LATEST NEWS
తమిళనాడు రాజకీయాల్లోకి మరో స్టార్ హీరో ఎంట్రీ ఇచ్చారు. తమిళనాడు అసెంబ్లీకి ఇటీవల జరిగిన  ఎన్నికలలో   దళపతి విజయ్ సృష్టించిన సంచలన విజయం తెలిసిందే.  రాజకీయాల్లోకి ప్రవేశించిన తొలిసారే విజయం సాధించి   ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించి  విజయ్ చరిత్ర సృష్టించారు.  కమల్ హాసన్ వంటి మహామహులకే సాధ్యం కాని ఈ ఫీట్ ను విజయ్ సాకారం చేయడంతో..  ఇప్పుడు కోలీవుడ్‌లోని మరికొందరు స్టార్స్ రాజకీయాలలోకి  అడుగులు వేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఈ క్రమంలోనే   స్టార్ హీరో ధనుష్ కూడా   రాజకీయ అరంగేట్రం చేయబోతున్నారు.  తాజాగా ధనుష్ అభిమాన సంఘం నిర్వహించిన ఓ ప్రత్యేక కార్యక్రమంలో  పార్టీ  జెండాను ఆవిష్కరించడం ఆయన పొలిటికల్ ఎంట్రీకి సంకేతంగా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  కేవలం జెండా రూపకల్పనకే పరిమితం కాకుండా..  తమిళనాడు వ్యాప్తంగా విస్తృతంగా సేవా కార్యక్రమాలు చేపట్టాలని అభిమాన సంఘాల నేతలకు ధనుష్ పిలుపునివ్వడం కూడా  ఆయన పోలిటికల్ ఎంట్రీని కన్ ఫర్మ్ చేస్తోందంటున్నారు.   Hero, Dhanush, Fans, Flag, Public, Service, Teluguone
  భువనగిరి మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు కొమ్మిడి నరసింహారెడ్డి మంగళవారం (జులై 7)  ఉదయం కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన, హైదరాబాద్‌లోని నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తెల్లవారుజామున 5 గంటలకు తుదిశ్వాస విడిచారు. రెండుసార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన ఆయన  విలువలతో కూడిన రాజకీయాలకు నిలువెత్తు రూపంగా నిలిచారు.   సొంత ఇల్లు కూడా లేకుండా, ఒక పాత స్కూటర్ మినహా ఎలాంటి ఆస్తులు కూడబెట్టకుండా నిరాడంబరంగా జీవించారు.   నరసింహారెడ్డి  తన 19 ఏళ్ల వయసులోనే..  1962లో బ్రాహ్మణపల్లి సర్పంచ్‌గా ఎన్నికై ప్రజా జీవితాన్ని ప్రారంభించారు. ఆ తర్వాత భువనగిరి సమితి అధ్యక్షుడిగా పనిచేశారు. 1978లో కాంగ్రెస్ తరపున భువనగిరి ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన... 1983లో ఎన్టీఆర్ ప్రభంజనాన్ని తట్టుకొని రెండోసారి కూడా కాంగ్రెస్  ఎమ్మెల్యేగా అదే నియోజకవర్గం నుంచి విజయం సాధించారు. ఆయన మృతి పట్ల రాజకీయాలకు అతీతంగా పలువురు నేతలు సంతాపం వ్యక్తం చేశారు.   Bhuvanagiri, Former, Mla, Values
వైసీపీకి, ఆ పార్టీ అధినేత జగన్ కు ఆర్కే రోజా దిమ్మదిరిగే షాక్ ఇచ్చారు. వైసీపీ సీనియర్ నాయకురాలు, ఆ పార్టీ ఫైర్ బ్రాండ్ నేతగా గుర్తింపు పొందిన ఆర్కే రోజా.. మావిగన్ అంటే అమరావతేనని కుండబద్దలు కొట్టేశారు. ఓ వైపు వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి.. వచ్చే ఎన్నికలలో తమ నినాదం మావిగన్ అని చెబుతున్నారు. వచ్చే ఎన్నికలు మావిగన్ వర్సెస్ అమరావతిగా జరుగుతాయనీ, మావిగన్ కు మద్దతు ఇచ్చే వారు వైసీపీకి, అమరావతి కావాలనుకునే వారు తెలుగుదేశం కూటమికి ఓటు వేస్తారనీ, ఎవరు గెలుస్తారో చూద్దామనీ సవాళ్లు విసురుతుంటే.. ఆర్కే రోజా మాత్రం మావిగన్, అమరావతీ ఒక్కటేననీ, ఏమీ తేడాలేదనీ చెబుతూ జగన్ గాలి తీసేశారు.  జగన్ మావిగన్ ప్రతిపాదన తరువాత.. వైసీపీ ఆ పేరును తెగ ప్రచారం చేస్తున్నది. అయితే..  జగన్, వైసీపీ నేతల ప్రచారం జనాలు పెద్దగా పట్టించుకోలేదనుకోండి అది వేరు సంగతి.  జనం దాకా ఎందుకు వైసీపీలో పలువురు నేతలు కూడా మావిగన్ ప్రతిపాదనపై పెదవి విరిచారు. ముఖ్యంగా ఉత్తరాంధ్రకు చెంది ధర్మాన వంటి నేతలైతే.. అంతర్గత సంభాషణల్లో జగన్ పై విమర్శలతో విరుచుకుపడ్డారని వైసీపీ వర్గాలే చెబుతున్నాయి.  ఇక ఇప్పుడు తాజాగా ఓ న్యూస్ చానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నేత మావిగన్ విషయంలో చేసిన వ్యాఖ్యలు తెగ వైరల్ అవుతున్నాయి. జగన్ మావిగన్ ప్రతిపాదనపై రోజా తన అయోమయాన్ని బయటపెట్టుకున్నారు. అదే సమయంలో మావిగన్ పట్ల తన వైఖరినీ బయటపెట్టారు. మావిగన్, అమరావతి రెండూ ఒకటే కదా అని రోజా ఆ చానల్ ఇంటర్వ్యూలో చెప్పారు. దీంతో మావిగన్ ను ప్రమోట్ చేస్తున్న వైసీపీ పరిస్థితి కుడితిలో పడ్డ ఎలుక చందంగా మారిపోయింది. తెలుగుదేశం, జనసేన నేతలు, కార్యకర్తలు మాత్రం రోజా వ్యాఖ్యలను తెగ వైరల్ చేస్తున్నారు. మావిగన్, అమరావతి ఒకటే అయినప్పుడు జగన్ మావిగన్ పాట పాడటం ఎందుకు, అమరావతిపై విషం చిమ్మడం ఎందుకు అంటూ నిలదీస్తున్నారు. జగన్ మావిగన్ జపం మాని రోజాను ఫాలో అవుతూ రెండూ ఒకటే అని ప్రకటించేయవచ్చుగా అంటూ వైసీపీలో మావిగన్ వ్యతిరేకులు కూడా అంటున్నారు.   జగన్ అధికారంలో ఉన్న ఐదేళ్లలో ఆయన, ఆయన పార్టీ నేతలూ    అమరావతిని  శ్మశానంతో పోలుస్తూతీవ్ర విమర్శలు గుప్పించారు. ఇప్పుడు అధికారం కోల్పోయిన తరువాత.. తెలుగుదేశం కూటమి ప్రభుత్వంలో శరవేగంగా నిర్మాణం పూర్తి చేసుకుంటున్న అమరావతిపై విషం చిమ్ముతున్నారు. తాను అధకారంలోకి వస్తే.. మావిగన్ ను ఏపీ రాజధానిగా చేస్తామంటూ జగన్ ప్రకటనను గుప్పిస్తున్నారు. అయితే..  అనూహ్యంగా ఆ పార్టీ ఫైర్ బ్రాండ్ నాయకురాలు.. అమరావతికి అనుకూలంగా గళం ఎత్తడం అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది.    అభివృద్ధి, వైభవం పరంగా అమరావతి  అంతటి  స్థాయి కలిగిన ప్రాంతమని రోజా అనడంతో వైసీపీ నేతలు, మరీ ముఖ్యంగా జగన్ ఏం మాట్లాడాలో అర్ధం కాని అయోమయంలో పడిపోయారు.   రోజాయే అమరావతి మావిగన్ ఒకటే అని చెప్పడంతో జగన్ మావిగన్ ప్రతిపాదనపై నెటిజనులు తెగ సెటైర్లు గుప్పిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని విషయంలో వైసీపీ అయోమయానికి ఇదే నిదర్శనమని అంటున్నారు. అమరావతిపై అకారణ ద్వేషం వినా.. వైసీపీకి రాజధాని విషయంలో ఒక క్లారిటీ అంటూ లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.  Roja Comments on Amaravati, YCP Capital Row, Roja Mavigan Controversy, AP Politics, Telugunews
ALSO ON TELUGUONE N E W S
  ప్రస్తుత సినీ వాతావరణం చూస్తుంటే 'లెనిన్'(Lenin)తో అఖిల్ అక్కినేని ఈ సారి చాలా బలమైన హిట్ అందుకునేలా ఉన్నాడు.  ప్రచార చిత్రాలతో పాటు ప్రీ రిలీజ్ ఈవెంట్ లో అఖిల్ ,నాగార్జున,భాగ్యశ్రీ బోర్సే తో పాటు మిగతా నటీనటుల స్పీచ్ కూడా అందుకు తగ్గ బలమైన సంకేతాలు ఇస్తున్నాయి. పైగా మాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ తో లెనిన్ ముస్తాబవడం అతి పెద్ద పాజిటివ్ వైబ్రేషన్. లెనిన్ థియేట్రికల్ రిలీజ్ గురించి ట్రేడ్ వర్గాల్లో ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. నైజాం(తెలంగాణ), ఆంధ్రా, రాయలసీమ (సీడెడ్) ఏరియాల్లో లెనిన్ కి  రికార్డు స్థాయిలో థియేటర్లని  కేటాయిస్తున్నట్లు సమాచారం. అన్ని ఏరియాస్ కలుపుకొని దాదాపు 600 నుండి 750 కి పైగా స్క్రీన్లలో లెనిన్  విడుదల చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ముఖ్యంగా రాయలసీమ బ్యాక్‌డ్రాప్ కావడంతో సీడెడ్ రీజియన్‌లోనే  120కి పైగా ప్రముఖ థియేటర్లను లాక్ చేసినట్లు టాక్. ఇక ఓవర్సీస్ తో పాటు ఇండియాలోని మిగతా ఏరియాలు కలిపి మరో 200 స్క్రీన్లలో లెనిన్  ప్రదర్శితం కానుంది. దీంతో  మొత్తంగా ప్రపంచవ్యాప్తంగా దాదాపు 950 నుండి 1000 వరకు భారీ స్క్రీన్ కౌంట్‌తో ఈ మాస్ జాతర థియేటర్లలో మొదలు కానున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. Also read: Jailer 2: మలయాళంలో జైలర్ 2 సంచలన రికార్డు.. రజినీ స్టామినాకి ఇదే నిదర్శనం! మురళి కిషోర్ అబ్బురు దర్శకత్వంలో, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, మనం ఎంటర్‌ప్రైజెస్ నిర్మించగా  థమన్ మ్యూజిక్. రిలీజ్ డేట్ 10 కోసమైతే ఫ్యాన్స్ ఫుల్ వెయిటింగ్ .    
విక్టరీ వెంకటేష్, నందమూరి కళ్యాణ్ రామ్ హీరోలుగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఒక భారీ మల్టీస్టారర్ చిత్రం రూపుదిద్దుకుంటున్న సంగతి తెలిసిందే. #VenkyAnil5 #NKRAR2 వర్కింగ్ టైటిల్స్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రం అనౌన్స్‌మెంట్ నుంచే టాలీవుడ్‌లో భారీ అంచనాలను రేకెత్తించింది. షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి నిర్మిస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్‌  నుంచి ఇటీవల నందమూరి కళ్యాణ్ రామ్ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్‌కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ సినిమా షూటింగ్‌కు సంబంధించిన ఒక సెన్సేషనల్ అప్‌డేట్‌ను చిత్రబృందం పంచుకుంది. ఈ సినిమా సరికొత్త షూటింగ్ షెడ్యూల్‌లో విక్టరీ వెంకటేష్ అడుగుపెట్టారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో ప్రత్యేకంగా డిజైన్ చేసి వేసిన ఒక భారీ సెట్‌లో ఈ సినిమాకు సంబంధించిన అత్యంత ముఖ్యమైన సన్నివేశాల చిత్రీకరణ శరవేగంగా జరుగుతోంది. ఈ షెడ్యూల్‌లో వెంకటేష్‌తో పాటు కళ్యాణ్ రామ్, కీర్తి సురేష్, కృతి శెట్టి కూడా పాల్గొంటున్నారు. ప్రధాన తారాగణం అంతా కలిసి నటిస్తున్న ఈ సుదీర్ఘమైన షెడ్యూల్ చిత్రంలోనే అత్యంత కీలకమైన ఘట్టం కానుందని మేకర్స్ స్పష్టం చేశారు. ఇటీవలే చిత్ర యూనిట్ కళ్యాణ్ రామ్, పలువురు ప్రధాన నటీనటులపై ఒక కలర్‌ఫుల్ సాంగ్ చిత్రీకరణను విజయవంతంగా పూర్తి చేసింది. ఆ వెంటనే ప్రారంభమైన ఈ మొదటి ప్రధాన షెడ్యూల్‌లో కీర్తి సురేష్, కృతి శెట్టి కూడా పాల్గొనడంతో సెట్స్‌లో సందడి నెలకొంది. ఈ సినిమాలో వెంకటేష్ , కళ్యాణ్ రామ్‌ల మధ్య వచ్చే కాంబినేషన్ సీన్స్ థియేటర్లలో ప్రేక్షకులకు ఒక అసలైన విజువల్ ట్రీట్‌లా మారనున్నాయి. వీరిద్దరి మధ్య ఉండే ఆన్-స్క్రీన్ కెమిస్ట్రీ, టైమింగ్, అనిల్ రావిపూడి మార్క్ సిగ్నేచర్ హిలేరియస్ ఎంటర్‌టైన్‌మెంట్‌కు పర్ఫెక్ట్‌గా సరిపోతాయని, ఇవి సినిమాకే మేజర్ హైలైట్‌గా నిలుస్తాయని సమాచారం. ఈ క్రేజీ ఎంటర్‌టైనర్‌లో వెంకటేష్ సరసన కీర్తి సురేష్ నటిస్తుండగా, కళ్యాణ్ రామ్‌కు జోడీగా కృతి శెట్టి సందడి చేయనుంది. జీవీ ప్రకాష్ కుమార్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తుండగా, సమీర్ రెడ్డి సినిమాటోగ్రఫీని అందిస్తున్నారు. తమ్మిరాజు ఎడిటర్‌గా, ఏఎస్ ప్రకాష్ ప్రొడక్షన్ డిజైనర్‌గా వ్యవహరిస్తున్నారు.  అనిల్ రావిపూడి మార్క్ ట్రేడ్‌మార్క్ హ్యూమర్, హార్ట్ టచింగ్ ఫ్యామిలీ ఎమోషన్స్, హోల్‌సమ్ ఎంటర్‌టైన్‌మెంట్, పండుగ వాతావరణాన్ని ప్రతిబింబించే సెలబ్రేషన్స్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రం వచ్చే 2027 సంక్రాంతి కానుకగా ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల కానుంది.     Victory Venkatesh, Nandamuri Kalyan Ram, Anil Ravipudi, VenkyAnil5, NKRAR2  
తమిళనాడు రాజకీయాలకు, సినిమా రంగానికి విడదీయరాని బంధం ఉంది. దశాబ్దాలుగా కోలీవుడ్ స్టార్ హీరోలు వెండితెరపైనే కాకుండా, రాజకీయ యవనికపైనా తమ ముద్ర వేస్తూ వస్తున్నారు. తాజాగా తమిళనాడు రాజకీయాల్లో కోలీవుడ్ దళపతి విజయ్ సృష్టించిన సంచలన విజయం... ఇప్పుడు ద్రవిడ రాజకీయ ముఖచిత్రాన్ని పూర్తిగా మార్చేసింది. రాజకీయాల్లోకి ప్రవేశించిన తొలిసారే ఏకంగా ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించి, విజయ్ సరికొత్త చరిత్ర సృష్టించారు. కమల్ హాసన్ వంటి మహామహులకే సాధ్యం కాని ఈ రాజకీయ అద్భుతాన్ని విజయ్ సాకారం చేయడంతో, ఇప్పుడు కోలీవుడ్‌లోని మరికొందరు స్టార్స్ అటువైపు అడుగులు వేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఈ అసాధారణ విజయ ప్రస్థానం ఇప్పుడు తమిళనాట సరికొత్త పొలిటికల్ ట్రెండ్‌కు తెరలేపింది. ఈ క్రమంలోనే కోలీవుడ్ విలక్షణ నటుడు, నేషనల్ అవార్డ్ విన్నర్ ధనుష్ కూడా త్వరలోనే రాజకీయ అరంగేట్రం చేయబోతున్నారనే ప్రచారం తమిళనాట జోరుగా సాగుతోంది. వెండితెరపై తన అద్భుత నటనతో కోట్లాది మంది అభిమానుల హృదయాలను గెలుచుకున్న ధనుష్, ఇప్పుడు ప్రజాసేవ వైపు అడుగులు వేస్తున్నారా అనే ప్రశ్న అందరిలోనూ ఆసక్తి రేకెత్తిస్తోంది. దళపతి విజయ్ సాధించిన ఘనవిజయం ఇచ్చిన స్పూర్తితో ధనుష్ సైతం పొలిటికల్ ఎంట్రీకి గ్రౌండ్ వర్క్ సిద్ధం చేసుకుంటున్నట్లు కోలీవుడ్ వర్గాల్లో గట్టి చర్చ నడుస్తోంది. తాజాగా ధనుష్ అభిమాన సంఘం ఆల్ ఇండియా ధనుష్ ఫ్యాన్స్ క్లబ్ నిర్వహించిన ఓ ప్రత్యేక కార్యక్రమంలో ఒక అధికారిక జెండాను ఆవిష్కరించడం ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది. ఈ జెండా ఆవిష్కరణ కేవలం ఒక సాధారణ అభిమాన సంఘం కార్యక్రమంలా కాకుండా, పక్కా రాజకీయ అజెండాతో కూడిన కార్యక్రమంలా సాగిందని విశ్లేషకులు భావిస్తున్నారు. కేవలం జెండా రూపకల్పనకే పరిమితం కాకుండా, తమిళనాడు రాష్ట్రవ్యాప్తంగా 38 జిల్లాల్లో విస్తృతంగా సేవా కార్యక్రమాలు చేపట్టాలని, పేదలకు సహాయం అందించాలని అభిమాన సంఘాల కీలక నేతలకు పిలుపునిచ్చారు. ఇది పక్కా పొలిటికల్ స్కెచ్‌తోనే జరుగుతోందని, భవిష్యత్తులో రాజకీయ పార్టీగా మారేందుకు ఇదొక తొలి అడుగు అని రాజకీయ విశ్లేషకులు గట్టిగా విశ్వసిస్తున్నారు. ముఖ్యమంత్రి విజయ్ బాటలోనే ధనుష్ కూడా ఇప్పుటి నుంచే క్షేత్రస్థాయిలో బలమైన పునాదిని సిద్ధం చేసుకుంటున్నారని సమాచారం. రాబోయే సార్వత్రిక ఎన్నికల సమయానికి పూర్తి ప్రణాళికతో, స్పష్టమైన పొలిటికల్ మేనిఫెస్టోతో పక్కాగా బరిలోకి దిగేందుకు ధనుష్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. సినిమా షూటింగ్‌లతో బిజీగా ఉంటూనే, మరోవైపు అభిమానులను సామాజిక సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనేలా ప్రోత్సహించడం ఈ వ్యూహంలో భాగమేనని అంటున్నారు. మరోవైపు, తన పొలిటికల్ ఎంట్రీపై సోషల్ మీడియాలో, ప్రధాన రాజకీయ వర్గాల్లో ఇంత పెద్ద ఎత్తున ఊహాగానాలు వస్తున్నప్పటికీ... హీరో ధనుష్ వైపు నుంచి గానీ, ఆయన పీఆర్ టీమ్ నుంచి గానీ ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడకపోవడం గమనార్హం. ఈ మౌనం మరింత అనుమానాలకు, ఉత్కంఠకు దారితీస్తోంది. జెండా ఆవిష్కరణతో మొదలైన ఈ సరికొత్త ప్రస్థానం భవిష్యత్తులో తమిళనాడు రాజకీయాల్లో ఎలాంటి సంచలనాలకు దారితీస్తుందో చూడాలి.       Dhanush, Tamil Nadu, Thalapathy Vijay, Kollywood stars 
Venkatesh has officially joined the sets of director Anil Ravipudi’s much-awaited multistarrer project. This marks the exciting beginning of his portions in the highly anticipated film, which was grandly launched last month. Following the successful launch ceremony, the production team commenced regular shooting immediately, generating huge expectations among movie lovers. The actor was previously busy completing his prior acting commitments for director Trivikram’s upcoming film, Aadarsha Kutumbam. Because his schedule for that project is now nearing completion, he was finally able to step into Anil Ravipudi's cinematic world. Until his arrival, the film's unit successfully shot several important scenes featuring the other lead actor, Nandamuri Kalyan Ram, alongside Krithi Shetty. Venkatesh is now actively participating in a major shooting schedule that is currently underway. The filming is taking place on a specially erected, massive set designed specifically for this crucial portion of the movie. The entire principal cast, including Venkatesh, Kalyan Ram, Keerthy Suresh, and Krithi Shetty, are all coming together on this set to shoot these key sequences. GV Prakash Kumar is scoring music for the film. The makers are strategically planning to wrap up the entire shooting process by the end of December. This well-organized schedule keeps the blockbuster film perfectly on track for a massive theatrical release during the festive season of Sankranti on January 13, 2027. Disclaimer: This article is based on discussions and information shared across publicly available sources and social media. Interpretations remain those of the users involved. Readers are encouraged to exercise discretion before drawing conclusions.
భారతీయ చలనచిత్ర సంగీత ప్రపంచంలో 'మ్యాస్ట్రో' ఇళయరాజా స్థానం అద్వితీయం. దశాబ్దాలుగా ఆయన అందించిన వేలాది మధురమైన గీతాలు కోట్లాది మంది శ్రోతల గుండెల్లో నిలిచిపోయాయి. అయితే కేవలం సంగీత సృష్టికర్తగానే కాకుండా, తన పాటల కాపీరైట్ హక్కుల రక్షణ కోసం ఆయన సాగిస్తున్న పోరాటం కూడా సినీ ఇండస్ట్రీలో నిరంతరం చర్చనీయాంశంగా మారుతోంది. తాజాగా తన అనుమతి లేకుండా ఓ ఐకానిక్ గీతాన్ని వాడుకున్నారంటూ ఇళయరాజా దాఖలు చేసిన పిటిషన్‌పై మద్రాస్ హైకోర్టు అత్యంత కీలకమైన మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. యువ నటుడు, సంగీత దర్శకుడు జీవీ ప్రకాష్ కుమార్ కథానాయకుడిగా, దర్శకుడిగా వ్యవహరించిన 'హ్యాపీ రాజ్' చిత్ర బృందానికి ఈ తీర్పుతో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు సదరు వివాదాస్పద గీతాన్ని సినిమాలో ఎక్కడా ఉపయోగించరాదని న్యాయస్థానం స్పష్టం చేసింది. ఈ వివాదం వెనుక దశాబ్దాల నాటి ఒక సూపర్ హిట్ పాట చరిత్ర దాగి ఉంది. 1980వ సంవత్సరంలో సూపర్ స్టార్ రజినీకాంత్ కథానాయకుడిగా విడుదలై, బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించిన చిత్రం 'మురట్టుకాళై'. ఈ సినిమాలో ఇళయరాజా స్వరపరిచిన "పొదువాగ ఎన్ మనసు తంగం" (Poduvaga En Manasu Thangam) అనే గీతం అప్పట్లో ఒక ఊపు ఊపింది. రజినీకాంత్ అభిమానులకు ఇప్పటికీ ఇదొక ఎవర్ గ్రీన్ ఆంథెమ్. అయితే, సరిగ్గా 46 సంవత్సరాల తర్వాత, ఈ ఏడాది మార్చి 27న థియేటర్లలో విడుదలైన 'హ్యాపీ రాజ్' సినిమాలో ఈ ఐకానిక్ సాంగ్‌ను రీమిక్స్ లేదా మార్పులు చేసి వాడుకున్నారు. తన అనుమతి లేకుండా, ఎటువంటి అధికారిక లైసెన్స్ తీసుకోకుండా, పూర్తిగా వాణిజ్య ప్రయోజనాల కోసం ఈ పాటను రీమేక్ చేశారని ఇళయరాజా మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు. కాపీరైట్ చట్టాల ఉల్లంఘన జరిగిందంటూ ఆయన సివిల్ దావా వేశారు. మద్రాస్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎం. కుమరేశ్ బాబు ఈ పిటిషన్‌పై లోతుగా విచారణ చేపట్టారు. కోర్టు ప్రాథమికంగా పరిశీలించిన తర్వాత ఇళయరాజా కాపీరైట్ హక్కులకు భంగం వాటిల్లిందని అభిప్రాయపడింది. ఇళయరాజా తరఫు న్యాయవాదులు వినిపించిన బలమైన వాదనలను అంగీకరించిన న్యాయస్థానం, 'హ్యాపీ రాజ్' సినిమాలో ఆ పాట వాడకాన్ని తక్షణమే నిలిపివేయాలని మధ్యంతర స్టే విధించింది. అంతేకాకుండా, ఈ తీవ్రమైన కాపీరైట్ ఉల్లంఘన వ్యవహారంపై పూర్తి వివరణ ఇవ్వాలంటూ చిత్ర దర్శకుడు, నటుడు జీవీ ప్రకాష్ కుమార్‌తో పాటు ఆ సినిమా నిర్మాతకు కూడా హైకోర్టు అధికారిక నోటీసులు జారీ చేసింది. ఈ తీర్పు భారతీయ సినిమా పరిశ్రమలో కాపీరైట్ చట్టాల ప్రాముఖ్యతను మరోసారి గుర్తుచేసింది. పాత తరం క్లాసిక్ సాంగ్స్ మరియు ట్యూన్స్‌ను నేటి తరం మేకర్స్ తమ సినిమాల్లో రీమిక్స్ లేదా రీమేక్ రూపంలో వాడుకోవడం ఈ మధ్య సర్వసాధారణంగా మారింది. అయితే, మూల సృష్టికర్త యొక్క మేధో సంపత్తి హక్కులను (Intellectual Property Rights), రాయల్టీని గౌరవించకుండా ఇలాంటి ప్రయోగాలు చేయడం చట్టరీత్యా నేరమని ఈ తీర్పు హెచ్చరిస్తోంది. ఇళయరాజా వంటి దిగ్గజాలు తమ హక్కుల కోసం న్యాయపోరాటం చేయడం ద్వారా భవిష్యత్తులో రాబోయే యువ సంగీత దర్శకులకు, గేయ రచయితలకు కూడా తమ సొంత క్రియేషన్లపై హక్కులను ఎలా కాపాడుకోవాలో ఒక మార్గదర్శిగా నిలుస్తున్నారు. ఈ కేసు తదుపరి విచారణలో ఎలాంటి మలుపులు తిరుగుతుందనేది ఇప్పుడు కోలీవుడ్‌తో పాటు మొత్తం సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది.     Ilaiyaraaja, Happy Raj, Madras High Court, GV Prakash Kumar
సూపర్ స్టార్ రజినీకాంత్(Rajinikanth)స్టార్ డమ్ ని మరింత ఎలివేట్ చేస్తు నెల్సన్ దిలీప్ కుమార్(Nelson Dilipkumar)తెరకెక్కించిన  'జైలర్' సృష్టించిన ప్రభంజనం అంతా ఇంతా కాదు. తమిళంతో పాటు తెలుగు, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లోనూ భారీ విజయాన్ని అందుకుంది. ప్రపంచవ్యాప్తంగా వసూలు చేసిన కలెక్షన్స్ కూడా ఒక సంచలనం. దీంతో సీక్వెల్ గా తెరకెక్కిన 'జైలర్ 2’(Jailer 2)పై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ మోస్ట్ అవేటెడ్ మూవీ బిజినెస్ క్లోజ్ కాకముందే సరికొత్త రికార్డులని  సృష్టిస్తోంది. ముఖ్యంగా మలయాళ చిత్ర పరిశ్రమలో ఈ సినిమాకు మునుపెన్నడూ లేని విధంగా ఊహించని డిమాండ్ ఏర్పడింది. మొదటి భాగం 'జైలర్' లో మలయాళ సూపర్ స్టార్ మోహన్‌లాల్ పోషించిన మాత్యూస్ క్యారక్టర్ కేరళ  బాక్సాఫీస్ వద్ద పూనకాలు తెప్పించింది. ఆయన స్క్రీన్ ప్రెజెన్స్, రజినీకాంత్‌తో కలిసి వచ్చే మాస్ ఎలివేషన్స్ కేరళలో థియేటర్లని  షేక్ చేశాయి. కేరళలో కేవలం ఒకే ఒక్క గెస్ట్ రోల్‌తో సినిమా కలెక్షన్లని  అమాంతం పెంచేసిన మోహన్‌లాల్ మ్యాజిక్, ఇప్పుడు 'జైలర్ 2' బిజినెస్‌కు పెద్ద ప్లస్ పాయింట్‌గా మారింది. సీక్వెల్‌లో కూడా ఆయన రోల్  మరింత పవర్‌ఫుల్‌గా ఉండబోతుందనే లీకులు రావడంతో మలయాళ థియేట్రికల్ హక్కుల కోసం కేరళ డిస్ట్రిబ్యూటర్లు ఎగబడుతున్నారు. పోటీపడి మరీ భారీ ఆఫర్లను ఇస్తుండటంతో, సినిమా విడుదల కాకముందే సరికొత్త రికార్డులు నమోదవుతున్నాయి. Also read: Babumohan: బాబుమోహన్ సెకండ్ ఇన్నింగ్స్..ఆ 15 సినిమాలపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్  ఇక రజినీ ముత్తువేల్ పాండియన్ గా ఈసారి మరింత వైల్డ్‌గా, మరింత పవర్‌ఫుల్‌గా డిజైన్ చేసినట్లు తెలుస్తోంది. 'ది టైగర్ ఈజ్ బ్యాక్ ఆన్ ది హంట్' అంటూ మేకర్స్ వదిలిన క్రేజీ లైన్స్ అయితే  సోషల్ మీడియాని  ఊపేస్తున్నాయి. మోహన్‌లాల్‌తో పాటు కన్నడ సూపర్ స్టార్ శివ రాజ్‌కుమార్, ఎస్‌. జే. సూర్య, రమ్యకృష్ణన్, యోగి బాబు వంటి భారీ తారాగణం నటిస్తుండటంతో పాన్ ఇండియా స్థాయిలో క్రేజ్ ఏర్పడింది. వీటికి తోడు రాక్‌స్టార్ అనిరుధ్ రవిచందర్ అందిస్తున్న బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ,మ్యూజిక్ మరో ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి. అక్టోబర్ 15 రిలీజ్ డేట్. Rajinikanth, nelson dilipkumar, mohanlal, jailer 2  
Megastar Chiranjeevi appears to be pushing his limits once again for his upcoming film with director Bobby Kolli. After the commercial success of Waltair Veerayya, the actor-director duo has reunited for Mega158, and the latest schedule suggests the makers are betting big on action. The film is currently being shot in Hyderabad, where the team is filming what is said to be one of the movie's major action episodes. Choreographed by Ram-Lakshman Masters, the sequence involves a large number of stunt performers and has Chiranjeevi performing several physically demanding stunts. Considering the actor's age, his willingness to execute such action scenes has become a talking point on the sets. The production had earlier released a behind-the-scenes glimpse from its Pollachi schedule, hinting at the scale of the action planned for the film. The ongoing Hyderabad schedule appears to be taking things a step further, with the makers mounting another large-scale fight sequence expected to be among the film's highlights. Mega158 stars Anaswara Rajan in a key role, while S. Thaman is composing the music. Backed by KVN Productions on a pan-India scale, the project is being mounted with high production values and is expected to showcase Chiranjeevi in a stylish yet intense action-packed avatar. While the makers are keeping the story under wraps, industry buzz suggests the film blends mass action with commercial entertainment. With the current schedule nearing completion, attention is now shifting towards the film's title teaser, which is expected to be unveiled soon.   Disclaimer: This article is based on discussions and information shared across publicly available sources and social media. Interpretations remain those of the users involved. Readers are encouraged to exercise discretion before drawing conclusions.
  తెలుగు సినిమాని ఒక ఊపు ఊపిన, చూపు చూసిన నటుడు బాబూమోహన్(Babu Mohan). బాబూమోహన్ పలానా సినిమాలో ఉన్నాడురా అని మూవీకి  వెళ్లే ప్రేక్షకుల నెంబర్ కి లెక్కే లేదు. తన కామెడీ తో తెలుగు వాళ్ళని పొట్టచెక్కలయేలా నవ్వించి చిన్న చిన్న రోగాలని కూడా మటుమాయం చేసిన లెజండ్రీ యాక్టర్. రాజకీయాల్లో బిజీ అవ్వడం వల్ల కొంతకాలం వెండితెరకి  దూరమైన ఈ అద్భుత నటుడు, ఇప్పుడు మళ్లీ కెమెరా ముందుకు వచ్చి వరుస ప్రాజెక్టులతో ఫుల్ బిజీ అయిపోయారు. బాబూమోహన్ రీసెంట్ గా కలియుగ దైవం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారిని  దర్శించుకున్నారు. విఐపి బ్రేక్ దర్శన సమయంలో స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఆలయ అధికారులు ఆయనకి  తీర్థప్రసాదాలు అందించి ఆశీర్వచనం ఇచ్చారు. ఈ సందర్భంగా ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడుతు నేను ప్రస్తుతం ఏకంగా 15 సినిమాల్లో నటిస్తున్నాను. అంతేకాదు  ఆ 15 చిత్రాలలో ఇప్పటికే 8 సినిమాలు షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలకి సిద్ధంగా ఉన్నాయి. ఈ చిత్రాలలో కనీసం 5 సినిమాల్లో పూర్తి స్థాయి నిడివి గల క్యారెక్టర్స్ లో  కనిపిస్తాను. అవి ప్రేక్షకులని  ఎంతగానో అలరిస్తాయి. రాబోయే రోజుల్లో థియేటర్లలో తన మార్కు కామెడీతో పాత రోజులను గుర్తు చేస్తాను.  Also read: sanjay dutt: నేను క్యాన్స‌ర్ బారిన ప‌డ్డాను.. బసవతారకం ఆస్పత్రిలో సంజయ్ దత్ భావోద్వేగం  ఎస్వీ కృష్ణా రెడ్డి దర్శకత్వంలో రాబోయే మూవీలో అయితే  డైలాగులతో నవ్వించడమే కాకుండా, అదిరిపోయే డ్యాన్స్‌లు కూడా చేశానని చెప్పుకొచ్చారు. ఎస్వీ కృష్ణా రెడ్డి దర్శకత్వంలో వచ్చిన మాయలోడు, రాజేంద్రుడు గజేంద్రుడు వంటి చిత్రాలు బాబు మోహన్ కెరీర్‌ను మలుపు తిప్పాయి. మాయలోడులో సౌందర్య తో చేసిన వాన సాంగ్ నేటికీ మారు మోగిపోతున్న విషయం తెలిసిందే.  babumohan, sv krishnareddy, soundarya
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు. వారితో పాటు పెద్ద సంఖ్యలో క్యాడర్ కూడా పార్టీని వీడుతున్నారు. ఇక ఇప్పుడు నామినేటెడ్ పదవులలో ఉన్న వారి వంతు మొదలైనట్లు కనిపిస్తోంది. తనకు కానీ తన భర్తకు  కానీ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు టికెట్ ఇవ్వాలంటూ గత  కొంత కాలంగా కోరుతూ వస్తున్న మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ వంతు వచ్చింది. ఆమె కూడా రాజీనామా అస్త్రం సంధించారు.  జగన్ కు నమ్మిన బంటుగా గుర్తింపు పొందిన మహిళాకమిషన్ చైర్ పర్సన్ వాసి రెడ్డి పద్మ తన పదవికి రాజీనామా చేశారు. ఉరుములేని పిడుగులా, ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా తన రాజీనామా లేఖను సీఎం జగన్ కు పంపేశారు. పేరుకు తాను పార్టీకి కాదు, కేవలం మహిళా కమిషన్ చైర్మన్ పదవికి మాత్రమే రాజీనామా చేశాననీ, ఇక నుంచి వైసీపీ కోసం పని చేస్తాననీ వాసిరెడ్డి పద్మ చెబుతున్నప్పటికీ, ఆమె రాజీనామాకు కారణం అసంతృప్తేనని పార్టీ వర్గాలు బాహాటంగానే చెబుతున్నాయి. చాలా కాలంగా వాసిరెడ్డి పద్మ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు తనకు కానీ తన భక్తకు కానీ పార్టీ టికెట్ ఇవ్వాలని జగన్ ను కోరుతూ వస్తున్నారు. అయితే ఇప్పటి వరకూ జగన్ చూద్దాం.. చేద్దాం అన్నట్లుగా దాట వేస్తూనే వచ్చారు. ఇప్పుడిక వరుసగా అభ్యర్థల జాబితాలను జగన్ ప్రకటించేస్తుండటం, తనకు గానీ తన భర్తకు కానీ పార్టీ టికెట్ విషయంలో ఎటువంటి స్పస్టత ఇవ్వకపోవడంతో ఆమె మనస్తాపం చెంది పదవికి రాజీనామా చేసేశారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.  వాసిరెడ్డి పద్మ రాజకీయ ప్రవేశం ప్రజారాజ్యం పార్టీతో జరిగింది. 2009లో ఆమె ప్రజారాజ్యం పార్టీలో చేరారు. ఇలా చేరడంతోనే ఆమె ప్రజారాజ్యం అధికార ప్రతినిథిగా పదవి దక్కించుకున్నారు. ప్రజారాజ్యం కాంగ్రెస్ పార్టీలో విలీనం కావడంతో ఆమె 2012లో జగన్ పార్టీలో చేరారు. జగన్ కూడా ఆమెకు అధికార ప్రతినిథి పదవి ఇచ్చారు.  2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆమెను రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా నియమించారు. చైర్ పర్సన్ హోదాలో ఆమె జగన్ మెప్పు పొందేందుకు చేయగలిగినంతా చేశారు. ప్రతిపక్ష పార్టీ నేతలకు నోటీసులు ఇచ్చారు. ఏకంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు సైతం నోటీసులు జారీ చేశారు. వార్డు వలంటీర్లపై పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు కమిషన్ ముందు హాజరై వివరణ ఇవ్వాలంటూ ఆమె పవన్ కు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. పవన్ హాజరు కాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు నమోదు చేయాలని ఆదేశించారు. ఇన్ని చేసినా వాసిరెడ్డి పద్మకు ఆమె కోరినట్లుగా పార్టీ టికెట్ లభించకపోవడంతో అలిగి పదవికి రాజీనామా చేశారని, ఇది జగన్ కు షాకేననీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు. ఒకరైతు తనకు చేసిన సేవలకు ప్రీతి చెందిన గురువు అతడికి స్వర్గ ప్రాప్తిని కలగజేయాలని అనుకుంటాడు. కానీ సంసారాసక్తి వల్ల ఆ రైతు ఆ అవకాశాన్ని వాయిదా వేసుకుంటూ వస్తాడు. చివరికి గురుకృప వల్ల ఆ రైతు స్వర్గ ప్రాప్తిని ఎలా పొందాడో ఈ కథ తెలియజేస్తుంది. "ఒక మహాపురుషుడు ప్రయాణం చేస్తూ, డస్సిపోయాడు. గొంతు ఎండిపోయింది. దారిలో ఒక రైతు కనపడితే నీళ్ళు అర్థించాడు. ఆ రైతు మహాత్మునికి సకల ఉపచారాలూ చేశాడు. చిరిగిపోయిన ఆయన ఉత్తరీయాన్ని రైతు జాగ్రత్తగా కుట్టి బాగుచేశాడు. రైతు పరిచర్యలకు సంతసించిన ఆ మహాత్ముడు శాంతి, ఆనందాలకు నిలయమైన స్వర్గానికి తనతోపాటు రమ్మని అంటాడు. అందుకు ఆ రైతు 'గురువుగారూ! మీరు నా మీద చూపిన దయకు కృతజ్ఞుణ్ణి. కానీ నా పిల్లలు ఇంకా చిన్నవాళ్ళు. ఓ ఏడేళ్ళ వ్యవధి ఇవ్వండి' అని అడుగుతాడు. అందుకు గురువు అంగీకరించాడు. సరిగ్గా ఏడేళ్ళ తర్వాత గురువు రైతును స్వర్గానికి తీసుకువెళ్ళడానికి వచ్చాడు. అప్పుడు రైతు 'అయ్యా! కడపటి కొడుకు కష్టాలకు అంతు లేదు. అన్ని జంఝాటాలనూ ఒక్కడే సంబాళించుకోలేకపోతున్నాడు. కాబట్టి మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని గురువుని అడిగాడు. మరో ఏడేళ్ళ తరువాత గురువు వచ్చాడు. కానీ రైతు చనిపోయాడని తెలిసింది. చనిపోయిన ఆ రైతు ఎద్దుగా పుట్టాడని ఆ గురువు తన దివ్య దృష్టితో తెలుసుకున్నాడు. ఎద్దుగా పుట్టిన ఆ రైతు తన కొడుకు పొలాన్నే దున్నుతున్నాడు. అప్పుడు గురువు ఆ ఎద్దుపై మంత్ర జలం చిలకరించగానే ఎద్దు జన్మనెత్తిన రైతు 'నా కొడుకు పరిస్థితి మరి కాస్త మెరుగు పడనీయండి స్వామీ! మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని అన్నాడు. ఇక చేసేది లేక వెనుదిరిగాడు గురువు. మరలా ఏడేళ్ళ తర్వాత వచ్చిన గురువుకు ఎద్దు చనిపోయిందని తెలిసింది. అది కుక్కగా పుట్టి కొడుకు ఇంటినీ, ఆస్తినీ కాపలా కాస్తోందని తన దివ్యదృష్టి ద్వారా తెలుసుకున్నాడు. గురువు. కుక్కగా పుట్టిన ఆ రైతు 'స్వామీ! నేను ఎంత దౌర్భాగ్యుణ్ణి. మీరు ఇంత దయ చూపుతున్నప్పటికీ మీతో స్వర్గమానం చేయలేకున్నాను. వీడికి ఆస్తిని కాపాడుకొనే దక్షత ఇంకా రాలేదు. కాబట్టి దయ చేసి మరో ఏడేళ్ళు వ్యవధి ఇవ్వండి' అని వేడుకున్నాడు. గురువు ఏడేళ్ళ తరువాత మళ్ళీ వచ్చేసరికి కుక్క మరణించింది. అది త్రాచుపాముగా జన్మనెత్తి, ఇప్పుడు కొడుకు భూమిలో ఉన్న లంకెబిందెలకు పడగెత్తి కాపలా కాస్తోంది. గుప్త ధనం ఇక్కడ ఉందని కొడుకుకి ఎలా తెలియజేయాలా అని పాము ఆలోచిస్తున్నప్పుడు గురువు ఆ రైతుకొడుకును పిలుచుకు వచ్చి లంకె బిందెలు ఉన్న చోట తవ్వమన్నాడు. లంకె బిందెలు బయటపడ్డాయి. ఆ పైన ఆ పామును చంపమన్నాడు. అనంతరం శిష్యుణ్ణి తీసుకొని స్వర్గారోహణం చేశాడు గురువు. సంసారంలోని ఈతి బాధల నుండి శిష్యుణ్ణి ఉద్ధరిస్తాడు సద్గురువు. అలాంటి గురువు అందరికీ అవసరం.                                      *నిశ్శబ్ద.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్  రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది.  80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత  ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది.   ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది. ఆమెది నెద‌ర్లాండ్స్‌. ఆమె తండ్రి నెద‌ర్లాండ్స్‌లోని ఆర్నెహెమ్‌లో చిన్న‌పిల్ల‌ల ఆస్ప‌త్రి డైరెక్ట‌ర్. పోయి దొరికిన ఆ పెయింటింగ్ విష‌యానికి వ‌స్తే.. అది 1683లో కాస్ప‌ర్ నెష‌ర్ వేసిన స్టీవెన్ ఓల్ట‌ర్స్ పెయింటింగ్‌. రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో నాజీల ఆదేశాల‌ను చార్లెట్ తండ్రి వ్య‌తిరేకించారు. ఆయ‌న ర‌హ‌స్య జీవ‌నం సాగించేడు. కానీ ఈ పెయింటింగ్‌ని మాత్రం త‌న న‌గ‌రంలోని ఒక బ్యాంక్‌లో భ‌ద్ర‌ ప‌ర‌చ‌మ‌ని ఇచ్చార‌ట‌. 1940లో నాజీలు నెద‌ర్లాండ్ పై దాడులు చేసినపుడు ఆ బ్యాంక్ మీద ప‌డి దోచుకున్నా రు. అప్పుడు ఈ పెయింటింగ్ కూడా తీసుకెళ్లారు. యుద్ధం అయిపోయిన త‌ర్వాత ఈ పెయింటింగ్ ఎక్క‌డున్న‌దీ ఎవ‌రికీ తెలియ‌లేదు. చిత్రంగా 1950ల్లో డ‌స‌ల్‌డార్ష్ ఆర్ట్ గ్యాల‌రీలో అది ప్ర‌త్య‌క్ష‌మ‌యింది. 1969లో ఆమ్‌స్ట‌ర్‌డామ్‌లో దాన్ని వేలానికి తీసికెళ్లే ముందు దాన్ని ఆ ఆర్ట్ గ్యాల‌రీలో వుంద‌ని చూసిన‌వారు చెప్పారు. వేలంపాట త‌ర్వాత మొత్తానికి ఆ పెయింటింగ్‌ను 1971లో ఒక క‌ళాపిపాసి త‌న ద‌గ్గ‌ర పెట్టుకున్నాడు.    ఆ త‌ర్వాత 2021లో అది చార్లెటీని చేరింది.  మొత్తానికి వూహించ‌ని విధంగా ఎంతో కాలం దూర‌మ‌యిన గొప్ప క‌ళాఖండం తిరిగి త‌న వ‌ద్ద‌కు చేర‌డంలో చార్లెటీ ఆనందానికి అంతేలేదు. అంతే క‌దా.. పోయింద‌నుకున్న గొప్ప వ‌స్తువు తిరిగి చేరితే ఆ ఆనంద‌మే వేరు!  అయితే చార్లెటీకి ఇపుడు ఆ పెయిం టింగ్‌ను భ‌ద్రంగా చూసుకునే ఆస‌క్తి వున్న‌ప్ప‌టికీ శ‌క్తి సామ‌ర్ధ్యాలు లేవు. అందుక‌నే త్వ‌ర‌లో ఎవ‌రిక‌యినా అమ్మేసీ వ‌చ్చిన సొమ్మును పిల్ల‌ల‌కు పంచుదామ‌నుకుంటోందిట‌!  చార్లెటీ కుటుంబంలో అయిదుగురు అన్న‌ద‌మ్ములు అక్క‌చెల్లెళ్లు వున్నారు. అలాగే ఇర‌వై మంది పిల్ల‌లు ఉన్నారు. అంద‌రూ ఆమె అంటే ఎంతో ప్రేమ చూపుతున్నారు. అంద‌రం ఒకే కుటుంబం, చాలాకాలం త‌ర్వాత ఇల్లు చేరిన క‌ళాఖండం మా కుటుంబానిది అన్న‌ది చార్లెటీ!
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు. చాకోను పార్టీలోకి ఆహ్వానిస్తూ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్’ ఫ్రంట్ ఏర్పాటు గురించి ప్రత్యేకించి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు కానీ, చాకో అలాంటి  సంకేతాలు ఇచ్చారు. ప్రస్తుతం దేశంలో ఉన్న ఏ ఒక్కపార్టీ కూడా బీజేపీకి ప్రత్యాన్మాయం కాదని,సమీప భవిష్యత్ కాంగ్రెస్ సహా ఏ పార్టీ కూడా ఆ స్థాయికి ఎదిగే అవకాశాలు కూడా కనిపించడంలేదని అన్నారు. ఈ పరిస్థితుల్లో దేశంలోని బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ, ఏకమై, ఒకే గొడుగు కిందకు రావలసిన అవసరం ఉందని చాకో అన్నారు. అదే సమయంలో ప్రతిపక్షాలను ఏక తాటిపైకి తెచ్చే బాధ్యతను పవార్ తీసుకోవాలని సంకేత మాత్రంగా చెప్పారు. అంతే కాకుండా కాంగ్రెస్ పేరు ఎత్తకుండా బీజేపీ వ్యతిరేక శక్తులను ఏకం చేసే ఆలోచన ఆ పార్టీ నాయకత్వానికి లేదని నెహ్రూ గాంధీ ఫ్యామిలీ (సోనియా, రాహుల్, ప్రియాంక)ఆలోచనా ధోరణిని పరోక్షంగానే అయినా ఎండ కట్టారు.ఆ విధంగా పవార్ ఆ బాధ్యత తీసుకోవాలని చాకో సూచించారు. ఇందుకు సంబంధించి, పవార్ బహిరంగంగా ఎలాంటి వ్యాఖ్య చేయలేదు. అయితే, చాకో సహా మరికొందరు ‘సీనియర్’ కాంగ్రెస్ నాయకులు, అలాగే సిపిఎం, సిపిఐ నాయకులు కూడా పవార్’తో చాలా కాలంగా థర్డ్ ఫ్రంట్  విషయంగా చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. అయితే మహారాష్ట్రలో సంకీర్ణం మనుగడను దృష్టిలో ఉంచుకుని పవార్ ఆచితూచి అడుగులేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే చాకో పార్టీలో చేరిన సందర్భంలో కూడా ‘చాకో చేరికతో మహారాష్ట్రలోని మహా వికాస్ అగాడీ ప్రభుత్వానికి ఎలాంటి నష్టం జరగదని, పవార్ మహారాష్ట్ర సంకీర్ణ సర్కార్ ప్రస్తావన చేశారని విశ్లేషకులు పేర్కొంటున్నారు.  మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వ మనుగడ గురించ్బి  పవార్ ప్రత్యేకంగా పేర్కొనడం ద్వారా, ఆయన థర్డ్ ఫ్రంట్ విషయంలో వేచి చూసే ఆలోచనలో ఉన్నట్లు అర్థమవుతోందని కూడా  రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే అదే ఎన్సీపీ అసెంబ్లీ ఎన్నికల జరుగతున్న కేరళలో, పశ్చిమ బెంగాల్లో  కాంగ్రెస్ వ్యతిరేక పార్టీలకు మద్దతు ఇస్తోంది. దీన్ని బట్టి చూస్తే, ఎన్సీపీ - కాంగ్రెస్ మధ్య దూరం పెరుగుతోందని స్పష్టమవుతోంది. అయితే, థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఏ రకంగా ముడి పడుతుంది అనే విషయంలో ఇంకా స్పష్టత రావలసి ఉంది. అలాగే, కాంగ్రెస్ లేకుండా జాతీయ స్త్గాయిలో బీజేపీ వ్యతిరేక కూటమిని ఏర్పాటు చేయడం వలన, వ్యతిరేక ఓటు చీలి  అది మళ్ళీ బీజేపీకే మేలు చేస్తుందని, కాబట్టి, ప్రస్తుతం కాంగ్రెస్ సారధ్యంలోని యూపీఏని బలోపేతం చేయడమే ఉత్తమమనే అలోచన కూడా  విపక్ష శిబిరం నుంచి వినవస్తోంది. ఈ నేపధ్యంలోనే, ప్రస్తుతం యూపీఏ ఛైర్పర్సన్’గా ఉన్న సోనియా గాంధీ వయసు, అనారోగ్యం కారణంగా బాధ్యతల నుంచి తప్పుకుని పవార్’కు బాద్యతలు అప్పగించాలనే ప్రతిపాదన వచ్చిందని అంటున్నారు. అలాగే, ఇతర పార్టీలను, ముఖ్యంగా కాంగ్రెస్ నుంచి విడిపోయి సొంత కుంపటి పెట్టుకున్న మమతా బెనర్జీ సారధ్యంలోని తృణమూల్, జగన్మోహన్ రెడ్డి సారధ్యంలోని వైసీపీలను కలుపుకుని కూటమిని బలోపేతం చేయడం ద్వారా బీజేపీని దీటుగా ఎదుర్కోవచ్చనే ఆలోచనలు కూడా సాగుతున్నాయి. అయితే, ఇటు థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు అయినా, యూపీఏని బలోపేతం చేయడమే అయినా, పవారే .. కేంద్ర బిందువు. ఆయన సారధ్యంలోనే ప్రత్యాన్మాయం అనేది విపక్ష శిభిరం నుంచి వినవస్తున్న ప్రస్తుత సమాచారం. మరి అదే జరిగితే రాహుల గాంధీ పరిస్థితి ఏమిటి ? గాంధీ నెహ్రూ కుటుంబం పరిస్థితి ఏమిటి? ఏ ప్రత్యేక ప్రాధాన్యత లేకుండా అందరిలో ఒకరిగా ఫస్ట్ ఫ్యామిలీ సర్దుకు పోతుందా? అంటే..చివరకు ఏమవుతుందో .. ఇప్పుడే చెప్పలేమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది. గతంలో అనేక సందర్భాలలో ముఖ్యమంత్రి కేసీఆర్,ఆర్థిక మంత్రి హరీశ రావు, కరోనా కారణంగా రాష్ట్ర  ఆదాయం గణనీయంగా తగ్గిందని, పేర్కొన్నారు. అయితే, కరోనా నుంచి వేగంగా కోలుకుని, ఆర్థికంగా అంతే వేగంగా పుంజుకున్న రాష్ట్రాలలో తెలంగాణ ప్రధమ స్థానంలో  ఉందని కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సర్వే 2020-21 నివేదిక పేర్కొంది. పడిలేచిన కెరటంలా, తెలంగాణ ‘వీ’ ఆకారంలో ఆర్థికంగా నిలతొక్కుందని కేంద్రం జనవరి  చివరి వారంలో విడుదల చేసిన ఆర్థిక సర్వేలో పేర్కొంది. అలాగే, రెవిన్యూ వసూళ్ళలో రాష్ట్రం కరోనా పూర్వస్థితికి చేరిందని కూడా సర్వే చెప్పింది.   అలాగే,రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు కూడా ఈ మధ్య కాలంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పై సంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరమ జనవరి,ఫిబ్రవరి, మార్చి నెలలతో పోలిస్తే ఈ సంవత్సరం ఈ మూడు నెలల కాలంలో రాష్ట్ర ఆర్థిక వృద్ది రేటు 10 నుంచి  15 శాతం మెరుగ్గా ఉందని హరీష్ రావు ఒకటి రెండు ఇంటర్వ్యూలలో పేర్కొన్నారు.అలాగే, బడ్జెట్ విషయంలోనూ ఆయన చాల ఆశావహ దృక్పథంతోనే ఉన్నారు. బడ్జెట్  పాజిటివ్’గా ఉంటుదని, ఎవ్వరూ ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని, సంక్షేమ పథకాలలో,ఇతరత్రా బడ్జెట్ కేటాయింపులలో ఎలాంటి కోతలు ఉండవని కూడా హరీష్ హామీ ఇచ్చారు. గత సంవత్సరంలో కొంత మేర హామీ ఇచ్చిన మేరకు అమలు చేయలేక పోయిన సొంత జాగాలలో డబల్ బెడ్ రూమ్ ఇళ్ళ నిర్మాణం, రుణ మాఫీ వంటి  పథకాలను ఈ బడ్జెట్ ద్వారా అమలు చేస్తామని చెప్పారు. అలాగే, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ తమిళి సై చేసిన ప్రసంగంలోనూ ఆశావహ దృక్పధమే వ్యక్తమైంది. ఆమె తమ ప్రసంగంలో,  ప్రభుత్వం సంక్షేమ పథకాలకు పెద్ద పీట వేసిందని అన్నారు. ‘సంపద పంచాలి ,పేదలకు పంచాలి’ అనేది తమ ప్రభుత్వ విధానమని స్పష్టం చేశారు. అలాగే, పెరుగతున్న ఆదాయంలో అధికశాతం సంక్షేమానికే వెచ్చిస్తున్నామని స్పష్టం చేశారు. దీంతో బడ్జెట్’లో కొత్త పథకాలకు శ్రీకారం చుట్టే అవకాశం ఉంటుందా అన్న చర్చ జరుగుతోంది. మరో వంక ఉద్యోగ వర్గాల్లో పీఆర్సీకి సంబంధించి ఆర్థిక మంత్రి తమ ప్రసంగంలో  ప్రకటన చేస్తారా లేదా అనే ఆసక్తి నెలకొంది. అలాగే, సామాన్య  ప్రజలు ఇటీవల పెరిగిన పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరల భారం నుంచి మంత్రి హరీష్, ఏదైనా ఉపసమనం కలిపిస్తారా అని ఎదురు చూస్తున్నారు. గతంలో వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సామాన్య ప్రజలపై వంటగ్యాస్ ధర భారాన్ని తగ్గించేందుకు కొంత మొత్తాన్ని, రూ.50(?) రాష్ట్ర ప్రభుత్వం తరపున  సబ్సిడీగా ఇచ్చిన విషయాన్ని, అదే విధంగా అసెంబ్లీ ఎన్నికలు జరుగతున్న తమిళనాడులో డిఎంకే పార్టీ,తమ పార్టీని అధికారంలోకి వస్తే  గ్యాస్ బండపై వంద రూపాయల సబ్సిడీ ఇస్తామని చేసిన  వాగ్దానాన్ని  గుర్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే, ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు, సోమవారం ఆర్థిక మంత్రి హరీష్ రావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఆర్థిక  శాఖ ముఖ్య కార్యదర్శి రామ కృష్ణా రావు,సలహాదారు జీఆర్ రెడ్డితో బడ్జెట్ పద్దులఫై సుదీర్ఘంగా చర్చించి తుది మెరుగులు దిద్దారు. బడ్జెట్ తుది రూపం సిద్దమైన నేపధ్యంలో ఆర్థిక శాఖ ప్రింటింగ్ ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 18 ఉదయం మంత్రి వర్గం ఆమోదం పొందిన అనంతరం ఆర్థికమంత్రి హరీష్ రావు అదే రోజు రాష్ట్ర బడ్జెట్ 2021-22ను సభలో ప్రవేశ పెడతారు. 20, 22 తేదీల్లో బడ్జెట్‌పై సాధారణ చర్చ,23, 24, 25 తేదీల్లో బడ్జెట్‌ పద్దులపై చర్చ ఉంటుంది 26న ద్రవ్యవినిమయ బిల్లు (బడ్జెట్)పై చర్చ, సభామోదం ఉంటాయి.
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది.  అధికార తెరాస, ఖమ్మం స్థానానికి సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర రెడ్డి పేరును ప్రకటించడంలో కొంచెం జాప్యం చేయడంతో పాటుగా, హైదరాబాద్ స్థానం నుంచి , పీవీ కుమార్తె వాణీ దేవి పేరును చివరి క్షణంలో తెరమీదకు తేవడంతో అంత వరకు కొంత స్తబ్దుగా సాగిన ప్రచారం ఆ తర్వాత వేడెక్కింది. ఉద్యోగ నియామకాల విషయంలో తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ తప్పులో కాలేయడంతో విపక్షాలు, పోటీలో ఉన్న ప్రత్యర్ధులు, నిరుద్యోగ యువత, విద్యార్ధి సంఘాలు  ఒకే సారి ఆయన మీద  విరుచుకు పడ్డారు. ఆయన లెక్క తప్పని నిరుపిస్తం రమ్మని వరస సవాళ్ళు విసిరారు. దీంతో, మంత్రి నియామకా ఇష్యూని పక్కకు తప్పించేందుకు , ఐటీఐఆర్, వరంగల్ రైల్వే ఫ్యాక్టరీ వంటి సెంటిమెంటల్ ఇష్యూస్’ను తెరపైకి  తెచ్చారు. అలాగే, కేంద్ర ప్రభుత్వంపై విమర్శల దాడిని పెంచారు. చివరకు పొరుగు రాష్ట్రానికి చెందిన విశాఖ ఉక్కు ఆందోళన   కూడా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగమైంది.   రెండు నియోజక వర్గాలలో గతంతో పోలిస్తే ఈసారి ఓటర్ల సంఖ్య రెట్టింపు అయింది. ఈసారి రెండు నియోజక వర్గాలలో కలిపి 10 లక్ష 36 వేల మంది తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. అలాగే, రెండు పట్ట భద్రుల నియోజక వర్గాల్లో 164 మంది అభ్యర్ధులు పోటీలో ఉన్నారు.  గత ఎన్నికలతో పోలిస్తే ఇటు ఓటర్ల సంఖ్య, అటు అభ్యర్థుల సంఖ్యా రెట్టింపునకు పైగానే పెరగడంతో ఎన్నికలలో జోష్ పెరిగింది. దీనికితోడు అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో సాధారణ ఎన్నికలను తలపించే రీతిలో ప్రచారం సాగింది. ఎక్కువమంది అభ్యర్ధులు బరిలో ఉండడంతో, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి  తమకే ప్రయోజనం జరుగుతుందని అధికార పార్టీ ఆశపడుతోంది .  దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో చేదు ఫలితాలను చవిచూసిన టీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా వ్యూహ రచన చేసి కేటీఆర్, హరీష్ సహా మంత్రులు,ఎమ్మెల్యేలకు స్పెసిఫిక్ బాధ్యతలు అప్పగించారు. అలాగే,కాంగ్రెస్‌ అభ్యర్థులు చిన్నారెడ్డి, రాములునాయక్‌లకు మద్దతుగా ఉత్తమ్‌, భట్టి, రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తదితరులు విస్తృతంగా ప్రచారం చేశారు. బీజేపీ అభ్యర్థులు ఎన్‌.రాంచందర్‌రావు, ప్రేమేందర్‌రెడ్డిల తరఫున ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, ఎంపీ అరవింద్‌ తదితరులు ప్రచారాన్ని వేడెక్కించారు.  ఖమ్మం స్థానం నుంచి ప్రత్యక్ష ఎన్నికల్లో తొలిసారి పోటీకి దిగిన కోదండరాంకు, టీజేఎస్‌ పార్టీకీ ఈ ఎన్నికలు కీలకంగా మారాయి. ఖమ్మ స్థానం నుంచి పోటీ చేస్తున్న తీన్మార్ మల్లన్న ముందస్తు వ్యూహంతో ప్రధాన పార్టీల అభ్యర్ధులకు ధీటుగా ప్రచారం సాగించారు.  వామపక్షాల మద్దతుతో జయసారథి, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్‌, యువతెలంగాణ కార్యనిర్వాహక అధ్యక్షురాలు రాణీ రుద్రమ తదితరులు పోటీలో ఖమ్మం సీటును పట్టభద్రులు  ఎవరికి  పట్టం కడతారు అన్నది ప్రశ్నార్థకంగా మారింది. హైదరాబాద్ సీటు కూడా ఇటు అధికార తెరాసకు అటు సిట్టింగ్ సీటును నిలుపుకోవడం తో పాటుగా దుబ్బాక , జీహెచ్ఎంసి జోష్ ను కొనసాగించాలని ఆశ పడుతున్నబీజేలకే కూడా ఇజ్జత్ కీ సవాల్ గా మారింది. కాంగ్రెస్ అభ్యర్ధి పార్టీ సీనియర్ నాయకుడు సౌమ్యుడు, మాజీ మంత్రి చిన్నారెడ్డి, వామ పక్షాల మద్దతుతో పోటీ చేస్తున్న మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ కూడా గట్టి పోటీ ఇస్తున్నారు. సో.. చివరకు ఏమి జరుగుతుంది అంటే ఏదైనా జరగవచ్చును. ఈ నెల 14 వ తేదీన పోలింగ్ జరుగుతుంది.17 ఫలితాలు వస్తాయి .. అంతవరకు వెయిట్ అండ్ వాచ్ .  
సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది. ఒకప్పుడు ఎర్ర జెండాను దిగ్విజయంగా ఎదిరించి, మార్క్సిస్టులను మట్టి కరిపించిన మమతా దీదీ ప్రస్తుతం, కాషాయ కూటమి నుంచి గట్టి సవాలును ఎదుర్కుంటున్నారు. వరసగా పదేళ్ళు పాలించడం వలన సహజంగా వచ్చిన ప్రభుత్వ వ్యతిరేకత  కంటే, హిందూ ఓటు పోలరైజేషన్ ఆమెను మరింతగా భయపెడుతోంది. నిజానికి ఐదేళ్ళ క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం ఐదు శాతం కంటే తక్కువ ఓట్లు, మూడంటే మూడు అసెంబ్లీ సీట్లు మాత్రమే గెలుచుకున్న బీజేపీ..  2019 లోక్ సభ ఎన్నికల్లో ఏకంగా 40 శాతం ఓట్లతో 18 స్థానాలు గెలుచుకుంది. ఈ  మార్పు ఇంకా కొన్ని కారణాలు ఉంటే ఉండవచ్చును కానీ.. హిందువుల ఓటు పోలరైజ్  కావడమే ప్రధాన కారణం.  ఈ నేపధ్యంలోనే కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ చివరకు కమ్యూనిస్టులు కూడా బీజేపీలో  చేరారు. ఎన్నికల ప్రకటన వెలువడిన తర్వాత కూడా సిట్టింగ్ ఎమ్మెల్ల్యేలు సహా  తృణమూల్ టికెట్ వచ్చిన నాయకులు కూడా బీజేపీలో చేరుతున్నారు. అనేక మంది ఇతర రంగాల ప్రముఖులు, ముఖ్యంగా ఇంతకాలం, బీజేపీని హిదుత్వ అనుకూల ‘అచ్చుత్’ (అంటారని) పార్టీగా చూసిన ‘సెక్యులర్’ ప్రముఖులు కాషాయం కప్పుకోవడంతో మమతా బెనర్జీకి కొంచెం అలస్యంగానే అయినా, తత్త్వం బోధపడింది. అందుకే ఆమె ఇప్పుడు గుళ్ళూ,గోపురాలకు తిరుగుతున్నారు. కార్యకర్తల సమావేశాల్లో తానూ హిందువునేనని, చెప్పుకుంటున్నారు.  నిజానికి ఇలా నేనూ హిందువునే  అని సెక్యులర్ నేతలు బహిరంగంగా ప్రకటించుకోవడం మమతా బెనర్జీతోనే మొదలు కాలేదు. రాహుల్ గాంధీ తాను హిందువునని, జన్యుధారీ కశ్మీరీ బ్రాహ్మణుని అనీ.. తమ గోత్రం, ‘దత్తాత్రేయ’ గోత్రమని బహిరంగంగా ప్రకటించుకున్నారు. అలాగే  కొద్ది రోజుల క్రితం ప్రియాంకా గాంధీ తానూ హిందువునని చెప్పుకునేందుకు ‘మౌని అమావాస్య’ సందర్భంగా అలహాబాద్ లో గంగా స్నానం చేశారు. గతంలోనూ ఆమె ఎన్నికలకు ముందు గంగా యాత్ర చేశారు. అంతవరకు ఎందుకు కొద్దిరోజుల క్రితం సిపిఐ నారాయణ విశాఖ స్వామి ఆశీస్సులు తీసుకున్నారు. చంద్రబాబు, జగన్ రెడ్డి, కేసీఆర్ ఇలా తెలుగు నేతలు అనేక మంది లౌకిక వాదానికి కాలం చెల్లిందన్న సత్యాన్ని గ్రహించి కావచ్చు ‘నేనూ హిందువును’ అంటూ ప్రకటించుకునేందుకు పోటీ పడుతున్నారు. రాముడిని తలచుకున్నా, జై శ్రీరామ్ అన్నా తమ  లౌకిక వాదం మయలపడి పోతుందని భయపడిన నాయకులు ఇప్పుడు .. జై శ్రీరామ్ అనేందుకు కూడా వెనకాడడం లేదు.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది. గత కొంత కాలంగా సబర్మలతో సహా అనేక అంశాలపై స్పందిస్తూ.. కేరళను టార్గెట్ చేస్తున్న బీజేపీ నాయకులు అక్కడ తమ జెండా ఎగరేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా పార్టీ పాలసీని కూడా పక్కన పెట్టి మెట్రో మ్యాన్ శ్రీధరన్ ను పార్టీలో చేర్చుకుని ఆయనే తమ సీఎం అభ్యర్థి అని ప్రకటించిన 24 గంటలలో యూ టర్న్ తీసుకున్నారు. ఇది ఇలా ఉండగా ప్రస్తుతం సీఎంగా ఉన్న కమ్యూనిస్ట్ నేత పినరై విజయన్ పై గోల్డ్ స్మగ్లింగ్ ఆరోపణలు రావడంతో.. ఈ ఎన్నికలలో ఎల్డిఎఫ్ భవిష్యత్తుపై ప్రజలు ఏ తీర్పు ఇవ్వబోతున్నారనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది ఈ నేపథ్యంలో అక్షరాస్యతలో దేశంలోనే మొదటి స్థానంలో ఉన్న ఆ రాష్ట్ర ప్రజలు ఎవరిని ఆశీర్వదిస్తారు అనే అంశంపై ప్రముఖ మీడియా సంస్థ టైమ్స్ నౌ, సీ ఓటరుతో కలిసి ఒక సర్వేను నిర్వహించారు. ఈ సర్వే ప్రకారం చూస్తే పాపం కమలనాథులు అక్కడ పవర్ చేతికి రావటం అటుంచి కనీసం రెండు మూడు అసెంబ్లీ స్థానాల్లో గెలవటం కూడా కష్టమేనని ఆ సర్వే తేల్చి చెబుతోంది. కేరళలో ఈసారి జరిగే అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ తన హవా చాటుతుందన్న ఆ పార్టీ నేతల మాటలలో ఎలాంటి నిజం లేదని.. ప్రస్తుతానికి అది ఏమాత్రం సాధ్యం కాదని ఈ తాజా సర్వే తేల్చి చెప్పింది. అంతేకాకుండా మొత్తం 140 స్థానాలు ఉన్న కేరళలో.. ప్రస్తుత సీఎం పినరయి విజయన్ నేతృత్వంలోని లెఫ్ట్డ్ డెమొక్రటిక్ ఫ్రంట్ కు 82 సీట్లు పక్కా అని.. ఆయనే తిరిగి అధికారాన్ని నిలబెట్టుకుంటాడని సర్వే చెపుతోంది. అదే సమయంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూనైటెడ్ డెమొక్రాటిక్ ఫ్రంట్ కు 56 నుంచి 60 వరకు సీట్లు వచ్చే అవకాశం ఉందని ఈ సర్వేలో తేలింది. అంతేకాకుండా 2016 ఎన్నికలతో పోలిస్తే ఎల్ డీఎఫ్ ఓటింగ్ శాతం కూడా కొంత పెరగటం ఇక్కడ గమనార్హం. ప్రస్తుతం సీఎంగా ఉన్న విజయన్ మరోసారి సీఎం కావాలని 43.34 శాతం మంది మొగ్గు చూపినట్లుగా సర్వేలో తేలింది. కరోనా సమయంలో విజయన్ సీఎంగా బాగా పని చేసారని ఈ సర్వే పేర్కొంది. మరోపక్క దేశ ప్రధానిగా రాహుల్ గాంధీ ఉండాలని కేరళ ప్రజల్లో 55.84 శాతం మంది కోరుకుంటున్నట్లుగా ఈ సర్వే;లో తేలింది. అయితే కేరళలో ఎలాగైనా పాగా వేయాలని పట్టుదలతో కృషి చేస్తున్న బీజేపీకి ఈసారి కూడా నిరాశ తప్పదని ఈ సర్వేలో స్పష్టం అయింది. ఈ ఎన్నికలలో బీజేపీకి రెండు సీట్లు కూడా రావటం కూడా కష్టమేనని ఈ సర్వే తేల్చింది. అయితే ఎన్నికలకు ముందు ఇలాంటి సర్వేలు బయటకు రావడం.. తరువాత అందులో కొన్ని చతికిల పడడం మనం చూస్తూనే ఉన్నాం. మరి ఈ సర్వే ఫలితాలు నిజామా అవుతాయో లేదో తేలాలంటే కొద్దీ రోజులు వెయిట్ చేయాల్సిందే.        
రాజకీయాలు అంటేనే అదో జూదం. పూలమ్మిన చోటనే కట్టెలు అమ్మవలసి రావచ్చును. అలాంటి పరిస్థితే వచ్చినా, తలవంచుకుని పోగలిగితేనే, ఎవరైనా రాజకీయాలలో రాణించగలరు. అలాకాదని, అలిమి కానిచోట, కూడా తామే అధికులమని భావిస్తే, ఎందుకూ కాకుండా పోతారు. అలాంటి వారు ఇద్దరూ కూడా ఇప్పుడు మన కళ్ళముందే ఉన్నారు.  జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు. అలాగే జయ మరణం తర్వాత ఆమె పరిస్థితి ఏమిటో కూడా వేరే చెప్పవలసిన, అవసరం లేదు. జైలు పాలయ్యారు. సర్వం తానై నడిపించిన పార్టీ నుంచి  బహిష్కరణకు గురయ్యారు. జయ ఉన్నంత వరకు తన వారుగా ఉన్న వారందరూ కానివారయ్యారు. ఒంటరిగా మిగిలారు.  నిజానికి నాలుగేళ్ళు జైలు జీవితం గడిపిన తర్వాత కూడా ఆమె తలచుకుంటే.. రాష్ట్ర రాజకీయాలలో, ముఖ్యంగా అధికారంలో ఉన్న డిఎంకే కూటమిలో అలజడి సృష్టించగలరు. ఎన్నికలలో ఆమె గెలవక పోవచ్చును కానీ.. తనను కాదన్న అన్నాడిఎంకేను ఓడించగలరు. అయిన  ఆమె అందుకు విరుద్ధంగా  రాజకీయాలకు వీడ్కోలు పలికి మౌనంగా పక్కకు తప్పుకున్నారు. రాజకీయ సన్యాసం ప్రకటించారు. ఉమ్మడి శతృవు డిఎంకే ను ఓడించేందుకు అన్నా డిఎంకే కూటమి  పోటీ చేయాలని, కూటమి ఐక్యతను దెబ్బతీయరాదనే ఉద్దేశంతోనే ఆమె రాజకీయ సన్యాసం ప్రకటించారు.    శశికళ మౌనంగా వెళ్లి పోవడం వెనక ఇంకా అనేక కారణాలున్నా ,అసలు కారణం ఆమె, రాజకీయ విజ్ఞత, వివేకం. ఆమె జైలుకు వెళ్ళిన సమయంలో జయలలిత సమాధి వద్ద ఎంత కసిగా, కోపంగా ‘మౌన’ ప్రతిజ్ఞ చేశారో చూశా. అలాంటి ఆమె ఇప్పుడు ఇలా ‘మౌనం’గా వెనకడుగు వేశారంటే, అది ఆలోచించ వలసిన విషయమే.ఆమె వ్యుహతంకంగానే సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే అనేక మంది అనేక కోణాల్లో శశికళ సంచలన నిర్ణయాన్ని విశ్లేషించారు.జైలు జీవితం తర్వాత కూడా అన్నా డిఎంకే నాయకులు తనను అగ్రనేతగా అంగీకరించక పోవడం, అమిత్ షా చెప్పినా.. అన్నా డిఎంకే నాయకులు ఆమెను, మేనల్లుడు దినకరన్’ను కులం పేరున, కుటుంబం పేరున దూరం చేయడం, తిరిగి పార్టీలోకి తీసుకోకపోవడంతో ఆమె మనసు కష్టపెట్టుకుని, సన్యాస నిర్ణయం తీసుకున్నారని కొందరంటున్నారు. పార్టీ మీద పట్టు లేదని, చరిష్మా అసలే లేదని, అందుకే ఆమె అలా నిశ్శబ్ధంగా రాజకీయ సన్యాసం స్వీకరించారని ఇంకొందరు విశ్లేషించారు. ఈ విశ్లేషణలో కొంత నిజం ఉంటే ఉండవచ్చును.. కానీ ఆమె గతాన్ని, నైజాన్ని గుర్తు చేసుకుంటే ఆమె స్ట్రైక్ బ్యాక్ వ్యూహంతోనే ఒకడుగు వెనక్కివేశారని ఆమెతో సన్నిహితంగా మెలిగినవారు, ఆమె రాజకీయ చాణక్యం తెలిసిన వారు అంటారు.   నిజానికి జైలులో ఉన్న కాలంలో కానీ, జైలు నుంచి విడుదలై వచ్చిన తర్వాత కానీ, ఆమె రాజకీయ సన్యాసం వైపు అడుగులు వేస్తున్నట్లు కనిపించలేదు. బెంగుళూరు జైలు నుంచి విడుదలై చెన్నైలో ప్రవేశించిన నప్పుడు ఆమె పెద్ద కాన్వాయ్ తో  తమ కారుకు అన్నాడిఎంకే జెండాతోనే ఎంటరయ్యారు. అలా ఎంట్రీలోనే రాజకీయ ఆకాంక్షను వెంట తెచ్చుకున్నారు. చివరకు ‘సన్యాస’ ప్రకట చేసే వరకు కూడా ఆమె రాజకీయ కార్యకలాపాలు సాగిస్తూనే ఉన్నారు. అటు ఢిల్లీని ఇటు చెన్నైనికూడా కదిల్చారు. అంతేకాదు, రాజకీయాలపై విరక్తితో కాదు, రాజకీయ కసితో, ఉమ్మడి శత్రువు (డిఎంకే) ను ఓడించేందుకే తాను రాజకీయాలనుంచి తపుకుంటున్నట్లు చెప్పారు.  సో .. సన్యాసం తీసుకోవాలనే ఆలోచన, రాజకీయవ్యూహం లోంచి పుట్టిందే కానీ,వైరాగ్యంతో పుట్టింది కాదు ,అన్నవిశ్లేషణ వాస్తవానికి ఇంకొంత దగ్గరగా ఉందని అనుకోవచ్చును. ఇది ‘కామా’నే కాని ‘ఫుల్స్టాప్’ కాదని అంటున్నారు.  ముఖ్యమంత్రి ఎడప్పాడి కే. పళని స్వామి (ఈపీఎస్) ఆమెను పార్టీలోకి అనుమతిస్తే తన కుర్చికీ ఎసరు పెడతారనే భయంతోనే,, ఆమె ఎంట్రీని అడ్డుకున్నారు. ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం, శశికళ ఒకే సామజిక వర్గానికి చెందిన వారు కావడం కూడా, ముఖ్యమంత్రి ఈపీఎస్’ భయానికి కారణంగా పేర్కొంటారు. అందుకే  ఆయన, ‘మన్నార్గుడి’ ఫ్యామిలీని బూచిగా చూపించి, ఆమెను దూరంగా ఉంచారని పార్టీలో ఒక వర్గం గట్టిగా విశ్వసిస్తుంది. అయితే ఆమె శక్తియుక్తులను కూడతీసుకుని  పులిలా పంజా విసిరేందుకే ఆమె వ్యూహాత్మకంగా ఒక అడుగు వెనక్కి వేశారు కావచ్చును అని కూడా, తమిళ రాజకీయ వర్గాల్లో ఒక చర్చ జరుగుతోంది.  గతంలో ఆమె జయలలితతో విబేధాలు వచ్చిన సమయంలో కూడా ఇలాగే కొద్ది కాలం మౌనంగా తెర చాటుకు వెళ్లి పోయారు.  కొద్ది కాలంలోనే మళ్ళీ ‘పోయస్ గార్డెన్’లో ప్రత్యక్షమయ్యారు. జయలలిత స్వయంగా ఆమెను వెనక్కి పిలుపించుకోవలసిన పరిస్థితులను సృష్టించారు. అలా  మళ్ళీ  చక్రం తిప్పారు. జయలలిత మరణం వరకు ఆమె అందరికీ చిన్నమ్మగా అమ్మకు పెద్దమ్మగా సర్వం తానై నిలిచారు. చివరకు జయ అంత్యక్రియల్లో కూడా ఆమెదే పై చేయిగా కనిపించింది.   జయలలిత చనిపోయిన సందర్భంలోనే అన్నా డిఎంకే ఎమ్మెల్ల్యేలో సుమారు 30 మంది వరకు ఆమెకు మద్దతుగా ఉన్నారన్న వార్తలొచ్చాయి. నిజానికి,ఇప్పటికి కూడా ఒక్క అన్నా డిఎంకే లోనేకాదు,డిఎంకే ఇతర పార్టీలలో కూడా  ఆమె అవసరం ఉన్న వాళ్ళు ఉన్నారు. కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో ‘మన్నార్గుడి’ ఫ్యామిలీ మద్దతు లేకుండా గెలిచే అవకాశం లేదు.  ఇవ్వన్నీ నిజమే అయినా.. అన్నీ ఉండి, ఎవరు లేని శశికళలో, ఇంకా  ఎవరి కోసం తాపత్రయ పడాలి? అనే ప్రశ్న జనించి ఉంటే, ఆమె రాజకీయ సన్యాసం నిజం కావచ్చును. ఎందుకంటే ఆమె నెచ్చలి, జయలిత లేరు, భర్త అంతకంటే ముందే చనిపోయారు, పిల్లలు లేరు... పైగా నాలుగేళ్ళ జైలు జీవితం ఆమెలో మార్పు తెచ్చి ఉండవచ్చును. ఈ వయస్సులో తనవారంటూ ఎవరు లేని తనకు రాజకీయాలు ఎందుకు ? శేష జీవితాన్ని ఇలా సాగిద్దామనే ఆలోచన నిజంగా వచ్చి ఉంటే, ఆమె సన్యాసం సత్యం అయినా కావచ్చును, కాకపోనూ వచ్చును. కానీ  శశికళ... ఆమెను అర్థం చేసుకోవడం, అంచనా వేయడం , అంత తేలిగ్గా అయ్యే పని కాదు..
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు. కాంగ్రెస్ అధినాయకత్వం పై నేరుగా అస్త్రాలు సంధించారు. రాహుల్ గాంధీ పేరు చెప్పకుండానే, ఆయన నాయకత్వానికి పనికిరాడని తేల్చి చెప్పారు. ఎవరైనా పార్టీ అధ్యక్షుడు అయితే కావచ్చును, కానీ, ప్రజానాయకుడు కాలేడని, రాహుల గాంధీ ప్రజానాయకుడు కాదు కాలేరు,అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తరచూ రాహుల్ గాంధీని ఉద్దేశించి చేసే  ‘నామ్’ధారీ వ్యంగ్యాస్త్రాన్నే కాంగ్రెస్ సీనియర్ నాయకులు కూడా సందించారు. ఇక అక్కడి నుంచి విధేయ, అసమ్మతి వర్గాల మధ్య మాటల యుద్ధం ఎదో ఒక రూపంలో సాగుతూనే వుంది. అదే క్రమంలో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ, కరుడు కట్టిన ముస్లిం మతోన్మాది, అబ్బాస్ సిద్దిఖీతో కాంగ్రెస్ పార్టీ చేతులు కలపడం అసమ్మతి నాయకులకు మరో అస్త్రాన్ని అందించింది. విషయంలోకి వెళితే, ఇటీవల పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా లోక్’సభలో కాంగ్రెస్ పక్ష నాయకుడు, పశ్చిమ బెంగాల్ పీసీసీ అధ్యక్షుడు అధీర్’రంజన్ చౌదరి, ముస్లిం మత ప్రచారకుడు, అబ్బాస్ సిద్దిఖీతో  వేదిక పంచుకున్నారు.అంతకు ముందే వామ పక్ష కూటమితో  పొత్తు కుదుర్చుకున్న కాంగ్రెస్ పార్టీ, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)ను కూటమిలో చేర్చుకుంది. ఇలా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) అమోదం లేకుండా మతోన్మాద ఐఎస్ఎఫ్’ తో ఎన్నికల పొత్తు పెట్టుకోవడం ఆ పార్టీ నాయకుడు,సిద్ధిఖీతో  పీసీసీ చీఫ్ వేదిక  పంచుకోవడం పై అసమ్మతి నేతలు మండి పడుతున్నారు. ఇలా సిద్దిఖీతో వేదిక పంచుకోవడం పార్టీ మౌలిక సిద్ధాంతాలకు వ్యతిరేకం అంటూ అసమ్మతి వర్గానికి చెందిన కీలక నేత, రాజ్యసభ సభ్యుడు,ఆనంద్ శర్మ మండిపడ్డారు. అంతే కాదు, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)తో జనవరిలో కుదుర్చుకున్న పొత్తుకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ)అమోదం లేదని ఆనంద్ శర్మ, అభ్యంతరం వ్యక్త చేశారు. పార్టీ విశ్వసించే లౌకిక వాదానికి కాంగ్రెస్ అధిష్టానం తీసుకున్న నిర్ణయం గొడ్డలి పెట్టని ఆయన తీవ్రంగా స్పందించారు.   శర్మ వ్యాఖ్యలపై అధీర్ రంజన్ చౌదరి అంతే ఘాటుగా ప్రతిస్పందించారు. “నిజాలు తెలుసుకోండి ఆనంద్ శ‌ర్మ జీ” అంటూ ఆయ‌న వ‌రుస ట్వీట్లు చేశారు. వ్య‌క్తిగ‌త ప్ర‌యోజ‌నాలు ప‌క్క‌న‌పెట్టి, ప్ర‌ధానిని పొగిడి టైమ్ వేస్ట్ చేయ‌కండంటూ ఆయ‌న ఓ ట్వీట్లో అన్నారు. ఆనంద్ శ‌ర్మ అన‌వ‌స‌రంగా కాంగ్రెస్‌ను ల‌క్ష్యంగా చేసుకుంటున్నార‌ని, ఈ అంశాన్ని పెద్ద‌ది చేసి చూపిస్తున్నార‌ని విమ‌ర్శించారు. ఆయ‌న ఉద్దేశాలు స‌రైన‌వే అయితే నేరుగా తనతో మాట్లాడ వలసిందని అన్నారు. బెంగాల్‌లో సీపీఐ(ఎం) కూట‌మికి నేతృత్వం వ‌హిస్తోంది. అందులో కాంగ్రెస్ ఓ భాగం. మ‌త‌తత్వ‌, విభ‌జ‌న రాజ‌కీయాలు చేస్తున్న బీజేపీకి చెక్ పెట్ట‌డానికే ఈ కూట‌మి అని మ‌రో ట్వీట్‌లో అధిర్ రంజ‌న్ అన్నారు. అక్కడతోనూ ఆగలేదు ... ట్వీట్ల మీద ట్వీట్లు సంధిస్తూ, ఆనంద్ శర్మ, బీజేపీ మత విభజన, అజెండాను బలపరుస్తున్నారని, పరోక్షంగా జీ23 నాయకులు బీజేపీకి ప్రయోజనం చేకూరుస్తున్నారని ఆరోపించారు.అంతే కాదు, క్షేత్ర స్థాయి వాస్తవ పరిస్థితులు తెలియకుండా, ఆనంద్ శర్మ పార్టీ మీద దండెత్తడం ఉచితం కాదని చౌదరి ఎదురుదాడి చేశారు. అసమ్మతిలో అసమ్మతి. ఇదలా ఉంటే, కాంగ్రెస్ పార్టీ  సమూల పక్షాళన కోరుతూ సోనియా గాంధీకి,గత సంవత్సరం  జీ 23గా ప్రాచుర్యం పొందిన సీనియర్ నాయకులు రాసిన లేఖపై సంతకాలు చేసిన  నాయకుల్లో నలుగురు,జమ్మూలోసమావేసమైన నాయకుల తాజా నిర్ణయాలు, వ్యాఖ్యలు,విమర్శల పట్ల అసంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరం సోనియా గాంధీకి రాసిన లేఖలో ప్రస్తావించిన అంశాలకు కట్టుబడి ఉన్నామని, అయితే, జీ 23లోని కొందరు సహచరులు, ఇటీవల గీతదాటి చేస్తున్న వ్యాఖ్యలు, విమర్శలను తాము సమర్ధించడం లేదని ఆ నలుగురు పేర్కొన్నారు. ఇందులో ముఖ్యంగా, రాజ్యసభ మాజీ డిప్యూటీ చైర్మన్, పీజే కురియన్ అయితే, “కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు అవసరమైన సంస్కరణలు తెచ్చేందుకు చేసే ప్రయత్నాలను పూర్తిగా సమర్దిస్తాను, కానీ, ‘లక్ష్మణ రేఖ’ దాటితే ఒప్పుకునేది లేదు”అని అసమ్మతిలో అసమ్మతికి తెర తీశారు.అలాగే, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ కుమారడు, మాజీ ఎంపీ సందీప్ దీక్షిత్,మధ్య ప్రదేశ్ సీనియర్ కాంగ్రెస్ నాయకుడు అజయ్ సింగ్’ కూడా గులాం నబీ ఆజాద్, కపిల్ సిబల్, ఆనంద్ శర్మ, మనీష్ తివారీ వంటి జీ 23 కీలక నేతలు అధినాయకత్వంపై చేసిన వ్యాఖ్యలను తప్పు పట్టారు. అలాగే, పార్టీ సీనియర్ నాయకుడు కేంద్ర మాజీమంత్రి వీరప్ప మొయిలీ కూడా,గత సంవత్సరం పార్టీ సీనియర్ నాయకులు  ఒక పరిమిత లక్ష్యంతో  సోనియా గాంధీకి లేఖ రాయడం జరిగిందని, ఆ పేరున జరుగతున్న  కార్యక్రమాలు లేఖ సంకల్పానికి  విరుద్ధమని అన్నారు. జీ 23 కార్యకలాపాలపై రాహుల్ గాంధీ కూడా పరోక్షగా స్పందించారు, ఒకప్పుడు ఎన్ఎస్’యుఐ, యూత్ కాంగ్రెస్’ కు సంస్థాగత ఎన్నికలు వద్దన్న వారే ఇప్పుడు ఇంకోలా మాట్లాడుతున్నారని పరోక్షంగానే అయినా సంస్థాగత ఎన్నికలు నిర్వహించడంతో పాటుగా, పార్టీ పక్షాలనకు తమ కుటుంబం వ్యతిరేకం కాదని, అందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఈ నేపధ్యంలో కాంగ్రెస్ పార్టీలో చెలరిగిన కలకలం  ఇక ముందు ఏమవుతుందో .. ఇంకెన్ని  మలుపులు తిరుగుతోందో ..చూడవలసిందే కానీ ఉహించలేము.
  నేటి కాలంలో, సంబంధాలు బలపడటానికి , విచ్ఛిన్నం కావడానికి కమ్యూనికేషన్ సరిగా లేకపోవడమే అతిపెద్ద కారణంగా మారింది. అది కుటుంబ సంబంధం అయినా, స్నేహ సంబంధం అయినా, లేదా మరేదైనా వ్యక్తిగత సంబంధం అయినా, ఒకరినొకరు సరైన విధంగా కమ్యూనికేట్ చేయడం, ఒకరినొకరు అర్థం చేసుకోవడం చాలాముఖ్యం. నిజానికి చాలామంది రిలేషన్ లో ఉన్నప్పుడు  తమ మనసులో ఉన్న విషయాలను ఓపెన్ గా చెప్పడానికి ధైర్యం చేయరు. చాలా సందేహపడుతూ ఉంటారు. దీని వల్ల అపార్థాలు పెరిగి  రిలేషన్స్ లో దూరం ఏర్పడుతుంది. అందుకే రిలేషన్ లో ఉన్నప్పుడు ఓపెన్ గా మాట్లాడుకోవడం చాలా ముఖ్యం అంటుంటారు.  దీని గురించి మరింత వివరంగా తెలుసుకుంటే.. నమ్మకాన్ని పెంచుతుంది.. చక్కగా, ఎలాంటి విమర్శలు లేకుండా ఓపెన్ గా మాట్లాడుకోవడం ఏ  సంబంధానికైనా బలమైన పునాది ఏర్పరుస్తుంది. రిలేషన్ లో ఉన్న వ్యక్తులు నిజాయితీగా మాట్లాడినప్పుడు, వారి మధ్య నమ్మకం దానంతట అదే పెరుగుతుంది. మంచి కమ్యూనికేషన్  వల్ల అవతలి వ్యక్తి మన మాటలను శ్రద్ధగా వింటున్నారని మనకు అనిపిస్తుంది. ఇది అపార్థాల అవకాశాన్ని తగ్గిస్తుంది , సంబంధాలు దీర్ఘకాలం పాటు బలంగా ఉండటానికి సహాయపడుతుంది.  కమ్యూనికేషన్ బలహీనంగా ఉంటే.. అనుమానం,  అపార్థాలు, దూరం పెరుగుతాయి. అపార్థాలు తొలగిస్తుంది.. రిలేషన్స్ లోని సమస్యలు చాలా వరకు పెద్ద కారణం వల్ల కాకుండా, చిన్న చిన్న అపార్థాల వల్ల తలెత్తుతాయి. సరైన సంభాషణ ద్వారా ఈ అపార్థాలను సులభంగా పరిష్కరించవచ్చు. ప్రజలు తమ ఆలోచనలను, భావాలను బహిరంగంగా మాట్లాడుకున్నప్పుడు, వారికి ఉండే  సందేహాలు తొలగిపోతాయి. ఇది సంబంధాలలో స్పష్టతను తీసుకువచ్చి, అనవసరమైన ఒత్తిడిని తగ్గిస్తుంది. ఎమోషనల్ బాండింగ్.. కమ్యూనికేషన్ చేయడం అంటే కేవలం ఒకరితో ఒకరు మాట్లాడుకోవడమే కాదు..  అది భావోద్వేగాలను వ్యక్తపరిచే ఒక మార్గం కూడా.   మనసులోని మాటలను పంచుకున్నప్పుడు ఇద్దరి మధ్య మరింత గాఢమైన భావోద్వేగ బంధం ఏర్పడుతుంది. ఇది ఒకరిలో ఒకరికి చెందిన ఫీలింగ్ ను పెంపొందించి, సంబంధాలను మరింత సన్నిహితంగా చేస్తుంది. ఈ అనుబంధమే ఏ సంబంధాన్నైనా ప్రత్యేకంగా నిలుపుతుంది. సమస్యల పరిష్కారం.. ప్రతి సంబంధంలో లేదా పరిస్థితిలో సమస్యలు సర్వసాధారణం, కానీ సరైన కమ్యూనికేషన్  ద్వారా వాటిని సులభంగా పరిష్కరించవచ్చు. ఇరు పక్షాలు తమ అభిప్రాయాలను ఓపెన్ గా వ్యక్తపరిచినప్పుడు, పరిష్కారాలు లభించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కమ్యూనికేషన్ వల్ల  తప్పుడు నిర్ణయాలు తీసుకునే అవకాశం తగ్గుతుంది.  ఇద్దరు వ్యక్తులు ఎలాంటి సమస్యలు లేకుండా ముందుకు వెళ్లడానికి మార్గం కల్పిస్తుంది.  అందుకే ఓపెన్ గా మాట్లాడుకోవడం  అన్ని సమస్యలకు పరిష్కారం చూపిస్తుంది. మానసిక ఒత్తిడి.. మనసులో భావాలను, ఆందోళనలను ఇతరులతో పంచుకున్నప్పుడు మనసు తేలికపడుతుంది. ఏ విషయాన్ని అయినా మనసులోనే దాచుకోవడం ఒత్తిడిని పెంచుతుంది, కానీ మాట్లాడటం ఉపశమనాన్ని అందిస్తుంది. ఇది మానసిక ఆరోగ్యానికి కూడా చాలా మేలు చేస్తుంది. మంచి కమ్యూనికేషన్ ఒక వ్యక్తి మరింత ప్రశాంతంగా, సమతుల్యంగా , సంతోషంగా ఉండేలా చేస్తుంది.                                      *రూపశ్రీ.
చుట్టూ ఉన్నవాళ్లు అందరూ మంచివాళ్లు ఉండరు. మనుషుల్లో మంచి, చెడు రెండూ ఉంటాయి. కానీ కొందరిలో స్వార్థం,  ఈర్ష్య,  అసూయ,  ఓర్చుకోలేని తత్వం ఇలాంటివన్నీ చాలా ఎక్కువ ఉంటాయి. అలాంటి వారిని చెడ్డవాళ్లుగా చెబుతూ ఉంటారు.  చాలా వరకు మనుషులు తాము మంచి వాళ్లని, చెడ్డ వాళ్లని బయటకు చెప్పుకోరు.  వారి ప్రవర్తనలో ఇది బయటపడుతూ ఉంటుంది.  ముఖ్యంగా కొందరు వ్యక్తులు మంచి వాళ్ల చుట్టూ చేరి తీయని మాటలతో మోసం చేయాలని చూస్తుంటారు.  వారు ఇలా మోసం చేస్తారని తెలుసుకోలేని పరిస్థితిలో కొందరు ఉంటారు.  తీయని మాటలతో అందరినీ మోసం చేయగల వ్యక్తులు ఎలా ఉంటారు? వారిని కనిపెట్టడం ఎలా?  తెలుసుకుంటే.. ప్రసంశలు.. ఎవరైనా  కలిసిన వెంటనే మితిమీరి పొగడటం మొదలుపెట్టినా లేదా రాత్రికి రాత్రే మిమ్మల్ని ప్రపంచంలోనే అత్యంత ప్రత్యేకమైన వ్యక్తిగా ప్రకటించినా, జాగ్రత్తగా ఉండాలి. మోసం చేసే వ్యక్తులు  వారిని గుడ్డిగా నమ్ముతారనే ఆశతో, మొదట్లో  ప్రేమను, పొగడ్తలను కురిపిస్తారు. మీకు వాళ్ల మీద  నమ్మకం ఏర్పడిన తర్వాత, వారి నిజ స్వరూపం బయటపడుతుంది. తప్పు ఒకరిది, అవమానం మరొకరిది.. తీయని మాటలతో మోసం చేసే వ్యక్తుల ముఖ్య లక్షణం ఏమిటంటే, వారు తమ తప్పులను ఎన్నడూ ఒప్పుకోరు . ఒకవేళ మీరు వారు తప్పు చేయడం మీరు గమనించినా, వారు ఆ పరిస్థితిని ఎంత చాకచక్యంగా వాడుకుంటారంటే, చివరికి మీకే అపరాధభావం కలుగుతుంది. మీరు తప్పు చేశారని మీకు అనిపించేలా  చేస్తారు. తమని తాము అనుమానించుకునేలా.. "నేను అలా ఎప్పుడూ అనలేదు," అనడం లేదా..  "నీకే పిచ్చి, అది అసలు ఎప్పుడు జరిగింది, అలాంటిదేం  జరగలేదు." వంటి  మాటలు ఎవరినుండైనా ఎదురవుతూ ఉంటే..  జాగ్రత్తగా ఉండాల్సిందే.. ఇతరులను తమ చెప్పుచేతల్లో ఉంచుకునేవారు తరచుగా మీకు ఎంత నమ్మకంగా అబద్ధాలు చెబుతారంటే, మీరు మీ జ్ఞాపకశక్తిని, నిజాయితీని మీరే అనుమానించడం మొదలుపెడతారు. ఇది మనసును నియంత్రించడంలో చాలా ప్రమాదకరమైన పద్ధతి. అయ్యో పాపం అనుకునేలా చేయడం.. పరిస్థితులు ఎలా ఉన్నా, తప్పు ఎవరిదైనా సరే, తియ్యని మాటలతో మోసం చేసే  వ్యక్తులు తామే ప్రపంచంలో చాలా బాధలో ఉన్నవారమన్నట్లుగా కథను చెబుతారు. వారు మీ సానుభూతిని పొందాలని చూస్తారు, తద్వారా మీరు వారి పట్ల జాలిపడి, వారు చెప్పే ప్రతిదానితో ఏకీభవించి వారి గురించి పాపం అనుకునేలా చేస్తారు. ఇష్టమైన వారి నుండి వేరు చేయడం.. మిమ్మల్ని లొంగదీసుకోవాలనుకునే వ్యక్తి, మొదట మిమ్మల్ని మీ నిజమైన స్నేహితులు , కుటుంబ సభ్యుల నుండి దూరం చేయడానికి ప్రయత్నిస్తారు. "మీ కుటుంబం మిమ్మల్ని అర్థం చేసుకోదు" లేదా "మీకు ఉన్నది నేను ఒక్కడినే" అనే ఆలోచనలను  మనసులో నాటుతారు. మీరు పూర్తిగా ఒంటరిగా ఉన్నారని, వారిపై ఆధారపడి ఉన్నారని భావించేలా చేయడానికి వారు ఇలా చేస్తారు. అవసరం.. అవసరానికి మాత్రమే మాట్లాడేవారు, మిగతా సమయాలలో తప్పించుకోవడం లేదా కారణాలు, సాకులు చెప్పి దూరంగా ఉండటం చేసేవారు మోసం చేసే స్వభావం కలిగినవారని అర్థం.  ఇలాంటి వారు తమకు అవసరం వచ్చినప్పుడు  చాలా మంచివారిలా ఉంటారు, కానీ వారి పని పూర్తయిన వెంటనే, మిమ్మల్ని మళ్లీ పట్టించుకోవడం మానేస్తారు . తియ్యగా మాట్లాడేవారిని గుర్తించడం కష్టం, ఎందుకంటే వారు తరచుగా చాలా బాగా నటిస్తారు. కానీ ఎప్పుడూ మీ అంతరాత్మ చెప్పేది వినాలి. ఒక సంబంధం మీకు సంతోషానికి బదులుగా ఎప్పుడూ మానసిక గందరగోళాన్ని, ఒత్తిడిని కలిగిస్తుంటే, హద్దులు పెట్టుకోవాల్సిన సమయం ఆసన్నమైందని అర్థం.                                    *రూపశ్రీ.
భార్యాభర్తల బంధం విచ్చిన్నం కాకుండా కాపాడే బంగారు సూత్రం! నేటి వేగవంతమైన జీవితంలో మనుషులకు అన్ని భౌతిక సౌకర్యాలు అందుబాటులో ఉన్నప్పటికీ, రెండు విషయాలలో మాత్రం  వెనుకబడిపోతున్నట్లు స్పష్టంగా తెలుస్తుంది. మొదటిది గాఢమైన, నిజమైన సంబంధాలను నిలబెట్టుకోవడం కాగా, రెండవది మనశ్శాంతి లేకపోవడం. ఇవి ప్రస్తుతం చాలామంది  ఎదుర్కొంటున్న అతిపెద్ద ఛాలెంజ్ లు. ముఖ్యంగా బార్యాభర్తల బంధం ఈ కాలంలో చాలా బలహీనంగా మారింది.  బంధాలను కాపాడుకోవడం,  మనఃశాంతిగా ఉండటం.. ఈ రెండింటిని ఎలా సమతుల్యం చేసుకోవాలనేదే అతిపెద్ద గందరగోళం. అయితే ఈ విషయానికి సమాధానం లేదా అంటే.. ఖచ్చితంగా ఉంది. బంధాలు నిలబెట్టుకోవడానికి బంగారు సూత్రం ఉంది. అదేంటో తెలుసుకుంటే.. బంధాలకు బంగారు సూత్రం.. నేటి వివాహాలు, సంబంధాలలో ఉన్న అతిపెద్ద బలహీనతను  ఎదుటి వ్యక్తిని పూర్తిగా అర్థం చేసుకోకపోవడమే.  బంధం బాగుండాలంటే బంధం ముడిపడేవరకు  కళ్ళు తెరిచి ఉండాలి, కానీ బంధం ముడిపడిన తర్వాత కళ్లు మూసుకుని ఉండాలట. ఈ విషయాన్ని  స్వయానా సినీ నటుడు, రచయిత, ఆధ్యాత్మిక వేత్త అయిన అశుతోష్ రాణా చెప్పుకొచ్చారు.  ఈయన తెలుగులో కూడా చాలా సినిమాలలో నటించారు.   ఒకరితో సంబంధంలోకి వచ్చాక, కళ్ళు మూసుకోవాలని ఆయన అంటున్నారు. దీని అర్థం ఏమిటంటే, ఒక సంబంధం ఏర్పడిన తర్వాత, ప్రతి చిన్న లోపాన్ని పట్టుకుని విమర్శించడం లేదా ఫిర్యాదు చేయడం కంటే, కొన్ని విషయాలను పట్టించుకోకుండా ఉండటం ముఖ్యమని అర్థం. ఈ ప్రపంచంలో ఏ మనిషి అన్ని విషయాలలోనూ పర్పెక్ట్ గా ఉండరు.  ప్రతి ఒక్కరిలోనూ కొన్ని చెడు అలవాట్లు, తప్పు చేసే స్వబావం, కొన్ని లోపాలు ఉంటాయి.   భగవద్గీతలోని పద్దెనిమిదవ అధ్యాయంలో శ్రీకృష్ణుడు, అగ్ని ఎల్లప్పుడూ పొగతో కప్పబడి ఉన్నట్లే, ప్రతి మనిషిలోనూ, ప్రతి చర్యలోనూ ఏదో ఒక లోపం లేదా దోషం ఉంటుందని పేర్కొన్నాడు. వివాహం విషయానికి వస్తే..  సీతాదేవి , శ్రీరాముని జీవితంలో కనిపించేది  సమతుల్యత. అక్కడ వివాహానికి ముందు రాముడి  యోగ్యతను పరీక్షించినప్పటికీ, వివాహం తర్వాత వారిద్దరూ ఒకరి పరిమితులను మరొకరు అంగీకరించి, ప్రేమ , కర్తవ్యానికి మాత్రమే ఎక్కువ  ప్రాధాన్యతనిచ్చారు. ఈ రోజుల్లో పెళ్లి తర్వాత చాలామంది తమ భాగస్వాములను మార్చుకోవాలని ప్రయత్నించడం వల్ల సంబంధాలు త్వరగా నాశనం అవుతున్నాయనేది చాలా మంది అర్థం చేసుకోరు, అయితే సగం కళ్ళు మూసుకోవడం అంటే ఉదాసీనత కాదు, అది ఎదుటి వ్యక్తిలోని లోపాలను అంగీకరించే పరిణతి. ప్రతి వ్యక్తకి తమ సమస్యలకు పరిష్కారాలు తమలోనే ఉంటాయి. కానీ వచ్చిన చిక్కల్లా తమని తాము విమర్శ చేసుకోలేక పోవడం, అలాగే..  తమకు నచ్చిన విధంగానే పరిష్కారం జరగాలని అనుకోవడం. ఇదే చాలామంది సమస్యలు పెద్దవి అవడానికి,  మనఃశాంతి లేకపోవడానికి దారి తీస్తుంది.  బందం బలంగా ఉండాలంటే చిన్న విషయాలను పట్టించుకోవడం మానెయ్యాలి. అదే బంగారు సూత్రం.                                           *రూపశ్రీ.  
శరీరంలో అధిక వేడి, పాదాల్లో మంట, కళ్లలో మంట, నోటి పూత, గ్యాస్, అసిడిటీ వంటి సమస్యలు చాలా మందిని ఇబ్బంది పెడుతుంటాయి. ఈ లక్షణాలు సాధారణంగా కనిపించినప్పటికీ, ఆయుర్వేదం ప్రకారం ఇవి పిత్త దోషం (Pitta Dosha) పెరగడం వల్ల వచ్చే సంకేతాలు కావచ్చని ప్రముఖ ఆయుర్వేద నిపుణులు డా. చి. మధుసూదన్ శర్మ వివరిస్తున్నారు. ఈ వీడియోలో పిత్త దోషం ఎందుకు పెరుగుతుంది? దానికి కారణమయ్యే ఆహారపు అలవాట్లు, జీవనశైలి, వాతావరణ ప్రభావాలు ఏమిటి? అలాగే పిత్తాన్ని తగ్గించేందుకు తీసుకోవాల్సిన ఆహారం, పాటించాల్సిన జీవనశైలి, ఆయుర్వేదంలో సూచించే సహజ చిట్కాలు వంటి అనేక ఉపయోగకరమైన విషయాలను సులభంగా వివరించారు. శరీరంలో వేడి ఎక్కువగా అనిపించడం, పాదాల్లో లేదా కళ్లలో మంట, తరచూ నోటి పూత రావడం, గ్యాస్, అసిడిటీ సమస్యలు వేధిస్తుంటే ఈ వీడియోలో చెప్పిన సూచనలు మీకు ఉపయోగపడవచ్చు. ఈ వీడియోలో తెలుసుకునే ముఖ్యాంశాలు: పిత్త దోషం అంటే ఏమిటి? శరీరంలో వేడి పెరగడానికి ప్రధాన కారణాలు పాదాలు, కళ్లలో మంట ఎందుకు వస్తుంది? నోటి పూత, గ్యాస్, అసిడిటీకి ఆయుర్వేద వివరణ పిత్తాన్ని తగ్గించే ఆహారాలు నివారించాల్సిన ఆహార పదార్థాలు రోజువారీ జీవితంలో పాటించాల్సిన ఆరోగ్యకరమైన అలవాట్లు సహజంగా శరీరాన్ని చల్లగా ఉంచే ఆయుర్వేద సూచనలు మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి, పిత్త దోషాన్ని సమతుల్యం చేసుకోవడానికి ఈ వీడియోను పూర్తిగా వీక్షించండి. గమనిక: ఈ వీడియోలోని సమాచారం ఆయుర్వేద అవగాహన కోసం మాత్రమే. వ్యక్తిగత ఆరోగ్య సమస్యల కోసం తప్పనిసరిగా అర్హత కలిగిన వైద్యుడిని లేదా ఆయుర్వేద నిపుణుడిని సంప్రదించండి. మీ ఆరోగ్య సమస్య ఏదైనా... మా హెల్త్ యూట్యూబ్ ఛానల్‌లో సీనియర్ డాక్టర్స్ చెప్పిన సలహాలు... సూచనలు ఉన్నాయి. మా యూట్యూబ్ ఛానల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 👉 TeluguOne Health (సబ్‌స్క్రైబ్ చేయడం మర్చిపోకండి!)  
పురుషుల ఆరోగ్యం విషయంలో చాలామంది నిర్లక్ష్యం చేసే సమస్యల్లో క్యాన్సర్ ఒకటి. ప్రారంభ దశలోనే గుర్తిస్తే చాలా రకాల క్యాన్సర్లను విజయవంతంగా చికిత్స చేయవచ్చు. అయితే లక్షణాలను నిర్లక్ష్యం చేయడం వల్ల వ్యాధి ముదిరే ప్రమాదం ఉంటుంది. ఈ వీడియోలో ప్రముఖ యూరాలజిస్టు, ఆండ్రాలజిస్టు డా. ఏవి రవి కుమార్ పురుషుల్లో ఎక్కువగా కనిపించే ఐదు ప్రధాన క్యాన్సర్ల గురించి సులభంగా వివరించారు. ముఖ్యంగా ప్రోస్టేట్ క్యాన్సర్, మూత్రాశయ క్యాన్సర్, కిడ్నీ క్యాన్సర్, వృషణాల క్యాన్సర్, పురుషాంగ క్యాన్సర్ వంటి వ్యాధుల లక్షణాలు, ప్రమాద కారకాలు, ఎప్పుడు వైద్యుడిని సంప్రదించాలి అనే అంశాలను తెలియజేశారు.  అలాగే చాలామందికి ఉండే సందేహమైన యూరాలజీ (Urology) మరియు ఆండ్రాలజీ (Andrology) మధ్య ఉన్న తేడాను కూడా స్పష్టంగా వివరించారు. మూత్ర సంబంధిత వ్యాధులు, పురుషుల లైంగిక ఆరోగ్యం, సంతానలేమి సమస్యలు, ప్రోస్టేట్ సమస్యలు వంటి సందర్భాల్లో ఏ నిపుణుడిని సంప్రదించాలో ఈ ఇంటర్వ్యూలో తెలుసుకోవచ్చు.  పురుషులు తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఏ లక్షణాలను అస్సలు నిర్లక్ష్యం చేయకూడదు? క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు ఎందుకు అవసరం? వంటి ఎన్నో ఉపయోగకరమైన విషయాలను ఈ వీడియోలో డా. ఏవి రవి కుమార్ వివరించారు.  ప్రతి పురుషుడు తప్పకుండా తెలుసుకోవాల్సిన ఆరోగ్య సమాచారం కోసం ఈ వీడియోను పూర్తిగా వీక్షించండి.   మీ ఆరోగ్య సమస్య ఏదైనా... మా హెల్త్ యూట్యూబ్ ఛానల్‌లో సీనియర్ డాక్టర్స్ చెప్పిన సలహాలు... సూచనలు ఉన్నాయి. మా యూట్యూబ్ ఛానల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 👉 TeluguOne Health (సబ్‌స్క్రైబ్ చేయడం మర్చిపోకండి!)