Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...పార్టీ పెట్టే ధైర్యం జూనియర్ కు ఉందా?
posted on: Jul 15, 2026 4:02PM
.webp)
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి నందమూరి వారసుడు, స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ రాజకీయరంగ ప్రవేశంపై జోరుగా చర్చ సాగుతోంది. ఈ నెల 18న ఎన్టీఆర్ తన అభిమానులతో ఒక భారీ స్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేస్తుండటమే ఇందుకు ప్రధాన కారణం. ఈ నేపథ్యంలో ఆయన జూలై 18న నూతన రాజకీయ పార్టీని ప్రకటిస్తారా, లేక కేవలం సామాజిక సేవా సంస్థకే పరిమితం అవుతారా అనే అంశంపై తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది.
ఈ సంచలన పరిణామాలపై ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు భరద్వాజ్ తెలుగువన్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలు చెప్పారు. కొందరు రాజకీయ నేతలు, న్యాయ నిపుణులు ఎన్టీఆర్ ఖచ్చితంగా పార్టీ పెడతారని, ఇందుకు సంబంధించిన ఆహ్వానాలు కూడా అందాయని బలంగా చెప్తున్నప్పటికీ.. క్షేత్రస్థాయి సమీకరణాలు మాత్రం అందుకు భిన్నంగా ఉన్నాయని భరధ్వాజ వెల్లడించారు.
గతంలో దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావు (సీనియర్ ఎన్టీఆర్) తెలుగుదేశం పార్టీని స్థాపించడానికి ముందు.. తాను సినిమాలకు స్వస్తి పలుకుతున్నానని, కేవలం సమాజ సేవ కోసమే ఒక సంస్థ పెడుతున్నానని ప్రకటించారు. తర్వాతే ఆయన దానిని తెలుగుదేశం' రాజకీయ పార్టీగా మార్చారు. ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ విషయంలోనూ ఇలాంటి వ్యూహమే నడుస్తోందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తమిళ నటుడు విజయ్, గతంలో రజనీకాంత్ వంటి వారు కూడా అభిమాన సంఘాల బలాన్ని సమీకరించిన తీరును ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు.
అయితే.. ప్రస్తుత పరిస్థితుల్లో జూనియర్ ఎన్టీఆర్ వెంటనే రాజకీయ పార్టీని స్థాపించే సాహసం చేయకపోవచ్చనన్న భరద్వాజ ఇందుకు ఆయనకున్న భారీ సినీ కమిట్ మెంట్లు కారణమన్నారు. ప్రస్తుతం ఆయన చేతిలో డ్రాగన్ , త్రివిక్రమ్ ప్రాజెక్ట్, దేవర 2 వంటి భారీ చిత్రాలు ఉన్నాయి. ఇవి పూర్తి కావడానికి కనీసం ఐదారేళ్ల సమయం పడుతుంది. ఈ దశలో సినిమాలను వదిలి పూర్తి సమయం రాజకీయాలకు కేటాయించడం జూనియర్ ఎన్టీఆర్ కు సాధ్యమయ్యే పని కాకపోవచ్చని భరద్వాజ అన్నారు.
మరోవైపు, పాన్ ఇండియా మార్కెట్లో తన పట్టును మరింత బలోపేతం చేసుకోవడానికి, సోషల్ మీడియా వేదికగా తన సినిమాలను ప్రమోట్ చేసుకోవడానికి అభిమానుల నెట్వర్క్ ను ఒక నిర్మాణాత్మకమైన కమిటీగా మార్చేందుకే ఈ సమావేశం ఉపయోగపడవచ్చనీ, హీరో అల్లు అర్జున్ సైతం జాతీయ స్థాయిలో తన ఆర్మీ కమిటీలను వేసిన విషయాన్ని భరద్వాజ గుర్తు చేశారు.
ఏది ఏమైనప్పటికీ, ఏపీలో ప్రాంతీయ పార్టీల మనుగడపై జాతీయ పార్టీల ఒత్తిడి ఎక్కువగా ఉన్న తరుణంలో.. ఎన్టీఆర్ అడుగులు ఎటు పడతాయనేది ఆసక్తికరంగా మారింది. ఒకవేళ ఆయన సేవా సంస్థను స్థాపించినా, భవిష్యత్తులో అది రాజకీయ పార్టీగా రూపాంతరం చెందే అవకాశాలను కొట్టిపారేయలేము. ఈ సర్వత్రా వ్యక్తమవుతున్న సస్పెన్స్కు తెరపడాలంటే జూలై 18న జరగబోయే అభిమానుల సమావేశం వరకు వేచి చూడాల్సిందే.
Jr NTR July 18 Meeting, NTR Legacy, Telugu Politics News, Jr NTR New Party Launch


.webp)


