LATEST NEWS
అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు మూడు రాష్ట్రాల ముఖ్యమంత్రుల తలరాతలు మార్చేశాయి. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ, తమిళనాడు సీఎం స్టాలిన్, కేరళ ప్రభుత్వాధినేత పినరయి విజయన్‌లు మాజీలుగా మిగిలిపోనున్నారు. మరోవైపు అయిదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల్లో ఎన్డీఏ కూటమి అస్సాం, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరిల్లో సిట్టింగ్ స్థానాలను నిలబెట్టుకుంది. అదనంగా పశ్చిమబెంగాల్‌లో ఎన్టీఏ హవా కొనసాగింది. కేరళలో కాంగ్రెస్ భాగస్వామిగా ఉన్న ఎల్‌డీఎఫ్ విజయకేతనం ఎగరవేసింది. తమిళనాట డీఎంకే, అన్నాడీఎంకేల ఆధిపత్యానికి విజయ్ సారథ్యంలోని టీవీకే చెక్ పెట్టింది.  పశ్చిమబెంగాల్‌లో మూడున్నర దశాబ్దాల ఏళ్ల సీపీఎం పాలనకు బ్రేక్ వేసి 2011లో అధికార పగ్గాలు చేపట్టిన తృణముల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్టీ..  2026 వరకు వరుస విజయాలతో ముఖ్యమంత్రిగా కొనసాగారు. ఆమె 15 ఏళ్ల ఆధిపత్యానికి   ఎన్డీఏ తెర దించింది. మమతా సైతం కాంగ్రెస్‌లో కేంద్రమంత్రిగా, పలు కీలక పదవులు నిర్వహించి, తర్వాత సొంత కుంపటి పెట్టుకున్న నాయకురాలే కావడం గమనార్హం.  ఇక తమిళనాడు సీఎం, డీఎంకే అధినేత స్టాలిన్ కరుణానిధి తండ్రి కరుణానిధి మరణానంతరం పార్టీ బాధ్యతలు చేపట్టిన తర్వాత మొదటి ఎన్నికల్లోనే ముఖ్యమంత్రి పీఠం అధిరోహించారు. ఈ ఎన్నికల్లో డీఎంకే భాగస్వామిగా ఉన్న ఇండియా కూటమిదే విజయమని అత్యధిక ఎగ్జిట్ పోల్స్ వెల్లడించాయి. అయితే యాక్సిస్ మై ఇండియా ఎగ్జిట్ పోల్ అంచనాలు నిజమై, విజయ్ సారథ్యంలోని టీవీకే తమిళనాట డీఎంకే, అన్నాడీఎంకేల అధిపత్యాన్ని తుడిచిపెట్టింది.  దాంతో పదేళ్ల తర్వాత డీఎంకేను తిరిగి అధికారంలోకి తెచ్చిన సీఎం స్టాలిన్ మాజీగా మిగిలిపోనున్నారు. కేరళ చరిత్రలో వరుసగా రెండు సార్లు సీఎం బాధ్యతలు నిర్వర్తించిన పినరయి విజయన్‌కు తాజా ఎన్నికల ఫలితాలతో షాక్ తప్పలేదు. ప్రతి ఎన్నికల్లో విలక్షణ తీర్పునిస్తూ ప్రభుత్వాన్ని మార్చేసే కేరళ ఓటర్లు సీపీఐ(ఎం)కు చెందిన విజయన్‌పై నమ్మకంతో వరుసగా రెండో సారి పట్టం కట్టారు.  2016 ఎన్నికల్లో ఎల్‌డీఎఫ్ కూటమి నుంచి గెలిచి మొదటి సారి సీఎం అయి, పూర్తి పదవీ కాలం పూర్తి చేసుకుని, తిరిగి 2021 ఎన్నికల్లో ఎన్నికైన కేరళ మొదటి ముఖ్యమంత్రి ఆయనే. అయితే ఈ సారి కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ కూటమి ఎల్‌డీఎఫ్‌ను చిత్తుగా ఓడించింది. ఆ క్రమంలో పినరన్ మాజీ సీఎంల జాబితాలో చేరనున్నారు. ఈ అయిదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల్లో అస్సాం, పుదుచ్చేరిల్లో వరుసగా రెండో సారి సీఎం బాధ్యతలు చేపట్టబోతున్న ఎన్డీఏ సీఎంలు  హిమంత బిశ్వ శర్మ, ఎన్.రంగస్వామిలు కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత వరుసగా రెండోసారి గెలుపొందడం విశేషం.
తమిళనాడు రాజకీయాల్లో  నటుడు విజయ్ పార్టీ  తమిళగ వెట్రి కజగం  (టీవీకే) విజయం సంచలనంగా మారింది. ఈ క్రమంలో ఇటీవలే తెలంగాణలో సొంత పార్టీ టీఆర్ఎస్ ను ఏర్పాటు చేసిన కల్వకుంట్ల కవిత విజయం రాజకీయ ప్రభంజనంపై హర్షం వ్యక్తం చేశారు.  ప్రజా సమస్యలపై స్పష్టమైన అజెండాతో ఎన్నికల బరిలోకి దిగిన విజయ్‌ను తమిళ ప్రజలు ఆదరించడం శుభపరిణామమన్నారు. భ్రష్టుపట్టిపోయిన   రాజకీయ చరిత్రను తిరగ రాయడానికి కొత్త రాజకీయ శక్తులు అవసరమని తమిళ ప్రజలు తమ తీర్పు ద్వారా నిరూపించారని  ఎక్స్ వేదికగా పేర్కొన్న కవిత.. 
సంకోచాలు, సవాళ్లు, వ్యక్తిగత వివాదాలు ఇవేవీ విజయ్ ను నిలువరించలేకపోయాయి.   తమిళనాట  దళపతి రాజకీయ ప్రభంజనం సృష్టించారు. నటుడు విజయ్ స్థాపించిన తమిళగ వెట్రి కజగం (టీవీకే) పార్టీ అనూహ్య విజయాన్ని అందుకోవడంతో  తమిళనాడు రాజకీయాల్లో సరికొత్త అధ్యాయం మొదలైంది.  తమిళనాడు రాజకీయాలు ఎప్పుడూ సినీ గ్లామర్‌తో పెనవేసుకుపోయి ఉంటాయి. ఎంజీఆర్, జయలలిత, కరుణానిధి వంటి హేమాహేమీల తర్వాత ఆ స్థాయిలో జనాకర్షణ ఉన్న నాయకుడు ఎవరనే ప్రశ్నకు విజయ్ సమాధానంగా నిలిచారు. తన పార్టీ స్థాపించిన నాటి నుండి నేటి వరకు ఆయన సాగించిన ప్రయాణం ఒక అద్భుతమైన రాజకీయ థ్రిల్లర్‌ను తలపిస్తుంది.  ఎన్నికల ప్రచార సమయంలో విజయ్ అనేక ఆటంకాలను ఎదుర్కొన్నారు. ప్రత్యర్థి పార్టీల నుండి వచ్చిన తీవ్ర విమర్శలు, అధికార యంత్రాంగం విధించిన ఆంక్షలు ఆయనను ఉక్కిరిబిక్కిరి చేశాయి. వ్యక్తిగత జీవితంపై జరిగిన దుష్ప్రచారం విజయ్ ఇమేజ్‌ను దెబ్బతీస్తుందని అందరూ భావించారు. భార్యతో విడాకుల ప్రచారాలు, నటి త్రిషాతో ముడిపెట్టి చేసిన విమర్శలు ఓటర్లను ప్రభావితం చేస్తాయని విశ్లేషకులు భాష్యాలు చెప్పారు. కానీ..  తమిళ ఓటర్లు వ్యక్తిగత విషయాల కంటే విజయ్ ఆశయాలకే పెద్దపీట వేశారు.  ప్రచార పర్వంలో జరిగిన ఒక బహిరంగ సభలో తొక్కిసలాట జరిగి పదుల సంఖ్యలో మరణాలు సంభవించడం పార్టీకి పెద్ద ఎదురుదెబ్బగా మారింది. దీనిపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. చివరికి సరైన అనుమతులు లేకపోవడంతో విజయ్ మలేషియాకు వెళ్లి అక్కడి నుండే డిజిటల్ ప్రచారం నిర్వహించాల్సి వచ్చింది. అయినప్పటికీ, ఆయన పట్టు వదలని విక్రమార్కుడిలా తన పోరాటాన్ని కొనసాగించారు. జాతీయ స్థాయి విశ్లేషకులు టీవీకే పార్టీకి స్వల్ప స్థానాలే దక్కుతాయని అంచనా వేశారు. ఎగ్జిట్ పోల్స్ కూడా అదే తేల్చాయి. కానీ.. ఫలితాలు మాత్రం యావత్తు భారతదేశాన్ని ఆశ్చర్యపరిచాయి. ఏకంగా 100కి పైగా స్థానాల్లో విజయం సాధించి..  ముఖ్యమంత్రి కుర్చీని దక్కించుకునే  మ్యాజిక్ ఫిగర్ కు అతి చేరువకు చేరుకున్నారు.   దశాబ్దాలుగా కొనసాగుతున్న డీఎంకే, ఏఐఏడీఎంకే వంటి సాంప్రదాయ పార్టీల ఆధిపత్యానికి ఆయన బ్రేక్ వేశారు.  విజయ్ సాధించిన ఈ విజయం కేవలం ఆయన సినిమా ఇమేజ్ వల్ల వచ్చింది కాదు. ప్రజల్లో ఆయనపై ఉన్నఅపార విశ్వాసానికి  నిదర్శనం. ఎంజీఆర్, జయలలిత వంటి చారిత్రాత్మక నాయకుల వారసత్వాన్ని విజయ్ నిలబెడతారని ప్రజలు విశ్వసిస్తున్నారు. అవినీతి రహిత, ప్రజాహిత పాలనను ఆయన అందిస్తారని సామాన్యులు ఆశిస్తున్నారు.  ఇక దళపతి ‘విజయ్ అనే నేను’ అంటూ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే ముహూర్తం ఎప్పుడా అని ఎదురు చూస్తున్నారు. 
ALSO ON TELUGUONE N E W S
Making a debut in film production is always a massive gamble, but for businessman-turned-producer Abhinav, it was a carefully calculated one. After spending a decade across various business ventures, he is stepping into Tollywood with the rural family drama Godari Gattupaina. He didn't rush the process, listening to nearly ten different scripts before finally locking director Subhash Chandra’s narrative. Explaining his choice, Abhinav shared, "I wanted to make a film with emotions that connect to everyone universally, and this story perfectly fell into place." One of the most intriguing creative choices in the project is casting Sumanth Prabhas. Known naturally for his authentic Telangana dialect, dropping the young actor into a hardcore Godavari backdrop seemed like a risky mismatch on paper. However, Abhinav viewed this linguistic hurdle as a major positive. "He learned the Godavari slang perfectly and took it up as a challenge. Only when it is tough, there is satisfaction as an actor," the producer noted. Beyond the casting, the film’s execution heavily relied on meticulous pre-production to avoid the usual chaotic nature of film sets. For a businessman, structured planning is everything, and Abhinav found his ideal collaborator in Subhash. "He showed every detail related to the shooting, including the frames, on paper. The entire film shoot happened flawlessly according to a strict plan," he explained, praising the director's intense focus. With veteran Jagapathi Babu and heroine Nidhi Pradeep anchoring what Abhinav describes as a "very peculiar" emotional bond, the film is gearing up for a worldwide release on May 8. Backed by industry heavyweights like Sunil Narang and Suresh Babu, it will be interesting to see how this strictly planned rural drama resonates at the box office.   Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them.
  ఇప్పుడు ఎక్కడ చూసినా సిఎం ఇళయ దళపతి విజయ్(VIjay)అనే స్లోగన్ మాత్రమే వినపడుతుంది. ఇంకేం వినపడటం లేదు. తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి కూడా విజయ్ కి అభిమానసుమాంజలిలు వెల్లువెత్తుతున్నాయి. కానీ ప్రకాష్ రాజ్(Prakash Raj)మాత్రం విజయ్ విజయంపై ఆసక్తి కర ట్వీట్ చేసాడు.ఆ ట్వీట్ ఏంటో చూద్దాం.  ఇది గెలుపే కాదు. తమిళ జాతిపిత, భారత రత్న  కామరాజ్ ఓడిపోయారు. స్టాలిన్ ఓడిపోయారు. సమాజం కేవలం అభిమానుల మయం అయిపోయింది. రాజకీయం చైతన్యం కలిగిన సమాజంగా మారలేదు అనడానికి ఈ ఎన్నికలే ఒక ఉదాహరణ. రాజకీయ విజ్ఞానాన్ని పెంచే వారి పని ఎప్పుడు ప్రతిపక్ష పాత్ర పోషించడమే. మన ప్రయాణాన్ని కొనసాగిద్దాం. విజేతలకి శుభాకాంక్షలు. ఏం చేయబోతారో కూడా చూద్దామని తన ట్వీట్ లో చెప్పుకొచ్చాడు.   also read:  suprita:  నన్ను చంపుతారా ప్లీజ్   ఎన్నికలకి ముందు విజయ్ ని ఉద్దేశించి ప్రకాష్ రాజ్ మాట్లాడుతు సినిమాల్లో ఒకే పాటలో డాక్టర్, ఇంజనీర్ లేదా ముఖ్యమంత్రి అయిపోవచ్చు. కానీ రాజకీయం వేరు, భాషకి లేదా ప్రజల ఆత్మగౌరవానికి సమస్య వచ్చినప్పుడు  విజయ్ ఎప్పుడైనా వచ్చి నిలబడ్డారా.  నటుడి కోసం థియేటర్లో ఈలలు వేయడం వేరు, కానీ దేశ భవిష్యత్తుని  ఆయన చేతిలో పెట్టడం వేరు, విజయ్‌ కి రాజకీయ అనుభవం లేదు. తమిళుల ఆత్మగౌరవాన్ని మోదీ పాదాల చెంత పెట్టే  బానిస మోడల్ కాకుండా, ద్రావిడ మోడల్ అవసరమని, విజయ్ రాజకీయాలు కేవలం సినిమాలకి పరిమితమని ప్రకాష్ రాజ్  అభిప్రాయపడ్డారు. ఇప్పుడు ఈ మాటలు విజయ్ గెలుపు నేపథ్యంలో మరో సారి వైరల్ గా మారడంతో ప్రకాష్ రాజ్ మాటలని తమిళ ప్రజలు ఎవరు విన్నట్టుగా లేదనే కామెంట్స్ వ్యక్తమవుతున్నాయి.  
Long before "Amma" J. Jayalalithaa achieved her iconic public status and faced massive criminal charges for corruption while in power, she was a leading actress who endured relentless public torment. Her transition from cinema to a political powerhouse was paved with unimaginable turmoil. From battling intense public scrutiny over scandals and link-ups to navigating a deeply complex, secretive alleged affair that eventually morphed into a very public political mentorship under M.G. Ramachandran, she underwent a lot. She survived brutal character assassinations that would have easily destroyed anyone else, slowly forging herself into an unshakable force in a highly volatile political arena.   Today, Tamil social media is flooded with fun memes, mashups, and edits playfully equating actress Trisha Krishnan to the late Chief Minister. At first glance, the comparison feels like typical internet mischief, but when you look closer, the underlying parallels are eerily accurate. Much like Jayalalithaa, Trisha's two-decade-long career in Kollywood has been a rollercoaster of extreme highs and brutal public trials that kept her constantly under the scanner. From dealing with an alleged private bathroom video and public nuisance controversies to surviving a highly publicized cancelled wedding and multiple relationship rumors, Trisha has faced her own severe share of public torment. Yet, her sheer resilience to weather every storm and remain at the top mirrors that same gritty survival instinct of the former AIADMK supremo. She simply refused to be written off, proving time and again that she possesses an incredibly tough core beneath her on-screen glamour. Adding weight to these viral edits is Trisha’s own cinematic and personal history. Her chilling portrayal of a ruthlessly ambitious politician in Dhanush's Kodi proved she could command serious political authority on screen. She has also previously made casual statements in interviews about aspiring to become a Chief Minister someday. These details provide endless material for trolls and fans alike, turning everyday edits into fascinating “what if” scenarios that keep the digital space buzzing. What makes these viral edits dangerously true rather than just harmless fun is the seismic political shift happening right now. With today's phenomenal Tamil Nadu Assembly election results showing Thalapathy Vijay and his newly formed TVK taking massive leads in a Hung Assembly, the comparison looks true. Still, the history is not repeating by unfolding a new chapter all on its own with"Anna" and "Maami" rather than "Ayya" and "Amma". Well, recent rumors state that Trisha is the top contender to contest in by-election if Vijay resigns from one constituency or take a MP seat. Let's wait and see how game unfolds in coming days.    Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them.
దక్షిణాది చిత్ర పరిశ్రమలో అగ్ర కథానాయకులుగా వెలుగు వెలుగుతున్న ఇద్దరు స్టార్ల మధ్య ఉన్న అనుబంధం మరోసారి బయటపడింది. తమిళ సూపర్ స్టార్, 'దళపతి' విజయ్ తన రాజకీయ ప్రయాణాన్ని అధికారికంగా ప్రారంభించి, ఇటీవల జరిగిన ఎన్నికల పర్వంలో తనదైన ముద్ర వేయడంపై టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి స్పందించారు. విజయ్ సాధించిన విజయానికి అభినందనలు తెలుపుతూ చిరంజీవి చేసిన ట్వీట్ ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది. విజయ్ తన రాజకీయ పార్టీ తమిళగ వెట్రి కజగం (TVK) స్థాపించిన తర్వాత ఎదుర్కొన్న మొదటి ఎన్నికల సవాలులో మంచి ఫలితాలను రాబట్టడంపై చిరంజీవి హర్షం వ్యక్తం చేశారు. తన అధికారిక ఎక్స్ (ట్విట్టర్) ఖాతా ద్వారా స్పందిస్తూ విజయ్‌ను ప్రశంసల్లో ముంచెత్తారు. "ప్రియమైన విజయ్.. నీ మొదటి ఎన్నికల్లో అద్భుతమైన, అర్హత కలిగిన విజయాన్ని అందుకున్నందుకు మనస్ఫూర్తిగా అభినందనలు. నువ్వు ఇదే పట్టుదలతో, స్పష్టమైన లక్ష్యంతో ప్రజలకు సేవ చేస్తూ ముందుకు సాగాలని కోరుకుంటున్నాను. తమిళనాడు ప్రజలకు నువ్వు చేసే ప్రజా సేవ దిగ్విజయంగా సాగాలని నా ఆకాంక్ష." - చిరంజీవి కొణిదెల చిరంజీవి సైతం గతంలో రాజకీయాల్లో చురుగ్గా పాల్గొన్న అనుభవం ఉన్న వ్యక్తి కావడంతో, ఒక సహ నటుడిగా విజయ్ ఆశయాలను ఆయన అభినందించారు. విజయ్ నాయకత్వం తమిళనాడు రాజకీయాల్లో కొత్త మార్పులకు శ్రీకారం చుడుతుందని చిరంజీవి తన పోస్ట్‌లో ఆశాభావం వ్యక్తం చేశారు. విజయ్ తన రాజకీయ సభల్లో వ్యక్తపరిచిన సిద్ధాంతాలు, యువతను ఆకట్టుకుంటున్న తీరును చూసి ఇప్పటికే అనేకమంది ప్రముఖులు ఆయనకు మద్దతు తెలుపుతున్నారు. ఇప్పుడు మెగాస్టార్ స్వయంగా అభినందనలు తెలపడంతో విజయ్ అభిమానులు మరియు టీవీకే కార్యకర్తలు పండగ చేసుకుంటున్నారు.
తెలుగు సినీ పరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేకమైన ముద్ర వేసుకున్న సూపర్ స్టార్ మ‌హేష్‌బాబు, పొరుగు రాష్ట్రమైన తమిళనాడులో చోటు చేసుకున్న విశేష పరిణామాలపై స్పందించారు. ముఖ్యంగా కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ సాధించిన ఘన విజయంపై మహేష్ బాబు సోషల్ మీడియా వేదికగా తన ఆనందాన్ని పంచుకున్నారు. మహేష్ బాబు తన అధికారిక X ఖాతా ద్వారా విజయ్‌కు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. "కొత్త బెంచ్‌మార్క్‌లను నెలకొల్పుతూ, అద్భుతమైన విజయాన్ని సాధించినందుకు విజయ్ గారికి అభినందనలు" అంటూ మహేష్ పేర్కొన్నారు. ఈ విజయం కేవలం ఒక వ్యక్తి గెలుపు మాత్రమే కాదని, ప్రజలకు ఆయనపై ఉన్న అపారమైన నమ్మకానికి నిదర్శనమని ఆయన కొనియాడారు. విజయ్ రాజకీయ లేదా ప్రజా సంబంధిత ప్రయాణంలో ప్రజలు చూపించిన ఆదరణను మహేష్ బాబు ప్రత్యేకంగా ప్రస్తావించారు. ప్రజలు విజయ్ మీద ఉంచిన భారీ విశ్వాసానికి ఈ రోజు అద్దం పడుతోందని ఆయన తెలిపారు. ఈ అఖండ విజయం తమిళనాడు అభివృద్ధికి మరియు అర్థవంతమైన పురోగతికి దారితీస్తుందని తాను ఖచ్చితంగా నమ్ముతున్నట్లు మహేష్ ఆశాభావం వ్యక్తం చేశారు. తన సందేశంతో పాటు విజయ్‌ను ఉద్దేశించి హృదయపూర్వక ఎమోజీలను జత చేస్తూ తన స్నేహపూర్వక బంధాన్ని చాటుకున్నారు.
విజయ్,  త్రిష 'మట్ట' సాంగ్ వైరల్.. అధికార పీఠం ఎక్కే వేళ పెరిగిన హంగామా!తమిళ చిత్ర పరిశ్రమలో 'దళపతి' విజయ్ మరియు 'చెన్నై అందం' త్రిషల జోడీకి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వీరిద్దరూ కలిసి నటించిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించడమే కాకుండా, వీరి మధ్య ఉండే కెమిస్ట్రీ ప్రేక్షకులను కట్టిపడేస్తుంది. తాజాగా వెంకట్ ప్రభు దర్శకత్వంలో విజయ్ నటిస్తున్న 'ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్' సినిమాలోని 'మట్ట' సాంగ్ ఇప్పుడు సోషల్ మీడియాను ఊపేస్తోంది. విజ‌య్ రాజ‌కీయ ప్ర‌వేశం చేయ‌డం, ఎన్నిక‌ల్లో పాల్గొన‌డం అంద‌రికి తెలిసిందే. ఇక ఎన్నిక‌ల ఫ‌లితాల్లో విజ‌య్ భారీ విజ‌యాన్ని అందుకోవ‌డ‌మే కాకుండా అధికార పీఠం ఎక్కేందుకు రంగం సిద్ధ‌మ‌వుతోంది. ఈ క్ర‌మంలో ఈ పాట త‌మిళ‌నాడును ఊపేస్తోంది.  ఈ పాటలోని వీరిద్దరి డ్యాన్స్ మూమెంట్స్ ప్రస్తుతం ఇంటర్నెట్‌లో వైరల్ అవుతున్నాయి. అభిమానులు ఈ వీడియో క్లిప్స్‌ను షేర్ చేస్తూ 'హిట్ జోడీ ఈజ్ బ్యాక్' అంటూ కామెంట్స్ చేస్తున్నారు. కేవ‌లం రెండు సంవ‌త్స‌రాల్లో రాజకీయంగా త‌న‌దైన ముద్ర వేసిన విజ‌య్‌కి ఎంత ఫాలోయింగ్ ఉందో ఈ ఎన్నిక‌ల ఫ‌లితాలు నిరూపిస్తున్నాయి. రాజ‌కీయ దిగ్గ‌జాల‌ను సైతం మ‌ట్టి క‌రిపించి సింహాస‌నాన్ని అధిరోహించేందుకు విజ‌య్ సిద్ధ‌మ‌య్యారు. దీంతో త‌మిళ‌నాడులో ఉన్న విజ‌య్ అభిమానులు పండ‌గ చేసుకుంటున్నారు. ఎక్క‌డ చూసినా విజ‌య్ ప్ర‌భంజ‌న‌మే క‌నిపిస్తోంది. 
  సోషల్ మీడియాకి దొరికిన అరుదైన అందగత్తెల్లో సుప్రిత గురించి ప్రత్యేకంగా  చెప్పుకోవాల్సిన పని లేదు. పెద్ద సంఖ్యలో ఫాలోవర్స్ ని సంపాదించుకున్న సుప్రీత సెల్యులాయిడ్ పై కూడా తన సత్తా చాటింది. పెద్ద హీరోలతో కూడా స్క్రీన్ షేర్ చేసుకోవాలని ఆశపడుతున్న సుప్రీత ఓల్డ్  వీడియో ఒకటి దారి తప్పి వచ్చిందో లేక నన్ను మర్చిపోవద్దు మీకు చాలా ఉపయోగపడతానని చెప్పడానికి వచ్చిందో కానీ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది. ఆ వీడియోలో ఏముందో చూద్దాం. సదరు వీడియోలో సుప్రీత  తన ఆరోగ్య సమస్యల గురించి మాట్లాడుతూ  కొంతకాలం క్రితం బాగా బరువు పెరిగాను. దీంతో  సోషల్ మీడియాలో నాపై వచ్చిన కామెంట్స్  చూసి మానసికంగా చాలా బాధపడ్డాను. ఆ ఒత్తిడిలోనే తినే అలవాట్లు పూర్తిగా మారిపోయాయి. రోజుకి 12 నుంచి 15 గంటల పాటు ఏమీ తినకుండా ఉండి, ఒక్క పూట మాత్రమే తినే దాన్ని. ఆ సమయంలో  బిర్యానీ వంటి హెవీ ఫుడ్ తీసుకోవడంతో ఆరోగ్యం పూర్తిగా దెబ్బతింది.  also read:  విజయ్ ముఖ్యమంత్రి కావడానికి మన ముగ్గురు హీరోలే కారణమా!  దీంతో పరిస్థితి ఒక్కసారిగా విషమించడంతో తీవ్ర అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరాను. ఆ విధంగా హాస్పిటల్ లో 15 రోజుల పాటు చాలా కష్టాలు అనుభవించాను. నీళ్లు తాగినా వాంతులు అయ్యేవి. దీంతో రోజుకి 15 సార్లు వాంతులు అవ్వడంతో పాటు 20 రోజుల పాటు అన్నం తినలేకపోయాను. ఒక దశలో  బతకనేమో అనిపించింది.  ఆ నరకాన్ని భరించలేక ఏదైనా మందు ఇచ్చి చంపేస్తే బాగుంటుందని అనిపించిందని చెప్పుకొచ్చింది.  
మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం గ్లోబల్ స్థాయిలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నారు. 'ఆర్ఆర్ఆర్' సినిమాతో అంతర్జాతీయ వేదికపై తెలుగు సినిమా సత్తా చాటిన చరణ్, ఇప్పుడు తన తదుపరి ప్రాజెక్టులపై దృష్టి సారించారు. ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సన దర్శకత్వంలో రాబోతున్న 'పెద్ది' చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే, ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్ విషయంలో రామ్ చరణ్ అభిమానులు తాజాగా సోషల్ మీడియా వేదికగా తమ అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు. సినిమాను గ్లోబల్ స్థాయిలో ప్రమోట్ చేయాలని, మార్కెటింగ్ విషయంలో స్పీడ్ పెంచాలని మేకర్స్‌ను డిమాండ్ చేస్తున్నారు. రామ్ చరణ్ - బుచ్చిబాబు కాంబినేషన్‌లో వస్తున్న ఈ సినిమా స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే ఒక ఎమోషనల్ డ్రామా అని తెలుస్తోంది. ఇప్పటికే ఈ చిత్రం ప్రీ-ప్రొడక్షన్ పనులు పూర్తి చేసుకుని, షూటింగ్ దిశగా అడుగులు వేస్తోంది. అయితే, ఇతర అగ్ర హీరోల సినిమాలతో పోలిస్తే 'పెద్ది' ప్రమోషన్స్ చాలా నెమ్మదిగా ఉన్నాయని అభిమానులు భావిస్తున్నారు. ముఖ్యంగా గ్లోబల్ మార్కెట్‌లో రామ్ చరణ్‌కు ఉన్న క్రేజ్‌ను దృష్టిలో పెట్టుకుని, చిత్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ పెద్ద ఎత్తున పబ్లిసిటీ ప్లాన్ చేయాలని వారు కోరుతున్నారు. ట్విట్టర్ (X) లో #PeddiMarketingBoost మరియు #GlobalPromotionForRC16 వంటి హ్యాష్ ట్యాగ్‌లు ట్రెండ్ అవుతున్నాయి. అభిమానుల వాదన ప్రకారం, కేవలం తెలుగు లేదా సౌత్ ఇండియాకు మాత్రమే పరిమితం కాకుండా, ఈ సినిమాను పాన్-వరల్డ్ స్థాయిలో ప్రొజెక్ట్ చేయాలి. 'ఆర్ఆర్ఆర్' తర్వాత చరణ్ మార్కెట్ వాల్యూ విపరీతంగా పెరిగింది, కాబట్టి ప్రచార చిత్రాలు, అప్‌డేట్స్ మరియు గ్లోబల్ ఈవెంట్స్ విషయంలో నిర్మాతలు మరింత చురుగ్గా వ్యవహరించాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు. సినిమా విజయంలో కంటెంట్ ఎంత ముఖ్యమో, దాన్ని ప్రేక్షకులకు చేరవేయడంలో ప్రమోషన్స్ కూడా అంతే కీలకం. రామ్ చరణ్ వంటి గ్లోబల్ స్టార్ సినిమాకు ప్రాపర్ మార్కెటింగ్ స్ట్రాటజీ అవసరమని చెప్పడంలో సందేహం లేదు. అభిమానుల ఈ ఆవేదనను గమనించి చిత్ర యూనిట్ రాబోయే రోజుల్లో ఎలాంటి ప్రమోషనల్ ప్లాన్స్‌తో ముందుకు వస్తుందో చూడాలి. 'పెద్ది' ప్రమోషన్స్ గనుక ఊపందుకుంటే, మెగా ఫ్యాన్స్ ఉత్సాహం రెట్టింపు అవ్వడం ఖాయం.
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు. వారితో పాటు పెద్ద సంఖ్యలో క్యాడర్ కూడా పార్టీని వీడుతున్నారు. ఇక ఇప్పుడు నామినేటెడ్ పదవులలో ఉన్న వారి వంతు మొదలైనట్లు కనిపిస్తోంది. తనకు కానీ తన భర్తకు  కానీ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు టికెట్ ఇవ్వాలంటూ గత  కొంత కాలంగా కోరుతూ వస్తున్న మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ వంతు వచ్చింది. ఆమె కూడా రాజీనామా అస్త్రం సంధించారు.  జగన్ కు నమ్మిన బంటుగా గుర్తింపు పొందిన మహిళాకమిషన్ చైర్ పర్సన్ వాసి రెడ్డి పద్మ తన పదవికి రాజీనామా చేశారు. ఉరుములేని పిడుగులా, ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా తన రాజీనామా లేఖను సీఎం జగన్ కు పంపేశారు. పేరుకు తాను పార్టీకి కాదు, కేవలం మహిళా కమిషన్ చైర్మన్ పదవికి మాత్రమే రాజీనామా చేశాననీ, ఇక నుంచి వైసీపీ కోసం పని చేస్తాననీ వాసిరెడ్డి పద్మ చెబుతున్నప్పటికీ, ఆమె రాజీనామాకు కారణం అసంతృప్తేనని పార్టీ వర్గాలు బాహాటంగానే చెబుతున్నాయి. చాలా కాలంగా వాసిరెడ్డి పద్మ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు తనకు కానీ తన భక్తకు కానీ పార్టీ టికెట్ ఇవ్వాలని జగన్ ను కోరుతూ వస్తున్నారు. అయితే ఇప్పటి వరకూ జగన్ చూద్దాం.. చేద్దాం అన్నట్లుగా దాట వేస్తూనే వచ్చారు. ఇప్పుడిక వరుసగా అభ్యర్థల జాబితాలను జగన్ ప్రకటించేస్తుండటం, తనకు గానీ తన భర్తకు కానీ పార్టీ టికెట్ విషయంలో ఎటువంటి స్పస్టత ఇవ్వకపోవడంతో ఆమె మనస్తాపం చెంది పదవికి రాజీనామా చేసేశారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.  వాసిరెడ్డి పద్మ రాజకీయ ప్రవేశం ప్రజారాజ్యం పార్టీతో జరిగింది. 2009లో ఆమె ప్రజారాజ్యం పార్టీలో చేరారు. ఇలా చేరడంతోనే ఆమె ప్రజారాజ్యం అధికార ప్రతినిథిగా పదవి దక్కించుకున్నారు. ప్రజారాజ్యం కాంగ్రెస్ పార్టీలో విలీనం కావడంతో ఆమె 2012లో జగన్ పార్టీలో చేరారు. జగన్ కూడా ఆమెకు అధికార ప్రతినిథి పదవి ఇచ్చారు.  2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆమెను రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా నియమించారు. చైర్ పర్సన్ హోదాలో ఆమె జగన్ మెప్పు పొందేందుకు చేయగలిగినంతా చేశారు. ప్రతిపక్ష పార్టీ నేతలకు నోటీసులు ఇచ్చారు. ఏకంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు సైతం నోటీసులు జారీ చేశారు. వార్డు వలంటీర్లపై పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు కమిషన్ ముందు హాజరై వివరణ ఇవ్వాలంటూ ఆమె పవన్ కు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. పవన్ హాజరు కాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు నమోదు చేయాలని ఆదేశించారు. ఇన్ని చేసినా వాసిరెడ్డి పద్మకు ఆమె కోరినట్లుగా పార్టీ టికెట్ లభించకపోవడంతో అలిగి పదవికి రాజీనామా చేశారని, ఇది జగన్ కు షాకేననీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు. ఒకరైతు తనకు చేసిన సేవలకు ప్రీతి చెందిన గురువు అతడికి స్వర్గ ప్రాప్తిని కలగజేయాలని అనుకుంటాడు. కానీ సంసారాసక్తి వల్ల ఆ రైతు ఆ అవకాశాన్ని వాయిదా వేసుకుంటూ వస్తాడు. చివరికి గురుకృప వల్ల ఆ రైతు స్వర్గ ప్రాప్తిని ఎలా పొందాడో ఈ కథ తెలియజేస్తుంది. "ఒక మహాపురుషుడు ప్రయాణం చేస్తూ, డస్సిపోయాడు. గొంతు ఎండిపోయింది. దారిలో ఒక రైతు కనపడితే నీళ్ళు అర్థించాడు. ఆ రైతు మహాత్మునికి సకల ఉపచారాలూ చేశాడు. చిరిగిపోయిన ఆయన ఉత్తరీయాన్ని రైతు జాగ్రత్తగా కుట్టి బాగుచేశాడు. రైతు పరిచర్యలకు సంతసించిన ఆ మహాత్ముడు శాంతి, ఆనందాలకు నిలయమైన స్వర్గానికి తనతోపాటు రమ్మని అంటాడు. అందుకు ఆ రైతు 'గురువుగారూ! మీరు నా మీద చూపిన దయకు కృతజ్ఞుణ్ణి. కానీ నా పిల్లలు ఇంకా చిన్నవాళ్ళు. ఓ ఏడేళ్ళ వ్యవధి ఇవ్వండి' అని అడుగుతాడు. అందుకు గురువు అంగీకరించాడు. సరిగ్గా ఏడేళ్ళ తర్వాత గురువు రైతును స్వర్గానికి తీసుకువెళ్ళడానికి వచ్చాడు. అప్పుడు రైతు 'అయ్యా! కడపటి కొడుకు కష్టాలకు అంతు లేదు. అన్ని జంఝాటాలనూ ఒక్కడే సంబాళించుకోలేకపోతున్నాడు. కాబట్టి మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని గురువుని అడిగాడు. మరో ఏడేళ్ళ తరువాత గురువు వచ్చాడు. కానీ రైతు చనిపోయాడని తెలిసింది. చనిపోయిన ఆ రైతు ఎద్దుగా పుట్టాడని ఆ గురువు తన దివ్య దృష్టితో తెలుసుకున్నాడు. ఎద్దుగా పుట్టిన ఆ రైతు తన కొడుకు పొలాన్నే దున్నుతున్నాడు. అప్పుడు గురువు ఆ ఎద్దుపై మంత్ర జలం చిలకరించగానే ఎద్దు జన్మనెత్తిన రైతు 'నా కొడుకు పరిస్థితి మరి కాస్త మెరుగు పడనీయండి స్వామీ! మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని అన్నాడు. ఇక చేసేది లేక వెనుదిరిగాడు గురువు. మరలా ఏడేళ్ళ తర్వాత వచ్చిన గురువుకు ఎద్దు చనిపోయిందని తెలిసింది. అది కుక్కగా పుట్టి కొడుకు ఇంటినీ, ఆస్తినీ కాపలా కాస్తోందని తన దివ్యదృష్టి ద్వారా తెలుసుకున్నాడు. గురువు. కుక్కగా పుట్టిన ఆ రైతు 'స్వామీ! నేను ఎంత దౌర్భాగ్యుణ్ణి. మీరు ఇంత దయ చూపుతున్నప్పటికీ మీతో స్వర్గమానం చేయలేకున్నాను. వీడికి ఆస్తిని కాపాడుకొనే దక్షత ఇంకా రాలేదు. కాబట్టి దయ చేసి మరో ఏడేళ్ళు వ్యవధి ఇవ్వండి' అని వేడుకున్నాడు. గురువు ఏడేళ్ళ తరువాత మళ్ళీ వచ్చేసరికి కుక్క మరణించింది. అది త్రాచుపాముగా జన్మనెత్తి, ఇప్పుడు కొడుకు భూమిలో ఉన్న లంకెబిందెలకు పడగెత్తి కాపలా కాస్తోంది. గుప్త ధనం ఇక్కడ ఉందని కొడుకుకి ఎలా తెలియజేయాలా అని పాము ఆలోచిస్తున్నప్పుడు గురువు ఆ రైతుకొడుకును పిలుచుకు వచ్చి లంకె బిందెలు ఉన్న చోట తవ్వమన్నాడు. లంకె బిందెలు బయటపడ్డాయి. ఆ పైన ఆ పామును చంపమన్నాడు. అనంతరం శిష్యుణ్ణి తీసుకొని స్వర్గారోహణం చేశాడు గురువు. సంసారంలోని ఈతి బాధల నుండి శిష్యుణ్ణి ఉద్ధరిస్తాడు సద్గురువు. అలాంటి గురువు అందరికీ అవసరం.                                      *నిశ్శబ్ద.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్  రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది.  80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత  ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది.   ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది. ఆమెది నెద‌ర్లాండ్స్‌. ఆమె తండ్రి నెద‌ర్లాండ్స్‌లోని ఆర్నెహెమ్‌లో చిన్న‌పిల్ల‌ల ఆస్ప‌త్రి డైరెక్ట‌ర్. పోయి దొరికిన ఆ పెయింటింగ్ విష‌యానికి వ‌స్తే.. అది 1683లో కాస్ప‌ర్ నెష‌ర్ వేసిన స్టీవెన్ ఓల్ట‌ర్స్ పెయింటింగ్‌. రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో నాజీల ఆదేశాల‌ను చార్లెట్ తండ్రి వ్య‌తిరేకించారు. ఆయ‌న ర‌హ‌స్య జీవ‌నం సాగించేడు. కానీ ఈ పెయింటింగ్‌ని మాత్రం త‌న న‌గ‌రంలోని ఒక బ్యాంక్‌లో భ‌ద్ర‌ ప‌ర‌చ‌మ‌ని ఇచ్చార‌ట‌. 1940లో నాజీలు నెద‌ర్లాండ్ పై దాడులు చేసినపుడు ఆ బ్యాంక్ మీద ప‌డి దోచుకున్నా రు. అప్పుడు ఈ పెయింటింగ్ కూడా తీసుకెళ్లారు. యుద్ధం అయిపోయిన త‌ర్వాత ఈ పెయింటింగ్ ఎక్క‌డున్న‌దీ ఎవ‌రికీ తెలియ‌లేదు. చిత్రంగా 1950ల్లో డ‌స‌ల్‌డార్ష్ ఆర్ట్ గ్యాల‌రీలో అది ప్ర‌త్య‌క్ష‌మ‌యింది. 1969లో ఆమ్‌స్ట‌ర్‌డామ్‌లో దాన్ని వేలానికి తీసికెళ్లే ముందు దాన్ని ఆ ఆర్ట్ గ్యాల‌రీలో వుంద‌ని చూసిన‌వారు చెప్పారు. వేలంపాట త‌ర్వాత మొత్తానికి ఆ పెయింటింగ్‌ను 1971లో ఒక క‌ళాపిపాసి త‌న ద‌గ్గ‌ర పెట్టుకున్నాడు.    ఆ త‌ర్వాత 2021లో అది చార్లెటీని చేరింది.  మొత్తానికి వూహించ‌ని విధంగా ఎంతో కాలం దూర‌మ‌యిన గొప్ప క‌ళాఖండం తిరిగి త‌న వ‌ద్ద‌కు చేర‌డంలో చార్లెటీ ఆనందానికి అంతేలేదు. అంతే క‌దా.. పోయింద‌నుకున్న గొప్ప వ‌స్తువు తిరిగి చేరితే ఆ ఆనంద‌మే వేరు!  అయితే చార్లెటీకి ఇపుడు ఆ పెయిం టింగ్‌ను భ‌ద్రంగా చూసుకునే ఆస‌క్తి వున్న‌ప్ప‌టికీ శ‌క్తి సామ‌ర్ధ్యాలు లేవు. అందుక‌నే త్వ‌ర‌లో ఎవ‌రిక‌యినా అమ్మేసీ వ‌చ్చిన సొమ్మును పిల్ల‌ల‌కు పంచుదామ‌నుకుంటోందిట‌!  చార్లెటీ కుటుంబంలో అయిదుగురు అన్న‌ద‌మ్ములు అక్క‌చెల్లెళ్లు వున్నారు. అలాగే ఇర‌వై మంది పిల్ల‌లు ఉన్నారు. అంద‌రూ ఆమె అంటే ఎంతో ప్రేమ చూపుతున్నారు. అంద‌రం ఒకే కుటుంబం, చాలాకాలం త‌ర్వాత ఇల్లు చేరిన క‌ళాఖండం మా కుటుంబానిది అన్న‌ది చార్లెటీ!
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు. చాకోను పార్టీలోకి ఆహ్వానిస్తూ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్’ ఫ్రంట్ ఏర్పాటు గురించి ప్రత్యేకించి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు కానీ, చాకో అలాంటి  సంకేతాలు ఇచ్చారు. ప్రస్తుతం దేశంలో ఉన్న ఏ ఒక్కపార్టీ కూడా బీజేపీకి ప్రత్యాన్మాయం కాదని,సమీప భవిష్యత్ కాంగ్రెస్ సహా ఏ పార్టీ కూడా ఆ స్థాయికి ఎదిగే అవకాశాలు కూడా కనిపించడంలేదని అన్నారు. ఈ పరిస్థితుల్లో దేశంలోని బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ, ఏకమై, ఒకే గొడుగు కిందకు రావలసిన అవసరం ఉందని చాకో అన్నారు. అదే సమయంలో ప్రతిపక్షాలను ఏక తాటిపైకి తెచ్చే బాధ్యతను పవార్ తీసుకోవాలని సంకేత మాత్రంగా చెప్పారు. అంతే కాకుండా కాంగ్రెస్ పేరు ఎత్తకుండా బీజేపీ వ్యతిరేక శక్తులను ఏకం చేసే ఆలోచన ఆ పార్టీ నాయకత్వానికి లేదని నెహ్రూ గాంధీ ఫ్యామిలీ (సోనియా, రాహుల్, ప్రియాంక)ఆలోచనా ధోరణిని పరోక్షంగానే అయినా ఎండ కట్టారు.ఆ విధంగా పవార్ ఆ బాధ్యత తీసుకోవాలని చాకో సూచించారు. ఇందుకు సంబంధించి, పవార్ బహిరంగంగా ఎలాంటి వ్యాఖ్య చేయలేదు. అయితే, చాకో సహా మరికొందరు ‘సీనియర్’ కాంగ్రెస్ నాయకులు, అలాగే సిపిఎం, సిపిఐ నాయకులు కూడా పవార్’తో చాలా కాలంగా థర్డ్ ఫ్రంట్  విషయంగా చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. అయితే మహారాష్ట్రలో సంకీర్ణం మనుగడను దృష్టిలో ఉంచుకుని పవార్ ఆచితూచి అడుగులేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే చాకో పార్టీలో చేరిన సందర్భంలో కూడా ‘చాకో చేరికతో మహారాష్ట్రలోని మహా వికాస్ అగాడీ ప్రభుత్వానికి ఎలాంటి నష్టం జరగదని, పవార్ మహారాష్ట్ర సంకీర్ణ సర్కార్ ప్రస్తావన చేశారని విశ్లేషకులు పేర్కొంటున్నారు.  మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వ మనుగడ గురించ్బి  పవార్ ప్రత్యేకంగా పేర్కొనడం ద్వారా, ఆయన థర్డ్ ఫ్రంట్ విషయంలో వేచి చూసే ఆలోచనలో ఉన్నట్లు అర్థమవుతోందని కూడా  రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే అదే ఎన్సీపీ అసెంబ్లీ ఎన్నికల జరుగతున్న కేరళలో, పశ్చిమ బెంగాల్లో  కాంగ్రెస్ వ్యతిరేక పార్టీలకు మద్దతు ఇస్తోంది. దీన్ని బట్టి చూస్తే, ఎన్సీపీ - కాంగ్రెస్ మధ్య దూరం పెరుగుతోందని స్పష్టమవుతోంది. అయితే, థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఏ రకంగా ముడి పడుతుంది అనే విషయంలో ఇంకా స్పష్టత రావలసి ఉంది. అలాగే, కాంగ్రెస్ లేకుండా జాతీయ స్త్గాయిలో బీజేపీ వ్యతిరేక కూటమిని ఏర్పాటు చేయడం వలన, వ్యతిరేక ఓటు చీలి  అది మళ్ళీ బీజేపీకే మేలు చేస్తుందని, కాబట్టి, ప్రస్తుతం కాంగ్రెస్ సారధ్యంలోని యూపీఏని బలోపేతం చేయడమే ఉత్తమమనే అలోచన కూడా  విపక్ష శిబిరం నుంచి వినవస్తోంది. ఈ నేపధ్యంలోనే, ప్రస్తుతం యూపీఏ ఛైర్పర్సన్’గా ఉన్న సోనియా గాంధీ వయసు, అనారోగ్యం కారణంగా బాధ్యతల నుంచి తప్పుకుని పవార్’కు బాద్యతలు అప్పగించాలనే ప్రతిపాదన వచ్చిందని అంటున్నారు. అలాగే, ఇతర పార్టీలను, ముఖ్యంగా కాంగ్రెస్ నుంచి విడిపోయి సొంత కుంపటి పెట్టుకున్న మమతా బెనర్జీ సారధ్యంలోని తృణమూల్, జగన్మోహన్ రెడ్డి సారధ్యంలోని వైసీపీలను కలుపుకుని కూటమిని బలోపేతం చేయడం ద్వారా బీజేపీని దీటుగా ఎదుర్కోవచ్చనే ఆలోచనలు కూడా సాగుతున్నాయి. అయితే, ఇటు థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు అయినా, యూపీఏని బలోపేతం చేయడమే అయినా, పవారే .. కేంద్ర బిందువు. ఆయన సారధ్యంలోనే ప్రత్యాన్మాయం అనేది విపక్ష శిభిరం నుంచి వినవస్తున్న ప్రస్తుత సమాచారం. మరి అదే జరిగితే రాహుల గాంధీ పరిస్థితి ఏమిటి ? గాంధీ నెహ్రూ కుటుంబం పరిస్థితి ఏమిటి? ఏ ప్రత్యేక ప్రాధాన్యత లేకుండా అందరిలో ఒకరిగా ఫస్ట్ ఫ్యామిలీ సర్దుకు పోతుందా? అంటే..చివరకు ఏమవుతుందో .. ఇప్పుడే చెప్పలేమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది. గతంలో అనేక సందర్భాలలో ముఖ్యమంత్రి కేసీఆర్,ఆర్థిక మంత్రి హరీశ రావు, కరోనా కారణంగా రాష్ట్ర  ఆదాయం గణనీయంగా తగ్గిందని, పేర్కొన్నారు. అయితే, కరోనా నుంచి వేగంగా కోలుకుని, ఆర్థికంగా అంతే వేగంగా పుంజుకున్న రాష్ట్రాలలో తెలంగాణ ప్రధమ స్థానంలో  ఉందని కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సర్వే 2020-21 నివేదిక పేర్కొంది. పడిలేచిన కెరటంలా, తెలంగాణ ‘వీ’ ఆకారంలో ఆర్థికంగా నిలతొక్కుందని కేంద్రం జనవరి  చివరి వారంలో విడుదల చేసిన ఆర్థిక సర్వేలో పేర్కొంది. అలాగే, రెవిన్యూ వసూళ్ళలో రాష్ట్రం కరోనా పూర్వస్థితికి చేరిందని కూడా సర్వే చెప్పింది.   అలాగే,రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు కూడా ఈ మధ్య కాలంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పై సంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరమ జనవరి,ఫిబ్రవరి, మార్చి నెలలతో పోలిస్తే ఈ సంవత్సరం ఈ మూడు నెలల కాలంలో రాష్ట్ర ఆర్థిక వృద్ది రేటు 10 నుంచి  15 శాతం మెరుగ్గా ఉందని హరీష్ రావు ఒకటి రెండు ఇంటర్వ్యూలలో పేర్కొన్నారు.అలాగే, బడ్జెట్ విషయంలోనూ ఆయన చాల ఆశావహ దృక్పథంతోనే ఉన్నారు. బడ్జెట్  పాజిటివ్’గా ఉంటుదని, ఎవ్వరూ ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని, సంక్షేమ పథకాలలో,ఇతరత్రా బడ్జెట్ కేటాయింపులలో ఎలాంటి కోతలు ఉండవని కూడా హరీష్ హామీ ఇచ్చారు. గత సంవత్సరంలో కొంత మేర హామీ ఇచ్చిన మేరకు అమలు చేయలేక పోయిన సొంత జాగాలలో డబల్ బెడ్ రూమ్ ఇళ్ళ నిర్మాణం, రుణ మాఫీ వంటి  పథకాలను ఈ బడ్జెట్ ద్వారా అమలు చేస్తామని చెప్పారు. అలాగే, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ తమిళి సై చేసిన ప్రసంగంలోనూ ఆశావహ దృక్పధమే వ్యక్తమైంది. ఆమె తమ ప్రసంగంలో,  ప్రభుత్వం సంక్షేమ పథకాలకు పెద్ద పీట వేసిందని అన్నారు. ‘సంపద పంచాలి ,పేదలకు పంచాలి’ అనేది తమ ప్రభుత్వ విధానమని స్పష్టం చేశారు. అలాగే, పెరుగతున్న ఆదాయంలో అధికశాతం సంక్షేమానికే వెచ్చిస్తున్నామని స్పష్టం చేశారు. దీంతో బడ్జెట్’లో కొత్త పథకాలకు శ్రీకారం చుట్టే అవకాశం ఉంటుందా అన్న చర్చ జరుగుతోంది. మరో వంక ఉద్యోగ వర్గాల్లో పీఆర్సీకి సంబంధించి ఆర్థిక మంత్రి తమ ప్రసంగంలో  ప్రకటన చేస్తారా లేదా అనే ఆసక్తి నెలకొంది. అలాగే, సామాన్య  ప్రజలు ఇటీవల పెరిగిన పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరల భారం నుంచి మంత్రి హరీష్, ఏదైనా ఉపసమనం కలిపిస్తారా అని ఎదురు చూస్తున్నారు. గతంలో వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సామాన్య ప్రజలపై వంటగ్యాస్ ధర భారాన్ని తగ్గించేందుకు కొంత మొత్తాన్ని, రూ.50(?) రాష్ట్ర ప్రభుత్వం తరపున  సబ్సిడీగా ఇచ్చిన విషయాన్ని, అదే విధంగా అసెంబ్లీ ఎన్నికలు జరుగతున్న తమిళనాడులో డిఎంకే పార్టీ,తమ పార్టీని అధికారంలోకి వస్తే  గ్యాస్ బండపై వంద రూపాయల సబ్సిడీ ఇస్తామని చేసిన  వాగ్దానాన్ని  గుర్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే, ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు, సోమవారం ఆర్థిక మంత్రి హరీష్ రావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఆర్థిక  శాఖ ముఖ్య కార్యదర్శి రామ కృష్ణా రావు,సలహాదారు జీఆర్ రెడ్డితో బడ్జెట్ పద్దులఫై సుదీర్ఘంగా చర్చించి తుది మెరుగులు దిద్దారు. బడ్జెట్ తుది రూపం సిద్దమైన నేపధ్యంలో ఆర్థిక శాఖ ప్రింటింగ్ ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 18 ఉదయం మంత్రి వర్గం ఆమోదం పొందిన అనంతరం ఆర్థికమంత్రి హరీష్ రావు అదే రోజు రాష్ట్ర బడ్జెట్ 2021-22ను సభలో ప్రవేశ పెడతారు. 20, 22 తేదీల్లో బడ్జెట్‌పై సాధారణ చర్చ,23, 24, 25 తేదీల్లో బడ్జెట్‌ పద్దులపై చర్చ ఉంటుంది 26న ద్రవ్యవినిమయ బిల్లు (బడ్జెట్)పై చర్చ, సభామోదం ఉంటాయి.
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది.  అధికార తెరాస, ఖమ్మం స్థానానికి సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర రెడ్డి పేరును ప్రకటించడంలో కొంచెం జాప్యం చేయడంతో పాటుగా, హైదరాబాద్ స్థానం నుంచి , పీవీ కుమార్తె వాణీ దేవి పేరును చివరి క్షణంలో తెరమీదకు తేవడంతో అంత వరకు కొంత స్తబ్దుగా సాగిన ప్రచారం ఆ తర్వాత వేడెక్కింది. ఉద్యోగ నియామకాల విషయంలో తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ తప్పులో కాలేయడంతో విపక్షాలు, పోటీలో ఉన్న ప్రత్యర్ధులు, నిరుద్యోగ యువత, విద్యార్ధి సంఘాలు  ఒకే సారి ఆయన మీద  విరుచుకు పడ్డారు. ఆయన లెక్క తప్పని నిరుపిస్తం రమ్మని వరస సవాళ్ళు విసిరారు. దీంతో, మంత్రి నియామకా ఇష్యూని పక్కకు తప్పించేందుకు , ఐటీఐఆర్, వరంగల్ రైల్వే ఫ్యాక్టరీ వంటి సెంటిమెంటల్ ఇష్యూస్’ను తెరపైకి  తెచ్చారు. అలాగే, కేంద్ర ప్రభుత్వంపై విమర్శల దాడిని పెంచారు. చివరకు పొరుగు రాష్ట్రానికి చెందిన విశాఖ ఉక్కు ఆందోళన   కూడా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగమైంది.   రెండు నియోజక వర్గాలలో గతంతో పోలిస్తే ఈసారి ఓటర్ల సంఖ్య రెట్టింపు అయింది. ఈసారి రెండు నియోజక వర్గాలలో కలిపి 10 లక్ష 36 వేల మంది తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. అలాగే, రెండు పట్ట భద్రుల నియోజక వర్గాల్లో 164 మంది అభ్యర్ధులు పోటీలో ఉన్నారు.  గత ఎన్నికలతో పోలిస్తే ఇటు ఓటర్ల సంఖ్య, అటు అభ్యర్థుల సంఖ్యా రెట్టింపునకు పైగానే పెరగడంతో ఎన్నికలలో జోష్ పెరిగింది. దీనికితోడు అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో సాధారణ ఎన్నికలను తలపించే రీతిలో ప్రచారం సాగింది. ఎక్కువమంది అభ్యర్ధులు బరిలో ఉండడంతో, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి  తమకే ప్రయోజనం జరుగుతుందని అధికార పార్టీ ఆశపడుతోంది .  దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో చేదు ఫలితాలను చవిచూసిన టీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా వ్యూహ రచన చేసి కేటీఆర్, హరీష్ సహా మంత్రులు,ఎమ్మెల్యేలకు స్పెసిఫిక్ బాధ్యతలు అప్పగించారు. అలాగే,కాంగ్రెస్‌ అభ్యర్థులు చిన్నారెడ్డి, రాములునాయక్‌లకు మద్దతుగా ఉత్తమ్‌, భట్టి, రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తదితరులు విస్తృతంగా ప్రచారం చేశారు. బీజేపీ అభ్యర్థులు ఎన్‌.రాంచందర్‌రావు, ప్రేమేందర్‌రెడ్డిల తరఫున ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, ఎంపీ అరవింద్‌ తదితరులు ప్రచారాన్ని వేడెక్కించారు.  ఖమ్మం స్థానం నుంచి ప్రత్యక్ష ఎన్నికల్లో తొలిసారి పోటీకి దిగిన కోదండరాంకు, టీజేఎస్‌ పార్టీకీ ఈ ఎన్నికలు కీలకంగా మారాయి. ఖమ్మ స్థానం నుంచి పోటీ చేస్తున్న తీన్మార్ మల్లన్న ముందస్తు వ్యూహంతో ప్రధాన పార్టీల అభ్యర్ధులకు ధీటుగా ప్రచారం సాగించారు.  వామపక్షాల మద్దతుతో జయసారథి, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్‌, యువతెలంగాణ కార్యనిర్వాహక అధ్యక్షురాలు రాణీ రుద్రమ తదితరులు పోటీలో ఖమ్మం సీటును పట్టభద్రులు  ఎవరికి  పట్టం కడతారు అన్నది ప్రశ్నార్థకంగా మారింది. హైదరాబాద్ సీటు కూడా ఇటు అధికార తెరాసకు అటు సిట్టింగ్ సీటును నిలుపుకోవడం తో పాటుగా దుబ్బాక , జీహెచ్ఎంసి జోష్ ను కొనసాగించాలని ఆశ పడుతున్నబీజేలకే కూడా ఇజ్జత్ కీ సవాల్ గా మారింది. కాంగ్రెస్ అభ్యర్ధి పార్టీ సీనియర్ నాయకుడు సౌమ్యుడు, మాజీ మంత్రి చిన్నారెడ్డి, వామ పక్షాల మద్దతుతో పోటీ చేస్తున్న మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ కూడా గట్టి పోటీ ఇస్తున్నారు. సో.. చివరకు ఏమి జరుగుతుంది అంటే ఏదైనా జరగవచ్చును. ఈ నెల 14 వ తేదీన పోలింగ్ జరుగుతుంది.17 ఫలితాలు వస్తాయి .. అంతవరకు వెయిట్ అండ్ వాచ్ .  
సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది. ఒకప్పుడు ఎర్ర జెండాను దిగ్విజయంగా ఎదిరించి, మార్క్సిస్టులను మట్టి కరిపించిన మమతా దీదీ ప్రస్తుతం, కాషాయ కూటమి నుంచి గట్టి సవాలును ఎదుర్కుంటున్నారు. వరసగా పదేళ్ళు పాలించడం వలన సహజంగా వచ్చిన ప్రభుత్వ వ్యతిరేకత  కంటే, హిందూ ఓటు పోలరైజేషన్ ఆమెను మరింతగా భయపెడుతోంది. నిజానికి ఐదేళ్ళ క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం ఐదు శాతం కంటే తక్కువ ఓట్లు, మూడంటే మూడు అసెంబ్లీ సీట్లు మాత్రమే గెలుచుకున్న బీజేపీ..  2019 లోక్ సభ ఎన్నికల్లో ఏకంగా 40 శాతం ఓట్లతో 18 స్థానాలు గెలుచుకుంది. ఈ  మార్పు ఇంకా కొన్ని కారణాలు ఉంటే ఉండవచ్చును కానీ.. హిందువుల ఓటు పోలరైజ్  కావడమే ప్రధాన కారణం.  ఈ నేపధ్యంలోనే కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ చివరకు కమ్యూనిస్టులు కూడా బీజేపీలో  చేరారు. ఎన్నికల ప్రకటన వెలువడిన తర్వాత కూడా సిట్టింగ్ ఎమ్మెల్ల్యేలు సహా  తృణమూల్ టికెట్ వచ్చిన నాయకులు కూడా బీజేపీలో చేరుతున్నారు. అనేక మంది ఇతర రంగాల ప్రముఖులు, ముఖ్యంగా ఇంతకాలం, బీజేపీని హిదుత్వ అనుకూల ‘అచ్చుత్’ (అంటారని) పార్టీగా చూసిన ‘సెక్యులర్’ ప్రముఖులు కాషాయం కప్పుకోవడంతో మమతా బెనర్జీకి కొంచెం అలస్యంగానే అయినా, తత్త్వం బోధపడింది. అందుకే ఆమె ఇప్పుడు గుళ్ళూ,గోపురాలకు తిరుగుతున్నారు. కార్యకర్తల సమావేశాల్లో తానూ హిందువునేనని, చెప్పుకుంటున్నారు.  నిజానికి ఇలా నేనూ హిందువునే  అని సెక్యులర్ నేతలు బహిరంగంగా ప్రకటించుకోవడం మమతా బెనర్జీతోనే మొదలు కాలేదు. రాహుల్ గాంధీ తాను హిందువునని, జన్యుధారీ కశ్మీరీ బ్రాహ్మణుని అనీ.. తమ గోత్రం, ‘దత్తాత్రేయ’ గోత్రమని బహిరంగంగా ప్రకటించుకున్నారు. అలాగే  కొద్ది రోజుల క్రితం ప్రియాంకా గాంధీ తానూ హిందువునని చెప్పుకునేందుకు ‘మౌని అమావాస్య’ సందర్భంగా అలహాబాద్ లో గంగా స్నానం చేశారు. గతంలోనూ ఆమె ఎన్నికలకు ముందు గంగా యాత్ర చేశారు. అంతవరకు ఎందుకు కొద్దిరోజుల క్రితం సిపిఐ నారాయణ విశాఖ స్వామి ఆశీస్సులు తీసుకున్నారు. చంద్రబాబు, జగన్ రెడ్డి, కేసీఆర్ ఇలా తెలుగు నేతలు అనేక మంది లౌకిక వాదానికి కాలం చెల్లిందన్న సత్యాన్ని గ్రహించి కావచ్చు ‘నేనూ హిందువును’ అంటూ ప్రకటించుకునేందుకు పోటీ పడుతున్నారు. రాముడిని తలచుకున్నా, జై శ్రీరామ్ అన్నా తమ  లౌకిక వాదం మయలపడి పోతుందని భయపడిన నాయకులు ఇప్పుడు .. జై శ్రీరామ్ అనేందుకు కూడా వెనకాడడం లేదు.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది. గత కొంత కాలంగా సబర్మలతో సహా అనేక అంశాలపై స్పందిస్తూ.. కేరళను టార్గెట్ చేస్తున్న బీజేపీ నాయకులు అక్కడ తమ జెండా ఎగరేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా పార్టీ పాలసీని కూడా పక్కన పెట్టి మెట్రో మ్యాన్ శ్రీధరన్ ను పార్టీలో చేర్చుకుని ఆయనే తమ సీఎం అభ్యర్థి అని ప్రకటించిన 24 గంటలలో యూ టర్న్ తీసుకున్నారు. ఇది ఇలా ఉండగా ప్రస్తుతం సీఎంగా ఉన్న కమ్యూనిస్ట్ నేత పినరై విజయన్ పై గోల్డ్ స్మగ్లింగ్ ఆరోపణలు రావడంతో.. ఈ ఎన్నికలలో ఎల్డిఎఫ్ భవిష్యత్తుపై ప్రజలు ఏ తీర్పు ఇవ్వబోతున్నారనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది ఈ నేపథ్యంలో అక్షరాస్యతలో దేశంలోనే మొదటి స్థానంలో ఉన్న ఆ రాష్ట్ర ప్రజలు ఎవరిని ఆశీర్వదిస్తారు అనే అంశంపై ప్రముఖ మీడియా సంస్థ టైమ్స్ నౌ, సీ ఓటరుతో కలిసి ఒక సర్వేను నిర్వహించారు. ఈ సర్వే ప్రకారం చూస్తే పాపం కమలనాథులు అక్కడ పవర్ చేతికి రావటం అటుంచి కనీసం రెండు మూడు అసెంబ్లీ స్థానాల్లో గెలవటం కూడా కష్టమేనని ఆ సర్వే తేల్చి చెబుతోంది. కేరళలో ఈసారి జరిగే అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ తన హవా చాటుతుందన్న ఆ పార్టీ నేతల మాటలలో ఎలాంటి నిజం లేదని.. ప్రస్తుతానికి అది ఏమాత్రం సాధ్యం కాదని ఈ తాజా సర్వే తేల్చి చెప్పింది. అంతేకాకుండా మొత్తం 140 స్థానాలు ఉన్న కేరళలో.. ప్రస్తుత సీఎం పినరయి విజయన్ నేతృత్వంలోని లెఫ్ట్డ్ డెమొక్రటిక్ ఫ్రంట్ కు 82 సీట్లు పక్కా అని.. ఆయనే తిరిగి అధికారాన్ని నిలబెట్టుకుంటాడని సర్వే చెపుతోంది. అదే సమయంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూనైటెడ్ డెమొక్రాటిక్ ఫ్రంట్ కు 56 నుంచి 60 వరకు సీట్లు వచ్చే అవకాశం ఉందని ఈ సర్వేలో తేలింది. అంతేకాకుండా 2016 ఎన్నికలతో పోలిస్తే ఎల్ డీఎఫ్ ఓటింగ్ శాతం కూడా కొంత పెరగటం ఇక్కడ గమనార్హం. ప్రస్తుతం సీఎంగా ఉన్న విజయన్ మరోసారి సీఎం కావాలని 43.34 శాతం మంది మొగ్గు చూపినట్లుగా సర్వేలో తేలింది. కరోనా సమయంలో విజయన్ సీఎంగా బాగా పని చేసారని ఈ సర్వే పేర్కొంది. మరోపక్క దేశ ప్రధానిగా రాహుల్ గాంధీ ఉండాలని కేరళ ప్రజల్లో 55.84 శాతం మంది కోరుకుంటున్నట్లుగా ఈ సర్వే;లో తేలింది. అయితే కేరళలో ఎలాగైనా పాగా వేయాలని పట్టుదలతో కృషి చేస్తున్న బీజేపీకి ఈసారి కూడా నిరాశ తప్పదని ఈ సర్వేలో స్పష్టం అయింది. ఈ ఎన్నికలలో బీజేపీకి రెండు సీట్లు కూడా రావటం కూడా కష్టమేనని ఈ సర్వే తేల్చింది. అయితే ఎన్నికలకు ముందు ఇలాంటి సర్వేలు బయటకు రావడం.. తరువాత అందులో కొన్ని చతికిల పడడం మనం చూస్తూనే ఉన్నాం. మరి ఈ సర్వే ఫలితాలు నిజామా అవుతాయో లేదో తేలాలంటే కొద్దీ రోజులు వెయిట్ చేయాల్సిందే.        
రాజకీయాలు అంటేనే అదో జూదం. పూలమ్మిన చోటనే కట్టెలు అమ్మవలసి రావచ్చును. అలాంటి పరిస్థితే వచ్చినా, తలవంచుకుని పోగలిగితేనే, ఎవరైనా రాజకీయాలలో రాణించగలరు. అలాకాదని, అలిమి కానిచోట, కూడా తామే అధికులమని భావిస్తే, ఎందుకూ కాకుండా పోతారు. అలాంటి వారు ఇద్దరూ కూడా ఇప్పుడు మన కళ్ళముందే ఉన్నారు.  జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు. అలాగే జయ మరణం తర్వాత ఆమె పరిస్థితి ఏమిటో కూడా వేరే చెప్పవలసిన, అవసరం లేదు. జైలు పాలయ్యారు. సర్వం తానై నడిపించిన పార్టీ నుంచి  బహిష్కరణకు గురయ్యారు. జయ ఉన్నంత వరకు తన వారుగా ఉన్న వారందరూ కానివారయ్యారు. ఒంటరిగా మిగిలారు.  నిజానికి నాలుగేళ్ళు జైలు జీవితం గడిపిన తర్వాత కూడా ఆమె తలచుకుంటే.. రాష్ట్ర రాజకీయాలలో, ముఖ్యంగా అధికారంలో ఉన్న డిఎంకే కూటమిలో అలజడి సృష్టించగలరు. ఎన్నికలలో ఆమె గెలవక పోవచ్చును కానీ.. తనను కాదన్న అన్నాడిఎంకేను ఓడించగలరు. అయిన  ఆమె అందుకు విరుద్ధంగా  రాజకీయాలకు వీడ్కోలు పలికి మౌనంగా పక్కకు తప్పుకున్నారు. రాజకీయ సన్యాసం ప్రకటించారు. ఉమ్మడి శతృవు డిఎంకే ను ఓడించేందుకు అన్నా డిఎంకే కూటమి  పోటీ చేయాలని, కూటమి ఐక్యతను దెబ్బతీయరాదనే ఉద్దేశంతోనే ఆమె రాజకీయ సన్యాసం ప్రకటించారు.    శశికళ మౌనంగా వెళ్లి పోవడం వెనక ఇంకా అనేక కారణాలున్నా ,అసలు కారణం ఆమె, రాజకీయ విజ్ఞత, వివేకం. ఆమె జైలుకు వెళ్ళిన సమయంలో జయలలిత సమాధి వద్ద ఎంత కసిగా, కోపంగా ‘మౌన’ ప్రతిజ్ఞ చేశారో చూశా. అలాంటి ఆమె ఇప్పుడు ఇలా ‘మౌనం’గా వెనకడుగు వేశారంటే, అది ఆలోచించ వలసిన విషయమే.ఆమె వ్యుహతంకంగానే సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే అనేక మంది అనేక కోణాల్లో శశికళ సంచలన నిర్ణయాన్ని విశ్లేషించారు.జైలు జీవితం తర్వాత కూడా అన్నా డిఎంకే నాయకులు తనను అగ్రనేతగా అంగీకరించక పోవడం, అమిత్ షా చెప్పినా.. అన్నా డిఎంకే నాయకులు ఆమెను, మేనల్లుడు దినకరన్’ను కులం పేరున, కుటుంబం పేరున దూరం చేయడం, తిరిగి పార్టీలోకి తీసుకోకపోవడంతో ఆమె మనసు కష్టపెట్టుకుని, సన్యాస నిర్ణయం తీసుకున్నారని కొందరంటున్నారు. పార్టీ మీద పట్టు లేదని, చరిష్మా అసలే లేదని, అందుకే ఆమె అలా నిశ్శబ్ధంగా రాజకీయ సన్యాసం స్వీకరించారని ఇంకొందరు విశ్లేషించారు. ఈ విశ్లేషణలో కొంత నిజం ఉంటే ఉండవచ్చును.. కానీ ఆమె గతాన్ని, నైజాన్ని గుర్తు చేసుకుంటే ఆమె స్ట్రైక్ బ్యాక్ వ్యూహంతోనే ఒకడుగు వెనక్కివేశారని ఆమెతో సన్నిహితంగా మెలిగినవారు, ఆమె రాజకీయ చాణక్యం తెలిసిన వారు అంటారు.   నిజానికి జైలులో ఉన్న కాలంలో కానీ, జైలు నుంచి విడుదలై వచ్చిన తర్వాత కానీ, ఆమె రాజకీయ సన్యాసం వైపు అడుగులు వేస్తున్నట్లు కనిపించలేదు. బెంగుళూరు జైలు నుంచి విడుదలై చెన్నైలో ప్రవేశించిన నప్పుడు ఆమె పెద్ద కాన్వాయ్ తో  తమ కారుకు అన్నాడిఎంకే జెండాతోనే ఎంటరయ్యారు. అలా ఎంట్రీలోనే రాజకీయ ఆకాంక్షను వెంట తెచ్చుకున్నారు. చివరకు ‘సన్యాస’ ప్రకట చేసే వరకు కూడా ఆమె రాజకీయ కార్యకలాపాలు సాగిస్తూనే ఉన్నారు. అటు ఢిల్లీని ఇటు చెన్నైనికూడా కదిల్చారు. అంతేకాదు, రాజకీయాలపై విరక్తితో కాదు, రాజకీయ కసితో, ఉమ్మడి శత్రువు (డిఎంకే) ను ఓడించేందుకే తాను రాజకీయాలనుంచి తపుకుంటున్నట్లు చెప్పారు.  సో .. సన్యాసం తీసుకోవాలనే ఆలోచన, రాజకీయవ్యూహం లోంచి పుట్టిందే కానీ,వైరాగ్యంతో పుట్టింది కాదు ,అన్నవిశ్లేషణ వాస్తవానికి ఇంకొంత దగ్గరగా ఉందని అనుకోవచ్చును. ఇది ‘కామా’నే కాని ‘ఫుల్స్టాప్’ కాదని అంటున్నారు.  ముఖ్యమంత్రి ఎడప్పాడి కే. పళని స్వామి (ఈపీఎస్) ఆమెను పార్టీలోకి అనుమతిస్తే తన కుర్చికీ ఎసరు పెడతారనే భయంతోనే,, ఆమె ఎంట్రీని అడ్డుకున్నారు. ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం, శశికళ ఒకే సామజిక వర్గానికి చెందిన వారు కావడం కూడా, ముఖ్యమంత్రి ఈపీఎస్’ భయానికి కారణంగా పేర్కొంటారు. అందుకే  ఆయన, ‘మన్నార్గుడి’ ఫ్యామిలీని బూచిగా చూపించి, ఆమెను దూరంగా ఉంచారని పార్టీలో ఒక వర్గం గట్టిగా విశ్వసిస్తుంది. అయితే ఆమె శక్తియుక్తులను కూడతీసుకుని  పులిలా పంజా విసిరేందుకే ఆమె వ్యూహాత్మకంగా ఒక అడుగు వెనక్కి వేశారు కావచ్చును అని కూడా, తమిళ రాజకీయ వర్గాల్లో ఒక చర్చ జరుగుతోంది.  గతంలో ఆమె జయలలితతో విబేధాలు వచ్చిన సమయంలో కూడా ఇలాగే కొద్ది కాలం మౌనంగా తెర చాటుకు వెళ్లి పోయారు.  కొద్ది కాలంలోనే మళ్ళీ ‘పోయస్ గార్డెన్’లో ప్రత్యక్షమయ్యారు. జయలలిత స్వయంగా ఆమెను వెనక్కి పిలుపించుకోవలసిన పరిస్థితులను సృష్టించారు. అలా  మళ్ళీ  చక్రం తిప్పారు. జయలలిత మరణం వరకు ఆమె అందరికీ చిన్నమ్మగా అమ్మకు పెద్దమ్మగా సర్వం తానై నిలిచారు. చివరకు జయ అంత్యక్రియల్లో కూడా ఆమెదే పై చేయిగా కనిపించింది.   జయలలిత చనిపోయిన సందర్భంలోనే అన్నా డిఎంకే ఎమ్మెల్ల్యేలో సుమారు 30 మంది వరకు ఆమెకు మద్దతుగా ఉన్నారన్న వార్తలొచ్చాయి. నిజానికి,ఇప్పటికి కూడా ఒక్క అన్నా డిఎంకే లోనేకాదు,డిఎంకే ఇతర పార్టీలలో కూడా  ఆమె అవసరం ఉన్న వాళ్ళు ఉన్నారు. కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో ‘మన్నార్గుడి’ ఫ్యామిలీ మద్దతు లేకుండా గెలిచే అవకాశం లేదు.  ఇవ్వన్నీ నిజమే అయినా.. అన్నీ ఉండి, ఎవరు లేని శశికళలో, ఇంకా  ఎవరి కోసం తాపత్రయ పడాలి? అనే ప్రశ్న జనించి ఉంటే, ఆమె రాజకీయ సన్యాసం నిజం కావచ్చును. ఎందుకంటే ఆమె నెచ్చలి, జయలిత లేరు, భర్త అంతకంటే ముందే చనిపోయారు, పిల్లలు లేరు... పైగా నాలుగేళ్ళ జైలు జీవితం ఆమెలో మార్పు తెచ్చి ఉండవచ్చును. ఈ వయస్సులో తనవారంటూ ఎవరు లేని తనకు రాజకీయాలు ఎందుకు ? శేష జీవితాన్ని ఇలా సాగిద్దామనే ఆలోచన నిజంగా వచ్చి ఉంటే, ఆమె సన్యాసం సత్యం అయినా కావచ్చును, కాకపోనూ వచ్చును. కానీ  శశికళ... ఆమెను అర్థం చేసుకోవడం, అంచనా వేయడం , అంత తేలిగ్గా అయ్యే పని కాదు..
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు. కాంగ్రెస్ అధినాయకత్వం పై నేరుగా అస్త్రాలు సంధించారు. రాహుల్ గాంధీ పేరు చెప్పకుండానే, ఆయన నాయకత్వానికి పనికిరాడని తేల్చి చెప్పారు. ఎవరైనా పార్టీ అధ్యక్షుడు అయితే కావచ్చును, కానీ, ప్రజానాయకుడు కాలేడని, రాహుల గాంధీ ప్రజానాయకుడు కాదు కాలేరు,అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తరచూ రాహుల్ గాంధీని ఉద్దేశించి చేసే  ‘నామ్’ధారీ వ్యంగ్యాస్త్రాన్నే కాంగ్రెస్ సీనియర్ నాయకులు కూడా సందించారు. ఇక అక్కడి నుంచి విధేయ, అసమ్మతి వర్గాల మధ్య మాటల యుద్ధం ఎదో ఒక రూపంలో సాగుతూనే వుంది. అదే క్రమంలో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ, కరుడు కట్టిన ముస్లిం మతోన్మాది, అబ్బాస్ సిద్దిఖీతో కాంగ్రెస్ పార్టీ చేతులు కలపడం అసమ్మతి నాయకులకు మరో అస్త్రాన్ని అందించింది. విషయంలోకి వెళితే, ఇటీవల పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా లోక్’సభలో కాంగ్రెస్ పక్ష నాయకుడు, పశ్చిమ బెంగాల్ పీసీసీ అధ్యక్షుడు అధీర్’రంజన్ చౌదరి, ముస్లిం మత ప్రచారకుడు, అబ్బాస్ సిద్దిఖీతో  వేదిక పంచుకున్నారు.అంతకు ముందే వామ పక్ష కూటమితో  పొత్తు కుదుర్చుకున్న కాంగ్రెస్ పార్టీ, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)ను కూటమిలో చేర్చుకుంది. ఇలా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) అమోదం లేకుండా మతోన్మాద ఐఎస్ఎఫ్’ తో ఎన్నికల పొత్తు పెట్టుకోవడం ఆ పార్టీ నాయకుడు,సిద్ధిఖీతో  పీసీసీ చీఫ్ వేదిక  పంచుకోవడం పై అసమ్మతి నేతలు మండి పడుతున్నారు. ఇలా సిద్దిఖీతో వేదిక పంచుకోవడం పార్టీ మౌలిక సిద్ధాంతాలకు వ్యతిరేకం అంటూ అసమ్మతి వర్గానికి చెందిన కీలక నేత, రాజ్యసభ సభ్యుడు,ఆనంద్ శర్మ మండిపడ్డారు. అంతే కాదు, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)తో జనవరిలో కుదుర్చుకున్న పొత్తుకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ)అమోదం లేదని ఆనంద్ శర్మ, అభ్యంతరం వ్యక్త చేశారు. పార్టీ విశ్వసించే లౌకిక వాదానికి కాంగ్రెస్ అధిష్టానం తీసుకున్న నిర్ణయం గొడ్డలి పెట్టని ఆయన తీవ్రంగా స్పందించారు.   శర్మ వ్యాఖ్యలపై అధీర్ రంజన్ చౌదరి అంతే ఘాటుగా ప్రతిస్పందించారు. “నిజాలు తెలుసుకోండి ఆనంద్ శ‌ర్మ జీ” అంటూ ఆయ‌న వ‌రుస ట్వీట్లు చేశారు. వ్య‌క్తిగ‌త ప్ర‌యోజ‌నాలు ప‌క్క‌న‌పెట్టి, ప్ర‌ధానిని పొగిడి టైమ్ వేస్ట్ చేయ‌కండంటూ ఆయ‌న ఓ ట్వీట్లో అన్నారు. ఆనంద్ శ‌ర్మ అన‌వ‌స‌రంగా కాంగ్రెస్‌ను ల‌క్ష్యంగా చేసుకుంటున్నార‌ని, ఈ అంశాన్ని పెద్ద‌ది చేసి చూపిస్తున్నార‌ని విమ‌ర్శించారు. ఆయ‌న ఉద్దేశాలు స‌రైన‌వే అయితే నేరుగా తనతో మాట్లాడ వలసిందని అన్నారు. బెంగాల్‌లో సీపీఐ(ఎం) కూట‌మికి నేతృత్వం వ‌హిస్తోంది. అందులో కాంగ్రెస్ ఓ భాగం. మ‌త‌తత్వ‌, విభ‌జ‌న రాజ‌కీయాలు చేస్తున్న బీజేపీకి చెక్ పెట్ట‌డానికే ఈ కూట‌మి అని మ‌రో ట్వీట్‌లో అధిర్ రంజ‌న్ అన్నారు. అక్కడతోనూ ఆగలేదు ... ట్వీట్ల మీద ట్వీట్లు సంధిస్తూ, ఆనంద్ శర్మ, బీజేపీ మత విభజన, అజెండాను బలపరుస్తున్నారని, పరోక్షంగా జీ23 నాయకులు బీజేపీకి ప్రయోజనం చేకూరుస్తున్నారని ఆరోపించారు.అంతే కాదు, క్షేత్ర స్థాయి వాస్తవ పరిస్థితులు తెలియకుండా, ఆనంద్ శర్మ పార్టీ మీద దండెత్తడం ఉచితం కాదని చౌదరి ఎదురుదాడి చేశారు. అసమ్మతిలో అసమ్మతి. ఇదలా ఉంటే, కాంగ్రెస్ పార్టీ  సమూల పక్షాళన కోరుతూ సోనియా గాంధీకి,గత సంవత్సరం  జీ 23గా ప్రాచుర్యం పొందిన సీనియర్ నాయకులు రాసిన లేఖపై సంతకాలు చేసిన  నాయకుల్లో నలుగురు,జమ్మూలోసమావేసమైన నాయకుల తాజా నిర్ణయాలు, వ్యాఖ్యలు,విమర్శల పట్ల అసంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరం సోనియా గాంధీకి రాసిన లేఖలో ప్రస్తావించిన అంశాలకు కట్టుబడి ఉన్నామని, అయితే, జీ 23లోని కొందరు సహచరులు, ఇటీవల గీతదాటి చేస్తున్న వ్యాఖ్యలు, విమర్శలను తాము సమర్ధించడం లేదని ఆ నలుగురు పేర్కొన్నారు. ఇందులో ముఖ్యంగా, రాజ్యసభ మాజీ డిప్యూటీ చైర్మన్, పీజే కురియన్ అయితే, “కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు అవసరమైన సంస్కరణలు తెచ్చేందుకు చేసే ప్రయత్నాలను పూర్తిగా సమర్దిస్తాను, కానీ, ‘లక్ష్మణ రేఖ’ దాటితే ఒప్పుకునేది లేదు”అని అసమ్మతిలో అసమ్మతికి తెర తీశారు.అలాగే, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ కుమారడు, మాజీ ఎంపీ సందీప్ దీక్షిత్,మధ్య ప్రదేశ్ సీనియర్ కాంగ్రెస్ నాయకుడు అజయ్ సింగ్’ కూడా గులాం నబీ ఆజాద్, కపిల్ సిబల్, ఆనంద్ శర్మ, మనీష్ తివారీ వంటి జీ 23 కీలక నేతలు అధినాయకత్వంపై చేసిన వ్యాఖ్యలను తప్పు పట్టారు. అలాగే, పార్టీ సీనియర్ నాయకుడు కేంద్ర మాజీమంత్రి వీరప్ప మొయిలీ కూడా,గత సంవత్సరం పార్టీ సీనియర్ నాయకులు  ఒక పరిమిత లక్ష్యంతో  సోనియా గాంధీకి లేఖ రాయడం జరిగిందని, ఆ పేరున జరుగతున్న  కార్యక్రమాలు లేఖ సంకల్పానికి  విరుద్ధమని అన్నారు. జీ 23 కార్యకలాపాలపై రాహుల్ గాంధీ కూడా పరోక్షగా స్పందించారు, ఒకప్పుడు ఎన్ఎస్’యుఐ, యూత్ కాంగ్రెస్’ కు సంస్థాగత ఎన్నికలు వద్దన్న వారే ఇప్పుడు ఇంకోలా మాట్లాడుతున్నారని పరోక్షంగానే అయినా సంస్థాగత ఎన్నికలు నిర్వహించడంతో పాటుగా, పార్టీ పక్షాలనకు తమ కుటుంబం వ్యతిరేకం కాదని, అందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఈ నేపధ్యంలో కాంగ్రెస్ పార్టీలో చెలరిగిన కలకలం  ఇక ముందు ఏమవుతుందో .. ఇంకెన్ని  మలుపులు తిరుగుతోందో ..చూడవలసిందే కానీ ఉహించలేము.
  వేసవి అంటే మండే ఎండలు, వేడి గాలులు,  చెమటలు పట్టించే వాతావరణం.. ఇవన్నీ ఉంటాయి.  ఇలాంటి రోజుల్లో  రోడ్డు పక్కన అమ్మే చెరకు రసం తాగితే ఎంతో హాయిగా ఉంటుంది. నిమ్మరసం, నల్ల ఉప్పు, పుదీనా కలపడం వల్ల చెరకు రసం  రుచి మరింత ఇనుమడిస్తుంది.  పైగా మార్కెట్ లో అమ్మే కూల్ డ్రింకులతో పోలిస్తే.. చెరకు రసం చాలా సహజమైన పానీయం.  అందుకే వేసవిలో చాలామంది చెరకు రసం తాగడానికి చాలా ఇష్టపడతారు.  కానీ ఎంతో  ఆరోగ్యకరమైనదని, తక్షణ చల్లదనాన్ని ఇచ్చేదాని అనుకునే  చెరకు రసం  తాగడం నిజంగా సురక్షితమేనా? ఈ విషయం నేటి కాలంలో చాలా సందేహమైన ప్రశ్నగా మారుతోంది.  వేసవి కాలంలో చెరకు తాగడం ఆరోగ్యానికి ఎంత వరకు మంచిది? దీని గురించి వైద్యులు ఏం చెప్తున్నారో తెలుసుకుంటే.. చెరకు రసం మంచిదే.. కానీ ఎక్కువగా తాగితే.. వేసవిలో చెరకు రసం చాలా ఎక్కువగా తాగుతుంటారు.  చెరకు రసం  శరీరానికి తేమను అందించి, తక్షణ శక్తిని ఇస్తుంది.  చెరకు రసంలోని  సహజ చక్కెర శరీరానికి తక్షణ శక్తిని అందించి, అలసట , డీహైడ్రేషన్ నుండి ఉపశమనం కలిగిస్తుంది. అందుకే మండుటెండలలో   ఉపశమనం కోసం చాలామంది చెరకు రసం తాగుతారు. చెరకు సహజంగానే తీపిగా ఉన్నప్పటికీ, రసంగా తీసుకున్నప్పుడు దానిలోని చక్కెర శాతం మరింత ఎక్కువగా మారుతుంది. రసం తీయడం వల్ల ఫైబర్ దాదాపు పూర్తిగా తొలగిపోతుంది, ఇది సాధారణంగా శరీరం చక్కెరను గ్రహించడాన్ని నెమ్మదింపజేస్తుంది. అందువల్ల, చెరకు రసం తాగడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు వేగంగా పెరిగే అవకాశం ఉంటుంది.  చెరకు రసం మధుమేహ వ్యాధిగ్రస్తులకు  మంచిది కాదని చెబుతారు. అంతేకాకుండా, ఫ్యాటీ లివర్, ఊబకాయం లేదా జీవక్రియ సమస్యలు ఉన్నవారు చెరకు రసం తాగడాన్ని చాలా తగ్గించాలని వైద్యులు చెబుతున్నారు. ఎక్కువ చక్కెర శరీరంలో కొవ్వు పేరుకుపోవడానికి కారణమై ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. చెరకు రసం పరిశుభ్రత.. చెరకు రసం విషయంలో ఉన్న మరొక  ప్రమాదం దాని పరిశుభ్రత. తరచుగా చెరకు  రసాన్ని ఆరుబయట తయారు చేస్తారు, చెరకు పైన ఉండే తెల్లని పొడిని శుభ్రపరచకుండా చెరకు నుండి రసం తీస్తుంటారు.  పైగా చెరకు రసం తీసే చోట  యంత్రాలు, ఐస్, నీరు , గ్లాసులు సరైన పరిశుభ్రతతో ఉండవు. వైద్యుల ప్రకారం, రసం తయారీలో ఉపయోగించే యంత్రాలు లేదా ఐస్  శుభ్రంగా లేకపోతే, బ్యాక్టీరియా , వైరస్‌లు సులువుగా అటాక్ అవుతాయి. దీనివల్ల టైఫాయిడ్, కలరా , హెపటైటిస్ వంటి నీటి ద్వారా సంక్రమించే వ్యాధుల ప్రమాదం పెరుగుతుంది. చెరకు రసం విషయంలో ఎవరు జాగ్రత్తగా ఉండాలంటే.. చెరకు రసం తాగే విషయంలో కొందరు చాలా జాగ్రత్తగా ఉండాలని వైద్యులు చెబుతున్నారు.  ముఖ్యంగా మధుమేహం, ఊబకాయం, లేదా ఫ్యాటీ లివర్ ఉన్నవారు,  రక్తంలో చక్కెర స్థాయిలు వేగంగా పెరుగుతున్నవారు చెరకు రసం తాగే ముందు జాగ్రత్త వహించాలి. చెరకు రసాన్ని ఎల్లప్పుడూ శుభ్రమైన , పరిశుభ్రమైన ప్రదేశం నుండే కొనుగోలు చేయాలి.                                *రూపశ్రీ.
సాధారణంగా తాంబూలం వేసుకోవడం అనేది మన సంప్రదాయంలో ఒక భాగం. కానీ, ఆ తాంబూలానికి కొన్ని ప్రత్యేకమైన ఆయుర్వేద మూలికలను జత చేస్తే, అది గుండెను రక్షించే ఒక అద్భుతమైన ఔషధంగా మారుతుందని మీకు తెలుసా? హార్ట్ ఎటాక్ ప్రమాదాన్ని తగ్గించడంలో ఈ 'ఆయుర్వేద పాన్' అద్భుతంగా పనిచేస్తుంది. గుండె రక్తనాళాల్లో అడ్డంకులను (Blockages) తొలగించి, గుండెపోటు రాకుండా కాపాడే ప్రత్యేక ఆయుర్వేద పాన్/తాంబూలం తయారీ విధానం మరియు దాని ప్రయోజనాలు ఈ వీడియోలో చూడండి. ఈ వీడియోలో గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరిచే హార్ట్ స్పెషల్ తాంబూలం తయారీని వివరించారు: ఈ ఆయుర్వేద తాంబూలానికి కావలసినవి: తమలపాకు: ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది మరియు ఔషధ గుణాలను రక్తంలోకి త్వరగా చేరుస్తుంది. అర్జున చెట్టు బెరడు చూర్ణం: గుండె పనితీరును మెరుగుపరచడంలో ఇది అగ్రగామి. వెల్లుల్లి: రక్త నాళాల్లో పేరుకుపోయిన కొవ్వును (Cholesterol) కరిగించి, అడ్డంకులను తొలగిస్తుంది. అల్లం లేదా సొంఠి: రక్త ప్రసరణను సాఫీగా చేస్తుంది. దాల్చిన చెక్క: రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుంది. ఎలా తీసుకోవాలి? వీడియోలో చూపిన విధంగా, తమలపాకులో ఈ మూలికలను సరైన మోతాదులో ఉంచి, తాంబూలంలా చప్పరిస్తూ తీసుకోవాలి. ఇది రక్తాన్ని పల్చగా ఉంచి, గడ్డకట్టకుండా (Blood Clots) చేయడంలో సహాయపడుతుంది. ప్రయోజనాలు: గుండె రక్తనాళాల్లో బ్లాకేజీలు ఏర్పడకుండా నిరోధిస్తుంది. చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి, గుండె కండరాలను దృఢంగా మారుస్తుంది. అధిక రక్తపోటు (BP) సమస్యను అదుపులో ఉంచుతుంది. శరీరంలోని వ్యర్థాలను తొలగించి జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.   మరిన్ని ఆరోగ్య సూచనలు మరియు పరిష్కారాల కోసం మా యూట్యూబ్ ఛానెల్ "TeluguOne Health" ను సందర్శించి సబ్‌స్క్రైబ్ చేయండి! సూచన: ఇది కేవలం సమాచారం కోసం మాత్రమే. తీవ్రమైన గుండె సమస్యలు ఉన్నవారు వైద్యుల సలహా మేరకు మాత్రమే వీటిని ప్రయత్నించాలి.