LATEST NEWS
తెలుగువన్ ఎక్స్ క్లూజివ్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పార్టీల కోసం ప్రాణాలర్పించే కార్యకర్తల వాస్తవ పరిస్థితిపై తెలుగువన్ కు ఇచ్చిన ప్రత్యక ఇంటర్య్వూలో  తెలుగుదేశం సీనియర్ కార్యకర్త సిరిపురం శ్రీధర్  మాట్లాడారు. ఎన్నికల సమయంలో, పార్టీ ఉద్యమాల్లో జెండాలు మోసి, ప్రత్యర్థులతో పోరాడే సాధారణ కార్యకర్తలు చివరకు కేసులపాలై కోర్టుల చుట్టూ తిరుగుతుంటే ఏ రాజకీయ పార్టీ కూడా వారిని పట్టించుకోవడం లేదనే చేదు నిజాన్నిఆయన ఇసుమంతైనా సంకోచం లేకుండా కుండబద్దలు కొట్టినట్లు చెప్పారు. రాజకీయ పార్టీలు కార్యకర్తలను కేవలం వాడుకుని వదిలేస్తున్నాయా  అంటే ఔననే అనాలని సిరిపురం శ్రీధర్ అన్నారు.  తెలుగు రాష్ట్రాల్లో, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లో గత కొన్నేళ్లుగా రాజకీయ కక్ష సాధింపులు, కేసుల పరంపర విపరీతంగా పెరిగిపోయింది. పార్టీ అధిష్ఠానం పిలుపునిచ్చిన కార్యక్రమాల్లో పాల్గొని, ఆవేశంతో ముందుకెళ్లే యువత, కార్యకర్తలు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలోనే తెలుగుదేశం పార్టీ   సీనియర్ కార్యకర్త, బ్రాహ్మణ చైతన్య వేదిక నిర్వాహకుడు సిరిపురం శ్రీధర్  పార్టీ కోసం చేసిన ఉద్యమాల్లో భాగంగా తనపై గతంలో దాదాపు 20 కి పైగా రాజకీయ కేసులు నమోదయ్యాయని చెప్పారు. ఒకసారి కేసుల్లో ఇరుక్కున్న తర్వాత సమాజంలో, కుటుంబంలో ఎదురయ్యే అవమానాలు, ఆర్థిక ఇబ్బందులు వర్ణనాతీతమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కేసుల విచారణ కోసం కోర్టులకు ఫీజులు చెల్లించలేక, చివరకు తల్లిదండ్రుల దగ్గర అడుక్కుని లేదా అప్పులు చేయాల్సిన దుస్థితి కార్యకర్తలకు వస్తోందని పేర్కొన్నారు. నిజాయితీగా పార్టీ కోసం జెండా పట్టి రోడ్లెక్కిన కార్యకర్త ఒకసారి పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కిన తర్వాత ఏ  అగ్రనేత కూడా వారిని కాపాడటానికి రావడం లేదని శ్రీధర్ చెప్పారు. నాయకులు కేవలం ఫోటోలకు ఫొటోలు దిగడానికి, మీడియాలో కనిపించడానికే ప్రాధాన్యత ఇస్తారు తప్ప,   లోయర్ లేదా మిడిల్ క్లాస్ కార్యకర్త ఆసుపత్రి బిల్లు ఎంత అయింది? కోర్టు ఖర్చులు ఎలా కడుతున్నాడు? అని మానవత్వంతో ఆలోచించే పరిస్థితుల్లో నేటి నాయకత్వాలు లేవని చెప్పారు.  ప్రతి రాజకీయ పార్టీలోనూ నిజమైన ఉద్యమ స్ఫూర్తితో పనిచేసేవాళ్లు వేళ్ల మీద లెక్కపెట్టేంత మందే ఉంటారన్న ఆయన మిగిలిన వారంతా కేవలం టీవీల్లో, ఫొటోల్లో కనిపించాలనే  బ్యాచ్ మాత్రమే అని శ్రీధర్ చెప్పారు.  వ్యక్తిగత ఆస్తుల గొడవలు లేదా సంఘవిద్రోహ చర్యల వల్ల వచ్చే కేసుల గురించి తాను మాట్లాడటం లేదని..  కేవలం పార్టీ పిలుపు మేరకు ఉద్యమాల్లో పాల్గొని అన్యాయంగా జీవితాలను నాశనం చేసుకుంటున్న జెన్యూన్ కార్యకర్తల కోణంలోనే ఈ వాదన  వినిపిస్తున్నట్లు స్పష్టం చేశారు. ఏదో ఒక రాజకీయ పార్టీని తక్కువ చేయడం తన ఉద్దేశం కాదని, ప్రస్తుతం అన్ని రాజకీయ పార్టీలలోనూ ఇదే పంథా నడుస్తోందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. కార్యకర్తలను వాడుకోవడం, ఆపై కేసులు కాగానే వదిలేయడం అనే సంస్కృతి మారాలని శ్రీధర్ అభిప్రాయపడ్డారు. యువత రాజకీయ ఆవేశంలో ఊగిపోయి వివాదాల్లో చిక్కుకోకుండా, కేసులకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిదని హితవు పలికారు.   Siripuram Sridhar Interview, Political Party Workers Cases, TDP Leader Sensational Comments, Political Cases On Youth, Tone News Telugu, AP Politics Reality
తెలుగువన్ ఎక్స్ క్లూజివ్  యూట్యూబర్ బచ్చలకూరి జోసఫ్ అలియాస్  ప్రశ్న రావణ్  అరెస్టు,  ఆయనపై నమోదైన సెక్షన్ల వ్యవహారం ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర సంచలనంగా మారింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌లను ఉద్దేశించి సోషల్ మీడియాలో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలతో గన్నవరం పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు. అయితే..  ఈ కేసులో సాధారణ  సెక్షన్లతో పాటు కేంద్ర ప్రభుత్వం ఉగ్రవాద నిరోధక చర్యల కోసం ప్రయోగించే అత్యంత కఠినమైన చట్టం  ఉపా  అన్‌లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ సెక్షన్ 39ను కూడా చేర్చడం తీవ్ర చర్చకు దారితీసింది.  ఈ నేపథ్యంలో ప్రస్తుత చట్టపరమైన పరిణామాలు,  ఉపా చట్టం తీవ్రత, రావణ్‌కు కోర్టుల్లో ఎదురుకాబోయే సవాళ్లపై మాజీ న్యాయమూర్తి రామకృష్ణ  తెలుగువన్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో సంచలన విశ్లేషణ చేశారు. సాధారణంగా దేశద్రోహ శక్తులు, ఉగ్రవాద ముఠాలతో సంబంధాలు ఉన్నవారిపై ప్రయోగించే ఈ చట్టాన్ని ఒక యూట్యూబర్‌పై ప్రయోగించడం వెనుక ఉన్న న్యాయపరమైన సాధ్యాసాధ్యాలను ఆయన  వివరించారు.  మాజీ జడ్జి రామకృష్ణ విశ్లేషణ ప్రకారం.. ఉపా  చట్టం కింద కేసు నమోదైతే నిందితుడికి సాధారణ కోర్టుల్లో అంత సులభంగా ఉపశమనం లభించదు. ఈ చట్టం పరిధిలోకి వచ్చే కేసులను ఎన్ఐఏ  ప్రత్యేక  కోర్టులు లేదా హైకోర్టులు మాత్రమే విచారిస్తాయి. అంతే కాకుండా, ఈ చట్టం కింద నమోదైన సెక్షన్ల ప్రకారం నిందితుడికి త్వరగా బెయిల్ వచ్చే అవకాశం ఉండదు.  విచారణ ప్రక్రియ చాలా సుదీర్ఘంగా సాగుతుందని ఆయన స్పష్టం చేశారు. రావణ్ కేసులో కేవలం దూషణలు, రాజకీయ విమర్శలే కాకుండా ఉపా చట్టం పరిధిలోకి వచ్చే వ్యూహాత్మక అంశాలు లేదా ఆడియో క్లిప్పింగుల ఆధారంగా పోలీసులు బలమైన సాక్ష్యాలను సిద్ధం చేసి ఉంటారని   అభిప్రాయపడ్డారు. ఒకవేళ ఈ సెక్షన్లను ఉన్నతాధికారులు,  న్యాయస్థానాలు ప్రాథమికంగా అంగీకరిస్తే.. రావణ్‌ను ఈ కేసుల నుండి రక్షించడం చట్టపరంగా చాలా కష్టమైన విషయమని మాజీ న్యాయమూర్తి   చెప్పారు.  రాజకీయ విమర్శలు, సోషల్ మీడియా వేదికగా ప్రశ్నించే హక్కు అందరికీ ఉన్నప్పటికీ..  మాట్లాడే భాష చట్టపరిధిని దాటినప్పుడు ఇలాంటి తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని రామకృష్ణ అన్నారు.  ఇప్పటికే రాష్ట్రంలో ఈ కేసు చుట్టూ తీవ్ర రాజకీయ దుమారం రేగుతోంది. ప్రజాస్వామ్యవాదులు, ప్రతిపక్షాలు ఈ చట్టం ప్రయోగాన్ని కక్షసాధింపుగా అభివర్ణిస్తుండగా..  చట్టాన్ని ఉల్లంఘిస్తే ఎంతటి వారైనా శిక్షార్హులేనని అధికార పక్షం వాదిస్తోంది.   పూర్తి ఇంటర్వ్యూ తెలుగువన్ చానల్ లో వీక్షించండి Former Judge Ramakrishna Legal Analysis, Andhra Pradesh Police Ravan Arrest, Chandrababu Pawan Kalyan YouTuber Case, AP Politics Social Media Arrests    
తెలంగాణ రాజకీయాలలో పరిచయం అక్కర్లేని పేరు... విలక్షణ శైలి, వినూత్న వాగ్ధాటితో నిత్యం వార్తల్లో ఉండే బీఆర్ఎస్ ఫైర్ బ్రాండ్ నాయకుడు ఛామకూర మల్లారెడ్డి కారు దిగేస్తున్నారా?  రాజకీయంగా సంచలన నిర్ణయం తీసుకోబోతున్నారా? అంటే.. తాజా రాజకీయ పరిణామాలను గమనించిన వారు ఔననే అంటున్నారు.    2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో భారత్ రాష్ట్ర సమితి  ఓటమి పాలైనప్పటి నుండి, ఆ పార్టీ రాష్ట్రంలో తన ఉనికిని కాపాడుకోవడానికి, క్యాడర్‌ను నిలబెట్టుకోవడానికి తీవ్రంగా శ్రమిస్తున్నప్పటికీ..  సీనియర్ నేతలు ఒకరి తరువాత ఒకరు అన్నట్లుగా పార్టీని వీడుతున్నారు. ఇప్పుడా బాటలో చామకూర మల్లారెడ్డి కూడా నడుస్తున్నారా అన్న చర్చ పొలిటికల్ సర్కిల్స్ లో జోరుగా సాగుతోంది.  ఇందుకు ఆయన మాటలు బలం చేకూరుస్తున్నాయి. ఇటీవల    ఒక   వేడుకలో పాల్గొన్న చామకూర మల్లారెడ్డి..  తాను బీఆర్‌ఎస్ పార్టీకి క్రమంగా దూరమవున్నానని బాహాటంగానే అఅంగీకరించారు. తాను పార్టీకి కాస్త దూరం కాగానే, బీఆర్‌ఎస్ కార్యకర్తలు, సొంత మద్దతుదారులు తనను నిర్లక్ష్యం చేయడం ప్రారంభించారన్న ఆవేదనను ఆ సందర్భంగా వ్యక్త పరిచారు. తాను బీఆర్ఎస్ కు దూరం జరగడం ప్రారంభించి కొన్ని రోజులే  అయినప్పటికీ.. అప్పుడే.. తన మద్దతుదారులు తనను ఏకాకిని చేసేయడం మొదలెట్టారనీ మల్లారెడ్డి ఒకింత భావోద్వేగ స్వరంతో చెప్పారు. ఆయన భావోద్వేగాలు, ఆవేదన కాసేపు పక్కన పెడితే.. మల్లారెడ్డి మాటలను బట్టే ఆయన బీఆర్ఎస్ కు దూరమౌతున్నారని అవగతమౌతోంది. ఆయన కారు దిగేయడానికి ఇంకెన్నో రోజులు పట్టకపోవచ్చునని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.   ఆయన చెప్పడం సరే.. వాస్తవానికి గత కొంత కాలంగా మల్లారెడ్డి బీఆర్ఎస్ తో అంటీముట్టనట్లుగా ఉంటున్నారు. పార్టీ కార్యక్రమాలకూ, సమావేశాలకూ ఆయన గైర్హాజరౌతున్నారు. దీంతో మల్లారెడ్డి స్వయంగా తాను బీఆర్ఎస్ కు దూరం అవుతున్నానని చెప్పడానికి చాలా రోజుల ముందు నేంచే మల్లారెడ్డి పార్టీ మార్పుపై రాజకీయవర్గాలలో చర్చ జోరందుకుంది.  ఇక ఇప్పుడు ఆయన స్వయంగా పార్టీకి దూరం అవుతున్నానని బహిరంగంగానే చెప్పేయడంతో ఆయన ఏ పార్టీ గూటికి చేరుతారన్న ఆసక్తికర చర్చ మొదలైంది.  ఈ నేపథ్యంలోనే ఆయనకు కాంగ్రెస్ లో చేరే అవకాశాలు దాదాపు మృగ్యమనీ, చేరితే గీరితే ఆయన కాషాయం గూటికే చేరాలని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అంతే కాకుండా గత కొంత కాలంగా ఆయన బీజేపీ అగ్రనేతలతో సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తూ, వారితో టచ్ లో ఉంటున్నారని విశ్వసనీయవర్గాల ద్వారా తెలుస్తోంది.   BRS Party, Telangana Politics, Revanth Reddy, BJP Telangana, Malla Reddy Leaving BRS, Teluguone
ALSO ON TELUGUONE N E W S
    ఇప్పుడు ఎక్కడ చూసినా ఈ నెల 10 న రాబోతున్న అఖిల్ అక్కినేని లెనిన్(Lenin)మూవీ సందడి వాతావరణం నెలకొని ఉంది. ఇప్పుడు ఆ సందడి వాతావరణాన్ని రెట్టింపు చెయ్యడానికి మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్(Ntr)రంగంలోకి దిగాడు. లెనిన్ లో శ్రీరామపురం, భారతమ్ మిట్ట అనే కీలకమైన ఏరియాలని  పరిచయం చేస్తూ, కథా నేపథ్యాన్ని వివరించే పవర్ ఫుల్ వాయిస్ ఓవర్ ని  ఎన్టీఆర్ అందించారు.  తన గంభీరమైన కంఠస్వరంతో సినిమా ప్రారంభంలో ఇచ్చే ఈ ఇంట్రడక్షన్ థియేటర్లలో ప్రేక్షకులకి, అభిమానులకి పూనకాలు తెప్పించడం ఖాయంగా కనిపిస్తోంది. పైగా లెనిన్ వంటి హై వోల్టేజ్ యాక్షన్ డ్రామాకి ఎన్టీఆర్ వంటి స్టార్ హీరో తన వాయిస్ ని ఇవ్వడం లెనిన్ కి అదనపు మైలేజ్ కూడా. ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ ఇస్తున్న స్టిల్స్ తో పాటు అఖిల్ తో దిగిన పిక్స్ వైరల్ గా మారాయి. Also read: ప్రొడ్యూసర్ వెంకట్ అనీష్ రెడ్డిపై చీటింగ్ కేసు నమోదు.. అమౌంట్ ఎంతో తెలిస్తే షాక్ అవుతారు  సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, మనం ఎంటర్‌టైన్‌మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న లెనిన్ కి  థమన్ అందించిన మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మరో స్థాయికి తీసుకెళ్లబోతున్నాయి. జూన్ 26న విడుదల కావాల్సిన ఈ చిత్రం 100 శాతం పర్ఫెక్ట్ అవుట్‌పుట్ కోసం జూలై 10కి వాయిదా పడింది. హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే కూడా ఈ చిత్రంలో ఒక అద్భుతమైన పాత్రలో కనిపిస్తోంది. తిరుమల శ్రీవారిని దర్శించుకుని చిత్ర యూనిట్ అంతా ప్రమోషన్లలో బిజీగా ఉండగా, ఎన్టీఆర్ ఎంట్రీతో లెనిన్  బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులని  సృష్టించడానికి సిద్ధమైపోయింది.  మురళి కిషోర్ అబ్బురు దర్శకుడు.  
ప్రముఖ నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ కన్నడ చలనచిత్ర పరిశ్రమలోకి అత్యంత ప్రతిష్టాత్మకంగా అడుగుపెడుతూ నిర్మిస్తున్న మైథలాజికల్ యాక్షన్ డ్రామా 'పినాక'. గోల్డెన్ మెగాస్టార్ గణేష్ సరికొత్త లుక్‌లో నటిస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ కి బి. ధనంజయ దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన 90 సెకన్ల నిడివి గల హై-వోల్టేజ్ టీజర్‌ను చిత్రబృందం అధికారికంగా విడుదల చేసింది. పీరియాడిక్ డ్రామాగా తెరకెక్కుతోన్న ఈ సినిమా టీజర్ ప్రేక్షకులను ఒక సరికొత్త ఆధ్యాత్మిక, యుద్ధ ప్రపంచంలోకి తీసుకెళ్తోంది. ఈ టీజర్‌లో దర్శకుడు బి. ధనంజయ్ చూపించిన విజువల్స్, యాక్షన్ ఎపిసోడ్స్ సినిమాపై అంచనాలు ఏర్పడేలా చేశాయి. టీజర్ ప్రారంభంలో ‘శివనామస్మరణ’ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, ఒక అద్భుతమైన డివైన్ కింగ్‌డమ్‌ను పరిచయం చేయడం ద్వారా ప్రేక్షకుడిని కథలోకి లీనం చేస్తుంది. శివుడి భారీ విగ్రహం, ప్రాచీన సామ్రాజ్యాల సెట్టింగ్స్ విజువల్స్ పరంగా ఎంతో రిచ్‌గా ఉన్నాయి. కథలోకి వెళ్తే, ఒకవైపు దైవత్వం ఉట్టిపడే సామ్రాజ్యం కనిపిస్తుంటే, మరోవైపు చీకటి శక్తుల ఎదుగుదల, అలాగే ఒక భయంకరమైన రహస్యాన్ని టీజర్‌లో చూపించారు. ఈ రెండు శక్తుల మధ్య జరిగే పోరాటమే ఈ సినిమా ముఖ్య కథాంశం అని అర్థమవుతోంది. కాలాలను దాటి సాగే యుద్ధం (A War Across Ages) అనే క్యాప్షన్ ఈ సినిమా బ్యాక్‌డ్రాప్‌ను వివరిస్తోంది. విధి అతడిని ఎంచుకుంది (Destiny Chooses Him) అంటూ హీరో గణేష్ ఎంట్రీ ఇచ్చే సీన్ ఆకట్టుకుంది. 'ధర్మ రక్షణ కోసం సాగే యుద్ధం' అనే లైన్‌తో టీజర్ ముగియడం సినిమాపై మరింత ఉత్కంఠను రేకెత్తిస్తోంది. ఈ చిత్రంలో రెండు భిన్నమైన కాలాల మధ్య జరిగే మిస్టరీని దర్శకుడు ఎంతో ఆసక్తికరంగా చూపించబోతున్నారు. ముఖ్యంగా ఈ సినిమాలో వచ్చే సుమారు 40 నుండి 45 నిమిషాల నిడివి గల ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్ కథకు ప్రధాన ఆకర్షణగా నిలవనుందని చిత్ర బృందం పేర్కొంది. ఈ భారీ ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్ కోసం విజువల్ ఎఫెక్ట్స్ పై ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. గౌర హరి అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, అద్భుతమైన విజువల్స్ టీజర్‌కు అదనపు బలాన్ని చేకూర్చాయి. గణేష్ సరసన అర్చన అయ్యర్ కథానాయికగా నటిస్తుండగా, రంగాయణ రఘు, ఇతర ప్రముఖ నటీనటులు కీలక పాత్రల్లో మెరవనున్నారు. ఈ మైథలాజికల్ వండర్ ను అక్టోబర్ 2, 2026 న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్ గా విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. టీజర్ లోని విజువల్స్ అద్భుతంగా ఉన్నాయంటూ ఇప్పటికే నెటిజన్ల నుండి భారీగా ప్రశంసలు దక్కుతున్నాయి. అయితే మరికొందరు మాత్రం కాస్ట్యూమ్ డిజైన్స్, కొన్ని సీన్స్ పాత సినిమాలను గుర్తుచేసేలా ఉన్నాయంటూ చిన్నపాటి విమర్శలు కూడా గుప్పిస్తున్నారు. ఏదేమైనప్పటికీ, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తున్న ఈ మొదటి కన్నడ పాన్ ఇండియా ప్రయత్నం బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి. Pinaka Teaser, Golden Megastar Ganesh, People Media Factory, B Dhananjaya, TeluguOne  
The makers of Lenin have announced a major surprise by revealing that Jr NTR has lent his voice to the film. The update has significantly boosted the buzz around the project, with fans excited to see the star extending his support to Akhil's ambitious venture. Sharing the announcement on social media, the makers wrote, "A world born out of conviction. Introduced by a voice that needs no introduction." While they did not reveal the exact nature of NTR's contribution, it is evident that his powerful narration will introduce the world of Lenin. Expressing his gratitude, Akhil shared an emotional note for the RRR star. He wrote, "Thank you Tiger. Thanks for roaring for #Lenin. Eppatiki marichipolenantha Prema ichhavu. Love you brother." The heartfelt message has resonated with fans, highlighting the bond between the two actors. NTR's voice has often elevated promotional content, and his association with Lenin has now added another layer of anticipation. Fans are eagerly waiting for the makers to unveil the title glimpse and experience the narration that promises to set the tone for the film. Disclaimer: This article is based on discussions and information shared across publicly available sources and social media. Interpretations remain those of the users involved. Readers are encouraged to exercise discretion before drawing conclusions.
తెలంగాణ జానపద గీతాలు, యూట్యూబ్ ప్రైవేట్ ఆల్బమ్ సాంగ్స్‌తో సోషల్ మీడియాలో విపరీతమైన క్రేజ్ మరియు లక్షలాది మంది అభిమానులను సొంతం చేసుకున్న తెలుగమ్మాయి నాగదుర్గ ఇప్పుడు వెండితెరపై హీరోయిన్‌గా అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి సిద్ధమైంది. యూట్యూబ్‌లో తనదైన నటన, డ్యాన్స్‌తో ఫేమ్ తెచ్చుకున్న ఈ తెలంగాణ బ్యూటీ, తమిళ చిత్రసీమలో హీరోయిన్‌గా అడుగుపెడుతూ చేసిన మొదటి చిత్రం 'లవ్ ఓ లవ్' (Love Oh Love). ఈ సినిమాలో హీరోగా ధనుష్ మేనల్లుడు పవిష్ నారాయణన్ నటించగా, మహేష్ రాజేంద్రన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఇండస్ట్రీలో మంచి అంచనాలు ఉన్న ఈ యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ చిత్రం జూలై 10వ తేదీన తమిళంతో పాటు తెలుగులోనూ గ్రాండ్‌గా థియేటర్లలో విడుదల కాబోతోంది.  చిత్ర యూనిట్ తాజాగా ఈ సినిమాకు సంబంధించిన అఫీషియల్ తెలుగు ట్రైలర్‌ను విడుదల చేసింది. ప్రస్తుతం ఈ ట్రైలర్ యూట్యూబ్‌తో పాటు సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్స్‌లో తెగ వైరల్ అవుతోంది. ఈ రోజుల్లో ప్రేమించడం ఎంత ఈజీనో, ఆ ప్రేమను నిలబెట్టుకోవడానికి, లవర్ చేసే విలాసవంతమైన ఖర్చులను భరించడానికి ఈ తరం అబ్బాయిలు పడే కష్టాలు, మానసిక సంఘర్షణలు ఎలాంటివో ఈ 'లవ్ ఓ లవ్' ట్రైలర్‌లో చాలా రియలిస్టిక్‌గా, వినోదాత్మకంగా చూపించారు. ట్రైలర్ లోని కథాంశం ప్రకారం హీరో రఘువరన్ ఒక సాధారణ యువకుడు. తన గర్ల్‌ఫ్రెండ్ మితిమీరిన ఖర్చులు, లగ్జరీ లైఫ్ స్టైల్ వల్ల అతని జీవితం అస్తవ్యస్తంగా మారుతుంది. అప్పుల ఊబిలో కూరుకుపోవడమే కాకుండా, చివరకు ఉద్యోగం కూడా ఊడిపోతుంది. ఈ కష్టాల వల్ల సొంత కుటుంబం కూడా అతన్ని దూరం పెడుతుంది. ఇలాంటి విచిత్రమైన, గందరగోళ పరిస్థితుల మధ్య సాగే ఒక భిన్నమైన లవ్ స్టోరీగా ఈ సినిమాను మలిచారు. ముఖ్యంగా ట్రైలర్‌లో హీరో "బ్రేకప్‌ను లీగలైజ్ చేయాలి" అంటూ కోర్టు మెట్లెక్కి చెప్పే డైలాగులు, చేసే హంగామా నేటి యువతను ఎంతగానో ఆకట్టుకునేలా ఉన్నాయి. అబ్బాయిల కష్టాలను కళ్లకు కట్టినట్లు చూపిస్తూనే, అవుట్ అండ్ అవుట్ యూత్‌ఫుల్ ఎలిమెంట్స్‌తో కూడిన కామెడీ, రొమాంటిక్ డ్రామాగా ఈ సినిమా ఉండబోతుందని ట్రైలర్ ద్వారా స్పష్టమవుతోంది. ఈ చిత్రంలో నాగదుర్గ తన గ్లామర్, యాక్టింగ్ స్కిల్స్‌తో టాలీవుడ్ ప్రేక్షకులను మెప్పించడానికి వస్తోంది. ట్రైలర్‌లో ఆమె లుక్స్, స్క్రీన్ ప్రెజెన్స్ చాలా ఎనర్జిటిక్‌గా ఉన్నాయి. కేవలం నూతన నటీనటులే కాకుండా ఈ సినిమాలో కోలీవుడ్ దిగ్గజ దర్శకులు సెల్వరాఘవన్, కె.ఎస్.రవికుమార్‌లతో పాటు సీనియర్ నటి వనితా విజయ్ కుమార్ కీలక పాత్రల్లో నటించడం విశేషం. ఇంతమంది ప్రముఖులు ఈ ప్రాజెక్ట్‌లో భాగం కావడంతో సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి. జినిమా మీడియా అండ్ క్రియేటివ్ ఎంటర్‌టైనర్స్ నిర్మించిన ఈ చిత్రానికి ప్రదీప్ పార్తిబన్ సంగీతం అందించారు. ఇప్పటికే విడుదలైన టీజర్, సాంగ్స్‌కు ఆడియన్స్ నుండి మంచి రెస్పాన్స్ రాగా, ఇప్పుడు వచ్చిన ట్రైలర్ సినిమాపై మరింత క్యూరియాసిటీని పెంచింది. మరి తెలంగాణ ఫోక్ సాంగ్స్‌తో యూట్యూబ్‌ను షేక్ చేసిన మన నాగదుర్గ, జూలై 10న థియేటర్లలోకి వస్తున్న ఈ 'లవ్ ఓ లవ్' సినిమాతో హీరోయిన్‌గా ఎలాంటి సక్సెస్ సాధిస్తుందో, బాక్సాఫీస్ వద్ద ఎలాంటి మ్యాజిక్ క్రియేట్ చేస్తుందో చూడాలి. ముఖ్యంగా నేటి ప్రేమికులు, యువత ఈ సినిమా కనెక్ట్ అయ్యే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి.       Naga Durga, Love Oh Love Trailer, Love Oh Love Telugu Movie, Pavish Narayan, Naga Durga Tamil Movie, Tollywood Latest News
  ప్రముఖ తెలుగు సినిమా నిర్మాత వెంకట్ అనీష్ రెడ్డిపై హైదరాబాద్‌లోని ప్రతిష్టాత్మక జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో భారీ చీటింగ్ కేసు నమోదైంది. చిత్ర పరిశ్రమకి చెందిన సహ నిర్మాత రజిత్ రావు ఇచ్చిన లిఖితపూర్వక ఫిర్యాదు ఆధారంగా పోలీసులు ఆ విధంగా కేసు నమోదు చేయడంతో కోట్ల రూపాయల విలువైన భారీ ఆర్థిక లావాదేవీలు,మోసపూరితమైన వాగ్దానాల నేపథ్యం సినీ సర్కిల్స్‌లో హాట్ టాపిక్‌గా మారింది.  రజిత్ రావు తన ఫిర్యాదులో 'వెంకట్ అనీష్ రెడ్డి తనకున్న భారీ రుణాలని  క్లియర్ చేసుకోవడం కోసం అత్యవసరంగా పెద్ద మొత్తంలో డబ్బు కావాలని అడిగాడు. దీంతో నాకున్న వ్యక్తిగత పరిచయాల ద్వారా, హైదరాబాద్ మాజీ పోలీస్ కమిషనర్, మాజీ ఐపీఎస్ అధికారి ఏకే ఖాన్ కుమారుడి వద్ద నుండి అనీష్ రెడ్డి కోసం 40 లక్షలరూపాయలు ఇప్పించాను . తనకి  ఉన్న ఆర్థిక ఇబ్బందులు, లోన్స్ అన్నీ క్లియర్ అయిన వెంటనే, . 40 లక్షల మొత్తాన్ని పూర్తిగా తిరిగి చెల్లిస్తానని వెంకట్ అనీష్ రెడ్డి హామీ ఇచ్చాడు. Also read: ఓటిటిలో రిలీజైన 48 గంటల్లోనే బ్యాన్ చేసి పడేసారు!  అయితే, ఇచ్చిన గడువు ముగిసి చాలా కాలం అవుతున్నప్పటికీ అనీష్ రెడ్డి ఆ డబ్బును తిరిగి చెల్లించకుండా కాలయాపన చేస్తూ వచ్చాడు. డబ్బు గురించి పదే పదే ఒత్తిడి చేయగా, అనీష్ రెడ్డి బాధ్యతారహితంగా ప్రవర్తించడమే కాకుండా తప్పించుకుంటూ తిరగడం ప్రారంభించాడు. పైగా నన్ను బెదిరించాడు. ఈ మోసంపై నాకు  పూర్తి న్యాయం చేయాలి. నా డబ్బు నాకు ఇప్పించడమే కాకుండా ప్రాణ భయం కలిగించేలా బెదిరింపులకు పాల్పడుతున్న అనీష్ రెడ్డిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ రజిత్ రావు  తన ఫిర్యాదులో పేర్కొన్నాడు. హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.    
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్, సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో వస్తున్న అత్యంత ప్రతిష్టాత్మక పాన్ ఇండియా చిత్రం 'డ్రాగన్'. ఈ క్రేజీ ప్రాజెక్ట్ అనౌన్స్ అయినప్పటి నుంచే రికార్డు స్థాయి అంచనాలు నెలకొనగా, ఇటీవల విడుదలైన గ్లింప్స్ సోషల్ మీడియాను షేక్ చేసింది. అయితే ఈ గ్లింప్స్‌లో యాక్షన్ ఎలివేషన్లు, ప్రశాంత్ నీల్ మార్క్ విజువల్స్ చూపించినప్పటికీ అసలైన కథను ఎక్కడా రివీల్ చేయకుండా దాచేయడం హాట్ టాపిక్‌గా మారింది. డ్రగ్ మాఫియా నేపథ్యాన్ని గ్లింప్స్‌లో చూపించారు కానీ, అసలు కథ వేరే ఉందని తెలుస్తోంది. సాధారణంగా ఈ రోజుల్లో సినిమాకు సంబంధించిన గ్లింప్స్‌ లేదా టీజర్స్ లోనే సగం కథను హింట్ ఇచ్చేస్తుంటారు. కానీ ప్రశాంత్ నీల్ మాత్రం ఇందుకు పూర్తి భిన్నమైన ఫార్ములాను ఫాలో అవుతున్నారు. సినిమాలోని మెయిన్ పాయింట్‌ను పూర్తిగా సస్పెన్స్‌గా ఉంచడం ద్వారా ప్రేక్షకుల క్యూరియాసిటీని పీక్స్‌కు తీసుకెళ్లేలా ప్లాన్ చేశారు. గ్లింప్స్ ద్వారా ఆ సినిమా ప్రపంచం ఎలా ఉంటుంది, అందులోని క్యారెక్టర్స్ షేడ్స్ ఏంటి అనేది మాత్రమే చూపించారు తప్ప, అసలు కథ దేని చుట్టూ తిరుగుతుంది అనే సీక్రెట్‌ను చాలా జాగ్రత్తగా దాచేశారు. ఈ హై-లెవెల్ మార్కెటింగ్ టూల్ ఇప్పుడు 'డ్రాగన్' సినిమాపై అంచనాలను ఆకాశానికి తీసుకెళ్తోంది. ఇక ఈ సస్పెన్స్ డ్రామాలో అందరినీ విపరీతంగా ఆకట్టుకుంటున్న అంశం బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్ క్యారెక్టర్. ఈ సినిమాలో కృతి సనన్ ఒక అత్యంత కీలకమైన పాత్రలో నటిస్తోందని టాక్ వినిపిస్తోంది. అయితే కేవలం గ్లామర్ పాత్రకే పరిమితం కాకుండా, సినిమాలోని మెయిన్ కథను మలుపు తిప్పే కీలకమైన లింక్ ఆమె పాత్రతోనే ముడిపడి ఉంటుందని ఇన్సైడ్ వర్గాల సమాచారం. అందుకే 'డ్రాగన్' టీమ్ ఆమె లుక్‌ను గానీ, పాత్ర స్వభావాన్ని గానీ ఎక్కడా బయటపెట్టడం లేదు. ఈ బాలీవుడ్ భామ రోల్ చుట్టూ మెయింటైన్ చేస్తున్న ఈ మిస్టరీ స్ట్రాటజీ నార్త్ బెల్ట్‌లో కూడా సినిమాకు ఊహించని రేంజ్ క్రేజ్ తెచ్చిపెడుతోంది. డైరెక్టర్ ప్రశాంత్ నీల్ అనగానే మనకు మైండ్ బ్లోయింగ్ ఇంటర్వెల్ బ్లాక్స్ గుర్తొస్తాయి. ఈ సినిమాలో ఎన్టీఆర్ ఫ్యాన్స్ కాలర్ ఎగరేసేలా ఒక భారీ ఇంటర్వెల్ యాక్షన్ ఎపిసోడ్‌ను నీల్ డిజైన్ చేశారట.ఈ ఇంటర్వెల్ బ్లాక్ థియేటర్లలో నెక్స్ట్ లెవెల్ పూనకాలు తెప్పించడం గ్యారెంటీ అని ఇండస్ట్రీ టాక్. ఈ మాస్ ఎలివేషన్లతో పాటు, ప్రశాంత్ నీల్ రెగ్యులర్ డార్క్ షేడ్స్‌కు భిన్నంగా ఈ సినిమాలోని ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్స్ మొత్తం చాలా కలర్‌ఫుల్‌గా, భారీ ఎమోషనల్ డ్రామాతో ఉండబోతున్నాయనే సరికొత్త అప్‌డేట్ ఫ్యాన్స్‌కు మరింత జోష్ ఇస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంస్థలు సంయుక్తంగా అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ వండర్ జూన్ 11, 2027న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది. ఎన్టీఆర్ పవర్ ఫుల్ పర్ఫార్మెన్స్, ప్రశాంత్ నీల్ మార్క్ మాస్ ఎలివేషన్స్, రవి బస్రూర్ సాలిడ్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, అన్నింటికీ మించి కృతి సనన్ పాత్ర చుట్టూ ఉన్న ఈ సస్పెన్స్ ఎలిమెంట్స్ గనుక థియేటర్లలో పక్కాగా వర్కవుట్ అయితే, బాక్సాఫీస్ దగ్గర 'డ్రాగన్' సృష్టించే విధ్వంసాన్ని ఆపడం ఎవరి తరం కాదనేది మాత్రం వాస్తవం.     Jr NTR, Prashanth Neel, Dragon, Interval Block, Kriti Sanon  
సినిమా ప్రియులకు సరికొత్త వినోదాన్ని పంచేందుకు మరో వారం సిద్ధమైపోయింది. ఈ జూలై రెండో వారంలో అటు థియేటర్లలోనూ, ఇటు డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లలోనూ ప్రేక్షకులను అలరించేందుకు అద్భుతమైన చిత్రాలు క్యూ కట్టాయి. ముఖ్యంగా ఓటీటీ వీక్షకులకు ఈ వారం అసలైన పండగ అని చెప్పాలి. వివిధ ప్రముఖ డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లలో ఏకంగా 18 కి పైగా సరికొత్త సినిమాలు, వెబ్ సిరీస్‌లు స్ట్రీమింగ్‌కు రెడీ అయ్యాయి. థియేటర్లలో దాదాపు మూడేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత అక్కినేని అఖిల్ హీరోగా నటిస్తున్న 'లెనిన్' చిత్రం బాక్సాఫీస్ బరిలో నిలుస్తుండగా, అదే సమయంలో ఓటీటీ ప్రపంచంలో భారీ బజ్ ఉన్న చిత్రాలు సందడి చేయబోతున్నాయి. ఈ వారం డిజిటల్ ఎంట్రీ ఇస్తున్న 18 చిత్రాలలో నాలుగు ప్రత్యేక ఆకర్షణలుగా నిలిచాయి. ఆ నాలుగింటిని మాత్రం అస్సలు మిస్ అవ్వద్దని సినీ విశ్లేషకులు సైతం సూచిస్తున్నారు. ఈ వారం ఓటీటీలో అత్యంత ఆసక్తి రేకెత్తిస్తున్న చిత్రాలలో రామ్ చరణ్ ప్రధాన పాత్రలో నటించిన 'పెద్ది' ఒకటి. ఈ మోస్ట్ అవేటెడ్ మూవీ జూలై 09 నుంచి నెట్‌ఫ్లిక్స్ వేదికగా డిజిటల్ స్క్రీన్‌పై సందడి చేయనుంది. దీంతో పాటు ఎంతో మంది సంగీత ప్రియులు ఎదురుచూస్తున్న మ్యూజికల్ ఎంటర్‌టైనర్ 'సింగ్ గీతం' జూలై 08 నుంచే నెట్‌ఫ్లిక్స్‌లో అందుబాటులోకి రాబోతోంది. తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న 'బల్టీ', 'పరిమళ అండ్ కో' వంటి చిత్రాలు కూడా ఉన్నంతలో మంచి బజ్ క్రియేట్ చేస్తూ డిజిటల్ స్ట్రీమింగ్‌కు లైన్ క్లియర్ చేసుకున్నాయి. అలాగే ఒకప్పుడు టాలీవుడ్‌లో లవర్ బాయ్‌గా అశేష ప్రేక్షకాదరణ పొందిన సీనియర్ హీరో వడ్డే నవీన్ చాలా కాలం తర్వాత రీఎంట్రీ ఇస్తూ చేసిన సినిమా సైతం ఈ వారమే ఓటీటీలోకి వస్తుండటం గమనార్హం. ఇక ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఓటీటీ లవర్స్ కోసం నెట్‌ఫ్లిక్స్ పలు అంతర్జాతీయ చిత్రాలను, సిరీస్‌లను కూడా తెలుగు ప్రేక్షకులకు అందిస్తోంది. అందులో భాగంగానే జూలై 08న 'ఐ యామ్ నాట్ అఫ్రైడ్', 'నథింగ్ టూ లూజ్', మరియు 'సల్సేడో, లెదర్ అండ్ బోగాలో' వంటి విభిన్న కథాంశాలు గల ఇంగ్లీష్ చిత్రాలు రిలీజ్ కానున్నాయి. అలాగే జూలై 09న 'లిటిల్ హౌస్ ఆన్ ద ప్రయిరే', జూలై 10న హిందీ చిత్రం 'పతి పత్ని ఔర్ వో దో', ఇంగ్లీష్ డాక్యుమెంటరీ 'షిప్ రెక్డ్: నైట్ మేర్ ఎట్ సీ', మరియు తెలుగు డబ్బింగ్ సిరీస్ 'ఇక్కా' స్ట్రీమింగ్ కానున్నాయి. వీటికి తోడుగా జూలై 11న కొరియన్ సిరీస్ 'ద అపార్ట్‌మెంట్ జాబ్' కూడా రిలీజ్ కాబోతోంది. మొత్తం 18 సినిమాలతో ఈ వారం ప్రతి ఒక్కరికీ నచ్చే వైవిధ్యమైన కంటెంట్ ఓటీటీ వేదికగా అందుబాటులో ఉండటంతో వీకెండ్ హోమ్ ఎంటర్‌టైన్‌మెంట్‌కు డోకా లేదని చెప్పవచ్చు. మీ ఇష్టమైన సినిమాల లిస్ట్‌ను ఇప్పుడే చెక్ చేసుకుని వీకెండ్ ప్లాన్ చేసుకోండి.       OTT releases, upcoming telugu ott movies 2026, ram charan, peddi ott, netflix, telugu cinema, latest ott updates
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ కాంబినేషన్‌లో 'రాకా' అనే ఒక భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. టాలీవుడ్, కోలీవుడ్ సినీ ఇండస్ట్రీలలోనే కాకుండా, దేశవ్యాప్తంగా ఈ సినిమాపై ఇప్పటికే ఆకాశాన్ని తాకే అంచనాలు నెలకొన్నాయి. అల్లు అర్జున్, అట్లీ కాంబినేషన్‌లో వస్తున్న మొట్టమొదటి చిత్రం కావడంతో బాక్సాఫీస్ వద్ద ఎలాంటి రికార్డులు సృష్టించబోతోందో అని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన రెగ్యులర్ షూటింగ్ శరవేగంగా సాగుతోంది. తాజాగా ఈ మోస్ట్ అవేటెడ్ ప్రాజెక్ట్‌కు సంబంధించిన ఒక అత్యంత ఆసక్తికరమైన సమాచారం ఇండస్ట్రీ వర్గాల నుండి బయటకు వచ్చింది. అల్లు అర్జున్ ఈ సినిమా షూటింగ్ విషయంలో ఒక కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. 'రాకా' సినిమాకు సంబంధించిన మొత్తం షూటింగ్ ను ఈ ఏడాది డిసెంబర్ చివరి నాటికి ఎలాగైనా పూర్తి చేయాలని దర్శకుడు అట్లీకి బన్నీ డెడ్‌లైన్ విధించినట్లు ఫిలిం నగర్ టాక్.  'రాకా' చిత్రీకరణ పూర్తయిన వెంటనే, దర్శకుడు లోకేష్ కనగరాజ్‌తో తను చేయనున్న తదుపరి భారీ యాక్షన్ ప్రాజెక్ట్‌పై అల్లు అర్జున్ పూర్తిగా దృష్టి పెట్టనున్నారు. ఈ కారణంగానే ప్రస్తుత సినిమా షూటింగ్‌లో ఎలాంటి జాప్యం జరగకుండా, అనుకున్న షెడ్యూల్ ప్రకారమే కచ్చితంగా షూటింగ్ మొత్తం పూర్తి కావాలని ఆయన చిత్ర బృందానికి గట్టిగా సూచించినట్లు తెలుస్తోంది. ఈ ప్రతిష్టాత్మక చిత్రంలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణె హీరోయిన్ గా నటిస్తుండగా.. మృణాల్ ఠాకూర్, జాన్వీ కపూర్, రష్మిక మందన్న వంటి క్రేజీ స్టార్స్ కీలక పాత్రల్లో మెరవనున్నట్లు సమాచారం. ఈ సినిమాకు యువ సంచలనం సాయి అభ్యంకర్ మ్యూజిక్ అందిస్తుండగా, ప్రముఖ నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. ఈ సినిమా కోసం నిర్మాణ సంస్థ ఏకంగా రూ.800 కోట్ల భారీ బడ్జెట్‌ను వ్యయం చేస్తున్నట్లు జోరుగా ప్రచారం సాగుతోంది. ఇండియన్ సినిమా హిస్టరీలోనే ఇదొక మైలురాయిగా నిలిచేలా ప్లాన్ చేస్తున్నారు. షూటింగ్ మొత్తం పూర్తయిన తర్వాతే చిత్ర యూనిట్ విడుదల తేదీపై ఒక అధికారిక ప్రకటన ఇచ్చే అవకాశం ఉంది. 2027 సెకండ్ హాఫ్ లో 'రాకా' విడుదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.     Allu Arjun, Atlee, Raaka, Lokesh Kanagaraj, AA23  
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు. వారితో పాటు పెద్ద సంఖ్యలో క్యాడర్ కూడా పార్టీని వీడుతున్నారు. ఇక ఇప్పుడు నామినేటెడ్ పదవులలో ఉన్న వారి వంతు మొదలైనట్లు కనిపిస్తోంది. తనకు కానీ తన భర్తకు  కానీ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు టికెట్ ఇవ్వాలంటూ గత  కొంత కాలంగా కోరుతూ వస్తున్న మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ వంతు వచ్చింది. ఆమె కూడా రాజీనామా అస్త్రం సంధించారు.  జగన్ కు నమ్మిన బంటుగా గుర్తింపు పొందిన మహిళాకమిషన్ చైర్ పర్సన్ వాసి రెడ్డి పద్మ తన పదవికి రాజీనామా చేశారు. ఉరుములేని పిడుగులా, ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా తన రాజీనామా లేఖను సీఎం జగన్ కు పంపేశారు. పేరుకు తాను పార్టీకి కాదు, కేవలం మహిళా కమిషన్ చైర్మన్ పదవికి మాత్రమే రాజీనామా చేశాననీ, ఇక నుంచి వైసీపీ కోసం పని చేస్తాననీ వాసిరెడ్డి పద్మ చెబుతున్నప్పటికీ, ఆమె రాజీనామాకు కారణం అసంతృప్తేనని పార్టీ వర్గాలు బాహాటంగానే చెబుతున్నాయి. చాలా కాలంగా వాసిరెడ్డి పద్మ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు తనకు కానీ తన భక్తకు కానీ పార్టీ టికెట్ ఇవ్వాలని జగన్ ను కోరుతూ వస్తున్నారు. అయితే ఇప్పటి వరకూ జగన్ చూద్దాం.. చేద్దాం అన్నట్లుగా దాట వేస్తూనే వచ్చారు. ఇప్పుడిక వరుసగా అభ్యర్థల జాబితాలను జగన్ ప్రకటించేస్తుండటం, తనకు గానీ తన భర్తకు కానీ పార్టీ టికెట్ విషయంలో ఎటువంటి స్పస్టత ఇవ్వకపోవడంతో ఆమె మనస్తాపం చెంది పదవికి రాజీనామా చేసేశారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.  వాసిరెడ్డి పద్మ రాజకీయ ప్రవేశం ప్రజారాజ్యం పార్టీతో జరిగింది. 2009లో ఆమె ప్రజారాజ్యం పార్టీలో చేరారు. ఇలా చేరడంతోనే ఆమె ప్రజారాజ్యం అధికార ప్రతినిథిగా పదవి దక్కించుకున్నారు. ప్రజారాజ్యం కాంగ్రెస్ పార్టీలో విలీనం కావడంతో ఆమె 2012లో జగన్ పార్టీలో చేరారు. జగన్ కూడా ఆమెకు అధికార ప్రతినిథి పదవి ఇచ్చారు.  2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆమెను రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా నియమించారు. చైర్ పర్సన్ హోదాలో ఆమె జగన్ మెప్పు పొందేందుకు చేయగలిగినంతా చేశారు. ప్రతిపక్ష పార్టీ నేతలకు నోటీసులు ఇచ్చారు. ఏకంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు సైతం నోటీసులు జారీ చేశారు. వార్డు వలంటీర్లపై పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు కమిషన్ ముందు హాజరై వివరణ ఇవ్వాలంటూ ఆమె పవన్ కు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. పవన్ హాజరు కాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు నమోదు చేయాలని ఆదేశించారు. ఇన్ని చేసినా వాసిరెడ్డి పద్మకు ఆమె కోరినట్లుగా పార్టీ టికెట్ లభించకపోవడంతో అలిగి పదవికి రాజీనామా చేశారని, ఇది జగన్ కు షాకేననీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు. ఒకరైతు తనకు చేసిన సేవలకు ప్రీతి చెందిన గురువు అతడికి స్వర్గ ప్రాప్తిని కలగజేయాలని అనుకుంటాడు. కానీ సంసారాసక్తి వల్ల ఆ రైతు ఆ అవకాశాన్ని వాయిదా వేసుకుంటూ వస్తాడు. చివరికి గురుకృప వల్ల ఆ రైతు స్వర్గ ప్రాప్తిని ఎలా పొందాడో ఈ కథ తెలియజేస్తుంది. "ఒక మహాపురుషుడు ప్రయాణం చేస్తూ, డస్సిపోయాడు. గొంతు ఎండిపోయింది. దారిలో ఒక రైతు కనపడితే నీళ్ళు అర్థించాడు. ఆ రైతు మహాత్మునికి సకల ఉపచారాలూ చేశాడు. చిరిగిపోయిన ఆయన ఉత్తరీయాన్ని రైతు జాగ్రత్తగా కుట్టి బాగుచేశాడు. రైతు పరిచర్యలకు సంతసించిన ఆ మహాత్ముడు శాంతి, ఆనందాలకు నిలయమైన స్వర్గానికి తనతోపాటు రమ్మని అంటాడు. అందుకు ఆ రైతు 'గురువుగారూ! మీరు నా మీద చూపిన దయకు కృతజ్ఞుణ్ణి. కానీ నా పిల్లలు ఇంకా చిన్నవాళ్ళు. ఓ ఏడేళ్ళ వ్యవధి ఇవ్వండి' అని అడుగుతాడు. అందుకు గురువు అంగీకరించాడు. సరిగ్గా ఏడేళ్ళ తర్వాత గురువు రైతును స్వర్గానికి తీసుకువెళ్ళడానికి వచ్చాడు. అప్పుడు రైతు 'అయ్యా! కడపటి కొడుకు కష్టాలకు అంతు లేదు. అన్ని జంఝాటాలనూ ఒక్కడే సంబాళించుకోలేకపోతున్నాడు. కాబట్టి మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని గురువుని అడిగాడు. మరో ఏడేళ్ళ తరువాత గురువు వచ్చాడు. కానీ రైతు చనిపోయాడని తెలిసింది. చనిపోయిన ఆ రైతు ఎద్దుగా పుట్టాడని ఆ గురువు తన దివ్య దృష్టితో తెలుసుకున్నాడు. ఎద్దుగా పుట్టిన ఆ రైతు తన కొడుకు పొలాన్నే దున్నుతున్నాడు. అప్పుడు గురువు ఆ ఎద్దుపై మంత్ర జలం చిలకరించగానే ఎద్దు జన్మనెత్తిన రైతు 'నా కొడుకు పరిస్థితి మరి కాస్త మెరుగు పడనీయండి స్వామీ! మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని అన్నాడు. ఇక చేసేది లేక వెనుదిరిగాడు గురువు. మరలా ఏడేళ్ళ తర్వాత వచ్చిన గురువుకు ఎద్దు చనిపోయిందని తెలిసింది. అది కుక్కగా పుట్టి కొడుకు ఇంటినీ, ఆస్తినీ కాపలా కాస్తోందని తన దివ్యదృష్టి ద్వారా తెలుసుకున్నాడు. గురువు. కుక్కగా పుట్టిన ఆ రైతు 'స్వామీ! నేను ఎంత దౌర్భాగ్యుణ్ణి. మీరు ఇంత దయ చూపుతున్నప్పటికీ మీతో స్వర్గమానం చేయలేకున్నాను. వీడికి ఆస్తిని కాపాడుకొనే దక్షత ఇంకా రాలేదు. కాబట్టి దయ చేసి మరో ఏడేళ్ళు వ్యవధి ఇవ్వండి' అని వేడుకున్నాడు. గురువు ఏడేళ్ళ తరువాత మళ్ళీ వచ్చేసరికి కుక్క మరణించింది. అది త్రాచుపాముగా జన్మనెత్తి, ఇప్పుడు కొడుకు భూమిలో ఉన్న లంకెబిందెలకు పడగెత్తి కాపలా కాస్తోంది. గుప్త ధనం ఇక్కడ ఉందని కొడుకుకి ఎలా తెలియజేయాలా అని పాము ఆలోచిస్తున్నప్పుడు గురువు ఆ రైతుకొడుకును పిలుచుకు వచ్చి లంకె బిందెలు ఉన్న చోట తవ్వమన్నాడు. లంకె బిందెలు బయటపడ్డాయి. ఆ పైన ఆ పామును చంపమన్నాడు. అనంతరం శిష్యుణ్ణి తీసుకొని స్వర్గారోహణం చేశాడు గురువు. సంసారంలోని ఈతి బాధల నుండి శిష్యుణ్ణి ఉద్ధరిస్తాడు సద్గురువు. అలాంటి గురువు అందరికీ అవసరం.                                      *నిశ్శబ్ద.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్  రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది.  80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత  ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది.   ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది. ఆమెది నెద‌ర్లాండ్స్‌. ఆమె తండ్రి నెద‌ర్లాండ్స్‌లోని ఆర్నెహెమ్‌లో చిన్న‌పిల్ల‌ల ఆస్ప‌త్రి డైరెక్ట‌ర్. పోయి దొరికిన ఆ పెయింటింగ్ విష‌యానికి వ‌స్తే.. అది 1683లో కాస్ప‌ర్ నెష‌ర్ వేసిన స్టీవెన్ ఓల్ట‌ర్స్ పెయింటింగ్‌. రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో నాజీల ఆదేశాల‌ను చార్లెట్ తండ్రి వ్య‌తిరేకించారు. ఆయ‌న ర‌హ‌స్య జీవ‌నం సాగించేడు. కానీ ఈ పెయింటింగ్‌ని మాత్రం త‌న న‌గ‌రంలోని ఒక బ్యాంక్‌లో భ‌ద్ర‌ ప‌ర‌చ‌మ‌ని ఇచ్చార‌ట‌. 1940లో నాజీలు నెద‌ర్లాండ్ పై దాడులు చేసినపుడు ఆ బ్యాంక్ మీద ప‌డి దోచుకున్నా రు. అప్పుడు ఈ పెయింటింగ్ కూడా తీసుకెళ్లారు. యుద్ధం అయిపోయిన త‌ర్వాత ఈ పెయింటింగ్ ఎక్క‌డున్న‌దీ ఎవ‌రికీ తెలియ‌లేదు. చిత్రంగా 1950ల్లో డ‌స‌ల్‌డార్ష్ ఆర్ట్ గ్యాల‌రీలో అది ప్ర‌త్య‌క్ష‌మ‌యింది. 1969లో ఆమ్‌స్ట‌ర్‌డామ్‌లో దాన్ని వేలానికి తీసికెళ్లే ముందు దాన్ని ఆ ఆర్ట్ గ్యాల‌రీలో వుంద‌ని చూసిన‌వారు చెప్పారు. వేలంపాట త‌ర్వాత మొత్తానికి ఆ పెయింటింగ్‌ను 1971లో ఒక క‌ళాపిపాసి త‌న ద‌గ్గ‌ర పెట్టుకున్నాడు.    ఆ త‌ర్వాత 2021లో అది చార్లెటీని చేరింది.  మొత్తానికి వూహించ‌ని విధంగా ఎంతో కాలం దూర‌మ‌యిన గొప్ప క‌ళాఖండం తిరిగి త‌న వ‌ద్ద‌కు చేర‌డంలో చార్లెటీ ఆనందానికి అంతేలేదు. అంతే క‌దా.. పోయింద‌నుకున్న గొప్ప వ‌స్తువు తిరిగి చేరితే ఆ ఆనంద‌మే వేరు!  అయితే చార్లెటీకి ఇపుడు ఆ పెయిం టింగ్‌ను భ‌ద్రంగా చూసుకునే ఆస‌క్తి వున్న‌ప్ప‌టికీ శ‌క్తి సామ‌ర్ధ్యాలు లేవు. అందుక‌నే త్వ‌ర‌లో ఎవ‌రిక‌యినా అమ్మేసీ వ‌చ్చిన సొమ్మును పిల్ల‌ల‌కు పంచుదామ‌నుకుంటోందిట‌!  చార్లెటీ కుటుంబంలో అయిదుగురు అన్న‌ద‌మ్ములు అక్క‌చెల్లెళ్లు వున్నారు. అలాగే ఇర‌వై మంది పిల్ల‌లు ఉన్నారు. అంద‌రూ ఆమె అంటే ఎంతో ప్రేమ చూపుతున్నారు. అంద‌రం ఒకే కుటుంబం, చాలాకాలం త‌ర్వాత ఇల్లు చేరిన క‌ళాఖండం మా కుటుంబానిది అన్న‌ది చార్లెటీ!
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు. చాకోను పార్టీలోకి ఆహ్వానిస్తూ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్’ ఫ్రంట్ ఏర్పాటు గురించి ప్రత్యేకించి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు కానీ, చాకో అలాంటి  సంకేతాలు ఇచ్చారు. ప్రస్తుతం దేశంలో ఉన్న ఏ ఒక్కపార్టీ కూడా బీజేపీకి ప్రత్యాన్మాయం కాదని,సమీప భవిష్యత్ కాంగ్రెస్ సహా ఏ పార్టీ కూడా ఆ స్థాయికి ఎదిగే అవకాశాలు కూడా కనిపించడంలేదని అన్నారు. ఈ పరిస్థితుల్లో దేశంలోని బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ, ఏకమై, ఒకే గొడుగు కిందకు రావలసిన అవసరం ఉందని చాకో అన్నారు. అదే సమయంలో ప్రతిపక్షాలను ఏక తాటిపైకి తెచ్చే బాధ్యతను పవార్ తీసుకోవాలని సంకేత మాత్రంగా చెప్పారు. అంతే కాకుండా కాంగ్రెస్ పేరు ఎత్తకుండా బీజేపీ వ్యతిరేక శక్తులను ఏకం చేసే ఆలోచన ఆ పార్టీ నాయకత్వానికి లేదని నెహ్రూ గాంధీ ఫ్యామిలీ (సోనియా, రాహుల్, ప్రియాంక)ఆలోచనా ధోరణిని పరోక్షంగానే అయినా ఎండ కట్టారు.ఆ విధంగా పవార్ ఆ బాధ్యత తీసుకోవాలని చాకో సూచించారు. ఇందుకు సంబంధించి, పవార్ బహిరంగంగా ఎలాంటి వ్యాఖ్య చేయలేదు. అయితే, చాకో సహా మరికొందరు ‘సీనియర్’ కాంగ్రెస్ నాయకులు, అలాగే సిపిఎం, సిపిఐ నాయకులు కూడా పవార్’తో చాలా కాలంగా థర్డ్ ఫ్రంట్  విషయంగా చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. అయితే మహారాష్ట్రలో సంకీర్ణం మనుగడను దృష్టిలో ఉంచుకుని పవార్ ఆచితూచి అడుగులేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే చాకో పార్టీలో చేరిన సందర్భంలో కూడా ‘చాకో చేరికతో మహారాష్ట్రలోని మహా వికాస్ అగాడీ ప్రభుత్వానికి ఎలాంటి నష్టం జరగదని, పవార్ మహారాష్ట్ర సంకీర్ణ సర్కార్ ప్రస్తావన చేశారని విశ్లేషకులు పేర్కొంటున్నారు.  మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వ మనుగడ గురించ్బి  పవార్ ప్రత్యేకంగా పేర్కొనడం ద్వారా, ఆయన థర్డ్ ఫ్రంట్ విషయంలో వేచి చూసే ఆలోచనలో ఉన్నట్లు అర్థమవుతోందని కూడా  రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే అదే ఎన్సీపీ అసెంబ్లీ ఎన్నికల జరుగతున్న కేరళలో, పశ్చిమ బెంగాల్లో  కాంగ్రెస్ వ్యతిరేక పార్టీలకు మద్దతు ఇస్తోంది. దీన్ని బట్టి చూస్తే, ఎన్సీపీ - కాంగ్రెస్ మధ్య దూరం పెరుగుతోందని స్పష్టమవుతోంది. అయితే, థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఏ రకంగా ముడి పడుతుంది అనే విషయంలో ఇంకా స్పష్టత రావలసి ఉంది. అలాగే, కాంగ్రెస్ లేకుండా జాతీయ స్త్గాయిలో బీజేపీ వ్యతిరేక కూటమిని ఏర్పాటు చేయడం వలన, వ్యతిరేక ఓటు చీలి  అది మళ్ళీ బీజేపీకే మేలు చేస్తుందని, కాబట్టి, ప్రస్తుతం కాంగ్రెస్ సారధ్యంలోని యూపీఏని బలోపేతం చేయడమే ఉత్తమమనే అలోచన కూడా  విపక్ష శిబిరం నుంచి వినవస్తోంది. ఈ నేపధ్యంలోనే, ప్రస్తుతం యూపీఏ ఛైర్పర్సన్’గా ఉన్న సోనియా గాంధీ వయసు, అనారోగ్యం కారణంగా బాధ్యతల నుంచి తప్పుకుని పవార్’కు బాద్యతలు అప్పగించాలనే ప్రతిపాదన వచ్చిందని అంటున్నారు. అలాగే, ఇతర పార్టీలను, ముఖ్యంగా కాంగ్రెస్ నుంచి విడిపోయి సొంత కుంపటి పెట్టుకున్న మమతా బెనర్జీ సారధ్యంలోని తృణమూల్, జగన్మోహన్ రెడ్డి సారధ్యంలోని వైసీపీలను కలుపుకుని కూటమిని బలోపేతం చేయడం ద్వారా బీజేపీని దీటుగా ఎదుర్కోవచ్చనే ఆలోచనలు కూడా సాగుతున్నాయి. అయితే, ఇటు థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు అయినా, యూపీఏని బలోపేతం చేయడమే అయినా, పవారే .. కేంద్ర బిందువు. ఆయన సారధ్యంలోనే ప్రత్యాన్మాయం అనేది విపక్ష శిభిరం నుంచి వినవస్తున్న ప్రస్తుత సమాచారం. మరి అదే జరిగితే రాహుల గాంధీ పరిస్థితి ఏమిటి ? గాంధీ నెహ్రూ కుటుంబం పరిస్థితి ఏమిటి? ఏ ప్రత్యేక ప్రాధాన్యత లేకుండా అందరిలో ఒకరిగా ఫస్ట్ ఫ్యామిలీ సర్దుకు పోతుందా? అంటే..చివరకు ఏమవుతుందో .. ఇప్పుడే చెప్పలేమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది. గతంలో అనేక సందర్భాలలో ముఖ్యమంత్రి కేసీఆర్,ఆర్థిక మంత్రి హరీశ రావు, కరోనా కారణంగా రాష్ట్ర  ఆదాయం గణనీయంగా తగ్గిందని, పేర్కొన్నారు. అయితే, కరోనా నుంచి వేగంగా కోలుకుని, ఆర్థికంగా అంతే వేగంగా పుంజుకున్న రాష్ట్రాలలో తెలంగాణ ప్రధమ స్థానంలో  ఉందని కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సర్వే 2020-21 నివేదిక పేర్కొంది. పడిలేచిన కెరటంలా, తెలంగాణ ‘వీ’ ఆకారంలో ఆర్థికంగా నిలతొక్కుందని కేంద్రం జనవరి  చివరి వారంలో విడుదల చేసిన ఆర్థిక సర్వేలో పేర్కొంది. అలాగే, రెవిన్యూ వసూళ్ళలో రాష్ట్రం కరోనా పూర్వస్థితికి చేరిందని కూడా సర్వే చెప్పింది.   అలాగే,రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు కూడా ఈ మధ్య కాలంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పై సంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరమ జనవరి,ఫిబ్రవరి, మార్చి నెలలతో పోలిస్తే ఈ సంవత్సరం ఈ మూడు నెలల కాలంలో రాష్ట్ర ఆర్థిక వృద్ది రేటు 10 నుంచి  15 శాతం మెరుగ్గా ఉందని హరీష్ రావు ఒకటి రెండు ఇంటర్వ్యూలలో పేర్కొన్నారు.అలాగే, బడ్జెట్ విషయంలోనూ ఆయన చాల ఆశావహ దృక్పథంతోనే ఉన్నారు. బడ్జెట్  పాజిటివ్’గా ఉంటుదని, ఎవ్వరూ ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని, సంక్షేమ పథకాలలో,ఇతరత్రా బడ్జెట్ కేటాయింపులలో ఎలాంటి కోతలు ఉండవని కూడా హరీష్ హామీ ఇచ్చారు. గత సంవత్సరంలో కొంత మేర హామీ ఇచ్చిన మేరకు అమలు చేయలేక పోయిన సొంత జాగాలలో డబల్ బెడ్ రూమ్ ఇళ్ళ నిర్మాణం, రుణ మాఫీ వంటి  పథకాలను ఈ బడ్జెట్ ద్వారా అమలు చేస్తామని చెప్పారు. అలాగే, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ తమిళి సై చేసిన ప్రసంగంలోనూ ఆశావహ దృక్పధమే వ్యక్తమైంది. ఆమె తమ ప్రసంగంలో,  ప్రభుత్వం సంక్షేమ పథకాలకు పెద్ద పీట వేసిందని అన్నారు. ‘సంపద పంచాలి ,పేదలకు పంచాలి’ అనేది తమ ప్రభుత్వ విధానమని స్పష్టం చేశారు. అలాగే, పెరుగతున్న ఆదాయంలో అధికశాతం సంక్షేమానికే వెచ్చిస్తున్నామని స్పష్టం చేశారు. దీంతో బడ్జెట్’లో కొత్త పథకాలకు శ్రీకారం చుట్టే అవకాశం ఉంటుందా అన్న చర్చ జరుగుతోంది. మరో వంక ఉద్యోగ వర్గాల్లో పీఆర్సీకి సంబంధించి ఆర్థిక మంత్రి తమ ప్రసంగంలో  ప్రకటన చేస్తారా లేదా అనే ఆసక్తి నెలకొంది. అలాగే, సామాన్య  ప్రజలు ఇటీవల పెరిగిన పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరల భారం నుంచి మంత్రి హరీష్, ఏదైనా ఉపసమనం కలిపిస్తారా అని ఎదురు చూస్తున్నారు. గతంలో వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సామాన్య ప్రజలపై వంటగ్యాస్ ధర భారాన్ని తగ్గించేందుకు కొంత మొత్తాన్ని, రూ.50(?) రాష్ట్ర ప్రభుత్వం తరపున  సబ్సిడీగా ఇచ్చిన విషయాన్ని, అదే విధంగా అసెంబ్లీ ఎన్నికలు జరుగతున్న తమిళనాడులో డిఎంకే పార్టీ,తమ పార్టీని అధికారంలోకి వస్తే  గ్యాస్ బండపై వంద రూపాయల సబ్సిడీ ఇస్తామని చేసిన  వాగ్దానాన్ని  గుర్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే, ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు, సోమవారం ఆర్థిక మంత్రి హరీష్ రావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఆర్థిక  శాఖ ముఖ్య కార్యదర్శి రామ కృష్ణా రావు,సలహాదారు జీఆర్ రెడ్డితో బడ్జెట్ పద్దులఫై సుదీర్ఘంగా చర్చించి తుది మెరుగులు దిద్దారు. బడ్జెట్ తుది రూపం సిద్దమైన నేపధ్యంలో ఆర్థిక శాఖ ప్రింటింగ్ ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 18 ఉదయం మంత్రి వర్గం ఆమోదం పొందిన అనంతరం ఆర్థికమంత్రి హరీష్ రావు అదే రోజు రాష్ట్ర బడ్జెట్ 2021-22ను సభలో ప్రవేశ పెడతారు. 20, 22 తేదీల్లో బడ్జెట్‌పై సాధారణ చర్చ,23, 24, 25 తేదీల్లో బడ్జెట్‌ పద్దులపై చర్చ ఉంటుంది 26న ద్రవ్యవినిమయ బిల్లు (బడ్జెట్)పై చర్చ, సభామోదం ఉంటాయి.
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది.  అధికార తెరాస, ఖమ్మం స్థానానికి సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర రెడ్డి పేరును ప్రకటించడంలో కొంచెం జాప్యం చేయడంతో పాటుగా, హైదరాబాద్ స్థానం నుంచి , పీవీ కుమార్తె వాణీ దేవి పేరును చివరి క్షణంలో తెరమీదకు తేవడంతో అంత వరకు కొంత స్తబ్దుగా సాగిన ప్రచారం ఆ తర్వాత వేడెక్కింది. ఉద్యోగ నియామకాల విషయంలో తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ తప్పులో కాలేయడంతో విపక్షాలు, పోటీలో ఉన్న ప్రత్యర్ధులు, నిరుద్యోగ యువత, విద్యార్ధి సంఘాలు  ఒకే సారి ఆయన మీద  విరుచుకు పడ్డారు. ఆయన లెక్క తప్పని నిరుపిస్తం రమ్మని వరస సవాళ్ళు విసిరారు. దీంతో, మంత్రి నియామకా ఇష్యూని పక్కకు తప్పించేందుకు , ఐటీఐఆర్, వరంగల్ రైల్వే ఫ్యాక్టరీ వంటి సెంటిమెంటల్ ఇష్యూస్’ను తెరపైకి  తెచ్చారు. అలాగే, కేంద్ర ప్రభుత్వంపై విమర్శల దాడిని పెంచారు. చివరకు పొరుగు రాష్ట్రానికి చెందిన విశాఖ ఉక్కు ఆందోళన   కూడా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగమైంది.   రెండు నియోజక వర్గాలలో గతంతో పోలిస్తే ఈసారి ఓటర్ల సంఖ్య రెట్టింపు అయింది. ఈసారి రెండు నియోజక వర్గాలలో కలిపి 10 లక్ష 36 వేల మంది తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. అలాగే, రెండు పట్ట భద్రుల నియోజక వర్గాల్లో 164 మంది అభ్యర్ధులు పోటీలో ఉన్నారు.  గత ఎన్నికలతో పోలిస్తే ఇటు ఓటర్ల సంఖ్య, అటు అభ్యర్థుల సంఖ్యా రెట్టింపునకు పైగానే పెరగడంతో ఎన్నికలలో జోష్ పెరిగింది. దీనికితోడు అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో సాధారణ ఎన్నికలను తలపించే రీతిలో ప్రచారం సాగింది. ఎక్కువమంది అభ్యర్ధులు బరిలో ఉండడంతో, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి  తమకే ప్రయోజనం జరుగుతుందని అధికార పార్టీ ఆశపడుతోంది .  దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో చేదు ఫలితాలను చవిచూసిన టీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా వ్యూహ రచన చేసి కేటీఆర్, హరీష్ సహా మంత్రులు,ఎమ్మెల్యేలకు స్పెసిఫిక్ బాధ్యతలు అప్పగించారు. అలాగే,కాంగ్రెస్‌ అభ్యర్థులు చిన్నారెడ్డి, రాములునాయక్‌లకు మద్దతుగా ఉత్తమ్‌, భట్టి, రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తదితరులు విస్తృతంగా ప్రచారం చేశారు. బీజేపీ అభ్యర్థులు ఎన్‌.రాంచందర్‌రావు, ప్రేమేందర్‌రెడ్డిల తరఫున ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, ఎంపీ అరవింద్‌ తదితరులు ప్రచారాన్ని వేడెక్కించారు.  ఖమ్మం స్థానం నుంచి ప్రత్యక్ష ఎన్నికల్లో తొలిసారి పోటీకి దిగిన కోదండరాంకు, టీజేఎస్‌ పార్టీకీ ఈ ఎన్నికలు కీలకంగా మారాయి. ఖమ్మ స్థానం నుంచి పోటీ చేస్తున్న తీన్మార్ మల్లన్న ముందస్తు వ్యూహంతో ప్రధాన పార్టీల అభ్యర్ధులకు ధీటుగా ప్రచారం సాగించారు.  వామపక్షాల మద్దతుతో జయసారథి, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్‌, యువతెలంగాణ కార్యనిర్వాహక అధ్యక్షురాలు రాణీ రుద్రమ తదితరులు పోటీలో ఖమ్మం సీటును పట్టభద్రులు  ఎవరికి  పట్టం కడతారు అన్నది ప్రశ్నార్థకంగా మారింది. హైదరాబాద్ సీటు కూడా ఇటు అధికార తెరాసకు అటు సిట్టింగ్ సీటును నిలుపుకోవడం తో పాటుగా దుబ్బాక , జీహెచ్ఎంసి జోష్ ను కొనసాగించాలని ఆశ పడుతున్నబీజేలకే కూడా ఇజ్జత్ కీ సవాల్ గా మారింది. కాంగ్రెస్ అభ్యర్ధి పార్టీ సీనియర్ నాయకుడు సౌమ్యుడు, మాజీ మంత్రి చిన్నారెడ్డి, వామ పక్షాల మద్దతుతో పోటీ చేస్తున్న మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ కూడా గట్టి పోటీ ఇస్తున్నారు. సో.. చివరకు ఏమి జరుగుతుంది అంటే ఏదైనా జరగవచ్చును. ఈ నెల 14 వ తేదీన పోలింగ్ జరుగుతుంది.17 ఫలితాలు వస్తాయి .. అంతవరకు వెయిట్ అండ్ వాచ్ .  
సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది. ఒకప్పుడు ఎర్ర జెండాను దిగ్విజయంగా ఎదిరించి, మార్క్సిస్టులను మట్టి కరిపించిన మమతా దీదీ ప్రస్తుతం, కాషాయ కూటమి నుంచి గట్టి సవాలును ఎదుర్కుంటున్నారు. వరసగా పదేళ్ళు పాలించడం వలన సహజంగా వచ్చిన ప్రభుత్వ వ్యతిరేకత  కంటే, హిందూ ఓటు పోలరైజేషన్ ఆమెను మరింతగా భయపెడుతోంది. నిజానికి ఐదేళ్ళ క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం ఐదు శాతం కంటే తక్కువ ఓట్లు, మూడంటే మూడు అసెంబ్లీ సీట్లు మాత్రమే గెలుచుకున్న బీజేపీ..  2019 లోక్ సభ ఎన్నికల్లో ఏకంగా 40 శాతం ఓట్లతో 18 స్థానాలు గెలుచుకుంది. ఈ  మార్పు ఇంకా కొన్ని కారణాలు ఉంటే ఉండవచ్చును కానీ.. హిందువుల ఓటు పోలరైజ్  కావడమే ప్రధాన కారణం.  ఈ నేపధ్యంలోనే కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ చివరకు కమ్యూనిస్టులు కూడా బీజేపీలో  చేరారు. ఎన్నికల ప్రకటన వెలువడిన తర్వాత కూడా సిట్టింగ్ ఎమ్మెల్ల్యేలు సహా  తృణమూల్ టికెట్ వచ్చిన నాయకులు కూడా బీజేపీలో చేరుతున్నారు. అనేక మంది ఇతర రంగాల ప్రముఖులు, ముఖ్యంగా ఇంతకాలం, బీజేపీని హిదుత్వ అనుకూల ‘అచ్చుత్’ (అంటారని) పార్టీగా చూసిన ‘సెక్యులర్’ ప్రముఖులు కాషాయం కప్పుకోవడంతో మమతా బెనర్జీకి కొంచెం అలస్యంగానే అయినా, తత్త్వం బోధపడింది. అందుకే ఆమె ఇప్పుడు గుళ్ళూ,గోపురాలకు తిరుగుతున్నారు. కార్యకర్తల సమావేశాల్లో తానూ హిందువునేనని, చెప్పుకుంటున్నారు.  నిజానికి ఇలా నేనూ హిందువునే  అని సెక్యులర్ నేతలు బహిరంగంగా ప్రకటించుకోవడం మమతా బెనర్జీతోనే మొదలు కాలేదు. రాహుల్ గాంధీ తాను హిందువునని, జన్యుధారీ కశ్మీరీ బ్రాహ్మణుని అనీ.. తమ గోత్రం, ‘దత్తాత్రేయ’ గోత్రమని బహిరంగంగా ప్రకటించుకున్నారు. అలాగే  కొద్ది రోజుల క్రితం ప్రియాంకా గాంధీ తానూ హిందువునని చెప్పుకునేందుకు ‘మౌని అమావాస్య’ సందర్భంగా అలహాబాద్ లో గంగా స్నానం చేశారు. గతంలోనూ ఆమె ఎన్నికలకు ముందు గంగా యాత్ర చేశారు. అంతవరకు ఎందుకు కొద్దిరోజుల క్రితం సిపిఐ నారాయణ విశాఖ స్వామి ఆశీస్సులు తీసుకున్నారు. చంద్రబాబు, జగన్ రెడ్డి, కేసీఆర్ ఇలా తెలుగు నేతలు అనేక మంది లౌకిక వాదానికి కాలం చెల్లిందన్న సత్యాన్ని గ్రహించి కావచ్చు ‘నేనూ హిందువును’ అంటూ ప్రకటించుకునేందుకు పోటీ పడుతున్నారు. రాముడిని తలచుకున్నా, జై శ్రీరామ్ అన్నా తమ  లౌకిక వాదం మయలపడి పోతుందని భయపడిన నాయకులు ఇప్పుడు .. జై శ్రీరామ్ అనేందుకు కూడా వెనకాడడం లేదు.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది. గత కొంత కాలంగా సబర్మలతో సహా అనేక అంశాలపై స్పందిస్తూ.. కేరళను టార్గెట్ చేస్తున్న బీజేపీ నాయకులు అక్కడ తమ జెండా ఎగరేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా పార్టీ పాలసీని కూడా పక్కన పెట్టి మెట్రో మ్యాన్ శ్రీధరన్ ను పార్టీలో చేర్చుకుని ఆయనే తమ సీఎం అభ్యర్థి అని ప్రకటించిన 24 గంటలలో యూ టర్న్ తీసుకున్నారు. ఇది ఇలా ఉండగా ప్రస్తుతం సీఎంగా ఉన్న కమ్యూనిస్ట్ నేత పినరై విజయన్ పై గోల్డ్ స్మగ్లింగ్ ఆరోపణలు రావడంతో.. ఈ ఎన్నికలలో ఎల్డిఎఫ్ భవిష్యత్తుపై ప్రజలు ఏ తీర్పు ఇవ్వబోతున్నారనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది ఈ నేపథ్యంలో అక్షరాస్యతలో దేశంలోనే మొదటి స్థానంలో ఉన్న ఆ రాష్ట్ర ప్రజలు ఎవరిని ఆశీర్వదిస్తారు అనే అంశంపై ప్రముఖ మీడియా సంస్థ టైమ్స్ నౌ, సీ ఓటరుతో కలిసి ఒక సర్వేను నిర్వహించారు. ఈ సర్వే ప్రకారం చూస్తే పాపం కమలనాథులు అక్కడ పవర్ చేతికి రావటం అటుంచి కనీసం రెండు మూడు అసెంబ్లీ స్థానాల్లో గెలవటం కూడా కష్టమేనని ఆ సర్వే తేల్చి చెబుతోంది. కేరళలో ఈసారి జరిగే అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ తన హవా చాటుతుందన్న ఆ పార్టీ నేతల మాటలలో ఎలాంటి నిజం లేదని.. ప్రస్తుతానికి అది ఏమాత్రం సాధ్యం కాదని ఈ తాజా సర్వే తేల్చి చెప్పింది. అంతేకాకుండా మొత్తం 140 స్థానాలు ఉన్న కేరళలో.. ప్రస్తుత సీఎం పినరయి విజయన్ నేతృత్వంలోని లెఫ్ట్డ్ డెమొక్రటిక్ ఫ్రంట్ కు 82 సీట్లు పక్కా అని.. ఆయనే తిరిగి అధికారాన్ని నిలబెట్టుకుంటాడని సర్వే చెపుతోంది. అదే సమయంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూనైటెడ్ డెమొక్రాటిక్ ఫ్రంట్ కు 56 నుంచి 60 వరకు సీట్లు వచ్చే అవకాశం ఉందని ఈ సర్వేలో తేలింది. అంతేకాకుండా 2016 ఎన్నికలతో పోలిస్తే ఎల్ డీఎఫ్ ఓటింగ్ శాతం కూడా కొంత పెరగటం ఇక్కడ గమనార్హం. ప్రస్తుతం సీఎంగా ఉన్న విజయన్ మరోసారి సీఎం కావాలని 43.34 శాతం మంది మొగ్గు చూపినట్లుగా సర్వేలో తేలింది. కరోనా సమయంలో విజయన్ సీఎంగా బాగా పని చేసారని ఈ సర్వే పేర్కొంది. మరోపక్క దేశ ప్రధానిగా రాహుల్ గాంధీ ఉండాలని కేరళ ప్రజల్లో 55.84 శాతం మంది కోరుకుంటున్నట్లుగా ఈ సర్వే;లో తేలింది. అయితే కేరళలో ఎలాగైనా పాగా వేయాలని పట్టుదలతో కృషి చేస్తున్న బీజేపీకి ఈసారి కూడా నిరాశ తప్పదని ఈ సర్వేలో స్పష్టం అయింది. ఈ ఎన్నికలలో బీజేపీకి రెండు సీట్లు కూడా రావటం కూడా కష్టమేనని ఈ సర్వే తేల్చింది. అయితే ఎన్నికలకు ముందు ఇలాంటి సర్వేలు బయటకు రావడం.. తరువాత అందులో కొన్ని చతికిల పడడం మనం చూస్తూనే ఉన్నాం. మరి ఈ సర్వే ఫలితాలు నిజామా అవుతాయో లేదో తేలాలంటే కొద్దీ రోజులు వెయిట్ చేయాల్సిందే.        
రాజకీయాలు అంటేనే అదో జూదం. పూలమ్మిన చోటనే కట్టెలు అమ్మవలసి రావచ్చును. అలాంటి పరిస్థితే వచ్చినా, తలవంచుకుని పోగలిగితేనే, ఎవరైనా రాజకీయాలలో రాణించగలరు. అలాకాదని, అలిమి కానిచోట, కూడా తామే అధికులమని భావిస్తే, ఎందుకూ కాకుండా పోతారు. అలాంటి వారు ఇద్దరూ కూడా ఇప్పుడు మన కళ్ళముందే ఉన్నారు.  జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు. అలాగే జయ మరణం తర్వాత ఆమె పరిస్థితి ఏమిటో కూడా వేరే చెప్పవలసిన, అవసరం లేదు. జైలు పాలయ్యారు. సర్వం తానై నడిపించిన పార్టీ నుంచి  బహిష్కరణకు గురయ్యారు. జయ ఉన్నంత వరకు తన వారుగా ఉన్న వారందరూ కానివారయ్యారు. ఒంటరిగా మిగిలారు.  నిజానికి నాలుగేళ్ళు జైలు జీవితం గడిపిన తర్వాత కూడా ఆమె తలచుకుంటే.. రాష్ట్ర రాజకీయాలలో, ముఖ్యంగా అధికారంలో ఉన్న డిఎంకే కూటమిలో అలజడి సృష్టించగలరు. ఎన్నికలలో ఆమె గెలవక పోవచ్చును కానీ.. తనను కాదన్న అన్నాడిఎంకేను ఓడించగలరు. అయిన  ఆమె అందుకు విరుద్ధంగా  రాజకీయాలకు వీడ్కోలు పలికి మౌనంగా పక్కకు తప్పుకున్నారు. రాజకీయ సన్యాసం ప్రకటించారు. ఉమ్మడి శతృవు డిఎంకే ను ఓడించేందుకు అన్నా డిఎంకే కూటమి  పోటీ చేయాలని, కూటమి ఐక్యతను దెబ్బతీయరాదనే ఉద్దేశంతోనే ఆమె రాజకీయ సన్యాసం ప్రకటించారు.    శశికళ మౌనంగా వెళ్లి పోవడం వెనక ఇంకా అనేక కారణాలున్నా ,అసలు కారణం ఆమె, రాజకీయ విజ్ఞత, వివేకం. ఆమె జైలుకు వెళ్ళిన సమయంలో జయలలిత సమాధి వద్ద ఎంత కసిగా, కోపంగా ‘మౌన’ ప్రతిజ్ఞ చేశారో చూశా. అలాంటి ఆమె ఇప్పుడు ఇలా ‘మౌనం’గా వెనకడుగు వేశారంటే, అది ఆలోచించ వలసిన విషయమే.ఆమె వ్యుహతంకంగానే సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే అనేక మంది అనేక కోణాల్లో శశికళ సంచలన నిర్ణయాన్ని విశ్లేషించారు.జైలు జీవితం తర్వాత కూడా అన్నా డిఎంకే నాయకులు తనను అగ్రనేతగా అంగీకరించక పోవడం, అమిత్ షా చెప్పినా.. అన్నా డిఎంకే నాయకులు ఆమెను, మేనల్లుడు దినకరన్’ను కులం పేరున, కుటుంబం పేరున దూరం చేయడం, తిరిగి పార్టీలోకి తీసుకోకపోవడంతో ఆమె మనసు కష్టపెట్టుకుని, సన్యాస నిర్ణయం తీసుకున్నారని కొందరంటున్నారు. పార్టీ మీద పట్టు లేదని, చరిష్మా అసలే లేదని, అందుకే ఆమె అలా నిశ్శబ్ధంగా రాజకీయ సన్యాసం స్వీకరించారని ఇంకొందరు విశ్లేషించారు. ఈ విశ్లేషణలో కొంత నిజం ఉంటే ఉండవచ్చును.. కానీ ఆమె గతాన్ని, నైజాన్ని గుర్తు చేసుకుంటే ఆమె స్ట్రైక్ బ్యాక్ వ్యూహంతోనే ఒకడుగు వెనక్కివేశారని ఆమెతో సన్నిహితంగా మెలిగినవారు, ఆమె రాజకీయ చాణక్యం తెలిసిన వారు అంటారు.   నిజానికి జైలులో ఉన్న కాలంలో కానీ, జైలు నుంచి విడుదలై వచ్చిన తర్వాత కానీ, ఆమె రాజకీయ సన్యాసం వైపు అడుగులు వేస్తున్నట్లు కనిపించలేదు. బెంగుళూరు జైలు నుంచి విడుదలై చెన్నైలో ప్రవేశించిన నప్పుడు ఆమె పెద్ద కాన్వాయ్ తో  తమ కారుకు అన్నాడిఎంకే జెండాతోనే ఎంటరయ్యారు. అలా ఎంట్రీలోనే రాజకీయ ఆకాంక్షను వెంట తెచ్చుకున్నారు. చివరకు ‘సన్యాస’ ప్రకట చేసే వరకు కూడా ఆమె రాజకీయ కార్యకలాపాలు సాగిస్తూనే ఉన్నారు. అటు ఢిల్లీని ఇటు చెన్నైనికూడా కదిల్చారు. అంతేకాదు, రాజకీయాలపై విరక్తితో కాదు, రాజకీయ కసితో, ఉమ్మడి శత్రువు (డిఎంకే) ను ఓడించేందుకే తాను రాజకీయాలనుంచి తపుకుంటున్నట్లు చెప్పారు.  సో .. సన్యాసం తీసుకోవాలనే ఆలోచన, రాజకీయవ్యూహం లోంచి పుట్టిందే కానీ,వైరాగ్యంతో పుట్టింది కాదు ,అన్నవిశ్లేషణ వాస్తవానికి ఇంకొంత దగ్గరగా ఉందని అనుకోవచ్చును. ఇది ‘కామా’నే కాని ‘ఫుల్స్టాప్’ కాదని అంటున్నారు.  ముఖ్యమంత్రి ఎడప్పాడి కే. పళని స్వామి (ఈపీఎస్) ఆమెను పార్టీలోకి అనుమతిస్తే తన కుర్చికీ ఎసరు పెడతారనే భయంతోనే,, ఆమె ఎంట్రీని అడ్డుకున్నారు. ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం, శశికళ ఒకే సామజిక వర్గానికి చెందిన వారు కావడం కూడా, ముఖ్యమంత్రి ఈపీఎస్’ భయానికి కారణంగా పేర్కొంటారు. అందుకే  ఆయన, ‘మన్నార్గుడి’ ఫ్యామిలీని బూచిగా చూపించి, ఆమెను దూరంగా ఉంచారని పార్టీలో ఒక వర్గం గట్టిగా విశ్వసిస్తుంది. అయితే ఆమె శక్తియుక్తులను కూడతీసుకుని  పులిలా పంజా విసిరేందుకే ఆమె వ్యూహాత్మకంగా ఒక అడుగు వెనక్కి వేశారు కావచ్చును అని కూడా, తమిళ రాజకీయ వర్గాల్లో ఒక చర్చ జరుగుతోంది.  గతంలో ఆమె జయలలితతో విబేధాలు వచ్చిన సమయంలో కూడా ఇలాగే కొద్ది కాలం మౌనంగా తెర చాటుకు వెళ్లి పోయారు.  కొద్ది కాలంలోనే మళ్ళీ ‘పోయస్ గార్డెన్’లో ప్రత్యక్షమయ్యారు. జయలలిత స్వయంగా ఆమెను వెనక్కి పిలుపించుకోవలసిన పరిస్థితులను సృష్టించారు. అలా  మళ్ళీ  చక్రం తిప్పారు. జయలలిత మరణం వరకు ఆమె అందరికీ చిన్నమ్మగా అమ్మకు పెద్దమ్మగా సర్వం తానై నిలిచారు. చివరకు జయ అంత్యక్రియల్లో కూడా ఆమెదే పై చేయిగా కనిపించింది.   జయలలిత చనిపోయిన సందర్భంలోనే అన్నా డిఎంకే ఎమ్మెల్ల్యేలో సుమారు 30 మంది వరకు ఆమెకు మద్దతుగా ఉన్నారన్న వార్తలొచ్చాయి. నిజానికి,ఇప్పటికి కూడా ఒక్క అన్నా డిఎంకే లోనేకాదు,డిఎంకే ఇతర పార్టీలలో కూడా  ఆమె అవసరం ఉన్న వాళ్ళు ఉన్నారు. కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో ‘మన్నార్గుడి’ ఫ్యామిలీ మద్దతు లేకుండా గెలిచే అవకాశం లేదు.  ఇవ్వన్నీ నిజమే అయినా.. అన్నీ ఉండి, ఎవరు లేని శశికళలో, ఇంకా  ఎవరి కోసం తాపత్రయ పడాలి? అనే ప్రశ్న జనించి ఉంటే, ఆమె రాజకీయ సన్యాసం నిజం కావచ్చును. ఎందుకంటే ఆమె నెచ్చలి, జయలిత లేరు, భర్త అంతకంటే ముందే చనిపోయారు, పిల్లలు లేరు... పైగా నాలుగేళ్ళ జైలు జీవితం ఆమెలో మార్పు తెచ్చి ఉండవచ్చును. ఈ వయస్సులో తనవారంటూ ఎవరు లేని తనకు రాజకీయాలు ఎందుకు ? శేష జీవితాన్ని ఇలా సాగిద్దామనే ఆలోచన నిజంగా వచ్చి ఉంటే, ఆమె సన్యాసం సత్యం అయినా కావచ్చును, కాకపోనూ వచ్చును. కానీ  శశికళ... ఆమెను అర్థం చేసుకోవడం, అంచనా వేయడం , అంత తేలిగ్గా అయ్యే పని కాదు..
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు. కాంగ్రెస్ అధినాయకత్వం పై నేరుగా అస్త్రాలు సంధించారు. రాహుల్ గాంధీ పేరు చెప్పకుండానే, ఆయన నాయకత్వానికి పనికిరాడని తేల్చి చెప్పారు. ఎవరైనా పార్టీ అధ్యక్షుడు అయితే కావచ్చును, కానీ, ప్రజానాయకుడు కాలేడని, రాహుల గాంధీ ప్రజానాయకుడు కాదు కాలేరు,అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తరచూ రాహుల్ గాంధీని ఉద్దేశించి చేసే  ‘నామ్’ధారీ వ్యంగ్యాస్త్రాన్నే కాంగ్రెస్ సీనియర్ నాయకులు కూడా సందించారు. ఇక అక్కడి నుంచి విధేయ, అసమ్మతి వర్గాల మధ్య మాటల యుద్ధం ఎదో ఒక రూపంలో సాగుతూనే వుంది. అదే క్రమంలో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ, కరుడు కట్టిన ముస్లిం మతోన్మాది, అబ్బాస్ సిద్దిఖీతో కాంగ్రెస్ పార్టీ చేతులు కలపడం అసమ్మతి నాయకులకు మరో అస్త్రాన్ని అందించింది. విషయంలోకి వెళితే, ఇటీవల పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా లోక్’సభలో కాంగ్రెస్ పక్ష నాయకుడు, పశ్చిమ బెంగాల్ పీసీసీ అధ్యక్షుడు అధీర్’రంజన్ చౌదరి, ముస్లిం మత ప్రచారకుడు, అబ్బాస్ సిద్దిఖీతో  వేదిక పంచుకున్నారు.అంతకు ముందే వామ పక్ష కూటమితో  పొత్తు కుదుర్చుకున్న కాంగ్రెస్ పార్టీ, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)ను కూటమిలో చేర్చుకుంది. ఇలా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) అమోదం లేకుండా మతోన్మాద ఐఎస్ఎఫ్’ తో ఎన్నికల పొత్తు పెట్టుకోవడం ఆ పార్టీ నాయకుడు,సిద్ధిఖీతో  పీసీసీ చీఫ్ వేదిక  పంచుకోవడం పై అసమ్మతి నేతలు మండి పడుతున్నారు. ఇలా సిద్దిఖీతో వేదిక పంచుకోవడం పార్టీ మౌలిక సిద్ధాంతాలకు వ్యతిరేకం అంటూ అసమ్మతి వర్గానికి చెందిన కీలక నేత, రాజ్యసభ సభ్యుడు,ఆనంద్ శర్మ మండిపడ్డారు. అంతే కాదు, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)తో జనవరిలో కుదుర్చుకున్న పొత్తుకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ)అమోదం లేదని ఆనంద్ శర్మ, అభ్యంతరం వ్యక్త చేశారు. పార్టీ విశ్వసించే లౌకిక వాదానికి కాంగ్రెస్ అధిష్టానం తీసుకున్న నిర్ణయం గొడ్డలి పెట్టని ఆయన తీవ్రంగా స్పందించారు.   శర్మ వ్యాఖ్యలపై అధీర్ రంజన్ చౌదరి అంతే ఘాటుగా ప్రతిస్పందించారు. “నిజాలు తెలుసుకోండి ఆనంద్ శ‌ర్మ జీ” అంటూ ఆయ‌న వ‌రుస ట్వీట్లు చేశారు. వ్య‌క్తిగ‌త ప్ర‌యోజ‌నాలు ప‌క్క‌న‌పెట్టి, ప్ర‌ధానిని పొగిడి టైమ్ వేస్ట్ చేయ‌కండంటూ ఆయ‌న ఓ ట్వీట్లో అన్నారు. ఆనంద్ శ‌ర్మ అన‌వ‌స‌రంగా కాంగ్రెస్‌ను ల‌క్ష్యంగా చేసుకుంటున్నార‌ని, ఈ అంశాన్ని పెద్ద‌ది చేసి చూపిస్తున్నార‌ని విమ‌ర్శించారు. ఆయ‌న ఉద్దేశాలు స‌రైన‌వే అయితే నేరుగా తనతో మాట్లాడ వలసిందని అన్నారు. బెంగాల్‌లో సీపీఐ(ఎం) కూట‌మికి నేతృత్వం వ‌హిస్తోంది. అందులో కాంగ్రెస్ ఓ భాగం. మ‌త‌తత్వ‌, విభ‌జ‌న రాజ‌కీయాలు చేస్తున్న బీజేపీకి చెక్ పెట్ట‌డానికే ఈ కూట‌మి అని మ‌రో ట్వీట్‌లో అధిర్ రంజ‌న్ అన్నారు. అక్కడతోనూ ఆగలేదు ... ట్వీట్ల మీద ట్వీట్లు సంధిస్తూ, ఆనంద్ శర్మ, బీజేపీ మత విభజన, అజెండాను బలపరుస్తున్నారని, పరోక్షంగా జీ23 నాయకులు బీజేపీకి ప్రయోజనం చేకూరుస్తున్నారని ఆరోపించారు.అంతే కాదు, క్షేత్ర స్థాయి వాస్తవ పరిస్థితులు తెలియకుండా, ఆనంద్ శర్మ పార్టీ మీద దండెత్తడం ఉచితం కాదని చౌదరి ఎదురుదాడి చేశారు. అసమ్మతిలో అసమ్మతి. ఇదలా ఉంటే, కాంగ్రెస్ పార్టీ  సమూల పక్షాళన కోరుతూ సోనియా గాంధీకి,గత సంవత్సరం  జీ 23గా ప్రాచుర్యం పొందిన సీనియర్ నాయకులు రాసిన లేఖపై సంతకాలు చేసిన  నాయకుల్లో నలుగురు,జమ్మూలోసమావేసమైన నాయకుల తాజా నిర్ణయాలు, వ్యాఖ్యలు,విమర్శల పట్ల అసంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరం సోనియా గాంధీకి రాసిన లేఖలో ప్రస్తావించిన అంశాలకు కట్టుబడి ఉన్నామని, అయితే, జీ 23లోని కొందరు సహచరులు, ఇటీవల గీతదాటి చేస్తున్న వ్యాఖ్యలు, విమర్శలను తాము సమర్ధించడం లేదని ఆ నలుగురు పేర్కొన్నారు. ఇందులో ముఖ్యంగా, రాజ్యసభ మాజీ డిప్యూటీ చైర్మన్, పీజే కురియన్ అయితే, “కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు అవసరమైన సంస్కరణలు తెచ్చేందుకు చేసే ప్రయత్నాలను పూర్తిగా సమర్దిస్తాను, కానీ, ‘లక్ష్మణ రేఖ’ దాటితే ఒప్పుకునేది లేదు”అని అసమ్మతిలో అసమ్మతికి తెర తీశారు.అలాగే, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ కుమారడు, మాజీ ఎంపీ సందీప్ దీక్షిత్,మధ్య ప్రదేశ్ సీనియర్ కాంగ్రెస్ నాయకుడు అజయ్ సింగ్’ కూడా గులాం నబీ ఆజాద్, కపిల్ సిబల్, ఆనంద్ శర్మ, మనీష్ తివారీ వంటి జీ 23 కీలక నేతలు అధినాయకత్వంపై చేసిన వ్యాఖ్యలను తప్పు పట్టారు. అలాగే, పార్టీ సీనియర్ నాయకుడు కేంద్ర మాజీమంత్రి వీరప్ప మొయిలీ కూడా,గత సంవత్సరం పార్టీ సీనియర్ నాయకులు  ఒక పరిమిత లక్ష్యంతో  సోనియా గాంధీకి లేఖ రాయడం జరిగిందని, ఆ పేరున జరుగతున్న  కార్యక్రమాలు లేఖ సంకల్పానికి  విరుద్ధమని అన్నారు. జీ 23 కార్యకలాపాలపై రాహుల్ గాంధీ కూడా పరోక్షగా స్పందించారు, ఒకప్పుడు ఎన్ఎస్’యుఐ, యూత్ కాంగ్రెస్’ కు సంస్థాగత ఎన్నికలు వద్దన్న వారే ఇప్పుడు ఇంకోలా మాట్లాడుతున్నారని పరోక్షంగానే అయినా సంస్థాగత ఎన్నికలు నిర్వహించడంతో పాటుగా, పార్టీ పక్షాలనకు తమ కుటుంబం వ్యతిరేకం కాదని, అందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఈ నేపధ్యంలో కాంగ్రెస్ పార్టీలో చెలరిగిన కలకలం  ఇక ముందు ఏమవుతుందో .. ఇంకెన్ని  మలుపులు తిరుగుతోందో ..చూడవలసిందే కానీ ఉహించలేము.
  నేటి కాలంలో, సంబంధాలు బలపడటానికి , విచ్ఛిన్నం కావడానికి కమ్యూనికేషన్ సరిగా లేకపోవడమే అతిపెద్ద కారణంగా మారింది. అది కుటుంబ సంబంధం అయినా, స్నేహ సంబంధం అయినా, లేదా మరేదైనా వ్యక్తిగత సంబంధం అయినా, ఒకరినొకరు సరైన విధంగా కమ్యూనికేట్ చేయడం, ఒకరినొకరు అర్థం చేసుకోవడం చాలాముఖ్యం. నిజానికి చాలామంది రిలేషన్ లో ఉన్నప్పుడు  తమ మనసులో ఉన్న విషయాలను ఓపెన్ గా చెప్పడానికి ధైర్యం చేయరు. చాలా సందేహపడుతూ ఉంటారు. దీని వల్ల అపార్థాలు పెరిగి  రిలేషన్స్ లో దూరం ఏర్పడుతుంది. అందుకే రిలేషన్ లో ఉన్నప్పుడు ఓపెన్ గా మాట్లాడుకోవడం చాలా ముఖ్యం అంటుంటారు.  దీని గురించి మరింత వివరంగా తెలుసుకుంటే.. నమ్మకాన్ని పెంచుతుంది.. చక్కగా, ఎలాంటి విమర్శలు లేకుండా ఓపెన్ గా మాట్లాడుకోవడం ఏ  సంబంధానికైనా బలమైన పునాది ఏర్పరుస్తుంది. రిలేషన్ లో ఉన్న వ్యక్తులు నిజాయితీగా మాట్లాడినప్పుడు, వారి మధ్య నమ్మకం దానంతట అదే పెరుగుతుంది. మంచి కమ్యూనికేషన్  వల్ల అవతలి వ్యక్తి మన మాటలను శ్రద్ధగా వింటున్నారని మనకు అనిపిస్తుంది. ఇది అపార్థాల అవకాశాన్ని తగ్గిస్తుంది , సంబంధాలు దీర్ఘకాలం పాటు బలంగా ఉండటానికి సహాయపడుతుంది.  కమ్యూనికేషన్ బలహీనంగా ఉంటే.. అనుమానం,  అపార్థాలు, దూరం పెరుగుతాయి. అపార్థాలు తొలగిస్తుంది.. రిలేషన్స్ లోని సమస్యలు చాలా వరకు పెద్ద కారణం వల్ల కాకుండా, చిన్న చిన్న అపార్థాల వల్ల తలెత్తుతాయి. సరైన సంభాషణ ద్వారా ఈ అపార్థాలను సులభంగా పరిష్కరించవచ్చు. ప్రజలు తమ ఆలోచనలను, భావాలను బహిరంగంగా మాట్లాడుకున్నప్పుడు, వారికి ఉండే  సందేహాలు తొలగిపోతాయి. ఇది సంబంధాలలో స్పష్టతను తీసుకువచ్చి, అనవసరమైన ఒత్తిడిని తగ్గిస్తుంది. ఎమోషనల్ బాండింగ్.. కమ్యూనికేషన్ చేయడం అంటే కేవలం ఒకరితో ఒకరు మాట్లాడుకోవడమే కాదు..  అది భావోద్వేగాలను వ్యక్తపరిచే ఒక మార్గం కూడా.   మనసులోని మాటలను పంచుకున్నప్పుడు ఇద్దరి మధ్య మరింత గాఢమైన భావోద్వేగ బంధం ఏర్పడుతుంది. ఇది ఒకరిలో ఒకరికి చెందిన ఫీలింగ్ ను పెంపొందించి, సంబంధాలను మరింత సన్నిహితంగా చేస్తుంది. ఈ అనుబంధమే ఏ సంబంధాన్నైనా ప్రత్యేకంగా నిలుపుతుంది. సమస్యల పరిష్కారం.. ప్రతి సంబంధంలో లేదా పరిస్థితిలో సమస్యలు సర్వసాధారణం, కానీ సరైన కమ్యూనికేషన్  ద్వారా వాటిని సులభంగా పరిష్కరించవచ్చు. ఇరు పక్షాలు తమ అభిప్రాయాలను ఓపెన్ గా వ్యక్తపరిచినప్పుడు, పరిష్కారాలు లభించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కమ్యూనికేషన్ వల్ల  తప్పుడు నిర్ణయాలు తీసుకునే అవకాశం తగ్గుతుంది.  ఇద్దరు వ్యక్తులు ఎలాంటి సమస్యలు లేకుండా ముందుకు వెళ్లడానికి మార్గం కల్పిస్తుంది.  అందుకే ఓపెన్ గా మాట్లాడుకోవడం  అన్ని సమస్యలకు పరిష్కారం చూపిస్తుంది. మానసిక ఒత్తిడి.. మనసులో భావాలను, ఆందోళనలను ఇతరులతో పంచుకున్నప్పుడు మనసు తేలికపడుతుంది. ఏ విషయాన్ని అయినా మనసులోనే దాచుకోవడం ఒత్తిడిని పెంచుతుంది, కానీ మాట్లాడటం ఉపశమనాన్ని అందిస్తుంది. ఇది మానసిక ఆరోగ్యానికి కూడా చాలా మేలు చేస్తుంది. మంచి కమ్యూనికేషన్ ఒక వ్యక్తి మరింత ప్రశాంతంగా, సమతుల్యంగా , సంతోషంగా ఉండేలా చేస్తుంది.                                      *రూపశ్రీ.
చుట్టూ ఉన్నవాళ్లు అందరూ మంచివాళ్లు ఉండరు. మనుషుల్లో మంచి, చెడు రెండూ ఉంటాయి. కానీ కొందరిలో స్వార్థం,  ఈర్ష్య,  అసూయ,  ఓర్చుకోలేని తత్వం ఇలాంటివన్నీ చాలా ఎక్కువ ఉంటాయి. అలాంటి వారిని చెడ్డవాళ్లుగా చెబుతూ ఉంటారు.  చాలా వరకు మనుషులు తాము మంచి వాళ్లని, చెడ్డ వాళ్లని బయటకు చెప్పుకోరు.  వారి ప్రవర్తనలో ఇది బయటపడుతూ ఉంటుంది.  ముఖ్యంగా కొందరు వ్యక్తులు మంచి వాళ్ల చుట్టూ చేరి తీయని మాటలతో మోసం చేయాలని చూస్తుంటారు.  వారు ఇలా మోసం చేస్తారని తెలుసుకోలేని పరిస్థితిలో కొందరు ఉంటారు.  తీయని మాటలతో అందరినీ మోసం చేయగల వ్యక్తులు ఎలా ఉంటారు? వారిని కనిపెట్టడం ఎలా?  తెలుసుకుంటే.. ప్రసంశలు.. ఎవరైనా  కలిసిన వెంటనే మితిమీరి పొగడటం మొదలుపెట్టినా లేదా రాత్రికి రాత్రే మిమ్మల్ని ప్రపంచంలోనే అత్యంత ప్రత్యేకమైన వ్యక్తిగా ప్రకటించినా, జాగ్రత్తగా ఉండాలి. మోసం చేసే వ్యక్తులు  వారిని గుడ్డిగా నమ్ముతారనే ఆశతో, మొదట్లో  ప్రేమను, పొగడ్తలను కురిపిస్తారు. మీకు వాళ్ల మీద  నమ్మకం ఏర్పడిన తర్వాత, వారి నిజ స్వరూపం బయటపడుతుంది. తప్పు ఒకరిది, అవమానం మరొకరిది.. తీయని మాటలతో మోసం చేసే వ్యక్తుల ముఖ్య లక్షణం ఏమిటంటే, వారు తమ తప్పులను ఎన్నడూ ఒప్పుకోరు . ఒకవేళ మీరు వారు తప్పు చేయడం మీరు గమనించినా, వారు ఆ పరిస్థితిని ఎంత చాకచక్యంగా వాడుకుంటారంటే, చివరికి మీకే అపరాధభావం కలుగుతుంది. మీరు తప్పు చేశారని మీకు అనిపించేలా  చేస్తారు. తమని తాము అనుమానించుకునేలా.. "నేను అలా ఎప్పుడూ అనలేదు," అనడం లేదా..  "నీకే పిచ్చి, అది అసలు ఎప్పుడు జరిగింది, అలాంటిదేం  జరగలేదు." వంటి  మాటలు ఎవరినుండైనా ఎదురవుతూ ఉంటే..  జాగ్రత్తగా ఉండాల్సిందే.. ఇతరులను తమ చెప్పుచేతల్లో ఉంచుకునేవారు తరచుగా మీకు ఎంత నమ్మకంగా అబద్ధాలు చెబుతారంటే, మీరు మీ జ్ఞాపకశక్తిని, నిజాయితీని మీరే అనుమానించడం మొదలుపెడతారు. ఇది మనసును నియంత్రించడంలో చాలా ప్రమాదకరమైన పద్ధతి. అయ్యో పాపం అనుకునేలా చేయడం.. పరిస్థితులు ఎలా ఉన్నా, తప్పు ఎవరిదైనా సరే, తియ్యని మాటలతో మోసం చేసే  వ్యక్తులు తామే ప్రపంచంలో చాలా బాధలో ఉన్నవారమన్నట్లుగా కథను చెబుతారు. వారు మీ సానుభూతిని పొందాలని చూస్తారు, తద్వారా మీరు వారి పట్ల జాలిపడి, వారు చెప్పే ప్రతిదానితో ఏకీభవించి వారి గురించి పాపం అనుకునేలా చేస్తారు. ఇష్టమైన వారి నుండి వేరు చేయడం.. మిమ్మల్ని లొంగదీసుకోవాలనుకునే వ్యక్తి, మొదట మిమ్మల్ని మీ నిజమైన స్నేహితులు , కుటుంబ సభ్యుల నుండి దూరం చేయడానికి ప్రయత్నిస్తారు. "మీ కుటుంబం మిమ్మల్ని అర్థం చేసుకోదు" లేదా "మీకు ఉన్నది నేను ఒక్కడినే" అనే ఆలోచనలను  మనసులో నాటుతారు. మీరు పూర్తిగా ఒంటరిగా ఉన్నారని, వారిపై ఆధారపడి ఉన్నారని భావించేలా చేయడానికి వారు ఇలా చేస్తారు. అవసరం.. అవసరానికి మాత్రమే మాట్లాడేవారు, మిగతా సమయాలలో తప్పించుకోవడం లేదా కారణాలు, సాకులు చెప్పి దూరంగా ఉండటం చేసేవారు మోసం చేసే స్వభావం కలిగినవారని అర్థం.  ఇలాంటి వారు తమకు అవసరం వచ్చినప్పుడు  చాలా మంచివారిలా ఉంటారు, కానీ వారి పని పూర్తయిన వెంటనే, మిమ్మల్ని మళ్లీ పట్టించుకోవడం మానేస్తారు . తియ్యగా మాట్లాడేవారిని గుర్తించడం కష్టం, ఎందుకంటే వారు తరచుగా చాలా బాగా నటిస్తారు. కానీ ఎప్పుడూ మీ అంతరాత్మ చెప్పేది వినాలి. ఒక సంబంధం మీకు సంతోషానికి బదులుగా ఎప్పుడూ మానసిక గందరగోళాన్ని, ఒత్తిడిని కలిగిస్తుంటే, హద్దులు పెట్టుకోవాల్సిన సమయం ఆసన్నమైందని అర్థం.                                    *రూపశ్రీ.
భార్యాభర్తల బంధం విచ్చిన్నం కాకుండా కాపాడే బంగారు సూత్రం! నేటి వేగవంతమైన జీవితంలో మనుషులకు అన్ని భౌతిక సౌకర్యాలు అందుబాటులో ఉన్నప్పటికీ, రెండు విషయాలలో మాత్రం  వెనుకబడిపోతున్నట్లు స్పష్టంగా తెలుస్తుంది. మొదటిది గాఢమైన, నిజమైన సంబంధాలను నిలబెట్టుకోవడం కాగా, రెండవది మనశ్శాంతి లేకపోవడం. ఇవి ప్రస్తుతం చాలామంది  ఎదుర్కొంటున్న అతిపెద్ద ఛాలెంజ్ లు. ముఖ్యంగా బార్యాభర్తల బంధం ఈ కాలంలో చాలా బలహీనంగా మారింది.  బంధాలను కాపాడుకోవడం,  మనఃశాంతిగా ఉండటం.. ఈ రెండింటిని ఎలా సమతుల్యం చేసుకోవాలనేదే అతిపెద్ద గందరగోళం. అయితే ఈ విషయానికి సమాధానం లేదా అంటే.. ఖచ్చితంగా ఉంది. బంధాలు నిలబెట్టుకోవడానికి బంగారు సూత్రం ఉంది. అదేంటో తెలుసుకుంటే.. బంధాలకు బంగారు సూత్రం.. నేటి వివాహాలు, సంబంధాలలో ఉన్న అతిపెద్ద బలహీనతను  ఎదుటి వ్యక్తిని పూర్తిగా అర్థం చేసుకోకపోవడమే.  బంధం బాగుండాలంటే బంధం ముడిపడేవరకు  కళ్ళు తెరిచి ఉండాలి, కానీ బంధం ముడిపడిన తర్వాత కళ్లు మూసుకుని ఉండాలట. ఈ విషయాన్ని  స్వయానా సినీ నటుడు, రచయిత, ఆధ్యాత్మిక వేత్త అయిన అశుతోష్ రాణా చెప్పుకొచ్చారు.  ఈయన తెలుగులో కూడా చాలా సినిమాలలో నటించారు.   ఒకరితో సంబంధంలోకి వచ్చాక, కళ్ళు మూసుకోవాలని ఆయన అంటున్నారు. దీని అర్థం ఏమిటంటే, ఒక సంబంధం ఏర్పడిన తర్వాత, ప్రతి చిన్న లోపాన్ని పట్టుకుని విమర్శించడం లేదా ఫిర్యాదు చేయడం కంటే, కొన్ని విషయాలను పట్టించుకోకుండా ఉండటం ముఖ్యమని అర్థం. ఈ ప్రపంచంలో ఏ మనిషి అన్ని విషయాలలోనూ పర్పెక్ట్ గా ఉండరు.  ప్రతి ఒక్కరిలోనూ కొన్ని చెడు అలవాట్లు, తప్పు చేసే స్వబావం, కొన్ని లోపాలు ఉంటాయి.   భగవద్గీతలోని పద్దెనిమిదవ అధ్యాయంలో శ్రీకృష్ణుడు, అగ్ని ఎల్లప్పుడూ పొగతో కప్పబడి ఉన్నట్లే, ప్రతి మనిషిలోనూ, ప్రతి చర్యలోనూ ఏదో ఒక లోపం లేదా దోషం ఉంటుందని పేర్కొన్నాడు. వివాహం విషయానికి వస్తే..  సీతాదేవి , శ్రీరాముని జీవితంలో కనిపించేది  సమతుల్యత. అక్కడ వివాహానికి ముందు రాముడి  యోగ్యతను పరీక్షించినప్పటికీ, వివాహం తర్వాత వారిద్దరూ ఒకరి పరిమితులను మరొకరు అంగీకరించి, ప్రేమ , కర్తవ్యానికి మాత్రమే ఎక్కువ  ప్రాధాన్యతనిచ్చారు. ఈ రోజుల్లో పెళ్లి తర్వాత చాలామంది తమ భాగస్వాములను మార్చుకోవాలని ప్రయత్నించడం వల్ల సంబంధాలు త్వరగా నాశనం అవుతున్నాయనేది చాలా మంది అర్థం చేసుకోరు, అయితే సగం కళ్ళు మూసుకోవడం అంటే ఉదాసీనత కాదు, అది ఎదుటి వ్యక్తిలోని లోపాలను అంగీకరించే పరిణతి. ప్రతి వ్యక్తకి తమ సమస్యలకు పరిష్కారాలు తమలోనే ఉంటాయి. కానీ వచ్చిన చిక్కల్లా తమని తాము విమర్శ చేసుకోలేక పోవడం, అలాగే..  తమకు నచ్చిన విధంగానే పరిష్కారం జరగాలని అనుకోవడం. ఇదే చాలామంది సమస్యలు పెద్దవి అవడానికి,  మనఃశాంతి లేకపోవడానికి దారి తీస్తుంది.  బందం బలంగా ఉండాలంటే చిన్న విషయాలను పట్టించుకోవడం మానెయ్యాలి. అదే బంగారు సూత్రం.                                           *రూపశ్రీ.  
శరీరంలో అధిక వేడి, పాదాల్లో మంట, కళ్లలో మంట, నోటి పూత, గ్యాస్, అసిడిటీ వంటి సమస్యలు చాలా మందిని ఇబ్బంది పెడుతుంటాయి. ఈ లక్షణాలు సాధారణంగా కనిపించినప్పటికీ, ఆయుర్వేదం ప్రకారం ఇవి పిత్త దోషం (Pitta Dosha) పెరగడం వల్ల వచ్చే సంకేతాలు కావచ్చని ప్రముఖ ఆయుర్వేద నిపుణులు డా. చి. మధుసూదన్ శర్మ వివరిస్తున్నారు. ఈ వీడియోలో పిత్త దోషం ఎందుకు పెరుగుతుంది? దానికి కారణమయ్యే ఆహారపు అలవాట్లు, జీవనశైలి, వాతావరణ ప్రభావాలు ఏమిటి? అలాగే పిత్తాన్ని తగ్గించేందుకు తీసుకోవాల్సిన ఆహారం, పాటించాల్సిన జీవనశైలి, ఆయుర్వేదంలో సూచించే సహజ చిట్కాలు వంటి అనేక ఉపయోగకరమైన విషయాలను సులభంగా వివరించారు. శరీరంలో వేడి ఎక్కువగా అనిపించడం, పాదాల్లో లేదా కళ్లలో మంట, తరచూ నోటి పూత రావడం, గ్యాస్, అసిడిటీ సమస్యలు వేధిస్తుంటే ఈ వీడియోలో చెప్పిన సూచనలు మీకు ఉపయోగపడవచ్చు. ఈ వీడియోలో తెలుసుకునే ముఖ్యాంశాలు: పిత్త దోషం అంటే ఏమిటి? శరీరంలో వేడి పెరగడానికి ప్రధాన కారణాలు పాదాలు, కళ్లలో మంట ఎందుకు వస్తుంది? నోటి పూత, గ్యాస్, అసిడిటీకి ఆయుర్వేద వివరణ పిత్తాన్ని తగ్గించే ఆహారాలు నివారించాల్సిన ఆహార పదార్థాలు రోజువారీ జీవితంలో పాటించాల్సిన ఆరోగ్యకరమైన అలవాట్లు సహజంగా శరీరాన్ని చల్లగా ఉంచే ఆయుర్వేద సూచనలు మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి, పిత్త దోషాన్ని సమతుల్యం చేసుకోవడానికి ఈ వీడియోను పూర్తిగా వీక్షించండి. గమనిక: ఈ వీడియోలోని సమాచారం ఆయుర్వేద అవగాహన కోసం మాత్రమే. వ్యక్తిగత ఆరోగ్య సమస్యల కోసం తప్పనిసరిగా అర్హత కలిగిన వైద్యుడిని లేదా ఆయుర్వేద నిపుణుడిని సంప్రదించండి. మీ ఆరోగ్య సమస్య ఏదైనా... మా హెల్త్ యూట్యూబ్ ఛానల్‌లో సీనియర్ డాక్టర్స్ చెప్పిన సలహాలు... సూచనలు ఉన్నాయి. మా యూట్యూబ్ ఛానల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 👉 TeluguOne Health (సబ్‌స్క్రైబ్ చేయడం మర్చిపోకండి!)  
పురుషుల ఆరోగ్యం విషయంలో చాలామంది నిర్లక్ష్యం చేసే సమస్యల్లో క్యాన్సర్ ఒకటి. ప్రారంభ దశలోనే గుర్తిస్తే చాలా రకాల క్యాన్సర్లను విజయవంతంగా చికిత్స చేయవచ్చు. అయితే లక్షణాలను నిర్లక్ష్యం చేయడం వల్ల వ్యాధి ముదిరే ప్రమాదం ఉంటుంది. ఈ వీడియోలో ప్రముఖ యూరాలజిస్టు, ఆండ్రాలజిస్టు డా. ఏవి రవి కుమార్ పురుషుల్లో ఎక్కువగా కనిపించే ఐదు ప్రధాన క్యాన్సర్ల గురించి సులభంగా వివరించారు. ముఖ్యంగా ప్రోస్టేట్ క్యాన్సర్, మూత్రాశయ క్యాన్సర్, కిడ్నీ క్యాన్సర్, వృషణాల క్యాన్సర్, పురుషాంగ క్యాన్సర్ వంటి వ్యాధుల లక్షణాలు, ప్రమాద కారకాలు, ఎప్పుడు వైద్యుడిని సంప్రదించాలి అనే అంశాలను తెలియజేశారు.  అలాగే చాలామందికి ఉండే సందేహమైన యూరాలజీ (Urology) మరియు ఆండ్రాలజీ (Andrology) మధ్య ఉన్న తేడాను కూడా స్పష్టంగా వివరించారు. మూత్ర సంబంధిత వ్యాధులు, పురుషుల లైంగిక ఆరోగ్యం, సంతానలేమి సమస్యలు, ప్రోస్టేట్ సమస్యలు వంటి సందర్భాల్లో ఏ నిపుణుడిని సంప్రదించాలో ఈ ఇంటర్వ్యూలో తెలుసుకోవచ్చు.  పురుషులు తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఏ లక్షణాలను అస్సలు నిర్లక్ష్యం చేయకూడదు? క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు ఎందుకు అవసరం? వంటి ఎన్నో ఉపయోగకరమైన విషయాలను ఈ వీడియోలో డా. ఏవి రవి కుమార్ వివరించారు.  ప్రతి పురుషుడు తప్పకుండా తెలుసుకోవాల్సిన ఆరోగ్య సమాచారం కోసం ఈ వీడియోను పూర్తిగా వీక్షించండి.   మీ ఆరోగ్య సమస్య ఏదైనా... మా హెల్త్ యూట్యూబ్ ఛానల్‌లో సీనియర్ డాక్టర్స్ చెప్పిన సలహాలు... సూచనలు ఉన్నాయి. మా యూట్యూబ్ ఛానల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 👉 TeluguOne Health (సబ్‌స్క్రైబ్ చేయడం మర్చిపోకండి!)