LATEST NEWS
మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి తాను చేసే ప్రతి పర్యటనలోనూ.. క్కడ అడుగుపెట్టినా బలప్రదర్శన చేయాలన్న ఆత్రం తప్ప.. తాను ఎందుకు పర్యటన చేస్తున్నారు అన్న ధ్యాస కనిపించడం లేదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. తాజాగా ఆయన బుధవారం (జులై 15) భీమవరం, కిర్లంపూడి లలో పర్యటించారు.   రెండు చోట్లా కూడా గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. ప్రజలలో పట్టు నిరూపించుకోవడానికి ఆయన చేపట్టిన ఏ పర్యటన అయినా సరే.. ఉద్రిక్తతలు, గందరగోళం మధ్యే సాగుతున్నాయి. దీంతో ఆశించిన సానుకూలతకు బదులుగా ప్రజల నుంచి వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. తాజాగా బుధవారం (జులై 15)పర్యటనల్లోనూ అదే జరిగింది.   ముందుగా ఆయన భీమవరంలో మత్స్య పరిశ్రమకు సంబంధించి  రవాణా సమస్యలతో బాధపడుతున్న స్థానిక ఆక్వా రైతులకు మద్దతుగా జరిగిన నిరసనలో పాల్గొన్నారు. అయితే ఆయన భీమవరం పర్యటనలో తొక్కిసలాట చోటు చేసుకుంది. స్వయంగా జగనే దాని వల్ల ఇబ్బందులు పడ్డారు. సొంత మద్దతు దారులే ముందుకు తోసుకుని రావడంతో ఆయన వేదికపై బొక్కబోర్లా పడినంతపనైంది.  భీమవరం  సభకు సంబంధించిన పలు వీడియోలు సామాజిక మాధ్యమాల్లో  తెగ వైరల్ అవుతున్నాయి. వేదికపై జగన్ చుట్టూ చేరిన అభిమానులు ఆయనను తాకేందుకు, ఆయన దృష్టిని ఆకట్టుకునేందుకు చేసిన ప్రయత్నాలు వికటించాయి. స్వయంగా తన మద్దతు దారుల తోపులాట కారణంగానే  జగన్ వేదికపై అదుపు తప్పి బోర్లా పడబోయారు. భద్రతా సిబ్బంది అప్రమత్తంగా వ్యవహరించారు కనుక సరిపోయింది కానీ.. లేకుంటే పెద్ద ప్రమాదమే జరిగి ఉండేదని పరిశీలకులు అంటున్నారు.   సరే బలప్రదర్శన కారణంగా భీమవరంలో జరిగిన నిర్వాకం చాలదన్నట్లుగా దివంగత ముద్రగడ పద్మనాభం అంత్యక్రియలకు కూడా జగన్ భారీ ర్యాలీతో వెళ్లారు. జగ్గయ్య పేట నుంచి రోడ్డు మార్గంలో కిర్లంపూడికి చేరుకున్న జగన్ పర్యటన అంత్యక్రియలకు వెడుతున్నట్లుగా కాకుండా ఏదో యుద్ధానికి వెడుతున్నారా అన్నట్లుగా భారీ ర్యాలీగా సాగింది.  మరణించిన నేతకు నిశ్శబ్దంగా నివాళు లర్పించాల్సిన   సమయంలో ఇలాంటి భారీ ప్రదర్శనలు నిర్వహించడం విమర్శలకు దారితీసింది. ముద్రగడ పద్మనాభం అంత్యక్రియల వేదిక వద్ద జగన్ రాకతో  హడావుడి, గందరగోళం నెలకొన్నాయి సీనియర్ నేత చివరి వీడ్కోలు కార్యక్రమం కాస్తా, రాజకీయ బలప్రదర్శనగా  ప్రదర్శనగా మారిందని ముద్రగడ అభిమానులు తీవ్ర అసహనం, అసంతృప్తి వ్యక్తం చేశారు.   YS Jagan Mohan Reddys tour, Bhimavaram aqua farmers protest, Mudragada Padmanabham's funeral, YSRCP turmoil
మాజీ మంత్రి, కాపు ఉద్యమ నేత దివంగత ముద్రగడ పద్మనాభం అంత్యక్రియల వేళ చోటుచేసుకున్న ఉద్రిక్త పరిణామాలు రాజకీయంగా మలుపు తిరిగాయి. ఈ వివాదానికి సంబంధించి వైసీపీ  సీనియర్ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబుపై పోలీసు కేసు నమోదైంది.  కిర్లంపూడి పోలీస్ స్టేషన్‌లో ఆయనతో పాటు మరికొందరు  వైసీపీ నేతలపై  పోలీసులు  ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం విధుల్లో ఉన్న పోలీసు సిబ్బందిని అడ్డుకుని, వారిపై భౌతిక దాడికి దిగారనే ఆరోపణలపై ఈ చర్యలు తీసుకున్నారు.  విషయమేంటంటే.. ముద్రగడ పద్మనాభం భౌతికకాయానికి అధికారిక లాంఛనాలతో  బుధవారం (జులై 16) అంత్యక్రియలు నిర్వహించేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. అయితే..  దీనిని ముద్రగడ కుటుంబ సభ్యులు వ్యతిరేకించారు. తమ కుటుంబ నిర్ణయం ప్రకారమే, సాధారణ పద్ధతిలో అంత్యక్రియలు జరగాలని వారు స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో అక్కడ ఉన్న వైసీపీ శ్రేణులు, నేతలు కూడా ప్రభుత్వ లాంఛనాల నిర్వహణను అడ్డుకునేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలోనే పోలీసులకు, అక్కడ ఉన్న రాజకీయ నాయకులకు మధ్య  వాగ్వాదం చోటుచేసుకుంది. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం తుపాకులతో సెల్యూట్ చేస్తూ గార్డ్ ఆఫ్ హానర్ సమర్పించేందుకు సిద్ధమైన ఏఆర్ ఎస్సై అప్పలరాజుతో పాటు ఇతర కానిస్టేబుళ్లను అంబటి రాంబాబు, ఆయన అనుచరులు   నెట్టివేశారని పోలీసులు తమ ఫిర్యాదులో పేర్కొన్నారు. విధినిర్వహణలో ఉన్న తమపై దాడి చేసి తోసి వేసి తన విధులకు ఆటంకం కల్పించారని బాధితులు ఆరోపించారు.   పోలీస్ సిబ్బంది ఇచ్చిన రాతపూర్వక ఫిర్యాదు మేరకు కిర్లంపూడి పోలీసులు  చట్టప్రకారం చర్యలకు ఉపక్రమించారు. ఈ ఘటనపై తీవ్రంగా స్పందిస్తూ మాజీ మంత్రి అంబటి రాంబాబు,  ఇతర వైసీపీ   కేసు నమోదు చేశారు.  ఈ వివాదంపై రాజకీయవర్గాలలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ముద్రగడ కుటుంబ సంప్రదాయాలు, వారి ఇష్టాయిష్టాలను గౌరవించకుండా బలవంతంగా ప్రభుత్వ లాంఛనాలు జరపాలని చూడటం వల్లే ఈ ఘర్షణ వాతావరణం ఏర్పడిందని ఒక వర్గం వాదిస్తుండగా,  విధుల్లో ఉన్న పోలీసుల  నెట్టేయడం చట్టరీత్యా నేరమని, శాంతిభద్రతలను కాపాడాల్సిన నాయకులే ఇలాంటి చర్యలకు పాల్పడటం సరికాదని  మరి కొందరు అంటున్నారు.   Mudragada Padmanabham Funeral Controversy, Kirlampudi Police Station FIR, YSRCP Leaders Police Push Case
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి నందమూరి వారసుడు, స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ రాజకీయరంగ ప్రవేశంపై జోరుగా చర్చ సాగుతోంది. ఈ నెల 18న ఎన్టీఆర్ తన అభిమానులతో ఒక భారీ స్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేస్తుండటమే ఇందుకు ప్రధాన కారణం. ఈ నేపథ్యంలో ఆయన జూలై 18న నూతన రాజకీయ పార్టీని ప్రకటిస్తారా, లేక కేవలం సామాజిక సేవా సంస్థకే పరిమితం అవుతారా అనే అంశంపై తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఈ సంచలన పరిణామాలపై ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు భరద్వాజ్  తెలుగువన్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలు చెప్పారు.  కొందరు రాజకీయ నేతలు, న్యాయ నిపుణులు ఎన్టీఆర్ ఖచ్చితంగా పార్టీ పెడతారని, ఇందుకు సంబంధించిన ఆహ్వానాలు కూడా అందాయని బలంగా చెప్తున్నప్పటికీ.. క్షేత్రస్థాయి సమీకరణాలు మాత్రం అందుకు  భిన్నంగా ఉన్నాయని భరధ్వాజ వెల్లడించారు.  గతంలో దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావు (సీనియర్ ఎన్టీఆర్) తెలుగుదేశం పార్టీని స్థాపించడానికి ముందు.. తాను సినిమాలకు స్వస్తి పలుకుతున్నానని, కేవలం సమాజ సేవ కోసమే ఒక సంస్థ  పెడుతున్నానని ప్రకటించారు.  తర్వాతే ఆయన దానిని  తెలుగుదేశం' రాజకీయ పార్టీగా మార్చారు. ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ విషయంలోనూ ఇలాంటి వ్యూహమే నడుస్తోందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తమిళ నటుడు విజయ్, గతంలో రజనీకాంత్ వంటి వారు కూడా అభిమాన సంఘాల బలాన్ని సమీకరించిన తీరును ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు.   అయితే.. ప్రస్తుత పరిస్థితుల్లో జూనియర్ ఎన్టీఆర్ వెంటనే రాజకీయ పార్టీని స్థాపించే సాహసం చేయకపోవచ్చనన్న భరద్వాజ ఇందుకు   ఆయనకున్న భారీ సినీ కమిట్ మెంట్లు కారణమన్నారు. ప్రస్తుతం ఆయన చేతిలో  డ్రాగన్ ,  త్రివిక్రమ్ ప్రాజెక్ట్,  దేవర 2 వంటి భారీ చిత్రాలు ఉన్నాయి. ఇవి పూర్తి కావడానికి కనీసం ఐదారేళ్ల సమయం పడుతుంది.  ఈ దశలో సినిమాలను వదిలి పూర్తి సమయం రాజకీయాలకు కేటాయించడం  జూనియర్ ఎన్టీఆర్ కు సాధ్యమయ్యే పని కాకపోవచ్చని భరద్వాజ అన్నారు.    మరోవైపు, పాన్ ఇండియా మార్కెట్లో తన పట్టును మరింత బలోపేతం చేసుకోవడానికి, సోషల్ మీడియా వేదికగా తన సినిమాలను ప్రమోట్ చేసుకోవడానికి అభిమానుల నెట్వర్క్ ను ఒక నిర్మాణాత్మకమైన కమిటీగా మార్చేందుకే ఈ సమావేశం ఉపయోగపడవచ్చనీ,   హీరో అల్లు అర్జున్ సైతం జాతీయ స్థాయిలో తన ఆర్మీ కమిటీలను వేసిన విషయాన్ని భరద్వాజ గుర్తు చేశారు.  ఏది ఏమైనప్పటికీ, ఏపీలో ప్రాంతీయ పార్టీల మనుగడపై జాతీయ పార్టీల ఒత్తిడి ఎక్కువగా ఉన్న తరుణంలో.. ఎన్టీఆర్ అడుగులు ఎటు పడతాయనేది ఆసక్తికరంగా మారింది. ఒకవేళ ఆయన సేవా సంస్థను స్థాపించినా, భవిష్యత్తులో అది రాజకీయ పార్టీగా రూపాంతరం చెందే అవకాశాలను కొట్టిపారేయలేము. ఈ సర్వత్రా వ్యక్తమవుతున్న సస్పెన్స్కు తెరపడాలంటే జూలై 18న జరగబోయే అభిమానుల సమావేశం వరకు వేచి చూడాల్సిందే.    Jr NTR July 18 Meeting, NTR Legacy, Telugu Politics News, Jr NTR New Party Launch
తెలంగాణ రాజకీయాల్లో కాళేశ్వరం ప్రాజెక్టు చుట్టూ తిరుగుతున్న మాటల యుద్ధం ముదిరి పాకాన పడింది.   అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్  మధ్య విమర్శలు, ప్రతివిమర్శలతో పొలిటికల్ హీట్ పీక్స్ కు చేరింది. ఈ నేపథ్యంలోనే  బీఆర్ఎస్ నాయకుడు, హుజూరాబాద్  ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ముఖ్యమంత్రి  రేవంత్ రెడ్డి, భారీ నీటిపారుదల శాఖ మంత్రి  ఉత్తమ్ కుమార్ రెడ్డిలకు సవాల్ విసిరారు. మేడిగడ్డ వద్ద గోదావరి నది గుండా ప్రతిరోజూ  9 టీఎంసీల  నీరు   వృథాగా పోతోందన్న ఆయన..  ఇంత నీరు అందుబాటులో ఉన్నప్పటికీ, కన్నెపల్లి పంప్ హౌస్ ద్వారా నీటిని ఎత్తిపోయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం మొండిగా నిరాకరిస్తోందని విమర్శించారు.  ఈ వైఖరి వల్ల ఉత్తర తెలంగాణలోని లోయర్ మానేరు, మిడ్ మానేరు ఆయకట్టు పరిధిలోని వేలాది ఎకరాల పంటలు ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ భవన్‌లో  ఏర్పాటు చేసిన  ప్రెస్ కాన్ఫరెన్స్‌లో ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి మాట్లాడుతూ, ప్రభుత్వం కేవలం రాజకీయ కక్ష సాధింపుల కోసమే కాళేశ్వరం మౌలిక సదుపాయాలను వినియోగించుకోకుండా రైతులను   ఇబ్బందులకు గురిచేస్తోందని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో తాము చేసిన అబద్ధాల ప్రచారాలు ఎక్కడ బయటపడతాయోననే భయంతోనే కన్నెపల్లి పంపులను ఆన్ చేయడం లేదని ఆరోపించారు. నీరిస్తే రైతులకు బోనస్ ఇవ్వాల్సి వస్తుందని, రైతు భరోసా నిధులు చెల్లించాల్సి వస్తుందనే నెపంతోనే ఈ చిల్లర రాజకీయాలకు పాల్పడుతున్నారని  విమర్శించారు. అంతేకాకుండా, గత రబీ సీజన్‌లో ప్రభుత్వం సేకరించిన మొక్కజొన్న పంటకు సంబంధించి దాదాపు 30 శాతం మంది రైతులకు ఇప్పటికీ అమ్మకపు సొమ్ము బకాయిలు అందలేదన్నారు. ఈ క్రమంలోనే రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి కౌశిక్ రెడ్డి ఒక ఛాలెంజ్ విసిరారు. కన్నెపల్లి పంప్ హౌస్ ద్వారా నీటిని వెంటనే ఎత్తిపోయాలని, ఆ నీటిని అన్నారం, సుందిళ్ల బ్యారేజీల మీదుగా ఎల్లంపల్లికి తరలించాలని డిమాండ్ చేశారు. ఒకవేళ ఆ విధంగా నీటిని ఎత్తిపోసే ప్రక్రియలో అన్నారం లేదా సుందిళ్ల బ్యారేజీలకు ఏవైనా నష్టాలు లేదా ప్రమాదాలు జరిగితే, దానికి పూర్తి బాధ్యత తమదేనన్నారు. ఆ నష్టానికి బాధ్యత వహిస్తూ బీఆర్ఎస్ పార్టీకి చెందిన మొత్తం 28 మంది ఎమ్మెల్యేలు తమ పదవులకు తక్షణమే రాజీనామా చేసి.. రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటామని సంచలన ప్రకటన చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మెట్రో రైల్ ఫేజ్-2 కోసం కేంద్రానికి లేఖలు రాయడంపై పెడుతున్న శ్రద్ధను, బ్యారేజీల మరమ్మతులను వేగంగా పూర్తి చేయాలని నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీకి   లేఖ రాయడంపై పెట్టడం లేదని విమర్శించారు. ఈ జాప్యం ఇలాగే కొనసాగితే ఉత్తర తెలంగాణలో సాగునీటి కొరతే కాకుండా తీవ్ర తాగునీటి ఎద్దడి కూడా ఏర్పడే ప్రమాదం ఉందని బీఆర్ఎస్ హెచ్చరించింది. aleshwaram Project Row, Padi Kaushik Reddy Challenge, Revanth Reddy BRS, Kannepalli Pump House, Telangana Politics, BRS MLAs Resignation
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరియు సామాజిక ఉద్యమాల్లో తనదైన ముద్ర వేసిన సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం భౌతికకాయానికి అధికారిక లాంఛనాలతో   అంత్యక్రియలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం  నిర్ణయించింది. మంగళవారం (జులై 14) సాయంత్రం హైదరాబాద్‌లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో  ముద్రగడ కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కల్యాణ్..  ముద్రగడ సమాజానికి చేసిన సేవలను గుర్తించి ఈ గౌరవాన్ని కల్పించాలని నిర్ణయించారు. ఈ మేరకు అంత్యక్రియల ఏర్పాట్లను పర్యవేక్షించాలని,  అన్ని రకాల ప్రభుత్వ మర్యాదలు లోటు లేకుండా చూడాలని ఉన్నతాధికారులను ప్రభుత్వం ఆదేశించింది. ముద్రగడ పద్మనాభం మృతి పట్ల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ప్రజా ప్రతినిధిగా, మంత్రిగా, పార్లమెంట్ సభ్యుడిగా ఆయన ప్రజలకు అందించిన సేవలను సీఎం ఈ సందర్భంగా స్మరించుకున్నారు. సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంలో ఎన్నో పదవులను అలంకరించిన ముద్రగడ, నిరంతరం ప్రజా సమస్యలపై గొంతుక వినిపించారని కొనియాడారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ, పద్మనాభం ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు సామాజిక మాధ్యమ వేదికగా పేర్కొన్నారు. ప్రభుత్వం తరఫున ఇవ్వాల్సిన అత్యున్నత గౌరవ మర్యాదలతో ఆయన అంతిమ యాత్రను పూర్తి చేయాలని అధికారులకు స్పష్టమైన మార్గదర్శకాలను జారీ చేశారు. మరోవైపు ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కూడా ముద్రగడ మరణం పట్ల తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. కాపు సామాజిక వర్గ అభ్యున్నతి కోసం, వారి హక్కుల కోసం ముద్రగడ చేసిన పోరాటాలు ఎప్పటికీ గుర్తుండిపోతాయని ఆయన అన్నారు.  ముద్రగడ పద్మనాభం రాజకీయ ప్రస్థానం అత్యంత వైవిధ్యభరితంగా సాగింది. 1978లో జనతా పార్టీ ద్వారా శాసనసభ్యుడిగా కెరీర్ ప్రారంభించిన ఆయన, తదనంతరం తెలుగుదేశం పార్టీ స్థాపించిన కాలంలో ఎన్టీఆర్ పిలుపు అందుకొని ఆ పార్టీలో చేరారు. ప్రత్తిపాడు నియోజకవర్గం నుండి వరుస విజయాలు సాధించి రాష్ట్ర క్యాబినెట్‌లో మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. ఆ తర్వాత వివిధ రాజకీయ పరిణామాల నేపథ్యంలో కాంగ్రెస్, బీజేపీ వంటి జాతీయ పార్టీలలో కూడా కీలక పాత్రలు పోషించారు. 1999లో కాకినాడ లోక్‌సభ స్థానం నుండి పార్లమెంట్‌కు కూడా ఎన్నికయ్యారు. 2024 ఎన్నికలకు ముందు ఆయన వైసీపీలో చేరినప్పటికీ..  రాజకీయాలకు అతీతంగా ఆయన సేవలను గౌరవించాలని ప్రస్తుత కూటమి ప్రభుత్వం నిర్ణయించడం విశేషం. రాజకీయాలను పక్కన పెట్టి ముద్రగడ అంత్యక్రియలను ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో నిర్వహించాలని చంద్రబాబు నిర్ణయించడం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది.  ముద్రగడ పద్మనాభం భౌతికకాయాన్ని హైదరాబాద్ నుండి ఆయన సొంత గ్రామమైన తూర్పుగోదావరి జిల్లా కిర్లంపూడికి తరలించారు. ఈ వార్త తెలియడంతో ఉమ్మడి గోదావరి జిల్లాల నుండి మాత్రమే కాకుండా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఆయన అభిమానులు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు మరియు కాపు సామాజిక వర్గ ప్రతినిధులు భారీ సంఖ్యలో కిర్లంపూడికి తరలివస్తున్నారు. ఆయన నివాస పరిసర ప్రాంతాలన్నీ శోకసంద్రంలో మునిగిపోయాయి. తమ ప్రియతమ నేతను ఆఖరిసారిగా చూసుకునేందుకు ప్రజలు బారులు తీరడంతో స్థానిక యంత్రాంగం భారీ రక్షణ చర్యలను చేపట్టింది. శాంతిభద్రతల సమస్య తలెత్తకుండా పోలీసు బలగాలను మోహరించారు. ప్రభుత్వం అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు ప్రకటించడంతో, పోలీస్ శాఖ ప్రత్యేక గౌరవ వందనం (గన్ సెల్యూట్) సమర్పించడానికి సన్నాహాలు చేస్తోంది. జిల్లా కలెక్టర్, ఎస్పీ స్వయంగా కిర్లంపూడిలో ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. ఒక సామాజిక ఉద్యమకారుడిగా రాష్ట్ర రాజకీయ చరిత్రలో నిలిచిపోయే వ్యక్తికి తగిన రీతిలో వీడ్కోలు పలకడమే ప్రభుత్వ ఉద్దేశమని అధికారులు పేర్కొంటున్నారు. ముద్రగడ మృతి అనేది కేవలం ఒక సామాజిక వర్గానికి మాత్రమే కాకుండా, రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఎందరో వెనుకబడిన వర్గాల ప్రజలకు తీరని లోటని పలువురు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.  Mudragada Padmanabham Last Rites, Chandrababu Naidu State Honours Mudragada, Pawan Kalyan Mudragada Demise, Kapu Leader Mudragada Passed Away 
ALSO ON TELUGUONE N E W S
తెలుగు సినీ పరిశ్రమలో కొరియోగ్రాఫర్స్, డాన్సర్స్ మధ్య రాజుకున్న వివాదం ఇప్పుడు టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. తెలుగు డాన్సర్స్ అసోసియేషన్‌లోని అంతర్గత విభేదాలు చిలికి చిలికి గాలివానగా మారుతూ ఫిల్మ్ ఎంప్లాయిస్ ఫెడరేషన్‌తో నేరుగా తలపడే స్థాయికి చేరుకున్నాయి. గత ఆదివారం జరిగిన సీక్రెట్ బ్యాలెట్ ఎలక్షన్స్ సందర్భంగా జానీ మాస్టర్, శేఖర్ మాస్టర్ వర్గాల మధ్య తీవ్ర ఘర్షణ వాతావరణం నెలకొంది. ఈ గొడవ కాస్తా పెద్దది కావడంతో పరిశ్రమ పెద్దగా మెగాస్టార్ చిరంజీవి స్వయంగా రంగంలోకి దిగాల్సి వచ్చింది. ఎన్నికల మరుసటి రోజే చిరంజీవి తన సినిమా షూటింగ్ స్పాట్‌కు జానీ మాస్టర్, శేఖర్ మాస్టర్ ఇద్దరినీ పిలిపించి మాట్లాడారు. ఇరు వర్గాల మధ్య సర్దుబాటు చేసేందుకు గట్టి ప్రయత్నమే చేశారు. ఆ తర్వాత జానీ మాస్టర్ స్పందిస్తూ శేఖర్ మాస్టర్‌కు, తనకు ఎలాంటి విభేదాలు లేవని, అంతా సద్దుమణిగిందని, ఇదంతా కేవలం మీడియా సృష్టేనని ప్రకటించారు. అయితే ఈ వ్యవహారంపై శేఖర్ మాస్టర్ మాత్రం ఇప్పటివరకు ఎలాంటి అధికారిక స్పందన ఇవ్వకపోవడం గమనార్హం. మరోవైపు ఈ వివాదంలో జానీ మాస్టర్ భార్య, డాన్సర్స్ అసోసియేషన్ అధ్యక్షురాలు సుమలత చేసిన వ్యాఖ్యలు మంటలకు మరింత నెయ్యి పోశాయి. అసోసియేషన్‌లోనే కొందరు 'ఇంటి దొంగలు' ఉన్నారని, వారి అక్రమాలను తాము ప్రశ్నించినందుకే తమను టార్గెట్ చేస్తున్నారని ఆమె తీవ్ర ఆరోపణలు చేశారు. అయితే ఈ క్రమంలోనే అసోసియేషన్ పదవులకు రాజీనామా చేసిన కొందరు సభ్యులు సుమలత, జానీ మాస్టర్‌లతో బహిరంగంగా వాగ్వివాదానికి దిగారు. జానీ మాస్టర్ తెలుగు డాన్సర్‌లకు సరైన అవకాశాలు ఇవ్వడం లేదని, ఆయన ఒంటెద్దు పోకడలను ప్రశ్నించినందుకే తమను బయటకు పంపించేశారని ఎదురుదాడికి దిగారు. ఇక్కడితో ఆగకుండా సుమలత నేరుగా ఫిల్మ్ ఎంప్లాయిస్ ఫెడరేషన్‌ను టార్గెట్ చేస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అసోసియేషన్లన్నీ కలిస్తేనే ఫెడరేషన్ ఏర్పడుతుందని, అంతేకానీ ఫెడరేషన్ తన ఇష్టానుసారంగా రూల్స్ పెడితే తాము ఒప్పుకునే ప్రసక్తి లేదని తేల్చి చెప్పారు. ఫెడరేషన్ కనుసన్నల్లో తాము నడవబోమని, బైలాలో లేని నిబంధనలను తమపై రుద్దాలని చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ తీవ్రమైన ఆరోపణలను ఫిల్మ్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ కార్యవర్గం అత్యంత సీరియస్‌గా తీసుకుంది. గురువారం అత్యవసరంగా సమావేశమైన ఫెడరేషన్ నాయకులు డాన్సర్స్ అసోసియేషన్ అధ్యక్షురాలి వైఖరిని తీవ్రంగా తప్పుపట్టారు. ఈ వివాదానికి వీలైనంత త్వరగా ఫుల్ స్టాప్ పెట్టాలని నిర్ణయించారు. ఒకవేళ డాన్సర్స్ అసోసియేషన్ గొడవను ఇలాగే వదిలేస్తే అది ఫెడరేషన్ చేతకానితనంగా మారుతుందని, భవిష్యత్తులో మిగిలిన 24 క్రాఫ్ట్స్ యూనియన్లు కూడా ఇదే బాట పడితే ఫెడరేషన్ మనుగడకే ప్రమాదం వాటిల్లుతుందని నాయకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అందుకే రాబోయే ఆదివారం నాటికల్లా ఇరు వర్గాలను కూర్చోబెట్టి ఈ వివాదానికి శాశ్వత పరిష్కారం చూపాలని గట్టి పట్టుదలతో ఉన్నారు. అయినప్పటికీ సుమలత మాత్రం తన పంథా మార్చుకోలేదు. ఫెడరేషన్ కార్యాలయానికి వెళ్లి నాయకులను కలిసిన ఆమె, తాను చేసిన ఆరోపణలకు కట్టుబడి ఉన్నానని స్పష్టం చేశారు. తమ యూనియన్ ఎన్నికలతో ఫెడరేషన్‌కు ఎలాంటి సంబంధం లేదని, అక్రమార్కులను ఫెడరేషన్ వెనకేసుకొస్తోందని మండిపడ్డారు. ఒకవేళ తప్పు చేసిన వారితోనే కలిసి పనిచేయాల్సిన పరిస్థితి వస్తే, తాము తమ పదవులకు రాజీనామా చేయడానికైనా సిద్ధమే కానీ తప్పుడు పనులను అస్సలు సమర్థించబోమని తేల్చిచెప్పారు. ఫెడరేషన్ నాయకులు గతంలో ఒకలా, ఇప్పుడు మరోలా ద్వంద్వ వైఖరి అవలంబిస్తున్నారని ధ్వజమెత్తారు. టాలీవుడ్‌లో తీవ్ర కలకలం రేపుతున్న ఈ డాన్సర్స్ అసోసియేషన్ వివాదానికి ఫెడరేషన్ పెద్దలు రాబోయే ఆదివారం ఎలాంటి ముగింపు పలుకుతారో చూడాలి.
  'అ' అంటే అక్కినేని అనే నిజాన్ని మరోసారి సినీ ప్రపంచానికి చాటి చెప్తూ లెనిన్(Lenin)తో దూసుకుపోతున్నాడు అఖిల్(Akhil). మరీ ముఖ్యంగా అభిమానులు అయితే అఖిల్ బ్లాక్ బస్టర్ ని అందుకోవడంతో ఫుల్ జోష్ లో ఉన్నారు. ఈ క్రమంలోనే అఖిల్ ఫస్ట్ టైం లెనిన్ తో  వంద కోట్ల క్లబ్ లోకి చేరే గడియ కోసం అభిమానులు ఎంతో ఉద్వేగంగా వెయిట్ చేస్తున్నారు.  అయితే ఈ వీకెండ్  లెనిన్ ముందు పెద్ద సవాళ్లే ఎదురుకాబోతున్నాయి. ఒకేసారి థియేటర్లలోకి  'మిస్టర్ మిడిల్ క్లాస్', 'ఓ సుకుమారి', 'వదలా', 'ఆపరేషన్ అరుణారెడ్డి', 'ఎంఆర్పీ', 'రాజా ది రాజా' వంటి ఆరు సినిమాలు ఈ శుక్రవారం నుంచి సందడి చేయనున్నాయి. సీనియర్ నటులు శ్రీకాంత్, రాజేంద్ర ప్రసాద్, లయ ముఖ్య పాత్రల్లో నటించిన 'మిస్టర్ మిడిల్ క్లాస్' సినిమా తారాగణం పరంగా ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తోంది. 'ఓ సుకుమారి'  కూడా ఓ మోస్తరు అంచనాలతో థియేటర్లలోకి వస్తోంది. మిగతా చిత్రాలకు పెద్దగా బజ్ లేనప్పటికీ, థియేటర్ల షేరింగ్‌లో ఇవి ప్రభావం చూపే అవకాశం ఉంది. Also read: ఒక్క టిప్‌తో వెయిటర్ జీవితాన్ని మార్చిన టైటానిక్ హీరో.. ఆ మొత్తం ఎంతో తెలుసా! ఈ ఆరు సినిమాల కంటే ఎక్కువగా, ఇంగ్లీష్ సినిమా 'ది ఒడిస్సీ  అడ్వాన్స్ బుకింగ్స్ చూస్తుంటే బాక్సాఫీస్ వద్ద గట్టి పోటీ ఇచ్చేలా కనిపిస్తోంది. ఇది కచ్చితంగా 'లెనిన్' వసూళ్లపై ప్రభావం చూపిస్తుందని ట్రేడ్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. బుధవారం 28 శాతం డ్రాప్ తర్వాత, గురువారం కూడా థియేటర్లలో ఆక్యుపెన్సీ ఆశించిన స్థాయిలో చూపించడం లేదు. మరి ఈ అరడజను కొత్త సినిమాల పోటీని తట్టుకుని అఖిల్ 'లెనిన్' బాక్సాఫీస్ వీకెండ్ రేసులో ఎంతవరకు నిలబడుతుందో వేచి చూడాలి. ఒక్కటి మాత్రం నిజం 'లెనిన్' వంద కోట్ల మార్కుని  చేరుకోవాలంటే ఈ వీకెండ్ ప్రేక్షకులు థియేటర్లకి క్యూ కట్టాల్సిందే.  akhil, lenin, srikanth, rajendraprasad, thiruveer
అక్కినేని అభిమానులకు ఒక భారీ షాకింగ్ న్యూస్ వినబడుతోంది. కింగ్ నాగార్జున తన ఇద్దరు కుమారులు నాగచైతన్య, అఖిల్ తో కలిసి ఒక అద్భుతమైన మల్టీస్టారర్ చిత్రాన్ని ప్లాన్ చేసిన సంగతి తెలిసిందే. ఎంతో కాలంగా అక్కినేని ముగ్గురు హీరోలను ఒకే ఫ్రేమ్‌లో చూడాలని ఆశపడుతున్న ఫ్యాన్స్ ఆశలపై ఈ తాజా వార్త గట్టి దెబ్బే కొట్టింది. దర్శకుడు కళ్యాణ్ కృష్ణ కురసాల దర్శకత్వంలో పూర్తి స్థాయి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రాన్ని పట్టాలెక్కించాలని స్క్రిప్ట్ కూడా సిద్ధం చేశారు. అంతా సవ్యంగా సాగితే ఈ ఏడాది జూలై నెలలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్‌ను ప్రారంభించాలని చిత్ర బృందం అన్ని ఏర్పాట్లు చేసుకుంది. అంతేకాదు, వచ్చే ఏడాది సంక్రాంతి 2027 కానుకగా ఈ క్రేజీ ప్రాజెక్ట్‌ను థియేటర్లలోకి తీసుకురావడమే లక్ష్యంగా మేకర్స్ ఒక పక్కా ప్రణాళికను కూడా సిద్ధం చేశారు. ఈ ప్రతిష్టాత్మక చిత్రాన్ని నిర్మించేందుకు ప్రముఖ నిర్మాణ సంస్థ జీ స్టూడియోస్ ముందుకు వచ్చింది. నాగార్జునకు చెందిన అన్నపూర్ణ స్టూడియోస్‌తో కలిసి ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో నిర్మించేందుకు జీ స్టూడియోస్ సిద్ధమైంది. అయితే, సరిగ్గా షూటింగ్ ప్రారంభం కావాల్సిన తరుణంలో ఊహించని విధంగా ఈ ప్రాజెక్ట్ పూర్తిగా నిలిచిపోయింది. దర్శకుడు కళ్యాణ్ కృష్ణ సిద్ధం చేసిన ఫైనల్ స్క్రిప్ట్ వెర్షన్ విషయంలో అక్కినేని బ్రదర్స్ నాగచైతన్య, అఖిల్‌ పూర్తిగా సంతృప్తి చెందలేదట. తన కుమారులు నాగచైతన్య, అఖిల్ ఇద్దరూ కథ విషయంలో ఏకాభిప్రాయానికి రాకపోవడంతో పాటు ఈ ప్రాజెక్ట్ పట్ల పూర్తి ఆసక్తి చూపించకపోవడంతో నాగార్జున కూడా వెనక్కి తగ్గారని తెలుస్తోంది. కుమారులకు నచ్చని ప్రాజెక్ట్‌తో బలవంతంగా ముందుకు వెళ్లడం సరైన నిర్ణయం కాదని భావించిన నాగార్జున, ఈ మల్టీస్టారర్‌ను ప్రస్తుతానికి పక్కన పెట్టేయడానికే మొగ్గు చూపారని సమాచారం. ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించి గతంలో ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడకపోవడంతో, ఇప్పుడు సినిమా రద్దు కావడంపై కూడా మేకర్స్ ఎలాంటి అధికారిక ప్రకటన విడుదల చేయకపోవచ్చు. ప్రస్తుతం ఈ మల్టీస్టారర్ ఆగిపోవడంతో అక్కినేని హీరోలు తమ తదుపరి సొంత ప్రాజెక్టులపై దృష్టి కేంద్రీకరించారు. నాగచైతన్య ప్రస్తుతం వృషకర్మ సినిమా చేస్తున్నారు. అలాగే తన సూపర్ హిట్ వెబ్ సిరీస్ సీక్వెల్ "దూత 2"తో పాటు, దర్శకుడు క్లాక్స్‌తో ఒక సినిమా, మసూద డైరెక్టర్ సాయి కిరణ్ తో మరొక భారీ హారర్ ఫిల్మ్‌ను లైన్‌లో పెట్టారు. అటు అఖిల్ అక్కినేని కూడా ఖాళీగా ఉండకుండా ఇప్పటికే రెండు కొత్త స్క్రిప్ట్‌లను లాక్ చేసుకోగా, అందులో ఒక ప్రాజెక్ట్‌ను ఈ నెలలోనే ఫైనలైజ్ చేయనున్నారు. తన ఇద్దరు కుమారులు తమ సరికొత్త ప్రాజెక్ట్‌లతో బిజీ అయిపోవడంతో, నాగార్జున సైతం తన ల్యాండ్‌మార్క్ చిత్రం "కింగ్ 100" (King 100) పై పూర్తి ఫోకస్ పెట్టనున్నారు.     Nagarjuna, Naga Chaitanya, Akhil Akkineni, Multistarrer, Shelved  
అమెరికాలోని ఐడాహో విశ్వవిద్యాలయంలో 2022 లో చోటుచేసుకున్న నలుగురు విద్యార్థుల దారుణ హత్యోదంతం ప్రపంచ వ్యాప్తంగా ఎంతటి సంచ‌ల‌న‌మైందో అందరికీ తెలిసిందే. రాత్రికి రాత్రే నలుగురు అమాయక కాలేజీ విద్యార్థుల ప్రాణాలు గాల్లో కలిసిపోయిన ఈ భయంకరమైన సంఘటనపై ఇప్పుడు ప్రముఖ ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ కాలేజ్ నైట్‌మేర్: ది ఐడాహో యూనివర్సిటీ మర్డర్ కేస్ (College Nightmare: The Idaho University Murder Case) పేరుతో ఒక ప్రత్యేక క్రైమ్ డాక్యుమెంటరీని రూపొందిస్తోంది. నిశ్శబ్దంగా, ఎంతో ప్రశాంతంగా సాగిపోయే విద్యార్థుల జీవితాల్లోకి ఒక అదృశ్య హంతకుడు అర్ధరాత్రి వేళ ఎలా ప్రవేశించాడు, ఎలాంటి కనికరం లేకుండా వారి ప్రాణాలను ఎలా బలితీసుకున్నాడు అనే అత్యంత భయంకరమైన నిజాలను ఈ డాక్యుమెంటరీ ప్రధానంగా చర్చించనుంది. ఈ యదార్థ గాథ ఆధారంగా వస్తున్న సరికొత్త చిత్రం ఇప్పుడు గ్లోబల్ ఆడియన్స్‌లో విపరీతమైన ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఈ సంచలన కేసు విచారణలో వెలుగులోకి వచ్చిన విస్తుపోయే వాస్తవాలు, ఘటనా స్థలంలో పోలీసులు అత్యంత చాకచక్యంగా సేకరించిన కీలక ఆధారాలు, అసలు నిందితుడిని పట్టుకోవడానికి అంతర్జాతీయ దర్యాప్తు సంస్థ ఎఫ్‌బీఐ (FBI), స్థానిక పోలీసులు ఎదుర్కొన్న సవాళ్లను ఈ డాక్యుమెంటరీలో కళ్ళకు కట్టినట్లు వివరించనున్నారు. హారర్ సినిమాను తలపించేలా అసలు ఆ దారుణ హత్య జరిగిన ఆ రాత్రి ఏం జరిగింది, చనిపోయిన ఆ నలుగురు విద్యార్థుల మధ్య ఉన్న బంధం ఏమిటి, అందరితో సాదాసీదాగా ఉంటూనే ఇంతటి ఘాతుకానికి ఒడిగట్టిన నిందితుడి ప్రవర్తనలో ఉన్న వింత పోకడలు, సైకో కోణాలు వంటి అనేక అంశాలను ఈ సిరీస్‌లో లోతుగా విశ్లేషించనున్నారు. నిజ జీవిత క్రైమ్ థ్రిల్లర్లను, ఇన్వెస్టిగేటివ్ డాక్యుమెంటరీలను ఇష్టపడే ప్రపంచవ్యాప్త ప్రేక్షకులకు ఇది మరో ఉత్కంఠభరితమైన సమాహారంగా మారనుంది. ప్ర‌స్తుతానికి ఈ మోస్ట్ అవైటెడ్ డాక్యుమెంటరీ విడుదల తేదీ, ఇతర ప్రమోషనల్ వివరాలపై నెట్టింట సర్వత్ర ఉత్కంఠ నెలకొంది. నెట్‌ఫ్లిక్స్ వేదికగా రానున్న ఈ చిత్రం ఐడాహో కేసుకు సంబంధించిన ప్రతి చిన్న విషయాన్ని, కోర్టు దాఖలాలు, అంతర్గత విచారణా పత్రాలను ఒక క్రమపద్ధతిలో వివరిస్తూ ప్రేక్షకులకు అప్పటి సంఘటనల తీవ్రతను, ఆ భయాందోళనలను ప్రత్యక్షంగా తెలియజేయనుంది. ఈ కేసు విచారణ దశలో అంతర్జాతీయ మీడియా చేసిన కవరేజ్, సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో రాత్రికి రాత్రే జరిగిన తీవ్రమైన చర్చలు, అలాగే నిందితుడిని ఉచ్చులోకి లాగడానికి పోలీసులు పన్నిన రహస్య వ్యూహాలు వంటివి ఈ డాక్యుమెంటరీకి ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి. నేరాల వెనుక దాగి ఉన్న క్రూరమైన మానసిక కారణాలను అర్థం చేసుకోవడానికి ఇలాంటి యదార్థ క్రైమ్ డాక్యుమెంటరీలు ఒక ముఖ్యమైన వేదికగా నిలుస్తాయి. అయితే ఇక్కడ అందరినీ వేధిస్తున్న కీలకమైన ప్రశ్న ఏమిటంటే, ఒక హంతకుడు సమాజంలో ఇంతటి భీభత్సాన్ని సృష్టించడానికి దారితీసిన అతడి వికృత మానసిక స్థితి ఏమిటి? సాంకేతికత ఇంతగా అభివృద్ధి చెందిన కాలంలో కూడా అతన్ని పట్టుకోవడంలో జరిగిన ఆలస్యం వెనుక ఉన్న అసలు కారణాలేంటి? అనే సరికొత్త కోణాల్లో కూడా ఈ నెట్‌ఫ్లిక్స్ సిరీస్ ప్రశ్నలు లేవనెత్తనుంది. ఈ డాక్యుమెంటరీ కేవలం దారుణ హత్య కేసును చూపించడమే కాకుండా, ఊహించని విపత్తుతో విలవిలలాడిపోయిన బాధితుల కుటుంబాలకు కలిగిన తీరని ఆవేదనను, భవిష్యత్తులో విద్యార్థుల భద్రతకు సంబంధించి అంతర్జాతీయ యూనివర్సిటీలు తీసుకోవాల్సిన కఠినమైన జాగ్రత్తలను కూడా ప్రపంచానికి గుర్తు చేయనుంది. నిజానిజాలు నిష్పక్షపాతంగా వెలికితీసే క్రమంలో ఎంతో బాధ్యతాయుతమైన కథనంతో ముందుకు రావడం నెట్‌ఫ్లిక్స్ ముందున్న ప్రధాన సవాలుగా మారింది. ప్రేక్షకులకు నూటికి నూరు శాతం వాస్తవికతను తెలియజేస్తూనే, ఇలాంటి సున్నితమైన నేరపూరిత అంశాలను తెరపై ఎలా ప్రదర్శిస్తారనేది ఇప్పుడు ఫిలిం సర్కిల్స్‌లో ఆసక్తికరంగా మారింది. ఈ డాక్యుమెంటరీ విడుదల ద్వారా ఈ ఐడాహో మిస్టరీ కేస్‌తో సంబంధం ఉన్న మరిన్ని సరికొత్త సంచలన విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం గట్టిగా కనిపిస్తోంది. నిజానికి నేర పరిశోధనా కథనాలు కేవలం వినోదం కోసమే కాకుండా భవిష్యత్తులో ఇలాంటి దారుణాలు జరగకుండా నివారించడానికి సమాజంలో అప్రమత్తతను పెంచేవిగా ఉండాలి. మరి ఈ 'కాలేజ్ నైట్‌మేర్' చిత్రం అంతర్జాతీయ ప్రేక్షకులను ఎలా ఆలోచింపజేస్తుందో చూడాలి. ఓటీటీలో క్రైమ్ థ్రిల్ల‌ర్ల‌కు ఎప్పుడూ మంచి స‌క్సెస్ రేట్ ఉన్న నేప‌థ్యంలో, ఈ రియల్ లైఫ్ మిస్టరీ డాక్యుమెంటరీ కూడా భారీ వ్యూస్‌తో సంచలన విజ‌యం సాధిస్తుంద‌ని డిజిటల్ మీడియా విశ్లేష‌కులు భావిస్తున్నారు.    
ప్రపంచ సినీ ప్రేమికుల ఫెవరేట్ మూవీ టైటానిక్(Titanic).. స్వచ్ఛమైన ప్రేమకి కూడా సింబాలిక్ గా నిలిచిన టైటానిక్ ద్వారా కోట్లాదిమంది అభిమానులను సంపాదించుకున్నాడు  'లియోనార్డో డికాప్రియో'. ఇప్పడు సోషల్ మీడియాలో ఈ పేరు సంచలనంగా మారింది. ఇటీవల లియోనార్డో సుమారు 15 మంది అతిదులతో  కలిసి ఫ్రాన్స్‌లోని ప్రసిద్ధ పర్యాటక ప్రాంతమైన సెయింట్ ట్రోపెజ్‌లోని ఒక రెస్టారెంట్‌లో రాత్రి వేళ భోజనానికి వెళ్లారు. భోజనం ముగిసిన తర్వాత వెయిటర్‌కి  50,000 యూరోలని టిప్‌గా ఇచ్చాడు. 50,000 యూరోలంటే మన భారతీయ కరెన్సీలో దాదాపు 55 లక్షల రూపాయలు.  ఒక సాధారణ వెయిటర్‌కు అంత పెద్ద మొత్తం లభించడం అంటే అతని జీవిత కాలపు సంపాదనతో సమానమని చెప్పవచ్చు. సాధారణంగా ఫ్రాన్స్ వంటి యూరప్ దేశాలలో రెస్టారెంట్లలో భోజనం చేసిన తర్వాత కేవలం 2 నుండి 5 యూరోలు మాత్రమే టిప్‌గా ఇవ్వడం అక్కడ ఒక ఆనవాయితీగా వస్తోంది. అలాంటి చోట లియోనార్డో డికాప్రియో ఏకంగా 50,000 యూరోలు టిప్ ఇవ్వడం అనేది సర్వీస్ ఇండస్ట్రీలోనే అత్యంత అరుదైన మరియు భారీ మొత్తంగా రికార్డు సృష్టించింది. ఈ భారీ మొత్తాన్ని అందుకున్న ఆ వెయిటర్ ఒక్కసారిగా నమ్మలేకపోయాడు. తీవ్రమైన భావోద్వేగానికి లోనై కన్నీళ్లు కూడా పెట్టుకున్నాడు. Also read: హీరోయిన్ కి ముద్దు పెట్టబోయిన అభిమాని.. హీరోయిన్ ఏం చేసిందో తెలిస్తే షాక్ గ్యారంటీ  ఈ సంఘటన గురించి ఫ్రెంచ్ టెలివిజన్ వ్యాఖ్యాత బెంజమిన్ కాస్టాల్డి తన పాపులర్ యూరప్ 2 మార్నింగ్ షో 'కాస్టా రెవెయిల్ లా ఫ్రాన్స్' లో స్వయంగా వెల్లడించారు. ఈ సంఘటన జరుగుతున్న సమయంలో బెంజమిన్ అదే రెస్టారెంట్‌లో ప్రత్యక్ష సాక్షిగా ఉన్నారు. బెంజమిన్ తెలిపిన మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, లియోనార్డో డికాప్రియో ఈ బిల్లు మరియు టిప్ మొత్తాన్ని చెల్లించడానికి ఎటువంటి బ్రాండింగ్ లేదా లోగోలు లేని ఒక సాదా వైట్ బ్యాంక్ కార్డును ఉపయోగించారు. సాధారణంగా బిలియనీర్లు అమెరికన్ ఎక్స్‌ప్రెస్ బ్లాక్ కార్డులను ఉపయోగిస్తుంటారు, కానీ ఏ రకమైన సమాచారం లేని ఈ వైట్ కార్డ్ ఆయన యొక్క అమితమైన సంపదకు మరియు నిరాడంబరతకు నిదర్శనమని బెంజమిన్ పేర్కొన్నారు. ప్రపంచంలోనే అత్యధిక పారితోషికం తీసుకునే టాప్ 10 నటులలో 7వ స్థానంలో ఉన్న లియోనార్డో, ప్రస్తుతం హాలీవుడ్‌లో షాన్ పెన్ మరియు బెనిసియో డెల్ టోరోలతో కలిసి 'వన్ బాటిల్ ఆఫ్టర్ అనదర్' వంటి 5 క్రేజీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆయన చేసిన ఈ మానవతా సాయంపై ప్రపంచవ్యాప్తంగా నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. leonardo dicaprio, titanic
స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ వైవిధ్యమైన సినిమాలతో సౌత్ ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన బ్రాండ్ క్రియేట్ చేసుకున్నారు. అయితే ఎప్పుడూ కెమెరా వెనుక ఉండి నటీనటులను నడిపించే లోకేష్, ఇప్పుడు మొదటిసారి హీరోగా మారి కెమెరా ముందుకు వచ్చారు. అరుణ్ మాథేశ్వరన్ దర్శకత్వంలో లోకేష్ కనగరాజ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న మోస్ట్ అవేటెడ్ వైలెంట్ యాక్షన్ అండ్ రొమాంటిక్ డ్రామా చిత్రం "DC". ఈ సినిమాలో గ్లామరస్ బ్యూటీ వామిఖ గబ్బి కథానాయికగా నటిస్తోంది. కాగా, ఈ క్రేజీ ప్రాజెక్ట్ కి సంబంధించిన ఒక ఆసక్తికరమైన అప్‌డేట్ తాజాగా బయటకు వచ్చింది. ఈ చిత్రం యొక్క సెన్సార్ ఫార్మాలిటీస్ అధికారికంగా పూర్తయ్యాయి. భారీ అంచనాలు ఉన్న ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ను సెన్సార్ బోర్డ్ సభ్యులు వీక్షించారు. సినిమాలో వైలెన్స్ ఎక్కువ ఉండటంతో, ఈ చిత్రానికి సెన్సార్ బోర్డ్ 'A' (అడల్ట్) సర్టిఫికేట్‌ను జారీ చేసింది. అరుణ్ మాథేశ్వరన్ మార్క్ ఇంటెన్స్ యాక్షన్, రా వైలెన్స్ ఈ సినిమాలో ఓ రేంజ్‌లో ఉండబోతున్నట్లు సెన్సార్ టాక్ ద్వారా స్పష్టమవుతోంది. ఈ చిత్రంలో దేవదాస్ పాత్రలో లోకేష్ కనగరాజ్, చంద్ర పాత్రలో వామిఖ గబ్బి నటిస్తున్నారు. గ్యాంగ్‌స్టర్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే ఒక విభిన్నమైన ప్రేమకథగా ఈ సినిమాను అద్భుతంగా తెరకెక్కించారు. సెన్సార్ అప్‌డేట్‌తో పాటు, ఈ సినిమా విడుదల తేదీలో కూడా మేకర్స్ మార్పులు చేశారు. మొదట ఈ చిత్రాన్ని జూలై 31న విడుదల చేయాలని చిత్ర యూనిట్ భావించింది. అయితే కొన్ని కారణాల వల్ల ఈ మూవీ రిలీజ్ డేట్‌ను వెనక్కి జరిపారు. సరికొత్త అధికారిక ప్రకటన ప్రకారం, ఈ చిత్రం ఆగస్టు 7న థియేటర్లలోకి రాబోతోంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ మేకర్స్ ఒక కొత్త పోస్టర్‌ను కూడా విడుదల చేశారు. ఈ క్రేజీ ప్రాజెక్ట్‌ను సన్ పిక్చర్స్ బ్యానర్‌పై కళానిధి మారన్ నిర్మించారు. రాక్‌స్టార్ అనిరుధ్ రవిచందర్ ఈ చిత్రానికి సంగీతం  అందించడం విశేషం. అనిరుధ్ అందించిన మ్యూజిక్ సినిమాకు మెయిన్ పిల్లర్ లా నిలుస్తుందని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి.  తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాను ఏషియన్ సునీల్ నేతృత్వంలోని ఏషియన్ డిస్ట్రిబ్యూషన్ సంస్థ గ్రాండ్‌గా రిలీజ్ చేస్తోంది. లోకేష్ కనగరాజ్ నటన, అరుణ్ మాథేశ్వరన్ టేకింగ్, అనిరుధ్ సంగీతం కలబోసిన ఈ 'A' సర్టిఫైడ్ ఇంటెన్స్ యాక్షన్ మూవీ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి వండర్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి. https://x.com/sunpictures/status/2077633930619142314   DC Movie, Lokesh Kanagaraj, DC Release Date, Wamiqa Gabbi  
టాలీవుడ్ సంచలన దర్శకుడు రామ్‌గోపాల్‌వర్మ మరోసారి తన పదునైన వ్యాఖ్యలతో చిత్ర పరిశ్రమలో తీవ్ర దుమారం రేపారు. కంటెంట్ క్రియేషన్, సినిమాటిక్ ఫ్రీడమ్ విషయంలో ఎప్పుడూ భిన్నమైన గొంతుక వినిపించే వర్మ, ఈసారి ఏకంగా కేంద్ర సెన్సార్ బోర్డు ఉనికినే సవాలు చేశారు. ప్రస్తుత ఆధునిక డిజిటల్ యుగంలో సినిమాలకు సెన్సార్ విధించడాన్ని ఆయన తీవ్రంగా వ్యతిరేకిస్తూ, 'సెన్సార్‌ను పూర్తిగా బ్యాన్ చేయండి' అంటూ సోషల్ మీడియా వేదికగా ఒక సుదీర్ఘమైన, అత్యంత ఘాటైన పోస్ట్‌ను పంచుకున్నారు. డిజిటల్ విప్లవం నడుస్తున్న ఈ రోజుల్లో సినిమాలకు ఇంకా సెన్సార్ పేరిట కోతలు విధించడం అంటే భారతదేశంలో ఉన్న కోట్ల మంది వయోజన ప్రేక్షకులను తీవ్రంగా అవమానించడమేనని ఆయన మండిపడ్డారు. ఆర్జీవీ తన పోస్ట్‌లో దేశంలోని ప్రజాస్వామ్య వ్యవస్థను, ప్రభుత్వ విధానాలను ప్రశ్నిస్తూ కొన్ని కీలకమైన తార్కిక ప్రశ్నలను లేవనెత్తారు. భారతదేశంలో 18 ఏళ్ల వయసు నిండిన ప్రతి యువకుడికి లేదా యువతికి దేశాన్ని పాలించే అత్యున్నత నాయకుడిని, ప్రభుత్వాన్ని ఎన్నుకునే పవిత్రమైన ఓటు హక్కు లభిస్తుంది. 100 కోట్లకు పైగా జనాభా ఉన్న ఈ దేశ భవిష్యత్తును తీర్చిదిద్దే అంతటి పెద్ద బాధ్యతను, పరిణతిని 18 ఏళ్ల అడల్ట్స్ చేతిలో పెడుతున్న ప్రభుత్వం, అదే అడల్ట్స్ థియేటర్‌లో కూర్చుని సినిమాలో ఏం చూడాలో నిర్ణయించడానికి మాత్రం ఒక ప్రత్యేక కమిటీని ఎందుకు నియమిస్తోందని ఆయన నిలదీశారు. ఒక నాయకుడిని ఎన్నుకోగల వయోజనులు, సినిమాలో ఒక బూతు పదం వినడం వల్లనో లేదా ఒక హింసాత్మకమైన షాట్ చూడటం వల్లనో చెడిపోతారని భావించడం ప్రభుత్వ కపటత్వానికి నిదర్శనమని వర్మ విమర్శించారు. సరిహద్దులు లేని ఇంటర్నెట్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) టూల్స్, గ్లోబల్ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫారమ్‌లు విరివిగా అందుబాటులో ఉన్న ఈ ఆధునిక కాలంలో, ప్రభుత్వం నియమించిన కొద్దిమంది సభ్యుల కమిటీ సినిమా ద్వారా పెద్దలను రక్షిస్తుందని అనుకోవడం కేవలం అవుట్ డేటెడ్ ఆలోచన మాత్రమే కాదు, అది పరమ మూర్ఖత్వం అని ఆర్జీవీ అభివర్ణించారు. అసలు ఈ సెన్సార్ బోర్డు సభ్యులకు సృజనాత్మకతను అంచనా వేసే అర్హతలు ఏంటో ఆ దేవుడికే తెలియాలని ఆయన ఎద్దేవా చేశారు. చిన్నపిల్లలతో సహా ప్రతి ఒక్కరూ స్మార్ట్‌ఫోన్‌లలో ప్రతిరోజూ అత్యంత దారుణమైన సమాజ వార్తలను, హింసను ఆన్‌లైన్‌లో నేరుగా చూస్తున్నప్పుడు, కేవలం సినిమాటిక్ నాటకీయ కథనాలపైనే ఈ ఆంక్షలు ఎందుకు విధిస్తున్నారని ప్రశ్నించారు. సెన్సార్‌షిప్ అనేది విలువలను కాపాడటం లేదు, పైగా ప్రజలను మానసికంగా ఎదగకుండా చిన్నపిల్లలుగానే ఉంచేలా చేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. సెన్సార్ బోర్డు విధిస్తున్న ఈ క‌ట్స్‌, ఆంక్ష‌లు ఎంత హాస్యాస్పదంగా మారాయో వివరించడానికి వర్మ ఒక లైవ్ ఉదాహరణను కూడా ప్రస్తావించారు. 'అబ్సెషన్' అనే సినిమాలోని ఒక తల బాదుకునే తీవ్రమైన సన్నివేశాన్ని సెన్సార్ బోర్డు సభ్యులు కట్ చేశారు. అయితే థియేట్రికల్ విడుదలలో ఆ సీన్ తొలగించబడినప్పటికీ, కత్తిరించని పూర్తి వెర్షన్ కొన్ని గంటల్లోనే టోరెంట్జ్, టెలిగ్రామ్ వంటి ఇంటర్నేషనల్ ప్లాట్‌ఫారమ్‌లలో ప్రత్యక్షమైంది. ఆ తర్వాత థియేటర్లలో ఆ సినిమా చూసిన ప్రేక్షకుల కంటే, ఇన్‌స్టాగ్రామ్ రీల్స్‌లో కనీసం 10 రెట్లు ఎక్కువ మంది ఆ నిషిద్ధ సన్నివేశాన్ని చూశారని వర్మ స్పష్టం చేశారు. సెన్సార్‌షిప్ అనేది కంటెంట్‌ను ఎప్పటికీ దాచలేదని, పైగా నిషేధించిన కంటెంట్‌పై ప్రేక్షకుల్లో మరింత క్యూరియాసిటీని, డిమాండ్‌ను క్రియేట్ చేస్తుందని ఆయన లాజికల్‌గా వివరించారు. చివరగా సినీ పరిశ్రమకు రామ్‌గోపాల్‌వర్మ ఒక గట్టి పిలుపునిచ్చారు. సెన్సార్ బోర్డుల ముందు, ఆలోచనా రహితమైన అధికార యంత్రాంగాల ముందు దర్శకులు, నిర్మాతలు మోకరిల్లడం ఆపాలని కోరారు. ఇండస్ట్రీ ఎప్పుడు రాజీ పడి స్వీయ-సెన్సార్ చేసుకున్నా, అది మొత్తం వ్యవస్థను బలహీనపరుస్తుందని హెచ్చరించారు. మనకు కావాల్సింది సీన్ల కోతలు కాదని, సినిమాలో ఏ తరహా కంటెంట్ ఉందో స్పష్టంగా రేటింగ్స్ ద్వారా తెలియజేయడమని, ఆపై చూడాలో లేదో నిర్ణయించుకునే హక్కును ప్రేక్షకులకే వదిలేయాలని డిమాండ్ చేశారు. ఇకనైనా కోర్టుల్లోనూ, బహిరంగ వేదికలపై ఈ అవుట్ డేటెడ్ సెన్సార్ బోర్డు వ్యవస్థను చట్టపరంగా సవాలు చేయడానికి చిత్ర పరిశ్రమ అంతా ఏకతాటిపైకి రావాల్సిన సమయం ఆసన్నమైందని ఆర్జీవీ పిలుపునిచ్చారు.
నేచురల్ స్టార్ నాని ప్రతి సినిమాతోనూ తన పరిధిని విస్తరించుకుంటూ, వైవిధ్యమైన కథలతో ప్రేక్షకులను అలరిస్తూ వస్తున్నారు. ప్రస్తుతం ఆయన నటిస్తున్న మోస్ట్ ఎవైటెడ్ యాక్షన్ డ్రామా 'ది ప్యారడైజ్' చిత్రంపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. కేవలం నాని నటన కోసమే కాకుండా, ఈ సినిమా మేకింగ్ స్టాండర్డ్స్ కూడా అసాధారణంగా ఉండబోతున్నాయని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి.  ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన క్లైమాక్స్ షూటింగ్ జరుగుతోంది. ఈ భారీ క్లైమాక్స్ యాక్షన్ ఎపిసోడ్ కోసం ఏకంగా రెండు  ప్రొడక్షన్ యూనిట్లు రేయింబగళ్లు శ్రమిస్తుండటం ఇక్కడ విశేషం. ఈ భారీ యాక్షన్ ఎపిసోడ్ వెనుక ప్రముఖ యాక్షన్ కొరియోగ్రాఫర్ నవకాంత్ మాస్టర్ శ్రమిస్తున్నారు. నవకాంత్ మాస్టర్ నేతృత్వంలో డిజైన్ చేసిన ఈ ఫైట్ సీక్వెన్స్ సరికొత్త యాక్షన్ స్టైల్‌తో థియేటర్లలో ప్రేక్షకులకు రోమాంచితమైన అనుభూతిని ఇస్తుందని తెలుస్తోంది.  ఈ హై-వోల్టేజ్ క్లైమాక్స్ షూటింగ్ పూర్తయిన వెంటనే, చిత్రబృందం ఒక అదిరిపోయే మాస్ ఐటమ్ సాంగ్ షూటింగ్‌ను ప్రారంభించనుంది. ఈ సాంగ్ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలవడమే కాకుండా, థియేటర్లలో మాస్ ఆడియన్స్‌తో డ్యాన్స్ చేయించడం ఖాయంగా కనిపిస్తోంది.  ప్రస్తుతం వినిపిస్తున్న సమాచారం ప్రకారం, త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన కొత్త రిలీజ్ డేట్‌ను మేకర్స్ అధికారికంగా ప్రకటించనున్నారు. సెప్టెంబర్ 25న ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల చేయడానికి సన్నాహాలు వేగవంతం చేశారు. అయితే ఈ సినిమా బడ్జెట్ గురించి, విడుదల ఆలస్యం గురించి రకరకాల మాటలు వినిపిస్తున్నాయి. సినిమాకు అనుకున్నదానికంటే ఎక్కువ ఖర్చవుతోందని, షూటింగ్ మరింత లేట్ అవుతోందని కామెంట్స్ వస్తున్నప్పటికీ, కంటెంట్ విషయంలో చిత్రబృందం ఎంతో నమ్మకంతో ఉంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన కంటెంట్ శాంపిల్స్ రషెస్ చూసిన కొద్దిమంది పరిశ్రమ పెద్దలు "ప్యూర్ మ్యాడ్‌నెస్ లోడింగ్" అంటూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.  ఫస్ట్ షో పడిన తర్వాత థియేటర్ల నుంచి వచ్చే రెస్పాన్స్ చూసి అందరి నోళ్లు మూతపడతాయని, ఆ కంటెంట్ ఏంటి, ఆ అద్భుతమైన మేకింగ్ ఏంటి, నాని విశ్వరూపం ఏంటి అని కథలు కథలుగా చెప్పుకుంటారని ఇండస్ట్రీ వర్గాలు బలంగా నమ్ముతున్నాయి. ఈ చిత్రం తర్వాత నేచురల్ స్టార్ నాని రేంజ్ పూర్తిగా మారిపోవడం, ఆయన నెక్స్ట్ లీగ్ స్టార్‌గా ఎదగడం ఖాయమని ట్రేడ్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.     The Paradise, Nani, Srikanth Odela, TeluguOne  
    భారతీయ సినీ పరిశ్రమ గొప్పతనాన్ని వరల్డ్ సినీ యవనిక పై నిలబెట్టాలనే పట్టుదలతో తెరకెక్కుతున్న మూవీ రామాయణ(Ramayana).. మొత్తం రెండు భాగాలుగా తెరకెక్కుతున్న రామాయణ ని రెండు భాగాలుగా తెరకెక్కిస్తుండగా మొదటి భాగం దీపావళి కానుకగా నవంబర్ 8 న విడుదల కానుంది. ఇప్పటికే రిలీజైన టీజర్ ని అయితే ప్రతి రామ భక్తుడు, సినీ ప్రేమికుడు డైలీ చూస్తూ రామాయణ కోసం వెయిట్ చేస్తూ ఉన్నాడు.  రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో చిత్ర యూనిట్ ఒక వినూత్నమైన మునుపెన్నడూ చూడని ప్రమోషనల్ స్ట్రాటజీని తెరపైకి తెచ్చింది. కేవలం కమర్షియల్ పబ్లిసిటీకే పరిమితం కాకుండా, రామాయణంలోని పవిత్రమైన విలువలని ,సంస్కృతిని, మన పురాణాల గొప్పతనాన్ని నేటి తరం యువతకి, ముఖ్యంగా విద్యార్థులకు చేరువ చేయడమే లక్ష్యంగా మేకర్స్ ఒక భారీ సాంస్కృతిక ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఇందులో భాగంగా రూపొందించిన ఒక ప్రత్యేకమైన ఔట్‌రీచ్ వీడియో సరికొత్త సంచలనం సృష్టిస్తోంది. దేశవ్యాప్తంగా ఉన్న పాఠశాలలను కలుపుకుంటూ సాగిన ఈ మహత్తర ప్రచారంలో భాగంగా ఏకంగా 5 లక్షల మంది పాఠశాల విద్యార్థులని  భాగస్వామ్యం చేసి సరికొత్త రికార్డు సృష్టించారు. ఈ విలక్షణమైన ప్రచార పద్ధతి ద్వారా చిన్న వయస్సు నుంచే పిల్లలలో నైతిక విలువలను పెంపొందించడంతో పాటు, మన సనాతన ధర్మం మరియు రామాయణ ఇతిహాసంపై ఆసక్తిని పెంచేలా కార్యక్రమాలను రూపొందించారు.మేకర్స్ తీసుకున్న ఈ నిర్ణయంతో  సినిమా అనేది కేవలం వినోద సాధనమే కాదు, సమాజంపై, భావితరాలపై తీవ్ర ప్రభావం చూపే శక్తివంతమైన మాధ్యమం అని చిత్ర బృందం నిరూపిస్తోంది. ఒక భారీ బడ్జెట్ మూవీ ప్రమోషన్ల కోసం 5,00,000 మంది పాఠశాల స్థాయి విద్యార్థులని ఒకే తాటిపైకి తెచ్చి కనెక్ట్ చేయడం భారతీయ సినిమా చరిత్రలోనే ఇదే మొదటిసారి కావడం విశేషం. Also read: రామ్ చరణ్ తో నయనతార.. అసలు ఆట మొదలు కాబోతుందా!  రాముడిగా రణ్‌బీర్ కపూర్, సీతమ్మతల్లిగా సాయి పల్లవి, రావణాసురుడిగా యశ్ నటిస్తుండటంతో సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి.ప్రైమ్ ఫోకస్ స్టూడియోతో కలిసి నిర్మాత నమిత్ మల్హోత్రా నిర్మిస్తుండగా యష్ కూడా వన్ ఆఫ్ ది ప్రొడ్యూసర్ గా ఉన్నాడు. దర్శకుడు నితీష్ తివారీ రామాయణ కోసం దాదాపు 5 ఏళ్ల పాటు స్క్రిప్ట్, ప్రీ ప్రొడక్షన్ పనుల పైనే ఉండి రామాయణ తెరకెక్కించాడు.  ramayana, ranbirkapoor, sai pallavi, yash, nitesh tiwari  
మలయాళ ఇండస్ట్రీలో విలక్షణమైన పాత్రలతో మరియు వైవిధ్యమైన కథలతో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును, క్రేజ్‌ను సొంతం చేసుకున్న యువ హీరో షేన్ నిగమ్. ఆయన లీడ్ రోల్‌లో నటించిన లేటెస్ట్ యాక్షన్ డ్రామా చిత్రం 'బాల్టి'. ఉన్ని శివలింగం దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ సినిమా గత ఏడాది సెప్టెంబర్ 26వ తేదీన థియేటర్లలో విడుదలై మంచి ప్రశంసలు అందుకుంది. కాగా, ఈ జూలై 10వ తేదీ నుంచి ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ 'సోనీ లివ్' (Sony LIV)లో తెలుగు వెర్షన్ కూడా స్ట్రీమింగ్ అవుతోంది. కేరళ, తమిళనాడు సరిహద్దు ప్రాంతంలోని ఒక చిన్న టౌన్ నేపథ్యంలో సాగే ఈ కథ, మనల్ని ఒక భిన్నమైన నేర ప్రపంచంలోకి తీసుకెళ్తుంది. కథ విషయానికి వస్తే, ఈ టౌన్ లో ఉదయ్ (షేన్ నిగమ్) తన తల్లితో కలిసి నివసిస్తూ ఉంటాడు. రమేశ్, మణి, కుమార్ అనే ముగ్గురు ఇతనికి ప్రాణ స్నేహితులు. ఈ నలుగురు మిత్రులు కబడ్డీ ఆటలో అత్యద్భుతంగా రాణిస్తూ ఉంటారు. కబడ్డీ స్పోర్ట్స్ కోటా ద్వారా ఉదయ్‌కి ఏదో ఒక ప్రభుత్వ ఉద్యోగం వస్తుందని, తమ కష్టాలు తీరుతాయని అతని తల్లి ఎన్నో ఆశలతో ఎదురుచూస్తూ ఉంటుంది. మరోవైపు ఉదయ్‌ని ప్రాణంగా ప్రేమించే కావేరి (ప్రీతీ అస్రాని) కూడా అతనితో ఒక అందమైన, ప్రశాంతమైన జీవితాన్ని ఊహించుకుంటూ ఉంటుంది. కానీ, వారి జీవితాల్లోకి రాబోయే ఒక పెద్ద తుఫాను గురించి ఆ సమయంలో వారికి అస్సలు తెలియదు. ఆ ప్రాంతంలో భైరవ (సెల్వ రాఘవన్) అనే ఒక క్రూరమైన వడ్డీ వ్యాపారి ఉంటాడు. ఎక్సెల్ వడ్డీ, లార్జ్ వడ్డీ, జంబో వడ్డీ అంటూ వింత పేర్లతో రకరకాల స్కీములు పెట్టి అమాయక ప్రజలను నిలువునా దోచేస్తుంటాడు. అతను ఇచ్చిన బాకీ సమయానికి తీర్చకపోతే అతను మరియు అతని అనుచరులైన ముత్తు, మూర్తి పెట్టే టార్చర్ నెక్స్ట్ లెవెల్‌లో ఉంటుంది. అదే టౌన్ లో 'సోడా' ఫ్యాక్టరీ నడిపే సోడాబాబు (అల్ఫోన్స్) అనే మరో వ్యక్తి ఉంటాడు. ఇతను కేవలం కాలేజీ స్టూడెంట్స్‌కు మాత్రమే అప్పులు ఇస్తూ ఉంటాడు. తన తండ్రి పెరుమాళ్లను చంపిన భైరవపై పగతో రగిలిపోతూ, ప్రతీకారం తీర్చుకోవడానికి సరైన సమయం కోసం సోడాబాబు వేచి చూస్తుంటాడు. వీరందరితో పాటు అదే ఏరియాలో 'జీమా' (పూర్ణిమ ఇంద్రజిత్) అనే మహిళ కూడా వడ్డీ వ్యాపారం చేస్తుంటుంది. ఆమె కేవలం వ్యాపారం చేసుకునే మహిళలకు మాత్రమే అప్పులు ఇస్తుంది. వ్యాపార ఆధిపత్యం కోసం భైరవకు, సోడాబాబుకు, జీమాకు మధ్య లోపల తీవ్రమైన శత్రుత్వం, గొడవలు నడుస్తుంటాయి. ఇలాంటి క్లిష్టమైన పరిస్థితులలో కబడ్డీ ఆటగాళ్లైన ఈ నలుగురు స్నేహితుల ప్రతిభను భైరవ గమనిస్తాడు. వారి అమాయకత్వాన్ని, అవసరాలను ఆసరాగా చేసుకుని, వారికి తెలియకుండానే రౌడీయిజం మరియు వడ్డీ వసూళ్ల క్రైమ్ ప్రపంచంలోకి దింపుతాడు. తప్పుడు దారిలోకి ప్రవేశించిన ఆ నలుగురు యువకుల జీవితాలు ఎలాంటి ఊహించని మలుపులు తిరిగాయి, ఆ మాఫియా ఊబి నుండి వారు ఎలా బయటపడ్డారు అనేది మిగతా ఉత్కంఠభరితమైన కథ. ఫైనాన్స్ కంపెనీల పేరుతో కొన్ని ముఠాలు సామాన్యుల జీవితాలను ఎలా నాశనం చేస్తున్నాయనే పాయింట్‌ను ఈ సినిమా కళ్లకు కట్టినట్టు చూపిస్తుంది. హోటల్‌లో రౌడీ గ్యాంగ్ ఎటాక్ సీన్, సోడా ఫ్యాక్టరీ ఫైట్, ప్రీ-క్లైమాక్స్ నుండి క్లైమాక్స్ వరకు వచ్చే ఉత్కంఠభరిత సన్నివేశాలు ఈ సినిమాకు ప్రధాన హైలైట్స్. 5కి 3.25 రేటింగ్‌తో నిలిచిన ఈ యాక్షన్ డ్రామా, మనం ఎంచుకునే మార్గమే మన భవిష్యత్తును నిర్ణయిస్తుందనే బలమైన సందేశాన్ని ఇస్తుంది.
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు. వారితో పాటు పెద్ద సంఖ్యలో క్యాడర్ కూడా పార్టీని వీడుతున్నారు. ఇక ఇప్పుడు నామినేటెడ్ పదవులలో ఉన్న వారి వంతు మొదలైనట్లు కనిపిస్తోంది. తనకు కానీ తన భర్తకు  కానీ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు టికెట్ ఇవ్వాలంటూ గత  కొంత కాలంగా కోరుతూ వస్తున్న మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ వంతు వచ్చింది. ఆమె కూడా రాజీనామా అస్త్రం సంధించారు.  జగన్ కు నమ్మిన బంటుగా గుర్తింపు పొందిన మహిళాకమిషన్ చైర్ పర్సన్ వాసి రెడ్డి పద్మ తన పదవికి రాజీనామా చేశారు. ఉరుములేని పిడుగులా, ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా తన రాజీనామా లేఖను సీఎం జగన్ కు పంపేశారు. పేరుకు తాను పార్టీకి కాదు, కేవలం మహిళా కమిషన్ చైర్మన్ పదవికి మాత్రమే రాజీనామా చేశాననీ, ఇక నుంచి వైసీపీ కోసం పని చేస్తాననీ వాసిరెడ్డి పద్మ చెబుతున్నప్పటికీ, ఆమె రాజీనామాకు కారణం అసంతృప్తేనని పార్టీ వర్గాలు బాహాటంగానే చెబుతున్నాయి. చాలా కాలంగా వాసిరెడ్డి పద్మ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు తనకు కానీ తన భక్తకు కానీ పార్టీ టికెట్ ఇవ్వాలని జగన్ ను కోరుతూ వస్తున్నారు. అయితే ఇప్పటి వరకూ జగన్ చూద్దాం.. చేద్దాం అన్నట్లుగా దాట వేస్తూనే వచ్చారు. ఇప్పుడిక వరుసగా అభ్యర్థల జాబితాలను జగన్ ప్రకటించేస్తుండటం, తనకు గానీ తన భర్తకు కానీ పార్టీ టికెట్ విషయంలో ఎటువంటి స్పస్టత ఇవ్వకపోవడంతో ఆమె మనస్తాపం చెంది పదవికి రాజీనామా చేసేశారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.  వాసిరెడ్డి పద్మ రాజకీయ ప్రవేశం ప్రజారాజ్యం పార్టీతో జరిగింది. 2009లో ఆమె ప్రజారాజ్యం పార్టీలో చేరారు. ఇలా చేరడంతోనే ఆమె ప్రజారాజ్యం అధికార ప్రతినిథిగా పదవి దక్కించుకున్నారు. ప్రజారాజ్యం కాంగ్రెస్ పార్టీలో విలీనం కావడంతో ఆమె 2012లో జగన్ పార్టీలో చేరారు. జగన్ కూడా ఆమెకు అధికార ప్రతినిథి పదవి ఇచ్చారు.  2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆమెను రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా నియమించారు. చైర్ పర్సన్ హోదాలో ఆమె జగన్ మెప్పు పొందేందుకు చేయగలిగినంతా చేశారు. ప్రతిపక్ష పార్టీ నేతలకు నోటీసులు ఇచ్చారు. ఏకంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు సైతం నోటీసులు జారీ చేశారు. వార్డు వలంటీర్లపై పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు కమిషన్ ముందు హాజరై వివరణ ఇవ్వాలంటూ ఆమె పవన్ కు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. పవన్ హాజరు కాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు నమోదు చేయాలని ఆదేశించారు. ఇన్ని చేసినా వాసిరెడ్డి పద్మకు ఆమె కోరినట్లుగా పార్టీ టికెట్ లభించకపోవడంతో అలిగి పదవికి రాజీనామా చేశారని, ఇది జగన్ కు షాకేననీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు. ఒకరైతు తనకు చేసిన సేవలకు ప్రీతి చెందిన గురువు అతడికి స్వర్గ ప్రాప్తిని కలగజేయాలని అనుకుంటాడు. కానీ సంసారాసక్తి వల్ల ఆ రైతు ఆ అవకాశాన్ని వాయిదా వేసుకుంటూ వస్తాడు. చివరికి గురుకృప వల్ల ఆ రైతు స్వర్గ ప్రాప్తిని ఎలా పొందాడో ఈ కథ తెలియజేస్తుంది. "ఒక మహాపురుషుడు ప్రయాణం చేస్తూ, డస్సిపోయాడు. గొంతు ఎండిపోయింది. దారిలో ఒక రైతు కనపడితే నీళ్ళు అర్థించాడు. ఆ రైతు మహాత్మునికి సకల ఉపచారాలూ చేశాడు. చిరిగిపోయిన ఆయన ఉత్తరీయాన్ని రైతు జాగ్రత్తగా కుట్టి బాగుచేశాడు. రైతు పరిచర్యలకు సంతసించిన ఆ మహాత్ముడు శాంతి, ఆనందాలకు నిలయమైన స్వర్గానికి తనతోపాటు రమ్మని అంటాడు. అందుకు ఆ రైతు 'గురువుగారూ! మీరు నా మీద చూపిన దయకు కృతజ్ఞుణ్ణి. కానీ నా పిల్లలు ఇంకా చిన్నవాళ్ళు. ఓ ఏడేళ్ళ వ్యవధి ఇవ్వండి' అని అడుగుతాడు. అందుకు గురువు అంగీకరించాడు. సరిగ్గా ఏడేళ్ళ తర్వాత గురువు రైతును స్వర్గానికి తీసుకువెళ్ళడానికి వచ్చాడు. అప్పుడు రైతు 'అయ్యా! కడపటి కొడుకు కష్టాలకు అంతు లేదు. అన్ని జంఝాటాలనూ ఒక్కడే సంబాళించుకోలేకపోతున్నాడు. కాబట్టి మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని గురువుని అడిగాడు. మరో ఏడేళ్ళ తరువాత గురువు వచ్చాడు. కానీ రైతు చనిపోయాడని తెలిసింది. చనిపోయిన ఆ రైతు ఎద్దుగా పుట్టాడని ఆ గురువు తన దివ్య దృష్టితో తెలుసుకున్నాడు. ఎద్దుగా పుట్టిన ఆ రైతు తన కొడుకు పొలాన్నే దున్నుతున్నాడు. అప్పుడు గురువు ఆ ఎద్దుపై మంత్ర జలం చిలకరించగానే ఎద్దు జన్మనెత్తిన రైతు 'నా కొడుకు పరిస్థితి మరి కాస్త మెరుగు పడనీయండి స్వామీ! మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని అన్నాడు. ఇక చేసేది లేక వెనుదిరిగాడు గురువు. మరలా ఏడేళ్ళ తర్వాత వచ్చిన గురువుకు ఎద్దు చనిపోయిందని తెలిసింది. అది కుక్కగా పుట్టి కొడుకు ఇంటినీ, ఆస్తినీ కాపలా కాస్తోందని తన దివ్యదృష్టి ద్వారా తెలుసుకున్నాడు. గురువు. కుక్కగా పుట్టిన ఆ రైతు 'స్వామీ! నేను ఎంత దౌర్భాగ్యుణ్ణి. మీరు ఇంత దయ చూపుతున్నప్పటికీ మీతో స్వర్గమానం చేయలేకున్నాను. వీడికి ఆస్తిని కాపాడుకొనే దక్షత ఇంకా రాలేదు. కాబట్టి దయ చేసి మరో ఏడేళ్ళు వ్యవధి ఇవ్వండి' అని వేడుకున్నాడు. గురువు ఏడేళ్ళ తరువాత మళ్ళీ వచ్చేసరికి కుక్క మరణించింది. అది త్రాచుపాముగా జన్మనెత్తి, ఇప్పుడు కొడుకు భూమిలో ఉన్న లంకెబిందెలకు పడగెత్తి కాపలా కాస్తోంది. గుప్త ధనం ఇక్కడ ఉందని కొడుకుకి ఎలా తెలియజేయాలా అని పాము ఆలోచిస్తున్నప్పుడు గురువు ఆ రైతుకొడుకును పిలుచుకు వచ్చి లంకె బిందెలు ఉన్న చోట తవ్వమన్నాడు. లంకె బిందెలు బయటపడ్డాయి. ఆ పైన ఆ పామును చంపమన్నాడు. అనంతరం శిష్యుణ్ణి తీసుకొని స్వర్గారోహణం చేశాడు గురువు. సంసారంలోని ఈతి బాధల నుండి శిష్యుణ్ణి ఉద్ధరిస్తాడు సద్గురువు. అలాంటి గురువు అందరికీ అవసరం.                                      *నిశ్శబ్ద.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్  రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది.  80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత  ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది.   ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది. ఆమెది నెద‌ర్లాండ్స్‌. ఆమె తండ్రి నెద‌ర్లాండ్స్‌లోని ఆర్నెహెమ్‌లో చిన్న‌పిల్ల‌ల ఆస్ప‌త్రి డైరెక్ట‌ర్. పోయి దొరికిన ఆ పెయింటింగ్ విష‌యానికి వ‌స్తే.. అది 1683లో కాస్ప‌ర్ నెష‌ర్ వేసిన స్టీవెన్ ఓల్ట‌ర్స్ పెయింటింగ్‌. రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో నాజీల ఆదేశాల‌ను చార్లెట్ తండ్రి వ్య‌తిరేకించారు. ఆయ‌న ర‌హ‌స్య జీవ‌నం సాగించేడు. కానీ ఈ పెయింటింగ్‌ని మాత్రం త‌న న‌గ‌రంలోని ఒక బ్యాంక్‌లో భ‌ద్ర‌ ప‌ర‌చ‌మ‌ని ఇచ్చార‌ట‌. 1940లో నాజీలు నెద‌ర్లాండ్ పై దాడులు చేసినపుడు ఆ బ్యాంక్ మీద ప‌డి దోచుకున్నా రు. అప్పుడు ఈ పెయింటింగ్ కూడా తీసుకెళ్లారు. యుద్ధం అయిపోయిన త‌ర్వాత ఈ పెయింటింగ్ ఎక్క‌డున్న‌దీ ఎవ‌రికీ తెలియ‌లేదు. చిత్రంగా 1950ల్లో డ‌స‌ల్‌డార్ష్ ఆర్ట్ గ్యాల‌రీలో అది ప్ర‌త్య‌క్ష‌మ‌యింది. 1969లో ఆమ్‌స్ట‌ర్‌డామ్‌లో దాన్ని వేలానికి తీసికెళ్లే ముందు దాన్ని ఆ ఆర్ట్ గ్యాల‌రీలో వుంద‌ని చూసిన‌వారు చెప్పారు. వేలంపాట త‌ర్వాత మొత్తానికి ఆ పెయింటింగ్‌ను 1971లో ఒక క‌ళాపిపాసి త‌న ద‌గ్గ‌ర పెట్టుకున్నాడు.    ఆ త‌ర్వాత 2021లో అది చార్లెటీని చేరింది.  మొత్తానికి వూహించ‌ని విధంగా ఎంతో కాలం దూర‌మ‌యిన గొప్ప క‌ళాఖండం తిరిగి త‌న వ‌ద్ద‌కు చేర‌డంలో చార్లెటీ ఆనందానికి అంతేలేదు. అంతే క‌దా.. పోయింద‌నుకున్న గొప్ప వ‌స్తువు తిరిగి చేరితే ఆ ఆనంద‌మే వేరు!  అయితే చార్లెటీకి ఇపుడు ఆ పెయిం టింగ్‌ను భ‌ద్రంగా చూసుకునే ఆస‌క్తి వున్న‌ప్ప‌టికీ శ‌క్తి సామ‌ర్ధ్యాలు లేవు. అందుక‌నే త్వ‌ర‌లో ఎవ‌రిక‌యినా అమ్మేసీ వ‌చ్చిన సొమ్మును పిల్ల‌ల‌కు పంచుదామ‌నుకుంటోందిట‌!  చార్లెటీ కుటుంబంలో అయిదుగురు అన్న‌ద‌మ్ములు అక్క‌చెల్లెళ్లు వున్నారు. అలాగే ఇర‌వై మంది పిల్ల‌లు ఉన్నారు. అంద‌రూ ఆమె అంటే ఎంతో ప్రేమ చూపుతున్నారు. అంద‌రం ఒకే కుటుంబం, చాలాకాలం త‌ర్వాత ఇల్లు చేరిన క‌ళాఖండం మా కుటుంబానిది అన్న‌ది చార్లెటీ!
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు. చాకోను పార్టీలోకి ఆహ్వానిస్తూ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్’ ఫ్రంట్ ఏర్పాటు గురించి ప్రత్యేకించి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు కానీ, చాకో అలాంటి  సంకేతాలు ఇచ్చారు. ప్రస్తుతం దేశంలో ఉన్న ఏ ఒక్కపార్టీ కూడా బీజేపీకి ప్రత్యాన్మాయం కాదని,సమీప భవిష్యత్ కాంగ్రెస్ సహా ఏ పార్టీ కూడా ఆ స్థాయికి ఎదిగే అవకాశాలు కూడా కనిపించడంలేదని అన్నారు. ఈ పరిస్థితుల్లో దేశంలోని బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ, ఏకమై, ఒకే గొడుగు కిందకు రావలసిన అవసరం ఉందని చాకో అన్నారు. అదే సమయంలో ప్రతిపక్షాలను ఏక తాటిపైకి తెచ్చే బాధ్యతను పవార్ తీసుకోవాలని సంకేత మాత్రంగా చెప్పారు. అంతే కాకుండా కాంగ్రెస్ పేరు ఎత్తకుండా బీజేపీ వ్యతిరేక శక్తులను ఏకం చేసే ఆలోచన ఆ పార్టీ నాయకత్వానికి లేదని నెహ్రూ గాంధీ ఫ్యామిలీ (సోనియా, రాహుల్, ప్రియాంక)ఆలోచనా ధోరణిని పరోక్షంగానే అయినా ఎండ కట్టారు.ఆ విధంగా పవార్ ఆ బాధ్యత తీసుకోవాలని చాకో సూచించారు. ఇందుకు సంబంధించి, పవార్ బహిరంగంగా ఎలాంటి వ్యాఖ్య చేయలేదు. అయితే, చాకో సహా మరికొందరు ‘సీనియర్’ కాంగ్రెస్ నాయకులు, అలాగే సిపిఎం, సిపిఐ నాయకులు కూడా పవార్’తో చాలా కాలంగా థర్డ్ ఫ్రంట్  విషయంగా చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. అయితే మహారాష్ట్రలో సంకీర్ణం మనుగడను దృష్టిలో ఉంచుకుని పవార్ ఆచితూచి అడుగులేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే చాకో పార్టీలో చేరిన సందర్భంలో కూడా ‘చాకో చేరికతో మహారాష్ట్రలోని మహా వికాస్ అగాడీ ప్రభుత్వానికి ఎలాంటి నష్టం జరగదని, పవార్ మహారాష్ట్ర సంకీర్ణ సర్కార్ ప్రస్తావన చేశారని విశ్లేషకులు పేర్కొంటున్నారు.  మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వ మనుగడ గురించ్బి  పవార్ ప్రత్యేకంగా పేర్కొనడం ద్వారా, ఆయన థర్డ్ ఫ్రంట్ విషయంలో వేచి చూసే ఆలోచనలో ఉన్నట్లు అర్థమవుతోందని కూడా  రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే అదే ఎన్సీపీ అసెంబ్లీ ఎన్నికల జరుగతున్న కేరళలో, పశ్చిమ బెంగాల్లో  కాంగ్రెస్ వ్యతిరేక పార్టీలకు మద్దతు ఇస్తోంది. దీన్ని బట్టి చూస్తే, ఎన్సీపీ - కాంగ్రెస్ మధ్య దూరం పెరుగుతోందని స్పష్టమవుతోంది. అయితే, థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఏ రకంగా ముడి పడుతుంది అనే విషయంలో ఇంకా స్పష్టత రావలసి ఉంది. అలాగే, కాంగ్రెస్ లేకుండా జాతీయ స్త్గాయిలో బీజేపీ వ్యతిరేక కూటమిని ఏర్పాటు చేయడం వలన, వ్యతిరేక ఓటు చీలి  అది మళ్ళీ బీజేపీకే మేలు చేస్తుందని, కాబట్టి, ప్రస్తుతం కాంగ్రెస్ సారధ్యంలోని యూపీఏని బలోపేతం చేయడమే ఉత్తమమనే అలోచన కూడా  విపక్ష శిబిరం నుంచి వినవస్తోంది. ఈ నేపధ్యంలోనే, ప్రస్తుతం యూపీఏ ఛైర్పర్సన్’గా ఉన్న సోనియా గాంధీ వయసు, అనారోగ్యం కారణంగా బాధ్యతల నుంచి తప్పుకుని పవార్’కు బాద్యతలు అప్పగించాలనే ప్రతిపాదన వచ్చిందని అంటున్నారు. అలాగే, ఇతర పార్టీలను, ముఖ్యంగా కాంగ్రెస్ నుంచి విడిపోయి సొంత కుంపటి పెట్టుకున్న మమతా బెనర్జీ సారధ్యంలోని తృణమూల్, జగన్మోహన్ రెడ్డి సారధ్యంలోని వైసీపీలను కలుపుకుని కూటమిని బలోపేతం చేయడం ద్వారా బీజేపీని దీటుగా ఎదుర్కోవచ్చనే ఆలోచనలు కూడా సాగుతున్నాయి. అయితే, ఇటు థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు అయినా, యూపీఏని బలోపేతం చేయడమే అయినా, పవారే .. కేంద్ర బిందువు. ఆయన సారధ్యంలోనే ప్రత్యాన్మాయం అనేది విపక్ష శిభిరం నుంచి వినవస్తున్న ప్రస్తుత సమాచారం. మరి అదే జరిగితే రాహుల గాంధీ పరిస్థితి ఏమిటి ? గాంధీ నెహ్రూ కుటుంబం పరిస్థితి ఏమిటి? ఏ ప్రత్యేక ప్రాధాన్యత లేకుండా అందరిలో ఒకరిగా ఫస్ట్ ఫ్యామిలీ సర్దుకు పోతుందా? అంటే..చివరకు ఏమవుతుందో .. ఇప్పుడే చెప్పలేమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది. గతంలో అనేక సందర్భాలలో ముఖ్యమంత్రి కేసీఆర్,ఆర్థిక మంత్రి హరీశ రావు, కరోనా కారణంగా రాష్ట్ర  ఆదాయం గణనీయంగా తగ్గిందని, పేర్కొన్నారు. అయితే, కరోనా నుంచి వేగంగా కోలుకుని, ఆర్థికంగా అంతే వేగంగా పుంజుకున్న రాష్ట్రాలలో తెలంగాణ ప్రధమ స్థానంలో  ఉందని కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సర్వే 2020-21 నివేదిక పేర్కొంది. పడిలేచిన కెరటంలా, తెలంగాణ ‘వీ’ ఆకారంలో ఆర్థికంగా నిలతొక్కుందని కేంద్రం జనవరి  చివరి వారంలో విడుదల చేసిన ఆర్థిక సర్వేలో పేర్కొంది. అలాగే, రెవిన్యూ వసూళ్ళలో రాష్ట్రం కరోనా పూర్వస్థితికి చేరిందని కూడా సర్వే చెప్పింది.   అలాగే,రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు కూడా ఈ మధ్య కాలంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పై సంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరమ జనవరి,ఫిబ్రవరి, మార్చి నెలలతో పోలిస్తే ఈ సంవత్సరం ఈ మూడు నెలల కాలంలో రాష్ట్ర ఆర్థిక వృద్ది రేటు 10 నుంచి  15 శాతం మెరుగ్గా ఉందని హరీష్ రావు ఒకటి రెండు ఇంటర్వ్యూలలో పేర్కొన్నారు.అలాగే, బడ్జెట్ విషయంలోనూ ఆయన చాల ఆశావహ దృక్పథంతోనే ఉన్నారు. బడ్జెట్  పాజిటివ్’గా ఉంటుదని, ఎవ్వరూ ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని, సంక్షేమ పథకాలలో,ఇతరత్రా బడ్జెట్ కేటాయింపులలో ఎలాంటి కోతలు ఉండవని కూడా హరీష్ హామీ ఇచ్చారు. గత సంవత్సరంలో కొంత మేర హామీ ఇచ్చిన మేరకు అమలు చేయలేక పోయిన సొంత జాగాలలో డబల్ బెడ్ రూమ్ ఇళ్ళ నిర్మాణం, రుణ మాఫీ వంటి  పథకాలను ఈ బడ్జెట్ ద్వారా అమలు చేస్తామని చెప్పారు. అలాగే, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ తమిళి సై చేసిన ప్రసంగంలోనూ ఆశావహ దృక్పధమే వ్యక్తమైంది. ఆమె తమ ప్రసంగంలో,  ప్రభుత్వం సంక్షేమ పథకాలకు పెద్ద పీట వేసిందని అన్నారు. ‘సంపద పంచాలి ,పేదలకు పంచాలి’ అనేది తమ ప్రభుత్వ విధానమని స్పష్టం చేశారు. అలాగే, పెరుగతున్న ఆదాయంలో అధికశాతం సంక్షేమానికే వెచ్చిస్తున్నామని స్పష్టం చేశారు. దీంతో బడ్జెట్’లో కొత్త పథకాలకు శ్రీకారం చుట్టే అవకాశం ఉంటుందా అన్న చర్చ జరుగుతోంది. మరో వంక ఉద్యోగ వర్గాల్లో పీఆర్సీకి సంబంధించి ఆర్థిక మంత్రి తమ ప్రసంగంలో  ప్రకటన చేస్తారా లేదా అనే ఆసక్తి నెలకొంది. అలాగే, సామాన్య  ప్రజలు ఇటీవల పెరిగిన పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరల భారం నుంచి మంత్రి హరీష్, ఏదైనా ఉపసమనం కలిపిస్తారా అని ఎదురు చూస్తున్నారు. గతంలో వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సామాన్య ప్రజలపై వంటగ్యాస్ ధర భారాన్ని తగ్గించేందుకు కొంత మొత్తాన్ని, రూ.50(?) రాష్ట్ర ప్రభుత్వం తరపున  సబ్సిడీగా ఇచ్చిన విషయాన్ని, అదే విధంగా అసెంబ్లీ ఎన్నికలు జరుగతున్న తమిళనాడులో డిఎంకే పార్టీ,తమ పార్టీని అధికారంలోకి వస్తే  గ్యాస్ బండపై వంద రూపాయల సబ్సిడీ ఇస్తామని చేసిన  వాగ్దానాన్ని  గుర్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే, ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు, సోమవారం ఆర్థిక మంత్రి హరీష్ రావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఆర్థిక  శాఖ ముఖ్య కార్యదర్శి రామ కృష్ణా రావు,సలహాదారు జీఆర్ రెడ్డితో బడ్జెట్ పద్దులఫై సుదీర్ఘంగా చర్చించి తుది మెరుగులు దిద్దారు. బడ్జెట్ తుది రూపం సిద్దమైన నేపధ్యంలో ఆర్థిక శాఖ ప్రింటింగ్ ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 18 ఉదయం మంత్రి వర్గం ఆమోదం పొందిన అనంతరం ఆర్థికమంత్రి హరీష్ రావు అదే రోజు రాష్ట్ర బడ్జెట్ 2021-22ను సభలో ప్రవేశ పెడతారు. 20, 22 తేదీల్లో బడ్జెట్‌పై సాధారణ చర్చ,23, 24, 25 తేదీల్లో బడ్జెట్‌ పద్దులపై చర్చ ఉంటుంది 26న ద్రవ్యవినిమయ బిల్లు (బడ్జెట్)పై చర్చ, సభామోదం ఉంటాయి.
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది.  అధికార తెరాస, ఖమ్మం స్థానానికి సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర రెడ్డి పేరును ప్రకటించడంలో కొంచెం జాప్యం చేయడంతో పాటుగా, హైదరాబాద్ స్థానం నుంచి , పీవీ కుమార్తె వాణీ దేవి పేరును చివరి క్షణంలో తెరమీదకు తేవడంతో అంత వరకు కొంత స్తబ్దుగా సాగిన ప్రచారం ఆ తర్వాత వేడెక్కింది. ఉద్యోగ నియామకాల విషయంలో తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ తప్పులో కాలేయడంతో విపక్షాలు, పోటీలో ఉన్న ప్రత్యర్ధులు, నిరుద్యోగ యువత, విద్యార్ధి సంఘాలు  ఒకే సారి ఆయన మీద  విరుచుకు పడ్డారు. ఆయన లెక్క తప్పని నిరుపిస్తం రమ్మని వరస సవాళ్ళు విసిరారు. దీంతో, మంత్రి నియామకా ఇష్యూని పక్కకు తప్పించేందుకు , ఐటీఐఆర్, వరంగల్ రైల్వే ఫ్యాక్టరీ వంటి సెంటిమెంటల్ ఇష్యూస్’ను తెరపైకి  తెచ్చారు. అలాగే, కేంద్ర ప్రభుత్వంపై విమర్శల దాడిని పెంచారు. చివరకు పొరుగు రాష్ట్రానికి చెందిన విశాఖ ఉక్కు ఆందోళన   కూడా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగమైంది.   రెండు నియోజక వర్గాలలో గతంతో పోలిస్తే ఈసారి ఓటర్ల సంఖ్య రెట్టింపు అయింది. ఈసారి రెండు నియోజక వర్గాలలో కలిపి 10 లక్ష 36 వేల మంది తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. అలాగే, రెండు పట్ట భద్రుల నియోజక వర్గాల్లో 164 మంది అభ్యర్ధులు పోటీలో ఉన్నారు.  గత ఎన్నికలతో పోలిస్తే ఇటు ఓటర్ల సంఖ్య, అటు అభ్యర్థుల సంఖ్యా రెట్టింపునకు పైగానే పెరగడంతో ఎన్నికలలో జోష్ పెరిగింది. దీనికితోడు అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో సాధారణ ఎన్నికలను తలపించే రీతిలో ప్రచారం సాగింది. ఎక్కువమంది అభ్యర్ధులు బరిలో ఉండడంతో, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి  తమకే ప్రయోజనం జరుగుతుందని అధికార పార్టీ ఆశపడుతోంది .  దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో చేదు ఫలితాలను చవిచూసిన టీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా వ్యూహ రచన చేసి కేటీఆర్, హరీష్ సహా మంత్రులు,ఎమ్మెల్యేలకు స్పెసిఫిక్ బాధ్యతలు అప్పగించారు. అలాగే,కాంగ్రెస్‌ అభ్యర్థులు చిన్నారెడ్డి, రాములునాయక్‌లకు మద్దతుగా ఉత్తమ్‌, భట్టి, రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తదితరులు విస్తృతంగా ప్రచారం చేశారు. బీజేపీ అభ్యర్థులు ఎన్‌.రాంచందర్‌రావు, ప్రేమేందర్‌రెడ్డిల తరఫున ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, ఎంపీ అరవింద్‌ తదితరులు ప్రచారాన్ని వేడెక్కించారు.  ఖమ్మం స్థానం నుంచి ప్రత్యక్ష ఎన్నికల్లో తొలిసారి పోటీకి దిగిన కోదండరాంకు, టీజేఎస్‌ పార్టీకీ ఈ ఎన్నికలు కీలకంగా మారాయి. ఖమ్మ స్థానం నుంచి పోటీ చేస్తున్న తీన్మార్ మల్లన్న ముందస్తు వ్యూహంతో ప్రధాన పార్టీల అభ్యర్ధులకు ధీటుగా ప్రచారం సాగించారు.  వామపక్షాల మద్దతుతో జయసారథి, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్‌, యువతెలంగాణ కార్యనిర్వాహక అధ్యక్షురాలు రాణీ రుద్రమ తదితరులు పోటీలో ఖమ్మం సీటును పట్టభద్రులు  ఎవరికి  పట్టం కడతారు అన్నది ప్రశ్నార్థకంగా మారింది. హైదరాబాద్ సీటు కూడా ఇటు అధికార తెరాసకు అటు సిట్టింగ్ సీటును నిలుపుకోవడం తో పాటుగా దుబ్బాక , జీహెచ్ఎంసి జోష్ ను కొనసాగించాలని ఆశ పడుతున్నబీజేలకే కూడా ఇజ్జత్ కీ సవాల్ గా మారింది. కాంగ్రెస్ అభ్యర్ధి పార్టీ సీనియర్ నాయకుడు సౌమ్యుడు, మాజీ మంత్రి చిన్నారెడ్డి, వామ పక్షాల మద్దతుతో పోటీ చేస్తున్న మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ కూడా గట్టి పోటీ ఇస్తున్నారు. సో.. చివరకు ఏమి జరుగుతుంది అంటే ఏదైనా జరగవచ్చును. ఈ నెల 14 వ తేదీన పోలింగ్ జరుగుతుంది.17 ఫలితాలు వస్తాయి .. అంతవరకు వెయిట్ అండ్ వాచ్ .  
సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది. ఒకప్పుడు ఎర్ర జెండాను దిగ్విజయంగా ఎదిరించి, మార్క్సిస్టులను మట్టి కరిపించిన మమతా దీదీ ప్రస్తుతం, కాషాయ కూటమి నుంచి గట్టి సవాలును ఎదుర్కుంటున్నారు. వరసగా పదేళ్ళు పాలించడం వలన సహజంగా వచ్చిన ప్రభుత్వ వ్యతిరేకత  కంటే, హిందూ ఓటు పోలరైజేషన్ ఆమెను మరింతగా భయపెడుతోంది. నిజానికి ఐదేళ్ళ క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం ఐదు శాతం కంటే తక్కువ ఓట్లు, మూడంటే మూడు అసెంబ్లీ సీట్లు మాత్రమే గెలుచుకున్న బీజేపీ..  2019 లోక్ సభ ఎన్నికల్లో ఏకంగా 40 శాతం ఓట్లతో 18 స్థానాలు గెలుచుకుంది. ఈ  మార్పు ఇంకా కొన్ని కారణాలు ఉంటే ఉండవచ్చును కానీ.. హిందువుల ఓటు పోలరైజ్  కావడమే ప్రధాన కారణం.  ఈ నేపధ్యంలోనే కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ చివరకు కమ్యూనిస్టులు కూడా బీజేపీలో  చేరారు. ఎన్నికల ప్రకటన వెలువడిన తర్వాత కూడా సిట్టింగ్ ఎమ్మెల్ల్యేలు సహా  తృణమూల్ టికెట్ వచ్చిన నాయకులు కూడా బీజేపీలో చేరుతున్నారు. అనేక మంది ఇతర రంగాల ప్రముఖులు, ముఖ్యంగా ఇంతకాలం, బీజేపీని హిదుత్వ అనుకూల ‘అచ్చుత్’ (అంటారని) పార్టీగా చూసిన ‘సెక్యులర్’ ప్రముఖులు కాషాయం కప్పుకోవడంతో మమతా బెనర్జీకి కొంచెం అలస్యంగానే అయినా, తత్త్వం బోధపడింది. అందుకే ఆమె ఇప్పుడు గుళ్ళూ,గోపురాలకు తిరుగుతున్నారు. కార్యకర్తల సమావేశాల్లో తానూ హిందువునేనని, చెప్పుకుంటున్నారు.  నిజానికి ఇలా నేనూ హిందువునే  అని సెక్యులర్ నేతలు బహిరంగంగా ప్రకటించుకోవడం మమతా బెనర్జీతోనే మొదలు కాలేదు. రాహుల్ గాంధీ తాను హిందువునని, జన్యుధారీ కశ్మీరీ బ్రాహ్మణుని అనీ.. తమ గోత్రం, ‘దత్తాత్రేయ’ గోత్రమని బహిరంగంగా ప్రకటించుకున్నారు. అలాగే  కొద్ది రోజుల క్రితం ప్రియాంకా గాంధీ తానూ హిందువునని చెప్పుకునేందుకు ‘మౌని అమావాస్య’ సందర్భంగా అలహాబాద్ లో గంగా స్నానం చేశారు. గతంలోనూ ఆమె ఎన్నికలకు ముందు గంగా యాత్ర చేశారు. అంతవరకు ఎందుకు కొద్దిరోజుల క్రితం సిపిఐ నారాయణ విశాఖ స్వామి ఆశీస్సులు తీసుకున్నారు. చంద్రబాబు, జగన్ రెడ్డి, కేసీఆర్ ఇలా తెలుగు నేతలు అనేక మంది లౌకిక వాదానికి కాలం చెల్లిందన్న సత్యాన్ని గ్రహించి కావచ్చు ‘నేనూ హిందువును’ అంటూ ప్రకటించుకునేందుకు పోటీ పడుతున్నారు. రాముడిని తలచుకున్నా, జై శ్రీరామ్ అన్నా తమ  లౌకిక వాదం మయలపడి పోతుందని భయపడిన నాయకులు ఇప్పుడు .. జై శ్రీరామ్ అనేందుకు కూడా వెనకాడడం లేదు.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది. గత కొంత కాలంగా సబర్మలతో సహా అనేక అంశాలపై స్పందిస్తూ.. కేరళను టార్గెట్ చేస్తున్న బీజేపీ నాయకులు అక్కడ తమ జెండా ఎగరేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా పార్టీ పాలసీని కూడా పక్కన పెట్టి మెట్రో మ్యాన్ శ్రీధరన్ ను పార్టీలో చేర్చుకుని ఆయనే తమ సీఎం అభ్యర్థి అని ప్రకటించిన 24 గంటలలో యూ టర్న్ తీసుకున్నారు. ఇది ఇలా ఉండగా ప్రస్తుతం సీఎంగా ఉన్న కమ్యూనిస్ట్ నేత పినరై విజయన్ పై గోల్డ్ స్మగ్లింగ్ ఆరోపణలు రావడంతో.. ఈ ఎన్నికలలో ఎల్డిఎఫ్ భవిష్యత్తుపై ప్రజలు ఏ తీర్పు ఇవ్వబోతున్నారనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది ఈ నేపథ్యంలో అక్షరాస్యతలో దేశంలోనే మొదటి స్థానంలో ఉన్న ఆ రాష్ట్ర ప్రజలు ఎవరిని ఆశీర్వదిస్తారు అనే అంశంపై ప్రముఖ మీడియా సంస్థ టైమ్స్ నౌ, సీ ఓటరుతో కలిసి ఒక సర్వేను నిర్వహించారు. ఈ సర్వే ప్రకారం చూస్తే పాపం కమలనాథులు అక్కడ పవర్ చేతికి రావటం అటుంచి కనీసం రెండు మూడు అసెంబ్లీ స్థానాల్లో గెలవటం కూడా కష్టమేనని ఆ సర్వే తేల్చి చెబుతోంది. కేరళలో ఈసారి జరిగే అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ తన హవా చాటుతుందన్న ఆ పార్టీ నేతల మాటలలో ఎలాంటి నిజం లేదని.. ప్రస్తుతానికి అది ఏమాత్రం సాధ్యం కాదని ఈ తాజా సర్వే తేల్చి చెప్పింది. అంతేకాకుండా మొత్తం 140 స్థానాలు ఉన్న కేరళలో.. ప్రస్తుత సీఎం పినరయి విజయన్ నేతృత్వంలోని లెఫ్ట్డ్ డెమొక్రటిక్ ఫ్రంట్ కు 82 సీట్లు పక్కా అని.. ఆయనే తిరిగి అధికారాన్ని నిలబెట్టుకుంటాడని సర్వే చెపుతోంది. అదే సమయంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూనైటెడ్ డెమొక్రాటిక్ ఫ్రంట్ కు 56 నుంచి 60 వరకు సీట్లు వచ్చే అవకాశం ఉందని ఈ సర్వేలో తేలింది. అంతేకాకుండా 2016 ఎన్నికలతో పోలిస్తే ఎల్ డీఎఫ్ ఓటింగ్ శాతం కూడా కొంత పెరగటం ఇక్కడ గమనార్హం. ప్రస్తుతం సీఎంగా ఉన్న విజయన్ మరోసారి సీఎం కావాలని 43.34 శాతం మంది మొగ్గు చూపినట్లుగా సర్వేలో తేలింది. కరోనా సమయంలో విజయన్ సీఎంగా బాగా పని చేసారని ఈ సర్వే పేర్కొంది. మరోపక్క దేశ ప్రధానిగా రాహుల్ గాంధీ ఉండాలని కేరళ ప్రజల్లో 55.84 శాతం మంది కోరుకుంటున్నట్లుగా ఈ సర్వే;లో తేలింది. అయితే కేరళలో ఎలాగైనా పాగా వేయాలని పట్టుదలతో కృషి చేస్తున్న బీజేపీకి ఈసారి కూడా నిరాశ తప్పదని ఈ సర్వేలో స్పష్టం అయింది. ఈ ఎన్నికలలో బీజేపీకి రెండు సీట్లు కూడా రావటం కూడా కష్టమేనని ఈ సర్వే తేల్చింది. అయితే ఎన్నికలకు ముందు ఇలాంటి సర్వేలు బయటకు రావడం.. తరువాత అందులో కొన్ని చతికిల పడడం మనం చూస్తూనే ఉన్నాం. మరి ఈ సర్వే ఫలితాలు నిజామా అవుతాయో లేదో తేలాలంటే కొద్దీ రోజులు వెయిట్ చేయాల్సిందే.        
రాజకీయాలు అంటేనే అదో జూదం. పూలమ్మిన చోటనే కట్టెలు అమ్మవలసి రావచ్చును. అలాంటి పరిస్థితే వచ్చినా, తలవంచుకుని పోగలిగితేనే, ఎవరైనా రాజకీయాలలో రాణించగలరు. అలాకాదని, అలిమి కానిచోట, కూడా తామే అధికులమని భావిస్తే, ఎందుకూ కాకుండా పోతారు. అలాంటి వారు ఇద్దరూ కూడా ఇప్పుడు మన కళ్ళముందే ఉన్నారు.  జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు. అలాగే జయ మరణం తర్వాత ఆమె పరిస్థితి ఏమిటో కూడా వేరే చెప్పవలసిన, అవసరం లేదు. జైలు పాలయ్యారు. సర్వం తానై నడిపించిన పార్టీ నుంచి  బహిష్కరణకు గురయ్యారు. జయ ఉన్నంత వరకు తన వారుగా ఉన్న వారందరూ కానివారయ్యారు. ఒంటరిగా మిగిలారు.  నిజానికి నాలుగేళ్ళు జైలు జీవితం గడిపిన తర్వాత కూడా ఆమె తలచుకుంటే.. రాష్ట్ర రాజకీయాలలో, ముఖ్యంగా అధికారంలో ఉన్న డిఎంకే కూటమిలో అలజడి సృష్టించగలరు. ఎన్నికలలో ఆమె గెలవక పోవచ్చును కానీ.. తనను కాదన్న అన్నాడిఎంకేను ఓడించగలరు. అయిన  ఆమె అందుకు విరుద్ధంగా  రాజకీయాలకు వీడ్కోలు పలికి మౌనంగా పక్కకు తప్పుకున్నారు. రాజకీయ సన్యాసం ప్రకటించారు. ఉమ్మడి శతృవు డిఎంకే ను ఓడించేందుకు అన్నా డిఎంకే కూటమి  పోటీ చేయాలని, కూటమి ఐక్యతను దెబ్బతీయరాదనే ఉద్దేశంతోనే ఆమె రాజకీయ సన్యాసం ప్రకటించారు.    శశికళ మౌనంగా వెళ్లి పోవడం వెనక ఇంకా అనేక కారణాలున్నా ,అసలు కారణం ఆమె, రాజకీయ విజ్ఞత, వివేకం. ఆమె జైలుకు వెళ్ళిన సమయంలో జయలలిత సమాధి వద్ద ఎంత కసిగా, కోపంగా ‘మౌన’ ప్రతిజ్ఞ చేశారో చూశా. అలాంటి ఆమె ఇప్పుడు ఇలా ‘మౌనం’గా వెనకడుగు వేశారంటే, అది ఆలోచించ వలసిన విషయమే.ఆమె వ్యుహతంకంగానే సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే అనేక మంది అనేక కోణాల్లో శశికళ సంచలన నిర్ణయాన్ని విశ్లేషించారు.జైలు జీవితం తర్వాత కూడా అన్నా డిఎంకే నాయకులు తనను అగ్రనేతగా అంగీకరించక పోవడం, అమిత్ షా చెప్పినా.. అన్నా డిఎంకే నాయకులు ఆమెను, మేనల్లుడు దినకరన్’ను కులం పేరున, కుటుంబం పేరున దూరం చేయడం, తిరిగి పార్టీలోకి తీసుకోకపోవడంతో ఆమె మనసు కష్టపెట్టుకుని, సన్యాస నిర్ణయం తీసుకున్నారని కొందరంటున్నారు. పార్టీ మీద పట్టు లేదని, చరిష్మా అసలే లేదని, అందుకే ఆమె అలా నిశ్శబ్ధంగా రాజకీయ సన్యాసం స్వీకరించారని ఇంకొందరు విశ్లేషించారు. ఈ విశ్లేషణలో కొంత నిజం ఉంటే ఉండవచ్చును.. కానీ ఆమె గతాన్ని, నైజాన్ని గుర్తు చేసుకుంటే ఆమె స్ట్రైక్ బ్యాక్ వ్యూహంతోనే ఒకడుగు వెనక్కివేశారని ఆమెతో సన్నిహితంగా మెలిగినవారు, ఆమె రాజకీయ చాణక్యం తెలిసిన వారు అంటారు.   నిజానికి జైలులో ఉన్న కాలంలో కానీ, జైలు నుంచి విడుదలై వచ్చిన తర్వాత కానీ, ఆమె రాజకీయ సన్యాసం వైపు అడుగులు వేస్తున్నట్లు కనిపించలేదు. బెంగుళూరు జైలు నుంచి విడుదలై చెన్నైలో ప్రవేశించిన నప్పుడు ఆమె పెద్ద కాన్వాయ్ తో  తమ కారుకు అన్నాడిఎంకే జెండాతోనే ఎంటరయ్యారు. అలా ఎంట్రీలోనే రాజకీయ ఆకాంక్షను వెంట తెచ్చుకున్నారు. చివరకు ‘సన్యాస’ ప్రకట చేసే వరకు కూడా ఆమె రాజకీయ కార్యకలాపాలు సాగిస్తూనే ఉన్నారు. అటు ఢిల్లీని ఇటు చెన్నైనికూడా కదిల్చారు. అంతేకాదు, రాజకీయాలపై విరక్తితో కాదు, రాజకీయ కసితో, ఉమ్మడి శత్రువు (డిఎంకే) ను ఓడించేందుకే తాను రాజకీయాలనుంచి తపుకుంటున్నట్లు చెప్పారు.  సో .. సన్యాసం తీసుకోవాలనే ఆలోచన, రాజకీయవ్యూహం లోంచి పుట్టిందే కానీ,వైరాగ్యంతో పుట్టింది కాదు ,అన్నవిశ్లేషణ వాస్తవానికి ఇంకొంత దగ్గరగా ఉందని అనుకోవచ్చును. ఇది ‘కామా’నే కాని ‘ఫుల్స్టాప్’ కాదని అంటున్నారు.  ముఖ్యమంత్రి ఎడప్పాడి కే. పళని స్వామి (ఈపీఎస్) ఆమెను పార్టీలోకి అనుమతిస్తే తన కుర్చికీ ఎసరు పెడతారనే భయంతోనే,, ఆమె ఎంట్రీని అడ్డుకున్నారు. ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం, శశికళ ఒకే సామజిక వర్గానికి చెందిన వారు కావడం కూడా, ముఖ్యమంత్రి ఈపీఎస్’ భయానికి కారణంగా పేర్కొంటారు. అందుకే  ఆయన, ‘మన్నార్గుడి’ ఫ్యామిలీని బూచిగా చూపించి, ఆమెను దూరంగా ఉంచారని పార్టీలో ఒక వర్గం గట్టిగా విశ్వసిస్తుంది. అయితే ఆమె శక్తియుక్తులను కూడతీసుకుని  పులిలా పంజా విసిరేందుకే ఆమె వ్యూహాత్మకంగా ఒక అడుగు వెనక్కి వేశారు కావచ్చును అని కూడా, తమిళ రాజకీయ వర్గాల్లో ఒక చర్చ జరుగుతోంది.  గతంలో ఆమె జయలలితతో విబేధాలు వచ్చిన సమయంలో కూడా ఇలాగే కొద్ది కాలం మౌనంగా తెర చాటుకు వెళ్లి పోయారు.  కొద్ది కాలంలోనే మళ్ళీ ‘పోయస్ గార్డెన్’లో ప్రత్యక్షమయ్యారు. జయలలిత స్వయంగా ఆమెను వెనక్కి పిలుపించుకోవలసిన పరిస్థితులను సృష్టించారు. అలా  మళ్ళీ  చక్రం తిప్పారు. జయలలిత మరణం వరకు ఆమె అందరికీ చిన్నమ్మగా అమ్మకు పెద్దమ్మగా సర్వం తానై నిలిచారు. చివరకు జయ అంత్యక్రియల్లో కూడా ఆమెదే పై చేయిగా కనిపించింది.   జయలలిత చనిపోయిన సందర్భంలోనే అన్నా డిఎంకే ఎమ్మెల్ల్యేలో సుమారు 30 మంది వరకు ఆమెకు మద్దతుగా ఉన్నారన్న వార్తలొచ్చాయి. నిజానికి,ఇప్పటికి కూడా ఒక్క అన్నా డిఎంకే లోనేకాదు,డిఎంకే ఇతర పార్టీలలో కూడా  ఆమె అవసరం ఉన్న వాళ్ళు ఉన్నారు. కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో ‘మన్నార్గుడి’ ఫ్యామిలీ మద్దతు లేకుండా గెలిచే అవకాశం లేదు.  ఇవ్వన్నీ నిజమే అయినా.. అన్నీ ఉండి, ఎవరు లేని శశికళలో, ఇంకా  ఎవరి కోసం తాపత్రయ పడాలి? అనే ప్రశ్న జనించి ఉంటే, ఆమె రాజకీయ సన్యాసం నిజం కావచ్చును. ఎందుకంటే ఆమె నెచ్చలి, జయలిత లేరు, భర్త అంతకంటే ముందే చనిపోయారు, పిల్లలు లేరు... పైగా నాలుగేళ్ళ జైలు జీవితం ఆమెలో మార్పు తెచ్చి ఉండవచ్చును. ఈ వయస్సులో తనవారంటూ ఎవరు లేని తనకు రాజకీయాలు ఎందుకు ? శేష జీవితాన్ని ఇలా సాగిద్దామనే ఆలోచన నిజంగా వచ్చి ఉంటే, ఆమె సన్యాసం సత్యం అయినా కావచ్చును, కాకపోనూ వచ్చును. కానీ  శశికళ... ఆమెను అర్థం చేసుకోవడం, అంచనా వేయడం , అంత తేలిగ్గా అయ్యే పని కాదు..
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు. కాంగ్రెస్ అధినాయకత్వం పై నేరుగా అస్త్రాలు సంధించారు. రాహుల్ గాంధీ పేరు చెప్పకుండానే, ఆయన నాయకత్వానికి పనికిరాడని తేల్చి చెప్పారు. ఎవరైనా పార్టీ అధ్యక్షుడు అయితే కావచ్చును, కానీ, ప్రజానాయకుడు కాలేడని, రాహుల గాంధీ ప్రజానాయకుడు కాదు కాలేరు,అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తరచూ రాహుల్ గాంధీని ఉద్దేశించి చేసే  ‘నామ్’ధారీ వ్యంగ్యాస్త్రాన్నే కాంగ్రెస్ సీనియర్ నాయకులు కూడా సందించారు. ఇక అక్కడి నుంచి విధేయ, అసమ్మతి వర్గాల మధ్య మాటల యుద్ధం ఎదో ఒక రూపంలో సాగుతూనే వుంది. అదే క్రమంలో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ, కరుడు కట్టిన ముస్లిం మతోన్మాది, అబ్బాస్ సిద్దిఖీతో కాంగ్రెస్ పార్టీ చేతులు కలపడం అసమ్మతి నాయకులకు మరో అస్త్రాన్ని అందించింది. విషయంలోకి వెళితే, ఇటీవల పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా లోక్’సభలో కాంగ్రెస్ పక్ష నాయకుడు, పశ్చిమ బెంగాల్ పీసీసీ అధ్యక్షుడు అధీర్’రంజన్ చౌదరి, ముస్లిం మత ప్రచారకుడు, అబ్బాస్ సిద్దిఖీతో  వేదిక పంచుకున్నారు.అంతకు ముందే వామ పక్ష కూటమితో  పొత్తు కుదుర్చుకున్న కాంగ్రెస్ పార్టీ, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)ను కూటమిలో చేర్చుకుంది. ఇలా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) అమోదం లేకుండా మతోన్మాద ఐఎస్ఎఫ్’ తో ఎన్నికల పొత్తు పెట్టుకోవడం ఆ పార్టీ నాయకుడు,సిద్ధిఖీతో  పీసీసీ చీఫ్ వేదిక  పంచుకోవడం పై అసమ్మతి నేతలు మండి పడుతున్నారు. ఇలా సిద్దిఖీతో వేదిక పంచుకోవడం పార్టీ మౌలిక సిద్ధాంతాలకు వ్యతిరేకం అంటూ అసమ్మతి వర్గానికి చెందిన కీలక నేత, రాజ్యసభ సభ్యుడు,ఆనంద్ శర్మ మండిపడ్డారు. అంతే కాదు, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)తో జనవరిలో కుదుర్చుకున్న పొత్తుకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ)అమోదం లేదని ఆనంద్ శర్మ, అభ్యంతరం వ్యక్త చేశారు. పార్టీ విశ్వసించే లౌకిక వాదానికి కాంగ్రెస్ అధిష్టానం తీసుకున్న నిర్ణయం గొడ్డలి పెట్టని ఆయన తీవ్రంగా స్పందించారు.   శర్మ వ్యాఖ్యలపై అధీర్ రంజన్ చౌదరి అంతే ఘాటుగా ప్రతిస్పందించారు. “నిజాలు తెలుసుకోండి ఆనంద్ శ‌ర్మ జీ” అంటూ ఆయ‌న వ‌రుస ట్వీట్లు చేశారు. వ్య‌క్తిగ‌త ప్ర‌యోజ‌నాలు ప‌క్క‌న‌పెట్టి, ప్ర‌ధానిని పొగిడి టైమ్ వేస్ట్ చేయ‌కండంటూ ఆయ‌న ఓ ట్వీట్లో అన్నారు. ఆనంద్ శ‌ర్మ అన‌వ‌స‌రంగా కాంగ్రెస్‌ను ల‌క్ష్యంగా చేసుకుంటున్నార‌ని, ఈ అంశాన్ని పెద్ద‌ది చేసి చూపిస్తున్నార‌ని విమ‌ర్శించారు. ఆయ‌న ఉద్దేశాలు స‌రైన‌వే అయితే నేరుగా తనతో మాట్లాడ వలసిందని అన్నారు. బెంగాల్‌లో సీపీఐ(ఎం) కూట‌మికి నేతృత్వం వ‌హిస్తోంది. అందులో కాంగ్రెస్ ఓ భాగం. మ‌త‌తత్వ‌, విభ‌జ‌న రాజ‌కీయాలు చేస్తున్న బీజేపీకి చెక్ పెట్ట‌డానికే ఈ కూట‌మి అని మ‌రో ట్వీట్‌లో అధిర్ రంజ‌న్ అన్నారు. అక్కడతోనూ ఆగలేదు ... ట్వీట్ల మీద ట్వీట్లు సంధిస్తూ, ఆనంద్ శర్మ, బీజేపీ మత విభజన, అజెండాను బలపరుస్తున్నారని, పరోక్షంగా జీ23 నాయకులు బీజేపీకి ప్రయోజనం చేకూరుస్తున్నారని ఆరోపించారు.అంతే కాదు, క్షేత్ర స్థాయి వాస్తవ పరిస్థితులు తెలియకుండా, ఆనంద్ శర్మ పార్టీ మీద దండెత్తడం ఉచితం కాదని చౌదరి ఎదురుదాడి చేశారు. అసమ్మతిలో అసమ్మతి. ఇదలా ఉంటే, కాంగ్రెస్ పార్టీ  సమూల పక్షాళన కోరుతూ సోనియా గాంధీకి,గత సంవత్సరం  జీ 23గా ప్రాచుర్యం పొందిన సీనియర్ నాయకులు రాసిన లేఖపై సంతకాలు చేసిన  నాయకుల్లో నలుగురు,జమ్మూలోసమావేసమైన నాయకుల తాజా నిర్ణయాలు, వ్యాఖ్యలు,విమర్శల పట్ల అసంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరం సోనియా గాంధీకి రాసిన లేఖలో ప్రస్తావించిన అంశాలకు కట్టుబడి ఉన్నామని, అయితే, జీ 23లోని కొందరు సహచరులు, ఇటీవల గీతదాటి చేస్తున్న వ్యాఖ్యలు, విమర్శలను తాము సమర్ధించడం లేదని ఆ నలుగురు పేర్కొన్నారు. ఇందులో ముఖ్యంగా, రాజ్యసభ మాజీ డిప్యూటీ చైర్మన్, పీజే కురియన్ అయితే, “కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు అవసరమైన సంస్కరణలు తెచ్చేందుకు చేసే ప్రయత్నాలను పూర్తిగా సమర్దిస్తాను, కానీ, ‘లక్ష్మణ రేఖ’ దాటితే ఒప్పుకునేది లేదు”అని అసమ్మతిలో అసమ్మతికి తెర తీశారు.అలాగే, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ కుమారడు, మాజీ ఎంపీ సందీప్ దీక్షిత్,మధ్య ప్రదేశ్ సీనియర్ కాంగ్రెస్ నాయకుడు అజయ్ సింగ్’ కూడా గులాం నబీ ఆజాద్, కపిల్ సిబల్, ఆనంద్ శర్మ, మనీష్ తివారీ వంటి జీ 23 కీలక నేతలు అధినాయకత్వంపై చేసిన వ్యాఖ్యలను తప్పు పట్టారు. అలాగే, పార్టీ సీనియర్ నాయకుడు కేంద్ర మాజీమంత్రి వీరప్ప మొయిలీ కూడా,గత సంవత్సరం పార్టీ సీనియర్ నాయకులు  ఒక పరిమిత లక్ష్యంతో  సోనియా గాంధీకి లేఖ రాయడం జరిగిందని, ఆ పేరున జరుగతున్న  కార్యక్రమాలు లేఖ సంకల్పానికి  విరుద్ధమని అన్నారు. జీ 23 కార్యకలాపాలపై రాహుల్ గాంధీ కూడా పరోక్షగా స్పందించారు, ఒకప్పుడు ఎన్ఎస్’యుఐ, యూత్ కాంగ్రెస్’ కు సంస్థాగత ఎన్నికలు వద్దన్న వారే ఇప్పుడు ఇంకోలా మాట్లాడుతున్నారని పరోక్షంగానే అయినా సంస్థాగత ఎన్నికలు నిర్వహించడంతో పాటుగా, పార్టీ పక్షాలనకు తమ కుటుంబం వ్యతిరేకం కాదని, అందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఈ నేపధ్యంలో కాంగ్రెస్ పార్టీలో చెలరిగిన కలకలం  ఇక ముందు ఏమవుతుందో .. ఇంకెన్ని  మలుపులు తిరుగుతోందో ..చూడవలసిందే కానీ ఉహించలేము.
పంచతంత్రంగా పిలుచుకుంటున్న ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భతం జరగబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే, వివిధ సంస్థలు అసెంబ్లీ ఎన్నికలు జరిగే  అస్సాం. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటుగా కేరళలోనూ ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఆ ఒపీనియన్ పోల్ ఫలితాలు నిజంగా నిజం అయితే, కేరళలో మళ్ళీ సీపీఎం సారధ్యంలోని వామపక్ష కూటమి అధికారంలోకి వస్తుంది. ఇదే ఆ అద్భుతం. ఎందుకంటే, గత నాలుగు దశాబ్దాలలో కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో ఒకే కూటమి వరసగా రెండవసారి అధికారంలోకి వచ్చిన చరిత్ర లేనే లేదు. ఒక సారి ఎల్డీఎఫ్ అధికారంలోకి వస్తే ఐదేళ్ళ తర్వాత కాంగ్రెస్ సారధ్యంలోని ఐక్య ప్రజాస్వామ్య కూటమి(యూడీఎఫ్) అధికారంలోకి రావడం, దేవభుమిలో దైవ నిర్ణయమా అన్నట్లుగా ప్రతి ఎన్నికల్లోనూ అధికారం చేతులు మారుతూ వస్తోంది. అలాంటిది, ఈసారి ఒపీనియన్ పోల్స్ నిజమై వరసగా రెండవసారి వామపక్ష కూటమి అధికారంలోకి వస్తే, అది చరిత్రే అవుతుంది. ఇక ఒపీనియన్ పోల్స్ విషయానికి వస్తే, జాతీయ న్యూస్ ఛానెల్ ఏబీపీ, సీ ఓటర్ సంస్థలు సంయుక్తంగా ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఈ సర్వే ప్రకారం, 140 స్థానాలున్న కేరళ అసెంబ్లీలో వామపక్ష కూటమికి 83 నుంచి  91 స్థానాలు, యూడీఎఫ్ కూటమికి 47 నుంచి 55 స్థానాలు మాత్రమే దక్కుతాయని తెలుస్తోంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్రంలో ఇలా జాతకాలు తిరగబడడంపై సోషల్ మీడియాలో,’లెగ్ మహిమ’ లాంటి జోక్స్  ట్రోలవుతున్నాయి. అయితే 2016లో జరిగిన ఎన్నికల్లో కేవలం 47 సీట్లకే పరిమితం అయిన కాంగ్రెస్’కు ఈసారి ఒకటీ అరా సీట్లు ఎక్కువస్తే, రావచ్చును. అదే కాంగ్రెస్’కు కాసింత ఊరట. అదలా ఉంటే, పశ్చిమ బెంగాల్లో సైతం పట్టు సాధించిన బీజేపే, కేరళలో మాత్రం పట్టు కాదు కదా, పట్టుమని పది సీట్లు తెచ్చుకునే స్థితిలో లేదు. నిజానికి, దేశంలో బీజేపీకి అసలు ఏ మాత్రం మింగుడు పడని రాష్ట్రాలు ఎవైన ఉన్నాయంటే కేరళ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల  పేర్లే ప్రముఖంగా వినిపిస్తాయి. ఈ సారి కూడా కమల దళం కేరళలో కాలు పెట్టె పరిస్తి లేదని సర్వే ఫలితాలు చెపుతున్నారు. ఎప్పటిలానే ఇప్పడు కూడా  బీజేపీకి సున్నా నుంచి రెండు సీట్లు వచ్చే అవకాశం ఉందని, సర్వేస్వరుల అభిప్రాయంగా ఉంది. కేరళలో మొత్తం 140 స్థానాలకు ఏప్రిల్ 6 తేదీన ఒకే విడతలో పోలింగ్ జరుగుతుంది. మే 2 తేదీన ఫలితాలు వెలువడతాయి. కేరళ ఎలక్షన్ పై యావత్ దేశం ఆసక్తి కనబరుస్తోంది.    
కేంద్ర ఎన్నికలసంఘం ‘పాంచ్ పటాక’ గంట కొట్టింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. ఎన్నికల గంట మోగడంతో మొదలైన మరో భారత ‘మినీ’  సంగ్రామానికి మే 12 తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తెర పడుతుంది.ఈలోగా వివిధ అంచల్లో పోలింగ్ జరుగుతుంది.  నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతం ఓటరు తీర్పుకు వెళుతున్నా, అందరి దృష్టి, ముఖ్యంగా ప్రాంతీయ పార్టీల ఏలుబడిలో ఉన్న ఉభయ తెలుగు రాష్ట్రాలు, మరీ ముఖ్యంగా ఇప్పటికే బీజేపీ కన్నుపడిన తెలంగాణ రాష్ట్ర ప్రజలు, రాజకీయ పార్టీల దుష్టి  మాత్రం పశ్చిమ బెంగాల్ పైనే వుంది.  పశ్చిమ బెంగాల్లో ‘అద్భుతం’ జరిగి బీజేపీ విజయం సాధిస్తే, ఇక  కమల దళం ఫోకస్, తెలంగాణకు షిఫ్ట్ అవుతుంది. ఇది అందరికీ తెలిసిన బహిరంగ రహస్యం. ఈ నేపధ్యంలో బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయి అనే విషయంలో రాష్ట్ర రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. బెంగాల్లో బీజేపీ గెలిస్తే, ఇప్పటికే అంతర్గత కుటుంబ కలహాలతో సతమతవుతున్న తెరాస నాయకత్వానికి మరిన్నితిప్పలు తప్పవన్న మాట అంతఃపుర వర్గాలలో సైతం వినవస్తోంది.  పశ్చిమ బెంగాల్’లో ఎలాగైతే కమలదళం ఓ వంక తమ ట్రేడ్ మార్క్, హిందుత్వ రాజకీయాలు సాగిస్తూ, మరో వైపు నుంచి ‘ఆకర్ష్’ అస్త్రంతో అధికార పార్టీని నిర్వీర్యం చేసిన విధంగానే, ఇక్కడ కూడా ఫిరాయింపులను ప్రోత్సహింఛి పార్టీని నిట్టనిలువునా చీల్చే ప్రమాదాన్ని కొట్టివేయలేమని పార్టీ వర్గాలు కూడా అనుమానం వ్యక్త పరుస్తున్నాయి.  ఇప్పటికే తెలంగాణ  బీజేపీ నాయకులు 30 మంది తెరాస ఎమ్మెల్యేలు తమ టచ్ లో ఉన్నారని బెదిరిస్తున్నారు.అది నిజం అయినా కాకపోయినా..తెరాసలో అసంతృప్తి అగ్గి రగులుతోందనేది మాత్రం ఎవరూ కాదనలేని నిజం. అంతే కాకుండా రాష్ట్రానికి వచ్చిన కేంద్రనాయకులు ఎవరిని పలకరించినా, నెక్స్ట్ టార్గెట్ తెలంగాణ అని ఎలాంటి సషబిషలు లేకుండా కుండబద్దలు కొడుతున్నారు.అందుకే, బెంగాల్లో బీజేపీ గెలిస్తే.. అనే ఊహా కూడా  గులాబీ గూటిలో గుబులు పుట్టిస్తోంది. అయితే, బెగాల్’లో బీజేపీ గెలిస్తే ఒక్క తెలంగాణలోనే కాదు, దేశ రాజకీయ వాతావరణంలోనే పెను మార్పులు చోటు చేసుకుంటున్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.  అలాగే,  దేశ ముఖ చిత్రంలో కూడా పెను మార్పులు తప్పవని అంటున్నారు. అయితే రాజకీయాలలో ఎప్పుడు ఏం జరుగుతుందో.. ఎవరూహించెదరు..
ఉద్గీత ప్రాణాయామం వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలు..రోజుకు 5 నిమిషాలు చాలు.! రోజుకు కేవలం 5 నిమిషాలు ఉద్గీత ప్రాణాయామం (ఓం ధ్యానం) చేస్తే శరీరం, మనసు ఎలా మారుతాయో తెలుసుకోవాలనుకుంటున్నారా? ఈ వీడియోలో ప్రముఖ సీనియర్ యోగా థెరపిస్ట్ & ఆయుర్వేద డైటీషియన్ శ్రీమతి స్రవంతి రఘు గారు ఉద్గీత ప్రాణాయామాన్ని సరైన పద్ధతిలో ఎలా చేయాలో సులభంగా వివరిస్తారు. అలాగే దీనివల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు, శాస్త్రీయంగా నిరూపితమైన అంశాలు, ఒత్తిడి తగ్గడం, మానసిక ప్రశాంతత పెరగడం, ఏకాగ్రత మెరుగుపడడం, మంచి నిద్రకు సహాయపడడం వంటి విషయాలను వివరంగా తెలియజేస్తారు. అంతేకాకుండా, ఉద్గీత ప్రాణాయామాన్ని ఎవరు చయాలి? ఎవరు చేయకూడదు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ప్రారంభ స్థాయి వారు ఎలా ప్రారంభించాలి? వంటి ముఖ్యమైన సందేహాలకు కూడా సమాధానాలు ఈ వీడియోలో పొందుపరిచారు. యోగా, ధ్యానం, సహజ ఆరోగ్యం మరియు మానసిక ప్రశాంతతపై ఆసక్తి ఉన్న ప్రతి ఒక్కరూ తప్పకుండా చూడాల్సిన ఉపయోగకరమైన వీడియో ఇది. ఈ వీడియోను పూర్తిగా వీక్షించి, ఉద్గీత ప్రాణాయామాన్ని సరైన విధంగా అభ్యసించి ఆరోగ్యకరమైన జీవనశైలికి నాంది పలకండి. మీ ఆరోగ్య సమస్య ఏదైనా... మా హెల్త్ యూట్యూబ్ ఛానల్‌లో సీనియర్ డాక్టర్స్ చెప్పిన సలహాలు... సూచనలు ఉన్నాయి. మా యూట్యూబ్ ఛానల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 👉 TeluguOne Health (సబ్‌స్క్రైబ్ చేయడం మర్చిపోకండి!)
మీ వంటింట్లో నల్ల మచ్చలు ఉన్న ఉల్లిపాయలు ఉన్నాయా?  ఇవి ఎంతవరకు సేఫ్ మీకు తెలుసా? ఉల్లిపాయ ఆహారంలో ఎక్కువగా వినియోగించే కూరగాయ.  ఏ కూరలు చేసినా అందులో ఉల్లిపాయ వేస్తే వచ్చే రుచి, సువాసన వేరు.  చాలామంది పచ్చి ఉల్లిపాయలు తినడానికి ఇష్టపడతారు.  అయితే గత కొంత కాలంగా ఉల్లిపాయల మీద నల్లటి మచ్చలు,  దుమ్ము లాంటి బూజు కనిపించడం చాలా మంది గమనించే ఉంటారు.  మార్కెట్ నుండి ఉల్లిపాయలు తెచ్చాక వాటిని నీటిలో కడిగి వండేస్తుంటారు. అయితే ఇలాంటి ఉల్లిపాయలు తినడం ఆరోగ్యానికి మంచిదేనా?  దీని గురించి ఆరోగ్య నిపుణులు ఏం చెబుతున్నారు?  వివరంగా తెలుసుకుంటే.. ఉల్లిపాయపై నలుపు రంగు..  ఉల్లిపాయ తొక్కలపై ఉండే నల్లటి మచ్చలు మట్టిలో కనిపించే ఒక సాధారణ శిలీంధ్రం వల్ల ఏర్పడతాయి. ఉల్లిపాయలపై కనిపించే ఈ శిలీంధ్రం సాధారణంగా అంటువ్యాధి కాదు, అయినప్పటికీ, ఉపయోగించే ముందు వాటిని బాగా కడగడం ముఖ్యం. చాలా మంది బాగా ఆరోగ్యంగా ఉండేవారికి ఉల్లిపాయ మీద ఉండే ఈ  బూజు వల్ల ప్రమాదం ఉండదు. అయితే, బూజు ఉల్లిపాయ లోపలి పొరలకు వ్యాపించినా, ఉల్లిపాయ మెత్తబడినా, లేదా కుళ్ళు స్పష్టంగా కనిపించినా, దానిని తినడం మంచిది కాదు. ఈ బూజు  కేవలం ఉల్లిపాయ పైననే కాకుండా   కొన్నిసార్లు దాని సన్నని వేర్లు కంటికి కనిపించని విధంగా లోపలికి కూడా వ్యాపిస్తాయి. ఆరోగ్యానికి మంచిదేనా? బాగా ఆరోగ్యంగా ఉన్న వ్యక్తులకు ఈ బూజు పెద్దగా ఆరోగ్యానికి హాని చేయదు. దీని వల్ల ప్రమాదం ఏమీ ఉండదు.   అయితే  కొంతమందిలో బూజు స్పోర్‌లు తుమ్ములు, ఆయాసం లేదా కంటి మంట వంటి అలెర్జీ రియాక్షన్ లకు కారణం కావచ్చు.  రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవారు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి. బయటి ఎండిన పొరపై కొద్దిగా నల్లటి పొడి మాత్రమే ఉండి, లోపల ఉల్లిపాయ పూర్తిగా గట్టిగా, శుభ్రంగా ఉంటే, బయటి పొరను తీసివేసి, బాగా కడిగిన తర్వాత దానిని ఉపయోగించవచ్చు. ఆరోగ్య నిపుణులు ఏమంటున్నారు? ఉల్లిపాయలపై నల్ల మచ్చలను కలిగించే శిలీంధ్రం సాధారణంగా హానికరమైనది కాదని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. అయితే, కొన్ని సందర్భాల్లో, ఇది ఓక్రాటాక్సిన్ ఎ అనే మైకోటాక్సిన్‌ను ఉత్పత్తి చేయగలదట. దీనిని ఎక్కువ కాలం పాటు, అధిక పరిమాణంలో తీసుకుంటే, అది మూత్రపిండాలు , కాలేయానికి నష్టం కలిగించగలదట. ఈ విషపదార్థం  వేడికి కూడా నశించదుని కాబట్టి వండటం వల్ల ఇది తప్పనిసరిగా తొలగిపోదని అంటున్నారు. అందుకే దీనిని ఆహారంలో ఉపయోగించే ముందు సరిగ్గా చూసుకోవడం  చాలా ముఖ్యం.                                     *రూపశ్రీ.  
గట్ మైక్రోబయోమ్ అంటే ఏమిటి? కడుపు ఆరోగ్యం మీ జీవితాన్ని ఎలా మార్చేస్తుందో తెలుసా? మన శరీర ఆరోగ్యానికి గట్ (Gut) ఎంత ముఖ్యమో చాలా మందికి పూర్తిగా తెలియదు. మన పేగుల్లో కోట్లాది సూక్ష్మజీవులు (Microbiome) నివసిస్తుంటాయి. వీటిలో మంచి బ్యాక్టీరియా, చెడు బ్యాక్టీరియా మధ్య సరైన సమతుల్యత ఉండటం ఆరోగ్యానికి ఎంతో అవసరం. ఈ సమతుల్యత దెబ్బతింటే దానిని డిస్బయాసిస్ (Dysbiosis) అంటారు. దీని వల్ల జీర్ణ సమస్యలతో పాటు అనేక ఇతర ఆరోగ్య సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఈ వీడియోలో ప్రముఖ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ Dr. Rakesh Kalapala గారు గట్ మైక్రోబయోమ్ అంటే ఏమిటి? అది మన శరీరంలో ఎలా పనిచేస్తుంది? మంచి బ్యాక్టీరియా పాత్ర ఏమిటి? చెడు బ్యాక్టీరియా పెరిగితే ఎలాంటి సమస్యలు వస్తాయి? వంటి విషయాలను సులభమైన భాషలో వివరించారు. అలాగే గట్ హెల్త్‌కు మెదడు (Gut-Brain Connection)తో ఉన్న సంబంధం, లివర్, ప్యాంక్రియాస్ వంటి ముఖ్యమైన అవయవాల పనితీరుపై గట్ ఆరోగ్యం ఎలా ప్రభావం చూపుతుందో వివరించారు. తరచూ గ్యాస్, అసిడిటీ, మలబద్ధకం, విరేచనాలు, కడుపు ఉబ్బరం వంటి సమస్యలు ఎందుకు వస్తాయి? వాటిని ఎలా గుర్తించాలి? ఎప్పుడు నిర్లక్ష్యం చేయకూడదు? అనే అంశాలపై కూడా అవగాహన కల్పించారు. గట్ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి తీసుకోవాల్సిన ఆహారం, ఫైబర్ అధికంగా ఉండే పదార్థాలు, పులియబెట్టిన ఆహారాలు (Fermented Foods), ప్రోబయోటిక్స్, ప్రీబయోటిక్స్, తగినంత నీరు తాగడం, వ్యాయామం, సరైన నిద్ర, ఒత్తిడిని తగ్గించడం వంటి జీవనశైలి మార్పుల ప్రాముఖ్యతను వివరించారు. అంతేకాకుండా యాంటీబయోటిక్స్‌ను అవసరం లేకుండా తరచూ వాడటం వల్ల గట్ మైక్రోబయోమ్ ఎలా దెబ్బతింటుందో, ఏ లక్షణాలు కనిపించినప్పుడు వెంటనే గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్‌ను సంప్రదించాలో కూడా స్పష్టంగా తెలియజేశారు. గట్ ఆరోగ్యంపై శాస్త్రీయమైన, ఉపయోగకరమైన సమాచారం తెలుసుకోవాలనుకునే ప్రతి ఒక్కరూ తప్పకుండా చూడాల్సిన వీడియో ఇది. ఈ వీడియోలో తెలుసుకునే ముఖ్యాంశాలు: గట్ మైక్రోబయోమ్ అంటే ఏమిటి? మంచి బ్యాక్టీరియా – చెడు బ్యాక్టీరియా మధ్య సమతుల్యత డిస్బయాసిస్ అంటే ఏమిటి? దాని ప్రభావాలు గట్-బ్రెయిన్ కనెక్షన్ ఎలా పనిచేస్తుంది? గట్ ఆరోగ్యం లివర్, ప్యాంక్రియాస్‌పై చూపే ప్రభావం గ్యాస్, అసిడిటీ, మలబద్ధకం, కడుపు ఉబ్బరం వంటి సమస్యలకు కారణాలు గట్ హెల్త్‌ను మెరుగుపరిచే ఆహారం మరియు జీవనశైలి ఎప్పుడు డాక్టర్‌ను సంప్రదించాలి?