతడిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. వాస్తవానికి ట్రిపుల్ ఐటీలో వార్షిక ఫెస్ట్ జరుగుతోంది. ఈ సమయంలో మిగిలిన విద్యార్ధులంతా ఫెస్ట్ లో బిజీగా ఉండటంతో ఓ విద్యార్ధిని ఉద్దేశపూర్వకంగానే కిటీకీ తెరిచి అదే ట్రిపుల్ ఐటీలో చదువుతున్న తనకు పరిచయమైన విద్యార్దిని లోపలికి తీసుకొచ్చింది. అయితే మిగిలిన విద్యార్ధినుల్లో ఒకరికి అనుమానం రావండంతో హాస్టల్ గది తలుపులకు తాళం వేసి వెళ్లిపోయింది. అయితే మరో విద్యార్దిని ఫిర్యాదు మేరకు వార్డెన్ సెక్యరిటీతో కలిసి తాళం బద్దలు కొట్టి తలుపు తెరవడంతో బండారం బయటపడింది. అబ్బాయి, అమ్మాయి ఇద్దరూ మైనర్లు కావడంతో వీరికి కౌన్సిలింగ్ ఇచ్చి తల్లితండ్రుల దగ్గరికి పంపినట్లు వీసీ హేమచంద్రారెడ్డి వెల్లడించారు. అయితే ఈ ఘటనపై క్రమశిక్షణా కమిటీకి సిఫార్సు చేశామని, నివేదిక రాగానే తదుపరి చర్యలుంటాయన్నారు. పిల్లల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని పోలీసులకు ఫిర్యాదు చేయలేదని ఆయన పేర్కొన్నారు. నూజివీడు ట్రిపుల్ ఐటీలో మొత్తం 4500 మంది అమ్మాయిలు, 3500 మంది అబ్బాయిలు చదువుతున్నారు.
విశాఖలో ఏపీ కార్యనిర్వాహక రాజధాని దిశగా జరుగుతున్న ప్రయత్నాలకు నేవీ నుంచి అభ్యంతరాలు వ్యక్తమైనట్లు వచ్చిన వార్తలను తూర్పు నావికా దళం ఖండించింది. రాష్ట్ర ప్రభుత్వం నుంచి సచివాలయం ఏర్పాటు కోసం తమ వద్దకు ఎలాంటి ప్రతిపాదనా రాలేదని, దానికి తాము ఎలాంటి అభ్యంతరాలు చెప్పలేదని వివరణ ఇచ్చింది. దీంతో విశాఖలో నేవీ అభ్యంతరాల వార్తలకు బ్రేక్ పడినట్లయింది. వాస్తవానికి విశాఖలో రాజధాని ఏర్పాటు కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తున్న తరుణంలో సచివాలయానికి ప్రతిపాదిస్తున్న మిలీనియం టవర్స్ పై నేవీ అభ్యంతరాలు వ్యక్తం చేసినట్లు వార్తలొచ్చాయి. ఐఎన్ఎస్ కళింగ పరిధిలోకి వచ్చే మిలీనియం టవర్స్ లో సచివాలయం ఏర్పాటు చేస్తే రాకపోకలు పెరుగుతాయని దీంతో భద్రతకు ప్రమాదం ఏర్పడుతుందని పేర్కొంటూ రాష్ట్ర ప్రభుత్వానికి నేవీ లేఖ రాసినట్లు వార్తలు వెలువడ్డాయి. తాజాగా నేవీ ఇచ్చిన వివరణతో ఈ ఊహాగానాలకు తెరపడింది.
ALSO ON TELUGUONE N E W S
  బాపు దర్శకత్వంలో కృష్ణంరాజు టైటిల్ రోల్ పోషించిన 'భక్త కన్నప్ప' (1976).. ఒక క్లాసిక్ మూవీగా టాలీవుడ్ హిస్టరీలో నిలిచిపోయింది. ఆ సినిమాని ప్రభాస్ రీమేక్ చేస్తే చూడాలని కృష్ణంరాజు భావించారు. కానీ ప్రభాస్ మాత్రం ఎప్పుడూ దానిపై ఆసక్తి చూపలేదు. కొన్నేళ్ల క్రితం రచయిత, నటుడు తనికెళ్ల భరణి తాను కన్నప్ప స్క్రిప్టు తయారు చేశాననీ, అందులో సునీల్ హీరోగా నటిస్తున్నాడని కూడా ప్రకటించారు. ఆయనది బాపు సినిమా రీమేక్ కాదు. సొంతంగా రాసుకున్న స్క్రిప్టు. అయితే సునీల్‌తో ఆ సినిమా తియ్యాలన్న భరణి ఆశలు నెరవేరలేదు. సునీల్‌పై భారీ బడ్జెట్ పెట్టడానికి  నిర్మాతలు వెనుకంజ వేశారు. దాంతో చాలా కాలం నిరీక్షించిన భరణి ఆ ప్రాజెక్ట్ ఆశలు వదిలేసుకున్నారు. కానీ ఆ ప్రాజెక్టును మంచు విష్ణు టేకప్ చేశాడు. ఇప్పుడు మోహన్ బాబు ఆ ప్రాజెక్టుపై తొలిసారి మాట్లాడారు. రూ. 60 కోట్ల భారీ బడ్జెట్‌తో ఆ సినిమా తీసేందుకు విష్ణు సిద్ధమవుతున్నాడని ఆయన వెల్లడించారు. మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా కాళహస్తిలోని శ్రీ కాళహస్తీశ్వర దేవాలయాన్ని దర్శించిన ఆయన అక్కడ మీడియాతో మాట్లాడుతూ ఈ విషయం చెప్పారు. శివునిపై ఆరాధనతో తన కళ్లను పెకలించుకోవడానికి కూడా వెనుకాడని పరమ శివభక్తునిగా కన్నప్ప గురించి కథలు ప్రచారంలో ఉన్నాయి. నాలుగేళ్లుగా ఈ ప్రాజెక్టుపై రచయితల బృందం పనిచేస్తోందని కూడా మోహన్ బాబు తెలిపారు. అయితే ఈ ప్రాజెక్టు విషయంలో విష్ణు నుంచి ఇంతవరకు అధికారిక ప్రకటన రాలేదు. కన్నప్పగా ఎవరు నటిస్తారు, ఎవరు ఆ సినిమాని డైరెక్ట్ చేస్తారనే విషయం కూడా ప్రస్తుతానికి సస్పెన్స్ గానే ఉంది. అతి త్వరలోనే ఈ సస్పెన్స్‌కు తెరపడనున్నది.
  ఇది టాలీవుడ్‌లో లేటెస్టుగా చక్కర్లు కొడుతున్న గాసిప్! 'సరిలేరు నీకెవ్వరు' మూవీ షూటింగ్‌లో ఉండగానే 'మహర్షి' డైరెక్టర్ వంశీ పైడిపల్లితో మరో సినిమా చెయ్యడానికి మహేశ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం అందరికీ తెలిసిందే. వంశీ చెప్పిన స్క్రిప్టు మహేశ్‌కు బాగా నచ్చిందనీ, అందుకే 'సరిలేరు నీకెవ్వరు' తర్వాత మరోసారి వంశీతో కలిసి పనిచెయ్యాలని మహేశ్ నిర్ణయించుకున్నాడనేది మనకు తెలిసిన వార్త. అనిల్ రావిపూడి డైరెక్ట్ చెయ్యగా సంక్రాంతికి విడుదలైన 'సరిలేరు నీకెవ్వరు' మూవీ మహేశ్ కెరీర్‌లో బిగ్గెస్ట్ గ్రాసర్‌గా నిలిచి వరల్డ్ వైడ్‌గా రూ. 130 కోట్లకు పైగా షేర్ వసూలు చేసింది.  ఆ సినిమా రిలీజ్ తర్వాత మూడు నెలల పాటు విశ్రాంతి తీసుకొని అప్పుడు వంశీ పైడిపల్లి సినిమా మొదలు పెడతానని మహేశ్ స్వయంగా ఇంటర్వ్యూల్లో తెలిపాడు. కానీ ఇప్పుడు పరిస్థితులు మారినట్లు కనిపిస్తోంది. వంశీ చెప్పిన ఫైనల్ వెర్షన్ స్క్రిప్ట్ మహేశ్‌ను ఇంప్రెస్ చెయ్యలేదనీ, అందువల్ల ఆ ప్రాజెక్టును ఆపుదామనీ అతను వంశీతో చెప్పినట్లు ప్రచారం మొదలైంది. నిమిషాల వ్యవధిలో ఈ ప్రచారం సోషల్ మీడియాను చుట్టేసింది. ఒకవేళ ఈ ప్రచారమే కనుక నిజమైతే, ఇటీవలి కాలంలో తాను మొదట ఓకే చేసిన ప్రాజెక్టును క్యాన్సిల్ చెయ్యడం మహేశ్‌కు ఇది రెండోసారవుతుంది.  వాస్తవానికి మహేశ్ 'సరిలేరు నీకెవ్వరు' ప్లేస్‌లో సుకుమార్‌తో సినిమా చెయ్యాల్సింది. కానీ స్క్రిప్ట్ విషయంలో ఇద్దరి మధ్యా అభిప్రాయ భేదాలు తలెత్తడంతో ఆ ప్రాజెక్టును మహేశ్ వదిలేసుకొని, అనిల్ రావిపూడితో సినిమా చేశాడు. ఇప్పుడు అదే తరహాలో వంశీతో ప్రాజెక్టును అతను వదులుకుంటున్నాడనీ సమాచారం. వంశీ ప్రాజెక్టుకు బదులు పరశురామ్ తో సినిమా చెయ్యడానికి మహేశ్ ఆసక్తి చూపుతున్నాడని వినిపిస్తోంది. అయితే ఇప్పటికే నాగచైతన్యను డైరెక్ట్ చెయ్యడానికి పరశురామ్ రెడీ అవుతున్నాడు. ఈ నేపథ్యంలో దాన్ని వదులుకొని అతను మహేశ్‌తో సినిమా చెయ్యడానికి ముందుకు వస్తాడా?.. అనేది సస్పెన్స్‌గా మారింది. మరోవైపు 'కేజీఎఫ్' డైరెక్టర్ ప్రశాంత్ నీల్ పేరు కూడా తెరపైకి వచ్చింది. కొంతకాలం క్రితం ప్రశాంత్ చెప్పిన సబ్జెక్ట్ మహేశ్‌ను పూర్తి స్థాయిలో ఇంప్రెస్ చెయ్యలేదు. ఇప్పుడు దాన్ని మార్చి తీసుకువచ్చి మహేశ్‌కు మరోసారి వినిపించాడనీ, మహేశ్‌కు ఈ రివైజ్డ్ వెర్షన్ నచ్చిందనీ అంటున్నారు. ఈ నేపథ్యంలో మహేశ్ ఏ డైరెక్టర్‌తో తన తదుపరి మూవీ చెయ్యనున్నాడనేది ఆసక్తికరంగా మారింది.
  దర్శకుడు తేజ శనివారం (ఫిబ్రవరి 22) తన పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ ప్రత్యేక సందర్భంలో, ఆయన తన తదుపరి రెండు సినిమాల టైటిళ్లనూ, వాటి హీరోలనూ ప్రకటించారు. ఒక మూవీలో గోపీచంద్, మరో సినిమాలో రానా హీరోలుగా నటించనున్నారు. ఈ సినిమాల కోసం ఆయన 'రాక్షస రాజు రావణాసురుడు', 'అలిమేలు మంగ వెంకట రమణ' అనే ఆసక్తికర టైటిళ్లను రిజిస్టర్ చేయించారు. అయితే, ఆసక్తికరమైన విషయమేమంటే, హీరోలు సహా ఎవరి పేర్లనూ ప్రస్తావించకుండా ఈ సినిమాల పోస్టర్లను తేజ విడుదల చేశారు. దాంతో రానాతో చేసే మూవీ ఏది? గోపీచంద్ నటించే సినిమా ఏది?.. అనే విషయాన్ని ఆయన ప్రస్తుతానికి సస్పెన్సులో ఉంచారు. ఈ సినిమాల నిర్మాతలనూ, వాటిలో నటించే తారాగణాన్నీ త్వరలోనే తేజ ప్రకటించనున్నారు. ఇప్పటికే ఆయన ఈ సినిమాల స్క్రిప్టుల్ని పూర్తి చేశారు. 'జయం' చిత్రంతో గోపీచంద్‌కు పెద్ద బ్రేక్ ఇచ్చిన తేజ, 'నేనే రాజు నేనే మంత్రి' సినిమాతో రానాకు మరపురాని హిట్‌ను అందించిన విషయం గమనార్హం. 'రాక్షస రాజు రావణాసురుడు' (ఆర్ఆర్ఆర్) టైటిల్‌ని బట్టి అది రానా సినిమా అనే అభిప్రాయం కలుగుతోంది. చూద్దాం.. తేజ ప్రేక్షకుల ఊహలకు భిన్నంగా వెళ్తారో, వాళ్ల అభిప్రాయానుసారం వెళ్తారో!
తండ్రిని కొడుకు చదివిస్తే... ఆల్మోస్ట్ 50 ఇయర్స్ ఏజ్‌లో ఓ వ్యక్తి కాలేజీకి వెళితే ఎలా ఉంటుందనే పాయింట్ చుట్టూ అల్లిన కథతో తెరకెక్కిన సినిమా 'కాలేజ్ కుమార్'. ఫైట్ మాస్టర్ విజయ్ కుమారుడు రాహుల్ విజయ్ హీరోగా నటించాడు. మార్చి 6న సినిమా ప్రేక్షకుల ముందుకొస్తోంది. శుక్రవారం ట్రైలర్ రిలీజ్ చేశారు. కాలేజీకి వెళ్లే తండ్రిగా నటకిరీటి రాజేంద్రప్రసాద్ నటించారు. ట్రైలర్ ఎండింగ్ సీన్, ఆయన కామెడీ టైమింగ్ సినిమాపై క్యూరియాసిటీ క్రియేట్ చేశాయి. ఇక్కడ ఇంట్రెస్టింగ్ టాపిక్ ఏంటంటే... ఈ సినిమాను తెలుగు, తమిళ లాంగ్వేజెస్‌లో తీశారు. తెలుగులో ఫాదర్ రోల్ రాజేంద్రప్రసాద్ చేస్తే... తమిళంలో ఆ ఫాదర్ రోల్ ప్రభు చేశారు. మిగతా ఆర్టిస్టులు ఆల్మోస్ట్ సేమ్. మదర్ రోల్ మధుబాల చేశారు. మొత్తంగా చూస్తే తమిళ్ ఆర్టిస్టులు ఎక్కువ ఉన్నారు. అయితే... హీరోయిన్ మాత్రం తెలుగమ్మాయే. ప్రియా వడ్లమాని కథానాయికగా నటించారు. ఆడియన్స్ కి నేటివ్ ఫీల్ తీసుకురావడం కోసం అక్కడ ప్రభు... ఇక్కడ రాజేంద్రప్రసాద్ చేత ఫాదర్ రోల్ చేయించినట్టు ఉన్నారు.
పరశురామ్ దర్శకత్వంలో అక్కినేని నాగచైతన్య కథానాయకుడిగా రూపొందనున్న చిత్రానికి లెజెండరీ యాక్టర్, చైతు తాతయ్య 'నాగేశ్వరరావు' టైటిల్ ఖరారు చేసిన సంగతి తెలిసిందే. అఫ్‌కోర్స్... ఇంకా అఫీషియల్ గా అనౌన్స్ చేయలేదనుకోండి. ప్రజెంట్ జనరేషన్ లో ఎక్కువగా ఎవరూ 'నాగేశ్వరరావు' లాంటి పేర్లు పెట్టుకోవడం లేదు. ఓల్డ్ ఫీల్ ఉంటుందని. అటువంటి టైటిల్ సినిమాకు పెట్టాడు పరశురామ్. సినిమా టైటిలే కాదు... సినిమాలో హీరో క్యారెక్టర్ కూడా ఓల్డ్ ఫీల్ టైపు పాత పద్ధతిలో సాగుతుందట. చిన్నతనంలో పెద్ద పెద్ద బాధ్యతలు తీసుకుని, పాతకాలం పద్ధతిలో సాగే యువకుడిగా చైతు క్యారెక్టర్ ఉంటుందట. కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ సినిమాగా ప్రేక్షకుల ముందుకు రానుంది. హీరోతో పాటు హీరోయిన్ క్యారెక్టర్ కూడా బావుంటుందని టాక్. ప్రజెంట్ ఈ సినిమా డైలాగ్ వెర్షన్ కంప్లీట్ చేసే పనిలో పరశురామ్ బిజీగా ఉన్నాడు. అది పూర్తయిన తర్వాత షూటింగుకు వెళతారు. హీరోయిన్ గా రష్మిక మందాన పేరు పరిశీలనలో ఉంది. 'గీత గోవిందం'లో ఆమె నటన సినిమా విజయానికి ఓ కారణం అయింది. అందుకని, ఆమెను రిపీట్ చేయాలనే ఆలోచనలో దర్శకుడు ఉన్నారు. మరోవైపు కీర్తి సురేష్ పేరునూ పరిశీలిస్తున్నారట.
  హ్యాట్రిక్ ఫ్లాపులతో కెరీర్‌లో క్లిష్ట స్థితిని ఎదుర్కొంటున్న నితిన్.. ఎట్టకేలకు రిలీఫ్ ఫీలయ్యాడు. అతని లేటెస్ట్ ఫిల్మ్ 'భీష్మ' ట్రేడ్ విశ్లేషకుల్ని సైతం ఆశ్చర్యానికి గురిచేస్తూ తొలిరోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 6.3 కోట్ల రూపాయల షేర్ వసూలు చేసి, అతని కెరీర్‌లోనే బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ సాధించిన సినిమాగా నిలిచింది. అంతే కాదు, సంక్రాతి సినిమాలు 'సరిలేరు నీకెవ్వరు', 'అల.. వైకుంఠపురములో' తర్వాత మంచి ఓపెనింగ్స్ సాధించిన సినిమాగా కూడా నిలిచింది 'భీష్మ'. తొలి సినిమా 'ఛలో' తోటే ఫిల్మ్ ఇండస్ట్రీ దృష్టిని తనవైపు తిప్పుకున్న డైరెక్టర్ వెంకీ కుడుముల, ఇప్పుడు ద్వితీయ విఘ్నాన్ని అధిగమించి, వరుసగా రెండో హిట్ సాధించాడు. ఆదయంతం ప్రేక్షకుల ముఖాలపై నవ్వులు పూయిస్తూ, వాళ్లను ఆహ్లాదర్పరుస్తున్న ఈ మూవీలో నితిన్ జోడీగా తొలిసారి రష్మికా మందన్న నటించింది. విడుదలకు ముందే పాజిటివ్ బజ్ సాధించిన 'భీష్మ' మూవీ నైజాంలో తొలిరోజు 2.2 కోట్ల రూపాయల షేర్ సాధించగా, ఆంధ్ర, రాయలసీమ ఏరియాలు కలిపి 4.1 కోట్ల రూపాయలు రాబట్టడం విశేషం. సీడెడ్‌లో 80 లక్షల రూపాయలు రాగా, 3.3 కోట్ల రూపాయలు ఆంధ్రా రీజియన్ నుంచి వచ్చాయి. అంటే నైజాంను మించి ఆంధ్రా ప్రేక్షకులే 'భీష్మ'ను తొలిరోజు ఎక్కువగా ఆదరించారని అర్థమవుతోంది. ఈ స్థాయిలో వసూళ్లు రావడంతో నితిన్, అతని ఫ్యాన్స్ ఆనందం అంతా ఇంతా కాదు. నితిన్‌పై నమ్మకాన్ని ఉంచి ఈ సినిమా నిర్మించిన సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ అధినేత సూర్యదేవర నాగవంశీ సంబరాల్లో మునిగి తేలుతున్నాడు. నిజానికి కథగా చెప్పుకోవాలంటే 'భీష్మ'లో పెద్ద విషయం లేదు. కానీ ప్రేక్షకులకు మంచి కాలక్షేపం అందించింది. అన్నిటి కంటే ముఖ్యంగా ఫ్యామిలీతో కలిసి చూసేలా ఆరోగ్యకరమైన హాస్యం ఉండటం సినిమాకు పెద్ద ప్లస్సయింది. ఒక ప్రీ వెడ్డింగ్ పార్టీకి వెళ్లిన నితిన్, అక్కడ పెళ్లికూతురితో తాను ఐఏఎస్ అని చెబితే, ఆమె అతనితో వచ్చేయడం మామూలుగా అయితే లాజికల్ కాదు. కానీ, అక్కడి డైలాగ్స్ బాగా నవ్వించి, ప్రేక్షకులు లాజిక్‌ను మర్చిపోయేలా చేశాయి. అదే సీన్‌ను ఆధారం చేసుకొని వెన్నెల కిషోర్‌పై తీసిన కామెడీ ట్రాక్ మరింతగా నవ్వించింది.  మీమ్స్ మీద బేస్ చేసుకుని రాసిన డైలాగులు ఆహ్లాదాన్ని పంచాయి. హీరో నితిన్ ఇంట్రడక్షన్, హీరోయిన్ రష్మికకు అతడు లైన్ వేసే సీన్స్, మధ్యలో కొంచెం కంపెనీ గొడవలు టచ్ చేస్తూ సినిమా ఫస్టాఫ్ అంతా సరదాగా నడిచింది. ఇంటర్వెల్ తర్వాత కామెడీ సీన్స్ తగ్గినప్పటికీ, పాటలు, స్టయిలిష్ ఫైట్లతో మేనేజ్ చేశారు. సినిమాలో అడుగడుగునా డైరెక్టర్ టేకింగ్, కామెడీ రైటింగ్ కనిపిస్తాయి. సెకండాఫ్‌లో వెంకట్ మాస్టర్ డిజైన్ చేసిన ఫైట్ బావుందని మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ ఇచ్చిన కితాబులో నిజం ఉంది. రిచ్ ప్రొడక్షన్ వాల్యూస్ కూడా సినిమాని ఆకర్షణీయంగా తయారుచేశాయని చెప్పాలి. సాయి శ్రీరామ్ సినిమాటోగ్రఫీకి, మణిశర్మ కుమారుడు మహతి స్వరసాగర్ అందించిన బ్యాగ్రౌండ్ స్కోర్ తోడై అనేక సన్నివేశాలు, ఫైట్లు ప్రేక్షకుల హృదయాల్ని రంజింపజేశాయి. పాటల మ్యూజిక్ ఇప్పుడున్న దానికంటే ఇంకా బాగుంటే, సినిమా హిట్ రేంజ్ ఇంకా పెద్దదిగా ఉండేదనేది విశ్లేషకుల అభిప్రాయం. ఇప్పటివరకూ త్రివిక్రమ్ డైరెక్ట్ చేసిన 'అ ఆ' మూవీ నితిన్ కెరీర్ బెస్ట్ మూవీ. ఏపీ, తెలంగాణలో ఆ సినిమా ఓవరాల్‌గా 31.7 కోట్ల రూపాయల షేర్ సాధించింది. వరల్డ్‌వైడ్‌గా చూసుకుంటే, 47 కోట్ల రూపాయల షేర్ వసూలు చేసింది. ఆ సినిమా ఏపీ, తెలంగాణలో ఫస్ట్ డే కలెక్ట్ చేసిన 5.55 కోట్ల రూపాయల షేర్‌ను 'భీష్మ' మూవీ దాటేసింది. సందర్భవశాత్తూ 'అ ఆ' మూవీకి త్రివిక్రమ్ దగ్గర వెంకీ కుడుముల అసిస్టెంట్‌గా పనిచేశాడు. అంటే నితిన్‌కు తన గురువు ఇచ్చిన ఓపెనింగ్స్ కంటే వెంకీ ఎక్కువ ఓపెనింగ్స్ ఇచ్చాడన్న మాట. మరి ఓవరాల్ కలెక్షన్స్ విషయంలోనూ అతను గురువును దాటుతాడో, లేదో చూడాలి.  టేకింగ్ పరంగా వెంకీ తన గురువును అనుసరించాడనేది స్పష్టం. త్రివిక్రమ్ సినిమాల్లో హెవీ సీన్స్ ఉండవు. హీరోలోని నటుడ్ని బాగా ఎలివేట్ చేసే ఎమోషనల్ సీన్స్ ఉండవు. లైటర్ వీన్‌లో, సన్నివేశాలు సరదా సరదాగా సాగుతూ, ఆహ్లాదాన్ని పంచుతాయి. వెంకీ కుడుముల సైతం అదే ఫార్మట్‌ను అనుసరించి 'భీష్మ'ను రూపొందించాడు. అంటే, 'భీష్మ' అనేది నటుడిగా నితిన్‌కి సవాల్ విసిరే పాత్ర కాదు. కానీ, ఆ పాత్రలో నితిన్ చక్కగా ఒదిగిపోయాడు. చాలా స్టయిలిష్‌గా దాన్ని చేశాడు. చాలా కాలం తర్వాత ఫ్యాన్స్ ఆకలి తీరేలే డాన్సులు బాగా చేశాడు. అతడి కామెడీ టైమింగ్ బావుంది. నితిన్-రష్మిక మధ్య కెమిస్ట్రీ అలరించింది. 'వాటే వాటే బ్యూటీ'లో నితిన్ కంటే ఆమె డాన్సు బాగా చేసింది. వీళ్లిద్దరి తర్వాత అంతగా ఆకట్టుకున్న నటుడు వెన్నెల కిషోర్. తనదైన శైలిలో నవ్వించాడు. అందుకే 'భీష్మ' ఆకట్టుకుంటున్నాడు, అలరిస్తున్నాడు.
'భారతీయుడు 2' సెట్స్‌లో బుధవారం క్రేన్ కిందపడి ముగ్గురు మృతి చెందిన దుర్ఘటనలో కథానాయకుడు కమల్ హాసన్, దర్శకుడు శంకర్ ను పోలీసులు ప్రశ్నించే అవకాశాలు ఉన్నాయని సమాచారం. బుధవారం రాత్రి ప్రమాదం జరిగిన వెంటనే క్రేన్ ఆపరేటర్ రాజన్ అదృశ్యం అయ్యాడు. పోలీసులు శుక్రవారం అతడిని అరెస్ట్ చేశారు. వృత్తిలో నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్ల ముగ్గురి మృతికి కారణమయ్యాడని రాజన్ మీద ఐపీసీ సెక్షన్స్ కింద కేసు పెట్టారు. అయితే... ఘటన జరిగిన సమయంలో కమల్ హాసన్, దర్శకుడు శంకర్ కూడా ఘటనాస్థలంలో ఉన్నారు. అందుకని, వాళ్లిద్దరినీ పోలీసులు ప్రశ్నించే అవకాశాలు ఉన్నాయని సమాచారం. పోలీసుల ముందుకు వారు వెళ్లవలసి రావొచ్చని చెన్నై టాక్. మృతుల కుటుంబాలకు కోటి రూపాయల సహాయం ప్రకటించిన కమల్ హాసన్, ఘటనలో గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పరామర్శించారు. దర్శకుడు శంకర్ కూడా ఆసుపత్రికి వెళ్లారు. దాంతో ఆయనకు తీవ్ర గాయాలు అయ్యాయనే పుకార్లకు ఫుల్ స్టాప్ పడింది.
తెలుగులో మెహరీన్ తొలి సినిమా 'కృష్ణగాడి వీరప్రేమగాథ'. కథానాయికగా ఆమె తొలి సినిమా కూడా అదే. అంతకు ముందు ఒక సోప్ యాడ్, బ్యూటీ ప్రోడక్ట్ యాడ్స్ ఏవో చేశారు. దర్శకుడు హను రాఘవపూడికి 'కృష్ణగాడి వీరప్రేమగాథ' రెండో సినిమా. అంతకుముందు ఆయన 'అందాల రాక్షసి' తీశారు. ఎవరో కోఆర్డినేటర్ ద్వారా మెహరీన్ ఫొటోలు చూసి కృష్ణగాడి ప్రేయసి మహాలక్ష్మి పాత్రకు సెలెక్ట్ చేశారు. అంతకు ముందు ఆమెకు యాడ్స్ లో నటించిన అనుభవం ఉన్నప్పటికీ ఫస్ట్ సినిమాలో ఫస్ట్ షాట్ చేయడానికి ఐదారు టేక్స్ తీసుకున్నారు. ఇంతకీ, 'కృష్ణగాడి వీరప్రేమగాథ'లో మెహరీన్ నటించిన ఫస్ట్ సీన్ ఏదో తెలుసా? దేవుడికి దణ్ణం పెడుతూ శ్లోకం చెప్పే సీన్!  షూటింగ్ చేసినప్పటి సంగతులను మెహరీన్ గుర్తు చేసుకుంటూ "యాడ్ షూటింగ్ చేయడం, సినిమా షూటింగ్ చేయడం డిఫరెంట్ ఎక్స్ ప్రీరియన్స్. 'కృష్ణగాడి వీరప్రేమగాథ' షూటింగ్ ఫస్ట్ డే నేను చాలా నెర్వస్ గా ఉన్నాను.కెమెరా రోలింగ్, యాక్షన్ అని డైరెక్టర్ చెప్పగానే కన్‌ఫ్యూజ్ అయ్యేదాన్ని. ఆ  బ్లాంక్ అయ్యేదాన్ని. ఆ కన్‌ఫ్యూజన్‌లో బ్లాంక్ ఎక్స్‌ప్రెషన్ ఇచ్చేదాన్ని. ఐదారుసార్లు అలాగే చేశా. దాంతో డైరెక్టర్ హను రాఘవపూడి కెమెరా ఎప్పుడూ రోలింగ్ లో ఉంచి సీన్ కంప్లీట్ చేశారు" అని చెప్పుకొచ్చారు. ఆ సినిమా తర్వాత మెహరీన్ తెలుగులో చాలా సినిమాలు చేశారు.
తెలంగాణలో ఖాళీ అవుతోన్న రెండు రాజ్యసభ సీట్లపై ఎప్పట్నుంచో రకరకాల ఊహాగానాలు వెలువడుతున్నాయి. టీఆర్ఎస్ ఖాతాలోకి వెళ్లే ఈ రెండు స్థానాలపై పలువురి పేర్లు ప్రచారంలో ఉన్నాయి. అయితే, మొదట్నుంచీ కవిత పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. లోక్ సభలో గట్టిగా తెలంగాణ వాణి వినిపించి పేరు తెచ్చుకున్న కవిత... అనూహ్యంగా నిజామాబాద్లో ఓటమిపాలు కావడంతో... రాజ్యసభకు పంపుతారనే ప్రచారం జరిగింది. అంతలోనే రాజ్యసభకు కాదు ఏకంగా రాష్ట్ర కేబినెట్లోకి తీసుకుంటారంటూ కథనాలు వచ్చాయి. అయితే, కవితను రాజ్యసభకు పంపడం ఖాయమైనట్లు తెలుస్తోంది.  టీఆర్ఎస్ కు దక్కనున్న రెండు రాజ్యసభ సీట్లలో ఒక స్థానానికి కవిత పేరు దాదాపు ఫైనల్ అంటున్నారు. ఢిల్లీ స్థాయిలో అన్ని రాజకీయ వర్గాలతో సత్సబంధాలు కలిగివుండటం... వాక్చాతుర్యం, హిందీ, ఇంగ్లీష్ మీద పట్టు ఉండటం.... తెలంగాణ సమస్యలు, అంశాల మీద సమగ్ర అవగాహన కలిగివున్న కవితను, రాజ్యసభకు పంపితే... హస్తినలో టీఆర్ఎస్ పాత్ర మరింత పెరుగుతుందని కేసీఆర్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక, కేసీఆర్ కూతురుగా ఉండే ఇమేజ్ ఎలాగూ ఉండనుంది. ఇలా, అన్నీ కవితకు కలిసొస్తున్నందున రాజ్యసభకు వెళ్లడం ఖాయమంటున్నారు. ఇక, మిగిలిన మరో సీటుపైనే మాజీ మంత్రులు, మాజీ ఎంపీలు, సీనియర్లు గంపెడాశలు పెట్టుకున్నారు. అయితే, ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి ఇప్పటికే హమీ లభించినట్టు పార్టీలో చర్చ జరుగుతోంది. ఖమ్మం ఎంపీ టికెట్ నిరాకరించినా..పొంగులేటి పార్టీకి విధేయులుగానే ఉన్నారు. పార్టీ అప్పగించిన బాధ్యతలను నిర్వర్తిస్తూ.. పార్టీ అభ్యర్ధుల విజయం కోసం పనిచేశారు. దీంతో అన్నా నువ్వు రాజ్యసభకు వెళుతున్నావు..రెడీ అవ్వు అని కేటీఆర్..పొంగులేటికి హమీ ఇచ్చినట్లు తెలుస్తోంది. దీంతో పెద్దల సభకు పొంగులేటి అని పార్టీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. ఏదైనా, చివరి నిమిషంలో మార్పులు చేస్తే తప్ప, కవిత అండ్ పొంగులేటి రాజ్యసభకు వెళ్లడం ఖాయమంటున్నారు.
ఎంకి పెళ్లి సుబ్బి చావుకొచ్చిందంటే ఇదేనేమో... ఏ.బీ. వెంకటేశ్వర రావు ఇంటెలిజెన్స్ అదనపు డి.జి.పి. గా ఉన్న సమయంలో విశేషంగా సేవలందించిన ముగ్గురు డి.ఎస్.పి. లకు వై ఎస్ ఆర్ సి పీ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఇంకా ఇంటెలిజెన్స్ కే సేవలందించే భాగ్యాన్ని పోలీసు బాస్ లు కల్పించారు. ఇంతకీ, ఆ ముగ్గురూ కూడా ఉన్నది ఉన్నట్టు, లేనిది లేనట్టు గానే నిజాయితీ తో కూడిన నివేదికలను ఏ.బి. కి ఇస్తూ వచ్చే వారు. నాయుడు పార్టీ గల్లంతవుతుందని, 50 కి మించి సీట్లు రావని మరీ ఢంకా బజాయించి సమగ్ర నివేదికలు, నియోజకవర్గాల వారీగా ఇచ్చారు. మిగిలిన డి.ఎస్.పి ల మాదిరి, ఏ.బి. అడుగులకు మడుగులు కొట్టకుండా...ఉన్న వాస్తవాన్ని కళ్ళకు కట్టినట్టు గా వివరించిన ఆ ముగ్గురు డి ఎస్ పి లకు ఆశ్చర్యకరంగా ఇప్పుడు లా ఎండ్ ఆర్డర్ లో కానీ, ఏ సి బీ లో కానీ, విజిలెన్స్ ఎండ్ ఎంఫోర్సుమెంట్ లో కానీ అవకాశం ఇవ్వటానికి పోలీసు బాస్ లు ససేమిరా అంటున్నారు. ఆ ముగ్గురూ కూడా తెలుగు దేశం హయాం లో నిక్కచ్చిగా పనిచేశారు కాబట్టి, ఎలాంటి రాగ ద్వేషాలకు లొంగకుండా పని తీరు ప్రదర్శించారు కాబట్టి వారి సేవలు ఇంటెలిజెన్స్ కె అవసరం పడతాయని పోలీసు బాస్ లు సూత్రీకరించారు. దరిమిలా...వారి ముగ్గురికీ ఇంటెలిజెన్స్ లోనే కొనసాగాల్సిన గతి ఏర్పడింది. వాస్తవానికి లా ఎండ్ ఆర్డర్ లో కానీ, ఏ సి బి లో కానీ వారికి అవకాశం కల్పించటానికి దారులు ఉన్నప్పటికీ, వారిని మినహాయించి వేకెన్సీ రిజర్వ్ (వీ.ఆర్.) లో ఉన్న చాలా మందికి పోస్టింగులు ఇవ్వటానికి కూడా పోలీసు బాస్ లు ప్రయత్నిస్తున్నారు. విషయం తెలిసిన ఆ ముగ్గురు ఇంటెలిజెన్స్ డి ఎస్ పి లు ఇక తమకు కీలకమైన విభాగాల్లో అవకాశం రాదనీ నిర్ధారించుకుని, రాజీనామా ఇవ్వటానికి సింథ్పడినట్టు పోలీస్ హెడ్ క్వార్ట్రర్స్ భోగట్టా. ఈ విషయమై వారు ఇప్పటికే, పలువురు సీనియర్ అధికారుల చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతున్నా ఎలాంటి ఫలితమూ కనపడక పోవటం తో , గత్యంతరం లేని పరిస్థితుల్లో ఆ ముగ్గురూ కూడా తమ పోస్టులకు రాజీనామా చేసేద్దామని నిర్ణయానికి వచ్చినట్టు ఒక సీనియర్ మోస్ట్ పోలీస్ బాస్ తన ఆంతరంగికుల దగ్గర సమాచారాన్ని షేర్ చేసుకున్నట్టు వెలగపూడి సెక్రెటేరియట్ లో చెప్పుకుంటున్నారు. ఇదే గనుక జరిగితే, ప్రభుత్వానికి కొంత ఇబ్బందికర మైన పరిస్థితి ఏర్పడుతుందని, హోమ్ మంత్రి నేరుగాఈ వ్యవహారం పై దృష్టిపెట్టి , ముఖ్యమంత్రి దృష్టి లో సమస్యను ఉంచాలని సీనియర్ పోలీస్ అధికారులు అభిప్రాయపడుతున్నారు. డి ఎస్ పీ స్థాయి అధికారులు కూడా నైరాశ్యానికి లోనై, ఇలాంటి కఠిన నిర్ణయాలు తీసుకుంటే, పోలీస్ శాఖపై ప్రజలకు తప్పు సంకేతాలు వెళతాయని ఆందోళనను పోలీసు అధికారులే వ్యక్తం చేస్తున్నారు. అసలు పోలీస్ శాఖపై హోమ్ మంత్రికి సమగ్ర అవగాహనా ఉండేలా ఇంతవరకూ ఒక కార్యాచరణ తో కూడిన ప్లాన్ ను ఏదైనా సీనియర్ అధికారులతో డిస్కస్ చేశారా, లేదా అనేది కూడా తెలియని ఒక అయోమయ స్థితి నెలకొంది.  వాస్తవానికి ఆ ముగ్గురు డి ఎస్ పి లు కూడా వాస్తవాలతో కూడిన నివేదికలు ఇవ్వటం అనేది, ఎన్నికల ముందు వై ఎస్ ఆర్ సి పీ కి కూడా కొంత నైతిక స్థైర్యాన్ని ఇచ్చింది. ఇప్పుడు పాలక పక్షం లో ఉన్న వై ఎస్ ఆర్ సి పీ ప్రస్తుతమ్ ఈ తరహా అన్యాయం పై నోరు మెదపకపోవటం తో ఆ ముగ్గురు డి ఎస్ పి లు అనివార్యంగా తమ రాజీనామా నిర్ణయాన్ని నేరుగా హోమ్ మంత్రి దృష్టి కె తీసుకెళ్లాలని  భావిస్తున్నారు. చిత్రం కాకపొతే, వారి నిక్కచ్చి తనమే ...వారికి ఇపుడు కీలక విభాగాల్లో పోస్టింగులు రాకుండా అడ్డు పడటమేమిటని సెక్రెటేరియేట్ సీనియర్లు ఆశ్చర్య పోతున్నారు. వాస్తవానికి అవినీతీ నిరోధక శాఖ (ఏ సి బీ) కి ఇప్పుడు 14 మంది డి ఎస్ పి ల అవసరం ఉన్నప్పటికీ, ఇటువంటి నిజాయితీ పరులైన అధికారులని ఏ సి బీ కోసం వదులుకోవటానికి ఇంటెలిజెన్స్ శాఖ సిద్ధంగా లేదని ఆ శాఖ లో ఒక పెద్ద ఆఫీసర్ వాక్రుచ్చారు. మరి ఎల్లా కాలమూ, వారు అక్కడే సేవలందించాలా అనే ప్రశ్నకు మాత్రం ఆ పెద్దాయన దగ్గర సమాధానం లేదు. మొత్తానికి, మోరల్ ఆఫ్ ది స్టోరీ ఏమిటంటే--మరీ ముక్కు సూటిగా పొతే, ఒకో సారి అవసరాలకు కూడా వెతుక్కునే పరిస్థితి ఎదురవ్వచ్చు అని...
తెలంగాణ సీఎం కేసీఆర్ నిరంతర శ్రామికుడు. అలుపెరుగని పోరాట యోధుడు. ఎప్పుడూ ప్రజాకాంక్షే ప్రధానంగా ప్రజానురంజకంగా పాలన సాగించే ఓ మేధావి. గొప్ప రాజకీయ వేత్త. అసాధారణ పట్టుదల, అచంచలమైన ఆత్మవిశ్వాసం, సాధించాలనే తపన కలగలసి ప్రజల్లో ఓశక్తిగా ఎదిగాడు కేసీఆర్. ఎన్నింటినో అసాధ్యం అనుకున్న వాటిని చేపట్టి సుసాధ్యం చేసుకొనేలా వ్యూహాలను.. తెగింపుతో కూడిన పోరాట పటిమను ప్రదర్శించి ప్రజలతో హ్యాట్సాప్ అనిపించుకున్నారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రసాధన కోసం అలుపెరుగని కృషి చేశారుడ. తెలంగాణ ఏర్పాటుతో తిరిగులేని నేతగా ప్రజల హృదయాలను గెలిచాడు. వరుసగా రెండోసారి కూడా ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించి ప్రజానురంజకంగా పాలన చేస్తున్నాడు. దేశంలోని ఎన్నో రాష్ట్రాలకు కేసీఆర్ తెలంగాణలో ప్రవేశపెట్టిన పథకాలు ఆదర్శంగా నిలిచాయి. రోల్ మోడల్ సీఎం కేసీఆర్ ను తీసుకొని ఇతర రాష్ట్రాలు పాలన సాగిస్తున్నాయి. సంక్షేమం, అభివృద్ధికి సముచిత ప్రాధాన్యం ఇస్తూ.. కేసీఆర్ పాలన సాగిస్తున్న తీరు అందర్నీ ఎంతో ఆకర్షిస్తుంది. తెలంగాణ చెరువులకు జలకళ తెచ్చాడు. అందుకోసం మిషన్ కాకతీయ.. ఇంటింటికి తాగునీటి కోసం మిషన్ భగీరథ ఎన్నో గొప్ప పథకాలతో దూసుకుపోతున్నారు. ముందు చూపున్న నేతగా కేసీఆర్ చేపట్టిన ఈ పథకాలను నీతి ఆయోగ్ కూడా ప్రశంసించింది. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంతో అపర భగీరథుడుగా మారారు కేసీఆర్. అంతేకాకుండా సంక్షేమం విషయంలో కేసీఆర్ తనదైన శైలిని ఎంచుకున్నారు. కళ్యాణ లక్ష్మీ, కేసీఆర్ కిట్, ఆసరా ఫించన్లు వంటి  పథకాలు పేదలకు భరోసాని కల్పించాయి. కేసీఆర్ తీసుకొచ్చిన రైతు బంధు పథకమైతే.. కేంద్రానికే ఆదర్శప్రాయంగా నిలిచింది. అలాగే.. కేసీఆర్ సంక్షేమానికి ఎంతటి ప్రాధాన్యత ఇస్తారో.. అంతకు మించి అభివృద్ధికి కూడా ప్రాధాన్యత ఇచ్చారు. టీఎస్ ఐపాస్ ద్వారా పరిశ్రమలకు అనుమతులు ఇవ్వడం కీలకంగా చెప్పవచ్చు. గత ఐదేళ్లలో హైదరాబాద్ ఐటీ రంగం భారీగా పుంజుకుంది. మళ్లీ బెంగళూరుకు పోటీ ఇచ్చే స్థాయికి ఎదిగింది. పెద్ద పెద్ద కంపెనీలు హైదరాబాద్ వైపు చూస్తున్నాయి. ఇదంతా కేసీఆర్ సర్కారు అందిస్తోన్న సుస్థిర పాలన వల్లే సాధ్యమైందని చెప్పవచ్చు. కేసీఆర్ అంటే తెలంగాణ ప్రజల గొంతుక. ఎవరికీ కష్టం వచ్చినా.. వారికి తెలిస్తే చాలు.. వెంటనే ఫోన్ చేసి ఆరా తీస్తాడు. పేద ధనిక అన్న తేడా లేకుండా అందరితో కలివిడిగా మాట్లాడతాడు. స్థానిక ప్రజలను నవ్వించాలన్నా.. ఏడిపించాలన్నా అది కేసీఆర్ కే సాధ్యం... కాదు కాదు.. ఆయన స్పీచ్ కు సాధ్యం. ప్రజల్లో ఊరమాస్ లెక్క ఉండే ఆయన స్పీచ్ లకు జనాలు దాసోహమౌతారు.  అక్షరం ముక్క రానోడి కూడా ఆయన మాటలకు పడిపోతాడు. అలాంటి కట్టిపడేసే నైజం కేసీఆర్ మాటకు ఉంది. ఒక్క మాటలో చెప్పాలంటే కేసీఆర్ అంటే తెలంగాణ.. తెలంగాణ అంటే కేసీఆర్. ఆ స్థాయి ఇమేజ్ తెచ్చుకున్న కేసీఆర్ నిజంగా తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్. కాగా ఈరోజు కేసీఆర్ జన్మదినం సందర్భంగా కేసీఆర్ గారికి మా తెలుగుఒన్.కామ్ తరఫున జన్మదిన శుభాకాంక్షలు.
ప్రశాంత్‌ కిశోర్ అలియాస్ పీకే. ఎన్నికల వ్యూహకర్తగా దేశంలో పాపులరైన పర్సన్. 2014 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీకి వ్యూహకర్తగా పనిచేసి ఆనాటి కమల విజయంలో కీలక పాత్ర పోషించడంతో మొదలైన పీకే ప్రస్థానం అప్రతిహాతంగా కొనసాగుతోంది. ఆ తర్వాత కాంగ్రెస్ తో కలిసి పనిచేసి పంజాబ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ లో హస్తం పార్టీ విజయంలో ముఖ్య పాత్ర పోషించారు. అలాగే, బీహార్లో జేడీయూ... ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ... ఢిల్లీలో ఆప్ కోసం పనిచేసి ఆ పార్టీల ఘన విజయానికి కారణమయ్యాడు. అయితే, జేడీయూ అధినేత, బీహార్ సీఎం నితీష్ తో వచ్చిన విభేదాలతో ఆ పార్టీ నుంచి బహిష్కరణకు గురైన ప్రశాంత్ కిశోర్.... మోడీ అండ్ నితీష్ లక్ష్యంగా కొత్త పార్టీ పెట్టబోతున్నారన్న చర్చ ఢిల్లీ వీధుల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది.  ముఖ్యంగా, తన సొంత రాష్ట్రంలో బీహార్ రాజకీయాల్లో కీ రోల్ పోషించేందుకు సిద్దమవుతున్నారన్న చర్చ జరుగుతోంది. జేడీయూ నుంచి బహిష్కృతుడైన పీకే, అటు జేడీయూ, ఇటు బీజేపీ మీద కసితో రగిలిపోతున్నారు. బీహార్‌లో ప్రాంతీయ పార్టీ పెట్టి, అదే వేదికగా, దేశవ్యాప్తంగా ప్రాంతీయ పార్టీలను ఏకంచేసి, మోడీ అండ్ అమిత్‌ షాలకు చెక్‌ పెట్టాలనుకుంటున్నారని, అందులో భాగంగా ప్రాంతీయ పార్టీ, ప్రాంతీయ పార్టీల కూటమి ప్రకటించబోతున్నారన్న ప్రచారం జరుగుతోంది. ఇదే, ఇప్పుడు అత్యంత ఆసక్తి కలిగిస్తోంది.  అయితే, జగన్‌కు పీకే అత్యంత క్లోజ్. దాంతో, ప్రాంతీయ పార్టీల కూటమిలో చేరాల్సిందిగా జగన్‌ను కోరే అవకాశముంది. ఆమ్‌ ఆద్మీ ఎలాగూ ఓకే చెప్పొచ్చు. బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీతోనూ పీకేకు మంచి రిలేషన్స్ ఉన్నాయి. ఇక, తమిళనాడులో డీఎంకే అధినేత స్టాలిన్‌తోనూ ప్రశాంత్ పని చేయబోతున్నారు. ఇలా బలమైన ప్రాంతీయ పార్టీలన్నింటితోనూ ప్రశాంత్‌ కిశోర్‌కు మంచి సంబంధాలున్నాయి. దాంతో, ప్రాంతీయ పార్టీల కూటమి ఏర్పాటు చేసి వచ్చే ఎన్నికల్లో మోడీ అండ్ షాకి తడాఖా చూపాలని స్కెచ్ వేస్తున్నారట పీకే. ఇందులో భాగంగానే తనకు అత్యంత సన్నిహితునిగా భావించే జగన్‌ను సైతం, ప్రాంతీయ కూటమిలో చేరాలని కోరాడని, అదే ఇప్పుడు కమలంలో అలజడి కారణమైందని అంటున్నారు. ప్రశాంత్ కిశోర్‌ ఫ‌్రంట్‌లో ఎట్టి పరిస్థితుల్లోనూ చేరొద్దని జగన్‌ పై బీజేపీ అధిష్టానం ఒత్తిడి తెస్తోందని అంటన్నారు. ఇప్పడున్నట్టే ఏ కూటమిలోనూ చేరకుండా, తటస్థంగా ఉండాలని సూచించిందట. అందుకే జగన్‌ను ఢిల్లీ పిలిపించుకుని మాట్లాడుతోందని అంటున్నారు. అటు కేసీఆర్‌ను సైతం పీకే ప్రతిపాదిత ఫ్రంట్‌లో చేరొద్దని సూచించబోతోందట. బీజేపీ బుజ్జగింపులకు జగన్‌ సైతం ఓకే చెప్పారని అంటున్నారు. అంతేకాదు, ఎన్డీఏ నుంచి శివసేన బయటికి వెళ్లిపోయినందున, మరో బలమైన మిత్రపక్షం కోసం చూస్తున్న బీజేపీ, కేంద్ర ప్రభుత్వంలో చేరాలని వైసీపీని ఒత్తిడి చేస్తున్నారట. విజయసాయిరెడ్డితోపాటు మరో కీలక వ్యక్తికి కేంద్రమంత్రి పదవులు ఇస్తామమని ఆఫర్ ఇచ్చినట్లు చెబుతున్నారు. మొత్తంగా వీటన్నింటిపైనా చర్చించేందుకే, జగన్ ఒక్కరోజు గ్యాప్ లో రెండుసార్లు ఢిల్లీ వెళ్లారని అంటున్నారు.
ముఖ్యమంత్రిగా తొలిసారి పరిమిత మీడియాతో జగన్ మాటా మంతి.. సీఎం స్థానం అంటే.. ఈరాష్ట్రానికి తండ్రిలాంటి స్థానం: జగన్ మోహన్ రెడ్డి రాష్ట్రంలో ఎక్కడనుంచి పనిచేయాలన్నది ముఖ్యమంత్రి ఇష్టం.                                          ముఖ్యమంత్రి ఎక్కడ ఉంటే పాలనా యంత్రాంగం అక్కడ ఉంటుంది: సి.ఎం. జగన్ మోహన్ రెడ్డి మనముందున్న లక్ష్యం విశాఖను  టైర్‌–1 స్థాయికి అభివృద్దిచేయడమే: జగన్ మోహన్ రెడ్డి .మొత్తానికి సి ఎం వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. పరిమిత మీడియా తో అయినా, అపరిమితమైన అంశాలను షేర్ చేసుకున్నారు. పెన్షన్ల దగ్గర నుంచి పోలవరం దాకా, ఇంగ్లిష్ మీడియం నుంచి రాజధాని నిర్మాణం దాకా....అనేకానేక విషయాలను స్పృశించిన జగన్ మోహన్ రెడ్డి , తన మనసులో మాటలను, ఆలోచనలను ప్రజలతో పంచుకున్నారు. పెన్షన్లగురించి మాట్లాడుతూ.. ఒకరికి  ఇచ్చి ఇంకొకరికి ఇవ్వకపోతే ... అన్యాయం జరిగిందనే భావన వారికి ఉంటుందాని చెప్పుకొచ్చారు. ప్రజల ముందే లబ్ధిదారుల జాబితా పెడుతున్నామనీ, సామాజిక తనిఖీకోసం గ్రామ ప్రజలముందే, గ్రామ సచివాలయంలో పెడుతున్నామనీ, ఎవరుకూడా తప్పులు చేసే అవకాశం లేకుండా చేస్తున్నామనీ చెప్పుకొచ్చారు సి.ఎం. ప్రతి పథకంకూడా సంతృప్తస్థాయిలో, పారదర్శకంగా అమలు చేస్తున్నామని చెప్పుకొచ్చిన సి.ఎం, పెన్షన్‌ ఇంతకుముందు కావాలంటే మూడు నెలల పెన్షన్‌ డబ్బు లంచంగా ఇవ్వాల్సి వచ్చేదన్న విషయాన్ని గుర్తు చేశారు. పధకాల గురించి మాట్లాడుతూ, మేం ఏంచెప్పామో అదే చేస్తున్నామన్నారాయన. మేం ప్రతి పథకాన్నీ పెడుతున్నామంటే.. మేం చెప్తున్నదాన్ని అమలుచేస్తున్నామని కదా? ప్రతి ఏటా రెవిన్యూ ఎంతోకొంత పెరుగుతుంది. నంబర్లలో కాస్త అటూ ఇటూ ఉండొచ్చుకాని, పెరుగుదలైతే ఉంటుందని కూడాభరోసాఇచ్చారు... ఇంగ్లిషు మీడియంపైన మాట్లాడుతూ, "న్యూట్రల్‌ మనిషిని ఎవరైనా అడగండి...కచ్చితంగా మా విధానాలను బలపరుస్తారు, మద్దతిస్తారు. ఇవాళ ఇంగ్లిషు మీడియం పెడితేనే... 20ఏళ్లలో మార్పులు వస్తాయి.ఇవాళ ఫస్ట్‌క్లాస్‌ చదవే వ్యక్తి.. 20 ఏళ్ల తర్వాత డిగ్రీ పూర్తిచేస్తారు. ఇవాళ ఫోన్‌ఆన్‌  చేస్తే..కమ్యూనికేషన్‌ అంతా ఇంగ్లిషే. కంప్యూటర్లు.. ఇంటర్నెట్‌అంతా ఇంగ్లిష్‌లోనే. డ్రైవర్‌లెస్‌కార్లు వస్తున్నాయన్నది రియాల్టీ. ఇవాళ మనం మార్పు చేసుకుంటేనే.. భవిష్యత్‌తరాలకు మంచి జరుగుతుంది. సానుకూల దృక్పథంతో ముందుకు సాగాలి," అని హితవు కూడా చెప్పారు.  అన్ని ప్రభుత్వ స్కూళ్లలోని విద్యాకమిటీలు పూర్తిగా ఇంగ్లిషు మీడియం పెట్టాలని వారంతా తీర్మానాలు చేసి పంపారని, ఎవర్ని అడిగినా ఇంగ్లిషుమీడియం కావాలనే చెప్తారని కూడా సి.ఎం. చెప్పుకొచ్చారు. రాజధాని కార్యకలాపాల వికేంద్రీకరణ, రాష్ట్ర సమగ్రాభివృద్ధిపై  మాట్లాడుతూ... "రాజధానిపై నేను చెప్పాల్సింది అంతా అసెంబ్లీలోనే చెప్పాను. రాజధానిని ఎంచుకున్న ప్రాంతాన్ని చూడండి. అటు విజయవాడా కాదు, ఇటు గుంటూరూ కాదు... రాజధాని ప్రాంతం ఎక్కడ వస్తుందీ ముందే తనవారికి, తన అనుచరులకీ చెప్పి.. వేలాది ఎకరాలు కొనుగోలుచేయడం, క్యాబినెట్‌ సబ్‌కమిటీ ప్రాథమిక పరిశీలనలోనే 4వేలకుపైగా ఎకరాలు బటయపడ్డం.. అదంతా వేరే కథ.మరికొన్ని కీలక అంశాలను చూస్తే.. రాజధాని ప్రాంతానికి వెళ్లాలంటే ఇవ్వాళ్టికీ మనం సింగిల్‌ రోడ్డుమీదే వెళ్లాలి. కరకట్టమీదున్న సింగిల్‌ రోడ్డుమీదనుంచే పోవాలి. నేనేమీ అబద్ధాలు చెప్పడంలేదు. మీడియా ప్రతినిధులుగా మీరుకూడా అదే దారివెంబడి వెళ్లాలి. సమీకరించిన భూమిని డెవలప్‌ చేయడానికి, కరెంటు, రోడ్లు, పైపులైన్‌తో నీరు ఇవ్వడానికి ఎకరాకు కనీసం రూ.2 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని గత ప్రభుత్వం వాళ్లే చెప్పారు. రూ. 1,09,000 కోట్ల అంచనా వేశారు. కాని అదే ప్రభుత్వం ఐదేళ్లకాలంలో రూ.5600 కోట్లకు మించి ఖర్చు చేయలేదు. మరో రూ.2–3 వేల కోట్ల రూపాయలు బిల్లులు చెల్లించమని మాకు అప్పగించి వెళ్లిపోయారు. ఇందులోనూ రూ.500 కోట్ల రూపాయలు వడ్డీలుగా చెల్లించాల్సిన పరిస్థితి," అని గణాంకాలతో సహా వివరించారు జగన్ మోహన్ రెడ్డి. . ప్రతి ఏటా రూ.6 నుంచి 7 వేల కోట్లరూపాయలు రాజధాని మీద పెడితే.. అది సముద్రంలో వేసిన నీటిబొట్టే అవుతుంది. పరిస్థితిలో ఏ మాత్రం మార్పు ఉండదు. ఇక్కడి రాజధాని ప్రాంతంలో కనీస మౌలిక సదుపాయాలు కోసం వేసిన అంచనాలో 10శాతం డబ్బును విశాఖపట్నంలో పెడితే కచ్చితంగా మార్పు వస్తుంది. ఇవాళ కాకపోయినా 10 ఏళ్లకైనా మనం హైదరాబాద్‌తోగాని, చెన్నైతోగాని, బెంగుళూరుతోగాని పోటీపడే పరిస్థితి వస్తుంది. మన పిల్లలకు ఉద్యోగాలు వస్తాయన్న నమ్మకం ఉంటుంది. అయినా సరే.. ఇక్కడ ప్రజలను దృష్టిలో పెట్టుకుని లెజిస్లేచర్‌ క్యాపిటల్‌గా కొనసాగిస్తామని చెప్పాం. మహారాష్ట్రలోని నాగపూర్, కర్ణాటకలోని బెల్గాంల్లో అసెంబ్లీ సమావేశాలు నిర్వహిస్తున్నారు. రాష్ట్రంలో ఎక్కడనుంచి పనిచేయాలన్నది ముఖ్యమంత్రి ఇష్టం.ముఖ్యమంత్రి ఎక్కడ ఉంటే పాలనా యంత్రాంగం అక్కడ ఉంటుంది. సీఎం అక్కడనుంచి పనిచేయాలి? ఇక్కడ నుంచి పనిచేయాలి? అని ఎవ్వరూ చుప్పలేరు. మంత్రివర్గానికి ముఖ్యమంత్రి నేతృత్వం వహిస్తారు, మంత్రివర్గం నిర్ణయాలు తీసుకుంటుంది, ఆ నిర్ణయాలను పాలనాయంత్రాంగం అమలు చేస్తుంది. విశాఖలో నీటికి కొరత ఉందనేది వాస్తవం కాదు. భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకుని మరీ.. పోలవరం నుంచి మరింత నీటిని అందించడానికి ప్రయత్నాలు మొదలు పెట్టామని ముఖ్యమంత్రి చెప్పారు. తుపాన్ల సమస్య రాష్ట్రంలోని 9 కోస్తా జిల్లాలకూ ఉందని చెప్పిన సి.ఎం., ఇదే కృష్ణాజిల్లాలోని దివిసీమలో ఉప్పెన వచ్చిన ఘటనలూ ఉన్నాయన్నారు. విజయవాడకు కేవలం 60 కి.మీ దూరంలో సముద్రం కూడా ఉంది. అలాగే కరవు పీడిత ప్రాంతాలూ ఉన్నాయి. వీటన్నింటికీ మించి మనం చూడాల్సిన అంశం మరొకటి ఉంది. విశాఖపట్నం అనేది రాష్ట్రంలో నంబర్‌ ఒన్‌ సిటీ. దేశవ్యాప్తంగా టైర్‌ –2 సిటీల్లో అగ్ర స్థానంలో ఉంది. ఇప్పుడు మనముందున్న లక్ష్యం దీన్ని టైర్‌–1 స్థాయికి అభివృద్దిచేయడమే. సీఎం స్థానం అంటే.. ఈరాష్ట్రానికి తండ్రిలాంటి స్థానం. దేవుడు మనకు ఈస్థానం ఇచ్చినప్పుడు ఏ నిర్ణయం తీసుకున్నా ఒక తండ్రిలా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. తీసుకోవాల్సిన సమయంలో నిర్ణయాలు తీసుకోకపోతే అదికూడా తప్పే అవుతుంది. దానికి ఎంతో మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది.మనం విశాఖపట్నం వెళ్లకూడదు, ఇక్కడా అభివృద్ధికాదు. దీనివల్ల నష్టం మన పిల్లలకే. రాజధాని కార్యకలాపాల వికేంద్రీకరణకు బిల్లులు పెట్టాల్సిన అవసరంలేదు. సీఆర్డీఏను ఏఎంఆర్‌డీఏగా మార్పుడానికే బిల్లు పెడితే సరిపోతుంది. కాని రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకూ ఒక సంకేతం ఇవ్వడానికే ఈ బిల్లులు పెట్టం.ఇక్కడ వారికీ న్యాయం చేస్తున్నాం, దీంతోపాటు మిగిలిన ప్రాంతాలకూ న్యాయం చేస్తున్నామని, అందరికీ మంచి చేస్తున్నామని చెప్పడానికే బిల్లులు పెట్టాం. ఒక్క ఏఎంఆర్‌డీఏ చట్టంకోసమే బిల్లు పెడితే ప్రస్తతు రాజధాని ప్రాంతం వారికి తప్పుడు సంకేతం పోతుందని చెప్పాం. ఈ బిల్లులను ఎవ్వరూ ఆపలేరు. 3 నెలలు ఆలస్యం చేయగలరు తప్ప.. ఎవ్వరూ అడ్డుకోలేరు. స్కూళ్లలో ఇంగ్లిషు మీడియంను ప్రవేశపెట్టే బిల్లునుకూడా ఇలాగే మండలిలో అడ్డుకున్నారు. ఆగిపోయిందా? అలాగే ఎస్సీ, ఎస్టీలకు వేర్వేరుగా కమిషన్లు బిల్లును కూడా అడ్డుకున్నారు.. ఆగిపోయిందా?, అని ముఖ్యమంత్రి ప్రశ్నించారు. కాని, ప్రజలకు మంచిచేసే బిల్లులను ఆమాత్రం ఆలస్యం కూడా ఎందుకు చేయాలి? ప్రజలకు మంచి చేయాలని లేనప్పుడు మండలి ఎందుకు?ప్రజలకు మంచి చేసే బిల్లులను ఆలస్యం చేయాలన్నదేవారి ఉద్దేశం అయినప్పుడు, నిబంధనలను కూడా ఉల్లంఘించి వాళ్లు బిల్లులను ముందుకు వెళ్లనీయకుండా అడ్డుకున్నప్పుడు మండలి అవసరం ఎందుకు? కేవలం మండలిలో ఒక పార్టీకి మెజార్టీ సభ్యులు ఉన్నారని రాజకీయపరమైన ఆలోచనలు చేశారు.  అసలు మండలిని అసెంబ్లీ సృష్టిస్తుంది, అసెంబ్లీకి సహాయపడుతుంది. మండలి అనేది అసెంబ్లీకి సలహా ఇచ్చే ఒక సభ. ఈ పనిని విడిచిపెట్టి రాజకీయంగా ఆలోచించి ప్రజలు ఇచ్చిన తీర్పును పరిహాసం చేస్తామంటే.. ఎలా? ఒక్క మండలి నిర్వహణ కోసం ఏడాదికి రూ.60 కోట్లు ఖర్చుచేస్తున్నాం. ఏడాదిపోతే..., శాసనమండలిలో మాక్కూడా మెజార్టీ వస్తుంది. కాని, ఈ ఏడాది సమయాన్నికూడా ఎందుకు వదులుకోవాలి? ప్రజలకు ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ప్రభుత్వ నిర్ణయాల వల్ల వచ్చే మంచిచేరాలి. ఇంగ్లిషు మీడియం బిల్లును ఆమోదిస్తే ఎవరికి లాభం?ఎస్సీ, ఎస్టీలకు వేర్వేరుగా కమిషన్లు ఉంటే ఎవ్వరికి లాభం? రాజధానికార్యకలాపాలు, అభివృద్ధి వికేంద్రీకరణ వల్ల ఎవ్వరికి లాభం? విశాఖను అభివృద్ధి చేస్తే ఎవ్వరికి లాభం? ఇవన్నీ కూడా మన పిల్లలకి లాభం కదా? మన ప్రజలకు లాభం కాదా? అన్నది ఆలోచించాలి. అమరావతి రైతుల నుద్దేశించి ప్రశ్నలపై మాట్లాడుతూ, అమరావతి రైతులకు ఏం చేయదలుచుకున్నామో అసెంబ్లీలోనే చెప్పాం. ఎవ్వరికీ అన్యాయం చేయం. రైతులికిచ్చే యాన్యునిటీని పదేళ్ల నుంచి పదిహేనేళ్లకు పెంచాం. అలాగే భూమిలేని వ్యవసాయ కూలీలకు ఇచ్చే జీవనభృతిని రూ.2500 నుంచి రూ.5వేలకు పెంచాం. అసైన్డ్‌దారులకు పట్టాదారులతో సమానంగా ప్లాట్ల కేటాయింపులు చేస్తాం. మేం గత ప్రభుత్వం మాదిరిగా బాహుబలి సినిమా గ్రాఫిక్స్‌ చూపించడంలేదు.  వాస్తవాలను ముందు పెడుతున్నాం. అమరావతి లెజిస్లేచర్‌ కేపిటల్‌గా కొనసాగుతుందని చెప్పామన్నారు ముఖ్యమంత్ర బీజేపీ మేనిఫెస్టో గురించి మాట్లాడుతూ, 2019లో బీజేపీ మేనిఫెస్టో ఏంచెప్పిందో ఒక్కసారి చూడండి.రాజధాని భూముల్లో అవినీతి జరిగింది... వెనక్కి ఇచ్చేస్తామని చెప్పారు. కాని రాష్ట్రంలోని బీజేపీ నాయకులు దీనికి భిన్నంగా మాట్లాడుతున్నారు. అదే పార్టీకి చెందిన జాతీయ స్థాయి ప్రతినిధులు ఉన్న విషయాలు చెప్తున్నారన్నారు సి.ఎం. ప్రత్యేక హాదా గురించి మాట్లాడిన సి.ఎం., ప్రత్యేక హోదా అనేది ముగిసిపోయిన అధ్యాయం కాదన్నారు.  ముగిసిపోయిన అధ్యాయం అనే పదం వాడ్డం సరికాదు. ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా తీసుకురావాలన్న మా ప్రయత్నాలు ఎప్పటికీ కొనసాగుతాయి. ప్రతిసారి మేం కేంద్రాన్ని అడుగుతూనే ఉన్నాం. ప్రధానమంత్రి గారిని అభ్యర్థిస్తున్నాం. ఎప్పుడో ఒకసారి మా అవసరం వస్తుందనే ఆశాభావంతో ఉన్నాం.  కేంద్రానికి అవసరమైన రోజున మన ఎంపీల పాత్ర కీలకం అవుతుంది. ఆ సమయంలో మనకున్న డిమాండ్‌ ప్రత్యేక హోదా మాత్రమే. కియా.. వ్యవహారంపై మాట్లాడుతూ, కియా తరలిపోతుందంటూ తప్పుడు వార్త ఇచ్చారు. అనైతికమైన రిపోర్టింగ్‌ చేశారు. వాస్తవాలను నిర్ధారించుకోకుండా వార్తా కథనం ఇచ్చారు. ఉద్దేశపూర్వకంగా ఇచ్చిన కథనం ఇది. తాము ఎక్కడికీ వెళ్లడంలేదంటూ కియా వరుసగా ఖండనలు ఇస్తున్నా... వాళ్లు వాస్తవాలు పట్టించుకోవడంలేదు. రాజకీయాలకోసం వ్యవస్థలను మేనేజ్‌చేసి ఏ స్థాయికైనా దిగజారే పరిస్థితి చూస్తున్నాం. నామీద బురదజల్లడం, నిందలు వేయడం ఇప్పడు మొదలుపెట్టింది కాదు. ఇవన్నీ నాకు అలవాటే. నిజాలతో పనిలేకుండా ఒక మనిషికి చెడ్డపేరును ఆపాదించాలని ప్రయత్నాలు నిరంతరం చేస్తూనే ఉంటారు. ఇలాంటి పరిస్థితుల్లో దేవుడు కచ్చితంగా మాకు తోడుగా ఉంటాడు.  గతంలో మా పార్టీలో 23 మంది ఎమ్మెల్యేలను, ముగ్గురు ఎంపీలను  కొనుగోలుచేశారు. ఎన్నికల తర్వాత వారికి వచ్చిన సీట్లు 23 మంది ఎమ్మెల్యేలు, ముగ్గురు ఎంపీలు మాత్రమే. దేవుడు రాసిన గొప్ప స్క్రిప్టు ఇది. వాళ్లు చేసే కొద్దీ దేవుడు అయ్యో పాపం అంటూ.. మన పక్కనే ఉంటాడు. 2014 నుంచి రాష్ట్రంలో పరిశ్రమలకు రాయితీల రూపంలో చెల్లించాల్సిన రూ.4వేల కోట్ల రూపాయలను గత ప్రభుత్వం చెల్లించలేదు.  ఈ రాయితీలు ఇవ్వకుండా చంద్రబాబు దావోస్‌ వెళ్లాడు, మార్కెటింగ్‌కోసం కోట్లు ఖర్చుచేశాడు. రాష్ట్రంలో నడుస్తున్న పరిశ్రమలకు ఇవ్వాల్సిన రాయితీలు ఇవ్వకుండా మనం అదిచేస్తాం, ఇది చేస్తాం అని ప్రకటనలు చేసీ ఏం లాభం. మా  ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ నాలుగు వేల కోట్ల రూపాయలను చెల్లిస్తున్నాం. పరిశ్రమలకు కావాల్సింది ప్రధానంగా సరసమైన ధరలకు భూములు, నీళ్లు, కరెంటు. అవినీతిలేని పాలన, సానుకూల దృక్పథం ఉన్న ప్రభుత్వం, విధానాల్లో పారదర్శకత. ఇవన్నీ ఉన్న ప్రభుత్వం మాది. పైగా అబద్ధాలు చెప్పే అలవాటు మా ప్రభుత్వానికి లేదు. పరిశ్రమలకు ఇవన్నీ సానుకూల అంశాలు. మిగిలినవన్నీ సహజంగానే వస్తాయి.  విషయాలన్నింటికీ ఎప్పటికప్పుడు మేం చెప్తూనే ఉన్నాం. కాకపోతే మాకు మీడియా బలం తక్కువన్నారు సి.ఎం. . సీఎంగా అతి పెద్ద సవాల్‌ ఏమి ఉంటుందన్న ప్రశ్నకు,ప్రతిరోజూ సవాలే. మంచి సమర్థతతో ఆ సవాలను అధిగమించాలి. విద్య, ఆరోగ్యం, వ్యవసాయం, నీటిపారుదల, హౌసింగ్‌... వీటిని ప్రాధాన్యతలుగా పెట్టుకున్నాం. అసలు అభివృద్ధి అంటే ఏమిటి? నాడు– నేడు కార్యక్రమం ద్వారా స్కూళ్లను బాగా అభివృద్దిచేస్తున్నాం? ఇది అభివృద్దికాదా? ఇంగ్లిషు ల్యాబ్‌ సహా 9 రకాల సదుపాయాలను ప్రతిస్కూళ్లలో కల్పిస్తున్నాం. ప్రతి స్కూళ్లో ఇంగ్లిషు మీడియం పెడుతున్నాం.మధ్యాహ్న భోజనంలో నాణ్యత బాగా పెంచాం.  గ్రీన్‌ఛానళ్లో పెట్టి బిల్లులు పెండింగులో లేకుండా చూస్తున్నాం.ఆయాల జీతాలు రూ.వేయి నుంచి రూ.3వేలకు పెంచాం. అమ్మ ఒడి అమలు చేశాం.ఫీజు రియంబర్స్‌మంట్‌ పూర్తిగా ఇస్తున్నాం. పాఠ్యప్రణాళికలో పూర్తిగా మార్పులు తీసుకు వస్తున్నాం. డిగ్రీ విద్యార్థులకు ఏడాదిపాటు అదనంగా అప్రెంటిస్‌ ఇప్పిస్తున్నాం.ఇది అభివృద్ది కాదా, అని ప్రశ్నించారు ముఖ్యమంత్రి జగన్ మోహన్ పోలవరం మీద ఎంతో «ధ్యాసపెడుతున్నామని చెప్పిన ముఖ్యమంత్రి, గత ప్రభుత్వం ప్రాజెక్టును మిస్‌ హ్యాండిల్‌ చేసిందని, త ప్రభుత్వానికి ప్రాజెక్టు నిర్మాణలో విజన్‌ లోపించిందని చెప్పారు. "స్పిల్‌వే పూర్తికాకుండానే కాపర్‌ డ్యాం నిర్మాణం చేపట్టింది. దీనివల్ల వరదనీరు అటు స్పిల్‌వేగుండా పోవడంవల్ల పనులు చేయలేని పరిస్థితి. నవంబర్‌ వరకూ పనులు నిలిపేయాల్సి వచ్చింది. ప్రస్తుతం పనులు వేగంగా జరుగుతున్నాయి. 2021 జూన్‌ నాటికి పనులు పూర్తవుతాయి," అని వివరించారు.  
కొత్త ఉద్యోగాలేమో గానీ, ఉన్న ఉద్యోగాలను ఊడబీకే విధంగా జగన్ ప్రభుత్వ విధానాలు కనిపిస్తున్నాయి. అసలే ఏపీకి కొత్త కంపెనీలు రావడానికి భయపడుతున్నాయని ప్రచారం జరుగుతుంటే... ప్రభుత్వ నిర్ణయాలతో ఉన్న కంపెనీలూ వెళ్లేపోయే పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పటికే, కియా మోటర్స్ ఏపీ నుంచి తమిళనాడుకు తరలిపోనుందంటూ ప్రముఖ వార్తాసంస్థ రాయిటర్స్ ప్రచురించిన కథనం ఆంధ్రప్రదేశ్లో కలకలం రేపుతుండగా... ఇఫ్పుడు మరో వార్త సంచలనం రేపుతోంది. విశాఖను పరిపాలనా రాజధానిగా ప్రకటించిన జగన్ ప్రభుత్వం... సెక్రటేరియట్, ఇతర ప్రభుత్వ కార్యాలయాల కోసం మిలీనియం టవర్స్ ను ఎంపిక చేసుకుంది. దాంతో, మిలీనియం టవర్స్ లో ఆపరేషన్స్ నిర్వహిస్తున్న ఐటీ కంపెనీలను ఖాళీ చేయాలంటూ ప్రభుత్వం నోటీసులు ఇచ్చింది. మార్చి 30లోపు మిలీనియం టవర్స్ ను ఖాళీ చేయాలంటూ ఆ నోటీసుల్లో ప్రభుత్వం పేర్కొంది. అయితే, 5వేల మందికి ఉద్యోగాల కల్పన కోసం 300 కోట్ల రూపాయల పెట్టుబడితో విశాఖ మిలీనియం టవర్స్ లో కార్యకలాపాలు నిర్వహిస్తోన్న కాండ్యుయేట్ కంపెనీ.... ప్రభుత్వ నోటీసులతో తీవ్ర నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఏపీలో మొత్తం ఆపరేషన్సే షట్ డౌన్ చేయాలని కాండ్యుయేట్ కంపెనీ బోర్డు డెసిషన్ తీసుకుందని అంటున్నారు. తమ కార్యకలాపాల కోసం కొత్త ప్రదేశాలను అన్వేషిస్తున్న కాండ్యుయేట్ కంపెనీ.... హైదరాబాద్ లేదా కొచ్చిలో కార్యాలయం ఏర్పాటు చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం మిలీనియం టవర్స్ లో పనిచేస్తున్న 2400మందిని హైదరాబాద్ లేదా కొచ్చి తరలించాలని నిర్ణయం తీసుకుందని అంటున్నారు.  ఇక, మిలీనియం టవర్స్ లోనే కార్యకలాపాలు నిర్వహిస్తున్న హెచ్ సీఎల్, ఎల్ అండ్ టీ కూడా మార్చి 30 తర్వాత ఆ బిల్డింగ్ ను ఖాళీ చేయనున్నాయి. దాంతో, మిలీనియం టవర్స్ నుంచి దాదాపు 18వేల మంది ఉద్యోగులు తరలిపోనున్నారని చెబుతున్నారు. అయితే, టీడీపీ ప్రభుత్వ హయాంలో తీసుకొచ్చిన ఈ కంపెనీల కోసం ఆనాడు తీవ్రంగా ప్రయత్నించాల్సి వచ్చింది. ఫార్చ్యూన్‌-500 కంపెనీల్లో ఒకటైన కాండ్యుయెంట్‌ సంస్థను విశాఖ తీసుకురావటానికి చంద్రబాబు ప్రభుత్వం ఎంతో కష్టపడింది. కానీ, ఇఫ్పుడు సచివాలయం పేరుతో భవనాన్నే ఖాళీ చేయమంటూ జగన్ ప్రభుత్వం నోటీసులు ఇవ్వడంతో.... మొత్తం ఏపీనే వదిలివెళ్లిపోవాలని ఆయా ఐటీ కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి. అయితే, ఎంతోకష్టపడి తీసుకొచ్చిన ఐటీ కంపెనీలను ఇలా తరిమేయడం రాష్ట్రానికి మంచిది కాదని విపక్షాలు ఆవేదన వ్యక్తంచేస్తున్నాయి.  
సమ్మక్క సారాలమ్మ గురించి అనేక కథలు ప్రచారంలో ఉన్నాయి. ఆదివాసీలకు కాకతీయ రాజులకు మధ్య జరిగిన యుద్ధం నేపథ్యంలోనే ఈ గాథలన్నీ ప్రాచుర్యంలోకి వచ్చాయి. కొన్ని కథల్లో సమ్మక్క మరణించినట్లు ఉంటే... మరికొన్ని కథల్లో నెత్తురోడుతూ చిలుకల గుట్టవైపు వెళ్లిపోయిందని చెబుతున్నాయి. ఇంకొన్ని గాథల్లో సమ్మక్క సహగమనం చేసినట్లు ఉంటుంది. కొన్ని కథల్లో ఆదివాసీలకు... కాకతీయ ప్రభువులకు మధ్య ఘర్షణ జరిగి... కప్పం కట్టకపోవడం కారణంగా చెప్పగా... మరికొన్ని కథల్లో సహజ వనరుల పంపకాల్లో వివాదం వచ్చినట్లు ఉంది. అయితే, ఆదివాసీల నుంచి కాకతీయ రాజులు కప్పం వసూలు చేసిన దాఖలాల్లేవని చరిత్రకారులు చెబుతున్నప్పటికీ... ఎక్కువగా ప్రాచుర్యంలో ఉన్న కథలు మాత్రం కప్పమే యుద్ధానికి కారణమని చెబుతున్నాయి. అయితే, అందరి నోళ్లలో ప్రసిద్ధి చెందిన కథ ఇలా ఉంది. ఏడో శతాబ్దంలో తమ నివాస స్థలమైన మేడారం నుంచి కోయ దొరలు వేట కోసం అడవికి వెళ్లగా, ఓ చోట పెద్ద పులులు కాపలా మధ్య దేదీప్యమానంగా వెలిగిపోతున్న ఓ పసిపాప కనిపించిందని, ఆ పాపను కోయదొరలు తమ గూడేనికి తీసుకెళ్లి పెంచి పెద్దచేశారని, అయితే... ఆ పసిపాప వచ్చినప్పట్నుంచి అన్నీ శుభాలే జరగడంతో కొండ దేవతే తమకు పాప రూపంలో సాక్షాత్కరించిందని నమ్మి ఆ చిన్నారికి సమ్మక్కగా పేరు పెట్టారని చెబుతారు. అలా, పెరిగి పెద్దయిన సమ్మక్కను కోయ చక్రవర్తి అయిన మేడరాజు... కరీంనగర్ ప్రాంతాన్ని ఏలుతున్న తన మేనల్లుడైన పగిడిద్ద రాజుకిచ్చి పెళ్లి జరిపించాడని చెబుతారు. పగిడిద్ద రాజు, సమ్మక్కకు సారాలమ్మ, నాగులమ్మతోపాటు జంపన్న జన్మించారు. అయితే, మేడారం ప్రాంతాన్ని పాలించే కోయరోజులు... ఓరుగల్లు రాజులకు సామంతులుగా ఉండేవారు. కరువు కాటకాలతో ఒక సంవత్సరం కోయరాజుల... కాకతీయ ప్రభువులకు కప్పం చెల్లించలేకపోయారు. దాంతో, కాకరాజు రాజు ప్రతాపరుద్రుడు తన సైన్యాన్ని గిరిజనులపైకి యుద్ధానికి పంపాడు. అయితే, కాకతీయ సేనల ముందు గిరిజనులు నిలువలేకపోయారు. ఈ యుద్ధంలో సమ్మక్క భర్త పగిడిద్దరాజుతోపాటు వారి కుమార్తెలు సారాలమ్మ, నాగులమ్మ, అల్లుడు గోవిందరాజు వీరణమరణం పొందుతారు. ఈ పరాజయాన్ని తట్టుకోలేక జంపన్న... మేడారం సమీపంలోని వాగులోకి దూకి ఆత్మహత్య చేసుకున్నట్లు చెబుతారు. అయితే, సంపెంగ వాగు సమీపంలో జంపన్నను కాకతీయ సేనలు హతమార్చాయని మరో కథ ప్రచారంలో ఉంది. జంపన్న వీరమరణం పొందిన వాగు కావడంతో దాన్ని అప్పట్నుంచీ జంపన్న వాగుగా పిలుస్తారు. అయితే, భర్త పిల్లల మరణవార్త తెలుసుకున్న సమ్మక్క మహోద్రురాలిగా మారి కాకతీయ సేనలపై విరుచుకుపడిందని, కానీ... ఓ సైనికుడు దొంగచాటుగా బల్లెంతో పొడవడంతో తీవ్రంగా గాయపడిన సమ్మక్క నెత్తురోడుతూనే ఈశాన్య వైపునున్న చిలుకలగుట్టపైకి వెళ్లి అదృశ్యమైందని చెబుతారు. సమ్మక్కను కొందరు కోయలు అనుసరించినప్పటికీ జాడ తెలియలేదని, అయితే చిలుకలగుట్టపైనున్న నాగవృక్షం కింద ఒక కుంకుమ భరిణె కనిపించడంతో, సమ్మక్కే అలా మారిందనే నమ్మకంతో అప్పట్నుంచి మాఘశుద్ధ పౌర్ణమి రోజు ముత్తయిదువల పండగ జరుపుకోవడం మొదలుపెట్టారని, ఇదే కాలక్రమేణా జాతరగా రూపొంతరం చెంది, సమ్మక్క సారాలమ్మ మేడారం మహా జాతరగా మారింది. అయితే, కోయవీరులు మరణించారంటే ఆదివాసీలు అంగీకరించరు. వాళ్లింకా బతికే ఉన్నారని... సమ్మక్క భరిణె రూపంలో రెండేళ్లకోసారి సాక్షాత్కరిస్తుందనేది వాళ్ల విశ్వాసం. అందుకే, ప్రతి రెండు సంవత్సరాలకోసారి ఈ మేడారం నిర్వహిస్తున్నామని చెబుతారు. అలా, ఆదివాసీల్లో వీరవనితగా పేరుగాంచిన సమ్మక్క... కుంకుమభరిణె రూపంలో వెలిసి... భక్తులకు కొంగుబంగారంగా విరాజిల్లుతోందని పురాణగాథలు చెబుతున్నాయి.
2020-21 కేంద్ర బడ్జెట్ ఫిబ్రవరి 1వ తేదీన పార్లమెంటు ముందుకు రానుంది. ప్రపంచ దేశాలను మాంద్యం చుట్టుముడుతున్న వేళ దేశం పై ఆర్థిక మందగమన ప్రభావం పడకుండా ఆర్థిక మంత్రి ఎటువంటి చర్యలు తీసుకుంటారోనని సామన్యులతో పాటు వివిధ రంగాల నిపుణులు ఎదురు చూస్తున్నారు. పెరుగుతున్న ద్రవ్యోల్బణం తగ్గుతున్న పొదుపుతో దిగాలుగా ఉన్న సగటు వేతన జీవి ఈసారైన ఆదాయపు పన్ను పై ఆర్థిక మంత్రి తీపికబురు అందిస్తారని ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు. గత ఆరేళ్లలో ఆదాయపు పన్నుకు సంబంధించి మోదీ సర్కారు తీసుకున్న చర్యలు ఈ సారి ఎలాంటి మార్పులు చేసే అవకాశాలున్నాయో చూడాలి.  2014 బడ్జెట్ లో నాటి ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఆదాయపు పన్ను మినహాయింపు పరిధిని రెండు లక్షల నుంచి రెండున్నర లక్షలకు పెంచారు. సీనియర్ సిటిజన్ లకు మినహాయింపు 2.5 లక్షల నుంచి మూడు లక్షలకు మార్చారు. 2015 బడ్జెట్ లో పన్ను శ్లాబుల జోలికి వెళ్లకుండా ఆరోగ్య భీమపై డిటెక్షన్ ను రూ.15,000 నుంచి రూ.25,000 రూపాయలకు పెంచారు. సీనియర్ సిటిజన్లకు రూ.20,000 నుంచి రూ.30,000 లుగా మార్చారు. సంపద పన్ను తొలగించి సంపన్నుల పన్ను ఆదాయం కోటి దాటితే రెండు శాతం సర్ చార్జ్ విధించేలా నిబంధనలు పెట్టారు. 2016 బడ్జెట్ లో సెక్షన్ 87 కింద ఐదు లక్షల ఆదాయం మించని వారికి పన్ను రిబేట్ ను రూ.2000 నుంచి రూ.5000 లకు పెంచారు. సెక్షన్ 80 జీజీ కింద అద్దెకు సంబంధించిన డిడక్షన్ ను రూ.24,000 నుంచి రూ.60,000 లకు పెంచారు. కోటి వార్షికాదాయం దాటిన వారిపై మరోసారి సర్ చార్జిని 12 నుంచి 15 శాతానికి పెంచారు. 2017 బడ్జెట్ లో 2.5 లక్షల నుంచి ఐదు లక్షల ఆదాయం ఉన్న వారికి పన్నును ఐదు శాతం చేశారు. వార్షికాదాయం 3.5 లక్షలు ఉన్న వారికి పన్ను రిబేట్ ను రూ.5000 నుంచి రూ.2,500 చేశారు. 50 లక్షల నుంచి కోటి ఆదాయం పై 10 శాతం సర్ చార్జిని వేధించడం మొదలు పెట్టారు. 2018 లో మెడికల్ రీయంబర్స్ మెంట్ ట్రాన్స్ పోర్టు అలవెన్సుల స్టాండర్డ్ డిడక్షన్ పరిధిని రూ.40,000 పెంచారు. ఆదాయపు పన్ను కార్పొరేట్ పన్ను పై ఉన్న మూడు శాతం విద్యాసెస్సు స్థానంలో 4 శాతం విద్య, ఆరోగ్య సెస్ విధించారు. 2019 లో పీయూష్ గోయల్ ప్రవేశపెట్టినా తాత్కాలిక బడ్జెట్ లో ఐదు లక్షల వరకు ఆదాయానికి పన్ను రిబేట్ ప్రకటించారు. స్టాండర్డ్ డిడక్షన్ రూ.40,000 నుంచి రూ.50,000 లకు పెంచారు. మోదీ ప్రభుత్వం రెండోసారి బాధ్యతలు చేపట్టాక ప్రస్తుత ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశ పెట్టిన బడ్జెట్ లో ఆదాయపు పన్నుకు సంబంధించి ఎటువంటి ప్రకటనలు వెలువడలేదు.ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దేందుకు ప్రభుత్వం కొత్త పన్ను శ్లాబులను తీసుకొచ్చి అంచనాలున్నాయి. చాలా ఏళ్లుగా వ్యక్తిగత పన్ను శ్లాబులలో సవరణలు పరిమితుల పెంపు లేదు. రిబేట్ల లాంటి ప్రత్యామ్నాయాలు కాకుండా 5,10,20,30,35 శాతం శ్లాబులు తేవాల్సిన అవసరం ఉంది. ఆదాయాన్ని అయిదు శ్లాబులుగా విభజిస్తే ఎంతో మందికి ప్రయోజనం చేకూరుతుంది. ప్రస్తుతం రూ.2,50,000 ఉన్న ఆదాయ పరిమితిని ఐదు లక్షలకు పెంచితే ఎంతో మందికి పన్ను భారం తగ్గుతుంది
మూడు రాజధానుల అంశం తెరపైకి వచ్చినప్పటి నుండి కమిటీలు , నివేదికలతోనే కాలం గడిచిపోయింది. ఇక ఆంధ్రప్రదేశ్‌కు మూడు రాజధానులు ఉండటం మంచిదని జగన్ చెప్పిన విధంగానే నివేదిక కూడా వెల్లడించింది. అలా నివేదిక ఇచ్చిన బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్‌కు రూ.5 కోట్ల 95 లక్షల ఫీజు చెల్లించింది ప్రభుత్వం. ఎటువంటి జీవో లేకుండా బోస్టన్‌కు అధ్యయనం చేసి నివేదిక ఇచ్చిన కంపెనీతో రహస్య లావాదేవీలు జరిపింది వైసీపీ ప్రభుత్వం. మొత్తం వ్యవహారాలు ఈమెయిల్స్ ద్వారానే నడిపింది. ఈ మొత్తం వ్యవహారం రాష్ట్ర ప్రణాకా విభాగం ద్వారా చేసింది. రాజధాని కేసులపై వాదించేందుకు ప్రభుత్వం నియమించుకున్న లాయర్ ముకుల్ రోహత్గీకి కూడా ప్రణాళికా విభాగం ద్వారానే రూ. 5 కోట్లు మంజూరు చేశారు. అది కాకుండా బోస్టన్ గ్రూప్‌కి కూడా దాదాపుగా రూ.6 కోట్లు ఇచ్చింది ప్రభుత్వం. ఆ మొత్తాన్ని కూడా ఈ ప్రణాళికా విభాగం ద్వారానే విడుదల చేసినట్లుగా తెలుస్తోంది.  బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ నుంచి బయటకు వచ్చిన లేఖల ప్రకారం చూస్తే రాష్ట్ర ప్రభుత్వమే ఆ కంపెనీని సంప్రదించింది. మూడు రాజధానులపై అధ్యయనం చేసేందుకు 2019 , నవంబర్‌ 27వ తేదీన బోస్టన్ కమిటీని ఎంపిక చేసినట్లుగా అధికారులు ఈమెయిల్ పంపారు. ఆ తర్వాత జనవరి 3వ తేదీన బోస్టన్ కమిటీ నివేదిక ఇచ్చింది. అంటే ప్రభుత్వం ఎంపిక చేసినట్లుగా నెల రోజుల్లోనే బోస్టన్ కమిటీ నివేదిక సమర్పించింది. అసలు ఆ కమిటీ ఏపీలో ఉండే ఎటువంటి పరిస్థితులను అధ్యయనం చేసి నివేదిక వెల్లడించిందో తెలియయటం లేదు. బోస్టన్ నివేదికలో కూడా గతంలో చంద్రబాబు ప్రభుత్వం ప్రకటించిన బ్లూప్రింట్‌లోని అంశాలు ఉన్నాయి. అలాగే జగన్మోహన్ రెడ్డి చెప్పిన విధంగా మూడు రాజధానుల అంశం కూడా ఉంది. అంటే ముందస్తుగా ఒక రిపోర్టును ప్రభుత్వమే సిద్ధం చేసి.. దానికి బోస్టన్ గ్రూప్ అనే ట్యాగ్ వేసి ఇచ్చేందుకు రూ. 6 కోట్లను సమర్పించుకున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. ఇలా బోస్టన్ నివేదిక గురుంచి గూగుల్ లో చాలా మంది వెతికినా దొరకలేదు.. అలానే ప్రభుత్వం కూడా చెప్పలేదు. అయితే ఇప్పుడు బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్‌తో ప్రభుత్వం నేరుగా జీవో ద్వారా కాకుండా.. మరో విధంగా ఒప్పందం చేసుకున్నట్లుగా తెలుస్తోంది. మొత్తానికి ప్రభుత్వ చీకటి వ్యవహారాలు అంచనా వేయలేని విధంగా ఒక్కొక్కటి బయటపడుతున్నాయని ప్రజల్లో విమర్శలు వస్తున్నాయి.
తన తండ్రి వైఎస్ వివేకా హత్య కేసులో తమకు అనేక అనుమానాలు ఉన్నాయని కుమార్తె సునీత, అల్లుడు రాజశేఖర్ రెడ్డిలు హైకోర్టు తెలిపారు. తాము, హైదరాబాద్ నుంచి పులివెందుల వెళ్లేలోపే వైఎస్ వివేకా బెడ్రూమ్ అండ్ బాత్రూమ్ లో రక్తపు మరకల్ని శుభ్రం చేసేశారని సునీత హైకోర్టుకు తెలిపారు. అదే రోజు సిట్ ఏర్పాటు చేశారని... కానీ, తన అన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి... సీబీఐ దర్యాప్తు కావాలని డిమాండ్ చేశారని గుర్తుచేశారు. అయితే, వైఎస్ ముఖ్యమంత్రి అయ్యాక... 2019 జూన్ 13న కొత్త డీజీపీ గౌతమ్ సవాంగ్... కొత్త అధికారులతో మళ్లీ సిట్ ఏర్పాటు చేశారని వివేకా కుమార్తె హైకోర్టుకు తెలియజేశారు. ఈ సిట్ 1300మందిని విచారించి సాక్ష్యాలను సేకరించిందని... కానీ కడప ఎస్పీగా అన్బురాజన్ నియమితులయ్యాక దర్యాప్తు నత్తనడకన సాగుతోందని సునీత ఆరోపించారు.  ఇక, సీబీఐ దర్యాప్తు కోరుతూ తన తల్లి సౌభాగ్యమ్మ... అలాగే తన అన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి దాఖలు చేసిన వ్యాజ్యాల్లో ఇప్పటివరకు ప్రభుత్వం కౌంటర్లు దాఖలు చేయలేదని హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. పైగా, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సీబీఐ దర్యాప్తు కావాలని కోరిన తన అన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి... ఇప్పుడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి 8 నెలలు అవుతున్నా ఇఫ్పటివరకు సీబీఐ దర్యాప్తు కోరలేదని ప్రశ్నించారు. అంతేకాదు... ప్రతిపక్షంలో ఉండగా ఏపీ పోలీసులపై విశ్వాసం లేదన్న జగన్.... తాను అధికారంలోకి వచ్చాక మళ్లీ సిట్ ను ఏర్పాటు చేసి ఉండకూడదన్నారు. జగన్మోహన్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ హైకోర్టులో ఉన్నంతకాలం సీబీఐ దర్యాప్తు కోసం ఇప్పటికీ డిమాండ్ చేస్తున్నట్లుగా భావించాలని సునీత అన్నారు. ఇక, తమ పిటిషన్ లో కేంద్ర హోంశాఖ కార్యదర్శి, సీబీఐ డైరెక్టర్, ఏపీ హోంశాఖ ముఖ్య కార్యదర్శి, డీజీపీ, సిట్ ఎస్పీ తదితరులను ప్రతివాదులుగా చేర్చారు సునీత. ఇదిలాఉంటే, వైఎస్ వివేకా కుమార్తు సునీత ప్రధానంగా 15మందిపై అనుమానాలు ఉన్నాయంటూ హైకోర్టుకు తెలిపారు. అందులో ఎక్కువగా వైఎస్ కుటుంబ సభ్యులే ఉండగా, మిగతా అనుమానితులు కూడా వైఎస్ కుటుంబ సభ్యులకు సన్నిహితులే ఉన్నారు. వివేకా కుమార్తె సునీత హైకోర్టుకు అందజేసిన అనుమానితుల జాబితాలో మొదట వాచ్ మన్ రంగయ్య(1)(వివేకా ఇంటి కాపలాదారు) పేరు ఉంది.ఆ తర్వాత యర్ర గంగిరెడ్డి (వివేకాకు అత్యంత సన్నిహితుడు)... 3.ఉదయ్ కుమార్ రెడ్డి (ఎంపీ వైఎస్ అవినాష్ కి అత్యంత సన్నిహితుడు).... 4.డి.శివశంకర్ రెడ్డి (వైసీపీ రాష్ట్ర కార్యదర్శి) (అలాగే, వైఎస్ అవినాష్ రెడ్డికి, వైఎస్ భాస్కర్ రెడ్డికి సన్నిహితుడు)... 5.పరమేశ్వర్ రెడ్డి... 6.శ్రీనివాస్ రెడ్డి... 7.వైఎస్ భాస్కర్ రెడ్డి (ఎంపీ అవినాష్ రెడ్డి తండ్రి)... 8.వైఎస్ మనోహర్ రెడ్డి (ఎంపీ అవినాష్ రెడ్డి చిన్నాన్న)... 9.వైఎస్ అవినాష్ రెడ్డి (కడప వైసీపీ ఎంపీ).... 10.శంకరయ్య (సీఐ)... 11.రామకృష్ణారెడ్డి (ఏఎస్సై).... 12. ఈసీ సురేంద్రనాథ్ రెడ్డి.... 13. ఆదినారాయణరెడ్డి (మాజీ మంత్రి).... 14. బీటెక్ రవి అలియాస్ ఎం.రవీంద్రనాథ్ రెడ్డి (టీడీపీ ఎమ్మెల్సీ)... 15. సురేందర్ రెడ్డి (పరమేశ్వర్ రెడ్డి బావమరిది)... ఇలా, ప్రధానంగా 15మందిపై తమకు అనుమానాలు ఉన్నాయన్న వైఎస్ వివేకా కుమార్తె... ఎందుకో కారణాలను కూడా హైకోర్టుకు వివరించారు.
      Papaya is a deliciously sweet fruit which has numerous nutritional benefits. It is very low in calories and also contains no cholesterol. Excellent for those who want to lose weight, consider eating papaya every day to maximize its health benefits.   Also a beauty food, papaya is low in fructose and is excellent for digestion! The antioxidant nutrients found in it, including Vitamins C and E and beta-carotene, are great at reducing inflammation and acne. Moreover, Vitamin C may also protect your skin against sun damage. Once considered quite exotic, they can now be found in markets throughout the year and if you have tree at home you can enjoy its benefits year long. The fruit, as well as the other parts of the papaya tree, contain papain, an enzyme that helps digest proteins. This enzyme is especially concentrated in the fruit when it is unripe. Health Benefits Papayas are a rich source of nutrients like carotenes, vitamin C and flavonoids; e B vitamin, folate and pantothenic acid; and rich in minerals like potassium, copper, and magnesium; and fiber. To categorize the health benefits without going into depth, the health benefits of papaya include: ·        It’s an antioxidant ·        Protection against Heart Disease ·        Promotes digestive health ·        Anti-Inflammatory ·        Supports the Immune system ·        Protection against Macular degeneration ·        Protects  against Rheumatoid arthritis ·        Protects against colon cancer   276.00 grams of Papaya contains 119 Calories Nutrient Values Vitamin C 224.1% Folate        25.5% Fiber         18.7% Vitamin A 14.5% Magnesium 14.4% Potassium    14.3% Copper        13.3% Pantothenic Acid  10.6%
India has emerged as the world's largest consumer of antibiotics, followed by China and the US, according to a new study on the growing alarm surrounding antibiotic-resistance. The study, Global Trends in Antibiotic Consumption 2000- 2010, according to Princeton University researchers found that worldwide antibiotic use has risen a staggering 36 per cent over the studied 10-year period. Among the 16 groups of antibiotics studied, cephalosporins, broad-spectrum penicillins and fluoroquinolones accounted for more than half of that increase, with consumption rising 55 per cent from 2000 to 2010. The study quantifies the growing alarm surrounding antibiotic-resistant pathogens and a loss of efficacy among antibiotics used to combat the most common illnesses. The report also highlights an increasing resistance to carbapenems and polymixins, two classes of drugs that have long been considered last-resort antibiotics for illnesses without any other known treatment. Overall, the study reviewed patterns, seasonality and frequency of use of antibiotics in 71 countries. "The data underscore the welcome evidence that more global citizens are able to access and purchase antibiotics. But that use is not being effectively monitored by health officials, from doctors to hospital workers to clinicians," the researchers noted. "Consequently, antibiotic use is both rampant and less targeted. That reality is driving antibiotic resistance at an unprecedented rate," researchers said. The five BRICS nations - Brazil, Russia, India, China and South Africa - have been held responsible for more than three-quarters of that surge. While India is the largest consumer of antibiotics, US accounts for the highest per capita consumption, with a rate of more than twice that of India. Source: PTI