LATEST NEWS
బెంగళూరులోని యలహంక ప్యాలెస్‌లో వైఎస్ షర్మిల కుమార్తె వివాహం నిర్వహించడంపై వైఎస్‌ఆర్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వ్యక్తం చేసిన అభ్యంతరాలు ఇప్పుడు వైఎస్ కుటుంబంలో  విభేదాలు, వైరుద్ధ్యాలు, వైషమ్యాలను మరోసారి రచ్చకెక్కించాయి. సెక్యూరిటీ, వ్యక్తిగత భద్రత, ప్రాణహాని నెపంతో బెంగళూరు నివాసాన్ని వివాహానికి ఇవ్వలేనంటూ జగన్ రాసిన లేఖపై షర్మిల కుటుంబ సభ్యులు, వైఎస్ రాజశేఖరరెడ్డి సన్నిహుతులు, బంధువులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.  జగన్ లేఖకు బదులుగా ఆయనకు పలు ప్రశ్నలు, సవాళ్లతో కూడిన లేఖ రాశారు.    గత కొంత కాలంగా వైఎస్ రాజశేఖరరెడ్డి కుటుంబంలో ఆస్తుల పంపిణీ, రాజకీయ విభేదాల చుట్టూ వివాదాలు నడుస్తున్నసంగతి విదితమే ఈ క్రమంలోనే షర్మిల కుమార్తె అంజలి వివాహాన్ని బెంగళూరులోని వైఎస్ కుటుంబ నివాసంలో జరిపేందుకు సిద్ధమవ్వగా, భద్రతా కారణాలను ఉటంకిస్తూ,   జగన్  యలహంక ప్యాలెస్ ను షర్మిల కుమార్తె వివాహ వేడుకకు వేదిక కావడానికి నిరాకరించారు. ఇదు కుటుంబ పరంగా విభేదాలు మరింత పెచ్చరిల్లేందుకు దోహదం చేయడమే కాకుండా, రాజకీయంగా కూడా హాట్ టాపిక్ గా మారింది.  వందలాది మంది కొత్త వ్యక్తులు వస్తే తనకు  ప్రాణహాని ఉందని, కెమెరాలు, ఫోటోలతో ఇంటి భద్రత బయటపడుతుందని జగన్  షర్మిల కుమార్తె వివాహం ఎలహంక ప్యాలెస్ లో వద్దనడానికి కారణంగా తన లేఖలో పేర్కొన్నారు. అయితే దీనికి వైఎస్ కుటుంబ సభ్యులు, షర్మిల కుటుంబం తప్పుపడుతోంది. ఈ నేపథ్యంలో   షర్మిల కుటుంబ సభ్యులు జగన్ కు సంధించిన లేఖాస్త్రంలో  వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో జరిగిన కుటుంబ వేడుకలను ప్రస్తావిస్తూ.. జగన్ ను వైఎస్సార్ కంటే గొప్పవాడివా అంటూ నిలదీశారు.  గతంలో లేని భయం ఇప్పుడేందుకని ప్రశ్నించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రతిపక్ష నేతగా, ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో నాటు బాంబులు, కత్తుల సంస్కృతితో తీవ్ర ప్రాణాభయం ఉన్నప్పటికీ, కుటుంబంలోని పిల్లల పెళ్లిళ్లను ఎప్పుడూ ఆపలేదనీ, ఘనంగా నిర్వహించారనీ గుర్తు చేశారు. అంతే కాదు.. వైఎస్ రాజశేఖరరెడ్డి శత్రువులను కూడా వివాహాది శుభకార్యాలకు ఆహ్వానించారని ఆ లేఖలో జగన్ కు  గుర్తు చేశారు.   వైఎస్ సోదరుల పిల్లలు, తోడబుట్టిన చెల్లెలు విమలమ్మ పిల్లల పెళ్లిళ్లు వైఎస్ ఇళ్లలోనే జరిగాయని ఆ లేఖలో పేర్కొన్నారు. జార్జ్ రెడ్డి, అనిల్ రెడ్డి పెళ్లి, విమలమ్మ కొడుకు యువరాజ్, కుమార్తె దివ్య పెళ్లిళ్లు, రవీంద్రనాథ్ రెడ్డి కుమారుడు రఘుదీప్ పెళ్లి, అలాగే సుధీకర్ రెడ్డి కుమార్తె విరోనికా రెడ్డి వివాహాలు వైఎస్ నివాసాల్లోనే ఘనంగా జరిగాయని  ఉదాహరించారు. వైఎస్ ఎన్నడూ జగన్ లా పెళ్లిళ్లను, కుటుంబ వేడుకలను అడ్డుపెట్టుకుని ప్రాణహాని ఉందంటూ   దాక్కోలేదని పేర్కొంటూ.. మేనకోడలి పెళ్లి వల్ల  ప్రాణహాని ఉందన్న భయం ఉంటే జగన్ ఆ పది రోజులూ బెంగళూరు ప్యాలెస్ వైపు రాకుండా వేరే  దేశానికో లేదా   ప్రాంతానికో వెళ్లిపోవచ్చునంటూ హితవు పలికారు.  యలహంక ప్యాలెస్‌లోని ఇరు భవనాలు, వాటి చుట్టూ ఉన్న కాంపౌండ్ గోడలు వేరని గూగుల్ మ్యాప్స్ ద్వారా చూసినా ఎవరికైనా స్పష్టంగా అర్థమవుతుందని, అలాంటప్పుడు భద్రతా సమస్య ఎక్కడి నుంచి వస్తుందని ఆ లేఖలో షర్మిల కుటుంబం నిలదీసింది. షర్మిలకు కాబోయే వియ్యంకులు ఇప్పటికేబెంగళూరులోని షర్మిల రెసిడెన్సీ వేదిక అంటూ ఆహ్వానపత్రాలు ముద్రించి బంధువులకు పంచిన విషయం తెలిసి కూడా జగన్ ఇలా వివాహ వేదికను వద్దనడం తమ పరువు తీయాలన్న ఉద్దేశంతోనేనని దుయ్యబట్టారు.  రెండు వైపులా కేవలం అత్యంత ముఖ్యమైన వందలాది మంది బంధువుల సమక్షంలో ప్రశాంతంగా పెళ్లి చేసుకోవాలనుకుంటే, ఇలాంటి కుట్రలతో అడ్డుకోవడం ఏంటంటూ నిలదీశారు. మేనకోడలి పెళ్లికి రావడం, శుభకార్యంలో పాల్గొనడం ఇష్టం లేక సెక్యూరిటీ సాకు చూపిస్తూ, ప్యాలెస్ షర్మిలది కాదు, అదేమీ ఫంక్షన్ హాలు కాదు అంటూ  అంటూ కొత్త డ్రామాలకు తెరలేపారని విమర్శించారు.   పక్కనే ఉండి కూడా మేనకోడలి పెళ్లికి హాజరు కాలేదనే చెడు ముద్ర సమాజంలో పడకుండా ఉండేందుకే, ముందుగానే ఇలాంటి వివాదాలు సృష్టించి నాటకాలు ఆడుతున్నారని విమర్శించారు.  వైఎస్ కుటుంబంలో గత కొంతకాలంగా ఆస్తులు, రాజకీయాల పరంగా వస్తున్న విభేదాలు ఇప్పుడు నివాసాలు, శుభకార్యాల వేదికల వరకు పాకడం తెలుగు రాష్ట్రాల్లో  చర్చనీయాంశమైంది. మేనకోడలి పెళ్లి విషయంలోనూ అన్నా చెల్లెళ్ల  మధ్య ఈ స్థాయిలో మాటల యుద్ధం నడవడం పట్ల  వైఎస్సార్ అభిమానులు , కుటుంబ శ్రేయోభిలాషులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.  [Jagan, YS Sharmila Strong Counter, Jagan, Yelahanka Palace, Life Thret, Letter, Sharmila Daughter Marriage,  YS Rajasekhara Reddy Family, Telugu One]
కర్ణాటక రాజకీయాల్లో  డీకే శివకుమార్ వ్యాఖ్యలు సంచలనం సృష్టించాయి. సరికొత్త అత్యాధునిక సాంకేతికతతో  రాష్ట్రానికి చెందిన  ప్రముఖ పారిశ్రామికవేత్త ఒకరు  తనను రహస్యంగా రికార్డ్ చేసేందుకు కుట్ర పన్నారంటూ కర్ణాటక ముఖ్యమంత్రి డీకే శివకుమార్ చేసిన వ్యాఖ్యలు  రాజకీయ వర్గాల్లో పెను సంచలనంగా మారాయి. మెటా సంస్థకు చెందిన స్మార్ట్ గ్లాసెస్‌ను ధరించి తనను కలిసిన ఆ పారిశ్రామిక వేత్త.. సంభాషణ మొత్తాన్ని సీక్రెట్‌గా రికార్డ్ చేసేందుకు ప్రయత్నించాడని డీకే పేర్కొన్నారు.  అధికారిక భేటీ ముసుగులో జరిగిన ఈ గోప్యతా ఉల్లంఘన ఉదంతం ఒక్కసారిగా రాష్ట్రంలో పొలిటికల్ హీట్ ను పెంచేసింది. ఒక వార్తా ఛానెల్‌కు ఇచ్చిన  ఇంటర్వ్యూలో డీకే శివకుమార్ ఈ అంశానికి సంబంధించిన వివరాలను వెల్లడించారు. తనను కలిసేందుకు అధికారికంగా అపాయింట్‌మెంట్ తీసుకున్న ఆ పారిశ్రామికవేత్త, మొదట సాధారణ వ్యాపార విషయాలపై చర్చలు ప్రారంభించి, ఆ తరువాత  రాజకీయ విషయాలు, బూత్ స్థాయి వ్యూహాలు,  సున్నితమైన అంశాల వైపు చర్చను మళ్లించినట్లు తెలిపారు.  ఆ సమయంలో అతడు ధరించిన ప్రత్యేక  కళ్లద్దాలపై అనుమానం కలగడంతో   విషయం వెలుగులోకి వచ్చిందని తెలిపారు. ఈ ఘటనపై అనుమానం బలపడటంతో సదరు పారిశ్రామికవేత్త నేపథ్యంపై నిఘా పెట్టాల్సిందిగా అధికారులను ఆదేశించినట్లు డీకే శివకుమార్  చెప్పారు.  కేవలం తనను మాత్రమే కాకుండా, కేరళ ముఖ్యమంత్రి వీడీ సతీషన్‌తో సమావేశమైనప్పుడు కూడా సదరు వ్యక్తి ఇదే రకమైన మెటా స్మార్ట్ గ్లాసెస్ ధరించి పాల్గొన్నట్లు తమ విచారణలో తేలిందని వెల్లడించారు. అయితే, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, ఇతర కేంద్ర మంత్రులను కలిసిన సందర్భాల్లో మాత్రం అతను ఈ కళ్లద్దాలను ఉపయోగించకపోవడం అనుమానాలకు తావిస్తోందన్నారు. మొత్తంగా  ఇటీవల కాలంలో కర్ణాటక రాజకీయాల్లో వరుసగా వెలుగుచూస్తున్న స్టింగ్ ఆపరేషన్ ఉదంతాలు  దుమారం రేపుతున్నాయి. కొద్ది రోజుల కిందట మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు ముడిపడి ఉన్నట్లు చెబుతున్న ఒక రహస్య వీడియో కలకలం రేపిన విషయం తెలిసిందే. ఆ వీడియోను ఉపయోగించి ప్రభుత్వాన్ని అస్థిరపరచేందుకు, నాయకుల ప్రతిష్టను దెబ్బతీసేందుకు కొందరు కుట్ర పన్నారన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. ప్రభుత్వ కార్యాలయాలు, మంత్రులను లక్ష్యంగా చేసుకుని ప్రైవేట్ ఏజెన్సీల ద్వారా ఇటువంటి స్టింగ్ ఆపరేషన్లు నిర్వహిస్తున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.  ఈ పరిణామాల నేపథ్యంలో రాష్ట్రంలోని కేబినెట్ మంత్రులు, అత్యున్నత స్థాయి నాయకులు, వారి వ్యక్తిగత సహాయకులు  అప్రమత్తంగా ఉండాలని డీకే శివకుమార్ హెచ్చరించారు. ముఖ్యంగా టెలిఫోన్ సంభాషణలు, డిజిటల్ కమ్యూనికేషన్లు,  వ్యక్తిగత భేటీల సమయంలో తగిన జాగ్రత్తలు పాటించాలని సూచించారు. రాజకీయ ప్రత్యర్థులు తమను ఇబ్బందుల్లోకి నెట్టేందుకు, చట్టపరమైన చిక్కుల్లో పడేసేందుకు   అత్యాధునిక గాడ్జెట్లను ఉపయోగించి కుట్రలకు పాల్పడుతున్నారన్నారు.  ఈ సాంకేతిక గూఢచర్యం,  డిజిటల్ పరికరాల ముసుగులో గోప్యతను భగ్నం చేసే  చర్యలు ప్రజాస్వామ్య విలువలకు విఘాతమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.   [Sting Operation On Karnataka CM, DK Shivakumar, Meta Smart Glasses, Karnataka Politics,Industrialist Secret Recording, Congress News, Telugu One]
దేశ రాజధాని ప్రాంతంలో జరిగిన ఒక అత్యంత విషాదకరమైన ఘటన ప్రస్తుతం దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమైంది. కేవలం పది రూపాయల చిరిగిన నోటు వివాదం కారణంగా జరిగిన ఘర్షణ, ఒక నిండు ప్రాణాన్ని బలిగొన్న తీరు అందరినీ కలచివేస్తోంది. ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ మినిట్స్ సంస్థలో డెలివరీ పార్టనర్‌గా పనిచేస్తున్న సమీర్ హుస్సేన్ అనే యువకుడు ఆత్మహత్య చేసుకుని ప్రాణాలు కోల్పోవడం పట్ల సర్వత్రా విచారం వ్యక్తమవుతోంది. అక్టోబర్ 20వ తేదీన ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సమీర్ తుదిశ్వాస విడిచాడు. ఢిల్లీలోని వినోద్ నగర్ ప్రాంతంలో అక్టోబర్ 4వ తేదీ రాత్రి సుమారు 10:30 గంటల సమయంలో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. సమీర్ హుస్సేన్ ఒక కస్టమర్‌కు సుమారు రూ.150 విలువైన కాఫీ ఆర్డర్‌ను అందించేందుకు ఆ ప్రాంతానికి వెళ్లాడు. ఆర్డర్ డెలివరీ సమయంలో కస్టమర్ రాంపాల్ సింగ్ నగదు చెల్లించేందుకు దాదాపు 15 నిమిషాల సమయం తీసుకున్నప్పటికీ, డెలివరీ బాయ్ ఎలాంటి అసహనం వ్యక్తం చేయకుండా ఓపికగా వేచి ఉన్నాడు. అయితే, ఆ తర్వాత అసలు సమస్య మొదలైంది. కస్టమర్ ఇచ్చిన చిరిగిన రూ.10 నోటును మార్చి వేరే నోటు ఇవ్వాలని సమీర్ మర్యాదపూర్వకంగా కోరాడు. దీనికి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన కస్టమర్ రాంపాల్ సింగ్ దురుసుగా ప్రవర్తించడమే కాకుండా, సమీర్‌ను అందరి ముందు మూడుసార్లు చెంపదెబ్బ కొట్టాడు. తన విధుల్లో భాగంగా వచ్చిన ఒక సామాన్య శ్రామికుడిని కేవలం పది రూపాయల నోటు కోసం ఇంత దారుణంగా కొట్టడం తీవ్ర మానసిక క్షోభకు గురిచేసింది. తనకు జరిగిన అవమానాన్ని, పడ్డ వేదనను తట్టుకోలేకపోయిన సమీర్.. తాను ఆత్మహత్య చేసుకునే ముందు కొన్ని సెల్ఫీ వీడియోలను రికార్డ్ చేశాడు. ఆ వీడియోల్లో తన గోడును వెళ్లబోసుకున్నాడు. తాను ఎవరికీ భారంగా మారకుండా సొంత కష్టంతో బతకాలని భావించానని, కస్టమర్ తన పేదరికాన్ని ఎగతాళి చేస్తూ దౌర్జన్యం చేశాడని కన్నీటిపర్యంతమయ్యాడు. ఆత్మహత్యకు పాల్పడే ముందు విషం సేవించిన సమీర్, ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. ప్రస్తుతం ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా, నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని నెటిజన్లు, కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.  
7.75 లక్షల విలువైన 1,035 కిలోల ఆహార పదార్థాలు సీజ్.! మూడు దుకాణాల లైసెన్సులు సస్పెండ్.! పండగల సీజన్‌లో స్వీట్ల తయారీ, విక్రయాలు జోరుగా సాగుతున్న వేళ.. హైదరాబాద్‌లోని పలు ప్రముఖ స్వీట్ షాపులపై ఫుడ్ సేఫ్టీ అధికారులు కొరడా ఝుళిపించారు. స్వీట్ల తయారీలో పరిశుభ్రత పాటించకపోవడం, నాణ్యతా ప్రమాణాలను గాలికొదిలేయడం, గడువు ముగిసిన ఆహార పదార్థాలను విక్రయానికి ఉంచడం వంటి ఉల్లంఘనలు తనిఖీల్లో వెలుగుచూశాయి. తెలంగాణ ఫుడ్ అండ్ ఎస్సెన్షియల్ డ్రగ్స్ స్టాండర్డ్స్ అథారిటీ (TG SAFE) ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగం ఆధ్వర్యంలో ఫుడ్ సేఫ్టీ అధికారులు, పోలీసులతో కూడిన 11 ప్రత్యేక బృందాలు నగరంలోని కోవా, స్వీట్ల తయారీ కేంద్రాలు, రిటైల్ దుకాణాలు కలిపి మొత్తం 21 చోట్ల తనిఖీలు నిర్వహించాయి. ఈ తనిఖీల్లో పలు దుకాణాల్లో అపరిశుభ్ర వాతావరణం, ఆహార పదార్థాల్లో పురుగులు, ఫంగస్, ఎలుకల విసర్జినాలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. నిబంధనల ఉల్లంఘనలపై చర్యలు చేపట్టిన అధికారులు.. కల్తీ అనుమానంతో 21 ఆహార నమూనాలను సేకరించి పరీక్షల నిమిత్తం పంపించారు. మరోవైపు మొత్తం రూ.7,75,850 విలువైన 1,035 కిలోల ఆహార పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. ప్రజారోగ్యానికి ముప్పు కలిగించేలా వ్యవహరించిన మూడు దుకాణాల ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ (FSSAI) లైసెన్సులను సస్పెండ్ చేయగా.. లైసెన్స్ లేకుండా నిర్వహిస్తున్న తార్నాకలోని సుదర్శన్ రెడ్డి ప్యూర్ ఘీ స్వీట్స్ దుకాణాన్ని మూసివేయించారు. పరిశుభ్రతకు పాతర.. స్వీట్ల తయారీలో నిర్లక్ష్యం అధికారుల తనిఖీల్లో పలు దుకాణాల్లో దారుణమైన పరిస్థితులు బయటపడ్డాయి. దెబ్బతిన్న ఫ్లోరింగ్, పేరుకుపోయిన ఆహార వ్యర్థాలు, మురికిగా ఉన్న వాషింగ్ ప్రాంతాలు, వ్యర్థాలతో మూసుకుపోయిన డ్రైనేజీ కాలువలు కనిపించాయి. గోడలపై మురికి, ఈగలు, బొద్దింకలు, ఎలుకల సంచారం ఉన్నట్లు గుర్తించారు.  కొన్ని చోట్ల ఆహార పదార్థాల్లో పురుగులు, ఫంగస్‌తో పాటు ఎలుకల విసర్జితాలు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.స్వీట్లను పరిశుభ్రమైన పరిస్థితుల్లో తయారు చేయాల్సి ఉండగా.. కొందరు వ్యాపారులు కనీస జాగ్రత్తలు కూడా తీసుకోలేదని తనిఖీల్లో తేలింది. సిబ్బంది హెయిర్ నెట్లు, గ్లౌజులు ధరించకపోవడం, పెరిగిన గోళ్లతోనే ఆహార పదార్థాలను తయారు చేయడం, స్వీట్లపై మురికి వస్త్రాలు, వార్తాపత్రికలు కప్పి ఉంచడం వంటి ఉల్లంఘనలను గుర్తించారు. నాన్‌-ఫుడ్‌ గ్రేడ్ రోజ్ వాటర్ వినియోగం, గడువు ముగిసిన పదార్థాలు, లేబుళ్లు లేని ఆహార ఉత్పత్తుల నిల్వ కూడా అధికారుల దృష్టికి వచ్చింది. పెస్ట్ కంట్రోల్, సిబ్బంది వైద్య పరీక్షలకు సంబంధించిన రికార్డులు సైతం కొన్ని దుకాణాల్లో అందుబాటులో లేవని గుర్తించారు. మూడు ప్రముఖ దుకాణాల లైసెన్సులు సస్పెండ్.! కూకట్‌పల్లిలోని ప్రశాంత్ నగర్‌లో ఉన్న వాసిరెడ్డి స్వగృహ ఫుడ్స్‌లో అపరిశుభ్ర వాతావరణం, బూజు, జిడ్డు పేరుకుపోయిన ఎగ్జాస్ట్‌లు, పచ్చళ్లలో ఫంగస్, బొద్దింకలు, సిబ్బంది వ్యక్తిగత పరిశుభ్రతలో లోపాలను అధికారులు గుర్తించారు. దీంతో ఆ దుకాణం లైసెన్సును సస్పెండ్ చేశారు.అలాగే మాసబ్ ట్యాంక్‌లోని హుమాయున్ నగర్‌లో ఉన్న మధుర్ స్వీట్స్‌లో స్వీట్లను వార్తాపత్రికలతో కప్పి ఉంచడం, బొద్దింకలు సంచరించడం, గడువు ముగిసిన ప్యాకేజ్డ్ ఆహార పదార్థాలను విక్రయానికి ఉంచడం వంటి ఉల్లంఘనలు బయటపడ్డాయి. ఇక్కడ రూ.5,63,000 విలువైన 705 కిలోల ఆహార పదార్థాలను సీజ్ చేసి, లైసెన్సును సస్పెండ్ చేశారు.అదే విధంగా చందానగర్‌లోని బి. బిచ్చారెడ్డి స్వీట్స్‌లో గోడలపై నాచు, ఎలుకల విసర్జితాలు, తుప్పు పట్టిన సామగ్రి, లేబుళ్లు లేని నెయ్యి ఉన్నట్లు గుర్తించారు. దీంతో రూ.2,12,850 విలువైన 330 కిలోల నెయ్యిని స్వాధీనం చేసుకుని, ఆ దుకాణం లైసెన్సును సస్పెండ్ చేశారు. లైసెన్స్ లేకుండా నడుస్తున్న దుకాణం మూసివేత.! తార్నాకలోని సుదర్శన్ రెడ్డి ప్యూర్ ఘీ స్వీట్స్ దుకాణం సరైన ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ లైసెన్స్ లేకుండానే నిర్వహిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. అపరిశుభ్ర పరిస్థితులతో పాటు గడువు ముగిసిన ఆహార పదార్థాలు ఉండటంతో దుకాణాన్ని మూసివేయాలని ఆదేశించారు. నిబంధనల ఉల్లంఘనలపై వివరణ కోరుతూ  గుండ్ల పోచంపల్లి పరిధిలోని హనీ ఫుడ్స్, శ్రీనగర్ కాలనీలోని హర్ష ఎంటర్‌ప్రైజెస్‌/స్వీట్ బాస్కెట్ , కూకట్పల్లి పరిధిలోని ఆల్మండ్ హౌస్ , దాదూస్ మిఠాయి వాటిక , నల్లకుంట పరిధిలోని రాజీవ్ రెడ్డి స్వీట్స్ , యూసఫ్ గూడా లోని పరుచూరి ఫుడ్స్ , తార్నాక లోని సుదర్శన్ రెడ్డి ప్యూర్ ఘీ స్వీట్స్ లకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు.  మరోవైపు బంజారాహిల్స్ పరిధిలోని మీఠే మియా, టోలిచౌకి లోని మెజెస్టిక్ స్వీట్స్ , జీడిమెట్ల లోని శివ నాగిరెడ్డి స్వీట్స్ , వెంగళరావు నగర్ లోని గోదావరి వంటిల్లు , ఇంద్ర పార్క్ వద్ద ఉన్న శుభం హోమ్ ఫుడ్స్ , ప్రమదాస్ స్వీట్స్ అండ్ హాట్స్ లకు మెరుగుదల చర్యలు చేపట్టాలని ఇంప్రూవ్‌మెంట్ నోటీసులు ఇచ్చారు. మొత్తంగా పండగల వేళ ప్రజలకు నాణ్యమైన ఆహారం అందించాలనే లక్ష్యంతో ఫుడ్ సేఫ్టీ అధికారులు ఈ తనిఖీలు చేపట్టారు. స్వీట్ల తయారీ, నిల్వ, విక్రయాల్లో పరిశుభ్రతతో పాటు ఆహార భద్రతా ప్రమాణాలు తప్పనిసరిగా పాటించాలని అధికారులు స్పష్టం చేశారు. నిబంధనలు ఉల్లంఘించే దుకాణాలపై తనిఖీలు కొనసాగుతాయని హెచ్చరించారు.     [ Hyderabad Sweet Shops Raids, Food Safety Department, TG SAFE, FSSAI, Food Safety Inspections, Hyderabad News, Adulterated Sweets, Food Adulteration, Expired Food Products, Food Hygiene, Sweet Shops License Suspended, 1035 Kg Food Seized, Food Safety Violations, Vassireddy Swagruha Foods, Madhur Sweets, B Bichareddy Sweets, Sudarshan Reddy Pure Ghee Sweets, Food Safety Alert, Festival Season Food Safety ]  
తెలంగాణలో ఎల్‌నినో ప్రభావంతో రాబోయే రోజుల్లో కరువు పరిస్థితులు తీవ్రరూపం దాల్చే అవకాశం ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హెచ్చరించారు. ప్రజాభవన్‌లో నిర్వహించిన సమావేశంలో కరువు సన్నద్ధత, విద్యుత్ వినియోగం, వ్యవసాయం, తాగునీటి సమస్యలు, పశుగ్రాసం వంటి అంశాలపై ఆయన మాట్లాడారు. ప్రజలను ముందుగానే అప్రమత్తం చేయడంతో పాటు, కరువును ఎదుర్కొనే కార్యక్రమాల్లో వారిని భాగస్వాములను చేయాలని అధికారులకు సూచించారు. ఎల్‌నినో అంటే భూతం కాదు.. కరువు పరిస్థితులపై అప్రమత్తంగా ఉండాలి.! ఎల్‌నినో అంటే ఏదో భూతం కాదని, దాని ప్రభావంతో వాతావరణంలో మార్పులు చోటుచేసుకుని కరువు పరిస్థితులు ఏర్పడవచ్చని సీఎం పేర్కొన్నారు. ప్రపంచంలోని అనేక దేశాలు ఇలాంటి పరిస్థితులను ఎదుర్కొంటున్నాయని తెలిపారు. ఎండ తీవ్రత పెరగడం, నీటి లభ్యత తగ్గడం, నీటి ఆవిరి పెరగడం వంటి పరిణామాలు ప్రజల జీవితాలపై ప్రభావం చూపుతాయని వివరించారు. అక్టోబర్‌లో ప్రారంభమయ్యే కరువు పరిస్థితులు జూలై వరకు కొనసాగే అవకాశం ఉందని, సుమారు 8 నుంచి 10 నెలలపాటు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని అన్నారు. కరువు ప్రారంభంలో దాని తీవ్రత వెంటనే కనిపించకపోవచ్చని, సమస్యను ముందుగానే గుర్తించి చర్యలు చేపట్టాలని సూచించారు. మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు సహా పలు రాష్ట్రాలతో పాటు ప్రపంచంలోని అనేక దేశాలు ఎల్‌నినో ప్రభావాన్ని ఎదుర్కొంటున్నాయని పేర్కొన్నారు. తాగునీటి సమస్యపై ప్రత్యేక దృష్టి.! కరువు పరిస్థితుల్లో సాగునీటి కంటే తాగునీటి సమస్య తీవ్రంగా మారే ప్రమాదం ఉందని రేవంత్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. ప్రాజెక్టుల్లో నీటి నిల్వలు తగ్గుతున్నాయని, రాష్ట్రంలోని నీటి వనరుల పరిస్థితిని ప్రజలకు వివరించాల్సిన అవసరం ఉందని చెప్పారు. రాష్ట్రంలో 200 టీఎంసీల నీరు కూడా అందుబాటులో లేదని, అనేక ప్రాజెక్టులు డెడ్ స్టోరేజీకి చేరువయ్యాయని ఆయన పేర్కొన్నారు. ప్రజలు నీటిని పొదుపుగా వినియోగించాలని, ప్రతి ఒక్కరూ తమ నీటి వినియోగాన్ని తగ్గించుకోవాలని సూచించారు. నీటి కొరతను తేలికగా తీసుకుంటే భవిష్యత్తులో సమస్య మరింత తీవ్రమవుతుందని హెచ్చరించారు. కరువు ప్రభావంపై ప్రజలకు అవగాహన కల్పించకుండా, వారిని భాగస్వాములను చేయకుండా ఈ పరిస్థితులను ఎదుర్కోవడం సాధ్యం కాదన్నారు. విద్యుత్ వినియోగం భారీగా పెరిగింది.! ఎండ తీవ్రత, నీటి కొరత కారణంగా విద్యుత్ వినియోగం పెరుగుతోందని సీఎం వివరించారు. గతంలో ఉమ్మడి రాష్ట్రంలోనూ ఈ సీజన్‌లో విద్యుత్ వినియోగం 13 వేల మెగావాట్లను దాటలేదని, ప్రస్తుతం రాష్ట్రంలో 20 వేల మెగావాట్ల వరకు వినియోగం నమోదైందని తెలిపారు. ప్రతి ఏడాది విద్యుత్ వినియోగం సగటున 6.5 శాతం పెరుగుతుందని నిపుణులు చెబుతున్నప్పటికీ, ఈసారి ఊహించని విధంగా సుమారు 20 శాతం వరకు పెరుగుదల కనిపించిందని పేర్కొన్నారు. ఈ పరిస్థితుల్లోనూ నిరంతర విద్యుత్ సరఫరా కోసం కృషి చేస్తున్న ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతో పాటు విద్యుత్ శాఖ అధికారులను అభినందించారు. వ్యవసాయంపై ప్రభావం.. రైతులకు ప్రత్యామ్నాయ పంటలపై అవగాహన.! రాబోయే రోజుల్లో వ్యవసాయానికి నీటి లభ్యత తగ్గే అవకాశం ఉందని సీఎం హెచ్చరించారు. తన ప్రసంగంలో రాష్ట్రంలోని 30 లక్షల పంపుసెట్లలో 15 లక్షలు ఎండిపోయాయని పేర్కొన్నారు. వచ్చే సీజన్‌లో సాగునీటి లభ్యతపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ, రైతులు పరిస్థితులకు అనుగుణంగా పంటల ఎంపికపై నిర్ణయాలు తీసుకోవాలని సూచించారు. వ్యవసాయానికి విస్తృతంగా నీరు అందించే పరిస్థితి లేకపోతే ఆరుతడి పంటలు, కూరగాయల సాగు వంటి ప్రత్యామ్నాయాలపై దృష్టి పెట్టాలని అన్నారు. రైతు వేదికల ద్వారా రైతులకు కరువు పరిస్థితులు, నీటి లభ్యత, పంటల ఎంపికపై అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు. వానాకాలం పంటలను సాధ్యమైనంతవరకు రక్షించి, కొనుగోలు చేస్తామని సీఎం తెలిపారు. గత సీజన్‌లో ఏడు రకాల సన్న వడ్లు పండించిన రైతులకు బోనస్ ఇస్తామని ప్రకటించామని గుర్తుచేశారు. సన్న వడ్ల విషయంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలపై ప్రతిపక్ష నేతలు చేస్తున్న విమర్శలను ఆయన ఖండించారు. ఇతర రాష్ట్రాల వ్యాపారులు క్వింటాల్‌కు రూ.3,400 నుంచి రూ.4,000 వరకు ధరలు చెల్లించేందుకు ముందుకొచ్చారని పేర్కొన్నారు. పశువుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు.! కరువు సమయంలో పశువులకు పశుగ్రాసం, తాగునీరు అందించడం అత్యంత ముఖ్యమని రేవంత్ రెడ్డి అన్నారు. మూగజీవాలకు ఆహారం, నీరు అందుబాటులో లేకపోతే వాటి మనుగడకు ముప్పు ఏర్పడుతుందని పేర్కొన్నారు. గ్రామాల్లో పశువుల కోసం ప్రత్యేక కేంద్రాలు ఏర్పాటు చేసి, పశుగ్రాసం, తాగునీరు అందించే చర్యలు చేపట్టాలని సూచించారు. ఉపాధి హామీ పథకం కింద కూడా ఇలాంటి కార్యక్రమాలను చేపట్టాలని అధికారులకు సూచించారు. కరువు ప్రభావం గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలు, రైతులు, పశువులపై పడకుండా ముందస్తు ప్రణాళికలు రూపొందించాలని స్పష్టం చేశారు. కరువు సన్నద్ధతకు సబ్‌కమిటీ.! కరువు పరిస్థితులను ఎదుర్కొనేందుకు ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఆధ్వర్యంలో సబ్‌కమిటీ ఏర్పాటు చేసినట్లు సీఎం తెలిపారు. ఎల్‌నినోపై ప్రజలకు వాస్తవ సమాచారం అందించేందుకు, తప్పుడు ప్రచారాన్ని ఎదుర్కొనేందుకు రామకృష్ణారావును ప్రత్యేక అధికారిగా నియమించినట్లు పేర్కొన్నారు. ప్రకృతి వైపరీత్యాలను పూర్తిగా నివారించడం సాధ్యం కాకపోయినా, ముందస్తు చర్యలతో నష్టాన్ని తగ్గించవచ్చని అన్నారు. కరువు, వరదలు, భూకంపాలు వంటి విపత్తుల విషయంలో ప్రజలను ముందుగానే అప్రమత్తం చేయడం ప్రభుత్వ బాధ్యత అని వివరించారు. కేసీఆర్, హరీశ్ రావుపై రేవంత్ రెడ్డి విమర్శలు.! కరువు పరిస్థితులపై ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలకు సీఎం రేవంత్ రెడ్డి ఘాటుగా స్పందించారు. కాంగ్రెస్ ప్రభుత్వమే కరువును తెచ్చిందంటూ కొందరు రాజకీయ దురుద్దేశంతో ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. ఎల్‌నినో వంటి ప్రకృతి సంబంధిత పరిణామాలను రాజకీయాలకు ముడిపెట్టడం సరికాదన్నారు. కరోనా సమయంలో అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ రేవంత్ రెడ్డి విమర్శలు గుప్పించారు. కరోనా తీవ్రతను తక్కువగా అంచనా వేసేలా మాట్లాడటం వల్ల ప్రజల్లో తప్పుడు అవగాహన ఏర్పడిందని ఆరోపించారు. లక్షలాది మంది ప్రాణాలు కోల్పోయిన ఆ విపత్కర పరిస్థితుల్లో బాధ్యతాయుతమైన ప్రకటనలు చేయాల్సిన అవసరం ఉందన్నారు. కరువు విషయంలోనూ ప్రజలకు వాస్తవ పరిస్థితులను వివరించాలని, తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టాలని కాంగ్రెస్ ప్రజాప్రతినిధులకు సూచించారు. కేటీఆర్, హరీశ్ రావు ప్రభుత్వంపై చేస్తున్న విమర్శలను కూడా ఆయన ప్రస్తావించారు. రాహుల్ గాంధీ సభకు తెలంగాణ నుంచి భారీగా తరలివెళ్లాలి.! జాతీయ రాజకీయాలపై మాట్లాడుతూ, నవంబర్ 1న ఢిల్లీలో రాహుల్ గాంధీ నిర్వహించనున్న సభకు తెలంగాణ నుంచి 10 వేల నుంచి 15 వేల మంది వరకు తరలివెళ్లాలని రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియ (SIR)ను బీజేపీ దురుద్దేశంతో ఉపయోగించుకుంటోందని ఆరోపించారు. ప్రజాప్రాతినిధ్య చట్టం, రాజ్యాంగ హక్కుల అంశాలను ప్రస్తావిస్తూ, పేదల హక్కుల పరిరక్షణ కోసం రాహుల్ గాంధీ పోరాడుతున్నారని అన్నారు. ఎస్‌ఐఆర్ ప్రక్రియ ద్వారా పేదల హక్కులను దెబ్బతీసి అధికారాన్ని కొనసాగించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. మతం పేరుతో ప్రజలను విభజించడం కంటే మానవత్వం ఆధారంగా ప్రజలను ఐక్యం చేయడమే కాంగ్రెస్ విధానమని పేర్కొన్నారు. మొత్తంగా, ఎల్‌నినో ప్రభావంతో ఎదురయ్యే కరువు పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని తాగునీరు, విద్యుత్, వ్యవసాయం, పశుగ్రాసం వంటి అంశాలపై ముందస్తు చర్యలు చేపట్టాలని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రజల్లో అవగాహన కల్పించడం, నీటిని పొదుపుగా వినియోగించడం, రైతులకు ప్రత్యామ్నాయ పంటలపై మార్గదర్శకత్వం అందించడం ద్వారా కరువు ప్రభావాన్ని తగ్గించేందుకు ప్రభుత్వం సిద్ధం కావాలని సూచించారు. [ CM Revanth Reddy, Telangana CM, El Nino Effect, Telangana Drought Alert, Drought Warning, Climate Change, Water Management, Power Consumption, Agriculture, Farmers Alert, Water Scarcity, Telangana Government, Praja Bhavan, Rainfall Forecast, Drought Preparedness, Telangana News, Revanth Reddy Latest News ]  
ALSO ON TELUGUONE N E W S
కొన్ని కాంబినేషన్స్ అంతే సెల్యులాయిడ్ పైకి అడుపెట్టడానికి చాలా దినాలు ఉన్నా సరే, మూవీ ఎప్పుడెప్పుడు స్టార్ట్ అవుతుందా అని అభిమానులు, సినీ ప్రేమికులు ఎదురుచూస్తూ ఉంటారు. అలాంటిది కాంబో రామ్ చరణ్, సుకుమార్ కాంబో(RC 17 ). ఈ నెల 26 , గాని 27 గాని RC 17  స్టార్ట్ కాబోతుందని ప్రొడ్యూసర్ రవిశంకర్ నిన్న వెల్లడి చేసారు.  చరణ్ సరసన 'ధురంధర్' ఫేమ్ సారా అర్జున్ పేరు ప్రముఖంగా వినిపించింది. కానీ, తాజాగా ఈ రేసులోకి మరో బాలీవుడ్ యంగ్ సెన్సేషన్ వచ్చి చేరడంతో సమీకరణాలు ఒక్కసారిగా మారిపోయాయి. ఇటీవలి కాలంలో బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తూ ఏకంగా రూ.203 కోట్లకు పైగా వసూళ్లతో దేశవ్యాప్తంగా యువతను ఊపేసిన 'సైయారా' సినిమా ఫేమ్ అనీత్ పద్దా పేరు ఇప్పుడు తెరపైకి వచ్చింది. పంజాబ్ లోని అమృత్‌సర్‌లో జన్మించి, మోడలింగ్ రంగం ద్వారా కెరీర్ ప్రారంభించిన అనీత్ పద్దా, 'బిగ్ గర్ల్స్ డోంట్ క్రై' వెబ్ సిరీస్ ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత 'సైయారా' చిత్రంలో ఆమె పోషించిన పాత్ర ద్వారా బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన కలెక్షన్లు రాబట్టడంలో కీలక పాత్ర పోషించింది.   ఇది కూడా చదవండి: ఆదర్శ కుటుంబం ఇంకో ఓజి కాబోతుందా!    ఇప్పుడు అదే క్రేజ్‌తో రామ్ చరణ్ సరసన RC17 చిత్రంలో నటించేందుకు అనీత్ పద్దా రేసులో ముందున్నట్లు ఫిలిం నగర్ వర్గాల్లో టాక్. అనీత్ పద్దా ఎంట్రీపై వస్తున్న ఈ తాజా రూమర్స్ మెగా అభిమానుల్లో భారీ చర్చకు దారితీశాయి. అయితే, ఈ వార్తలపై చిత్ర నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ లేదా దర్శకుడు సుకుమార్ ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. సారా అర్జున్ మరియు అనీత్ పద్దా ఇద్దరి పేర్లు పరిశీలనలో ఉన్నప్పటికీ, ఎవరని ఫైనల్ చేస్తారో చూడాలి.    [RC 17 Heroine, Aneet Padda In RC 17, Ram Charan, Sukumar, RC17 movie, Aneet Padda, Saiyaara heroine, Mythri Movie Makers,TeluguCinema, TeluguCinema News, Tollywood, Tollywood News]
Gopichand’s upcoming action drama Singa has completed 50% of its shoot, with the makers unveiling a new poster featuring the actor in a fierce soldier avatar. Holding a long spear (ET), Gopichand looks intense in a period costume, offering another glimpse into the film’s world after the aggressive first look released on his birthday. Directed by renowned action choreographer Vvenkat, Singa marks his directorial debut. The film features Malayalam actress Anarkali Nazar as the female lead, marking her Tollywood debut, while Sam CS is composing the music. The recently completed schedule was filmed on specially constructed sets recreating a surreal forest environment. The team is now preparing for the next phase of production, scheduled to begin in December, with even larger sets being developed for the upcoming shoot. Produced by Vijay Chilla and Shashi Devireddy, Singa is being mounted on an ambitious scale, combining Vvenkat’s expertise in action choreography with period drama. Gopichand’s new look hints at a physically demanding role, while the film’s elaborate sets indicate a visually expansive theatrical presentation. Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them.
విజయ్ దేవరకొండ హీరోగా నటించిన ‘రణబాలి’ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి సందడి చేస్తోంది. ఈ నేపథ్యంలో అనంతపురంలో నిర్వహించిన ‘రణబాలి రణభేరి’ విజయోత్సవ వేడుకలో విజయ్ దేవరకొండ భావోద్వేగంగా మాట్లాడారు. తాను చిన్నప్పుడు సినిమాలు చూసిన కొత్తచెరువు థియేటర్‌లోనే ఇప్పుడు తన సినిమా హౌస్‌ఫుల్ ప్రదర్శనలు జరగడం ఎంతో సంతోషాన్నిచ్చిందని పేర్కొన్నారు. తన జీవితంలో ఈ క్షణం ఎప్పటికీ గుర్తుండిపోతుందని చెప్పారు. ‘రణబాలి’ని కేవలం ఒక సినిమాగా చూడలేదని, రాయలసీమ గడ్డకు చెందిన వీరుల కథను ప్రపంచానికి చెప్పాలనే బాధ్యతతో ఈ చిత్రంలో నటించానని విజయ్ వెల్లడించారు. ఈ నేల ప్రజలు తనపై చూపించిన ప్రేమ, అభిమానం తనకు ఎంతో ప్రత్యేకమని అన్నారు. ఒక పెద్దాయన తన చేతిని పట్టుకుని, తమ వీరుల కథను తెరపైకి తీసుకొచ్చినందుకు కృతజ్ఞతలు తెలిపిన సందర్భం తనను భావోద్వేగానికి గురిచేసిందని పేర్కొన్నారు. దర్శకుడు రాహుల్ సంకృత్యాన్ తెరకెక్కించిన ఈ పీరియాడికల్ యాక్షన్ డ్రామాలో విజయ్ దేవరకొండ రణబాలి పాత్రలో, రష్మిక మందన్నా జయమ్మ పాత్రలో నటించారు. 19వ శతాబ్దంలో బ్రిటిష్ పాలన సమయంలో రాయలసీమ ప్రాంతంలో చోటుచేసుకున్న చారిత్రక ఘటనలు, కరువు పరిస్థితులు, ప్రజల పోరాటం నేపథ్యంలో ఈ చిత్రాన్ని రూపొందించారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ నిర్మించిన ఈ సినిమాకు అజయ్–అతుల్ సంగీతం అందించారు. ఈ వేడుకలో చిత్ర నిర్మాతలు కూడా సినిమా పట్ల తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. ప్రేక్షకుల నుంచి వస్తున్న ఆదరణకు కృతజ్ఞతలు తెలిపారు. ముఖ్యంగా రాయలసీమ ప్రాంతంలో సినిమాకు లభిస్తున్న స్పందన చిత్రబృందానికి మరింత ఉత్సాహాన్నిచ్చింది. తన కెరీర్‌లో ‘రణబాలి’కి ప్రత్యేక స్థానం ఉంటుందని విజయ్ దేవరకొండ చెప్పిన మాటలు ఈ వేడుకలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.     [Vijay Deverakonda, Ranabaali Movie, Ranabaali Success Meet, Ranabaali Ranabheri Event, Rashmika Mandanna, Rahul Sankrityan, Tollywood News, Vijay Deverakonda Emotional Speech]
వెంకీ మామ, కేజిఎఫ్ భామ శ్రీనిధి శెట్టి, త్రివిక్రమ్, థమన్ తమ ఆదర్శ కుటుంబాన్ని చూపించడానికి అక్టోబర్ 30 న వస్తున్నారు. ఈ మేరకు శాంపిల్ పీస్ ట్రైలర్ ని అందించారు. హైదరాబాద్ లో జరిగిన ఈ ట్రైలర్ ఈవెంట్ లో థమన్ మాట్లాడిన మాటలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.  తమన్  మాట్లాడుతు 'అభిమానులు ఎప్పుడు 'ఓజీ' గురించి ప్రస్తావించినా త్రివిక్రమ్ శ్రీనివాస్ గారే గుర్తుకొస్తారని, అసలు ఆ ప్రాజెక్ట్ ప్రారంభం కావడానికి, సాధ్యపడటానికి పూర్తిగా త్రివిక్రమ్ గారే కారణమని తమన్ స్పష్టం చేశారు. ఈ ఆసక్తికరమైన ప్రకటనతో సోషల్ మీడియాలో పవన్ కళ్యాణ్, వెంకటేష్ అభిమానులు తెగ సంబరాలు చేసుకుంటున్నారు. ఇది కూడా చదవండి: టైగర్ ష్రాఫ్ కారు కాల్పులపై ఆర్జీవీ సంచలన ట్వీట్: వర్మ చెప్పేది నిజమేనా!     ఇదే వేదికపై వెంకటేష్, త్రివిక్రమ్ కాంబినేషన్‌పై తనకున్న అమితమైన ప్రేమను తమన్ మనసారా పంచుకున్నారు. తనకు ఎప్పుడైనా బోర్ కొట్టినప్పుడు యూట్యూబ్‌లో వెంటనే చూసే సినిమా 'నువ్వు నాకు నచ్చావ్' అని, ఇప్పటికీ రోజూ భోజనం చేసే సమయంలో ఆ సినిమా చూస్తూనే ఉంటానని సరదాగా చెప్పుకొచ్చారు. జూనియర్ ఎన్టీఆర్, త్రివిక్రమ్ కలయికలో వచ్చిన 'అరవింద సమేత' సినిమాకు పనిచేసే అవకాశం తనకెలా దక్కిందో గుర్తుచేసుకుంటూ, ఇప్పుడు విక్టరీ వెంకీ మామ మరియు త్రివిక్రమ్ గారి కాంబోలో వస్తున్న 'ఆదర్శ కుటుంబం' చిత్రానికి మ్యూజిక్ అందించడం తన జీవితంలో మరపురాని గొప్ప అనుభూతినిచ్చిందని వెల్లడించారు. ఈ చిత్రంలో వెంకీ మామ మరియు త్రివిక్రమ్ గారి మధ్య వచ్చే భావోద్వేగ సన్నివేశాలు, వారిద్దరి మధ్య కెమిస్ట్రీ స్క్రీన్ మీద ప్రేక్షకులని కట్టిపడేస్తాయని తమన్ తెలిపారు.   [Thaman Speech In Aadarsha Kutumbam Trailer Event, thaman reveals pawan kalyan og secret  Reveals, Aadarsha Kutumbam, Thaman S, TeluguCinema, TeluguCinema News, Tollywood, Tollywood News]  
తమిళ స్టార్ హీరో సూర్య నటించిన ‘కరుప్పు’ సినిమాలో చిన్న పాత్రలో కనిపించి వెండితెరపై కూడా అడుగుపెట్టిన ప్రియ‌వ‌ద‌న 24 ఏళ్ల చిన్న వ‌య‌సులోనే త‌నువు చాలించారు. తమిళ బుల్లితెరపై న్యూస్ యాంకర్‌గా గుర్తింపు తెచ్చుకున్న ప్రియవదన మృతి చెందడం మీడియా, సినీ వర్గాల్లో విషాదాన్ని నింపింది. చెన్నైలోని తంతి టీవీలో న్యూస్ రీడర్‌గా పనిచేస్తున్న ఆమె, నటిగానూ తన ప్రయాణాన్ని కొనసాగిస్తున్నారు.కెరీర్‌లో ఎదిగే దశలోనే ఆమె మరణవార్త వెలువడటంతో సహచరులు, అభిమానులు దిగ్భ్రాంతికి గురయ్యారు. ప్రియవదన మరణానికి ముందు రెండు రోజుల వరకు సోషల్ మీడియాలో చురుగ్గా ఉన్నారు. ఇటీవల నవరాత్రి కొలువు వేడుకలను సందర్శించిన వీడియోతో పాటు, పెళ్లికూతురు అలంకరణలో చేసిన ఫొటోషూట్‌కు సంబంధించిన చిత్రాలను కూడా ఆమె పంచుకున్నారు. కొద్ది రోజుల క్రితమే తన 24వ పుట్టినరోజును జరుపుకున్న ఆమె, భవిష్యత్తులో మరింతగా రాణించాలనే ఆశయంతో ముందుకు సాగుతున్నట్లు ఆమె సోషల్ మీడియా పోస్టులను బట్టి తెలుస్తోంది. అయితే ఆమె వ్యక్తిగత జీవితంలో ఎదుర్కొన్న పరిస్థితులు, మరణానికి దారితీసిన కారణాలపై పూర్తి వివరాలు ఇంకా వెల్లడికాలేదు. వారణాసికి చెందిన ప్రియవదన తల్లిదండ్రులకు ఒక్కగానొక్క కుమార్తె. ఆమె మృతి కుటుంబ సభ్యులను తీవ్ర విషాదంలోకి నెట్టింది. చెన్నైలోని జాఫర్‌ఖాన్‌పేటలో ఉన్న ఆమె నివాసంలో అంత్యక్రియలు నిర్వహించగా, మీడియా రంగానికి చెందిన పలువురు సహచరులు హాజరై నివాళులర్పించారు. న్యూస్ యాంకర్‌గా ప్రేక్షకులకు పరిచయమైన ఆమె, నటిగా కూడా తనకంటూ గుర్తింపు తెచ్చుకోవాలని ప్రయత్నిస్తున్న సమయంలో ఈ విషాదం చోటుచేసుకుంది. మరోవైపు.. ప్రియవదన మృతికి సంబంధించి సోషల్ మీడియాలో పలు చర్చలు జరుగుతున్నప్పటికీ, ఊహాగానాలను వాస్తవాలుగా భావించకూడదు. ఆమె ఎదుర్కొన్న పరిస్థితులు, మరణానికి దారితీసిన కారణాలపై అధికారికంగా నిర్ధారితమైన సమాచారం వెలువడాల్సి ఉంది. పైకి సంతోషంగా కనిపించే వ్యక్తులు కూడా వ్యక్తిగతంగా ఇబ్బందులు ఎదుర్కొంటుండవచ్చని ఈ ఘటన గుర్తుచేస్తోంది.      [Priyavadhana, Priyavadhana Death, Tamil TV Anchor, Priyavadhana News, Suriya Karuppu Movie, Thanthi TV News Reader, Tamil Actress News, Priyavadhana Instagram, Kollywood News, Tamil Television Anchor]
    మూడు దశాబ్దాల క్రితమే తెలుగు సినిమా గొప్పతనాన్ని పాన్ ఇండియాకి తెలిసేలా చేసి బాలీవుడ్ ని తన చుట్టూ తిరిగేలా చేసుకున్న దర్శకుడు రామ్ గోపాల్ వర్మ. టైగర్ ష్రాఫ్  పై రివాల్వర్ తో జరిగిన దాడి గురించి వర్మ ఎక్స్ వేదికగా స్పందిస్తూ 'సినిమాల్లో విలన్ల గ్యాంగ్‌లో కనీసం టీ అందించే చిన్నపాటి క్యారెక్టర్స్ లకి కూడాటైగర్ ష్రాఫ్ పై దాడి చేసిన వారిని ఎంపిక చేయరు. నిజ జీవితంలోని నేరగాళ్లకు, వెండితెరపై కనిపించే గ్లామరస్ విలన్లకు మధ్య చాలా వ్యత్యాసం ఉంటుంది. మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్‌స్టర్ దావూద్ ఇబ్రహీంపై సినిమా తీసినా, నిజమైన దావూద్‌లా కనిపించే వ్యక్తిని ఆ క్యారక్టర్ కి  ఎంపిక చేయకపోవచ్చు . ప్రముఖ కాస్టింగ్ డైరెక్టర్ ముఖేశ్ ఛాబ్రాని ట్యాగ్ చేస్తూ.. రీల్ లైఫ్ కాస్టింగ్ డైరెక్టర్‌తో పోలిస్తే రియల్ లైఫ్ కాస్టింగ్ డైరెక్టర్ అభిరుచి ఎంతో విచిత్రంగా ఉంటుందని తెలిపారు. ఇప్పుడు ఈ ట్వీట్ వైరల్ గా మారింది. ఇది కూడా చదవండి: ఆల్కహాల్ బాటిల్ ఏ బ్రాండ్: అసలు నిజం తెలిస్తే మైండ్ బ్లాంక్ అవ్వాల్సిందే!    రామ్ గోపాల్  వర్మ నుంచి వచ్చిన చాలా సినిమాలు గ్యాంగ్ స్టర్స్ కోణం నుంచే వచ్చిన విషయం తెలిసిందే. బాలీవుడ్ లో అయితే కొన్ని రియల్ లైఫ్ గ్యాంగ్ స్టర్స్ కి సంబంధించిన సినిమాలు తెరకెక్కించిన రికార్డు వర్మ ది.   [Rgv comments Tiger Shroff Car Shooting, Tiger Shroff car shooting, RGV satirical comments, Mumbai Juhu firing incident, TeluguCinema, TeluguCinema News, Tollywood, Tollywood News]  
  ఒకే ఒక్క పిక్.. ఇప్పుడు అభిమానుల్లోనే కాదు, ఎంటైర్ ఆల్ ఇండియా సినీ ప్రేమికుల్లో ఫుల్ వైరల్ గా మారింది. అదే..ప్రభాస్ కి సందీప్ రెడ్డి బర్త్ డే విషెస్ చెప్తూ ఓపెన్ చేయబోతున్న ఆల్కహాల్ బాటిల్ గురించి.  ఆల్కహాల్ బాటిల్  గురించి చర్చ ఏంటని అనుకుంటున్నారా? అదేనండి ఏ బ్రాండ్ అని.  ఏ బ్రాండ్ నో తేల్చిపడేయాల్సిందే అని అందరూ తమ మెదళ్ళకి పదును పెడుతున్నారు. కొంత ముందైతే   నా ఆలోచనకి తిరుగులేదు అంటూ ఆ బ్రాండ్ ఇదే  అంటూ సోషల్ మీడియా వేదికగా పలు బ్రాండ్స్ నేమ్ తో కామెంట్స్ చేస్తున్నారు. దీంతో సోషల్ మీడియా నయజోష్ తో పరుగులు తీస్తూ ఉంది. ఏది ఏమైనా! అసలు నిజం ఏంటంటే.. ప్రభాస్, సందీప్ రెడ్డిలో ఎవరో ఒకరు చెప్తే గాని ఆ బాటిల్ బ్రాండ్ పేరు  తెలుస్తుంది. అప్పటిదాకా ఫ్యాన్స్, నెటిజెన్స్ కి ఆ బాటిల్ న్యూస్ గుడ్ టాస్క్. ఇది కూడా చదవండి:  'ఫౌజీ' గ్లింప్స్‌ రిలీజ్: రెస్పాన్స్ ఇదే!    ఇక ఆ ఇద్దరి కాంబోలో తెరకెక్కుతున్న స్పిరిట్ షూటింగ్ దశలో ఉంది. అన్నా... లెట్స్ పార్టీ, ఈరోజు నీ పుట్టినరోజు అంటూ ప్రభాస్‌కి సందీప్ బర్త్‌డే విషెస్ చెప్పాడంటే స్పిరిట్ ఏ రేంజ్ లో తెరకెక్కబోతుందో అర్థంచేసుకోవచ్చు.   [sandeep reddy alcohol bottle gift to prabhas, Fauzi Glimpse, Fauzi Glimpse Responce, Prabhas About Fauzi, Fauzi Glimpse Records, Spirit, teluguCinema, telugu Cinema news, Tollywood, Tollywood News]  
పాన్ ఇండియా కింగ్ 'ప్రభాస్' పుట్టిన రోజుని నిన్న అభిమానులు చాలా ఘనంగా జరుపుకున్నారు. కానీ వాళ్ళందరిలో ఏ నిమిషమైనా 'ఫౌజీ'' గ్లింప్స్‌ రిలీజ్ కాకపోతుందా అనే కుతూహలం.. అందుకు తగ్గట్టే మేకర్స్ నిన్న నైట్ 10 తర్వాత రిలీజ్ చేసారు. అలా రిలీజ్ చేసారో లేదో రికార్డుల ఊచకోతకి పేరు మార్చాల్సిన పరిస్థితి.  ‘ఫౌజీ’ పవర్‌ఫుల్ హిస్టారికల్ ఫైల్ నంబర్ 25  పేరుతో రిలీజైన గ్లింప్స్‌  రెండో ప్రపంచ యుద్ధం నేపథ్యంలో  1942 మే 29న బెర్లిన్‌లో ప్రారంభమవుతుంది. నేతాజీ సుభాష్ చంద్రబోస్, అడాల్ఫ్ హిట్లర్ మధ్య జరిగే చారిత్రాత్మక సమావేశాన్ని ఇందులో చూపించారు. భారతదేశంలో బ్రిటిష్ వలస పాలనకు వ్యతిరేకంగా సాగుతున్న పోరాటానికి జర్మనీ మద్దతుని కోరుతారు నేతాజీ. దాదాపు రెండు శతాబ్దాల అణచివేత తర్వాత భారత్‌కు స్వాతంత్ర్యం సాధ్యమేనా అనే అంశంపై ఆసక్తికరమైన చర్చ మొదలవుతుంది. బ్రిటిష్ సామ్రాజ్యాన్ని భారత్ ఓడించగలదా అని హిట్లర్ ప్రశ్నించగా, స్వాతంత్రం సాధించాలనే సంకల్పాన్ని ఎవరూ ఆర్పలేరని నేతాజీ గట్టిగా చెబుతారు. సైనిక బలానికంటే ఇంటెలిజెన్స్ మరింత శక్తివంతంగా పనిచేయగలదని నేతాజీ చెప్పడంతో సంభాషణ ఆసక్తికరమైన మలుపు తిరుగుతుంది. తన వాదనకు బలాన్ని చేకూర్చేందుకు బ్రిటిష్ ఇంటెలిజెన్స్‌కు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్న ఓ అసాధారణ భారతీయ ఆపరేటివ్ కథను ఆయన పరిచయం చేస్తారు. అత్యంత వ్యూహాత్మకంగా రూపొందించిన ఆపరేషన్ల ద్వారా ఈ వ్యక్తి బ్రిటిష్ సైనిక బలగాలను దారి మళ్లించడం, కీలక మిషన్లను అడ్డుకోవడం, వలస పాలకుల వ్యూహాలను పదేపదే చిత్తు చేయడం వంటి పనులు చేస్తున్నప్పటికీ, తన గుర్తింపును మాత్రం బయటపెట్టడం లేదని రివిల్ అవుతుంది.  ఈ క్యారక్టర్ కి సంబంధించిన మరో ఆసక్తికరమైన అంశం అతని తెలివైన కమ్యూనికేషన్ వ్యవస్థ. భగవద్గీత స్ఫూర్తితో రూపొందించిన ఈ రహస్య కోడ్‌ను ఛేదించడం జర్మనీకి చెందిన ఎనిగ్మా కోడ్‌ను ఛేదించడం కంటే కూడా కష్టమని వివరిస్తారు. ఆ ఆపరేటివ్ ప్రభావం రోజురోజుకూ పెరుగుతున్నప్పటికీ, అతని అసలు గుర్తింపు ఏమిటో బ్రిటిష్ వారికి ఇప్పటికీ తెలియదని నేతాజీ వెల్లడించడం అతడిని నీడల్లో పనిచేసే ఓ బలమైన శక్తిగా నిలబెడుతుంది. ‘ఫైల్ నంబర్ 25’లో అత్యంత ఆసక్తికరమైన ఘట్టాల్లో పాత్ర అసలు పేరు, ఐడెంటిటీకి సంబంధించిన అంశం ఒకటి. బ్రిటిష్ అధికారులకు ‘ఫౌజీ’గా తెలిసిన ఈ సైనికుడి అసలు పేరు మాత్రం రహస్యంగానే ఉంటుంది. 1932 నుంచి వలస పాలకులకు కావాల్సిన వ్యక్తిగా ఉన్న అతడిని, తన మాతృభూమిని కాపాడటమే లక్ష్యంగా పెట్టుకున్న రెబల్ గా చూపించారు. ప్రస్తుతం ఆ రహస్య ఆపరేటివ్ కలకత్తాలో ఉన్నాడని, బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా తన పోరాటాన్ని కొనసాగిస్తున్నాడని నేతాజీ రివిల్ చేస్తారు.  గ్లింప్స్ చివర్లో ప్రభాస్ ఎంట్రీ అదిరిపోయింది. వలస పాలకులకు తలవంచడానికి నిరాకరించే  రెబల్ సోల్జర్ గా ఆయన కనిపించారు. పెదవుల మధ్య సిగరెట్, చేతిలో భారీ తుపాకీతో ప్రభాస్ చూపించిన ఆగ్రహం, తిరుగుబాటు తత్వం  మరింత బలాన్ని చేకూర్చాయి. బ్రిటిష్ వారికి ఆయన విసిరే సవాల్‌తో గ్లింప్స్  అదిరిపోయింది. ఇందులో ప్రభాస్ నుంచి ఎలాంటి పవర్‌ఫుల్ స్క్రీన్ ప్రెజెన్స్, ఇంటెన్స్ యాక్షన్‌ను ఆశించవచ్చో ఈ గ్లింప్స్ రుచి చూపించింది. ‘ఫైల్ నంబర్ 25’ ప్రత్యేకత ఏమిటంటే.. హీరో క్యారక్టర్ ని కేవలం శారీరక బలం, యుద్ధభూమిలో చూపించే వీరత్వానికే పరిమితం చేయకపోవడం. రహస్య ఆపరేషన్లు, ఇంటెలిజెన్స్ యుద్ధం, కోడ్ భాషలో సమాచార మార్పిడి, అసలు గుర్తింపును దాచిపెట్టడం వంటి అంశాలు కథలో ఉత్కంఠని పెంచుతున్నాయి. రెండో ప్రపంచ యుద్ధం నేపథ్యాన్ని భారత స్వాతంత్ర  పోరాటంతో మేళవిస్తూ, విలక్షణమైన చారిత్రక నేపథ్యం, అసాధారణమైన కథానాయకుడితో ‘ఫౌజీ’ ఓ భారీ పీరియడ్ యాక్షన్ డ్రామాగా రూపుదిద్దుకుంటున్నట్లు ఈ గ్లింప్స్ సూచిస్తోంది.     ప్రభాస్ కోసం దర్శకుడు హను రాఘవపూడి ఓ విభిన్నమైన పవర్ ఫుల్ రోల్ రూపొందించాడని అర్ధమవుతుంది.  చారిత్రక అంశాలు, గూఢచర్యం, దేశభక్తి, భారీ యాక్షన్ సన్నివేశాలను కలిపి ఈ కథను తెరకెక్కిస్తున్నారు. ఇమాన్వి హీరోయిన్ కాగా  సీనియర్ నటులు అనుపమ్ ఖేర్, మిథున్ చక్రవర్తి, జయప్రద, భానుచందర్ కీ రోల్స్. ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్‌గా సుదీప్ ఛటర్జీ, సంగీత దర్శకుడిగా విశాల్ చంద్రశేఖర్, ప్రొడక్షన్ డిజైనర్‌గా అనిల్ విలాస్ జాదవ్, ఎడిటర్‌గా కోటగిరి వెంకటేశ్వరరావు పనిచేస్తున్నారు. 2027 మార్చి 19 రిలీజ్.మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తుండగా  టీ సిరీస్ సమర్పిస్తోంది.      [Fauzi Glimpse, Fauzi Glimpse Responce, Prabhas About Fauzi, Fauzi Glimpse Records, Telugu Cinema , TeluguCinema News, Tollywood, Tollywood News]
Prabhas’ period actioner Fauzi, directed by Hanu Raghavapudi, has unveiled an explosive birthday glimpse titled File No: 25 Reveal, offering a glimpse into the secret agent’s extraordinary fight against British rule. The makers have also confirmed that the film will arrive worldwide on March 19. The glimpse establishes the scale of Fauzi’s character through a conversation between Subash Chandra Bose and Adolf Hitler in 1940s Germany. While Hitler looks down upon Indians as slaves, Bose proudly speaks about his trusted soldier, who has been fighting the British since 1932 as part of the Azad Hind Fauj. He reveals how the agent helped Japan defeat the British and capture Singapore, using an uncrackable secret code designed with Sanskrit. The sequence builds a powerful backdrop for Prabhas’ character before introducing him in action in Calcutta, wielding a massive machine gun single-handedly. Prabhas looks striking as a soldier from the 1930s and 1940s, with his lean physical transformation and commanding screen presence standing out. Bose speaking about Fauzi with such pride adds another layer of elevation to the character, positioning him as a formidable nightmare for British forces. Hanu Raghavapudi appears to have crafted an ambitious period action saga around an Indian soldier operating against the British as a one-man army. Produced by Mythri Movie Makers on a massive scale, the pan-India film features Imanvi as the leading lady. The birthday glimpse has further heightened anticipation for Fauzi.    Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them. 
విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కలయికలో రూపొందుతోన్న సినిమా ‘ఆదర్శ కుటుంబం – హౌస్ నెం. 47’. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై ఎస్. రాధాకృష్ణ నిర్మిస్తున్న ఈ మూవీపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన టీజర్, నారాయణమ్మ, మాలా పాటలు ఆకట్టుకున్నాయి. ఇక ఇప్పుడు ఈ సినిమా నుంచి అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ట్రైలర్ విడుదలైంది.  గిలిగింతలు పెట్టే హాస్య సన్నివేశాలు, ఉత్కంఠభరితమైన యాక్షన్, ఆసక్తికరమైన డ్రామాతో ఈ సినిమా ఒక కంప్లీట్ ఎంటెర్టైనర్ లా నిలుస్తుందనే నమ్మకాన్ని ‘ఆదర్శ కుటుంబం’ ట్రైలర్ కలిగిస్తోంది. త్రివిక్రమ్ రచన, దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ సినిమా ట్రైలర్.. ఆయన బలమైన రచనను, విలక్షణమైన కథా శైలిని మరోసారి చూపిస్తోంది. కుటుంబ వినోదానికి యాక్షన్‌ థ్రిల్లర్‌ అంశాలను జోడిస్తూ ఆసక్తిని పెంచుతోంది. కామెడీ, యాక్షన్, సస్పెన్స్‌లను చక్కగా మేళవించిన ట్రైలర్‌.. అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా సినిమా ఉండబోతోందనే అంచనాలను పెంచుతోంది. వెంకటేష్ తనదైన కామెడీ టైమింగ్‌, ఆకట్టుకునే స్క్రీన్‌ ప్రెజెన్స్‌తో ట్రైలర్‌లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. యాక్షన్‌ సన్నివేశాల్లోనూ ఆయన చూపించిన ఎనర్జీ సినిమాపై ఆసక్తిని మరింత పెంచుతోంది. ఆయన నటనకు తోడు ఆసక్తికరమైన కథనం, వినోదభరిత సన్నివేశాలు ట్రైలర్‌ను మరింత ఆకట్టుకునేలా చేశాయి. ఇక తమన్‌ అందించిన నేపథ్య సంగీతం ట్రైలర్‌కు అదనపు బలాన్నిచ్చింది. ముఖ్యంగా యాక్షన్‌ సన్నివేశాల్లో తీవ్రతను పెంచుతూ, కథలోని ఉత్కంఠను మరింతగా ఎలివేట్‌ చేసింది.  20 ఏళ్ల తర్వాత వెంకటేష్, త్రివిక్రమ్‌ కలయికలో సినిమా వస్తుండటంతో ‘ఆదర్శ కుటుంబం’పై ఆసక్తి నెలకొంది. యువతతో పాటు కుటుంబ ప్రేక్షకుల్లోనూ మంచి క్రేజ్‌ ఉన్న ఈ కలయిక.. మరోసారి నవ్వులు, భావోద్వేగాలు, యాక్షన్‌, ఉత్కంఠతో కూడిన పూర్తిస్థాయి వినోదాన్ని అందించేందుకు సిద్ధమవుతోంది. అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఈ చిత్రాన్ని రూపొందించినట్లు ట్రైలర్‌ చూస్తే అర్థమవుతోంది. అద్భుతమైన ట్రైలర్ తో ‘ఆదర్శ కుటుంబం – హౌస్ నెం. 47’పై అంచనాలు రెట్టింపు అయ్యాయి. క్రైమ్‌ థ్రిల్లర్‌ అంశాలతో కూడిన పూర్తిస్థాయి వినోదం అందించబోతోందనే అంచనాలతో ఈ సినిమాపై ఆసక్తి పెరుగుతోంది. అక్టోబర్‌ 30న ఈ సినిమా భారీస్థాయిలో థియేటర్లలో విడుదల కానుంది. Aadarsha Kutumbam Trailer    ఇది కూడా చదవండి: రాజమౌళి హాలీవుడ్ ఎంట్రీ.. వారణాసి తర్వాత బిగ్ ప్లాన్.!       [Aadarsha Kutumbam Trailer, Aadarsha Kutumbam Official Trailer, AK47 Trailer, Aadarsha Kutumbam House No 47, Aadarsha Kutumbam Movie, Venkatesh, Trivikram Srinivas, Srinidhi Shetty, Telugu Film News]  
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు. వారితో పాటు పెద్ద సంఖ్యలో క్యాడర్ కూడా పార్టీని వీడుతున్నారు. ఇక ఇప్పుడు నామినేటెడ్ పదవులలో ఉన్న వారి వంతు మొదలైనట్లు కనిపిస్తోంది. తనకు కానీ తన భర్తకు  కానీ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు టికెట్ ఇవ్వాలంటూ గత  కొంత కాలంగా కోరుతూ వస్తున్న మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ వంతు వచ్చింది. ఆమె కూడా రాజీనామా అస్త్రం సంధించారు.  జగన్ కు నమ్మిన బంటుగా గుర్తింపు పొందిన మహిళాకమిషన్ చైర్ పర్సన్ వాసి రెడ్డి పద్మ తన పదవికి రాజీనామా చేశారు. ఉరుములేని పిడుగులా, ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా తన రాజీనామా లేఖను సీఎం జగన్ కు పంపేశారు. పేరుకు తాను పార్టీకి కాదు, కేవలం మహిళా కమిషన్ చైర్మన్ పదవికి మాత్రమే రాజీనామా చేశాననీ, ఇక నుంచి వైసీపీ కోసం పని చేస్తాననీ వాసిరెడ్డి పద్మ చెబుతున్నప్పటికీ, ఆమె రాజీనామాకు కారణం అసంతృప్తేనని పార్టీ వర్గాలు బాహాటంగానే చెబుతున్నాయి. చాలా కాలంగా వాసిరెడ్డి పద్మ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు తనకు కానీ తన భక్తకు కానీ పార్టీ టికెట్ ఇవ్వాలని జగన్ ను కోరుతూ వస్తున్నారు. అయితే ఇప్పటి వరకూ జగన్ చూద్దాం.. చేద్దాం అన్నట్లుగా దాట వేస్తూనే వచ్చారు. ఇప్పుడిక వరుసగా అభ్యర్థల జాబితాలను జగన్ ప్రకటించేస్తుండటం, తనకు గానీ తన భర్తకు కానీ పార్టీ టికెట్ విషయంలో ఎటువంటి స్పస్టత ఇవ్వకపోవడంతో ఆమె మనస్తాపం చెంది పదవికి రాజీనామా చేసేశారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.  వాసిరెడ్డి పద్మ రాజకీయ ప్రవేశం ప్రజారాజ్యం పార్టీతో జరిగింది. 2009లో ఆమె ప్రజారాజ్యం పార్టీలో చేరారు. ఇలా చేరడంతోనే ఆమె ప్రజారాజ్యం అధికార ప్రతినిథిగా పదవి దక్కించుకున్నారు. ప్రజారాజ్యం కాంగ్రెస్ పార్టీలో విలీనం కావడంతో ఆమె 2012లో జగన్ పార్టీలో చేరారు. జగన్ కూడా ఆమెకు అధికార ప్రతినిథి పదవి ఇచ్చారు.  2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆమెను రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా నియమించారు. చైర్ పర్సన్ హోదాలో ఆమె జగన్ మెప్పు పొందేందుకు చేయగలిగినంతా చేశారు. ప్రతిపక్ష పార్టీ నేతలకు నోటీసులు ఇచ్చారు. ఏకంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు సైతం నోటీసులు జారీ చేశారు. వార్డు వలంటీర్లపై పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు కమిషన్ ముందు హాజరై వివరణ ఇవ్వాలంటూ ఆమె పవన్ కు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. పవన్ హాజరు కాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు నమోదు చేయాలని ఆదేశించారు. ఇన్ని చేసినా వాసిరెడ్డి పద్మకు ఆమె కోరినట్లుగా పార్టీ టికెట్ లభించకపోవడంతో అలిగి పదవికి రాజీనామా చేశారని, ఇది జగన్ కు షాకేననీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు. ఒకరైతు తనకు చేసిన సేవలకు ప్రీతి చెందిన గురువు అతడికి స్వర్గ ప్రాప్తిని కలగజేయాలని అనుకుంటాడు. కానీ సంసారాసక్తి వల్ల ఆ రైతు ఆ అవకాశాన్ని వాయిదా వేసుకుంటూ వస్తాడు. చివరికి గురుకృప వల్ల ఆ రైతు స్వర్గ ప్రాప్తిని ఎలా పొందాడో ఈ కథ తెలియజేస్తుంది. "ఒక మహాపురుషుడు ప్రయాణం చేస్తూ, డస్సిపోయాడు. గొంతు ఎండిపోయింది. దారిలో ఒక రైతు కనపడితే నీళ్ళు అర్థించాడు. ఆ రైతు మహాత్మునికి సకల ఉపచారాలూ చేశాడు. చిరిగిపోయిన ఆయన ఉత్తరీయాన్ని రైతు జాగ్రత్తగా కుట్టి బాగుచేశాడు. రైతు పరిచర్యలకు సంతసించిన ఆ మహాత్ముడు శాంతి, ఆనందాలకు నిలయమైన స్వర్గానికి తనతోపాటు రమ్మని అంటాడు. అందుకు ఆ రైతు 'గురువుగారూ! మీరు నా మీద చూపిన దయకు కృతజ్ఞుణ్ణి. కానీ నా పిల్లలు ఇంకా చిన్నవాళ్ళు. ఓ ఏడేళ్ళ వ్యవధి ఇవ్వండి' అని అడుగుతాడు. అందుకు గురువు అంగీకరించాడు. సరిగ్గా ఏడేళ్ళ తర్వాత గురువు రైతును స్వర్గానికి తీసుకువెళ్ళడానికి వచ్చాడు. అప్పుడు రైతు 'అయ్యా! కడపటి కొడుకు కష్టాలకు అంతు లేదు. అన్ని జంఝాటాలనూ ఒక్కడే సంబాళించుకోలేకపోతున్నాడు. కాబట్టి మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని గురువుని అడిగాడు. మరో ఏడేళ్ళ తరువాత గురువు వచ్చాడు. కానీ రైతు చనిపోయాడని తెలిసింది. చనిపోయిన ఆ రైతు ఎద్దుగా పుట్టాడని ఆ గురువు తన దివ్య దృష్టితో తెలుసుకున్నాడు. ఎద్దుగా పుట్టిన ఆ రైతు తన కొడుకు పొలాన్నే దున్నుతున్నాడు. అప్పుడు గురువు ఆ ఎద్దుపై మంత్ర జలం చిలకరించగానే ఎద్దు జన్మనెత్తిన రైతు 'నా కొడుకు పరిస్థితి మరి కాస్త మెరుగు పడనీయండి స్వామీ! మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని అన్నాడు. ఇక చేసేది లేక వెనుదిరిగాడు గురువు. మరలా ఏడేళ్ళ తర్వాత వచ్చిన గురువుకు ఎద్దు చనిపోయిందని తెలిసింది. అది కుక్కగా పుట్టి కొడుకు ఇంటినీ, ఆస్తినీ కాపలా కాస్తోందని తన దివ్యదృష్టి ద్వారా తెలుసుకున్నాడు. గురువు. కుక్కగా పుట్టిన ఆ రైతు 'స్వామీ! నేను ఎంత దౌర్భాగ్యుణ్ణి. మీరు ఇంత దయ చూపుతున్నప్పటికీ మీతో స్వర్గమానం చేయలేకున్నాను. వీడికి ఆస్తిని కాపాడుకొనే దక్షత ఇంకా రాలేదు. కాబట్టి దయ చేసి మరో ఏడేళ్ళు వ్యవధి ఇవ్వండి' అని వేడుకున్నాడు. గురువు ఏడేళ్ళ తరువాత మళ్ళీ వచ్చేసరికి కుక్క మరణించింది. అది త్రాచుపాముగా జన్మనెత్తి, ఇప్పుడు కొడుకు భూమిలో ఉన్న లంకెబిందెలకు పడగెత్తి కాపలా కాస్తోంది. గుప్త ధనం ఇక్కడ ఉందని కొడుకుకి ఎలా తెలియజేయాలా అని పాము ఆలోచిస్తున్నప్పుడు గురువు ఆ రైతుకొడుకును పిలుచుకు వచ్చి లంకె బిందెలు ఉన్న చోట తవ్వమన్నాడు. లంకె బిందెలు బయటపడ్డాయి. ఆ పైన ఆ పామును చంపమన్నాడు. అనంతరం శిష్యుణ్ణి తీసుకొని స్వర్గారోహణం చేశాడు గురువు. సంసారంలోని ఈతి బాధల నుండి శిష్యుణ్ణి ఉద్ధరిస్తాడు సద్గురువు. అలాంటి గురువు అందరికీ అవసరం.                                      *నిశ్శబ్ద.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్  రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది.  80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత  ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది.   ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది. ఆమెది నెద‌ర్లాండ్స్‌. ఆమె తండ్రి నెద‌ర్లాండ్స్‌లోని ఆర్నెహెమ్‌లో చిన్న‌పిల్ల‌ల ఆస్ప‌త్రి డైరెక్ట‌ర్. పోయి దొరికిన ఆ పెయింటింగ్ విష‌యానికి వ‌స్తే.. అది 1683లో కాస్ప‌ర్ నెష‌ర్ వేసిన స్టీవెన్ ఓల్ట‌ర్స్ పెయింటింగ్‌. రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో నాజీల ఆదేశాల‌ను చార్లెట్ తండ్రి వ్య‌తిరేకించారు. ఆయ‌న ర‌హ‌స్య జీవ‌నం సాగించేడు. కానీ ఈ పెయింటింగ్‌ని మాత్రం త‌న న‌గ‌రంలోని ఒక బ్యాంక్‌లో భ‌ద్ర‌ ప‌ర‌చ‌మ‌ని ఇచ్చార‌ట‌. 1940లో నాజీలు నెద‌ర్లాండ్ పై దాడులు చేసినపుడు ఆ బ్యాంక్ మీద ప‌డి దోచుకున్నా రు. అప్పుడు ఈ పెయింటింగ్ కూడా తీసుకెళ్లారు. యుద్ధం అయిపోయిన త‌ర్వాత ఈ పెయింటింగ్ ఎక్క‌డున్న‌దీ ఎవ‌రికీ తెలియ‌లేదు. చిత్రంగా 1950ల్లో డ‌స‌ల్‌డార్ష్ ఆర్ట్ గ్యాల‌రీలో అది ప్ర‌త్య‌క్ష‌మ‌యింది. 1969లో ఆమ్‌స్ట‌ర్‌డామ్‌లో దాన్ని వేలానికి తీసికెళ్లే ముందు దాన్ని ఆ ఆర్ట్ గ్యాల‌రీలో వుంద‌ని చూసిన‌వారు చెప్పారు. వేలంపాట త‌ర్వాత మొత్తానికి ఆ పెయింటింగ్‌ను 1971లో ఒక క‌ళాపిపాసి త‌న ద‌గ్గ‌ర పెట్టుకున్నాడు.    ఆ త‌ర్వాత 2021లో అది చార్లెటీని చేరింది.  మొత్తానికి వూహించ‌ని విధంగా ఎంతో కాలం దూర‌మ‌యిన గొప్ప క‌ళాఖండం తిరిగి త‌న వ‌ద్ద‌కు చేర‌డంలో చార్లెటీ ఆనందానికి అంతేలేదు. అంతే క‌దా.. పోయింద‌నుకున్న గొప్ప వ‌స్తువు తిరిగి చేరితే ఆ ఆనంద‌మే వేరు!  అయితే చార్లెటీకి ఇపుడు ఆ పెయిం టింగ్‌ను భ‌ద్రంగా చూసుకునే ఆస‌క్తి వున్న‌ప్ప‌టికీ శ‌క్తి సామ‌ర్ధ్యాలు లేవు. అందుక‌నే త్వ‌ర‌లో ఎవ‌రిక‌యినా అమ్మేసీ వ‌చ్చిన సొమ్మును పిల్ల‌ల‌కు పంచుదామ‌నుకుంటోందిట‌!  చార్లెటీ కుటుంబంలో అయిదుగురు అన్న‌ద‌మ్ములు అక్క‌చెల్లెళ్లు వున్నారు. అలాగే ఇర‌వై మంది పిల్ల‌లు ఉన్నారు. అంద‌రూ ఆమె అంటే ఎంతో ప్రేమ చూపుతున్నారు. అంద‌రం ఒకే కుటుంబం, చాలాకాలం త‌ర్వాత ఇల్లు చేరిన క‌ళాఖండం మా కుటుంబానిది అన్న‌ది చార్లెటీ!
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు. చాకోను పార్టీలోకి ఆహ్వానిస్తూ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్’ ఫ్రంట్ ఏర్పాటు గురించి ప్రత్యేకించి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు కానీ, చాకో అలాంటి  సంకేతాలు ఇచ్చారు. ప్రస్తుతం దేశంలో ఉన్న ఏ ఒక్కపార్టీ కూడా బీజేపీకి ప్రత్యాన్మాయం కాదని,సమీప భవిష్యత్ కాంగ్రెస్ సహా ఏ పార్టీ కూడా ఆ స్థాయికి ఎదిగే అవకాశాలు కూడా కనిపించడంలేదని అన్నారు. ఈ పరిస్థితుల్లో దేశంలోని బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ, ఏకమై, ఒకే గొడుగు కిందకు రావలసిన అవసరం ఉందని చాకో అన్నారు. అదే సమయంలో ప్రతిపక్షాలను ఏక తాటిపైకి తెచ్చే బాధ్యతను పవార్ తీసుకోవాలని సంకేత మాత్రంగా చెప్పారు. అంతే కాకుండా కాంగ్రెస్ పేరు ఎత్తకుండా బీజేపీ వ్యతిరేక శక్తులను ఏకం చేసే ఆలోచన ఆ పార్టీ నాయకత్వానికి లేదని నెహ్రూ గాంధీ ఫ్యామిలీ (సోనియా, రాహుల్, ప్రియాంక)ఆలోచనా ధోరణిని పరోక్షంగానే అయినా ఎండ కట్టారు.ఆ విధంగా పవార్ ఆ బాధ్యత తీసుకోవాలని చాకో సూచించారు. ఇందుకు సంబంధించి, పవార్ బహిరంగంగా ఎలాంటి వ్యాఖ్య చేయలేదు. అయితే, చాకో సహా మరికొందరు ‘సీనియర్’ కాంగ్రెస్ నాయకులు, అలాగే సిపిఎం, సిపిఐ నాయకులు కూడా పవార్’తో చాలా కాలంగా థర్డ్ ఫ్రంట్  విషయంగా చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. అయితే మహారాష్ట్రలో సంకీర్ణం మనుగడను దృష్టిలో ఉంచుకుని పవార్ ఆచితూచి అడుగులేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే చాకో పార్టీలో చేరిన సందర్భంలో కూడా ‘చాకో చేరికతో మహారాష్ట్రలోని మహా వికాస్ అగాడీ ప్రభుత్వానికి ఎలాంటి నష్టం జరగదని, పవార్ మహారాష్ట్ర సంకీర్ణ సర్కార్ ప్రస్తావన చేశారని విశ్లేషకులు పేర్కొంటున్నారు.  మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వ మనుగడ గురించ్బి  పవార్ ప్రత్యేకంగా పేర్కొనడం ద్వారా, ఆయన థర్డ్ ఫ్రంట్ విషయంలో వేచి చూసే ఆలోచనలో ఉన్నట్లు అర్థమవుతోందని కూడా  రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే అదే ఎన్సీపీ అసెంబ్లీ ఎన్నికల జరుగతున్న కేరళలో, పశ్చిమ బెంగాల్లో  కాంగ్రెస్ వ్యతిరేక పార్టీలకు మద్దతు ఇస్తోంది. దీన్ని బట్టి చూస్తే, ఎన్సీపీ - కాంగ్రెస్ మధ్య దూరం పెరుగుతోందని స్పష్టమవుతోంది. అయితే, థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఏ రకంగా ముడి పడుతుంది అనే విషయంలో ఇంకా స్పష్టత రావలసి ఉంది. అలాగే, కాంగ్రెస్ లేకుండా జాతీయ స్త్గాయిలో బీజేపీ వ్యతిరేక కూటమిని ఏర్పాటు చేయడం వలన, వ్యతిరేక ఓటు చీలి  అది మళ్ళీ బీజేపీకే మేలు చేస్తుందని, కాబట్టి, ప్రస్తుతం కాంగ్రెస్ సారధ్యంలోని యూపీఏని బలోపేతం చేయడమే ఉత్తమమనే అలోచన కూడా  విపక్ష శిబిరం నుంచి వినవస్తోంది. ఈ నేపధ్యంలోనే, ప్రస్తుతం యూపీఏ ఛైర్పర్సన్’గా ఉన్న సోనియా గాంధీ వయసు, అనారోగ్యం కారణంగా బాధ్యతల నుంచి తప్పుకుని పవార్’కు బాద్యతలు అప్పగించాలనే ప్రతిపాదన వచ్చిందని అంటున్నారు. అలాగే, ఇతర పార్టీలను, ముఖ్యంగా కాంగ్రెస్ నుంచి విడిపోయి సొంత కుంపటి పెట్టుకున్న మమతా బెనర్జీ సారధ్యంలోని తృణమూల్, జగన్మోహన్ రెడ్డి సారధ్యంలోని వైసీపీలను కలుపుకుని కూటమిని బలోపేతం చేయడం ద్వారా బీజేపీని దీటుగా ఎదుర్కోవచ్చనే ఆలోచనలు కూడా సాగుతున్నాయి. అయితే, ఇటు థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు అయినా, యూపీఏని బలోపేతం చేయడమే అయినా, పవారే .. కేంద్ర బిందువు. ఆయన సారధ్యంలోనే ప్రత్యాన్మాయం అనేది విపక్ష శిభిరం నుంచి వినవస్తున్న ప్రస్తుత సమాచారం. మరి అదే జరిగితే రాహుల గాంధీ పరిస్థితి ఏమిటి ? గాంధీ నెహ్రూ కుటుంబం పరిస్థితి ఏమిటి? ఏ ప్రత్యేక ప్రాధాన్యత లేకుండా అందరిలో ఒకరిగా ఫస్ట్ ఫ్యామిలీ సర్దుకు పోతుందా? అంటే..చివరకు ఏమవుతుందో .. ఇప్పుడే చెప్పలేమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది. గతంలో అనేక సందర్భాలలో ముఖ్యమంత్రి కేసీఆర్,ఆర్థిక మంత్రి హరీశ రావు, కరోనా కారణంగా రాష్ట్ర  ఆదాయం గణనీయంగా తగ్గిందని, పేర్కొన్నారు. అయితే, కరోనా నుంచి వేగంగా కోలుకుని, ఆర్థికంగా అంతే వేగంగా పుంజుకున్న రాష్ట్రాలలో తెలంగాణ ప్రధమ స్థానంలో  ఉందని కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సర్వే 2020-21 నివేదిక పేర్కొంది. పడిలేచిన కెరటంలా, తెలంగాణ ‘వీ’ ఆకారంలో ఆర్థికంగా నిలతొక్కుందని కేంద్రం జనవరి  చివరి వారంలో విడుదల చేసిన ఆర్థిక సర్వేలో పేర్కొంది. అలాగే, రెవిన్యూ వసూళ్ళలో రాష్ట్రం కరోనా పూర్వస్థితికి చేరిందని కూడా సర్వే చెప్పింది.   అలాగే,రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు కూడా ఈ మధ్య కాలంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పై సంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరమ జనవరి,ఫిబ్రవరి, మార్చి నెలలతో పోలిస్తే ఈ సంవత్సరం ఈ మూడు నెలల కాలంలో రాష్ట్ర ఆర్థిక వృద్ది రేటు 10 నుంచి  15 శాతం మెరుగ్గా ఉందని హరీష్ రావు ఒకటి రెండు ఇంటర్వ్యూలలో పేర్కొన్నారు.అలాగే, బడ్జెట్ విషయంలోనూ ఆయన చాల ఆశావహ దృక్పథంతోనే ఉన్నారు. బడ్జెట్  పాజిటివ్’గా ఉంటుదని, ఎవ్వరూ ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని, సంక్షేమ పథకాలలో,ఇతరత్రా బడ్జెట్ కేటాయింపులలో ఎలాంటి కోతలు ఉండవని కూడా హరీష్ హామీ ఇచ్చారు. గత సంవత్సరంలో కొంత మేర హామీ ఇచ్చిన మేరకు అమలు చేయలేక పోయిన సొంత జాగాలలో డబల్ బెడ్ రూమ్ ఇళ్ళ నిర్మాణం, రుణ మాఫీ వంటి  పథకాలను ఈ బడ్జెట్ ద్వారా అమలు చేస్తామని చెప్పారు. అలాగే, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ తమిళి సై చేసిన ప్రసంగంలోనూ ఆశావహ దృక్పధమే వ్యక్తమైంది. ఆమె తమ ప్రసంగంలో,  ప్రభుత్వం సంక్షేమ పథకాలకు పెద్ద పీట వేసిందని అన్నారు. ‘సంపద పంచాలి ,పేదలకు పంచాలి’ అనేది తమ ప్రభుత్వ విధానమని స్పష్టం చేశారు. అలాగే, పెరుగతున్న ఆదాయంలో అధికశాతం సంక్షేమానికే వెచ్చిస్తున్నామని స్పష్టం చేశారు. దీంతో బడ్జెట్’లో కొత్త పథకాలకు శ్రీకారం చుట్టే అవకాశం ఉంటుందా అన్న చర్చ జరుగుతోంది. మరో వంక ఉద్యోగ వర్గాల్లో పీఆర్సీకి సంబంధించి ఆర్థిక మంత్రి తమ ప్రసంగంలో  ప్రకటన చేస్తారా లేదా అనే ఆసక్తి నెలకొంది. అలాగే, సామాన్య  ప్రజలు ఇటీవల పెరిగిన పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరల భారం నుంచి మంత్రి హరీష్, ఏదైనా ఉపసమనం కలిపిస్తారా అని ఎదురు చూస్తున్నారు. గతంలో వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సామాన్య ప్రజలపై వంటగ్యాస్ ధర భారాన్ని తగ్గించేందుకు కొంత మొత్తాన్ని, రూ.50(?) రాష్ట్ర ప్రభుత్వం తరపున  సబ్సిడీగా ఇచ్చిన విషయాన్ని, అదే విధంగా అసెంబ్లీ ఎన్నికలు జరుగతున్న తమిళనాడులో డిఎంకే పార్టీ,తమ పార్టీని అధికారంలోకి వస్తే  గ్యాస్ బండపై వంద రూపాయల సబ్సిడీ ఇస్తామని చేసిన  వాగ్దానాన్ని  గుర్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే, ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు, సోమవారం ఆర్థిక మంత్రి హరీష్ రావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఆర్థిక  శాఖ ముఖ్య కార్యదర్శి రామ కృష్ణా రావు,సలహాదారు జీఆర్ రెడ్డితో బడ్జెట్ పద్దులఫై సుదీర్ఘంగా చర్చించి తుది మెరుగులు దిద్దారు. బడ్జెట్ తుది రూపం సిద్దమైన నేపధ్యంలో ఆర్థిక శాఖ ప్రింటింగ్ ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 18 ఉదయం మంత్రి వర్గం ఆమోదం పొందిన అనంతరం ఆర్థికమంత్రి హరీష్ రావు అదే రోజు రాష్ట్ర బడ్జెట్ 2021-22ను సభలో ప్రవేశ పెడతారు. 20, 22 తేదీల్లో బడ్జెట్‌పై సాధారణ చర్చ,23, 24, 25 తేదీల్లో బడ్జెట్‌ పద్దులపై చర్చ ఉంటుంది 26న ద్రవ్యవినిమయ బిల్లు (బడ్జెట్)పై చర్చ, సభామోదం ఉంటాయి.
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది.  అధికార తెరాస, ఖమ్మం స్థానానికి సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర రెడ్డి పేరును ప్రకటించడంలో కొంచెం జాప్యం చేయడంతో పాటుగా, హైదరాబాద్ స్థానం నుంచి , పీవీ కుమార్తె వాణీ దేవి పేరును చివరి క్షణంలో తెరమీదకు తేవడంతో అంత వరకు కొంత స్తబ్దుగా సాగిన ప్రచారం ఆ తర్వాత వేడెక్కింది. ఉద్యోగ నియామకాల విషయంలో తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ తప్పులో కాలేయడంతో విపక్షాలు, పోటీలో ఉన్న ప్రత్యర్ధులు, నిరుద్యోగ యువత, విద్యార్ధి సంఘాలు  ఒకే సారి ఆయన మీద  విరుచుకు పడ్డారు. ఆయన లెక్క తప్పని నిరుపిస్తం రమ్మని వరస సవాళ్ళు విసిరారు. దీంతో, మంత్రి నియామకా ఇష్యూని పక్కకు తప్పించేందుకు , ఐటీఐఆర్, వరంగల్ రైల్వే ఫ్యాక్టరీ వంటి సెంటిమెంటల్ ఇష్యూస్’ను తెరపైకి  తెచ్చారు. అలాగే, కేంద్ర ప్రభుత్వంపై విమర్శల దాడిని పెంచారు. చివరకు పొరుగు రాష్ట్రానికి చెందిన విశాఖ ఉక్కు ఆందోళన   కూడా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగమైంది.   రెండు నియోజక వర్గాలలో గతంతో పోలిస్తే ఈసారి ఓటర్ల సంఖ్య రెట్టింపు అయింది. ఈసారి రెండు నియోజక వర్గాలలో కలిపి 10 లక్ష 36 వేల మంది తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. అలాగే, రెండు పట్ట భద్రుల నియోజక వర్గాల్లో 164 మంది అభ్యర్ధులు పోటీలో ఉన్నారు.  గత ఎన్నికలతో పోలిస్తే ఇటు ఓటర్ల సంఖ్య, అటు అభ్యర్థుల సంఖ్యా రెట్టింపునకు పైగానే పెరగడంతో ఎన్నికలలో జోష్ పెరిగింది. దీనికితోడు అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో సాధారణ ఎన్నికలను తలపించే రీతిలో ప్రచారం సాగింది. ఎక్కువమంది అభ్యర్ధులు బరిలో ఉండడంతో, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి  తమకే ప్రయోజనం జరుగుతుందని అధికార పార్టీ ఆశపడుతోంది .  దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో చేదు ఫలితాలను చవిచూసిన టీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా వ్యూహ రచన చేసి కేటీఆర్, హరీష్ సహా మంత్రులు,ఎమ్మెల్యేలకు స్పెసిఫిక్ బాధ్యతలు అప్పగించారు. అలాగే,కాంగ్రెస్‌ అభ్యర్థులు చిన్నారెడ్డి, రాములునాయక్‌లకు మద్దతుగా ఉత్తమ్‌, భట్టి, రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తదితరులు విస్తృతంగా ప్రచారం చేశారు. బీజేపీ అభ్యర్థులు ఎన్‌.రాంచందర్‌రావు, ప్రేమేందర్‌రెడ్డిల తరఫున ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, ఎంపీ అరవింద్‌ తదితరులు ప్రచారాన్ని వేడెక్కించారు.  ఖమ్మం స్థానం నుంచి ప్రత్యక్ష ఎన్నికల్లో తొలిసారి పోటీకి దిగిన కోదండరాంకు, టీజేఎస్‌ పార్టీకీ ఈ ఎన్నికలు కీలకంగా మారాయి. ఖమ్మ స్థానం నుంచి పోటీ చేస్తున్న తీన్మార్ మల్లన్న ముందస్తు వ్యూహంతో ప్రధాన పార్టీల అభ్యర్ధులకు ధీటుగా ప్రచారం సాగించారు.  వామపక్షాల మద్దతుతో జయసారథి, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్‌, యువతెలంగాణ కార్యనిర్వాహక అధ్యక్షురాలు రాణీ రుద్రమ తదితరులు పోటీలో ఖమ్మం సీటును పట్టభద్రులు  ఎవరికి  పట్టం కడతారు అన్నది ప్రశ్నార్థకంగా మారింది. హైదరాబాద్ సీటు కూడా ఇటు అధికార తెరాసకు అటు సిట్టింగ్ సీటును నిలుపుకోవడం తో పాటుగా దుబ్బాక , జీహెచ్ఎంసి జోష్ ను కొనసాగించాలని ఆశ పడుతున్నబీజేలకే కూడా ఇజ్జత్ కీ సవాల్ గా మారింది. కాంగ్రెస్ అభ్యర్ధి పార్టీ సీనియర్ నాయకుడు సౌమ్యుడు, మాజీ మంత్రి చిన్నారెడ్డి, వామ పక్షాల మద్దతుతో పోటీ చేస్తున్న మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ కూడా గట్టి పోటీ ఇస్తున్నారు. సో.. చివరకు ఏమి జరుగుతుంది అంటే ఏదైనా జరగవచ్చును. ఈ నెల 14 వ తేదీన పోలింగ్ జరుగుతుంది.17 ఫలితాలు వస్తాయి .. అంతవరకు వెయిట్ అండ్ వాచ్ .  
సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది. ఒకప్పుడు ఎర్ర జెండాను దిగ్విజయంగా ఎదిరించి, మార్క్సిస్టులను మట్టి కరిపించిన మమతా దీదీ ప్రస్తుతం, కాషాయ కూటమి నుంచి గట్టి సవాలును ఎదుర్కుంటున్నారు. వరసగా పదేళ్ళు పాలించడం వలన సహజంగా వచ్చిన ప్రభుత్వ వ్యతిరేకత  కంటే, హిందూ ఓటు పోలరైజేషన్ ఆమెను మరింతగా భయపెడుతోంది. నిజానికి ఐదేళ్ళ క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం ఐదు శాతం కంటే తక్కువ ఓట్లు, మూడంటే మూడు అసెంబ్లీ సీట్లు మాత్రమే గెలుచుకున్న బీజేపీ..  2019 లోక్ సభ ఎన్నికల్లో ఏకంగా 40 శాతం ఓట్లతో 18 స్థానాలు గెలుచుకుంది. ఈ  మార్పు ఇంకా కొన్ని కారణాలు ఉంటే ఉండవచ్చును కానీ.. హిందువుల ఓటు పోలరైజ్  కావడమే ప్రధాన కారణం.  ఈ నేపధ్యంలోనే కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ చివరకు కమ్యూనిస్టులు కూడా బీజేపీలో  చేరారు. ఎన్నికల ప్రకటన వెలువడిన తర్వాత కూడా సిట్టింగ్ ఎమ్మెల్ల్యేలు సహా  తృణమూల్ టికెట్ వచ్చిన నాయకులు కూడా బీజేపీలో చేరుతున్నారు. అనేక మంది ఇతర రంగాల ప్రముఖులు, ముఖ్యంగా ఇంతకాలం, బీజేపీని హిదుత్వ అనుకూల ‘అచ్చుత్’ (అంటారని) పార్టీగా చూసిన ‘సెక్యులర్’ ప్రముఖులు కాషాయం కప్పుకోవడంతో మమతా బెనర్జీకి కొంచెం అలస్యంగానే అయినా, తత్త్వం బోధపడింది. అందుకే ఆమె ఇప్పుడు గుళ్ళూ,గోపురాలకు తిరుగుతున్నారు. కార్యకర్తల సమావేశాల్లో తానూ హిందువునేనని, చెప్పుకుంటున్నారు.  నిజానికి ఇలా నేనూ హిందువునే  అని సెక్యులర్ నేతలు బహిరంగంగా ప్రకటించుకోవడం మమతా బెనర్జీతోనే మొదలు కాలేదు. రాహుల్ గాంధీ తాను హిందువునని, జన్యుధారీ కశ్మీరీ బ్రాహ్మణుని అనీ.. తమ గోత్రం, ‘దత్తాత్రేయ’ గోత్రమని బహిరంగంగా ప్రకటించుకున్నారు. అలాగే  కొద్ది రోజుల క్రితం ప్రియాంకా గాంధీ తానూ హిందువునని చెప్పుకునేందుకు ‘మౌని అమావాస్య’ సందర్భంగా అలహాబాద్ లో గంగా స్నానం చేశారు. గతంలోనూ ఆమె ఎన్నికలకు ముందు గంగా యాత్ర చేశారు. అంతవరకు ఎందుకు కొద్దిరోజుల క్రితం సిపిఐ నారాయణ విశాఖ స్వామి ఆశీస్సులు తీసుకున్నారు. చంద్రబాబు, జగన్ రెడ్డి, కేసీఆర్ ఇలా తెలుగు నేతలు అనేక మంది లౌకిక వాదానికి కాలం చెల్లిందన్న సత్యాన్ని గ్రహించి కావచ్చు ‘నేనూ హిందువును’ అంటూ ప్రకటించుకునేందుకు పోటీ పడుతున్నారు. రాముడిని తలచుకున్నా, జై శ్రీరామ్ అన్నా తమ  లౌకిక వాదం మయలపడి పోతుందని భయపడిన నాయకులు ఇప్పుడు .. జై శ్రీరామ్ అనేందుకు కూడా వెనకాడడం లేదు.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది. గత కొంత కాలంగా సబర్మలతో సహా అనేక అంశాలపై స్పందిస్తూ.. కేరళను టార్గెట్ చేస్తున్న బీజేపీ నాయకులు అక్కడ తమ జెండా ఎగరేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా పార్టీ పాలసీని కూడా పక్కన పెట్టి మెట్రో మ్యాన్ శ్రీధరన్ ను పార్టీలో చేర్చుకుని ఆయనే తమ సీఎం అభ్యర్థి అని ప్రకటించిన 24 గంటలలో యూ టర్న్ తీసుకున్నారు. ఇది ఇలా ఉండగా ప్రస్తుతం సీఎంగా ఉన్న కమ్యూనిస్ట్ నేత పినరై విజయన్ పై గోల్డ్ స్మగ్లింగ్ ఆరోపణలు రావడంతో.. ఈ ఎన్నికలలో ఎల్డిఎఫ్ భవిష్యత్తుపై ప్రజలు ఏ తీర్పు ఇవ్వబోతున్నారనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది ఈ నేపథ్యంలో అక్షరాస్యతలో దేశంలోనే మొదటి స్థానంలో ఉన్న ఆ రాష్ట్ర ప్రజలు ఎవరిని ఆశీర్వదిస్తారు అనే అంశంపై ప్రముఖ మీడియా సంస్థ టైమ్స్ నౌ, సీ ఓటరుతో కలిసి ఒక సర్వేను నిర్వహించారు. ఈ సర్వే ప్రకారం చూస్తే పాపం కమలనాథులు అక్కడ పవర్ చేతికి రావటం అటుంచి కనీసం రెండు మూడు అసెంబ్లీ స్థానాల్లో గెలవటం కూడా కష్టమేనని ఆ సర్వే తేల్చి చెబుతోంది. కేరళలో ఈసారి జరిగే అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ తన హవా చాటుతుందన్న ఆ పార్టీ నేతల మాటలలో ఎలాంటి నిజం లేదని.. ప్రస్తుతానికి అది ఏమాత్రం సాధ్యం కాదని ఈ తాజా సర్వే తేల్చి చెప్పింది. అంతేకాకుండా మొత్తం 140 స్థానాలు ఉన్న కేరళలో.. ప్రస్తుత సీఎం పినరయి విజయన్ నేతృత్వంలోని లెఫ్ట్డ్ డెమొక్రటిక్ ఫ్రంట్ కు 82 సీట్లు పక్కా అని.. ఆయనే తిరిగి అధికారాన్ని నిలబెట్టుకుంటాడని సర్వే చెపుతోంది. అదే సమయంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూనైటెడ్ డెమొక్రాటిక్ ఫ్రంట్ కు 56 నుంచి 60 వరకు సీట్లు వచ్చే అవకాశం ఉందని ఈ సర్వేలో తేలింది. అంతేకాకుండా 2016 ఎన్నికలతో పోలిస్తే ఎల్ డీఎఫ్ ఓటింగ్ శాతం కూడా కొంత పెరగటం ఇక్కడ గమనార్హం. ప్రస్తుతం సీఎంగా ఉన్న విజయన్ మరోసారి సీఎం కావాలని 43.34 శాతం మంది మొగ్గు చూపినట్లుగా సర్వేలో తేలింది. కరోనా సమయంలో విజయన్ సీఎంగా బాగా పని చేసారని ఈ సర్వే పేర్కొంది. మరోపక్క దేశ ప్రధానిగా రాహుల్ గాంధీ ఉండాలని కేరళ ప్రజల్లో 55.84 శాతం మంది కోరుకుంటున్నట్లుగా ఈ సర్వే;లో తేలింది. అయితే కేరళలో ఎలాగైనా పాగా వేయాలని పట్టుదలతో కృషి చేస్తున్న బీజేపీకి ఈసారి కూడా నిరాశ తప్పదని ఈ సర్వేలో స్పష్టం అయింది. ఈ ఎన్నికలలో బీజేపీకి రెండు సీట్లు కూడా రావటం కూడా కష్టమేనని ఈ సర్వే తేల్చింది. అయితే ఎన్నికలకు ముందు ఇలాంటి సర్వేలు బయటకు రావడం.. తరువాత అందులో కొన్ని చతికిల పడడం మనం చూస్తూనే ఉన్నాం. మరి ఈ సర్వే ఫలితాలు నిజామా అవుతాయో లేదో తేలాలంటే కొద్దీ రోజులు వెయిట్ చేయాల్సిందే.        
రాజకీయాలు అంటేనే అదో జూదం. పూలమ్మిన చోటనే కట్టెలు అమ్మవలసి రావచ్చును. అలాంటి పరిస్థితే వచ్చినా, తలవంచుకుని పోగలిగితేనే, ఎవరైనా రాజకీయాలలో రాణించగలరు. అలాకాదని, అలిమి కానిచోట, కూడా తామే అధికులమని భావిస్తే, ఎందుకూ కాకుండా పోతారు. అలాంటి వారు ఇద్దరూ కూడా ఇప్పుడు మన కళ్ళముందే ఉన్నారు.  జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు. అలాగే జయ మరణం తర్వాత ఆమె పరిస్థితి ఏమిటో కూడా వేరే చెప్పవలసిన, అవసరం లేదు. జైలు పాలయ్యారు. సర్వం తానై నడిపించిన పార్టీ నుంచి  బహిష్కరణకు గురయ్యారు. జయ ఉన్నంత వరకు తన వారుగా ఉన్న వారందరూ కానివారయ్యారు. ఒంటరిగా మిగిలారు.  నిజానికి నాలుగేళ్ళు జైలు జీవితం గడిపిన తర్వాత కూడా ఆమె తలచుకుంటే.. రాష్ట్ర రాజకీయాలలో, ముఖ్యంగా అధికారంలో ఉన్న డిఎంకే కూటమిలో అలజడి సృష్టించగలరు. ఎన్నికలలో ఆమె గెలవక పోవచ్చును కానీ.. తనను కాదన్న అన్నాడిఎంకేను ఓడించగలరు. అయిన  ఆమె అందుకు విరుద్ధంగా  రాజకీయాలకు వీడ్కోలు పలికి మౌనంగా పక్కకు తప్పుకున్నారు. రాజకీయ సన్యాసం ప్రకటించారు. ఉమ్మడి శతృవు డిఎంకే ను ఓడించేందుకు అన్నా డిఎంకే కూటమి  పోటీ చేయాలని, కూటమి ఐక్యతను దెబ్బతీయరాదనే ఉద్దేశంతోనే ఆమె రాజకీయ సన్యాసం ప్రకటించారు.    శశికళ మౌనంగా వెళ్లి పోవడం వెనక ఇంకా అనేక కారణాలున్నా ,అసలు కారణం ఆమె, రాజకీయ విజ్ఞత, వివేకం. ఆమె జైలుకు వెళ్ళిన సమయంలో జయలలిత సమాధి వద్ద ఎంత కసిగా, కోపంగా ‘మౌన’ ప్రతిజ్ఞ చేశారో చూశా. అలాంటి ఆమె ఇప్పుడు ఇలా ‘మౌనం’గా వెనకడుగు వేశారంటే, అది ఆలోచించ వలసిన విషయమే.ఆమె వ్యుహతంకంగానే సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే అనేక మంది అనేక కోణాల్లో శశికళ సంచలన నిర్ణయాన్ని విశ్లేషించారు.జైలు జీవితం తర్వాత కూడా అన్నా డిఎంకే నాయకులు తనను అగ్రనేతగా అంగీకరించక పోవడం, అమిత్ షా చెప్పినా.. అన్నా డిఎంకే నాయకులు ఆమెను, మేనల్లుడు దినకరన్’ను కులం పేరున, కుటుంబం పేరున దూరం చేయడం, తిరిగి పార్టీలోకి తీసుకోకపోవడంతో ఆమె మనసు కష్టపెట్టుకుని, సన్యాస నిర్ణయం తీసుకున్నారని కొందరంటున్నారు. పార్టీ మీద పట్టు లేదని, చరిష్మా అసలే లేదని, అందుకే ఆమె అలా నిశ్శబ్ధంగా రాజకీయ సన్యాసం స్వీకరించారని ఇంకొందరు విశ్లేషించారు. ఈ విశ్లేషణలో కొంత నిజం ఉంటే ఉండవచ్చును.. కానీ ఆమె గతాన్ని, నైజాన్ని గుర్తు చేసుకుంటే ఆమె స్ట్రైక్ బ్యాక్ వ్యూహంతోనే ఒకడుగు వెనక్కివేశారని ఆమెతో సన్నిహితంగా మెలిగినవారు, ఆమె రాజకీయ చాణక్యం తెలిసిన వారు అంటారు.   నిజానికి జైలులో ఉన్న కాలంలో కానీ, జైలు నుంచి విడుదలై వచ్చిన తర్వాత కానీ, ఆమె రాజకీయ సన్యాసం వైపు అడుగులు వేస్తున్నట్లు కనిపించలేదు. బెంగుళూరు జైలు నుంచి విడుదలై చెన్నైలో ప్రవేశించిన నప్పుడు ఆమె పెద్ద కాన్వాయ్ తో  తమ కారుకు అన్నాడిఎంకే జెండాతోనే ఎంటరయ్యారు. అలా ఎంట్రీలోనే రాజకీయ ఆకాంక్షను వెంట తెచ్చుకున్నారు. చివరకు ‘సన్యాస’ ప్రకట చేసే వరకు కూడా ఆమె రాజకీయ కార్యకలాపాలు సాగిస్తూనే ఉన్నారు. అటు ఢిల్లీని ఇటు చెన్నైనికూడా కదిల్చారు. అంతేకాదు, రాజకీయాలపై విరక్తితో కాదు, రాజకీయ కసితో, ఉమ్మడి శత్రువు (డిఎంకే) ను ఓడించేందుకే తాను రాజకీయాలనుంచి తపుకుంటున్నట్లు చెప్పారు.  సో .. సన్యాసం తీసుకోవాలనే ఆలోచన, రాజకీయవ్యూహం లోంచి పుట్టిందే కానీ,వైరాగ్యంతో పుట్టింది కాదు ,అన్నవిశ్లేషణ వాస్తవానికి ఇంకొంత దగ్గరగా ఉందని అనుకోవచ్చును. ఇది ‘కామా’నే కాని ‘ఫుల్స్టాప్’ కాదని అంటున్నారు.  ముఖ్యమంత్రి ఎడప్పాడి కే. పళని స్వామి (ఈపీఎస్) ఆమెను పార్టీలోకి అనుమతిస్తే తన కుర్చికీ ఎసరు పెడతారనే భయంతోనే,, ఆమె ఎంట్రీని అడ్డుకున్నారు. ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం, శశికళ ఒకే సామజిక వర్గానికి చెందిన వారు కావడం కూడా, ముఖ్యమంత్రి ఈపీఎస్’ భయానికి కారణంగా పేర్కొంటారు. అందుకే  ఆయన, ‘మన్నార్గుడి’ ఫ్యామిలీని బూచిగా చూపించి, ఆమెను దూరంగా ఉంచారని పార్టీలో ఒక వర్గం గట్టిగా విశ్వసిస్తుంది. అయితే ఆమె శక్తియుక్తులను కూడతీసుకుని  పులిలా పంజా విసిరేందుకే ఆమె వ్యూహాత్మకంగా ఒక అడుగు వెనక్కి వేశారు కావచ్చును అని కూడా, తమిళ రాజకీయ వర్గాల్లో ఒక చర్చ జరుగుతోంది.  గతంలో ఆమె జయలలితతో విబేధాలు వచ్చిన సమయంలో కూడా ఇలాగే కొద్ది కాలం మౌనంగా తెర చాటుకు వెళ్లి పోయారు.  కొద్ది కాలంలోనే మళ్ళీ ‘పోయస్ గార్డెన్’లో ప్రత్యక్షమయ్యారు. జయలలిత స్వయంగా ఆమెను వెనక్కి పిలుపించుకోవలసిన పరిస్థితులను సృష్టించారు. అలా  మళ్ళీ  చక్రం తిప్పారు. జయలలిత మరణం వరకు ఆమె అందరికీ చిన్నమ్మగా అమ్మకు పెద్దమ్మగా సర్వం తానై నిలిచారు. చివరకు జయ అంత్యక్రియల్లో కూడా ఆమెదే పై చేయిగా కనిపించింది.   జయలలిత చనిపోయిన సందర్భంలోనే అన్నా డిఎంకే ఎమ్మెల్ల్యేలో సుమారు 30 మంది వరకు ఆమెకు మద్దతుగా ఉన్నారన్న వార్తలొచ్చాయి. నిజానికి,ఇప్పటికి కూడా ఒక్క అన్నా డిఎంకే లోనేకాదు,డిఎంకే ఇతర పార్టీలలో కూడా  ఆమె అవసరం ఉన్న వాళ్ళు ఉన్నారు. కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో ‘మన్నార్గుడి’ ఫ్యామిలీ మద్దతు లేకుండా గెలిచే అవకాశం లేదు.  ఇవ్వన్నీ నిజమే అయినా.. అన్నీ ఉండి, ఎవరు లేని శశికళలో, ఇంకా  ఎవరి కోసం తాపత్రయ పడాలి? అనే ప్రశ్న జనించి ఉంటే, ఆమె రాజకీయ సన్యాసం నిజం కావచ్చును. ఎందుకంటే ఆమె నెచ్చలి, జయలిత లేరు, భర్త అంతకంటే ముందే చనిపోయారు, పిల్లలు లేరు... పైగా నాలుగేళ్ళ జైలు జీవితం ఆమెలో మార్పు తెచ్చి ఉండవచ్చును. ఈ వయస్సులో తనవారంటూ ఎవరు లేని తనకు రాజకీయాలు ఎందుకు ? శేష జీవితాన్ని ఇలా సాగిద్దామనే ఆలోచన నిజంగా వచ్చి ఉంటే, ఆమె సన్యాసం సత్యం అయినా కావచ్చును, కాకపోనూ వచ్చును. కానీ  శశికళ... ఆమెను అర్థం చేసుకోవడం, అంచనా వేయడం , అంత తేలిగ్గా అయ్యే పని కాదు..
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు. కాంగ్రెస్ అధినాయకత్వం పై నేరుగా అస్త్రాలు సంధించారు. రాహుల్ గాంధీ పేరు చెప్పకుండానే, ఆయన నాయకత్వానికి పనికిరాడని తేల్చి చెప్పారు. ఎవరైనా పార్టీ అధ్యక్షుడు అయితే కావచ్చును, కానీ, ప్రజానాయకుడు కాలేడని, రాహుల గాంధీ ప్రజానాయకుడు కాదు కాలేరు,అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తరచూ రాహుల్ గాంధీని ఉద్దేశించి చేసే  ‘నామ్’ధారీ వ్యంగ్యాస్త్రాన్నే కాంగ్రెస్ సీనియర్ నాయకులు కూడా సందించారు. ఇక అక్కడి నుంచి విధేయ, అసమ్మతి వర్గాల మధ్య మాటల యుద్ధం ఎదో ఒక రూపంలో సాగుతూనే వుంది. అదే క్రమంలో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ, కరుడు కట్టిన ముస్లిం మతోన్మాది, అబ్బాస్ సిద్దిఖీతో కాంగ్రెస్ పార్టీ చేతులు కలపడం అసమ్మతి నాయకులకు మరో అస్త్రాన్ని అందించింది. విషయంలోకి వెళితే, ఇటీవల పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా లోక్’సభలో కాంగ్రెస్ పక్ష నాయకుడు, పశ్చిమ బెంగాల్ పీసీసీ అధ్యక్షుడు అధీర్’రంజన్ చౌదరి, ముస్లిం మత ప్రచారకుడు, అబ్బాస్ సిద్దిఖీతో  వేదిక పంచుకున్నారు.అంతకు ముందే వామ పక్ష కూటమితో  పొత్తు కుదుర్చుకున్న కాంగ్రెస్ పార్టీ, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)ను కూటమిలో చేర్చుకుంది. ఇలా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) అమోదం లేకుండా మతోన్మాద ఐఎస్ఎఫ్’ తో ఎన్నికల పొత్తు పెట్టుకోవడం ఆ పార్టీ నాయకుడు,సిద్ధిఖీతో  పీసీసీ చీఫ్ వేదిక  పంచుకోవడం పై అసమ్మతి నేతలు మండి పడుతున్నారు. ఇలా సిద్దిఖీతో వేదిక పంచుకోవడం పార్టీ మౌలిక సిద్ధాంతాలకు వ్యతిరేకం అంటూ అసమ్మతి వర్గానికి చెందిన కీలక నేత, రాజ్యసభ సభ్యుడు,ఆనంద్ శర్మ మండిపడ్డారు. అంతే కాదు, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)తో జనవరిలో కుదుర్చుకున్న పొత్తుకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ)అమోదం లేదని ఆనంద్ శర్మ, అభ్యంతరం వ్యక్త చేశారు. పార్టీ విశ్వసించే లౌకిక వాదానికి కాంగ్రెస్ అధిష్టానం తీసుకున్న నిర్ణయం గొడ్డలి పెట్టని ఆయన తీవ్రంగా స్పందించారు.   శర్మ వ్యాఖ్యలపై అధీర్ రంజన్ చౌదరి అంతే ఘాటుగా ప్రతిస్పందించారు. “నిజాలు తెలుసుకోండి ఆనంద్ శ‌ర్మ జీ” అంటూ ఆయ‌న వ‌రుస ట్వీట్లు చేశారు. వ్య‌క్తిగ‌త ప్ర‌యోజ‌నాలు ప‌క్క‌న‌పెట్టి, ప్ర‌ధానిని పొగిడి టైమ్ వేస్ట్ చేయ‌కండంటూ ఆయ‌న ఓ ట్వీట్లో అన్నారు. ఆనంద్ శ‌ర్మ అన‌వ‌స‌రంగా కాంగ్రెస్‌ను ల‌క్ష్యంగా చేసుకుంటున్నార‌ని, ఈ అంశాన్ని పెద్ద‌ది చేసి చూపిస్తున్నార‌ని విమ‌ర్శించారు. ఆయ‌న ఉద్దేశాలు స‌రైన‌వే అయితే నేరుగా తనతో మాట్లాడ వలసిందని అన్నారు. బెంగాల్‌లో సీపీఐ(ఎం) కూట‌మికి నేతృత్వం వ‌హిస్తోంది. అందులో కాంగ్రెస్ ఓ భాగం. మ‌త‌తత్వ‌, విభ‌జ‌న రాజ‌కీయాలు చేస్తున్న బీజేపీకి చెక్ పెట్ట‌డానికే ఈ కూట‌మి అని మ‌రో ట్వీట్‌లో అధిర్ రంజ‌న్ అన్నారు. అక్కడతోనూ ఆగలేదు ... ట్వీట్ల మీద ట్వీట్లు సంధిస్తూ, ఆనంద్ శర్మ, బీజేపీ మత విభజన, అజెండాను బలపరుస్తున్నారని, పరోక్షంగా జీ23 నాయకులు బీజేపీకి ప్రయోజనం చేకూరుస్తున్నారని ఆరోపించారు.అంతే కాదు, క్షేత్ర స్థాయి వాస్తవ పరిస్థితులు తెలియకుండా, ఆనంద్ శర్మ పార్టీ మీద దండెత్తడం ఉచితం కాదని చౌదరి ఎదురుదాడి చేశారు. అసమ్మతిలో అసమ్మతి. ఇదలా ఉంటే, కాంగ్రెస్ పార్టీ  సమూల పక్షాళన కోరుతూ సోనియా గాంధీకి,గత సంవత్సరం  జీ 23గా ప్రాచుర్యం పొందిన సీనియర్ నాయకులు రాసిన లేఖపై సంతకాలు చేసిన  నాయకుల్లో నలుగురు,జమ్మూలోసమావేసమైన నాయకుల తాజా నిర్ణయాలు, వ్యాఖ్యలు,విమర్శల పట్ల అసంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరం సోనియా గాంధీకి రాసిన లేఖలో ప్రస్తావించిన అంశాలకు కట్టుబడి ఉన్నామని, అయితే, జీ 23లోని కొందరు సహచరులు, ఇటీవల గీతదాటి చేస్తున్న వ్యాఖ్యలు, విమర్శలను తాము సమర్ధించడం లేదని ఆ నలుగురు పేర్కొన్నారు. ఇందులో ముఖ్యంగా, రాజ్యసభ మాజీ డిప్యూటీ చైర్మన్, పీజే కురియన్ అయితే, “కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు అవసరమైన సంస్కరణలు తెచ్చేందుకు చేసే ప్రయత్నాలను పూర్తిగా సమర్దిస్తాను, కానీ, ‘లక్ష్మణ రేఖ’ దాటితే ఒప్పుకునేది లేదు”అని అసమ్మతిలో అసమ్మతికి తెర తీశారు.అలాగే, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ కుమారడు, మాజీ ఎంపీ సందీప్ దీక్షిత్,మధ్య ప్రదేశ్ సీనియర్ కాంగ్రెస్ నాయకుడు అజయ్ సింగ్’ కూడా గులాం నబీ ఆజాద్, కపిల్ సిబల్, ఆనంద్ శర్మ, మనీష్ తివారీ వంటి జీ 23 కీలక నేతలు అధినాయకత్వంపై చేసిన వ్యాఖ్యలను తప్పు పట్టారు. అలాగే, పార్టీ సీనియర్ నాయకుడు కేంద్ర మాజీమంత్రి వీరప్ప మొయిలీ కూడా,గత సంవత్సరం పార్టీ సీనియర్ నాయకులు  ఒక పరిమిత లక్ష్యంతో  సోనియా గాంధీకి లేఖ రాయడం జరిగిందని, ఆ పేరున జరుగతున్న  కార్యక్రమాలు లేఖ సంకల్పానికి  విరుద్ధమని అన్నారు. జీ 23 కార్యకలాపాలపై రాహుల్ గాంధీ కూడా పరోక్షగా స్పందించారు, ఒకప్పుడు ఎన్ఎస్’యుఐ, యూత్ కాంగ్రెస్’ కు సంస్థాగత ఎన్నికలు వద్దన్న వారే ఇప్పుడు ఇంకోలా మాట్లాడుతున్నారని పరోక్షంగానే అయినా సంస్థాగత ఎన్నికలు నిర్వహించడంతో పాటుగా, పార్టీ పక్షాలనకు తమ కుటుంబం వ్యతిరేకం కాదని, అందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఈ నేపధ్యంలో కాంగ్రెస్ పార్టీలో చెలరిగిన కలకలం  ఇక ముందు ఏమవుతుందో .. ఇంకెన్ని  మలుపులు తిరుగుతోందో ..చూడవలసిందే కానీ ఉహించలేము.
పంచతంత్రంగా పిలుచుకుంటున్న ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భతం జరగబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే, వివిధ సంస్థలు అసెంబ్లీ ఎన్నికలు జరిగే  అస్సాం. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటుగా కేరళలోనూ ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఆ ఒపీనియన్ పోల్ ఫలితాలు నిజంగా నిజం అయితే, కేరళలో మళ్ళీ సీపీఎం సారధ్యంలోని వామపక్ష కూటమి అధికారంలోకి వస్తుంది. ఇదే ఆ అద్భుతం. ఎందుకంటే, గత నాలుగు దశాబ్దాలలో కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో ఒకే కూటమి వరసగా రెండవసారి అధికారంలోకి వచ్చిన చరిత్ర లేనే లేదు. ఒక సారి ఎల్డీఎఫ్ అధికారంలోకి వస్తే ఐదేళ్ళ తర్వాత కాంగ్రెస్ సారధ్యంలోని ఐక్య ప్రజాస్వామ్య కూటమి(యూడీఎఫ్) అధికారంలోకి రావడం, దేవభుమిలో దైవ నిర్ణయమా అన్నట్లుగా ప్రతి ఎన్నికల్లోనూ అధికారం చేతులు మారుతూ వస్తోంది. అలాంటిది, ఈసారి ఒపీనియన్ పోల్స్ నిజమై వరసగా రెండవసారి వామపక్ష కూటమి అధికారంలోకి వస్తే, అది చరిత్రే అవుతుంది. ఇక ఒపీనియన్ పోల్స్ విషయానికి వస్తే, జాతీయ న్యూస్ ఛానెల్ ఏబీపీ, సీ ఓటర్ సంస్థలు సంయుక్తంగా ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఈ సర్వే ప్రకారం, 140 స్థానాలున్న కేరళ అసెంబ్లీలో వామపక్ష కూటమికి 83 నుంచి  91 స్థానాలు, యూడీఎఫ్ కూటమికి 47 నుంచి 55 స్థానాలు మాత్రమే దక్కుతాయని తెలుస్తోంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్రంలో ఇలా జాతకాలు తిరగబడడంపై సోషల్ మీడియాలో,’లెగ్ మహిమ’ లాంటి జోక్స్  ట్రోలవుతున్నాయి. అయితే 2016లో జరిగిన ఎన్నికల్లో కేవలం 47 సీట్లకే పరిమితం అయిన కాంగ్రెస్’కు ఈసారి ఒకటీ అరా సీట్లు ఎక్కువస్తే, రావచ్చును. అదే కాంగ్రెస్’కు కాసింత ఊరట. అదలా ఉంటే, పశ్చిమ బెంగాల్లో సైతం పట్టు సాధించిన బీజేపే, కేరళలో మాత్రం పట్టు కాదు కదా, పట్టుమని పది సీట్లు తెచ్చుకునే స్థితిలో లేదు. నిజానికి, దేశంలో బీజేపీకి అసలు ఏ మాత్రం మింగుడు పడని రాష్ట్రాలు ఎవైన ఉన్నాయంటే కేరళ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల  పేర్లే ప్రముఖంగా వినిపిస్తాయి. ఈ సారి కూడా కమల దళం కేరళలో కాలు పెట్టె పరిస్తి లేదని సర్వే ఫలితాలు చెపుతున్నారు. ఎప్పటిలానే ఇప్పడు కూడా  బీజేపీకి సున్నా నుంచి రెండు సీట్లు వచ్చే అవకాశం ఉందని, సర్వేస్వరుల అభిప్రాయంగా ఉంది. కేరళలో మొత్తం 140 స్థానాలకు ఏప్రిల్ 6 తేదీన ఒకే విడతలో పోలింగ్ జరుగుతుంది. మే 2 తేదీన ఫలితాలు వెలువడతాయి. కేరళ ఎలక్షన్ పై యావత్ దేశం ఆసక్తి కనబరుస్తోంది.    
కేంద్ర ఎన్నికలసంఘం ‘పాంచ్ పటాక’ గంట కొట్టింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. ఎన్నికల గంట మోగడంతో మొదలైన మరో భారత ‘మినీ’  సంగ్రామానికి మే 12 తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తెర పడుతుంది.ఈలోగా వివిధ అంచల్లో పోలింగ్ జరుగుతుంది.  నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతం ఓటరు తీర్పుకు వెళుతున్నా, అందరి దృష్టి, ముఖ్యంగా ప్రాంతీయ పార్టీల ఏలుబడిలో ఉన్న ఉభయ తెలుగు రాష్ట్రాలు, మరీ ముఖ్యంగా ఇప్పటికే బీజేపీ కన్నుపడిన తెలంగాణ రాష్ట్ర ప్రజలు, రాజకీయ పార్టీల దుష్టి  మాత్రం పశ్చిమ బెంగాల్ పైనే వుంది.  పశ్చిమ బెంగాల్లో ‘అద్భుతం’ జరిగి బీజేపీ విజయం సాధిస్తే, ఇక  కమల దళం ఫోకస్, తెలంగాణకు షిఫ్ట్ అవుతుంది. ఇది అందరికీ తెలిసిన బహిరంగ రహస్యం. ఈ నేపధ్యంలో బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయి అనే విషయంలో రాష్ట్ర రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. బెంగాల్లో బీజేపీ గెలిస్తే, ఇప్పటికే అంతర్గత కుటుంబ కలహాలతో సతమతవుతున్న తెరాస నాయకత్వానికి మరిన్నితిప్పలు తప్పవన్న మాట అంతఃపుర వర్గాలలో సైతం వినవస్తోంది.  పశ్చిమ బెంగాల్’లో ఎలాగైతే కమలదళం ఓ వంక తమ ట్రేడ్ మార్క్, హిందుత్వ రాజకీయాలు సాగిస్తూ, మరో వైపు నుంచి ‘ఆకర్ష్’ అస్త్రంతో అధికార పార్టీని నిర్వీర్యం చేసిన విధంగానే, ఇక్కడ కూడా ఫిరాయింపులను ప్రోత్సహింఛి పార్టీని నిట్టనిలువునా చీల్చే ప్రమాదాన్ని కొట్టివేయలేమని పార్టీ వర్గాలు కూడా అనుమానం వ్యక్త పరుస్తున్నాయి.  ఇప్పటికే తెలంగాణ  బీజేపీ నాయకులు 30 మంది తెరాస ఎమ్మెల్యేలు తమ టచ్ లో ఉన్నారని బెదిరిస్తున్నారు.అది నిజం అయినా కాకపోయినా..తెరాసలో అసంతృప్తి అగ్గి రగులుతోందనేది మాత్రం ఎవరూ కాదనలేని నిజం. అంతే కాకుండా రాష్ట్రానికి వచ్చిన కేంద్రనాయకులు ఎవరిని పలకరించినా, నెక్స్ట్ టార్గెట్ తెలంగాణ అని ఎలాంటి సషబిషలు లేకుండా కుండబద్దలు కొడుతున్నారు.అందుకే, బెంగాల్లో బీజేపీ గెలిస్తే.. అనే ఊహా కూడా  గులాబీ గూటిలో గుబులు పుట్టిస్తోంది. అయితే, బెగాల్’లో బీజేపీ గెలిస్తే ఒక్క తెలంగాణలోనే కాదు, దేశ రాజకీయ వాతావరణంలోనే పెను మార్పులు చోటు చేసుకుంటున్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.  అలాగే,  దేశ ముఖ చిత్రంలో కూడా పెను మార్పులు తప్పవని అంటున్నారు. అయితే రాజకీయాలలో ఎప్పుడు ఏం జరుగుతుందో.. ఎవరూహించెదరు..
ప్రతి రోజు ఉరుకుల పరుగుల జీవితంలో ఒత్తిడి, సరిగ్గా విశ్రాంతి లేకపోవడం వల్ల చాలామందిలో తలనొప్పి, ఒళ్లు నొప్పులు సర్వసాధారణంగా మారిపోయాయి. ఇలాంటి చిన్నపాటి నొప్పులు రాగానే కొందరు ఏమాత్రం ఆలోచించకుండా వెంటనే మెడికల్ స్టోర్ కు వెళ్లి పెయిన్‌ కిల్లర్స్ తెచ్చుకుని వేసుకోవడం అలవాటు చేసుకుంటారు. ఆ మాత్రలు వేసుకోగానే క్షణాల వ్యవధిలో ఉపశమనం ఇస్తుందనే ఉద్దేశంతో ప్రతి చిన్న విషయానికి ఈ మాత్రలు మింగుతూ ఉంటారు.  అయితే ఇలా మాత్రలు మింగడం ఆరోగ్యంపై తీవ్రమైన దుష్ప్రభావాన్ని చూపుతుంది. ముఖ్యంగా ఈ చిన్న అలవాటు చాప కింద నీరులా శరీరంలో సమస్యలు క్రియేట్ చేస్తుంది.  తలనొప్పికి మందులు వాడితే ఏం జరుగుతుందో.. వివరంగా తెలుసుకుంటే.. కిడ్నీలు.. మన శరీరంలో కిడ్నీలు రక్తంలోని మలినాలను వడకట్టడంలో, వ్యర్థాలను బయటకు పంపడంలో , శరీరంలో ద్రవాల సమతుల్యతను కాపాడడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. అయితే ఎటువంటి వైద్యుల సలహా లేకుండా తరచూ వాడే కొన్ని రకాల నొప్పి నివారణ మందులు కిడ్నీల పనితీరును క్రమంగా దెబ్బతీస్తాయి. నాన్‌స్టెరాయిడ్ యాంటీ ఇన్‌ఫ్లమేటరీ డ్రగ్స్ అనబడే ఎన్.ఎస్.ఐ.డి రకానికి చెందిన పెయిన్‌ కిల్లర్లు కిడ్నీలకు వెళ్లే రక్త ప్రవాహాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తాయి. ఈ రకమైన మందులు కిడ్నీలలో రక్తం సక్రమంగా ప్రవహించడానికి సహాయపడే కొన్ని సహజమైన రసాయనాల ఉత్పత్తిని నిరోధిస్తాయి. దీనివల్ల కిడ్నీలకు అందవలసిన ఆక్సిజన్ , పోషకాలు తగ్గిపోయి, వాటి పనితీరు క్రమంగా మందగిస్తుంది. పెయిన్ కిల్లర్ల ప్రమాదం.. దీర్ఘకాలికంగా లేదా పదే పదే ఈ రకమైన మాత్రలు వేసుకోవడం వల్ల కిడ్నీల కణజాలం దెబ్బతింటుంది. ముఖ్యంగా శరీరంలో నీటి శాతం తగ్గిపోయినప్పుడు అంటే డీహైడ్రేషన్ సమస్య ఉన్న సమయంలో ఈ పెయిన్‌ కిల్లర్లు తీసుకుంటే కిడ్నీలు అకస్మాత్తుగా ఫెయిల్ అయ్యే  ప్రమాదం కూడా పెరుగుతుంది. ఇప్పటికే డయాబెటిస్, హై బ్లడ్ ప్రెజర్ లేదా ఇతర దీర్ఘకాలిక మూత్రపిండాల సమస్యలతో బాధపడుతున్న వారు ఈ మందుల విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలి. ఎలాంటి ప్రిస్క్రిప్షన్ లేకుండా ఇష్టానుసారంగా వీటిని వాడడం వల్ల సమస్య మరింత జటిలమయ్యే అవకాశం ఉంటుంది. అతిగా వాడితే.. పెయిన్‌ కిల్లర్ల అతి వాడకం వల్ల కిడ్నీలు దెబ్బతింటున్నాయని మన శరీరం కొన్ని రకాల సంకేతాల ద్వారా ముందే హెచ్చరిస్తుంది. మూత్ర విసర్జన సమయంలో మోతాదు చాలా తక్కువగా ఉండటం, పాదాలలో లేదా చీలమండల వద్ద వాపు కనిపించడం, ముఖం వాపు రావడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. అలాగే ఎప్పుడూ విపరీతమైన అలసట, బలహీనత ఆవరించడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కలగడం లేదా శరీరంలో నీరు చేరిపోవడం వంటి సమస్యలు ఎదురవుతాయి. ఒకవేళ జ్వరం, వాంతులు లేదా విరేచనాలు వంటి సమస్యలు ఉన్నప్పుడు శరీరంలో నీటి శాతం తగ్గిపోతుంది, ఆ సమయంలో ఈ మందులు వాడితే కిడ్నీలపై పడే భారం మరింత ఎక్కువగా ఉంటుంది. వైద్యుల సలహా లేకుండా వాడకండి.. ఎలాంటి అనారోగ్య సమస్యకైనా వైద్యుల సలహా లేకుండా సొంత వైద్యం చేసుకోవడం ఎప్పుడూ శ్రేయస్కరం కాదు. చిన్నపాటి తలనొప్పి లేదా ఒంటి నొప్పుల కోసం ప్రతిసారీ మాత్రలు వేసుకునే బదులు తగిన విశ్రాంతి తీసుకోవడం, వేడి నీటి కాపడం పెట్టుకోవడం లేదా ఆరోగ్యకరమైన జీవనశైలిని పాటించడం మంచిది. శరీరంలో నీటి శాతం తగ్గకుండా తగినన్ని నీరు తాగుతూ ఉండాలి. ఏ చిన్న అనారోగ్య సమస్య వచ్చినా నిర్లక్ష్యం చేయకుండా  వైద్యులను సంప్రదించి, వారు సూచించిన మోతాదులో మాత్రమే మందులు వాడడం ద్వారా కిడ్నీలను సురక్షితంగా కాపాడుకోవచ్చు.                                                                                                                                                  *రూపశ్రీ.
క్యాన్సర్ చికిత్స రంగంలో వ్యక్తిగత mRNA థెరపీ మరో చారిత్రాత్మక ముందడుగు వేసింది. ముఖ్యంగా ప్రాణాంతక చర్మ క్యాన్సర్‌ అయిన మెలనోమా చికిత్సలో ఈ అధునాతన విధానం అత్యంత ఆశాజనకమైన ఫలితాలను అందించింది. శస్త్రచికిత్స అనంతరం క్యాన్సర్ తిరిగి వచ్చే ప్రమాదాన్ని సమర్థవంతంగా తగ్గించడమే లక్ష్యంగా రూపొందించిన ఈ ప్రయోగాత్మక చికిత్స వైద్య నిపుణులలో కొత్త ఆశలను రేకెత్తిస్తోంది. తాజా క్లినికల్ ట్రయల్స్ వెల్లడించిన వివరాల ప్రకారం.. ఇమ్యూనోథెరపీ మందుతో కలిపి వ్యక్తిగత mRNA థెరపీని అందించిన రోగుల్లో క్యాన్సర్ తిరిగి రావడం కానీ, లేదా మరణించే ప్రమాదం కానీ సాపేక్షంగా 42 శాతం తగ్గినట్లు స్పష్టమైంది. ఈ అద్భుతమైన పురోగతి క్యాన్సర్ వైద్య చరిత్రలో ఒక మైలురాయిగా నిలుస్తోందని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఈ కీలకమైన పరిశోధన కోసం హై రిస్క్ మెలనోమాతో బాధపడుతున్న ఏకంగా 1,137 మంది రోగులతో మూడో దశ క్లినికల్ ట్రయల్‌ను విజయవంతంగా నిర్వహించారు. ఈ ట్రయల్‌లో భాగంగా తొలుత రోగులకు శస్త్రచికిత్స ద్వారా కణితులను తొలగించారు. ఆ తర్వాత కొంతమందికి కేవలం పెంబ్రోలిజుమాబ్‌ అనే ఇమ్యూనోథెరపీ మందును మాత్రమే అందించగా, మరో ప్రత్యేక బృందానికి దానితోపాటు వ్యక్తిగత mRNA ఆధారిత చికిత్సను కూడా అందజేశారు. ఈ రెండు గ్రూపుల ఫలితాలను క్షుణ్ణంగా పోల్చి చూడగా.. కలయిక చికిత్స పొందినవారిలో క్యాన్సర్ మళ్లీ తిరగబెట్టే ముప్పు గణనీయంగా తగ్గినట్లు పరిశోధకులు గుర్తించారు. ఆస్ట్రేలియాకు చెందిన ప్రముఖ క్యాన్సర్ పరిశోధకురాలు ప్రొఫెసర్ జార్జినా లాంగ్ నేతృత్వంలో సాగిన ఈ అధ్యయనం వైద్య లోకంలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అయితే, ఈ 42 శాతం గణాంకం సాపేక్ష ప్రమాద తగ్గింపును సూచిస్తుందని, ప్రతి రోగికి ముప్పు ఒకేలా తగ్గుతుందని దీని అర్థం కాదని శాస్త్రవేత్తలు స్పష్టం చేస్తున్నారు. ఈ విప్లవాత్మక చికిత్సలో అత్యంత ప్రధానమైన ప్రత్యేకత ఏమిటంటే.. అందరికీ ఒకే రకమైన వ్యాక్సిన్‌ను ఇవ్వకుండా, ప్రతి రోగి కణితిలో ఉండే ప్రత్యేక జన్యు మార్పుల ఆధారంగా ఈ థెరపీని సరికొత్తగా తయారు చేయడం. దీనికోసం ప్రత్యేకంగా కణితి నమూనాను సేకరించి లోతుగా విశ్లేషిస్తారు. తద్వారా క్యాన్సర్ కణాల్లో ఉన్న విశిష్ట మార్పులను గుర్తించి, ఇంటిస్మెరాన్ ఆటోజీన్ అనే అత్యాధునిక ప్రయోగాత్మక mRNA థెరపీని రూపొందిస్తారు. ఈ థెరపీ శరీరంలోని రోగనిరోధక వ్యవస్థకు క్యాన్సర్‌కు సంబంధించిన ప్రత్యేక లక్షణాలను గుర్తించడంలో అద్భుతమైన శిక్షణ ఇస్తుంది. దీనివల్ల రోగనిరోధక వ్యవస్థ నేరుగా క్యాన్సర్ కణాలపై విరుచుకుపడే బలమైన ప్రతిస్పందనను ప్రేరేపించవచ్చు. సర్జరీ తర్వాత శరీరంలో ఎక్కడైనా మిగిలిపోయే సూక్ష్మ క్యాన్సర్ కణాల ద్వారా వ్యాధి మళ్లీ వృద్ధి చెందే ప్రమాదాన్ని అణచివేయడమే ఈ విధానం యొక్క ముఖ్య ఉద్దేశం. ప్రస్తుతం మెలనోమాతో పాటు ఊపిరితిత్తులు, మూత్రాశయం, కిడ్నీ వంటి ఇతర ప్రమాదకరమైన క్యాన్సర్లలోనూ ఈ వ్యక్తిగత mRNA చికిత్సల సామర్థ్యాన్ని నిపుణులు లోతుగా అధ్యಯనం చేస్తున్నారు. అయితే, ఒక క్యాన్సర్ రకంలో వచ్చిన సానుకూల ఫలితాలను ఇతర క్యాన్సర్లకు నేరుగా వర్తింపజేయలేమని, ప్రతి వ్యాధికి విడివిడిగా క్లినికల్ పరీక్షలు అవసరమని వారు హెచ్చరిస్తున్నారు. ఫేజ్ 3 ట్రయల్స్‌లో అద్భుతమైన ఫలితాలు వచ్చినప్పటికీ, రోగుల మొత్తం జీవనకాలంపై ఈ చికిత్స చూపే దీర్ఘకాలిక ప్రభావం ఏమిటనే దానిపై మరింత పరిశీలన అవసరం ఉంది. నియంత్రణ సంస్థల పూర్తి స్థాయి సమీక్షలు, అధికారిక అనుమతులు లభించే వరకు ఇది అందరికీ అందుబాటులోకి రావడానికి కొంత సమయం పట్టవచ్చు. మొత్తంగా చూస్తే, రోగి కణితి జన్యువులకు తగినట్లుగా అందించే ఈ వ్యక్తిగత mRNA విధానం క్యాన్సర్ చికిత్సలో సరికొత్త శకానికి నాంది పలుకుతోంది.     Melanoma Treatment Trials, Skin Cancer Breakthrough, Phase 3 Clinical Trials, Cancer Treatment Good News, Oncology Research Updates, New Melanoma Therapy, Medical Science News.  
ఉదయం నిద్రలేవగానే వరుసగా తుమ్ములు రావడం, ముక్కు కారడం, ముక్కులో దురద, ముక్కు మూసుకుపోవడం వంటి సమస్యలతో చాలామంది ఇబ్బంది పడుతుంటారు. ముఖ్యంగా ఉదయం వేళల్లో ఈ లక్షణాలు ఎక్కువగా కనిపిస్తే, అది సైనస్ సమస్యా? లేక అలర్జీ వల్ల కలిగే అలర్జిక్ రైనైటిస్‌నా? అనే సందేహం కలుగుతుంది. ఈ రెండు సమస్యల మధ్య తేడాను తెలుసుకోవడం, సరైన కారణాన్ని గుర్తించడం చాలా ముఖ్యం. ఈ TeluguOne Health వీడియోలో  డాక్టర్ అపూర్వ రెడ్డి (MS ENT, Gold Medalist) సైనస్ సమస్యలు, అలర్జిక్  రైనైటిస్‌కు సంబంధించిన ముఖ్యమైన విషయాలను వివరిస్తున్నారు. వరుసగా తుమ్ములు రావడానికి గల కారణాలు, ముక్కు కారడం, ముక్కులో దురద, ముక్కు దిబ్బడ వంటి లక్షణాలు ఏ సమస్యలో కనిపిస్తాయి? సైనస్ సమస్యను, ముక్కు అలర్జీని ఎలా గుర్తించాలి? ఈ సమస్యలకు అవసరమైన వైద్య పరీక్షలు ఏమిటి? వంటి సందేహాలకు ఈ వీడియోలో సమాధానాలు తెలుసుకోవచ్చు. మందులతో తగ్గుతుందా? సర్జరీ ఎప్పుడు అవసరం? సైనస్ సమస్యలు, ముక్కు అలర్జీలకు చికిత్స చేసే విధానం ఒకేలా ఉండకపోవచ్చు. కొందరికి మందులతో ఉపశమనం లభించవచ్చు. మరికొందరిలో సమస్య తీవ్రత, ఇతర కారణాలను బట్టి అదనపు చికిత్స అవసరం కావచ్చు. ముక్కులో పాలిప్స్ (Nasal Polyps) ఉంటే ఎలాంటి సమస్యలు ఎదురవుతాయి? చికిత్స తర్వాత మళ్లీ వచ్చే అవకాశం ఉందా? సర్జరీ ఎప్పుడు అవసరమవుతుంది? వంటి అంశాలను కూడా ఈ వీడియోలో తెలుసుకోవచ్చు. సెటిరిజిన్ (Cetirizine) టాబ్లెట్ వాడకం గురించి తెలుసుకోండి ముక్కు అలర్జీ, తుమ్ముల సమస్య ఉన్నప్పుడు కొందరు సొంతంగా అలర్జీ మందులు వాడుతుంటారు. అయితే సెటిరిజిన్ వంటి మందులను ఎప్పుడు వాడాలి? వాటి వల్ల నిద్రమత్తు వంటి దుష్ప్రభావాలు కలగవచ్చా? మందుల వాడకంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అనే విషయాలపై అవగాహన అవసరం. తరచుగా తుమ్ములు రావడం, ముక్కు కారడం లేదా ముక్కు దిబ్బడ ఎక్కువకాలం కొనసాగడం వంటి లక్షణాలను నిర్లక్ష్యం చేయకండి. సైనస్ సమస్య అని లేదా అలర్జీ అని మీరే నిర్ణయించుకుని మందులు వాడకుండా, అవసరమైతే ENT వైద్య నిపుణులను సంప్రదించండి. సైనస్ సమస్యలు, అలర్జిక్ రైనైటిస్, నాసల్ పాలిప్స్, మందులు మరియు సర్జరీకి సంబంధించిన ముఖ్యమైన విషయాలను తెలుసుకోవడానికి ఈ వీడియోను పూర్తిగా చూడండి.  మరింత ఆరోగ్య సమాచారం, వైద్య నిపుణుల సూచనలు, ఉపయోగకరమైన ఆరోగ్య విషయాల కోసం TeluguOne Health‌ ను అనుసరించండి. గమనిక: ఈ సమాచారం అవగాహన కోసం మాత్రమే. ఇది వ్యక్తిగత వైద్య సలహాకు ప్రత్యామ్నాయం కాదు.