LATEST NEWS
కల్వకుంట్ల కవిత కొత్త  రాజకీయ పార్టీ పేరు   ఇప్పుడు న్యాయస్థానం పరిధిలోకి చేరింది. తన నూతన పార్టీకి  తెలంగాణ రక్షణ సమితి  (టీఆర్ఎస్)  పేరు  ఖరారు చేయాలని కోరుతూ ఆ పార్టీ అధినేత్రి కల్వకుంట్ల కవిత..  ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కేంద్ర ఎన్నికల సంఘం  టీఆర్ఎస్  పేరు ఖరారు విషయంలో  పంపిన లేఖను సవాల్ చేస్తూ ఆమె   న్యాయపోరాటానికి దిగారు.  పార్టీ రిజిస్ట్రేషన్ ప్రక్రియలో భాగంగా తమ పార్టీ పేరుపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ జూన్ 23న కేంద్ర ఎన్నికల సంఘం తనకు ఒక అధికారిక లేఖను పంపిందని కవిత తన పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈసీ లేవనెత్తిన అభ్యంతరాల నేపథ్యంలో, పార్టీ పేరు ఆమోదం పొందేలా తగిన ఆదేశాలు ఇవ్వాలని ఆమె కోర్టును అభ్యర్థించారు. తెలంగాణ సెంటిమెంట్‌తో ముడిపడి ఉన్న ‘టీఆర్ఎస్’ అనే సంక్షిప్త నామం చుట్టూ ఈ వివాదం తిరుగుతోంది. గతంలో కవిత తండ్రి, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలోని తెలంగాణ రాష్ట్ర సమితి టీఆర్ఎస్ పార్టీని భారత రాష్ట్రీయ సమితి (బీఆర్ఎస్)గా మార్చిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత కవిత బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చి.. సొంత పార్టీ ఏర్పాటు చేసుకున్నారు. తెలంగాణ సెంటిమెంట్, తెలంగాణ ఉద్యమం గుర్తుకు వచ్చేలా.. తన పార్టీకి  తెలంగాణ రక్షణ సమితి  అని పేరు పెట్టుకున్నారు. అయితే ఈ పేరుపై, ముఖ్యంగా  టీఆర్ఎస్  అనే సంక్షిప్త అక్షరాల వాడకంపై అభ్యంతరం తెలుపుతూ ఈసీకి పలు పిటిషన్లు వచ్చాయి.    ప్రస్తుతం చలామణిలో ఉన్న..  లేదా ప్రజల్లో గుర్తింపు పొందిన ఇతర పార్టీల పేర్లను పోలి ఉండేలా కొత్త పేర్లు ఉంటే ఓటర్లలో గందరగోళం నెలకొనే అవకాశం ఉంటుంది. కనుక కవిత ప్రతిపాదించిన పేరు పాత టీఆర్ఎస్ పార్టీని పోలి ఉండటంతో, దీనిపై స్పష్టత ఇవ్వాలంటూ ఈసీ నోటీసులు జారీ చేసింది. దీనిపై స్పందించిన కవిత  చట్టప్రకారం తాము పెట్టుకున్న పేరు చెల్లుబాటు అవుతుందని వాదిస్తున్నారు.  ఈ పేరు మార్పు లేదా అభ్యంతరాలపై ఎన్నికల సంఘం అడిగిన వివరాలకు కవిత ఇప్పటికే బదులిచ్చినట్లు తెలుస్తోంది. అయినప్పటికీ రిజిస్ట్రేషన్ ప్రక్రియ మరింత ఆలస్యం కాకుండా ఉండేందుకు,  తమకు అనుకూలంగా నిర్ణయం వచ్చేలా చూసేందుకు ఆమె ముందు జాగ్రత్తగా ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించినట్లు పరిశీలకులు భావిస్తున్నారు.  ఈ పిటిషన్‌పై రానున్న రోజుల్లో ఢిల్లీ హైకోర్టులో విచారణ జరగనుంది. న్యాయస్థానం ఈ విషయంలో ఎలాంటి తీర్పు ఇస్తుంది, కేంద్ర ఎన్నికల సంఘానికి ఎలాంటి మార్గదర్శకాలు జారీ చేస్తుంది అనే అంశంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.   Telangana Rakshana Sena, TRS Party Name Row, Delhi High Court, Election Commission of India
తమిళనాడు రాజకీయాల్లోకి మరో స్టార్ హీరో ఎంట్రీ ఇచ్చారు. తమిళనాడు అసెంబ్లీకి ఇటీవల జరిగిన  ఎన్నికలలో   దళపతి విజయ్ సృష్టించిన సంచలన విజయం తెలిసిందే.  రాజకీయాల్లోకి ప్రవేశించిన తొలిసారే విజయం సాధించి   ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించి  విజయ్ చరిత్ర సృష్టించారు.  కమల్ హాసన్ వంటి మహామహులకే సాధ్యం కాని ఈ ఫీట్ ను విజయ్ సాకారం చేయడంతో..  ఇప్పుడు కోలీవుడ్‌లోని మరికొందరు స్టార్స్ రాజకీయాలలోకి  అడుగులు వేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఈ క్రమంలోనే   స్టార్ హీరో ధనుష్ కూడా   రాజకీయ అరంగేట్రం చేయబోతున్నారు.  తాజాగా ధనుష్ అభిమాన సంఘం నిర్వహించిన ఓ ప్రత్యేక కార్యక్రమంలో  పార్టీ  జెండాను ఆవిష్కరించడం ఆయన పొలిటికల్ ఎంట్రీకి సంకేతంగా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  కేవలం జెండా రూపకల్పనకే పరిమితం కాకుండా..  తమిళనాడు వ్యాప్తంగా విస్తృతంగా సేవా కార్యక్రమాలు చేపట్టాలని అభిమాన సంఘాల నేతలకు ధనుష్ పిలుపునివ్వడం కూడా  ఆయన పోలిటికల్ ఎంట్రీని కన్ ఫర్మ్ చేస్తోందంటున్నారు.   Hero, Dhanush, Fans, Flag, Public, Service, Teluguone
  భువనగిరి మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు కొమ్మిడి నరసింహారెడ్డి మంగళవారం (జులై 7)  ఉదయం కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన, హైదరాబాద్‌లోని నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తెల్లవారుజామున 5 గంటలకు తుదిశ్వాస విడిచారు. రెండుసార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన ఆయన  విలువలతో కూడిన రాజకీయాలకు నిలువెత్తు రూపంగా నిలిచారు.   సొంత ఇల్లు కూడా లేకుండా, ఒక పాత స్కూటర్ మినహా ఎలాంటి ఆస్తులు కూడబెట్టకుండా నిరాడంబరంగా జీవించారు.   నరసింహారెడ్డి  తన 19 ఏళ్ల వయసులోనే..  1962లో బ్రాహ్మణపల్లి సర్పంచ్‌గా ఎన్నికై ప్రజా జీవితాన్ని ప్రారంభించారు. ఆ తర్వాత భువనగిరి సమితి అధ్యక్షుడిగా పనిచేశారు. 1978లో కాంగ్రెస్ తరపున భువనగిరి ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన... 1983లో ఎన్టీఆర్ ప్రభంజనాన్ని తట్టుకొని రెండోసారి కూడా కాంగ్రెస్  ఎమ్మెల్యేగా అదే నియోజకవర్గం నుంచి విజయం సాధించారు. ఆయన మృతి పట్ల రాజకీయాలకు అతీతంగా పలువురు నేతలు సంతాపం వ్యక్తం చేశారు.   Bhuvanagiri, Former, Mla, Values
ALSO ON TELUGUONE N E W S
అక్కినేని అఖిల్(Akhil)అప్ కమింగ్ మూవీ  'లెనిన్'(lenin)ఈ నెల 10 న విడుదల కాబోతున్న విషయం తెలిసిందే. మూడు సంవత్సరాల తర్వాత అఖిల్ నుంచి వస్తున్న చిత్రం కావడంతో ఇండస్ట్రీలోను, అభిమానుల్లోను, ప్రేక్షకుల్లోను భారీ అంచనాలు ఉన్నాయి. నాగార్జున, నాగవంశీ నిర్మిస్తున్న ఈ హై-వోల్టేజ్ యాక్షన్ డ్రామా  ఇప్పుడు బిజినెస్ పరంగా సరికొత్త రికార్డులను సృష్టిస్తోంది. తాజాగా అందుతున్న ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం, ఈ సినిమా నాన్-థియేట్రికల్ హక్కులు ఊహించని రీతిలో భారీ ధర పలికాయి. అఖిల్ మార్కెట్ స్టామినాతో సంబంధం లేకుండా 'లెనిన్' చిత్రం ఏకంగా 34 కోట్ల నాన్ ది  యేట్రికల్ డీల్‌ను సొంతం చేసుకున్నట్లు ట్రేడ్ రిపోర్ట్స్ చెబుతున్నాయి. ఇందులో శాటిలైట్, డిజిటల్ (ఓటీటీ), మరియు ఆడియో హక్కులు అన్నీ కలిపి ఉన్నాయని తెలుస్తోంది. 'ఏజెంట్' బాక్సాఫీస్ వద్ద కేవలం 13 కోట్ల లోపే వసూలు చేసి తీవ్ర నిరాశ పరిచినప్పటికీ, 'లెనిన్' కథా బలం, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మాణ విలువలు చూసి ప్రముఖ ఓటీటీ, శాటిలైట్ సంస్థలు పోటీ పడి ఈ హక్కులని  దక్కించుకున్నాయి. ఒక ప్లాప్ హీరో తదుపరి చిత్రానికి  34 కోట్ల నాన్-థియేట్రికల్ బిజినెస్ జరగడం ట్రేడ్ వర్గాలను సైతం ఆశ్చర్యపరుస్తోంది. also read: Bhagyaraj: బతికుండగా పట్టించులేదు.. ఇప్పుడు నెరవేర్చారు కేవలం నాన్-థియేట్రికల్ పరంగానే కాకుండా, థియేట్రికల్ బిజినెస్‌లోనూ ఈ సినిమా జోరు చూపిస్తోంది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ఏరియా థియేట్రికల్ హక్కులు భారీ మొత్తానికి అంటే దాదాపు 9 కోట్లకు అమ్ముడైనట్లు వార్తలు వచ్చాయి. దీనికి తోడు నైజాం, సీడెడ్, మరియు ఓవర్సీస్ హక్కుల బిజినెస్ కూడా ముగింపు దశకు వచ్చింది. నిర్మాత నాగవంశీ ఈ సినిమాపై ఎంతగానో నమ్మకంతో ఉన్నారు. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, 'లెనిన్' సినిమా చివరి 40 నిమిషాలు అద్భుతమైన ఎమోషనల్ డ్రామాతో సాగుతుందని, థియేటర్లలో అఖిల్ క్యారెక్టర్ చూసి ఆడియన్స్ కన్నీళ్లు పెట్టుకోవడం ఖాయమని సంచలన వ్యాఖ్యలు చేశారు. అఖిల్ సరసన భాగ్యశ్రీ బోర్సే( Bhagyashri Borse)కథానాయికగా చేస్తుండగా మురళి కృష్ణ అబ్బూరి దర్శకుడు.  
అఖిల్ అక్కినేని నటించిన లేటెస్ట్ యాక్షన్ డ్రామా ‘లెనిన్’ (Lenin). మురళీ కిషోర్ అబ్బురు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంపై అక్కినేని అభిమానులతో పాటు సాధారణ ప్రేక్షకులలోనూ భారీ అంచనాలు నెలకొన్నాయి. మనం ఎంటర్‌ప్రైజెస్, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్  సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించాయి. జూలై 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. సినిమా విడుదలకు సమయం దగ్గరపడుతుండటంతో చిత్ర యూనిట్ ప్రమోషన్ల వేగాన్ని పెంచేసింది. తాజాగా రెండు తెలుగు రాష్ట్రాలలో 'లెనిన్' చిత్రానికి సంబంధించిన బుకింగ్స్ కూడా ఓపెన్ అయ్యాయి. థియేటర్లలో అఖిల్ అక్కినేని మాస్ జాతరను కళ్లారా చూసేందుకు అక్కినేని అభిమానులతో పాటు, సినీ లవర్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అఖిల్ ఈ సినిమాతో ఒక భారీ హిట్ కొట్టి, హీరోగా నిలదొక్కువాలని చూస్తున్నాడు. అందుకు తగ్గట్టే ఈ సినిమాపై మొదటి నుంచి పాజిటివ్ బజ్ ఉంది. ముఖంగా ఇటీవల విడుదలైన ట్రైలర్ కు అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. అందుకే ఇప్పుడు అడ్వాన్స్ బుకింగ్స్ కి మంచి స్పందన లభిస్తోంది.  అఖిల్ కెరీర్‌లోనే ఇదొక మైల్ స్టోన్ మూవీగా నిలుస్తుందని ఇండస్ట్రీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. జూలై 10న థియేటర్లలో బొమ్మ దద్దరిల్లిపోవడం ఖాయమని అక్కినేని అభిమానులు బలంగా నమ్ముతున్నారు. మరి అఖిల్ ఆ నమ్మకాన్ని నిలబెడతాడేమో చూడాలి. https://x.com/SitharaEnts/status/2074414405589389346   Akhil Akkineni, Lenin Movie, Bookings, TeluguOne  
  తమిళ చిత్రసీమలో తనదైన ముద్ర వేసిన దిగ్గజ నటుడు, దర్శకుడు, స్క్రీన్‌ప్లే రచయిత కే. భాగ్యరాజ్ ఇటీవల కన్నుమూసిన సంగతి తెలిసిందే. 73 ఏళ్ల వయసులో హఠాత్తుగా సంభవించిన గుండెపోటు కారణంగా ఆయన మరణించడం ఇండస్ట్రీని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. భాగ్యరాజ్ కేవలం నటుడే కాదు, కథను నడిపించడంలో అద్భుతమైన ప్రతిభ ఉన్న అగ్రశ్రేణి సృష్టికర్త. ఆయన తన సుదీర్ఘ సినీ ప్రస్థానంలో 25 కంటే ఎక్కువ చిత్రాలకు దర్శకత్వం వహించడమే కాకుండా, 75కి పైగా సినిమాల్లో వైవిధ్యభరితమైన  క్యారక్టర్లతో ప్రేక్షకుల హృదయాలని గెలుచుకున్నారు. అలాంటి గొప్ప కళాకారుడు భౌతికంగా మనల్ని విడిచివెళ్లినా, ఆయన చిరకాల కోరిక ఒకటి ఇప్పుడు నెరవేరింది. మరణించడానికి కొద్దిరోజుల ముందే భాగ్యరాజ్ తన జీవిత ప్రయాణాన్ని, సినీ రంగానికి సంబంధించిన మధుర స్మృతులను క్రోడీకరిస్తూ 'పడిచ్చా పుడిచిర్లాం' అనే పేరుతో ఒక అద్భుతమైన స్వీయచరిత్రాన్ని (ఆటోబయోగ్రఫీ) రాసుకున్నారు. ఈ పుస్తకానికి ఒక మనోహరమైన ముందుమాట (ఫోర్‌వర్డ్) రాయాలని ఆయన ఎంతో ఆశపడ్డారు. ఇందుకోసం 2026 జూన్ 17వ తేదీన తన పుస్తక ప్రతినోకదాన్ని ప్రముఖ గీత రచయిత, కవి వైరముత్తుకు పంపించి, ప్రేమతో ముందుమాట రాసివ్వాలని కోరారు. ఆ సమయంలో వైరముత్తు ఇతర పనుల్లో బిజీగా ఉండటం వల్ల "కొంచెం సమయం కావాలి" అని అడగ్గా, భాగ్యరాజ్ ఎప్పటిలాగే తన మార్కు చిరునవ్వుతో "సరే" అని సమాధానమిచ్చారు. కానీ అదే వారి మధ్య చివరి సంభాషణ అవుతుందని ఎవరూ ఊహించలేదు. ఆ తర్వాత సరిగ్గా పది రోజులకు, అంటే జూన్ 27వ తేదీన భాగ్యరాజ్ మరణించారనే వార్త వైరముత్తును తీవ్రంగా కలచివేసింది. భాగ్యరాజ్ మరణానంతరం వైరముత్తు ఆ స్వీయచరిత్ర పుస్తకాన్ని పూర్తిగా చదివారు. ఆ పుస్తకంలోని ప్రతి పేజీ ఆయనని ఎంతగానో కదిలించింది. భాగ్యరాజ్ తన జీవితంలో ఎదుర్కొన్న తీవ్రమైన పేదరికం, అవమానాలు, పరాజయాలు, పోరాటాలు మరియు అనుభవించిన మానసిక వేదనలను చూసి వైరముత్తు కంటతడి పెట్టారు. భాగ్యరాజ్ బతికుండగా ఆ కోరికని తీర్చలేకపోయాననే బాధతో, ఆయన మరణించిన తర్వాత పూర్తి భావోద్వేగంతో ఆ పుస్తకానికి అద్భుతమైన ముందుమాటని  రాశారు. సాధారణంగా అయితే దీనిని ఈమెయిల్ ద్వారా పంపవచ్చు, కానీ భాగ్యరాజ్ పై ఉన్న గౌరవంతో వైరముత్తు స్వయంగా ఆయన ఇంటికి వెళ్లారు. భాగ్యరాజ్ భార్య పూర్ణిమ, కొడుకు శాంతనులను కలిసి ఆ ముందుమాట ప్రతిని వారికి అందజేశారు. ఈ సందర్భంగా పూర్ణిమ భాగ్యరాజ్ ఎంతో భావోద్వేగానికి లోనయ్యారు. ఈ పుస్తకం ఒక మనిషి జీవిత స్పందన అని, దీనిని త్వరలోనే ప్రచురించాలని వైరముత్తు ఆకాంక్షించారు. Also read: Prakash raj: ఈ నటుడుకి కులం లేదు.. ప్రకాష్ రాజ్ కామెంట్స్ వైరల్     
ప్రపంచ సినిమా రంగంలో క్రిస్టోఫర్ నోలన్ పేరుకు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ఆయన నుంచి ఒక సినిమా వస్తోందంటే చాలు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ ప్రియుల్లో అంచనాలు ఆకాశాన్ని తాకుతాయి. ముఖ్యంగా సంచలన విజయం సాధించిన 'ఓపెన్‌హైమర్' చిత్రం తర్వాత నోలన్ దర్శకత్వంలో తెరకెక్కిన సరికొత్త విజువల్ వండర్ 'ది ఒడిస్సీ'. ఈ చిత్రం రిలీజ్‌కు ముందే గ్లోబల్ వైడ్‌గా అత్యధిక చర్చకు కారణమైన సినిమాల్లో ఒకటిగా నిలిచింది. అయితే, ఈ సినిమా చుట్టూ నడిచిన డిస్కషన్ మొత్తం మొదట్లో సానుకూలంగా సాగిందా అంటే అస్సలు కాదు. ఈ ప్రతిష్ఠాత్మక చిత్రం ప్రయాణం ప్రారంభంలో ఎన్నో ఒడిదుడుకులను, తీవ్రమైన వ్యతిరేకతను ఎదుర్కొంది. కొద్ది రోజుల క్రితం విడుదలైన 'ది ఒడిస్సీ' అఫీషియల్ ట్రైలర్ సోషల్ మీడియాలో తీవ్రమైన విమర్శల పాలైంది. నోలన్ ఎంచుకున్న క్యాస్టింగ్, విజువల్ టోన్, అలాగే క్లాసిక్ పురాణ గాథను ఆయన తెరకెక్కించిన విధానంపై నెటిజన్లు, హాలీవుడ్ వర్గాలు పెద్ద ఎత్తున పెదవి విరిచాయి. ఏకంగా యూట్యూబ్‌లో ఈ ట్రైలర్‌కు భారీ స్థాయిలో డిస్‌లైక్స్ రావడం ప్రపంచవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది. ఈ డిస్‌లైక్స్, ట్రోలింగ్ కారణంగా సినిమాపై నెగిటివ్ ప్రచారం ఒక్కసారిగా ముదిరిపోయింది. నోలన్ లాంటి లెజెండరీ డైరెక్టర్ కెరీర్‌లోనే ఇది ఒక పెద్ద డ్యామేజ్ లాగా కనిపించింది. ట్రైలర్ చూసి సినిమా ఫ్లాప్ అంటూ అప్పుడే సోషల్ మీడియాలో తీర్పులు కూడా ఇచ్చేశారు. కానీ, అసలు సిసలైన నోలన్ మ్యాజిక్ ఏంటో వరల్డ్ ప్రీమియర్ షో తర్వాత తెలిసొచ్చింది. ఇటీవల నిర్వహించిన ఇంటర్నేషనల్ ప్రీమియర్ అనంతరం పరిస్థితి 180 డిగ్రీలు పూర్తిగా మారిపోయింది. సినిమాను నేరుగా వీక్షించిన టాప్ సినీ విమర్శకులు, ఇంటర్నేషనల్ మీడియా ప్రతినిధులు ఈ చిత్రంపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఇప్పటివరకు ఈ సినిమాపై ఉన్న నెగిటివిటీకి ఈ మొదటి రెస్పాన్స్ గట్టి బ్రేక్ వేసింది. థియేట్రికల్ ఎక్స్‌పీరియన్స్, కథను భారీ స్థాయిలో ఆవిష్కరించిన తీరు, నోలన్ సిగ్నేచర్ విజువల్ స్టైల్ అద్భుతంగా ఉన్నాయంటూ రివ్యూలు వెలువడుతున్నాయి. ట్రైలర్ ఆధారంగా సినిమాను తక్కువ అంచనా వేసిన వారంతా ఇప్పుడు ముక్కున వేలేసుకుంటున్నారు. ఈ అద్భుతమైన పాజిటివ్ టాక్ తో సినిమా చుట్టూ ఇప్పుడు సరికొత్త బజ్ క్రియేట్ అయింది. జూలై 17న 'ది ఒడిస్సీ' ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా థియేటర్లలోకి రానుంది. సినిమా విడుదలకు ఇంకా కచ్చితంగా 10 రోజులు సమయం ఉండగానే, ఈ రేంజ్‌లో పాజిటివ్ వర్డ్ ఆఫ్ మౌత్ రావడం ట్రేడ్ వర్గాలను సైతం ఆశ్చర్యపరుస్తోంది. ఈ ముందస్తు సానుకూల వాతావరణం సినిమా అడ్వాన్స్ బుకింగ్స్‌కు భారీగా కలిసిరానుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. యూట్యూబ్ డిస్‌లైక్స్ నుండి థియేటర్లలో స్టాండింగ్ ఓవేషన్ వరకు సాగిన 'ది ఒడిస్సీ' ప్రయాణం, జూలై 17న బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సునామీ సృష్టించబోతుందోన‌ని ప్రపంచ సినీ లోకం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. Christopher Nolan, The Odyssey, The Odyssey First Reactions, Nolan Next Movie, Hollywood Epic Film, The Odyssey Premiere Talk
  ప్రకాష్ రాజ్.. నటుడుగా పది కాలాల పాటు పదితరాల వారు చెప్పుకునేంత పేరు ప్రఖ్యాతలు సంపాదించాడు. సమాజంలో కులం, మతం అనే అంశాలపై ఆయన ఎప్పుడూ తనదైన శైలిలో గళం విప్పుతూనే ఉంటాడు. అయితే, ఇటీవల ఆయన వ్యక్తిగత జీవితంలో ఎదురైన ఒక తీవ్ర శోకం నేపథ్యంలో ఆయన పంచుకున్న మాటలు ఇప్పుడు అందరినీ ఆలోచింపజేస్తున్నాయి. ఇటీవల ప్రకాష్ రాజ్ మాతృమూర్తి స్వర్ణలత గారు మరణించిన సంగతి తెలిసిందే. ఆమె జీవిత ప్రయాణం, తమ కుటుంబ నేపథ్యం గురించి ఆయన ఒక ఇంటర్వ్యూలో అత్యంత భావోద్వేగంగా మాట్లాడారు. ఈ ఎమోషనల్ కామెంట్స్ నెట్టింట ఒక్కసారిగా వైరల్‌గా మారాయి. ప్రకాష్ రాజ్ మాట్లాడుతు 'సమాజంలో ఎవరైనా తనని  పరిచయం అడిగితే, నేను  ఏ కులానికో లేక మతానికో చెందినవాడినని చెప్పనని, అందరికంటే ముందుగా నేను ఒక 'మనిషిని' అని గర్వంగా చెప్పుకుంటాను. నటన అనేది కేవలం తన వృత్తి మాత్రమే. చదవడం, రాయడం నాకున్న ముఖ్యమైన అభిరుచులు. నా  తల్లి స్వర్ణలత చిన్న వయసులోనే ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నారు. 1960 ప్రాంతంలో మా అమ్మానాన్న బెంగళూరుకి వలస వచ్చారు. మా అమ్మకు 12 ఏళ్ల వయసులోనే తల్లి మరణించగా, ఆ తర్వాత తండ్రి కూడా దూరమయ్యాడు. ఆమెతో పాటు నలుగురు చెల్లెళ్లు, ఒక తమ్ముడు ఉన్నారు. అనాథాశ్రమంలో పెరిగిన మా అమ్మని ఎంతోమంది ఆదుకున్నారు. కష్టపడి నర్సింగ్ శిక్షణ పూర్తి చేసింది. వాళ్లకు తమ జాతి, కులం, బంధువులు ఎవరో కూడా తెలియదు. తర్వాత క్రిస్టియన్ మిషనరీలో చేరి క్రైస్తవ మతాన్ని స్వీకరించింది. ఇటీవల వయోభారంతో తలెత్తిన ఆరోగ్య సమస్యల కారణంగా కన్నుమూశారు. ఆమె చివరి కోరికను గౌరవిస్తూ బెంగళూరులోని సెయింట్ మైఖేల్ చర్చిలో క్రైస్తవ సంప్రదాయం ప్రకారం అంత్యక్రియలు నిర్వహించినట్లు ప్రకాష్ రాజ్ తెలిపారు. Also read: ఆ మూవీని ప్రమోట్ చేస్తే పెద్దిని డామేజ్ చేస్తున్నావ్ అనేవారు.. నాగవంశీ సంచలన వ్యాఖ్యలు   
ప్రస్తుతం టాలీవుడ్‌తో పాటు బాలీవుడ్‌లోనూ మోస్ట్ బిజీ హీరోయిన్‌గా మారిపోయింది గ్లామర్ డాళ్‌ శ్రీలీల. కెరీర్ పరంగా ఎక్కడా తగ్గకుండా వరుస ప్రాజెక్టులతో ఈ బ్యూటీ దూసుకుపోతోంది. తనదైన అద్భుత అందం, చలాకీతనం, అంతకుమించిన డ్యాన్సింగ్ ప్రతిభతో కుర్రకారు హృదయాలను కొల్లగొట్టిన ఈ ముద్దుగుమ్మ.. సోషల్ మీడియాలోనూ భారీగా ఫాలోయింగ్‌ను సంపాదిస్తూ నిరంతరం యాక్టివ్‌గా ఉంటోంది. ఈ క్రమంలోనే శ్రీలీల ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టే ప్రతి పోస్ట్ కేవలం క్షణాల వ్యవధిలోనే నెట్టింట విపరీతంగా వైరల్ అయిపోతోంది. తాజాగా శ్రీలీల తన అధికారిక‌ ఇన్‌స్టా ఖాతాలో షేర్ చేసిన కొన్ని అందమైన ఫోటోలు సోషల్ మీడియాను ఊపేస్తున్నాయి. తాజా పోస్ట్‌కు "ఏ డే వెల్ స్పెంట్" అంటే ఈరోజు చాలా బాగా గడిచింది అంటూ ఒక క్యూట్ క్యాప్షన్‌ను జోడించారు. తెల్లటి హార్ట్ ఎమోజీని క్యాప్ష‌న్ కి జత చేయ‌గా.. ఈ లేటెస్ట్ సోషల్ మీడియా అప్‌డేట్ ప్రస్తుతం నెటిజన్లను, అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటూ లైకుల వర్షం కురిపిస్తోంది. ఈ పోస్ట్ చూసిన మెజారిటీ నెటిజన్లు శ్రీలీల అందాన్ని పొగడకుండా ఉండలేకపోతున్నారు. ఈ పోస్ట్ లో గ్రూప్ ఫోటో చూడ‌గానే ఎంబిబిఎస్ శ్రీ‌లీల త‌న క్లాస్ మేట్ల‌తో ఫోటో దిగిందా? అంటూ ప‌లువురు నెటిజ‌నులు ప్ర‌శ్నిస్తున్నారు. కామెంట్ సెక్షన్ లో అభిమానులు బ్యూటీ క్వీన్.. డ్రీమ్ గర్ల్ అని కొనియాడుతుంటే.. మరికొందరైతే ఏకంగా సౌత్ ఇండస్ట్రీస్ నెం.1 హీరోయిన్ అంటూ హార్ట్, ఫైర్ ఎమోజీలతో కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. మరోవైపు ఒక ప్రొఫెషనల్ మేకప్ ఆర్టిస్ట్ స్పందిస్తూ.. భవిష్యత్తులో ఎప్పటికైనా మీతో కలిసి పని చేసే అవకాశం రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అంటూ తన కలని వెల్లడించారు. మరో ఆసక్తికరమైన విషయమేమిటంటే.. శ్రీలీల నటిస్తూనే ఎంబీబీఎస్ (MBBS) పూర్తి చేసిన‌ సంగతి తెలిసిందే. దీనిని ప్రస్తావిస్తూ కొందరు అభిమానులు నా గర్ల్‌ఫ్రెండ్ శ్రీలీల MBBS.., సత్యా MBBS కి జాన్ అంటూ చాలా సరదాగా కామెంట్లు పెడుతున్నారు. మరికొందరు నెటిజన్లు మాత్రం తమ కామెంట్లు హైలైట్ అవ్వడం కోసం, లైకులు రావడం కోసం రకరకాల వింత వింత కామెంట్లతో ఈ పోస్ట్ కింద హంగామా సృష్టిస్తున్నారు. మొత్తానికి ఈ ఒక్క పోస్ట్‌తో శ్రీలీల క్రేజ్ ఏంటో మరోసారి నిరూపితమైంది. ఇక శ్రీలీల సినిమా కెరీర్ విషయానికి వస్తే.. ప్రస్తుతం హిందీ చిత్రసీమలో కూడా పాగా వేసేందుకు సిద్ధమైంది. బాలీవుడ్ నవాబ్ సైఫ్ అలీఖాన్ కుమారుడు ఇబ్రహీం అలీఖాన్ సరసన న‌టిస్తున్న తదుపరి బాలీవుడ్ చిత్రం త్వరలోనే విడుదలకు సిద్ధమవుతోంది. దీంతో పాటు బాలీవుడ్ క్రేజీ హీరో కార్తీక్ ఆర్యన్ సరసన కూడా ఒక భారీ మ్యూజిక‌ల్ చిత్రంలో నటిస్తూ బిజీగా ఉంది.   Sreeleela, Sreeleela MBBS, RT75 Sreeleela
టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో అడివి శేష్ తన లేటెస్ట్ యాక్షన్ మూవీ ‘డెకాయిట్’ బాక్సాఫీస్ వద్ద సేఫ్ వెంచర్‌గా నిలవడంతో ప్రస్తుతం ఫుల్ జోష్‌లో ఉన్నారు. ఈ సక్సెస్ ఉత్సాహంతో ఆయన తన పూర్తి దృష్టిని ప్రతిష్టాత్మక స్పై థ్రిల్లర్ సీక్వెల్ 'గూఢచారి 2' (G2) ప్రాజెక్ట్ పైనే పెట్టారు. మొదటి భాగం ‘గూఢచారి’ సృష్టించిన భారీ రికార్డుల దృష్ట్యా, ఈ సరికొత్త సీక్వెల్‌పై టాలీవుడ్‌లోనే కాకుండా దేశవ్యాప్తంగా అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఈ క్రేజీ సీక్వెల్‌లో బాలీవుడ్ స్టార్ హీరో ఇమ్రాన్ హష్మీ మెయిన్ విలన్‌గా నటిస్తుండటం ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లో అత్యంత హాట్ టాపిక్‌గా మారింది. ఈ బిగ్ కాస్టింగ్ లీప్ వెనుక టాలీవుడ్ మేకర్స్, అడివి శేష్ ప్లాన్ చేసిన మైండ్ బ్లోయింగ్ బిజినెస్ వ్యూహాలు ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. గతంలో ‘మేజర్’ సినిమాతో నార్త్ ఇండియా ఆడియన్స్‌కు కూడా బాగా దగ్గరైన అడివి శేష్, రీసెంట్‌గా ఒక పెద్ద బాలీవుడ్ మల్టీస్టారర్ సినిమాకు సైన్ చేశారంటూ సోషల్ మీడియా వేదికగా ఒక రేంజ్‌లో ప్రచారం జరిగింది. దాంతో ఆయన అభిమానులంతా ఆ టాప్ ప్రొడక్షన్ బ్యానర్,  డైరెక్టర్ ఎవ‌రు అని ఆరా తీయడం మొదలుపెట్టారు. అయితే ట్రేడ్ వర్గాల నుంచి అందుతున్న తాజా సమాచారం ప్రకారం ఆ బాలీవుడ్ ఎంట్రీ వార్తల్లో ఎలాంటి నిజం లేదు. అడివి శేష్ ప్రస్తుతానికి ఎలాంటి హిందీ స్ట్రెయిట్ సినిమాను ఓకే చేయలేదు. ఆయన మైండ్ అండ్ ఫోకస్ అంతా కేవలం 'గూఢచారి 2' (G2) ను విజువల్ వండర్‌గా స్క్రీన్ పైకి తీసుకురావడం పైనే ఉంది. సాధారణంగా ఒక హై-వోల్టేజ్ స్పై థ్రిల్లర్ సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ కావాలంటే హీరో క్యారెక్టరైజేషన్ ఎంత స్టైలిష్‌గా ఉందో, దానికి ధీటుగా విలన్ పాత్ర కూడా అంతే పవర్‌ఫుల్‌గా మైండ్ గేమ్స్ ఆడేలా ఉండాలి. అందుకే ‘G2’ మేకర్స్ ఏరికోరి బాలీవుడ్ స్టార్ ఇమ్రాన్ హష్మీని ప్రతినాయకుడిగా రంగంలోకి దించారు. ఈ సినిమాలో అడివి శేష్ వర్సెస్ ఇమ్రాన్ హష్మీ మధ్య వచ్చే ఇంటెన్స్ మైండ్ గేమ్స్, హై-ఎండ్ యాక్షన్ సీక్వెన్సులు సినిమాకే మేజర్ హైలైట్‌గా నిలవబోతున్నాయని ఇన్సైడ్ టాక్. భారీ బడ్జెట్‌తో అంతర్జాతీయ ప్రమాణాలతో తెరకెక్కుతున్న ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్‌లో అడివి శేష్ సరికొత్త స్టైలిష్ అవతార్‌లో కనిపించి మెప్పించనున్నారు. ఈ సినిమాలో ఇమ్రాన్ హష్మీని విలన్‌గా ఎంచుకోవడం వెనుక ఒక పక్కా కాస్టింగ్ అండ్ మార్కెట్ స్ట్రాటజీ దాగి ఉంది. దీనివల్ల నార్త్ బెల్ట్‌లో సినిమాను ప్రత్యేకంగా, ఖర్చు పెట్టి ప్రమోట్ చేయాల్సిన అవసరం లేకుండానే బాలీవుడ్ ట్రేడ్ మార్కెట్‌లో ఒక సహజమైన హైప్, క్రేజ్ క్రియేట్ అవుతుంది. హిందీలో నేరుగా ఒక స్ట్రెయిట్ హీరోగా ఎంట్రీ ఇచ్చి రిస్క్ చేసే కంటే, ఇలాంటి పక్కా స్క్రిప్ట్ ఉన్న గ్లోబల్ స్పై థ్రిల్లర్ ద్వారా నార్త్ ఇండియన్ మార్కెట్‌ను కొల్లగొట్టాలనేది అడివి శేష్ మాస్టర్ ప్లాన్‌గా కనిపిస్తోంది. బిజినెస్ భాగస్వాములకు, డిస్ట్రిబ్యూటర్లకు భారీ స్థాయిలో లాభాలు, నార్త్ మార్కెట్ మైలేజ్ తెచ్చేలా ఈ కాస్టింగ్ లీప్‌ను ప్లాన్ చేశారు. ప్రస్తుతానికి మాత్రం ఈ 'G2' ద్వారానే పాన్ ఇండియా బాక్సాఫీస్‌ను షేక్ చేయాలని గట్టిగా డిసైడ్ అయ్యారు. ఇటు శేష్ స్టైలిష్ యాక్షన్, అటు ఇమ్రాన్ హష్మీ పవర్‌ఫుల్ విలనిజం తోడైతే థియేటర్లలో ప్రేక్షకులకు పూనకాలు రావడం ఖాయం అని సినిమా విశ్లేషకులు భావిస్తున్నారు.       Goodachari 2, Adivi Sesh, Emraan Hashmi
ఈటీవీ విన్ వేదికగా సరికొత్త ఫ్యామిలీ, ఫ్రెండ్‌షిప్ ఎమోషన్స్ కలబోసిన కథతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది ‘గుర్తుకొస్తున్నాయి’ వెబ్ సిరీస్. విరాజ్ అశ్విన్ ప్రధాన పాత్రలో, వినోద్ గాలి దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ సిరీస్ మొత్తం 7 ఎపిసోడ్‌లుగా వినోదాన్ని పంచుతోంది. ఎప్పుడూ కుటుంబ బంధాలు, మానవీయ విలువల చుట్టూ తిరిగే కథలకే ప్రాధాన్యతనిచ్చే ఈటీవీ, ఈసారి డిజిటల్ ప్లాట్‌ఫామ్‌పై కూడా అదే సెంటిమెంట్‌ను నమ్ముకుని ఈ వెబ్ సిరీస్‌ను నిర్మించింది. కాకినాడ నేపథ్యంలో నలుగురు ప్రాణస్నేహితుల చుట్టూ తిరిగే ఈ కథ, చూసే ప్రతి ఒక్కరికీ తమ బాల్యాన్ని, స్కూల్ రోజులను ఖచ్చితంగా గుర్తుచేస్తుంది. సమీక్షల ప్రకారం ఈ సిరీస్‌కు ఐదుకి 2.75 రేటింగ్ లభించింది. పాత కథే అయినప్పటికీ, దర్శకుడు కథనాన్ని నడిపించిన తీరు ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. కథలోకి వెళితే, కాకినాడలో స్కూల్ డేస్ నుంచి సంతోష్, ఆనంద్, శ్రీకాంత్, గణేశ్ మంచి స్నేహితులు. చిన్నప్పుడు చదువుపై పెద్దగా శ్రద్ధ పెట్టకపోయినా ఆకతాయి పనులతో, ఆటపాటల్లో ఎప్పుడూ ముందుండేవారు. కాలక్రమంలో సంతోష్ మిగతా ముగ్గురు మిత్రులకు కొద్దిగా దూరమవుతాడు. అయితే చిన్నతనం నుంచే సంతోష్, వైశాలి ఇద్దరూ ప్రేమించుకుంటారు. వైశాలి ఎవరో కాదు, వారు చదువుకున్న స్కూల్ ప్రిన్సిపాల్ రఘునాథ్ కూతురు. సంతోష్ మరియు అతని స్నేహితుల ఆకతాయి పనుల వల్ల రఘునాథ్ మాస్టర్‌కు వారిపై అస్సలు మంచి అభిప్రాయం ఉండదు. కానీ కూతురి ఇష్టాన్ని కాదనలేక, సంతోష్ మారిపోయాడన్న నమ్మకంతో పెళ్లికి ఒప్పుకుంటాడు. అయినప్పటికీ పెళ్లికి ముందే సంతోష్‌ను పరీక్షించాలనుకుని, వివాహానికి 3 రోజుల ముందు ఊరు దాటి వెళ్లకూడదని వైశాలితో కండిషన్ పెట్టిస్తాడు. ట్విస్ట్ ఎక్కడ వస్తుందంటే, మామగారి మాటను పక్కనబెట్టి సంతోష్ తన మిత్రులతో కలిసి బ్యాచిలర్ పార్టీ కోసం కారులో గోవా బయల్దేరతాడు. దురదృష్టవశాత్తూ మార్గమధ్యంలో జరిగిన ఒక రోడ్డు ప్రమాదంలో సంతోష్ తలకు తీవ్ర గాయమై గతాన్ని పూర్తిగా మర్చిపోతాడు. పెళ్లికి కేవలం వారం రోజుల సమయం మాత్రమే ఉన్న తరుణంలో డాక్టర్ చెప్పిన ఈ మాటతో స్నేహితులు, తల్లిదండ్రులు తీవ్ర దిగ్భ్రాంతికి గురవుతారు. వైశాలి తండ్రికి ఈ విషయం తెలిస్తే పెళ్లి ఆగిపోతుందని భయపడి, ఎలాగైనా సంతోష్ ఉన్న పరిస్థితిని దాచిపెట్టి పెళ్లి జరిపించాలని స్నేహితులు నిశ్చయించుకుంటారు. సంతోష్ పక్కనే ఉంటూ అతనికి పాత జ్ఞాపకాలను గుర్తుచేయడానికి ఆ ముగ్గురు మిత్రులు పడే పాట్లు, ఆ క్రమంలో వచ్చే హాస్యం ఈ సిరీస్‌కు ప్రధాన బలం. ఈ తరహా మెమొరీ లాస్ డ్రామా గతంలో చాలా సినిమాల్లో చూసినప్పటికీ, దర్శకుడు వినోద్ గాలి స్క్రీన్‌ప్లేతో కొంతవరకు కొత్తదనాన్ని ఆవిష్కరించారు. ముఖ్యంగా టీనేజ్ జ్ఞాపకాలు, వేసవి సెలవుల్లో అమ్మమ్మ తాతయ్యల ఇళ్లకు వెళ్లడం వంటి దృశ్యాలు ప్రతి ప్రేక్షకుడి హృదయాన్ని హత్తుకుంటాయి. రోహిణి హట్టంగడి, శుభలేఖ సుధాకర్ వంటి సీనియర్ నటుల నటన ఈ సిరీస్‌కు మరింత నిండుదనాన్ని తీసుకురాగా, శివన్నారాయణ కామెడీ ప్రేక్షకులకు మంచి రిలీఫ్ ఇస్తుంది. క్లైమాక్స్ ఎపిసోడ్‌లో స్నేహితులు చేసే త్యాగాలు, ఎమోషన్స్ కళ్లు చెమర్చేలా చేస్తాయి. రహీమ్ షేక్ ఫోటోగ్రఫీ, అజయ్ అరసాడ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సిరీస్‌ను నెక్స్ట్ లెవెల్‌కు తీసుకెళ్లాయి. ప్రేమ, స్నేహం కోసం నిలబడే ఒక మంచి సందేశంతో సాగే ఈ 7 ఎపిసోడ్ల సిరీస్‌ను కుటుంబ సమేతంగా హాయిగా వీక్షించవచ్చు.     Gurthukosthunnayi, ETV Win, Viraj Ashwin, Wonod Gali, Telugu web series 2026
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు. వారితో పాటు పెద్ద సంఖ్యలో క్యాడర్ కూడా పార్టీని వీడుతున్నారు. ఇక ఇప్పుడు నామినేటెడ్ పదవులలో ఉన్న వారి వంతు మొదలైనట్లు కనిపిస్తోంది. తనకు కానీ తన భర్తకు  కానీ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు టికెట్ ఇవ్వాలంటూ గత  కొంత కాలంగా కోరుతూ వస్తున్న మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ వంతు వచ్చింది. ఆమె కూడా రాజీనామా అస్త్రం సంధించారు.  జగన్ కు నమ్మిన బంటుగా గుర్తింపు పొందిన మహిళాకమిషన్ చైర్ పర్సన్ వాసి రెడ్డి పద్మ తన పదవికి రాజీనామా చేశారు. ఉరుములేని పిడుగులా, ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా తన రాజీనామా లేఖను సీఎం జగన్ కు పంపేశారు. పేరుకు తాను పార్టీకి కాదు, కేవలం మహిళా కమిషన్ చైర్మన్ పదవికి మాత్రమే రాజీనామా చేశాననీ, ఇక నుంచి వైసీపీ కోసం పని చేస్తాననీ వాసిరెడ్డి పద్మ చెబుతున్నప్పటికీ, ఆమె రాజీనామాకు కారణం అసంతృప్తేనని పార్టీ వర్గాలు బాహాటంగానే చెబుతున్నాయి. చాలా కాలంగా వాసిరెడ్డి పద్మ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు తనకు కానీ తన భక్తకు కానీ పార్టీ టికెట్ ఇవ్వాలని జగన్ ను కోరుతూ వస్తున్నారు. అయితే ఇప్పటి వరకూ జగన్ చూద్దాం.. చేద్దాం అన్నట్లుగా దాట వేస్తూనే వచ్చారు. ఇప్పుడిక వరుసగా అభ్యర్థల జాబితాలను జగన్ ప్రకటించేస్తుండటం, తనకు గానీ తన భర్తకు కానీ పార్టీ టికెట్ విషయంలో ఎటువంటి స్పస్టత ఇవ్వకపోవడంతో ఆమె మనస్తాపం చెంది పదవికి రాజీనామా చేసేశారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.  వాసిరెడ్డి పద్మ రాజకీయ ప్రవేశం ప్రజారాజ్యం పార్టీతో జరిగింది. 2009లో ఆమె ప్రజారాజ్యం పార్టీలో చేరారు. ఇలా చేరడంతోనే ఆమె ప్రజారాజ్యం అధికార ప్రతినిథిగా పదవి దక్కించుకున్నారు. ప్రజారాజ్యం కాంగ్రెస్ పార్టీలో విలీనం కావడంతో ఆమె 2012లో జగన్ పార్టీలో చేరారు. జగన్ కూడా ఆమెకు అధికార ప్రతినిథి పదవి ఇచ్చారు.  2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆమెను రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా నియమించారు. చైర్ పర్సన్ హోదాలో ఆమె జగన్ మెప్పు పొందేందుకు చేయగలిగినంతా చేశారు. ప్రతిపక్ష పార్టీ నేతలకు నోటీసులు ఇచ్చారు. ఏకంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు సైతం నోటీసులు జారీ చేశారు. వార్డు వలంటీర్లపై పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు కమిషన్ ముందు హాజరై వివరణ ఇవ్వాలంటూ ఆమె పవన్ కు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. పవన్ హాజరు కాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు నమోదు చేయాలని ఆదేశించారు. ఇన్ని చేసినా వాసిరెడ్డి పద్మకు ఆమె కోరినట్లుగా పార్టీ టికెట్ లభించకపోవడంతో అలిగి పదవికి రాజీనామా చేశారని, ఇది జగన్ కు షాకేననీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు. ఒకరైతు తనకు చేసిన సేవలకు ప్రీతి చెందిన గురువు అతడికి స్వర్గ ప్రాప్తిని కలగజేయాలని అనుకుంటాడు. కానీ సంసారాసక్తి వల్ల ఆ రైతు ఆ అవకాశాన్ని వాయిదా వేసుకుంటూ వస్తాడు. చివరికి గురుకృప వల్ల ఆ రైతు స్వర్గ ప్రాప్తిని ఎలా పొందాడో ఈ కథ తెలియజేస్తుంది. "ఒక మహాపురుషుడు ప్రయాణం చేస్తూ, డస్సిపోయాడు. గొంతు ఎండిపోయింది. దారిలో ఒక రైతు కనపడితే నీళ్ళు అర్థించాడు. ఆ రైతు మహాత్మునికి సకల ఉపచారాలూ చేశాడు. చిరిగిపోయిన ఆయన ఉత్తరీయాన్ని రైతు జాగ్రత్తగా కుట్టి బాగుచేశాడు. రైతు పరిచర్యలకు సంతసించిన ఆ మహాత్ముడు శాంతి, ఆనందాలకు నిలయమైన స్వర్గానికి తనతోపాటు రమ్మని అంటాడు. అందుకు ఆ రైతు 'గురువుగారూ! మీరు నా మీద చూపిన దయకు కృతజ్ఞుణ్ణి. కానీ నా పిల్లలు ఇంకా చిన్నవాళ్ళు. ఓ ఏడేళ్ళ వ్యవధి ఇవ్వండి' అని అడుగుతాడు. అందుకు గురువు అంగీకరించాడు. సరిగ్గా ఏడేళ్ళ తర్వాత గురువు రైతును స్వర్గానికి తీసుకువెళ్ళడానికి వచ్చాడు. అప్పుడు రైతు 'అయ్యా! కడపటి కొడుకు కష్టాలకు అంతు లేదు. అన్ని జంఝాటాలనూ ఒక్కడే సంబాళించుకోలేకపోతున్నాడు. కాబట్టి మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని గురువుని అడిగాడు. మరో ఏడేళ్ళ తరువాత గురువు వచ్చాడు. కానీ రైతు చనిపోయాడని తెలిసింది. చనిపోయిన ఆ రైతు ఎద్దుగా పుట్టాడని ఆ గురువు తన దివ్య దృష్టితో తెలుసుకున్నాడు. ఎద్దుగా పుట్టిన ఆ రైతు తన కొడుకు పొలాన్నే దున్నుతున్నాడు. అప్పుడు గురువు ఆ ఎద్దుపై మంత్ర జలం చిలకరించగానే ఎద్దు జన్మనెత్తిన రైతు 'నా కొడుకు పరిస్థితి మరి కాస్త మెరుగు పడనీయండి స్వామీ! మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని అన్నాడు. ఇక చేసేది లేక వెనుదిరిగాడు గురువు. మరలా ఏడేళ్ళ తర్వాత వచ్చిన గురువుకు ఎద్దు చనిపోయిందని తెలిసింది. అది కుక్కగా పుట్టి కొడుకు ఇంటినీ, ఆస్తినీ కాపలా కాస్తోందని తన దివ్యదృష్టి ద్వారా తెలుసుకున్నాడు. గురువు. కుక్కగా పుట్టిన ఆ రైతు 'స్వామీ! నేను ఎంత దౌర్భాగ్యుణ్ణి. మీరు ఇంత దయ చూపుతున్నప్పటికీ మీతో స్వర్గమానం చేయలేకున్నాను. వీడికి ఆస్తిని కాపాడుకొనే దక్షత ఇంకా రాలేదు. కాబట్టి దయ చేసి మరో ఏడేళ్ళు వ్యవధి ఇవ్వండి' అని వేడుకున్నాడు. గురువు ఏడేళ్ళ తరువాత మళ్ళీ వచ్చేసరికి కుక్క మరణించింది. అది త్రాచుపాముగా జన్మనెత్తి, ఇప్పుడు కొడుకు భూమిలో ఉన్న లంకెబిందెలకు పడగెత్తి కాపలా కాస్తోంది. గుప్త ధనం ఇక్కడ ఉందని కొడుకుకి ఎలా తెలియజేయాలా అని పాము ఆలోచిస్తున్నప్పుడు గురువు ఆ రైతుకొడుకును పిలుచుకు వచ్చి లంకె బిందెలు ఉన్న చోట తవ్వమన్నాడు. లంకె బిందెలు బయటపడ్డాయి. ఆ పైన ఆ పామును చంపమన్నాడు. అనంతరం శిష్యుణ్ణి తీసుకొని స్వర్గారోహణం చేశాడు గురువు. సంసారంలోని ఈతి బాధల నుండి శిష్యుణ్ణి ఉద్ధరిస్తాడు సద్గురువు. అలాంటి గురువు అందరికీ అవసరం.                                      *నిశ్శబ్ద.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్  రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది.  80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత  ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది.   ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది. ఆమెది నెద‌ర్లాండ్స్‌. ఆమె తండ్రి నెద‌ర్లాండ్స్‌లోని ఆర్నెహెమ్‌లో చిన్న‌పిల్ల‌ల ఆస్ప‌త్రి డైరెక్ట‌ర్. పోయి దొరికిన ఆ పెయింటింగ్ విష‌యానికి వ‌స్తే.. అది 1683లో కాస్ప‌ర్ నెష‌ర్ వేసిన స్టీవెన్ ఓల్ట‌ర్స్ పెయింటింగ్‌. రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో నాజీల ఆదేశాల‌ను చార్లెట్ తండ్రి వ్య‌తిరేకించారు. ఆయ‌న ర‌హ‌స్య జీవ‌నం సాగించేడు. కానీ ఈ పెయింటింగ్‌ని మాత్రం త‌న న‌గ‌రంలోని ఒక బ్యాంక్‌లో భ‌ద్ర‌ ప‌ర‌చ‌మ‌ని ఇచ్చార‌ట‌. 1940లో నాజీలు నెద‌ర్లాండ్ పై దాడులు చేసినపుడు ఆ బ్యాంక్ మీద ప‌డి దోచుకున్నా రు. అప్పుడు ఈ పెయింటింగ్ కూడా తీసుకెళ్లారు. యుద్ధం అయిపోయిన త‌ర్వాత ఈ పెయింటింగ్ ఎక్క‌డున్న‌దీ ఎవ‌రికీ తెలియ‌లేదు. చిత్రంగా 1950ల్లో డ‌స‌ల్‌డార్ష్ ఆర్ట్ గ్యాల‌రీలో అది ప్ర‌త్య‌క్ష‌మ‌యింది. 1969లో ఆమ్‌స్ట‌ర్‌డామ్‌లో దాన్ని వేలానికి తీసికెళ్లే ముందు దాన్ని ఆ ఆర్ట్ గ్యాల‌రీలో వుంద‌ని చూసిన‌వారు చెప్పారు. వేలంపాట త‌ర్వాత మొత్తానికి ఆ పెయింటింగ్‌ను 1971లో ఒక క‌ళాపిపాసి త‌న ద‌గ్గ‌ర పెట్టుకున్నాడు.    ఆ త‌ర్వాత 2021లో అది చార్లెటీని చేరింది.  మొత్తానికి వూహించ‌ని విధంగా ఎంతో కాలం దూర‌మ‌యిన గొప్ప క‌ళాఖండం తిరిగి త‌న వ‌ద్ద‌కు చేర‌డంలో చార్లెటీ ఆనందానికి అంతేలేదు. అంతే క‌దా.. పోయింద‌నుకున్న గొప్ప వ‌స్తువు తిరిగి చేరితే ఆ ఆనంద‌మే వేరు!  అయితే చార్లెటీకి ఇపుడు ఆ పెయిం టింగ్‌ను భ‌ద్రంగా చూసుకునే ఆస‌క్తి వున్న‌ప్ప‌టికీ శ‌క్తి సామ‌ర్ధ్యాలు లేవు. అందుక‌నే త్వ‌ర‌లో ఎవ‌రిక‌యినా అమ్మేసీ వ‌చ్చిన సొమ్మును పిల్ల‌ల‌కు పంచుదామ‌నుకుంటోందిట‌!  చార్లెటీ కుటుంబంలో అయిదుగురు అన్న‌ద‌మ్ములు అక్క‌చెల్లెళ్లు వున్నారు. అలాగే ఇర‌వై మంది పిల్ల‌లు ఉన్నారు. అంద‌రూ ఆమె అంటే ఎంతో ప్రేమ చూపుతున్నారు. అంద‌రం ఒకే కుటుంబం, చాలాకాలం త‌ర్వాత ఇల్లు చేరిన క‌ళాఖండం మా కుటుంబానిది అన్న‌ది చార్లెటీ!
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు. చాకోను పార్టీలోకి ఆహ్వానిస్తూ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్’ ఫ్రంట్ ఏర్పాటు గురించి ప్రత్యేకించి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు కానీ, చాకో అలాంటి  సంకేతాలు ఇచ్చారు. ప్రస్తుతం దేశంలో ఉన్న ఏ ఒక్కపార్టీ కూడా బీజేపీకి ప్రత్యాన్మాయం కాదని,సమీప భవిష్యత్ కాంగ్రెస్ సహా ఏ పార్టీ కూడా ఆ స్థాయికి ఎదిగే అవకాశాలు కూడా కనిపించడంలేదని అన్నారు. ఈ పరిస్థితుల్లో దేశంలోని బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ, ఏకమై, ఒకే గొడుగు కిందకు రావలసిన అవసరం ఉందని చాకో అన్నారు. అదే సమయంలో ప్రతిపక్షాలను ఏక తాటిపైకి తెచ్చే బాధ్యతను పవార్ తీసుకోవాలని సంకేత మాత్రంగా చెప్పారు. అంతే కాకుండా కాంగ్రెస్ పేరు ఎత్తకుండా బీజేపీ వ్యతిరేక శక్తులను ఏకం చేసే ఆలోచన ఆ పార్టీ నాయకత్వానికి లేదని నెహ్రూ గాంధీ ఫ్యామిలీ (సోనియా, రాహుల్, ప్రియాంక)ఆలోచనా ధోరణిని పరోక్షంగానే అయినా ఎండ కట్టారు.ఆ విధంగా పవార్ ఆ బాధ్యత తీసుకోవాలని చాకో సూచించారు. ఇందుకు సంబంధించి, పవార్ బహిరంగంగా ఎలాంటి వ్యాఖ్య చేయలేదు. అయితే, చాకో సహా మరికొందరు ‘సీనియర్’ కాంగ్రెస్ నాయకులు, అలాగే సిపిఎం, సిపిఐ నాయకులు కూడా పవార్’తో చాలా కాలంగా థర్డ్ ఫ్రంట్  విషయంగా చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. అయితే మహారాష్ట్రలో సంకీర్ణం మనుగడను దృష్టిలో ఉంచుకుని పవార్ ఆచితూచి అడుగులేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే చాకో పార్టీలో చేరిన సందర్భంలో కూడా ‘చాకో చేరికతో మహారాష్ట్రలోని మహా వికాస్ అగాడీ ప్రభుత్వానికి ఎలాంటి నష్టం జరగదని, పవార్ మహారాష్ట్ర సంకీర్ణ సర్కార్ ప్రస్తావన చేశారని విశ్లేషకులు పేర్కొంటున్నారు.  మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వ మనుగడ గురించ్బి  పవార్ ప్రత్యేకంగా పేర్కొనడం ద్వారా, ఆయన థర్డ్ ఫ్రంట్ విషయంలో వేచి చూసే ఆలోచనలో ఉన్నట్లు అర్థమవుతోందని కూడా  రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే అదే ఎన్సీపీ అసెంబ్లీ ఎన్నికల జరుగతున్న కేరళలో, పశ్చిమ బెంగాల్లో  కాంగ్రెస్ వ్యతిరేక పార్టీలకు మద్దతు ఇస్తోంది. దీన్ని బట్టి చూస్తే, ఎన్సీపీ - కాంగ్రెస్ మధ్య దూరం పెరుగుతోందని స్పష్టమవుతోంది. అయితే, థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఏ రకంగా ముడి పడుతుంది అనే విషయంలో ఇంకా స్పష్టత రావలసి ఉంది. అలాగే, కాంగ్రెస్ లేకుండా జాతీయ స్త్గాయిలో బీజేపీ వ్యతిరేక కూటమిని ఏర్పాటు చేయడం వలన, వ్యతిరేక ఓటు చీలి  అది మళ్ళీ బీజేపీకే మేలు చేస్తుందని, కాబట్టి, ప్రస్తుతం కాంగ్రెస్ సారధ్యంలోని యూపీఏని బలోపేతం చేయడమే ఉత్తమమనే అలోచన కూడా  విపక్ష శిబిరం నుంచి వినవస్తోంది. ఈ నేపధ్యంలోనే, ప్రస్తుతం యూపీఏ ఛైర్పర్సన్’గా ఉన్న సోనియా గాంధీ వయసు, అనారోగ్యం కారణంగా బాధ్యతల నుంచి తప్పుకుని పవార్’కు బాద్యతలు అప్పగించాలనే ప్రతిపాదన వచ్చిందని అంటున్నారు. అలాగే, ఇతర పార్టీలను, ముఖ్యంగా కాంగ్రెస్ నుంచి విడిపోయి సొంత కుంపటి పెట్టుకున్న మమతా బెనర్జీ సారధ్యంలోని తృణమూల్, జగన్మోహన్ రెడ్డి సారధ్యంలోని వైసీపీలను కలుపుకుని కూటమిని బలోపేతం చేయడం ద్వారా బీజేపీని దీటుగా ఎదుర్కోవచ్చనే ఆలోచనలు కూడా సాగుతున్నాయి. అయితే, ఇటు థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు అయినా, యూపీఏని బలోపేతం చేయడమే అయినా, పవారే .. కేంద్ర బిందువు. ఆయన సారధ్యంలోనే ప్రత్యాన్మాయం అనేది విపక్ష శిభిరం నుంచి వినవస్తున్న ప్రస్తుత సమాచారం. మరి అదే జరిగితే రాహుల గాంధీ పరిస్థితి ఏమిటి ? గాంధీ నెహ్రూ కుటుంబం పరిస్థితి ఏమిటి? ఏ ప్రత్యేక ప్రాధాన్యత లేకుండా అందరిలో ఒకరిగా ఫస్ట్ ఫ్యామిలీ సర్దుకు పోతుందా? అంటే..చివరకు ఏమవుతుందో .. ఇప్పుడే చెప్పలేమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది. గతంలో అనేక సందర్భాలలో ముఖ్యమంత్రి కేసీఆర్,ఆర్థిక మంత్రి హరీశ రావు, కరోనా కారణంగా రాష్ట్ర  ఆదాయం గణనీయంగా తగ్గిందని, పేర్కొన్నారు. అయితే, కరోనా నుంచి వేగంగా కోలుకుని, ఆర్థికంగా అంతే వేగంగా పుంజుకున్న రాష్ట్రాలలో తెలంగాణ ప్రధమ స్థానంలో  ఉందని కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సర్వే 2020-21 నివేదిక పేర్కొంది. పడిలేచిన కెరటంలా, తెలంగాణ ‘వీ’ ఆకారంలో ఆర్థికంగా నిలతొక్కుందని కేంద్రం జనవరి  చివరి వారంలో విడుదల చేసిన ఆర్థిక సర్వేలో పేర్కొంది. అలాగే, రెవిన్యూ వసూళ్ళలో రాష్ట్రం కరోనా పూర్వస్థితికి చేరిందని కూడా సర్వే చెప్పింది.   అలాగే,రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు కూడా ఈ మధ్య కాలంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పై సంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరమ జనవరి,ఫిబ్రవరి, మార్చి నెలలతో పోలిస్తే ఈ సంవత్సరం ఈ మూడు నెలల కాలంలో రాష్ట్ర ఆర్థిక వృద్ది రేటు 10 నుంచి  15 శాతం మెరుగ్గా ఉందని హరీష్ రావు ఒకటి రెండు ఇంటర్వ్యూలలో పేర్కొన్నారు.అలాగే, బడ్జెట్ విషయంలోనూ ఆయన చాల ఆశావహ దృక్పథంతోనే ఉన్నారు. బడ్జెట్  పాజిటివ్’గా ఉంటుదని, ఎవ్వరూ ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని, సంక్షేమ పథకాలలో,ఇతరత్రా బడ్జెట్ కేటాయింపులలో ఎలాంటి కోతలు ఉండవని కూడా హరీష్ హామీ ఇచ్చారు. గత సంవత్సరంలో కొంత మేర హామీ ఇచ్చిన మేరకు అమలు చేయలేక పోయిన సొంత జాగాలలో డబల్ బెడ్ రూమ్ ఇళ్ళ నిర్మాణం, రుణ మాఫీ వంటి  పథకాలను ఈ బడ్జెట్ ద్వారా అమలు చేస్తామని చెప్పారు. అలాగే, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ తమిళి సై చేసిన ప్రసంగంలోనూ ఆశావహ దృక్పధమే వ్యక్తమైంది. ఆమె తమ ప్రసంగంలో,  ప్రభుత్వం సంక్షేమ పథకాలకు పెద్ద పీట వేసిందని అన్నారు. ‘సంపద పంచాలి ,పేదలకు పంచాలి’ అనేది తమ ప్రభుత్వ విధానమని స్పష్టం చేశారు. అలాగే, పెరుగతున్న ఆదాయంలో అధికశాతం సంక్షేమానికే వెచ్చిస్తున్నామని స్పష్టం చేశారు. దీంతో బడ్జెట్’లో కొత్త పథకాలకు శ్రీకారం చుట్టే అవకాశం ఉంటుందా అన్న చర్చ జరుగుతోంది. మరో వంక ఉద్యోగ వర్గాల్లో పీఆర్సీకి సంబంధించి ఆర్థిక మంత్రి తమ ప్రసంగంలో  ప్రకటన చేస్తారా లేదా అనే ఆసక్తి నెలకొంది. అలాగే, సామాన్య  ప్రజలు ఇటీవల పెరిగిన పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరల భారం నుంచి మంత్రి హరీష్, ఏదైనా ఉపసమనం కలిపిస్తారా అని ఎదురు చూస్తున్నారు. గతంలో వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సామాన్య ప్రజలపై వంటగ్యాస్ ధర భారాన్ని తగ్గించేందుకు కొంత మొత్తాన్ని, రూ.50(?) రాష్ట్ర ప్రభుత్వం తరపున  సబ్సిడీగా ఇచ్చిన విషయాన్ని, అదే విధంగా అసెంబ్లీ ఎన్నికలు జరుగతున్న తమిళనాడులో డిఎంకే పార్టీ,తమ పార్టీని అధికారంలోకి వస్తే  గ్యాస్ బండపై వంద రూపాయల సబ్సిడీ ఇస్తామని చేసిన  వాగ్దానాన్ని  గుర్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే, ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు, సోమవారం ఆర్థిక మంత్రి హరీష్ రావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఆర్థిక  శాఖ ముఖ్య కార్యదర్శి రామ కృష్ణా రావు,సలహాదారు జీఆర్ రెడ్డితో బడ్జెట్ పద్దులఫై సుదీర్ఘంగా చర్చించి తుది మెరుగులు దిద్దారు. బడ్జెట్ తుది రూపం సిద్దమైన నేపధ్యంలో ఆర్థిక శాఖ ప్రింటింగ్ ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 18 ఉదయం మంత్రి వర్గం ఆమోదం పొందిన అనంతరం ఆర్థికమంత్రి హరీష్ రావు అదే రోజు రాష్ట్ర బడ్జెట్ 2021-22ను సభలో ప్రవేశ పెడతారు. 20, 22 తేదీల్లో బడ్జెట్‌పై సాధారణ చర్చ,23, 24, 25 తేదీల్లో బడ్జెట్‌ పద్దులపై చర్చ ఉంటుంది 26న ద్రవ్యవినిమయ బిల్లు (బడ్జెట్)పై చర్చ, సభామోదం ఉంటాయి.
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది.  అధికార తెరాస, ఖమ్మం స్థానానికి సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర రెడ్డి పేరును ప్రకటించడంలో కొంచెం జాప్యం చేయడంతో పాటుగా, హైదరాబాద్ స్థానం నుంచి , పీవీ కుమార్తె వాణీ దేవి పేరును చివరి క్షణంలో తెరమీదకు తేవడంతో అంత వరకు కొంత స్తబ్దుగా సాగిన ప్రచారం ఆ తర్వాత వేడెక్కింది. ఉద్యోగ నియామకాల విషయంలో తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ తప్పులో కాలేయడంతో విపక్షాలు, పోటీలో ఉన్న ప్రత్యర్ధులు, నిరుద్యోగ యువత, విద్యార్ధి సంఘాలు  ఒకే సారి ఆయన మీద  విరుచుకు పడ్డారు. ఆయన లెక్క తప్పని నిరుపిస్తం రమ్మని వరస సవాళ్ళు విసిరారు. దీంతో, మంత్రి నియామకా ఇష్యూని పక్కకు తప్పించేందుకు , ఐటీఐఆర్, వరంగల్ రైల్వే ఫ్యాక్టరీ వంటి సెంటిమెంటల్ ఇష్యూస్’ను తెరపైకి  తెచ్చారు. అలాగే, కేంద్ర ప్రభుత్వంపై విమర్శల దాడిని పెంచారు. చివరకు పొరుగు రాష్ట్రానికి చెందిన విశాఖ ఉక్కు ఆందోళన   కూడా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగమైంది.   రెండు నియోజక వర్గాలలో గతంతో పోలిస్తే ఈసారి ఓటర్ల సంఖ్య రెట్టింపు అయింది. ఈసారి రెండు నియోజక వర్గాలలో కలిపి 10 లక్ష 36 వేల మంది తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. అలాగే, రెండు పట్ట భద్రుల నియోజక వర్గాల్లో 164 మంది అభ్యర్ధులు పోటీలో ఉన్నారు.  గత ఎన్నికలతో పోలిస్తే ఇటు ఓటర్ల సంఖ్య, అటు అభ్యర్థుల సంఖ్యా రెట్టింపునకు పైగానే పెరగడంతో ఎన్నికలలో జోష్ పెరిగింది. దీనికితోడు అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో సాధారణ ఎన్నికలను తలపించే రీతిలో ప్రచారం సాగింది. ఎక్కువమంది అభ్యర్ధులు బరిలో ఉండడంతో, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి  తమకే ప్రయోజనం జరుగుతుందని అధికార పార్టీ ఆశపడుతోంది .  దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో చేదు ఫలితాలను చవిచూసిన టీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా వ్యూహ రచన చేసి కేటీఆర్, హరీష్ సహా మంత్రులు,ఎమ్మెల్యేలకు స్పెసిఫిక్ బాధ్యతలు అప్పగించారు. అలాగే,కాంగ్రెస్‌ అభ్యర్థులు చిన్నారెడ్డి, రాములునాయక్‌లకు మద్దతుగా ఉత్తమ్‌, భట్టి, రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తదితరులు విస్తృతంగా ప్రచారం చేశారు. బీజేపీ అభ్యర్థులు ఎన్‌.రాంచందర్‌రావు, ప్రేమేందర్‌రెడ్డిల తరఫున ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, ఎంపీ అరవింద్‌ తదితరులు ప్రచారాన్ని వేడెక్కించారు.  ఖమ్మం స్థానం నుంచి ప్రత్యక్ష ఎన్నికల్లో తొలిసారి పోటీకి దిగిన కోదండరాంకు, టీజేఎస్‌ పార్టీకీ ఈ ఎన్నికలు కీలకంగా మారాయి. ఖమ్మ స్థానం నుంచి పోటీ చేస్తున్న తీన్మార్ మల్లన్న ముందస్తు వ్యూహంతో ప్రధాన పార్టీల అభ్యర్ధులకు ధీటుగా ప్రచారం సాగించారు.  వామపక్షాల మద్దతుతో జయసారథి, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్‌, యువతెలంగాణ కార్యనిర్వాహక అధ్యక్షురాలు రాణీ రుద్రమ తదితరులు పోటీలో ఖమ్మం సీటును పట్టభద్రులు  ఎవరికి  పట్టం కడతారు అన్నది ప్రశ్నార్థకంగా మారింది. హైదరాబాద్ సీటు కూడా ఇటు అధికార తెరాసకు అటు సిట్టింగ్ సీటును నిలుపుకోవడం తో పాటుగా దుబ్బాక , జీహెచ్ఎంసి జోష్ ను కొనసాగించాలని ఆశ పడుతున్నబీజేలకే కూడా ఇజ్జత్ కీ సవాల్ గా మారింది. కాంగ్రెస్ అభ్యర్ధి పార్టీ సీనియర్ నాయకుడు సౌమ్యుడు, మాజీ మంత్రి చిన్నారెడ్డి, వామ పక్షాల మద్దతుతో పోటీ చేస్తున్న మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ కూడా గట్టి పోటీ ఇస్తున్నారు. సో.. చివరకు ఏమి జరుగుతుంది అంటే ఏదైనా జరగవచ్చును. ఈ నెల 14 వ తేదీన పోలింగ్ జరుగుతుంది.17 ఫలితాలు వస్తాయి .. అంతవరకు వెయిట్ అండ్ వాచ్ .  
సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది. ఒకప్పుడు ఎర్ర జెండాను దిగ్విజయంగా ఎదిరించి, మార్క్సిస్టులను మట్టి కరిపించిన మమతా దీదీ ప్రస్తుతం, కాషాయ కూటమి నుంచి గట్టి సవాలును ఎదుర్కుంటున్నారు. వరసగా పదేళ్ళు పాలించడం వలన సహజంగా వచ్చిన ప్రభుత్వ వ్యతిరేకత  కంటే, హిందూ ఓటు పోలరైజేషన్ ఆమెను మరింతగా భయపెడుతోంది. నిజానికి ఐదేళ్ళ క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం ఐదు శాతం కంటే తక్కువ ఓట్లు, మూడంటే మూడు అసెంబ్లీ సీట్లు మాత్రమే గెలుచుకున్న బీజేపీ..  2019 లోక్ సభ ఎన్నికల్లో ఏకంగా 40 శాతం ఓట్లతో 18 స్థానాలు గెలుచుకుంది. ఈ  మార్పు ఇంకా కొన్ని కారణాలు ఉంటే ఉండవచ్చును కానీ.. హిందువుల ఓటు పోలరైజ్  కావడమే ప్రధాన కారణం.  ఈ నేపధ్యంలోనే కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ చివరకు కమ్యూనిస్టులు కూడా బీజేపీలో  చేరారు. ఎన్నికల ప్రకటన వెలువడిన తర్వాత కూడా సిట్టింగ్ ఎమ్మెల్ల్యేలు సహా  తృణమూల్ టికెట్ వచ్చిన నాయకులు కూడా బీజేపీలో చేరుతున్నారు. అనేక మంది ఇతర రంగాల ప్రముఖులు, ముఖ్యంగా ఇంతకాలం, బీజేపీని హిదుత్వ అనుకూల ‘అచ్చుత్’ (అంటారని) పార్టీగా చూసిన ‘సెక్యులర్’ ప్రముఖులు కాషాయం కప్పుకోవడంతో మమతా బెనర్జీకి కొంచెం అలస్యంగానే అయినా, తత్త్వం బోధపడింది. అందుకే ఆమె ఇప్పుడు గుళ్ళూ,గోపురాలకు తిరుగుతున్నారు. కార్యకర్తల సమావేశాల్లో తానూ హిందువునేనని, చెప్పుకుంటున్నారు.  నిజానికి ఇలా నేనూ హిందువునే  అని సెక్యులర్ నేతలు బహిరంగంగా ప్రకటించుకోవడం మమతా బెనర్జీతోనే మొదలు కాలేదు. రాహుల్ గాంధీ తాను హిందువునని, జన్యుధారీ కశ్మీరీ బ్రాహ్మణుని అనీ.. తమ గోత్రం, ‘దత్తాత్రేయ’ గోత్రమని బహిరంగంగా ప్రకటించుకున్నారు. అలాగే  కొద్ది రోజుల క్రితం ప్రియాంకా గాంధీ తానూ హిందువునని చెప్పుకునేందుకు ‘మౌని అమావాస్య’ సందర్భంగా అలహాబాద్ లో గంగా స్నానం చేశారు. గతంలోనూ ఆమె ఎన్నికలకు ముందు గంగా యాత్ర చేశారు. అంతవరకు ఎందుకు కొద్దిరోజుల క్రితం సిపిఐ నారాయణ విశాఖ స్వామి ఆశీస్సులు తీసుకున్నారు. చంద్రబాబు, జగన్ రెడ్డి, కేసీఆర్ ఇలా తెలుగు నేతలు అనేక మంది లౌకిక వాదానికి కాలం చెల్లిందన్న సత్యాన్ని గ్రహించి కావచ్చు ‘నేనూ హిందువును’ అంటూ ప్రకటించుకునేందుకు పోటీ పడుతున్నారు. రాముడిని తలచుకున్నా, జై శ్రీరామ్ అన్నా తమ  లౌకిక వాదం మయలపడి పోతుందని భయపడిన నాయకులు ఇప్పుడు .. జై శ్రీరామ్ అనేందుకు కూడా వెనకాడడం లేదు.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది. గత కొంత కాలంగా సబర్మలతో సహా అనేక అంశాలపై స్పందిస్తూ.. కేరళను టార్గెట్ చేస్తున్న బీజేపీ నాయకులు అక్కడ తమ జెండా ఎగరేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా పార్టీ పాలసీని కూడా పక్కన పెట్టి మెట్రో మ్యాన్ శ్రీధరన్ ను పార్టీలో చేర్చుకుని ఆయనే తమ సీఎం అభ్యర్థి అని ప్రకటించిన 24 గంటలలో యూ టర్న్ తీసుకున్నారు. ఇది ఇలా ఉండగా ప్రస్తుతం సీఎంగా ఉన్న కమ్యూనిస్ట్ నేత పినరై విజయన్ పై గోల్డ్ స్మగ్లింగ్ ఆరోపణలు రావడంతో.. ఈ ఎన్నికలలో ఎల్డిఎఫ్ భవిష్యత్తుపై ప్రజలు ఏ తీర్పు ఇవ్వబోతున్నారనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది ఈ నేపథ్యంలో అక్షరాస్యతలో దేశంలోనే మొదటి స్థానంలో ఉన్న ఆ రాష్ట్ర ప్రజలు ఎవరిని ఆశీర్వదిస్తారు అనే అంశంపై ప్రముఖ మీడియా సంస్థ టైమ్స్ నౌ, సీ ఓటరుతో కలిసి ఒక సర్వేను నిర్వహించారు. ఈ సర్వే ప్రకారం చూస్తే పాపం కమలనాథులు అక్కడ పవర్ చేతికి రావటం అటుంచి కనీసం రెండు మూడు అసెంబ్లీ స్థానాల్లో గెలవటం కూడా కష్టమేనని ఆ సర్వే తేల్చి చెబుతోంది. కేరళలో ఈసారి జరిగే అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ తన హవా చాటుతుందన్న ఆ పార్టీ నేతల మాటలలో ఎలాంటి నిజం లేదని.. ప్రస్తుతానికి అది ఏమాత్రం సాధ్యం కాదని ఈ తాజా సర్వే తేల్చి చెప్పింది. అంతేకాకుండా మొత్తం 140 స్థానాలు ఉన్న కేరళలో.. ప్రస్తుత సీఎం పినరయి విజయన్ నేతృత్వంలోని లెఫ్ట్డ్ డెమొక్రటిక్ ఫ్రంట్ కు 82 సీట్లు పక్కా అని.. ఆయనే తిరిగి అధికారాన్ని నిలబెట్టుకుంటాడని సర్వే చెపుతోంది. అదే సమయంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూనైటెడ్ డెమొక్రాటిక్ ఫ్రంట్ కు 56 నుంచి 60 వరకు సీట్లు వచ్చే అవకాశం ఉందని ఈ సర్వేలో తేలింది. అంతేకాకుండా 2016 ఎన్నికలతో పోలిస్తే ఎల్ డీఎఫ్ ఓటింగ్ శాతం కూడా కొంత పెరగటం ఇక్కడ గమనార్హం. ప్రస్తుతం సీఎంగా ఉన్న విజయన్ మరోసారి సీఎం కావాలని 43.34 శాతం మంది మొగ్గు చూపినట్లుగా సర్వేలో తేలింది. కరోనా సమయంలో విజయన్ సీఎంగా బాగా పని చేసారని ఈ సర్వే పేర్కొంది. మరోపక్క దేశ ప్రధానిగా రాహుల్ గాంధీ ఉండాలని కేరళ ప్రజల్లో 55.84 శాతం మంది కోరుకుంటున్నట్లుగా ఈ సర్వే;లో తేలింది. అయితే కేరళలో ఎలాగైనా పాగా వేయాలని పట్టుదలతో కృషి చేస్తున్న బీజేపీకి ఈసారి కూడా నిరాశ తప్పదని ఈ సర్వేలో స్పష్టం అయింది. ఈ ఎన్నికలలో బీజేపీకి రెండు సీట్లు కూడా రావటం కూడా కష్టమేనని ఈ సర్వే తేల్చింది. అయితే ఎన్నికలకు ముందు ఇలాంటి సర్వేలు బయటకు రావడం.. తరువాత అందులో కొన్ని చతికిల పడడం మనం చూస్తూనే ఉన్నాం. మరి ఈ సర్వే ఫలితాలు నిజామా అవుతాయో లేదో తేలాలంటే కొద్దీ రోజులు వెయిట్ చేయాల్సిందే.        
రాజకీయాలు అంటేనే అదో జూదం. పూలమ్మిన చోటనే కట్టెలు అమ్మవలసి రావచ్చును. అలాంటి పరిస్థితే వచ్చినా, తలవంచుకుని పోగలిగితేనే, ఎవరైనా రాజకీయాలలో రాణించగలరు. అలాకాదని, అలిమి కానిచోట, కూడా తామే అధికులమని భావిస్తే, ఎందుకూ కాకుండా పోతారు. అలాంటి వారు ఇద్దరూ కూడా ఇప్పుడు మన కళ్ళముందే ఉన్నారు.  జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు. అలాగే జయ మరణం తర్వాత ఆమె పరిస్థితి ఏమిటో కూడా వేరే చెప్పవలసిన, అవసరం లేదు. జైలు పాలయ్యారు. సర్వం తానై నడిపించిన పార్టీ నుంచి  బహిష్కరణకు గురయ్యారు. జయ ఉన్నంత వరకు తన వారుగా ఉన్న వారందరూ కానివారయ్యారు. ఒంటరిగా మిగిలారు.  నిజానికి నాలుగేళ్ళు జైలు జీవితం గడిపిన తర్వాత కూడా ఆమె తలచుకుంటే.. రాష్ట్ర రాజకీయాలలో, ముఖ్యంగా అధికారంలో ఉన్న డిఎంకే కూటమిలో అలజడి సృష్టించగలరు. ఎన్నికలలో ఆమె గెలవక పోవచ్చును కానీ.. తనను కాదన్న అన్నాడిఎంకేను ఓడించగలరు. అయిన  ఆమె అందుకు విరుద్ధంగా  రాజకీయాలకు వీడ్కోలు పలికి మౌనంగా పక్కకు తప్పుకున్నారు. రాజకీయ సన్యాసం ప్రకటించారు. ఉమ్మడి శతృవు డిఎంకే ను ఓడించేందుకు అన్నా డిఎంకే కూటమి  పోటీ చేయాలని, కూటమి ఐక్యతను దెబ్బతీయరాదనే ఉద్దేశంతోనే ఆమె రాజకీయ సన్యాసం ప్రకటించారు.    శశికళ మౌనంగా వెళ్లి పోవడం వెనక ఇంకా అనేక కారణాలున్నా ,అసలు కారణం ఆమె, రాజకీయ విజ్ఞత, వివేకం. ఆమె జైలుకు వెళ్ళిన సమయంలో జయలలిత సమాధి వద్ద ఎంత కసిగా, కోపంగా ‘మౌన’ ప్రతిజ్ఞ చేశారో చూశా. అలాంటి ఆమె ఇప్పుడు ఇలా ‘మౌనం’గా వెనకడుగు వేశారంటే, అది ఆలోచించ వలసిన విషయమే.ఆమె వ్యుహతంకంగానే సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే అనేక మంది అనేక కోణాల్లో శశికళ సంచలన నిర్ణయాన్ని విశ్లేషించారు.జైలు జీవితం తర్వాత కూడా అన్నా డిఎంకే నాయకులు తనను అగ్రనేతగా అంగీకరించక పోవడం, అమిత్ షా చెప్పినా.. అన్నా డిఎంకే నాయకులు ఆమెను, మేనల్లుడు దినకరన్’ను కులం పేరున, కుటుంబం పేరున దూరం చేయడం, తిరిగి పార్టీలోకి తీసుకోకపోవడంతో ఆమె మనసు కష్టపెట్టుకుని, సన్యాస నిర్ణయం తీసుకున్నారని కొందరంటున్నారు. పార్టీ మీద పట్టు లేదని, చరిష్మా అసలే లేదని, అందుకే ఆమె అలా నిశ్శబ్ధంగా రాజకీయ సన్యాసం స్వీకరించారని ఇంకొందరు విశ్లేషించారు. ఈ విశ్లేషణలో కొంత నిజం ఉంటే ఉండవచ్చును.. కానీ ఆమె గతాన్ని, నైజాన్ని గుర్తు చేసుకుంటే ఆమె స్ట్రైక్ బ్యాక్ వ్యూహంతోనే ఒకడుగు వెనక్కివేశారని ఆమెతో సన్నిహితంగా మెలిగినవారు, ఆమె రాజకీయ చాణక్యం తెలిసిన వారు అంటారు.   నిజానికి జైలులో ఉన్న కాలంలో కానీ, జైలు నుంచి విడుదలై వచ్చిన తర్వాత కానీ, ఆమె రాజకీయ సన్యాసం వైపు అడుగులు వేస్తున్నట్లు కనిపించలేదు. బెంగుళూరు జైలు నుంచి విడుదలై చెన్నైలో ప్రవేశించిన నప్పుడు ఆమె పెద్ద కాన్వాయ్ తో  తమ కారుకు అన్నాడిఎంకే జెండాతోనే ఎంటరయ్యారు. అలా ఎంట్రీలోనే రాజకీయ ఆకాంక్షను వెంట తెచ్చుకున్నారు. చివరకు ‘సన్యాస’ ప్రకట చేసే వరకు కూడా ఆమె రాజకీయ కార్యకలాపాలు సాగిస్తూనే ఉన్నారు. అటు ఢిల్లీని ఇటు చెన్నైనికూడా కదిల్చారు. అంతేకాదు, రాజకీయాలపై విరక్తితో కాదు, రాజకీయ కసితో, ఉమ్మడి శత్రువు (డిఎంకే) ను ఓడించేందుకే తాను రాజకీయాలనుంచి తపుకుంటున్నట్లు చెప్పారు.  సో .. సన్యాసం తీసుకోవాలనే ఆలోచన, రాజకీయవ్యూహం లోంచి పుట్టిందే కానీ,వైరాగ్యంతో పుట్టింది కాదు ,అన్నవిశ్లేషణ వాస్తవానికి ఇంకొంత దగ్గరగా ఉందని అనుకోవచ్చును. ఇది ‘కామా’నే కాని ‘ఫుల్స్టాప్’ కాదని అంటున్నారు.  ముఖ్యమంత్రి ఎడప్పాడి కే. పళని స్వామి (ఈపీఎస్) ఆమెను పార్టీలోకి అనుమతిస్తే తన కుర్చికీ ఎసరు పెడతారనే భయంతోనే,, ఆమె ఎంట్రీని అడ్డుకున్నారు. ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం, శశికళ ఒకే సామజిక వర్గానికి చెందిన వారు కావడం కూడా, ముఖ్యమంత్రి ఈపీఎస్’ భయానికి కారణంగా పేర్కొంటారు. అందుకే  ఆయన, ‘మన్నార్గుడి’ ఫ్యామిలీని బూచిగా చూపించి, ఆమెను దూరంగా ఉంచారని పార్టీలో ఒక వర్గం గట్టిగా విశ్వసిస్తుంది. అయితే ఆమె శక్తియుక్తులను కూడతీసుకుని  పులిలా పంజా విసిరేందుకే ఆమె వ్యూహాత్మకంగా ఒక అడుగు వెనక్కి వేశారు కావచ్చును అని కూడా, తమిళ రాజకీయ వర్గాల్లో ఒక చర్చ జరుగుతోంది.  గతంలో ఆమె జయలలితతో విబేధాలు వచ్చిన సమయంలో కూడా ఇలాగే కొద్ది కాలం మౌనంగా తెర చాటుకు వెళ్లి పోయారు.  కొద్ది కాలంలోనే మళ్ళీ ‘పోయస్ గార్డెన్’లో ప్రత్యక్షమయ్యారు. జయలలిత స్వయంగా ఆమెను వెనక్కి పిలుపించుకోవలసిన పరిస్థితులను సృష్టించారు. అలా  మళ్ళీ  చక్రం తిప్పారు. జయలలిత మరణం వరకు ఆమె అందరికీ చిన్నమ్మగా అమ్మకు పెద్దమ్మగా సర్వం తానై నిలిచారు. చివరకు జయ అంత్యక్రియల్లో కూడా ఆమెదే పై చేయిగా కనిపించింది.   జయలలిత చనిపోయిన సందర్భంలోనే అన్నా డిఎంకే ఎమ్మెల్ల్యేలో సుమారు 30 మంది వరకు ఆమెకు మద్దతుగా ఉన్నారన్న వార్తలొచ్చాయి. నిజానికి,ఇప్పటికి కూడా ఒక్క అన్నా డిఎంకే లోనేకాదు,డిఎంకే ఇతర పార్టీలలో కూడా  ఆమె అవసరం ఉన్న వాళ్ళు ఉన్నారు. కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో ‘మన్నార్గుడి’ ఫ్యామిలీ మద్దతు లేకుండా గెలిచే అవకాశం లేదు.  ఇవ్వన్నీ నిజమే అయినా.. అన్నీ ఉండి, ఎవరు లేని శశికళలో, ఇంకా  ఎవరి కోసం తాపత్రయ పడాలి? అనే ప్రశ్న జనించి ఉంటే, ఆమె రాజకీయ సన్యాసం నిజం కావచ్చును. ఎందుకంటే ఆమె నెచ్చలి, జయలిత లేరు, భర్త అంతకంటే ముందే చనిపోయారు, పిల్లలు లేరు... పైగా నాలుగేళ్ళ జైలు జీవితం ఆమెలో మార్పు తెచ్చి ఉండవచ్చును. ఈ వయస్సులో తనవారంటూ ఎవరు లేని తనకు రాజకీయాలు ఎందుకు ? శేష జీవితాన్ని ఇలా సాగిద్దామనే ఆలోచన నిజంగా వచ్చి ఉంటే, ఆమె సన్యాసం సత్యం అయినా కావచ్చును, కాకపోనూ వచ్చును. కానీ  శశికళ... ఆమెను అర్థం చేసుకోవడం, అంచనా వేయడం , అంత తేలిగ్గా అయ్యే పని కాదు..
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు. కాంగ్రెస్ అధినాయకత్వం పై నేరుగా అస్త్రాలు సంధించారు. రాహుల్ గాంధీ పేరు చెప్పకుండానే, ఆయన నాయకత్వానికి పనికిరాడని తేల్చి చెప్పారు. ఎవరైనా పార్టీ అధ్యక్షుడు అయితే కావచ్చును, కానీ, ప్రజానాయకుడు కాలేడని, రాహుల గాంధీ ప్రజానాయకుడు కాదు కాలేరు,అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తరచూ రాహుల్ గాంధీని ఉద్దేశించి చేసే  ‘నామ్’ధారీ వ్యంగ్యాస్త్రాన్నే కాంగ్రెస్ సీనియర్ నాయకులు కూడా సందించారు. ఇక అక్కడి నుంచి విధేయ, అసమ్మతి వర్గాల మధ్య మాటల యుద్ధం ఎదో ఒక రూపంలో సాగుతూనే వుంది. అదే క్రమంలో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ, కరుడు కట్టిన ముస్లిం మతోన్మాది, అబ్బాస్ సిద్దిఖీతో కాంగ్రెస్ పార్టీ చేతులు కలపడం అసమ్మతి నాయకులకు మరో అస్త్రాన్ని అందించింది. విషయంలోకి వెళితే, ఇటీవల పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా లోక్’సభలో కాంగ్రెస్ పక్ష నాయకుడు, పశ్చిమ బెంగాల్ పీసీసీ అధ్యక్షుడు అధీర్’రంజన్ చౌదరి, ముస్లిం మత ప్రచారకుడు, అబ్బాస్ సిద్దిఖీతో  వేదిక పంచుకున్నారు.అంతకు ముందే వామ పక్ష కూటమితో  పొత్తు కుదుర్చుకున్న కాంగ్రెస్ పార్టీ, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)ను కూటమిలో చేర్చుకుంది. ఇలా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) అమోదం లేకుండా మతోన్మాద ఐఎస్ఎఫ్’ తో ఎన్నికల పొత్తు పెట్టుకోవడం ఆ పార్టీ నాయకుడు,సిద్ధిఖీతో  పీసీసీ చీఫ్ వేదిక  పంచుకోవడం పై అసమ్మతి నేతలు మండి పడుతున్నారు. ఇలా సిద్దిఖీతో వేదిక పంచుకోవడం పార్టీ మౌలిక సిద్ధాంతాలకు వ్యతిరేకం అంటూ అసమ్మతి వర్గానికి చెందిన కీలక నేత, రాజ్యసభ సభ్యుడు,ఆనంద్ శర్మ మండిపడ్డారు. అంతే కాదు, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)తో జనవరిలో కుదుర్చుకున్న పొత్తుకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ)అమోదం లేదని ఆనంద్ శర్మ, అభ్యంతరం వ్యక్త చేశారు. పార్టీ విశ్వసించే లౌకిక వాదానికి కాంగ్రెస్ అధిష్టానం తీసుకున్న నిర్ణయం గొడ్డలి పెట్టని ఆయన తీవ్రంగా స్పందించారు.   శర్మ వ్యాఖ్యలపై అధీర్ రంజన్ చౌదరి అంతే ఘాటుగా ప్రతిస్పందించారు. “నిజాలు తెలుసుకోండి ఆనంద్ శ‌ర్మ జీ” అంటూ ఆయ‌న వ‌రుస ట్వీట్లు చేశారు. వ్య‌క్తిగ‌త ప్ర‌యోజ‌నాలు ప‌క్క‌న‌పెట్టి, ప్ర‌ధానిని పొగిడి టైమ్ వేస్ట్ చేయ‌కండంటూ ఆయ‌న ఓ ట్వీట్లో అన్నారు. ఆనంద్ శ‌ర్మ అన‌వ‌స‌రంగా కాంగ్రెస్‌ను ల‌క్ష్యంగా చేసుకుంటున్నార‌ని, ఈ అంశాన్ని పెద్ద‌ది చేసి చూపిస్తున్నార‌ని విమ‌ర్శించారు. ఆయ‌న ఉద్దేశాలు స‌రైన‌వే అయితే నేరుగా తనతో మాట్లాడ వలసిందని అన్నారు. బెంగాల్‌లో సీపీఐ(ఎం) కూట‌మికి నేతృత్వం వ‌హిస్తోంది. అందులో కాంగ్రెస్ ఓ భాగం. మ‌త‌తత్వ‌, విభ‌జ‌న రాజ‌కీయాలు చేస్తున్న బీజేపీకి చెక్ పెట్ట‌డానికే ఈ కూట‌మి అని మ‌రో ట్వీట్‌లో అధిర్ రంజ‌న్ అన్నారు. అక్కడతోనూ ఆగలేదు ... ట్వీట్ల మీద ట్వీట్లు సంధిస్తూ, ఆనంద్ శర్మ, బీజేపీ మత విభజన, అజెండాను బలపరుస్తున్నారని, పరోక్షంగా జీ23 నాయకులు బీజేపీకి ప్రయోజనం చేకూరుస్తున్నారని ఆరోపించారు.అంతే కాదు, క్షేత్ర స్థాయి వాస్తవ పరిస్థితులు తెలియకుండా, ఆనంద్ శర్మ పార్టీ మీద దండెత్తడం ఉచితం కాదని చౌదరి ఎదురుదాడి చేశారు. అసమ్మతిలో అసమ్మతి. ఇదలా ఉంటే, కాంగ్రెస్ పార్టీ  సమూల పక్షాళన కోరుతూ సోనియా గాంధీకి,గత సంవత్సరం  జీ 23గా ప్రాచుర్యం పొందిన సీనియర్ నాయకులు రాసిన లేఖపై సంతకాలు చేసిన  నాయకుల్లో నలుగురు,జమ్మూలోసమావేసమైన నాయకుల తాజా నిర్ణయాలు, వ్యాఖ్యలు,విమర్శల పట్ల అసంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరం సోనియా గాంధీకి రాసిన లేఖలో ప్రస్తావించిన అంశాలకు కట్టుబడి ఉన్నామని, అయితే, జీ 23లోని కొందరు సహచరులు, ఇటీవల గీతదాటి చేస్తున్న వ్యాఖ్యలు, విమర్శలను తాము సమర్ధించడం లేదని ఆ నలుగురు పేర్కొన్నారు. ఇందులో ముఖ్యంగా, రాజ్యసభ మాజీ డిప్యూటీ చైర్మన్, పీజే కురియన్ అయితే, “కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు అవసరమైన సంస్కరణలు తెచ్చేందుకు చేసే ప్రయత్నాలను పూర్తిగా సమర్దిస్తాను, కానీ, ‘లక్ష్మణ రేఖ’ దాటితే ఒప్పుకునేది లేదు”అని అసమ్మతిలో అసమ్మతికి తెర తీశారు.అలాగే, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ కుమారడు, మాజీ ఎంపీ సందీప్ దీక్షిత్,మధ్య ప్రదేశ్ సీనియర్ కాంగ్రెస్ నాయకుడు అజయ్ సింగ్’ కూడా గులాం నబీ ఆజాద్, కపిల్ సిబల్, ఆనంద్ శర్మ, మనీష్ తివారీ వంటి జీ 23 కీలక నేతలు అధినాయకత్వంపై చేసిన వ్యాఖ్యలను తప్పు పట్టారు. అలాగే, పార్టీ సీనియర్ నాయకుడు కేంద్ర మాజీమంత్రి వీరప్ప మొయిలీ కూడా,గత సంవత్సరం పార్టీ సీనియర్ నాయకులు  ఒక పరిమిత లక్ష్యంతో  సోనియా గాంధీకి లేఖ రాయడం జరిగిందని, ఆ పేరున జరుగతున్న  కార్యక్రమాలు లేఖ సంకల్పానికి  విరుద్ధమని అన్నారు. జీ 23 కార్యకలాపాలపై రాహుల్ గాంధీ కూడా పరోక్షగా స్పందించారు, ఒకప్పుడు ఎన్ఎస్’యుఐ, యూత్ కాంగ్రెస్’ కు సంస్థాగత ఎన్నికలు వద్దన్న వారే ఇప్పుడు ఇంకోలా మాట్లాడుతున్నారని పరోక్షంగానే అయినా సంస్థాగత ఎన్నికలు నిర్వహించడంతో పాటుగా, పార్టీ పక్షాలనకు తమ కుటుంబం వ్యతిరేకం కాదని, అందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఈ నేపధ్యంలో కాంగ్రెస్ పార్టీలో చెలరిగిన కలకలం  ఇక ముందు ఏమవుతుందో .. ఇంకెన్ని  మలుపులు తిరుగుతోందో ..చూడవలసిందే కానీ ఉహించలేము.
పెరుగు ఆరోగ్యానికి ఎంతో మంచిది. పెరుగులో ప్రోబయోటిక్స్ పుష్కలంగా ఉంటుంది. అలాగే కాల్షియం,  ప్రోటీన్ కూడా ఉంటుంది.  భారతీయులు భోజనం చివర పెరుగుతో తింటే తప్ప వారికి తృప్తి ఉండదు. వేసవి కాలంలో పెరుగును ఇష్టంగా తింటారు. అయితే వర్షాకాలంలో పెరుగు తినడం గురించి చాలామంది చాలా రకాలుగా మాట్లాడుతుంటారు.  పెరుగు తినడం ఆరోగ్యానికి మంచిది కాదని,  జీర్ణవ్యవస్థ పై ప్రభావం పడుతుందని అంటుంటారు.  దీని గురించి వివరంగా తెలుసుకుంటే.. పెరుగు కడుపుకు మేలు చేసే ప్రోబయోటిక్ ఆహారంగా పరిగణించబడుతుంది, కానీ వర్షాకాలంలో పెరుగు తినడం పై  భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. వర్షాకాలంలో పెరుగు తినడం వల్ల జలుబు, దగ్గు వంటి సమస్యలు మరింత తీవ్రమవుతాయని కొందరు చెబుతారు, అయితే ఆరోగ్య నిపుణులు మాత్రం వేరే విధంగా చెబుతున్నారు. వర్షాకాలంలో పెరుగు తినవచ్చా? ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం, వర్షాకాలంలో పెరుగును తినవచ్చు, కానీ దాని పరిమాణం , పెరుగు తినే  సమయం విషయంలో జాగ్రత్తగా ఉండటం ముఖ్యం. పెరుగులో ప్రోబయోటిక్స్ పుష్కలంగా ఉంటాయి, ఇవి జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. అయితే, వర్షాకాలంలో జీర్ణక్రియ సరిగ్గా జరగకపోవడం వల్ల కొంతమందికి సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. పెరుగు తినడం వల్ల కలిగే ప్రయోజనాలు.. జీర్ణ వ్యవస్థను బలపరుస్తుంది,  పేగులలో మంచి బ్యాక్టీరియాను పెంచుతుంది, శరీరాన్ని చల్లబరచడమే కాకుండా ఉత్తేజపరుస్తుంది.   రోగనిరోధక వ్యవస్థకు మద్దతు ఇస్తుంది. వర్షంలో పెరుగు తినడం వల్ల కలిగే నష్టాలు.. వర్షాకాలంలో పెరుగు తినడం వల్ల జలుబు , ఫ్లూ పెరిగే అవకాశం ఉంటుంది. అందుకే పెద్దలు జలుబు, జ్వరం ఉన్నప్పుడు పెరుగు తినకూడదని చెబుతారు. పెరుగు తినడం వల్ల   కఫం , శ్లేష్మంతో సమస్యలు రావచ్చు. కొంతమందికి కడుపు ఉబ్బరం కలగవచ్చు.  రాత్రిపూట తినడం జీర్ణక్రియను నెమ్మదింపజేస్తుంది. పెరుగు ఎలా తింటే శ్రేష్టం..  పగటిపూట మాత్రమే పెరుగు తినడం మంచిది.  రాత్రిపూట పెరుగు తినడం మానుకోవాలి.   కొద్దిగా వేయించిన జీలకర్ర లేదా నల్ల మిరియాల పొడి వేసుకుని  పెరుగు తీసుకుంటే మంచిది.  తాజాగా,  ఇంట్లో తయారుచేసిన పెరుగును మాత్రమే తినడం ఆరోగ్యానికి ఎంతో ఉత్తమం. పెరుగు ఎవరు తినకూడదు? జలుబుతో బాధపడుతున్న వాళ్లు,  రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్న వాళ్ళు, ఆస్తమా లేదా అలర్జీ రోగులు, రాత్రి ఆలస్యంగా భోజనం చేసే వారు.. పెరుగు విషయంలో జాగ్రత్తగా ఉండాలి.                                   *రూపశ్రీ.
శరీరంలో అధిక వేడి, పాదాల్లో మంట, కళ్లలో మంట, నోటి పూత, గ్యాస్, అసిడిటీ వంటి సమస్యలు చాలా మందిని ఇబ్బంది పెడుతుంటాయి. ఈ లక్షణాలు సాధారణంగా కనిపించినప్పటికీ, ఆయుర్వేదం ప్రకారం ఇవి పిత్త దోషం (Pitta Dosha) పెరగడం వల్ల వచ్చే సంకేతాలు కావచ్చని ప్రముఖ ఆయుర్వేద నిపుణులు డా. చి. మధుసూదన్ శర్మ వివరిస్తున్నారు. ఈ వీడియోలో పిత్త దోషం ఎందుకు పెరుగుతుంది? దానికి కారణమయ్యే ఆహారపు అలవాట్లు, జీవనశైలి, వాతావరణ ప్రభావాలు ఏమిటి? అలాగే పిత్తాన్ని తగ్గించేందుకు తీసుకోవాల్సిన ఆహారం, పాటించాల్సిన జీవనశైలి, ఆయుర్వేదంలో సూచించే సహజ చిట్కాలు వంటి అనేక ఉపయోగకరమైన విషయాలను సులభంగా వివరించారు. శరీరంలో వేడి ఎక్కువగా అనిపించడం, పాదాల్లో లేదా కళ్లలో మంట, తరచూ నోటి పూత రావడం, గ్యాస్, అసిడిటీ సమస్యలు వేధిస్తుంటే ఈ వీడియోలో చెప్పిన సూచనలు మీకు ఉపయోగపడవచ్చు. ఈ వీడియోలో తెలుసుకునే ముఖ్యాంశాలు: పిత్త దోషం అంటే ఏమిటి? శరీరంలో వేడి పెరగడానికి ప్రధాన కారణాలు పాదాలు, కళ్లలో మంట ఎందుకు వస్తుంది? నోటి పూత, గ్యాస్, అసిడిటీకి ఆయుర్వేద వివరణ పిత్తాన్ని తగ్గించే ఆహారాలు నివారించాల్సిన ఆహార పదార్థాలు రోజువారీ జీవితంలో పాటించాల్సిన ఆరోగ్యకరమైన అలవాట్లు సహజంగా శరీరాన్ని చల్లగా ఉంచే ఆయుర్వేద సూచనలు మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి, పిత్త దోషాన్ని సమతుల్యం చేసుకోవడానికి ఈ వీడియోను పూర్తిగా వీక్షించండి. గమనిక: ఈ వీడియోలోని సమాచారం ఆయుర్వేద అవగాహన కోసం మాత్రమే. వ్యక్తిగత ఆరోగ్య సమస్యల కోసం తప్పనిసరిగా అర్హత కలిగిన వైద్యుడిని లేదా ఆయుర్వేద నిపుణుడిని సంప్రదించండి. మీ ఆరోగ్య సమస్య ఏదైనా... మా హెల్త్ యూట్యూబ్ ఛానల్‌లో సీనియర్ డాక్టర్స్ చెప్పిన సలహాలు... సూచనలు ఉన్నాయి. మా యూట్యూబ్ ఛానల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 👉 TeluguOne Health (సబ్‌స్క్రైబ్ చేయడం మర్చిపోకండి!)